ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
శ్రీ సీతాపరిత్యాగము
క: క్షుల్లక జన వచన వచో
భల్ల కదంబముల హృదయ పద్మ మగల ,భూ
వల్లభుడోరిచె, భవదా
యల్లకభర మేమి వినియె దమ్మరొ ? యింకన్ .
ఉత్తర రామాయణము-6ఆ-- కంకంటి పాపరాజు.
తెలుగు సాహిత్యంలో చదవదగిన గ్రంధాలలో కంకంటి పాపరాజకృత ఉత్తర రామాయణ కావ్యం మరువరానిది. సరళమైన భాషతో ధారాళమైన శైలితో హృదయావర్జకమైన రీతితో వ్రాయబడిన యీకావ్యం కవితా ప్రియంభావులైన పాఠకులకుమరపురాని మహత్తర కావ్యం. కరుణరసార్ద్రమైన సీతాపరిత్యాగ ఘట్టం పాఠకులకు కన్నీరు నించుచు రసానంద తుందిలమై
యొప్పారు చున్నదనుట యదార్ధము.
రాముడు ప్రజలాడుకొను నిందా వాక్యములను విని , రాచరికమునకు మచ్చదెచ్చు నిందను భరింప నోపక సీతాపరిత్యాగమునకు నిశ్చయించి తత్కార్యమును నిర్వహింప లక్ష్మణునాదేశించెను. అంతకుముందే గర్భవతియగు సీత యడవులకేగి మునిపత్నుల జూచివచ్చుటకు రాముని గోరియుండెను. అదిసాకుగా లక్ష్మణునితో సీతనడవుల కంపి ,వాల్మీకి ఆశ్రమ
ప్రాంతమున విడిచిరమ్మన యతడట్లే యొనర్చి పరిత్యాగ కారణము నెఱిగించుటతో నీఘట్టమారంభమగుచున్నది. పైపద్యమదియే!
(సరళమైన రచన గావున నర్ధతాత్పర్యములతో పనిలేదు. )
లక్ష్మణుడు:
ఉ: అంచిత వామలూరుజ వనాంతర భూముల నిన్నుడించిర
మ్మంచు రఘూద్వహుండనిచె; నక్కట! యెక్కడ నిల్చి యెట్లు వే
గించెదవమ్మ యెవ్వరు సఖీజనులయ్యెదరమ్మ ? యేమి యూ
హించి దినంబులింక గ్రమియించెదవమ్మ! పతివ్రతామణీ!
ఇవి లక్ష్మణుని మాటలు
క: అల్లలన యతని వచనము
లెల్లన్విని మొదలు నఱుక నించుక వడిలో
ద్రెళ్ళెడి కదళికవలె హా!
తల్లీ! యని బిట్టు సొరగి ధరపైఁ బడియెన్ ;
( యిక్కడో పెద్దవచనం -- దానితరువాత మూర్చతేరి సీత పలికిన మాటలు)
చ: కట కట! లక్ష్మణా! పిడుగు కంటెను బెట్టిదమైన మాట, నే
డిటు వినియుండియున్ బగుల దింతలు యింతలు గాదు గుండె; యె
ప్పటివలెనున్న దీకఠిన భావముతో నశువుల్ భరించి యి
య్యటవిని యంక నేవలన నాపద లొందగ నున్నదాననో?
చ: ఎఱుగని మూఢులాడుకొను నెగ్గులకున్భయమంది , యప్పుడే,
కఱకు మనంబుతో విభుడు కానన సీమకు బంచెగాక , య
త్తెఱ కొక సారి నన్బిలచి, తెల్పి, మనోవ్యధదీర్చి , నిన్ను నే
మఱనని బంపడాయె, నభిమానము ,కూర్మియు ,నెందుబోయెనో?
క: ఆకరుణ ,యాప్రసన్నత
యాకూరిమి , యాప్రియోక్తి ,యాగారవమున్
కాకుస్థుడు మరచెగదా?
యాకస్మికముగ జనించు నపవాదమునన్;
ఉ: ఎన్నటికిన్ రఘూద్వహుని నేనును , నన్నిక రామచంద్రుడున్
కన్నులఁ జూడఁగల్గదొకొ? కల్గకయుండిన ప్రాణమేల పో
దన్న! రఘుప్రవీరు చెవులారగ నింతయుఁ దెల్పు నాదు మే
నున్నది, చెంత గంగ మడుగున్నది, యైనటు లయ్యెడిన్ తుదిన్;
చ: పతిమతి నెంచెనేమొ ?తనుబాసి యశోకవనంబులోపలన్
బ్రతుకదె పెక్కునాళ్ళనుచు; క్రమ్మర తాజనుదెంచు శత్రులన్
హతులుగఁ జేయు ,నేలు నను నాస గదాబ్రతికించె నాటి కా
గతి నిక నేమి యాశగొని కాయము నిల్పుదు దెల్పు లక్ష్ణణా!
( ఇవి సీతమ్మ మాటలు- ఆతదుపరి లక్ష్మణుడు అయోధ్యకేగుట. సీత వాల్మీకి ఆశ్రమ ప్రవేశము-ఆమెజీవన విధానము-
రంగారు బంగారు చెంగావులు ధరించు-పద్యము మొన్నగునవి)
ఆవిషాద ఘట్టమును కరుణ రసోదంచితముగ మనకనుల ముందుంచిన పాపరాజునకు
అంజలి ఘటించుచూ,---
స్వస్తి!
om sri ram- sri matrenama:

మరొక తెలుగు ప్రహేళిక (7) - సమాధానాలు:
1) “అక్కడ, ఇక్కడ, ఎక్కడ” అనే మాటలు ఏ సంధివలన ఏర్పడ్డాయి? వీటిలో సమానంగా ఉన్న పదం ఏది?
త్రిక-సంధి - ‘ఆ, ఈ, ఏ’లు త్రికాలు. వాటి తరువాత ‘క,త,మ,వ’ మొదలైన (ఇంకా చాలానే) అసంయుక్తహల్లులుంటే, ఈ అచ్చులు చిన్నవై, తరువాతి హల్లు ద్విత్వం అవుతుందన్నమాట. సమానంగా ఉన్న పదం “కడ”.[ఆ +కడ = అక్కడ],... ‘కడ’= చోటు/ప్రదేశం

2) మనదేశంలో అతి పొడవైన పేరుగల రైల్వే స్టేషన్ ఆం.ప్ర.లోనే ఉంది. అది ఎక్స్ప్రెస్ బండ్లు ఆగని ఒక చిన్న స్టేషన్. దాని పేరేమిటి?
“వెంకటనరసింహారాజువారిపేట” (చిత్తూరు జిల్లా - నగరి, పుత్తూరు ప్రాంతాల్లో ఉంది. ఆర్కోణం-రేణిగుంట మధ్య)
3) “మొక్కజొన్న తోటలో..” అనే జానపద శైలిలోని పాటను ఏ సినిమాలో పాడించారు? ఆ పాట రచయిత ఎవరు?
“అదృష్టవంతులు.” (అంతకుముందు ‘సిపాయికూతురు’ అనే సినిమాలో కొంత చిత్రీకరింపబడిందని ఒకరన్నారు.) పాట రచయిత “శ్రీ కొనకళ్ళ వెంకటరత్నం.”
4) ‘ధర్మవ్యాధోపాఖ్యానము’ (కౌశికుడనే బ్రాహ్మణుడు ఒక కొంగను కోపంగా చూస్తే అది కాలిపోవడం, ఒక పతివ్రత దగ్రకు భిక్షానికి పోతే, ఆమె ఆలస్యం చేసినందుకు కోప్పడితే, ‘కాలిపోవడానికి నేను కొంగను కా’నని చెప్పడం, మిథిలానగరంలో ఉండే ధర్మవ్యాధుడిదగ్గర నీతులు నేర్చుకోమని చెప్పడం...) ఆంధ్రమహాభారతంలోనిదే. దీనిని తెనిగించిన కవి ఎవరు?
ఈ భాగం “ఎర్రాప్రగడ”విరచితం (14వ శతాబ్దం).
5) ‘ఆంధ్రమహాసభ’ అనే సంస్థ యొక్క మొదటి సమావేశాలు ఎక్కడ, ఏ సంవత్సరంలో జరిగాయి?
“జోగిపేట” (మెదక్ జిల్లా, నేటి తెలంగాణా - హైదరాబాద్ కు 80 కిమీ.)
‘ఆంధ్రజనసంఘం’ పేరుతో 1921లో మొదలై, 1930లో ఇది ‘ఆంధ్రమహాసభ’గా మార్పుచెందింది! అంతేకాదు, 1901లో హైదరాబాద్-లో స్థాపించబడినదాని పేరు శ్రీకృష్ణదేవరాయ “ఆంధ్ర”మహాసభ. ఈ ఉద్యమానికి కారణం ఒకాయన ఒక సభలో తెలుగులో (ఆంధ్రములో) (ఉర్దూ, మరాఠీ, ఇంగ్లీషులలో కొందరు మాటలాడడం అయిపోయాక) అక్కడ మాట్లాడబోతే జరిగిన హేళన, గందరగోళమూనట!
6) తెలుగులో వచ్చిన మొదటి “పూర్తి” రంగుల చలనచిత్రమేది?
లవకుశా (‘గేవా కలర్’ - ‘ఈస్ట్మన్ కలర్’ అన్నది మరో కంపెనీ పేరు, టెక్నాలజీ ఒకటే!)
7) “మాకొద్దీ తెల్లదొరతనం… ” అనే దేశభక్తిగేయాన్ని రచించిన స్వాతంత్ర్యయోధుడెవరు?
గరిమెళ్ళ సత్యనారాయణ గారు (శ్రీకాకుళం)
8) “వటపత్రశాయికి”, “రామా! కనవేమిరా? (హరికథ)” - ‘స్వాతిముత్యం’ సినిమాలోని ఈ రెండు పాటలనూ వ్రాసిన ప్రముఖ సినీకవి ఎవరు?
‘సినారె’
9) ఈ సామెతను పూరించండి - “తుంగభద్రలో స్నానానికి…..”
…….కొండుభట్లు ఆజ్ఞ కావాలా?” (మనం ఏదో పుణ్యకార్యం చేయబోయినప్పుడు మరొకడి ఆశీస్సులకి, ‘పర్మిషన్’కి (మన సదుద్దేశంకంటే ప్రాముఖ్యం ఉంటుందనుకుంటూ) ఆగనక్కరలేదని చెప్పడం!)
10) ‘వేసట’ అనే అచ్చతెనుగు పదానికి అర్థమేమిటి?
బడలిక, అలసట, విసుగూ, విరామం...
********

No comments:
Post a Comment