ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం
ప్రాంజలి ప్రభ - ఉపాద్యాయల దినోత్సవం
సర్వేజానా సుఖోనోభావంతు
భారతదేశంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం అయిన సెప్టెంబరు 5 తేదీన ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. ఈ రోజు శెలవుదినం కాదు. ఉత్సవం జరుపుకొనవలసిన దినం. పాఠశాలలు యధావిధిగా తెరిచి , ఉత్సవాలు జరుపుకుంటాము. ఈ రోజున ఉపాధ్యాయులను జాతీయ, రాష్ట్రీయ మరియు జిల్లా స్థాయిలలో పురస్కారాలు, గౌరవసత్కారాలు జరుగుతాయి.
.
|
Guru's Day - my mother, father and all guru's - who tougher me so many things to live.
పల్లవి. అత్రి, అనసూయ అమృత పుత్ర, సర్వ
భూత పోష, భువిజన స్తోత్ర. ||అత్రి||
అనుపల్లవి. త్రిమూర్తి రూప, త్రైలోక వంద్య,
సౌమ్య సురుచిర రూప, సుగుణ సాంద్ర. ||అత్రి||
నిర్మల మూర్తి, నిరుపమ రూప,
దారిద్య ధ్వంశ, దీన జన మిత్ర,
గరుడ, హంస, నంది వాహన గమన,
కరుణ స్వరూప, కమల నేత్ర. ||అత్రి||
చక్ర, త్రిశూల, చతుర్వేద హస్త,
సుకుమార దేహ, స్థిత ప్రఙ్ఞ,
ఆకళంక రూప, ఆనంత తేజ,
సకల జన సన్నతు, శ్రీశుభాంగ! ||అత్రి||
మాయ వినాశక, మధుర రూప,
తోయజాక్ష, తఱలు ఙ్ఞాన రూప,
సాయి, శ్రీపాద, సకల గురు రూప,
భయ భవ నాశ బుద్ధి వికాశ. ||అత్రి||
పల్లవి. అత్రి, అనసూయ అమృత పుత్ర, సర్వ
భూత పోష, భువిజన స్తోత్ర. ||అత్రి||
అనుపల్లవి. త్రిమూర్తి రూప, త్రైలోక వంద్య,
సౌమ్య సురుచిర రూప, సుగుణ సాంద్ర. ||అత్రి||
నిర్మల మూర్తి, నిరుపమ రూప,
దారిద్య ధ్వంశ, దీన జన మిత్ర,
గరుడ, హంస, నంది వాహన గమన,
కరుణ స్వరూప, కమల నేత్ర. ||అత్రి||
చక్ర, త్రిశూల, చతుర్వేద హస్త,
సుకుమార దేహ, స్థిత ప్రఙ్ఞ,
ఆకళంక రూప, ఆనంత తేజ,
సకల జన సన్నతు, శ్రీశుభాంగ! ||అత్రి||
మాయ వినాశక, మధుర రూప,
తోయజాక్ష, తఱలు ఙ్ఞాన రూప,
సాయి, శ్రీపాద, సకల గురు రూప,
భయ భవ నాశ బుద్ధి వికాశ. ||అత్రి||
రచించి మాకు పంపినవారు నవారు రమాకాంతరావు చాకలకొండ
| ||||
నమస్తే హితులారా! అందరికీ నమస్తే హితులారా! అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
సినిమావాళ్ళ దృష్టిలో ' గురువు ' ఒక బఫూన్ అయిపోయాడు. వాళ్ళు ఆ చెత్త సీనులు వ్రాసిన అక్షరాలు నేర్చుకొన్నది యీ గురువు దగ్గరే అని మరిచిపోయారు. " ఏరు దాటాక ఓడ మల్లయ్యను బోడి మల్లయ్య" అనే రకాలు. ఆయనెవడో నగ్న సరస్వతిని చిత్రిస్తే గొప్ప కళాఖండమని చంకలు కొట్టుకొనే రకాలు. వదిలేయండి.
నా దృష్టిలో తల్లిదండ్రుల ఆశాసౌధానికి రూపాన్నిచ్చే " మేస్త్రీ " గురువే! ఆ గురువుకి నాప్రణామాలతో యీ గీతం. . . .
గురుపూజ
బై
సోమసుధ
పూజకు రండి - గురుపూజకు రండి
అక్షరసుమాల గీతమాలను
గళమున వేసి గణుతించండి
పూజకు రండి - గురుపూజకు రండి
బంగరుభావికి రూపము నిచ్చి
ప్రాణముపోసే బ్రహ్మదేవుడు
ఆశల సిద్ధికి ఆయుధమైన
ధీయుతశక్తి విష్ణువాతడు
అడుగు అడుగులో లయలను కూర్చి
కలలను కళగా మార్చే రుద్రుడు
మూడు తేజాల స్ఫూర్తిప్రదాత
మూర్తిమంతుడీ పుడమిని గురువే! ~ పూజకు ~
అమ్మల అమృతజీవనఝరికి
వారధి కట్టే సారధి గురువే!
నాన్నల మధుర భావనాళికీ
జీవప్రదాత, వేలుపు గురువే!
తడబడువేళల నూతము తానై
అంబరవీధుల నడిపిస్తాడు
జ్ఞానవీధిలో వెలిగే సోముడు -
మాటతో మనసును గెలిచే రాముడు ~ పూజకు ~
* * *
సినిమావాళ్ళ దృష్టిలో ' గురువు ' ఒక బఫూన్ అయిపోయాడు. వాళ్ళు ఆ చెత్త సీనులు వ్రాసిన అక్షరాలు నేర్చుకొన్నది యీ గురువు దగ్గరే అని మరిచిపోయారు. " ఏరు దాటాక ఓడ మల్లయ్యను బోడి మల్లయ్య" అనే రకాలు. ఆయనెవడో నగ్న సరస్వతిని చిత్రిస్తే గొప్ప కళాఖండమని చంకలు కొట్టుకొనే రకాలు. వదిలేయండి.
నా దృష్టిలో తల్లిదండ్రుల ఆశాసౌధానికి రూపాన్నిచ్చే " మేస్త్రీ " గురువే! ఆ గురువుకి నాప్రణామాలతో యీ గీతం. . . .
గురుపూజ
బై
సోమసుధ
పూజకు రండి - గురుపూజకు రండి
అక్షరసుమాల గీతమాలను
గళమున వేసి గణుతించండి
పూజకు రండి - గురుపూజకు రండి
బంగరుభావికి రూపము నిచ్చి
ప్రాణముపోసే బ్రహ్మదేవుడు
ఆశల సిద్ధికి ఆయుధమైన
ధీయుతశక్తి విష్ణువాతడు
అడుగు అడుగులో లయలను కూర్చి
కలలను కళగా మార్చే రుద్రుడు
మూడు తేజాల స్ఫూర్తిప్రదాత
మూర్తిమంతుడీ పుడమిని గురువే! ~ పూజకు ~
అమ్మల అమృతజీవనఝరికి
వారధి కట్టే సారధి గురువే!
నాన్నల మధుర భావనాళికీ
జీవప్రదాత, వేలుపు గురువే!
తడబడువేళల నూతము తానై
అంబరవీధుల నడిపిస్తాడు
జ్ఞానవీధిలో వెలిగే సోముడు -
మాటతో మనసును గెలిచే రాముడు ~ పూజకు ~
* * *
No comments:
Post a Comment