Friday, 25 September 2015

ప్రాంజలి ప్రభ - సరస్వతి కి పర్యాయపదములు

ఓం శ్రీ రాం  -   ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం
ప్రాంజలి ప్రభ - సరస్వతి కి పర్యాయపదములు

సర్వేజనా సుఖినోభవంతు
సరస్వతి కి పర్యాయపదములు
(జి. ఎన్ రెడ్డిగారి "తెలుగు పర్యాయపద నిఘంటువు" నుండి)

1. అంచతత్తడి చలియ 2. ఉక్తి, 3. కబ్బము, 4. ప్రోయాలు, 5. గీర్దేవి, 6. చదువుతొయ్యలి, 7. చదువులజవరాలు, 8. చదువులపడతి, 9. చదువులమ్మ, 10. తెల్లనితల్లి, 11. దేవి, 12. ధవళాంగి, 13. నలువరాణి, 14. నుడుగుల చెలి, 15. నుడువులననబోణి, 16. నుడువులపడతుక, 17. నొడువుజవ్వని, 18. పద్మలాంచన, 19. పలుకుకలికి, 20. పలుకు జిలకల కొల్కి, 21. పలుకుజెలి, 22. పలుకుటెలనాగ, 23. పలుకుతొయ్యలి, 24. పలుకుపూబోడి, 25. పలుకుబోటి, 26. పలుకుముద్దరాలు, 27. పల్కుజవరాలు, 28. పల్కుననబోడి, 29. పారాయణి, 30. పావకి, 31. పూత్కారి, 32. పొత్తువు, 33. బాణ, 34. బాస, 35. బ్రహ్మకన్యక, 36. బ్రహ్మసతి, 37. బ్రాహ్మి, 38. భగవతి, 39. భారతి, 40. భాష, 41. భాషాయోష, 42. భాషాలక్ష్మి, 43. మాటలబోటి, 44. మాటలమిటారి, 45. మినుకుగొమ్మ, 46. మినుకుచేడియ, 47. ముఖనివాసిని, 48. మేధావిని, 49. లచ్చికోడలు, 50. వర్ణమాతృక, 51. వాకు(వాక్కు), 52. వాక్కాంత, 53. వాక్కుచేడియ, 54. వాగీశ్వరి, 55. వాగ్దేవి, 56. వాగ్భామ, 57. వాణి, 58. విద్దెలతల్లి, 59. విద్యాదేవి, 60. వేదాగ్రణి, 61. శాబ్ధి, 62. శారద, 63. శుక్ల, 64. శ్రీ, 65. శ్రుతదేవి, 66. సనాతని.

కం. తలవాఁకిటను మెలంగెడుపొలఁతుక
పలుకుల వెలఁది, పొత్తముముత్తో
నలువపడఁతి కలుములపై
దలికోడ లనంగఁ బరఁగు (ధర) వాణి (శివా)


తలవాఁకిటను మెలంగెడు పొలఁతుక=శిరస్సునకు ద్వారమైన నోటి యందు సంచరించెడు స్త్రీ, పలికులవెలంది=వాక్కులకు అధిదేవత యగు పడుచు, పొత్తము ముత్తో= పుస్తకములందు వెలయునట్టి ముత్తైదువ, నలువపడఁతి= బ్రహ్మదేవుని భార్య, కలుములబైదలికోడలు=సంపదలకధిదేవతయైన లక్ష్మీదేవికి కోడలు.


పైడిపాటి లక్ష్మణ కవి "ఆంధ్రనామ సంగ్రహము" నుండి


అజరాణి; నిగమప్రతి తతి అభిమాని; బ్రహ్మాణి; వీణాపాణి; శారదాంబ; ధవళగీత; విధికాంత; వాగ్దేవి;సరస్వతి, మీకు మాకు సమ్పూర్ణ  విద్యను సాధించాలని కోరు కుంటున్నాను,  సుబ్రహ్మణ్యంగారు బహు చక్కని ప్రయత్నము. నిరాఘాట ముగా కొనసాగించండి. శుభం భూయాత్. అందరికి హృదయపూర్వకఅభినందనలు

No comments:

Post a Comment