Sunday, 23 August 2015



ప్రాంజలి ప్రభ 
సేకరణ : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

తిరుమల లో వున్న జయ విజయులు ఎవరు ! 

వైకుంఠథామమున శ్రీ మహావిష్ణు మందిరమునకు కావలివారు జయ విజయులు. ఒకనాడు సనక, సునంద, సనత్క్ మార, సనత్సుజాతులను బ్రహ్మమానసపుత్రులు ఐదే౦డ్ల బాలకులైన శ్రీహరిని జూచుటకు వచ్చిరి. జయవిజయులు వారిని లోనికి బోనియక అడ్డగించారి. వారు బ్రహ్మజ్ఞానులైన మమ్ము మీరు అడ్డగించుట యముకాదనిరి . ఐనను వారు వినలేదు. మునులు వారిని భూలోకంలో రాక్షసులై పుట్టమని శపించిరి. శ్రీహరి వచ్చి విషయము తెలిసుకొని సనకాదులను లోనికి తీసుకుని వెళ్ళేను . 

తరువాత ద్వారపాలకులు మాధవునకు నమస్కరించి నిలిచిరి. విష్ణువు వారినోదార్చి మూడు జన్మము లెత్తి నాకే సంహరింపబడి తరువాత వైకుంఠమునకు వచ్చేదరులేమ్మని చెప్పెను. వారు మొదట జన్మమున హిరణ్యాక్షహిరణ్యకశిపులు, రెండోజన్మమున రావణకుంభకర్ణులు, మూడవజన్మమున శిశుపాల దంతవక్త్రలుగా పుట్టిరి. మట్టిచే తయారు చేయబడిన పాత్రలలో నామ రూప భేదమే కాని వాస్తవ భేద మెంత మాత్రము లేదు. ఉన్నది ఒకే మట్టి. అలాగే నురగలు, కెరటాలు, బుడగలు మొదలైన బుడగలన్నీ సముద్ర లక్షణాలు.. కానీ ఆ సముద్రం మాత్రం ఏకైకమైనదే.. ఇదే  తరహాలో "వాస్తవానికి దృశ్య పదార్థాలన్నీ శివ స్వరూపాలే". 

నేను, నీవు, ఈ బ్రహ్మ.. భవిష్యత్తులో ఆవిర్భవించనున్న నా రుద్రమూర్తీ ఇవన్నీ ఏకస్వరూపాలే. వీటిలో ఏ బేధం లేదని" విష్ణువుతో పరమేశ్వరుడు తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. దితి ఒకప్పుడు సంతానము గోరి భర్తయగు కశ్యప ప్రజాపతి జేరెను. ఆమెకు హిరణ్యాక్షహిరణ్యకశిపులు కవలపిల్లలుగా జన్మించిరి. వారు బ్రహ్మను గూర్చి ఉగ్రతపము చేసి అనేక వరములు సంపాదించిరి .ఆ వరగర్వముతో లోకములకు పిడ కలిగించుచు౦డిరి. హిరణ్యాక్షుడు మరింతగా లోకములను బాధించుచు తన్నెదిరించువారు కనిపించక వరుణునిమీదకి దండయాత్రకుబోయను. వరుణుడతనిని గెలుచుట తనవలన గాదని గ్రహించి,''నిన్నెదిరించువాడు ఒక్క విష్ణువు కావున వైకుంఠమునకు పొమ్మనెను. వాడు అచటికివెళ్ళి, విష్ణువు యజ్ఞవరాహమూర్తియై రసతలమున నున్నాడని విని అచ్చటికి పోయెను.

No comments:

Post a Comment