ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్
ప్రాంజలి ప్రభ

హాస్యకధ
డిసిప్లైన్ (కధ)
రచన : గొర్తి వెంకట సోమనాధ శాస్త్రి(సోమసుధ)
"సెక్షన్ హెడ్ అయ్యాక కోదండం డిసిప్లైండ్ మనిషైపోయాడేంటి గురూ?"
అతని ఆఫీసులోగానీ, స్నేహబృందంలో గానీ యిద్దరు వ్యక్తులు కలిస్తే కోదండం
గూర్చి చెప్పుకొనే మొదటి వాక్యమిదే! చదువుకొనే రోజుల్లో కూడా లేని '
డిసిప్లైన్ ' అతనికిప్పుడు అర్ధాంగి కన్న ఎక్కువైపోయింది. అతను మాట్లాడే
ప్రతిమాటలోను డిసిప్లైన్ పై కోదండానికున్న తహతహను చూపుతూంటుంది.
ఒకరోజు యింట్లో ఆఫీసుఫైళ్ళతో కుస్తీ పడుతున్నాడతను. ఆరేళ్ళ కూతురు
ఏడుస్తూ అతన్ని సమీపించింది. అతను పట్టించుకోకపోయేసరికి శ్రుతి పెంచింది. "
ఏమిటి? " చిరాగ్గా అరిచాడతను.
"అన్నయ్య. . నా పెన్ను లాగేసుకొన్నాడు" ఏడుస్తూ చెప్పింది.
"ఈ మాట చెప్పటానికి నా పని పాడుచెయ్యాలా? ఇలాంటి చిన్న చిన్న
కంప్లైంట్స్ మీ అమ్మకివ్వాలని ఎన్నిసార్లు చెప్పాను?.. . ఛీ. . ఛీ . . .
మరీ డిసిప్లైన్ లేకుండా పోతోందీ కొంప. ." తండ్రి కేకలకు నోరు మూసేసిందా
పిల్ల. ఆ కేకలకు పరుగున వచ్చిందతని భార్య.
" నీ కూతురు పెన్ను దానన్న లాగేసుకొన్నాట్ట. అది యిక్కడకొచ్చి నా బుర్ర పాడుచేస్తోంది " భార్యపై అరిచాడతను.
" బాగుంది. .తండ్రి కదాని మీకు చెప్పింది. ఆ మాత్రానికే కేకలెయ్యాలా?"
" చిన్న సమస్యలను నీతో చెప్పాలి గాని నా దగ్గరకు రాకూడదు. నీకూ కష్టమైతేనే నా దగ్గరకు రావాలి అదీ ప్రొసీజర్! " అన్నాడతను.
" బాగుంది. తండ్రితో మాట్లాడ్డానికీ ఓ పద్ధతుందని పసిపిల్లకేం తెలుస్తుంది?" భార్యమాటలకు గొంతు స్థాయి హెచ్చించాడు.
"తెలియకపోతే తెలుసుకోవాలి. ఆఫీసులో చిన్న విషయాలన్నీ సెక్షన్ హెడ్డే
చూసుకొంటాడు.మరీ పెద్ద విషయాలకే ఆఫీసరు దగ్గర కెడతారు. ఆ లెక్కప్రకారం
యింట్లో చిన్న తగవులను సెక్షన్ హెడ్డువైన నువ్వే చూసుకోవాలి. అది తెలుసుకోక
మాటకి మాట చెబుతావా? ఎక్కువ మాట్లాడితే మెమో యిచ్చి సంజాయిషీ అడుగుతాను.
జాగ్రత్త!"
భర్తతో వాదించలేక కూతుర్ని నాలుగంటించి అక్కడినుంచి యీడ్చుకుపోయింది.
మరొకరోజు - కోదండం భోజనం తిని సోఫాలో కూర్చుని న్యూస్ పేపరు
చదువుతున్నాడు. తొమ్మిదేళ్ళ కొడుకు భయపడుతూ అతన్ని సమీపించాడు.
కొద్దిక్షణాలు చూడనట్లే నటించాడతను.
" నాన్నా! . . .స్కూల్లో ప్రోగ్రెస్ కార్డిచ్చారు. . దానిపై మీ సంతకం.
.. " నసుగుతున్న కొడుకు చేతిలో పెన్ను, కార్డు లాక్కుని, దానిపై ఏదో గిలికి
వాడి మొహాన కొట్టాడు.అది చూసిన వాడి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. వచ్చే
కన్నీళ్ళాపుకొంటూ వంటింట్లోకెళ్ళాడు. మరుక్షణం కోదండం భార్య దూకుడుగా
వచ్చింది. ఆమె చేతిలో ప్రోగ్రెస్ కార్డుంది.
" వాడు దీనిమీద మీ సంతకం అడిగితే 'త్రూ ప్రోపర్ ఛానల్ ' అని వ్రాశారేంటి? " గద్దించిందామె.
"అది పద్ధతి. నన్ను విసిగించకు " అంటూ పేపర్లో తలదూర్చాడతను. ఆమె కోపంగా చేతిలో పేపరు లాగేసరికి తారాజువ్వలా లేచాడతను.
" పద్ధతి ప్రకారం ఏదైనా కాగితంపై ఆఫీసర్ సంతకం కావాలంటే దాన్ని సెక్షన్
హెడ్. . అంటే యిక్కడ. . నువ్వు చూశాక నా దగ్గరకి పంపాలి. వాడికది
తెలియాలనే అలా వ్రాశాను"
" పోనీ దాన్ని చూసి నేనే పంపాననుకోవచ్చుగా "
" దానిపై నువ్వు ఇనీషియల్ వేస్తేనే నువ్వు చూసినట్లు" కోదండం బదులుకు ఖంగు తిందామె.
" బాగుంది. సక్రమంగా పనులవటానికి ఆఫీసులో కొన్ని పద్ధతులుండొచ్చు.
వాటిని సంసారాల్లో కూడా అమలు చేయాలంటే ఎలా? అర్జంటుగా రమ్మని మా వాళ్ళు
ఉత్తరం వ్రాస్తే సెలవుచీటి యిమ్మనేలాగుంది మీ తంతు.. "
"యస్. . దానితో పాటు హెడ్ క్వార్టర్ లీవ్ పెర్మిషన్ కూడా తీసుకోవాలి.
అంతేకాదు. నీ సెలవుచీటీకి మీ వాళ్ళు వ్రాసిన ఉత్తరం జతచేయాలి.అదీ పద్ధతి "
భర్త మాటలకు
అవాక్కయింది.
" జీవితంలో డిసిప్లైన్ లేకపోతే బ్రతకటం కష్టం. అది నువ్వు నేర్చుకొని పిల్లలకు నేర్పు" క్లాసు పీకాడతను.
"ఇకపై అలాగే చేస్తాను. దీనిపై సంతకం చేయండి"
" దానిపై నీ ఇనీషియల్ వేయి ముందు " భర్త చెప్పినట్లే చేసిందామె.
ఏడాది తరువాత -
ఆసుపత్రిలో కళ్ళడాక్టరిచ్చిన మందులు తీసుకొని గది బయటకొచ్చాడు
సుదర్శనం. అప్పుడే తన ముందునుంచి పోతున్న కోదండాన్ని చూసి పిలిచాడు.
వెనక్కి తిరిగిన కోదండానికి సుదర్శనం కనిపించాడు.
"ఏమయ్యా సుదర్శనం? ఏమిటిలా వచ్చావ్?"
"వారంనుంచి తలనొప్పి చంపేస్తోంది బాబాయిగారూ!చూపించుకొని మందులు తీసుకొన్నా. మరి మీరు?" అడిగాడతను.
"రాత్రి మీ పిన్నికి పురిటినొప్పులొచ్చాయోయ్! ఆపరేషన్ చేయాలని కొన్ని మందులు వ్రాశారు. కొని తెస్తున్నా"
"అలాగా! పదండి. . " అంటూ అతనితో పాటు ఆపరేషన్ ధియోటర్ కొచ్చాడు
సుదర్శనం. అప్పటికే ఆపరేషన్ మొదలైనట్లుంది. బయట నిలబడ్డ నర్స్ కోదండం
యిచ్చిన మందులు తీసుకొని లోనికెళ్ళింది. పావుగంట తరువాత హుషారుగా
బయటకొచ్చిందామె.
" గుడ్ న్యూస్ కోదండంగారూ! . . .ఆపరేషన్ సక్సెస్. .కవలపిల్లలు.మగపిల్లలే! తల్లీ, పిల్లలూ క్షేమం"
"ఇప్పుడు చూడొచ్చా?" ఆదుర్దాగా అడిగాడామెను.
"పావుగంట ఆగాలి" అంటూ వచ్చినంత వేగంగా లోనికెళ్ళిందామె. నర్స్
చెప్పింది విని బలంగా గాలి పీలుస్తున్న కోదండాన్ని చూసి సుదర్శనం గుండె
వేగం హెచ్చింది.
" చూశావా సుదర్శనం? ఇన్నాళ్ళకు మా ఆవిడ నా డిసిప్లైన్ని వంట
పట్టించుకొందయ్యా! కవలపిల్లలు. .అంటే యిద్దరిదీ ఒకే పోలికన్న మాట! మన
ఆఫీసులో ప్రతీ లెటర్ కీ ఒక ఆఫీస్ కాపీ ఉంటుందికద! మా ఆవిడ ఆ రూలు ఎంత
చక్కగా పాటించిందో చూడు. యిద్దరిలో ఒకడొరిజినల్ అయితే రెండవ వాడు ఆఫీస్
కాపీ అన్న మాట "
కోదండం డిసిప్లైన్ స్టేట్మెంట్ కి అసలే గుండెదడగా ఉన్న సుదర్శనం కళ్ళు తిరిగి ప్రక్కనున్న బల్లపై దబ్బున పడిపోయాడు.
* * *
(అచ్చంగా తెలుగు - వెబ్ మాగజైను(సెప్టెంబరు)లో ప్రచురితమైన నా కధ
--((**))--
హాయ్ ఫ్రండ్స్ ..
కొన్ని పోస్ట్లకు చూసి చూడనట్లు ఎందుకు వుండవు అని ఒక పేస్ బుక్
మిత్రురాలు అడిగాక ఈ లెటర్ రాయాలి అనిపించింది.. తానున్న సమాజమో ,,
దేశమో,, కులమో ,, మతమో తమ ఎదుగుదలకి అవరోధాలు అంటూ భావించే వాళ్ళ పోస్ట్లను
చూస్తె కొంచెం B P వచ్చేసేది కూడా బహుసా నేను పెరిగిన వాతావరణమే
కావచ్చు.. జీవితం తొలి రోజుల్లో కేవలం ఒక పూట మాత్రమె కూర తో భోజనం ,,
రెండవ పూట ఆవకాయ పెరుగే .. అందుకే నా లైఫ్ షేర్ చేసుకోవాలి అనుకున్నా ఈరోజు
పదమూడు మంది సంతానం లో పదో నెంబర్ గా నా జీవితం మొదలు.. నా చిన్నప్పుడే
నాన్న పోవడంతో ,,సంతకం కూడా పెట్టడం రాని మా అమ్మ గారిని మోసం చేసి
బందువులు ఆస్తి మొత్తం కాజేశారు.. కట్టు బట్టలతో హైదరాబాద్ వచ్చి .. కేవలం
తనకు వచ్చిన పని వంట .. దానినే ఉపాధిగా మలుచుకొని తెల్లవారు ఝామున
నాలుగింటికి లేచి ఒక ఇరవయ్ కిలోల తరిగి కూరలు చేసేవారు ..అన్నయ్యలు కాస్త
చేతికి అంది వచ్చేవరకూ అమ్మ వంటే ఇంటి అంతటికీ ఆధారం .. కష్టపడే తత్వం
ఉన్నవాడు ఎప్పుడు ఒకరికి కింద చేయి పెట్ట వలసిన అవసరం రాదనీ నిరూపించిన
వ్యక్తీ .. తనే నా మొదటి గురువు.. ఆమె నుండి నేను నేరుచుకున్న ఆ కష్టపడే
తత్వం కేవలం B com చదివిన నేను ఒక MSC Software కంపెనీ కి A P regional
head స్థాయికి చేర్చింది .
Emacet లో స్టేట్ మొత్తం లో నాకు వచ్చిన రాంక్ 100.. కాని ఇంజనీరింగ్
చదివించే స్తోమత లేకపోవడం అయిష్టం గానే డిగ్రీ లో చేరా .. ఓ పక్క డిగ్రీ
చదువుతూనే ,, పార్ట్ టైం జాబు.. ఓ బయో టెక్నాలజీ కంపెనీ లో డేటా ఎంట్రీ
ఆపరేటర్ గా.. అక్కడే పరిచయం రమణ గారు.. అందరి టైపింగ్ లో చాల మిస్టేక్స్
నీ టైపింగ్ లో వెతికినా మిస్టేక్స్ దొరకవు.. క్లినికల్ త్రియల్స్
కాన్సెప్ట్ మీద మంచి పట్టు సాధించావు .. నీకు మంచి భవిస్యత్తు ఉంది.అంటూ
పొగిడారు ఓ రోజు . ఎంసెట్ లో మంచి రాంక్ వచ్చినా ఇంజనీరింగ్ లో చేరాలకే
పోయానని తెలుసుకొని. . చదువు అంటే డిగ్రీ పట్టాలు కాదు అవి నీ మొదటి
ఉద్యోగానికే అర్హత గా పనికొస్తాయి.. knowledge ఉంటెనే ఉద్యోగం లో
ఎదిగేది.. అంటూ soft ware ఇంజనీరింగ్ పుస్తకాలు చదమని ప్రొతహించారు..
కోటి లో సెకండ్ హాండ్ బుక్స్ కొనుక్కుని C ++ కోడింగ్ సాధన చేయడం
మొదలుపెట్టా .. ఆఫీసు అయ్యాకా అందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత .. రాత్రి
తొమ్మిది వరకూ ఆఫీసు లో systems use చేసుకుంటూ . పొద్దున్న నాలుగింటే లేవడం
కాసేపు డిగ్రీ బుక్స్ , తర్వాత కాలేజీ ,, అదయ్యాక ఉద్యోగం .. ఆ తర్వాత
ఇంకో రెండు గంటలు కోడింగ్ ప్రాక్టిసే .. ఇంటికి వచ్చేటప్పటికీ రాత్రి పది.
..పడ్డ కష్టానికి త్వరలో నే మంచి గుర్తింపు వచ్చింది.. డిగ్రీ పూర్తీ
కాకుండానే అదే కంపెనీ లో సిస్టం అనలిస్ట్ గా ప్రమోషన్.. చదువు అంటే
పట్టాలు కాదు knowledge అని చెప్పిన మా నా రెండవ గురువు రమణ గారికి
ఎప్పుడూ రుణ పడి ఉంటాను..
డిగ్రీ పూర్తయ్యింది.. MCA ఎంట్రన్స్ రాసా మళ్ళీ మంచి రాంక్ .. మంచి
కాలేజీ లో సీట్ .. పొద్దున్న కాలేజీ ,, తర్వాత జాబు.. కొద్ది రోజులు
గడిచాయో లేదో .అక్క పెళ్ళిలో నిన్ను చూసారట ,, కట్నం వద్దు అంటూన్నారు
..పిల్లవాడిది మంచి ఉద్యోగం అంటూ కాదనకు అంటూ అమ్మ సంబధం గురించి చెప్పడం
,, పెళ్లి జరగడం అంటా ఫాస్ట్ గా అయిపొయింది.. అత్తగారికి ఉద్యోగం ఇష్టం
లేదు.. ఇంక నా కెరీర్ పూర్తిగా మూల పడ్డట్టే అనుకున్న సమయం లో మళ్ళీ నన్ను
encourage చేసింది మా వారు.. అత్తగారిని ఒప్పించి మళ్ళీ నన్ను కెరీర్ బాట
పట్టించారు .MCA చదువు అటక ఎక్కినా atleast జాబు అన్న చేయమన్నదుకు అత్తగారి
కృతజ్ఞతలు చెప్పుకుని మళ్ళీ జాబు లో చేరా . ఇక ఆ తర్వాత వెను తిరిగి
చూసుకొంది లేదు.. ఏ soft ware enginering చేయాలని కలలు కన్నానో ఆ డిగ్రీ
చేయక పోయినా ,, అదే వృత్తిలో అంచెలు అంచెలుగా ఎదిగి M tech .. B tech చేసిన
రెండు వందల మందినే లీడ్ చేసే ఉద్యోగం లో స్థిర పడి నెలకు మూడు లక్షలు
సంపాదించే స్థాయికి ఎదిగాను.. ఇందుకు నేను రుణ పడ్డ వ్యక్తీ మా వారు ..
అంతా సవ్యం గా జరిగితే జీవితం ఎందుకు అవుతుంది.. . ఓ నర్స్ నిర్లక్ష్యం
.. రాంగ్ ఇంజక్షన్ ఇవ్వడం తో రియాక్షన్ వచ్చి .. ఏడో నెల కడుపు పోవడం .
విపరీతమైన రక్త స్రావంతో hemarage లోకి వెళ్లి ఒక నెల ICU లోనే ఉండాల్సి
రావడం ..ఆ సమయం లో నా స్నేహితులు ,, మా వారు ఒక్క క్షణం నన్ను విడిచి
ఉండలేదు ఎక్కడ deppression లోకి వెళ్తానో అని.. ఆ తర్వాత కోలుకుని మళ్ళీ
మామూలు జీవితం లోకి వచ్చేసాను.. ఆ తర్వాత బాబు.. అంతా హ్యాపీ అనుకుండగా
మళ్ళీ రెండవ పాప కాన్పు సమయం లో మళ్ళీసమస్య తిరగ పెట్టింది.. ఈ సారి బతకడం
కష్టమే అని తేల్చి చెప్పేశారు డాక్టర్స్.. అయినా ఏదో విల్ పవర్ .. positive
ఆటిట్యూడ్ కష్టమైన ట్రీట్ మెంట్ కూడా తట్టుకొని మళ్ళీ పునర్జన్మ ఎత్తాను..
ఆ తర్వాత జాబు పూర్తిగా వదిలేసే ఇంటికే పరిమతం ..
తిరిగే కాలు,, తిట్టే నోరు ఊరికే ఉండవుగా .. కష్టపడటం అలవాటు అయ్యాక
ఖాళీగా ఉండటం పనిష్మెంట్ లా గే ఉండేది.. అందుకే మళ్ళీ కన్సల్టెన్సీ ఇంటి
దగ్గర ఉండే business చేసేలా మా వారిని ఒప్పించి మొదలు పెట్టా.. సరిగ్గా
గురు పూర్ణిమ రోజే మూడు నెలల కష్టానికి మొదటి ఫలితం పెద్ద మొత్తం లో
వచ్చింది..హ్యాపీ హ్యాప్పీ .
అందుకే ఫ్రండ్స్ జీవితం అన్నాక ఆటు పోటులు ఉంటాయి .. ఎవరి జీవితం
నల్లేరు పై నడక కాదు.. పడ్డప్పుడల్లా లేచి మళ్ళీ అడుగేయడమే .. సునాయాస
గెలుపు కన్నా .. కస్టపడి సాధించే గెలుపు చిన్నదైన ఎక్కువ ఆనందాన్ని
ఇస్తుంది.. మన వైఫల్యాలకు ఇతరులు కొంత కారణం కావచ్చేమో కానీ మొత్తంగా
ఎప్పటికీ కారణం కాలేరు .... స్త్రీల విషయం లో అత్తారింటి పర్మిషన్
కావాలేమో ,, కాని పురుషులకు ఆ పరిస్థితి లేదు గా.. అయినా తమ ఎదుగుదలకు
అవరోధం గా సమజాన్నో ,, దేశాన్నో తిట్టే వారిని చూస్తె BP వచ్చేది అందుకే..
ఇప్పటికే మీ బుర్ర చాల తినేసి నట్ల్లున్నా మరి ఉంటా
రేవతి (kastuuri vaaru pampina jiivitam )
No comments:
Post a Comment