ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం
ప్రాంజలి ప్రభ - ఆద్యాత్మిక కధ
సర్వేజన సుఖినోభవంతు
శ్రావణమాసంలో అతిముఖ్యమైనది వరలక్ష్మి వ్రతం. లక్ష్మి దేవి ని ఆవాహనం చేసి , మన తాహత మేరకు ఆమెకు ఉపచారాలు చేసి, సౌభాగ్యం, సంపద, అందరి క్షేమం కోసం పూజ చేస్తాం. ఈ వ్రతం రోజు కొందరు కలిశం పెడతారు, ఆ పద్ధతి లేని వారు అమ్మవారి పటానికి పూజ చేస్తారు.
స్కంద పురాణం లో వరలక్ష్మి వ్రతం గురించి పరమశివుడు, పార్వతి దేవికి వివరిస్తారు. చారుమతి యొక్క కదే ఈ వ్రత కధ. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమి కి ముందే వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేయాలి.
ఏ పూజ మొదలుపెట్టాలన్న, ముందుగా గణపతిని పూజించాలి. ఆ ప్రకారం ముందుగా పసుపు వినాయకుడికి పూజ చేసి, అమ్మణి ఆవాహనం చేయాలి. కలిశా పూజ చేసి అమ్మవారిని ఆహ్వానించాలి. లక్ష్మి అష్టోత్తరం చేసాక, తొమ్మిది ముడులతో కూడిన తోరాలకు తోరపు పూజ చేయాలి. వరలక్ష్మి వ్రత కధ చదివి, అమ్మకి హారతి ఇచ్చి, నైవేద్యం పెట్టి, పూజలో పెట్టిన తోరం కట్టుకొని, ముత్తైదువలకు తాంబూలం ఇవ్వాలి. అమ్మవారి ప్రసాదం అందరు తీసుకోవాలి.
వరలక్ష్మి వ్రతం ముఖ్యంగా పసుపు కుంకుమలకు, సౌభాగ్యానికి ప్రతీక. అమ్మవారి దయను పొందాలని ప్రతి ముత్తైదువ అమ్మవారిని ప్రార్ధిస్తుంది. మనం చేయడమే కాదు, వ్రతం తెలియని వారికి చెప్పి చేయిస్తే మంచి పలితం ఉంటుంది.
అమ్మ వారి పూజలో పెట్టిన తోరమే మనకు శ్రీ రామ రక్షగా ఉండి కాపాడుతుంది.
వరలక్ష్మి మనని వీడిపోకుండా ఉండాలంటే మనం చేయకూడని పనులు అలాగే ఎలాంటి చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. అందరిని ఆవరలక్ష్మిదేవి సదా కాపాడాలని, మనస్పూర్తిగాకోరుకుంటూఅందరికి వరలక్ష్మిఅమ్మనికోరుతూ...
వరలక్ష్మీ నమోస్తుతే...వరలక్ష్మీ నమోస్తుతే.!
.
"లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం. శ్రీ రంగథామేశ్వరీం
దాసీభూత సమస్త దేవ వనితాం ..లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవః .. బ్రహ్మేంద్ర గంగాధం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం.. వందేముకుందప్రియామ్"
.
శుక్రవారం పూటే వచ్చిన శ్రీ వరలక్ష్మీ వ్రత దినాన నిష్టతో లక్ష్మిదేవిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.
ఆ రోజున స్త్రీలు వరలక్ష్మి భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం. అందుచేత శుక్రవారం వచ్చిన శ్రీ వరలక్ష్మీ వ్రత పుణ్య దినాన్ని విశేషంగా జరుపుకుందాం..
శ్రీ వరలక్ష్మీ వ్రతం సందర్భం గా మిత్రులు అందరికీ శుభోదయం మరియు శుభాకాంక్షలు......