Monday, 31 July 2023







 మాంగల్యధార వేనుక ఉన్న పరమరహస్యం ఏంటీ ?

హిందూ వివాహ తంతులో మాంగల్యధారణే అతి ప్రధానమైనది. మాంగల్యానికే మంగళసూత్రం, తాళి, తాళిబొట్టు, పుస్తె, శతమానం అనే పేర్లతోబాటూ వివిధ రూపాలు కూడా ఉన్నాయి. మానవులకు మనువాడటం ఎంత ముఖ్యమో, మనువాడటానికి మంగళసూత్రం అంతే ముఖ్యం.
వివాహ సమయం నుండి స్త్రీలు మంగళ సూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్ధంలోనే ఆరంభమయింది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. సంస్కృతంలో 'మంగళ' అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్ధాలు కలవు. సూత్రం అంటే తాడు, ఆధారమైనది అని అర్ధాలు కలవు. సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు కలిపికూడా కొందరు తాళిని తయారు చేస్తారు. మంగళ సూత్రధారణ జరుగునపుడు ఈ మంత్రమును పఠిస్తారు.

" మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం .
భారతదేశంలో వివాహం వెనుక ఎంతో శాస్త్రీయత ఉంది. ఇద్దరు వ్యక్తులకు వివాహం చేసేటప్పుడు చూసేది కేవలం రెండు కుటుంబాలు, రెండు దేహాల కలయిక కానే కాదు, అంతర్గతంగా ఇద్దరు వ్యక్తుల మధ్య గాఢమైన శక్తి సంబంధిత అనుకూలత ఉండాలన్నదే వారి ఉద్దేశం. అప్పుడే వివాహాన్ని నిశ్చయించే వారు. చాలా సార్లు అసలు వివాహం చేసుకోబోతున్న ఇరువురు ఒకరినొకరు పెళ్లి రోజు దాకా చూసుకునే సందర్భం కూడా ఉండేది కాదు. అయినా అది అంత ముఖ్యం కాదు, ఎందుకంటే వారి మధ్య సయోధ్యను కుదిర్చిన వారు, ఆ జంట కంటే ఆ విషయం బాగా తెలిసిన వారు. వధూవరుల వివాహ సమయానికి మంగళసూత్రాన్ని సిద్ధం చేసేవారు.

‘మంగళ సూత్రం' అనగా పవిత్రమైన సూత్రం'(దారం). ఈ పవిత్రమైన సూత్రాన్ని తయారుచేయటం విస్తృతమైన శాస్త్రం. కొన్ని వడికిన నూలు దారాలను తీసుకొని, పసుపు కుంకుమలు రాసి ఒక పద్దతిలో శక్తిమంతం చేస్తారు. ఒకసారి ముడి వేస్తే ఈ జీవితానికే కాక ఆపైన కూడా నిలిచి ఉండేలా మంగళ సూత్రం తయారుచేసే వారు. ఆ ఇద్దరిని కలిపి ముడి వేసుందుకు వారు వినియోగించిన విధానాలు కేవలం భౌతిక, మానసిక స్థాయిలోనే కాక వారి నాడులు కూడా కలిపి ముడి వేయటం వల్ల అదే జంట అనేక జీవితాల పర్యంతం అలా కలిసి ఉంటుంది.

భౌతికమైన, మానసిక, భావావేశ స్థాయిల్లో చేసేది ఏదైనా మరణంతో పూర్తి అయి పోతుంది. కానీ శక్తి స్థాయిలో చేసేది శాశ్వతంగా మిగులుతుంది. ఎంతో గాఢంగా, మన అవగాహనకు అందని విధంగా ఎలా ముడి వేయాలో తెలిసిన వారిచే ముడి వేయటం వల్ల ఆ బంధం గురించి పునరాలోచన చేసే ప్రశ్నే లేదు. ఇదే క్రతువు ఈనాడూ జరుగుతున్నా ఏమీ తెలియని వారిచేత జరుపుతున్నారు. వివాహం వెనుక ఉన్న శాస్త్రీయతను కోల్పోవటం వల్ల అది నిరర్ధకం. ఈ రోజుల్లో మనుషులు ప్రేమ గురించి మాట్లాడేటపుడు, వారు కేవలం భావోద్వేగపరంగానే మాట్లాడుతున్నారు. భావోద్వేగాలు నేడొకటి చెపితే రేపొకటి చెప్తాయి. నేడు మనం జీవిస్తున్న సంస్కృతిలో ఒకే జీవిత భాగస్వామితో జీవితాంతం కలిసి ఉండక్కరల్లేని పరిస్థితి వచ్చింది.
వివాహం అంటే స్వార్థజీవితం కాదని, జీవితాన్ని ఆనందంగా గడపడమని మహర్షలు చెబుతారు. ఆధ్మాత్మిక, సాంఘీక జీవితాన్ని బాధ్యతగా గడుపుతూ ఒకరితో ఒకరు సఖ్యంగా, చనువుగా, ప్రేమగా ఉండటమే దీని మూలమని పెద్దలు వివాహాన్ని నిర్వచించారు. జీవితంలో ఒకరితో ఒకరిని ఎక్కువ కాలం కలిపి ఉంచేది భార్యాభర్తల బంధం. ఆ బంధం పట్టిష్టంగా ఉండటానికి పెద్దలు కొన్ని మంత్రాలను నిర్ధేశించారు. వాటినే లౌకికంగా పెళ్లినాటి ప్రమాణాలని చెబుతారు. ఈ ప్రమాణాలను త్రికరణ శుద్దిగా ఆచరించిన దంపతుల సంసారం మూడుపువ్వులు, ఆరుకాయలుగా వర్ధిల్లుతుంది. ఆ సంబంధం నిండునూరేళ్ళు పవిత్రంగా పచ్చగా ఉంటుంది.
వివాహ తంతులో మాంగల్య ధారణే అతి ప్రధానమైనది. మాంగల్యానికే మంగళసూత్రం, తాలి, తాళిబొట్టు, పుస్తె, శతమానం అనే పేర్లతో బాటు వివిధ రూపాలు కూడా ఉన్నాయి. ఇవి కులం, వంశానుసారం పలురూపాల్లో ఉంటాయి. మానవులకు మనువాడం ఎంత ముఖ్యమో, మనువాడటానికి మంగళసూత్రం అంతే ముఖ్యం. పెళ్లికోసం సమకూర్చుకున్న, ఇవచ్చిపుచ్చుకున్న ఇతర వస్తువులు, ఆభరణాలు అన్నీ రూపాంతరం చెందినా చివరి వరకూ వెంట ఉండేది తాళిబొట్టు మాత్రమే.
 
--(())--
[తాజా జీవనం

తాజాదనానికి ఆరోగ్యానికి చాలా దగ్గర సంబంధముంది. ఒకటి దేహమైతే, మరొకటి ఆ శరీరానికి ముఖభాగం వంటిది. ఆ రెండూ కలిసి ఒకదాన్నొకటి ఆవిష్కరిస్తాయి. వృద్ధులతో పోలిస్తే చిన్న పిల్లల్లో ఆరోగ్యం పాలు ఎక్కువ. అందుకే లేత ప్రాయంలో ముఖవర్చస్సు వెలిగిపోతూంటుంది. నిండు ఆరోగ్యంతో ఉన్న కొంతమంది వయోజనుల్లోనూ అంతే. ఇలాంటివాళ్లు నిరంతరం ఆనందంతో, ఉత్సాహంగా జీవిస్తుంటారు. ఈ తీరు బతుకు గమనంలో జీవితం తాలూకు తాజాదనాన్ని తేటతెల్లం చేస్తుంది.

మొత్తం విశ్వంలో నిత్య నూతనమై, ఎల్లప్పుడూ తాజాగా ఉండేది  ఒకే ఒక్కటి. అదే- దివ్యత్వం. ఆ పరంధాముడి ప్రతిరూపాలకూ దైవ గుణాలే అబ్బుతాయి. అందువల్లే, పరమాత్మ దేహమైన ప్రకృతిని ఎప్పుడు చూసినా పచ్చగా, తాజాగా ఉంటుంది.

‘గణికుల్లో కాలాన్ని నేనే’ అన్నాడు    గీతాచార్యుడు. కాలమంటే, జీవంతో నిండిన వర్తమానం. అది ‘శ్రీ’నివాసం. అంటే, ఆద్యంతాల్లో ఎల్లవేళలా ని…
[దక్షిణా మూర్తి స్వరూపం...

దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలిస్తే.....

కుడిచెవికి మకరకుండలం ఎడమ చెవికి “తాటంకం' అలంకారాలుగా కనిపిస్తాయి. మకరకుండలం పురుషుల శ్రవణాలంకారం. తాటంకం స్త్రీల అలంకృతి, దక్షిణామూర్తిగా సాక్షాత్కరించినది శివశకుల సమైక్య రూపమేనని తెలియజేస్తాయి. ఈ రెండు అలంకారాలు. సనకసనందనాదులకు ముందు రెండుగా కనబడిన శివశక్తులే ఇప్పుడు ఏకాకృతిగా దర్శనమిచ్చాయి. అందుకే దక్షిణామూర్తి అయ్యరూపమే కాక, అమ్మమూర్తి కూడా
ఈ విషయాన్నే లలితాసహస్రంలో

దక్షిణామూర్తి రూపిణీ | సనకాదిసమారాధ్యా శివజ్ఞాన ప్రదాయినీ" అని వివరిస్తోంది.

ఉత్తరాభిముఖులై ఉంటారు. ఉత్తరం జ్ఞానదశ. ఆ దిశలో కూర్చున్న స్వామిని చూస్తూ ఉన్నవారికి వెనుక భాగాన
(పృష్ట భాగాన) దక్షిణ దిశ.
అంటే యమ (మృత్యు) దిశ. దీని భావం ఎవరు దేవుని వైపు చూస్తారో, వారు యముని (మృత్యువుని) చూడరు. యముని చూపు మనపై పడకుండా స్వామి చూపు 'నిఘా', వేస్తుంది. అజ్ఞానమే మృత్యువని ఉపనిషత్తు చేస్తుంది. ఆత్మ స్వరూపాన్ని ఎరుగకపోవడమే మృత్యువు - ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి' యముని సైతం శాసించిన మృత్యుంజయుడే దక్షిణామూర్తి, దక్షిణ' అంటే 'దాక్షిణ్య భావం'..

ఏ దయవలన దుఃఖం పూర్తిగా నిర్మూలనమవుతుందో ఆ 'దయ'ను ‘దాక్షిణ్యం' అంటారు. ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి (దాక్షిణ్యం) భగవంతునికి మాత్రమే ఉంది. ఆ దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే దక్షిణామూర్తి.

అన్ని దుఃఖాలకీ కారణం అజ్ఞానం. అజ్ఞానం పూర్తిగా తొలగితేనే శాశ్వత దుఃఖవిమోచనం. ఆ అజ్ఞానాన్ని (అవిద్యను) తొలగించే జ్ఞాన

స్వరూపుని దాక్షిణ్య విగ్రహమే దక్షిణామూర్తి. | వసిష్టుడు కూడా తపస్సుతో దక్షిణామూర్తిని ప్రత్యక్షం చేసుకొని బ్రహ్మవిద్యను సంపాదించాడు. వసిష్ఠునకు దక్షిణామూర్తి సాక్షాత్కరించిన క్షేత్రమే 'శ్రీకాళహస్తి'.

అందుకే ఇప్పటికీ ఆలయంలో ప్రవేశించగానే దక్షిణామూర్తి విగ్రహం కనబడుతుంది. ఇది జ్ఞానప్రధాన క్షేత్రం, ఇక్కడి శక్తి పేరు కూడా జ్ఞాన ప్రసూనాంబ కావడం గమనార్తరి, రుద్ర యతే దక్షిణం ముఖం తేన మాం పాహి నిత్యమ్'

ఓ రుద్రా! నీ దక్షిణ ముఖంతో నిత్యం మమ్ము రక్షించు' అని శ్వేతాశ్వతరోపనిషత్తు దక్షిణామూర్తిని ప్రార్థించింది,

పరమజ్ఞానమూర్తియైన ఈ ఆదిగురువును స్తుతిస్తూ ఆదిశంకరులు రచించిన దక్షిణామూర్తి సోత్రము బహుళ ప్రసిద్ది చెందింది.

“విశ్వం దర్పణ దృశ్యమాననగరీతుల్యం...” అంటూ ప్రారంభమై ............... “గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే" అని మకుటంతో సాగు. ఆ స్తుతిలో అద్యైత వేదాంతమంతా సుప్రతిష్టితమయ్యింది.
" గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్! నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ:

దక్షిణామూర్తి సకల జగద్గురు మూర్తి కనుక - స్వామి ఆరాధన సకల విద్యలను ప్రసాదిస్తుంది.

ఐహికంగా - బుద్ధిశక్తిని వృద్ధి చేసి, విద్యలను ఆసుగ్రహించే ఈ స్వామి, పారమార్థికంగా తత్త్వ జ్ఞానాన్ని ప్రసాదించే దైవం.

--(())--

జ్యేష్ట మాసం రోహిణీ కార్తె రాత్రి మొదటి ఝాము చివరికి వస్తోంది.  వేడిగాలి తగ్గి కొంచెం చల్లని గాలి వీయడం మొదలు పెడుతోంది.  బహుళ పక్షం కావడంతో చంద్రోదయం ఇంకా కాలేదు.

ఆ చిట్టడవి మధ్యలో మఱ్ఱి చెట్టు మొదట్లో పుట్టలోనుంచి బయటకొచ్చిన మిన్నాగు పాదాల చప్పుడేమిటా అని చుట్టూ పరికించి చూసింది.

ఇద్దరు యువకులు ఆ దారి వెంట వెళ్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇందాక ఆ దారిన వెళ్ళిన వారే అని గ్రహించింది నాగు. కానీ ఈ సారి వారి వెంట ఒక గోవు కూడా నడుస్తోంది. 

బుస కొడదామా అని ఆలోచిస్తూ ముందు నడుస్తున్న యువకుడిని చూసి ఆగిపోయిందా నాగు.  నల్లగా ఉన్నా ఆ యుపకుడినుంచి వచ్చే కాంతికి ఆ యువకులిద్దరూ దీపం లేకపోయినా సులువుగా నడుస్తున్నారు. సరిగంచు పంచె కట్టి, ఉత్తరీయం నడుముకు చుట్టుకుని అందులో పిల్లనగ్రోవి జోపి తలకి పాగ చుట్టి నెమలి ఈక పెట్టాడతడు.

ఆ వెనక నడుస్తున్న వాడు బ్రాహ్మణ కుర్రాడని తెలిసిపోతూనే ఉంది. పచ్చని పసిమి, గోష్పాదమంత శిఖ, జంధ్యం పోగు ఇంకా బ్రహ్మచారే !

ఇవేమీ చూడలేదా నాగు. ముందు నడుస్తున్న యువకుడినే ఆరాధనగా, భక్తితో చూస్తూ పడగ ముడిచేసి నమస్కారమా అన్నట్లు తలను నేలకు తాటించింది.

"కన్నయ్యా ! ఈ వేడికి దప్పికౌతోంది , నిస్త్రాణగా ఉంది, కాసేపు విశ్రమించాలి", అన్నాడతడు. "గురువుగారు నిరీక్షిస్తున్నారు కదా సుదామా ! వారికి త్వరగా ఈ కామేశ్వరి ఆచూకి చెప్తే ఆయన ఆరాటం తగ్గుతుంది " అన్నాడు కన్నయ్య.

"ఒక్క గడియ, అంతే ! కొంచెం నోట నీరు పడితే ప్రాణము లేచొస్తుంది" అన్న లోగొంతులో వినపడ్డ మాటకు కన్నయ్య నొచ్చుకున్నాడు.  "అయ్యో! మిత్రమా. గమనించనే లేదు. నీరు పట్టుకుని వస్తాను. ఇక్కడ కూర్చో".

రెండు నిముషాలలో తామర దొన్నెతో నీరు పట్టుకొచ్చి "నా చేతి నీరు ! ఫర్వాలేదా ? బాపనయ్యా !" అని పరిహాసమాడాడు కన్నయ్య.

మొదటి దోసిలి గబగబా త్రాగేశాక "మన మధ్య ఆ తారతమ్యం ఇంతకు ముందు ఎప్పుడైనా చూశావా నల్ల గొల్ల పిల్లడా !" పరిహాసమూ, అచ్చెరువూ కలగలిపి అడిగాడు సుదాముడు నొచ్చుకూంటూ.

రెండో దోసిలి నీరు పట్టాక, "నీరసంలో నీ పరిహాసపు పలుకులు ఉన్నాయో, బజ్జున్నాయో తెలుసుకోవడానికి అడిగానయ్యా ! చెలికాడా !" అని బుగ్గ మీద చి
న్నగా చేతివ్రేళ్ళు తాటించాడు గోప కిషోరుడు.

"ఇంకొక దోసెడు నీరు ఇవ్వవా ?" అన్న సుదాముడిని చిరునవ్వుతో చూస్తూ "వద్దులే మిత్రమా ! దాహం తీరే ఉంటుందిలే ! అంతకన్నా ఎక్కువ నువ్వు అడగకూడదు, నేనివ్వ కూడదు" అంటున్న మిత్రుడి మోము చూస్తూ స్వప్నంలో మాట్లాడినట్లు "అవును కదూ ! కృష్ణా " అన్నాడు సుదాముడు.

ఆ ఋణం తనకు తెలియకుండానే చాలా సంవత్సరాల తరువాత తీర్చుకున్నాడు సుదాముడు.

భగవంతుడు భక్తుడి కోర్కెలు తీర్చడానికి ఎంతో దయతో తనే ముందుగా భక్తుడికి సేవ చేస్తాడు.


--(())__


విఘ్నేశ్వరుడు* ఒకనాడు పార్వతీదేవి చెలికత్తెలయిన జయ విజయలు అమ్మవారితో ఒకమాట చెప్పారు. ‘అమ్మా, నంది నిన్నూ వహిస్తాడు, శంకరుడినీ వహిస్తాడు. కానీ ఆయనకు కొంచెం శంకరుని మాల ఔదలదాల్చడంలోనే సంతోషం ఎక్కువ. భ్రుంగీ అంతే. మన మాటే వినేవాడు ఒకడు లేడు. అలాంటి వాడు మనకి ఒకడు ఉంటే బాగుంటుంది. అందుకని నీవు ఒకడిని సృష్టించి ద్వారపాలకుడిగా పెడితే వాడు నీ మాటే వింటూంటాడు. అలాంటి వాడిని తయారు చెయ్యి. 

అతడు మన అంతఃపురమును కాపాడడానికి పనికివస్తాడు” అని చెప్పారు. వారి మాటలు విన్న పార్వతీ దేవి అలాగే చేద్దాం అని తన శరీరమునకు ఉన్న మలమును స్నానం చేసేటప్పుడు నలుగు పిండిలా తీసి దానిలోంచి ఒక పిల్లవాడిని తయారు చేసింది. నలుగులోంచి తయారు చేయబడిన పిల్లవాడు ఎలా ఉన్నాడన్నది ఎవరికీ తెలియదు. చాలా బాగుండాలని అమ్మవారు సంకల్పం చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది. వాడు లేచి కూర్చున్నాడు. అపుడు వానితో నీవు వెళ్లి ద్వారము దగ్గర కూర్చుని ఎవరూ లోపలి రాకుండా నిలుపు’ అంది అపుడు ఆ పిల్లవాడు ద్వారం దగ్గర కూర్చున్నాడు. ప్రమథగణములలో ముందు నందీశ్వరుడు విజయం చేస్తుండగా శివుడు లోపలి వెళ్ళబోయాడు.ఈ పిల్లవాడు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అన్నాడు. ముందు శంకరుడు జ్యోక్యం చేసుకోలేదు. అపుడు ప్రమథగణములకు ఆ పిల్లాడికి మధ్య యుద్ధం జరిగింది. ఎవరు సలహా చెప్పారో వాళ్ళే అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మా పిల్లవాడు యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి నీ శక్తులను పిల్లవాడికి ఇవ్వవలసింది అని చెప్పారు. అమ్మవారు శక్తులను ఇచ్చింది. ఆ పిల్లవాడు అద్భుతమయిన యుద్ధం చేసి ప్రమథగణములనన్నిటిని ఓడించేశాడు. ఇంక అక్కడ నుండి బ్రహ్మ, విష్ణువు కూడా వచ్చేశారు యుద్ధానికి. అయినా ఆ పిల్లవాడు శంకరుడిని లోపలికి పంపించలేదు. అపుడు శంకరుడు చేతిలో త్రిశూలమును పట్టుకుని పిల్లవాని కంఠమునకు గురి పెట్టి విసిరాడు. అపుడు త్రిశూలం ఆ పిల్లవాని కంఠమును ఉత్తరించేసింది. ఆ పిల్లవాడు క్రిందపడి మరణించాడు. 

తరువాత శంకరుడు లోపలికి వెళ్ళాడు. భార్యాభర్తలిద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటున్న సమయంలో పార్వతీదేవి బయట కాపలా పెట్టిన పిల్లవాని ప్రస్తావన వచ్చింది. అపుడు శివుడు ఆ పిల్లవానిని త్రిశూల ధారల చేత చంపేశాను అన్నాడు. అపుడు పార్వతీదేవి అయ్యో ఆ పిల్లాడిని నేనే సృష్టించాను – చంపేశారా అని దుఃఖమును పొందింది. ఆవిడ దుఃఖమును ఉపశమింపజేయడానికి దేవతలు అందరూ వచ్చారు. ఆవిడ శంకరుని తన బిడ్డను మరల బ్రతికించమని అడిగింది. అప్పుడు ఆయన తన అనుచరులను పిలిచి మీరు ఉత్తర దిక్కుగా వెళ్ళి మీకు మొట్టమొదట కనపడిన ప్రాణి ఏదయితే ఉంటుందో దాని తలకాయ తీసుకురండి. ఆ తలకాయ పిల్లవాడికి పెడతాను’ అన్నాడు. వాళ్లకి మొట్టమొదట ఏనుగు కనపడింది. వాళ్ళు దాని తలకాయ పట్టుకొచ్చారు. దానిని ఈ పడిపోయిన పిల్లవాని కంఠమునకు కలిపాడు. ఆ పిల్లవాడు చక్కగా లేచి కూర్చున్నాడు. 

ఇప్పుడు వానికి శంకరుడెవరో తెలిసి శంకరునికి నమస్కారం చేశాడు. వెంటనే శంకరుడు కూడా వాడిని ఎత్తి తొడమీద కూర్చోపెట్టుకున్నాడు. ఈలోపుగా సుబ్రహ్మణ్య జననం కూడా జరిగిపోయింది. ఈ ఇద్దరి పిల్లలతో సంసారం చక్కగా నడిచిపోతోంది. ఒకరోజు ఒక యోగ్యమయిన సంబంధం వచ్చింది విశ్వరూప ప్రజాపతి అనే ఆయన తన ఇద్దరు కుమార్తెలయిన సిద్ధిబుద్ధి అనే వాళ్ళను ఇవ్వాలనుకుంటున్నాను అని వచ్చాడు. అపుడు శంకరుడు తన కుమారులను పిలిచి ఎవరు ముందు భూప్రదక్షిణ చేసి వస్తే వారికి ముందుగా పెళ్ళి చేస్తానన్నాడు. ఇద్దరూ బయలుదేరారు. గణపతిది మూషిక వాహనం. అందుకని ఆయన తల్లిదండ్రులిద్దరికీ ఏడుమార్లు ప్రదక్షిణం చేసి వారిని పత్ర పుష్పములతో పూజ చేశారు. సుబ్రహ్మణ్యుడికి ఎక్కడికి వెళ్ళినా వినాయకుడు ముందుగా వెళ్ళిపోతున్నట్లు కనపడుతున్నాడు. పార్వతీ పరమేశ్వరునకు ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసిన ఫలితమును ఆయన ఖాతాలో వేసి ‘నువ్వు చెప్పినటువంటి నియమమును పాటించిన వాడివి కనుక నీకు ముందు వివాహం చేస్తున్నాను అని చెప్పి సిద్ధి బుద్ధిలను గణపతికిచ్చి వివాహం చేశారు. సుబ్రహ్మణ్య స్వామీ వారు క్రౌంచ పర్వతం దగ్గరకు వెళ్ళారు. పార్వతీ పరమేశ్వరులు కూడా వెళ్ళారు. ఇక్కడ మనకు కొన్ని సందేహములు కలగడానికి అవకాశం ఉంది. ఒకవేళ నిజంగా శంకరుడు ఆ పిల్లవాని తలను తీసివేసి ఉంటే ఏనుగు తల పెట్టడం ఎందుకు? పడిపోయిన తలకాయనే అతికించవచ్చు కదా! అని. పార్వతీ దేవి అనగా పరమ ప్రక్రుతి. పరమ శివుడనగా పరమ పురుషుడు. పరమ ప్రకృతి అంటే పంచ భూతములు. పంచభూతములయందలి కదలిక పరమేశ్వరుడు. అమ్మవారు భూతములన్నిటిని తయారుచేస్తుంది. కానీ లోపల చైతన్యం శివుడు. అంటే శివ సంబంధమయిన ఎరుక లేదు. లోపల ఉన్న చైతన్యము ‘నేను’ అన్నది తెలియదు. పైన ఉన్న శరీరము మూడు గుణముల చేత బంధింపబడి ఉంది. ఈ మూడు గుణములే ప్రకృతి యొక్క మలము. అదే అమ్మవారి శరీరంలోంచి వచ్చిన మలము. ఆ మలముతో పిల్లవాడు తయారు అయాడు. అంటే త్రిగుణములయందు కొట్టుమిట్టాడుతున్నాడు. కాబట్టి ఈ తలకు ప్రకృతి తెలుసు శివుడు తెలియదు. లోపల ఉన్న చైతన్యం బయట నిలబడిన శివుడు అని తెలియదు. కాబట్టి ఆయన దానితోనే పోరాటం చేశాడు. శంకరుడు ఆ పిల్లవాని తలను త్రిశూలంతో తరిగేశాడు. త్రిశూలమునకు ఉన్న మూడు త్రిగుణములు, వీటికి ఆధారమైన సత్యము శంకరుని చేతిలో ఉన్న త్రిశూలం. శంకరుడు గుణాతీతుడు. ఎప్పుడయితే శివుడి చేతి త్రిశూలం పిల్లవాని కంఠమునకు తగిలిందో త్రిగుణములకు సంబంధించిన బుద్ధి పోయింది. ఇప్పుడు ‘గజ’ – ఏనుగు తల పెట్టబడింది. ‘గ’ అంటే గతి అంటే కదలడం; ‘జ’ అంటే పుట్టడం. ఇపుడు ఆ పిల్లవానికి ఇందులోంచి పుట్టి ఇందులోకి వెళుతున్నాడో తెలిసిపోయింది. అంటే ఇప్పుడు శివసంబంధం వచ్చేసింది. శివుడు తెలిసిపోయాడు. తెలిసిపోవడం గజముఖం. అందుకని శంకరుడికి నమస్కారం చేశాడు. ఇది మీరు చెయ్యవలసిన ఉపాసనా క్రమమును వినాయకుని మూర్తి ద్వారా లోకమునకు తెలియజెప్పడం. ఏనుగు తల బ్రహ్మాండమును చెప్తే మనిషి శరీరం పిండాండమును చెప్తుంది. బ్రహ్మాండం, పిండాండం రెండింటి యందు పంచభూతములు ఉన్నాయి. రెండూ పంచ భూతములలో నిండి ఉన్నప్పటికీ రెండింటియందు ఉన్నది ఒక్కటే అని జీవ బ్రహ్మైక్య సిద్ధిని పొంది తత్త్వమసి అర్థమయితే ‘తత్ త్వం అసి’ ‘అదే వాడి ఉన్నాడు’ జీవుడే ఈశ్వరుడై ఉన్నాడు అని తెలియడమే ఏనుగు ముఖం మనుష్యుడు తల కంఠం దగ్గర శివానుగ్రహంతో కలవడం. కాబట్టి తత్త్వమసి మహావాక్యం నడయాడితే మహాగణపతిగా తిరుగుతున్నాడు. కాబట్టి ఇప్పుడాయన వినాయకుడు అయ్యాడు. ‘వి’ అంటే విశిష్టమయిన – అనగా విశిష్టమయిన నాయకుడు అయ్యాడు. మీరు ఆయనను ఉపాసన చేస్తే ఆయన మిమ్మల్ని అటువంటి పథంలోకి తీసుకు వెడతాడు. ఆయన విఘ్నములకు నాయకుడు. విఘ్నమును తీసేస్తాడు. మీరు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుస్తాడు. గణపతి పరబ్రహ్మమై ఉన్నాడు. ఈయనకు సిద్ధిబుద్ధి భార్యలు. ఎవరు బుద్ధిని ఉపయోగిస్తాడో వాడు సిద్ధిని పొందగలడు. బుద్ధి అనేది ఒక్క మనుష్య ప్రాణికే ఉంది. గణపతి ఆరాధన చేత మంచి బుద్ధి వచ్చి సిద్ధి పొందడమే ఆయనకీ సిద్ధి బుద్ధి భార్యలు అయి ఉండడం. ఆ అనుగ్రహం మీయందు ప్రసరింపబడడం. ఏనుగుకు అన్నిటికన్నా ఇష్టమైనది దాని దంతం. కానీ అది నమలడానికి పనికిరాదు. ఏనుగు ముఖం ఉన్న గణపతి వ్యాసుడు భారతం చెప్తుంటే తన దంతమును విరిచేసి దానితో రచన చేశాడు. మనకి ఉన్న వస్తువులను లోకోపకారానికి ఉపయోగించాలి. భారతమును రచించడానికి తన దంతం ఉపయోగ పడితే కొన్ని యుగాలపాటు పంచమ వేదమయిన భారతమును లోకం చదువుకుని ఉద్ధరింపబడుతుంది అని భావించి తన దంతమును విరిచేసి దానితో భారతమును రచన చేశాడు. ‘ఏకదంతం, శూర్పకర్ణం, లంబోదరం’ అని పేర్లు సంపాదించాడు. ఎంతో శాశ్వతమయిన యశస్సు పొందాడు. శివుడు ఎంత సులభుడో వినాయకుడు అంత సులభుడు. ఇరువది ఒక్క గరిక తెచ్చి ఆయన పాదముల మీద వేస్తే చాలు. అన్నీ ఇచ్చేస్తాడు. కొద్దిగా సింధూరమును గండయుగ్మమునాకు రాస్తే చాలు పొంగిపోతాడు. ఏనుగు తల కనపడితే మంగళ ప్రథము. చివరకు కలలోకి ఏనుగు వచ్చినా అది మంగళప్రదమే. గణపతి స్వరూపంలో చిత్రమయినది ఎలుక. గణపతికి వాహనం ఎలుక. ఎలుక దొంగతనానికి ప్రతీక. మనతో పాటే ఉంటుంది. మన వస్తువులన్నీ ఎత్తుకుపోతూ ఉంటుంది. మన బ్రతుకూ అంతే. విఘ్నేశ్వరుని ప్రార్థిస్తే మనకి ఆయన పదిమంది హృదయాలను కొల్లగొట్ట గలిగిన దొంగతనమును పొందుతాడు. అనగా ఈశ్వరాభిముఖుడై భగవద్భక్తి చేత తాను మాట్లాడిన మాటలకు పరవశులై చాలామంది హృదయాలను తాను కొల్లగొట్టే దొంగ అవుతాడు. ఇలా మారడానికి ఎలుక విఘ్నేశ్వరుడిని వహించింది. మీరు కూడా అలా వహించడం నేర్చుకోవాలి. పదిమంది ప్రేమను సంపాదించుకోవడం నేర్చుకోవాలి. దీనిని సూచించదానికే ఎలుకను వాహనంగా పెట్టుకున్నాడు. ఎలుక చెవులు పెద్దవిగా ఉంటాయి చేట లాగా. గణపతిని నమ్మి ఆవాహన చేసి జాగ్రత్తగా ఉపాసన చేస్తే లోకంలో పొల్లు తీసేసి సారం వైపుకి మనలను నడిపిస్తాడు. పరమభక్తిని ఇస్తాడు. ఆయన ఆయుధమయిన గొడ్డలితో కర్మ పాశములను తెంచి భక్తీ పాశములను వేసి తన వైపుకి లాక్కుంటాడు. చవితి తిథి ఆయనకు చాలా ఇష్టమైన తిథి. ఆరోజు ఎవరయినా వినాయకుడి గురించి ప్రత్యేకంగా వినినా, చదివినా వారు ఎంతో ప్రయోజనమును పొందుతారు. పరమ భక్తితో స్వామికి నమస్కారం చేసినా ఎవరు కోరుకున్నది వారికి అనుగ్రహిస్తాడు. విద్యార్థికి విద్య వస్తుంది. ద్రవ్యార్థికి ద్రవ్యం వస్తుంది. కన్యార్థికి కన్య దొరుకుతుంది. పుత్రార్థికి పుత్రుడు పుడతాడు. భోగార్థి అయిన వాడికి భోగములు కలుగుతాయి. మోక్షార్థికి మోక్షం దొరుకుతుంది. రాజ్యార్థికి రాజ్యం, కీర్తి కావాలనుకున్న వారికి కీర్తి వస్తుంది. ఆరోగ్యం కుదుటపడక చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్లకి ఆరోగ్యం కలుగుతుంది. ఋణభారంతో ఉన్నవాడికి ఋణం తొలగుతుంది. ఇక్కట్టులలో ఉన్న వాడికి ఇక్కట్టులు తొలగిపోతాయి. గణపతి దర్శనం చేత గణపతి యొక్క అనుగ్రహం చేత గణపతి కథను చదవడం చేత సమస్త శుభములు సమకూడతాయని పెద్దలు మనకు ఫలశ్రుతిని వివరణ చేసి ఉన్నారు. కాబట్టి ఆ గజానన స్వరూపము అంత గొప్ప స్వరూపము.
*****


8..  *తిరుచానూర్ పద్మావతి అమ్మవారి ఆలయం :*


* తిరుచానూరు లేదా అలమేలు మంగాపురం అనే ఊరు చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణం సమీపంలో ఉంది. ఇది తిరుపతి పరిధిలోకి వస్తుంది. దీనిని అలమేలు మంగాపురమని కూడా అంటారు. ఇక్కడ వెంకటేశ్వరుని దేవేరి లక్ష్మీ దేవి అవతారమైన అలమేలు మంగ ఆలయం ప్రసిద్ధి చెందింది. తిరుపతి సమీప జలపాతాలు ! స్థలపురాణం త్రిమూర్తులను పరీక్షించే యత్నంలో కోపిష్టియైన భృగు మహర్షి విష్ణువు వక్ష స్థలాన్ని కాలితో తన్నాడు. తన నివాస స్థానాన్ని అవమానించినందుకు అలిగి లక్ష్మీదేవి కొల్హాపూర్ వెళ్ళింది. సిరి లేని శ్రీనివాసుడు తిరుమల కొండల్లో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. ప్రసన్నురాలైన శ్రీదేవి తిరుచానూరులోని పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు శుక్రవారం, ఉత్తరాషాఢ నక్షత్రంలో బంగారు పద్మంలో అవతరించింది. ఆ పద్మావతినే శ్రీనివాసుడు లక్ష్మి అనుజ్ఞతతో పెండ్లియాడాడు.

* అభయముద్రలో అలమేలు మంగ గుడిలో అమ్మవారి సన్నిధిలో లక్ష్మీదేవి చతుర్భుజ, రెండు చేతులలో పద్మాలు ధరించి ఉంటుంది. రెండు చేతులు వరద అభయ ముద్రలలో ఉంటాయి. ఈ ఆలయంలో ఉన్న మరి కొన్ని సన్నిధులు - శ్రీకృష్ణుడు, సుందరరాజస్వామి, సూర్యనారాయణ స్వామి. విగ్రహాలు చారిత్రిక ఆధారాల ప్రకారం పల్లవ రాజుల కాలంలో ఇది 'తిరువెంగడ కూటం'గా ఉంది. ఇంతకు ముందు కాలంలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఒకటుండేది. తరువాత ఆ విగ్రహాలను వేరే చోటికి తరలించారు.

* భక్తుల విశ్వాసం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తరువాత తిరుచానూరులో కొలువై ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోకపోతే ఆ యాత్రకు ఫలం లభించదని ప్రతీతి. పదివేల జనాభా మాత్రమే ఉన్న తిరుచానూరులో 50కి పైగా కళ్యాణ మంటపాలున్నాయి. ఏటా వెయ్యికి పైగా వివాహాలు జరుగుతాయి. సేవలు, సంప్రదాయాలు అమ్మవారి ఆలయంలో ప్రతిదినం ఉదయం సుప్రభాత సేవ జరుగుతుంది. తరువాత సహస్ర నామార్చన, కళ్యాణోత్సవము, ఊంజల్ సేవ ఉంటాయి. రాత్రి ఏకాంత సేవ అనంతరం ఆలయం మూసివేస్తారు.

* ప్రతి సోమవారం 'అష్టదళ పదపద్మారాధన' జరుగుతుంది. శుక్రవారం అభిషేకం జరుగుతుంది. గురువారం తిరుప్పావడ సేవ ఉంటుంది. పూజలు శ్రావణమాసంలోను, మరి కొన్ని దినాలలో లక్ష్మీపూజ జరుగుతుంది. ఇక్కడ ప్రసాదంతో పాటు ఇచ్చే పసుపు కుంకుమలను భక్తులు అతి పవిత్రమైనవిగా స్వీకరిస్తారు. బ్రహ్మోత్సవాలు కార్తీక బ్రహ్మోత్సవాలు ఇక్కడి ముఖ్యమైన ఉత్సవం. అమ్మవారి అవతరణ దినమైన కార్తీక శుద్ధ పంచమి నాడు తిరుమలనుండి గజవాహనంపై వచ్చే చక్రత్తాళ్వార్తో అమ్మవారు స్నానమాచరించడం సంప్రదాయం. ఆ సుముహూర్తంలో లక్షలాది జన సందోహం భక్తితో పుష్కరిణిలో స్నానమాచరిస్తారు.

* ఉత్సవాలు ఆనాడు ఆది శంకరాచార్యులు అమ్మవారికి అలంకరించినట్లు చెప్పబడే మంగళ సూత్రాలను దర్శిస్తారు. దసరాకు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఇంకా తెప్పోత్సవం, వసంతోత్సవం, రథ సప్తమి ముఖ్యమైన ఉత్సవాలు. సుందరరాజ స్వామి గుడిలో మూడు రోజుల పాటు అవతారోత్సవం జరుగుతుంది. ఇతర దర్శనీయ స్థలాలు అమ్మవారి ఆలయం వెనకాల ఉన్న కోనేరు, శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం, పద్మావతి గార్డెన్, శ్రీరామ ఆలయం, రామకృష్ణ తీర్థం, గోవిందరాజ స్వామి ఆలయం, శేష తీర్థం, ఆంజనేయస్వామి ఆలయం మొదలగునవి చూడదగ్గవి. 

*అలమేలు మంగాపురం ఎలా చేరుకోవాలి?*

1) తిరుపతి బస్ స్టాండ్ నుంచి తిరుచానూరు ఆలయానికి లోకల్ బస్సులు, ఏ పీ ఎస్ ఆర్ టి సి బస్సులు మరియు ప్రవేట్ బస్సులు, జీపులు రెగ్యులర్ గా తిరుగుతుంటాయి.

 2) లోకల్ గా తిరిగే షేర్ ఆటోలలో ఎక్కి దేవస్థానం వరకు చేరుకోవచ్చు. వారు అడిగినంత డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు. 

 3) తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి, రేణిగుంట ఎయిర్ పోర్ట్ నుంచి డైరెక్ట్ గా క్యాబ్ లేదా టాక్సీ మాట్లాడుకొని కూడా అలమేలు మంగాపురం చేరుకోవచ్చు.


*><><><><><><><><><><*

*సేకరణ :*


Monday, 17 July 2023

printied


                శ్రీ జగద్గురు  శంకర భాగవత్పాదులచే రచితమైన
                                                  కనకధారాస్తవము
ఆంధ్రపద్యానువాదకర్త: కీర్తిశేషులు శ్రీ అక్కిరాజు వేంకటేశ్వరశర్మగారు 
                        (ఆంధ్ర పద్య తాత్పర్య సహితము )

                                               పరిచయము                                          శ్రీ శంకర భగవత్పాదులు  బ్రహ్మ చర్యాశ్రమమునవలంబించి  మధుకర వృత్తితో జీవించుచు వేద వేదాంగాది విద్యల నభ్య్యసించు  చున్నకాలమది. ఆయన ఒకనాడు మధుకరమునకై  ఒక గృహము వాకిట నిలిచి "భవతి! భిక్షాందేహి" యని అనెను.  ఆ ఇల్లాలు నిరుపేద . మహాసాద్వి  తమ  పేదరికమునకు వగచుచు ఒక్క ఉసిరిక పండును భిక్షగా పెట్టి కన్నీరు కార్చేను.  శ్రీ శంకర దేశి కేంద్రుడు ఆశువుగా ఇరువదినాలుగు శ్లోకములతో శ్రీ మహాలక్ష్మిని స్తుతించెను.  ఆ దేవి ప్రత్యక్షమై శ్రీ శంకరులు కోరిన విధముగా బంగారు ఉసిరిక  పండ్లను  ఆ నిరుపెదరాలి  గృహమున వర్షముగా  కురిపించెను.    శ్రీ శంకర భగవత్పాదులు  ఆ లక్ష్మీదేవినిస్తుతించిన ఇరువదినాలుగు శ్లోకములకే  కనకధారాస్తవము (స్త్రోత్రము) అని పేరు .  దీనిని అనుదినము చదివిన వారికి సకల సంపదలు చేకూరును.  అనాదిగా అనుదినము అనేకమంది దీనిని చదువుతున్నారు,  భారతదేశము మరియు  ఇతర దేశాలలో ఉన్న తెలుగువారు  మరియు   ప్రతిఒక్కరు చదివి ఆ లక్ష్మిదేవి కృపకు పాత్రులగుదురు.  

1) శ్లో.  వందే వందారు మందార మిందిరా  నందకందలమ్ 
           ఆమందానంద  సందోహ భంధురం సింధురాననమ్.
 

2) శ్లో.   అంగం హరే: పులక భూషణ మాశ్రయంతీ 
            భ్రుంగాంగ నేవ ముకులాభరణం తమాలం
            అంగీ కృతాఖిల విభూతి రపాంగ లీలా
            మాంగల్యదాస్తు మమ మంగళ దేవతాయా:     
 

3)శ్లో.    ముగ్ధా ముహర్విదధతీ వదనే మురారే:
            ప్రేమ త్రపా ప్రణిహితాని గతా గతాని
            మాలా దృశో  ర్మ్దుదుకరీవ మహోత్పలే యా   
           సామే శ్రియం దిశతు సాగర సంభవాయా:
 

4.శ్లో.    విశ్వా మరేంద్రపద విభ్రమ దాన దక్ష
            మానందహేతు రధికం మురవిద్విషో పి
            ఈ షన్నిషీదతు మయి  క్షణ మీ క్షణార్ధం
             ఇందీ వరోదర సహోదర మిందిరాయా:   
 

5.శ్లో.     అమీలితాక్ష మధిగమ్య ముదా ముకుందం
             ఆనంద కంద మనిమేష  మనంగతంత్రం
             ఆకేకరస్థిత కానీనిక పద్మనేత్రం
             భూత్యై భవే న్మమ భుజంగ  శయాంగనాయా:
 

6.శ్లో.      కాలాంబుదాళి  లలితితోరసి కైటభారే:
              ధారాధరే స్పురతి  యా తటి  దంగనేవ
              మా తుస్సమస్త జగతాం  మహానీయమూర్తి:
               భద్రాణి మేదిశతు భార్గవ నందనాయా: 


7. శ్లో :     బాహ్వాంతారే మురజిత: శ్రితకౌస్తుభే యా 
               హారావళీవ   హరినీలమఈ  
వినిభాతి
               కామప్రదా భాగవతోపి  కటాక్షమాలా
               కళ్యాణ మావహాతు మే కమలాలయాయా: 

8. శ్లో :      ప్రాప్తం పదం ప్రధమత: ఖలు యత్ప్రభావాత్
                మాంగల్య  భాజి  మధుమాధిని మన్మధేన
                మయ్యా పతే  త్తదిహ మంధర మీక్షణార్ధం
                మందాలసంచ  మకరాలయ కన్యకాయా:

9. శ్లో :      దద్యా ద్దయ్యానుపవనో ద్రవిణాంబుధారా
                మస్మి న్నకించన విహంగశిశౌ  విషణ్ణే
                దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం
                నారాయణ ప్రాణయినీ  నయనాంబువాహ:

10.శ్లో       ఇష్టా వశిష్ట మతయోపి యయా దయార్ద్ర  
               దృష్టా స్త్రివిష్ట మపదం  సులభం భజన్తే
               ద్రష్టి: ప్రహృష్ట కమలోదరదీప్తి రిష్టాం
               పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయా:

11.శ్లో      గిర్దేవతేతి  గరుడధ్వజ సుందరీతి
              శాకంభరీతి శశి  శేఖర వల్లభేతి
              సృష్టి  స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై  
              తస్యై  నమ స్త్రిభువనైకగురో స్తరు ణ్యై:

12. శ్లో     శృ త్యై  నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై
               రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై 
              శక్యై నమోస్తు శతపత్ర  నికేతనాయై
              పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ ఫల్లభాయై: 


13.  శ్లో :    నమోస్తు నాళీ క నిభానానయై
                 నమోస్తు దుగ్దోదధి  జన్మభూమ్యై
                 నమోస్తు సోమామృత సోదరాయై
                  నమోస్తు నారాయణ వల్లభాయై

14.   శ్లో :   నమోస్తు హే
మాంబుజ పీటికాయై
                నమోస్తు భూమండల నాయి కా యై
                 నమోస్తు దేవాది సుపుజితాయై
                  నమోస్తు శార్జాయుద వల్లభాయై :

15: శ్లో :     నమోస్తు దేవ్యై  భ్రుగునందనాయై
                నమోస్తు విష్ణో రురసి స్థితాయై
                 నమోస్తు లక్ష్మ్యే కమలాలయాయై
                  నమోస్తు దామోదర  వల్లభాయై :

16.:శ్లో :    నమోస్తు కాన్యై కమలేక్షణాయై
                నమోస్తు 
భూత్యై భువన ప్రసూ త్యై
                 నమోస్తు దేవాదిభి రర్చితాయై
                  నమోస్తు నందాత్మజ  వల్లభాయై :

17: శ్లో :      సంపత్కరాణి  సకలేంద్రియ నందనాని
                  సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి
                  త్వద్వందనాని దురితాహరణోద్యతాని
                  మామేవ మాత రనిశం కలయంతు మాన్యే  

18. శ్లో :       యత్కటాక్ష సము పాసనా  విధి:
                 సేవకస్య  సకలార్ద  సంపద:
                 సంతనోతి వచనాం గ  మానసై
                 త్వాం  మురారి హ్రుదయేశ్వరీం  భజే.  


19. శ్లో :        సరసిజ నయనే సరోజ హస్తే
                    ధవళ తరాం శుక  గంధ మాల్య శోభే
                    భగవతి హరివల్లభే మనోజ్జ్నే
                    త్రిభువన భూతికరి ప్రసీద మహ్య్యాం

20. శ్లో :         దిఘస్తిబి: కనకకుంభ ముఖావ సృష్ట
                     స్రగ్వా హినీ  విమల 
చారు జల ప్లు తాంగీం
                     ప్రాతర్నమామి జగతాం  జననీ మశేష
                     లోకాధినాథ గృహిణీ   మమృతాబ్ది పుత్రీం

21. శ్లో           కమలే కమలాక్ష వల్లభే త్వం
                     కరుణాఫూ ర తరంగితై  రపాంగై :
                     అవలోకయ
చారు మా  మకించ నానాం
                     ప్రధమం పాత్ర మకృ త్రిమం దయాయా:

22. 
శ్లో :        బిల్వాట వీమధ్య లసత్సరోజే
                    సహస్రపత్రే సుఖ సన్ని విష్టాం
                    అష్టాపదాంభోరుహ పాణి పద్మాం
                    సువర్ణా వర్ణాం  ప్రణమామి నిత్యం

23. 
శ్లో :       కమలాసన పాణినా లలాటే 
                   లిఖితా మక్షర పంక్తిమస్య జంతో:
                   పరిమార్జయ మాత  రంఘ్రిణా  తే
                   ధనిక 
 ద్వార నివాస దు:ఖ దోగ్ద్రీం 


24. శ్లో :  అంభోరుహం జన్మగృహం భవత్యా;
              వక్షస్థలం భర్త్రు గృహం మురారే
              కారుణ్యత: కల్పయా పద్మవాసే !
              లీలా  గృహం మే హ్రుదయార విందం

25. శ్లో :   స్తువంతి యే  స్తుతి భి రమూ భి రన్వహమ్
               త్ర ఈ మ ఈమ్ త్రిభువన మాతరం రమాం
               గుణాధికా  గురుతర భాగ్య  భాజినో
               భవంతి తే భువి బుధ భావితాశయా;      


....................................................................................................................................................

 1) శ్లో.  వందే వందారు మందార మిందిరా  నందకందలమ్ 

           ఆమందానంద  సందోహ భంధురం సింధురాననమ్ 

ప:          ఇందిరా నంద కందలు నేకదంతు

              అఖిల పందారు మందారు నభయవరదు

              ప్రవిమలానంద సందో హ భందురుని ప్ర

              నటుల్ నర్పింతు భక్తి  విఘ్నంబు  తొలగ  

 ...........................................................................................................

2) శ్లో.   అంగం హరే: పులక భూషణ మాశ్రయంతి

            భ్రుంగాంగ నేవ ముకులాభరణం తమాలం

            అంగీ కృతాఖిల విభూతి రపాంగ లీలా

            మాంగల్యదాస్తు మమ మంగళ దేవతాయా:     

 

ప:   రంగగుమోగ్గలంబరగు రమ్యత మాలముపైకినేగు సా

       రంగి యనంగ వెన్నుని యురమ్మున నుండిన సారసాక్షి ఆ

       మంగళమూర్తి  నాపయి సమంచిత ముగ్ధ  కృపావలోకనా

       పొంగ  కటాక్ష లీలలను బర్వేడుగాక నిరంతరంబుగా


 తా:    మొగ్గలే  నగలు గాగల తమాల వృక్షమును ఆడు తుమ్మెద ఆశ్ర యించినట్లు, పులకలతో  నిండిన శ్రీ హరిపైకి ప్రసరించు నదియు  భక్తులకు సర్వసంపద లొసంగు  జాలు నట్టి మంగళ  

దేవతయైన  లక్ష్మీదేవి కరుణ తోడి కడగంటి చూపు నాకుమంగళముల నోసంగునుగాక .         

............................................................................................................. 

3)శ్లో.    ముగ్ధా ముహర్విదధతీ వదనే మురారే:

            ప్రేమ త్రపా ప్రణిహితాని గతా గతాని

            మాలా దృశో  ర్మ్దుదుకరీవ మహోత్పలే యా   

           సామే శ్రియం దిశతు సాగర సంభవాయా:  


ప:    చూచుచు  ప్రేమతోడ హరి సుందరరూపము,  శౌరి ప్రేమతో

        జూచినయంత సిగ్గుమెయి చూపుమరల్చుచు నుత్పలంబులో

        నేచు మరందముంగొనగ నేగెడి  భ్రుంగి విలాసలీలలన్

        దోచెడు భాగ్యలక్ష్మి కృపతోడుత  నన్నును జూచుగావుతన్   


 తా:      మక రందముకై నల్లగలువపైకి రాకపోకలు సాగించు ఆడు తుమ్మేద వలె శ్రీ మహావిష్ణువు మొగముపైకి ప్రేమతో సిగ్గుతో  మనోహరములగు చూపులను పరపుచు అయన 

చూచినంతనే  మాటికి సిగ్గుతో మరల్చునట్టి లక్ష్మీదేవి  చూపుల పరంపర నాకు సిరిసంపద లోసగునుగాక.

........................................................................................................

 4.శ్లో.    విశ్వా మరేంద్రపద విభ్రమ దాన దక్ష

            మానందహేతు రధికం మురవిద్విషో పి

            ఈ షన్నిషీదతు మయి  క్షణ మీ క్షణార్ధం

             ఇందీ వరోదర సహోదర మిందిరాయా:   


 ప:     ఈ యగుజాలునట్టి దమరేం ద్రుని రాజ్యమునైనగని, నా

          రాయనమూర్తికెంతయు ముదావహమైనది, తమ్మిదుద్దుమే

          ల్చాయకు సాటివచ్చునది సారసవాసినిఐన లక్ష్మి  అ

          త్యాయత లోచనాంచల కటాక్షము నాపైబర్వుగావుతన్

 

తా:     దేవేంద్రుని రాజ్యమునైన ఈయగలదియును శ్రీ మహా  విష్ణువునకు ఆనందము  కలిగించునది    యును, తామర   దుద్దు పసిమి మిసిమి గలిగిన మేనిఛాయగల లక్ష్మీ దేవి

కరుణా కటాక్షము  నాపై సదా ప్రసరించు  గాక      

 .....................................................................................................

5.శ్లో.     అమిలితాక్ష మధిగమ్య ముదా ముకుందం

             ఆనంద కంద మనిమేష  మనంగతంత్రం

             ఆకేకరస్థిత కానీనిక పద్మనేత్రం

             భూత్యై భవే న్మమ భుజంగ  శయాంగనాయా:  


ప:     అరమర లేని ప్రేమను ననంగుని మోహము మోడ్పుకన్నులన్

        గురియగుదన్నుజూచెడి ముకుందుని మోహమును గాంచి సిగ్గుచే

        మురిపెముగా మురారి నరమోడ్పు కనంగతోడ జూచు ఆ

        సిరి కరుణా కటాక్షములు శ్రీల నొసంగుత నాకు నెప్పుడున్


తా:   మన్మధుని ప్రేరణచేత అమందానందముతో, అరమోడ్పు  కన్నులతో రెప్ప వాల్చక తనవైపు చూచుచున్న మహావిష్ణువును  గాంచి సిగ్గుతో కమలములవంటి అరమోడ్పు  కన్నులతో  కంటి  పాప నోరగా జేసి పతివైపు చూచుచున్న పాలకడలి పట్టి లక్ష్మీ దేవి 

కటాక్షము నాకు సమస్తైశ్వరములు నోసగుగాక.  

............................................................................................................

6.శ్లో.      కాలంబుదాళి  లలితితోరసి కైటభారే:

              ధారాధరే స్పురతి  యా తటి  దంగనేవ

              మా తుస్సమస్త జగతాం  మహానీయమూర్తి:

               భద్రాణి మేదిశతు భార్గవ నందనాయా: 


ప :            నీలపయౌ ధరంబునను నిగ్గులుదేరు తటిల్లతాంగానం

                 బోలిమురారి వక్షమున మొదముతోడ వసించి కుర్మిమై

                 హేలగ సర్వలోకముల నేలుచు నుండెడి  కన్న  తల్లి  ప

                 ద్మాలయ  నాకోసంగుతను మంగళముల్ సతతంబుదారతన్


తా:           నల్లని మబ్బులో మెర యు చున్న మెరుపు తీగవలె  శ్రీ మహావిష్ణు హ్రుదయమున వసించుచు, సమస్త లోకములను  చల్లగా పాలించు కన్న తల్లి భ్రుగు నందనయగు  లక్ష్మీ  

 దేవి నాకు సమస్త శుభములు నొసంగును గాక             

........................................................................................................... 

7. శ్లో :     బాహ్వాంతారే మురజిత: శ్రితకౌస్తుభే యా 

               హారావళీవ   హరినీలమఈ  నిభాతి

               కామప్రదా భాగవతోపి  కటాక్షమాలా

               కళ్యాణ మావహాతు మే కమలాలయాయా:   


ప:  అతులిత కౌస్తుభం బురమునందున దాల్చిన విష్ణు  వక్షమం

      దతి  రుచిరంబు నీల మణిహారము వోలె వెలుంగు నిందిరా

      సతి సవిలాస ముగ్ధ వికసన్నవకైరవ  లోచనాంచలా

      తత కమనీయదృక్కులు సతంబు శుభంబు లోసంగు గావుతన్


తా:  కౌస్తుభ రత్నాలంకృతమైన శ్రీ మహావిష్ణువు వక్షమునందు వసించేడి  లక్ష్మీ దేవి యో క్క ఇంద్ర నీల మణిహారము వలే విరాజిల్లు కరుణా తరంగితములైన కడగంటి చూపులు సదా నాపై  ప్రసరించు నుగాక.  

 .......................................................................................................

8. శ్లో :      ప్రాప్తం పదం ప్రధమత: ఖలు యత్ప్రభావాత్

                మాంగల్య  భాజి  మధుమాధిని మన్మధేన

                మయ్యా పతే  త్తదిహ మంధర మీక్షణార్ధం

                మందాలసంచ  మకరాలయ కన్యకాయా: 

ప:  ఏయమప్రేమపూర్ణములు దృక్కులు విశ్వ ము నేల్లగావ, నా    

      యణమూర్తి కాదినిననంతముశక్తినొసంగేనట్టిఅ                                

      త్యాయత పద్మనేత్ర మకరాలయపుత్రి కటాక్షవీక్షణల్

      చేయుత  మంగళంబుల సశేషముగాను నిరంతరంబుగా


తా:  సంపూర్ణప్రేమ భరితములైన ఏ చూపులు సృష్ట్యా దిని శ్రీ మహావిష్ణువునకు విశ్వసంరక్షనకై అనంత శక్తి నొసంగెనో అట్టి  క్షీరసాగరతనయయగు లక్ష్మి దేవి కటాక్షవీక్షణములు నాపై 

       ప్రసరించును గాక.

...........................................................................................................  


9. శ్లో :      దద్యా ద్దయ్యానుపవనో ద్రవిణాంబుధారా

                మస్మి న్నకించన విహంగశిశౌ  విషణ్ణే

                దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం

                నారాయణ ప్రాణయినీ  నయనాంబువాహ:

ప:  కరుణా మారుత చోదితంబులతులే కల్యాణి దృక్పధముల్

      చిర కాలార్జిత పాపపుంజము వలె న్వేదంబు పోకార్చునో

      పరితప్తాకుల చాతకంబునగు నాపై నార్తి చల్లారగా

      కురియుమ్గాక దరిద్రతా జడిమ లేకుండా న్నిరుల్ సంపదల్


తా:  శ్రీ మహావిష్ణువు ప్రియసతియైన శ్రీ మహాలక్ష్మి కటాక్షవిక్షణ మనేడి  మేఘము దయయను మారుతముచేత ప్రేరితమై చిరకాలార్జిత పాప  రూపమగు చెమటను పోగొట్టి పేద చాతక  పక్షికూననగు నాపై కనక  వర్షమును తనివితీరా కురియునుగాక .  

..........................................................................................................

10.శ్లో       ఇష్టా వశిష్ట మతయోపి యయా దయార్ద్ర  

               దృష్టా స్త్రివిష్ట మపదం  సులభం భజన్తే

               ద్రష్టి: ప్రహృష్ట కమలోదరదీప్తి రిష్టాం

               పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయా:  


ప:  అనయం బెవ్వడు పుణ్యకార్యముల జేయన్లేదో యవ్వానికిన్

      అనంఘంబైన మహేం ద్ర రాజ్యమును నీయంజాలునో  సత్క్రుషణ్

     కనకాభ్జోదర సోదరంబాగు తటిత్కామ్తి స్త్రకాసిమ్చు ఆ

     కనదబ్జాసన  లక్ష్మి  నాకిడు సనర్ఘంబైన భాగ్యంబులన్


తా:  ఎన్నడును ఎట్టి పుణ్యమును కుడ  చేసి యుమ్దరో అట్టి వారికి   సైతము దయతో దేవేంద్ర పదవినైన ఈయగల్గినదియును  పద్మములోని పసిడి కాంతులుగల మేనిచాయ గల లక్ష్మీ దేవి

       కటాక్ష వీక్షణము నాకు అనంత సంపదల నొసగును గాక.  

 ........................................................................................................

 11.శ్లో      గిర్దేవతేతి  గరుడధ్వజ సుందరీతి

              శాకంభరీతి శశి  శేఖర వల్లభేతి

              సృష్టి  స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై  

              తస్యై  నమ స్త్రిభువనైకగురో స్తరు ణ్యై:


ప:  వనజభవునకు సృష్టిలో వాణి  యనగా

      రక్షణము నందు శౌరికి రమ యనంగ

      ప్రళయవేళను శివునకు పార్వతి యన

      సాయపడు నిందిరకును సాస్టాంగ నతులు


తా:  లోకములను సృజించువేళ  బ్రహ్మాకు సరస్వతిగాను, లోక రక్షణ మందు నారాయణునకు లక్ష్మిగాను ప్రళయ కాలమున శంకరునకు  శాకంభరియనబడు  పార్వతిగాను సర్వవిధముల  సహకరించు ఆ పరాశక్తికి నమస్కారములు.    

...............................................................................................................................................................

12. శ్లో     శృ త్యై  నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై

               రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై 

              శక్యై నమోస్తు శతపత్ర  నికేతనాయై

              పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ ఫల్లభాయై:


ప:  శుభ ఫలప్రద  యగునట్టి శ్రుతికి సతులు

      రమ్య గుణరత్న నిధిఐన రతికి సతులు

      స్వ ఛ శత పాత్ర  వాసినీ  శక్తి  సతులు

      పూజ్య పురుషోత్తముని పత్ని పుష్టి సతులు


తా:  యజ్ఞాది పుణ్యకార్యములకు కారణ భూతఇన వెదరూపిణికి   శ్రీలక్ష్మికి నమస్కారములు,  సద్గుణములకు సాగారమైన రతి  స్వరూపిణికి నమస్కారములు, నూరు రేకుల పద్మ మందు  

       వసించు శక్తి  స్వరూపిణికి నమస్కారములు.  పురుషోత్తముడగు విష్ణు దేవునకు పత్నిఐన  పుష్టి  స్వరూపిణికి నమస్కారములు.

...............................................................................................................................................

13.  శ్లో :    నమోస్తు నాళీ క నిభానానయై

                 నమోస్తు దుగ్దోదధి  జన్మభూమ్యై

                 నమోస్తు సోమామృత సోదరాయై

                  నమోస్తు నారాయణ వల్లభాయై


ప:  సరసిజాత  సమాస్యయౌ సతికి నతులు

      క్షీరసాగారభవయైన సరికి నతులు

      తత సుధాకర సుధల సోదరికి నతులు

      సరసిజోదర పత్నికి సతము నతులు


తా:  కమలమువంటి మొగముగల లక్ష్మికి నమస్కారములు.  పాల  కడలి గారాబుపట్టియగు సిరికి నమస్కారములు.  చంద్రునకు  అమృతమునకు తోబుట్టువగు  లక్ష్మికి నమస్కారములు.  శ్రీ  మహావిష్ణువునకు ప్రియసతి ఐన  లక్ష్మీదేవికి నమస్కారములు. 

 ...........................................................................................................

14.   శ్లో :   నమోస్తు హేమామ్భుజ పీటికాయై

                నమోస్తు భూమండల నాయి కా యై

                 నమోస్తు దేవాది సుపుజితాయై

                  నమోస్తు శార్జాయుద వల్లభాయై :


ప:  కనక పద్మ నివాసినీ  కమల నతులు

      రమ్య భుమండలంబెలు రాజ్ఞి నతులు

      వానవాదుల కరుణించు పద్మ నతులు

      శార్జ  పాణిప్రియా సరోజాన్య  నతులు  


తా:  స్వర్ణ పద్మ వాసినియగు లక్ష్మీదేవికి నమస్కారములు.  సమస్త  భుమండలమును పాలించు మహారాజ్నికి నమస్కారములు.  ఇంద్రాదేవతలను కరుణతో కాపాడు కన్నతల్లికి నమస్కారములు.   సార్జమను విల్లు గల శ్రీ మహావిష్ణువునకు ప్రియసతిఐన శ్రీ మహాలక్ష్మికి నమస్కారములు.

.........................................................................................................15: 

15. శ్లో :     నమోస్తు దేవ్యై  భ్రుగునందనాయై

                నమోస్తు విష్ణో రురసి స్థితాయై

                 నమోస్తు లక్ష్మ్యే కమలాలయాయై

                  నమోస్తు దామోదర  వల్లభాయై : 

ప:  భ్రుగుతనూభవ అలికులవేణి నతులు

      విష్ణువక్షోనివాసినీ వేలనతులు

      కమలవాసిని శ్రీ దేవి కమల నతులు

      నతిననాభుని వల్లభా నతులు నీకు


తా:  భ్రుగు మహర్షిపుత్రిఐన శ్రీదేవికి నమస్కారములు.  శ్రీ విష్ణు వక్షస్థల  నివాసినికి లక్ష్మికి నమస్కారములు.  కమలవాసినిఐనకమలకు నమస్కారములు.  నందసుతుడైన శ్రీ  కృష్ణునకు   రుక్మిణి  నామముతో పత్నిఐన శ్రీ మహాలక్ష్మికి నమస్కారములు.      

........................................................................................................

 16.:శ్లో :    నమోస్తు కాన్యై కమలేక్షణాయై

                నమోస్తు భూత్యై భువన ప్రసూ త్యై

                 నమోస్తు దేవాదిభి రర్చితాయై

                  నమోస్తు నందాత్మజ  వల్లభాయై :


 ప:  కాంతి రూపిణి  ఐన ఒకమల  నతులు

      అఖిల సంపత్ప్ర దాయి నీ  అంబ నతులు

      దేవముని గణపూజితా దేవి  నతులు

      నందన సుత వల్లభా పద్మన  న నతులు


తా:  పద్మములవంటి  కన్నులుగల కాంతరూపిణికి  నమస్కారములు.   లోకజననికి, ఐస్వర  రూపిణికి  నమస్కారములు,  ఇంద్రాది దేవతలు చేత పుజింప బడు శ్రీదేవికి నమస్కారములు. నందసుతుడగు శ్రీ కృష్ణునకు రుక్మిణి నామముతో సతిఐన లక్ష్మీదేవికి నమస్కారములు .     ...........................................................................................................

17: శ్లో :      సంపత్కరాణి  సకలేంద్రియ నందనాని

                  సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి

                  త్వద్వందనాని దురితాహరణోద్యతాని

                  మామేవ మాత రనిశం కలయంతు మాన్యే  


            ప:  సకల సంపత్క రంబులు  సారసాక్షి

                  విందు లఖిలేంద్రి  యమల ఆనందములకు

                  పాపహరములు సామ్రాజ  అ  భాగ్యదములు

                  పద్మ జనయిత్రి నీకిడు వందనములు


తా:  పద్మ పత్ర విశాలలోచనా మాతా నీకు చేయు  వందనములు , సకల  సంపద్ర్పదములు

 సకలెంద్రియములకు ఆమమ్దా అమందా నంద ముల విందు చేయును .  సర్వ పాపములను తొలగిమ్చును.  సామ్రాజ  వైభవమును  సైతము యీయ గలవు. తల్లి నీకు సదా వందన మొనర్చు భాగ్యము  నాకే  కలుగునుగాక  

............................................................................................................

18. శ్లో :       యత్కటాక్ష సము పాసనా  విధి:

                 సేవకస్య  సకలార్ద  సంపద:

                 సంతనోతి వచనాం గ  మానసై

                 త్వాం  మురారి హ్రుదయేశ్వరీం  భజే.  


ప:  సకల సంపద్ర దంబులు  జనని నీదు

      సాంద్ర  కరుణా కటాక్ష వీక్షణములమ్మ

      భక్తితో గొల్తు నీ పాద పద్మములను

      స్తుతి యో నార్చెద త్రికరణ  శుద్ధిగాను


తా:  ఎవరి కరుణా కటాక్ష వీక్షణము  భక్తితో సేవించు వారికి సమస్త  సంపదలోసంగునో అట్టి మహాలక్ష్మీ  శ్రీ హరి హృదయేశ్వరి  నిన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించెదను 

.................................................................................................................................................19. శ్లో :        సరసిజ నయనే సరోజ హస్తే

                    ధవళ తరాం శుక  గంధ మాల్య శోభే

                    భగవతి హరివల్లభే మనోజ్జ్నే

                    త్రిభువన భూతికరి ప్రసీద మహ్య్యాం 


ప :  కమలలోచన  జనయిత్రి  కమలహస్త

       ధవళతర గంధ  మాల్య  వస్త్రా మానోజ్న

       భగవతీ  హరివల్లభా భాగ్యదాత్రి

       కరుణతో  బ్రోవుమా మమ్ము కన్నతల్లి.


తా : కమలముల  కన్నులు గల తల్లీ,  కమలము కరమునందు  గల  జననీ,  తెల్లని పట్టు వస్త్రములను ధరించి, తెల్లని గంధమును  పూసికొని, తెల్లని పూలమాలలతో శో భిమ్చు లక్ష్మీ దేవి,   నారాయణ ప్రియసతీ, నన్ను అనుగ్రహింపుము.    

         ............................................................................................................

20. శ్లో :         దిఘస్తిబి: కనకకుంభ ముఖావ సృష్ట

                     స్రగ్వా హినీ  విమల చారు జల ప్లు తాంగీం

                     ప్రాతర్నమామి జగతాం  జననీ మశేష

                     లోకాధినాథ గృహిణీ   మమృతాబ్ది పుత్రీం 


ప:  కనక కలశాల  నాకాశ  గంగ దెచ్చి

      తీ ర్ధ మాడింపగా నిన్ను దిగ్గజములు

      స్నాతవై  యోప్ప త్రైలోక్య జననీ  క్షీర

      వారాశి  పుత్రికా వందనములు


తా:  బంగారు కలశములతో నిర్మలమైన ఆకాశ గంగా నది  జలములను  తొండముతో దిగ్గజములు తెచ్చి స్నానము   చేయింపగా  నిర్మల  శరీరముతొ ప్రకాశించుచున్న తల్లీ, సమస్త 

       లోకములకు  ప్రభువైన నారాయాణుని ప్రియ పత్నీ  నమస్కారములు      .............................................................................................................

21. శ్లో           కమలే కమలాక్ష వల్లభే త్వం

                     కరుణాఫూ ర తరంగితై  రపాంగై :

                     అవలోకయచారు మా  మకించ నానాం

                     ప్రధమం పాత్ర మకృ త్రిమం దయాయా:

             

ప: కమల కమలాక్షవల్ల్లభా కమలనయన

     కనుము కరుణా కటాక్ష వీక్షణముతోడ

     వరమ దారిద్ర్య  వంతులం బ్రథముడనగు

        నన్ను బ్రోవుము! దినునిగన్న తల్లీ !

                

                   పద్మదళములవంటి కన్నులు గల తల్లీ !  పద్మాక్షుడగు  నారాయణుని  ప్రేయసి!   నేను పరమ దరిద్రులలో ప్రథముడను, నీ  దయకు పాత్రుడ నగు నన్ను కరుణా వీక్షణముల తో కనుగొనుము  

.............................................................................................................

22. శ్లో :        బిల్వాట వీమధ్య లసత్సరోజే

                    సహస్రపత్రే సుఖ సన్ని విష్టాం

                    అష్టాపదాంభోరుహ పాణి పద్మాం

                    సువర్ణా వర్ణాం  ప్రణమామి నిత్యం 


ప::అమ్మ మారేడు వనములో  నలరు నరసి

     వేయి రేకుల తమ్మిలో వెలయు  దీవు

     కనక కమలము కరమున గలిగి పసిడి

     చాయ నొప్పెడి సిరి నమస్కారమమ్మ


            మారేడు వనములో గల తామర కొలనులో  వేయి  రేకుల పద్మ మందు సుఖముగా కూర్చుండి, పసిడి తామర పువ్వు కరమునందు దాలిచి మిసిమి గల మేని చాయతో నొప్పారు లక్ష్మీదేవీ  ! అమ్మ! నమస్కారము.         ...............................................................................................................,,,

23. శ్లో :       కమలాసన పాణినా లలాటే 

                   లిఖితా మక్షర పంక్తిమస్య జంతో:

                   పరిమార్జయ మాత  రంఘ్రిణా  తే

                   ధనిక  ద్వార నివాస దు:ఖ దోగ్ద్రీం 

ప: నాదు  నుదుటను వ్రాసెను నలువ యిట్లు

     వరమ దారిద్ర్య  దు:ఖంబు పడయు మంచు

     కలిమి గలవారి వాకిట నిలువు మంచు

     బ్రహ్మ వ్రాతను తుడువు నీపదముతోడ


                    పరమ దరిద్రులలో ప్రథముడవై కలవారి వాకిళ్ళ ముందు నిల్చి బిచ్చమెత్తుకొనుమని బ్రహ్మదేవుడు  నా నుదుటిపై వ్రాసెను.  తల్లి నీవు ఆ బ్రహ్మవ్రాతను నీ  పాద పద్మముతో తుడిచి వేయుము 

.....................................................................................................................................................................

24. శ్లో :  అంభోరుహం జన్మగృహం భవత్యా;

              వక్షస్థలం భర్త్రు గృహం మురారే

              కారుణ్యత: కల్పయా పద్మవాసే !

              లీలా  గృహం మే హ్రుదయార విందం


ప: ముద్దు గొల్పెడి తమ్మి  నీ పుట్టినిల్లు

     ఆ మహావిష్ణు హృదయమే అత్తయిల్లు

     కమలవాసిని! కొలు వుండు  కరుణతోడ

     ఎల్లవేళల నాదగు హ్రదయ పీట్టి 

 

                    తల్లీ శ్రీ మహాలక్ష్మి పద్మము నీకు పుట్టినిల్లు, శ్రీ మన్నరాయణుని హృదయమే నీకు మెట్టినిల్లు, ఓ పద్మాలయా కరుణతో నా హృదయారవిమ్దమును నీ  విలాస మందిరముగా చెసికొనుము. 

..............................................................................................................................................................

25. శ్లో :   స్తువంతి యే  స్తుతి భి రమూ భి రన్వహమ్

               త్ర ఈ మ ఈమ్ త్రిభువన మాతరం రమాం

               గుణాధికా  గురుతర భాగ్య  భాజినో

               భవంతి తే భువి బుధ భావితాశయా;      

ప:   ఎవరు స్తుతియింతురో వారలి స్తవమున

       మాన్య వేదాత్మ త్రిభువన మాత  రమను

       అతుల సంపద గల్గి గుణాధికులయి

       పండితుల మెప్పు గాంతురు వసుధయందు


                 ప్రతిదినము ఎవరు ఈ స్తుతులతో ముల్లోకములకు తల్లి ఐయిన లక్ష్మీదేవిని స్తుతిమ్తురో వారు గుణములచే నధికులగుచు అధిక ధనవంతులై  పండితుల మెప్పు గాంతురు

***

నా స్నేహితుడు కీర్తిశేషులు శ్రీ అక్కిరాజు వేంకటేశ్వరశర్మగారి     కుమారుడు "శ్రీధర్ " అందచేసిన శ్రీ జగద్గురు  శంకర భాగవత్పాదులచే రచితమైన కనకధారాస్తవము (ఆంధ్ర పద్య తాత్పర్య సహితము )
ఆన్ లైన్ లో ప్రతివక్కరు చదువుకొనుటకు, ముద్రణద్వార నలుగురు ఒక చోట కూర్చొని భక్తితో లక్ష్మీ దేవి కరుణా కటాక్షము, సమస్త శుభములు కలగాలని ఇందు పొందు పరుస్తున్నాను.
                         సర్వేజనా స్సుఖినోభవంతు                                                                                                విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 
 

Sunday, 21 May 2023

 

: *భగవద్గీత పైన అందరికి ఉండవల్సిన అవగాహన కోసం...హిందూ ధర్మం పాటించే ప్రతీ ఒక్కరికీ షేర్ చేయండి*

*1.* భగవద్గీతను లిఖించినదెవరు?

=విఘ్నేశ్వరుడు.

*2.* భగవద్గీత మహాభారతంలోని ఏ పర్వములోని భాగము?

= భీష్మ పర్వము.

*3.* గీతాజయంతి ఏ మాసములో ఎప్పుడు వచ్చును?

=మార్గశిర మాసము.

*4.* గీతాజయంతి ఏ ఋతువులో వచ్చును?

=హేమంత ఋతువు.

*5.* ఋతువులలో తాను ఏ ఋతువునని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వసంత ఋతువు.

*6.* భగవద్గీత ఎవరు ఎవరికి బోధించెను?

=శ్రీకృష్ణుడు అర్జునునికి.

*7.* భగవద్గీత ఏ సంగ్రామ సమయంలో ఆవిర్భవించెను?

=కురుక్షేత్ర సంగ్రామము.

*8.* భగవద్గీత బోధింపబడిన సమయంలో ఎవరెవరికి సంగ్రామము ప్రారంభమయ్యెను?

=కౌరవ పాండవులకు.

*9.* పాండవులలో ఎవరికి శ్రీకృష్ణుడు రథసారధిగా వుండెను?

=అర్జునుడు.

*10.* వేదములలో తాను ఏ వేదమని శ్రీకృష్ణుడు చెప్పెను?

=సామవేదము.

*11.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరేమిటి?

=పాంచజన్యము.

*12.* భగవద్గీతలో ఎన్ని అధ్యాయములు గలవు?

=పద్దెనిమిది (18)

*13.* “నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడినవో, నా బుద్ధి వికాసమునకు భగవద్గీత అంతకంటే ఎక్కువ ఉపయోగపడినది” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోథుడెవరు?

= వినోబా భావే.

*14.* “సంశయములు నన్నావరించినపడు, సంకటములు సంప్రాప్తమైనపుడు, నిరాశా నిస్పృహలు జనించినపుడు నేను భగవద్గీత తెరచి చూచెదను. అందు ఏదో ఒక శ్లోకము నన్నూరడించును.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?

= మహాత్మా గాంధీ.

*15.* భగవద్గీతకు ప్రథమ ప్రచారకుడెవరు?

= సంజయుడు.

*16.* సేనానాయకులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=కుమారస్వామి.

*17.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు ఊదిన శంఖం పేరేమిటి?

=దేవదత్తము.

*18.* భగవద్గీత యందు వ్యాసునిచే ఎన్ని ఛందస్సులు వాడబడినవి?

= ఐదు. (అనుష్టుప్, ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర, ఉపజాతి, విపరీతపూర్వ.)

*19.* భగవద్గీతను సాక్షాత్తుగా (లైవ్) వినినవారెవరు?

=నలుగురు. అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, హనుమంతుడు.

*20.* ఆయుధమును ధరించిన వారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= శ్రీరామచంద్రుడు.

*21.* భగవద్గీత యందు శ్రీకృష్ణునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు?

=అచ్యుత, అనంత, జనార్ధన.

*22.* భగవద్గీత యందు అర్జునునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు?

=ధనుంజయ, పార్ధ, కిరీటి.

*23.* శ్రీకృష్ణపరమాత్మ తన అవతార సమయంలో రెండు గానములు చేసెను. ఒకటి మురళీగానం. మరి రెండవది ఏమిటి?

=గీతా గానం.

*24.* “ది సాంగ్ ఆఫ్ సెలెస్టియల్” అనే పేరుతో భగవద్గీతను ఆంగ్లభాషలో పద్యరూపమున వ్రాసిన ఆంగ్లకవి ఎవరు?

=ఎడ్విన్ ఆర్నాల్డ్.

*25.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో భీముడు ఊదిన శంఖం పేరేమిటి?

=పౌండ్రము.

*26.* ఏకాదశ రుద్రులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=శంకరుడు.

*27.* “నా తల్లి చాలా కాలం క్రిందటే మరణించెను. కానీ అప్పటినుండి భగవద్గీత యను తల్లి ఆ స్ధానమును ఆక్రమించి, నా పక్కనే వుండి నన్ను కాపాడుచున్నది.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?

=మహాత్మాగాంధీ.

*28.* భగవద్గీత ఏ వేదములోనిది?

=పంచమ వేదం-మహాభారతం.

*29.* భగవద్గీత యందు ఎన్నవ అధ్యాయంలో భగవంతుని విశ్వరూప సందర్శన ప్రత్యక్షముగా వర్ణింపబడినది?

=11వ అధ్యాయము

*30.* ద్వాదశాదిత్యులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=విష్ణువు

*31.* భగవద్గీత మొదటి అధ్యాయం పేరేమిటి?

=అర్జున విషాద యోగము.

*32.* భగవద్గీత మొదటి అధ్యాయంలో చెప్పబడిన మహారథుడు అనగా ఎంతమంది యోధులతో ఒక్కడే యుధ్ధము చేయగలడు?

=పదివేలమంది.

*33.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో ధర్మరాజు ఊదిన శంఖం పేరేమిటి?

=అనంతవిజయము.

*34.* భగవద్గీత మొదటి శ్లోకం ఏ పదం (శబ్దము)తో ప్రారంభమవుతుంది?

= “ధర్మ” - శబ్దముతో గీత ప్రారంభమయినది.

*35.* ధృతరాష్ట్రునికి మహాభారత యుద్ధంలో జరుగుతున్న ప్రతీ విషయమును గీత సంవాదముతో సహా ఎప్పటికపుడు ప్రత్యక్షంగా (లైవ్) వివరించినదెవరు?

=సంజయుడు.

*36.* భగవద్గీత ప్రకారం మహాభారత సంగ్రామం మొదటిరోజున పాండవుల తరపున వ్యూహ రచన చేసినది ఎవరు?

=దృష్టద్యుమ్నుడు.

*37.* ఆయుధములలో తాను ఏ ఆయుధమని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వజ్రాయుధము.

*38.* మహాభారత సంగ్రామం మొదటి రోజున పాండవుల యుద్ధవ్యూహము పేరేమిటి?

=వజ్ర వ్యూహం.

*39.* గీతా సంవాదము జరిగిన మహాభారత సంగ్రామ మొదటి రోజున కౌరవుల సేనాపతి ఎవరు?

=భీష్ముడు.

*40.* సర్పములలో తాను ఏ సర్పమని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వాసుకి.

*41.* అనేక తలలు గల నాగులలో తాను ఏ నాగునని శ్రీకృష్ణుడు చెప్పెను?

= అనంతుడు.

*42.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో నకులుడు ఊదిన శంఖం పేరేమిటి?

=సుఘోషము.

*43.* అర్జునుని ధనస్సు పేరేమిటి?

=గాండీవము.

*44.* జీవునకు ఈ శరీరమునందు ఎన్ని అవస్థలు కలుగునని శ్రీకృష్ణుడు చెప్పెను?

=నాలుగు. (బాల్యము, యౌవనము, వార్థక్యము, దేహాంతర ప్రాప్తి)

*45.* నదులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= గంగానది.

*46.* ఆత్మ యెట్టిది?

=నాశరహితమైనది.

*47.* కొంత ఆచరించి మధ్యలో వదిలివేసిననూ నిష్ఫలము కాని కర్మను ఏమందురు?

=నిష్కామ కర్మ.

*48.* మనుజునకు దేనియందు అధికారము కలదు?

=కర్మలు చేయుటయందు మాత్రమే. (ఫలమునాశించుట యందులేదు.)

*49.* అర్జునుడు ఎవరి లక్షణములు-భాష, నివాసము, నడవడిక తెలుపమని శ్రీకృష్ణుని అడిగెను?

=స్థితప్రజ్ఞుడు (జీవన్ముక్తుని లక్షణములు.)

*50.* వృక్షములలో తాను ఏ వృక్షమని శ్రీ కృష్ణుడు చెప్పెను?

= రావిచెట్టు.


*51.* పంచభూతములచే నాశనము పొందనిది ఏది?

=ఆత్మ.

*52.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో సహదేవుడు ఊదిన శంఖం పేరేమిటి?

=మణిపుష్పకము.

*53.* ప్రపంచమున పూర్ణానందమెచట లభించును?

=ఆత్మయందు.

*54.* మహాభారత సంగ్రామంలో అర్జునుని రధము యొక్క జెండాపై గల వానరుడెవరు?

=హనుమంతుడు.

*55.* పక్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= గరుత్మంతుడు.

*56.* ఏ జంతువు వలె యోగి అయినవాడు తన ఇంద్రియములను వెనుకకు మరల్చును?

=తాబేలు.

*57.* కర్మచేయుట మేలా, చేయకుండుట మేలా?

=చేయుటయే మేలు.

*58.* బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించునపుడు వారితో సహా మఱి వేనిని సృష్టించిరి?

=యజ్ఞములు (సత్కార్యములు, దైవకార్యములు)

*59.* వివేకవంతుడు కర్మలను ఎందుకు చేయవలెను?

=లోక క్షేమం కొరకు.

*60.* ఆవులలో తాను ఏ ఆవునని శ్రీకృష్ణుడు చెప్పెను?

= కామధేనువు.

*61.* స్వధర్మ, పరధర్మములలో ఏది శ్రేష్ఠమైనది?

=స్వధర్మము.

*62.* పొగచేత అగ్నియు, మురికిచేత అద్దము, మావిచేత గర్భమందలి శిశువు కప్పబడి వున్నట్లు ఆత్మజ్ఞానము దేనిచే కప్పబడియుండును?

=కామము చేత.

*63.* దేని ప్రేరణచే జీవుడు తాను వద్దనుకొన్ననూ పాపమును చేయుచున్నాడు?

= కామము యొక్క ప్రేరణచే.

*64.* భగవంతుడెపుడు అవతరించును?

=ధర్మము క్షీణించి, అధర్మము వృద్ధిపొందునపుడు.

*65.* అసురులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= ప్రహ్లాదుడు.

*66.* గంధర్వులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= చిత్రరథుడు.

*67.* హృదయ శుద్ధి తద్వారా మోక్షము దేనివలన కలుగగలదు?

=జ్ఞానతపస్సు.

*68.* జ్ఞానప్రాప్తి వలన కలుగు ఫలితమేమిటి?

=పరమశాంతి.

*69.* ఆత్మధ్యానమును అభ్యసించుచున్న యోగి యొక్క మనస్సు దేనితో పోల్చవచ్చు?

=గాలిలేనిచోట గల దీపంతో.

*70.* ఏ సాధనములచేత మనస్సు నిగ్రహింపబడగలదు?

=అభ్యాసము, వైరాగ్యము.

*71.* భయంకరమైన మాయను దాటుట ఎట్లు?

=భగవంతుని శరణుపొందుట వలన.

*72.* భగవంతుని సేవించువారిని ఎన్నిరకములుగా శ్రీకృష్ణుడు వర్గీకరించెను?

=నాలుగు రకాలు (ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధార్థి, జ్ఞాని.)

*73.* భగవత్స్వరూపమును ఎవరు తెలిసికొనలేరు?

=అజ్ఞానులు.

*74.* విద్యలలోకెల్లా శ్రేష్ఠమైనది, అతిరహస్యమైనది ఏది?

=బ్రహ్మవిద్య.

*75.* మహర్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= భృగు మహర్షి.

*76.* బ్రహ్మవిద్యకు అర్హత యేమి?

=హృదయ శుద్ధి, అసూయాది దుర్గుణరాహిత్యము.

*77.* ఆకాశమునందు వాయువు వలె, సమస్త ప్రాణికోటి ఎక్కడ స్థితిగలిగి యున్నది?

=పరమాత్మయందు.

*78.* గొప్ప దుర్మార్గుడు సన్మార్గుడెట్లు కాగలడు?

=పరమాత్మయందు అనన్యభక్తిచే.

*79.* ఎప్పటికీ దుర్గతి పొందనది ఎవరు?

=భగవంతుని భక్తుడు.

*80.* సమస్త ప్రాణికోటి యొక్క హృదయాంతరాళములందు నివసించు ప్రత్యగాత్మ ఎవరు?

=సాక్షాత్తు పరమాత్మయే.

*81.* ఇంద్రియములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=మనస్సు.

*82.* పర్వతములలో తాను ఏ పర్వతమని శ్రీకృష్ణుడు చెప్పెను?

=మేరువు.

*83.* పురోహితులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=బృహస్పతి.

*84.* వాక్కులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=ఓం కారము.

*85.* యజ్ఞములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు నుడివెను?

=జప యజ్ఞము.

*86.* ఏనుగులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= ఐరావతము.

*87.* గుర్రములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= ఉచ్ఛైశ్శ్రవసము.

*88.* శ్రీకృష్ణ భగవానునిచే ఆహారము ఎన్ని రకమలుగా పేర్కొనబడెను?

= మూడు (సాత్విక, రాజస, తామసాహారము)

*89.* దేవఋషులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= నారదుడు.

*90.* సిద్ధులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=కపిల మునీంద్రుడు.

*91.* భగవద్గీత చివరి అధ్యాయము పేరేమిటి?

= మోక్షసన్యాస యోగము.

*92.* లెక్కపెట్టువారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= కాలము.

*93.* జలచరాలలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= మొసలి.

*94.* ఆత్మను దేహమునందు ఉంచుటకు కారణమైన మూడు గుణములేవి?

= సత్త్వ, రజ, తమో గుణములు.

*95.* వేగముగా సంచరిస్తూ పవిత్రమొనర్చు వారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వాయువు.

*96.* భక్తియోగమైన పన్నెండవ అధ్యాయంలో భక్తుని లక్షణములు మొత్తము ఎన్ని చెప్పబడెను?

= 35.

*97.* విద్యలోల తాను ఏ విద్యనని శ్రీకృష్ణుడు చెప్పెను?

= ఆధ్యాత్మ విద్య.

*98.* రాగద్వేష రహితముగా, తత్త్వ నిశ్చయము కొరకు వాదించువారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వాదము.

*99.* అక్షరములలో తాను ఏ అక్షరమని శ్రీకృష్ణుడు చెప్పెను?

= "అ"-కారము.

*100.* భగవంతుని విశ్వరూప సందర్శనమును ఎవరు మాత్రమే చూసెను?

= అర్జునుడు. (వ్యాసుడు, వ్యాసుని వరం వలన సంజయుడు, రథ ధ్వజంపై అదృశ్యరూపంలో వున్న హనుమంతుడు కూడా)

*101.* మాసములలో తాను ఏ మాసమునని శ్రీకృష్ణుడు చెప్పెను?

= మార్గశిరము.

*102.* క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగమైన 13వ అధ్యాయములో జ్ఞానగుణములు మొత్తము ఎన్ని చెప్పబడెను?

= 20 (ఇరువది).

*103.* శ్రీకృష్ణ భగవానునిచే దైవగుణములు ఎన్ని పేర్కొనబడెను?

= 26 (ఇరువదియాఱు).

*104.* శ్రీకృష్ణ భగవానునిచే అసుర గుణములు ఎన్ని పేర్కొనబడెను?

= 6 (ఆఱు).

*105.* తపస్సులెన్ని రకములు?

= మూడు (శారీరక, వాచిక, మానసిక)

*106.* పరబ్రహ్మమునకు ఎన్నిపేర్లు కలవు?

= మూడు (ఓమ్, తత్, సత్).

*107.* మోక్షమును పొందుటకు కర్మలను వదలవలెనా?

= లేదు. కర్మలు చేయునపుడు భగవంతుని యందు మనస్సు లగ్నమై వుండవలెను.

*108.* సంజయుడు ఎవరి అనుగ్రహముచే ఈ గీతాసంవాదమును నేరుగా (లైవ్) వినగలిగెను?

వేదవ్యాసుడు.

💐🙏💐



నేటి బ్రహ్మజ్ఞానము .. ప్రాంజలి ప్రభ .. 111

సేకరణ రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

 

అవమానాలు, దూషణలు, అహంకారాన్ని గాయపరచక మానవు. అయితే ఈ రెండూ జ్ఞాని దృష్టిలో, దూషించేవాని మనస్సులో కదిలే రెండు రకాల భావనా వీచికలు మాత్రమే! 


సంతోషంతో నిండిన మనస్సులోంచి పొగడ్తల వంటి మంచి శబ్దాలు వస్తాయి. క్రోధ విచారాలతో ఈర్ష్యతో నిండిన మనస్సు నుండి తిట్లు అవమానాలు ఉదయిస్తాయి.

 వస్తుతః రెండూ కూడా మనోవికార జనిత భావాలే! భావనాధారంగా ఆత్మ చైతన్యంగా తన్ను తాను తెలుసుకున్న జ్ఞాని భావాల క్రీడ అని శాంతంగా సమదృష్టితో వీక్షిస్తాడు.

 సాధారణంగా మనలోని అహంకారమే బుద్ధితో తాదాత్మ్యం చెంది ఎదుటివారి మాటల అర్థాన్ని గ్రహించి సంతోష విచారాలను అనుభవిస్తూ ఉంటుంది.

 ఆత్మతత్త్వాన్ని అర్థం చేసుకుని అహంకారపు మాయను జయించిన ధీరుని, మానావమానాలు ఏం చెయ్యగలవు? రెండూ అదే చైతన్యంలో ఉద్భవించి నర్తించి నమస్కార సూచకమైన మౌనంతో పాదాభివందనం చేసి అదృశ్యమయిపోతాయి.

ఒకసారి బుద్ధభగవానుడు బజారులో నుండి శిష్యసమేతంగా వస్తూ ఉన్నాడు. ఒకవ్యక్తి 

ఆయనను సమీపించి దూషించి అవమానించడం మొదలు పెట్టాడు. అన్నిటినీ శాంతంగా వింటూ భగవానుడు నిలబడ్డాడు. 

అవన్నీ పూర్తయిన తరువాత ఆదే శాంతంతో ఆయన ముందుకు సాగబోతుంటే ఆయన శిష్యుడు అపరిమితమైన ఆవేశంతో 'స్వామీ ఆ నీచునికి బుద్ధి చెప్పి వస్తాను అనుజ్ఞ " నీయండి, దైవస్వరూపులయిన మిమ్మల్ని అన్ని మాటలన్న అతడు క్షమార్హుడు కాడు" అన్నాడు. అందుకాయన చిరునవ్వుతో "వత్సా! అతడన్న మాటలన్నిటిని నేను విన్నాను కాని, స్వీకరించలేదు. 

అందుకే నేనతనికి తిరిగి యివ్వవలసిందేదీ లేదు. ఒకవేళ నీవు స్వీకరించి ఉంటే తప్పకుండా వెళ్ళి బదులు తీర్చి రా నాయనా' అన్నారట. బుద్ధితో సాధించగలిగిన పూర్ణత్వం ఇదే. దీనినే సమబుద్ధి అంటారు.

ఆత్మజ్ఞానికి తన చైతన్యమే భావనా తరంగాలుగా సర్వత్రా నర్తిస్తూందనే సత్యం సర్వదా స్ఫురిస్తూనే ఉంటుంది. చూడబడే, గుర్తింపబడే సర్వమూ తన నర్తనలే అని అతడికి స్పష్టంగా తెలుసు. 

అహంకారంలేని కారణంగా, మనో బుద్ధులతో తాదాత్మ్యం చెంది, సంఘటనలను యిష్టాయిష్టాల దృష్టితో చూడడు. మానఅవమానాలతనికి సమానమే. దేనిపైనా అతనికి ఆకర్షణా వికర్షణా ఉండవు. 

సర్వత్రా, సర్వదా, సర్వ సంఘటనలలోనూ, చైతన్యమయిన తానే భావనా తరంగాలుగా నర్తించడాన్ని గుర్తిస్తూ మౌనసమయ మాధురీపూర్ణ మానసంతో శాంతుడై ఉంటాడు!

ప్రతి స్ఫురణము లేక స్పందన లేక కంపమునకు హేతువు అగు మహాశక్తి మాయ- దైవము.

ప్రతి చలనము నకు  కావలసిన చలన శక్తి- దైవము.  ప్రతి తేజమును  వీక్షించు  చూపు  అనే కాంతి లక్ష్మి- దైవము.   ప్రతి మాటలోని  శబ్ధబ్రహ్మము-దైవము.

ప్రతి హృదయములోని జాగరూకమైన ప్రాణము- దైవము.  ప్రతి శిరస్సు అందలి 

ధ్యానము- దైవము.  ప్రతి చూపు లో ప్రకాశము- దైవము ప్రతి మూలాధార చక్రమున 

జ్వలించునది-దైవము.

***

శీర్షిక:-నాకు నేనే -- ప్రాంజలి  ప్రభ  (వ్యాసం)  --1  

*********

నిలదీసే తత్వాన్ని నిద్రపుచ్చకు, రాజీపడే తత్వాన్నిచేరనీకు, నిజాన్ని నిర్భయంగా తెలుపుట మరువకు, దేశ భక్తి , మాతృభాష రక్షణ, నరనరానికి ఎక్కించుకొన్నాక, తల్లి లేరు తండ్రి బంధువులు అసలే లేక, బాధ్యత క న్నా భయమే తోడు రానీక, చేయనెంచ దలచినది నిర్భయంగా, నిస్వార్ధంగా, నిర్ణయ పరంగా, హృదయం ఒక యంత్రంగా, విద్యుత్తై ఆయుధంగా, కనబడని గాలిలాగా దూసుకు పోయే ఇంధనంగా సేవలకై నిత్య ప్రయత్నం.           

దేహమంతా ఆవహించి చిన్ని గుండెలో తిష్టేసింది ఆ ఉదయాన..!!

తప్పు చేయకున్నా, తప్పించుకునే దారులు వెతకకున్నా, వెతుకులాటలో  వ్యక్తిత్వం చూపే హృదయమున్నా, రుధిరం చిందించకుండా, సమయం వ్యర్ధ అవ్వకుండా,  దొడ్డి దారి లోకి దూర కుండా, నిర్మలమైన మనస్సుతో, నవ్వులమ్మ మొగం చూపిస్తూ, సర్వం నిగ్రహించె 

హృదయాంతరంగాన. తిష్టేసింది ఆ ఉదయాన..!!. 

నిత్యం నీళ్ళు పోసి పెంచిన సహజత్వం పూలమొక్కల వంటి ఎదుగుతున్న యువక వర్ధమాన శక్తి, వాడిపోయే వారికి చేయుట నిచ్చే శక్తి, మొగ్గలుగానే రాలిపో కుండా పులా పరిమాళాలను అందించేవిధముగా  వికాసం కల్పించే శక్తి యువరక్తం, వృద్ధులకు, స్త్రీలకు, పిల్లలకు,       

నడవడిక రాజమార్గాన.తిష్టేసింది ఆ ఉదయాన..!!.

నేరమొకడు చేసి శిక్షను  వేరొకరి కేసిన, నోరు మెదపని ప్రజానీకం చుస్తే ఏమనాలో నాకు మాత్రం తెలియలేదు, ఇటువంటి పిరికి బందల మనస్సు మార్చాలని నా ప్రయత్నం,     

ఆలవాలమై ఆలనాపాలనా లో అబద్రతా భావ ఆనవాళ్లు అడుగడుగునా ధనమదం, అధికార జులం, రక్షక భటుల అగమ్య గోచరం, మార్పు రావాలని  తిష్టేసింది ఆ ఉదయాన..!!.

మొలకెత్తి  నిలకడ తత్వం లేని మానవత్వం, పెరిగి పోతున్నా న్యాయ వాద రాజనీతి చదరంగం ఆటలు వెల్లువ ప్రజలకు నిదుర కరువైంది, ఆకలి మొదలైంది, మందుల మోసం ఎగసి పడుతున్నది, నకిలీ విత్తనాలు బాజారులో అమ్ముడవుతున్న పట్టించుకోని ప్రభుత్వాలు, కేవలము సంపాదన, సంపాదనా గుప్పెడు అన్నాని కోసం కోట్లు దాచటం తిష్టేసింది ఆ ఉదయాన..!!.         

నన్ను నేను హింసించుకుంటు అనారోగ్యాన్ని ఆహ్వానించక, ధైర్యాన్ని ఊపిరిగా వివరించి, స ర్వే జనా సుఖినోభవంతు అంటూ నిలకడ లేని నా ప్రయాణం సాగిస్తూ, మనశ్శాంతి  ఎక్కడ ఎక్కడ అంటూ ధర్మాన్ని రక్షించ దలిచాను మనసా, వాచా, కర్మణా, నిరీక్షనా జీవితం తిష్టేసింది ఆ ఉదయాన..!!. 

మనఃపూర్వక  భావవ్యక్తీకరణ మౌనం వహించక భాషలో  అసహనం అపసృతులు తాండవించకుండా, మనసుకు బుద్ధి కి మద్య వైరుధ్యాల యుద్ధాలు సహజమైన, దాని భావాల్ని ఉత్తేజ పరచడానికి నిర్విరామ కృషిగా నిత్యం చేస్తూనే వున్నాక సత్యం ఎక్కడ లోన ఈ లోకానా తిష్టేసింది ఆ ఉదయాన..!!.  

చేతకాని తనమో, కాదు కాదు చేవలేని తనమో అన్న మాటలకూ తలఒగ్గకుండా ప్రశ్నించలేని  అస్తిత్వాన్ని కోల్పోక స్థిరత్వాన్ని నిలపడానికి శ్రావ్య శక్తులను ప్రజ్వలింప చేయ గలను, నిస్సహాయుడను కాను ఒక్కడినే అయినా తోడు రాక పోయినా ఎంత మంది ఉన్న గమ్యాన్ని మార్చను, ఆలోచనలను ఆచరణకు త్రికరసిద్ధిగా ప్రయాణాలు సాగె వారికీ చే యూత నివ్వ గలను అదే నా లక్ష్యం , నా ధ్యేయం, నా కర్మలు చేయు మర్మం,  తిష్టేసింది ఆ ఉదయాన..!!.  

అస్తవ్యస్తంగా మారిన జీవనశైలిలో స్థిరత్వం శిధిలమై పోకుండా,   అంతరంగమంతా ఆత్మ తత్వంగా ప్రశ్నలే ప్రశ్నలు జవాబులు తెలియపరుస్తూ హృదయాంతరాలలో జీవిస్తూ,  

జవాబు దారి తనాన్ని అందరికి అందిస్తూ,  ఎడారి చేసిన మార్గాన్ని పరిశీలించి పునర్ నిర్మిస్తూ 

రాజీ ధోరణిలో  నన్ను నేను కోల్పోక జీవశ్చవంగా కనిపించక నిర్ణయాలన్ని ఆ భగవంతుడు చేయిస్తున్నాడని భవిస్తూ నలుగురికి సేవలు చేస్తూ ఆ హనుమంతుడ్ని ప్రార్ధిస్తూ నాగమ్యం పూల బాటగా మార్చుకోవాలని ఈ ప్రయత్నం అందుకే తెలుగును రక్షించు కుందా, పరభా షను తరిమేద్దాం ఓం శ్రీ రామ  శ్రీ మాత్రే నమః  తిష్టేసింది యీ ఉదయాన..!!.       

*******

  

Friday, 19 May 2023

 


01*తెలుగు చిత్రం, భళారే విచిత్రం!* 
_వారణాసి సుధాకర్_

చిత్తూరు నాగయ్య గారి కాలంనాటి సినిమాల్లో దేశభక్తి, దైవభక్తి లాంటివి చూపించడం పెద్ద సక్సెస్ ఫార్ములా కాబట్టి, మొదటి రీలులోనే అయిదారు చరణాల భక్తి పాట పాడి, యింటిల్లిపాదీ కలిసి,  దేవుడి పూజచేసి, మనందరికీ హారతి చూపించి, ప్రసాదం మాత్రం...వాళ్ళే తినేసేవాళ్ళు.

తరవాత రీళ్ళలో నాగయ్య గారి సంగీత విభావరి మస్టు. హీరోయిన్లు..నాటి దేశ, కాలమాన పరిస్థితులకు అనుగుణంగా, అప్పటి సమాజ కట్టుబాట్ల కి తలవంచి, వీలయినంత వరకు, తలుపు చాటు నుంచి చూపులతోనే శృంగారం ఒలికించేవాళ్ళు. విలన్లు కూడా...క్రూర చూపుల బాణాలే సంధించేవాళ్ళు తప్ప, హీరోయిన్లని ముట్టుకునేవాళ్ళు కాదు.

మధ్య మధ్యలో గాంధీ - నెహ్రూ లను, మన జాతీయ జెండాని దేశభక్తి  చిహ్నంగా చూపిస్తే, మేవందరం చప్పట్లు కొట్టేసేవాళ్ళం. అదంతా....ఒక పాతరాతి యుగం !

తరవాత్తరవాత, రామాయణ, భారత భాగవతాల్లాంటివి చూపిస్తే, అన్ని తరగతుల వాళ్ళూ వస్తారని, నేల క్లాసు పామరులు, బాల్కనీ క్లాసు పండితులూ కూడా చూస్తారని, కాస్త వాక్సుద్ధి, స్ఫురద్రూపం ఉన్నవాళ్ళని ఏరి - కోరి తీసుకొచ్చి పెట్టి, వాళ్ళ తడాఖా చూపిస్తే, వాటిని ఒకటికి పది సార్లు చూసి, మా తడాఖా మేం చూపించేవాళ్ళం.

మాయాబజార్ సినిమాని, ఎన్నోసార్లు మేము చూసిన డబ్బులతోనే, విజయా వాళ్ళు, మెడ్రాసు లో 'విజయ హాస్పిటల్' కట్టుకున్నారని చెప్పుకునేవాళ్ళం !
అంతకు ముందు యింట్లో ముసలమ్మలు చెప్పిన భారత - రామాయణ పురాణ పాత్రల్ని ఊహించుకుని,ఫోటోలకి దణ్ణం పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ పురాణ పాత్రల్ని పేద్ధ తెర మీద మూడుగంటల పాటు చూసి, చూసి, ఎన్టీ వోడికే దణ్ణం పెట్టడం అలవాటైపోయి, కాంతారావుగా పుట్టిన నారదుడు, నిజంగానే మేఘాల మధ్యలోంచి తేలివచ్చి, పాట పాడుతున్నాడనుకుని, ఆయనక్కూడా ఓ దణ్ణం పడేసేవాళ్ళం.

మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా మెడ్రాసు వెళ్ళి వచ్చినట్టు తెలిస్తే, 'సినిమా వాళ్ళు ఎవరైనా కనపడ్డారా?' అని కుశల ప్రశ్నగా అడిగేవాళ్ళం. ఎందుకంటే, మెడ్రాసు వీధుల్లోను, మెడ్రాసు సెంట్రల్ స్టేషన్ చుట్టూరా తిరిగేది వాళ్ళే కదా అని మా ఉద్దేశం.

సినిమా వాళ్ళని చూసిన వాళ్ళు....
'ఎంత పుణ్యం చేసుకుని పుట్టారో ' అని తెగ ముచ్చట పడిపోయేవాళ్ళం. ఇంక ఆపురూపమైన సినిమా వాళ్ళు ఎప్పుడైనా  కనపడినా, వాళ్ళని మనం ముట్టుకున్నా, యింటికి వచ్చాక కూడా ఆ పులకరింత తగ్గేది కాదు. పదేళ్ళపాటు అందర్నీ పిలిచి మరీ చెప్పుకునేవాళ్ళం.

క్లాసు పుస్తకాల్లో సతీ అరుంధతి, సతీ సుమతి, సతీ అనసూయ వగైరాల కధలు చదివీ...చదివీ...
మగాళ్ళకి వర్తించని 'సతీ' బిరుదుల కోసం,  'వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా, వీళ్ళు వాళ్ళనే ఆరాధిస్తూ, అన్ని కష్టాలు పడ్డం ఎందుకో ' అని మనసులో రహస్యంగా అనుకుంటుంటే, సతీ సావిత్రి, సతీ జమున, సతీ అంజలి లాంటి సినిమాలు తీసి, మా అనుమానాలు నివృత్తి చేశారు. యధాశక్తి వాటినీ పోషించాం. (బహుశా ఇప్పుడెవడూ అలాంటి సినిమాలు తీసే సాహసం చెయ్యడు.)

మలి దశలో...మూడు గంటల పాటు మనల్ని అలరించడానికి, హీరోయిన్ చేత ఒక సుశీల బ్రాండు పాటతో, పూజ.. లేక వ్రతం చేయించి, ఆవిడ ఇంట్లో అందర్నీ నిద్ర లేపి, ప్రసాదం పంపిణీ చేశాక, మడి బట్టలు మార్చుకుని, రకరకాల చీరలతో... కొన్ని డ్యూయెట్ లు హీరోతో పాడగా, వాటిలో బాగున్న ఒక పాటని విషాద యోగంలో ఏడుస్తూ మళ్ళీ పాడించి, ఆ కొంపలో ఉన్న ఎవళ్ళో ఒకళ్ళని చంపితే తప్ప, కధ రక్తి కట్టదని, అప్పటి దాకా దగ్గుతోనే సరిపెడుతున్న తల్లిదో, తండ్రిదో, లేక వయసుకి మించిన ముది కబుర్లు చెప్పి, ముద్దులొలికించిన పిల్లదో... మరణం కళ్ళారా చూపించి, అంతిమ సంస్కారాలు ఎలా చెయ్యాలో మనకి నేర్పించి,'ఆ నలుగుర్నీ' పురమాయించి, వీలయితే, ఘంటసాల చేత, "అమ్మా...వెళ్ళిపోతున్నావా... తిరిగి రాని లోకాలకు, పది మాసాలూ మోశావే... పది వారాలు బాధ పడీ...పోతున్నావా...." లాంటి ఏడుపు పాట ఒకటి పాడించి, 'అక్కడిదాకా' మనల్ని కూడా తీసుకెళ్ళి, కపాలమోక్షం చేయించేవాళ్ళు (మనకే) !

కాస్త కన్నూ - ముక్కూ - పళ్ళ వరస బావున్నవాళ్ళనే హీరో - హీరోయిన్ లుగా చూపించే వాళ్ళు.
హీరోయిన్ ఎంత ఒళ్ళు చేస్తే...మనకి అంత తృప్తి !
35 మి.మీ ల తెర మీద సూర్యకాంతం, భానుమతి, సావిత్రి, దేవిక, యస్.వరలక్ష్మి, జీ.వరలక్ష్మి, లాంటి  మన ఘనమైన హీరోయిన్ లు... మన హీరో పక్కన నుంచుంటే, ఆ క్కని...రమణారెడ్డికి తప్ప మరెవరికీ చోటు ఉండేది కాదు !

అందుకే...కెమేరా మాన్ లు, తమ కెమెరాలు కిందకి చూడకుండా గట్టిగా పట్టుకుని,... హీరోయిన్ ల మొహం మీదకి మాత్రమే తమ ధ్యాస, గురి పెట్టి, మిగిలిన పాత్రలు, పాత్రధారులు కూడా కనపడ్డానికి, తెలివిగా తమ కెమేరాలను గిర గిరా చుట్టూ తిప్పేవారు !

నాగయ్య గారికి తండ్రి -  తాత పాత్రలకు ప్రమోషన్ యిచ్చి, గుమ్మడిని ముసలి పాత్రలకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసి, యస్వీయార్ ని 'ఆల్ ఇన్ వన్' గా వాడుకుంటూ, రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం, అ, రాజబాబు వగైరాల చేత మనకి కిత కితలు పెట్టిస్తూ, సినిమా నడిపించేవాళ్ళు.

తెరపై నిండుగా మన హీరో - హీరోయిన్ లు అనవసరంగా ఎక్కువగా డాన్స్ లు అవీ చేసి,
అలిసిపోయి, చిక్కిపోకుండా, పొలం గట్టుమీదో, పూల తోటలోనో స్థిమితంగా చేతులు పట్టుక్కూచుని, ఘంటసాల, సుశీలల చేత పాడించుకున్న చక్కని పాటలకి పెదాలు కదిపేవారు. "ఒక పూల బాణం...తగిలింది మదిలో" అని వాళ్ళు నర్మ గర్బంగా చెబితే, వాళ్ళ భావం మనకి అర్ధమయి, అదే బాణం... మనక్కూడా తగిలేది.

కధ మధ్యలో...ఆ కుళ్ళు బుద్ధి, గయ్యాళి సూర్యకాంతమ్మో, నక్కజిత్తుల రమణారెడ్డో...ఏదో కిరి కిరి చేసి, వాళ్ళిద్దరి మధ్యా పుల్ల పెట్టేవాళ్ళు. కధ అలా మలుపు తిరిగితేనే...మనకీ తుత్తి ! 
వాళ్ళ ప్రేమ పెళ్ళిదాకా వెడుతుందో..లేదో... ఏమైపోతుందో అని, జుట్టు పీక్కుంటూ, గోళ్ళు కొరుక్కునేవాళ్ళం. సున్నిత మనస్కులు అయితే...కన్నీళ్ళపర్యంతం అయేవాళ్ళం కూడా..
హాల్లో కర్చీఫులు పిండేసేవాళ్ళూ ఉండేవాళ్ళు !

సరిగ్గా అప్పుడే ఒక స్తంభం వెనకాల నుంచి, ముందు పొగ వచ్చేది...వెనకాల.. తన కళ్ళలోనే 
హీరోయిన్ పట్ల తనకి ఉన్న మోజు, హీరో పట్ల ఉన్న అసూయ, ఏక కాలం లోనే చూపిస్తూ, రాజనాల / నాగభూషణం / ప్రభాకర రెడ్డి / కైకాల దిగేవాడు. పక్కనే...కళ్ళజోడు ముక్కుమీద నుంచి కిందకి జారిపోయినా...అల్లు దుర్భిణీలు వేస్తూనే ఉండేవాడు.
 
ఆ పక్కన రేలంగి - గిరిజ, పద్మనాభం - గీతాంజలి, రాజబాబు - రమాప్రభ, ప్రేమించు కుంటూనే, హీరో - హీరోయిన్ లని కలపడానికి వేషాలు మారుస్తూ తంటాలు పడుతుండే వాళ్ళు.
గుమ్మడి, నాగయ్య, ఎన్ని భర్తృహరి సుభాషితాలు చెప్పినా, హీరో - హీరోయిన్ లు వినరుగా ?

అక్కినేని అయితే, ఎంతసేపు చూసినా, తన కాలర్ తనే పట్టుకుని, చూపుడు వేలు చూపిస్తూ,
"లతా...నువ్వు నన్ను అపార్ధం చేసుకుంటున్నావ్" అంటాడేగానీ...అసలు అపార్ధం విషయం చెప్పడే !
ఈలోగా మనమే అక్కడికి వెళ్ళి, ఆ అసలు విషయం  చెప్పేయాలని, మనకి ఆరాటం !
ఈ అపార్ధాల సదవకాశం చూసుకుని, ఫ్లైట్లో జగ్గయ్య ఫుల్ సూట్ లో దిగి, హీరోయిన్ ని లగ్గమాడేసి, హనీమూన్ వెళ్ళిపోయేవాడు. 

నాగేశ్వర్రావు మాంఛి పంచీ, లాల్చీ, శాలువా కొనుక్కుని, వస్తూ వస్తూ దారిలో రెండు వేట్ - 69 లు పురమాయించి, తన తరఫున ఘంటసాలని దగ్గమనేవాడు. ఎన్టీఆర్  అయితే, రక రకాల వేషాలు మార్చి- మార్చి,  చివరాఖరికి తన సమ ఉజ్జీ..రాజనాలని / విలన్ ని కొండచివరికి తీసుకెళ్ళి, బాగా సర్ఫ్, సోడా, సున్నం పెట్టి ఉతుకుతుంటే, ఉడతా భక్తి గా, పక్కనే, రాజబాబు / పద్మనాభం విలన్ అనుచరుల్ని, అల్లూ ని కామెడీగా కొట్టేవాళ్ళు. చివరికి హీరో...చితికిపోయిన విలన్ని మెడ పట్టుకుని అక్కణ్ణించి ఒక్క తోపు తోస్తే...అప్పటికే అక్కడ గ్రూప్ ఫోటో కోసం రడీ గా ఉన్న మొత్తం జనాల మధ్య వచ్చి పడేవాడు.

సూర్యకాంతం మంచిదైపోయి, వాళ్ళల్లో కలిసిపోతే, అప్పటిదాకా బయట, వీధి అరుగుమీద పడుక్కుని, బీడీలు కాల్చుకుంటున్న పోలీసులు వచ్చి, విలన్ కి బేడీలు వేసి, రెండు డైలాగ్ లు చెప్పి, హీరో ని అభినందించి, జీపులో తుర్రుమనేవారు. హీరోయిన్, అపార్ధం చేసుకున్నందుకు హీరోకి సారీ చెప్పేస్తే, హీరో - హీరోయిన్లు... నాగయ్య / గుమ్మడి వాళ్ళకోసమే తెప్పించి ఉంచిన పూలదండలు మార్చేసుకుని, మనందరికీ దణ్ణం పెట్టి, నవ్వితే, రేలంగి / పద్మనాభం / రాజబాబు కూడా రెండు దండలు తెచ్చుకుని, వాళ్ళ వాళ్ళ ఇలాకాలతో 
ఒక ఇంటి వాళ్ళు అయిపోయేవాళ్ళు. ఇంటికి వెళ్ళే దాకా మనం ఆనందంగా నవ్వుకుందుకు వీలుగా, కమేడియన్ చివర్లో ఒక జోకు కూడా వేసేవాడు. మనం కూడా...తృప్తి పడి, ఇంటిదారి పట్టేవాళ్ళం.

టీవీ లు యింకా మన దాకా రాని రోజుల్లో...
ఆ పాత, కొత్త సినిమా మాటలు - పాటలే తల్చుకుంటూ, యవ్వన వీణలు మోగించాం.

ఏ డైరెక్టర్ అయినా తన చేత కామెడీ చేయిస్తే, లక్ష యిస్తానని, ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు, శోభన్ బాబు పాతికేళ్ళు ఎదురు చూసి, చూసి, ఎవడూ ముందుకు రాకపోయేసరికి, 
తన సహజ ధోరణిలోనే, భ్రుకుటి ముడి వేసి, ఆ లక్షతో మెడ్రాసు లో స్థలం కొనేసుకున్నాడు.
మన ఆంధ్రా జేమ్స్ బాండ్ కృష్ణ అయితే, నుంచున్న చోట నుంచి కదలకుండా, యిరవై మందిని ఎలా చితక్కొట్టాలో కనిపెట్టాడు. "మైఖేల్ జాక్సన్ కే మతిపోయే భంగిమ"లతో 
స్టెప్పులు కూడా వేశాడు. ఈలోగా 'రవివర్మకే అందని ఒకే ఒక అందం' జయచిత్ర లాంటి సజీవ శిల్పాలు కూడా వచ్చి,  మనని అలరించి, తల్లులుగా ప్రమోషన్ కొట్టేశారు.

ఆ "జయ" సీరీస్ లో...సుధలు, ప్రదలు, లక్ష్మిలు, మాలినిలు వచ్చి, 'అరేసుకోబోయి... పారేసుకున్నవన్నీ...ఏరేసుకుని', వెళ్ళిపోయారు. కొందరైతే, యిప్పటికీ.. అప్పుడప్పుడు కనిపిస్తుంటే...
గుర్తుపట్టలేక, "ఈవిడెవర్రా...ఎక్కడో చూశాను..."
అని పక్కవాళ్ళని అడిగి మరీ తెలుసుకుంటున్నాం.   ⬇️

మధ్యలో అప్పుడప్పుడు వచ్చి, నిలబడ్డవాళ్ళు, పడిపోయినవాళ్ళు, పతనమై - పోయినవాళ్ళు, ఎగిరెగిరిపడ్డవాళ్ళు, ఎగిరిపోయిన వాళ్ళు, హీరోలు, హీరోయిన్లు, హాస్యనటులు, విలన్లు, కొంతమంది వచ్చినా, వాళ్ళనీ కొంతకాలం పోషించి, కొంతమంది నటించిన సినిమా పేర్లు, చివరికి వాళ్ళ పేర్లు కూడా మర్చిపోయాం.

మధ్యలో కొంతకాలం, కన్నడ రాష్ట్రం నుంచి, విఠలుడనే ఆచార్యుడు వచ్చి, నారదుడనే 
కాంతారావు ని కిడ్నాప్ చేసి, కొత్తరకం లెగ్గింగ్ లు తొడిగి, పొట్టి చొక్కాలు కుట్టించి, చేతికి ఒక కత్తి తగిలించేటప్పటికి, మన నారద కాంతారావు, వెనకా - ముందూ చూసుకోకుండా, ఆ కత్తినే పట్టుకుని వేలాడ్డం మొదలెట్టాడు.

'ఇదేదో బాగుందే' అనుకున్నారో, ఏమో, రాజనాల కల్లయ్య అండ్ కో కూడా అలాంటి 
లెగ్గింగులే కుట్టించేసుకుని, కత్తులు కొనేసుకుని, కాంతారావుని కొట్టడానికి గుర్రాలమీద వచ్చేశారు. వాళ్ళకోసం... రాజశ్రీ అనే నిత్య రాకుమారి, నేల విడిచి - సాము కాకుండా, గాలిలో డాన్సులు చెయ్యడం మొదలెట్టింది. కొన్నాళ్ళు మన యన్టీ. కృష్ణుడు - రామారావు కూడా...
లెగ్గింగ్ ల మోజులో పడి, మరింత పొట్టి చొక్కాలు కుట్టించుకుని, కత్తి ఝళిపించాడు. ఇక్కడ కూడా పాపం, రాజనాల ని, కైకాల ని ఉతక్కుండా వదల్లేదు !

మనం పెంచి, పోషించిన అదొక ప్రత్యేక అధ్యాయం.

 ⬇️

ఏఎన్నార్, ఎన్టీఆర్, తాము రిటైర్ అవ్వకముందే, ముందు జాగ్రత్త పడి, తమ వారసుల్ని రిక్రూట్ చేసేసి,  తమ బిరుదుల్ని, ఫాన్స్ ని కూడా వారసత్వ హక్కుగా వాళ్ళకి యిచ్చేశారు.
ఆ వారసులు, వాళ్ళతో పాటే సినిమాల్లోకి వచ్చి,  ఎదిగిన వాళ్ళూ కలిసి, ఐకమత్యంగా 
హీరో లక్షణాలనే మార్చేశారు. హీరో ఏం చదివాడు, ఏ ఉజ్జోగం చేస్తున్నాడు ? 
అని మనం అడక్కుండా, రిక్షా లాక్కున్నా, ఆటో నడుపుకున్నా, మూటలు మోసుకున్నా,
'ఏంజేశావన్నది కాదు, అన్నయ్యా... పదిమందిని చితక్కొట్టామా, లేదా అన్నదే పాయింటు' అని 
ట్రెండు మార్చి పడేశారు. వీళ్ళు తమ తమ డ్యూటీల్లో ఉండగా, లోపల ఖాకీ నిక్కరు, పైన లుంగీకట్టి, ఎర్రటి పువ్వుల చొక్కాలు, రంగు బనీన్లు వేసి, రఫ్ గా కనపడ్డానికి గెడ్డం గీయకుండా, 
నోట్లో వంకరగా పెట్టి బీడీలు కాల్చినా..కండలు చూపించి, కోటీశ్వరుడి కూతుర్నే ప్రేమించి, ప్రేమింపజేసుకుని, డ్యూయెట్లు పాడుకుందుకు, ఊటీ, సిమ్లా, యూరోప్ లాంటి చలి ప్రదేశాలకి వెళ్ళినప్పుడు మాత్రం...ఖరీదైన సూటు - కోటు, నల్ల కళ్ళద్దాలు బయటికి తీసేవారు.
వీళ్ళ దగ్గిర యింకో ప్రత్యేకత ఉంది. ఒకే గుద్దుతో...
గాలిలో గింగిర్లు కొట్టేట్టు, ముప్ఫయ్ మందిని లేపెయ్యడం, ఇద్దరు - ముగ్గురు హీరోయిన్లు వెంటపడుతున్నా, అందరితోనూ స్టెప్పులు వేసి,చివరికి ఎక్కువ డబ్బులు తీసుకున్న హీరోయిన్ కే మెళ్ళో దండ వెయ్యడం !

పాపం, పాత హీరోలకి, ఒకళ్ళిద్దరు మాత్రమే హాస్యగాళ్ళు ఉంటే....వీళ్ళకి, టోకుగా మాట్టాడి, బ్రమ్మానందం నాయకత్వంలో, ఒక గ్యాంగునే తీసుకొచ్చారు. వాళ్ళందరూ మనల్ని నవ్వించాలి కాబట్టి, ఒక్కొక్కళ్ళు...ఒక్కొక్క ప్రాంతీయ యాస పట్టుకుని, నవ్వు తెప్పించే డైలాగులు పంచుకుంటారన్నట్టు !

ఈ తరం హీరోలు... ఒకప్పటి నాట్య తారల్ని మించిపోయి, తమ వెనకాల ఒక యాభైమందిని పోషిస్తూ, స్టెప్పులు వేస్తూ, వాళ్ళచేత కూడా వేయిస్తూ, హీరోయిన్లని ప్రేమించడం మొదలెట్టారు. వెనకాల కనీసం యాభైమంది ఉంటే తప్ప, వీళ్ళకి హీరోయిన్ ని ప్రేమించే మూడు రాదు.... మనకీ అంతే !

ఇన్ని తరాల సినిమా వాళ్ళని పోషించి, పోషించి, మనం శోషించిపోయి, ఇంక యిప్పుడు వచ్చే సినిమా వాళ్ళని పోషించలేక, కాళ్ళు ఎత్తేసి, టీ పోయ్ మీద పెట్టుకుని, 
ఆ పాత సినిమాలనే టీవీల్లో చూస్తూ... 
మధ్య మధ్యలో ఓ కునుకు లాగేస్తున్నాం. టీవీ నడుస్తుంటేనే...నిద్ర వస్తోంది !
"మేం తీసే సినిమాలు మీకోసం కాదు, మీ మనవల కోసం, మీరు వస్తే.. రండి, పోతే..పొండి" అని తీసేవాళ్ళు చెప్పేశాక, ఒకప్పటి సినిమాకి మహారాజ పోషకులమైన మనకి, .... 
మన ఏకైక వినోద సాధనం...
సినిమా హాలు వైవు వెళ్ళి ఎన్నాళ్ళయిందో కూడా గుర్తు లేదు !
****
02. తెల్లవారింది..

నాకు ఐదు గంటలకే మెలకువ వచ్చింది లేచి చేసేది ఏముందని అలాగే పడుకొని ఉన్నాను.మార్నింగ్ వాక్ కి వెళ్ళాలి... 

కానీ బద్దకంగా అనిపించింది. మావారు బ్యాంక్ మేనేజర్ గా పనిచేసేవారు...

ఆయన చనిపోయి రెండేళ్లు అయింది... 

కొడుకు కూతురు అమెరికాలో స్థిర పడి పోయారు.నన్నూ అక్కడకు వచ్చేయమంటారు...

కానీ నాకే ఇష్టం లేదు ఆయన పోయాక నాకు ఆసక్తి పోయింది నిరాశ నిస్పృహలతో కాలం గడుపుతున్నాను..

కాఫీ తాగాలి అనిపించింది కానీ ఈ మధ్యన చక్కెర వ్యాధి రావడాన డాక్టర్స్ సలహా మేరకు 

కాఫీ మానేశాను..

కాఫీ త్రాగడం ఎప్పటి అలవాటో!

చిన్నగా నిట్టూర్చి పైకి లేచాను బ్రష్ చేసుకొని వాకింగ్ కి బయలు దేరాను...

కొంత సేపటికి జాగింగ్ చేస్తూ ఒక యువతి ఎదురు పడింది వయసు పాతిక ఉంటుంది.

అందంగా...

ఆరోగ్యంగా...అంతకు మించి చలాకీగా ఉంది.

        నన్ను చూడగానే "గుడ్ మానింగ్ ఆంటీ!" అని విష్ చేసింది,.ఆ అమ్మాయి ఎవరో గుర్తు రాలేదు.     ఇంటికి వెళ్ళాక కూడా ఆ అమ్మాయి ని గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేశాను.

కానీ గుర్తు రాలేదు.,మరుసటి రోజు వాకింగ్ కి వెళ్ళినప్పుడు కూడా అదే చిరు నవ్వుతో

విష్ చేసింది.

       అలా వారం గడిచింది ఒక రోజు తను నన్ను విష్ చేసినప్పుడు " సారీ అమ్మా!

నిన్ను గుర్తు పట్టలేక పోయాను!"అన్నాను.

      ఆ యువతి చిన్నగా నవ్వి " మన మధ్య పరిచయం ఉంటే కదా ఆంటీ!మీరు నన్ను గుర్తు పట్టడానికి" అన్నది.

      నేను ముఖం ప్రశ్నార్థకంగా పెట్టాను. అప్పుడా అమ్మాయి" విష్ చేయడానికి పరిచయం ఎందుకు?" అన్నది.,తన మాటకు నేను నవ్వేసాను..నేను నవ్వి చాలా కాలం అయింది.,ఆ విషయం మనసు గుర్తు చేసింది.

      " నీ పేరు?" అని అడిగాను"స్వప్న.మరి మీ పేరు?" అని అడిగింది."వకుళ" అని చెప్పాను.స్వప్న నన్ను దాటిపోతూ వెనక్కి తిరిగి "ఆంటీ! మీ నవ్వు చాలా బాగుంటుంది" అన్నది.,నాకు మావారు గుర్తుకు వచ్చారు.ఆయన కూడా అదే మాట అనేవారు గుండెలో సంతోషం పొంగింది.     మధ్య మధ్యలో నాకు స్వప్న ఉత్సాహం...సంతోషం గుర్తుకు వస్తూ ఉండేవి ఉత్తేజంగా అనిపించేది.

   ఒక రోజు "ఒక ఐదు నిముషాలు అలా కూర్చుని మాట్లాడుకుందాం" అన్నాను. స్వప్న సరేనంది ఇద్దరం అక్కడ ఉన్న సిమెంట్ బల్ల మీద కూర్చున్నాము.

     "నీకు పెళ్లి అయిందా?" అని అడిగాను.

"అయింది ఒక బాబు...పాప" అంది స్వప్న మాటల్లో మావారు పోయిన విషయం...మా పిల్లలు అమెరికాలో ఉన్న విషయం చెప్పాను మావారు పోయినందుకు సంతాపం తెలియ పరిచింది.

      కొద్ది క్షణాల తరువాత "ఇప్పుడు ఇంటికి వెళ్లి బ్రేక్ ఫాస్ట్ ఏం చేస్తారు?" అని అడిగింది స్వప్న." బ్రెడ్" అని చెప్పాను. 

"ప్రతి రోజూ అదేనా?" అని అడిగింది స్వప్న.

"ఒక్కదాన్నే గా!అందుకే!" అన్నాను.

      "ఒక్కరు కాబట్టే మంచి ఆహారం తీసుకోవాలి మీ ఆరోగ్యం మీరు కాపాడు కోవాలి" అంది స్వప్న.కొంచెం సేపు ఆగి..,తనే" మీవారు..పిల్లలు ఉన్నప్పుడు వాళ్లకు ఇష్టం అయినవి చేసి పెట్టి ఉంటారు..,

ఇప్పుడుమీకు ఇష్టమైనవి చేసుకు తినండి" అన్నది.,

ఆ తరువాత మేం వెళ్ళిపోయాము. 

        ఇంటికి వెళ్ళిన తరువాత కూడా స్వప్న మాటలు తలపుకు వచ్చాయి.అందులోని వాస్తవం గుర్తించాను.,చాలా కాలం తరువాత నాకు ఇష్టమైన జీడిపప్పు ఉప్మా చేసుకు తిన్నాను.

ఎందుకో మనసుకు తృప్తిగా అనిపించింది.

     మరుసటి రోజు కలిసినప్పుడు స్వప్నకి జీడిపప్పు ఉప్మా గురించి చెప్పాను ఎంతో సంతోషించింది."మంచి పని చేశారు" అని అభినందించింది..,మాటల్లో జీవితం నిరాసక్తత

గా ఉన్నట్లు చెప్పాను.స్వప్న మౌనం వహించింది.

    నెల తరువాత ఒక రోజు    " వీలు చూసుకొని ఒకసారి మా ఇంటికి రా!" అని ఆహ్వానించాను.స్వప్న వచ్చే ముందు ఫోన్ చేసి వస్తాను" అని నా సెల్ నంబర్ తీసుకుంది.మా వారు పోయాక నేను

మా ఇంటికి ఆహ్వానించిన తొలి వ్యక్తి స్వప్న.

      సాయంత్రం నాలుగు గంటలకు  వస్తున్నట్లు స్వప్న ఫోన్ చేసింది.

నాకు సంతోషం అనిపించింది.

     తనకోసం కాఫీ చేసి ఫ్లాస్క్ లో పోసి ఉంచాను..,

చెప్పినట్లు సరిగ్గా నాలుగు గంటలకు స్కూటీ మీద వచ్చింది.

వస్తూ వస్తూ నాకోసం గులాబీ కుండీ  తెచ్చింది.

       "ఎందుకిది " అని అడిగాను."రోజూ దీనికి నీళ్లు పోస్తూ పూవు పూసే రోజు కోసం ఎదురు చూడండి!" అంది.

        స్వప్న సోఫాలో కూర్చుంది కాఫీ అందించాను."మీరు తీసుకోరా?" అని అడిగింది."డయాబెటీస్.అందుకే ఇష్టమైనా

 తీసుకోవడం లేదు" అన్నాను.

        తను కిచెన్ లోకి వెళ్లి ఒక కాఫీ కప్పు తెచ్చి అందులో కొద్దిగా కాఫీ పోసి నాకు అందిస్తూ"జబ్బు కంటే భయమే శరీరం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది..,ఏం కాదు.హ్యాపీగా త్రాగండి" అంది నేను మంత్ర ముగ్ధురాలిలా కాఫీ సిప్ చేశాను..

చాలా కాలం తరువాత త్రాగుతున్న కాఫీ నాకు అద్భుతంగా అనిపించింది..

  అప్పుడు స్వప్న చిక్కటి పాలల్లో..

బ్రూ పౌడర్ కలుపుకు త్రాగినా రుచి అద్భుతంగా ఉంటుంది..,అందుకు కొంచెం

మైండ్ సెట్ మార్చుకోవాలి" అన్నది.

         కాఫీ త్రాగడం పూర్తి అయ్యాక "ఇల్లు చూద్దువు గాని రా!" అని స్వప్నను లోనికి తీసుకు వెళ్ళాను.

   తను పూజా మందిరం చూసి " రోజూ పూజ చేయడం లేదా?" అని అడిగింది." లేదు"

అన్నాను..,తను రెండు అగరొత్తులు  తీసి వెలిగించింది.,క్షణంలో గది పరిమళ భరితం

అయింది అప్పుడు స్వప్న "పూజ చేసినప్పుడు

మన మనసూ ఇలా పరిమళ భరితం అవుతుంది" అన్నది.

       " ఈ అమ్మాయి ఏ విషయం చెప్పినా ఎంతో

బాగుంటుంది" అని మనసులో అనుకున్నాను.

         స్వప్న బయలు దేరినప్పుడు " గులాబీ మొక్కకు నీరు పోసేటప్పుడు చిన్నప్పుడు 

మీ పాపకు పాలు పట్టడం గుర్తు చేసుకోండి!"

అన్నది."అలానే" అన్నాను.

          గదిలో అలుముకున్న అగరొత్తుల  పరిమళం స్వప్న వెళ్ళిపోయినా ఆమెను గుర్తు చేస్తూనే ఉంది.      మరునాటి ఉదయం రోజులా నిస్పృహతో లేవలేదు.కాఫీ త్రాగాలన్న ఉత్సాహంతో లేచాను.కాఫీ చక్కెర లేకుండా త్రాగాను.స్వప్న చెప్పినట్లు మైండ్ సెట్ మార్చుకొని త్రాగితే బాగుంది అనిపించింది..,

చాలా కాలం తరువాత ప్రభాత సమయంలో  ఉత్సాహంగా అనిపించింది...

     వాకింగ్ సమయంలో అదే విషయం స్వప్నకి చెప్పాను.సంతోషం వ్యక్తం చేసింది.

     స్వప్న ఇచ్చిన గులాబీ మొక్కకు రోజూ శ్రద్ధగా నీరు పోయసాగాను క్రమేపీ దానితో

అనుబంధం పెరిగింది..,ప్రతి రోజూ దాన్ని శ్రద్ధగా పరిశీలించ సాగాను మొగ్గ తొడగడం...

పువ్వు విచ్చడం పరిమళం అద్భుతం అనిపించ సాగింది.

      మావారు ఉన్నప్పుడు పూల కుండీలు ఉండేవి గాని...వాటి పోషణ ఆయన చూసుకునేవారు ఇప్పుడు ఇది నాకు సరి కొత్త అనుభవం.     మధ్య మధ్యలో స్వప్న తను ఇచ్చిన గులాబీ మొక్క గురించి వాకబు చేస్తూ నా ఆనందం  పంచుకుంది.

              ఈమధ్య స్వప్న నాతో పాటే వాకింగ్ చేయసాగింది.,ఒకరోజువాకింగ్ మధ్యలో " మీకో చిన్న పని చెప్తాను., అలా చేసి ఎలా ఉందో నాకు చెప్పండి" అంది.

      "ఏమిటది?" అని ఆసక్తిగా అడిగాను.

రెండు చిన్న బౌల్స్ తీసుకొని ఒకదానిలో బియ్యం గింజలు..ఒకదానిలో నీరు పోసి మీ పిట్ట గోడ మీద పెట్టండి" అన్నది.తన భావం గ్రహించి" సరే" అన్నాను.          అలా పెట్టిన గింజలు పిట్టలు తింటూ...

దప్పిగొన్న పక్షులు నీరు తాగుతుంటే ఆ దృశ్యం మనోహరంగా అనిపించ సాగింది.

      ఉదయం తాగుతున్న కాఫీ...పూజ...

అగరొత్తుల పరిమళం... పూస్తున్న గులాబీలు...గింజలు తింటున్న పిట్టలు...

నీరు తాగుతున్న పక్షులు....ఇవి చిన్న చిన్న మార్పులే గానీ నా జీవితంలో పెను మార్పులు తెచ్చాయి.ఒకప్పుడు నిరాశ..నిస్పృహలతో నిరుత్సాహంగా ఉండే నేను ఇప్పుడు ఉత్సాహంగా...సంతోషంగా ఉంటున్నాను. నాలోని మార్పుకు స్వప్నే కారణం.

      ఒకరోజు సాయంత్రం స్వప్న స్కూటీ మీద వచ్చింది.తనతో పాటు ఇద్దరు పిల్లలను తెచ్చింది."వీళ్ళు మా పని మనిషి పిల్లలు.బాగా చదువుతారు.,కానీ వీళ్ళమ్మ వీళ్ళను

చదివించలేక పోతున్నది..అందుకే ఈ బాబుకు నేను స్కూల్ ఫీ కడుతున్నాను.

మీకు అభ్యంతరం లేకపోతే ఈ పాప స్కూల్ ఫీ కి మీరు సహాయం చేయండి" అన్నది..

నేను క్షణం ఆలస్యం చేయకుండా ఒప్పేసుకున్నాను...

వాళ్లకు సహాయం చేయడం నాకు ఎంతో తృప్తిని ఇచ్చింది.

      పిల్లలు నన్ను అడిగి జామ చెట్టు దగ్గరకు వెళ్ళి జామ కాయలు కోసుకున్నారు,స్వప్న నాతో "మీ హాబీస్ ఏమిటి?" అని అడిగింది." ఒకప్పుడు బొమ్మలు గీసేదాన్ని" అని చెప్పాను.

" వావ్" అని స్వప్న నన్ను కౌగిలించుకుంది. "ఆంటీ! నాకు పెయింటింగ్స్ అంటే పిచ్చి.

నాకోసం ఒకటి డ్రా చేయండి" అని చిన్న పిల్లలా మారాం చేసింది ."వాటి జోలికి వెళ్లి

చాలా కాలం అయింది..,వేయగలనో! లేదో!" అన్నాను."తప్పక వేయగలరు!" అంది స్వప్న.

ఆన డమే కాదు...ఆ సాయంత్రం నేను పెయింటింగ్ వేయడానికి అవసరమైన డ్రాయింగ్ చార్ట్...పెన్సిల్స్...వాటర్ కలర్స్

తెచ్చి ఇచ్చింది.       దాన్ని బట్టి తనకు పెయింటింగ్స్ ఎంత ఇష్టమో అర్థం చేసుకున్నాను.

        ఆలోచించి రాధా కృష్ణుల పెయింటింగ్ మొదలు పెట్టాను.మొదట కొంచెం తడబడినా త్వరగానే దారిలోకి వచ్చాను. పెయింటింగ్ పూర్తి చేయడానికి నాలుగు రోజులు పట్టింది.,ఆ విషయం స్వప్నకి చెప్పాను.

       ఆ సాయంత్రమే పరుగున నా దగ్గరకు వచ్చేసింది.పెయింటింగ్ చుడగానే " "ఎక్సలెంట్ ఆంటీ!" అని నన్ను కౌగిలించుకొని బుగ్గ మీద ముద్దు పెట్టింది.

నాకు సంతోషం...సిగ్గు రెండూ కలిగాయి.

     " పెయింటింగ్ మీద మీ సైన్ చేసి నాకు గిఫ్ట్ గా ఇవ్వండి" అని కోరింది.అలానే చేశాను.

      ఆ రాత్రి అమెరికాలో ఉన్న మా అమ్మాయికి ఫోన్ చేశాను. "ఎప్పుడూ మేం చేయడమే గాని,నీవు చేసింది లేదు.ఫస్ట్ టైం నువ్వే చేశావు" అని ఆశ్చర్య పోయింది.క్లుప్తంగా స్వప్న గురించి చెప్పాను." నీ లైఫ్ స్టైల్ మార్చింది .నా అభినందనలు తెలియ జేయి" అన్నది.

        కొద్ది రోజులకు స్వప్న తన ఇంటికి ఆహ్వానించింది.తనే వచ్చి స్కూటీ మీద తీసుకు

వెళ్ళింది.,ఇంటికి వెళ్లగానే నేను పెయింట్ చేసిన రాధాకృష్ణ  అందమైన ఫ్రేమ్ లో

కనిపించి కనువిందు చేసింది.,నాకు మనసులో  గర్వంగా అనిపించింది.        స్వప్న నాకు వాళ్ళ అత్త మామ గార్లను

పరిచయం చేసింది.,నేను సోఫాలో  కూర్చున్నాను.,స్వప్న కాఫీ తేవడానికి లోనికి

వెళ్ళింది.        స్వప్న అత్తగారు నాతో మాట్లాడుతూ..

" మా కోడలు దేవతమ్మా!మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది."అన్నది.,అంతలో

స్వప్న కొడుకు...కూతురు మా దగ్గరకు వచ్చారు.నేను వాళ్లకు నేను తెచ్చిన బిస్కెట్స్...చాక్లెట్స్ ఇచ్చాను. వాళ్ళు 

అక్కడినుంచి వెళ్లి పోయారు.

      అప్పుడు స్వప్న అత్తగారు" ఈ బాబే స్వప్న కొడుకు ఆ పాప అనాధ.,స్వప్న దత్తత తీసుకొని పెంచుకుంటున్నది అంతే కాదు...

మరిక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంది.,అదేమంటే...మన పిల్లలను మనం పెంచడం ...ప్రేమించడం గొప్ప కాదు.

అనాధకు చేయూత నీయడం గొప్ప అంటుంది మా అబ్బాయి అందుకు సమర్ధిస్తాడు" అని

చెప్పింది.      అది విన్న నాకు సంభ్రమాశ్చర్యాలు కలిగాయి.స్వప్న కు అంత చిన్న వయసులోనే

ఎంత పరిపక్వత అనుకున్నాను.,కాఫీ తెస్తున్న స్వప్న లో నాకు దేవతా మూర్తి గోచరించింది.

    స్వప్న,అత్తగారితో " మొత్తం చెప్పేసారా? చెప్ప నిదే ఊరుకోరు కదా!" అంది నవ్వుతూ. నేను సింపుల్ గా " అభినందనలు స్వప్నా!"

అన్నాను.

          ఇల్లు చేరానే గాని ఆ రాత్రి నిద్ర పట్టలేదు.స్వప్నను చూసాక జీవన మాధుర్యం

బోధ పడింది.ఈరోజు తను చేసిన పని తెలిశాక నా జీవిత గమ్యం బోధ పడింది.

నా దగ్గర బాగానే డబ్బు ఉంది.,నా డబ్బు మా పిల్లలు ఆశించరు.ఆ విషయం నాకు బాగా తెలుసు. చాలా సేపు ఆలోచించి ఏం చేయాలో

నిర్ణయం తీసుకున్నాను.,అప్పుడు హాయిగా నిద్ర పట్టింది.

       కొద్ది కాలానికి మా వారి పేరు మీద  ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పరిచాను.,దానికి సెక్రటరీ గా స్వప్నను ఏర్పాటు చేశాను.

      ఇప్పుడు నాకు జీవితం నిరాశగా... నిస్పృహగా అనిపించడం లేదు...సంతోషంగా...

ఉత్సాహంగా అనిపిస్తున్నది...

ఒకప్పుడు సమయం గడవని నాకు..,

ఇప్పుడు సమయం చాలడం లేదు.    వయసులో చిన్నదే అయినా ..నా మనసులో గురువు స్థానం స్వప్నకే

ఇచ్చాను!! 

Note≈ ఒంటరిగా ఉంటే అన్ని కోల్పోయినట్టు కాదు... మనస్సుకు నచ్చినట్టు ఉండటం తప్పు కాదు....

***

03. "తాతా, యిది ..మాంఛి హిట్టు సినిమా, నువ్వు తప్పకుండా చూడాలి" అని యీ కుర్రకారు టీవీ ముందు కూచోపెట్టి, ఆ రెండు మూడు రిమోట్ల లో ఏవేవో బటన్లు నొక్కి, చూపిస్తుంటే, ఆ తెర మీద... వాళ్ళు ఏమి మాట్టాడుతున్నారో... ఎందుకు మాట్టాడుతున్నారో... పాడే పాట ఏమిటో...ఎవరు రాశారో... ఎవరు పాడుతున్నారో...అది ఏ భాషో తెలియక మనం బాధ పడుతుంటే...వీళ్ళు, వాళ్ళతోపాటు స్టెప్పులు వేస్తున్నారు ! క్రిందటేడు...కొరోనా పుట్టేముందు పుట్టిన కొత్త మనవడు కూడా చప్పట్లు కొడుతూ, కూచునే స్టెప్పులు వేసేస్తున్నాడు ! "అదేంట్రా...మన ఏరియా స్వచ్ఛ భారత్ కార్మికుడు...సినిమాల్లో కూడా వేస్తున్నాడా ?" అన్నాను, పొరపాటున.... ముగ్గురు మనవలు గయ్యి మని లేచారు ! "అతను ఎవరనుకున్నావ్ ? మా అభిమాన హీరో... అతనికి చైనాలో కూడా అభిమానులు ఉన్నారు, తెలుసా ?" అన్నారు. "సినిమా వాళ్ళంటే... కళ్ళూ - ముక్కూ - మూతీ బాగుండాలి కదురా... వీడికి ఒక్కటీ బాలేదేం ?" అన్నాను ఆపుకోలేక... 'సినిమా వాళ్ళని, రాజకీయ నాయకుల్ని విమర్శిస్తే, కావలసిన వాళ్ళతోనే సత్సంబంధాలు తెగిపోయేట్టున్నాయ్', అనుకుని, యింకా మాట్టాడితే నాతో మాటలు కూడా మానేస్తారనిపించింది. 'సరే..మరి అంతంత కండలు పెంచిన వాడు, ఆ బఖ్ఖ గా ఉన్న వాడినెందుకు, ఎత్తి - కుదేస్తున్నాడు, వాడేంతప్పు చేశాడని ?" అన్నాను. మళ్ళీ... గయ్యి మన్నారు. 'వాడు' కాదు...తాతా... 'ఆవిడ' ! అల్ ఇండియా ఫేమ్, హీరోయిన్... బొంబాయి నుంచి కోటి రూపాయలు యిచ్చి తీసుకొచ్చారు. వాళ్ళు త్వరలో ప్రేమించుకోబోతున్నారు! ముందు అలాగే ఏడిపించి, ఎత్తుకుపోయాక, ఆవిడకి ప్రేమ పుడుతుందన్నమాట ! మీతరం వాళ్ళకి అర్ధం కాదులే !" అన్నారు. నాకు మనసు పాడయిపోయి, 'మిగతాది...మీరు చూడండి, నేనెళ్ళి హనుమాన్ చాలీసా చదువుకోవాలి" అని లేవబోయాను. "అయ్యో, తాతగారూ...అసలు కథ యిప్పుడే మొదలవుతుంది, ఆ హీరోయిన్... ఆ హీరోని చంపేసి, రెండో హీరోతో అమెరికా వెళ్ళి చేసే సాహస కృత్యాలు చూసి తీరాలి" అన్నాడు, పెద్ద మనవడు... ఎక్సయిటెడ్ గా...ఊగిపోతూ... "ఏంటీ...హీరోయిన్ - హీరోని చంపేస్తుందా? మా నాయనే..." అని అక్కడినుంచి వాకౌట్ చేశాను. 😷

04. గోదావరి జిల్లా కామెడీ సంఘటన. శ్రీనివాస్ తన బెస్ట్ ఫ్రెండ్ వెంకట్ పెళ్ళికి రెండు రోజులు ముందుగా హైదరాబాద్ నుండి బయల్దేరి తాడేపల్లిగూడెం దగ్గరలో ఉన్న తన ఫ్రెండ్ ఊరికి వెళ్ళాడు. శ్రీనివాస్ తన ఫ్రెండ్ వెంకట్ వాళ్ళ ఇంటి గుమ్మంలో అడుగు పెట్టగానే శ్రీనివాస్ ని చూసి వెంకట్ తల్లి "రా బాబూ రా. బావున్నావా? ఇంతకీ దేనికొచ్చావ్?" అనడిగింది. శ్రీనివాస్ కి "దేనికొచ్చావ్?" అన్న ప్రశ్న ఎందుకడిగారో అర్ధం కాలేదు. కొంపదీసి పెళ్ళి ఈ నెల కాదా అనుకొని కాళ్ళు కడుక్కోవడానికెళ్ళాడు. అంతలో టవల్ తీసుకొచ్చిన వెంకట్ చెల్లెలు శ్రీనివాస్ ని "అన్నయ్యా బావున్నావా? దేనికొచ్చావ్?" అని అడిగింది. మళ్ళీ "దేనికొచ్చావ్?" అనే ప్రశ్న. శ్రీనివాస్ కి "పెళ్ళి తేదీ తనేమన్నా తప్పుచూసాడా ఏంటీ, ఎందుకొచ్చావ్ ఎందుకొచ్చావ్" అని అడుగుతున్నారు" అని అనుమానం పెద్దదైంది. పెళ్ళి తేదీ ఎప్పుడు అని అడిగితే ఏమనుకొంటారో అని మొహమాటంతో అడగలేదు. కాళ్ళు కడుక్కొని ఇంటిలోపలకి వెళ్ళగానే అక్కడ వాలు కుర్చీలో కూర్చున్న వెంకట్ తండ్రి శ్రీనివాస్ ని "బాబూ బాగున్నావా? దేనికొచ్చావ్?" అనడిగాడు. శ్రీనివాస్ "ఏంటీ ఇంట్లో అందరూ దేనికొచ్చావ్? దేనికొచ్చావ్? అని ఒకటే ప్రశ్న. కొంపదీసి పెళ్ళిగాని కేన్సిల్ అయ్యిందా ఏంటీ". అదేమాట అడుగుదామా అనుకొని ఫ్రెండ్ వచ్చాక వాడినే అడుగుదాం అని బయటకెళ్ళిన ఫ్రెండ్ వెంకట్ రాకకోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన వెంకట్ శ్రీనివాస్ ని చూస్తూనే "ఏరా శ్రీను ఎంతసేపైంది వచ్చి? దేనికొచ్చావ్?" అన్నాడు. శ్రీనివాస్ కి సహనం సన్నగిల్లింది. ఫ్రెండ్ ని పక్కకు తీసుకెళ్ళి ఏంట్రా పెళ్ళికి పిలిచి ఇప్పుడు ఇంట్లో అందరూ "దేనికొచ్చావ్? దేనికొచ్చావ్? అని ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నారు. పెళ్ళి కేన్సిల్ అయ్యిందా ఏంటీ?" అని అడిగాడు. వెంకట్ నవ్వాపుకొంటూ అరేయ్ "దేనికొచ్చావ్? అంటే గోదావరోళ్ళ అర్ధం ఏ బండెక్కి వచ్చావ్? బస్సుకా, రైలుకా? తెలుసుకోవడానికి" అని చెప్పగానే శ్రీనివాస్ కి విషయం అర్ధమై నవ్వుకొన్నాడు. 😂😀 సో... గోదావరోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు "దేనికొచ్చావ్?" అనడిగితే కంగారుపడిపోకండి సుమీ! 😀🤣😅👍

5 *ఆవకాయ మీదొట్టు ..ఈ వ్యాసం నేను రాయలేదు సుమా 🤗*

ఆవకాయ 'నవగ్రహ' స్వరూపం

 ఆవకాయలో ఎరుపు--- "రవి"

ఆవకాయలోవేడి, తీక్షణత---"కుజుడు"

ఆవకాయలో వేసే నూనె, ఉప్పు---"శని"

ఆవకాయలో వేసే పసుపు,మెంతులు--- "గురువు"

మామిడిలో ఆకుపచ్చ---"బుధుడు"

మామిడిలో పులుపు---"శుక్రుడు"

ఆవకాయ తినగానే కలిగే , అలౌకికానందం---"కేతువు"

తిన్న కొద్దీ తినాలనే ఆశ---"రాహువు"

ఆవకాయ కలుపుకునే అన్నం---"చంద్రుడు"


ఇలాంటి ఆవకాయ కంచంలో ఆగ్నేయ మూల వేసుకుని నవగ్రహ స్తోత్రం చెప్పుకొని, తింటే,

సమస్త గ్రహ దోషాలు ఔట్, హాం ఫట్.😛😜😆😄


 శ్రేష్టంబిది పచ్చళ్ళలోన,

టేష్టున ఇది మొదటనుండు డెఫినెట్ గానూ,

ఇష్టముగ ఆవకాయను

సుష్టుగ తిని దొర్లినంత సుఖమది కలదే!


ఊరిన ముక్కను కొరకగ,

ఔరా! అది ఎంత రుచిని అందించునయా,

కూరిమితొ నాల్గు ముక్కలు

నోరారా తినని నోరు నోరవ్వదుపో!


బెల్లము వేసిన మధురము,

పల్లీనూనెను కలపగ పచ్చడి మధురం,

వెల్లుల్లి వేయ మధురము,

పుల్లని మామిడితొ చేయ ముక్కది మధురం!!!

〰〰〰〰〰〰

ఈ ఆవకాయలోని ముక్కకి చాలా పేర్లు ఉన్నాయి:

చెక్కందురు, డిప్పందురు,

ముక్కందురు కొంతమంది మురిపెము తోడన్.

డొక్కందురు, మామిడి

పిక్కందురు దీనికన్ని పేర్లున్నవయా!

〰〰〰〰〰〰

ఆవకాయ ఉపయోగాలు:

ఉదయమె బ్రెడ్డున జాముకు

బదులుగ ఇదివాడిచూడు బ్రహ్మాండములే,

అదియేమి మహిమొ తెలియదు,

పదునుగ నీ బుర్ర అపుడు పనిచేయునయా!


ఇందువలదందు బాగని

సందేహము వలదు;

ఊట సర్వరుచిహరం ఎందెందు కలపి చూసిన,

అందందే రుచిగనుండు, అద్భుత రీతిన్!

〰〰〰〰〰〰

ఆవకాయ అవతరణ: “చప్పటి దుంపలు తినుచును, తిప్పలు పడుచుంటిమయ్య దేవా, దయతో గొప్పగు మార్గం బొక్కటి చెప్పుము మా నాల్కలొక్క చింతలు తీర్పన్”

ముక్కోటి దేవులందరు మ్రొక్కగ తా జిహ్వలేప సృష్టించెనయా చక్కనిది ఆవకాయన ముక్క తిననివాడు కొండముచ్చై పుట్టున్!!!

చారెరుగనివాడును, గోదారిన తా నొక్కమారు తడవని వాడున్, కూరిమిన ఆవకాయను

ఆరారగ తిననివాడు, తెలుగువాడు  కాడోయ్!!!

*ఆవకాయ అభిమానులకు అంకితం*   *మీ శ్రేయోభిలాషి*

 ఓసారి ఒక నర్తకీమణి శ్రీ కృష్ణ దేవరాయల వారి ఆస్థానానికి వెళ్ళి మహారాజా నేను ఎనిమిది భాషల్లో పాడుతూ నృత్యం చెయ్యగలను. అయితే అంతా అయ్యాక అందులో నా మాతృ భాష ఏదో సరిగ్గా చెప్పగల వారెవరైనా ఉన్నారేమో చూద్దాం అందిట. 

సరేనని ప్రభువులు ఆమె కార్యక్రమం ఏర్పాటు చేశారు. బ్రహ్మాండమైన ఆ కార్యక్రమం తరవాత ఆ నర్తకీమణి ఒక ఉచితాసనం మీద సేద తీరుతుండగా, రాయల వారు ముందుగా అష్టదిగ్గజాలను అడిగారుట. అప్పుడు  పెద్దన్నగారు పెదవి విరిచారుట.  తిమ్మన గారు కిమ్మన లేదుట.  

యథాప్రకారం రాయల వారు తెనాలి రామకృష్ణునికి సైగ చేయగా, వారు లేచి సాలోచనగా ఆ నర్తకీమణి ముందు నుంచి నడిచి వెళుతూ, ఆమె బొటన వేలు మీద కాలేసి కసిక్కున తొక్కారుట! అప్పడా నర్తకీమణి "యూ బ్రూట్, కాంట్ యూ సీ వాట్ యూ ఆర్ డూయింగ్?" అని కోపగి౦చుకుందిట. 

యథా ప్రకారం రాయల వారు "ఏమి రామకృష్ణా! ఏమిటిది?" అని గద్దించారుట. 

అప్పుడు రామకృష్ణుడు "మన్నించండి మహారాజా, ఈ నర్తకీమణి అచ్చమైన తెలుగమ్మాయి. ఆ విషయం తెలుసుకోడానికే ఇలా చెయ్యవలసొచ్చింది" అన్నాట్ట. అపుడా నర్తకి "ఆయ్, నిజవేఁనండి! అయ్ బాబోయ్, ఎలా కనిపెట్టీసార౦డీ" అందిట! అపుడు సభనుద్దేశించి రామకృష్ణుడు "ఎవరైనా ఏదైనా హఠాత్ సంఘటన జరిగినా, దెబ్బ తగిలినా, ఆశ్చర్యాన్ని, బాధని వారి మాతృ భాషలో వ్యక్తం చేస్తారు. కానీ అటువంటి సమయంలో కూడా ఇంగ్లీషులో మాట్లాడేవారు తెలుగువారే!

😋

6 *శ్రీ వేంకటేశ్వర స్వామి అంటే..!!*

                          

వేం - పాపము

కట - తీసేయడం

శ్వరుడు - కర్మ తొలగించేటటు వంటివాడు .

కలియుగంలో ఎవరికీ భగవంతునికి పాదాల యందు మనస్సు నిలబడదు. కలి యొక్క ప్రభావం వల్ల భౌతిక సుఖాల వైపు ఎక్కువ మోజు ఉంటుంది. మనస్సుని నిగ్రహించడం అంత సులభం కాదు. చాలా పాపాలు చేస్తూ ఉంటాం. ఈ పాపాలు చేసేటటు వంటి వారిని ఉద్ధరించడానికి పరమాత్మ "శ్రీ వేంకటేశ్వరుడు" గా ఆవిర్భవించారు. ఆ పాపాల్ని తీసేయగలిగే శక్తి ఆ పరమాత్మకే ఉంది.

ఇక తిరుమల కొండకి వస్తే, సాక్షాత్తు వేదములే ఆ కొండకి రాళ్ళు అయ్యాయి. ఒక్కొక్క యుగం లో ఒక్కో అవతారం ఎత్తి ఆయన ధర్మాన్ని రక్షించాడు.

కృత యుగం - నరసింహావతారం

త్రేతా యుగం - శ్రీరాముడుగా,

ద్వాపరి యుగం లో - శ్రీ కృష్ణుడుగా,

కలియుగం లో శ్రీ వేంకటేశ్వరుడుగా అవతరించాడు.

మిగిలిన అవతారారలో చేసినట్లుగా కలియుగం లో స్వామి దుష్ట సంహారం ఏమి చెయ్యలేదు. కత్తి పట్టి ఎవ్వరిని సంహరించలేదు. ఆయన చాలా కాలం వరకు నోరు విప్పి మాట్లాడేవారు. తొండమాన్ చక్రవర్తి మీద కోపం వచ్చి మాట్లాడ్డం మానేశారు.

కాబట్టి ఆ వేంకటాచల క్షేత్రం పరమపావనమైనటువంటి క్షేత్రం. తిరుమల కొండ సామాన్యమైన కొండేమీ కాదు. ఆ కొండకి, శ్రీ వేంకటేశ్వరునికి ఒక గొప్ప సంబంధం ఉంది. తిరుముల కొండకి ఒక్కో యుగం ఒక్కో పేరు ఉండేది.

కృత యుగం లో - వృషా చలం,

త్రేతా యుగం లో - అంజనా చలం

తరువాత కలియుగం లో - వేంకటా చలం అని పేరు వచ్చింది. 

యుగాలు మారిపోయినా ఆ కొండ అలాగే ఉంది. ఈ కొండ శ్రీ మహావిష్ణువు యొక్క క్రీడాద్రి.. తిరుమల చాల పవిత్రమైనటు వంటి స్థలం.

"శ్రీవేంకటేశ్వరస్వామి మాట్లాడేవారా?"

అవును, శ్రీవారు మాట్లాడేవారు. ఒకానొకప్పుడు 'తొండమాను చక్రవర్తి' చేసిన పనికి ఆగ్రహించి మాట్లాడటం మానేసారు. 

  

 పూర్వం "కూర్ముడు" అనే బ్రాహ్మణుడు కాశీకి పోతూ, తాను తిరిగి వచ్చే వరకూ తన భార్యాపిల్లలను కాపాడమని తొండమాను రాజుకు అప్పచెప్పాడు. 

ఆ రాజు వారికి ఒక భవనంలో సకల సౌకర్యాలు కలుగచేసి, భద్రతకై తాళం వేసి ఉంచాడు. తర్వాత ఆ విషయం మరిచిపోయాడు. ఆ భవనంలోనివారు ఆహారం చాలక లోపలే మరణించారు. ఒక సంవత్సరం తర్వాత బ్రాహ్మణుడు కాశీ నుంచి వచ్చాడు. 

ఆ విషయమే మరచిన తొండమానుడు, భవనంలో చనిపోయిన వారిని చూసి భయపడి, వేంకటాచలానికి పరుగెత్తి వెళ్ళి, శ్రీనివాసుని పాదాలపై పడి శరణువేడాడు. 

అప్పుడు  శ్రీవేంకటేశ్వరుడు "నీకు బ్రహ్మహత్యాపాపం చుట్టుకుంది. కానీ నీకు అభయం ఇచ్చినందువల్ల నిన్ను రక్షిస్తాను. అందుకు ప్రతిఫలంగా ఇకముందు ఎవరికి ప్రత్యక్షంగా కనిపించను.ఎవరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడను" అంటూ శపధం చేసి, ఆ బ్రాహ్మణుడి కుటుంబాన్ని బ్రతికించాడు.


అప్పుడు బ్రహ్మాదిదేవతలు "బలహీనులు, అల్పాయుష్కులైన మానవులను ఉద్దరించడానికై కలియుగాంతము వరకూ ఈ వేంకటాచలంపై ఉండవలసింది" అని ప్రార్ధించారు. 

అప్పుడు శ్రీనివాసుడు "దివ్యమూర్తిగా దర్శనమిస్తాను. కానీ ఎవరితోనూ మాట్లాడను. అందరి కోరికలూ తీరుస్తాను" అంటూ "కన్యామాసం, శ్రవణానక్షత్రం" రోజున దివ్యమైన సాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించారు. 

తొండమానుడు ఆలయగోపురాదులు నిర్మించాడు.   

 బ్రహ్మదేవుడు రెండు అఖండ దీపాలు వెలిగించి, ఇవి కలియుగాంతం వరకూ వేలుగుతూంటాయని చెప్పాడు. తరువాత పదిరోజులపాటు ఉత్సవాలు నిర్వహించాడు. 


అవే ఆ తర్వాత కాలంలో బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధిపొందాయి.

"భగవంతుడి నామాన్ని జపిద్దాం,

 భగవంతుడిని చేరుకుందాం. 

సేకరణ:

🌹🙏🏻ఓం నమో వేంకటేశాయ🌹🙏🏻

7 *దేవుడే భోజనం పంపిస్తాడు*

                  ➖➖➖✍️


_-[స్వామి_వివేకానంద జీవితంలో జరిగిన ఒక అపూర్వ సంఘటన..]-_

*ఒకసారి స్వామి వివేకానంద మండు వేసవిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక రైల్వేస్టేషన్‌లో ఉండగా ఒక సంఘటన చోటుచేసుకుంది.* 

*వివేకానందుడు సన్యసించారు, కనుక వారికి భగవత్ ప్రసాదంగా లభించినదే భుజిస్తుండేవారు.      భిక్షగా ముడి సామాన్లు లభిస్తే వండుకుని భుజించేవారు లేదా భిక్షాటన చేస్తుండేవారు.*

*వివేకానందుడికి ఒకరోజు తినటానికి ఏమీ దొరకలేదు. ఆయన వద్ద చిల్లిగవ్వ కూడా లేదు. ఆకలి బడలికలతో దాహార్తితో నేలపై కూర్చొని ఉన్న స్వామీజీని గమనించి ఒక ధనవంతుడు చులకనగా మాట్లాడనారంభించాడు. అతని ఆలోచన ప్రకారం సన్యాసులు అంటే ఏ పనీ చేయకుండా, సోమరిలా తిరుగుతూ, ఊరిలో వారిపై భోజనానికై ఆధారపడుతూ, ప్రజలను మభ్యపెట్టి ధనం అపహరిస్తూ ఉంటారని. ఇటువంటి భావం కలిగి  స్వామీజీతో అతడిలా అన్నాడు…*

*“ఓ స్వామీ! చూడు... చూడు... నేనెంత మంచి భోజనం చేస్తున్నానో..   నా వద్ద త్రాగటానికి చల్లని నీళ్ళు ఉన్నాయి కూడా. నేను డబ్బులు సంపాదిస్తాను. కాబట్టి నాకు మంచి మంచి వంటకాలు, వగైరాలు అన్నీ సమకూరాయి. ఇటువంటి భోజనం నువ్వు కనీసం కలలో అయినా పొందగలవా...? ఏ సంపాదనా లేకుండా దేవుడు... దేవుడూ... అంటూ తిరిగేవాడివి. అందుకే నీకు ఈ బాధలు.    అయినా నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నీకు ఏమి ఇచ్చాడయ్యా... ఆకలి బడలిక తప్ప..!” అని దెప్పి పొడవటం మెుదలుపెట్టాడు.* 

*స్వామీజీ ముఖంలోని ఒక్క కండరం కూడా కదలలేదు. విగ్రహంలా కూర్చొని భగవంతుని పాదపద్మాలనే తలచుకుంటున్నారు.*

*అప్పుడు ఒక అద్బుతం జరిగింది ...*

*ప్రక్క ఊరి జమీందారు ఒక వ్యక్తి వెతుక్కుంటూ వచ్చి స్వామీజీ పాదాలపై వాలిపోయాడు. అతను స్వామితో ఇలా అన్నాడు,   “మీ పాదాలను సేవించి స్పృశించే భాగ్యం కలగడం నా పట్ల                     శ్రీ రామ చంద్రమూర్తి అనుగ్రహం. దయచేసి మీరు ఈ భోజనం స్వీకరించండి!" అని ప్రాధేయపడ్డాడు.*

*స్వామీజీ “ఎవరు నాయనా నీవు? నేను నిన్ను ఎరుగనే.. పొరబడుతున్నట్లున్నావు. నీవు వెతుకుతున్న వ్యక్తిని నేను కాదు!” అని అంటూ ఉంటే,  ఆ వ్యక్తి స్వామీజీ ముందు వెండి పీట వేసి భోజనం ఒక బంగారు అరటి ఆకు మీదకు మారుస్తూ... లేదు స్వామీ నేను కలలో చూసింది మిమ్మల్నే..!”*

*”శ్రీరామచంద్రమూర్తి స్వయంగా నా కలలో కనిపించి మిమ్మల్ని చూపించి నా బిడ్డ ఆకలితో ఉంటే నీవు హాయిగా తిని నిద్రిస్తున్నావా.. లే.. లేచి అతనికి భోజనం పెట్టు!  అని ఆజ్ఞాపించారండి. ఆహా.. ఏమి నాభాగ్యం మీ వలన నాకు రామదర్శనం కలిగింది. తండ్రీబిడ్డలు ఇరువురుది ఏమి గాంభీర్యం, ఏమి సౌందర్యం ఒక్కసారి చూస్తే చాలు ఎవరూ మరచిపోలేరు.”*

*”నేను పొరబడటం లేదు స్వామీ.. దయచేసి వేడి చల్లారక ముందే ఆరగించండి. చల్లటి నీరు కూడా తెచ్చాను అన్నాడు.* 

*స్వామీజీ కనుల వెంబడి జలజల నీరు కారింది.     ఏ అభయ హస్తమైతే తన జీవితమంతా ఆయనను కాపాడుతూ వస్తుందో... అదే అభయ హస్తమిది.*

*ఎదురుగా నోరు వెళ్ళబెట్టి ఇదంతా చూస్తున్న ఆ ధనవంతుడు ఉన్నపళంగా స్వామి వారి పాదాలపైపడి, కన్నీటి ధారాలతో స్వామి పాదాలను అభిషేకిస్తూ క్షమాపణ కోరాడు. సన్యాస జీవితమంటే భగవంతుని వడిలో నివసించటం అని అర్థమయింది. నిజమైన సన్యాసిని దూషించటం అంటే భగవంతుని దూషించినట్లే అని తెలుసుకున్నాడు.*

*తనని నమ్ముకున్న వారిని కంటికి రెప్పలా ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు భగవంతుడు. యోగులు హృదయాలలో సదా నివసిస్తుంటాడు ఆ పరమాత్మ.*

*ఇది కేవలం స్వామి వివేకానంద జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన మాత్రమే, ఇంతకు మించినవి, ఎంతో ఆశ్చర్యం కలుగజేసేవి, భగవంతుని పట్ల, యోగుల పట్ల సడలని విశ్వాసం కలుగజేసేవి మరెన్నో...!*

*అందరికీ తెలిసేలా మన భారతీయ ధర్మాన్ని వ్యాప్తిచెయ్యాలి.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు🙏