Thursday, 23 August 2018

Pranjali Pabha (telugu patrika) -8-2018

ఓం శ్రీ రాం - శ్రీ మత్రేనమ: - శ్రీ కృష్ణాయనమ:


ఆనందం ఆరోగ్యం - ఆధ్యాత్మికం 



అధిక్షేప ప్రేమ లీల - ప్రాంజలి ప్రభ .కం
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

ఆలోచన ముందు ఆవేశం అధికం 
- అయినా ఆలోచింపచేసేదే శాశ్వితం  

నిరుత్సాహము ముందు ఉత్సాహం అధికం 
- అయినా నిరుత్సాహమే శాశ్వితం   

చిరునవ్వుల ముందు ప్రేమానందం అధికం 
- అయినా చిరునవ్వులే శాశ్వితం  

స్త్రీ చూపుల ముందు పరిమళం అధికం 
- అయినా చూపుల్లో చిక్కే  శాశ్వితం  

శృంగారము  ముందు మధువు అధికం 
- అయినా స్త్రీ శృంగారమే శాశ్వితం 

పరిమళం  ముందు స్నేహమే అధికం 
- అయినా పరిమళమే శాశ్వితం 

ఆశయము ముందు మౌనమే అధికం 
- అయినా ఆశయమే శాశ్వితం

సంసారము ముందు సంపదే అధికం 
- అయినా సంసారమే శాశ్వితం     

ఏది ఏమైనా కాలాన్ని వ్యర్థం 
చేయక నడిచే వాడే శాశ్వితం  
ప్రేమించి ప్రేమింపబడేవాడే శాశ్వితం 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా  

--((**))--


సర్వదేవ కృతమ్ శ్రీ లక్ష్మీ స్తోత్రమ్

క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే
శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే

ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే
త్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్
సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీ
రాసేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః
కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకా
స్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే
వైకుంఠేచ మహాలక్ష్మీః దేవదేవీ సరస్వతీ
గంగాచ తులసీత్వంచ సావిత్రీ బ్రహ్మ లోకతః
కృష్ణ ప్రాణాధి దేవీత్వం గోలోకే రాధికా స్వయమ్
రాసే రాసేశ్వరీ త్వంచ బృందా బృందావనే వనే
కృష్ణ ప్రియా త్వం భాండీరే చంద్రా చందన కాననే
విరజా చంపక వనే శత శృంగేచ సుందరీ
పద్మావతీ పద్మ వనే మాలతీ మాలతీ వనే
కుంద దంతీ కుందవనే సుశీలా కేతకీ వనే
కదంబ మాలా త్వం దేవీ కదంబ కాననే2పిచ
రాజలక్ష్మీః రాజ గేహే గృహలక్ష్మీ ర్గృహే గృహే
ఇత్యుక్త్వా దేవతాస్సర్వాః మునయో మనవస్తథా
రూరూదుర్న మ్రవదనాః శుష్క కంఠోష్ఠ తాలుకాః
ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభమ్
యః పఠేత్ప్రాతరుత్థాయ సవైసర్వం లభేద్ధ్రువమ్
అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీమ్
సుశీలాం సుందరీం రమ్యామతి సుప్రియవాదినీమ్
పుత్ర పౌత్ర వతీం శుద్ధాం కులజాం కోమలాం వరామ్
అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినమ్
పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశస్వినమ్
భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్ట శ్రీర్లభేతే శ్రియమ్
హత బంధుర్లభేద్బంధుం ధన భ్రష్టో ధనం లభేత్
కీర్తి హీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాంచ లభేద్ధ్రువమ్
సర్వ మంగళదం స్తోత్రం శోక సంతాప నాశనమ్
హర్షానందకరం శాశ్వద్ధర్మ మోక్ష సుహృత్పదమ్
|| ఇతి సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం సంపూర్ణం ||



వరలక్ష్మీ తల్లీ రావమ్మా
వరమిచ్చే వరలక్ష్మీ రావమ్మ 
పసుపు , కుంకుమ
పూల పళ్ళెము తోడ ముత్తైదవులంతా
స్వాగతమిత్తుము శ్రావణ శుక్రవార
వరలక్ష్మీ తల్లీ రావమా !!

సౌభాగ్యములు మాకిచ్చే జననీ
నీ రాకాతో మే తరించూ వేళ
మామిడి తోరణాల , ముత్యాలముగ్గుతో
రాశిగా పూలతో పూజించుమమ్మా
పసుపు కుంకుమ అక్షింతల తోడ
కొలిచేము తల్లీ ..
తోరములు కట్టీ , రూపునూ పూజించి
గృహమున వనితలకు వాయనాలు ఇచ్చుచూ
వరముల వరలక్ష్మీ నిన్ను మేము స్మరింతుము
కళకళ లాడే గృహమున
నీవే మా కల్పవల్లీ తల్లీ
నీవమ్మా .. నీ కరుణా , ప్రేమను
మా పై కురిపించువమ్మా
ఇలలో నీకే అందరమూ వేచీయున్నాము తల్లీ !!
వరలక్ష్మీ తల్లీ రావమ్మా !!
నీ పూజా వ్రతమూ చేసే
భాగ్యము , వరమును ఇవ్వమ్మా
తల్లీ పిల్లా పాపల తోడ హారతి
నీ కిచ్చేము మనసా మా తల్లీ
వరలక్ష్మీ రావమ్మా !!
సకల లోక జనులను రక్షించే
తల్లీ నీ దయా కృప లతో మమ్ము ఎల్లవేళలా
కాపాడు వరలక్ష్మీ తల్లీ ..
వరములిచ్చే వరలక్ష్మీ రావమ్మా
భూలోక వనితలా నోము పండించమ్మా
వరమివ్వు తల్లీ వరలక్ష్మీ తల్లీ రావమ్మా !!
~దివ్య చేవూరి


    23..8..18. సుందరకాండ. 

కారణైర్బహుభిర్దేవి రామప్రియచికీర్షయా, 

స్నేహప్రసన్నమనసా మయైతత్ సముదీరితమ్. 
లంకాయా దుష్ప్రవేశత్వాద్దుస్తరత్వాన్మహోదధేః, 
సామర్ధ్యాదాత్మనశ్చైవ మయైతత్ సముదీరితమ్. 
ఇచ్ఛామి త్వాం సమానేతుమధ్యైవ రఘుబంధునా, 
గురుస్నేహేన భక్త్యా చ నాన్యథైతతదుదాహృతమ్.. 

ఓ దేవీ! రాముని పట్ల నాకు గల అచంచల భక్తిప్రపత్తుల కారణాన, ఆయనకు ప్రీతిని కలిగించాలనే కోరిక వలన మనస్సు కరిగి నిన్ను నాతో పాటు తోడ్కొనిపోతానని చెప్పాను. ఇందుకు ప్రత్యేకించి మరో కారణం ఏదీ లేదు. 

లంకలో ప్రవేశించడం అసాధ్యం కనుక సముద్రం దాట శక్యం కానిదవడం చేత, నిన్ను తోడ్కొని వెళ్ళగల సామర్ధ్యం నాకు ఉందనుకోవడం వల్లా నేను ఇలా పలికాను. అంతకన్నా మరో కారణం లేదు. 
అమ్మా! నిన్ను రాముని సన్నిధికి సత్వరమే చేరుద్దామనే బలీయమైన కోరికచేత, రాముని పట్ల నాకున్న విశేష భక్తిప్రపత్తులు, అభిమానం కారణంగానే నేను ఇలా పలికానుగానీ మరో కారణం ఏదీ లేదు.
--((**))-- 


అంతా నేనే అనుకుంటున్నాను, 
నన్ను నేను గుర్తించలేక పోతున్నాను! 

కాళ్ళకు గజ్జె కట్టుకునే ముందు 
కళ్ళకు అద్దుకోటం మరిచి పోతున్నాను! 
విద్యను ప్రదర్శించేముందు గురువు గార్ని 
గుర్తు చేసుకోలేక పోతున్నాను! 
ముద్ద నోట్లో పెట్టుకుంటూ వైద్యుణ్ణి 
మాత్రం తలపోసుకుంటున్నాను! 
ఆర్జన మాత్రమే చేస్తున్నాను 
అనుభూతిని విస్మరిస్తున్నాను! 

స్వయం శక్తి విలువ తెలియక 
సిఫార్సులకు తంటాలు పడుతున్నాను! 
ఎదుటివాడి మెప్పుకోసం 
వ్యక్తిత్వం తాకట్టు పెడుతున్నాను! 
విలువలేని వాడికి గులామునవుతున్నాను! 
గందరగోళం తాళంలో కంగాళీ చేస్తున్నాను! 

అమ్మో ఇప్పుడు ప్రవచనం వచ్చే వేళైంది, 
ఆలోచిస్తూ కూర్చుంటే అది మిస్సవుతుంది! 
అందుకనే ఆలోచించటం మానేస్తున్నాను, 
తలుపులు మూసి తలపుల్ని బయటకు గెంటేస్తున్నాను!
 --((**)
రచయత: జయంతు ఎం. 
నిత్య నీస్తోత్రాల 
విలసిల్లే దేవీ 
శుచి శుభ్రతల 
పరిభ్రమించె దేవీ 
నీ ధ్యానం లేకుంటే 
నీకరుణే లేకుంటే 
ధన కనకములకూ 
చోటేదమ్మా 

ప్రతి యింట 
విష్ణు గానములతో 
పులకించేవమ్మా 
నిత్యానుష్టాన పూజలతో 
విలసిల్లేవమ్మా 
అనురాగ మాత్మీయత 
అల్లుకున్నవారిలోన 
అనుదినమునీవు 
చల్లని చూపులతో 
వికసించేవమ్మా 

మాయింటి గృహలక్ష్మీ 
మముగన్న తల్లీ 
విద్యబుద్దులతో 
అష్టైశ్వర్యం ప్రసాదించే 
మాతల్లివమ్మా మాయింటి 
మహలక్ష్మివమ్మా
--((**))-- 
            
మళ్లీ వనమయూరము -

నాకు నచ్చిన వృత్తములలో వనమయూరము ఒకటి. ఇది కూడ తాళవృత్తమే. ఇంతకు ముందే చెప్పియున్నాను ఈ వృత్తములోని నరసింహస్తోత్రము (శ్రీమదకలంక పరిపూర్ణ...) చాల ప్రసిద్ధమైనది.

వనమయూరము - భ/జ/స/న/గగ
14 శక్వరి 3823

శారదను దల్చ నవ - చారుమతి గల్గున్ 
మేర లిఁక లేక కడు - మేలు గలిగించున్ 
హారములె భావములు - హర్షలత పూయున్ 
చేరువగుఁ జిత్రముగఁ - జెల్వముల గీతుల్

ఈదినము మంచి దిన - మెల్లరకుఁ గాదా 
ఖేదములు మాయమగుఁ - గృష్ణుఁ డనరాదా 
మోదమిడు రాగ మది - మోహనము గాదా 
సాధానము సేతు నిఁక - సారిగపధాసా

సందె యరుణార్ణవము - శ్యామలము రాత్రుల్ 
మంద మృదు రావమును - మారుతము దెచ్చెన్ 
విందు లిడు వేళ యిది - ప్రేమ మధు పాత్రన్ 
సందియము లెందు కిఁక - సాకి దయ నీవా

విధేయుడు - మోహన
--((**))--


ఉల్లి చేసిన మేలు చేయదు తల్లి
ఉల్లి కారం కలిపి తినిచూది కిల్లి
ఉల్లితినాలనిపిస్తునిది మల్లి మల్లి
ఉల్లి కోసం చేయకు ఇపుడు లొల్లి

ఉల్లి తరిగితే కారు తుంది కన్నీరు
ఉల్లి కొనాలంటే వస్తున్నాయి కన్నీరు
ఉల్లి లేని సాంబారు ఉత్తుత్తి కన్నీరు
ఉల్లి తెస్తే పన్నీరు లేకపోతె కన్నీరు

ఉల్లి రేటుకు వాడని హోటళ్ళు
ఉల్లి ఎక్కువ కమ్మే లోగిళ్ళు
ఉల్లి కొనాలంటే సంసారికి కన్నీళ్ళు
ఉల్లి అమ్మేచోట అంతటా కుళ్ళు

ఉల్లి కొంటున్నారు ఉన్నవారు రేటు ఎక్కువైన
ఉల్లి ముక్కలు లేని అట్టు తింటారు ఎక్కువైన
ఉల్లి ధరపెరిగితే ప్రభుత్వాలుపడును ఎప్పుడైన
ఉల్లి ప్రభుత్వమా కళ్ళుతెరిచి అమ్మాలి తక్కువకైన

ఉల్లి రక్షించు వేసవి వడదెబ్బ
ఉల్లి కాంక్షించ వద్దు నీ వబ్బ
ఉల్లి వాడని తిండి తినాలబ్బ
ఉల్లి కోసం పిల్లాడులా లొల్లి చేయకబ్బ
--((**))--
ఓం శ్రీ సరస్వత్యై నమః

శ్రీ గురుభ్యో న్నమః
అజ్ఞతా చిహ్నము "గు"కార మట్టి దాని గడచు జ్ఞాన చిహ్నంబు "రు" కార మంద్రు
అజ్ఞతాంధ్యమ్ము బాపి సత్యాధ్వమందు జ్ఞాన దీప్తిని దయచేయు యనుడె గురువు!

సహనావవతు యన్న సమభావనా పూర్ణ సత్సాంప్రదాయంపు సార మలది
ప్రేయస్సు నెడబాపి శ్రేయస్సు సమకూర్చు దివ్య విజ్ఞానంపు దీక్ష నొసగి
వినయ వివేకాది వితరణ గుణభూతి చేతంబులన్ నిండ జేర దీసి
సౌశీల్య విశ్వాస సత్య నిష్టల బెంచు శిక్షా విధానంపు చెలిమి నిచ్చి

విద్య గరుపంగ గురువులీ విశ్వమందు పరిణతిన్ బొంది మనజాతి పంచిపెట్టె
విహిత సంస్కార చైతన్య విమల దీప్తి మహి సమస్తంబు శోభాయమాన మవగ!

పరిసరాలోకనా ప్రాపిత విజ్ఞాన శోధనమ్మున ఆత్మ శుద్ధి నంది సతతంబు నియమాను సారమా విజ్ఞాన సాధన జేయుచు సార మరసి శోధనా సాధనా స్ఫూర్తి శిష్యుల దేర్ప
బోధనా శీలురై బుద్ధి గరిపి సంస్కార చైతన్య సౌశీల్య దీప్తుల వ్యక్తిత్వ నిర్మాణ పథము చూప త్రివిధ ధన యుక్తులై యొప్పి అవని మీద జాతి నిర్మాణ నేతలై సాగువారె
గురువు లన జెల్లు! చెల్లునే గురువు లనగ విద్య నమ్మెడి అక్షర విదిత జనుల!

వట తరుచ్ఛాయలో బ్రహ్మ తేజోదీప్తి శోభిల్లు పిన వయస్కుండె "గురువు"
ఆచార్యు ముంగిట అతి భక్తి నియతులై చెలువారు వృద్ధులె శిష్య గణము
ఆధ్యాత్మ తత్త్వమ్ము వ్యాఖ్యానమును చేయ జ్ఞాన ధనుడు పూను మౌన ముద్ర
అతి రహస్యమౌ ఆ భావ మెద చేర్చి  సంశయములు శిష్య చయము బాయు

ఆ గురువె దత్తనాధుండు; అంత వారె శంకరాచార్యులాది శిష్యౌఘ మనగ
అట్టి గురు శిష్యులీ భూమి నవతరించి రెందరో ఆ పరంపర కివియె నతులు!
(చిత్రం వట తరోర్మూలే వృద్ధా శిష్యాః గురుర్యువాః గురోః మౌనం వ్యాఖ్యానం శిష్యాః ఛిన్న సంశయః అన్న ఈ శ్లోకానికి స్వేచ్చానువాదం చివరి పద్యం)

--((**))--



Monday, 20 August 2018

ప్రాంజలి ప్రభ (అంతర్జాల telugu పాత్రిక ) -8- 2 0 1 8

ఓం శ్రీ రాం - శ్రిమత్రే నమ: శ్రిక్రిష్ణాయనమ:  


ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం

తాత మనవడి (చిన్న కధలు-  
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

తాతయ్య మనవడ్ని ప్రక్కన కూర్చోపెట్టుకొని చిన్న ఆద్యాత్మిక ఉపన్యాసం చెప్పటం మొదలి పెట్టాడు.    
సమస్త జీవరాసిలోనూ పరమాత్మను దర్శించగల శక్తి  మానవునకే ఉన్నది.   "ఒక చేతి వ్రేళ్ళు ఒకటిగా ఉండవు " అయినా విశ్వమంతా సౌందర్యమయంగా కనబడుతుంది ప్రతి ఒక్కరికి. దూరమునుండి కొండ చుస్తే నున్నగా కనబడుతుంది దగ్గరకు వెళ్ళితేగాని దాని విశ్వ రూపం తెలియదు.  ప్రతి మానవుడు ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ధర్మిక శక్తి సాధించు కోగలిగితే ప్రపంచంలోని స్థితిగతులన్నీ మారుతాయి. " ఒకడికున్నదని ఏడిస్తే ఒక కన్ను పోతుంది - తనకు లేదని ఏడిస్తే రెండో కన్ను పోతుంది " గుడ్డి వాడిగా మారితే ఫలితము ఎమన్నా ఉన్నదా .  కలతలు కార్పణ్యాలు ప్రబలిన చోటే శాంతి స్థాపన చేయుట మన కర్తవ్యము అని భావించి ముందుకు సాగాలి.  ఘర్షణకు తావు లేకుండా, ద్వేషం దారి ఇవ్వకుండా,  అసూయ ఆవకాశమివ్వకుండా, పూర్తిగా మనో నిబ్బర శక్తితో ప్రతిఒక్కరిని శక్తి వంచన లేకుండా ఆదుకుంటూ జీవితం సాగించాలి.   "చెడు  వినకు, చెడు అనకు, చెడు కనకు."   "ఒకడిని చూస్తే పెట్టబుద్ధి - ఉంకొకడిని చూస్తే మెట్టబుద్ధి" అయినా  ఆదర్శమైన ప్రేమ సర్వత్ర వ్యాపించి ఉన్నది, అయినా  అసూయా ద్వేషాలకతీతంగా మానవులుగా ఆ పరమాత్ముని ప్రార్ధిస్తూ కర్తవ్యదీక్షతో కంకణ బద్దులుగా మారి మనుష్యుల్లో ఉన్న పరమాత్ముని గమనిస్తూ  ప్రవర్తించే వాడే నిజమైన మానవుడు.
తాత నేను నిజమైన మానవుడ్ని కానా అన్నాడు మానవుడు,. ఎందుకు కావు వయసుని బట్టి ప్రవర్తనే 
మన:శాంతి కలిగించే విధముగా ఉంటె చాలు ఈ కలియుగంలో. 
అలాగే తాతయ్య ఎవ్వరికి కష్టం కలిగించకుండా ఉంటా. సరేరా బాబు ఉంటా ... ఆ ఉంటా 
ఆ.. ఉంటా అని వెళ్లి పోతావే. 
తాతయ్య మీరే చెప్పారు ఒకనాడు అవునంటే కాదని, కాదంటే అవునని వస్తా ...  కాదు కాదు వీళ్ళొస్తా ... అంటూ బయలు దేరాడు మనవుడు         
--((**))--

ఆదిక్షేప ప్రేమ లీల  - ప్రాంజలి ప్రభ.కం 
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ 

నయనాల చూపులకు నవనీతము కరిగే 
- సోయగాల మెరుపుకు అభిమానము పెరిగే 

పరువాల వెన్నెలకు పరిమళము కరిగే 
- మదిలీల మగువకు చమత్కారము పెరిగే   

వింత గోల వయసుకు విపరీతము కలిగే 
- సంత గోల వనితకు ఉపోద్ఘాతము పెరిగే 

విధి లీల మనసుకు భయమోహము కలిగే 
- ప్రేమ లీల మహిళకు సుఖభారము పెరిగే 

శుభమో భారమో భయమో 
ద్వేషమో దాహమో తాపమో  
సతిపతిగా కరుగుటే  
వేణు గోపాల పేమ సుమా  
   --((**))--


ఆదిక్షేప ప్రేమ లీల  - ప్రాంజలి ప్రభ.కం 
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ 
ఈ రోజు పెళ్లి రోజు జరుపుకునే జంటకి శుభాకాంక్షలు 

సన్న నవ్వుల కోరిక కన్నా, కావలిసిందేమిటి జంటకి 
- నిత్య పువ్వుల వాసన కన్నా, పరిమళమేమిటి జంటకి

సత్య వాక్కుల బోధల కన్నా, మాటలు ఇంకేమిటి జంటకి   
- ఉన్న దానితో సంతృప్తి కన్నా, ఆశ ఎక్కువేమిటి జంటకి 

ఆశయముతో బ్రతుకు కన్నా, బాధ కష్టమేమిటి జంటకి   
- మనసు దాటని మాట కన్నా, ఓపిక తీర్పేమిటి జంటకి  

నీడలా ఉండుట తృప్తి కన్నా, పొందేటి సేవేమిటి జంటకి   
- ఇంటిలో ప్రేమ పంచుట కన్నా, వేడుకలు ఏమిటి జంటకి  

ఒక రొకరు నమ్ముటం కన్నా, బ్రతుకు మార్పేమిటి జంటకి 
- ఉన్నది దానం చేయుట కన్నా, పొందు పాశమేమిటి జంటకి  

చెలిమి ఊయల పాట కన్నా, గుణ స్వర మేమిటి జంటకి 
- చిలిపి కోర్కల మాట  కన్నా,  మనో రాగమేమిటి జంటకి 

తల్లి తండ్రుల ప్రేమలు కన్నా,  కావలసిన దేమిటి జంటకి    
- దైవ సన్నిధి పూజలు కన్నా, మనో  తృప్తి ఏమిటి జంటకి

పసిడి వెలుగు బాట కన్నా, వెన్నెల పొందేమిటి జంటకి
- మనసు వాంఛ తీర్చుటకన్నా, ధనం పని ఏమిటి జంటకి   

లోకవ్యవహారము, భయము ,సిగ్గు,
 దాక్షిణ్యము, ధర్మసీలత 
ఈ యైదును లేనివారితో స్నేహము కూడదు
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

--((**))--

తాత మానవుడి చిన్న కధ 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

తాత నాకు ఒక కధ చెప్పు అని అడిగాడు మనవుడు. అప్పుడు తాత "తినే ప్రాప్తి ఉంటె వడ్డించేవాడు మనవాడవుతాడు అన్నాడు" అవును తాత దేవుడి మీద నమ్మకం ఉంటె ఎంతటి  రోగమైన క్షణంలో పోతుంది అన్నాడు మనవుడు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు కదా తాత అవునురా మనవుడా ఒక్కోసారి దేవుడే నీవుకష్ట పడకుండా నీ దగ్గరకే వచ్చి నీకు సేవ చేస్తాడు నీవు చేసిన పుణ్యాన్ని బట్టి నీదగ్గర ఉంటాడు. ఏదన్న ఉదాహరణ చెప్పు తాత . 
సరే చెపుతా  విను అని చెప్పటం మొదలు పెట్టాడు తాత.              
స్టీఫెన్ అనే ఒక ప్రఖ్యాత డాక్టర్, వైద్య రంగంలో తాను చేసిన పరిశోధనలకు తాను పొందిన ఒక గొప్ప అవార్డును అందుకోవడానికి వెరే నగరానికి బయలుదేరాడు. రెండూ గంటల ప్రయాణం తరువాత అతను ఎక్కిన విమానం కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆగిపోయింది. కాన్‌ఫరెన్సుకు ఆలస్యం అవుతోంది అన్న ఆందోళనతో అతను ఒకా కారు అద్దెకు తీసుకుని ప్రయాణం కొనసాగించాడు. మళ్ళి కొంతసేపు అయిన తరువాత, విపరీతమైన గాలివాన, వర్షం..దానితో ఈ వాతావరణంలో ముందుకు సాగలేక ఆగిపోయాడు. భరించలేని ఆకలి, అలసట, వేళకు వెళ్ళలేకపోతున్నాను అనే చికాకులతో ఉన్నాడు ఆ డాక్టరు. కొంతదూరం ముందుకు వెళ్ళాక, అతనికి ఒక చిన్న ఇల్లు కనిపించింది. ఆ ఇంట్లోకి వెళ్ళి వారి ఫోను ఉపయోగించుకుందాము అనుకున్న ఆ డాక్టరుకు ఆ ఇంటి తలుపు తీసిన ఒక ముసలామె తన ఇంట్లో కరంటు, ఫోను సౌకర్యాలు లేవు అని, బాగా వర్షంలో తడిసిపోయినందున తన ఇంట్లో కొంత సేపు విశ్రాంతి తీసుకోమని, వెచ్చగా ఉండేందుకు టీ, కొంత ఆహారం టేబుల్ మీద పెట్టి తను ప్రార్ధన చేసుకోవడానికి వెళ్ళింది. ఆమె పక్కన ఉయ్యాలలో ఒక పసివాడు ఉన్నాడు. ఆమె గురించిన వివరాలు తెలుసుకుందామనుకున్నా, ఆమె ప్రార్ధనలు ఎంతకీ పూర్తి అవటం లేదు. ఎట్టకేలకు ఆమె ప్రార్ధనలు ముగించి వచ్చిన తరువాత, ఆమె మంచి మనసుకు ఆమె చేసిన ప్రార్ధనలు అన్నీ ఆ భగవంతుడు వింటాడు అని భరోసా ఇచ్చాడు. ఆ ముసలామె చిరునవ్వు నవ్వి, భగవంతుడు నేను కోరిన అన్ని కోరికలూ తీర్చాడు ఒక్కటి తప్ప, ఎందుకనో ఈ కోరిక మాత్రం తీర్చడం లేదు అని చెప్పింది. 

ఆమెకు అభ్యంతరం లేకపోతే, ఆమెకు కల కోరిక ఏమిటో చెప్పమని, తాను సాధ్యమైనంత సహాయపడతానని చెప్పాదు వైద్యుడు. ఆమె ఇలా చెప్పటం ప్రారంభించింది. "ఈ ఉయ్యాలలో ఉన్నవాడు నా మనుమడు. అతనికి ఒక అరుదైన క్యాన్సర్ వ్యాధి సోకింది. ఎంతో మంది వైద్యులకు చూపించాము. ఎవ్వరూ నయం చేయలేకపోయారు. ఒక్క స్టీఫెన్ అన్న ఆయన మాత్రమే ఈ వ్యాధి తగ్గించగలడు, ఆయన ఇక్కడికి చాలా దూరంలో ఉన్నాడు. అందుకే వైద్యం మీద ఆశ వదిలేసి, భగవత్ ప్రార్ధనలతో జీవితం గడిపేస్తున్నాను అని చెప్పింది. వింటున్న డాక్టరు కళ్ళల్లో నీళ్ళు. "భగవంతుడు దయామయుడు. ఆయన మీ ప్రార్ధనలు వినడమే కాదు, ఆ డాక్టరును మీ వద్దకే తీసుకువచ్చాడు కూడా. విమానం పాడయ్యి, గాలివానలో చిక్కుకుని, నేను మీ ఇంటికి వచ్చాను. కాదు కాదు, ఈ పరిస్థితి సృష్టించి ఆయనే నన్ను మీ వద్దకు పంపాడు. ఆ డాక్టర్ స్టీఫెన్ ను నేనే." అని బదులిచ్చాడు. అప్పుడు ఆ క్షణం అతను అందుకోవలసిన అవార్డు అతనికి గుర్తు రాలేదు. 

భగవత్ ప్రార్ధన లోని మహత్యం అదే. మనం వెళ్ళలేని చోటుకు కూడా దాని శక్తి వెళుతుంది. కావలసినది నమ్మకం అంతే. 1.అడగడం, 2. నమ్మడం, 3.అందుకోవడం...ఇవే ప్రార్ధనకు కావలసిన అంశాలు. భగవంతుని నమ్మి మనం ప్రార్ధిస్తే, మనకు కావలసినది ఆయన తప్పక మనకు లభింపచేస్తాడు. అని చెప్పాడు తాత కధ ముగిస్తూ 
--((**))--


వింటున్నా వింటున్నా
తల్లి గర్భమందు నుండి
లయ తప్పని చప్పుడొకటి
లలితం గా వింటున్నా!

ఓం కార శబ్దం... లా
ఓం భూర్బువ స్సువ:.. లా
మధుర మైన స్వరము నె
హృదయం లో వింటున్నా!

మనసు లోని మలినాన్ని
మనిషి లోని కాలుష్యాన్ని
శృతి తప్పని శబ్ద మొకటి
శుద్ధి చేయు ప్రతి క్షణం!

మమత లకు, మోహానికి
మనుగడకు, ప్రాణ మదె
మంచి చెడు భావాలను
మార్పు చేయు చోటు అదే!

జీవరాసు లన్నిటికి
జీవము ఆ శబ్దమె
విశ్వ విభు డైన గాని
విన వలెను దాని మాట!

డాక్టర్.....
శ్రీనివాసమూర్తి గంజాం 

శ్లో === లోకయాత్రా భయం లజ్జా దాక్షిణ్యం ధర్మ శీలతా | 
పజ్జ యస్మాన్ని విధ్యన్తే నకుర్యాత్తెన సజ్గతి మ్ || 

భావము === లోకవ్యవహారము, భయము ,సిగ్గు, దాక్షిణ్యము, ధర్మసీలత ఈ యైదును లేనివారితో స్నేహము కూడదు.

వందనము 

పల్లవి. అన్నమయ్య ఏది అడిగి నాడయ్య? 
అన్న, పానములా? ఆస్తులా, మేడలా? ||అన్న|| 

అనుపల్లవి. మిన్నైన సిరులేమి కోరినాడయ్యా? 
వెన్నుని వన్నెల సహవాసము తప్ప. ||అన్న|| 

1. త్యాగ రాజుల వారు తారక రాముని, 
రాగ సుధలో ముంచి రంజింప జేసి, 
పొగడి, పల్లకి, పదవి, పుడమి సంపదలు, 
యోగి పుంగవుడు అడిగినాడయ్యా? ||అన్న|| 

2. రామ దాసుల వారు, భక్తి రమ్యతతో, 
స్వామి కీర్తన చేసి సుఖమొందిరే గాని, 
కమ్మిన చీకటిలో కారావాసములో, 
యిమ్మని కాసులు అడిగినాడయ్యా? ||అన్న|| 

3. దేవుడిచ్చిన ఆ తియ్యని కంఠము, 
స్వామికే అర్పించి సుఖ మొందు సుజన, 
అమ్మ అలమేలును, అందాల స్వామిని, 
ప్రేమ రాగముతో పూజింపుమయ్యా. ||అన్న|| 

4. నిత్య సంకీర్తనతో నరహరిని నుతి చేసి, 
ముత్యములా జగములో వెలిగి పోవయ్యా, 
నిత్యము గాదు యీ నర జన్మ చెరసాల, 
సత్యమిది, స్వరమును శృతి చేయవయ్యా. ||అన్న|| 

రమాకాంతరావు చాకలకొండ 25 జూన్ 2015 
Visit: http://ramakantha.com / & http://lordbalajisongs.com/
Ramakantha Rao Chakalakonda | Poet, Lyricist, Writer
ramakantha.com
--((**))--
కం. శరణాగత సంశ్రితభయ 
హరణా సురనికర శేఖరానర్ఘమణి 
స్ఫురణాపరిచయరంజిత 
చరణా వనమాలికా భుజంగభరణా 

కం. అజగవశార్ఙ్గలంకృత 
భుజగర్వనిరస్తదైత్య భూమాస్తుత్య 
త్రిజగద్ధారణనిత్య 
భుజగసమాచరితశయన భూషణకృత్యా 

కం. జలనిధిహిమవద్భూధర 
కలితజననకేళికౌతుకవ్యక్తావ్య 
క్తలలితసౌందర్యస్ఫుర 
దలఘుతనుస్త్రీసనాథ హరిహరనాథా! 

ఆంధ్రమహాభారతము "విరాటపర్వము" నుండి హరిహరనాథ స్తుతి. (తిక్కన సోమయాజి)

--((**))--
  
గజల్ 2405.

అందాలకు లోటుండదు..తను అలిగిన సమయాన..!
పరిమళించు సెలయేఱే..తను నవ్విన సమయాన..!

ప్రతిచినుకొక మౌనరాగ మాలపించు తనను కూడి..
సరిగమలకు పరవశమే..తను పాడిన సమయాన..!

మబ్బులలో కలహంసయె..కదిలినట్లు నడకలు కద..
ప్రతిమెఱుపుకు వేడుక కద..తను ఆడిన సమయాన..!

విహరించే ఊహలకే..పల్లకి కద తన ఊసే..
మధువేదో పొంగునుగా..తను చూసిన సమయాన.!

రత్నకాంతు లెన్నైనా..తక్కువేగ తన సొగసుకు..
నవపున్నమి కోవెలగా..తానయ్యిన సమయాన..!

ఈ మాధవ గజలంటే..తన ముద్దుల ధార కదా..
నా శ్వాసల దీపంతో..తను చేరిన సమయాన..!
--((**))--

గజల్ 2401. 

నిశిని వలచిన శశిని చూశా..తెల్లవారని రేయిలో..! 
కలికి వెన్నెల సఖిని చూశా..ఆశ వాడని రేయిలో..! 

యేటిగట్టున వింత సొగసుల..విరహవేదన విందుగా.. 
అలుక చూపని చెలిని చూశా..కలలు వీడని రేయిలో..! 

పండువెన్నెల వన్నెలెన్నో..తెల్లబోయే వేళరో.. 
గుండెవీణియ తడిని చూశా..రాగమారని రేయిలో..! 

పలకరించు అందమేదో..పరువమల్లే పూసెనే.. 
పసిడి చెలిమికి నిధిని చూశా..గంధమందని రేయిలో..! 

మంచుపూలకు మధువులేవో..నింపుతున్నది ఎవ్వరో.. 
శుభముహూర్తపు సడిని చూశా..ఘడియవాలని రేయిలో..! 

ప్రేమసాగర తీరమేదో..చేర్చవేలర మాధవా.. 
దిగులు పడు ఊర్వశిని చూశా..మువ్వనవ్వని రేయిలో..!

--((**))--

గజల్ 2406. 

వంతెనగా తనతనువును..నిలిపినాడు..జైజవాన్..! 
దేవునికే ప్రతిరూపమై..నిలచినాడు..జైజవాన్..! 

మనసు రాయి చేసుకున్న..మాంత్రికుడే సైనికుడా.. 
ఒక రక్షణ యంత్రంలా..ఒదిగినాడు జైజవాన్..! 

కాపాడే తత్వానికి..ప్రతీకగా ముందుండును.. 
విపత్తులకు ఎదురీదగ..సాగినాడు జైజవాన్..! 

ఎంత చరుకుతనము వాని..సొంతమోయి గమనిస్తే.. 
సమయానికి తగుశక్తిగ..ఎదిగినాడు జైజవాన్..! 

జీతానికి కాకతాను..తన నేనును విడనాడెనె.. 
తనకమ్మని జీవితాన్ని..ఇచ్చినాడు జైజవాన్..! 

మాధవుడా నీ గజలే..అంకితమాతని పదముల.. 
తన సర్వస్వం తా నర్పించినాడు జైజవాన్..!
--((**))--




గజల్ 2407. 

సన్ననవ్వుల పంటకన్నా..సంపదేమిటి జంటకి..! 
ఉన్నదానితొ తృప్తికన్నా..ఎక్కువేమిటి జంటకి..! 
ర్కెతీరగ గొడవపడితే..అసలు నెమ్మది ఎక్కడ.. 
మనసు దాటని మాటకన్నా..ఓపికేమిటి జంటకి..! 

చిన్నిసరదా నీడలాగా..తోడు నిలచుట మధురము.. 
ఇంటిచుట్టూ తోటకన్నా..వేడుకేమిటి జంటకి..! 

ఒకరికోసం ఒకరు బ్రతుకని..లోకమెట్లా ప్రేమా.. 
మనసునిండిన శ్వాసకన్నా..పండుగేమిటి జంటకి..! 

చిలిపి ఆశల గగనమేదో..చేరకుండా ఎట్లా.. 
చెలిమిఊయల పాటకన్నా..వేదికేమిటి జంటకి..! 

మధురమాధవ గజల్ లాగా..ప్రవహించే దెన్నడు.. 
పసిడివెలుగు బాటకన్నా..వెన్నెలేమిటి జంటకి..!
--((**))--


అధిక్షేప పేమ లీల 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

పండువెన్నెల వన్నెలెన్నో చూశా, తెల్లారే వేళలో  
- నది పరుగు కడలిలో చూశా, వర్షపు వేళలో 

తొలి ముద్దు పెదవియందు చూశా, మొదటి రాత్రిలో  
- నళిని వలచిన శశి చూశా, అంబరం ఆశలో 

యుగ యుగాల ఆశను చూశా, జగతి లీళలో   
- కలికి వెన్నెల సఖిని  చూశా, ప్రకృతి వడిలో  

అలుక తీర్చే ఆకలిని చూశా, శ్రీమతి వడిలో 
- గుండె వీణియ తడిని చూశా, ఆత్రుత మదిలో 

కలి బలిమి గర్వమును చూశా, నాయక వేటలో 
- యేటి గట్టున సొగసును చూశా, యవ్వన ఆశలో 

మెరుపుతో మేఘం పన్నీరు చూశా, శ్రావణ మాసంలో    
- ఆశతో పుడమి ఆత్రుత చూశా, తెలుగు భాషలో 

విత్తు విచ్చి విజ్ఞాన తేజం చూశా, సామాన్య శాస్త్రంలో 
- పెంపకంలో అమ్మ ప్రేమను చూశా, జీవన గమ్యంలో  

మల్లె పూల సువాసనను చూశా, శృంగార లీలలో  
- దిగులు పడు యవ్వనాన్ని చూశా, మగువ మత్తులో 

జాబిల్లి ఆశా, భానుప్రతాపం చూశా
ప్రకృతి ఆశా, కాల మహిమ చూశా      
ఆనందం ఆరోగ్యం ఆధ్యాత్మికం చూశా 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))- 

Pranjali prabha (telugu Antarjaala patrika) -8-2018

 ఓం సి రామ్ - శ్రీ మాత్రే నమ: - సి కృష్ణాయనమ:

ఆనందం - అనారోగ్యం -  ఆధ్యాత్మికం  

నా పరిచయం! 

నా పాళీ కాస్త పదును! 
నా బాణీ కాస్త అరుదు! 

ఇంకులేదు నా కలంలో 
పొంగిపోయో ఆవేశం తప్ప! 
బొంకులేదు నా గళంలో 
కృంగ తీస్తున్న ఆక్రోశం తప్ప! 

ఒళ్ళు మరిచి సమాజాన్ని 
తప్పు పట్టడం లేదు! 
కళ్ళ మూసుకుని కారు చీకటిని 
తిట్టడం లేదు! 
దారి తప్పుతున్నామని 
గొంతు చించుకు అరుస్తున్నాను! 
కాలు జారతామని ముందుగానే 
అందరినీ హెచ్చరిస్తున్నాను! 

చచ్చు పడిన సమాజాన్ని 
వెన్ను చరిచి లేపుతున్నాను, 
ఆరని గాయాలకు చురకలు వేసి 
చికిత్స చేస్తున్నాను! 
మీకూ నాకూ తప్పదు 
ఎంతో కొంత నెప్పి, 
అలాగని వదిలేస్తే 
అందరి బతుకులూ పిప్పి! 

హృదయాలు కరిగించి 
వన్నె లెక్క వేస్తున్నాను! 
గుండెలు పిండి 
ఎండలో ఆరేస్తున్నాను! 
సమాజం గుట్టు విప్పి, 
నిష్ఠూరాలు భోంచేస్తున్నాను! 
హాలాహలం మిగుతూ, 
అమృతం అందరికీ పంచుతున్నాను! 

అందుకే నేను చాల నిరంకుశుణ్ణి, 
నిరంతరం కాలానికి ఎదురీదే శ్రామికుణ్ణి! 

నా పాళీ కాస్త పదును, 
గుచ్చుకుంటే మన్నించండి! 
నా బాణీ చాల అరుదు, 
మెచ్చుకుంటే దీవించండి!


సరోయితూగే 
గజల్ 2411. 

బాధించే మచ్చ ముందు..గాయమెంత అసలు..! 
తిరిగిరాని క్షణం ముందు..శోకమెంత అసలు..! 

చిరునవ్వుకు సరితూగే..మల్లెమొగ్గ ఏది.. 
పరిమళించు చెలిమి ముందు..స్వర్గమెంత అసలు..! 

విరహానికి మధువుతోటి..అనుబంధం మెండు.. 
అందమైన మనసు ముందు..గగనమెంత అసలు..! 

నాటకాన శృతిమించిన..అయోమయం మిగులు.. 
మౌనమైన తలపు ముందు..సంద్రమెంత అసలు..! 

చెలి అందెల సవ్వడులే..గుండెలయల తోడు.. 
మెఱుపుపూల వానముందు..పవనమెంత అసలు..! 

ఓ మాధవ ఆరాధన..గీతమేదొ పొంగె.. 
ఉప్పొంగే గజలు ముందు..కవనమెంత అసలు..!

--((**))--

శృంగార భావ లహరి ౹౹
సీస పద్య॥
జలతారు చీరెలో జలజాక్షి మెఱయంగ
................వెండి మబ్బున దాగె వెన్నెలమ్మ
కలికి కన్నులు జూచి కలువచందమునెంచి
................కుముదసంతతిదాగె కొలను యందు
పసిడి కాంతుల మేను పచరించు అందాలు
................వేల్పుకన్నెలమించి వెలుగు జిలికె
నీలవేణికురుల నీలాల యందాన
................నీలిమబ్బులజూడ జాలి పుట్టె ౹౹

ఆట వెలది ॥
పూల పరిమళాలు పూబోడి వశమాయె
నదులు ఝరుల మించె నడుము సొగసు
విస్తు బోయె తాను వేలుపుగమికాడు
తన సృష్ఠి జూచె వింతగ సంతసముమీర ౹౹
ఆధిక్షేప ప్రేమ లీల- Pranjali Prabha.com
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ


చిరునవ్వుకు సరితూగే, మల్లెపువ్వు శాశ్వితమా
- మతి భ్రమకు సరితూగే, సంపెంగము శాశ్వితమా

గుండె కోతకు సరితూగే, జీవనము శాశ్వితమా
- మది చురుకు సరితూగే, ప్రణయము శాశ్వితమా

క్షణ సుఖంకు సరితూగే. సంసారము శాశ్వితమా
- నిత్య శోకంకు సరితూగే, కుటుంబము శాశ్వితమా

దాహం మధువు సరితూగే, అనుభందం శాశ్వితమా
- వయసు ప్రేమ సరితూగే, స్వర్గమైన శాశ్వితమా

మౌనం కుదుపు సరితూగే, సంద్రమైన శాశ్వితమా
- తల్లీ తండ్రికి సరితూగే, దైవమైన శాశ్వితమా
శీలం బాధకు సరితూగే, కొడుకైనా శాశ్వితమా
- ప్రేమ శృతికి సరితూగే, భర్త ఐనా శాశ్వితమా

చెలి ప్రేమకు సరితూగే, సుఖమైనా శాశ్వితమా
- గీత బోధకు సరితూగే, ఆచరణ శాశ్వి తమా
గాణ విద్యకు సరితూగే, సంగీతము శాశ్వి తమా
- విద్య భోదకు సరితూగే, సహాయము శాశ్వితమా

దాసదాసీ జనము, నౌకర్లు,
కొడుకు, బంధువు, వస్తువులు,
వాహనములు, ధనసమృద్ది ధాన్య సమృద్ది యను
శాశ్వితము కావు ఒక్క దైవ ప్రార్ధనే శాశ్వితం
ఇది వేణుగోపాల ప్రేమ సుమా

-((**))--











..8..18.. సుందరకాండ. పొన్నాడ లక్ష్మి 


సమీక్ష్య తం సంయతి చిత్రకార్ముకమ్, 
మహాబలం వాసవతుల్యవిక్రమమ్. 
సలక్ష్మణం కో విషహేత రాఘవం, 
హుతశనం దీప్తమివానిలేరితమ్. 
సలక్ష్మణం రాఘవమాజిమర్దనం, 
దిశాగణం మత్తమివ వ్యవస్థితమ్. 
సహేత కో వానరముఖ్య సంయుగే 
యుగాంతసూర్యప్రతిమం శరార్చిషమ్. 
స మే హరిశ్రేష్ట సలక్ష్మణం పతిం 
సయూథపం క్షిప్రమిహోపపాదయ, 
చిరాయ రామం ప్రతి శోకకర్శితామ్ 
కురుశ్అ మాం వానరముఖ్య హర్శితామ్. 

అద్భుతమైన ధనుస్సు ధరించిన, బలంలో పరాక్రమంలో దేవేంద్రునికి సాటియైన రాముడు, లక్ష్మణ సమేతుడై వాయువుతోడై ప్రజ్వలిస్తున్న అగ్నిలా యుధ్ధరంగంలో నిలబడితే, ఎవరైనా ఆయన ముందుకు రాగలరా? 
ఓ వానరోత్తమా! రణరంగంలో శత్రుసమూహాలను నుగ్గు నుగ్గు గావించే లక్ష్మణసహితుడైన రాముడు శరపరంపరలచే కిరణాలతో ప్రళయకాల సూర్యునిలా తేజరిల్లుతూ మదించిన దిగ్గజంలా నిలబడి ఉంటే ఆ మహావీరుని యుధ్ధరంగంలో ఏ యోధుడు ఎదుర్కొనగలడు? 
కాబట్టి ఓ వానరోత్తమా! వానరసేనాసమూహాలతో పాటు లక్ష్మణ సమేతుడైన రాముని వెంటనే ఇక్కడకు తీసుకువచ్చే యత్నానికి శ్రీకారం చుట్టు. రాముని ఎడబాటు శోకంతొ కృశించిపోయి ఉన్న నా దుఖం ఈ ఒక్కకార్యం వల్లనే ఉపశమిస్తుంది. 
శ్రీమద్వాల్మీకి రామాయణమున సుందరకాండలోని 37 వ సర్గ సమాప్తం.


నీతి శాస్త్రము - పండిత పరిష్కృతము
శ్లో === దాసీ భ్రుత్య స్పుతో బన్ధు ర్వస్తు వాహన మేవచ |
ధనధాన్య సమృద్ది శ్చా ప్యాష్ట భోగాః ప్రకీర్తితాః ||
భావము === దాసదాసీ జనము, నౌకర్లు, కొడుకు, బంధువు, వస్తువులు, వాహనములు, ధనసమృద్ది ధాన్య సమృద్ది యను నీ ఎనిమిదింటిని అష్ట భోగములందురు
తాత మనవుడి -చిన్న కధలు -4 
తాత నాకు ఏదైనా కధ చెప్పు అని అడిగాడు మనవడు సరే చెపుతా విను అని మొదలు పెట్టాడు " కొందరు చెపితే వినరు, గిల్లెతే ఏడుస్తారు" తను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళని వాదిస్తారు, మోసపోయిన గర్వంతో ఒట్రిస్తారు అని చెప్పటం మొదలు పెట్టాడు తాత కధను .      
అనగనగా ఒక ఊళ్ళో పశువుల వ్యాపారి ఒకడు ఉండేవాడు. అతని భార్య వెంగమ్మ నిజంగానే ఒట్టి వెర్రి వెంగళమ్మ. ఒక రోజున వ్యాపారి ప్రక్క ఊరి సంతకు ప్రయాణం అయ్యాడు. వెళ్తూ వెళ్తూ అతను భార్యతో చెప్పి వెళ్ళాడు- "నేను రెండు రోజుల వరకూ తిరిగి రాను వెంగమ్మా! అయితే రేపు మన దగ్గరున్న మూడు ఆవుల్నీ కొనేందుకు బేరగాళ్ళు వస్తారు. ఒక్కో ఆవూ వంద నాణాల లెక్కన, మూడు ఆవులనూ మూడు వందల నాణాలకి అమ్ము. సరేనా?! వాళ్ళు అంతకంటే తక్కువకి బేరం అడిగితే మటుకు ఏమాత్రం ఒప్పుకోకు. అర్థం అయిందా, నేను చెప్పేది?!” అని. “మీరేం కంగారు పడకండి, ప్రశాంతంగా వెళ్ళి రండి. అదంతా నేను చూసుకుంటాగా!" అంది వెంగమ్మ. 

“ఏంటోనే, నువ్వు ఎప్పుడూ అలాగే చెప్తావు; కానీ ఏదో రకంగా పిచ్చి పనులు చేసి మోసపోతావు! ఈ విషయంలో ఏమీ తప్పులు జరగకుండా ఉండాలనే ఇంత చెప్తున్నాను- మూడు వందలు ఇస్తేనే ఆవుల్ని ఇవ్వు. అర్థమైందా, ఏమి?! నేను చెప్పేది వింటున్నావా?!” అన్నాడు. 

“ఆఁ విన్నా, విన్నా!" అన్నదామె, తల ఊపుతూ. 

వ్యాపారి ప్రయాణమై వెళ్ళిపోయాడు. 

తర్వాతి రోజున అనుకున్నట్లుగానే బేరగాడు వచ్చాడు. ఆవులను చూసి, ఆమెతో బేరం మొదలు పెట్టాడు. మాట్లాడటం మొదలు పెట్టిన కొద్దిసేపటికే వెంగమ్మ ఎంత అమాయకురాలో గ్రహించేశాడు ఆ బేరగాడు. బేరం ఇంకా పూర్తి కూడా కాకనే, వాడు పశువుల పాక దగ్గరికి వెళ్ళి "సరే అక్కా! ఇంక ఆవులను నేను కొనుక్కున్నాను!" అంటూ ఆవులకు కట్టిన పలుపుతాళ్ళు విప్పి వాటిని బయటకి తోలటం మొదలు పెట్టాడు గడుసుగా. వెంగళమ్మ అమాయకురాలే అయినా, మరీ ఇంత గడుసుదనాన్ని గమనించకుండా ఉండలేకపోయింది. పోయి కొట్టం గడప దగ్గర నిలబడి "ఒక్క నాణెం తక్కువైనా ఆవులను ఇవ్వను- ముందు మొత్తం మూడు వందల నాణాలు ఇచ్చి, ఆ తర్వాతనే ఆవులను బయటకి తోలండి!" అంది మొండిగా. 

"ఇబ్బంది వచ్చి పడిందే-" అనుకున్నాడు బేరగాడు. అయినా మరో బాణం వేసి చూద్దామని, "అయ్యో అక్కా! నా దగ్గరుండగా నీ డబ్బు ఎక్కడికి పోతుంది? అయినా ఇవాళ్ళ డబ్బుల మూటను తీసుకురావడం మర్చిపోయానే, ఏం చేయను? -సరే, ఒక పని చేద్దాం! ఈ మూడు ఆవుల్లోనూ ఒక దాన్ని నీ దగ్గరే హామీగా వదిలి వెళతాను. ఇంటికి వెళ్ళి, మూడు వందల నాణాలు తెచ్చి ఇచ్చాక గానీ ఈ ఆవును విడిపించుకు పోను!" అన్నాడు, ఆ మూడు ఆవుల్లో‌నే ఒకదాన్ని గాటానికి తిరిగి కట్టేస్తూ. వెంగమ్మ ముఖం వెలిగింది. “ఆఁ అదీ మరి! ఏమీ హామీ లేకపోతే ఎలా?! అలా చెయ్యి. ఆ మూడో ఆవుని ఇక్కడే ఉంచి వెళ్ళు. డబ్బు నా చేతిలో పడ్డాకే, ఈ ఆవుని వదిలేది!" అంది గట్టిగా. 

బేరగాడి పంట పండింది. ఉత్సాహంతో మురిసిపోయి, అతి మర్యాద నటిస్తూ, తాను ఆసరికే కట్టేసిన ఆవును అక్కడే వదిలి, మిగిలిన రెండు ఆవులనీ తోలుకుని చక్కా పోయాడు వాడు. 

మూడో రోజున భర్త రాగానే తాను చేసిన ఘనకార్యాన్ని భర్తతో సంతోషంగా చెప్పింది వెంగమ్మ. వ్యాపారికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు- కోపం ముంచుకుని వచ్చింది. 

“ఛీ! ఛీ! నీ కంటే తెలివి తక్కువ మనిషి ఈ లోకంలో లేరు. వాడు మళ్ళీ‌ వస్తాడుటే, నీ వెర్రి గానీ?!" అని అరిచాడు ఆవేశంగా. “అబ్బో! తెలివి నీ ఒక్కడిదేగా?" అంది వెంగమ్మ వెటకారంగా. "నేను అందరి కంటే తెలివి తక్కువ దాన్నా?! ఆ సంగతి నీకెలా తెలుసు? అసలు ఈ లోకంలో ఎట్లాంటి వాళ్ళుంటారో తెలీనిది నీకే. వెళ్ళి ఓసారి దేశం అంతా తిరిగి, చూసిరా!” అంది ఈసడిస్తున్నట్లు. 
తర్వాత ఏమైంది తాత ఏముంది భార్యను ఏమి అనలేక ఊరిలోకి మోసగాడని పట్టి బందిఖానాలో  
పెట్టిచ్చాడు అంతే .....    అంతేనా .....  ఆ ..  ఆ   

--((**))--


"సుప్రియ .."........................డా .కృష్ణ సుబ్బారావు పొన్నాడ .

అరుదెంచెగ 'నెలరాజు'
వికసించెను 'కలువమ్ము'
పరికించెలె 'విరజాజి'
'పురినే'.. విరిసె 'మ.. యూరి '
'మనసే'.. మురిసెను జూడ
'పిలుపే'.. విను మనసార !

వినిపించన 'మది'.. నీకై
అనిపించులె 'యది'.. నీదై
'రగిలే' సెగలను 'గూడి'
'తగిలే' విరహపు 'వేడి'
'మనసే' తలచెను 'వేడి'
'తనువే' పిలిచెను 'జోడి'

అరుదెంచెగ 'నెలరాజు'
వికసించెను 'కలువమ్ము'
'మనసే' మురిసెను 'జూడ'
'పిలుపే' విను మనసార !

'వయసే' వలపుగ 'మారె'
'వలపే' సలపులు 'రేపె'
'మరుడే' మరులను 'దూసె'
'చెలుడే' సరసకు 'రాడె'

అరుదెంచెగ 'నెలరాజు'
వికసించెను 'కలువమ్ము'
'మనసే' మురిసెను 'జూడ'
'పిలుపే' విను మనసార !

" సుప్రియ "- నూతన ఛందము . డా కృష్ణ సుబ్బారావు పొన్నాడ .

గురువు గారు శ్రీ మోహన గారు , సరస్వతీ పుత్రి Suprabha Pavuluri గారు నేర్పినదీ నూతన ఛందము _/\_ _/\_
J K Mohana Rao
Admin · December 4, 2014 · Frederick, MD, United States
సుప్రియ వృత్తము ఎత్తుగీతి ప్రత్యేకత -

సుప్రభగారు సృష్టించిన సుప్రియ వృత్తము ఎత్తుగీతియొక్క 24 విధములలోని ఒక ప్రత్యేకత. క్రింద నా ఉదాహరణములు -

సుప్రియ - స/న/జ IIUI III UI
9 బృహతి 380
ఎత్తుగీతి - ఇం/సూ/సూ

@ సినీ సంగీత ఝరీ ... గుద్పెడు మనస్సు .

మౌనమే నీ భాష ఓ మూగ మనసా
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగమనసా ..

చీకటి గుహ నీవు చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో
ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో
ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో

మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా ...

కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు
ఊహల ఉయ్యాలవే మనసా మాయల దెయ్యానివే
లేనిది కోరేవు ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు

మౌనమే నీ భాష ఓ మూగ మనసా
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా...

చిత్రం : గుప్పెడు మనసు
గానం : మంగళంపల్లి బాల మురళి కృష్ణ
రచన : ఆత్రేయ
సంగీతం : ఎం ఎస్ విశ్వనాథన్
సినీ సంగీత ఝరీ ..." అపర్ణ గారి బాబాయ్ " శోభన్ బాబు గారు నటించఅన చిత్రం మిది ౹౹

చిత్రం : కన్నవారి కలలు (1974)
సంగీతం : వి.కుమార్
సాహిత్యం : రాజశ్రీ
గానం : రామకృష్ణ, పి.సుశీల

మధువొలకబోసే ఈ చిలిపి కళ్ళూ
అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ
మధువొలకబోసే ఈ చిలిపి కళ్ళూ
అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ

మధువొలకబోసే ఈ చిలిపి కళ్ళూ
అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ

అడగకనే ఇచ్చినచో అది మనసుకందమూ
అనుమతినే కోరకనే నిండేవు హృదయమూ
తలవకనే కలిగినచో అది ప్రేమబంధమూ
బహుమతిగా దోచితివీ నాలోని సర్వమూ
మనసు మనసుతో ఊసులాడనీ
మూగభాషలో బాస చేయనీ
ఈ నాటి హాయీ వెయ్యేళ్ళు సాగాలనీ

మధువొలకబోసే ఈ చిలిపి కళ్ళూ
అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ

గగమముతో కడలి చెలి తెలిపినది ఏమనీ
తలపులకూ వలపులకూ సరిహద్దు లేదనీ
కుసుమముతో ఆ భ్రమరం తెలిపినది ఏమనీ
జగమునకూ మన చెలిమీ ఆదర్శమౌననీ
కలలు తీరగా కలిసిపొమ్మనీ
కౌగిలింతలో కరిగిపొమ్మనీ
ఈ నాటి హాయీ వెయ్యేళ్ళు సాగాలనీ

మధువొలకబోసే హా ఈ చిలిపి కళ్ళూ హా..ఆ
అవి నాకు వేసే ఆఆ.ఆఅ.. బంగారు సంకెళ్ళూ
@ సినీ సంగీత ఝరీ ...చిరంజీవి జన్మదిన సందర్బంగా ...

చిత్రం: దొంగ మొగుడు (1987)

సంగీతం: చక్రవర్తి

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: బాలు, సుశీల
అభినయం :చిరంజీవి , మాధవి .

************

నల్ల౦చు తెల్లచీర

ఓ.ఓ. తల్లోన మల్లెమాలా

ఓ.ఓ.ఈడెక్కి కవ్వి౦చితే భామా.

వేడెక్కి నేరేగనా.

ముసిరే మిసమిసలే గుసగుసగా వలవిసిరే హొయ్



బుగ్గల్లో సిగ్గులూర ఒహొ... చూడొద్దు తేరిపారా

ఒహొకోరేవు మోమాటము రాజా... రేపేవు ఆరాటమూ

విరి తూపుల జడిలో పడి వసివాడేను సొగసే... హొయ్



సాగే వన్నెవాగే నన్ను... కమ్మేసి౦దిరో

ఊగే కన్నెలాగే నన్ను ...లాగేసి౦దిరో

మూగే మూగ సైగే నన్ను ...ముద్దాడి౦ద రో

ఊగే తీగలాగే మేను... అల్లాడి౦దిరో



గాజుల బాజాలతో ...జాజులు ఊరేగెనే

మోజుల రోజాలతో ...రోజులు ఎదురేగెనే

తనివే తీరని... తనిమే ఊరనీ

జతలో గతులే... జతులై...



బుగ్గల్లో సిగ్గులూర ఒహొ... చూడొద్దు తేరిపారా

ఒహొనల్ల౦చు తెల్లచీర ఓ.ఓ. తల్లోన మల్లెమాలా ఓ.



కాగే ఈడు కోరే వేడి ఉ౦దీ లోయలో

రేగే చల్లగాలే ము౦చుతు౦ది మాయలో

రాలే మ౦చుపూలే పె౦చె నాలో దాహము

జాలేలేని చలిలో ది౦చుతు౦ది మోహము



కౌగిలి చెరసాలలో ...ఈ చెలి చిక్కాలిలే

పెదవుల సరసాలలో... కోరిక కరగాలిలే

మరిగే మరులనే... నదులై పారనీవిరులే జడిసే ఒడిలో... ఏహ్.



నల్ల౦చు తెల్లచీర ఓ.ఓ. తల్లోన మల్లెమాలా

ఓ.ఓ.ఈడెక్కి కవ్వి౦చితే భామా. వేడెక్కి నేరేగనా

ముసిరే మిసమిసలే గుసగుసగా వలవిసిరే హొయ్.



బుగ్గల్లో సిగ్గులూర ఒహొ... చూడొద్దు తేరిపారా ఒహొ

కోరేవు మోమాటము రాజా... రేపేవు ఆరాటమూ

విరి తూపుల జడిలో పడి వసివాడేను సొగసే... హొయ్