Saturday, 3 April 2021

 Radhe Radhe...💞💝 Follow @krishnaholic__ @krishnaholic__ @krishnaholic__ 💞😘

టవెలది పద్యమును అనుసరించునట్లు కూడ వెణ్బాను వ్రాయ వీలగును. ఆ ప్రయత్నమే యిది. క్రింద నా ఉదాహరణములు - 

UI IIIUI - UIU UIU 
UI III - III IIIUI 
UI IIIUI - UIU UIU 
UI IIIUI U 

ప్రాంజలి ప్రభ ....కరోనాపై ..
వెణ్బాను పద్యాలు 
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

ప్రాంజలి ఘటియించి చెపుతున్నాను ఈ 
మార్పుకు సహనము కరుణ మనస్సు 
ఏకమవుట వల్ల నిర్మలమ్మే వేదవా
క్కే మనుగడ మార్గమే 

కాలము నిను వంచి శోధనా వేదనా 
చేసి మనసు మమత మగువ సొంత 
మంత కలలుగాను లోకమంతా ఎదో 
తీపి వలయ మైనదే 

ఏమని తెలిపేది దేశ ఆరోగ్య మం
తా నలిగియు వెతలు కలిగియే మ 
నో మయమును చెప్ప వీలులేకే సహా 
యమ్ము అటక ఎక్కియే  

దారుణములు జర్గు చుండెనే ఏది మం 
చో చెడుయో తెలుసు కొనక ఉండు
టే సమయమంత కర్జి పోతున్నదే   
యీ మనసుకు భాదయే 

మారు పలుకు లేక చేయ వల్సిందె చే
సే విషయపు మలుపు తెలుపు లోగ    
అంత జరిగిపోయి సాధనంతా సహా
యమ్ము కరుణ లేకయే  

UI IIIUI - UIU UIU 
UI III - III IIIUI 
UI IIIUI - UIU UIU 
UI IIIUI U 
Krishna and Meera bai (via Pinterest: M Ramalakshmi)
ప్రాంజలి ప్రభ ....ప్రేమ పై ..
వెణ్బాను పద్యాలు 
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

ప్రేమ కలసి పోవు నంతలో ఆశచే
రే, మనిషికి మనుగడకు మమతాను 
రాగమునకు కాలమాయ విశ్వాసభా
వమ్ము జొరబడే కదా     

కృష్ణ కళలు చూసి మోహనా మూర్తులై 
నా, మహిళలు హృదయము కలిపేందు 
కే, మనసును పంచి దేహమే పంచుటే  
ప్రేమ సుఖము పొందుటే 

మాట విలువ తెల్పి సూక్తులన్నీ, మనో 
పల్కులను వివరణ తెలిపి, వేద  
భావములు సమాన  తీర్పుగా, నమ్మియే 
ప్రేమ కలల పంటయే   

వెన్న మనసులోనఁ - బ్రేమయే వెన్నయా 
కన్నె మనసు - కలల కవనమయ్యె 
వన్నె లలరినట్లు - వాంఛలే పూచెఁగా 
నన్ను కనవదేల నీవు 

నేఁడు హృదయమందు - నీనృత్య మెల్లెడ 
నాడు మిపుడు - హరుస మలలవంగ 
పాడు వలపుగీతి - పల్లవిన్ వల్లకిన్ 
కూడ రజనివేళలో 

సందె వెలుఁగులోనఁ - జల్లఁగా మెల్లఁగా 
మంద పవన - మందు మనసునిండ 
కుంద కుసుమరాశి - కోమల గంధమే 
ముందు మొగముతమ్మి జూపు 

వేణు రవములందు - వెన్నుఁడే పల్కునా 
మౌన హృదయ - మలల మయమొనర్చ 
గాన లహరిలోన - గాయమ్ము లారునా 
ప్రాణ మొసఁగువాఁడు వాఁడు 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

Lord Sri Krishna the Supreme God in Vedic culture. Also, His other names are Govinda, Madhava, Gopala, Shyamasundara, Damodara, Shyama and many others names. Krishna is the original form of God. It...

ప్రాంజలి ప్రభ ....ప్రేమ పై ..(2)
వెణ్బాను పద్యాలు 
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

అమ్మ కరుణచే మనస్సు ఉల్లాసమే  
వాక్కు పరిణతి కలిగి శుభ సూచి
కా వినయ వినోద మార్గమే నిత్య స 
త్యాల పలుకు సంతృప్తి  

రాగమయము కాదు . రంగరించేది కా 
దే హరిఘన పద లయకర మేలు 
చూపుల కథలేలు  పాపపుణ్యమ్ము యే 
లే దినదిన వేల్పులే 

ఈ మనసు భయాన్ని తీర్చలేకుండగా  
కాలమహిమ గమనము కలగా మ 
నోమయము చేరి సాహసమ్ము యే 
ప్రేమ చిలుకు భావమే  

ఎంతవరకు చేయ అంతమాత్రమ్ముయే 
చేసె పనిలొ భయము నిజము కల్సి 
ఉండు తరుణమంత ఓర్పు ఓదార్పు తో  
వుంటె సుఖము సంతృప్తి 

--(())--

ప్రాంజలి ప్రభ ....ప్రేమ పై ..(4)
వెణ్బాను పద్యాలు 
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

కాల మహిమ వల్ల - కాలమంతా నవ 
జ్వాల మయము తరుణ - మనసు వికలమయ్యె 
బేల నటన మార్పు లొచ్చియే జీవితం 
చల్లగ మది మార్పులే 

దైవ మహిమ వల్ల - దేశమంతా ప్రేమ 
సేవ మయము - సహన కలిగి గొప్ప 
మోవి వరుసలాయె - ఏమి చెప్పాలి దీ 
పా వెలుగులు  పంచెనే 

దేహ కమలమందు - నీడలన్నీ ఒకే 
మోహము కలిగియు సమరముచేయు 
జిహ్వ  మయము జెంది - కాలమంతా ఒకే 
స్వాహ అగుట జీవితం 

పారు నదులవల్ల - జీవరాశి స్వబు
ద్దెరిగియు కలిసికొను మదిలోన 
వేరు వలన పెర్గు జీవమే నిత్య మా 
ర్పుఋణములు తీర్చునే 

        

03042021శనివారం

 

ఓం శ్రీ రాం   శ్రీ మాత్రేనమ: శ్రీ కృష్ణయాణమ:
ప్రాంజలి ప్రభ - ఆధ్యాత్మిక  ప్రభ 
Ngắm nhìn những trái tim tình yêu đập rộn ràng, lung linh tỏa sáng với tải hình nền tình yêu lấp lánh tuyệt đẹp nào!
సర్వేజనా సుఖినోభవంతు






సుభాషితాలు !


గుణ దోషౌ బుధో గృణ్హన్ ఇందు క్ష్వేడా వివేశ్వరః 
శిరసా శ్లాఘ్య తే పూర్వం పరం కంఠే నియచ్ఛతి!

శివుడు గరళమును కంఠము నందుంచు కొని,  చంద్రకళను శిరమున ధరించినట్లుగా పండితుడైనవాడు పరుల దోషములను లోపలే వుంచుకొని, గుణలేశములను శిరసావహిస్తాడు. 

సతాం ధనమ్ సాధుభి రేవ భుజ్యతే 
దురాత్మభి రుదుశ్చరితా త్మనామ్ ధనం
శుకాదయ శ్చూత ఫలాని భుజంతే 
భవంతి నింబా: ఖలు కాకభోజనాః

మంచివారి సంపదలు మంచివారికే అనుభవానికి వస్తాయి. దురాత్ముల దానములు దుష్టచరిత్రులకే వినియోగ పడతాయి. మామిడిపండ్లను చిలుకలు ఆరగిస్తాయి. వేపపండ్లు కాకులకే భుక్తం అవుతాయి.
ఇది లోకములో జరుగుతూనే వున్నది.కదా!

మనసులో సద్గుణాలను బాగా వృద్ధి చేయండి, నేల దున్ని కలుపు తీయండి బుద్ధిని మధించి పాపాలనే కలుపు మొక్కల్ని తరిమి వేయండి. 
భుక్తి కై అన్ని విధాలా కృషి చేయండి ముక్తి కై సర్వ విధాల పాటు పడండి.

తన రహస్యము నోకనితో చెప్పి మరల నితరులకు చెప్ప వలదని హెచ్చరించు కంటే చెప్పక యుండుట కరము మేలు నాల్క దాటిన మాటలు నగరు దాటు మామూలుగా లోకం లో చాలా మంది రహస్యమని 
ఒకరితో చెప్పి ఇంకెవరికీ చెప్ప వద్దని చెప్తూ వుంటారు.

మన తెలుగులో ఒక సామెత వుంది
"పెదవి దాటితే పృథ్వి దాటుతుంది" అని  అందుకని చెప్పకుండా ఉండడమే మేలు కదా!
--((***))--

శ్రీ ఆదిశంకరుల విరచిత కాశీ విశ్వనాథాష్టకం
🕉ఓం శ్రీమాత్రే నమః 🕉

అద్వైత చైతన్య జాగృతి
గంగా తరంగ రమణీయ జటా కలాపం
గౌరీ నిరంతర విభూషిత వామ భాగం 
నారాయణ ప్రియమనంగ మదాపహారం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 1 ||

వాచామగోచరమనేక గుణ స్వరూపం
వాగీశ విష్ణు సుర సేవిత పాద పద్మం
వామేణ విగ్రహ వరేన కలత్రవంతం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 2 ||

భూతాదిపం భుజగ భూషణ భూషితాంగం
వ్యాఘ్రాంజినాం బరధరం, జటిలం, త్రినేత్రం
పాశాంకుశాభయ వరప్రద శూలపాణిం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 3 ||

సీతాంశు శోభిత కిరీట విరాజమానం
బాలేక్షణాతల విశోషిత పంచబాణం
నాగాధిపా రచిత బాసుర కర్ణ పూరం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 4 ||

పంచాననం దురిత మత్త మతంగజానాం 
నాగాంతకం ధనుజ పుంగవ పన్నాగానాం
దావానలం మరణ శోక జరాటవీనాం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 5 ||

తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం
ఆనంద కందమపరాజిత మప్రమేయం
నాగాత్మకం సకల నిష్కళమాత్మ రూపం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 6 ||

ఆశాం విహాయ పరిహృత్య పరశ్య నిందాం
పాపే రథిం చ సునివార్య మనస్సమాధౌ
ఆధాయ హృత్-కమల మధ్య గతం పరేశం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 7 ||

రాగాధి దోష రహితం స్వజనానురాగం
వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం
మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 8 ||

వారాణసీ పుర పతే స్థవనం శివస్య
వ్యాఖ్యాతమ్ అష్టకమిదం పఠతే మనుష్య
విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం
సంప్రాప్య దేవ నిలయే లభతే చ మోక్షమ్ ||

విశ్వనాధాష్టకమిదం పుణ్యం యః పఠేః శివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేనసహ మోదతే ||

--((**))--

కాశీవిశ్వనాథాష్టకం -తాత్పర్యం
*******************
గంగాధరుడు 
************
గంగా తరంగ రమణీయ జటా కలాపం,
గౌరీ నిరంతర విభూషిత వామ భాగం
నారాయణ ప్రియ మనంగ మదాపహారం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం

తాత్పర్యం:
************
గంగా నదీ అలలను తన జటాఝూటంలో అందంగా కలిగిన, తన ఎడమ వైపు పార్వతీ దేవి ఎల్లప్పుడూ శోభించే, శ్రీహరికి ప్రియుడైన, మన్మథుని గర్వము అణచిన, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.

వామే శక్తి ధరం వందే వకారాయ నమో నమః
వాచామగోచరమనేక గుణ స్వరూపం
వాగీశ విష్ణు సుర సేవిత పాద పీఠం
వామేన విగ్రహ వరేణ కళత్రవంతం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం

తాత్పర్యం: 
************
పదములకు, వర్ణనకు అందని అనేక గుణాలు కలిగిన స్వరూపంతో ఉన్న, బ్రహ్మ విష్ణు మరియు ఇతర దేవతలచే సేవించబడిన పాదములు కలిగిన, తన ఎడమ వైపు శుభములు కలిగించే పార్వతిని కలిగి ఉన్న, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.

పులిచర్మము ధరించిన శశిధరుడు
భూతాధిపం భుజగ భూషణ భూషితాంగం
వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం
పాశాంకుశాభయ వర ప్రద శూల పాణిం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం

తాత్పర్యం: 
************
సమస్త భూతములకు అధిపతియైన, సర్పములను ఆభరణంగా కలిగిన, పులిచర్మం వస్త్రంగా ధరించిన, జడలు కట్టిన కేశములు కలిగిన, పాశము (తాడు), అంకుశము, త్రిశూలము ధరించిన, అభయము, వరాలను ప్రసాదించే, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.
నెలవంక సిగపూవు నవ్వగా

శీతాంశు శోభిత కిరీట విరాజమానం
ఫాలేక్షణానల విశోషిత పంచ బాణం
నాగాధిపారచిత భాసుర కర్మ పూరం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం

తాత్పర్యం: 
************
చల్లదనాన్ని ఇచ్చే చంద్రుని కిరీటముగా కలిగి భాసిల్లుతున్న, తన ఉగ్రనేత్రముతో మన్మథుని దగ్ధము చేసిన, నాగేంద్రుని కర్ణములకు అలంకారముగా ధరించిన, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.

రౌద్రమున, ఆనందమున తాండవము
పంచాననం దురిత మత్త మతంగజానాం
నాగాంతకం దనుజ పుంగవ పన్నగానాం
దావానలం మరణ శోక జరాటవీనాం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం

తాత్పర్యం: 
************
మదించిన ఏనుగులపాలిటి సింహంలా ఉన్న, అసురులపాలిటి గరుత్మంతుని వలె ఉన్న, మరణాన్ని, శోకాన్ని, వృద్ధాప్యాన్ని నాశనం చేసే అగ్నిలా ఉన్న, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.

నిరంజనుడు, నిర్గుణుడు

తేజోమయం సుగుణ నిర్గుణమద్వితీయం
ఆనందకందమపరాజితమప్రమేయం
నాగాత్మకం సకల నిష్కలమాత్మ రూపం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం

తాత్పర్యం: 
************
తేజస్సు కలిగి, సుగుణములు కలిగి, గుణములు లేని, వేరే సాటిలేని, ఆనందకారకుడైన, ఓటమి ఎరుగని, తర్కానికి అందని, సర్పములకు ఆత్మయై, అన్ని శుద్ధ స్వరూపములు తానేయై, ఆత్మ స్వరూపుడైన, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.

సచ్చిదానందుడు

ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందా
పాపే రతిం చ సునివార్య మనః సమాధౌ
ఆదాయ హృత్ కమల మధ్య గతం పరేశం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం

తాత్పర్యం: 
************

ఏ కోరికలూ లేనివాడైన, దోషములు ఎంచని, నింద చేయని, పాపములకు దూరముగా ఉండి సమాధి స్థితిలో ఉన్న హృదయకమలము మధ్యలో నివసించి ఉన్న, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.

గరళ కంఠుడు

రాగాది దోష రహితం స్వజనానురాగం,
వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహయం,
మాధుర్య ధైర్య శుభగం గరళాభిరామం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం

తాత్పర్యం: 
**************
రాగద్వేషాది దోషములు ఎరుగని, తన భక్తులను ప్రేమతో చూసే, వైరాగ్యము, శాంతికి నిలయమై, హిమవంతుని పుత్రిక సహాయం పొందుతూ, మాధుర్యము, ధైర్యము కలిగి విషాన్ని ధరించిన, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము

ఫలశ్రుతి:
***********
వారాణసీ పురపతే స్తవనం శివస్య
వ్యాఖ్యాతమష్టకమిదం పఠతే మనుష్యః
విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంతకీర్తిం
సంప్రాప్య దేహ విలయే లభతే చ మోక్షం

తాత్పర్యం:
************
వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని అష్టకాన్ని పఠనం చేసే మనుష్యులకు దేహమున్నప్పుడు విద్య, మంచి, ఎనలేని సుఖము, అనంతమైన కీర్తి, అటు తర్వాత మోక్షము లభించును.

విశ్వనాథాష్టకమిదం యః పఠేచ్ఛివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే

తాత్పర్యం:
************
ఈ విశ్వనాథ అష్టకం శివుని సన్నిధిలో చదివిన వారికి శివలోకము, ఆ పరమశివుని ఆశీస్సులు పొందుదురు.
అంతర్యామి - అంతయును నీవే

--((**))--

🕉 *లింగాష్టకం యొక్క అర్థం*🕉

 *బ్రహ్మమురారిసురార్చిత లింగం* 

బ్రహ్మ ,విష్ణు , దేవతల చేత పూజింపబడ్డ లింగం..!!

 *నిర్మల భాషిత శోభిత లింగం* 

నిర్మలమైన మాటల చేత అలంకరింపబడ్డ లింగం..!!

 *జన్మజ దుఃఖ వినాశక లింగం* 

జన్మ వల్ల పుట్టిన బాధలను నాశనం చేసే లింగం..!!

 *తత్ ప్రణమామి సదాశివ లింగం* 

ఓ సదా శివ లింగం నీకు నమస్కారం..!!

 *దేవముని ప్రవరార్చిత లింగం* 

దేవమునులు మహా ఋషులు పూజింప లింగం..!!

 *కామదహన కరుణాకర లింగం* 

మన్మధుడిని దహనం చేసిన , అపారమైన కరుణను చూపే చేతులు గల శివలింగం..!!

 *రావణ దర్ప వినాశక లింగం* 

రావణుడి గర్వాన్ని నాశనం చేసినట్టి శివ లింగం..!!

 *తత్ ప్రణమామి సదా శివ లింగం* 

నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!

 *సర్వ సుగంధ సులేపిత లింగం* 

అన్ని మంచి గంధాలు , మంచి గా పూసిన శివ లింగం..!!

 *బుద్ధి వివర్ధన కారణ లింగం* 

మనుషుల బుద్ధి వికాసానికి కారణ మైన శివ లింగం ..!!

 *సిద్ధ సురాసుర వందిత లింగం* 

సిద్ధులు , దేవతలు , రాక్షసుల చేత కీర్తింపబడ్డ శివ లింగం..!!

 *తత్ ప్రణమామి సదా శివ లింగం* 

నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!

 *కనక మహామణి భూషిత లింగం* 

బంగారు , మహా మణుల చేత అలంకరింప బడ్డ శివ లింగం..!!

 *ఫణిపతి వేష్టిత శోభిత లింగం* 

నాగరాజు నివాసం చేత అలంకరింపబడ్డ శివ లింగం..!!

 *దక్ష సుయజ్ఞ వినాశక లింగం* 

దక్షుడు చేసిన మంచి యజ్ఞాన్ని నాశనం చేసిన శివ లింగం..!!

 *తత్ ప్రణమామి సదా శివ లింగం* 

నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!

 *కుంకుమ చందన లేపిత లింగం* 

కుంకుమ , గంధము పూయబడ్డ శివ లింగం..!!

 *పంకజ హార సుశోభిత లింగం* 

కలువల దండ చేత చక్కగా అలంకరింప బడ్డ శివ లింగం..!!

 *సంచిత పాప వినాశక లింగం* 

సంక్రమించిన పాపాలని నాశనం చేసే శివ లింగం..!!

 *తత్ ప్రణమామి సదా శివ లింగం* 

నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!

 *దేవగణార్చిత సేవిత లింగం* 

దేవ గణాల చేత పూజింప బడ్డ , సేవించ బడ్డ శివ లింగం..!!

 *భావై ర్భక్తీ భిరేవచ లింగం* 

చక్కటి భావం తో కూడిన భక్తీ చేత పూజింప బడ్డ శివ లింగం..!!

 *దినకర కోటి ప్రభాకర లింగం* 

కోటి సూర్యుల కాంతితో వెలిగే మరో సూర్య బింబం లాంటి శివ లింగం..!!

 *తత్ ప్రణమామి సదా శివ లింగం* 

నీకు ఇవే నా నమస్కారాలు, ఓ సదా శివ లింగమా ..!!

 *అష్ట దలోపరి వేష్టిత లింగం* 

ఎనిమిది రకాల ఆకుల మీద నివాసముండే శివ లింగం..!!

 *సర్వ సముద్భవ కారణ లింగం* 

అన్నీ సమానంగా జన్మించడానికి కారణమైన శివ లింగం..!!

 *అష్ట దరిద్ర వినాశక లింగం* 

ఎనిమిది రకాల దరిద్రాలను (అష్ట దరిద్రాలు) నాశనం చేసే శివ లింగం..!!

 *తత్ ప్రణమామి సదా శివ లింగం* 

నీకు ఇవే నా నమస్కారాలు, ఓ సదా శివ లింగమా ..!!

 *సురగురు సురవర పూజిత లింగం* 

దేవ గురువు (బృహస్పతి), దేవతల చేత పూజింప బడ్డ శివ లింగం..!!

 *సురవన పుష్ప సదార్చిత లింగం* 

దేవతల తోటల్లో పూచే పువ్వులు (పారిజాతాలు) చేత ఎప్పుడూ పూజింప బడే శివ లింగం..!!

 *పరమపదం పరమాత్మక లింగం* 

ఓ శివ లింగమా, నీ సన్నిధి ఏ ఒక స్వర్గము

 *తత్ ప్రణమామి సదా శివ లింగం* 

నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!

 *లింగాష్టక మిదం పుణ్యం యః పట్టేత్ శివ సన్నిధౌ* 

ఎప్పుడైతే శివుడి సన్నిధిలో చదవబడుతుందో , వారికి చాలా పుణ్యం వస్తుంది..!!

*శివ లోక మవాప్నోతి శివేన సహమోదతే* 

శివ లోకం లభిస్తుంది ..!!
శివుడి లో ఐక్యమయ్యే మార్గం దొరుకుతుంది. 

⚜సర్వేజనా సుఖినో భవంతు..⚜
--((***))--

🕉🌞🌎🌙🌟🚩

*_Swami Vivekananda's Wisdom for Daily Inspiration - Apr 3._*

*_స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - ఏప్రిల్ 3._*

*We are what our thoughts have made us; so take care of what you think.*

*మనం చేసే ప్రతి ఆలోచన మన శరీరాలు అనే ఇనుప ముద్దలపై పడే చిన్న సుత్తి దెబ్బల లాంటిది. దాని నుండి మనం ఏమి కావాలని అనుకుంటున్నామో అలా రూపొందుతాం. మన ఆలోచనలు ఎలా తయారు చేస్తే అలా అయ్యాం మనం. అందువల్ల మీరేం ఆలోచిస్తున్నారు అనే దాని పట్ల జాగ్రత్త వహించండి.*

🕉🌞🌎🌙🌟🚩
Image may contain: 1 person, smiling

సమ్మోహనాల ప్రక్రియ "సుందరకాండ" 

రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

ఈశ్వరునికే తెలియపరుస్తూ సుందరాకాండ రామాయణము ఇది  

ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు (01.... 10)

 

 ఆకాశ మార్గాన

మార్గాన తరుణాన

తరుణాన హనుమ లంకకు కదిలె ఈశ్వరా


సీతా న్వేషణ కే

అన్వేషణ కొరకే 

కొరకే వానరుల ప్రోత్సాహం చేసేను


సీతయోక్క జాడకు

జాడ తెలిసి కొనుటకు

తెలిసికొను ఉద్దేశ్యంతో కదిలె హనుమంతు


సముద్ర లంఘణమే

లంఘణ దుష్కరమే

దుష్కరమే అయిన సాగె హనుమ ఈశ్వరా


తలను మెడను పెంచి

పెంచీ  ప్రకాశించి

ప్రకాశించి ఆబోతువలె హనుమ ఈశ్వరా


పచ్చిక బీళ్ళయందు

బీళ్ళ కదిలే ముందు

కదిలే ధైర్యశాలి హనుమంతు ఈశ్వరా


వక్షస్థలము చేత

చేత తరువుల చెంత

చెంత సింహము విజ్రుంభన వలె హనుమంతు


సహజధాతువులతో

ధాతువులందమతో

అందము కిన్నర గంధర్వ లే ఈశ్వరా


మహేంద్ర పర్వతము

పర్వతము ప్రాంతము

ప్రాంతమే అద్భుతము

అద్భుతమేన గజము

గజము వలె ప్రకాశించెను హనుమంతు


హనుమాన్ సూర్యునకే

సూర్యునకె, ఇంద్రకే

ఇంద్ర వాయువు కు నమస్కరించే ఈశ్వరా

--(())--

నేటి హాస్యం 

భర్త : పక్కింటావిడ ఎలా 

         చనిపోయింది?

భార్య : పప్పుల రేట్లు పెరగడంతో...

భర్త : కామెడీ చేయకు..

        పప్పుల రేట్ల పెరిగితే  

       ఎవరైనాచనిపోతారా?

భార్య: నిఝమండీ.

          నా కళ్ళతో ఆవిడ  Death 

          Certificate చూశాను.

భర్త: ఏమని రాశారు?

భార్య: 'DEATH DUE TO HIGH  

           PULSE RATE'

భర్త కోమాలోకి....

నాతో నా శ్రీమతి... ప్రాంజలి ప్రభలు.. (13)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

శ్రీమతి గారు ఈరోజు భగవద్గీత గురించి కధగా చెప్పవా. నీ నోటి నుండి వింటే అసలు విన్నట్టే ఉండదు 

అంటే బాగుండదా 

కాదే నీ మాటలు మనసుకు హత్తు కుంటాయి 

అందుకే చెప్పఁమంటున్నాను. 

పరమగురువులు బోధించినది, సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించినది నేను చెప్పటం ఏమిటి మీమాటలు నాకు నవ్వు తెప్పిస్తున్నాయి. 

అదికాదే ఏపుట్టలో ఏపాముందో తెలియదు అట్లాగే మంచిని ఎంతమందైన చెప్పవచ్చు దానికి కొలమానం లేదు వారుచెప్పఁరాని భావన వద్దు , నీకు తెలిసినది చెప్పు చాలు. ఎవ్వరికీ పూర్తిగా భగవద్ గీత అర్ధం చేసుకొనే శక్తి లేదు కేవలం యోగీశ్వరులకుతప్ప. 

అందుకే భగవద్గీత గూర్చిన సంభాషణము అత్యంత బాధ్యతా యుతమైనది. వారిని గూర్చి ఎంత తక్కువ సంభాషించిన అంత మేలు. కారణమేమనగా  వారిని గూర్చిన అవగాహన కలవారు వాణ్నియమము కలవారగుటచే మాట్లాడరు. వారిని గూర్చి తెలియని వారు గాలి కబుర్లుగ నియమముల నుల్లంఘించి మాట్లాడ కూడదు.  

నేను ఆ భగవంతుని ప్రార్ధించి చెప్పటానికి ప్రయత్నిస్తాను.  ఆయన త్వరగానే అర్థం అవుతుందని ఆశిస్తాను. ఆపరమాత్ముడు  నన్ను ఆజ్ఞాపించినది నేను చెప్పగలను. ‘‘ఈ పని చెయ్యాలి. నీకు నచ్చితే చెయ్యి. లేకపోతే, నీ ఇష్టం’’ అనేవారు నాతో. ఉన్నా ,అన్నా , ‘‘అసలైన ప్రేమ ఇలా ఉండాలి’’ అనేది భగవద్ గీత భావము అదే మీకు తెలియపరుస్తాను .

         భగవద్గీతలో గ్రుడ్డివారైన,  వయసు మీదపడిన వారైన "దృతరాష్టుడు కౌరవుల రాజు"  వారికి  కన్నప్రేమ ఎప్పటికీ తగ్గదు,  మనవారు పరాయివారు మధ్య సంఘటనలు తెలుసుకోవాలని ఆరాటం తగ్గదు. అందుకే నేను చెప్పేది వారికి వయసు  మీద పడినవారు కన్నవారిని ఎటు వంటివారైనా వదులుకోలేరు వారిని ఎదిరించి మాట్లాడలేరు. పిల్లలు కూడా గమనించాలి పెద్దల్ని బాధ పెట్ట కూడదు పెట్టిన వారు మాట్లాడలేరు ఎందుకనగా ప్రేమ.      

     

           అందరికన్నా ముఖ్యం "గురువు" ఆ గురువుని ప్రార్ధించి ఏ పని అయినా చెయ్యాలని భవగవద్ గీత బోధిస్తున్నది. గురువుని మించిన శిష్యులనుతయారుచెయ్యాలని గురువుకి ఆశగా ఉంటుంది అందుకనే తనలో ఉన్న  విద్యనంతా అనాడు గురుకులములో నేర్పేవారు తరువాత  "ప్రకృతి విద్య , సంసార విద్య, ప్రపంచ విద్య నేర్చుకోమని బయటకు పంపేవారు. 

శ్రీమతిగారు ఈ నాడు అటువంటి గురువులు లేరా. గురువులు ఉన్న నేర్చుకొనే ఓర్పు నేర్పు ఉన్నవారు లేరు ఆనాడు సంస్కృతం ఒక్కటే వుంది అదే క్షుణ్ణంగా నేర్చుకుంటున్నారు ఇప్పుడు ఆంగ్లం వచ్చి మనుష్యులను పాడుచేస్తున్నది అర్ధం కానీ బాష భోధిస్తున్నారు అదేతేడా నేనొక్కటే చెప్పగలను అప్పుడు బతికి బతికించే విద్య, ఇప్పుడు బతుకుటకు కొనుక్కునే విద్య. 

ఇక వర్ణించను భగవద్ గీత గురించి ఆలోచిద్దాం ....

అట్లాగే కాస్త కాఫీ త్రాగక మళ్ళా చెపుదానివిలే అన్నాడు శ్రీవారు      


                                                                                        ఇంకా ఉంది 


సమ్మౌహనాలు..గుడ్ ఫ్రైడే

వినుచున్న నీలీల

నీలీల బతుకు కల

కలలు తీర్చి శాంతిని పంచేటి దైవమే

రక్తమ్ము చిందించి

చిందించి శాసించి

శాసించి మేడ్వ వలదనే ‌పలికె దైవమే

ఖ్యాతి గాదే నీతి

నీతి సూక్తులే మతి

మతి ననుసరించి జీవించమనె దైవమే

పలుకంగ నీస్తోత్ర

స్తోత్రము బతుకు సూత్ర

సూత్రమే ప్రేమ పూరితమైన దైవమే

పాఠముల్ పుణ్యమౌ

పుణ్యమౌ గ్రంధమౌ

గ్రంధమే ప్రవక్త పాఠముగా దైవమే

కనుచున్న నీరూపు

నీరూపు మా పిలుపు

పిలుపు తోను మమ్ము రక్షించే దైవమే

మోడు వారకు జీవి

జీవి తెలుపు కధలవి

కధలు అనుభవాలు జ్ఞాపకాల దైవమే

కరుణకే చిహ్నమై

చిహ్నము ప్రేమమై

ప్రేమతో బతుకులను నెర్పేది దైవమే

--(())--



మంచి పలకరింపు చాలు

మనిషి గుర్తించటానికి

ఎడారిలొ నీరు చాలు

నరకం తప్పించటానికి


ప్రాంజలి ప్రభ సనాతన ధర్మములో గల తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు.....

1) ముక్కులు కుట్టిన్చుకున్నచో దృష్టి దోషము కలగదని నమ్మకము.

2) చెవులు కుట్టించుకున్న హృదయ సంబంద రోగములు రావు.

3) ఎడమ హస్తము పరమాత్మ అనియు, కుడి హస్తము జీవాత్మ అనియు ఈ రెండు ఏకము కావలెనను ఉద్దేశముతో రెండు చేతులు కలిపి నమస్కరించుచున్నాము.

4) తడి పాదములతో బోజనము చేసిన ఆయుర్వుద్ధి.

5) తడి పాదములతో శయనించిన ఆయుక్షీణం.

6) స్త్రీలకు బేసి సంఖ్యా గల అక్షరములతో, పురుషులకు సరి సంఖ్యా గల అక్షారములతో పేర్లు పెట్టుట మంచిది.

7) సూర్య గ్రహణానికి ముందు ''12 '' గంటల కాలము, చంద్ర గ్రహణానికి ''9'' గంటల ముందు కాలము కడుపు ఖాళీగా ఉంచుకోవలెను.

8) శిశువు పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడ ఉంటె ఆ స్థానం వారి జన్మ రాశి . బంగారం కుజునికి , వెండి గురువునకు , రాగి రవికి ,ఇత్తడి భుదునకు, ఇనుము శని కి ఇష్టము.

9) రుద్రాక్ష ఎంత పెద్దదైతే అంత మంచిది, సాలగ్రామం ఎంత చిన్నదైతే అంత మంచిది.

10) బుదవారం నాడు బూడిద గుమ్మడి కాయను, గురువారం నాడు కొబ్బరి కాయను ఇంటి ముందు వ్రేలాడ కట్టుకుంటే నరఘోశాలు తొలుగుతాయి.

11) యాత్ర సమయములందు మార్గ మధ్యమున పరుండునపుడు పాదరక్షలను తలక్రింద పెట్టుకుని పరున్నచో మృత్యుభయం తొలగి సులభ మార్గమధ్య మేర్పడును.

12) ఎవరికైనా వస్త్రములను ఇవ్వదలచినపుడు(వస్త్ర యుగ్మం) రెండు వస్త్రాలను ఇవ్వవలెను.

13) తాంబూలం ఇచ్చేటపుడు తమలపాకు మరియు అరటిపండు తొడిమలను ఇచ్చేవారి వైపు, కొసలు తాంబూలం పుచ్చుకునే వారివైపు ఉండాలి.

14) ఇరువురు వ్యక్తులు ఎదురెదురుగా కుర్చునప్పుడు దక్షిణ ముఖం అను ఆక్షేపణ రాదు. అలాగే హోమం చేయునపుడు -రుద్రునకు అభిషేకం చేయునపుడు నాలుగు వైపులందు నలుగురు కుర్చుండిన దిశల ఆక్షేపణలు ఉండవు.

15) ఇద్దరు ఆడపిల్లలకు ఒకేమారు వివాహం చేయవచ్చును, కాని ఇద్దరు మగపిల్లలకు ఒకేసారి వివాహం చేయకూడదు. కనీసం ఆరు మాసాలు తేడా ఉండాలి. లేదా సంవత్సర భేదం జరగాలి.

16) గృహ ప్రవేశ సమయములందు మంచి గుమ్మడికాయను పగలకోట్టుచుండురు. అది కేవలం పురుషులు మాత్రమే చేయవలెను. ఎట్టి పరిస్థితిలోను స్త్రీలు చేయరాదు.

17) వినాయకునికి తులసి దలంతోను- శివునకు మొగలిపువ్వుతోను- దుర్గ ను గరిక తోను పూజించరాదు.

18) తులసి దళమును-బిల్వ దళమును ఒకసారి పూజ చేసిన తర్వాత కడిగి మరల మరొకసారి పూజించవచ్చును.

19) బోజనం చేసిన తర్వాత ఎడమ వైపు తిరిగి పడుకొని, కుడివైపు తిరిగి లేవవలెను.

20) కొబ్బరి- మామిడి-అరటి-పనస ఉదయం పూట తినరాదు.

21) వేరుశనగ పప్పు-అరటిపండు తిన్న పిదప నీరు త్రాగ రాదు.

--(())--

Thursday, 1 April 2021

02042021 శుక్రవారము




*శ్రీ కృష్ణ శరణాష్టకం*

ఓం శ్రీ రామ్ఓం....శ్రీమాత్రే నమః..ప్రాంజలి ప్రభ


*1)సర్వసాధన హీనస్య పరాధీనస్య సర్వతః!*

*పాప పీనస్య దీనస్య శ్రీకృష్ణః శరణం మమ!!*


*2) సంసార సుఖ సంప్రాప్తి సన్ముఖస్య విశేషతః!*

*వహిర్ముఖస్య సతతం శ్రీకృష్ణః శరణం మమ!!*


*3) సదా విషయ కామస్య దేహా రామస్య సర్వథా!*

*దుష్ట స్వభావ వామస్య శ్రీకృష్ణః శరణం మమ!!*


*4) సంసార సర్వ దుష్టస్య ధర్మ భ్రష్టస్య దుర్మతేః!*

*లౌకిక ప్రాప్తి కామస్య శ్రీకృష్ణః శరణం మమ!!*


*5)విస్మృత స్వీయ ధర్మస్య కర్మ మోహిత చేతసః!*

*స్వరూప జ్ఞాన శూన్యస్య శ్రీకృష్ణః శరణం మమ!!*


*6) సంసార సింధు మగ్నస్య భగ్న భావస్య దుష్కృతేః!*

*దుర్భావ లగ్న మనసః శ్రీకృష్ణః శరణం మమ!!*


*7) వివేకధైర్య భక్త్యాది రహితస్య నిరంతరం!*

*విరుద్ధ కరణాసక్తేః శ్రీకృష్ణః శరణం మమ!!*


*8)విషయాక్రాంత దేహస్య వైముఖ్య హృతసన్మతేః!*

*ఇంద్రియాశ్వ గృహితస్య శ్రీకృష్ణః శరణం మమ!!*


*9) ఏతదష్టక పాఠేన హ్యేత దుక్తార్థ భావనాత్!*

*నిజాచార్య పదాం భోజసేవకో దైన్య మాప్నుయాత్!!*


*ఇతి శ్రీహరి దాసవర్య విరచితం శ్రీకృష్ణ శరణాష్టకం సంపూర్ణం*
OoooooooO


సీతాపతీ పద్య కావ్యము

సీసము

ప్రేమయే మనిషికి పెట్టని కోట నౌ

ప్రేమను పొందియు ప్రేమ పంచు

తల ఎత్తు దించకు - దింపేను లోకము

ధర్మము తప్పకు - ధరణి నమ్ము

కష్టాలు తప్పవు - కాష్టంలకాలేను

కొమ్మలు ఒంగితే .. కోరి కొద్దు

సహనం చూపుతూ సమభావ ముంచుము

లక్ష్మణా కళలకు లొంగి ఉండు

ఆటవెలది

వాన నీరు వీలు వాలును బట్టియు 

మనిషి ఓర్పు నేర్పు మనసు బట్టి

రకరకాల పంట దిగుబడి జరుగును

ధనము కూర్చి ఆశ దారి పోకు.............103

--(())--


సీసము

ఏకాగ్రత వలన - ఏదైన సాధించు

ఎంత తరుణమైన - ఎనక ముందు

సవ్యసమర్ధత - శాంతము కలిగించు

ఆట లాడుచు ఉన్న - ఆశ పెరుగు

పనులన్ని చేయుచూ - ప్రీతిని కల్పించు

యజమాని యైయుండి - యదను పంచు

వదలక మెదలక - ఏర్పాటు చేసిన

లక్ష్మణా రుచులేలు - లలిత మగును


తేటగీతి

క్షణమొక యుగం అవసర క్షణము ఏది

ఒక అలక్ష్యంమ్ము జీవితం మొకటి మార్చు

జీవ జవసత్వాలుగా జాడ్య మవ్వు

నీదు లక్ష్యము మరువక నిలకడుంచు

--(())--


నాతో నా శ్రీమతి... ప్రాంజలి ప్రభలు.. (11)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

ఏమిటండి ఈరోజు చాలా నీరసంగా ఉన్నారు.
ఇమీ లేదు, నీరసం లేదు కానీ నువ్వొక్కదానివే కష్టబడుతుంటే, కొంత బాధనిపించింది. నీకు ఎటువంటి సహాయము చేయకుండా ఊరికినే కూర్చొని తింటున్నా అందుకనే 

అట్లా అనుకోకండి స్త్రీ పురుషుల ధర్మాలు ఉన్నాయి. ధర్మాలనేవి అందరికీ సమానము కానీ శ్రీ పురుష శరీరసౌష్టమును బట్టి  కొన్ని ధర్మాలు ఎవరికీ వారు పొందేవి ఉన్నాయి 
అందుకే  నే చెపుతున్నా   
అనుకోని సంఘటనలు (కొందరి వల్ల చెడుగా)  జరిగినప్పుడు మనమంచికే జరిగాయని భావించాలి 
ప్రతీకారవాంఛ జోలికి పోకండి జరిగేవన్ని కర్మ అని భావించండి.   
శ్రీవారు వింటున్నారా 
ఆ వింటున్నా 
ప్రతీకార వాంఛ నీ మనసుకు రానీకు, నీకున్న అమూల్యమైన   సమయం వృధా చేసుకో వద్దు 
వాటికోసం అనగా నిన్ను మానసిక ఇబ్బంది చేసినా దయా గుణం వహించు మనిషి కర్మ తనపని తను చేసుకుంటుంది.

చీమలను పక్షి తింటుంది అది చనిపోతే పక్షిని చీమలు తింటాయి

 ఎవరు బలవంతులూ అంటే ఇద్దరూ కాదు అందరికంటే సమయమే బలవంతుడు.

ఒక మనిషి ఒంటరిగా జన్మిస్తాడు ఒంటరిగా మరణిస్తాడు

 మనుష్యుల మంచిచెడుల ద్వారా చేసిన ఫలితమే మీకు స్వర్గానికి అయినా నరకానికి అయినా కర్మ ఆధారంగానే వెళ్తాడు
ఒక మంచి ఆటగాడు కూడా ఒకసారి ఒక అద్భుత ఆటగాడి ముందు బొమ్మలా మారిపోతాడు 
అదే కర్మ
నువ్వు వెళ్లిపోవాలి చెడు నుండి మంచికి, నువ్వు మంచిగా ఉంటే ఎప్పుడు అన్నీ నిన్నే అనుసరిస్థాయి, నీ మంచే నీకు గెలుపును ఇస్తుంది దురదృష్టం పైన.
నువ్వు ప్రపంచానికి మంచిని ఇస్తే అది తిరిగి మళ్లీ మంచిగానే నీ దెగ్గరకు తెస్తుంది.

మంచిఆ జీవనమంటే తెలియపరుస్తావా ... ఆ తెలియపరుస్తాను మధురిమలుగా వినండి 

*పవిత్రుడే నిజమైన - జీవితాన్ని సాగిస్తు 
ఇతరుల మేలుకోరైన - నిస్వార్థంగ సేవిస్తు

*పావనాత్ముడై అయిన - అధికారాన్ని చూపిస్తు 
తన మాటె వినాలనిన -  వత్తిడి నిరాకరిస్తు 
 
*సత్యము అనుష్ఠించిన -   అందరికి సహకరిస్తు 
స్వార్ధమే లేకుండిన -  వాంఛించేదియు చేస్తు
 
* ఆధ్యాత్మికము వలన -  బాధను వ్యక్త పరుస్తు
 సహజంగా తరుణాన -  ఉన్నతమైనది చేస్తు 

*పవిత్రమైనది కరుణ -  దివ్యమై సహకరిస్తు
 ఆకాంక్ష యే ఉండిన - అంతరమే మర్ధిస్తు

*ఈ సారవంతమైన - భూమాతను సేవిస్తు
 ఆధ్యాత్మిక రంగాన - విత్తనమై  జీవిస్తు

*ఫలితమే లేకుండిన - సంసారం సాగిస్తు 
  నిర్మలమైన మనసున - నిజ ప్రేమ చూపిస్తు
  
సాగేదే జీవనం 
అసలు 

ధర్మమును పాటించకుండా, ధర్మానికి వ్యతిరేకముగా పనిచేయడం వలన బలము తగ్గి,  మనలో ఉన్న శక్తి తిరోధానము చెందుతూ ఉంటుంది. ప్రేమ అంటూ చుట్టూ తిరగకుండా ఎంత దైవారాధన చేస్తుంటే అంత శక్తి పెరుగుతూ ఉంటుంది. మన శక్తిని పదార్ధము వైపు గాకుండా పరమార్ధము వైపు మరల్చాలి.

*పరమార్ధము వైపు మన ప్రజ్ఞను పెంచుకోవాలంటే మనము ఏ మూలము నుంచి వచ్చామో, ఆ మూలముతో అనుసంధానం చెందాలి. ఆరాధన వలన, చక్కని ప్రవచనము వినడము వలన మనకు శక్తి పెరుగుతుంది. ధర్మముతో కూడిన కార్యక్రమముల వలన  మనలో చైతన్యము వికాసము చెంది, శక్తికి బలము చేకూరుతుంది. 
శుభం భూయాత్

చిన్న మాటకు పెద్ద సందేశమే తెలియపరిచావు  
అంతా మీరు నేర్పిన విధ్యే కదండీ 
మాటలు బాగా నేర్చావే 
అన్ని మీ దగ్గరేనండి అసలు విషయం మరిచా కొబ్బరికాయ తెచ్చారా షాపుకు పోయివచ్చారుగా 
ఆ మర్చి పోయానే ఇప్పుడే తెస్తా టీ  త్రాగి రాకండి కాఫీ కలుపుతా 
అలాగే ......................... అలాగే  
--(())--

సమ్మోహనాలు .. కోయిలా 


తెల్లారె కోకిలా కోకిల కూయనెలా 

కూయగానె సంతోషం గలిగె ఈశ్వరా 

 

అదియు వసంత పిలుపు పిలుపే  మేలుకొలుపు 

మేలుకొలుపు తోను ఆనందం ఈశ్వరా 


తరువులే చిగురించు చిగురుతొ సంతసించు 

సంతసము కోయిల పంచుకొనును ఈశ్వరా 

 

మాటకు మాట లాగ  మాటల కూతలాగ

కూతతోనె పిలిచే కోయిలా ఈశ్వరా 


రూపము చూడ నలుపు  నలుపు తో మైమరపు

మైమరపు గానముతొ కోయిలా ఈశ్వరా 

  

చల్లని వేళయనీ   వేళలొ  పిలుపులనీ  

పిలుపులు హాయిని గొలుపు మనసుకు ఈశ్వరా 


ప్రకృతి పరవశముతో   పరవశ ప్రేమతో 

ప్రేమ పిలుపు కోయిల రాగమే ఈశ్వరా 


కోయిల రాగాల తొ  రాగ అనురాగముతొ

అనురాగము కుహు కుహు అనిపిలుచు ఈశ్వరా 

 --(())--

 శివుడుని కపాలీశ్వరుడు అని ఎందుకు అంటారు స్మశానంలో ఎందుకు నివసిస్తాడు🙏

శివ అనే పదానికి శుభం, మంగళకరం, కళ్యాణం, భద్రం, విశ్వశ్రేయస్సు, సర్వ సంరక్షణం, మోక్షప్రదాయకం అనే అర్థాలున్నాయి. అందరూ అమంగళ కరమైనవిగా భావించే శ్మశానం, కపాలం, చితాభస్మం, విషసర్పాలు వంటివి శివుడికి ప్రీతిపాత్రమైనవి. ఆయన శ్మశానంలో నివసిస్తాడు. చితాభస్మాన్ని ఒంటికి పూసుకుంటాడు. విషసర్పాలను ఆభరణాలుగా ధరిస్తాడు. అయినప్పటికీ ఆయన మంగళ ప్రదాత, మంగళస్వరూపుడు. సర్వదేవతా వంద్యుడు.

ఈ సృష్టిలోని ప్రతి వస్తువు ఎప్పుడో ఒకప్పుడు బూడిదగా మారాల్సిందే! అలాంటి వస్తువులపై మమకారం తగదన్న విషయాన్ని ఆయన పూసుకునే విభూది సూచిస్తుంటుంది. ఈ భస్మం కూడ సామాన్య మానవులు ధరించే భస్మం వంటిది కాదు. 

మహాపురుషుల మరణానంతరం, వారి చితాభస్మాన్ని శివయ్య తన శిరస్సుపై పోసుకుంటాడు. అలా నిష్ఠాపరులైన వారి కపాల మాలనే మెడలో అలంకరించుకుంటాడు. అందుకే ఆయన కపాలీశ్వరుడయ్యాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే, కర్మలన్నీ, జ్ఞానమనే అగ్నిచేత దహించబడగా మిగిలేది భస్మం మాత్రమే. అదే జ్ఞానైశ్వరం.

ఈ విభూతి మహిమ అమోఘం. ఈ విభూతితోనే అరుంధతి, మృత విప్రుడిని బ్రతికించింది. బూడిద రాశులుగా మారిన కశ్యపాది మహర్షులను వీరభద్రుడు భస్మం చల్లి తిరిగి బ్రతికించాడు. దుర్వాసమహాముని శివుడు ప్రసాదించిన విభూతిని ధరించి, బ్రహ్మ హత్యాపాతకాన్ని నివారించుకున్నాడు. కుంభీపాక నరకంలో పడ్డ పాపాత్ములు, దుర్వాసమహాముని ధరించిన విభూతి రేణువులు పడగానే పుణ్యాత్ములుగా మారిపోయారు.

తన జీవితమంతా డబ్బు సంపాదించడం కోసమని,భార్య ,పిల్లలు,పరువు,ప్రతిష్టలంటూ క్షణం కూడా తీరిక లేకుండా,తీరిక ఉన్నా ఇంక సంపాదించాలన్న కోరికతోనూ జీవితాన్ని గడిపిన మనిషి,చనిపోయి స్మశానంలో పూడ్చిపెట్టాక,మిగితావి ఏవి పట్టకుండా సుఖంగా నిద్రిస్తాడు. అప్పటివరకు నావి,నావే అనుకున్న మనిషి “నా”అనుకున్న వాటిని వదిలేస్తాడు. ఇక్కడ మనం అర్ధం చేసుకోవలసింది.. శ్మశానం అంటే ఎటువంటి భయాలు, ఆశలు, కోరికలు, కోపాలు, ఆందోళనలు, బంధాలు లేని ప్రదేశం. అక్కడున్న శరీరాలు ఎండకు, చలికి, వర్షానికి దేనికి కూడా చలించవు. ఎవరు ప్రతి కర్మను కర్తవ్యంగా చేస్తారో, నిత్యం ప్రశాంతంగా ఉంటారో, సుఖః దుఃఖాలను సమానంగా చూస్తారో, ప్రతి విషయానికి ఆవేశ పడరో, అటువంటి వారి మనసు కూడా స్మశానం లాగా దేనికి చలించకుండా ఉంటుంది.అటువంటి వారి మనసులో శివుడుంటాడని అర్ధం. భగవద్గీతలో కృష్ణుడు కూడా తనకు అలాంటి వారంటేనే ఇష్టం అని చెప్పాడు. అందుకే శివుడు స్మశానవాసి అన్నారు.

అంతేకాదు ఎంతగొప్పవాడైనా, బీదవాడైన, ఎంత తప్పించుకుందామన్న ఆఖరున చేరేది స్మశానానికే. అలాగే ప్రతి జీవుడు(ఆత్మ) ఆఖరున ఏ పరమాత్మను చేరాలో, ఏ ప్రదేశాన్ని చేరడం శాశ్వతమో, ఎక్కడకు చేరిన తరువాత ఇక తిరిగి జన్మించడం ఉండదో, ఆ కైవల్యపదమే శివుడి నివాస స్థానం అని అర్ధం. ఆలయంలో ఆడంబరాలు వుంటాయి. పూజా విధానాలు వుంటాయి. కాని శ్మశానంలో ఏమి ఉండవు. కాలుతున్న శవాలు, బూడిద తప్ప. ఆ బూడిదే సత్యం. అందుకే శివుడు ఎప్పుడూ బూడిద ధరిస్తాడు. అదే ఆయన ఆభరణం. అందుకే ఆయన నివాసం శ్మశానం.

__(())--

ఓం నమః శివాయ🙏

 ఆచమనం విశిష్టత 

మనం చేసే ఆచమనంలో వైదికాంశాలతోపాటు వైజ్ఞానిక రహస్యాలు కూడా ఇమిడి ఉన్నాయి.. 

మన గొంతులో 'స్వరపేటిక' అనే శరీర అంతర్భాగం వుంటుంది. మనం చేసే ధ్వనులు అంటే మన మాటలు స్వరపేటిక నుండే పుడతాయి. మన ధ్వని గాంభీర్యానికి, స్పష్టతకు ఈ స్వరపేటికే ఆ ధారం. స్వరపేటికలోకి గాలి జొరబడినప్పుడు అంటే మన శ్వాసకోశాల నుండి వెలువడే ఉచ్ఛ్వాస వాయువు ధ్వని తంతులమీదుగా పయనించినప్పుడు, ఈ ధ్వని తంతువులలో ఏర్పడిన శబ్దాలు బయటకు రావడానికి నోరు, ముక్కు రంధ్రాలు సహాయపడతాయి.. 🙏

 అదేవిధంగా నాలుక పెదవులు శబ్దాల ఉచ్ఛారణకు, స్పష్టతకు దోహదం చేస్తాయి. ప్రతి అక్షరానికి తనదైన ధ్వని ఉంటుంది. నోటిలోని అవయవాలు కదులుతూ ఈ ధ్వనులను ఉత్పత్తి చేస్తాయి. ఈ ధ్వని (అక్షరం) ఏ భాగం నుండి ఉత్పత్తి అవుతుందో దాని ఆధారంగా అక్షరాలను కాంఠ్యాలు, తాలవ్యాలు మొదలైనవిగా విభజించారు. ఇక మనం వైదిక కర్మలను ఆచరించేటప్పుడు చేసే ఆచమనం వలన మన నాలుకకు, గొంతుకు ఒకరకమైన ఉత్తేజం కలుగుతుంది.. 🙏

అంతేకాకుండా మన గొంతునుండి మాట బయటకు వచ్చేటప్పుడు, ధ్వనితోపాటు గొంతు నుండి వాయువు కూడా బయటకు వస్తుంది. ఈ విధంగా లోపలి నుండి వాయువు బయటకు వచ్చేటప్పుడు ఎలాంటి అడ్డంకి లేకుండా ఉండేందుకు ఆచమనం ద్వారా మనం త్రాగే నీరు ఉపయోగపడుతుంది.. 🙏

 నిర్దిష్ట పరమాణంలో మనం తీసుకున్న నీరు గొంతు నుండి వెలుపలివైపు మార్గాన్ని నునుపుగా చేసి మన మాట సులభంగా, స్పష్టంగా వచ్చేందుకు దోహదం చేస్తుంది. పూజాది వైదిక కార్యాలను ఆచరించేటప్పుడు మంత్రోచ్చారణ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఆయా మంత్రాలన్నీ గొంతునుండి ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చేందుకే మన మహర్షులు ఈ ఆచమన సంప్రదయాన్ని ఏర్పరచారు.. 🙏

ఇక ఆచమనంలో కేశవాది నామాలను ఉచ్చరించడంలో కూడా ఎంతో వైజ్ఞానిక అంశం ఇమిడి ఉంది. ఆచమనంలో ముందుగా "కేశవాయస్వాహా: అని చెప్పుకుంటారు. ‘కే’  శబ్దము గొంతునుండి పుడుతుంది. తర్వాత పలికే "నారయణస్వాహా" అనే నామము నాలుక నుండి వస్తుంది. ఇక మూడవసారి చెప్పుకునే "మాధవాయస్వాహా" అనే పదము పెదవుల సహాయంతో పలుక బడుతుంది. కాబట్టి కేశవాది నామాలను పలకడం వలన గొంతుకు, నాలుకకు, పెదవులకు ఒకేసారి వ్యాయామం కలుగుతుంది మరియు ఆ తరువాత వచ్చే శబ్దాలకు ఉచ్చారణ కూడా స్పష్టంగా ఉంతుంది.. 🙏

మన శరీరము ఒక విద్యుత్ కేంద్రములాంటిది, మన శరీరమంతా విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. ఆచమన సమయంలో మనం అరచేతిలో తక్కువ ప్రమాణంలో నీటిని వేసుకున్నప్పుడు ఎలక్ట్రో మాగ్నిటిజమ్ పద్ధతిలో అరచేతిలో ఉన్న నీరు పీల్చుకొంటుంది. ఈ నీటిని త్రాగినప్పుడు, నీరు జీర్ణకోశమును చేరి, అక్కడి గోడలలో ప్రవహించే విద్యుత్తుతో కలిసి, శరీరమంతా ఒకే క్రమపద్ధతిలో విద్యుత్తు ప్రవహించేలాగా చేస్తుంది.. 🙏 

ఇలా విద్యుత్తీకరణము చెందిన నీరువల్ల గొంతు, నాలుక, స్వరపేటిక మొ|| భాగాలు కూడా ఉత్తేజము పొందుతాయి.. 🙏

ఇంతటి వైజ్ఞానికాంశాలు ఇమిడి ఉన్నాయి కాబట్టే, మన మహర్షులు ఆచమనాన్ని ఒక తప్పనిసరి వైదిక నియమంగా ఏర్పరిచారు..🙏

!! ఓం నమో వేంకటేశాయ !! 🙏

!! సర్వం శ్రీవెంకటేశ్వరార్పణమస్తు !! 🙏

 ప్రదోషము

ప్రదోషం అంటే దోషాలను తొలగించేది అని అర్థం.

ప్రతి రోజూ సూర్యాస్తమయ కాలంలో దాదాపు ఆరు ఘడియల  (రెండు గంటల 24 నిమిషాల) సమయాన్ని ప్రదోష కాలంగా పరిగణిస్తారు

. ప్రదోష కాలములో త్రయోదశి తిథి ఉంటే దానిని మహా ప్రదోషం అంటారు. 

మహా ప్రదోషం రోజున శివ భక్తులు  ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు. 

రెండు త్రయోదశి తిథులలో (శుక్ల పక్షము మరియు కృష్ణ పక్షము) ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు. 

కొన్ని ప్రాంతాలలో మాత్రం కేవలం కృష్ణ పక్ష ప్రదోషం రోజును మాత్రమే పాటిస్తారు. 

ప్రదోష సమయంలో శివుడు అర్థనారీశ్వర రూపంలో ఆనంద తాండవ నృత్యం చేస్తాడని నృత్యరత్నావళి లో చెప్పబడింది. 

ప్రదోష సమయంలో సమస్త దేవతలందరూ శివుడిని అర్చిస్తారని భావిస్తారు. ప్రదోష సమయంలో చేసే శివారాధన ఉత్తమమని చెప్పబడుతుంది. ఈ సమయంలో శివారాధన చేయటాన్ని సమస్త దేవతలను పూజించటంతో సమానంగా భావిస్తారు. 

ప్రదోష  సమయంలో శివాలయాలలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు సిద్ధిస్తాయని భావిస్తారు. ఈ సమయంలో శివుడితో పాటు నందీశ్వరుడిని కూడా ఆరాధిస్తారు.   నందీశ్వరుడిని ఆరాధించడం వలన బుద్ధికుశలత, మానసిక ఉల్లాసం లభిస్తాయి. 

ఆదివారం రోజు వస్తే దానిని రవి ప్రదోషం అని,

సోమవారం రోజు వస్తే దానిని సోమ ప్రదోషమనీ, 

మంగళవారం రోజు వస్తే దానిని భౌమ ప్రదోషమని, 

బుధవారం రోజు వస్తే దానిని బుధ ప్రదోషమని, 

గురువారం రోజు వస్తే దానిని గురు ప్రదోషమని, 

శుక్రవారం రోజు వస్తే దానిని శుక్ర ప్రదోషమని, 

శనివారం రోజు వస్తే దానిని శని త్రయోదశి అనీ, శని ప్రదోషమని పిలుస్తారు. 


వీటిలో శుక్ల పక్షంలో వచ్చే సోమ ప్రదోషం, కృష్ణపక్షంలో వచ్చే  శని ప్రదోషములు విశేషమైనవిగా భావిస్తారు.

సాయంకాలం ప్రదోష సమయంలో స్నానమాచరించి శివ షోడశోపచార పూజ జరపాలి. ప్రదోషం రోజు ఆ పరమశివుడికి నేతి దీపారాధన, ఆవుపాలతో అభిషేకం చేయటం, బిల్వ పత్రాలు మరియు శంఖుపూలతో అర్చించటం శ్రేయస్కరం. మహా మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించి ప్రదోష కథను వినటంగానీ చదవటం గానీ చేయాలి. ఇంటిలో పూజ ముగించిన అనంతరం శివాలయాన్ని దర్శించాలి. వీలైనవారు ప్రదోష స్తోత్రం, శివ స్తోత్రములను కూడా పఠించాలి.

🍁🍁🍁🍁🍁



🌹 . శ్రీ శివ మహా పురాణము - 379🌹 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః  🌴 
అధ్యాయము - 13

🌻. పార్వతీ పరమేశ్వర సంవాదము - 2 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆమె సాంఖ్య శాస్త్రాను సారముగా పలికిన ఈ మాటలను విని శివుడు వేదాంత సిద్ధాంతము నాశ్రయించి శివా దేవితో నిట్లు పలికెను (22).

శ్రీ శివుడు ఇట్లు పలికెను-

ఓ పార్వతీ! నీవు సాంఖ్య సిద్ధాంతమునను సరించి ఇట్లు పలుకుచుంటివా? ఓ అందమైన పలుకులు గలదానా! అట్లైనచో, నీవు ప్రతి దినము నా సేవను చేయుము. నాకు నిషేధము లేదు (23). నేను మాయా లేపము లేని వాడను, పరమేశ్వరుడను, వేదాంతములచే తెలియదగు పరబ్రహ్మను, మాయను వశము చేసుకున్నవాడను అయినచో, అపుడు నీవేమి చేయగలవు? (24)

బ్రహ్మ ఇట్లు పలికెను-

భక్తులను రంజింపజేసి, అనుగ్రహించు ఆ ప్రభుడు పార్వతితో నిట్లు పలికి, తరువాత హిమవంతునితో నిట్లనెను (25).

శివుడిట్లు పలికెను-

ఓ పర్వత రాజా! నేను ఇచట నీ ఈ అతి సుందర పీఠ భూమి యందు మహా తపస్సును చేసెదను. అనందఘనము, పరమతత్త్వము, సద్ఘనమునగు ఆత్మ స్వరూపమును దర్శించుచూ ఈ భూమి యందు సంచరించెదను (26). ఓ పర్వతరాజా! నేను ఇచట తపస్సును చేసుకొనుటకు అనుజ్ఞనిమ్ము అనుజ్ఞ లేకుండగా నీ ఈ స్థానమునందు ఏ విధమైన తపస్సునైననూ చేయుట సంభవము కాదు (27).

బ్రహ్మ ఇట్లు పలికెను-

దేవదేవుడు, త్రిశూలధారి యగు ఆ శివుని ఈ వచనమును విని, హిమవంతుడు శివునకు నమస్కరించి ఇట్లు పలికెను (28).

హిమవంతుడిట్లునెను-

దేవతలు, రాక్షసులు, మనుష్యులతో గూడిన జగత్తు అంతయూ నీదే. హే మహాదేవా! నేను అత్యల్పుడను. నీతో నేనేమి చెప్పగలను? (29)

బ్రహ్మఇట్లు పలికెను-

హిమవంతుడిట్లు పలుకగా, లోకములకు మంగళమునిచ్చే శంకరుడు నవ్వి హిమవంతునితో సాదరముగా 'నీవు వెళ్లుము' అని చెప్పెను (30). హిమవంతుడు శంకరుని అనుమతిని పొంది తన ఇంటికి వెళ్లెను. ఆయన ప్రతిదినము పార్వతితో గూడి శంకరుని దర్శించుచుండెను (31). భక్తి తత్పరురాలగు ఆ కాళి ప్రతి దినము తండ్రి రాకపోయిననూ, ఇద్దరు చెలికత్తెలతో గూడి సేవకొరకై శంకరుని సమీపమునకు వెళ్లుచుండెను (32). వత్సా! మహేశుని ఆజ్ఞను పాలించే పవిత్ర హృదయుడగు నందీశ్వరుడు, ఇతర గణములు శివుని ఆజ్ఞచే ఆమెను వారించలేదు (33). 

జాగ్రత్తగా పరిశీలించినచో శివాశివుల మధ్య భేదమే లేదు. అట్టి వారిద్దరు క్రమముగా సాంఖ్యవేదాంత మతములననుసరించి చేసిన సుఖకరమగు సంవాదమును వివరించితిని. ఈ సంవాదము సర్వదా మంగళములను కలిగించును (34). జితేంద్రయుడగు శంకరుడు పర్వతరాజు నందు గల గౌరవముచే ఆతని మాట ప్రకారంగా ఆతని కుమార్తెను తన వద్దకు వచ్చుటకు అంగీకరించెను (35). జితేంద్రియుడగు శివుడిట్లు పలికెను. ఈ కాళి సఖరాండ్రిద్దరితోగూడి ప్రతిదినము నన్ను సేవించి వెళ్లవచ్చును. మరియు ఇచట నిర్భయముగా నుండవచ్చును (36). ఇట్లు పలికి, వికారములు లేనివాడు, మహాయోగీశ్వరుడు, అనేక లీలలను ప్రదర్శించువాడునగు శివ ప్రభుడుఆ దేవిని సేవకొరకై స్వీకరించెను (37).

ధీరులగు తపశ్శాలురకు విఘ్నములు వచ్చుచుండును. కాని అవి వారి తపస్సును భంగము చేయజాలవు. అదియే వారికి గల గొప్ప ఐశ్వర్యము (సామర్థ్యము) (38). ఓ మహర్షీ ! అపుడు పర్వతరాజు సేవకులతో గూడి తన పురమునకు మరలివచ్చెను. ఆతడు మనస్సులో గొప్ప ఆనందమును పొందెను (39). శివుడున్నూ విఘ్నముల పీడలేని తన మనస్సుతో ధ్యానయోగము నభ్యసించుచూ, ఆత్మ రూపమును ధ్యానించుచుండెను (40). కాళీ దేవి సఖురాండ్రిద్దరితో గూడి ప్రతిదినము అచటకు వచ్చి చంద్ర భూషణుడగు మహాదేవుని సేవించి మరలు చుండెను (41). ఆమె శంభుని పాదములను కడిగి ఆ పాదోదకమును త్రాగెడిది. మరిగించిన నీటిలో శుభ్రము చేయబడిన వస్త్రముతో శివుని శరీరమును తుడిచెడిది (42).

ఆమె ప్రతి దినము శివుని యథావిధిగా షోడశోపచారములతో పూజించి, మరల మరల నమస్కరించి తండ్రి గృహమునకు మరలుచుండెడిది (43). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

Wednesday, 31 March 2021





శ్రీవారు మీకు ఓకే విషయం చెప్పాలి 

ఏమిటే "ఈవయసులో చెయ్యాల్సింది ఆ వయస్సులో చెయ్యాలి కదా " అవును అది నిజము 

మనబ్బాయి చదువుపూర్తయినది పెళ్ళిచేస్తే బాగుంటుంది 

ఉద్యోగం రాలేదు కదా 

ఉద్యోగం వచ్చే లోపు ప్రేమ పుట్టితే మీరు ఆపగలరా 

అదేమిటీ అట్లాంటావు 

తల్లి తండ్రులు పిల్లలను చదివించాలి మాత్రమే తర్వాత వివాహము చెయ్యాలి వల్లకాలల్మీద వాళ్ళు నిలబడేటట్లు ధైర్యం చెప్పాలి, వారి సంపాదనమీద ఆధారాపడకూడదు , కట్నం ఇవ్వగలము అని ఆడపిల్ల పిల్లల పెళ్లి చేయక పోవటం కూడా తప్పు. వాళ్లలో విశ్వాసం కలిగించటమే తల్లి తండ్రుల కర్తవ్యము.    

లేని యడల 

మందారం తొ సంవ్యాప్తి - సింగారం తొ సంప్రాప్తి

సిందూరం  సంవ్యాప్తి  - వయ్యారంతొ  సంప్రాప్తి


నాంచారి దైవప్రాప్తి - బంగారి దైర్య ప్రాప్తి

వయ్యారి భావ్య ప్రాప్తి - సింగారి సౌర్య ప్రాప్తి


ఉద్వేగం తోను తృప్తి - ఉత్సాహం తో ప్రాప్తి

ఉన్మాదం తోను తృప్తి - ఉల్లాసం తో ప్రాప్తి

ఇలా పిల్లలు మారితే ఎవరు బాధ్యలు 

అందుకే 

దృఢ విశ్వాసములు -   అయిదు విధములైన జ్ఞానములు 

 1. ప్రాపంచిక జ్ఞానము = పిల్లల పెళ్లి మంచివారని తలంచి వారికి వివాహం చెయ్యాలని నిర్ణయం.  అనగా బావిని త్రవ్వకయే, ఇచ్చట మంచి నీరున్నదని భావించుటయు, భూమిని త్రవ్వుకొనుచు లోపలికి చొచ్చుకొని పోవుటయు మొదటి విశ్వాసము.

2. ధర్మశాస్త్ర జ్ఞానము= తల్లి తండ్రులు ఇటువారు అటువారు ఇచ్చి పుచ్చుకొని పిల్లల పెళ్లి చేసి ఏకం చెయ్యాలి . అనగా  నీటిని కన్నులార చూచుట రెండవ విశ్వాసము.

3. ఆధ్యాత్మిక జ్ఞానము= కొత్తగా పెళ్లిఅయినవారికి పూర్తిగా స్వశ్చ ఇచ్చి వారి సంతోషానికి అడ్డు లేకుండా ఉండాలి.   నీటిని రుచి చూచుట మూడవ విశ్వాసము.

4. బ్రహ్మ జ్ఞానము= సంసార సుఖము వల్ల పిల్లలు పుట్టి వారికి కర్తవ్యదీక్షగా పెంచి నలుగురిలో మంచివారు అనుకున్నప్పుడే తల్లితండ్రులగుర్తింపు  అనగా  ఆ నీటిని గూర్చి ఇతరులకు వర్ణించి చెప్పుట నాల్గవ విశ్వాసము. 

5 . విశ్వ విజ్ఞానము = కుటుంబములో సభ్యులందరూ కలసి ఒకేచోట ఉండటమే నిజమైన జీవితం అనగా   జ్ఞానము, సర్వజ్ఞత్వము నీరులేనిదే బతకలేరని ప్రాణుల విశ్వాసము 

ఆస్వాదించే అందం - ఇదే ప్రకృతి ప్రభంజనం

ఇక స్త్రీ ముఖార విందాం - ఆకర్షణ తోనె బంధం

చూసె రమణీయ దృశ్యం - పుడమితల్లి సింగారం

బతికించు తల్లి సహనం - తల్లీ తండ్రి బంధనం


నేలపైన బంగారం - అణువణువున పచ్చదనం

జీవితముకు వెచ్చదనం - ఆరోగ్యానికి తరుణం

నిజము తెలిపేటి వర్ణం - బతుకు వర్ణించె చిత్రం

హృదయం పెంచే కిరణం - పెంచే మలయమారుతం

--((()))--


శరదిందు వికాస మందహాసాం స్పురదిందీవర లోచనాభిరామాం!
అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే !

శరదృతువులో పౌర్ణమి వెన్నెలలా వికసించిన చిరునగవు కలిగినది, వెన్నెల వంటి చల్లని చూపులతో ప్రకాశించేది, పద్మమువంటి సుందరమైన ముఖము కలిగినది, పద్మము ఆసనముగా కలిగిన బ్రహ్మకు భార్య అయిన సరస్వతీ మాతను ఉపాసిస్తున్నాను.
         
" వ్యాకర్తారం తమశ్ఛేదం ,  జీవరక్షప్రసాదినమ్ !
సర్వ లోక ప్రపూజ్యం , తం , భజే మరీచిమాలినమ్ !!!

. నేటి సూక్తి : దేవుడు వరాలు, శాపాలు ఇవ్వడు. అవకాశాలు మాత్రమే ఇస్తాడు. ఎలా ఉపయోగిస్తామో అటువంటి ఫలితం.

****

Thursday, 11 March 2021


*పిత్రార్జితం. కాస్త పెద్ద కథే...ఓపిగ్గా చదవగలరు.


‘అమ్మ ఎవరి దగ్గర ఉంటుంది?’’* 


వినోద్‌ తన అన్నయ్యను అడుగుతున్న ప్రశ్న విని ఉలిక్కిపడింది సావిత్రి. 


అటువంటి సన్నివేశం ఎన్నో కథల్లో చదివింది, ఎన్నో సినిమాల్లో చూసింది. 


కానీ తన జీవితంలో మాత్రం అటువంటి సన్నివేశం రాకూడదనీ, భర్తకంటే ముందే పునిస్త్రీగా వెళ్ళిపోవాలనీ అందరు దేవుళ్ళనూ కోరుకుంది. 


అయితే తన ప్రార్థన ఫలించలేదు.


 భర్త గుండెపోటుతో తనకంటే ముందుగా భగవంతుణ్ణి చేరుకున్నాడు.


‘‘అమ్మ మన ఇద్దరిదగ్గరా ఉంటుంది. అలా అని ఏడాదికి ఆరునెలలంటూ మనం పంచుకోవలసిన అవసరంలేదు. ఆమెకు ఇష్టమైనన్ని రోజులు ఎవరి ఇంట్లోనైనా ఉండొచ్చు’’ అన్నాడు విజయ్‌.


విజయ్‌ సమాధానం విన్నాక ఆమె మనసు కాస్త స్థిమితపడింది.


 ‘అయినా తనకెందుకు లేనిపోని భయాలు, అనుమానాలు? తన బిడ్డల గురించి తనకు తెలియదా?’ అనుకుంది.


విజయ్, తండ్రి బీరువా తెరిచి అందులోంచి బ్యాంకు పాస్‌బుక్‌ తీశాడు. 


తండ్రి పోయినరోజు నుంచి వైకుంఠ సమారాధన వరకూ అయిన ఖర్చులు ఇద్దరూ కలసి లెక్కలు వేశారు. 


బ్యాంకులో ఉన్న డబ్బు తాము ఖర్చుపెట్టిన మొత్తంకంటే ఎక్కువగానే ఉండటం చూసి సంతోషించారు.


భర్త అకౌంటులో ఉన్న డబ్బు గురించి తనతో సంప్రదించకుండానే కొడుకులు నిర్ణయాలు తీసుకోవడం సావిత్రిని బాధించింది. 


‘అయినా తండ్రి అంతిమయాత్రకూ కార్యాలకూ అయ్యే ఖర్చులు ఆమాత్రం భరించలేరా.. ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో ఉన్నారు’ అనుకుంది.


తర్వాత ఇంటి ప్రస్తావన వచ్చింది.


‘‘మేమిద్దరం ఇళ్ళు కట్టుకున్నాం. అందుకు బ్యాంకు లోనుతోపాటు బయట కూడా అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ ఇల్లు అమ్మితే పదిలక్షలదాకా వస్తుంది. మేము చెరో అయిదు లక్షలు తీసుకుంటాం. ఎటూ నువ్వు మాతోనే ఉంటావు కాబట్టి ఇక ఈ ఇంటి అవసరం ఉండదు’’ అన్నాడు విజయ్‌ తల్లితో.


‘‘మీ నాన్నగారు ఎంతో ఇష్టంతో కట్టుకున్న ఇల్లురా ఇది. కేవలం ఇటుకలు, సిమెంట్‌తో కట్టిన ఇల్లు కాదు. ఎంతో శ్రమతో, శ్రద్ధతో, ఆయన కష్టార్జితంతో కట్టిన ఇల్లు. ఈ ఇంట్లో ఎన్నో శుభకార్యాలు జరిగాయి. మీ చదువులూ ఆటలూ మీ భార్యల సీమంతాలూ మీ పిల్లల బారసాలలూ... అన్నీ ఈ ఇంట్లోనే జరిగాయి. ఎంతోమంది బంధువులూ స్నేహితులూ ఈ ఇంటికి వచ్చి, మన ఆతిథ్యాన్ని స్వీకరించి, మనసారా దీవించి వెశ్ళారు. మనకెన్నో తీయని అనుభూతుల్నీ మీ నాన్నగారికి తృప్తినీ ఆనందాన్నీ ఇచ్చిన ఈ ఇంటిని అమ్మడం నాకిష్టంలేదురా’’ అంది సావిత్రి.


‘‘మనిషే పోయాక ఇక ఇల్లెందుకమ్మా? 


మా ఇళ్ళకీ బంధువులూ మిత్రులూ వస్తారు. అక్కడ కొత్త అనుభూతులకు స్వాగతం పలుకుదాం. పైగా ఆర్థికంగా మేము ఇబ్బందుల్లో ఉన్నాం. ఇల్లు అమ్మితే వచ్చే డబ్బుల్తో మా సమస్యలు తీరితే నాన్న ఆత్మ కూడా సంతోషిస్తుంది’’ అన్నాడు వినోద్‌.


‘‘లేదురా, ఆయనకు ఈ ఇల్లంటే ప్రాణం. కనీసం నేను ఉన్నంతవరకైనా ఇల్లు అమ్మకండి. కావాలంటే నా నగలన్నీ ఇస్తాను. అవి అమ్ముకుని మీ అప్పులు తీర్చుకోండి’’.


‘‘నీ నగలు ఎన్ని ఉన్నాయమ్మా? అన్నీ అమ్మినా యాభైవేలు రావు’’ అన్నాడు విజయ్‌ విసుగ్గా.


‘‘అమ్మా, ఇంటి డాక్యుమెంట్లు కనబడటంలేదు. బ్యాంకు లాకర్లో పెట్టారా నాన్న?’’ బీరువా వెతుకుతున్న వినోద్‌ అడిగాడు.


‘‘లాకర్లో కాదు. నాన్న ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టారు. నేనూ ఆ విషయం మరచిపోయాను. ఇప్పుడు నువ్వడిగితే గుర్తొచ్చింది’’.


‘‘తాకట్టు పెట్టారా? అంత అవసరం ఏం వచ్చింది?’’ కొడుకులిద్దరూ ఒకేసారి అడిగారు.


‘‘మీ చదువుల కోసం’’.


‘‘మా చదువుల కోసమా? మా చదువులు పూర్తయి అయిదేళ్ళు కావస్తూంది’’ అన్నాడు విజయ్‌ అసహనంగా. బ్యాంకులోను వల్ల ఇల్లు అమ్మితే వచ్చే మొత్తంలో తన వాటా మరింత తగ్గిపోతుందన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు అతను.


‘‘కావచ్చు. 


ఆయన రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసినా జీతం తప్ప మరో ఆదాయం ఆశించలేదు. 


మీకు ఎంట్రన్స్‌లో మంచి మార్కులు రాకపోతే లక్షలు ఖర్చుపెట్టి ప్రైవేటు కాలేజీల్లో మిమ్మల్ని ఇంజినీరింగ్‌ చదివించారు. 


మరి అంత డబ్బు ఆయనకు ఎక్కణ్ణుంచి వచ్చిందనుకున్నారు?


 మీకు ఉద్యోగాలొచ్చాక ఆయన అప్పుల గురించి మీరు అడుగుతారనీ మీ వంతు సాయం చేస్తారనీ అనుకున్నాం. 


కానీ మీకా ఆలోచన లేకపోయింది.


 మీముందు చేయిచాచడానికి ఆయన ఇష్టపడలేదు. 


ఆ అప్పు అలాగే నిలిచిపోయింది. 


అప్పటికీ తన పెన్షను నుంచి కొంత, పైపోర్షను బాడుగ నుంచి కొంత బ్యాంకు లోనుకు కడుతూనే ఉన్నారు’’.


‘‘ఇంకా ఎంత కట్టాలట?’’ 


విజయ్‌ అడిగాడు.


‘‘అయిదు లక్షలు కట్టాలి’’ బీరువా నుంచి తీసిన బ్యాంకు స్టేట్‌మెంట్‌ను టీపాయ్‌మీదకి గిరాటేసి అన్నాడు వినోద్‌.


‘‘హు, ఏడ్చినట్లే ఉంది. ఈమాత్రం దానికి ప్రపంచంలో తానొక్కడే ఇల్లు కట్టినట్లూ పిల్లల్ని చదివించినట్లూ ఫోజులు’’ అన్నాడు విజయ్‌.


పిల్లలు భర్తను తేలికచేసి మాట్లాడుతూంటే సావిత్రికి ఎంతో బాధేసింది.


‘‘లోను తీసుకున్న ఆయన ఇప్పుడు లేరు కదరా. అయినా ఆ అప్పు మీరు తీర్చాలా?’’ అని తన అనుమానం వ్యక్తంచేసింది.


‘‘ఆయన లేకపోతేనేం? మేం బతికున్నాం కదా. ఆయన ఇంటికి ఎలా వారసులమో ఆయన అప్పుకూ వారసులమే. అయినా అవన్నీ నీకు చెప్పినా అర్థంకాదు. ఇక మమ్మల్ని వదిలెయ్‌’’ రెండుచేతులూ జోడించి విసుగ్గా అన్నాడు వినోద్‌. 


సావిత్రి కళ్ళనీళ్ళు పెట్టుకుంది.


 ‘తను చదువుకోలేదు. ఉద్యోగం చెయ్యలేదు. కానీ చెబితే అర్థం చేసుకోలేనిదేంకాదు. భర్త ప్రతి విషయం ఎంతో ఓపికతో తనతో చెప్పేవాడు. అర్థంకాకపోతే వివరించేవాడు. వీళ్ళకు అంత ఓపిక లేదు. అందుకే ఇలా విసుక్కుంటున్నారు. వీళ్ళకోసం, వీళ్ళ ఆరోగ్యం కోసం తను ఎన్ని పూజలు చేసింది? ఎన్ని రోజులు ఉపవాసాలుంది? ఎంత ఓపికతో అన్నీ అమర్చిపెట్టింది? అవన్నీ వాళ్ళకు ఇప్పుడు గుర్తులేదు. గుర్తుచేసుకోరు కూడా’ అనుకుంది.


ముఖ్యంగా కోడళ్ళముందు కొడుకులు తనను అలా విసుక్కోవడం ఆమెను మరింత బాధించింది.


 ‘కోడళ్ళను కన్నకూతుళ్ళలా చూసుకున్నారు తనూ భర్తా. వాళ్ళు కల్పించుకుని భర్తల్ని వారించకపోవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూంది. ఆర్థిక అవసరాలు అభిమానాల్ని ఇంతగా చంపేస్తాయా?’ అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది.


*   *   *


ఉదయం నిద్రలేచిన సావిత్రి గడియారం వంక చూసింది. 


ఏడు గంటలు చూపిస్తూంది. 


‘అబ్బ, ఇంతసేపు ఎలా నిద్రపోయాను?’ అనుకుంటూ పిల్లల గదిలోకి నడవబోయింది.


 ఇంతలో కొడుకులు తమ కుటుంబాలతో ఉదయమే ఊరికి వెళ్ళిపోవడం గుర్తొచ్చింది ఆమెకు.


‘రాత్రంతా ఏడ్చీ ఏడ్చీ నిద్రపోయేసరికి పన్నెండు దాటింది. తెల్లవారుజామునే పిల్లల ప్రయాణం. నిద్రలేమి వల్ల తల పగిలిపోతూంది. కాఫీ గొంతులోపడితేగానీ అది తగ్గదు’ అనుకుంటూ గేటు దగ్గరకు వెళ్ళి పాలబ్యాగులో చెయ్యిపెట్టి చూసింది. అది ఖాళీగా ఉంది.


తల్లిని తనతో తీసుకెళుతున్నాననీ మరుసటిరోజు నుంచి పాలప్యాకెట్‌ అవసరంలేదనీ పాలవాడితో విజయ్‌ ముందురోజు చెప్పడం గుర్తుకొచ్చింది.


 ‘ఇంటిపై లోను ఉందని తెలిసి, ఆ నిరుత్సాహంతో నన్ను పిలుచుకుని వెళ్ళడం మరచిపోయారు ఇద్దరూ’ అనుకుని నవ్వుకుంది.


షాపు నుంచి పాలప్యాకెట్‌ తెచ్చుకోవడానికి చిల్లరకోసం ఇల్లంతా వెదికింది. 


ఎక్కడా చిల్లరగానీ కరెన్సీ నోట్లుగానీ కనిపించలేదు. 


తలనొప్పి క్షణక్షణానికి అధికం కాసాగింది. 


ఏంచేయాలో తెలియక నిస్సహాయంగా నిలబడిపోయిన ఆమెకు ఎదురుగా కొక్కేనికి తగిలించి ఉన్న భర్త చొక్కా కనిపించింది.


 ఆశగా వెళ్ళి జేబులో చెయ్యి పెట్టింది. 


కొన్ని పదిరూపాయల నోట్లు ఆమె చేతికి తగిలాయి. 


ఆమెకు ప్రాణం లేచివచ్చింది.


‘నీకు నేనున్నాను’ అని భర్త తనతో అన్న భావన కలిగింది ఆమెకు.


 ‘ఎప్పుడూ వందరూపాయలకు సరిపడా పదిరూపాయల నోట్లు జేబులో ఉంచుకోవడం ఆయనకు అలవాటు. ఆ అలవాటే ఇప్పుడు తన అక్కర తీర్చింది’ అనుకుంది.


 కాసేపు భర్త ప్రేమను తలచుకుని ఏడ్చింది.


 తర్వాత చెప్పులేసుకుని షాపుకు బయలుదేరబోతూంటే రామయ్య వచ్చాడు. 

అతను ఆమె భర్త పనిచేసిన ఆఫీసులో అటెండరు.

అతను చేతిలోని ఫ్లాస్కు ఆమె చేతికిస్తూ ‘‘పిల్లలు ఊళ్ళకు వెళ్ళిపోయారని విన్నాను. వాళ్ళ పనులు వాళ్ళకుంటాయిగా మరి. మరో నాలుగురోజులు మీరు వంట జోలికి పోకండి. కాఫీ, టిఫిన్, భోజనం అన్నీ నేను తెచ్చిస్తాను. మంచి శాకాహార హోటల్‌నుంచే తెస్తానులెండి. పదిరోజులుగా మనిషి పోయిన బాధతో, వచ్చేపోయే జనంతో బాగా అలసిపోయి ఉంటారు. నాలుగురోజులు విశ్రాంతి తీసుకోండి. మళ్ళీ ఎటూ మనుషుల్లో పడిపోవాలి. తప్పదు’’ అన్నాడు.

సావిత్రి కాఫీ రెండు కప్పుల్లో పోసి, అతనికొకటి ఇచ్చి తనొకటి తీసుకుంది.

‘‘అమ్మా, నా కూతురి పెళ్ళికి అయ్యగారిని పదివేలు అప్పడిగాను. ఆయన తన పి.ఎఫ్‌. నుంచి లోను తీసుకుని నాకిచ్చారు. ప్రతినెలా అయ్యగారి జీతంనుంచి ఆ లోన్‌కు అయ్యే కటింగ్‌ మొత్తం ఆయనకు నా జీతంనుంచి ఇచ్చేసేవాణ్ణి. ఆయన రిటైర్‌ అయ్యేలోపు ఆ అప్పు తీర్చేయాలనుకున్నానుగానీ సాధ్యంకాలేదు. ఆయన రిటైర్‌ అయినప్పుడు ఆ డబ్బుల్ని ఆయనకు ఇవ్వాల్సిన పి.ఎఫ్‌. నుంచి పట్టుకున్నారు. నేను ఈ నెల రిటైర్‌ అవుతున్నాను. నాకొచ్చే డబ్బుల్లోంచి మిగిలిన బాకీ మీకిచ్చేస్తాను. అటువంటి గొప్పవ్యక్తి అప్పు ఎగ్గొడ్తే నాకు మంచి జరగదమ్మా. ఆయన దేవుడమ్మా. అటువంటి మనుషుల్ని మళ్ళీ మనం చూడలేం’’ అంటూ రామయ్య ఏడవసాగాడు. 

సావిత్రి కళ్ళనిండా నీరు నిండింది.

‘‘అమ్మా, మీ పెన్షన్‌ పేపర్లన్నీ నేనే తెచ్చి మీ సంతకం తీసుకుంటాను. ఈ విషయంలో మీకు సహాయం చేయడానికి మా ఆఫీసులో అందరూ సిద్ధంగా ఉన్నారు’’ అని చెప్పి రామయ్య శెలవు తీసుకున్నాడు. 

ఆమెకు మళ్ళీ భర్త తనతో ‘నేనున్నాను’ అన్న భావన కలిగింది.

రామయ్య వెళ్ళిపోయాక ‘రామయ్య తీసుకున్న అప్పు గురించి ఆయన నాకు చెప్పారు. కానీ పదివేలు అప్పు తీసుకున్న రామయ్య అది తీర్చాలని తపనపడుతున్నాడే. 

మరి పాతికేళ్ళు పిల్లల్ని పెంచి, పెద్దచేసి చదివించామే. 

వాళ్ళకు తండ్రి బాధ్యత పంచుకోవాలనిగానీ తల్లి ఒంటరిగా ఉంటుందన్న ఆలోచనగానీ ఎందుకు రావడంలేదు? 

ఎందుకు పిల్లలు ఇలా మారిపోయారు? 

పిల్లలు పెద్దవాళ్ళయ్యాక వారికీ తల్లిదండ్రులకీ మధ్య ఆర్థిక సంబంధాలు తప్ప ఇంకే బంధాలూ ఉండవా?

ఆయన పిల్లల్ని ఎంతో శ్రద్ధ తీసుకుని పెంచారు. 

మంచితనం, మానవత్వం, నిజాయతీ, క్రమశిక్షణ లాంటి సుగుణాలను నూరిపోశారు.

 ఆయన వాటిని పాటించి చూపించారు కూడా. 

తన తల్లిదండ్రుల్ని చివరి శ్వాస వదిలేవరకూ తనవద్దనే ఉంచుకుని చూసుకున్నారు. 

తన తల్లి చివరి మూడురోజులూ మంచంమీదే ఉండిపోతే విసుగూ అసహ్యం లేకుండా అన్నిరకాల సేవలూ చేశారు. 

అవన్నీ పిల్లలు గమనించారు కూడా. 

మరి ఈరోజు వాళ్ళు తమ తల్లిపట్ల ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు’ అనుకుంది.

వెంటనే తన ప్రశ్నకు సమాధానం కూడా దొరికింది ఆమెకు. 

‘ఆ కాలంలో టీవీలూ ఫ్రిజ్జులూ లేవు. 

సంపాదించిన డబ్బు కుటుంబంకోసం, పిల్లల చదువులకోసం ఖర్చుపెట్టేవారు.

 దుబారా ఖర్చులు చేసేవారు కారు.

 రాబడి, ఖర్చు దాదాపు సమానం కావడంతో పెద్దగా అప్పులుచేసే అవసరం ఉండేదికాదు. 

తృప్తిగా మనశ్శాంతితో బతికేవారు.

 కానీ ఈనాటి పరిస్థితి వేరు.

 పెళ్ళైన వెంటనే టీవీ, ఫ్రిజ్, ఏసీ, కంప్యూటర్, కారు అన్నీ కొనేయాలి. 

వీటిలో చాలా వస్తువులు స్టేటస్‌ సింబల్‌గా మారిపొయ్యాయి.

 అవసరాలకూ విలాసాలకూ తేడా తెలుసుకోలేకపోతున్నారు. 

ఇంటికి నిదానంగా ఒక్కొక్కటీ అమర్చుకుందామన్న ఆలోచన, ఓపిక లేదు.

 పైగా ఫ్లాట్ల రేట్లు  పెరుగుతున్నాయనీ ఇన్‌కమ్‌టాక్స్‌ తగ్గుతుందనీ చేతిలో డబ్బులు లేకపోయినా ఇళ్ళు కూడా కొనేస్తున్నారు. 

కంపెనీలూ బ్యాంకులూ లోన్లు ధారాళంగా ఇస్తూండటంతో అన్ని లోన్లూ తీసుకోవడం, జీతంలో ఇన్‌స్టాల్‌మెంట్లకు పోగా మిగిలింది చాలకపోవడం, దీంతో ఇబ్బందులు, విసుగు, అసహనం మొదలు. 

వీటన్నిటితోపాటు ఉద్యోగంలో ఒత్తిడులు, అభద్రతాభావం పెరుగుతున్నాయి. 

ఇన్ని ఒత్తిడులమధ్య పాపం తల్లిప్రేమ, ఆమె సేవలు వీళ్ళకు గుర్తురావడంలేదు. 

ఉన్నంతలో తృప్తిగా బతకడం వీళ్ళకు ఎప్పుడు అలవాటవుతుందో’ అనుకుని బాధగా నిట్టూర్చింది.

*     *     *

వారంరోజులు గడచిపోయాయి.

 సావిత్రికి పిల్లల నుంచి ఫోన్‌కాల్స్‌ లేవు. 

ఫోన్‌ మోగితే ‘పిల్లలనుంచేమో’ అని ఆశగా ఫోను దగ్గరికి పరిగెడుతూంది. 

ఓరోజు తన ఇంట్లోకి అడుగుపెట్టిన కొత్త వ్యక్తిని ఆశ్చర్యంగా చూసింది సావిత్రి.

‘‘నా పేరు శ్రావణ్‌. బ్యాంకులో ఫీల్డ్‌ ఆఫీసర్ని’’ అంటూ తన వివరాలు చెప్పాడతను.

‘‘రండి, కూర్చోండి’’ అంటూ కుర్చీ చూపించింది.

‘‘రామనాథంగారు నేను క్లర్క్‌గా ఉన్నప్పటినుంచీ నాకు తెలుసు. ఆయన ఇల్లు కట్టడంకోసం, పిల్లల చదువులకోసం, వాళ్ళ పెళ్ళిళ్ళకోసం, ఎన్నోసార్లు లోన్లు తీసుకున్నారు. అయితే ఆయన ఇన్‌స్టాల్‌మెంట్‌ కట్టకపోవడం అన్నది ఇంతవరకూ జరగలేదు. మొదటిసారిగా ఆయన మార్ట్‌గేజ్‌ లోన్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌ బాకీ పడింది. నాకు అనుమానమొచ్చి విచారిస్తే ఆయన చనిపోయారని తెలిసింది. మా బ్యాంకు క్రమశిక్షణ కలిగిన ఓ కస్టమర్‌ను కోల్పోయింది’’ అన్నాడు బాధగా.

‘‘నాకు ఫ్యామిలీ పెన్షన్‌ మొన్న శాంక్షన్‌ అయింది. ఈనెల పెన్షన్‌ తీసుకోగానే బ్యాంకుకు వచ్చి కట్టేస్తాను’’ అంది సావిత్రి నొచ్చుకుంటూ.

‘‘అవసరంలేదమ్మా. ఆయన ఇంటిపై తీసుకున్న లోనుపై దాదాపు ఏడులక్షలు బాకీ ఉంది. అయితే చాలా ఏళ్ళకిందటే మా బ్యాంకు ప్రవేశపెట్టిన ఇన్సూరెన్సు స్కీములో మీవారి లోను కూడా కవర్‌ అయ్యేందుకు ఆయనచేత సంతకాలు పెట్టించుకుని ప్రీమియం కట్టించుకున్నాం. రామనాథంగారు మరణించారు కనుక ఆ రుణం మొత్తం ఇన్సూరెన్స్‌ కంపెనీ చెల్లిస్తుంది. మీరు నయాపైసా కూడా కట్టక్కరలేదు. నేను అప్లికేషన్‌ మీకు పంపిస్తాను సంతకాలు చేసి పంపండి. ఉంటానండీ’’ అతను నమస్కారం చేసి వెళ్ళిపోయాడు.

సావిత్రి భర్త ఫొటో వైపు చూసింది. రామనాథం నవ్వుతున్నట్లు కనిపించింది ఆమెకు.

*   *   *

సావిత్రి కొడుకులకు ఫోన్‌చేసి రుణం మాఫీ అయిన విషయం చెప్పి ‘ఇల్లు అమ్మకానికి పెట్టాననీ ఎవరైనా వస్తే కబురు చేస్తాననీ వచ్చి మాట్లాడుకొమ్మనీ’ చెప్పింది.

 కొడుకులు ఆమె ఊహించినదానికంటే ఎక్కువగానే సంతోషించారు. 

ఆ రోజు సాయంత్రం ఊళ్లోఉన్న వృద్ధాశ్రమానికి వెళ్ళి ఆశ్రమం మేనేజరుతో మాట్లాడింది.

 త్వరలోనే తను ఆశ్రమంలో చేరతానని చెప్పింది.

సావిత్రి వివరాలు తెలుసుకున్న మేనేజరు ‘‘రామనాథంగారు చనిపోయారా? నాకా విషయమే తెలియలేదే’’ అంటూ విచారం వెలిబుచ్చారు.

‘‘ఆయన మీకు తెలుసా?’’ ఆశ్చర్యంగా అడిగింది సావిత్రి.

‘‘తెలియకపోవడం ఏమిటమ్మా? ఈ ఆశ్రమం స్థలం కోసం గవర్నమెంటుకు అర్జీ పెట్టినప్పుడు కలెక్టరాఫీసులో ఆ సీట్లో ఉన్న మీవారిని కలిశాను. ఆయన సానుకూలంగా స్పందించారు. మంచి కార్యం తలపెట్టినందుకు మమ్మల్నెంతో అభినందించారు. కలెక్టరుగారికి చెప్పి ఈ స్థలం మాకిప్పించారు. డిపార్ట్‌మెంట్‌లో ఆయనకున్న మంచిపేరు వల్ల కలెక్టరుగారు వెంటనే ఒప్పుకున్నారు. ఇంతచేసిన ఆయన మా నుంచి ఒక్క పైసా కూడా ఆశించలేదు. అటువంటి వ్యక్తి భార్య అయిన మీరు ఓ అనాథలా మా ఆశ్రమంలో చేరడం నాకు బాధగా ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళతాను. మాతోపాటు ఉండిపొండి. మిమ్మల్ని మా అమ్మలా చూసుకుంటాను’’.

సావిత్రికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

 ‘భర్త మంచితనం గురించి తెలుసుగానీ అది ఇంతమంది మనసుల్ని గెలుస్తుందని తను ఊహించలేదు’ అనుకుంది.

 ‘మరణించి కూడా బతికి ఉండటం’ అంటే ఏమిటో ఆమెకు అర్థమైంది.

‘‘వద్దండీ. నావల్ల ఎవరికీ ఇబ్బంది ఉండకూడదనే పిల్లల్ని కూడా కాదనుకుని ఇక్కడికి వస్తున్నాను. పైగా ఇక్కడ ఉంటే నాకు కాలక్షేపం కూడా అవుతుంది. మీరు ఆ మాట అన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు పిల్లాపాపలతో కలకాలం చల్లగా ఉండాలి. నేను ఇల్లు అమ్మకం పనులు పూర్తయ్యాక వస్తాను’’ అంటూ అతని దగ్గర శెలవు తీసుకుంది.

*   *   *

ఒకరిద్దరు సావిత్రికి ఫోన్‌చేసి ఇల్లు కొనడానికి తమ ఆసక్తిని వెలిబుచ్చారు. 

ఓ ఆదివారం కొడుకుల్ని రమ్మంటాననీ ఆరోజు వచ్చి మాట్లాడమనీ వాళ్ళతో చెప్పింది సావిత్రి. 

మరుసటి ఆదివారమే కొడుకులు భార్యలతో వచ్చారు.

ఆ ఆదివారం ఉదయం ఇంటి గురించి మాట్లాడటానికి వచ్చిన వ్యక్తిని చూసి ‘‘మీరు మా ఎదురింటి మేడపైన ఉండేవారు కదా?’’ అని అడిగాడు వినోద్‌.

అతను ‘‘అవును. నా పేరు రామారావు’’ అంటూ తన వివరాలు చెప్పసాగాడు.

తర్వాత ‘‘మేము చాలా ఏళ్ళు ఆ ఇంట్లోనే ఉన్నాం. ఏడాదిక్రితమే ఇల్లు చాలక వేరే ఇంట్లోకి మారాం. మీ ఇంటి మండువా మా గది కిటికీ నుంచి బాగా కనబడేది. మీ కుటుంబం మమతానురాగాలకూ తీపి అనుభవాలకూ ప్రతీకలా అనిపించేది నాకు. 

ఉదయాన్నే మీ అమ్మగారు ఇంటిముందు ముగ్గులేస్తూంటే మీ తండ్రీకొడుకులు కబుర్లు చెబుతూ కంపెనీ ఇవ్వడం, భోగి పండుగరోజు ప్రాతఃకాలాన మీరు భోగిమంట వేస్తూంటే మీ అమ్మగారు కాఫీ తెస్తే అందరూ కలసి తాగడం, దీపావళిరోజు మీ నాన్నగారు మీతో టపాకాయలు జాగ్రత్తగా కాల్పించడం, ఉదయం నాలుగు గంటలకు లేచి మీరు చదువుకుంటూంటే మీకు తోడుగా మీ నాన్నగారు కూర్చోవడం, మీ ఇంటికి తరచుగా బంధువులు, మిత్రులు రావడం, రాత్రిపూట అందరూ మండువాలో కూర్చుని పాటలు పాడటం మాకు కనిపించేది.

ఓసారి విజయ్‌కి ఆటల్లో చేయి విరిగితే ప్రమోషన్‌ పరీక్ష రాయడానికి వెళ్ళిన మీ నాన్నగారు పరీక్ష రాయకుండానే తిరిగొచ్చి పుత్తూరు తీసుకెళ్ళి కట్టు కట్టించడం, నొప్పి తెలియకుండా రాత్రంతా కథలు చెబుతూ జాగారం చెయ్యడం, తన తల్లి వేసుకోవాల్సిన మాత్రల్ని ఏ పూటకాపూట గుర్తుగా ఆమెకివ్వడం, ఆవిడ మంచానపడితే సేవలు చేయడం నా మనసును కదిలించేది. 

ఆయన చేసిన ఉద్యోగానికి కావాలనుకుంటే ఈ ఊళ్లో పది ఇళ్ళు కట్టించి ఉండేవారు. 

కానీ ఆయన తీరే వేరు.

 ‘పైసంపాదన ఆశించని వ్యక్తి’ అని ఊళ్లో మంచిపేరు తెచ్చుకున్నారు.

 కళ్ళముందు నోట్లకట్టలు కనబడుతున్నా అవసరాలు ఇబ్బందిపెడుతున్నా చలించక నీతికి కట్టుబడి వాటికి దూరంగా ఉండటం చాలా గొప్ప విషయం.

ఇక మా ఇంట్లో ఎప్పుడూ గొడవలే.

 మా నాన్న గెజిటెడ్‌ ఆఫీసరు.

 లంచాలు బాగా తినేవాడు.

 ప్రతిరోజూ తాగొచ్చి ఇంట్లో గొడవలు చేసేవాడు. 

మాకు చదువు తలకెక్కేది కాదు.

 ఆయన చనిపోతే ఆ ఆఫీసులో నాకు ఉద్యోగం ఇచ్చారు. 

ఇప్పుడు నా తమ్ముళ్ళతో నాకు మనస్పర్థలు పెరుగుతున్నాయి. 

 నాన్న ఉద్యోగం నాకొచ్చింది కాబట్టి పెద్ద వాడిగా అన్ని బాధ్యతలు  తీసుకోమంటారు బంధువులు.

 అలా తీసుకోవడం నాకు సంతోషమే కానీ 

ఈ విషయంలో నాకూ నా భార్యకూ మధ్య గొడవలు అవుతా ఉన్నాయి.

మనిషికి డబ్బు పుష్కలంగా లేకపోయినా ఉన్నంతలో జీవితాన్ని ఎంత ఆనందంగా అనుభవించవచ్చో మీ నాన్నగారిని చూశాక నాకు తెలిసింది. 

అందుకే మీ ఇల్లు కొని మా తమ్ముల్లను, మా అమ్మ ను ఇందులో చేర్చితే ఆ అదృష్టం మాకూ తగిలి మా సమస్యలు తగ్గుతాయని మా ఆశ.

 చదువుకునే రోజుల్నించీ ఈ ఇల్లు నా ‘డ్రీమ్‌ హౌస్‌’.

 ‘ఇటువంటి మనుషుల మధ్య నేను లేనే’ అని బాధపడేవాణ్ణి. 

కనీసం ఈ ఇంట్లో నివసించే అవకాశం వస్తే అది నా అదృష్టంగా భావిస్తాను.

 ఆస్తులకంటేరక్తసంబందాలు, ఆప్యాయతలు, మమకారాలే ముఖ్యమని నమ్మేవ్యక్తి ని నేను.  

 మా నాన్నగారి రుణం కొంత లో కొంత అయినా నెరవేర్చానన్న తృప్తి నాకు మిగులుతుంది " అన్నాడు రామారావు. 

*    *   *

రామారావు వెళ్ళిపోయాక విజయ్, వినోద్‌లు మౌనంగా కూర్చుండిపోయారు. 

రామారావు చెప్పిన విషయాలే పదేపదే గుర్తుకు రాసాగాయి.

 తమ గుండెలో ఎంతో అపురూపంగా దాచుకోవలసిన జ్ఞాపకాల్ని పరాయివ్యక్తి వచ్చి చెపితే తప్ప గుర్తుచేసుకోలేకపోయినందుకు సిగ్గుపడ్డారు. 

వాళ్ళ మనసులో తప్పుచేసిన భావన కలిగింది. 

పశ్చాత్తాపం మొదలైంది.

రాత్రి భోజనాల సమయంలో సావిత్రి - కొడుకు, కోడళ్ళతో వాళ్ళు ఊరు వదిలివెశ్ళాక జరిగిన విషయాలన్నీ చెప్పింది. 

రామయ్య, బ్యాంకు ఫీల్డ్‌ ఆఫీసరు, ఆశ్రమం మేనేజరు అన్న మాటల్ని చెప్పింది. 

అది విన్న కొడుకుల మనసుల్లో పశ్చాత్తాపం మరింత పెరిగింది.

వినోద్‌కు తండ్రి తమతో తరచుగా చెప్పే కొటేషన్‌ ‘గుడ్‌నెస్‌ ఈజ్‌ ద ఓన్లీ ఇన్‌వెస్ట్‌మెంట్‌ విచ్‌ నెవర్‌ ఫెయిల్స్‌ టు ఎర్న్‌ డివిడెండ్స్‌’ గుర్తొచ్చింది.

‘నిజం నాన్నా, మీ మంచితనం డివిడెండ్లను సంపాదించడమే కాదు, ఎంతోమంది హృదయాల్ని కూడా గెలుచుకుంది. మాలాంటి పాపాత్ముల హృదయాలు తప్ప’ అనుకుని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు.

విజయ్‌ తల్లితో ‘‘అమ్మా, మమ్మల్ని క్షమించు. నాన్న మంచితనాన్ని ఇంతమంది గుర్తించినా మేము కొడుకులమై ఉండీ గుర్తించలేకపోయాం. గొప్పలకుపోయి ఆర్థిక ఇబ్బందుల్లోపడి, బయటి వ్యక్తులు వచ్చి మన ఇంట్లో జరిగిన మధురమైన దృశ్యాల్ని గుర్తుచేస్తే తప్ప గుర్తుకురాని పరిస్థితిలో ఉండిపోయాం. మనం ఇల్లు అమ్మవద్దు. కింది పోర్షను రామారావుగారికి అద్దెకిద్దాం. పై పోర్షను మాత్రం ఖాళీగా ఉంచుదాం. నువ్వు మాతో వచ్చేసెయ్‌. ప్రతి సంవత్సరం వేసవిలో ఇక్కడకు వచ్చి ఓ వారంరోజులు హాయిగా గడుపుదాం. పాత రోజుల్ని గుర్తుచేసుకుని ఆనందిద్దాం’’ అన్నాడు.

‘‘అవునమ్మా, నిన్ను ఇన్నాళ్ళూ నిర్లక్ష్యం చేసినందుకు సిగ్గుపడుతున్నాం. నువ్వు మాతో వచ్చెయ్‌. ఈ ఇంటి గురించీ నాన్నగారి మంచితనం, వ్యక్తిత్వం గురించీ మా పిల్లలకు కూడా చెబుదాం. ఈ ఇంటితోపాటు ఆయన పాటించిన విలువలు కూడా వాళ్ళకు వారసత్వంగా లభించనీ’’ అన్నాడు.

సావిత్రి భర్త ఫొటోవైపు చూసింది.

 ఆయన ఆనందంతో నవ్వుతున్నట్లు కనిపించింది ఆమెకు.

 ‘అవును మరి, మానవత్వపు విలువల్ని పిల్లలకు ఆస్తిగా ఇచ్చారు ఆయన. వాళ్ళు వాటిని నిలుపుకుంటే ఆయన ఆత్మ సం తోషిస్తుంది’ అనుకుంది తృప్తిగా.

మిత్రులారా సమాజంలో ఇలాంటి యధార్థ సంఘటనలు కోకొల్లలు. ఈ రోజు మీరు మంచి హోదా లో ఉండవచ్చు గాక . మీరు ఈ భూమి మీద కు రావటానికి జన్మను ఇచ్చింది ఎవరు? మీరు అనుభవిస్తున్న   ప్రస్తుత   హోదా మీకు రావటానికి కారణం ఎవరు? కేవలం ఆస్తులు మాత్రమే పంచుకుంటాం. వారి బాగోగులు మాకెందుకు అంటూ  జన్మనిచ్చి, కష్టపడి  పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేసిన కనపడే ఆ దేవుళ్ళ ను మరిస్తే ఎలా?  

ఈరోజు మీ తల్లిదండ్రుల ను ఎలా చూస్తున్నారో రేపు భవిష్యత్తులో మీ పిల్లలు మిమ్మల్ని అలాగే చూస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కధ చదివిన తర్వాత అయినా సరే కొంతమంది కొడుకుల మనఃస్తత్వం అయినా మారుతుంది అని ఆశిస్తున్నాను. 

తమ స్వంతం   గురించి పట్టించుకోకుండా పిల్లల భవిష్యత్తే తమ భవిష్యత్తు గా భావించి వారిని మంచి ప్రయోజకులు గా చేసిన ప్రతి ఒక్క  తల్లితండ్రి కి ఈ కధ అంకితం 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

#భార్య

🎲బాత్రూమ్ లో నుండి " ఏమండి" అని పిలిచిందంటే బొద్దింకని కొట్టాలని అర్ధం..

🎲రెస్టారెంట్ లో తిన్నాక " ఏమండీ" అని పిలిచిందంటే బిల్లు కట్టమని అర్ధం

🎲కళ్యాణమండపంలో " ఏమండీ" అని పిలిచిందంటే తెలిసినవారొచ్చారని అర్ధం

🎲బట్టల షాపులో " ఏమండీ" అని పిలిచిందంటే వెతుకుతున్న చీర లభించిందని అర్ధం..

🎲బండిలో వెళ్…

 సతీశంకరుల వృత్తాంతం :(1001)

సేకరణ  మల్లాప్రగడ శ్రీదేవిరామకృష్ణ   

హిమవంతుడు అనే ఒక పర్వతరాజు వుండేవాడు. అతని భార్య మేన. అతనికి ఎంత ప్రయత్నించినా సంతానం కలుగలేదు. ఒకరోజు కశ్యప్రజాపతి వీరికి ఇంటికి చేరుకుంటాడు. రాజు అతనికి మర్యాదలు చేసి ఇలా అంటాడు.. ‘‘ఓ మునీంద్రా! దేనివల్ల అక్షయపుణ్యలోకాలు కలుగుతాయి? దేనివల్ల కీర్తి ప్రాభవాలు కలుగుతాయి? దానికి సంబంధించిన విషయాలుఏంటో వివరించండి...’’ అంటూ కోరుకుంటాడు. 

అప్పుడు ఆ కశ్యపుడు.. ‘‘నాకు ఉత్తమ కుమారులు (దేవతలు) జన్మించడం వల్ల నాకు ప్రజాపతిత్వం, గౌరవం కలిగింది. నువ్వు కూడా తపంచేసి సంతానభాగ్యాన్ని పొందు’’ అని చెప్పి వెళ్లిపోతాడు.

అప్పుడు హిమవంతుడు బ్రహ్మకోసం తపం చేయగా.. బ్రహ్మ అతని ముందు ప్రత్యక్షమవుతాడు. ‘‘నీకు ఒక కొడుకు, కుమార్తెలు జన్మిస్తారు. ఆ కూతురివల్ల నువ్వు కీర్తిమంతుడివి అవుతాయి. ఆమె దేవతలతో కూడా నమస్కరింపబడుతుంది’’ అని వరమిస్తాడు. 

ఆనాడు యోగాగ్నిలో తన శరీరాన్ని దహించజేసుకున్న శివుడి భార్య అయిన సతీదేవి హిమవంతుడికి కుమార్తెగా జన్మిస్తుంది. ఆమె ‘ఉమ’ అనే పేరుతో పిలువబడుతుండేది. ఆమె మహానుభావురాలు. ఆమె ఆత్మ కూడా మూడు విధాలుగా రూపొందించబడింది. అపర్ణ, ఏకపర్ణి, ఏకపాటలు అని ఆ ఆత్మల పేర్లు. అందులో అపర్ణయే ఉమ. 

ఉమ శంకరుని విడిచివుండలేక మహాతపస్సు చేయడానికి బయలుదేరుతుండగా.. తల్లి ఆమెను నివారించి ‘తపము వద్దు’ అని అంటుంది. కాని ఆమె నిశ్చయంగా చేయాల్సిందేనని చెప్పి.. తల్లి అనుమతి తీసుకుని వెళుతుంది. ఆమెతోపాటు ఏకపర్ణి, ఏకపాటలు కూడా తపస్సు చేయడానికి బయలుదేరారు. ఆ ముగ్గురే లోకమాతలు. 

ఉమ మహాదేవుడిని ఆశ్రయిస్తుంది. ఆమె తపస్సుకు లోకాలు కూడా హాహాకారం చేశాయి. అప్పుడు బ్రహ్మ ఆమె తపస్సుకు ప్రసన్నుడై.. ‘అమ్మా! నువ్వు జగజ్జననివి. నీవల్ల ఈ లోకాలు నశింపరాదు. దయచేసి నీ తపమును చాలించు’ అనగా... ఆమె ‘‘పితామహా! నేను ఏమికోరి తపము చేస్తున్నానో నీకు తెలియదా?’’ అని సమాధానం ఇస్తుంది. 

అప్పుడు బ్రహ్మ...‘అమ్మా! నువ్వు కోరినవాడు వెదుక్కుంటూవచ్చి నిన్ను వరిస్తాడు. ఏ రూపంలో వచ్చి అనుగ్రహిస్తాడో తెలియదు. మేము శివుని చరణసేవలం’’ అని అంటాడు. మునులు ఆమె దగ్గరకు వెళ్లి.. ‘‘నువ్వు కోరుకున్న శంకరుడే నీకు పతిగా వస్తాడు. ఇంక నీ తపమును చాలించు’’ అని కోరుకుంటారు. 

ఒకనాడు ఒక వామనుడు అక్కడికి చేరుకుంటాడు. అతని కాళ్లు, చేతులు చాలా పొట్టివి. తల కూడా తుప్ప లాగా వుండేది. ముక్కు వంకరగా తిరిగివుంటుంది. ఏవైపు నుంచి చూసినా.. చాలా అసహ్యంగా వుండేవాడు. అతడు మెల్లగా పార్వతి దగ్గరకు వచ్చి.. ‘ఉమా! నిన్ను వరించడానికి నేను వచ్చాను’’ అని పలుకుతాడు. పార్వతి అతనిని తన యోగమహిమవల్ల పరమశివునిగా గుర్తిస్తుంది. 

పార్వతి అతనిని అర్ఘ్యపాద్యాదులతో పూజించి.. ‘‘స్వామీ! నేను స్వతంత్రురాలిని కాను. నన్ను ఇవ్వడానికి నా తండ్రి వున్నాడు. నా తండ్రి ఆమోదిస్తే.. నేను నీతో వివాహమాడుతాను’’ అని పలుకుతుంది. ఆమె పలికిన మాటలకు సంతోషించి ఆ కపట వేషధారి.. ‘‘అయితే నేను హిమాచలాధీశునే అడుగుతాను’ అని వెళ్లి.. హిమవంతునిచేత పూజితుడై.. తనకు అపర్ణను ఇవ్వమని అడుగుతాడు. 

హిమవంతుడు ఆలోచనలో పడతాడు. ‘‘ఇతని రూపం పరమవికారంగా వుంది. ఇతనికి నా కుమార్తెను ఎలా ఇవ్వగలను? కాదన్నా ఇతడు శపించి వెళతాడేమో’ అని తలచుకుని.. ఆ వామనునితో ఇలా అంటాడు.. ‘‘అయ్యా! నువ్వు నా కుమార్తెను ఇవ్వమని అడుగుతున్నావు. నేను నా కుమార్తెకు స్వయంవరం చాటింతమని కోరుతున్నాను. నువ్వు ఆ స్వయంవరానికి రా... అక్కడ నీ అదృష్టాన్ని పరీక్షించుకో’’ అని అంటాడు. 

ఈ మాటలు విన్న ఆ కుబ్జుడు, పార్వతీ దగ్గరకు వెళ్లి.. ‘‘అపర్ణా! నీ తండ్రి నీకు స్వయంవరం చాటిస్తున్నాడు. అందులో నువ్వు ఎవరినైతే వరిస్తావో అతడే నీ భర్త అవుతాడట. ఈ సంగతి చెప్పి వెళదామని నీ దగ్గరకు వచ్చాను. మన్మథునిలాంటి వాడినే నువ్వు వరిస్తావుగాని.. నాలాంటి వికృతరూపంగల వాడిని ఎలా వరిస్తావు? సెలవిస్తే నేను బయలుదేరుతాను’’ అని అంటాడు. 

ఉమ అతడు చెప్పింది విని.. ‘‘ఓ స్వామీ! నిన్ను నేను శంకరునిగా గుర్తించాను. నాపై నీకున్న అనురాగానికి సంతోషించాను. నేను ఎవ్వరినో ఎందుకు కోరుకుంటాను? నువ్వే నా భర్తవు. నీకు విశ్వాసం కలగాలంటే.. ఇప్పుడే నేను నిన్ను వరించుకుంటాను’’ అంటూ.. ఒక పుష్ఫహారాన్ని ఆ నీలకంఠుని మెడలో వేస్తుంది. 

అప్పుడు అతడు.. ‘‘నువ్వు నన్ను ప్రీతితో వరించావు కాబట్టి నీకు ముసలితనం, మరణం లేకుండా వరాన్నిస్తున్నాను. నువ్వు తపస్సు చేసిన ఈ వనం ఇకనుంచి చిత్రకూటమని పిలువబడుతుంది. ఈ వనానికి వచ్చి దేవపూజకోసం ఎవరైతే పుష్పాలను కోస్తాడో.. అతడు అశ్వమేధఫలాలను పొందుతాడు. ఎవడు ఈ గిరిశిఖరమున తపము చేసి ప్రాణాలు విడుస్తాడో.. అతడు ప్రమథగణంలో ముఖ్యుడవుతాడు’’ అని అంటాడు. 

పార్వతి ఆ పర్వతశికరం దగ్గరే కూర్చుని పరమేశ్వరుని ధ్యానిస్తుంటుంది. ఆ పర్వత శిఖరానికి సమీపంలో ఒక తామర చెరువు గలదు. ఒకరోజు శివుడు ఒక బాలకుని రూపంలో ఆ చెరువులోదిగి బాలక్రీడలు ఆడుతుండగా.. అందులో వున్న మొసలొకటి అతనిని పట్టుకుంటుంది. ఆ బాలుడు పెద్దగా అరుపులు పెడుతూ ఏడుస్తుంటాడు. అదివిన్న పార్వతి ఆ కొలను దగ్గరకు వెళ్లి చూస్తుంది. ‘‘అయ్యో! ఈ మొసలి నన్ను పట్టుకుంది. ఎవరైనా పుణ్యాత్ములు వచ్చి నన్ను కాపాడండి? నేను నా తల్లిదండ్రుల గురించి విచారిస్తున్నాను. వారికి నేనొక్కడినే పుత్రుడ్ని. నా మరణవార్త విని వాళ్లు కూడా మృతిచెందుతారు. దైవనిర్ణయాన్ని కాదని చెప్పేవాళ్లు ఎవరు? అని విచారిస్తుంటాడు. 

అక్కడకు చేరుకున్న పార్వతి ఆ మొసలితో.. ‘‘ఓ నక్రమా! నీవెందుకు ఈ బ్రాహ్మణవటువును మింగుతున్నావు? కనికరించి అతనిని వదిలిపెట్టు’’ అనగా.. మొసలి ‘‘తల్లీ! ఇక్కడికి వచ్చే ఏ ప్రాణినైనా భక్షించి జీవనాన్ని గడుపుమని బ్రహ్మ నాకు చెప్పాడు. ఈరోజు నాకు ఈ బాలుడు దొరికాడు. ఎలా వదలగలను?’’ అని అంటాడు. అప్పుడు పార్వతి.. ‘‘ఓ జలచరమా! నేను హిమవంతుని పుత్రికను. నేను ఇన్నాళ్లూ చేసిన తపము నీకిస్తాను. ఆ బాలుడిని వదిలిపెట్టు’’ అని అంటుంది. 

ఆ మాటలు విన్న మొసలి.. ‘‘నువ్వు ఉత్తమంగా భావించే తపము కొంచెమైనా నాకివ్వు’’ అనగా.. పార్వతి ‘‘నేను పుట్టినప్పటినుండి ఏ పుణ్యాలు చేశానో.. ఆ పుణ్యాలు వాటి ఫలాలు నీకిచ్చేస్తున్నాను. ఆ బాలుడిని వదిలిపెట్టు’’ అని కోరుకుంటుంది. అందుకు మొసలి.. ‘‘ఉమాదేవీ! ఇంత కష్టపడి చేసిన తపమును వదులుకుంటున్నావా? పెద్దలు వింటే నిన్ను మెచ్చుకోరు’’ అని అంటాడు. 

పార్వతి తిరిగి ఘోరతపస్సు చేయడం ప్రారంభిస్తుంది.  పరమేశ్వరుడు అక్కడకు ప్రత్యక్షమై.. ‘‘అపర్ణా! నువ్వు చేసిన తప: ఫలమును ధారపోయగా.. దానిని నేను గ్రహించాను. అది నీకు అక్షయమైన ఫలితాలనిస్తుంది. ఇక ఈ తపము చాలించు’’ అని పలుకగా.. పార్వతి తన తపము ఫలించినందుకు చాలా ఆనందిస్తుంది.

***