సీతాపతీ పద్య కావ్యము
సీసము
ప్రేమయే మనిషికి పెట్టని కోట నౌ
ప్రేమను పొందియు ప్రేమ పంచు
తల ఎత్తు దించకు - దింపేను లోకము
ధర్మము తప్పకు - ధరణి నమ్ము
కష్టాలు తప్పవు - కాష్టంలకాలేను
కొమ్మలు ఒంగితే .. కోరి కొద్దు
సహనం చూపుతూ సమభావ ముంచుము
లక్ష్మణా కళలకు లొంగి ఉండు
ఆటవెలది
వాన నీరు వీలు వాలును బట్టియు
మనిషి ఓర్పు నేర్పు మనసు బట్టి
రకరకాల పంట దిగుబడి జరుగును
ధనము కూర్చి ఆశ దారి పోకు.............103
--(())--
సీసము
ఏకాగ్రత వలన - ఏదైన సాధించు
ఎంత తరుణమైన - ఎనక ముందు
సవ్యసమర్ధత - శాంతము కలిగించు
ఆట లాడుచు ఉన్న - ఆశ పెరుగు
పనులన్ని చేయుచూ - ప్రీతిని కల్పించు
యజమాని యైయుండి - యదను పంచు
వదలక మెదలక - ఏర్పాటు చేసిన
లక్ష్మణా రుచులేలు - లలిత మగును
తేటగీతి
క్షణమొక యుగం అవసర క్షణము ఏది
ఒక అలక్ష్యంమ్ము జీవితం మొకటి మార్చు
జీవ జవసత్వాలుగా జాడ్య మవ్వు
నీదు లక్ష్యము మరువక నిలకడుంచు
--(())--
సమ్మోహనాలు .. కోయిలా
తెల్లారె కోకిలా కోకిల కూయనెలా
కూయగానె సంతోషం గలిగె ఈశ్వరా
అదియు వసంత పిలుపు పిలుపే మేలుకొలుపు
మేలుకొలుపు తోను ఆనందం ఈశ్వరా
తరువులే చిగురించు చిగురుతొ సంతసించు
సంతసము కోయిల పంచుకొనును ఈశ్వరా
మాటకు మాట లాగ మాటల కూతలాగ
కూతతోనె పిలిచే కోయిలా ఈశ్వరా
రూపము చూడ నలుపు నలుపు తో మైమరపు
మైమరపు గానముతొ కోయిలా ఈశ్వరా
చల్లని వేళయనీ వేళలొ పిలుపులనీ
పిలుపులు హాయిని గొలుపు మనసుకు ఈశ్వరా
ప్రకృతి పరవశముతో పరవశ ప్రేమతో
ప్రేమ పిలుపు కోయిల రాగమే ఈశ్వరా
కోయిల రాగాల తొ రాగ అనురాగముతొ
అనురాగము కుహు కుహు అనిపిలుచు ఈశ్వరా
--(())--
శివుడుని కపాలీశ్వరుడు అని ఎందుకు అంటారు స్మశానంలో ఎందుకు నివసిస్తాడు🙏
శివ అనే పదానికి శుభం, మంగళకరం, కళ్యాణం, భద్రం, విశ్వశ్రేయస్సు, సర్వ సంరక్షణం, మోక్షప్రదాయకం అనే అర్థాలున్నాయి. అందరూ అమంగళ కరమైనవిగా భావించే శ్మశానం, కపాలం, చితాభస్మం, విషసర్పాలు వంటివి శివుడికి ప్రీతిపాత్రమైనవి. ఆయన శ్మశానంలో నివసిస్తాడు. చితాభస్మాన్ని ఒంటికి పూసుకుంటాడు. విషసర్పాలను ఆభరణాలుగా ధరిస్తాడు. అయినప్పటికీ ఆయన మంగళ ప్రదాత, మంగళస్వరూపుడు. సర్వదేవతా వంద్యుడు.
ఈ సృష్టిలోని ప్రతి వస్తువు ఎప్పుడో ఒకప్పుడు బూడిదగా మారాల్సిందే! అలాంటి వస్తువులపై మమకారం తగదన్న విషయాన్ని ఆయన పూసుకునే విభూది సూచిస్తుంటుంది. ఈ భస్మం కూడ సామాన్య మానవులు ధరించే భస్మం వంటిది కాదు.
మహాపురుషుల మరణానంతరం, వారి చితాభస్మాన్ని శివయ్య తన శిరస్సుపై పోసుకుంటాడు. అలా నిష్ఠాపరులైన వారి కపాల మాలనే మెడలో అలంకరించుకుంటాడు. అందుకే ఆయన కపాలీశ్వరుడయ్యాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే, కర్మలన్నీ, జ్ఞానమనే అగ్నిచేత దహించబడగా మిగిలేది భస్మం మాత్రమే. అదే జ్ఞానైశ్వరం.
ఈ విభూతి మహిమ అమోఘం. ఈ విభూతితోనే అరుంధతి, మృత విప్రుడిని బ్రతికించింది. బూడిద రాశులుగా మారిన కశ్యపాది మహర్షులను వీరభద్రుడు భస్మం చల్లి తిరిగి బ్రతికించాడు. దుర్వాసమహాముని శివుడు ప్రసాదించిన విభూతిని ధరించి, బ్రహ్మ హత్యాపాతకాన్ని నివారించుకున్నాడు. కుంభీపాక నరకంలో పడ్డ పాపాత్ములు, దుర్వాసమహాముని ధరించిన విభూతి రేణువులు పడగానే పుణ్యాత్ములుగా మారిపోయారు.
తన జీవితమంతా డబ్బు సంపాదించడం కోసమని,భార్య ,పిల్లలు,పరువు,ప్రతిష్టలంటూ క్షణం కూడా తీరిక లేకుండా,తీరిక ఉన్నా ఇంక సంపాదించాలన్న కోరికతోనూ జీవితాన్ని గడిపిన మనిషి,చనిపోయి స్మశానంలో పూడ్చిపెట్టాక,మిగితావి ఏవి పట్టకుండా సుఖంగా నిద్రిస్తాడు. అప్పటివరకు నావి,నావే అనుకున్న మనిషి “నా”అనుకున్న వాటిని వదిలేస్తాడు. ఇక్కడ మనం అర్ధం చేసుకోవలసింది.. శ్మశానం అంటే ఎటువంటి భయాలు, ఆశలు, కోరికలు, కోపాలు, ఆందోళనలు, బంధాలు లేని ప్రదేశం. అక్కడున్న శరీరాలు ఎండకు, చలికి, వర్షానికి దేనికి కూడా చలించవు. ఎవరు ప్రతి కర్మను కర్తవ్యంగా చేస్తారో, నిత్యం ప్రశాంతంగా ఉంటారో, సుఖః దుఃఖాలను సమానంగా చూస్తారో, ప్రతి విషయానికి ఆవేశ పడరో, అటువంటి వారి మనసు కూడా స్మశానం లాగా దేనికి చలించకుండా ఉంటుంది.అటువంటి వారి మనసులో శివుడుంటాడని అర్ధం. భగవద్గీతలో కృష్ణుడు కూడా తనకు అలాంటి వారంటేనే ఇష్టం అని చెప్పాడు. అందుకే శివుడు స్మశానవాసి అన్నారు.
అంతేకాదు ఎంతగొప్పవాడైనా, బీదవాడైన, ఎంత తప్పించుకుందామన్న ఆఖరున చేరేది స్మశానానికే. అలాగే ప్రతి జీవుడు(ఆత్మ) ఆఖరున ఏ పరమాత్మను చేరాలో, ఏ ప్రదేశాన్ని చేరడం శాశ్వతమో, ఎక్కడకు చేరిన తరువాత ఇక తిరిగి జన్మించడం ఉండదో, ఆ కైవల్యపదమే శివుడి నివాస స్థానం అని అర్ధం. ఆలయంలో ఆడంబరాలు వుంటాయి. పూజా విధానాలు వుంటాయి. కాని శ్మశానంలో ఏమి ఉండవు. కాలుతున్న శవాలు, బూడిద తప్ప. ఆ బూడిదే సత్యం. అందుకే శివుడు ఎప్పుడూ బూడిద ధరిస్తాడు. అదే ఆయన ఆభరణం. అందుకే ఆయన నివాసం శ్మశానం.
__(())--
ఓం నమః శివాయ🙏
ఆచమనం విశిష్టత
మనం చేసే ఆచమనంలో వైదికాంశాలతోపాటు వైజ్ఞానిక రహస్యాలు కూడా ఇమిడి ఉన్నాయి..
మన గొంతులో 'స్వరపేటిక' అనే శరీర అంతర్భాగం వుంటుంది. మనం చేసే ధ్వనులు అంటే మన మాటలు స్వరపేటిక నుండే పుడతాయి. మన ధ్వని గాంభీర్యానికి, స్పష్టతకు ఈ స్వరపేటికే ఆ ధారం. స్వరపేటికలోకి గాలి జొరబడినప్పుడు అంటే మన శ్వాసకోశాల నుండి వెలువడే ఉచ్ఛ్వాస వాయువు ధ్వని తంతులమీదుగా పయనించినప్పుడు, ఈ ధ్వని తంతువులలో ఏర్పడిన శబ్దాలు బయటకు రావడానికి నోరు, ముక్కు రంధ్రాలు సహాయపడతాయి.. 🙏
అదేవిధంగా నాలుక పెదవులు శబ్దాల ఉచ్ఛారణకు, స్పష్టతకు దోహదం చేస్తాయి. ప్రతి అక్షరానికి తనదైన ధ్వని ఉంటుంది. నోటిలోని అవయవాలు కదులుతూ ఈ ధ్వనులను ఉత్పత్తి చేస్తాయి. ఈ ధ్వని (అక్షరం) ఏ భాగం నుండి ఉత్పత్తి అవుతుందో దాని ఆధారంగా అక్షరాలను కాంఠ్యాలు, తాలవ్యాలు మొదలైనవిగా విభజించారు. ఇక మనం వైదిక కర్మలను ఆచరించేటప్పుడు చేసే ఆచమనం వలన మన నాలుకకు, గొంతుకు ఒకరకమైన ఉత్తేజం కలుగుతుంది.. 🙏
అంతేకాకుండా మన గొంతునుండి మాట బయటకు వచ్చేటప్పుడు, ధ్వనితోపాటు గొంతు నుండి వాయువు కూడా బయటకు వస్తుంది. ఈ విధంగా లోపలి నుండి వాయువు బయటకు వచ్చేటప్పుడు ఎలాంటి అడ్డంకి లేకుండా ఉండేందుకు ఆచమనం ద్వారా మనం త్రాగే నీరు ఉపయోగపడుతుంది.. 🙏
నిర్దిష్ట పరమాణంలో మనం తీసుకున్న నీరు గొంతు నుండి వెలుపలివైపు మార్గాన్ని నునుపుగా చేసి మన మాట సులభంగా, స్పష్టంగా వచ్చేందుకు దోహదం చేస్తుంది. పూజాది వైదిక కార్యాలను ఆచరించేటప్పుడు మంత్రోచ్చారణ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఆయా మంత్రాలన్నీ గొంతునుండి ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చేందుకే మన మహర్షులు ఈ ఆచమన సంప్రదయాన్ని ఏర్పరచారు.. 🙏
ఇక ఆచమనంలో కేశవాది నామాలను ఉచ్చరించడంలో కూడా ఎంతో వైజ్ఞానిక అంశం ఇమిడి ఉంది. ఆచమనంలో ముందుగా "కేశవాయస్వాహా: అని చెప్పుకుంటారు. ‘కే’ శబ్దము గొంతునుండి పుడుతుంది. తర్వాత పలికే "నారయణస్వాహా" అనే నామము నాలుక నుండి వస్తుంది. ఇక మూడవసారి చెప్పుకునే "మాధవాయస్వాహా" అనే పదము పెదవుల సహాయంతో పలుక బడుతుంది. కాబట్టి కేశవాది నామాలను పలకడం వలన గొంతుకు, నాలుకకు, పెదవులకు ఒకేసారి వ్యాయామం కలుగుతుంది మరియు ఆ తరువాత వచ్చే శబ్దాలకు ఉచ్చారణ కూడా స్పష్టంగా ఉంతుంది.. 🙏
మన శరీరము ఒక విద్యుత్ కేంద్రములాంటిది, మన శరీరమంతా విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. ఆచమన సమయంలో మనం అరచేతిలో తక్కువ ప్రమాణంలో నీటిని వేసుకున్నప్పుడు ఎలక్ట్రో మాగ్నిటిజమ్ పద్ధతిలో అరచేతిలో ఉన్న నీరు పీల్చుకొంటుంది. ఈ నీటిని త్రాగినప్పుడు, నీరు జీర్ణకోశమును చేరి, అక్కడి గోడలలో ప్రవహించే విద్యుత్తుతో కలిసి, శరీరమంతా ఒకే క్రమపద్ధతిలో విద్యుత్తు ప్రవహించేలాగా చేస్తుంది.. 🙏
ఇలా విద్యుత్తీకరణము చెందిన నీరువల్ల గొంతు, నాలుక, స్వరపేటిక మొ|| భాగాలు కూడా ఉత్తేజము పొందుతాయి.. 🙏
ఇంతటి వైజ్ఞానికాంశాలు ఇమిడి ఉన్నాయి కాబట్టే, మన మహర్షులు ఆచమనాన్ని ఒక తప్పనిసరి వైదిక నియమంగా ఏర్పరిచారు..🙏
!! ఓం నమో వేంకటేశాయ !! 🙏
!! సర్వం శ్రీవెంకటేశ్వరార్పణమస్తు !! 🙏
ప్రదోషము
ప్రదోషం అంటే దోషాలను తొలగించేది అని అర్థం.
ప్రతి రోజూ సూర్యాస్తమయ కాలంలో దాదాపు ఆరు ఘడియల (రెండు గంటల 24 నిమిషాల) సమయాన్ని ప్రదోష కాలంగా పరిగణిస్తారు
. ప్రదోష కాలములో త్రయోదశి తిథి ఉంటే దానిని మహా ప్రదోషం అంటారు.
మహా ప్రదోషం రోజున శివ భక్తులు ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు.
రెండు త్రయోదశి తిథులలో (శుక్ల పక్షము మరియు కృష్ణ పక్షము) ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు.
కొన్ని ప్రాంతాలలో మాత్రం కేవలం కృష్ణ పక్ష ప్రదోషం రోజును మాత్రమే పాటిస్తారు.
ప్రదోష సమయంలో శివుడు అర్థనారీశ్వర రూపంలో ఆనంద తాండవ నృత్యం చేస్తాడని నృత్యరత్నావళి లో చెప్పబడింది.
ప్రదోష సమయంలో సమస్త దేవతలందరూ శివుడిని అర్చిస్తారని భావిస్తారు. ప్రదోష సమయంలో చేసే శివారాధన ఉత్తమమని చెప్పబడుతుంది. ఈ సమయంలో శివారాధన చేయటాన్ని సమస్త దేవతలను పూజించటంతో సమానంగా భావిస్తారు.
ప్రదోష సమయంలో శివాలయాలలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు సిద్ధిస్తాయని భావిస్తారు. ఈ సమయంలో శివుడితో పాటు నందీశ్వరుడిని కూడా ఆరాధిస్తారు. నందీశ్వరుడిని ఆరాధించడం వలన బుద్ధికుశలత, మానసిక ఉల్లాసం లభిస్తాయి.
ఆదివారం రోజు వస్తే దానిని రవి ప్రదోషం అని,
సోమవారం రోజు వస్తే దానిని సోమ ప్రదోషమనీ,
మంగళవారం రోజు వస్తే దానిని భౌమ ప్రదోషమని,
బుధవారం రోజు వస్తే దానిని బుధ ప్రదోషమని,
గురువారం రోజు వస్తే దానిని గురు ప్రదోషమని,
శుక్రవారం రోజు వస్తే దానిని శుక్ర ప్రదోషమని,
శనివారం రోజు వస్తే దానిని శని త్రయోదశి అనీ, శని ప్రదోషమని పిలుస్తారు.
వీటిలో శుక్ల పక్షంలో వచ్చే సోమ ప్రదోషం, కృష్ణపక్షంలో వచ్చే శని ప్రదోషములు విశేషమైనవిగా భావిస్తారు.
సాయంకాలం ప్రదోష సమయంలో స్నానమాచరించి శివ షోడశోపచార పూజ జరపాలి. ప్రదోషం రోజు ఆ పరమశివుడికి నేతి దీపారాధన, ఆవుపాలతో అభిషేకం చేయటం, బిల్వ పత్రాలు మరియు శంఖుపూలతో అర్చించటం శ్రేయస్కరం. మహా మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించి ప్రదోష కథను వినటంగానీ చదవటం గానీ చేయాలి. ఇంటిలో పూజ ముగించిన అనంతరం శివాలయాన్ని దర్శించాలి. వీలైనవారు ప్రదోష స్తోత్రం, శివ స్తోత్రములను కూడా పఠించాలి.
🍁🍁🍁🍁🍁
🌹 . శ్రీ శివ మహా పురాణము - 379🌹
మీ అభిప్రాయాలు తెలపండి
ReplyDelete