సుభాషితాలు !
గుణ దోషౌ బుధో గృణ్హన్ ఇందు క్ష్వేడా వివేశ్వరః
శిరసా శ్లాఘ్య తే పూర్వం పరం కంఠే నియచ్ఛతి!
శివుడు గరళమును కంఠము నందుంచు కొని, చంద్రకళను శిరమున ధరించినట్లుగా పండితుడైనవాడు పరుల దోషములను లోపలే వుంచుకొని, గుణలేశములను శిరసావహిస్తాడు.
సతాం ధనమ్ సాధుభి రేవ భుజ్యతే
దురాత్మభి రుదుశ్చరితా త్మనామ్ ధనం
శుకాదయ శ్చూత ఫలాని భుజంతే
భవంతి నింబా: ఖలు కాకభోజనాః
మంచివారి సంపదలు మంచివారికే అనుభవానికి వస్తాయి. దురాత్ముల దానములు దుష్టచరిత్రులకే వినియోగ పడతాయి. మామిడిపండ్లను చిలుకలు ఆరగిస్తాయి. వేపపండ్లు కాకులకే భుక్తం అవుతాయి.
ఇది లోకములో జరుగుతూనే వున్నది.కదా!
మనసులో సద్గుణాలను బాగా వృద్ధి చేయండి, నేల దున్ని కలుపు తీయండి బుద్ధిని మధించి పాపాలనే కలుపు మొక్కల్ని తరిమి వేయండి.
భుక్తి కై అన్ని విధాలా కృషి చేయండి ముక్తి కై సర్వ విధాల పాటు పడండి.
తన రహస్యము నోకనితో చెప్పి మరల నితరులకు చెప్ప వలదని హెచ్చరించు కంటే చెప్పక యుండుట కరము మేలు నాల్క దాటిన మాటలు నగరు దాటు మామూలుగా లోకం లో చాలా మంది రహస్యమని
ఒకరితో చెప్పి ఇంకెవరికీ చెప్ప వద్దని చెప్తూ వుంటారు.
మన తెలుగులో ఒక సామెత వుంది
"పెదవి దాటితే పృథ్వి దాటుతుంది" అని అందుకని చెప్పకుండా ఉండడమే మేలు కదా!
--((***))--
🕉ఓం శ్రీమాత్రే నమః 🕉
అద్వైత చైతన్య జాగృతి
గంగా తరంగ రమణీయ జటా కలాపం
గౌరీ నిరంతర విభూషిత వామ భాగం
నారాయణ ప్రియమనంగ మదాపహారం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 1 ||
వాచామగోచరమనేక గుణ స్వరూపం
వాగీశ విష్ణు సుర సేవిత పాద పద్మం
వామేణ విగ్రహ వరేన కలత్రవంతం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 2 ||
భూతాదిపం భుజగ భూషణ భూషితాంగం
వ్యాఘ్రాంజినాం బరధరం, జటిలం, త్రినేత్రం
పాశాంకుశాభయ వరప్రద శూలపాణిం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 3 ||
సీతాంశు శోభిత కిరీట విరాజమానం
బాలేక్షణాతల విశోషిత పంచబాణం
నాగాధిపా రచిత బాసుర కర్ణ పూరం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 4 ||
పంచాననం దురిత మత్త మతంగజానాం
నాగాంతకం ధనుజ పుంగవ పన్నాగానాం
దావానలం మరణ శోక జరాటవీనాం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 5 ||
తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం
ఆనంద కందమపరాజిత మప్రమేయం
నాగాత్మకం సకల నిష్కళమాత్మ రూపం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 6 ||
ఆశాం విహాయ పరిహృత్య పరశ్య నిందాం
పాపే రథిం చ సునివార్య మనస్సమాధౌ
ఆధాయ హృత్-కమల మధ్య గతం పరేశం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 7 ||
రాగాధి దోష రహితం స్వజనానురాగం
వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం
మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 8 ||
వారాణసీ పుర పతే స్థవనం శివస్య
వ్యాఖ్యాతమ్ అష్టకమిదం పఠతే మనుష్య
విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం
సంప్రాప్య దేవ నిలయే లభతే చ మోక్షమ్ ||
విశ్వనాధాష్టకమిదం పుణ్యం యః పఠేః శివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేనసహ మోదతే ||
--((**))--
కాశీవిశ్వనాథాష్టకం -తాత్పర్యం
*******************
గంగాధరుడు
************
గంగా తరంగ రమణీయ జటా కలాపం,
గౌరీ నిరంతర విభూషిత వామ భాగం
నారాయణ ప్రియ మనంగ మదాపహారం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం
తాత్పర్యం:
************
గంగా నదీ అలలను తన జటాఝూటంలో అందంగా కలిగిన, తన ఎడమ వైపు పార్వతీ దేవి ఎల్లప్పుడూ శోభించే, శ్రీహరికి ప్రియుడైన, మన్మథుని గర్వము అణచిన, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.
వామే శక్తి ధరం వందే వకారాయ నమో నమః
వాచామగోచరమనేక గుణ స్వరూపం
వాగీశ విష్ణు సుర సేవిత పాద పీఠం
వామేన విగ్రహ వరేణ కళత్రవంతం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం
తాత్పర్యం:
************
పదములకు, వర్ణనకు అందని అనేక గుణాలు కలిగిన స్వరూపంతో ఉన్న, బ్రహ్మ విష్ణు మరియు ఇతర దేవతలచే సేవించబడిన పాదములు కలిగిన, తన ఎడమ వైపు శుభములు కలిగించే పార్వతిని కలిగి ఉన్న, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.
పులిచర్మము ధరించిన శశిధరుడు
భూతాధిపం భుజగ భూషణ భూషితాంగం
వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం
పాశాంకుశాభయ వర ప్రద శూల పాణిం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం
తాత్పర్యం:
************
సమస్త భూతములకు అధిపతియైన, సర్పములను ఆభరణంగా కలిగిన, పులిచర్మం వస్త్రంగా ధరించిన, జడలు కట్టిన కేశములు కలిగిన, పాశము (తాడు), అంకుశము, త్రిశూలము ధరించిన, అభయము, వరాలను ప్రసాదించే, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.
నెలవంక సిగపూవు నవ్వగా
శీతాంశు శోభిత కిరీట విరాజమానం
ఫాలేక్షణానల విశోషిత పంచ బాణం
నాగాధిపారచిత భాసుర కర్మ పూరం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం
తాత్పర్యం:
************
చల్లదనాన్ని ఇచ్చే చంద్రుని కిరీటముగా కలిగి భాసిల్లుతున్న, తన ఉగ్రనేత్రముతో మన్మథుని దగ్ధము చేసిన, నాగేంద్రుని కర్ణములకు అలంకారముగా ధరించిన, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.
రౌద్రమున, ఆనందమున తాండవము
పంచాననం దురిత మత్త మతంగజానాం
నాగాంతకం దనుజ పుంగవ పన్నగానాం
దావానలం మరణ శోక జరాటవీనాం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం
తాత్పర్యం:
************
మదించిన ఏనుగులపాలిటి సింహంలా ఉన్న, అసురులపాలిటి గరుత్మంతుని వలె ఉన్న, మరణాన్ని, శోకాన్ని, వృద్ధాప్యాన్ని నాశనం చేసే అగ్నిలా ఉన్న, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.
నిరంజనుడు, నిర్గుణుడు
తేజోమయం సుగుణ నిర్గుణమద్వితీయం
ఆనందకందమపరాజితమప్రమేయం
నాగాత్మకం సకల నిష్కలమాత్మ రూపం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం
తాత్పర్యం:
************
తేజస్సు కలిగి, సుగుణములు కలిగి, గుణములు లేని, వేరే సాటిలేని, ఆనందకారకుడైన, ఓటమి ఎరుగని, తర్కానికి అందని, సర్పములకు ఆత్మయై, అన్ని శుద్ధ స్వరూపములు తానేయై, ఆత్మ స్వరూపుడైన, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.
సచ్చిదానందుడు
ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందా
పాపే రతిం చ సునివార్య మనః సమాధౌ
ఆదాయ హృత్ కమల మధ్య గతం పరేశం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం
తాత్పర్యం:
************
ఏ కోరికలూ లేనివాడైన, దోషములు ఎంచని, నింద చేయని, పాపములకు దూరముగా ఉండి సమాధి స్థితిలో ఉన్న హృదయకమలము మధ్యలో నివసించి ఉన్న, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.
గరళ కంఠుడు
రాగాది దోష రహితం స్వజనానురాగం,
వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహయం,
మాధుర్య ధైర్య శుభగం గరళాభిరామం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం
తాత్పర్యం:
**************
రాగద్వేషాది దోషములు ఎరుగని, తన భక్తులను ప్రేమతో చూసే, వైరాగ్యము, శాంతికి నిలయమై, హిమవంతుని పుత్రిక సహాయం పొందుతూ, మాధుర్యము, ధైర్యము కలిగి విషాన్ని ధరించిన, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము
ఫలశ్రుతి:
***********
వారాణసీ పురపతే స్తవనం శివస్య
వ్యాఖ్యాతమష్టకమిదం పఠతే మనుష్యః
విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంతకీర్తిం
సంప్రాప్య దేహ విలయే లభతే చ మోక్షం
తాత్పర్యం:
************
వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని అష్టకాన్ని పఠనం చేసే మనుష్యులకు దేహమున్నప్పుడు విద్య, మంచి, ఎనలేని సుఖము, అనంతమైన కీర్తి, అటు తర్వాత మోక్షము లభించును.
విశ్వనాథాష్టకమిదం యః పఠేచ్ఛివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే
తాత్పర్యం:
************
ఈ విశ్వనాథ అష్టకం శివుని సన్నిధిలో చదివిన వారికి శివలోకము, ఆ పరమశివుని ఆశీస్సులు పొందుదురు.
అంతర్యామి - అంతయును నీవే
--((**))--
*బ్రహ్మమురారిసురార్చిత లింగం*
బ్రహ్మ ,విష్ణు , దేవతల చేత పూజింపబడ్డ లింగం..!!
*నిర్మల భాషిత శోభిత లింగం*
నిర్మలమైన మాటల చేత అలంకరింపబడ్డ లింగం..!!
*జన్మజ దుఃఖ వినాశక లింగం*
జన్మ వల్ల పుట్టిన బాధలను నాశనం చేసే లింగం..!!
ఉ
*తత్ ప్రణమామి సదాశివ లింగం*
ఓ సదా శివ లింగం నీకు నమస్కారం..!!
*దేవముని ప్రవరార్చిత లింగం*
దేవమునులు మహా ఋషులు పూజింప లింగం..!!
*కామదహన కరుణాకర లింగం*
మన్మధుడిని దహనం చేసిన , అపారమైన కరుణను చూపే చేతులు గల శివలింగం..!!
*రావణ దర్ప వినాశక లింగం*
రావణుడి గర్వాన్ని నాశనం చేసినట్టి శివ లింగం..!!
*తత్ ప్రణమామి సదా శివ లింగం*
నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!
*సర్వ సుగంధ సులేపిత లింగం*
అన్ని మంచి గంధాలు , మంచి గా పూసిన శివ లింగం..!!
*బుద్ధి వివర్ధన కారణ లింగం*
మనుషుల బుద్ధి వికాసానికి కారణ మైన శివ లింగం ..!!
*సిద్ధ సురాసుర వందిత లింగం*
సిద్ధులు , దేవతలు , రాక్షసుల చేత కీర్తింపబడ్డ శివ లింగం..!!
*తత్ ప్రణమామి సదా శివ లింగం*
నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!
*కనక మహామణి భూషిత లింగం*
బంగారు , మహా మణుల చేత అలంకరింప బడ్డ శివ లింగం..!!
*ఫణిపతి వేష్టిత శోభిత లింగం*
నాగరాజు నివాసం చేత అలంకరింపబడ్డ శివ లింగం..!!
*దక్ష సుయజ్ఞ వినాశక లింగం*
దక్షుడు చేసిన మంచి యజ్ఞాన్ని నాశనం చేసిన శివ లింగం..!!
*తత్ ప్రణమామి సదా శివ లింగం*
నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!
*కుంకుమ చందన లేపిత లింగం*
కుంకుమ , గంధము పూయబడ్డ శివ లింగం..!!
*పంకజ హార సుశోభిత లింగం*
కలువల దండ చేత చక్కగా అలంకరింప బడ్డ శివ లింగం..!!
*సంచిత పాప వినాశక లింగం*
సంక్రమించిన పాపాలని నాశనం చేసే శివ లింగం..!!
*తత్ ప్రణమామి సదా శివ లింగం*
నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!
*దేవగణార్చిత సేవిత లింగం*
దేవ గణాల చేత పూజింప బడ్డ , సేవించ బడ్డ శివ లింగం..!!
*భావై ర్భక్తీ భిరేవచ లింగం*
చక్కటి భావం తో కూడిన భక్తీ చేత పూజింప బడ్డ శివ లింగం..!!
*దినకర కోటి ప్రభాకర లింగం*
కోటి సూర్యుల కాంతితో వెలిగే మరో సూర్య బింబం లాంటి శివ లింగం..!!
*తత్ ప్రణమామి సదా శివ లింగం*
నీకు ఇవే నా నమస్కారాలు, ఓ సదా శివ లింగమా ..!!
*అష్ట దలోపరి వేష్టిత లింగం*
ఎనిమిది రకాల ఆకుల మీద నివాసముండే శివ లింగం..!!
*సర్వ సముద్భవ కారణ లింగం*
అన్నీ సమానంగా జన్మించడానికి కారణమైన శివ లింగం..!!
*అష్ట దరిద్ర వినాశక లింగం*
ఎనిమిది రకాల దరిద్రాలను (అష్ట దరిద్రాలు) నాశనం చేసే శివ లింగం..!!
*తత్ ప్రణమామి సదా శివ లింగం*
నీకు ఇవే నా నమస్కారాలు, ఓ సదా శివ లింగమా ..!!
*సురగురు సురవర పూజిత లింగం*
దేవ గురువు (బృహస్పతి), దేవతల చేత పూజింప బడ్డ శివ లింగం..!!
*సురవన పుష్ప సదార్చిత లింగం*
దేవతల తోటల్లో పూచే పువ్వులు (పారిజాతాలు) చేత ఎప్పుడూ పూజింప బడే శివ లింగం..!!
*పరమపదం పరమాత్మక లింగం*
ఓ శివ లింగమా, నీ సన్నిధి ఏ ఒక స్వర్గము
*తత్ ప్రణమామి సదా శివ లింగం*
నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!
*లింగాష్టక మిదం పుణ్యం యః పట్టేత్ శివ సన్నిధౌ*
ఎప్పుడైతే శివుడి సన్నిధిలో చదవబడుతుందో , వారికి చాలా పుణ్యం వస్తుంది..!!
*శివ లోక మవాప్నోతి శివేన సహమోదతే*
శివ లోకం లభిస్తుంది ..!!
శివుడి లో ఐక్యమయ్యే మార్గం దొరుకుతుంది.
⚜సర్వేజనా సుఖినో భవంతు..⚜
సమ్మోహనాల ప్రక్రియ "సుందరకాండ"
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఈశ్వరునికే తెలియపరుస్తూ సుందరాకాండ రామాయణము ఇది
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు (01.... 10)
ఆకాశ మార్గాన
మార్గాన తరుణాన
తరుణాన హనుమ లంకకు కదిలె ఈశ్వరా
సీతా న్వేషణ కే
అన్వేషణ కొరకే
కొరకే వానరుల ప్రోత్సాహం చేసేను
సీతయోక్క జాడకు
జాడ తెలిసి కొనుటకు
తెలిసికొను ఉద్దేశ్యంతో కదిలె హనుమంతు
సముద్ర లంఘణమే
లంఘణ దుష్కరమే
దుష్కరమే అయిన సాగె హనుమ ఈశ్వరా
తలను మెడను పెంచి
పెంచీ ప్రకాశించి
ప్రకాశించి ఆబోతువలె హనుమ ఈశ్వరా
పచ్చిక బీళ్ళయందు
బీళ్ళ కదిలే ముందు
కదిలే ధైర్యశాలి హనుమంతు ఈశ్వరా
వక్షస్థలము చేత
చేత తరువుల చెంత
చెంత సింహము విజ్రుంభన వలె హనుమంతు
సహజధాతువులతో
ధాతువులందమతో
అందము కిన్నర గంధర్వ లే ఈశ్వరా
మహేంద్ర పర్వతము
పర్వతము ప్రాంతము
ప్రాంతమే అద్భుతము
అద్భుతమేన గజము
గజము వలె ప్రకాశించెను హనుమంతు
హనుమాన్ సూర్యునకే
సూర్యునకె, ఇంద్రకే
ఇంద్ర వాయువు కు నమస్కరించే ఈశ్వరా
--(())--
నేటి హాస్యం
భర్త : పక్కింటావిడ ఎలా
చనిపోయింది?
భార్య : పప్పుల రేట్లు పెరగడంతో...
భర్త : కామెడీ చేయకు..
పప్పుల రేట్ల పెరిగితే
ఎవరైనాచనిపోతారా?
భార్య: నిఝమండీ.
నా కళ్ళతో ఆవిడ Death
Certificate చూశాను.
భర్త: ఏమని రాశారు?
భార్య: 'DEATH DUE TO HIGH
PULSE RATE'
భర్త కోమాలోకి....
శ్రీమతి గారు ఈరోజు భగవద్గీత గురించి కధగా చెప్పవా. నీ నోటి నుండి వింటే అసలు విన్నట్టే ఉండదు
అంటే బాగుండదా
కాదే నీ మాటలు మనసుకు హత్తు కుంటాయి
అందుకే చెప్పఁమంటున్నాను.
పరమగురువులు బోధించినది, సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించినది నేను చెప్పటం ఏమిటి మీమాటలు నాకు నవ్వు తెప్పిస్తున్నాయి.
అదికాదే ఏపుట్టలో ఏపాముందో తెలియదు అట్లాగే మంచిని ఎంతమందైన చెప్పవచ్చు దానికి కొలమానం లేదు వారుచెప్పఁరాని భావన వద్దు , నీకు తెలిసినది చెప్పు చాలు. ఎవ్వరికీ పూర్తిగా భగవద్ గీత అర్ధం చేసుకొనే శక్తి లేదు కేవలం యోగీశ్వరులకుతప్ప.
అందుకే భగవద్గీత గూర్చిన సంభాషణము అత్యంత బాధ్యతా యుతమైనది. వారిని గూర్చి ఎంత తక్కువ సంభాషించిన అంత మేలు. కారణమేమనగా వారిని గూర్చిన అవగాహన కలవారు వాణ్నియమము కలవారగుటచే మాట్లాడరు. వారిని గూర్చి తెలియని వారు గాలి కబుర్లుగ నియమముల నుల్లంఘించి మాట్లాడ కూడదు.
నేను ఆ భగవంతుని ప్రార్ధించి చెప్పటానికి ప్రయత్నిస్తాను. ఆయన త్వరగానే అర్థం అవుతుందని ఆశిస్తాను. ఆపరమాత్ముడు నన్ను ఆజ్ఞాపించినది నేను చెప్పగలను. ‘‘ఈ పని చెయ్యాలి. నీకు నచ్చితే చెయ్యి. లేకపోతే, నీ ఇష్టం’’ అనేవారు నాతో. ఉన్నా ,అన్నా , ‘‘అసలైన ప్రేమ ఇలా ఉండాలి’’ అనేది భగవద్ గీత భావము అదే మీకు తెలియపరుస్తాను .
భగవద్గీతలో గ్రుడ్డివారైన, వయసు మీదపడిన వారైన "దృతరాష్టుడు కౌరవుల రాజు" వారికి కన్నప్రేమ ఎప్పటికీ తగ్గదు, మనవారు పరాయివారు మధ్య సంఘటనలు తెలుసుకోవాలని ఆరాటం తగ్గదు. అందుకే నేను చెప్పేది వారికి వయసు మీద పడినవారు కన్నవారిని ఎటు వంటివారైనా వదులుకోలేరు వారిని ఎదిరించి మాట్లాడలేరు. పిల్లలు కూడా గమనించాలి పెద్దల్ని బాధ పెట్ట కూడదు పెట్టిన వారు మాట్లాడలేరు ఎందుకనగా ప్రేమ.
అందరికన్నా ముఖ్యం "గురువు" ఆ గురువుని ప్రార్ధించి ఏ పని అయినా చెయ్యాలని భవగవద్ గీత బోధిస్తున్నది. గురువుని మించిన శిష్యులనుతయారుచెయ్యాలని గురువుకి ఆశగా ఉంటుంది అందుకనే తనలో ఉన్న విద్యనంతా అనాడు గురుకులములో నేర్పేవారు తరువాత "ప్రకృతి విద్య , సంసార విద్య, ప్రపంచ విద్య నేర్చుకోమని బయటకు పంపేవారు.
శ్రీమతిగారు ఈ నాడు అటువంటి గురువులు లేరా. గురువులు ఉన్న నేర్చుకొనే ఓర్పు నేర్పు ఉన్నవారు లేరు ఆనాడు సంస్కృతం ఒక్కటే వుంది అదే క్షుణ్ణంగా నేర్చుకుంటున్నారు ఇప్పుడు ఆంగ్లం వచ్చి మనుష్యులను పాడుచేస్తున్నది అర్ధం కానీ బాష భోధిస్తున్నారు అదేతేడా నేనొక్కటే చెప్పగలను అప్పుడు బతికి బతికించే విద్య, ఇప్పుడు బతుకుటకు కొనుక్కునే విద్య.
ఇక వర్ణించను భగవద్ గీత గురించి ఆలోచిద్దాం ....
అట్లాగే కాస్త కాఫీ త్రాగక మళ్ళా చెపుదానివిలే అన్నాడు శ్రీవారు
ఇంకా ఉంది
సమ్మౌహనాలు..గుడ్ ఫ్రైడే
వినుచున్న నీలీల
నీలీల బతుకు కల
కలలు తీర్చి శాంతిని పంచేటి దైవమే
రక్తమ్ము చిందించి
చిందించి శాసించి
శాసించి మేడ్వ వలదనే పలికె దైవమే
ఖ్యాతి గాదే నీతి
నీతి సూక్తులే మతి
మతి ననుసరించి జీవించమనె దైవమే
పలుకంగ నీస్తోత్ర
స్తోత్రము బతుకు సూత్ర
సూత్రమే ప్రేమ పూరితమైన దైవమే
పాఠముల్ పుణ్యమౌ
పుణ్యమౌ గ్రంధమౌ
గ్రంధమే ప్రవక్త పాఠముగా దైవమే
కనుచున్న నీరూపు
నీరూపు మా పిలుపు
పిలుపు తోను మమ్ము రక్షించే దైవమే
మోడు వారకు జీవి
జీవి తెలుపు కధలవి
కధలు అనుభవాలు జ్ఞాపకాల దైవమే
కరుణకే చిహ్నమై
చిహ్నము ప్రేమమై
ప్రేమతో బతుకులను నెర్పేది దైవమే
--(())--
మంచి పలకరింపు చాలు
మనిషి గుర్తించటానికి
ఎడారిలొ నీరు చాలు
నరకం తప్పించటానికి
No comments:
Post a Comment