Sunday, 2 February 2025

తెనాలి రామకృష్ణ*

 *రోజూ రెండు కథలు.. ప్రాంజలి ప్రభ.. మల్లాప్రగడ.o6?


తెనాలి రామకృష్ణ*  


గతంలో అక్బర్ - బీర్బల్ కధలను చదివి బాగా ఆనందించారు, ఆస్వాదించారు. కధ చాలా బాగుందని నాకు మెసేజ్ లు పెట్టారు. అదే కోవకు చెందినది ఈ తెనాలి రామకృష్ణ కధ. కల్పితాలతో రాసిన కధలు అంతగా నప్పవు. కొంతమంది జీవితాలలో నుండి పుట్టిన ప్రతి సంఘటన ఒక చిన్న కధగా మారుతుంది. భావితరాలలో ఎన్నో రకాలుగా అది ఉపయోగపడుతుంది. 


ఈ కధ (లు)కల్పితం కాదు. రాయల కాలంనాటి రోజుల్లోకి పాఠకులను 

తీసుకువెళ్లిపోతుంది. రెప్పవాల్చకుండా చదివిస్తుంది. రెండేళ్ళ క్రితం మన కథల గ్రూప్ లో అనేకమంది పాఠకులను అలరించిన ఈ కధను మళ్ళీ పోస్ట్ చెయ్యమని అడిగారు. 


అక్బర్ - బీర్బల్ కధల లాగానే ఈ కధ కూడా మిమ్మల్ని రంజింపచేస్తుందని భావిస్తున్నాను.


*తెనాలి రామకృష్ణ - 1*

 🧑‍🦲


*శ్రీకృష్ణదేవరాయల కొలువులో చేరిక-1*


*కస్తూరీ తిలకం* *లలాటఫలకే* 

*వక్షస్థలే కౌస్తుభం*


*నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం*


*సర్వాంగే హరిచందనంచ కలయన్‌ కంఠేచ ముక్తావళీ*


*గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడమణి...* 


రాగయుక్తంగా పాడుతున్న ఆ గొంతు విని, విజయనగర సామ్రాట్‌ శ్రీకృష్ణదేవరాయలు ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. గజారూఢుడై సాగుతున్న ఆయన ఎందుకో తన ప్రయాణాన్ని నిలుపుదల చేసుకుని చెవులు రిక్కించి, ఏనుగు దిగి మెత్తగా అడుగులు వేసుకుని ఓ ఆలయంలో ప్రవేశించాడు. చూస్తే ఎన్నిసార్లయినా 

చూడాలనిపించే శ్రీకృష్ణుని విగ్రహం ముందు చేతు లు జోడించి పై శ్లోకం కర్ణపేయంగా ఆలపిస్తున్న ఓ భక్తుడిని చూసి అతన్ని సమీపించాడు. 


రాయలను చూసిన ఆలయ పూజారులు సర్దుకుని, ఆ భక్తుడిని గర్భగుడిలోంచి పక్కకు నెట్టారు. అపుడు కళ్ళు విప్పి చూసాడా భక్తు డు.


“అయ్యా! లీనమై ఆ దేవదేవున్ని తనివి తీరా కొలుచుకుంటున్న నన్ను నెట్టడానికి కారణం? నేనేమైనా తెలియని అపరాధం చేసి ఉన్నానా?” అని అడిగాడు.


“స్వామీ! ఆ వచ్చినది విజయనగర పురాధీశులు. ఇపుడే వచ్చి వెళ్ళారు. మరల విచ్చేయడానికి కారణం తెలియదు. అందుకే భయపడుతున్నాం” అని బదులిచ్చి రాయలువారి ముంగిటికి పరుగున వెళ్ళారు పూజారులు.


“అర్చకులారా! ఎవరీ మహానుభావుడు ? ఎంత మధురంగా కృష్ణకర్ణామృతంలోని శ్లోకం ఆలపించారు. అది విని మరల విచ్చేసాను.” అని అ భక్తుని వైపు తిరిగి “వాగ్గేయకారుడు లీలాశుకుడు రాసిన కృష్ణకర్ణామృతంలో రసాలూరించే శ్లోకం చిన్న చిన్న మార్పులు చేసి నాకు వినిపించి నా జన్మ ధన్యం చేసారు స్వామీ! ఎవరు మీరు? మీ దివ్యతేజస్సు చూస్తే మీరు సామాన్యులు కారని తెలుస్తోంది. ”అని మృదుమధురంగా చిరునవ్వు చిందిస్తూ అడిగాడు శ్రీ కృష్ణదేవరాయలు.


అర్చకులు బిక్కముఖాలు వేసి నిలబడ్డారు. వారికీ అతడెవరో తెలియదు. అడుగుతున్నది సాక్షాత్తు రాయలవారు, గాభరపడ్డారు అర్చకులు.ఆ భక్తుడు మిక్కిలి వినమ్రుడై రాయల వారికి చేతులు జోడించి..

 

“నా పాండురంగడు కోరకుండానే వరమిచ్చాడు. విద్యలనగర ప్రభువు, మూరు రాయరగండడు, యవన రాజ్య స్థాపనాచార్యుడు, సాహితీసమరాంగన చక్రవర్తి ముందు నన్ను నిలిపాడు. నేనెంతటి అదృష్టశాలినో కదా! మీదర్శన భాగ్యంచే మీ భువనవిజయమందు నా జీవితం పండినట్టుగా ఒక్కింత ఆనందం అనుభవించాను. ఈ జన్మకిది చాలు ప్రభూ !” అన్నాడు.


“మీరు కవులా? ఎంత చమత్కారంగా మీ మనస్సును చెప్పకనే చెప్పారు. మీరు కాదు ధన్యులు. నేను, నా విద్యలనగరం. క్షణమాల సించక నాతో విచ్చేయుడు. ఇదే స్వాగతించుచుంటిని. మీ గురించి ఇంకా వినాలని కుతూహలపడుతున్నాను.  మీరెక్కడివారు ఎందుకు ఇటు వచ్చినారు? సవిస్తరంగా తెలియజేయండి. తక్షణం వినాలని ఆత్రపడ్డున్నాను.” అని రాయలు అతని వంక అప్యాయంగా చూసి చిరునవ్వులు చిందించాడు.


“ప్రభూ, నేను ఆంధ్రదేశమందు తెనాలి వాస్తవ్యుడను. నా తల్లి అక్కమాంబ, తండ్రి రాయనామాత్యులు. నా పేరు రామలింగకవి. కానీ, రామకృష్ణ కవిగా నాకు విద్య నేర్పే గురువుచే పిలవబడే వాడను. ఇంటి పేరు గార్లపాటి వారు, కౌండిన్య గోత్రానికి చెందిన యజుశ్శాఖా నియోగి బ్రాహ్మణుడను. వివాహితుడను. ఇరువురు బిడ్డలకు తండ్రిని. ఉదరపోషణ కై త మవంటి వారి కొలువును ఆశించి మిక్కిలి ఆశతో తమవద్దకువచ్చుచుంటిని. కాలము నాతో చేతులు కలుపునట్లు తమ ముందు నిలిపినది.” అని చేతులు జోడించాడు రామ లింగకవి.


“కవిశేఖరా! మీరు లీలాశుకుడు పై ప్రత్యేక గౌరవము కలిగినవారై ఉన్నారు. అమృత తుల్య మైన గానాన్ని వినిపించారు. అందులో కొన్ని మార్పులు బహుచక్కగా కుదిరినవి. దానికి మీ గాత్రం తోడైనది.


“ఓ సార్వభౌమా! నేను పాండురంగ మహ త్యం అను కావ్యం రాయుచున్నాను. అందులో ఈ శ్లోకం ఈసరికే తెనుగు చేసి రాసాను. ఆ కావ్యం పాండురంగనిదయతో పూర్తిచేయగలనని నమ్ముచున్నాను. భీమరధీ నదిలో స్నానం చేసినపుడు ఓ గొప్ప అనుభూతిని అనుభవించాను. ఈ పండరీ క్షేత్రం ఎంతో విశిష్టమైనది. నా కావ్య రచన ఇక్కడికి వచ్చాక నేను పూర్తి చేయగలనని ఉత్సాహంతో ఉన్నాను” అని కళ్ళనిండా తృప్తిని నింపుకుని చెప్పాడు రామలింగడు.


వారి సంభాషణ వింటున్న పూజారులు రెండు పాత్రలతో దేవునికి నైవేద్యంగా పెట్టబడిన క్షీరాన్ని రాయల వారి కనుసైగలతో తెచ్చి ఇచ్చారు.


“కవీశ్వరా! ఈ రెండు పాత్రలలో ఉన్నది క్షీరమే (గోవు పాలు). ఒకటి మీరు తీసుకువచ్చినది. అంటే సాహిత్యలక్ష్మి పాత్ర. ఇక నేను తెచ్చినది ధైర్యలక్ష్మి పాత్ర. ఈ రెండింటిని మనమిరు వురును తక్షణం పుచ్చుకొని ఒకింత సేద  తీరాలి. ఇందులో ఏదో ఒకటి తీసుకొనుడు.” అని పాత్రలు చూపాడు రాయలు.


లిప్త సమయం ఆలస్యం చేయకుండా రెండు పాత్రలను అందుకున్నాడు రామలింగకవి. వాటిని అటు ఇటు చూసి ఒకింత సంధిగ్దంలోపడ్డాడు. ఆలయ పూజారులు చేష్టలుడిగి చూసారు. అసలే రాయలు ఆ పాలను త్రాగి సేద తీరాలనుకుంటుంటే, ఈ వెర్రిబాపడు రెండు పాత్రలు పట్టుకుని ఆ వెర్రిమొర్రి చూపులతో కాలాయాపన చేస్తున్నాడేంటి? రాయల వారికి కోపం వచ్చే పరిస్థితి, ఇక తాము కలుగచేసుకుని రానున్న ఉపద్రవానికి అడ్డుకట్ట వేయాలి అనుకుని.. 


“అయ్యా! రామలింగకవిగారూ! ఒక పాత్రను ఇప్పించండి. మన ప్రభువులు దప్పికగొని ఉన్నారు.” అని లోగొంతుతో కోరిరి. అందుకు రామలింగడు నవ్వి..


"ఓ పుణ్యపురుషులారా! ప్రభువే నాకు రెండు మహోన్నతమైన క్షీర పాత్రలను ఇచ్చి వాటి గురించి వివరించిరి. జంట లక్ష్మిలను ఏ భక్తుడును వదులుకోలేడు. నాకు అవశ్యం ఈ రెండు పాత్రలూ ప్రియములే!” అని రెండు పాత్రలను ఎత్తి ఒకదాని తరువాత ఒకటి గడగడ తాగేసాడు. పూజారులు భయభ్రాంతులై చేష్టలుడిగి మరీ చూసారు.


“మహాప్రభూ! నా జన్మ ధన్యం అయినది. నా జీవనాధారమైన సాహిత్యలక్ష్మిని పాల పాత్ర ద్వారా నేను తనివి తీరా తాగితిని. తమవంటివారి కొలువున మసలేందుకు అవసరమైన ధైర్యలక్ష్మిని మరో పాత్రలో పాల రూపంలో తాగితిని. ఇందు లేశమైనా నా దోషం లేదు ప్రభూ!” అని మిక్కిలి వినయముతో చేతులు జోడించి నిలబడ్డాడు రామలింగడు.****(2)


"భళీ రామలింగా! నీ చమత్కారం, నా మనస్సును ఎంతగానో ఆనందపరిచినది.” అని రామలింగ కవిని బిగియార కౌగిలించుకున్నాడు రాయలు. పూజారులు గుండెల పై చేతులు వేసుకున్నారు. 


'హమ్మయ్యా పెద్ద ఉప్పెన తప్పిందని అనుకున్నారు. మహాతేజస్సుతో వెలిగి పోతున్న రామలింగ కవిని తొలిసారిగా వింతగా అయోమయంగా చూసారు.


" కవితిలకమా! మీ గురించి లోగడ విని 

ఉన్నాను. మీరు కాళీ ఉపాసకులు అని, ఒకసారి అంబ ప్రతక్షమై రెండు పాయస పాత్రలు ఇచ్చి ఒకటి ధనము, వేరొకటి విద్య ఇచ్చే పాత్రలు ఇందు ఏదో ఒకదాన్ని మాత్రమే స్వీకరించు అని ఆయమ్మ ఆదేశించగా మీరు బాల్యచాపల్యమున ఇక్కడ జరిగినట్లు రెండు పాత్రలలో పాయసం స్వీకరించినందున ఆయమ్మ ఆగ్రహించి వికట కవి కమ్ము అని పలికి అంతర్ధానమొందెనని విన్నాను. నేను ఆ కథ నమ్ముచున్నాను. ఇప్పుడు నా కళ్లెదుట జరిగినది." అన్నాడు రాయలు. 


“నేను లేలేత ప్రాయమందు ఒక యోగి ఉపదేశించిన మంత్రోపదేశం పై ఓ కాళికా

లయంలో కనులు మూసి ఆ మంత్రం జపిస్తూ నిద్రపోయాను. నిద్రలో కూడా ఆ మంత్రం నా పెదవులపై అలాసాగిపోతుంటే ఆయమ్మ నా తదేక దీక్షకు మెచ్చి నా ఫాల భాగమందు కనిపించి మీరు విన్నట్టుగానే పాయస పాత్రలనిచ్చింది. ఏదో ఒక్కటి మాత్రమే తాగాల్సిందిగా అంబ ఆదేశాన్ని కాదని, రెండింటిని తాగినందుకు, అంబ నన్ను కోపంగా రెండు పాత్రలయందు పాలను ఏల తాగితివి అని ప్రశ్నించింది. 

అమ్మా ఒకటి ధనం అన్నావు. మరొకటి విద్య అన్నావు. రెండింటిని వదులుకోలేక పోతిని. ఎందుకో అంబ నా పై కోపగించక నవ్వి నీవు హాస్య కవిగా జీవించగలవు అని పలికి అంతర్ధానమయినది. ఒకరకంగా చిన్న శాపానికి గురయితిని.” అని వినమ్రంగా చెప్పాడు రామలింగడు.


"శాపమా ? ఏమని ” రాయలు ప్రశ్నించాడు.


"ప్రభూ ఆ అంబకు ఈ రామలింగ పుత్రుడన్నచో ఎంతో ప్రేమ. అందుకే చిరుకోపములో కూడా నన్ను ఓ హాస్య కవిగా బతకగలవని వరం వంటి శాపం ఇచ్చింది. వాస్తవానికి నేను నా కావ్య రచనల్లో హాస్యం పై ఆధారపడినది లేదు. కానీ అంబ పలుకు ఆ విధంగా ఉంది. మరి మున్ముందు అలా రాస్తానేమో !” అన్నాడు.


"మీ కావ్యాలలో కాకపోవచ్చు కానీ మీ కదలికలు హాస్యాన్ని గుమ్మరిస్తున్నాయి.” అని రాయ లు సంతృప్తిగా నవ్వాడు. పూజారులు చేష్టలుడిగి మరీ రామలింగని వైపు చూసారు.


"ప్రభూ తొలి కలయికలో తమ యొక్క 

అభిమానాన్ని పొందాను. నిజంగా నన్ను నేను నమ్మలేకపోతున్నాను. ఈరోజు చాలా ఆనందంగా ఉంది.' అన్నాడు రామలింగడు.

   

 *సశేష*


*తెనాలి రామకృష్ణ - 2* 

🧑‍🦲


*దయ్యాల భవంతిని కొనుగోలు చేయుట


విద్యలనగరమైన విజయనగరంలో రామలింగ కవి తన భార్య ఇద్దరు పిల్లలతో రాయలు వారిచ్చిన ఓ సనాతన గృహంలో కాపురం పెట్టాడు. రాజాధిరాజు తలుచుకుంటే సౌక ర్యాలకు కొదవేముంటుంది.


ఇంటినిండా పప్పులు, బియ్యాలు, పట్టు వస్త్రాలు, అంగడికి పోయి ఏమైనా కొనుగోలు చేయాలనుకుంటే అందుకు పదింతలు ధనం సమకూర్చబడింది. తన కొత్త జీవితానికి తనే ఎంతో మురిసిపోతూ ఇంటి అరుగు మీద కూర్చున్నాడు రామలింగడు.


ఇంట్లోంచి కమ్మటి నేతి వంటకాల వాసనకు మైమరచి ముక్కుపుటాలు ఎగరేస్తున్న రామలింగడి చెవికి ఓ టముకు వినిపించింది.


"పురజనులకు ఓ ముఖ్య విన్నపం. అయ్యా! నగరంలో అతి పెద్ద నగల వ్యాపారి లింగిశెట్టి గారు తను ఎంతో ముచ్చటపడి నిర్మించుకున్న అత్యాధునిక భవనాన్ని అమ్మేస్తున్నార హో! కొనగల శ్రీమంతులు ఎవరైనాఉంటే ముందుకు రావచ్చు!" అని అరిచి చెప్తున్నాడు. 


రామలింగకవి ఆ టముకువాడిని పిలిచి ఆరా తీసాడు. విషయం తెలిసివచ్చింది. ఈలోగా అతని భార్య లోపల నుంచి వచ్చి “ఇక్కడైనా కాస్తా బుద్ధిగా ఉండండి. ఏదో రాయలవారి ధర్మమా అని ఓ గొప్ప బ్రతుకుదారి దొరికింది. వీధి గుమ్మంలో కూర్చున్నారంటే నాకు చచ్చేటంత భయం. దారినపోయినవన్నిటిలో వేలు, చెయ్యి పెట్టకండి. నేను నా పిల్లలు అన్యాయం అయిపోతాం." అని నిష్ఠూరంగా పలికి చరచరా లోపలికి వెళ్లిపోయింది.


రామలింగడు హాయిగా నవ్వుకున్నాడు. ఆ సాయింత్రమే నగల వ్యాపారి ఇంటిని చూడడానికి వెళ్లాడు. అదో రాజభవనంలా ఉంది. చాలా ధనంతో నిర్మించబడింది. లింగిశెట్టి తనెందుకు అమ్ముతున్నాడో చెప్పాడు. విని రామలింగడు అంతులేని ఆశ్చర్యానికి గురయ్యాడు. 


"అయ్యా! రామలింగకవిగారూ, ఈ ఇంటిని తమరు కొనలేరు. ఆరువేల వరహాలకు ఒక్క చిల్లిగవ్వ తగ్గించలేం. అయినను తమరు ఈ నగరానికి కొత్తగా వచ్చారు. ఇంకా సంపాదనలో లేరు. కొన్నాళ్ళు పోయాకగాని మీ వలన కాదు. రాయల వారి దయ పొందాలి " అని నసిగాడు.


“ఓ వర్తకుడా, నాకన్నివిధాల ఈ భవనం 

నచ్చింది. ఈసరికే నాకు రాయలవారు చాలా ధనం ఇచ్చి ఉన్నారు. కనుక నాకు ఈ భవనాన్ని అమ్మినచో కొనుగోలు చేసుకొందును. ఇతరత్రా నీవాలోచించ తగదు. కొంత ధనం ఇప్పుడిచ్చివేయు దును. మిగిలినది ఒక్క నెల గడువులో పూర్తిగా చెల్లించగలను” అని రామలింగడు భవనం మొత్తం కలియతిరుగుతూ మరీ తన కోరికను తెలిపాడు.


“చూస్తే నావంటివాడవు. బ్రాహ్మనయ్యవు. ఈ ఇంట్లో ఎలా ఉండగలవు? అసలే దయ్యాలు, పిశాచాలు భవనాన్ని వదలకుండా పట్టి పీడిస్తున్నాయి అని పదే పదే నీకు కనుక అడగ్గానే చెప్పాను. నా మొత్తం కుటుంబం అరవై మంది వరకు ఉన్నాం. ఐనా ఏమీ చేయలేకపోయాం. ఎంతమంది భూత వైద్యుల్ని రప్పించినా 

ఫలితం లేకపోయింది. చివరికి ఎంతో ముచ్చటపడి కట్టుకున్న భవనం ఇలా అమ్మదలిచాం. ఏ ఒక్కరం ఇకపై ఇక్కడ ఉండడానికి ధైర్యంగాలేం. భయభ్రాంతు లైపోయాం. కనుక సాహసించి కొనవద్దు. నిన్ను చూడగానే విషయం చెప్పానే మరి వినవేం ?" అని జాలిగా చెప్పాడు లింగిశెట్టి.



"నేను కాళీ ఉపాసకుడను. నాకు చీడ పీడల బాధలేదు. ఈ ఇంటిని చాలా కాలంగా అమ్మజూపినా ఎవరూ రాలేదని తెలిసివచ్చాను. నేను ఇష్టపడుతున్నాను. అమ్ముకో! " అని భుజం తట్టాడు. 


లింగిశెట్టి తీవ్రంగా ఆలోచించి సరేనన్నాడు. చివరికి వెయ్యి వరహాలు పుచ్చుకుని ఓ పత్రం రాయించుకున్నాడు. ఒక నెల గడువు మాత్రమే ఇచ్చాడు. "ఎట్టి పరిస్థితి లో నెలలోపు మిగిలిన చెల్లింపులు చేయాలి. లేకుంటే రాయలవారి బాల్య స్నేహితుడను. కనుక రాజతీర్పు పొందగలను. కొత్తగా వచ్చినవాడవు నీపై రాయలకు చులకన భావం ఏర్పడి అసలకే మోసం రాగలదు. బతుకు చెడి వీధిన పడతావు” అని సుతిమెత్తగా 

హెచ్చరించాడు.


రామలింగడు మరోసారి నవ్వుకున్నాడు. అన్ని నియమ నిబంధనలకు సై అన్నాడు. తొలి చెల్లింపు ఇచ్చి తృప్తిగా నవ్వుకున్నాడు.


రామలింగడు రాయలిచ్చిన గృహాన్ని వదిలి కొత్తగా కొనుకున్న భవనానికి వెంటనే మారా డు. ఈ విషయం వేగుల ద్వారా విన్న రాయలు ముందు ఒకింత ఆశ్చర్యపడినా, తనకు మాట మాత్రంగా అయినా చెప్పకుండా ఇంత తొందరగా స్వంత నిర్ణయాలు తీసుకోవడమా? తనకు చెప్పి ఉంటే కొనిపెట్టేవాడ్ని కదా అని పరిపరి విధాలుగా అలోచించాడు. ఆ తరువాత ఏ రోజూ చెప్పనే లేదు. మూడు నెలలు గడిచా యి.... ఒక విధంగా రాయలు బయటికి కనపడకుండా లోలోపల నొచ్చుకున్నాడు.


రాయలవారు నిండుకొలువులో ఊపిరి సలపనంత పని ఒత్తిడిలో ఉండగా లింగి శెట్టి వచ్చి ఫిర్యాదు చేసాడు. ఒక్కసారి సభంతా నిశ్శబ్దం అయిపోయింది. జనులంతా ఖిన్నులై విన్నారు.


"సాహితీ సమరాంగన సార్వభౌమా! మీ 

బాల్యమిత్రుడు ఈరోజు మీముంగిట తీర్పుకై చేతులు కట్టుకుని నిలుచున్నాడు. నేను విధి వశాత్తు ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మించాను. అది వెలకట్టలేనిది. కానీ, అందు నివసించలేనిదిగా కొరకరాని కొయ్యిగా నాపాలిటి మిగిలింది. అతి తక్కువ వెలకు కొత్తగా తమ కొలువుకు విచ్చేసిన రామలింగకవిగారికి ఆ ఇల్లు అమ్మివేసితిని. ఆయన నమ్మబలికి తొలుత అతి తక్కువ ధనమిచ్చి, నెల గడువులోపు మిగిలినది తప్పక జమ చేయుదును అని చెప్పి ఇప్పుడు మూడు నెలలు అయిన పిదప ఇక తాను ఏమీ ఇవ్వవలిసినదిలేదు అని చెప్పుచున్నాడు. తమరు నాకు తగు న్యాయం ఇప్పించ గోర్తున్నాను" అని మొత్తం వివరించాడు లింగిశెట్టి.


రాయలు లోలోపల చాలా బాధపడ్డాడు. ఇదేమీ ఈ కొత్త కవి వింతపోకడలు. వినుటకే చాలా కష్టంగా ఉంది. సరే పిలిపించి విచారించిన తెలియగలదు అని వెంటనే రామలింగడిని పిలిపించాడు. 


ఆ రోజు ఆ సభలో దిగ్గజాల వంటి కవులు ఆశీనులై ఉన్నారు. సభకు విచ్చేసిన రామలింగకవి సభకు, రాయలవారికి, ప్రముఖులకు నమస్కరించి... 


"ఏలినవారు నన్ను సభకు తక్షణం పిలిపించడానికి కారణం నాకు తెలియ కుండా నేనేమైనా తప్పు చేసి ఉన్నానా, తెలుసుకోగోరుతున్నాను" అని మిక్కిలి వినమ్రతతో అడిగాడు.


రాయలకు ఎందుకో ఆ క్షణంలో తట్టుకో లేనంత కోపం వచ్చింది. అది గ్రహించిన మహామంత్రి తిమ్మరుసు రాయలకు కనుసైగ చేసి ఓపిక పట్టమనెను. రాయలు మనస్సును కుదుటపరుచుకుని.. 


"కొత్తగా మా కొలువుకు విచ్చేసిన ఓ కవి రాజశేఖరా, మీ పై ఈ నగల వర్తకుడు పెద్ద అభియోగం చేసారు. మీరీతన్ని మోసం చేసారని, అయితే పూర్వపరాలు చూడగా మీరు పెద్ద తప్పు చేసారనిపిస్తోంది. దీని పై మీరిచ్చు సమాధానం? ఏదీ దాచకుండా సభకు తెలియపరచండి. నిజాలే ఇక్కడ వింటాం. అబద్ధానికి తావులేదు. తప్పు జరిగినట్టు రుజువైనచో తీవ్రదండన తప్పదు" అన్నాడు కొంచెం ఆగ్రహంతో.

    

"రాజాధిరాజులైన మీ నీడన బతుకీడ్చు ఈ బాపడా తప్పు చేయునది. అది తమరు 

విశ్వసించుటయా! ఎంతటి ప్రారబ్దం ఈ క్షణ మనుభవించుచున్నాను. హతవిధీ! సత్య నిరూపణ కావలె. ఇక విషయం తమకు తెలియపరుచుకొందును.. అయ్యా నా ఇంటి వాకిట కూర్చుని ఉండగా ఓ టముకు విని ఆరా తీసిన నేరానికి ఈ వణిజ ప్రముఖుడు లింగిశెట్టి తన అనుయాయులను నా వద్దకు పంపి ఆ భవనం కొనుగోలు చేయమని మిక్కిలి

ప్రోత్సహించిరి. అతి తక్కువ ధరకు లభ్యం కాగలదని ప్రలోభపెట్టిరి. పెద్ద ఎత్తున ధనం ఖర్చుచేసి ఇంత స్వల్ప ధరకు ఎందుకు అమ్ముచున్నారని అడిగితిని. పొంతనలేని మాటలు వల్లెవేసారు. ఇందు ఏదో మోసం ఉన్నదని గ్రహించి ఈ లింగిశెట్టిని నేరుగా కలిసితిని. ఈ గృహమందు దయ్యాలు, పిశాచాలున్నాయి. వాటితో నువు వేగలేవని, చెప్తునే షరతుల పై నాకు అమ్మాడు.” అని రామలింగడు చెప్పాడు. 


సభా మధ్యమున నిలుచుండి కంచు గంట మ్రోగినట్లు అద్భుతమైన కంఠధ్వనితో చెప్పాడు. అంతా చెవులు రిక్కించి మరీ విన్నారు. 


“నీవు చెప్పునది సరే. ముందు షరతుల 

ప్రకారం నీవు ఈసరికి మిగిలిన మొత్తం చెల్లించాల్సి ఉంది. మరెందుకుఇవ్వకుండా మొండికెత్తితివి. రాయలవారికిచెప్పుకున్నా నీకు ఒక్క రూక రాదని పదేపదే అన్నావని ప్రధానంగా నీ పై అభియోగం. ఒక కవివై ఉండి ఇంతగా దిగజారి ప్రసంగించవచ్చా? రామలింగకవి, నీపై ఎంతో గౌరవభావంతో ఉన్న నాకు నీ చేష్టలతో మానసికంగా చాలా కృంగదీశావు. ఇట్టి తప్పిదాన్ని చేసినవారికి ఈ విజయనగరంలో శిక్షలు చాలా తీవ్రంగా ఉంటాయి. నిన్ను ఏ విధంగా కఠినశిక్షకు గురిచేయాలి. నీవు నాకెందుకు ఈ విషమపరిస్థితికల్పించితివి. నీ తప్పు చాలా స్పష్టంగా కన్పించుచున్నది. నిన్ను ఏ విధంగా శిక్షించాలో నీవే చెప్పు.” అన్నాడు రాయలు అసహనంగా నొసలు నొక్కుకుంటూ.


సభలోని వారంతా హీనంగా రామలింగని వైపు చూసారు. ఎప్పుడు ఉత్సాహంగా ఉండే రాయలు ఈరోజు ఇంతటి వేదనకు గురికావడం ఏ ఒక్కరూ జీర్ణించుకోలేక పోయారు. 


" మహామంత్రీ నేనే అపరాధం చేయలేదు. నా చేత రాయించిన పత్రం ఒకసారి తమరే చదవండి నిజం తెలియగలదు. ఈ రామలింగని నిర్దోషిత్వం తమకు స్పష్టంగా తెలియగలదు” అన్నాడు రామలింగడు.


పత్రం చదివాక తిమ్మరుసు పెదవి విరవడం రాయలు మరింత నొచ్చుకున్నాడు. రామలింగ కవి ఏదో విధంగా నిర్దోషిగా నిరూపితుడవుతాడని కొండంత ఆశ పడ్డాడు. కానీ ఈతడు పెద్ద తప్పు చేసాడు. ఈ కవిలో ఇంత లక్షణాలున్నాయా ? అని అనుకున్నాడు.


"రామలింగా, ఇందులో నీవు తప్పక చెల్లించాల్సినట్టు మాత్రమే ఉంది." తిమ్మరుసు గొంతు ఖంగుమంది.


“మహామంత్రీ తమరు తప్పులో కాలు వేసారు. తమవంటివారు ఇలా చదివితే ఎలా ? లింగిశెట్టి అమ్మునది నా ఒక్కడికే కదా! ఆ పత్రంలో నా ఒక్కని పేరుందా? లేదే వేరే వారి పేర్లున్నాయి. దయ చేసి చదవండి.” 


“ఒక్కనిదే ఉంది. వేరెవ్వరి పేరు లేదే. ఎన్ని కళ్లతో చదవినా మారిపోదుకదా ! నీకు ఛాదస్తం మరీ ఎక్కువలా ఉంది.”


శ్రీకృష్ణదేవరాయలు ఉత్కంఠగా రామలింగని వైపే చూసాడు. 


"ఆ పత్రంలో అక్షరాల ఇరువురి పేర్లు 

ఉన్నాయి. రామలింగకవితో బాటు దయ్యాలు, పిశాచాలు ఉన్నాయి. వాటి వలన కవికి ఏ ప్రమాదం వాటిల్లినా అందుకు ఎలాంటి పూచీ తనకు లేదని కూడా రాసాడు ఈ పెద్దమనిషి. ఒక ఇల్లు ఒక్కరికి అమ్మినచో ఆ ఒక్కరే దాని ధర చెల్లించగలరు. మరి నాతో బాటుగా దయ్యాలు, పిశాచాలున్నాయి. అని అతనే లిఖితపూర్వకంగా ఒప్పుకున్నాడు. అవి చెల్లించవా ? ఇదేం న్యాయం మహామంత్రీ. అందుకే ఈ పెద్దమనిషితో పదేపదే అన్నాను. ఏలినవారికి చెప్పినా ఒక్క రూక రాలదని, ఇప్పుడూ చెప్తున్నాను. లింగి శెట్టికి నేను నా వాటా చెల్లించితిని. ఇక ఏ భూత మాంత్రికుడినో, పిశాచ వైద్యుడినో పట్టుకుని ఆ ఇంట్లో అక్రమంగా తిష్టవేసిన దయ్యాలు పిశాచాల వద్ద మిగిలిన వాటా వసూలు చేసుకోమనండి. మీరు విధించే కొరడాల శిక్ష ఆ భూతాలకే వేయగలరు" 

సభికులు గొల్లుమని నవ్వుతుండగా సభలో రామలింగడు ఎలాంటి జంకుగొంకు లేకుండా మరీ చెప్పాడు.


రాయలు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతూ 

తిమ్మరుసు వైపు చూసాడు. ఆయన కూడా తెరలు తెరలుగా నవ్వసాగాడు. సభ మొత్తం నవ్వులమయం అయ్యింది. లింగిశెట్టి ఆముదం తాగినట్టు జేవురించిన ముఖంతో మిగిలాడు.


నవ్వులతో ఎంతసేపటికి తేరుకోని సభనుద్దేశించి “మన్నించండి ఏలికా! నాకు చీడపీడల పై ఎలాంటి నమ్మకంలేదు. ఈ లింగిశెట్టి తక్కువ ధరకు అమ్మినందుకు ఆయన చెప్పిన కారణం నిజమని నమ్మాను. ఈతడు తమకు బాల్య స్నేహితుడు అనే ముసుగులో ఉంటూ ఈతడు మన శత్రువులకు అందుబాటులో ఉన్నాడు. ఆ ఇంటికి నేలమాళిగ సొరంగం ఉంది. అందులో పెద్ద ఎత్తున మారణా యుధాలున్నాయి. ఇవేవి ఒక వర్తకునికి అవసరమైనవి కావు. కనుక ఈతడు ఖచ్చితంగా అనుమానించదగ్గవాడే” అని లింగిశెట్టి యొక్క లోగుట్టు విప్పేశాడు.


ఒక్కసారి సభంతా నవ్వుల స్థానంలో కలకలం చెలరేగింది. రాయలు అర్ధంకాక తిమ్మరుసు వైపు చూసాడు.


లింగిశెట్టి అవమానంతో తలదించుకున్నా డు. రాయలు కన్నెర్రతో లింగిశెట్టి నిజం ఒప్పేసుకున్నాడు. తాను విజయనగర శత్రువులైన గజపతులతో ఒక దశలో చేతులు కలపక తప్పలేదు. ఆ సొరంగ మార్గంలోంచి రాకపోకలు సాగేవి. ఒకసారి సొరంగంలో గజపతుల వేగులవారికి 

దయ్యాలు ఎదురైనవని అందులోంచి రావడానికి భయపడ్డారు. తీరా నాకు ఆ ఇంట్లోకి వెళ్లాక అన్నివిధాలుగా తీవ్రంగా నష్టాలు ఎదురయ్యాయి. నేను చేస్తున్నది తప్పని తెలుసుకుని, ఇటీవల వారితో తెగతెంపులు చేసుకున్నాను. అందుకే ఆ ఇంటి గురించి ఆరాలు తీయనివాడికి అమ్మేసి బుద్ధిగా నా బతుకు బతకాలను కున్నాను. తీరా ఈ కవి చాలా తెలివైన వాడు కనుక, ఇలా నా గుట్టు తెలుసుకో గలిగాడు. వేరెవ్వరూ పసిగట్టలేనిది నా దేశద్రోహం. మన్నించండి చక్రవర్తీ !".


"ఏమయ్యా ! నీవు నాకు బాల్యమిత్రుడవు. నేను నీ యెడల చాలా ప్రేమగానే ఉంటున్నానే మరి నాపై నీకెందులకు ఈ ద్రోహచింత. దీన్ని మన్నించలేనిదిగా భావిస్తున్నాను. కనుక నీవు శిక్షార్హుడవే ” రాయలు కోపంగా లింగిశెట్టి వైపు చూస్తూ ఉరిమాడు.


"ఏలినవారికి నాదో విన్నపం. ఈతడు కులపరంగా వైశ్యుడు. కుట్రలతో సాధించే శారీరక బలుడు కానేకాడు. ఏదో ధనాశకు మన శత్రువులకు తనింటి సొరంగ మార్గం ఇచ్చి ఉండవచ్చు. వారిచ్చు ధనం కంటే ఈతనికి జరిగిన నష్టమే ఎక్కువ. గజపతుల వేగులు ఇక్కడ గూఢచర్యం సజావుగా సాగదని తెలివిగా తప్పుకునే ముందు ఆ సొరంగ మార్గంలో దయ్యాలు ఉన్నట్లు బొంకి వెళ్లిపోయారు. దయ్యాల ఉనికి నిజమని భ్రమలో పాపం ఎంతో 

వెచ్చించి నిర్మించిన భవనాన్ని చవకగా నాకే అమ్ముకున్నాడు. దయ్యాలే నిజమైతే ఈసరికి నాకు కన్పించాలి. కానీ ఇంత వరకు నేను చూడనైనా చూడలేదు. ఒక విధంగా చేసిన తప్పుకు ఇతడు తగిన శిక్ష ఆర్ధికంగా అనుభవించాడు. ఏది ఏమైనా ఈతడు చేసినది తప్పే.... అందుకు శిక్ష ఏలినవారు దేశద్రోహులకు విధించే 

మరణదండన, కనుగుడ్లు పెరికివేయించు ట వంటివి విధించవద్దని నా మనవి. దేశ బహిష్కారమే మరణదండనతో సమానం.”


రామలింగడు సభ మధ్యలో వందలాది జనాలు గుడ్లప్పగించి పరికిస్తుంటే వినమ్రుడై చెప్పాడు.


రాయలు గట్టిగా కళ్ళుమూసుకున్నాడు.


“నిజమే రామలింగడు చెప్పినట్లు దేశ బహి ష్కారంతో సరిపుచ్చాలి, లింగిశెట్టి తనకు బాల్యస్నేహితుడు. చేతులారా చిత్రహింస లు పెట్టే శిక్ష తను అమలు చేయలేడు. ఒక విధంగా రామలింగడు అడ్డుపడకుండా ఉంటే తను తప్పని పరిస్థితిలో శిక్ష విధించేవాడు అని మనస్సులో అనుకుని చివరికి లింగిశెట్టికి దేశ బహిష్కార శిక్ష విధించాడు.


ఆ తరువాత రాయలు సింహాసనం దిగి వచ్చి రామలింగ కవిని గాఢాలింగనం చేసుకున్నాడు. 


" కవి చరిత్ర మరువదు మీ చతురత, స్వామి భక్తి పరాయణత, సదా నిలుచును మీ ఎడల మా కృతజ్ఞుత. ఈరోజు నా హృదయం తేలి పోవుచున్నది. ఇట్టి కవిని నా హృదయానికి హత్తుకొనుచున్నాను. ఆ దయ్యాల భవంతిని వదిలేయండి. నేను వేరే భవంతిని ఏర్పాటు చేయగలను కాదనకండి." అన్నాడు రాయలు.


ఇతరత్రా కూడా పదేపదే మెచ్చుకుని ధనకనక వస్తువాహనాలతో సత్కరించాడు.


"ప్రభూ ఆ భవంతి ఎంతో గొప్పది. నాకు అన్ని విధాల నచ్చినది. అందులోకి వెళ్లగానే నాకు కవిగా కాకుండా నా మాతృ భూమికి నా చక్రవర్తికి నా సహచర ప్రజలకు సేవలందించాలని తెలియజేసింది. చక్కని అవకాశం లభించింది. ఆ భవంతిలో నేను నా భార్య పిల్లలతో జీవించగలను. అందులోనే మరిన్ని అద్భుతాలు చేయగలనని ఆశిస్తూ జీవించగలను. నన్ను కాదనకండి. తమ మాటకు అడ్డు వస్తున్నానని వేరే విధంగా భావించవద్దు” అన్నాడు.


తిమ్మరుసు రామలింగని వద్దకు వచ్చి..


" నాయనా నీవు గొప్ప విషయాన్ని బయటపెట్టావు. నగరంలో శత్రువుల ఉనికి ఎంతో ప్రమాదాన్ని ఇస్తుంది. అట్టిదాన్ని నీవు కుండబద్దలు కొట్టినట్టు చేసావు. తక్షణం ఆ సొరంగ మార్గంలో నిక్షిప్తమైన గుప్తాయుధాలను స్వాధీనం చేసుకుంటాం. నీవు ఈరోజు ఈ అప్పాజీతో విందుకు వచ్చి ఓ పూట గడపాల్సిందిగా నిన్న కోరుతున్నాను.” అన్నాడు ప్రేమగా..


రామలింగడు చేతులు కట్టుకుని తృప్తిగా తన సమ్మతిని తెలిపాడు.

 🧑‍🦲   

 *సశేషం*

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

*తెనాలి రామకృష్ణ -3*


*నక్క తోక మహిమ*

🦝🦝🦝🦝🦝


ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు చాలా ఉల్లాసంగా ఉన్నవేళ కవులందరిని పిలిపించుకుని భువనవిజయం మందిరంలో సరదాగా గడపసాగాడు. తాను ఇటీవల రచించిన జాంబవతీ కళ్యాణం కావ్యం గురించి ప్రస్తావించాడు. ఈ కావ్యంలో తను జాంబవంతునిలో పరకాయ ప్రవేశం చేసి మరీ రచించాను అని ఒకవిధంగా గొప్పలకుపోయాడు. కవులందరూ ఉల్లాసభరితంగా వింటూ తెగ ఆనందపడిపోసాగారు. వారిని చూసి మరింతగా రాయలువారు ఎక్కువ మోతాదులో చెప్పుకుపోతుంటే... రామ లింగకవి చిరునవ్వు మోముతో వినసాగాడు. ఆ కావ్యం గురించి కవుల నుంచి పొగడ్తలు శృతిమించాయి. ఒక విధంగా ఆకాసానికి ఎత్తేసారు.


“నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది ఆ కావ్యం. జాంబవంతుడు అడవిలో సంచరించే ఓ ఎలుగుబంటి. మానవభాష నేర్చుకున్న మహాజ్ఞాని, రామభక్తుడు. అతడికి మానుష్య రూపంలో గల ఓ అందాల అపరంజి బొమ్మ లాంటి కూతురు జాంబవతి. ఆమెకు ద్వారకాపురివాసి శ్రీకృష్ణుడుతో వివాహం జరిపించి ధన్యుడవుతాడు జాంబవంతుడు. ఈ కధనంలో జాంబవంతుడు మానవభాష నేర్చుకున్నట్టు నేను ఎలుగుభాషను తెలుసుకుని మరీ రాసాను.” అని రాయలు సంతృప్తిగా నవ్వుతూ చెప్పి కొత్తగా వచ్చిన రామలింగని వైపు చూసాడు. అతడు ఎలాంటి భావాలను వ్యక్తం చేయకుండా, తన ముఖంలో కనిపించనీయకుండా 

మౌనముద్రతో వింటుంటే చూసి ఆశ్చర్యపోయాడు.


"రామలింగా, ఏమిటా పరధ్యానం ? నా కావ్యం పట్ల మీకేమైనా విముఖత ఉందా ? మరి, అందరిలా విని ఆనందించలేదు. కనీసం తప్పేమి చూపలేదు. సరికదా ఇక్కడ ఉన్నట్టు లేరు, పరధ్యానంగా ఉన్నారు.” అన్నాడు.


"ప్రభూ ! మీ జాంబవతీ కళ్యాణం గురించి చెప్తుంటే జిత్తులమారి నక్కతో సంభాషణ గుర్తుకువచ్చింది. ఆ కధ తమరు తప్పక వినాల్సిందే"నన్నాడు. 


కవులు అదోలా చూసారు. అలసాని పెద్దన, దూర్జటి, నంది తిమ్మన, రామరా జభూషణుడు ఆ మాటలకు పెదాలు విరిచారు. అయ్యల రాజు రామభద్రుడు మాత్రం “ఇదేమి వైపరీత్యం రామలింగా, మమ్మల్ని ఏ విధంగా నువు పశువుల కొట్టంలో ఒకేరాటకు కట్టివేస్తున్నావు. లేకుంటే నక్కలతో నీవు సంభాషించావా ? చాలు చాలు ఆపవయ్యా” అని పెద్ద గొంతుతో అడ్డుపడ్డాడు.


“ ప్రభూ నేను చెప్పేది వినాలని ప్రార్ధిస్తున్నా ను. తొలిసారి ఈ పవిత్రమైన భువన విజయం లోకి అడుగుపెట్టిన నాకు మాట్లాడేందుకు, నా గురించి మీకు చెప్పుకోవడానికి ఇది తొలి అవకాశం" అని ప్రాధేయపడ్డాడు.


“సరే చెప్పు రామలింగా, మాకు కుతూహలంగా ఉంది. నీవు నక్కలతో సంభాషించావా ? నమ్మశక్యంగానిదిగా ఉందే. అందుకే మన అయ్యలరాజు రామ భద్రుడు వినడానికే ససేమిరా అని బయట పడ్డాడు. మిగిలినవారు చూస్తున్నావుగా పెదాలు విరిచారు." అసహనంగా నవ్వుతూ రాయలు రామలింగానికి చెప్పేందుకు అవకాశం ఇచ్చాడు. రామలింగడు లేచి నిలుచుని వినమ్రంగా నమస్కరించా డు.


“మిత్రమా రామభద్రా! నీవు తప్పక వినాల్సిందే. మిగిలినవారు కూడా. నేను ఇరవైఏండ్ల ప్రాయమప్పుడు ఏదో పనిపడి, ఓ అడవి మార్గం లోంచి వెళ్తుండగా తోవలో నిద్రపోతున్న నక్కను చూసుకోకుండా దాని తోక మట్టేసాను. అది కుయ్యో మొర్రో అని అరిచి పక్క పొదలో దూరింది. అక్కడ ఓ పెద్ద ఎలుగుబంటి ఉంది, దాన్ని చూడగానే నా ప్రాణాలు విలవిలలాడాయి. అంతలో దొంగలగుంపు వచ్చి నన్ను ఎగాదిగా చూసి "ఓయి బాపడా, నీకు మంత్రాలు వచ్చు కదా. పదా మా నాయకుడికి పెళ్లి 

చేయాలి.” అని నన్ను ఈడ్చుకువెళ్లారు. భయంతో వెళ్లాను. దొంగల పెళ్లిలానే జరిపించాను. వాళ్లు దోచుకువచ్చిన వాటిల్లో నాకూ దండిగా ధనకనక వస్తువులు ఇచ్చారు. తిరిగి నన్ను ఎక్కడ్నించి తీసుకువెళ్లారో అక్కడే వదిలేసారు. 


పొద వద్ద ఆ నక్క ఎలుగుబంటి ఉన్నాయి. అవి నన్ను గుర్రుగా చూస్తున్నాయి. అప్పుడు నక్క అంది "ఏయ్ బాపడా.. నువ్వు నా తోక మట్టి చాలా ధనం మూటకట్టుకు వచ్చావు. చూసావా నా తోక మహిమ." అని అపురూపంగా తోకను ముద్దులాడుకుంది.


నక్క మాటలు విన్న ఎలుగుబంటి "రేయ్ నక్క అల్లుడూ, ఒకసారి నేను నీ అదృష్టాల తోకను మడతానురా కాదనకురా, ఎప్పట్నించో ఈ అడవికి రాజును కావాలని ఆశ పడ్తున్నాను.” అని ప్రాధేయపడింది. ఇదేదో చూడాల్సిందేనని నక్క సరేనంది. ఎలుగుబంటి నక్కతోక బలంగా మట్టేసింది. అంతే దిక్కులు పిక్కటిల్లేలా అరిచిందా నక్క. అపుడే అడవి అదిరేలా మృగరాజు సింహం గర్జన వినిపించింది. నాకు పై ప్రాణాలు పైనే పోయాయి. పక్కనున్న చెట్టు ఎక్కాను, నక్క పొదల్లో దూరింది. ఎలుగుబంటి మాత్రం బిక్కచచ్చి పోయి చేష్టలుడిగిపోయినిలబడిపోయింది. 


రానే వచ్చింది సింహం. "నన్ను రక్షించుము లేని ఆశలకుపోయితిని. ఈ అడవిని ఏలుదామని కోరికతో స్వామి ద్రోహినయి తిని. మన్నించు. నక్క తోక మాత్రమే మట్టితిని తప్ప ఇతరత్రా ఎలాంటి కుట్రను చేయలేదు."అని ప్రాధేయపడిందా ఎలుగుబంటి.


"ఎలుగుబంటి మాఁవా, నేను వచ్చింది నీ సాయం కోరడానికి, నీవన్నట్టు నీవు మట్టిన నక్క తోక మహిమో ఏమో నాకు తెలియదు. ఈ క్షణం నుండి నీవు ఈ కాకులు దూరని కారడవికి కొన్నాళ్లు రాజువు. నేను నా సుపుత్రుని పెళ్లి పని మీద పొరుగు అడవికి వెళ్తున్నాను." అని కిరీటం ఎలుగుబంటి నెత్తి పై పెట్టి వెళ్లిపో యింది. ఎలుగుబంటి చిరకాల కోరిక తీరినందుకు మహా ఆనందించింది. పొదలో నక్కి దాక్కున్న నక్క బయటికి వచ్చి “ఏమిటీ విడ్డూరం.. నా తోక తొక్కిన ఆ వెర్రి బాపడికి ధనం. రేపోమాపో కాటికి పోయే ఎలుగుబంటికి కిరీటం దక్కాయి. నాకేటి లేదా ?నాతోక పచ్చి పుండు కావడమేనా ? ఇంక ఎవరికి నా తోక దొరకనీయను.” అని ఓ పెద్ద ఎలుక బొరియలోకి తోక పెట్టుకుని శోకాలు తీయసాగింది. 


పాపం నక్క దురదృష్టం ఆ బొరియలో ఆకలి గొన్న పందికొక్కు అందమైన నక్క తోకను మొదల్లో పుటుక్కున కొరికేసి ఆరగించేసింది. “చచ్చాను దేవుడోయ్.. పాడు పందికొక్కు నా తోకను తినేసింది " అంటూ నేలపై గింగరాలు కొట్టి ఏడ్చింది నక్క.


అడవికి కొత్తరాజు ఎలుగుబంటి నవ్వి “చచ్చిన పీనుగులను తిని బతికే నీలాంటి వాడికి ఆ దేవుడు అదృష్టమైన తోక ఇచ్చాడు. పరోపకారం లేశమైనా లేని నీకు తగిన శాస్త్రి జరిగింది. నాకు ఈ అడవిలో మరి కనిపించ కు, నా మాట ధిక్కరించావో నీ ప్రాణాలు తీయంది వదలను. ఇది రాజాజ్ఞ" అని హెచ్చరించి పొమ్మంది ఎలుగుబంటి. నక్క బిక్కచచ్చిపోయింది. వేదాంతిలా నవ్వుకుంది. 


"ఎలుగుబంటి మావా, నా తోక దయా లబ్దంతో రాజువయి తొలిసారిగా నాకే శిక్ష విధించావా, కలియుగం కదా యుగధర్మం " అని తోకలేని నడుంతో భారంగా నడుచుకుంటూ వెళ్లిపోగా, మరోవైపు ఎలుగుబంటి రాజదర్పంతో కాకు లు దూరని కారడివిలోకి వెళ్లిపోయింది.


"బ్రతుకు జీవుడా అని నేను చెట్టు దిగి ఇంటి ముఖం పట్టాను. ఇది ప్రభూ! నాకు జరిగిన అడవి జంతువులతో వింతైన అనుభవం" అని చెప్పి ముగించాడు రామలింగడు.


చెవులు రిక్కించి విన్న కవులు తెరలు తెరలుగా నవ్వారు. ఒకరిద్దరూ... పడిపడి నవ్వారు. రాయలు మాత్రం రామలింగడు ఏమనుకుంటాడోనని కనిపించకుండా నవ్వాడు. ఎలాగు తొలుత బయటపడ్డ అయ్యలరాజు రామభద్రుడు మళ్లీ తానే గొంతెత్తి "రామలింగా, అడవి జంతువుల భాష ఏ గురువు నుంచి నేర్చుకున్నావు. మాకు చెప్పరాదూ నీ వద్ద నక్కల భాష క్షుణ్ణంగా అభ్యసిస్తాం. లేదా నీ గురువు వద్ద నేర్చుకుంటాం. ఆయనెవరో చెప్పు. " అని ప్రాధేయపడ్డాడు.


ఆ మాటలకు మరోసారి అందరూ గొల్లున నవ్వారు. ఈసారి శ్రీకృష్ణదేవరాయలు కూడా బిగ్గరగా నవ్వాడు. ఆ నవ్వుల హోరయ్యాక "అయ్యల రాజ రామభధ్రా ! నక్కల భాష ని జంగా నేర్చుకుంటావా ? నీవేనా లేక ఇక్కడ కడివెడు నవ్వులు పాలుపంచుకున్న మన కవితిలకాలూ కూడానా "అని అడిగాడు రామలింగడు.


కవులందరూ రామలింగడిని మరింత ఇరుకున పెట్టాలి అని ఏక కంఠంతో "నేర్చుకుంటాం” అన్నారు. రాయలూ అనేవాడేమో కానీ రామలింగడు ఈసరికే ఒంటరి అయిపోయాడు. అని మౌనం వహించాడు.


"మిత్రులారా! నేను గురువుగా పనికిరాను. కారణం నన్ను గేలి చేస్తున్న శిష్యులు మీరు. నా వద్ద విద్య మీకు అబ్బదు. గురువు అంటే భయం, భక్తి, గౌరవం ఉండాలి. శిష్యులుగా శుంఠలు పనికిరారు. ఈ జంతు విద్య నేర్చుకోవాలన్న ఆశ మీకు బలంగా ఉంటే అదిగో మన ధర్మప్రభువులు రాయలువారి వద్ద చేతులు కట్టుకుని అభ్యసించండి. ఆయనకు ఎలుగుబంటి భాష వచ్చు, కనుకనే జాంబవంతునిలో పరకాయప్రవేశం చేసి మరోవైపు ఎలుగు భాషను తెలుసుకున్నందున రచించారు జాంబవతీకళ్యాణం. కనుక ఆయన వద్ద నేర్చుకున్నాక, అప్పటికి ఓపిక, మరిన్ని జంతుభాషలు నేర్చుకునే కోరిక బలీయంగా ఉంటే మీలో ఇప్పుడున్న శుంఠతనంపోతే నా వద్ద నక్క, సింహం భాషలు తప్పక నేర్పగలను" అని నిశ్శబ్దంగా మారిపోయిన ఆ మందిరంలో కంచుగంట లాంటి గొంతుతో వ్యంగ్యంగా ఏ మాత్రం సంకోచించకుండా కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు రామలింగకవి.


ఒక్కసారి అందరి ముఖాలు వివర్ణమయ్యా యి. ఎవరికి వారే ఏమిటింత సాహసం, రాయలవారినే తప్పుపట్టే ప్రయత్నం చేసేది, ఈ వెర్రి మొర్రి బాపడా ? కొంపదీసి ఈతడు అమావాశ్యకు పిచ్చిపట్టే రకం కాదుకదా! అని పరిపరి విధాలుగా ఆలోచించారు. భయంతో చూసారంతా. 


అప్పటికే అక్కడికి విచ్చేసిన తాతా

చార్యులు వారు నొచ్చుకుని “ఏయ్ రామ లింగా నీకేమైనా మతిచాందసం ఉందా ? రాయల వార్ని చిన్నబుచ్చుతావా ? ఇక్కడ కొలువు తీరిన ప్రభువుకి, మిగిలిన కవులందరికి, క్షమాపణలు కోరుకుని తక్షణం ఈ నగరం విడిచి పో ! " అని ఉగ్రుడైపోయాడు.


“మన్నించండి తాతాచార్యులుగారూ ! నేనే అపరాధం చేయలేదే.. ఎలుగులభాష తనకు వచ్చని మన ప్రభువులవారే 

సెలవిచ్చారు. అందుకు ఇక్కడ కవులు అందరూ చెక్కభజన చేసి మరింత ప్రోత్సహిస్తున్నారు. ఎంతటి వారికైనా పొగడ్త ఎనలేని సంతోషాన్నిస్తుంది. మన ఏలిక ఆ దిశలో ఆనందపడ్తున్నారు. నేను రాయలవారి శ్రేయస్సు కోరేవాడిని తప్ప ఇచ్చకాల వాడిని కాను. కనుకనే యదార్థవాదాన్ని వినిపించాను. యధారాజా! తదా ప్రజా !! కాకూడదు. అని కోరుకునేవాడిని." అని తను చెప్పాల్సింది చెప్పి లేచి నిలబడి.. 


"ప్రభూ నా మాటలు బాధించినట్లయితే నన్ను మన్నించండి.” అని చేతులు జోడించాడు.


రాయలు తీక్షణంగా రామలింగని వైపు చూసాడు. అంతా ఇక రామలింగడి పని అయిపోయినట్లే ! ఈ పిల్లకవి బతకడం కష్టం అని ఎవరికివారే అనుకున్నారు, కానీ దూర్జటి మాత్రం లోలోపల ఆనందించాడు. భలేగా రాయలకు గడ్డిపెట్టాడు. చక్రవర్తి నన్న అహంతో తనకు ఎలుగు భాష వచ్చని పేలడం అందుకు తామంతా దిక్కులు పిక్కటిల్లేలా వంతపాడడం. బయటపడలేక తల అమ్ముకునే బతుకు అనుభవిస్తున్నాం. ధైర్యం అంటే ఈ రామలింగడిదేనని కవులందరూ రాయల వైపే చూసారు. ఎలాంటి శిక్ష వేస్తాడోనని ఊపిరిబిగబట్టారు. బహుశా ఇక మరణదండన అని అనుకున్నారు.


రాయలు లేచి రామలింగని వద్దకు వెళ్లి... 


“నీవు ధైర్యంగా నన్ను వేలెత్తి చూపావు. నిజమే ఈరోజు నేను శృతిమించాను. ఆ కావ్యం రాసానన్న ఆనందంలో ఏమేమో అనేస్తూ నోరు జారాను. చక్రవర్తి తప్పును దిద్దే సాహసం ఎవరూ చేయసాహసించ లేరు. అది నీవు అవలీలగా చేసావు. భయపడకుండా నీ వాదన వినిపించావు. జంతు భాషను నా వద్ద నేర్చుకోవాలా? గురుభక్తి లేనివారా వీరంతా ? పైగా శుంఠలా? ములుకుల్లాంటి నీ చమత్కార పలుకులు నా మనస్సున తొలుత కోపాన్ని పెంచినా తర్వాత ఆనందాన్ని నింపాయి" అని అభినందించాడు.


అంతా నిండుగా నవ్వుకున్నారు. అలసాని పెద్దన “రామలింగా, ఎక్కడ రాజాగ్రహానికి గురవుతావోనని భయపడ్డాను.” అని గాఢంగా కౌగిలించుకున్నాడు.


“క్షమించండి రామలింగకవి, నేను తొలుత బాధ కలిగించేట్టు ఏమెమో అనేసాను " అని అయ్యలరాజు రామభద్రుడు చేతులు పట్టుకున్నాడు. రామలింగడు నవ్వుతూ అందరికీ నమస్కారం చేసి సభ నుండి ఇంటికి బయలుదేరాడు.

🧑‍🦲

 *సశేషం*

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

*తెనాలి రామకృష్ణ - 4*

🧑‍🦲


*పాలెగాపు లంచాల ఎర -1* 


ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు సభలో ఉండగా కొందరు నగరశివారు ప్రాంతపు గ్రామీణ ప్రజలు విచ్చేసి “అడవి జంతువుల బాధపడలేకున్నామని, దేవరవారు తగు రక్షణ కల్పించకపోతే జీవించలేమ” ని, పాదాలపై పడి వేడుకున్నారు. వారి బాధలు విన్న రాయలు వారికి అభయం ఇచ్చి పంపేసాడు. 


నరమాంసం రుచి మరిగిన పెద్దపులి రాత్రులయందు ఆరుబయట నిదురించే వారి పై దాడి చేసి దొరికినవారిని నోట కరచుకుపోతోంది. దాన్ని గ్రామీణులందరు ఏంచేయలేకనే ఏలినవారికి మొరపెట్టు కుంటున్నాం అని ప్రజలు చెప్పిన మాటలు రాయలువారి చెవుల్లో గింగురుమంటుంటే, ఆరోజు సభలో అన్యమనస్కుడై ఉన్నాడు. ఏ పని చేయలేక సింహాసనానికి అతుక్కుపోయాడు.


ఆ సభలో ఉన్న తెనాలి రామలింగకవి రాయలువారిని గమనించి, “ప్రభూ ! తమరెందుకో ఏదో ఆలోచనలో సభా కార్యక్రమాలపై మనస్సు నిలపలేకపోతు న్నారు. ఆ పులిని వధించేందుకు ఎవరిని పంపించాలా అని ఆలోచిస్తున్నారు కదూ !" అని అడిగాడు.


“పాపం పల్లెవాసులు ప్రాణల మీద పెను గండంగా పెద్దపులి దాపురించింది. పులి వేట అంటే ఎవరూ అంతగా ముందుకు రారు. మేమే స్వయంగా వెళ్లాలి. ఇప్పటి నా పరిస్థితిలో నేను పులి వేటపై ఆసక్తిగా లేను. వేటకి ఎవరిని పంపాలా అని ఆలోచిస్తున్నాను. నీవు నన్ను బాగా పసిగట్టావు. కొలువులో అతిరధమహార ధులున్నారు. వారిలో నాగమనాయకుడు జగజెట్టి, వృద్ధాప్యంలో ఉన్నారు. వారి పుత్రుడు చిరుతప్రాయపువాడు. అదే అర్ధంకావడం లేదు. కొంతసైన్యం వాడితే సరిపోతుంది. కొంత ప్రాణనష్టం ఉంటుంది” రాయలు మాటలు సభలో ఖంగుమన్నాయి.


"ఏలినవారు అంతగా ఆలోచించపనిలేదు. ఈరోజు నా వద్దకు పెనుగొండ పాలెగాపు వీర రుద్రసింహారెడ్డి విచ్చేసారు. ఆయనకు సాహసం, యుద్ధం అంటే చెవికోసుకునే టంత పిచ్చి. మహారాజు తనను కేవలం కొన్ని పల్లెలకే పాలెగాపుగా నియమించి వదిలేసారు. ఏమాత్రం అవకాశం ఇచ్చిన నా పోరాటపటిమను చూపేవాడిని అని ఈరోజే నాతో అన్నాడు వీరసింహం. అతని సేవలు వాడుకోండి ప్రభూ!" అని రామలింగడు విన్నవించాడు.


అక్కడే ఉన్న రాజోద్యుగులు, మహామంత్రి తిమ్మరుసు, తాతాచార్యులువారు “ఇంకేం మన రామలింగకవి చెప్పిన ఆ సాహసినే ఈ పులి వేటలో వాడుకుందాం." అని అంతా ఏక కంఠంతో రాయలవారితో చెప్పారు.


రాయలువారు తలపంకించి " రామలింగా నీకు ఆ రుద్రసింహుడు ధైర్య సాహసాలపై నమ్మకం ఉందా, అతడు నీకెలా తెలుసు?”

అని అడిగాడు.


“రాళ్ళసీమ పల్లెల్లో తిరుగుబాటులను అణచడానికి, శత్రువులు జొరబాటులను కట్టించడానికి తమరేకదా కొన్ని ప్రాంతాల్లో ఈ పాలెగాపులను నియమించారు. వారు ఓ సామంతుల్లా ఆ గ్రామాల్లో క్రూరపాలన తో చెలరేగిపోతున్నారు. ఈ వీరరుద్ర సింహుడు ఆబాపతే ! ఇక అతనికి నాకున్న పరిచయం, అతడు ఎంతటి క్రూరస్వభావో, అంతటి సాహిత్యపిపాసి. నాచే ఏదైనా గ్రంధం రాయించి అంకితం పుచ్చుకోవాల ని ఆరాటపడ్తున్నాడు. అతని మాటలలో తను యుద్దపిపాసి అని పదేపదే చెప్పడం తో ఇంతకంటే సమయం రాదుకదా అని తమ చెవిలో వేసాను " అని విన్నవించాడు రామలింగడు.


రాయలు రాజ భటులను పంపించి, వీర రుద్రసింహుడు బస చేసిన చోటి నుంచి క్షణాలలో రప్పించాడు. పేరుకు తగ్గట్టుగానే భారీ విగ్రహంతో చేతులు కట్టుకుని వచ్చి విధేయతతో నిలబడ్డాడు.


" రుద్రసింహా! నీవు నగరానికి వచ్చి నన్నేందుకు కలియలేదు. ఇప్పుడు రామలింగకవి చెప్పగా నిన్ను పిలిపించు కున్నాను. నీతో ఒక ముఖ్యపని పడింది. అది నీవు సాధించి తీరాలి. పోతరించిన పెద్దపులి ఒకటి నరమాంసం రుచి మరిగి పల్లెల మీద పడి నానాభీభత్సం చేయు చున్నది. దాన్ని నీవు వధించాలి. ఇట్టి పనులను మాచే నియమింపబడే పాలెగాపులతో చేయించలేదు. నీకే తొలి అవకాశం ఇస్తున్నాను. ఏమందువు ? " అని తీక్షణమైన చూపులతో అడిగాడు.


వీరరుద్రసింహుడు గుటకలు మ్రింగుతూ చూసి “మీ కోసం ప్రాణాలైనా సమర్పించడా నికి సిద్ధం మహారాజా " అని తలవంచి నమస్కరించాడు.


"మీతో జెగజ్జెట్టీలవంటి సైనికులు వంద మందిని వెంట పంపుతాను. ఆ పులివధ జరిగి తీరాలి. ఆ పల్లెలకు దాని పీడ వదిలి పోవాలి. ఇదే నాకోరిక.” చెప్పి రాయలు సింహాసనం దిగి కిందికి వచ్చి వీరసింహుడి భుజం తట్టాడు.


తెనాలిరామలింగడిని కొరకొరా తినేసేట్టు చూసాడు రుద్రసింహుడు. ఎరక్కపోయి ఈ వెర్రి బాపనితో వెర్రిమొర్రి మాటలు చెప్పి మీదకు తెచ్చుకున్నాను." అని లోలోపల బాధపడ్తూ "ధన్యుడిని మహారాజా, స్వామి కార్యం పూర్తి చేసి విజయుడనై వచ్చెదను. తమ ఆశీర్వాదం కావాలి.” అని రాయల పాదాల పై మోకరిల్లాడు.


"ప్రభూ అనుగ్రహిస్తే నేనూ వెళ్తాను" అని రామలింగడు కోరాడు. సభలో వారంతా అయోమయంగా చూసారు. పులివేటకు వెళ్లేందుకు ఈ రామలింగడికి ఉన్న ధైర్యం ఏమిటి ? ఇదేమి ఛాదస్తం అని నోళ్లు వెళ్లబెట్టారు.


రాయలు కూడా వింతగా చూసాడు. ఏదో విశేషం లేకుండా రామలింగడు ఇలాంటి నిర్ణయం తీసుకోడు అని లోలోపల అనుకుని.. "సరే నీవును వెళ్లు రుద్రసింహా! రామలింగకవి ముచ్చటపడి మీతో వస్తామంటున్నారు. ఆయన వీరత్వం ప్రదర్శించేందుకు రావడంలేదు. 'ఆయన రక్షణ బాధ్యత మీదే. ఆయనకు ఏం కాకూడదు. జాగ్రత్తసుమా !" అని చెప్పి పంపాడు.

📖


వీరరుద్రసింహుడు నాయకత్వంలో పులి వేట ప్రారంభం అయ్యింది. అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు. పులి జాడ వారికి కనిపించలేదు. దాని అడుగుల ముద్రలు కొంతవరకే పనిచేసాయి. వారితో ఉన్న రామలింగడు రుద్రసింహుడినే గమనించసాగాడు. అతడు ప్రత్యర్ధులను అంత మొందించడంలో అతి పాషాణ హృదయుడు. కానీ పులి అంటే భయపడు తున్నాడు. అది పసిగట్టిన రామలింగడు..


"అయ్యా ! మీ వ్యూహం నాకు అసలు అర్ధంకావడం లేదు. తమరు తప్పదని వచ్చినట్టున్నారు." లోగొంతుతో అడిగాడు.


"రామలింగా ఎంత పని చేసావయ్యా ! 

అనవరంగా నా గురించి చెప్పి ఈ అడవుల్లోకి తెచ్చి పడేసావు. ఆ పులి ఎప్పుడు మనకెదురు పడుతుందో? ఏమో ? అందులో నరమాంస రుచి మరిగింది. ఒక విధంగా పిచ్చి పట్టినట్టు పెట్రేగిపోతుంది” అని విసుగు ప్రకటించాడు.


ఓ చిన్న గుడారం వేసారు సైనికులు. అంతా విశ్రమించారు. చీకట్లు ఆవరించాయి. రామలింగడు ఉదయం అంతా అడవిలో తిరుగాడడం వలన బాగా అలసి నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు వీరరుద్ర సింహుడు సైనికుల్లో ఉన్న తుళు, కబ్బలి, మొరస జాతివారి గురించి ఆరాతీసాడు. రాయలవారి సైన్యంలో ఈ మూడు జాతులవారే ఎక్కువ ఉండేవారు. కారణం ధైర్యసాహసాలకు పెట్టింది పేరు. ఒక్క కబ్బలి జాతివారు మాత్రమే ఈ వంద మందిలో పదిమంది వరకు ఉన్నారు. వారిని సైన్యం నుంచి వేరు చేసి రహస్య మంతనాలు చేసాడు. పులిని తెల్లారేసరికి చంపి తీసుకురమ్మన్నాడు. అందుకు బహుమానంగా రాయల వారు తనకు ఏమిచ్చినా మీకే ఇవ్వగలను అని వారికి ఆశ చూపాడు. 


వారు ఇంకనూ పలు గొంతెమ్మ కోరికలు కోరారు. వాటికి సరేనని ఒప్పేసుకున్నాడు. అదెంతపని అని అ పదిమంది ఆ రాత్రే అడవుల్లోకి వెళ్లారు. రుద్రసింహుడు 

గుడారంలో హాయిగా నిద్రపోయాడు.


ఉదయానికి ఆ పులిని చంపి గుడారం ముందు పడేసారు కబ్బలిజాతి సైనికులు. కళ్ళు నులుముకుంటూ లేచిన రుద్రసింహు నికి భయనకంగా కనిపిస్తున్న పులి శవం కనిపించింది. ఇంత పెద్ద పులిని తనెప్పుడు చంపగలడు. అసలు దాని పంజా దెబ్బకు చచ్చేవాడిని అనుకున్నాడు. పులి వధ రహస్యం అక్కడ పులిని చంపిన సైనికులు పదిమందికి, రుద్రసింహునికి మాత్రమే తెలుసు. మిగిలినవారికి అసలు పులి చంపబడినట్లు తెలియదు. 


ఒక్కసారి గుడారంలో కలకలం రేగింది. 


" జై రుద్రసింహునికి, రాయలసీమ సింహానికి జై " పులి వధించిన వీరునికి జై " అని నినాదాలు చేసారు.


తుళ్ళిపడి లేచాడు రామలింగకవి. కొంపదీసి పులి లోపలికి వచ్చిందా ! అని భయపడి " రక్షించండి " అంటూ గట్టిగా అరవసాగాడు. సైనికులు లోపలికి వచ్చి “ఏమయ్యింది కవిగారూ !” అని అడిగారు.


"ఏంటయ్యా ఆ కేకలు, పులి గుడారంలోకి జొరబడిందేమోనని భయపడి అరిచాను. ”


ఆ సైనికులు విపరీతంగా నవ్వారు. "అయ్యా మన రుద్రసింహులు వారు ఆ పులిని తెల్లవార్లు వెదికి వెంటాడి మరీ చంపేసారు. ఆ ఆనందంతో నర్తిస్తున్నాం. రండి చచ్చిన పులిని చూడండి. ఇంత పులిని అతనొక్కడే ఎలా చంపాడో అర్ధం అవుతుంది. తీరా ఆ పులి పంజా దెబ్బ ఒక్కటి అతని పై పడలేదు. అంతటి వీరుడు" అని ఒక సైనికుడు చెప్పాడు.


"అతడో సింహం, అతడు పులిని చంపడం, అయినా ఏమీకాదన్నమాట.. భలేవేట, ఏమో అనుకున్నాను. రాయలవారు నన్ను తెగమెచ్చుకుంటారు. ఓ పరాక్రమవంతుడ్ని చూపినందుకు అభినందనలతో నన్ను 

ముంచెత్తుతారు." అని రామలింగడు ఆనందంతో బయటికి వచ్చాడు.


పులి వికృతంగా ఉంది. కనీసం పదిమంది యోధులు కలిసి కానీ నిర్జించలేరు. ఒకే ఒక్కడు ఎలా ఎదుర్కొన్నాడు? వీరరుద్రమ ఏమని పొగడను నిన్ను. ఈ పులిని రాయల వారికి చూపించాలి. నాకు తెలిసి ఎవరూ ఇంత పెద్దపులిని చంపి ఉండరు. " అని తెగ మెచ్చుకున్నాడు.

📖


ఆరోజు మధ్యాహ్నం రాజదర్బారుకు పులి శవంతో వెళ్లారు. డప్పులు, భేరీలు మ్రోగాయి. పులిని చూసి నగరవాసులు భయభ్రాంతులైయ్యారు. సైనికుల భుజాల పై కూర్చున్న వీరరుద్రసింహుడు సభా సదులకు చేతులు ఊపుతూ అట్టహాసంగా కనిపించాడు. రాయలు అతడిని చూసి ఉప్పొంగిపోయాడు. లేచి నిలబడి చంపబడ్డ పులిని చూసి ఒక విధంగా నిర్ఘాంతపోయాడు. సైనికులు పదిమంది ముందుకువచ్చి.. “జయము, జయము మహారాజా ఈ పులి కోసం మేము పదిమంది, మాతో శ్రీశ్రీశ్రీ వీరరుద్ర సింహులు వారు అర్ధరాత్రివేళ అడవంతా గలాయించాం. ఇది నరమాంస రుచి మరిగినందున మమ్మల్ని చూడగానే మాపై దుమికింది. నిజానికి ఈ మహావీరుడు రుద్రసింహులవారు అడ్డుపడకుండా ఉంటే ఈపాటికి మా ప్రాణాలు పోయేవి. ఈయన కత్తి దూసి ఇంత పులిని క్షణాలలో మట్టికరిపించా రు." అని విన్నవించారు.


సభలో ఉన్నవారంతా ఉత్కంఠభరితంగా విన్నారు.


"ఇట్టి వీరుడిని మనకు పరిచయం చేసిన రామలింగడు ఎక్కడ?" ఆరా తీసాడు తిమ్మరుసు. రాయలు కళ్ళు కవి కోసం వెతకసాగాయి.


"మీతో వచ్చిన  రామలింగకవి ఎక్కడ ?" తిమ్మరుసు అడిగాడు.


సైనికులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకు న్నారు. "ఇంతవరకు మనతో ఉన్నాడు. ఇప్పుడెటు వెళ్లాడు" అని వెదకసాగారు.


అంతలో మళ్ళీ భేరీలు, డప్పులు మ్రోగాయి. అంతా అటు వైపు చూసారు. మరో ఊరేగింపు సభలోకి ప్రవేశించింది. 


“కవితిలకా, సాహస విక్రమార్క క్రూరమృగ నాశక, అరివీరభ యంకర, రామలింగా” అని నినాదాలతో ఇరవైమంది సైనికులు రామలింగని భుజాలపై మోసుకుంటూ వచ్చారు. రామలింగడు సభలోని వారందరిని చూస్తూ చేతులు ఊపుతూ, తన కండల్ని పొంగిస్తూ హడావుడిగా కనిపించాడు. కవులు నోళ్లు తెరిచారు. తిమ్మరుసు, తాతాచార్యులు, ఉన్నత రాజోద్యుగులు రామలింగని ఎగాదిగా చూసారు. 


"ఏంటీ!! ఈ బాపడా అడవిలో పులిని చంపాడంటున్నారు. ఆ సైనికులు, వారికి పిచ్చిపట్టలేదు కదా !" అని ఎవరికివారే అనుకున్నారు.


వీరరుద్రసింహుడు చెమటలు పోసాడు. రామలింగడు ఎందుకు ఇలా ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు. తన వ్యవహారం బయటపడితే ఎంత ప్రమాదం ? అందులో రాయలవారు క్షమించనే క్షమించరు అని లోలోపల చాలా భయపడ్డాడు.

🐯

 *సశేషం*

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂


*తెనాలి రామకృష్ణ - 5*

🧑‍🦲


*పాలెగాపు లంచాల ఎర - 2*


https://youtu.be/FwXmfyREbd4?si=X9qUZVLbkw2zpW6M



అంతలో మళ్ళీ భేరీలు, డప్పులు మ్రోగాయి. అంతా అటు వైపు చూసారు. మరో ఊరేగింపు సభలోకి ప్రవేశించింది. “కవితిలకా, సాహస విక్రమార్క క్రూరమృగ నాశక, అరివీరభ యంకర, రామలింగా” అని నినాదాలతో ఇరవైమంది సైనికులు రామలింగని భుజాలపై మోసుకుంటూ వచ్చారు. రామలింగడు సభలోని వారందరిని చూస్తూ చేతులు ఊపుతూ, తన కండల్ని పొంగిస్తూ హడావుడిగా కనిపించాడు. కవులు నోళ్లు తెరిచారు. తిమ్మరుసు, తాతాచార్యులు, ఉన్నత రాజోద్యుగులు రామలింగని ఎగాదిగా చూసారు. ఈ బాపడా పులిని చంపాడని అంటున్నారు. ఆ సైనికులు వారికి పిచ్చి పట్టలేదు కదా ! అని ఎవరికివారే 

అనుకున్నారు.


వీరరుద్రసింహుడు చెమటలు పోసాడు. రామలింగడు ఎందుకు ఈ విధంగా ఇలా ప్రవర్తిస్తున్నాడు. తన వ్యవహారం అంతా బైటపడితే ఎంత ప్రమాదం ? అందులో రాయలవారు క్షమించనే క్షమించరు అని లోలోపల చాలా భయపడ్డాడు.


"రామలింగా నువ్వా పులిని చంపింది. మరి రుద్రసింహుడంటున్నారు సైనికులు? ఏమిటిదంతా ! నిజం చెప్పండి. పులిని చంపింది ఎవరు ?" అని రాయలు కోపంగా ప్రశ్నించాడు.


"రుద్రసింహుడి వెనుక పదిమంది ఉన్నారు. నావెంట ఇరవైమంది ఉన్నారు. వారినే అడగండి. నిజానిజాలు తెలియగలవు ప్రభూ!"


"సైనికులారా ఏమిటిదంతా, ప్రజలను భీతావహులను చేసే పులి చచ్చింది అంటే ఆ ఆనందం అనుభవించకుండా మీరు చేస్తుంది. సభను తప్పుతోవ పట్టించడమే, ఇట్టి తప్పిదము క్షమించరానిది. " రాయలు కోపాన్ని ప్రదర్శించాడు.


“మన్నించండి. మహారాజా తమరు ఆదేశించినట్లు పులి చంపబడింది. మాలో ఎవరు చంపినా ఒకటే. రామలింగకవికే ఆ ఫలాలు ఇప్పించండి. ఆయనకే తమరిచ్చే కానుకలను ఇచ్చి ఆనందింపచేయండి.” తెలివిగా వీర రుద్రసింహుడు తన అభిమతాన్ని తెలియజేసాడు..


ఆ మాటలకి సభ అంతా నివ్వెరపోయింది. ఒక విధంగా రామలింగని పై కోపోద్రిక్తులై ఉన్నారు. రాయలు కూడా అదోలా చూసాడు. 


“రామలింగా నువ్వే పులిని చంపావా ?” మరోసారి అడిగాడు రాయలు పైస్వరంలో. 


"ప్రశాంతంగా వినండి ప్రభూ ! పులిని చంపినందుకు నాకేమి ఇస్తారో ముందు తెలియజేయండి. ఆ తరువాత నేను నా వెనుక ఉన్న సైనికులు ఓ నిర్ణయానికి రాగలము.”


"నేను ఒకటి అడుగుతుంటే నీవు మరొకటి చెప్తుతున్నావు. ఆ క్రూర జంతువుని 

చంపినవారికి వెయ్యి వరహాలు ఇవ్వగలను. దానితో వీరులకు ఇచ్చే బిరుదును ఇవ్వగలను. ఇదే విధానం మా తాతతండ్రుల నుంచి వస్తున్నది. నిజం చెప్పు పులిని చంపింది ఎవరు ?”


“వెయ్యి వరహాలు అయితే మాకు అభ్యంతరం లేదు. కానీ, బిరుదు దగ్గరే పేచీ ఉంది ప్రభూ మరో మాట చెప్పలేరా ?” 


రాయలువారికి ఏమీ అర్ధంకాలేదు. సభ మొత్తం క్షణ క్షణం ఉత్కంఠభరితంగా మారిపోతోంది. అంతా ఊపిరి బిగబట్టి వింటున్నారు సభికులు.


"ఏలినవారు అనుజ్ఞ ఇస్తే నేను సభ నుంచి నిష్క్రమించగలను.” చేతులు జోడించాడు వీరరుద్రసింహుడు. అతడి వెనుక ఉన్న సైనికులు అతన్ని కొరకొరా చూడసాగారు. అతడికి వినపడేట్టు గొణగసాగారు. 


"ఎంతో కష్టపడి పులిని చంపితే మాకు ఇస్తామన్న బహుమతులని రామలింగడి పరం చేయడానికి నీ మనస్సు ఎలా ఒప్పుతుందయ్యా ! నీకోసం మా ప్రాణాలకి తెగించినందుకు ఇదా నీవు మాకు ఇచ్చేది”


“దయచేసి నన్ను అర్ధంచేసుకోండి. మీకు ఇవ్వవలిసినది నేను చెల్లించగలను. నన్ను నమ్మండి."


వారికి మాత్రమే వినపడేట్టు చెప్పాడు వీర రుద్రసింహుడు. అంతా మూతులు కొరుక్కుంటున్నట్టుగా ఉంది.


రామలింగడు ఆ సైనికుల మాటలను చెవులను రిక్కించి విని "అయ్యా వీర రుద్రసింహుడు పూర్తిగా ఓ మంచి నిర్ణయానికి వచ్చేసాడు. అతడి వెనుకున్న సైనికులకు స్వంతంగా ముందు అనుకున్న లంచం ఇచ్చుకుంటాడు. ఇక తేలాల్సిందే తమ వద్ద నా బిరుదులు. నాకు దయచేసి ఓ ఇరవై బిరుదులు ఇప్పిస్తే మాలో ఎలాంటి పేచీలుండవు.” రాయలు వైపు చూసి చెప్పాడు.


ఆ మాటల్లో రాయలకు ఇందులో ఏదో మతలబు ఉందనిపించింది.


“నువ్వు ఒక పులిని చంపినందుకు ఒక బిరుదు ఇవ్వగలను, కానీ ఇరవై ఇవ్వడం అంతమంచిది కాదు. అయినా అన్ని బిరుదులతో నీకేంపనయ్యా! నువ్వు పులిని చంపడమే సభలోని వారంతా నమ్మలేకపోతున్నారు. కనీసం నీ ఒంటి మీద చిన్న గాయం లేదు. పులి చూస్తే భయోత్పాతంగా ఉంది. నువ్వు నిజంగా పులిని వేటాడావా ? నేనడిగిన ఏ ఒక్క ప్రశ్నకు నీ నుంచి సరైన సమాధానం 

రాకుండా ఉంది " రామలింగడిని నిలదీసినట్లుగా అడిగాడు రాయలు.


"నిజమే ప్రభూ, తమరు సెలవు ఇచ్చారు. అంత పెద్ద పులిని వట్టి బ్రాహ్మడు చంపడ మనేది ఎవరూ నమ్మరు. పైగా నా ఒంటి మీద చిన్నపాటి గాయం లేదు. ఇదే ప్రశ్న నా ప్రక్క నిలుచున్న రుద్రసింహుడిని ఎందుకు అడగలేదు. అతని పేరులో రౌద్రం ఉంది. తమరు నియమించిన సరిహద్దు పాళెగాళ్ల పదవిలో ఉన్నాడు. అతడి ఒంటి మీద గాయాలేవి లేవే. నా వెనుకు ఉన్న సైనికులకూ, చిన్నపాటి గాయం కూడా కాలేదు. అంతో ఇంతో గాయపడినది మనందరికి కనిపిస్తోంది రుద్రసింహుని వెనకున్న సైనికుల శరీరాల పై మాత్రమే. వాళ్లంతా ఆ పులి వలన చావు తప్పి కన్నులొట్టపోయిన పరిస్థితిలో తీవ్రంగా గాయపడ్డారు.” 


రాయలు రెట్టించాడు. "అంటే.....”


“ప్రభూ ! తమకు అరటిపండు ఒలిచినట్టు గా వివరించాను. లోగుట్టు అర్దంకాలేదా ?” రామలింగడు నవ్వుతూ అడిగాడు. 


"పులిని చంపింది రామలింగడు కాదు, వీర రుద్రసింహుడు కాదు. మన వీర సైనికులే. రామలింగకవి నిజం చెప్పినందుకు ఈ సభ రుణపడి ఉంటుంది.” అని సభలోని వారంతా ఎలుగెత్తి ఆరచి మరీ చెప్పారు..


రాయలు నవ్వుతూ “రామలింగా నీవు కవివే కాదు. దేశాభిమానివి. నీలాంటి దేశభక్తులు అందరికి మార్గదర్శకులు. ఓయీ తగునా, నీవు పాలెగాడివి అంటే గండరగండడవు. నీకు ఇలాంటి అక్రమ పద్దతుల్లో లభించిన వీరత్వం వలన ఒనగూరింది ఏమిటి ?” కళ్ళు పెద్దవి చేసి అడిగాడు రాయలు.


రాయల ప్రశ్నకు రుద్రసింహుడు తలవంచు కుని నిలబడ్డాడు. అతడి ముఖంలో నెత్తురు చుక్కలేదు. పెద్ద తప్పు చేసినట్లు బాధపడ్డాడు.


“క్షమించండి ప్రభూ ! నేను వచ్చింది తెనాలి రామలింగకవి వద్ద ఓ కావ్యం అంకితం స్వీకరించాలనే ఆశతో వచ్చాను. నాకు సాహిత్యాభిలాషతో ఆ కోరిక తెలిపాను. అందుకు రామలింగకవి ఒప్పుకున్నారు. ఈలోగా తమరు పిలిపించారు. ఈ పులిని వేటాడమని ఆదేశించారు. నేను తీర్ధయాత్ర చేయుచున్నాను. నేను జీవహింసను చేయలేను అని తమకు చెప్పే సాహసం చేయలేను. అందుకే సైనికులకు లంచం ఎర చూపి ఈ వక్రమార్గంలో తమ ముందు ఈరోజు ఘోరమైన తప్పుతో మీ ముందు 

నిలుచున్నాను." తన నేరాన్ని ఏదీ దాచకుండా ఒప్పుకున్నాడు.


రామలింగడు వెంటనే అందుకుని తన గొంతు విప్పాడు.


"ఏలిన వారికి నేను చెప్పుకోవల్సింది ఉంది. ఈ రుద్రసింహుడు పాలెగాపు పదవిలో ఉంటూ అక్కడ ప్రజలను నానా బాధలు పెడుతున్నాడు. తలకు మించిన భారమైన పన్నులతో వేధిస్తున్నాడు. అక్కడ నా బంధువులు బతకలేక దేశాంతరం పోయారంటే అక్కడ పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించండి. వీళ్లక్కడ సామంతుల్లా ఏలుతున్నారు. ఏది ఏమైనా ప్రజలకు కంటగింపు పాలన రుచిచూపడం ఏమేరకు న్యాయం ? అందుకే ఈతనికి నేను కావ్యం అంకితం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాను. ఎలాగైనా రుద్ర సింహునికి బుద్ధిచెప్పాలని ఈ వేటలోకి రప్పించాను. అతడే తప్పటి అడుగులు వేసి తమ ముందు దోషిగా నిలబడ్డాడు. అతడు తమవలె సాహిత్యం పట్ల అభిరుచి ఎందుకు చూపుతున్నాడో తెలుసా ప్రభూ ! అతనికి అతనే తానో శ్రీకృష్ణ దేవరాయల నుకుంటున్నాడు. అందుకే వక్ర మార్గంలో సాహసాన్ని కొనుగోలు ప్రయత్నాలు. ఇదేదో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు లేదా ?” సభలో ఉన్నవారి నవ్వుల మధ్య రామలింగకవి చెప్పాడు.


(రాయల పాలన పై అబ్దుల్ రజాక్ అను ముస్లిం చరిత్రకారుడు ఈ పాలెగాపుల పాలన పై తీవ్రంగా విమర్శిస్తూ రాసాడు. ప్రజలను చాలా ఘోరంగా పాలించేవారని, ఆ బాధలు రుద్రసింహా వింతగా తన సాహసాన్ని కొనుగోలు చేయడం, నీవంటి వాడికి తట్టుకోలేనివిగా ఉండేవని కూడా వివరించాడు. ఈ విషయంలో రాయలు మిన్నకుండడానికి కారణం. దక్షిణాది రాజులెవ్వరూ  పోషించనంత సైన్యాన్ని సుమారు ఐదులక్షల మందిని పెంచడానికి సామంతులపై, ఈ పాలెగాపుల పై ఆధార పడేవాడు. ఆ కారణంగా ప్రజారంజక పాలనను ఒక విధంగా రాయలు వారికి అందించలేదనే చెప్పాలి. అత్యధికంగా పన్నులు ప్రజల్నించి పాలెగాపులు సామంతులు వసూలు చేసేవారు. పోర్చుగీస్ చరిత్రకారులు ఫేజ్ మరియు న్యూనిజ్ కూడా ఈ పాలన విషయంలో అబ్దుల్ రజాక్ రాతలనే ధృవీకరించడమే కాకుండా వీరు కూడా విమర్శించి రాసారు.)


"రామలింగా నువ్వు ఈతనికి ఒక కావ్యం అంకితమీయనున్నట్లు చెప్తున్నాడు. అది ఏ కావ్యం ? ఎప్పటిలోగా అతనికి అది అందజేయనున్నావు. మరి కావ్యం రచించి ఇవ్వకుండా ఈ పులి వేటలో అతన్నెందుకు లాగావు.” 


“నేను రాసిచ్చేవాడిని. కానీ ఈతడికి అసలు చదువురాదు. ఏదో కూనిరాగాలతో శుద్ధ తప్పులతో కొన్ని పద్యాలు చెప్పగలడు. ఇట్టి వానికి ఇచ్చిన నా కావ్యమునకు ఏ మేరకు ప్రచారము జరుగును. అదియునుకాక, ఈతడు వచ్చినది నగరానికి, తమ దర్శనం చేసుకోకుండా, వారం దినాలుగా ఇక్కడే సంచరించడం, కావ్యమన్నచో ఈతనికి ఏదో వృత్తి పని వలే ఉన్నది. పగలు రావడం పూర్తి అయినదా ? ఏ రాత్రికో దిగి ఏం కవీశ్వరా నా పని ఇంకనూ కాలేదా ? నీవు మనస్సు పెట్టినా అదెంతపని అని విసుగుచెందడం భరించలేకపోయాను. ఈ మద్య ఏకంగా ఏదో రాసి నా ముఖాన కొట్టవయ్యా పంతులయ్యా ! నీకు నేను ఇవ్వజూపినది చాలనట్టుంది. అందుకే రాయక ఎప్పుడూ రాజసభకి పోతున్నావు. అని నిష్ఠూరంగా నా వైపు చూసిన చూపులను తట్టుకోలేక ఈతనికి తగు విధంగా బుద్ది చెప్పాలనుకున్నాను. ఇంతలో తాటాకులను గుత్తులు గుత్తులు నా వద్దకు తెచ్చి నువైనా రాయి లేదా నేనైనా రాసుకుంటాను అని ఏకంగా ఘంటం పట్టుకున్నాడు.”


“నగరంలో ఉండే కవినే ఇంత మానసికంగా హింసిస్తుంటే ఇక ఈతని ఏలుబడిలో పాప మాప్రజలు ఎలా బతుకుతున్నారో?” రామలింగడు చెప్తుంటే సభాసదులు విరగబడి నవ్వుల్లో తేలియాడారు. ఒక దశలో రాయలు కూడా నవ్వాపుకుంటూనే నవ్వసాగాడు.


సభలో ఉన్న దూర్జటికవి "ఎలా భరించా

వయ్యా ఇన్ని సవతి పోకిల్లను.......? ” అని పంటి బిగింపులో నవ్వుతూ ప్రశ్నించాడు.


"ఈ అనుభవాలు తమకు అలవాటు. నాకు కొత్తకదా! యారళ్లపోరు లాంటి ఈ అంకిత తతంగాలు తమరు నేర్పిందే, నీరజాక్ష ధనకనక వస్తు వాహనాలు ఇవ్వాలేగాని తమరు ఎవరికైనా ఎన్ని కావ్యాలనైనా ఈయగలరు. తమ వద్దకే రావలిసిన రుద్రసింహులు మతి తప్పి నా వద్దకు వచ్చి పడరాని పాట్లుపడ్డాడు. పాపం దోషిగా నిలబడ్డాడు.” అని 

సూటిగా చురక తొలిసారి దూర్జటికి అంటించాడు.


ఒక్కసారి సభాప్రాంగణంమంతా ఉలిక్కి పడింది. దూర్జటి వంటికవి తొలిసారిగా మరో కవితో మాటపడడం విన్నవారు అవాక్కయిపోయారు. రాయలువారు విన్నారే తప్ప వారించనేలేదు. తిమ్మరుసు మీసాలు సరిచేసకుంటూ విన్నారు. తాతాచార్యులు ఉత్సాహంగా వింటూనే రాయలు వైపు చూసాడు.


"రామలింగా ఏమిటి నీ అదుపు ఆజ్ఞలేని మాటలు. నీకు పెద్దల యందు వీసమెత్తు గౌరవం లేదు. ఏమి చూసుకుని నీకు ఈ అహంకారం? నిన్న కాక మొన్న సాక్షాత్తు రాయలవారిని విమర్శించావు. నేడు నీకంటే అన్ని విధాలుగా ఆధిక్యతలో ఉన్నందుకైనా నన్ను గౌరవించావా? నీవేమైనా అలవోకగా ఘంటాన్ని తాళ పత్రాలపై రాసే ప్రజ్ఞాసంపద కల్గినవాడివా ? పలు రాజ్యాల్లో నీపండితపటిమ చూపి కవులను ఓడించే చరిత్రగల పండిత జెగజ్జెట్టివా ? పండితులన్న క్షమించే గుణం మన రాయలవారికి ఉన్నందున నీవు బతికి బట్టకడితివి. లేకున్నా ఈపాటికి నీవు జీవచ్చవమై ఉండేవాడివి కావా ? పండితులను దూషిస్తావు. మహారాజును గేలిచేస్తావు. ఒక విప్రునికి ఉండాల్సిన వినయవిధేయతలు లేసమైనా లేవే. నీవంటివాడు ఉన్న ఈ సభలో ఒక్క ఘడియ కూడా ఉండలేను." అంటూ చివాలున లేచాడు దూర్జటి.


"ఆగండి మహాకవీ ! ఎందుకంత ఉలుకు. ఏమన్నాను ? నిజం కుండబద్దలుకొట్టాను. ఇప్పుడు మీరీ సభలో నాపై చిర్రెత్తిన ప్రతీ దానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ప్రభూ నన్ను మాటలాడడానికి అనుజ్ఞ ఇవ్వం డి”.


రాయలు కళ్లతో సరేననడంతో గొంతు సవరించుకుని.. 

“ఓ కవితిలకమా! నేను పండితులను, మన ఏలికను అవమానించాను అని పెద్ద అభియోగం చేసారు. ఈరోజే మొదటిసారి మీ వంటి పెద్దలను తమ తప్పులతో నిలదీసే పరిస్థితిని మీరే కల్పించారు, ఇక మన ఏలిక రాయలవారిని ఆయన రాసే కావ్యాన్ని నేను ఎప్పుడు మనసావాచా గౌరవిస్తాను. ఆయన రాస్తున్న ఆముక్త మాల్యద కావ్యం గురించి అలా ఇలా విన్నాను. అందులో తేనెలూరించే తియ్యదనాన్ని మన ఏలిక రాయలవారు గుప్పించారు, దట్టించారు. అందులో ఒక 

పద్యాన్ని విని సంభ్రమాశ్చర్యాలతో ఏనాడైనా రాయలవారిని కనులారా దగ్గర నుంచి చూడాలనుకున్నాను. కానీ ఆ సర్వేశ్వరుడు నా మొరనాలించి ఆయన వద్దకే చేర్పించాడు. ఇక ఆ తేనెలూరే పద్యం గురించి చెప్తాను వినండి కవిశేఖరా !


“తెలుగుదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లభుండ తెలుగొకండ!

ఎల్ల నృపులు గూడి ఎరుగవే బాసాడి

దేశ భాషలందు తెలుగు లెస్స!”


ఇట్టి పద్యాన్ని ఆయన రాసినందుకే నేను ఎంతో ఆనందిస్తున్నాను. మనం తెలుగు కవులం. ఆయన మనతో బాటు కన్నడ, తమిళ, ఉర్దూ భాషాల కవులను మనవలే చేరదీసి ఆదరిస్తున్నారు. ఆయనకు మన మెంతో ఇతర భాషా కవులు అంతే ! ఇతర భాషాలపై పట్టున్న రాయలువారింట మాట్లాడింది కన్నడమే, కానీ ఆయన తెలుగుభాష పై చూపిన మమకారం అత్యంత గొప్పది. " 


రామలింగని మాటలు వింటున్నవారు నోళ్ళు తెరిచారు. పిడుగుల్లాంటి నిజాలు గుప్పించాడు.


దూర్జటి నొసలు చిట్లించి “ఏమయ్యా రామలింగా, నేను అడిగిందేవిటి ? నీవు చెప్తున్నదేమిటి ? భువనవిజయంలో ప్రభువులను ధిక్కరించితివని గుర్తుచేసి నందుకా? ఈ ముఖస్తుతి కీర్తనలు, చక్రవర్తి మన్ననలు పొందాలని అవకాశం కోసం కాచుకుని కూర్చున్నట్లు ఏమేమో నీ మాటకారితనంతో గతంలో చేసిన ఘోర తప్పిదాన్ని కప్పిపుచ్చుకుంటున్నావు. ఈ సభలో ఉన్నవారు నిన్ను మించినవారు అని మరువకు. అంతెందుకు నీ భార్య నన్ను బతిమాలుకున్నది. నా భర్త దుందుడుకు మనిషి. సభలో ఏదైనా తప్పుగా వాగి రాయలవారి ఆగ్రహానికి గురవకుండా కాపాడమని పదేపదే కోరింది. ఆమెకు అభయం ఇచ్చి ఉన్నాను." అంటూ నవ్వాడు దూర్జటి.


"ఓ ఆడుదాని అర్ధింపు, ఆవేదనను ఇలా బయటపెట్టినందుకు మీ గొప్పతనం, మీ బోళాతనం మొత్తం బయటపడ్డాయి. సరే, నేనెప్పుడైనా రాయలవారి ఆగ్రహానికి గురయినపుడు మీరెలాగు రక్షించగలనని ఈ సభా ముఖంగా శెలవిచ్చారు, ఇది ఆనందించదగ్గ విషయం. ఇక మీదట విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీశ్రీశ్రీ కృష్ణదేవరాయలవారి నుంచి నేను అసలు భయపడనక్కర్లేదు. ప్రపంచాధినేత కవిశేఖరులు దూర్జటి వారి అభయం మరియు వారి కొండంత అండదండలు నాకు అతి పెద్ద రక్ష"


ఆ మాటలకు సభంతా ఒక్కసారిగా గొల్లుమంది. రాయలు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నాడు. దిగ్గజ కవులందరూ నవ్వు ఆపుకోలేకపోయారు. అర్ధం కాకపోయినా తమిళ, ఉర్దూ, కన్నడ కవులు ఏకొంచెమో అర్ధం అయినందున పడిపడి నవ్వారు. తిమ్మరుసు దగ్గు తెరల మధ్య నవ్వుతుండగా... 


“అప్పాజీ ! నవ్వు నాలుగువిధాల చేటు అని పెద్దలు చెప్పినది మీ కోసమేనని అన్నట్టుంది. మీకు కఫం ఎక్కువలా ఉంది. నవ్వాపుకోండి. మన దూర్జటివారు మన మధ్య ఉంటారు కనుక మనకిక నిత్యం వేడుకే." మరో వాణి  సంధించాడు రామలింగడు. 


తట్టుకోలేని దూర్జటి నేరుగా రాయలవారి వద్దకు వెళ్లి "ఏమిటి ప్రభూ ! అతని నోటికి అడ్డుకట్టవేయరా ? మీ సమక్షంలో నా వంటివాడికి ఇటువంటి మాటలుపడే శిక్ష తప్పదా ? నేనే పాపం చేసాను ?" అన్నాడు దూర్జటి.


"అదేమిటి దూర్జటి కవిసామ్రాట్! నన్ను ఆపద సమయంలో రక్షించమని కదా నా భార్య తమకు అర్ధించినది. అక్కడ ఆమెకు మాటిచ్చి ఇక్కడ శిక్షింపచేసే పన్నాగమా ? మనం కవులమా లేక పాలెగాళ్ళమా ? ఈపాటి అన్యాయం తమ వద్ద పుష్కలం గా లభిస్తున్నదా ? కటకటా..." అన్నాడు రామలింగడు. 


మరోసారి గొల్లుమన్నారు. తాతాచార్యులు కలుగచేసుకుని “నాయన రామలింగా, శాంతించు. నీ ఆవేదన నాకర్ధం అయ్యింది. ఇంతటితో నీ ప్రసంగం ఆపి కూర్చొ " అని చెప్పాడు.


"క్షమించండి. తాతాచార్యులువారు. ఆముక్తమాల్యద వంటి దైవసంకల్పితమైన కావ్య రచన చేయుచున్న రాయలవారు తన జాంబవతీ కళ్యాణం కావ్యం కూడా ఎంతో మనోహరంగా రచించారు. తనకు జంతువుల భాష వచ్చునని పదేపదే చెప్పినందున నా ప్రాణాలను లెక్కచేయ కుండా సాక్షాత్తు రాయలవారిలో గల కవిని మాత్రమే నిలదీసాను. అంతే కానీ నేను ఇందులో ప్రభువులను వీసమెత్తు కించ పరచలేదు. దీనిపై రాయలవారు చాలా 

నొచ్చుకుని ఉండవచ్చు. ఆనాడు భువన విజయం లోంచి బయటికి వచ్చిన వెంటనే ఈ దూర్జటి నన్ను గాఢంగా కౌగిలించుకుని " భళీ రామలింగా ! మేమెవ్వరం చేయని పని నీవు చేసావు. ఉన్మత్తరాజసేవలు నరకప్రాయం. మన ఏలికకు గట్టిగా బుద్ది చెప్పితివి. చూసావా! నీయందు దోషం ఇసుమంతైనా లేనందున నిన్ను ఏమీ చేయలేకపోయారు. నీ వాదనలో అర్ధం ఉంది. ఆముక్తమాల్యద కావ్యం రాసే రాయల వారు మరీ నీచంగా జంతువుల భాష వచ్చని వాగి చులకన అయ్యాడు." అని నన్ను కీర్తించాడు." అని రామలింగడు నాటి నిజం బయటపెట్టాడు.


సభంతా నివ్వెరపోయింది, దూర్జటి సిగ్గుతో తలవంచుకున్నాడు. మిగిలిన కవులు అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. 


"ప్రభూ ! దూర్జటివారిని మన్నించమని ప్రార్ధిస్తున్నాను. అలాగే నా ప్రక్క నిలబడి ఉన్న ఈ పాలెగాపు వీరరుద్రసింహున్ని క్షమించగోర్తున్నాను.” అని రామలింగడు వినయంగా ఇద్దరి గురించి అర్ధించాడు.


రాయలువారు దీర్ఘంగా ఆలోచించాక, తల పంకించారు. తాతాచార్యులవారు నవ్వుతూ “ఇంతకీ రామలింగా, నిన్ను దూర్జటి రక్షించడం అలా ఉంచి దూర్జటిని నీవే రక్షించినట్టున్నావు." అని సరదాగా అడిగాడు.


మరోసారి సభంతా గొల్లుమంది. దూర్జటి మానసిక వేదనను దిగమింగుకుని, తల దించుకుని అవమానంతో రుసరుసలాడ్తూ సభ నుంచి వెళ్లిపోయాడు.

సశేషం


*తెనాలి రామకృష్ణ - 5*

🧑‍🦲


*పాలెగాపు లంచాల ఎర - 2*


అంతలో మళ్ళీ భేరీలు, డప్పులు మ్రోగాయి. అంతా అటు వైపు చూసారు. మరో ఊరేగింపు సభలోకి ప్రవేశించింది. “కవితిలకా, సాహస విక్రమార్క క్రూరమృగ నాశక, అరివీరభ యంకర, రామలింగా” అని నినాదాలతో ఇరవైమంది సైనికులు రామలింగని భుజాలపై మోసుకుంటూ వచ్చారు. రామలింగడు సభలోని వారందరిని చూస్తూ చేతులు ఊపుతూ, తన కండల్ని పొంగిస్తూ హడావుడిగా కనిపించాడు. కవులు నోళ్లు తెరిచారు. తిమ్మరుసు, తాతాచార్యులు, ఉన్నత రాజోద్యుగులు రామలింగని ఎగాదిగా చూసారు. ఈ బాపడా పులిని చంపాడని అంటున్నారు. ఆ సైనికులు వారికి పిచ్చి పట్టలేదు కదా ! అని ఎవరికివారే 

అనుకున్నారు.


వీరరుద్రసింహుడు చెమటలు పోసాడు. రామలింగడు ఎందుకు ఈ విధంగా ఇలా ప్రవర్తిస్తున్నాడు. తన వ్యవహారం అంతా బైటపడితే ఎంత ప్రమాదం ? అందులో రాయలవారు క్షమించనే క్షమించరు అని లోలోపల చాలా భయపడ్డాడు.


"రామలింగా నువ్వా పులిని చంపింది. మరి రుద్రసింహుడంటున్నారు సైనికులు? ఏమిటిదంతా ! నిజం చెప్పండి. పులిని చంపింది ఎవరు ?" అని రాయలు కోపంగా ప్రశ్నించాడు.


"రుద్రసింహుడి వెనుక పదిమంది ఉన్నారు. నావెంట ఇరవైమంది ఉన్నారు. వారినే అడగండి. నిజానిజాలు తెలియగలవు ప్రభూ!"


"సైనికులారా ఏమిటిదంతా, ప్రజలను భీతావహులను చేసే పులి చచ్చింది అంటే ఆ ఆనందం అనుభవించకుండా మీరు చేస్తుంది. సభను తప్పుతోవ పట్టించడమే, ఇట్టి తప్పిదము క్షమించరానిది. " రాయలు కోపాన్ని ప్రదర్శించాడు.


“మన్నించండి. మహారాజా తమరు ఆదేశించినట్లు పులి చంపబడింది. మాలో ఎవరు చంపినా ఒకటే. రామలింగకవికే ఆ ఫలాలు ఇప్పించండి. ఆయనకే తమరిచ్చే కానుకలను ఇచ్చి ఆనందింపచేయండి.” తెలివిగా వీర రుద్రసింహుడు తన అభిమతాన్ని తెలియజేసాడు..


ఆ మాటలకి సభ అంతా నివ్వెరపోయింది. ఒక విధంగా రామలింగని పై కోపోద్రిక్తులై ఉన్నారు. రాయలు కూడా అదోలా చూసాడు. 


“రామలింగా నువ్వే పులిని చంపావా ?” మరోసారి అడిగాడు రాయలు పైస్వరంలో. 


"ప్రశాంతంగా వినండి ప్రభూ ! పులిని చంపినందుకు నాకేమి ఇస్తారో ముందు తెలియజేయండి. ఆ తరువాత నేను నా వెనుక ఉన్న సైనికులు ఓ నిర్ణయానికి రాగలము.”


"నేను ఒకటి అడుగుతుంటే నీవు మరొకటి చెప్తుతున్నావు. ఆ క్రూర జంతువుని 

చంపినవారికి వెయ్యి వరహాలు ఇవ్వగలను. దానితో వీరులకు ఇచ్చే బిరుదును ఇవ్వగలను. ఇదే విధానం మా తాతతండ్రుల నుంచి వస్తున్నది. నిజం చెప్పు పులిని చంపింది ఎవరు ?”


“వెయ్యి వరహాలు అయితే మాకు అభ్యంతరం లేదు. కానీ, బిరుదు దగ్గరే పేచీ ఉంది ప్రభూ మరో మాట చెప్పలేరా ?” 


రాయలువారికి ఏమీ అర్ధంకాలేదు. సభ మొత్తం క్షణ క్షణం ఉత్కంఠభరితంగా మారిపోతోంది. అంతా ఊపిరి బిగబట్టి వింటున్నారు సభికులు.


"ఏలినవారు అనుజ్ఞ ఇస్తే నేను సభ నుంచి నిష్క్రమించగలను.” చేతులు జోడించాడు వీరరుద్రసింహుడు. అతడి వెనుక ఉన్న సైనికులు అతన్ని కొరకొరా చూడసాగారు. అతడికి వినపడేట్టు గొణగసాగారు. 


"ఎంతో కష్టపడి పులిని చంపితే మాకు ఇస్తామన్న బహుమతులని రామలింగడి పరం చేయడానికి నీ మనస్సు ఎలా ఒప్పుతుందయ్యా ! నీకోసం మా ప్రాణాలకి తెగించినందుకు ఇదా నీవు మాకు ఇచ్చేది”


“దయచేసి నన్ను అర్ధంచేసుకోండి. మీకు ఇవ్వవలిసినది నేను చెల్లించగలను. నన్ను నమ్మండి."


వారికి మాత్రమే వినపడేట్టు చెప్పాడు వీర రుద్రసింహుడు. అంతా మూతులు కొరుక్కుంటున్నట్టుగా ఉంది.


రామలింగడు ఆ సైనికుల మాటలను చెవులను రిక్కించి విని "అయ్యా వీర రుద్రసింహుడు పూర్తిగా ఓ మంచి నిర్ణయానికి వచ్చేసాడు. అతడి వెనుకున్న సైనికులకు స్వంతంగా ముందు అనుకున్న లంచం ఇచ్చుకుంటాడు. ఇక తేలాల్సిందే తమ వద్ద నా బిరుదులు. నాకు దయచేసి ఓ ఇరవై బిరుదులు ఇప్పిస్తే మాలో ఎలాంటి పేచీలుండవు.” రాయలు వైపు చూసి చెప్పాడు.


ఆ మాటల్లో రాయలకు ఇందులో ఏదో మతలబు ఉందనిపించింది.


“నువ్వు ఒక పులిని చంపినందుకు ఒక బిరుదు ఇవ్వగలను, కానీ ఇరవై ఇవ్వడం అంతమంచిది కాదు. అయినా అన్ని బిరుదులతో నీకేంపనయ్యా! నువ్వు పులిని చంపడమే సభలోని వారంతా నమ్మలేకపోతున్నారు. కనీసం నీ ఒంటి మీద చిన్న గాయం లేదు. పులి చూస్తే భయోత్పాతంగా ఉంది. నువ్వు నిజంగా పులిని వేటాడావా ? నేనడిగిన ఏ ఒక్క ప్రశ్నకు నీ నుంచి సరైన సమాధానం 

రాకుండా ఉంది " రామలింగడిని నిలదీసినట్లుగా అడిగాడు రాయలు.


"నిజమే ప్రభూ, తమరు సెలవు ఇచ్చారు. అంత పెద్ద పులిని వట్టి బ్రాహ్మడు చంపడ మనేది ఎవరూ నమ్మరు. పైగా నా ఒంటి మీద చిన్నపాటి గాయం లేదు. ఇదే ప్రశ్న నా ప్రక్క నిలుచున్న రుద్రసింహుడిని ఎందుకు అడగలేదు. అతని పేరులో రౌద్రం ఉంది. తమరు నియమించిన సరిహద్దు పాళెగాళ్ల పదవిలో ఉన్నాడు. అతడి ఒంటి మీద గాయాలేవి లేవే. నా వెనుకు ఉన్న సైనికులకూ, చిన్నపాటి గాయం కూడా కాలేదు. అంతో ఇంతో గాయపడినది మనందరికి కనిపిస్తోంది రుద్రసింహుని వెనకున్న సైనికుల శరీరాల పై మాత్రమే. వాళ్లంతా ఆ పులి వలన చావు తప్పి కన్నులొట్టపోయిన పరిస్థితిలో తీవ్రంగా గాయపడ్డారు.” 


రాయలు రెట్టించాడు. "అంటే.....”


“ప్రభూ ! తమకు అరటిపండు ఒలిచినట్టు గా వివరించాను. లోగుట్టు అర్దంకాలేదా ?” రామలింగడు నవ్వుతూ అడిగాడు. 


"పులిని చంపింది రామలింగడు కాదు, వీర రుద్రసింహుడు కాదు. మన వీర సైనికులే. రామలింగకవి నిజం చెప్పినందుకు ఈ సభ రుణపడి ఉంటుంది.” అని సభలోని వారంతా ఎలుగెత్తి ఆరచి మరీ చెప్పారు..


రాయలు నవ్వుతూ “రామలింగా నీవు కవివే కాదు. దేశాభిమానివి. నీలాంటి దేశభక్తులు అందరికి మార్గదర్శకులు. ఓయీ తగునా, నీవు పాలెగాడివి అంటే గండరగండడవు. నీకు ఇలాంటి అక్రమ పద్దతుల్లో లభించిన వీరత్వం వలన ఒనగూరింది ఏమిటి ?” కళ్ళు పెద్దవి చేసి అడిగాడు రాయలు.


రాయల ప్రశ్నకు రుద్రసింహుడు తలవంచు కుని నిలబడ్డాడు. అతడి ముఖంలో నెత్తురు చుక్కలేదు. పెద్ద తప్పు చేసినట్లు బాధపడ్డాడు.


“క్షమించండి ప్రభూ ! నేను వచ్చింది తెనాలి రామలింగకవి వద్ద ఓ కావ్యం అంకితం స్వీకరించాలనే ఆశతో వచ్చాను. నాకు సాహిత్యాభిలాషతో ఆ కోరిక తెలిపాను. అందుకు రామలింగకవి ఒప్పుకున్నారు. ఈలోగా తమరు పిలిపించారు. ఈ పులిని వేటాడమని ఆదేశించారు. నేను తీర్ధయాత్ర చేయుచున్నాను. నేను జీవహింసను చేయలేను అని తమకు చెప్పే సాహసం చేయలేను. అందుకే సైనికులకు లంచం ఎర చూపి ఈ వక్రమార్గంలో తమ ముందు ఈరోజు ఘోరమైన తప్పుతో మీ ముందు 

నిలుచున్నాను." తన నేరాన్ని ఏదీ దాచకుండా ఒప్పుకున్నాడు.


రామలింగడు వెంటనే అందుకుని తన గొంతు విప్పాడు.


"ఏలిన వారికి నేను చెప్పుకోవల్సింది ఉంది. ఈ రుద్రసింహుడు పాలెగాపు పదవిలో ఉంటూ అక్కడ ప్రజలను నానా బాధలు పెడుతున్నాడు. తలకు మించిన భారమైన పన్నులతో వేధిస్తున్నాడు. అక్కడ నా బంధువులు బతకలేక దేశాంతరం పోయారంటే అక్కడ పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించండి. వీళ్లక్కడ సామంతుల్లా ఏలుతున్నారు. ఏది ఏమైనా ప్రజలకు కంటగింపు పాలన రుచిచూపడం ఏమేరకు న్యాయం ? అందుకే ఈతనికి నేను కావ్యం అంకితం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాను. ఎలాగైనా రుద్ర సింహునికి బుద్ధిచెప్పాలని ఈ వేటలోకి రప్పించాను. అతడే తప్పటి అడుగులు వేసి తమ ముందు దోషిగా నిలబడ్డాడు. అతడు తమవలె సాహిత్యం పట్ల అభిరుచి ఎందుకు చూపుతున్నాడో తెలుసా ప్రభూ ! అతనికి అతనే తానో శ్రీకృష్ణ దేవరాయల నుకుంటున్నాడు. అందుకే వక్ర మార్గంలో సాహసాన్ని కొనుగోలు ప్రయత్నాలు. ఇదేదో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు లేదా ?” సభలో ఉన్నవారి నవ్వుల మధ్య రామలింగకవి చెప్పాడు.


(రాయల పాలన పై అబ్దుల్ రజాక్ అను ముస్లిం చరిత్రకారుడు ఈ పాలెగాపుల పాలన పై తీవ్రంగా విమర్శిస్తూ రాసాడు. ప్రజలను చాలా ఘోరంగా పాలించేవారని, ఆ బాధలు రుద్రసింహా వింతగా తన సాహసాన్ని కొనుగోలు చేయడం, నీవంటి వాడికి తట్టుకోలేనివిగా ఉండేవని కూడా వివరించాడు. ఈ విషయంలో రాయలు మిన్నకుండడానికి కారణం. దక్షిణాది రాజులెవ్వరూ  పోషించనంత సైన్యాన్ని సుమారు ఐదులక్షల మందిని పెంచడానికి సామంతులపై, ఈ పాలెగాపుల పై ఆధార పడేవాడు. ఆ కారణంగా ప్రజారంజక పాలనను ఒక విధంగా రాయలు వారికి అందించలేదనే చెప్పాలి. అత్యధికంగా పన్నులు ప్రజల్నించి పాలెగాపులు సామంతులు వసూలు చేసేవారు. పోర్చుగీస్ చరిత్రకారులు ఫేజ్ మరియు న్యూనిజ్ కూడా ఈ పాలన విషయంలో అబ్దుల్ రజాక్ రాతలనే ధృవీకరించడమే కాకుండా వీరు కూడా విమర్శించి రాసారు.)


"రామలింగా నువ్వు ఈతనికి ఒక కావ్యం అంకితమీయనున్నట్లు చెప్తున్నాడు. అది ఏ కావ్యం ? ఎప్పటిలోగా అతనికి అది అందజేయనున్నావు. మరి కావ్యం రచించి ఇవ్వకుండా ఈ పులి వేటలో అతన్నెందుకు లాగావు.” 


“నేను రాసిచ్చేవాడిని. కానీ ఈతడికి అసలు చదువురాదు. ఏదో కూనిరాగాలతో శుద్ధ తప్పులతో కొన్ని పద్యాలు చెప్పగలడు. ఇట్టి వానికి ఇచ్చిన నా కావ్యమునకు ఏ మేరకు ప్రచారము జరుగును. అదియునుకాక, ఈతడు వచ్చినది నగరానికి, తమ దర్శనం చేసుకోకుండా, వారం దినాలుగా ఇక్కడే సంచరించడం, కావ్యమన్నచో ఈతనికి ఏదో వృత్తి పని వలే ఉన్నది. పగలు రావడం పూర్తి అయినదా ? ఏ రాత్రికో దిగి ఏం కవీశ్వరా నా పని ఇంకనూ కాలేదా ? నీవు మనస్సు పెట్టినా అదెంతపని అని విసుగుచెందడం భరించలేకపోయాను. ఈ మద్య ఏకంగా ఏదో రాసి నా ముఖాన కొట్టవయ్యా పంతులయ్యా ! నీకు నేను ఇవ్వజూపినది చాలనట్టుంది. అందుకే రాయక ఎప్పుడూ రాజసభకి పోతున్నావు. అని నిష్ఠూరంగా నా వైపు చూసిన చూపులను తట్టుకోలేక ఈతనికి తగు విధంగా బుద్ది చెప్పాలనుకున్నాను. ఇంతలో తాటాకులను గుత్తులు గుత్తులు నా వద్దకు తెచ్చి నువైనా రాయి లేదా నేనైనా రాసుకుంటాను అని ఏకంగా ఘంటం పట్టుకున్నాడు.”


“నగరంలో ఉండే కవినే ఇంత మానసికంగా హింసిస్తుంటే ఇక ఈతని ఏలుబడిలో పాప మాప్రజలు ఎలా బతుకుతున్నారో?” రామలింగడు చెప్తుంటే సభాసదులు విరగబడి నవ్వుల్లో తేలియాడారు. ఒక దశలో రాయలు కూడా నవ్వాపుకుంటూనే నవ్వసాగాడు.


సభలో ఉన్న దూర్జటికవి "ఎలా భరించా

వయ్యా ఇన్ని సవతి పోకిల్లను.......? ” అని పంటి బిగింపులో నవ్వుతూ ప్రశ్నించాడు.


"ఈ అనుభవాలు తమకు అలవాటు. నాకు కొత్తకదా! యారళ్లపోరు లాంటి ఈ అంకిత తతంగాలు తమరు నేర్పిందే, నీరజాక్ష ధనకనక వస్తు వాహనాలు ఇవ్వాలేగాని తమరు ఎవరికైనా ఎన్ని కావ్యాలనైనా ఈయగలరు. తమ వద్దకే రావలిసిన రుద్రసింహులు మతి తప్పి i వద్దకు వచ్చి పడరాని పాట్లుపడ్డాడు. పాపం దోషిగా నిలబడ్డాడు.” అని 

సూటిగా చురక తొలిసారి దూర్జటికి అంటించాడు.


ఒక్కసారి సభాప్రాంగణంమంతా ఉలిక్కి పడింది. దూర్జటి వంటికవి తొలిసారిగా మరో కవితో మాటపడడం విన్నవారు అవాక్కయిపోయారు. రాయలువారు విన్నారే తప్ప వారించనేలేదు. తిమ్మరుసు మీసాలు సరిచేసకుంటూ విన్నారు. తాతాచార్యులు ఉత్సాహంగా వింటూనే రాయలు వైపు చూసాడు.


"రామలింగా ఏమిటి నీ అదుపు ఆజ్ఞలేని మాటలు. నీకు పెద్దల యందు వీసమెత్తు గౌరవం లేదు. ఏమి చూసుకుని నీకు ఈ అహంకారం? నిన్న కాక మొన్న సాక్షాత్తు రాయలవారిని విమర్శించావు. నేడు నీకంటే అన్ని విధాలుగా ఆధిక్యతలో ఉన్నందుకైనా నన్ను గౌరవించావా? నీవేమైనా అలవోకగా ఘంటాన్ని తాళ పత్రాలపై రాసే ప్రజ్ఞాసంపద కల్గినవాడివా ? పలు రాజ్యాల్లో నీపండితపటిమ చూపి కవులను ఓడించే చరిత్రగల పండిత జెగజ్జెట్టివా ? పండితులన్న క్షమించే గుణం మన రాయలవారికి ఉన్నందున నీవు బతికి బట్టకడితివి. లేకున్నా ఈపాటికి నీవు జీవచ్చవమై ఉండేవాడివి కావా ? పండితులను దూషిస్తావు. మహారాజును గేలిచేస్తావు. ఒక విప్రునికి ఉండాల్సిన వినయవిధేయతలు లేసమైనా లేవే. నీవంటివాడు ఉన్న ఈ సభలో ఒక్క ఘడియ కూడా ఉండలేను." అంటూ చివాలున లేచాడు దూర్జటి.


"ఆగండి మహాకవీ ! ఎందుకంత ఉలుకు. ఏమన్నాను ? నిజం కుండబద్దలుకొట్టాను. ఇప్పుడు మీరీ సభలో నాపై చిర్రెత్తిన ప్రతీ దానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ప్రభూ నన్ను మాటలాడడానికి అనుజ్ఞ ఇవ్వం డి”.


రాయలు కళ్లతో సరేననడంతో గొంతు సవరించుకుని.. 

“ఓ కవితిలకమా! నేను పండితులను, మన ఏలికను అవమానించాను అని పెద్ద అభియోగం చేసారు. ఈరోజే మొదటిసారి మీ వంటి పెద్దలను తమ తప్పులతో నిలదీసే పరిస్థితిని మీరే కల్పించారు, ఇక మన ఏలిక రాయలవారిని ఆయన రాసే కావ్యాన్ని నేను ఎప్పుడు మనసావాచా గౌరవిస్తాను. ఆయన రాస్తున్న ఆముక్త మాల్యద కావ్యం గురించి అలా ఇలా విన్నాను. అందులో తేనెలూరించే తియ్యదనాన్ని మన ఏలిక రాయలవారు గుప్పించారు, దట్టించారు. అందులో ఒక 

పద్యాన్ని విని సంభ్రమాశ్చర్యాలతో ఏనాడైనా రాయలవారిని కనులారా దగ్గర నుంచి చూడాలనుకున్నాను. కానీ ఆ సర్వేశ్వరుడు నా మొరనాలించి ఆయన వద్దకే చేర్పించాడు. ఇక ఆ తేనెలూరే పద్యం గురించి చెప్తాను వినండి కవిశేఖరా !


“తెలుగుదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లభుండ తెలుగొకండ!

ఎల్ల నృపులు గూడి ఎరుగవే బాసాడి

దేశ భాషలందు తెలుగు లెస్స!”


ఇట్టి పద్యాన్ని ఆయన రాసినందుకే నేను ఎంతో ఆనందిస్తున్నాను. మనం తెలుగు కవులం. ఆయన మనతో బాటు కన్నడ, తమిళ, ఉర్దూ భాషాల కవులను మనవలే చేరదీసి ఆదరిస్తున్నారు. ఆయనకు మన మెంతో ఇతర భాషా కవులు అంతే ! ఇతర భాషాలపై పట్టున్న రాయలువారింట మాట్లాడింది కన్నడమే, కానీ ఆయన తెలుగుభాష పై చూపిన మమకారం అత్యంత గొప్పది. " 


రామలింగని మాటలు వింటున్నవారు నోళ్ళు తెరిచారు. పిడుగుల్లాంటి నిజాలు గుప్పించాడు.


దూర్జటి నొసలు చిట్లించి “ఏమయ్యా రామలింగా, నేను అడిగిందేవిటి ? నీవు చెప్తున్నదేమిటి ? భువనవిజయంలో ప్రభువులను ధిక్కరించితివని గుర్తుచేసి నందుకా? ఈ ముఖస్తుతి కీర్తనలు, చక్రవర్తి మన్ననలు పొందాలని అవకాశం కోసం కాచుకుని కూర్చున్నట్లు ఏమేమో నీ మాటకారితనంతో గతంలో చేసిన ఘోర తప్పిదాన్ని కప్పిపుచ్చుకుంటున్నావు. ఈ సభలో ఉన్నవారు నిన్ను మించినవారు అని మరువకు. అంతెందుకు నీ భార్య నన్ను బతిమాలుకున్నది. నా భర్త దుందుడుకు మనిషి. సభలో ఏదైనా తప్పుగా వాగి రాయలవారి ఆగ్రహానికి గురవకుండా కాపాడమని పదేపదే కోరింది. ఆమెకు అభయం ఇచ్చి ఉన్నాను." అంటూ నవ్వాడు దూర్జటి.


"ఓ ఆడుదాని అర్ధింపు, ఆవేదనను ఇలా బయటపెట్టినందుకు మీ గొప్పతనం, మీ బోళాతనం మొత్తం బయటపడ్డాయి. సరే, నేనెప్పుడైనా రాయలవారి ఆగ్రహానికి గురయినపుడు మీరెలాగు రక్షించగలనని ఈ సభా ముఖంగా శెలవిచ్చారు, ఇది ఆనందించదగ్గ విషయం. ఇక మీదట విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీశ్రీశ్రీ కృష్ణదేవరాయలవారి నుంచి నేను అసలు భయపడనక్కర్లేదు. ప్రపంచాధినేత కవిశేఖరులు దూర్జటి వారి అభయం మరియు వారి కొండంత అండదండలు నాకు అతి పెద్ద రక్ష"


ఆ మాటలకు సభంతా ఒక్కసారిగా గొల్లుమంది. రాయలు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నాడు. దిగ్గజ కవులందరూ నవ్వు ఆపుకోలేకపోయారు. అర్ధం కాకపోయినా తమిళ, ఉర్దూ, కన్నడ కవులు ఏకొంచెమో అర్ధం అయినందున పడిపడి నవ్వారు. తిమ్మరుసు దగ్గు తెరల మధ్య నవ్వుతుండగా... 


“అప్పాజీ ! నవ్వు నాలుగువిధాల చేటు అని పెద్దలు చెప్పినది మీ కోసమేనని అన్నట్టుంది. మీకు కఫం ఎక్కువలా ఉంది. నవ్వాపుకోండి. మన దూర్జటివారు మన మధ్య ఉంటారు కనుక మనకిక నిత్యం వేడుకే." మరో వాణి  సంధించాడు రామలింగడు. 


తట్టుకోలేని దూర్జటి నేరుగా రాయలవారి వద్దకు వెళ్లి "ఏమిటి ప్రభూ ! అతని నోటికి అడ్డుకట్టవేయరా ? మీ సమక్షంలో నా వంటివాడికి ఇటువంటి మాటలుపడే శిక్ష తప్పదా ? నేనే పాపం చేసాను ?" అన్నాడు దూర్జటి.


"అదేమిటి దూర్జటి కవిసామ్రాట్! నన్ను ఆపద సమయంలో రక్షించమని కదా నా భార్య తమకు అర్ధించినది. అక్కడ ఆమెకు మాటిచ్చి ఇక్కడ శిక్షింపచేసే పన్నాగమా ? మనం కవులమా లేక పాలెగాళ్ళమా ? ఈపాటి అన్యాయం తమ వద్ద పుష్కలం గా లభిస్తున్నదా ? కటకటా..." అన్నాడు రామలింగడు. 


మరోసారి గొల్లుమన్నారు. తాతాచార్యులు కలుగచేసుకుని “నాయన రామలింగా, శాంతించు. నీ ఆవేదన నాకర్ధం అయ్యింది. ఇంతటితో నీ ప్రసంగం ఆపి కూర్చొ " అని చెప్పాడు.


"క్షమించండి. తాతాచార్యులువారు. ఆముక్తమాల్యద వంటి దైవసంకల్పితమైన కావ్య రచన చేయుచున్న రాయలవారు తన జాంబవతీ కళ్యాణం కావ్యం కూడా ఎంతో మనోహరంగా రచించారు. తనకు జంతువుల భాష వచ్చునని పదేపదే చెప్పినందున నా ప్రాణాలను లెక్కచేయ కుండా సాక్షాత్తు రాయలవారిలో గల కవిని మాత్రమే నిలదీసాను. అంతే కానీ నేను ఇందులో ప్రభువులను వీసమెత్తు కించ పరచలేదు. దీనిపై రాయలవారు చాలా 

నొచ్చుకుని ఉండవచ్చు. ఆనాడు భువన విజయం లోంచి బయటికి వచ్చిన వెంటనే ఈ దూర్జటి నన్ను గాఢంగా కౌగిలించుకుని " భళీ రామలింగా ! మేమెవ్వరం చేయని పని నీవు చేసావు. ఉన్మత్తరాజసేవలు నరకప్రాయం. మన ఏలికకు గట్టిగా బుద్ది చెప్పితివి. చూసావా! నీయందు దోషం ఇసుమంతైనా లేనందున నిన్ను ఏమీ చేయలేకపోయారు. నీ వాదనలో అర్ధం ఉంది. ఆముక్తమాల్యద కావ్యం రాసే రాయల వారు మరీ నీచంగా జంతువుల భాష వచ్చని వాగి చులకన అయ్యాడు." అని నన్ను కీర్తించాడు." అని రామలింగడు నాటి నిజం బయటపెట్టాడు.


సభంతా నివ్వెరపోయింది, దూర్జటి సిగ్గుతో తలవంచుకున్నాడు. మిగిలిన కవులు అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. 


"ప్రభూ ! దూర్జటివారిని మన్నించమని ప్రార్ధిస్తున్నాను. అలాగే నా ప్రక్క నిలబడి ఉన్న ఈ పాలెగాపు వీరరుద్రసింహున్ని క్షమించగోర్తున్నాను.” అని రామలింగడు వినయంగా ఇద్దరి గురించి అర్ధించాడు.


రాయలువారు దీర్ఘంగా ఆలోచించాక, తల పంకించారు. తాతాచార్యులవారు నవ్వుతూ “ఇంతకీ రామలింగా, నిన్ను దూర్జటి రక్షించడం అలా ఉంచి దూర్జటిని నీవే రక్షించినట్టున్నావు." అని సరదాగా అడిగాడు.


మరోసారి సభంతా గొల్లుమంది. దూర్జటి మానసిక వేదనను దిగమింగుకుని, తల దించుకుని అవమానంతో రుసరుసలాడ్తూ సభ నుంచి వెళ్లిపోయాడు.

సశేషం

*జై సోమనాథ్ - 45*

🚩🔱


*యుద్ధం - 6*

రచన : కులపతి కె. యం. మున్షీ 

అనువాదం : భండారు సదాశివరావు 


జునాగఢ ద్వారం దగ్గర పరిస్థితి చాలా విషమించింది. ఆబూ నరపతి, యువకుడగు పరమారుడు భీమదేవుని ఆదేశం చొప్పున మొదట ద్వార సంరక్షణ చేస్తూ అశ్వికులను నురుమాడాడు. కానీ ఇటువైపు నిపుణులైన కవచధారులగు సైనికులు లేనందువల్ల శత్రుసైనికులు వీరిని చాలా వరకు పడగొట్టారు. పైగా రాళ్ళను ఉపయోగించే భీమదేవుని ఉపాయం ఇక్కడ అనుసరింపబడలేదు. ఫలితంగా శత్రువులు సునాయాసంగా ముందుకు వచ్చేశారు. తాబేటి సైనికులు అనుకున్న సమయానికి నీటిలోకి దిగి ఈదనారంభించారు. వెనుకనున్న అశ్వికులు కోటపై నున్న సైనికులతో యుద్ధం చేస్తూ వాళ్ళను నిరోధించి ఉంచారు. గజదళం వేళకు ముందుకు నడిచి తాబేటి సేనకు నిచ్చెనలు అందిచ్చింది. కోట మీద మోకాళ్ళ పై కూర్చున్న సైనికులు ఈ తాబేటిసైనికులని వధించడానికి ప్రయత్నించారు. కానీ దృఢమైన లోహ కవచాలకు తగిలి అనేక బాణాలు వృధా అయ్యాయి.


పరమారుడు సైనికులను ఉత్సాహ పరచడంలో కానీ, సాహసాన్నీ, శౌర్యాన్నీ ప్రదర్శించడంలోకానీ కొంచమైనా వెనుకంజ వేయలేదు. అతని సైనికులు కూడా విసుగులేకుండా కష్టపడ్డారు. ఎందరో ఈ భగవత్కార్యం కొరకు తమ నిండు ప్రాణాలను బలి చేశారు. ఇంత చేసినా తాబేటి సైనికులు అగడ్తదాటి కోట గోడకి నిచ్చెనలు వేయనారంభించారు. అశ్వికులు నీటిలో దిగి వీరికి సహాయం చేయడానికి ప్రయత్నించారు. ఏనుగులు ఆ ఒడ్డున వచ్చి స్థిరంగా నిలుచున్నాయి. వాటి పైన ఉన్న విలుకాండ్రు కోటపై నున్న సైనికులను చిందరవందరగా చేసి నొప్పించడం మొదలుపెట్టారు. అదృష్ట వశాత్తు అమీరు సేనలు కోట మధ్య ద్వారాన్ని ఎదిరించాయి. అందుకని అమీరు అతని సేనాపతులు అక్కడే తమ దృష్టిని కేంద్రీకరించారు. కనుక జునాగఢ ద్వారం వైపు లభించిన సౌకర్యాన్ని వాళ్ళు వినియోగించుకోలేక పోయారు.


"పరుగెత్తు నాయకా" అని పరమారుడు ఒక విశ్వాసపాత్రుడైన సేనానితో చెప్పాడు. 


''పరుగెత్తి మహారాజుకు, రత్నాదిత్యునికి చెప్పు సైన్యాన్ని పంపనుని, లేకపోతే మధ్యాహ్నానికి ఈ ద్వారాన్ని శత్రువులు ఆక్రమిస్తారని చెప్పు పో!''


''సరే స్వామీ!'' అంటూ ఆ సేనాని ఈ వార్తను తెలపడానికి గుర్రాన్ని ఉరికించాడు.


భీమదేవునికి ఈ వార్త తెలిసినప్పుడు ఉభయపక్షాలూ మధ్య ద్వారం దగ్గర పేరుకు మాత్రమే యుద్ధం చేస్తున్నాయి. ఆక్రమణ తీవ్రత కొంత తగ్గింది. ప్రభాస సేనల వీరతాండవం కూడా కొంత తగ్గింది.


కొత్త అశ్వికులను పంపడం ఆగింది. కొత్త తాబేటి సేనలు వస్తూ ఆగిపోయాయి.

దాదాపు మూడు వందల మంది అగడ్తలో చికాకు పరుస్తున్నారు. పైనుంచి ప్రభాస సైనికులు రాళ్ళు విసిరి వారి ప్రాణాలను కబళిస్తున్నారు. అంతవరకూ కోటకు ఒక్కడు కూడా నిచ్చెన వేయలేక పోయినాడు.


"విమలా! నీ విక్కడ జాగ్రత్తగా ఉండు. జునాగఢ ద్వారం వైపు వెళ్తున్నా నేను. అక్కడ పరమారుని స్థితి విషమంగా ఉంది. ఇటువంటి ధనుర్దారులైన సైనికులు సగంమంది నాతో రావాలి. ఇది శత్రువులకు తెలియకూడదు." అంటూ శత్రువులని మోసం చేయడానికి విమలు ని తలపై తన తలపాగా పెట్టి అతని శిరస్త్రాణాన్ని తాను ధరించి పరమారుని కి సహాయపడేందుకు పరుగెత్తాడు భీమదేవుడు.


రత్నాదిత్యుడు కూడా ద్వారకా ద్వారం దగ్గర మహా వ్యవస్థను నెలకొల్పాడు. అతని జాగ్రత్తకు సౌరాష్ట్ర సైనికుల గురి తప్పని విలువిద్య తోడై శత్రు సైన్యాన్ని కదలనివ్వలేదు. అందుకని పరమారుని సందేశం రావడంతోటే మూడువందల మంది విలుకాండ్రను తీసుకొని జునాగఢ ద్వారానికి పరుగెత్తారు.


అక్కడి పరిస్థితి విషమించింది. ఈదుతూ అయిదువందల మంది అశ్వికులు ఒక వ్యూహాన్ని పన్నారు. వారందరూ కలిసి ఒక జీవితనౌకనే నిర్మించారు. తాబేటి సైనికులు వారిపై ఎక్కి గోడలకి నిచ్చెనలు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. అగడ్త ఆవలిగట్టు నుంచి ఏనుగులపై నున్న సైనికులు విడిచే బాణాలను తప్పించు కుంటూ, తిరిగి ప్రతిక్రియ చేయడం కోట పైనున్న సైనికులకు అసంభవం అయి పోయింది. పైనుంచి ఎన్ని బాణాలు వర్షిస్తున్నా అనుభవజ్ఞులైన తాబేటి సైనికులూ, అశ్వికులూ కలిసి తెప్పలతో ఒక వంతెన లాంటిది నిర్మించారు. చూస్తూ చూస్తూనే అగడ్త పైన వంతెన ఏర్పడింది. కొత్త సైనికులు వచ్చి అగడ్త దాటి తాళ్ళతో ఈ వంతెనని తలుపుకు ఉన్న ఇనుప సలాకులకు గట్టిగా కట్టారు, నిచ్చెనలు వేశారు. వారి కవచాలు తీసి సైనికులు పైకెగబ్రాకటం ప్రారంభించారు. శత్రుసేనల్లో ఉత్సాహం ఇనుమడించింది. కోట పైన విలుకాండ్రు కుప్పలుగా కూలి పోతున్నారు.


పరమారుడు కూడా మహాద్భుత శౌర్యాన్ని ప్రదర్శించాడు. ఆ వంతెనను ముంచడానికి చాలా ప్రయత్నించాడు. స్వయంగా ఎందరినో సంహరించాడు. కానీ క్రమేపీ క్షీణిస్తూన్న అతని సైన్యం అక్కడ సరిపోలేదు. ప్రతి నిముషానికీ "భీమదేవులు ఏరీ?'' అని అడుగుతూ ఉండేవాడు. తన మిత్రుడూ, తన ఆదర్శమూ అయిన భీమదేవ మహారాజు వచ్చేంతవరకూ ద్వారాన్ని కాపాడగలిగితే చాలునని మాత్రమే అతని ఏకైక వాంఛ, ద్వారం పైన నిల్చుని ఎందరినో తాబేటి సైనికులనూ, రౌతులనూ చంపాడు. కానీ ఒకడు చస్తే నలుగురు పుట్టుకొని వస్తున్నారు. చివరకతడు పెద్ద గదను తీసుకొని బురుజు మీదికి ఎక్కాడు. అతని కవచం అపరాష్ట్ర సూర్యుని కాంతికి ధగధగమని మెరుస్తున్నది. అతని మీద బాణాల వర్షం కురుస్తున్నా బురుజు చివర నిల్చుని పైకెగబ్రాకుతూన్న సైనికులను గదతో నుగ్గు నుగ్గుగా చావమోదడం ఆరంభించాడు.


పరమారుని ప్రతాపం అతని సైనికుల్లో కొత్త ప్రాణాన్ని నింపింది. కొందరు సైనికులు ద్వారమ్మీద నిల్చొని అతనికి సాయపడుతున్నారు. గజదళ సైనికులు కూడా ఇటే బాణాల వర్షం కురిపిస్తున్నా రు. దుర్గంలో మిగతా భాగాల కంటే ఎక్కువ భయంకర యుద్ధం జరిగింది ఇక్కడే. ఇంతలో ఘోరమైన ప్రమాదం ఏర్పడింది. నూర్గురు తాబేటి సైనికులు మెట్లనెక్కి పైకి వస్తున్నారు. ద్వారం మీద ఇరవై ఐదుగురు కవచధారులైన సైనికుల మధ్య పరమారుడు ఊగిపోతున్నాడు. ఎదురుగా శత్రువుల బాణాలు రివ్వున వస్తున్నాయి. క్రింద ఒక తాబేటి సైనికుడు చస్తే, పై నుంచి ఎవరో ఒకరు గాయపడి అగడ్తలో పడుతూనే ఉండేవాడు. 


"భీమదేవ మహారాజా! వేంచేయండి, త్వరగా వచ్చి ఆదుకోండి.”


పరమారునికి ఏమీ తోచలేదు. రాక్షసుని లాంటి ఒక కాకేషియన్ వీరుడు కవచంతో తనను కాపాడుకుంటూ మెట్లు ఎక్కాడు. ఇక ఒక్క క్షణం ఆలస్యం అంతే. ఆ వీరుడు కోట బురుజు వరకూ రానే వచ్చాడు. ఒక్క గంతులో అతను పైకి చేరాడు. క్రింద మరో వంతెన తయారవు తున్నది. మరికొన్ని నిచ్చెనలు వేస్తున్నారు. 


చాలా ప్రమాదమైన పరిస్థితి. పరమారుడు “జైసోమనాథ్” అని గర్జిస్తూ కోట పైన కాళ్లు పెట్టిన వీరుణ్ణి క్రిందికి త్రోసెయ్యాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ వెనుక నుంచి పైకి నిచ్చెన మెట్లు ఎక్కుతున్న ముగ్గురు తాబేటి సైనికులు అతణ్ణి రక్షిస్తున్నారు.


ఇంతలో బాణం రివ్వున వచ్చి పరమారుని మెడలో గుచ్చుకున్నది. వెంటనే అతని కొక భావం స్ఫురించింది. పరమారుడు తనను మృత్యుముఖానికి అర్పించాడు. అతడు ప్రచండకాయుడైన శత్రుసైనికుణ్ణి గట్టిగా రెండు చేతుల్తో అదిమిపట్టుకొని ''జైసోమనాథ్'' అని ఆఖరుసారి విజయ నినాదంతో గర్జించి అగడ్తలో పడడానికి ప్రయత్నించాడు. ఊహించని విధంగా పైబడ్డ ఈ బరువు వల్ల ఆ సైనికుని కాళ్ళు చలించాయి. ఒక నిమిషం సేపు వారిద్దరూ గాలిలో అలా ఊగులాడారు. తరువాత పడిపోయారు. పడిపోయేటప్పుడు పరమారుడు ఒక కాలిని నిచ్చెన మెట్టుకు తగిలించాడు. ఒక నిముషంలో ఒండొరుల కౌగిలిలో పరమారుడూ, యవ సైనికుడూ, మెట్ల మీదుగా ఎగబ్రాకుతున్న మిగతా సైనికులూ ఒక్కసారిగా అగడ్తలో పడి మునిగిపోయారు. 


వంతెన కదలిపోయింది. తాబేటిసైనికులు నీటిలో పడిపోయారు. కవచహీనమైన వారి శరీరాలను పై నుంచి రాజపుత్రులు వదిలే బాణాలు చెండాడనారంభించా యి. పరమారుడు తన ప్రాణాలు అర్పించి జునాగఢ ద్వారాన్ని కాపాడాడు.

⚔️

*సశేషం* 

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂


*తెనాలి రామకృష్ణ  - 7*

🧑‍🦲


*ఏడు వారాల నగల కధ - 2*


https://chat.whatsapp.com/CZQgeP49YWXChiXMvaOuYI


ఆ వెంటనే చెప్పడం మొదలుపెట్టాడు. అప్పుడు సభలో సూది పడినా శబ్దం వినిపించేట్టుంది. రాయలకు ఒకటే ఉత్కంఠగా ఉంది. కళ్లు పెద్దవి చేసాడు. 


"గత రాత్రి నిదురపట్టనందున ఇంటి ముంగిట ఓ నులక మంచంపై నడుం వాల్చితిని. వీధి అంతా నిర్మామష్యంగా ఉంది. ఒక వ్యక్తి ముక్కుతూ మూల్గుతూ ఆ వీధిని పడి పోవుచున్నాడు, చూసేసరికి అతడు తీవ్రంగా బాధపడ్తున్నాడని నాకుగా నేను... 


“నాయనా ఎవరు నీవు ? ఇంత రాత్రివేళ అంత బాధ పడ్తుంటివేల” అని అడిగితిని. 


అందుకు అతడు "ఏమని చెప్పను సోమీ ! మీవంటి కపిస్పరుడు తిమ్మన నగలు పోయినాయంట. కొత్వాలు అతని భటులు నన్ను నగలు దొంగిలించావా లేదా అని చావచితక బాది వదిలారు. ఇంటి వరకు వెళ్లగలనో లేదో సోమీ !” అని బదులు ఇచ్చాడు.


నాకు అతడి మాటలకు నవ్వు వచ్చింది. “చూడరా అబ్బీ.. నీ మాటలు మళ్లీ నిన్ను ఇరుకున పెట్టగలవు. కపీస్వరుడు కాదు అలా అంటే అర్ధం మారిపోతుంది, కవీశ్వరుడు అనాలి అని తప్పు దిద్దాను. 


” అందుకు అతడు సోమీ ఆ తిమ్మన రంగసాని వీధినపడి అర్ధరాత్రులయందు తిరగడం నేను ఎన్నిసార్లు చూడలేదు. పెద్దోల్లకు చెల్లుతాయి. నా మాట ఎవరు వింటారు.?" అని దిగులుపడ్డాడు. ఇదేదో కొత్త కథలా ఉందే అని వాడిని నా నులక మంచం మీద కూర్చోబెట్టి తినడానికి తీపి తినుబండారాలు ఇచ్చి.. 


"నాయనా నువు చూసింది మా నంది తిమ్మననే కదా ! రంగసానింటికి పోతున్నాడా లేక ఇంకా వేరెవ్వరి ఇంట్లో దూరుచున్నాడా ?" అని అడిగితిని. 


"సోమీ మీరంతా అనుకున్నట్లు ఆ కపి (తిమ్మన) అంత మంచోడు కాడు. రంగ సానింటికెదురుగా కొత్తగా ఓ చిలక వచ్చి వాలింది. అది నాట్యకత్తెంట. దానితో మన తిమ్మన ఉన్నాడు. పోయిన బంగారం అని పిర్యాదు చేసాడే. నిజంగా పోలేదు దానికి ఇచ్చేసి ఉంటాడు. ఆ అబద్ధం మా పేనాల పైకి వచ్చింది చావుదెబ్బలు తిన్నాను” అని వజ్రా యుధంతో చరిచినట్లు చెప్పాడు.


రామలింగడు జరిగినది పూసగుచ్చినట్లు చెప్తుంటే సభలోనివారు తొలుత సంభ్రమా శ్చర్యాలలో మునిగి ఆ తరువాత తేరుకుని నవ్వులలో తేలియాడడంమొదలుపెట్టారు. నంది తిమ్మన బిక్కముఖం వేసి తలదించు కున్నాడు. ఇలా జరుగుతుంది అని అనుకుని ఉంటే ఏదో విధంగా సభ నుండి వెళ్లిపోయేవాడు. పట్టులో పిట్టలా పాపం దొరికిపోయాడు, తన భార్య వైపు చూడలేకపోతున్నాడు. ఆమె కొంత అర్ధం అయినట్లు భర్తను తినేసేలా కోపంతో చూడసాగింది. అది గమనించిన రామలింగడు.. 


"అమ్మా రుక్మిణీదేవీ, నీ పాత్ర భాగవత మందు సాత్విక లక్షణాలతోకూడినది. నీవు సత్యభామ అవతారం ఎత్తరాదు, ఈ తరహా భర్త వైపు కోపపు చూపులు చూడరాదు.” ఆమెకు చెప్పి ఇటు తిరిగి "అయ్యా మనకథ ఎందాక వచ్చింది,” అని సభ నుద్దేశించి ప్రశ్నించాడు.


“తిమ్మను పోగొట్టుకున్నాను అని చెప్తున్న బంగారు నగలు దొంగిలింపబడలేదు. ఆయనే ఎవరికో ఇచ్చారని దొంగగారు తమకు చెప్పిన ట్టు చెప్పారు.” సభలో పలువురు ఏక కంఠం తో రామలింగని ప్రశ్నకు బదులిచ్చారు. 


ఈసారి రాయలువారు నవ్వుల్లో తేలియాడారు. తిమ్మన వైపు జాలిగా చూసారు, అతడికి తలెత్తుకోలేని పరిస్థితి ఎదురయ్యింది.


“సరే మీరన్నట్లు ఆ దొంగను ఇక నుంచి నేను దొంగగారూ అని పిలుస్తాను. కథలోకి వెడదాం. అయితే అతడిని మెల్లగా ముగ్గులోకి దించాను. 


“మనిద్దరం అక్కడికి వెళదాం. నీవు అనవరంగా చావుదెబ్బలు తిన్నావు. కనుక నీకు దొరికితే ఆ బంగారం, నగలు దోచుకో ! నేను మావాడి సరస శృంగారాన్ని కనులారా తిలకిస్తాను. పాపం నంది తిమ్మన ముద్దుపలుకులు విని ఉన్నాను కానీ అతనిని సరససల్లాపాలను ముక్కు తో పలుకుచుండగా వినాలని నా కోరిక " అని వాడికి నగల ఆశ చూపాను. 


"వద్దు సోమీ.. రాజభటులు నన్ను బతకనీయరు" అని అతను తన భయాన్ని వ్యక్తం చేసాడు. నేను అతడిని మరింత ప్రోత్సహించాను. 64 విద్యలలో చోర విద్య ఒకటి అని నమ్మబలికాను. చివరికి ఇద్దరం కలిసి ఆ రాత్రి చీకటిలో కలిసిపోయాం."


“దొంగగారు తీసుకువెళ్లిన ఇంటి నుంచి పరిమళం వెదజల్లినట్లు సువాసనలు వస్తుంటే ఇద్దరం వెనుక నుంచి లోపలికి ప్రవేశించాం. నేను మతి తప్పి నోటమాట రాకుండా అయిపోతిని. ఎందుకోతెలుసా ? మన నందితిమ్మన వారు తను రచిస్తున్న పారిజాతాపహరణం గురించి చెప్తుంటే కవి ఎక్కడున్నా తన కావ్యం గురించి ఆలోచిస్తాడా అని ఒకింత సంభ్రమంకి లోనయ్యాను. కానీ అది ఎంతోసేపు నిలువలేదు.”


"అయ్యా రామలింగకవిగారూ.. ఇలా నిదానంగా చెప్పుకుంటూ వెళ్తే మేము భరించలేం. తిమ్మనవారు ఏంచేస్తున్నారు చెప్పండి" అసక్తిగా వింటున్న వారిలో కొందరు పరిసరాలను మరచి ఎలుగెత్తారు.


తిమ్మరుసు, తాతాచార్యులు, కవి దిగ్గజాలు, ఒకరేమిటి అంతా చెవులు రిక్కించి వింటున్నారు. రామలింగడు ఉపోద్ఘాతాలతో చెప్తుంటే భలే బాగున్నా ఏ క్షణమైనా రాయల వారు కలుగజేసుకుని ఇంతటితో ఆపవయ్యా ఇది ఒక విధంగా ఆంతరంగికం వేరే చోట చెప్పు. అంటే ఇంతవరకు ఉత్కంఠగా విన్న తాము సగం విన్నామే అని బాధపడుతూ వెనుదిరగాలి అని ఎవరికి వారే లోపల అనుకోసాగారు. అందరికీ నరాలు తెగే ఉత్కంఠ వారిని ఆవరించింది. పరిసరాలను మరిచి మరీ వింటున్నారు.


“ఆ మహా కావ్యంలో చెరుకుగడలాంటి పద్యాల రుచి ఆ వన్నెల విశనకర్ర అయిన ఇదిగో ఈ మోహనాంగికి వినిపిస్తున్నాడు. అదీ ఎలా అంటే తాను శ్రీకృష్ణునిగాను, ఈమె అపర సత్యభామగాను ఊహించుకు ని మరీ చక్కగా అనునయించాడు. ఏది ఏమైనను నా రెండు కళ్ళు ధన్యం ఐనవి. మీకెవ్వరికి లేనిది నాకు దక్కింది. నా రెండు నేత్రాలు వీక్షించి తరించినవి. నా రెండు చెవులు అమృతధారలు కురిపించే నంది తిమ్మన వారి పద్యాలు విని మంచు ముద్దలయినాయి. అక్కడ నేను ఏం చూసానో మీకు చెప్తాను..


ఇక్కడ కవీంద్రుని సరససల్లాప మృదు మధుర పలుకులు గురించి వివరిస్తాను వినండి.........


కొలికీ ! నీవేల ఈరోజు ఈ దాసుని వద్ద నీ తియ్యని ఓ చిలుకల చిలుక పలుకులు పలుకవేమి. నేను చేసిన తప్పిదమేమి ?  నన్ను బిగియార కౌగిలించుకుని ఉక్కిరి బిక్కిరి సేయవా ? ఆ భాగ్యం నాకు కలుగజేయవా ? అయినను నే చెప్పినది వినుము. నేనే కాంతలను గూడినను వారిచేంత కూడా కలువ కన్నులదానవైన నిన్ను తలచకుండా ఉండలేనని నీకు తెలియదా ? ” అని మన తిమ్మన వారు మోహనాంగిని వాటేసుకున్నారు.


ఇక ఆమె పరిస్థితి ఒంటి నిండా బంగారు ఆభరణాలతో నిండినదై ఉంది. వారి మధ్య చిన్న దీపపు సిమ్మె గుడ్డిగా కాంతులీనుతు న్నది. 

  

“ఓ మానస చోరా ! తమరు ఇంటిలో ఉన్న నగలు అన్నీ ఊడ్చుకుని వచ్చి ఇచ్చారు. తీరా నగలు పోయినవని చక్రవర్తికి ఫిర్యాదు చేసారు. చుట్టూ తిరిగి మన మీదకు రాదు కదా ! " బిగియార కౌగిలించుకుని గారాలుపోయింది ఆ మోహనాంగి.


"ఓసీ నాట్యమయూరీ ! మీ వంటివారికి మగవాడిని ఇట్టే పసిగట్టగల నైపుణ్యం ఉంటుందని విన్నాను. కానీ నీవింత బేలవయి మాట్లాడుతున్నావు.. చక్రవర్తికి కవులంటే పిచ్చి అభిమానం కనుక నా ఫిర్యాదు నమ్మి పోయిన వస్తువులను ఇవ్వగలడు. వాటినీ ఏదో రోజు నా ఆలిని మోసగించి ఎత్తుకు వచ్చి నీకు సమర్పించగలను. " 


“ముక్కుతో తిమ్మనవారు పలుకుతూ బహు చక్కగా ఆమెకు బ్రహ్మవరాలను మితిమీరిన ప్రేమతో ఇచ్చారు.”


"మరల ఇస్తే మరి మా అక్క అదే మీ అర్ధాంగి అంగీకరించునా? ఈసారి ఆమె నమ్మదుగాక నమ్మదు" అని బుంగమూతి పెట్టింది ఇక్కడ నిలబడున్న మోహనాంగి."


నవ్వుల హోరెత్తిపోతోంది సభ. చెవులు రిక్కించి వింటున్నారు సభికులు. నంది తిమ్మన, చేష్టలుడిగిపోయి కూర్చున్నాడు.


"ఇంతటి ఆనంద సమయాన మీ అక్కని ఏల తలచెదవు ? అది సాత్వికురాలు. అంటే నా కావ్యమందు ఆమె పాత్ర రుక్మిణి. దానికి నగలు ఎందుకు ? పూజలకు చిన్ని తులసీ దళమున్న చాలు. ఆభరణాల తళుకులు, ధగధగలు నీవంటి చంద్రముఖి కి, నీ అమోఘ లావణ్యాన్ని మరింత రంజింపచేస్తాయి. నగలూ రంజిల్లుతాయి" అని తిమ్మనవారు సెలవిచ్చారు.”


సభ అంతా నవ్వులతో ఊగిపోతుంటే తిమ్మన, మోహనాంగి మరి తట్టుకోలేక

పోయారు. ఆమె రామలింగని ప్రసంగానికి అడ్డుపడింది.


"ఇంతటితో ఆపేయండి. పాపమాయన నాకంటే సిగ్గుతో కుంచించుకుపోతున్నారు. నాకు నగలు ఏమీవద్దు. నేవెళ్లిపోతాను” మోహనాంగి శ్రీ రామలింగకవిని వేడుకుంది.


"వారకాంతవైన నీకు సిగ్గు కూడదు. నీవు ఈ సభలో ప్రసంగించుటకు అర్హత కోల్పోయావు. మీరిరువురు చేసిన తప్పు మీవరకైనచో విడిచిపుచ్చవచ్చు. ఒక విధంగా రాజద్రోహం చేసినారు. అబద్దపు ఫిర్యాదులు చేసారు.. మీరు చక్రవర్తినే మోసగించారు. నీవలె నంది తిమ్మన ఎందుకు నా మాటలకు అడ్డుపడలేదు. అతడికి ధర్మం తెలుయును గనుక." 


రామలింగడు ఆమె నోరు మూయించాడు. మోహనాంగి బిక్కముఖంతో రాయలవారి వైపు దీనంగా చూస్తూ నిలబడింది. సభ అసలే నవ్వుల జడివానలో మునిగి ఉంది. అందుకే ఎవరూ నోరు విప్పలేదు. తిరిగి రామలింగడు చెప్పసాగాడు.


"అన్నట్లు దేవీ నా కావ్యంలో అలకబూనిన సత్యభామ సర్వాభరణములను విడిచి మాసిన చీర కట్టుకుని, చీకటి గృహమున మన్మధవేధనతో అపర సత్యభామ వలె నాకు దర్శనమీయవా ? " అన్నారు తిమ్మనవారు.


"మీరు కోరాలేగాని, ఏ కోరికనైనా తీర్చగలదీ మోహనాంగి."


వెంటనే లోపలి గదిలోకి పోయి వచ్చినది. ఆభరణాలు లేకుండా కూడా మోహనాంగి సహజ సౌందర్యంతో మెరుపుతీగవలే కన్పించినది.


అదేమిటీ అంటే సత్మభామ అలుక తీర్చవలెనని శ్రీకృష్ణుడు ఆమె పాదాలపై తన శిరస్సు ఉంచుతాడు. ఆమె తన ఎడమపాదంతో తన్నేస్తుంది. ఈ సన్నివేశం తప్పక మన మధ్య జరిగితీరాలి అని పట్టుపట్టాడు. ఆమె ఎట్టకేలకి వప్పుకుంది. నందితిమ్మన ఈ అపర సత్యభామని తను పాత్రలో లీనమై ఎంతోసేపు బతిమాలి బామాలి చివరకు ఆమె పాదాలను తల వంచి మ్రొక్కాడు. మాటిచ్చినందున మోహనాంగి తన ఎడమ పాదంతో తన్నింది. ఎగిరి కొద్ది దూరంలో పడ్డాడు. ఈ తన్నుడులో చాలా అతి ఎక్కువైయ్యిందనే చెప్పాలి. కొంత సేపటి వరకు తేరుకోలేక పోయాడు. కాలు, చేయి కూడదీసుకుని అతికష్టం మీద లేచి లేని గంభీరతను ప్రదర్శించి అతడు రాసిన అమృతతుల్య మైన ఒక పద్యాన్ని ఆలపించాడు.


నను భవదీయ దాసుని మనంబున నెయ్యపుఁ గిన్కఁబూని తాం చినయది నాకు మన్ననయ, 

చెల్వగు నీపద పల్లవంబు మత్తను పులకాగ్రకుడ కంటకవితాపము దాకిన నొచ్చునంచు నే ననియద నల్కమానవు గదా యికనైన, నరాళ కుంతలా !


(తాత్పర్యం:- ఓ సత్యాదేవి, నీ ప్రణయ కోపముతో నీవు ఈ దాసుని దండించినను అది గొప్ప సన్మానమే. కానీ, కోమలమైన నీ మెత్తని పాదము నా శరీరముపై గల కఠినమై న ముళ్లవంటి రోమాలను గుచ్చుకుని ఎంత బాధపడితివో ! ఇప్పటికైనా నీ కోపం విడిచి పుచ్చుము. )


పద్యం రాగాలాపన ముగించి నందితిమ్మన తన మెడపట్టుకుని చాలా బాధపడ్డాడు. మోహనాంగి చాలా నొచ్చుకుని ఉపచర్యలు చేసింది, కానీ అతడి నొప్పి ఎక్కువ కాసాగింది. సత్యభామ తన భర్తను అతి సున్నితంగా తన్నింది. కానీ ఈ అపర సత్యభామ తన్నిందేదో గాడిద తన్నిన విధంలో తన్నింది. ఇక ఏవే వో పసరలు, చూర్ణాలు రాయడం పూయడం లో పాపం మోహనాంగి, అవి రాయించుకో వడంలో నందితిమ్మనవారు అదో తియ్య తియ్యగా పుల్లపుల్లగా ఆనందంలో మునిగితేలారు. ఈలోగా నాతో వచ్చిన దొంగ, కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు మొత్తం చక్కబెట్టాడు. ఓ చీరలో నగలు మూటకట్టాడు. సద్దుమనిగాక వాటిని పంచుకుందాంమని. ఈ ఒప్పందంతో ఆ మూటను నా ఇంట్లో దాచేందుకు ఒప్పుకున్నాడు. ఇదీ జరిగిన తంతు." అని వివరించాడు రామలింగకవి.


రామలింగకవి ఆదేశం మేరకు కొత్వాలు రామలింగని ఇంటి నుంచి నగల మూటను తెచ్చాడు. వాటిని నందితిమ్మన భార్యకు ఇచ్చి “సరిచూడమ్మా !”అని అందించాడు. 


ఆత్రంగా నగలు అందుకుని "ఇవే నేను పోగొట్టుకున్న నగలు " అని తన గుండెలకు హత్తుకుంది.


"ప్రభూ! రుక్మిణమ్మ తనవే అంటుంది. ఆమెకే ఇప్పించండి. ఇక ఈ అపర సత్యభామవారికి దినమునకు కోరినంత బంగారం ఇచ్చు శమంతకమణి అనే నాట్య విన్యాసం ఆమె వృత్తిలో ఉంది, ఉరకలెత్తే వయస్సు ఈమెది.. పైగా వారకాంత ! తనే సంపాదించుకోగలదు. దయతో ఆమెను క్షమించండి. కావ్యం రాయడం దేవుడిచ్చిన వరం. కానీ పవిత్రమైన కావ్యంలో పాత్రధారి కావడం, ఆ అనుభవాలను తనపై రుద్దుకోవడం అందుకు తానే ఇంట్లో నగలు దొంగిలించి వారకాంతకిచ్చి ఏమీ ఎరుగనివానిలా ఫిర్యాదు చేయడం నందితిమ్మనవారు చేసిన భరించరాని నేర పరంపర. కనుక వీరిరువురిని ధర్మప్రభువులు క్షమించి విడిచిపెట్టగలరని ఆశిస్తున్నాను.” అని రామలింగకవి ఏడువారాల నగల కథను ముగించాడు.


రాయలువారు నవ్వుతూనే  "ఏమిటయ్యా నంది తిమ్మన. ఇదంతా ఎందుకు చేసినట్టు ? మెత్తగా ముద్దుగా పలుకులు పలికే నీవా ఇవన్నీ చేసినది. పారిజాతాప హరణం గురించి నాకు మాటవరసకైనా చెప్పలేదే ! నాకంటే నీకు మోహనాంగీ ఎక్కువయ్యిందా ? రామలింగకవి నన్ను, ఇక్కడవారినందరిని పదేపదే ఊరించి వినిపించాడు. అతను అన్నట్లు చెరకుగడ తియ్యదనాన్ని సంతరించుకున్నాయి. తప్పక నాకు వినిపించాలి. ఇక మీరు చేసిన తప్పులు క్షమించరానివి. ఈ సభలో రామలింగకవి మీ ఇద్దరిని దోషులుగా నిలిపాడు. ప్రజల ముందు కూడా మీరు చులకనయ్యారు. ఇంతకంటే వేరే శిక్ష ఉండదు. కనుక మిమ్మల్ని క్షమించి విడిచిపెడుతున్నాను.”


"మోహనాంగీ ! నీ నాట్యప్రదర్శన ఏర్పాటు చేస్తాం. ఆ తరువాత నీకు ఉచితరీతిని ధన కనక వస్తువాహనాలతో సంతృప్తిని చేస్తాను. నీవు ప్రదర్శించు నాట్యం, నీ పదఘట్టలను చూడాలనుకుంటున్నాను. " అని రాయలు అనేసరికి ఒక్కసారి సభంతా గొల్లుమంది. మోహనాంగి సిగ్గుతో కుంచించుకుపోయింది.


తిమ్మన ముఖం ఎత్తలేకపోయాడు. అతని భార్య గొంతు విప్పి "అయ్యా రాజవైద్యులకి చూపించి ఈయనకు మెడ కుదుటపడనీ యండి. ఆ పాపిష్టిది ఏ భూతమో అయి ఉంటుంది. ఆమె ఇంతగా తన్ని తీవ్రంగా గాయపరిచింది ." కళ్లనీళ్లు తిప్పుకుని రాయలవారిని వేడుకుంది. 


"అమ్మా రుక్మిణీ ! మరి రాయలవారికి పని ఏముందమ్మా.. ఇలా వారకాంతలతో తన్నించుకు వచ్చిన వారికి ఆ ధర్మప్రభువు వైద్యం చేయించుట తప్పదు కదమ్మా! నీవు సాత్వి కురాలవమ్మా నీ భర్తయే సెలవిచ్చినాడు. నీకు తులసీదళమున్నచా లన్నాడు. నీవా సత్యభామను భూతము, దయ్యము అని దూషించరాదు. ఆమె నాట్య ప్రదర్శన నీవును చూడాలి. అప్పుడు తెలియును ఆమె పాదములు ఏనుగు పాదముల కంటే బలమైనవి అని. ఇప్పటికే నీ పతిదేవునికి ఎరుకయినది.” 


రామలింగడు తిమ్మన భార్యతో ఓదార్పుగా పలికాడు.. మళ్లీ సభంతా నవ్వులు పువ్వులయ్యింది.

🧑‍🦲

 *సశేషం*


*తెనాలి రామకృష్ణ -  8*

🧑‍🦲


*అదెంత ! చిటికెలో పని....1*


శ్రీకృష్ణదేవరాయలు ఆ రోజు ఎంతో ఉల్లాసంగా తనలో తనే పదే పదే నవ్వుకుంటూ అంతఃపురంలో గడిపాడు. రామలింగని చతురత గుర్తుకువస్తుంటే ఆ కవిలో ఉన్న తెగింపు, బుద్ధికుశలత, సమయస్పూర్తిని అభినందించడంతో సరిపుచ్చకుండా తగిన విధంగా సత్కరించాలి. ఉన్నపళంగా రప్పించి ధనకనక వస్తు వాహనాలను అతనికి ఇవ్వవలిసిందే. తను చక్రవర్తి అయ్యాక ఇంతగా ఎప్పుడూ నవ్వలేదు. ఆనందంలో మునిగితేలే సందర్భం రాలేదు.. సరిగ్గా అప్పుడే వచ్చాడు తిమ్మరుసు.


“రండి అప్పాజీ ! ఈరోజు సభలో రామ లింగని విశ్వరూపం చూసినట్లయ్యింది మీరేమంటారు. పాపం ముక్కు తిమ్మన ఎంతగా దొరికిపోయాడు. తిమ్మనను పట్టుకుని ఏకంగా సభలో నిలిపిన తీరు నిజంగా ఇలా జరిగిందా? అనిపిస్తోంది." నవ్వుతూ అన్నాడు రాయలు.


"ఇది హర్షించదగ్గదిగా లేదని నాకన్పిస్తోంది. ప్రతి మనిషిలో ఏవో కొన్ని బలహీనతలుంటాయి. వాటిని మనం రామలింగకవి వంటివాడు గారడీవాడిలా ప్రదర్శిస్తుంటే నోరు మెదపక చూసామని అనిపిస్తోంది. తిమ్మన కవిని మనమంతా అవమానించినట్టుగా ఉంది. ఈ విషయమై పట్టపురాణి వారు అన్నపూర్ణాదేవి (తుఖా దేవి, ఓడ్రదేశపు రాజు గజపతి కూతురు) చాలా బాధపడినట్లు తెలిసింది. మీతో ఆ విషయమే మాట్లాడ్డానికి వచ్చాను. నిజమే తుళాదేవి పారిజాతాపహరణంలో కొంత భాగం ఈసరికే కవి నోట విన్నారు. ఇక ఆ కవి తను పిలిచినా సిగ్గుతో రాలేడని తనకా దివ్యకావ్యం వినే అదృష్టం ఇక లేకుండాపోయిందని నొచ్చుకున్నారని విన్నాను."


రాయలకు అప్పాజీ మాట మీద అపార గౌరవం, కానీ రామలింగడిని గారడీవాని ప్రదర్శనతో పోల్చడం సరికాదనిపించింది. తిమ్మన చేసినది ముమ్మాటికి తప్పే. ఇందులో రాణీవాసంకు సంబంధం ఏమిటి ? అని తనలో తనే తర్కించుకుని... 


"అప్పాజీ ఈరోజు పట్టపురాణి తిరుమల దేవి మందిరానికి పోవల్సినవాడిని. కానీ మీరు చెప్పారు కనుక సాధ్యమైనంత త్వరగా ఆ తుఖాదేవిని కలుసుకుని ఇప్పుడు రాజుకున్న సమస్యనిసరిచేస్తాను. మీరు నిశ్చింతంగా ఉండండి.”


రాయలు వెంటనే బయలుదేరాడు. అన్నపూర్ణాదేవి చక్రవర్తికి ఘనస్వాగతం పలికింది. ఆమె ఓ అందాలరాశి. ఆమె లేనిదే బతుకులేదని నానా తిప్పలుపడి చివరికి వివాహం చేసుకున్నాడు. ఆమె అంటే రాయలకు ప్రాణం. ఆమె చాలా నొచ్చుకుందని తెలిసి హుటాహుటిన ఆ మందిరంలో వాలాడు. చాలా విషయాలు మాట్లాడాక, ఆమె కావాలని తిమ్మన ప్రస్థావన తెచ్చింది. సర్ది చెప్పాడు.


" నాకు కావ్యం వినే అదృష్టం లేనందుకు విచారిస్తున్నాను. తిమ్మన అమాయకుడు కనుకనే ఆ గడుగ్గాయి రామలింగని మాయలకు తలవొంచుకుని నిలబడ్డాడు. అయినను దేశాన్ని ఏలిన ఏలికలు మీముందర ఇలా జరగడం నాకు ఏ మాత్రం నచ్చలేదు. " 


సూటిగా రాయలు కళ్లలోకి చూస్తూ తను అడగాల్సింది నిలదీసినట్లు అడిగింది.


రాయలు నవ్వి "మహారాణీ మీకు తెలీదు. పూర్తిగా అక్కడ జరిగింది కనులారా చూసినచో తెలిసేది. నన్ను సవిస్తరంగా చెప్పమందువా మొత్తం వివరిస్తాను. "


"వద్దు ప్రభూ నేను మొత్తం విన్నాను. ఈరోజు సభకు వచ్చాను. నన్ను మీరు గమనించలేదు. మీ పట్టపురాణీయే కాదు నా సవతి తిరుమలాంబదేవి, మిగిలిన మీ తొంబండుగురు భార్యలు విచ్చేసి చోద్యం చూసారు. అందరూ ఆనందించారు. ఆ రామలింగడు రెచ్చిపోయి తానో ఋష్య శృంగునిలా, ఈ లోకంలో తప్పు చేసిన ఏకైక వ్యక్తి తిమ్మన అని చాటేందుకు సభలో తీవ్రంగా అవమానించాడు. మీరు గమనించలేదు. రామలింగడు మిమ్మల్నీ అవమానపరిచాడు. " నవ్వుతూ చెప్పడం ఆపింది.


"నన్ను అవమానించాడా ? ఎప్పుడు ఎలా ?"


ఆ కవి నోటివెంట పలుమార్లు వచ్చిన పలుకు వారకాంత, ఈ మాటతో అతడు మానసికంగా గాయపరిచింది నాట్యకత్తె మోహనాంగినే కాదు. మిమ్మల్ని మీ గారాల రాణీ చిన్నాదేవిని. నిజమే చిన్నాదేవి మీ ప్రేమలో పడక ముందు ఆమె వెలయాలే కదా ! మీరా వారకాంతను తీసుకువచ్చి అందలం ఎక్కించారు. మాతో సమానంగా రాణిని చేసారు.”


"అన్నపూర్ణాదేవీ శృతిమించవద్దు. ఏమిటి మీ దూషణలు. మరణించిన చిన్నాదేవిని విమర్శించడానికి ఎలా సాహసించారు. " అని దిగ్గున లేచి ఆ మందిరం విడిచి చరచరా వెళ్లిపోయాడు రాయలు.


రాయలు తన మందిరం చేరుకున్నాక మతి స్థిమితం కోల్పోయినవాడిలా ఐపోయాడు. చిన్నాదేవి పై ఎంతటి భయంకరమైన విమర్శ చేయగలిగింది. మొదటి నుంచి ఆ తుఖాదేవికి నోరు జారే గుణం ఉంది. ఆమె ఎడల తను చూపిన అనురాగంకు బదులుగా ఆమె తన మనస్సును చిత్రవధ చేసేందుకు ఏమాత్రం సంకోచించడం లేదు. ఇక ఆమె ముఖం చూడరాదు. అని గట్టిగా తీర్మానించుకున్నాడు.


ఒంటరిగా ఉండేకంటే తిరుమలదేవి మందిరంకు వెళ్లేందుకు సిద్ధపడి మళ్ళీ విరమించుకున్నాడు. మనస్సంతా ముసురు పట్టినట్లయ్యింది.


తిమ్మరుసు మాటలు గుర్తుకువచ్చాయి. రామలింగడు ఏమాత్రం బెదరకుండా ఎవరి నైనా నిలదీయగలడు. పదేపదే వారకాంత అని అన్నది నన్ను నా చిన్నాదేవిని అవమానించడానికా ? అతనిలో అంతటి దురుద్దేశం ఉందా? అదే నిజమైతే కవి అని చూడకుండా అతని శిరస్సు ఖండించి వేయడానికి వెనుకాడను. ఐనను ఇప్పుడే తేలాలి. వెంటనే రామలింగని ఉన్నపళంగా రావల్సిందిగా భటులను పంపాడు.


రామలింగడు వచ్చి నిలబడి చేతులు కట్టుకున్నాడు. 


"ఇది ఏకాంత మందిరం, మనమిరువురమే ఉన్నాం. నేను అడిగినదానికి దాచకుండా నిజమే చెప్పాలి. అబద్దం అని అనిపిస్తే నేను క్షమించను. ఈరోజు సభలో ఆ మోహనాంగిని వారకాంత అని పదేపదే ఉచ్ఛరించావు. ఆ నీచమైన ఉచ్ఛరణ ఆమెకే పరిమితమా లేక నాకు, నా రాణీ చిన్నాదేవివారికీనా ?”


రామలింగడు ఆ ప్రశ్నకు హతాశుడయ్యాడు. 


"ప్రభూ ఇలా అడగడానికి తమకు నోరు ఎలా వచ్చింది. వినడానికే నాకు కష్టంగా ఉంది. ఏమని బదులీయగలను. ఐనను అడిగినవారు నన్ను నా కుటుంబాన్ని పెంచిపోషిస్తున్న చక్రవర్తి. నాకు కొంత సమయం ఇవ్వండి. మీకు తప్పక బదులీయగలను.”


"రామలింగా నాకు కావల్సింది, ఈ క్షణమే నిజం తెలియాలి. అంతే కాని కాలతీతం కాకూడదు. నీవు రాజద్రోహానికి ఈ నీచ ఉచ్చారణతో పాల్పడినట్టుగా భావించి అడుగుతున్నాను. అవునా ? కాదా ?" రెట్టించాడు.


"ప్రభూ సభకు విచ్చేసిన తిరుమలదేవి వారిని నన్ను అడిగినట్లే అడగండి. నా తల్లిని దూషించిన సాహసం నేనెలా చేయగలను. ఆమె నన్ను అనుమానించిన ఎలాంటి విచారణ చేయకుండానే మీ ఇష్టమొచ్చినట్లు శిక్షించండి. తిరుమలదేవి వారు ధర్మం తెలిసినవారు "


రాయలు ఆలోచనలోపడ్డాడు. తుఖారాణి ఏదో అన్నంతమాత్రనా తను గాభరపడి రామలింగకవిని అనవసరంగా ప్రశ్నించానే అని అనుకుని.. 


" ఇక మీరు వెళ్లండి. ఏదో అడిగేసాను. మనస్సులో ఏమీ పెట్టుకోవద్దు. నాకు మానసికంగా ఏదోలా ఉంది. " అని తలపట్టుకున్నాడు.


రామలింగడు అక్కడే నిలబడ్డాడు. 


“దయచేసి నాతో తమ బాధను పంచుకోండి. మీరొక్కరే ఆలోచించుకుంటూ ఉంటే మరింత గా జవాబు దొరకని బాధ అనుభవించాల్సి వస్తుంది" అని రాయలని అనునయంగా అడిగాడు.


“రామలింగా.. నిన్ను ఉరి తీసి చంపేయాలి అన్నంత కోపం వచ్చింది. ఎందుకో తెలుసా ? అని జరిగినదంతా తుఖాదేవి ఉదంతం పూసగుచ్చినట్లు చెప్పాడు. సాంతం విన్న రామలింగడు.. 


“ఇది సవతుల మధ్య జరిగే తంతు. ఇందులో తమరు అన్నీ ఏకపక్ష నిర్ణయాలే తీసుకుంటున్నారు. నిశ్చింతంగా ఉండలేక పోతున్నారు. పదండి తిరుమలదేవివారి మందిరానికి నేను వస్తాను. ఆమెతో వివాహం చనిపోయే ముందు చిన్నాదేవి వారే చేయించారు. ఆ ఇరువురికి చెప్పలే నంత ప్రేమాభిమానాలున్నాయి. కనుక తిరుమలదేవి నన్ను చూసి ఏవగించుకు న్నా నాపై కోపం ప్రదర్శించినా తమరు 

ఉపేక్షించవద్దు. ఆమె ఎదుటే నన్ను తీవ్రంగా దండించండి. అలాగే ఆ వెంటనే తుఖాదేవి వారి మందిరానికి వెళదాం. ఆమె నన్ను ఏవగించుకున్నా దండించండి”


రాయలకు అర్ధంకాలేదు. "ఏమిటి 

రామలింగా నీకేమైనా మతిచలించినదా? తిరుమలదేవి మాట ఎలా ఉన్నా నిన్ను ఆ తుఖాదేవి క్షమించదు. నీపై చురికతో పొడిచినట్లు మాట్లాడుతుంది. పైగా నీవు అలా అయితే దండించమంటున్నావు. నీవు అనవరంగా ఇందులో తల దూర్చి ఇరుక్కుపోతున్నట్లుంది. నా బాధ నేను పడతాను నీవు వెళ్లిపో !"


“లేదు ప్రభూ నేను చెప్పినట్లు చెయ్యండి. మీకే తెలియగలదు. పదండి క్షణం కూడా ఆలసించవద్దు. " అని బలవంతంపెట్టాడు.


రాయలు రామలింగడిని వెంటపెట్టుకుని తొలుత తిరుమలదేవి మందిరంలోకి ప్రవేశించాడు. తొలిసారిగా రామలింగడు రాణివాసం చూడడం, అక్కడ కట్టుబాట్లు చూసి ఆశ్చర్య పోయాడు. వచ్చినది కవీశ్వరుడు అని తిరుమలదేవి రామలింగ నికి పాదాభివందనం చేసి “తమ రాకతో మా మందిరం పావనమయ్యింది అని బంగారు పళ్లెంతో వెలలేని బంగారు నగలను ఇచ్చి సత్కరించింది. 


“ఈరోజు సభలో తమరు వల్లించిన పద్యములను విన్నాక నా మనస్సునిండా అమృతం చిలకరించినట్టయ్యింది. ప్రభువుల కోసమే ఎదురు చూస్తున్నాను. ఆ పద్యముల గురించి అడగాలని ఆశ పడ్డాను.” అని ఆమె తన ఆనందాన్ని చాటింది.


రామలింగడు రాయల వైపు ఓర కంటితో చూసి "అమ్మా ఈ కవి తమ బిడ్డవంటి వాడు ఆదేశించండి. తమకు ఎన్ని కావ్యాల నైనా వినిపించి ఆనందింపచేయగలను.” అని మిక్కిలి వినయంగా పలికాడు.


ఆమె చేతులు జోడించి “ఈరోజు నాకెంతో ఆనందంగా ఉంది. కవితిలకమా! మీ వాక్కులు అమృతతుల్యంగా ఉన్నాయి. ప్రజలు మాకు కన్నబిడ్డలు. వారిలో మీరున్నారు, కనుక మీరు మాకు బిడ్డలే " అంది.


రాయలకు తల తిరిగిపోయింది. ఆ మందిరంలో కొంతసేపు గడిపి ఇద్దరూ బయల్దేరారు. దారిలో...


 “రామలింగా తిరుమలదేవి వద్ద ఏదో మాట పడకుండా లాభపడితివి. కానీ, మా తుఖారాణివారి వద్ద నీవు అభాసుపాలు కావడం ఖాయం. ఎందుకైనా మంచిది ఇప్పటికైనా వెనక్కుపోదాం. ఆమె సంగతి నాకు తెలుసు. అనవసరంగా నీవు దండనకు గురికావడం నాకు ఏమీ ఇష్టం లేదు. నిన్ను దండించడానికి నా చేతులు రావు. నిన్ను ఇతరత్రా దండించలేను. పదా వెనుకకు పోదాం.” అన్నాడు కొంచెం ఆవేదనగా...

🧑‍🦲

 *సశేషం*

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂


*తెనాలి రామకృష్ణ -  9*

🧑‍🦲


*అదెంత ! చిటికెలో పని....2*


https://youtu.be/GnQ6r9FyhX8?si=i5n_mu3Lc2Vpnchj


"ప్రభూ ఈ రామలింగని తక్కువ అంచనా వేయుచున్నారు. మనమెళ్ళాల్సిందే, ఆమె ఏమన్నా నేను మనసావాచా స్వీకరిస్తాను. నాకు లేని బాధ తమకెందుకు ? పదండి వడివడిగా నడవండి. నాకు చాలా తొందరగా ఉన్నది.” అని భగభ అడుగులు వేసుకుంటూ సాగిపోయాడు.


"ఓయీ రామలింగా ! ఆగవయ్యా నా మాట విను. నా వద్ద ఆమె నీ గురించి చెడ్డగా అన్నందుకైనా నిన్ను చూడగానే మరింత కోపాన్ని ప్రదర్శిస్తుందయ్యా ! పద పోదాం. పైగా నిన్ను శిక్షించమని నాకు చెప్పడానికి వెనుకాడదు. ఆమె ఎంత అందాలరాశియో అంత తంపులమారి. ఎందుకు ఊరక ఆపద కోరి తెచ్చుకుంటా వు.” రాయలు నచ్చజెప్ప చూసాడు.


రామలింగడు ససేమిరా అన్నట్టు ఒప్పుకో నందున ఇద్దరూ తుఖాదేవి మందిరంలో ప్రవేశించారు. ఆమె వారి రాక చూసి సంభ్ర మాశ్చర్యానికి గురుయి రాయలు పాదాల పై వ్రాలి “ తమ మనస్సు కష్టపెట్టాను. అయినను రవ్వంత బాధపడకుండా ఈ మహానుభావుడ్ని నా వంటి అజ్ఞానికి చూపించి తరింపచేసారు, ధన్యురాలను అయ్యాను. ఇట్టి కవీశ్వరులను కొలుచు భాగ్యం నాకు కల్గించారు. అని ఎన్నో కానుకలను ఇచ్చి రామలింగడిని ఘనంగా సత్కరించింది. 


"ఓ కవీశ్వరా మీ మేలు జన్మలో మరువను. సవతులపై కోపాన్ని ప్రభువులపై చూపాను. పరుష పదజాలంతో చక్రవర్తిని మానసికం గా బాధపెట్టాను. ఆయన అలకబూని కొన్ని నెలలకు గాని స్థిమితపడరు. ఈవైపు చూడరు. అటువంటిది తమరే ఆయనని తీసుకువచ్చారు.


"నిజమే తల్లీ రాయలవారు తీవ్రమనస్థాపం తో ఉంటే నన్ను పిలిపించారు. విషయం తెలిసి అన్నపూర్ణాదేవి (తుఖాదేవి) ఏదో అన్నంతమాత్రనా తమరు పట్టించుకుంటే ఎలా ? అని నచ్చజెప్పాను. నేను రాలేను అని అన్నారు. అందుకు నా వలన కదా మీ ఇరువురికి కీచులాట జరిగినది. నేను వస్తాను. ఆమె ఒకవేళ ఇంకనూ కోపం చూపినచో నన్ను తీవ్రంగా దండించండి అని చెప్పి తీసుకువచ్చితిని. తీరా వస్తే మీరు నన్ను ఆదరించి సత్కరించినారు. ప్రభువులను క్షమించమని పాదాలపై వాలారు.”


“నన్ను క్షమించండి. ఈరోజు ఏమేమో జరిగిపోయాయి. అందరం యధాస్థానాల్లో ఉందాం " అని రాయలవారి చేతులు పట్టుకుంది. రాయలు ఆమెను క్షమించాన న్నట్లుగా చిర్నవ్వులు చిందించాడు. రామలింగని వైపు కృతజ్ఞుతగా చూసాడు. వారిద్దరిని రామలింగడు అదోలా నవ్వుతూ చూసాడు. 


తుఖాదేవి రామలింగనితో  "రాకరాక విచ్చేసారు. నాకు ఏదైనా ధర్మబోధ చేసి ధన్యురాలను చేయండి." అని కోరింది.


రామలింగడు నవ్వి "తల్లీ కోరితివి, మా చక్రవర్తి పట్టపురాణివారి ఆజ్ఞ మేరకు నాకు తెలిసిన నాలుగు ధర్మసూత్రాలని తమకి చెప్పి నేనును ధన్యుడనవుతానమ్మా !”


రాయలు చెవులు రిక్కించి వినసాగాడు. రామలింగడు గొంతు సవరించుకుని..


"సూర్యవంశానికి మూలపురుషుడు అయిన మనువు, బ్రహ్మచే రచింపబడిన మానవ ధర్మశాస్త్రం బ్రహ్మచే విధి ప్రకారం ఉపదేశం పొంది, తాను భృగుమునీంద్రు నికి చెప్పి మహర్షులకు బోధించమని ఆదేశించాడు. మిక్కిలి ప్రచారమైన మను ధర్మశాస్త్రంలో కొంత మీకు చెప్పగలను. విని పాటించవమ్మా.


పసిపాప వయస్సు నుంచి ముదుసలి అయిన వరకు స్వతంత్రముగా ఏ కార్యము చేయరాదు. స్త్రీ బాల్యమున దండ్రి, యౌవనమందు భర్త, పెనిమిటి తదనంతరం పుత్రుని చాటున తన బతుకును గడపవలెను. ఎల్లప్పుడూ భర్త తన ఎడ ఇష్టములేకయున్నను భార్య నగుమోముగలదై అణకువ కలిగిఉండ వలెను. తండ్రి, సోదరుడు తనను ఎవని కిచ్చి పరిణయం చేసిన అట్టివానిని జీవితాంతము శుశ్రూష చేయవలెను. భర్తకు ప్రియము కలిగించవలెను. ఏ చిన్న తప్పుతో భర్తను బాధించరాదు. ఇవి హైందవ స్త్రీ ఆచరించాల్సినవి మీకు చెప్పాను.”


తుఖ్యాదేవి పరిసరాలను మరిచి మరీ వింటోంది. రాయలు కూడా రామలింగని మాటలకు మంత్రముగ్ధుడైనాడు.


“నేను చివరగా మరికొన్ని చెప్తాను. రాజు లేని లోకం బలవంతులచే పీడింప బడుతుంది. అందుకే నాలుగు తలల బ్రహ్మ తన సృష్టిలో ఇంద్రుడు, వాయువు, యముడు, సూర్యుడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, కుభేరుడు, ధర్మరాజు వీరి అంశముల నుంచి రాజును సృజించెను. అట్టి చక్రవర్తికి ఏ పూర్వజన్మ సుకృతము వలన ఇల్లాలవయితివి. రాజు పసివాడైనా కేవలం మానవ మాత్రుడని అవమానింప రాదు. రాజులో ఉన్నది దైవాంశము. అట్టి రాజును ఏ కొంత తూలనాడిన సాక్షాత్తు ఆ దైవాలను ద్వేషించినట్లే. రాజు అనుగ్రహం వలన ఐశ్వర్యం కలుగుతుంది, ఆతడు మగటిమి చూపునపుడు విజయము కలుగుతుంది. అట్టి రాజు సకల తేజ స్వరూపుడు, ధనము కోరువాడు, జీవము కోరువాడు. రాజు ఎడల విరోధం కల్గి ఉండ రాదు. ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించువారు నశించిపోగలరు. మనువు ఈ విషయం పదేపదే చెప్పాడు." అని ముగించాడు.


ఆ మాటలు విన్న రాయలు ముఖంలో నెత్తురు చుక్క లేకుండాపోయింది. ఒక్కసారి అతడి మనస్సులో కల్లోలం ఏర్పడింది. రామలింగడు చెప్పిన వాటిలో ఈ తుఖాదేవికి ఏ ఒక్కటి లేదు. ఆడుదాని కుండాల్సిన అణుకువలేదు. భర్త అన్నచో అభిమానం అంతకంటే కనపరచదు. ఆమె కేవలం తన అందాన్నే నమ్ముకున్నట్లుంది. తను అందగత్తె నన్న అహం ఆమెకు తెలియకుండా ఆమెనే దహించివేస్తోంది. ఎవరైనా రాణించునది తొలుత అంద చందాలతో కాదు. గుణగణాలతో, ఈ నగ్న సత్యం పట్టపురాణి తెలుసుకున్నంత వరకు ఈమెను చూడకుండా ఉండా ల్సిందే. అని ఒక దృఢచిత్తానికి వచ్చేసాడు.


"రామలింగా నీవు చెవిటివాని ముందు శంఖు ఊదుచున్నావు. పదా పోదాం " అని ఆ అంతఃపురం వీడి రాయలు బయటికి వెళ్లిపోయాడు . ఊహించని పరిణామం, రామలింగడు తుఖాదేవి అయోమయంలో పడ్డారు. ఒక్కసారి ఆమెలో మార్పు 

వచ్చింది.


“చూసారా చక్రవర్తి అలుక. నేను ఎన్నో మెట్లు దిగి వచ్చాను. క్షమాపణలడిగాను. అయినను ఆయనలో మార్పులేదు. ఏదో నోరుజారాను. అంతమాత్రనా ఇంత పెద్ద శిక్ష వేస్తే ఎలా?” అని బాధపడింది. చూస్తుండగా ఆమె చెంపలు తడిసాయి.


రామలింగడు ఆమె వద్ద శెలవుపుచ్చుకుని అక్కడి నుంచి బయటికి వచ్చేసాడు.


ఆరు మాసాలు గడిచాయి. రాయలు తుఖాదేవిని పూర్తిగా మరిచిపోయినంత పని చేసాడు. కలలో కూడా ఆమెను తలచుకుండా మిగిలిన రాణుల వద్ద రోజులు గడిపాడు. ఈలోగా ఎన్నో ప్రయత్నాలు చేసింది తుఖాదేవి. కానీ చక్రవర్తి దేనిని పట్టించుకోకుండా తన పనిలో తాను నిమగ్నుడైయ్యాడు.


చివరికి తుఖాదేవి, రాయలవారి కలహ కథనం మహామంత్రి తిమ్మరుసువారి వద్దకు వెళ్లింది. అప్పటికే ఆయన ఆరా తీసాడు. కొంతమంది దాసీల ద్వారా విని ఉన్నందున ఆమెను విజయ విఠలాలయం వద్ద కలుసుకున్నాడు. తిమ్మరుసును చూడగానే కన్నీరు కార్చింది తుఖాదేవి. 


"అమ్మా విన్నాను. రాయలవారు పూర్తిగా తమ మందిరంకి రావడం మానుకున్నారని విని చాలా బాధపడ్డాను. అసలేమైంది? ఇంతటి సాహస నిర్ణయం తీసుకునేందుకు రాయలవారికి అంత అవమానమేమై ఉంటుంది? సాధారణంగా రాయలువారు సహనపరులే కదా ”


"అదేమిటి మహాశయా ! అలా ప్రశ్నిస్తున్నారు. రాయలవారికి నా మందిరంలో అవమానమా? అలుమగలు అన్నాక ఏదైనా మాటరావచ్చు. అంత మాత్రనా ఇలా నా ముఖమే చూడరా ! ఇదేనా రాజ ధర్మము. నేను మీ వలన కాకుంటే నేరుగా ఓ దీనురాలిలా రాజ దర్బారుకు వెళ్లి మొరపెట్టుకోనా? చెప్పండి. కొన్నివేల క్రోసుల దూరం వచ్చి ఈఅభాగ్యు రాలను హింసించడానికేనా యుద్ధాలు చేసి సాధించి పరిణయమాడింది." అని నిష్టూ రంగా ప్రశ్నించింది.


“అమ్మా తుఖాదేవీ కన్నీరు కార్చవద్దు. నీ కథంతా విన్నాను. నీవు నోరుజారినందున రాయలవారు చిన్నబోయి తన ముఖం చాటేసారు. మరి రామలింగకవి కదా రాయలవారిని ఆరోజు తిరిగి తీసుకొచ్చా డు. ఆ కవినే పిలిచి చెప్పలేకపోయావా ? అతడు ఒక విధంగా కార్యవాదే. ఆ దారిలో నీవు మరల రాయలవారిని పొరపొచ్చాలు లేకుండా కలుసుకోగలవు. "


"నిజమే అప్పాజీ ! నేను ఆలోచించలేక

పోయాను. భేష్ అయిన ఆలోచన. ఇప్పుడే కబురు పంపి అతని ద్వారా తిరిగి రాయల వారికి చేరువవుతాను. ”


ఉత్సాహంగా బదులిచ్చి తుఖాదేవి ఆ ఆలయంలో దైవ దర్శనం చేసుకుని వెళ్లిపోయింది.


తిమ్మరుసు రామలింగకవికి కబురంపి తన మందిరంకి పిలిపించుకున్నాడు. "ఆనాడు అలకబూనిన రాయలవారిని తుఖాదేవి మందిరంకు తీసుకువెళ్లగలిగావు. ఆయన ఎందుకో తుఖాదేవి నీడను భరించలేనంత ఎడబాటులో ఆరు మాసాలుగా ఉన్నాడు. ఈసారి నీవే ఆ దంపతులను తిరిగి ఒక్కటి చేయాలి." ఆజ్ఞాపించినట్లుగా చెప్పాడు.


ఆ ఆదేశానికి రామలింగడు పకపక నవ్వాడు.


“ఎందుకు నవ్వుతున్నావు ? నేను రాయల వారి క్షేమం కోరినవాడిని. అందుకే నిన్ను ఈ విధంగా కోరాను. నువ్వు ఎందుకో చాలా హేయంగా నవ్వుతున్నావు. నీవామె కి వల్లించిన మనుధర్మశాస్త్రం నీకు వర్తించదా? రాజును తూలనాడడం నీకు మాత్రం క్షేమమా?”


"పూజ్య అప్పాజీ ! ఎంతగా ఆరోజు జరిగిన విశేషాలు, నా ధర్మబోధల గురించి సేకరించి నారు. అందుకే తమరు మహామంత్రులు అయ్యారు. ఈ సామ్రాజ్యానికి మీ సేవలు మరువరానివి. మీరన్నచో రాయలవారికి తగు భక్తికి కారణం ఇదే ! మీరే చెప్పలేక పోయారా ? రాయల వారు వింటారు”


"ఆ మాత్రం నాకు తెలియక కాదు. నా మాట కాదనలేక రాయలవారు ఆమె మందిరానికి వెళ్లగలడు. ఇదికాదు, నేను కోరేది వారిద్దరూ చిలకా గోరింకల్లా జీవించాలి. కనుక నీవే ఏదైనా చేయాలి. నిన్ను ఇప్పుడు తుఖాదేవి అదే అన్నపూర్ణా దేవి పిలిపిస్తుంది. తప్పక ఆమెను రాయల వారికి దగ్గరయ్యేట్లు నీవంతు సహకరించు”


"అప్పాజీ ! చూసారా, మీరు నాకేమని ప్రశ్నించారు ? ఎందుకు హేయంగా నవ్వావు అని అడిగి నా నుంచి నాలుగు పొగడ్తలు విని ఆ హేయపు నవ్వు గురించి పట్టించుకోలేదు. ఇక్కడే నా జవాబు ఉంది. "


అర్ధంకాక తిమ్మరుసు చూసాడు.


"అప్పాజీ పట్టపురాణివారిని రాయల వారిని విడదీసింది ఆమె దుందుడుకు మాటలు కావు. నా ధర్మబోధనలు. ఆ బోధనలసారం తెలుసుకున్న రాయలవారు వెంటనే ఆమెను విడిచిపెట్టేసారు. ఆ బోధనల గురించి తమరు ఆరా తీసారు కదా. వాటిని ఒకసారి మననం చేసుకోండి మీకే తెలియగలదు.” అన్నాడు రామలింగడు తెలివిగా.

🧑‍🦲

 *సశేషం*

*తెనాలి రామకృష్ణ -  10*

🧑‍🦲


*అదెంత ! చిటికెలో పని....3*




గతాన్ని నెమరువేసిన తిమ్మరుసుకు మొత్తం అవగతం అయ్యింది. 


"అరిపిడుగా ! నీవు ఇలా చేయడానికి కారణం ?”


"తుఖాదేవి కారణంగా రాయలవారు నన్ను తల తీయించే స్థితికి వచ్చారు. ఆయన ఆ రోజు నా ముఖం చూడడానికి సయితం ఇష్టపడలేదు. ఆ రోజు సభలో నంది తిమ్మన వారి నిర్వాకంపై ఆమె మొసలి కన్నీరుతో కావాలని రాయలవారిని, చిన్నా దేవివారిని నేను అవమానించినట్లు నమ్మబలికింది. నా మీద ఆమె చేసిన అభియోగం ఏమిటో తెలుసా ? అప్పాజీ! ఆరోజు సభలో నందితిమ్మన, మోహనాంగి లను అడ్డుపెట్టుకుని చిన్నాదేవిని నేను వారకాంత అని పలుమార్లు అన్నట్లు తద్వారా రాయలవారిని సుతిమెత్తగా అవమానించానని ఆమె నూరిపోసింది. ఆమె విషపు మాటలు చక్రవర్తీ నమ్మి నన్ను చంపేయాలన్నంతగా కోపం చెందారంటే ఆమె పలుకులవాడి ఎంతటివో ఒకసారి ఆలోచించండి. ఒక దశలో రాయలవారు నన్ను శిక్షించకుండా వదిలేసి తాను ఒంటరిగా ఏదో తెలియని బాధను అనుభవించసాగారు. ఆ ఆవేదనను చూసి ఆయన్ని ఓదార్చి నా ప్రాణాలను పణంగా పెట్టి తుఖాదేవి వద్దకు రాయలవారితో పందెం వేసి వెళ్లాను. ఆరోజు నేను రాయల వారు తొలుత తిరుమలదేవివారి మందిరా నికి వెళ్లాం. ఒకవేళ ఆమె కూడా నా మాటలను తప్పుగా తీసుకుంటే నన్ను తీవ్రంగా శిక్షించమని రాయలవారికి ముందే చెప్పాను. పాపం రాయలవారు ఊపిరి బిగబట్టి నాతో ఇష్టంలేకున్నా వచ్చారు. నాకావల్సినది నా ప్రాణం కాదు. రాయల వారి మనశ్శాంతి. అందుకే అంతకు తెగించాను. తీరా వెళ్తే తిరుమలదేవి నన్ను ఘనంగా సత్కరించారు. ఆ తరువాత తుఖాదేవి మందిరానికి వెళ్లాం. అక్కడ ఆమె రాయలవారు ఊహించని విధంగా ప్రవర్తించారు. నన్ను నగలతో తూచినంత పని చేసారు. ఎందుకో తెలుసా ? నన్ను అడ్డుపెట్టుకుని కదా ఆమె చనిపోయిన సవతిని వారకాంత అని రాయలవారిని గేలిచేయగలిగారు. చిన్నాదేవిని తూలనా డడం భరించలేని రాయలవారు అలిగి వెళ్లిపోతే తిరిగి తెచ్చాను. అందుకే నన్ను గొప్పగా చూసారు. ఆమె నన్ను మరింతగా కీర్తించి ధర్మబోధ చేయమంది. ఇక్కడే ఆమె నాకు చిక్కినది. తొలిపలుకులు ఆమెకు రుచికరంగా పలికి తరువాత రాయల వారికి సూదులతో పొడిచినట్లు మను ధర్మాన్ని బోధించాను. రాయలవారు మాకంటే గొప్ప కవులు. ఆయన ఆ బోధనలలోని మర్మం ఎరిగిన మరుక్షణం ఆమెకు దూరం అయ్యారు.” అని జరిగినదంతా చెప్పుకొచ్చాడు రామలింగడు. 


“రామలింగా జరిగినదేదో జరిగినది. చాలు ఆమెకాశిక్ష! వారిరువురిని పాలునీళ్లు కలిసి పోయినట్లు కలపాలి. ఏమంటావు ”


 "అదెంత పని అప్పాజీ ! చిటికెలో చేయగలను.”


నిర్ఘాంతపోయాడు తిమ్మరుసు. "ఏమిటి చిటికెలో పనా ? నీకు అరివీరభయంకరుడ యిన చక్రవర్తీ నీ చిటికెల్లో ఉన్నాడా ? భలే గుందయ్యా నీ మాట నీ చేష్టలు. ఏదీ చూస్తాను. ఈరోజు రాత్రి తుఖాదేవి మందిరానికి రాయలవారు తనకు తానుగా ఉత్సాహంగా వెళ్లాలి. రాత్రి గడువుగా పెడ్తున్నాను. ఒకవేళ నీవు ఓడితే ? " అన్నాడు తిమ్మరుసు సందేహంగా..


రామలింగడు నవ్వి "తమ ఆజ్ఞగా ఆ పని చేసిపెడ్తాను. ఈరోజు ఏ మందిరానికైనా నేను వెళ్లడానికి అనుమతి పత్రం ఒకటి రాయించి ఇప్పించండి. ఆ తరువాత నాకు మీ పందెం చెప్పండి." అని బదులిచ్చాడు.


"పందెం వద్దు, నీవు నాకా పనిచేసి పెడితే చాలు. ఈరోజు నిరభ్యంతరంగా ఈ మహా సామ్రాజ్యంలో ఏ మందిరానికైనా నీకు వెళ్లేందుకు అనుమతినిస్తూ పత్రం రాసిస్తున్నాను. ఇంతకీ అనుమతి ఎందుకు ? ” అని భుజం చరిచి అడిగాడు తిమ్మరుసు.


"చూస్తారుగా, స్వామికార్యం చక్కగా చక్కబెట్టలంటే ఇలాంటి చిన్న చిట్కాలు తప్పవు.” 


ఆసరికే తిమ్మరుసు స్వయంగా రాసిచ్చిన పత్రం అందుకున్నాడు. అప్పటికే సాయం సమయం అయినందున రామలింగడు నేరుగా రాయలవారి వద్దకు వెళ్లడానికి సిద్ద పడ్డాడు. దారిలో తుఖాదేవి దాసి ఎదురయి "అయ్యా కవీశ్వరా! తమ గురించి ఎక్కడని వెతకను. మా రాణీవారు ఉన్నపళంగా తమను తీసుకురమ్మన్నారు. ఆమె చెప్పి చాలాసేపు అయ్యింది. అసలే ఆమె కోపిష్టిది. దయ చేసి విచ్చేయండి." అని కోరింది.


"పట్టపురాణీవారి పని మీద రాయలవారిని కలవనున్నాను. తప్పక రాయలవారు విచ్చేసి ఆరుమాసాలుగా ఎడబాటయి ఎదురు చూస్తున్న రాణీ వారిని ఆనందింప జేస్తారు. ఈ విషయంలో తిమ్మరుసువారికి మాటిచ్చాను” అని చెప్పి ఆ దాసీని పంపించేసాడు రామలింగడు.


రాయలవారిని అత్యవసరంగా కలవాలని చెప్పి రామలింగడు రాయలవారి రహస్య మందిరంలో కలుసుకున్నాడు. రాయలకు అర్ధంకాలేదు. తను చాలా ముఖ్యమైన పనిలో ఉండగా రాయలు వ్యక్తిగత భద్రతా ఉద్యోగులు వచ్చి రామలింగకవి తొందరగా కలవాలంటున్నాడు అని చెప్పారు. వేరెవ్వరికైతే తను లోపలికి రానిచ్చేవాడు కాడు. పైగా నిషిద్దమైనా రహస్య మందిర ప్రాంతంలో ఎవరొచ్చినా శిక్షార్హులే. కానీ రామలింగని పై రాయలకు మంచి అభిప్రాయమున్నందున..


"ఏమి రామలింగా, ఇక్కడ వరకు వచ్చావంటే నీవేదో వ్యధతో వచ్చావని అనిపిస్తోంది, పర్వాలేదు చెప్పు. '


"ప్రభూ! ఇక్కడికి రాకూడదు అని నేనెరుగు దును. ఈ రోజంతా తమరు ఈ రహస్య మందిరంలో ఏవో సమాలోచనల్లో ఉంటారని, ఇతరులు ఎవరు ప్రవేశించినా తీవ్రమైన శిక్షలకు గురికావల్సిందేనని. నాకు నా ప్రభువు ముఖ్యం కానీ నా ప్రాణం కాదు అని నిర్ణయించుకుని వచ్చాను. ఇక విషయం ఏమంటే నేను ధర్మశాస్త్రములని నమ్మినవాడిని. ఈరోజు ఉదయం ఒక బాధాకరమైన వార్తను విన్నాను. తమ దేవేరులలో ఒకరిపట్ల విముఖంగా ఉన్నారని, మనుధర్మశాస్త్రం ప్రకారం ఈ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఏలికలు కనుక ఎలాగైనా కలిసి తమకు ఈ తాళ పత్రాన్ని అందించాలనుకున్నాను స్వీకరించండి.” అని చేతిలో పెట్టాడు.


రాయలు ఆసక్తిగా తాళపత్రరేకును అందుకుని ఆత్రంగా చదివాడు. రాజుచే ఆగ్రహింపబడినవారు నశింతురు. అదెట్లన్నచో ఇంద్రుడు, యముడు, అగ్ని, సూర్యుడు,వరుణుడు, చంద్రుడు, కుభేరుడు, ధర్మరాజు అంశములు రాజు యందున్నందున రాజు ఎవరిపై ఆగ్రహం చూపినా ఆ దేవదేవులు వారికి కీడు తలపెట్టెదరు, అని ఉన్నది అందులో.


రాయలు అయోమయంగా చూసాడు. కూర్చున్న ఆసనంలోంచి లేచి మందిరానికి దూరంగా వెళ్లిపోయి ఆలోచనలోపడ్డాడు. 


“రామలింగా ఒకసారి ఇటురా ! ఈ తాళప త్రము చదివాక నా మనస్సు చాలా బాధప డుతోంది. నిజమే నేనేవో పొరపాటులు చేస్తునే ఉన్నాను. అందుకే నాకు ముగ్గురు కుమారులు కలిగి కూడా ఈసరికే ఇద్దరిని కోల్పోయినాను. మనువు వాక్కు బ్రహ్మ వాక్కు. నా కళ్లు తెరిపించావు. నేను నీకు చెప్పలేదు కానీ ఆ తుఖాదేవిని గత ఆరు మాసాలుగా దూరం పెట్టాను. ఆమె ఎన్నో మార్లు కబురంపినను నేను ఇలా చాలా మొండికెత్తితిని. ఈ క్షణమే ఆమె వద్దకు వెళ్లి పూర్వపు అనురాగంతో కలిసిమెలిసి ఉండగలను. రామలింగా నువు మా దంపతులను తిరిగి ఒక్కటిగా చేసిన మహానుభావు డవు.”  అన్నాడు సంతోషంగా రాయలు.


"ప్రభూ! నేను వచ్చిన పని అయిపోయింది. కానీ రాకూడని ఈ మందిర ప్రవేశం చేసితిని. కనుక శిక్షార్హుడనే. ఒకవేళ శిరస్సుఖండన వంటి శిక్షకు గురయినచో నా కుటుంబం అనాధ కాకుండా మీరే కాపాడవలయును. ఇదే నా చివరి కోరిక. " అని చేతులు జోడించి మ్రొక్కాడు.


రాయలు అయోమయంగా చూసాడు. అక్కడే ఉన్న తిమ్మరుసుకి దూరంగా వెళ్లిన వీళ్ళు ఇద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో తెలియక నొసలు చిట్లించాడు. మరోవైపు రామలింగడు చెప్పిన పని చేయకుండా అనవసరంగా ఈ నిషేధస్థలికెందుకు వచ్చాడు అని రుసరుసలాడాడు.


"రామలింగా నువు ఇక్కడి నుంచి వెళ్లిపో ! నీవు శిక్షార్హుడవు కావు." అని రాయలు నవ్వుతూ చెప్పాడు.


"నేను ధిక్కరించితిని కనుక శిక్షించండి" అప్పటికే అక్కడకి చేరారు తిమ్మరుసు, సర్వసేనాని, న్యాయనిర్ణయకర్త (అప్పటి రాయల కాలంలో న్యాయనిర్ణేతలే రాజుకు బదులు తీర్పులిచ్చేవారు.) రామలింగని విన్నపాన్ని విన్నారు. 


“చేసిన తప్పును ఒప్పుకుని శిక్షించమనేవా డిని ఇదే నేను తొలిసారి చూడడం. ఇట్టివా నిని విచారించాలి ప్రభూ !” న్యాయనిర్ణేత రాయలవారికి సూచించాడు.


దండనాయకుడు రామలింగకవిని సోదా చేసాడు. అతడి వద్ద చిన్ని ఆయుధం దొరికినా తీవ్ర నేరం కిందే లెక్క. ఎందుకు అంటే అతడు ప్రవేశించినది రాయల రహస్యమందిరంలోకి, ఐనా అలాంటివేమీ దొరకలేదు. కానీ తిమ్మరుసు వారు స్వదస్తూరీతో రాసిచ్చిన ప్రవేశ అనుమతి పత్రం దొరికింది. అంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. 


న్యాయనిర్ణేత నిట్టూర్చి “రామలింగా నువు నిరపరాధివి వెళ్లొచ్చు." అని తీర్పునిచ్చి పొమ్మన్నాడు. రామలింగడు వెంటనే వెళ్లిపోయాడు.


"అప్పాజీ ! మీరే జవాబుదారి.” అని న్యాయపతి అడిగాడు.


రాయలు ఇక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండదలచలేదు. 


"నేను తుఖాదేవి మందిరానికి అత్యవసరం గా వెళ్లాల్సి ఉన్నందున మూడురోజుల వరకు ఎలాంటి సమావేశాలకు హాజరు కాను” అని చెప్పి వెళ్లిపోయాడు రాయలు.


తిమ్మరుసుకు రామలింగడు ఇక్కడికి వచ్చింది అర్ధం అయ్యింది. అంతులేని ఆశ్చర్యానికి గురయ్యాడు. అక్కడే రాయలు విడిచివెళ్లిన పత్రం చదివాక పూర్తిగా అర్ధం అయ్యింది. 


“చిటికెలో చేయడం అంటే ఇదా? రామలింగా" అని పకపక నవ్వాడు. 


“అప్పాజీవారు తమ జవాబు కోసం న్యాయపతి అడిగితే" అని గొణిగాడు అక్కడే ఉన్న సర్వసేనని.


“నేను రాసిచ్చిన అనుమతి పత్రానికి చిటికెలో ఉరివేయవయ్యా” అని బదులిచ్చి చకచకా వెళ్లిపోయాడు తిమ్మరుసు. 


"ఏమిటీ చిటికెలో ఎలా ఉరివెయ్యగలను.” తనలో తనే తర్కించుకోసాగాడు న్యాయపతి. చుట్టున్నవారు గొల్లున నవ్వారు.

🧑‍🦲

 *సశేషం*


తెనాలి రామకృష్ణ -  11

👳🏼‍♀️


పండితపుత్ర..... శుంఠ - 1


అలసాని పెద్దన అంటే రాయలవారికి అపారమైన గౌరవం, అందుకే స్వయంగా పెద్దనామాత్యుని కాలికి గండపెండేరం తొడిగాడు. పెద్దన అధిరోహించిన పల్లకిని రాయలు చేతబట్టి ఎత్తి నాలుగడుగులు వేసినాడు. కోకట గ్రామంతో బాటు మరికొన్ని అగ్రహారములను ఇచ్చి కటకాదిసీమ నాయకుడ్ని చేసాడు. 


భువనవిజయంలో కార్యక్రమాలు అన్నీ అలసాని పెద్దనవారి కనుసన్నలలో జరిగేవి. తనకు విధేయత కనబరిచే కవులకు మాత్రమే అతడు రాయలవారి వద్ద ఉన్న చనువు కొద్ది అనేక ధనకనక వస్తు వాహనాలను రాయల వారిచే ఇప్పించేవాడు. ఈ విధేయత లేశమైనా ప్రదర్శించని కవులు లేకపోలేదు. 


తమిళకవి అప్పయ దీక్షితులు, కన్నడ కవులు హరిహరేశన్ వారితోబాటు తెనాలి రామలింగ కవి ఉన్నారు. వీళ్లంతా రాయలను మాత్రమే నమ్ముకున్నారు.


అవకాశం చిక్కినపుడల్లా అలసాని పెద్దన ఎక్కువగా రామలింగడి పై మిరపకాయలు నమిలినవాడిలా విరుచుకుపడేవాడు. రామలింగడు ఇక లాభంలేదనుకుని తొలుత తన లొంగుబాటుతో కార్యం చక్కదిద్దాలను కున్నాడు. ఏ కొంతో అణిగి మణిగి ఉండేవాడు. అయినను పెద్దనలో మార్పురాలేదు. పూర్తిస్థాయిలో దాసోహం అంటేకాని తను వారికి ఏ విధంగా సాయపడకూడదు అనే నిర్ణయంలో ఉండేవాడు పెద్దన.


రామలింగకవితో తమిళకవులు ఈ విషయమై తమ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తే అందుకు “విచారించకండి కాలం నిర్ణయిస్తుంది" అని మాత్రమే వారికి సమాధానపరిచేవాడు.


ఒకసారి తనే స్వయంగా పెద్దనామాత్యుల తో "అయ్యా తమరు నన్ను చిన్నచూపు చూసినా సరిపడును కానీ, పొరుగు భాషా కవులను హీనపరచడం మనకంత మంచిదికాదు.” అని మిక్కిలి వినయంగా చెప్పాడు. 


"రామలింగా నువు వచ్చి చేరిననాటి నుంచి కవుల లోకం కల్లోలమైంది. నువు అసూయపరుడవు. నీ కారణంగా మనలో మనకు పొరపొచ్చాలు ఏర్పడినవి. నీవు ఏదో విధంగా రాయలవారి ప్రాపకం సంపాదించేందుకు దొడ్డిత్రోవ యత్నాలు చేస్తున్నావు. నేను ముక్కుసూటి మనిషిని. ఏ దూర్జటినో, నందితిమ్మననో, సాక్షాత్తు రాయలవారినో కాను. నా వద్ద వేలెత్తి చూపే నీ ఆటలు చెల్లవుగాక చెల్లవు. నీవు ఎవరికోసమో రాయబారం నడపవలిసిన దేమీలేదు” అని కఠినంగా బదులిచ్చాడు.


"పెద్దనవారికి ఆగ్రహం క్షణికం. నేనేమీ అనుకోను. ఏదో పొరుగు భాష కవుల గురించి చెప్పాను" అని అక్కడే ఉన్న మిగిలిన కవుల ముందు తనకు తనే సర్ధుకున్నాడు. 


అక్కడే ఉన్న తాతాచార్యులవారు.. 


"ఏమి పెద్దనా! రామలింగని పై చిరుబుర్రు మంటావెందుకు ? అతడు చెప్పే సలహాలో తప్పేమి ఉంది. అయినను రామలింగడిని చాలా తక్కువ అంచనా వేయుచున్నావు.” అని కావాలని సమస్య పెద్దది చేసే ప్రయత్నం చేసాడు.


రామలింగడు నవ్వుకున్నాడు. తాతాచార్యుల వారి ఆంతర్యం గ్రహించాడు. మంచి సమయమునకే ఆ ముసలి తంపులమారి నోరు విప్పింది అనుకున్నాడు.


"అదే వద్దన్నాను తాతాచార్యులవారూ ! ఏమిటి ఈ రామలింగడి ఆధిక్యత. దక్షిణా పథాన్ని ఏకఛత్రం కింద ఏలుతున్న శ్రీకృష్ణ దేవరాయలు వారిచే గండపెండేరాన్ని తొడిగించుకున్న అదృష్టశాలిని. ఈతడు ఎన్ని జన్మలు ఎత్తినను నా వలె ఇట్టి ఘన సన్మానము జరిపించుకోగలడా ? ఈతనికి నాకు సరిపోలికా. ఈతడు చేయునది కొంటెకోనంగి పనులు. తుంటరి పనులు. పొట్టపోసుకొను విధూషకులు చేయాల్సిన పని చేస్తున్నాడు. అది కవి లక్షణమా ? " అలసాని పెద్దన అగ్రహాంతో పరిసరాలు మరిచి రామలింగడిని తీవ్రంగా విమర్శించాడు.


అక్కడున్న కవులంతా ఖిన్నులై విన్నారు. మద్యలో ధూర్జటి వారించిన పెద్దన ఏమాత్రం తన స్వరాన్ని తగ్గించనేలేదు. “ఇట్టివానికి అంత్యనిష్ఠూరము వరకు చూడరాదు. మొక్కనాడే తృంచాలి.”


రామలింగడు చిరుమందహాసంతో నిలబడ్డాడు. ఆరోజు భువన విజయానికి విచ్చేసిన వీరేంద్రపాత్రో (ఓండ్రదేశపురాజు గజపతి పంపిన కారణంగా విచ్చేసిన పబ్రుద్ధుడు. ఈతడు పట్టపురాణి తుఖా దేవికి స్వయాన వరుసకి బావ. ఇతడు నిలువెల్ల విషంతో నిండి ఉన్నవాడు. రాయలు పతనాన్ని కనులారా తిలకించు భాగ్యానికే ఇక్కడ తిష్టవేసినవాడు. ఈతని గురించి ఈకధల్లో మరోచోట ముచ్చటిద్దాం)

ఆసక్తిగా విన్నాడు.


ఇదే మంచి అదనుగా భావించి కవులలో కల్లోలం పుట్టించడానికి అవకాశాన్ని వాడుకోచూసాడు. సంతోషంతో చప్పట్లు చరిచాడు.


" శెహభాష్ ! పెద్దనాచార్య ఎంత చక్కగా శెలవిచ్చారు. ఈతడు కవికంటే మీరన్నట్లు విదూషకుడుగా రాణిస్తున్నాడు. అవును ఈతనికి ఇంతమంది కవులుండి చక్కటి బిరుదు నీయలేకపోయారే ” వీరేంద్రపాత్రో నవ్వుతూ మరింత ఆజ్యం పోసాడు.


కవులంతా బిక్కముఖాలు వేసారు. ఇదేమిటి రాజబంధువు ఇందులో దూరి మరింత ఎక్కువ చేయుచున్నాడు అని గాభరాపడ్డారు.


రామలింగడు తన చిర్నవ్వును ఏ మాత్రం సడలించకుండా వినసాగాడు. పైకి చెప్పక తాతాచార్యులవారు లోలోపల ఎందుకో తెలియని ఆనందం పొందారు. ధూర్జటి తలపట్టుకున్నాడు. చివరికి తమిళకవి పెద్దనను బ్రతిమాలి బామాలి శాంతపరచి కూర్చోబెట్టాడు. ఒకింత నిశ్శబ్దం ఆవరించిందా చోట..


వీరేంద్రపాత్రో పెద్దనను మరల కదిపి “అయ్యా తమరు సగం చెప్పి మిగిలినది వదిలేయడం ఏపాటి న్యాయం? ఈ కవికి ఓ బిరుదు ప్రధానం చేయండి." అని మొండిపట్టు పట్టాడు. అయితే అక్కడున్న కవులు అతనిని నిలువరించేవారే కానీ పట్టపురాణివారి బంధువు, కక్కలేక మింగలేక చూస్తూ ఊరుకున్నారు.


అలసాని పెద్దనకు ఇదే మంచి సమయం అనిపించింది. ఇంతకుమించి రామలింగడు తనకు దొరకడు. రాయలవారి మనస్సులో తిష్టవేసుకుంటూపోతున్నాడు. ఏదో రోజు తన పెత్తనానికి చేటురాకపోదు అని లోలోపల తర్కించుకుని..


“రామలింగా.. ఈతడు రాజబంధువు. ఇక్కడ విషయాలు ఏమీ తెలియవు. కానీ నీవన్నచో ఎంతజుగప్సగా చూస్తున్నాడో చూసావుకదా! ఇప్పటికైనా నీ అభిమతం మార్చుకో ! లేకుంటే నీవు వాత్సాయనుడు చెప్పినట్లు వికటకవిగా గుర్తింపు పొందుతావు” అన్నాడు.


"అంటే ఏమిటి పెద్దనామాత్యా! మాబోటి వారికి అర్ధమయ్యేట్లు చెప్పాలి. వికటకవి అన్నచో అది బిరుదుగా ఉంది. మీరేమో ఏదో చెడ్డ ఆపాదించేట్లు హెచ్చరించారు.” అని వీరేంద్రుడు అర్ధంకాక తలగోక్కున్నాడు.


"ఏముంది రాజబంధువూ,వాత్సాయనుడు తన అపూర్వమైన కామ శాస్త్రగ్రంధాలలో వేశ్యలకు, రాజులకు మధ్యవర్తులుగా ఉండేవారిని విదూషకులుగా, వికటకవులు గా పేర్కొన్నాడు. అంతేకాకుండా వారి గురించి ఉదాహరణలతో చిత్రించి మరీ రాసాడు. దాన్ని గుర్తుకుతెచ్చాను" అన్నాడు. అలసాని పెద్దన విడమర్చి చెప్తే భువనవిజయం కొన్ని క్షణాలు నివ్వెరపోయింది..


ముఖంలో రంగులు మారుతుండగా 

రామలింగడు తలదించుకుని మెత్తగా అడుగులు వేసుకుని వెళ్లిపోయాడు. ఆ తరువాత అంతా ఒక్కొక్కరే అక్కడి నుండి నిష్క్రమించారు. కొంతమందికి కడుపు నిండా విందుభోజనం ఆరగించినట్లు అయ్యింది. వారిలో తాతాచార్యులు, నంది తిమ్మన, బయటికి కనపడకపోయినా ధూర్జటి ఉన్నారు.


నాలుగు నెలలు గడిచాయి. ఓరోజు నిండు దర్బారులో రాయలవారు అలసాని పెద్దనని ఏదో కావ్యం గూర్చి పిచ్చాపాటిలో దించారు. కవులు తలా ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు. అంతా ఆనందంగా ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో దర్బార్ లోకి వచ్చాడు అలసాని పెద్దనవారి సుపుత్రుడు బొమ్మప్ప. విచ్చేసి తండ్రి పాద పద్మములకు మ్రొక్కి చేతులు కట్టుకుని తండ్రితో గుసగుసగా మాట్లాడసాగాడు. ఒక్కసారి దర్బారులో ఆ కుర్రపంతుల వైపే చూపులు నిలిచాయి. కవులకు తెలుసు అతను పెద్దన పుత్రుడని కానీ రాయల వారికి తెలియదు.


“ఎవరీతడు ? పోలికలు చూస్తే పెద్దనకు బిడ్డగా కనిపిస్తున్నాడు. ఎక్కడో గురుకులం నుంచి వచ్చినట్లున్నాడు. ఎప్పుడో చిన్నప్పుడు చూసాను.” అని రాయలవారు అడిగారు.


“అవును ప్రభూ ! నా పుత్రుడే బొమ్మప్ప నామధేయుడు. మీరూహించినట్లుగానే గురుకులం నుంచి వచ్చాడు. విద్యల యందు మేటిగా గురువులచే ప్రశంసలు అందుకున్నాడు. నాకు మీరు ఇచ్చిన కటకాదిసీమ నాయకరకం ఇప్పుడు పనికి వచ్చింది. వీడిని అక్కడే గ్రామ బాగోగులని చూసేందుకు ఉంచాలనుకుంటున్నాను. " అని అలసాని పెద్దన పుత్రోత్సాహంతో చెప్పాడు. అందుకు బొమ్మప్ప కూడా కడు వినయం ప్రదర్శించాడు.


"ప్రభూ బొమ్మప్ప వంటి వినయశీలిని ఎక్కడా చూడలేదు. పెద్దన గారు చాలా అదృష్టవంతులు" ధూర్జటి ముచ్చటగా చెప్పాడు.


"అవును ఈతడు పెద్దలయందు గౌరవం తో మెలగే గుణసంపన్నుడు. అంతేకాదు, ఎలాంటి చెడుసావాసాలు వంటపట్టించుకు నేరకం అంతకంటే కాదు." నందితిమ్మన వంత పాడాడు..


"తండ్రి మాట జవదాటడు. ఆడువారి పట్ల గౌరవం మెండుగా గలవాడు. యవ్వనంలో ఉన్నవాడు ఎవడైనా వయస్సు అల్లరికి తట్టుకోలేక కనీసం నేత్రానందంలో ఆనందిస్తాడు, కానీ ఈ బొమ్మప్ప తండ్రి రాసిన కావ్యంలో ప్రవరాఖ్యుడే” పింగళి సూరన బొమ్మప్ప భుజం తట్టిమరీ రాయలకు చెప్పాడు.


బొమ్మప్ప సిగ్గుతో కుంచించికుపోసాగాడు. అది గ్రహించిన రాయలు " బొమ్మప్ప నీవు తండ్రిని మించిన తనయుడవు కావాలి. నీ నుంచి పెక్కుకావ్యాలను నేను అంకితంగా స్వీకరించాలి. ఇదే నా కోరిక, తప్పక తీర్చాలి"


బొమ్మప్ప తల వంచి రాయలకు నమస్కరించి “తమ ఆజ్ఞను తప్పక నెరవేర్చెదను. నా మనోఫలకంపై పెక్కు కావ్యములు ఊహాలిఖితమై ఉన్నవి. వాటిని రచించి తమకే అంకితమీయ గలను.” అని సమీపమునకు వెళ్లాడు.


రాయలు ఎనలేని ఆనందాన్ని కనబరిచి "నేను ఫలానా అని కోరను. కానీ నేను ఏదైనా సంగీతకావ్యమును స్వీకరించాలని ఆశపడ్తున్నాను. నా కోరికని సాధ్యమైనంత త్వరలో తీర్చగలవని ఆశిస్తున్నాను." అన్నాడు.


"అదెంతపని! నాకు సంగీతమన్నా చెవి కోసుకోవాలనేంత ఇష్టం. తప్పక ఓ సంగీత కావ్యం రచించి తమకు వినిపించి తమ మన్ననలను పొందగలను ప్రభు. నన్ను ఆశీర్వదించండి" అని వంగి భక్తితో నమస్కరించాడు.


"పులి కడుపున పులి పుడుతుంది. అంటే ఇదేనేమో” నోరు తెరిచాడు నందితిమ్మన. అతనికి వంతపాడారు మిగిలిన కవులు.


ఆ తరువాత పెద్దన తనయుడు వచ్చిన పని తెలుసుకుని ఏదో బదులివ్వగా తలపంకించి అందరికి నమస్కరించి వెళ్లిపోయాడు.


రామలింగడు తన శైలి మరిచి మన్నుతిన్న పాములా మిన్నకున్నందుకు కవులు మూతులు కొరుక్కున్నారు. పెద్దనకి విధేయుడుగా ఉన్నట్లు ఆయన కనుసన్నల లో వినమ్రతతో మెలగడం కొంతకాలంగా చూస్తున్న రాయల వారు కూడా అడగనే అడిగారు.


"ఇదేమిటి రామలింగా! అలసాని పెద్దన వారికి ఇటీవల శుశ్రూష చేస్తున్నట్లుందే. నీ నోటికి తాళం వేసినట్లయ్యింది. ఎందులో నీవు పెద్దనవారికి దొరికిపోయి ఇలా మారావు. మేమెవ్వరం నిన్ను కట్టడి చేయలేకపోయాం.”  ఏం చెప్తాడా అని అంతా ఉత్కంఠగా చూసారు.


రామలింగడు నవ్వి ఊరుకున్నాడు. 


తాతాచార్యులు నవ్వాపుకోలేకపోతూ 

“నేను చెప్తాను.” అని అనాటి భువన విజయంలో జరిగినదంతా మొత్తం పూసగుచ్చినట్లు చెప్పాడు. 


రాయలు నవ్వి “నిజమే.. ఆ బిరుదు ఏ కవి మాత్రం భరించగలడు. అప్పుడు వాత్సాయనుడు రాసినదానికి ఇప్పుడు గుణం కనిపించిందన్నమాట. "


రాయలు నవ్వడంతో అంతా నవ్వారు. రామలింగడి ముఖం ఏ మాత్రం కందగడ్డ లా అయిపోతుందోనని కవులందరూ ఉత్సాహంగా చూసారు. కానీ అందుకు విరుద్ధంగా రామలింగడు చిర్నవ్వులు చిందిస్తూ కనిపించాడు.👳🏼‍♀️

 సశేషం

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂


తెనాలి రామకృష్ణ - 12  

👳🏼‍♀️


పండితపుత్ర..... శుంఠ - 2



అలసాని పెద్దన లేచి "ప్రభూ! ఒకప్పటి రామలింగడు కాడు ఈ రామలింగడు. ఈతని ఆగడములు మితిమీరినందున నాకున్న పెద్దరికంతో ఓ చిన్న అడ్డుకట్ట వేసాను. ఇపుడీతడు నా శ్రేయోభిలాషి అంతే కాదు, పెద్దలను ఎదుటివాడిని అపారంగా గౌరవించుస్థాయికి ఎదిగాడు. తనకుతాను విచ్చేసి అయ్యా ఇకమీదట తమవద్దనే కొన్నాళ్లు గడిపినగాని నాకు ఎవరితో ఎలామెలగాలో తెలియదు అని నా ఇంటికి వచ్చి ప్రాధేయపడినాడు. సరే లెమ్మని ఒప్పుకున్నాను. ప్రభువులు మరోలా భావించరాదు. రామలింగని కోసం నేను ఇకపై సభలో మరి మాటలాడను. నా తరుపున రామలింగడే మాట్లాడగలడు. అంతెందుకు నా గురించి, నేను ఇప్పుడు రచిస్తున్న కావ్యం గురించి విపులంగా చెప్పగలడు. నన్ను తన గురువుగా స్వీకరించినాడు. అతనికి పూర్తిగా బుద్ది వచ్చిన వరకు నా గురు పెత్తనం తప్పదు.” అన్నాడు.


"అదే నన్ను నేను నమ్మలేకున్నాను. రామలింగ కవికి తమరు అడ్డుకట్ట వేయడమా? ఏ వైష్ణవ మాయ కాదుకదా!”


"ప్రభువులు నమ్మలేని స్థితిలో ఉండడానికి కారణం అతడు తొలుత పెట్రేగి ఉండడమే కదా ! అతడి ఇల్లాలు నా భర్తనెలాగైనా ఓ మంచివాడిగా, సత్పురుషిడిగా చేయమని కోరినందున ఓ ఆడకూతురి మాట కాదనలేక సరేనన్నాను. రామలింగడు కూడా అతి వినమ్రుడై ఉండి చెప్పినది చక్కగా ఆచరిస్తున్నాడు. అతడు త్వరలో ఓ మంచివాడుగా, పెక్కు కావ్యములను రచించే శారదా స్వరూపుడిగా మనం చూస్తాం.” అని ఆప్యాయంగా రామలింగ కవి భుజం చరిచాడు అలసాని పెద్దన. రామలింగడు కూడా తలవంచుకుని కనురెప్పలు టపటపలాడించాడు.


"రామలింగా ! ఏది ఏమయినా ఇట్టి కట్టడి నీకు ఎంతమాత్రం అలంకారముగా లేదయ్యా! నీ చతుర సంభాషణలతో మా ఆందరిని ఆనందింపచేయడమే నీకు సరైనది." రాయలవారు ఒకింత జాలితో రామలింగడిని అనునయించ చూసారు.


“క్షమించండి తమకు నాపై ఉన్న వాత్సల్యమునకు సర్వదా కృతజ్ఞుడ్ని, నాకు అలసాని పెద్దనవారి వద్ద మరి కొన్నాళ్లు తమ భాషలో చెప్పాలంటే శుశ్రూష చేయాలని ఉంది. నేను మనిషిని పెరిగినా చిన్నపిల్లల వంటి మనస్సుతో ఉన్నాను. అది నా నుంచి దూరమయ్యాక నేనుగా బతకగలను.” అన్నాడు రామలింగడు.


ఈసారి మరింత పెద్దగా నవ్వాడు రాయలు.


అలసాని పెద్దన రాయలనే సూటిగా నిలదీసినట్లు "అయ్యా రామలింగడు కుర్ర బుద్ధులతో చరిస్తే చూడాలనుకుంటున్నా రా ? మరి కుదరదు. అతడు ఓ మంచివాని గా ఎదగాలనుకుంటున్నాడు. అది ఈ పెద్దన శుశ్రూషలో " అని తేల్చి గర్వంగా చెప్పాడు.


"అయితే ఈ మద్య మీరు రచించే ఏదైన కావ్యంలో చెరుకుగడ తీపితో నిండిన పద్యాన్ని మీరు కాకుండా మీ కొత్త శిష్యుడు రామలింగడి నోటి నుంచి వినిపించండి. అపుడు అంగీకరింతును.” అన్నాడు రాయలు.


రాయలు అలా అడిగేసరికి అలసాని పెద్దనకు అయోమయంగా అనిపించింది. నిజంగా రామలింగడు నా వద్ద శుశ్రూషనే చేస్తున్నాడా ? లేక ఆషాడబూతిలా నటిస్తున్నాడా ? చక్రవర్తి ఎందుకో నమ్మలేక పోతున్నాడు. కొంపదీసి ఆయన ఈ రామలింగడు ప్రమాదకారి అని నన్ను హెచ్చరిస్తున్నాడా ? అని తనలో తనే తర్కించుకొనుచుండగా..


“నన్ను ఆదేశించండి. గతరాత్రి మీరు రాసిన మనుచరిత్రలో ఒక పద్యాన్ని ఇక్కడ చదివి వినిపించనా ?" రామలింగడు లోగొంతుతో అలసాని పెద్దన చెవిలో అడిగాడు.


“రాసిన నాకే తడబాటు వస్తుంది. నాలుగైదుసార్లు వల్లె వేయాలి. సరే చదివి వినిపించు. పక్కనే ఉన్నాను కదా నేను సరిదిద్దగలను" అన్నారు అలసాని అయోమయంగా..


అలసాని పెద్దనవారికి చేతులు జోడించి వినమ్రంగా నమస్కరించి గొంతు సవరించా డు రామలింగడు. కవులందరూ తెల్లబోయి మరీ చూసారు.


రాయలు చెవులు రిక్కించాడు. రాజదర్బారు నిశ్శబ్దం అయ్యింది. అలసాని పెద్దనకు ఎందుకో లోలోపల అనుమానం పెనుభూతంగా ఉన్నందున రామలింగడిని వారించి తనే చదివి వినిపించాలనుకున్నాడు. మీకెందుకా వృధాశ్రమ అని కూర్చుండబెట్టి సభకు నమస్కరించి “అలసాని పెద్దనవారు రాయగా నేను దాన్ని తొలిసారిగా మీ అందరికి విన్పించు భాగ్యం లభించినందు న ఎంతో ఆనందపడ్తున్నాను.” అని చెప్పి రామలింగడు తన్మయత్వంతో ఆలపించాడు.


నిక్కము దాపనేల ధరణీ సురనందన యింక నీ పయిం జిక్కె మనంబు నాకు; ననుఁజిత్తజుబారికి నప్పగించెదో ? చొక్కి మరంద మద్యముల చూఱలఁబాటలు వాడుతేంట్ల సొం పెక్కిన యట్టి పూవు బొదరిండ్లను గౌఁగిట గారవించెదో !


“అలసాని పెద్దనవారిచే రాయలవారి కోరికపై రాయబడిన మనుచరిత్రలో ఒక పద్యరత్నం ఇది. దీని అర్ధం ! 


గరుడపచ్చ లతో పొదగబడిన భవన మందు వీణ వాయిస్తున్న ఓ దేవకాంత వరూధినిని ప్రవరాఖ్యుడు చూసాడు. ఆమె కూడా అతన్ని చూసి తన మనస్సు పారేసుకుంది. ఆపుకోలేని తమకంతో అతన్ని కౌగిలించుకుంది. పెద్దనామాత్యులు అన్ని రసాలను గుప్పించి జొప్పించగలిగారు." అని రామలింగడు పద్యం వివరించి చెప్పాడు.


"ఏమి ఈ వింత రామలింగడు ఏ మాత్రం తడుముకోకుండా ఎలా వల్లించగలిగాడు ఆ పద్యం. దానిలో శృంగారం పాలు ఎక్కువైనందున మన కొంటెకోనంగిలాంటి రామలింగానికి చాలా ఇష్టపడి ఉంటుంది.” అని దూర్జటి నవ్వుతూ వ్యాఖ్యానించాడు.


"నిజమే, ఒకసారి చదివిన ఇంతగా కంఠో పాఠం రాదుకదా” ఆశ్చర్యం ప్రకటించాడు అయ్యల రాజు రామభద్రుడు.


"మిత్రులారా ఈరోజు పెద్దనగారు వేకువ జామున రాసిన ఓ పద్యం తడుము కోకుండా చెప్తాను" అని కర్ణపేయంగా విన్పించాడు రామలింగడు.


“ప్రాంచద్భూషణ బాహు మూల రుచితోఁ బాలిండ్లు పొంగారఁ బై యంచుల్ మోవఁగ గౌఁగిలించి యధరం బాసింప 'హ ! శ్రీహరీ' యంచున్ బ్రాహ్మణుఁడోర మోమిడి తదీయాంస ద్వయం బంటి పొమ్మంచున్ ద్రోచెఁగలంచునే సతుల మాయల్ ధీర చిత్తంబులన్”


తా॥ వరూధిని ఉప్పొంగిన తమకంతో శారీరక సౌందర్యంతో ప్రవరుడిని బిగియార కౌగిలించుకోబోయింది. అతడు ముఖం తిప్పుకుని నిగ్రహంలేని ఆమె భుజాలను పట్టుకుని 'హ శ్రీహరీ ' అని తోసివేసాడు. ఎంతటి సతులైనా ధీరుల చిత్తాలను మార్చలేరని మన పెద్దనగారు బహు చక్కగా శెలవిచ్చారు”. అని రామలింగడు చాలా అందంగా చెప్పాడు. 


పెద్దనకు మరోసారి గండపెండేరం తొడుక్కు న్నంత ఆనందం వేసింది. ఎంత చక్కగా రామలింగడు తన గురించి చెప్పాడు అని ముచ్చటగా చూసాడు.


"నిజమే రామలింగా, ఎంత మధురంగా పద్య రచన సాగింది." రాయలు తన అభిప్రాయాన్ని చెప్పాడు. 


తాతాచార్యులు పెదవి విరిచి "మను చరిత్ర కావ్యం రాసి ఇచ్చాక కదా ఎవరికి లభించని అపార గౌరవసత్కారాలను అందుకున్నాడు. ఆంధ్రకవితా పితామహా అలసాని పెద్దనార్య అని పిలిపించుకున్నా డు. గండపెండేరం తొడిగించుకున్నాడు. మరి ఈ రామలింగడు ఏమిటి రాత్రి రాసిన పద్యమూ, మనుచరిత్ర అంటున్నాడు.” రాయలను చదువుకొద్దీ అడిగాడు.


“నిజమే! పెద్దనార్య నాకు రాసి ఇచ్చిన తరువాత దాన్ని మరింతగా మెరుగులు దిద్దమని కోరినందున ఆ కావ్యం అనేక ఉపకథలతో చాలా ఎక్కువ అయినది. పెద్దనార్యలవారి శృంగారరసాన్ని ఒకింత చదివిన నేను కావాలనే పెంచమని కోరితిని.”


రామలింగడు కలుగజేసుకుని..


"ప్రభువులవారు మంచిపని చేసారు. మను చరిత్రను మహాకావ్యంగా తీర్చిదిద్దమనడం వలన ముందుతరాలవారికి ఇట్టి గ్రంధం చదువ వీలుకలుగుతుంది. ఆయన రచనకి కూర్చుంటే చాలు బహు చూడముచ్చటగా 

ఉండును. ఆయన చేతికి చిక్కిన తాళపత్రాలు ధన్యతపొందాయి. ఆయన రాసే ఘంటంగా నేను పుట్టాల్సింది. అట్టి భాగ్యం నాకు దక్కనందుకు మిక్కిలి చింతించుచున్నాను. ఇక్కడ మరో విషయం చెప్పవలసి ఉంది. ఈ కావ్యం మన ఏలిక రాయలవారు మార్కండేయ పురాణ ప్రకారంగా మనుచరిత్రను రచింపు మని పెద్దనను కోరారు. కేవలం 150 పద్యాలతో వ్రాయబడిన ఈ కథ ప్రబంధం లో సుమారు 827 గద్య పద్యాలతో ఆరాశ్వాసాల మహా ప్రబంధంగా మన పెద్దనార్య తీర్చిదిద్దారు.. ఇందుకుగల కారణం ఉప కథలు, అవాంతర కథలు, స్వారోచిషమనుసంభవం ప్రధానకథ ఇందీవరాక్షుని కథ, విభావసీ కళావతుల కథ, మృగీస్వరోచుల వృత్తాంతము, మనుసంభవ వృత్తాంతం. ఇన్ని కథల సమ్మేళనమే ఈ మహాకావ్యం." అని కావ్యాన్ని, అలసాని పెద్దనను మరోసారి గొప్పగా వర్ణించి చెప్పాడు రామలింగకవి. 


అలసాని పెద్దన రామలింగడి వైపు చాలా సంతోషంగా చూసాడు. 


" ఓయీ రామలింగా నీవు తూలనాడినా, బలమైన బాణపు పుల్ల దెబ్బ తగిలినట్లు ఉంటుంది. అలాగే నీవు ఎవరినైనా ఎత్తి పొగిడినా అవధులు దాటి ఆనందపు అంచులలో ఓలలాడించినట్లుంటుంది. భళీ రామలింగా! నిన్నటికి నేటికి ఎంత తేడా నీలో కనిపించుచున్నది. వెనకటికి నీలాంటివాడు అమృత పానం చేసి గోమూత్రంతో నోరు కడుగుకున్నాడట. ఇంత చక్కగా ఎదుటివాడిని ఎత్తిపొగిడే వాడివి, ఎందుకయ్యా నరాలు త్రెంచే శూలపు పోటువంటి మాటలతో ఇన్నాళ్లు బతికావు” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.


"నిజమే పెద్దనార్య ! చాలా బాగా చెప్పారు” వంతపాడాడు తాతాచార్యులు. ఆ మాటలకు దర్భారు నవ్వులమయం అయ్యింది. రాయలు మాత్రం నవ్వలేదు, ఆశ్చర్యంగా చూసాడు. రామలింగడి ముసిముసి నవ్వు ఆ మాటలకు మరింత హాస్యాన్నిచ్చాయి.


“పెద్దనార్య మీరన్నమాటలు నిజంగా శూలాల్లా రామలింగానికి గుచ్చుకుని ఉండాలి. ఏమి విచిత్రమోగాని అతడు ఎందుకు ఇంతగా భరిస్తున్నాడు. నాకంతా అయోమయంగా ఉంది. ఏది ఏమయినా, రామలింగా నీ ముందే హెచ్చరిస్తున్నాను. నీవు నిజంగా అలసానిపెద్దనకు సేవలు చేసినా నాకేమీ అభ్యంతరములేదు. నీ మనస్సులో ఏదో పెట్టుకుని కక్షసాధింపులో ఉంటే పెద్దనకు ఏ చిన్న అవమానం జరిగినా తీవ్రంగా పరిగణిస్తాను. అంతా ఒక కుటుంబంలా ఉన్నాం. ఆయన మనకు, మన భువనవిజయంకు పెద్ద దిక్కు. వీటన్నిటిని మించి నాకు బాల్య మందు గురుదేవుడు.” రాయలు తీవ్ర స్వరంతో చెప్పి ఆ రోజుకు సభ చాలించి వెళ్లిపోయాడు.


అలసాని పెద్దన మరింత ఉత్సాహంతో రామలింగడి వైపు ఎగాదిగా చూసి..


“రాయలవారికి ఇప్పటికీ నీవంటే నమ్మకం లేదు. నా విషయంలో చాలా సూటిగా చెప్పారు. ఒకవేళ రాయలవారి అనుమానం నిజం అయితే నీలో ఇంకా కుళ్లుబుద్ధి ఉంటే దాన్ని తగలెట్టేయి." చెప్పి రుసరుస వెళ్లిపోయాడు. 


మిగిలిన కవులు రామలింగని చుట్టూ చేరి "ఏమిటయ్యా ! ఆ ముసలాడు తెగ మిడిసి పడ్తున్నాడు. నీవేమో అతనికి పూర్తిగా పాదా క్రాంతుడవయ్యావు. నీవొచ్చాక పెద్దనకు గుర్తింపు తగ్గిపోతుంది అని అనుకున్నాం. ఇది కలికాలం. మాబోటి వారికి న్యాయం ఏం జరుగుతుంది ?” అని కొందరు వాపోయారు.


రామలింగడు శూన్యంలోకి చూసాడు. తాతాచార్యులు వచ్చి "రామలింగా నువు ఎందుకు పెద్దన అడుగులకు మడుగులు వత్తుచున్నావో చెప్పమందువా ? నీకు వికటకవి అనే బిరుదు సార్ధకం అవుతుందని కదూ! లేకున్న నీవేమి ? ఊడిగం చేయడంఏమిటి ?” అని ఎత్తిపొడిచాడు.


"తాతాచార్యులవారూ తగునా మీకిది. గమనిస్తున్నాను. ఆజ్యం పోయడంలో దిట్టలయ్యారు. ఎందుకు నాపై మీకు ఇంత చిన్నచూపు. నాకు తెలిసి నేను మిమ్ము బాధించిన పని ఏమీ చేయనేలేదు.”


"రామలింగా నువు పట్టపురాణి తుఖ్యా దేవిని రాయలను ఆరు మాసాలు కలవనీయకుండా చేసావు. ఆమె నన్నాశ్రయించింది. నేను ఎంత చెప్పినా రాయలవారు ఆమెను స్వీకరించలేదు. చిటికెలో ఆ దంపతులను కలపగలనని చిటికెలోనే కలిపావు. ఇందులో నేను పరో క్షంగా ఓడినట్లే కదా! అందుకే నీవంటే నాకు ఒక విధంగా అసహ్యం" తాతాచార్యులు లోపలదంతా దాచుకోకుండా కక్కాడు.


"ఇందుకు నేనెట్లు బాధ్యుడను. ఆ చిటికెలో పనిని మీరు చేయలేకపోయారా ? ప్రత్యక్షంగా గెలిచేవారు కదా !"


"చాలించు, నీవు కపట మాటలకు ప్రసిద్ధుడవు. నీ అంతటి మాటకారితనం లేనందున ఇదిగో ఇలా నీకు జవాబు చెప్పుకునే స్థితిలో ఉన్నాను. పెద్దన మీద ఈగ వాలడానికి లేదు అని రాయలవారి శాసనం. తెలిసినది కదా !" అని పకపక నవ్వుకుని వెళ్లిపోయాడు.

👳🏼‍♀️

 సశేషం

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂


*తెనాలి రామకృష్ణ -  13*

👳‍♀️


*పండితపుత్ర..... శుంఠ - 3*


మరో నాలుగు మాసములు గడిచినవి. పది దినాలుగా అలసాని పెద్దనవారు ఇటు దర్బారుకు గాని అటు భువన విజయంకి గాని రావడంలేదు. రామలింగడు కూడా రావడం లేదు. కారణం ఏమిటో తెలుసుకు రమ్మని భటులను పంపాడు రాయలు. ఏదో పనిపడి రావడంలేదని, అంతకు మించి ఏ విషయం చెప్పని పరిస్థితిలో తిరిగి వస్తున్నారు రాజ భటులు. కనీసం రామలింగడు వచ్చినా తెలిసేది కనుక రామలింగకవిని తీసుకురండి అని మరలా భటులను పంపించాడు రాయలు.


రామలింగడు ఓ లేఖను రాసిచ్చాడు. అందులో తాము ఓ ముఖ్య పని మీద ఉన్నందున రాలేకపోతున్నాం. తప్పక రేపు రాగలం. అని ఉంది. లేఖయితే రాసి ఇచ్చాడు కానీ ఆ తరువాత కూడా వారం వరకు రాలేకపోయారు. ఈసారి రాయల వారే కాదు, అంతా ఆశ్చర్యపోయారు. కొంతమంది లోపల దాచుకోలేక కక్కారు. "పాపం అలసాని పెద్దన ఆ రామలింగడి మాయలోపడి ఏమైపోయాడో ఏమో ? ఏదో జరగరానిదేదో జరిగి ఉంటుంది. రాయలవారే కలుగజేసుకుని మాకు, మన భువనవిజయానికి పెద్ద దిక్కు అయిన అలసాని పెద్దనార్యను కాపాడండి.” అని కవులంతా ఏక కంఠంతో కోరారు. అలా కొంతసేపటికి అంతా అదే మాటను బలపరిచారు.


రాయలు ఎందుకో అనుమానిస్తునే ఉన్నాడు. రామలింగడు ఎవరికి తలవొంచి ఊడిగాలు చేసే రకం కాదు. అతడిని బలవంతంగా తన వద్ద పెట్టుకున్న అలసాని పెద్దన అమాయకుడు. రామలింగడు ఏదో చేసి ఉంటాడు. ఇక ఉపేక్షించినచో మొదటికే మోసం వచ్చును. రాజ భటులను, కొత్వాలును పంపి “ఉన్న పళంగా రామలింగడిని తీసుకురండి. అతడు ఇతరత్రా ఏమి చెప్పినా వినవద్దు. మర్యాదగా వచ్చినా సరే. లేకుంటే ఈడ్చుకురండి” అని తీవ్రస్థాయిలో ఆదేశించి పంపాడు రాయలు.


రాయలవారి కట్టలు త్రెంచుకునే ఆగ్రహం చూసి ఆ రోజు సభలోని వారంతా భయభ్రాంతులయ్యారు. అక్కడ సూది పడినా వినిపించే నిశ్శబ్ధం అలుముకుంది. అంతా ప్రధాన ద్వారం వైపే చూస్తున్నారు. ఏ క్షణమైనా రామలింగడిని బరబరా ఈడ్చుకురావడం కనులార చూడవచ్చని గంపెడు ఆశతో చూడసాగారు కొందరు గుర్రు పెంచుకున్న కవులు.


అసలే రాయలవారి ఆగ్రహంతో కూడిన ఆదేశం. రాజ భటులు రామలింగడిని ఈడ్చుకువచ్చారు. అతని వెంట అలసాని పెద్దన వడివడిగా నడుస్తూ “ఈతడు చేసిన నేరమేమి ? ఇదంతా ఎవరు ఇలా చేయమన్నారు. ఓ కవిని ఇంతగా అవమానించడం కూడదు.” దర్బారులోకి వచ్చి రాయలనే సూటిగా అడిగాడు పెద్దన.


"పెద్దనార్య తమరు క్షేమమే కదా! ఈ రామ లింగడు వలన తమరు ఏదో ఆపదలో ఇరుక్కున్నారని నేను, కవులందరూ భయపడ్డాం. ఈతడి వలన మీకేమి ఆపద వాటిల్లలేదు కదా !" రాయలు ఆదుర్ధగా ప్రశ్నించాడు.


“ఈ రోజు చక్రవర్తికి నాపై ఉన్న శ్రద్ధను తలచుకుంటే ఎంతో ఆనందంగా ఉంది. కానీ నా కారణంగా రామలింగనికి జరిగిన ఈ చిన్న అవమానం నాకు బాధగా ఉంది. సరే, ఓయీ రామలింగా! నువ్వు జరిగిన దానికి విచారింపకు. నన్ను గౌరవించిన నిన్ను గౌరవించునట్లే కదా ! " అని భుజం తట్టాడు.


రాయలకు ముఖం చెల్లని పరిస్థితి ఏర్పడింది. రామలింగని వైపు చూసి ఏదో చెప్పబోయాడు. అది గమనించిన పెద్దన నవ్వి "ప్రభూ మీకెందుకు దిగులు. నేను రామలింగని విషయం చూసుకుంటాను. ఈతడు ఒక విధంగా పెంకితనపు పనులు చేయడం వలనే కదా ఈరోజు వరకు ఎవరి నమ్మకాన్ని పొందలేకపోయాడు. కనుక తప్పు ఈతనిదే. మీరెవ్వరూ బాధపడన వసరం లేదు." అని అహంకారాన్ని కనబరుస్తూ చెప్పాడు.


ఆ మాటలకు సభంతా ఒక్కసారి నవ్వులు పువ్వులయ్యింది. "సరే పెద్దనార్యా ఇంతకీ మీరెందుకు మా సన్నిధికి రాకుండా అజ్ఞాతంలో ఉన్నారు. కనీసం అదైనా చెప్తారా ?” రాయలు అడిగాడు.


"ఏముంది. మనిషన్న తరువాత కష్ట నష్టాలు తప్పవు. చెప్పుకోలేనివి కొన్ని ఉంటాయి. అందరితో పంచుకునేవి కొన్ని ఉంటాయి. ఏదో పండితులం ఏ చిన్న కష్టం కలిగినా ఓర్చుకునే ధైర్యం ఉండదు. నేను ఈసరికే బాగా అలసి ఉన్నాను. మా రామలింగడు చెప్తాడు" అని బదులిచ్చి, రామలింగని చెవిలో ఫలానా మాత్రమే చెప్పు అని గుసగుసగా చెప్పాడు.


రామలింగడు గొంతు సవరించుకుని

"నన్ను నమ్మలేని నా పోషణకర్త రాయల వారి దివ్య సముఖమున ఈ అభాగ్యుడు నిజమే పలుకుతాడు. ప్రాణంపోయినా బొంకడు. నా సత్యవాక్కులని నమ్మవలెన ని మిక్కిలి ప్రార్ధించుచున్నాను. అలసాని పెద్దనార్య పై రాయలవారి ప్రేమ అపారం. ఆయనకు ఏ మాత్రం బాధకలిగినట్లు ప్రవర్తించినా సహించనని ఇదివరకే తీవ్రంగా హెచ్చరించారు. పైగా అంతా ఒక కుటుంబంలా ఉన్నాం అని అన్నారు. నాకు చక్రవర్తి ఆజ్ఞ శిరోధార్యం. ఇక్కడ ఒక్క కుటుంబం అని మన ఏలిక చెప్పారు కనుక ఈ సభలో అక్కడ కూర్చున్న వంతెన నిర్మాణ నిపుణులు అయిన పోర్చుగీసు వారిని దయచేసి ఈ సభ నుంచి నిష్క్రమించాల్సిందిగా కోరుచున్నాను." అని సవినయంగా వారిని అర్ధించాడు.


రాయలు ఎందుకో తనేదో పెద్ద తప్పు చేసినట్లుగా బాధపడ్డాడు. నిజమే, 

రామలింగడు తప్పుగా ఏ విషయంలో కనిపించడు. అతడు నిజాన్ని నమ్ముకున్న వాడు. అనవసరంగా తనే అనుమానించి అవమానించాడు. అంతటి కవిని నిండు సభకు ఈడ్చుకుని తీసుకురావల్సిందిగా తను ఆదేశించకుండా ఉండాల్సింది అని నొసలు నొక్కుకున్నాడు.


రాయలు బాధను చూసిన తిమ్మరుసు ఆయన వద్దకు వెళ్లి "ఇలాంటివి పాలనలో సహజం. విచారించకు, కర్తవ్యం మరిచి పోకు. అవకాశం దొరికింది. వివరణ ఇస్తే సరిపోతుంది. ” చిన్న గొంతుతో చెప్పాడు.


"రామలింగా ! నీవు నాకంటే విజ్ఞుడవు. నేను చేసినది తప్పే. పాలకుల ఏలుబడిలో ఇలాంటివి సహజమే అని నీకు తెలుసు ! నీవేమి చెప్పినా వింటాను. నేనే కాదు, నా ప్రజలూ వింటారు. నీవు చెప్పాల్సింది చెప్పు. నీవన్నట్లు మనమంతా ఒక కుటుంబం. నీవు పూర్తిగా చెప్పేవరకు ఈ సభలో నీ ప్రసంగానికి ఎవరూ అడ్డుకోరు. పెద్దన ఏదో చిన్న కష్టం ఎదుర్కొన్నాను అనుచున్నారు. అది ఏమిటో మాకూ తెలియజేయి. ఆ కష్టాన్ని మేము భరించి కాపాడుతాం." రాయలు మృదువుగా పలికాడు.


"ప్రభూ! అకారణంగా నా ప్రాణాలు తీసినా నేను కించిత్ బాధపడను. అట్టి శిక్షకు గల కారణాన్ని తెలుసుకో ప్రయత్నం చేయను. నాయీ తనువు మీ ఉప్పుపులుసులతో బతుకీడ్చుచున్నది. నాపై, నా కుటుంబంపై తమకు సర్వహక్కులు గలవు. మీకోసం ఈ ప్రాణాలు వదలవలిసి వస్తే ఆనందంగా అర్పిస్తాను. అట్టి అవకాశం రావాలని కోరుకుంటున్నాను." రామలింగని ఈ పలుకులకు సభ మొత్తం నివ్వెరపోయి వినసాగింది.


"ప్రభూ ! పండితుల కష్టాలను తెలుసుకునే మీ ఉత్సాహం గొప్పది. నేను చెప్పదలిచిన దానికి పెద్దనార్య రచించిన మనుచరిత్రకు చాలా దగ్గర పోలికలున్నాయి." అని చెప్పనారంభించాడు.


ఇదేదో తనకు బాగానే అనుకూలిస్తుందని అలసాని పెద్దన సంతోషపడుతూ "ఏం చెప్పినా ఉపమానాలతో చెప్తావు. నీ సహజ చాతుర్యం భలేగుంటుంది. ఇక ఆగకుండా చెప్పవయ్యా !" అని ప్రోత్సహించాడు.


"మన అలసాని పెద్దనార్య ప్రవరాఖ్యుడి వైరాగ్య ప్రవృత్తిని, మాతా పితృభక్తిని, అతిధి సేవాసక్తిని, ఆ మహాకావ్యంలో రంగరించారు. ఆ కావ్యాన్ని ఆయన పుత్రుడు బొమ్మప్ప పూర్తిగా చదివెనో లేదో కానీ, ప్రేమాగ్నితో కాగిపోయే వరూధిని శృంగార కథనాన్ని చక్కగా ఆకళింపు చేసుకున్నాడు.”


"నేనడిగినదేమి, నీవు చెప్పునది ఏమి?” మధ్యలో రాయలు అర్ధంకాక ప్రశ్నించాడు. అప్పటికే సభలో ఒకింత కలవరం మొదల య్యింది.


"ప్రభువులు చిత్తగించాలి. తమరే మాటిచ్చి మధ్యలో ఇలా ప్రసంగభంగం చేయుట న్యాయం కాదు. నన్ను మాటలాడనీ యండి" రామలింగడు వేడుకున్నాడు. ఒక్కసారి గొల్లుమన్నారు సభికులు.


రాయలు సర్దుకుని “నిజమే! నీవు చెప్పుము.” అని చిర్నవ్వు చిందించాడు. అలసాని పెద్దన అంతులేని ఆశ్చర్యానికి గురయి చోద్యం చూసాడు. రామలింగడు ఏవో వెర్రి కూతలు కూస్తున్నట్లున్నాడే, అని గుడ్లప్పగించాడు. మిగిలిన దిగ్గజకవులు పంటిబిగువులో నవ్వాపుకుని విన్నారు. అందరిలో ఒకటే ఉత్కంఠ. పెద్దన పరువు పోవడం ఖాయం అని.


“నేనేదో చిన్నపిల్లల మనస్సుకలవాడినని కదా పెద్దన వద్ద పెద్ద బుద్ధులు నేర్చుకుందా మనుకుంటే ఆయన సుపుత్రుడి వలన చాలా నేర్చుకునేందుకు మాంచి అవకాశం కలిగినది. బొమ్మప్ప ఈ మధ్య తండ్రి మాట జవదాటని విధంగా కటకాదిసీమ నాయకత్వం వహిస్తూ ఓరోజు సమీప అడవికి వేటకు వెళ్లాడు. అక్కడ అతనికి ఓ బోయ యువతి కన్పించింది.


అసలే పెద్దనార్య బిడ్డ,చొక్కయామాత్యుని మనుమడు. ఋగ్వేద శాఖ, అశ్వలాయన సూత్ర వశిష్ట గోత్రుడు. ప్రవరాఖ్యుడంతటి అందగాడని ప్రతీతి. ఆ బోయ యువతి ఈ అందగాణ్ని చూసి ముచ్చటపడి “ఓయీ నీవెవరవు? నీ అందమైన మోములో నా ముఖం చూసుకునేంత బంగారుఛాయతో మెరిసి పడ్తున్నావు. నిన్ను వదిలి ఉండలేనే మో ! నేను నా భర్తను పిల్లలను విడిచి వత్తును. నీ పై మరులు గొంటిని కాదనకు” అని ప్రాధేయపడినది. అయితే, మన ప్రవరాఖ్యుడులా బొమ్మప్ప ఆమెను తూలనాడలేదు. విసిరికొట్టనూ లేదు.


రెప్పలు వేయకుండా ఆమెను చూస్తూ “ఓ వెన్నెల కలువా, నీవు, నీ అందం ఈ అడవి గాచిన వెన్నెల కావడం ఎంత దురదృష్టం. నీ ప్రేమమందిరంలోకి నన్ను ఆహ్వానించి నా జన్మ ధన్యం చేసావు. కావాలంటే నీ కోసం నా తల్లితండ్రిని, నాయకత్వం వహిస్తున్న కటకాదిసీమను వదులుకుని రమ్మంటే వస్తా ను.” అని ఓ చెట్టుతొర్రలో కాపురం పెట్టేసాడు. 


నాలుగు రోజులు తొర్ర లోంచి రాకుండా వరూధిని మాయా ప్రవరునిలా కేళీవిలాసా ల్లో మునిగితేలారు. బోయజాతివారు అడవంతా వెతికి వేసారి చివరికి చెట్టు తొర్రలో పకపకలు వికవికలు విని తలలు పైకెత్తి చూసారు. ఇద్దరూ ఒక్కటిగా కనిపించారు. చెట్టెక్కి ఇద్దరిని కిందికి దించారు. మనజాతి పరువు గంగపాలు చేస్తివని మండిపడ్డాడు బోయ పెద్ద. ఆమె తెగేసి చెప్పింది. ఈ బాపనయ్యను విడిచి ఉండలేను. నన్ను వదిలేయండి. దూరంగా ఏ కొండలకో కోనలకో పోవుదుము అని కాళ్లావేళ్లా పడింది. దాంతో బోయవారి మనస్సులు అగ్ని గుండాలయ్యాయి."


"ఏమిటి రామలింగా నువు చెప్తున్నది. మన పెద్దనార్య బిడ్డ గురించేనా ? అతడెంతో ఉత్తముడే" అని పింగళ సూరన ఆశ్చర్యాన్ని కనబరిచాడు.


“తమరే కదూ బొమ్మప్పను యవ్వనంలో ఉన్నా కనీసం ఆడవారివైపు చూడని కావ్య ప్రవరాఖ్యుడన్నది. ఆ మన్మధమొలక గురించే ముచ్చటిస్తున్నాం. పబ్బం గడుపు కోవడానికి ఇలా ముఖస్తుతిని మీ బోటి వారు నమ్ముకోవడం రాయలవారికి తప్పుడు సంకేతాన్ని ఇవ్వడం కాదా.” అని సూరనకు చురక అంటించాడు రామలింగడు.


“ఇక మన కథలోకి వద్దాం. ఎక్కడున్నాం ? ఓహో చెట్టు తొర్ర వద్ద ఉన్నాం. బొమ్మప్ప తక్కువ తినలేదు. ఈమెను నా నుంచి ఏ శక్తి విడదీయలేదు. అని ఉత్తరకుమార ప్రగల్భాలను పలికాడు. అప్పటికే చిర్రెత్తి పోతున్న బోయవారు చెడామడా కొట్టినెట్టి వేసారు. నేనెవరినో తెలుసా ? కటకాది సీమకు ఏలికను. తలచుకుంటే నా సైన్యం తో వచ్చి మీ అటవికులను రాచిరంపాన పెట్టగలను.” అని తాను బ్రాహ్మణుడునని మరిచి అలగాజన నాయకుడిలా కూసాడు.


“నువ్వు పెద్దనార్య బిడ్డవు కదూ ?” అని బోయవారు తెలుసుకుని బొమ్మప్పను కట్టి పడవేసి, అతడి వీరత్వాన్ని తుంగలో తొక్కారు. ఈ నీచపు కథ విన్న ఏడు మాసాలకు మా గురువు పెద్దన, నేను ఆ అడవికి పరుగులు తీసి పోతిమి. మా వేడుకోలును పది దినాలుగా వాయిదాలు పై విని చివరికి బొమ్మప్ప ప్రాణాలు తీయకుండా వదిలి ఆమెను అడవి బహిష్కరణ చేసారు. ఆ బోయ యువతికి నేను నచ్చజెప్పినా, ఆమెను బొమ్మప్ప వదలడు. 


“నా వాళ్లు నన్ను తరిమేసారు ఇక నీవే గతి” అని ఆమె బొమ్మప్ప వెంటపడింది. పెద్దన ఇంటి పరువు ఆ కుర్రకుంక ఈ విధంగా తుంగభద్రలో నిలువునా కలిపాడు." అని చెప్పాడు.


సభ అంతా నవ్వులమయమయ్యింది. 


" రామలింగా ! నీవు అలసాని పెద్దన పై కక్ష సాధింపులో ఉన్నావు. లేకుంటే బొమ్మప్ప పై ఏమిటి నీ అభియోగాల వెల్లువ. ఎవరూ నమ్మరుగాక నమ్మరు. చాలించు నీ కపట ప్రసంగం!"అని కోపాన్ని ప్రదర్శించాడు ముక్కుతో పలికే నంది తిమ్మన.


"ఒహో తిమ్మనవారా, ఆనాడు ఏమన్నారు ? బొమ్మప్ప గుణసంపన్నుడు, పెద్దలయందు గౌరవంగా మెలిగేవాడని మన ఏలికకు చెప్పారు. ఈరోజు ఈ సభలో నేను నిజాలను నిక్కచ్చిగా ఎందుకు చెప్పాల్సివచ్చిందో తెలుసా ? బొమ్మప్ప అడవి బోయలని బతకనీయ నని హెచ్చరించడంతో పాపం ఆ బోయలు చక్రవర్తికి చెప్పేందుకు వస్తున్నారు. నేను చెప్పకపోయినా నిజాలు దాగవు. ఇక తమరు శెలవిచ్చినట్లు కపట ప్రసంగం అని అన్నారు. ఏది ఇక్కడే ఉన్న పెద్దన వారిని చెప్పమనండి. ఇంతటితో ఆపేస్తాను.” రామలింగడు సవాలు విసిరాడు.


అంతా పెద్దన వైపు చూసారు. బిక్కముఖం వేలాడేసుకుని కూర్చున్నాడు. అతడిని అలా చూడడం ఎంతమాత్రం ఇష్టపడని రాయలు ఏదో చెప్పటానికి పెదవి విప్పు తుండగా తిమ్మరుసు కనుసైగ చేసాడు వలదు అని. ముక్కుతిమ్మన ఏమీ పాలు పోక అయోమ యంగా చూస్తూ కూర్చున్నాడు.


“మిగిలిన శేషాన్ని విపులంగా చెప్పనా ? లేక చాలించనా ?” సభలోని వారిని గుచ్చిగుచ్చి అడిగాడు రామలింగడు.


“మంచి రసపుష్టిలో ఉంది కథ! వదలొద్దు. మొత్తం వివరించండి.” ఎలుగెత్తారు సభికు లు. సభంతా నవ్వులతో నిండిపోయింది. రాయలు తదేకంగా రామలింగని వైపు చూపులు నిలిపాడు. తాతాచార్యులు ఏదో నమ్మలేని నిజాన్ని విన్నట్లు వినసాగాడు.


తిమ్మరుసు మెలి తిరిగిన మీసాలను దువ్వుకుంటూ “ఈ కవి గొప్ప మేధాసంపత్తి గలవాడు. ఇటు రాజలోకాన్ని, అటు 

పండితులకు పామరులకు చెవులారా తన హాస్యాభిషేకంతో మంచు ముద్దలను చేయుచున్నాడు అని అనుకున్నాడు.

👳‍♀️

 *సశేషం*

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

*కథల 

*తెనాలి రామకృష్ణ -  14*

👳‍♀️


*పండితపుత్ర..... శుంఠ - 4*


“అనునిత్యం రాయలు యుద్ధాలతో అలసి నందున ఇట్టి చతురత చూపే కవి దొరకడం ఓ గొప్ప వరం " ఆ మాటలను మెల్లగా అంటే విని ఆ పక్కనే ఉన్న కొత్వాలు రాయలు కను సైగతో వెళ్లి తిమ్మరుసు మాటలను చెప్పాడు. రాయలూ తలపంకించాడు. 


"అప్పాజీ నిజమే! గొప్ప వినోదమే!!" 


రామలింగడు తిరిగి తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. "ప్రభూ చెప్పాల్సింది ఉంది. కొంత ఓపిక కనబరచండి. తమరేమో బొమ్మప్పకు పెక్కు కావ్యము లను రాయమ న్నారు. అందుకు అతడు సరేనని దీవించమన్నాడు. అతడికి పొట్ట చించినా ఒక్క అక్షరం నిలువదని గురువులు మన అలసాని పెద్దనవారికి చెప్పకనే చెప్పారు. తండ్రి కదా తానుగా విద్య చెప్పేందుకు సిద్ధమయ్యారు. అంతలో పిడకలవేట. అదే బోయ యువతి కథనం. ఆమె నేరుగా పెద్దనార్య గృహానికి విచ్చేయడానికి సిద్ధమయ్యింది. బొమ్మప్ప కూడా ఆమె లేనిదే తను లేను అని ఒకటే సణుగుడు. 


కొడుకు ముద్దు చెల్లించాలి. పలురకాలుగా చెప్పి చూసాడు. మన తిమ్మన చెప్పినట్లు పెద్దలయందు గౌరవం లేశమైనా కనబరిస్తే కదా ! చివరికి  ఆమెని ఇంటికి తీసుకురాక తప్పలేదు. తీరా చచ్చీ చెడి తెచ్చాం. అదీ అగ్రహారంలోకి, చుట్టుపక్కలవారు వేయి కళ్ల తో చూస్తున్నారు. ఆ బోయ యువతికి చీర ధరించడం సరిగ్గారాదు. అదేదో బొమ్మప్పనే నేర్పమన్నాం. అతడికి విప్పడమేగానీ, కట్టడం రాదన్నాడు. పెద్దన వారి శిష్యుడను కనుక నేనే పెద్ద మనస్సు తో ఆ కట్టుకట్టడం నేర్పించాను. " చెప్పడం ఆపాడు. 


అలసాని పెద్దన తలదించుకుని గట్టిగా కన్నులు మూసుకున్నాడు. అప్పటికే పడి పడి నవ్వసాగారు సభికులు. రాయలు పంటి బిగువులో నవ్వసాగాడు.


"అయ్య కొద్దిగా నీళ్లు నా ముఖానకొట్టండి " అని కొత్వాలును అడిగాడు, క్షణాల్లో నీళ్లు వచ్చాయి. గటగటా తాగి హమ్మయ్యా! ఏం రస పట్టుకథ ఇది. మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. ఎంత వరకు వచ్చాం.” అని సభికులను అడిగాడు రామలింగడు. 


“అలసాని పెద్దనవారి పుత్రునికి చీర విప్పడమే వచ్చు అని చెప్పారు. మిగిలినది చెప్పండి "అని ఎలుగెత్తారు సభికులు.


ఈసారి తిమ్మరుసు అణుచుకోలేక పెద్దగా నవ్వాడు. 


“అసలే అగ్రహారం అన్నానుకదా! చుట్టు ప్రక్కల అమ్మలక్కలు ఏదో పని అంటూ రావడం మన బోయ యువతిని ఎగాదిగా చూసి “ఎవతె ఇది. ముఖం చూస్తే ఏ కొండ దానిలా ఉంది. కట్టుబొట్టు చూస్తే మనలా ఉంది. ఏదో కత ఇక్కడ జరుగుతోంది అని తెగ అనుమానం పడిపోతూ ఆరాలు తీయసాగారు. పెద్దనవారు ఆరాలు తీసే వారిని మభ్యపెట్టడం కూడా నా మీద వేసారు. తప్పదని ఆమె ఎగువదేశం నుంచి వచ్చిన కవయిత్రి అని ఆరాలు తీసిన వారితో బొంకా ను. వారు ఏదో నమ్మారు. కానీ మన బోయ యువతి బాపన తిండి రెండ్రోజులు తిన్నదో లేదో నాలుకపై చెట్లు మొలిచినట్టు మాంస భక్షణ వైపు దృష్టి నిలిపింది. మాట జవదాటని మిండెడు బొమ్మప్పను కోరింది. ఓస్ అదెంత పని అని ఏకంగా మూడు రకాల పచ్చి మాంసాన్ని తేవడం వండేయడం జరిగిపో యింది. ఆ ఇద్దరూ తిన్నాక మిగిలింది ఏం చేద్దాం అని ఆలోచించి చివరికి నన్ను అడిగారు తింటావా అని. నేను చెంపలు వేసుకున్నాను. ఈలోగా బోయ యువతికి తన గారాల పిల్లలు గుర్తుకురాగా ఎలాగైనా అడవికి వెళ్లి పిల్లలకు ఈ వండిన మాంసం కుడిపి వద్దాం అని మరో కోరిక కోరింది.


ఆమెతో అడవికి బయల్దేరాడు. అదీ ఆమెను పల్లకీలో కూర్చుండపెట్టి తను పక్కనే ఒదిగి కూర్చున్నాడు. పల్లకి కదిలింది. లోపల ఒకటే సరస సల్లాపాలు. పల్లకి మోస్తున్న బోయలు చెవులు రిక్కించి వింటూ అడవిలో ఒక చోట దించారు. పల్లకి దిగిందో వెళ్తుందో తెలియని పరిస్థితి లో మన బొమ్మప్ప ఉన్నాడు. " 


“అయ్యా ! నీ యవ్వారం చూస్తే మా మతులుపోతున్నాయి. మోయలేని పరిస్థితి ఎటు ఒరిగిపోతుందో తెలియదు. ఇక ఈ కొలువు చేయలేం. " అని చెప్పి వదలిపోయారు. ఆ దారినిపోయే దొంగలు పల్లకిలోంచి విన్పిస్తున్న వికవికలు పకపకలు విని, లోపలున్నవారిని బయటికి ఈడ్చుకువచ్చి వారి వద్ద కొద్దిపాటి నగలు లాక్కుని వెళ్లబోతూ ఓ వస్త్రంలో మూట కట్టబడిన మాంసం చూసి గతుక్కుమన్నారు. 


“ఏరా నువు చూస్తే బాపడిలా ఉన్నావు. దీనికి వేషం మార్చి దీనితో కులికినదే కాకుండా మా లాంటి పామరుడిలా ఈ జీవహింస తిండి ఏమిటిరా నువ్వే వండి చచ్చావా? భలే వాసన్లు దంచుతున్నాయి. నీలాంటి వాడికి ఇది తగనిపనిరా!” అని చావచితకగ్గొట్టి ఆ వండిన మాంసం ఆరగించి పారిపోయారు.”


సభ నవ్వులతో హోరెత్తిపోయింది, రాయలు కూడా ఏనాడు ఇంతగా నవ్వి ఎరుగడు. రామలింగడు అడుగడుగునా సమయస్పూర్తి ని చూపిస్తూ, తన ముఖ కవళికలను పలు రకాలుగా మారుస్తూ, చెప్తుంటే వినాలనే కుతూహలం రాయలు ప్రదర్శించాడు.


"ఏం బాదారురా దొంగనాయాళ్లు అన్నీ దోచుకుపోయారు. అయినా ఇలా చావ గొట్టడం ఏమిటి ? అబ్బ లేవలేకున్నాను. మెల్లగా చెయ్యి సాయం చెయ్యవా ! ప్రేయసీ !!" అని బొమ్మప్ప ఆమెను కోరాడు.


“అప్పటికి మాకు అంటే నాకు మన అలసాని పెద్దనవారికి వేగు అందింది. తిరిగివచ్చిన బోయలు చెప్పారు. అటవికులు ఈసారి బొమ్మప్పను ఆ అడవిలో చూస్తే వదలరు. చంపేస్తారు అని పెద్దన ఆయన భార్య ఒకటే గోల. తప్పదు నేను పెద్దన వెంటనే బయల్దేరాం. పల్లకి పక్కన కూలబడ్డ కొడుకును చూసి పెద్దన గుండెలు మీద చేతులు వేసుకున్నారు”


“బొమ్మప్ప మమ్మల్ని పట్టించుకోకుండా ఆమె కాళ్లు పట్టుకుని బతిమాలుతున్నా డు. ఆ మధ్య మన ముక్కుతిమ్మనవారు మోహనాంగి కాళ్లు పట్టుకున్నట్లు..ఆమె కోపంతో "వదలవయ్యా! పిల్లల నోటికాడ కూడు (వండిన మాంసం) రక్షించలేని వాడివి రేపు నన్నేం కాపాడతావు. చాలు నేను నా పిల్లల వద్దకే పోతాను" అని ఈసడించింది.


"నీవు లేకున్నా నేను బతకలేను. కావాలంటే నేను నా బంధువులు నీకు సపర్యలు చేయగలం. నన్ను వదిలి పోవద్దు. " అని బతిమిలాడాడు.


పెద్దన కొడుకును చూసి జాలిపడి “నాయనా పోనియ్యి దరిద్రం ఇలా అయినా వదిలిపోతుంది. నీకు భువన సుందరిలాంటి చక్కని చుక్కను తెచ్చి పెళ్లి చేస్తాను. దీన్ని పోనియ్యరా !” అని బొమ్మప్ప తల నిమిరాడు.


"నా వన మయూరి లేని జీవితం శూన్యం. మీరైనా దాని కాళ్లు పట్టుకునైనా వెళ్లకుండా వారించండి.” నీరసంగా గొంతెత్తి కోరాడు బొమ్మప్ప. అతడికి దొంగలు కొట్టిన దెబ్బల కంటే ఆమె ఎడబాటు నొప్పి ఎక్కువయ్యింది.


"ఎవరు ఎన్ని చెప్పినా వినను. మీతో ఉండలేను. మీ ఇళ్ళల్లో నన్ను కొండకోతిని చూసినట్లు చూస్తున్నారు. ఆ చప్పిడి పప్పు మెతుకులు, నేను తిని బతకలేను. నేను నా పెనిమిటి మరో అడవికి పోయి బతుకుతాం " చెప్పి ఊడ సాయంతో చూస్తుండగా అడవిలోకి తుర్రుమంది.


ఎలాగోలా బొమ్మప్పకు నచ్చజెప్పి పల్లకీలో పడుకోబెట్టి తేవాలనుకునేసరికి, బోయ జాతి వారు వస్తూ "మళ్లీ ఈ అడవిలో ఏం చేస్తున్నారు. ఆ వెలి వేయబడినది ఏది ? అని అడిగారు. జరిగింది చెప్పాను. వారు ఒక విధంగా సంతోషించారు. ఈలోగా బొమ్మప్ప పల్లకీలోంచి అరిచాడు. "నా అడవి సుందరిని నాకు అప్పగించండి. లేదా నా వెనుక ఉన్న జనాలతో వచ్చి మీ బోయజాతివారిని పాతరేస్తాను"  అని నోరుపారేసుకున్నాడు.


"ఈతని చేతిలో కొంత సైన్యం ఉంది. లేనిపోని పోరాటాలు ఎందుకు? రాయల వద్ద తేల్చుకుందామని వారు పల్లకీని స్వాధీనం చేసుకుని మా వెనుకనే వస్తున్నారు” అని మొత్తం పూసగుచ్చినట్లు చెప్పాడు రామలింగడు.


హర్షధ్వానాల మధ్య రామలింగడు కథ చెప్పాడు. అలసాని పెద్దన ముఖం కంద గడ్డలా అయిపోయింది.


సరిగ్గా అపుడే వచ్చారు బోయజాతివారు, వారితో బాటు పల్లకి ఉంది. అందులోంచి బొమ్మప్పను దించారు. 


"ఏలికా మమ్మల్ని సంపేత్తాను అని ఇప్పటికి చాలాసార్లు హెచ్చరిస్తున్నాడు. ఇతడి వెనుక కొద్దిపాటి పాలెగాళ్ళున్నారు. వారి అండ చూసుకుని ఈ బాపడు రెచ్చిపోతున్నాడు." అని నాగరికత తెలిసిన ఓ అటవిక యువకుడు రాయలకు వివరించాడు.


సభ నిశ్శబ్ధంగా మారిపోయింది. బొమ్మప్ప  దెబ్బలకు బాధపడ్తునే  "ప్రభూ వీరి మాటలను విశ్వసించకండి. వీరు శత్రువుల తో చేతులు కలిపేరకం ” అని ఇంకా ఏమెమో చెప్పబోతుండగా, తిమ్మరుసు మధ్యలో అందుకుని... 


“ఆపు నీ అభియోగం. ఓ పండితునికి సుపుత్రుడవై పుట్టి నీచంగా చరించడానికి నీకు సిగ్గులేదు. తలదించుకో " అని అతడికి అడ్డుకట్ట వేసాడు.


"ప్రభూ నన్ను చూసి నా పుత్రుడ్ని విడిచి పెట్టండి." అని వేడుకున్నాడు అలసాని పెద్దన. అతడి వంక అందరూ జాలిగా చూసారు.


“ఓ అటవికులారా భయపడకండి. పండిత పుత్రుడు లోకజ్ఞానం లేనందున ఇలా ప్రవర్తించాడు. ఈతని వలన ఏ భయం మీకుండదు. ఇక మీరు వెళ్లవచ్చు." అని చెప్పి రాయలు వారిని పంపేసాడు.


"రామలింగా.. ఈతనికి ఏ శిక్ష విధించమం దువు ?"


"ప్రభూ ఈతడు తల్లితండ్రుల పెంపకంలో అల్లారుముద్దుతనం వలన ఈ విధంగా తయారయ్యాడు. పెద్దనవంటి వారికి శోకం కలిగించే విధంగా తమరు ఏవిధమైన శిక్ష వేయకుండానే విడిచిపెట్టగలరని కోరుకుం టున్నాను." రామలింగడు వినయంగా కోరాడు.


“నాయన రామలింగా.. పెద్ద మనస్సుతో ఏలికను కోరావు. నాకీ వయస్సులో పుత్రుని వలన ఏలాంటి శోకాన్ని భరించలేను.”


"పెద్దనార్య.. మీపై నమ్మకంతో విడిచిపెడ్తు న్నాను. బొమ్మప్పలో మార్పును నాకు చూపాలి.” అన్నాడు రాయలు.


“తప్పకుండా ప్రభూ! నేటి నుంచి నాకదే పని. వాడిని యోగ్యుడిగా చూపగలను. దయతో విడిచిపెట్టినందున తమకు ఋణపడి ఉన్నాను.” అలసాని పెద్దన చేతులు కట్టుకున్నాడు.


" పెద్దనార్య ఈ రోజు నీ కొడుకు శిక్ష నుంచి తప్పించుకోవడానికి కారణం రామలింగడే. అతడు వేడుకగా బొమ్మప్ప గురించి చెప్పడం వలన సభ అంతా నవ్వుల మయం అయ్యింది. నా  జీవితంలో ఇంతగా నేను ఏ సందర్భంలో నవ్వలేదు. ఈ కారణంగానే బొమ్మప్పను విడిచి పెట్టాను. నవ్వులపాలయిన కథలో నాయకుణ్ణి ఎలా శిక్షించగలను.” 


రాయలు వివరణ ఇచ్చి రామలింగని వైపు తిరిగి " రామలింగా నీకు ముందే చెప్పాను. పెద్దనార్యలను ఏమాత్రం విమర్శించినా భరించలేను అని, నా మాటను నీవు ధిక్క రించినట్లుగా ప్రవర్తించావు. నీవు శిక్షకు పాత్రుడవు కాదా!” రాయలు తీక్షణ దృక్కు లతో అడిగాడు.


"నేను నోరు విప్పకుంటే ఆ అటవికులే చెప్పేవారు. వారి మాటలను వింటే తమరు బొమ్మప్పను మన్నించలేరు. ఇప్పుడు మన్నించగలనని నాకు మాటివ్వండి చెప్తా ను. విన్నాక మీలో పెనుమార్పులు రాకుండా ప్రశాంతంగా ఉండాలి.”


రాయలు భృకుటి ముడిపడింది. “నేను బొమ్మప్ప విషయంలో మునుపు ఇచ్చే తీర్పుకు కట్టుబడి ఉంటాను. ఇక చెప్పు.” 


"ఈ బొమ్మప్ప అటవికులపై దాడి చేస్తానంటే వారు తన్నితరిమేయగలరు. కానీ ఈతడు చాలా మోతాదులో ప్రేలాడు. రాయలు ఒక ఆడుదాని కోసం కొన్ని వేల క్రోసుల దూరం కటకం వరకు వెళ్లి కొన్ని నెలలు యుద్ధం చేసి ఎందరిచావుకో కారకుడైయ్యాడు. కోరినదాన్ని చేపట్టాడు. నేను ఆ రాయలవారి ఉప్పు పులుసులతో బతుకుతున్నవాడిని. నేను మీ అటవిక యువతి కోసం మీ జాతిని మొత్తం మట్టిలో కలిపేయగలను అని వారిని తీవ్రంగా హెచ్చరించాడు." 


ఈ మాటలను విని మీరు తట్టుకోగలరా? పాపం పండిత పుత్రుడు తెలిసీ తెలియని మాటలు ఆ బోయ యువతి మైకంలో ప్రేలాడు. ఆ అటవికులు చెప్తే ఘోరమైన శిక్షకు గురయ్యేవాడు. అందుకే అతన్ని రక్షించేందుకు ఇలా నవ్వుల గాథగా మలచి చెప్పాను.” అని ముగించాడు.


"రామలింగా నీవు చెప్పినది వింటుంటే ఒడలు గగుర్పాటు కలుగుతోంది. వినడానికి కష్టంగా ఉంది. బొమ్మప్పను తీవ్రమైన శిక్షకు గురిచేసేవాడ్ని. నీవు ఈ విధంగా అన్ని వైపులా ఏ ఇబ్బంది లేకుండా నీ సున్నితమైన చతురతతో మేలు చేసావు." అని మెచ్చుకుని.. 


" బొమ్మప్పా నీవు ఏనాడు నాకు ఎదురుప డవద్దు. నీవు పండితునికి పుట్టిన శుంఠవు కనిపిస్తే క్షమించను." అని పొమ్మన్నాడు. 


కవులంతా రామలింగని వలన బొమ్మప్పు రాయలు ఆగ్రహానికి గురికాకుండా కఠినశిక్ష తప్పించుకున్నాడు అని మూతులు కొరుక్కున్నారు.

👳‍♀️


 *సశేషం*

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

*

No comments:

Post a Comment