రోజూ రెండు కథలు.. ప్రాంజలి ప్రభ.. మల్లాప్రగడ.o2/సేకరణ
బ్రాహ్మణత్వం"
బ్రాహ్మణత్వము గురించి భీష్ముణ్ణి...ధర్మరాజు ఇలా అడిగాడు...!💐శ్రీ💐
పితామహా ! బ్రాహ్మణులు కాక ఇతరులు తాము చేసే గుణకర్మల వలన బ్రాహ్మణత్వము పొందవచ్చునా ! అని తన సందేహం వెలిబుచ్చాడు.
భీష్ముడు ధర్మనందనా ! బ్రాహ్మణత్వము పొందడం చాలా దుర్లభం.ఎన్నోజన్మలు ఎత్తిన తరువాత కాని బ్రాహ్మణజన్మ లభించదు.
ఈ విషయము గురించి నీకు ఒక ఇతిహాసము చెప్తాను విను. పూర్వము మతంగుడు అనే విప్రకుమారుడు ఉండే వాడు. అతడు తండ్రి ఆదేశానుసారము ఒక యజ్ఞానికి వెడుతున్నాడు.
దారిలో అతడు ఒక గాడిదపిల్లను కర్రతో గట్టిగా కొట్టాడు. ఆ గాడిద పిల్ల ఏడుస్తూ తనతల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పింది. ఆ గాడిద తన కూతురుతో అమ్మా ! ఇతడు చంఢాలుడు, క్రూరుడు అందుకే నిన్ను అలా కొట్టాడు అని చెప్పింది.
గాడిద మాటలను అర్ధము చేసుకున్న విప్రకుమారుడు ఆ గాడిద ఊరికే అలా అన లేదు. గాడిద మాటలలో ఏదో అంతరార్ధము ఉంది. లేకుంటే అలా ఎందుకు అంటుంది? అనుకున్నాడు. విప్రకుమారుడు ఆ గాడిద వద్దకు వెళ్ళి తన జన్మరహస్యము చెప్పమని అడిగాడు.
గాడిద విప్రకుమారా ! నీ తల్లి కామంతో ఒక క్షురకుని వలన నిన్ను కన్నది. కనుక నీవు బ్రాహ్మణుడివి కాదు అని చెప్పింది. ఆపై అతడికి యజ్ఞముకు వెళ్ళడానికి మనస్కరించక ఇంటికి తిరిగి వెళ్ళి తండ్రితో తండ్రీ ! నేను బ్రాహ్మణ స్త్రీకి క్షురకుడికి పుట్టాను కనుక నేను బ్రాహ్మణుడను కాను.
ఆ గార్ధభము ఏదో శాపవశాన ఇలా జన్మ ఎత్తి ఉంటుంది. లేకున్న ఈ నా జన్మరహస్యము ఎలా తెలుస్తుంది?. తండ్రీ ! నేను తపస్సు చేసి బ్రాహ్మణత్వము సంపాదిస్తాను అని చెప్పి మతంగుడు తపస్సు చేయడానికి అడవులకు వెళ్ళాడు.
మతంగుడు కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి ఇంద్రుడిని ప్రసన్నము చేసుకున్నాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై కుమారా ! నీవు తపస్సు ఎందుకు చేస్తున్నావు ? నీ కోరిక ఏమిటి అని అడిగాడు. మతంగుడు దేవా ! నాకు బ్రాహ్మణత్వము ప్రసాదించండి అని అడిగాడు.
ఇంద్రుడు కుమారా ! బ్రాహ్మణత్వము మహత్తరమైనది. ఇతరులకు అది లభ్యము కాదు కనుక మరేదైనా వరము కోరుకో అని అన్నాడు. మతంగుడు అయ్యా ! నా కోరిక తీర్చడం మీకు కుదరదు కనుక మీరు వెళ్ళండి. నా తపస్సు కొనసాగిస్తాను అన్నాడు.
ఇంద్రుడు వెళ్ళగానే మతంగుడు తన తపస్సు కొనసాగించి ఒంటి కాలి మీద మరొక నూరేళ్ళు తపస్సు చేసి ఇంద్రుడిని ప్రత్యక్షం చేసుకున్నాడు.
ఇంద్రుడు కుమారా ! నీ పట్టు విడువక ఉన్నావు! శూద్రుడు ఇలాంటి తపస్సు చేస్తే చస్తాడు జాగ్రత్త అని బెదిరించి అసలు బ్రాహ్మణత్వము ఎలా సిద్ధిస్తుందో నీకు తెలుసా !
ఇంతకంటేపది రెట్లు తపస్సు చేస్తే కాని ఒక చంఢాలుడు శూద్రుడు కాలేడు.
దాని కంటే నూరు రెట్లు తపస్సు చేస్తే కాని శూద్రుడు వైశ్యుడు కాలేడు.
దాని కంటే వేయిరెట్లు తపస్సు చేసిన కాని వైశ్యుడు క్షత్రియుడు కాలేడు.
దాని కంటే పది వేల రెట్లు తపస్సు చేసిన కాని క్షత్రియుడు దుర్మార్గుడైన బ్రాహ్మణుడు కాలేడు.
దానికంటే లక్షరెట్లు తపస్సు చేస్తే కాని దుర్మార్గుడైన బ్రాహ్మణుడు ఇంద్రియములను, మనస్సును జయించి, సత్యము అహింసలను పాటించి, మాత్సర్యము విడిచి పెట్టి సద్బ్రాహ్మణుడు కాలేడు.
అటువంటి సద్బ్రాహ్మణత్వము ఒక వంద సంవత్సరాల తపస్సుకు వస్తుందా ! చెప్పు అన్నాడు. ఒక వేళ బ్రాహ్మణ జన్మ పొందినా దానిని నిలబెట్టుకొనుట కష్టము.
ఒక్కొక్క జీవుడు అనేక జన్మల తర్వాత కాని బ్రాహ్మణజన్మ ఎత్తలేడు. అలా ఎత్తినా అతడు దానిని నిలబెట్టుకోలేడు. ధనవాంఛ, కామవాంఛ, విషయాసక్తితో సదాచారములను వదిలి దుర్మార్గుడు ఔతాడు.
తిరిగి బ్రాహ్మణజన్మ రావడానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది. అటువంటి బ్రాహ్మణజన్మ కొరకు నీవు తాపత్రయపడి నీ వినాశనము ఎందుకు కొని తెచ్చుకుంటావు. నీ కిష్టమైన మరొక వరము కోరుకో ఇస్తాను తపస్సు చాలించు అన్నాడు.
మారుమాటాడని మాతంగుడి మొండి తనము చూసి విసుగు చెంది ఇంద్రుడు వెళ్ళి పోయాడు. మాతంగుడు తిరిగి తన తపస్సు కొనసాగించాడు. కాలి బొటనవేలి మీద నిలబడి శరీరం అస్థిపంజరము అయ్యేవరకు తపస్సు చేసాడు.
అతడి శరీరము శిధిలమై పడిపోతుండగా ఇంద్రుడు పట్టుకున్నాడు. ఏమిటి నాయనా ఇది? పెద్ద పులిలా నిన్ను మింగగలిగిన బ్రాహ్మణత్వము నీకెందుకు? చక్కగా వేరు వరములు అడిగి సుఖపడు అన్నాడు.
మాతంగుడు అంగీకరించగానే ఇంద్రుడు నీవు చంఢదేవుడు అనే పేరుతో అందమైన స్త్రీల. పూజలందుకుని వారి వలన నీ కోరికలు ఈడేర్చుకుంటావు అని వరాలు ప్రసాదించాడు.
కానీ బ్రాహ్మణ జన్మను ప్రసాదించలేదు.
(భారతంలోని అనుశాసనిక పర్వంలోని కథ).
అటువంటి ఉత్కృష్టమైన, పరమ పవిత్రమైన బ్రాహ్మణ జన్మను కాపాడుకోవలసిన అవసరం బ్రాహ్మణులదే.
లోకా సమస్తా సుఖినో భవంతు..!!💐 💐శ్రీ మాత్రే నమః💐
****
రోజూ రెండు కథలు చదవండి... ప్రాంజలి ప్రభ..01/
*నాకు నచ్చిన కథ.. గుంటూరు
. చదువుతారు కదూ...* సేకరణ
**********
" నీలకంఠం ఉన్నాడు జాగ్రత్త" ********
"ఎవరండీ ఇంట్లో?" బైటనుంచి కేక వినపడింది.
"మనుషులు .... " అన్న బదులు వినపడింది లోపలనుండి.
"ఒకసారి బైటకొస్తారా?" అడిగాడు ఆ వ్యక్తి.
"ఎందుకు?"
"మేం ఆదరాబాదరా పబ్లిక్ స్కూల్ నుంచి వచ్చామండి" చెప్పాడు బైటనున్న వ్యక్తి.
"ఎంతమంది వచ్చారు?" అన్నది లోపలి కంఠం.
"ఒక్కణ్ణే వచ్చాన్సార్" అన్నాడు బైట వ్యక్తి. అతడి కంఠంలో కొంచెం చిరాకు ధ్వనించింది.
"మరి 'బహువచనం'లో చెబుతావేరా శుంఠ" అన్నది లోపలి కంఠం.
బైట వ్యక్తి ఖంగుతిన్నాడు ఈ మాటకి. ఐనా అవసరం తనది కాబట్టి నిభాయించుకుని మళ్ళీ పిలిచాడు.
"పనేఁవిటి?" అన్నది లోపలి కంఠం.
"మీ ఇంట్లో పిల్లోళ్ళుంటే మా స్కూల్లో చేర్పిస్తారేమోనని అడగడానికి వచ్చాన్సార్ ...."
"పిల్లోళ్ళంటే ...." అడిగింది లోపలి కంఠం.
"పిల్లల్సార్ ...." బైట వ్యక్తికి ఏడుపొకటే తక్కువ.
"మరి పిల్లోళ్ళేంట్రా?"
బైటనుంచి ఎటువంటి సమాధానం రాలేదు.
"ఉన్నావా, పొయ్యావా?" అన్నది లోపలి కంఠం.
"ఉన్నా సార్ .... " దీనంగా పలికాడు బైట వ్యక్తి.
"మరి పలకవేఁ?" అన్నది లోపలి కంఠం.
"మీరొక్కసారి బైటకొస్తే మాట్లాడేసి వెళ్ళి పోతా సార్" అన్నాడు బైట వ్యక్తి.
"సరే .... " అంటూ బైటకొచ్చాడు లోపలి కంఠం తాలూకు వ్యక్తి.
"నమస్తే సార్ .... నా పేరు .... " చెప్పబోయాడు ఆ వ్యక్తి.
"నీ పేరుతో పనేఁవుంది? వచ్చిన పనేఁవిటో చెప్పు" అన్నాడు లోపలి నుండి వచ్చిన వ్యక్తి.
"సార్ .... నీలకంఠం గారంటే మీరేనా సార్?" భయం భయంగా అడిగాడు ఆ వ్యక్తి.
"ఐతే నీకెందుకు? కాకపోతే నీకెందుకు? వచ్చిన విషయం చెప్పు" అన్నాడు నీలకంఠం గారు అనబడే ఆ పెద్ద మనిషి.
"నేను ఆదరాబాదరా పబ్లిక్ స్కూల్ నుంచి వచ్చాన్సార్ .... "
"ఆ విషయం ఇందాకే అఘోరించావ్ .... విషయం చెప్పు" అన్నారు నీలకంఠం గారు.
"మీ పిల్లోళ్ళను .... సారీ .... పిల్లలను మా స్కూల్లో చేర్పించమని అడుగుదామని వచ్చాన్సార్ ...."
"మీ స్కూల్లో ఎమ్మెస్సూ, ఎమ్డీ ఉన్నాయా?" అడిగారు నీలకంఠం గారు.
"అవి మా స్కూల్లో ఉండవు సార్ .... "
"మరి మా అమ్మాయి ఎమ్బీబీయస్ చేసింది. ఇప్పుడు ఇంకా పై చదువులు చదువుతానంటోంది. మరి మా అమ్మాయి మీ స్కూల్లో చేరాలంటే అవి మీ స్కూల్లో పెట్టినప్పుడు వచ్చి కలు" అన్నారు నీలకంఠం గారు తాపీగా.
"అది కాదు సార్ .... మీ మనవడు, అదే మీ అబ్బాయి గారి అబ్బాయికి రెండెళ్ళి మూడో ఏడు వచ్చిందని తెలిసింది సార్ .... మా స్కూల్లో ప్రీ నర్సరీ నుండి టెన్త్ వరకు ఉందీ సార్ .... ప్రీమియమ్ గోల్డ్ స్కీమ్ లో చేర్పిస్తే మొత్తం కలిపి పదిహేను లక్షలు ప్యాకేజీ సార్ .... ఒకేసారి కడితే టెన్ పర్సెంట్ కన్సెషన్ కూడా ఉంటుంది సార్ .... గోల్డ్ స్కీమ్ కూడా ఉంది సార్ .... ఈ స్కీములో అయితే ఇయర్లీ లక్షన్నర కడితే చాలు సార్ .... యూనిఫామ్, బుక్స్, స్టేషనరీ అన్నీ మా దగ్గరే ఉంటాయి సార్ ...." చెప్పుకుంటూ పోతున్న ఆ వ్యక్తికి నీలకంఠం గారు అడ్డం పడ్డారు.
"మీది స్కూలా? స్టేషనరీ షాపా?"
"అదేంట్సార్ అలా అడిగారు?" అన్నాడు ఆ వ్యక్తి.
"మరి స్కూల్లో పాఠాలెలా చెబుతారో ఏడవకుండా మిగతావన్నీ చెబుతావేరా అక్కుపక్షి?" అన్నారు నీలకంఠం గారు.
ఆ మాటకు ఆ వ్యక్తి మొహం చిన్నబుచ్చుకున్నాడు.
"నువ్వు ఆ స్కూలుకి మార్కెటింగ్ మేనేజరువా?" అడిగారు నీలకంఠం గారు.
"కాదు సార్ ...."
"మరి ....?"
"నేను ఆ స్కూల్లో సైన్సు టీచర్ని సార్. కనీసం ఐదుగురు పిల్లల్ని చేర్పిస్తేనే ఈ సంవత్సరం నా ఉద్యోగం ఉంటుంది సార్ .... లేకుంటే తీసేస్తారు సార్" అంటూ దీనంగా మొహం పెట్టాడు ఆ వ్యక్తి.
"ఏం చదివావ్?" అడిగారు నీలకంఠంగారు. ఈ సారి ఆయన స్వరం పెడసరంగా కాకుండా అనునయంగా పలికింది.
"ఎమ్మెస్సీ ఫిజిక్స్ సార్ .... "
"మరి ఇలాంటి ఉద్యోగాలెందుకు? ఏవైనా పోటీ పరీక్షలు రాయొచ్చుగా?" అనడిగారు నీలకంఠం గారు.
"శక్తి లేదు సార్" అన్నాడావ్యక్తి.
"కుర్రాడివేగా, ఏమ్మాయరోగం?" అన్నారు నీలకంఠం గారు.
"శక్తంటే ఆ శక్తి కాద్సార్ .... ఆర్ధికంగా శక్తి లేదు" అన్నాడతను.
"ఓహో .... ఇంతకీ ఎమ్మెస్సీలో ర్యాంకొచ్చిందా?" అని అడిగారు నీలకంఠం గారు.
"ర్యాంకు రాలేదు కానీ 98 పర్సెంట్ వచ్చింది సార్ ...."
"ఐతే క్వాంటమ్ థియరీ గురించి చెప్పు" అనడిగారు నీలకంఠం గారు.
"క్వాంటమ్ థియరీ ఈజ్ ద బేసిస్ దట్ ఎక్ప్లైన్స్ ద నేచర్ అండ్ బిహేవియర్ ఆఫ్ మేటర్ అండ్ ఎనర్జీ ...." అంటూ చెబుతూ పోతున్నాడు ఆ వ్యక్తి.
"గుడ్ .... మీ స్కూల్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూలంత బాగా చెబుతారా? అడిగారు నీలకంఠం గారు.
"వాళ్ళ బాబులా చెబుతాం సార్ ...." అన్నాడు ఆ వ్యక్తి హుషారుగా, ఈయన సంతుష్టుడయ్యాడనే ఉద్దేశ్యంతో.
"ఐతే మా మనవడి 'బాబు'ని చేర్చుకోండి" అన్నారు నీలకంఠం గారు.
"మీ మనవడి బాబునా? అంటే?" అడిగాడతను అయోమయంగా.
"అదేనయ్యా 'వాళ్ళ బాబులా చెబుతాం' అన్నావు కదా, అందుకని వీళ్ళ బాబుని చేర్చుకోండి" అన్నారు నీలకంఠం గారు.
"సార్ .... ఏదో పొట్ట కూటి కోసం ఇలా ఇల్లిల్లు తిరిగి పిల్లల్ని చేర్చమని అడుగుతున్నాం సార్ .... మీరిలా జోకులెయ్యకండి సార్ ...." అన్నాడావ్యక్తి ఆవేదనగా.
"భలే వాడివయ్యా .... నేనేమీ జోకులెయ్యడం లేదు. నీలాంటి చాకులాంటి కుఱ్ఱాళ్ళను ఇలాంటి పనులకు వాడుకుంటున్న ఆ స్కూళ్ళను అనాలి వాళ్ళు చేసేది విద్య పేరుతో వ్యాపారం. ఆ వ్యాపారంలో కూడా దోపిడి. నీలాంటి కుఱ్ఱాళ్ళకు ఉద్యోగాలు రాక, పై చదువులు చదివే స్థోమతు లేక ఇలా వీళ్ళ చేతుల్లో పడి నలిగి పోతున్నారు. మీ జీవితాలు వ్యర్ధం చేసుకుంటున్నారు .... ఒక పని చేస్తావా?" అనడిగారు నీలకంఠం గారు.
"ఏంటి సార్ అది?" అనడిగాడు ఆ వ్యక్తి నిర్వేదంగా. పిల్లవాణ్ణి చేర్చమని అడగడానికి వస్తే ఈయన తనకే పనులు చెబుతున్నాడనుకుంటూ.
"నీలాగా ఎంతోమంది ఇలా ప్రైవేటు స్కూళ్ళలో మార్కెటింగ్ కమ్ సేల్స్ కమ్ టీచర్లుగా ఉన్నారు కదా?"
"ఔను సార్ ...."
"మీరే ఒక స్కూలు పెట్టుకుని నడపొచ్చుగా?"
"పెట్టుబడి ఎవరిస్తారు సార్? ఇప్పుడు అంతా ఖరీదైన యునిఫారాలు, లాప్ టాపులు, ఏసీ బస్సులు, ఏసీ క్లాస్ రూమ్సు .... పేరెంట్స్ కూడా అలాంటి ఖరీదైన చదువులవైపే మొగ్గు చూపుతున్నారు సార్ .... "
"మరి ఖరీదైన మనుషుల దగ్గరకెళ్ళక నా దగ్గరకెందుకొచ్చావ్?"
"అంటే మీ ఇంట్లో పిల్లోడు .... సారీ పిల్లవాడు ఉన్నాడని ...." నీళ్ళు నములుతూ చెప్పాడు ఆ వ్యక్తి.
"సర్లే .... మా వాడొక స్టార్టప్ మొదలు పెట్టాడు. వాళ్ళ పనల్లా మీలాంటి చుఱుకైన కుఱ్ఱాళ్ళను చేర్చుకుని కొత్త కొత్త విషయాల మీద పరిశోధనలు చెయ్యడం".
"ఏ సబ్జెక్ట్ మీద సార్ ....?" ఉత్సాహంగా అడిగాడు ఆ వ్యక్తి.
"నిన్ను ముందుగా ఇంటర్వ్యూ చేస్తారు. ఆ చేసేవాళ్ళు కూడా పెద్ద కంపెనీల్లో పనిచేసే సైంటిస్టులే. నువ్వు ఏ విషయంలో పట్టు కలిగి ఉన్నావో చూసి అందులో పరిశోధనలు చేయమంటారు. పరిశోధనలకు కావలసిన లేబొరేటరీలు అవీ వాళ్ళే ఏర్పాటు చేస్తారు. ఐతే పరిశోధనలు చేసిన తరువాత వచ్చే పేటెంట్స్ మీద హక్కులో వాళ్ళకు మీకు సగం సగం. నువ్వు చేసే పరిశోధన వల్ల ఎంత రాబడి ఉంటుందన్నది నీ తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. నీకు ఇష్టమైతే చెప్పు. ఇవాళే మా వాడితో మాట్లాడుతా" అన్నారు నీలకంఠం గారు.
"కానీ ప్రస్తుతం నా ఆర్ధిక పరిస్థితి అందుకు సహకరించదు సార్ ...." అన్నాడు ఆ వ్యక్తి.
"ఇప్పుడు నీకెంత ఇస్తున్నారు?" అనడిగారు నీలకంఠం గారు.
"పదిహేను వేలు సార్ .... అది కూడా ఒక నెల బకాయి పెట్టుకుని ఇస్తారు" చెప్పాడతడు.
"మా వాడి కంపెనీలో సెలెక్టైతే నెలకి యాభై వేలనుండి లక్ష వరకు స్టైఫండ్ ఇస్తారు .... నువ్వు చేసే పరిశోధనని బట్టి, ఐదారు సంవత్సరాలు కూడా ఇస్తారు. ఈ లోగా నీ పరిశోధనలు పూర్తి కావాలి. ఆలోచించుకో" అన్నారు నీలకంఠం గారు.
"ఇప్పటికిప్పుడు మానేయాలంటే నేను రెండు నెలల జీతం ఎదురు కట్టాలి సార్ .... నా ఒరిజనల్ సర్టిఫికేట్స్ కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఇస్తారో, ఇవ్వరో సార్?" అనుమానంగా అడిగాడు ఆ వ్యక్తి.
"మీ స్కూల్లో పిల్లవాణ్ణి ఎండలో నిలబెట్టారని ఒక పేరెంట్ కేసు పెట్టాడు గుర్తుందా?"
"ఉంది సార్ ...."
"ఆ కేసు వాదిస్తోంది నేనే. కాబట్టి నీ సర్టిఫికేట్ల కేఁవీ ఇబ్బంది లేదు. రెణ్ణెల్ల జీతమూ కట్టనవసరం లేదు" అన్నారు నీలకంఠంగారు.
"ఆఁ .... ?" నోరెళ్ళబెట్టాడు ఆ వ్యక్తి.
"ఆఁ .... మా ఇంట్లో ఈగలెక్కువ. నువ్వు నోరు మూసేసుకుంటే మంచిది" అన్నారు నీలకంఠం గారు.
"సార్ .... నాకు ఈ విషయం సమ్మతమే. మీ విషయమే అర్ధం కాకుండా ఉంది" అన్నాడతను.
"ఏ విషయం?"
"అదే సార్ .... మా స్కూలుకి వ్యతిరేకంగా కేసు వాదిస్తూ మా స్కూలునుంచే సర్టిఫికెట్లు ఎలా పట్టుకొస్తారని డౌటు సార్?"
"చాలా సింపుల్ .... మీ లాయర్ తో మాట్లాడి .... "
"అంటే ....?"
"అర్ధం కాలేదా?"
"అయింది సార్ .... కానీ పేరెంట్ ఒప్పుకుంటాడా?"
"దేనికి?"
"మా లాయర్ తో మాట్లాడటానికి ...."
"పేరెంట్ తో మాట్లాడను. డైరక్ట్ గా మీ లాయర్ తోనే మాట్లాడతాను. నీ సర్టిఫికెట్లు నీకొస్తాయి. కేసు పోతుంది. అసలు ఆ పేరెంట్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కేసు పెట్టాడు. అంతే. అతడి ఇగో శాటిస్ఫై అవుతుంది. నా ఫీజు నాకొస్తుంది ...."
"సార్ .... ఇప్పుడు అర్ధమయింది బైట మీ నేమ్ బోర్డు అలా ఎందుకు పెట్టారో?" అన్నాడతను.
"సరే .... రెండ్రోజులు ఆగిరా .... నీ సర్టిఫికెట్లు నీ చేతిలో ఉంటాయ్" అన్నారు నీలకంఠం గారు.
ఆ వ్యక్తి నీలకంఠం గారికి నమస్కరించి బైటకు వెళ్తూ ఆయన నేమ్ బోర్డ్ వంక చూసి మరోసారి దణ్ణం పెట్టుకున్నాడు. ఎవరైనా 'కుక్క ఉన్నది జాగ్రత్త' అని బోర్డు పెట్టుకుంటారు ఈయనేఁవిటో ....
"నీలకంఠం ఉన్నాడు జాగ్రత్త"
అని పెట్టుకున్నాడు అని ఆశ్చర్యపోతూ ....
********************************** (సమాప్తం)
రచన : అధరాపురపు మురళీ కృష్ణ, గుంటూరు
*రోజూ రెండు కథలు.. ప్రాంజలి ప్రభ.. మల్లాప్రగడ.o3?
పురోహితుని ఆశీర్వాదం విలువ*
*ఒకరోజు ఒక కోర్టులో జడ్జి గారి ముందుకు ఒక కేసు వచ్చింది*
*ఫిర్యాదు దారుడు ఒకతను ఈ విధంగా ఫిర్యాదు చేశాడు....*
*"ఒక పురోహితుడు తను సంపాదించిన ధనానికి ప్రభుత్వానికి Tax చెల్లించడం లేదు. కావున తమరు విచారణ జరిపి అతని సంపాదన అక్రమ సంపాదనగా గుర్తించి అతనిని తగిన విధంగా శిక్షించగలరని మనవి."*
*జడ్జిగారు పురోహితునితో "మీరు ధనాన్ని అక్రమంగా సంపాదించారా లేక సక్రమంగా సంపాదించారా?" అని ప్రశ్నించారు.*
*దానికి పురోహితుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు....*
*"నేను సంపాదించినదంతయు సక్రమమే...*
*ఇసుమంతయు అక్రమం కాదు ."*
*"అయితే అంత ధనాన్ని సక్రమంగా ఎలా సంపాదించారో వివరించండి" అని జడ్జిగారు అడిగారు.*
*"అయ్యా ! ఒక రోజు ధనవంతులైన దంపతులిద్దరు ఆత్మహత్య చేసుకోవడానికి ఒక చెరువు వద్దకు వచ్చారు*.
*నేను ఆ సమయంలో సంధ్యావందనం చేస్తున్నాను*.
*ఆ సమయంలో వారు చేసుకోబోయే అకృత్యాన్ని చూసి వారించాను.* *'ఆత్మ హత్య మహా పాపం' అని వివరించి వారిని ఆ ప్రయత్నం నుండి విరమింప చేసి స్వాంతన కలిగించాను.*
*నా మాటపై విశ్వాసంతో వారు వెనుదిరిగి వెళ్లారు*
*కొద్ది రోజుల తరువాత నాపై గౌరవంతో వద్దన్నా వినకుండా కొంత ధనాన్ని ఇచ్చి 'ఆశీర్వదించండి'* *అని వేడుకున్నారు. అప్పుడు నేను 'సంతాన సిద్ధిరస్తు' అని ఆశీర్వదించాను.*
*కొన్ని సంవత్సరాల తరువాత వారికి కలిగిన సంతానాన్ని వెంటబెట్టుకొని ఆనందంతో నావద్దకు వచ్చి..*నా కుమారునికి మీ ఆశీస్సులు అందచేయండి. 'అని ప్రాధేయపడ్డారు.*
*దానికి నేను 'మీ పిల్లవాడు బాగా చదివి ప్రయోజకుడు అవుతాడు. మీకు మంచి కీర్తి ప్రతిష్టలు తీసుకొని వస్తాడు.' అని ఆశీర్వదించాను.*
*ఆ సమయంలో ఆనందంతో వారు మరికొంత ధనం ఇచ్చి వెళ్ళారు.*
*మరికొన్ని సంవత్సరాల తరువాత ఈ మధ్యనే ఆ ధనవంతుడు తన కుమారుడు ప్రయోజకుడాయ్యాడనే విషయం తెలియ జేయడానికి నా ఇంటికి వచ్చి ఆశీర్వాదం అడిగాడు.* *నేను ఆ దంపతులిద్దరిని 'ఆయురారోగ్య వృద్ధిరస్తు' అని ఆశీర్వదించాను.*
*అప్పుడతను తన వద్ద ఉన్న ధనంలో మరికొంత ధనాన్ని ఇచ్చి ఆనందంగా ఇంటికి వెళ్ళాడు.*
*అయ్యా! ఈ విధంగా నేను ధనవంతుణ్ణి అయ్యాను. నేను సంపాదించిన ధనము సక్రమమైనదో లేక అక్రమమైనదో తమరే తీర్పు ఇవ్వండి" అన్నారు.*
*పై విషయం అంతా సావధానంగా విన్న జడ్జి గారు ఈ విధంగా తీర్పు ఇచ్చారు...*
*"ఆరోజున ఆత్మ హత్య చేసుకోవాలనుకున్న ఆదంపతులను ఈ పురోహితుడు వారించకుండా ఉంటే వారికి తర్వాత జీవనం ఉండేది కాదు.* *కొన్ని రోజులకు వారు తమ తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో కృతజ్ఞతా పూర్వకంగా కొంత ధనం ఇవ్వడం పూర్తిగా ఆమోద యోగ్యమైనదే.* *ఆ ధనం సక్రమమైనదే.*
*అటుపిమ్మట కొన్ని రోజులకు వారు సంతానవంతులై పుత్రుడు పుట్టాడనే ఆనందంలో మరికొంత ధనం ఇచ్చారు.* *అదియును సక్రమైనదే !*
*మరికొన్ని రోజులకు కొడుకు ప్రయోజకుడాయ్యాడనే సంతోషంతో మరికొంత ధనం ఇచ్చారు. అది కూడా సక్రమమే.*
*మరియు ధనవంతుని శేష జీవితం ఆయురారోగ్యాలతో ఉంటుందని తెలుసుకొని ఆనందంగా జీవిస్తున్నారు.*
*ఈ విషయంలో ఎక్కడా పురోహితుని సంపాదన అక్రమమని తెలుపలేము." అని తీర్పు వెల్లడించారు.*
*ఈ సందర్భంలోనే జడ్జి గారు*ఇలా అడిగారు.*
*"అయ్యా ఇంత ధనాన్ని మీకు ఇచ్చి పుణ్యాత్ములైన ఆ ధనవంతులు ఎవరో తెలుసుకోవాలనే ఉత్సాహం తో ఉన్నాను.*
*వారు ఎవరో తెలుపగలరా?"*
*"ఆ పుణ్య దంపతులు మీ తల్లిదండ్రులే !" అని తెలియచేశారు పురోహితుల వారు.*
*వెంటనే దుఃఖంతో తను కూర్చున్న స్థానం నుంచి దిగి వచ్చి పురోహితునికి సాష్టాంగ నమస్కారం చేసాడు జడ్జి.*
*బ్రాహ్మణుడి ఆశీర్వాద బలం ఎంతో శక్తివంతమైనది !!!*
*వారిని చిన్నచూపు చూడవద్దు*
🙏🏻🙏🏻🙏🏻
రోజూ రెండు కథలు.. ప్రాంజలి ప్రభ.. మల్లాప్రగడ.o4?
55 ఏళ్ళ పైబడిన సీనియర్ సిటిజెన్స్ కు శుభాకాంక్షలు!
ఇంక చాలు తగ్గించండి (MINIMIZE):
1. ఉప్పు
2. చక్కెర
3. పిండి పదార్థాలు (బ్లీచ్డ్ ఫ్లోర్)
4. పాలు మరియు పాడి ఉత్పత్తులు
5. ప్రాసెస్డ్ ప్రొడక్ట్స్
మీరు తినదగ్గ ఆహార పదార్థాలు (FOOD NEEDED):
1. కూరగాయలు
2. పప్పులు
3. బీన్స్
4. గింజలు (నట్స్)
5. గుడ్లు
6. కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ (ఒలివ్, కొబ్బరి తదితరాలు)
7. పండ్లు
మరిచిపోవలసిన 3 విషయాలు (THINGS TO FORGET):
1. మీ వయస్సు
2. మీ గతం
3. మీ గొప్పలు
4. మీ సమస్యలు
5. మీ వితండవాదాలు
మరువకూడని ముఖ్య విషయాలు (ESSENTIAL THINGS TO CHERISH):
1. మీ కుటుంబం
2. మీ స్నేహితులు
3. మీ సానుకూల ఆలోచనలు
4. శుభ్రమైన మరియు ఆహ్లాదకరమైన ఇంటిని కలిగి ఉండండి
అభ్యసించాల్సిన 3 ముఖ్యమైన అలవాట్లు (THINGS TO ADOPT):
1. ఎప్పుడూ నవ్వండి / ఆనందంగా ఉండండి
2. మీకు తగ్గట్టుగా నిత్య శారీరక వ్యాయామం చేయండి
3. మీ బరువును నియంత్రించండి
చర్చించాల్సిన 6 జీవనశైలులు (LIFESTYLES TO PRACTICE):
1. దాహం వేసే వరకు నీళ్లు త్రాగడానికి వేచి ఉండకండి
2. అలసిపోయే వరకు విశ్రాంతి తీసుకోవడానికి వేచి ఉండకండి
3. అనారోగ్యం వచ్చేదాకా వైద్య పరీక్షలు చేయించుకోడానికి వేచి ఉండకండి
4. మిరాకిల్స్ కోసం వేచి ఉండకుండా దేవుడిపై విశ్వాసం కలిగి ఉండండి
5. మీ మీద నమ్మకాన్ని ఎప్పటికీ కోల్పోకండి
6. ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండండి మరియు మరింత మెరుగైన రేపటి కోసం ఆశపడండి
మీకు 55 - 90 సంవత్సరాల వయసులో ఉన్న స్నేహితులకు ప్రాంజలి ప్రభ
రోజూ రెండు కథలు.. ప్రాంజలి ప్రభ.. మల్లాప్రగడ.o5?
మన దేశంలో " *అశోక చక్రవర్తి* " *జయంతి* ఎందుకు జరుపుకోరు??
ఎంత ఆలోచించినా "సమాధానం" దొరకలేదు కదా! మీరు ఈ "*చారిత్రక విషయాలను* " కూడా పరికించండి!
# అశోక చక్రవర్తి తండ్రి పేరు - *బిందుసార గుప్త,* తల్లి పేరు - *సుభద్రణి* ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిత్రకారులు "గొప్ప చక్రవర్తి" అని పిలుచుకునే " *అశోక చక్రవర్తి* " యొక్క రాజ చిహ్నం "*అశోక చక్రం*" ను భారతీయులు తమ జెండాలో ఉంచారు.
# "చక్రవర్తి" రాజ చిహ్నం" *చార్ముఖి సింహం* "ను భారతీయులు *"జాతీయ చిహ్నం"* గా పరిగణిస్తారు మరియు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు మరియు *"సత్యమేవ జయతే"* ని స్వీకరించారు.
# అశోక చక్రవర్తి పేరు మీద ఉన్న సైన్యం యొక్క అత్యున్నత యుద్ధ గౌరవం *"అశోక చక్రం".* ఇంతకు ముందు లేదా తర్వాత ఇలాంటి రాజు లేదా చక్రవర్తి లేరు"...
# *"అఖండ భారత్"* (నేపాల్, బంగ్లాదేశ్, మొత్తం భారతదేశం, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్) యొక్క విస్తారమైన భూభాగాన్ని ఒంటరిగా పాలించిన చక్రవర్తి.
# అశోక చక్రవర్తి కాలంలో "23విశ్వవిద్యాలయాలు"స్థాపించబడ్డాయి.ఇందులో *తక్షశిల, నలంద, విక్రమశిల, కాందహార్* మొదలైనవి ప్రముఖమైనవి. ప్రపంచనలుమూలల నుంచి విద్యనభ్యసించడానికిఇక్కడికి వచ్చేవారు.
"చక్రవర్తి" పాలనను ప్రపంచంలోని మేధావులు మరియు చరిత్రకారులు భారతీయ చరిత్రలో అత్యంత " *స్వర్ణయుగ కాలం*"గా పరిగణిస్తారు.
"అశోకచక్రవర్తి" యొక్క పాలనలో భారతదేశం *"విశ్వ గురువు".* గా భాసిల్లిందిభారతదేశం "*బంగారు పక్షియై*" పరిఢవిల్లింది. ప్రజలందరూ సంతోషంగా మరియు వివక్ష లేకుండా ఉన్నారు.
వీరి హయాంలో అత్యంత ప్రసిద్ధ హైవే "*గ్రేడ్ ట్రంక్ రోడ్* " వంటి అనేక హైవేలునిర్మించబడ్డాయి.
*2,000 కిలోమీటర్ల* మేర మొత్తం "రోడ్డు"కి ఇరువైపులా చెట్లు నాటబడ్డాయి. "సరస్సులు" నిర్మించబడ్డాయి.
జంతువుల కోసం కూడా తొలిసారిగా " *వైద్యగృహాలు* "(ఆసుపత్రులు) ప్రారంభించ బడ్డాయి.చంపడం ఆగిపోయింది.
అలాంటి "*గొప్ప చక్రవర్తి అశోకుని*" జన్మదినాన్ని తన దేశమైన భారతదేశంలో ఎందుకు జరుపు కోలేదు??
లేదా ......*సెలవు దినంగా ఎందుకు ప్రకటించలేదు?*
ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవాల్సిన *పౌరులు* తమ చరిత్రను మరచిపోవడం బాధాకరం,
తెలిసిన వారు ఎందుకు జరుపుకోకూడదో తెలియడం లేదు??
# *గెలిచినవాడు చంద్రగుప్తుడు* అని కాకుండా *"గెలిచినవాడు అలెగ్జాండర్"* ఎలా అయ్యాడు??
*చంద్రగుప్త మౌర్యుని ప్రతాపం చూసి* అలెగ్జాండర్ సైన్యం యుద్ధానికి నిరాకరించిందని అందరికీ తెలుసు.
చాలా ఘోరంగా వారి నైతికత దెబ్బతింది మరియు
అలెగ్జాండర్ "*వెనుదిరగవలసి వచ్చింది* ".
ఈ "*చారిత్రక తప్పిదాన్ని* " సరిదిద్దడానికి మనమందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దాం.🙏
ఈ చారిత్రక నిజాల్ని కనీసం *ఐదు* గ్రూపుల కన్నా పంపుదాం🙏
# *కొందరు పంపరు*...
అయితే మీరు తప్పకుండా పంపుతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్న👍🏻
*వర్ధిల్లాలి భారతి యశస్సు*
*ఉప్పొంగాలి పునర్వైభవ తేజస్సు*
*భారత్ మాతాకీ జై* 🇮🇳
రోజూ కథలు.. ప్రాంజలి ప్రభ.. మల్లాప్రగడ.o6?
జీవితమంతా ఒక మాయ
*🍁మనం ఎంత గొప్ప వాళ్ళయినా...ఏదో ఒక రోజుకి మనం ఉన్న ఇల్లు,స్థలము,మనకి కావాల్సిన వారందరిని వదిలేసి వెళ్లిపోవాల్సిందే.మనకంటూ సంబంధించింది ఏది మనతో రాదు.ఈ మనుషులు.ఈ ఆలోచన..ఈ జీవితం.అంతా...మాయ సంకల్పం.కోరికలు ఉరవడిలో కొట్టుకుపోయే మనసుకి ఆలోచించే సమయం అసలే దొరకట్లేదు.*
*కొన్ని సంవత్సరాలు గడిచిపోయాక అదేంటి అప్పుడే నా జీవితమంతా అయిపోయిందా అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే జ్ఞాపకాలుగా మిగిలిన గుర్తులు మాత్రం ఉంటాయి.కొంతమంది స్వార్థపరులు మిగిల్చిన కన్నీరు మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం మనం పడిన కష్టం గుర్తుకు వచ్చిన ప్రతీ సారి గుండెను పిండేస్తూ ఉంటాయి.అవి మనకు తప్ప ఇంకెవరికి గుర్తుండదు.వారికి ఏదైతే అవసరమో దానికోసమే వాళ్ళ కోరుకున్నది జరిగేవరకు నీ చుట్టూ తిరుగుతూనే ఉంటారు..దాన్ని ప్రేమ,ఆప్యాయత అనుకుని పొరపడితే...ఆఖరికి బాధపడేది,గాయపడేది శూన్యమై మిగిలిపోఏది మనమే.మన అనుకున్న వాళ్లు మనలని ఏదో ఉద్ధరిస్తారనుకోవటం మన పిచ్చి,మన పొరపాటు.. మనసు పిచ్చిది అది సాగరంలా పరుగులు పెడుతూనే ఉంటుంది.*
*కోరికలు కెరటాలై ఎగసిపడుతూనే ఉంటాయి ఆ సముద్రాన్నికి కూడా ఆనకట్ట ఉన్నట్టే నీ ఆలోచనలకు కూడా ఒక అనకట్టు వేసుకో అందులో మంచి ఏంటో,చెడేంటో అన్నది విచక్షనతో నిర్ణయం తీసుకుని అడుగులు వెయ్యి.నీ జీవిత పయనంలో ఎంతమందిని చూసావో...ఎంతమందితో మాట్లాడావో....ఎన్నో వేల కోట్ల కిలోమీటర్లు దాటుకుంటూ ప్రయాణం చేసావో..నీకు తెలియని,నువ్వు చూడని వసంతాలే మున్నాయ్.రుతువులు ఎన్ని మారినా..మారని మన తలరాతలు అలానే ఉన్నాయ్.మన జీవితంలో కొన్ని ఇవ్వాలి ,మరికొన్ని తీసుకోవాలి.స్వార్థం ఉండొచ్చు.కోరికలు ఉండొచ్చు. మోసంతో కూడిన ప్రవర్తన ఉండకూడదు.లైఫ్ ఎండింగ్ ఎలా ఉండాలి అంటే మన చావుని చూసి ఆ స్మశానం కూడా కన్నీరు పెట్టేలా ఉండాలి.*
రోజూ కథలు.. ప్రాంజలి ప్రభ.. మల్లాప్రగడ... 10?
*ఆనం ద రహస్యం*
కొన్ని పనులు మనకు పుట్టుకతో వస్తాయి. కొన్ని మనం నేర్చుకోవాలి. నేర్చుకోవడంలో
ఆనందం ఉందన్న సంగతి మనందరికీ తెలుసు.
సీతాకోకచిలుకకు ఎగరడం మనం నేర్పక్క రలేదు. చేపకు ఈత నేర్పక్క రలేదు. ప్రకృ తితో మమేకమై జీవిం చే జీవులకు నేర్చుకునే బాధ లేదు. అవి సహజం గా వాటికి అబ్బు తాయి.
నేర్చుకోవడమన్నది మనిషికి అవసరం. కుండలు తయారు చేసేవాడు ఎంత నైపుణ్యంగా, శ్రద్ధగా, ఏకాగ్రతతో చేస్తాడో అలా ప్రతి మనిషీ ఏదో ఒకటి నేర్చుకోవడంలో పొందే ఆనందం అనుభవైకవేద్యం . నిజానికి ఆనందాన్నే సృష్టించడం నేర్చుకోవాలి. ఆనం దం బజారులో దొరికే వస్తువు కాదు. ఆనం దం మనమీద మనం చిలకరిం చుకునే పన్నీరు కాదు. అదో
సుగంధ ద్రవ్యమూ కాదు.
ఆనందం ఇతరులను ఆనందింపజేయడంలో ఉంది. తనను తాను మరచి ఇతరుల సం తోషం గురించి నిత్యం ఆలోచించడంలో నిజమైన ఆనందం ఉంది. ఇదే ఆనంద సృ ష్టికి కీలకం .
ఆనం దంగా బతకడంరాకపోతే మనిషికి సాటి జీవులతో కలిసిమెలిసి ఉండే అవకాశం దొరకదు. ఆనందంతోనే అతడు ప్రకృతికి దగ్గర కాగలడు. ఆనందంతోనే తన అంతరంగంలో
జ్యోతిస్సీమలను వెలిగిం చుకోగలడు. ఆనం దం మనిషికి దీపశిఖ సంచారిణి.
ఆనంద రహస్యం తెలుసుకున్న వాడు నిత్యం నవ్వు తూ, చలాకీగా నవ్వి స్తూ ఉంటాడు.
అందులో సందేహం లేదు. ఆనందాన్ని అపార్థం చేసుకున్న వాడే విషాదం వెంట తిరుగుతాడు.
ఈ విశ్వంలో మనం సరైన సంబంధాలు కొనసాగించాలంటే ఆనందమే పరమావధిగా జీవిం చాలి. ఎవరు ఎంత బాగా, తొందరగా దాన్ని తమ శరీరాల్లోకి వ్యాపింపజేసుకోగలరో వాళ్లకే ఈ బతుకు ఆహ్వానం పలుకుతుంది. ఆత్మదారి దొరుకుతుం ది.
తిరోగామిని చేసే విషాదం మూసిన తలుపు వం టిది. దాన్ని బాదుతూ కూర్చో కూడదు. అది తెరుచుకుందా... అడుగులేని గొయ్యి లాగా జీవితం నరకప్రాయమవుతుం ది.
ఆనందం కోసం బతికే మనుషులకు భగవంతుడు తప్పక సహాయంచేస్తాడు. సత్యం రుజువు చేసి, ఎందుకు విషాదంగా ఉండకూడదో అర్జునుడికి తెలియజేసిన శ్రీకృ ష్ణుడిలా మనకూ సహాయపడతాడు.
ఆనం దం మన జన్మహక్కు . ఆనం దం గా జీవిం చడం కోసం బతుకు రహస్యం తెలుసుకోవాలి. లేకపోతే జీవనం మొదటి పొర చూసి, అంతా విషాదమేనన్న భ్రమలోనే ఉం టాం .
నాచును తొలగిస్తే లోపల నిర్మలమైన నీరుంటుం ది. తెల్లవారిన వెంటనే సూర్యు డు
కనిపించడు. కొంతసేపు ఓపిక పట్టి నిరీక్షిస్తే తూర్పు ఎర్రబారుతుం ది. లోకమం తా వెలుగుతో నిండిపోతుం ది.
జీవించడం అయిపోయిన తరవాతా ఆనందం కనుగొనలేని మనిషి అసంతృ ప్తికి చిరునామాగా మిగులుతాడు. ఆనందంలో పుట్టి, ఆనం దం లో బతికి, ఆనందంలోనే లయమవుతున్నా యి జీవులు అంటున్నాయి ఉపనిషత్తులు. తనతోపాటు నిత్య మూ ఉం డే వస్తువుపై ఎరుక కలగడమే ఆనందం . ఆ ఆనందం తనకు సహజమైనది, చైతన్య వంతమైనది. అదే సత్యం కూడా.
దాన్నే ఆధ్యా త్మికవాదులు, వేదాంతులు ‘సచ్చి దానందం ’ అని పిలుస్తారు.
అది ఆకాశంలోను, నీటిలోను, అణువణువులోనూ ఉం ది. మనిషిలో మహత్తరంగా ఉంది. అటు దృష్టి పెట్టడంతోనే ఊటనీరు ఊరినట్లు హృదయం లో పెల్లుబుకుతుంది
****
రోజూ కథలు.. ప్రాంజలి ప్రభ.. మల్లాప్రగడ.o9?
ఒక్కోసారి వదిలేయడం కూడా తెలిసుండాలి !
కొందరు వ్యక్తులు, కొన్ని సంఘటనలు, లేదా ఆలోచనలు మన హృదయాన్ని గాయపరుస్తుంటాయి. అలాంటి సందర్భాల్లో వాటిని వదిలేయడం అవసరం. వదిలేయడం అంటే ఓడిపోవడం కాదు, అది మన ప్రశాంతత కోసం తీసుకునే మంచి నిర్ణయం.
🌱 వదిలేయడం వల్ల ప్రయోజనాలు:
మనసుకు తేలికపడ్డ అనుభూతి.
మన జీవితంలో కొత్త అవకాశాలకు చోటు ఇవ్వడం.
మన శక్తి, సమయాన్ని అవసరాలపై అవసరాలమీద కేంద్రీకరించగలగడం.
అందుకే, వదిలేయడం గర్వకారణంగా భావించండి. మీలో ఉన్న అసలు సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి ఇది ఒక కీలకమైన అడుగు అవుతుంది.
మీ మనశ్శాంతికి అడ్డుగా ఉన్నదానిని వదిలేయండి. హృదయానికి కాస్త శాంతిని, మనసుకు ప్రశాంతతని అందించండి 💫ఒక్కోసారి వదిలేయడం కూడా తెలిసుండాలి !
కొందరు వ్యక్తులు, కొన్ని సంఘటనలు, లేదా ఆలోచనలు మన హృదయాన్ని గాయపరుస్తుంటాయి. అలాంటి సందర్భాల్లో వాటిని వదిలేయడం అవసరం. వదిలేయడం అంటే ఓడిపోవడం కాదు, అది మన ప్రశాంతత కోసం తీసుకునే మంచి నిర్ణయం.
🌱 వదిలేయడం వల్ల ప్రయోజనాలు:
మనసుకు తేలికపడ్డ అనుభూతి.
మన జీవితంలో కొత్త అవకాశాలకు చోటు ఇవ్వడం.
మన శక్తి, సమయాన్ని అవసరాలపై అవసరాలమీద కేంద్రీకరించగలగడం.
అందుకే, వదిలేయడం గర్వకారణం
*****
రోజూ కథలు.. ప్రాంజలి ప్రభ.. మల్లాప్రగడ.o8?
**సైంటిస్ట్ లకు చుక్కలు చూపించిన దైవ లీలలు *****
ఇండియా అంటేనే మిస్టరీలకు పెట్టింది పేరు. భారతదేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు దర్శనమిస్తూనే వుంటాయి. అయితే వీటిలో కొన్ని మిస్టరీతో మిళితమై ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అలాంటి మిస్టరీలు ఇప్పటివరకూ వీడనే లేదు. మన దేశంలో ఎన్నెన్నో మిస్టరీలున్న దేవాలయాలు చాలా వున్నాయి. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత కలిగివుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
****మొదటగా శని శింగనాపూర్ ని చూద్దాం.
మహారాష్ట్రలో ఒక గ్రామం. ఈ వూరిలోని ఏ ఒక్క ఇంటికి కూడా తలుపులుండవు. అయితే ఇక్కడ దొంగతనాలు జరిగిన సంఘటన ఒకటి కూడా లేవు. ఒకవేళ దొంగతనం చేస్తే అక్కడ వుండే శనిదేవుడు.. శని రూపంలో శిక్షిస్తాడని భక్తులనమ్మకం. మరో విశేషం ఏంటంటే డబ్బులు దాచిపెట్టే బ్యాంకులకు కూడా ఇక్కడ వారు తాళాలు వేయరు.
****యాగంటి
ఆంధ్రప్రదేశ్ లోఇది ప్రసిద్ధిచెందిన క్షేత్రం. ఇక్కడ వున్న నంది విగ్రహం మిస్టరీ ఇప్పటివరకూ వీడనేలేదు. మొదట్లో చిన్నగావున్న నంది విగ్రహం రానురాను పెరుగుతూవచ్చి ఆలయప్రాంగణాన్ని ఆక్రమించుకుందని స్థానికులు చెబుతూంటారు. దీనికి సైంటిస్టులు చెప్పే మాట ఏమిటంటే.. ఆ రాయి పెరిగే స్వభావ గుణాన్ని కలిగివుందని, అందుకే ప్రతి 20 ఏళ్ళకు ఒక ఇంచు చొప్పున పెరుగుతూ ఉంటుందని అంటుంటారు. అయితే భక్తులనమ్మకం మాత్రం అది కాదు. యుగాంతంలో ఆ నంది పైకి లేచి రంకె వేస్తుందని అక్కడి భక్తులందరూ నమ్ముతూవుంటారు..
లేపాక్షి ***
ఆంధ్రప్రదేశ్ లోని ఆనంతపురం జిల్లాలో లేపాక్షి వుంది. ఇక్కడ వున్న స్థంభాలు చాలా మిస్టరీగా మిగిలిపోయాయి. ఈ ఆలయాన్ని 16 వ శతాబ్దంలో నిర్మించారు. ఈ స్థంభం క్రింద పేపర్ కానీ, క్లాత్ కానీ ఈజీగా పట్టించేయోచ్చు. అంటే స్థంభానికి కింద ఫ్లోర్ గ్యాప్ ఉంటుందన్నమాట. స్థంభం క్రింద ఫ్లోర్ ఏ సపోర్ట్ లేకుండా ఆలయాన్ని మోస్తుందని అర్థం. స్థంభం నేలని తాకకుండా ఆలయాన్ని ఎలా మోస్తుందో, ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేకపోయారు..
తంజావూరులో మిస్టరీ
****తంజావూరులోని బృహదీశ్వరాలయం ఇప్పటికి ఒక మిస్టరీగానే వుంది. దీనిని రాజరాజచోళుడు 11 వ శతాబ్దంలో నిర్మించాడు. ఈ ఆలయంలో రహస్యం దాగి వుంది. ఈ ఆలయంలో దాగిన రహస్యం నీడ. ఈ ఆలయపు నీడలు ఎవరికి కనిపించవు. సంవత్సరం పొడుగునా ఏ రోజు చూసినా.. సాయంత్రంవేళ ఆ దేవాలయం నీడలు భూమి మీద పడకపోవడంతో ఇది ఎవరికీ అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. అలాగే ఆ ఆలయానికుపయోగించిన గ్రానైట్ ను కూడా ఎక్కడ నుండి తీసుకోచ్చారనేది కూడా తెలియదు.
***పూరీజగన్నాథ్ ఆలయం
పూరీజగన్నాథ్ ఆలయంలో నీడ ఎలాంటి సమయంలో కూడా కనిపించదు. అంతేకాదు పూరీక్షేత్రానికి సమీపంలో బంగాళాఖాతం సముద్రం వుంది. ఆ సముద్రపు శబ్దంకూడా ఈ ఆలయంలోకి వినిపించదు. ఆలయ సింహద్వారం వరకూ సముద్రఘోష వినిపిస్తుంది. అది దాటి లోపలికి వెళ్తే శబ్దం అనేదే వుండదు. మరి ఆ టెక్నాలజీ ఏంటో కూడా అంతుచిక్కలేదు..
షోలాపూర్💐
మహారాష్ట్రలోని షోలాపూర్ మనం రోజూ ఉపయోగించే బెడ్ షీట్ లకు పెట్టిందిపేరు. ఇక్కడ ఒక వింత గ్రామం వుంది పేరు షెత్పల్.. ఈ గ్రామంలో పాములకు పూజ చేయటం ఆనవాయితీ. ఈ గ్రామంలో ప్రతిఇంట్లో పాములకు కూడా ఒక గదివుంటుంది. ప్రతి ఇంట్లో మనుష్యులు తిరిగినట్టే పాములు కూడా తిరుగుతూవుంటాయి. కాని ఇంతవరకూ ఆ గ్రామంలో ఏ పాము ఎవరినీ కరిచినట్టు కంప్లైంట్స్ కూడా లేవు. ఏమైనా పాము తిరుగుతోంది.. అంటేనే భయమేస్తోంది కదూ..
అమ్రోహా ***
ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహా షర్ఫుద్దీన్ షావిలాయత్ కు ప్రసిద్ధిచెందింది. ఈ పుణ్యక్షేత్రం చుట్టూ కాపలాగా ఎవరుంటారో తెలుసా? తేళ్ళు!! అవును.. ఇక్కడ ఆలయంలోపల.. చుట్టూ తేళ్ళు తిరుగుతూనే వుంటాయి. ఒకటికాదు, రెండుకాదు వేలసంఖ్యలో. అయితే ఇవి అక్కడకు వచ్చే భక్తులను కుట్టవు. వారు వాటిని పట్టుకుంటారు కూడా.
తుార్ప గోదావరి జిల్లా లోని దివిలి గ్రామంలో తిరుపతి అనే ఉరు ఉంది అక్కడ వేంకటేశ్వర ఆలయం ఉంది అది ఎవరు ఎంత ఎత్తిలో ఉంటే అంతే ఎత్తి లో కనిపిస్తుంది
***ఇలాంటి ఎన్నో మిస్టరీలు మనదేశంలో ఉన్నాయి. వీటి రహస్యాలు ఏంటి అన్నది మన శాస్త్రవేత్తలకు ఇంతవరకు అర్ధం కాలేదు. ఇప్పటికి అవి మిస్టరీగానే ఉండిపోయాయి......
***""సర్వేజనా సుఖినోభవంతు ****
No comments:
Post a Comment