Monday, 20 January 2025


సరదాగా నవ్వుకోవటానికి.😄

#భార్య భర్తల మీద ఏదన్నా ఒకటి రాయాలనుకున్నాను. 

భార్య, భర్తల మధ్య జరిగిన సంభాషణ మీ ముందు పెడతాను.

♦️భార్య: మీకు ఏమి పని లేదా? మొదట చాగంటి గారి మహా భాగవతం విన్నారు, అది అయిపోంగానే మాడుగుల వారిది విన్నారు, 

తరువాత గరికిపాటి వారిది, ఇప్పుడు సుందర చైతన్యానంద స్వామి వారిది. ఎవరు చెప్పినా అదే మహా భాగవతం కథ కదా!

 ఒకరిది వింటే సరిపోదా?

♦️భర్త: నువ్వు మినప్పిండి రుబ్బి మొదటి రోజు కొంచెం పిండిలో ఇడ్లీ రవ్వ కలిపి ఇడ్లీలు వేస్తావు,

 రెండో రోజు గారెలు, మూడో రోజు వడలు, నాలుగవ రోజు సాదా దోశలు, అయిదో రోజు కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లి దోశ, 

ఆరో రోజు పొటాటో కూర వేసి మసాలా దోశ, 

ఏడో రోజు ఇంత టొమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఊతప్పమ్, 

ఎనిమిదో రోజు అదే పిండితో గుంట పునుగులు, 

తొమ్మిదో రోజు పుల్ల మజ్జిగ కలిపి పుల్లట్లు వేస్తూ ఉంటే నేను 

రేపు అనేది ఉందో లేదో అని ఆత్రంగా తినటం లేదా!

వీటన్నిట్లో ఉన్నది మినప్పిండి అని తెలిసినా ఎంజాయ్ చేస్తున్నామా లేదా? 

♦️మహా భాగవతం కూడా అంతే! 

♦️చాగంటి వారు చెప్పేదాంట్లో భక్తి పాలు ఎక్కువ - అందుకు వినాలి, ♦️మాడుగల వారిది  ఎందుకంటే - ఆయన అమృత తుల్యమైన కంఠం లో పోతన గారి పద్యం వినటానికి,

♦️ గరికిపాటి వారు ప్రస్తుతo సమాజం లో జరుగుతున్న వాటిని మేళవిస్తారు కాబట్టి ఆయనది వినాలి, 

♦️చివరకు సుందర చైతన్యానందుల వారిది వినాలి - ఎందుకంటే  కలిపి కొట్టరా కావేటి రంగా అన్నట్టు ఆయన చెప్పే దాంట్లో పైన చెప్పినవి అన్నీ ఉంటాయి. 

♦️ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన పంథా. అన్నీ ఎంజాయ్ చేయాలి.

♦️భార్యకు ఏమి అర్థం కాలా. తను చేసే పనిని భాగవతం తో పోల్చి పొగిడారా లేక ఒకే పిండితో వారం రోజులు టిఫిన్ చేసి పెడుతున్నాను అని ఎత్తి పొడుపుగా అన్నారా! ఆలోచనలో పడింది.🤔

😃😀

*****

త్రివేణీ సంగమం - ప్రయాగ :

₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹

👉 భారతదేశంలోని పుణ్యక్షేత్రాల్లో ప్రయాగ ఒకటి. ఏడు మోక్షదాయక నగరాల తరవాత దివ్య పాపవిమోచన క్షేత్రంగా ప్రయాగ ప్రసిద్ధికెక్కింది. ప్రజాపతి బ్రహ్మ అక్కడ అనేక యాగాలు చేయడం వల్ల ప్రయాగ అనే పేరొచ్చిందని చెబుతారు. త్రివేణీ సంగమంలోని మూడు భాగాలను అగ్నిస్వరూప యజ్ఞవేదికలుగా భావిస్తారు. 

క్షేత్ర దర్శనానికి వచ్చే యాత్రికులు ఈ మూడు భాగాల్లోను భక్తి శ్రద్ధలతో స్నానం చేసి, ఒక్కొక్క రాత్రి బస చేస్తే త్రేతాగ్నుల ఉపాసనా ఫలం లభిస్తుందని విశ్వాసం. ప్రయాగరాజ అనే శబ్దాన్ని పలకగానే జీవుడు చేసిన పాపాలు భస్మమైపోతాయని, త్రివేణీ సంగమంలో స్నానం మోక్షప్రదమని భక్తులు విశ్వసిస్తారు. 

దానధర్మాలకు ప్రయాగ శ్రేష్ఠమైన భూమిగా పరిగణిస్తారు. ఎందరో రాజులు చక్రవర్తులు తమ సర్వస్వాన్నీ ఈ క్షేత్రంలో సమర్పించారని చెబుతారు. ఈ ప్రదేశంలో భరద్వాజ మహర్షి ఆశ్రమం ఉంది. వనవాసంలో సీతారామ లక్ష్మణులు ఈ ఆశ్రమాన్ని సందర్శించారని రామాయణం చెబుతోంది. భరద్వాజుడి విందు ప్రసిద్ధం. 

ఎప్పటికీ నాశనం కాకుండా కల్పాంతం వరకూ నిలిచి ఉండే అక్షయ వటవృక్షం ఇక్కడే  ఉంది. శంఖమాధవ, చక్రమాధవ, గదామాధవ మొదలైన 14 మంది మాధవులు విరాజిల్లుతున్న క్షేత్రం ఇది. తంత్ర చూడామణి ప్రకారం 51 శక్తిపీఠాల్లో ఒకటి ప్రయాగ. సతీదేవి చేతివేలు భూమ్మీద పడిన ఈ ప్రదేశంలో అమ్మవారిని లలితాదేవిగా పూజిస్తారు.

👉 కుంభ అనే సంస్కృత పదానికి తెలుగులో కుండ, కలశమనే అర్థాలున్నాయి. మేళా అంటే కలయిక, జాతర. సూర్యుడు, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు త్రయంబకేశ్వరంలో, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభమేళా జరుగుతుంది. బృహస్పతి వృషభరాశిలో సూర్యుడు మకరరాశిలో ఉన్నప్పుడు ప్రయాగలో, బృహస్పతి సూర్యుడు వృశ్చికరాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళా నిర్వహిస్తారు. 

క్షీరసాగర మథనంలో అమృతం లభించాక దేవతలు దానవులు దాన్ని చేజిక్కించుకోవటానికి పోరాటం చేస్తారు. విష్ణువు అమృతభాండంతో పారిపోతూ మార్గమధ్యంలో ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ అనే నాలుగుచోట్ల అమృత బిందువులు చిలకరించాడట

సాధారణ కుంభమేళా నాలుగేళ్లకోసారి జరుగుతుంది.

👉 అర్ధ కుంభమేళా ఆరేళ్లకోసారి ప్రయాగ, హరిద్వార్లలో జరుగుతుంది. పూర్ణ కుంభమేళా పన్నెండేళ్లకో పర్యాయం ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ లో నిర్వహిస్తారు. పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తయ్యాక 144 సంవత్సరాలకోసారి ప్రయాగలో మహా కుంభమేళా జరుగుతుంది.

👉 క్రీ.శ. 7వ శతాబ్దం నాటి హర్షవర్ధనుడి పాలనాకాలంలో చైనా బౌద్ధ యాత్రికుడు హుయాన్ త్సాంగ్ కుంభమేళాను ప్రస్తావించాడు. చారిత్రకంగా సముద్రగుప్తుడి దిగ్విజయాలను వర్ణిస్తూ హరిసేను రచించిన అలహాబాద్ శాసనం ప్రసిద్ధమైంది.

👉 ప్రయాగలో మాఘస్నానం అత్యంత పుణ్యప్రదమని పద్మపురాణం చెబుతోంది. ప్రయాగ క్షేత్ర మాహాత్మ్యాన్ని అగ్ని, మత్స్య, కూర్మ పురాణాలూ పేర్కొన్నాయి...!!

****

* ఓ ఉపాధ్యాయుడు, ఓ పోలీస్ అధికారి, ఓ బ్యాంక్ అధికారి ముగ్గురూ ఓ నౌకలో ప్రయాణిస్తున్నారు...

సముద్రం మధ్యకి నౌక చేరగానే ఒక సముద్ర రాక్షసుడు వారి ముందు ప్రత్యక్ష మయ్యాడు. మిమల్ని తినేస్తానని పెద్దగా కేకలు పెడుతున్నాడు.

ముగ్గురూ భయంతో వణికిపోతున్నారు. వారు భయపడటం చూసిన రాక్షసుడికి ఒక చిలిపి ఆలోచన వచ్చింది. వాళ్ళతో ఇలా అన్నాడు, మీ ముగ్గురూ మీకు తోచింది సముద్రంలోకి విసిరేయండి.

నేను తెచ్చి ఇస్తే గెలుపునాదే. వస్తువు తేలేకపోతే గెలుపు మీది వాళ్ళని వదిలేస్తాను. వాళ్లకు నేను జీవితాంతం బానిసగా ఉంటా నన్నాడు.

సరేనని ముందుగా బ్యాంక్ అధికారి తన చేతి వజ్రపుఉంగరం విసిరేశాడు.*
*సముద్రంలో మునిగి కాసేపటికి రాక్షసుడు ఆ ఉంగరాన్ని తెచ్చి ఆ  అధికారిని మింగేశాడు.

తరువాత పోలీసు  తన చేతికున్న ఖరీదైన వాచీని నీళ్ళలోకి విసిరేశాడు.

రాక్షసుడు సముద్రంలోకి దూకి దాన్నీ తెచ్చేసి అతన్ని మింగేశాడు.

ఇంక ఈ సారి ఉపాధ్యాయుడి వంతు వచ్చింది.

అతను కొంచెం యోచనచేసి తన దగ్గరవున్న నీళ్ళ సీసామూత తీసి అందులోని నీళ్ళను సముద్రంలోకి ధారగా పోశాడు. నా మంచి నీళ్ళను నాకు తెచ్చి ఇవ్వు అన్నాడు.

ఆ దెబ్బకి రాక్షసుడికి దిమ్మ తిరిగిపోయింది.

ఇది ఉపాధ్యాయుడి దెబ్బ ఎలావుంది? అన్నాడు రాక్షసుడితో*
*రాక్షసుడు తన ఓటమి ఒప్పుకొని అతనికి బానిసగా ఉండటానికి ఒప్పుకున్నాడు.

నా స్నేహితుల నిద్దరినీ బ్రతికించు అని ఆజ్ఞాపించాడు ఉపాధ్యాయుడు, రాక్షసుడు వాళ్ళని కక్కేశాడు.

మంచి పని చేశావు. ఇంక ఎవ్వరినీ యిలా బాధించకుండా ఉంటానంటే నిన్ను బానిసత్వంనుంచి విముక్తుడిని చేస్తానన్నాడు ఉపాధ్యాయుడు. రాక్షసుడు అలా చెయ్యనని ప్రమాణం చేసి సముద్రంలోకి దూకి మాయమయ్యాడు. ఎంతటి ఆపద వచ్చినా ఆలోచించేవాడు  ఉపాధ్యాయుడు

సమాజానికి సమస్య వస్తే తగు పరిష్కారం సూచించగలిగేవాడు గురువు... 🙏
******

No comments:

Post a Comment