తెనాలి రామకృష్ణ కథలు (5)
శ్రీ కృష్ణ దేవరాయిల్తో రామకృష్ణ కూడా సంచరించేవాడు.
అనేకమంది అనుయాయులు ఉండేవారు. ఒకసారి వారు పర్యటన చేస్తూ... విశ్రాంతి కోసం ఒక మారుమూల గ్రామంలో ఆగారు. రాజు రాక గురించి తెలుసుకున్న ప్రజలు ఆయనను దర్శించుకోవడానికి తండోపతండాలుగా వచ్చారు.
అక్కడ రామకృష్ణ కథలు చెప్పడం మెదలు పెట్టాడు, శ్రీ కృష్ణ దేవరాయలు నవ్వుకుంటున్నారు. అప్పుడే
వారిలో చిన్న పనులు చేస్తూ జీవించే నిరుపేద అయిన శర్మాజీ కూడా ఉన్నాడు. రామకృష్ణ కధలు విన్న శర్మాజీ ...రాజుగారికి ఆయనకు ఆతిథ్యం ఇవ్వాలనుకున్నాడు. అతను సమీపించి, ‘‘రాజా జీ! మీ దర్శనంతో నా జన్మ పునీతం అయింది. మీరు నా ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలి’’ అని కోరాడు.
ఆ కోరికను మన్నిస్తూ... శర్మా జీ ఇంటికి వెళ్ళారు. రొట్టెలు, పప్పు, అన్నం, పెరుగుతో సాధారణమైన భోజనాన్ని శర్మాజీ భార్య వడ్డించింది. రాజుగారు, రామకృష్ణ , ఆయన అనుయాయులూ సంతృప్తిగా భోజనం చేశారు. ఆ తరువాత శర్మాజీ దంపతులను ఆశీర్వదించి, తన బసకు వెళ్ళిపోయారు.
అదే గ్రామంలో మాలిక్ అనే సంపన్నుడు ఉన్నాడు. ఆ ప్రాంతానికి పాలనాధికారి కూడా అయిన అతను స్వార్థపరుడు, అహంకారి. ప్రజలను వేధిస్తూ ఉండేవాడు. కానీ ఏడాదికి ఒకసారి దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి పెద్ద ఉత్సవం నిర్వహించేవాడు. ఆ సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచీ తెప్పించిన అపురూపమైన పదార్థాలతో వంటలు చేయించి, సంతర్పణ జరిపించేవాడు. తమ ఊరికి రాజుగారు వచ్చినట్టు తెలుసుకున్న మాలిక్ ... తన ఇంటికి విందుకు రావాల్సిందిగా సేవకుడితో కబురు పంపించాడు.
‘‘నేను రాలేనని చెప్పు’’ అన్నారు రాజుగారు .
ఆ సేవకుడు భయపడుతూ ‘‘అయ్యా! నాతో మీరు విందుకు రాకపోతే నా యజమాని నన్ను తీవ్రంగా దండిస్తారు’’ అని చెప్పాడు.
ఒక్క క్షణం ఆలోచించిన చేసిన రామకృష్ణ రాజుగారు మీరు విశ్రాంతి తీసుకోండి ఆ విందుకు నేను వెల్లగలను అన్నాడు. భళా రామకృష్ణ వెళ్ళిరా మన ప్రజల ఆ తిద్యం చూడాలిగా అన్నాడు.
‘‘సరే, పద’’ అన్నారు.
భాగో ఇంట్లో రకరకాల వంటలను సిద్ధం చేశారు. రామకృష్ణను ఆహ్వానించి వడ్డించారు. అయితే ఒక మెతుకైనా ఆయన ముట్టలేదు.
అంతకుముందు రోజే శర్మాజీ ఇంటికి వెళ్ళి, కడుపారా భోజనం చేసినట్టు విని ఉన్నాడు. తన ఇంట ఆయన భోజనం చేయకపోవడం అవమానంగా భావించి, ఆగ్రహంతో ‘‘! ఇన్ని పదార్థాలున్నా ఏదీ మీరు ఎందుకు తినడం లేదు? ఇవన్నీ ఎంతో రుచికరమైన, ఎంతో ఖరీదైన పదార్థాలు. నిన్న తక్కువ జాతి వాడి ఇంట్లో తిన్న నాసిరకం భోజనం కన్నా ఇది తీసిపోయిందా?’’ అని ప్రశ్నించాడు.
‘‘ఎందుకు తినలేదో నీకు చూపిస్తాను’’ అన్నారు రామకృష్ణ అక్కడ ఉన్న వారిలో ఒకరిని పిలిచి... శర్మాజీ ఇంట్లోంచీ ఏవైనా పదార్థాలు తీసుకురమ్మని చెప్పారు. అలా తెచ్చిన వాటిలో రొట్టెను ఒక చేత్తో తీసుకున్నారు. మాలిక్ విందు భోజనం లోంచీ ఒక రొట్టెను మరో చేత్తో తీసుకున్నారు. వాటిని పిండడం మొదలుపెట్టారు. రొట్టె నుంచి పాలు కారుతున్నాయి. మాలిక్ రొట్టె నుంచి రక్తం చిమ్ముతోంది. అది చూసి అందరూ దిగ్ర్భాంతి చెందారు.
అయినా అహంకారం తగ్గని మాలిక్ ‘‘ఇంతకీ మీరేం చెప్పదలచుకున్నారు?’’ అని అడిగాడు వెటకారంగా.
‘‘శర్మాజీ కష్టపడి పని చేస్తున్నాడు. నిజాయితీగా సంపాదిస్తున్నాడు. అతని భార్య ప్రేమగా వండి, భక్తితో వడ్డించింది. ఆధ్యాత్మిక జీవనం గడిపే నాలాంటి వాడికి ఆ ఆహారం పాలలాంటిది. ఇక నీ ఇంట్లో నీ సేవకులు భయంతో వంట చేశారు. ఏదైనా పొరపాటు జరిగితే నువ్వేం చేస్తావోననే ఆందోళనతో వడ్డించారు. అందుకే నీ ఇంటి భోజనం నెత్తుటి కూడు. ప్రేమతో, భక్తితో పెట్టే ఆహారం... అమృతం లాంటిదని గుర్తించు’’ అని హితోపదేశం చేశారు
ఆ మాటలతో మాలిక్ కళ్ళు తెరుచుకున్నాయి. ఏడాది పొడుగునా ప్రజల్ని వేధిస్తూ, భయపెడుతూ... ఒక్క రోజు ఉత్సవాలు, విందులు చేస్తే దేవతలు మెచ్చరని గ్రహించాడు. ప్రతి ఒక్కరినీ సమానంగా చూడడం ప్రారంభించాడు. జీవితాంతం రామకృష్ణ చూపిన మార్గంలో పయనించి... మంచివాడనే పేరు తెచ్చుకున్నాడు.
తిరిగి వచ్చిన రామకృష్ణ తో శ్రీ కృష్ణదేవరాయలు విందు బాగుందా ఆని అడిగారు, బహుబావుంది ఒకరికి బుద్దిచెప్పాలిసి వచ్చింది. ఆ.. ఆ.. అంటూ నవ్వుకున్నారు అందరూ.
సశేషం.. (6)
తెనాలి రామకృష్ణ కథలు (6)
తెనాలి రామకృష్ణ ఒకనాడు విలువైన ఒక రాయిని తెచ్చి మహారాజు దగ్గరికి వెళ్ళాడు.
ఆ రాయిని మహారాజుగారికి సమర్పించి ఇలా అన్నాడు.......
" మహారాజా! ఈ రాయి చాలా ప్రత్యేకమైనది........ఇది మీదగ్గర ఉంటేనే
బాగుంటుంది." అన్నాడు.
రాయి చాలా బాగుందని రాజుగారు ముచ్చటపడి ఆ రాయి ను తీసుకుని కవి 🌹 కి 5000 వరహాలు
ఇచ్చాడు......అదిచూసిన మహారాణికి చిన్న రాయికి 5000 వరహాలు ఇవ్వడం నచ్చలేదు.
రాజుగారితో ఇలా అంది.
" మహారాజా! రాయి తెచ్చి ఇచ్చిన అతనికి 5000 వరహాలు ఇవ్వడం
నాకు నచ్చలేదు. ఆ రాయి ని ఇచ్చేసి ఆ వరహాలను వెనక్కు తీసుకోండి"
దానికి మహారాజు ఇలా అన్నాడు.
" ఒక రాయి తెచ్చింది మన రామకృష్ణ కవి కదా ఇచ్చిన కానుకను వెనక్కి
తీసుకోవడం మంచిదికాదు. ఆ ఆలోచన మానుకో "
కానీ రాణి ససేమిరా ఒప్పుకోలేదు. ఎలాగైనా వరహాలను వెనక్కు
తీసుకోవాలని రాజుగారిని ఒత్తిడిచేసింది. చేసేదేంలేక రాజుగారు
ఒప్పుకుని ఎలా వెనక్కుతీసుకోవాలో చెప్పమని రాణినే అడిగారు.
దానికి రాణి ఇలా అన్నది.
" రాయి లో బంగారమా .........వెండా ఆని అడిగి తెలుసుకోండి...వాడు బంగారం అంటే మాకు వెండి కావాలి అనీ............
కవి వెండి అంటే మాకు బంగారం
కావాలని చెప్పి తెలివిగా రాయి ని వెనక్కి ఇచ్చి వరహాలు వెనక్కు తీసుకుందాం "
రాజుగారు కవిని పిలిచి బంగారమా లేదా వెండిదా పిలిచి రాయి అని
అన్యమనస్కంగా అడిగాడు . దానికి కవి ఇలా సమాధానం ఇచ్చాడు.
" మహారాజా! బంగారం కాదు..........వెండి కాదు. చాలా వింతైన
రాయి కాబట్టే మీకు ఇచ్చాను "
ఆ సమాధానానికి మెచ్చి రాజుగారు మరొక 5000 వరహాలు ఇచ్చాడు
అలా ఇస్తున్నప్పుడు ఒక వరహా జారి కిందపడిపోయింది. దానికోసం
అతను వెదుకుతుండగా మహారాణి మళ్ళి ఇలా అన్నది.
" చూశారా! మహారాజా! వాడి పిసినారితనం.......లేకితనం..
మిమ్మల్ని ఎలా బురిడీ కొట్టించి మరొక 5000 వరహాలు
కొట్టేశాడు. అతన్ని అడగండీ"
రాజు గారు కవిని ఇలా అడిగడు " నీకు 10000 వరహాలు వచ్చాయి కదా!
మళ్ళీ కిందపడిపోయిన ఒక్క వరహా కోసం ఎందుకు అంతలా వెతుకుతున్నావు.?
దానికి కవి ఇలా సమాధానం చెప్పాడు .
" మహారాజా! నాకు , నా కుటుంబానికి సరిపడా సంపాదనను మీరే
నాకు కల్పిస్తున్నారు. అలాంటి మీరంటే చాలా గౌరవం మాకు.
ఆ వరహా మీద మీ రూపు ఉంటుంది కదా! పొరపాటునకూడా
దాన్ని ఎవరూ తొక్కడం నాకు ఇష్టంలేదు మహారాజా! అందుకే
ఆ ఒక్క వరహాను వెతుకుతున్నాను. క్షమించండి మహారాజా!
అది విన్న మహారాజు మరొక 5000 వరహాలు కానుకగా ఇచ్చి పంపించారు.
మహారాణి మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని తక్కువగా అంచనా
వేయకూడదు....... వారి తెలివితేటలు
ఉండవనీ......మనం .బాగా చదువుకున్నాము కాబట్టి బాగా తెలివి
తేటలు ఉంటాయని అభిప్రాయానికి రాకూడదు.కొంతమందికి
జీవితమే ఎన్నో తెలివితేటలను .......అనుభవాలతో కూడిన
శక్తి యుక్తులను ఇస్తుందని తెలుసుకోవాలి.
సభ ముగిసింది.
ఇంకా వుంది (7)
తెనాలి రామకృష్ణ కథలు (7)
సభ జరుగుతున్నప్పుడు శ్రీ కృష్ణ దేవరాయలకు అద్భుతక్షణాలు అంటే ఏవి?
వాటి గురించి వివరించు రామకృష్ణ
ఆ మాటలకు
అద్భుత క్షణాలు
మనిషి తొలిశ్వా స నుంచి తుదిశ్వాస వరకు జీవించే ప్రతిక్షణం అద్భు తమే. అనుక్షణం ఆనందాన్ని ప్రత్య క్షంగా అనుభవించగలగడం మహాద్భుతం .
భగవంతుడు మనిషి జీవన ప్రాంగణంలోకి అద్భుత క్షణాలను వర్తమానం ద్వారా నిరంతరం పంపుతూ ఉంటాడు. అవి అనుక్షణం మనిషి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. వాటిని అందిపుచ్చు కోవాలంటే మనిషి వర్తమానంతో అనుసంధానం కావాలి. అంతర్లీనం గా ఉన్న అనంత శక్తిని వెలికి తీయడానికి అద్భుత క్షణాలు సదా సంసిద్ధంగా ఉంటాయి. వాటిని గుర్తించడానికి ఒక్క క్షణం , రోజు, నెల, సంవత్స రం , దశాబ్దం , ఒక జీవితకాలం కూడా పట్టవచ్చు . దాన్ని సరైన సమయంలో గుర్తించి సద్వినియోగం చేసుకున్న వారే చరిత్ర సృ ష్టిస్తారు.
వెంటనే లోపల దాగి ఉన్న కవితాధార గంగాప్రవాహం లా ఉప్పొంగింది. మహాకావ్యా లను సృ జిం చి కవికుల గురువుగా ప్రసిద్ధిచెం దారు. కర్తవ్యం నెరవేరుతుంది.
ఆల్చిప్ప లో సరైన సమయం లో నీటి బిందువు పడటం అద్భుతం . తరవాత అది ముత్యంగా మారడం మరో అద్భుతం . నవమాసాలు మోసి ప్రసవ వేదనతో మరణపుటంచుల వరకు వెళ్ళి, బిడ్డను ప్రసవించిన క్షణం - మాతృమూర్తికి మరువలేని అద్భు తం . ఎన్నో వ్య య ప్రయాసలకోర్చి ఏడుకొం డలూ ఎక్కి , ఎన్నో కోరికలతో శ్రీవారిని దర్శిం చుకున్న క్షణం లో మనసు స్తబ్ధమవుతుంది. అప్పుడు కలిగే వాంఛారహిత శూన్య స్థితి అత్యద్భుతం . మొలకెత్తే లక్షణం ఉన్న విత్తనం భూమిని చేరిన తక్షణం అంకురించే దశ ఉద్దీపన కావడం అద్భుతం .
తద్వారా వందల నందన వనాలు రూపొందుతాయి.
వ్య క్తి తనలో ఉండే సానుకూల శక్తిని వెలికి తీసే క్షణాన్ని గుర్తిం చినప్పుడే వందలాది సత్సమాజాలకు సృ ష్టికర్త కాగలుగుతాడు.
హృదయ కుహరంలో దాగి ఉన్న శక్తి గురిం చి మీకు తెలిసింది చాలా తక్కు వ. అవధులు లేని సంద్రంలా మీలో అనంత శక్తి విస్తరించి ఉంది. దాని దివ్యత్వాన్ని జాగృ తపరచే అద్భుత క్షణాన్ని మీరు గుర్తిం చగలగాలి. అప్పుడే ఆ అనం త శక్తి మిమ్మల్ని విశ్వ విజేతల్ని చేస్తుం ది అన్నారు
అవకాశం
ఎంతోమంది క్రీడాకారులు కఠోర పరిశ్రమ అనంతరం పోటీల్లో పాల్గొంటారు. గెలుపును అం దుకునే తరుణం లో లక్ష్యం క్షణంలో వెయ్యో వంతు గురి తప్పి నా పసిడి పతకం పరాధీన మవుతుంది.
అదృ ష్టం తరచూ వచ్చి పోతూ ఉంటుం ది. కానీ అద్భు త క్షణాలు జీవితంలో ఒక్క సారే తలుపు తడతాయి. ఒక్క సారి ఆహ్వానించాక ఆపై ప్రవేశించే క్షణాలు ఉండవు. ఆహ్వా నించే వ్య క్తీ ఉండరు. తొలి అడుగే తుది అడుగు...అదే అద్భుతం మహారాజా
భలే వివరించావ్ రామకృష్ణ, నీకు నీవే సాటి, అందుకో బహుమతిమహా ప్రసాదం అంటూ అందుకొని విశ్రామించాడు రామకృష్ణ
సశేషం (8)
తెనాలి రామకృష్ణ కథలు (8)
ప్రజలే సుల్తానులపై యుద్ధం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నారు వారిని ఉత్తేజ పరిచేందుకు రామకృష్ణ యీ విధంగా పలికారు
మన కళ్ళు ఏమి చూడగలవో దాని గురించి, ఇది పరిమాణం లేదా సంఖ్యల గురించి. విశ్వంతో మానవాళికి ఉన్న సంబంధం గురించి (మనం పురాతనమైనది అని పిలుస్తాము) నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే.* మనమందరం ఒకే త్రాటిపై ఉండటం గొప్ప విశేషం.
మానవ సంబంధాన్ని మరియు మానవ విధి మరియు భవిష్యత్తుపై దాని భౌతిక మరియు ఆధ్యాత్మిక ప్రభావాన్ని సూచిస్తుంది.*
*దీనికి ఎటువంటి శక్తి నిర్మాణం లేదా రాజకీయ వ్యవస్థ లేదు. ఇది విశ్వాసానికి చెందినది. ఇది వ్యవస్థీకృత మతం గురించి కాదు. ఇది సోపానక్రమం గురించి కాదు.*
*(మన పాదాల కింద) వృక్షసంపద నుండి (పాలపుంతలో) నక్షత్రాల వరకు (విశ్వంతో మానవాళికి ఉన్న సంబంధాన్ని ధర్మం అర్థం చేసుకోవడం, అందరి లక్ష్యం.
ఏకో దేవ: సర్వభూతేషు గూఢ:
సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మా
కర్మాధ్యక్ష: సర్వభూతాధివాస:
సాక్షీ చేతా కేవలో నిర్గుణశ్చ
( శ్వేతాశ్వతర ఉపనిషద్/౭/౨)
అన్ని ప్రాణులయందు నిగూఢంగా దాగియున్న భగవంతుడొక్కడే. అతడే సర్వవ్యాపి.సమస్త ప్రాణులకు అంతరాత్మ. సమస్తకర్మలకు ఫలప్రదాత. సమస్త ప్రాణులకు అంతర్యామి. అన్నికర్మలకు సాక్షి. జ్ఞాన స్వరూపుడు. సజాతీయ విజాతీయ స్వగతభేదశూన్యుడు. అంటే అతనితో సమానమైన వాడు మరొకడు లేడు. అతని కంటే ఇతరుడు మరొకడు లేడు. అతనిలో ఎటువంటి విభాగము లేదు. అతడు గుణాతీతుడు. శుద్ధచైతన్య స్వరూపుడు.
ఆ దైవాన్ని
*ధ్యానం చేసే సాధువుల స్పృహ స్థలం మరియు కాలానికి అతీతంగా సరిహద్దులను చేరుకోగలగటం, ఇది నా విశ్వం యొక్క ద్వంద్వత్వం యొక్క భ్రమను విచ్ఛిన్నం చేస్తుంది.* ఇదే ఆ దైవం నడిపించిన మార్గం.
మన భౌతిక శరీరాలు మనవి కావు. మనం భౌతికంగా ఎక్కడికీ ప్రయాణించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం భౌతిక అనుభవాన్ని పొందుతున్న ఆత్మలమని అర్థం చేసుకున్న తర్వాత, స్థానికీకరించిన కణాల నుండి, మనం అనంతంగా, మొత్తంలో భాగంగా, ప్రతిచోటా ఉన్నాము, చిక్కుకున్న కణాలు ప్రదర్శించినట్లుగా; దూరం మరియు కాల అడ్డంకులు ఉనికిని కోల్పోతాయి. మనం స్వచ్ఛమైన స్పృహగా మారినప్పుడు; దైవిక కాంతిలో భాగం; కాలాతీతంగా మరియు నిరాకారంగా మారినప్పుడు.*
మనలో తెలియని ఉత్తేజం ఏర్పడుతుంది.
విస్తారమైన జ్ఞాన సముద్రంలో కలిసి పవిత్ర స్నానం చేసినప్పుడు కలిగే విస్మయం తో ప్రకృతితో అనుసంధానించబడి సహజస్థితిలో ఒకరికొకరు సహకరిస్తుంది దేశాసేవకు నడుంకట్టండి
* పాయసాన్నప్రియా* అంటూ అమ్మవార్ని తెలుస్తూ
పాయసము నందు ప్రీతి గలది. పాలతో వండిన అన్నమునందు ప్రీతి గలది.
అయితే కేవలము పాలు, బియ్యము కలిపి వండటంకాదు. పాయసమంటే....
తండులేషు క్షిపేత్ క్షీరం ద్విగుణం వా తదర్ధకం
అలాభే విన్యసే తోయం తస్యార్ధం గోఘృతం పరం
తందులాధాన్ భిన్నముద్దాన్ గుడం విన్యస్య పాచయేత్
నివేదయే త్తతో మంత్రీ పాయసాన్నం శివాయ చ ||
బియ్యం - ఒక శేరు
పాలు - రెండు పేర్లు
ఆవు నెయ్యి - అర్ధశేరు.
పెసరపప్పు - అర్థశేరు
బెల్లం - అర్థశేరు
ఈ రకంగా వండిన అన్నాన్ని పాయసము అంటారు.లెక్క ప్రకారంగా అందరికి అందేవిధముగా పాయసం తయారు చేసి దేశ రక్షణకు తోడ్పడే సైనికులను తయారు చేసాడు రామకృష్ణ.
పాయసం తింటూ అందరూ కార్యోన్ముకులైన్నారు.
సశేషం (9)
తెనాలి రామకృష్ణ కథలు (9)
రామకృష్ణ స్త్రీ గూర్చి నీ అభిప్రాయాలు తెలువు
*ఆడది ఏమి చేసినా తప్పే ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి*
*నవ్వితే అమ్మో ఆపిల్ల చూడండి బుద్ది లేకుండా ఎలా నువ్వుతుంది అంటారు కొందరు*
*ఏడిస్తే దరిద్రం ఎడవకూడదు అంటారు మరి కొందరు*
*నలుగురిలో కలిసిపోతే సిగ్గు ఎగ్గూ లేకుండా చూడండి ఎలా వుందో నలుగురిలో అంటారు ఇంకొందరు*
*నలుగురితో కలవకపోతే ముచ్చు మొహంది అస్సలు కలవదు అంటారు పెద్దలు*
*బయటకు వెళ్లి అన్ని పనులు చక్కబెట్టుకుంటే అమ్మో..అసాద్యురాలు అంటారు గిట్టని వారు*
*బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే చేతకానిది అసమర్థురాలు అంటారు బామ్మగారు*
*ఉద్యోగం చేస్తే మగరాయుడు అంటారు, చేయక పొతే భయస్తులంటారు*
*ఇంట్లో ఖాళీగా ఉంటే సోమరి, బద్ధకస్తురాలు, తిండి పోతు అనేవారు ఉంటారు*
*లక్షణంగా తయారయితే సోకులాడి అంటారు, మదమెక్కి తిరుగుతున్నావంటారు*
*చింపిరిగా ఉంటే మోటు మనిషి,,మొరటు మనిషి అంటారు, నాగరికం తెలుసుకోమంటారు*
*భర్తను ప్రపంచంగా భావిస్తే..రెండో పని లేదు మొగుడే ప్రపంచం అంటారు*
*భర్తను పట్టించుకోకుండా హద్దుల్లో ఉంటే దానికి పొగరు బెట్టు చేస్తుంది అంటారు*
*పిల్లల్ని త్వరగా కంటే ముసలిదయ్యింది అంటారు, యవ్వనమ్ పోతుందంటారు*
*లేటుగా కంటే..ఈలోపు కొన్ని నోర్లు గొడ్రాలు అంటారు*
*భర్త బయటకు వెళ్లెప్పుడు ఎదురొస్తే ఈవిడ ఎదురొస్తేనే తిరిగి వస్తారా అంటారు, అంతా మూఢ నమ్మకం యంటారు*
*భర్త బయటకు వెళ్లెప్పుడు రాకపోతే ఎప్పుడు పని పని,,దీనికి ఇంటి పని తప్ప మొగుడు ధ్యాస ఉండదు పాపం పొద్దునే వెళ్తే ఎప్పుడో రాత్రికి కదా వచ్చేది అంటారు*
*భర్త కోసం ఎదురు చూస్తుంటే ఎక్కడికి పోతారు రారా...అంటారు*
*ఎదురుచూడకపోతే వాడి జీతం మీద వున్న శ్రద్ధ మనిషి మీద ఉండదు అంటారు*
*పిల్లలకి భయం చెప్తే వామ్మో...అది తల్లి కాదు రాక్షసి అంటారు*
*ముద్దుగా గారాబంగా పెంచితే హద్దు లేకుండా పెంచుతుంది అంటారు*
*ఒక రూపాయి ఖర్చు పెడితే దుబారా అంటారు, స్వతంత్రం చెందావే అంటారు*
*దాచిపెడితే పీనాసి అంటారు, పిల్లికి బిచ్చం పెట్టదంటారు*
*స్వేచ్ఛగా గా మాట్లాడితే ఏది దాచుకోలేదు అంటారు*
*మౌనంగా ఉంటే కుళ్లు ఎక్కువ వ్యసన పడుతుంది అంటారు*
ఇవన్నీ_ప్రతి_ఒక్క_మహిళ_ఏదో_సమయంలో_ఎదుర్కొంటూనే_ఉంటుంది...
కాని_తానెక్కడ_కృంగిపోదు_ఎందుకంటే_స్త్రీ_కాబట్టి_మాతృమూర్తి_కాబట్టి...
గౌరవించక_పోయినా_పర్వాలేదు_బాధ_పెట్టవద్దు.
ఆడది లేనిదే మీరు లేరు మేము లేము ఈ జగతే లేదు అన్నాడు రామకృష్ణ
వెంటనే కృష్ణ దేవరాయలు లేచివచ్చి చక్కగా తెలియపరిచావు రామకృష్ణ అంటూ మేడలో హారం మేడలో హారం బహుమతిగా ఇచ్చారు. హర్షద్వానాలమధ్య.....
సశేషం (10)
నాలి రామకృష్ణ కథలు (10)*
*మన చుట్టూ అద్భుతాలతో పయనిస్తూ ప్రాణం ఉన్న
అద్భుతాలు తెలియ పరుస్తావా రామకృష్ణా అందరి ముందు అడిగారు శ్రీకృష్ణ దేవరాయల వారు.
*మన చుట్టూ ఉన్న 7 అద్భుతాలు* తెలియ పరుస్తాను.
1. *తల్లి*
మనల్ని ఈలోకానికి పరిచయం చేసిన వ్యక్తి,మనకు జననం ఇవ్వడానికి మరణం దాకా వెళ్లివచ్చిన తల్లి 1వ అద్భుతం!
2. *తండ్రి*
మన కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని తన కన్నీళ్లను దాచేస్తాడు.మన పెదవులపై చిరునవ్వును చూడాలని తన కష్టాలను దాచేస్తాడు.దుఃఖాన్ని తాను అనుభవిస్తూ,సంతోషాన్ని మాత్రమే మనకు ఇచ్చే తండ్రి 2వ అద్భుతం!
3. *తోడబుట్టిన వాళ్ళు*
మన తప్పులను వెనకేసుకురావాడానికి,మనతో పోట్లాడడానికి, మనకు నేను ఉన్నా అనే ధైర్యం ఇవ్వడానికి వచ్చే బంధమే వీళ్ళు.తోడబుట్టినవాళ్లు 3వ అద్భుతం!
4..*స్నేహితులు*
మన భావాలను పంచుకోవడానికి,మంచి చెడు అర్థం అయ్యేలా చెప్పడానికి, ఏది ఆశించకుండామనకు దొరికిన స్నేహితులు. 4వ అద్భుతం!
5. *భార్య / భర్త*
ఈ ఒక్క బంధం కోసం అన్ని బంధాలనుఎదిరించేలా చేస్తుంది. కలకాలం తోడు ఉంటూ ఇన్నిరోజులు తోడు ఉన్న అన్ని బంధాలకంటే,ఈ బంధం ఇంకా గొప్పదని నిరూపిస్తుంది.భార్య/భర్త అర్థం చేసుకునేవారు దొరికితే 5వ అద్భుతం మన సొంతం!
6. *పిల్లలు*
మనలో స్వార్థం మొదలవుతుంది.మన పిల్లలు బావుండాలని పదే పదే మనసు ఆరాటపడుతుంది.వారి ఆలోచనలే ఎప్పుడూ చుట్టూ ఉంటాయి. వారికోసం మాత్రమే గుండె కొట్టుకుంటూ ఉంటుంది.వారి కోసం ఏదో ఒకటి త్యాగం చేయని తల్లి తండ్రులు అసలు ఉండరు...
పిల్లలు..6వ అద్భుతం!
_*అన్ని అయిపోయాయి..
ఇంకా 7 అద్భుతం ఏంటా అని అనుకుంటున్నారా?*_
7. *మనవళ్ళు..మనవరాళ్లు*
వీరికోసం ఇంకా కొన్నిరోజులు బతకాలనే ఆశపుడుతుంది.వీరితో కలిసి ఆడుకోవడానికి వయసును మరిచి, అద్భుతంగా మళ్ళీ పసిపిల్లలం..అయిపోతాం.వీరు మన జీవితానికి దొరికిన.. 7వ అద్భుతం!
*ఇన్ని అద్భుతాలమధ్య తిరుగుతూ, అనుభవాలతో సృష్టికి ప్రతి సృష్టి చేసి
మరో అద్భుతాన్ని సృష్టించేద్దాం*
అన్నాడు రామకృష్ణ
అందరూ సంతోషాన్ని వ్యక్త పరిచారు.
సశేషం (11)
తెనాలి రామకృష్ణ కథలు (11)
ఏమిటో యీ రోజు అందరూ మౌనం పాటిస్తున్నారు. అన్నారు శ్రీ కృష్ణ దేవరాయలుగారు. ఎవ్వరూ కదలలేదు. అర్ధం కాలేదు. రాజుగారు అనుకుంటున్నారు ఎందుకీ మౌనం అనగా యీ విధముగా వ్రాసిన పత్రం అందించారు తెనాలి రామకృష్ణ
చదవటం మీదలుపెట్టారు మౌనంగా మహారాజు
మీ పెదవుల కదలికలు ఊహిస్తూ తెలిసికోలేని మౌనం
మీ చదవటాలు తలచుకుంటూ అర్ధం కాని మౌనం
మీ మాటలు వినపడినట్లు భావిస్తూ పరిశీలించ మౌనం
మీ ఆలోచనలు చెలరేగటం లో మౌనం
మీ గళాలు విచ్చుకోవటం వినలేక మౌనం
మీ స్పందనలు ఎరిగి సంతసించ లేక మౌనం
మీ మోములవెలుగులు దర్శించుతూ మౌనం
మీ మదులను దోచుకోవటం లో మౌనం
మీ మెప్పులను పొందుతూనే సుఖపడుతూ మౌనం
మీ ప్రోత్సాహానికి ప్రతిస్పందింస్తుండా లని అనుకుంటూ మౌనం
మీ అభిమానానికి ధన్యవాదాలు చెబుతూ మౌనం
మీ కోసమే కవితాప్రయాణం కొనసాగిస్తూ మౌనం
గుడ్డిగా రాయకూడదనుకుంటూ మౌనం
పిచ్చిగా ప్రేలకూడదనుకుంటూ మౌనం
వ్యూహత్మకంగా అక్షరాలనల్లాలనుకుంటూ మౌనం
పసందుగా పదాలనుకూర్చాలనుకుంటూ మౌనం
రుచిగా కవితావంటలు వండాలనుకుంటూ మౌనం
కమ్మగా కవనవిందులు వడ్డించాలనుకుంటూ మౌనం
మదికొక్కటే వినిపించే నిశ్శబ్ద ఘోష మౌనం
మౌనం అసమర్థత కాదు లౌఖ్యుల వివేచనలో మౌనం
మాట్లాడకుండడం కాదు మాట జారకుండుట మౌనం
మౌనం అంతరంగపు ఆంతర్యం తెలసిన నేస్తం తో మౌనం
కలహాలను కూల్చు అద్భుత ఆయుధం మౌనం
మౌనం మనసును వికసింపచేయు ఉత్ప్రేరకం గా మౌనం
బదులు దొరకని ప్రశ్నలకు సమాధానమే మౌనం
మౌనం ఎన్నో తపముల ఫలం భగవంతుడిచ్చిన అమూల్య వరం.అదియే మౌనం
మౌనానికి సంకేతం.. ప్రేమ, గౌరవం, సంతాపం.అప్పుడే గంట మ్రోగింది
ఏమిటి రామకృష్ణ సభలో వింత దర్శన
మహారాజా రోజూ ఎంతోమంది చనిపోతున్నారు, పేరుపేరునా చేప్ప లేంకనుక యీ 5 నిముషాలు మౌనం.
సశేషం (12)
తెనాలి రామకృష్ణ కథలు (12)
రామకృష్ణ స్వర్గం అనగా ఏమి? నరకం అనగా యేమి? దానికి ధనం అవసరమా? ఉదాహరణ తో వివరిస్తావా అని శ్రీ కృష్ణ దేవరాయలు అడిగారు.
వెంటనే కొంచం సేపు అలోచించి....
మానవుని జీవితం మూడు దశలు అనుకుంటే--
మొదటి దశ - గాడిదలా చాకిరి చేస్తారు.
రెండవ దశ - కుక్కలాగ కాపలా కాస్తారు.
చివరి దశ - గుడ్లగూబలా చూస్తూ ఉంటారు.
ఇది మనం ధ్యాన జీవితానికి అనుకరిస్తే --
మొదటి దశ - ఏ మారుమూల గ్రామానికైనా వెళ్లి ధ్యాన, జ్ఞాన ప్రచారం చేస్తారు.
రెండో దశ - తన దగ్గరికి వచ్చిన వారికి జ్ఞాన ప్రబోధాన్ని అందిస్తారు.
చివరి దశలో - సాక్షి తత్వంతో ఆత్మయుతంగా జీవిస్తారు.
“స్వర్గానికి ప్రవేశం ఉచితం, నరకానికి వెళ్లాలంటే బోలెడు డబ్బు ఖర్చుపెట్టాలి,” అన్నాను.
ఆశ్చర్యంగా రాజుగారు “అదెలా?” అన్నాడు.
చిన్నగా నవ్వి, ఇలా అన్నాడు రామకృష్ణ
.. “జూదం ఆడటానికి డబ్బు కావాలి, మత్తు పానీయాలు త్రాగడానికి డబ్బు కావాలి, సిగరెట్ త్రాగడానికి డబ్బు కావాలి, పాపాలతో పయనించడానికి డబ్బుకావాలి, ఇలా ఇంకా, ఇంకా .. గాడిదలా, కుక్కలా, గుడ్లగూబలా బ్రతకడమే జీవితం.
నరకానికి వేరే దారివెతక నక్కరలేదు.
కానీ, ప్రేమను పంచడానికి డబ్బు అవసరం లేదు, దేవుణ్ణి ప్రార్థించడానికి డబ్బు అవసరం లేదు, సేవచేయడానికి డబ్బు అవసరం లేదు, అప్పుడప్పుడు ఉపవాసం (ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం కోసం) ఉండడానికి డబ్బు అవసరం లేదు, క్షమించమని అడగడానికి డబ్బు అవసరం లేదు, మన చూపులో కరుణ, సానుభూతి, మానవత్వం చూపడానికి పెద్దగా డబ్బు అవసరంలేదు! స్వర్గానికి దారి కనబడుతుంది
దేవుడిపై నమ్మకం ఉండాలి, మనపై మనకు ప్రేమ, విశ్వాసం ఉండాలి, ఇప్పుడు చెప్పండి ..
డబ్బు ఖర్చు చేసి నరకానికి వెళ్ళడానికి ఇష్టపడతారా ? ఉచితంగా లభించే స్వర్గం సుఖభోగాలకు ఇష్టపడతారా ? ఆలోచించండి ..
సత్సంగత్వే నిస్సంగత్వం !
నిస్సంగత్వే నిర్మోహత్వం !!
నిర్మోహత్వే నిశ్చలతత్వం !
నిశ్చలతత్వే జీవన్ముక్తి: !!
సత్పురుషులు .. మార్గదర్శనం
సత్సంగత్యం .. సహవాసం
సత్ప్రవర్తన .. జీవించడం
మించి, ఈ భౌతిక ప్రపంచంలో ఇంకొకటి, మరొకటి లేదు ..
అంటూ ముగించాడు రామకృష్ణ
****
-
ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలతో.....
తెనాలి రామకృష్ణ కథలు (13)
రామకృష్ణా ప్రేమైక జీవనమ్ గురించి వివరించుమా అన్న కృష్ణదేవరాయుల పలుకులకు
తెలియపరిచాడు రామకృష్ణ ఈ విధంగా సరళంగా అందరికీ అర్ధమయ్యేలా
వృక్షానికి వేరుల్లా, దేహానికి తాపం ల్లా, దాహానిక దేహం ల్లా, హృదయానికి స్పర్శ ల్లా ఉండేది.
జగతికి సూర్యచంద్రుల్లా, జీవానికి హరిష డ్వర్గాలుగా, కాలానికి ప్రకృతిలా తోడుండేది.
మనిషికి మమతల హృదయం లా
జీవసృష్టికి కలయిక కధ ప్రేమ లా
మనసు యేకమై సహచర్య జీవితంలా ఉండేది.
చేతులు రెండూ కలిస్తే
కలిగేది చెలిమిలా
గాలికి ఆకురాలి మహితలంపై శబ్దంలా
అంతర్గత ఆత్మలు మమేకము నూతన ప్రక్రియకు మూలం లా ఉంటుంది.
రతి దేవిని మన్మధ దర్శన స్పర్శనాదికాలు సంభోగ సంతస మనస్తత్వo యేకమై య నుభవాల ప్రతిబింబ సృష్టి మూల మౌతుంది.
విరహ విదితమౌ ననురాగ మెరిగి ప్రియుడు
వేగ వచ్చి భాగ్యంబు లర్పించు నంచు
మరిచములు నేత్రముల నుంచి, పురవధూటి
ద్వార సీమ గూర్చుండి భాష్పాలు విడుచు
ప్రేమకు అక్షరాలు రెండు లక్షణాలు మెండు!
క్షేమము కోరియుండు క్షామమ్ము తొలగించు చుండు
ఆమని సౌలభ్యమ్ము ఆశ్రిత ఆరోగ్యమ్ము చూచు చుండు
కాముని లీల మాధుర్యముతో మనసు ఊయలూగుచుండు
నిలుచును నిండు నూరేళ్ళ జీవిత భాగ్యమై
ప్రేమతో ప్రేమను ప్రేమిస్తే అశాంతికి దూరమై
ప్రశాంతత చేకూరుటే జీవిత గమ్యానికి మూలమై
సముద్రంలో నడిపే నావగా మనశ్శాంతి చేరువై సాగుతుంటుంది.
దేశాల మధ్య యుద్ద భయాలు తొలగాలన్నా
విశ్వసౌబ్రాతత్వం వెల్లి విరియాలన్నా
నేటి సమాజంలో సంభవించే
అవాంచనీయ సంఘటనలు తోలగాలన్నా
మత సామరస్యము విస్తరించాలన్నా
ప్రేమ పంచి పొందుటే జీవిత శృంగారమౌతుంది
ప్రతిమనిషి మదిలో
మానవత్వం పరిమళించాలన్నా
సాటి మనిషిని ప్రేమతో పలకరించాలన్నా
ప్రేమతో ఆహ్వానిస్తూ
ప్రేమతో పులకిస్తు ఉండాలన్నా
ప్రేమను దేహాల మద్యగాక
హృదయాల మద్య ప్రజ్వలింపా లన్నా
ప్రేమైక జీవనానికి శ్రీకారం చుట్టాలి,
అదే అదే అందరికీ క్షేమ సంపదే యవుతుంది.
నీ వచన కవిత్వం తో అందరినీ అలరించావ్ ప్రేమ లోకాల్లో విహరింప చేసావ్
నీకు నీవేసాటి అన్నారు
సశేషం (14)
తెనాలి రామకృష్ణ - 14*
*దయ్యాల భవంతిని కొనుగోలు చేయుట
విద్యలనగరమైన విజయనగరంలో రామలింగ కవి తన భార్య ఇద్దరు పిల్లలతో రాయలు వారిచ్చిన ఓ సనాతన గృహంలో కాపురం పెట్టాడు. రాజాధిరాజు తలుచుకుంటే సౌక ర్యాలకు కొదవేముంటుంది.
ఇంటినిండా పప్పులు, బియ్యాలు, పట్టు వస్త్రాలు, అంగడికి పోయి ఏమైనా కొనుగోలు చేయాలనుకుంటే అందుకు పదింతలు ధనం సమకూర్చబడింది. తన కొత్త జీవితానికి తనే ఎంతో మురిసిపోతూ ఇంటి అరుగు మీద కూర్చున్నాడు రామలింగడు.
ఇంట్లోంచి కమ్మటి నేతి వంటకాల వాసనకు మైమరచి ముక్కుపుటాలు ఎగరేస్తున్న రామలింగడి చెవికి ఓ టముకు వినిపించింది.
"పురజనులకు ఓ ముఖ్య విన్నపం. అయ్యా! నగరంలో అతి పెద్ద నగల వ్యాపారి లింగిశెట్టి గారు తను ఎంతో ముచ్చటపడి నిర్మించుకున్న అత్యాధునిక భవనాన్ని అమ్మేస్తున్నార హో! కొనగల శ్రీమంతులు ఎవరైనాఉంటే ముందుకు రావచ్చు!" అని అరిచి చెప్తున్నాడు.
రామలింగకవి ఆ టముకువాడిని పిలిచి ఆరా తీసాడు. విషయం తెలిసివచ్చింది. ఈలోగా అతని భార్య లోపల నుంచి వచ్చి “ఇక్కడైనా కాస్తా బుద్ధిగా ఉండండి. ఏదో రాయలవారి ధర్మమా అని ఓ గొప్ప బ్రతుకుదారి దొరికింది. వీధి గుమ్మంలో కూర్చున్నారంటే నాకు చచ్చేటంత భయం. దారినపోయినవన్నిటిలో వేలు, చెయ్యి పెట్టకండి. నేను నా పిల్లలు అన్యాయం అయిపోతాం." అని నిష్ఠూరంగా పలికి చరచరా లోపలికి వెళ్లిపోయింది.
రామలింగడు హాయిగా నవ్వుకున్నాడు. ఆ సాయింత్రమే నగల వ్యాపారి ఇంటిని చూడడానికి వెళ్లాడు. అదో రాజభవనంలా ఉంది. చాలా ధనంతో నిర్మించబడింది. లింగిశెట్టి తనెందుకు అమ్ముతున్నాడో చెప్పాడు. విని రామలింగడు అంతులేని ఆశ్చర్యానికి గురయ్యాడు.
"అయ్యా! రామలింగకవిగారూ, ఈ ఇంటిని తమరు కొనలేరు. ఆరువేల వరహాలకు ఒక్క చిల్లిగవ్వ తగ్గించలేం. అయినను తమరు ఈ నగరానికి కొత్తగా వచ్చారు. ఇంకా సంపాదనలో లేరు. కొన్నాళ్ళు పోయాకగాని మీ వలన కాదు. రాయల వారి దయ పొందాలి " అని నసిగాడు.
“ఓ వర్తకుడా, నాకన్నివిధాల ఈ భవనం
నచ్చింది. ఈసరికే నాకు రాయలవారు చాలా ధనం ఇచ్చి ఉన్నారు. కనుక నాకు ఈ భవనాన్ని అమ్మినచో కొనుగోలు చేసుకొందును. ఇతరత్రా నీవాలోచించ తగదు. కొంత ధనం ఇప్పుడిచ్చివేయు దును. మిగిలినది ఒక్క నెల గడువులో పూర్తిగా చెల్లించగలను” అని రామలింగడు భవనం మొత్తం కలియతిరుగుతూ మరీ తన కోరికను తెలిపాడు.
“చూస్తే నావంటివాడవు. బ్రాహ్మనయ్యవు. ఈ ఇంట్లో ఎలా ఉండగలవు? అసలే దయ్యాలు, పిశాచాలు భవనాన్ని వదలకుండా పట్టి పీడిస్తున్నాయి అని పదే పదే నీకు కనుక అడగ్గానే చెప్పాను. నా మొత్తం కుటుంబం అరవై మంది వరకు ఉన్నాం. ఐనా ఏమీ చేయలేకపోయాం. ఎంతమంది భూత వైద్యుల్ని రప్పించినా
ఫలితం లేకపోయింది. చివరికి ఎంతో ముచ్చటపడి కట్టుకున్న భవనం ఇలా అమ్మదలిచాం. ఏ ఒక్కరం ఇకపై ఇక్కడ ఉండడానికి ధైర్యంగాలేం. భయభ్రాంతు లైపోయాం. కనుక సాహసించి కొనవద్దు. నిన్ను చూడగానే విషయం చెప్పానే మరి వినవేం ?" అని జాలిగా చెప్పాడు లింగిశెట్టి.
సశేషం.. (15)
**తెనాలి రామకృష్ణ - 15*
👳♀️
*పిలకపట్టుకున్నందుకు గుర్రాలు జరిమాన -1*
🐎🐎🐎
భారతదేశంలో పోర్చుగీసువారు 1498లో అడుగుపెట్టారు. ఆ వచ్చింది వర్తకం చేద్దాం అనే ఆలోచనతోనే కానీ, గోవాలో మకాం వేసాక తెలిసింది, భారతీయులలో పూర్తి స్థాయిలో అనైక్యత, ఈర్షాద్వేషాలు, ఒకరి పతనం ఒకరు కళ్లారా చూసుకుందామన్న తపన చూసాక వర్తకంతో బాటు అధికారం సంపాదించడం చాలా తేలికగా వారికి కనిపించింది. తొలుత వర్తకంలో భారతీ యులను దారుణంగా వంచించవచ్చని ఓ నిర్ణయానికి వచ్చారు.
ఆర్ముజ్ నుండి గుర్రాలను పడవల పై తెచ్చి అమ్మజూపారు. ఆ గుర్రాలు ఎత్తుగా మంచి
బలిష్టంగా ఆరోగ్యంగా కన్పించేసరికి చాలా మంది రాజులు వీటిపై మోజుపడ్డారు. ఆ నోట ఈ నోట విన్న విజయనగర చక్రవర్తి కబురంపాడు. ఆ గుర్రాలను కొనేసత్తా మాకే ఉంది. మాకే అమ్మండి. ఎంతకైనా కొంటాం ఎన్నైనా కొంటాం అని. వారికీ కావల్సింది రాయలవారితో స్నేహం... తద్వారా భారతదేశంలో అధికారం ఎలాగైనా సాధించాలి.
ఆలస్యం చేయకుండా వెంటనే ఒక దూతను పంపారు. మాకు సమ్మతమే. వాటి ధర ఇంత అని కబురుపెట్టారు..
ధర బాగుంది. కనుక మాకు సమ్మతమే అని మొత్తం ధనం ముందుగానే చెల్లించాడు రాయలు. ఆ దూత ధనం మూటతో తిరిగి వెళ్లిపోయాడు. ఇక ఆలస్యం చేయకుండా వెళ్లి గుర్రాలని తీసుకురావాలి. అందుకు గుర్రాల గురించి తెలిసినవారిని పంపడానికి రంగం సిద్ధం అయ్యింది. పాలెగాళ్ళు కొందరు, సైనికులు కొందరు, గోవా వెళ్లేందుకు సన్నాహాలు చేశారు.
కవులలో రామలింగడితో అవమానం పొందిన ముక్కు తిమ్మన, దూర్జటిలతో బాటు మరికొందరు, పనిగట్టుకుని అలసాని పెద్దనను “ఇదే మంచి అవకాశం ఆ గుర్రాలను తీసుకువచ్చే పని రామలింగ డికి పురమాయించండి. మీరు చెప్తే తప్పక రాయలు పంపుతాడు” అని చెవుల్లో నూరిపోసారు.
తాను బయటపడకుండా రామలింగడి అంతు చూడాలన్న తలంపు అలసాని పెద్దనకు లోలోపల ఉండనే ఉంది. "ఆ రామలింగడు ఆషాడభూతి. వాడిని నమ్మద్దు అని మీలాంటివాళ్లు ఎందరు చెప్పినా నేను వినకపోతిని. నేడు నా కొడుకుని నా నుంచి దూరం చేసుకున్నా ను. హాయిగా నా కొడుకు నా కళ్ల ముందు ఉండాల్సినవాడు. రాయలవారి ఆగ్రహానికి గురయ్యాడు. నా చిన్ననాటి స్నేహితుడు కాశీ పండితుడు భజేంద్రుని వద్దకు పంపాను. ఇప్పుడు కంచిపురంలో ఉన్నాడు. ఈ వయస్సులో నాకెందుకు పుత్రుని ఎడబాటు." అని తీవ్రంగా బాధపడ్డాడు.
" రామలింగడే కావాలని ఆరోజు సభలో నిజాలమూటను విప్పి మీ కుమారుని బంగారు భవిషత్తును నాశనం చేసాడు. రాయలు ఏ యుద్ధానికైనా వెళ్లేటపుడు మనలో కొందరిని తీసుకుపోవడం ఆనవాయితి. సైనిక గుడారంలో మనతో సరదాగా గడపడం మన చక్రవర్తికి అలవాటు. అలాగే ఈసారి ఈ గుర్రాల పనికి రామలింగాన్ని పంపమని మీరు రాయలనే కోరండి. ఎక్కడా బైటపడద్దు. రామలింగడిని రాయల వద్ద పొగడండి." సూచించాడు దూర్జటి.
"చక్కని యోచన. నేను చేయగలను. అతడు వెళ్తే అతడికి ఏమి నష్టం వాటిల్లుతుంది. అదే అర్థం కావడంలేదు." పెద్దన లోగొంతుతో అడిగాడు.
"గోవా వెళ్లేది ఇక్కడ్నించి చిన్న నాయకులు. వారిలో ముస్లింలున్నారు. అక్కడున్న పోర్చుగీసువాళ్లకి ముస్లింలు,హిందూవులు అంటే పరమ అసహ్యం. ఇదే మనకు బాగా ఉపయోగపడ్తుంది. రాయలు పంపిన ధనం అక్కడకు చేరాక, మళ్లీ గుర్రం ధర పెంచుతారు. లోగడ ఇలాగే పెంచిన ధరను అప్పుడు వెళ్లినవారు ఏ తంటాలోపడి చెల్లించివచ్చారు. రాయలవారి దృష్టికి పోకుండా జాగ్రత్తపడ్డారు. పైగా మన
రామలింగడి నుదుటబొట్టు, జంధ్యం తలపై సిగ చూస్తే అసలే కిరస్తానీలు ఐన ఆ పోర్చుగీసువారికి వెంటనే అరికాలిమంట తలకెక్కుతుంది. రామలింగడు ఇక్కడలా అక్కడ నోరు పారేస్తే భరించరు. పిలకకోసి చేతికిస్తారు. ఐనా ఇతగాడి సంస్క్రతాంధ్ర భాషా పరిజ్ఞానం వారికి కావాలా ?” అని పకపక నవ్వాడు ముక్కుతిమ్మన. అతడికి వంతపాడారు మిగిలినవారు.
"చక్కని యోచన. ఈ మధ్యకాలంలో నేను విన్నాను. గోవాలో ఘోరంగా పోర్చుగీసు వారు హిందువులను ముస్లింలను హింసిస్తున్నారట. అక్కడ ఈ క్రైస్తవం పుచ్చుకోనివారిని చంపేటంతగా వాళ్లున్నా రట. రామలింగడు వెళ్లాక వాళ్లు ఏదో ఒకటి అనకపోరు. ఈ వాగుడుకాయ తిరిగి ఏదో అని మీదకు తెచ్చుకోక తప్పదు." అలసాని పెద్దన తృప్తిగా నవ్వాడు.
"ఎంతకాలమయ్యింది మీ నవ్వు చూసి.” దూర్జటి పెద్దనాచార్యతో అనేసి "తిమ్మన నీవు మంచి పథక రచన చేసావు. నీవు కవిగా కావ్యాలను రాసి పేరు తెచ్చుకునే బదులు రాయలవారికి యుద్ధతంత్రాలనే రచించి ఈయరాదు. మన సామ్రాజ్యం దశదిశలు పెరుగుతుంది.” అన్నాడు.
"ఓహో ఇది తిమ్మన తంత్రమా ? భళీ ! దీనికి పెద్దన రాయలవారితో చెప్పి కాగల కార్యం తీర్చాలన్నమాట.” నవ్వాడు పెద్దన పెద్దగా.
📖
రాయలు వారి నుంచి పిలుపు రాగా విచ్చేసాడు రామలింగడు.
" ఈ సాయింత్రం గోవాకు వెయ్యి గుర్రాలను తీసుకురావడానికి మనవాళ్ళు 160 మంది వెళ్తున్నారు. వారికి తూర్పుదళనాయకుడు చంద్రప్పరాయుడు నాయకత్వం ఉన్నాడు. నీవు వారితో వెళ్లిరావాలి." అని రాయలు ఆదేశించాడు.
"గుర్రాలను తీసుకురావడానికి వెళ్లేవారితో నేను పోవాలా ? నా వలన కాగల కార్యం ఏముంటుంది. చిత్రంగా ఉందే !" అని రామలింగడు విస్తుపోయాడు.
"ఏమి రామలింగా లోగడ ఇదే నోటితో చెప్పావు. తల తీయించిన అందుకుగల కారణం కూడా విననన్నావు, అంతటి ప్రభుభక్తి పరాయణుడను అని చెప్పి నీ గోవా ప్రయాణానికి కారణాలు అడుగుతున్నావు?”
"క్షమించండి తప్పక వెళ్లి లాభంతో వస్తాను.”
"లాభమా ? నేను పంపిన ధనానికి నీవేమైన రెండింతలు తీసుకురాగలవా ?" రాయలు పకపక నవ్వాడు.
"ప్రభూ తమరు ఆదేసిస్తే తప్పక రెట్టింపు తీసుకురాగలను.” అని బదులు ఇచ్చాడు. అ ప్రక్కనే ఉన్న కవులు వింతగా చూసారు. పెద్దన చిర్నవ్వు చిందించాడు. రామలింగా
.. గొయ్యి తవ్వుకుంటున్నావు అని సంబరపడ్డాడు.
"ఓయీ రామలింగా ! ఏమి చూసుకుని అహంకారంతో నీవు ఇలాంటి కూతలు పలుకుతుంటావు? రెట్టింపు తీసుకుని
రావడమా ? నీవు ఈ విజయనగరంలో ఎవరి కంటే గొప్పవాడివి. ఏమి నీ మిడిసి పాటు” అలసాని పెద్దన ఇదే మంచి అవకాశం అని ఆజ్యం పోసాడు..
“పెద్దనార్య తమరి వద్ద శుశ్రూష చేసితిని కదా! మీ నుంచి మీ పుత్రరత్నం నుంచి నేర్చుకున్నది చాలా ఎక్కువే. ఇక రాయల వారు నాకాదేసించాలే గాని తలతాకట్టు పెట్టి మరీ తీసుకురాగలను. ఏమంత కష్టమైన పని కాదు. జానెడు పొట్ట నింపుకో వడానికి ఒక చేత్తో శిలువ, మరో చేత్తో వర్తకపు సంచితో ఊడిపడ్డ అన్య దేశపు వారి వద్దకు వెళ్తున్నాను.. అదే పోర్చుగీసు ముసుగు వర్తకుల దగ్గరకు."
రాయలు ఆలోచనలోపడ్డాడు. "రామలింగా నీవేమెమో చెప్తున్నావు. గోవా వర్తకులు ముసుగు వర్తకులా ? ఇచ్చిన మాట పై మనతో వ్యాపారం చేస్తున్నారు. ఇంక ఎక్కడుంది ముసుగు? "
"ఇక్కడ అందరితో బాటు మా కవులందరికి తెలుసు! లోగడ ధనాన్ని తీసుకున్నాక పోర్చుగీసువారు పలుమార్లు ధరలు పెంచారు. ఆ పెంచిన ధరను వెళ్లినవాళ్లు ఎలాగో నానా బాధలుపడి చెల్లించి తీసుకు వచ్చారు. ఈ విషయం తమకు భయపడి చెప్పలేదు. అలాంటి ఉపద్రవంలో నేను ఇరుక్కోవాలని మా కవుల గుంపు తమకు చెప్పి నా ప్రయాణం ఖరారు చేసారు.”
అని అసలు విషయాన్ని చెప్పాడు రామలింగడు.
అదిరిపడ్డారు అక్కడున్న కవులు. వారి ముఖాలు వివర్ణం అయ్యాయి. రాయలు తీక్షణంగా కవుల వైపు చూసాడు.
"ప్రభూ వారిని దయచేసి ఏమి అనవద్దు. నాకు గొప్ప అవకాశం కల్పించారు. నన్ను నమ్మి పంపండి, కార్యం చక్కబెట్టుకుని రాగలను. నేను కేవలం నా హోదాలోనే వెళ్లగలను. చంద్రప్ప నాయకత్వంలో ఈ కార్యం జయప్రదం చేసుకునిరాగలను. కానీ నాదో విన్నపం. మా వెంట ఎక్కువ మంది ముస్లింలు, కొద్దిపాటి మంది హిందువులుండేట్టు చూడగలరు.” అన్నాడు.
"ఇలా ఎందుకు ? దీనివలన ప్రయోజనం ఏమిటి " రాయలు అర్ధంకాక ప్రశ్నించాడు.
"ఆ గోవా గవర్నర్ కు అన్యమతాలపై మంచి అభిప్రాయం లేదట. అయినా తినబోతూ రుచులు చూడడం వద్దు ప్రభూ నమ్మి పంపండి" అన్నాడు రామలింగడు.
రాయలు సరేనన్నాడు..
" మీ ప్రయాణం అన్ని విధాల శుభప్రదం కావాలని కోరుకుంటున్నాను. చంద్రప్ప రాయా నీవు చాలా అదృష్టవంతుడవు. రామలింగ కవితో నీవు అలసట ఎరుగక సాగిపోతావు. ఈ ప్రయాణం నీ జన్మలో మరువరానిది. మన కవిని నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సుమా ! ఏ కొరత రానీయ్యరాదు. ఆయన్ని కంటికి రెప్పలా చూసుకోవాలి. ఏ తప్పు జరిగినా నేను ఏ మాత్రం ఉపేక్షించను.” అని చెప్పి పంపాడు రాయలు.
కవులు బిక్కచచ్చిపోయారు. ఇదేమిటి మనం ఒకటి అనుకుంటే మరొకటి అయినది. అయినా తిరిగి వచ్చాక రాయలవారి దండనకు సులభంగా గురువుతాడు, అప్పుడు తెలుస్తుందిలే రామలింగడికి ! అని మూతులు మళ్లీ చెడామడా కొరుక్కున్నారు.
పల్లకీలో రామలింగడు కూర్చున్నాడు. మిగిలినవారు గుర్రాలు ఎక్కి వెనుక పయనమయ్యారు. పేరుకే గుర్రాలు అవి, పల్లకీ చుట్టూ అతి మెల్లగా నడవసాగాయి. అంతకుమించి అవి ముందుకు సాగడం లేదు. ఇలా అయితే ఎన్నాళ్లకు గమ్యం చేరతాం, అని అంతా లోలోపల అనుకుని ఈ విషయం చంద్రప్ప రాయుడికి కూడా చెప్పారు.
" నేనూ అదే ఆలోచిస్తున్నాను. ఇలా అయితే గోవా వెళ్లేసమయం కొన్ని నెలలు పట్టవచ్చు. తిరుగు ప్రయాణం మరీ ఆలస్యం అవుతుంది." అని బాధపడ్తునే బదులిచ్చాడు కొందరికి.
👳♀️
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*꧂*తెనాలి రామకృష్ణ - 16*
*పిలకపట్టుకున్నందుకు గుర్రాలు జరిమాన -2*
పొలిమేరలు దాటగానే పల్లకీలోంచి పిలుపు రాగా అంతా చెవులు రిక్కించారు. పల్లకీని దింపించి రామలింగడు క్రిందికి దిగాడు.
"మనం చాలా దూరప్రయాణం పెట్టుకుని ఇలా నత్తనడకలో సాగడం పద్దతికాదు. దీర్ఘకాలం ఇలా సాగితే ఆరోగ్యం క్షీణిస్తుంది. నేను పల్లకీలో సాగేటంత సుఖ వాసిని కాను. నాకో గుర్రం ఇప్పించండి. ఈ పల్లకిని ఇక్కడే నిలిపేద్దాం.” రామలింగడు ఉత్సాహంగా చెప్పి ఒక రౌతుని గుర్రం దించేసి..
"మేము తిరిగి వచ్చేవరకు నీవు ఇక్కడే ఈ ఖాళీ పల్లకీని కనిపెట్టుకుని ఉండు.” అని ఆ రౌతుకు పురమాయించి, చెంగున గుర్రం పైకి ఉరికి కళ్లాలు అందుకుని బలంగా లాగి దౌడు తీయించాడు.
అంతా నివ్వెరపోయారు. చూస్తుండగా రామలింగడు కనుచూపు మేరకు దూరంగా వెళ్లిపోయాడు. అసలే రాయల శాసనం, 'రామలింగడికి ఏమైనా ఐతే ఒప్పుకోను' అని, గుర్తుకు తెచ్చుకుని ఆ వైపుకు పరుగులు తీయించారు. గుర్రాలు లేపిన దుమ్ములో అంతా కలిసిపోయారు.
అర్ధరాత్రి వరకు విరగకాసిన వెన్నెలలో సాగిపోయి, అడవి మధ్యలో నిలిచారు.
"ఓ దళనాయకా! ఇక్కడే మనం ఈ రాత్రికి బసచేద్దాం. చెవులకు విన్పిస్తూనే ఉన్నాయి కదా క్రూర జంతువుల భీకర గర్జనలు. మన గుడారాల చుట్టూ దివిటీలను ఏర్పాటు చేయండి. బాగా అలిసిపోయాం ఇక విశ్రమి ద్దాం. నా సూచన అందరికి నచ్చిందా !" అని గుర్రం పై నుంచి దిగాడు రామలింగడు.
క్షణాల్లో గుడారాలు వేయబడ్డాయి. తెచ్చుకున్న తినుబండారాలు అందరూ తిని నడుంలు వాల్చారు.
"ఓ కవితిలకమా! మనం సాయంత్రం బయల్దేరితిమి. నిజానికి కొన్ని క్రోసులు వెళ్లాక ఓ గ్రామంలో ఆగిపోవాలనుకున్నాం. అక్కడ మనకు భోజన ఏర్పాట్లు సిద్దం అయ్యాయి. కానీ మీరు యవ్వనంలో అడుగెట్టినవాని వలే ఏమా గుర్రపుస్వారీ నిజంగా అద్భుతం" చంద్రప్పరాయుడు మెచ్చుకున్నాడు రామలింగడిని.
“ కవి గాక ముందు ఉదరపోషణకై ఎన్నో పనులను చేసినవాడిని. నా చిన్నతనంలో మా తాతగారింటికి మా వద్ద ఉన్న గుడ్డి గుర్రం పై ఓ అడవి దాటేవాడిని. పాపమా గుర్రంకు కన్నులు కనిపించేవికావు. దాని మూపు పై ధాన్యాల మూటలను వేసుకుని ఇంటికి వచ్చేవాడిని. నాకు గుర్రపుస్వారీ వచ్చు." అన్నాడు రామలింగడు.
“రాయలవారు చూస్తే చాలా సంతోషించే వారు." నిద్ర ముంచుకురాగా రామలింగడు మాటలాడ్తునే నిద్రపోయాడు.
వేకువజామున లేచాడు. అంతా నిద్రమత్తు లో ఉన్నారు. అ దగ్గరలో నది ప్రవాహంలో స్నాన సంధ్యాదులు నిర్వర్తించి తిరిగి వచ్చే సరికి తన కోసం అంతా తలో దిక్కు వెదుకుతున్నట్లు తెలిసి నవ్వేసాడు.
"మీరు భయపడాల్సింది ఏమీలేదు. ముందు మీ పనులు చకచకా ముగించి ప్రయాణానికి సిద్ధంకండి" చెప్పి తన గుర్రం నోటికి గడ్డిపరకలుఅందించసాగాడు.
అనుకున్న దానికంటే ముందే గోవా చేరుకు న్నారు. పోర్చుగీసు గవర్నర్ రామలింగని వైపు హీనంగా చూసి..
"ఈ భారతదేశంలో క్రైస్తవం గురించి చాటి చెప్పాలని విచ్చేసాం. మేమొచ్చేసరికి మా కెదురుగా వచ్చింది క్రైస్తవులే. వారిని చూసి నిర్ఘాంతపోయాం. 4వ శతాబ్దం నాటికే ఇక్కడ ఎందరో క్రైస్తవులుగా మారారు. అలాంటిది నీవు ఇంకను ఈ పిచ్చి వేషంతో గుడ్డలు విప్పదీసుకుని గుర్తు పట్టడానికి అన్నట్లు శరీరం పై గంధపుబొట్లు ఏమిటి ? ఏమి నీ ఛాదస్తం ?" అని వ్యంగ్యంగా ప్రశ్నించారు.
ఒక్కసారి రాయలవారి పరివారంలో కలకలం పుట్టుకొచ్చింది. కోపంగా ఆ ప్రేలుతున్నవాడిని చూసారు. మొలల్లో చాటునున్న కత్తుల పై చేతులు గట్టిగా బిగుసుకున్నాయి. వారందర్ని నిలువరించి రామలింగడు నవ్వుతూ గోవా పై పేను పెత్తనం చెలాయిస్తున్న పోర్చుగీసువారి తొలి గవర్నర్ ఆల్బుకేరక్ ను సమీపించి..
"నీవా మాకు మతాల గూర్చి బోధించునది. ఇక్కడ అనైక్యతను నీవు వ్యాపారంలో ఉపయోగించుకుంటివి. నీవు వచ్చింది వ్యాపారానికి. వస్తూనే నీవెంట మతాధి పతులని తెచ్చావు. వారు చేయాల్సిన పని నీవే చేస్తున్నావు. కేవలం వర్తకుడవు గోవా ని నీ గుప్పిట్లోకి తీసుకున్నావు. దాంతో ఈ యావత్ భారతావనే నీ పెత్తనం కింద ఉన్నట్లు తెగ రాలిపోతున్నావు. లోగడ ఇస్మాయిల్ ఆదిలా ఖాన్ నిన్ను నీ మోచేతి నీళ్లు తాగే బుడతలను తన్ని తరిమేసాడు. ఒకసారి గుర్తుకుతెచ్చుకో ! హిందువులను హీనపరుస్తావా ? ముస్లింలను ఈ గోవాలో లేకుండా తరిమేస్తావా ? ఇవన్నీ నాలుగు గోడల చాటులా జరుగుతున్నాయి. ఎదురుగా చూస్తే కనపడవు.”
రామలింగడు చెప్తుంటే మధ్యలో ఆల్బుకేరక్ “ఏయ్ ఆపుతావా లేదా, ఎంత ధైర్యం.. నా ముందే నోటికి వచ్చినట్లు ప్రేలుతున్నావు. నీవు అతి తక్కువమంది మార్బలంతో ఉన్నావు. నిన్ను ఏం చేసినా నాకెదురేలేదు.” అని పిశాచంలా నవ్వుతూ చెప్పి రామలింగని నెత్తి మీద ముడిపెట్టి ఉన్న పిలక జుట్టును చేత్తో తాకి..
“ఇందులో ఏదో మహత్తు ఉందట. ఏమేమి ఉన్నాయో పిలకను విప్పదీసి చెప్పరాదు.” అని పగలబడి నవ్వాడు.
మరి తట్టుకోలేకపోయాడు దళనాయకుడు చంద్రప్పరాయుడు. ఆల్బుకేరక్ పైకి దూసుకు వెళ్లాడు. మళ్లీ రామలింగడు అతన్ని నిలువరించి..
"రాయుడు, మీరలా చూడండి చాలు. నాకీ బుడతకీచులు ఎంత ?" భుజం తట్టాడు. ఆ మాట విన్న ఆ తెల్లవాళ్లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.
ఆల్బుకేరక్ కళ్లు ఎరుపెక్కాయి. చుట్టూ ఉన్న అతని తెల్ల సైనికులు అతను ఆదేశించిన మరుక్షణం అమలు చేసేటంత ఉద్రేకులయ్యా రు అని రామలింగడు గ్రహించాడు.
“గోవా గవర్నర్ ! నీవెనకున్న వారు నీవైపే చూస్తున్నారు. నీవు తెలివిగా ఆలోచిస్తు న్నావు. ఏ ధైర్యం నిన్ను ఇంతలేసి మాట లాడిస్తున్నది, అనేకదూ! నీవు మూలాలు వెతుకుతున్నావు. నీవు కోపిష్టివే కానీ కార్యవాదివి, తెల్లవాడివే కానీ నీ నల్ల మనస్సులో తెల్లని యోచన ఉంది."
అదిరిపడి రామలింగని వైపు చూసాడు ఆల్బుకేరక్. నిజమే తను ఆలోచిస్తున్నది వీడెలా అవలీలగా కనిపెట్టేయగలిగాడు. ఈ హిందువు సామాన్యుడు కాడు. గౌరవంగా మెలగాలి అని వెంటనే నిర్ణయించుకున్నాడు.
“మాటలు మన మధ్య పెరిగి ఎక్కడికో వెళ్లిపోయాయి. అలా కూర్చోండి, మీరు వచ్చినపని ప్రకారం మనం వ్యాపారం మాట్లాడుకుందాం. మీ నుంచి ధనం ముట్టింది.....” అని చెప్తూనే శాంత స్వరూపుడైనట్టు నటిస్తూ కూర్చున్నాడు.
"నేను తోలుబొమ్మను కాను. నువు చెప్పినట్లు ఆడడానికి. నీలో వ్యాపార లక్షణాలే లేవు. మమ్మల్ని పురుగుల్లా చూసావు. అందింది కదా అని నా జుట్టు (పిలక) కూడా అందుకున్నావు. నీ వద్దకొచ్చినవారి పట్ల నీ మర్యాద చాలా గొప్పగా ఉంది. ఎందుకో నీకుగా నీవు భయపడ్డావు. కాలు బేరంకి దిగుతున్నావు. ఇప్పుడు నీవు చెప్పేది ఏమిటో నేను చెప్తాను. మా రాయలవారు ఇచ్చిన ధనంకు సరిపడా గుర్రాలు వెయ్యి మాకు అప్పగించాల్సి ఉంది. కానీ పొరుగున ఉన్న రాజులు మరింత ఎక్కువ ధనాన్ని ఇవ్వనున్నారు. కనుక ధర పెంచుతున్నాం. ఇదే కదూ నీవు చెప్పబోతున్నది. అది ఇంకెక్కడైనా చెప్పు నీ వ్యాపార మర్మాలు, నా వద్ద పనిచేయవు. నా జుట్టు పట్టుకున్న నేరానికి నీవు నా పిలకలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని గుర్రాలను జరిమానాగా చెల్లించు. కాదంటే గోవాను చుట్టుముట్టి నిన్ను నీ బుడతగాళ్లను మట్టుబెట్టి గాని తిరిగిపోము. ఈ సరికే గోవా చుట్టూ ఉన్న రాజులతో ఒప్పందంకి వచ్చాం. ఇలా పిలిస్తే అలా వచ్చి మా పని చేసిపెడతారు. నీవు చేసిన నీచమైన పనికి, జరిమానా చెల్లింపు
కి ఔనంటే నీ గవర్నర్ పదవి పోదు. పైగా రాయలవారితో నీ స్నేహం కలకాలం సాగుతుంది. నీవిచ్చిన ఉచిత జరిమానా గుర్రాలు నిన్ను నీ అధికారాన్ని రక్షిస్తాయి. ఆలోచించుకో ". రామలింగడి గొంతు ఖంగుమంది.
తెల్లవారు నోళ్లు జాపి విన్నారు. అక్కడ భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. ఆల్బుకేరక్ తన కింది ఉద్యోగులతో లోగొంతు మంతనాలు ఆ క్షణమే ప్రారంభించాడు. వారి వైపు అదోలా రామలింగడు చూసి..
“మరో మాట, నేనేదో మాటకారిలా భయ
పెట్టేలా పేలలేదు. మా సైన్యం ఐదు లక్షలకి పై మాటే. ఎర్రగా చూస్తే కాలిపోతావు. రాయలు కన్నెర్రకి గురయినవాడు జీవించ లేడు. ఆయన యుద్ధోన్మాది. ఓటమి ఎరుగనివాడు. నీలాంటివాడిని శూలంతో గుచ్చి ఈ గోవా అంతా తిప్పిగాని నిద్రపోడు”
మంతనాలు ముగించి ఆల్బుకేరక్ తను లోగడ ఎందుకు గుర్రాలు ధర పెంచింది చెప్పబోయాడు. రామలింగడు చెవులు మూసుకుని..
" గతం తవ్వుకుని వినాలని కుతూహలం నాకు లేదు. కారణం మేము త్వరగా వెళ్లకుంటే నీ చుట్టూ ఉన్న రాజులు సైన్యాలతో వచ్చి పడతారు. ముందు మమ్మల్ని త్వరగా పంపించే ఏర్పాటు చెయ్.” రామలింగడు అతడి ప్రసంగానికి అడ్డు తగిలి మరీ చెప్పాడు.
ఆల్బుకేరక్ కు అయోమయంగా ఉంది. వెంటనే గుర్రాలను ఇవ్వాలంటే ముందు పిలకలో ఉన్న వెంట్రుకల లెక్క తేలాలి. అతని వద్ద ఉన్న ఆర్ధిక నిపుణుడిని పిలిచి నువ్వు ఈ హిందువు తలపై గల పిలకలో ఉన్న వెంట్రుకలను లెఖించు.” అని ఆదేశించాడు.
“లెక్కలో తప్పు దొర్లితే ఒప్పనుగాక ఒప్పను. నిదానంగా లెఖించు” అని ఓ హెచ్చరిక చేసాడు రామలింగడు. రామలింగానితో వచ్చిన వారు అంతులేని ఆశ్చర్యానికి గురై మరీ చూడసాగారు. వారిలో ముస్లింలు తెగ ఆనందపడిపో సాగారు. దళనాయకుడు చంద్రప్ప రాయుడు సంతోషంగా ముఖంమంతా నవ్వులు నింపుకుని చూడసాగాడు.
రామలింగడు వారి వద్దకు వచ్చి "మీరు కొంతవరకు ఓపికపట్టండి. నా పిలకను లెఖిస్తారు కదా నెత్తి మీద వారి చేతులు కదుల్తాయి కనుక నాకు నిద్ర వస్తే ఓ కునుకు తీయగలను. ఇక్కడ ఒకింత ప్రయాణపు బడలికను తీర్చుకుందును.” అని వారి చెవుల వరకే పరిమితం అన్నట్లు చెప్పాడు.
పోర్చుగీసువారి ఆర్ధిక నిపుణుడు కూర్చున్న రామలింగని నెత్తి మీద పిలకను చేత్తో అటు ఇటు తిప్పి చూసి..
“ఇది ఒత్తుగా ఉంది. వెయ్యికి అవతలే వెంట్రుకలున్నట్లుంది. లెక్క మొదలుపెడతా ను. అవునూ, నేను తేడా చెబితే నీకు ఎలా తెలుస్తుంది.?" రామలింగడినే అడిగాడు.
"ఓ తెల్లతొక్కా నీకు తెలియదు. నీకు ముందు ఈ గడ్డ పైకి వచ్చిన గవర్నర్ కు తెలుసు. ఈ భారతావనిలో అన్నీ వింతలే వింతలు. నా పిలక చాలా మహిమగలది. తేడా ఉంటే నోరు తెరిచి చెప్పేస్తుంది. పిలక నోటి కోసం వెతకకుండా నీ పని కానియ్. సరిగ్గా నీ గాజుపిల్లి కళ్లతో చూసి లెఖించు " అని పెద్దగా ఆవులించాడు.
రామలింగని పిలకలో వెంట్రుకల లెక్క ప్రారంభం అయ్యింది. చేతివేళ్లు నెత్తి మీద నర్తిస్తున్నట్లుగా, మర్దనలా ఉన్నందున రామలింగడు పెద్దగా ఆవులిస్తూనే నిద్ర లోకి జోగుతూ సింహాసనం లాంటి ఆసనం పై పక్కకు ఒరిగిపోయి గుర్రెట్టాడు.
ఆర్ధిక నిపుణుడి కష్టం వృధాపోలేదు. పిలకలో వెంట్రుకలు మొత్తం 1498 అని నిగ్గుతేల్చాడు. పక్కనే కూర్చుని చోద్యం చూస్తున్న ఆల్బుకేరక్ లోగొంతుతో..
“ఆ లెఖించినవన్ని ఒక్కటి కూడా తేడా లేదు కదా!” అని అడిగాడు. ఆ వెంటనే మరోవైపు నుంచి గుర్రాలను సిద్ధం చేయమని తనవారికి ఆదేశాలు జారీ చేసాడు. రామలింగడి వైపు కోపంగానే చూస్తూ ఎంత ధైర్యం లేకపోతే శత్రువుల గుహలో ఇంత మత్తుగా నిద్రపోతాడా ? ఈ గంధంబొట్లు మాటున హిందువు చాలా ప్రమాదకారి అని లోలోపల అనుకుని “అతన్ని లేపండి, నిద్రకు వాచిపోయిన వాడిలా పడుకున్నాడు.” అని తన వారిని పురమాయించాడు. కొంతమంది తెల్లవాళ్లు నిద్రపోతున్న రామలింగడిని తట్టి లేపారు. అంతా అతని వంకే చూడసాగారు.
రామలింగడు నిద్రలోంచి ఆవులిస్తూనే లేచి చేత్తో పిలకను తడుముకుని " మీ లెఖింపు అయ్యిందయ్యా! ఎన్ని ఉన్నాయి నా వెంట్రుకలు. ఈమధ్య నా ధర్మపత్ని ముసలివాడినయిపోతున్నానని జాలిపడి పిలకలో ఉన్న అక్కడక్కడ తెల్లవెంట్రుకల ను ఏరిపారేసింది. అందుకే పలుచబడింది. ఒకప్పుడు ముదిరిన నాగుపాము నడుం లా ఒత్తుగా గుప్పిటలో నిండుగా జారుతూ ఉండేది పిలక. ఇప్పుడు నీరు అందని దోసకాయలా ఉంది అని చేత్తో తడుము కున్నాడు. ఆ తరువాత ముడివైచాడు.”
ఆ మాటలకు అక్కడున్నవారంతా గొల్లుమన్నారు.
"ఏ ఒక్క వెంట్రుక మా కనుదృష్టి నుంచి తప్పించుకోలేదు. మొత్తం 1498 ఉన్నాయి. కావాలంటే మీ పిలక మహిమ తో తెలుసుకోండి." ఆల్బుకేరక్ చిరాకు పడ్డునే తప్పదన్నట్టు బదులిచ్చాడు.
👳♀️
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*తెనాలి రామకృష్ణ - 17*
*పిలక పట్టుకున్నందుకు గుర్రాలు జరిమానా - 3*
"తెల్లదొరా ఈ సంఖ్య నీకు బాగా అచ్చి వచ్చినట్టుంది. నీవు ఈ గడ్డ పై కాలు మోపినది, 1498లో కదూ ! సరే త్వరితంగా మిగిలిన పనులు పూర్తి చెయ్యి. ఈ సాయంత్రానికి మేమంతా గోవా వదిలిపోవాలి.” అన్నాడు రామలింగడు.
ఆల్బుకేరక్ ఓ రాగిరేకు పై ఓ ఒప్పందం రాసాడు. రాయలవారి స్నేహాన్ని తాను మనసా వాచా కోరుతున్నానని, మన మీద ఏ ఇతర రాజులు సైనికచర్య చేపట్టినా పరస్పరం సహకరించుకుని కలిసి ప్రతిఘటిద్దాం. ఆర్మూజ్ నుంచి వచ్చిన గుర్రాలను విజయనగరం చక్రవర్తులే కొనుగోలు చేయాలి. వారికే పరిమితం చేస్తాం. అలాగే విజయనగరం నుంచి వచ్చే వస్త్రాలు, ఇతర వ్యాపార సరుకులను హోనావార్, బార్యూర్ వంటి మలబారు రేవు ప్రాంతాలకు తీసుకురావాలి. మన మధ్య వాణిజ్య, సైనిక ఒప్పందం ఎప్పుడూ కొనసాగాలి అని కోరుకుంటున్నాను. ఇది పోర్చుగీసువారు శ్రీకృష్ణదేవరాయలవారితో తొలి ఒప్పందం.....
దానితోబాటు మరికొన్ని కానుకలను ఇచ్చాడు ఆల్బుకేరక్. వాటిల్లో 40 మంది యువతులున్నారు.
“మీ అంతఃపురంలో ఏదైనా పనిపాట చేసుకుంటారు. మాంచి అందగత్తెలు కూడాను, కావాలంటే నీ హిందూ ధర్మం అంగీకరిస్తే కొంతమందిని ఉంపుడుగత్తెలు గా నీతో ఉండనీయ్.” అని చెప్పాడు ఆల్బుకేరక్.
ముసుగు పరదాల మాటున ఉన్న యువతులను చూసిన రామలింగడు “ఓ తెల్లదొరా, నీవు మతపిశాచివి. గోవాలో బతుకీడ్చే ముస్లింలను అమానుషంగా ఏదో కారణం చూపి చంపుతున్నావు. ఆ చంపబడ్డవాని కుటుంబ స్త్రీలను ఇలా నిర్భందించి నీ పనివారికి ఉంపుడుకత్తెలు గా అప్పగిస్తున్నావు. దీని విషయం నేను పంచాయితీ పెట్టదల్చలేదు. నీ బందిఖానా లో మిగిలి ఉన్న ఆడువారిని తెలివిగా నాకు అప్పగించి, మా రాయలవారికి ఇచ్చే భోగ కానుకగా చెప్తున్నావు. ముందే చెప్పాను నా వద్ద నీ ఆటలు సాగవు. నీ కానుకలను కాదనను యువతులను తీసుకుపోతాను.” అన్నాడు.
మరోసారి బిక్కముఖం వేసాడు ఆల్బుకేరక్.
ఒక చేత్తో ఒప్పందాల రాగిరేకు, మరో చేత్తో పిలక పట్టుకున్నందుకు జరిమానగా 1498 మేలుజాతి గుర్రాల అప్పగింత పత్రంతో, రామలింగడు గుర్రమెక్కాడు. ఈ గుర్రాల కోసం ముందు తీసుకున్న ధనాన్ని తిరిగి చంద్రప్పరాయుడికి ఆల్బుక్ ఇచ్చేసాడు. గోవా నుంచి బయలుదేరే ముందు..
“ఆల్బుకేరక్ నీవు నీ అజ్ఞానంతో నీ ముంగిటకు వచ్చిన ఐశ్వర్యాన్ని కాలదన్ను కున్నావు. వ్యాపార లక్షణాలతో ఇక నుంచి మాతో ఈ గుర్రాల వ్యాపారం చెయ్యి. నీలో మార్పు ఆశిస్తున్నాను. మా నుంచి ప్రస్తుతానికి నీకెలాంటి భయం అక్కర్లేదు. ఇక సెలవు.” అని చెప్పి గుర్రాలతో బయలుదేరాడు రామలింగడు.
రామలింగడి పిలక పట్టుకున్నందుకు జరిమానగా లభించిన 1498 గుర్రాలు దుమ్ము రేపుకుంటూ పరుగులు తీస్తుంటే వాటి వెనుక 160 మంది రాయలవారి సైనికులు కానుకగా ఇవ్వబడిన యువతులు గోవా వదిలి విజయనగరం వైపు సాగిపోయారు. ప్రతి ఒక్కరిలో తెలియని ఆనందం చోటు చేసుకుంది. తెల్లవాడితో వ్యాపారం అంటే భయపడేట్టు ఉండేది. తీరా రామలింగడి సమయస్పూర్తి తో ఉచితంగా గుర్రాలు లభించడం, ఇచ్చిన ధనం తిరిగి చేతికి రావడం అక్కడివారు నమ్మలేకపోయారు.
రాయలవారికి కబురు అందింది. గోవాలో జరిగినదంతా ముందుగా వచ్చిన ఓ సైనికుడు పూసగుచ్చినట్లు చెప్పాడు. ఇక దర్బార్ అంతా నవ్వులతో ఆనందంతో హోరెత్తిపోయింది. రామలింగడి పిలకలో వెంట్రుకలు 1498 ఉన్నాయా.. ఏ ఒక్కటి వదలకుండా పాపమా తెల్లదొర మొత్తం లెక్కపెట్టాడా? ఆ సమయంలో తెల్లవాడి చేతి వేళ్ళు కదుల్తుంటే రామలింగడు హాయిగా నిద్రపోయాడా ? వెంట్రుకకు ఒక గుర్రం చొప్పున జరిమానగా మొత్తం 1498 గుర్రాలు తెల్లవాడి వద్ద పుచ్చుకున్నాడా ? ”
ఎవరి నోట విన్నా ఇదే మాట. మొత్తం నగరమంతా కోడై కూసింది. పడిపడి నవ్వినవాళ్లు కొందరు కాగా, కొంతమంది నవ్వలేక కడుపులు పట్టుకున్నారు.
రెండు రోజుల తరువాత తిరిగి వచ్చిన రామలింగడు రాయలవారిని కలిసాడు. కుశల ప్రశ్నలయ్యాక గోవాలో జరిగిన విషయాలను అడిగి తెలుసుకుని తన ఆనందం వ్యక్తం చేసాడు. కవులెవ్వరికి ముఖంలో నెత్తురు చుక్కలేదు. అంతా అయోమయంగా చూసారు. రాయలు రామలింగానికి వెలలేని కానుకలను ఇచ్చాడు..
తొలిరోజు ఆనందించిన తిమ్మరుసు మరుసటి రోజు ముభావంగా ఉన్నాడు. రాయలు ఒక కంటకనిపెడుతునే విషయం తరువాత అడగచ్చు అని ఊరుకున్నాడు. గోవా నుంచి కానుకగా వచ్చిన 40మంది యువతులు ముసుగుపరదా ధరించి రాయల ఎదుట నిలబడ్డారు. వారి గురించి తెలుసుకున్న రాయలు వారికి స్వేచ్ఛనిచ్చి మీ ఇష్టం వచ్చిన చోటికి పోవచ్చునని చెప్పాడు. వారు తాము అన్నీ కోల్పోయిన అనాధలం ఇక్కడే ఏదో ఒక భృతి లేదా ముస్లిం యువకులతో వివాహం జరిపించ వలిసినదిగా కోరారు. రాయలు ఆఏర్పాట్లు చేయగలనని చెప్పాడు.
వారంతా రామలింగనికి తాము ఋణపడి ఉన్నామని అతను తీసుకురాకుంటే గోవా కారాగారాలలో ఆ మతపిశాచి విధించే శిక్షలతో మ్రగ్గిపోయేవాళ్లం అని కన్నీటితో చెప్పారు.
రాయలు రామలింగడిని బిగియార కౌగిలించుకుని "నీవు చతురతతో అందరిని ఆకట్టుకోగల చమత్కారివి. నీకు ఏమి ఇచ్చినా అది తక్కువే. అందుకే నా హృదయ పూర్వక అభినందనలు ” అని తన సంతోషాన్ని వ్యక్తం చేసాడు.
సభలో చప్పట్లు మారుమ్రోగాయి.
మిగిలిన కవులు అది చూస్తూ భరించలేక పోయారు. తామొకటి తలిస్తే ఊహించనిది జరిగిపోయింది అని విలవిల్లాడిపోయారు. ఒకవైపు ఓ క్రైస్తవ సామ్రాజ్యం స్థాపించిన వాడికే బురిడి పుచ్చి లాభాలపంటతో విచ్చేసాడు అని కుతకుతమని ఉడికిపోయారు.
తాతాచార్యులవారిని అక్కడే కలుసుకుని "అయ్యా రామలింగడు అన్ని విధాలుగా పెరిగిపోతున్నాడు. కవులలో అగ్రగణ్యుడై న అలసాని పెద్దన రాయలవారి వద్ద ఎంతో హీనపడిపోయాడు. మా సంగతి సరేసరి. మిగిలినది మీ వంటి పెద్దలు. ఏదో రోజు మీరు నిలవడానికి గోతులే మిగులుతాయి” అని చెవిలో జోరీగల్లా నూరిపోసారు.
తాతాచార్యులు దీర్ఘాలోచనలో మునిగి తేలి, తిమ్మరుసుతో...
“రామలింగడి వలన ఏదో అపశృతి జరగబోతున్నట్టుగా లేదూ!” అని లోగొంతుతో అడిగాడు.
అప్పటికే తిమ్మరుసు ఎన్నడూ లేనంత చిరాకుగా రామలింగడి నిర్వాకంపై కన్నెర్రగా ఉన్నాడు. తట్టుకోలేక..
"రామలింగా.. నీవేమైనా ఆంజనేయుడవ నుకుంటున్నావా ? చూసి రమ్మంటే కాల్చి రావడానికి వెళ్లింది. కార్యం చక్కదిద్దుకొని రాకుండా నీ నిర్వాకం ఏమిటి ? తెల్లవారి గవర్నర్ పై నీ సాధింపేమిటి ? నీ పిలక దయా లబ్దంతో గుర్రాలు తీసుకురావడ మేమిటి ?” కోపంగానే ప్రశ్నించాడు.
ఒక్కసారి గొల్లుమన్నారు దర్బార్లో జనాలు.
"చాలించండి మీ ప్రోత్సాహపు నవ్వులు " అని నవ్వుతున్న వారి పై విరుచుకుపడి..
“ఏం రామలింగా బదులీయవా ?" అని సూటిగా ప్రశ్నించాడు తిమ్మరుసు.
“క్షమించండి అప్పాజీ ! నేను ఈ విధంగా ప్రవర్తించి ఉండకపోతే మన సైనికులలో ముస్లింలను ఆ మత పిశాచి వధించేవాడు. నన్ను కూడా హతమార్చేవాడు. గుర్రాల్ని కొనుగోలు చేయడానికి వెళ్లేవారిని ఎంతో హీనంగా చూడడం ఏ మేరకు న్యాయం? వాడు హిందూరాజులపై, నవాబులపై ప్రతి ఒక్కరిపై ఆధిపత్యం వహించాలని చూస్తున్నాడు...” అని పూర్తిగా ఆల్బుకేరక్ గురించి చెప్తుంటే తిమ్మరుసు మరింతగా మండిపడ్డాడు.
"ఆపవయ్యా నీ ప్రసంగం. నీవు అసలు పండితుడవా లేక రాజకీయాలు వెలగబెట్టి ఏదైనా పదవి ఆశిస్తున్నావా ? నీకెందుకు అక్కడి గొడవలు. అక్కడ ముస్లింల పై అతడేదో సాధింపు చర్యలు చేస్తే నాకు నీకు పోయిందేమిటి ? నీ వలన అతనికి మాకు ఉన్న మైత్రిబంధం తెగిపోయింది. నీవు ఒక విధంగా దేశద్రోహానికి సిద్ధపడినంత పని చేసి వచ్చావు.” అన్నాడు.
“అప్పాజీ ! నేను కవినే కావచ్చు కానీ, నేను బాధ్యతగల వాడిని, అవసరమైతే నా ప్రాణాలైనా ధారపోయడానికైనా ఎప్పుడూ సిద్ధపడతాను. నేను చేసినది మనసా వాచా సరైనది అని నమ్ముతున్నాను." రామలింగడు తేల్చి చెప్పాడు.
రాయలు భృకుటి ముడిచి ఆసక్తిగా గమనిస్తున్నాడు.
కవులు ఆనందంగా చూడసాగారు. ఇప్పుడు రామలింగడు ఏకంగా దేశద్రోహం అనే వలలో చిక్కిపోయే పరిస్థితిలో పడ్డాడని సంతోషించారు. అందులో తిమ్మరుసు దృష్టిలో పడిన తరువాత పుట్టగతులుండవు. తిమ్మరుసు చిరాకు చాలా తీవ్రంగా ఉంటుంది.
"నీవు నీ మాటల గారడీతో తెచ్చిన గుర్రాల్ని చూసి మురిసిపోయేది ఎవరు ? పామరులు తప్పితే విజ్ఞులు కాదు. నీ పిలక వెంట్రుకల లెక్కన వచ్చిన గుర్రాలు ఏ విధంగా వాడతారు మన సైనికులు. అవి ఎంత హీనమైనవి. చూడడానికి ఎంత బావున్నా, విలువ తక్కువవికావా ?” తిమ్మరుసు కోపంగానే అడిగాడు.
“మన్నించండి అప్పాజీ ! నా పిలకను పట్టు కుని హేళన చేసిన తెల్లవాడి చర్య మీ దృష్టిలో సరైనది కావచ్చు. నేను ఈ విజయనగర పౌరుషాన్ని అక్కడ చవిచూపి వేలమంది తెల్ల సైనికుల మధ్య కేవలం 160 మంది మన సైనికులతో వారిని నా మాటల బాణాలతో సాధించుకు వస్తే అభినందించడం పోయి నన్ను దేశ ద్రోహిగా చిత్రిస్తున్నారంటే ఇదా నాకు మీ నుంచి లభించిన పురస్కారం. సరే, నేను నా పిలక ద్వారా తెచ్చిన గుర్రాలు హీనమైనవే కావచ్చు, వీటిని మన వద్ద ఉన్న గుర్రాలతో కలపవద్దు. దాణా కూడా మార్చండి. గుగ్గిల్లుకు బదులు గులకరాళ్లు పెట్టండి. ఆ గుర్రాల ధర పదింతలు ఉన్నపళంగా ఆ తెల్లవాడికి జమకట్టండి. కానుకగా వచ్చిన ఈ యువతులను మన చెరసాలల్లోకి నెట్టండి. అప్పుడు మనం ఆ తెల్లవాడి గుండెల్లో గుర్తుండిపోతాం. ఇకపై వాడు గుర్రాల ధరను మున్ముందు మూడింతలేం ఖర్మ వందరెట్లు పెంచుకునిపోతాడు. ఆ మహా ధర పలికే గుర్రాలపై ఎక్కి మన సైనికులు యుద్ధరంగానికి వెళ్తే శత్రువులు వింతగా చూస్తారు. బహుశా కత్తులు కలపరు. అసలు వీళ్ళు పిచ్చెక్కిలేరు కదా ! ఈ గుర్రాల్లో ఏముంది అని ఇంతలేసి ధరలతో ఆ తెల్లవాడి వద్ద కొన్నారు. వీటికి దాణా ఏం పెడతారు. ఇవి దేవతా గుర్రాలా లేక పిశాచగుర్రాలా అని ఆశ్చర్యపోతారు. అదే ఇప్పుడు ఈ గుర్రాలను ఏ శత్రువైనా కళ్లు చీరుకుని చూస్తాడు. ఇంతలేసి గుర్రాలున్నాయి. ఓ బాపని పిలకలో ఎందుకూ కొరగాని వెంట్రుకకో గుర్రం జరీమానగా వచ్చాయని చెవులు కొరుక్కుంటారు. విజయనగరంలో ఒక బ్రాహ్మడికే అంత సాహసం ఉంటే మిగిలిన వారి శక్తి ఇంకెంత ఉంటుందోనని అంచనాలు వేయకపోరు. కనుక ఈ క్షణం వరకు నేను చేసింది నూటికి నూరుపాళ్లు సరైనదేననుకుంటున్నాను.” అని తన సహజ ధోరణితో చెప్పుకుంటూపోతుంటే మళ్లీ నవ్వుల మయం అయ్యింది సభ.
రాయలూ నవ్వుతూ చూసాడు. పక్కనే ఉన్న తాతాచార్యులతో..
“రామలింగడు భలే చమత్కారి ! ఏమాత్రం జంకు గొంకు లేకుండా మన అప్పాజీ వంటి అపరిమిత ప్రజ్ఞావంతునితో తను చెప్పా ల్సింది చెప్తున్నాడు.” అని లోగొంతుతో మెచ్చుకోలుగా అన్నాడు.
తాతాచార్యులు రాయల మాటలకు ఇష్టం లేకున్నా నవ్వి “నిజమే చక్కగా బదులు
ఇస్తున్నాడు. చూద్దాం ఇలా ఎంతవరకు నిలబడగలడో, ఇప్పుడే మంచి రసపట్టులో పడింది.” అని బదులిచ్చాడు.
తిమ్మరుసుకు తల తీసినంతపనయ్యింది. 'ఇంతవరకు రాయలే తన మాటకు ఇలా అడ్డంపడలేదు. ఏమిటి ఈ బాపడి సాహసం. మొక్కలోనే తొక్కాలి. మాను అయ్యాక తుంచడం కష్టం అనుకుని'..
" కట్టిపెట్టు నీ పెంకి కబుర్లు. ఒకటి అడగితే ఏదెదో చెప్తున్నావు. నీవు రాజలోకాన్ని ఏం అనుకుంటున్నావు. బుద్దిహీనంగా మాట్లాడకు. నీకు పెద్దలయందు వినయం లేదు. నీకు కవి లక్షణాలే లేవు. నిన్ను అక్కడకు పంపడమే మేం చేసిన తప్పు. నీ వలన దక్కన్ సుల్తాన్ ఆకస్మిక దాడులకు జవాబుగా ఆ గవర్నర్ అల్బుకేరక్ తో త్వరలో ఓ ఒప్పందానికి రావాలనుకునే అతడి వద్ద ఈ గుర్రాలను కొనుగోలు చేస్తున్నాం. నీ కారణంగా అంతా ఇప్పుడు మట్టికొట్టుకుపోయింది. పైగా మాటకు మాట జవాబు చెప్తున్నావు. నీవు తీవ్రమైన భావాలున్న ఆలోచనపరుడివిలా ఉన్నావు. ఇక నీవు ఈ సభలో గొంతు విప్పద్దు.” అన్నాడు కోపంగా.
రామలింగడు సభలో నిశ్శబ్దంగా ఉన్న జనాల వైపు చూసాడు. అంతా అతడి వైపే జాలిగా చూసారు. తల వంచుకుని నడుచుకుంటూ వెళ్లిపోతుంటే రాయలు లేచి...
" రామలింగా ఆగాగు ! అప్పాజీ మీరు చెప్పింది నిజాలతో నిండిన నిప్పుమూట వంటిది. రామలింగడు ఓ మహాకవి. ఆయన చతురత కలిగినవాడు. తప్పితే, మన కుళ్లు రాజకీయాలు తెలియనివాడు. ఈతన్ని మనం రాజకీయ దృష్టిలో చూడరాదు. మనమే పంపాం. అతడు ఏం చేసినా భరించగలగాలి. ఇప్పుడు ఆ గోవా గవర్నర్ మరింతగా మనకు విధేయుడిగా ఉంటాడు. మన రామలింగడు అంతగా బెదరించాడు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, నీవేమైనా ఆంజనేయుడవా ? చూసి రమ్మంటే కాల్చి వస్తావా - అని నిజంగా అలాంటి పనే చేసాడు.
అభినందిద్దాం, పిలక పట్టుకోవడం అనేది ఆ తెల్లవాడి పొగరుకు సరైన శిక్ష వేసే వచ్చాడు రామలింగడు. ఒకవేళ అలా చేయకుంటే కోపంతో రగిలిపోయేవాళ్లం కాదా! మనమే దండెత్తి పోయేవాళ్లం ఆ తెల్లవాడికి బుద్ధి చెప్పేవాళ్లం. మనకాశ్రమ తప్పించాడు రామలింగడు”
రాయలవారి మాటలకు సభ హర్షధ్వానాల తో నిండిపోయింది. తిమ్మరుసు క్షణం ఆలోచించి తల పంకించి "రాయా నీ ఇష్టం. నీవు 64 విద్యలలో ఆరితేరినవాడవు. నీకు తెలియని ధర్మశాస్త్రమే లేదు. నీకు చెప్పాల్సినవాడినే కాను." అని కూర్చున్నాడు.
రామలింగడు చేతులు జోడించి కృతజ్ఞత గా రాయల వైపు చూసాడు. సభలోని వారంతా పరమానందభరితులయ్యారు. మిగిలిన కవులు ఆ దృశ్యం చూడలేకపోయారు.
👳♀️
*తెనాలి రామకృష్ణ - 18*
👳♀️
*హలీం రుచి వారెవాహ్ ! -1*
గోవా గవర్నర్ రాయలవారికి కానుకగా ఇచ్చిన 40 మంది యువతులను రాయల వారి సమక్షంలో ముస్లిం యువకులు నిఖాహ్ (వివాహం) చేసుకున్నారు. కానీ, వారిలో ఒక్క అమ్మాయిని మాత్రం ఏ యువకుడు వివాహం చేసుకోవడానికి ముందుకు రాలేదు. ఆమె ఒంటరిగా మిగిలిపోయింది. రాయలు చాలా ప్రయత్నం చేసాడు. కానీ తగిన వరుడు దొరక లేదు. దీని వెనుక ఒక కారణం ఉంది.
అదేమిటి అంటే ఆ అమ్మాయి అరేబియాకి చెందినది. ఈసరికే ఇద్దరు భర్తలను కోల్పోయినది. అక్కడవారికి ఇక్కడ వారికి జీవన విధానంలో కూడా తేడాలున్నాయి అని ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకు న్నారు. ఆమె ఒంటరిగా మిగిలిపోయింది. కొత్తగా పెళ్లి అయినవారికి రాయలు వెలలేని కానుకలను ఇచ్చి గౌరవించాడు.
కవులు పెళ్లికాని అమ్మాయి వంక చూసి ఆమె అందానికి దాసోహం అన్నారు.
"ఈమె సౌందర్యం ఏమని వర్ణించగలం. ఇంతటి అందగత్తెకు పెళ్లి చేసుకోవడానికి
యువకులు ముందుకు రాకపోవడం అది వారి దురదృష్టం అనే చెప్పాలి అని గుసగు సలాడుకోసాగారు. చివరికి వారిలో ముక్కు తిమ్మనాచార్యులవారికి ఒక దుష్ట తలంపు వచ్చింది.
" అవునూ, ఈ యువతులను తీసుకు వచ్చింది మన రామలింగడే కదా ! ఈ అందాలరాశిని ఎవడు చేసుకోకపోతే ఆమె ను విధిగా రామలింగడే కదా చేసుకోవాలి. ఈ విధానం మన పురాణాలే ఘోషిస్తున్నాయి " అని ఒక ఆలోచన చేసాడు.
" అదెలా ! నాకేమి అర్ధంకావడంలేదు. అయినా ఇలాంటివి ఆ రామలింగని వద్ద చెల్లవు. అతడో గండరగండడు." పింగళి సూరన చెప్పాడు.
మాదయగారి మల్లన అందరికి సైగలు చేసి "కాస్తా మెల్లగా మాట్లాడండి. తిమ్మన చెప్పినట్లు ఇదేదో బాగుంది. అలనాడు భీష్ముడు ముగ్గురు బాలికలు అంబ, అంబిక, అంబాలికలను ఎత్తుకువచ్చి విచిత్ర వీరునికి ఇచ్చి పెళ్లి చేయబోయాడు. వారిలో అంబ ఎవరినో ప్రేమించితినని చెప్పడంతో విడిచిపెట్టాడు. తీరా ఆ ప్రేమికుడు కాదనడంతో తిరిగి వచ్చి మళ్ళీ విచిత్రవీరున్ని చేపట్టమని కోరింది. ఎవరినో ప్రేమించినదాన్ని నేను చేసుకోను అనిచెప్పి పొమ్మన్నాడు విచిత్రవీరుడు. చివరికి ఎత్తుకు వచ్చినవాడివి కనుక నన్ను నీవు చేసుకోవడమే ధర్మం అని భీష్ముని వెంట పడింది. ఆ గాధనే మనం ఇక్కడ మన రామలింగని పై ప్రయోగిద్దాం”
"మంచి యోచన ! మల్లన నీవు ఏదో ముఖ మాటంగా, ఎప్పుడూ పరధ్యానంగా ఉంటావే గాని, అమ్మో నీలో ఎన్నో గారడీలున్నాయి.” అని మెచ్చుకున్నాడు రామరాజ భూషణుడు.
వారిని అల్లంతదూరం నుంచి గమనిస్తు
ఉన్నాడు రామలింగడు. తన వెనుక నిలువెత్తు గొయ్యి తవ్వుతున్నారని గుర్తించాడు. తను వారు తవ్వే గొయ్యిలో పడకుండా జాగ్రత్తపడాలి అనుకున్నాడు. తను వారిని పట్టించుకోనట్లే నటించాడు.
"కవులందరూ మూతులు కొరుక్కుంటున్నా రు. ఆ విశేషాలు మాకూ చెప్పండి. ఈరోజు ముస్లిం వివాహాలతో సరిపోయింది. చాలా బడలికగా ఉంది. మీరేమయినా చెప్తే విని అంతా ఆనందిద్దాం” అని కవులనుద్దేశించి అడిగాడు రాయలు.
"ప్రభూ! ఎందుకో ధర్మశాస్త్రం గుర్తుకు వచ్చింది. అలాగే, భారతంలో భీష్ముని కథనం కళ్ల ముందు కదలాడింది." చెప్పాడు మాదయగారి మల్లన.
"మల్లనా, నీ గొంతు విని చాలాకాలం అయ్యింది. ఏమిటో ధర్మ శాస్త్రం, భీష్ముడు అంటున్నావు నాకు చెప్పండి. ఎలాంటి సంశయం వద్దు."
"ప్రభూ ! గోవా నుంచి తీసుకురాబడిన 40 మంది యువతులకు పెద్ద మనస్సుతో పెళ్లి ళ్ళుచేసారు. కానీ వారిలో ఒక మ్మాయిని వదిలేసారు. ఆమె గురించి ఆలోచిస్తున్నాం. ఎక్కడి నుంచో ఆమెను తీసుకువచ్చింది, మన రామలింగడు. ఆమెను మన రామ లింగడే చేరదీయాలి. అంటే పెళ్లి చేసుకో వాలి."
తనలో ఉన్న ఆలోచనను రాయలకు ధైర్యంగా చెప్పాడు. అతడి మాటలకు ఒక్కసారి దర్బార్ అంతా నివ్వెరపోయింది. అంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకోసాగారు.
ఓ మూలగా నిలబడిన యువతి కూడా సంభ్రమాశ్చర్యంతో పరదా ముసుగు లోంచి కవుల వైపు వింతగా చూసింది. రాయలు వస్తున్న నవ్వును ఆపుకోసాగాడు. రామలింగడికి వివాహం అనేసరికి ఎందుకో నవ్వు తన్నుకు రాసాగింది.
తాతాచార్యులు వింతగా చూసాడు. 'రామలింగడు ఎంత అదృష్టవంతుడు అందాలభరిణ వంటి యువతి లభిస్తోంది." అని కుళ్లుపడ్డాడు. ఎంతమంది ఎన్నో రకాలుగా అనుకుంటున్నా రామలింగకవి చిర్నవ్వుతో అలానే కూర్చున్నాడు.
"ప్రభూ! రామలింగని మౌనం పూర్ణాంగీకార సూచన, ఆ యువతికిచ్చి పరిణయం
చేయండి. అంతటి అందగత్తెను చేపడ్తున్న రామలింగడు ఎంతో అదృష్టవంతుడు. అట్టి భాగ్యం నాకు దక్కనందుకు నిజంగా విచారించుచున్నాను. "
మాదయగారి మల్లన నవ్వాపుకుంటూ చెప్పాడు. తాను రామలింగని ఓ ఉచ్చులో బిగించాను అని ఆనందంతో... మల్లన
మాటలకి సభ నవ్వులతో నిండిపోయింది.
“నా కావ్యంలో నాయికలా ఉన్న ఈ యువతిని భార్యగా పొందడం పూర్వజన్మ సుకృతం. అట్టి పుణ్యం ఏ జన్మలో రామలింగడు చేసెనో కదా ! ఈమెను చూసాక నేనేల గోవా పోకుండా ఇక్కడనే పడియుంటిని అని బాధపడ్తున్నాను. నాకు ఇలాంటి అవకాశం వచ్చిన క్షణం ఆలస్యం చేయను. ఇంక యోచించెదవేల” దూర్జటి రామలింగని వద్దకు వచ్చి భుజం తట్టాడు.
"ఓయీ రామలింగా ! నీవు వాగుడుకాయ వైనా ఏమూలనో అదృష్టం మాత్రం నిన్నే వరిస్తున్నదయ్యా! నాకందని ఈ భాగ్యం నీకు దక్కినందుకు లోలోపల బాధపడ్తునే ఆశీర్వదించుచుంటిని.” అలసాని పెద్దన తన పెద్దరికాన్ని నిలుపుకుంటూనే తన కుతకుతను బయటపెట్టాడు.
"భళీ రామలింగా, ఇట్టి లావణ్యము ఏరి కోరి వస్తుంటే ఇంకనూ ఉపేక్షించెదవేల ? నా మనస్సులోనూ ఆమె అందం తిష్ట వేసినది. కానీ, మందమతి మాదయ్యగారి మల్లన వలన నీవే పరిణయమాడాల్సి వచ్చినది.” రామ రాజభూషణుడు నిష్టూరంగా చెప్పి కూర్చున్నాడు.
"ఎంతో ధైర్యం ప్రదర్శించేవాడివి ఓ దిక్కులేని ఆడదానికి నీ నీడలో ఇంత చోటు ఈయరాదా ? ఎందుకా మౌనం. నీ భార్య నిన్ను గడపలోకి రానీయదని భయపడకు. మేము సర్దిచెప్పగలం. నీవంటివాడికి ఇద్దరు భార్యలు ఉంటే తప్ప నీ ముక్కుకు తాడు పడదు. అయినా ఇంతటి అందాలరాశి మన భార్యల్లో ఎవరున్నారు ? ఈమె కోసం ఎంతటి
త్యాగమైనా చేయవచ్చు.” పింగళి సూరన నవ్వుతూ చెప్పి దగ్గరగా వచ్చి చెవిలో ఏదో రశికగుళిక చెప్పి పకాలున నవ్వాడు.
"ఏమిటయ్యా ఇంతమంది నీకు చెప్తేగాని, వినవా? నీవు కొత్త పెళ్లి కొడుకులా తెగ మారము చేస్తున్నావు. నీవు అందగాడవని నీకు ఈ అవకాశం రాలేదు. ఏదో నీకు మరో అందాల విందు రాసి ఉన్నందున గోవా వరకు వెళ్లావు. నేనయితే ఈపాటికి మరో గృహంలో ఈ భరిణతో కాపురం పెట్టేయ గలను. నీవు ఓ ఛాదస్తపు బాపడవి.” అయ్యలరాజు రామభద్రుడు ఒకింత నిష్టూరంగా మాట్లాడాడు.
"సరే ఇంతమంది చెప్పాక నాకు తప్పేట్లు లేదు. చెప్పక చెప్తున్నా! ఓ రామలింగా నీకు ఇంతటి అందాలచిలుక ఎన్ని జన్మలు తపస్సు చేసినా లభించదు. నీవు ఎదుటి వాడిని విమర్శించడానికి పుట్టావు. మా వద్ద సాగినట్లు ఆడవాళ్ల వద్ద నీ ఆటలు సాగవు గాక సాగవు. అని గ్రహించి నీవు మిన్నకున్నావు." అని అక్కసుగా పలికి ఇటు తిరిగి, ఆ ముస్లిం యువతిని చూసి...
"ఓ కోమలాంగి, ఇక్కడ అంతా విన్నావు కదా ! ఈతడు ఒకరకంగా మేకవన్నె పులి లాంటివాడు. చూడు ఎలా మిన్నకున్నాడో. ఇలాంటి వాడితో నీవు జీవించుటెట్లు ఆలోచించుకో " చెప్పి కూర్చున్నాడు నంది తిమ్మన.
ఇక లాభం లేదని తాతాచార్యులు లేచి..
“నీకు మేమూ చెప్పాలా? లేకుంటే ఇంతమంది చెప్పినా నీలో రవ్వంతైనా చలనంలేదు. నీ మనస్సులో ఉన్నది చెప్పు, నీకు ఈ వివాహం ఇష్టం లేదా ?” అని అడిగాడు.
తెనాలి రామలింగడు చిర్నవ్వుతో అలానే కూర్చున్నాడు.
రాయలు నవ్వులు ఆపి " రామలింగా ఇంతమంది నీ తోటి కవులు, మన తాతాచార్యులు వారు చెప్పాల్సింది చెప్పారు. మరి ఎందుకా మౌనం? అంగీకారం అనుకొందునా లేక తిరస్కారమ నుకొందునా ?" సభలో ఆయన కంఠం ఖంగుమంది.
రామలింగడు లేచి నమస్కరించాడు. గొంతు సవరించుకున్నాడు.
"ఏలినవారికి నా హృదయపూర్వక నమస్సులు. ఇక్కడేం జరుగుతోంది. నాకు అర్ధంకావడంలేదు. ఐనను మా ప్రభువుల వారు నన్ను ఆదేశించారు కనుక బదులు చెప్తున్నాను.”
కవులు కసిగా రామలింగని వైపు చూడసాగారు. 'చిక్కావురా రామలింగా, మా పగ తీరబోతోంది.' అని లోగొంతుతో మిగిలిన కవుల చెవులకే పరిమితంగా చెప్పాడు ముక్కుతిమ్మన.
ముసుగు పరదాల మాటున ఉన్న ఆ యువతిని రామలింగడే స్వయంగా ఓ మూల నుంచి తీసుకువచ్చి...
"ప్రభూ.. ఒక్కసారి చూడండి. ఈమె శరీర ఛాయ ఏ రంగులో ఉంది. ఈమెఅందమైన ముఖంలో చంద్రుడు ఉన్నాడా లేక కలువ లున్నాయా ? ఈమె వయస్సు ఎంత? ఈమె మనస్సులో ఏముంది. తొలుత తమరే చెప్పండి.” సూటిగా రాయలనే అడిగాడు.
రాయలు పెద్దగా నవ్వి "ఇదెలా సంభవం ? ఆమె పరదా ముసుగులో ఉంది. కనీసం ఆమె నీడలా కూడా కన్పించడంలేదే. మరి నేనెలా చెప్పగలను అని నన్ను ఈ విధంగా ప్రశ్నిస్తున్నావు.” అన్నాడు.
"రవిగాంచని చోట కవి గాంచు. మా పిచ్చి కవులు ఈ పరదాల మాటున ఉన్న యువతిని ఆమె అందాలను చూసినట్లు భ్రమలోపడి పైత్య ప్రలోభంతో అడ్డమైన కారుకూతలు కూస్తుంటే మనమంతా విన్నాం. వినడమే కాదు. వారి పిచ్చిలో మనం కలిసిపోయాం. ఈ పిచ్చి కవులను నేను కోరుతున్నాను. ఈమె మేని ఛాయ ఏ రంగులో ఉందో చెప్పమనండి." కోపంతో రామలింగడు ప్రశ్నించాడు.
ఒక్కసారి సభ అంతా నివ్వెరపోయింది.
“మేమెందుకు ఆమె రంగులు చెప్తాం. నీకే ఆ రంగులతో పని..అనవసరంగా నువ్వు మమ్మల్ని ఇరికించాలని చూడద్దు. నీ మాటల గారడీ ఆపి అసలు విషయానికి రావయ్యా" నంది తిమ్మన లేచి కోపంగానే బదులిచ్చాడు..
👳♀️
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀
*సశేషం*తెనాలి రామకృష్ణ - 19
👳♀️
హలీం రుచి వారెవాహ్ ! - 2
"ఆపు ముక్కుతిమ్మా! నీవా నన్ను గారడీవాడిగా జమచేయునది. వేశ్యా వాటికల్లో పవిత్ర ప్రబంధాలను వేశ్యల ముందు ప్రదర్శించే నీవా నన్ను తప్పు పట్టేది. మీరంతా కలిసి నన్ను మరో పెళ్లి చట్రంలోకి నెట్టేయ్యాలని చూసారు. అందుకే ఒడలు మరచి నోటికి వచ్చినట్లు కూయసాగారు. ఆమె అందాల్ని పొగిడాడు ఒకడు. ఓ అదృష్టాన్ని కోల్పోయాను అని మరొకడు. నాకు దక్కని ఇంతటి అందాల చిలకను పొందిన నీవు ఎన్ని జన్మముల తపస్సు చేస్తివో అని ఇంకొకడు. ఓ కవి అయితే తానేల గోవా పోలేదు, పోయి ఉన్నచో నాకే దక్కెను కదా ఈ భాగ్యం అని ఏకంగా సభ సాంప్రదాయాలను మరిచి చెప్పుకుంటుం టే ఎంతగా దిగజారితిమో నని బాధపడితిని. మన పింగళ సూరన వారైతే మన ఆడవాళ్ల కంటే ఈమె అందగత్తె అని చొంగకార్చిన వైనం అతి హేయం." రామలింగడు పిడుగులు కురిపించినట్లుగా ఎలుగెత్తాడు.
నవ్వులతో సభ అంతా హోరెత్తిపోయింది. కవులు మాత్రం ఇలా చుట్టూ తిరిగి తమకే ఎదురు తిరుగుతుందనుకోలేదు.
"నేనే ఈమెను తీసుకువచ్చితిని. కనుక ఆలనాపాలనా చూడాల్సిన బాధ్యత నాదేనని సెలవియ్యక ఏకంగా పెళ్లి చేసుకోమని తీవ్ర స్థాయి ఒత్తిడి తీసుకు వచ్చారంటే వీరి మనస్సులో ఎంతటి మాలిన్యం ఉన్నదో అర్ధం అవుతుంది. నేను ఒకవేళ వీరి ఒత్తిడి పై ఈమెను పెళ్ళి చేసుకుంటే నన్ను అగ్రహారం నుంచి గెంటి వేయడానికి గోతులు సిద్ధం చేసేవారు. నన్ను కులభ్రష్టుడ్ని చేయడానికి అన్ని వైపుల నుంచి కులంచే దాడులు కూడా చేయించేందుకు పతకాలు వేసేవారు. మనం చేయుపని ఏమిటి ? పెక్కు ప్రబంధాలను రాయల్సి ఉంది. ఆ పనిలో కుదురుగా కూర్చోకుండా ఈ నీచపు పని ఏమి ?".
రాయలు ముఖంలో రంగులు మారాయి. ఒకసారి కవుల వైపు కను చివర్లలోంచి చూసాడు. వారిలో ఏదో తెలియని లొసుగు, అభద్రత కన్పించింది.
'రామలింగడు చెప్పింది నూటికి నూరుపాలు నిజం. నల్లని మేలిముసుగు లో ఏమాత్రం కనిపించని ఆమె రూపం తాము చూసినట్లు ఆమెను పొగిడి బలవంతంగా కట్టబెట్టాలనుకోవడం పెద్ద తప్పిదమే.' అని రాయలు లోలోపల అనుకున్నాడు. రామలింగని వైపు ఒకింత జాలిగా చూసాడు.
"ప్రభూ నన్ను చెప్పమందురా ? పోనీ వీరిలో ఏ కుట్రలు లేవనే అనుకుందాం. ఇంతమంది మధ్య ఓ యువతి ముఖం ముందే ఈమె నాకిష్టం అంటే నాకిష్టం అని ఎలుగెత్తి చెప్పారు. చెప్పి నన్ను పెళ్లి చేసుకోమంటున్నారంటే వీళ్లనేమనాలి. నేను పెళ్లాడుతానని ఆమె అందాలను పదేపదే పొగిడి నన్ను ఆమె వైపు మరల్చ డానికి ఎంతకు తెగించారు. వీరు భట్రాజుల ను మించిపోయారు. వీరి ముందు వేశ్య వాటికల్లో వెలయాళ్ళ ఇంట ఉండే విదూషకులు, వికటకవులు బలాదూర్. ఛీ! ఎంత జుగప్సగా ప్రవర్తించిరి. అయినను నా విధి నేను పాటిస్తాను. ఇక నాలో ఉన్న నా నిర్ణయం చెప్తున్నాను.
ఈమెనింతవరకు నేను చూడనేలేదు. చూడాలని కోరుకోవడంలేదు. నా చూపుకు పరదా ముసుగులో ఉన్న ఈమె ఓ గర్భస్త శిశువులాంటిది. ఈమె నా కూతురుతో సమానం. కనుక ఈమె యోగక్షేమము లను నేను చూడగలను. ఇదే నా నిర్ణయం" ప్రకటించి కూర్చున్నాడు రామలింగడు.
రాయలు విప్పారిన నేత్రాలతో చూసాడు. కవులు తప్ప అంతా రామలింగడు చెప్పినదానికి ఆనందించారు. రామలింగ కవి నిర్ణయం సరైనది అని హోరెత్తారు.
“ఆమె యోగక్షేమములు నీవు ఎలా ఏ విధముగా చూడగలవు" రాయల ప్రశ్న..
"ప్రభూ ప్రేమ పిచ్చిలో ఓలలాడుతున్న ఈ కవులు ఈమె అంటే చాలా ఇష్టపడ్తున్నారు కనుక నాకో అవకాశం ఇప్పించండి. వీరిలో ఒకరికి ఈమెను కట్టబెడతాను. అంతా ఈమె లేనిదే తాము లేము అని తమ ముందే వందలాది మంది ఉండే సభలో చెప్పారు. మరి నేను గోవా నుంచి తీసుకు వచ్చినందుకు ఈమె యోగక్షేమములను చూడాల్సిన బాధ్యత నాకుంది. ఇంట్లో ఈ ఆడకూతురిని దాచుకోలేను కదా !” చేతులు జోడించి కోరాడు.
రాయలు ఆలోచించి “ఇంతటితో ఈ తతంగం ముగించరాదా? ఈమెకు తక్కువ వ్యవధిలో ఓ అందమైన ముస్లిం వరునితో వివాహం జరిపించగలను. నీకెందుకు శ్రమ. కవుల లోకం ఏదో తప్పుచేసినట్లుగా బాధపడ్తున్నారు. క్షమించి వదిలేయరాదు” అన్నాడు.
"ప్రభూ! మన్నించండి. కవీశ్వరులు ఈమెను చాలా ఇష్టపడ్తున్నారు. వీరి కోరిక తీర్చాలి. వీరిలో ఎవరెన్ని తపములు చేసారు. ఎంతటి భాగ్యం వరించనున్నారో? చూద్దాం. నా తోటి కవులారా! ముఖ్య విన్నపం. ఈమెను మీరంతా ఇష్టపడ్తున్నా రని మీకుగా మీరే వాగారు. ఈమె వివాహ పరీక్షలో మీరంతా ఉన్నట్టే. ఇష్టంలేనివారు నిరభ్యంతరంగా వెనక్కిపోవచ్చు. కానీ, అలా వెళ్లిపోవాలంటే ముందు ఈమె అందాలను మీ పాపపు బుద్దితో పొగిడి అవమానించినందుకు ఆమెకి క్షమాపణలు చెప్పాలి. మీరు భట్రాజులా, వికటకవులా, విధూషకులా ఈ మూడింటిలో ఏదో ఒకటి ఈ సభలో ఒప్పుకుని తీరాలి.”
సభలో అంతా కవుల వైపే చూడసాగారు.
రాయలు గంభీరంగా రామలింగడు వైపు కన్నార్పకుండా చూడసాగాడు. చాప కింద నీరులా వెన్నుపొడవడానికి సిద్దపడిన కవులను చాలా తెలివిగా సభలో అందరి ముందు భలేగా నిలబెట్టినందుకు వినోదించాడు. కవుల మధ్య గొడవలు రాయలకు వినోదమే.
కవులు ఎవరూ నోటమాట లేకుండా ఉన్నారు. ఏం చెప్పాలి. బాగా ఇరుక్కున్నా, ఏమిటి దారి ? ఇదంతా మరో చోట ఐనా బావుణ్ణు. ఏకంగా ఏలినవారి వద్ద పుట్టలో పిట్టల్లా దొరికిపోయాం. రాయలు మౌనం వహించాడు. అంటే తమ పీకలకు ఈ రామలింగడు బిగించిన ఉచ్చు బలంగా బిగుసుకుంటోంది. అని ఎవరికి వారే మనస్సుల్లో బాధపడసాగారు.
రామలింగడు ఆమెను రెక్కపట్టుకుని ముందుకు తీసుకువచ్చి "ఏమ్మా వీరిలో ఎవరినైనా నీవు వివాహం చేసుకోగలవా ? అని నేను అడుగుతాననుకున్నావు. నీవు నీకు నచ్చినవారినే చేసుకోవచ్చు. వీళ్లంతా పిచ్చి కవులు. పిచ్చి ప్రేమికులు. పదా నా ఇంటికి. పెళ్లినాడు నాతో కలిసి వివాహ మండపానికి విచ్చేయుదువు." అని నడిపించుకుని సభలోంచి బయటికి వెళ్లి ఆమెను బయటే నిలిపి తిరిగి ఒంటరిగా పరుగులాంటి నడకతో విచ్చేసి...
"అయ్యా పెళ్లి కొడుకులు, రేపే మీరు హజార రామాలయం ప్రాంగణంకు రావాలి. ఒకవేళ రాకుంటే ఒప్పుకోను. అలా రాని వారు ఆడంగిలతో సమానం. శిఖండిలుగా గుర్తింపు లభిస్తుంది. నా మీద ప్రయోగం చేసిన కథనంలో నాయిక అంబ, ఆమె భీష్ముడు కాదంటే శివుని మెప్పించి శిఖండి గా జన్మించింది. అలాంటి శిఖండిలుగా అవతరించకండి. రేపు నా కూతురుకాని కూతురు స్వయంవరం మీతోనే. మీలో ఎవరికి దక్కునో ఆ అదృష్టం. ఈ రాత్రి ఆమె కోసం తపస్సు చేయండి. ఆ దేముడి దయవలన మీలో ఎవరికో ఒకరికి దక్కును మీ కలల రాణి. "
సభికుల నవ్వుల మధ్య చెప్పి రాయల వైపు తిరిగి “ ఈ వివాహానికి తమరిని ఆహ్వానించలేకపోతున్నాను. రేపు సభకు కొత్త దంపతులను తమ వద్దకే నేరుగా తీసుకురాగలను. ఇందుకు నాకు కొంత సైన్యం, కొంత ధనం అవసరం. అలాగే తూర్పు దిక్కు గవాక్షం కాపలాదారు ఉర్దూ కవి, జమీనుల్లాఖానును, నాతో ఉండేందు కు అనుమతినిస్తూ ఆ ఏర్పాట్లు చేయగలరని ఆశిస్తున్నాను.” అన్నాడు రాయలకి ప్రణామం చేస్తూ రామలింగడు.
రాయలు నవ్వి సర్వసేనానికి ఆదేశాలిచ్చా డు.
📖
నగరమంతా భువనవిజయంలో రాయలవారి నుంచి గొప్ప గౌరవాలను పొందే తెలుగు కవుల పునర్వివాహాల గురించి కోడైకూసింది. కొంతమంది పౌరులు ఏకంగా తిట్టిపోసారు.
“ఇదేం పోయేకాలం ఈ ముసలి పీనుగు ల్లాంటి వారికి ఈ వయస్సులో కన్నెలపిచ్చి ఏమిటి ? కావ్యాలు తాళపత్రాల పై రాసి రాసి చివరికి వాటిల్లో ఉన్న పురాణ నాయకులమనుకుంటున్నారు. దేవతలు, రాక్షసుల్లా పెక్కుమందిని పెళ్లి చేసుకునే వరకు ఈ కవులు ఎదిగారు. రాయల ఆస్థానంలో కూటికి చేరినవారు ఎంత నీచానికి ఒడిగట్టారు. కవులే ఇంతగా తెగిస్తే ఇంక న్యాయం ఉండి కూడా ఏం ఏడుస్తుంది? రామలింగకవి వీరిపాలిటి కాలయముడయ్యాడు." అని చెప్పుకోసాగారు.
నగరంలో ప్రజలు ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ. కవులు తమ ఇళ్లల్లో తమ భార్యలకి తెలియకుండా జాగ్రత్తపడ్తూనే, ఒక విధంగా ఆ యువతి పెళ్లి రామలింగడితో చేయిద్దామంటే ఏకంగా మన పీకకు చుట్టుకుందేమిటా అని ఎవరికి వారు తెగ బాధపడసాగారు. ఆ పరదాసుందరి అసలు అందగత్తా లేక అనాకారా ? అనవసరంగా ఊబిలోకి దిగిపోయాం. తప్పించుకునే దారి లేదా అని ముచ్చె మటలుపోసారు.
ఈలోగా కవులందరిని కలిసి ఓ రహస్యం చెప్పాడు మాదయ్యగారి మల్లన. అదేమిటి అంటే..“రేపు రామలింగడు మనకు పెట్టబోయే పరీక్ష ఏమిటోతెలుసా ? ఆ పెళ్లికూతురు అరబ్బుల పిల్లంట. ఆమె అరబ్బీ పాక శాస్త్రంలో దిట్ట అంట. ఆమెతో హలీమ్ అనే వంట చేయించి, మనకు పెట్టిస్తాడంట. అది తిన్న తరువాత ఎవరు బాగుంది అని చెప్తే వారిని ఆమెకి ఇచ్చి పెళ్ళి చేస్తాడంట. ఇక్కడే ఆ వెర్రి వెంగళాయి పప్పులో కాలువేసాడు. మన మంతా బావుందని ఎవరికివారే చెప్పుదాం. ఆ రామలింగడు పైత్యం కుదురుతుంది. పిల్ల ఒక్కతే. మనం ఏడుగురం. ఎక్కడ నుంచి తీసుకురాగలడు? ఏడుగురు ముస్లిం యువ తులను. ఈసారైనా మనం వాడిని ఇరుకున పెట్టాలి.”
మళ్లీ మాదయ్యగారి మల్లన రెండో పతక రచనకు అంతా తప్పదని తలలూపారు. ఏదిఏమయినా రేపటి పరీక్ష గురించి ముందే బాగానే సేకరించాడు. ఎంతటి వాడైనా తప్పులు చేస్తుంటాడు కదా! ఆ వాగుడు కాయ రామలింగాన్ని చావు తప్పి కన్ను లొట్టపోయే దెబ్బ కొట్టాలి. ఈసారి మనం సంఘటితంగా పని చేద్దాం. నీవు భలే సేకరించావు అని మెచ్చుకున్నారు.
మరుసటి రోజు కవులు హజారా రామాల యంకు అతికష్టం మీద చేరుకున్నారు. ఆరోజు దేవాలయంలో మధ్యాహ్నం గర్భ గుడి తలుపులు వేసి ఉన్నందున భక్తులు లేక ఖాళీగా ఉంది.
" హమ్మయ్య ఆ రాముడు మన నిర్వాకం చూడకుండా అయ్యింది. ఎంత తప్పు. అన్య మతపు పిల్లను మనం చేసుకుంటే ఇంకా ఏమైనా ఉందా ? అవును ఆ పిల్ల వండివార్చింది తినమంటాడు ఈ వెర్రి రామలింగడు. కొంపదీసి ఆ అరబ్బీ వంట లో ఏ పీనుగు మాంసం కలిసిపోయిందో.. నేరకపోయి అనవసరంగా ఆ రామలింగడి విషయంలో దూరాం." అని అలసాని పెద్దన కవులు చెవులకే పరిమితం అన్నట్లుగా తన బాధను వ్యక్యం చేసాడు.
అప్పటికే అక్కడికి చేరుకున్న ఉర్దూ కవి, గవాక్ష కాపలాదారు, జమీనుల్లాఖాన్ కవులను చూసి తల వంచి నమస్కరించాడు.
"వేడివేడిగా మా అరబ్బీపిల్ల వండిన హలీమ్ అనే వంట రుచి చూసాక, స్వయంవరానికి సిద్దం అయిపోవడమే.” నవ్వుతూ చెప్పాడు.
“నాయనా వయస్సులో చిన్నవాడివి. నీవైనా చెప్పలేకపోతివా ఆ గడుగ్గాయి రామలింగనికి. ఆ వంట తినడంలో అభ్యంతరం లేదు గాని అందులో ఏమైనా పశుమాంసం కలిసినచో మా బ్రాహ్మణత్వం ఏంకావాలి? అలాగే చూస్తూ పవిత్రమైన ఆలయంలో ఇలాంటి తినుబండారాలను రానివ్వరాదు. కానీ మాచే తినిపించి మమ్మల్ని భ్రష్టుపట్టించాలని చూస్తున్నాడు మా కొరివి రామలింగడు.” దూర్జటి చాలా ఇబ్బంది పడ్తూనే చెప్పాడు.
ఆయన మాటలకు వంత పాడారు మిగిలిన కవులు.
"మరి మీరంతా పాపం ఆ రామలింగకవి గారికి మరో మతం పిల్లతో పెళ్లి చేయాలని చూసారు. మీరన్నట్లు ఆయన భ్రష్టుపట్టి పోడా ?".
“నాయనా నీవు ఉర్దూ కవివి, అతని ఉచ్చులో ఉన్నావు. ఆ మాటలనే వల్లె వేస్తున్నావు. మమ్మల్ని ఈ యమగండం నుంచి తప్పించరాదా! నీకు జన్మజన్మలకు ఋణపడి ఉంటాం. నిన్ను రాయలవారి కొలువులో మాతో బాటే కవి స్థానం కల్పించగలం. ఇక గవాక్ష కాపలా నీకు ఉండదు." అలసాని పెద్దన కొత్త ఆశలు చూపాడు..
"నేను చిన్న కవిని. అదీ ఉర్దూలో రాస్తాను. నా కవిత్వాన్ని ఏదో రోజు రాయలవారు గుర్తిస్తారు. ఒకరోజు రాయలవారికి నేను రాసిన ఓ ప్రేమ గీతాన్ని రామలింగకవిగారే విన్పించి నన్ను పరిచయం చేసారు. నాకు ఎలాంటి ఆశలు లేవు. అదిగో ఆ గదిలోకి మీరంతా ఒక్కొక్కరే వెళ్లి పెండ్లి కూతురు చేసిన వంట హలీమ్ ని తిని మీ మీ అభిప్రాయం చెప్పండి." అన్నాడు.
"ఏడీ ఆ రామలింగడు.. అంతా నీచే జరిపి స్తున్నాడు. పుట్టగతులుండవు. బ్రాహ్మణ ఉసురు ఊరికేపోదు. పది జన్మల వరకు వెంటాడుతుంది.” దూర్జటి వారు కోపంగానే దుయ్యబట్టారు.
రామలింగడు లోపలికి వచ్చి "కోరకుండానే కొత్త దుస్తులు వేసుకొచ్చారు. పెళ్లి పిచ్చి అందరిలో బాగా రాజుకుంది. తొలుత పెద్దలు పూజ్యులు అలసాని పెద్దనార్య ఆ గదిలోకి వెళ్లి ఆరగించండి, అదే హలీమ్ను తిని అక్కడే తమ కోసం ఎదురు చూస్తున్న పరదామాటున ఉన్న యువతికి చెప్పండి.” అన్నాడు.
"రామలింగా ఇప్పటికైనా మించిపోయింది లేదు. నా మాట విను, ఈ పిచ్చి పనిని ఇంతటితో ముగించి క్షమాపణలు వేడుకో ! నిన్ను జాలితో విడిచిపెడతాం. నువ్వు ఈ పరీక్ష కారణంగా అభాసుపాలవుతావు.” హెచ్చరించాడు అలసాని పెద్దన.
“ముందు వచ్చిన పని కానివ్వండి. మీ హెచ్చరికలు నాకు కొత్తకావు. మీరు వెళ్లాల్సింది అదిగో ఆ కనిపిస్తున్న గదిలోకి. అందులో ఈ ఆలయం యొక్క జమా బందీలు చూసే గదిగా వాడుతున్నారు. ఓపికగా కొద్ది దూరం నడవాల్సిందే.”
"వినాశకాలే విపరీత బుద్ది అని నీలాంటి వారినే అంటారు." అని రోషంతో అటు వైపు సాగాడు. వెళ్లిన కొంత సమయం తరువాత, ఒక్కసారి బాజాభజంత్రీలు విన్పించాయి.
"అదేమిటి అప్పుడే పెద్దన వారికి పెళ్లి అయినట్లుందే." రామరాజభూషణుడు ఉత్కంఠగా అరిచాడు. ఆ వెంటనే ఆ భజంత్రీలు అలా అలా దూరం దూరం అయిపోయాయి. అక్కడ ఏమి జరిగిందో ఎవరికీ అర్ధంకాలేదు..
👳♀️
సశేషం
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*తెనాలి రామకృష్ణ - 20*
👳♀️
*హలీం రుచి వారెవాహ్ ! - 3*
"అయ్యా దూర్జటివారు తమరి వంతు"
దూర్జటి అలా వెళ్లిన తరువాత మళ్లీ భజంత్రీలు మ్రోగాయి. కొద్దిసేపటిలో దూరం అయిపోయాయి. ఈసారి కవులు కళ్లు సాగదీసుకుని మరీ చూసారు. ఏం జరుగుతోందక్కడ ? అని ఉత్కంఠభరితు లయ్యారు.
"అయ్యా రశిక సార్వభౌమా బహుపరాక్. తమరు దయచేయండి.”
“ ముద్దు పలుకుల ముక్కుతిమ్మనవారు” తిమ్మన రుసరుసలాడుతునే వెళ్లాడు.
మళ్లీ అదే తంతు. వెళ్లిన కొద్దిసేపటికి భజంత్రీలు మ్రోగడం. ఆ వెంటనే దూరం కావడం జరిగిపోతోంది.
మిగిలినవారికి భరించలేని ఉత్కంఠగా ఉంది. రామలింగడిని అడిగేంత చొరవ ఇక్కడున్న మిగిలిన కవులకు లేదు. ఒక వేళ ధైర్యం చేసి అడిగితే కరిచేట్టున్నాడు. భయంతో బిక్క ముఖాలు వేసుకుని చేష్టలుడిగి ఉన్నారు.
“రామరాజభూషణా నిన్ను హలీమ్ పిలుస్తోంది. తృప్తిగా తిని నచ్చింది లేంది చెప్పు.”
"రామలింగా ఇంకా ఎంతకాలం నీ మిడిసి పాటు ?” తిక్కగా బదులిచ్చి వెళ్లాడు.
ఆ తరువాత మాదయగారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు, చివరగా పింగళి సూరన వెళ్లారు.
పింగళి సూరనకు పరదా సుందరి ఆకులో వడ్డించింది. "చూడడానికి ఈ హలీమ్ ఎంతో అందంగా కన్పిస్తోంది. కొంపదీసి మాంసం కలియలేదు కదా! అన్నట్టు ఇక్కడికి వచ్చిన కవి భజంత్రీలతో ఎటు సాగిపోతున్నాడు. అంతా అయోమయం గా ఉంది" అని ప్రశ్నలు కురిపించాడు. అక్కడ ఉన్న సైనికులు యమదూతల్లా నిలబడి ఉన్నారు.
"అయ్యా తమరు తిని ఎలా ఉందో చెప్పడం వరకే, ఎలాంటి ప్రశ్నలకు ఈమె బదులీయదు." అని కటువుగా చెప్పారు.
“తినకపోతే సభలో ఆ వెర్రి రామలింగడు ఏ శిఖండీ అనో వేశ్యవాటికల్లో తిరుగాడే వికటకవి అనో పిలిచి గేలిచేస్తాడు. ఆ బాధ కంటే ఏదో తిని అందరిలా బావుంది అని చెప్తే పోలా అని ఓ నిర్ణయానికి వచ్చాడు. నాలుగు ముక్కలు తిన్నాడు. రుచి యమగా ఉంది. పంటికింద సాగుతూ నలుగుతుంటే శివశివా ఎంత తప్పు చేయుచుంటినో, నేను తిన్నది ఖచ్చితంగా మాంసపు ముక్కలే.. అయ్యో ఇంటికి వెళ్లగానే గోమూత్రంతో నోరు శుద్ధి చేసుకుంటే తప్ప పాపపరిహారం కాదు. ప్రాయశ్చిత్తమైనా చేసుకోవాలి. అని పరిపరి విధాలుగా దుఃఖించాడు.
“తిన్నది చాలు ఎలా ఉంది రుచి ? దీన్నే అంటారు చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి దొమ్మరి గుడిశెలు."
ఒక సైనికుడు విసుగ్గా అన్నాడు.
"బావుంది, ఈ పిల్లదాని చేతివంట బావుంది. నా పిండాకూడుకి ఎక్కువ. నా శ్రాద్ధానికి పెట్టే దానికంటే తక్కువ అని చెప్తే కుదరదు కదూ! అయితే చాలా బావుంది."
"ముక్కు ఏదిరా అంటే వెనకటికి ఒకడు రాయితో పగలకొట్టుకుని మరీ చూపించా డంట. అలా ఉంది నీయవ్వారం. తగుదునమ్మా అని కుర్రపిల్లని పెళ్లాడతాన ని వెంటపడ్డావు. తినకూడనిది ఆలయం లో తిన్నావు. ఇక నీకు పెళ్లే ఆలస్యం.” మరో సైనికుడు గేలిచేస్తున్నట్లు అన్నాడు.
వడ్డించిన పరదా ముసుగు యువతికి, పింగళి సూరనకు సైనికులు దండలు ఇచ్చి భజంత్రీలు మ్రోగగానే దండలు మార్చుకో మని చెప్పి ఆ పని త్వరితంగా పూర్తి చేసి కొత్త దంపతులను అక్కడ బయట సిద్దంగా ఉన్న పల్లకీ ఎక్కించి భజంత్రీల వెంట పంపేసారు.
పల్లకీలో కూర్చున్న పింగళి సూరనకు తల తిరిగినట్లు అయ్యింది. కవులందరం హలీమ్ తిని బావుంది అని చెప్పి ఆ ఒక్క పిల్లను అంతా కలిసి పెళ్లి చేసుకోవడానికి సిద్దపడినట్లు పెద్ద టోకరా పుచ్చాలని అనుకుంటే ఆ దిక్కుమాలిన రామలింగడు ఏకంగా ఏడుగురు కవులకు ఏడుగురు వేరే యువతులతో పెళ్లి చేసేసి చక్కగా చేతులు దులుపుకున్నట్లుంది. అసలు ప్రతీసారి ఆ రామలింగడే గెలుపుబాటలోఉంటున్నాడు. ఇప్పుడు ఇంతకీ ఎక్కడికి పోతుంది ఈ పల్లకీ అని అడ్డంగా ఉన్న పలుచని పల్లకీ తెరను ఒకింత తెరిచి చూసాడు.
ఎదురుగా రాజసౌధవం. ఒక్కసారిగా గజగజలాడిపోయాడు. పల్లకిని రాజ దర్బార్ లో దించారు బోయలు. సూరన కిందికి దిగాడు. అప్పటికే అక్కడికి చేరారు మిగిలిన కవులు. వాళ్ళు తోటకూరకాడల్లా వేలాడిపోయి ఉన్నారు. ఎవరి ముఖాల్లో నెత్తురుచుక్కలేదు. అందరి ప్రక్కన ఒక్కో పరదా యువతి ఉంది. సభంతా కలకలం గా ఉంది, నవ్వులతో నిండిపోయింది.
తెనాలి రామలింగడు తప్ప మిగిలిన కవులందరికి పునర్వివాహాలు హజారా రామాలయంలో జరిగిన వార్త దావానంలా నగరమంతా వ్యాపించిపోయింది. కవుల ఇళ్లల్లో తెల్సిపోయి ఆడాళ్లు లబోదిబోమని ఇదేం రాయలవారి తీరు, మా బ్రతుకులేం కావాలి, ఆ రాయలనే అడుగుదాం అని కవుల భార్యలు ఎవరికి వారే బయల్దేరి వచ్చారు. సభంతా ఒకటే ఉత్కంఠ, పడిపడి నవ్వుతున్నారు.
తిమ్మరుసు ఏనాడు అంతగానవ్విపోలేదు. ఇదేమాట పక్కనే కూర్చున్న తాతాచార్యు ల వారితో అన్నాడు. ఆయన పరిస్థితి అలాగే ఉంది.
"మన రామలింగడు ఉండాల్సిన వాడండి. భలేగా రోగం కుదిర్చాడు. అన్నట్టు వీరంతా ఈ కొత్త పెళ్లికూతుర్లను ఏంచేస్తారు ? ఇళ్లకు తీసుకుపోతారా ?" ఎదురు ప్రశ్న వేసాడు.
"మనం చూడడం వరకే అంతకుమించి ఏం చేయగలం" తిమ్మరుసు బదులిచ్చి ఆసక్తిగా కవుల వైపు దృష్టి నిలిపాడు.
రాయలకు అలసాని పెద్దన అంటే ఎంతో మక్కువ. అలాంటిది ఆయనను ఆ స్థితిలో చూడడం ఎంతో బాధ అనిపించింది. పెద్దన నేల చూపులు చూస్తూ నిలుచున్నాడు. పక్కనే పరదాల యువతి అంటి పెట్టుకునే ఉంది. అంతలోనే కవుల భార్యలు వచ్చారు. ఎరుపెక్కిన కళ్లతో భర్తల వంక కోపంగా చూసారు. నంది తిమ్మన భార్య అయితే సభలో భర్తను నిలదీసింది.
"ఏమయ్యా ! నీవు భార్య పిల్లల్ని ఏంచేద్దాం అని ఇంతగా తెగించావు. గత నెలలో ఉన్న దంతా ఆ భోగం దానికి దోచిపెట్టావు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు కానీ ఆ రామలింగకవి దయతో నా నగలు నేను కళ్ల చూసాను. ఇప్పుడు అదే రామలింగ కవి వలన నన్ను వదిలి మరో దాన్ని ఏకంగా ఏలుకోడానికి ఇంతగా తెగిస్తావా ? ఆ రామలింగకవి నీలా ఎవతెనో ఇలా గాంధర్వ విధిని పూలమాలలు వేసి తెచ్చాడా ? నీకు సిగ్గులేదు. ఈ రోజు అటో ఇటో తేలాలి. చక్రవర్తినే అడుగుతాను." ఏడుస్తూ అన్నది ఆమె.
మాదయ్యగారి మల్లన భార్య మరో అడుగు ముందుకు వేసి “మన్ను తిన్న పాములా పడిఉండే నీకు మరోకతె కావల్సి వచ్చిందా? ఏదో కావ్యం రాసి రాయలవారి మన్ననలు పొందక ఇలా అడ్డతోవలు తొక్కితే మనకేం మిగులుతుంది. చివరికి చిప్ప గతి అవుతుంది.” గుడ్ల నీరు కక్కుతూ భోరున విలపించింది.
అయ్యలరాజు రామభద్రుడు భార్య ఏకంగా తన భర్తకు రెండో భార్యగా వచ్చిన పరదాల మాటున ఉన్న ఆమె పై పడింది.
"ఏదో ఆ ప్రభువుల వారి కృపతో ఇలా బతుకీడ్చుచున్నాం. నీవు మా మధ్య దాపురించావు కదే పిశాచి" అని దాడి చేసినంత పని చేసింది. రాజ భటులు వారించారు.
“అందరికి చెప్పేటోడివి నీవు ఇలా దిగజారడం భరించలేకున్నాను.” అని అలసాని పెద్దన కాళ్లను చుట్టేసింది ఆయన భార్య. అంతకుమించి ఇంకేమీ మాట్లాడలేకపోయింది. ఆమె పెద్దరికాన్ని కాపాడుకోసాగింది.
“ఎదుటివాడు బాగుపడితే చూడలేవు కదా! ఆ రామలింగని పై నీ అక్కసు పెంచుకుని అతని నాశనం కోరావు. తోటి కవులతో చేతులు కలిపి ఏదో చేద్దాం అనుకున్నావు. తీరా మన మీద ఇలా తీర్చుకుంది. మీ ముదనష్టపు ఆలోచన నాకో సవతిని తెచ్చిపెట్టింది. రామలింగని భార్య చేసుకున్న పుణ్యం ఎన్ని జన్మముల నుంచి మూటకట్టిందోగాని భర్త వలన వీసమెత్తు ఇబ్బంది లేదు. నీవేదో మహా కవీశ్వరుడు అని నేరాణివాసం అనుభవి స్తానని నా తండ్రి నీపాల పడేసాడు. నువు చూస్తే భోగాల మనిషివి. ఇప్పుడు ఎవతో మనమతం కాని పిల్లను ఏక్షణం అయినా నా ఇంటికి తెచ్చిదించుతావు. బ్రాహ్మణ పుట్టుకపుట్టి రాముని సన్నిధిలో తినకూడ ని తిండి కుడిచితివి. ఇంకా ఏమేమి అనాచారాలు జరుగనున్నాయో ? నన్ను నా పిల్లల్ని నట్టేట ముంచావు.” నెత్తినోరు బాదుకుని పింగళి సూరనను మాటలతో ఉతికిపారేసింది అతడి భార్య.
రామరాజు భూషణుడు భార్య గొంతు పెద్దది, మొత్తం సభంతా విన్పించేట్టు ఎలుగెత్తి చెప్పాల్సింది చెప్పింది.
"ఈ వివాహం నేనొప్పుకోను. నా భర్తకు మళ్లీ పెళ్లి చేయడానికి ఆ రామలింగకవి ఎవరు ? మమ్మల్ని కులహీనులను చేయాలనుకుని అతడు మరో మతం యువతికి తండ్రిని అని చెప్పుకున్నాడు. అతడు మాలాగునే కుల భ్రష్టుడే. నోటి మాటలో తీపి కురిపించి అతడు చేతల్లో విషం గుమ్మరిస్తున్నాడు. ఇట్టివాడు ఈ రోజు మావంటి తాడూ బొంగరంలేనివారిని, రేపు రాయలవారినే ధిక్కరిస్తాడు. వీలుంటే దేశద్రోహానికి కూడా వెరువడు. కనుక ఇట్టివాని పట్ల అంతా జాగ్రత్తగా ఉండాలి.” అని నిప్పులు చెనిగింది.
దూర్జటి భార్య భర్తను ఏమి అనకుండా రాయలవారి సన్నిధికి వెళ్లి..
"అయ్యా! పండిత వంశం. మా కళ్లు వర్షించ రాదని మీకు తెలుసు. ఆయన ఎన్నో రాజ్యాలు తిరిగి ఎక్కడా జీవించు మార్గం లభించక ఇక్కడ మీ నీడలో ఏ లోటు లేకుండా గడిచిపోతుంది అనుకుంటే, ఆ రామలింగడు మాపై పగబట్టి కులభ్రష్టత్వం సమాజంలో విలువ లేకుండా చేసి భువన విజయంలో తెలుగు కవులందరిని తగిలేసి తానొక్కడే ఏలుకోవాలనుకుంటున్నాడు.
అతడి దుష్టతలంపును ఏలికలైన మీరు మొక్కగా ఉన్నప్పుడే తృంచాలి.” ఆమె చేతులు జోడించి అర్ధించింది.
అప్పటికే నవ్వి నవ్వి ఉల్లాసంగా ఉన్న రాయలు కవుల భార్యలు నిప్పులు చెణిగిన మాటలు విన్న తరువాత ఒకింత గంభీరంగా మారిపోయాడు. రామలింగని కోసం అతని కన్నులు వెతికాయి. సభలో చిర్నవ్వుతో కూర్చుని వింటూ కన్పించాడు రామలింగడు.
“రామలింగా విన్నావు కదా ! కవుల భార్యల ఆక్రందనలు. నీకు అప్పుడే చెప్పాను. ఇంతటితో వదిలేయమన్నాను. నీవు మొండిపట్టుదలతో నీ పని నీవు చేసావు. చూడు నారీలోకం శాపనార్ధాలు పెడుతోంది. ఇప్పుడు ఇది జటిలమైన సమస్యగా మారిపోయింది. నీవే ఎవరికి ఇబ్బంది లేకుండా న్యాయం చేయ్." అని ఆదేశించాడు.
రామలింగడు లేచి నిలబడ్డాడు. సభ అంతా నిశ్శబ్దంగా మారిపోయింది.
"నేను నా ఏలికకు మాత్రమే జవాబుదారి ని కానీ, ఈ నారీ లోకానికి కాదు. ఐనను ఇప్పుడేం కొంపమునిగింది అని ఇంతగా గగ్గోలు పెడుతున్నారు. ముచ్చటపడ్డారు భర్తలు. పెళ్లి చేసుకుని నవదంపతులై వచ్చారు. మనం కవులం, మనకు ఈ పురాణాలే కదా జీవిత ప్రమాణాలు. అంతే కాని ఆ పురాణాలను మనం పామరుల్లా కొట్టిపారేయలేం కదా, మనం నమ్మకపోతే ఎలా ? మీలాగనే అలనాడు పతివ్రత సుమతి అనుకుంటే ఆమె కోసం ఈనాడు చర్చ చేయాల్సింది లేదు. కుష్టురోగి భర్త ఓ అందాల రాశి పై మనస్సు పడితే, భార్యగా తన భర్త సుఖం కోరి ఆ అందాలరాశి ఇంటికిపోయి ఆమెకు ఊడిగాలు చేసి తన భర్తతో ఒక్కసారి గడపాల్సిందిగా కోరింది. ఆ కథనం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ముందు మనం పురాణాలను గౌరవిస్తే మన చుట్టూ ఉన్నవారు వాటి కోసం చెవులు కోసుకుంటారు. కనుక కొత్త పెళ్లి కూతురుని ఇంటికి ఆహ్వానించి వారికి మంగళహారతులు పట్టవల్సిన బాధ్యత అందరి పై ఉంది."
తొలి చురకను అస్త్రంలా సంధించాడు. మళ్లీ నవ్వులమయం అయ్యింది సభ.
రాయలు ఎటు తేల్చుకోలేకపోతున్నాడు. రామలింగడిని కూర్చోబెట్టి తనే తీర్పు ఇద్దా మంటే ఏకంగా కవులందరికి పెళ్ళిళ్ళు చేసి మరీ తెచ్చి నిలిపాడు. ఈ పెళ్ళిళ్ళు చెల్లవని చెప్తే పరదా ముసుగుల్లో ఉన్న వారికి తను అన్యాయం చేసినవాడు అవుతాడు. అసలు ఎలా ఈ సమస్యను పరిష్కరించేది.” అని ఆలోచిస్తూనే రామలింగడి వైపు చూసాడు.
కవుల భార్యలందరూ ఉగ్రరూపాలతో రామలింగని వైపు చూడసాగారు.
"మాకు ఆదర్శం ఆ దిక్కుమాలిన సుమతి కాదు. అదో పిచ్చిది. ఆ కుష్టుభర్తను ఆమె వ్యసనలోలుడిని చేసింది. మా వద్ద ఇలాంటివి సాగవు." బదులిచ్చింది రామరాజ భూషణుడి భార్య పెద్ద గొంతుతో.
“చెప్పానుగా మీకెవరికి నేను జవాబుదారి ని కాను. ఇక విషయానికి వద్దాం. మీవద్ద ఆటలు సాగవంటున్నారు. ఏంచేస్తారు. మీ భర్తలు ముచ్చటపడి చేసుకున్నారు. అనుభవించక తప్పదు. ఈ కొత్త పెళ్లి కూతుర్లకు అదే మీ సవతులకు మంగళ హారతులు పట్టండి.".
"రామలింగా! నీవే సమస్య పెద్దది చేసావు. నీవే దీనికి సత్వరం పరిష్కరించాలి. ఇది నా కోరిక. మరీ కవుల భార్యలు ఇలా బాధపడడం మనకెవ్వరికి మంచిదికాదు. వారు రోధిస్తున్నారు. వారు సంతోషంతో ఇక్కడినించి వెళ్లాలి. నీవేం చేస్తావో నాకు తెలియదు. అలా చేయగలిగితే నీకు ఇంతవరకు నేను పలువురు కవులకు పలు సందర్భాల్లో ఇచ్చిన ధనకనక వస్తు వాహనాల ఖరీదు లెఖించి అంత ధనం నీకు ఇవ్వగలను” రాయలు ఆశను కల్పించి ఆ పైన సున్నితంగా ఆదేశించాడు.
"చిత్తం ప్రభూ! నా తోటి కవుల భార్యలను సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయి ఈ ప్రాంగణం నుంచి వెళ్ళేట్టు చేయగలను. కానీ కొత్త పెళ్లికొడుకులు తొలుత కొంత ఆనందించినా వెలవెలబోతూ ఇక్కడి నుంచి వెళ్తారు. కనుక ఏలినవారికి జరగబోయేది ముందే చెప్తున్నాను.”
అంతా అయోమయంగా విని రామలింగని వైపు ఆసక్తిగా చూడసాగారు. రాయలు నవ్వి..
" రామలింగా నాకు కావల్సింది కవుల భార్యల ఆనందం. వారు మరి ఈ విషయంలో దుఃఖించరాదు.” అని తేల్చి చెప్పాడు.
అంతా ఉత్కంఠగా రామలింగని వైపు చూడసాగారు. ఎలా పరిష్కరించగలడు. కవులను పిచ్చివాళ్లను చేసి పెళ్లి చేసి సభలో నిలిపాడు. కొంపదీసి ఏడుగురు కవులు కొత్త భార్యలను రామలింగడే ఏలుకుంటాడా ? తాతాచార్యులవారికి తలదొలిచేస్తున్న అనుమానం. తన పక్కన ఉన్నవారందరితో గుసగుసలాడసాగా డు.
రాయలవారి ఆస్ధాన న్యాయనిపుణులు తలలు పట్టుకున్నారు. ఈ తుంటరి రామలింగడు ఎలా పరిష్కరించగలడు. ఇది అసాధ్యం. రాయలు ఇస్తామన్న పెద్ద మొత్తం ఆ పెళ్లికూతుర్లకు ఇచ్చి పంపేస్తా డా ? ఇంతకుమించి మరో మార్గం లేనే లేదు. ఈ దారే రామలింగడు ఎన్నుకున్నా డు అని వారు తర్కించుకున్నారు. రకరకాలుగా ఆలోచించుకున్నారు.
రాయలు ఉత్కంఠ భరించలేకపోతున్నా డు. పక్క వరుసలో కూర్చున్న న్యాయ నిపుణులను దగ్గరగా పిలిచి..
"సభలో ఉన్న ఈ సమస్య రామలింగడు ఎలా సుఖాంతం చేస్తాడు. మీరేమైనా ఊహించారా ?” లోగొంతుతో అడిగాడు.
"ప్రభూ రామలింగకవికి ఒకే ఒక పరిష్కార మార్గం ఉంది. తమరు పెద్ద బహుమతిని ప్రకటించారు. ఆ ధనం ఇప్పుడు అతడు తెలివిగా వాడతాడు. ఆ ధనంతో ఆ పెండ్లి కూతుళ్లను ఒప్పించి సాగనంపుతాడు. అందుకే తెలివిగా తమతో కవుల భార్యలు ఆనందిస్తారు కవులు తొలుత ఆనందించిన చివరికి బాధ పడతారని చెప్పాడు." అని నివేదించారు.
"నేను అదే ఆలోచించాను. మీరు అదే చెప్పారు. ఇంతకుమించి రామలింగడు చేసింది ఏమీ ఉండదు. ధనంతో కొనగలిగి తే అతడు అందరిలాంటివాడే. ఆ పని మనం అవలీలగా చేయగలం. అలా చేస్తే అతనికి ఏం మిగులుతుంది.” రాయలు నవ్వుతూ వారికి బదులిచ్చాడు..
" ప్రభూ ! ఇక ముడి విప్పుతున్నాను. కవులని పెండ్లి చేసుకున్న ఓ యువతుల్లా రా ఈ వైపుకు రండి.” అని పిలిచాడు.
యువతులు భర్తలను వదిలి వచ్చేసారు. తమ ప్రక్క నుంచి వెళ్లిపోతున్న పరదా యువతులను చూసి కవులు కూడా సంతోషంగా చూసారు. ఇక వారి భార్యలు అయితే ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. సభలో ఉన్న జనాలు
చేష్టలుడిగి మరీ చూస్తున్నారు.
👳♀️
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*తెనాలి రామకృష్ణ - 21*
👳♀️
*హలీం రుచి వారెవాహ్ ! - 4*
"ఓ యువతుల్లారా అన్నెంపున్నెం ఎరుగని కవులను మీరు గాంధర్వ వివాహం చేసుకున్నందుకు మిమ్మల్ని ఘోరంగా శపిస్తున్నాను."
తనతో తెచ్చుకున్న సంచిలోని కమండలం తీసి అందులో నీటిని తీసి చేతిలోకి పోసుకున్నాడు.
"ఈ క్షణం మీరంతా పురుషలయిపోదురు గాక !" అని శాపించాడు.
అంతా ఆ యువతుల వైపు కన్నులు చీరుకుని చూసారు. నిజంగానే ఆ యువతులు పురుషులయ్యారా లేక శాపం ఉత్తిదేనా ! అని తర్జనభర్జనలో మునిగారు.
"ఏయ్ రామలింగా.. ఏం చేస్తున్నావు. నీవేదో పక్కతోవ పట్టిస్తున్నట్టున్నావు. నీవేమైనా ఋషిపుంగవుడవా శాపం అంటున్నావు. సభను తప్పుతోవ పట్టిస్తే ఉపేక్షించను. ఈ శాపం అనేది బూటకం అని ఒప్పుకో ! లేకుంటే దండన తప్పదు.” కోపంగా హెచ్చరించాడు రాయలు.
"క్షమించండి ప్రభూ! నా శాపం తిరుగు లేనిది. మీకు అనుమానం ఉంటే రాజ భటులను పిలిచి పరదాలను తొలగించి చూసుకోండి. ఒకవేళ నా శాపం గురితప్పితే మరణదండనతో నా కథ ముగించండి. ఐతే యువతుల పై గల పరదాముసుగు లను తీసే ముందు ఆయా యువతులను పరిణయమాడిన కవులను అడిగి మరీ ముసుగులు తీయించండి. ఎందుకంటే భర్తలకు ఈ యువతుల పై అధికారం గలదు.”
రామరాజభూషణుని భార్య ఒంటికాలి పై లేచినట్లు లేచి “ మరో మతం యువతుల పై మా భర్తలకు ఎలాంటి అధికారం లేనే లేదు. మేమే భార్యలం. భర్తలకు మా పైనే అధికారం కలదు. మాకెవరు సవతుల్లేరు.” అరిచి చెప్పింది.
రాయలు ఆదేశించాడు. వెంటనే రాజ భటులు యువతుల మేలిముసుగులను తొలగించారు. అంతా మగాళ్లే, ఇదెలా సంభవం అని అంతా నోళ్ళు తెరిచి ఆశ్చర్యంలో మునిగితేలారు. కొందరు రామలింగడిలో ఏవో అద్భుతశక్తులు ఉన్నాయని నమ్మేదిశలో మూతులు కొరుక్కోసాగారు. రాయలు సరేసరి న్యాయ నిపుణులు తలలుపట్టుకున్నారు. కవుల భార్యలు సంతోషంతో తమ భర్తల వద్దకు వెళ్లారు. కవులు కూడా రెండో పెళ్లి తంతు వదిలిపోయిందని ఆనందించారు.
"అలసాని పెద్దనార్య మీ తల మీద ఉన్న బరువుతీరిపోయింది” రాయలు నవ్వుతూ పరామర్శించాడు.
మాదయ్యగారి మల్లన క్షణికానందాన్ని వదిలి “చెప్పానుగా ఈ రామలింగడు గారడీలు చేసే రకం. ఇప్పుడు ప్రత్యక్షంగా చూసారుగా ఈతడి నయవంచన. నిన్నటి యువతిని ఏం చేసాడో ఆమెనూ శాపంతో పురుషుడిని చేసాడా, లేక తన ఉంపుడు గత్తెగా పెట్టుకున్నాడా ? అడగండి ప్రభూ !” ఒత్తిడి చేసాడు. అతనికి వంత పాడాడు అయ్యలరాజు రామభద్రుడు.
"ఆ యువతి గురించి ఆరాలు మనకి ఎందుకు ?” కవుల భార్యలు కోపంతో తమ భర్తలను వెనక్కులాగారు.
“నా నయవంచనను బాగా వెలికితీసావు. నీ చింత చచ్చినా పులుపు చావలేదంటే ఇదే ! ప్రభూ నిన్నటి సభలో 40 మందిలో మిగిలిన యువతి పరదాలో ఉన్నందున అందరూ ఆమె అనుకున్నారు. కానీ ఆమె కాదు. అతను! గోవాలో అత్తరు తయారు చేసే ముస్లిం. అక్కడ పోర్చుగీసు గవర్నర్ ఆల్బుకేరక్ ముస్లిం వ్యతిరేకతను అత్యంత దారుణంగా ప్రదర్శించి ఒక విధంగా ముస్లిం లను గోవాలో ఏరిపారేసాడు. కనిపించిన వారిని ఏవో సాకులు చూపి వారిని హతమార్చడం, అతడి భార్య పిల్లలను బందీలుగా చెరలో పెట్టి హింసించడం. ఈ నేపధ్యంలో రజ్జుఖాన్ అనేవాడు పోర్చుగీస్ సైనికులకి చిక్కి ప్రాణాలు దక్కించుకోవడా నికి ఉన్నదంతా లంచంగా వారికి ఇచ్చేసి ఇలా పరదా ముసుగులో బందీ అయిన ఆడవాళ్ల మధ్య దూరి బిక్కుబిక్కుమని
మిగిలాడు. ఆల్బుకేరక్ 40 మంది యువతులను కానుకగా పంపినపుడు ఆ గుంపులో ఇక్కడికి వచ్చాడు. అందుకే అతన్ని ఏ మగాడు పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు." సభలోని నవ్వుల మధ్య అసలు గుట్టు విప్పాడు.
రాయలు అంతులేని ఆశ్చర్యానికి గురయ్యాడు.
"ప్రభూ ఈ విషయం నాకు నిజంగా తెలియదు. 40 మందికి పెళ్లి జరిపించే సన్నాహాలు జరుగుతుండగా ఆ యువతులే ఈ నిజం చెప్పారు. ఆరోజే సభ దృష్టికి తీసుకువచ్చేవాడిని కానీ, మన అప్పాజీవారు నా పిలక వలన జరిమానగా తెచ్చుకున్న గుర్రాల విషయమై నా పై గుర్రుమన్నారు. ఆల్బుకేరక్ పాలన విధానం తప్పులు పట్టడం కూడదన్నారు, నాలో తప్పులు ఉన్నాయి అని మండిపడ్డారు. ఆ సమయంలో నేను ఈ రజ్జుఖాన్ గురించి చెప్పలేకపోయాను. తీరా ఆ మరుసటిరోజు మా కవులు నాపై ధ్వజం ఎత్తారు. మేలిముసుగులో ఉన్న రజ్జుఖాన్ ను భీష్మునిలా పెళ్లాడమన్నారు. ఆ తరువాత కథ మన మధ్య జరిగింది”.
కవుల భార్యలు ఎనలేని సంతోషంతో కృతజ్ఞుతగా రామలింగని వైపు చూసారు. రామరాజ భూషణుని భార్య చేతులు జోడించి “నన్ను మన్నించండి. ఏమెమో సభ ముందు బాధ కలిగేలా అనేసాను. ఈ బూటకపు పెళ్ళిళ్ళు సరే. మరి దేవాలయం లో ఆ పరదాలో దాక్కున్న యువతి వేషదారి రజ్జుఖాన్ చేతి మాంసం వంటకం హలీమ్ రుచి నీ తోటి బ్రాహ్మణులకు చూపించడం ఎన్ని రకాల ప్రాయశ్చిత్తాలు చేసుకుంటే గాని ఆ పాపం పోదుకదా ” రామలింగడిని అడిగింది.
“చూడమ్మా హలీమ్ వంట వాస్తవానికి మాంసంతో తయారయ్యేదే, కానీ రజ్జుఖాన్ కు ముందే చెప్పాను. ఆ కారణంగా అతడు మాంసంకు బదులు ఎండు ఖర్జూరంతో తయారుచేసాడు. అందులో ఏ దోషంలేదు. కేవలం తిన్నప్పుడు ఒకింత భ్రమలోకి పోయారు మన కవులు”
ఆమెకు చెప్పి రాయల వైపు తిరిగి..
"ప్రభూ ! ఈ హలీమ్ తమరు ఒకసారి రుచి చూడాల్సిందే. అరబ్బుల వంట చాలా బావుంటుంది. ఈ రజ్జుఖాన్ను నమ్మి మనం కొలువులో ఏదో పనిలో పెట్టుకోవచ్చు. ఇక మిగిలిన పెళ్లికూతుర్ల వేషదార్లు తూర్పు గవాక్ష కాపలాదారు వద్ద పనిచేసే మావటి వాళ్లు. వీళ్లే మా కవుల ముద్దుల భార్యలు."
మళ్లీ నవ్వులతో హోరెత్తిపోయింది సభ.
అంతా కథ సుఖాంతం అయినందుకు చాలా ఆనందించారు. రాయలు పెను గండం తప్పినందుకు పట్టరాని ఆనందం లో మునిగాడు. కవులు తొలుత చాలా ఆనందించినా సభలో రామలింగడు అన్ని విధాలుగా పెరిగిపోవడం భరించలేక
పోయారు.
రామలింగడు కవులను రాయలకు చూపిస్తూ " తమకు ముందే చెప్పానుగా, మా కవులు ముఖాలు రెండో భార్య వదలి పోయినప్పుడు వెలిగిపోతాయి. ఇప్పుడు ఎలా వెలవెల పోయాయో చూడండి” అని చూపించాడు. ఆ మాటలకి కవుల ముఖాలు ఎరుపెక్కాయి.
రాయలు పకపక నవ్వాడు. కవుల భార్యలు భర్తలను 'గండం గడిచి గట్టెక్కాం కదా !' అని అనునయించసాగారు.
దూర్జటి రోషంతో కపోలాలు పొంగిపోగా, హీనాతిహీనంగా రామలింగని వైపు చూస్తూ..
"ఓయీ వెర్రి రామలింగా, రాజుల కొలువు లో కించిత్ భోగానికి తలవంచినావు. ధన పిచ్చితో తారతమ్యాలను మరచి మావంటి వారిని అవమానించితివి. నీకు కాలమే గుణపాఠం చెప్పగలదు..
జాతుల్ సెప్పుట, సేవసేయుట, మృషల్ సంధించుట, న్యాయ విఖ్యాతింబొందుట, కొండెకాడవుట, హింసారంభకుండౌట,
మిధ్యాతాత్పర్యములాడుటన్నియుఁ బరద్రవ్యంబు నాశించి, యీ శ్రీ తానెన్ని యుగంబు లుండఁ గలదో
శ్రీ కాళహస్తీశ్వరా !
( ఈశ్వరా.. లోకములోని మనుజులు జాతకాలు చెప్పుట, ఇతరులకు సేవలు చేయుట, అసత్యములాడుట, ఎదుటివారి నన్యాయము చేయుటలో పేరొందుట. ఇతరులపై నేరములు చెప్పుట, హింస చేయుట, దొంగసాక్ష్యములను చెప్పుట, ఇవన్నీయును ఇతరుల ధనమును ఆశించి చేయుచుందురు కదా ! ఈ ధనములు ఎన్నియుగములు శాశ్వతముగా నుండునో ఎవరు చెప్పగలరు. )
రాయలు అంతవరకు సరదాగా గడిపి దూర్జటి సంధించి విడిచిన బాణం వంటి పద్యం విన్నంతనే రామలింగని వైపు జాలిగా చూసాడు. రామలింగడు నవ్వి..
"వయస్సుతో బాటు దూర్జటి వారికి ఒకింత పైత్యం, ఆపైన ఎదుటివాడు ఎదుగుదలను భరించలేనితనం అన్నీయును కలగాపుల గా కలిసిపోయి ఇలా పద్య రూపములలో వెళ్లగ్రక్కుతుంటారు. తమరే రాసిన ఈ పద్యం అంగడిలో మీ శిష్యులు మీ గురించి చెప్పి గొప్పగా ఆలపిస్తుంటారు. దీని అర్ధం సెలవీయండి. మీ ఘంటానికి, తాళపత్రా నికి ఎవరూ అతీతులు కారు.” అని దూర్జటి రాసిన ఈ పద్యం రాగయుక్తంగా ఆలపించాడు.
రాజుల్మత్తులు వారిసేవ నరక ప్రాయంబు, వారిచ్చు నం
భోజాక్ష్మీ చతురంత యాన తురగీ భూషాదులాత్మ వ్యథా
భీజంబుల్, తదపేక్ష చాలుఁ బరి తృప్తిం బొందితన్, జ్ఞానలక్ష్మీ
జాగ్రత్పరిణామమిమ్ము దయతో శ్రీకాళహస్తీశ్వరా !
(ఈశ్వరా! రాజులైశ్వర్య మద మత్తులు, వారి సేవ నరకము వంటిది. వారు దయతో ఇచ్చిన పరిచారికలు, పల్లకీలు, గుర్రాలు, భూషణములు మున్నగునవి సంసార బంధములను పెంచి దుఃఖములను కలిగించును. వీటన్నిటిని అనుభవించి సంతృప్తి పడినాను. ఇంకనూ వీటిపై వ్యామోహం చాలు. జ్ఞానసంపదను దానివల్ల గలిగెడు మోక్షమును నాకు ప్రసాదింపుము. )
ఈసారి రాయలు మెల్లగా లేచి అంతటితో సభను చాలించి, చిన్నబోయిన ముఖంతో వెళ్లిపోయాడు. దూర్జటిని అంతా దోషిని చూసినట్టు చూడసాగారు.
తాతాచార్యులు రామలింగనివద్దకు వచ్చి
“ఆ దూర్జటి రాసిన ఈ పద్యం ఎంతగా రాజ దూషణలతో నిండిపోయింది. అతడు ఎంత కొవ్వెక్కినాడు. రాజుల ప్రాపకంలో బతుకు ఈడ్చుచూ ఈ విధంగా రాజులనే ద్వేషించడమా?” అని అడిగాడు. రామలింగడు బదులీయకుండానే సభలోంచి వెళ్లిపోయాడు.
ఒక్కసారి అందరూ చెల్లని ముఖాలతో ఒక్కొక్కరే నిష్క్రమించారు. చివరకి అక్కడ మిగిలింది దూర్జటి దంపతులు మాత్రమే. అతడి కన్నులు ఎరుపెక్కాయి.
"మీకెందుకు అంత కోపం. ఈ సభలో ఎవరు ఆ రామలింగనితో దెబ్బలాటకు దిగలేదు. మీరు మీ కోపాన్ని మీరు రాసే పద్యంతో బదులిస్తే ఆ దురహంకారి ఎంతకు తెగించాడు. రాయలవారికి కోపం వచ్చేట్టు మరో పద్యంతో చెప్పి రసాభాస చేసాడు. రాయలవారు నొచ్చుకున్నారు.” అతని భార్య అనునయించింది.
"రామలింగ” చేసినది తప్పుగా నీకు తోచిన తోచవచ్చు. కానీ అతడు ఎంతో మేలు చేసాడు. రాయలకు తెలుస్తుంది మన అసంతృప్తి. మనకు సరిపడా కదా రాయల వారు ఇచ్చేది. తరాలు తిన్నంత కాదు కదా ! ఎందుకు ఈ కొలువు. ఈ పాటిది ఏ చిన్న రాజు పంచన చేరినా మనకు చాలా లభించగలదు. కనుక నేను ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను.” దూర్జటి తన ఆనందాన్ని వ్యక్తం చేసాడు.
అతని భార్య అదోలా చూసింది.
"రాయలవారు పిలిచి ఆగ్రహిస్తారేమో"
భయం వ్యక్తం చేసింది.
"భయపడకు రాయలవారు కీడుతలపెట్టు వాడుకాడు" దూర్జటి తన భార్యకు ధైర్యం నూరిపోసాడు. "ఎంతో కొంత లాభ పడతాం." అని చెప్తుండగా రామలింగడు తిరిగి వచ్చి...
"క్షమించాలి. పద్యాన్ని ఆలపించడం నా పొరపాటే, ఏదో వాగాను. అందుకే రాయల వారి వెనుకనే వెళ్లి ఆయన్ని మన్నించమని కోరాను. అందుకు తాను చాలా బాధపడ్తు న్నాను. ఎందుకో దూర్జటికి తెలియని అసంతృప్తి మాపట్ల ఉంది అని చెప్పాడు. కనుక ఏ క్షణమైనా పిలుపు రావచ్చు వెళ్లి చెప్పాల్సింది చెప్పుకో ! సాయపడగలనని ఆయన స్వయంగా చెప్పాడు. అది చెప్పడానికి తిరిగి వచ్చాను.” అని చెప్పి వెనుదిరిగి వెళ్లిపోయాడు.
దూర్జటి చాలా ఆశ్చర్యపడ్డాడు.
“చూసావా దేవీ రామలింగని నైజం. అతనికి మనలా ఎలాంటి కల్మషం మనస్సులో ఉండదు. మన గురించి వెళ్లి రాయలకు చెప్పాడట. అతని మనస్సు పాలనురుగులా లేదు.”
దూర్జటి భార్య వింతగా చూసింది.
“నిజమే ఇతడు అర్ధంకాకుండా ఉన్నాడు."
ఇలా అంటుండగా రాయలవారి నుంచి పిలుపు వచ్చింది. దూర్జటి భార్యతో సహ వెళ్లాడు. రాయలు యోగక్షేమాలను అడిగి “ మీకు ఏమైనా ధనం కావాలా ఏమీ సంశయించక అడగండి. మీ అంసతృప్తి గురించి చెప్పి ఎంతోకొంత ఆర్ధికసాయం అందించమని రామలింగడు చెప్పగా మిమ్మల్ని పిలిచాను” అని చెప్పాడు రాయలు.
దూర్జటి ముఖమాటపడ్తుంటే "సరే మీ కొత్త శకంలో ఓ పద్యం నాకు విన్పించండి. అది విన్నాక నా నుంచి గొప్ప బహుమతులను పొందవచ్చు" అని ఆశ చూపాడు.
"నీకున్ మాంసము వాంఛయేని కరవా ? నీచేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ, ననలజ్యోతుండ, నీరుండగా పాకంబొప్ప ఘటించి, చేతిపునుకన్ భజక్షింప కాబో యచే జేకొం టెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వరా !
(తాత్పర్యం : ఓ ఈశ్వరా ! నీకు మాంసాహారం తినవలెనని కోరిక ఉన్నచో నీ చేతిలో లేడి యున్నది. గండ్రగొడ్డలి యున్నది. నీ మూడవకంటిలో చండ్ర నిప్పు వంటి నిప్పు ఉన్నది. శిరస్సు పై గంగ ఉన్నది. ఒకింత శ్రమపడితే రుచిగా శుచిగా నీవే వండుకుని తినవచ్చుకదా! ఆ తిన్నడు ఎంగిలి చేసిన మాంసమే నీకు కావల్సి వచ్చిందా ? అన్నీ ఉండి స్వంత ఆలోచన లేదు. ఈ పని నీకు తగునా?)
రాయలు ఆ పద్యం విన్నాక చిర్నవ్వుతో..
" ఈ పద్యం నాపైనే గురి పెట్టినట్టున్నారు. సర్వసంపదలు కలిగిన చక్రవర్తివి, రామలింగడు చెప్పినంతవరకు కనీసం గుర్తించలేకపోయితివి అని భలే గుర్తు చేసావు" అని చాలా ధనం దూర్జటికి ఇచ్చి పంపాడు. ఆ తరువాత ఆ పద్యాన్ని ఏకాంతంలో వల్లెవేయసాగాడు...
👳♀️
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
21-2-25
ఆధ్యాత్మికం –40
దేవుడికి సమర్పించాల్సిన... ఆ ఎనిమిదిపూలు
మానవీయం
ధర్మం అన్న మాటకు పర్యాయపదమే భక్తి. గోనెసంచుల్లో మారేడు దళాలు తీసుకొచ్చి, పూలదండలు మోసుకొచ్చి పూజ చేయడాన్ని భక్తి అనరు. కూర్చొని, ఊరికే స్తోత్రాలు చేసి, పూలు వేసేస్తే- పరమేశ్వరుడు సంతోషపడిపోడు. కర్తవ్య నిష్ఠతో ధర్మపాలన చేసిన వాడిని ఇష్టపడతాడు. అంటే భగవంతుడు ఏది చెప్పాడో అది చేసినవాడే ధర్మాన్ని అనుసరిస్తునట్లు! భగవంతుడు విహిత కర్మ చెప్పాడు!! విశుద్ధ కర్మ చెప్పాడు!! ‘‘ఒరేయ్ ! నీకు అయిదు ఇంద్రియా ద్రి లిచ్చాను. సుఖం అనుభవించు... నేను వద్దనడం లేదు. వీణావాదన వినాలని ఉందా, పాట వినాలని ఉందా? ‘సాంబశివాయని అనరే..’ అని రాజోపచారాల్లో కీర్తన చేస్తుం టారు. విను! భగవంతుడి దగ్గర కూర్చొని నీ కూతురే‘కంజ దళాయతాక్షీ’ అంటూ కీర్తన చేస్తుం టే మురిసిపో! కానీ, లౌల్యానికి కట్టుబడకు. భగవత్ ప్రసాదంగా అనుభవించడం నేర్చుకో. భగవంతుడు వద్దన్నదాని జోలికి వెళ్ళకు. నిషిద్ధ కర్మ జోలికి వెళ్ళకు! విశుద్ధ కర్మ విడిచి పెట్టకు! ఇతరుల ద్రవ్యా న్ని కోరవద్దు. నిత్య తృప్తితో ఈశ్వరుడు నీకు ఇచ్చినదేదో అదే పరమానందదాయకం అన్న భావనతో జీవితాన్ని అనుభవించు. అలా బతికినవాడెవడో వాడు ధర్మమునందున్నవాడు!
పరమ భక్తితత్పరుడు అన్నదానికి గుర్తేమిటి? ‘సౌందర్యలహరి’లో శంకరాచార్యుల వారేమంటారంటే... ‘‘జపో జపఃశిల్పం సకలమపి ముద్రా విరచనా...’’ నేను మాట్లాడుతున్నానంటే ఇది నేను మాట్లాడుతున్నది కాదు. మనుష్యుడిగా నాకు జన్మనిచ్చి, పరమేశ్వరుడు 83 లక్షల 99 వేల 999 జీవులకు ఇవ్వని చక్కటి స్వరపేటికను ఇచ్చి, ఇన్ని మాటలు నా చేత పలికించగలుగుతున్నాడు. ఆయన పలకించిన ఆ ఒక మంచి మాటతో ఎంత కష్టం లో ఉన్న వాళ్ళనైనా శాంతి పొందేలా చేయగలుగుతున్నాను. ‘ ‘అయ్యా. బెంగ పెట్టుకోకండి. ‘భయకృత్ భయనాశనః’ - ఎవడు భయాన్ని కల్పించాడో వాడే భయాన్ని తీసేస్తాడు. చింతించకండి’’ అని ఒక్క మంచి మాట అన్నాననుకోండి. అంత కష్టాన్నీ మర్చిపోయి వెళ్ళగలుగుతున్నారు.
‘‘మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు’’. మాట అంత గొప్పది. ‘‘జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ, జిహ్వాగ్రే మిత్రబాం ధవాః, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం’’ అన్నారు. ఆ మాటచేత ఏదైనా పొం దవచ్చు. శత్రుత్వాన్ని, చివరకు మరణాన్ని కూడా తెచ్చుకోవచ్చు. ‘‘ఈశ్వరా! నాకు ‘మాట’ ప్రసా దించావు. నీవిచ్చిన ‘మాట’ను ఎప్పుడూ ఎవరినీ బాధపెట్టేది కాకుండా నేను చూసుకుంటా’’ అని దేవుడికి కృతజ్ఞత చెప్పుకుంటూ, మాట్లాడే ముందు జాగ్రత్తపడేవాడెవడో... వాడు పరదేవత పట్ల భక్తితో ఉన్న వాడు. అంతేకానీ నాలుగుపూలు వేసి పూజ చేసి, బయట రావణుడిలా పనికిమాలిన మాటలన్నీ మాట్లాడుతుంటే భక్తుడెలా అవుతాడు?
‘‘ధార్మికమైతే నేను మాట్లాడతా. కాకపో తే మాట్లాడను’’ అన్నాడనుకోండి. ఇప్పు డది భక్తి. ‘జపో జపః శిల్పం’ అంటే మాటల చేత భక్తి. ‘‘సకలమపి ముద్రా విరచనా’’ - నా చేతులు, కాళ్ళు ఏది కదిలినా అనవసరంగా ఎవరికీ భయం కలగకూడదు. ‘ఎంతోమంది అవయవాలు కదలక బాధపడుతున్నారు. నా అదృష్టం . కదులుతున్నాయి. ఇదిపరదేవతానుగ్రహం’ అన్నారనుకోండి. అప్పుడు మీ శరీర కదలికలన్నీ భగవత్ సంబంధమైన ముద్రలే!
ఇలా ఏదిచేస్తున్నా భగవంతుని అనుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకుని బ్రతుకుతున్న వాడు నిత్యం భగవంతుడికి ఉత్సవం చేస్తున్నవాడితో సమానం. కేవలం ‘అష్టదళ పాద పద్మారాధన’ టికెట్ కొనుక్కుని ఏడుకొండలూ ఎక్కి దర్శనం చేసుకున్నవాడు ఆ పద్మారాధన సేవ చేసినవాడు కాడు. ‘అష్టదళ పాద ప ద్మారాధన’ ప్రతిరోజూ ప్రతిక్షణం చేసేలా అనుగ్రహించమని వేడుకోవాలి.
ఆ పూజెలా ఉండాలి? 8 రకాల పూలతో పూజ. ఏమిటా పూలు? ‘అహింసా ప్రథమం పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహః, సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషతః, జ్ఞాన పుష్పం తపఃపుష్పం ధ్యానం పుష్పం తతై ్తవచ సత్యం అష్టవిధం పుష్పమ్ విష్ణోఃప్రీతికరమ్ భవత్’ అన్నారు. అహింస (ప్రేమ), ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయ, క్షమ, జ్ఞానం, తపస్సు, ధ్యానం, సత్యమనే 8 రకాల పుష్పాలతో నీ మనస్సుని ఈశ్వరుని పాదాల వద్ద పెట్టు. భక్తిమార్గం లో పయనించడమంటే అదీ!
ఈశ్వరుడు వద్దన్నదాన్ని చేయకుండా ఉండడం- బ్రేకు . చేయమన్నదాన్ని చేయడం -యాక్సిలరేటర్. లోపల నీ ప్రయా ణం క్షేమం. గమ్యం ఈశ్వరానుగ్రహం. ఇది ఎవడికి సాధ్యపడుతుందోవాడు ఉద్రేకపడ డు, ప్రలోభాలకు లొంగడు. రామాయణంలో రాముడు ఒక మాట అంటాడు... ‘ఒకడు మంచివాడా, చెడ్డవాడా అని దేన్నిబట్టి నిర్ణయించాలి’ అని. ‘ఎవడో సంతోషంతో పొగిడాడనో, లేదా అక్కసుకొద్దీ తిట్టాడనో కాదు. ధర్మ ప్రవర్తనను బట్టి దాన్ని నిర్ణయించాలి.’
చాలామంది రాముడికి సీతమ్మ ఇష్టమనుకుంటారు. కానీ ఆయనకు ఏది ఇష్టమో తెలుసా? తండ్రి పోయినా, సీతమ్మ దూరమైనా, ఇంకొక కష్టమొచ్చినా రాముడు నిత్య తృప్తుడు. నవమి (9వతిథి) నాడు పుట్టాడు. తొమ్మిదిని ఏ అంకెతో హెచ్చవేసినా మళ్ళీ తొమ్మిదే వస్తుం ది. రాముడికి కష్టమొచ్చినా, సుఖమొచ్చినా ఎందుకు సంతోషంగా ఉంటాడో తెలుసా! ‘నా ధర్మం నేను నెరవేర్చా’ అన్న తృప్తి ఒక్కటే అందుకు కారణం. ‘రామో విగ్రహవాన్ ధర్మః’ మనుష్యుడిగా పుట్టిన రాముడు ధర్మం కోసం నిలబడ్డాడు. అలాగే ప్రతివాడూ ‘నేనీ రోజు భగవంతుడు చెప్పినట్టే బ్రతికాను కదూ! ఆయన వద్దన్నది చేయలేదు కదూ!’ అని మననం చేసుకోవాలి. ఇక జీవితంలో ఎదురయ్యే ఉత్థాన పతనాలంటారా... ‘ఈశ్వరుడున్నాడు, ధర్మముంది. నా ధర్మానుష్ఠానం నన్ను రక్షిస్తుం ది’ అని భావన చేయాలి. ధర్మంతో మనిషి తరిస్తాడు. ధర్మం మనకు నిగ్రహశక్తినిస్తుం ది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, నైతికబలాన్నిస్తుం ది. అదే భక్తి. అదే మనకు, మన కుటుంబాలకు, మన సమాజానికి హితకారిణి. ఈశ్వరానుగ్రహాన్నిస్తుం ది.
పరమ భక్తితత్పరుడు అన్న దానికి గుర్తేమిటి? ‘సౌందర్యలహరి’లో శంకరాచార్యుల వారేమంటారంటే... ‘‘జపో జపః శిల్పం సకలమపి ముద్రా విరచనా.’’ ‘జపో జపః శిల్పం’ అంటే మాటల చేత భక్తి. ‘సకలమపి ముద్రా విరచనా’ - నా చేతులు, కాళ్ళు... ఏది కదిలినా అనవసరంగా ఎవరికీ భయం కలగకూడదు. ‘ ఎంతోమంది శరీరావయవాలు కదలక బాధపడుతున్నారు. నా అదృష్టం . కదులుతున్నాయి. ఇదిపరదేవతానుగ్రహం’ అన్నారనుకోండి. అప్పుడు మీ శరీర కదలికలన్నీ భగవత్ సంబంధ ముద్రలే .
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
*తెనాలి రామకృష్ణ - 22*
👳♀️
*కంభం చెరువు కప్పల కథ - 1*
శ్రీకృష్ణదేవరాయలు ఆంతరంగిక మందిరం లో ఉన్నాడే కానీ, అతడి మనస్సు అంతా గజిబిజిగా ఉంది. అలసటగా నొసలు నొక్కుకున్నాడు. పట్టపురాణివారు “కంభం వెళ్లి కొన్నాళ్లు ఉండి రాగలను, అక్కడ వేల ఎకరాల ఆయ కట్టు చెరువు పనితోబాటు కొన్ని శిధిల దేవాలయాల మరమ్మత్తులు చేయించాలి. ఇవన్నీ నా వివాహమొక్కులు తీర్చుకోక తప్పదు. ఇప్పటికే ఆలస్యం జరిగింది అనుజ్ఞ ఇవ్వండి. నాతో కొన్ని ఏనుగులు, కొంత ధనం తీసుకువెళ్లాల్సి ఉంది” అని రాత్రి మరీమరీ కోరినది.
ఆమె పట్టపురాణి అయినా, పాత శత్రువు గజపతి బిడ్డ. పైగా శోభనం నాటి రాత్రే ఆమె తన బొడ్డులో దాచిన విషపు కత్తిని తాను చూడకపోతే ఈపాటికి తన స్థానం లో చక్రవర్తిగా మరో రాయలు ఉండేవాడు. భర్తను తొలిరాత్రే చంప చూసిన చరిత్ర ఆమెది. ఇప్పుడు ఆమె కోరికను తీర్చడం లో కొన్ని ఇబ్బందులున్నాయి.
ఒకప్పటి కంభం చెరువు గజపతుల అధీనంలో ఉండేది. అక్కడవారంతా ఈమెకు విధేయులే. అక్కడేమైనా కుట్రలు చేయడానికిపోతోందా ? ఆమెకు భర్తకంటే తండ్రి అంటే ఇష్టం, అని పరిపరి విధాలు గా ఆలోచించసాగాడు.
ఇలా తను ఒంటరిగా ఆలోచించుకుని తల పిచ్చి పట్టించుకునే కంటే అప్పాజీతో చెప్పుకోవాలి అని చెప్పాడు. విషయం విన్న అప్పాజీ తీవ్రంగా ఆలోచించాడు.
"రాయా ! తుఖాదేవిని అనుమానించాల్సి నదే. అలా అని ఆమెను వెళ్లకుండా నిరోదించరాదు. అక్కడ ఉన్న రాజ సిబ్బంది అంతా పాతవాళ్ళే. మనకంటే గజపతులు అంటేనే వీర విధేయత కనబరుస్తారు. అక్కడ నుంచి ఏదైనా రహస్య లేఖ ఈమె వద్దకు వచ్చి ఉంటుంది"
"అప్పాజీ మన వేగులను వెంట పంపితే?"
"మన వేగుల గురించి తుఖాదేవికి తెలుసు ఆమె రాచబిడ్డ. ఆమెకి నమ్మకం కలిగించే లా మనం ఉంటూనే ఆమెను కనిపెట్టాలి. ఒక పని చేద్దాం. మన రామలింగాన్ని ఆమె వెంట పంపుదాం. అతడు స్వామి భక్తి పరాయణుడు. చూసి రమ్మంటే కాల్చి రాకపోడు. అతనికి అసలు గుట్టు ఏంటో
చెప్పకుండానే వెంట పంపుదాం.” అని తిమ్మరుసు చెప్పి ఒప్పించాడు.
రాయలు ఉన్నపళంగా రామలింగకవిని రప్పించాడు. ఆదరాబాదరాగా వచ్చాడు. సరిగ్గా అప్పుడే తుఖాదేవి రాణీవాసం నుంచి దాసీజనం వచ్చారు. వారి వద్ద ఓ అభ్యర్ధన లేఖ ఉంది. దాన్ని ఆత్రంగా చదివాడు తిమ్మరుసు.
"అప్పాజీ ! ఆ లేఖలో ఏముంది ? ” రాయలు ఆసక్తిగా అడిగాడు.
"కాగల కార్యం గంధర్వులు తీర్చారన్నట్లు ఏముంది మన రామలింగకవిని పట్టపు రాణివారు తనతో కంభం ఆలయాలకు తీసుకువెళ్తామని అభ్యర్ధిస్తున్నారు. ఆమె వెళ్ళిన చోటికి తన వెంట ఎప్పుడూ తీసు కువెళ్ళే నంది తిమ్మనార్యను ఈసారికి తీసుకువెళ్లనంటూ తమకు తెలియపరి చారు. రామలింగకవిని పంపమని కోరారు.”
“ఏం రామలింగా పట్టపురాణివారు మిమ్మల్ని తన పర్యటనకి ఆహ్వానిస్తున్నా రు. సిద్ధమేనా ? "
"ఇదేం ప్రశ్న.. ఆమె ఆదేశాన్ని తలవంచు తూ వెళ్ళగలను. "
"సరే ఈసారి కూడా నీ నుంచి మేము పలు విషయాలను విని ఆనందించాలని మిక్కిలి ఆశపడ్తున్నాం." రాయలు నవ్వుతూ సాగనంపాడు.
తుఖాదేవి 500 మంది బలాడ్యులైన సైనికులతో కంభం గ్రామానికి బైలుదేరింది. రామలింగడు ప్రత్యేక పల్లకీలో కూర్చుని వారి వెంటసాగిపోయాడు. దారిపొడుగునా రాయలుచే నిర్మితమైన పెక్కు చెరువులు, ఆలయాలను చూసుకుంటూ తుఖాదేవి ఆనందంగా ప్రయాణం చేసింది. ఆమెకు ఏదో తెలియని అనుభూతి ఆవరించింది.
కంభం చేరుకున్నాక, అక్కడ ఆమెకి ఘన స్వాగతం లభించింది. ఎప్పుడో గజపతుల కాలంలో ఉన్న రాజప్రతినిధులు ఇప్పుడూ ఉన్నారు. ఇక్కడే రాయలు పెద్ద తప్పు చేసాడు. పిల్లనిచ్చినా గజపతులకు రాయలపై తల తీసే పగ మాత్రం కరిగిపో లేదు. ఆ దిశలో కత్తులు నూరుతునే ఉన్నారు.
విడిది ఏర్పాట్లు అయ్యాయి. సోమిదేవ వడయార్ అనే ప్రధాన ఉద్యోగి మాటల్లో రాయలను ఏకవచన సంభోదన చేయడం రామలింగానికి ఏమాత్రం రుచించలేదు. అందుకు ఎలాంటి అభ్యంతరాన్ని తుఖా దేవి చెప్పనేలేదు. దీనిపై రామలింగడు నొచ్చుకుని ఓ ఆలయ మంటపంలో కూర్చుని ఆలోచించసాగాడు.
కొంతసేపయ్యాక, సోమిదేవర వడయార్ ఎదురుగా వచ్చి “ నీవేనా తెనాలిరామ లింగకవివి. నీ గురించి ఇక్కడ జనాలు బాగా చెప్పుకుంటున్నారు. నీవు తోకలేని కోతిలా అందరితో కోతికొమ్మచ్చి ఆడుతుం టావంట. నిన్ను రాయలు కూడా తెగ మెచ్చుకుంటాడట. నీవు బాగా అతన్ని ఆకట్టుకున్నావట. ధన లాభంతో ఉన్నా వని విన్నాను.” అని పలకరించాడు.
"విన్నావు కానీ, ప్రత్యక్షంగా ఇప్పుడు చూస్తున్నావు. నిన్ను కోతిని చేసి నీ గుంపు లో వారిచే చావచితక తన్నించగలను. నీవు ఈ గ్రామంలో నాటి గజపతులు నియమించిన చిరుఉద్యోగివి. నీ తల ఇంకనూ ఆ పాత తరం గజపతులవారి సేవలకే పరిమితం అయినట్టుంది."
ఏ మాత్రం తడుముకోకుండా కఠినంగానే బదులిచ్చాడు రామలింగడు.
"ఏయ్ నువ్వు కవివేనా, నేనెవరినో తెలియ కుండానే నన్ను బాధ కలిగించే మాటలు అంటున్నావు. నేను పట్టపురాణి వారికి అనుచరుడిని. తలచుకుంటే ఈ క్షణమే నిన్ను వెయ్యికొరడా దెబ్బలు కొట్టించి మంచం పట్టించగలను. చచ్చే దాక మంచం వదలవు.” అన్నాడు వడయార్ కోపంగా.
“ఇంకెవరి దగ్గరైనా చెప్పు నీ డంబ ప్రలాపా లు. నా వద్ద చెల్లవు.. రాయలవారిని ఏక వచనంతో సంభోదించే నిన్ను, మాతో వచ్చిన సైనికులు విని ఈసరికే నొచ్చుకు న్నారు. వారు రాయలవారి వద్ద నోరు విప్పితే నీ తల ఎగిరి ఈ కంభం చెరువులో పడి కప్పలు నోట చిక్కుతుంది.”
ఆ మాటలకు వడయార్ వెంటనే సర్దుకున్నాడు. “కవులు ఛలోక్తులు భలే చెప్పగలరు, నాతో రండి విడిదికిపోదాం. అక్కడ మీకు భోజన ఏర్పాట్లు చేసాం." అని మిక్కిలి వినయంగా తోడ్కొని వెళ్లాడు.
రామలింగడు కంభం గ్రామంలో తిరిగాడు. అదో పెద్ద పల్లెటూరు. (ఇప్పుడు పట్టణం) అక్కడ కొన్ని దేవాలయాలు చూసి చాలా ముచ్చటపడ్డాడు. ఎక్కువ ఒరియా కుటుంబీకులు ఉన్నారు. అడుగడునా పెత్తనం లేకపోయినా గజపతుల ప్రాభల్యం కన్పిస్తోంది. అతి పెద్ద చెరువును చూసాక ఆ వైపుకు వెళ్లాడు. చెరువు గట్టు మీదకు వెళ్తే అక్కడ గట్టు పై విచిత్రమైన కప్పలు కన్పించాయి. పసుపురంగులో చాలా పెద్దవిగా ఉన్నాయి. వాటి ప్రక్కనే ఎండ్ర కాయలు చిన్న చిన్న బొరియల్లోంచి చూస్తూ కన్పించాయి. ఓ చిన్నరాయి తీసుకుని వాటి పైకి విసిరాడు.
అక్కడే కాచుకుని ఉన్న కాపలాదారు పరుగున వచ్చి "ఏయ్ చూస్తే మడీ తడి పాటించేటోడిలా ఉన్నావు. నీకు ఇదేం పోయేకాలం ? కప్పల పైకి రాళ్ళు రువ్వు తున్నావు. ఏ ఒక్కటి సచ్చినా నానా ఇబ్బంది. ఇక్కడ బాపనోళ్ళకి ఇదే జబ్బు. ఏ దేశం మనిషివో గాని నీకు ఇదేం రోగం.” అని గట్టు మీద ఉన్న కప్పల్ని చెరువులోకి అదమాయించాడు.
"అవునయ్యా కప్పల కథ ఏమిటో నాకర్ధం కాలేదు. ఇక్కడికి వచ్చానో లేదో కప్పలు వండుకుని తినేవాళ్ళను చూసాను. పక్షులో, పాములో తినే కప్పల గురించి ఇంతగా బాధపడ్తున్నావు. ఇవి ఎవరికి కావాలి ? వీటిని ఎక్కడా ఎవరూ తినరు కానీ, ఇక్కడ ప్రీతిగా తింటున్నారు ఏమిటి ?"
" ఏయ్ పంతులయ్యా.. నా మాటలు ఎక్కడా అనమాకు. లోగుట్టు నీతో సెప్పక తప్పలేదు. మా పల్లె అంతా వైష్ణవం కనుక ఇక్కడ మాంసం, చేపల అమ్మకాలు ఉండదు. ఇక తినడం కుదరదు. పెద్ద నేరం. ఆ కారణంగా ఈ కప్పల్ని తినేవాళ్ళే ఎక్కువ. నేను ఒక విధంగా ఈ కప్పల్ని కాపాడుతుంటాను. ఇదే నా ఉద్యోగం. నేను తినేది వీటినే. మరేంసేస్తాం రుచి మరిగినోళ్ళం "
రామలింగడికి ఆసక్తి పెరిగింది. తన చిటికెన వేలుకున్న ఉంగరం తీసి ఆ కాపలావాడికి ఇచ్చి "నీ వేలికి చాలా బాగుంటుంది తీసుకో ! " అని అతడి పక్కనే కూర్చున్నాడు.
ఉంగరాన్ని చూసుకుని తెగ ముచ్చట్లు పడ్డాడు కాపలాదారు.
"ఎవరెవరు తింటారు ? ” రామలింగని ప్రశ్న.
"తిననోడు లేడంటే ఒట్టు. ఎక్కువగా ఆ నకిలి బాపనోళ్ళు ఇష్టంగా తింటారు."
"ఎవరు ఆ ఎర్రగా ఉన్నారు, వాళ్ళేనా ? వాళ్ళు ఒరియా బ్రాహ్మణుల్లా ఉన్నారు. అంత పాపానికి ఒడిగడ్తున్నారా ? వారికి పాపభీతి లేదా ?”
"మరి ఇదే తల తక్కువగా అడగడం. వెనకటికి ఒకడు నీలాంటోడే మొత్తం రామాయణం వినేసినాడంట, ఆఖర్న రావణుడు, కుంభకర్ణుడు. ఒకరికొకరు ఏం అవుతారు అని అడిగినాడంట. అలా ఉంది నీవడిగింది. ఆళ్ళు బాపనోళ్ళుకారు. పూజలు పునస్కారాలు వారివద్ద కనపడవు. ఖూనీకోర్లు, కడుపునిండా తాగడం, ఎప్పుడూ ఏదో కుట్రలు సేయడం"
“మరి దేవాలయాల్లోకి వెళ్ళరా ?”
"పూజారులు లేరు. పొరుగూరుల్లో ఉన్నారు. ఉదయం వచ్చిపోతారు. అంతకుమించి వారికి ఇక్కడ ఏ పని ఉండదు."
“ఇక్కడున్నవారు ఒరియా బాపనులు చేసేది ఏమిటి ?"
“ చెప్పానుగా కుట్రలు సేస్తుంటారు. ఈ కంభంకు ఎవరెవరో వస్తూపోతూంటారు. వీరికి నాయకుడు సోమిదేవర వడయార్. గజపతులు కూడా పరమ భక్తులు కనుక వారూ మాంసభక్షణను అంగీకరించరు. ఈ చెరువు చేపలు పెద్దోల్లకు, మిగిలిన వారికి ఈ కప్పలు, అలవాటు అయ్యింది. చాలా గుట్టుగా తినడం మరిగినారు.” రామలింగడికి రహస్యపు కథనం ఆకళింపు అయ్యింది.
"ఈ కప్పల్ని వండుకుని తింటారా ? లేక కాల్చుకుని తింటారా ?” అని అడిగాడు.
"అవన్నీ నా పనులు. ఎక్కువగా చీకటి పడ్డాక దాక్షసారాయితో వస్తారు. నేను కప్పల్ని వేటాడి ఎక్కువగా ఎర్రగా కట్టెల మీద కాల్చి పెడతాను.”అన్నాడు.
రామలింగడు అక్కడ్నించి బైలుదేరాడు. తిన్నగా వడయార్ని కలుసుకుని “అయ్యా ఇక్కడ చాలా గుడులు గోపురాలున్నాయి. దయచేసి నాకు గుడి పూజారులను ఒక్కసారి చూపితే వారితో మాట్లాడ గలను” అన్నాడు.
"తప్పకుండా, వారివద్దకు మనం పోనక్కర్లేదు. వారినే పిలిస్తే వచ్చి చేతులు కట్టుకుంటారు. ఏం అడిగినా నమ్రతగా చెప్తారు.”
"వడయార్.. నేను వారి ఇంటికిపోయి కలవాలనుకుంటున్నాను.”
ఒకరిని తోడిచ్చి పంపాడు. రామలింగడు ఆ ఒరియా బ్రాహ్మణుల ఇళ్ళకుపోయి అందరిని కలిసాడు. ఏవో మాట్లాడి మరీ వచ్చాక ఒక సైనికుడితో రహస్యంగా మంతనాలు జరిపి రాయలవారి వద్దకు పంపాడు.
👳♀️
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*తెనాలి రామకృష్ణ - 23*
👳♀️
*కంభం చెరువు కప్పల కథ - 2*
తుఖాదేవిని కలుసుకుని తను చూసినవ న్నీ చెప్పాలి అనుకున్నాడు. కానీ ఆమె అందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వనందున ఆమెను కలుసుకునే ఆలోచనకు స్వస్తి పలికి కంభంలో పరిస్థితిని తనే డేగకళ్ళతో చూసాడు.
పట్టపురాణి తుఖాదేవి ఆధ్వర్యంలో శిధిలమైన దేవాలయాల మరమ్మతులు, కంభం చెరువును మరింత లోతు, విస్తీర్ణం పెంచే కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. ఆమెకు శిల్పాల పై మంచి అవగాహన ఉంది. పాడయిన శిల్పాలను తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసేందుకు శిల్పులకు తగు సలహాలనిస్తూ పగలంతా ఎంతో శ్రమ పడడం ఆమె పట్ల అక్కడ ప్రజలకు అభిమానం వెల్లువెత్తింది.
( ఇప్పటికి రాయలసీమ ప్రజల్లో వరద రాజమ్మ సుగుణసంపత్తి, ఉదార స్వభావం గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. ఈ వరద రాజమ్మ ఎవరో కాదు తుఖాదేవియే.)
రామలింగడు అవకాశం కోసం ఎదురు చూడడం మానేసాక, ఆలయంలో ఆమెను కలవాలని కబురంపినది. తక్షణం అక్కడికి చేరాడు.
"రామలింగకవిగారూ మీతో ఇలా మాట్లాడ్డానికి నాతో తీసుకువచ్చాను. మీరు నాకో సాయం చేయాలి. మీ పై కొండంత నమ్మకం ఉంది. ఇటీవల మీరు రాయలవారితో బాటు ప్రజల అభిమానా న్ని పొందారు. ఆ నమ్మకంతో మీ పై పెనుభారం పెడ్తున్నాను. విషయం ఏమిటో చెప్పమందురా!" తుఖాదేవి రామలింగని వైపు ప్రశాంతంగా చూస్తూ అడిగింది.
"అవశ్యం ఆదేశించండి. తప్పకనెరవేర్తును. మీరు నాకు రాయల వారంతటివారు. మీ ఆదేశానికి బద్దుడను." అన్నాడు.
"నేను రాణి హోదాలో చెప్పడంలేదు. ఓ సగటు ఆడదానిగా నా గోడు నీకు చెప్పుకుంటున్నాను. మీకు తెలుసు రాయలవారి ఆగర్భ శత్రువులు ఈ గజపతులు. వారికి కావల్సినది నా పసుపు కుంకుమలు కావు. కక్షలు కార్పణ్యాలు, రాయలవారిని అంతమొం దించుటయే వారి నిరంతర ఆలోచన. ఈ రోజు నన్ను ఇక్కడికి పిలిపించింది కూడా అందుకే. నేను తొలుత తండ్రి మాట నెరవేర్చు తలంపున మా శోభనం నాటి రాత్రి విషపు బాకుతో రాయలవారి శయన మందిరంలోకి ప్రవేశించాను. కానీ రాయల వారు అప్రమత్తులై నన్ను నా సాహసాన్ని వమ్ము చేసి క్షమించి నా పట్ల అనురాగంతో ఉన్నారు. ఆ తరువాత నేను ఎలాంటి సాహసాల జోలికి పోకుండా ఉన్నాను. నా తండ్రి అందుకు విరుద్ధంగా నిత్యం రహస్య వేగులతో రాయలవారిని అంతమొందించు పగతోనే ఉన్నారు. వారికి కూతురి పసుపు కుంకుమలతో పనిలేదు. నాకు రాయల వారి కంటే ఈ లోకంలో ఏది ఎక్కువ కాదు. ఇప్పుడు నన్ను ఇక్కడికి రప్పించింది కూడా కుట్రలో భాగమే.” అని కన్నీరుతో చెప్పుకుంది.
“ఈ నిజాలు మీరు రాయలవారితో చెప్పేయాల్సింది. ఇలా దాచినచో సమస్య మరింత జటిలం కాగలదు. మీరే ఆలోచించండి. ఇక నేను చేయునది ఏమిటో సంశయించక ఆదేశించండి. "
“ తెల్లజాతి వారినే హడలెత్తించి, జరిమానగా గుర్రాలను తెచ్చిన సమయ స్ఫూర్తి గలవాడివి. ఎలాగైనా ఇక్కడ మాటు వేసిన ఈ గజపతుల వేగులను లేకుండా చేయాలి. అదే నేను మిమ్ము కోరుతున్నాను. వీరు చీటికి మాటికి ఏదో ఒక భయంకరమైన వర్తమానం గజపతుల నుంచి తెచ్చి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ఏ క్షణం ఏమవుతుందోనని ఏం మునుగుతుందోనని భయపడ్తున్నా ను." అన్నది.
"నాపై మీకున్న విశ్వాసం గొప్పది. నా శాయశక్తుల నా ప్రయత్నం నేను చేస్తాను. ఈసరికే ఇక్కడ పరిస్థితిలను గుర్తుపట్టా ను. మీరు నిశ్చింతగా ఉండండి.” ధైర్యం చెప్పి వెనుదిరిగాడు రామలింగడు.
కంభం ప్రధాన రాజోద్యోగి సోమిదేవర వడయార్ తుఖాదేవి విడిదిలో ఆమెను కలుసుకున్నాడు. అతడిని చూస్తే ఆమెకు కంపరం పుడ్తుంది.
“అమ్మా నీ తండ్రిని ఈ మద్యనే నేను కలుసుకున్నాను. ఆయన మీపట్ల చాలా విరక్తిగా ఉన్నారు. తాను బతికి ఉండగా రాయల పతనం చూడలేనని బాధ పడ్తున్నారు. ఇచ్చిన మాట తప్పినారని మీపై కోపంగా ఉన్నారు. ఈసరికే రాయల ను శాశ్వతంగా మట్టుబెట్టాల్సిందని మీ తండ్రి ఎదురు చూసి అది మీ వలన జరగక విసిగిపోయి ఉన్నారు.” అన్నాడు.
ఒకప్పుడు ఇలాంటి వర్తమానాలు విని జీర్ణించుకోగలిగేది. కానీ ఇప్పుడు వాటిని వినలేకపోతోంది. తను రాయలవారిని గాఢంగా ప్రేమిస్తోంది. తను ఏ విధంగా అపకారం తలపెట్టలేదు....
“నాకు నా పసుపు కుంకుమలే ముఖ్యం. ఇలాంటివి నేను చేయలేను. నన్ను మన్నించమని కోరగలవు. ఇక రామలింగ కవిని నాతో ఎందుకు రప్పించారు. మీరు కోరితే కదా నేను తీసుకువచ్చాను. అతనితో ఏం పని ?” నిలదీసినట్టు అడిగింది.
"అతడు కవిగా బతకకుండా అనవసరం గా అన్ని విషయాల్లో అగ్రగామిగా ఉండాలనుకుంటున్నాడు. రాయలకు ఇతడి వలన అనేక విధాలుగా మంచి జరుగుతోంది. కవిగా కాకుండా గూఢచారి లా, అంగరక్షకుడిగా పనిచేస్తున్నాడు. ఇతడు కుడి భుజంగా ఎదుగుతున్నట్లు అనుమానించి గుట్టుచప్పుడు కాకుండా అంతం చేయమని గజపతుల రహస్య ఆదేశం.”.
"ఏమిటి, మీకు పిచ్చిగాని పట్టలేదు కదా ! అతడు కవీశ్వరుడు. గజపతులు వైష్ణవా నికి ఇచ్చే విలువ ఇదేనా ? అటువంటివాణ్ణి చంపిన బ్రహ్మహత్యా పాతకం మీ అందరికీ చుట్టుకుంటుంది. పొరపాటున అలాంటి పని చేయవద్దు. నేను ఒప్పుకోను. ఈరోజు ఇంతకుమించి మాట్లాడలేను.” కోపంగా బదులిచ్చింది. నాగుపాములా బుసలు కొట్టింది.
“మన్నించండి నా విధి నేను నిర్వర్తించక తప్పదు. మీరు ఇలా మొండికెత్తితే గజపతులు చూస్తూ ఊరుకోం అని మీకు చెప్పమన్నారు. లోగడ మీ వివాహానికి ముందు మీరు మీ బావగారితో (వీరేంద్రుడు) మిక్కిలి ప్రేమగా ఉన్నారని ఆ వివరాలను రాయల చెవికి విన్పించక తప్పదని తీవ్ర హెచ్చరికగా నాకు చెప్పమన్నారు.” కుండబద్దలు కొట్టినట్లు చెప్పి తల దించుకున్నాడు.
“నీవు శృతిమించి మాట్లాడుతున్నావు. ఇక నీవు వెళ్లొచ్చు. నీ మాటలు వినే ఓపిక నాకు ఆ దేముడీయలేదు.” అని చెప్పి పంపేసింది.
తుఖాదేవికి తలంతా గిర్రున తిరుగుతున్న ట్లుగా అన్పించింది. తన తండ్రి ఇంత
దారుణంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు. కూతురి ప్రేమ వ్యవహారాలను బయట పెడతాను అని హెచ్చరించిన తొలి తండ్రిగా చరిత్రలో ప్రసిద్ధుడవుతాడు. చివరికి బ్రహ్మ హత్యాపాతకానికి కూడా దిగజారాడంటే రాజకీయ శత్రుత్వం, కుట్రలు ఎంతగా దిగజార్చాయి. ఏదో రోజు రాయలను తన బిడ్డలను కూడా తన తండ్రి పొట్టను పెట్టుకుంటాడేమో అని పరిపరి విధాలుగా యోచించి దుఃఖించింది.
రామలింగకవిని హెచ్చరించాలి, ప్రమాదం పొంచి ఉందని చెప్పాలి. అయినా తన మాటనుకాదని సోమిదేవర వడయార్ తెగించలేడు. అలా చేస్తే వాడిని సైన్యం చేతిలో చిత్రవధ చేయిస్తాను. అని ఓ దృఢ నిర్ణయానికి వచ్చింది..
రామలింగడు రాత్రి తన విడిదిలో నిద్ర పట్టక బయటికి వచ్చాడు. ఎదురయ్యాడు సోమదేవర వడయార్.
“ఏం కవిశ్వరా! నిద్రపట్టక తిరుగుతున్నట్టు ఉన్నారు. వేశ్యా వాటికకు పోదాం పదండి. ఈ మద్య తంజావూరు నుంచి ఇద్దరు అక్కచెల్లెల్లు వచ్చారు. వారి నృత్యం అద్భుతం చూసి తీరాల్సిందే.” అని తీసుకుపోయాడు.
ఒక ఇంటి ముందాగారు. లోపల నుంచి అత్తరుల వాసనలు మల్లెల పరిమళాలు ముక్కుపుటలను అదరగొడ్తుంటే రామలింగడు నవ్వుతూ ఉత్సాహంగా లోపలికి వెళ్లాడు. అతడి వెంట వడయార్ నడిచాడు. లోపల నృత్య ప్రదర్శన జరుగుతోంది. ఇద్దరికి ఆహ్వనం పలికారు వేశ్యమాతలు.
పండుటాకుల్లా ఉన్నారు. వారిని చూడగా నే రామలింగానికి మరింత అయోమయం అనిపించింది. వారు ఓడ్రపు స్త్రీలే. అసలు ఈ కంభం గ్రామం రాయలవారి ఏలుబడి లో ఉన్నట్టులేదు. ఇంకా గజపతుల ఏలుబడియే కన్పిస్తోంది అని పలురకాలు గా ఆలోచించాడు.
నర్తిస్తున్న నాట్యగత్తెలకు సైగలతో రామలింగని వైపు చూపించి చెప్పాడు వడయార్. వాళ్ళు వెంటనే రామలింగాన్ని చుట్టేసి వారి అందచందాలను ప్రదర్శించ సాగారు. మత్తునిచ్చే ద్రాక్షసారాయిని అందించారు. రామలింగడు నవ్వి వాటిని తాకకుండానే వారి నృత్యాన్ని తిలకించ సాగాడు. అక్కడ చాలామంది ఓడ్రపు బలశాలులు మద్యం మత్తులో జోగుతూ తన వంకే చూడసాగారు. వడయార్ వారికి ఏవేవో సైగలతో చెప్తున్నాడు. అవన్నీ క్రీగంటనే గమనిస్తున్నాడు రామలింగడు.
వేశ్యమాతలు పళ్ళెంలో చేపలకూర తెచ్చి రామలింగని ముందు పెట్టి తినమన్నారు. వాటిని కాదన్నాడు. అందులో ఒకామె “ఇక్కడికి వచ్చినవారు మా ఆతిధ్యం బెట్టు చేయకుండా తినాలి, ఆనందించాలి, కాదన కూడదు." అని చెప్పింది.
"నాకు ఇష్టంలేనివి బలవంతం పెట్టదు.”
"రేయ్ వెర్రిబాపడా! నీతుల మూట విప్పుతున్నట్లున్నావు. మర్యాదగా తింటావా ? తినిపించమంటావా ?” తప్ప తాగిన ఓ బలశాలి నోరు పారేశాడు.
రామలింగడి వద్దకు ఓ నర్తకి వచ్చి "అయ్యా రాక రాక వచ్చారు. వాళ్ళు మనుష్యులు కారు. ఓడ్రదేశపు వారు, అసలు వినేరకాలు కారు. ఇక్కడ మీరు తింటే ఎవరు చూస్తారు, తినండి. కంభం చెరువు చేపలు ఈ గ్రామంలో వారికి అందుబాటులో దొరకవు. మాకు, రాజ ప్రతినిధులకు మీలాంటి వారికి మాత్రమే పరిమితం. గ్రామంలో ఎవరు ఆశించినా తీవ్రదండు తప్పవు కనుక ఆరగించండి. చాలా రుచిగా ఉంటాయి.” కళ్ళు చక్రాల్లా తిప్పుతూ చెప్పింది ఓ నర్తకి.
"నేను బ్రాహ్మణుడను. తినడం నాకిష్టం లేదు.” అన్నాడు రామలింగాడు.
“ రేయ్ బాపడా రెచ్చగొడ్తున్నావు. తిని తైతక్కలు ఆడరా, నువ్వు గెంతుతూ ఉంటే నీ గుర్రాల ఖజానా పిలక అల్లల్లా డుతుంటే కళ్ళార చూడాలనుకుంటున్నా ను.” ఒకడు పెద్దగా అరిచాడు.
మిగిలినవారు పగలబడి నవ్వారు. ఆ మూర్ఖులు మొలల్లో ఉన్న కత్తులను తడుముకోసాగారు.
"ఈ వెర్రి బాపని పిలకలో ఖజానా ఉందా? అయితే ఆ వెంట్రుకలు పీకి పందిరివేద్దాం. అంతా సమానంగా పంచేసుకుందాం. ” అని ఓ తాగుబోతు లేచాడు.
"ఆ పంతులయ్య పిలకలో కుచ్చు నాదేరా ! తాకావో చంపేస్తాను. అవును ఆ పిలక కుచ్చును ఎవరికి అమ్ముకోవాలిరా! పోనీ రాయలకు అమ్ముకుందాం. అతడో వెర్రి వెంగళాయి. " అని పకపకమని నవ్వి లేచాడు మరొకడు.
పరిస్థితి ఉద్రిక్తం అయిపోతున్నదని గ్రహించిన నర్తకీమణులు భయంగా "ఓ కవి పుంగవా, నా మాట విని పారిపోయే తోవ చూసుకో! వారు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. పారిపో! ఇక్కడ ఎందరి నో చంపిన చరిత్ర వారిది. వారు రక్తంతో ఆడుకునే పాపులు.” లోగొంతుతో చెప్పారు.
రామలింగడు నవ్వి “నాకు వీళ్ళ వలన
ఏ భయం లేదు. మీరు నిశ్చితంగా ఉండండి” అని చెప్పి ఆ వస్తున్న ముష్కరులకు ఎదురు నిలిచి...
“ ఎక్కడ వడయార్.. ఇక్కడ నన్ను అప్పగించి అతడు జారిపోయాడు. బైట పొంచి ఉన్న సైనికుల చేతిలో విలవిలలా డుతున్నాడు.” అని చప్పట్లు చరిచి పిలిచాడు. బిలబిలమని సైనికులు లోపలికి దూసుకువచ్చారు.
ఆ వచ్చినవారు లోపల తప్ప తాగిన వారిని అదుపులోకి తీసుకుని బయటికి ఈడ్చుకుపోయారు. అంతా క్షణాల్లో జరిగిపోయింది.
నర్తకిలు, వేశ్యమాతలు బిక్కముఖాలు వేసారు.
"అయ్యా నువ్వు బ్రాహ్మణుడవేనా ? నీలో భయం అన్నది వీసమెత్తు లేదు. పైగా తెగింపు మరీ ఎక్కువగానే ఉంది.” అని తమ సంతోషం వ్యక్తం చేసారు.
సైనికులు కొంతమంది వచ్చి" ఆ వడయార్ తప్పించుకుపోయాడు. అతడి కోసం గాలింపులు జరుపుతున్నాం" అని చెప్పారు.
“చెప్పింది సరిగ్గా చేయలేకపోయారు. ముందే చెప్పాను. బాధ్యతగా వ్యవహ రించాలి అని " రామలింగడు కోపంతో మండిపడ్డాడు.
“గ్రామం చుట్టూ మన సైనికులు అప్రమత్తులై ఉన్నారు ఎక్కడికిపోలేడు." అని చెప్పి ఆ వెంటనే వెళ్ళిపోయారు.
నర్తకీమణులను చాలా ప్రశ్నించాక, అక్కడ్నించి బయటికి వచ్చాడు రామలింగడు.
👳♀️
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*తెనాలి రామకృష్ణ - 24*
👳♀️
*కంభం చెరువు కప్పల కథ -3*
ఉదయాన్నే కంభం గ్రామంలో పెద్ద హడావుడి అయ్యింది. గజపతుల ఉప్పు పులుసులు తిని వారికై పాటుపడిన వారిని సైనికులు వెతికివెతికి పట్టుకున్నారు. వడయార్ దగ్గర ఎంగిలి మెతుకులకు ఆశపడినవారిని మొత్తం ఏరివేసారు. ఆ మధ్యాహ్నం తరలింపులు కూడా జరిగి పోయాయి. గజపతుల అవశేషాలుగా బ్రాహ్మణ వేషదారులను మాత్రం వదిలి రామలింగడు ఏమీ జరగనట్టుగానే తుఖా దేవి నిర్వహిస్తున్న దేవాలయ మరమ్మత్తు లకు కొంతమంది సైనికులను తోడుగా పంపాడు.
వడయార్ గ్రామం వదలిపోవడానికి ఎలాంటి అవకాశంలేదు. అతడు దాక్కున్న చోటును చెరువు కాపలాదారుకు తెలిసి ఉంటుంది అని రామలింగడు అడిగాడు. అతడు ముందు భయపడినా తరువాత నిజం చెప్పాడు. కంభం చెరువు మధ్యలో గల కొండ గుహలో వడయార్ తల దాచుకున్నాడు.
మరి నాలుగు దినాలు గడిచాక తుఖాదేవి తను వచ్చిన పని పూర్తయినందున తిరిగి రాజధానికి వెళ్లిపోవాలనుకుంది. ఈ విషయమే ఆమె వడయార్ కి చెప్పాలని చూస్తే అతడు కనిపించకపోవడం, ఎంతమంది కంభం గ్రామస్తులను అడిగినా తెలియదని అనడంతో ఆమె భీతిల్లింది. కొంపదీసి తన తండ్రిని ఉన్నపళంగా తీసుకురావడానికి వెళ్లాడా ? తండ్రి కూడా నరమాంసం రుచి మరిగిన పులిలా ప్రవర్తిస్తున్నాడు. ఏ ఉపద్రవం రానున్నదో అని చాలా భయంతో ఆ రోజంతా గడిపింది.
రామలింగడు ఉదయాన్నే ఆమెను కలుసుకున్నాడు. వడయార్ గురించి ఆందోళనగా ప్రశ్నించింది.
“అతడు గురించి మరిచిపొండి. ఈరోజు మీరు దర్శించాల్సింది శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి వారి దేవాలయం. మేము రేపు అక్కడకి వచ్చి కల్సుకుంటాం. ఆ తరువాత అంతా కలిసి రాజధాని తిరిగిపోగలం.” అని వివరంగా చెప్పాడు.
“ఆ వడయార్ వలన ఎలాంటి ప్రమాదం లేదు కదా !"
“అమ్మా ఇప్పటికైనా రాయలవారికి ఏదీ దాచకుండా నిజం చెప్పేయండి. ఇలా మీరు పనికిమాలిన వడయార్లు వంటి వారి గురించి భయపడడం ఏమీ బాగోలేదు. అది మీ స్ధాయి కాదు.”
“రాయలవారికి చెప్పడానికి నా ప్రయత్నం నేను చేస్తాను.” చెప్పి ప్రయాణానికి సిద్ధపడింది.
తుఖాదేవి దాసీజనంతో ఆమె వెనుక పెద్ద ఎత్తున సైన్యం కదిలింది. అప్పటికే అక్కడ
అదనపు బలగాలు వచ్చి కంభం చేరుకున్నాయి. ఈ బలగాలు, రాత్రి జరిగిన శత్రువుల ఏరివేత, వడయార్ కనపడకుండాపోవడం, రామలింగని పై హత్యాప్రయత్నం ఏవీ తుఖాదేవికి తెలియదు. అంత రహస్యం అక్కడ చోటు చేసుకుంది.
అదనపు బలగాలను తీసుకుని తొలుత కంభం చెరువు మీదకు వెళ్లాడు. అక్కడ ప్రజలను పిలిపించి “ఈ చెరువులో గల చేపలను తినే హక్కు మీకుంది. ఈ గ్రామం వైష్ణవానికి చెందినా అది పండితుల వరకే కానీ మీవంటి పామరులకి కాదు. కాయ కష్టంతో బతుకు ఈడ్చే మీకు ఇన్నాళ్ళు ఈ వడయార్ మోసం చేసి అతడు వెనుక ఉన్నవారితో హాయిగా చాలాకాలంగా చెరువులో చేపలన్నీ ఆరగించి మీకు అటవికుల్లా కప్పలను తినబెట్టాడు. ఇప్పుడు చెరువు గట్లు కొడతాం, చేపలు పెద్ద ఎత్తున దొరుకుతాయి వాటిని ఆరగించండి. కంభం రాయలవారి పాలన లో ఉంది. గజపతులకు తొత్తులు ఇక్కడ మిమ్మల్ని రాచిరంపాన పెడ్తున్నారు.” అని అందరికి అర్ధం అయ్యేలా చెప్పాడు.
అంతవరకు ఓపిగ్గా వింటున్న బ్రాహ్మణ వేషాల్లో ఉన్న గజపతుల పెంపుడు కుక్కలు వంటి ఓడ్రపు ముష్కరులు ఒక్కసారి కత్తులతో రామలింగని పై పడ్డారు. లాఘవంగా తప్పించుకుని వారిని సైన్యంతో గొలుసులతో బంధింప చేసి నేల మీద పడుకునేట్లు చేసాడు. అంతవరకు పట్టనట్టున్న గ్రామీణులు ఒక్కసారి పురి విప్పినట్టు బందీలపై పడ్డారు. వారిని నిలవరించి వీరిని శిక్షించేది మనం కాదు చక్రవర్తి అని నచ్చజెప్పాడు రామలింగడు.
“చెరువు కట్ట కొట్టించి చెరువులో నీళ్ళు ఖాళీ అయ్యాక ఆ మధ్య ఉన్న కొండలో దాక్కున్న ఆ వడయార్ను పట్టుకుని మాకు అప్పగించండి” అని గ్రామీణులను కోరాడు. నీళ్ళు రోడ్ల మీదకు పారాయి. చేపలు తేలిపోయాయి. ఎవరికి దొరికినవి వారు పట్టుకుని లొట్టలు వేసుకుని ఇళ్ళకు తీసుకుపోయారు. ఆరోజు ఒకటే సందడిగా ఉంది ఆ గ్రామంలో.
కొంతమంది గుహలో ఉన్న వడయార్ని పట్టుకుని చావచితకతన్ని తెచ్చి అప్పగించారు. పట్టుబడ్డ వడయార్ కోపంతో రెచ్చిపోయాడు.
" రామలింగా, నీవు గజపతుల దృష్టిలో ఇప్పటికే పీకలోతు కూరుకుపోయావు. వారు పగతో ఉన్నారంటే ఎంతటివాడినైనా బతకనీయరు. అల్లుడైన రాయలనే వారు చంపేందుకు ఎత్తులు వేస్తున్నారంటే నీవనగా ఎంత ? నన్ను వదిలి నీ దారిని నీవు వెళ్లిపో ! రాయల ను అంతం చేయంది వదలం. ఇందుకే ఇక్కడున్నాం." అన్నాడు కోపంగా.
వడయార్ కి ఎలాంటి బదులీయకుండా అక్కడి నుంచి తన విడిదికి వెళ్లిపోయాడు రామలింగడు. సైన్యం చేతిలో వడయార్, అతడి మనుష్యులు బందీలై పడిఉన్నారు.
మరుసటి రోజు ప్రయాణం. అంతా కలిసి రాజధానికి బయల్దేరారు.
తొలుత పట్టపురాణి తుఖాదేవి సైన్యం తోడురాగా నిజపురానికి చేరుకుంది. రాయలవారు అక్కడ విశేషాలు అడుగగా “తను వెళ్ళిన పని అయ్యింది, చాలా దేవాలయాలను దర్శించగలిగాను. అవసరమైన చోట మరమత్తులు చేయించాను. ఎంతో తృప్తిగా ఉంది” అని చెప్పింది. చివరగా తను ఏదీ దాచకుండా కంభంలో తన తండ్రి నిర్వాకం గురించి అక్కడ ఇంకా గజపతుల పాలన రహస్యంగా సాగుతోందని, అక్కడ గ్రామ పెద్దరికం వెలగబెడ్తున్న వడయార్ గురించిన నిజాల ముడి విప్పి చెప్పింది. రాయలు విని ఉగ్రుడైపోయాడు. ఆమె పట్ల విరక్తిగా, నిర్వేదంగా మారిపోయాడు.
"తుఖాదేవీ నీవు చిన్నదానవు కావు. ఒకవేళ నేను హఠాన్మరణానికి గురయితే నీవే కదా ఈ రాజ్యాన్ని ఏలవల్సింది. కానీ నీవు ఇంకా తండ్రి నీడ బిడ్డలా ప్రవర్తిస్తు న్నావంటే ఏమనుకోవాలి ? నీముందా ద్రోహి వడయార్ మన గురించి అలా వాగుతుంటే వాడిని అక్కడే కడతేర్చా ల్సింది. ఇప్పటికైనా మించిపోలేదు. వాడిని పట్టి రప్పించి చిత్రవధ చేస్తాను. దీనికంతటి కి కారణం నీవే. కంభం గ్రామంలో నీవు చెప్పినందున అక్కడ పాతవారినే అయిష్టంగానే కొనసాగించాను. అక్కడ నీ తండ్రి నిర్వాకం మనకు కంటకప్రాయంగా ఉంది." రాయలు కోపంతో ఊగిపోయాడు.
తుఖాదేవి రాయల కోపాన్ని తగ్గించాలని ఎంతో ప్రయత్నించింది. కానీ రాయలు ఆమె ఏం చెప్పినా వినే స్థితిలో లేడు. ఆయన గొప్ప అవమానంగా తీసుకుంటున్నాడు.
"ఇంతకీ రామలింగడిని వారు చంపాలను కుంటున్నారంటే ఇక్కడ పరిస్థితులను నీ వలన చాలా సేకరించగలుగుతున్నాడు నీ తండ్రి. కూతురు అని చూడకుండా ఏమిటి ఈ నీచపు పగలు, ప్రతీకారాలు ఈ పాపపు మూటలను చచ్చాక మోసుకుపోతాడా ?"
తుఖాదేవి కన్నీరుమున్నీరయ్యింది. ఆమె ఏంచెప్పినా వినేందుకు రాయలు ఏమాత్రం సుముఖంగా లేకపోవడంతో ఆమె పూర్తిగా నీరసపడిపోయింది.
“రేపే కంభం గ్రామానికి సైన్యం పంపి అక్కడ ఆ నీచపు గజపతుల ఆనవాళ్ళు మిగలకుండా తుడిచిపెడతాను.” చెప్పి కోపంగా వెళ్లిపోయాడు రాయలు.
మరుసటి రోజు రాయలు మానసికంగా కృద్దుడై కొలువు తీరి ఉన్నాడు. ఏదో సభ జరుగుతోంది. ఓ సైనికుడు లోపలకు వచ్చి “జయము, జయము ఏలికా ! పట్టపురాణి వారితో వెళ్లిన రామలింగకవి, సైనికులు తిరిగి వచ్చారు. తమ దర్శనం కోసం అనుజ్ఞ కోరుతున్నారు.” చెప్పాడు రని తక్షణం లోపలికి ప్రవేశపెట్టమని చెప్పాడ
*స••
*
*తెనాలి రామకృష్ణ - 25*
👳♀️
*కంభం చెరువు కప్పల కథ - 4*
సభలో కవులు పెద్దకళ్ళు చేసుకుని చూడసాగారు. వారిలో అయ్యల రాజు రామభద్రకవి మెల్లగా కవుల చెవులు కొరికాడు.
"అయ్యా మన రామలింగనికి ఈరోజు నూకలు నిండుకున్నట్టున్నాయి. నిన్ననే వచ్చిన మన రాణివారు రాయలవారికి ఏదో చెప్పినట్టుంది. రాయలు ముఖం కందగడ్డలా అయిపోయింది. మనవాడు
అక్కడేదో ఘనకార్యం చేసి తగలడినట్టు న్నాడు. పోనీ, మన కళ్ళల్లో రగులుతున్న మంటలు ఇప్పటికైనా ఆరి చల్లారుతాయి.”
తలలు పంకించి అంతా ఉత్కంఠగా ఎదురుచూడసాగారు.
తొలుత గాడిదలు లోపలకి వచ్చాయి. వాటిపై నకిలీ బ్రాహ్మణులు పెడరెక్కలు వెనక్కి విరిచి కట్టబడి ఉన్నారు. సభ నివ్వెరపోయింది. వారికి ఇంత అవమానం ఎందుకు ? రాయలు భృకుటిముడిపడింది. రాణివాస స్త్రీలు పలుచని తెరల వెనుక నుంచి ఆత్రంగా చూడసాగారు.
"అయ్యా ఎంత ఘోరం ! ఆ గాడిదల పై ఆ అమాయక బాపనోళ్ళను ఊరేగించడానికి ఆ రామలింగానికి మనస్సేలా వచ్చింది. చూడలేకపోతున్నాం."
ఇది మంచి తరుణం అన్నట్టు కులపిచ్చి గల దూర్జటి ఆ గాడిదల వద్దకు పోయి వాటి పై ఉన్నవారిని చూసి తెగ బాధపడి పోసాగాడు.
అలసాని పెద్దన ఒద్దిగా కూర్చోలేక తను గాడిదల వద్దకుపోయి వాటి పై ఉన్నవారి వివరాలను ఆరా తీయసాగాడు. అప్పుడే రామలింగడు ప్రవేశించాడు. అతన్ని చూడగానే పెద్దనార్య కళ్ళు చింత నిప్పులు చేసి..
"ఏమయ్యా అసలు నువ్వు బాపన పుట్టుక పుట్టలేదా ? తోటి అమాయక బాపనోళ్ళ ను ఇలా గాడిదల పై ఊరేగించి తీసుకు వస్తావా ? వీరు చేసిన అంత గొప్ప నేరం ఏమిటి ?”
కవులకు ఎలాంటి బదులు ఈయలేదు. అతని వెనుక తొట్టిల్లో కొన్ని వేల కప్పలను తీసుకువచ్చి రాయలకు వాటిని చూపాడు.
"రామలింగా కప్పలను తెచ్చావేంటి ? పైగా ఆలయ పూజారులను ఇంతగా హీనపరిచి సభలో నిలిపితివి ఎందుకు ? ముందు వారి కట్లు విప్పండి." రాయలు భటులను ఆదేశించాడు.
"ఆగండి ప్రభూ ! నిదానంగా అంతా తమకే తెలుస్తుంది. అరచేతంత ఉండే కప్పలు ఈ బాపనోళ్ళకి పరమ ప్రీతి. వీటిని కాల్చుకుని మద్యంతో తింటారు. వీడి పిలకముడిని చూడండి. పిలకను గొరక చీపురులా (కసువు ఊడ్చేందుకు వాడే చీపురు) ఎంత బిగుతుగా కట్టి నింగికి నిటారుగా వెక్కిరిస్తు న్నట్టుగా కట్టాడో చూడండి. ఇందులో ఆకుల పొట్లాం ఉంటుంది. ఇదివిషతుల్యం. శత్రువు చేతికి చిక్కిన వెంటనే తన చేతిలో ఉన్న దండంతో ఎదిరిస్తాడు. ఆ దండం ఏమిటో చెప్తే ఆశ్చర్యపోతారు. బంగారు తాపడంతో చేసిన ఈ దండం లోపల భయంకరమైన విషంతో నిండిన కరవాలం ఉంది. ఒకవేళ కుదరకపోతే పొట్లాం విప్పి చప్పరిస్తాడు. ఆ మరుక్షణం ప్రాణాలు విడుస్తాడు.
ఈ బాపతుగాళ్ళే ఈ బాపనోళ్ళు. వీళ్ళ వాలకం చూసిన వారెవరైనా ఇట్టె గుర్తు పడతారు. మన ఖర్మ మా కవులు మాత్రం వీరిని తమలో ఒకరిగా గుర్తించడమే కాక నన్ను దారుణంగా నిలదీస్తున్నారు. ఈ గాడిదల పై వీరిని చూడలేకపోతున్నారు. వీరంతా గజపతుల రహస్య సైన్యంలో పరమ కర్కోటకులు. దైవాన్ని నమ్మే గజపతులు ఈ అధమజాతి వారిని ఏకంగా బ్రాహ్మలుగా ఎలా కంభంలో నిలిపారో అర్ధం కావడంలేదు." చెప్పి.. ఒకడి పిలక విప్పి ఆకుల పొట్లాం తీసి చూపించాడు.
సభలో ఒక్కటే ఉత్కంఠ. చిన్న సూది పడ్డా విన్పించే నిశ్శబ్దం అలుముకుంది. తిమ్మరుసు మీసాలు మెలివేసాడు. అతడిలో ఉత్సాహం కట్టలు తెంచుకుంది చాలా ఉల్లాసంగా కన్పించాడు.
రాయలు కన్నులు విప్పార్చి రామలింగని వైపు చూసాడు..
"ప్రభూ ఇలా వీరంతా ఆత్మరక్షణలో శత్రువుని ఎదుర్కోవడంలో నిష్ణాతులు. వీరు ఓడ్రపు దేశవాసులు. అక్కడ క్రూర జాతికి చెందినవారు. మనకంటే తెల్లగా ఉన్నందున బాపనోళ్ళ అవతారం మన ప్రాంతంలో ఎత్తేసారు.”
ఆ మాటలకు రాజోద్యోగులు ఒరల్లో కత్తుల పిడులపై చేతులు బిగించారు. వారి నరాలు పొంగాయి. రాయల వైపు తీక్షణగా చూసారు. ఆయన ఊం అంటే చాలు తలలు పుచ్చకాయల్లా లేపేద్దాం అన్నట్టు వారి చూపులున్నాయి.
"రాజద్రోహం ! చక్రవర్తిని ఏకవచన సంభోధన, పరుష పదజాలం విసరడం. కంభంలో అసలు బ్రాహ్మలను గుళ్ళలో పూజల వరకే వినియోగించి ఆ తరువాత సాగనంపి వీరే ఆ అవతారాలు ఎత్తేసి మొత్తం గ్రామాన్ని వైష్ణవం పేరిట మాంసం నిషేధించి వీరు మాత్రం మూడు పూటలా కప్పలను తింటూ మద్యం మత్తులో జోగుతున్నారు. అసలు కథానాయకుడు సోమిదేవర వడయార్. ఈతడు మిక్కిలి గజపతులు భక్తుడు. చెరువులో చేపలను ఈతడు మస్తుగా తింటాడు. ఆ ఊళ్ళో వేశ్యవాటికల్లో బతికేవారికి, గజపతుల నుంచి వర్తమా నం మోసుకువచ్చేవారికి తినబెడతాడు. కానీ, ఈ గాడిదల పై ఉన్న నకిలీ బ్రాహ్మణులను, ఆ ఊరి ప్రజలను తిననీయడు." ఏదీ దాచకుండా మొత్తం వివరించాడు రామలింగడు.
రాయలు కోపంగా చూస్తుంటే వడయార్ తట్టుకోలేక తలదించుకున్నాడు. తిమ్మరు సు రామలింగని వైపు మెచ్చుకోలుగా చూసాడు.
"ఓయీ రామలింగా చూసి రమ్మంటే కాల్చి వచ్చావు. నేను మన ప్రభువుల వారికి చెప్పి నీకు కంభం గ్రామనాయకరం ఇప్పిస్తాను. వెళ్ళి నాయకరం చేస్తావా?".
"అప్పాజీ, నాకెందుకు? ఆ దిశలో నేను జీవించలేను. వీళ్ళను చూస్తుంటేనే చాలా అసహ్యంగా ఉంది. నేను వెళ్ళింది పట్ట పురాణివారితో. ఆమెను ఈ వడయార్ భయపెట్టే విధంగా ప్రవర్తించడం నేను తట్టుకోలేకపోయాను. అందుకే వీరి పన్నాగాలకు తెరదించేసి వీరి తోలు బొమ్మ లాటను కంభంలో లేకుండా చేసాను”
"రామలింగా వీరిని నీవే శిక్షించు. నీకు ఆ అధికారం ఇస్తున్నాను." రాయలు నిలబడి చెప్పాడు.
"ప్రభూ ఈ వడయార్ అక్కడ రాజభక్తి ప్రదర్శించినవారిని వదలడు. వారిలో ఏదో తప్పు చూపించి కంభం చెరువు బలి కోరిందని నమ్మబలికి వారిని చెరువు తూముల్లోకి నెట్టి చంపేయడం ఘోరం. ఇలా చంపబడిన వారు పెక్కుమంది ఉన్నారు. కనుక వీరిని చాలా కఠినంగా శిక్షించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే వీరిని మా కవుల ఇంటికి ఓ రోజు ఆతిధ్యం కు పంపాక, ఆ తరువాత రాజద్రోహానికి గాను మీరే తగు దండన విధించండి.” రామలింగడు నవ్వుతూ చెప్పాడు.
అంతవరకు సభలో ఉన్న గగుర్పాటు మాయమైపోయి ఆ స్థానంలో ఒక్కసారి నవ్వులు విరిశాయి. కవులు భయపడి నోళ్లు విప్పారు.
"మేము వీరిని భరించలేం. బాబోయ్ ఖూనీకోర్లు.” అని అంతా కలిసి ఏక కంఠంతో పలికారు. రాయలు కూడా నవ్వాడు.
"రామలింగా వీరితోబాటు వందలాది కప్పలను తెచ్చావు. కారణం ఏమిటి ?" తిమ్మరుసు అర్ధంకాక అడిగాడు.
“ఎక్కడో మళయాళ దేశంలో కప్పలను తింటున్నారని ఇక్కడ ఈ ఓడ్రపు నకిలీ బ్రాహ్మలు ఇష్టంగా తింటున్నారు. ఇవి మన ప్రాంతంలో లభించవు. ప్రత్యేకంగా మళయాళదేశం (కేరళ) నుంచి తీసుకు రాబడ్డాయని విన్నాను. వీటి పరిమాణం చూడండి చాలా పెద్దవి. పైగా వీటిని తింటే చురుగ్గా ఉంటారు. వీటి రుచి మరిగిన వారు మరి వదలరు. ఈ వడయార్ ఈ కప్పలను ఈ నకిలీలకు పెట్టి పోషించాడు."
సభలో వారంతా కప్పల వైపు చూసారు. రాయలు అందరిని ఖైదు చేసాడు. ఆ తరువాత వారిని దశలవారిగా నాలుగు వారాల తేడాలో ఉరి తీసాడు. కంభం గ్రామ పెద్దను చిత్రవధజేసి చివరికి కందకం లో మొసళ్ళకు విందు చేయించాడు. ఈ విషయం వేగుల ద్వారా తెలుసుకున్న గజపతులు పిచ్చిపట్టినట్టు ఐపోయారు. వారికి అన్ని విధాలుగా ఈ కంభం చెరువు కలిసివచ్చింది. ఇక్కడివారు నియమించిన మొత్తం కుట్రవిభాగం నాశనం కావడం భరించలేకపోయారు.
(ఈ కంభం చెరువు నేడు పక్రాశం జిల్లాలో కంభం పట్టణానికి అనుకుని ఉంది. ఈ చెరువు ఆయకట్టు భూములకు నాలుగు ఛానల్సు ద్వారా నీళ్ళు అందుతుంది. చిన్న కంభం కింద 2,064 ఎకరాలు, పెద్ద కంభం కింద 2,400 ఎకరాలు, పాపాయి పల్లి కింద 400 ఎకరాలు ఆయకట్టు ఉంది. నాటి రాయలవారు తవ్వించిన చెరువులు నేటికి ఇప్పటి పజ్రల అవసరాలు తీరుస్తున్నాయి అంటే అప్పటి జలవనరుల పై వారికున్న ఆలోచన అర్ధం అవుతుంది. అలాగే కొన్ని వందల చెరువులు తవ్వించిన ఘనచరిత రాయలవారిది.)
గజపతులు రాయల పై తీవ్రస్థాయిలో కత్తిగట్టారు. కంభం గ్రామంలో తమ ఉనికి లేకుండా చేసినందున, తన వారినందరిని పనిగట్టుకుని అంతమొందించినందున ఇక ఉపేక్షించరాదని ఓ నిర్ణయానికి వచ్చారు. ఈసారి కత్తికి చిక్కేది రాయలే కాదు ఆయన బిడ్డలైనా సరే ! వేటుపడాల్సిందే.. చాప కింద నీరులా వారి ప్రయత్నాలు పునః ప్రారంభించారు.
(శ్రీకృష్ణదేవరాయల వారి చివరి పుత్రుడు తిరుమలరాయలు హత్యకు మూడు ప్రధాన కారణాలు. తండ్రికి తుఖాదేవి ఎదురు తిరగడం, కంభంలో శత్రువుల ఏరివేత, పలువురి ఉరితీతలు. )
కంభం చెరువులో కప్పలకు చాలా గిరాకి ఉండేది. రాయలవారి కాలం నుంచి గోల్కండ ప్రభువుల చివరి ఏలిక తానాషా కాలం వరకు అక్కడ ప్రజలు కప్పలను తింటే ఔషదం తినినట్టుగా భావించేవారు. ఆ తరువాత ఆ పసుపు రంగు జాతి కప్పలు అంతరించిపోయి కప్పలను తినడం అలా మరుగునపడిపోయింది. ( ఈ విషయమై చారిత్రక ఆధారాలున్నాయి.)
👳♀️
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల
*తెనాలి రామకృష్ణ - 26*
👳♀️
*అగ్రహారం దానంగా వద్దు - 1*
కొన్ని అగ్రహారాలను కవులు స్వయం ప్రతిభతో రాయలవారి వద్ద నుండి పుచ్చుకున్నారు. ఎక్కువగా అలసాని పెద్దన, దూర్జటి, నందితిమ్మనలే లబ్ధి పొందారు. అతి తక్కువగా అయ్యలరాజు రామభద్రుడు, రామరాజ భూషణుడు, పింగళిసూరనలు అగ్రహారాలు దానాలుగా పొందారు. ఏమీ పొందని వాడుగా మిగిలింది ఒక్క తెనాలి రామలింగకవే. ఇందుకు కారణం ఉంది.
రాయలు దృష్టిలో కవిగా కంటే ఓ మాటకారిగా, కార్యవాదిగా మాత్రమే రామలింగానికి గుర్తింపు లభించింది. బహుమతుల రూపంలో ధనకనక
వస్తువులు లభించాయి తప్పితే అంతకు మించి అతడు రాయల వద్ద ఏమీ నిర్ధిష్టంగా సంపాదించలేకపోయాడు. ఈ నేపధ్యంలో రాయలని తుఖాదేవి తానుగా రామలింగానికి ఏదైనా పెద్ద అగ్రహారాన్ని దానంగా ఇవ్వవలిసిందిగా ఓ రాత్రి సూచించింది. అందుకు రాయలు కూడా అంగీకరించాడు.
మరుసటి రోజు రాయలవారి వద్దకు వచ్చిన రామలింగానికి ఈ విషయం
చెప్పింది తుఖాదేవి. రామలింగడు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతాడు అని అనుకుంటే అందుకు భిన్నంగా..
"నాకు అంత ఆశ లేదు. ఏదో తమ కొలువులో కాలం వెళ్లబుచ్చడమే నాకు ఆనందంగా ఉంది. మీరు ఇస్తామన్న అగ్రహారం చాలా పెద్దది. నేను ఏకంగా అక్కడే ఉండిపోవల్సిందే. మీ అందర్ని వదిలిపోలేను” అని తేల్చి చెప్పేసాడు.
తొలుత తుఖాదేవి ఖంగుతిన్నట్టు అయిపోయింది. రాయలు కూడా అయోమయంగా చూసాడు.
" ఇదేమి రామలింగా! నీకు ఇస్తామన్న అగ్రహారం చాలా పెద్దది. నీకు ఇవ్వాల్సి
నది ఇంతకుమించి వేరే ఎక్కడా లేనేలేదు, మరెందుకు కాదనుచున్నావు. అంత అదృష్టం నీకు కల్పించింది ఎవరు తెలుసా సాక్షాత్తు పట్టపురాణివారే.”
"ప్రభూ, నాకు తమరే ఇచ్చి ఉంటే తప్పక స్వీకరించేవాడిని. కానీ, రాణివారు ఇచ్చినందునే నేను కాదంటున్నాను. అమ్మా ఇప్పటికైనా నిజాలు చెప్పండి. మీకుగా మీరు కాదు కదా ఈ నిర్ణయం తీసుకునేది.” ముక్కుసూటిగా ఆమెను అడిగాడు.
తుఖాదేవి, రాయలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఆ మందిరంలో ఉన్నది, ఆ ముగ్గురే. “నిజాలా ఏమిటవి?” రాయలు అడిగాడు.
తుఖాదేవి మౌనంగా నిలబడిపోయింది. ఆమెలో ఏదో తెలియని భయం చోటు చేసుకుంది. రామలింగడు ఇక తను నిజం చెప్పకతప్పదన్నట్లు తనే గొంతు విప్పాడు.
“నా పై పగబట్టిన గజపతుల కుట్రలో భాగం ఇది. నేను ఇక్కడనుంచి వెళ్లిపోవాలి అనేది వారి కుట్ర. కనుక నాకు ఇస్తామన్న అగ్రహారం కూడా ఇప్పటికీ గజపతుల నీలి నీడల్లో ఉంది. తుఖాదేవి వారికి రహస్య వర్తమానం అందాకనే ఆమె నాకు ఈ అగ్రహారం కట్టబెట్టే ఆలోచనకు వచ్చారు." రామలింగడు పురి విప్పాడు.
రాయలు భృకుటి ముడిపడింది. అతడు కోపంగా ఆమె వంక చూసాడు. రాణి తల వంచుకుని కళ్లనీళ్లు పెట్టుకుంది. వెంటనే రామలింగడిని పంపించేసి ఆమెను నిలదీసాడు.
"ఏమిటి నీవు మారవా ? నీ కారణంగా ఏదో రోజు మనం పెద్ద ప్రమాదంలో పడతాం. తరువాత ఆకులు పట్టుకుని లాభం లేదు. ఆలోచించుకో'! నీవు మారనంత వరకు నేను ఇక నీ మందిరానికి రాలేను." అని చెప్పి విసవిసలాడుకుంటూ వెళ్లిపోయాడు.
తుఖాదేవి ఎటుపాలుపోక తలపట్టుకుంది. రాయలు తనను వదలి ఉండలేడు. తనంటే అతనికి ప్రాణం. అతడికి తను తెలియకుండానే ద్రోహం చేస్తున్నానని తీవ్రంగా బాధపడింది.
రాజు పెద్ద అగ్రహారం దానమివ్వబోతే రామలింగడు కాదన్నాడంట అని నగర మంతా ఎవరో టముకు పెట్టి చెప్పినట్లుగా కోడైకూసింది. చివరికి రాయలవారు అది విని మా ముగ్గురు మధ్య జరిగిన విషయం ఎలా బయటికి పొక్కింది. చెబితే తను చెప్పాలి. లేకుంటే పట్టపురాణివారు చెప్పాలి. ఆమె రాణివాసం వదలి నగరం అంతా కలియతిరిగి చెప్పాల్సింది లేదు. తప్పకుండా ఇది రామలింగడు పనే అయి ఉంటుంది. అతడికి చక్రవర్తి అంటే ఏమీ కానట్టుంది. ఏమాత్రం భయపడకుండా ఎందుకు అంతఃపుర రహస్యాలను బయటపెట్టాడు. ఇది క్షమించరాని నేరం అని మండిపడ్డాడు. వెంటనే ఏ విధమైన వివరణ అడగకుండానే రామలింగడిని కారాగారంలో పడవేయించాడు. ఆ రాత్రి రాయలవారే స్వయంగా వెళ్లి కారాగారం లో ఎందుకు పెట్టింది తెలియజేసాడు.
ప్రభువులకు అకారణంగా కూడా శిక్షించే హక్కు కలదని రామలింగడు తలబిరుసు గా బదులిచ్చినందుకు శ్రీకృష్ణదేవరాయలు మరింత కోపం చెంది..
" కవి సార్వభౌముడు శ్రీనాధుడుకి నాడు పట్టిన గతి నీకును నేడు పట్టగలదు" తీవ్ర స్థాయిలో హెచ్చరించి వెళ్ళిపోయాడు.
నగరమంతా వింతగా చెప్పుకున్నారు. రాజుల కొలువు అంటే ఇలానే ఉంటుంది. ఇష్టముంటే అందలం ఇష్టం లేకుంటే కారాగారం. చూడండి రామలింగానికి ఎంత గౌరవం ఉండేది. ఇప్పుడు ఏకంగా చీకటికొట్టులో పడేసారంట. అని ప్రజలు రకరకాలుగా చెప్పుకున్నారు.
రెండో రోజు తిమ్మరుసు కారాగారంలో ఉన్న రామలింగడిని కలుసుకుని..
"ఏమయ్యింది. ఇంతవరకు తెచ్చుకున్నావు రాయలు ఆచితూచి అడుగేస్తాడు. నీ విషయంలో అతను అంతగా నమ్మాడంటే కారణం బలమైందే అయి ఉంటుంది. నీ విషయంలో పట్టపురాణి కూడా మంచి అభిప్రాయంలో లేదు. నీకు ఏదో అగ్రహారం ఇవ్వజూపితే కాదన్నావట. అలా ఎందుకు కాదన్నావు ?" జాలిపడ్తునే అడిగాడు.
"ఏం చెప్పమంటారు. మన దూర్జటివారు ఎప్పుడు రాజుల పై విరక్తితో పద్యాలు అల్లుతూనే ఉంటారు. ఈ మధ్య ఆయన రాసిన ఒక పద్యం ఆయన దగ్గరే నేను వినడం తటస్థించినది. చెప్తాను వినండి అప్పాజీ !"
పరిశీలించితి మంత్రతంత్రములు, చెప్పన్వింటి సాంఖ్యాది యోగ రహస్యంబులు, వేదశాస్త్రములు వక్కాణించితిన్, శంక వో దరయన్ గుమ్మడి కాయలోని యవగింజంతైనా నమ్మించి సుస్థిర విజ్ఞానము త్రోవఁ జూపఁ గదవే శ్రీకాళహస్తీశ్వరా !
తాత్పర్యం: ఓ ఈశ్వరా! ఎన్నో మంత్రాలు, తంత్రాలు చూచినాను. సాంఖ్యము మున్నగు యోగశాస్త్రములలోని రహస్యములను పెద్దలు చెప్పగా విన్నాను. నేను స్వయముగా ఇతరులకు వేదశాస్త్ర విషయములను బోధించినాను. ఐనను గుమ్మడికాయలోని చిన్న గింజంతైనా నా సందేహము తీరలేదు. నీవే నాయందు దయ చూపి నిశ్చయమైన జ్ఞానమార్గము ను జూపి నన్నుద్ధరింపుము.
తిమ్మరుసు అది విని రామలింగని వైపు మరింత జాలిగా చూసాడు.
“నేను ఏదో విధంగా సర్ది చెప్పి నిన్ను గట్టెక్కించగలను. భయపడకు దూర్జటి రాసిన పద్యం నీకు అన్వయించుకోకు. అందులో ఎంత నిజం ఉన్నదో అంత కీడు ఉన్నది. విచారింపకు నీకు మంచి కాలం మున్ముందు ఉంది. రాయలకు కవులన్నచో ప్రాణం. నీకు హాని తలపెట్టడు. అందుకు నేనే హామీ!" అన్నాడు.
ఇనుప చువ్వల నుంచి లోపలికి చేతులు పోనిచ్చి భుజం చరిచాడు.
"అప్పాజీ నా గురించి నాకు ఎలాంటి భయం లేదు. కానీ మన పట్టపురాణివారి వలన పెను ప్రమాదములు ఏదో రోజు విజయనగరానికి ముంచుకురాగలవు. ఆమెకు ఇప్పటికి గజపతుల నుంచి రహస్య వర్తమానాలు అందుతునే ఉన్నాయి. వారి చేతిలో కీలుబొమ్మ ఆమె. చెప్పినట్టు ఆడాల్సిందే".
తిమ్మరుసు కళ్ళు పెద్దవయ్యాయి.
" రామలింగా నీవు కవి కంటే రాజకీయం గా మేటివి. అతి తక్కువ సమయంలో చాలా విషయాలు తెలుసుకోగలిగావు.
తుఖాదేవిని పట్టపురాణిని చేయడం నేను, రాయలు చేసినది పెద్ద తప్పు. గజపతులు నాటి నుంచి నేటి వరకు హీనంగా ప్రవర్తిస్తూనే ఉన్నారు.”
"అప్పాజీ గజపతులవారి కసి అంతా తమ పైనే. ఆ తరువాత మా అందరిపై ఉంది. ఆచితూచి అడుగేయండి. చూసారా రాయలవారి నిర్వాకం. అకారణంగా నన్ను నిర్భందించారు. మా ముగ్గురు మధ్య జరిగిన విషయం ఎలా బయటికి పొక్కింది అని ఆలోచించనేలేదు. ఆ టముకు వేసింది గజపతుల వేగులు. నగరంలో వారి ఉనికి గణనీయంగా ఉంది.”
తిమ్మరుసు మనస్సు అంతా ముసురు పట్టినట్టు అయిపోయింది. ఇంకా ఏదో చెప్పబోతుండగా రాయలవారి నుంచి ఆదేశం తీసుకువచ్చాడు కొత్వాలీపటేల్. ఆ వెంటనే చదివి విన్పించాడు.
"దిప్పలూరు ( క్రీ.శ. 1527 లో రాయలు దానమిచ్చిన గ్రామమే ఈ దిప్పలూరు. కడప జిల్లాలో ఉంది. తొలుత రామలింగ కవికి మాత్రమే ఇవ్వబడినది. రామలింగని కోరికపై ఆ తర్వాత మొత్తం అష్టదిగ్గజాల కు ఇవ్వబడినది. రామలింగడు ప్రభుభక్తి పరాయణుడు. గజపతుల కుట్రలను భగ్నం చేయడంలో తను రాయల వద్ద ఉన్న ఆరేళ్ల కాలం అంతా రాయల కోసం మనసావాచా పని చేసాడు. కనుక అతడు రాయల వద్ద పెద్దగా ఏమీ సంపాదించుకో లేదు. కనీసం తాను రాసిన కావ్యాలను సయితం రాయలకు అంకితం ఇవ్వలేని దురదృష్టవంతుడనే చెప్పాలి. ఆయన రాసే కావ్యాలను చాలా చిన్నవారికి అంకితమిచ్చుకునే పరిస్థితిలో మిగిలాడు.)
"దిప్పలూరు నీకు దానం ఇవ్వడమైంది. నీవు ఒంటరిగా అక్కడికి పోయి అక్కడ వ్యవసాయం చేసి తగు శిస్తు చెల్లించవలె ను. నీ భార్య పిల్లలను ఇక్కడనే విడిచి వెళ్లవల్సిందిగా ప్రభువుల ఆదేశం. దక్షిణా పథంలో అతి ఎక్కువ సైన్యం ఉన్న విజయ నగర సామ్రాజ్యంలో సైన్యాన్ని పోషించేది సామంతులు, పాలెగాళ్లు కానీ, అతి పెద్ద అగ్రహారాన్ని దానంగా పుచ్చుకున్న నీవు అక్కడ షేఖ్సనాది (ఫౌజుదార్) పదవిలో ఉంటావు. మీకు ప్రత్యేకంగా 500 మంది సైనికులను, 50 ఏనుగులను, 200 గుర్రాలను, 100 ఒంటెలను ఇచ్చి పోషించ వల్సిందిగా రాయలవారి ప్రత్యేక ఆదేశాల తో అందజేసిన ఉత్తర్వుల లేఖ. ఇందుకు భిన్నంగా ఉండదలిస్తే ఫలితం అత్యంత దారుణంగా జీవితఖైదులో మ్రగ్గాల్సి ఉంటుంది.” చదవడం ఆపాడు కొత్వాలీ పటేల్.
తిమ్మరుసుకు ఏమీ అర్ధంకాలేదు. "ఏమిటి ఇదంతా కొత్వాలు, అసలు ఈ లేఖను తయారుచేసింది ఎవరు ? కింద రాయల వారి రాజముద్ర ఉంది. అన్నట్లు ఆదేశాల కు భిన్నంగా అంటే..” కొత్వాలను అడిగాడు.
"రాయలవారి ఆదేశాలు భేఖాతరు చేస్తే నాడు ఓడ్రరాజు కొలువులో ఘోరమైన శిక్షకుగురయిన శ్రీనాధునకు పట్టిన గతే రామలింగకవికి పట్టగలదు అని రాయల వారు హెచ్చరించారు."
"రాయలవారి ఆజ్ఞలకు బద్దుడను. రేపే నా ప్రయాణం." రామలింగడు రాజుగారి ఆజ్ఞను అంగీకరించాడు.
📖
తుఖాదేవి మందిరం.
"దేవీ రామలింగాన్ని దిప్పలూరు గ్రామానికి
పంపేవేసాను. అక్కడ ప్రజలు చాలా క్రూర స్వభావాలతో ఉంటారు. కారణం నీ తండ్రి వారికి ఉగ్గుపాలతో నేర్పాడు. వారి మధ్య రామలింగడు ఇక నానా కష్టాలను భరిస్తూ అనుభవించాల్సిందే. అతడు మన ముగ్గురి మధ్య జరిగే రహస్యాన్ని ఇలా బహిర్గతం చేసినందున అతడికి ఈ శిక్ష విధించాను.” రాయలు ఉప్పొంగిన ఉత్సాహంతో చెప్పాడు.
విని ఊరుకుంది తుఖాదేవి.
“దేవీ ఎందుకు ఇలా ఉన్నావు.. ఏమయ్యింది ఒంట్లో నలతగా ఉందా ?" ఆమె దేహం తడిమి అడిగాడు.
“లేదు ప్రభూ ఎందుకో రామలింగానికి అంత శిక్ష విధించారని తెలిసి నా మనస్సు చాలా బాధపడ్తోంది. అతనికి ఆ గ్రామం ఇచ్చి పంపేయవల్సింది. ఇంకా సైన్యం, ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు వీటిని పెంచే బాధ్యతను అప్పగించడం అదీ కూడా ఒక్క వరాహ ఇవ్వకపోవడం నాకు నచ్చలేదు.” అంది.
"అయినా నీకు రాజకీయపు టెత్తులు తెలియవు వదిలేయ్ " అని ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు.
“ఒకవేళ అతడు అక్కడ మీరు విధించే పనులు చేయలేకపోతే, నిజంగా అప్పటి శ్రీనాధునికి విధించిన శిక్ష రామలింగకవికి విధించి అంతం చేస్తారా ? అతడు బ్రాహ్మడు, మనకు మన వంశంకు ఆ పాపం చుట్టుకుంటుంది.”
రాయలు మళ్లీ ఆలోచనలోపడ్డాడు.
తుఖాదేవి మరింతగా అతని మనస్సు మార్చేందుకు శతవిధాల ప్రయత్నాలు చేసింది.
"దేవీ చూద్దాం అంతవరకు రానీ అప్పుడు మనం ఉన్నాం. రామలింగడంటే నాకు అభిమానమే. కానీ అతడు మన ముగ్గురు మధ్య జరిగినదాన్ని నగరమంతా టముకు తో చెప్పినట్లు చెప్పాడు. అదే నా కోపానికి అసలు కారణం.” అన్నాడు.
📖
దిప్పలూరు గ్రామంలో ప్రవేశించాడు రామలింగడు. అతడితో ఉన్న సైన్యంలో వారు..
"అయ్యా రాయలవారు మనకు చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా పంపించారు. ఇక్కడ మనమంతా ఒక్కపూటకు గతిలేకుండా మాడి ఛస్తాం కాబోలు." వారి భయం చెప్పుకున్నారు.
అందుకు రామలింగడు నవ్వి "ఎవరూ అధైర్యపడవద్దు. ఇక రోజూ రాజభోజనాలే మీకు పెడతాను. నా వెనుక ఉండండి.” అని వారికి ధైర్యం నూరిపోసి అతడో పోతరించిన గుర్రంపై కావాలనే కూర్చుని సర్వాగ్రహారం అంతా కలియతిరిగాడు. అటు ఇటు కళ్లాలు విసురుతూంటే ఆ గుర్రం దుమ్మురేపుకుంటూ పరుగులు తీసింది. ఆ గ్రామంలో అప్పటికే వేళ్ళూను కుని ఉన్న గజపతుల అనుయాయులు మిర్రిమిర్రిగా రామలింగని వైపు పెద్ద కళ్ళతో చూడసాగారు. వారికి కోపం తారాస్థాయికి చేరుకుంది.
వారిలో ఒకడు ఉండబట్టలేక అడిగేసాడు. గుర్రం కళ్లాలు పట్టుకుని ఆపి మరీ రామలింగడిని నిలదీసాడు.
"నువ్వు కవివా, లేక కత్తులు ఝళిపించే బద్ మాష్ వా ? మదమెక్కిన ఆ గుర్రం ఏమిటి ? నీ పోకిరీ స్వారీ ఏమిటీ ? బతకాలని లేదా ? నీలాంటి తాటాకుల ఖరాబు చేసేటోళ్ళా ఇక్కడ ఫౌజుదార్..”
ఆ మాట అన్నందున రామలింగని చుట్టూ ఉన్న సైనికులు కోపంగా ఆ ప్రేలినవాణ్ణి తినేసేట్టు చూడసాగారు. అప్రయత్నంగా కత్తులు
- 27*
👳♀️
*అగ్రహారం దానంగా వద్దు - 2*
"ఈ దూషించేవాడి వలన ఈ గ్రామమే చెడుతుంది. వీడి నోరు ముందు కట్టించాలి, కనుక నేను ఈ అగ్రహారానికి ఫౌజుదార్ సర్వహక్కులు కలిగినవాడిగా ఆదేశిస్తున్నాను. వీడికి తగిన శిక్ష శిరో ముండనం. ఇతడి ఆస్తులను జప్తు చేయండి. ఏనుగులశాలలో వీడికి తగు పనిని కల్పించి మూడు పూటలా తిండి పడేయండి. నన్ను నా శాసనాన్ని ధిక్కరించిన వారిని ఎవరిని వదలద్దు. సాక్షాత్తు రాయలవారు చెప్పినా వినొద్దు." గ్రామం అంతా వినేలా కంచు కంఠంతో చెప్పాడు రామలింగడు.
ఆ సాయంత్రానికి ధిక్కరించిన వంద మందికి పైగా శిరోముండనాలతో వారి ఆస్థులు జప్తులతో ఆ గ్రామం అట్టుడికి నట్టు ఉడికింది.
వారం గడిచింది. రాయలవారి నుంచి ఇక్కడ ఏం జరుగుతోంది తెలుసుకునేందు కు వచ్చిన ఓ పరిశీలకుడు తొలుత సైన్యం తిండి తిప్పలు దగ్గర నుండి మొత్తం గమనించాలని డేగకళ్లతో పరికించి చూసాడు.
మధ్యాహ్నం భోజనాల సమయంలో సైనికులు తృప్తిగా భుజించి లేచారు.
"రామలింగకవి, నాకు తెలియక అడుగుతున్నాను. రాయలవారు బొక్కసం లోంచి నీకు ధనం ఏమాత్రం ఇవ్వలేదు. మరి ఇంతమందికి మంచి భోజనం ఎలా పెట్టగలుగుతున్నావు. నీ ఇంటి నుండి ఏమైనా నగలు నట్రా తెచ్చుకుని వెచ్చిస్తూ కాలం గడుపుతున్నావా ?” అనుమానంగా అడిగాడు ఆ పరిశీలకుడు.
"నాయనా పరిశీలకా, నీకెందుకు నా బాధల గురించి తీర్చగలవా! ఆర్చగలవా !! నీ పని చూసుకో, నా మాటగా రాయల వారికి చెప్పు. ఇప్పుడున్న సైన్యం 500 మంది చాలరు. మరో 1000 మందిని పంపవలిసిందిగా మిక్కిలి ప్రార్ధిస్తున్నానని చెప్పు. నీవు జాగ్రత్తగా రాయలవారికి నీ ద్వారా నేను పంపే విలువైన వస్తువులు అందజేయాలి సుమా !" అన్నాడు రామలింగడు.
చెప్తుంటే అయోమయంగా వినసాగాడు
పరిశీలకుడు.
"చివరికి రాయలవారికి బహుమతులిచ్చే స్థాయికి ఎదిగితివా రామలింగా ?” అని ప్రశ్నించి నోరు తెరిచాడు పరిశీలకుడు.
"ఇదిగో పచ్చలు పొదిగిన కరవాలం. చూసావా ఎంత పదునుగా ఉందో, తల తెగేయ్యాలంటే దీన్ని ఒరలోంచి దూస్తే చాలు వేటు పడకుండా ఎదుటివాడి మెడ మీద తలకాయ నాలుగుసార్లు బొంగరంలా గాల్లో తిరుగాడుతుంది. అంతటిది ఈ కరవాలం. దీనికి పచ్చలు పొదిగున్నాయి. ఇతర మణులతో తీర్చిదిద్దారు.”
"అయ్యా దీని ధర ఎంతుంటుంది ?”
"ఏం నీవు తల తాకట్టు పెట్టి కొంటావా ? "
“మీరన్నట్లు చాలా ఖరీదుంటుంది." అని నలువైపులా ఆ కరవాలాన్ని తిప్పి చూసి ఓ బంగారుపెట్టెలో భధ్రపరిచాడు ఆ పరిశీలకుడు.
“ఇక వచ్చినవాడివి ఉత్తచేతులతో వెళ్లడం నాకిష్టం లేదు. నీవును ఈ ఆభరణములు తీసుకుని సంతృప్తి చెంది మరీ వెళ్లు." అని కొన్ని వెలలేని బంగారు ఆభరణాలను కానుకగా ఇచ్చాడు.
ఆ పరిశీలకుడు మూర్చపోయినంత పని చేసాడు. దబ్బున నేల మీదపడిపోయాడు. బంగారు చెంబుతో నీళ్లు తెచ్చి ముఖం పై చల్లి లేపాడు రామలింగడు.
“ఇలా పడిపోకు. మున్ముందు గుండెలు ఆగుతాయ్".
"అయ్యా రామలింగకవిగారు నేను ఇంక తట్టుకోలేకపోతున్నాను. నిజం చెప్పండి. చూస్తుంటే మన చక్రవర్తికంటే ధనికుడిలా ఉన్నారు. ఎలా సంభవం. నాకు చెప్పండి. ఇక్కడ త్రవ్వకాల్లో ఏమైనా గుప్త నిధులు లభించాయా ?"
"ఓయీ నీకు కావల్సింది ధనం కానీ ఆరాలు కాదు ! హాయిగా లాభాల మూట తో సంతోషంతో వెళ్లిరా!"
"ఇక్కడ వైభవం గురించి ఏదీ చెప్పద్దు.
ఏదీ దాచద్దు. నిజాలను చెప్పు. అబద్దం చెప్పడం నాకు ఇష్టం ఉండదు. నీవు వచ్చింది అబద్దాలు, కథలు అల్లడానికి కాదు” అన్నాడు రామలింగడు.
పరిశీలకుడు వెనుదిరిగి రాయల సన్నిధికి చేరుకున్నాడు. నిండు కొలువులో రామ లింగని వద్ద నుంచి వచ్చినవాడిని అంతా ఊపిరి బిగబట్టి చూడసాగారు.
నిశ్శబ్దం భగ్నం చేస్తూ రాయలు గొంతు ఖంగుమంది.
"ఆ వెర్రిమొర్రి బాపడి తలపొగరు తగ్గిందా? సైన్యంతో అవస్థలు పడుతున్నాడా ? కొన్నాళ్లు తిండికి వెతుక్కోకుండా మంచి తోటలున్నాయి. ఆ పండ్లతో పాపం నెట్టుకు వస్తున్నాడా ? ఆ విధంగా తన బతుకు హేయంగా ఈడ్చుతున్నాడా ? " మీసం మెలివేసి మరీ అడిగాడు.
సభలో చాలామందికి రాయలు ఆ విధంగా అడగడం ఏమీ నచ్చలేదు. చక్రవర్తికి ఎవరు ఎదురు చెప్పగలరు ?
"పర్వాలేదు చెప్పు. ఆ గుడ్డ చుట్టిన కర్ర పెట్టెలో ఏముంది, బహుశా రామలింగడు నాకు రాసుకున్న విజ్ఞాపన పత్రమా ? అక్కడ తన కష్టాలను నీతో ఏకరువు పెట్టుకున్నాడా ? తెరిచి నాకు ఇవ్వు ” రాయలు నవ్వుతూ అడిగాడు.
"ప్రభూ మన్నించండి. ఆయన తమకు ఒక లేఖ మరియు బహుమానంతో బంగారు పెట్టె పంపించారు." మిక్కిలి వినయంగా చెప్పాడు. లేఖను తిమ్మరుసు వారికి అందించాడు. ఆ లేఖలో సారాంశం ఇలా ఉంది.
"ప్రభూ తమ దయవలన నేను తమరు ఆదేశించిన మేరకు సైనికులను పోషించు చున్నాను. కానీ వారు నాకు చాలరు. మరో 1000 మందిని అవలీలగా సాకగలను కనుక పంపగలరు. ఆ వచ్చిన వారిని కంటికి రెప్పలా కాపాడుకోగలను.” పెద్ద గొంతుతో చదివి విన్పించాడు.
సభలో వారంతా బిక్కముఖాలు వేసారు. కవులు చేష్టలుడిగిపోయారు. బంగారు పెట్టెలోంచి పచ్చలతో మెరిసిపడ్తున్న పొడవాటి కత్తిని పరిశీలకుడు తీసి రాయల ముందు పెట్టి రామలింగకవి ప్రభువులకు బహుమతిగా ఇచ్చినట్టు తెలిపాడు.
రాయలు అయోమయంగా తిమ్మరుసు వైపు చూస్తూ పచ్చల పిడి కత్తిని అందుకుని, చాలా విలువైనది అని గుర్తించాడు.
“ఏమా సాహసం, పెట్టిన చెయ్యికే బహుమానాలు పంపేవాడయ్యాడా ఆ రామలింగడు." అలసాని పెద్దన, సభలో నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ ఎలుగెత్తి ప్రశ్నించాడు.
ఒక విధంగా సభలో ఎక్కువమంది తప్పుగా అనుకున్నారు. తిమ్మరుసు అవమానంగా తీసుకున్నాడు. ఎవరి ముఖాల్లో కాంతుల్లేవు. రాయలు కోపంతో రామలింగానికి మరణదండన విధిస్తారని పెక్కుమంది భావించారు. కానీ, అందుకు విరుద్దంగా రాయలు నవ్వి...
"నేను ఎంత అదృష్టవంతుడినో నా బంగారు కలలపంట భువనవిజయంలో ఒక కవి నాకు పచ్చల పిడికత్తి బహుమతి గా ఇచ్చాడంటే నిజంగా నా జన్మ ధన్యం అయ్యింది." అని ప్రకటించాడు.
ఒక్కసారి అంతా బిక్కముఖాలు వేసారు. కవులయితే తాము విన్నది నిజమా లేక వైష్ణవ మాయ అని రాయలవంక మార్చి మార్చి చూసారు. తిమ్మరుసుకు ఏ మాత్రం అర్థంకాలేదు.
"ఈ మధ్య రామలింగడి వలన ఏమిటే మిటో తెలియకుండా జరిగిపోతున్నాయి.” అని తన ప్రక్క కూర్చున్న తాతాచార్యుల తో లోగొంతుతో అన్నాడు.
"నిజమే అప్పాజీ ! రామలింగడేమిటి అతడి నిర్వాకం ఏమిటి ? పొట్ట చేత పట్టుకుని దేహీ అన్నవాడు ఈరోజు లక్షలు విలువ చేసే పచ్చల కత్తిని ఏ జంకుగొంకు లేకుండా రాయలవారికే బహుమతిగా ఇవ్వడం జీర్ణించుకోలేకపోతున్నాను. కొంపదీసి దిప్పలూరు గ్రామంలో ఆ వెర్రి బాపనికి ఏదైనా లంకెబిందెలు దొరికి ఉండాలి. ఒక్కసారి కూటిపురుగు తలకెక్కి ఇలా కన్నుమిన్ను కానకుండా పొగరుగా ప్రవర్తిస్తున్నాడు. రాయలు కూడా ఒక విధంగా క్షమించేసినట్లు ఊరుకున్నాడు. మరోలా అగ్గిబుగ్గి అయి ఉరితీత, లేదా కాళ్లుచేతులు నరకడం వంటి శిక్షలకు గురి చేయకుండా నా జన్మ ధన్యం అయ్యిందని చెప్తున్నాడు. ఇదంతా మీరన్నట్లు ఏదో జరిగిపోతోంది. నాకేం అర్ధంకావడం లేదు." బదులిచ్చాడు తాతాచార్యుల వారు.
"రామలింగడు కోరిన ప్రకారం అదనపు సైన్యం తక్షణం పంపండి." అని రాయలు ఆదేశించాడు.
📖
దిప్పలూరు అగ్రహారం గురించి తిమ్మరుసు ఆరా తీసాడు. అసలు రాయలు ఏవిధంగా రామలింగానికి దిప్పలూరు పత్రాలను ఇచ్చింది పరిపాలన విభాగం నుంచి తెప్పించి చూసాడు. దిప్పలూరు గ్రామంతో మరి పది పెద్ద గ్రామాలు కలిసి ఉన్నాయి. అవన్నీ కలుపుకునే దిప్పలూరు సర్వాగ్ర హారం అయ్యింది. అసలు ఏవిధమైన పన్ను లేకుండా ఇవ్వబడినది. ఇందులో ఉప్పర ఈనాము, (చెరువులకు గండ్లు పడితే ఉప్పర్లకు ఇవ్వబడినది). ఊరడు ఈనాము (చలివేంద్రం పెట్టినవారికి ఇచ్చినది.) కావలి ఈనాము (కోట కావలి కాయువారికిచ్చునది) భట్రాజు ఈనాము (భట్రాజులకు అనగా వ్యక్తిగత పొగడ్తలతో పబ్బం గడుపువారికిచ్చినది) బాగ్మారి ఈనాము (పులిని చంపేవారికి ఇచ్చేది)
ఇవిగాక బారాబలోతీలు: 1) రెడ్లు 2) కమ్మరి 3) కరణం 4) నీరుకట్టి 5) తలారి 6) కుమ్మరి 7) కంసాలి 8) వడ్రంగి, 9) మంగలి 10) చాకలి 11) జ్యోతిష్కుడు 12) వేగులు (గూఢచారులు) వీటిపై పెత్తనం రామలింగనికి దాఖలు చేయబడింది.
రామలింగానికి రాయలు దానపత్రాన్ని పక్కాగా ఇచ్చాడు. ఒక సామంతరాజుకి ఇచ్చినట్లుగా భారీగా అతనికి దానం చేసాడు. కనీసం ఇప్పుడు పంటల కాలం కాదు. ఒకవైపు భారీగా సైన్యాన్ని ఎలా పోషిస్తున్నాడు. మరోవైపు రాయలకు అతి ఖరీదైన కానుకలను పంపుతున్నాడు. ఇంకా పంపండి అదనపు బలగాలను అంటూ ఆర్జీలు పెట్టుకుంటున్నాడు. ఎలా సాధ్యం ? ఏవిధంగా ఇదంతా చేస్తున్నాడు. తిమ్మరుసు తల పట్టుకున్నాడు.
అంతలో రాయలు వచ్చి "అప్పాజీ మీరు ఏమంటారు? రామలింగడు ఏమీ కాని పని చేయడం లేదుకదా ! నాకు అతడు బహుమానం పంపాడని తెల్సిన మరు క్షణం నా ఒంట్లో రక్తం సలసల కాగింది. కానీ, అది నిండు సభ అక్కడ మనం ఏ పొరపాటు చేసినా నగరం అంతా చాటింపు మనమే వేసుకున్నట్టు అవుతుంది. మన భువన విజయం నగరవాసుల ముందు అభాసు పాలవుతుంది. రాయలవారి కవికి తల పొగరు గురించి చిలవలు పలవలుగా ప్రజలు చెప్పుకుని నవ్వుకుంటారు.” అని మనస్సులో ఉన్నది కక్కాడు.
"రాయా.. నీవు రామలింగాన్ని అనుమా నిస్తున్నావా ? ముమ్మాటికి అతడు అనుమానించ దగ్గ వ్యక్తి కాదు. ఈరోజు అతడు మీకు పంపిన కానుక వెనుక ఏదో నిఘాడత్వం ఉంది. చూద్దాం వెళ్ళాయి కదా అదనపు బలగాలు. వారిలో పెక్కు మంది మన వేగులను సైనికుల వేషాలలో పంపాను. మరో విషయం అతడు తొలుత తనతో తీసుకువెళ్లిన సైన్యంలో నాయీ బ్రాహ్మలున్నారు. అదే ఎందుకో నాకు అర్ధంకావడంలేదు."
"మంచి పని చేసావు అప్పాజీ ! ఇక మనం నిశ్చింతగా ఉండొచ్చు" రాయలు భుజం తట్టి ప్రత్యేకంగా మహామంత్రిని అభినందించాడు.
📖
రామలింగడు అగ్రహారం మధ్యలో కొలువు తీరాడు. అతడి చుట్టు సైనికులున్నారు.
"ఈ పది గ్రామాలలో అన్ని ఎక్కువగానే ఉన్నాయి. అంటరానితనం ఉంది. తలకు మించిన పన్నుల విధింపు కొనసాగుతోంది. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలవారి సార్వభౌ మాధికారాన్ని ధిక్కరించేవారి సంఖ్య గణనీయంగా ఉంది. ఒకప్పటి గజపతుల మోచేతి నీళ్లు తాగినందున మీకు విశ్వాసం ఉండిన ఉండవచ్చు. కానీ ఏలుతున్నది రాయలవారు, ఆయనకు గజపతులు బంధువులైనందున ఈ గ్రామాలపై పట్టు గురించి పట్టించుకోకపోవచ్చు. కానీ దానంగా పుచ్చుకున్న నాకు గజపతులు ఏమీ కారు. నాకు రాయలవారే సర్వము. కనుక మీలో మార్పుకై కొంత గడువు ఇచ్చాను. గడువు మీరారు. మీపై చర్య తప్పదు.” అని చెప్పి కొన్ని వందలమంది గజపతుల సానుభూతిపరులను నేల మీద పడదోయించి శిరోముండనాలు చేయించి, వారి ఆస్థులు జప్తు చేసాడు. వారి వద్ద పెద్ద ఎత్తున ధనం, గుప్తాయుధాలు, ఖరీదైన అభరణాలు రహస్య లేఖలు స్వాధీనం చేసుకున్నాడు.
రామలింగని చర్యలు గజపతుల దృష్టికి వాయువేగంగా వెళ్లాయి. వెంటనే ఒక తెల్ల పావురం ద్వారా తీవ్రమైన హెచ్చరికను పంపారు. ఆ లేఖ చదివి రామలింగడు దిప్పలూరు పై ఇక నుంచి పావురాలు ఎగురరాదు అని శాసనం చేసి వేటగాండ్రు ను గ్రామం చుట్టూ కాపలా కాయించి, కొన్ని వందల గూఢచారి పావురాలను పట్టించి పంజరపు గూళ్లలో బంధించాడు.
పావురాల వద్ద దొరికిన సమాచారంలో అతి గొప్పది పట్టపు రాణి తుఖాదేవి రాసిన లేఖలు. ఆమె ఎంత కాదనుకున్నా కన్నపాపానికి గజపతుల మాట మీరలేని బతుకును, రాయలపై వారి అక్కసును తీర్చుకోవడానికి ఒక విధంగా ఈమె సహకరిస్తోంది. అని రామలింగడు గ్రహించాడు.
👳♀️
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*తెనాలి రామకృష్ణ - 28*
👳♀️
*అగ్రహారం దానంగా వద్దు - 3*
రెండు వారాలు గడిచాయి. మళ్లీ మరో పరిశీలకుడు వచ్చాడు. అతడు అన్ని విధాలుగా సంతృప్తిచెంది, తిరిగి రాయల వద్దకు వెళ్లాడు. మళ్లీ సభలో ఉత్కంఠ. రామలింగడు ఈసారి ఏవిధంగా కబురు, విలువైన బహుమతులు పంపాడని ఆత్రంగా చెవులు రిక్కించారు.
ఈసారి రామలింగడు మరింత ఖరీదైన బంగారు ఆభరణాలు రాయలవారికి, రాణీ వాసంలో ఉండే రాయలవారి భార్యలకు పేరు పేరున పంపాడు. అందులో పట్టపు రాణివారికి మాత్రం పంపలేకపోయాడు. దాంతో సభలో కలకలం మొదలయ్యింది. రాయలు భృకుటి ముడిపడింది. తల ఎత్తి రాణీవాస స్త్రీలు కూర్చునే చోటు వైపు చూసాడు. తుఖాదేవి ఆందోళనగా కన్పించింది.
అంతలోనే తిమ్మరుసు పరిశీలకుడిని అడిగాడు.
“రామలింగడు ఏమైనా ప్రత్యేకంగా కబురు పంపాడా ? ఉంటే ముందా విశేషాలు చెప్పండి.”
"రామలింగకవి ఒక్కక్షణం దిప్పలూరులో ఉండలేను అని కబురు పంపాడు. తను వచ్చిన పని అయిపోయిందని మీకు చెప్ప మన్నాడు. రాయలవారిని చూడకుండా తను ఈ మారుమూల గ్రామంలో జీవించలే నని మరీ మరీ చెప్పుకున్నాడు." అని వినయంగా చెప్పాడు పరిశీలకుడు.
ఆ మాటలకు తాతాచార్యులవారు, కవులు పెద్దపెట్టున నవ్వసాగారు.
"ఏమిటి అతడు చేసిన నిర్వాకం. ఏమి చేసినాడని అక్కడ పని అయిపోయిందని కబురు కాకరకాయ అంటున్నాడు. ఏదో రాయలవారు కనికరించి ఇచ్చిన అగ్రహారం లో అందరిని ఆకట్టుకునేట్టు బతకకుండా తప్పుల తడకగా ఏదో ఒక తెలివిమాలిన పని చేయడం." అని గేలిచేసారు.
రాయలు ఆలోచనలోపడ్డాడు. పరిశీలకుడి ని అక్కడ విశేషాలు గురించి గుచ్చి గుచ్చి అడిగాడు. అతడేమి చెప్పలేకపోయాడు. సభనుద్దేశించి రాయలు మాట్లాడాడు.
“రామలింగకవి గురించి నా అభిప్రాయాన్ని ముందే చెప్పాను. అతడు కవి కంటే పాలకుడుగా చాలా ముందున్నాడు. ఈ పరిశీలకుడు ఎవరో కాదు అతిముఖ్యమైన గూడచారి, ఈతడే వెళ్లి అక్కడ విశేషాలను ఒక్కటి కూడా పసిగట్టలేకపోయాడు. అక్కడ ఏదో జరుగుతోంది. సరే రామలింగ కవిని వెనుక్కు రమ్మనమని వర్తమానం పంపండి.” మహామంత్రిని ఆదేశించాడు.
ఆ వెంటనే నాలుగు పల్లకీల్లో అమ్మాయిలు దిగారు. వారిని ఆశ్చర్యంగా అంతా చూసారు. పరిశీలకుడు వినమ్రంగా చెప్పాడు.
“ ప్రభూ ! ఈ కన్నెలు తమ సేవలకు వినియోగించమని రామలింగకవిగారు పంపారు.”
"అప్సరసలను తలదన్నేట్టున్నారు. పదహారు నుంచి ఇరవై లోపు వయస్సున్న వారు. వీరు ఏ ప్రాంతం నుంచి తీసుకురా బడ్డారు ఇంతకీ ఎవరు వీరు ? చూస్తుంటే దాసీజనాలుగా లేరే. వీరి ఉనికిఎక్కడిది ?”
రాయలు ప్రశ్నకు గుంపుగా నిలబడిన కన్యలలో ఒకతె ముందుకు వచ్చి తల వంచి చెప్పేందుకు పెదాలు విప్పింది. అప్పటికే ఆమె కన్నులు చింత నిప్పులయ్యాయి.
"తమ పాదములకు నమస్కరిస్తున్నాం. మేము ఓడ్రదేశపు కన్యలం. తమ పట్టపు రాణి తుఖాదేవి వారికి ఒక విధంగా దూరపు బంధువులం. మేము చాలా కాలంగా తలదాచుకుంటున్న దిప్పలూరు లో రామలింగకవి దుర్మార్గపు నాయకరం వెలగబెట్టి మా తండ్రులను శిరోముండనా లకు గురిచేసి, మా ఇల్లు గుల్ల చేసి, నిరు పేదలుగా చేసి, మమ్ముచెరపట్టి ఇలా దాసీజనాలుగా మార్చివేసాడు." ఉబికి వస్తున్న కన్నీళ్లుతో చెప్పింది.
ఒక్కసారి సభ నివ్వెరపోయింది.
"ఆ గ్రామంలో మీ తండ్రులు ఏం చేస్తుంటారు? వారు రామలింగనితో గొడవకు దిగారా? శిరోముండనాల వరకు వెళ్లిందా అక్కడ పరిస్థితి. నిజాలే చెప్పండి. అబద్దాలకు ఇక్కడ తావులేదు” తిమ్మరుసు ఆ అమ్మాయిలను సుతిమెత్తగా హెచ్చరించాడు.
చాలా కాలంగా గజపతుల ఉప్పు పులుసు లతో బతికినోళ్లం. దిప్పలూరులో మేమే మహరాజుల్లా బతికేవాళ్లం. ఇప్పుడు ఓ బాపని పెత్తనం కింద బతకాల్సివచ్చింది. అతని నాయకరం అంగీకరించని మా తండ్రులు ఈరోజు ఘోరమైన శిక్షలకు గురి అయ్యారు.” ఏదీ దాచకుండా చెప్పింది. రాయలు ఆమె మాటలను అయోమయం గా విన్నాడు.
రాయలు ఇబ్బంది గ్రహించిన తిమ్మరుసు జవాబు చెప్తున్న ఆమెకు అడిగాడు.
" అక్కడ మీరెలా మారాజుల్లా బతికేవారు. ఎవరిచ్చారు మీకా హోదా, దిప్పలూరు రాయలవారి ఏలుబడిలో ఉంది కదా. మరి గజపతులు ఉప్పు పులుసు అని అంటున్నారు. మన అందరికి రాయలవారే చక్రవర్తులు.”
"క్షమించండి. మాకేమీ తెలియదు. మాకు అప్పటికీ ఇప్పటికీ గజపతులే చక్రవర్తులు. వారి సార్వభౌమాధికారాన్ని మేం మా గుండెల్లో నిలుపుకున్నాం." ఏమాత్రం తొణక్కుండా బెణక్కుండా చెప్పింది.
రాయలకు మొత్తం అర్ధం అయ్యింది. ఒక్కసారి అతనిలో పెను మార్పులు వచ్చాయి. ఆ కన్నెలను చూసి...
"రామలింగడు గురించి ఇప్పుడే కదా కవి కంటే పాలకుడిగా గొప్పవాడు అని చెప్పాను. అతడు పాలకుడిగా పెద్ద తప్పటడుగు వేసాడు. ఈ కన్నెలు అందగత్తెలు కానీ, వీరి నరనరాన రాయ లంటే మండిపాటు ఉంది. ఇట్టి వారు నాకు గాని నా రాణీవాస స్త్రీలకు గాని హాని చేయరని నమ్మకం ఏమిటి ? వీరిని నాకు దాసీజనాలుగా పంపించి ఒక విధంగా రామలింగడు రాజద్రోహంచేసినట్టయ్యింది. తక్షణం రామలింగకవిని పిలిపించండి.” కోపంగా ఆదేశించాడు.
అంతవరకు కళాకాంతులు లేని ముఖాల తో ఉన్న కవులకు ఒక్కసారి వెయ్యి దివ్విటీల వెలుగు ముఖం అంతా నిండినట్టు అయ్యింది. రాయలు ఆ కన్నెల వంక చూసి వీరిని ఏం చేద్దామా అని ఆలోచనలోపడ్డాడు. అందుకు కారణం ఉంది. తనెదురుగా నిలబడి ఉన్నవారు తుఖాదేవికి దూరపు బంధువులం అని చెప్తున్నారు. ఆమె నీడ వీరిపై ఉంది. కనుకనే ధైర్యంగా వారి మనస్సులో ఉన్నదంతా కక్కారు. లేకుంటే అంత సాహసం చేయలేరు. ఆ కన్నెల్లో ఇంత వరకు బదులిచ్చిన ఆమె రాయలను చూసి..
"ప్రభూ మమ్మల్ని ఏంచేద్దాం అని ఆలోచనలో ఉన్నారు. మేము చెరలో చిక్కిన బానిసలం. కనుక రాణీవాసంలో మా సేవలను వాడుకోవచ్చు." చెప్పి రాయల నుంచి జవాబుకై ఎదురు
చూడసాగింది.
"వీరిని అతిధి గృహంలో ఉండనీయండి. రామలింగడు వచ్చాక వీరి సంగతి ఆలోచిద్దాం. ఇటువంటి వారి సేవలు రాణీవాసానికి ఉపయోగించవు. కనుక పగవారైన, స్త్రీలైనందున కొన్నాళ్లు అతిథిలుగానే ఉంచండి.” చెప్పి అంతటితో సభ చాలించాడు.
📖
మూడవరోజు రామలింగడు సభలో ప్రవేశించాడు. అంతకు ముందు కొన్ని వందలమంది దిప్పలూరు వాసులను బోడిగుళ్లుతో సైనికులు తోడుతో సభలో నిలబెట్టించాడు. వారు తలలు దించుకుని నిలబడ్డారు. రామలింగడు ఏం చెప్పుతాడో నని అంతా చెవులు రిక్కించి వినసాగారు. రాయలవారే సూటిగా చూస్తూ...
"రామలింగా నీకు నేను ఇచ్చినది ఓ సర్వాగ్రహారం, అక్కడ నీవు వెళ్లి చేసుకొచ్చిన నిర్వాకం వినడానికి ముందు చాలా గొప్పగా ఉన్నా క్రమేపి నీపై కోపాన్ని తెప్పించింది. అక్కడ గజపతులను
కొలిచే కన్యలను రాణీవాస సేవలకు పంపినందున నీపై తీవ్రమైన కోపంగా ఉంది. అక్కడ అమాయక గ్రామీణులను కొన్ని వందలమందికి తలలు గొరిగించి ఇలా నా ముందు నిలబెట్టావు. శిరో ముండనం అంటే తల తీయించినంత శిక్ష అని నీవెరుగవా ? ఇవన్నీ నీకు ఇచ్చిన నాయకరంలో లేనివి. మరెలా నీకుగా నీవు ఈ దారుణమైన శిక్షలు మా ఆదేశాలు లేకుండా విధించావు. ఇందుకు నీకు శిక్ష ఏమిటో తెలుసా ?" అన్నాడు.
"ప్రభూ ముందు నా వాదన విన్నాక మీరు వేయాల్సిన శిక్ష అమలు చేయండి. నాకు మీరు ఇచ్చిన సర్వాగ్రహారం, ఓ బాపడు బతకడానికి కాదు. ఆ బాపడు అయిన నన్ను చంపడానికి...అక్కడ పేరుకే రాయల వారి ఏలిక. కానీ అక్కడ సగానికి పైగా జనాలు గజపతుల నీడలుగా బతుకుతు న్నారు. నేను వెళ్లగానే నాపై ఈ బోడిగుళ్ల వాళ్లంతా విరుచుకుపడ్డారు. రాయల వారిని దూషించారు. నేను దిప్పలూరికి నాయకరం వెలగబెట్టడానికి కదా వెళ్లింది కనుక ఎవరిని ఉపేక్షించలేదు. నాకు ఎలాంటి అధికారాలున్నాయో తెలియదు. కానీ, నా చేతిలో సైనికబలం ఉంది. కనుక ఏమాత్రం ఉపేక్షించక శత్రువులైన వీరిపై విరుచుకుపడ్డాను.”
రాయలు ఆసక్తిగా వినసాగాడు. తిమ్మరుసు అయోమయంగా వింటూనే ఏమెమో ఆలోచించసాగాడు. సర్వసేనాని అతని వెనుకనున్న వారు వింటూ అప్రమత్తులైయ్యారు.
రామలింగడు మళ్ళీ ఇలా చెప్పసాగాడు..
"ప్రభూ ఇందుకు కారణం మీ బంధుత్వమే తమరే కారణంగా అక్కడ జనాలను పట్టించుకోలేదో నాకు తెలియదు. అక్కడ ఎక్కువశాతం మందికి గజపతులంటే ప్రాణసమానం. వారెంతకైనా తెగించగల రు. కనుకనే వారి కుట్రలు తమకు తెలియ పరిచే సమయం లేనందున నాకుగా నేను ఒక నిర్ణయానికి వచ్చి అన్నింటికంటే హేయమైన శిక్ష తల గొరిగేయడం వేసాను. దేశద్రోహం, సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే వారిని మరణదండన లేదా చేతులు కాళ్లు నరికేయడం వంటివి చేయాలి. కానీ నేను అలాంటి ఘోరశిక్షలు వేయలేను. అమలు చేయలేను.
ఈ బోడి గుళ్లుతో నిలబడున్నవారు కూడా దేశద్రోహులే. వీరి ఆస్థులను కొల్లగొట్టాను, బొక్కసాన్ని నింపాను. వీరి ఆడాళ్లను దాసీ జనాలుగా కొన్ని దేవాలయాలకు, మన సామంతులకు అప్పగించాను. ఆ విధంగా వారికి బతుకు తెరువు చూపాను.”
"ఇంతవరకు బాగానే ఉంది రామలింగా. ఎన్నింటినో తెలుసుకున్న నీవు నాకు పంపించిన కన్యల ఆంతర్యం తెలుసుకో
లేదా ? వారు నా ముందే నాసార్వభౌమాధి కారాన్ని ధిక్కరించునట్లు మాట్లాడుతునే ఉన్నారు. అట్టివారిని నా సేవలకు, రాణీ వాసానికి పంపించడం ఏమిటి, వారి వలన ఎంత ప్రమాదం. వారు మాటల తీరు చూస్తుంటే వారు ఎంతకైనా తెగించగలరని అనిపిస్తోంది. కనుక ఇటువంటి వారిని చెరపట్టి హింసించాల్సింది పోయి, అత్యంత కీలకమైన చక్రవర్తి మందిరాలలో నియోగించబూనడం ఎంత హేయం. ఇదంతా నీవు కావాలన్నట్టు చేసిన రాజద్రోహ నేరం. క్షమించరాని నేరం.”
"ప్రభూ నా నిర్ణయం సరైనది. కారణం ఏమిటంటే, తమకు పంపిన కన్యలు తప్పక తమ కనుసన్నల్లో ఉండాల్సిన వారు. వేరే ఏ చోట ఉన్నా ఎంతో దేశ ద్రోహం జరిగిపోతుంది. కనుక వారిని ఇక్కడకు పంపాను. వీరికి పెంపుడు పావురాలతో రహస్యాలు అందించే గుణం ఉంది. వీరు కోరుకున్న రహస్యాలు రాణి వాసంలో పుష్కలంగా లభిస్తాయి. అందుకే ఆ కన్యలను వారి పెంపుడు పావురాలను మొత్తం మీ అధీనం చేసాను." చెప్పి చప్పట్లు చరిచి భటులను పిలిచి సైగలతో ఆదేశించాడు రామలింగడు.
సైనికులు బుట్టలతో తీసుకువచ్చారు బంధించిన పావురాలను. రాయలు అది చూసి నివ్వెరపోయాడు.
"ఈ పావురాలు రాణీవాసం నుంచి రహస్యాలను మోసుకుపోతున్నాయా ? అలా రహస్యాలను చేరవేసేవారు ఎవరు? చాలా కాలంగా రాణీవాసంలో పాతుకు పోయిన దాసీలా ? ఈ ఓడ్రపు కన్యలను ప్రశ్నించిన తెలియగలదు. ఆడవారు అని చూడకుండా దండించాల్సిందే. "
ఉగ్రసింహుడైపోయాడు రాయలు. అతడి ముఖం రౌద్రంగా మారిపోయింది. అంతటి కోపం ఎన్నడూ చూడలేదు ఆ సభలోని వారు.
కొన్ని రహస్య లేఖలను రాయలకు అందించాడు రామలింగడు.
"ఈ లేఖల రాతను బట్టి ఎవరు రాసింది తెలియగలదు. మహా మంత్రీ తప్పక దోషులను పట్టితీరాలి. ఆడువారు అని చూడకుండా తీవ్రంగా దండించాల్సిందే ” చేతిలో ఉన్న లేఖలను అందించాడు రాయలు.
తిమ్మరుసు లేఖలను ఇటు అటు త్రిప్పి
" ఇందులో ఓడ్రపు లిపి కన్పించుచున్నది. అవును మన అధీనంలో ఉన్నవారు ఓడ్రపువారే. మన రాణీవాసంలో ఉన్న పరిచారికలను వారికి వచ్చు భాషలు గురించి పూర్తిగా వాకబు చేసి ఈ లేఖలు ఎవరు రాసింది తెలుసుకోండి." అని కొందరు రాజోద్యోగులను ఆదేశించాడు.
రామలింగడు నవ్వి " ఆ లేఖలు రాసేది ఆడువారని కూడా చూడకుండా శిక్షిస్తారా ? ఆ శిక్షలు ఎలాంటివి ప్రభూ !" అని రాయలనే అడిగాడు.
"దేశద్రోహం క్షమించరాని నేరం. కఠినంగా శిక్షించక తప్పదు. ఆ లేఖలు చదివించి వాటి ప్రభావం తెలుసుకుని తగు శిక్షలు విధించక విడువను" అన్నాడు రాయలు కోపంగా.
"ఆ లేఖలు చదివేది ఎవరు ? మీ అతిధి గృహంలో బందీలుగా ఉన్న కన్యలు. వారు మూడు నాలుగు భాషలపై పట్టున్నవారు, చిన్నపాటి గూఢచారులు. కనుక మీరు కోరితే తప్పదని ఏదో పురాణంలా చదివి తప్పుగానే విన్పిస్తారు కానీ, నిజాలు పైకి చెప్పరు కదా ! మన పట్టపు రాణివారి మాతృభాష ఒరియా ఆమె చదవగలరు. ఇక ఆమె వద్ద గల ఇక్కడ దాసీజనాలకు ఏ భాష చదవనూ రాయనూ రాదు.”
రామలింగని మాటలకు రాయలు విని అయోమయంగా చూసాడు.
"నిజమే పట్టపురాణి వారికి ఆ భాష వచ్చు. ఆమె వద్ద ఉండే దాసీజనాలు నిరక్షరాస్యు లే. మరి ఈ రాసినది ఎవరు ? దాసీజనాలు కారా? ”
“ముమ్మాటికి కారు. ఆ రాసినది తుఖాదేవీ వారే. ఆమె తన కన్నవారు చేస్తున్న ఘాతుకాలను, వారి ఆదేశాలను వదులు కోలేకపోతోంది. గజపతులకు రాయలవారు అల్లుడని కూడా చూడడంలేదు. నేను అక్కడికి వెళ్లడానికి కారణం ఆమె కదా ప్రభూ, ఆమె కోరికపై తమరే నన్ను అక్కడికి సాగనంపారు. ఆమె ఎందుకు కోరారంటే నా ప్రభుభక్తిని చూసి నాపై గజపతులు కత్తి కట్టారు. ఆమె ద్వారా నన్ను అక్కడికి రప్పించారు. ఇక్కడున్న బోడిగుళ్లు వారు నన్ను తుదముట్టించాలని అనుకున్నారు.”
మొత్తం సభ అంతా అది విని అంతులేని ఆశ్చర్యానికి గురయ్యింది. రామలింగడు ఏకంగా రాయలవారి అత్యంత ప్రేమ మూర్తి తుఖాదేవి పైనే దేశద్రోహం నేరం ఆపాదించడం పెద్ద సాహసం. అసలు తాము అలాంటి మాటలను వింటున్నా మా లేదా అని ఒకటి రెండుసార్లు గిచ్చుకున్నారు. రాయలు తీవ్రంగా ఆలోచించసాగాడు.
"రామలింగా నీకు ఏది ఎక్కడ చెప్పాలో తెలియదా ? సభలో నీ నోటికి ఏమొస్తే అది ప్రేలితే అది నీ కొంప ముంచుతుందని ఎరుగవా. నీవు కట్టుబాట్లు మరిచి రాణీ వాసంపై కల్లు తాగిన కోతిలాఅభియోగాలు చేసావు. క్షమించరాని నేరం చేసావు." అని తిమ్మరుసు నిప్పులు చెరిగాడు.
👳♀️
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*
*తెనాలి రామకృష్ణ - 29*
👳♀️
*అగ్రహారం దానంగా వద్దు - 4*
కవులు ఒక విధంగా ఆనందించారు. మరో విధంగా బాధపడ్డారు. సభలోని వారు రామలింగడికి మూడింది పాపం రాయల వారి ఆగ్రహానికి గురికాక తప్పదు అని అనుకున్నారు.
రామలింగడు చెక్కుచెదరలేదు. రాయల వైపు చూస్తూ నిలబడ్డాడు. సూది కింద పడినా విన్పించేటంత నిశ్శబ్ధం అక్కడ చోటు చేసుకుంది. సభలో రాణీవాస ప్రముఖులు కూర్చున్న చోటులోంచి తుఖా దేవి లేచి వెళ్లిపోయింది. తెరల వెనుక ఆమె వెళ్లిపోతున్న దృశ్యం రాయలు చూసి తానూ అర్ధాంతరంగా సభను చాలించి వెళ్లిపోయాడు.
నగరమంతా రామలింగని కోసం పదేపదే చెప్పుకున్నారు. అతడిని రాయలు ఉరి తీసేస్తాడు, రాయలకు తుఖాదేవి అంటే ప్రాణం. ఆమెను సభలో కించపరిచే విధంగా మాట్లాడినందున ఘోరంగా శిక్ష అనుభవించక తప్పదు. ఏ పదిమంది కలిసినా ఇదే చర్చ. రామలింగని ఇల్లాలు విని కన్నీరు మున్నీరు అయ్యింది. ఆ రాత్రి భర్తను అడిగింది. “ఎందుకు మా రాజులతో మనకు పుల్లవిరుపు మాటలు, మిమ్మల్ని ఊరంతా ఉరి తీస్తారని అనుకుంటున్నారు. అప్పుడు నా పిల్లలు నేను ఏమి కావాలి ?” అని తలబాదుకుని ఏడ్చింది.
“పిచ్చిదానా రాయలు నన్ను శిక్షించలేడు. కారణం నేను బయటపెట్టినది దేశ సమగ్ర తకు సంబంధించినది. అదీ సభలో అందరి సమక్షంలో నోరు విప్పి చెప్పాను. ఇందులో దోషి తుఖాదేవి. ఆమె సభ వీడి వెళ్లిన మరుక్షణం రాయలు ఆమె వెంటపడ్డాడు. అతడికి ఆమె పిచ్చి. రాయలు ఆమె కారణంగా చాలా ఇడుములపాలు కావడం ఖాయం."
"ఈ విజయనగరంలో ఎవరికి లేనిది మనకెందుకు ?”
“అలా అని అందరూ అనుకుంటే ఎలా ? మనం తింటున్నది రాయలవారి చేతి కూడు. నేను అంకితమై పని చేయక మానను. ఇందులో నా తలే పోనీ, నా సర్వమే పోనీ. భయపడను ఎవరికి వెరువను. ఇదే నా తుది నిర్ణయం." అని ఖరాఖండిగా చెప్పాడు రామలింగడు.
“నేను నా పిల్లలు అన్యాయం అయిపో తాం." అని పెద్దపెట్టున ఏడుస్తుండగా తిమ్మరుసు వద్ద నుంచి ఒక భటుడు విచ్చేసి “తక్షణం మిమ్ము అప్పాజీ తీసుకు రమ్మన్నారు.” అని చెప్పాడు.
రామలింగడు ఉన్నపళంగా బయల్దేరాడు. అంతే, అతడి భార్య భయబ్రాంతురాలు అయ్యింది. చూస్తుండగానే రామలింగడు వీధిన పడి చకచకా వెళ్లిపోయాడు. రామలింగని భార్యకు భయం నిలువెల్లా వణికించేసింది. పరుగు పరుగున రాయల వారి వద్దకు వెళ్లింది.
"ప్రభూ నా భర్తను రక్షించండి. తెలియక ఏదో అసందర్భంగా వాగాడు. మమ్మల్ని ప్రాణాలతో వదిలేయండి. ఈ రాజ్యం వదిలి దూరంగా వెళ్లిపోతాం.” అని రాయలు పాదాలపై పడింది.
"లే, అంత ప్రమాదం ఏమొచ్చింది. రక్షించాల్సింది శిక్షించబడినపుడే కదా. రామలింగని వలన ఈ రాజ్యానికి చాలా మహోపకారం జరిగింది. నేను నా ప్రజలు అతనికి ఋణపడి ఉన్నాం. అయినా నీకెందుకు వచ్చింది ఇలాంటి భయం. రామలింగడు ఎక్కడ ?" అని అడిగాడు.
"ప్రభూ ఇంతకు మునుపే తిమ్మరుసు గారి నుంచి పిలుపురాగా వెళ్లాడు..అందుకే భయపడి వచ్చాను.”.
రాయలు ఆలోచనలోపడ్డాడు. తిమ్మరుసు ఎందుకు పిలిచాడు. రామలింగడితో అతనికేం పని ? రామలింగడు దేనికి భయపడనివాడు. అతని వలన ఏదైన రాచకార్యం తలపెడ్తున్నాడా ? ఏమో అప్పాజీ నిలువెల్లా రాజకీయాలతో నిండి ఉంటాడు. ఇంతకీ వారిద్దరి కలయిక మంచి కోసమా? లేక చెడ్డకోసమా ? ఒక్కసారి అతని తల గిర్రున తిరిగిపో
సాగింది. రామలింగని భార్యను అక్కడే కూర్చోమని చెప్పి ఉన్నపళంగా తన దగ్గరికి రామలింగడిని తీసుకురమ్మని భటులను పంపాడు...
రామలింగడుతో బాటు తిమ్మరుసు వచ్చాడు. వారిని చూసి...
"అప్పాజీ ఈమె వచ్చి తన భర్తను కాపాడమని గోడుపెడుతోంది. రామలింగని మీరు పిలిపించడానికి గల కారణం ?”
"ఉదయం జరిగినదాని పై వివరణ అడిగి తెలుసుకుందామని పిలిపించాను. పాపం ఈమె తన భర్తకు ఏమయిపోతుందోనని భయపడి ఉంటుంది.” అన్నాడు తిమ్మరుసు.
అప్పాజీ ఏదో దాస్తున్నట్టుగా చెప్పడం రాయలు గ్రహించి ఈసారి నేరుగా రామలింగడినే ప్రశ్నించాడు.
“నిన్నేం ప్రశ్నించారు మన అప్పాజీ"
రామలింగడు సరిగ్గా బదులీయలేక
పోయాడు. నాన్చాడు మీన మేషాలు లెఖించాడు. అది గ్రహించిన రాయలు తీక్షణంగా చూసాడు.
"అప్పాజీ ఇక మీరు మీ పనులు చూసుకోండి. నాకు రామలింగనితో పని ఉంది. " అని చెప్పి పంపించేసి ఇటు తిరిగి మళ్లీ రెట్టించి అడిగాడు.
"రామలింగా నువ్వు రాజకీయాల్లో రాణించాలనుకుంటున్నావా ? ”
"ప్రభూ, అప్పాజీ నాన్ను పిలిపించింది కేవలం నన్ను అభినందించడానికే! దేశ క్షేమం కోరినవాడిగా అయన నన్ను గుర్తించారు. అంతకుమించి ఏమీలేదు.”
ఆ మాటలకు రాయలు కోపంగా చూసి చాలాసేపు తనలో తనే తర్కించుకుని చివరికి రామలింగని పై చర్యతీసుకోవాలని నిర్ణయించేసుకుని, అందుకు దారులు వెతికాడు.
"తొలుత నా ప్రశ్నకు నీవు నిజంచెప్పకుండా దాచే ప్రయత్నం చేసావు. ఓ కవిగా అయితే భరించగలను కానీ, నిన్ను ఓ సర్వాగ్రహారా నికి షేఖ్సనాది (ఫౌజుదార్) గా నమ్మి నియమించాను. నీవు చక్రవర్తికే నిజం చెప్పకుండా నాన్చుతున్నావంటే నీవు క్షమార్హుడవు కావు. రెండోసారి అడిగితే తప్పదని చెప్పే స్థాయికి ఎదిగితివి. వీటన్నిటిని మించి సభలో పట్టపురాణి అని చూడకుండా తుఖాదేవి పై అంతగా నిందారోపణ చేసావు. రామలింగా నీవు నాకు ఏడాది పాటు కనపడకుండా ఎక్కడికైనా వెళ్లిపో! లేకుంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. నీ భార్య కన్నీరు చూసి విడిచిపెడ్తున్నాను. ఈరోజు కేవలం ఓ ఆడదాని కన్నీరు నిన్ను కాపాడి నీ బొందిలో ప్రాణాలు నిలిపింది.” అన్నాడు.
రామలింగడు రాయలవారి మందిరం లోంచి తలవంచుకుని వెనుదిరిగాడు. బతుకుజీవుడా అని అనుసరించింది అతడి భార్య. తుఖాదేవి లోపల నుంచి వచ్చి రాయలు పక్కకు చేరి వెళ్లిపోతున్న రామలింగకవి దంపతుల వైపు నవ్వుతూ చూసింది. ఆమెలోని విజయగర్వం తొణికిసలాడింది. రాయలవైపు తృప్తిగా చూసి...
"ఈ వెర్రి బాపనికి ఎంత పొగరు. నా మీదే అభియోగాలు చేస్తాడా ? చక్రవర్తి తన భార్య కంటే ఏదీ ఎక్కువ కాదు అని ఈ కవి ముందు, నగరవాసులు ముందు మీరు నిరూపించారు. నా జన్మ ధన్యమయ్యింది. మహోన్నతుడయిన పురుషునికి నేను అర్ధాంగినయ్యాను. ఇంక నాకు కావల్సింది ఈ జగతిలో లేనే లేదు." అని ఒత్తి పలికింది.
రాయలు తలపంకించి ఆమె వంక తీక్షణంగా చూస్తూ గొంతు సవరించుకుని
“తుఖాదేవి, నీవు నాకు మాట ఇచ్చావు. ఇక మీదట నీ తండ్రితో ఎలాంటి సంబంధాలు పెట్టుకోనని చెప్పావు. కనుకనే నీ కోరిక మీద రామలింగడిలో ఏ నేరం కనిపించకపోయినా దేశబహిష్కారం చేసాను.. ఇంకనూ ఆ గజపతులతో మంతనాలు, వారి పెత్తనం చెల్లుబాటు కావాలంటే సహించను. కవులంటే నాకు అమిత గౌరవం నీకు తెలుసు. రామలింగ కవినే వదులుకున్నానంటే, నీ మీద నాకున్న ప్రేమ ఎలాంటిదో అర్ధం చేసుకో, నీలో మార్పు లేకుంటే దారుణంగా మనం విడిపోవడం ఖాయం. హిందూ స్త్రీకి చిన్న తనంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధా ప్యంలో కొడుకు సంరక్షకులుగా ఉంటారు. కానీ, నీవు పిల్లల తల్లివైనా నీ బుద్ధి నీ తండ్రి చుట్టూ తిరుగుతోంది.” అన్నాడు.
“తప్పకుండా నాలో మార్పును ప్రభువులు చూస్తారు.” అంది తుఖాదేవి.
"దేవీ నీకు ఓ నిజం చెప్తున్నాను. ఈరోజు నేను చాలా తప్పు చేసాను. మనకోసం మన ప్రజల కోసం అంకితభావంతో పని చేసే రామలింగకవిని దేశబహిష్కారం చేసి సత్కరించినందున నా గుండెల్లో తెలియని ఆందోళనగా ఉంది. అందుకే అంటారు పెద్దలు, రాజు మంచితనం, అల్లుడి మంచితనం ఒక్కలాంటివేనని.”
రాయలు బాధగా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
తుఖాదేవి కూడా ఆలోచించుకోసాగింది. 'తనంటే పడి చచ్చే రాయలు ఈరోజు ధర్మం తప్పి ప్రవర్తించాడు. నిజంగా తనే శిక్షింపబడాలి. తనచే తన తండ్రి కాని పనులను చేయిస్తున్నాడు. తను చేయక తప్పడంలేదు. కూతురు సౌభాగ్యం కూడా చూడని ఇటువంటి తండ్రి ఈ లోకంలో ఎక్కడా ఎవరికి ఉండబోడు. ఇలా ఎంత కాలం చేయాలి. ఇంకా ఎంతమంది బలిపశువులు కావాలి. ' తల పట్టుకుని తల్పం పై కూర్చుంది.
తూరుపు తెలవారుతుండగా రామలింగడు నగరం వదిలిపోవాలి. ఇది చక్రవర్తి ఆజ్ఞ. రాయలకు దిగ్గున తెలివి వచ్చింది. ఆ రాత్రి అసలు నిద్రకు దూరం అయిపోయి ఏదో మగతగా తెలవారుజామున నిద్రలోకి జారుకున్నాడు. తీరా పక్షుల కిలకిలరావా లకు తెలివి వచ్చేసింది. ఎర్రని ఎండ కన్పించింది. రామలింగడు వెళ్లిపోయి ఉంటాడు, కాదు తనే అన్యాయంగా రాజ్యం నుండి తరిమేసాడు. లోలోపల బాధపడ్తూనే లేచి అటు ఇటు పచార్లు చేయసాగాడు.
ఏదో కొంప మునిగిపోయినట్లు తాతా చార్యులు ఆయాసపడ్తూ వచ్చి..
" రాయా రామలింగానికి వేసిన శిక్ష మార్చే వేసి ఏకంగా గండశిల శిక్ష వేస్తివా ? అగ్రహారంలో అతడు ఆ శిక్షను భారంతో అనుభవించుచున్నాడు. అతనికి అంతటి శిక్షకు గురిచేయాల్సింది లేదే. పాపం వెర్రిబాపడు నానా అవస్థపడ్తున్నాడు"
“ఆచార్య ఏమి చెప్తున్నారు. రామలింగాని కి నేను వేసినది దేశబహిష్కారమే కానీ, ఎలాంటి హింసకు గురిచేయలేదే.” అంతులేని ఆశ్చర్యానికి గురై చేష్టలుడిగి నట్లు అయ్యాడు రాయలు.
వెంటనే ఎవరా శిక్ష వేసి అమలు చేసినది తెలుసుకోవాల్సిందిగా ఆదేశిస్తూ తక్షణం రామలింగనిపై అమలు అవుతున్న శిక్షను ఆపివేయాల్సిందిగా కొత్వాలు పటేలును రాయలు ఆజ్ఞాపించాడు. ఆ తరువాత ఇక ఒక్కక్షణం తన మందిరంలో ఉండలేకపో యాడు. తాతాచార్యులతో రధమెక్కి బయల్దేరాడు.
అగ్రహారంలో ధూళిరేపుకుంటూ గుర్రాలు పూన్చిన రధం ఆగింది. అంతవరకు అక్కడ గుంపులు గుంపులుగా ఉన్న జనాలు పారిపోయారు. రాయలు పెద్ద కళ్లు చేసుకుని చూసాడు. తన ఎదురుగా రామలింగడు మోయలేని నల్లని గుండు మోసుకుంటూ ఆయాసపడ్తూ నడవలేక నడుస్తూ వైశాఖ మాసపు ఎండలో విపరీతంగా చెమటలు పోస్తూ నింగి వైపు నిలుగుడ్లు వేసాడు.
అతని వెనుక రాజభటులెవరూ లేరు. ఒకవేళ ఎవరైన భటులుంటే రాయలే వాళ్ళని స్వయంగా తన మొలలో ఉన్న కరవాలానికి ఎరచేసేవాడు. అంతగా కోపంతో అతని ముఖం రౌద్రంగా మారిపోయింది. పరుగులాంటి నడకతో రామలింగానికి ఎదురెళ్లాడు.
"ప్రభూ అక్కడే నిలవండి. ఈ దీనుని పై కనికరం కలిగిందా ? ఆ రోజు తమరన్నా రు. శ్రీనాధునివలే శిక్షకు గురిచేయగలనని, మీ పంతం తీరినది కదా ! దేశ బహిష్కారం కంటే ఈ శిక్ష చిన్నదే. నేను ప్రయాసపడి అనుభవిస్తాను. నాకు మునుపు వేసిన దేశబహిష్కార శిక్షను రద్దు చేయండి. " అతికష్టం మీద గొంతు పెగుల్చుకుని బతిమలాడాడు.
"ముందా నల్లగుండు తీయండి" అని తనతో వచ్చిన భటులను ఆజ్ఞాపించాడు రాయలు.
“నన్ను ఈ శిక్ష అనుభవించనీయండి. మరెంత....నగరపొలిమేరలు దాటానంటే నాకు కొత్తగా తమరు విధించిన శిక్షను అనుభవించినట్టే కదా!” అని తన వద్దకు వచ్చిన భటులను పొమ్మన్నాడు. రామలింగడు పేలవంగా నవ్వి..
"ఆ మహాకవి శ్రీనాధుడు ఈ యాతన శిక్షను ఎలా అనుభవించాడో కదా! అది తలచుకుంటే గుండెలు బరువెక్కుచున్నా యి. పోనీ ప్రభూ తమ ఏలుబడిలో ఇక్కడ ప్రజలు కూడా ఓ కవికి ఇట్టి సత్కారం జరిగినందుకు కన్నులు సాగదీసుకుని చూసే భాగ్యం కలిగింది. ఓ శ్రీనాధకవి ఎంత బాధపడితివో...
సీ॥ కవిరాజు కంఠంబు కౌగిలించెను గదా పురవీధి నెదురెండ పొగడదండ
ఆంధ్ర నైషధకర్త యంఘ్ర యగ్మంబున దగిలి యుండెను గదా నిగళయుగము
వీరభద్రారెడ్డి విద్వాంసు ముంజేత వియ్యమందెను కదా వెదురు గడియ సార్వభౌముని భుజస్కంధ మెక్కెను గదా నగరి వాకిటనుండు నల్లగుండు...
నాటి శ్రీనాధుని పద్యాన్ని హృద్యంగా రామలింగడు ఆలపించాడు.
"రామలింగా ఏదో మాటవరుసకి అన్నాను. ఆ కవిలా నిన్ను హింసించగలనా ? అది నాకు పాడియా! అంతటి క్రూరుడినా, నీవెరుగవా.. నాకు ఈ శిక్షకు ఏ సంబంధం లేదు. నిన్ను ఈ దారుణానికి గురిచేసిన వారు ఎలా ఉంటారు. చెప్పు వారిని క్షమించను.” అని చాలా బాధ పడ్తూనే రామలింగని భుజాల పై గల నల్లగుండును రాయలే స్వయంగా తీసి పక్కకు పడేయాలనుకున్నాడు. రామలింగడు తనే నల్లగుండును పడేసాడు. రాయలు చొరవగా గొలుసులు విప్పదీసి రధంలో కూర్చుండబెట్టుకుని రామలింగని తన నివాసానికి తీసుకుపోయాడు.
👳♀️
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*తెనాలి రామకృష్ణ - 30*
👳♀️
*అగ్రహారం దానంగా వద్దు - 5*
"రామలింగా ఏదో మాటవరుసకి అన్నాను. ఆ కవిలా నిన్ను హింసించగలనా ? అది నాకు పాడియా! అంతటి క్రూరుడినా, నీవెరుగవా.. నాకు ఈ శిక్షకు ఏ సంబంధం లేదు. నిన్ను ఈ దారుణానికి గురిచేసిన వారు ఎలా ఉంటారు. చెప్పు వారిని క్షమించను.” అని చాలా బాధ పడ్తూనే రామలింగని భుజాల పై గల నల్లగుండును రాయలే స్వయంగా తీసి పక్కకు పడేయాలనుకున్నాడు. రామలింగడు తనే నల్లగుండును పడేసాడు. రాయలు చొరవగా గొలుసులు విప్పదీసి రధంలో కూర్చుండబెట్టుకుని రామలింగని తన నివాసానికి తీసుకుపోయాడు.
అక్కడ చల్లని నీళ్లు తాగాక రామలింగడు కుదుటపడ్డాడు. రామలింగాన్ని పలుమా ర్లు రాయలే క్షమాపణలు కోరాడు. ఎక్కడో పొరపాటు జరిగింది. ఆ రాజభటులెవరో తెలిసిన మరుక్షణం వారి శిరస్సులు నేల పొర్లాడాల్సిందే అని ఉగ్రుడైపోయాడు..
దండనాయకులు వచ్చి ఈ విచిత్ర శిక్ష అమలు చేసిన రాజభటులు ఎవరైంది తెలియడం లేదు అని చెప్పారు. “గాలించండి ఆ ద్రోహులెవరైంది. నాకు తెలియాలి. లేకుంటే నేను ఆ తప్పు చేసిన వాడిగా చరిత్రలో మిగిలిపోతాను. తప్పక వెదికి పట్టుకుని తీరాలి. లేకుంటే నాకెదురుపడద్దు” అని తీవ్రస్థాయిలో చెప్పాడు. దానిపై దండనాయకులు కళావిహీనమైన ముఖాలతో అక్కడి నుంచి వెళ్లిపోతూ జాలిగా రామలింగని వైపు చూసారు.
అప్పటికి రామలింగానికి బడలిక తీరింది. “ఓ దండనాయకులారా! చక్రవర్తి ఆజ్ఞకు బద్దులు మీరు, కానీ, మీకు ఆ రాజ భటులు దొరకరు. వాళ్ళు భటుల వేషాల్లో ఉన్న శత్రువుల వేగులు. మనలో కలిసి పోయి ఉన్నారు. మీరు మనసు పెట్టి వెతికితే కొన్ని వందల మందిని పట్టుకోవచ్చు.".
దండనాయకులు రామలింగని వద్దకు వచ్చి “ వేగులా, మీకెలా తెలుసు. రాజ భటులు కారని శత్రుగూడచారులని ఎలా చెప్తున్నారు. సైన్యంలో నిత్యం తిరుగాడే మేమే భటులను గుర్తుపట్టలేం. లక్షల్లో సైన్యం ఉంది. అలాంటిది మీరెలా చెప్పగలరు. మీకు ఎవరిపైన అనుమానం ఉన్నచో చెప్పండి. క్షణాల్లో తీసుకువచ్చి మీముందుపడేస్తాం." దండనాయకుల్లో ఒకడు వినయంగా బదులిచ్చాడు.
“నాయనా ఇక మీరు వెళ్లొచ్చు. మీ వెతుకులాట కానీయండి." చెప్పి దండనాయకులను పంపేసి ఇటు తిరిగి రాయల వైపు చూసాడు.
“రామలింగా ఏమిటి ఇదంతా ? మీ మాటలు నాకు అయోమయంగా ఉన్నాయి. ఈ నగరంలో శత్రువు చాప కిందనీరులా ఆక్రమించి ఉన్నాడా ? మిమ్మల్ని శిక్షించింది రాజభటుల వేషాల్లో శత్రువులచే నియమితులైన వేగులా ? ఎవరు వారు చెప్పండి. నేను వారిని ఉపేక్షించను. నా కత్తికి ఎరగా వేసిగాని నిద్రపోను."
"గజపతులే. వారు మన రాజ్యమంతటా ఉన్నారు. నేను తుఖాదేవి వారితో వెళ్లిన కంభం, దిప్పలూరులలో గజపతుల ప్రభావం తమకు తెలియపరిచాను. ఈ మధ్య నాకు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వకుండానే శిక్షకు గురిచేసారు. నేను దిప్పలూరు నుంచి అత్యంత విలువైన కానుకలను తమకు పంపించాను. అవి చూసి కూడా తమరు ఏమీ గ్రహించలేక పోవడం చాలా బాధపడ్తున్నాను. తొలిసారి పంపిన పచ్చల కత్తి ఇక్కడిదే అంటే మీ పూర్వీకులదే. అక్కడకెలా వచ్చింది? నేను దిప్పలూరులో చాలామంది ఆస్థుల్ని స్వాధీనం చేసుకున్నప్పుడు దొరికిన అత్యంత విలువైన వస్తువులు. అవి కూడా ఇక్కడ మీ ఖజానాలోని సొత్తు అని తెలుసుకున్నాను. అందుకే పంపాను. ఒక్క తుఖాదేవికి మాత్రం పంపలేదు. కారణం ఆమెకు ఈ విలువైన సొత్తుకు కాళ్లెలా వచ్చాయో తెలుసు. ఆమెను కన్న తండ్రే బెదరించి విష పుత్రికగా మార్చేసాడు. ఇలా ఆమె తన కోసం, తన భర్త కోసం, తన పిల్లల కోసం కాకుండా తండ్రి కోసం బతికితే చాలా దుర్మార్గాలు జరిగిపోతాయి. ఆమెకు తెలియని విషయం ఒకటుంది, ఆ తరువాత విచారించి లాభం ఉండదు.” కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పాడు రామలింగడు.
రాయలు ఆసక్తిగా విన్నాడు.
"రామలింగా నాకు తెలుసు. నేను నీ కానుకలను చూసినపుడే మనిషిని కాలేదు. నేను, అప్పాజీ ఆ పచ్చల కత్తిని చూసాక, అప్రమత్తులైయ్యాం. అది ఒకప్పటి ఈ రాజ్యాన్ని ఏలే ప్రౌడదేవ రాయలవారిది. ఆ కత్తి మన భాండాగారం నుంచి తస్కరించబడింది. చివరికి దిప్పలూరులో అది నీవు పుణ్యం కట్టుకోగా దొరికింది. అయితే నిండు సభలో ఇలాంటి విషయాలని బహిర్గతం చేసినందున నేను నిన్ను దేశబహిష్కారానికి గురి చేసాను. పట్టపురాణీవారిని ప్రజల ముందు దోషిని చేయలేం కదా ! ఈరోజు నీకు అమలు జరిగిన గండశిల శిక్ష వెనుక పట్టపురాణీ వారున్నారా చెప్పు మరి ఉపేక్షించను.”
"ప్రభూ ఆనాడు మన ముగ్గురం (నేను, పట్టపురాణీవారు, మీరు) రహస్యంగా మాట్లాడుకున్నాం, ఆ విశేషాలు బయటికి పొక్కినందున నన్ను అనుమానించి మీరు కారాగారంలో పడేసారు. ఆ తరువాత ఏకంగా దిప్పలూరు పంపేసారు."
"నీవు కారకుడవు కావా ? నేను, తుఖా దేవి ఎవరికి చెప్పం. మరి నీవే చెప్పి ఉంటావని భ్రమించాను. నిన్ను కారాగారం లో వేయడం తుఖాదేవి ఒప్పుకోనందున ఆమె కోరిక పై దిప్పలూరు పంపాను.”
"ఇదంతా గజపతుల కుట్రలో భాగం ప్రభు"
“ఆమె చాలా మారానని చెప్పినందున నేను ఆమె కోరిక పై నిన్ను దేశ బహిష్కారా నికి సిద్దపడ్డాను. ఇక నీవు ఎక్కడికి పోవద్దు. ఆమెకు నచ్చజెప్పుకుంటాను.” రామలింగని చేతులు పట్టుకుని మరీ చెప్పాడు.
“మన్నించండి. నాకు పిల్లనిచ్చిన అత్త మాఁవలు పడవ ప్రమాదంలో మూడు రోజుల క్రితం మరణించిరని తెలిసినది. వారికి నేను తప్ప ఎవరూ లేరు. వారి శ్రాద్ధ కర్మలు నిర్వర్తించడం నాకు తప్పనిసరి. కనుక నేను కాశీకి పోవుచున్నాను. వెళ్లి వచ్చుసరికి కనీసం పదిమాసాలైన పట్టును కనుక నేను దేశం వదిలిపోవుచున్నట్టే! కాశీ అన్నచో తిరిగి వస్తామో లేదో తెలియని ప్రయాణం. కనుక ఒకసారి తుఖాదేవిని కలుసుకుని వెళ్లగలను.”
"రామలింగా అవశ్యం వెళ్లి కలుసుకుని రండి. మీ కాశీ ప్రయాణానికి నా నుంచి ఏమికావాలన్నా బిడియపడకుండా అడిగి తీసుకోండి." చెప్పి రాణీవాసానికి పంపాడు.
ప్రత్యేకంగా దాసీజనాలు తోడురాగా రాణీ వాసంలోకి ప్రవేశించాడు రామలింగడు. తుఖాదేవిని ఆంతరంగిక మందిరంలో కలుసుకున్నాడు. అప్పుడే పూజలు నిర్వర్తించి వచ్చిందామె. ఎదురుగా బాగా కమిలిపోయినట్లున్న రామలింగాన్ని చూసి ఆందోళనపడింది.
“కవీశ్వరా ఏం జరిగింది? హోమగుండంలో భగభగలాడే అగ్నిజ్యోతిలా నిత్యం వెలిగే మీ ముఖం నేడు మసకబారినట్లున్నది ఏమయ్యింది.".
"అమ్మా తుఖాదేవి.. నా ముఖంలో ఆ జ్యోతులను మరల చూడాలనుకుంటే ముందుగా మారాల్సింది మీరేనమ్మా. మీరంటే రాయలవారికి ప్రాణం. కానీ మీరు మీ తండ్రి చేతిలో బొమ్మలా ఐపోయారు. గజపతులు ఇంతవరకు రకరకాల విధానాల్లో పగలు సాధిస్తున్నారు. వారి విషపు పంజా అన్నెం పున్నెం ఎరుగని పసివారి పై పడకుండా చూసుకోండి, ఆ తరువాత ఎవరిని అనీ లాభం ఉండదు. రాయలపై గజపతుల కక్ష రాయల వంశంపై పడకూడదు. ఇప్పటికైనా రాయలవారికి నిజం చెప్పేయండి. మిమ్ము మీ తండ్రి మీ పూర్వపు ప్రేమ వ్యవహారం గురించి రాయల వారికి చెప్తాను అని భయపెట్టి నందున మీరు గజపతులు ఎలా ఆడమంటే అలా ఆడుతున్నారు.
(తుఖాదేవి పెళ్లికి ముందు తన బావ వీరేంద్రతో పీకలోతు ప్రేమ వ్యవహారం నడిపింది. ఒక దశలో వీరిద్దరికి పెళ్లి జరగాల్సిందే కానీ, రాయలు కావాలని ఈమెను తనదాన్ని చేసుకోవడానికి ఎడతెగని యుద్ధం చేసి మరీ సాధించాడు. ఇందులో విపరీతమైన రక్తపాతం, జన నష్టం అయ్యింది. పలు దుర్గాలు జయించాడు రాయలు, ఈ నేపధ్యంలో గజపతుల యొక్క సామంత రాజులు పదహారుమంది రాయలకు సహకరిస్తున్నా రని గజపతులు అనుమానించి విందుకు పిలిచి మూడో కంటికి తెలియకుండా విషాన్నం పెట్టి మరీ చంపేసారు. ఆతర్వాత రాయల చేతిలో గజపతులు చిత్తుగా ఓడిపోయే పరిస్థితిలో సంధిచేసుకున్నారు. శ్రీ కాకుళం నుండి నెల్లూరు వరకు రాయల వారి ఏలుబడిలోకి వెళ్లిపోయింది. ఎంతో కావల్సినవాడైన వీరేంద్రకు కాకుండా ఒక దాసీపుత్రుడైన రాయలకు తన కుమార్తెను కట్టబెట్టాల్సివచ్చినందుకు గజపతులు పగతో రగిలిపోయారు. ఆ పర్యవసనమే తుఖాదేవిని రాయలపై ఉసిగొలపడానికి కారణం అయ్యింది.
ఒకవేళ తుఖాదేవి సహకరించకపోతే ఆమె వీరేంద్రతో జరిపిన ప్రేమవ్యవహారాన్ని ఏమాత్రం సంకోచించ కుండా రాయలకు చెప్పేయగలమని బెదరించి మరీ ఆమెను వారి పావుగా మార్చుకున్నారు. ఆమె కూడా ఈ భయం వలన వారికి అనుగుణం గా మారకతప్పలేదు. ఆమె తన కోసం, తన ప్రేమ కోసం పరితపించి యుద్ధాలు చేసిన రాయలపై పెళ్లయిన కొన్నాళ్లకే ఎంతో ప్రేమను పెంచుకుంది. కానీ ఆమెను ఒక్కక్షణం గజపతులు ప్రశాంతంగా బతకనీయలేదు. ఆమెను అన్ని విధాలుగా మృత్యుదూతగా వినియోగించుకున్నారు.
తొలిరాత్రి రాయలను చంపాల్సిందిగా కోరితే ఆమె తు.చ. తప్పకుండా గజపతుల ఆదేశాలని శోభనం నాటి రాత్రిపాటించింది. యుద్ధ పిపాసి రాయలు ఆమె వెంట తెచ్చుకున్న గుప్తాయుధాన్ని పసిగట్టి వెలికి తీసి అవతలపారేసి ఆమెను మన్నించి ఏలుకున్న ధీశాలి.)
"ఇంతవరకు ఏదేదో జరిగిపోయింది. కానీ ఇక ముందు దారుణమైనవి వినలేనివి చాలా జరుగుతాయి. ఇదేనమ్మా నేను మీకు చెప్పాల్సినది. దయచేసి నన్ను పగవాడిగా చూడకుండా అర్థంచేసుకోండి.” అని చెప్పి వెనుదిరిగాడు.
తుఖాదేవి గుండెలు గుభగుభలాడాయి.
“కవీశ్వరా ఆగండి. ఈ రాణీవాసపు తెరలు వెనుక సాగుతున్న కథలు మీరు తెలుసుకు న్నందుకు మున్ముందు జరిగే విపత్తుల గురించి హెచ్చరించినందుకు నేను చాలా భయపడ్తున్నాను. మీ ముందు దోషిగా నిలబడ్తున్నాను. మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు. నేను ప్రశాంతంగా బతకలేక పోతున్నాను.” తలపట్టుకుని ఏడ్చింది.
రామలింగడు వెనుదిరిగి వచ్చి " అమ్మా ఇప్పటికైనా రాయలవారికి చెప్పండి. భయపడవద్దు మీకు తెలియంది కాదు. భార్యభర్తల మధ్య దాపరికాలు కూడదు. అనేక ప్రమాదాలకు తావిస్తాయి. శాస్త్ర పరిజ్ఞానం కలవారు, మీకు తెలియంది లేదు" అని ఆమెకు హితవు చెప్పి భారంగా నిట్టూర్చి అక్కడి నుండి వెళ్లిపోయాడు.
👳♀️
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల
*తెనాలి రామకృష్ణ - 31*
👳♀️
*అగ్రహారం దానంగా వద్దు - 6*
రామలింగడు కృష్ణదేవరాయల వద్దకు వెళ్లి చేతులు మోడ్చి "ప్రభూ ఇక సెలవు. నా భార్యతో పుణ్యక్షేత్రాల్లో నేను చేయవల్సిన పనులు చేసుకుని తిరిగి వస్తాను." అని చెప్పి వెనుతిరగబోతుండగా రాయలే నిలువరించి..
“రామలింగా నీవు తుఖాదేవితో జరిపిన సంభాషణ నేను తెలుసుకున్నాను. అక్కడికి నీతో వచ్చిన దాసీజనాలలో కొందరు ఈ పని పైనే వచ్చారు. ఆమె అమాయకురాలు, భర్తను నాతో అన్నియు దాచి మీదకు తెచ్చుకుంది. ఒక విధంగా నాపై కపట ప్రేమను చూపింది. అయినను తొలిరాత్రి నాపై కత్తి దూసిన నీచ చరిత్రకు శ్రీకారం చుట్టింది. అప్పుడే ఆమెను వదిలేయాల్సింది. అదే నేను చాలా బాధ పడ్తున్నాను. ఇక గజపతుల ఆట కట్టిస్తా” పిడికిళ్ళు బిగించి మరీ చెప్పాడు.
"ప్రభూ ఆమె అబల. మీలో ఉంది అసలు పొరపాటు. మీకు ఆమె అంటే అనురాగం ఎక్కువ. ఆమె లేనిదే జీవించలేని భగ్న ప్రేమ మీలో గూడుకట్టుకుంది. అంతెందుకు ఈమెకు ముందు చిన్నాదేవి వారితో ఎంత అనురాగంతో ఉండేవారు. ఆమె చనిపోయిన తరువాత పిచ్చివానివలె అయిపోయారు. కానీ అదీ ఎంతకాలం ? ఒకసారి ఆలోచించండి. పట్టుమని నెల రోజులు లేదు. తుఖాదేవి చిత్రపటం చూసి ఏం చేసారు. ఆమె కోసం అన్ని రకాలుగా బలవంతులైన గజపతుల పై యుద్ధభేరి మ్రోగించారు. చివరికి రక్తపాతంతో ఆమెను సాధించుకున్నారు. ప్రేమలో మీరు ఒక పుష్పక విమానం లాంటివారు. మీ మనస్సులో ఎంతోమంది అందగత్తెలతో నిండుగా ఉన్నా ఇంకా ఒకరికి చోటు ఉండనే ఉంటుంది. ఇలా అన్నానని బాధపడవద్దు. ఎవరి హోదాలో వారు ఉండి ఉంటే ఇప్పుడు ఈ అనర్ధాలు వచ్చేవికావు. ఆమె పై కోపాన్నిచూపకుండా కార్యం సాధించడం మీవంటి విజ్ఞుల లక్షణం" రామలింగడు రాయల వారి చేతులు పట్టుకుని చెప్పాడు.
రాయలు ఏదో తప్పు చేసినవాడిలా వింటూనే తలపంకించాడు.
" రామలింగా నీవు చెప్పిన ప్రతిమాట నా మనోఫలకం పై లిఖించుకున్నాను. నీవు ఇంతవరకు రామలింగడివే కానీ నేటి నుంచి రామకృష్ణుడవు. నిండు మనస్సుతో నిన్నభినందిస్తున్నాను.” అని గాఢంగా కౌగిలించుకున్నాడు రాయలు.
“ఇక సెలవు ప్రభూ ! నాపై ఉన్నబాద్యతల్ని చక్కబెట్టుకుని తిరిగి రాగలను. మీ నీడలో చిరకాలం బతకాలనుకుంటున్నాను" అని చెప్పి వెనుదిరిగాడు.
📖
కొత్వాలు పటేల్ నగరమంతా గాలింపులు జరిపి చివరికి రామలింగడిని శిక్షించిన వారిని కనుగొనలేకపోయాడు. రాయలు దోషులను పట్టుకోకుండా తనను కలవ వద్దని పదేపదే హెచ్చరించాడు. అందునా రాయలు ఎంత శాంతస్వభావుడో అంత కఠినాత్ముడు. ఏమిటి దారి అని తలలు పట్టుకుని కూర్చున్నారు. అంతలో ఒక భటుడు వచ్చి రామలింగడు సతీసమేతం గా నగరం వదిలి కాశీ ప్రయాణమై పోతున్నాడు అని చెప్పాడు..
వెంటనే ఉరుకులు పరుగులతో రామలింగ డిని నగరపొలిమేరల్లో కలుసుకున్నారు కొత్వాలు పటేల్ మరియు దండనాయకులు.
వారిలో కొత్వాలు నోరు విప్పి "అయ్యా రామలింగకవి గారూ! తమరు కాశీ వెళ్ళు చున్నారు. సంతోషం కానీ మిమ్మల్ని నానా విధాలుగా హింసించిన అజ్ఞాత వ్యక్తులు ఇంతవరకు దొరకలేదు. రాయల వారు మమ్మల్ని ముఖాలు చూపవద్దని కసురుకున్నారు. తమరే మాకు ఏదైనా ఉపాయం చెప్పి రాయలవారి ప్రసన్నత మాపై కలిగేలా చేయగలరని కొండంత ఆశతో వచ్చాను.” వినయంగా ప్రార్ధించా డు.
“కొత్వాలు విచారించకు. నేను మోయలేక మోసిన నగరవాకిట నుండే నల్ల గుండును నీవు ఒక్కడివే మోసుకుని వెళ్లు.”
"అదేమిటి, అంత పెద్ద నల్లగుండును నేను ఒక్కడినే మోయలేను. నలుగురు కలిసినా మోయలేం. మరేదైన చెప్పండి.”
"తప్పక మోయగలవు. దీని వెనుక ఒక మహామంత్రం ఉంది. అది జపించి నీవు నిక్షేపంగా మోసుకుని ఎంచక్కా రాయల వారు సభలో ఉన్న వేళ ఎదురుపడండి." అని అందరికి ఆ మంత్రం చెప్పాడు.
"నల్లగుండు ఒక్కటే ఉంది. మంత్రం అందరికి చెప్పారు.” దండ నాయకుడు అనుమానంగా అడిగాడు.
"ఇంటి పెరట్లో ఓ పది వరకు నల్లగుండ్లు ఉన్నాయి. తలా ఒకటి ఈ మంత్రం జపించి తీసుకుపొండి. ఆ రోజు నాచే మోయించిన శత్రువుల వేగులు నా ఇంటిలో పెక్కు నల్ల రాళ్లు పడవేసిపోయారు. ఇప్పుడు మీకు ఉపయోగపడ్తాయి” చెప్పి నవ్వూతూ సాగనంపాడు రామలింగడు.
మంత్రం ఎక్కడ మరిచిపోతామోనని పెద్దగా వల్లెవేసుకుంటూ నగరవాకిట పడి ఉన్న నల్లగుండును సమీపించారు. ఆ మంత్రం జపించి దాన్ని ఎత్తాడు. ఆ గుండు అమాంతం లేచింది. ఆశ్చర్యంతో అంతా అయోమయంలోపడ్డారు.
“ఇంత తేలిగ్గా ఉందేమిట్రా భలే మంత్రం. చెప్పి వెళ్లాడురా కవీశ్వరుడు." అని రెట్టింపు ఉత్సాహంతో ఆ నల్లగుండును మోసుకుంటూ రామలింగని ఇంటి పెరటి లోకి వెళ్లి అక్కడ పడి ఉన్న అతి పెద్ద నల్లరాళ్లను మంత్రం జపించి అవలీలగా ఎత్తుకుని రాయలవారిని కలిసేందుకు బయల్దేరారు.
సభలో నల్లగుండు రాళ్లను మోసుకొచ్చిన రాజోద్యోగులు పదిమందివరకు ఉన్నారు. ఒక్కటే కలవరం సభలో మొదలయ్యింది. వారిని చూసిన రాయలకు ఇదేదో శత్రు వేగులపనే అయి ఉంటుంది, వీరిచే మోయిస్తున్నారని క్షణాల్లో అతనిలో కోపం పెరిగిపోసాగింది.
తిమ్మరుసు పరికించి చూసి " ఏమిటి ఇదంతా, ఈ భయంకరమైన నల్ల గుండుల ను ఎవరు మీచే మోయించారు.” అని ప్రశ్నించాడు.
“రామలింగకవిగారు.” అంతా కలిసి చెప్పారు.
“అతనికి ఏమైన మతిహీనమైన లక్షణాలు ఉన్నాయా? కాశీ వెళ్తూ ఇదేంపని? ఆ నల్ల గుండులనుదించండి. వాటి బరువుకు మీరు చచ్చేట్టున్నారు.” తిమ్మరుసు చిరాకు పడ్డాడు.
“మన్నించాలి. మాకేం బరువుగా లేవు. కారణం రామలింగకవి మాకు ఓ మంత్రం చెప్పారు. దాని మహిమతో ఈ నల్ల గుండులు గుమ్మడి పువ్వంత తేలికగా మారిపోయాయి." అని కొత్వాలు పటేలు చెప్పాడు.
“మంత్రంతో నల్లగుండు బరువుకోల్పోయి తేలికగా మారిపోయిందా? ఏమా మంత్రం నాకు చెప్పండి. ఇదేదో రామాయణంలో నీలుడి చేతితో పెద్ద పెద్ద బండలు, కొండలు సముద్రంలో వేస్తే మునగక తేలియాడడం మనం చదివాం. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం.”
అంతవరకు రాయలలో ఉన్న కోపం పోయి కొత్త విషయం తెలుసుకోవాలన్న జిజ్ఞాస మొదలయ్యింది.
కొత్వాలు పటేల్ ఆ మంత్రం గుర్తుకు తెచ్చుకుని పదేపదే లోపల వల్లెవేస్తూ మరీ చెప్పాడు.
“రాయల నగరవాకిట నల్లగుండు ఆహ! ఆహ!!
తెనాలిరామలింగని పెరటిలో ఉండు గుండు ఓహో! ఓహో!!
ఈ దయ్యపు మంత్రం చెబితే గుండు శక్తి ఏహే! ఏహే!!
గుండుకున్న బరువు తాటాకులా ఈహి! ఈహి!!”
“ఇదే ఆ దివ్య మంత్రం. ఎవరైనా ఈ మంత్రం చెప్పుకుని బండ బరువున్న ఈ గుండులను అవలీలగా ఎత్తేయవచ్చు. చూసారుగా కసికందకుండా ఎలా మోసుకువచ్చామో,” రాయలవారికి విన్నవించాడు కొత్వాలు పటేల్.
ఆ మంత్రం పదేపదే సభలోని వారంతా ఉచ్చరించుకుని నవ్వుకోసాగారు. ఇలా ఉందేమిటి అని గుసగుసలాడుకోసాగారు.
రాయలు ఒకటికి రెండుసార్లు అనుకుని పెద్దగా నవ్వుకున్నాడు. తిమ్మరుసు పరిస్థితి అలానే ఉంది. ఇక కవులయితే పడిపడి నవ్వారు. ఇన్ని రకాల మంత్రాల ను చదివాం, విన్నాం కానీ ఇలాంటిది ఎక్కడా విని ఉండలేదు. ఇది నిజంగా రామలింగని పైత్యానికి పరాకాష్ట అని చెప్పక తప్పదు. అంటూ ఒకరికి ఒకరు చెప్పుకుని నవ్వుతూనే మండిపడ్డారు.
"అప్పాజీ చిత్రంగా లేదు. మంత్రంలో ఏముందని ఈ నల్లగుండుల్ని ఇలా ఈ ఉద్యోగులు అవలీలగా తీసుకురాగలిగా రు. ఇదేదో మనం కూడా ప్రత్యక్షంగా చూడాల్సిందే. దండనాయకులారా మీ మూపుల పై ఉన్న నల్లగుండులను కిందకు జాగ్రత్తగా దించండి. నేను జపించి ఎత్తి చూడగలను.” రాయలే స్వయంగా ఆసనం దిగాడు.
సభ నిశ్శబ్ధంగా మారిపోయింది. రాయలు పెద్దగా మంత్రం జపించి నేల మీదున్న నల్లగుండును తేలిగ్గా ఎత్తేసాడు. ఆ వెంటనే ఆశ్చర్యానికి గురయి..
"అరెరే ఏ మాత్రం బరువుగా లేకుండా ఉంది. కావలంటే ఒక్కొక్కరూ వచ్చి మంత్రం జపించి మరీ చూడండి" అని తన ఆనందాన్ని అందరితో పంచుకున్నాడు.
చాలామంది మంత్ర పరీక్ష చేసుకుని నల్ల గుండులను ఎత్తి చాలా ఆనందించారు. వీరిలో అప్పాజీ అలసాని పెద్దన, దూర్జటి ప్రభ్రుతులున్నారు.
ఇదంతా మూడు గంటలు పాటు సాగింది. సభలో మొత్తం ఆహా ఆహా! ఓహో ఓహో! ఏహే ఏహే! ఈహి ఈహి! అనే అరుపులు మారుమ్రోగిపోయింది.
సభంతా ఒకటే నవ్వులతో నిండిపోయింది. రాణీవాసంలో ఉండే మూగ ఆడంగి భటుడు ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డాడు. వాడ్ని కొందరు భటులు పక్కకి తోసేసారు. పాపం అతడికి తను అ నల్లగుండును ఎత్తాలి అని ఆశ. కానీ దానికి మంత్రం జపించకుండా ఎత్తలేవురా, మాటవినరా అని పక్కకు నెట్టేస్తున్నారు. తిమ్మరుసు అతన్ని చూసి జాలిపడి..
“ఏయ్ భటులూ అతన్ని అడ్డుకోవద్దు. అతడు ఎత్తాక తెలుస్తుంది మంత్రం లేనిదే ఎత్తలేనని. వాడి సరదా ఎందుకు కాదనాలి. అదీ చూద్దాం.” చెప్పి పకపక నవ్వాడు.
భటులు అడ్డు తొలగారు. ఆ మూగ భటుడు ఉత్సాహంగా నల్ల గుండును ఎలాంటి మంత్రోచ్ఛారణ లేకుండా అవలీల గా పైకి ఎత్తి పెద్దగా నవ్వాడు. అంతే, అందరిలో ఒకటే అయోమయం. ఆ మూగ భటుడు కిందపడున్న అన్ని నల్లగుండు లను ఎత్తి ఇటు అటు పడేస్తున్నాడు. ఈ హడావుడిలో ఒక గుండు పై అతడి కాలు పడి గుండు అప్పడంలా అయిపోయింది. అంతే! సభలోనివారు బిక్కముఖాలు వేసారు. అప్పుడు నల్ల గుండులను పరీక్షించారు. తీరా అవి నల్లగుండులు కావు. తాటాకులకు బంక మన్నుతో నునుపుగా చేసి రంగులు అద్ది అచ్చం నల్ల గుండుల్లా తయారు చేయబడినవి.
ఆ సభలో ఉన్న ఒక పౌరుడు " నేను రామలింగని ఇంటి పక్క నివసిస్తున్నాను. ఈ గుళ్లు తయారుచేయడం నేను చూసాను. రామలింగని పుత్రుడు శంభ లింగడు చేసాడు. ఆ పోరడు శిల్ప శాస్త్రం లో దిట్ట. ఎలాంటి శిల్పానైనా అందంగా మలచగలడు. ఆ పెరట్లో నకిలీ గుండులు ఇవేనని నేను ఊహించలేదు." అని పిడుగులాంటి వార్తను తెలియజేసాడు.
"ఏమిటి రామలింగని పుత్రుని పేరు శంభులింగడా? అతడు ఈ తయారీకి ఆజ్యం పోసాడా ? భలే, తండ్రికి తగ్గ కొడుకు" అని తిమ్మరుసు మెచ్చుకున్నాడు.
రాయలు ఆ మంత్రం తలుచుకుని పడిపడి నవ్వాడు.
"శెహబాష్ రామలింగా, నీవెంతటి హాస్య బ్రహ్మవు. ఆ రోజు మోసిన నల్లగుండును నన్ను స్వయంగా తొలగించనీయకపోవడా నికి కారణం ఇదేనా ? నీవు ఇక్కడ సభలో లేకుండానే మా అందరిని చాలాసేపు నవ్వించావు. ఇంతగా ఎప్పుడు నవ్వి ఉండలేదు. చతురత నీకు ఆయువు పట్టు లాంటిది. నీవు త్వరగా వస్తే నీ నుంచి మరిన్ని ఆనందపు హాస్యగుళికల్ని ఆస్వాదించవచ్చు.” సభనుద్దేశించి ప్రసంగించి తృప్తిగా నవ్వాడు రాయలు.
“రాయా, ఆరోజు రామలింగడు మోసినది కూడా ఇలాంటి తాటాకు గుండునా ? అలాగే నాటి శ్రీనాధుని పద్యం ఎండలో పడి ఆలపించాడు. అతడు మంచి చమత్కారి. భలేగా ఉన్నాయి అతడి ఛలోక్తులు. మరీ అంతగా నవ్వద్దు. ఈ రోజు ఇంతగా మనం ఎప్పుడు నవ్వి ఎరుగం. నా వృద్దాప్యం గుర్తుకురానంతగా ఓడలు మరిచి నవ్వితిని. నవ్వు నాలుగు విధాల చేటు." అని తిమ్మరుసు లోగొంతు తో చెప్పి వెనుదిరిగి తన ఆసనం వద్దకు వెళ్లిపోయాడు.
రాయలు అంతటితో సభ ముగించి ఉల్లాసంగా తన ఆంతరంగిక మందిరానికి వెళ్లిపోయాడు.
👳♀️
*సశేషం*
*తెనాలి రామకృష్ణ - 32*
👳♀️
*నవ్వు నాలుగు విధాల చేటు - 1*
రాయలు ఒంటరిగా తన ఆంతరంగిక మందిరంలో హంసతూలికా తల్పం మీద శయనించి ఉదయం సభలో జరిగిన నల్ల గుండు ప్రహసనాన్ని తలచుకుని నవ్వుకో సాగాడు. ఒక్కోసారి తెరతెరలుగా నవ్వుతూనే ఆ మంత్రం చదువుతూ ఆనందించసాగాడు. ఉన్నపళంగా రామలింగాన్ని పిలిపించి అభినందించాలి అనుకున్నాడు. అది జరగని పని. ఐనా
ఈపాటికి అతడు చాలా దూరం సాగిపోయి ఉంటాడు. సరిగ్గా అప్పుడే వచ్చాడు కొత్వాలు పటేల్.
ఏదో అత్యవసర పని చెప్పుకుందామని నోరు తెరవబోయి రాయలు తనలో తనే నవ్వుకుంటుంటే అలా నిలబడ్డాడు. కొంతసేపటికి రాయలు అతన్ని చూసి “ఈరోజు ఉదయం ఆ నల్లగుండులను మీరెందుకు తీసుకువచ్చారు?” అని అడిగాడు.
"తమరు రామలింగకవిచే నల్లగుండు మోయించిన అజ్ఞాత భటులను పట్టి చూపించమన్నారు. లేకుంటే మా ముఖా లు చూపవద్దన్నారు. ఎంత శోధించినా మాకు ఎక్కడా వారి ఆచూకి లభించలేదు ప్రభూ ! ఈలోగా ఎవరో చెప్పారు. రామ లింగ కవిగారు కాశీ ప్రయాణమై వెళ్తున్నా రని,, మా గోడు చెప్తే వారే ఏదైన మార్గం చూపిస్తారని కొండంత ఆశతో పరుగెత్తుకు వెళ్లాం. మా శ్రమ ఫలించింది.”
"రామలింగకవి చాలా తెలివైనవాడు కదూ ! భలేగా మనందరిని బుట్టలో వేసాడు. ఆ మూగవాడు రాకుంటే మనం ఇంకా ఆ భ్రమల్లో ఉండేవాళ్లం. ఆ దయ్యం మంత్రం వల్లిస్తూ పిచ్చి పట్టి పోయేవాళ్లం."
"అవును ప్రభూ! నాకు అవకాశం లేదు కానీ, ఆయనతో కాశీకి తోడుగా వెళ్లేవాడి ని. దారిపొడుగునా ఇలాంటివెన్నో చవిచూసేవాడిని.”
"సరే, ఇంతకీ ఎందుకు వచ్చావు ? ఏం చెప్పాలనుకుంటున్నావు.”
"ప్రభూ యువరాజావారికి పట్టాభిషేకం వెంటనే జరగాలి అని రాణీవాసంలో ఓ సణుగుడులా విన్పించింది. అది తమ చెవిలో వేయాలని వచ్చాను. ఈ వార్త నేను ఒక్కడినే కాదు, మరి కొంతమంది కూడా విన్నారు. కనుక తమ ముందు పెట్టాల్సి వచ్చింది.”
"ఏమిటి యువరాజు పట్టాభిషేకమా ? ఇంత హఠాత్తుగానా, ఎందుకు ? ఎవరి వద్ద విన్నావు." ప్రశ్నిస్తూనే గంభీరంగా మారిపోయాడు రాయలు. కొన్ని క్షణాలు కళ్లు మూసుకుని తీవ్రంగా ఆలోచించి..
"అవును నిప్పులేనిదే పొగరాదు. నీవు వెంటనే తిమ్మరుసు వారిని ఉన్నపళంగా తీసుకురావాలి. ఇంతవరకు రామలింగని వలన హాయిగా నవ్వుకున్నాం. సరే నీవు పని చక్కదిద్దుకుని రా !" అని కొత్వాలను పంపేసాడు.
రాయలకు ఏకైక కుమారుని పట్టాభిషేక మంటే ఆనందంగా ఉన్నా తనకు తెలియ కుండానా! ఇదేం విడ్డూరం. ఏది ఏమయి నా, తను తుఖాదేవికి అడుగులకు మడుగులు ఒత్తేయడం వలన ఏమేమో జరిగిపోతున్నాయి. తను ఇప్పుడు విన్నది తన ప్రమేయం లేకుండా ఆఘమేఘాల మీద జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.” అని తనకు తాను సమాధానపరుచుకున్నాడు.
తిమ్మరుసు వచ్చి రాయలు ఎదురుగా కూర్చున్నాడు. తను విన్న విషయం చెప్పాడు రాయలు. తనూ విన్నానన్నాడు. ఇదంతా మన ప్రమేయం లేకుండా ప్రచారం ఎలా జరుగుతోంది అని తర్జన భర్జనలు పడ్డారు. చివరికి ఒకవేళ తుఖాదేవి కోరినా వాయిదా వేయాల్సిన అవసరం ఎంతైన ఉంది రాయా!' అని తిమ్మరుసు తన మనస్సులోని మాట చెప్పాడు.
"ఏం ఎందుకని ఈరోజు కాకపోయినా రేపయినా నా పుత్రుడే కదా ఈ సింహాసనం పై కూర్చునేది. వాయిదా వేయాల్సిన అవసరం నిజంగా ఉందా ? అప్పాజీ మీరు అలా అన్నారని నేను అడుగుతున్నాను.”
“ అదేంటి రాయా ఇంకా నీవు నీవుగా రాజ్యమేలాల్సిన కాలం చాలా ఉంది. అయినా యువరాజు వయస్సులో చాలా చిన్నవాడు. పైగా మనం మరోసారి బీజాపూర్ పై యుద్ధం చేయాల్సి ఉంది. అంతలో ఈ పట్టాభిషేకం ఎంత మాత్రం కూడదు. యుద్ధంలో సైన్యానికి అంత ప్రోత్సాహంగా ఉండదు. మానసికంగా ఆందోళనకు గురవుతారు. అందుకే అలా అన్నాను.”
ఆ తర్వాత రాయలు మరి మాట్లాడలేదు. మౌనంగా వెనుక్కు చేరగిలబడి కళ్లు మూసుకున్నాడు. తిమ్మరుసు చాలాసేపు రాయలు ఎదురుగా కూర్చుని ఎంతకీ రాయలు కన్నులు తెరవనందున, పైగా రాయలకు మాట్లాడాలని లేకుంటే ఈ తరహ అలకను చూపుతాడు. ఆయన అలకలో భాగం ఈ విధానం. ఇలా తన వద్ద ఏనాడు ప్రదర్శించలేదు. ఈ రోజు తనకు తప్పింది కాదు అనుకుని గాఢంగా నిట్టూర్చి అక్కణ్ణించి లేచి వెళ్లిపోయాడు.
ఆ తరువాత, రాయలు కన్నులు తెరిచి తిమ్మరుసు గురించి ఆలోచించాడు. ఎందుకు తన ఏకైక వారసునికి పట్టం అంటే కాదన్నాడు. ఇతనిలో ఏదో దాగి ఉంది. రాజకీయాల్లో తలపండినవాడు. ఆనాడు తనను రాజును చేయడానికి ఎన్నో కుట్రలు ఎడమ చేతితో చేసిన ఘన చరిత్ర అప్పాజీది. ఇప్పుడు తన వారసు నికి బదులు ఇంకెవరిని అయినా సిద్ధం చేస్తున్నాడా ? ఏమో అప్పాజీని తక్కువ అంచనా వేయరాదు.” ఉన్న చోట కూర్చుని ఆలోచించాలనిపించక వెంటనే తుఖాదేవి మందిరానికి బయలుదేరి వెళ్లాడు.
హఠాత్తుగా ఊడిపడినట్టు వచ్చిన రాయలను చూసి తొలుత తుఖాదేవి గాబరపడినా, వెంటనే సాదరంగా ఆహ్వానించింది.
తనే అడగాలనుకున్నాడు. కానీ అ అవకాశం ఆమె ఇవ్వలేదు. తానే రాయల ను ఊపిరి తీసుకోనీయకుండా అడిగింది. "ఏలినవారు ఉన్నపళంగా ఈ అభాగ్యు రాలి కోరిక తీర్చాలి. నా కుమారుడు మీ ముద్దులపట్టి అయిన తిరుమల రాయలకి ఘనంగా పట్టాభిషేకం జరగాలి.”
"దేవీ నీ కోరిక చాలా సాధారణమైనది. నాకు ముగ్గురు కొడుకుల్లో మిగిలింది మన తిరుమలరాయలొక్కడే కదా! తప్పక అతడే సింహాసనాన్ని అధిరోహించాల్సిన వాడు. కానీ, ఇప్పుడు ఇంత తొందరెందుకు పడ్తున్నావు! ఇంకా అతనికి పసితనం పోలేదు. కొన్నాళ్లు ఆగాక నిదానంగా చేద్దాం. మనమేం వయస్సుడిగినవాళ్లం కాదు.” అని సముదాయించబోయాడు. కానీ ఆమె వెంటనే జరగాలి అని చాలా మొండికెత్తింది. ఆమె ముఖం ఎరుపెక్కింది.
రాయలకు ఆమె ధోరణి అంతుచిక్కలేదు. అక్కడ కూడా ప్రశాంతత కరువు కావడం తో ఆలోచించుకుంటూ వెను దిరిగాడు. వెనుకనే పరుగెత్తుకు వెళ్లింది."
“ మీరు నాకు ఏమీ చెప్పకుండానే ఇలా వెళ్లిపోతున్నారు. కనులారా నా బిడ్డను పట్టాభిషిక్తుడుగా చూడాలి అని నేను కోరుకోవడం తప్పా ” అని తొలిసారిగా రాయలవారిని భుజాలను పట్టుకుని కుదిపింది.
"తుఖాదేవి, నీవు ఏ రోజు నాతో మనస్సు విప్పి మాట్లాడలేదు. నిజం చెప్పు. నీకు ఇంత తొందరెందుకు కలిగింది. నీలో ఏదో దాగి ఉంది.”
"ప్రభూ మీకు కోపం వస్తే నా తొలి పేరుతో పిలుస్తారు. నేను అడిగిన దానిలో తప్పేమి ఉంది. తిరుమలరాయలంటే నాకంటే మీకే ఎక్కువ ఇష్టం. మరి ఎందుకు ఆనందించక నిదానం అంటూ వెనకడుగు వేస్తున్నారు. అప్పాజీకి ఇష్టం లేదు. అతనికి అమోదం కాని పని ఏది మీరు చేయలేరు. అప్పాజీ తన బిడ్డ గోవిందరాయలకు ఈసారి పట్టం కట్టే ఆలోచన ఉన్నట్టు నేను విన్నాను. అందుకే ఈ హడావుడి చేస్తున్నాను. ఈ విషయం మీరు నమ్మరుగాక నమ్మరు అందుకే చెప్పలేకపోయాను."
రాయలు తీక్షణంగా ఆమె వంక చూసి..
“నీవు ఎంతమాటైనా అవలీలగా ఏమి కానట్టు అనగలవు. ఈ బుద్ది నీకు నీ తండ్రి నుంచి వచ్చింది. అప్పాజీ అంటే ఎవరను కుంటున్నావు. అతడు లేకుంటే నీ ఎదుట ఈ చక్రవర్తి లేనేలేడు. అప్పాజీ గురించి నీవు కాదు కదా ఈ ప్రపంచం అంతా ఏకమయి చెప్పినా వినను. నన్ను ఇంతకు మించి విసిగించొద్దు. సరే ఇక నీవు కోరిన విధంగానే పట్టాభిషేక సన్నాహాలు చేస్తాను. " కటువుగా చెప్పి వెనుతిరిగాడు.
సంతృప్తిగా రాయలు కనుమరుగైన వరకు చూసి ఆనందించింది. తన కొడుకు విజయనగర చక్రవర్తిగా తాను చూడబో తోందని గర్వంగా ఆ మందిరంలో బొంగరం లా తిరిగింది. సరిగ్గా అప్పుడే ఆమెకు రామలింగ కవి గుర్తుకువచ్చాడు. అతడి మాటలు చెవుల్లో గింగురుమన్నాయి. గజపతులు అనుక్షణం వెన్నుపోటులో ఉంటారు. అల్లుడైన రాయలను మట్టుబెట్టే వారి కుట్రను స్వంత కూతురుతో చేయించిన దుర్మార్గులు. వారికి రాయలు ఏమీ కానప్పుడు, వారి వంశంపై మాత్రం మంచి ఆలోచన ఎలా ఉంటుంది. కనుక వారి గురించి రాయలకు నిజంచెప్పేయాలి. ఇంకను రహస్యంగా ఉంటే తీవ్రమైన దారుణాలు వినక తప్పదు.
కాశీకి వెళ్తూ రామలింగకవి హెచ్చరికను గుర్తుకు తెచ్చుకుని ఎందుకో గజగజలాడి పోయింది. 'నిజమే, తన బావ వీరేంద్రుడు పసివాడైన తిరుమలరాయలకు పట్టం కట్టించాలి అని తన ద్వారా తీవ్రమైన ఒత్తిడి తెచ్చాడు. దీని వెనుక ఏదైన కుట్ర దాగి ఉందా ?
ఒక్కతే పిచ్చిపట్టినదానిలా మెత్తని తల్పం పై పడుకుని చేతివేళ్లను లెఖించుకుంటూ తనకు తన కొడుకుకు ఏమీకాదు అని సరిపెట్టుకోసాగింది.
సరిగ్గా అప్పుడే వచ్చాడు తిమ్మరుసు. ఆయన రాక గమనించలేదు ఆమె.
“అమ్మా తుఖాదేవీ ! నీ దర్శనార్ధం వచ్చాను. నీవేమో పరిసరాలు మరిచి ఆలోచనలో ఉన్నావు. తిరుమలరాయ లకు పట్టం అవశ్యం చేద్దాం. ఇదంతా నీ బుద్ధికి తోచినదా! లేక ఎవరైనా చెప్తే చేస్తున్నావా అడిగి పోదామని వచ్చాను.”
అప్పాజీ నా బుద్ధికి ఇంత మంచి ఆలోచనలు ఎలా వస్తాయి? నా పుట్టింటి వారి ఆలోచన. నాకెందుకో అయోమయం గానే ఉంది.”
"ఇంకా ఆరేళ్ల పసివాడు కదా ! జీవితం గురించి చాలా తెలుసుకోవాల్సినది ఎంతో ఉంది. వాయిదా వేయాల్సింది. ఈ మధ్య ఓ యుద్ధానికి వెళ్లాల్సి ఉంది. దీని ప్రభావం ఆ యుద్ధం పై పడకూడదు.”
“ఏది ఏమైనా ప్రభువులవారు సరే అన్నారు కనుక జరిగిపోతుంది. ఇక ఆ విషయం వదిలేయండి.”
అంతలోనే రాణీవాసంలో అరుపులు కేకలు వింటుండగానే మిన్ను ముట్టాయి. తుఖా దేవి తిమ్మరుసు ఆందోళనగా అటు చూసారు. అంతలో ఒక దాసీ వచ్చి..
" అమ్మా కొంప మునిగింది. తిరుమలరా యలవారిని చంపేసారు." అని రోధిస్తూ చెప్పింది.
ఆ దుర్వార్తను విని తట్టుకోలేకపోయారు. తిమ్మరుసు ఆ వైపుకు వృద్ధాప్యం మరచి పరుగులాంటి నడకతో వెళ్లాడు. తుఖాదే వీని దాసీజనాలు గట్టిగా పట్టుకుని నడిపించుకు వెళ్లారు. అప్పటికే ఆమెలో తెలివి తప్పిన లక్షణాలు ప్రారంభం అయ్యాయి ఏదో నడుస్తోంది..
శయనమందిరంలో నిద్రలో ఉన్న చిన్నారి తిరుమలరాయలు తెగిపడి ఉన్నాడు. ఆ దృశ్యం చూసి నిశ్చేష్టుడయ్యాడు తిమ్మరుసు. తుఖాదేవీ తన కళ్లను తానే నమ్మలేకపోయింది. క్షణాల్లో రాయలవారి కి, కోటలో జనాలకు తెలిసిపోయింది.
రాయలు వచ్చి చూసి దుఃఖ సముద్రంలో మునిగిపోయాడు. అప్పటికే వీరేంద్ర గజపతి వీరంగం సృష్టించసాగాడు.
"తాను కళ్లార చూసాను ఈ హత్య చేసింది మహా మంత్రి తిమ్మరుసులువారు. ఆయన స్వయంగా చంపడం నేను చూసాను. నేనే కాదు తుఖాదేవీ కూడా చూసి తెలివితప్పి పడిపోయింది. ఆమె కోలుకున్నాక అడగండి తెలియగలదు." అని ప్రత్యక్ష సాక్షిగా కధనాన్ని విన్పించాడు.
అంతదుఃఖంలో రాయలు తల తిప్పి తిమ్మరుసు వైపు చూసి “అప్పాజీ ఎందుకు ఇదంతా ? ఇంత చిన్నవాని పై ఇంత కరకు వేటు వేయడానికి చేతులెలా వచ్చాయి. ఇది చేసేవారు మనుష్యులా మృగాలా " అని తల బాదుకున్నాడు. అప్పటికే తుఖా దేవికి తెలివి వచ్చింది. వీరేంద్రుడు ఆమెను సముదాయించి “ఈ సమయంలో గుండె నిబ్బరం చేసుకోవాలి. నీవు చూసిన నిజం ఇక్కడవారికి చెప్పు. నీ కుమారుడిని ఆ తిమ్మరుసు పొట్టను పెట్టుకోవడం కళ్లార చూసింది చూసినట్లే చెప్పు.” ఒక విధంగా ఏం చెప్పాలో ఆమెకు వివరిస్తున్నట్టు చెప్పి బలవంతం చేసాడు.
ఆమె పరిస్థితి దయనీయమైనది. పిచ్చి చూపులు చూస్తూనే చెప్పక తప్పలేదు. “అవును ఈ తిమ్మరుసే నా బిడ్డను చంపాడు. ప్రభూ మీకు చెప్పాను కదా ఈతనికి రాజ్యకాంక్ష పెరిగినది. అందుకు నా బిడ్డ బలి అయినాడు.” అని పెద్ద పెట్టున ఏడ్చింది. రాయలు అది విని భరించలేకపోయాడు.
రాయలు తనని అనుమానించడం చూసి తట్టుకోలేకపోయాడు అప్పాజీ. బాధతో విలవిలలాడిపోయాడు.
"ప్రభూ నేను నిరపరాదిని. నేను పసివాణ్ణి చంపేటంత కృదయుడను కానే. అయిన నా ఈ వృద్ధాప్యంలో నేను ఇంతటి
దారుణాన్ని చేయగలనా ? ఈ చేతులతో పెంచిన తిరుమలరాయలను నేను తుంచగలనా ?" కన్నీళ్లు పెట్టుకున్నాడు..
"దండనాయకా ఈతన్ని కారాగారంలో పడవేయండి. నేను ఎవరి మాటలు వినలేని స్థితిలో ఉన్నాను. రేపే న్యాయ మూర్తుల తీర్పుకై సభకు తీసుకురండి. నా ఎదుట ఒక్క క్షణం నిలవనీయవద్దు. తీసుకుపొండి.” రాయలు సింహగర్జన చేసాడు.
అప్పాజీ గట్టిగా కన్నులు మూసుకున్నాడు. అతని కన్నీళ్లు చెంపల మీదుగా జలజల జారాయి. ఆ దృశ్యం చూసిన దాసీజనాలు అక్కడే ఉన్న దండనాయకులు, భటులు తట్టుకోలేకపోయారు. పాములా వంకర చూపులు చూస్తూ ఆనందిస్తున్న వీరేంద్రుని వైపు కొరకొర చూసారు.
రాయలు ఆ క్షణం నుంచి సర్వస్వం కోల్పోయినవాడిలా అయిపోయాడు. తుఖాదేవికి ఆసరికి తెలిసిపోయింది. ఈ హత్య చేసింది తన బావ వీరేంద్రుడే కానీ చెప్పుకోలేని సంకట పరిస్థితి. అతడి వంక క్రూరంగా చూసింది. అతడు గొప్ప ఆనందంలో ఉన్నట్టున్నాడు. రెండు గొప్ప విజయాలు ఒకటి రాయల వంశం కడతేరడం, పుత్రశోకంతో రాయలు కృంగిపోవడం, రెండవది తిమ్మరుసు బందీ కావడం, ఘోరమైన శిక్షకు గురవుతాడు. తెలియని ఆనందం అతనిలో ఉన్నా బైటికి బాధపడ్తున్నట్టు నటించసాగాడు.
ప్రత్యక్ష సాక్షిగా వీరేంద్రుడు ఆరోజు సభలో నిలబడ్డాడు. రాణీవాసాన్ని గౌరవించాలి కనుక పట్టపురాణీవారిని సభకు రప్పించ వద్దని గొలుసులతో బందీగా నిలబడిన తిమ్మరుసు స్వయంగా చెప్పాడు. రాయలు తిమ్మరుసు ముఖం చూడడానికి ఇష్టపడక తల దించుకునే ఉన్నాడు. సభ ప్రారంభం అయ్యింది.
విజయనగర సామ్రాజ్యంలో చక్రవర్తిగాని, మహామంత్రి గాని దోషులను విచారించరు. అక్కడ ఆచారం ప్రకారం దీని కోసం వేరేగా న్యాయ నిపుణులుంటారు. వారే తీర్పుని ఇస్తారు. దాన్ని చక్రవర్తి తూ.చ. తప్పక పాటిస్తాడు. ఒక్కోసారి ఈ తీర్పును చక్రవర్తి రద్దుచేయగలడు.
“ప్రత్యక్ష సాక్షి నీ కథనం వినిపించు. నీవే కళ్లార చూసానని చెప్పావని నగరమంతా కోడైకూస్తోంది. నీవు నిజాన్ని చెప్పాలి. నీవు చేసిన అభియోగం సాక్షాత్తు ఈ సామ్రాజ్య మహామంత్రివారి పైన.. గుర్తుంచుకో ! తప్పు అని తేలితే శిరస్సు ఖండించబడ్తుంది. ఇక్కడ ప్రభువులవారి బంధువని చూడం” న్యాయమూర్తి ములుకుల్లాంటి పలుకులతో హెచ్చరించాడు.
“గత రాత్రి నేను కొద్ది దూరంలో ఉండగా జరిగింది. ఈతడు ఓ చురికతో నిద్రిస్తున్న బాలుని చంపడం నేను కళ్లార చూసాను.”
"ఆ రాత్రి నీకు రాణీవాసంలో ఏంపని? హత్య జరుగుతుండగా కనీసం నీవు కేకలు పెట్టినా వేటుపడకుండా ఉండేది. ఎందుకు ఆ పని చేయలేకపోతివి. నీకు చంపబడిన బాలుడు స్వయాన బంధువు.”
"రాత్రివేళ తిమ్మరుసుకు రాణీవాసంలో ఏం పని పడింది అని నేను చూసి అతని వెనుక వెళ్లాను. హఠాత్తుగా చురికతో నరకడం చూసి నోట మాట రాకుండా కదలలేకపోతిని.”
"నీవు సామాన్యుడవు కావు నీవు యుద్ధ వీరుడవు. ఎన్నో యుద్దాలను చేసిన చరిత్ర గలవాడివి. నీవు చూసి హంతకుడిని అవలీలగా నిలవరించగలవు. కానీ ఆ పని నీవు చేయలేదు. నీ కళ్ల ముందు హత్య జరగలేదు చేసింది తిమ్మరుసు కాదు. నీవు కావాలని అభియోగం చేయుచున్నావు."
రాయలు మరి వినలేకపోయాడు. నేరుగా తిమ్మరుసును అడగండి అని న్యాయ మూర్తికి సలహ ఇచ్చాడు.
తిమ్మరుసు రాయలవారి అసహనాన్ని చూసి " రాయా నిన్ను పెంచి పెద్ద చేసి రాజును చేసిన చేతులతో నీ వంశంపై కత్తికడతానా ? నీవు నన్ను హంతకుడిగా నీ మనసావాచా నమ్మితే నన్ను ఎట్టి విచారణ లేకుండా ఉరితీయ్. మరి ఇక వాదోపవాదాలు వద్దు. ప్రభువు నమ్మని నా బ్రతుకు ప్రాణమున్న శవం లాంటిది. బతకడం శుద్ధదండుగ. నేను జీవించాలని అనుకోవడం లేదు. ఎంతో మానసిక వేధనకు గురయితిని.” అన్నాడు.
సభ అంతా నిశ్శబ్ధం అయ్యింది. ఉత్కంఠ నెలకొంది. రాయలు చెవుల్లో రాత్రి తుఖా దేవి మాటలు గింగురుమనసాగాయి. తిమ్మరుసే నా బిడ్డను చంపాడు. ఆమె మాటలు ఈటెల్లా రాయల గుండెలకు తాకాయి. నిజమే తిమ్మరుసు ఆ పని చేయడు అని నమ్మడానికి వీలులేదు. అతడు ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా చూడడమే కాదు, స్వతంత్రంగా నిర్ణయించి అమలు చేస్తాడు. తిరుమల రాయడు తుఖాదేవీకి పుట్టినందున రాజుగా పనికిరాడని భావించి స్వయంగా హత్యకు పూనుకుని ఉంటాడు.
ఆరోజు న్యాయమూర్తి తీర్పుకి అవకాశం ఇవ్వకుండా రాయలు గొంతు విప్పాడు.
" అప్పాజి, ఈహత్య చేసినట్టు పట్టపురాణి వారు చూసారు. కనుక ఈతడు శిక్షార్హుడే. పసివాణ్ణి చంపినందుకు ఈతని కన్నులు పెరికివేసి చనిపోయినంతవరకు ఖైదు చేయండి." అని ఆదేశించి అంతటితో సభ చాలించి తన ఆంతరంగిక మందిరానికి వెళ్లిపోయాడు.
సభలోని వారు నివ్వెరపోయారు. తిమ్మరుసు తలదించుకున్నాడు. ఒక్కసారి ఉవ్వెత్తున నిరసన ధ్వనులతో సభ మొత్తం నిండిపోయింది. నగరమంతా తిరుగుబాటు ధోరణిలోపడింది. ఎక్కడ చూసిన మండిపడిన ప్రజలే కనిపించారు. కొంతమంది రాణీవాసం మందిరాలకు వినతిపత్రాలు రాసి పంపారు. నీవు చూసినది తిమ్మరుసును కాదు, ఆ గుంటనక్క వీరేంద్రుడిని అతడే చంపాడు. అతన్ని ఉరి తీయండి అని నినదించారు. తిరుగుబాటులా ప్రజలు కన్పించేసరికి రాయలు అవలీలగా అణచివేసాడు.
ఆమరుసటి రోజు సూర్యోదయానికి ముందే రహస్యంగా వచ్చి తిమ్మరుసును కలుసుకున్న కీలక రాజోద్యోగులు రాజు పై తిరగబడతాం. రాయల పని పడతాం అని చెప్పితే, రాయలను కొలవండి అతడిని దూషించవద్దు. అని ఎలాంటి తిరుగుబాటు జరగకుండా హితవు చెప్పి పంపిన కొన్ని గంటల్లో ఆ మహామంత్రి తిమ్మరుసు పై శిక్ష అమలు జరిగిపోయింది. అతని కన్నులు పెరికివేయబడ్డాయి.
తిమ్మరుసు పై శిక్ష అమలు అయినట్టు వార్త తెలియడంతో నగరంలో ఒక్కసారిగా తిరుగుబాటు జరిగింది. తన సైన్యంలో తిరుగుబాటు ధోరణి కనిపించినమరుక్షణం రాయలు తానే స్వయంగా దిగి వారికి చెప్పాల్సింది చెప్పి అంతకు మించి ముందుకుపోకుండా నిలువరించగలిగాడు. వీరేంద్రునికి నగరవాసుల వలన తక్షణమే ప్రాణాపాయం అని తెలిసి ముందు జాగ్రత్తగా వీరేంద్రుని ఇంటి చుట్టూ పటిష్టమైన కాపలాను ఏర్పాటు చేసాడు రాయలు.
అంతలోనే తుఖాదేవీ నుంచి వీరేంద్రునికి పిలుపు వచ్చింది. తక్షణం బయలుదేరి రావల్సింది, బయట ఏమాత్రం రక్షణ ఉండదు. రాణీవాసంలో తలదాచుకుంటే ఎవరు ఏమీ చేయలేరు. పైగా, నగరవాసు లు ఎందుకో నిన్నే అనుమానిస్తున్నారు. అని కబురు అందింది. వీరేంద్రుడు తనపై ఇంతగా తిరుగుబాటు ఉంటుంది అని అనుకోలేదు. భయంగానే బయలుదేరా డు. తను బయట కనిపిస్తే నగరవాసులు నరికేస్తారని ఊహించాడు. భయం భయం గా తక్షణం రాణీవాసానికి బయలుదేరాడు.
👳♀️
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల
No comments:
Post a Comment