Thursday 23 May 2024

03-06-2024

 

.....
*019..>>>>>>>>>>>ఓం<<<<<<<<<<<*

*నందికి ఎందుకంత ప్రత్యేకత.....!!*

శివాలయంలోకి అడుగుపెట్టగానే పరమేశ్వరునికంటే ముందుగా నందినే దర్శించుకుంటాం. 

కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచీ పరమేశ్వరుని చూస్తే, మరికొందరు ఆయన చెవిలో తమ అభీష్టాలని చెప్పుకొంటారు.

నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టే ఆయనకి అంత ప్రాముఖ్యతా? కాదంటోంది ఆయన చరిత్ర! 

పూర్వం శిలాదుడనే ఋషి ఉండేవారు. ఎంత జ్ఞానాన్ని సాధించినా, ఎంతటి గౌరవాన్ని సంపాదించినా… పిల్లలు లేకపోవడం ఆయనకు లోటుగా ఉండేది. 

ఎలాగైనా సరే తనకు సంతానభాగ్యం కలిగేందుకు పరమశివుని కోసం తపస్సు చేయసాగాడు శిలాదుడు. ఏళ్లూ ఊళ్లూ గడిచిపోయాయి,

ఎండావానా వచ్చిపోయాయి… కానీ శిలాదుని తపస్సు ఆగలేదు. ఆతని ఒంటినిండా చెదలు పట్టినా సరే నిష్ఠ తగ్గలేదు. ఎట్టకేళకు శిలాదుని ఎదుట ప్రత్యక్షం అయ్యాడు పరమశివుడు. 

 "నాకు అయోనిజుడయిన ఒక కుమారుడిని కలుగచేయి" అని కోరుకున్నాడు శిలాదుడు. 

అతని భక్తికి పరవశించిన పరమేశ్వరుడు తథాస్తు అంటూ వరాన్ని అనుగ్రహించాడు. శివుని వరాన్ని పొందిన శిలాదుడు ఒకనాడు యజ్ఞాన్ని నిర్వహిస్తుండగా,

ఆ అగ్ని నుంచి ఒక బాలుడు ప్రభవించాడు. ఆ బాలుడికి నంది అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకోసాగాడు శిలాదుడు. 

నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడని అర్థం!  బాలుని జననంలాగానే అతని మేథ కూడా అసాధారణంగా ఉండేది.

పసివాడకుండానే సకలవేదాలన్నీ ఔపోసన పట్టేశాడు. 
ఇలా ఉండగా ఓనాడు శిలాదుని ఆశ్రమానికి మిత్రావరుణులు అనే దేవతలు వచ్చారు. 

ఆశ్రమంలో తిరుగుతున్న పిల్లవాడిని చూసి మురిసిపోయారు. అతను తమకి చేసిన అతిథి సత్కారాలకు పరవశించిపోయారు.

వెళ్తూ వెళ్తూ దీర్ఘాయుష్మాన్భవ అని అశీర్వదించబోయి ఒక్క నిమిషం ఆగిపోయారు! నంది వంక దీక్షగా చూసి మిత్రావరుణులు ఎందుకలా బాధలో మునిగిపోయారో శిలాదునికి అర్థం కాలేదు.

ఎంతగానో ప్రాథేయపడిన తరువాత నంది ఆయుష్షు త్వరలోనే తీరిపోనుందని తెలుసుకున్నాడు శిలాదుడు. భవిష్యత్తు గురించి తెలుసుకున్న శిలాదుడు విచారంలో మునిగిపోయాడు.

కానీ నంది మాత్రం తొణకలేదు, బెణకలేదు. "శివుని అనుగ్రహంతో పుట్టినవాడిని కాబట్టి, దీనికి మార్గం కూడా ఆయనే చూపిస్తాడు" అంటూ

శివుని కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు నంది. నంది తపస్సుకి మెచ్చిన శివుడు అచిరకాలంలోనే అతనికి ప్రత్యక్షమయ్యాడు.

శివయ్యని చూసిన నందికి నోట మాట రాలేదు. ఆయన పాదాల చెంత ఉండే అదృష్టం లభిస్తే ఎంత బాగుండో కదా అనుకున్నాడు.

అందుకే తన ఆయుష్షు గురించో, ఐశ్వర్యం గురించో వరం కోరుకోకుండా "అచిరకాలం నీ చెంతనే ఉండే భాగ్యాన్ని ప్రసాదించు స్వామీ" అని శివుని వేడుకున్నాడు నంది. 

అలాంటి భక్తుడు తన చెంతనుంటే శివునికి కూడా సంతోషమే కదా! అందుకే నందిని వృషభరూపంలో తన వాహనంగా ఉండిపొమ్మంటూ అనుగ్రహించాడు. 

ఆనాటి నుంచీ శివుని ద్వారపాలకునిగా ఆయనను కాచుకుని ఉంటూ, ఆయన ప్రమథగణాలలో ముఖ్యునిగా కైలాసానికి రక్షణను అందిస్తూ, తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు నంది.

శివునికి సంబంధించిన చాలా గాథలలో నంది ప్రసక్తి ఉంటుంది. వాటిలో శివుని పట్ల నందికి ఉన్న స్వామిభక్తి, దీక్ష కనిపిస్తూ ఉంటాయి. 

ఉదా॥ క్షీరసాగరమథనంలో హాలాహలం అనే విషం వెలువడినప్పుడు, దాని నుంచి లోకాలను కాపాడేందుకు శివుడు ఆ విషాన్ని మింగి గరళకంఠునిగా మారాడు. 

ఆ సమయంలో కొద్దిపాటి విషం కిందకి ఒలికిందట. అప్పుడు శివుని చెంతనే ఉన్న నంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కాస్త విషాన్నీ ఆరగించేశాడు.

మహామహా దేవతలే హాలాహలానికి భయపడి పారిపోతుండగా, నంది మాత్రం కేవలం శివుని మీద ఉన్న నమ్మకంతో దాన్ని చప్పరించేసి నిశ్చింతగా నిల్చున్నాడు. 

నంది వెనుక ఇంత చరిత్ర ఉంది కాబట్టే, ఆయనను శివునికి సేవకునిగానే కాకుండా ముఖ్యభక్తునిగా కూడా భావిస్తారు పెద్దలు.

తమిళనాట ఆయనను అష్టసిద్ధులు కలిగినవానిగా, జ్ఞానిగా, ప్రథమ గురువులో ఒకనిగా భావిస్తారు. 

శైవమత ప్రభావం అధికంగా ఉన్న కర్ణాటకలోని బసవనగుడి, మైసూర్‌ వంటి ప్రదేశాలలో నందికి ప్రత్యేకించిన ఆలయాలు ఉన్నాయి. 

ఇక తెలుగునాట కూడా లేపాక్షి (అనంతపురం), మహానంది (కర్నూలు) వంటి క్షేత్రాల్లో నందీశ్వరుని ప్రాధాన్యత కనిపిస్తుంది.

శివుడు ఉన్నంతకాలమూ, ఆయన భక్తుడైన బసవన్నకి కూడా ఏ లోటూ ఉండదు....నమస్తే.. నందీశ్వరా..
🙏🙏🙏

20..*ఒకనాటి  జీవన శైలి...

ఉదయం పళ్ళు తోముకోవడానికి వేప్పుల్లలను ఉపయోగించేవారు. 
వీటినే "పందొం పుల్లలు" అని కూడా అనేవారు.
కొంతమంది "కచ్చిక" (ఆవు పేడ పిడకలను కాల్చగా వచ్చిన పొడి), పళ్ళపొడితో పళ్ళు తోముకునేవారు. తాటాకులు చిన్నచిన్న ముక్కలుగా చేసి పెట్టుకుని వాటిని నాలిక శుభ్రపరచుకోవడానికి ఉపయోగించేవారు.
మగవాళ్ళు చాలామంది నూతి దగ్గరే, నీళ్ళు చేదలతో తోడుకు పోసుకొనేవారు. ఆ చన్నీటి స్నానం చాలా హాయినిచ్చేది. చలికాలంలో మాత్రం వేడినీళ్ళు ఉండేవి.
ఉదయం నీళ్ళు కాచుకొనేoదుకు కర్రలపొయ్యి, లేదా పొట్టుపొయ్యి ఉండేది. పొట్టు పొయ్యిలో పొట్టు కూరడం చాలా చిత్రమైన విషయం. Rs.3/- కి ఒక పొట్టు బస్తా వచ్చేది. పొట్టు బస్తాలను ఎడ్ల బండిమీద పట్టుకొచ్చి ఇంటిదగ్గర అమ్మేవారు.
కాఫీ డికాషన్ కి వేడి వేడి నీళ్లలో కాఫీపొడి వేసి, కొంచం సేపు ఆగాక, పైన తేరిన నీటినే డికాషన్ గా ఉపయోగించే వారు. పాలు శేరులెక్కన అమ్మే వారు.
బొగ్గుల కుంపటిమీద కాఫీ. కుంపటి విసరడానికి ఓ వెదురు విసినకర్ర. కొంతమంది వత్తుల స్టౌ,  పంపు స్టౌ వాడేవారు కిరసనాయిలుది.
అదే విధంగా బరువులను వీశ (1400 గ్రా), ఏబులం (అర వీశ), పదలం (పావు వీశ) గా తూచేవారు.
ఇంట్లో దేవుడి పూజలు అవీ సామాన్యంగా ఉండేవి. మడి, తడీ మాత్రం పాటించేవారు బాగా. వంట అంతా ఇత్తడి గిన్నెలతోనే. అందరి ఇళ్లలోనూ  రాచ్చిప్పలు ఉండేవి. ఈ రాచ్చిప్పల్లో పచ్చి పులుసు,  ఉల్లిపాయల పులుసు, పప్పుపులుసు కాచేవారు. ఆ రుచి అమోఘంగా ఉండేది. అన్ని పచ్చడులూ రుబ్బు రోట్లోనే.
అప్పుడు బియ్యంలో మట్టి బెడ్డలు, వడ్లు, ఎక్కువుగా ఉండటంతో వాటిని బియ్యం నుండి ఏరేసుకుని వండుకునేవారు. రోజూ మధ్యాహ్నం ఆడవాళ్ళు అందరూ కలసి బియ్యం చేటల్లో పోసుకుని, వడ్లూ బెడ్డలూ ఏరుకునేవారు. అదే వారికి ఇరుగింటి పొరుగింటి వాళ్లతో కాలక్షేపం, పిచ్చాపాటి.
అదేవిధంగా అన్ని సామాన్లు అంటే, ఆవాలు, జీలకర్ర ఇలాoటివి కూడా బాగు చేసుకుని డబ్బాల్లో పోసుకొనేవారు.
బియ్యంలో అక్కుళ్లు, ఆట్రగడ్డలు, వంకసన్నాలు, కిచిడి అనే రకాలు ఉండేవి. ఆక్కుళ్లు, ఆట్రగడ్డలు అంటే ముతక బియ్యం. వంక సన్నాలు, మధ్యరకం. కిచిడి బియ్యం అంటే సన్నబియ్యం. మసూరీ బియ్యం ఇంకా ఖరీదు.
సీతా రామాభ్యానమః అని యాయవారం బ్రాహ్మణుడు ఉదయమే అందరి ఇళ్ళకు వచ్చి తిథివార నక్షత్రాలు చెప్పి వెంటనే వెళ్లిపోయేవారు. వెళ్లిపోయేలోపులో గృహస్థులు అందరూ గుప్పెడు బియ్యం వేసేవారు. ఒకవేళ రాలేకపోతే, అయితే ఏదో తప్పు చేసినట్లుగా, అపరాధ భావనతో ఉండి, మర్నాడు ముందే రెడీగా ఉండి, రెండు గుప్పెళ్లు వేసేవారు బియ్యం.
రాత్రిపూట7, 8 గంటలకు మాదాకవళం తల్లీ అంటూ వచ్చేవాళ్లకి ఆరాత్రి తినగా మిగిలిన అన్నం, కూరలు ఇచ్చేవాళ్ళు. చిన్నపిల్లలు పేచీ పెడుతుంటే మాదాకవళం అబ్బాయికి ఇచ్చేస్తానని భయపెట్టేవారు తల్లులు.
టిఫిన్స్ ఉండేవి కావు. ఒక్క శనివారం మాత్రం మినపరొట్టి / ఎర్రనూక ఉప్మాలాంటివి ఉండేవి.
పిల్లలు అందరూ 3 పూటలు అన్నం తినేవారు. భోజనం ఎప్పుడూ వంటింట్లో నేలమీద పీట వేసుకునే. తినడం అయ్యేక తిన్న చోట నీళ్ళు జల్లి శుద్ధి చేసేవారు. ప్రతి రోజూ రాత్రి వంటిల్లు కడిగి ముగ్గు పెట్టడం అలవాటు.
ఎప్పుడైనా చుట్టాలు వస్తే ఇంట్లో పిల్లలు వంటింట్లో పెద్దలు పడుకొనే వాళ్ళం బొంతలు వేసుకుని. చుట్టాలు లోపలిగదిలో పడుకునే వారు.
డబుల్ బెడ్రూం, సింగిల్ బెడ్రూం అనే పదాలే తెలియవు. చాలా మటుకు 3 గదుల ఇళ్లే. కొంచం స్థితిమంతులు ఐతే 4 గదులులోనూ, ఇంకా పెద్ద పెద్ద ఇండ్లలో ఉండేవారు. గదులు కూడా చాలా పెద్దవి.
3 వరుస గదుల ఇల్లు అద్దె నెలకి - 27 రూపాయలు. కరెంటు -1 బల్బుకి నెలకు 1 రూపాయి. అలాగ మొత్తం కరెంటుతో కలిపి నెలకి 30 అద్దె ఉండేది.
వైద్యంకి డాక్టర్స్ చెయ్యి పట్టుకు చూసి, బిళ్ళలు, అరకు ఇచ్చే వారు. జ్వరం తగ్గేవరకూ లంఖణమే. తర్వాత బన్ను, జావ, ఆ తర్వాత రోజు చారు అన్నం తినమనే వారు. డాక్టర్  భుజం తట్టి తగ్గిపోతుందిలే అనేమాటకే సగం జ్వరం తగ్గిపోయేది. అదే ప్రభుత్వాసుపత్రికి పోతే రంగు రంగుల ఔషథాలిచ్చేవారు.
ఇంకా, పిల్లల చదువులమీద ఎక్కువ వత్తిడి ఉండేది కాదు. బాగా చదువుకోమని చెప్పే వారు అంతే. ఊరికే చదివావా చదివావా అని ఏ తల్లిదండ్రులు పిల్లలని టెన్షన్ కి గురి చేసేవారు కాదు.
పుస్తకాలు ఎప్పుడు, వేరే వాళ్ళు వాడినవే. పై తరగతి పాసైన వాళ్ళ దగ్గర సగం ధరకే టెక్స్ట్ బుక్స్ కొనేవారు. నోట్స్ అన్నీ తెల్లకాగితాల పుస్తకాలే. సింగిల్ రూల్లు, బ్రాడ్ రూళ్లు, పెన్సిల్ తో కొట్టుకోవడమే. క్రితం ఏడు నోట్ బుక్సులో. మిగిలిన తెల్లకాగితాలు అన్నీ చింపి, ఒక కొత్త పుస్తకంలా కుట్టించుకుని నెక్స్ట్ ఇయర్ లో రఫ్ బుక్ గా వాడుకునే వారు.
రాత్రి 9 గంటలకు రేడియోలో వచ్చే ఇంగ్లీష్ న్యూస్ వినే వారం. అర్థం అయినా కాకపోయినా, రాత్రి పెందలాడే, నిద్ర. వేసవికాలం అయితే ఆరుబయట, మిగిలిన కాలాల్లో లోపల పక్కలమీద. ఉంటే ఫ్యాన్ ఉండేది లేకపోతే విసన కర్రే."*
ఇంకోటి ఏమిటంటే అప్పుడు సైకిల్ కి కూడా లైసెన్స్ ఉండేది.  రెండు రూపాయలు పెట్టి  ఒక లైసెన్స్ రేకు బిళ్ళ కొనుక్కుని సైకిల్ కి బిగించేవారు.
అదీ ఆరోజుల్లో జీవనశైలి.
ఎవరికీ ఏ చీకూచింతా ఉండేది కాదు. జీవితంలో ఏది ఎలా వస్తే అలాగే స్వీకరించే వారు. సంతోషంగా కాలం గడిపేసే వారు. ఆనందంగా భాద్యతలు  నిర్వహించేవారు.
అప్పట్లో ఎన్నో ఉమ్మడి కుటుంబాలుండేవి. 
వారాలబ్బాయిలు వీథి దీపాల చదువులు… మనుషులంత ఒక్కటిగా ఉండే వాళ్ళు.  ప్రజలంతా అమాయకంగా ఉండేవాళ్ళు.
కక్షలూ, కార్పణ్యాలు.  కోప తాపాలు, కుళ్ళూ కపటం.   ఈర్ష్యా ద్వేషాలు వాళ్ళకుంది మాకులేదని ఏనాడూ అనుకునేవారే లేరు.   అహంకారం, ప్రతీకారం అనేవే తెలీదు అప్పటి జనాలకి.
వెనక్కి తిరిగి చూచుకుంటే ఆ రోజులే బాగున్నాయనిపిస్తుంది. ఇప్పుడున్నన్ని సౌకర్యాలు, విలాసాలు లేకపోయినా, ప్రకృతికి దగ్గరగా, ఆరోగ్యంగా గడచిన రోజులు.
-


021
జీవితం లో కస్టాలు సుఖాలు రెండూ పంచుకునే మంచి మిత్రులు దొరకడం చాలా కష్టం.
హనుమ ద్వారా మనం నేర్చుకోవాల్సినవి 

1.ఎవరిని / దేనిని ఆశ్రయించావు?
ధర్మం తెలిసిన బ్రాహ్మణుడు రావణుడు.అపారమైన శివ భక్తుడు. అయినా పరకాంతల యందు..పరుల సొమ్ము నందు వాంఛను చంపుకోలేకపోయాడు. చివరకు రాముని ఒక్క బాణం తో పది తలలు కూలి మట్టిలో కలిసిపోయాడు. ధర్మ మూర్తి అయిన శ్రీ రాముని పాదాలను పట్టి ఆశ్రయించి….ఆయన బాట యందు నడిచిన “స్వామి హనుమ” చిరంజీవి గా మిగిలిపోయారు. చరిత్రలో నిలిచిపోయారు.

“జీవితం లో ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు దేన్ని పట్టుకోవాలో ….దేన్ని విడిచిపెట్టలో తెలియాలి. సరైన మార్గాన్ని తెలుసుకోవాలి. తెలియడం కాదు…పాటించే దమ్ము కూడా ఉండాలి.”

2. మైత్రి యొక్క విలువ!
వంచన తో..బలం తో..భార్యను, భూమిని, బలగాన్ని తనవైపు తిప్పుకున్న వాలి కి మంత్రిగా హనుమ ఒక్క నాటికి లేరు.తన దారి తానూ చూసుకోలేదు. న్యాయం వైపు గా..సుగ్రీవుడి పక్షాన్నే నిలిచి… ఉన్నారు.

“జీవితం లో కస్టాలు సుఖాలు రెండూ పంచుకునే మంచి మిత్రులు దొరకడం చాలా కష్టం. నిజంగా అలాంటి వాళ్ళు దొరికినప్పుడు… వాళ్ళని ఎన్ని కాష్టాలొచ్చినా విడిచిపెట్టకండి.”

3. అహం బ్రహ్మాస్మి
నేనే గొప్ప అని అనకు!
నాదేం లేదు…అనగలిగే గొప్ప స్వభావం కలిగి ఉండాలి!

లంకకు వెళ్ళే ముందు…హనుమ ఇలా అంటారు..!
నేను తలచుకుంటే నా శరీరాన్ని అమాంతం పెంచి వంగి ఒక్క చేత్తో అవతలి లంకా తీరాన్ని అందుకో గలను…అంత బలం ఉంది…

కాని నేను ఎలా వెళ్తానో తెలుసా?
“నా స్వామి రామ చంద్రమూర్తి యొక్క కుడిచేత్తో తన భుజం వెనుకనున్న అక్షయ బాణ తూనీరం లో నుండి తీసిన బాణాన్ని తన ఎడమ చేతిలోనున్న బంగారు వింటినారికి సంధించి ఆకర్ణాంతం లాగి విడిచిపెడితే ఆ బాణం ఎలా వెళుతుందో ” అలా దూసుకెళతాను…

అది నా శక్తి కాదు…!రాముడి చే విడవబడితే… రాముడి శక్తి ఆ బాణం లో కెళ్ళి బాణం వెళుతుంది! అటువంటి రామ బాణం లా వెళతాను!”

- నేను… నా వల్ల, నా బలం..ఇదంతా నేనె చేసాను.. అని హనుమ ఒక్క సారి కూడా అనలేదు!

4. నీ మీద నమ్మకం ఉండేలా బ్రతుకు!
కొన్ని లక్షల వానర సేన! నూరు యోజనముల సముద్రం! జాంబవంతుడు సహా ఎందరో అతిరథ మహారథులు! తలచుకుంటే కాని పని కాదు! కాని రాముడు నమ్మింది …అందరూ సూచించింది “హనుమనే”!

“నిన్ను నమ్మి పని అప్పగించి ….గుండెల పై చెయ్యేసుకుని హాయిగా నిద్రపోయేలా బ్రతుకు!”

5. మోసం చేసేవాళ్ళు ఉంటారు. నువ్వు మోసపోకు…ఆగిపోకు..ముందుకు మరో అడుగేసి సాగిపో!
హనుమ సముద్రం దాటుతూ ఉండగా….ఒక అందమైన బంగారు పర్వతం…పైకి లేచింది!“స్వామి…మీరు చాలా దూరం ప్రయాణం చేసి అలసి ఉన్నట్టు కనబడుతున్నారు..!కాసేపు నా ఈ పర్వతం పై కూర్చుని….విస్రాంతి తీసుకుని, ఇక్కడ ఉన్న పళ్ళు కాయలు తినివెళ్ళండి “అని అంటుంది.

హనుమ…”సముద్రం లో బంగారు పర్వతమా? మాయ లా ఉంది? ఇది నాకు విఘ్నమని” ఆలోచించి…ఆ పర్వతాన్ని చేత్తో ప్రేమగా తాకి, లంకా నగరం వైపుగా వెళ్ళిపోయారు.

“చేసే పనిలో ….గమ్యాన్ని చేరుకోడం లో..ఎలాంటి అడ్డంకులున్నా ప్రయాణం ఆపకూడదని హనుమ చేసుకున్న ప్రమాణం.”

6. లక్ష్యం తప్ప మరేదీ కనబడకూడదు.
హనుమ,లంకలో సీతమ్మకోసం వెతుక్కుంటూ రావణ అసురుని అంత: మందిరం లోనికి ప్రవేశించగా కొన్ని వందల మంది స్త్రీలు వివస్త్రలు గా, సురా పానం చేసి…మత్తులో ఒకరిపై ఒకరు పడి అడ్డదిడ్డంగా…పడి ఉన్నారు… లెక్కలేనన్ని పళ్ళు…మధుర…పానియాలు నేలపై పది పారుతూ ఉన్నాయి. వారి ఒంటి మీద బంగారు నగలు…నేలంతా పడి ఉన్నాయి…ఇవన్నీ చూస్తున్నా….. హనుమ ఒక్కింత కూడా చలించలేదు…ఆతని మనసులో ఉన్నది ఒక్కటే!నా తల్లి సీతమ్మ ఎక్కడ ఉందొ? ఎన్ని కస్టాలు పడుతోందో అని…!

మురుగు కాలువ దాటినట్టు ఆ స్థలాన్ని దాటి సీతమ్మ ను వెతుక్కుంటూ వెళ్లారూ హనుమ.

“లక్ష్యం సాధించడం లో గురి… చేసే పని లో పట్టుదల.. పడే శ్రమలో తపన ఉంటె….మన చుట్టూ ఏమున్నా కనపడవు.”

7. పెద్దరికాన్ని గౌరవించు
రావణుడు హనుమను బంధించి తీసుకు రమ్మన్నపుడు ఎన్నో విధాలుగా ప్రయత్నించిచివరగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తారు. నిజానికి బ్రహ్మాస్త్రం హనుమను ఆపలేదు.హనుమ బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి కట్టుబడ్డారు!
రావణ సభలో అంతే సులువు గా ఆ తాళ్లను విడిపించుకున్నారు.

“పెద్దలకి…నువ్విచ్చే గౌరవం నలుగురిలో నీ గౌరవాన్నే పెంచుతుంది”
****

022..*_బంధమైన, బంధుత్వాలయినా, స్నేహమైనా... మరో జన్మ ఉంటుందో లేదో తెలియదు, ఈ జన్మలోనే వాటిని కాపాడుకోవాలి._*

*_ఎందుకంటే, దూరమైతే దగ్గరవడం చాలా కష్టం, దూరం కాకుండా ప్రతి బంధాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది._*

*_బంధం నిలవాలంటే భాద్యతగా ఉండండి. విచ్చలివిడితనం మీ బ్రతుకు అదోగతి పాలుచేస్తుంది._*

*_స్నేహం,... బంధం పదిలంగా ఉండాలంటే... మన మాట తీరే ముఖ్యం. ఎదుటివారి మనసు గాయపడేట్టు మాట్లాడితే. స్నేహితులైనా, బంధువులైనా విరోధులవుతారు. మంచి మనస్సుకు, మంచి మాటకు మాత్రమే విలువ ఉంటుంది._*

*_నేటి బంధాలన్నీ ఆర్థిక సంబంధలే... కొంతమంది బంధువులు అన్నీ ఉన్ననాడే కలిసి వస్తారు, మీ దగ్గర ఏమీ లేనప్పుడు దూరంగా వెళ్తారు. అలాంటి వారిని దూరంగానే ఉంచండి._*

*_మీ దగ్గర ఏమీలేనినాడు ఎవరూ మిమ్మల్ని అక్కున చేర్చుకుంటారో వారే అసలైన ఆత్మ బంధువులు._*

*_మన అనుకున్న వాళ్ళకి కష్టం వస్తే ఆ కష్టానికి ఎదురెళ్లి మీరే నిలబడాలి. అప్పుడే మీది నిజమైన బంధం, స్నేహం అని అర్థం._*

*_బంధువులకు, స్నేహితులకు కష్టం వచ్చినప్పుడు మీరు ఆ బాధలన్నీ తీర్చక్కర్లేదు, కానీ ఆ బాధల్లో వారికి తోడుగా ఉంటే చాలు. మీరు విలువైన వ్యక్తిగా ఎదుగుతారు. వారి మనస్సులో సుస్థిరస్థానం నిలబెట్టుకున్న వారవుతారు.☝️_*

           *_మీ శ్రేయోభిలాషి..._*
మల్లాప్రగాడ రామకృష్ణ, ప్రాంజలి ప్రభ

****

023..మామిడి పండు మాయాసారం*

రెండు చేతులలో మామిడి పండును తేరి పారా చూస్తూ పట్టుకుంటామే ,దీనినే  *"వ్యామోహం"* అని అంటారు.

మగ్గిన పండును చూసి పరవశించి , పండంతా గుడ్లప్పగించి తడిమి చూచుకుంటామే, దీనినే  *"వాత్సల్యం"* అని విశదీకరించారు.

చేతికందిన పండును చూచి భుజాలు గజాలు అవ్వగా , చొక్కాతో అపురూపంగా పండుని సుతారంగా నిమురుతుంటామో, దీనినే  *"ఆప్యాయత"* అని చాటి చెప్పారు.

పండంతా ఆబగా తినిన తరువాయి కూడా , టెంకను చీకుతూ మైమరుస్తుంటామే అదిగో దానినే *"లోభం"* అని అన్నారు.

మన పండంతా తిని  ఆస్వాదించాక, టెంక విసిరేసి , చేతులు నాక్కుంటూ, పక్క వాడు తింటున్న మామిడిపండు ఇంకా అవ్వటం లేదేమిటి అని ఆలోచిస్తుంటామే దానినే  *"అసూయ"* అని వివరించారు.

మామిడిపండు చేతికి చిక్కాక , ఆబగా  చివర్లలో కొరికి రసాద్వాసన చేసే ప్రయత్నంలో , గుజ్జు టెంకతో సహా ఆ కొరుకుడు ప్రాంతం నుంచీ జారి పడిపోయి నప్పుడు , మనం వేసే చిందులతో కూడిన తాండవమునే, *"క్రోధం"* అని వివరంగా తెలిపారు.

మామిడి పండు తిని తొక్కను ఆవులకు, మేకలకు విసిరి, పండంతా పెట్టినట్టు  దీర్ఘ శ్వాస వదలి బిగుసుకు పోతామే, ఇదిగో దీనినే  *"అహంకారం"* అని చాటారు.

మామిడి పండు అంతా తిని పెదవులు మరియు మూతి నాలికతో అందుకుంటూ, టెంకను మురిపెంగా చూచుకుని , దానిని శుభ్రంగా కడిగి, మొక్కవుతుందని నేలలో పాతి పెడతామే, దానినే  *"మమకారం"* అని తెలిపారు.

అతిగా మామిడి పళ్ళు తిని , జడివానలా వచ్చే వమనములుకై చెరువు గట్టుకు పరిగెడుతుంటామే, ఇదిగో దీనినే ముఖ్యంగా *"ఆత్రం"* అని విశదీకరించారు.

*ఒక  పండు ఆరగింపు ముద్దు,*
*రెండు కద్దు*
 *మూడు అసలే వద్దు,*
 *ఉండాలి దేనికయినా సరిహద్దు.*
 దీనినే   *స్వీయ నియంత్రణ* అని విపులీకరించారు మన పెద్దలు.

🥭😛🥭

024..సేకరణ రచయత : మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ


కొన్ని భోజ కాళిదాస కథలలో మహాకవిని స్త్రీ లోలుడిగా చిత్రీకరించారు.కవిగా,లలిత శృంగార రస పోషణ లో ఆయన అందే వేసిన చెయ్యి కావటం వల్ల ఇలాంటి అపోహ కలిగిందా?లేక కాళీ వుపాసనతో పాటు కేళీ పిపాసకూడా ఆయన జీవితం లో భాగంగా చెప్తే ఈ కథలు మరీ ఆసక్తి కరంగా వుంటాయని యిది ఈ కథలకు జోడించబడిందా?లేక 'ఎంత వారలయినా కాంత దాసులే' అన్న లోకోక్తి ని కాళిదాసు కూడా పూర్తిగా అనువర్తించాడా?
చెప్పడం కష్టం.

ధారానగరం లో రమణీ మణి అనే రాజ నర్తకి వుండేది. ఆమె సౌందర్యానికి నాట్య ప్రతిభకీ దాసుడై రాజు ఆమెను తన ఉంపుడు కత్తెగా వుంచుకున్నాడు.ఆమెకు కాళిదాసు కవిత్వమంటే చాలా అభిమానం.ఆయనతోనూ ఆమెకు సంబంధాలుండేవి.ఈ రహస్యం ఆమె రాజుకు తెలియకుండా జాగ్రత్త పడింది.అయినా కొన్నాళ్ళకు రాజుకు అనుమానం వచ్చింది. ఆయన దాన్ని తెలుసుకునేందుకు ఒక ఉపాయం చేశాడురాజు ఆమె భవనానికి వచ్చినప్పుడు గోడ మీద శ్లోక పాదం వ్రాశాడు. 

'కుసుమే కుసుమోత్పత్తి: శ్రూయతే న తు దృశ్యతే'

అర్థము:-ఒక పువ్వులో నుంచి మరో పువ్వు పుట్టటం వినటమే గానీ ఎక్కడా కనబడదు.
ఈ శ్లోకం పూర్తీ చేసిన వారికి అక్షర లక్షలు యిస్తానని భోజుడు రమణి తో చెప్పాడు.ఒక వేల కాళిదాసు ఇక్కడికి వచ్చినట్టయితే తప్పక పూర్తీ చేస్తాడు,అప్పుడు రహస్యం బట్ట బయలవుతుందని ఆయన ఉద్దేశ్యం.
ఇంత పెద్ద బహుమతి అంటే రమణికి ఆశ పుట్టింది.

ఈసారి కాళిదాసు వచ్చినప్పుడు ఆమె గోడమీది శ్లోక పాదం చూపించి నా కోసం దీనిని పూర్తీ చేయండి అని కోరింది.ఇదేమీ తెలియని కాళిదాసు చెప్తాను రాసుకో అని 

'బాలే, తవ ముఖాంభోజే దృష్టం యిందీవర ద్వయం'

అర్థము:-- కానీ ఓ ముద్దరాలా యిప్పుడు నిన్ను చూడగా,నీ ముఖ మనే తామరపువ్వులో నీ కన్నులనే నీలి కలువలు పుట్టినట్టు కనిపిస్తున్నాయి సుమా!అన్నాడు మహా కవి.
అంత చక్కని పూరణ వినగానే రమణికి మతి పోయింది.ఈ పూరణ రాజుకు చూపిస్తే తనకు అక్షర లక్షలు ఖాయం.అనుకోని దురాశ తో కాళిదాసు నిద్రిస్తుండగా ఆయన తల నరికేసి శవాన్ని దాచేసింది. 

రాజుగారు వ్రాసిన దానికిందే తన చేత్తో కాళిదాసు పూరణను కొంచెం మార్చి 'బాలే' అనే పదం కాక రాజును వుబ్బేద్దామని 'రాజే!'అని వ్రాసింది
కుసుమే కుసుమోత్పత్తి: శ్రూయతే న తు దృశ్యతే
రాజే,తవ ముఖాంభోజే దృష్టం యిందీవర ద్వయం

అర్థము:-- ఒక పువ్వులోనుంచి యింకొక పువ్వు పుట్టటం వినడమే గానీ ఎక్కడా కనబడదు.కానీ యిప్పుడు నిన్ను చూస్తె రాజా!నే ముఖమనే కమలం లో కన్నులనే నల్ల కలువల జంట కనబడుతున్నది.
రాజు రానే వచ్చాడు పూరణ చూసి ఎవరు పూరించారు?అని అడిగాడు యింకెవరు నేనే అని బొంకింది.

రాజు ఆమె చెంప చెళ్ళు మని పించాడు.దుర్మార్గురాలా నీ అబద్దం నమ్మటానికి నేను మూర్ఖుడ ననుకున్నావా?.ఇది కాళిదాసు పూరించినదని స్పష్టంగా తెలుస్తూంది.ఎటొచ్చీ నీ బుద్ధి హీనత వల్ల 'బాలే'అన్న మాటను మార్చి 'రాజే' అని వ్రాశావు.ఆ మాత్రం తో నేను బుట్టలో పడిపోతాననుకున్నావు.కానీ 'రాజన్'అనే సరయిన సంబోధనకు బదులు నీ సొంత తెలివి నుపయోగించి 'రాజే' అని తప్పు రాసి నీ దొంగ బుద్ధి ని నువ్వే ప్రకటించు కున్నావు.చెప్పు యింతకూ కాళిదాసు ఎక్కడ?అని నిలదీశాడు.
రమణి భయపడిపోయి తప్ప్పు ఒప్ప్పుకొని జరిగిన దంతా చెప్పింది.కాళిదాసు మరణించాడన్న వార్త రాజు నమ్మలేక పోయాడు.రమణి కాళిదాసు శవాన్ని చూపగానే రాజు మూర్ఛ పోయాడు.కాసేపటికి తేరుకొని తన యిష్ట దేవత భువనేశ్వరీ దేవిని ప్రార్థించాడు.నా జీవితం లో మిగిలి వున్న ఆయువు లో సగం ఈ కవీశ్వ రుడికి ధార పోస్తాను.ఈయనను బ్రతికించు తల్లీ అని ప్రార్థించాడు.దేవి కరుణతో కాళిదాసు లేచి వచ్చాడు.రాజా నీ ఆయువు లో సగం ధారపోసి నన్ను బ్రతికించావు.నా శేష జీవితం నీకే అంకితం చేసి నీ ఋణం తీర్చుకుంటాను ఏమి చెయ్యాలో ఆజ్ఞాపించు. అన్నాడు కవిరాజు.కవీశ్వరా నువ్వు లేకుండా నేను జీవించ లేను,జీవించినా అటువంటి నిస్సార మైన జీవితం నాకు వద్దు.మనం జంటగా ఒక కావ్య రాద్దాం
నీ పేరూ,నాపేరూ శాశ్వతంగా చరిత్ర లో నిలిచి పోతుంది.అన్నాడు రాజు.
తర్వాత యిద్దరూ కలిసి 'చంపూ రామాయణ కావ్యాన్ని ప్రారంభించారు.(చంపూ కావ్య మంటే శ్లోకాలూ,గద్యాలూ రెండింటి తో చెప్పబడ కావ్యం) సరళంగా సాగే ఈ చక్కని గ్రంథం 'భోజ చంపువు'గా ప్రచారం పొందింది.దీన్ని ఈనాటికీ సంస్కృత విద్యార్థులు తమ తొలి అధ్యయన గ్రంథాలలో ఒకటిగా చదువుకుంటారు. అయితే ఈ రామాయణం 'సుందరకాండ వరకే భోజ,కాళిదాసుల రచన.అక్కడిదాకా వ్రాసి యిద్దరూ ఒకే సారి మరణించారు. మిగిలిపోయిన యుద్ధ కాండను ఆ తర్వాత 16వ శతాబ్దం లో లక్ష్మణ సూరి అనే ఆంధ్ర దేశ పండితుడు పూర్తి చేశాడట..

సేకరించబడింది ఆనందమె జీవిత మకరందం*

#రచన - #వేదార్థం జ్యోతి

--((***))--

_*25🚩 నేడు నారదుడు జయంతి🚩*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*ఆదర్శ పాత్రికేయుడు నారదుడు*

నారదుడు దేవర్షి , సంగీతజ్ఞుడు. నిరంతరం లోక సంచారం చేస్తారు. ఆయా ప్రాంతాల విశేషాలను అందరికీ  తెలుపుతుంటారు. ఆయన ఒక ఆదర్శ పాత్రికేయుడు. మంచి చెడుల మధ్య జరిగే యుద్ధంలో ఆయనది ఎప్పుడూ ధర్మ పక్షమే. కృత , త్రేతా , ద్వాపర యుగాలన్నిటిలోనూ ఆయన ఉంటారు.

నారదుని జన్మతిధి వైశాఖ బహుళ పాడ్యమి. ఈ తిధినాడే ప్రపంచమంతా నారద జయంతిని జరుపుకుంటున్నది.

*ముల్లోకసంచారి*

నారదుడు త్రిలోక సంచారి. మూడు లోకాల్లోను సంచరిస్తూ ఆయన భక్తి మార్గాన్ని ప్రచారం చేస్తుంటారు. ఎంతోమంది సాత్వికులకు అయన మోక్షమార్గాన్ని చూపించాడు. ధర్మానికి అధర్మానికి జరిగే పోరాటంలో ఆయన తనదైన పాత్ర పోషిస్తుంటాడు. అయితే కొంతమంది మేధావులు , రచయితలు మాత్రం ఆయన్ను *“కలహా భోజనుడు” గా “కలహా ప్రియుడు” గా* అభివర్ణించారు.

ఈ లోకం తీరే ఇంత. నిజం మాట్లాడే వాడికి ఎప్పుడు కష్టాలే. అందుకే అన్నారు *‘యదార్ధవాది లోక విరోధి’*. ఈ ఆధునిక కాలంలో కూడా సత్యాన్ని ధర్మాన్ని పాటించే వాళ్ళంటే అదో చిన్నచూపు. వారిని లోక విరోధులుగానే చూస్తారు. అనేక కష్టాలకు గురి చేస్తారు. నారద మహర్షి కూడా లోక కళ్యాణం కొరకు నిరంతరం తపించేవాడు. ముల్లోకాలలోనూ సంచరిస్తూ దేవ , మానవ , దానవులకు  సందర్భానుసారంగా కర్తవ్య బోధ చేస్తుంటాడు. అయితే నారదుడిది ఒకటే లక్ష్యం. ధర్మం గెలవాలి.

*‘నార’* అనగా మానవ జాతికి ఉపయోగపడే జ్ఞానం అని , *‘ద’* అనగా ఇచ్చే వాడని అర్ధం ఉంది. మానవజాతి నిరంతర అభివృద్ధిని సాధించడానికి అవసరమైన జ్ఞానాన్ని ఇచ్చి , వారిని సన్మార్గంలో నడిపించేవాడే నారదుడు. అంతేకాదు , నారదుడు ఒక అత్యున్నత సంగీతకారుడు.

*జన్మ వృత్తాతం*

ప్రళయం తర్వాత కాలంలో పునఃసృష్టి ప్రారంభమైనప్పుడు నారాయణుడి నాభి నుంచి బ్రహ్మ వచ్చాడు. బ్రహ్మ మరీచి , అత్రి మొదలైన ఎనిమిది మంది ప్రజపతులను సృష్టించాడు. వీరిలో నారదుడు కూడా ఒకరు.

*ధర్మ రక్షణలో నారదుడి పాత్ర*

*రామాయణ రచనలో*

రామాయణ రచనలో మనకు నారదుడి పాత్ర కనిపిస్తుంది. వాల్మీకి ఆశ్రమానికి వచ్చిన నారదుడితో *“ఎన్ని కష్టాలు వచ్చినా , ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఋజువర్తనలో సాగిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా ?”* అంటూ ప్రశ్నించాడు వాల్మీకి. అప్పుడు అయోధ్య రాజైన శ్రీరామచంద్రుడు గురించి మొదట వాల్మీకికి తెలిపింది నారదుడే. వాల్మీకి మహర్షి రామకథను విని పులకించి పోయాడు. నారదుడి తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి రామకథను శ్లోక రూపంలో రచించమని కోరాడు.

*మహర్షికి మార్గదర్శనం*

ఒకసారి మహర్షి వేదవ్యాసుడు వేదాలను ఋగ్ , యజుర్ , సామ , అధర్వణమని నాలుగు భాగాలుగా విభజించాడు. సామాన్యులకు వేదాలు మరింత సులభంగా అర్ధం కావాలనే తలంపుతో పురాణాలను రచించాడు. మహాభారతాన్ని రాశాడు. మానవాళి శ్రేయస్సుకై ఇన్ని రచించినప్పటికీ ఆయనకు తృప్తి కలుగలేదు. ఒకరోజు సరస్వతీ నది ఒడ్డున కూర్చుని ఆలోచనలో నిమగ్నుడై ఉండగా నారదుడు వచ్చి ఆయన్ను పలకరించాడు. భక్తి మహత్యాన్ని తెలిపే నారాయణుడి లీలలను తెలిపే భాగవతాన్ని రాయమని కోరాడు. ఈ రచనతో కలియుగంలో ప్రజలకు దైవభక్తి , సత్సాంగత్యం కలుగుతాయని నారదుడు తెలిపాడు.

ఇలా మానవాళికి మార్గం చూపే రామాయణం , మహాభారతం , భాగవతాలను గ్రంధస్థం చేయడంలో , వాటి ప్రచారంలో నారదుడి పాత్ర చాలానే ఉంది.

అలాగే వాల్మీకి , ధ్రువుడు , చిత్రకేతు , ప్రహ్లాదుడు  సావిత్రి వంటి వారికి భక్తి మార్గాన్ని ఉపదేశించినది కూడా నారద మహర్షియే.

*ధ్రువుడు*

ఉత్తానపాద మహారాజుకి ఇద్దరు భార్యలు. వారిలో ఒకరు సునీత. ఆమె కుమారుడు ధ్రువుడు. రెండవ భార్య సురుచి. ఆమె కుమారుడు ఉత్తముడు. ఒకరోజు సురుచి *“నువ్వు రాజు కావడానికి అనర్హుడివి” అని ధ్రువుడిని నిందిస్తుంది. దానితో విష్ణువుని మెప్పించి రాజార్హత సంపాదిస్తానని ఐదేళ్ళ వయసులోనే అడవి బాట పడతాడు ధ్రువుడు. ధ్రువుని శపథం విన్న నారదుడు వెంటనే అతని వద్దకు వచ్చి తపస్సు చేసే పద్ధతి వివరిస్తాడు. “ఓం నమో భగవతే వాసుదేవాయ”* అన్న మంత్రాన్ని కూడా ఉపదేశిస్తాడు. నారదుని ఉపదేశం ప్రకారం ధ్రువుడు తన తపస్సు ద్వారా శ్రీ మహావిష్ణువుని మెప్పిస్తాడు.

*చిత్రకేతు*

శూరసేన రాజ్యానికి సంబంధించిన కథలోనూ నారదుడి పాత్ర మనకు కనిపిస్తుంది. ఈ రాజ్యానికి రాజు చిత్రకేతు. ఆయనకు ఎన్నో ఏళ్ల తర్వాత ఒక కుమారుడు జన్మిస్తాడు. అయితే చిత్రకేతు మిగిలిన భార్యలు ఆ పిల్లవాడికి విషం పెట్టి చంపేస్తారు. లేక లేక పుట్టిన కుమారడు మృతి చెందడంతో చిత్రకేతు చాలా దుఃఖిస్తాడు. నారదుడు వచ్చి అతనిని ఎంత అనునయించినా ఫలితం లేకపోవడంతో , తన యోగ శక్తితో చనిపోయిన చిత్రకేతు కుమారుని బ్రతికిస్తాడు. తిరిగి ప్రాణం పోసుకొన్న అ బాలుడు *“నేను ఎన్నో జన్మలను ఎత్తాను. ఎంతోమంది తల్లితండ్రులను చూశాను. ఒకరి చేతిలోనుంచి ఇంకొకరి చేతిలోకి మారే నాణెం లాగా మానవుడు తన కర్మానుసారం ఒక జన్మ తర్వాత మరొక జన్మ ఎత్తుతాడు. నేను ఈ జన్మ చక్రం నుంచి బయటపడలనుకుంటున్నాను”* అని దేహ త్యాగం చేశాడు. దీంతో చిత్రకేతుకు జ్ఞానోదయమవుతుంది. అతని మనస్సు నిర్మలమవుతుంది. చిత్రకేతుకి మంత్రోపదేశం చేసి మోక్షమార్గాన్ని చూపాడు నారదుడు.

*భక్త ప్రహ్లాద*

భక్త ప్రహ్లాదుడికి సంబంధించిన వృత్తాంతం లోనూ మనకు నారదుడు దర్శనమిస్తారు. హిరణ్యకశిపుడు దేవతలకు శత్రువు. ఒకసారి అతడు మంధర పర్వతం మీద తపస్సు చేసుకుంటూ ఉండగా , ఇంద్రుడు అతని భార్యని చెరపడతాడు. వెంటనే అక్కడకు వచ్చిన నారదుడు ఇంద్రుడిని వారిస్తాడు. ధర్మం తప్పి ప్రవర్తిస్తున్నావని హెచ్చరిస్తాడు. హిరణ్యకశిపుని భార్యను నారదుడు తన ఆశ్రమానికి తీసుకెళ్తాడు. ఆమెకు ధర్మానికి సంబంధించిన విషయాలతో పాటు శ్రీమన్నారాయణుని లీలను బోధించేవారు. వీటిని ఆమె గర్భంలోని శిశువు ఎంతో ఆసక్తితో వినేవాడు. నారదుడి బోధనలు విన్న ప్రహ్లాదుడు పుట్టుకతోనే మహావిష్ణువు భక్తుడయ్యాడు.

*సతీ సావిత్రి*

సావిత్రి కథలోనూ మహర్షి నారదుడు కనిపిస్తారు. మద్ర రాజు ఆశ్వపతి కుమార్తె సావిత్రికి సత్యవంతునితో వివాహం జరుగుతుంది. నారదుడు వచ్చి సత్యవంతుడు చాలా బుద్ధిమంతుడని , అయితే ఇంకా ఒక్క సంవత్సరం మాత్రమే జీవిస్తాడని చెబుతాడు. అయినా అంతా శుభమే జరుగుతుందని నారదుడు సావిత్రికి ధైర్యం చెబుతాడు. ఆ తర్వాత నారదుడి ఉపదేశానుసారం సావిత్రి తన పతిభక్తితో యమధర్మ రాజు ను మెప్పించి తన భర్త ప్రాణాలను తిరిగి కాపాడుకుంటుంది.

శ్రీ కృష్ణుడి కథల్లోనూ నారదుడు మనకు దర్శనమిస్తాడు. ఇటు ధర్మరాజుకి రాజధర్మం , ప్రజలకోసం రాజు నిర్వహించాల్సిన కార్యాలను గురించి  కూడా నారదుడు వివరిస్తాడు. పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు వారికి ఉపయుక్తమైన కథలు , ధర్మాలు చెప్పమని మార్కండేయ మహర్షిని వారివద్దకు పంపిస్తారు.

ఇంకా వేదాలు , ఉపనిషత్తులలో కూడా నారదుని ప్రస్తావన మనకు కనిపిస్తాయి. ఖగోళ , సంగీత శాస్త్రాలలో సైతం ఆయన నిష్ణాతుడు. వేదాలలో చెప్పిన విషయాలను దేశ , కాల పరిస్థితులకు తగినట్లుగా అన్వయించుకుని , ఎలా పాటించాలో చెప్పేవే స్మృతులు. నారదుడు కూడా అటువంటి స్మృతిని రచించాడు. దానిని `నారద స్మృతి’ అంటారు.  నారదుని *“నారద శిక్ష”* అనే గ్రంథం వ్యాకరణ సిద్ధాంతాలను వివరిస్తుంది. నారద భక్తి సూత్రాలు అనే గొప్ప గ్రంథాన్ని ఆయన రచించారు. ఇందులో భక్తి మార్గము , దాని విశిష్టత , దానిని అనుసరించడం ఎలా అన్న విషయాలపై 84 అధ్యాయాలలో వివరించారు. అలాగే `బృహన్నారదీయమ్’, `లఘునారదమ్’ అనే గ్రంధాలలో ఆస్తిపంపకాలు మొదలైన ధర్మాలన్నీ వివరించారు. అవి నేటికీ ఉపయోగపడుతున్నాయి. నారదుడు రచించిన శిల్పశాస్త్రం కూడా ఉంది.  ఈ విధంగా మానవాళి శ్రేయస్సుకై ధర్మ రక్షణ కోసం నారద మహర్షి తనదైన పాత్ర పోషించారు.

*మొదటి పాత్రికేయుడు నారదుడు*

ఇలా చెప్పుకొంటూ పోతే నారదుడు చేసిన మంచి పనులు అన్నీ ఇన్నీ కావు. మానవాళి శ్రేయస్సు కొసం ఎన్నో మంచిపనులు చేశారు. అవసరమైతే వ్యక్తుల మధ్య కలహాలు కూడా సృష్టించాడు. ఎన్ని కలహాలు సృష్టించినప్పటికీ అయన ధ్యేయం ధర్మ రక్షణే. శిష్ట రక్షణ , దుష్ట శిక్షణే. అయితే ఆయన అందరితో స్నేహం చేసేవాడు. చివరికి దానవులతో కూడా ఆయనకు సత్సంబంధాలున్నాయి. కానీ ధర్మానికి హాని చేసేవారు ఎంత స్నేహితులైన ఉపెక్షించే వాడు కాదు నారదుడు. తప్పు చేసినవాడు ఎంతటి వాడైన అతనికి శిక్ష పడేటట్లు చేయటమే నారదుని లక్ష్యం. మానవాళి శ్రేయస్సు కోసం , ధర్మ రక్షణ కోసం నారదుడు ఎప్పుడూ తపిస్తూ ఉంటాడు. అందుకే నారదుడు మహర్షి అయ్యాడు. మహర్షి అంటే ఋషులకే ఋషి. ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడేవారిని ఋషులనే అంటారు.

నేటి సమాజంలో ఒక పాత్రికేయుని జీవితం కూడా ప్రజల తరఫున పోరాడటమే. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పాత్రికేయుని జీవితం సాగుతుంది. ఈ మార్గంలో పత్రికేయులందరికి మహర్షి నారదుని జీవితం పరమ ఆదర్శం. అందుకే నారదుడిని మొదటి పాత్రికేయుడు అంటాం.

*నారద జయంతి –  ప్రపంచ పాత్రికేయుల దినోత్సవం*

వైశాఖ బహుళ విదియ మహర్షి నారదుని జన్మ తిధి. మొదటి ఆదర్శ పాత్రికేయుడయిన నారదుని జయంతిని ప్రపంచం యావత్తు పాత్రికేయ దినోత్సవంగా జరుపుకుంటున్నది. ఆ రోజున పాత్రికేయ వృత్తికి న్యాయం చేకూర్చే కొంతమంది పాత్రికేయులకు సన్మాన సత్కారాలు జరుగుతాయి. ఆ రోజున మహర్షి నారదుని స్మరించుకొని నిజమైన పాత్రికేయ వృత్తిని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. పాత్రికేయులంతా మహర్షి నారదుని బాటలో నడిస్తే ఇక ప్రజలకు కష్టలెక్కడి నుండి వస్తాయి ? ధర్మ మార్గంలో  నడిచే సమ సమాజం వెల్లివిరిస్తుంది.
*****

26..
అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఎందుకంటారు?

మనిషి మాటలు నేర్చి, వివేకం తెలిసి, వికసించి విజ్ఝానవంతుడైన తర్వాత ఆహారానికి ఉన్న విలువను గుర్తించాడు, మానవుని ప్రాథమిక అవసరాలన్నింటిలోకి ఆహారమే ముఖ్యమైనది అని తెలిసిన తర్వాత సహజంగానే భక్తిభావం పెరిగింది ‘ఆహార ఉపాహారాల ఇష్టత లేనివానికి సుఖాపేక్ష ఉండదు. సుఖాపేక్ష లేనివానికి సంతుష్టత ఉండదు. ఆహారాన్ని సక్రమంగా తీసుకోనని వానికి ఏ కోరికలు ఉండవు' అని చెబుతుంది భగవద్గీత.
ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారం చెయ్యడం’ అన్నాడట వెనకటికెవడో. ఎంత విడ్డూరమైన సామెతో కదా! కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే సతికి అన్నం పెట్టడమే కాదు తను తినటం కూడా ఊరికి ఉపకారమే. ‘శరీరమాద్యం ఖలు ధర్మసాధనం’ అన్నాడు మహాకవి కాళిదాసు. ధర్మసాధనకు అత్యవసరమైంది శరీరం. దేహమే కాదు ఈ సృష్టి అంతా ధర్మసాధన నిమిత్తమే. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయాలనే పంచకోశ సమన్వితమైన శరీరంలో అన్నమయకోశానికి మొదటి స్థానం ఇవ్వటం ఆహార ప్రాధాన్యతనే తెలియజేస్తుంది. అన్నపూర్ణ ఆత్మసఖుణ్ణి ఆదిభిక్షువుగాచేసి అన్నాన్ని అందించడం వెనుక ఆంతర్యమూ ఇదే. మనుగడకు మూలాధారమైన ఆహారాన్ని, ఆరోగ్యాన్ని విడదీసి చూడలేం.
‘అన్నాద్భవంతి భూతాని’ అంటుంది భగవద్గీత. సకల ప్రాణులకూ మూలాధారం అన్నం. అన్నమంటే ఆహారం. దాని నుంచే సకల ప్రాణులూ ఉద్భవించాయని కృష్ణపరమాత్ముడి సందేశం. ఇదే విషయాన్ని ‘ఆత్మనః ఆకాశః, ఆకాశాద్వాయుః, వాయోరగ్నిః, అగ్నేరాపః, అద్భ్యః పృథివీ, పృథివ్యా ఔషధయః, ఓషధీభ్యోన్నం, అన్నాత్‌ పురుషః’ అంటుంది తైత్తరీయోపనిషత్తు. అన్నిటికీ మూలమైన ఆత్మ, ఆత్మ నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటినుంచి పృథివీ, నేల నుంచి ఔషధాలు, వాటినుంచి అన్నం, దాన్నుంచి ప్రాణులు- ఇదీ క్రమం. ఈ గొలుసును (శృంఖల) పట్టుకుని వెనక్కి వెళ్తే దానికి మూలమైన ఆత్మ, ఆత్మకు మూలమైన పరమాత్మ కనిపిస్తాయి. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం. శరీరంలోని ప్రాణ, అపాన, ఉదాన, వ్యాన, సమాన రూపాల్లో ఉండే పంచప్రాణాలకు పంచభూతాల్లోని శక్తిని అందించడానికి పరమాత్మ తత్వమైన ఆహారాన్ని తీసుకోవాలి.
ఆహారం ఎలా తినాలి?
పృథ్వి, జలం, అగ్ని, వాయువు- ఆకాశ తత్వాలు కలిగిన, బొటనవేలు చూపుడువేలు మధ్యవేలు ఉంగరంవేలు చిటికినవేళ్లతో కలిపి చేతితో ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే పంచభూతాలు ఉత్తేజితమౌతాయి. ఆ ఆహారాన్ని వైశ్వానరాగ్ని రూపంలో ఉండే పరమాత్మ పచనం చేసి ధర్మసాధనకు కావలసిన శక్తిని ప్రసాదిస్తాడు.
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం
అంటూ ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తుంది భగవద్గీత. శక్తిని ప్రసాదించే ఈ ఆహారాన్ని భగవంతుడికి సమర్పిస్తూ, ప్రశాంత వాతావరణంలో, శుచిగా, మౌనంగా, ఆకులో లేదా బంగారు, వెండి లాంటి ఉత్తమ లోహ పాత్రల్లో తీసుకున్నప్పుడు అది ప్రసాదమౌతుంది. భోజనానికి ముందు శాస్త్రం తెలిసినవారు మంత్రయుక్తంగా ఆచమనం చేసి, ఆ పరిజ్ఞానం లేనివారు భగవంతుని స్మరిస్తూ కొన్ని నీళ్లు తాగి, అప్పుడు తినడం మానసిక ప్రశాంతతను, శారీరక ఆరోగ్యాన్ని కలిగిస్తుంది.
ఏం తినాలి?
పరమేష్ఠి దేవతలకు అమృతం, మనుషులకు అన్నం, పశువులకు ఆకులలములు, దైత్య రాక్షస పిశాచ జాతులకు మద్య మాంసాలు ఆహారంగా ఏర్పరచారు. ప్రకృతిసిద్ధమైన సహజ ఆహారం సాత్వికాహారం. రుచి కోసం వండి తినడం రాజసాహారం, మసాలాలు, మాంసాహారాలు తామసాహారం. మనం తినే ఆహారాన్ని బట్టే శారీరక, మానసికతత్వాలు ఆధారపడి ఉంటాయి. రాక్షసాదులు తామసిక ఆహారం తీసుకుంటారని కాకుండా, అలాంటివి తినేవారు ఆ ప్రవృత్తి కలిగుంటారని అర్థం చేసుకోవాలి.
ఎప్పుడు తినాలి?
‘న సంధ్యయోర్న మధ్యాహ్నే నార్థరాత్రే కదాచన’ అన్నారు. అంటే ప్రాతఃసంధ్య, సాయంసంధ్య, అర్ధరాత్రి సమయాల్లో భోజనం చెయ్యకూడదంటుంది శాస్త్రం. సాధు, సన్యాసులకు మధ్యాహ్న సమయాన్ని కూడా నిషేధించింది. సంధ్యాసమయాలు సత్ఫలితాన్నిచ్చే ఉపాసనా సమయాలు. అలానే అర్ధరాత్రి ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడి జాడ శరీరానికి అందని కారణంగా జీర్ణక్రియ మందగించి అనారోగ్యాన్ని కలిగిస్తుంది. కనుక అది కూడా భోజనానికి నిషిద్ధసమయం.
అన్నం తినడానికి అర్హత ఏమిటంటే జిల్లెళ్లమూడి అమ్మ చెప్పినట్లు ‘ఆకలే అర్హత’. ఆయుర్వేదం ప్రకారం అన్నమంటే ఔషధమే. మనిషి రుతు చర్యను పాటించాలి. అంటే ఆయా రుతువుల్లో, ఆయా ప్రాంతాల్లో దొరికే ఆహారాన్ని, శరీరతత్వాల అనుకూలతను బట్టి తినాలి. ఆహార, జల, విహారాదుల్ని పాటించని ప్రాణిలో వాతపిత్తకఫాలనే త్రిదోషాలు విజృంభించి గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తుల్లాంటి అవయవాలు దెబ్బతిని ప్రాణం దేహాన్ని వదిలి వెళ్లిపోతుంది.
ఎక్కడ తినాలి?
ఆహారాన్ని పరబ్రహ్మ స్వరూపంగా, ప్రసాదంగా భావించి మౌనంగా స్వీకరించాలి. ఎక్కడబడితే అక్కడ తింటే అధ్వాన్నం అంటారు. అధ్వ అంటే దారి, అన్నం అంటే ఆహారం. రోడ్ల పక్కన శుచీ శుభ్రత లేకుండా దొరికే ఆహారమన్నమాట. అది అనారోగ్య హేతువు.  దేహం దేవాలయం, అందులో ఉన్న జీవుడు దేవుడన్న భావన ఉన్నప్పుడు ఆహారవిషయంలో జాగ్రత్తపడతాం. అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నది ఆధ్యాత్మికతకే కాదు, ఆరోగ్యానికీ సంబంధించింది.
ఎలాంటి ఆహారం తినాలి?
అసలే తినకపోవడం, అతిగా తినడం రెండూ ప్రమాదమే. సగం ఉడికిన, అతిగా వేగిన, ఎప్పుడో వండిన, విరుద్ధ పదార్థాలు, దుమ్మూధూళీ కలిసిన దోషపూరిత ఆహారం, చలికాలంలో చలువచేసేవి, వేసవిలో వేడిచేసేవి- లాంటివన్నీ అనారోగ్య హేతువులే. అలాంటివన్నీ పరిహరించి పరబ్రహ్మ స్వరూపమైన ఆహారాన్ని ఔషధంగా స్వీకరించి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించాలి.
ఇంట్లోని పిల్లలు భోజనం సరిగా తినకుండా వెదజల్లితే పెద్దలు వారిని మందలిస్తారు. అంతే కాకుండా దాన్ని అలా పారవేయరాదని అన్నం పరబ్రహ్మస్వరూపం అని వారితో అంటారు. అసలు ఇలా ఎందుకు అంటారు అని పిల్లలు అడితే దీనికి నూటికి నూరు శాతం సరైన కారణం చెప్పరు, చెప్పలేరు కూడా.
ప్రతి జీవికి కావాల్సిన ఆహార పదార్థాలను పుట్టుకతోనే ఈ భూమి మీద భగవంతుడు కల్పిస్తాడు. కాబట్టే ఎవరైనా జన్మించిన తర్వాత నారు పోసిన వాడు నీరు పోయకపోడు అని భగవంతుని గురించి పెద్దలు చెబుతుంటారు. అంటే అమ్మ కడుపులో నుంచి బయటకు రాకముందే మనకు ఇంత ఆహారం అని, ఇన్ని నీళ్లని నిర్ణయిస్తాడు. గత జన్మలో చేసిన పాప పుణ్యాలను లెక్కించి వాటిని అనుగుణంగా మనకు సమకూర్చి ఎవరికి కడుపు పుట్టాలో కూడా నిర్ణయిస్తాడట. ఆయన సమకూర్చిన ఆన్న, పానీయాలు ఎప్పుడు నిండుకుంటాయో ఆ జీవికి ఈ భూమి మీద నూకలు చెల్లిపోయినట్లే. అందుకే మీరు తినగా ఉన్న ఆహారాన్ని, తాగే నీటిని వృథా చేయకుండా అవసరమైన వారికి దానంగా ఇవ్వడం వల్ల పుణ్యఫలం పెరుగుతుందట. అలాగే భవిష్యత్తులో మనకు నచ్చిన ఆహారం మరింత లభించి దీర్ఘాయుష్షు కలుగుతుందట. అలా కాకుండా సృష్టికర్త ఇచ్చిన ఆహారాన్ని వృథాచేస్తే నీ ఆయువు క్షీణించి పోతుందట.
ఏ తల్లి అయినా తన బిడ్డల ఆయు: క్షీణాన్ని తట్టుకోలేదు. అందుకే అన్నంపారబోయవద్దని ఒకటికి పదిసార్లు చెబుతుంది. అవసరమైతే దండిస్తుంది కూడా. ఇదంతా వివరంగా చెప్పలేక అన్నం పరబ్రహ్మస్వరూపం అని మాత్రమే చెబుతారు. అందుకే అన్ని దానాలో కన్నా అన్నదానం మిన్న. ఎవరికైనా కోట్లు ఇచ్చినా సంతృప్తి చెందరు కడుపు నిండా భోజనం పెడితే చాలు అంటారు.
మహాభారత యుద్ధంలో కర్ణుడు మరణించిన తరువాత స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ కర్ణునికి అన్ని సౌకర్యాలు లభించాయి. స్వాగత సత్కారాలు లభించాయి. ఏది కావాలంటే అది పొందే అవకాశం ఉంది. అన్నీ అందుబాట్లో ఉన్నాయి. ఏంలాభం...! కర్ణుడికి ఏదో అసంతృప్తి. ఏదో వెలితి. ఎంత తిన్నా కడుపు నిండినట్టుండడంలేదు. సంతృప్తినేది లేదు. ఎందుకు ఈ విధంగా ఉంటుందో అతనికర్థం కావడంలేదు. ఇదే మాట దేవేంద్రుడిని అడిగాడు కర్ణుడు. అప్పుడు దేవేంద్రుడు చిరునవ్వుతో, నీవు అనేక దానాలు చేసావని, అడిగినవాడికి లేదనకుండా ఇచ్చే దానకర్ణుడివని చెప్తారు.  మరి.. ఎప్పుడైనా అన్నదానం చేసావా?'' అనడిగాడు. దానికి సమాధానంగా లేదు.. నేనెన్నో దానాలు చేసాను గాని అన్నదానం మాత్రం చేయలేదు అన్నాడు కర్ణుడు. ''పోనీ అన్నం పెట్టే ఇల్లయినా చూపించావా?'' అనడిగాడు దేవేంద్రుడు. కాస్త ఆలోచించిన కర్ణుడు చెప్పాడు- ''అవును. ఓ బీద బ్రాహ్మణుడు నా దగ్గరకు వచ్చి అన్నం పెట్టించమని అడిగాడు. అపుడు నేను ఏదో ధ్యాసలో ఉండి, నాకు అవకాశం లేదు గానీ... అక్కడ ఆ ఇంటికి వెళ్ళు అని ఒక ఇంటిని చూపించాను'' అని. నీవుఅన్నదానం చేసిన ఇంటిని చూపించిన వేలిను నోట్లో పెట్టుకో'' అన్నాడు ఇంద్రుడు. సరేనని ఆ వేలిని నోట్లో పెట్టుకున్నాడు కర్ణుడు. ఒక్క గుటక వేసాడు. ఆ క్షణంలోనే అతని కడుపు నిండిపోయింది. అంతవరకున్న అసంతృప్తి మటుమాయమైంది. ఎనలేని తృప్తి కలిగింది. ఈ కథనం ద్వారా అన్నదానం యొక్క మహత్మ్యం, దాని ప్రాశస్త్యం తెలుస్తోంది...
****

27..ఆధునిక విజ్ఞానశాస్త్రం కూడా కనుగొనలేని, వివరించలేని ఆ అనంతశక్తి లేదా ఆత్మ ఒక మహా ఆశ్చర్యకరమైన వస్తువనీ, ఇంద్రియానుభవ రహితమైనదని, మానసికానుభవమని నాటి ఋషులుగా చెప్పబడే ఆధ్యాత్మిక పరిశోధకులు వేల ఏళ్లక్రితం ఉపనిషత్తుల్లో ఘోషించడం ఎంతో ఆశ్చర్యకరం. ఉపనిషత్తులు ఆ ఆత్మ గురించి పరిపరి విధాల వర్ణిస్తూ, ప్రతి ఒక్కరినీ మానవత్వం నిండిన విశ్వనరునిగా జీవించమంటూ, బతికినంతకాలం జ్ఞానపీఠికపై కర్మయోగిగా, చిత్జడ గ్రంథిని చిదిమివేసి మోక్షాన్ని అనుభవించాలని ఉపదేశిస్తాయి. ప్రాణసహితంగా ఉన్నా, ప్రాణరహితంగా ఉన్నా ‘నీవే ఆ అనంతశక్తిగా అనుభూతి చెందాలి’ అని చెప్తాయి.

అనుభూతి అనేది మనసు చేసే మథనం. ఇదే విషయాన్ని ‘ముండకోపనిషత్తు’ ‘ఆ ఆత్మ కళ్ళతోనో, ఇతర ఇంద్రియాలతోనో తెలుసుకోబడదు. తపస్సు వలననో, కర్మలచేతనో లభించదు. సాధకుని మనస్సు విశుద్ధమైనదై ఉండి, నిరంతరం ఆ ఆత్మతో తాదాత్మ్యత పొందడం వలననే దాని సాక్షాత్కారం పొందడం సాధ్యమౌతుంద‘ని తెలుపుతోంది. అంతేకాకుండా నయమాత్మా’ బలహీనేన లభ్యో...’ అంటూ ‘ఆత్మను బలహీనులైన వారు పొందలేరు. అజాగ్రత్త వలన, నిర్దిష్టమైన తపస్సు లేని యెడల ఆత్మసాక్షాత్కారం జరుగదు. శారీరక, మానసిక దృఢత్వం వలన వచ్చే మనోస్థైర్యం కలిగిన సాధకులు మాత్రమే బ్రహ్మస్థితిని అనగా ఆత్మసాక్షాత్కారం పొందగలర‘ని నిర్ధారిస్తోంది.

మనసుకున్న గొప్పలక్షణాల వల్ల ఆత్మ అటువంటి శక్తిని గ్రహించగలుగుతుంది. మనసు ఎంతో బలమైనదై, నిశ్చలమైనదై ఉండాలి. దృఢమైనది ఎందుకంటే ఆత్మతో ఏకత్వాన్ని అనుభవించినపుడు కలిగే ఆనందాన్ని భరించగలిగినదై ఉండాలి. నిశ్చలమైనదై ఎందుకుండాలంటే, మనసు నిశ్చలంగా ఉంటేనే పదార్థ లక్షణాలేవీ లేని శక్తిపట్ల తాదాత్మ్యత పొందగలుగుతుంది. నీటి ప్రవాహంలో గాలి బుడగలు ఉద్భవించి, కొంతదూరం ప్రయాణించి, పగిలిన తర్వాత తిరిగి నీటిలో కలిసి పోయినట్లే ఈ చరాచర ప్రపంచం ఆ అనంతశక్తిలో ప్రవర్తిస్తుంది. ఈ విషయాన్ని ఏకాగ్రచిత్తంతో గమనిస్తూ ఉంటే అర్థమవుతుంది. ఈ విధమైన ఏకాగ్రత మనలో ఎనలేని మార్పును తీసుకొస్తుంది. ఏ పదార్థంపైనా, జీవిపైనా వ్యామోహంగానీ, విరక్తి గానీ కలుగదు. మంచి–చెడు,సుఖం–దుఃఖం లాంటి ద్వైదీభావనలు కలుగవు. కామ, క్రోధాది అరిషడ్వర్గాలకు అసలు స్థానమే ఉండదు.

నిర్వికార, నిశ్చలమనస్సు ఏర్పడి ప్రతిపనిలో, ప్రతివాక్కులో, ప్రతిరూపంలో, సర్వత్రా ఏకాత్మను గ్రహిస్తూ ఉంటుంది. అదో అద్భుత ఆనందానుభూతి. ఈ దృశ్యమాన ప్రపంచాన్ని, దానికి హేతువైన ఆత్మను గెలిచి, ఒడిసిపట్టుకున్న ఆనందం. అంతకుమించిన విజయమేముంటుంది మనిషికి? జీవరాశుల్లో అన్నిట్లో మేధావి ఐన మనిషికి భౌతిక ప్రపంచంలో తాను ఆశించిందాన్ని గెలుపొందడమే గొప్ప విజయంగా భావిస్తాడు. అలాంటిది ఈ సృష్టి మొత్తానికి హేతువైన అనంతశక్తిని మన మనసులో ఒడిసి పట్టుకోవడం ఎంతటి విజయమో మనం ఊహించలేం. ఆ విజయానందం అనిర్వచనీయం. సాధకుడు ఆ జీవితాన్ని అనుభవించాల్సిందే. అప్పుడు సాధకుని మనస్సు అనిర్వచనీయమైన, అవధుల్లేని ఆనందడోలికల్లో తేలిపోతూ ఉంటుంది. ఈ ప్రపంచం, దాని పరిణామాలన్నీ ఆల్పమైపోతాయి. అసలు వీటిమీద ఏ చింతా కలగదు.

 భగవంతుని చూడాలనుకునే ప్రతి ఒక్కరూ భగవంతుడు అని చెప్పబడే ఆ ఆత్మను సాకారం చేసుకోలేరు. మనసులో ఆత్మను నిరంతర సంయోగం చేయగలవారే ఆత్మ లేక భగవత్సాక్షాత్కారం పొందగలరు. అలా పొందిన వారు అద్వైతచిత్తులై, కుల, మత, లింగ, భాష, ప్రాంత, జైవికాది భేదాలకు అతీతులై, ఉన్నత మానసిక స్థితిలో ఓలలాడుతూ ఉంటారు. అదే స్వర్గం. అదే మోక్షం.

002 -06-2024 ... ప్రాంజలి ప్రభ కధలు..9




010..నేటి కథ..ప్రాంజలి ప్రభ.(.ఆనందం 

. ఆరోగ్యం.. ఆధ్యాత్మకం.. తో అంతర్జాల పత్రిక )లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి.. స్నేహాన్ని పెంచుకోండి..మనభాష తెలుగండి


తెలుసుకోదగిన విషయం ..... పూజారి తనకు తోచిన కధలు తేలుతున్నాడు 


ఒక రోజొక గురువు గారు తన ఇద్దరు శిష్యుల్నీ పిలిచి, “ఈ రోజు మీరిద్దరూ పొరుగూరికి వెళ్లి రావాలి” అని చెప్పారు. ఒక సంచిలో ఆహారాన్ని నింపి, ఒక శిష్యులకు ఇచ్చి, “ఎవరైనా అవసరం ఉన్న వాళ్లు కనిపిస్తే వారికి ఈ ఆహారాన్ని పంచుకుంటూ వెళ్లు” అన్నారు. 


రెండో శిష్యుడికి ఖాళీ సంచి ఇచ్చి ‘దారిలో ఏదైనా విలువైన వస్తువు కనిపిస్తే దాన్ని సంచిలో వేసుకుంటూ వెళ్లు’ అన్నారు.


ఇద్దరూ సంచుల్ని భుజాలకి తగిలించుకుని ప్రయాణం మొదలుపెట్టి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఖాళీ సంచి వాడు ఆడుతూపాడుతూ నడుస్తున్నాడు. కొంత దూరం వెళ్లాక అతనికి ఒక విలువైన రంగు రాయి దొరికింది. దాన్ని తీసి సంచిలో వేసుకున్నాడు. మరికొంత దూరం వెళ్లాక మరొకటి కనిపించింది. దాన్ని తీసి సంచిలో వేసుకున్నాడు. అలా ఎక్కడ రంగు రాయి కనిపిస్తే దాన్ని తీసుకుని సంచిలో వేసుకుంటూ నడక సాగించాడు. దాంతో సంచి బరువెక్కసాగింది. నడక భారంగా మారింది. శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది అయింది. ఉండేకొద్దీ అడుగు తీసి అడుగేయడమే చాలా కష్టమైపోయింది.


ఇక రెండోవాడు వెళ్తూ వెళ్తూ దారిలో ఆకలితో కనిపించిన వారికి తన సంచిలోని తిను బండారాలను కొంచెం కొంచెంగా పంచుకుంటూ వెళ్లాడు. క్రమంగా సంచి బరువు తగ్గి నడక సులభం అయింది. పంచుకుంటూ వెళ్లినవాడు తన గమ్యాన్ని తేలిగ్గా చేరుకోగలిగాడు. పోగేసుకుంటూ వెళ్లిన వ్యక్తి గమ్యాన్ని చేరుకోలేక పోయాడు. ప్రయాణమూ కష్టంగా సాగింది.


మరి మీరూ మనసు పెట్టి ఆలోచించండి. మీ యగమ్యాన్ని ఎలా చేరుకోదలచుకున్నారు?


ఈ కథను తాత్విక దృష్టితో చూసినట్లయితే “విలువగలవైనా ..


లౌకిక విషయాలను, వస్తు సమాగ్రిని ప్రోగు చేసుకుంటూ వెళితే, జీవితం దుర్భరమవుతుంది. అదే మన ప్రేమనీ , జ్ఞానాన్నీ పంచుకుంటూ జీవన ప్రయాణం సాగిస్తే, మోక్షానికి చేరే మార్గం సుగమం అవుతుంది”. 


అట్లాగే పిల్లలపై ప్రేమ ఉండోచ్చు మొదటి వ్యక్తిలాగా బరువులను మోస్తే ఇవితమంతా బరువుతుంది, రెండోవ్యక్తిలా అందుకున్నదంతా పంచి సహాయము చే యుటె సుఖము.       


***


0'011..నేటి కథ..2012 నుండి ప్రాంజలి ప్రభ.(.ఆనందం 

ఆరోగ్యం  .. ఆధ్యాత్మకం.. తో అంతర్జాల పత్రిక ) లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి.. స్నేహాన్ని పెంచుకోండి..మనభాష తెలుగండి

గుంటూరు చరిత్ర'


గుంటూరు అంటే మిరపకాయ బజ్జీలు, జిన్నా టవరు, గోలీ సోడా లేక శంకర్ విలాస్ మాత్రమేనా?


శతాబ్దాల చరిత్ర నా గుంటూరు ....


ధాన్యకటకం రాజధానిగా క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలోనే విశాల సామ్రాజ్యాన్ని ఏలిన శాతవాహనుల చరిత్ర నా గుంటూరు. వీరికి కోటిలింగాల, జున్నూర్ అనే ప్రాంతాలలో కూడా రాజధానులు ఉండేవి.


కవిత్రయంలోని తిక్కన నడయాడిన చరిత్ర నా గుంటూరు.


మాచర్ల చెన్నకేశవుడి ఆశీస్సులతో ౘాపకూడు సిధ్ధాంతం ద్వారా సామాజిక న్యాయం కోసం నిలబడ్డ పల్నాటి బ్రహ్మనాయుడి చరిత్ర నా గుంటూరు.


కృష్ణరాయలుకే కొఱుకుడు పడని కొండవీటి రెడ్డి రాజుల చరిత్ర నా గుంటూరు.


అష్ట దిగ్గజాలకే తలమానికమైన రామకృష్ణ కవి నా గుంటూరు.


'కృష్ణం కలయసఖి సుందరం బాల కృష్ణం కలయసఖి సుందరం' అంటూ 'తరంగాలు' అందించిన నారాయణ దాసు నా గుంటూరు.


అమరావతి కేంద్రంగా సుపరిపాలన అందించిన రాజా వాసిరెడ్డి వేంకట్రాది నాయుడు చరిత్ర నా గుంటూరు.


ముచుకుంద మహర్షి తపమాచరించిన గుత్తికొండ బిలం నా గుంటూరు. 


త్రేతాయుగంనాటిదని పేరు గాంచిన సీతానగరం నా గుంటూరు.


శిబి చక్రవర్తి తన తొడను కోసి పావురాన్ని రక్షించిన క్షేత్రం కపోతేశ్వరాలయమున్న చేజెర్ల చరిత్ర నా గుంటూరు.


అక్కరలో ఉన్నవారిని చేదుకునే కోటయ్య వెలసిన పుణ్య క్షేత్రం కోటప్పకొండ చరిత్ర నా గుంటూరు.


పానకాల స్వామిగా వినుతికెక్కిన నృసింహ క్షేత్రం మంగళగిరి నా గుంటూరు.


పంచారామాలలో ఒకటైన అమరావతి చరిత్ర నా గుంటూరు.


వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న పాత గుంటూరు అగస్తేశ్వరాలయం నా గుంటూరు.


ఇరవై నాలుగు అడుగుల ఆంజనేయుడు అండగా నిలబడిన పొన్నూరు నా గుంటూరు.


పేరెన్నికగన్న భావనారాయణుడు కొలువైన బాపట్ల నా గుంటూరు.


అనంతపద్మనాభుడు కొలువైన ఉండవల్లి గుహలు నా గుంటూరు.


సుదూర తీరాలనుండి వచ్చే వలస పక్షలు సంరక్షణ కేంద్రం ఉప్పలపాడు నా గుంటూరు.


ఆంగ్లో-ఫ్రెంచ్ యుధ్ధం జరిగిన ప్రాంతం (నేటి హిందూ కాలేజ్ ఉన్న ప్రాంతం) నా గుంటూరు.


'నీరు పెట్టావా, నారు పోసావా, కోత కోసావా, కుప్ప నూర్చావా? ఎందుకు కట్టాలిరా శిస్తు?' అని బ్రిటీషు వారిని ఎదుర్కొని ముప్ఫై ఏళ్ళ ప్రాయంలోనే కన్నెఱ్ఱ చేసి ప్రాణత్యాగం చేసిన కన్నెగంటి హనుమంతు చరిత్ర నా గుంటూరు.


సామాజిక ఆనాచారం వల్ల శివ దర్శనానికి నోచుకోని ఒక అభాగ్యుడి వేదనను 'గబ్బిలం' ద్వారా వినిపించిన మహా కవి జాషువా చరిత్ర నా గుంటూరు.


కొప్పరపు కవుల చరిత్ర నా గుంటూరు.


పువ్వులంటే ముచ్చట పడే మహిళల చేతనే కన్నీరు పెట్టించిన కరుణశ్రీ నా గుంటూరు.


సంస్కృతాంధ్ర భాషల్లో అగ్రగణ్యులైన జమ్మలమడక మాధవరాయశర్మ, శ్రీ కృష్ణాచార్యుల చరిత్ర నా గుంటూరు. 


ప్రవచనాలకు నాంది పలికిన బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి నా గుంటూరు.


మహా కవులు, రచయితలు అయిన 'తెలుగులెంక' తుమ్మల సీతారామశాస్త్రి,  సత్యం శంకరమంచి, మునిమాణిక్యం నరసింహారావు, కొడవటిగంటి కుటుంబరావు, చలం, కవిరాజు త్రిపురనేని రామస్వామి,  రాయప్రోలు సుబ్బారావు, బలిజేపల్లి లక్ష్మీకాంతారావు, పండిత సత్యదేవ్, తత్వవేత్త, చిత్రకారుడు, ప్రముఖ రచయిత సంజీవ దేవ్, అధరాపురపు తేజోవతి, పాపినేని శివశంకర్, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, ఓల్గా,  దేవీప్రియ, శార్వరి వంటి వారిని కన్న నేల నా గుంటూరు.


జ్ఞానపీఠ్ ఎవార్డు గ్రహీత రావూరి భరద్వాజను కన్న నేల నా గుంటూరు. 


వేయి వసంతాల మానవ జీవన యానం, చరిత్రకెక్కని స్వాతంత్ర్య సమరయోధుల గురించి వ్రాసి నాకు మార్గదర్శకం చేసిన మా నాన్న గారు స్వర్గీయ విఠల్ రావు గారు నా గుంటూరు చరిత్ర.


మాంటిస్సొరి ఎడ్యుకేషన్ కు నాంది పలికి ఈనాడు మహావృక్షమైన శ్రీ వేంకటేశ్వర బాల కుటీర్, చేతన, ఉషోదయ, సంధ్యారాగం, రక్ష వంటి సంస్థల వ్యవస్థాపకులు మంగాదేవి గారు నా గుంటూరు.


ఎమ్సెట్ లేని రోజుల్లో మెడికల్ ఎంట్రన్స్ కు కోచింగ్ ఇవ్వడంద్వారా తెలుగునేల అంతా చిరపరిచితమైన సింహం శ్రీ చతుర్వేదుల విశ్వనాధమ్ ఎలియాస్ సివియన్ ధన్ గుంటూరు.


నాటక రంగంలో లబ్దప్రతిష్టులైన స్థానం నరసింహారావు, ఏ.వి. సుబ్బారావు, ఈలపాట రఘురామయ్య, కాళిదాసు కోటేశ్వరరావు, స్థానం వారి తరువాత స్త్రీ పాత్రలలో స్థానం సంపాదించిన బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి,  మాడభూషి వేంకట శేషాచారిలను అందించిన నేల నా గుంటూరు.


శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్ధ మహా సన్నిధానం నా గుంటూరు.


కుర్తాళం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సిధ్ధేశ్వరానంద భారతి స్వామి నా గుంటూరు.


క్రీస్తు పూర్వం రెండు వందల ఏళ్ళ నాడే అబ్రకాన్ని కనుగొన్న భౌతిక వాది, బౌధ్ధుడు, రసాయనిక శాస్త్రాన్ని ఔపోసన పట్టిన నాగార్జునుడి చరిత్ర నా గుంటూరు.


సూర్య మండలంలో హీలియమ్ గ్యాస్ ను కనుగొన్న చరిత్ర నా గుంటూరు.


ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కోహినూరు వజ్రానికి పుట్టినిల్లు నా గుంటూరు.


బుఱ్ఱకధా పితామహుడు నాజర్ నా గుంటూరు.


బౌధ్ధ భిక్షువులకు ఆలవాలమైన భట్టిప్రోలు చరిత్ర నా గుంటూరు.


బ్రహ్మదేవునికి ఉన్న రెండే రెండు దేవాలయాల్లో ఒకటైన చేబ్రోలు నా గుంటూరు.


చేత వెన్న ముద్ద తో దర్శనమిచ్చే ప్రపంచంలోని ఏకైక శ్రీ కృష్ణ దేవాలయం ఉన్న సొలస గ్రామం నా గుంటూరు.


బ్రిటీషు వారి తుపాకులకు ఎదురొడ్డి నిల్చిన ఆంధ్రకేసరి పుట్టినిల్లు అలనాటి నా అవిభాజ్య గుంటూరు.


కోట్ల విలువైన ఆస్థిని స్వాతంత్ర్యం కోసం దేశానికి ఇచ్చివేసిన దేశభక్త కొండా వెంకటప్పయ్య నా గుంటూరు.


చీరాల-పేరాల ఉద్యమాన్ని నడిపిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నా గుంటూరు.


మూడు సార్లు నిషేధానికి గురైన నవల 'మాలపల్లి' రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు ఉన్నవ లక్ష్మీ నారాయణ నా గుంటూరు.


బాల వితంతువులను చేరదీసి విద్యాబుధ్ధులు గరిపి గౌరవప్రదమైన బ్రతుకులను ఇచ్చిన ఉన్నవ లక్ష్మీబాయమ్మ నా గుంటూరు.


నిస్వార్ధ సేవకు నిరుపమానమైన ఉదాహరణ వావిలాల గోపాలకృష్ణయ్య నా గుంటూరు.


దేశంలోనే మొట్టమొదటిసారిగా మునిసిపల్ ఆఫీసుపై మువ్వన్నెల ౙండా ఎగురవేసి బ్రిటీష్ అధికారాన్నే సవాలు చేసిన నడింపల్లి నరసింహారావు నా గుంటూరు.


రైతు లేనిదే దేశం లేదని అహర్నిశలు వారి శ్రేయస్సుకై పాటుబడ్డ గోగినేని రంగనాయకులు (N.G.Ranga) నా గుంటూరు.


ఐదుగురు ముఖ్యమంత్రులను, నలుగురు అసెంబ్లీ స్పీకర్లను అందించిన చరిత్ర నా గుంటూరు.


కేంద్ర కేబినెట్ లో ఒకే సమయంలో ఒకే జిల్లానుండి ఇద్దరు మంత్రులు ఉన్న ఏకైక జిల్లా నా గుంటూరు.


పొగాకు, మిర్చి, పత్తి, పసుపు వంటి వాణిజ్య పంటలకు నెలవు నా గుంటూరు. 


శాకంబరీదేవీ ప్రసాదం, ఆంధ్రశాకం గోంగూర నా గుంటూరు.


భగభగ మంటలు మండించే మిరప్పళ్ళ కారం నా గుంటూరు.


గలగలా పారే కృష్ణమ్మ కెరటాలతో సస్యశ్యామలమైన కృష్ణా డెల్టా నా గుంటూరు.


విద్యారంగానికి పంచ మాతృకలుగా విరాజిల్లుతున్న 135 సంవత్సరాల ఆంధ్ర క్రైస్థవ కళాశాల, వంద సంవత్సరాల చరిత్ర కలిగిన హిందూ కళాశాల, యాభై సంవత్సరాల వయసున్న జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కళాశాల, తెల్లాకుల జాలయ్య పోలిశెట్టి సోమసుందరం కళాశాల, (మునిసిపాలిటీ ఆధ్వర్యంలో మహిళలకు కళాశాల ప్రారంభించి, తరువాత బ్రిటీష్ ప్రభుత్వానికి అంటగట్టిన లౌక్యుడు తెల్లాకుల జాలయ్య గారు) ప్రభుత్వ మహిళా కళాశాలల వైభవంతో Oxford of Andhra అని పేరుగన్నది నా గుంటూరు.


దేశ విదేశాలలో స్థిరపడ్డ తెలుగు వైద్యులలో అధిక శాతం గుంటూరు మెడికల్ కాలేజీ విద్యార్ధులే అన్నది జగమెరిగిన సత్యం. అది నా గుంటూరు.


గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ అంటే సామాన్య జనం నుండి కోటీశ్వరుడి వరకు అందరూ కోరుకునేదే.


Guntur is considered as Medical Hub of AP.


ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త యలవర్తి నాయుడమ్మ, ప్రొ॥ వాసిరెడ్డి శ్రీ కృష్ణ, ప్రొ॥కె.సచ్చిదానంద మూర్తి, ప్రతి ఇంటా వినిపించే సుందరకాండ ఎమ్మెస్ రామారావు, ప్రవచన కర్త శ్రీ మైలవరపు శ్రీనివాసరావు నా గుంటూరు.


మెడికల్, ఇంజనీరింగ్ .... ఇప్పుడు CA కోచింగ్ లకు పుట్టినిల్లు నా గుంటూరు.


ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చార్టర్డ్ ఎకౌంటెంట్, ICFAI Founder Governor నండూరి జ్యోతిర్మయి యశస్వి (N J YASASWI) నా గుంటూరు. 


శాస్త్రీయ సంగీత దిగ్గజం మంగళంపల్లి బాల మురళి గారి గురువు, త్యాగరాజ స్వామి శిష్య పరంపరలో ఒకరైన పారుపల్లి రామకృష్ణయ్య, పురాణం పురుషోత్తమ శాస్త్రి, కొమండూరి శేషాద్రి, కర్లపాలెం చంద్రమౌళి మరియు వారి శిష్యులైన నాదస్వర విద్వాంసులు షేక్ సుభానీ, కాలీషా దంపతులు (పద్మశ్రీ అవార్డుల గ్రహీతలు), రాజనాల వేంకట్రామయ్య, వింజమూరి వరదరాజయ్యంగారు,  సంస్కృతాంధ్ర పండితులు శ్రీమాన్ కొమండూరి సీతారామాచార్యులు నా గుంటూరు.


సినీ ప్రముఖులైన చక్రపాణి, వేమూరి గగ్గయ్య, గోవిందరాజుల సుబ్బారావు, నాగయ్య, ముక్కామల, కాంచనమాల, ఛాయా దేవి, సావిత్రి, జమున, కొంగర జగ్గయ్య, శారద, ప్రభ, దివ్యవాణి, జయలలిత, సుమలత, రాగిణి, బాలయ్య, గుమ్మడి, ధూళిపాళ, డేరింగ్ అండ్ డాషింగ్ కృష్ణ, ఏవియస్, వీర నరసింహాపుర అగ్రహారీకురాలైన భానుమతి, కొసరాజు రాఘవయ్య, ముదిగొండ లింగమూర్తి, సియస్సార్, వంగర వెంకట సుబ్బయ్య, కె. విశ్వనాధ్, గాన కోకిల ఎస్. జానకి, మాధవపెద్ది సత్యం, గోఖలే, బ్రహ్మానందం, జీవా, ప్రదీప్ శక్తి, బోయపాటి శీను, కొరటాల శివ, పోసాని, సంగీత 'చక్రవర్తి', గాయని సునీత, గాయకుడు మనో, సినీ రచయిత మాడభూషి దివాకర బాబు, సంగీత దర్శకుడు, గేయ రచయిత వోగేటి నాగ వేంకట రమణ మూర్తి (స్వర వీణాపాణి), హాస్య రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి, సూర్యదేవర రామమోహనరావు, సినీ, టి.వి. సీరియల్ రచయితలు గూడూరు విశ్వనాధ శాస్త్రి, మాడభూషి వేంకటేష్, సినీ రచయితలు, దర్శకులు అయిన బుర్రా సాయి మాధవ్, రాజేంద్ర భరద్వాజ, క్రిష్ జాగర్లమూడి, కే.యస్. రవీంద్ర, బయ్యవరపు వేంకటేశ్వరరావు, గుంటూరు శాస్త్రిగా ప్రసిధ్ధి చెందిన GSRK శాస్త్రి, నాటక, సినీ రచయిత ృశ్నేశ్వరరావు, నాటక రంగ ప్రముఖుడు నాయుడు గోపి నా గుంటూరు.


పారిశ్రామికవేత్తలలో సుప్రసిధ్ధులైన వెలగపూడి రామకృష్ణ ICS నా గుంటూరు.


యువ డాషింగ్ & రెబల్ క్రికెటర్ అంబటి రాయుడు నా గుంటూరు. చదరంగంలో గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక నా గుంటూరు.


పిడుగురాళ్ళ, రాగి నిక్షేపాల అగ్నిగుండాల, నరుకుళ్ళపాడు, ఫిరంగిపురం .... ఈ పేర్లు వింటేనే ప్రత్యర్ధికి కాళ్ళు వణుకుతాయి. అదీ నా గుంటూరు.


శిల్పకళకు నెలవు దుర్గి నా గుంటూరు.


విప్లవ నాయకుడు అక్కిరాజు హరగోపాల్ నా గుంటూరు.


మొట్టమొదటగా 1913 లో ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని నినదించింది నా గుంటూరు ....


గోంగూరంటే ముందుంటాం. మిరప్పళ్ళ కారం మాదేనంటాం.


దేనికైనా ముందుంటాం .... 


మాటలో సూటిదనం, నిక్కచ్చితనం, పొగరు, విగరు ఉన్నదే నా గుంటూరు ....


ఇంతటి ఘన చరిత్ర ఉన్న ప్రాంతాన్ని మీకు పరిచయం చేసిన

* కీర్తి శేషులు మల్లాప్రగడ లక్ష్మణరావు గారు మానాన్న గారు, యీ గుంటూరులో హనుమాన్ జ్యోతిషాలయం గా అంజనం వేసి (బాలంజనేయ ప్రశ్న ) వచ్చిన వారి సమస్యలు తీర్చి, జాతకాలు చెప్పి, హనుమాన్ మూలికా వైద్యశాల నడిపి ఆంజనేయస్వామి గుడి కట్టి తనవంతు సేవలు చేశారు*


*  యిక్కడే పుట్టి డిగ్రీ చదివి (P M C ) నేను లెక్కల మాస్టర్ గా పనిచేసి పుట్టి పెరిగినది మరొక్కసారి జన్మభూమి కి ప్రణామాలు అర్పిస్తూ మీ 

మల్లాప్రగడ రామకృష్ణ, ప్రాంజలి ప్రభ, హైదరాబాద్*

మన బాష తెలుగు.. మన చెలిమి అందరికీ రక్ష 


 పుట్టి పెరిగిన ఊరు గుంటూరు ....


ఇదీ గుంటూరు అంటే .....


12..నేటి కథ..2012 నుండి ప్రాంజలి ప్రభ.(.ఆనందం 

ఆరోగ్యం  .. ఆధ్యాత్మకం.. తో అంతర్జాల పత్రిక ) లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి.. స్నేహాన్ని పెంచుకోండి..మనభాష తెలుగండి


*ఈ రోజు వేటూరి సుందర* *రామమూర్తి గారి* 

 *వర్ధంతి.(22-5-2010).* 


ఆయన రాకముందు ఎందరో మహామహులు సినీ గీతాలు...సాహిత్యవిలువలతో వ్రాశారు. 


నీతులు రాశారు. బూతులు రాశారు!


కానీ ఈయన రాకతో రసవద్గీతలు & భగవద్గీతలు కూడా వెల్లువయ్యాయి.


పున్నాగపూలు సన్నాయి పాడాయి..కోకిలమ్మకు పెళ్ళి కుదిరింది...కోనంతా పందిరయ్యింది...చిగురాకులు తోరణాలయ్యాయి.


మానసవీణలు మధు గీతాలు పాడాయి.


వెల్లువొచ్చి గోదారమ్మా వెల్లకిలా పడింది.


గోవుల్లు తెల్లన, గోపయ్య నల్లన, గోధూళి ఎర్రనా ఎందువలన? అని సందేహాలు కలిగాయి!


నెమలికి నేర్పిన నడకలు, మురళికి అందని పలుకులు, అందానికి అందమైన పుత్తడి బొమ్మలు దొరికారు.


తకిట తకిట తందానాలు, జగడ జగడ జగడాలు, మసజసతతగ శార్ధూలాలు,గసగసాల కౌగిలింతలు తెలుగు పాటను శృంగారభరితం...రసవంతం చేశాయి.


                            @@@@


ఏ కులము నీదంటే గోకులము నవ్వింది... మాధవుడు యాదవుడు మాకులమే లెమ్మందీ.. 

అని నడమంత్రపు మనుషులకు  జవాబిచ్చింది!


వేణువై వచ్చాను భువనానికి..గాలినై పోతాను గగనానికి....

 

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే....వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే...


నరుని బ్రతుకు నటన ..ఈశ్వరుని తలపు ఘటన... ఈ రెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన...


వేదాంత ధోరణి నిగ్గదీసింది.


చిలక్కొట్టుళ్ళు, గిచ్చుళ్ళు, 

తిక్క రేగిపోవడాలు, పలక మారిపోవడాలు, 

ఆకు చాటున తడిసిన పిందెలు, 

ఆరేసుకోబోయి పారేసుకోవడాలు...


ఇలాంటి పామర జన రంజకమైన పదాలు కూడా సంధర్భోచితంగా...సాహిత్య మర్యాదకు నోచుకున్నాయి!


ఈ ధుర్యోధన ధుశ్శాసన  గీతంలో... మర్మ స్థానం కాదది నీ జన్మ స్థానం.. అంటూ అందరినీ ఉద్వేగ పరిచే ఆవేశం!


వెండితెరపై పాటలకు సరికొత్త గౌరవం తీసుకొచ్చిన ఆ పాళీ..

ఎవరిదో మీకిప్పటికే తెలుసు.


కీ.శే.వేటూరి సుందర రామమూర్తి గారు.


                             @@@@


అలలు కదిలినా....పాటే! 

ఆకు మెదిలినా....పాటే!

కలలు చెదిరినా....పాటే!

కలత చెందినా.....పాటే!....


ఏ పాట నే పాడనూ.....అంటూ సందిగ్ధావస్థలో పడే వారు ఆకాలంలో. 


అదో స్వర్ణ యుగం....సినీ సంగీతానికి!


ఇప్పుడదేం లేదు! పాటలు ఉండాలి. 


అవి ఓన్లీ హీరో హీరోయిన్లకే ఉండాలి! 


మహా ఐతే...ఒకటో...రెండో ఐటెం సాంగ్స్ ఉండాలి! అవి కూడా స్టెప్పులేసుకునేందుకు వీలుగా....మాంచి ఊపు వచ్చేట్లుండాలి!


ఆ పాటలకు సందర్భ శుధ్ధి కూడా ఏమీ అవసరం లేదు! ఎప్పుడంటే....అప్పుడే వచ్చిపోతుంటాయి! 


సూటూ...బూట్లతో హీరో....పెద్ద పెద్ద కర్చీఫ్ లు పైన.... చిన్ని చిన్ని చెడ్డీలు క్రింద వేసుకుని హీరోయిన్...గెంతుతూ ఉంటే....


ప్రక్కన పదిమంది....వెనకాల వంద మంది గెంతుతూ ఉంటారు!


పాట ఎప్పుడెప్పుడైపోతుందా.....అని ప్రేక్షకుడు....చూస్తుంటాడు! 


అదీ ఇప్పటి పాట గతి!


                                @@@@


అసలీ పాటలు & పద్యాలు ఎందుకండి !? విదేశీ సినిమాలలో చాలా తక్కువగా ఉంటాయి....లేదా...సినిమా అంతా పాటలే ఉంటాయి. సౌండ్ ఆఫ్ మ్యూజిక్ లాగా!


ఈ ధుర్యోదన దుశ్శాసన దుర్వినీతి లోకం లో......బదులు సింపుల్ గా..నీకు తల్లీ..చెల్లీ లేరా! అనొచ్చు. 


ముప్పిరిగొన్న భావావేశాలను...మాట భరించలేదు. అవి పదాలుగా దొర్లకుండా...కళారూపం ఇవ్వాలి. అదే పాట!


                              @@@@


1974 లోవచ్చిన 'ఓ సీత కథ తో సినీ గీతాల రచన క్రొత్త మలుపు తిరిగింది.


ఆ పదవిన్యాసంలో.....

ఆ నవ్యతలో.....,

ఆ వైవిధ్యంలో...., 

ఆ నిర్భయ పదసృష్టిలో....

ఆ ప్రభంజనంలో...... 


సినీ కవిత 4 దశాబ్ధాల పాటు ఉర్రూత లూగింది.


ఇప్పటి తెలుగు సినిమా పాట...మాట ఎలా ఉన్నాయంటే....బెజవాడలో ఏలూరు కాలువ లేదూ...అలా ఉంది! ఒకప్పుడు  తెలుగు సినిమా పాట గౌరీశంకర శృంగం! అని అన్నాడాయన.


పాట పక్షి లాంటిదని....ఏ పక్షి ఎంత బరువు మోయగలదో...ఎంత దూరం పయనించ గలదో...వారికి తెలిసినట్లు ఇంకెవరికీ తెలియదని కాదు!


అలా తెలిసిన వారిలో అగ్రగణ్యులు వేటూరి వారు. ఏ పాటకు...ఎలాంటి అలంకారం చేయాలి. ఏ ఆభరణాలు తొడగాలో...బాగా తెలిసిన వారు!


శృంగార గీతాలు కూడా....చిందులు తొక్కేలా చేశాయి వీక్షకులను!


నమక చమక యమగమక లయంకర సకలలోక జర్జరిత భయంకర వికట నటస్పద విస్ఫులింగాల్ని....

కురిపించిన ఆ కలమే....


అబ్బ నీ తీయనీ దెబ్బ...ఎంత కమ్మగా ఉన్నదోయబ్బ...

అంటూ శృంగారాన్ని ఒలికించింది!


                              @@@@


నే చెప్పేదేముంది. అందరూ ఒప్పుకునేదే.

వేటూరికి సాటి వేటూరి యే....


వేటూరి వారిపాటకి

సాటేదని సరస్వతిని చేరి కోర, 

నా పాటేశ్వరుడికి వుజ్జీ

వేటూరేనంది నవ్వి వెంకటరమణా!


ఇది ముళ్ళపూడి వెంకటరమణ గారు ఛలోక్తి గా చెప్పిన విషయం.


గానం కోరుకునే గీతం వేటూరి 

గాయకుడు కోరుకునే కవి వేటూరి 

ఇది మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి ఉవాచ.


యాభై సంవత్సరాలు పైబడిన మా సినీ జీవిత ప్రయాణంలో మాకు తారసపడిన మహాకవులు ఇద్దరే ఇద్దరు. ఒకరు కణ్ణదాసన్. ఇంకొకరు వేటూరి.

ఇది సంగీత దర్శకద్వయం రాజన్-నాగేంద్ర గార్ల అభిప్రాయం.


పయనీర్ అన్నా, ట్రెండ్ సెట్టర్ అన్నా వేటూరి గారే! నేను కేవలం ఆయనకు కొనసాగింపు మాత్రమే.

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇలా చెప్పారు.


                            @@@@


వేటూరి సుందరరామ్మూర్తి గారు 1936 న జనవరి 29 న కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లిలో జన్మించారు.


మద్రాసులోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్... బెజవాడలో డిగ్రీ పూర్తిచేశారు. 


ఆంధ్ర ప్రభ పత్రిక ఉప సంపాదకుడిగా పనిచేశారు. 

1956 నుంచి పదహారేళ్ళపాటు పాత్రికేయ వృత్తిలో ఉన్నారు.


వేటూరి దైతా గోపాలం గారి దగ్గర...

ఆ తర్వాత మల్లాది వద్ద శిష్యరికం చేశారు.


8 నంది అవార్డులతో పాటు మొత్తం 14 అవార్డులు...

ఒక జాతీయ పురస్కారం అందుకున్నారు. 


వేటూరి గారు 75సంవత్సరాల వయస్సులో మే 22, 2010 న హైదరాబాదులో గుండెపోటుతో మరణించారు.


వేణువై వచ్చాను భువనానికి

గాలి నై పోయాను గగనానికి.....అంటూ.


ఈ రోజు వేటూరి సుందర రామమూర్తి గారి

వర్ధంతి.(22-5-2010).


స్మృత్యంజలి.🌹


              

🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿


🌹రథసప్తమి - బీష్మాష్టమి విశిష్టత 🌻🌹*

*సప్త సప్త మహా సప్త, సప్త ద్వీపా వసుంధరా*

*సప్తార్క పర్ణ మాధాయ సప్తమి రధ సప్తమి*

*ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడి జన్మదినమే రథసప్తమి.  సూర్యుని గమనం ఏడు గుర్రములు పూన్చిన బంగారు రథం మీద సాగుతుందని వేదము "హిరణ్యయేన సవితారథేన" అని తెలుపుతుంది. సూర్య గమనం ప్రకారం ఉత్తరాయనము, దక్షిణాయనము అని రెండు విధములు. ఆషాఢమాసము నుండి పుష్యమాసము వరకు దక్షిణాయనము. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకముగా రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్ర దినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. "భా" అంటే సూర్యకాంతి, "రతి" అంటే సూర్యుడు, కావున సూర్యుని ఆరాధించువారు అందరూ భారతీయులు. "భారతీ" అంటే వేదమాత. వేదమాత నారాధించు వారును భారతీయులే.*

*సూర్యగ్రహణతుల్యా సా శుక్లా మాఘస్య సప్తమీ,*

*అరుణొదయవేళాయాం స్నానం తత్ర మహాఫలమ్‌.*

*మాఘే మాసి సితే పక్షే సప్తమీ కోటిపుణ్యదా,*

*కుర్యాత్ స్నానార్ఘ్యదానాభ్యా మాయురారోగ్యసంపదః.*

*మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణముతో సమానము. ఆ రోజున అరుణోదయ వేళ చేసిన స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పణ, దానాదులన్ని అనేక కోట్ల రెట్లు పుణ్య ఫలములను ఆయురారోగ్య సంపదలను ఇచ్చును. సప్తమినాడు షష్ఠి తిథి గూడ యున్నచో షష్ఠీ సప్తమీ తిథుల యోగమునకు పద్మమని పేరు. ఈ యోగము సూర్యుని కత్యంత ప్రీతికరము. ఆ సమయమున ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీ స్నానము చేసినచో ఏడు జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధము. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ జన్మలోను, జన్మాంతరంలోను (రెండు), మానసిక, వాచిక, శారీరకములు (మూడు), తెలిసిచేసేవి, తెలియకచేసేవి (రెండు) కలిసి మొత్తం ఏడు పాపములు నేడు రోగాలకు కారణములు.*

*రథసప్తమి నాడు బంగారముతో గాని, వెండితో గాని, రాగితో గాని రథమును చేయించి, కుంకుమాదులు, దీపములతో నలంకరించి అందు ఎర్రని రంగుగల సూర్యుని ప్రతిమ నుంచి, పూజించి, గురువునకు ఆ రథమును దానమీయ వలెను, ఆ రోజు ఉపవాసముండి, సూర్య సంబంధమగు రథోత్సవాది కార్యక్రమములను చూచుచూ కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు కురియునని పురాణప్రబోధము. రథసప్తమి వ్రతము మన సంప్రదాయమున నిలచియుండుట భారతీయతకు చిహ్నము.*

7 *🌻. సూర్య స్తోత్రం 🌻*

*ధ్యాయేత్సూర్యమనంతకోటికిరణం తేజోమయం భాస్కరం*

*భక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్*

*ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రైలోక్యచూడామణిం*

*భక్తాభీష్టవరప్రదం దినమణిం మార్తాండమాద్యం శుభమ్*

*🌻. పాలు పొంగించే విధానం 🌻*

*సూర్యుని కిరణాలూ పడే చోట..లేదా..తులసిచెట్టు ఉండే దగ్గర ఓ పీటను పెట్టి దాన్ని పసుపుతో శుద్ధి చేసి, ముగ్గులుపెట్టి, సూర్యభగవానుడి ఫోటోను ఉంచాలి. గంధం, కుంకుమతో బొట్టు పెట్టాలి. ఎర్రటి పుష్పాలతో అలంకరించాలి.*

*ఏడు చిక్కుడు కాయలను తీసుకుని రథంగా తయారుచేసుకోవాలి. ఈ రోజు సూర్యునికి నేతితో దీపం వెలిగించి ఆవు పిడకలను కర్పూరంతో వెలిగించి దానిపై ఇత్తడి పాత్ర ఉంచి ఆవుపాలు, బెల్లం, బియ్యం తో చేసిన పరమాన్నం చేసుకోవాలి. ఈ పరమాన్నం  సూర్యునికి ఎంతో ప్రీతి.*

*🌹.బీష్మాష్టమి విశిష్టత 🌹*

*ప్రతి సంవత్సరం రథ సప్తమి అనంతరం భీష్మ అష్టమి అనుసరించాల్సి ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరు మూడు దోసిళ్ల అర్ఘ్యం భీష్మ ప్రీతికి అనుసరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను అందరూ భీష్మ తర్పణం అని అంటారు. ధర్మశాస్త్రం ప్రకారం, భీష్మ తర్పణం, యమ తర్పణం తండ్రి బతికి ఉన్నవారు కూడా చేయాల్సిందే. ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఈరోజున విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు.*

*భీష్మాష్టమి రోజున విష్ణుమూర్తి పూజ అనంతరం ఆవునెయ్యితో పంచహారతి ఇవ్వాలి. దీపారాధనకు తామరవత్తులను వాడాలి. విష్ణుమూర్తి ఆలయాల్లో విష్ణు అష్టోత్తరం, సత్యనారాయణ వ్రతం, బ్రహోత్సవ దర్శనం, లక్ష తులసి పూజ వంటివి నిర్వహించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు. అలాగే విష్ణు సహస్రనామం, విష్ణు పురాణం, సత్య నారాయణ వ్రత పుస్తకాలను సన్నిహితులకు తాంబూలాలు ఇవ్వాలని పురోహితులు చెబుతున్నారు.*

*🍀. భీష్మ అష్టమి తర్పణ శ్లోకం 🍀*

*వైయాఘ్రపాద గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ |*

*గంగాపుత్రాయ భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే  ౧*

*భీష్మః శాన్తనవో వీరః సత్యవాదీ జితేంద్రియః |*

*ఆభిరద్భిరవాప్నోతు పుత్ర పౌత్రోచితాం క్రియామ్  ౨*

*వసూనామవతారాయ శంతనోరాత్మజాయ చ |*

*అర్ఘ్యం దదామి భీష్మాయ ఆజన్మబ్రహ్మచారిణే  ౩*

*భీష్మాయ నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం*

🌹 🌹 🌹 🌹 🌹





🍀

014..నేటి కథ..2012 నుండి ప్రాంజలి ప్రభ.(.ఆనందం 

ఆరోగ్యం  .. ఆధ్యాత్మకం.. తో అంతర్జాల పత్రిక ) లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి.. స్నేహాన్ని పెంచుకోండి..మనభాష తెలుగండి


*అద్భుతం….*


              *శ్రీకృష్ణ జననం!*

                 ➖➖➖✍️

శ్రీకృష్ణుని జనన సమయంలో జరిగిన అద్భుతాలు…*


*గ్రహ నక్షత్రతారకలన్నీ సౌమ్యులై వెలిగిన మహాద్భుత క్షణం..* 


*శ్రావణమాసం.. కృష్ణపక్షం, అష్టమి, అర్ధరాత్రి రోహిణీ నక్షత్రయుక్త వృషభలగ్నంలో కృష్ణుడు జన్మించాడు. సకలలోకాలకూ మంగళప్రద మైన సమయం అది. కృష్ణుడు అవతరించగానే దేవ దుందుభులు మోగాయి. పూలవాన కురిసింది. గంధర్వులు గానం చేశారు. విద్యాధరాంగనలు, అప్సరసలు నాట్యం చేశారు. పరిమళభరితంగా గాలి వీచింది. సకలప్రాణి కోటీ సంతోషించింది. ఎందుకు ఆ సంతోషం అన్నది అంతుచిక్కలేదెవరికీ.*


*శంఖం, చక్రం, గద మొదలయిన ఆయుధాలు ధరించిన నాలుగు చేతులతోనూ, శిరస్సున మణిమయ కిరీటంతోనూ, మెడలో కౌస్తుభమణితోనూ, చేతులకు కేయూరాది భూషణాలతోనూ, వక్షస్థలాన శ్రీవత్సం పుట్టుమచ్చతోనూ, పద్మపత్రాలవంటి నేత్రాలతోనూ, వెలుగులు విరజిమ్ముతున్న ముఖబింబంతోనూ, పట్టువస్త్రంతోనూ, సకల జగత్తునూ సమ్మోహింపజేసే                       నీల మోహనరూపంతోనూ జన్మించిన శిశువును చూసి దేవకీ వసుదేవులు దిగ్భ్రాంతి చెందారు. ఆ తేజస్సును తట్టుకోలేకపోయారు.*


*కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకుని నిల్చున్న వసుదేవునికి అప్పుడు తెలిసింది, తనకి జన్మించింది విష్ణుమూర్తి అని. సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. విష్ణుమూర్తికి ప్రణమిల్లాడు. అనేక విధాల స్తోత్రం చేశాడతన్ని. అవతారమూర్తిగా తన కడుపున జన్మించిన విష్ణుమూర్తిని చూసి చేతులు జోడించింది దేవకి.* 


*నమస్కరించిందతనికి. అనేక విధాల కీర్తించింది. పూర్వజన్మ సుకృతం కారణంగానే భగవంతుణ్ణి కన గలిగాననుకున్నది . 🙏

 015..నేటి కథ..2012 నుండి ప్రాంజలి ప్రభ.(.ఆనందం 

ఆరోగ్యం  .. ఆధ్యాత్మకం.. తో అంతర్జాల పత్రిక ) లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి.. స్నేహాన్ని పెంచుకోండి..మనభాష తెలుగండి


మహా మానవతామూర్తి గౌతమ బుద్ధుని 2568 వ జయంతి ! సందర్భంగా మీకోసం


****************************************


1. బాల్యంలోనే బాణం దెబ్బకు విలవిల లాడిన పావురమును

కట్టు కట్టి కాపాడినవాడు!


2. బాణంతో కొట్టిన వాడిది కాదు, కాపాడిన వాడిదే పక్షి అని రాజ సభలో నిరూపించిన వాడు!


3. రెండు రాజ్యాల మద్య నదీజలాల వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించిన వాడు!


4. మానవ కళ్యాణానికి

భార్యా బిడ్డలను వదిలి మహాభినిష్క్రమణ చేసిన వాడు!


5. తమను వదిలి వెళుతున్నందుకు రధసారధి చెన్నుడితో పాటు అశ్వం కంథకను కూడా ఏడ్పించిన వాడు!


6. పెంచిన తల్లి గౌతమి పేరునే తన పేరుగా చేసుకున్న వాడు!


7. తాను జ్ఞానం పొందిన బోధి వృక్షం గుర్తు వచ్చేలా పేరు 

స్థిరపడిన వాడు!


8. తనను ధిక్కరించి వెళ్ళిన వారినే తన బోధనలతో శిష్యులుగా

చేసుకున్న వాడు!


9. గజదొంగ అంగుళీ మాలుడి మనసు మార్చి తన అనుచరుడిగా చేసుకున్న వాడు!


10. ఆనాటి విశ్వ సుందరి, రాజ నర్తకి, గణిక  వృత్తిలో వున్న “ఆమ్రపాలి”నిని 

బౌద్ద బిక్షుణిగా మార్చిన వాడు!


11. గృహస్తులు శాఖాహార లేదా మాంసాహారం ఏది పెట్టినప్పటికీ భిక్షువులు తిరస్కరించ కూడదని చెప్పిన వాడు!


12. గృహస్తుడు పెట్టిన

కుళ్ళిన భిక్ష వలన తాను మరణ శయ్యపైన వున్నప్పటికీ

ఆ గృహస్తుని ఏమీ అనరాదని తన శిష్యులను ఆదేశించిన వాడు!


13. తాను చెప్పిన కార్య- కారణ, అనిత్య, అనాత్మ , 

ప్రతీత సముత్పాద

సిద్ధాంతాలను ప్రజా ఉద్యమ దృక్పథంతో 

విశాల ప్రజా రాశులకు

చేర్చినవాడు!


14. తనకంటే ముందు చార్వాక , లోకాయతులు చెప్పిన హేతువాద ఆలోచనా ధారకు ప్రజా ఉద్యమ స్వరూప మిచ్చిన వాడు!


15. త్రిరత్నాలను, పంచశీలను , అష్టాంగ మార్గమును బోధించిన వాడు!


16.  క్షురక వృత్తి దారుడయిన ఉపాలికి , చర్మ కారుడయిన సునీతుడికి  బౌద్ద దీక్షను ఇచ్చి , స్వయం కృషితో వారు ఉన్నత స్తానం ఎదగటానికి కారణం అయినవాడు!


17.  బౌద్ద సంఘంలో మహిళలను చేర్చుకోవటమే గాక బౌద్ద బిక్షుణీ సంఘాన్ని 

ఏర్పరచి, 

వారికి తగిన గౌరవ స్థానాన్ని కల్పించిన వాడు! మన దేశంలో మొదటి మహిళా సంఘ నిర్మాత అయినవాడు!


18. కులాన్ని- వర్ణాశ్రమ ధర్మాలను నిరశించటమే గాక 

అన్ని కులాల వారిని తన అనుచరులుగా చేసుకున్న వాడు!


19. బౌద్ద దీక్షలో ప్రథముడు ఏ కులం వారు అయినప్పటికీ 

తర్వాత వచ్చిన వారు  ప్రధములను గౌరవించే

గురు సంప్రదాయాన్ని ఏర్పరిచిన వాడు!


20. భార్యా , పిల్లలను, తల్లి దండ్రులను తన బోధనలను అనుసరించే వారుగా చేసుకున్న వాడు!


21. ఆసియా జ్యోతిగా వెలుగొందిన వాడు!


22. బాబా సాహెబ్ అంబేద్కర్ తన సిద్దాంతాలకు మూల పురుషుడిగా చెప్పబడిన వాడు!


23.అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగ రచనకు ప్రేరణ అయిన 

స్వేఛ్చ, సమానత్వం,  సౌభ్రాతృత్వాలను అందించిన వాడు!


24. వేమన , గురజాడ, గుర్రం జాషువా, గాంధీ, నెహ్రూలపైన , ప్రపంచ ప్రఖ్యాత   సైంటిస్ట్  

ఐన్ స్టీన్ పైన   విశేష ప్రభావం చూపిన వాడు!


25. మతాన్ని నల్లమందుగా భావించిన కారల్ మార్క్స్ చే గౌరవించ బడిన  మన దేశ మహనీయుడు!


26. ప్రఖ్యాత మార్క్సిస్ట్ రచయిత అయిన రాహల్ సాంకృత్యాయన్ 

తన రచనలకు ప్రేరణగా తీసుకోబడినవాడు!


27. మహా వీరుడు అయిన చండాశోకుని

ధర్మమూర్తిగా శాంతాశోకుడుగా మార్చినవాడు!


28. పూర్వజన్మ, పునర్జన్మ లను , వర్ణాశ్రమ ధర్మాలను బలపరిచే కర్మ సిద్ధాంతాలను  నమ్మవద్దని చెప్పినవాడు!


29. తన బోధనలను ప్రజలలో వుండి  , ప్రజల తిండితిని , ప్రజలపై ఆధారపడి  పని చేసే ప్రజా ఉద్యమ దృక్పధం ఏర్పరచి  దానికి నియమ నిబంధనలు 

ఏర్పరచిన వాడు!


30. తన జననం, జ్ఞానోదయం, మహాపరి నిర్యాణం ఒకే రోజు , వైశాఖ పూర్నిమ

రోజునే జరిగినవాడు!


31. తన జీవిత మంతా వనాలలోను ప్రజల మద్య బోధనలు చేస్తూ 

గడిపిన వాడు !


32. ప్రకృతిని ప్రేమించిన వాడు, ప్రకృతి రక్షణ కోరిన వాడు!


33. ప్రజల భాషలోనే తన బోధనలు చేసిన వాడు!


34. దేవుడు లేడని చెప్పినవాడు

స్వయం శక్తిపై  నమ్మకం ఉంచాలని చెప్పినవాడు!


35. సత్య నిరూపణ కోసం ఎవరి నయినా

ధిక్కరించమన్నది, తాను చెప్పిన దానిని  కూడా తప్పని భావిస్తే తిరస్కరించమని, 

ప్రతి దానిని నిరూపణ చేసుకోకుండా ఆచరించ వద్దని చెప్పినవాడు!


36. నిరంతర చలనం - నిరంతర మార్పు గురించి 2500 సంవత్సరాల నాడే చెప్పినవాడు!


37. ఇలాంటివి ఇంకా ఎన్నో చెప్పిన వాడు, 

84 వేల ప్రవచనాలు చేసిన వాడు! 

ఎవరు?


ఎవరా  మహనీయుడు!


అతడే సిద్దార్దుడు

అతడే గౌతముడు

అతడే బుద్దుడు


అతడే సిద్దార్ధ గౌతముడు

అతడే గౌతమ బుద్దుడు

అతడే గౌతమ బుద్దుడు.


 నమో బుద్దాయ!

నమో  బుద్దాయ!

నమో  బుద్దాయ!

****

16..

వివాహ సంభంద విచిత్రాలు - ఇనప బెండకాయ?

పెళ్లి చూపులలో అమ్మాయి అబ్బాయి మాట్లాడుకున్నారు. చూడబోతే వాళ్ళు ఒకళ్ళను ఒకళ్ళు ఇష్టపడట్లే వున్నారు. ఇద్దరూ మంచి ఉద్యోగులు. పెద్ద జీతాలు. 

ఎన్ని అనుకున్నాకన్యాదానం చేయవలసింది పిల్ల తండ్రి కాబట్టి అందరం అనగా ఆయన పిల్లతో సహా,  అందరం ఆయన వంక చూసాము. 

అయన అప్పటికే వీర గంభీర ముద్రలోకి ప్రవేశించి వున్నాడు.

"అబ్బాయితో కొంచెం మాట్లాడేది వుంది" అని అభిప్రాయం వ్యక్తం చేసాడు. 

అలాగే మాటాడండి అని పిల్లాడి తల్లి అన్నది.  

ఇక్కడ కాదు, అలా డాబా మీదకు వెళ్లి మాటాడుకుంటాం అని అయన పిల్లవాడిని తీసుకొని డాబా మీదకు వెళ్ళాడు. 

ఇదో కొత్త పోకడ కాబోసు అని మేము సరిపెట్టుకున్నాము.  

వారు అరగంట తరువాత కిందకి తిరిగి వచ్చారు. 

సంభందం - భజ గోవిందం అయిందని మాలో ప్రతి ఒక్కరికి అర్ధం అయ్యింది. అందరం నిరుత్సాహంతో బయట పడ్డాము. ఉత్సాహం కోసం లిమ్కా లు తాగాము. 

నేను ఇరువురికి బాగా పరిచయం వున్నా వాడిని, పైగా ఈ సంభందం ఇక్కడి వరకు తెచ్చిన వాడిని కూడా. ఆయనది నాదీ ఒకే ఆఫీస్ కూడాను. 

మీరు ఏమి మాట్లాడుకున్నారు అని  పిల్లవాడిని ఎంతో అడిగి కూడా సంభందం ఎందుకు బెడిసింది కనుక్కోలేక పోయాము. 

వాళ్ళు చివరి ప్రయత్నంగా నాతో "విషయం ఏమిటో తెలుసుకుందాము. ఇకముందట జాగర్త పడవచ్చు. మీరు అడిగి తెలుసుకొని రండి" అని నన్ను బ్రతిమాలారు. 

ఆ బ్రతిమిలాటకు లొంగి కొంతా, ఏమిటో తెలుసు కుంటే ఎందుకైనా మంచిది అని కొంతా అలోచించి నేను పిల్ల తండ్రిని ఆయన తీరికగా వున్నప్పుడు మా ఆఫీసులోనే కదలేసాను. 

అయన పేరు పురుషోత్తమ దాస్ రూప్ చెందు జ్ఞ్యానేంద్రు. పేరు ఎట్లావున్నాగాని అయన, అచ్చం మనవాడే. 

పురుషోత్తం దాసు గారు ఇలా అన్నాడు.  

"పిల్ల వాడు  చదువుకి సంబంధించని ఎన్నో పుస్తకాలు చదివినట్లు తెలుసుకున్నాను. లోకజ్ఞనం, సొంత తెలివి, మనో వికాసం  కోసం ఆ బుక్స్ చదివాడుట. ఒక్క ఆధ్యాత్మిక పుస్తకం కూడా లేని   లైబ్రరీ ఇంట్లో ఉందట. మీరు భగవత్ గీత చదివారా అని అడిగితే,అది ఆధ్యాత్మిక గ్రంధం కాదు జ్ఞ్యాన భాండం" అని దాని గొప్పని  గురించి మాట్లాడాడు. అతడి మనసు బాగా వికాసం చెంది వుంది. మేము అల్లుడి  మర్యాదలు చేసినపుడు పొంగిపోయి మాఇంట్లో బోర్లా పడే మనిషి కాదు. అల్లాగే మేము అతని మీద నిరసన వ్యక్తం చేయటానికి అని అతన్ని చిన్న చూపు చూస్తే, కుంగి పోయి మా దారికి వచ్చే మంచి  మనిషి కూడా కాదు. దేనికైనా ఉక్కు కడ్డీలా స్థిరంగా వుండే మనిషి అనిపించింది. అతని ముందు ఎవరి పప్పులూ ఉడకవు. ఫదిమంది ఫ్రెండ్స్ సర్కిల్ కి ఇతడే నాయకుడట. ఆఫీసులో కూడా సొంత నిర్ణయాలను తీసుకొని ఆ  నిర్ణయాలను చక్కగా  అమలు పరుచుకో గలుగుతాడుట! అంటే కొండను ధీ కొట్టే అంత  సాహసం వున్నవాడు. ముక్కుసూటి మనిషి అని తెలుస్తోంది. తల్లి తండ్రులంటే భక్తీ వినయం వున్నాయి. పిల్లాడికి జ్ఞ్యానం మరీ ఎక్కువగా వుంది. పెళ్లి తరువాత తల్లి తండ్రులని ఎలా చూడాలి వాళ్ళని ఏమి చేయాలి అన్నది కూడా ప్లానింగ్ చేసి పెట్టుకున్నాడు. 

"ఇల్లాంటి ఆదర్శ పురుషుడికి నా పిల్లనిస్తే నాకేమి ప్రయోజనం? అల్లుడు అంటే అట్టు మీద ఉల్లి పాయలాగా, పులుసులోకి ముక్కలాగా, చెట్టునున్న చిక్కుడు కాయలాగా, కొమ్మకున్న కరేపాకు రెమ్మ లాగా, మనం ఏమనుకుంటే దానికి పనికొచ్చ్చేట్లు ఉండాలి. ఏపని చెపితే ఆ పని గురించి తర్కించకుండా ప్రతి పనికి "వూ" కొట్టేవాడై  ఉండాలి. వాళ్లకు పెళ్లి కావాల్సిన పిల్లాడిని పెంచే విధానం తెలీదు. పిల్లాడిని మంచి వ్యక్తిత్వంతో, స్థిరమైన సొంత భావాలతో పెంచారు. అలా సొంత వ్యక్తిత్వం వున్న అబ్బాయి అంటే ఇనప బెండకాయ లాంటి వాడు. మాకు పెళ్లి పులుసులోకి పనికి రాడు" అని తేల్చి చెప్పాడు. 

ఇది చదివి సంతోషించిన వారు సంతోషించగా, స్వర్గీయులు శ్రీ  కొడవటి గంటి కుటుంబరావు గారని ఒక ప్రముఖ రచయిత, ఇది చదివి స్వర్గంలో కన్నీరు మున్నీరు అయ్యారు. ఆయనకు నా క్షమాపణలు.
***
017..నేటి కథ..2012 నుండి ప్రాంజలి ప్రభ.(.ఆనందం 
ఆరోగ్యం  .. ఆధ్యాత్మకం.. తో అంతర్జాల పత్రిక ) లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి.. స్నేహాన్ని పెంచుకోండి..మనభాష తెలుగండి

వివాహ సంభంద విచిత్రాలు - ఇనప బెండకాయ?

పెళ్లి చూపులలో అమ్మాయి అబ్బాయి మాట్లాడుకున్నారు. చూడబోతే వాళ్ళు ఒకళ్ళను ఒకళ్ళు ఇష్టపడట్లే వున్నారు. ఇద్దరూ మంచి ఉద్యోగులు. పెద్ద జీతాలు. 

ఎన్ని అనుకున్నాకన్యాదానం చేయవలసింది పిల్ల తండ్రి కాబట్టి అందరం అనగా ఆయన పిల్లతో సహా,  అందరం ఆయన వంక చూసాము. 

అయన అప్పటికే వీర గంభీర ముద్రలోకి ప్రవేశించి వున్నాడు.

"అబ్బాయితో కొంచెం మాట్లాడేది వుంది" అని అభిప్రాయం వ్యక్తం చేసాడు. 

అలాగే మాటాడండి అని పిల్లాడి తల్లి అన్నది.  

ఇక్కడ కాదు, అలా డాబా మీదకు వెళ్లి మాటాడుకుంటాం అని అయన పిల్లవాడిని తీసుకొని డాబా మీదకు వెళ్ళాడు. 

ఇదో కొత్త పోకడ కాబోసు అని మేము సరిపెట్టుకున్నాము.  

వారు అరగంట తరువాత కిందకి తిరిగి వచ్చారు. 

సంభందం - భజ గోవిందం అయిందని మాలో ప్రతి ఒక్కరికి అర్ధం అయ్యింది. అందరం నిరుత్సాహంతో బయట పడ్డాము. ఉత్సాహం కోసం లిమ్కా లు తాగాము. 

నేను ఇరువురికి బాగా పరిచయం వున్నా వాడిని, పైగా ఈ సంభందం ఇక్కడి వరకు తెచ్చిన వాడిని కూడా. ఆయనది నాదీ ఒకే ఆఫీస్ కూడాను. 

మీరు ఏమి మాట్లాడుకున్నారు అని  పిల్లవాడిని ఎంతో అడిగి కూడా సంభందం ఎందుకు బెడిసింది కనుక్కోలేక పోయాము. 

వాళ్ళు చివరి ప్రయత్నంగా నాతో "విషయం ఏమిటో తెలుసుకుందాము. ఇకముందట జాగర్త పడవచ్చు. మీరు అడిగి తెలుసుకొని రండి" అని నన్ను బ్రతిమాలారు. 

ఆ బ్రతిమిలాటకు లొంగి కొంతా, ఏమిటో తెలుసు కుంటే ఎందుకైనా మంచిది అని కొంతా అలోచించి నేను పిల్ల తండ్రిని ఆయన తీరికగా వున్నప్పుడు మా ఆఫీసులోనే కదలేసాను. 

అయన పేరు పురుషోత్తమ దాస్ రూప్ చెందు జ్ఞ్యానేంద్రు. పేరు ఎట్లావున్నాగాని అయన, అచ్చం మనవాడే. 

పురుషోత్తం దాసు గారు ఇలా అన్నాడు.  

"పిల్ల వాడు  చదువుకి సంబంధించని ఎన్నో పుస్తకాలు చదివినట్లు తెలుసుకున్నాను. లోకజ్ఞనం, సొంత తెలివి, మనో వికాసం  కోసం ఆ బుక్స్ చదివాడుట. ఒక్క ఆధ్యాత్మిక పుస్తకం కూడా లేని   లైబ్రరీ ఇంట్లో ఉందట. మీరు భగవత్ గీత చదివారా అని అడిగితే,అది ఆధ్యాత్మిక గ్రంధం కాదు జ్ఞ్యాన భాండం" అని దాని గొప్పని  గురించి మాట్లాడాడు. అతడి మనసు బాగా వికాసం చెంది వుంది. మేము అల్లుడి  మర్యాదలు చేసినపుడు పొంగిపోయి మాఇంట్లో బోర్లా పడే మనిషి కాదు. అల్లాగే మేము అతని మీద నిరసన వ్యక్తం చేయటానికి అని అతన్ని చిన్న చూపు చూస్తే, కుంగి పోయి మా దారికి వచ్చే మంచి  మనిషి కూడా కాదు. దేనికైనా ఉక్కు కడ్డీలా స్థిరంగా వుండే మనిషి అనిపించింది. అతని ముందు ఎవరి పప్పులూ ఉడకవు. ఫదిమంది ఫ్రెండ్స్ సర్కిల్ కి ఇతడే నాయకుడట. ఆఫీసులో కూడా సొంత నిర్ణయాలను తీసుకొని ఆ  నిర్ణయాలను చక్కగా  అమలు పరుచుకో గలుగుతాడుట! అంటే కొండను ధీ కొట్టే అంత  సాహసం వున్నవాడు. ముక్కుసూటి మనిషి అని తెలుస్తోంది. తల్లి తండ్రులంటే భక్తీ వినయం వున్నాయి. పిల్లాడికి జ్ఞ్యానం మరీ ఎక్కువగా వుంది. పెళ్లి తరువాత తల్లి తండ్రులని ఎలా చూడాలి వాళ్ళని ఏమి చేయాలి అన్నది కూడా ప్లానింగ్ చేసి పెట్టుకున్నాడు. 

"ఇల్లాంటి ఆదర్శ పురుషుడికి నా పిల్లనిస్తే నాకేమి ప్రయోజనం? అల్లుడు అంటే అట్టు మీద ఉల్లి పాయలాగా, పులుసులోకి ముక్కలాగా, చెట్టునున్న చిక్కుడు కాయలాగా, కొమ్మకున్న కరేపాకు రెమ్మ లాగా, మనం ఏమనుకుంటే దానికి పనికొచ్చ్చేట్లు ఉండాలి. ఏపని చెపితే ఆ పని గురించి తర్కించకుండా ప్రతి పనికి "వూ" కొట్టేవాడై  ఉండాలి. వాళ్లకు పెళ్లి కావాల్సిన పిల్లాడిని పెంచే విధానం తెలీదు. పిల్లాడిని మంచి వ్యక్తిత్వంతో, స్థిరమైన సొంత భావాలతో పెంచారు. అలా సొంత వ్యక్తిత్వం వున్న అబ్బాయి అంటే ఇనప బెండకాయ లాంటి వాడు. మాకు పెళ్లి పులుసులోకి పనికి రాడు" అని తేల్చి చెప్పాడు. 

ఇది చదివి సంతోషించిన వారు సంతోషించగా, స్వర్గీయులు శ్రీ  కొడవటి గంటి కుటుంబరావు గారని ఒక ప్రముఖ రచయిత, ఇది చదివి స్వర్గంలో కన్నీరు మున్నీరు అయ్యారు. ఆయనకు నా క్షమాపణలు.
***

018..నేటి కథ..2012 నుండి ప్రాంజలి ప్రభ.(.ఆనందం 
ఆరోగ్యం  .. ఆధ్యాత్మకం.. తో అంతర్జాల పత్రిక ) లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి.. స్నేహాన్ని పెంచుకోండి..మనభాష తెలుగండి

శ్రీ కూర్మ జయంతి

 మంధనాచల ధారణ హేతో, దేవాసుర పరిపాలవిభో 
కూర్మాకార శరీర నమో, భక్తం తే పరిపాలయమామ్.

కృతయుగంలో దేవ, దానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలకడం మొదలు పెట్టారు.

మందరగిరిని కవ్వంగా, వాసుకుని తాడుగా చేసుకుని దేవాసురులు పాలసముద్రాన్ని చిలుకుతుండగా మందరగిరి సముద్రంలోకి జారిపోతూ సముద్ర మధనానికి ఆటంకం కలిగింది. 

ఈ ఆటంకం నుంచి బయటపడేలా అనుగ్రహించమని దేవతలు మహావిష్ణువు వేడుకున్నారు.

అప్పుడు నారాయణుడు కూర్మరూపం దాల్చి సముద్రంలోకి మందరగిరిని మునిగిపోకుండా చేశాడు. అలా ఉద్భవించినదే కూర్మావతారం.

శ్రీ కూర్మం 

ప్రపంచంలోనే ఏకైక కూర్మదేవాలయంగా చెప్పబడుతున్న పుణ్యక్షేత్రం శ్రీకూర్మం.

శ్రీకాకుళం జిల్లాలోని గార మండలంలో శ్రీకాకుళం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వంశధారా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది.

కృతయుగంలో శ్వేతరాజు, అతని భార్య వంశధారల తపస్సుకు, భక్తికి మెచ్చుకున్న కూర్మనాధుడు వారి కోరిక ప్రకారం ఈ క్షేత్రంలో పశ్చిమ ముఖంగా వెలిశాడట. 

ఈ క్షేత్ర ప్రస్తావన కూర్మ, బ్రహ్మాండ, పద్మ పురాణాలలో వుంది. 

శ్రీరాముడు, బలరాముడు, జమదగ్ని మొదలైన పురాణ పురుషులెందరో ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామిని ఆరాధించారని పురాణాలు చెబుతున్నాయి. 

మరే దేవాలయంలోను లేనివిధంగా ఇక్కడ రెండు ధ్వజస్తంభాలను ఈ ఆలయంలో చూడవచ్చు.

ఈ స్తంభాలు రెండూ శివ కేశవులకు ప్రతీకలుగా చెప్తారు. చెప్పడానికి ఇది వైష్ణవ క్షేత్రమే. అయినా శివ కేశవులకు చిహ్నాలుగా చెప్పే ఈ ధ్వజస్తంభాలు శివకేశవుల అభేద తత్వాన్ని సూచిస్తున్నాయి. 

ఈ క్షేత్రం కృతయుగం నాటిది. దేవాలయంలోని మూలవిరాట్టు సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి చేత ప్రతిష్టించబడిందట. 

శ్రీ కూర్మంలోని స్వామి వారి పుష్కరిణిని శ్వేతగుండం అని పిలుస్తారు. 

ఇది అత్యంత విశిష్టమైంది. ఆ స్వామి చేతిలోని సుదర్శనచక్రం చేత పుష్కరిణి ఆవిష్కరించబడిందనీ, అందుకే ఈ గుండంలో స్నానం చేస్తే కలిదోషాలు తొలగిపోతాయని చెప్తారు.

ఈ గుండంలో స్నానం చేసి ఇక్కడ వున్న విష్ణుపాదాల దగ్గర పిండప్రదానం చేస్తే పితరులకు ఉత్తమ గతులు కలుగుతాయని విశ్వాసం.

ప్రతి సంవత్సరం మార్చిలో హోళీ పున్నమినాడు పెద్దఎత్తున ఈ ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి. వైశాఖ శుద్ధ ఏకాదశినాడు స్వామికి కల్యాణోత్సవం, జ్యేష్ట మాసం లో వచ్చే కూర్మ జయంతి నాడు జరిగే ఉత్సవాల్లో పాల్గొంటే సకల సంతోషాలు చేకూరుతాయని పెద్దల ఉవాచ

ఓం నమో భాగవతే కూర్మనాథాయ


Wednesday 22 May 2024

01-06-2024..ప్రాంజలి ప్రభ కథలు..9





0001..రోజుకొక కథ.. ప్రాంజలి ప్రభ.. మీ మల్లాప్రగడ 

ఒక ఉద్యోగి ఇండియాలో తాను చేసే జాబ్ విసుగొచ్చి రిజైన్ చేసి అమెరికా లో అతిపెద్ద మాల్ లో ఒక సేల్స్ మాన్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నాడు.

అది ప్రపంచంలోనే అతి పెద్ద మాల్. 

అక్కడ దొరకని వస్తువు అంటూ  ఉండదు.

ఇంతకు ముందు సేల్స్ మాన్ గా ఎక్కడైనా పనిచేసావా ?

అడిగాడు బాస్.

చెయ్యలేదు

సరే ! 

రేపు వచ్చి జాయిన్ అవ్వు. 

నీ పెర్ఫార్మన్స్ నేను స్వయంగా చూస్తా! 

తర్వాతి రోజు చాలా భారంగా నడిచింది సేల్స్ మాన్  కి. 

చివరకి సాయంత్రం ఆరు గంటలకి బాస్ వచ్చాడు.

ఈ రోజు ఎంత మంది కస్టమర్స్  కి  సేల్స్ చేశావు?

కేవలం ఒకరు అని బదులిచ్చాడు సేల్స్ మాన్ 

ఒకటేనా ! 

నువ్వు ఇక్కడ గమనించావా, అందరూ 40 నుండి 50 సేల్స్ చేస్తారు. 

సరే, ఎంత ఖరీదైన సేల్ నువ్వు చేశావో చెప్పు?

8,009,770 పౌండ్స్  చెప్పాడు మన సేల్స్ మాన్. 

వాట్ !! అదిరిపడ్డాడు  బాస్. 

అంత పెద్ద సేల్ ఏమి చేశావు? అడిగాడు. 

వినండి. ఒక పెద్దాయనకి ఒక చేపలు పట్టే పెద్ద గేలం అమ్మాను.

గాలం ఖరీదు నువ్వు చెప్పినంత ఎక్కువ ఖరీదు కాదే?  అన్నాడు బాస్.  

    

పూర్తిగా వినండి ..!!!

తర్వాత ఆ గాలానికి సరిపడే రాడ్, ఒక గేర్ అమ్మాను. ఎక్కడ చేపలు పట్టాలనుకుంటున్నారో అడిగితే దూరంగా నది ఒడ్డున అని చెప్పారు

దాని కన్నా ఒక బోట్  లో వెళుతూ నది మధ్య చేపలు పడితే  బాగుంటుందని ఒప్పించి బోట్ స్టోర్లో ఒక షూనర్ బోట్  డబల్ ఇంజన్ ఉన్నది కొనిపించాను. 

ఆ పెద్దమనిషి తన జీప్ కెపాసిటీ తక్కువ ఈ బోట్ ని తీసుకు పోలేదు అన్నారు.

అప్పుడు ఆటొమోబైల్ డిపార్ట్మెంట్ లో ఒక కొత్త 4 * 4 డీలెక్స్ బ్లాజర్ కొనిపించాను.

తరువాత అక్కడే నది ఒడ్డున ఉండటానికి కాంపింగ్ డిపార్ట్మెంట్ లో కొత్తగా ఒచ్చిన ఆరు స్లీపర్ల ఇగ్లూ కాంప్ టెంట్ దానిలో ఉండటానికి కావల్సిన భోజన సామగ్రి పాక్ చేయించాను.

బాస్ ఆశ్చర్యంతో రెండు అడుగులు వెనక్కి వేశాడు.

ఇవన్నీ ఒక గేలం కొనడానికి వచ్చిన వాడితో కొనిపించావా !!!

లేదు సార్ ! బదులు ఇచ్చాడు సేల్స్ మాన్.

మరి ?  అన్నాడు బాస్. 

ఆయన నిజానికి ఒక తల నొప్పి టాబ్లెట్ కోసం వచ్చారు. 

తలనొప్పికి టాబ్లెట్ కన్నా చేపలు పట్టే  హాబీ ద్వారా తగ్గించుకోవచ్చు అని ఒప్పించాను.

బాస్: అరే యార్ …!! 

ఇంతకీ  నువ్వు ఇండియాలో ఏం ఉద్యోగం చేసేవాడివి?

అప్పుడు ఆ సేల్స్ మాన్ చెప్పాడు 

నేను శివా ళయాన్ని మొదట శుభ్రం చేసేవాణ్ణి, తరువాత పూజారికి పూలు,పండ్లు విభూతి నీరు అందించేవాడిని, భక్తులు వస్తే రసీదు బుక్ పెట్టుకొని మంచిమాటలతో పూజలక్రింద గోత్రనామాలు వ్రాసేవాడ్ని, నా ప్రవర్తన మెచ్చి అన్నదానం చేసె ఖర్చు వ్రాయించేవారు, బ్యాంకు లావాదేవీలు చేసేవాడ్ని, ఇల్లు ఇచ్చారు, భోజనం అక్కడే 

మరి ఇంకేమి హాయిగా ఉండొచ్చుగా 

ప్రజల సొమ్ము, దేవుని సొమ్ము దొంగిలించటం చూసాను అంతే 


మెడబెట్టి గేంటుంటారు 


లేదండి మారేందుకు మానేసావు 

మానెయ్యలేదండి బ్యాంకు పనులు ఆపారు పూజారిగారు, ఇంటిపనులు చేయమన్నారు 

అంతే.... అంతేనా 


పూజారి భార్యను చూసాను అంతే నామనసు మారిపోయింది 


ఏమిట్రా పెద్దావిడిని చూసావా 


చూసానండి చాలా అందంగా వుంది, చూపు తప్ప లే కపొయ్యాను 

అప్పుడే మయిందిరా 

పూజారి వచ్చాడండి 

వస్తే 

రాత్రికి అమ్మయి వస్తుంది రా బాబు అందండి 

అందా ... వచ్చిందా 

వచ్చిందండి అమ్మకన్నా అమ్మాయి బాగుందండి 

తరువాత ఏమైంది 

నన్ను పిలిచిందండి 

నన్ను పెళ్లిచేసుకుంటావా అమెరికాకు వెళ్లిపోదామందండి 

మరి ఒప్పుకున్నావా ఏమిటి 

అందాలు చూపిస్తే ఏ మగాడు ఒప్పుకోకుండా ఉంటాడండి 

చంపాకురా తరువాత ఏమైందో చెప్పు..

అమ్మాయికి అమెరికా అబ్బాయితో పెళ్లి కుదిరిందండి 

నిన్ను బయటకు నెట్టారా 

నన్నే పెళ్లి పెద్ద చేసి తోడుగా పెళ్ళైన తర్వాత అమెరికాకు పంపించారండీ 

మరే మయిందిరా నీ బతుకు 

అక్కడినండి తిరకాసయందండి 

ఏమిటిరా ఆ తిరకాసు 

అమ్మాయిగారి మొగుడు నండి అమెరికాలో దిగేంగానే పోలీసులు పట్టికెళ్ళారండి 

అప్పు డేమయిందిరా 

మల్లా ఇండియాకు వెళ్లిపోయారా 

లేదండి 

అమ్మాయిగారే నన్ను ఉంచుకున్నారండి 

ఉంచుకోవటమేమిటిరా 

విడాకులొచ్చాక పెళ్లి టండి 

ఆ అమ్మాయి ఎవరురా?

మీరు మేనేజర్ అయితే ఆమె దీని ఓనర్, ఇలాంటివి రెండు మూడున్నాయి 

అంతే అప్పడిదాకా ప్రశ్నలు వేసే వాడు నాలికతెరిచి నేలపై పడి గిలగిలా కొట్టుకున్నాడు 

మిగతా కధ మీకు తెలుసుకదా?


02..నేటి కథ..ప్రాంజలి ప్రభ.. లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి 


తప్పని శిక్ష

హలాపురిని హేమచంద్రుడు పాలించేకాలంలో - దేవుడి విగ్రహం ముందు పూజలోగాని, ప్రార్థనలోగాని ఉన్న ఎవరినీ బంధించకూడదన్న శాసనం అమలులో ఉండేది. నేరస్థుడని తెలిసినా, పూజ ముగించుకుని ఇవతలికి వచ్చిన తరవాతే రక్షకభటులు వాణ్ణి పట్టి బంధించేవారు. ఈ శాసనాన్ని అడ్డుపెట్టుకుని పలువురు నేరస్థులు శిక్షనుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించేవారు.

నేరానికి పాల్పడిన తమను ఖైదుచేయడానికి రక్షక భటులు వస్తున్నారని తెలియగానే, పూజగదిలోకిగాని, గుడిలోకిగాని వెళ్ళి విగ్రహం ముందు చేతులు జోడించి నిలబడేవారు. పూజలు ప్రారంభించేవారు. రక్షకభటులు వేచి చూసి చూసి, విసుగు చెంది తరవాత వద్దామని వెళ్ళిపోయేంతవరకు ఈ పూజలు కొనసాగేవి. భటులు వెళ్ళి పోయాక, వెలుపలికివచ్చి, వాళ్ళ కంటబడకుండా తప్పించుకుని పారిపోయేవాళ్ళు. రాజు హేమచంద్రుడి వద్ద కొత్తగా సలహాదారుగా చేరిన చంద్రహాసుడు ఒకనాడు ఈ శాసనంలోని లొసుగును రాజుగారి దృష్టికి తీసుకువచ్చి, ‘‘దేవాలయాలు పరమ పవిత్రమైనవి. మానవ జీవితం ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా ముందుకు సాగడానికి దైవభక్తి, పాపభీతి చాలా వరకు ఉపయోగపడతాయి.అయితే, విగ్రహం సమక్షంలో నేరస్థులను సైతం బంధించకూడదన్న పురాతన శాసనం ద్వారా నేరస్థులు రక్షకభటుల కళ్ళుకప్పి తప్పించు కుంటున్నారు. రోజురోజుకూ నేరాలు పెరిగి పోతున్నాయి. ప్రభువులు దీనిని గురించి ఆలోచించి, న్యాయాధికారులను సంప్రదించి తగునిర్ణయం తీసుకోవడం మంచిది కదా!'' అన్నాడు. అంతా శ్రద్ధగా విన్న రాజు తలపంకిస్తూ, ‘‘ఈ శాసనం మన రాజ్యంలో మా తాత తండ్రుల నుంచి వస్తున్నది. దీనిని ఇప్పుడు హఠాత్తుగా మార్చడం భావ్యం కాదు. నేరాలు పెరగ కుండా ఉండడానికి మరేదైనా మార్గం ఆలోచిద్దాం,'' అన్నాడు. చంద్రహాసుడు అప్పటికి మౌనంగా ఊరుకున్నప్పటికీ దానిని గురించి తీవ్రంగా ఆలోచించసాగాడు. ఇలా వుండగా ఒకనాడు సుగంధపురిలో పెళ్ళికుమార్తె బంగారు నగలను దొంగిలించుకుని పారిపోతూన్న దొంగను పట్టుకోవడానికి రక్షకభటులు వాడి వెంటబడ్డారు. అయితే, ఆ దొంగ వారికి దొరకకుండా ఊరి పొలిమేరను చేరుకున్నాడు. రక్షక భటులు వదలకండా తరమసాగారు. అటవీ ప్రాంతంలో పరిగెత్తుతూన్న దొంగకు ఒక చోట నాలుగు గుంజలు పాతి, పైన తాటాకులు కప్పబడివున్న పాకలో పసుపూ, కుంకుమా పూసిన తెల్ల బండరాయి కనిపించింది. దొంగ పరమానందంతో పాకలోకి జొరబడి పసుపూ కుంకుమలు పూసిన తెల్లబండరాయి ముందు చేతులెత్తి మొక్కుతూ నిలబడ్డాడు. వాడి వెనకనే అక్కడికి చేరుకున్న రక్షక భటులు వాణ్ణి చూసి, ‘‘అరరే, దేవుడి విగ్రహం ముందు చేరాడే! బంధించలేక పోయామే!''అంటూ ఆశాభంగానికి గురై, చేసేది లేక అలాగే నిలబడిపోయారు. దొంగ కళ్ళు మూసుకుని విగ్రహం ముందు కూర్చుని మరింత భక్తి నటించసాగాడు. అయితే, కొంతసేపటికి రక్షకభటులు తనను చుట్టుముట్టి, సంకెళ్ళు తగిలిస్తున్నారని గ్రహించి, దొంగ అమిత ఆగ్రహంతో కళ్ళు తెరిచి, ‘‘ఏమిటీ! దేవుడి ఎదుటే బంధిస్తున్నారా?'' అనబోయి నోట మాట రాక అలాగే ఉండిపోయాడు. కారణం- అప్పటికే రక్షక భటులు వాడి ఎదుట వున్న పసుపు కుంకుమలు పూసిన బండరాతిని అవతలికి తొలగించారు. దొంగ కారాగారం పాలయ్యాడు. మరునాడు న్యాయాధికారి ద్వారా ఈ సంగతి గురించి విన్న రాజు హేమచంద్రుడు, నూతన సలహాదారు చంద్రహాసుడి సూచనలోని సత్యాన్ని గ్రహించి, పూజాది కార్యక్రమాలలో ఉన్న నేరస్థులను బంధించకూడదన్న పాతశాసనాన్ని రద్దు చేశాడు. అప్పటి నుంచి నేరస్థులు అంత సులభంగా తప్పించుకోలేకపోయారు. క్రమేణా రాజ్యంలో నేరాలు తగ్గిపోయాయి.

****

003..నేటి కథ..ప్రాంజలి ప్రభ.. లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి 


జయద్రదుడు (సైంధవుడు)

మహాభారతములో నూరుగురు కౌరవుల ఏకైక సోదరి దుస్సల భర్త. ఈ జయద్రదుడు ఇతను సింధు రాజ్యానికి రాజు కాబట్టి సైంధవుడు అని కూడా పిలుస్తారు. ఈ పేరుతోనే అతను ప్రసిద్ధి చెందాడు. ఇతనికి దుస్సల కాకుండా మరో ఇద్దరు భార్యలు ఉన్నారు. వారిలో ఒకరు గాంధార రాజ్యము నుండి మరొకరు కాంభోజ రాజ్యము నుండి.

ఇతని తండ్రి పేరు వృద్ధక్షత్రుడు జయద్రదుడు అర్భకుఁడై ఉండు కాలమున ఒకనాడు అశరీరవాణి వీడు  యుద్దములో వీడి తల తునుమబడును అని చెప్పగా, అది  విన్న అతని తండ్రి అగు వృద్ధక్షత్రుఁడు వీని తలను నేలమీద ఎవరు పడవేస్తారో వారి తల వెయ్యి ముక్కలగును అని పలికెను. కానీ కురుక్షేత్ర సంగ్రామములో వీని తల నరికింది కృష్ణుని ఉపాయముతో అర్జునుడే అయినప్పటికీ  ఆ తల ను నేల మీద పడవేసింది సాక్షాత్తు తండ్రియే! తన వాక్కు ఫలితముగా తండ్రి వృద్ధక్షత్రుని తల వెయ్యి ముక్కలవుతుంది .

జయద్రదుని పేరు రెండు సంస్కృత పదాలనుండి వచ్చింది "జయత్"అంటే విజయవంతుడైన

,"రథ"అంటే రధము. అంటే విజయవంతమైన రధాలు కలిగినవాడు అని అర్ధము అలాగే సింధు

రాజ్యానికి రాజు కాబట్టి  సింధూరాజా అనియు సింధు రాజ్య వారసుడిగా సైంధవుడు అని పిలుస్తారు ఈ పేరుతోనే అతను ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాడు. ఇంత  చరిత్ర ఉన్న రాజు అయినప్పటికీ గొప్ప కురు వంశానికి అల్లుడైనప్పటికీ, బుద్ధి  మంచిది కాదు. పాండవులు మాయ జూదములో ఒడి అరణ్యవాసము చేస్తున్నప్పుడు పాండవులు వేటకు వెళుతు ద్రౌపదిని  తృణబిందు మరియు ధౌమ్య ఋషుల ఆశ్రమములో వారి రక్షణలో ఉంచి వెళతారు. ఆ సమయములో ద్రౌపదిని చూసిన జయద్రదుడు తన మంత్రి కోటికస్యు ని ఆమె ఎవరో కనుక్కుని

రమ్మని పంపుతాడు. ఆతను ఆశ్రమానికి వచ్చి, ద్రౌపది పాండవుల భార్యగా గుర్తించి ఆ సంగతిని జయద్రదునికి తెలియజేస్తాడు. అన్ని విషయాలు తెలిసినప్పటికీ జయద్రదుడు ద్రౌపది దగ్గరకు వచ్చి తన్ను తానూ పాండవుల బావగారిగా పరిచయము చేసుకొని ద్రౌపదిని తనను పరిణయమాడమని అడుగుతాడు. 

ఇది విన్న ద్రౌపది జయద్రదుని మందలిస్తుంది. కానీ ఆగ్రహించిన జయద్రదుడు ద్రౌపదిని

అపహరించి తన రాజ్యానికి తీసుకుపోవాలని ప్రయత్నిస్తాడు. ఇదంతా గమనించిన ద్రౌపది సఖి ధాత్రేయిక పాండవులకు జరిగిన విషయాన్ని చెపుతుంది. అప్పుడు ధర్మరాజు తన సోదరులను ద్రౌపదిని విడిపించుకు రమ్మని పంపుతాడు. వారు జయద్రదుని సైన్యాన్ని వెంబండించి, అతని సైనికులను హతమారుస్తారు.

ఇది చుసిన జయద్రదుడు ద్రౌపది ని అక్కడే వదిలి పారిపోతాడు. అర్జునుడు సైనికుల తప్పేమి లేదు వారిని చంపటం అనవసరం వదిలేయమని, భీమునికి సలహా ఇచ్చి తన బాణాలతో పారిపోతున్నజయద్రదుని అశ్వాలను చంపి, జయద్రదుని బందీగా పట్టుకుంటాడు. భీముడు కోపముతో జయద్రదుని జుట్టు పట్టుకొని నేలకేసి బాదుతాడు. చంపటానికి సిద్దమైన భీముడిని అర్జునుడు వారిస్తాడు. భీముడు జయద్రదుని కి గుండు గీసి సంకెళ్లతో బంధించి  ధర్మరాజు సముఖానికి తీసుకువస్తాడు. భీముడు ద్రౌపదిని ఏవిధమైన శిక్ష వేయమంటావు అని అడుగుతాడు.

కానీ ద్రౌపది పెద్ద మనసుతో ఇప్పటికే బానిస వలే ధర్మరాజు ముందు మోకరిల్లి ఉన్నాడు. ఎంతైనా ఇంటి ఆడబడుచు భర్త చంపటం మంచిది కాదు, క్షమించి వదిలెయ్యండి అని చెపుతుంది. ఆ విధముగా అవమాన భారంతో జయద్రదుడు తన రాజధానికి చేరుకుంటాడు.

పరాభవించబడ్డ సైంధవుడు చాలా దుఃఖించి, పాండవులమీద పగ తీర్చుకోవాలని కోరికతో శివుడి గురించి తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్ష్యం అయి వరాన్ని కోరకోమనగా సైంధవుడు పాండవులని సంహరించే వరాన్ని కోరతాడు. దానికి శివుడి అంగీకరించక ఒక్కరోజు మాత్రం అర్జునుడు తప్ప మిగతా పాండవులని అడ్డగించే వరాన్ని పొందుతాడు. మహాభారత యుద్ధంలో భీష్ముడు పతనమై ద్రోణుడు సేనాపతిగా ఉండగా, పాండవులు వీరవిహారం చేస్తుండగా దుర్యోధనుడి కోరిక మేరకు

ద్రోణుడు పద్మవ్యూహం పన్నుతాడు. పద్మవ్యూహ విద్య పాండవులలో అర్జునుడికి తప్ప మిగతా ఎవ్వరకి రాదని కౌరవులకు తెలుసు, అర్జునుడిని,శ్రీకృష్ణుని ప్రక్కకి తప్పించడానికి ద్రోణుడు ఒక ప్రణాళిక వేసి, సుశర్మ,త్రిగట అనే ఇద్దరు  రాజులను వారి సైన్యాలతో మరోచోట యుద్ధము చేయటానికి అర్జునుడిని పైకి పంపుతారు. అప్పుడు పాండవ సైన్యం సమాలోచన చేస్తే అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి ప్రవేశించడం మాత్రమే తెలుసని బయటకు రావడం తెలియదని అంటాడు. అప్పుడు మిగిలిన పాండవులు తాము వెంట ఉండి అభిమన్యుడిని కాపాడతామని అభిమన్యుడితో పద్మవ్యూహంలోకి ప్రవేశిస్తారు. పద్మవ్యూహంలోకి ప్రవేశించిన వెంటనే సైంధవుడు శివుడు ఇచ్చిన వరం ప్రకారం పాండవులకు అడ్డం పడి వారిని వ్యూహంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తాడు. ఎంతో వీరోచితంగా పోరాడినా అభిమన్యుడు ఏకాకి కావడం చేత, ఏకాకిగా రథం క్రింద ఉన్న అభిమన్యుడిని కౌరవులు సంహరిస్తారు. సైంధవుడు అడ్డం పడడం వల్లనే అభిమన్యుడు ఏకాకిగా అయి సంహరించబడ్డాడన్న వార్త పాండవ సేన శిబిరాలకు వచ్చినప్పుడు అర్జునుడుకి తెలిసి చాలా చింతించి తరువాతి రోజు సూర్యాస్తమయం లోపల సైంధవుడిని సంహరించక పోతే తాను అగ్నికి ఆహుతి అయి పోతానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఆనాడు జయద్రదుని చంపకుండా వదిలివేసినందుకు భీముడు ద్రౌపది చింతిస్తారు. 

అర్జునుడి బారి నుండి జయద్రదుని రక్షించటానికి ద్రోణుడు మూడు రకాల వ్యూహాలను ఏర్పరుస్తాడు మొదటిది శకట వ్యూహము, రెండవది సూచీముఖం వ్యూహము, మూడవది పద్మవ్యూహము. భీముడు, అర్జునుడు, సాత్యకి కౌరవ సేనను చీల్చుకుంటూ ముందుకు సాగుతారు.  అనుకొన్న ప్రణాళిక ప్రకారం కౌరవ సైన్యం సైంధవుడి వద్దకు అర్జునుడిని చేరకుండా చేస్తుంది. అర్జునుడు చాలా చింతిస్తూ  సైంధవుడిని ఎలా సంహరించాలో ఆలోచిస్తుంటే జగన్నాటక సుత్రధారి శ్రీ కృష్ణుడు తన సుదర్శన చక్రంను సూర్యుడికి అడ్డుగా ఉంచి సూర్యాస్తమయం అయిపోయిందనే భావన కలిగిస్తాడు. అర్జునుడు కూడా ఆ విషయాన్ని గ్రహించలేక సూర్యాస్తమయం అయిపోయింది ప్రాణ త్యాగం చెయ్యాలని ఆలోచిస్తుండగా శ్రీకృష్ణుడు అసలు విషయం తెలిపి, తన చక్రాన్ని సూర్యుడి ముందు నుండి తొలగిస్తాడు. సూర్యాస్తమయం జరిగిందని కౌరవసైన్యం అంతా తాము పన్నిన వ్యూహం నుండి సడలుతారు. ఆ విధంగా సడలడం వల్ల సైంధవుడిని వద్దకు చేరడం చాలా తేలికవుతుంది. అర్జునుడు సైంధవుడితో యుద్ధం జరిపి సైంధవుడి మీదకు పాశుపతాశ్త్రం ప్రయోగిస్తాడు. పాశుపతాస్త్రం సైంధవుడి శిరఛ్చేధం చేస్తుంది. అప్పుడు ఆ శిరస్సు నేలపై పడిపోతుండగా శ్రీ కృష్ణుడు ఆ శిరస్సు నేలపై పడరాదని దానిని ఆ అస్త్ర సహాయంతోనే వనంలో తపస్సు చేసుకొంటున్న

సైంధవుడి తండ్రి వృద్ధాక్షాత్రుడి చేతులలో పడేటట్లు చేయమని చెబుతాడు. సైంధవుడి శిరస్సు ఎవరి చేతులనుండి పడుతుందో వారి శిరస్సు నూరు చెక్కలు అవుతుంది. ఆ విధంగా తన తండ్రి వృద్ధాక్షాత్రుడి చేతులనుండి సైంధువుడి శిరస్సు పడగానే వృద్ధాక్షాత్రుడు తల నూరు చెక్కలై వృద్ధాక్షాత్రుడు మరణిస్తాడు. ఈ విధంగా సైంధవుడు మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో మరణిస్తాడు.

జయద్రదునికి దుస్సల వలన కలిగిన కొడుకు సురధడు.  కానీ ఇతను కురుక్షేత్ర యుద్దములో  పాల్గొనడు కురుక్షేత్ర యుద్ధము అనంతరము ధర్మరాజు అశ్వ మేధయాగము చేస్తూ సైన్యము వెంబడి అర్జునుని పంపుతాడు. అర్జునుడు సింధు రాజ్యానికి వచ్చినప్పుడు సురధుడు అర్జునుని ఎదుర్కొని గెలవటం కష్టము అని భావించి ప్రాణత్యాగము చేస్తాడు. ఈ విషయము తెలుసుకున్న అర్జునుడు సురధుడి కొడుకును రాజుగా పట్టాభిషేకము చేసి యుద్ధము చేయకుండానే తన రాజ్యానికి వెళతాడు.


004..నేటి కథ..ప్రాంజలి ప్రభ.. లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి 


''దేవుడు కేవలం ప్రతిమ రూపంలో ఉంటాడు... ఏమీ సేవించడు. మరి నైవేద్యం ఎందుకు సమర్పించాలి'' - అని చాలామందికి సందేహం వస్తుంటుంది. భగవంతుడికి సమర్పించే నైవేద్యాలను భగవంతుడు తినడు. కానీ పూజించేవారికి భగవంతుడిపై ఉన్న కృతజ్ఞతాభావాన్ని సూచిస్తుంది నైవేద్యం. లోకంలో మనిషి బతకడానికి భుజించే ఆహారపదార్థాలన్నీ ప్రకృతి ప్రసాదించినవే. ప్రకృతిని సృష్టించి చల్లగా కాపాడుతున్నందుకు ఆ దేవుడికి ఈ జీవుడు కృతజ్ఞతాపూర్వకంగా అర్పించేదే నైవేద్యం. తాను అనుభవించడంకన్నా ఇతరులకు పంచడంలోనే ఆనందం ఉందని చెప్పడమే ఈ ఆచారం వెనుక ఉద్దేశం. సాధారణంగా దేవాలయాలకు వెళ్లి, ఆ దేవ దేవతలకు నైవేద్యాలు సమర్పించి, తీర్థ ప్రసాదాలను పుచ్చుకోవడం ఆనాదిగా వస్తున్న ఆచారం.దేవాలయాలను సందర్శించి నప్పుడు మాత్రమే నైవేద్యాలు సమర్పించుకుండా మన ఇంట్లో చేసే పూజా కార్యక్రమాలలో కూడా దేవ దేవతలకు నైవేద్యాన్ని సమర్పిస్తారు. నిత్య పూజ అయినా లేదా ప్రత్యేక పర్వదినాలలో అయినా పూజలు నిర్వహించి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు.

నిత్యం దేవుడికి పూజ చేయాలని, నైవేద్యం సమర్పించాలని, అసలు దేవుడికి నివేదించని పదార్థాలు మనం తినకూడదని ధర్మగ్రంధాలు చెప్తున్నాయి. అందుకే దైవారాధనలో ప్రత్యేకంగా ప్రసాదం పెట్టడమే కాకుండా, వండిన పాత్రలను ముందుగా దేవునికి నివేదించిన తర్వాత తాము తినడం చాలామందికి అలవాటు. ఇంకొందరు తినే ప్రతి పదార్దాన్నీ, ఆఖరికి మంచినీటిని కూడా "కృష్ణార్పణం" అంటూ భక్తిగా దేవునికి అర్పించి, ఆపైన తాము తినడం లేదా తాగడం చేస్తారు. అది భక్తికి నిదర్శనం.

మనం తినే ప్రతి పదార్ధాన్నీ దేవుడికి అర్పించడం వెనుక ఓ కారణం ఉంది. అదేమిటంటే... దేవుడికి నైవేద్యం పెట్టాలి అనే యావ ఉన్నప్పుడు శుచిగా, శుభ్రంగా, నిర్మలమైన మనసుతో ఆహారాన్ని తయారుచేస్తాం. అంతే ఎక్కడా సమయాభావం లేకుండా జాగ్రత్త పడతాం. ముందుగా స్నానం చేసి పదార్ధాల దగ్గరికి వెళ్తాం. పండ్లు మొదలైనవి కూడా మంచి పక్వమైనవి, పుచ్చులు, డాగులు లేనివి, మిగలపండి కుళ్ళిపోనివి పూజకు ఉపయోగిస్తాం. నైవేద్యం సమర్పించిన తర్వాత వాటిని తింటాం. పరిశుభ్రత లేనివి, పాడైపోయిన పదార్ధాలు, పక్వంకానివి, సరిగా ఉడకనివి, మిగల పండినవి, నిలవ ఉన్నవి, ఎంగిలి చేసినవి, రుచి లేనివి, పవిత్రంగా లేనివి - మొదలైన పదార్థాలు నివేదనకు పనికిరావు. 

''ఆహార శుద్ధిః సత్వ శుద్ధిః '' - అంటూ వర్ణించింది ఉపనిషత్తు. అంటే పరిశుభ్రమైన సాత్విక ఆహారం మాత్రమే నివేదించాలి. అలాంటి పదార్దాలు మనసును ప్రశాంతంగా ఉంచి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే, దేవుడికి నివేదించడానికి ఎప్ప్పుడూ సాత్విక పదార్ధాలను మాత్రమే వినియోగిస్తాం. దేవునిముందు నైవేద్యంగా సాత్విక పదార్ధాలను ఉంచినట్లయితే, మన ఆహారం కూడా అదే అవుతుంది కదా! అలా మనం తామస, రజో గుణాలు ఉన్న పదార్ధాలను కాకుండా సాత్విక గుణాలను పెంపొందించే సాత్విక ఆహారానికి కట్టుబడి ఉండగలుగుతాం. అదీ సంగతి. దేవునికి నైవేద్యం సపర్పించడంతో మన మనసులో భక్తిప్రపత్తులు నెలకొనడమే కాకుండా, ఆ పదార్ధాన్ని మనం తింటాం కనుక సుఖంగా, శాంతంగా ఉంటాం. పూజా కార్యక్రమాన్ని నిర్వహించి, ఎటువంటి లోటు ఉండకూడదన్న ఉద్దేశంతో నైవేద్యాన్ని దేవునికి పెడతారు. సాధారణంగా ఆలయానికి వెళ్లినా, ఇంట్లో పూజ చేసినా కొబ్బరికాయ, అరటి పండ్లు ప్రసాదంగా పెడతాము. కానీ ఒక్కో దేవుడికి ప్రీతిపాత్రమైన నైవేద్యం ఒక్కోటి ఉంటుంది. విఘ్నేశ్వరుడికి బెల్లం అంటే ప్రీతి. ఉండ్రాళ్లు, జిల్లేడుకాయలు నైవేద్యంగా సమర్పించాలి. గణపయ్యకి గరిక మాల అంటే చాలా ఇష్టం. శివుడికి కొబ్బరికాయ, అరటిపండ్లు నైవేద్యం పెట్టి మారేడు దళాలు, నాగమల్లి పువ్వులతో అర్చన చేయాలి. వేంకటేశ్వరుడికి తులసిమాల మెడలో వేసి వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించాలి.సత్యనారాయణస్వామికి ఎర్ర గోధుమనూక, జీడిపప్పు, కిస్ మిస్, నెయ్యి, పంచదార కలిపిన ప్రసాదం నైవేద్యం పెట్టాలి. హనుమంతుడికి అప్పాలంటే ఎంతో ఇష్టం. అప్పాలు నైవేద్యంగా సమర్పించి సింధూరం, తమలపాకులతో పూజించాలి.లలితాదేవికి క్షీరాన్నం, పండ్లు, పులిహోర, పానకం, వడపప్పు, చలిమిడి నైవేద్యంగా పెట్టాలి. దుర్గాదేవికి మినపగారెలు నైవేద్యం పెట్టి నిమ్మకాయల మాల అమ్మవారికి వేస్తే చాలా మంచిది.

సాధారణ సర్వసాధారణమైన లోపం ఏమిటంటే, సమర్పణలను PRASĀD అని పిలవడం. ప్రసాదం అంటే "అనుగ్రహం" మరియు అది భగవంతునికి సమర్పించిన తర్వాత మాత్రమే నైదేద్యం అవుతుంది. చాలా మందికి ఈ తేడా తెలియదు.

ఆగమ శాస్త్రం వివిధ రకాల నైవేద్యం కోసం వంటకాలను కలిగి ఉంది ఉదాహరణకు:-

పానకం - చూర్ణం చేసిన మిరియాలు మరియు ఉప్పు మరియు బెల్లం పొడితో సమాన పరిమాణంలో పెరుగు మరియు నీరు.

పరమాన్నము - పాలు, నెయ్యి, బెల్లం కలిపి వండిన అన్నం

పాయస - పచ్చి శెనగలు, బియ్యం, నెయ్యి మరియు పాలు 4 రెట్లు బియ్యం. (ఆవు పాలకు బదులుగా కొబ్బరి పాలను ఉపయోగించవచ్చు.

గూడన్నము— బెల్లంతో వండిన అన్నం

ముద్గన్న - అన్నం మరియు పచ్చి శెనగలు కలిపి వండుతారు

దధ్యోదనము - పెరుగు కలిపిన అన్నం.

క్షరన్న - అరటి, పనసపండు, మామిడి మరియు బెల్లంతో పచ్చి శనగపప్పు తో వండిన అన్నము 

సిట్రాన్న - చింతపండు-బియ్యం 

హరిద్రాన్నం - పసుపు మరియు మిరియాలు కలిపి వండిన అన్నం.

యవన్నం - బార్లీతో చేసిన వంటకం

రోజువారీ పూజలో నైవేద్యానికి ప్రత్యామ్నాయంగా కాల్చిన గింజలు లేదా ఎండిన పండ్లను ఉపయోగించవచ్చు. ప్రాసెస్ చేసిన చక్కెర కూడా సాధారణ పూజ కోసం నైవేద్యంగా పరిగణించబడుతుంది.

0005..నేటి కథ..ప్రాంజలి ప్రభ.. లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి 

ఆలుమగల హాస్యానందం!

"ఏఁవోయ్..."

"ఆఁ…"

"పులుసులో చిలగడ దుంపలు వేసావా, ఘుమఘుమలాడుతోంది?"

"కళ్ళు మూసుకుని పూజ్జేసుకుంటూ మళ్ళీ లౌకికాలు ఎందుకు?"

"కళ్ళు మూసుకున్నాను గానీ ముక్కు మూసుకోలేదుగా?"

"బానే ఉంది. ముందు పూజ కానివ్వండి".

"నైవేద్యానికి ముక్కల పులుసు బ్రహ్మాండంగా ఉంటుందనుకో. భగవంతుడికి ప్రీతికరమైనది".

"మరే... మీకు కలలోకొచ్చి చెప్పాడాయన!"

"కలలోకే రావాలేఁవిటే రాజ్జం? మనకు ఇష్టమైనవన్నీ ఆ భగవంతుడికి నైవేద్యాలే. అలా నైవేద్య రూపంలో పెడితే మనం తినేవి పూర్తిగా వంటబడతాయ్... భక్తిగా తింటాం కాబట్టి".

"ఓహో... అలాగా?"

"ఆంజనేయస్వామికి అప్పాలు, వెంకన్నకు దధ్యోజనం, చక్కెరపొంగలి, శివుడికి పాయసం, విఘ్నేశ్వరుడికి లడ్లు, కుమారస్వామికి తేనె, పాలు..."

"ఇంకా...?"

"అసలు మహానైవేద్యం అంటేనే మనకు ఇష్టమైనవి మనఃస్పూర్తిగా తినడానికేనే… ఆ భగవంతుడి పేరు చెప్పి కళ్ళకద్దుకుని ఆరగించడఁవే".

"మరి అమ్మ వారికి ఇష్టమైనవి చెప్పలేదెందుకో?"

"దుర్గమ్మకు పులిహోర, శ్రీ మహాలక్ష్మికి పూర్ణాలు..."

"అవేఁవీ కావు..."

"మరి...?"

"అమ్మ వారికి వడ్రాణ్ణం, గాజులు, కమ్మలు, వంకీలు, బుట్టలు, చంద్రహారం, జడలో చామంతి బిళ్ళ..."

"ఆపుతావా దండకం? నీకిష్టమైనవాటన్నిటికీ అమ్మవారి పేరు చెబుతావా?"

"మీకిష్టమైన వాటికి భగవంతుడి పేరు చెప్పుకోవడం లేదేంటి మరి?"

"నన్ను కాసేపు పూజ్జేసుకోనిస్తావా? అసలు నిన్ను కదిలించడం నాదీ బుధ్ధి తక్కువ".

"మీరా, నేనా కదిలించింది? శ్రావణమాసానికి ఏం చేయించుకున్నావని అమ్మాయడుగుతోంది".

"శ్రీమహావిష్ణోరాఙ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్యః బ్రహ్మణః ద్వితీయ పదార్ధే శ్వేత వరాహ కల్పే వైవశ్వత మన్వంతరే కలియుగే ప్రధమ పాదే జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య నైఋతి ప్రదేశే..."

"నైఋతి ఇక్కడ కాదు, ఈశాన్య ప్రదేశే... అని చెప్పుకోవాలి".

"నీతో ఇంకొంచెం సేపు మాట్లాడితే ప్రవర కూడా మరచిపోతాను".

****

006..నేటి కథ..ప్రాంజలి ప్రభ.. లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి 

  *భోజరాజుకు కాళిదాసు  చమత్కారస్తుతి*

      *****************************

  భోజరాజుసాహిత్యకళాపోషణము,వారి ఆస్థాన మహామహాకవి కాళిదాసులను గురించి వినని సాహితీరసజ్ఙులుండరు.

 ఒకప్పుడు భోజరాజుకు ఒకవిచిత్రమైన ఆలోచన

కలిగి, "ఒకవేళ నేను మరణించితే నీ స్పందన ఎలా ఉంటుంది?" అని కాళిదాసును పండిత సభలో ప్రశ్నించాడట.కాళిదాసు "మహారాజా! అలాంటి ఊహను నేను భరించి, స్పందించటం

అసంభవం"అని జవాబిచ్చాడట.భోజుడు తన

ఆజ్ఞను ధిక్కరించిన కాళిదాసుపై కోపించి, దేశ బహిష్కారశిక్ష విధించగా,అతడు సభను విడచి వెళ్ళిపోయెనట.

   కాళిదాసు లేని  సరస్వతీకళావిహీనమగు రాజ

సభలో ఉండలేక కొంతకాలం తరువాత భోజుడు వేగులద్వారా కాళిదాసు ఉన్నప్రాంతాన్ని తెలిసి కొని మాఱువేషంలో అక్కడికి వెళ్ళి కాళిదాసును కలవగా, మాటల సందర్భములో  కాళిదాసు అతనిని "అయ్యా! తమరే ప్రాంతనివాసులు? ఇక్కడకు మీ రాక కారణమేమిటి?" అని ప్రశ్నిం చాడట.మాఱు వేషంలోని రాజు తాను ధారా నగరంలో నివసించే పండితుడననీ,అచ్చోట భోజరాజు మరణించాడనీ,కళావిహీనమై ఆ నగరాన్ని వీడి దేశంలో పర్యటిస్తున్నాననీ పలికి

నాడట.

   వెంటనే కాళిదాసు హృదయం అత్యంత శోక  తప్తమై ఆయన వాక్కునుండి వెలువడిన శ్లోక

మిది.

    "అద్యధారా  నిరాధారా నిరాలంబా సరస్వతి౹

    పండితాః ఖండితాస్సర్వే భోజరాజే దివంగతే౹౹"

   భావము: ఈ రోజు ధారానగరము నిరాధార

మైనది.సరస్వతీదేవికి ఆలంబనము లేక దీనం గాఉన్నది.అనేకమంది పండితుల శిరస్సులు ఖండించబడినట్లుగ అయినది.భోజరాజు లేక పోవుటయే ఈ అనర్థాలన్నింటికీ కారణము.

      ఈ శ్లోకశ్రవణముతో భోజరాజు హృదయము పరవశించింది.మేను పులకరించింది.వెంటనే

అతడు తన మాఱురూపమును తొలగించగా,

కాళిదాసు మహానందభరితుడై , అమంగళకర

మైన తన శ్లోకంలోని ఒక్కొక వాక్యంలో రెండు

అక్షరాలను మాత్రమే మార్చి ఇలా చెప్పాడు.

         అద్య ధరా *"సదా"* ధారా

       *"సదా"* లంబా సరస్వతి ౹

         పండితాః *"మం"* డితాస్సర్వే

         భోజరాజే *"భు"* వంగతే౹౹


  భావము:ఈ రోజున ధారానాగరము సరస్వతీ దేవి  నిత్యాలంబనముతో  సదా శోభిల్లుచున్నది. భోజరాజు భువిపైన ఉన్నంతకాలము పండితు లందఱూ అఖండ  శోభతో సంభావించబడు     తూనే ఉంటారు.

   ఈ శ్లోకములోని మొదటిపాదంలో *నిరా* ను

*"సదా"* గాను, రెండవ పాదంలో *ఖం* ను

  *"మం"* గను, *ది* ను *"భు"* గను మాత్రమే

మార్పు చేయుటచే భావము శుభకరంగ మార్పు

చెందుట విశేషము.

   భోజరాజు హర్షపులకితుడై కాళిదాసును తిరిగి

తనవెంట ధారానగరమునకు సగౌరవముగా

తోడ్కొని పోయెనట.

    విపులార్థమును చిన్నవాక్యములో ఛందోబద్ధం

చేయటం సంస్కృతవాణికే సాధ్యము.ఇటువంటి

సంస్కృత శ్లోకాలు ఎన్నో ఉన్నవి.

 卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐


07..నేటి కథ..ప్రాంజలి ప్రభ.. లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి 


*అమెరికా ఖరీదైన దేశం, కానీ దాని పౌర సేవలు అత్యున్నత ప్రమాణాలు.*


 *వేసవిలో, తెలంగాణ లోని వరంగల్ నుండి ఒక కుటుంబం సెలవు కోసం యుఎస్ వెళ్ళింది.  అందులో ఒక జంట, వారి ఇద్దరు పిల్లలు మరియు ఆ వ్యక్తి తండ్రి ఉన్నారు.*


*న్యూయార్క్ నగరంలో మూడు రోజుల తర్వాత, వారు నయాగరా జలపాతానికి వెళ్లేందుకు కారును అద్దెకు తీసుకున్నారు.  NYC నుండి నయాగరా వరకు ఉన్న ఇంటర్‌స్టేట్ హైవే అద్భుతంగా ఉంది.*


 *వారి వెనుక కారులో ఒక 80 పైబడిన వయస్సు గల అమెరికన్ మహిళ వస్తుంది.*

 *భారతీయ పిల్లలు వెనుక  సీటుపై మోకరిల్లి, వెనుకకు చూస్తూ, నవ్వుతూ, వెనక్కి ఊపుతూ వెనుక కారులో వస్తున్న అమెరికన్ లేడీకి చేతులు ఊపుతూ ఉంటారు.*

*అకస్మాత్తుగా అమెరికన్ లేడీ కి ముందు కారులో ప్రయాణిస్తున్న భారతీయుల కారు వెనుక సీటు కిటికీలో నుండి ఒక వృద్ధ భారతీయుడి తల బయటకు వచ్చి రక్తం వాంతి చేసుకోవడం చూసింది.*

*ఆమె తన కారును పక్కన ఆపి వెంటనే సహాయం కోసం 911కి కాల్ చేసింది.*

*వెంటనే, ఆకాశంలో ఎయిర్ అంబులెన్స్ హెలికాప్టర్ కనిపించింది.  అది ఒక మైలు ముందుకి దిగి, కారును ఆపమని భారతీయ కుటుంబానికి సంకేతాలు ఇచ్చింది మరియు శిక్షణ పొందిన వైద్య సిబ్బంది వృద్ధుడిని దాదాపు ICUలో ఉన్న ఛాపర్‌లోకి తీసుకెళ్లారు.  ఆక్సిజన్ సరఫరా ప్రారంభమైంది.*

*హృదయ స్పందన రేటు మరియు ఇతర పారామితులు పర్యవేక్షించబడ్డాయి.  సూచనలను అందించడానికి జాన్ హాప్‌కిన్స్ నుండి ఒక స్పెషలిస్ట్ MD వీడియో కాల్‌లో ఉన్నారు.*

*అరగంటలో, వృద్ధుడు క్షేమంగా ఉన్నాడని మరియు మళ్లీ ప్రయాణించడానికి సరిపోతాడని ప్రకటించారు.*

*అమెరికన్ లేడీ 👍 త్వరిత సహాయం మరియు సమయానుకూల చర్యకు అభినందనలు!*

*ఈ సేవల కోసం, వ్యక్తి నుండి $ 5,000 డాలర్లు వసూలు చేయబడింది..*

*ఒక భారతీయ కుటుంబానికి ఇది చాలా డబ్బు.*

*ప్రణాళికేతర ఆర్థిక ఖర్చులతో, ఆ వరంగల్ వ్యక్తి షాక్‌కు గురయ్యాడు మరియు అతని తండ్రిని తిడుతూ..*

  *"పాన్ (కిళ్ళీ) తిని కారులోంచి ఉమ్మివేయాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు?"*

****

008..నేటి కథ..ప్రాంజలి ప్రభ.. లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి

😂 *సరదాగా నవ్వుకోండి.*😂

😂 *జైలర్: ఈరోజు నిన్ను ఉరి తీస్తారు. నీ చివరి కోరిక ఏంటో చెప్పు..?*

*ఖైది: నా బదులు మీరేస్కోండి... సార్...!*

😂 *"ఏమండీ మన బాబు నిద్రలో జడుసుకుంటున్నాడు...."*

*"వాడి పెళ్ళాం ఎక్కడో పుట్టినట్టుందిలే..నువ్వు పడుకో.."*

😂 *బస్సులల్లో ఆడవారు కూరుచ్చునే వైపు "ఆడవాళ్ళని గౌరవించండి".. అని వ్రాశారు సరే...*

*అలాగే మగ వాళ్లు వైపు "మగ వాళ్ళను గౌరవించండి"... అని రాయాలి కాదా..*

*కానీ మావైపెమో.... "దొంగలున్నారు జాగ్రత్తా".. "టికెట్ లేని ప్రయాణం నేరం" అని రాస్తారా ఇది అన్యాయం కాదా.!!*

😂 *"టీచరుకిచ్చి పెళ్ళి చేసి నా గొంతు కోశారు" భోరుమంది సుశీల.*

*"ఏవైందమ్మా... నిన్నేమన్నా అన్నాడా..?" అడిగింది తల్లి. "నిన్న వడ్డించిన కూరలో కాస్త ఉప్పు తక్కువైందని ఆ కూరను పదిసార్లు వండమన్నాడు"  చెప్పింది సుశీల.*

😂 *భార్య : గత 4 సంవత్సరాలుగా నేను వ్రతాలు ఏవీ చేయడం లేదు...*

*భర్త : ఇప్పుడేమైంది..*

 *భార్య : అయినా మీరు ఆరోగ్యంగా ఉన్నారు..!!*

*భర్త : అవును..నేను ఆరోగ్యం పై చాలా శ్రద్ధ తీసుకుంటుంటాను.*

 *భార్య : నేనేం వెర్రి దానిలా కనిపిస్తున్నానా.. తిన్నగా నిజం చెప్పు..ఎవర్తది..నీ ఆరోగ్యం కోసం పూజలు, వ్రతాలూ చేస్తున్నది. ?* 

*వామ్మో...భర్త వెర్రి చూపులు చూస్తున్నాడు..*

😂 *భార్యాభర్తలైన సుబ్బారావు, సుందరి ఏడు గంటలు ఏకధాటిగా దెబ్బలాడి అలసిపోయారు. చివరికి..*

*సుబ్బారావు- ".. సరే, పైన దేవుడున్నాడు... నాది తప్పయితే నేనే పోతాను.." అన్నాడు రొప్పుతూ.          "గుళ్లో అమ్మోరుంది.. నాది తప్పయితే నా పసుపు కుంకాలే పోతాయిలే..." ముక్కు చీదుతూ అంది సుందరి.*

😂 *ఇదిగో అక్కా !  పక్కింటాయన కోమా లోకి వెళ్ళాట్ట తెలుసా!*

*అవునా ! ఈ డబ్బున్నోళ్లు ఎక్కడికైనా వెళతారమ్మా!*

😂 *కట్నం ఎందుకు తీసుకుంటారో ఇప్పుడు నాకు అర్ధం అయ్యింది. పెళ్లి జరిగిన తర్వాత భార్య పెట్టే మానసిక సమస్యలకు "నష్ట పరిహారంగా" భర్త కట్నం తీసుకుంటాడు.*

😂 *భార్య : ఏవండీ..కొన్నేళ్ల కిందట నేను పెప్సీ బాటిల్ లా సన్నగా.. నాజుగ్గా ఉండేదాన్ని కదా...*

*భర్త : ఇప్పుడు కూడా నువ్వలానే ఉన్నావ్ డియర్..*

*భార్య (ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ) నిజమా!!..*

*భర్త : అవును..కాపోతే అప్పుడు 200ml బాటిల్..ఇప్పుడు 2.5ltr బాటిల్.. అంతే.*

*భార్య : సచ్చినోడా..*


😂 *మొగుడు: పండగకి చీర కావాలా? చుడీదార్ కావాలా?*

*పెళ్లాం: నాదేం ఉంది మీకు ఏది ఉతకడానికి సులువుగా ఉంటుందో అదే కొనివ్వండి.*


😂 *ఏవోయ్ రామారావు ఎనిమిదైంది, అసలేకొత్తగా పెళ్ళయింది, ఇంకా ఆఫీసులోనే పనిచేస్తూ ఉన్నావు ఇంటికి వెళ్ళాలనిపించడం లేదా? అని అడిగాడు ఆఫీసర్. ఏం లేదు సార్, మా ఆవిడ కూడా ఉద్యోగం చేస్తుంది. “ముందుగా ఎవరైతే ఇంటికి చేరుతారో వాళ్ళు వంట చేయాలి” రహస్యం చెప్పాడు రామారావు.*


😂 *భర్త : నీ చీర పని మనిషికి ఇచ్చావా?*

*భార్య :  అవును.. ఏమైంది?*

*భర్త : వంటింట్లో ఉంటే నువ్వే అనుకుని వెళ్ళి..*

*భార్య : ఆ.. అనుకుని.. వెళ్ళి.. ఏమైంది.. త్వరగా చెప్పండి.. ఏంచేశారు?*

*భర్త : నీకెందుకు శ్రమ తప్పుకో అని అంట్లన్నీ నేనే కడిగేశా!!* 

*సర్వే జనా సుఖినోభవంతు.🙏🙏*           సేకరించినది

***

  *నృసింహ జయంతి:*

క|| *ఇందు గల డందు లేడని*

*సందేహము వలదు, చక్రి సర్వోపగతుం,*

*డెం దెందు వెదకి చూచిన,*

*నందందే కలడు, దానవాగ్రణి!**వింటే.


తండ్రీ ! శ్రీమన్నారాయణుడు లేని ప్రదేశము ఉన్నదా? ఎక్కడ ఎక్కడ వెతికి చూస్తే అక్కడ ఉంటాడు నారాయణుడు. వ్యాపకత్వముచేత అన్నిటియందు నిండి నిబిడీకృతమై ఉంటాడు అన్నాడు. *ఓహో! అలాగా ఈ స్తంభములో ఉంటాడా?* అన్నాడు ఇప్పుడు వస్తున్నది నరసింహావతారము. పిల్లవాడు *అంతటా ఉన్నాడు ఉన్నాడు* అంటున్నాడు. హిరణ్యకశిపుడు మూడు వేళ్ళు ముడిచి చూపుడు వేలు పైకి తీసి చూపిస్తూ ఎక్కడో ఆపుతాడు. ఆ వేలు ఎక్కడ ఆగితే అక్కడనుండి పైకి రావాలి. రాకపోతే తనని నమ్ముకున్న భక్తుని మాట వమ్మయిపోతుంది. రావడము అంటూ జరిగితే శంఖ, చక్ర, గద, పద్మములు పట్టుకున్న శ్రీమన్నారాయణునిగా వచ్చి హిరణ్యకశిపుని సంహారము చెయ్యడానికి బ్రహ్మగారు ఇచ్చిన వరము ప్రతిబంధకము. ఆయన ఎన్ని వరములు ఇచ్చాడో అన్నివరములకు మినహాయింపుగా రావాలి. అన్నివరములకు మినహాయింపుగా ఎక్కడనుండి రావాలో తనచేతిలో లేదు. హిరణ్యకశిపుడి వేలు ఎక్కడ ఆపితే అక్కడనుండి రావాలి.

మ|| ' *హరి సర్వాకృతులం గలం ' డనుచు బ్రహ్లాదుండు భాషింప స

త్వరుడై ' యెందును లేడు లే ' డని సుతున్ దైత్యుండు తర్జింప శ్రీ

నరసింహాకృతి నుండె నచ్యుతుడు నానాజంగమస్థావరో

త్కరగర్భంబుల నన్ని దేశముల నుద్దండ ప్రభావంబునన్!

బ్రహ్మాండము అంతా నారసింహము అయిపోయి విష్ణుతత్వము అన్నిటిలోకి చేరిపోయింది నరసింహావతారముగా. అన్నిటా నిండిన నారసింహతత్వము ఎలా ఉంటుందో ఊహించాలి. హిరణ్యకశిపుడు వేలు తిప్పుతూ స్తంభమును చూపించి *ఇందులో ఉన్నాడా?* అన్నాడు. అంటే *మళ్ళీ అదేమాట అడగవద్దు అంతటా ఉన్నాడు అంటే ఉంటే వస్తాడా అని అడిగితే వస్తాడు* నాన్నా అన్నాడు అయితే పిలవమని అన్నాడు. కొడుకు మాట కాదని నిరూపించాలి. కొడుకు మాట నిలపెట్టాలని పరమేశ్వరుడు. ఇది ఆయన దయ. పిల్లవాడు ధైర్యముగా ఉన్నాడు పరమేశ్వరుడంటూ మాట్లాడుతున్నాడు. అతని మాట నిలబెట్టడానికి బ్రహ్మాండమంతా నారసింహము అయిపోయింది. ఆస్తంభమును ఒక్కదెబ్బ కొట్టి *రమ్మను ఇందులోనుండి* అన్నాడు. అలా అనడముతోనే పెళపెళా శబ్దములు చేస్తూ ఆస్తంభము బద్దలయి అందులో నుండి విస్ఫులింగములు పైకివచ్చి పెద్ద కాంతిమండలము కనపడి కన్నులతో చూడలేనంత భయంకరమైన తేజస్సు ఒకటి బయటికి వచ్చింది. అందులోనుండి పట్టుపుట్టము కట్టుకుని స్వామి నిలబడ్డారు. భయంకరమైన గర్జనచేస్తూ ఆయన పాదములు తీసి, వేస్తుంటే ఆయన వేగమునూ, వత్తిడినీ తట్టుకోలేక వేయిపడగలుగల ఆదిశేషుడు సార్వభౌమము మొదలైన దిగ్గజములు కూడా భూమియొక్క బరువుని ఓర్చలేక తలలు వంచాయి. ఆయన పాదములలో శంఖ , చక్ర, పద్మరేఖలు, నాగలి , అమృతభాండము మొదలైన దివ్యమైన చిహ్నములు కనపడుతున్నాయి. బలిష్ఠమైన మోకాళ్ళు, ఐరావతముయొక్క తొండమువంటి బలిష్ఠమైన తొడలు, సన్నటి నడుము, దానికి పెట్టుకున్న మువ్వల వడ్డాణము, చప్పుడు చేస్తున్న గంటలు, మెడలో వేసుకున్న హారములు, నృసింహాకారము పైన సింహముయొక్క ముఖము, పెద్ద దంష్ట్రలు భయంకరమైనవాటిని తెగకోయగలిగిన నాగళ్ళు ఎలా ఉంటాయో అటువంటి దంత పంక్తి. అదిరి పడిపోతున్న పెదవులు. మంధరపర్వత గుహలను పోలినటువంటి నాసికారంధ్రములు. పుట్టలోనుండి పైకివచ్చి కోపముతో ఊగుతున్న నాగుపాము ఎలా ఉంటుందో? అలా ఆడుతున్న నాలుక. కోటిసూర్యుల ప్రకాశముతో గురిచూసి చూస్తున్న వెలిగిపోతున్న కన్నులు. నిక్కపొడుచుకున్న వెంట్రుకలు. పెట్టుకున్న పెద్దకిరీటము. అనంతమైన బాహువులయందు ఆయుధములు పట్టుకుని మహానుభావుడు అడుగుతీసి అడుగు వేస్తూవస్తూ పెద్దగర్జన చేస్తూ తల ఇటూ అటూ ఊపితే కేసరములు కదలి విమానములో వెడుతున్న దేవతలు భ్రంశమై విమానములనుండి కిందపడిపోయి, ఆ మేఘములన్నీ కొట్టబడి, పర్వతములు అన్నీఘూర్ణిల్లి, సముద్రములన్నీ పొంగిపోయి, భూమండలమంతా కలతచెంది స్వామి నరసింహావతారము వచ్చింది. ఇప్పటివరకు విష్ణుమూర్తి ఉగ్రతత్వమును పొందనటువంటి విష్ణుమూర్తి అపారమైన కోపముతో తన పరమ భక్తుడైన ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు నిగ్రహించాడన్న కోపమును ఆపుకోలేక ఉగ్ర నృసింహావతారమై వచ్చాడని లోకమంతా భీతిల్లిపోతే 33 కోట్లమంది దేవతలు ఆకాశములో నిలబడి స్థోత్రము చేస్తుంటే హిరణ్యకశిపుడు గదాదండముతో స్వామి చుట్టూ తిరిగి కొట్టడానికి ప్రయత్నిస్తుంటే దేవతలు విడిచిపెట్టకుండా సంహరించమని అంటే, పెద్దగర్జన చేస్తూ వెళ్ళి హిరణ్యకశిపుని డొక్కలదగ్గర పట్టుకుని పైకిఎత్తి కలుగులోకి పారిపోతున్న ఎలుకని నాగుపాము పట్టుకున్నట్లుగా పట్టుకుని పడగ పైకి ఎత్తితే ఎలా ఉంటుందో అలా పైకి ఎత్తి గడప దగ్గరకు తీసుకుని వచ్చి ఇంట్లో కాదు బయటా కాదు గడప మీద, పగలూ కాదు, రాత్రి కాదు,  ప్రదోషవేళ, ఏ ఇతరమైన ప్రదేశము కాక పంచె పైకితీసి తొడల మీద పెట్టుకుని, పంచ కట్టి ఉంటే దిక్కులు ఉంటాయి, కానీ పైకితీస్తే దిక్కులు ఉండవు. అదొక శాస్త్రము. ప్రాణము ఉన్నది ప్రాణము లేనిదీ కాదు గోళ్ళు, జంతువుకాదు, పాముకాదు, ఆయుధము కాదు, అస్త్రము శస్త్రము కాదు, రాక్షసులు దేవతలు కాదు, యక్షులు, గంధర్వుల, కిన్నెరలు,కింపురుషులు, నరుడు కాదు నరసింహమై గంగానది సుడితిరుగుతున్నట్లుగా ఉన్న నాభి కనపడుతుండగా విశాలమైన వక్షస్థలముతో పెద్ద దంతములతో దగ్గరగా చూస్తుంటే ఆయన ముఖము వంక చూసి మృత్యువు ఆసన్నమైనదని తెలివితప్పి తల వాల్చేసిన హిరణ్యకశిపుని తొడల మీద వేసుకుని పెద్దగా పెరిగిన గోళ్ళు కడుపులోకి దగ్గర పట్టుకుని అలా పైకిఎత్తి గడప దగ్గరకు తీసుకునివచ్చి ఇంట్లోకాదు, బయటా కాదు గడప మీద, పగలూ కాదు, రాత్రి కాదు, ప్రదోషవేళ,  ప్రాణము ఉన్నది ప్రాణము లేనిదీ కాదు గోళ్ళు, జంతువుకాదు, పాముకాదు, ఆయుధము కాదు, అస్త్రము శస్త్రము కాదు, నరుడు కాదు నరసింహమై గంగానది సుడితిరుగుతున్నట్లుగా  తల వాల్చేసిన హిరణ్యకశిపుని తొడల మీద వేసుకుని పెద్దగా పెరిగిన గోళ్ళు కడుపులోకి దింపి చీల్చి గోళ్ళని గొడ్డళ్ళుగా చేసి వక్ష:స్థలములో ఉన్న ఉర: పంజరములోని ఎముకలు అన్నిటినీ కోసేసి పటపట విరిచి పేగులు తీసి మెడలో వేసుకుని ధారలుగా కారుతున్న నెత్తురు దోసిళ్ళతోపట్టి త్రాగి ఒళ్ళు, బట్ట , కేసరములు అన్నీ నెత్తుటితో తడిసిపోతే అక్కడ ఉన్న రాక్షసగణములన్నిటినీ చంపి పెద్దశబ్దము చేస్తూ డొల్లబడిన హిరణ్య కశిపుని శరీరమును విసరివేసి భయంకరాకృతితో నడుస్తుంటే బ్రహ్మాది దేవతలు స్థోత్రము చేసారు. ఏమి నారసింహ అద్భుత అవతారము? ఇంతమంది స్థోత్రము చేస్తే ఆయన ప్రసన్నుడు కాలేదు. ఉగ్ర భావనతో ఊగిపోతున్నాడు. లక్ష్మీదేవిని చూసి *అమ్మా నీవు నిత్యానపాయినివి ఆయన వక్ష:స్థలములో ఉంటావు. నిన్ను చూస్తే ప్రసన్నుడౌతాడు తల్లీ దగ్గరకు వెళ్ళమని* అన్నారు.

ఆమె *నా భర్త ముఖము పూర్ణచంద్రబింబములా ఉంటుంది. ఇంత కోపముగా నేనెప్పుడూ చూడలేదు, నేనుకూడా దగ్గరకు వెళ్ళను* అన్నది. శ్రీమహావిష్ణువు అవతారములలో లక్ష్మీదేవి దగ్గరకు వెళ్ళనటువంటి అవతారము నరసింహావతారమే. అందరూ భయపడుతుంటే *ప్రహ్లాదా! నీ గురించి వచ్చినదే ఈ అవతారము నీ స్వామి దగ్గరకు వెళ్ళి ప్రసన్నుని చెయ్యమని* అన్నారు. చిన్న పిల్లవాడయిన ప్రహ్లాదుడు స్వామి వద్దకు వెళ్ళి పాదములను పట్టి నమస్కరించి *పైన సింహముగా కింద నరుడిగా వచ్చి, పెద్దనోరుతో, గోళ్ళతో, గర్జన చేస్తే భయపడిపోతామని అనుకుంటున్నావా? నీకన్నా భయంకరమైనది లోకములో ఉన్నది దాని పేరు సంసారము. దానికి భయపడతాము గాని నీకు భయపడతామా?* అన్నాడు. *బ్రహ్మాది దేవతల తలమీద పెట్టని చెయ్యి, లక్ష్మీదేవి ఒంటి మీద పడితే పొంగిపోయే చెయ్యి, పరమ భక్తుడిని అని పేరుపెట్టి ఏమీతెలియని అర్భకుడిని అయిన నాతల మీద చెయ్యిపెట్టి నాకోసము పరుగెత్తుకు వచ్చి నా మాట నిలపెట్టడానికి స్తంభమునుండి వచ్చి నా తండ్రిని సంహరించిన నీ హృదయములో ఎంత కారుణ్యము ఉన్నదో నాకు తెలియదు అనుకుంటున్నావా? అరిస్తే భయపడతాను అనుకుంటున్నావా? పరమేశ్వరా నీకు నమోవాక్కములు* అని స్థోత్రము చేసాడు. పరవశించిననరసింహస్వామి పరమ ప్రసన్నుడై ప్రహ్లాదుని ఎత్తుకుని తన తొడమీద కూర్చోపెట్టుకుని "నీ భక్తికి పొంగిపోతున్నాను ఏమి వరముకావాలో కోరుకోమని" అన్నాడు. అంటే మళ్ళీ నన్ను మాయలో ముంచుదామని అనుకుంటున్నావా? నాకెందుకు వరాలు? నాకు ఎందుకు కోరికలు? ఏకోరికా లేదు. నీపాదములయందు నిరతిశయ భక్తి కలిగి ఉంటే చాలు. నా తండ్రి అమాయకముతో నీకు వ్యతిరేకముతో బతికాడు ఆయనకు ఉత్తమగతులు కలిగేటట్లుగా అనుగ్రహించమని వేడుకుంటే ఏనాడు పట్టుకుని పైకిఎత్తి తొడలమీద పెట్టుకున్నానో, నీ తండ్రి నావంక చూసి ఎప్పుడైతే స్తబ్దుడైనాడో నాగోళ్ళతో చీల్చి నెత్తురు తాగానో, ఆనాడు నీ తండ్రే కాదు అంతకుముందు 21 తరములు తరించాయి. ప్రహ్లాదా నీవు బెంగపెట్టుకోవద్దు. నీకు ఆశీర్వచనము చేస్తున్నాను. దీర్ఘాయుష్మంతుడవై రాజ్యమును ధార్మికముగా పరిపాలించి పరమ భాగవతోత్తముడవై అంత్యమునందు నన్ను చేరుకుంటావు. నీకధ ఎక్కడ చెప్పబడుతుందో, ఎక్కడ వినపడుతుందో, అక్కడ నేను ప్రసన్నుడ నవుతాను. ఎంతో సంతోషిస్తాను. సభామంటపములోని వారందరికీ నా ఆశీర్వచనము పరిపూర్ణముగా లభిస్తుంది. దానివలన రోగములు సమసిపోయి అందరూ ఉత్తమగతులు పొందుతా" రని ప్రహ్లాదోపాఖ్యానమునకు శ్రీమహావిష్ణువే ఫలశృతి చెప్పారు🙏🏻🕉️👏 *మీకూ మరియూ మీ కుటుంబ సభ్యులకూ శ్రీలక్ష్మీనృసింహ జయంతి శుభాకాంక్షలతో*🙏🏻🕉️👏