001 .. సోహం, 002. శ్రీ-అంటే, స- అంటే, తి-అంటే...?, ౦౦౩..*నక్క పిల్ల-కుందేలు* 004 .మంచినీ, సంకల్పాన్నీ తట్టిలేపే కథ, 005 .గడ్డి నీలం రంగులో, 006. *చీకటి..007*నాలో నేను .. (2 ), 008 ..శ్వేతాశ్వతరోపనిషత్తు, 009 ..సత్పురుషుల సాంగత్యం, 010-సిధ్ధభూమిక, 011 .....అత్తా.. కోడలు కథ, 012 మీ సంతోషాలను ఎవరితో, 013 *ప్రతీ ఏరియా లో బ్రాహ్మణ సంఘాలు,014 ఒక ఇల్లు తగలబడి పోతోంది, 015 *మన పిల్లలు ఇంటర్ తర్వాత ...... ???*
016 మూడు కలలు -- చందమామ కథలు..,017 . *గోవు మరియు గేదె పాలల్లోని తేడా,
018*ఆవు వీపు పైన ఉండే "సూర్య కేతు నాడి" 019*ప్రవర ఎలా చెప్పాలి...?*020మనస్సు* ** 023*నేటి కధ నాలో నేను .. 024*నేటి కధ నాలో నేను .. 025 ఓం సదాశివ పతివ్రతాయై నమః
సోహం ఓం రెండు ఒకటే. సో అనే అక్షరంలో స ని తీసివేస్తే ఓ ఉంటుంది హం లో హ ని తీసివేస్తే o ఉంటుంది. రెంటిని కలిపితే ఓం అవుతుంది. ఓం కారం కంటే సోహమే సులభమైంది. శ్వాసతో కలిపి మనసుతో భావన చేయాలి. అందుకే ఇది సోహం ధ్యానం కాదు సోహం భావన లేదా హంస భావన అని అంటారు. ఈ జపాన్ని కష్టపడి చేయాల్సిన పనిలేదు కేవలం శ్వాస మీద ధ్యాస పెట్టి, ఉచ్వాస నిశ్వాసాలను గమనిస్తే చాలు.
హంసోహం అని పునరావృతమవుతూ ఉంటుంది. దానికంటే ముందు నేతి నేతి ఇది కాదు ఇది కాదు అనే వేదాంత వాక్యం ద్వారా ఈ దేహం నేను కాదని, "నాహం ఇదం శరీరం" దేహాన్ని మరియు పంచ కోశాలను నేను కాదని నిరసించాలి. నేను పాంచ భౌతికమైన దేహం కాదు నేను ఆత్మను, పరమాత్మా స్వరూపమని భావించాలి.
ఈ మంత్రాన్ని లోపలున్న జీవుడు లేదా ఆత్మ రోజుకి 21,600 సార్లు పునరావృతం చేస్తూ ఉంటుంది. గాఢనిద్రలో కూడా దానంతట అదే ఈ అజప జపం జరుగుతూ ఉంటుంది.
ఉచ్వాస నిశ్వాసాలను ఏకాగ్రతతో గమనిస్తే ఈ మంత్ర శబ్దం వినవచ్చు. గాలి లోపలకి పీల్చినపుడు ఉచ్వాసంలో సో అని వదిలినపుడు హం అనే శబ్దం వినిపిస్తుంది.
దీనినే అజప జపమని అంటారు ఎందుకంటే నోరు తెరవకుండా పెదవులు కదపకుండా మనసుతో భావన చేసేది.
సహజంగానే పరమాత్మ మనకొక వరం ఇచ్చారు. సంధ్యాకాలంలో మనం కనుక మేలుకొని హంసను గమనిస్తూ వుంటే, మన ప్రాణాన్ని గమనిస్తూ వుంటే, సుషుమ్న నాడిలో హంస కొట్టుకోవడం గమనించవచ్చును. ఇడా పింగళ, మధ్యలో సుషుమ్న నాడి వుంటుందన్నమాట. ఆ సుషమ్నా నాడిలో ఒక్క క్షణం పాటు హంస కొట్టుకుంటుంది. ఎప్పుడూ అందులో కొట్టుకోదు, ఇడాపింగళలో కొట్టుకుంటుందన్నమాట. ఈ సుషుమ్నానాడిలో ఆ క్షణం పాటు ఎప్పుడైతే కొట్టుకుంటుందో, ఆ కొట్టుకునే క్షణంలోనే మనం తెలుసుకోగలమట ఆత్మజ్ఞానాన్ని. ఆత్మసాక్షాత్కారం అప్పుడు జరుగుతుంది. ఒక్క క్షణంలో, ఒక్క రెప్పపాటులో జరిగిపోతుంది అది. ప్రతిరోజూ వుంది మనకు ఆ అవకాశం. ఎవరు చెప్పినా అదే. 6 గంటలకు చేయండి, 5.30కు చేయండి. బ్రహ్మముహూర్తంలో లేవండి, ఏమిటి? లేచి ఏం చేయాలి? ఇది చేయాల్సిన పని. ఐదు గంటలకు లేచానండి, మళ్ళా అటూ ఇటూ దొర్లానండి. అది కాదండీ అక్కడ విషయం.
లేచిన తరువాత ప్రాణాన్ని గమనించవయ్యా! ఇడ, పింగళ, సుషుమ్న పైకి క్రిందకి ఎలా కొట్టుకొంటోంది? కుడిలోంచి వెళ్ళింది. ఎడమకు తిరిగి వచ్చింది. మళ్ళా ఎడమలోంచి వెళ్ళింది, కుడికి తిరిగి రావాలి. కానీ అలా రావడం లేదు. ప్రయత్నం చేసి అలా శ్వాసను త్రిప్పుకో. తిప్పుకుంటే మధ్యలో సుషుమ్నా నాడి అలా తగుల్తుందన్నమాట. తగిలినప్పుడు నీకు ఆ స్పర్శయొక్క భేదం తెలుస్తుంది. ఇడా పింగళలో హంస పనిచేస్తే ఎలా వుంది? సుషుమ్నలో వుంటే ఎలా ఉందొ తెలుస్తుంది? మనలో చాలా మందికి ఉదయం అస్సలు ధ్యానం కుదరడంలేదని సమస్య. అయితే మనం అప్పుడే ధ్యానం వగైరాల జోలికి వెళ్ళకూడదు. ముందు ప్రాథమిక ప్రయత్నం చేయాలి. మన అందరికీ ఏమిటంటే, అక్షరాభ్యాసం లేదు పై క్లాసువుంది. ఈ అక్షరాభ్యాసం లేకుండా ఆ పై క్లాసు రాదు. ముందు మనకు ప్రాధమిక అభ్యాసం set right అవ్వాలి.
శాన్తాయ దాన్తయ గురుభక్తాయ హంస హంసేతి|| (హంసోపనిషత్)
- హంస హంస అను పరబ్రహ్మ స్వరూపము జితేంద్రియుడగు గురుభక్తునకు తెలియబడుచున్నది.
భావాభావాతీతమైన సొగసా
ఊపిరిని వదలని గొలుసా
నీకు ముడిపడినది మనసు తెలుసా
ఈ కనుల మెరుపులా వరస
బాహ్య మధ్య అంతర రభస
ఇది మలుపు వెలుగుల దశ
నీవేలే పైకి కిందకి ఎగిరే హంస
అందుకొని గగనపు కొనలే చూసా
ఇంకేమి అవసరం లేదు
గురువాక్యమిది చాలు
ఇడా పింగళ నాడుల మధ్యన సుషుమ్న నాడి ఉంటుంది.
ఈ ఇడా పింగళ
రెండు నాడులు రెండు శబ్దాలను చేస్తాయి.
నాభి చక్రమైన అనాహతం నుండి ప్రాణ వాయువు సుషుమ్న నాడి యందు ప్రవిశించినపుడు , మనకి జీవుడు చేసే శబ్దం లేదా అజపం వినపడుతుంది.
అదే సోహం.
ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులు బోధించే మంత్రమిది.
ఇదే ఆఖరి మంత్రం , అత్యున్నత మంత్రం,
అజపా మంత్రం, హంస అని అంటారు. జీవాత్మా పరమాత్మతో ఐక్యమవడానికి ఉపయోగపడే మంత్రమిది.
సోహం = సః + అహం
సః" అంటే ఆ పరమాత్మా / తాను , ఇడా నాడి చేసే శబ్దం
అహం" అంటే జీవాత్మ / నేను.
పింగళ నాడి చేసే శబ్దం.
సః అహం ఈ రెండు కలవడమే జీవబ్రహ్మాఇక్యం.
అదే చిన్ముద్ర సూచన , చూపుడు వేలు బొటన వేలితో కలిపి మౌన వ్యాఖ్య చేస్తారు.
జీవుడు లోపల నిరంతరం సోహం సోహం అని ధ్యానిస్తూ ఉంటాడు.
ఉచ్చ్వాస- ముక్కులోకి శ్వాస పీల్చినపుడు "సో" అని
నిశ్వాస- శ్వాస వదిలినపుడు " హం" అని లోపల వినపడుతుంది , కాబట్టి మనసులో నిత్యం స్మరించాలి , నోటితో జపించరాదు , పలకరాదు.
ఏమీ తెలియదని తెలుసుకోవడమే జ్ఞానం హంస భావనే అభ్యాసం గుర్తెరిగే శరీరం ఏమి లేదనుటే వైరాగ్యం ఆత్మ / పరమాత్మ నేనని అనుభవమే ఆరూఢమ్
చిత్తము నిలుపుటే యోగం అంతా ఉత్తదనుటే ఉత్తమం
వాదులాడక ఉరుకుంటే సుఖం
నిశ్శబ్దమే భజన మౌనమే బ్రహ్మ ధ్యానం
నిద్దురలో నిద్దూరే బ్రహ్మ నిర్వాణం
నిర్వికల్ప సమాధిలోనే బ్రహ్మ తత్త్వం
ఆత్మానుసంధానమే మోక్షం
జన్మ రహితమే పరమార్థం
జీవజగదీశులు స్వప్నం
నీవేకమని గుర్తెరిగితే ఆనందం
స్వానుభవమే సత్యం.
మనసే బంధం
మరుపే మరణం
గురువే దైవం.
ఒకసారి పాలసముద్రం శేషపాన్పుపై శ్రీ మహావిష్ణువు లక్ష్మీసమేతుడై ఉండగా, అనుకోకుండా పార్వతీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవిని చూడటానికి వైకుంఠానికి వచ్చారు. అల్లంతదూరాన వారిని చూసిన లక్ష్మీదేవి, భర్త అనుమతితో ఆయన పాదాలను వొత్తడం ఆపి, శేషపానుపు దిగి వారిద్దరినీ సాదరంగా ఆహ్వానించింది. ముగ్గురు సమీపంలోని ఓ ఉద్యానవనానికి వెళ్లి, ఓ చంద్రకాంత శిల మీద ఆసీనులై ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకోసాగారు. వారలా మాట్లాడుకుంటుండగా, దూరంగా నారదుడు వస్తుండటం కనిపించింది. నారదుడు కూడా వీరిని చూశాడు.
ఇంకేం.. కలహభోజనుడు తనకు కావలసినంత కాలక్షేపం దొరికిందనుకున్నాడు. త్రిమూర్తుల భార్యలంతా ఒకేచోట కూర్చుని ఏదో విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు. కనుక ఏదో ఒక చిక్కు ప్రశ్న వేసి.. వారి మధ్య కలహాన్ని రేపి, తన నామానికి సార్థకతను చేకూర్చుకోవాలనుకున్నాడు. అదేవిధంగా జగన్మాతలు కూడా నారదుడిని చూసి 'ఈ కలహ భోజనుడు ఊరకనే రాడు. ఇతనికి తగిన బుద్ధి చెప్పాలి'' అని నిర్ణయించుకుని బ్రహ్మమానసపుత్రుడిని సగౌరవంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నారదుడు ముగ్గురమ్మలను నమస్కరించాడు. ముగ్గురమ్మలు సైతం నారదుడిని ఆశీర్వదించి, విషయాలేంటని అడిగారు. ఇక సమయం దొరికింది కదా అని నారదుడు కలహాన్ని మొదలెట్టాడు. త్రిమూర్తులైన భార్యలైన మీరు ముగ్గురూ, సకలలోక వాసులచే స్తుతింపబడుతున్నారు. అంతవరకు బాగానే ఉంది.. కానీ మీ ముగ్గురిలో ఎవరుగొప్ప? అనే సందేహమే చాలామందిని వేధిస్తోందని చెప్తాడు. నారదుడు తన పనిని ప్రారంభించాడనుకున్న ముగ్గురమ్మలు.. నారదా నీ సందేహం ధర్మసమ్మతమే. నువ్వు భూలోకంలో మేము చెప్పిన చోటుకు వెళ్ళి.. అక్కడున్న మా భక్తుల్ని పరీక్షించి మేము చెప్పిన మంత్రాన్ని వారికి ఉపేశిస్తుండు. కొంతకాలం తర్వాత మా తర్వాత మాలో ఎవరు గొప్పో నీకే అర్థమవుతుందని చెప్పారు.
ముందు సరస్వతీ దేవి నారదునితో.. నారదా! భూలోకంలో మహాబలిపురానికి వెళ్ళి, అక్కడున్న ఓ గురుకులంలో సెల్వనాథుడనే విద్యార్థిని కలిసి, సమయం సందర్భం చూసుకుని అతని చెవిలో "ఓం శ్రీ సతియే నమః'' అనే మంత్రాన్ని మూడుసార్లు ఉచ్ఛరించి అతనికి మంత్రోపదేశం చేయమంటుంది. మంత్రోచ్ఛరణకు తర్వాత అక్కడ జరిగిన విషయాన్ని తమతో చెప్పగలవని సరస్వతీ దేవి అంటుంది.
ఇలా నారదుడు పండితుడి వేషంలో సెల్వనాథుడి బంధువుగా మహాబలిపురం వెళ్లి సెల్వనాథుడి గురువును కలిశాడు. సెల్వనాథుడి బంధువని తెలుసుకున్న గురువు.. సెల్వ నాథుడికి అక్షరం ముక్క రాదు... వాడితో నా ప్రాణం విసిగిపోయింది. పశువులను మేపాల్సిందిగా పంపేశాను.. వెళ్ళి చూడమంటాడు. నారదుడు విషయం తెలుసుకుని బాలుడి దగ్గరికి వెళ్తాడు. ఆ బాలుడు చదువు రాదని.. తాను పడే కష్టాల్ని చెప్పి బోరుమన్నాడు. నారదుడు ఆ బాలుడిని ఓదార్చి మంత్రోపదేశం చేస్తానని.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని చెప్తాడు. ఇలా సముద్రంలో స్నానం చేసి.. శుచియై వచ్చిన ఆ బాలుడికి ''ఓం శ్రీసతియే నమః'' అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయమని చెప్తాడు. ఇలా 108 సార్లు పఠించిన తర్వాత ఆ బాలుడు వేదాలను, శాస్త్రాలను సులభంగా అర్థం చేసుకోసాగాడు. అతనిలో వచ్చిన మార్పును చూశాక నారదుడు ముగ్గురమ్మలకు ఈ విషయం చెప్పాడు.
పార్వతీదేవి తన వంతు ప్రారంభించింది. నారదా.. కావేరి నది ఒడ్డున సమయపురం అనే ఊరుంది. అక్కడ పెరినాయకి అనే ఆవిడ ఇంట గురించి అడుగు. అక్కడి పరిస్థితులను గమనించి సమయం సందర్భం కుదిరినప్పుడు నేను చెప్పే ''ఓం శ్రీసతియే నమః'' మంత్రాన్ని ఆవిడకు ఉపదేశించమంటుంది. ఇలా పెరినాయకి ఇంటికి వెళ్లిన నారదుడు.. ఆమెకు సంతానం లేకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడాన్ని నిరోధిస్తాడు. సంతానం లేకపోవడంతో తన భర్తకు వేరొక వివాహం చేసి పెట్టేందుకు అంతా సిద్ధమవుతున్నట్లు గమనిస్తాడు. ఈమెకు కూడా పై మంత్రాన్ని నారదుడు ఉపదేశిస్తాడు. ఈ మంత్ర ప్రభావంతో ఓ శుభ సమయానికి పెరియనాయకి సంతానవతి అయింది. ఈ విషయాన్ని వెంటనే నారదుడు ముగ్గురమ్మలకు చేరవేశాడు.
ఇక మూడో సారిగా లక్ష్మీదేవి నారదుడిని గోదావరి ఒడ్డునున్న తాటాకుల ఇంట్లోని రాజశేఖరుడనే పేద పండితుడిని కలవమంటోంది. ''ఓం శ్రీసతియే నమః'' అనే మంత్రాన్ని ఉపదేశించమంటోంది. అలాగే నారదుడు కూడా గోదావరికి వెళ్లి.. దానం చేసే ఉత్తముడైన రాజశేఖరుడిని కలుస్తాడు. రాజశేఖరుడు తనవద్ద ఉన్న బియ్యాన్ని మారు వేషంలో వచ్చిన నారదునికి ఇవ్వపోగా, రాజశేఖరుని వద్దనున్న బియ్యం కుండ నిండుకుంది. దీంతో ఆశ్చర్యపోయిన రాజశేఖరుడు ఇంతకుముందు ఇలాంటి కార్యాలు జరగలేదంటాడు. ఇలా రాజశేఖరుడికి కూడా నారదుడు ''ఓం శ్రీసతియే నమః'' అనే మంత్రాన్ని ఉపదేశించి 108సార్లు జపించమని చెప్తాడు. ఆ తర్వాత ఆ పేద పండితులు శ్రీమంతుడిగా మారిపోతాడు. ఈ అద్భుతాన్ని కళ్ళారా చూసిన నారదుడు అజ్ఞానానికి సిగ్గుపడుతూ..ముగ్గురమ్మలను దర్శింటుకుంటాడు. అమ్మలారా! మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ప్రశ్న అడిగాను. ఇప్పటికైనా ఈ మంత్రం ఎలా పుట్టిందని అడుగుతాడు. అప్పుడు నారదునితో లక్ష్మీదేవి ఇలా అంది. బ్రహ్మదేవ పుత్రా.. మా ముగ్గురు శక్తిలో ఎటువంటి తేడాలుండవు. జగదాంబ ఆజ్ఞానుసారం నా వలన ఐశ్వర్యం, సంపదలు, పార్వతీదేవి వలన ఐదవతనం, సౌభాగ్యం, సరస్వతీదేవి వలన విద్యలు, కళలు ప్రాప్తిస్తుంటాయి.
శ్రీ లక్ష్మిలోని ''శ్రీ'' అనే అక్షరాన్ని, సరస్వతిలోని ''స'' అనే అక్షరాన్ని, పార్వతీదేవిలోని తి అనే అక్షరాన్ని బీజాక్షరాలుగా జతచేసి ''ఓం శ్రీసతియే నమః'' అనే మంత్రసృష్టికి కారణం నువ్వే అయ్యావన్నారు. ఈ మంత్రాన్ని జపించిన వారికి మా కటాక్షం కలుగుతుంది. అందువల్ల ఈ మంత్రాన్ని అర్హులైన మా భక్తులకు, భక్తురాలకు ఉపదేశం చేయగలవు అని చెప్పింది. అదే ''ఓం శ్రీసతియే నమః' అనే మంత్రం పుట్టిన కథ.
--(())--
*నక్క పిల్ల-కుందేలు*
ఒక అడవిలో ఒక నక్క ఉండేది. దానికి మూడు పిల్లలున్నాయి. తల్లి నక్క రోజూ తన పిల్లలకి కాసేపు వేట నేర్పించేది.
తమకంటే చిన్న జంతువులను ఎలా వేటాడాలో తర్ఫీదు ఇచ్చేది. ఒకరోజు అది తన పిల్లల్ని వెంట బెట్టుకుని, ఒక చెట్ల గుబురు చాటున మాటు వేసింది. అదుగో ఆ పొదలో ఒక కుందేలు వుంటుంది. అది తిండికోసం బయటకు వస్తుంది. అది కనిపించగానే మీలో ఎవరైనా ఒక్కరు- అమాంతం పోయి దాని మీద పడాలి” పిల్లలతో చెప్పింది తల్లి, నెమ్మదిగా అమ్మా నేనెళ్తానే…. నేనెళ్తానే….” అంటూ ఉత్సాహంగా అరిచింది అన్నింటిలోకీ పెద్ద దైన నక్కపిల్ల. “సరేలే, నువ్వే ముందు దూకు” అనుమతి ఇచ్చింది తల్లి నక్క ఇంతలో కుందేలు బయటికి వచ్చింది పొదలోంచి.
దాన్ని చూసీ చూడగానే నక్కపిల్ల అమాంతం ముందుకు ఉరికింది. అయితే కుందేలు మాత్రం ఏం చిన్నది నక్క రాకను పసికట్టనే కట్టింది కుందేలు. నక్కపిల్లకు చిక్కకుండా వాయువేగంతో పరుగు తీసింది.
నక్కపిల్ల దాన్ని వెంబడించింది- కానీ చూస్తూ చూస్తూండగానే అది ఇక నక్కకు అందనంత దూరం వెళ్ళిపోయింది. ముఖం వేలాడేసుకొని తల్లి దగ్గరి తిరిగి వచ్చింది నక్కపిల్ల. ఏంటమ్మా గొప్ప గొప్పగా కూసి వెళ్ళావు ఇప్పుడు ఆ చిట్టి కుందేలు కూడా తప్పించుకుపోయిందా, చేతులు ఊపుకుంటూ వస్తున్నావు మిగతా పిల్లలు దాన్ని వేళాకోళం చేసాయి.
అమ్మా నాకు అసలు వేటాడటంరాదేమోనమ్మా, అంత చిన్నకుందేలునుకూడా పట్టలేకపోయాను చూడు అవమానం పాలై, అనుమానంతో కన్నీళ్ళు పెట్టుకుంది నక్కపిల్ల. తల్లి నక్క దాన్ని ఓదారుస్తూ అన్నది- లోపం నీలో లేదు నాయనా నువ్వు నీ తమాషా కోసం దాని వెనక పరిగెత్తావు. అదేమో తన ప్రాణాలు రక్షించుకునేందుకు పరుగు పెట్టింది.
నిజంగా చూడు- నీ తమాషా కంటే దాని ప్రాణాలు బలమైనవి. అందుకని నీకంటే అదే వేగంగా పారిపోగల్గుతుంది. ఒకసారి నీ కడుపు ఆకలితో మాడిందనుకో, అప్పుడు నువ్వు ఇలాంటి కుందేళ్ళని ఎన్నింటినయినా పట్టగలవు అన్నది.
*"గడ్డి నీలం రంగులో కదా ఉండేది?"*
*అని ఒక గాడిద పులిని అడిగింది.*
*దానికి పులి...*
*"నీ మొహం! గడ్డి నీలం రంగులో ఉండడం ఏమిటి?..*
*ఆకుపచ్చ రంగులో ఉంటుంది"*
*అని పులి జవాబిచ్చింది..*
*"ఏడ్చావులే! గడ్డి నీలం రంగులోనే ఉంటుంది" అని గాడిద వాదించింది..*
*అలా అలా గాడిదకు పులికి వాగ్వివాదం పెరిగింది...*
*ఎవరి మాట సరైందో తేల్చుకోవడానికి అవి రెండూ అడవికి రాజైన సింహం దగ్గరకు వెళ్ళాలని నిశ్చయించుకొన్నాయి....*
*దట్టమైన అడవి మధ్యలో ఒక ఎత్తైన ప్రదేశంలో సింహం హూందాగా కూర్చొని ఉంది.*
*అక్కడికి చేరుకోగానే పులికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా గాడిద*
*"వన రాజా! వన రాజా!... గడ్డి నీలం రంగులో కదా ఉండేది.. అవునా కాదా? మీరే చెప్పండి " అంది.*
*"అవును! గడ్డి నీలం రంగులోనే ఉంటుంది" అంది సింహం*
*అది విని గాడిద ఇంకా రెచ్చిపోతూ....*
*"చూడండి మహారాజా!...*
*అలా అని నేను ఎంత చెప్పినా ఈ పులి ఒప్పుకోవడం లేదు, అలా కాదని నాతో వాదిస్తుంది, దీనికి తగిన శిక్ష పడవలసిందే" అంది.*
*"అవును, పులికి తప్పకుండా శిక్ష పడవలసిందే...*
*పులిని ఒక సంవత్సరం పాటు జైలులో ఉంచండి!!" అని ఆదేశించింది సింహం.*
*పెల్లుబికిన ఉత్సాహంతో రంకెలేసుకుంటూ అడవంతా పరిగెత్తడం మొదలెట్టింది గాడిద...*
*పులి నీరసంగా సింహం దగ్గరకు వెళ్ళి " అదేమిటి మహారాజా! గడ్డి ఆకుపచ్చ రంగులో కదా ఉండేది?" అంది.*
*"అవును గడ్డి ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది!" అంది సింహం.*
*"మరి నాకెందుకు శిక్ష విధించారు మహారాజా?" అంది పులి.*
*దానికి సింహం "గడ్డి నీలం రంగులో ఉంటుందా? లేక ఆకుపచ్చ రంగులో ఉంటుందా? అనే విషయం గురించి నిన్ను శిక్షించడం జరగలేదు.*
*బుద్ధిలేని ఒక గాడిదతో వాదించి, మరలా దానికి తీర్పు ఇవ్వమని నా దగ్గరకు వచ్చినందుకు నీకు శిక్ష పడింది.." అంది.*
*నీతి---*
*2024 ఎన్నికలలో ఉత్తమమైన అభ్యర్ధులకే ఓటెయ్యండి..*
*గాడిదలతో వాగ్వివాదాలు పెట్టుకోకండి..*
*లేకపోతే ఐదేళ్ళు శిక్ష పడుతుంది..!*👏
. *చీకటి.. ప్రాంజలి ప్రభ కథలు..16
*చీకటితో పోరాడే ప్రయత్నం చేయవద్దు. అవకాశమే లేదు, ఎందుకంటే చీకటి ఉనికిలో లేదు - మీరు దానితో ఎలా పోరాడగలరు? దీపం వెలిగించండి, చీకటి పోతుంది. కాబట్టి చీకటిని మరచిపోండి, భయాన్ని మరచిపోండి. సాధారణంగా మానవ మనస్సును వెంటాడే ప్రతికూల విషయాలన్నింటినీ మరచిపోండి. ఉత్సాహం యొక్క చిన్న కొవ్వొత్తిని వెలిగించండి. ఉదయాన్నే మొట్ట మొదట, గొప్ప ఉత్సాహంతో లేచి, ఈ రోజు మీరు నిజంగా ఎంతో ఆనందంతో జీవించబోతున్నారనే నిర్ణయంతో- ఆపై గొప్ప ఆనందంతో జీవించడం ప్రారంభించండి. మీ అల్పాహారం తీసుకోండి, కానీ మీరు దేవుడిని తిన్నట్లుగా తినండి. అప్పుడు అది సంస్కారం అవుతుంది.*
*నీ స్నానం చెయ్యి, కానీ దేవుడు నీలోనే ఉన్నాడని గుర్తుంచుకో; మీరు దేవుడికి స్నానం చేస్తున్నారు. అప్పుడు నీ చిన్న బాత్రూమ్ దేవాలయం అవుతుంది, నీ మీద కురిసే జలం అభిషేకం. ప్రతి రోజు ఉదయం చాలా నిర్ణయాత్మకతతో, నిశ్చయతతో, స్పష్టతతో లేవండి, ఈ రోజు చాలా అందంగా ఉండబోతోందని మరియు మీరు దానిని అద్భుతంగా జీవించబోతున్నారని మీకు వాగ్దానం చేసుకోండి. మరియు ప్రతి రాత్రి మీరు పడుకునేటప్పుడు, ఈ రోజు ఎన్ని అందమైన విషయాలు జరిగాయో మళ్లీ గుర్తుంచుకోండి. కేవలం స్మరణ మాత్రమే అవి రేపు తిరిగి రావడానికి సహాయపడుతుంది. గుర్తుంచుకోండి, ఆపై ఈ రోజు జరిగిన ఆ అందమైన క్షణాలను గుర్తుంచుకుని నిద్రపోండి. మీ కలలు మరింత అందంగా ఉంటాయి. అవి మీ ఉత్సాహాన్ని కలిగి ఉంటాయి మరియు మీరు కూడా కొత్త శక్తితో కలల్లో జీవించడం ప్రారంభిస్తారు. ప్రతి క్షణాన్ని పవిత్రంగా చేసుకోండి.*
*నాలో నేను .. (2 ).. 15
నా మనస్సు సమాధానపడ్డానికి కొన్నేళ్ళు పట్టింది,
“జన్మజన్మలుగా, అనేకమంది తల్లి తండ్రులు వాత్సల్యరూపంలో నిన్ను కనిపెట్టుకొని ఉన్నదాన్ని నేను! నువ్వు వెతుకుతున్న ఆ నల్లని కళ్ళను, మాయమైపోయిన ఆ అందమైన కళ్ళను, రెండింటినీ నా చూపులో చూడు!”
ఎంతో ప్రేమాస్పదురాలైన అమ్మకు దహనకాండ ముగిసింది, ఆ వెంటనే నేనూ భాగ్య నగరం తిరిగి వచ్చేశాం, అక్కడ మా ఇంటికి ఎదురుగా ఆకుపచ్చ - బంగారు వన్నెలో మిసిమిచెందే మెత్తని పచ్చిక నేల ఉంది, దానికి నీడనిచ్చేది పెద్ద ‘పున్నాగ ’ చెట్టు ఉన్నది, రోజు పూలు రాల్చేది, నేను ప్రతిరోజూ పొద్దున విచారగ్రస్తుడినయి ఆ చెట్టు దగ్గిరికి సంస్మరణాత్మక తీర్థయాత్ర సాగిస్తూ ఉండేవాణ్ణి, కవితావేశం కలిగిన క్షణాల్లో నాకు అనిపిస్తూ ఉండేది।
తెల్లటి ఆ ‘సేవాలి’ పుష్పాలు, పచ్చని గడ్డితో నిండిన గద్దెమీద, మనఃపూర్వకమైన భక్తిభావంతో ఆత్మార్పణ చేసుకుంటున్నట్టుగా పరుచుకుంటున్నాయని।
నా కన్నీటి బిందువులు మంచు కణాలతో కలిసిపోతూ ఉండగా, ఉషస్సులోంచి బయల్వెడలుతున్న మరో లోకపు చిత్రమైన కాంతిని, తరచు గమనిస్తూ ఉండేవాణ్ణి। భగవంతుడికోసం తీవ్రమైన ఆకాంక్ష కలిగినందువల్ల ఏర్పడిన గాఢమైన వేదన నన్ను బాధిస్తూ ఉండేది, హిమాలయాలు నన్ను బలంగా దగ్గరికి లాక్కొంటున్నట్టు అనిపించేది।
జరిగిపోయిన సంఘటనలు గుర్తుకొచ్చి నాన్న నాన్న అని పిలుపు కలవరింతలు
ఏమిటండి కళలు కంటున్నారా
ఇదంతా కలా నాన్న గుర్తుకొచ్చారే , అవునండి మీనాన్నగారి ఆబ్దికం కొన్ని రోజుల్లో వస్తుంది, కరోనా కూడా మాయమైంది మంచిగా బంధువులు కలసి ఏర్పాటు చేద్దామండి
****
శ్వేతాశ్వతరోపనిషత్తు మొదటి అధ్యాయం
1. మం !! హరిః ఓం !!
బ్రహ్మవాదినోళవదంతి.కింకారణం బ్రహ్మకుతంః
స్మ జాతాజీనామ కేన క్వ చ సంపత్రిష్టాః అధిష్టితాః
కేశ సుఖేతరేషు వర్తామ హే బ్రహ్మవిదో వ్యవస్థామ్.
ఈ జగత్తుకు మూలకారణం ఏది ? అది బ్రహ్మమా ? మనమంతా దేనినుండి పుట్టాము? మనం ఎవరివల్ల లేక దేని వల్ల జీవిస్తున్నాం ? చివరకు మనమంతా దేనిలో కలిసిపోతాం ? మనం ఎవరి ప్రేరణవల్ల లేదా ఎవని నియామకాన్ని అనుసరించి సుఖదుఃఖాలను అనుభవిస్తున్నాము ? అంటే మనం అనుభవించే ఈశుఖదుఃఖాలనన్నింటిని వ్యవస్థీకరించే దెవరు ?
ఇందులో మొదటి కారణం బ్రహ్మం. బ్రహ్మమంటే నామరూపాలకు, కార్యకారణాలకు అన్నిటికి అతీతమైనట్టి నిర్గుణ బ్రహ్మము. నామరూపాలకు కార్యకారణాలకు అన్నిటికీ అతీతమైనది (నిర్గుణ బ్రహ్మము) ఈ జగత్తుకు సృష్టికి కారణం కాగలదా ? ఇది మొదటి ప్రశ్న.
ఇక రెండవ ప్రశ్న - మనము ఎవరివల్ల పుట్టాము ? ఈ సృష్టి రహస్య మేమిటి ? ఈ విశ్వం నిజంగా సృష్టింప బడ్డదా ? అయితే అట్లా సృష్టింప బడటానికి కారణం ఏమిటి ? ఈ విశ్వం సృష్టించ బడకపోతే మనకు కార్యంగా ఎందుకు కనిపిస్తోంది ?
కార్యం కనిపిస్తుంటే, కారణం ఉండాలిగదా ?
ఇక మూడవ ప్రశ్న - మనం ఎందుకు జీవిస్తున్నాము ? ఈ విధంగా జీవించటానికి కారణం ఏమిటి ? ఈ జీవితానికి పరమార్ధ మేమిటి ? ఈ జన్మకు కారణ మేమిటి ? దాని ఉద్దేశ్యమేమిటి ?
ఇక నాల్గవ ప్రశ్న - ఇట్లా జీవించిన సృష్టి లేదా మనం చివరకు ఏమవుతా ము ?
మళ్ళీ పుడతామా ?
లేక పూర్తిగా నశించి పోతిమా ? లేక బ్రహ్మలో లీనమై పోతామా ?
ఇక చివరి ప్రశ్న - ఈ విశ్వమంతా ఒక నియమాన్ననుసరించి ఒక పధ్ధతిప్రకారం నియమా లకు లోబడి జరుగుతోందని కనిపిస్తుంది. మనము స్వతంత్రులము కాము. స్వతంత్రులమైతే సుఖమే తప్ప దుఃఖముననుభవించవలసిన అగత్యం ఏమి ఉంటుంది ? మనమనుబవించే దుఃఖాలను తొలగిఃచుకొనే మార్గమున్నదా ?
మానవ జన్మనెత్తిన ఎవరికైనా ఈ పైప్రశ్నలు తప్పవు. జిజ్ఞాసుకీప్రశ్నలు నిరంతరం వేధిస్తాయి. ఈ విషయాన్నే మొదట బ్రహ్మవేత్త లైనవారు తమలో తాము చర్చించుకొన్నారు.
. ( సశేషం )
*మాఘమాస స్నాన సంకల్పము*_
***
నాలో నేను .. (2 )నా మనస్సు సమాధానపడ్డానికి కొన్నేళ్ళు పట్టింది,“జన్మజన్మలుగా, అనేకమంది తల్లి తండ్రులు వాత్సల్యరూపంలో నిన్ను కనిపెట్టుకొని ఉన్నదాన్ని నేను! నువ్వు వెతుకుతున్న ఆ నల్లని కళ్ళను, మాయమైపోయిన ఆ అందమైన కళ్ళను, రెండింటినీ నా చూపులో చూడు!”ఎంతో ప్రేమాస్పదురాలైన అమ్మకు దహనకాండ ముగిసింది, ఆ వెంటనే నేనూ భాగ్య నగరం తిరిగి వచ్చేశాం, అక్కడ మా ఇంటికి ఎదురుగా ఆకుపచ్చ - బంగారు వన్నెలో మిసిమిచెందే మెత్తని పచ్చిక నేల ఉంది, దానికి నీడనిచ్చేది పెద్ద ‘పున్నాగ ’ చెట్టు ఉన్నది, రోజు పూలు రాల్చేది, నేను ప్రతిరోజూ పొద్దున విచారగ్రస్తుడినయి ఆ చెట్టు దగ్గిరికి సంస్మరణాత్మక తీర్థయాత్ర సాగిస్తూ ఉండేవాణ్ణి, కవితావేశం కలిగిన క్షణాల్లో నాకు అనిపిస్తూ ఉండేది।తెల్లటి ఆ ‘సేవాలి’ పుష్పాలు, పచ్చని గడ్డితో నిండిన గద్దెమీద, మనఃపూర్వకమైన భక్తిభావంతో ఆత్మార్పణ చేసుకుంటున్నట్టుగా పరుచుకుంటున్నాయని।నా కన్నీటి బిందువులు మంచు కణాలతో కలిసిపోతూ ఉండగా, ఉషస్సులోంచి బయల్వెడలుతున్న మరో లోకపు చిత్రమైన కాంతిని, తరచు గమనిస్తూ ఉండేవాణ్ణి। భగవంతుడికోసం తీవ్రమైన ఆకాంక్ష కలిగినందువల్ల ఏర్పడిన గాఢమైన వేదన నన్ను బాధిస్తూ ఉండేది, హిమాలయాలు నన్ను బలంగా దగ్గరికి లాక్కొంటున్నట్టు అనిపించేది।జరిగిపోయిన సంఘటనలు గుర్తుకొచ్చి నాన్న నాన్న అని పిలుపు కలవరింతలుఏమిటండి కళలు కంటున్నారాఇదంతా కలా నాన్న గుర్తుకొచ్చారే , అవునండి మీనాన్నగారి ఆబ్దికం కొన్ని రోజుల్లో వస్తుంది, కరోనా కూడా మాయమైంది మంచిగా బంధువులు కలసి ఏర్పాటు చేద్దామండి****
మహాభారతంలో వ్యాసాది మహర్షులు ఈ ప్రాంతానికి తరచుగా వచ్చే వారని కనిపిస్తున్నది. కాశీ చేరకముందు అగస్త్యుడు వ్యాసుడు ఈ పర్వతం దగ్గరే నివసించేవారు.
ఈ పర్వత పాదాల దగ్గర హనుమంతుని తప:స్థలము ఉన్నదని టిబెట్ గ్రంథాలలో ఉంది. ధర్మరాజు రాజసూయయాగం చేస్తున్నప్పుడు ఉత్తర దిగ్విజయానికి బయలుదేరిన అర్జునుడు ఇక్కడకు కూడా వచ్చాడట!
ఆ తర్వాత పాండవులంతా ఒకసారి వచ్చి పరమశివుని దర్శించాలని ప్రయత్నించారు. అక్కడి ఒక లోయ మార్గంలో గోవృషభముల గుంపు నడుస్తున్నది. వాటిలో వృషభరూపంలో మహేశ్వరుడు ఉంటాడని ఒక ఋషి వారికి చెప్పాడు.
ఆలోచించి భీముడు తన శరీరాన్ని పెంచి ఆలోయపై అటు ఇటూ కొండ శిఖరాల మీద తన రెండు పాదాల నుంచాడట ! ఆవులు, ఎద్దులు ఆ కాళ్ళ క్రిందుగా వెళుతున్నవి. దేవుడు అలా వెళ్ళటానికి ఇష్టపడడు గనుక గుర్తుపట్టవచ్చునని వారి ఆశ. అలానే అన్నీ కదిలిపోయినవి.
చివరకు ఒక వృషభం ఆగిపోయి భీముని చూచి దేహాన్ని భీముని కంటె ఎత్తుకు పెంచిందట. అప్పుడు పాండవులు గుర్తించి ఆ వృషభరాజరూపుడైన మహేశ్వరునకు పాదాక్రాంతులై నమస్సులు సమర్పించారు. స్వామి వారిని ఆశీర్వదించాడు. ఇప్పటికీ ఆ కొండ మీద వృషభదేవుని శిరస్సు, కర్ణముల గుర్తులు కనిపిస్తున్నవి. శివపురాణంలో కైలాసనాథుని వర్ణన గమనించండి..
శ్లో॥ కైలాస శిఖరస్థంచ పార్వతీపతిముత్తమం
యథోక్త రూపిణం, శంభుం నిర్గుణం గుణరూపిణం
వేదైశ్శాసైర్యధాగీతం విష్ణు బ్రహ్మనుతం సదా
భక్తవత్సలమానందం శివమావాహయామ్యహం.
కైలాస పర్వతంలో శివుడుంటాడనేది సర్వ సామాన్య వచనం. తీవ్ర భక్తులు కొండమీది ప్రతిశిల శివుడే అని భావిస్తుంటారు. మహనీయుడైన పండితారాధ్యుడు శ్రీశైలం వెళ్ళి అక్కడి ప్రతిశిల శివలింగంవలె కనిపిస్తుంటే దాని మీద కాలు మోపటం పాపం గనుక కొండ ఎక్కలేదు.అయినా అతనికి ఉన్న భక్తి వల్ల మల్లికార్జునస్వామి ఆశీర్వాదం లభించింది.
అలానే తిరుపతి కొండ మీది. ప్రతిశిలాఖండము అన్నమాచార్యులకు సాలగ్రామముగా దర్శనమిచ్చింది. భక్తివివశుల తీరు ఆ విధంగా ఉంటుంది.
13వ శతాబ్దంలో గేవా గోజంగ్బ అనే బౌద్ధ సాధువు కైలాసపర్వతానికి వెళ్తూ టీ చేసుకు వెళ్తామని ఆగాడు.
టీ పాత్ర ఉంచటానికి ఏ రాయిని చూచినా ప్రతి దాని మీద బౌద్ధుల ప్రధానమంత్రమైన “మణిపద్మే హుం" కనిపిస్తున్నదట! టీ లేకుండానే అతడు ప్రయాణం చేశాడు. కైలాస పర్వతం చుట్టూ ఉన్న కొండలకు బౌద్ధులు - వజ్రపాణి, అవలోకితేశ్వర, మంజుఘోష పద్మసంభవ ఇత్యాది పేర్లు పెట్టుకున్నారు.
కైలాస పర్వతానికి ప్రదక్షిణం చేయటం యాత్రికులకు అత్యంత ప్రధానం. ప్రదక్షిణం అనే మాటకు ఉత్తర భారతంలో పరిశ్రమ అంటారు. ఆ మంచులో, చలిలో స్వయంగా పరిక్రమ చేయలేనివారు ఇతరుల చేత తమ కోసం చేయించుకొని ఫలితాన్ని ధార పోయించుకొంటారు.
దానికి గాను కొంత దక్షిణ సమర్పిస్తారు. మరణించిన ఆత్మీయుల, బంధువులకు ఉత్తమగతులు కలగటానికి ఇతరుల చేత పరిక్రమ చేయించటం కూడా ఇక్కడి ఒక ఆచారం.
ఈ శివుని కొండకు ఒకసారి పరిక్రమ చేస్తే సమస్త పాపాలు పోతాయని, పది పరిశ్రమలు చేస్తే రాబోయే జన్మలలో పాపాలు కూడా నశిస్తాయని, 108 పరిశ్రమలు చేస్తే జన్మరాహిత్యం, నిర్వాణం లభిస్తుంది అని టిబెటన్ల నమ్మకం.
దండపరిక్రమ చేసే మరో ఆచారం కూడా ఉంది. పరిశ్రమకు బయలుదేరి కైలాస శిఖరానికి సాష్టాంగ దండ ప్రణామం చేస్తారు. నమస్కారం చేసినప్పుడు చివరి చేతులు పెట్టిన చోట నుండి రెండో ప్రణామం. అలా పరిక్రమ అంతా చేయటానికి ఒక నెలపడుతుందట !
తిరుపతిలో ప్రధానాలయం చుట్టూ కొందరు పొర్లు దూల పెడుతూ అంగ ప్రదక్షిణం చేస్తారు. ఇవన్నీ తవన్సులో భాగాలు ఈ పరిశ్రమల వల్ల సర్వపాప క్షయమవుతుందని విశ్వాసము - పురాణవాక్కు. (కైలాస పరిక్రమదూరం 52 కి.మీ.)
పరిక్రమ ప్రదేశంలో శివస్థల్ ఉంది. ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేసి యమధర్మరాజును ప్రార్థిస్తారు. సూదితో వేలు గుచ్చుకొని ఒకటి రెండు చుక్కలు నెత్తురు బొట్లు సమర్పిస్తారు.
ధరించిన పాతగుడ్డలు కొన్ని వదిలేస్తారు. దీని వల్ల పాపాలన్నీ పోతాయని పుణ్యలోకాలు వస్తాయని నమ్మకం. కొందరు జుట్టులో కొన్ని వెండ్రుకలు కత్తిరించి సమర్పిస్తే మరికొందరు పూర్తి తలనీలాలు సమర్పిస్తారు.
కైలాస పర్వతానికి పరిక్రమ చేస్తారేగాని ఎవరూ ఎక్కటానికి సాహసించరు సాధ్యం కాదు కూడా. అది సాక్షాత్తు పరమశివరూపం గనుక ఆరోహించటం పాపమని కొందరి అభిప్రాయం.
ఒక్క బౌద్ధయోగి మిలారేపా మాత్రం మంత్రశక్తితో గిరి పైకి వెళ్ళాడని ఆయన కథలో ఉంది. పురాణాలలో పుష్పదంతుడనే గంధర్వుడు కైలాస పర్వత అగ్రాన బ్రహ్మ నిర్మితమైన మహాద్వారం నుంచి లోపలికి వెళ్ళి పరమశివుని దర్శించాడట !
శ్లో|| యస్యాః ద్వారం మహాభాగే ఏకం కైలాస మూర్ధని
సంప్రాప్య కౌతుకావిష్టః పుష్పదంతోమహామతిః
(సశేషం )
మల్లాప్రగడ శ్రీదేవి, హైదరాబాద్
అత్త మాటలు
కోడలా జాగర్తగా విను
అసలే కొత్తకాపురం కదా
అది నిజమే ... సరే చెప్పండి
పూర్వ జన్మ సంస్కారము అనే అర్థంలో మన జీవితం యుంటుంది.
సంస్కార సంబంధమైన గుణాలు, లక్షణాలు, చిత్తవృత్తులు. ఇవి మూడు విధాలు (వాసనాత్రయం) : 1. లోక వాసనలు, 2. శాస్త్ర వాసనలు, 3. దేహ వాసనలు. లోకంలో గుర్తింపు పొందాలను కోవడం, అధికులుగా ఉండాలని కోరుకోవడం, ఏది చేసినా లోకాన్ని దృష్టిలో పెట్టుకొనే చేయడం లోక వాసన. గ్రంథ పఠనం, ఆయా విషయాలలో ప్రజ్ఞ సంపాదించాలను కోవడం, శాస్త్రజ్ఞానాన్ని కలిగి ఉండటం శాస్త్రవాసన. దేహాన్ని శుభ్రంగా, ఆకర్షణీయంగా ఉంచుకోవడం, తీర్థ యాత్రలు చేయడం, ఉపవాసాలు చేయడం, యోగాభ్యాసం మొదలైన సాధనల ద్వారా ఐహిక ఆముష్మికాలను సాధించాలను కోవడం దేహ వాసన. ఇందులో కొన్ని (some of the traits) పూర్వ జన్మనుంచి "Carry Forward" అయి ఉండవచ్చు అని ముగించింది.
అయితే అత్తగారు గుర్తింపు నాకు గ్రంథ పఠనము మీకు
ఆకర్షణ నాకు తీర్ధయాత్రలు మీకు
యోగాబ్యాసం నాకు ఉపవాసాలు పూజలు మీకు
బలేచెప్పావు కోడలా
అత్తకు తగ్గ కోడలిని కదండీ
అవునా
ఉమా అనిపిలుపు కొడుకు
ఆ వస్తున్నా అంటూ కదల బోయింది అత్త
ఆగండీ మీ అబ్బాయి పిలిచింది అమ్మా కాదు ఉమా
చెవి మిషన్ పెట్టుకోండి
ఆ అని నోరేళ్ళ పెట్టింది అత్త
****
అత్తా.. కోడలి.. చిన్న కథ
రచన.. మల్లాప్రగడ
ప్రాణం పోసేదాన్ని మందు అంటాం ప్రాణం తీసేదాన్ని కూడా మందు అనే అంటాం*
పేర్లు ఒకేలా ఉన్నా గుణంలో తేడా ఉన్నట్టు మనుషులంతా ఒకేలా ఉన్నా వారి వారి మనసుల్లో తేడా ఉంటుంది.*
అత్తా కోడళ్ళ ఆలోచనలు ఒకటైనప్పటికీ ఆచరణ వేరువేరుగా ఉంటాయి వారి మధ్య సాగే అహము అర్థం కాని విధము, ఎవ్వరికీ అర్థం కాదు.
కోడలు.. యే వండీ, యే వండీ
ఆ చెప్పవే
యే వండీ పాపమండి ముసలి వాడండి, ఎంతో కొంత సహాయం చేయాలండి, మీరేమంటారు.
నీ ఇష్టానికి ఎప్పుడన్నా కాదంటానా
మీ చేతులతో ఇవ్వండి అంటూ పరుసు తెచ్చింది
సరిపోతుందా వేయి రూపాయలు
అంతేనా
ఇదిగో ఈ ఐదు వేలు తీసుకో
అంతేనా
సరే మార్ చెప్పకుండా ఈ 10000 తీసుకో
పది నిమిషాలు ఆగండి ఇప్పుడే వస్తా
ఎక్కడికే
వీధి చివర ముసలివాడు బట్టలమ్ముతున్నాడు తీసుకొద్దామని వెళ్తున్నా
ఆ........
అంటం తప్ప ఏమి చేయలేకపోయాడు
అవున్రా పెళ్ళాం బెల్లం అన్నారు అమ్మ అల్లం అన్నారు
అందుకే
నీ ఇష్టంకు అడ్డుచెప్పలేను, నువ్వు కూడా ఏదో కొనుక్కో
అత్తయ్య గారు ఈ చీరలు ఎలా ఉన్నాయి
కోడలా ఈ స్టీల్ డబ్బా ఎలా ఉంది
ఎలా కొన్నారండి
మా అబ్బాయ్ బట్టలేసి కొన్నాను
అయ్యో ఎంత పని చేసారండి అసలు బట్టలు లేవుగా
ఆ పరవాలేదు ఇంట్లోనే ఉంటారుగా, ఆ చీరలుంగీ లా కట్టుకుంటాడు లే
ఉద్యోగం పోగొట్టుకున్నాడు ఇంట్లో కూర్చొని తింటున్నాడుగా
మరేం చేద్దాం తల్లా.. పెళ్ళామా
జీవితంలో మనం అర్థం చేసుకుని సర్దుకు పోయేవారు చాలామంది ఉంటారు.*
కానీ మనల్ని అర్థం చేసుకుని సర్దుకుపోయేవారు చాలా అరుదుగా ఉంటారు. వారిని జీవితాంతం వదులుకోకూడదు.*
జీవితంలో కన్నీళ్లు , నవ్వులు , జ్ఞాపకాలంటూ ఎన్నో ఇస్తుంది.*
కన్నీళ్లు ఇంకిపోతాయి , నవ్వులు మాసిపోతాయి , కానీ ఎప్పటికీ మిగిలిపోయేది మాత్రం జ్ఞాపకాలే!*
కాలాన్ని బట్టి సర్దుకు పోతూ బతకాలి అదే సంసార రహస్యం ఎవ్వరినీ ఏమనలేము
భాష :ప్రాంజలి ప్రభ.. చిన్న కధ..4
"తెలుగులో పదాలకు ఉన్న అసలు అర్ధాలే మారుతూవుంటాయ్!"
ఒక మాటకి 'ఇదే అర్థం' అని కచ్చితంగా చెప్పలేం. సంస్కృతం జనం భాష కాదు కాబట్టీ , పూర్తిగా వ్యాకరణ బద్ధంగా నడిచేది కాబట్టీ భాష పదాలకు ఆట్టే మార్పు ఉండదు.
తెలుగు లాంటి జీవద్భాషలో కాలాన్ని బట్టి పదాలకు అర్థాలు మారిపోతుంటాయ్. ఒక ప్రాంతంలో వాడే మాటకి ఒక అర్థం వుంటే, దానికి మరో ప్రాంతంలో మరో అర్థం వుంటుంది. కుల, వృత్తి, మత, ఇతరేతర భాషల ప్రభావాల, రాజకీయ, ఆర్థిక, భౌగాళికాది ప్రాతిపదికల మీదా అర్థాలలో మార్పులు చోటుచేసుకోవడం ( విపరిణామం ) సహజ క్రమ పరిణామమే. భాష విస్తృతికి ఒక మంచి సూచిక కూడా.
'చెంబు' అనే పదాన్నే ఒక ఉదాహరణగా తీసుకుందాం. ఎఱ్ఱని రాగితో చేసిన 'పాత్ర' ని చెంబు అనాలి నిజానికి. రాగిది కాని పాత్రనూ 'చెంబు' అనేస్తున్నాం. 'స్టీలు - చెంబు, ప్లాస్టిక్ చెంబు' అనీ వాడేస్తున్నాం.
'నేను రాత్రిపూట భోజనం చెయ్యను, టిఫిన్ చేస్తా ' అనటం వింటుంటాం కదా! భోజనం అంటే మీల్స్ అనే కాదు, భుజించేది ఏదైనా 'భోజనమే అవుతుంది.
అట్లాగే ' సంతర్పణ ' అన్న పదానికి ఉన్న అసలైన అర్ధం ' సంతృప్తి పర్చటం' . ఆ అర్ధం మరుగున పడి, సమారాధనల్లో పెట్టే భోజనానికే ' ' సంతర్పణ ' పదం స్థిరపడిపోయింది.
' తద్దినం ' అనే పదాన్ని చచ్చిపోయిన వాళ్ళకి సంబంధించిన భ్రష్టార్థలో వాడేస్తున్నాం . కానీ, తత్ + దినం = తద్దినం ; అంటే ఆరోజు . ఆరోజు పుట్టినరోజైనా కావచ్చు, పెళ్లిరోజైనా కావచ్చు .. నిజానికి!
ధర్మం' అంటే న్యాయం, విధి, కర్తవ్యం. ధర్మాసుపత్రి, ధర్మ దర్శనం, ధర్మం చెయ్యండి. . అన్నప్పుడు అర్థాలు మారుతున్నాయి కదా మరి!
'కోక' అంటే 'చీర' అని మాత్రమే చెప్తారు ఇప్పుడైతే. శ్రీనాథుడనే కవి కూడా 'కోక' ధరించాడు ఆయన రోజుల్లో మరి! అప్పట్లో కోక అంటే ఏదో ఒక వస్త్రం .. పంచ, చీర, తుండు ఏదైనా కావచ్చన్నమాట!
ఒక్కోసారి పదం పూర్తిగా వ్యతిరేకార్థంలో వాడటం జరుగుతుంటుంది.
'బియ్యం నిండుకున్నాయి' అంటే బియ్యం అయిపోయాయి అని అర్థం .
అట్లాగే ఆరిపోయిన దీపాన్ని 'దీపం కొండెక్కింది' అంటుంటాం.
సభ్యతగా చెప్పాలని అనుకోవటం వల్ల అసలైన అర్థం పోయి మరో అర్థం వచ్చేలా పరోక్షంగా చెప్పే పద్ధతి కూడా ఉంది. . ఆవిడ నీళ్ళు పోసుకుంది; ఉత్త మనిషి కాదు; నెల తప్పింది వంటి వాటికి అసలైన అర్థాలు కాక 'గర్భవతి, కడుపుతో వుంది' అని అర్థం ఉంటుంది.
కైంకర్యం - అనే మాటకు ' సేవ ' అసలు అర్థం అయితే - కాజేయడం అనే అర్థంలో వాడేస్తున్నాం.
నిజానికి, ఛాందసుడు అంటే ' ఛందస్సు తెలిసిన వాడు' అని అర్థం. కాని, ఇప్పుడు చాదస్తుడు, లోకజ్ఞానం లేనివాడు అనే నిందార్థంలో వాడటం చూస్తున్నాం .
చాలా మంది తెలీకుండా చేసే పెద్ద పొరపాటు ఒకటుంది. సభలో హాజరైన వాళ్లందర్నీ ఉద్దేశించి ' సభికులు ' అంటారు పెద్ద పెద్ద వక్తలు కూడా! కాని, సభికులు అనే పదానికి ' జూదం ఆడేవాళ్లు ' అన్నదే అసలైన అర్థం.
అట్లాగే ' శ్రాద్ధం ' కూడా. శ్రద్ధగా చేసే పని ' శ్రాద్ధం ' అయితే .. చచ్చిపోయినవాళ్లకు చేసే కర్మకాండ మాత్రమే శ్రాద్ధమనే పదంగా స్థిరపడిపోయింది .
ఆగ్రహం అంటే ఇప్పుడు మనం అందరం అనుకుంటున్నట్లు ' కోపం ' కానే కాదు సుమా . ' పట్టుదల ' అన్నది అసలైన అర్థం.
బంధాలు = మాటలు
*కొన్ని బంధాలు మనల్ని బ్రతికిస్తాయి, ఇంకొన్ని బంధాలు బ్రతకాలనే ఆశని కలిగిస్తాయి, మరికొన్ని బంధాలు బ్రతుకు మీద ఆశ లేకుండా చేస్తాయి.*
*ఈ మూడింటిలో ఏదో ఒకటి ఎంచుకోవటం చాలా కష్టం అయినా మనసులో బాధని దాచుకొని పెదవులపై చిరునవ్వులు చిందిస్తూ బ్రతకడమే జీవితం .*
***
ప్రాంజలి ప్రభ .. కథ..003
*_మీ సంతోషాలను ఎవరితో పంచుకోవాలని చూస్తున్నారో వారు మీకు మంచి స్నేహితులు._*
*_మీ బాధలను ఎవరితో పంచుకోవాలని చూస్తున్నారో వారే మీ ఆత్మీయులు._*
తేటతెలుగు నేర్చుకుందాం .. తెలుగును రక్షించుకుందాం
కలల మెరుపు... కావ్య మాయలే .. శిలల మెరుపు .... శిల్పమాయలే
కళలు తలపు ... కళ్ళ లాయాలే .. వలల తలుపు .. బంధ మాటలే
కళలు గెలుపు.... కచ్చ లాయలే .. గెలలు కుదుపు .. గంతు లాయలే
తలలు తడుపు .. తంతులయాలే .. మొలల పొదుపు .. మోక్షమాయెలే
మలుపు కథలు.. మానసమ్ములే .. గెలుపు మనిషి ... గమ్యమౌనులే
మరువ వలదు... మాన్య బత్కులే .. కరువు బతుకు ... కల్లొలమ్ము లే
కరుణ గుణము... చూపవచ్చులే ... అరుణ మెరుపు ... ఆట పట్టులే
తరుణ మయిన... తత్వమాయలే ... మరణ పిలుపు ... మచ్చ తెచ్చులే
బరువు మరుచు.. . భాగ్యమేనులే ... మరియు మురియు ... ముప్పు తెచ్చులే
గరుకు బెరుకు ... గంధ మవ్వులే ... తరువు గిరులు ... స్నేహ మిచ్చులే
నవవిధ మున .. నాట్యమాడు లే .. అవసరమున .. అట చూపులే
అవయవములు... ఆట పల్కు లే .. చవక పలుకు .. చాటు తిట్టులే
భవభవములు... బాధ్యత వ్వులే .. నవకలువలు ... నాటు ఒప్పులే
సవరమలులె... సాధ్యమౌను లే ... సకలముకద ... సౌఖ్యమేనులే
మధురిమలుగ.. మల్లెజాజులే .. మమత కులుకు .. మచ్చ చూపులే
సమవిధి కను ....విద్య పొందుటే .. సమరము విధి .. శాంతా మెప్పులే
మీ విధేయుడు .. (IIIIII -- UIUIU నేటి ఛందస్సు)
*_కష్టాల్లో ఉన్నప్పుడు నిజాయితీగా, సంపదలు కలిగినపుడు సాదా సీదాగా_*
*_అధికారంలో ఉన్నప్పుడు అణకువగా, కోపంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండాలి._*
మల్లాప్రగడ రామకృష్ణ
ప్రాంజలి ప్రభ కథలు...007
ప్రతీ ఏరియా లో బ్రాహ్మణ సంఘాలు ఉన్నాయి.. దురదృష్టం కొద్దీ... కొంత కాలం నిర్వహించి తదుపరి.. ఎదో ఒక ఇగో లతో మన కొమ్మ మనమే.. నరుకుంటున్నాం.... విశేషం ఏమిటి అంటే... శత్రువులు బయట నుండి వస్తే.. బ్రాహ్మణ సంఘాలలో శత్రువులు అంతర్గతం గా తయారయ్యారు....
కొంత మంది సేవ చేసిన వారిని... త్యాగాలు చేసిన కుటుంబాలని ఉద్దేశ్య పూర్వకంగా... వెనక్కి నెట్టి... ఎవరో మంత్రి కో... MLA కో... ఊడుగం చేసి బ్రాహ్మణ సంఘం నాయకులుగా... స్వయం ప్రకటిత నాయకులు తయారయ్యారు....తప్పులేదు... కానీ ఈ నాయకులు వారి ఎదుగుదల కు చూపిన శ్రద్ద... వేదపాఠశాలలు కానీ.. దేవాలయాలు కానీ... కళ్యాణమండపాలు కానీ అపర కర్మల బిల్డింగ్స్ కానీ.. పేద విద్యార్థుల చదువుల పట్ల కానీ... పేద అమ్మాయి వివాహనికి సహకరించడం కానీ... Covid లో ఉపకారం కానీ చేసిన దాఖలాలు ఏమీ లేవని నా అభిప్రాయం.. ఒక వేళ నా ఎనాలిసిస్ తప్పు అయితే క్షమతవ్యుడును... ఒకసారి ఆలోచన చెయ్యండి....
ఇప్పుడు మనకి కావలిసింది చిత్తశుద్దిగా... నిస్వార్ధంగా... జాతి ప్రయోజనాలు రక్షించి సాధించే నాయకత్వం....
ముందు మన "" బ్రాహ్మణ జాతి "" కి రక్షణ కంచె వేసే సమర్ధ నాయకత్వం...
విన్నాం... విన్నాం... చూసాం... చూసాం.... ఇక మోసపోవద్దు....
ప్రతీ మండలం లో ... మన ఆచార వ్యవహారాలుకు తగ్గట్టుగా... దేవాలయాలు ఉత్సవాలు బాగా జరిగేట్టుగా... దేవుని ధనం దేవుడు కార్యక్రమాలలో ఖర్చు పెట్టేవిధంగా..
బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్
కళ్యాణ మండపాలు..
అపర కర్మల బిల్డింగ్స్...
తెలుగు భాషను రక్షించే విధంగా మనప్రయత్నం చెయ్యాలి
వేద పాఠశాలలు విద్యార్థులు లేక.. మూత బడినవి తెరిపించి... ఊర్లో ఉన్న బ్రాహ్మణులు ఒక గంట అక్కడే అనుష్టానం చేసుకొనే దిశగా... మార్పు రావాలి....
ఒక్కొక్క మహిళా... లలితా అమ్మవారిలా... మంచి చైతన్యం తో ఫోన్ చేసి ప్రోత్సాహించడం... చాలా గొప్ప విశేషం!! ఆశ్చర్యం పురుషులు కన్నా మహిళా మూర్తులే చాలా బాగా స్పందిస్తున్నారు.. ఇది గొప్ప పరిణామం... స్త్రీ మూర్తి స్పందన తో మార్పు చాలా బలంగా ఉంటుంది...🙏🙏🙏🙏
ప్రాంజలి ప్రభ కథలు..6లు
ఒక ఇల్లు తగలబడి పోతోంది. జనం చుట్టూ చేరి చూస్తున్నారు. యజమాని దూరంగా నిల్చుని రోదిస్తున్నాడు. ఎంతో అందమైన ఇల్లు. పది రోజుల క్రితం ఎవరో రెట్టింపు ధర ఇస్తామన్నా అమ్మలేదు. అందుకే దుఃఖం. ఇంతలో పెద్ద కొడుకు వచ్చాడు. "నాన్నా ఎందుకు ఏడుస్తున్నావ్.. నీకు తెలీదా నాన్నా? మూడు రెట్ల ధర వస్తే, ఇల్లు నిన్నే అమ్మేసాను. నీకు చెప్పేటంత సమయం లేక పోయింది" అన్నాడు. చేత్తో తీసేసినట్టు ఒక్క సారిగా వేదన పోయింది. గుండెల్నిండా సంతోషంగా గాలి పీల్చుకున్నాడు. ఆ తరువాత తనూ ఒకడిగా మంటల్ని చూస్తూ పక్క వారి సంభాషణలో పాలు పంచుకొనసాగాడు…!
అదే ఇల్లు. అవే మంటలు. క్షణం క్రితం వరకూ ఉన్న అటాచ్‌మెంట్ పోయింది. ఇప్పుడు నిజం చెప్పాలంటే, కాస్త ఆనందిస్తున్నాడు కూడా.
ఇంతలో రెండో కొడుకు వచ్చాడు. "నువ్వు సంతకం పెట్టకుండా అమ్మకం ఎలా పూర్తి అవుతుంది నాన్నా. ఆమాత్రం తెలీదా?" అన్నాడు. అంతే. తిరిగి దుఃఖం చుట్టు ముట్టింది. కళ్లల్లో నీళ్లు ఎగజిమ్మాయి. అక్కడే కుప్పకూలిపోయాడు.
ఈ లోపులో మూడో కొడుకు వచ్చి, "నాన్నా.. ఇల్లు కొన్న వ్యక్తి మాట మీద నిలబడే నిజాయితీ గల మనిషి. మాటతోనే అమ్మకం జరిగిపోయిందన్నాడు. సగం డబ్బు చెల్లించేశాడు కూడా" అన్నాడు. తిరిగి సంతోషం పెనవేసుకుంది.
‘ఇది నాది’ అనుకున్నప్పుడు దుఃఖం వస్తోంది. కాదనుకున్నప్పుడు పోతోంది. నిజానికి ఏమీ మారలేదు. ఇదే బుద్ధుడు చెప్పిన నిర్వికార నిర్వాణ యోగం. అప్పుడు దుఃఖం మిమ్మల్ని వదిలేస్తున్నందుకు దుఃఖిస్తుంది..
*ప్రాంజలి ప్రభ...005
*చేయడానికి అవకాశం ఉన్న ఉన్నతమైన 113 కోర్సులు ఇవే...*
001. ఏరోనాటికల్ ఇంజనీరింగ్
002. ఏరోస్పేస్ ఇంజనీరింగ్
003. ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్
004. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్
005. ఆస్ట్రోనమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్
006. ఆటోమొబైల్ ఇంజనీరింగ్
007. బయో మెడికల్ ఇంజనీరింగ్
008. బయో టెక్నాలజీ ఇంజనీరింగ్
009. సెరామిక్స్ ఇంజనీరింగ్
010. కెమికల్ ఇంజనీరింగ్
011. సివిల్ ఇంజనీరింగ్
012. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్
013. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
014. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
015. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్
016. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్
017. ఇంస్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్
018. మ్యాన్యుఫ్యాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
019. మెరైన్ ఇంజనీరింగ్
020. మెకానికల్ ఇంజనీరింగ్
021. మెడికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
022. మెటాలర్జీ
023. మెటరాలజీ
024. మైనింగ్ ఇంజనీరింగ్
025. నావల్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్
026. ఫిజికల్ సైన్సెస్
027. పాలీమర్ ఇంజనీరింగ్
028. రోబోటిక్స్
029. టెక్స్‌టైల్ ఇంజనీరింగ్
030. అగ్రికల్చర్ సైన్స్
031. బయోలాజికల్ సైన్స్
032. బయోటెక్నాలజీ
033. కంప్యూటర్ అప్లికేషన్స్
034. కంప్యూటర్ సైన్స్
035. సైబర్ సెక్యూరిటీ
036. ఎర్త్ సైన్స్ / జాగ్రఫీ
037. ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్
038. ఫిషరీస్
039. ఫ్లోరికల్చర్/హార్టికల్చర్
040. ఫుడ్ టెక్నాలజీ
041. ఫారెస్ట్రీ
042. ఓషియనోగ్రఫీ
043. స్టాటిస్టికల్ సైన్స్
044. వెటర్నరీ సైన్సెస్
045. వైల్డ్ లైఫ్ బయాలజీ
046. జువాలజీ
047. ఆయుర్వేద బీఏఎంఎస్
048. డెంటల్ బీడీఎస్
049. హోమియోపతి
050. న్యాచురోపతి
051. ఫార్మసీ
052. సిద్ధ
053. యునానీ
054. ఆంత్రోపాలజీ
055. ఆర్కియాలజీ
056. ఆర్ట్ రిస్టోరేషన్
057. క్యూరేషన్
058. ఎడ్యుకేషనల్/వొకేషనల్ స్కూల్ కౌన్సిలర్
059. మాన్యుమెంట్స్ అండ్ స్కల్ప్చర్ రిస్టోరేషన్
060. మ్యూసియాలజీ
061. ఫిజియోథెరపీ
062. రిహ్యాబిలిటేషన్ సైకాలజీ
063. రిహ్యాబిలిటేషన్ థెరపీ
064. సోషల్ వర్క్
065. స్పెషల్ ఎడ్యుకేటర్
066. స్పీచ్ లాంగ్వేజ్ అండ్ హియరింగ్
067. లా
068. అడ్వర్టైజింగ్
069. జర్నలిజం
070. మాస్ కమ్యూనికేషన్
071. పబ్లిక్ రిలేషన్స్
072. ఆర్ట్ డైరెక్షన్
073. కొరియోగ్రఫీ
074. డైరెక్షన్
075. ఫిల్మ్/డ్రామా ప్రొడక్షన్
076. ఫైన్ ఆర్ట్స్
077. పర్ఫామింగ్ ఆర్ట్స్
078. వోకల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్
079. యానిమేషన్
080. సినిమాటోగ్రఫీ
081. కమ్యూనికేషన్ డిజైన్
082. డిజైన్
083. గ్రాఫిక్ డిజైనింగ్
084. ఫోటోగ్రఫీ
85. యాక్చురియల్ సైన్సెస్
086. బ్యాంక్ మేనేజ్‌మెంట్
087. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్
088. బిజినెస్ మేనేజ్‌మెంట్
089. కాస్ట్స్ అండ్ వర్క్స్ అకౌంట్స్
090. చార్టర్డ్ అకౌంటెన్సీ
091. చార్టర్డ్ ఫైనాన్షియల్ అనాలిసిస్
092. ఈవెంట్ మేనేజ్‌మెంట్
093. హాస్పిటల్ మేనేజ్‌మెంట్
094. హోటల్ మేనేజ్‌మెంట్
095. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్
096. ఇన్స్యూరెన్స్
097. లాజిస్టిక్స్ అండ్ సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్
098. మేనేజ్‌మెంట్
099. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్
100. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్
101. కార్పొరేట్ ఇంటెలిజెన్స్
102. డిటెక్టీవ్
103. ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రీషియన్
104. ఫారిన్ లాంగ్వేజెస్
105. హోమ్ సైన్స్
106. ఇంటీరియర్ డిజైనింగ్
107. లిబరల్ స్టడీస్
108. లైబ్రరీ సైన్సెస్
109. మాంటెస్సరీ టీచింగ్
110. న్యూట్రీషియన్ అండ్ డైటెటిక్స్
111. ఫిజికల్ ఎడ్యుకేషన్
112. స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్
113. టూరిజం అండ్ ట్రావెల్.
విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం రూపొందించిన బుక్ లెట్ లో సీ.బీ.ఎస్.ఈ(CBSE) ప్రధానంగా వివరించిన 113 కోర్సులు ఇవి.
ఇవే కాకుండా అనేక రంగాల్లో అనేక కోర్సులు ఉన్నాయి.
అయితే విద్యార్థుల అభిరుచికి తగ్గట్టుగా కోర్సలు ఎంచుకుంటే కెరీర్ బాగుంటుంది.
ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్
(రిజిస్టర్ నెంబర్ 6/2022).
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ.
*మూడు కలలు -- చందమామ కథలు..8
ధర్మనిరతుడైన గోకర్ణికరాజు మణికర్ణుడికి యోగిపుంగవులన్నా, సాధు సన్యాసులన్నా అమిత గౌరవం. ఆయన తరచూ మహనీయులైన యోగులను దర్శించి వారి ఆశీర్వాదం పొందేవాడు. రాజధానికి వచ్చే సాధు సన్యాసులను సాదరంగా ఆహ్వానించి భక్తి శ్రద్ధలతో అతిథి సత్కారాలు చేసేవాడు. ఒకసారి జడధారి అనే సన్యాసి రాజభవనానికి విచ్చేశాడు. యథాప్రకారం రాజు ఆయనకు అతిథిసత్కారాలు అందించి, సాష్టాంగ దండ ప్రమాణం చేశాడు. రాజు వినయ విధేయతలకు, ధర్మబుద్ధికి పరమానందం చెందిన జడధారి, ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు బోధించి, బయలుదేరే ముందు, ‘‘మహారాజా! నీతో ఒక ముఖ్య విషయం చెప్పాలి. నువ్వు ఈ రోజు నుంచి మూడు రాత్రులు వరుసగా మూడు దుస్వప్నాలు కాంచబోతున్నావు. అప్రమత్తతతో వ్యవహరించు. లేకుంటే ప్రమాదం బారిన పడగలవు,'' అని హెచ్చరించి వెళ్ళాడు. అది విన్న రాజు ఎంతగానో కలవరపడ్డాడు. వెంటనే మంత్రులను సమావేశపరచి, విషయం వివరించాడు. అప్పుడు వివేకవర్థనుడనే వృద్ధ మంత్రి, ‘‘జడధారి మీకు రాత్రి సమయంలోనే దుస్వప్నాలు రాగలవని హెచ్చరించాడు గనక, మీరు పగటి పూట నిద్రించి మూడు రాత్రులూ మెలకువగా గడపండి. అప్పుడు స్వప్నాలూ రావు. ప్రమాదాలు సంభవించే అవకాశమూ ఉండదు,'' అని సలహా ఇచ్చాడు. రాజుకు ఆ సలహా నచ్చింది. ఆయనకు సంగీతం, చదరంగం, ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తిమెండు. అందువల్ల రాత్రి సమయంలో వాటితో కాలక్షేపం చేస్తే నిద్రరాదని భావించాడు. తక్కిన మంత్రులు కూడా అదే మంచిదని ఆభిప్రాయపడ్డారు. ఆనాటి రాత్రి చదరంగం ఆడుతూ గడపాలని రాజు నిర్ణయించాడు. చదరంగం ఆటలో దిట్టలైనవారిని పిలిపించాడు. తెల్లవార్లూ చదరంగం ఆడుతూ గడిపాడు. అయితే, తెలతెలవారుతూండగా మహారాజు చిన్న కునుకు తీశాడు.
ఆ చిన్నపాటి కునుకులో మహారాజుకు ఒక కల వచ్చింది. ఆయన ఒక అరణ్యంలో ఉన్నాడు. ఒక త్రాచుపాము రాజును చూసి బుసలు కొడుతూ పైకి ఉరికింది. ఆయనకు ఒళ్ళంతా చెమటలు పట్టాయి. అంతలో మెలకువ వచ్చింది. రెండో రోజు రాత్రి రాజు సంగీతం వింటూ మెలకువతో ఉండాలనుకున్నాడు. కాని మధురమైన సంగీతం వింటూ ఉండగా ఆయన కొద్ది క్షణాలు కళ్ళుమూసుకున్నాడు. ఆకాశం నుంచి ఒక పెద్ద పిడుగు తనకేసి రావడం చూసి, దాని నుంచి తప్పించుకోవడానికి అటూ ఇటూ పరిగెత్తసాగాడు. అయినా, కలలో పిడుగు ఆయన్ను వెంటాడుతూనే ఉన్నది. అంతలో రాజుకు మెలకువ వచ్చింది. మూడో రోజు రాత్రి ధార్మిక, ఆధ్యాత్మిక విషయాలు చర్చిస్తూండగా మరలా కునుకు పట్టింది. ఈసారి స్వప్నంలో భయంకరమైన సింహం ఒకటి రాజు మీదికి ఉరికింది. ఆయన ఒక మడుగులో దూకాడు. మడుగులో నీరు రుధిరవర్ణంలో ఉంది. అంతలో యువరాణి మణిమేఖల అక్కడ కనిపించి, తండ్రిని నెత్తురు మడుగు నుంచి పైకిలాగింది. అంతలో రాజుకు మెలకువ వచ్చింది. తెల్లవారగానే, రాజు మంత్రులను సమావేశపరచి తన కలల గురించి వివరించాడు. మంత్రులు వెనువెంటనే పాముకాటుకు మంత్రం వేసేవారిని పిలిపించారు. మహారాజుగారిని వేటకుగాని, బయటకు గాని వెళ్ళవద్దని సలహా ఇచ్చారు. అంతఃపురంలో అందరినీ అప్రమత్తులు చేశారు. అయినా మహారాజు కలవరం తగ్గలేదు. ఆ సమయంలో శివుడనే యువకుడు మహారాజును దర్శించి, ‘‘రాజా! నేను చాలా తెలివిగలవాణ్ణి. కాని నా తెలివితేటలను ఎవరూ గుర్తించడంలేదు. మీరైనా నా తెలివితేటలను గుర్తించండి. లేకుంటే హిమాలయాలకు వెళ్ళిపోతాను,'' అన్నాడు. ఆ మాటలు విన్న మహారాజుకు వాడు మతి చలించినవాడేమో నన్న అనుమానం కలిగింది. అయినా, ఎవరికి ఎలాంటి శక్తి ఉంటుందో ఏమోనని భావించి, జడధారి తనను స్వప్నాల గురించి హెచ్చరించడం; ఆయన చెప్పినట్టే తనకు వరసగా వచ్చిన మూడు కలల గురించి అతనికి వివరించాడు. అంతా విన్న శివుడు కొద్ది క్షణాలు ఆలోచించి, ‘‘మహారాజా, యోగులు, సన్యాసులు దైవాంశ సంభూతులు. వారి నోటి మాట వృథా కాదు. మిమ్మల్ని కలవర పరుస్తూన్న మూడు కలలను విశ్లేషించి, ఫలితం చెప్పగలను. మొదటి రెండు కలల గురించి వివరిస్తాను. అందులో వాస్తవం ఉందని తెలిస్తే, మూడవ కలకు వివరణ ఇస్తాను,'' అన్నాడు. ‘‘అలాగే, చెప్పుమరి. ఆలస్యం దేనికి?'' అన్నాడు రాజు ఆదుర్దాగా. శివుడు కొంతసేపు మౌనంగా ఊరుకుని, ‘‘మహారాజా! మీకు మొదటి కలలో కనిపించిన అరణ్యం జనారణ్యం. త్రాచు పాము పగకు సంకేతం. మీ మీద పగబట్టిన వ్యక్తి ఎవరో మీకు అపాయం తలపెట్టాడన్నదే ఆ కల అంతరార్థం! ఇక పిడుగు అనేది హఠాత్తుగా పడేది. అంటే, ఊహించని ఘటన ఏదో జరగబోతున్నది. పిడుగు మిమ్మల్ని వెంటాడిందంటే జరగబోయే దుర్ఘటన మీకు గురిపెట్టబడి వుందని అర్థం," అన్నాడు. రాజుకు శివుడి తెలివితేటల మీద నమ్మకం కుదిరింది. శివుడు ఉండడానికి విడిది ఏర్పాటు చేశాడు. తీవ్రంగా ఆలోచించిన రాజుకు ఒక విషయం స్ఫురించింది. ఇటీవల రాజ్యంలో బందిపోట్ల బెడద ఎక్కువయితే, దానిని అరికట్టడానికి రాజు ప్రయత్నించాడు. బందిపోట్ల నాయకుడు భైరవుడు తనకు అపాయం తలపెట్టి ఉండవచ్చని భావించిన రాజు, సైనికులతో అష్టదిగ్బంధనం చేయించి, నాయకుడు భైరవుడితో సహా బందిపోట్లందరినీ బంధించాడు. విచారణలో భైరవుడు విషనాగును రాజు శయనమందిరంలోకి పంపి రాజును చంపడానికి కుట్ర పన్నినట్టు ఒప్పుకున్నాడు. ఆ విధంగా తాను కన్న మొదటి కలకు శివుడి విశ్లేషణ సరైనదని గ్రహించి ఎంతగానో సంతోషించిన రాజు, రెండవ కల వివరణను పరీక్షించడానికి గూఢచారులను అన్ని దిశలకూ పంపాడు. రెండు రోజుల తరవాత, ఒక గూఢచారి వచ్చి, ‘‘సింహపురి రాజు విక్రమసేనుడు మన రాజ్యం మీదికి దండెత్తడానికి ఆయత్తమవుతున్నాడు,'' అని చెప్పాడు. శివుడి తెలివితేటలకు అబ్బురపడిన రాజు, అతన్ని పిలిచి సంగతి చెప్పి, ‘‘అన్ని విధాలా నాకన్నా బలవంతుడైన విక్రమసేనుణ్ణి ఎదుర్కోవడం ఎలా?'' అన్నాడు విచారంతో. ‘‘దానికి మీరు కన్న మూడో కలలో పరిష్కారం సూచించబడింది, మహారాజా,'' అన్నాడు శివుడు. ‘‘ఎలా?'' అని అడిగాడు రాజు. ‘‘మహారాజా! మీ కలలో కనిపించిన సింహం, సింహపురిరాజు విక్రమసేనుడు. మీరు నెత్తురు మడుగులో పడడం యుద్ధంలో జరగనున్న రక్తపాతానికి సంకేతం. మిమ్మల్ని మడుగులో నుంచి బయటకు లాగిన యువరాణి గారే మిమ్మల్ని ఈ ఆపదనుంచి గట్టెక్కించ గలరు,'' అన్నాడు శివుడు. ‘‘అదెలా?'' అని అడిగాడు రాజు. ‘‘సింహపురి రాజుకు యుక్తవయస్కుడైన కుమారుడు ఉన్నాడు కదా? ఆయనతో మన యువరాణి వివాహం జరిపిస్తే, యుద్ధ ప్రసక్తే ఉండదు!'' అన్నాడు శివుడు. అందులోని వాస్తవాన్ని గ్రహించిన మణికర్ణుడు ఒక మంచి రోజు చూసి కుమార్తె చిత్రపటాన్ని విక్రమసేనుడికి పంపి, ‘‘మీకు సమ్మతమైతే నా కుమార్తెను మీ కోడలిగా స్వీకరించండి,'' అని పురోహితుడి ద్వారా కబురు పంపాడు. మణిమేఖల అద్భుత సౌందర్యానికి ముగ్థుడైన సింహపురి యువరాజు త్రివిక్రముడు ఆమెను వివాహ మాడడానికి సంతోషంగా సమ్మతించాడు. దాంతో విక్రమసేనుడు గోకర్ణిక మీద యుద్ధ ప్రయత్నాలు విరమించి కుమారుడి పెళ్ళి ఏర్పాట్లకు శ్రీకారం చుట్టాడు. త్వరలో వారి వివాహం అత్యంత వైభవంగా జరిగిపోయింది. రాజు విక్రమసేనుడు, తనకు వచ్చిన మూడు కలలను చక్కగా విశ్లేషించి, తగిన సూచనలిచ్చి తన రాజ్యాన్ని పెను ప్రమాదాల నుంచి కాపాడిన శివుణ్ణి ఘనంగా సత్కరించి, తన ఆంతరంగిక సలహాదారుగా నియమించాడు.
సేకరణ.. ప్రాంజలి ప్రభ
*ప్రాంజలి ప్రభ కథలు..9
గోవు మరియు గేదె పాలల్లోని తేడా చాలా మందికి తెలియదు, అలాంటి వారి కొరకు...*
🐃 గేదె కు బురద అంటే చాలా ఇష్టం.
🐂 దేశీ గోవు తన పేడ లో కూడా తను కూర్చోదు. గోవుకు స్వచ్ఛత అంటే చాలా ఇష్టం.
***
🐃 గేదెను 10 kms దూరం తీసుకు వెళ్లి వదిలేస్తే.. ఇంటికి తిరిగి రాలేదు. దానికి జ్ఞాపక శక్తి గోవు తో పోలిస్తే చాలా తక్కువ .
🐂 ఆవు ను 10 kms దూరం తీసుకు వెళ్లి వదిలేసినా, ఇంటి దారి మర్చిపోకుండా తిరిగి వచ్చేస్తుంది.
గోవు పాలల్లో స్మరణ శక్తి ఉంటుంది.
***
🐃 పది గేదెలను కట్టి, వాటి పిల్లలను విడిచిపెడితే ఒక్క పిల్ల కూడా దాని తల్లిని గుర్తించలేదు.
🐂 గాని ఆవు దూడ అలా కాదు, తన తల్లి కొన్ని వందల ఆవుల మధ్య లో ఉన్నా గుర్తించగలదు.
***
🐃 పాలను తీసేటప్పుడు గేదె తన పాలను మొత్తం ఇచ్చేస్తుంది.
🐂 గోవు తన పిల్ల కోసం పొదుగు లో కొంచం పాలను దాచిపెడుతుంది. అది పిల్ల త్రాగేటప్పుడు మాత్రమే వదులుతుంది. నాటు ఆవు పాలల్లో వాత్సల్య గుణం ఉంటుంది
***
🐃 గేదె ఎండ లేదా వేడిమి ని తట్టుకోలేదు.
🐂 ఆవు మే- జూన్ ఎండలను సైతం తట్టుకోగలదు.
***
🐃 గేదె పాలు భారీ గా ఉండి తొందరగా అరగవు. దాని వల్ల చలాకి తనం ఉండదు. పాలను తీసే సమయం లో దూడను యజమాని దానిని లేపుతాడు.
🐂 ఆవు దూడ తాడు ఇప్పడం చాలా కష్టం గా ఉంటుంది. పాలు తీసాక కూడ దూడను మనం కంట్రోల్ చేయలేము.
***
*ఆవు వీపు పైన ఉండే "సూర్య కేతు నాడి"
ఆవు వీపు పైన ఉండే "సూర్య కేతు నాడి" ఎండ లో ఉన్నప్పుడు జాగృతమై ఆవు లో బంగారు లవణాలు తయ్యారవుతాయి. ఈ నాడి సూర్యుడు, నక్షత్రాలు, చంద్రుడు మరియు విశ్వం నుండి "కాస్మిక్ ఎనర్జీ" ని గ్రహించుకుంటుంది. అందుకే ఆవు పాలకు రోగాలను హరించే శక్తి వస్తుంది. ఈ విశ్వం లో ఏ జీవికి ఇటువంటి శక్తి లేదు.
నిజానికి ఆవు పాలు వేడి చేయవు, చలువ చేస్తాయి. గేదె పాలు భారీ గా ఉండడం వల్ల, జీర్సీ పాలు వేడి చెయ్యడం వల్ల మనకి షుగర్ వస్తుంది. అలాగే షుగర్ ఉంటే తగ్గదు.
మనం అన్నింటిలోనూ ఫ్యాట్ కంటెంట్ చూస్తాము. రిఫైన్డ్ ఆయిల్ వల్ల మనకి కోలేస్ట్రోల్ తయ్యారవ్వదు అని టీవీ లో చూపిస్తే ఆ ఆయిల్ నే వాడతాము. ఫ్యాట్ తక్కువ ఉన్న పాలను వదిలి గేదె పాలల్లో ఎంత ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటే అంత ఎక్కువ డబ్బులు చెల్లించి మరీ ఇంటికి తెచ్చుకుంటాము.
🐃 గేదె పాలల్లో మూడో నాలుగో ఉండే పోషక తత్త్వాలు మనం పొయ్యి మీద పెట్టి కొంచం వేడి చెయ్యగానే ఆవిరైపోతాయి.
🐂 ఆవు పాలు ఎంత వేడి చేసి మరిగించి- మరిగించి కోవా లా చేసినా అందులో ఉండే పోషక తత్త్వాలు నశించవు.
*ప్రవర ఎలా చెప్పాలి...?*
*1). భగవంతుని ముందు ప్రవర చెప్పేటప్పుడు కుడి చేత్తో కుడి చెవిని, ఎడమ చేత్తో ఎడమ చెవిని పట్టుకొని ముందుకు వంగి చెప్పవలెను.*
*2). మానవుల ముందు ప్రవర చెప్పేటప్పుడు కుడి చేత్తో ఎడమ చెవిని, ఎడమ చేత్తో కుడి చెవిని పట్టుకొని ముందుకు వంగి చెప్పవలెను.*
*3). చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభంభవతు /సజ్జనేభ్యః శుభం భవతు. ఆయా సందర్భానుసారంగా చెప్పవలెను.*
*ఋషి1___,*
*ఋషి 2___*
*ఋషి 3___*
*త్రయార్షేయ ప్రవరాన్విత,*
*_గోత్రోద్భవస్య, _ఆపస్తంబ__సూత్రః కృష్ణ యజుశ్శాఖాధ్యాయి* *_____________(పేరు)*
*శర్మాహం భో అభివాదయే, అభివాదయామి.*
*ఓం భారతీయ*
*సంస్కృతి*
*కొన్ని బ్రాహ్మణ గోత్రాలు మరియు వాటి 99 ప్రవరలు..*
*1. భరద్వాజ*
ఆంగీరస,
భార్హస్పత్స్య,
భరద్వాజ త్రయా ఋషేయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రస్య
*2. వాథూలస*
భార్గవ,
వైతాహవ్య,
శావేదస త్రయా ఋషేయ ప్రవరాన్విత వాథూలస గోత్రస్య
*3. శ్రీవస్త లేక శ్రీవత్స*
భార్గవ,
చ్యవన,
ఆప్నవాన,
ఔర్వ,
జామదగ్న పంచా ఋషేయ ప్రవరాన్విత శ్రీవత్సస గోత్రస్య
*4. శ్యాలంకాయన*
విశ్వామిత్ర,
అఘమర్షణ,
దేవరాత త్రయా ఋషేయ ప్రవరాన్విత శ్యాలం కాయనస గోత్రస్య
*5. శఠమర్షణ:*
ఆంగిరస,
ఫౌరుకుత్స,
త్రాసతస్య త్రయా ఋషేయ ప్రవరాన్విత శఠమర్షణ స గోత్రస్య
*6. ఆత్రేయ:*
ఆత్రేయ,
అర్చనానస,
శ్యావాస్య త్రయా ఋషేయ ప్రవరాన్విత ఆత్రేయస గోత్రస్య
*7. కౌశిక:*
విశ్వామిత్ర,
అఘమర్షణ,
కౌశిక త్రయా ఋషేయ ప్రవరాణ్విత కౌశిక గొత్రస్య
*8. ఖల బోధన/ఖల భవస (రెండు రకాలు)*
*i. ఖలబోధన:* విశ్వామిత్ర,
అఘమర్షణ,
ఖలబోధన త్రయా ఋషేయ ప్రవరాన్విత ఖలబోధన గోత్రస్య
*ii. ఖలభవస:*
విశ్వామిత్ర,
ఆఘమర్షణ,
ఖలభవస త్రయా ఋషేయం ప్రవరాన్విత ఖలభవస గోత్రస్య
*9. విశ్వామిత్ర:*
విశ్వామిత్ర,
దేవరాత,
ఔదల త్రయా ఋషేయ ప్రవరాన్విత విశ్వామిత్రస గోత్రస్య
*10. కౌండిన్య:*
వాసిష్ట,
మైత్రావరుణ,
కౌండిన్యస త్రయా ఋషేయ ప్రవరాన్విత కౌండిన్యస గోత్రస్య
*11. హరితస:*
హరిత
అంబరిష,
యవనాశ్వ,
త్రయా ఋషేయ ప్రవరాన్విత హరితస గోత్రస్య
*12. గౌతమస*
ఆంగిరస,
ఆయాస్య,
ఆఔశిద్యస,
కాక్షివత,
వామదేవ,
గ్రిహదుగ్ద,
గౌతమస – సప్తా ఋషేయ ప్రవరాన్విత గౌతమస గోత్రస్య
*13.ఔద్గల్య (మూడు రకాలు)*
i. ఆంగిరస,
భర్మ్యశ్వ,
ఔద్గల్య త్రయా ఋషేయ ప్రవరాన్విత ఔద్గల్య గోత్రస్య
ii. తర్క్ష్య,
భార్మ్యశ్వ,
మౌద్గల్య త్రయా ఋషేయ ప్రవరాన్విత ఔద్గల్య గోత్రస్య
iii. ఆంగిరస,
ఢవ్య,
ఔద్గల్య త్రయా ఋషేయ ప్రవరాన్విత ఔద్గల్యగోత్రస్య
*14. శండిల్య (మూడు రకాలు)*
i. కాశ్యప,
ఆవత్సార,
దైవల త్రయా ఋషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రస్య
ii. కాశ్యప,
ఆవత్సార,
శాండిల్య త్రయా ఋషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రస్య
iii. కాశ్యప,
దైవల,
ఆసిత త్రయా ఋషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రస్య
*15. నైద్రువ కాశ్యప:*
కాశ్యప,
ఆవత్సార,
నైద్రువ త్రయా ఋషేయ ప్రవరాన్విత నైద్రువ కాశ్యపస గోత్రస్య
*16. కౌత్స:*
ఆంగిరస,
మాంధాత్ర,
కౌత్స త్రయా ఋషేయ ప్రవరాన్విత కౌత్సస గోత్రస్య
*17. కణ్వ (రెండు రకాలు)*
i. ఆంగిరస,
ఆజామీళ,
కణ్వ త్రయా ఋషేయ ప్రవరాన్విత కణ్వస గోత్రస్య
ii. ఆంగిరస,
కౌర, కణ్వ త్రయా ఋషేయ ప్రవరాన్విత కణ్వస గోత్రస్య
*18. పరాశర:*
వాశిష్త,
శాక్త్య,
పరాశర త్రయా ఋషేయ ప్రవరాన్విత పరాశర స గోత్రస్య
*19. అగస్త్య:*
అగస్త్య,
తర్ధచ్యుత,
శౌమవహ త్రయా ఋషేయ ప్రవరాన్విత అగస్త్యస గోత్రస్య
*20. గార్గి (రెండు రకాలు)*
i. ఆంగిరస, బార్హస్పత్య,
భారద్వజ,
త్రయా ఋషేయ ప్రవరాన్విత ఆంగిరసస గోత్రస్య
ii. ఆంగిరస,
శైన్య, గార్గ్య త్రయా ఋషేయ ప్రవరాన్విత ఆంగిరస గోత్రస్య
*21. బాదరాయణ:*
ఆంగిరస,
ఫార్షదశ్వ,
ఋతితర త్రయా ఋషేయ ప్రవరాన్విత బాదరాయణ గోత్రస్య
*22. కాశ్యప (మూడు రకాలు)*
i. కాశ్యప,
ఆవత్సార,
దైవల త్రయా ఋషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రస్య
ii. కాశ్యప,
ఆవత్సార,
నైద్రువ త్రయా ఋషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రస్య
iii. కాశ్యప,
నైద్రువ,
ఆవత్సార, ,
రేభ,
రైభ ,
శండిల,
శాండిల్య సప్తా ఋషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రస్య
*23. సుంక్రితి లేదా శాంక్రిత్య గోథ్ర (రెండు విధాలు)*
i. ఆంగీరస,
కౌరవిద,
శాంక్రిత్య త్రయా ఋషేయ ప్రవరాన్విత శాంక్రిత్యస/సుంక్రిత్స గోత్రస్య
ii. శధ్య ,
కౌరవిధ,
శాక్రిత్య త్రయా ఋషేయ ప్రవరాన్విత శాక్రిత్యస/సుంక్రిత్స గోత్రస్య
*24. ఆంగీరస*
ఆంగీరస,
ఫురుకుత్స్య,
త్రాసదస్య త్రయా ఋషేయ ప్రవరాన్విత ఆంగీరస గోత్రస్య
*25. గౌతమస*
అంగీరస,
ఆయాస్య,
గౌతమస త్రయా ఋషేయ ప్రవరాన్విత గౌతమస గోత్రస్య
*26. అగ్ని వైవస్వత:*
ఆంగీరస,
భార్హస్పత్స్య,
భారద్వాజ,
శ్రుక్ల ఆగ్నివైవస్వత పంచాఋషేయ ప్రవరాన్విత అగ్ని వైవస్వత గోత్రస్య
*27. సాంఖ్యాయన:*
విశ్వామిత్ర,
అఘమర్షణ,
దేవవ్రత సాంఖ్యాయన త్రయా ఋషేయ ప్రవరాన్విత సాంఖ్యాయనస గోత్రస్య
*28. విశ్వామిత్ర:*
శ్రౌమిత,
ఖామకయన,
దేవతరస,
దేవరాత,
పంచా ఋషేయ ప్రవరాన్విత విశ్వామిత్ర
*29. కపి:*
ఆంగీరస,
అమాహ్య,
ఔరుక్షయ,
త్రయా ఋషేయ ప్రవరాన్విత కపిస గోత్రస్య.
….సేకరణ.
🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*
షేర్ చేసి స్నేహాన్ని పంచుకోండి
*మనస్సు* ** 11
మనస్సు అనేది మనలోనే ఉన్న జడ పదార్థము. అన్నింటికిని మూలము ఈ మనస్సే.
జీవుని అజ్ఞానములో ప్రవేశింపజేసేది మనస్సే. అన్ని దుఃఖములకు (ప్రాపంచిక అనురక్తి మరియు కామక్రోధాది విషయముల వలన) హేతువు ఈ మనస్సే. తిరిగి జీవుడు ఆ మనస్సుకు సత్యము ను సాధనద్వారా తెలియజేస్తే జీవుని బ్రహ్మానందస్థితి కి తీసుకువెళ్ళెది ఈ మనస్సే.
మనస్సు చంచలమైనది. చపలమైనది మరియు నిగ్రహించుట కష్టము కానీ అసాధ్యము కాదు కేవలం జీవుని అజ్ఞానం వలననే ఇవి జీవునిలో ప్రవేశించి జీవుని యజమాని గా తిష్టవేసి యున్నాయి. మనస్సును వశము చేసుకొన్నవాడే మనిషి.
మనసు మానవునిలో ప్రాణం, ఆత్మ మొదలైన వాటిలా కనులకు కనిపించదు. కాని మానవుని జీవనం లో అత్యంత ముఖ్యమైనది. ఇంద్రియాలు ద్వారా అందుకున్న సమాచారం తో బుద్ది సహాయంతో ప్రతిచర్యలోకి దిగుతుంది మనసు...
ఇది జడమైనదే అయినప్పటికీ ప్రాణం సహాయం తో చైతన్యం గా పనిచేస్తుంది. ఇది సంకల్పాల మూట. మానవుని ముందు ఉన్న మంచి చెడు మార్గాల్లో ఆ మనసు తన స్థితిని బట్టి నడుస్తుంది. మనసు సహకరించకపోతే మనిషి ఆధ్యాత్మిక స్థితి సిద్ధించదు. శుద్ధ మనసే ఆధ్యాత్మిక చింతనకు చివరికి ఆత్మ సాక్షాత్కారం వరకు తీసుకెళ్ళి తాను ఆత్మ లో లయం అవుతుంది. చంచలం , చాపల్యంతో అగమ్యగోచరంగా ఉన్న మనసును అడవి గుర్రంగా పోలుస్తారు. దానిని తన అదుపులోకి తీసుకున్న వాడు జీవిత విజేత. మనసు కలిగించే ప్రతి ఆలోచనను పరమాత్మ వైపు మరల్చగలగాలి. మనసు చేసే గారడీకి లోబడకుండా దానినే ఆయుధంగా చేసుకుని పరమాత్మను చేరుకోవాలి.
దానికి లొంగిపోయిన వారికి అది మిత్రునిగా నటిస్తూ అధఃపాతాళానికి తీసుకెళ్తుంది.
ప్రతి నిముషం దానిని గమనిస్తూ, బుజ్జగిస్తూ దాని సహాయంతో ఉన్నత స్థాయికి వెళ్లగలగాలి.
మనసులో చేరిన దుర్లక్షణాలు ఎలా అవి లోపలికి చేరాయో జాగ్రత్తగా గమనించి వాటిని మనసు నుంచి మనసు సహాయం తోనే బయటకు పంపాలి. ఇది కేవలం సాధనతోనే సాధ్యం. మనసును అదుపులోకి తీసుకుని దానిని ఉన్నత మార్గం వైపు మళ్ళించిన సాదాసీదా మనిషి మహనీయుడు అవుతాడు, సాక్షాత్తు ఆ పరబ్రహ్మము గా నిలుస్తాడు..
మనస్సు ఇది సంకల్పాల మూట. సంకల్ప, వికల్పములు కు కేంద్ర స్థానం.
మంచి ,చెడు,రెండులకు మూలం. జడము,జీవము,రెండింటిలో వున్నది చైతన్యము.దీన్ని గుర్తించాలి అంటే మనస్సు తప్ప ఇంకేమీ గుర్తించ లేవు. చైతన్యము అంతటా వ్యాపించి ఉన్నదాన్ని,ఉన్నదిఉన్నట్లు చూపించేది మనస్సు.మనస్సు ఇలానే వుంటుంది ఎవరికీ ఐనా..దీనికి బుద్ధి నీ జోడిస్తే ,ఆత్మ కు చేరువవుతుంది...
మనస్సు. జడ జీవాలలో సారవంతమైనది మనస్సే! కనుక మనసు స్వతహాగా జడమే అయినా, నిశ్చయాత్మకంగా సత్యమును అవగతం చేసుకొని, అంటిపట్టుకున్న శుద్ధమనసు అనేది చేతనమే అని చెప్పక తప్పదు!
ప్రతీవారిలో మనసు బుద్ధి చిత్తం అహంకారం అనే నాలుగు విధాలుగా పనిచేస్తున్న అంతఃకరణమే మనసు! సంకల్ప వికల్పాలు చేసేది మనసే! ఏదైనా ఆలోచించేదీ మనసే, దేన్నైనా అనుభవించేదీ కూడా మనస్సే కనుక, బంధ మోక్షాలు అనుభవించేది మనసే!
సత్య శోధన చేసేది మనసే! నిర్వికల్పమైన శుద్ధ మనసే ఆత్మ! శ్రేయస్సు వైపు మొగ్గుతున్నదీ మనసే, ప్రేయస్సు వైపు మొగ్గేదీ మనసే! కనుక అపరను పరకోసం వాడుకొనుటకు మనసు యొక్క ప్రాముఖ్యత ఎంతైనా వుంది! నిశ్చయాత్మకమైన బుద్ధిగా వున్న శుద్ధ మనసే బ్రహ్మాత్మ అనుభవం పొందుతున్నది!
రోజూ చదవండి ప్రాంజలి ప్రభ, లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి, అంతర్జాల పత్రిక కధలు, రచయత సేకరణ మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ , హైద్రాబాదు,
***
*ఆవు వీపు పైన ఉండే "సూర్య కేతు నాడి"
*ప్రవర ఎలా చెప్పాలి...?*
*నేటి కధ నాలో నేను .. ప్రాంజలి ప్రభ .. 10
ఎంత ప్రేమ నా మనసును ఓదార్చగ నాలో యుత్తేజము, యుద్భవించి, వినయ వాంఛలు, తీరు వేళ యిదియే, ఎంత నేర్పు నా బుద్ధికి, పదునుగా బ్రతికించ మహిలో కొత్త యు ఉరవడి నన్ను చేరింది, నా భావాల వరద పొంగులు "తెలుగు కవిత్వములా" పొర్లుతున్నది. ఇది ఆ అమ్మవారి కృపా కటాక్షమే నేను నిమిత్తమాత్రుడను.
చిన్నబుచ్చుకోను ఎప్పుడు, నా అనుభవమే నాకు నేర్పిన గురువుల ఫలమే, నన్ను ప్రోత్సహించిన వారి కి కృతజ్ఞతలు, ఎంత గొడవ ఏది నిజము, నా నేటి కాలమే తీర్పుగా, ఏమార్చెను నన్ను. తనువంతా చిరుచెమటలు, సిగ్గు యలముకోగ, హృదయస్పందనలు తెలియపర్చలేక, అలుకల తలపులు ఉడికించగ నన్ను.
అడ్డమైన సంసారం, అనుకొంటిని కాదు, అదొక వరమని జీవిత ఫలమని, జీవన మార్గమని
ఎంత జ్ఞాన భండారమొనని, విలువలు తెలిసినాయి చదివించగ నన్ను.
కలహించగ యవసరమే లేదు, నాతో ప్రేమ పలుకుల జోలపాటల వాడిలో నలిగిపోయినాను నే నెపుడు తానేనా శ్రీమతి సగమైనది, నాకు సంకల్ప శ్రేష్ఠిగా దీక్షగా నడిపించగ నన్ను. 9 సంవత్సరాలు లెక్కల అధ్యాపకునిగా గుంటూరులో, తదుపరి ట్రజరీస్ అండ్ యకౌంట్స్ 29 సంవత్సరాల హైదరాబాద్, కర్నూల్, నిజామాబాద్ (I/c Dy. Director)మరియు అకౌంట్స్ ఆఫీసర్ (APMS /R M S) school education department, at విజయవాడ HOD అనుభవము తో వ్రాతలు మా నాన్నగారు, హనుమాన్ జ్యోతిషలయం గుంటూరు, మాతాత గారు కవులు.
ఈ మౌనమె, కాన్వయపరమై, దీపముగా మదిని తెలియపరచగలిగాను నిత్యమూ నన్ను న్నుగా ఎవరైనా పలికించగ నన్ను.
కాల మార్పుల కళలే తెల్పగలగాను, జీవితంలో అందరినీ ప్రేమించడం నాకు సాధ్యం కాకపోయినా నన్ను నమ్మిన వారిని జీవితాంతం ప్రేమించడానికి ప్రయత్నించగలను .
జీవితం నా దైనపుడు దానికోసం చేయాల్సిన కష్టం కూడా నాదే. ఓడినా గెలిచినా కష్టపడటం మాత్రం ఆపను . నా కష్టం ఇపుడు గెలుపునివ్వకపోవచ్చు కాని ఏదో ఒకరోజు అది నన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుందని గట్టి నమ్మకం .
మీ ప్రాంజలి ప్రభ
మల్లాప్రగడ రామకృష్ణ
**
*నేటి కధ నాలో నేను .. ప్రాంజలి ప్రభ .. 10
ఎంత ప్రేమ నా మనసును ఓదార్చగ నాలో యుత్తేజము, యుద్భవించి, వినయ వాంఛలు, తీరు వేళ యిదియే, ఎంత నేర్పు నా బుద్ధికి, పదునుగా బ్రతికించ మహిలో కొత్త యు ఉరవడి నన్ను చేరింది, నా భావాల వరద పొంగులు "తెలుగు కవిత్వములా" పొర్లుతున్నది. ఇది ఆ అమ్మవారి కృపా కటాక్షమే నేను నిమిత్తమాత్రుడను.
చిన్నబుచ్చుకోను ఎప్పుడు, నా అనుభవమే నాకు నేర్పిన గురువుల ఫలమే, నన్ను ప్రోత్సహించిన వారి కి కృతజ్ఞతలు, ఎంత గొడవ ఏది నిజము, నా నేటి కాలమే తీర్పుగా, ఏమార్చెను నన్ను. తనువంతా చిరుచెమటలు, సిగ్గు యలముకోగ, హృదయస్పందనలు తెలియపర్చలేక, అలుకల తలపులు ఉడికించగ నన్ను.
అడ్డమైన సంసారం, అనుకొంటిని కాదు, అదొక వరమని జీవిత ఫలమని, జీవన మార్గమని
ఎంత జ్ఞాన భండారమొనని, విలువలు తెలిసినాయి చదివించగ నన్ను.
కలహించగ యవసరమే లేదు, నాతో ప్రేమ పలుకుల జోలపాటల వాడిలో నలిగిపోయినాను నే నెపుడు తానేనా శ్రీమతి సగమైనది, నాకు సంకల్ప శ్రేష్ఠిగా దీక్షగా నడిపించగ నన్ను. 9 సంవత్సరాలు లెక్కల అధ్యాపకునిగా గుంటూరులో, తదుపరి ట్రజరీస్ అండ్ యకౌంట్స్ 29 సంవత్సరాల హైదరాబాద్, కర్నూల్, నిజామాబాద్ (I/c Dy. Director)మరియు అకౌంట్స్ ఆఫీసర్ (APMS /R M S) school education department, at విజయవాడ HOD అనుభవము తో వ్రాతలు మా నాన్నగారు, హనుమాన్ జ్యోతిషలయం గుంటూరు, మాతాత గారు కవులు.
ఈ మౌనమె, కాన్వయపరమై, దీపముగా మదిని తెలియపరచగలిగాను నిత్యమూ నన్ను న్నుగా ఎవరైనా పలికించగ నన్ను.
కాల మార్పుల కళలే తెల్పగలగాను, జీవితంలో అందరినీ ప్రేమించడం నాకు సాధ్యం కాకపోయినా నన్ను నమ్మిన వారిని జీవితాంతం ప్రేమించడానికి ప్రయత్నించగలను .
జీవితం నా దైనపుడు దానికోసం చేయాల్సిన కష్టం కూడా నాదే. ఓడినా గెలిచినా కష్టపడటం మాత్రం ఆపను . నా కష్టం ఇపుడు గెలుపునివ్వకపోవచ్చు కాని ఏదో ఒకరోజు అది నన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుందని గట్టి నమ్మకం .
మీ ప్రాంజలి ప్రభ
మల్లాప్రగడ రామకృష్ణ
**
సదాశివ పతివ్రతాయై నమః
తానవతరించిన వివిధ అవతారము లందును సదా శివుడే పతిగా, శివునిలో తను సగమై అర్ధనారీశ్వర తత్వమునకు ప్రతీకగా, శివునితో అవినాభావ సంబంధం గలిగి పాతివ్రత్యమునకు సంకేతమై నిలచిన తల్లికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి సదాశివపతివ్రతా యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం సదాశివ పతివ్రతాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిప్రపత్తులతో ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు సర్వకామార్ధసిద్ధి సంప్రాప్తించి, అంత్యమున సాయుజ్యమునందగలరు.
శివుడు అంటే మంగళకారుడు. సదాశివుడు అంటే నిత్యమూ మంగళకారుడు. అటువంటి సదాశివుని జగన్మాత భర్తగాపొందినది. తాను అవతరించిన ప్రతీ అవతారములోను ఆయననే తన భర్తగాపొందినది. పార్వతీ-పరమేశ్వరులు అన్నారు. ఎందుచేతనంటే తనభర్తతో అవినాభావసంబంధం గలిగి పాతివ్రత్యానికి సంకేతమై తను నిలిచినది. అందుకనే జగన్మాతకు తనభర్త సదాశివునిలో గల అన్ని విభూతులు గలిగియున్నది. శివశక్త్యైక స్వరూపిణి. రూపంలోను, నామంలోను, పంచకృత్యాలలోను అన్నివిధాలా పరమేశ్వరునితో జగన్మాత సమన్వయింపబడినది. సాధకుడు యోగసాధనలో కుండలినీ శక్తిని జాగృతంచేసి ఊర్ధ్వముఖంగా పయనింపజేయగా, బ్రహ్మ,విష్ణు,రుద్ర గ్రంథులను ఛేదించి, షట్చక్రాలకావల సహస్రారంలోని చంద్రమండలంలో సుధాసాగరమధ్యమందు పరమేశ్వరునిచేరి ఆయనతో ఆనందతాండవమాడిన తరుణంలో అమృతధారలను వర్షింపజేసినది అంటే ఆ సదాశివుని ఎంతగానో కోరినదైన జగన్మాత సదాశివపతివ్రతా యని స్తుతింపబడవలసినదేగదా! సౌందర్యలహరిలో, 96వ శ్లోకంలో శంకరభగవత్పాదుల వారు అమ్మవారి పాతివ్రత్యాన్ని ఇలా చెప్పారు:
కళత్రం వైధాత్రం - కతికతి భజంతే న కవయః
శ్రియో దేవ్యాః కోవా - న భవతి పతిః కైరపి ధనైః|
మహాదేవం హిత్వా - తవ సతి సతీనామచరమే
కుచాభ్యా మాసంగః - కురవకతరో రప్య సులభః||96||
సతీదేవీ! గొప్పకవులను సరస్వతీవల్లభులంటారు. గొప్ప సంపన్నులను లక్ష్మీపతులంటారు. కాని నీ కౌగిలింత మాత్రము ఈశ్వరునకు మాత్రమే లభించును. గోరింట చెట్టుకు కూడా లభించదు.
భావము:
అమ్మా! పతివ్రతాగ్రగణ్యా - ఎందరెందరో కవులు సరస్వతిని ఉపాసించి ఆమె అనుగ్రహం తో కవీశ్వరులై సరస్వతీ వల్లభులు అనిపించుకుంటున్నారు. అలాగే లక్ష్మీదేవిని ఆరాధించి ఆమె దయతో ధనవంతులై లక్ష్మీపతులు అవుతున్నారు. కాని అమ్మా శివునికి మాత్రమే సొంతమై శివునిలో అర్ధభాగమై ఉండు నీ అనుగ్రహం పొందుట మాత్రం అంత తేలికైన విషయం కాదు.లోకంలో కురవకవృక్షం ( గోరింటాకు చెట్టు) పండుటకు ఉత్తమ స్త్రీ ఆలింగనం చెప్పబడి ఉన్నది. నీ ఉద్యాన వనంలో ఆ చెట్టుకు నీవు దోహదం చేయునప్పుడు కూడా ఆ వృక్షమునకు నీ స్పర్శ నీలో అర్ధభాగమైన సదాశివునితోనే తప్ప శివేతరగా (శివుడు లేకుండా) నిన్ను తాకుట కుదరదు. అటువంటి పతివ్రతవు నీవు.పతివ్రతలలో అగ్రగణ్యవు (ముందు లెక్కింపవలసినదానవు) నీవు.
ఇచట శ్రీ ఆదిశంకరులు చెబుతున్నది ఏమనగా - బ్రహ్మ లేకుండా సరస్వతిని ఉపాసించి సరస్వతిని మాత్రం పొందవచ్చు, విష్ణువు లేకుండా లక్ష్మిని ఉపాసించి లక్ష్మిని మాత్రం పొందవచ్చు. కాని జగన్మాత విషయంలో మాత్రం అలాకాదు, ఆమె ఒక్కరేగా నిన్ను అనుగ్రహించదు.ఆమె అనుగ్రహం పొందాలంటే అర్ధనారీశ్వరులైన వారిరువురినీ కలిపి ఉపాసించవలసినదే. అంతేకాదు లోకంలో ఎవరైనా ఎప్పటికైనా విద్యావంతులు కావచ్చు, లక్ష్మీవంతులు కావచ్చు కాని లలితా కటాక్షవంతులు కావటం మాత్రం పరమ దుర్లభం. ఎంతో కఠోరమైన "యమ నియమ ఆసన ప్రత్య ఆహార ధ్యాన ధారణ సమాధి" ఇత్యాది అష్టాంగ యోగ నిష్ఠాగరిష్టులై అనన్య భక్తితో ఉపాసించు వారికి తప్ప ఇతరులకు ఇది సాధ్యం కాదు. ఇహ లోకంలో సుఖములను ఉపకరించు ఈ విద్యా, ధనం పొందినంత సులభం కాదు పరలోకంలో ముక్తిని అనుగ్రహించు అమ్మ పాదాలు పొందుట అని కవి భావము.
జగన్మాత ఆయన ప్రేమఅనే మణిరత్నాన్ని మొత్తంగా తనదిగా చేసుకోవడానికి తన స్తన ద్వయమనే ప్రపిఫలాన్ని అచ్చం ఇచ్చేసిందనడానికి, శ్రీలలితా సహస్రనామావళిలోని 33వ నామ మంత్రాన్ని పరిశీలించుదాము: కామేశ్వరప్రేమరత్న మణి ప్రతిపణస్తనీ పరమ పదాన్ని పొందడానికి భక్తి, జ్ఞానములు రెండూ కూడా కావాలని గూఢార్థము.
ఆ మహాతల్లి ఎంతటి పతివ్రత అంటే కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా (శ్రీలలితా సహస్ర నామావళి లోని 39వ నామ మంత్రము). పతివ్రతామతల్లులు తమ ముఖపద్మమును సహితం ఒరులకు కనుపింపనీయరు. అటువంటిది కామేశ్వరునికి మాత్రమే తెలిసిన, సౌభాగ్య మృదుత్వాలతోగూడిన ఉరుద్వయం గలిగిన మహాతల్లి జగన్మాత ఎంతటి పతివ్రతామతల్లి. శివశక్త్యైక్యము ఇక్కడ నిరూపితమౌతోందిగదా!
తన భర్త వలదు వలదని చెప్పినా వినక తన తండ్రి (దక్షుడు) నిర్వహించు దక్షయజ్ఞమునకు వెళ్ళగా, తాను (జగన్మాత) పిలవని పేరంటమునకు వచ్చినదనియు, అలా పంపించిన పరమేశ్వరుని (దక్షుడు) నానా దుర్భాషలాడగా, తన భర్త అవమానము తనదిగా భావించిన జగన్మాత, యజ్ఞకుండంలో తనువు చాలించి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకున్నది.
సురాసురులు అమృతము కొరకై చేయు క్షీరసాగరమథనమందు లోకభయంకరమైన హాలాహలము ఉత్పన్నమైనవేళ, జీవకోటి హాహాకారములు చేస్తుండగా, లోకానికి వచ్చిన పెనుముప్పుకు తల్లడిల్లినది జగన్మాత. ఆ తల్లి ఆ పెనుముప్పును తప్పించలేకనా? తన మాంగల్యసౌభాగ్యమును, తన పాతివ్రత్య మహనీయతను ఎంతగానో విశ్వసించినదిగా, అంతటి భయంకరమైన హాలాహలమును పరమేశ్వరునిచే సేవింపజేసింది. ఎందుకని? తన పాతివ్రత్యాన్ని, తన మాంగల్యబలాన్ని అందరికీ ఆదర్శంగా ఉండడంకోసం . ఇదే విషయాన్ని బమ్మెర పోతనామాత్యులవారు అమ్మవారి పాతివ్రత్యానికి అబ్బురపడిన ఈ పద్యరత్నములను ఒకసారి పరిశీలిద్దాము.
కంద పద్యము
మ్రింగెడి వాఁడు విభుం డని
మ్రింగెడిదియు గరళ మనియు మే లని ప్రజకున్
మ్రింగు మనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో!
తాత్పర్యం
ఆమె సర్వమంగళ కదా మరి; అంతేకాక ఆమె తన మనస్సులో తన మంగళసూత్రాన్ని అంత గట్టిగా నమ్మింది. కనుకనే మింగేవాడు తన భర్త అని, మింగేది విషం అని తెలిసి కూడ లోకులు అందరికి మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతోనే పార్వతీదేవి హాలాహలాన్ని మింగు మని పరమశివునికి చెప్పింది.
ఆ హాలాహలమును పరమ శివుడు గ్రోలినప్పుడు
మత్తేభ విక్రీడితము
కదలం బాఱవు పాఁప పేరు; లొడలన్ ఘర్మాంబుజాలంబు పు
ట్టదు; నేత్రంబులు నెఱ్ఱ గావు; నిజజూటా చంద్రుఁడుం గందఁడున్;
వదనాంభోజము వాడ; దా విషము నాహ్వానించుచో డాయుచోఁ
బదిలుండై కడి జేయుచోఁ దిగుచుచో భక్షించుచో మ్రింగుచోన్.
తాత్పర్యము
మహాదేవుడు ప్రచండమైన ఆ హాలాహలాగ్నిని ఆహ్వానిస్తున్నప్పుడు కానీ, దానిని సమిపించే టప్పుడు కానీ, పదిలంగా పట్టుకుని ముద్దచేసే టప్పుడు కానీ, నోట్లో ఉంచుకునే టప్పుడు కానీ, తినేటప్పుడు కానీ, మ్రింగే టప్పుడు కానీ, ఆయన కంఠాన హారాలుగా ఉన్న సర్పాలు కదలలేదు; చెమటలు గ్రమ్మ లేదు; కన్నులు ఎఱ్ఱబార లేదు; సిగలోని చంద్రుడు కందిపోలేదు; ఆయన ముఖ పద్మం వడల లేదు.
అంతటి జగన్మాతకు నమస్కరించునపుడు ఓం సదాశివపతివ్రతాయై నమః అని అనవలెను.
***
No comments:
Post a Comment