Friday, 15 March 2024

 




026* *వివాహమనేది* 027 వాగ్భూషణం - అవి ఎన్ని రకాలు* 028  *మాట వీపుకి చేటు* *029 వాగ్దేవతలు* 0..030 *పూర్వ జన్మ కర్మ.....*031.వాగ్భూషణం - అవి ఎన్ని రకాల, 032 *కాకి -పితృదేవత  * 033 బుద్ధిహీనత * 034*నేను లేకపోతే?* 035🪷అన్ని రోగాలకూ విరుగుడు మనసే* 036.పాపం – పుణ్యం.037.. ఐశ్వర్య సాధకులు *038 . జ్ఞానయోగము  039.. పిలిచేవాళ్ళు పిలిస్తే వస్తా,  040..ప్రయాణానికి శుభ శకునాలు 041..ఎవరు ఏ శుభకార్యం, 042.. *నీకు మంచి జరిగే ది ఏదైతే, 043.. 07.. కిృష్ణా, గుంటూరు జిల్లాల గొప్పేంటో తెలుసా ? ..044 *(సంసార చక్రము) 045.."అన్నదాన మహిమ" 046..కేవల అఖండ చిన్మాత్రమ్*047..*కమ్మని వాసనతో పాటు 048..విడిచిపెట్టటానికీ వీలులేనిది, 049 చద్దన్నం,  050 నవ్వులే నవ్వులు -4 



050 నవ్వులే నవ్వులు -4 

బామ్మ నీవు కష్ట పడుట మేము చూడలేము
మరి మీరు నాకోసం ఎం చేస్తారురా
నిన్ను కూర్చోపెట్టి మేము ఎం చేయమన్న చేస్తాం 

బయట ముగ్గే యండిరా అన్నది బామ్మ
కృష్ణ నేను వేస్తాను బామ్మ అంటూ
పళ్లెంలో తెల్ల పౌడరు తెచ్చి నాలుగు గీతాలు గీశాడు
అంతలో ప్రక్కనే ఉన్న నీళ్ళగిన్నె తన్నాడు
నీళ్లలో కాళ్ళు బెట్టి జర్రు జర్రు మని జారి పడ్డాడు
బామ్మ బామ్మ అని అరిచాడు, బామ్మ , రాము ఒకటే నవ్వులు
బామ్మ: ఏమిటిరా అక్కడంతా నురుగుంది
రాము: బామ్మ ముగ్గని "సర్ఫు పౌడర్ " వేసాడు ముగ్గు
అంతే అంతేనా
కృష్ణ నోట్లో వేలువేసుకొని నవ్వుకుంటూ కూర్చున్నాడు

మీరు ఏపని చేయలేరు కనీసం ఉప్మా చేసి పెట్టండిరా
ఓసి అంతే కదా బామ్మ నేను చేస్తా అంటూ కృష్ణ ముందుకు వచ్చాడు
ఏమిటిరా అరిచావ్
ఏమి లేదు బామ్మ, లైటర్ వెలగలేదు, అగ్గి పుల్ల చేయి కాల్చింది
ఒరేయ్ రాము నీవు వాడికి సహయ పడురా అన్నది
అట్లాగే బామ్మ అంటూ స్టవ్ వెలిగించి బాండి పెట్టి
నూనె వెయ్యాలి బామ్మ ఎక్కడుంది
నేను చెపితే మీకేం తెలుస్తుంది తెలుసు కోండిరా 
నాకు తెలుసు నీవు అల్లా కూర్చో నేను నూనె పోస్తాను అంటూ
ఒక సీసా తెచ్చి పోసాడు అంతే భగ్గుమని బాండి పగిలింది
ఇల్లంతా వెలుగుతో పొగ కమ్మింది, ఇద్దరు అక్కడే క్రింద పడ్డారు
బామ్మ ప్రక్కవారిని కేకలేసి పిలిచింది
మనవళ్ళని హాస్పటల్లో చేర్చారు
బామ్మను డాక్టర్ అడిగాడు ఇది ఎలా జరిగింది
ఎం చెప్పాను డాక్టర్ మా మనవుడు నూనె వేయమంటే
యాసిడ్ బాటిల్ తెచ్చి పోసాడు అంతే
ఆ ఆ అని నోరు తెరిచాడు డాక్టర్
డాక్టర చూసి అందరు నవ్వారు ఎం జరిగినిదో మాత్రం తెలియలేదు
అందరికీ వంట నేర్పండి- అవసరానికి ఆదుకుంటారు -
లేదా నవ్వులు పాలు కాక తప్పదు
--((*))--             

049 చద్దన్నం 

#చద్దన్నమా... అంటూ దాన్ని ఎంతో తేలికగా తీసిపారేస్తుంటాం. కానీ ఇప్పుడు ఆ చద్దన్నమే అనేక వ్యాధులకు అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుందని ఆయుర్వేద, అల్లోపతీ వైద్యులూ పరిశోధకులూ సశాస్త్రీయంగా చెబుతున్నారు. దాంతో స్టార్‌హోటళ్లు సైతం ఆ చద్దన్నాన్ని తమ మెనూలో చేర్చేస్తున్నాయి. ఇంతకీ అంత ఘనం అందులో ఏముందీ అంటే...

చద్దన్నమా... కావాలని చేసుకుని తింటున్నారా...ఆశ్చర్యంగా అనిపించినా నిజమే. ప్రతి ఇంట్లోనూ అన్నం అంతో ఇంతో మిగులుతూనే ఉంటుంది. మర్నాడు దాన్ని ఏ పులిహోరో కలుపుకోవడం తెలిసిందే. కానీ ఇక్కడ మన చద్దన్నం అది కాదు. కుక్కర్లు లేని కాలంలో అన్నం వండి గంజి వార్చేవారు. ఓ కుండలో అన్నం వేసి నీళ్లు, కాస్త గంజి పోసి దబ్బ లేదా నిమ్మ ఆకు వేసి, ఒకటి నుంచి #మూడురోజులు పులియనిచ్చేవారు. కొందరు అచ్చంగా నీళ్లు పోసీ పులియబెట్టేవారు. ఉదయాన్నే ఆ అన్నంలో కాస్త మజ్జిగో పెరుగో వేసి ఉల్లిపాయో మిరపకాయో నంజుకుని తినేవారు. దీన్నే తర్వాణి అనేవారు. అదే అసలైన చద్దన్నం... పుష్టికరమైన అల్పాహారం. దీన్నే ఫెర్మెంటెడ్‌ లేదా ప్రొబయోటిక్‌ రైస్‌ అంటున్నారు. అయితే కొందరు మిగిలిన అన్నంలో ఉదయాన్నే పులిసిన మజ్జిగ పోసుకుని తినేవారు. అలాగే అన్నంలో నీళ్లుపోసి కాసిని పాలు, పెరుగు వేసి #తోడుపెట్టుకుని వేసవిలో #ఉదయాన్నే తినడమూ వాడుకలో ఉంది. మొత్తమ్మీద అన్నాన్ని నీళ్లలోనో గంజిలోనో పులియనిచ్చి తినడం దేశవ్యాప్తంగా వాడుకలో ఉంది. అసోంలో దీన్ని పొయిటాబాత్‌ అంటే, బిహారీలు జీల్‌బాత్‌; తమిళులు పళయ సాదమ్‌; బెంగాల్‌, ఒడిశాల్లో పఖాలా బాత్‌ అంటారు. ఏటా మార్చి నెలలో చద్దన్నం దినోత్సవాన్నీ జరుపుకుంటారు ఒడిశావాసులు. అందుకే ఆ రోజున ఒడిశా రెస్టరెంట్ల మెనూలో ఇది తప్పక ఉంటుందట. కొత్త సంవత్సరం రోజున దీన్ని తినడం బెంగాలీల సంప్రదాయం. నీళ్లలో రాత్రంతా పులిసిన అన్నానికి కాస్త పెరుగు, ఆవనూనె, జీలకర్ర, ఉల్లి, పుదీనా జోడిస్తారక్కడ. విందు భోజనంలో అయితే ఇలస చేపముక్కలు, ఆలూబజ్జీ, మామిడికాయ పప్పు... వంటి వాటితో చద్దన్నం వడ్డిస్తారట. ఈ పులిసిన అన్నం తింటే పులికి ఉన్నంత బలం వస్తుందనేది ఈశాన్య భారతీయుల నమ్మకం. దీని గొప్పతనం గురించి ఆనోటా ఈనోటా విన్న పాశ్చాత్యులు పసుపు పాలు తాగినట్లే ఇప్పుడు గంజి అన్నాన్నీ రుచి చూస్తున్నారు. అమెరికన్‌ న్యూట్రిషన్‌ అసోసియేషన్‌ ఇందులోని ఉపయోగాల్ని పేర్కొనడంతో మళ్లీ మన దగ్గరా ప్రాచుర్యంలోకి రావడమే కాదు, స్టార్‌ హోటళ్ల మెనూలోనూ చేరింది. దాంతో ఆధునిక షెఫ్‌లు పెరుగు, కొబ్బరి తురుము, కరివేపాకు, ఆవకాయ, దబ్బకాయబద్ద... వంటి వాటిని చద్దన్నానికి జోడించి మరీ వడ్డిస్తున్నారు.

చద్దన్నం గొప్పతనం!

#ఒకప్పుడు రైతులూ కూలీలూ ఉదయాన్నే చద్దన్నమే తిని పొలం పనులకు వెళ్లిపోయేవారు. ఇది తినడంవల్ల అలిసిపోకుండా నిచేసుకునేవారు. వేసవిలో వడదెబ్బ తగిలేది కాదు. చద్దన్నం చలవ అనేది ఇందుకే కాబోలు. కానీ క్రమేణా ఇది పేదవాళ్ల ఆహారంగా స్థిరపడిపోయింది.

అయితే, జీర్ణక్రియలో భాగంగా విడుదలయ్యే హానికర రసాయనాల్ని చద్దన్నం హరిస్తుందనీ మంచి బ్యాక్టీరియాని పెంచి, పిత్త లక్షణాన్ని తగ్గించడం ద్వారా వ్యాధులు రాకుండా అడ్డుకుంటుందనీ ఆయుర్వేదం ఎప్పుడో పేర్కొంది. అందుకే అది మన దగ్గర పూర్వం నుంచీ వాడుకలో ఉంది. దాన్నే ఇప్పుడు ప్రొబయోటిక్‌గా అల్లోపతీ చెబుతోంది.

దీనికితోడు పొట్టలోని బ్యాక్టీరియా లోపం వల్లే మతిమరుపు, ఆల్జీమర్స్‌, బుద్ధిమాంద్యం... వంటి సమస్యలు వస్తున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి ప్రొబయోటిక్‌ ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులూ చెప్పడంతో అందరి దృష్టీ చద్దన్నంమీదకి మళ్లింది.

#పులియబెట్టినప్పుడు అందులో చేరిన బ్యాక్టీరియా అన్నంలోని పోషకాలతో చర్య పొందడం వల్ల కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, పొటాషియం వంటి పోషకాల శాతం పెరుగుతుందట. మామూలు అన్నంతో పోలిస్తే పులియబెట్టిన అన్నంలో ఐరన్‌ 21 శాతం ఎక్కువట. దీన్ని క్రమం తప్పకుండా తినేవాళ్లలో బి12-విటమిన్‌ సమృద్ధిగా ఉండి అలసటకు గురికారు. ఇది బలవర్థకమైన ఆహారమనీ రోగనిరోధక శక్తిని పెంచుతుందనీ రక్తహీనత ఉండదనీ దంతాలూ ఎముకలూ దృఢంగా ఉంటాయనీ చెబుతున్నారు. అల్సర్లూ పేగు సమస్యలు ఉన్నవాళ్లకి పరమౌషధంలా పనిచేస్తుందట. ఇందులోని బ్యాక్టీరియా వల్ల జీర్ణశక్తి మెరుగవడంతోపాటు బీపీ, మలబద్ధకం తగ్గుతాయి. ఇంకా బి6, బి12 విటమిన్లు కండరాల నొప్పుల్నీ తగ్గిస్తాయి. గంజిలోని విటమిన్‌-ఇ, ఫెరూలిక్‌ ఆమ్లం, కొలాజెన్‌ల వల్ల చర్మం మృదువుగా ఉంటుంది, అలర్జీలూ త్వరగా రావు. సో, చద్దన్నం సంగతి అర్థమైందిగా మరి!!! ...

*ధ్యానాలుగా వేదమంత్రాలు

యోగ సూత్రాలపై వ్యాఖ్యాత అయిన వాచస్పతి మిశ్రా పేర్కొన్నట్లుగా, వేదాలు నుండి పురుష సూక్తం వంటి శ్లోకాల యొక్క అర్ధాన్ని అర్థం చేసుకోవడంతో పాటు  రోజువారీ పారాయణం గొప్ప స్వాధ్యాయమని చెప్పవచ్చు. అలాగే, దేవాలయంలో మనం రోజూ,బహుశా దాని అర్థం తెలియకుండానే జపించే శతరుద్రియం,  - దానిని సరిగ్గా అర్థం చేసుకుని, సరైన భక్తి దృక్పథంతో పఠిస్తే గొప్ప ధ్యానం. వాచస్పతి మిశ్రా ప్రత్యేకంగా వేదానికి సంబంధించిన రెండు గొప్ప శ్లోకాలను సూచిస్తాడు-పురుష సూక్తం మరియు శతరుద్రియ-అవి చాలా శుద్ధి చేసే మంత్రాలు. అవి మనసుని ధ్యనలగ్నం మరియు ఏకాగ్రం చేయడమే కాక శరీరాన్ని ఎన్నో రకాలుగా శుద్ధి చేస్తాయి. ఈ మంత్రాలను పఠించడం వల్ల శరీరంలో మరియు మొత్తం వ్యవస్థలో ఇది జరుగుతుంది.

ఈ వేదమంత్రాలు అణుబాంబుల వంటి అపారమైన శక్తిని కలిగి ఉంటాయి మరియు వాటిని నిర్వహించడం మరియు వాటి బలగాలతో వ్యవస్థను శక్తివంతం చేయడం అనేది ఆధ్యాత్మిక సాధన. ఇది ఒక సూచన. స్వాధ్యాయానికి అనేక ఇతర పద్ధతులు ఉన్నాయి. ఇది ఒకరి మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది-అది ఎంత వరకు ఏకాగ్రతతో ఉంది, ఎంత వరకు పరధ్యానంలో ఉంది, ఈ కోరికలు లోపల నిరాశగా ఉండి పోయాయి, కోరికలు ఏమి అధిగమించ బడ్డాయి మరియు మొదలైనవి. ఒక వ్యక్తి సాధన చేయవలసిన స్వాధ్యాయ రకాన్ని తన మానసిక స్థితి నిర్ణయిస్తుంది.

***
048..విడిచిపెట్టటానికీ వీలులేనిది 

(1) విడిచిపెట్టటానికీ వీలులేనిది - పట్టుకొనటానికీ వీలులేనిది ఆత్మ*. మనకన్న వేరుగా నున్న వస్తువుని మనం పట్టుకుంటాం - అవసరం లేదనుకుంటే విడిచిపెడతాం. ఆత్మ మనకన్న వేరైన వస్తువు కాదు. వేరైన భావమూ కాదు. అది నేనే అయినప్పుడు ఎలా విడిచిపెట్టటం? ఆత్మనైన నేను నా శరీరాన్ని విడిచిపెడతాను; ఆలోచనలను విడిచిపెడతాను, మంచిభావాలను - చెడ్డభావాలను విడిచిపెడతాను - చుట్టూ ఉన్న వస్తువులను, వ్యక్తులను, వారి తోటి గల బాంధవ్యాన్నీ విడిచిపెడతాను. నాలో ఉన్న వాసనలు, కర్మఫలాలను కూడా విడిచిపెడతాను జ్ఞానం పొంది; కాని నన్ను నేను ఎలా విడిచిపెట్టగలను. కనుక ఆత్మ విడిచిపెట్ట వీలులేనిది, 'అహేయం'.

అలాగే నాకన్న వేరుగా నున్న వస్తువులను - పుస్తకాన్ని, పెన్నుని, కుర్చీని, బల్లని, మనిషిని, దొంగను - దేన్నైనా పట్టుకోవచ్చు. అలాగే ఆత్మనైన నేను ఈ దేహాన్ని పట్టుకున్నాను. ఈ మనోబుద్ధులను పట్టుకున్నాను. వాసనలను పట్టుకున్నాను. కాని ఆత్మను (నన్ను) పట్టుకోవటం ఎలా? నన్ను నేనే పట్టుకోవటం ఎలా? నా దగ్గర లేని దాన్ని నేను పట్టుకోవచ్చు. నాకు దూరంగా - నాకన్న వేరుగా నున్నదాన్నీ పట్టుకోవచ్చు. అసలు నేనే అయినదాన్ని ఎలా పట్టుకోవటం? కనుక ఆత్మను విడిచిపెట్టే వీలులేదు. పట్టుకొనే వీలులేదు. నేను శరీరాన్ని అనుకుంటే ఆత్మ నాకన్న వేరుగా ఉన్నట్లే గనుక పట్టుకోనూవచ్చు - విడిచిపెట్టనూ వచ్చు. నేను శరీరాన్ని కాదే. అలా అనుకోవటం అజ్ఞానమే. కనుక 'అనుపాదేయం' పట్టుకొనే వీలులేనిది -

*(2) మనోవాచాం అగోచరం* :- మనస్సుకు వాక్కుకు అందనిది. ఆలోచనల ద్వారా అందుకోలేనిది. ఏదైనా ఒక వస్తువో - ఒక వ్యక్తియో - ఒక విషయమో - ఒక భావమో ఉంటే దానిని గురించి మనస్సు ఆలోచనలు చేస్తుంది. మరి ఆత్మ వస్తువూ కాదు - వ్యక్తీ కాదు - విషయమూ కాదు - భావనా కాదు. పైగా ఒక తెలిసిన విషయాన్ని గురించి - మనస్సు ఆలోచించగలుగుతుంది. మరి ఆత్మ తెలిసిన విషయం కాదే - అసలు విషయమే కాదుగదా. అలాగే తెలియని విషయాన్ని గురించైనా ఆలోచించి తెలియలేదు అనైనా అనుకుంటాం. మరి ఆత్మ తెలియని విషయమా? కాదే. అది తెలిసిన దానికి - తెలియని దానికి వేరైనది గదా - కనుకనే మనస్సుకు అందదు. అగోచరం.

మనస్సుకు అందిన వాటినే మాటల్లో చెబుతాం. భాష నుపయోగించి శబ్దశక్తితో చెబుతాం. మనస్సుకు అందని దానిని వాక్కుతో ఎలా చెప్పటం? కనుక వాక్కుకు అగోచరం. అసలు ఇంద్రియాలకన్నింటికి అగోచరమే.

ఇదే విషయాన్ని కేనోపనిషత్తులో చెప్పటం జరిగింది. "నతత్ర చక్షుర్ గచ్ఛతి, నావాగ్గచ్ఛతి, నమనః ------" అని. కళ్ళు - వాక్కు - మనస్సు అక్కడకు పోలేవు అని. - ఆత్మయే అన్ని ఇంద్రియాలకు ఆధారంగా ఉండి ఆ ఇంద్రియాలు పనిచేయటానికి శక్తి నిస్తున్నది. అట్టి ఆధారమైన ఆత్మను ఇంద్రియాలు ఎలా తెలుసుకుంటాయి? మనం మంచె మీద కూర్చొని పొలాన్ని కాపలా కాస్తుంటాం. పొలం అంతా మనకు కనిపిస్తుంది. అయితే మనం కూర్చున్న మంచెకు ఆధారంగా ఉన్న కొయ్యబాదుల్ని చూడగలమా? - చూడలేం. కనుకనే 'మనోవాచాం అగోచరం' అనటం.

*(3) అప్రమేయం* :- సాటిలేనిది. మరొక దానితో పోల్చటానికి - కొలవటానికి అసలు రెండవ వస్తువు లేదు. సత్యవస్తువు ఆత్మ ఒక్కటే. సత్య వస్తువును అసత్య వస్తువుతో కొలవలేము.

ఇక్కడ ఒక బస్తా బియ్యం కుమ్మరించి మిమ్మల్ని కొలవమన్నాను. దేనితో? మానికలతో. అలా కొలిచి ఎన్ని మానికలో చెప్పాలి. ఓ! ఇంతేగదా! అని అందరూ పైట బిగించారు. అయితే ఒక షరతు చెప్పాను. మీరు కొలవవలసింది రాత్రి కలలో కనిపించిన మానికలతోనని - అంతే ఆగిపోయారు. మీరేమైనా తెలివి తక్కువ వారా? రాత్రి నాకు మానిక కలలోకి రాలేదండి. ఇప్పటివరకూ ఎప్పుడూ రాలేదు అన్నారు. సరే. అయితే ఇదిగో ఈ మానికతో కొలవండి అని ఒక పేపరు మీద మానిక బొమ్మను గీచి చూపించాను.  మరి కొలవగలరా? సత్యవస్తువును అసత్య వస్తువుతో కొలవలేం.  కనుక ఆత్మను దేనితోనూ కొలవలేం. అన్నీ అసత్యవస్తువులే గనుక.

*(4) ఆద్యంత రహితం* :- పుట్టుక చావులు లేని నిత్యసత్యం ఆత్మ - అనంతం. దానికి ఆది అంతం అనేవి ఉండవు.

*(5) మహ* :- తేజో రూపం. రూపం లేదు. తేజస్సే దాని రూపం. అదీ కనిపించని తేజస్సు. ఈ కన్నులు చూచి తట్టుకోలేవు. కనుకనే అది కన్నులకు కనిపించదు.

*(6) అహం పూర్ణం బ్రహ్మ* :- అట్టి పరిపూర్ణ బ్రహ్మమును - పరమాత్మను - శుద్ధ చైతన్యాన్ని నేనే - నాలో ఉన్న ఆత్మ అనటం తప్పు. నేనే ఆత్మను. నాలో ఇంకేమీ లేదు. కాకపోతే నేను దీనిలో ఉన్నట్లుగా భావన - అంతే.

--(()/--

047..*కమ్మని వాసనతో పాటు

కమ్మని వాసనతో పాటు నోరూరించే తీపినిచ్చే బెల్లం ఆరోగ్యానికీ చాలా మంచిది. ఎందుకంటే పంచదారలో ఉన్నట్లు బెల్లంలో ఎక్కువగా రసాయనాల వాడకం ఉండదు. పైగా ఇందులో ఖనిజాలు అధికం. అందుకే దీన్ని మెడిసినల్‌ చక్కెర అంటారు. బెల్లంతో సాధా రణంగా వచ్చే చాలా అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు. పొడి దగ్గు ఇబ్బంది పెడుతు న్నప్పుడు గ్లాసు బెల్లం పానకంలో కొద్దిగా తులసి ఆకులు వేసి, రోజుకు మూడుసార్లు తీసు కుంటే ఉపశమనం ఉంటుంది. కొన్ని కాకర ఆకులు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, మూడు మిరియాల గింజలు, చిన్న బెల్లం ముక్క వేసి గ్రైండ్‌ చేసిన మిశ్రమాన్ని రోజూ రెండుపూటలా వారం పాటు తీసుకున్నా... లేదంటే గ్లాసు పాలల్లో బెల్లం వేసి, రోజు తాగినా స్త్రీలకు నెలసరి సమస్యలు రావు.

--(())--

046..కేవల అఖండ చిన్మాత్రమ్*

*(3) కేవల అఖండ చిన్మాత్రమ్* :- ఆత్మ - చిత్ - జ్ఞాన స్వరూపం. ప్రజ్ఞాన ఘనం. ఇక్కడి బుద్ధిలోని తెలివి ఒక వస్తువును గురించి తెలుసుకోనూవచ్చు. తెలుసుకోలేక పోనూ వచ్చు. కాని ఆత్మలో ఉండే తెలివి అలా కాదు. తెలుసుకోవటానికి - తెలుసుకోలేక పోవటానికి వేరైనది. తెలుసుకొనుటకు వేరే వస్తువులేమీ అందులో లేవు. కనుక అది జ్ఞానానికి - అజ్ఞానానికి అతీతమైనది. అది తెలిసిన దానికన్నా వేరైనది. తెలియని దానికన్నా అధికమైనది - పైగా అది అఖండం. ఆ జ్ఞానాన్ని విభాగం చేసే వీలులేదు. కనుకనే అది కేవల అఖండ చిత్ స్వరూపం.

*(4) నిర్వికల్పకం* :- ఎటువంటి ఆలోచనలు, సంశయాలు, సంకల్పాలు, వికల్పాలు లేనిది ఆ పరమాత్మతత్త్వం. ఉన్నదొక్కటే గనుక - రెండవదేదీ లేదు గనుక - దేనిని గురించి ఆలోచిస్తుంది? కనుక ఆలోచనలు లేవు. అలాగే దానికి ఏ కొరతలు లేవు - ఏ కోరికలు లేవు కనుక సంకల్ప వికల్పాలతో పనిలేదు. అందుకే అది నిర్వికల్పకం.

*(5) పరంతత్వం బుధః విదుః* :- అట్టి ఈ పరతత్త్వాన్ని ఎవరు తెలుసుకో గలుగుతారు? బుధః = విజ్ఞులు - వివేకం గలవారు. విజ్ఞులు అంటే జ్ఞానులు. వివేకం అంటే ఆత్మానాత్మ వివేకం. ఎవరిలో ఆత్మానాత్మ వివేకజ్ఞానం ఉంటుందో - దానితో వారికి ప్రాపంచిక విషయాల పట్ల వైరాగ్యం ఉంటుంది. అట్టివారే శమదమాదులతో - తితిక్షతో - శ్రద్ధతో - చిత్త ఏకాగ్రతతో సాధన చేసి స్వస్వరూపంలో నిలువగలుగుతారు. తనలో ఉన్న చిదంశను తానుగా గుర్తించగలుగుతారు. నేను ఈ నేను (క్షేత్రం) కాదు - ఈ నేనుకు వెనుకనున్న నిజమైన నేనును (ఆత్మను) అని తెలుసుకోగలుగుతారు. అట్టి కేవల చిత్ గా - చైతన్యంగా ఉండిపోతారు.

- ఇంకా ఆత్మ ఎట్టిదో -

 ******

045.."అన్నదాన మహిమ"

               పూర్వం ఓ బ్రాహ్మణుడుండేవాడు. వేళగాని వేళ తనయింటికి ఎవరు వచ్చినా వాళ్లను తను ఎరగకపోయినాసరే, ఆదరించి భోజనం పెట్టేవాడు. ఒక వేళ ఇంటికెవరూ రాకపోతే, వీధి వెంట పోయే వాళ్ళని పిలిచి అన్నం పెట్టేవాడు. ఇలాగ చాలాకాలం జరిగేక, ఒకనాడాయనకు అన్నదానంవల్ల వచ్చే పుణ్యం ఎలాంటిదో తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది. ఎవళ్ళను అడిగినా చెప్పలేకపోయారు.

ఒకాయన ఏమన్నాడంటే, " అన్నదాన మహిమ చాలా గొప్పది. దానిని వర్ణించాలంటే, కాశీ అన్నపూర్ణకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు. మీకు తెలుసుకోవాలని ఉంటే, స్వయంగా ఆ అన్నపూర్ణాదేవినే , అడిగి తెలుసుకోండి” అని సలహా ఇచ్చాడు.

అన్నపూర్ణ అంటే కాశీ విశ్వేశ్వరుని భార్య ఐన పార్వతీదేవి అన్నమాట.

ఆవిడకు కూడా అన్నదానమంటే ఎంతో ఆసక్తి. అందుకనే కాశీలో ఎవరికీ అన్నం లేకుండా పోదు. మన బ్రాహ్మడు కాశీ వెళ్లి గంగ ఒడ్డున కూచుని పార్వతీ దేవిని గురించి గాఢంగా తపస్సు చేయసాగాడు.

దేవి అతని తపస్సుకు మెచ్చుకుని ప్రత్యక్షమై 'నీకేం కావాలి?' అని అడిగింది. బ్రాహ్మడు సాష్టాంగనమస్కారం చేసి, " అన్నపూర్ణాదేవీ, నాకేమీ కోరిక లేదు. కాని, అన్నదాన మహిమ ఎటువంటిదో తెలుసుకోవాలని నేను మిమ్మల్ని గురించి తపస్సు చేశాను. ఈసంగతి మీరే చెప్పాలి గాని ఇతరులవల్ల కాదు " అని తన మనసులో వుద్దేశం వెల్లడించాడు.

అప్పుడు దేవి అతనితో “నీకు అన్నదాన మహిమ తెలియాలి అంటే నేను చెప్పటం కాదు , అది నీవు తెలుసుకునే ఉపాయం మాత్రం చెబు తాను, విను:

హిమవత్పర్వతం దగ్గర హేమవతమని ఒక పట్టణం ఉంది. ఆ పట్టణాన్ని ఏలుతున్న రాజుకి పిల్లలు లేరు. నువ్వాయనదగ్గరకు వెళ్లి ఆయనకి కొడుకు పుట్టాలని దీవించు. ఆ రాజు సంతోషిoచి, ' బాబూ మీకేం కావాలని అడుగుతాడు. అప్పుడు నీవు, 'నాకు పెద్ద కోరిక ఏమీ లేదు. నీకు కుమారుడు పుట్టిన తక్షణమే ఆ పిల్లవాణ్ని నేను చూడాలి. ఆ సమయంలో పిల్లవాడి దగ్గర రాణీ కూడా ఉండకూడదు ' అని ' చెప్పు. 'ఇంతేగదా ?' అని రాజు అందుకు ఒప్పుకుంటాడు. ఆ పిల్లవాడు పుట్టడంతోనే ఏకాంతంగా వాణ్ని 'అన్నదానంవల్ల కలిగే పుణ్యమేమిటిరా అబ్బాయి ?' అని అడిగి తెలుసుకో” అని చెప్పింది.

బ్రాహ్మణుడు 'సరే' అని చెప్పి హేమవతానికి బయలుదేరి వెళ్లేడు. దారిలో ఒక అడవి అడ్డమైంది. అందులో ప్రవేశించి వెడుతూ అతడు దారి తప్పి పోయాడు. దారితెలియక తచ్చాడుతోంటే, ఆ అడవిలో ఉండే బోయవాడొకడు ఆయన అవస్థ కనిపెట్టి "ఏం బాబూ, దారి తప్పిపోయినట్టున్నారు, ఏ ఊరు వెళ్లాలి?” అని ఆత్రముతో అడిగాడు.

హేమవత పర్వతం దగ్గరికి పోవాలి' అన్నాడు బ్రాహ్మడు.

"బాబూ, దారితప్పి ఆమడ దూరం వచ్చేశావు. సాయంత్ర మయిపోయింది. పులులు, సింహాలూ ఉన్న అడవి ఇది. రాత్రి ప్రయాణం చెయ్యకూడదు. పొద్దున్నే దారి చూపిస్తాను. ఈ రాత్రి ఆగిపొండి” అన్నాడు బోయవాడు.

బ్రాహ్మడు రాత్రికి అక్కడ ఉండిపోవటానికి ఒప్పుకోగానే బోయవాడు ఆయనను తన చేనువద్దకు తీసుకెళ్లేడు.

చేను దగ్గరకు వెళ్ళటంతోనే బోయవాడు యింటికి అతిథిగా వచ్చిన ఆ బ్రాహ్మణుడికి భోజనం ఏం పెడితే బాగుంటుంది అని ఆలోచించాడు. అనపకాయలూ, కంది కాయలూ, పెసర కాయలూ కావలసినన్ని ఉన్నాయిగాని వాటిని ఉడకేసుకోమని ఇవ్వటానికి వాడి వద్ద కొత్తకుoడ లేకపోయింది. తమ కుండల్లో ఉడకేసి పెడితే ఆయన తినడు. ఎలాగ మరి? అని ఆలోచించాడు.

బ్రాహ్మడు, 'నాయనా, నాకేమీ వద్దోయ్. నువ్వు చేసిన ఆదరణవల్ల నా శ్రమా, ఆకలీ కూడా తీరిపోయాయి. ఆలోచించక పడుకో' అన్నాడు. కాని బోయవాడికి ఆ బ్రాహ్మణి పస్తు పెట్టడమంటే మనస్సు ఒప్పింది కాదు. అంచేత ఇంత చారపప్పూ పుట్ట తేనే తెచ్చి ఇచ్చి, వాటితో ఆకలి తీర్చుకోమన్నాడు.

బ్రాహణుడు అవి తీసుకొని, అంగోస్త్రం పరుచుకుని, కింద పడుకోబోతూంటే, బోయవాడు, 'అయ్యో, కిందపడుకోబోకండి. పులులు వస్తాయి ' అని చెప్పి, ఆయనని చేలో ఎత్తుగా ఉన్న మంచె మీద పడుకో బెట్టి, తాను కింద ఉండి, విల్లూ, అమ్ములూ పుచ్చుకుని మృగాలేవీ రాకుండా రాత్రంతా బ్రాహ్మడికి కాపలా కాశాడు.

బోయవాడలా నిద్రపోకుండా రాత్రంతా కాపలా కాశాడు కాని, తెల్లవారు ఝామున నిద్ర ఆగక ఒక్క కునుకు తీశాడు. అంతలో ఎక్కడనుంచో ఓపులి వచ్చి, పాపం ఆ బోయవాడి మీద పడి చంపేసింది.

బ్రాహ్మణుడు నిద్ర లేచి, జరిగినదంతా తెలుసుకుని, తనమూలాన ఆ బోయవాడు పులివాత బడ్డాడని ఎంతో విచారించాడు. బోయవాని భార్య బాహ్మణునితో “స్వామీ, నా రాత ఇలా ఉండగా ఎవరు తప్పించగలరు? మీరు విచారించకండి. మీకు హేమవతానికి దారి చూపిస్తాను , నడవండి" అని, ఆయనను తీసికెళ్లి దారి చూపెట్టి, వెనక్కి తిరిగివచ్చి, భర్తతోపాటు సహగమనం చేసింది.

ఆ బ్రాహ్మణుడు బోయదంపతుల మంచితనాన్ని తలుచుకుంటూ హేమవతాన్ని చేరుకున్నాడు. అక్కడ రాజును చూచి పార్వతీదేవి చెప్పినట్లుగా దీవించాడు. ' పుట్టినప్పుడు మీ పిల్లవాణ్ణి ఏకాంతంగా చూడడానికి అనుమతి ఇవ్వాల'ని కోరగా రాజు అందుకు ఒప్పుకున్నాడు.

రాజు గారి భార్య తొమ్మిది నెలలు మోసి, చందమామ లాంటి పిల్ల వాణ్ణి కన్నది. బ్రాహ్మణుడు ఎవరూ లేకుండా చూసి ఆ పిల్ల వాణ్ణి, 'అన్న దానంవల్ల కలిగే ఫలమేమిటో చెప్పు'  అని అడిగేడు.

అప్పుడే పుట్టిన శిశువైనప్పటికీ పెద్ద వానికి మల్లే ఆ పిల్లవాడు బ్రాహ్మణునితో యిలా అన్నాడు. “పది నెలల క్రితం మీరీ పట్టణానికి వస్తూ అడవిలో దారి తప్పిపోతే, మిమ్మల్ని తీసుకెళ్లి చారెడు చార పప్పూ, పుట్ట తేనే ఇచ్చిన బోయవాణ్ణి నేనే సుమండీ ! ఈమాత్రపు దానానికే ఈ రాజు గారికి కుమారుడైయి పుట్టి, రాజ్య మేలబోతున్నాను. ఒకనాటి దానానికే ఇంత గొప్ప ఫలం కలిగినప్పుడు, నిత్యం అన్నదానం చేసే మహానుభావులకు ఎటువంటి ఫలం కలుగుతుందో మీరే ఊహించుకోండి."

ఇలా చెప్పేసి, ఆ పిల్లవాడు మరుక్షణం లోనే ఏమీ ఎరుగని పసిపాపలాగ 'తువ్వా, కువ్వా' అని ఏడవడం ఆరంభించాడు.

బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపడి, తన వూరు తిరిగివచ్చి జరిగినదంతా భార్యతో చెప్పేడు. ఆ దంపతులు అప్పటినించి విడవకుండా అన్న దానం చేస్తూ ధన ధాన్య సమృద్ధి, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సుఖంగా ఉంటున్నారు.

(1949 ఆగష్టు నెల చందమామ కథ)

యిప్పుడు చందమామ లేదు!

చక్కని కధలు లేవు!!

సేకరణ :  మల్లాప్రగడ  రామకృష్ణ


  *. జ్ఞానయోగము  

బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున |
తా న్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప || 5

సృష్టియందు జీవులకు పునర్జన్మ లుండునని, కొందరు వాటి నెరుగుదురని, కొందరెరుగరని ఒక సత్యమును భగవానుడు ప్రతిపాదించినాడు. తనకును, అర్జునునకు అనేక జన్మలు గడచినవని, తానన్నిటిని ఎరుగుదునని, అర్జునుడెరుగడని తెలుపుటలో పై సత్య మున్నది. జన్మలు గడచుచున్నను తానెవరో తెలిసియున్నవారు యోగులు, ఋషులు, సిద్ధులు. 

తెలియని వారు అజ్ఞానులు. అజ్ఞానులు మృత్యువుతో సమస్తమును మరతురు. యోగులు మృత్యువును దాటుట తెలిసినవారు. కనుక వారికన్ని జన్మలును జ్ఞప్తి యందుండును. వీరినే చిరంజీవులని కూడ అందురు. 

మృత్యువును దాటుటకు అనంతుడైన ఆదిశేషువు యోగవిద్య నందించెను. భగవంతుని ఆదేశము కూడ అందరును యోగులు కావలెననియె. కలియుగమున అజ్ఞానవశమై ఇతర మతము లేర్పడి, జీవునకు పునర్జన్మలు లేవని, ఒకే జన్మమని ప్రచారమున్నది. ఇది అజ్ఞానము. 

జీవుని స్వభావములో దైవీ ప్రకృతి ఏర్పడుటకు పరిణామ మార్గమొకటి కలదు. ఈ పరిణామ మార్గమున జీవులు పాశవిక ప్రవృత్తి నుండి మానవతా ప్రవృత్తిలోనికి పెరుగుదురు. అటు పైన దైవీ ప్రవృత్తిలోనికి పెరుగు సందర్భమున యోగవిద్యా ప్రవేశము కలుగును. యోగ విద్యయందు పరిపూర్ణత చెంది జీవుడు మృత్యువును దాటి అమరుడై భూమి మీద యుండును. 

అట్టి జీవుని భూసురులందురు. అట్టివారు బ్రహ్మోపాసన చేయుచు బ్రహ్మమును పొందుదురు. అనగా బ్రహ్మమే వారి రూపమున వుండును. వీరినే బ్రహ్మర్షులందురు. వీరు జీవులకు తరణోపాయము చూపించుచు సద్గురు పరంపరగ నేర్పడి యున్నారు. 

వశిష్ఠ అగస్త్యులట్టి వారు. శ్రీకృష్ణుడు అట్టి యోగీశ్వరుల గమ్యము. అతనికి సృష్ట్యాది నుండి జరుగుచున్న జీవుల కథ తెలిసియున్నది. అతడికి అర్జునుని యొక్క పూర్వజన్మలు తెలియుటలో ఆశ్చర్యము లేదు. సద్గురువులకు కూడ జీవుల పూర్వజన్మల అవగాహన యుండును. వాని ననుసరించియే వారు జీవులకు హితము కలిగించు చుందురు. ఇది యొక సత్యము.

---
  03.. పిలిచేవాళ్ళు పిలిస్తే వస్తా 

స్వామి వివేకానంద భారతదేశంలోని ఓ గ్రామంలో నుంచి నడిచి వెళ్తున్నాడు.
ఊరి బయట ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం విగ్రహం ద్వంసమై ఉంది. దేవాలయం కూల్చబడి ఉంది. లోపలికి వెళ్ళాడు స్వామీజీ. అమ్మవారు భవానీదేవి.
క్శీరభవానీ అంటారు ఆ ప్రాంతీయులు ఆమెను. విగ్రహాన్ని చూసి స్వామీజీ...
అమ్మా!?
ఇతర మతస్థులు వచ్చి నీ దేవాదాయాన్నిలా ద్వంసం చేశారు.??
నీ విగ్రహాన్ని ముక్కలు చేశారు.??
నువ్వు ఎందుకు చూస్తూ ఊరుకున్నావు??
నువ్వందరినీ రక్షిస్తావని కదా!?దేవాలయాన్ని కట్టింది.!?
నిన్ను నీవే రక్షించుకోలేకపోతే ఎలా!??
ఇక మమ్మల్నేమి రక్షిస్తావు?
అన్నారు స్వామీజీ అమ్మవారితో.
అని కళ్ళు మూసుకుని బాధపడుతున్నాడు.
అమ్మవారు కనిపించిందాయనకు.!
పరమేశ్వరి సాక్షాత్కరించింది.
ఆమె అన్నది...నాయనా!
దేవాలయాన్ని నేను కట్టమన్నానా?!
మీరు కట్టుకున్నారు.!
మీరే రక్షించుకోవాలి.!
అంటే!??
ఆ సమాధానం సంతృప్తిగా లేదమ్మా?!
దేవాలయాన్ని మేము కట్టాము.
కానీ నువ్వు వస్తున్నావు కదా?!
మీరే రక్షించుకోండి అంటే?
నువ్వెందుకిక్కడ?
అన్నాడు స్వామీజీ.
అంటే!?
కాదు నాయనా!
Divine Law is different from Human Law. 
మేము జోక్యం చేసుకుంటే!?మా ముందు ఎవరాగుతారు? ఈ ప్రపంచంలో?
కానీ...!
మేము కర్మ ఫలితాలనిస్తాము. సరాసరి.,నేరుగా జోక్యం చేసుకోము.
దేవాలయం కట్టినవాడికి పుణ్యఫలితమిస్తాము. దేవాలయం నాశనం చేసినవాడికి పాపఫలితమిస్తాము. నరకాన్నిస్తాము.
అయితే!?
మీరెందుకున్నది?
మీరు రారా?
అని నువ్వడిగావు. వస్తాము. తప్పకుండా వస్తాము.
మమ్మల్ని పిలువగలవాడు పిలిస్తే వస్తాము!
పిలువగలగాలా?
మమ్మల్ని పిలిచేవాళ్ళు తక్కువైపోయారు.
నువ్వు పిలువగలిగేవాడవు గనుక వచ్చాను నేను.!
కనుక పిలువగలిగేవాళ్ళను తయారు చేయు.
వస్తే..అప్పుడు తప్పకుండా వస్తాము మేము.
అని ఆమె సమాధానం చెప్పింది క్శీరభవానీ దేవి వివేకానంద స్వామికి.

***

..ప్రయాణానికి శుభ శకునాలు 

      ఎవరు ఏ శుభకార్యం నిమిత్తం బయలుదేరినా మంచి శకునం చూసుకుని బయల్దేరుతుంటారు. మంచి శకునం చూసుకుని వెళ్లడం వలన, తలపెట్టిన కార్యం ఎలాంటి అటంకం లేకుండా పూర్తవుతుందనే విశ్వాసం ప్రాచీన కాలం నుంచి వుంది. సాధారణంగా ముత్తయిదువులు ఎదురు వచ్చినప్పుడు మంచి శకునంగా భావించి బయలుదేరుతుంటారు. అలాగే నీళ్ల బిందెలతో స్త్రీలు ఎదురైనప్పుడు కూడా మంచి శకునంగానే భావించి అడుగుముందుకు వేస్తారు.

ప్రయాణానికి సిద్ధమైనప్పుడు మగళధ్వనుల వినిపించినా .. గంట ధ్వని వినిపించినా శుభప్రదమేనని శాస్త్రం చెబుతోంది. గుమ్మంలో నుంచి అడుగు బయటికి పెడుతుండగా ఏదైనా శుభవార్త వినిపించినా, పిల్లా పాపాలతో కూడిన దంపతులు ఎదురైనా నిస్సందేహంగా బయలుదేరవచ్చని అంటారు. ఇక అనుకోకుండా ఏనుగు .. గుర్రం .. ఆవులు ఎదురైనా, తలెట్టిన కార్యం శుభప్రదంగా పూర్తవుతుందని చెబుతారు. ఒకవేళ ఏదైనా శకునం చెడుగా అనిపించినా .. చెడు వార్త విన్నా, కాళ్లు కడుక్కుని కాసేపు కూర్చోవాలి. మంచినీళ్లు తాగేసి .. ఇష్టదైవానికి నమస్కరించుకుని తిరిగి బయలుదేరవచ్చని పెద్దలు చెబుతుంటారు.
🙏🌷


--(())--
ఎవరు ఏ శుభకార్యం

      ఎవరు ఏ శుభకార్యం నిమిత్తం బయలుదేరినా మంచి శకునం చూసుకుని బయల్దేరుతుంటారు. మంచి శకునం చూసుకుని వెళ్లడం వలన, తలపెట్టిన కార్యం ఎలాంటి అటంకం లేకుండా పూర్తవుతుందనే విశ్వాసం ప్రాచీన కాలం నుంచి వుంది. సాధారణంగా ముత్తయిదువులు ఎదురు వచ్చినప్పుడు మంచి శకునంగా భావించి బయలుదేరుతుంటారు. అలాగే నీళ్ల బిందెలతో స్త్రీలు ఎదురైనప్పుడు కూడా మంచి శకునంగానే భావించి అడుగుముందుకు వేస్తారు.

ప్రయాణానికి సిద్ధమైనప్పుడు మగళధ్వనుల వినిపించినా .. గంట ధ్వని వినిపించినా శుభప్రదమేనని శాస్త్రం చెబుతోంది. గుమ్మంలో నుంచి అడుగు బయటికి పెడుతుండగా ఏదైనా శుభవార్త వినిపించినా, పిల్లా పాపాలతో కూడిన దంపతులు ఎదురైనా నిస్సందేహంగా బయలుదేరవచ్చని అంటారు. ఇక అనుకోకుండా ఏనుగు .. గుర్రం .. ఆవులు ఎదురైనా, తలెట్టిన కార్యం శుభప్రదంగా పూర్తవుతుందని చెబుతారు. ఒకవేళ ఏదైనా శకునం చెడుగా అనిపించినా .. చెడు వార్త విన్నా, కాళ్లు కడుక్కుని కాసేపు కూర్చోవాలి. మంచినీళ్లు తాగేసి .. ఇష్టదైవానికి నమస్కరించుకుని తిరిగి బయలుదేరవచ్చని పెద్దలు చెబుతుంటారు.

 --(())--
*నీకు మంచి జరిగే ది ఏదైతే

నీకు మంచి జరిగే ది ఏదైతే అది నీకు మంచి నీకు చెడు కలిగించేది ఏది అయితే అది చెడు దానికి దూరంగా ఉండాలి.. అంటే నీకు జరిగే మంచి కొందరికి నచ్చదు కొందరికి కష్టం కొందరికి నష్టం కూడా కావచ్చు..అదేలా అంటే నువ్వు బాగా సంపాదించి అభివృద్ధి లోకి రావడం కొందరికి అసూయతో బాధ కలిగిస్తుంది కొందరికి అదే వ్యాపారం లో పోటీ అవ్వడం వల్ల నష్టం కలుగుతుంది.. మరి నీకు జరిగిన మంచి ఎందరికో బాధ కలిగింది అనే కదా, అలా బాధ పడే వారిలో న్యాయం ఉందా..నువ్వు నిజాయితీగా ఉంటే అది నేరం కాదు..

ఏది చెడు నీ ఆరోగ్యాన్ని హాని కలిగించే అలవాట్లు చెడు.. నీ కుటుంబాన్ని నీ క్షేమాన్ని దూరంచేసే అలవాటు మీకు చెడు.. నువ్వు వచ్చిన స్థానం మర్చిపోకూడదు అప్పుడే మళ్ళీ అటువంటి స్థితికి చేరకుండా జాగర్త పడతావు... కష్టాన్ని లెక్కపెట్టి కర్చుపెట్టక పోతే అది నీకు శాపం అవుతుంది అపాత్ర ధానం శత్రువులను తయారు చేస్తుంది..

మరి నీకు మంచి జరుగుతుంది అంటే ఏమైనా చేయవచ్చా అని అనుకుంటే అది చాలా పొరబాటు నీకు మంచి జరిగే ది నీకు మంచి అంటే ఏదైనా చేయవచ్చు ఎలా అయినా బతకవచ్చు అని కాదు..ధర్మ విరుద్ధమైన పనులు చేయకూడదు ఇంకొకరికి నీ స్వార్ధం తోనో మూర్కత్వం తోనో హాని కలిగించ కూడదు...ఒకరి స్థాయిని ఎప్పుడూ తక్కువ చేయాకుడదు నీ స్థాయికి మించి కానీ తగ్గించుకుని గాని ప్రవర్తించకూడదు..

ఏది అసలైన సంపాదన?
ఇది తెలుసుకోవాలి సంపాదించిన ఒక్క రూపాయి కూడా నీతో రాదు మరి ఏది నీతో వస్తుంది.. నువ్వు చేసే అన్నదానం మళ్ళీ నీ జన్మకి ధాన్యం రూపంలో చేరుతూ ఉంటుంది, చేసే ప్రతి సహాయం మళ్ళీ జన్మకు నీకు నువ్వు సమకూర్చు కున్నట్టు అయితే ఆ సహాయం చిన్నది అయినా పెద్ద మనసుతో చేస్తే నువ్వు ఇచ్చిన దానికన్నా ఎక్కువగా నీకు సమకూర్చుకుంటున్నావు అని అర్థం..

మనము ఎవరికి సమాధానం చెప్పాలి..?
మన అంతరాత్మకు మనము సమాధానం చెప్పాలి. ఎందుకంటే  ఆత్మ దైవ స్వరూపం, కాలం చేసిన తర్వాత చిత్ర గుప్తుడి రూపంలో రచించిన పాప పుణ్యాల జాబితా కి కారణ శరీరం సమాధానం చెప్పాలి ,ప్రేత శరీరం కర్మను శిక్ష ను అనుభవించాలి. మళ్ళీ జన్మ కు నువ్వు చేసుకున్న కర్మలే నీకు కూడా వచ్చే ఆస్తులు.

మరి మళ్ళీ జన్మ ఎవరు నిర్ణయిస్తారు..?
మన తల్లితండ్రులను, తోబుట్టువులను, భాగస్వామిని బిడ్డలు స్నేహితులు , అన్ని కూడా మనము చేసిన పుణ్యం ఋణము కారణంగా మనమే నిర్ణయించుకుని పుడతాము.. నీ కర్మను అనుసరించి నీ తలరాత నీచేత లికించ బడినది తర్వాత దైవాన్ని కానీ జన్మనిచ్చిన వారిని కానీ నిందించడం కూడా పాపం..

కొలిమిలో బాగా కాలితేనే స్వచ్ఛమైన బంగారు పుడుతుంది, ఎన్నో ఉలి దెబ్బలకు రాయి దేవుడు అవుతుంది.. కష్టం అని అనుకున్న ప్రతి సారి దాన్ని ప్రేమించండి కష్టంకుడా దాటడానికి సులువుగా మారిపోయింది. కష్టాన్ని ఎలా ప్రేమించడం అంటారా నీ కష్టంలో నిన్ను నువ్వు ప్రేమించు నీ సమస్యను నువ్వు అర్థం చేసుకుని వాస్తవాన్ని అంగీకరించు నిన్ను నువ్వు నిరూపించుకునే అవకాశంగా భావించి.. అప్పుడు నీ కష్టం నీకు బాధ కలిగించదు బాధ్యతగా కనిపిస్తుంది..

***
07.. కిృష్ణా, గుంటూరు జిల్లాల గొప్పేంటో తెలుసా ?

క్రిష్ణా గుంటూరు జిల్లాల మాట వినగానే ఏం చెప్పక ముందే అబ్బో… అనే సౌండ్ వస్తుంది కదా ! 

అలా ఎందుకొస్తుందో తెలియాలంటే మీరు కచ్చితంగా ఇది చదవాల్సిందే ! 

ఉన్నసంగతేంటో కొన్ని బుల్లెట్ పాయింట్స్ లా ఉంది. చకచకా చదివేయండి.

– దేశంమొత్తంమ్మీద క్రిష్ణా జిల్లానే టాప్. ఇండియా జీడీపీ 7.5 శాతం. ఏపీ జీడీపీ 11.99 శాతం. క్రిష్ణాజిల్లా జీడీపీ 12.89 శాతం. తలసరి ఆదాయంలో క్రిష్ణాది రాష్ట్రంలో సెకండ్ స్పాట్. 1,40,593 రూపాయలు. గుంటూరుదైతే 1.04 లక్షలు.

– దేశానికి వచ్చే విదేశీ మారక ద్రవ్యంలో క్రిష్ణా గుంటూరు జిల్లాల వాటా7.6 శాతం. దేశంలోనే ఈ రెండు జిల్లాలదే టాప్ పొజిషన్.

– క్రిష్ణా గుంటూరు జిల్లాల్లో 2960 మంది బిలీనియర్లు ఉన్నారు. ఈ జిల్లాల నుంచి వెళ్లిన వాళ్లలో 460 మంది అమెరికా ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో టైకూన్ లుగా ఉన్నవాళ్లే !

– పొగాకు, పసుపు, మిర్చిలో ఆసియా దేశాలకి ఎగుమతి చేసే మోస్ట్ వాంటెడ్ సెంటర్ గుంటూరే. ఇక్కడి నుంచి వచ్చే ఉత్పత్తుల్ని మయన్మార్, సింగపూర్, మలేషియా, ధాయ్ లాండ్ ప్రత్యేకంగా తీసుకొంటాయ్.

– వాహనాల వాడకంలోనూ క్రిష్ణా, గుంటూరులే టాప్. టూవీలర్, ఫోర్ వీలర్ అన్నీ కలిపి ఈ రెండు జిల్లాల్లో 196 షోరూమ్ లు ఉన్నాయ్. ఇందులో 44 కార్ల కంపెనీ షోరూమ్ లే ! రూరల్ జిల్లాల్లో ఇంత మార్కెట్ ఉన్న ఒకేఒక్క ఏరియా ఇదే.

దేశంలోనే ఇది రికార్డ్.

25 లక్షల వాహనాలున్నాయ్ కాబట్టి ఏపీలో ఎక్కువగా ఫ్యూయెల్ వాడుతున్నది కూడా ఈ రెండు జిల్లాలే !

– కేరళ తర్వాత దేశంలో ఎక్కువమంది ఎన్నారైలు ఉన్న ప్రాంతం క్రిష్ణా, గుంటూరు జిల్లాలే ! 

29500 మంది ప్రవాసులున్నారు రెండు జిల్లాల్లో ! జిల్లాల వారీగా తీస్తే… ఇది దేశంలోనే టాప్ !

– దేశం మొత్తంమ్మీదా వైద్యులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు క్రిష్ణా గుంటూరు. ఈ రెండు జిల్లాల్లో 12600 డాక్టర్లున్నారు. ఇంతమంది మరెక్కడా లేరు. అమెరికాలో ఉన్న తెలుగు డాక్టర్లలో కూడా వీళ్లే ఎక్కువ.

– ఇంటర్నెట్ వినియోగంలో ఏపీలో క్రిష్ణా గుంటూరు జిల్లాలే టాప్. మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల్లో 36 శాతం ఈ రెండు జిల్లాల్లోనే ఉన్నారు.

– గుంటూరు జిల్లాలో 29 గ్రామాల రైతులు… 33 వేల ఎకరాలు స్వచ్చందంగా రాజధానికి కోసం ఇచ్చారు. అందులో 8 వేల ఎకరాలు రైతు కుటుంబాలకి ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయిస్తోంది. తిరిగి ఇస్తోంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద భూ సమీకరణ.

– క్రిష్ణా గుంటూరు జిల్లాల్లో 28 జలవిద్యుత్కేంద్రాలున్నాయ్. ఏపీ మిగులు విద్యుత్ రాష్ట్రం కావడంలో వీటి పాత్ర చాలా కీలకం . క్రిష్ణా గుంటూరు జిల్లాల్లో సరిగ్గా 28 సిమెంట్ కంపెనీలు కూడా ఉన్నాయ్. నిర్మాణానికి ఇవే మూలస్తంభాలు.

– 1954 నుంచి 140 మంది తెలుగువాళ్లకి పద్మశ్రీలు వస్తే…అందులో 45 మంది క్రిష్ణా గుంటూరు జిల్లాల వాళ్లే ! 18 పద్మవిభూషణ్ లు వస్తే అందులో ఐదుగురు క్రిష్ణా జిల్లాల వాళ్లే !

– క్రిష్ణా గుంటూరు జిల్లాలు చదవుల్లోనూ టాపే ! గుంటూరులో 51 ఇంజినీరింగ్ కాలేజీలుంటే… క్రిష్ణాలో 39 ఉన్నాయ్. 690 ఇంటర్మీడియట్ కాలేజీలు, ఐదు వర్సీటీలూ ఈ జిల్లాల్లో ఉన్నాయ్.

– ఇక క్రిష్ణా గుంటూరు జిల్లాల నదీతీరాల్లో 438 గుళ్లూగోపురాలున్నాయ్. తమిళనాడులో కూడా ఇంత డెన్సిటీతో ఆలయాలు లేవ్.

--(())--
*(సంసార చక్రము)
భగవంతుని  ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము)  - 

. ఏ వస్తువునకైనా ఆది ఎప్పుడున్నదో, దాని అంత్యము కూడా తప్పనిసరిగా అప్పుడే ఉన్నది.

1) స్వప్నము - > జాగృతి -> సుషుప్తి,  2) భూతము -> వర్తమానము. -> భవిష్యత్

3) సృషి. --> స్థితి. - - > లయము . ) మానవుడు బాల్యములో

a) నడక నేర్వక ముందు ప్రాకును., (b) తప్పటడుగులతో నడక నేర్చును , (c) దంతములు, పల్లు లేవు., (d) అమాయకపు స్థితి, (e) తినుబండారములకై మారాము చేయును, (f) సంసారమనగానేమో ఎరుగడు,. (g) బట్ట కట్టడు, దిగంబరి.

వృధాప్యములో a) నడవ లేక దేకును b) చేతికర్ర ఊతగాగొని, నడచును , c) దంతములు, పళ్లు ఊడి పోయినవి.

d) చాంచల్య స్థితి, e) జిహ్వ చాపల్యముచే రుచులను కోరును, f) సంసారమందు తాపత్రయము లేదు., g) అవసాన స్థితిలో, దహనసమయ మందు గాని, ఖనన సమయమందు గాని, వస్త్రమును తీసి వైతురు.

--(())--

 



 

*🟨 బుద్ధిహీనత 🟨

పూర్వం ఒక రాజు ఉండేవాడు. అతను అప్పుడప్పుడూ రకరకాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ఇస్తూ ఉండేవాడు. ఒకసారి రాజుగారికి బుద్ధిహీనుల పోటీ నిర్వహించాలనే ఓ వింత ఆలోచన వచ్చింది. వెంటనే ‘ఫలానా రోజు ఫలానా సమయాన ఫలానా ప్రదేశంలో బుద్ధిహీనుల పోటీ నిర్వహించబడుతుంది. ఉత్తమ బుద్ధిహీనుడికి విలువైన బహుమతి ప్రదానం చేయబడుతుంది’ అని ప్రకటన జారీచేయించాడు. ఆ రోజు రానే వచ్చింది. రాజ్యంలోని బుద్ధిహీనులందరూ పోటీలో పాల్గొన్నారు. అందరూ తమ తమ ప్రావీణ్యాన్ని, కళను ప్రదర్శించారు. వారిలో ఓ వ్యక్తి తన బుద్ధిహీనతను అత్యుత్తమంగా ప్రదర్శించి విజేతగా నిలిచాడు.

రాజుగారు విజేతగా నిలిచిన ఆ వ్యక్తిని ప్రశంసిస్తూ, తన మెడలో ఉన్న విలువైన హారాన్ని అతని మెడలో వేసి సత్కరించాడు. సభముగిసింది. అందరూ వెళ్ళిపోయారు. ఇది జరిగిన కొద్దిరోజులకే రాజుగారికి సుస్తీ చేసింది. అందరూ వెళ్ళి రాజుగారిని పరామర్శించి వస్తున్నారు. ఒకరోజు బుద్ధిహీనుడు కూడా రాజు గారిని చూడడానికి వెళ్ళాడు. ‘‘రాజుగారూ.. ఏమిటీ పరిస్థితి.. ఇలా అయిపోయారు.. ఎలా ఉంది ఆరోగ్యం..’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. రాజు ఓపికగా ‘‘నా ఆరోగ్యం క్షీణించింది. బహుశా ఇక నేను ఎక్కువ కాలం ఇక్కడ ఉండకపోవచ్చు’’ అన్నాడు.

 ‘‘అవునా.. వేరే చోటికి వెళుతున్నారా?’’ సంభ్రమంగా ప్రశ్నించాడు బుద్ధిహీనుడు. 

‘‘అవును.. అంటే.. ఈ ప్రపంచం వదిలేసి మరోప్రపంచానికి ప్రస్థానం..’’ అన్నాడు రాజు వేదాంత ధోరణిలో..

‘‘అవునా.. వేరే చోటికి వెళుతున్నారా? రాజుగారూ.. మీదగ్గర చాలా సంపద ఉందిగదా.. అదంతా అక్కడికి కూడా పంపించారా?’’ అడిగాడు బుద్ధిహీనుడు.

‘‘లేదు.. పంపలేదు..’’ 

‘‘ఇక్కడ ఇంత పెద్ద అద్భుతమైన భవనంలో ఉంటున్నారు కదా.. మరి అక్కడ కూడా పెద్ద భవంతి కట్టించారా?’’

‘‘లేదు.. అక్కడ పూరి గుడిసె కూడా నిర్మించలేదు’’ 

‘‘ఇక్కడ మీకింతమంది సేవకులు, నౌకర్లు, రకరకాల సేవలు చేసేదాస దాసీలు ఉన్నారు కదా.. అక్కడ కూడా వీళ్ళంతా ఉన్నారా.. అక్కడ మీకెవరు సేవలు అందిస్తారు?’ ప్రశ్నించాడు బుద్ధిహీనుడు.

రాజుకి బుద్ధిహీనుడి మాటల్లోని మర్మం అంతుచిక్కడం లేదు.. కాని బుద్ధి హీనుడి మాటల్లో ఎక్కడో జ్ఞానోదయ బోధ ఉన్నట్లు అనిపించ సాగింది.. అప్రయత్నంగానే ‘‘అక్కడ ఎవరూ నౌకర్లు లేరు. సేవకులు లేరు.. అక్కడికేమీ పంపలేదు కూడా..’ అన్నాడు.

‘‘మహారాజా.. ఇక్కడ మీరు సమస్త సంపదనూ సంపాదించుకున్నారు. సకల భోగభాగ్యాలూ, సమస్త విలాసాలూ అనుభవించారు. మరి అక్కడికి ఏమీ పంపుకోకుండానే వెళ్ళిపోతే అక్కడి పరిస్థితి ఏమిటి? ఆ జీవితం ఎలా గడుస్తుంది? బుద్ధిమంతులెవరైనా రేపటికోసం ఆలోచిస్తారు గదా! బుద్ధిహీనుడు ఎవరో ఇప్పుడు మీరే తేల్చుకోండి’’ అంటూ తన మెడలోని ఆ విలువైన హారాన్ని తీసి రాజు గారి మెడలో వేసి అక్కడినుండి బిరబిరా వెళ్ళిపోయాడు బుద్ధిహీనుడు.

రాజుగారు ఆలోచనలో పడిపోయారు. 

అవును...  ఈ ప్రపంచమే శాశ్వతమని, ఈ జీవితమే సర్వస్వమని రేపటి భవిష్యత్తును, రేపటి జీవితాన్ని పట్టించుకోకుండా ప్రాపంచిక వ్యామోహంలో మునిగి పోవడమే నిజమైన బుద్ధిహీనత.

 * నిర్మల ధ్యానాలు *

*ప్రతి మనిషి ప్రశాంతంగా జీవించాలనుకుంటాడు. అనుకున్నంత మాత్రాన ప్రశాంతంగా వుండలేడు. కొంత మంది శాంతి కోసం అరుస్తూ యుద్ధానికి సిద్ధపడతారు. శాంతి గురించి మాట్లాడుతూ ఆటంబాంబులు సిద్ధం చేస్తారు. ఇది చాలా చిత్రమయిన విషయం. మనుషులు అట్లాంటి వైరుధ్యాల్లో జీవిస్తారు. కారణం మంచి విషయాల గురించి కోరుకోవడం సులభం. వాటిని ఆచరణలోకి తేవడం పూర్తిగా భిన్నమైన విషయం. కలగనడం ఒక విషయం. కలని ఆచరణలోకి తేవడం మరొక విషయం. ఐనా కలలు కలలే. మేలుకొంటేనే అవి మాయమవుతాయి.*

*వాస్తవం వేరుగా వుంటుంది. మనిషిలో చీలిక ఏర్పడుతుంది. దేవుడి గురించి, శాంతి గురించి ప్రేమ గురించి కలగంటాడు. వాస్తవంలో యుద్ధానికి, వినాశనానికి, దౌర్జన్యానికి సిద్ధపడతాడు.నిజమైన శాంతి కాముకుడు. ఆంతరిక పరివర్తన గుండా సాగుతాడు. అప్పుడే స్వప్నం సాకారమవుతుంది. ధ్యానమొకటే పరివర్తనకు కారణమవుతుంది. దౌర్జన్యాన్ని ప్రేమగా పరివర్తిస్తుంది. అవి వేరు వేరు కావు. ఒక శక్తి. మన దగ్గర శక్తులున్నాయి. మనం ఎదగలేదు. ధ్యానం గుండానే అవి ఎదుగుతాయి.*

*సశేషం ...*

***

 ఐశ్వర్య సాధకులు అందరూ ఈ రోజు తెలిపే పాఠం నేర్చుకోవాలి.

అందరి దృష్టిలో ఐశ్వర్యం అంటే ధనం మాత్రమే.కానీ ధనం మనిషి బ్రతకడానికి ఒక మీడియా మాత్రమే.ఏమి సాధించాలి, అన్నా ధనమే కావాలి, కాబట్టి ధనం మాత్రమే శాశ్వతం అని మనుష్యులు అందరూ దాని చుట్టూ తిరుగుతూ తమ జీవితాన్ని వృధాగా చూసుకుంటున్నారు.కానీ వాస్తవానికి మానవ జన్మ ఉత్తమైనది,మరియు ఎంతో గొప్పది మరియు దర్లభమైనది.నేను శరీరం కాదు పరమాత్మ నుండి ఉద్భవించిన ఆత్మ శకలాన్ని నేను చేసిన సృష్టి ఈ సంపదలు,నేను జీవించడానికి సృష్టి చేసిన వసతులు, నేను కోరుకుంటే ఇవన్నీ నావద్దనే  ఉంటాయి.నేను వాటికోసం ప్రతీ నిత్యం ప్రాకులాడవలసిన పని లేదు, నేను కోరుకున్నా తక్షణమే అవి నాముందు ఉంటాయి , అన్న జ్ఞానం మరిచాడు.కారణం ఏమంటే తాను ఆత్మ స్వరూపం అనిమరచి ,తాను శరీరం అని తలచి ధనం ఎక్కడో ఉంది తాను దానిని సంపాదించడానికి ఎంతో ప్రయాస పడలి, నిరంతరం కష్టపడాలి అని అనుకుంటూ తన యొక్క నిజ తత్వాన్ని మరచి తాను సృష్టించిన ధనం చుట్టూ తిరుగుతూ బ్రతుకుతున్నాడు. తాను సృష్టించిన దానికోసం తానే పరిగేడుతున్నాడు.ఇది విచిత్రం.తాను ఎవరో, పరమాత్మ ఎవరో తెలుసుకొనన్నంత వరకుఈ జంజాటం తప్పదు.తాను శరీరం కాదు , ఆత్మను అని తెలుసుకుంటే చాలు తనకు కావలసినవి అన్ని తనవెంట ఉంటాయి.

మనిషి – ఆత్మ – పరమాత్మ ఇవన్నీ……… 

నేను ఎవరు ,నా గమ్యం ఏమిటి పరమాత్మ అంటే ఎవరు ఎక్కడ ఉంటాడు అని తెలుసుకోవాలి.

అణువులకు పరిమితమైన స్థితి లో జీవులు ,ఉన్నపుడు భగవంతుడు సృష్టి చేశాడు. మనకు (జీవులకు) ఉపాధి చేకూర్చాడు. అయితే నేను ఎవరు? ఈ శరీరమా? కాదు అది ఉట్టి ఉపాధి మాత్రమే. మరి నేను ఎవరు? మనసా? కాదు. బుద్దా? కాదు మరి శరీరమూ కాదు,ఎందుకంటే శరీరం అనేది ,మనకున్న అనుభూతి కారకం. మరి నేను ఎవరు? నాశనం లేని ఒక అంశ. భగవంతుని అంశ. అదే ఆత్మ.......... 

భగవంతుని తో ,దైవంతో ,పరమాత్మ తో , పూర్ణాత్మతో (మీరు ఏ పేరు ఐనా పెట్టుకోండి )వేరుపడి, అనేక ఉపాదులలో జీవించి, చివరకు మానవ జన్మ తీసుకున్నాము. ఈ జ్జన్మలో మనం జీవిస్తూ , ఆనందంగా ఉంటూ, అనుభవాన్ని పొండుతూ ,పరమాత్మ లో ఐక్యం పొందడం ఈ ఆత్మ తత్వం. ఆ క్రమంలోనే ఇప్పుడు మనమున్నాం.

మరి మనం ఏమి చేయాలో అర్థం కాక, ఈ సాంసారిక జీవితం లో కొట్టుమిట్టాడుతూ కేవలం కోరుకుంటే వచ్చే అశాశ్వతమైన వాటిని శాశ్వతంగా భావించి, శాశ్వత శివ సాయుజ్యాన్ని గుర్తించలేక ఉత్తమ జన్మ ఐన మానవ జన్మను వృదా చేసుకుని ఇదే గతిలోనో అధోగతిలోనో తిర్యక్ జన్మలలో తిరుగుతూ ఉంటాము. ఇది కాదు మన గమ్యం.

అజ్ఞానం నుంచే జ్ఞానం ఉదయిస్తుంది, అజ్ఞానం అంటే చీకటి .చీకటి లోనే వెలుగు విలువ తెలుస్తుంది. అపనమ్మకం నుండి నమ్మకం పుడుతుంది. ఇది ఈ జ్ఞానాన్ని గురువు ద్వారా మాత్రమే తెలుస్తుంది.మరి ఆ గురువు? మీ అంతరాత్మే మీ గురువు. మీరు మీ గురుంచి తెలుసుకోవాలి అని అనుకున్న తక్షణమే మీ అంతరాత్మ బాహ్య గురువుని మీ ముందు ఉంచుతుంది. బాహ్య గురువు మీ లోనికి పంపుతాడు.ఆయన కూడా మీకు మీ అంతరాత్మకు ఒక మీడియా మాత్రమే... అసలు గురువు, దైవం మీ పుర్ణాత్మే .. అదే మీ అంతరాత్మగా నిలిచి ఉంది... నేను ఆత్మ స్వరూపం , నేను బ్రతకడానికి ఈ శరీరం ఒక మీడియా గా తీసుకున్నాను, నేను బ్రతకడానికి నాకు వసతులు కావాలి అని అనుకున్నంత మాత్రాన మనకు అన్ని వనరులు,వసతులు  ఏర్పడుతాయి. కానీ నేను శరీరం అని అనుకుంటే మాత్రం మనం వాటిని సంపాదించడానికి నిరంతరం కష్ట పడుతూనే ఉండాలి, వాటి వెంట పరిగెడుతూనే ఉండాలి, అవి మనకు అందకుండా పోతూ మనల్ని పిచ్చి వాళ్ళుగా చూస్తూనే ఉంటాయి.

***

పాపం – పుణ్యం.

ఇవి రెండూ పరస్పర సంబంధం లేని బ్యాంకు అకౌంట్లు లాంటివి. పాపం కష్ట కారణమైతే, ఐశ్వర్యం పుణ్య కారణం. ఇలా పాప, పుణ్యాల సమీకరణ లో మాయా ప్రపంచం చాలా అందంగా కనిపించి మనలను గుడ్డి వాళ్లను చేస్తుంది. ఎది చేసినా మన గమ్యం మారరాదు. మారితే మరికొంత కాలం ఇక్కడే , ఉండవలసి వస్తుంది.మరలా, మరలా జన్మను తీసుకోవలసినదే....మరి ఈ కర్మను సరిగా చేయడం ఎలా? 

సులభమైన మార్గం మన కోసం, మన పూర్వీకులైన ఋషులు చెప్పిఉన్నారు. అదే భక్తి మార్గం. భక్తి నవ విదాలు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, పరమాత్మకు నివేదనం నవవిధ భక్తి మార్గాలు. ఈ మార్గంలో మనం అరిషడ్వర్గాలను జెయించాలి. జయిస్తాం కూడా...

 కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యములు అరిషడ్వర్గాలు. ఈ ఆరింటినీ అదుపులో ఉంచడమే జయించడం అంటే. అప్పటికి గానీ తెలియదు ఆత్మ పరమాత్మ వేరుకాదు. రెండూ ఒకటే అని... ఇదే అద్వైత సిద్ధాంతం. మనసు ప్రమేయంతో ఎప్పుడూ ఆత్మ పరమాత్మనే తలుస్తూ అన్నింటికీ ఆ దేవ దేవుడే కారణంగా అని తలిస్తే ఇక ఎ బాదలూ బదనాయాలూ ఉండవు. అంతా ఆత్మానందం. పరమానందం. 

జనన మరణాలు  దైవాధీనాలు. మరణం శరీరానికే గానీ ఆత్మకు కాదు. శరీరంలో చైతన్యం ఉన్నంత కాలం మనసు శరీరానికి అనుసంధానమై ఉంటుంది. బుద్ధి కర్మానుసారి అంటారు. మనస్సు మనిషిని పరి పరి విధాలుగా ఆలోచింపచేసి అనేక సుఖ దుఃఖాలకు కారణమౌతుంది. జీవమున్నంత వరకు మనస్సును మంచి మార్గంలో ఉంచడానికి దర్మాచరనే ముఖ్యం. 

దర్మాచరనను శాస్త్రాలద్వారా తెలుసుకొనవచ్చు. కష్టతరమైనా ధర్మాన్ని అనుసరించాలి. అదే సులభ మార్గం. 

దేవ విధిలో భాగంగా ప్రాణమున్నంత కాలం దర్మాచరణ పాటిస్తే, ప్రణాళిక సక్రమంగా సాగినట్లే. సుఖ దుఃఖాలకు పరమాత్మే కారణమని నమ్మితే అసలు సమస్యే లేదు. ఎన్ని జన్మలెత్తినా విసిగి వేసారే పని లేదు. అంతా సంతోషమే. అంతా ఆనందమే. నిత్యానందం. పరమానందం. 

మరి ఈ జన్మలోనే ఈ విషయం మనకు తెలిసింది కాబట్టి ఈ రోజునుండి, ఈ గంట నుండి ఈ క్షణం నుండే మనం భగవత్ సాన్నిధ్యాన్ని కోరుకుందాం...మన పూర్ణాత్మతో మమేకమై ఉందాం....నిరంతరం ఆయనతో ఉంటే చాలు అన్ని మనం కోరకుండానే అన్ని ఆయనే మనకు సమకూరుస్తాడు.అంటే మరలా ఆయన ఎక్కడో ఉన్నాడు అని అనుకోకండి.మీలోనే ,మీలానే లోపల,బయట ,అన్నిటి లోనూ అందరిలోనూ , అంతటా మీరు కోరుకున్న వాటన్నిటిలోనూ పరమాత్మ ఉన్నాడు.మీరు కురుకున్నా, కోరుకున్నా మీకు యెప్పుడు,అవసరమో అన్ని వాటంతట అవి వాటికవే అన్ని సమకూరుతాయి.....

ఇంకా ఉంది....

మీకు ఏమైనా సందేహాలు ఉంటే సంప్రదించండి.

***

🪷అన్ని రోగాలకూ విరుగుడు మనసే💓🙏🌷🌻*

*💎 జపాన్ శాస్త్రవేత్తలు చేసిన వివిధ ప్రయోగాలలో ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. ఇంతకాలం మనం గుడ్డిగా నమ్ముతున్న అనేక ఆరోగ్యసమస్యలకు మూలాలు మనం తీసుకునే ఆహారంలో లేవని మన జీవించే విధానంలోనే ఉన్నాయని, మనసును హాయిగా ఉంచుకున్న వారికి ఏ రోగాలు రావని వారు తేల్చిచెబుతున్నారు. అమెరికాలో జరిగిన మరో సర్వేలో కూడా మనసుబాగున్న వారు ఎక్కువకాలం జీవిస్తున్నారని తేల్చారు. మనసు కలతబారితే లేనిపోని ఆలోచనలు చోటుచేసుకుని వాటి నుంచి బైటపడడానికి బలహీనతలు పెంచుకోవడం, వాటికి బానిసలై దురలవాట్ల పాలైపోవడం వంటివి చేస్తున్నారని వారు తేల్చారు. ఇటీవలకాలంలో ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు కీలక రోగాలకు మందులు ఇవ్వడం తగ్గించి జీవన శైలిని సరిదిద్దే పనిలో పడ్డారు.*

 అందుకే డయాబిటిక్, బిపి వంటి నిరంతర అనారోగ్యకర అంశాలకు డాక్టర్లు ట్రీట్‌మెంట్ ఇచ్చే పద్ధతి మార్చుకున్నారు. ఇది వరకు తినకూడదు అన్న అన్ని రకాల ఆహారాన్ని నిరభ్యంతరంగా తినమంటున్నారు. పొద్దుటే వాకింగ్ వెళ్ళే వారు ప్రశాంతమైన మూడ్‌లో ఉండాలని అందుకోసం నచ్చిన పాటలు వినమంటున్నారు.*

*💎 ఏం చేస్తే ఉత్సాహంగా అనిపిస్తుందో అది చేయమంటున్నారు. కొందరు వాకింగ్ ఇష్టపడితే మరికొందరు జిమ్‌కు వెళ్ళాలనుకుంటారు. ఇంకొందరు బ్రిస్క్‌వాక్ చేయాలనుకుంటే, ఇంకొందరు స్టురైకేస్ వాక్  చేయాలనుకుంటుంటారు. అందుకని డాక్టర్లు పేషెంట్ల ఇష్టానికే విడిచిపెట్టి ఎంతో కొంత వ్యాయామం మాత్రం చేయమని సూచిస్తున్నారు. ఒక్కసారిగా వీరి వైఖరి ఇలా మారిపోడానికి కారణం సరికొత్త అధ్యయనాలలో వెలుగుచూస్తున్న అంశాలే కారణం. ఇలా వెల్లడైన అనేక పరిశోధనల ఫలితాలలో జపాన్ శాస్త్రవేత్తల పరిశోధన, అధ్యయనం సరికొత్తది. దీనిలో పాల్గొన్న సైంటిస్టులు ఏం చెబుతున్నారో చూద్దాం.* -:

*📍మానసిక ఒత్తిడి వల్ల గ్యాస్: కడుపులో  గ్యాస్ సమస్యను వాయువు అంటారు. ఇది రావడానికి, ముదరడానికి కారణం  ఆహార లోపాల వల్ల కాదట.  మానసిక ఒత్తిడి వల్ల ఎక్కువ వస్తుందట !*

* ఆవేశాల వల్లే అధికరక్తపోటు: ఉప్పు ఎక్కువగా తినే వారికంటే ఆవేశ కావేశాలను అదుపులో పెట్టుకోని వారిలోనే  అధికరక్తపోటు ఎక్కువట !*

*📍అతిబద్ధకం వల్ల చెడుకోలెస్టరాల్: కొవ్వు పదార్థాలు తినేవారిలో కంటే  అతిబద్ధకం వలన కొవ్వు పెరిగిన వారిలోనే చెడుకోలెస్టరాల్ ఎక్కువట!*

*💎 మధుమేహం సమస్య: తీపి పదార్థాలు అధికంగా తినేవారిలో కంటే, అధికస్వార్ధం, మొండి తనం ఉన్నవారిలో నే ఎక్కువట !*

*📍అతివిచారం వల్ల ఆస్త్మా: ఊపిరితిత్తులకు గాలి అందకపోవడం కంటే, అతివిచారం వల్లనే ఊపిరితిత్తులలో మార్పులు వచ్చి ఆస్తా వస్తుందట.* 

*💎 ప్రశాంతత లేక గుండెజబ్బులు: ధమనుల్లో రక్తం ప్రసరణ లోపాల కంటే ప్రశాంతత లోపించడం వల్లనే గుండె కొట్టుకోవడంలో మార్పులు వస్తున్నాయట. అందువల్ల మనిషికి గుండెజబ్బులు వస్తున్నాయట.*

*మొత్తం మీద శరీరంలో వచ్చే సర్వ రోగాలకు మూల కారణాలు తరచి చూస్తే ఆహార అలవాట్ల, మరీ ముఖ్యంగా లైఫ్‌స్టయిల్ సంబంధమైనవేనని తెలుస్తోంది. అందుకు వారు వివిధ కారణాలను చూపించారు. వారి అధ్యయనం ప్రకారం*

*50% ఆధ్యాత్మికత లోపంవల్ల*

*25% మానసిక కారణాల వల్ల*

*15% సామాజిక, స్నేహబాంధవ్యాల లోపం వల్ల*

*10% శారీరక కారణాల వల్ల*

*📍రోగాలు వస్తున్నాయి.*

*అందువల్ల ఆరోగ్యాన్ని  కాపాడుకోవడానికి ఓంకార🕉️ ధ్యానం💓 (om🕉️Chanting) చేయాలని మరియు జీవన శైలిని మార్చుకుని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మేలు అని జపాన్ సైంటిస్టులు అంటున్నారు.* 

*వీరి సూచనల ప్రకారం మనం ఆరోగ్యంగా ఉండాలంటే స్వార్ధం, కోపం, ద్వేషం, శత్రుత్వం, ఆవేశం, అసూయ,మొండితనం, బద్ధకం, విచారం, వంటి వ్యతిరేక భావాలను వదిలించుకోవాలి..* 

*ప్రేమ, దయ, కరుణ, త్యాగం, శాంతం, క్షమ, నిస్వార్ధం, స్నేహభావం, సేవాభావం, కృతజ్ఞత, హాస్య ప్రియత్వం, ఆనందం- సంతోషం , సానుకుల దృక్పథం (Positive thinking), ఆధ్యాత్మిక శక్తులు (Spiritual powers) పెంచుకోవాలి అని చెప్పారు*.✍️

***

*నేను లేకపోతే?*

అశోక వనంలో రావణుడు... సీతమ్మ వారి మీదకోపంతో... కత్తి దూసి, ఆమెను చంపటానికి ముందుకు వెళ్ళినప్పుడు.... హనుమంతుడు అనుకున్నాడు 'ఎవరి నుంచైనా కత్తిని తీసుకుని  రావణాసురుని తలను ఖండించాలి' అని

కానీ మరుక్షణంలోనే మండోదరి... రావణుడి చేతిని పట్టుకొని ఆపడాన్ని చూశాడు! 

 ఆశ్చర్య చకితుడయ్యాడు. 

'"నేనే కనుక ఇక్కడ లేకపోతే... సీతమ్మను  రక్షించే వారెవరు... అనేది నా భ్రమ అన్నమాట" అనుకున్నాడు హనుమంతుడు! 

బహుశా మనం కూడా ఎన్నోసార్లు ఇలానే అనుకుని ఉంటాం,  'నేను లేకపోతే ఎలా?' అని. 

 సీతామాతను రక్షించే పనిని, ప్రభువు ఏకంగా రావణుని భార్యకు అప్పగించాడు. 

అప్పుడు హనుమంతుడు కి అర్థమైంది  'ఎవరి ద్వారా ఏ కార్యాన్ని  చేయించుకోవాలో... వారి ద్వారానే ప్రభువు ఆపని చేయించుకుంటాడు' అని. 

**మరింత ముందుకు వెళితే 

త్రిజట ....తనకు ఒక కల వచ్చిందని, ఆ కలలో లంకకు ఒక కోతి వస్తుందనీ, అది లంకను కాల్చివేస్తుందనీ..దాన్ని నేను చూశాను ....అనీ చెప్పింది. 

అయితే హనుమంతుడికి ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ప్రభువు తనను సీతను చూసి మాత్రమే రమ్మన్నాడు, అంతేకానీ లంకను కాల్చి రమ్మని చెప్పలేదు. 

తాను లంకను కాల్చడం ఎలా సాధ్యం.. అనుకున్నాడు

అయితే త్రిజట ఇది తన స్వప్నంలో చూశాను ...అని చెప్పింది. హనుమంతుడు ధర్మ మీమాంసలో పడ్డాడు... తను ఇప్పుడు ఏం చేయాలి? సరే, ప్రభువు ఇచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది.... అనుకున్నాడు. 

హనుమంతుని చంపడానికి రావణుడి సైనికులు పరిగెత్తుకొని వస్తున్నప్పుడు... హనుమంతుడు ఏమి చేయలేదు. అలా నిలబడ్డాడు. 

అయితే ఆ సమయంలో విభీషణుడు వచ్చి 'అన్నా! దూతను చంపటం నీతి కాదు' అన్నాడు. 

అప్పుడు హనుమంతునికి అర్థమైంది, తనను రక్షించే భారం ప్రభువు విభీషణుని  పై ఉంచాడు అని. 

ఆశ్చర్యానికి పరాకాష్ట ఎక్కడంటే .... విభీషణుడు ఆ మాట చెప్పగానే... రావణుడు  ఒప్పుకుని 'కోతిని చంపొద్దు. కోతులకు తోకంటే మహా ఇష్టం . తోకకు నిప్పు పెట్ట0డి' అన్నాడు.

అప్పుడు హనుమంతుడికి మరింతగా అర్థమైంది త్రిజట స్వప్నం నిజం కాబోతుంది అని. "ప్రభువు నాకే చెప్పి ఉంటే... నేను ఎక్కడి నుంచి నూనె తీసుకురావాలి, ఎక్కడి నుంచి గుడ్డలు తీసుకురావాలి, ఎక్కడి నుంచి నిప్పు తీసుకురావాలి, ఎప్పుడు లంకను తగలబెట్టాలి! "ఆలోచనల వరంపరతో ఆశ్చర్యంలో మునిగిపోయాడు.

పరమాశ్చర్యం ఏంటంటే... వాటన్నిటికే ఏర్పాట్లు... రావణుడే స్వయంగా చేయించాడు. 

అంటే, రావణునితో కూడా తన పనిని చేయించుకోగలిగిన తన ప్రభువు ....తనకు"లంకను చూసి రా"అని మాత్రమే ఆజ్ఞాపించడంలో ఆశ్చర్యం ఏముంది! 

**

అందుకే ప్రియ భక్తులారా! ఒకటి గుర్తుంచుకోండి. 

ప్రపంచంలో జరుగుతున్నదంతా ఈశ్వరేచ్ఛ ప్రకారమే జరుగుతుంది. మనమంతా కేవలం నిమిత్తమాత్రులం .

అందువల్ల 

* నేను లేకపోతే ఏమవుతుందో* 

అన్న భ్రమలో ఎప్పుడూ పడవద్దు 

'నేనే గొప్పవాడి'నని గర్వపడవద్దు. 

*భగవంతుడి కోటానుకోట్ల దాసులలో 

అతి చిన్నవాడను* 

అని   ఎఱుక       కలిగి ఉందాం.

***

*కాకి -పితృదేవత

ఒక పెద్దావిడకు నలుగురు కొడుకులు  ముగ్గురు కోడళ్ళు ఆవిడ హటాత్తుగా మరణించింది

నిత్య కర్మ మొదలు అయినది చక్కగా భక్తి శ్రద్ధలతో  నలుగురు  కొడుకులు ముగ్గురు కోడళ్ళు చేయ సాగారు  కాకికి పిండము  పెట్టారు ఒక కాకి వచ్చి వాలింది  పిండము ముట్టుకోకుండా అలాగే కూచుంది అందరూ  అమ్మ కాకి రూపములో వచ్చినదని  దణ్ణాలు పెట్టారు కాని కాకి పిండము ముట్టుకో లేదు కర్మ చేయిస్తున్న. పురోహితుడు  తెలిపాడు  

"మీలో ఎవరో ఇంకా మీ అమ్మ గారి కోరిక తీర్చటములో సందేహం గా ఉన్నారు  భక్తిగా ఆ కాకి దగ్గరకు వెళ్ళి  మొక్కుకోండి" అని చెప్ప సాగాడు పెద్ద కొడుకు దండము పెట్టి ఇలా ప్రార్థన చేశాడు 

"అమ్మా  నీ కోరిక ప్రకారము కుటుంబంలోని వారు అందరు కలసి ఉంటాము " అని మొక్కాడు 

ఉహూ  కాకి పిండము ముట్టు కోలేదు రెండో కొడుకు వెళ్ఖి మొక్కు కున్నాడు  

"అమ్మా  నీ కోరిక ప్రకారము నా భార్యను‌ అదుపులో ఉంచి అన్నయ అడుగు జాడలలో నడుస్తాను " 

అని మొక్కు కున్నాడు ఉహూ  కాకి పిండము ముట్టు కోలేదు మూడో కొడుకు వెళ్లి మొక్కు కున్నాడు

"అమ్మా నేను విదేశాలకు వెళ్ళను  అన్నయ్య వాళ్ళతోటే కలసి ఉంటాను"  అని అన్నాడు

ఉహూ  కాకి పిండము ముట్ట లేదు నాలుగో కొడుకు  వెళ్ళి  దండము పెట్టాడు

"అమ్మా నేను కాలేజికి చక్కగా ఎగ కొట్డకుండా వెళతాను   నీవు చెప్పిన ప్రకారము డాక్టర్‌ ను అవుతాను " అని మొక్కాడు ఉహూ కాకి ముట్డుకోలేదు  పిండము భర్త వచ్చాడు  భార్యకు మనసులోనె తన కోరిక చెప్పాడు "సావిత్రీ  ఇక నుంచి తాగను   అందరితోటి సక్రమంగా ఉంటాను  పిండము తీసుకొని వెళ్ళు"  అని అహము అడ్డుపడుతున్నా  తప్పక తెలిపాడు ఉహూ  పిండము ముట్టలేదు  కాకి వరుసగా మనుమలు మనుమరాళ్లు మొక్కారు కాని పిండము కాకి తీసుకొని వెళ్ళ లేదు ఎప్పుటి నుంచో నమ్మకంగా  పని చేస్తున్న పనిమనిషి  వచ్చినది  కాకి దగ్గరకుదగ్గరకు

ఆవిడ దండము పెట్డుకొన్నది ఒక అయిదు నిముషాల ఏదో చెప్పింది  వెంటనే కాకి పిండము తీసుకొని ఎగిరి పోయింది  అందరూ బిత్తర పో యారు మూడో రోజు మొదలు అయినది  మళ్ళీ అదే తంతు   కాకి పిండము ముట్టుకోలేదు అందరు మొక్కుకున్నా చివరికి పని‌మనిషి వచ్చి మొక్కుకున్న తర్వాత అది పిండము తీసుకు వెళ్ళినది ఇలా తొమ్మిది రోజులు నడిచాయి   అందరికి అనుమానము గా ఉంది  పనిమనిషి మొక్కుకున్న‌ తర్వాత. పిండము తీసుకు వెళుతున్బది   దీనిలో ఏదో‌ మతలబు  ఉంది అని అనుకున్నారు  మరుసటి రోజు పదోరోజు కార్యక్రమమునకు పని మనిషిని రావద్దు అని హుకుం జారీ చేశారు ముగ్గురు 

కోడళ్ళు పదోరోజు తిలోదకాలు ధర్మోదకాలు విడవటానికి  చాలా మంది వచ్చారు  కాకికి పిండము పెట్టిన తర్వాత. ఆమె కొడుకులు కూతుళ్ళు అల్లుళ్ళ తో పాటు అందరూ మొక్కు కున్నారు   యధా ప్రకారము కాకి  పిండము తీసుకు వెళ్ళలేదు

"పురోహితుడు చెప్పాడు  అయ్యా నా మాట వినండి అ పని మనిషిని పిలవండి అప్పుడే అమ్మగారు పిండము తీసుకు వెళుతుంది"  అని చెప్పాడు తప్పక పని మనిషిని పిలిచారు అవిడ వచ్చి దండము పెట్టకొని  ఏవో నాలుగు మాటలు చెప్పిన ది అంతే కాకి పిండము తీసుకు వెళ్ళినది అందరు ముక్కు మీద వేలు వేసుకున్నారు  

పదకొండవ రోజు కూడా అదే తంతు కోడళ్ళ తండ్రులు  గుసగుస లాడారు  "ఈవిడ. కొంపదీసి వియ్యంకునికి రెండవ భార్య కాదు గదా" అని చెవులు కొరుక్కున్నారు.

పన్నెండో రోజు  రెండు వందల మంది పైగా బంధు జనము వస్తారు  వారి అందరి ముందు తమ పరువు పోతుంది  అని మధన పడసాగారు. రాత్రికి సమావేశము  అయి అందరు  పని‌మనిషిని నిల దీశారు.  "ఏమిటి నీవు చేస్తున్న పని మా  పరువు ఏమ్ కాను  ఏమిటి నీకు మా అమ్మకు సంబంధం "అని గద్దించారు

ఆవిడ ఏమి మాటలాడ లేదు నవ్వి  ఊరుకొంది  ఆ నవ్వుకు అందరికి కోపమ్ పెరిగింది "రేపు నువ్వు కర్మ చేసే సత్రానికి  రావాక." అని హూకుమ్ జారి చేశారు.  అందరు  కోడళ్ళు

"ఆవిడ రాక పోతే కాకి పిండము ముట్డు కోదు  అది పిండము తీసుకు వెళ్ళక పోతే మనము ఎవరము భోజనాలు  చేయడానికి వీలు లేదుట అని పంతులు గారు చెప్పారు"  

అని కొడుకులు సొణగ సాగారు "మీరేమ్  బాధ పడవాకండి   రేపు నేను రాను  రాకపోయినా కాకి కచ్చితంగా  పిండము తీసుకు వెళుతుంది " అని పనిమనిషి చెప్పినది.

"ఎలా అంత ధీమాగా  చెప్పగలవు పిచ్చి పిచ్చి మాటలు చెప్పి మా పరువు తీస్తున్నావు  అసలు ఏమి జరుగుతున్నది  నువ్వు మొక్కు కోంగానే కాకి  ఎలా పిండము తీసుకు వెళుతోంది" అందరు ప్రశ్నలు కుప్పించారు ఆవిడ నింపాదికా చెప్ప సాగింది.  

"అయ్యా మీరు అందరు ఎవరి గదులలో వారు ఉండేవారు  అమ్మగారికి నాన్న గారికి ఒక‌ గది ఇచ్చారు  అందరు ఎవరి గదులలో  వారు టీ విలు చూస్తు కూర్చునేవారు

నాన్నగారి గదిలో  టీ వి పెట్టుకుందాము అనుకుంటే మీ ఆఖరి తమ్ముడు  ఎప్పుడు గేమ్స్ పెట్టుకొని కూర్చునేవాడు. నాన్బగారు  రాత్రి పది తర్వాత ఇంటికి వచ్చే వారు  ఎవరు పలుకరించే వారు లేక పోయేటప్పటికి  ఆవిడ చాలా బాధ పడేది అందు  వల్ల సాయంత్రం గుడికి వెళ్ళి మా ఇంటికి వచ్చి కూర్చునేది ప్రతిరోజు టీవి సీరియల్  కామాక్షమ్మ ఇంట్లో  కరివేపాకు చెట్టు  చూస్తూ ఉండేది  అది బాగా గుండెకు హత్తుకు పోయింది   ఒక రోజు  సీరియల్ మిస్  అయనా నా దగ్గర నుంచి ఆ కథ చెప్పించుకొని వింటూ ఉండేది   ఆ కధ వినక పోతే అన్నము కూడా తినేది కాదు. ఆ సీరియల్ ముగింపుకు వచ్చినది  చాలా దిగులు పడ్డది  రత్తాలు నేను పోయే లోపు ఆ క్లైమాక్స్  చూస్తానో చూడనో అని బాధ పడేది. అకస్మాత్తుగా ప్రాణము విడిచింద ఆమెక. నాకు తెలుసు  ఆ సీరియల్  అంటే ఆవిడకు చచ్చే ఇంటరెష్ట్  సీరియల్ లో ఏమి  జరుగిందో అనే బాధ అవిడకు ఉందని నాకు అర్థం అయినది  అందుకే నిన్న నేను చూసిన ఆ భాగము మొత్తం  మరునాడు  అవిడకు నేను వినిపించి దండము పెట్టుకొనేదాన్ని   అవిడ తృప్తి చెంది వెళ్ళి పోయేది  అంతే తప్ప. నేను ఏమి చేయలేదు " అని తెలిపింది హవ్వా ఇదా సంగతి అని అందరు నోళ్ళు తెరిచారు

"మరి రేపు రాను అంటున్బావు  మరి పిండమ్ ఎలా తీసుకు వెళుతుంది  మా బామ్మ. "అని  ఒక సిసింద్రీ    మనవడు అడిగాడు అదా  ఆ సీరియల్ నిన్నటి తోటి అయి పోయినది గదా అని సమాదానము చెప్పి వెళ్లిపోయింది అందరు ' ఎట్టా '   అని ముక్కు మీద వేలు వేసుకున్నారు

---

*👂 కర్ణ విలాపం (చెవి గోల)*


  నేను మీ చెవిని👂   మేము  ఇద్దరము, కవలలము👂👂, కానీ  మా దురదృష్టమేమిటంటే,  ఇప్పటి వరకు మేము ఒకరినొకరు చూసుకోలేదు .   ఏ శాపమో తెలియదు మేము ఎడ మొహం పెడ మొహంగా అమర్చబడ్డాము.    మా బాధ్యత కేవలము   వినడము మాత్రమే.   తిట్లు, చప్పట్లు, చాడీలు, పొగడ్తలు, మంచి, చెడు అన్నీ ఒకేలా మేమే వింటాము. 

   కానీ  క్రమ క్రమంగా మమ్మల్ని వస్తువుల్ని వేలాడదీసే ఆధారాలుగా మార్చేశారు. కళ్ళ జోడు బరువును మాపై  మోపుతున్నారు. సమస్య కళ్లదైతే, చావు మోత

 మాకేమిటి ? 

 చిన్నతనంలో చదువుకునేటప్పుడు ఎవరికైనా మెదడు పని చేయకపోతే మాస్టరు గారు మమ్మల్నే మెలేస్తారు మాకేంటి సంబంధం చెప్పండి మాస్టారూ   యవ్వనంలో పురుషులు,   మహిళలు అందరూ  అందమైన జూకాలు,  కమ్మలు, లోలకులు   మొదలైనవి చేయించుకొని   మాపైన వేలాడదీస్తారు.  రంద్రాలు చేయడం, రక్తాలు కారడం  నొప్పులు మాకైతే, అందరి పొగడ్తలు మాత్రము  ముఖానికి ఎంత దారుణమో చూడండి. 

 ఎప్పుడైనా ఏ కవి అయినా  ఏ శాయరీ అయినా చెవుల గురించి ప్రశంసిస్తూ పొగిడారా చెప్పండి.వారి దృష్టిలో  పెదవులు, చెంపలు సొగసైన కళ్ళు ఇవే మీకు సర్వస్వము మేము గుర్తుకు రాం మీకు .  కళ్లకు బాధ కలిగితే కన్నీరు కారుస్తాయి. ముక్కుకు బాధకలిగితే చీదుతుంది, నోటికి బాధ కలిగితే అబ్బో, అయ్యో  అమ్మా అని అరుస్తూ గోలగోల చేస్తుంది . మరి మాకు బాధ కలిగితే బయటకు తెలియకుండా లోలోపలే భరించాలా ఏం పాపం చేసాము .

ఇక పోతే పెన్నులు, పెన్సిళ్లు, అగ్గి పుల్లలు,  సిగరెట్లు, బీడీలు ఇలా ఎవరికి కావలసింది వారు మా మీద దాస్తుంటారు. ఇదివరకు హెడ్ ఫోన్లని మాకు మూతలు వేసేవారు, ఇప్పుడు పైత్యం పెరిగి, ఇయర్ ఫోన్లని మాలోపలికి తోసి మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఏమండీ ఒక్కసారి మీ ముక్కులోకి నోట్లోకి ఏదైనా కూరేసి కొంతసేపు మూతవేసి చూడండి ఏం  జరుగుతుందో. 

మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు కరోనా మాయరోగం మా చావుకు వచ్చింది. ముక్కు, మూతి మూసుకోవడానికి వేసుకునే మాస్కులను కూడా మాకే తగిలిస్తున్నారు. మేము చెవులమండీ, చెక్క కొయ్యలం కాదు, ఏది పడితే అది వ్రేలాడెయ్యడానికి. mi కిష్టమొచ్చినట్లు కాకుండా    మా పనికి మాత్రమే మమ్మల్ని వాడండి. చెవులే కదా అని చిన్న చూపు చూడకండి. మేం సంయమనం కోల్పోయామంటే మీరు కళ్ళు తిరిగి కింద పడతారు,మీరు నిలబడటానికి బాలన్సు ఇచ్చేది మేమే అన్న ఈ విషయం తెలుసా మీకు, ఏం అనుకుంటుంన్నారో మాతో పెట్టుకోండి తస్మాత్ జాగర్త, మాకిచ్చే గౌరవం మాకు ఇవ్వండి మిమ్మల్ని చక్కగా చూసుకుంటాం ఇక సెలవ్ 🙏🏻💐🪷💐🙏🏻

👂👂👂 *ప్రపంచ వినికిడి దినోత్సవం శుభాకాంక్షలతో* 👂👂👂 ప్రపంచ వ్యాప్తంగా 6.3 కోట్లమంది వినికడిలోపంతో బాధపడుతూన్నారని వినికిడి( ఒక సర్వే) *💐💐💐💐

ఓంశ్రీరామ వివాహమనేది



వివాహమనేది మానవులకు తప్పనిసరి ఎందుకనగా వయస్సు పెరిగిన కొద్దీ మనలో ఉన్న జవ సత్వాలు తగ్గుతూ ఉంటాయి, వయసులో ఉన్నప్పుడే మన కోరికలకు పదును పెట్టి, సక్రమ    మార్గాన ప్రయాణమే మానవుల సత్ సంకల్పము, సుఖ దు:ఖాలు మనల్ని వెంబడిస్తాయి  అయినప్పటికీ మనలో ఉన్న నిక్షిప్తముగా ఉన్న జ్ఞానాన్ని ప్రపంచ ప్రజలతో పంచుకుంటే,  సభ్యులతో పంచుకుంటే మనస్సు ప్రశాంతముగా ఉంటుంది.

             కాల గమనాన్ని బట్టి మనప్రవర్తనను మార్చుకుంటూ, జీవితము గడపాలి, అసలు నా దృష్టిలో నరుడు ఏడ్చేవాడు నారాయణుడు నవ్వేవాడు, నరుడు  ఏడుస్తాడు పోయేటప్పుడు ఏడుస్తాడు.  కాని జీవితాంతం ఒకరికొకరు కలసి ఉండటం తప్పదు.  

అసలు మానవుల మనసులో  ఎక్కడో అసంతృప్తి ఉంటుంది.   కారణం సృష్టించిన ఆ బ్రహ్మ దేవుడే చెప్పాలీ. మంచి విద్య నేర్చుకున్న  ఇంకా నేర్చుకోవాలని,  డబ్బు సంపాదించిన ఇంకా సంపాదించాలని, సంసారంలో  సుఖ మున్నా ఎక్కడో  ఉన్న సుఖం కోసం  వెంపర్లాడటం,   ఇంకా ఎన్నో మానవ జీవితానికి ఈ ఆలోచనలు అవసరమా, అనవసరమా  ఒక్కసారి ఆలోచించండి.

నిత్య ధ్యానంతో మిద్ధ్యా వాదాన్ని విడిచిపెట్టి ప్రకృతి ననుసరించి కాలాన్ని బట్టి   నిగ్రహ శక్తితో బ్రతికి బ్రతికించు కోవటమే సార్ధకం                  

 అసలు దు:ఖం అంటే  ...    ఏడుపు ... వెలితి ... కొరత ... శోకం ... చింత ...  విచారము ... నిర్లిప్తత ... అయిష్టత ... చంచలత్వం ... ఘర్షణ ... వత్తిడి ..... ఇంకా ఎన్నో  వీటికి విరుగుడు ఆనందం ఒక్కటే అదే సహజానందం ...      నిత్యానందం ...  పరమానందం ... బ్రహ్మానందం ... వీటిని అందుకోవాలనుంటే ప్రతి విషయాన్ని (+)వ్ గా  తీసుకోవాలి,     (-)వ్  ఆలోచనలు మనసులోకి రాకుండా జాగర్త పడాలి . మనం విచక్షణా వివేకంతో జీవితాన్ని మార్చుకోవాలి.

జీవన ప్రవాహం అంటే  వచ్చేవారు లేనివారే ... .. ఉన్నవారు లేకుండా పోయేవారు అయినప్పటికీ వివాహబంధం కలియుగ జీవనంలో ఒక భాగము అదే మన మనస్సును మేధావంతునిగా మార్చేది, సంతృప్తి లేకుండా జీవిస్తే పిచ్చివాళ్ళగా మార్చేది.
అందుకనే తృప్తిలోనే సంతృప్తిగా భావించి సాగేదే నిజమైన జీవితం.

 నూతన వధువరులకు నేను వ్రాస్తున్న అక్షరమాల (పువ్వులమాల) ఒక్కసారి చదివి అర్ధం చేసుకోగలరని ఆశిస్తున్నాను,   అందరికి అభినందనలు,  శుభాకాంక్షలు.

"అ "ప్పటి ఎవరికీ వారే "వివాహం అనేటప్పటి కల్లా ఒకరి కొకరు వారి వారి   అభిప్రాయాలు ఏకం చేసుకొని ఒక నిర్ణయానికి వచ్చి నిశ్చయ తాంబూలం ప్రధానానికి తార్కాణం.

"ఆ " కాశమంత పందిరివేసి  భూదేవి యంత పీటవేసి   వధువు మేడలో మంగళసూత్ర ధారణ వరుడు కట్టినతర్వాత,  తలంబ్రాలు పెద్దల దీవెనలు చదివింపులు భోజనాలతో ముగిస్తుంది పెళ్ళి, ఇదియే ఇరువురిమద్య కొత్త ఉరవడికి తోడ్పడే బం ధం.

"ఇ" ల్లాలుగా  అడుగు పెట్టి అత్తమామలకు సేవలందించి వారి ఆదరణతో, భర్త అనురాగంతో  ఇల్లాలుగా పేరు తెచ్చుకోవటం పుట్టినిల్లికి, మెట్టినిల్లికి పేరుతెచ్చుటే   ధర్మం. 

"ఈ" నాటి బంధం ఏనాటిదో అని భావించి, ఈ బందమే శాశ్వితముగా భావించి సకర్మ మార్గంలో ఉండుటకు స్త్రీ - పురుషులు ఒకటిగా ఏకమై చేయాలి స్థిర కాపురం 

"ఉ"ల్లాసంగా .....     ఉత్సాహంగా  ...   స్వర్గ  సుఖాలు అనుభవించటమే తక్షణ కర్తవ్యం.. 

"ఊ" హల సఫలీకృతముగా ఊయలులో  ఊగి మనసు ప్రశాంత పరుచుకొని ఒకరి కొకరు పొందాలి ఆనంద పారవశ్యం. 

"ఋ " ణాలు లేకుండా ధనాశకు పోకుండా ఉన్న దానితో తృప్తి పడటమే ప్రేమికుల జీవిత ఆశయంగా ఉండటం. 
      
"ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి, ఓర్పుతో పెద్దలను గౌరవించి మన్ననలను పొందటమే ప్రకృతి  ప్రభావంతో ఏకీభవించడం. 

"ఏనాడు తొందర పడకుండా ఎదుటి వ్యక్తిని అనుసరించి చక్కటి మాటలతో మనసును అర్ధం చేసుకొని వారి భావాలను అర్ధం చేసుకుని నిదానంగా మాట్లాడటం. 

"ఐకమత్యంతో  జీవితాంతం కలసి ఉండటం, ఐకమత్యంతో దేశానికి సేవచేయడం.  

"ఒ "కే మాట, ఒకే బాటగా జీవితాంతము ఒకరి మాటను ఒకరు గౌరవించుకుంటూ ఎవరు గొప్ప అని మనసులోకి రాకుండా జాగర్త పడటం. 

"ఓ"టమి ఎరుగక జీవితము గడపాలి, ఓటమి ఎదురైనా మన జయమునకు నాంది అని భావించటం ఎదుగుదలకు ఇదే ప్రధానం అని భావించడం 

"ఔ"న్నత్యం తో జీవించాలి , ప్రతి ఒక్కరు భావించాలి  జీవితమే  సహజ ఆనందం, జీవితమే నిత్యానందం, జీవితమే  బ్రహ్మానందం,  జీవితమే పరమానందం 

"అం" తరాలు లేకుండా మమతానూ రాగాలతో సుఖ సంతోషాలతో నవ తేజంతో సుఖాలను భవించటమే ప్రేమికులు ఉద్దేశ్యం 

"అ:హంకారాన్ని కరగించుకొని  ప్రేమ, దయ, కరుణ తో నిత్య  అనంత సౌభాగ్యాలు అనుభవిస్తూ దేశానికి సహయ సహకారాలు అందిస్తూ అనాథలను ఆదుకుంటూ మనో నిగ్రహ శక్తి తో నేర్చుకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచటమే నిజమైన బంధం.          ప్రేమ ఉంటే సుఖం - ప్రేమ తగ్గితే సాధింపే              

--00--


*వాక్కు భగవంతుడు మానవునుకి ఇచ్చిన అద్భుత మైన వరం.*

*ఆ శక్తిని అంటే వాక్కును సద్వినియోగ పరచుకోవడం లేదా దుర్వినియోగ పరచుకోవడం అనేది మానవునిలోనే ఉంది...*

మనిషి మాట్లాడే తీరును బట్టి అతని వ్యక్తిత్వం అవగతమవుతుంది, మాట్లాడే మాటను బట్టి అతని సంస్కారం అర్థమవుతుంది.
మాటల్లో ఎంత మహత్తు ఉందంటే మనిషి మాట్లాడే విధానం, పద్ధతి వలన, ఉపయోగించే పదాల వలన మిత్రులు ఏర్పడతారు.
బంధువర్గం ఏర్పడుతుంది, శత్రువులు కూడా మిత్రులవుతారు.
వైరివర్గం బంధుగణం అవుతుంది, అలాగే మిత్రులు శత్రువులవుతారు, బంధువులు విరోధులవుతారు.

అంచేత వాక్కు మనిషికి భూషణం కావాలంటే భాషణం లోనే ఉంది అంతా. అయితే ఈ భాషణం ఎలా ఉండాలీ అంటే మితం గానూ, ప్రియం గానూ, మృదువు గానూ, సత్యమైనది గానూ ఉండాలి.

*మిత భాషణం...*

మితంగా, అవసరమైనంత వరకే మాట్లాడడం, దీని వలన ఆత్మస్తుతికీ, పర నిందకూ అవకాశం ఉండదు. వాదోపవాదాలకూ, ఘర్షణలకూ తావుండదు. అనవసరమైన సంభాషణలు లేనప్పుడు కాలమూ వ్యర్థమవదు.

*ప్రియ భాషణం...*

ఎదుటి వారికి ప్రియం కలిగించేలా మాట్లాడడం, దీని వలన మైత్రి, సఖ్యత, ప్రేమ, అభిమానం, గౌరవం ఏర్పడతాయి.

*మృదు భాషణం...*

మృదువుగా మాట్లాడడం ఒక విధంగా కటువుగా మాట్లాడకపోవడం. కొంత మంది మాట్లాడితే వినాలనిపిస్తుంది.
ఇంకా మాట్లాడితే బాగుండును అనిపిస్తుంది. కొంత మంది మాట్లాడితే వినబుద్ధి వేయదు.
మాట్లాడడం ఆపేస్తే బాగుండును అనిపిస్తుంది, ఇంకా చెప్పాలంటే ఆపకపోతే తిట్టాలనో, కొట్టాలనో అనిపిస్తుంది. అదే కటు భాషణం.

*సత్యభాషణం...*

ఎప్పుడూ నిజాన్నే మాట్లాడడం. ఇది ఒక వ్రతం లాంటిది. గొప్ప ధర్మం. శ్రేయస్కరం కూడా. కాని ఒక్కొక్కప్పుడు సత్యం కూడా కఠోరంగా ఉంటుంది.
అందుకే "నిజం నిప్పు లాంటిది" అంటారు. దాన్ని దాచలేము కూడా. నిజం చెపితే నిష్ఠూరం కూడా కలుగుతుంది. అవతలి వారి మనసు గాయపడవచ్చు. వారు బాధపడవచ్చు, అలాంటి సందర్భాలలో వారికది ప్రియభాషణం కాకపోవచ్చు.

*అంచేత "సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం".*

సత్యాన్నే పలకాలి. ప్రియంగా పలకాలి. అప్రియమైన సత్యాన్ని పలకకుండా ఉండడమే మంచిది. అంటే నిజం చెపితే ఎవరికైనా ఏదైనా కీడు జరుగుతుందనుకున్నప్పుడు ఆ నిజం చెప్పవలసిన అవసరం లేనప్పుడు చెప్పకుండా ఉండడమే మంచిది.
అలాగే ఒక అసత్యం చెపితే ఎవరికయినా ఏదయినా మేలు జరుగుతుందన్నప్పుడు అసత్యమాడినా పరవాలేదు. అదే ధర్మరాజు "అశ్వత్థామా హతః (కుంజరః)" అని ఆడిన అసత్యం.
అలాంటి సందర్భాలలో, సమయాలలో సత్యం చెప్పకపోవడమే కాకుండా అసత్యమాడినా దోషం అంటదనేది శుక్రనీతి. కాని అది ఎల్లవేళలా పనికి రాదు.

*"స్మితవక్త్రో మితభాషీ, అపూర్వభాషీచ రాఘవః"* అని శ్రీరామచంద్రుని అష్టోత్తర శతనామావళిలో కీర్తించడం జరిగింది.
అంటే శ్రీరామచంద్రుడు ఎల్లప్పుడూ చిరునవ్వుతో మాట్లాడేవాడునూ, మితంగా భాషించేవాడునూ, అపూర్వంగా అంటే ఇంతకు ముందు ఎన్నడూ ఎవరూ ఎరుగని విధంగా మహోన్నతంగా భాషించేవాడునూ అని కొనియాడడం జరిగింది.
అందుకే అవతార పురుషుడై మానవులందరికీ మాటల్లోనూ, చేతల్లోనూ ఆదర్శప్రాయమైన మార్గాన్ని అవలంబించి చూపాడు.

అయితే ఈ వాక్కును నిగ్రహించుకోవడం ఎలా.. మనం మన మనసును నిగ్రహించుకుంటే వాక్కును నిగ్రహించుకోగలుగుతాము మనసు నిర్మలంగా, శుద్ధిగా ఉంటే వాక్కు కూడా నిర్మలంగా ఉంటుంది.
వాక్శుద్ధి కలుగుతుంది. అటువంటి వాక్శుద్ధి కలవారు అన్నది జరిగి తీరుతుంది.

𝕝𝕝 శ్లో 𝕝𝕝 *ఉద్యంతు శతమాదిత్యా ఉద్యంతు శతమిందవః।*
*న వినా విదుషాం వాక్యైః నశ్యత్యాభ్యంతరం తమః॥*
𝕝𝕝తా𝕝𝕝 *వందమంది సూర్యులు ఉదయించినా, వందమంది చంద్రులు ఉదయించినా  - ఒక జ్ఞానియొక్క సత్సందేశం వింటేతప్ప, మనస్సులోని చీకటి నశించదు. (సుభాషితరత్నకోశః)*

*మాట వీపుకి చేటు*

మాట వీపుకి చేటు చేయగలదని ఒక సామెత. ఇరుగు పొరుగువారితో, బంధువులతో ఆఫీస్‌లో పనులు చక్కబెట్టాలి అన్నా, నలుగురితో మెప్పు పొందాలి అన్నా మాట ముఖ్యం. మాటలు ఎప్పుడు కోటలు దాటకూడదు. దానివలన మనల్ని కోతల రాయుడు(రాలు) అంటారు తప్ప సీరియస్‌గా మనల్ని పట్టించుకోరు. అలాగే చాలామంది ముక్కుసూటిగా మాట్లాడతాము అని అనుకొని ఎదుటివారి మొహంమీదనే కర్కశంగా చెప్పేస్తుంటారు. అలా కూడా మంచిది కాదు. మాట్లాడటం రాదు వీరికి అని నిర్ణయించి వారు ఎప్పుడైనా ఎదురైతే పక్కకి తొలగిపోతారు.
మాట్లాడటం ఒక చక్కని కళ. కొంతమంది గంటలకొద్దీ మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది. మరికొంతమంది మాట్లాడుతుంటే, వీళ్ళు మనల్ని ఎప్పుడు వదలిపెడతారా అని అనుకుంటాం. సందర్భోచితంగా నలుగురికీ నచ్చేటట్లు ముచ్చటగా మాట్లాడటం నిజంగా ఒక కళ. మరికొంతమంది, తమకు తెలిసినది, మళ్లీ మళ్లీ ఎక్కడ పడితే అక్కడ, మాట్లాడేవాడికి అంతరాయం కలిగించి కూడా మాట్లాడుతుంటారు. అది కూడా సరికాదు..
ఇక సంభాషణలలో చాలా రకాలు ఉన్నాయి. హితభాషణం, మితభాషణం, స్మితభాషణం, ప్రియభాషణం, పూర్వభాషణం- ఇలా చాలావిధాలు ఉన్నాయి. ఇవన్నీ ఒకే మనిషి వద్ద వుంటే అతని చెంతనే మనకు ఉండాలనిపిస్తుంది. హితభాషణం అన్నిటిలోకి చాలా కష్టమైన విధానం. అవతలివాడికి హితం చెప్పటం. అది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే, సలహాలు ఎవరూ సంతోషంగా స్వీకరించరు, ఎవరికైతే అవి అవసరమో, వారు తిరస్కరిస్తారు. మితభాషణం, క్లుప్తంగా ఎంతవరకు మాట్లాడాలో, అంతవరకే మాట్లాడటం మితభాషణం. అనవసరంగా, అతిగా మాట్లాడితే అపార్థాలు రావటానికి చాలా అవకాశాలు వున్నాయి. అందువల్ల బాగా ఆలోచించి క్లుప్తంగా మాట్లాడటం నేర్చుకోవాలి. స్మితభాషణం మాట్లాడే విషయాన్ని చిరునవ్వుతో మాట్లాడటం స్మితభాషణం. పళ్ళు కనపడకుండా నవ్వటమే ‘స్మితం’. అలా ఏ విషయాన్నయినా కూడా నవ్వుతూ చెప్పగలగాలి. ప్రియభాషణం, ప్రియభాషణలో కొన్ని అసత్యాలు ఉండే అవకాశంవుంది. అయితే కొన్ని సందర్భాల్లో అవి చాలా తప్పనిసరి. ఇతరుల మనసు బాధపెట్టకుండా ప్రియంగా మాట్లాడటం చాలా కష్టమైన పని. ఒక్కోసారి అవతలివారికి తెలిసిపోయే ప్రమాదం కూడా వుంది.
పూర్వభాషణం, దీనికి చక్కని సంస్కారం అవసరం. అవతలి మనిషితో ముందుగా మనమే మాట్లాడటమే పూర్వభాషణం. అవతలి మనిషి మనకన్నా గొప్పవాడా, చిన్నవాడా అని చూడకుండా పలకరించటం చాలా గొప్ప సుగుణం. సంభాషణం ఒక గొప్ప భూషణం, ఎందుకంటే సంభాషణ బాగోలేకపోతే కింద పేర్కొన్న విధంగా మనం దేన్నైనా కోల్పోవచ్చు.
కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతాం. ఎక్కువగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతాం. అనవసరంగా మాట్లాడితే అపార్థాలకు తావిస్తాం, స్నేహితులను కోల్పోతాం. అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతాం. అసత్యం మాట్లాడితే శీలాన్ని కోల్పోతాం. ఆలోచించి మాట్లాడితే వ్యక్తిత్వాన్ని, ప్రత్యేకతను కాపాడుకుంటాం.
మాటలలో చాలా రకాలుంటాయి. మంచి మాటలు, చెడు మాటలు. చెడు మాటలు నాలుగు విధాలుగా ఉంటాయి. పారుష్యం అనగా కఠింనగా మాట్లాడడం. కష్టం కలిగించే విధంగా మాట్లాడితే కష్టాలు, సమస్యలే కాక మిత్రులు కూడా శత్రువులు అవుతారు. అందువలన అశాంతి, దుఃఖం కలుగుతుంది. ఇతరులు వారితో మాట్లాడేందుకు సంకోచిస్తారు. అనృతం అనగా అసత్యం చెప్పడం. దీనివలన ఆత్మ, మనస్సు కలుషితమవుతాయి. సత్యం దేవతల వ్రతం అని, అసత్యం చెప్పడం అసురుల స్వభావమని వేదవిదులు అంటున్నారు. అసత్యవాదులు జీవించినా మరణించినవారితో సమానమని వేదోక్తి. పైశున్యం అనగా చాడీలు చెప్పడం. దీనివలన కుటుంబాలలో కలహాలు, సన్నిహితులతో విరోధాలు ఏర్పడతాయి. పరస్పరం అసూయ, అసహనం ఏర్పడతాయి. ఇతరులనుండి అవమానాల్ని, అవహేళనల్ని పొందాల్సి వుంటుంది. వీరు సాంఘిక జీవనం కోల్పోతారు. అసందర్భ ప్రలాపం, పరమాత్మ ప్రసాదించిన వాక్కును ఆచి తూచి వినియోగించాలి. అనవసరంగా, అసందర్భంగా వ్యర్థంగా మాట్లాడకూడదు. ఎడతెగకుండా మాట్లాడుతుంటే ఇతరులకు చిరాకుపుడుతుంది. ఇక చాలామంది మాట్లాడుతూ పోతూనే వుంటారు. ఎదుటివారు ఏమి చెప్పాలి అనుకుంటున్నది అస్సలు వినరు. తాము చెప్పిందే వేదం అనుకుంటారు. ఇలా ఎప్పుడూ చేయరాదు. ఎదుటివారు ఏమి చెప్తున్నారో కూడా వినరు. ఏదో పని ఉన్నట్టుగా బడబడా మాట్లాడేసి వెళ్లిపోతారు.
మాట లేకుంటే చోటే లేదన్నది ఓ సామెత. ఆ చోటన్నది ఊళ్లో అయినా.. ఎదుటివాళ్ల గుండెల్లోనైనా! మనిషి సంగతి చెప్పేది మాటే.
ఉపాధ్యాయులనుంచి రాజకీయ నాయకుల వరకూ, సాహితీ ఉపన్యాసకులనుంచి కార్పొరేట్ బృంద నాయకులవరకూ ఏ రంగంలోనివారైనా సరే గెలవాలంటే ప్రసంగ కళమీద పట్టు సాధించాల్సిందే.
సంభాషించడం ఒక అందమైన కళ. మన సంభాషణ ఆసక్తికరంగా ఉంటేనే ఎదుటివారు మనతో సంభాషించటానికి ఇష్టపడతారు. లేదంటే మనతో సంబంధాన్ని, స్నేహాన్ని తుంచేసుకుంటారు. ఎదుటివారితో మాట్లాడేముందు మనతో మనం మాట్లాడుకోవాలి. ప్రతిరోజూ మీరు మీతో మాట్లాడుతూ మీరు చేసే పనులను, ఫలితాలను చర్చించుకుంటూ మిమ్మల్ని మీరు బాగా తెలుసుకున్నపుడే ఎదుటివారితో బాగా సంబంధ బాంధవ్యాలని కొనసాగించగలరు.
**-*
*వాగ్దేవతలు*

*తెలుగు భాషలో వాగ్దేవతల యొక్క వర్ణమాల దాని అంతర్నిర్మాణం :

*"అ" నుండి "అః" వరకు ఉన్న 16 అక్షరాల విభాగాన్ని చంద్ర ఖండం అంటారు. ఈ చంద్రఖండంలోని అచ్చులైన 16 వర్ణాలకు అధిదేవత "వశిని" అంటే వశపరచుకొనే శక్తి కలది అని అర్ధం.*

*"క" నుండి "భ" వరకు ఉన్న 24 అక్షరాల విభాగాన్ని "సౌర ఖండం"అంటారు.*

*ఈ సౌరఖండం లోని "క, ఖ, గ, ఘ, జ్ఞ" వరకు గల ఐదు అక్షరాల అధిదేవత "కామేశ్వరి".! అంటే కోర్కెలను మేలుకొలిపేది అని అర్ధం.*

*"చ, ఛ, జ, ఝ, ఞ" గల ఐదు వర్ణాలకు అధిదేవత "మోదిని".! అంటే సంతోషాన్ని వ్యక్తం చేసేది.*

*"ట, ఠ, డ, ఢ, ణ" వరకు గల ఐదు అక్షరాల అధిదేవతా శక్తి "విమల".! అంటే మలినాలను తొలగించే దేవత.*

*"త, థ, ద, ధ, న" వరకు గల ఐదు అక్షరాలకు అధిదేవత "అరుణ".! కరుణను మేలుకొలిపేదే అరుణ.*

*ప, ఫ, బ, భ, మ" అనే ఐదు అక్షరాలకు అధిదేవత "జయని." అనగా జయము ను కలుగ చేయునది.*

*అలాగే "మ" నుండి "క్ష" వరకు ఉన్న 10 వర్ణాల విభాగాన్ని "అగ్ని ఖండం" అంటారు. అలాగే అగ్ని ఖండంలోని "య, ర, ల, వ" అనే అక్షరాలకు అధిష్టాన దేవత "సర్వేశ్వరి." అంటే శాశించే శక్తి కలది సర్వేశ్వరి.*

*ఆఖరులోని ఐదు అక్షరాలైన "శ, ష, స, హ, క్ష" లకు అధిదేవత "కౌలిని"*

*ఈ అధిదేవతలనందరినీ "వాగ్దేవతలు" అంటారు. ఈ బీజ శబ్దాలన్నీ జన్యు నిర్మాణాన్ని, క్రోమొజోములను ప్రభావితం చేస్థాయి.*

*అయితే ఈ ఏడుగురే కాకుండా అన్ని వర్ణాలకు ప్రకృతిలో ఒక రూపం, ఒక దేవతాశక్తి ఉంది.*

*ఎందుకంటే శబ్దం బ్రహ్మ నుండి అద్భవించింది.*
*అంటే బ్రహ్మమే శబ్దము.*
*ఆ బ్రహ్మమే నాదము.*

*మనం నిత్యజీవితంలో సంభాషించేటప్పుడు వెలువడే శబ్దాలు మనపై, ప్రకృతి పై ప్రభావం చూపుతాయి.*

*అదే మంత్రాలు, వేదం అయితే ఇంకా లోతుగా ప్రభావం చూపుతుంది.*

*భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఈ శబ్దాల్ని ఉచ్ఛరించి "అమ్మ"ను అర్చిస్తున్నాయి.*

*కాబట్టి మనం స్తోత్రం చదువుతున్నా, వేద మంత్రాలు, సూక్తులు వింటున్నా మనం ఈ విషయం స్ఫురణలో ఉంచుకుంటే అద్భుతాలను చూడవచ్చు.*

*మనం చదివే స్తోత్రం ఎక్కడో వున్న దేవుడిని/దేవతను ఉద్దేశించి కాదు, మనం చదివే స్తోత్రమే ఆ దేవత.*

*మనం చేసే శబ్దమే...ఆ దేవత..!*
*మన అంతఃచ్ఛేతనలో ఉండి పలికిస్తున్న శక్తియే మన ఉపాస్య దేవత.*

*ఆ శబ్దం వలన పుట్టిన నాదం దేవత.*
*ఇది సనాతన ధర్మం.*
*ఇది మనకు మాత్రమే పరిమితమైన అపూర్వ సిద్ధాంతం.*

*శ్రీ మాత్రేనమః*
***
*పూర్వ జన్మ కర్మ.....*
ఒక గురువు చెట్టు క్రింద కూర్చొనీ...భక్తి గురించి దేవుని గురించి...జన్మ రాహిత్యం గురించి చెబు తున్నాడు. అటుగా వెళుతున్న బాటసారి గురువు చెబుతున్నది. వినీ దగ్గరకు వెళ్లి తనకు మంత్రోప దేశం ఇవ్వమని అడిగాడు. గురువు అప్పుడు అడిగాడు, నీకు భార్య బిడ్డలు ఉన్నారా...అని తన భార్య గర్భవతి అని చెప్పాడు.
గురువు ఇలా అన్నాడు గురు దక్షిణగా నువ్వు నాకే మిస్తావు? అని అడిగాడు గురువు. మీరు ఏది అడిగితే అదే ఇస్తాను అన్నాడు. సరే...నీ భార్యను అడిగి రా...తనకు పుట్టిన బిడ్డలను నాకు ఇవ్వ గలదా? అలా చేస్తే నీకు మంత్రోపదేశం చేస్తాను. వెళ్లి నీ భార్యను అడిగిరా, పిల్ల పుట్టిన వెంటనే రక్తం మడుగులో ఉండ గానే నాకు ఇచ్చేయాలి అన్నాడు గురువు. అతను వెంటనే ఇంటికి పరుగెత్తి భార్యకు విషయం చెప్పి మన పిల్లలను గురువుకు ఇవ్వ గలవా ? అని అడిగాడు. అందుకు ఆమె అలాగే ఇచ్చేద్దాం.
మన పిల్లలు గురువు వద్ద ఉంటే మంచిదే కదా, అంటూ ఒప్పు కుంది. ఆ విషయాన్ని గురువుకు చెప్పాడు. కొద్ది రోజులకీ ఆమె ప్రసవించింది.
మగ పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడిని నెత్తుటి మడుగులో ఉండ గానే తీసుకెళ్లి గురువు చేతిలో పెట్టారు. భార్య భర్తలు గురువు ఆ పిల్ల వాడిని తీసు కెళ్లి గొయ్యి తీసి అందులో పూడ్చేసాడు.
తల్లి దండ్రులు బిత్తర పోయి చూస్తు, చేసేది. ఏమి లేక వెను తిరిగి వెళ్లి పోయారు. ఈ విధంగా రెండో పిల్ల వాడిని కూడ గొయ్యి లో పూడ్చి పెట్టేసాడు.
మూడో సారికీ ఆవిడ ఒప్పు కోలేదు. ఇదేం గురువయ్యా ? నాకు నచ్చలేదు. నా కొడుకును ఇవ్వనుకాక ఇవ్వను అంటూ మొండి కేసింది. అతను గురువు వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. గురువు గారే ఆమె దగ్గరకు వెళ్లి ఇలా... అన్నాడు. అమ్మ నీ బిడ్డను ఇవ్వనన్నావు కదా, ఇప్పుడు నీ బిడ్డను నేనేమి చేయను. కాని ఒక్క సారి బిడ్డను నా చేతి కిచ్చి నా వెంట రండి. మీ బిడ్డను నేనేమి చేయను.తిరిగి మీ బిడ్డను మీకు ఇచ్చేస్తా అని అన్నాడు.
సరే ననీ బిడ్డను తీసుకొని గురువు వెంట బయలుదేరారు వారిరువురు.
గురువు వీళ్లిద్దరినీ ఇంతకు ముందు గొయ్యి తీసి పెట్టిన చోటికి తీసుకుని వెళ్ళాడు. ఆ రెండు గొయ్యిల మధ్య తెల్లని గుడ్డ పరిచి...ఈ పిల్ల వాడిని వాటి మద్యలో పడుకో బెట్టి చేతి లోకి నీళ్ళు తీసుకొని మంత్రించి...ఆ ముగ్గురు పిల్లల మీద చల్లాడు. తల్లిదండ్రులను కొంచెం దూరంలో నిలబెట్టి...
ఆ గొయ్యిలో నుండి వస్తున్న శబ్దాలను విన మన్నాడు. గొయ్యి లో నుండి మొదటి పిల్లవాడు రెండవ వాడిని అడుగుతున్నాడు. ఒరేయ్ వీళ్ళకు కొడుకుగా పుట్టావు. కదా దేని కోసం పుట్టావు. వీళ్ళకి నీకు ఏమిటి సంబంధం అని అడిగాడు.
రెండో వాడు ఇలా చెబుతున్నాడు. గత జన్మలో వీడు బాకి పడ్డాడు. నాకు డబ్బులు ఇవ్వ కుండానే పోయాడు. అందుకనీ వీడికి కొడుకునై పుట్టి అందినంత లాగేసుకుందామని వచ్చాను. మరీ నువ్వు ఎందుకొచ్చావు అని అడిగాడు. వీడు నాకు కూడా ఇవ్వాలిరా...నేను కూడా అందుకే వచ్చాను.
వీడికి కొడుకునై పుట్టి దొరికి నంత దోచుకొని వదిలేసి వెళదామని వచ్చాను . కానీ వీడు మనల్ని గురువు చేతిలో పడవేసాడు.
ఇంకే ముంది? వాడు మనకు పడిన బాకీలన్నీ గురువు తెగ్గొట్టేశాడు. ఇప్పుడు వాడికి మనకి రుణ బంధం తెగిపోయింది అని వాళ్ళు మాట్లాడు కుంటున్నారు. ఈ ఇద్దరూ కలిసి బ్రతికి ఉన్న మూడో వాడిని అడిగారు. ఒరేయ్ నువ్వెందు కొచ్చావురా అని? అప్పుడు బ్రతికి ఉన్న మూడోవాడు ఇలా చెప్పాడు, గతజన్మలో నాకు కొడుకులు బిడ్డలు ఉండికూడ దిక్కు లేకుండా పడిఉంటే వీడు నన్ను చేరదీసి అన్నంపెట్టి ఆదరించాడు.
నేను పోయే వరకు నన్ను పోషించాడు.
అందుకే...ఈ జన్మ లో వీనికి కొడుకునై పుట్టి తల్లితండ్రులిద్దరినీ వాళ్ళు బ్రతికినంతకాలం అన్నం పెట్టి వాళ్లను సంతోషంగా ఉంచి ప్రశాంతమైన జీవితాన్ని వాళ్ళకు ఇచ్చి వారి రుణం తీర్చు కుందామని వారికి కొడుకునై పుట్టాను. మీరు ఆయన్ని పీడించాలని వచ్చారు. గనుక గురువు మిమ్మల్ని గొయ్యి లో పాత పెట్టాడు. నేను అలా కాదు గనుక నేను బ్రతికి ఉన్నాను అని చెప్పాడు. ఈ ముగ్గురు మాట్లాడుకున్న మాటలు ఈ తల్లి తండ్రులు విన్నారు. గురువు పాదాల మీద పడి క్షమించమని వేడు కున్నారు. కాబట్టీ గురువు లేని పూజ గుడ్డి పూజ అని అర్ధం.
ఆత్మ జ్ఞానము తెలిసిన గురువును పట్టు కుంటే రుణానుబంధాలే కాదు, జన్మ రాహిత్యమే కలుగుతుంది.ఈ జన్మ లోనే మోక్షం లభిస్తుంది...
మోక్ష మంటే చని పోయిన తర్వాత మోక్షం వస్తుందనీ చాలా మంది అను కుంటారు కాని అది కాదు.మోక్షం అంటే బ్రతికుండగానే ఆత్మ జ్జానాన్ని పొందటం...దైవం ఏ ఏ రూపాలలో ఉన్నాడు.. ఎక్కడ ఉన్నాడు...ఏం చేస్తున్నాడు.ఈ సృష్టి ఏమిటి. ఎలా తయారైంది, నేనెవరిని,ఎక్కడ నుండి వచ్చాను,మళ్లీ ఎక్కడికి వెళతాను. అసలు మాయ అంటే ఏమిటి??? ఇలా ఎన్నో సృష్టి రహస్యాలు బ్రతికుండగానే తెలిసిపోతాయి.ఇదే మోక్షం.మరుజన్మకి రాకుండా భగవంతుడు తన రూపాన్ని ఇచ్చి తానుగా మార్చు కుంటాడు.

ఈ ఆత్మ జ్ఞానం కలగ డానికి ధ్యానం అనే ఆత్మ విద్యను మనకి బోధిస్తారు.

No comments:

Post a Comment