శ్రీ విఘ్నేశ్వరాయనమః .. శ్రీ మాత్రేనమః .. శ్రీ సీతారామాంజనేయనమః
" ఇదేనా .. న్యాయం " (రచన మల్లాప్రగడ రామకృష్ణ)
(రోజువారి కథ స్మృతి మాధురి) (1 )
కళ్ళు తెరిచినప్పుడు కనిపించేది దృశ్యం
కళ్ళు మూసుకుంటే కనిపించినట్టు అనిపించేది అదృశ్యం తాలూకు స్మృతి
నిజానికి మనిషికి మధురస్మృతి ఒక వరం. వికల స్మృతి ఒక శాపం.
ఏమిటి ఇలా వ్రాస్తున్నాడు అనుకోకండి
ఎందుకంటే అది నాలుగు రోడ్ల కూడలిలో ఒక మూలా స్వాగతం సుస్వాగతం అనే వ్రాసిన పలక ఇటుగా ఒక స్థంభానికి అందంగా పిలుస్తున్నట్లు "రండి రారండి " అన్నట్లు
ఎతైన ద్వారముపైన "శ్రీ సీతా రాంజనేయుల నిలయము " అని వ్రాసి వున్నది.
అది గుడి యనుకునేరు కాదు అది 5 అంతస్తుల భవన సముదాయము అందులో ఇరువది కుటుంబాల ఆశ్రమము. చుట్టూ సువిశాలమైన వీధులు, రెంటువైపులా ఎతైన వృక్షములు, ఒక ప్రక్క ఆటస్థలాలు, మరో ప్రక్క అందమైన పూలతోట, దాని ప్రక్కన పిల్లలు ఆడుకొనే విధముగా ఏర్పాటు చేసిన జారుడుబండలు, రంగుల రాట్నము, ఇంకా అనేకము.
ఉంటె ఇక్కడే ఉండాలి అనిపించే విధముగా ఉన్నది కానీ అక్కడ నీటి కొరత రోజు ట్యాంకుల ద్వారా నీరు తెప్పించు కోవాలి, కరంటు ఖర్చు కూడా ఎక్కువే, ఇంకా అందరి సుఖము కొరకు సుబ్రతా , సమయ నిర్ధారణ, భవనము పైకి పోవుటకు క్రిందకు వచ్చుటకు వీలుగా యంత్రము దాని బాగోగులు, నీటి పంపుల బాగోగుల క్రిందా ప్రతి మాసము కొంత ఖర్చు ప్రతి కుటుంబము కట్టుకొనుట.
బయట ఏమి జరిగినా పట్టించుకోని కొందరి స్థితి, అతిగా మాట్లాడుతూ కాలక్షేపం చేసేవారు కొందరు, ఏమి లేక పోయినా గొప్పలు చెప్పు కొనే వారు కొందరు, మరి కొందరు ఓపికతో చుట్టూ నడక సాగిస్తూ ఉంటారు.
ఇంకా
వయసులోన పెద్ద వారిని గౌరవించు పిల్లలే పిల్లలు
సుతిమెత్తగా పలకులుగా సంగీత స్వరాలు తో స్త్రీలే స్త్రీలు
అహర్నిశలూ సత్యమును ఉచ్చరించు పెదవులే పెదవులు
నిత్యం కష్టాలు గూర్చి చెప్పుకొనే ఉద్దండ పిండాలే పిండాలు
అవకాశాన్ని ఉపయోగించుకొనే కొందరు స్వార్ధ పరులే స్వార్ధ పరులు
అక్కరలోన పదిమందికి సాయపడే చేతులే చేతులు, సలహాలే సలహాలు
చేసినట్టి సత్కార్యాలకు కొనియాడే చేతలే చేతలు, గిట్టని వారైతే బూతులే బూతులు
పూల రీతిలో అందరికీ స్ఫూర్తినిచ్చు బ్రతుకులే బ్రతుకులు కాలక్షేపాలు
అవరోధాలెదురైననూ గెలుపొందే వ్యక్తులే వ్యక్తులు, ధైర్య సాహసాలు, ప్రార్ధనలే ప్రార్ధనలు
అజ్ఞానాన్ని రూపుమాపే సామాజిక సేవకులే సేవకులు , రక్షక కార్య కర్తలే కర్తలు
విజ్ఞానాన్ని పంచిపెట్టే పుడమిలోన గురువులే గురువులు , బోధకులే బోధకులు
భక్తి తోడ భగవంతుని స్మరించు అందరికోసం హృదయము తపనలు
చిరు మందహాసంతో వికసించు పలుకులు మేలు కొలుపులే కొలుపులు
సుగుణాల సంపదతో అలరించు అందము , శుఘంధము
సరిహద్దు సైనికుల్లా ఒకరికొకరు తోడుగా చూపించు త్యాగము
హృదయాలను సుతిమెత్తగా తాకు కవిత్వము, కవితలు, పాటలు.
కష్టాల కడలిలోన ఆదుకొను స్నేహధర్మమూ నిత్యమూ సాత్యము
ఇహలోకం విడుచు వరకు హత్తుకొను బంధపు కాంతుల నిలయము
పిల్లా పాపలతో నిండి ఉండు సదనము అదే సీతారామాంజనేయుల నిలయము
ప్రజకు మేలు చేయ ప్రాణమ్ము నైనను
దారపోయు నతడె దైవమూర్తి
పాపులైన వారి పరిరక్షణమ్ముకై
శిలువ మోసె క్రీస్తు సేవ మనకు
* ఇంకా ఉంది*
శ్రీ విఘ్నేశ్వరాయనమః .. శ్రీ మాత్రేనమః .. శ్రీ సీతారామాంజనేయనమః
" ఇదేనా .. న్యాయం " (రచన మల్లాప్రగడ రామకృష్ణ)
(రోజువారి కథ స్మృతి మాధురి) (2 )
(జరిగిన కథ శ్రీ సీతారామాంజనేయుల నిలయము వర్ణన )
శ్రీ సీతారామాంజనేయుల నిలయానికి కొందరు రాజకీయ నాయకులూ అతుల్ అడగటానికి వస్తున్నారు. అక్కడే వున్నా వాచ్ మెన్ వారి ఆపి మీరు లోపలకు రాకండి ఈ ప్రక్కన రూము వుంది మా ప్రెసిడెంట్ కు తెలియపరుస్తాను అందాక మా అమ్మ భారతమ్మతో మాట్లాడండి అన్నాడు.
చుడండి
మనుషులు నాలుగు రకాలు. , బొంగరం లాంటివారు, గుర్రం లాంటివారు, భూమి లాంటి వారు.,సూర్యుని లాంటివారు .
బొంగరం తన చుట్టూ తాను తిరుగుతున్నట్టు స్వార్థపరుడు నిరంతరం తనను గురించే ఆలోచిస్తాడు. తనతో వున్న వారందరు గుర్తించలేదని బాధపడతాడు.
గుఱ్ఱం మైదానం చుట్టూ పరిగెత్తినట్టు ఈ కోవకు చెందినవారి ఆలోచనలు కేవలం తన కుటుంబాని కే పరిమితమై వుంటాయి. ఇతరులు ఏమైనా పట్టించుకోరు.
భూమి తన చుట్టూ తానూ తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ అందరికీ మేలు చేస్తున్నట్టు ఈ కోవకు చెందినవారు తన గురించి,తన కుటుంబం గురించే కాక తోటివారికి కూడా మేలు చేస్తారు. వారే నిజమైన పృద్వీ వాసులు.
ఇంకా నాలుగవ రకం వారు సూర్యుని లాంటివారు.సూర్యుడు తనగురించి ఆలోచించ కుండా సర్వ జీవులకూ హితాన్ని చేకూర్చి నట్టుగావీరు తమ సర్వస్వాన్నీ ఇతరుల హితానికే సమర్పిస్తారు.
భగవంతుడు మొదటి రెండు కోవలకూ చెందినా వారిని చూసి నవ్వుకుంటాడట. మిగతా రెండు కోవలకూ చెందిన వారిని చూసి ఆనందిస్తాడట
దూర ప్తోపి సమీపస్తో యో యస్య హృది వర్తతే
యో యస్య హృదయే నాస్తి సమీపస్తో పి దూరగః
భావము:-- దూరమున నున్ననూ హృదయములో నున్నవాడు దగ్గరనే యుండును. దగ్గరగా నున్ననూ హృదయములో లేనివాడు దూరంగానే యుండును.
అమ్మా మేము ప్రచారం చెయ్యాలి మమ్మలి వదలండి మీ ఉపన్యాసానికి వింతనైకి రాలేదు మేము
మీ కు ఓపిక లేక పొతే ఎట్లా అసలు మీ నాయకుని గురించి తెలుసా మీకు
మిరే చెప్పండమ్మా అన్నారు వచ్చినవారు
ఒరేయ్ ఒరేయ్ నాయకా అంటూ కోపంగా
మీకు ఓటేసి గెలిపించినందుకు మేము తవ్విన గోతిలో మేమే పడ్డాం, అందుకే కుక్క కాటుకు చెప్పు దెబ్బ, రాజకీయ వేటుకు ఓటు దెబ్బ. అని శోష పెడుతున్నాము.
అసలు తెలుగు విలువ తెలుసురా మీకు, కపట రాజకీయ సన్యాసి, తెలుగు గురించి మాట్లాడతావా, తెలుగు మీడియం ఎత్తు వేసి, మా నోటిలో మట్టి కొట్టి, చదువులను వీధిన పెట్టి, గొప్పగా అందర్నీ ఇతరదేశాలకు పంపేవిధంగా ఇంగ్లీష్ ఉండాలన్న దౌర్భాగ్యుడా,
ఉట్టి కెగర లేని వాడు, స్వర్గాన్ని అందిస్తానంటే, సొంగ కార్చుకుంటూ మాటలు వింటూ మడ్డి మొహాలై జనాలు మీ ఉపన్యాసాలు విని మోసపోయే కాలం పోయింది కులపిచ్చి నాయకుడా.
పర్యావరణ పరిశుభ్రత అంటూ చిన్న మొక్కలు నాటి, ఫోటోలు దిగి, మీటింగ్ కు అడ్డమున్నాయని పెద్దచెట్లు నరికే అంట్ల కాకి వెధవా, పాదయాత్రలంటూ ఇల్లు ఇల్లు తిరిగి ఓట్లడిగి, మాపిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకా, పరిశ్రమలు తేకుండా, ఉన్న జలవనరులు ఉపయోగించకుండా ధనాన్ని దుర్వినియోగం చేసి, కబుర్లతో కాలక్షేపం చేస్తూ, కాలం గడుపుతావురా కంపు వెధవా.
అమ్మా , అమ్మ మమ్ము వదలడమ్మా ... ..
ఒరే పీనాసి దరిద్రుడా పెళ్లిళ్లకు వచ్చి హంగామా చేసి అక్షంతులు వేయటమే తప్ప ఏనాడైనా కానుకలు ఇచ్చావా, ఇంటికి క్యారేజ్ తీసికెళ్లే నిష్ట నికృష్ట దరిద్రుడా.
రేషన్ బియ్యమంటూ ఇచ్చి, ఇష్ట మొచ్చినట్లు పెంచుకోమని వ్యాపారులతో లాలూచి పడి పార్టీ ఫండు వసూలు చేసే మేధావిరా.
త్రాగుడు అలవాటుచేసి ఫారన్ సరుకంటూ ఎక్కువరేటుకమ్మి మనుష్యుల ప్రాణాలను దోచుకొనే అభాగ్యుడా.
ఒరేయ్ అబ్బిగా నా మాటలు తప్పు ఒప్పు లో నాకు తెలిసినవి గబగబా మాట్లాడటం నాకలవాటు నామాటలు తప్పులయితే బంధీఖానా కు పంపమని చెప్పండి మీ నాయకునితో వాక్ స్వతంత్రం తో పలికాను యీ మంచి పనులు చేసామని చెప్పమనండి నాకేం అభ్యంతరం లేదు.
అపుడే కొడుకు వచ్చాడు అమ్మ అమ్మా ని సోది చప్పావా వారితో
ఆబ్బె ఎక్కువ చెప్పలేదు ఎదో కొద్దిగా మాత్రమే
నెమ్మదిగా మరలా
చూడు బాబు ఇక్కడ 100 ఓట్లుదాకా ఉన్నాయ్ మాకు నీరు దొరకక కష్టంగా ఉన్నది దాని గురించి మీ నాయకుడు చెప్పమనండి, అసలు మీరు యీ కోటలోకి రాకూడదు, దయచేసి మీరు వెళ్లిపోండి నా మాటలు మిమ్మల్ని కదిలిస్తే మీ నాయకుడిని కూడా కదిలిస్తాయని అనుకుంటా, గాంధీ గారు చెప్పినట్లుగా శాంతి సౌభాగ్యాలతో ఉంటేనే దేశం బాగుంటుంది అన్నారు. అటువంటి మంచి రోజులు వస్తాయని ఆశిస్తాను అన్నది భారతమ్మా, అందరి క్షేమం కోరే నాయకుడు ఎక్కడో పుట్టి వుంటాడు అన్నాది. అందరూ వింటూ వెనక్కు వెళ్లిపోయారు.
కాలమాగదు, కర్మమారదు ఈ మీ మారదు, నాయకులూ మారరు మనం తిండి కోసం వాళ్ళ వెంబడి తిరగక తప్పదు అంటూ ఎవ్వరిని కలవకుండా వెళ్లిపోయారు వచ్చినవారు.
*ఇంకావుంది*
శ్రీ విఘ్నేశ్వరాయనమః .. శ్రీ మాత్రేనమః .. శ్రీ సీతారామాంజనేయనమః
" ఇదేనా .. న్యాయం " (రచన మల్లాప్రగడ రామకృష్ణ)
(రోజువారి కథ స్మృతి మాధురి) (3 )
(జరిగిన కథ శ్రీ సీతారామాంజనేయుల నిలయము వర్ణన, అక్కడకొచ్చిన నాయకులకు బుద్ధి చెప్పుట )
అక్కడ సీతారామాంజనేయల నిలయమున (400 ) నాలుగవ వరుసలో భవనంలో నెల క్రితం కొత్తగా వచ్చి చేరారు, ఆమెతో అమాయకచూపులతో ఉన్న ఒక పెద్దావిడ కూడా వున్నది, ఆమె పేరు మాణిక్యాంబ, కూతురి పేరు "స్మృతి మంజరి " సరదాగా పడుతూ ఉంటుంది. ఒక మినిష్టర్ వద్ద పని చేస్తున్నది. ఆమె ధ్యేయం ఎప్పుడు మంచిని బ్రతికించాలి, అధర్మాన్ని అరికట్టాలి అనే ఆలోచన ఆమెది.
చూసి నడవాటం కాదు, స్ప్రుహ కోల్పోకుండా నడుస్తూ,అడుగులో అడుగేసుకుంటూ కాదు,
అడ్డాలను తొలగించుకొని అడుసుతొక్కకుండా నడక సాగిస్తూ, రహదారి కవ్విస్తున్న, పక్షుల శబ్దాలతో ఉడికిస్తున్న, కన్నుగీటే వారు వెంటాడుతున్న, చూపుల విత్తనాల వంటి మనుష్యులు
పిలుపులున్నా కర్తవ్యం మాత్రం మరువక రహస్యంగా పొంచి ఉన్న కుట్రలను పసిగడుతూ, చేవలేని సంఘంలో, జీవంలేని మనిషిలా కాకుండా ధైర్యంగా బ్రతకాలని చాటి చెప్తూ, సుతిమెత్తని సుడిగుండాలను, అసహనం మాటున అపార్ధమో, ఆవేశం చిమ్మిన నిస్పృహలు, దాటుకుంటూ జీవన గమనాన్ని సాగిస్తున్నది.
నవ్వులతో పిల్లలనుదగ్గిరకు తీసుకోని ఆడిస్తుంది,
అక్కడే ఉన్న ఒక తల్లితో
అబ్బాయి:-అమ్మా ఏమి ఆలోచిస్తున్నావు?
తల్లి:--పెద్దయ్యాక నీవు ఏమవుతావో నని.
అబ్బాయి:- విచారించకు అమ్మా వుద్యొగమెదీ దొరకకుంటే మూటలు మోసి బతుకుతాను.
ఇదండీ లోకం
అబ్బాయి:- అమ్మ ఏమంటున్నావు నన్ను " సెల్లు చూడదంటావా ?"
తల్లి:-- అవును నీవు పెద్దయ్యాక నీవు ఏమవుతావో నని భయము, ఇప్పుడే కళ్లజోడు తెచ్చుకున్నావు కదా ?.
అబ్బాయి:- విచారించకు అమ్మా వుద్యొగమేదీ దొరకకుంటే గూగుల్ నమ్ముకొని బతుకుతాను
అప్పుడే స్కూలు బస్సు వచ్చింది
వరుసగా పిల్లలు నడుస్తున్నారు వారిని చూసి "స్మృతి మంజరి " అనుకుంటున్నది
నేటి చదువులు "బరువు సంచులు మోస్తారు బాల్యమందె మెడలు, వీపులు సడలి పోవఎంత చదివేరొ యీ మోత కేమి ఫలమో పాప మనిపించు" పసివారి పాట్లు చూస్తేపుస్తకాల సంచి, బువ్వ డబ్బా, నీళ్ళ సీసా, సాక్సు, బూట్సు, 'టై'లు చాల కలవుఇంటి ముందు కొచ్చి యెక్కించుకొని పోవు వాహనములు కూడ కలవు". డబ్బుకు లోకం దాసోహం మ్మే కదా ? వున్నవాడు చదివించ గలుగుతాడు, లేనివని స్థితి ఏమిటి కలం ఎప్పుడు మారుతుంది ఉచిత విద్య ఎప్పుడొస్తుంది.
అక్కడే వున్న భారతమ్మ పిచ్చిగా పడుతున్నది
ఓ మనిషి యీ ప్రేమ యనే
మాయ లో పడి జీవిస్తున్నావ్...! సంపాదిస్తున్నావ్...! దేనికి.....2
ఎవరికోసం... ఎవరికోసం... ఎవరి కోసం...
ఈ కుళ్ళు కుతంత్రాలు... అహంకారం... అర్భటాలు...!?దేనికి....2
ఎవరికోసం... ఎవరికోసం... ఎవరి కోసం...
ఇదొక మాయ ప్రపంచం
నీవు స్వార్థం తో సంపాదించేది సాధించేది ఏది నీది కాదు....2
మరొకరి పాలవుతుంది. ఈ బంధాలు అనుబంధం కూడ నీది కాదు...నీదికాదు...2
నీ బొందిలో జీవం ఉన్నంత వరకే తరువాత ఎవరు ఎవరికి వారే అవుతారు. కానీ ఆశ చావదు, అవకాశం వదలరు
ఎవరికోసం... ఎవరికోసం... ఎవరి కోసం...
కాలి చేతులతో ఈ భూమి పైకి వచ్చావ్... అదే కాలి చేతులతో వెళ్లి పోతావ్... నే వెంట ఏది రాదు. ఎవరు రారు... ఏ బంధం రాదు...ఈ సంపద ప్రేమ బంధము
ఎవరికోసం... ఎవరికోసం... ఎవరి కోసం.....2
చావు వచ్చే వరకు దేవుడు రాముడు గుర్తు కురారు... వారిని తలుచుకోవు... చావు దగ్గర పడ్డాక అప్పుడు దేవుడు గుర్తు కి వస్తాడు. ప్రయోజనం ఏమిటి...!?
ఎవరికోసం... ఎవరికోసం... ఎవరి కోసం...
అంటూ నవ్వుకుంటూ భారతమ్మ పడు కుంటున్నది
*ఇంకావుంది*
శ్రీ విఘ్నేశ్వరాయనమః .. శ్రీ మాత్రేనమః .. శ్రీ సీతారామాంజనేయనమః
" ఇదేనా .. న్యాయం " (రచన మల్లాప్రగడ రామకృష్ణ)
(రోజువారి కథ స్మృతి మాధురి) (4) 02-04-2024
(జరిగిన కథ శ్రీ సీతారామాంజనేయుల నిలయము వర్ణన, అక్కడకొచ్చిన నాయకులకు బుద్ధి చెప్పుట, పిలల్లు స్కూల్ కెళ్ళుట, భారతమ్మ పాట )
"స్మృతి మంజరీ "తన చిన్ననాటి విషయాలు పిల్లలను తగ్గరగా తీసుకొని నెమ్మదిగా చెపుతున్నది
పిల్లలు " సరదాగా నవ్వుకోండి.." నే చెప్పే నా పాత పాఠాలు
చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో మా మాస్టారు నన్ను కొట్టినప్పుడల్లా ప్రతీదెబ్బ తిన్న వెంటనే నేను చేతులను దులుపుకుని నా గౌను కి రాసుకున్న తర్వాతే రెండో దెబ్బకు చెయ్యి చాచేవాణ్ణి. శుచి-శుభ్రత అన్నది నాకు అప్పటినుంచే ఉండేది తెలుసా !
*శరీరానికి - శాకాహారం, * మనస్సుకు - సజ్జన సాంగత్యం, * బుద్ధికి - స్వాధ్యాయం, * ఆత్మకు - ధ్యానం. అనిచెప్పేవారు
అప్పట్లో మా గురువులంతా పాఠం చెప్పినంతసేపూ నిలబడే ఉండేవాళ్ళు, ఎందుకో తెలుసా? గౌరవం...
నేనంటే వాళ్ళకి అంత గౌరవం...అంతే!
"మా గురువు చెప్పేవారు, భిన్నత్వంతో కూడిన ఈ సృష్టిలో ఏది అందరికీ ఒకేలా ఉండదు.
కొందరూ సత్యయుగంలో ఉంటే, మరికొందరు కలియుగంలో కొట్టుమిట్టాడుతూ ఉండవచ్చు".
నేను చదువుకునే రోజుల్లో మా గురువులు నాలుగురోజులకొకసారి మా నాన్నగారిని తీసుకుని రమ్మనే వారు! ఎందుకంటే వాళ్ళందరూ ఏ విషయమైనా నాకు సూటిగా చెప్పడానికి చాలా భయపడేవారు!
అప్పుడే నాపలుకులు
"సృష్టిలో లెక్క ఎప్పుడూ సరిగ్గా ఉంటుంది., మన బుద్దే అప్పుడప్పుడు తిక్కగా ఉంటుంది.ఆ బుద్ధిలోని తిక్క సరిచేసుకునేందుకే ధ్యానం". అన్నాను, వ్రాసాను..
నేను రాసినవి చదవడానికి, మా గురువులంతా చాలా ఇష్టపడేవారు. అందుకే వాళ్ళు ఇచ్చిన ప్రశ్నలకు కొన్ని వందలసార్లు మళ్ళీ మళ్ళీ రాసి చూపించమని ప్రతీరోజూ అభ్యర్థించేవారు!
"శరీరం అన్నది అన్నంతోనే సంతృప్తి చెందుతుంది., గురువు పాఠము చెప్పి అభివృద్ధితో సంతృప్తి చెందుతాడు. మరి ఆత్మ అన్నది జ్ఞానంతోనే సంతృప్తి చెందుతుంది.పిల్లలు తల్లి తండ్రులమాటల ఆచరణతో సంతృప్తి చెందు తారు".
మా గురువులందరూ నన్ను "యీ పిల్ల సివంగి " అన్నట్టుగా చూసేవారు. అందుకే వాళ్ళకి ఏమాత్రం భయం వేసినా తరగతి లో నుంచి నన్ను బయటకు పంపి గుమ్మం దగ్గర కాపలా కోసం నిల్చోబెట్టేవారు.
గురువుగారు నోట్లో శని అంటే?
గురువుగారు అటుఇటు చుస్తూనుండగా
మీ ముఖకవలికలే నన్నా
అంతే నువ్వు చెప్పు అన్నారు గురువుగారు
*తినకూడనివి తినడమే నోట్లో శని అంటే, *మాట్లాడకూడనివి మాట్లాడితే నోట్లో శని అంటే
ధ్యాన, స్వాధ్యాయ, సజ్జనసాంగత్యాల ద్వారా 'శని దేవుడు' మటుమాయం అవుతాడు.
మా గురువులకి నేను చాలా తెలివైనదాన్నని భావన బాగా బలంగా ఉండేది. అందుకే వాళ్ళంతా, నువ్వు స్కూలుకి ఎందుకొస్తావే . పోయి ఎక్కడైనా పనిలో చేరిపోవచ్చు కదా!", అని కనీసం రోజుకోసారైనా అనేవారు!
అంటే... చిన్నప్పుడే నేను ఉద్యోగం చేసే తెలివి తేటలు సమర్ధత ఉన్నాయి అని ముందుగానే గ్రహించారు అన్నమాట..
అందుకే, నా చిన్నతనం నిజంగా ఒక స్వర్ణ యుగం!
అమ్మ గులాబీలు గురించి చెప్పవా అన్నాడు ఒక బాలుడు .. అక్కడ గులాబీలు చూపిస్తూ స్మృతి మంజరి చెప్పఁటం మొదలుపెట్టింది
ముళ్ళున్నా వంగికదులతో చల్లని చూపులు, కరుణ రసాన్ని పంచే రసగుళికల గులాబీలు
అరుణ వర్ణంలో ఆహ్లాదపరిచే రాణిగా థళుకులు, కాల ప్రకృతికి తలవంచి రంగులు మార్చే గులాబీలు
తనకు తానే తన్మయిస్తూ ప్రకృతి కాంతులు, పన్నీరు చల్లుతూ పరవశింప చేసే గులాబీలు
అత్తరు అందంతో అందాన్ని ఘుబాలించు సుమాలు, చేయనించి దారి నా పువ్వుల భస్మ కళలు
దేహానికి రమ్మింపచేయు ఆనంద గులాబీలు, సీతాకోక చిలకలకు అందించే మధువులు
భ్రమరముల మనసును హరించే గులాబీలు, మమతల పరిమళాలతో మిరమెట్లు సోయగాలు
మనసున కావ్వించే ప్రేమికుల స్వప్నాలు, మధుర భావాలగా ప్రేమ వర్గాలుగా గులాబీలు
తలపుల తరంగాలు కలుపుకునే నేస్తాలు, సంతోషానికి సౌరభాలుగా కనువిందు గులాబీలు
ముద్దు గుమ్మలు తొలిప్రేమకు చిహ్నాలు, శుభకార్యాలకు అందించే గులాబీలు
ప్రేమికులు కోరుకొనే హృదయానయణాలు, మనసున మరిపించే పారవస్యపు గులాబీలు
*ఇంకా వుంది*
***
శ్రీ విఘ్నేశ్వరాయనమః .. శ్రీ మాత్రేనమః .. శ్రీ సీతారామాంజనేయనమః
" ఇదేనా .. న్యాయం " (రచన మల్లాప్రగడ రామకృష్ణ)
(రోజువారి కథ స్మృతి మాధురి) (5)
(జరిగిన కథ శ్రీ సీతారామాంజనేయుల నిలయము వర్ణన, అక్కడకొచ్చిన నాయకులకు బుద్ధి చెప్పుట, పిలల్లు స్కూల్ కెళ్ళుట, భారతమ్మ పాట, స్మృతి మంజరీ "తన చిన్ననాటి విషయాలు )
సీతారామాంజనేయుల నిలయమున నూతన క్రోది నామ సంవత్సర ఉస్చ వాలుగా అక్కడ ఉన్న సముదాయ భవణము నందు అక్కడ ఉన్న వారు ప్రతిరోజు సాయంత్రం చేరి కవితలు పద్యాలు కథలు కలసి ముచ్చట్లు
మొదటగా స్మృతి మంజరి తను వ్రాసుకున్న సీస పద్యాలు చక్కగా చదివింది
ఋతువుమార్పు జరుగు ఋషులు జపాలగు
శిశిరమాసమే పోవు సిరులు వలెను
చైత్రమాసము వచ్చి చైతన్య పరచుటే
వసంతమాసము వరుస కలుపు
మల్లెల పరిమళ మేమనసుకు శాంతి
కోకిల గానము కొత్త వెలుగు
పంచాంగ శ్రవణము పలికెడు బ్రహ్మణ
తెలుగుసంవత్సరం తేట తెలుపు
పండిత కవిత పద్యాలు పలుకు తీరు
కవుల సమ్మేళనం వర్ణ కావ్య తీరు
ప్రేక్షకులనుపులకరించ ప్రేమ తీరు
ప్రాంజలి ఘటించి తెలిపేద ప్రభల గీత
***
పద్మవ్యూహంలోన పలుకు క్రోదిఉగాది
చిక్కెను యభిమన్యు చింత పలుకు
బలహీనతలుతెల్పు బలము పంచాగము
తెలుపు నలుపు కళ తేట గీతి
జనవిజయమె బ్రహ్మ జాతి పంచాంగము
మనదేహ పసిగట్టి మనసు గీత
సమ సమర్థతగాను సమర్థత తెలుపుటే
సన్మార్గము పథాన శాంతి గీత
ఎవరికి యెవరో చేధించ ఎల్ల లేవి
స్థానమే మారుటయు వాద సాక్షి కన్ను
నేడుమారిపోవు కథలు నీడ లన్ని
స్వార్థ చింతనలోననే సగము బతుకు
***
సృష్టిలో అద్భుత శృతి లయలు కదలు
తలరాత కళలన్ని తారుమారు
భవితవ్యము తెలుపు భజన పం చాంగము
పంచాంగ శ్రవణమే పలుకు తీరు
పవిత్రమైన గ్రహాలు పరిచయమగు తీరు
లాభనష్ట బ్రతుకు లయలు తెలుపు
శుభ లక్షణాలుగా సుఖవాంఛలు తెలుపు
సూత్ర ప్రాయము మంచి చూపు లగుట
రాజనీతి కథలు రాటు తేలు
కోకిలమ్మ కూతలుగాను కొత్త వెలుగు
నవవసంత కళలు తీరు నరుని నడక
షడ్రు చులు సమన్వయముగా షకల తృప్తి
ప్రాంజలి ఘటించి తెలిపేద ప్రభలు తీరు
***
అందరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు మిగతా వారి పలుకులు రేపుచూద్దాం అంటూ కదిలారు
*ఇంకా వుంది*
03-04-2024
***
శ్రీ విఘ్నేశ్వరాయనమః .. శ్రీ మాత్రేనమః .. శ్రీ సీతారామాంజనేయనమః
" ఇదేనా .. న్యాయం " (రచన మల్లాప్రగడ రామకృష్ణ)
(రోజువారి కథ స్మృతి మాధురి) (6)
(జరిగిన కథ శ్రీ సీతారామాంజనేయుల నిలయము వర్ణన, అక్కడకొచ్చిన నాయకులకు బుద్ధి చెప్పుట, పిలల్లు స్కూల్ కెళ్ళుట, ముచ్చట్లు భారతమ్మ పాట )
శ్రీ సీతారామాంజనేయుల నిలయంలో క్రో ధి సంవత్చర ఉత్సవాలు కోసం
అక్కడ చేరిన వారి ముచ్చట్లు....
స్మృతి మంజరీ నెమ్మదిగా శ్రీ సీతారామాంజనేయులనిలయములో ఉత్చవాల దగ్గర అడుగుపెట్టింది
అప్పటికే చాలామంది చేరారు
జోకులు చెపుతున్నారు
రిటైర్ అయ్యావుగా కాలక్షేపం ఎలా అవుతోంది? అని అడిగారు ఒకరు
అసలు ఇదేం దిక్కుమాలిన ప్రశ్న?!
చరవాణి చూస్తాను... పుస్తకాలు చదువుతాను. అప్పుడేనా నా వయసెంతనుకున్నారు అన్నాడు
మీ తెలివితేటలకు యిదో పెద్ద పనా? అన్నారు మరొకరు
ఇంకా వివరంగా నిన్న మొన్న జరిగిన సంఘటనలు వివరించండి అన్నారు ఒకరు.
అయితే ఒక జోకు చెప్పీ నేను వెళతాను అన్నది అక్కడ వున్న సభ్యులతో
బంగారం షాపు నుంచి నేను మా అమ్మ బయటకు వచ్చాం. అక్కడ కారు దగ్గర ఒక పోలీసు రశీదుతో నిలబడి వున్నాడు.
పోలీసు : కారు ఇక్కడ ఆప కూడదు వెయ్యి రూపాయలు పన్ను కట్టండి.
నేను : మేము లోపలికి వెళ్ళి ఐదు నిమిషాలు కూడా గడవలేదండీ
పో : ప్రతి ఒక్కరూ అలానే చెపుతా రు
నే : సార్ మా అమ్మ వయసుకైనా మర్యాద యివ్వండి. నాకు మా అమ్మకు విశ్రాంతి కి వచ్చే ధనము కూడా లేదు .
పో : సరే ఒక రెండు వందలు యివ్వండి
నే : రశీదు యిస్తారా?
పో : అదెలా కుదురుతుంది.?
నే : యివ్వకపోతే ఎలా? లా ప్రకారం రశీదు యివ్వాలి కదా!
పోలీసు : (బాగా యిరిటేట్ అయ్యాడేమో) లా నాకే చెప్తావా! సరే చూడు ఈ కారుకి ఒక మిర్రర్ పగిలి పోయింది. వెనుక నెంబర్ ప్లేటు సరిగా లేదు.. మొత్తం నాలుగు వేలు కట్టు.
నేను నిస్సహాయంగా మా అమ్మతో అతని వైపు చూసాను.
అమ్మ వాదులాట మొదలు పెట్టింది. అలా గంటకు పైగా అన్నిరకాలుగా వాదన జరుగుతూనే వుంది.
అప్పుడు వచ్చింది, మా సిటీ బస్సు. వెంటనే ఎక్కి ఇంటికి చేరుకున్నాం.
ఆ కారు నాది కాకపోయినా కాలక్షేపం ఎంత బాగా అయిందో చూశారుగా! అన్నారు ఒకరు
ఆ అంటూ నోరు వెళ్ళబెట్టారు అందరూ
ఒకటే చప్పట్లు
****
మరోటి చెప్పండి
ఒక్క నిముషం జోకు చెప్పి వెళతాను అని స్మృతి మంజరీ చెప్పింది
కూసింత “జీకే” ఉండాలి!!
పెళ్లిచూపులకు వెళ్లొచ్చాక తండ్రి రామయ్య అడిగాడు...కొడుకు సుబ్బారావుని!
’అమ్మాయీ నువ్వూ విడిగా మాట్లాడుకున్న తర్వాత ఆ అమ్మాయి నిన్ను ఇష్టపడలేదని తెలిసింది. అసలేం జరిగింది అక్కడ?!’
‘ఆ హాలులో గోడకు తగిలించి ఉన్న ఫోటోను ఉద్దేశించి ..ఈ photo మీ తాతగారిదా ?.. అన్నానంతే...
నా వైపు కూడా చూడకుండా ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయింది పెళ్లి చూపులకు ముస్తాబైన సుమలత.
అదే సమయంలో...
అమ్మాయి ఇంట్లో జరిగిన సంభాషణ:
అబ్బాయి బానే ఉన్నాడుగా. ఎందుకు వద్దనుకున్నావు?!!’
అడిగింది వాళ్ళమ్మ.
‘ఆ ఇడియట్ ని ఎవరూ పెళ్లిచేసుకోరు. గోడకు తగిలించిన *మహాత్మాగాంధీ* ఫోటోను చూసి... "ఆయన మీ తాతగారా? ..అని అడిగాడు."
ఒకటే చప్పట్లు
ఒకటే చప్పట్లు
ఇంకా వుంది 4 ..4 ..24
శ్రీ విఘ్నేశ్వరాయనమః .. శ్రీ మాత్రేనమః .. శ్రీ సీతారామాంజనేయనమః
" ఇదేనా .. న్యాయం " (రచన మల్లాప్రగడ రామకృష్ణ)
(రోజువారి కథ స్మృతి మాధురి) (4) 02-04-2024
(జరిగిన కథ శ్రీ సీతారామాంజనేయుల నిలయము వర్ణన, అక్కడకొచ్చిన నాయకులకు బుద్ధి చెప్పుట, పిలల్లు స్కూల్ కెళ్ళుట, muchhatlu భారతమ్మ పాట )
శ్రీ సీతారామాంజనేయుల నిలయంలో కాలక్షేపం కోసం పదవీ విరమణ అయిన వారి ముచ్చట్లు....
స్మృతి మంజరీ నెమ్మదిగా శ్రీ సీతారామాంజనేయుల నిలయములో అడుగుపెట్టింది
ప్రతిరోజూ యిదే ప్రశ్న!!
రిటైర్ అయ్యావుగా కాలక్షేపం ఎలా అవుతోంది? అని అడిగారు ఒకరు
అసలు ఇదేం దిక్కుమాలిన ప్రశ్న?!
చరవాణి చూస్తాను... పుస్తకాలు చదువుతాను. అప్పుడేనా నా వయసెంతనుకున్నారు అన్నది
మీ తెలివితేటలకు యిదో పెద్ద పనా? అన్నారు మరొకరు
ఇంకా వివరంగా నిన్న మొన్న జరిగిన సంఘటనలు వివరించండి అన్నారు ఒకరు.
అయితే ఒక జోకు చెప్పీ నేను వెళతాను అన్నది అక్కడ వున్న సభ్యులతో
బంగారం షాపు నుంచి నేను నా మా అమ్మ బయటకు వచ్చాం. అక్కడ కారు దగ్గర ఒక పోలీసు రశీదుతో నిలబడి వున్నాడు.
పోలీసు : ఇక్కడ కారు ఇక్కడ ఆపకూడదు వెయ్యి రూపాయలు పన్ను కట్టండి.
నేను : మేము లోపలికి వెళ్ళి ఐదు నిమిషాలు కూడా గడవలేదండీ
పో : ప్రతి ఒక్కరూ అలానే చెపుతా రామ్మా
నే : సార్ మా అమ్మ వయసుకైనా మర్యాద యివ్వండి. నాకు మా అమ్మకు విశ్రాంతి కి యిచ్చే ధనము కూడా లేదు .
పో : సరే ఒక రెండు వందలు యివ్వండి
నే : రశీదు యిస్తారా?
పో : అదెలా కుదురుతుంది.?
నే : యివ్వకపోతే ఎలా? లా ప్రకారం రశీదు యివ్వాలి కదా!
పోలీసు : (బాగా యిరిటేట్ అయ్యాడేమో) లా నాకే చెప్తావా! సరే చూడు ఈ కారుకి ఒక మిర్రర్ పగిలి పోయింది. వెనుక నెంబర్ ప్లేటు సరిగా లేదు.. మొత్తం నాలుగు వేలు కట్టు.
నేను నిస్సహాయంగా మా అమ్మతో అతని వైపు చూసాను చూసాను.
అమ్మ వాదులాట మొదలు పెట్టింది. అలా గంటకు పైగా అన్నిరకాలుగా వాదన జరుగుతూనే వుంది.
అప్పుడు వచ్చింది, మా సిటీ బస్సు. వెంటనే ఎక్కి ఇంటికి చేరుకున్నాం.
ఆ కారు నాది కాకపోయినా కాలక్షేపం ఎంత బాగా అయిందో చూశారుగా! అన్నారు ఒకరు
ఆ అంటూ నోరు వెళ్ళబెట్టారు అందరూ
అప్పుడే భారతమ్మ ఒక పాట పడుతూ వచ్చింది
ఆ వుండండి భారతమ్మ పాట విని పోండి తొందరేముంది అన్నారు అక్కడి వారు
**
లీలా ప్రకృతి ! యుగాది లీలలు
లీలగనైనా - తెలియనుగా! ... 2
***
""ఏకోన దాగేను యిన్ని అందాలు ?
ఏ సీమలో తిరిగి పాడేవు కోయిలా !?? .. 2
ఎంతటి కొత్త మార్పులుగా లోక పరిపాలా వందనాలు !
మా ప్రణతులివిగో! ప్రకృతి !నీకు వందనాలు !! . 2
!! ఏ కోన దాగేవు!!
నీల వర్ణ! మేఘమా నిన్నెంచతరమా ?
నిఖిల భువనాల ఏలేటి మాతా ప్రకృతి ?
నీ కృప కోరుచు నిరతము ప్రార్థించెదము ఉగాది పంచాంగముగా ...2
నన్నేలవేల - కరుణాలోలా!మహానుభావా వచన !పంచగముగా
నమ్మితి నిను మిగుల!నిత్య లోలా!
ఒక్కసారి మొర వినిరావేల కొత్తగా సుఖము నిచ్చు ప్రకృతి నీవే ??
పంచాంగశ్రవణం మా కర్తవ్యం అంతా నీవే?
!! ఏ కోన దాగేవు !!
నీలమేఘ ఘన ప్రకృతి సుందర!
నీ రూపము చూడ మనసాయెరా !
నగధర_ బహుపరా మనోహర _
నీ గుణగానమున నా ఎద పులకించేనురా ! ...2
మీ అమృత పంచాంగ గానము వినగోరితి రా
ఈ దాసునిపై నీ దయచూపరా మహానుభావా !ఓ దేవరా
!! ఏ కోన దాగేవు!!
మా వినతి వినుమా _కొత్త క్రోధి సం వచ్చరము మాకు పంచు సుఖములు
మా తనువు మనసు ప్రాణము మీ దేనురా! యీ కాలము దేవరా
మధుర గానము నుతియించదా కాలమా _దేవరా
మధురానుభూతితో మై మరచిపోవుదుము మేము దేవరా
కొత్త ధ్యాసతో మా శ్వాస సాగేనురా
షడరుచులు మాకిచ్చావు ఆ నందంగా వేడుచున్నాను రా !! ఓ దేవరా
!! ఏ కోన దాగేవు !!
అందరు చెప్పఁట్లతో సంతోషపెట్టారు ..
03 -04 -2024
ఇంకావుంది
***
శ్రీ విఘ్నేశ్వరాయనమః .. శ్రీ మాత్రేనమః .. శ్రీ సీతారామాంజనేయనమః
" ఇదేనా .. న్యాయం " (రచన మల్లాప్రగడ రామకృష్ణ)
(రోజువారి కథ స్మృతి మాధురి) (7)
(జరిగిన కథ శ్రీ సీతారామాంజనేయుల నిలయము వర్ణన, అక్కడకొచ్చిన నాయకులకు బుద్ధి చెప్పుట, పిలల్లు స్కూల్ కెళ్ళుట, ముచ్చట్లు భారతమ్మ పాట )
శ్రీ సీతారామాంజనేయుల నిలయంలో క్రో ధి సంవత్చర ఉత్సవాలు కోసం
అక్కడ చేరిన వారి ముచ్చట్లు....
అక్కడ చేరిన వారిలో శ్రీదేవి గారు పద్యాలు చదవటం మొదలుపెట్టారు అందరూ వహ్వా.. వహ్వా.. అనిరిచారు
* బ్రహ్మాస్త్రం*
భోజ్యాలు జీర్ణించు బోధలు వల్లించు
పలుకులు నేస్తమై పాఠమౌను
కుమిలిపోవలదులే కుళ్ళు రాజ్యము మారు
మాటలు తూఠాలు మనసు గాను
చర్యకు ప్రతిచర్య చరితమ్ము తెలపదు
ఒక్కక్షణం గతి ఓర్పు గాను
మనసు అద్దంలోకి మనసు విప్పియు జూడు
నీ తప్పు ప్రతిబింబ నిజము గాను
వైరి నిందలు మాను వైపరిత్యము యున్న
మడమత్రిప్పక సేవ మనసు గాను
మౌన యస్త్రము గాను మార్గమ్ము జూపాలి
బ్రహ్మస్త్ర ము పలుకు భయము వలదు
ఒకపరి పరికించు మనసు ఓడి గెలుపు
నడక ధర్మము వైపున నరుని గెలుపు
వినయ వినయమ్ము వివరణ విద్య గెలుపు
ప్రాంజలి ఘటించి తెలిపేద ప్రభల గీత
****
*కొడిగట్టు దీపం*
కన్ను మూసియు తెర్చి కనువిప్పు గమనమ్ము
కలలుగా నిద్రలో కరిగి పోవు
కాలనిర్ణయమేచేరి కన్నీరు కన్నులై
కలసుకో లేనట్టి కథలు చేరు
శ్వాసపోవుఘడి విశ్వాసమజలి గాను
గాలి దుర్గందము గమన మౌను
తనువు నిశ్శత్తువు తప్పని స్థితి కళ
మనిషి కొవొత్తిగా మాయ వెలుగు
నీడ నిశ్శబ్ద పరిచేను నిజము గాను
సహజ వృద్దాప్య తరుణము సమయ మౌను
రాలిన చిగురు కొత్తగా రవ్వ వెలుగు
ప్రాంజలి ఘటించి తెలిపేద ప్రభల గీత
****
*అభిమాని మరుపు మెరుపు*
భావాలకు కదలి బానిసలగుటయే
అభిమానమని బంధి ఆశ మెరుపు
యీ వినోదానికి యిష్ట దాసులు గాను
పాఠకులైనను పాశ మెరుపు
ఇది దశాబ్దాలుగా యిల్లాలు యి చ్ఛయే
పట్టమహిషి యగు పాట మెరుపు
జీవితాన్నివిలాస జీవ ప్రసాదమే
ఆత్మాభిమానము అలక మెరుపు
ఏ కష్ట మైనను ఎదను తట్టగలుగు
నష్టమైనా తన నటన మెరుపు
తన్ను తాకట్టుగా తపన ప్రాణముగాను
విలువైన సమయాన వింత మెరుపు
తమతమ జీవితం తెల్లారినాకళ
అభిమానమనె ఉచ్చు ఆట మెరుపు
గతులుతప్పిన నిత్య గమ్యమ్ము వేదనే
విలువైన జీవితం వింత మెరుపు
మరుపు మెరుపుల చరితము మయమగు కళ
తరువు కలకల చినుకుల తహతహ కళ
బరువు పదనిస పలుకులు భయభయ కళ
ప్రాంజలి ఘటించి తెలిపేద ప్రభల గీత
ఇంకా వుంది
శ్రీ విఘ్నేశ్వరాయనమః .. శ్రీ మాత్రేనమః .. శ్రీ సీతారామాంజనేయనమః
" ఇదేనా .. న్యాయం " (రచన మల్లాప్రగడ రామకృష్ణ)
(రోజువారి కథ స్మృతి మాధురి) (8)
(జరిగిన కథ శ్రీ సీతారామాంజనేయుల నిలయము వర్ణన, అక్కడకొచ్చిన నాయకులకు బుద్ధి చెప్పుట, పిలల్లు స్కూల్ కెళ్ళుట, ముచ్చట్లు భారతమ్మ పాట )
శ్రీ సీతారామాంజనేయుల నిలయంలో క్రో ధి సంవత్చర ఉత్సవాలు కోసం
అక్కడ చేరిన వారి ముచ్చట్లు....
అప్పుడే ఉత్సవాల దగ్గరనుంచి ఇంటికి చేరింది స్మృతి మంజరీ
పుస్తకం చదువుతూ కాఫీ తాగుతూండగా తల్లి చెప్పింది.
"స్మృతి , విజయ వచ్చింది. నిన్ను రాగానే కలవమంది." అన్నాది.
"అవునా. సరే స్నానం చేసి వెళ్తానమ్మా. చిరాగ్గా ఉంది." అంటూ స్నానానికి వెళ్ళింది.
టిఫిన్ తిని స్నేహితురాలు విజయ దగ్గరకు వెళ్ళింది. ఇద్దరి కళ్ళూ చెమ్మగిల్లాయి.
"ఎలా ఉన్నావ్ విజయ . జాబ్ లో చేరావట. ఎక్కడుంటున్నావ్? అక్కడంతా బాగానే ఉందా." అడిగింది స్మృతి .
భర్త పొయ్యారని విన్నాను
"అలాగని నీ జీవితం మోడు చేసుకుంటావా. పెళ్ళైన ఏడాదికే భర్త చనిపోతే అతని తల్లిదండ్రుల కోసం నీ జీవితాన్ని బలి చేసుకుంటావా." కోపం, బాధ మేళవించిన స్వరంతో అడిగింది స్మృతి .
రమేశ్ తల్లిదండ్రులను
వాళ్ళని గాలి కొదిలేయమంటావా? రమేశ్ నేను ప్రేమించుకున్నామని తెలియగానే పెద్దమనసుతో వాళ్ళే వచ్చి మావాళ్ళని పిల్లనిమ్మని అడిగారు. వారిద్దరూ తమ కొడుకు కన్నా నన్నే ఎక్కువ ప్రేమగా చూసుకొనేవారు. ఇప్పటికీ వారి ప్రేమలో మార్పు లేదు.
నీవు చేసిన సహాయంతో నేను నర్సు ట్రైనింగ్ పూర్తిచేసాను. గత నెలరోజుల్నించి హోస్పటల్లో జాబ్ జేస్తున్నాను అది కూడా నీవే ఇప్పంచ్చావని తెలిసింది నీ ఋణం ఎలా తీసుకోవాలి అన్నాది విజయ.
జాబ్ రావడంతో ఊరట చెందింది. అత్తమామల్ని ఒంటరివాళ్ళని చేయలేక వారితోనే ఉంటున్నా . వారి ముందు తయారై తిరగలేక సాదాసీదాగా ఉంటోంది. ఎవరితోనూ కలవలేక అందరితోనూ దూరంగా ఉంటున్నా .
ఒకరోజు తను స్నానానికి వెళ్ళి వచ్చేసరికి అత్తగారు గదిలోనే ఉన్నారు
"ఏమన్నా చెప్పాలా అత్తయ్యా." అడిగింది విజయ .
"అవునమ్మా. ఎన్నాళ్ళ నుంచో నీకు చెప్పాలని మీ మామయ్యా, నేనూ అనుకుంటున్నాం. నువ్వు మామూలుగా ఉండు తల్లీ. ఈ దుఃఖం ఎన్నేళ్ళైనా తీరదు. నిన్ను ఇలా సాదాసీదాగా చూస్తుంటే మరీ బాధగా ఉంటోంది. మీ అమ్మ కూడా మొన్న మాట్లాడుతూ ఇదే బాధ పడ్డారు." అన్నారు బాధపడుతూ.
"నాకేమైందత్తయ్యా నేను బాగానే ఉన్నాను." ,అని ఏదో అనబోతుంటే ఆగమని చెప్పి "చూడమ్మా, వాడున్నప్పుడు ఎలా ఉండే దానివో అలాగే ఉండు. నీలో మేము కూతుర్ని చూసుకుంటున్నాం. మా పిల్ల ఇలా తిరుగుతుంటే మాకు ఏం ఆనందం ఉంటుంది. చెప్పమ్మా." అనునయంగా ఆంటూ చేతిలో ఒక కవర్ పెట్టారు. ఆవే వేసుకోమని సూచించి వెళ్ళి పోయారు.
అది తనకెంతో ఇష్టమైన కలర్ చూడీదార్. ఆ బట్టలు వేసుకొని బైటికి వచ్చి, వారి కాళ్ళకి నమస్కరించగానే ఎంతో పొంగి పోయి "నువ్విలాగే లక్షణంగా ఉండాలి తల్లీ" అంటూ దీవించారు.
అప్పుడే స్మృతి తెచ్చిన వస్త్రాలు ఇచ్చింది
ఆ డ్రెస్ లో చూసిన అందరూ ఆశ్చర్య పోయారు. తర్వాత విషయం తెలిసీ కొంచెం బాధ పడినా, ఇప్పటికైనా మామూలైనందుకు ఆనందించారు.
అప్పుడే మాటల్లో తనవిషయం చెప్పింది విజయ
"అయితే ఇప్పుడు విజయ గార్ని నాణేనికి రెండో వైపు నుంచీ చూస్తున్నామనమాట." అంటూ నవ్వాడు.. డాక్టర్ రాజు. అతని మాటలకి విజయ నవ్వడం తో అందరూ ఆనందంగా నవ్వేశారు.
అందరూ అన్నావు కదూ
అనినేను అన్నానా అన్నది నాలిక కొరుక్కొన్న విజయను జూసింది స్మృతి మంజరీ యిక ముందు అన్నీ మంచిరోజులు అన్నాది స్మృతి.
ఇంకా వుంది
శ్రీ విఘ్నేశ్వరాయనమః .. శ్రీ మాత్రేనమః .. శ్రీ సీతారామాంజనేయనమః
" ఇదేనా .. న్యాయం " (రచన మల్లాప్రగడ రామకృష్ణ)
(రోజువారి కథ స్మృతి మాధురి) (10)
(జరిగిన కథ శ్రీ సీతారామాంజనేయుల నిలయము వర్ణన, అక్కడకొచ్చిన నాయకులకు బుద్ధి చెప్పుట, పిలల్లు స్కూల్ కెళ్ళుట, ముచ్చట్లు భారతమ్మ పాట, ఉగాది ఉత్సవాలు విజయ ముచ్చట్లు.)
అప్పడే ఒక స్వామీ జి వస్తూ
*ఉర్వారుకమివ బంధనాత్ అంటే* వివరించ దలిచాను అన్నారు అక్కడే వున్న వారు ఆయనను ఆహ్వానించి స్థిరాశనంలో కూర్చోబెట్టి పాదపూజ చేశారు అందరూ
కొంత బోధ చేశారు. చెప్పే మాటలు అందరూ వింటున్నా రు.
*ఇసుకలో..! పిల్లల్ని..! చూస్తుంటాం..!*
*అద్భుతంగా..!*
*గుడి కడతారు..!*
*తీరికగా అలంకారాలు..!* *అద్దుతారు..! తోచినంతసేపు..! హాయిగా..! ఆడుకుంటారు..!*
*పొద్దు..! వాలేటప్పటికి..!*
*ఆ కట్టడాలన్నింటినీ..!*
*చటుక్కున..! కూలదోస్తారు..!* *కిలకిల నవ్వులతో..!*
*నిశ్చింతగా..!*
*ఇంటిదారి..! పడతారు..!*
*అక్కడి..! ఆ నిర్మాణాలకు..!* *సంబంధించిన..! మమకారాలు..!*
*వియోగ దుఃఖాలు..!*
*ఏవీ..! వారికి ఉండవు..!*
*అంతగా అయితే..!*
*మరునాడు వచ్చి..!*
*మళ్ళీ..! కడతాం..!* *పోయేదేముందీ..!*
*అనే ధీమాతో..! పిల్లలందరూ..!*
*"సొంతిళ్లకు"..! వెళ్లిపోతారు..!*
*"త్య్రంబకం..! యజామహే "* *అనే మృత్యుంజయ మహామంత్రం..!*
*సారాంశమూ అదే..!*
*జీవితాన్ని..!*
*ఎంతైనా..! నిర్మించుకో..!*
*ఆత్మీయ బంధాలెన్నింటినో..!* *పెంచుకో..! ప్రేమానురాగాల్ని..!*
*గాఢంగా పంచుకో..!*
*ఆట ముగిసే సమయానికి..!* *వాటిని..! అదేవిధంగా..!* *సునాయాసంగా..! తెంచుకో..!*
*అని ఆ మంత్రం..! బోధిస్తుంది...!*
*వాటికి..! మనిషికి..!*
*మధ్య..! ముడి..!*
*"ఉర్వారుక మివ బంధనం లాగా"* *ఉండాలంటుంది..!*
*పచ్చి దోసకాయ ముచికకు..!* *దోస తీగకు మధ్య బంధం..!*
*ఎంత గట్టిగా ఉంటుందంటే..!*
*ఆ కాయను పట్టుకు లాగితే..!*
*ఆ తీగ మొత్తం..! వచ్చేస్తుంటుంది..!*
*అవి ఒకదాన్ని మరొకటి..!*
*అంత గట్టిగా పట్టుకొని..!* *ఉంటాయి..!*
*అదే రీతిలో..! మనిషి..!*
*తన చుట్టూ ఉన్న పరివారంతో..!*
*ప్రపంచంతో..! బంధాన్ని..!*
*అంత గట్టిగానూ..!* *పెనవేసుకొని..! ఉంటాడు..!*
*పిల్లలు ఇసుక గూళ్ళు..!*
*కట్టినంత ప్రీతిగా..! తన..!తనవారి జీవితాల్ని..!* *తీర్చిదిద్దుకుంటాడు..!*
*దోసపండు..!* *మిగలముగ్గేనాటికి..!*
*పరిస్థితి మారుతుంది..!* *ఉన్నట్లుండి..! ఆ తీగ నుంచి..!*
*అది చటుక్కున..! విడిపోతుంది..!*
*అప్పడు చూస్తే..! ముచిక గాని..! తీగ గాని..! ఎండి..!* *ముదిరిపోయినట్లు ఉంటాయి..! అంతవరకు..! ఆ రెండూ..! ఒకదానితో మరొకటి..!*
*గాఢంగా..! బలంగా..!*
*అతుక్కునే ఉన్నాయా..!*
*అనే అనుమానం వస్తుంది..!*
*ప్రపంచంతో అన్నింటినీ..!*
*చివరన తెంచుకోగలిగితే..!*
*"ఈ ఆత్మ నిత్యమని"* *నమ్మగలిగితే..!*
*మృత్యుభయాన్ని..!* *అధిగమించడం..!* *సాధ్యమవుతుంది..!*
*సాయంత్రం అయ్యేసరికి..!*
*పిల్లలు నిశ్చింతగా..!*
*సొంతింటికి..!*
*తిరిగి వెళ్లిపోయినట్లు..!*
*ఈ..! అద్దె..! ఇంటితో అనగా ఈ దేహంతో..!* *అనుబంధాన్ని..! వీడాలన్నదే..!*
*ఆ మంత్ర..! మహోపదేశం..!*
*" దేహం వీడి వెళుతున్నాను "* *అనేది అసుర భావం...!*
*"అద్దె గృహాన్ని వీడుతున్నాను"*
*అనేది అమృత భావన..!* *అలా అమృతత్వ స్థితిలోకి..!*
*చేరుకోవడమే..!*
*-"ముక్తి"- అనిపించుకుంటుంది..!*
*మనిషి జీవించి ఉండగానే..!* *సాధించాల్సిన స్థితి అది..!*
*అందుకే..! దాన్ని..!*
*"జీవన్ముక్తి"..! అంటారు..!*
*|| ఓం..! నమః..! శివాయ..! ||*
*అసతోమా..! సద్గమయ..!*
*తమసోమా..! జ్యోతిర్గమయ..!*
*మృత్యోర్మా..! అమృతంగమయ..!*
*ఓం..! శాంతిః..! శాంతిః..! శాంతిః..!*
అంటూ కదిలారు స్వామీ జీ
....
మనుప నెంతైన నేరదు మరలి మరలి
తొలగనీయక దుర్గతి ద్రోచుగాని
కలిత లక్ష్మీశ ! సర్వజగన్నివేశ!
విమలరవికోటి సంకాశ! వేంకటేశ!
తా:--ఒకరిని చెరిచిన వాని బ్రతుకు, కౄరుడై బలవంతముగా చేసుకొన్న పెండ్లి, అపద్దాలు చెప్పి,మోసముతో సంపాదించి ధనము,దుర్మార్గపు దొరతనము, కపటముగారాజ్యము లోకి చొచ్చుకొనివచ్చి సంపాదించిన రాజ్యము, దయలేని తాపస వృత్తి, వూరికే ఆశపడి స్వీకరించిన సన్న్యాసము, గపటాత్ముడై వ్యవహరించు దేవాధికారవృత్తి ఎప్పటికీ నిలవవు పైగా దుర్గతికి దారితీయును.
మామిడి చిగుళ్ళను కోయిలలు ఆస్వాదించి మధురాలాపన చేస్తాయి. ఆ చిగుళ్ళను మదనుడు అస్త్రంగా ఉపయోగించుకుంటాడు. అంత వాసిగల మామిడి చిగుళ్ళను వేపచిగుళ్ళు తినే అలవాటున్న కొందరు ఏవగింపుతో ఉమ్మేస్తే ఆ మామిడి పరితపిస్తుందా? పరితపించదు. (మంచిని మెచ్చలేని కొందరిని గూర్చి కదా ఈ చెప్పడం! మంచిదని )