ఒకసారి 45 ఏళ్ల వయసున్న ఒకామె కోర్టు మెట్లు ఎక్కింది. జడ్జిగారి ముందు ఆమె ఇలా విన్నవించుకుంది. "మా వారికి ఆరోగ్యం బాగాలేదు. మాకు ఒక పాప ఉంది. నేను అందరి ఇళ్లలో పనిచేసి తెచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నాను. అందరినీ అడుక్కుని ఎలాగోలా నా కూతురికి మంచి చదువు చెప్పించాను. మా అమ్మాయిని ఎటువంటి కష్టం తెలియకుండా పెంచాను. అమ్మాయి కూడా బాగా చదివి ఉద్యోగం సంపాదించుకుంది. ఇక మా కష్టాలు తీరాయి... అనుకునే లోపు అమ్మాయి కనిపించకుండా పోయింది. ఎవరైనా మాయమాటలు చెప్పి మోసంచేసి ఎత్తుకుపోయారేమో".... అని చెప్పింది.
జడ్జిగారు ఆ విషయం గురించి పూర్తిగా విచారించగా, ఆ రోజు వాళ్ళ అమ్మాయి కోర్టుకు వచ్చింది. బోనులో ఎదురెదురుగా తల్లి కూతుర్లు. ఆ అమ్మాయి కళ్ళలో ఏమాత్రం ప్రేమ కనిపించలేదు. తప్పు చేశానన్న పశ్చాత్తాపమూ లేదు.
ఆ అమ్మాయి... "నన్ను ఎవరూ మోసం చేయలేదు. నన్ను ఎవరూ ఎత్తుకుని పోలేదు. నేను మేజర్ ని నాకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను" అనిచెప్పింది.
ఇంట్లో వాళ్లకు ఒక్కమాటైనా చెప్పాలి కదా!.... అని అడగాలని అనుకున్నా, కోర్టులో ఇలాంటి సంభాషణలు ఉండరాదు. కనుక ఒక గంటసేపు తల్లి కూతుర్లు మాట్లాడుకోవలసిందిగా జడ్జిగారు తీర్పు ఇచ్చారు.
జడ్జిగారి ఆశ ఏంటంటే... ఒకవేళ ఆ తల్లీకూతుళ్ళు కలిసి మాట్లాడుకుంటే, ఆ తల్లి కష్టాన్ని కూతురు అర్థం చేసుకుంటుందని, గతాన్ని తలచి ఆమె మారుతుందేమో అని. ఆయనకూ మనసు ఉంది కదా! అందుకే ఆలోచించి అలా చెప్పారు.
ఒక గంట తరువాత మళ్ళీ వచ్చిన తల్లి కూతుర్లు ఎదురుగా నిలబడ్డారు. కానీ, ఎటువంటి మేజిక్కూ జరగలేదు.
అమ్మ ఒక నిశ్చయానికి వచ్చి, "ఇక అమ్మాయి ఇష్టం అండీ... తను సంతోషంగా ఉంటే మాకు అంతే చాలు. ఒక్కమాట... వాళ్ళ నాన్నతో వెళ్ళొస్తానని చెప్పమనండి. ఆయనకు ఆ పిల్లంటే ప్రాణం" అని తల్లి చెప్పింది.
"వాళ్ళ నాన్న ఎక్కడ?" అని అడగగా... అతను ఒక మూలన కూర్చుని ఇవన్నీ గమనించి కన్నీరు పెట్టుకుంటున్నాడు. అతను వికలాంగుడు (physically handicapped.) అతనిని ఒకరు ఆసరాగా పట్టుకుని ఉన్నారు.
అయినా ఏమాత్రం మనసు కరగని ఆ అమ్మాయి "ఇక నేను వెళ్లొచ్చా"... అని అడిగి బయట తన భర్త వేచిచూస్తున్న కార్ ఎక్కి వెళ్లిపోయింది.
ఆ అమ్మాయిని శిక్షించడానికి కోర్టుకి అధికారం లేదు. 'ఆర్డర్ వేసి ఇవి ఆచరించి తీరాలి' అని చెప్పడానికి ఇంకా చట్టాలు రాలేదు.
జడ్జిగారు ఆ అమ్మను ఉద్దేశించి... "ఇప్పుడెలా వెళతారు?" అని అడిగితే... "బస్టాండ్ లో నలుగురి దగ్గర అడుక్కుని మా ఊరువెళ్ళిపోతాం. అక్కడ మళ్ళీ ఇళ్లలో పనిచేసుకుని మా బతుకులు ఈడ్చేస్తాం." అని అంటుంటే అక్కడ అందరి కళ్ళలో కన్నీళ్లు.
కోర్టు నుండి బయటకు వచ్చిన జడ్జిగారు ఆమెకు వెయ్యి రూపాయలు ఇవ్వగా, అక్కడ ఉన్నవారంతా తోచిన సాయం చేసి పంపారు.
సినిమాల్లో లాగా నిజ జీవితాల్లో మార్పులు ఉండవు.
తప్పు చేశామేమో అనే పశ్చాతాపం ఉండదు. చట్టం కూడా కొన్నిసార్లు మౌనంగా చూస్తూ ఉండాలి అంతే.
మన పిల్లలకు మన కష్టం తెలియకుండా పెంచాలి అని అనుకోవడమే పొరపాటు.
ప్రేమను పంచినట్టే కష్టాన్ని కూడా పంచండి. అప్పుడు కాసింత మానవత్వంతో మనుషులుగా మిగిలిఉంటారు. లేకపోతే మానవత్వాన్ని మరిచిపోయి, ప్రేమగా పెంచిన మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా గాలికొదిలేసి ఎటో వెళ్ళిపోతారు.
"""**"""
కాశీ పట్టణంలో ధనవంతుడు అయిన ఒక బ్రాహ్మణుడు వుండేవాడు.
అతను ప్రతీ రోజు దాన ధర్మాలు చేసేవాడు. దానికి తోడు మిక్కిలి దైవ భక్తి కలవాడు మరియు యజ్ఞ యాగాదులు కూడ చేసేవాడు.
ఒక యాగంలో అన్నీ దానం చేయటంతో కుటుంబ పోషణకు అతడి వద్ద డబ్బులు లేకుండా పోయాయి.
పక్క ఊరిలో ఒక పెద్ద సేఠ్ నివసిస్తున్నాడని అతడు ఇతరుల పుణ్యంను కొని ధనం ఇస్తాడని బ్రాహ్మణుడి భార్య అతనికి చెప్పి వారి వద్దకు వెళ్లి మీ పుణ్యాలు అమ్మి కొంత డబ్బు తీసుకురండి, తద్వారా వ్యాపారం మళ్లీ ప్రారంభం చేయవచ్చును అని సలహా ఇస్తుంది.
బ్రాహ్మణుడు మాత్రం తను చేసిన పుణ్యం అమ్మడానికి ఇష్టపడలేదు, కానీ భార్య ఒత్తిడి మరియు పిల్లల బాధల కారణంగా అతను పుణ్యం అమ్మడానికి సిద్ధపడక తప్పలేదు.
దారిలో తినడానికి భార్య ఇచ్చిన నాలుగు రొట్టెలు తీసుకొని ప్రయాణం అవుతాడు.
అతను నడుచుకుంటూ అడవిలో నుండి పోయేవేళ ఆకలి కావటంతో ఊరికి చేరేలోపు భోజనం ముగించాలి అనుకుని రొట్టె తీయగానే ఒక కుక్క వచ్చి తన మూడు కుక్కపిల్లలతో ఎదుట నిలబడుతుంది. పిల్లలు చాలా చిన్నవి కావడంతో వాటిని వదిలి ఊరులోకి వెళ్లలేకపోయింది.
బ్రాహ్మణునికి బాధగా అనిపించి అతను కుక్క పై కుక్కపిల్లల కోసం జాలిపడి, తన దగ్గర ఉన్న రొట్టెల నుండి ఒక రొట్టెను కుక్కకు ఇస్తాడు.
కుక్క చాలా రోజులుగా ఆకలితో ఉండటంతో, కుక్క త్వరగా రొట్టె తినేసింది, కానీ ఇంకా ఆకలితో ఉండటంతో బ్రాహ్మణుడి వైపు చూపసాగింది.
బ్రాహ్మణుడు జాలిపడి రెండవది, తరువాత మూడవది, చివరి నాల్గవది అలా మొత్తం రొట్టెలు కుక్కకు వేసి తను మాత్రం కేవలం నీరు త్రాగి సేఠ్ వున్న వూరికి చేరుకొంటాడు.
బ్రాహ్మణుడు సేఠ్‌తో తన పుణ్యాన్ని అమ్ముకోవడానికి వచ్చానని చెప్పుతాడు.
అప్పుడు సేఠ్ ‘నేను చాలా బిజీగా ఉన్నాను, సాయంత్రం రండి, నేను కొంటాను!’ అని అంటాడు.
మధ్యాహ్నం సేఠ్ తన ఇంటికి భోజనానికి వెళ్లి ‘తన పుణ్యాన్ని విక్రయించడానికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడని భార్యతో చెప్పుతాడు. అతని దగ్గర నేను ఏ పుణ్యం కొనాలి చెప్పు!’ అని సలహా అడుగుతాడు.
సేఠ్ భార్య చాలా మంచి పతివ్రత స్త్రీ. ఈరోజు బ్రాహ్మణుడు రొట్టెలన్నీ కుక్కకు ఇచ్చి చాలా పుణ్యం సంపాదించుకున్నాడని కండ్లు మూసుకొని ధ్యానం చేసి తెలుసుకొంటుంది.
కుక్కలకు రొట్టెలు వేసి సంపాదించిన పుణ్యాన్ని బ్రాహ్మణుడి నుండి కొనమని తన భర్తకు చెబుతుంది.
సాయంత్రం బ్రాహ్మణుడు తన పుణ్యాన్ని విక్రయించడానికి వచ్చినపుడు సేఠ్ ఇలా అంటాడు…
’ఈరోజు నువ్వు చేసిన యజ్ఞం యొక్క పుణ్యాన్ని నేను కొనాలని అనుకొంటున్నాను.
బ్రాహ్మణుడు నవ్వి ఇలా అంటాడు… ’నా దగ్గర యజ్ఞానికి సరిపడ ధనం ఉంటే నీకు పుణ్యం అమ్మడానికి వచ్చేవాడినా?’ అని.
’ఈరోజు ఆకలితో ఉన్న కుక్కకు ఆహారం పెట్టి ఆ కుక్కను, దాని పిల్లలను నువ్వు రక్షించావు. అదే యజ్ఞం!’ అని సేఠ్ అంటాడు.
’నువ్వు సంపాదించిన ఆ పుణ్యాలన్నీ నేను కొనాలని అనుకొంటున్నాను!’ అని అంటాడు.
బ్రాహ్మణుడు పుణ్యం అమ్మడానికి అంగీకరిస్తాడు.
దానికి బదులుగా నీకు నాలుగు రొట్టెల బరువుకు సమానంగా వజ్రాలు, ముత్యాలు ఇస్తానని సేఠ్ అనటం దానికి బ్రాహ్మణుడు కూడ అంగీకరించడం జరిగిపోతాయి.
నాలుగు రొట్టెలు తయారు చేసి త్రాసులో కాటాకు ఒక ప్రక్కన ఉంచబడతాయి.
రెండవ దానిలో, సేఠ్ ఒక సంచీ నిండా వజ్రాలు, ముత్యాలు మరియు ఆభరణాలు ఉంచుతాడు.
త్రాసు యొక్క కాటా కొంచెం కూడ కదలదు.
రెండవ సంచీ ఉంచినాకూడా కాటా కొంచెంకూడ కదలక పోయేసరికి సేఠ్ తన దగ్గర వున్న ఆభరణాలు అన్నీ రెండో దిక్కున వుంచినా కూడ కాటా అసలుకే కదలదు.
అది చూసిన తర్వాత అక్కడ వున్న వారందరు ఆశ్చర్య పోతారు.
అప్పుడు బ్రాహ్మణుడు సేఠ్‌తో, "నేను నా మనసు మార్చుకున్నాను. ఇప్పుడు నా పుణ్యాన్ని నీకు అమ్మడం ఇష్టం లేదు!” అని రిక్త హస్తాలతో తన ఇంటికి ప్రయాణం అవుతాడు.
ఇంట్లోకి అడుగు పెట్టగానే భార్య తనతో గొడవ పడుతుందేమోనని భయపడి, దారిలో కుక్కకి రొట్టెలు ఇచ్చిన చోటు నుంచి కొన్ని గులకరాళ్లు, రాళ్లను ఏరుకుని దానితో ఒక మూటనూ తయారు చేసి ముడి వేస్తాడు.
ఇంటికి చేరుకోగానే అతని భార్య పుణ్యాన్ని అమ్మి ఎంత సంపాదించావు అని అడగటం తో ఆ రాళ్ల మూటను భార్యకు ఇచ్చి అప్పు దొరుకుతుందేమోనని గ్రామం లోకి వెళ్ళుతాడు.
ఇక్కడ అతని భార్య ఆ మూటను చూసి ఆగలేక, భర్త వెళ్లగానే ఆ మూట తెరిచి చూస్తుంది. ఆ మూట నిండా వజ్రాలు, నగలు ఉండటంతో ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోతాయి.
బ్రాహ్మణుడు ఇంటికి తిరిగి రాగానే అతని భార్య మీ పుణ్యానికి ఇంత మంచి ధర ఎవరు చెల్లించారని అడుగుతుంది. మీకు ఇన్ని వజ్రాలు మరియు ఆభరణాలు ఎక్కడ నుండి వచ్చాయి? అంటుంది.
”వజ్రాలు, నగలా ? ఎక్కడ ఉన్నాయో చూపించు!” అని అంటాడు బ్రాహ్మణుడు.
భార్య తన ముందు ఉన్న మూటను విప్పగానే అందులోంచి విలువైన ఆభరణాలు బయట పడటంతో బ్రాహ్మణుడు కూడా ఆశ్చర్యపోతాడు.
అప్పుడు అతను తన భార్యకు జరిగిన విషయాలు అన్నీ పూస గుచ్చినటుల చెబుతాడు.
విపత్తు సమయంలో తన పుణ్యంను విక్రయించమని అతనిని బలవంతం చేసినందుకు అతని భార్య చాలా బాధపడుతుంది.
ఇదీ కథ…!
నిజానికి ఇది కథ కాదు. జీవితం! ఈ కలిలో, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి. ఆపదలో ఉన్న వారికి సాయం చెయ్యండి. మీకు ఎంత డబ్బున్నా ఇహలోక ప్రయాణానికే. డబ్బును ఎవరైనా దొంగిలించవచ్చు. కానీ, మీ పుణ్యాన్ని ఎవరూ దొంగిలించలేరు.అందుకే, మీ దగ్గర ఉన్న డబ్బును పుణ్యంగా మార్చుకోండి. పరలోక ప్రయాణానికి పుణ్యం తోనే టిక్కెట్టు కొనుక్కోండి . దేవుడు మనల్ని పరీక్షిస్తాడు! మనం ఆ పరీక్షలో ఉత్తీర్ణులైతే, మనల్ని శాశ్వతంగా ఆశీర్వదిస్తాడు!అందుకే ఎంతటి సంక్షోభం వచ్చినా భగవంతునిపై విశ్వాసం వమ్ముకాకూడదు.
((()))
091..*వాక్చాతుర్యం
సీతాదేవి ఆనందించినదియై హనుమతో రామలక్ష్మణుల కుశలములు, వారి కార్యసన్నద్ధత గురించి అడిగెను. జనస్థానములో శ్రీరాముడు ఒక్కడే పదునాలుగు వేల మంది రాక్షసులను సంహరించెను. అట్టి పురుష శ్రేష్ఠుడు ఆపదలచే చలించు వాడు కాడు. నాకు ఇంకా రెండు నెలల సమయము మాత్రమే యున్నది. కావున రాముని త్వరగా తీసుకొని వచ్చి నన్ను చెర నుంచి విడిపింపుము అని అనెను. అప్పుడు హనుమ సీతతో నీ అనుమతి అయితే ఇప్పుడే నేను నిన్ను రాముని దగ్గరకు చేర్చగలను అని అనగా సీత రవ్వంత హనుమ శక్తి సామర్థ్యములకు శంకించినను, తరువాత అతని శక్తిని చూసి ఉత్తమ పతివ్రత అయిన సీత అందుకు మృదువుగా నిరాకరించెను.
స్వధర్మో నిథనం శ్రేయః పరధర్మో భయావహః
అందుకు హనుమ మిక్కిలి సంతోషించి రాముడు గుర్తింపగల ఏదైనా అబిజ్ఞానమును ఒసగమని కోరెను. అప్పుడు సీత గద్గద స్వరముతో కాకాసురుని కథను రామునికి గుర్తుగా ఈ విధముగా తెలియ చేయు చున్నది.
తతో మాంస సమాయుక్తో వాయసః పర్యతుణ్డయత్
తమ్ అహం లోష్టమ్ ఉద్యమ్య వారయామి స్మ వాయసం 5.39.15
న చా౭ప్యుపారమ న్మాంసా ద్భక్షా౭ర్థీ బలి భోజనః 5.39.16
ఆసీనస్య చ తే శ్రాన్తా పున రుత్స౦గమ్ ఆవిశమ్
బాష్ప పూర్ణ ముఖీ మన్దం చక్షుషీ పరిమార్జతీ
లక్షితా౭హం త్వయా నాథ వాయసేన ప్రకోపితా 5.39.20
పర్యాయేణ ప్రసుప్త శ్చ మ మా౭౦కే భరతా౭గ్రజః 5.39.21
స తత్ర పునరే నాథ వాయస స్సముపాగమత్
వాయస స్సహసాగమ్య విదధార స్తనాంతరే
పునః ్పున రథోత్పత్య విదధార స మాం భృశమ్ 5.39.23
స దర్భ సంస్తరా ద్గృహ్య బ్రహ్మణోఽస్త్రేణ యోజయత్ 5.39.30
స దీప్త ఇవ కాలా౭గ్ని ర్జజ్వాలా౭భిముఖో ద్విజమ్
స తం ప్రదీప్తం చిక్షేప దర్భం తం వాయసం ప్రతి 5.39.31
అనుసృష్ట స్తదా కాకో జగామ వివిధాం గతిమ్ 5.39.32
న శర్మ లబ్ధ్వా లోకేషు త్వా మేవ శరణం గతః 5.39.35
మత్కృతే కాక మాత్రేఽపి బ్రహ్మా౭స్త్రం సముదీరితమ్ 5.39.39
తతో వస్త్రగతం ముక్త్వా దివ్యం చూడామణిం శుభమ్ 5.39.69
ప్రదేయో రాఘవా యేతి సీతా హనుమతే దదౌ
[1] రత్నాకరం నందు పుట్టిన ఈ చూడామణిని సముద్రుడు, వరుణనునికి ఇవ్వగా అతడు జనకునికి ఇచ్చెను. జనకుడు ఈ మణిని వివాహకాల సమయమున తన భార్య ద్వారా సీతకు ఇచ్చెను
--(())--
093
*ఒకడు విమానాశ్రయంలో విమానాలు తుడిచే పనిలో ఉన్నాడు.*
*అలా తుడుస్తున్నప్పుడు కాక్పిట్ లో, 'విమానం నడపడం ఎలా?' అన్న పుస్తకం కనపడింది.*
*అతనిలో ఆసక్తి కలిగి పుస్తకం తెరిచాడు.*
*మొదటి పేజీలో 'విమానం ఇంజన్ స్టార్ట్ అవ్వాలంటే ఆకుపచ్చ బటన్ నొక్కాలి' అని ఉంది. అతడు అది నొక్కాడు. విమానం ఇంజన్ స్టార్ట్ అయింది.*
*అతడికి ఆసక్తి పెరిగింది. రెండో పేజీ తిప్పాడు.*
*'విమానం కదలాలంటే 'పచ్చ బటన్ నొక్కండి' అని ఉంది. అతడు నొక్కి చూసాడు. విమానం కదిలింది.*
*అతడు మరింత ఆసక్తిగా మూడో పేజీ తెరిచాడు.*
*'విమానం వేగం అందుకోవాలంటే నీలం బటన్ నొక్కండి' అని ఉంది. అతడు నీలం బటన్ నొక్కాడు. విమానం వేగం అందుకుంది.*
*అతడు మరింత ఉత్సాహంగా నాలుగో పేజీ తిప్పాడు.*
*'విమానం గాలిలోకి ఎగరాలంటే ఆరెంజ్ బటన్ నొక్కండి' అని ఉంది. అతడు ఆరంజ్ బటన్ నొక్కాడు. విమానం గాల్లోకి లేచింది.*
*యమా వేగంగా గాల్లో తేలుకుంటూ పోతున్న విమానంలో ఉన్న అతను ఐదో పేజీ తిప్పాడు.*
*'విమానం కిందకు దిగాలంటే 'ఈ పుస్తకం 2వ వాల్యూమ్ ' కొనండి' అని ఉంది.*😜
*ఇందులో నీతి ఏంటంటే... విమానం అయినా... అధికారం అయినా... ఒక్క అవకాశం వచ్చింది కదా అని అనుభవం లేకుండా ఎక్కితే... సర్వ నాశనం కాక తప్పదు.*😁
*నడపడం అంటే బటన్ నొక్కడమే కాదు... సమర్ధత అనుభవం కూడా ఉండాలి.*☺️
****
094
ఒకరోజు తమ్ముడు ఫోన్ చేసాడు.
అక్కా నీ మరదల్ని తీసుకుని మీ ఇంటికి వస్తున్నాను అని.
అందుకు సంతోషంతో పొంగిపోయిన అక్క
ఇల్లంతా వెతికింది. వారికోసం ప్రత్యేకంగా ఏదైనా వండాలి అని.
పేదరికంలో ఆమె ఓడిపోయింది. ఏమీ కనిపించలేదు.
రెండే రెండు ఆరంజ్ పళ్ళు కనిపించాయి. వాటితో
రెండు గ్లాసుల జ్యూస్ తయారు చేసి ఇద్దరి కోసం సిద్ధంగా ఉంచింది ...
బెల్ మోగింది తమ్ముడు వచ్చేసాడని పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా తమ్ముడు, మరదలు, మరదలు తల్లి కూడా రావడంతో క్షణం ఆలోచనలో పడిపోయింది.
అయినా వారిని ఆనందంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది..
వంట గదిలోకి వెళ్ళింది. రెండు గ్లాసుల్లో జ్యూస్ తీసుకుని ఒక గ్లాసు లో నీళ్లు తెచ్చింది. మరదలు ముందు ఆమె తల్లి ముందు ఆరంజ్ జ్యూస్ ఉంచింది. తమ్ముడి ముందు మాత్రం నీళ్ళ గ్లాసు ఉంచింది... తమ్ముడికి 7up అంటే ఇష్టం అని చెబుతూ ..
తమ్ముడి అది తాగి నిజం తెలుసుకున్నాడు.
ఇంతలో అత్తగారు నాకు 7up కావలి అని అడగడంతో గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది అక్కకు..
అక్కా నువ్వు కూర్చో నేను తెస్తానని చెప్పి వంటింట్లోకి వెళ్ళి ఒక గ్లాసు కింద పడేసాడు. అయ్యో ఏమైంది ఆని అందరూ అడిగితే
జ్యూస్ ఒలికింది. నేను వెళ్ళి బయట తెస్తాను అని అల్లుడు వెళ్తుంటే.. అత్తగారు వద్దులే బాబు అంటూ వారించింది.
ఇక వెళ్ళొస్తామంటూ.. బయల్దేరారు ముగ్గురూను.
తమ్ముడు అక్క దగ్గరకు వచ్చి, చేతులు పట్టుకుని "అక్కా.! జాగ్రత్త. వంటగదిని శుభ్రంగా తుడిచేయి. లేదంటే చీమలు వచ్చేస్తాయి" అని చేతిలో కొంత డబ్బును చేతిలో పెట్టాడు. భార్యకు, అత్తగారికి కనిపించకుండా డబ్బులను, అక్కకు తెలియకుండా.. కంటి నీరుని దాచుకుంటూ, అక్క కష్టాన్ని కాస్త తాను పంచుకుంటూ. 👍
"ఇక నుంచి తరచూ.. పనుల మీద ఈ ఊరు రావలసి వస్తుంది. వచ్చినపుడల్లా.. నీ చేతి వంట రుచి చూడాల్సిందే" అన్నాడు. భవిష్యత్తులో చేయవలసిన వాటికి బీజం వేస్తూ.. ఆలోచించుకుంటూ!
సోదరులంటే ఇలా ఉండాలి కదా ..! 🤗🤗
బంధం అనే కాదు.. కష్టాల్లో ఉన్నవారికి మన వల్ల చేతనైన సాయం అందించి వారిని కష్టాల నుండి బయటపడే సహాయం, ప్రయత్నం చేయాలి.
*ఆత్మీయతను కోల్పోకండి.!*
దయచేసి మనకి అందరు దొరుకుతారు. ఎక్కడ అయినా తోడపుట్టిన వాళ్ళని కోల్పోతే వాళ్ళు దొరకరు. ఏదైనా విభేదాలు ఉన్నా.. మనమే ఒక అడుగు ముందుకు వేసి కలుపు కోవడంలో తప్పు లేదు.
ఇలాంటి ఆత్మీయతలను; అనుబంధాలను
నేడు మనం కోల్పోతున్నాం
***
095 //వ్యాఘ్రీ యధా హరేత్ పుత్రాన్ దంష్ట్రాభ్యాం చ న పీడయేత్
భీత పతనాదేతాభ్యాం తద్వత్ వర్ణాన్ ప్రయోజయేత్
1. వేదం లోని అక్షరాలు సునాయాసం గా పలకాలి
2. అక్షరాలు అస్పష్టం గా ఉండకూడదు
3. ధ్వని జారిపోవడం కాని తేలిపోవడం కాని జరగకూడదు అలా అని అరిచినట్టు గా కూడా ఉండకూడదు.
4. పెదవుల చివరనుంచి పదాలని పలకకూడదు
వేద పఠనానికి ఉండాల్సింది మూడు లక్షణాలు. అవి ఏమిటంటే అక్షర శుద్ధి, మాత్రా శుద్ధి, స్వర శుద్ధి. వేదాన్ని జాగ్రత్త గా పఠనం చెయ్యకపోతే అర్ధం మారిపోయే అవకాశం ఉంది. వేద పఠనం లో దైవ ప్రీతి కలిగించడమంతా వాటి స్వరం లో ఉంటుంది. ఉచ్ఛ మంద్ర స్థాయి లో పలికే స్వరాలని ఆ స్థానం గమనించి అలాగే పలకాలి. వేదం లో స్వరితము, అనుదాత్తము , దీర్ఘ స్వరితము, ఉదాత్తము అనే ముఖ్య స్వరాలు ఉంటాయి. వాటిని గురుముఖతా నేర్చుకుని వల్లె వేయాలి. వేద విద్యకి గురు అనుగ్రహం పూర్తిగా ఉండాలి. సంకల్పం ఉంటే మార్గము, గురువు దొరకడం కష్టం కాదు. అనుష్ఠానాన్ని క్రమం తప్పకుండా ఆచరిస్తూ ఆ వేదమాతని ప్రార్ధిస్తే నేర్చుకోవాలన్న తపన తోడయితే తప్పక మార్గం సుగమం అవుతుంది.
నేర్చుకునే ఒక్క పాఠం అయినా పద్దతిగా నేర్చుకుని సాధన చేస్తేనే ప్రయోజనం.
శంకరులు మనకు ఎన్నో స్తోత్రాలు అనుగ్రహించారు. తప్పులు లేకుండా అవి నేర్చుకుని చెప్పుకున్నా వేద మంత్రాలకి సమానమైన ఫలితం ఉంటుంది.
పై విషయాలపై సందేహాలు ఉంటే పెద్దవారి వద్ద నివృత్తి చేసుకోవచ్చు, కానీ చర్చకు వితండానికి తావు లేదు.
***
096...
096..1000 ఏళ్ల నాటి శ్రీరామానుజాచార్యుల శరీరం... శ్రీరంగంలో ఎప్పుడైనా చూసారా?*
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
వేదానికి సరైన అర్ధం చెప్పి, విశిష్టద్వైత గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు రామానుజాచార్యుడు. ఆయన మరణించి వెయ్యేళ్లు పూర్తియైనను ఇప్పటికీ ఆ శరీరం భద్రపరిచి ఉండడం విశేషం.
*శ్రీరామానుజచార్యులు*
భారతదేశంలో హిందూ మతానికి ఉన్న ప్రాముఖ్యత ఎంతో విశిష్టమైనది. ప్రతి రాష్ట్రంలోనూ అబ్బురపరిచే ప్రఖ్యాత దేవాలయాలు మనకు కనిపిస్తాయి. వాటిలో తమిళనాడులోని తిరుచ్చునాపల్లికి ఆనుకుని ఉభయ కావేరీ నదుల మధ్య ఉన్న శ్రీరంగం పట్టణం కూడా ఒకటి. ప్రసిద్ధ వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటైన శ్రీరంగం ఆలయంలో విష్ణు మూర్తి స్వయంభువుగా అవతరించినట్లు చెబుతారు. ఏడు ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆలయంలో అడుగడుగునా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది శ్రీ రామానుజాచార్యుల వారి శరీరం.
శ్రీరామానుజాచార్యులు పరమపదించి వెయ్యేళ్లకు పైగా గడిచినా ఆయన శరీరాన్ని నేటికీ ఇక్కడ భద్రపరిచి ఉంచడం విశేషం. అయితే చాలా మంది భక్తులకు దీని గురించి తెలియకపోవడం విచారకరం. కొందరు శ్రీరంగంలోని 4 వ ప్రాకారంలో ఉన్న రామానుజాచార్యుల ఆలయాన్ని సందర్శించినా... అక్కడ ఉన్నది ఆయన దివ్య శరీరం అని మాత్రం గుర్తించలేరు.
పద్మాసనంలో యోగ భంగిమలో కూర్చుని రామానుజులు ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టారు. ఆ కూర్చున్న భంగిమలోనే ఇప్పటికీ ఆ శరీరం కనిపిస్తుంది. ప్రతి ఏటా రెండు సార్లు ఆయన కోసం ఓ ఉత్సవం నిర్వహిస్తారు. ఆ సమయంలో కర్పూరం, కుంకుమ పువ్వును ఓ ముద్దగా నూరి రామానుజుల శరీరానికి పూస్తారు. అందువల్ల ఆయన శరీరం ఓ ఎర్రని వర్ణంలో విగ్రహంలా మెరుస్తూ కనిపిస్తుంది. అయితే హారతి ఇచ్చే సమయంలో ఆయన కళ్లు, గోర్లను మనం స్పష్టంగా గుర్తించవచ్చు. కుంకుమ పువ్వు లేపనాన్ని అక్కడ అద్దకపోవడం వల్ల హారతి వెలుగులలో అవి మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయి.
*రామానుజాచార్యుల గొప్పదనం:*
రామానుజులు క్రీస్తు శకం 1017 సంవత్సరంలో చెన్నై పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరంబుదూరు (భూతపురి)లో జన్మించారు. దాదాపు 123 ఏళ్లు జీవించిన రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రచారానికి విశేష కృషి చేశారు. ఆయన జీవిత కాలంలో సగభాగం తమిళనాడులోని శ్రీరంగం, కాంచీపురం క్షేత్రాల్లోనే గడిపారు.
కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వర స్వామి విగ్రహం విష్ణువు రూపానిదా? శివ రూపానిదా? అని వైష్ణవులు, శైవులకు మధ్య ఏర్పడిన వాదోపవాదాలకు రామానుజాచార్యులు పరిష్కారం చూపించారు. తిరుమల స్వామి వారి గర్భాలయంలో శంఖు చక్రాలను ఉంచగా తెల్లవారి చూసే సరికి స్వామి వాటిని ధరించి కనిపించడంతో ఈ సమస్య సులువుగా పరిష్కృతమైంది. తిరుమల వెంకటేశ్వరుని నిత్య కైంకర్యాలను, సేవలను కూడా రామానుజాచార్యులే నిర్ణయించారు.
కొందరికే పరిమితమైన అష్టాక్షరీ ముక్తి మంత్రాన్ని తిరుకొట్టియూర్ ఆలయం గోపురం పైకి ఎక్కి అందరికీ వినిపించారు. ఈ మంత్రం బహిరంగంగా ప్రకటిస్తే నరకానికి వెళ్తారనే వాదనలను తోసి పుచ్చి.. తాను నరకానికి వెళ్లినా పర్వాలేదు, ఈ మంత్రోపదేశం పొందిన వారికి ముక్తి లభిస్తే చాలని ఆయన భావించారు. ఇలా సమ భావన, సహ జీవన, సమతా భావాలను ఆనాడే ఆయన ప్రతిపాదించారు. హిందూ మతంలో ఎన్నో గొప్ప సంస్కరణలకు ఆద్యుడయ్యారు.
*ప్రాచుర్యంలోకి రాని రహస్యం:*
క్రీస్తు శకం 11 - 12 శతాబ్ధాల మధ్య రామానుజాచార్యులు శ్రీరంగంలో శరీరాన్ని విడిచి పెట్టారు. అప్పటి నుంచి ప్రత్యేక లేపనాలను అద్ది ఆయన శరీరాన్ని భద్రపరుస్తున్నారు. అయితే రామానుజాచార్యుల మాదిరిగానే 15వ శతాబ్ధంలో మరణించిన సెయింట్ జేవియర్ పార్ధివ దేహాన్ని కూడా గోవాలోని బసిలికా ఆఫ్ బాంబ్ అనే చర్చిలో భద్రపరిచారు.
గోవాను పోర్చుగీసు వారు పాలిస్తున్న సమయంలో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనే క్రైస్తవ మతస్తుడు ఇక్కడ సువార్త వ్యాప్తికి కృషి చేశాడు. ప్రజలకు సహాయం అందిస్తూ క్రైస్తవ మతంపై నమ్మకాన్ని కలిగించాడు. ప్రపంచ వ్యాప్త పర్యటనల్లో భాగంగా మకావూలో క్రైస్తవ మత ప్రచారాలకు వెళ్ళిన ఆయన అక్కడ మరణించడంతో ఆ శరీరాన్ని గోవాలోని బసిలికా ఆఫ్ బాంబ్ చర్చికి తరలించారు.
క్రైస్తవ మత వ్యాప్తిలో జేవియర్ చేసిన కృషికి గుర్తుగా ఆయన శరీరాన్ని ఓ గాజు పెట్టెలో ప్రత్యేక మూలికలతో కుళ్లిపోకుండా భద్రపరిచారు. దీంతో ఈ చర్చికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. గోవా పర్యాటకంలో ఇది ఒక ముఖ్యమైన సందర్శనీయ స్థలంగా పేరుగాంచింది. అయితే ఈ ప్రదేశానికి వచ్చిన ప్రాచుర్యం దీనికి ముందే శ్రీరంగంలో ఉన్న రామానుజాచార్యుల దివ్య దేహానికి మాత్రం లభించలేదు. అందుకే అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన రహస్యంగా ఇది మిగిలిపోయింది. కాబట్టి శ్రీరంగం పర్యటనకు మీరు వెళ్లినట్లయితే రామానుజుల పవిత్ర దేహాన్ని తప్పక సందర్శించండి.
097.. ప్రాంజలి prabha❤️
ఈ క్రింది 26 దోషాలు మనుష్యుని నరకం వైపు పయనింపచేస్తాయి - 1 🌹*
*🌻. భవిష్య పురాణం 5వ అధ్యాయము 🌻*
సేకరణ రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
*ఈ మనుష్యులెవరనగా*
*(1) అధముడు (2) విషముడు (3) పశువు (4) పిశునుడు (5) కృపణుడు (6) పాపిష్టుడు (7) నష్టుడు (8) రుషుడు (9) దుష్టుడు (10) పుష్టుడు (11) హృష్టుడు (12) కాణుడు (13) అంధుడు (14) ఖండుడు (15) చండుడు (16) కుష్టు (17) దత్తాపహారకుడు (18) వక్త (19) కదర్యుడు (20) దండుడు (21) నీచుడు (22) ఖలుడు (23) వాచాలుడు (24)చపలుడు (25)మలీమసడు (26)స్తేయి.*
*(ఈ దోషాలు స్త్రీలకున్నా దోషాలే... )*
*ఈ ఇరవై ఆరుదోషాల్లోనే మళ్ళా భేద, ప్రభేదాలు చెప్పబడ్డాయి.*
*అందుకే వాటిని ఒక్కొక్కటిగా సంగ్రాహంగానైనా వివరించి చెప్పవలసి వుంది. ఇలా :*
*(1) గురువుల వద్దకూ దైవసన్నిధికి చెప్పులు విడవకుండానే, గొడుగును ముడవకుండానే పోవుట, గురువుగారి ఎదురుగానే ఉన్నతాసనంపై కూర్చుని యుండుట, పల్లకిలో కూర్చొని తీర్థయాత్రలు చేయుట, తీర్థాలలో గ్రామ్యధర్మాచరణను చేయుట- ఇవన్నీ అథమసంజ్ఞక దోషాలు.*
*(2) పైకి ప్రియంగా మధురంగా మాట్లాడుతూ హృదయంలో మాత్రం హాలాహలాన్ని కలిగియుండి చెప్పేదొకటిగా చేసేదొకటిగా జీవించేవాడు విషముడు.*
*(3) మోక్షమును గురించి అసలు ఆలోచించకుండా, ప్రాపంచిక విషయవాంఛలలోనే మునిగితేలుతూ, హరి సేవ వూసే తలపక, ప్రయాగలో వుంటూ ఇంకెక్కడో స్నానం చేస్తూ, ప్రత్యక్ష దైవాలను విస్మరించి అదృష్టభాగ్యాన్ని వెతుకుతూ, శాస్త్రసారాన్ని బొత్తిగా పట్టించుకోకుండా వుండేవాడు పశువు.*
*(4) బలంతోగాని, వేషంతోనో మోసంతోనో గాని, మిథ్యా ప్రేమను ప్రదర్శించి గాని మనుష్యులను తన లాభం కోసం ఆపదలలో ముంచేసేవాడు పిశునుడు.*
*(5) దేవ, పితృ కార్యాలలో మంచి అన్నం పెట్టే స్తోమతు వుండీ కూడా మ్లానమై అశుభ్రమైన అన్నాన్ని భోజనాలలో వడ్డించే దుర్బుద్ధియైన మానవుడు కృపణుడు. వానికి స్వర్గమూ దొరకదు; మోక్షమూ లభింపదు.*
*అప్రసన్నమైన మనసుతో కుత్సిత వస్తువులతో దాన కర్మలను గావిస్తూ కోపంగా మొహం మాడ్చుకొని పూజలను చేసేవాడూ కృపణుడే. శరీర విక్రయదారులు కూడా కృపణులే.*
*(6) మాతాపితలను, గురువులను వారి కర్మకు వారిని వదలివేసి హోమ-యజ్ఞాల నిర్వహణలో కూడా లోపం చేసేవారు పాపిష్టులు.*
*(7) సాధనాచరణను పరిత్యజించి, అసత్యపు సేవాప్రదర్శన చేయువాడు, వేశ్యాగామి, దేవధనం ద్వారా స్వంత పబ్బం గడుపుకొనేవాడు, భార్యచేత వ్యభిచారం చేయించి బతుకు నిలుపుకొనేవాడు, కన్యలను తెచ్చి అమ్ముకొనో మరే విధంగానో మొత్తానికి స్త్రీధనం ద్వారానే అపసవ్యంగా అక్రమంగా బతికేసేవాడు పురాణ పరిభాషలో నష్టుడన బడతాడు.*
*(8) మనసులో ఎప్పుడూ క్రోధమే తప్ప మరో మనోవికారమూ, సరాగమూ వుండనివాడు, తన హీనతను తానే తలచుకొని మరీ కోపం తెచ్చేసుకుని చల్లటి వాతావరణాన్ని మంట సెగలపాలు చేసేవాడు (ఉడుకుమోతువాని ముఖాన కునుబొమలు శాశ్వతంగా ముడివడే ఉంటాయి. చిరునవ్వన్నది వుండదు ) - ఇలాంటి వాడు రుష్ఠుడు*
*(9) అకార్య లేదా నిందిత ఆచరణ ద్వారానే జీవించే వాడు. ధర్మకార్యమేదీ పూర్తిగా చేయని వాడు.*
*నిద్రాళువు, దుర్వ్యసనాలపై ఆసక్తిగలవాడు, మదిరాలోలోడు, స్త్రీలను సేవిస్తుండేవాడు, ఎల్లపుడూ దుష్టులుగా జగత్రసిద్ధులైన వారి సాంగత్యంలోనే తిరుగుతుండేవాడు దుష్టుడనబడతాడు.*
*(10) మధుర, మృష్టాన్న భోజనాన్ని తానొక్కడే తినేవాడు, వంచకుడు, సజ్జనులను నిందించేవాడు, శుకర (మద్యశాల వంటి వాటిని శుభ్రపరచుట)తో సమానమైన వృత్తి చేసేవాడు పుష్టుడు.*
*(11) నిగమాగమాలను అంటే వేదతంత్రాలను అధ్యయనం చేయకపోగా, వినడానికి కూడా రానివాడు హృష్టుడు*
*(12, 13) శ్రుతులు, స్మృతులు బ్రాహ్మణ్యానికి రెండు కళ్ళు. ఒకటి లేనివాడు కాణుడు, రెండూలేనివాడు అంధుడు.*
*(14) అన్నదమ్ములతో కయ్యమాడేవాడు, మాతాపితలను అప్రియవచనాలతో బాధించువాడు ఖండుడవుతాడు.*
*(15) శాస్త్రనింద జేయువాడు, చాటున కొండెములు చెప్పేవాడు, రాజ్ మాగీ, శూద్రసేవకుడు, శూద్రపత్నులతో అనాచర చేసేవాడు, శూద్రగృహంలో వండబడిన అన్నాన్ని ఒకమారు తిన్నా, శూద్రగృహంలో అయిదు రోజులు నివసించినా... వాడు చండుడనబడతాడు.*
*(16) కుష్టుడు :*
*ఎనిమిదిరకాల కుష్టురోగాలు కలవాడు, లేదా మూడురకాలైనా వున్నవాడు, శాస్త్ర నిందులతో కలిసి తిరిగేవాడు కుష్టుడు*
*(17) దత్తాపహారకుడు :*
*కీటకంలా తెగ తిరిగేవాడు, కుత్సిత దృష్టితోనే వ్యాపారం చేసేవాడు, దత్తాపహారకుడన బడతాడు.*
*(18) వక్త :*
*కుపండితుడై, అజ్ఞానియై ఉండి కూడా ధర్మోపదేశాలు చేసేస్తుండే వాడు వక్త. (వక్త అనే మాటకి ప్రస్తుతం మాత్రం మంచి అర్థముంది. అదే రూఢి)*
*(19) కదర్యుడు :*
*గురుజనుల వృత్తులను అపహరించడానికి ప్రయత్నించేవాడు. కాశీ నివాసి అయివుండి కూడా కాశినొదిలేసి బహుదినాలు బయటి ఊళ్ళల్లో వుండేవాడు కదర్యుడు.*
*(20) ఉద్దండుడు :*
*మిథ్యాక్రోధాన్ని ప్రదర్శిస్తూ, దండవిధానంలో, అమలులో కల్పించుకొని జనులను దండించేవాడు దండదోషి లేదా ఉద్దండుడు.*
*(21) దురాచారి :*
*బ్రాహ్మణ, రాజ, లేదా దేవ సంబంధి ధనాన్ని అపహరించి మరొక బ్రాహ్మణునికో దైవానికో పెట్టేవాడు, ఆ ధనంతో భోజనాలు పెట్టేవాడు, అక్షరాభ్యాసముండి చదవడానికి గాని, బలవంతాన చదివినా అర్థం చేసుకోవడానికి గాని ప్రయత్నించని వాడు, అనాచారి, దురాచారి నీచుడు.*
*(22) ఖలుడు :*
*గుణవంతులలో సజ్జనులలో దోషాలు వెతకడమే పనిగా పెట్టుకొనేవాడు ఖలుడు.*
*(23) వాచాలుడు :*
*భాగ్యహీనులను పరిహాసయుక్తంగా, వెటకారంగా సంబోధించి వేధించేవాడు, చండాలురతో మరీ బహి రంగంగా సల్లాపము లాడేవాడు వాచాలుడు.*
*(24) చపలుడు :*
*పక్షులను పెంచి అమ్ముకొనేవాడు పిల్లిపిల్లీ తగువులాడుకొని కోతి దగ్గరకు ధర్మంకోసం వెళితే రెండిటినీ మోసం చేసిన కోతిలాగా మానవద్రవ్యాలను భక్షించేవాడు, మాంస భక్షకుడు, అన్యాంగనాసక్తుడు, మట్టిపెళ్లలను పగులగొట్టేవాడు (వ్యంగా) చపలుడనబడతాడు.*
*(25) మలీమసుడు :*
*నూనె రాసుకొని నలుగు పెట్టుకొని తలంటి పోసుకోవడం వంటి శరీరశుద్ధికర్మ ఏనాడూ చేసుకోనివాడు, నిత్యశరీర శుభ్రతకర్మలేవీ చేపట్టనివాడు మలీమసుడు.*
*(26) స్తేయి :*
*చోరుడు దొంగతనం చేయడమేకాక మాతా పితలను పోషించకుండుట, గురువును గౌరవించకుండుట, మంచి ఆలోచనేదీ మనసులో లేకుండుట స్తేయి లక్షణాలు.*
*🌻. ఈ దోషాలలో ఏ ఒక్కటీ లేనివాడే నిజమైన మనిషి 🌻*
🌹 🌹 🌹 🌹 🌹
098.. ప్రాంజలి ప్రభ
వృద్ధదంపతులు మనసు కుదుటపడి ఒకరికొక్కరు చిన్ననాటి ఆలోచనలు గుర్తు చేసు కుంటున్నారు
స్వచ్చమైన గాలి నీళ్ళు,. పచ్చటి పొలాలు. పరిశుభ్రమైన. వాతావరణం లో పుట్టి. పెరిగిన వాళ్ళం...
తలపై నుండి. చెంపల మీదకు కారిపోయేలా నూనె రాసుకుని...
చేతికి పుస్తకాల. సంచి తగిలించుకుని...,
ఒక్కడిగా. బయలుదేరి దారిలో స్నేహితులను ఒక్కొక్కళ్లను. కలుస్తూ పెద్దగుంపుగా. . కిలోమీటర్ల దూరంలో ఉన్న బడికి కాళ్లకు చెప్పులు లేకుండా నడచి వెళ్ళిన తరం వాళ్ళం, జారిపోయే నిక్కరు మీదకు మొలతాడు. లాక్కుంటు ..., చిరుగు. బొక్కలకు గుడ్డ ముక్కలు అతుకులేయించుకున్న వాళ్ళం
10 వ తరగతి అయ్యే వరకు నిక్కరు. వేసుకున్న. , తరం మాదే...
గోలీలు, బొంగరాలు, కర్రా బిళ్ళ, నేలా బండ,. ఉప్పాట, ఏడు పెంకులాట.....
బంతి పుచ్చుకుని. నేరుగా కొట్టేసుకుంటే బంతిలాగ వంటిమీద ముద్రపడే ముద్రబాల్. లాంటి ఆటలాడిన తరం...,
బడికి వేసవి కాలం. , సెలవులు రాగానే తాటి చెట్లూ,. .. సీమ తుమ్మ చెట్లూ ఈతచెట్లు ఎక్కి కాయలు. కోసుకొని తిన్న వాళ్ళం, చెరువులు, కాలవల్లో స్నానాలు చేసిన వాళ్ళం. , తాటి బుర్రలు బండితో ఆడినోళ్లం...
దీపావళి కి. తాటి బొగ్గుల రవ్వల దివిటీ కోసం వళ్ళంతా మసి పూసుకొని మరీ తయారు చేసుకనే వాళ్ళం. 5 ps ఐస్ తిన్నది మేమె. ,, . పది పైసలతో బళ్ళో. మ్యాజిక్ షో. చూసింది మేమే....
వర్షం వస్తె తాటాకు. గొడుగూ, యూరియా సంచులు, కప్పుకుని బడికి వెళ్ళిన వాళ్ళం..
సెకెండ్ హ్యాండ్ సైకిల్ తొ పక్క. తొక్కుడుతో సైకిల్ నేర్చుకున్నోల్లo మేమే...
ఉత్తరాలు.., రాసుకున్న.. ,అందుకున్న తరంవాళ్ళం...
పండగ సెలవులు, వేసవి సెలవులు. , ,దసరా, సంక్రాంతి సెలవులు
ఎన్ని సెలవులు. వొచ్చినా ఐదు పైసలు ఖర్చులేకుండా ఆనందాన్ని. అనుభవించిన తరంవోళ్ళం...,
పెద్దలు. /పిల్లలూ అందరం వీధి అరుగుల మీద కూర్చుని ఎన్నో సాయంత్రాలు/రాత్రులు ఆనందంగా కబుర్లు చెప్పుకుని. పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నదీ మేమే....
ఊర్లో,. ఎవరి ఇంట్లో ఏ వేడుక జరిగినా,. మన ఇంట్లో జరిగినట్లు,. అంతా మాదే. ,
అంతామేమే. అన్నట్లుగా భావించి స్వచ్చందంగా. / నిస్వార్థంగా పాలుపంచుకున్న తరం మాదే...
ఉర్లో ఒక ఇంట్లో దొంగలు పడ్డారని ,. పిల్లలు. అందరం కలిసి ఊరు చుట్టూ తెల్లవార్లూ ఎన్నో రాత్రులు
టార్చిలైట్స్, కర్రలు పట్టుకుని కాపలా కాసిన వాళ్ళం మేమే.
వృద్ధదంపతులు ఓరి మొహాలు ఓకారు చూసుకుంటున్నారు
ఏమంటుంది ఆలోచిస్తున్నారు మీరు అన్నది శ్రీమతి
నాకనిపిస్తున్నదే ఇద్దరికి ఒకే సారి శ్రీ మరణం రావాలని కోరుకుందాము మన వేనని ఉంటుంది
*. ఓ మరణమా…! :
హే… ఎప్పటికప్పుడు నిన్ను ఎంతగా మిస్ అవుతున్నానో నీకేం తెలుసు… అసలెప్పుడు వస్తావ్ నువ్వు? త్వరగా రావూ…
తమకంతో కళ్ళు మూసుకుంటున్నా… రెప్పలపై కమ్మగా వాలిపో... నా వంటిని వెచ్చని దుప్పటిలా కప్పేసేయ్… నన్ను సుఖాల మత్తులోకి నెట్టేస్తూ...
రెప్పలపై నీ చప్పుడు వినగానే నీ శబ్దంలోకి నన్నులాగేసుకుంటావనుకుంటూ ఉంటాను.
ఉత్తుత్తి చప్పుళ్ళతో నన్నుభ్రమల దారుల్లోనడిపిస్తూ ఎప్పటికప్పుడు ముఖం చాటేస్తావ్… ఎందుకోయ్? అంత అల్లరి? నీకెవరు నేర్పారు ఈ తిమ్మిరి ఆటలు?
అసలు నీ కోసం కళ్ళు కాయలు కాసేలా ఉన్న ఎదురు చూపులలో నా విరహాన్ని ఎప్పుడైనా చదివావా?
అయినా నువ్వెందుకు చదువుతావులే… నేనేం గొప్పట నీకు… నన్ను మించిన ఇష్టులెవరట నీకు… చాలా పోసెస్సివ్ గా ఉంది. నీకు నేను తప్ప ఎవరూ ఎక్కువ కాకూడదు.
ప్రతి క్షణం నీ చప్పుడు వింటూనే ఉంటాను… పక్కనే ఉన్నట్లుంటావ్… పలకరిద్దాం అంటే పలుకులకి విరామమంటావ్… ఎప్పటికప్పుడు నా దగ్గరకు వచ్చి నన్ను అల్లుకుపోతావ్ కదా అని ఆశగా ఎదురు చూస్తుంటా.
అసలు ఇన్నాళ్ళు నన్ను చూడకుండా నాకోసం వెదకకుండా ఉన్నావని నీ మీద చాలా కోపం వస్తుంది… నాకు నువ్వొద్దు పో అని అనాలని అనిపిస్తుంది…
నీ మీదే ప్రాణం పెంచుకున్న నేను నువ్వు లేకుండా ఉండగలనా…? నీతో కలసి ప్రకృతిలో పరిమళమై నడుస్తున్న ఊహ వచ్చినప్పుడల్లా నా అలక మటుమాయం లే… బెంగ పడకు.
నా ప్రతి విరామంలో నీ గురించిన ఆలోచనలతో మత్తు తెప్పిస్తావ్. నీకన్నా నాకు హితులెవ్వరు…? సన్నిహితులెవ్వరు…?
నాకు నువ్వు ఉన్నావని అనుకున్నప్పుడల్లా దుఃఖ భారాలన్నీ మాటు మాయం అయిపోతాయి తెలుసా? ఆ దుఃఖాలన్నీ కట్టగట్టుకుని ఎక్కడికి పారిపోతాయో గానీ మనసుకి మాత్రం మధురమైన సేదని పోత పోసేస్తావ్. ఇది కేవలం నీకు మాత్రమే సాధ్యమైన విద్య కదూ...
నువ్వలా నావైపు నడుస్తూ వస్తున్నప్పుడు నా కళ్ళల్లో కనిపించే అంత వెలుగుని నీ జీవితకాలం లో నువ్వు చూడలేవు.
నేను దాటిన ప్రతి స్మృతికీ తెలుసు… ఇప్పుడు తమకన్నా నాకు నువ్వెక్కువ అని. నేను నాలో ఉండిపోవటంలో కంటే నీలోకి జారిపోవటంలో ఉన్న ఆనందం ఉంది చూశావూ… అది చెప్పటానికి సాధ్యం కాదురా… త్వరగా నువ్వొచ్చేసి నన్ను ఆనందాల్లో ముంచెయ్యవూ...
అసలే నువ్వు దూరంగా ఉంటున్నావని చాలా దుఃఖంగా ఉందని తెలుసు కదా…
అందుకే ఈ సారి నువ్వు ఇల్లు మారినప్పుడు నీ చిరునామా నాదే అవ్వాలి… ఓ మరణమా…! :)
****
c099.. దెయ్యపు కధ
--(())--
No comments:
Post a Comment