Wednesday 31 January 2024

kanda



తలిదండ్రులు తొలి గురువులు

తలిదండ్రులె తొలి చెలిమియు తలచిన యెడలన్

తలిదండ్రులె బంధు గణము

తలిదండ్రులు దైవసములు తధ్యము రామా !!


కాయము కొవ్వగు రీతిన

ఖాయమ భయమే గనున్న ఖర్చులు పెరిగే

ధ్యేయము లేకయు తిండియు

మాయల జబ్బులు కళకళ మర్మము రామా


మితమే మరచీ సుఖమని

పతనమ్ము రుచులకునేడు పాఠము చెప్పెన్ 

మితదాహము నున్ననాడు

సతిపతి దేహానికొచ్చు శాంతిరామా


అసమానత యవినీతియు

దేశములో రక్త పోటు దీనుల పైనన్ 

ఆశల దాహము వల్లన 

పాశముతో గుండెపోటు పాఠము రామా 


స్త్రీ కళ తోడగు నిత్యము

వేకువ కళలౌను సత్య విద్యల మయమున్ 

నేకము యగుటే మూలము

తాకెడి తప్పోప్పు లేను తత్త్వము రామా


యగుసహజీవనమేరతి

వేగు వెతలతో బ్రతుకులు వెల్లువ తోటన్ 

మాగినసుఖముల దుఃఖము 

సాగును కళలగుట గాను సాధ్యము రామా


ఎవ్వడు రోషము లేకయు 

ఎవ్వడు విద్యా వినయము ఎల్లప్పుడుగన్ 

ఎవ్వడు సంతుష్టుడగుట 

ఎవ్వడు లోకమున భయము యెరుకా రామా


సత్యపలుకుగా గుణమున్ 

నిత్యమితవ్యయముతోను నిర్ణయ కళలన్ 

పత్యము మితమై హితమున్ 

నిత్యకళలు ఇంద్రియాల నీడలు రామా


వలపుల్లో యూరడిగన్ 

కళలల్లో కావ్యమేను గానుక గానున్ 

తలపుల్లో తన్మయమున్ 

కులుకుల్లో సందడీను పున్నమి రామా


దెబ్బలు తిన్న స్వర్ణమ్ 

బొబ్బలు ఎక్కిన చరణము భోధలు గానెన్ 

అబ్బుర పడుటే మనసున్ 

తబ్బిబ్బగుటయే జగతిన తాపము రామా


ఎగిసే గడసరి పడుచున్ 

నిగనిగ మెరిసేను కాంతి నియమౌనుకళన్ 

చిగురింపమదీ చిలికెన్ 

శృంగార ప్రియాసఖీ యశోవిధి రామా


పడతిరో యువతి కళకు

వడివడి మనసుకు ముసురగు విలయపు వేళల్

కడు లలిత యుగళ రాగము

చెడుగుడు యాటల ఫలితము చింతలు రామా


కం. కమలాప్తుడ నతి గొనుమయ

విమలంబగు బుద్ధినిచ్చి వినయము నిడుచున్

కమనీయపు చరితల నిడి

శమమేలెడు మనసు తోడ శాంతాకారా||


హరిహరసంభవపుత్రా!

గిరిశబరివసిత! మనోజ్ఞ !కృపతోఁగనుచున్

వరపూజ్యాయ్యప్పా!

సురనరకామ్యార్థదాత! శుభములనిడుమా !!! "


కం. శ్రీవేంకటేశ శ్రీశా

గోవర్ధన శైలమెత్తి గోకులమెల్లన్

గావగ బూనినతండ్రీ

 శ్రీవత్సాంకా నతిగొను చిన్మయరూపా||


కం. నారాయణీ నమోయన

కారుణ్యంబును గురిసెడు కల్పకవల్లీ

క్షీరాబ్ధివాసివమ్మా

ధీరారక్షించుమమ్మ ధీశక్తిడుచున్||


వందనము భారతమ్మా

నందన వనముగ వెలసిన నవ భారతమా!!

సందేహించక ప్రజలము

వందేమాతరము గీతి పాడెదమమ్మా!!


భవభయ ముడిపెడు శశిధర

పవనాశన భూష  శూలి పావనచరితా

శివ హర గిరీశ గిరిశా

జవమున‌ నతిగొని శరణిడు జంగమదేవా||


శరవణజన్మాऽऽసాదిత..

గురుఁడవునిఖిలురకు బుధేంద్ర కోటిజనులకున్

హరుఁడవు దురితచరులకున్

సురనిచయాత్మా ప్రసీద 'సుబ్రహ్మణ్యా'!!! "


కం. బొజ్జగణపతికి నతులిడ

నొజ్జగవిజ్ఞానమిచ్ఛు నోరిమితోడన్

సజ్జనమార్గము జూపును

గుజ్ధునిరూపమునరసిన గోరిక దీర్చున్||


కం.  *రాకా!* నిన్నే నమ్మితి,

రా కావగ నన్నునిపుడె, రమ్యా! కృతికిన్

శ్రీకారముగా నిలుము శు

భాకారవు కావ్యమునకు భాస్వన్మణి వై


పెద్దలు సెప్పుదురన్నియు

విద్దెలఁగూలంకషముగ వేడుకతోడన్

బద్దలువిఱుగవు తనువున

ౘద్దియనందురు పలుకులు శారదదయతో.."


ఘనులగు పూర్వులరచనలు

సునిశితముగఁజదివియప్డు శుద్ధకవనముల్

మనతెనుఁగునవ్రాసినచో

* మన పద్యములను పఠించి మాన్యతఁగనరే *..."


చేయి*0పఁదగును హితమును

*రా ..యి*0పగునుత బుధేష్ట రాగముతోడన్

*సాయి*యగురంగనిమరువ

*కోయి*నరవరుఁడ మనమున కుపశాం తినిడున్


నచ్చే సమయమ్మేలే

విచ్చే పువ్వుల సుఘంద వెన్నెలమయమే

మెచ్చే సొగసందాలగు

స్వేచ్చే సుఖదుఃఖములగు సేవల బ్రతుకే


ఆశల యానంద మధువు

చూసే యనురాగ తలపు చూపుల కళలే

వేసే యడుగు సుఖమగుటే

చేసే పనుల ఫలములు చేరువ కొరకే


నీలో మనసు కలకళలు 

నీలో కొంటె సరసాల నీడల మయమే

నీలో వయ్యారి కళలు 

నీలో రేపుకళ ప్రేమ నిత్య సు శోభల్


కిన్నెర సానిక మధురా 

దన్నుగ నిలువంగ లేదు ధరణిని నెంచున్ 

కన్నెల సొగసుల జూడగ

వెన్నెల చినబోయినెంచి వెలదిని, వేళా 


నీ హృదయము నాదియులే 

నీ చిగురు పెదవుల తీపి  నియ మమ్మగుటే

నీ చిలక పలుకు మనసే 

నీ చిలిపి నగవుల చూపు నిర్ణయ మౌనే


నీతో కలిసే నిజమిది

నీతో పంచుకొనుటేను నిర్ణయమేలే

నీతో సర్వ సుఖములే

నీతో బంధము జయమగు నియమగు విధ్యే


చిరుజల్లులలో సందడి

విరజాజివిరహము జూడ వింతకులుకుయే

ధరహాసము జూప తలపు

అరవిందసమేతుని కళ యాసలు తీర్చే


కన్నె కలువపై కులుకే

వెన్నెల పిలుపగు పలుకుల వలపై రాణీ

నున్నని ముఖముగ కదలే

మన్నన కోర మనసైన మహిమను జూపే


యంతా చూసినయేదో

కొంతా శుభమే జరుగును కోరిక తీరే

వింతా మార్పు కలుగుటే

పంతాలపలుకు పరువము పదనిస వరకే


సుందరాంగుని లీల లు

పందెరము యగు పరమపద ఫలమే నయ్యే

మందగమనమే మనసగు

చందురుని కథలను తెల్పు చిన్మయ రూపే


లోపాలే యాసలుగా

పాపాలే వ్యాదు లగుట పాలక మహిమే

కోపాలే మూల రసం

తాపాలే దుఃఖమునకు తత్త్వమ్ము గనే 


నాహృదయకుపహరములో

నీ హృదయము దాగి యుంది నిర్మలమగుటే 

నా హృదయం నీ మయమే 

నీ హృద్యము నాకుపంచు నిర్ణయ శంభో


కం. పురుషోత్తమ శ్రీరమణా

కరుణాకర దేవదేవ కావుము శౌరీ

సరసిజ నయనుడ మురహరి

పరమిడి నిలుపగ నతిగొను పరమాత్మహరీ||


కం. తృణములమేయుచు గోవులు

గుణమయక్షీరములను గురియును గూర్మిన్

మణిమయ దేహపు కాంతుల

గుణసుందరి నెపుడు నతుల

గొలుతునుమదిలో||


కం.యదుకుల తిలకుడ నిరతము

మదిదలతును మురియుచు నిను మరువకుమము‌లన్

సదయుడ శరణము నిడుమయ

పదముల గొలుతును నియతిని పరమపదమిడన్||


కం. అంబుజదళ శుభ నేత్రా

కంబుగ్రీవా గణేశ కరిముఖ వరదా

అంబాసుత హర వరసుత

దంబంబుల రూపుమాపు దయవిఘ్నేశా


ఇష్టంమే నన దే ననుటే

కష్టంమే విధిగనేటి గళము నేర్పున్

నష్టంమే మది వాంఛలు

ఇష్టం నన్నది సమమ్ము యీశ్వర శక్తిన్


తొలివలపుల రాణీ, నా

తలపుల వయ్యారి నీవె ధరణిని వెదకన్

కొలువంగ నాడు నేడును

కలలోనను కనికరించు గడసరి సఖియా!!


స్వచ్ఛత పలుకే వయసుది

ఇచ్ఛా మలుపే మనస్సు యిష్టమ్ముగనే

స్వేచ్చా జీవిత బతుకే

మచ్చయు లేనిది జగంబు మానస మగుటన్


కమ్మని కలలను తెలిపే

ఇమ్మని ముద్దుల కలయిక యింకా శోభల్

రమ్మని సతిరాజతలపు

 కమ్మగనున్నది ప్రకృతియె కళలే శోభల్


తండ్రి మాట మిన్న తల్లి మాటలు మిన్న 

రాజభోగమన్న రాజరికము 

కన్న అడుగుజాడ కళ్లునే తెరిపించు

భక్తి మిన్న అనియు బంధ తృప్తి


నాన్నగ రామా యనుచూ

మన్నన మహినా మహాత్మ మహిమే జూడన్

మన్నిక బ్రతుకే నిచ్చున్

సన్నిధి పెన్నిధి యనుటయు సమ్మతి రామా


No comments:

Post a Comment