తేటగీతి పద్యాలు
001 స్పర్శ రూప రసం శబ్ద సమర మౌను
విషయ వాసన అనుభవం వేళ ఇదియె
యోగినీ రక్షించును గాక యోగ మాయ
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
02 యే కలువ ఎప్పుడు జననం ఎవరి కెరుక
ఇదొక సుఖము పంచుటకు లే ఇష్ట పడియు
నిత్య ఉదయించి మకులించు నియమ నీడ
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
03. అమృత ఘడియ ఆలోచన ఆదమరిచె
తప్పు ఒప్పులు తెలియవు తపము ఇదియు
జన్మ వాహన చోదక జాతి కొరకు
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
04. ఎదుటి వారి గుణాలతో ఏల నీకు
నీదు గుణముమంచి దయినా నీకు తోడు
లేని కష్టాల కొలిమియే నేటి బ్రతుకు
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
05. న్యాయమన్నది కష్టమే నటన ఏల
తీర్పు రెండు నెలలు మించి తిట్టు తేట
చేయు ఆలస్యము జనుల చింత ధనము
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
06.దాన ధర్మాది వినియోగం ధర్మ మార్గ
భార్య బిడ్డ మిత్రుల సేవ బంధ మార్గ
కరుణ చూపుఅనామకు లనెడి మార్గ
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
07..సోమరి తనము దరి జేర నియకుండ
శోభ శుభ కర్మ ఫలముల జోలు పోక
బ్రహ్మ చర్యల విద్యయే బడయ చుండ
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
08..అర్థమైతేను 'అవ'ధూతలం కళలగు
ఒడ్డున పడెడి మనిషిగా ఓర్పు తెలుపు
అర్ధ పరమార్ధ తెలుపుటే ఆశయమగు
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
09..సూర్యుని పయణం చీకటి చూచు వరకు
చంద్రుని పయణం పగలు వచ్చె వరకు కళ
సృష్టి ఉన్నంత పయనమే చెలిమి బ్రతుకు
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
010.బయట ఆనంద మనునది బంధ మవదు
మనసు లోనున్న ఆనంద మార్గ బ్రతుకు
విషయ ఏకాంత మై అర్ధ వినయ విజయ
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
011సంధి సంయోగ సక్యత సంభవమ్ము
సలపు సంతోష పర్యావ సాన మమత
సమయ సాధ్య అసాధ్యము సమర మవదు
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
012.దూరము అనక దగ్గర దూత యగుట
రావు అనుటలో వచ్చును రాత్రి పగలు
విధి వినయమేను విజయమే విశ్వముందు
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
013..నిర్మలమె పరాత్పరశక్తి నిజము తెలుపు
నిత్య చైతన్యదీశక్తి నిర్మలమగు
సాత్వికమె బుద్ధి కదలిక సామరస్య
ప్రాంజలి హృదయ చండికా పద్య గీత.
014. స్వప్న జాగృతం ఆత్మకు సాధణగుట
జీవి బ్రహ్మ ఐక్యత స్థితి జగతి యగుట
నిర్వికారమై పరమాత్మ నిజము తెలుపు
ప్రాంజలి హృదయ చండికా పద్యగీత.
015.క్షోభలను భరించుట మేలు క్షమకు మార్గ
అల్పు డైనచో కోపమై ఆశ మార్గ
రత్నము సహించు ఘర్షణ రమ్యమగుట
ప్రాంజలి హృదయ చండికా పద్యగీత.
016.ఆత్మ వెలుగుగా నీవుయే ఆలనేను
వ్యర్థ పలుకులు లేకయే వ్యక్తి గుండు
ఉనికి కేవలం శ్రవణమై ఉదయ పలుకు
ప్రాంజలి హృదయ చండికా పద్య గీత.
017.మనము కాకుంటె ధూతలం మనసు పంచు
ఒడ్డుకు ప్రయాణిస్తునే ఓడి గెలుచు
కాల నిర్ణయ తలపులే కలసి వచ్చు
ప్రాంజలి హృదయ చండికా పద్య గీత.
018. ప్రభల వెలుగులే అందరి ప్రతిభ ఇదియు
ప్రేమ ఇచ్చి పుచ్చుకొనుట ప్రియము చెందు
విశ్వ వేదిక మనుషుల వినయ మగుట
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
019. చలికి నీవు లేక నిదుర చలన మేను
కృష్ణ వేధించకే రామ్ము కృపను పంచు
ముందు యమునతీరమునకు యదను పంచు
ప్రాంజలి ఘటించి చండికా పద్యగీత
020.మనము కాకుంటె ధూతలం మనసు పంచు
ఒడ్డుకు ప్రయాణిస్తునే ఓడి గెలుచు
కాల నిర్ణయ తలపులే కలసి వచ్చు
ప్రాంజలి హృదయ చండికా పద్య గీత.
021.ఉనికి అనునది ఏకవచనము యగుట
రెండు ఆభరణాలుండు రంగు వెలుగు
రెండు బంగాములనరే వెళయు బుద్ధి
ప్రాంజలి హృదయ చండికా పద్య గీత.
022. నిత్య అభ్యుదయా భీష్ట నియమ దాయి
నిర్మలశుభాంగ వర్ణాయ నీలకంఠ
భూభృ తే సనాతనధర్మ భుక్తి కొరకు
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
023.కంటిలో గుడ్డు వెలుగుగా కనుల విందు
దృశ్య కళలుగా కనులందు దక్కగల్గు
నింగి తాపపు సిరిగాను నిన్నుచూడు
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత.
024.పదలయలుగా పలకరింపు పరవశించ
దినకరునికివేడి ఉదయం తెలుగు సేవ
సమయ పాలనా పరమగు సహనశీలి
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత.
025.శీర్ష మెచట ఉత్తంగమో శీగ్ర మౌను
ఇనుప కండరాల జపమే ఇనమదించు
జీవమూ ఆత్మ స్తేర్యము జీవ గమన
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత.
026.గురువు లగువు తగువు కూడి గుర్తు తెచ్చు
లగువు గురువు ఒకరొకరు లాగి లాగి
బిగువు కవితలు చెప్పగా బిగిసి పోయె
ప్రంజలి ఘటించి చండికా పద్య గీత.
027.నోరు జారకు తగువులు కోరవద్దు
విధి బజారులో బేజారి వినయ మేల
మంట పుట్టించి అరుపుల మనసు ఏల
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
028.నీవు నేను రేపటి కళ నీడ మార్చు
నిన్న నేడు రేపు కలలు నిన్ను మార్చు
ఉన్న లేకున్న భుక్తికి ఊయలాట
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
029. విషమమృత మవదు విధిగా వీర చావు
వ్యర్థ పలుకుల నష్టము వ్యసనమ గుట
స్వార్ధమే మనమాయగా సాగు నీడ
ప్రాంజలి ఘటించిచండికా పద్య గీత
030.కీర్తి ధనము పొందనులేవు కీడు తెచ్చు
నిత్య సౌశీల్యమే మన నీడ రక్ష
నోరు జారక బ్రతుకుటే నొప్పి తెచ్చు
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
031. భేద బుద్ధి ఎందుకు నీకుఁ బేరమేల
ఆరు నూరైన తెలుసుకో ఆశయేల
కారుచీకటి ఉపయోగ కామ్య బ్రతుకు
ప్రాంజలి ఘటించి చండికా పద్యగీత
032.నమ్మకము పదో చరవాణి నమ్మ లేక
అనుభవము ఆవిరియగు ఆట మల్లె
ఇది దురదృష్టమో మది ఇష్టమేల
ప్రంజలి ఘటించి చండికా పద్య గీత
033.చరకు వింటిగమన్మధ చేష్ట లుడికె
పూల భాణాలు మనసుపై పురులు విప్పె
గాలి బాణాల కాంతులు కలసి పోయె
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
034.నవ్వె ను చిలిపిగ కనులు నాట్యమైన
రువ్వె ను మనసు వలపులు ఋణముమల్లె
సవ్వడి విసురు శబ్దము సమయ మాయె
ప్రాంజలి ఘటించు చండికా పద్య గీత
035.సిరి కలలు ఆశ పాశము చిద్విలాస
సిరిని యదనుంచి శీఘ్ర ము చిత్ర మాయె
విరి విలాస పురుష నీవు వినయమిదియు
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
036.చావు పుట్టుక దొర్లును చాప క్రింద
నీవు నేను ఒకటిగాను నియమ మేది
పోవు కాలమాగదు నీదు పోరు నిజము
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
037.భారమవదు బంధము తృప్తి భాద్యతగుట
సార మున్నను లేకున్న సహన మధియె
కారము మమ కారమునయ్యె కాని దైన
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
038.భేద బుద్ధి ఎందుకు నీకుఁ బేరమేల
ఆరు నూరైన తెలుసుకో ఆశయేల
కారుచీకటి ఉపయోగ కామ్య బ్రతుకు
ప్రాంజలి ఘటించి చండికా పద్యగీత
039.మనసులోహరి తలచి మరువకుండి
మాయ మర్మము తెలియక మనుగడయని
మచ్చ లేనిబ్రతుకు కోరి మధుర మలుపు
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
040.అహము పుట్టుకతో వచ్చు అందరికిని
పెంచి పోషించు గుణము పెరుగు వెన్న
సక్రమ నెయ్యి ఉపకర శక్తి సకల పలుకు
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
041.విషమమృత మవదు విధిగా వీర చావు
వ్యర్థ పలుకుల నష్టము వ్యసనమ గుట
స్వార్ధమే మనమాయగా సాగు నీడ
ప్రాంజలి ఘటించిచండికా పద్య గీత
042.న్యాయమన్నది కష్టమే నటన ఏల
తీర్పు రెండు నెలలు మించి తిట్టు తేట
చేయు ఆలస్యము జనుల చింత ధనము
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
043.ఎదుటి మౌనము ఆసరా ఏల నీకు
నీగుణము తెల్పి తొందర నీకు వలదు
దూషణ గుణాలు దగ్గరై దురద ఏల
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
044.కట్టి పడవేయు కనులతో కాల మహిమ
వట్టి మాటలని అనకు వణుకు పుట్టు
గట్టి పోరుతప్పదు ఇక గళము ఏల
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
045. పరిమితజ్ఞాన సంపద పగలు సెగలు
తరుణమానంద కాలము తగ్గు పెరుగు
సరిగమల కాల నిర్ణయం సాగ లేదు
ప్రాంజలి ఘటించి చండికా పద్యగీత
046.ఎవరు నీవు ఎవరనెడి ఏల బ్రతుకు
ఏది నిజ ఎదబద్దము ఎపుడెరుకయు
ఏల యన్న ఇదేవిది ఏమిఅనక
ప్రాంజలి ఘటించి చండికా పద్యగీత
047. చనువు చపలమనేదియే, చక్క చేయు
చేరువగుట కూడ, కళయే చింత వలదు
చెలిమి కలలన్ని శుభముగా, చలవ నీరు
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
048.తనువు తపనల వయసుగా, తరుము చుండు
తప్పుయైనేది ఒప్పుగా, తారుమారు
తనివితీరా ఇదియు కథ తడిక బ్రతుకు
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
049.నీవు నేరుగా భగవంతుని కలిసేటి
పుణ్య మన్నది కేవలం పులుసు ముక్క
పాప మన్నది బానిసగాను చేయు
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
050.ఉన్నదాన్ని చూసి అధిరి ఉరకవద్దు
ఉన్నది మరువకున్నను ఊయలగుట
ఉన్న లేకున్న బంధము ఉల్లి పొరయు
ప్రాంజలిఘటించి చండికా పద్యగీత
051.మంచుగడ్డవలె అవరోహణము చెంది
నీరు ఆవిరి వలెను ఆరోహణమగు
క్రమము నేర్పరచు మనసు కళల జీవి
ప్రాంజలి ఘటించి, చండికా పద్య గీత
052.జడముచే ఆవరించేటి జపము శక్తి
ఎముక అత్యంత ఘనమగు ఏల అనకు
మాత ఏడు లోకములలో మనసు నిచ్చు
ప్రాంజలి ఘటించి, చండికా పద్య గీత
053.సృష్టి కార్యము జడ శక్తి, సమయమగుట
నిత్య చైతన్య స్థితిగాను, నీడ నిచ్చు
చిత్తమెంత అవసరమో, చెలిమి తోడు
ప్రాంజలి ఘటించి, చండికా పద్య గీత
054.మీరు క్షణికము కాదులే మేలు చేయ
శాశ్వతం, మారుతున్నాను సేతువవరు
మార్పులేని వారు అనియు మారనిదియు
ప్రాంజలి ఘటించి, చండికా పద్య గీత
055.పువ్వు పుట్టి రాలట విధి పుడమినందు
నిత్య అందము మారదు నియమ పువ్వు
మనిషి ఎదిగికొద్దీ మారు మనసు పువ్వు
ప్రాంజలి ఘటించి, చండికా పద్య గీత
056.వాస్తవికత అనుభవించ వ్యాధి కలుగు
పగలు ఒకరకం చీకటి పడక వేరు
శాశ్వ తంగా మనసు బుద్ది శాంతి లేదు
ప్రాంజలి ఘటించి, చండికా పద్య గీత
057. ముసలి తనమైన మేధస్సు ముందు పంచు
సాధు జంతువు లగుటయే సమయ మందు
పాప పుణ్యాలు తెలుపుతూ పరమ భక్తి
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
058. మనసు ధర్మాన్ని బట్టియే మార్గ మెంచు
ధైర్య సంపద బ్రతికించు ధరణి యందు
స్వర్గ మైనది ప్రేమయే సమయమందు
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
059. జ్ఞాపకాల వేదన కృష్ణ జ్ఞాన ప్రేమ
ప్రేమ ఊసులునిండెను ప్రియసి మదియు
చేసినది మర్చిపోలేక చెరిత ఒట్టు
ప్రాంజలి ఘటించి చండికా పద్యగీత
060. జీవితం సుస్వరాలుగా గీత పల్కె
నువ్వు లేక నిద్ర పిలిచే నిజము తెలిప
కనులు పిలిచేను మత్తుగా కథలు తెలుప
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
061. నీదు అనురాగ బంధమై నీడ వలపు
కాచుకున్నాను నీకోస కాల మంత
బొగడపూల పానుపు పైన బోసి నవ్వు
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
062. తలకు ఒక ఆసర కలిగి తపము కలయె
వెచ్చదనముకే కావాలి వేదనొద్దు
దుప్పటి పొదానురాగము పుడమి నందు
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
ఆటవెలది పద్యాలు
001.ఆ.వె.జప తపాదులన్నిచే తీర్థయాత్రలై
భగవత్ప్రాప్తి పొంద భయము వలదు
దేహ కష్టపెట్ట సేవ లగుట
సహన ప్రాంజలి కళ శారదాంబ.
002.ఆ.వె.అణు మాత్రమగుట నామ స్మరణ భక్తి .
దేవ లోక శివుడు దేవుడనుచు
సర్వకాలమందు సరయు తృప్తి
సహన ప్రాంజలి కళ శారదాంబ.
003.ఆ.వె.నేను దుఃఖితుడగు నైతెచ్చి పెట్టితి
నేను తలచుకొన్న నీదు సుఖము
ధీరయువత శక్తి దేవతా గమ్యము
సహన ప్రంజలి కళ శారదాంబ.
004..చెదిరె సూర్య కిరణ కేంద్రీకరించు టే
దీప్తి స్తాయి మనసు ఏకగ్రత
జ్ఞాన సాధనమ్ము కాల నిర్ణయముగా
లోక నీతి మనకు లోక్యమ నే నేర్పు
సహన ప్రాంజలి కళ శారదాంబ.
005..ఉపకరమగు జ్ఞాన ఉన్నత భావము
చిత్తము వలన కళ చేరు వగుట
తట్ట లోని ప్రకృతి తెలియ జేయు
సహన ప్రాంజలి కళ శారదాంబ.
006..మానవునిలొ మహిమ దివ్యశక్తి
యుగయుగాల నుండి యోగ మగుట
జీవితాలు మార్చు జీవ సర్వ స్వాన్ని
సహన ప్రాంజలి కళ శారదాంబ.
007..పరమ హంస గారి బోధన లన్నియు
ఆత్మ శక్తు లగుట అందరందు
ప్రతి ఫలాన్ని అనక ప్రగతి కోరు
సహన ప్రాంజలి కళ శారదాంబ.
008..క్రియల అవసరమ్ము కీలకమ్ము యగుట
క్రియ యోగమగుట కీర్తియేను
గురువు ప్రధమ విద్య గుర్తు చేయు
సహన ప్రాంజలి కళ శారదాంబ.
009..మనిషి మాటలన్ని మాయచే
స్వార్ధ బుద్ధి కలిగి సాకు చుండు
స్థాన బలిమి గాని తన బలిమి కాదయా
సహన ప్రాంజలి కళ శారదాంబ.
010..కాలకల్మషమది కళల ప్రభావము
కర్మ,ధర్మ,యోగ, కామ్య భోగపు త్యాగ
సాధన లని తత్త్వబోధ లేల
సహన ప్రాంజలి కళ శారదాంబ
011.ఏమి సేతు నకట ఎనలేని నీ రూప
కాంతి రెంట దీన కష్ట జనుల
యోజ చేరి మనసు నుర్రూత లూగించ
సహన ప్రాంజలి కళ శారదాంబ
012..చేయి చేయి కలుపు చేయు పని తెలుపు
చేతనైన పనికి చెలిమి చేయి
చేవ ఉన్న వరకు చింతలేని బ్రతుకు
సహన ప్రాంజలి కళ శారదాంబ
013..నొప్పి పొరలు పుట్టు కోపము కలిగించు
రాతి పొరలు తొలగి రక్తినీరు
కోప సెగలుతగ్గి ప్రోత్చాహధీశక్తి
సహన ప్రాంజలి కళ శారదాంబ.
014..ఎల్లవేళ లందు ఏల పరాచకమ్
కాల గమన మదియు కళలు అనకు
జ్ఞాన సంపదయని జ్ఞప్తి తెచ్చు కొనుట
సహన ప్రాంజిలికళ శారదాంబ.
015..వ్యర్ధ పలుకు లేల వ్యసన భాషణలేల
ఖర్చు చేయు టేల కాని దేల
లోన మందుగుండు లోకమందు తిరుగు
సహన ప్రాంజలి కళ శారదాంబ.
016.. పాల పాత్ర వంటి ప్రాణ మిదియునులే
మీరు దాన్ని నిత్య ధ్యాన పరుచు శాంతితోను
నింపి సహజ అవసరాలు
సహన ప్రాంజలి కళ శారదాంబ.
017..నేను పాపి ననుట నాటక మగుటయే
దుఖితుడనెడి శక్తి దూరమగుట అదియు
చేయలేను ఆదుర్ద పడుటయే
సహన ప్రాంజలి కళ శారదాంబ.
018.. కర్మ బంధ నగుట కాల నిర్ణయముయే
ఇంద్ర జాల మిదియు ఇష్ట మగుట
గొలుసు వలెను మీరు కొక్కాన్ని చిక్కుటే
సహన ప్రాంజలి కళ శారదాంబ.
019..కలత లేని వాడు కలిమిచే వెలయును
కలిమిలేనివాని కలలు దిగును
కలలు కన్న భువిని కలిమి ఎక్కువ
సహన ప్రాంజలి కళ శారదాంబ.
020..గుట్టు రట్టు ఏను గుమ్మము దాటితే
ఆరు చెవుల మాట ఆట మొదలు
నాల్గు నలిగి పోయి నవ్వు ఏడ్పు
సహన ప్రాంజలి కళ శారదాంబ.
021..సార మేది లేని సంసార మేలనో
చెడుగు డాడు టేల జగము నందు
నరక యాతననియు నమ్మ బలుకులేల
సహన ప్రాంజలి కళ శారదాంబ.
022..పెళ్లి ముందు కళలు పెనవేయు కథలుగా
తరుణ సుఖము చేరి తపన బ్రతుకు
నిత్య నూతనమ్ము నియమాలు మధ్యనే
సహన ప్రాంజలి కళ శారదాంబ.
023..మనకు ముక్తి నిచ్చు మనసుకళ్యాణమే
గడిచె గతము శాంతి గణిత గమన
పతి సతి గతి మతులు పండుగ కథలులే
సహన ప్రాంజిలికళ శారదాంబ.
024..ప్రేమ పూరిత మగు పేగు బంధమగుతే
తలపు లెన్ని నున్న తాను మార్చు
జనని బ్రతుకు నిచ్చి జగతి మాయలనుండి
సహన ప్రాంజలి కళ శారదాంబ.
025..కాంత కనక సుఖము కాలము నేర్పుటే
క్షమయు కరుణ మనసు క్షామ మేల
లేత వయసు పరుగు లే ఇవియనె
సహన ప్రాంజలి కళ శారదాంబ.
026..గుండె గుచ్చి గుచ్చి కూనలా అరుపే ల
ఆరటి పండు తొక్క ఆశ ఏల
ధనము దోచి కరుణ దాన మేల
సహన ప్రాంజలి కళ శార దాంబ.
027. అడగ కుండ పలుకు అర్ధ అనర్ధమే
ఆశ చూప రాదు అహము యున్న
విద్య ఉన్న మౌన వినయమ్ము లోకంలొ
సహన ప్రాంజలి కళ శారదాంబ
028. గొప్ప కాదు అర్ధ గోప్యము మేలులే
లిఖిత హృదయ వాంచ్ఛ లేఖ కళయె
వ్రాయటమనె గుణము వాక్యమే అనుకోకు
సహన ప్రాంజలి కళ శారదాంబ
029. మాయ బంధ అవసరాలతో మెలికగా
కర్మ దేహ మార్పు కోరె సృష్టి
మాయమల విముక్తి మనసు స్థిరత్వము
సహన ప్రాంజలి కళ శారదాంబ
030.ఆది పరిణితియగు ఆటంక అబద్రత
స్వేచ్ఛ పరిధి లోన సత్య పలుకు
క్షణము కొత్తదనము క్షమ గుణమగుటయే
సహన ప్రాంజలి కళ శారదాంబ
031.వేప చెట్టు నరికి వేదన తోడుగా
చేదు అనుభవాలు చెలిమి నీడ
తీపి పలుకు కరువు తేరుకోని మనిషి
సహన ప్రాంజలి కళ శారదాంబ
032.మనిషి మంచి చెడులు మనసు ఆయుధములే
జీవి నరక సుఖము జగతి ఇచ్ఛ
స్వేచ్ఛ చిక్కు ముడిగ సీతకోక చిలకే
సహన ప్రాంజలి కళ శారదాంబ
033.కర్త కర్మ క్రియలు కర్మంబులోజేరి
కర్త జేయు పనులు గానలేరు
కర్మ బంధమునకె కడ తేర లేరయా
సహన ప్రాంజలి కళ శారదాంబ
034.కట్టు బొట్టు బట్టి కన్నులు నమ్మకు
ఒట్టు బెట్టి చెప్పు ఓటి మాట
ఏది మంచి ఏదియు చెడు ఏల నమ్మ
సహన ప్రాంజలి కళ శారదాంబ
035. కత్తిమీదసాము కాపురం కలలుగా
పుడమి విత్తు నీరు పున్న మగుట
పురిటి నెప్పులగుట పూర్తిసుఖము పర
సహన ప్రాంజలి కళ శారదాంబ
036.అద్దమైన పగులు అందానికి దిగులు
ఆద మరచి పలుకు అసలు నలుగు
హృదయ కదలికాగు హాయి నిశ్శబ్ద మే
సహన ప్రాంజలి కళ శారదాంబ
037.దివికి భువికి మధ్య దివ్యమైనది ప్రేమ
మేఘ వర్ష మగుట మేలు చేయు
చినుకులై కబుర్లు కదిలే చెలిమి కొరకు
సహన ప్రాంజలి కళ శారదాంబ
038.అద్దమైన పగులు అందానికి దిగులు
ఆద మరచి పలుకు అసలు నలుగు
హృదయ కదలికాగు హాయి నిశ్శబ్ద మే
సహన ప్రాంజలి కళ శారదాంబ
039. విత్తు నాటి కాల చిత్తము చూడుటే
మొక్క పెరుగు వరకు మోద మగుట
గాలి నీరు వెలుగు గాయమవని మొక్క
సహన ప్రాంజలి కళ శారదాంబ
040.కనక బుద్ధి ఇదియు కానుకలా కళ
కనక తెలియ జేయు కాల కథలు
కనక అక్షరాలు కనకాభి షేకమే
సహన ప్రాంజలి కథ శారదాంబ
041. మంచు గడ్డ వలెను మనసు కరుగుటయే
మౌన నీతి బ్రతుకు మౌఖ్య మగుట
మనసు సాక్షిగా ను మనుగడ నుండుటే
సహన ప్రాంజలి కళ శారదాంబ
042.అతల వితల సుతల ఆరాధ్య మాతయే
ప్రకృతి ప్రతిభగాను ప్రభల వెలుగు
సత్య లోక ధర్మ సమయ నీతి తెలుపు
సహన ప్రాంజలి కళ శారదాంబ
043. రాము డైన మరియు రాక్షసి యైనను
నిన్ను గొలిచి గాద నిష్ఠ తోడ
జ్ఞానులైరి నీవె జ్ఞానంబు బంచగా
సహన ప్రాంజలి కళ శారదాంబ
044..కాంత కనక సుఖము కాలము నేర్పుటే
క్షమయు కరుణ మనసు క్షామ మేల
లేత వయసు పరుగు లే ఇవియనె
సహన ప్రాంజలి కళ శారదాంబ
045..జ్ఞాపకములు లేని జ్ఞాని వలన నేమి
కలగబోదు చూడు ఫలము సుంత !
స్మృతియు నీదు భిక్షె స్మృతి రూపిణివి నీవె
సహన ప్రాంజలి కళ శారదాంబ
046.విద్య యున్న గాదు, వినయమే ముఖ్యము
చిత్తి లేని యెడల సీత్కృతియెగ !
బుద్ధిమంతులనెగ పుణ్య శీలుర జేతు
సహన ప్రాంజలి కళ శారదాంబ
047. వాక్కు పంచు మహిమ వాగ్దేవియే నీవు
గీత దాటకుండ కృపయె చూపు
మాట మీరనీక మన్నన చూపుమా
సహన ప్రాంజలి కళ శారదాంబ
048. హంస వాహనంబు నది నేర్పు మాకెంతొ
మసలు కొనగ వలయు మంచిగాను
చెడుగు చెరగ నేర్పి చేర్చవా తీరము
సహన ప్రాంజలి కళ శారదాంబ
049. కోడి కూసె జాము కోలుకొని కదులు
తోడు వచ్చు చందు రోడు కదులు
లక్షణాల మనిషి లాస్యమేను కదులు
సహన ప్రాంజలి కళ శారదాంబ
050. గెలుపు విటమి అయిన గెలవాలి మనసుయే
ముందు కెల్లఁటమని మూల్యమగుట
సామ దాన భేద సమయంబు నీదయా
సహన ప్రాంజలి కళ శారదాంబ
051. చిక్కు చక్క దనము చేరువ చెలిమియే
దక్కు హృదయవాంఛ ధరణి యందు
మొక్కు కున్న ముడుపుకట్ట మోక్షమిచ్చు
సహన ప్రాంజలి కళ శారదాంబ
052. ఒక్క పలుకుగా విజయమై ఓర్పు నిచ్చు
విషయ వాంఛ లన్ని వేగ మలుపు
సమయ తృప్తి నిచ్చు శాంతి మాత
సహన ప్రాంజలి కళ శారదాంబ
053. అచల తత్వ మనగ ననుభావ గమ్యమ్ము
చూసి చెప్ప లేము సూక్ష్మ మదియు
మదికి దోచు గాని మర్మమెన్నగ రాదు
సహన ప్రాంజలి కళ శారదాంబ
054. చిత్త ముంచి పనులు చేయ దలచి నాను
మత్తు వదల దలచి మార్గ మెంచె
చిత్తశుద్ధి కలిగి చిన్మయా రాధన
సహన ప్రాంజలి కళ శారదాంబ
055. జ్వాల కలిగి చేరి జన్యువై పరమాణు
దిక్కులన్ని కలిగి దివ్వె వెలుగు
సర్వ జనుల కృషికి సమయ తృప్తి పరచు
సహన ప్రాంజలి కళ శారదాంబ
056. అతల వితల సుతల ఆరాధ్య మాతయే
ప్రకృతి ప్రతిభగాను ప్రభల వెలుగు
సత్య లోక ధర్మ సమయ నీతి తెలుపు
సహన ప్రాంజలి కళ శారదాంబ
057. దేహభ్రాంతి కలిగి దీనాతి దీనమై
ఘర్షణ పడుతుండి ఘంటమ్రోగె
జ్ఞాని లెక్క లన్ని జ్ఞప్తి నిశ్చితముగా '
సహన ప్రాంజలి కళ శారదాంబ
058. జగతిన తెగతెంపు జాడ్జమవదఇక
ధ్యాన మరణ మనుచు ధరణి యందు
జ్ఞాన మోక్ష మిదియు జ్ఞాతి పలుకు వాక్కు
సహన ప్రాంజలి కళ శారదాంబ
059. పావనమది రామ భావన యందే ర
మించు చింత చేరు మేలు కోరు
ధ్యాన సత్య వస్తు ధర్మమే జీవితం
సహన ప్రాంజలి కళ శారదాంబ
060. దైవమిచ్చు తనువు దైవతృపీతి కొరకు
కల్ల మాట లేని కరుణ కొరకు
కానివారమణకు కామ్యము కొరకునే
సహన ప్రాంజలి కళ శారదాంబ
061. పక్కనున్న వారి పరిచయమును కోరు
పలుకరించు యెపుడు పలుకు తోడ
పలుకు తెలుపు మదిని పరహాస మెందుకు
సహన ప్రాంజలి కళ శారదాంబ
062. పలుకు తెలుపు మదిని పరహాస మవ్వదు
పదుగురన్నమాట పలుకు చుంటి
మనసు పలుకు లన్ని మాకుతెలియచేయు
సహన ప్రాంజలి కళ శారదాంబ
063. నరులకొరకు నీవు నాటకములు ఎలా
లోక హితము కోరు లేత మనసు
నెర వేర్చు తనువు నిత్యకృత్యములని
సహన ప్రాంజలి కళ శారదాంబ
064. పద్మ వక్త్ర యన్న పలువిధంబుల యొప్పు
వదనమైన నేమి వచన మైన
గళము నందు నెపుడు కరుణయే వర్షించు
సహన ప్రాంజలి కళ శారదాంబ
065. జ్ఞాన ముద్ర గలిగి జ్ఞానుల గామార్చు
అమ్మ మాకు నేర్పు మక్షరములు
నిండు మనసుతోటి నిన్నె గొల్చెదముగా
సహన ప్రాంజలి కళ శారదాంబ
066. చేరదీసి వాని చిత్తమె మార్చవా ?
కాలనిర్ణయమ్ము కానిదేల ?
కలసి మెలసి బ్రతుకు కష్టాలు తీర్చవా
సహన ప్రాంజలి కళ శారదాంబ
067. పాతకములన్ని పరిహరించగలవు
పావనచరితమది పాఠ మదియు
పాపి నైన మార్చ పావనివగు
సహన ప్రాంజలి కళ శారదాంబ
068. నరులు బొగడ చుండ నిత్యమైబాసిల్లు
సత్య లోక మిదియు సమరమేల
పుడమి నందు నిత్య పూజలందుకొనిడి
సహన ప్రాంజలి కళ శారదాంబ
069. అమ్మ ! నీవె చూడు మదియు మా భాగ్యమే
అమ్మ కన్న వారు కరుణ జూపు
అమ్మ ఆది నుంచి మాఇలవేల్పువి
సహన ప్రాంజలి కళ శారదాంబ
070. భోగ భాగ్యములనె భూరిగా నిత్తువు
భయము తొలచి వేసి బంధమవ్వు
బాధ లన్ని తీర్చి బంధముగానుండు
సహన ప్రాంజలి కళ శారదాంబ
071. మాసమంత వెలుగు మహిని పరతు వీవు
వేషభాషలన్ని వేకువగుట
మాయ మర్మ మన్న మాకు తెలియదమ్మ
సహన ప్రాంజలి కళ శారదాంబ
072. తాప జపము వళ్ళ తరుణ మార్గము ప్రాప్తి
తప్పులన్ని మరచి తోడు కోరె
ఒప్పు కొనియు తెల్ప ఓర్పుతో కర్మలే
సహన ప్రాంజలి కళ శారదాంబ
073. బాహు బలము బాగు భాద్యత లకు చిక్కె
బరువు బంధ మగుట భార్య యగుచు
ప్రాణమెళ్ళ ఒడ్డి పలకరింపు కథలై
సహన ప్రాంజలి కళ శారదాంబ
074. అమ్మ కోపమేల ఆరాధన ఇదియే
నేను నీదు మాట నమ్మి నాను
నీకు కష్ట మవదు నీదు సేవలు చాలు
సహన ప్రాంజలి కళ శారదంబ
075. చక్ర భాష్య మిదియు చలనమై సాగుటే
వక్రతుండ మనసు వ్యక్త పరుచు
సక్రమమ్ము ఇదియు సందియాలనుతీర్చు
సహన ప్రాంజలి కళ శారదాంబ
076. శుద్ధ జ్ఞాన మందు స్థితుడు కాగలుడులే
వాస్తవమగు జీవి వ్యాధి పెరుగు
సర్వ కారణముల శరణు జోచ్చును మది
సహన ప్రాంజలి కళ శారదాంబ
077. వాసుదేవ రక్ష వయ్యారి కోయిలా
వలపు తలపు కూత వాలు చూపు
వర్ణ శోభితమ్ము వరదలా గానము
సహన ప్రాంజలి కళ శారదాంబ
078. మనిషి చేయు పనియు మానస కాంక్షయే
ఆశతోనుబ్రతుకు ఆస్తి కొరకు
ఆశల వల అదియు ఆకాంక్షల నిలయం
సహన ప్రాంజలి కళ శారదాంబ
079. నేను అన్న ఎరుక నీడలాకదులుటే
నమ్మలేవు ఇదియు నటన కాదు
నీవు నేను కాదు నిజము నిత్యమగుటే
సహన ప్రాంజలికళ శారదాంబ
080. కన్నవారులేరు కావడి కుండలా
కాల మందు బ్రతుకు కామ్యచరిత
కథల కాల నాగు కాటువేయ దళచే
సహన ప్రాంజలి కళ శారదాంబ
081. కట్టుకున్న పతిని నాటేటిలోముంచి
మన్నుతిన్న పాము మనసు పంచి
కధలు చెప్పు చున్న అపరంజి కోసమే
సహన ప్రాంజలి కళ శారదాంబ
082. సత్య వచన ప్రేమ సమరము కోరుటే
ప్రేమ వినయ సేవ ప్రీతి కొరకు
చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యమై
సహన ప్రాంజలి కళ శారదాంబ
083. అక్షరంబు వలయు ఆత్మతృప్తికొరకు
అక్షరంబు మనసు కక్ష మార్చు
అక్షరంబు తన్ను రక్షించ గలుగుటే
సహన ప్రాంజలి కళ శారదాంబ
084. అక్షరంబు నేర్వ ఆశయసాధన
అక్షరంబు లోక రక్షితంబు
అక్షరంబు జిహ్వ అందరి అక్షయం
సహన ప్రాంజలి కళ శారదాంబ
085. ఎంత మందియున్న యదలోన ధైర్యము
కష్టమైనచోట గుట్టు విప్పె
స్థాన బలము యున్న సమయ మందు
సహన ప్రాంజలి కళ శారదాంబ
086. ఎందు దాగి యున్న యదను తాకుటుగాను
ఘడియ ఘడియ యందు గాళ మగుట
ఎంత రుచిగ యున్న ఏమనకను ఇంక
సహన ప్రాంజలి కళ శారదాంబ
087. ఒరిమిగాను నుండి ఒరుగుల బ్రతుకగా
ప్రజ్ఞ లన్ని చలవ ప్రియము లేక
భూషణంబు రారి భూరివిజయ మగు
సహన ప్రాంజలి కళ శారదాంబ
088.అమ్మకరుణ దీప్తి ఆశయాలను ఘనియే
అమ్మలేని బ్రతుకు ఆటలగుత
క్షేత్ర మైనదమ్మ క్షేమమ్ము కోరుటే
సహన ప్రాంజలి కళ శారదాంబ
089. మనిషి చేయు పనియు మానస కాంక్షయే
ఆశతోనుబ్రతుకు ఆస్తి కొరకు
ఆశల వల అదియు ఆకాంక్షల నిలయం
సహన ప్రాంజలి కళ శారదాంబ
090. ధర్మ భూమి అయిన దరిద్రము ఏలనో
యుద్ధ కాంక్ష పెరిగి యుద్య మగుట
కూడినట్టివారు కూడుకున్న కరువే
సహన ప్రాంజలి కళ శారదాంబ
091. కాటుక తిలకమ్ము కానిదగుట ఏల
కర్మ భూమి ఇదియు కాల మాయ
వావివరుసమారు వాంఛహాలహలము
సహన ప్రాంజలి కళ శారదాంబ
092.నోటితోను మెచ్చి నొసలుతోహేళన
చింత యుడికి నాక చేష్ట జబ్బు
కడుపు తీపి పలుకు కపటమ్ము ప్రేమయే
సహన ప్రాంజలి కళ శారదాంబ
093. కంటి చూపు లన్ని కదల నీయనులేదు
మోహ మేను మదిన మోక్ష మిచ్చు
భావ మేదొ నన్ను భంధ నాలపిలుపు
సహన ప్రాంజలి కళ శారదంబ
094. గాయపడిన గుండె గలముతేల్ప నులేదు
కడుపు కోత మరవక మది తెలుపు
వినబడని వెత లగు విశ్వ కథలగుట
సహన ప్రాంజలి కళ శారదాంబ
095. నీదు భావమేను పదునౌచు పద్యమై
శ్రోత గుండెలోన సూటిగాను
లక్షణాల తోను లాస్యమేల అనుట
సహన ప్రాంజలి కళ శారదాంబ
096. ఇంతకష్టమైన ఎదురీత తప్పదు
ధర్మ పధము విడకు ధరణి లోన
నీస్వధర్మ మనిన నినుగాంచు దైవమ్ము
సహన ప్రాంజలి కళ శారదాంబ
097. పుస్తకములు తెల్పు పుణ్యశీలురకధల్
చదువుచుండవలయు సరస రీతి
మనిషి జీవి తమ్ము మానమార్గము లవి
సహన ప్రాంజలి కళ శారదాంబ
098. ధర్మ దృష్టి తోను ధర్మార్ధ ములుతెల్పు
ధనము బంధు బలము ధరణియందు
వయసు నడవడికలు విద్య వినయమేను
సహన ప్రాంజలి కళ శారదంబ
099. వయసు రాగ మదియు వలపువీ ణలు మీటు
సొగసు చెలిమిచేయు సొమ్ము పంచ
స్వరము మధురమగుట సాక్షిగా ఉండుటే
సహన ప్రాంజలి కళ శారదాంబ
100.ఏరువాకవేళ ఎదను పొంగులు ఏల
ఈడు ఆడువేళ ఈశ్వరేచ్చ
చిలిపి వయసు ఆట చిత్ర విచిత్రాలు
సహన ప్రాంజలి కళ శారదాంబ
101. కౌగిలి రుచి మరిగి కౌలు కొప్పుకొనియు
సిగ్గు చితికి ముద్దు చింత లగుట
చెంత మేలు తలపు చింత తొక్కు బ్రతుకు
సహన ప్రాంజలి కళ శారదాంబ
102. మనది కాని సొమ్ము మానసమ్ము హరించు
మనకు ఉండి దొంగ మనిషి యగుట
గోయి తీయక మది గోతిలో పడ వేయు
సహన ప్రాంజలి కళ శారదాంబ
103. వీడి పోని మనసు వినయమ్మును తెలుపు
మధుర కావ్య రచన మనసు చేరు
మంగళ కరమగుట మానస తృప్తి యగుటే
సహన ప్రాంజలి కళ శారదాంబ
104. శివుని పత్నిగాను శివమొసంగుదు వీవు
అమ్మ నామ మొకటి యవధరించి
మూర్తి భేదమున్న మూలము నీవెగా
సహన ప్రాంజలి కళ శారదాంబ
105. ధాత పత్నిగాను ధర్మము తెల్పు చూ
తరతరములపాటు తలచు నటుల
తీర్చి దిద్ద గలవు తీర్పుగా నిను వేడ
సహన ప్రాంజలి కళ శారదాంబ
106. విమల యనుచు నిన్నె వేడుకొందుమిపుడు
కమలములను బోలు కనులు నీవి
పూజ్య భావములునె పొంగారు చుండెను
సహన ప్రాంజలి కళ శారదాంబ
107. కామ రూపి నీవు కన్యాకుమారివి
విశ్వమంత నిండి విబుధ జనుల
గాచుచుందు వీవు గారుణ్య స్ఫూర్తిగా
సహన ప్రాంజలి కళ శారదాంబ
108. మా యెదలను నీవె మాలిన్యమునుమాపు
మధుర భావనలకు మరలు గొలుపు
జగతి నందు మేమె జడ్జము కలిగితి
సహన ప్రాంజలి కళ శారదాంబ
109. మాయ జేసియైన మనసున ఉన్నావు
మాయ లేవియైన మంచి కొఱకె
దుర్గమంబె దారి దురిత మగుట ఏల
సహన ప్రాంజలి కళ శారదాంబ
110. అవయవములు చూడ ఆస్చర్య పరచుటే
ఇంద్రియమ్ము మాది యినుమడింప
తీర్చి దిద్దవలయు తీవ్ర కష్టము ఆయె
సహన ప్రాంజలి కళ శారదాంబ
111. జ్ఞాన ముద్ర గలిగి జ్ఞానుల సేసేటి
అమ్మ! మాకు నేర్పు మక్షరములు
నిండు మనసుతోటి నిన్నె గొల్చెదముగా
సహన ప్రాంజలి కళ శారదాంబ
112. పాతకముల నన్ని పరిహరింతువు తల్లి
పాహి పాహి యన్న పాపి నేను
చేరదీసి వాని చిత్తమె మార్చమా
సహన ప్రాంజలి కళ శారదాంబ
113. సత్య లోకమందు సత్యమై భాసిల్లు
దేవి ! నిన్నె యెపుడు దీటు శక్తి
సురలు పొగడనేమి చోద్యమె లేదులే
సహన ప్రాంజలి కళ శారదాంబ
114. కాళి వగుదు వీవు కఠిన హృదయులకు
కాటు వేయగలవు కర్కశులను
సాధు జనుల పట్ల శాంతము కలిగించు
సహన ప్రాంజలి కళ శారదాంబ
115. పాశములను బట్టి పాపాల తగ్గించు
మోక్షదాత వగుదు ముదము నీవు
మోహ పాశములనె మూలము నీవుయె
సహన ప్రాంజలి కళ శారదాంబ
116. కర్కశులకు నెపుడు కాళరాత్రివె తల్లి
నీదు నామ మదియు నిజము మనసు
రాత్రి తొలగజేసి రాణింపు నొసగుచూ
సహన ప్రాంజలి కళ శారదాంబ
117. కాల మేదియైన కనగలవే తల్లి
నిజము తెలుపు విధియు నిదా తల్లి
తెలియ వలసినదియె తెలియ జెప్ప తల్లి
సహన ప్రాంజలి కళ శారదాంబ
118. భాష లెన్ని యున్న భావ మొకటి గాను
భావి భారతనిధి భవిత ఏను
బాధ్యత గల విధిగ భార మవదు నీకు
సహన ప్రాంజలి కళ శారదాంబ
119. నదుల నీరు పారు నరుల ఇంట జలము
పంచు కొనియు త్రాగు పంచె ధాత్రి
తెలుసుకొని మెలగ తెలివి గాను మదియు
సహన ప్రాంజలి కళ శారదాంబ
120. నేల మందునిధులు నేను జూడ
లేదె సుఖము అనియు లేదు జనని
దొడ్డ హృదయమేను దొడ్డ కర్త కళలు
సహన ప్రాంజలి కళ శారదాంబ
121. అమ్మ నమ్మినట్టి యయ్య లారవినుడు
నాన్న నమ్మకమని నమ్ము నటన
నమ్మి నడచుటయగు నేర్పు మనకు
సహన ప్రాంజలి కళ శారదాంబ
122. మంచి విషయ తెల్పు మాత మనకు
నడక నేర్పు చుండు నాన్న ఎప్పుడు విధి
నడత కళలు నడచుట నరులకల
సహన ప్రాంజలి కళ శారదాంబ
123. చెడ్డ తోడ చేయ చెలిమి చేటు గనుము
చెడును విడువ ఇపుడు చేదు గదర
చేయి జోడి కలిపి చేయ హితము
సహన ప్రాంజలి కళ శారదాంబ
124. భక్తి శక్తి యనుచు భక్త వరుల రక్తి
బొక్కసమును నింప జొచ్చిరగుట
నేను జెప్ప లేక నేటి మాటలగుట
సహన ప్రాంజలి కళ శారదాంబ
125. కొలువులన్నియున్న కోరు పెరుగు టయే
యాయుధములు తోను యుక్తి బిరిగె
కాల మాయ యిదియు కాలనిర్ణయమేను
సహన ప్రాంజలి కళ శారదాంబ
126. శక్తి ,సామి నీవు ద శక్తులకునునీడ
గుడులు గూడు గట్టి గుడికి మొక్క యగుట
పాతిన యవధూత పరిధి పెంచి
సహన ప్రాంజలి కళ శారదాంబ
127. గురువు దైవ రూపు గుర్తు యెరుగు టయే
గోపురమ్ము యున్న గొప్ప గాదు
అనుసరించు బోధ లాచరించ
సహన ప్రాంజలి కళ శారదాంబ