Sunday, 10 July 2022








నువ్వు చేసే పని చెప్పుకునే లా ఉంటే నువ్వు మంచి మార్గంలో ఉన్నట్టు నువ్వు చేసే పనికి చెప్పుకోవడానికి భయపడిన సిగ్గుపడిన నువ్వు సమాజం అంగీకరించని తప్పు చేస్తున్నావు అని అర్థం.. సమాజంలో కట్టుబాట్లకు విలువ ఇచ్చిన వాడు రాముడు అయ్యాడు, కట్టుబాట్లకు విరుద్ధంగా చేసి ప్రవర్తించిన వాడు రావణాసురుడు అయ్యాడు..
ఇప్పుడు ఏది మంచి ఏది చెడు అన్నది మీరే నిర్ణయించు కోండి ..



రామాయణం  

దశరథుడు రాముణ్ణి తన వద్దకు తీసుకురమ్మని తన సారథి అయిన సుమంత్రుడితో చెప్పాడు. సుమంత్రుడు వెళ్ళీ రథంలో రాముణ్ణి తెచ్చాడు. దశరథుడు రాముడితో " నాయనా, నీకు రాజ్యాభిషేకం చేస్తాను. ధర్మాన్ని పాలిస్తూ తగినవిధంగా నీవు రాజ్యం ఏలుకో," అని చెప్పి అతన్ని పంపేశాడు. తరవాత, దూరదేశాల నుంచి వచ్చిన రాజులూ, ప్రజలూ ఎవరి దారిన వారు వెళ్ళిపో యారు. రాముడి మిత్రులు కొందరు కౌసల్యకు ఈ శుభవార్త చెప్పారు. కౌసల్య ఆనందంతో వారికి బంగారమూ, ఆవులూ, రత్నాలూ బహూకరించింది.

అందరూ వెళ్ళాక దశరథుడు తన మంత్రులతో ఆలోచించి, "రేపు పుష్యమీ నక్షత్రం. పట్టాభిషేకానికి చాలా బాగుంటుంది. అందు చేత రేపే జరుపుదాం," అని నిశ్చయించి, రాముణ్ణి తీసుకురుమ్మని సారథి సుమంత్రుణ్ణి పంపాడు. సారథి వచ్చి తండ్రిగారు రమ్మంటున్నారని చెప్పాగానే రాముడు , "నే నిప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. మళ్ళి ఎందుకు రమ్మన్నారు?" అని అడిగాడు. "నిజమే. అయినా మహారాజుగారు తమరిని చూడాలన్నారు. వెంటనే తీసుకురమ్మ న్నారు," అన్నాడు సారథి.

రాముడు తత్తరపడి సారథి వెంట బయలుదేరాడు. పై వాళ్ళెవరూ లేరుగనక దశరథుడు ఈసారి తన కాళ్ళకు నమస్కరించే రాముణ్ణి లేవనెత్తి, ఆలింగనం చేసుకుని, ఉన్నతాసనంపై కూచోబెట్టి, "నాయనా, రామా!నేను ముసలివాణ్ణి కావటం అలా ఉంచి, నా జన్మనక్షత్రంలో దుష్టగ్రహాలు చేరాయని జ్యోతిష్కులు చెబుతున్నారు. పీడకలలు వస్తున్నాయి. కనక నా దేహంలో ఊపిరి ఉండగానే పట్టం కట్టుకో. ఇవాళ పుష్యమి. రేపు పునర్వసు. శుభకార్యాలకు చాలా మంచిది. ఈ రాత్రికి నీవూ, నీ భార్యా దర్భలపై పడుకుని ఉపవాసం చెయ్యండి. నీ తమ్ముడు భరతుడు తన మేనమామ ఇంటి నుంచి తిరిగిరాక పూర్వమే ఈ పట్టాభిషేకం ముగించటం మంచిదని నాకు తోచింది. వాడైనా పెద్దలంటే భక్తిగల వాడే; ఈ పట్టభిషేకానికి ఎదురు చెప్పబోడు. అయినా మానవస్వభావం అమిత చంచలమైనది," అని చెప్పాడు.

రాముడు తండ్రి అనుమతితో అక్కడి నుండి బయలుదేరి తన తల్లి అయిన కౌసల్య మందిరానికి వచ్చేసరికి ఆమె మౌనంతో రాజ్యలక్ష్మిని ప్రార్థిస్తూ కనిపీంచింది. రాముడు రాక పూర్వమే పట్టాభిషేక వార్త తెలిసి సుమిత్రా లక్షణులు సీతను తమ వెంట కౌసల్య మందిరానికి తెచ్చారు. రాముడు తల్లికి నమస్కరించి తన పట్టాభిషేక వార్త తెలిపి, "అమ్మా, రెపటి పట్టాభిషేకానికి నేనూ, సీతా ఏమేమి అలంకారాలు చేసులోవాలో అవన్నీ చేయించు," అని కోరాడు.

రాముడు లక్ష్మణుడితో, "లక్ష్మణా, నాతో బాటు నీవుకూడా ఈ భూమినంతా పాలింతువుగాని. మనిద్దరమూ ఒకటేగదా. నేను రాజయితే నీవూ రాజువే. మనిద్దరమూ సమస్త సుఖాలూ ఒక్కటిగా అనుభవించుదాం," అన్నాడు. తరవాత అతను తల్లుల అనుమతి పొంది సీతతోసహా తన మందిరానికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి రాముడిచేతనూ, సీతచేతనూ ఉపవాసవ్రతం సక్రమంగా చేయించ టానికి దశరథుడి కోరికపై వసిష్ఠుడు రథమెక్కి రాముడుండే నగరుకు వెళ్ళి ఆ పని పూర్తి చేసి తెరిగి వచ్చే సమయంలో వీధులన్నిటా జనంతండోపతండా లుగా కనిపించారు. రేపటి ఉత్సవం తాలూకు ఉత్సాహంలో వారు సంతోష ధ్వానాలు చేస్తున్నారు వీధులలో నీళ్ళు చల్లి, పూలదండలు కట్టారు. ప్రతి ఇంటిమీదా జెండా ఎగురుతున్నది. స్త్రీలూ, పిల్లలూ, వృద్దులూ ఇప్పటినుంచే పట్టాభిషేకానికి ఎదురుచూస్తునారు.

వసిష్ఠుడు వెళ్ళిపోయాక రాముడు స్నానం చేసి, సీతతో కూడా హొమం చేసి, హొమశేషం తిని, నిశ్చలమైన మనస్సుతో నారాయణాలయంలో భగవంతుణ్ణి ధ్వానం చేసి అక్కడే పడుకుని ఒక ఝాముసేపు నిద్రపోయి, వందిమాగధుల మేల్కొలుపులకు లేచాడు. ఆయన ఉదయం సంధ్యావందనం మొదలైనవి పూర్తిచేసేసరికి తెల్లవారింది. బ్రాహ్మాణులు వచ్చి పుణ్యాహావాచనం చేశారు. మంగళవాద్యాలతో అయోధ్య యావత్తూ మారుమోగిపోయింది.

తెల్లవారుతూనే మళ్ళీ పౌరులు తమ ఇళ్ళను అలంకరించసాగారు

--(())_-- 

 గురు బోధ

ఆత్మ బంధువు లందరికీ శుభోదయం మరియు శుభాశీస్సులు.

ఆత్మ బంధువు లారా మనం అందరం దైవ వారసులం.

కామ క్రోధం గూర్చి

--------------------    తెలుసుకోండి.

భగద్గీతలోని 2 వ అధ్యాయములో 62 వ శ్లోకం లో భగవంతుడు క్రోధం గూర్చి, దానివలన వచ్చే నష్టాల గూర్చి ఈ విధంగా తెలియ జేస్తున్నాడు.పూర్తిగా చదివి మీ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకొండి. 

 "ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే ।

సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోఽభిజాయతే ।। 62 ।।"

ధ్యాయతః — చింతన చేయునట్టి; విషయాన్ — ఇంద్రియ విషయములు; పుంసః — వ్యక్తికి; సంగః — సంగము (మమకారాసక్తి); తేషు — ఆ విషయములయందు; ఉపజాయతే — కలుగును; సంగాత్ — సంగము (మమకారాసక్తి) నుండి; సంజయతే — ఉత్పన్నమగును; కామః — కోరికలు; కామాత్ — కోరికల నుండి; క్రోధః — కోపము; అభిజాయతే — ఉద్భవించును.

ఇంద్రియ విషయముల మీద చింతన చేయటం వలన వాటి మీద మమకారాసక్తి పెరుగుతుంది. ఈ ఆసక్తి కోరికలను కలుగ చేస్తుంది, ఆ కోరికల నుండే క్రోధం ఉత్పన్నమవుతుంది.

క్రోధం, లోభం, కామము మొదలగునవి వైదిక వాజ్ఞ్మయం లో మానసిక రోగాలు అని పరిగణించబడ్డాయి. రామాయణం ఇలా పేర్కొంటున్నది : మానస్ రోగ కచ్చుక మై గాయే హహిన్ సబ కే లఖి బిరలేన్హ పాయే. మనకందరికీ శారీరిక వ్యాధులు అంటే ఏమిటో తెలుసు - ఎదో ఒక్క శారీరిక జబ్బుకి కూడా మనిషి రోజంతా దుర్భరం చేసే శక్తి ఉంది. - కానీ మనము ప్రతి నిత్యం చాలా మానసిక రోగాలతో సతమతమౌతునట్టు మనకు తెలియట్లేదు. మనము కామ, క్రోధ, లోభాదులను మానసిక వ్యాధులుగా పరిగణించక పోవటం వలన మనం వాటిని నయం చేసుకోవటానికి ప్రయత్నించటం లేదు. మనస్తత్త్వశాస్త్రము అనేది మానవ విజ్ఞానంలో ఒక భాగం, అది ఈ వ్యాధులను విశ్లేషించి వాటికి పరిష్కారం సూచిస్తుంది. కానీ, పాశ్చాత్య మనస్తత్త్వశాస్త్రము సూచించే విశ్లేషణ మరియు పరిష్కారం రెండూ కూడా అసంపూర్తిగా ఉండి, మనస్సు యొక్క వాస్తవ తత్వానికి, గుండుగుత్తంగా ఒక అంచనా మాత్రమే అని అనిపిస్తుంది.

ఈ శ్లోకం ఇంకా తదుపరి శ్లోకం లో శ్రీ కృష్ణుడు మనస్సు యొక్క పనితీరుమీద సంపూర్ణమైన మరియు లోతైన అవగాహన కల్పించాడు. మనం ఒక వస్తువు వలన ఆనందం కలుగుతుంది అని పదే పదే అనుకుంటే, మనస్సుకి ఆ వస్తువుతో మమకార బంధం ఏర్పడుతుంది. ఉదాహరణకి, ఒక తరగతిలో ఉన్న కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు, అమాయకంగా అందరూ కలిసి పని చేసుకుంటున్నారనుకుందాం. ఒక రోజు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి గురించి ఏదో గమనించి ఇలా అనుకుంటాడు, "ఆమె నాదవుతే ఏంతో బాగుంటుంది" అని. ఈ ఆలోచనని నిరంతరం మనస్సులో తిప్పటం వలన, అతని మనస్సు కి ఆమె పట్ల అనురక్తి ఏర్పడుతుంది. అతను తన స్నేహితులతో, తను ఆ అమ్మాయిని పిచ్చిగా ప్రేమిస్తున్నానని, తన మనస్సు నిరంతరం ఆమె వైపే వెళ్తుండటం వలన చదవలేక పోతున్నానని చెప్తాడు. మేమందరం తరగతిలో ఆ అమ్మాయితో కలసి పని చేస్తున్నాము, మాకెవరికీ ఆమె మీద పిచ్చి వ్యామోహం లేదని, అతని స్నేహితులు వాడిని ఎగతాళి చేస్తారు. ఎందుకు ఆ అబ్బాయి ఆమె కోసం తన నిద్ర ని చెడగొట్టుకొని, ఇంకా తన చదువును పాడు చేసుకుంటున్నాడు? ఎందుకంటే, అతను, ఆ అమ్మాయిలో సుఖం ఉంది అని పదేపదే అనుకోవటం వలన అతని మనస్సుకు ఆమెతో మమకారానుబంధం ఏర్పడింది.

ఇప్పుడు ఆ అనురాగం మొదట్లో హానిచేయనిది గా అనిపిస్తుంది. కానీ, ప్రమాదం ఏమిటంటే అనురాగం నుండి కోరిక జనిస్తుంది. ఒక వ్యక్తికి తాగుడు మీద అనురాగం ఉంటే తాగుదామనే కోరిక పదే పదే మనస్సులో వస్తుంటుంది. ఒకడికి ధూమపానం మీద అనురాగం ఉంటే సిగరెట్టు తాగితే ఉండే ఆహ్లాదము మీదికే మనస్సులో తలపులు పదేపదే వస్తుంటాయి, అవి ఒకలాంటి యావ కలిగిస్తాయి. ఈ ప్రకారంగా, మమకారం అనేది కోరికలకు దారి తీస్తుంది.

ఒకసారి కోరిక జనిస్తే, అది ఇంకా రెండు సమస్యలను సృష్టిస్తుంది - లోభము (అత్యాశ) మరియు క్రోధము. కోరికలు తీరటం వలన అత్యాశ కలుగుతుంది. “జిమి ప్రతిలాభ లోభ అధికాఈ” (రామాయణం) “కోరికలను తీర్చుకుంటే అది అత్యాశ కు దారి తీస్తుంది.” కాబట్టి, వాంఛలను తృప్తి పరచటం ద్వారా వాటిని పోగొట్టుకోలేము:

"ఎవరికైనా ప్రపంచంలోని సమస్త సంపదలు, విలాసాలు మరియు భోగ వస్తువులు వచ్చినా అతని తృష్ణ చల్లారదు. కాబట్టి, దుఃఖానికి మూల కారణం కోరికలే అని తెలుసుకొని తెలివైన వ్యక్తి వాటిని త్యజించాలి."

మరోపక్క, కోరికలు తీర్చుకోటానికి ఆటంకం కలిగినప్పుడు ఏమవుతుంది? అది కోపం కలుగ చేస్తుంది. గుర్తుంచుకోండి, కోపం అనేది దానికదే ఉత్పన్నమవదు. అది కోరికలకు ఆటంకం కలగటం నుండి వస్తుంది; కోరిక మమకారబంధం నుండి వస్తుంది; మమకారాసక్తి అనేది ఇంద్రియ విషయముల యందు పదేపదే ఆలోచించటం వలన కలుగుతుంది. ఈ విధంగా, ఇంద్రియ భోగ వస్తు విషయముల మీద పదేపదే చింతించటం అనే సాధారణ క్రియ, లోభము, క్రోధము అనే జంట రోగాల దిశగా పతనానికి దారి తీస్తుంది. ఈ క్రోధం ఎంతో అనర్థాలకు దారి తీస్తుంది. కావున అందరూ కోర్కెలకు దూరంగా ఉండడమే, అన్ని రోగాలకు  ( శారీరక, మానసిక ) దూరంగా ఉండవచ్చు.... 


సేకరణ: భగవద్గీత.2 వ అధ్యాయం.62 వ శ్లోకం.


మీ

హరే కృష్ణ.


Saturday, 9 July 2022






072.. రోజు కొక కధ (1 )

పిల్లాడికి 5 ఏట వచ్చేదాక నెత్తిన పెట్టుకొని పెంచండి
15వ ఏట వచ్చేదాక క్రమశిక్షణతో పెంచండి
25వ ఏట వచ్చేదాక మంచి స్నేహితుడిలా పెంచండి
తర్వాత మీ పిల్లలు చెప్పి నాట్లు వినండి, ఇదే లోకం తీరు   

మీ పెంపకం నుండే వాడికి సంస్కారం అలవాటు అవుతుంది అని గుర్తించండి.
అమ్మమ్మలు ,నాయినమ్మలతో కొన్నాళ్ళు గడిపే అవకాశం వారికివ్వండి.బంధువులు బాంధవ్యాల గొప్పతనం తెలిసోకోనివ్వండి. ముఖ్యంగా ఆడవాళ్లు అత్తమామలను ఇంటికి రానియ్యటంలేదు. రేపు మీ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంటే...? చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదు. మీరు మారండి పిల్లలకు మారే అవకాశం ఇవ్వండి.

అసలేం జరుగుతుంది మన దేశంలో..?
విద్యాసంస్ధలేమో లాబాల కోసం ఫీజులు పెంచేస్తున్నారు 
ఉపాధ్యాయులేమో జీతాల కోసం బతకలేక బతుకుతున్నారు 
తల్లిదండ్రులేమో ఎంత ఖర్చైనా పర్లేదు మంచి స్కూలు అని పిల్లలను గారాబం చేస్తున్నారు .
తమ పిల్లలకు మంచి ర్యాంకులు రావాలి మరీ మరీ అడుగుతున్నారు, త్రాసులో పెట్టి ఫీజుకు తగ్గ చదువస్తున్నాడా అని ఆలోచిస్తున్నారు.    
పిల్లలకేమో బట్టి కొట్టైన కాపి పెట్టైనా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని.
బయట ఎండ నాన్నా అని చెప్పి వాడి చేతిలో మొబైల్ పెడతారు ఇక వాడి ఆటలన్ని అందులోనే..
అది కాస్తా తలుపులు వేసుకొని బూతు బొమ్మలు చూసేదాకా వెళ్తాయి.
మీ అందరి స్వార్ధంతో అజ్ఞానంతో పిల్లల ఇష్టాలను, ఎదుగుదలను బాల్యంలోనే సమాధి చేస్తున్నారు.

గట్టిగా చెప్పాలంటే అందరు కలిసి పిల్లలతో వాళ్ళకే తెలియని ఒక ' మానసిక వ్యభిచారం ' చేయిస్తున్నారు...!

గుర్తుంచుకోండి..

" మీరు పెంచేది మీ పిల్లల్ని కాదు సమాజాన్ని తీర్చిదిద్దే  రేపటి తరాన్ని.."
అది మర్చి పోవద్దు...
వారే రాబోయే రోజుల్లో ఈ జాతి నిర్మాణ రథ సారథులు .
ఇప్పుడు వారుంటున్న వసతి గృహాలు రేపు మీ వృద్ధాశ్రమాలు...
***

071... రోజూ భగవంతునికి పూజ చేసే వారు కూడా...
భగవంతుడు అంటే ఏమిటి? అంటే.....
ఎంతోమంది సరైన సమాధానం చెప్పలేరు.

కాబట్టి ఓపిక చేసుకుని...
ఈ చిన్న కథను చదవండి

ఓ దేశాన్ని పాలించే రాజు మనసులో... ముఖ్యంగా మూడు అర్దంకాని ప్రశ్నలు మెదడును తోలుస్తూ ఉన్నాయి.
అవి...

1.దేవుడు ఏ వైపు చూస్తుఉంటాడు?
2.దేవుడు ఎక్కడ ఉంటాడు?
3.దేవుడు ఏం చేస్తాడు?

ఆ ప్రశ్నలకు ఎన్నోమార్లు ఎంత యోచించినా  సరైన సమాధానం దొరకలేదు.

తన ఆస్థానంలో ఓ రోజు సమావేశమై... పండితులను, శాస్త్రకారులను, మేధావులను ఆహ్వానించాడు.
తాను మూడు ప్రశ్నలు వేస్తానని, వాటికి జవాబులు చెప్పడానికి ముందుకు వచ్చి సరైన సమాధానం చెప్పిన వారికి గొప్ప బహుమతి లభిస్తుందని చెప్పాడు. సరైన సమాధానం చెప్పకపోతే కారాగారం పాలు చేస్తానని చెప్పాడు. దాంతో భయపడి ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయం దేశమంతా చాటింపబడింది.

ఓ కుగ్రామం నుండి పశువుల కాపరి ఒకాయన ముందుకు వచ్చాడు. రాజాస్థానం చేరుకొన్నాడు. రాజు సభలో ఎందరో మేధావులు శాస్త్ర పండితులు కూర్చొన్నారు.

పశువుల కాపరి, రాజుగారి మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు.... రాజుకో విషయం నిర్దేశం చేసాడు. ‘చెప్పేవాడు గురువు,    వినేవాడు శిష్యుడు. గురువు పైన ఉండాలి, శిష్యుడు క్రింద ఉండాలి’  అని కండీషన్ పెట్టాడు .

దానికి రాజు అంగీకరించి సింహాసనం నుండి క్రిందికి దిగాడు.
పశువుల కాపరి సింహాసనం అధిష్ఠించాడు.

‘మహారాజా ఇప్పుడు అడగండి మూడు ప్రశ్నలు’’ అన్నాడు పశువుల కాపరి.

🌷మొదటి ప్రశ్న
దేవుడు ఏ వైపు చూస్తుఉంటాడు?
దీనికి జవాబు చెప్పండి అన్నాడు రాజు.

వెంటనే ఒక దీపాన్ని తెప్పించమన్నాడు గురువు స్థానంలో వున్న పశువుల కాపరి. దీపం తెచ్చి సభ మధ్యలో పెట్టారు.

మహారాజా! ఈ దీపం ఎక్కడ చూస్తుంది? నావైపా? నీవైపా? తూర్పువైపా? పశ్చిమానికా? పైనకా? క్రిందకా? ఎక్కడ చూస్తుందో చెప్పండి? అని ప్రశ్నించాడు.
‘అన్నివైపులకు చూస్తుంది’ అని జవాబిచ్చాడు రాజు.

ఇంత చిన్న జ్యోతి అన్నివైపులా చూడగలిగినపుడు.... పరంజ్యోతి స్వరూపమైన భగవంతుడు అన్నివైపులా చూడలేడా? సమస్త జీవుల కళ్ళల్లో వెలుగుగా వున్న పరంజ్యోతి పరమాత్మే.

🌷మరి ఇక రెండవ ప్రశ్న....

దేవుడు ఎక్కడ ఉంటాడు?  అన్నాడు రాజు.

‘సరే! ఓ చిన్న పాత్రలో పాలు తెప్పించండి’ అన్నాడు పశువుల కాపరి.
పాలు తెచ్చారు.
‘మహారాజా ! ఈ పాలల్లో నెయ్యి ఎక్కడ ఉందో చెప్పగలవా?’ అని అడిగాడు.

‘పాలను బాగా మరుగబెట్టాలి. వాటిని తోడు (మజ్జిగ) కలిపి కొన్ని గంటలు కదలకుండా ఉంచాలి. పెరుగు సిద్ధం అవుతుంది. దాన్ని కవ్వంతో చిలికితే వెన్న వస్తుంది. తర్వాత తయారైన వెన్నను కాస్తే నెయ్యి తయారవుతుంది’ అన్నాడు రాజు.

‘సరిగ్గా చెప్పారు మహారాజా!
అలాగే హృదయం అనే పాలను గురువు అనే నిప్పులపై బాగా మరిగించి, మనస్సు అనే తోడు వేసి, స్థిరంగా ఉంచితే వచ్చే సత్యం అనే పెరుగును, సాధన అనే కవ్వంతో చిలికితే జ్ఞానం అనే వెన్న వస్తుంది.
ఆ సాధన ‘అంతర్ముఖం’ అనే నిప్పులపై బాగా కాచినట్లయితే పరమాత్మ అనే నెయ్యి వస్తుంది’అన్నాడు కాపరి. సభలో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి.

ఇక చివరి ప్రశ్న.
దేవుడు ఏం చేస్తాడు? అని.

నేను పశువుల కాపరిని, మీరు మహారాజు.
క్రింద వున్న నన్ను సింహాసనం పైన కూర్చోబెట్టారు.
పైన వున్న మిమ్మల్ని క్రిందికి దించేశారు. ఇదే పరమాత్మ లీల.
సత్కర్మలు చేసే జీవులను పై జన్మల్లో ఉత్తమ జన్మగా మార్చడం,
దుష్కర్మలు చేసే వాళ్ళను మరుజన్మలో క్రింది స్థాయికి పంచడమే పరమాత్మ పని’ అన్నాడు.

సభలో గంభీర వాతావరణం నెలకొంది. రాజు పశువుల కాపరి ముందు పాదాక్రాంతుడయ్యాడు.
పశువుల కాపరి రూపంలో ఉన్న పరమాత్మ తాను వచ్చిన దిక్కుగా తిరుగు ప్రయాణం అయ్యాడు.

మంచిని ఎక్కడ ఉన్న గ్రహిద్దాము..
*మంచిని నేర్చుకుందాము..  *
*మంచిని ఆచరించుదాము... *
*మంచిని అందరికి పంచుదాము... *
మంచి పేరుతో మరణిద్దాము...
         🙏శుభం భూయాత్! 🙏
 ఓంనమశ్శివాయ


070.. సప్త మహర్షులు - సప్త ఋషి మండలము

సప్త ఋషులు అనబడేవారు ఒక గణం. ఆ గణంలో ఏడుగురు ఋషులుంటారు. ప్రతి మన్వంతరంలో ఒక గణం ఉంటుంది. మహాప్రళయానికి ముందయితే 14 మన్వంతరాలుంటాయి కనుక 98 మండి సప్తర్షులు ఉంటారు! బ్రహ్మ మానస పుత్రులయిన ఇప్పటి వైవస్వత మన్వంతరంలోని సప్తర్షులు వరుసగా - మరీచి, అంగీరస, అత్రి, పులస్త్య, వశిష్ట, పులహ, క్రతువులు.

మనది కర్మభూమి అయిన ఋషిభూమి. ఈ జగత్తును పాలించేది రాజులయిన, వారిని తమ సలహాలతో, శిక్షణలతో ముందుకు నడిపించేది వారివారి గురువులయిన ఋషులే! అంతేకాదు, మానవాలికికూడా ఋజువర్తన, సత్ప్రవర్తనలకు మార్గం నిర్దేశించిందికూడా మహనీయులయిన ప్రాచీన ఋషులే. అందుకే మానవజాతి వీరికేంతో ఋణపడి ఉంది. మనుష్య జన్మనేట్టిన ప్రతి ఒక్కరూ పితృ ఋణం, మాతృ ఋణం, గురు ఋణం (ఋషిఋణం), దైవ ఋణాలను తప్పక తీర్చుకోవాలని మన శాస్త్రాలు నొక్కి వక్కాణిస్తున్నాయి.

సప్తఋషిగణంలోని ఏడుగురు మహర్షులు వరుసగా కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వశిష్టుడు, జమదగ్ని - ఇది మరొక క్రమం. తమ అమోఘ తపఃశక్తితో, నియమ నిష్ఠలతో మానవజాతికి సన్మార్గాన్ని నిర్దేశించి, వినువీధిలో "సమ్ప్తఋషి మండలం" గా వేలుగుసోబగులు గుప్పిస్తున్న ఈ మహనీయ, ఋషిపుంగవుల గురించి కొంతయిన తెలుసుకోవడం మన కనీస కర్తవ్యం.

069.. కశ్యపుడు:-- సూర్యుని మానస పుత్రుడైన మరీచి తనయుడు. దక్షుని కుమార్తెలయిన అదితి, దితి మొదలయిన పన్నెండు మందిని పెళ్లాడి, సృష్టిని వృద్ధి చేసిన ఇతనికి దేవదానవులు, నరులు, మృగాలు, పశు, పక్షి, వృక్షాదులను కూడా ఇతని సంతతిగానే పేర్కొంటారు. విష్ణువు వామనవతారంలో ఇతనికి పుత్రుడుగా జన్మించాడు. అలాగే, రామకృష్ణావతారాల్లో కూడా కశ్యపుడే దశరథుడుగా, వసుదేవుడుగా జన్మించాడని మన పురాణోక్తి! ధర్మ ప్రబోధం గావించే "కశ్యపధర్మసూత్రాలు", క్షమాగుణాన్ని చాటిచెప్పే "కశ్యపగీత"ను రచించిందీ ఇతనే.

068.. అత్రి:-- బ్రహ్మ మానస పుత్రుడు, మహాసాధ్వి అయిన అనసూయ భర్త, మరియు ఘోర తపస్సుతో త్రిమూర్తుల అంశలో చంద్ర, దత్తాత్రేయ, దుర్వాసులను కుమారులుగా పొందాడు. దేవదానవ యుద్ధంలో, చంద్రుడు రాహువుచేత కబళించబదాగా, సూర్యుడు పాలిపోవడంతో జగత్తంతా అంధకారమయిన తరుణంలో, అత్రి, సూర్యునికి ధైర్యానిస్తూ, చంద్రుడి, సూర్యుడి శరీరాలు., నక్షత్రాలు గావించి, ప్రకాశాన్ని తిరిగి రప్పించాడు. రామాయణ కాలంలో, తన ఆశ్రమానికి వచ్చిన సీతారామలక్ష్మణులకు ఆతిథ్యమిచ్చి, అతని ధర్మ పత్ని అయిన అనసూయ సీతమ్మకు నూతన వస్తాభరణాలను ఇచ్చి, పతివ్రతాధర్మ సూక్ష్మాలను ఎరుక పరిచింది. అత్రి మహాముని, "అత్రి సంహిత", "అత్రిస్మృతి", అనే రచనలు చేసాడు. అత్రిస్మృతి కాలక్రమంలో "అత్రేయధర్మ శాస్త్రం"గా జగద్విఖ్యాతి నొందింది.

067.. భరద్వాజుడు:-- దేవగురువైన బృహస్పతి కుమారుడు. అతన్ని మరుత్తులు పెంచి, భరతునికి అప్పగించారు. భరతునిచే స్వీకరించబడిన వాడు కనుక "భరద్వాజుడు"గా పిలువబడ్డాడు. గంగానదీ తీరంలో ఆశ్రమవాసియైన ఈయన, సీతారామలక్ష్మణులకు అరణ్యవాస సమయంలో ఆతిథ్యమిచ్చాడు. అదే విధంగా, రాముణ్ణి వెదుకుతూ వచ్చిన భరతునికీ, అతని పరిజనులకూ గొప్పగా విందు నొసగి, రాముడు చనిన దిక్కును తెలిపాడు. రావణ వధానంతరం తిరుగు ప్రయాణంలో కూడా వారికి ఆతిథ్య మిచ్చాడు. ఈయన వ్రాసిన 'భారద్వాజస్మృతి' అనే శాస్త్రం - వసిష్ఠాది మహర్షుల కోరిక మేరకు - ఏయే కర్మలను, ఎప్పుడెలా ఆచరించాలో వివరిస్తుంది.

066.. విశ్వామిత్రుడు:-- తండ్రి గాధి అనంతరం రాజయి, వేటకు వెళ్ళినప్పుడు, విశిష్ఠాశ్రమానికి వేలడం, అక్కడ ఉన్న కామధేనువును కోరటం, వశిష్ఠుడు నిరాకరించడం, కదనానికి దిగి భంగపడడం జరిగిన తరువాత, వశిష్ఠుని అమోఘమైన తపఃశక్తిని చూచి, రాజ్యాన్ని త్యజించి, ఘోర తపస్సు చేసి, మహేంద్రుడు పంపిన మేనక యౌవన-సౌందర్యానికి దాసోహమని, శకుంతల జన్మకు కారణమయ్యి, తప్పు తెలుసుకొని, తిరిగి ఘోర తపస్సు గావించి, తీవ్ర క్షామాన్ని అనుభవించి, పడరాని పట్లు పడి, బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి చేసి, సత్యవ్రతుడనే రాజును బొందితో స్వర్గానికి పంపబోయి, సాధ్యం కాక, త్రిశంకు స్వర్గాన్నే స్రుష్టించి, వసిష్ఠునిచేత 'బ్రహ్మర్షి' అని పిలిపించుకునేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి, వెతలు అనుభవించి, కోపాన్ని జయించి, చివరకు ఆయనచే 'బ్రహ్మర్షి' అని అనిపించుకొని తృప్తి చెందాడు. విశ్వామిత్రుడే రామలక్ష్మణులకు ఎన్నో శాస్త్రాలు, మంత్ర విద్యలు ఉపదేశించి, ఎందరో దుష్ట రాక్షసులను సంహారం చేహించాడు. అలాగే మిథిలకు వాళ్ళను తోడ్కొని పోయి సీతారామ కళ్యాణానికి హేతువయ్యాడు. సంధ్యావందన గాయత్రీ మంత్రాన్ని ప్రపంచానికి బహూకరించిన ఇతడు 'విశ్వామిత్ర స్మృతి' అనే గ్రంథాన్ని రచించాడు.

065.. గౌతముడు:-- ప్రచేతసుని మానస పుత్రుడు. 'తను చల్లే విత్తనాలు వెంటనే మొలచి పంట పండా'లని ప్రార్థిస్తూ, బ్రహ్మను స్మరిస్తూ, గొప్ప తపస్సు చేసాడు. వర్షాభావంతో, క్షామం ఏర్పడినప్పుడు, ప్రజలకు తను స్వయంగా వంది, అన్నదానం చేసి, రక్షించాడు. అసూయాపరులైన కొందరు మునులు, గౌతముని సంపదను చూసి, ఒక గోవును అతని పొలంలోకి పంపగా, పైరు మేస్తున్న గోవున అదిలించటానికి ఒక దర్భను మంత్రించి వదలగా, గోవు మరణిస్తుంది. మునులు అతనమీద గోహత్య పాతక దోషం వెయ్యగా, గౌతముడు పరమేశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి, మెప్పించి, అయన జటాజూటంలో ఉన్న గంగను ఆవుప ప్రోక్షించగా, అది బ్రతకటమే కాకుండా, నీటిబిందువులు పడినచోట ఒక నది పుట్టగా, దానికి "గౌతమీ' అని, గోవును బ్రతికించింది కావున 'గోదావరి' అని పేర్లు వచ్చాయి. గౌతముడు, ధర్మ సూత్రాలు, న్యాయ శాస్త్రం, 'గౌతమ సంహిత' అనే జ్యోతిష శాస్త్ర గ్రంథాన్ని రచించాడు.

064.. వసిష్ఠుడు:-- పరమ పతివ్రతా శిరోమణి అయిన అరుంధతి భర్త. సూర్యవంశ క్షత్రియులకు గురువై, శ్రీరామలక్ష్మణ భరతశత్రుఘ్నులకు జాతవివాహాది శుభ కర్మలను జరిపించాడు. అశ్రమాని వచ్చిన విశ్వామిత్రునికి అన్నం పెట్టిన పాపానికి, కామధేనువును అపహరించబోగా గుణపాఠం నేర్పాడు. అకారణాలవల్ల అనేక కష్టాలను, కాల పరీక్షలను, ఓర్పుతో, ధైర్యంతో, ఎదుర్కొని, చివరికి ధర్మం, శాంతం, సత్యగుణాలే విజయానికి సోపానాలని జగత్తుకు చాటి చెప్పిన జితేంద్రియుడు, సత్యస్వరూపుడు, ధర్మమూర్తి. హరిశ్చంద్రుని కీర్తి చిరస్థాయిగా నిల్పినవాడు. శ్రీరాముణ్ణి ధర్మపథంలో నడిపినవాడు ఇతడే. ఇతడు ప్రపంచలహిరి, వసిష్ఠధనుర్వేద సంహిత, వసిష్ఠ స్మృతి అనే గ్రంథాలను వ్రాసాడు.

063.. జమదగ్ని:-- సత్యవతీఋచీకుల పుత్రుడు. రేణుకాదేవిని పెళ్ళాడాడు. గొప్ప తపశ్శాలి అయినా, రేణుక మనస్సులో జరిగిని తడబాటును ఒకరోజు గ్రహించగానే, ఆగ్రహంతో ఆమెను వధించమని పుత్రులను అజ్ఞాపించాడు. అయిదుగురు పుత్రులలో చివరివాడైన పరసురాముడు పరశువుతో తల్లిని వధించి, తిరిగి తండ్రి ఇచ్చిన వర ప్రభావంతో ఆమెను బ్రతికిస్తాడు. అధికార మదంతో, దురహంకారి అయిన రాజు కార్తవీర్యార్జునుడు తన తండ్రిని మరియు సోదరులను చంపినందుకు అతణ్ణి హతమార్చి, ఆ రక్తంతో తర్పణంతో జమదగ్ని పునర్జీవితుడౌతాడు..జమదగ్ని తన అమోఘ తపఃశక్తితో సప్తఋషి మండలంలో స్థానం పదిలపరచుకున్నాడు.

ఈ సప్త మహా ఋషుల ప్రస్తావన రామాయణంలో కూడా చూదవచ్చు. ముఖ్యంగా రత్నాకరుడు వాల్మీకిగా మారటానికి కారణభూతులవుతారు. అతనికి ప్రాయశ్చిత్త మార్గాన్ని చూపించి తరింపచేసి, రామనామ జపాన్ని బోధించి, వాల్మీకిగా మారుస్తారు. దివ్య తేజస్సుతో, కొన్నేళ్ళ తపస్సు తరువాత, క్రమ్ముకున్న వాల్మీకం నుండి బయటకు దివ్య తేజస్సుతో, ఋషిగా మారి వచ్చిన వాల్మీకిని సప్త మహర్షులు మనస్ఫూర్తిగా ఆశీర్వదించి పవిత్రమైన, ఆదికావ్యమైన రామాయణ రచనకు అతన్ని నియోగిస్తారు.

ఈ సప్త ఋషులు, మన పురాణగాథల్లో, మన దివ్య సంస్కృతికి గుర్తులుగా నింగిలో నక్షత్ర రూపులై శాశ్వత మహోన్నతులుగా ప్రఖ్యాతి గడించి, నిలిచిపోయారు.

***
062.. ఒకరోజు ఒక పూల వ్యాపారి క్షౌరం కోసం క్షౌరశాల వద్దకు వెళ్లాడు.

కట్ తర్వాత, అతను తన బిల్లు గురించి అడిగాడు, మరియు బార్బర్ ఇలా సమాధానమిచ్చాడు, 'నేను మీ నుండి డబ్బు తీసుకోలేను, నేను ఈ వారం సమాజ సేవ చేస్తున్నాను.

పూల వ్యాపారి సంతోషించి దుకాణం నుండి వెళ్లిపోయాడు.

మరుసటి రోజు ఉదయం మంగలి తన దుకాణాన్ని తెరవడానికి వెళ్లినప్పుడు, అతని కోసం ఒక 'ధన్యవాదాలు' కార్డు మరియు డజను గులాబీలు అతని కోసం వేచి ఉన్నాయి.

తరువాత, ఒక కిరాణా వ్యాపారి హెయిర్‌కట్ కోసం వచ్చాడు మరియు అతను తన బిల్లు చెల్లించడానికి ప్రయత్నించినప్పుడు, క్షౌరకుడు మళ్లీ ఇలా సమాధానమిచ్చాడు, 'నేను మీ నుండి డబ్బు తీసుకోలేను, నేను ఈ వారం సమాజ సేవ చేస్తున్నాను.

కిరాణా వ్యాపారి సంతోషించి దుకాణం నుండి వెళ్లిపోయాడు.

మరుసటి రోజు ఉదయం బార్బర్ తెరవడానికి వెళ్ళినప్పుడు, అతని కోసం ఒక 'ధన్యవాదాలు' కార్డు మరియు తాజా కూరగాయల సంచి అతని కోసం వేచి ఉంది.

*అప్పుడు ఒక రాజకీయ నాయకుడు జుట్టు కత్తిరింపు కోసం వచ్చాడు, అతను తన బిల్లు చెల్లించడానికి వెళ్ళినప్పుడు, క్షౌరకుడు మళ్లీ ఇలా సమాధానమిచ్చాడు, 'నేను మీ నుండి డబ్బు తీసుకోలేను. 

నేను ఈ వారం సమాజ సేవ చేస్తున్నాను.*

రాజకీయ నాయకుడు చాలా సంతోషించి దుకాణం నుండి వెళ్లిపోయాడు.

మరుసటి రోజు ఉదయం, బార్బర్ తెరవడానికి వెళ్ళినప్పుడు,

ఒక డజను మంది రాజకీయ నాయకులు ఉచిత హెయిర్‌కట్ కోసం వేచి ఉన్నారు.

ఇది, మన దేశ పౌరులకు మరియు సమాజాన్ని నడిపే రాజకీయ నాయకులకు మధ్య ఉన్న ప్రాథమిక వ్యత్యాసాన్ని వివరిస్తుంది.

మీరు దీన్ని ఫార్వార్డ్ చేయకపోతే, ఎవరైనా మంచి నవ్వును కోల్పోతారు.

--

061..గురువు సలహా (కథ) ---20-03-2023

sekarana  

ఆ ఊరుకి ఎక్కడి నుండో ఒక స్వామీజీ వచ్చాడు.  ఆయన వెనుక  ఇద్దరు శిష్యులు ఉన్నారు.  ఊరి బయటున్న గుడి ప్రాంగణంలో నివాసం ఏర్పాటు చేసుకుని,  గుడికి వచ్చే  భక్తులకు మంచి విషయాలను  బోధించేవాడు గురువు.     ఆధ్యాత్మిక సందేహాలు అడిగినా , సమస్యలు చెప్పుకున్నా తగిన సలహాలిచ్చి  పంపేవాడు స్వామీజీ.  

ఒకరోజు పొద్దున్నే  ఒక యువజంట వచ్చింది.   గురువుకి నమస్కరించి “మాది ప్రేమ వివాహం. అన్యోన్యంగా వుండాలనుకున్నా ఉండలేక పోతున్నాము. నాకు కోపం వస్తే  ఆయనని తిడుతున్నాను. అది  భరించలేక అతడు నన్ను కొడుతున్నాడు. మేం  సంతోషంగా ఉండాలంటే ఏంచెయ్యాలి?” అని అడిగింది  యువతి. 

వాళ్ళని పరీక్షగా చూసి ‘ అమ్మా! నీకు భర్తని  తిట్టాలనిపిస్తే  అతడిలో  మీ నాన్నని ఊహించుకో”  అని చెప్పాడు. ఈసారి   యువకుడితో “బాబూ ! నీకు  భార్యని కొట్టాలనిపిస్తే ఆమెలో  మీ అమ్మని ఊహించుకో” అని చెప్పి  పంపించాడు స్వామీజీ.  

“పాలూ నీరు, పూలూ దారంలా అన్యోన్యంగా  కలసి జీవించమని చెబుతారనుకుంటే ఇలా చేసారేమిటి?” అని ఒక శిష్యుడు అంటే రెండోవాడు కల్పించుకుని “ అవును.   వద్దని చెప్పాలి కానీ  తిట్టుకోమని, కొట్టుకోమని సలహా ఇస్తారా?”  అన్నాడు  .  

స్వామీజీ మౌనంగా నవ్వాడు  తప్ప జవాబివ్వలేదు.

 పదిరోజుల తరువాత  యువజంట మళ్ళీ వచ్చింది. 

వాళ్ళని చూడగానే   ‘మనమనుకున్నట్టే గురువు గారిచ్చిన  సలహా వికటించి ఉంటుంది’ అని మనసులోనే  అనుకున్నారు శిష్యులు. 

ఆ జంట స్వామీజీ కాళ్ళ మీద పడి “మా కాపురం చక్కబడింది” అన్నారు. వాళ్ళని “అన్యోన్యంగా  జీవించమని’ దీవించాడు  స్వామీజీ. 

ఈసారి  ఆశ్చర్యపోవడం శిష్యుల వంతయింది. “మాకేం అర్ధం కాలేదు గురువు గారూ!.  గతసారి సలహాతో సరిపుచ్చి పంపారు. ఇప్పుడేమో దీవించారు”  అన్నారు  శిష్యులు. 

స్వామీజీ చిన్నగా నవ్వి “ఆ రోజు జంటను  చూడగానే  గొడవలకు అలవాటు పడ్డ వాళ్ళుగా  గ్రహించాను. ఎలాగూ  జరిగేది ఆపలేను కాబట్టి  ప్రయోగం చేయాలనుకుని  అలాంటి సలహా ఇచ్చాను. అది ఫలితం ఇచ్చింది” అన్నాడు స్వామీజీ.  మరింత  వివరంగా చెప్పమని శిష్యులు అడగడంతో ఇలా చెప్పాడు స్వామీజీ. 

 “సాధారణంగా అమ్మాయిలకి  అమ్మ  కంటే  నాన్న మీద ప్రేమ, గౌరవం ఎక్కువ ఉంటాయి. అది గుర్తు పెట్టుకునే   తిట్టేముందు భర్త స్థానంలో ఆమె నాన్నని  వూహించుకోమన్నాను.  అతడిలో నాన్నని ఊహించుకుని తిట్టలేకపోయింది యువతి.  ఆవిడ తిట్టనప్పుడు యువకుడు కొట్టడం లేదు కదా. అలా సమస్య తగ్గిపోయింది.    ఒకవేళ ఆమె ఎపుడైనా తిట్టిందే  అనుకుందాం.  అప్పుడా  యువకుడు  ఆమె స్థానంలో అమ్మను ఊహించుకుంటాడు. కాబట్టి   కొడుకులకు అమ్మ మీద ఉండే ప్రేమ,  అభిమానం, అనురాగం వలన కొట్టడానికి చెయ్యి ఎత్తలేడు.  అదే జరిగింది వాళ్ళ విషయంలో. అందువలన గొడవలు తగ్గాయి.  అందుకే అన్యోన్యంగా ఉండమని దీవించాను”. 

స్వామీజీ చెప్పింది విని ఆయన  పాదాల మీద పడ్డారు శిష్యులు.    

జీవిత సారాన్ని కాచి వడబోసినందు వల్లనే వచ్చే  సందర్శకుల  మానసిక స్థితిని ఊహించి అందుకు  అనువైన  సలహాలిచ్చి స్వామీజీ  మెప్పు పొందుతున్నారని మనస్పూర్తిగా  శిష్యులు నమ్మారు. 


      ----**-------- 

 060.. అనారోగ్యం 21-03-2023

 🤔ఏమండీ మీరు మధుమేహులా? మీకు డయాబెటిస్ ఉందా? మీరు చెక్కర వ్యాధితో బాధపడుతున్నారా? అయితే మీరు పుట్ట గొడుగులను తరచు తినండి. అవి మీ షుగర్ ను కంట్రోల్ లో ఉంచుతుంది.**🤔

         *ప్రస్తుతం పట్టణ వాసులే కాదు పల్లెవాసులు కూడా తమ జీవితంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపే విధానం వైపు పరుగెత్తుతున్నారు. ప్రస్తుత జనాభాలో డయాబెటిస్ ఉన్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వైద్యులు కూడా ఈ డయాబెటిస్ మరియు రక్తపోటు వ్యాధులను చాలా సాధారణమైన జబ్బులే అంటున్నారు. కానీ ఈ రెండింటి బారిన పడినవారు ఆపకుండా జీవితాంతం మందులు, మాత్రలు వాడుతూనే ఉండాలి, ఆహారం తీసుకోవడంలోనూ మార్పులు చేసుకోవాలి. కానీ కొన్ని సహజ ఆహారాలు మన శరీరంలో చక్కెరను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. వాటిలో ముఖ్యంగా తెల్ల పుట్టగొడుగులను తరచూ తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం. డయాబెటిస్‌ను నియంత్రించడానికి తెల్ల పుట్టగొడుగులలో అద్భుతమైన లక్షణాలు ఉన్నాయని వైద్యులు కూడా అంటున్నారు.

        *ఈ తెల్ల పుట్టగొడుగులలో తక్కువ స్థాయిలో కార్బోహైడ్రేట్లు మరియు చక్కెర ఉంటాయి. ఇది యాంటీ డయాబెటిక్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఇటీవలి జర్నల్ ఆఫ్ ఫంక్షనల్ ఫుడ్స్ వారి సర్వే ప్రకారం, తెల్ల పుట్టగొడుగులు తినేటప్పుడు ప్రోబయోటిక్ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఇది గౌట్ లోని సూక్ష్మజీవుల చర్యను మెరుగుపరుస్తుంది. ఇది కాలేయంలో స్రవించే గ్లూకోజ్ మొత్తాన్ని కూడా నియంత్రిస్తుంది. ఇందుకొరకు ఎలుకలపైన అధ్యయనం చేయగా ఎలుకలకు తెల్ల పుట్టగొడుగులను ఇవ్వడం ద్వారా పరీక్షించినప్పుడు, వాటి గౌట్లోని సూక్ష్మజీవులను ఉత్పత్తి చేస్తుంది, ఇవి కొవ్వును కరిగించే ఆమ్లాలను ఉత్పత్తి చేస్తాయి.

         *మరొక అధ్యయనం ప్రకారం పుట్టగొడుగులు మరియు  విటమిన్స్ అధికంగా ఉండే ఆహారాలు వంటి కూరగాయలను తీసుకోవడం వల్ల గర్భధారణ సమయంలో మధుమేహం నుండి రక్షణ పొందగలరని నివేదించబడింది. డయాబెటిస్ మెల్లిటస్ ప్రపంచవ్యాప్తంగా 14% గర్భాలను ప్రభావితం చేస్తుంది, ఇది తల్లులు మరియు శిశువులను ప్రభావితం చేస్తుంది. ఈ తెల్ల పుట్టగొడుగులోని విటమిన్ బి వృద్ధులను చిత్తవైకల్యం ఉన్నవారిని మానసిక కార్యకలాపాల నుండి మరియు చిత్తవైకల్యం నుండి కాపాడుతుందని కనుగొనబడింది. అదేవిధంగా, డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి మెట్‌ఫార్మిన్ తీసుకుంటారు. కానీ బదులుగా ఈ తెల్ల పుట్టగొడుగులు సహజంగా శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మీకు సహాయపడతాయి.

       *పుట్టగొడుగులు తీసుకొంటే ఆరోగ్యంగా ఉంటారు. మీకు అవసరమైన, ఆరోగ్యకరమైన పుట్టగొడుగులను ఎంచుకోవడం మరియు ఉపయోగించడం ఉత్తమం. కానీ ఈ పుట్టగొడుగులలో పోషకాలు మరియు ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి. మధుమేహానికి పుట్టగొడుగులు ఉత్తమమైన ఆహారం. ఎందుకంటే ఇందులో మన శరీరానికి అవసరమైన పోషకాలు మరియు తక్కువ కేలరీలు ఉంటాయి. అందువల్ల, పుట్టగొడుగులను ఉదారంగా తీసుకోవచ్చు. దీనివల్ల తక్కువ స్థాయిలో చక్కెరను అందిస్తుంది.

        *ఇవి గుండె ఆరోగ్యానికి సహాయపడుతాయి. తెల్ల పుట్టగొడుగులలో కేలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి అవి కొవ్వును కరిగిస్తాయి. అందువలన గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. గుండె రక్త నాళాలలో కొవ్వు అడ్డుపడటం జరగదు. ఈ పుట్టగొడుగులలో రోగ నిరోధక శక్తి కూడా బాగా ఉంటుంది.

         *తక్కువ గ్లైసెమిక్ సూచిక మరియు తక్కువ కార్బోహైడ్రేట్ పుట్టగొడుగులలో కనిపిస్తుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది మరియు అధిక బరువు ఉన్నవారు దీనిని ఉపయోగిస్తే అతిబరువు తగ్గవచ్చు. ఈ తెల్ల పుట్టగొడుగు తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. విటమిన్ బి మరియు పాలిసాకరైడ్ వంటి పోషకాలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు అదనపు పోషకాలను అందిస్తాయి. రక్తంలో చక్కెర మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. దీనిలోని యాంటీ బయోటిక్ గుణాలు మీ ఆహారాన్ని రుచిగా ఉంచుతుంది. కాబట్టి మీ ఆహారంలో పుట్టగొడుగులను చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.

*మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది.*

       *ఆరోగ్యమే మహాభాగ్యం.*
***

059.. *మరణానంతరం మన అంత్యక్రియలు  

జరిగిన తరువాత ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? 

➖➖➖➖➖➖➖➖➖➖

కొద్ది గంటల్లో రోదనధ్వనులన్నీ పూర్తిగా సద్దుమణుగుతాయి. కుటుంబసభ్యులేమో బంధుమిత్రుల కోసం హోటల్ నుండి భోజనం తెప్పించడంలో  నిమగ్నమవుతారు. 

మనవలు, మనవరాళ్లు ఆటపాటల్లో మునిగి పోతారు. ఓ యువతీ యువకుల జంట రొమాంటిక్ గా ముసిముసినవ్వులు నవ్వుకుంటూ, పరస్పరం ఫోన్ నెంబర్లు ఎక్స్ఛేంజ్ చేసుకుంటారు. మరికొందరు దగ్గర్లో ఉన్న టీషాపులో బాతాఖానీకి బయల్దేరుతారు. 

అప్పటివరకూ ఆప్యాయత ఒలకబోసిన పక్కింటాయన - శ్రాద్ధకర్మల సందర్భంగా వదిలిన  పిండోదకం, విస్తరాకులు తన ఇంటి ముంగిట పడ్డాయని చిర్రుబుర్రులాడుతాడు. 

ఈ లోగా నీ దగ్గరి బంధువు ఒకాయన - ఆఫీసులో శెలవు దొరకని కారణంగా నీ అంత్యక్రియలకు హాజరవ్వలేక పోయానని నీ భార్యతో మొక్కుబడిగా వాపోతాడు. 

మరునాడు వెళ్ళిపోయినవాళ్ళు  వెళ్ళిపోగా - మిగిలిన వాళ్ళల్లో ఒకాయన మధ్యాహ్న భోజనాల్లో ఉప్పెక్కువైందని అలుగుతాడు. మరొకాయన దానికి వంత పాడుతాడు.

నువ్వు జీవితాంతం ఒళ్ళు హూనం చేసుకొని, కడుపు కట్టుకుని  కూడబెట్టిన కోట్లు విలువ జేసే ఆస్తుల్ని పంచుకొనే విషయంలో నీ పుత్రరత్నాలు పేచీ పడతారు. నీ అంత్యక్రియలకు ఎవరెంత ఖర్చు పెట్టారో అణాపైసలతో లెక్కలేసి వాటాలు తేల్చేసుకుంటారు. అప్పటికింకా నువ్వు పోయి నిండా నాల్రోజులు కూడా కాలేదు సుమా!  మెల్లగా బంధుమిత్రులందరూ ఒక్కక్కళ్ళుగా జారుకొంటారు. విదేశాల నుండి వచ్చిన బంధువులైతే, పదకొండో రోజు తరువాత వెళ్ళబోయే విహారయాత్రకు ఇప్నట్నించే రహస్యంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. 

నువ్వు పోయిన విషయం తెలియక నీ ఫోన్ నెంబరుకు వచ్చే ఫోన్లని నీ కొడుకో, కూతురో విసుగ్గా ఆన్సర్ చేస్తారు. కుదిరితే నీ ఆస్తిపాస్తులు, రావలసిన బాకీల గురించి తెలివిగా కూపీ లాగుతారు. 

అంతలో, తమ ఎమర్జెన్సీ లీవు అయిపోవడంతో కొడుకులు, కూతుళ్ళు నీ భార్యని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు. 

నెల తిరగక ముందే, మీ అర్థాంగి టీవీలో వస్తున్న కామెడీ షో చూస్తూ పగలబడి నవ్వుతుంది. అంతకుముందే అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు యథాతథంగా సినిమాలు, షికార్లు చుట్టబెట్టేస్తుంటారు. 

మొత్తంగా, నేల లోపే నీ చుట్టూ ఉన్నవారు, నీకు అత్యంత ఆత్మీయులు, నువ్వు లేకుండా బతకలేమన్నవాళ్ళు - అందరూ తమ తమ విధుల్లో ఎంతగా మునిగిపోతారంటే - నువ్వనే వ్యక్తి తమ జీవితంలో ఉన్నావనే విషయమే మర్చిపోయేంతగా!! ఒక  పండుటాకు ఓ మహావృక్షాన్నుంచి ఎంత సునాయాసంగా, ఎంత వేగంగా రాలిపోతుందో, అంతే వేగంగా 'నీవారు' అనుకున్న అందరి స్మృతిపథం లోంచి నువ్వు కనుమరుగై పోతావు. 

నీ మరణానంతరం కుడా - అవే వర్షాలు, అవే రాజకీయాలు, బస్సుల్లో సీటు కోసం అవే తోపులాటలు. పండుగలు ఒకదానివెంట మరోటి వస్తూనే ఉంటాయి. సినిమాతారలకి రెండు, మూడు, నాలుగు పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉంటాయి. నువ్వు ఎంతో ప్రేమగా పెంచుకున్న నీ పెంపుడు కుక్క మరో యజమానిని వెతుక్కుంటుంది.

అంతలో, నీ సంవత్సరీకాలు రానే వస్తాయి. నీ పెళ్ళి కంటే ఆడంబరంగా జరిగే ఆ తంతును చూసి ఆనందించడానికి నువ్వు ఉండవు కదా! నీ గ్జ్నాపకార్థం అతిథులకి పంచబోయే స్టీలు శాల్తీలు అత్యంత తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతాయో అన్న విషయంపై కొడుకులు, కోడళ్ళ మధ్య పెద్ద చర్చే జరుగుతుంది. 

ఈ కార్యక్రమంతో నీకు, ఈ లోకానికి పూర్తిగా సంబంధం తెగిపోయినట్లే. నీ గురించి మాట్లాడుకునే వారు గానీ, నిన్ను తలచుకునే వారు గానీ దాదాపుగా ఉండరు.

ఇప్పుడు చెప్పండి !!

ఇన్నాళ్ళూ మీరు పాకులాడింది ఎవరికోసం?  దేనికోసం తెగ హైరానా పడిపోయావు? నువ్వు కట్టించిన భవనంలో నివసించే వారు సైతం నీ ఉనికిని మర్చిపోయారంటే, నీ తపనకూ, తాపత్రయానికీ ఏమన్నా అర్థం ఉందా?

జీవితంలో ముప్పాతిక భాగం నీవాళ్ళనుకునే వాళ్ళకోసం, వారి మెప్పు పొందటం కోసం, వారి భవిష్యత్తు కోసం బతికావు కదా! వాళ్ళకు కనీసం నీ గురించి ఆలోచించే తీరిక ఉందా? 

ఇవన్నీ కొద్ది తేడాతో అందరికీ వర్తిస్తాయి కాబట్టి, నీ కోసం నువ్వు సంతృప్తిగా బతకటంలో   అర్థం, పరమార్థం ఉంది కదూ!!!

***

058..*బీజము రూపము 

 మూడు గుణముల విశేషములు

. వానికతీతముగా ప్రవర్తింపవలెనన్నచో పుట్టుకయననేమో తెలియవలెను. పరబ్రహ్మమునకు పుట్టుక లేదు. కాని పుట్టవలెనను కోరిక కలుగుట ప్రకృతి, ఇదియే ప్రకృతి పుట్టుక. ఇది త్రిగుణాత్మకముగా, పుట్టుక లేని నాయందు ఉద్భవించును. అందు ఇమిడియున్న నేనే సృష్టి కర్త అయిన బ్రహ్మ. కనుక నా గర్భమైన ప్రకృతియను అండమున బ్రహ్మ పుట్టుచున్నాడు. నేనే ఈ గర్భమును ధరించుచున్నాను. దాని నుండి సర్వ జీవరాసులు పుట్టుచున్నవి.

 గర్భములనగా మూర్తులు లేక ఆకారములు నిర్మింపబడు ప్రకృతి ముద్రలు. వానియందు మొదటి విత్తనముగా నేనే నా తేజస్సును నిహితము చేయుచున్నాను. నేను సర్వ వ్యాప్తిని గనుక బీజమునందు సర్వవ్యాపనశక్తి యుండును. ఈ నా బీజ మహిమ వలననే జీవులు సూక్ష్మత్వము నుండి స్థూలత్వమునకు పెరుగుచున్నవి. గర్భము, బీజము, ఆధానము అను స్థితులు ప్రకృతి గుణములు కనుక, ఇట్లు తెలుసుకొనుట వలన వానియందు వ్యామోహితము కాని స్థితి ఏర్పడును. అప్పుడు జీవుడు గర్భమున పడినను, పడకున్నను వ్యామోహితుడు కాడు.

 సర్వాంతర్యామి అయిన నా తత్వము ఆద్యంతపరిమితముగా పుట్టుటకు దేశ కాల స్వభావాది నిబంధనమను బంధము ఆవశ్యకము. అదియే బీజము రూపమున గర్భమునందు దేహిగా జీవుడు ఆధానమగుట. ఈ బంధము చేయుటకే ప్రకృతి ఉన్నది. దానికి సత్త్వ రజస్తమస్సులను మూడు గుణములు బంధించు త్రాళ్లుగా పనిచేయును.

****
*057..పశు వధ

 ఒకరోజు పశు వధ శాలలో ఒకడు గోవును చంపడానికొచ్చినపుడు...గోవు వానిని చూసి నవ్వింది.

దాన్ని చూసి కసాయి అడిగాడు. నేను నిన్ను చంపడానికి వచ్చాను, అది తెలిసి నువ్వు ఎందుకు నవ్వుతున్నావ్?అని అడిగాడు.

అప్పుడు గోవు ఇలా చెప్పింది.

నేను ఎప్పుడూ మాంసాన్ని తినలేదు.

అయినా నా చావు ఇంత ఘోరంగా ఉండబోతోంది. ఏ తప్పూ చేయక, ఎవరికీ హాని కలిగించని నన్ను, నువ్వు చంపి, నా మాంసాన్ని తినే నీ చావు ఎంత ఘోరంగా ఉంటుందో అని ఆలోచించి నేను నవ్వాను.

పాలిచ్చి మిమ్మల్ని పెంచాను. మీ పిల్లలకూ పాలిస్తున్నాను. కానీ నేను తినేది మాత్రం గడ్డి.

పాలతో వెన్న చేసుకున్నారు. వెన్నతో నెయ్యి చేసుకున్నారు. నా పేడతో పిడకలు చేసుకుని వంటకు వాడుకున్నారు. అలాగే నా పేడతో ఎరువు తయారు చేసి పంటలు పండించుకున్నారు.

ఆ డబ్బుతో సుఖంగా జీవిస్తున్నారు. కానీ నాకు మాత్రం కుళ్లిపోయిన కూరలను ఎండి పోయిన గడ్డిని పెట్టారు. నా పేడతో గోబర్ గ్యాస్ తయారు చేసుకుని మీ ఇంటిని చీకటి నుంచి వెలుగులోకి తెచ్చుకున్నారు.

కానీ నన్ను కసాయివాడిలా చంపడానికొచ్చావ్... నా పాలనుంచి వచ్చిన శక్తితోనే నన్ను చంపడానికి ఆయుధాన్ని ఎత్తగలిగావ్.

ఆ ఆయుధాన్ని ఎత్తే శక్తి నీకు వచ్చింది నా నుంచే. నా వల్ల బాగా సంపాదించి ఇల్లు కట్టుకున్నావ్. కానీ నన్ను మాత్రం ఒక గుడిసెలో ఉంచావ్.

నిన్ను కన్న తల్లికంటే నేనే నీకు ఎక్కువ ఆసరాగా నిలిచాను. శ్రీకృష్ణుని ఇష్టురాల్ని నేను.

నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తున్న నీ గతి ఏమౌను?

నా సంతతిని, నా జాతిని ఇలా మీరు చంపుతూ పోతూ ఉంటే. 

మీకు, మీ ముందు తరాలకు మేము సేవ చేసుకునే భాగ్యం ఉండదేమో. 

మాకే... భవిష్యత్తులో ఉనికి లేనప్పుడు... మీ కెక్కడి మనుగడ,అందుకే 

నీ భవిష్యత్తు గురించి ఆలోచించి నేను నవ్వాను. అని చెప్పింది.

(మీకు సాధ్యమైనంతవరకూ మీ బంధుమిత్రులందరికీ ఇది తెలియజేసి గోమాత ఋణాన్ని తీర్చండి.)

జై గోమాత.🙏


***
 056..,ఇది మనకధ మీరు చదవండి..సేకరణ ప్రాంజలి ప్రభ

       మహాభారతంలో ఒక కధ ఉంది... కకుద్మి అనే ఒక రాజు ఉండేవాడు.  అతనికి రేవతి అనే అందమైన కూతురు ఉండేది.  అయితే ఆ అమ్మాయి అందానికి తగిన వరుణ్ణి వెతకడం ఆ రాజుకి పెద్ద తలనొప్పి అయ్యింది. అందుకని ఆ రాజు తనకున్న తపశ్శక్తిని ఉపయోగించి తన కూతుర్ని వెంట పెట్టుకుని బ్రహ్మ లోకానికి వెళ్తాడు. అయితే ఆ సమయానికి బ్రహ్మ లోకంలో సంగీత కార్యక్రమం జరుగుతుండడం వల్ల కొద్దిసేపు వేచి ఉన్నాడు.

ఆ సంగీత కార్యక్రమం ముగిసిన తర్వాత బ్రహ్మ దగ్గరికి వెళ్లి తన కూతురికి తగిన వరుణ్ణి తన రాజ్యంలో గాని పక్క రాజ్యంలో గానీ ఉంటే చెప్పమని ప్రార్ధిస్తాడు. అప్పుడు బ్రహ్మ ఆ రాజుతో నువ్వు నీ కూతుర్ని తీసుకురావడం చాలా మంచిది అయ్యింది అన్నాడు. అదేంటి అని అడిగాడు రాజు. నీకు తెలియదా భూమిపై సమయానికి, బ్రహ్మ లోకంలో సమయానికి వ్యత్యాసం ఉందని. నువ్వు ఇక్కడ ఉన్న ఈ కాస్త సమయంలో భూమి పై 27 చతుర్యుగాలు గడిచి పోయాయి. ఇప్పుడు అక్కడ నీవారు గానీ, నీ రాజ్యం గానీ లేదు అన్నాడు.

దిగ్భ్రాంతి చెందిన ఆ రాజు బ్రహ్మను వేడుకుని ఇప్పుడు తాను ఏం చేయాలో సెలవియ్యమన్నాడు. అప్పుడు బ్రహ్మ...

"ఇప్పుడు భూమిపై 28 వ చతుర్యుగము నడుస్తుంది. అక్కడ మహా విష్ణు అవతారం అయిన శ్రీ కృష్ణుని అన్న బలరాముడు నీ కూతురికి తగిన జోడి. కాబట్టి అతనికిచ్చి నీ కూతుర్ని వివాహం చెయ్యి" అన్నాడు బ్రహ్మ...

ఇప్పుడు ఒక ప్రముఖ హాలీవుడ్ చిత్రం గురించి మాట్లాడదాం...

ఆ చిత్రం పేరు "Interstellar" ఈ చిత్రం 2014 లో వచ్చింది. ఈ చిత్రం గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఈ చిత్రంలో కథానాయకుడు గతంలో నాసాలో పైలట్ గా చేసి ప్రస్తుతం తన ఊరిలో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అతనికి ఒక కూతురు, కొడుకు ఉంటారు. కూతురంటే అతనికి ప్రాణం. 

ఒకరోజు అతని కూతురు తన గదిలో ఉన్న పుస్తకాల అర నుండి తరచూ పుస్తకాలు వాటంతట అవే పడడం గమనించి ఆ గదిలో దెయ్యం ఉందని తండ్రితో చెబుతుంది. అప్పుడు ఆమె తండ్రి అదేమీ కాదని వివరించి గతంలో నాసాలో పనిచేసిన తన ప్రొఫెసర్ని కలిసి దీని గురించి వివరిస్తాడు.

తన కూతురు గదిలో దూళి చారలు ఏర్పడ్డాయని, తన జేబులోంచి పడిన నాణాన్ని ఆ దూళి చారలు ఆకర్షించాయని, వాటిని పరిశీలించి చూసి దానిని డీకోడ్ చేశానని, ఎక్కడో ఇతర లోకాల్లో ఉన్న జీవులు భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతాడు ఆ హీరో.  అయితే భూమిపైకి వస్తున్న ఆ పాజిటివ్ తరంగాలపై పరిశోధన చేయగా అవి శని గ్రహానికి(Saturn) దగ్గరలో ఉన్న ఒక పాలపుంతలోని (Galaxy) ఒక గ్రహం నుండి వస్తున్నాయని చెబుతాడు ఆ ప్రొఫెసర్.

అయితే అది భూమి ఉన్న పాలపుంత కాకపోవడం వల్ల ఆ పాలపుంతలోకి వెళ్ళడానికి ‘వార్మ్ హోల్’ (Warm hole) ద్వారా చేరుకోవచ్చని కొంతమంది బృందాన్ని తయారు చేసి ఒక వ్యోమ నౌక మీద వారి అందరినీ పంపిస్తాడు ఆ ప్రొఫెసర్ హీరోతో పాటుగా.  వార్మ్ హోల్ అంటే ఒక గాలక్సీ నుండి ఇంకో గాలక్సీకి వెళ్ళడానికి దగ్గరి దారి. అయితే వారి లక్ష్యం ఏంటంటే ఆ పాలపుంతలో మానవ జీవనానికి అనువుగా ఉండే గ్రహాన్ని కనిపెట్టి భూమిపై మనుషుల్ని అక్కడికి తరలించాలని.. వగైరా వగైరా(etc etc..).. అప్పటికి ఆ హీరో కూతురు వయ్యస్సు 10 సంవత్సరాలు (ఇక్కడ ఈ విషయం గుర్తుంచుకోవాలి). ఆ తరువాత కధ ఎన్నో మలుపులు తిరిగి చివరికి ఆ హీరో ఆ పాలపుంతలో ఉన్న కృష్ణ బిలంలోనికి (Black hole) ప్రవేశిస్తాడు.   అయితే అది 4D లోకం. మనం ఉన్నది 3D ప్రపంచం.  నాలుగవ డైమెన్షన్ కాలం.

అంటే నాలుగవ డైమెన్షన్ ప్రపంచంలో మనం కాలంలో కూడా ప్రయాణించవచ్చన్న మాట.

అంటే ఇప్పుడు ఆ హీరో కాలంలో ప్రయాణించ గలడన్న మాట.  అయితే ఆ హీరో కాలంలో ప్రయాణించి తన కూతురు గదిలోకి వెళ్తాడు.  అప్పుడు గదిలో ఉన్న తన కూతురికి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ పుస్తకాల అరలో నుంచి పుస్తకాలను కింద పడేస్తాడు.

ఇప్పుడు అర్ధం అయ్యిందా... అంటే వేరే లోకం నుండి భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నది భవిష్యత్తులో ఉన్న హీరోనే.

ఇక ఆ తరువాత కొంత కధ నడిచాక ఆ హీరో భూమిపైకి తిరిగి వస్తాడు.  అయితే అప్పటికే తన కూతురు ముసలిది అయిపోతుంది. కాని హీరో వయసు మాత్రం మారదు.  ఎందుకంటే హీరో వెళ్లిన గ్రహంలో ఒక గంట భూమిపై ఏడు సంవత్సరాలతో  సమానం.

పైన మహా భారతంలోని కథను చదివి మనం దాన్ని ఒక కధగానే తీసుకుంటాం. కాని ఆ కధలో నేటి సైన్స్ కన్నా ఎంతో ముందే  "సమయ విస్ఫారణం"(Time dilation), "కృష్ణ బిలం (Black hole), "వెచ్చని రంధ్రం” (Warm hole) వంటి ఆధునిక సైన్స్ చెబుతున్న వాటిని ఎప్పుడో మన హిందూ సనాతన ధర్మము యందు చెప్పడం జరిగింది.

అందుకే స్వామీ వివేకానంద అన్నారు.. 

"సైన్స్ అభివృద్ధి అయ్యేకొద్దీ సనాతన ధర్మం మరింత బలపడుతూ ఉంటుంది" అని.

ఇతర లోకాలకు, మనకు ఉన్న ఈ కాల వ్యత్యాసాన్నే "సమయ విస్ఫారణం” (Time dilation) అని నేటి సైన్స్ చెబుతుంది. మనం మహాభారతంలో చదువుకున్నాం.  పాండవులు చివరి రోజులలో స్వర్గాన్ని చేరుకోవడానికి హిమాలయాలు మీదుగా ప్రయాణం చేయడం.  కాని, స్వర్గం ఉండేది భూమిపై కాదు.   మరి స్వర్గాన్ని చేరుకోవడానికి భూమిపై ఉన్న హిమాలయాలకు వెళ్లడం ఏంటి అని అనుమానం వస్తుంది.  నాక్కుడా వచ్చింది.

పైన చెప్పిన వార్మ్ హోల్ సిద్ధాంతం ఇక్కడ మనం అర్ధం చేసుకోవాలి.  హిమాలయాల్లో స్వర్గానికి చేరుకునే వార్మ్ హోల్స్ ఉన్నాయన్న మాట. అలాగే ఆది శంకరాచార్యుల వారు బద్రీనాథ్ వద్ద అంతర్ధానం అయిపోయారని ఆయన చరిత్ర చెబుతుంది. అంటే అక్కడ వార్మ్ హోల్ ద్వారా ఆయన పరంధామం చేరుకున్నారని అర్ధం అవుతుంది.

మన హిందూ సనాతన ధర్మము ప్రకారం, మరియు గరుడ పురాణం బట్టి చూసినా చనిపోయిన వారికి 11 -15 రోజుల వరకూ ప్రతీరోజూ పిండ ప్రధానం చేస్తారు.  ఆ తరువాత సంవత్సరం వరకూ నెలకొక్కసారి చేస్తుంటారు.  ఆ తరువాత సంవత్సరానికి ఒకసారి చేస్తుంటారు.

ఎందుకో తెలుసా, చనిపోయిన 11 – 15 రోజుల వరకూ జీవుడు భూమిపైనే ఉంటాడు.  అందుకే ప్రతీరోజు పిండ ప్రధానం చేస్తాం.  ఆ తరువాత జీవుడు స్వర్గానికి గానీ నరకానికి గానీ చేరు కోవడానికి ఒక సంవత్సర కాలం పడుతుంది గరుడ పురాణం ప్రకారం.  ఆ సమయంలో భూమిపై నెలరోజుల కాలం ఆ లోకంలోని వారికి ఒకరోజుతో సమానం.  అందుకే నెలకొకసారి చేస్తే వారికి రోజు కొకసారి పెట్టినట్టు.  ఇక సంవత్సరం తరువాత స్వర్గానికి గానీ నరకానికి గానీ చేరుకుంటారు.  అప్పుడు సంవత్సరానికి ఒకసారే పెడతాం.

ఎందుకంటే అక్కడ ఒక రోజు, భూమిపై ఒక సంవత్సరంతో సమానం. ఇలానే ఎన్నో లోకాలు, ఎన్నో డైమెన్షన్లు ఉన్నాయి.  ఈ లోకాల మధ్య ఉన్న కాల వ్యత్యాసమే "సమయ విస్ఫారణం"(Time Dilation) అంటాం.

ఇట్లానే.. బ్రహ్మ దేవుఁడు శ్రీకృష్ణుని స్నేహితులను అపహరించినపుడు కూడా ఒక క్షణం పాటు అది ఒక సంవత్సరం అయ్యింది. అప్పుడు కృష్ణుడే అన్ని రూపాలుగా మారి అందరి పిల్లలుగా, జంతువులుగా మారి బ్రహ్మకు గుణపాఠం చెప్తాడు.

ఇలా మన పురాణాలలో ఎన్ని విషయాలు ఉన్నాయో కూడా తెలియని ఈ ప్రస్తుత సమాజం, మన సంస్కృతిని కాదని ఏ తల తోక లేని పరమతం మాయలో పడుతున్నారు.  మన తరువాత ఎప్పుడో వచ్చిన ఎడారి మతాలు ఇలాంటి విజ్ఞానంలో మన హిందూ సనాతన ధర్మమునకు దరిదాపుల్లో కూడా రాలేవు....

0 comm

055..ప్రాంజలి ప్రభ కధలు చదవండి.. ఓ శ్రీ రామ

04, తన కలెక్టర్ కొడుకును చూడడానికి ఛాంబర్ లోకి వెళ్ళాడు ఓ తండ్రి.

 కలెక్టర్ ఐన తన కొడుకు భుజం మీద చేయి వేసి. "ప్రపంచం లో అత్యంత శక్తివంతుడు ఎవరు?" అని అడిగాడు . 

అప్పుడు ఆ కలెక్టర్ సమాధానమిచ్చాడు..

 ప్రపంచంలో అత్యంత శక్తి వంతుడిని నేనే అని.

ఆ తండ్రి ముఖం పాలిపోయింది. మా నాన్నే ప్రపంచంలో అత్యంత శక్తివంతుడు అనే జవాబు వస్తుందని ఆశించాడు.

నిరాశగా వెనక్కుతిరిగి ఛాంబర్ లోనుంచి బయటకు వెళ్తూ మరొక్కసారి ఆలోచించమన్నాడు.

అప్పుడు ఆకొడుకు మానాన్నే ప్రపంచంలో అత్యంత శక్తివంతుడు అని బదులిచ్చాడు. ఆశ్చర్యంతో తండ్రి అన్నాడు...

ఇంతకు ముందు నిన్ను నీవే శక్తివంతునిగా చెప్పావు, ఇప్పుడేమో నన్ను శక్తివంతుడు అంటున్నావేం అన్నాడు...!!

 నాన్నా అప్పుడు నీ చేయి నా భుజం మీద ఉండింది. అందుకే అప్పడు నేనే శక్తివంతమైన వాన్ని. ప్రపంచంలో ఏకొడుకు భుజంమీద తండ్రి చేయి ఉంటుందో ఆకొడుకే అత్యంత శక్తివంతుడు కాదా నాన్నా?!

 తండ్రి కళ్ళలో నీళ్ళు!

తోటలో నాటిన విత్తు మొలకెత్తడం సహజం.

 ఆ విత్తును మొలకగా, చెట్టుగా, మహావృక్షంగా మలచడం తోటమాలి గొప్పదనం.

విత్తులాంటి వాడు కొడుకైతే మహా వృక్షంగా మలిచే తోటమాలి నాన్న.

,,,,,,,,,

054...మూడు జల్లెడ్ల పరీక్ష ...ప్రాంజలి ప్రభు 

(ఇప్పటితరానికీ ఉపయోగపడే నేటి కధ.)

ఒక సారి ఉత్తమ బ్రాహ్మణుడైన చాణిక్యునిదగ్గరకు అతని మిత్రుడు ఒకడు వచ్చి నీకు తెలుసా నీ మిత్రుడు గురించి నేను ఒక విషయం విన్నాను” అని ఎంతో ఉత్సాహంగా ఇంకేదో చెప్పబోతున్న అతన్ని చాణిక్యుడు ఆపి “నీవు నా మిత్రుడు గురించి చెప్పబోయే ముందు ఒక్క నిముషం సావధానంగా నీవు చెప్పబోయే విషయాన్ని కొద్దిగా జల్లెడ పడదాం దీన్ని నేను “మూడు జల్లెడ్ల పరీక్ష (Triple Filter Test)” అంటాను అని అడగటం మొదలు పెట్టాడు.

మొదటి జల్లెడ “నిజం” – “నీవు నా స్నేహితుడి గురించి చెప్పబోయే విషయం ఖచ్చితంగా నిజమైనదని నీకు తెలుసా ?” అని అడిగాడు.

అందుకు ఆ స్నేహితుడు “లేదు, ఎవరో అంటుండగా విన్నాను” అని అన్నాడు.

“అంటే నీవు చెప్పబోయే విషయం నిజమైనదే అని నీకు తెలీదన్న మాట” అని చాణిక్యుడు అన్నాడు.

సరే రెండో జల్లెడ “మంచి ” – ” నీవు నాకు చెప్పబోయే విషయం నా మిత్రుని గురించిన మంచి విషయమా ?” అని అడిగాడు చాణిక్యుడు,

“కాదు” అన్నాడు చాణిక్యుని స్నేహితుడు .

“అంటే నీవు నా మిత్రుని గురించి చెడు చెప్పాలను కున్నావు, అది కుడా నీకు ఖచ్చితంగా మంచి విషయం కాదు అని తెలుసు,, సరే ఇంక మూడో జల్లెడకు వెళదాం”అన్నాడు చాణిక్యుడు.

మూడో జల్లెడ “ఉపయోగం” – “నీవు నా మిత్రుని గురించి చెప్పబోయే విషయం నాకు ఉపయోగమైనదా ? ” అని చాణిక్యుడు అడిగాడు.

“లేదు” అన్నాడు ఆ మిత్రుడు.

“అయితే నీవు చెప్పబోయే విషయం నిజమైనది, మంచిది, ఉపయోగకరమైనది కానపుడు నాకు చెప్పటం ఎందుకు ?” అని అన్నాడు చాణిక్యుడు

నీతి : మన గురించి, మన వాళ్ళ గురించి చెడు వార్తలను, విషయాలను మోసే వాళ్ళు చాలా మంది వుంటారు. ఒక విషయం (చాడి) వినేముందు ఈ మూడు జల్లెడల పద్ధతి అనుసరిస్తే, మన బంధాలు నిలబడతాయి, మంచి పెంపొందుతుంది. చాడీలు నివారించబడతాయి.

స్నేహానికి విలువ తెలిసిన వారికి మాత్రమే ఈ కథ!!

భక్తుడు తెల్పగా ప్రజల మానస కోర్కెలు తీర్చే దైవమే లౌకిక మోహమే ప్రకృతి వెండియు వజ్రము ఆశగా, మనో శక్తియు మర్చియే పరుగు సాగియు దైవము చూడకే సదామోక్షము కొర్కనే శరణు మూఢులు కోరెను అంతరాత్మతోపద్యానికి మూలం ఆశలకు దైవాన్ని కలిస్తే మోక్షమే

---

053*అమృతస్య పుత్రా:* సేకరణ। ప్రాంజలి ప్రభ

*1- అన్నమయ్య జీవిత చరిత్ర*

అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు (మే 9, 1408 - ఫిబ్రవరి 23, 1503) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు)। 

అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉంది। దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు। గొప్ప వైష్ణవ భక్తుడు। 

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు । అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి।

కన్నడ వాగ్గేయకారుడు పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడంటారు। 

సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీవైష్ణవసంప్రదాయంలో నమ్మకం ఉంది। ప్రధాన మందిరంలో ఘంట అవతారమని కూడా అంటారు। 

త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు।

చందమామ రావే జాబిల్లి రావే అంటే వేంకటేశుడు ముద్దలు తిన్నాడో తినలేదో కానీ, తెలుగు పిల్లలు మాత్రము గబుక్కున తింటారు।

జోఅచ్యుతానంద జో జో ముకుందా అంటే ముకుందుడు నిద్ర పోతాడో లేదో కానీ తెలుగు పిల్లలు మాత్రము హాయిగా నిద్ర పోతారు। 

అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు। అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమై పోయాయి; 

జనాల నోళ్ళలో నాటుకొని పోయినాయి। తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు - ఇలా మొత్తము ముప్పై రెండు వేల పాటలు వ్రాసాడు।

052..అన్నమయ్య 

మనుమడు తాళ్ళపాక చిన్నన్న అన్నమాచార్య చరితము అన్న ద్విపద కావ్యములో అన్నమయ్య జీవిత విశేషాలను పొందుపరచాడు। ఈ గ్రంథం 1948లో లభ్యమై ముద్రింపబడింది।

అన్నమయ్య జీవితం గురించి మనకు తెలిసిన వివరాలకు ఈ రచనే మౌలికాధారం। 

కాని బహువిధాలైన నమ్మకాలూ, అనుభవాలూ, ఘటనలూ, కథలూ ఈ వివరాలలో పెనవేసుకొని ఉన్నాయి।

నందవరీకులు క్రీ।శ। 10వ శతాబ్దంలో కాశినుండి ఆంధ్ర దేశానికి వలస వచ్చిన శుద్ధవైదిక బ్రాహ్మణులని పరంపరాయాత ప్రతీత। 

క్రీ।శ। 10వ శతాబ్దంలో నేటి కర్నూలు జిల్లాలోని "నందవరం" అనే గ్రామాన్ని నందుడనే రాజు పాలించేవాడు। 

ఈ రాజు కాశియాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ కొందరు వైదిక బ్రాహ్మణులు చాముండేశ్వరీ ఉపాసకులు పరిచయం అయ్యారని, ఆ సమయంలో వారణాసిలో క్షామం రాగా ఆ బ్రాహ్మణ కుటుంబాలు కొన్ని ఆంధ్రదేశానికి వలసివచ్చి నంద రాజు ఆశ్రయంలో స్ధిరపడ్డారనీ, నందరాజుచే తీసుకొని రాబడిన వైదికులు కావడంచే నందవైదికులుగా ప్రచారం పొందారని జనవాక్యం। 

కాలక్రమాన వీరు నేటి కర్నూలు, కడప జిల్లాలో స్ధిరపడ్డారని పరిశోధకులు అభిప్రాయం। తాళ్ళపాక గ్రామ నామం అన్నమయ్య వంశస్ధులకు ఇంటిపేరుగా నిలిచింది। అన్నమయ్య కూడా నందవరీకుడే। 

ద్విపద కావ్యం ప్రకారం అన్నమయ్య తాత నారాయణయ్య। 

చదువు అబ్బక, గురువులు పెట్టే హింసలు భరించలేక నారాయణయ్య చనిపోవాలని అనుకొన్నాడట। వూరిలో గ్రామ దేవత చింతలమ్మ గుడివద్ద విషసర్పం పుట్టలో చేయి పెట్టాడట। అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై అతని వంశంలో మూడవతరంలో హరి అంశతో ఒకబాలుడు జన్మిస్తాడని చెప్పిందట।

అన్నమయ్య తాతయ్య - నారాయణయ్య

కడప జిల్లా రాజంపేట తాలూకా పొత్తిపి నాడు మండలం నడిఒడ్డున తాళ్లపాక గ్రామం విరాజిల్లుతుండేది। ఆ గ్రామంలో వెలసిన చెన్నకేశవస్వామి, సిద్ధేశ్వరస్వామి కరుణాకటాక్షములతో ఆ గ్రామజనులు సుఖవంతులై జీవనం సాగించేవారు। 

ఇచ్చట చెన్నకేశవస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసాడు।

సస్యశ్యామలమై విరాజిల్లే ఈ గ్రామం సన్మునులకు, అఖిల దేవతలకు నిజవాసమై వుండేదని అంటారు।  

ఈ చెన్నకేశవస్వామిని దేవతలు, ఋషులు, సిద్దులు ప్రతి రోజు పూజిస్తారు। ఈ చెన్నకేశవస్వామి గుడిని ఆశ్రయించుకొని కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు జీవించేవి। 

ఆ గ్రామ వాసులు తలపక ఇందిరారమణపదైక మానసులుగా జీవనం సాగించేవారు। వాళ్లల్లో నారాయణయ్య చాల ప్రసిద్దుడు। 

ఇతని నాలుగోతరంలో మరో నారాయణయ్య వుండేవాడు। అన్నమయ్య పితృ పితామహులు నారాయణయ్య, విఠలయ్యలు విష్ణు భక్తిరతులై తాళ్ళపాక చెన్న కేశవస్వామిని సేవించుకొంటు జీవితం గడిపేవారు।

ఈ నారాయణయ్య కథ తోనే మన అన్నమయ్య కథ మొదలౌతుంది।

నారాయణయ్యకు చిన్నతనంలో ఎంతకీ చదువు రాలేదు। తండ్రి విఠలయ్య నయాన భయాన చెప్పి చూశాడు। లాభం లేక పోయింది। తన వద్ద ప్రయోజనం లేదని ప్రక్కనే వున్న ఊటుకూరులో తన బంధువుల వద్ద వుంచాడు।

ఊటుకూరు నేడు కడపజిల్ల రాజంపేట తాలూకాలో ఉంది। అన్నమయ్య మనవడు చినతిరుమలయ్య ఊటుకూరి చెన్నరాయని మీద కొన్ని సంకీర్తనలు కూడా రచించాడు। 

అక్కడ బళ్ళో ఉపాధ్యాయులు శతవిధాల ప్రయత్నించారు।

----

051 ...  మీ శ్రీమతి లేఖ।। మీరు చదవండి 

ప్రియమైన భార్య పుట్టింటికి వెడుతూ, ప్రియాతి ప్రియమైన శ్రీవారికి పంపిన గీతోపదేశం। (ఇది చదివిన తరువాత పాపం పురుషుడికి, అరె ఇవన్నీ చేయొచ్చా అనే ఫీలింగ్ వస్తె, కొంచెం కస్టమే।

ఇక చిత్తగించండి 

(P।S ఇది చదివి పురుషుల్లో మార్పు వస్తే, నాకు భాధ్యత లేదు )

*** పనిమనిషికి జీతం ఇచ్చేశాను। నేను ఊరినుండి వచ్చిందాకా పనిమనిషి రాదు, వాళ్ళ అమ్మ పనిలోకి వస్తుంది। గిన్నెలు తోవించి బట్టలుతికించి వెళ్ళాక తెలుపు వేసుకోండి।

*** 10 రోజులు వైఫై ఆపెయ్యమని ప్రొవిడర్ కి చెప్పేశాను। పెందలాడే పడుకోండి। మీ external HDD కేబుల్ కోసం వెతక్కండి। అది నా తో పాటు హాండ్ బాగ్ లోఉంది। మీరు కాలక్షేపం గా కధలు వ్రాయండి।

*** మీరు చాలా హెల్దీ గా ఉన్నారు। మాటి మాటికి ఆ లేడి డాక్టర్ వద్ద చెకప్ కి వెళ్లవద్దు। మీరు వేసుకొనే మాత్రలను పెట్టి ఉంచాను రోజూ వేసుకోండి।

*** మీ కోతి మూకని పోగు చేయకండి। సోఫాలో సిగిరేట్ పొడిని పోయిన సారి క్లీన్ చేసుకోటానికి రెండు రోజులు పట్టింది। పిజ్జా బిల్లులు చాలా దొరికాయి। పది రోజులన్నా బయటితిండి తినక ఓపిక చేసుకుని వండు కోండి అల్పాహారం,ఆహారం।

*** మీ మరదలు పుట్టినరోజు పోయిన నెలలోనే అయిపోయింది। మనిద్దరం వెళ్ళి వచ్చాం। అర్ధరాత్రి వెళ్ళి దానికి బిలేటెడ్ బర్త్ డే విశేస్ చెప్పాల్సిన పని లేదు। మా మరిది కరాటే నేర్చుకుంటున్నాడట। అది మీకోసమే అని నా నమ్మకం।మెసేజ్లుపెట్టడం,చదవడం మంచిది కాదుకదా?

*** పక్కింటి వాళ్ళని పొద్దుటే లేపి పేపర్ వచ్చిందా, పాలు వచ్చాయా అని విసిగించకండి। పెపరు పాలు వేయమని చెప్పాను।

*** అల్మారాలో కుడి వైపు మీ చడ్డీలు ఉన్నాయి। ఎడంవైపు ఉన్నవి పిల్లాడివి। ఆఫీసునుండి ఏదో ఇబ్బందిగా ఉంది అని పోయినసారి హడావిడి పెట్టారు గుర్తుందా?

నీవు బుధ్ధి మంతుడివి నాకు తెలుసు అయినా చెపుతున్నా।

*** మొబైల్ ఫోన్ బాత్రూమ్ సోప్ బాక్స్ లో పెట్టి ఇల్లంతా రెండు రోజులు వెతికారు పోయినసారి। కళ్ళజోడు ఫ్రీడ్జ్ లో ఉండి పోయింది।

కళ్ళజోడు కలము సుబ్బు అన్నీ ఉన్నా యి తీసుకోగలరు।

*** మరి అంత ఎక్కువ స్మార్ట్ గా తయారవ్వకండి।।।।।!!!!!!! మన వీధిలో ఉండే మిసెస్ స్వాతి, జ్యోతి, రాధిక ముగ్గురు ఊర్లో లేరు।

నేను ఇక్కడి నుండే చూడగలను ఇక్క డున్నా నిన్నే తలుస్తాను నీ ఆరోగ్యం జాగ్రత్త ఎన్ని పనులున్నా నా ఫోన్లకు సమాధానములు ఇవ్వ  గలవు।

*** షరా మామూలుగా నేను ఎప్పుడయినా తిరిగి వచ్చే అవకాశం ఉండనే

 ఉంది।

మీ  శ్రీమతి

Friday, 8 July 2022

శ్రీఆదిశంకరాచార్య విరచితం శ్రీ వైద్యనాథాష్టకము

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

పరమశివుడు వైద్యులకు అధిపతిగా కూడా పేరొందాడు. శ్రీ రుద్రాభిషేచనంలో చాలా భాగం దీన్ని వక్కాణిస్తుంది.  నమకం, చమకంలో పూర్తి ప్రార్థన, ఫలితం కూడా రోగ నివారణ, ఆరోగ్యము, దీర్ఘాయుష్షు గురించి చెపుతాయి. అందుకనే శివుని వైద్యనాథుడిగా కొలుస్తారు. దీనికి జ్యోతిర్లింగ స్వరూపమే మహారాష్ట్ర అంబజోగై సమీపం లోని వైద్యనాథ దేవాలయం. అలాగే, తమిళనాట చిదంబరం దగ్గర వైదీశ్వరన్ కోవిల్ ఈ స్వామి మహాత్మ్యాన్ని తెలిపేదే.

జటాయు అంత్యక్రియలు, కుష్ఠు వ్యాధితో బాధపడుతున్న అంగారకునికి (కుజ గ్రహం) రోగ నివారణ ఇక్కడే జరిగాయని గాథ. సుబ్రహ్మణ్యునికి శూలము కూడా ఇక్కడ శివుని ప్రార్థించిన తర్వాతే లభించిందని ఇక్కడి ప్రజల విశ్వాసం. ఇక్కడి సిద్ధామృత తీర్థం (పుష్కరిణిలో నీరు), అంగసనాతన తీర్థంలో స్నానం చేసి,  వేప చెట్టు క్రింద మట్టి తీసుకుని పవిత్ర భస్మముతో కలిపి దేవునికి సమర్పించి ఆ సిద్ధామృత తీర్థంతో తీసుకుంటే సర్వ రోగ నివారణ అవుతుందని గట్టి విశ్వాసం. అలాగే ఆ వైద్యనాథుని ఈ క్రింది స్తోత్రము రోజుకు మూడు సార్లు చదివితే ఆరోగ్యం కలుగుతుందట. అంతటి మహిమాన్వితమైన వైద్యనాథ అష్టకం & తాత్పర్యము. 

(1)శ్రీ రామ సౌమిత్రి జటాయు వేద షడాననాదిత్య కుజార్చితయ!
శ్రీ నీలకంఠాయ దయామయాయ శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ!!

తాత్పర్యము:- శ్రీ రాముడు, లక్ష్మణుడు, జటాయువు, వేదములు, సుబ్రహ్మణ్య స్వామి, సూర్యుడు, అంగారకుడిచే పూజించబడిన, నీలకంఠము కలవాడు, దయామయుడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములుl.

(2)గంగా ప్రవాహేందు జటాధరయ త్రిలోచనాయ స్మర కాల హంత్రే!
సమస్త దేవైరపి పూజితాయ శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ!!

తాత్పర్యము:- ప్రవహించే గంగను, చంద్రుని జటా ఝూటములో ధరించిన, మూడు కన్నులు కలవాడు, మన్మథుని, యముని సంహరించిన వాడు, దేవతలందరి చేత పూజించ బడినవాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

(3)భక్త ప్రియాయ త్రిపురాంతకాయ పినాకినీ దుష్ట హరాయ నిత్యమ్!
ప్రత్యక్ష లీలాయ మనుష్య లోకే  శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ!!

తాత్పర్యము:-  భక్త ప్రియుడు, త్రిపురములను నాశనము చేసిన వాడు, పినాకమును (త్రిశూలమును) చేతిలో ధరించిన వాడు, నిత్యము దుష్టులను సంహరించే వాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

(4)ప్రభూత వాతాది సమస్త రోగ ప్రణాశ కర్త్రే ముని వందితాయ!
ప్రభాకరేంద్ర్వగ్ని విలోచనాయ శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ!!

తాత్పర్యము:- వాతము, కీళ్ళనొప్పులు మొదలగు రోగములను నాశనము చేసే వాడు, మునులచే పూజించబడిన వాడు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని నేత్రములుగా కలవాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

(5)వాక్శ్రోత్ర నేత్రాంఘ్రి విహీన జంతోః వాక్శ్రోత్ర నేత్రాంఘ్రి సుఖ ప్రదాయ!
కుష్ఠాది సర్వోన్నత రోగ హంత్రే శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ!!

తాత్పర్యము:- వాక్కు, వినికిడి శక్తి, కాంతి చూపు, నడిచే శక్తి కోల్పోయిన జీవ రాశులకు ఆ శక్తులను తిరిగి కలిపించే వాడు,  కుష్ఠు మొదలగు భయంకరమైన రోగములను నిర్మూలము చేసి ఆరోగ్యాన్ని ప్రసాదించే వాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

(6)వేదాంత వేద్యాయ జగన్మయాయ యోగీశ్వర ధ్యేయ పదాంబుజాయ!
త్రిమూర్తి రూపాయ సహస్ర నామ్నే శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ!!

తాత్పర్యము:- వేదముల ద్వారా తెలుసుకొనే దైవము, విశ్వమంతా వ్యాపించి యున్నవాడు, యోగులచే ధ్యానింపబడిన పాద పద్మములు కలిగిన వాడు, త్రిమూర్తుల రూపమైన వాడు, సహస్ర నామములు కలవాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

(7)స్వతీర్థ మృడ్భస్మ భృతాంగ భాజాం పిశాచ దుఃఖార్తి భయాపహాయ!
ఆత్మ స్వరూపయ శరీర భాజాం శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ!!

తాత్పర్యము:- ఆయన దేవాలయమున ఉన్న పుణ్య పుష్కరిణీ స్నానము వలన, వేపచెట్టు క్రింద మట్టి మరియు భస్మము వలన - భూత ప్రేతముల బాధ, దుఃఖములు, కష్టములు, భయములు, రోగములు తొలగించే, ఆత్మ స్వరూపుడై దేహము నందు నివసిస్తున్న,  వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

(8)శ్రీ నీలకంఠాయ వృష ధ్వజాయ స్రక్గంధ  భస్మాద్యభి శోభితాయ!
సుపుత్రదారాది సుభాగ్యదాయ శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ!!

తాత్పర్యము:- నీలకంఠుడు, వృషభమును (ఎద్దును) పతాకమందు చిహ్నముగా కలవాడు,  పుష్పములు, గంధము, భస్మముచే అలంకరించబడి శోభిల్లే వాడు, సుపుత్రులు, మంచి ధర్మపత్ని, సత్సంపదలు, అదృష్టములు ఇచ్చే వాడు,  వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములుl.


ఫలశ్రుతిః
ॐॐॐॐॐॐ

బాలాంబికేశ వైద్యేశ భవ రోగ హరేతి చ!జపేన్నామ త్రయం నిత్యం మహారోగ నివారణం!!

తాత్పర్యం:- బాలాంబిక పతి, జరామరణముల భయమును పోగొట్టేవాడు అయిన వైద్యనాథుని ఈ వైద్యనాథాష్టకం ప్రతి దినము మూడు సార్లు పఠించే వారికి సకల రోగ నివారణ కలుగును.

🕉🌞🌎🌙🌟🚩

Wednesday, 6 July 2022


01..।మనకవులు పాటల రూపంలోనే మన వయసులతో జీవిత చదరంగం।। అంచెలంచెలుగా 

😅।  *బిడ్డ పుట్టినప్పుడు:*
------------------
"లాలీ  లాలీ లాలీ లాలీ।।। 
లాలీ లాలీ లాలీ లాలీ।।। 
వటపత్రసాయికి 
వరహాల  లాలీ 
రాజీవనేత్రునికి రతనాల లాలీ 
 మురిపాల కృష్ణునికి ముత్యాల  లాలీ।।।"
 *16 ఏళ్ళకి:*
"పదహారు ప్రాయంలో 
నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి। 
నేటి సరికొత్త  జాజిపువ్వల్లె 
 నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి।।।" 
 *18 ఏళ్ళకి:*
"ఎక్కడ ఉన్నా పక్కన  నువ్వే  ఉన్నట్టుంటుంది 
చెలీ ఇదేం అల్లరీ।। 
నా  నీడైనా అచ్చం  నీలా  కనిపిస్తూ  వుంది।।
అరే ఇదేం గారడీ।।
నేను  కూడా  నువ్వయానా 
 పేరుకైనా  నేను  లేనా।।।"
  *25 ఏళ్ళకి:*
"My Love is Gone 
My Love is Gone 
My Love is Gone 
My Love is Gone 
పోయే  పోయే లవ్వేపోయే 
పోతే పోయిందే ।। 
its gone, its gone, 
 its gone, my love is gone।"
*35 ఏళ్ళకి:*
"ఎందుకే  రవణమ్మా పెళ్ళెందుకే రవణమ్మా
ఎందుకే రవణమ్మా పెళ్ళెందుకెే రవణమ్మా
తాను  దూర సందు లేదు 
తాను  దూర సందు లేదు 
తాను  దూర సందు లేదు 
మెడకేమో డోల రవణమ్మా 
సతాయించాకే రవణమ్మా 
బాగోదే రవణమ్మా
 ఛీ ఛీ అంటారే రవణమ్మా"
*45 ఏళ్ళకి:*
"జన్మమెత్తితిరా।। 
అనుభవించితిరా।। 
జన్మమెత్తితిరా।। 
అనుభవించితిరా।। 
బ్రతుకు సమరములో।।  
పండిపోయితిరా।।
బ్రతుకు సమరములో।।  
పండిపోయితిరా।।
 మంచి తెలిసి మానవుడిగా మారినానురా।।।।"
*55 ఏళ్ళకి:*
"సంసారం  ఒక చదరంగం 
అనుబంధం  ఒక రణరంగం 
స్వార్ధాల మత్తులో సాగేటి ఆటలో 
ఆవేశాలు రుణపాశాలు తెంచే  వేళలో 
సంసారం  ఒక చదరంగం 
 అనుబంధం  ఒక రణరంగం।।" 
*65 ఏళ్ళకి:*
(పురుషుడు)
"కాశీకి  పోయాను  రామాహరి
గంగ తీర్థమ్ము  తెచ్చాను  రామాహరి
గంగ తీర్థమ్ము తెచ్చాను రామాహరి।।"
(స్త్రీ)
"కాశీకి పోలేదు రామాహరి 
ఊరి కాల్వలో నీళ్ళండి రామాహరి
 మురుగు  కాల్వలో నీళ్ళండి రామాహరి।।"
*75 ఏళ్ళకి:*
"జగమంత  కుటుంబం నాది 
ఏకాకి  జీవితం నాది 
సంసారం సాగరం నాదే
 సన్యాసం శూన్యం నాదే"
*85 ఏళ్ళకి:*
"రాలి పోయే పువ్వా నీకు రాగాలెందుకే
తోటమాలి నీ తోడు  లేదులే 
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే।।। 
 లోకమెన్నడో చీకటాయెలే।।।"
*100 ఏళ్ళకి:*
"చుక్కలో కెక్కినాడు చక్కనోడు ఎప్పటికి ఎవ్వరికీ చిక్కనోడు। 
చుక్కలో కెక్కినాడు చక్కనోడు ఎప్పటికి ఎవ్వరికీ చిక్కనోడు। 
తల్లడిల్లి పోతుంది తల్లి అన్నది।।।"
😄 మిత్రులారా Just నవ్వు కోండి। కాని ఇదే జీవిత రహస్యం।😊
మీ విధేయుడు।।మల్లాప్రగడ రామకృష్ణ


5 ప్రాంజలి ప్రభ కధలు।।05/07/2022

. వర్ణమాలతో పెళ్లి ఆహ్వానం 

 అ - అరుదైన అమ్మాయి
 ఆ - ఆకతాయి అబ్బాయి
 ఇ - ఇద్దరికి 
 ఈ - ఈడు జోడి కుదిరి
 ఉ - ఉంగరాలను తొడిగి
 ఊ - ఊరంతా ఊరేగించారు
 ఋ - ఋణాల కోసం 
 ఎ - ఎ వరెవరినో అడుగుతూ ఉంటే
 ఏ - ఏనుగు లాంటి కుభేరుడితో అడిగి
 ఐ - ఐశ్వర్యం అనే కట్నం ఇచ్చి
 ఒ - ఒకరికి ఒకరు వియ్యంకులవారు
 ఓ - ఓర్పుతో ఒప్పందం చేసుకొని
 ఔ - ఔదార్యాని ఇరు కుటుంబాలకు
 అం - అందించాలని కోరుకుంటూ
 అ : - అ : అంటూ
 క - కలపతో తయారయిన పత్రికలపై 
కలంతో రాసిచ్చి
 ఖ - ఖడ్గలతో నరికిన పందిరి ఆకులను
 గ - గడప ముందుకు తీసుకొచ్చి
 ఘ - ఘనమైన ఏర్పాట్లు చేయించి
 చ - చాపుల (బట్టలు)నింటిని కొని
 ఛ - ఛత్రం (గొడుగు) పట్టి గండదీపాని
 జ - జరిపిస్తూ
 ఝ - ఝాము రాత్రి దాక
 ట - ట పకాయలను కాలుస్తూ
 ఠ - ఠీవిగా (వైభవంగా)
 డ - డ ప్పులతో
 ఢ - ఢం ఢం అని శబ్దాలతో సాగుతుంది
 ణ - కంక ణా లు చేతికి కట్టుకొని
 త - తట్టలో తమలపాకులు పట్టుకొని
 థ - థమన్(మ్యూజిక్ డైరెక్టర్) డప్పులతో
 ద - దగ్గరి బంధువులను పిలిచి
 ధ - ధ నవంతులను కూడా పిలిచి
 న - న అనే నలుగురిని పిలిచి
 ప - పది మందిని పలకరిస్తూ
 ఫ - ఫంక్షన్ కి రావాలని చెప్తూ
 బ - బ లగాలతో బంగార దుకాణాలకు వెళ్లి
 భ - భటువులని (ఆభరణాలు) కొని
 మ - మంగళ స్నానాలు చేయించి, రాజసూయ
 య - యాగం లాంటి పెళ్లి కి 
 ర - రా రండోయ్ వేడుక చూద్దాం అని చెప్పి
 ల - లక్షణమైన 
 వ - వధూవరులను మీరు
 శ - శతమానం భవతి అని
 ష - షరతులు లేకుండా ఆశీర్వదించడానికి
 స - సప్తపది (పెళ్లి) వేడుకలో
 హ - హంగు ఆర్భాటాలతో రెడీ అయిన మండపంలో
 ళ - క ళ త్రం (భార్య) కాబోతున్న ఆమె ప్రక్కన వరుడు కూర్చొని
 క్ష - క్షత్రియ చెంత ఉండే బ్రాహ్మణుల సాక్షిగా జరిగే ఈ పెళ్లి కి
 ఱ - ఱరండి 

 వర్ణమాల పెళ్లి 
 వైకుంఠన మళ్లీ 


Tuesday, 5 July 2022

కధలు 01-02-2023 to 08-02-2023


ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక కధ లూ

01-02-2023 *మనశ్శాంతి*
ఒకసారి బుధ్ధుడు తన శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. ఇంతలో ఒక శిష్యుడిని పిలిచి, "నాయనా, దాహంగా ఉంది, ఆ కనబడే చెరువునుంచి కొన్ని నీళ్ళు తీసుకురా" అని చెప్పాడు.  అప్పుడే ఒక ఎద్దులబండి ఆ చెరువులోంచి వెళ్ళడం మూలంగా నీరు అంతా మురికిగా తయారయింది. శిష్యుడు ఆ నీరు తేరుకొనేంతవరకు అలాగే కూర్చున్నాడు. అరగంట సమయం గడిచింది. చూస్తే నీరు ఇంకా మురికిగానే ఉంది. మరో అరగంట సమయం వేచి చూసాడు. నీరు తేరుకున్నాయి.

ఆ పైన ఉన్న నీరు తీసుకెళ్ళి బుధ్ధుడికి ఇచ్చాడు శిష్యుడు. అప్పుడు శిష్యుని అనుమానం " ఈ నీరు అంత మురికిగా ఉన్నా, ఎలా తేరుకుంది? నువ్వు కాసేపు దాని మానాన దాన్ని కదపకుండా ఉంచావు. అది నెమ్మదిగా మురికి కిందకుపోయి, స్వచ్చమైన నీరు పైకి తేరుకుంది.  మన మనసు కూడా అంతే !!

ఒకసారి మనసులో ఆందోళన కలిగినపుడు దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా కొంతసేపు వదిలేయాలి. కొంతసేపు గడిచేటప్పటికి చింత అనే మురికి అంతా అడుగుకు వెళ్ళిపోయి, మనసు స్వచ్చంగా మారుతుంది.

నీ మనసు తేలిక అవ్వడానికి నువ్వు ఏ ప్రయత్నమూ చేయవలసిన పనిలేదు.
కొంతసేపు అలా వదిలేస్తే, దానంతట అదే సద్దుమణుగుతుంది. చక్కబడుతుంది.
మనశ్శాంతి పొందడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. మన ప్రయత్నం లేకుండానే జరిగిపోతుంది." 

మీకు ఇష్టమైన వాళ్లను ఎప్పుడూ వదులుకోకండి !!
వారు తప్పులు చేసారు అనుకుంటే, ఒక్క క్షణం వారితో మీరు గడిపిన అద్భుతమైన, ఆనందకరమైన క్షణాల గురించి ఒక్కసారి తలుచుకోండి. ఎందుకంటే, పరిపక్వత కన్నా, అభిమానం ముఖ్యం. మిమ్మల్ని మీరు కౌగలించుకోలేరు. మిమ్మల్ని మీరు ఓదార్చుకోలేరు.
అందుకోసం ఖచ్చితంగా ఒకరి సహాయం ఉండాలి. జీవితం అంటే ఒకరి కోసం ఒకరు బ్రతకటమే. మీకు ఇష్టమైన వారి కోసం, మిమ్మల్ని ప్రేమించేవారికోసం బ్రతకండి. స్నేహం, ప్రేమ, బంధుత్వాలు అనేవి డబ్బు భాష మాట్లాడేవారికి అర్థం కావు. ఎందుకంటే కొన్ని పెట్టుబడులు మనకు కనిపించే లాభాలను ఇవ్వలేకపోవచ్చు, కాని మనలను సంపన్నుల్ని చేస్తాయి.

****

02-01-2023 ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక  /// కథకాని బోధ 

అయ్యిందేదో మంచికే అయ్యింది. . అవుతున్నదేదో అది మంచికే అవుతుంది..  అవ్వపోయేది కూడా మంచికే అవుతుంది..  నీవేమి పోకొట్టుకున్నావని విచారిస్తున్నావ్? ఏమి తెచ్చావని పోకొట్టుకుంటావ్? 
నీవేమి సృష్టించావని నీకు నష్టం వాటిల్లింది  నీవు ఏదయితే పొందావో అవి ఇక్కడినుండి పొందావు  ఏదయితే ఇచ్చావో ఇక్కడే ఇచ్చావు  ఈనాడు నీవు నాసొంతం అనుకున్నదంతా, నిన్న ఇంకొకరి సొంతం కద, మరి రేపు మరొకరి సొంతం కాగలదు..  పరివర్తనం@మార్పు చెందడం అనేది లోకం యొక్క పోకడ@అలవాటు.. కావున జరిగేదేదో జరుగకమానదు..జరిగింది ఎన్నటికీ మారదు.. అనవసరంగా ఆందోళన పడకు  ఆందోళన అనారోగ్యానికి మూలం..  
'ప్రయత్నలోపం లేకుండా ప్రయత్నించు'..  ఫలితం ఏదయినా దయివప్రసాదంగా స్వీకరించు.. కాలం విలువైనది. . రేపు అనుదానికి రూపులేదు. మంచిపనులు వాయిదా వేయకు..  అసూయను రూపుమాపు.. అహంకారాన్ని అణగద్రొక్కు..
హింసను విడనాడు, అహింసను పాటించు.. కోపాన్ని దరిచేర్చకు, ఆవేశంతో ఆలోచించకు...
ఉపకారం చేయలేకపోయినా, అపకారం తలపెట్టకు.. మతిని సిద్ధంచేసేది మతం, మానవత్వం లేని మతం మతం కాదు.. దేవుని పూజించు, ప్రాణకోటికి సహకరించు..
తద్వారా భగవదాశీర్వాదంతో శాంతి నీ వెంట, ఇంట, చెంత ఉండగలదు..
ఓం శాంతి శాంతి శాంతి

*****

03-02-2023 *ఓం నమః శివాయ: కర్మ - జన్మ (1)

 "కర్మ ఫలం" లో - ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాం.

 ఎవరైనా చంపబడ్డప్పుడు చాలామందికి వచ్చే సందేహం, ఓ మనిషి అందరిలా సహజంగా మరణించే దాకా ఆగకుండా ఇంకొకరు అతన్ని చంపితే అప్పుడతని ఆయుష్షు ప్రకారం కాక, అతను ముందే మరణించినట్లు అవుతోంది కదా? 

 ఓ జీవి ఆయుష్షుకి ఒక్క క్షణం ముందు కూడా ఈ భూ ప్రపంచంలో ఎవర్నీ ఎవరూ చంపలేరు, ఎవరూ అలా మరణించలేరు. హత్య ద్వారా మరణించడం అతని ప్రారబ్ధ కర్మ అయినప్పుడే అతను హత్య చేయబడతాడు. పాపం చేసినవాడికే అలాంటి మరణం వస్తుంది. అంటే సహజ మరణం ఎలా ప్రారబ్ద కర్మో, అలాగే హత్య చేయబడటం ద్వారా మరణించడం కూడా ప్రారబ్ద కర్మలో ఓ భాగంగా మాత్రమే సంభవిస్తుంది. 

మహా భారతంలో ఈ విషయం స్పష్టంగా చెప్పబడింది.

"స్వకర్మణా హతం హంతి హత ఏవ సహన్యతే"                 ‌      -  శాంతి పర్వం 

భావం:  పాపి అయినవాడు తన కర్మచే మరణిస్తాడు కనుక, అతన్ని చంపేవాడు చచ్చినవాళ్లే చంపేవాడు అవుతాడు.

 ప్రతీ జీవి పుట్టుక, మరణాలు ప్రారబ్ద కర్మలు ముందే నిర్ణయించబడి ఉంటాయని ఇందాకే అనుకున్నాం. మరి ఆత్మహత్య ఎలా సంభవం అనే అనుమానం చాలామందికి వస్తూంటుంది. 'కారణం లేకుండా కార్యం జరగదు' అన్న కర్మ సిద్ధాంతం ప్రకారం ఆత్మహత్య ద్వారా మరణించడం అన్నది కూడా వారి ప్రారబ్ద కర్మలోని భాగమే తప్ప, ఇంకా జీవించాల్సి న సమయం రాసిపెట్టి ఉండగా ఓ మనిషి ఆత్మహత్య చేసు కుని దాన్నించి తప్పించుకోలేడు. అది కర్మ సిద్ధాంతానికే విరుద్ధమైన భావన.

 పూర్వ జన్మలో ఎవరైనా ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వారు కల్పించినా, లేదా అందుకు సహాయం చేసినా ఆ దుష్కర్మ ఫలితంగా అతను ఏడు జన్మల పాటు ఆత్మహత్య చేసుకుని మరణిస్తాడని ఓ సందర్భంలో శ్రీగణపతి సచ్చిదానంద స్వామి చెప్పారు.

 కొందరు అతి స్వల్ప కారణానికి కూడా ఆత్మహత్య చేసుకుని మరణించడం మనం చూస్తూంటాం. అందుకు ఇదే కారణం కావచ్చు. తను ఆత్మహత్యకి పురికొలిపిన వాడి ఆత్మ దేహాన్ని వదిలాక పడే బాధని అతని ఆత్మ కూడా అనుభవించి కర్మ క్షయం చేసుకోవాలి కాబట్టి అతను ఆత్మహత్య చేసుకుంటాడు. హత్యలా ఆత్మహత్య కూడా ప్రారబ్ద కర్మ. ఇది వేదాంతం చెప్పేది.

 శ్రీ రామకృష్ణ పరమహంస గురువు,  తోతాపురి దక్షిణేశ్వర్ లో పదకొండు నెలలు ఉండి కడుపునొప్పితో బాధ పడి, గంగలో ముణిగి చావాలనుకుని వెళ్తే....... 

ఎంత దూరం వెళ్ళినా మోకాలు వరకే నీరు ఉండటంతో, చేసేది లేక తిరిగి వెనక్కి వచ్చేసాడు. ఆత్మహత్య కూడా ఈశ్వరాధీనం లేదా కర్మాధీనం అని దీనినిబట్టి తెలుస్తోంది.

 వేదాంతం, హిందూ మతం ప్రకారం ఆత్మహత్య నిషిద్ధ కర్మ. అది మహా పాపం. కర్మ శక్తి మృత్యువుతో ఆగిపోయేది కాదు. అది జాగిలమై మృత్యవు తర్వాత కూడా ఆ జీవిని వెన్నాడుతుంది. జీవిస్తే,  వాడు అనుభవించే ఫలం కంటే ఆత్మహత్య ఎక్కువగా బాధిస్తుంది. ఇది మత పరమైన భావన. మతం కన్నా వేదాంతం  చెప్పేదాంట్లో ఎక్కువ స్పష్టత ఉంటుంది.

కోహిలోకస్యకురుతెవినాశప్రభవావుభౌ

కృతమ్ హితత్కృతెనైవ కర్తాతస్యాపి చాపరః                  - శాంతి పర్వం 217-16 

 భావం:-  ఈ ప్రపంచంలో పునరుత్పత్తి, నాశనం ఎవరు చేస్తున్నారు? మానవుని విభిన్న కర్మలే అవి చేస్తున్నాయి.

 మరణ స్థల, సమయాలు  మనం మరణించే సమయం, ప్రదేశం, పద్ధతి కూడా మన ప్రారబ్ద కర్మలోని భాగాలే. సహజ మరణమా లేక ప్రమాదంలో పోవడమా, అత్మ హత్యా లేదా హత్య చేయబడటమా, సునాయాస మరణమా లేదా బాధపడి పోవడమా, పక్క ఎక్కి ఎత్తి పోయించుకోవడమా లేదా తన పనులు తను చేసుకుంటూ పోవడమా అన్నవి కూడా ప్రారబ్ధ కర్మలోని భాగాలే అవుతాయి.

 రచయిత బాల్యంలో ఓ పొరుగాయన హిమాలయాల్లోని బదరీనాథ్ లో మరణించాడు. హిప్నటిస్ట్ నాగరాజు, విజయవాడ వెళ్ళే రైల్లో మరణించాడు, రచయిత కొండముది శ్రీరామచంద్రమూర్తి కైలాస మానస సరోవర యాత్రకి వెళ్ళి అక్కడ మరణించాడు. ముఖ్యంగా ప్రమాదంలో మరణించడం ప్రారబ్ద కర్మే.

ఓ చిత్ర నిర్మాత బాగా తాగి, హోటల్ గదిలో పడుక్కున్నాడు. ఆ గదిలో మంచి నీళ్ళు లేకపోవడంతో ఆయన దప్పికతో అక్కడే మరణించాడని మద్రాసులో, రచయిత ఇరవై ఏళ్ళ క్రితం విన్నాడు. స్వంతిల్లు ఉన్నా ఆ రాత్రి ఆయన ఇంటికి వెళ్ళలేదు. 

 మరణ సమయం, స్థలం గురించి చక్కగా వివరించే ఈ కథ చూడండి. 

ఓసారి యముడుకి శివుడితో పనిపడి హిమాలయాల్లోని కైలాస పర్వతానికి వెళ్ళాడు. శివుడి దగ్గరకి వెళ్ళబోతూ అక్కడున్న జీవుల్లోని ఓ పిచ్చుక వంక ఆయన ఆశ్చర్యంగా చూసాడు.

 యముడు తనని ఎందుకలా చూసాడా అని ఆ పిచ్చుకకి భయం వేసి వెంటనే పక్షిరాజు గరుత్మంతుడ్ని ప్రార్ధించింది. అతను ప్రత్యక్షం అవగానే ఆ పిచ్చుక జరిగింది చెప్పి 'యముడు తన ప్రాణాలని తీసుకెళ్ళక మునుపే తనని కాపాడమని' కోరింది.

 ఆ పిచ్చుక మీద జాలి కలిగిన గరుత్మంతుడు వెంటనే దాన్ని తన మీద ఎక్కించుకుని తీసుకెళ్ళి కన్యాకుమారిలోని సముద్రతీరంలో వదిలి వచ్చాడు. శివుడితో పని ముగించుకుని కైలాస పర్వతం నించి బయటకి వచ్చిన యముడు ఆసక్తిగా చూస్తూంటే, ఏం తెలీనట్లుగా ఏమిటని అడిగాడు గరుత్మంతుడు. “ఇక్కడ ఓ పిచ్చుక ఉండాలి.

అదేమైందా అని చూస్తున్నాను.” జవాబు చెప్పాడు యముడు.

 “దాని ప్రాణం పట్టుకెళ్ళడం నీ వల్ల కాదు. నేను దాన్ని తీసుకెళ్ళి ఓ రహస్య ప్రదేశంలో వదిలి వచ్చాను.” నవ్వుతూ చెప్పాడు గరుత్మంతుడు. 

 “ఈ క్షణంలో అది కన్యాకుమారిలోని సముద్రం ఒడ్డున ఓ విలుకాడి బాణానికి మరణించాల్సి ఉంటే, ఇక్కడ ఎలా ఉందా అని నాకు ఆశ్చర్యం కలిగింది.” చెప్పి యముడు వెళ్ళిపోయాడు. 

 మరణించే ప్రదేశం మన ప్రారబ్ధ కర్మ నిర్ణయమే. 

(తరువాతి భాగంలో - "కర్మల బట్వాడా" - "కర్మని బట్టే పునర్జన్మ")

---(((())))---


ప్రాంజలి ప్రభ - om sri raam - శ్రీ మాత్రేనమ:
సేకరణ/ రచయత : మల్లాప్రగడ రామకృష్ణ  
6281190539 -- 13-07-2022


Discover Nirupama Mishra's (India) creative work on Touchtalent. Touchtalent is premier online community of creative individuals helping creators like Nirupama Mishra in getting global visibility
04-02-2023 తండ్రి ఎవరు???
------------------వాట్సాప్ సేకరణ 
(ఇది రాసినవారు తెలిస్తే దయచేసి వివరాలు కామెంట్ చేయండి)
శ్రీరాముడు పాలిస్తున్న రామరాజ్యంలో ఒక శూద్ర మహిళ గర్భవతి అయింది...
ఆమె ఒక విధవరాలు. రామ రాజ్యంలో ఒక విధవ స్త్రీ, అందులోనూ శూద్రురాలు, గర్భవతి కావటమా! అందరూ ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు., అలా జరగటం రామరాజ్యానికే మాయని మచ్చ అనుకొంటున్నారు. రాజధాని అంతటా ఆ వార్త
గుప్పుమంది. దీనికి శిక్ష తీవ్రంగా వుంటుంది. నేరం చేసింది ఎవరైనా విధించిన శిక్షకు కట్టుబడి వుండాలి. శూద్రకులం నుంచి నేరస్థులు
వుంటే శిక్ష మరింత తీవ్రంగా వుంటుంది. అది నాటి యుగ ధర్మం!
   ఈ వార్త దావానలంలా పాకుతూ చివరికి ఒకరి ఫిర్యాదు ద్వారా రాముని దగ్గరకు చేరింది. రాముని ఆదేశంతో ఆ శూద్ర గర్భిణిని కోర్టుకు (కొలువుకు) తీసుకొచ్చారు.
అక్కడ వాదోపవాదాలు ఇలా సాగాయి.
రాముడు:- అమ్మా! నీ గర్భంలో వున్న శిశువుకి తండ్రెవరు?
గర్భిణి:- పేరు బైటకు చెప్పలేను, రామచంద్రా! ఎందుకంటే, ఆయన ఒక కులీనుడు, సవర్ణుడు, ఎంతో ప్రఖ్యాతి గలవ్యక్తి, అతనెవరో బయటపెడితే నన్ను, నా కుటుంబాన్ని చంపేస్తాడు.
రాముడు:- సరే, ఇందుకు నీకెలాంటి శిక్ష వుంటుందో తెలుసా? ఈ నేరానికి యావజ్జీవ జైలు శిక్ష తప్పదు.
గర్భిణి:- అయ్యా! ఆ శిక్ష గురించి నాకు తెలుసు.
(ఎంత అడిగినా ఆ మహిళ తన కడుపులోని బిడ్డకు తండ్రెవరో చెప్పలేదు. దాంతో రాముని ఆగ్రహం పెరిగింది. ఆమె చేసిన నేరానికి రాముడు మరణ శిక్ష అమలు చేయమని తీర్పు చెప్పాడు. శిక్ష అమలుకావటానికి ముందు రోజున, ఆమెను రాముని కొలువుకు తీసుకొచ్చారు భటులు. రాముని ప్రక్కనే అతని గురువు వసిష్టుడు, తమ్ములయిన లక్ష్మణ భరత శత్రుఘ్నులు, హనుమంతుడు వగైరాలంతా వున్నారు. 
గర్భిణిని చూసి వసిష్టుడు ఇలా అడిగాడు.
వసిష్టుడు:- అమ్మాయి! రేపు నీకు మరణ శిక్ష అమలవుతుంది. నీ చివరి కోరిక ఏమిటో చెప్పు.
గర్భిణి:- (వినయంగా) నా భర్త మరణించాక, అతనితో పాటే నా కోరికలూ పోయాయి. 
మీరేదనుకుంటే అది చేయండి.
వసిష్టుడు:- రఘువంశాచారం ప్రకారం, నీ కడసారి కోరిక ఏదో చెప్పాలమ్మా!
గర్భిణి:- నా కడుపులోని బిడ్డకు తండ్రెవరో చెపితే భయంకర శిక్షకు గురవుతాను గనుక, చెప్పలేకపోయాను. అయ్యా, వసిష్టులవారూ! నా చివరి కోరిక ఒకటుంది. దయచేసి మీ తండ్రేవరో చెపుతారా?
(వసిష్టుడు ఆ మాటతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అతని తల్లి ఊర్వశి ఒక వేశ్య, ఒకసారి ఆమె అందాన్ని చూసిన సూర్యునికి వరుణునికి వీర్య పతనమయింది. వారి వీర్యాన్ని  ఆమె ఒక కుండలో భద్రపరిచింది. అందులోంచే
వసిష్టుడు, అగస్త్యుడు పుట్టారు. వసిష్టుని ఉలికిపాటుకు ఇదీ కారణం)
రాముడు:- ఏవమ్మా! ఎంత ధైర్యం నీకు? మా గురువుగారి తండ్రి వివరాలడుగుతావా? 
నీ తల తెగుతుంది జాగ్రత్త!
గర్భిణి:- మీరేమైనా చేయండి ప్రభూ! నా చివరి కోరిక మీ గురువు తండ్రేవరో తెలుసుకోవటమే, అయినా, వారిని అడిగితే మీరెందుకు మండిపడుతున్నారు? పోనీ, ఆయన సంగతి వదిలేయండి. మీ తండ్రేవరో చెప్పండి మహారాజా!
(ఆ మాటతో రాముడు కూడా తలదించుకున్నాడు. ఎందుకంటే, రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులు, వారి తల్లులు పాయసం తింటే పుట్టారట! దశరధుడు వృద్ధుడు గనుక పుత్ర సంతానం కోసం నియోగ పద్ధతికి అంగీకరించాడని
మరో కధనం వుంది.)
లక్ష్మణుడు:- ఏం మాట్లాడుతున్నావమ్మా! మరొక్క మాట నీ నోటివెంట వస్తే బాణాలతో నీ శరీరాన్ని 
తూట్లు గావిస్తాను.
గర్భిణి:- అయ్యా లక్ష్మణులవారూ! నా చివరి కోరిక చెప్పమని మీరే బలవంత పెట్టారు. చెపితే, ఇలా విరుచుకుపడుతున్నారు. ఏం చేయను? మీ అన్నగారు మీ తండ్రి పేరు చెప్పలేకపోతున్నాడెందుకో! పోనీ మీరైనా చెప్పండి
(ఈ మాటతో లక్ష్మణుని నోరు మూతపడింది. ఏం చెప్పాలో తెలియక తికమక పడుతున్నాడు. తన మరిది పరిస్థితిని చూసిన సీతకు జాలి వేసింది)
సీత:-ఏం మాట్లాడుతున్నావమ్మా, కొంచెమైనా మర్యాదలేదా? నా మరిదిని ఇంకొక్క మాటంటే నీకు శిరచ్చేదనమే శిక్ష !!
గర్భిణి:- అమ్మా, సీతమ్మా! ఎలాగైనా నేడో రేపో నన్ను చంపుతారు, చివరికోరిక కోరుకొమ్మని బలవంతపెట్టింది మీరే. కనుక అడుగుతున్నాను. మీ కుల గురువు వశిష్టుడు, మీ భర్త రాముడు, మీ మరిది నా కోరికను తీర్చలేకపోయారు. పోనీ,
మీరైనా చెప్పండి, మీకు తండ్రెవరు?
(సీతకు తన జన్మవృత్తాంతం గుర్తుకువచ్చింది. జనక మహారాజు పొలం దున్నుతుంటే, ఆమె నాగటి చాలులో వుండే మన్నులో దొరికిందని తనకు చెప్పారు. తన తండ్రెవరో తెలియదు. సీత కూడా మౌనం వహించింది)
హనుమాన్:- (ఆగ్రహంతో) ఓ యమ్మా! నీకెంత తెగింపు! మా ప్రభువైన రామచంద్రుని, సీతమ్మను సైతం ప్రశ్నించే నీ తెగువ క్షమించరానిది. నువ్వు తీవ్ర శిక్షకు పాత్రురాలవు.
గర్భిణి:- అయ్యా, హనుమాన్లు వారూ! మీకూ మీ సీతారాములన్నా, వారి కుల గురువు వసిష్టులన్నా, లక్ష్మణస్వామన్నా ఎంత గౌరవమో, భక్తో నాకూ తెలుసు, వాళ్లెవరూ వాళ్ల తండ్రుల గురించి చెప్పలేకపోయారు, పోనీ, మీరైనా మీ తండ్రెవరో
చెప్పి, నా చివరి కోరికను తీర్చండి.
(హనుమంతుని ముఖం వాడిపోయింది, అతని తల్లి అంజన, కేసరి అనే వానరుని భార్య, ఒకసారి  ఆమెను విడిచి తపస్సు కోసం అడవులకు వెళ్లాడు. అప్పుడు, అంజన వాయువును ప్రసన్నం చేసుకోగా, ఆ వాయువు వల్ల తాను పుట్టినట్లు విన్నాడు. అంటే తన పుట్టుక కూడా ..... హనుమంతుడు ఏం చెప్పలేక మౌనం వహించాడు)
గర్భిణి :- (సీతా రామలక్ష్మణ వసిష్టాదులను చూస్తూ) అయ్యలారా! అమ్మా! మీరెవరూ మీ తండ్రులెవరో చెప్పలేకపోయారు, అలాంటి మీరు నా కడుపులోని బిడ్డకు తండ్రెవరో చెప్పని నేరానికి మరణ శిక్ష విధిస్తున్నారు నాకు, నా కడుపులోని బిడ్ద అక్రమ సంతానమైతే మరి మీరూ??? మీరెలా నాకు మరణ శిక్ష విధిస్తారు??? ఇదెంతవరకు న్యాయం???
(ఈ ప్రశ్నకు జవాబివ్వలేక రాముని సభాసదనమంతటా మౌనం ఆవరించింది)...


*||శ్రీమన్నారాయణీయము||  05-01-2023
సప్తమ స్కంధము/ 25వ దశకము - శ్రీనృసింహావిర్భావ వర్ణనము/25-7-శ్లోకం*

త్యక్త్వాతం హతమాశు రక్తలహరీసిక్తోన్నమద్వర్ష్మణి
ప్రత్యుత్పత్య సమస్తదైత్యపటలీం చాఖాద్యమానేత్వయి।
భ్రామ్యద్భూమి వికంపితాంబుధికులం వ్యాలోలశైలోత్కరం
ప్రోత్సర్పత్థచరం చరా చరమహో! దుః స్థామవస్థాందధౌ।।

భావము:-

హిరణ్యకశిపుని సంహరించి శీఘ్రమే నీవతని శరీరమును వదలివేసితివి. రుధిరధారలతో తడిసి, ప్రభూ! మహోన్నతమైన నీ శరీరమంతయూ రక్తసిక్తమయి ఉండెను. మహోగ్రరూపముననున్న నీవు, పిదప, మిగిలిన అసుర సమూహమును తినివేయ నారంభించితివి. అప్పుడు భూమి కంపించెను. సముద్రము అల్లకల్లోలమయ్యెను. పర్వతశిఖరములు మిక్కిలి చలించెను. దేవతలు వారివారి స్థానములను వదిలి పారిపోవసాగిరి. అక్కటా! సమస్త జగత్తుకు దుస్థితి కలిగెను కదా!

వ్యాఖ్య:-

దేవదేవుడు నరసింహ రూపుడు, దానవేశ్వరుడి గుండెలు చీల్చి నెత్తురు కురిపించాడు; కఠోరమైన రక్తనాళాలు త్రెంచి తుత్తునియలు చేసాడు; కండరాలు ఖండించి ముక్కలు ముక్కలుగా చేసాడు; రక్తం కారుతున్న ప్రేగులు లాగి తన కంఠంలో మాలికలుగా వేసుకున్నాడు. ఇలా అమితోత్సాహంతో హిరణ్యకశిపుని చంపి సంహరించి నరసింహమూర్తి గోళ్ళ కాంతులతో ప్రచండంగా ప్రకాశిస్తున్నాడు.

ఉగ్ర నరసింహుని గోళ్ళు ఆ రాక్షసుడి వక్ష కవాటం పగులగొట్టేటప్పుడు గండ్రగొడ్డళ్ళలా విరాజిల్లాయి. హృదయపద్మం పెకలించేటప్పుడు త్రవ్వుగోలల వలె దీపించాయి. రక్తనాళాలు త్రెపేటప్పుడు బలిష్ఠమైన కొడవళ్ళు వలె ప్రకాశించాయి.

 ప్రేగులు కోసేటప్పుడు రంపాలలాగా రాణించాయి. తన ఊరువులపై పడి ఉన్న రాక్షసుడిని ఎలాంటి అస్త్రశస్త్రాలతోనూ పనిలేకుండా నరకేసరి తన గోళ్ళతోనే సంహరించాడు. అప్పుడు ఆ గోళ్ళు అతి విచిత్రమైన రణ విజయాన్ని చాటుతూ శోభించాయి.

నరసింహస్వామి గోళ్ళు శరణాగత సాధుజనులకు ఇష్టమైనవి. ఆ దానవేశ్వరుని దేహాన్ని చీల్చివేశాయి. దేవతల ముఖాలను వికసింపజేశాయి. బహు అధికమైన కాంతులతో అగ్నిశిఖలను సైతం ఓడించాయి.

ఆ విధంగా బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలకు భంగం కలుగకుండా; కేవలం నరరూపం కానీ, మృగరూపం కానీ కానటువంటి నరసింహ రూపంతో; రాత్రి గానీ, పగలు గానీ కానట్టి సంధ్యాసమయంలో; లోపల కానీ, వెలుపల కానీ కానటువంటి సభాభవనపు గడప మీద; ఆకాశం కానీ, భూమీ కానీ కానట్టి తన ఊరు ప్రదేశంలో (ఒళ్ళో); ప్రాణం ఉన్నవీ కానీ, ప్రాణం లేనివి కానీ కాని గోళ్ళతో సంహరించాడు. అలా ఉగ్రనరసింహస్వామి ముల్లోకాలకూ గుండెల్లో గాలంలా తయారైన ఆ రాక్షసరాజు హిరణ్యకశిపుడిని చంపాడు. 

అప్పుడు, ఆయన మిక్కిలి ఉగ్ర స్వరూపంతో దావానల జ్వాలలా దర్శనమిచ్చాడు. అతిభయంకరంగా ఉన్న ముఖంతో; నాగేంద్రుని నాలుక లాగ మాటిమాటికి బయటకు వచ్చి చలిస్తున్న భీకరమైన నాలుకతో; నెత్తురుతో తడసి ఎఱ్ఱబారిన మెడజూలుతో; భయంకరంగా ఆ దానవ రాజు ప్రేగులు కంఠమాలికలులా వేసుకున్న మెడతో ఆ ఉగ్ర నరసింహుడు దర్శనమిచ్చాడు. ఆ దేవుడు ఆ దానవుడి హృదయకమలం చీల్చి వేసి, మదగజేంద్రుడి కుంభస్థలం చీల్చి చెండాడిన సింహరాజులాగా విరాజిల్లుతున్నాడు;

రక్తంలో తడసిన ఆయన గోర్లు సంధ్యారాగ రంజిత చంద్రరేఖల వలె ప్రకాశిస్తున్నాయి; ఆ రూపం చూసిన రాక్షస వీరులు కోపాలు పట్టలేక వివిధ ఆయుధాలతో ఆ రాక్షసాంతకుని మీదకి దండెత్తి వచ్చారు; అలా వచ్చిన పెక్కువేల రక్కసులను వచ్చిన వారిని వచ్చినట్లే చక్రాది ఆయుధాలతో ఒక్కడిని కూడా వదలకుండా వధించాడు ఆ ఉగ్ర నరకేసరి.

ఈ విధంగా రాక్షస సంహారం కానిచ్చి, యుద్ధం పరిసమాప్తి చేసాడు. ఇంకా ఆ ఉగ్ర నరసింహస్వామి ఆగ్రహం తగ్గలేదు. ఆ చూపులు భయం కలిగిస్తున్నాయి. భీకరమైన ముఖంతో ఊగిపోతున్నాడు. చూడటానికి గానీ, పలకరించడానికి కానీ చాలక అక్కడున్న వాళ్లందరూ భయభ్రాంతులై తత్తర పడుతుండగా, ఆ భీకర నరకేసరి ఆ సభాభవనంలో సింహాసనంపై ఆసీను డయ్యాడు.

దేవతలు, చారణులు, విద్యాధరులు, గరుడులు, నాగులు, యక్షులు, సిద్ధులు మొదలైన వారిలో ఏ ఒక్కరు కూడ ఆ సమయంలో ఆ ఉగ్ర నరకేసరి దరిదాపులకు వెళ్ళటానికి సాహసించలేక భయకంపితు లౌతున్నారు.
*****

o

06-02-2023 *ఎప్పుడు మారుతుంది ఈ దేశం?

నేననుకుంటున్నాను ఎప్పుడు దేశం మారుతుందా అని. 

గత కొన్ని సంవత్సరాలుగా,

మానవ సమాజంలో విపరీత మార్పులు చోటు చేసుకున్నాయి, నగరీకరణ, నవీకరణ అత్యంత వేగవంతంగా జరుగుతున్నది, 

ధరల పెరుగుతున్నాయి అంటూ ప్రోత్సాహం చూపేవారు ఎక్కువయ్యారు.అసలు బీదవాళ్ళనే వారు లేరు భారత దేశంలో కాని

మరణం అందరికి ఉంది కాని .... మరణించాలని ఎవరూ అనుకోరు. ఈ రోజుల్లో ఐతే పరిస్థితి ఇంకా విషమంగా ఉంది

భోజనం అందరికీ కావాలి కాని., ఎవరూ వ్యవసాయం చేయా లనుకోరు. నీరు అందరికి కావాలి కానీ , నీటి వనరులు రక్షించ డానికి ఎవరూ ప్రయత్నం చేయరు. పాలు అందరికీ కావాలి కానీ,ఆవు ను పాలించాలని ఎవరూ అనుకోరు.నీడ అందరికి కావాలి కాని, చెట్లను నాటాలని వాటిని రక్షించాలనీ ఎవరూ అనుకోరు.  భార్య  అందరికి కావాలి, కాని ఆడ పిల్లలు పుట్టా లనీ, వారిని రక్షించాలనీ ఎవరూ అనుకోరు.

అంతా ఆధునికం అంటూ

ధనం దుర్వినియోగం జరుగుతున్నది.

 ఆహారపు అలవాట్లు, మానవ సంబంధాలలో విపరీత మార్పులు చోటుచేసుకున్నాయి, అంతా ఇంట్లోవుండే నిత్యావసర వస్తువులను తెప్పించుకుని సుఖపడుతు న్నారు. అసలు విలువ ఏంతో తెలియటంలేదు చెట్లకు డబ్బులు కాస్తున్నాయి.

 మన అన్న భావన తొలిగి నేను - నాది అన్న సంకుచిత మనస్తత్వానికి బీజాలు పడ్డాయి, నైతిక విలువలు, మానవ బాంధవ్యాలు సన్నగిల్లసాగాయి, చదువు, సంపాదన పెరిగినప్పటికీ మానవ సంబంధాలు మసక బారడం మొదలయింది.

ఏది ఏమైనా వాట్సాప్, కరోనా పుణ్యమా అని సంబంధం సమాచారం అందుతున్నది.

మనం నిజం తెలుసుకనేలోపు నిజాయితీ గా ప్రేమించే వాళ్ళను దూరం చేసుకుంటాం ఇదేనా జీవితం.

మనిషి మనిషికీ మధ్య 

సామాజిక పరివర్తన

అనేది ఎపుడూ సానుకూల దిశలో సమాజ హితం కోసం జరగాలి, వ్యతిరేక దిశలో పయనిస్తే మానవత్వం అనే పదానికి (అర్థం) విలువ లేకుండా పోతోంది.

అలాగే ప్రభుత్వం ధనికులకు అప్పులిచ్చి వసూలు చేయలేక బీదవారిపై వత్తి డి తగ్గాలి. సంక్షేమాలముసుగులో ధనాన్ని దుర్వినియోగం కూడా తప్పే, చదువు, ఆరోగ్య ఉచితం, నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చే ప్రభుత్వం రావాలని ఆశిద్దాం.

కెరటాలు తీరానికి తాకితే వినోదం. ప్రజల కు నాయకుల మాటలు వినోదం. కెరటం దాటితే ఎంతో విధ్వంసం అవుతుందో అట్లాగే ప్రజల ఓర్పుపై ప్రయోగాల ప్రభావము అంతకన్నా ఎక్కువుగా రావచ్చు.

     *ఏది ఏమైనా మనం చేయగలను  అనుకుంటే చేయగలము, చేయలేము అనుకుంటే చేయలేము.*          

        *నమ్మకం లోని నాణ్య తే మనల్ని నాణ్యమైన జీవితానికి మంచి మార్గం చూపిస్తుంది, వెనకడుగు వేస్తే వెన్ను పోటే గతౌతుంది అందరూ గమనించాలి.*

మనసుకు శాంతి కల్గించేందుకు చేసే మంచ పనుల ప్రయత్నం కావాలి, రావాలి వస్తుందని ఆశిద్దాం.


మీ శ్రేయోభిలాషి..మల్లాప్రగడ రామకృష్ణ

--((())--


07-02-2023 "ఎ ఆవ్ రా బా వా " చక్కటి కధ చదవండి 

ఒకసారి శ్రీకృష్ణ దేవరాయలు తన ఆస్థాన కవులందరికీ ఒక పరీక్ష పెట్టాడు.

" మీరు ఐదు అక్షరాల పదం ఒకటి రూపొందించాలి. ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క భాషలో పుండాలి. ఆ ఒక్కొక్క అక్షరానికి ఆ భాషలో ఏమి అర్థమో మిగిలిన నాలుగు భాషల్లో కూడా అదే అర్థం వుండాలి.

అంతేకాక ఆ ఐదక్షరాల పదంకూడా

అర్థవంతంగా వుండాలి.

దీనికి సమాధానం రేపు సభాముఖంగా నాకు చెప్పండి."

కవులలో కలకలం బయలుదేరింది.

విచిత్రమైన సమస్య అనుకుని ఎవరింటికి వారు బయల్దేరి వెళ్లారు.

మన తెనాలి రామకృష్ణ కు నిద్రపట్టడం లేదు. తన బావమరిది ఇంటికెళ్ళి అక్కడ పశువుల పాకలో మంచంవేసుకుని దీర్ఘాలోచనలో మునిగిపోయాడు‌. అర్థరాత్రి అయినది. ఆ సమయానికి పశువులశాలలో ఒక ఆవు దూడను ప్రసవించినది. వెంటనే రామ కృష్ణుడు " బావా! బావా! ఆవు ఈనింది‌" అని కేకలు వేశాడు. నిద్రమత్తులో నున్న బావమరిది ఆ మాటలు విని " ఏ ఆవ్ రా బా వా " అని అడిగాడు. రామకృష్ణకు వెంటనే ఏదో స్ఫురించింది. ఎగిరి గంతేసాడు.

మరునాడు మహారాజు సభ తీర్చాడు.

" అందరూ సిద్ధంగావున్నారా" రాయలవారి మాట విన్న కవులు ఏమీ మాట్లాడలేదు.

 కాని రామకృష్ణుడు మాత్రం లేచి " నేను సిద్ధమే" అన్నాడు.

మహారాజు: ఏదీ ఆ పదం చెప్పు!

రామకృష్ణుడు: " ఎ ఆవ్ రా బా వా "

'ఏ' అనగా మరాఠీలో 'రా' అని అర్థము.

'ఆవ్ ' అనగా హిందీలో ' రా' అని అర్థము.

'రా' అనగా తెలుగులో 'రా' అనే కదా అర్థము!

'బా' అనగా కన్నడ భాషలో 'రా' అని అర్థము.

' వా' అనగా తమిళంలో 'రా' అని అర్థము.

ఈ అయిదు అక్షరాలూ అయిదు భాషలకు చెందినవి. ఈ అయిదు అక్షరములు కలిసిన పదం " ఏ ఆవ్ రా బా వా" ఇదికూడా అర్థవంతమైన పదమే!

-

*తెలుగు పాఠము*

 08-02-2023 *"ర"కీ "ఱ"కి మధ్య తేడా ఏమిటి?*

ఈ మధ్యనే వాట్సాప్ లో మెసేజ్ చూసాను. ద్వానా శాస్త్రి గారు రాసారట. బావుంది. అది ఇక్కడ పెడతాను. forwarded as it is.

తెలుగు భాషాభిమానుల కోసం.👇

*అరసున్న [ ఁ ], బండి ' ఱ 'లు ఎందుకు?*

అరసున్న, బండి ' ఱ 'లు నేటిభాషలో దాదాపుగా వాడుకలో లేవు. అలా చేసారు మన ఆధునిక భాషా వేత్తలు. తెలుగుకు పట్టిన దుర్గతి ఇది. అయితే, ఇవి తెలుగు భాషకి ప్రత్యేకమైనవి. తెలుగు భాషా లక్షణాన్ని నిరూపించేవి. అంతేకాదు- కావ్యభాషలోను, లక్షణ శాస్త్రంలోను వీటి ప్రాముఖ్యం చాలావుంది. కానీ వీటిగురించి తెలుగువాడు తెలుసు కోవాలిగదా! మన భాషా సంపదలో ఇవీ భాగస్వాములే అని గ్రహించాలి గదా! అరసున్న( ఁ ) , ఱ- ల వల్ల అర్థభేదం ఏర్పడుతుంది. పదసంపదకి ఇవి తోడ్పడతాయి. ఎలాగో చూడండి:

అరుఁగు = వీధి అరుగు

అరుగు = వెళ్ళు, పోవు

అఱుగు = జీర్ణించు

ఏఁడు = సంవత్సరం

ఏడు = 7 సంఖ్య

కరి = ఏనుగు

కఱి = నల్లని

కాఁపు = కులము

కాపు = కావలి

కాఁచు = వెచ్చచేయు

కాచు = రక్షించు

కారు = ఋతువు, కాలము

కాఱు = కారుట (స్రవించు)

చీఁకు = చప్పరించు

చీకు = నిస్సారము, గ్రుడ్డి

తఱుఁగు = తగ్గుట, క్షయం

తఱుగు = తరగటం(ఖండించటం)

తరి = తరుచు

తఱి = తఱచు

తీరు = పద్ధతి

తీఱు = నశించు, పూర్తి(తీరింది)

దాఁక = వరకు

దాక = కుండ, పాత్ర

నాఁడు = కాలము

నాడు = దేశము, ప్రాంతము

నెరి = వక్రత

నెఱి = అందమైన

నీరు = పానీయం

నీఱు = బూడిద

పేఁట = నగరములో భాగము

పేట = హారంలో వరుస

పోఁగు - దారము పో( గు

పోగు = కుప్ప

బోటి = స్త్రీ

బోఁటి = వంటి [నీబోఁటి]

వాఁడి = వాఁడిగా గల

వాడి = ఉపయోగించి

వేరు = చెట్టు వేరు

వేఋ = మరొకవిధము

మడుఁగు = వంగు, అడఁగు

మడుగు = కొలను, హ్రదము

మొదలైనవీ ఉన్నాయి.

అయినా తెలుగు భాషను నాశనం చేస్తున్న కాలం దాపురించింది కదా!

[డాక్టర్ ద్వా. నా. శాస్త్రి )

~~~~Forwarded~~~~