కనక రత్న వజ్ర వైడూర్య మకుటమ్ము
కల్గి ఉన్న శోభ నిచ్చు కృష్ణ
తళుకుల సుమలలిత ఫాలదేశముజూపు
సురుచిర కర సుముఖ వెల్గు కృష్ణ .... .... 1
లలిత ఫాల దేశ భ్రూలతా శోభితం
సుందర కనుగవ బెళుకుల కృష్ణ
లేత ముదురు మొగ్గ నాసిక మంద
స్మిత కనికరమును జూపు కృష్ణ ... .... 2
రత్న దంత వెలుగు మధురాతి మధురమ్ము
రమ్య మైన బింబ ఆధారమ్ము
సిరులు ఒలక పుచ్చు చిన్నయా రూపమ్ము
పలువురి మనసులను దోచు కృష్ణ ..... .... 3
--(())--
ఈరోజు .. ఉత్తమం పై కవిత
కన్నులార ఎదలోయలు మనుగడమే ఉత్తమం
చిన్న పిల్ల పలుకే పలు విధముగనే ఉత్తమం
ఉన్న మాట తెలిపేందుకు సహనముయే ఉత్తమం
అన్న మాట మరుపేందుకు మనుగడ యే ఉత్తమం
పరా యెవరు లేరన్నది తెలియడమే ఉత్తమం
వినోదముయు పొందాలని తలచుటయే ఉత్తమం
మనోమయము కోరేదియు జరువుటయే ఉత్తమం
సుఖాలయము సౌందర్యతొ మనుఁగడ యే ఉత్తమం
చల్లఁదనానికి వెచ్చదనం తోడైతే మనసుకు ఉత్తమం
అల్లము బెల్లము కల్సి ఒకే తీపైతే వయసుకు ఉత్తమం
అల్లిక మన్నిక ఇస్తె ఒకే తృప్తైతే సొగసుకు ఉత్తమం
ఉల్లము జిల్లను ఆశ మనో మాధుర్యం మగనికి ఉత్తమం
ఆట మాటల మధ్య శత్రువు లేక పోవడమే ఉత్తమం
మాట పాశము మధ్య వైరము లేక బత్కుట యే ఉత్తమం
వేట ఎందుకు మధ్య బేధము లేని ఆశలు యే ఉత్తమం
బాట చూపుట నేత ధర్మము మంచి తెల్పుటయే ఉత్తమం
కనీసం ఒక్కరుకూడ చూడలేని ఫేస్బుక్ లో చేసినా ఫలితం లేదు అదే నాకు ఉత్తమం
--(())--
నేటి కవిత్వం - - - రామ
మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ
రామ శాంతియు లోక మంతయు రాజ్య మేలెను రక్షగా
రామ ఆశ్రిత భావ శిధ్ధిని రమ్య పర్చియు నాయకా
రామ మందిర మెల్ల పోకయు రాజి చేసియు పిల్పుకే
రామ వచ్చియు మాకు దీవెన రవ్వ వెల్గులు ఆత్మగా
రామ సీతయు ఆంజ నేయుని రక్ష దీవెన సత్క్రపన్
రామ రక్షయె భాగ్య బీదకు రక్ష సత్యపు సత్క్రపన్
రామ శక్తియే లక్ష్య సాధన రక్ష శోధన సత్క్రపన్
రామ నామము పాడు చుంటిని రక్తి భక్తి గ సత్క్రపన్
రామ చంద్రుడు ఆశ్రితా సుమ రమ్యమై సహ వాసుడై
రామ భద్రుడు ధర్మ రక్షణ రాత్రి భావపు ధీరుడై
రామ లైక్యుడు ఏక పత్నిగ రమ్య వాక్కును వేల్పుడై
రామ భావము దుష్ట శిక్షణ రామ రక్షక భానమై
రామ కృష్ణుని వేడు చుంటిని రాల్చు ముక్తికి తోడుగా
రామ మాయతొ వెల్గు లిచ్చియు రాక్షసత్వము మార్చగా
రామ లక్ష్యము మాకు దీవెన రమ్య మయ్యెను ఆత్మగా
రామ ధర్మము సంభవామియు రాజ్య మేలెను భక్తిగా
--((***))__
No comments:
Post a Comment