Friday, 4 June 2021


తెలుగు భాషా మాధుర్యం (మాతృభాషామృతం)

ఆంధ్రభూమి ప్రచురణ ఆదివారం 27-08-2017


తెలుగుజాతి గొప్పదనం, తెలుగుభాష  కమ్మదనం తెలుసుకున్న వాళ్లకి తెలుగే
 
ఒక మూలధనం. తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్లను

నువ్వు మరచినట్టురా అన్నాడో సినీ కవి తెలుగు గురించి చెప్పుకోవడమంటే అమ్మ

గురించి మాట్లాడుకోవడమే. అందమైన అజంతా భాష స్వచ్ఛమైన తెలుగు భాష.
 
భాష పద సంపద కలిగినది, ఉచ్ఛారణ సౌలభ్యం కలిగినది, మాధుర్యాన్ని

కలిగినట్టిది మన తెలుగుభాష. అటువంటి మాధుర్యం కలిగి ఉండటం వలనే ఈ భాష

ఎందరికో ఆనందాన్ని కలిగించింది. అందుకే కన్నడ ప్రభువు అయిన

శ్రీకృష్ణదేవరాయలుచే కూడా ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని కీర్తించబడిన

రాజభాష మన తెలుగుభాష. మాతృభాష మన ఇల్లు తెలుగు కవిత పన్నీటి జల్లు
ఏ ఒక్కరు కలం పట్టినా జాలు పరిమళాలు వ్రాలు’ - అంటారు కుందుర్తి ఆంజనేయులు గారు.
 అజంతాల సుందరి అదే తెలుగు పందిరి.

తెలుగు నుడికారం మనందరికి అలంకారం. ఆత్మశక్తి గూర్చు అజరామరమైన భాష
మన తెలుగు భాష. దేశము పట్టినంతటి మహాకవి విశ్వనాథ సత్యనారాయణ తెలుగు గురించి
మృదుమధురంగా వివరించారు. ఒక సంగీతమేదో పాడుచున్నట్లు భాషించునపుడు విన్పించు భాష స్పష్టోచ్ఛారణంబు ననొనరు భాష రసభావముల సమర్పణ శక్తియందున
అమర భాషకు దీటైన భాష జామలలోనున్న చేమ యంతయు

చమత్కృతి

పల్కులన్ సమర్పించు భాష  భాషలొక పది తెలిసిన ప్రభువుచూచి

భాష యన నిదియని చెప్పబడిన భాష తనదు ఛందస్సులోని యందమ్ము నడక
తీర్చి చూపించినట్టిది తెలుగు భాష తేనెసొనలు కురియు భాష తెలుగు భాష
అటువంటి గొప్ప తేనెలూరు భాష, తేటయిన

భాష, తరతరాల వారధిగా తలెత్తుకుని నిలబెట్టి భాష మన తెలుగు భాష. ఏ

ప్రక్రియలోనైనా ఒదగటం భాషకు ఉండాల్సిన విశిష్ట లక్షణం. ఆ రకంగా చూస్తే

తెలుగు వెలుగు ఏనాడైనా దేదీప్యమానమే! భాషామూర్తి చదువుతల్లి ఎందరు కవి

పండిత మునిగాయక జనావళిని పొదువుకుందో! ఆ ప్రస్థానం ఇప్పటిదా!

పదకొండో శతాబ్దం నాటిది. తెలుగుల కన్నయ్య ఆదికవి నన్నయ వినిపించే

ప్రథమనామం. తెలుగు పద్య విద్యకు ఆద్యుడు నన్నయ. తెలుగు నుడికారానికి

గుడి కట్టినవాడు తిక్కన. ఆంధ్ర మహాభారతానికి నిండుదనం

సమకూర్చాడు ఎర్రన.ప్రతి గుండెలో గుడి కట్టుకున్న ధర్మమూర్తి

రామయ్య వాల్మీకి ఆర్తికాదా! ఇంకా బసవన్నను కీర్తించిన పాల్కురికి, నిత్య

పారాయణం నోచుకున్న తెలుగుల పుణ్యపేటి పోతన భాగవతం--

అక్షరమూర్తికి ఆభరణాలై అలరాయి అదేవిధంగా శృంగార మధువు సీసాలలో
నింపి విద్యదౌషధం కావించాడు శ్రీనాథుడు.

తెలుగు సరస్వతిని సువర్ణ పుష్పములతో అలంకరించిన రాయల యుగం తెలుగు
భాషకు స్వర్ణయుగం. చేమకూర వేంకట కవి పద్య చమత్కారానికి పెద్దపీట వేశాడు.
ఆధునిక కవితా విహాయాసన  పద్యకవిత్వాన్ని విహరింపజేశారు తిరుపతి

వేంకట కవులు, కొప్పరపు సోదరులు. ఆధునిక యుగ దస్తూరి కందుకూరి,

తెలుగమ్మచే వ్రాలు రాయప్రోలు, అడుగుజాడ గురజాడ, సంప్రదాయ కవితా

కల్పవృక్షము విశ్వనాథ సత్యనారాయణ , అభ్యుదయ కవిత్వోద్యమ రథసారథి శ్రీశ్రీ,

భావకవుల కల్పవల్లి దేవులపల్లి గేయ కవిత్వానికి చిరునామా సినారె, ఆంధ్ర

కవితా కుమారిని అర్చించినవాడు కరుణశ్రీ, కవితా మాధుర్యమందు భేషువా

అనిపించుకున్నాడు జాషువా. గాన యోగ్యతల భాష మన తెలుగు భాష.

మధుర కవితా దార్శనికుడు అన్నమయ్య వాడిన మాటలు అమృతకావ్యంగా, పాడిన

పాటెల్ల పరమగానంబుగా జీవితాంతం కీర్తనల రచన, ప్రచారం, సంరక్షణకే

కృషిచేసిన ధన్యజీవి అన్నమయ్య. వీరంతా తెలుగు భాషకు ఎనలేని సేవ

చేశారు. తెలుగు భాషను సుసంపన్నం చేశారు. వీరంతా తెలుగును ఆరాధించారు.

తెలుగును ఆదరించారు. తెలుగుకు ప్రణమిల్లారు. ఇంత గొప్ప తెలుగు

మాతృభాషగా లభించినందుకు కారణం మన పూర్వజన్మ సుకృతం. అందుకే

రాయప్రోలు సుబ్బారావు గారంటారు - ఏ ప్రపుల్ల పుష్పంబుల నీశ్వరునకు
పూజ చేసితినో ఇందు పుట్టినాడే కలదమేని పునర్జీన్ము కలుగుగాక
మధుర మధురంబైన తెన్గు మాతృభాష తెలుగు మనకు ప్రాణం. పలకాలి అనుక్షణం.

అమ్మ బాష అందం కమ్మనైన బంధం. తెలుగు భాషా మాధుర్యాన్ని ఖండ

ఖండాంతరాల విస్తరింపజేసింది పద్యకవిత ఇది తెలుగు ప్రజల సొమ్ము. తెలుగు పద్యం

ఎంత పాతదో అంత కొత్తది. ఆపాత మధురం, ఆలోచనామృతం. ఆస్వాదయోగ్యం.

‘తల్లిపాల వంటిది మాతృభాష, పోత పాల వంటిది పరభాష’ అటువంటి అమ్మ భాషను

మరిచి పరభాషకు అంకితమైపోతున్నాము. మాతృభాష కళ్లు లాంటిది, ఇతర భాష

కళ్లజోడు లాంటిది. కళ్లజోళ్లు ఎన్నైనా మారుస్తాము కానీ కళ్లు మార్చలేము.

మాతృభాష తపస్సు, మహిత జగతికి ఉషస్సు. తెలుగే మన ప్రాణం భవితకు

మాగాణం.
తెలుగు నాడును గొల్వరా తమ్ముడా
తెలుగు గాలిని పీల్చరా
తెలివిగలవారంతా తెలుగువారేనోయి
- అంటారు కర్లపాలెం కృష్ణారావుగారు.

కనుక మనందరం ముద్దులొలికే తెలుగును
ముచ్చటగా పలకాలి. పలుకు పలుకులో
కులుకు పరవశించి పలకాలి.
- గుంటూరు వెంకటాచారి.
నవ్వండి-నవ్వించండి

🦜🦜🦜🦜🦜🦜🦜

‘నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక మాయరోగం’ అని తాత్వికుల అభిప్రాయం. పెద్దగా నవ్వటం అమృత హృదయుని లక్షణమని పెద్దలంటారు.

‘‘నవ్వును జంతువుల్, నరుడు నవ్వును, నవ్వులు చిత్త వృత్తికిన్
దివ్వెలు – కొన్ని నవ్వులెటు తేలవు కొన్ని విషప్రయుక్తముల్
పువ్వులు వోలె ప్రేమరసముల్ వెలిగ్రక్క విశుద్ధమైనవే
నవ్వులు – సర్వము దుఃఖదమనంబు వ్యాధులకు మహీషదుల్’’

అన్నారు మహాకవి గుర్రం జాషువాగారు. నవ్వు సర్వరోగ నివారిణి. అటువంటి నవ్వును నవ్వాలా, వద్దా అని ఆలోచించడం అర్ధరహితం.

చిరునవ్వు, సకిలింపు, ఇకిలింపు, ముసి,ముసి నవ్వు, మూగనవ్వు, గుడ్డినవ్వు, పక,పకలు, అట్టహాసం ఇలా నవ్వనేక రకాలు. దేనికదే సాటి. భరతముని నాట్యశాస్త్రంలో ‘స్మితం, హసితం, విహసితం, ఉపహసితం, అపహసితం, అతిహసితం’ అని నవ్వుని వర్గీకరించాడు.

 ఆధునికి సాహిత్యంలో హాస్యాన్ని కొత్తపుంతలు తొక్కించిన పానుగంటి లక్ష్మీనరసింహరావు గారు మొలక నవ్వు, మొద్దు నవ్వు, కిచకిచ నవ్వు, కిలకిల నవ్వు, ఇగిలింపు నవ్వు, సకిలింపు నవ్వు, కుండమూకుడు నవ్వు, కప్పదాటు నవ్వు, వెర్రి నవ్వు, తిట్టు నవ్వు అంటూ నవ్వుకి అనేక రూపాలిచ్చారు.

అయితే, నవ్వంటే ఏమిటిని, దానికి నిర్వచనం చెప్పమంటే మాత్రం మహామహులకే సాధ్యంకాలేదు. నవ్వు ఒక అనిర్వచనీయమైన అనుభూతి. దానిని అనుభవించాలే కానీ, అర్ధాలు వెదికి ప్రయోజనం లేదు. నవరసాల్లో ఒకటైన హాస్యం మనసుకు ఆనందం కలిగిస్తూనే విజ్ఞాన్ని అందిస్తుంది. ఆ రసాస్వాదన చేసిననాడు అసంకల్పితంగా వచ్చేదే నవ్వేమో!

జనజీవనంలో అంతర్లీనంగా హాస్యం తద్వారా నవ్వు గేయాలు, పాటలు, పొడుపు కథల రూపంలో నిక్షిప్తమై ఉంది.

‘‘కలకల నవ్వే లక్ష్మణదేవ రపుడూ – కలతలు పుట్టెను కపులందరికినీ
కిలకిల నవ్వే లక్ష్మణదేవ రపుడూ – కిలకిల నవ్వగా ఖిన్నుడయ్యె రాజూ
ఇందరి చిత్తమ్ము లీవిధమ్ముననూ – నిండిన కొలువెల్ల కడుచిన్నబోయె’’

లక్ష్మణుడి నవ్వు రాముని కొలువులో కల్లోల్లాన్నే సృష్టించింది. గుమ్మడి పండ్ల దొంగ భుజాలు తడుముకున్నట్టు ప్రతి ఒక్కరూ తమలోని లోపాన్ని తలుచుకుని సిగ్గుతో కుంచించుకోపోయిన వైనం జానపదుల నోటి నుండి ఎంతో రమణీయంగా జాలువారింది. ద్రౌపది నవ్వు కురుక్షేత్ర సంగ్రామానికే హేతువైంది. ఇక మధురవాణి నవ్వు కన్యాశుల్కానికే ఊపిరైంది.

మనకు నవ్వు పట్ల ఎప్పుడు శీతకన్నే అయినా మన ప్రాచీన, ఆధునిక కవులు వీలైనప్పుడల్లా నవ్వుని అందించడానికే ప్రయత్నించారు.

 ఆంధ్ర మహాభారంతో తిక్కన్న నవ్వుల గురించి వివరిస్తూ, 32 రకాల నవ్వుల గురించి చెప్పారు. 

అవి: 1. పిన్న నవ్వు 2. అల్ల నగవు 3. అలతి నవ్వు 4. చిరునవ్వు 5. మందస్మిత 6. హర్ష మందస్మిత 7. అంతస్మితం 8. జనిత మందస్మితం 9. ఉద్గత మందస్మితం 10. అనాదరం మందస్మితం 11. సాదర దరహాసం 12. తిన్నని నవ్వు 13. లేత నవ్వు 14. కొండొక నవ్వు 15. పెలుచన నవ్వు 16. ఉబ్బు మిగిలి నవ్వు 17. గేలికొను నవ్వు 18. ఒత్తిలి నవ్వు 19, అపహాసం 20. రోషకఠిన హాసం 21. ఊద్భుట నవ్వు 22. కలకల నవ్వు 23. ఎల నవ్వు 24. ప్రౌఢ స్మితము 25. బెట్టు నవ్వు 26. కన్నుల నవ్వు 27. కన్నుల నిప్పుల రాలు నవ్వు 28. కినుక మానిన నవ్వు 29. కినుక మునుగు నవ్వు 30. కఠిన నవ్వు 31. నవ్వురాని నవ్వు మరియు 32. ఎర్ర నవ్వు.

**********************




********************

ఇవికాక, ఆధునికి కవులు మరికొన్ని నవ్వులను కనిపెట్టారు. తలకాయ నవ్వు – తల మాత్రం తెగ ఝాడిస్తూ వంచేసి కళ్లు మూసుకు నవ్వడం, లయధాటీ నవ్వు – తాళం వెయ్యటానికి వీలై ఉండేది. తుపాకి నవ్వు – పెదిమల బద్ధలు చేసుకుని ఠప్పున బయల్దేరేది, కొన ఊపిరి నవ్వు – గుక్క తిరగని సమయం దాకా మాట్లాడి అప్పుడు మాట తెమలకుండా, నవ్వు రాకుండా నవ్వడం, కోతి నవ్వు – నవ్వేమో అని ఇతరులు భ్రమించేది, దాగుడు ముచ్చీ నవ్వు – అధికారి ఎవరైనా కని పెడతారేమో అనే భయంతో చప్పున ఆపేసుకోవడానికి ప్రయత్నించే టప్పటిది, సరి విషపు నవ్వు – నవ్వు జాతిలో చెడబుట్టి లోపలి ఏడుపుని ఓ ప్రక్క నుంచే వెళ్లగక్కేది, డోకె నవ్వు, దొంగ నవ్వు, కొలిమి తిత్తి నవ్వు, గుడ్స్ బండి నవ్వు ఇలా అనేకం.

ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే, నవ్వులో ఎన్ని వంద రకాలున్నాయని వెడకడం మానేసి మల్లెపూవులాంటి స్వచ్ఛమైన నవ్వు నవ్వొకటి నవ్వుతూ ఉండండి. లేకపోతే ‘నవ్వనివాడు దున్నపోతై పుట్టున్’ అనను కానీ…

‘‘అకాల మృత్యుహరణం
సర్వ వ్యాధి నివారణం
సమస్త దురితోపహారం
హాస్యరసామృతం – పావనం శుభం.’’

సేకరణ 

🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜

*సంపాదించడం* అంటే
  
               కేవలం *డబ్బే* కాదు

*మనుషుల విలువలను* కూడా సంపాదించాలి.

                   *కష్ఠాల్లో* ఉన్నప్పుడు

     *మనల్ని గట్టెకించే* వారిని సంపాదించాలి 

                 *ఆపదలో* ఉన్నప్పుడు
 
       *ఆదుకునేవారిని* సంపాదించాలి,

                   *భాదల్లో* ఉన్నప్పుడు

       *ధైర్యాన్ని నింపే వారిని సంపాదించాలి*...


 *గడిచిన కాలం చాలా బాగుంటుంది*

*ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి*...

*రాబోయే కాలం అందంగా ఉంటుంది నచ్చినట్టు ఊహించుకుంటాం కాబట్టి*....

*ప్రస్తుతం కష్టంగా ఉంటుంది ఎందుకంటే అనుభవిస్తున్నాం కాబట్టి*...
                 


*మూర్ఖుని మనసు ఎప్పటికీ మారేది కాదు*.....

*దానిని మార్చడం ఎవరి తరమూ కాదు కూడా*.....

 అందుకే,

*అలాంటి వారినే మూర్ఖుడు అన్నారు*. ...

 *ఆఖరకు మనిషి వలె ఆలోచించలేని ఎద్దుకైనా ఒక ఏడాదిపాటు ఒక పద్ధతిని అలవాటు చేస్తే అది మన మర్మాన్ని ఎరిగి నడచుకొంటుంది*.

 కానీ.....

 *ముప్పయేండ్లపాటు... ఎన్ని బోధించినా మూర్ఖునికి/మూర్ఖురాలికి బోధపడదు*....


        *"*బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది*.

*పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే*,

*ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించుకోవాలి*,

కానీ

*మొత్తం పుస్తకాన్ని చించివేయకూడదు.*


 *పరిస్థితులు ఎప్పుడూ.. మన చేతుల్లో వుండవు*!

కానీ

*మన ప్రవర్తన మాత్రం మన ఆధీనంలోనే వుంటుంది*!

*పరిస్థితులు మార్చుకోలేక పోయినా*...

*మన ప్రవర్తన మార్చుకొనే శక్తి అందరికీ వుంటుంది*!

*మంచి ప్రవర్తన కలిగినవాడు*..

*ప్రతికూల పరిస్థితిని కూడా... అనుకూలంగా మార్చుకుంటాడు*!

*ఏపరిస్థితి అయినా ఎలా అధిగమించాలో మన నడవడికమిదే ఆధారపడివుంటుంది*........


*తీర్థస్నానాదుల చేత, బహుదానాల చేత, తీవ్ర తపస్సుల చేత కూడా యేది పొందలేమో*......

*అది* ...
*పరోపకారం చేత పొందగలం*.


 *నియమిత వ్యాయామం లేకుంటే ఈ శరీరం సరిగా ఉండదు*.

*అధికంగా మాట్లాడటం వల్ల అనారోగ్యం కలుగుతుంది.!*


*"మనిషి మంచివాడు కావాలంటే మంచి పనులే చెయ్యక్కర్లేదు*...

*ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు."*
       

*"అసూయపడే వారితో మన అభివృద్ధి గురించి చెప్పుకోవడం*,

*ఆవేశపడే వారితో మన ఆలోచనల్ని పంచుకోవడం మూర్ఖత్వం."*

            *శుభోదయం*

దేవరకొండ బాలగంగాధరతిలక్  మరణానంతరం 1967 లో వెలువడిన అయన "అమృతం కురిసిన రాత్రి" తొలి ఎడిషన్లో పై కవితాఖండిక లేదు. ఈ ఖండిక 24.2.1992 నాటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైనదనీ, దీనిని శ్రీపాద కృష్ణమూర్తి గారు తమకు పంపినారనీ ప్రచురణ కర్తలు పేర్కొన్నారు. ఇది నాకు "అమృతం కురిసిన రాత్రి" 2004 ఎడిషన్ లో లభించింది.

ఈ కవితలో ఒక ప్రియురాలు, తన ప్రియునికై ఎదురుతెన్నులు చూస్తున్నది. ఆ రోజు మెయిల్ లో అతడు వస్తాడని, తప్పక వస్తాడనీ, ఆ ఉదయానికి అందము, అర్థము యిస్తాడని, కలలు కంటున్నది.

ఆ ప్రియుడు నగరంలోని ట్రాముల కన్న, బస్సుల కన్న, వీధిలో పోయే జనం కన్న, ఈ దేశం కన్న, ఈ విశాల విశ్వం కన్న ముఖ్యమైన వాడు.

ఆమె కళ్ళకు వేడిగా, ఆమె గుండెల్లోకి వాడిగా, ఆమె ఒళ్ళో సుగంధపరిమళం వలె వాలి పోతాడని ఆమె కలలు కంటున్నది. 

షాంపూ సువాసనలు వెదజల్లే కురులను సిగగా చుట్టింది. జడలో గులాబీలు తురిమింది. న్యూలుక్ బ్రా, మఖమల్ చోళీ ధరించింది. జార్జెట్ చీరను ఒంటిపై సున్నితంగా సవరించింది. గుమ్మం వద్ద అతని రాకకై విప్పారిన నేత్రాలతో ఎదురు చూస్తున్నది.

తన అందాన్ని తానే ఊహించుకుంటున్నది.  యౌవనానికి శిల్పం వంటి తాను. చిత్రకారుడు చైవక్స్ షావడా రచించిన చిత్రం వంటి తాను. తానే అందానికి అవధి.

నీరెండలో మనుష్యులు మెరుస్తున్నారు. పక్కింట్లో రేడియోగ్రామ్ నుండి వెలువడే పాటలతో పాటు తానూ తేలుతూ, ఊగుతూ, కాస్త దూరంలో పార్కులో విరబూసిన పూవులాడుతూ, ఆ వెల్లివిరిసిన పూవులే ఆకుపచ్చని ఆకుల వలువల్లో దాగి పిలుస్తూ, సిగ్గుపడుతూ, పేపరమ్మే కుర్రవాని గొంతులో ఏదో వింత సంతరిస్తూ, 
గుమ్మం నుండి తాను వెలుపలికి వచ్చి నీరెండవాన చినుకుల్లో తడుస్తూ, తన  ఉద్రేక తరంగాలను హృదయపేటికలో కొత్త చీర వంపుల వలె మడుస్తూ, ఈ ప్రియురాలు, తన ప్రియుని కోసం అతని కోసం, అతని కోసమే ఎదురుతెన్నులు చూస్తున్నది.

ఈ ఖండికలో కవియే తనను తాను ప్రియురాలిగా ఊహించుకుంటున్నాడు.   తానెదురు చూసే, తాను బహితంతరాలలో ఆరాధించే, ఆ మరొక కవినే ప్రియునిగా భావించుకుంటున్నాడు. జీవితాత్మ పరమాత్మను ప్రియనాథునిగా భావించినట్లే, ఈ ఎదురుచూసే కవికి, ఆ ఆగమించే కవియే ప్రియనాథుడు. కృష్ణ భగవానుని వంటి మహాకవి కవిత్వం వేణునాదమైతే, గోపిక వలె తానా మహాకవికి  పాడి వినిపించే  నిజ కవితా గీతికలే తన అలంకారాలు.  ఆ ఖండికలే తన శిరోజ సౌందర్యం. అవే తన కురుల షాంపూ ఘుమ ఘుమలు. అవే తన కేశపాశాలలో తురిమిన గులాబీలు. అవే తన న్యూలుక్ బ్రా అందాలు. అవే తన మఖమల్ చోళీ మిలమిలలు. అవే తన జార్జెట్ చీర వంపులు. తన కవిత్వమే ఒక యవ్వన శిల్పం. తన కవిత్వమే అందానికి అవధి. తన కవిత్వమే ఒక చిత్రకళా తపస్వి గీసిన తైలవర్ణ చిత్రం.

ఇదీ బాలగంగాధర తిలక్ ఊహాప్రపంచం. ఇంతకూ గుమ్మం వద్ద నిలబడి ఆ కవిలోని కవిత్వమనే ప్రియురాలు నిరీక్షించే కవి ఎవరు? దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఆయననే భావించి, రచించిన ఖండిక యిది.
......

కృష్ణశాస్త్రి అపూర్వ ఖండిక "అన్వేషణము" లో "సాము సడలని పతి పరిష్వంగంలో నిదురించే గోపికాస్త్రీలకు, వెన్నెల రాత్రి వేణునాదం వినిపిస్తుంది. వారు పరిసరాలు మరచి, ఇల్లు వీడి, యమునా తటాన్ని చేరుకుంటారు. అక్కడ మురళీలోలుడు వేణువు మ్రోగిస్తుంటాడు.

"శారద శర్వరీ మధుర చంద్రిక, సూర్యసుతా స్రవంతికా
చారు విలీన వీచిక, నిశా పవనోర్మి మనోజ్ఞ మాలికా
చారిత నీపశాఖిక, కృశాంగిని గోపిక, నేను, నాడు, బృం
దా రమణీయసీమ వినినారము మోహన వేణుగానమున్!"

ఇదంతా స్వప్నం. ఇదంతా ఒట్టి భ్రమ. "నిర్జీవ ధావళ్యంతో వున్న సికతాతలంపై ఎవ్వరూ వుండరు. "లేవు శరత్తమస్వినులు, లేవు మనోజ్ఞ సుధాంశు మాలికల్".

"ఇట్టులీ దీన గోపికా హృదయ మంది
రాంత రాళమ్ము నందు త్రుళ్ళింత లాడు
వేణు నాదంబు విడిపించు విశ్వ మోహ
నాకృతి కిశోర గాయకు నరయుచుంటి"

అన్న నిరంతర ప్రతీక్షయే మిగిలింది గోపికాజనానికి.
........

తిలక్ కృష్ణశాస్త్రిని జీవితాంతం అభిమానించి, ఆరాధించిన వాడు. తన కవిత్వంలో సదా కృష్ణశాస్త్రి కవితా సౌందర్యం వంటి సౌందర్యం సాక్షాత్కరించాలనే  ఆకాంక్ష చెందిన వాడు. ఆ సాధనలో కృతకృత్యుడైన వాడు. 

కృష్ఢశాస్త్రి పద్యము, పాట, ఎన్నుకుంటే, తిలక్, పద్యంతో మొదలుపెట్టి, వచనం ఎన్నుకున్నవాడు. తనదైన బాణీ, తనదైన శైలీ చేపట్టిన వాడు. 

ఈ ఖండిక అసంపూర్ణం అని ప్రచురణ కర్తలు తెలుపుతున్నారు. తిలక్ జీవితం సైతం అసంపూర్ఢంగా ముగిసింది. 

తాను అభిమానించిన కృష్ణశాస్త్రి పద్యానికీ, శ్రీశ్రీ గేయానికీ భిన్నంగా, వచనకవితా మార్గంలో, ఒక అపూర్వ కవితా యుగాన్ని ఆవిష్కరించే వాడే. కానీ,
మధ్యలో మృత్యువు ఆకస్మికంగా కబళించింది.

"చూడు వీడు 
అందమైన వాడు
ఆనందం మనిషైన వాడు
కలల పట్టు కుచ్చు లూగుతున్న కీరీటం ధరించాడు
కళ్ళ చివర కాంతి సంగీతాన్ని రచిస్తున్నాడు
ఎర్రని పెదవులమీద తెల్లని నవ్వుల వీణల్ని మీటుతున్నాడు
ఎవరికి దొరకని రహస్యాల్ని వశపరచుకున్నాడు
జీవితాన్ని ప్రేమించినవాడు
జీవించడం తెలిసిన వాడు
నవనవాలైన ఊహా వర్ణార్ఢవాల మీద ఉదయించిన సూర్యుడు
ఇతడే సుమీ మన ప్రియుడు, నరుడు, మనకు వరుడు"

అని తన గురించి వ్రాసుకున్న వాడు తిలక్. 

"నా నివాసమ్ము తొలుత  గంధర్వ లోక మధుర సుషుమా సుధాగాన మంజువాటి" అని చాటిన కృష్ఢశాస్త్రి వలె తానూ దూరదూర గంధర్వలోకాలకు సాగిపోయినవాడు.

శుభోదయం

నివర్తి మోహన్ కుమార్
అక్షరార్చన వేదికకు

[02/06, 06:13] Mallapragada Sridevi: ప్రాంజలి ప్రభ ..కవిత..101

హృదయమా నీకెందుకు తొందరా
ఉన్నగాలి సరిపోవుటలేదా
శబ్దము వద్దు ఆదరా బాదరా
రక్తము సరిగా నీకు అందటం లేదా
తినేటప్పుడు బాగా తొందరా
ఆలోచించుట లేదా
పని వత్తిడి వల్ల గాబరా
గదులు మూసి తెలియును లేదా
ఈతనువుకు నీవే తోడురా
సూది పోటు చేరిందా
శ్వాసక్రియలో ఉన్నావురా
అసలు మధువు నీవేను
మనస్సాక్షి అయినావురా
ఆశలేని బతుకంతా
తియ్యని తలపు తోడు
అలుపెరుగని వలపుతో
చెలిమి కాయముతో
హృదయానికి ఎన్ని ఘాట్లు ఉన్న
నిన్నే ప్రేమిస్తున్నాను అంటూ
నిత్యము తపస్సు చేస్తుంది
ఆలోచనకు, ఆవేశమునకు,ఆలాపనకు,ఆదుర్దాకు, అక్కరకు, తోడుగా ఉన్నదాన్ని 
అందరూ నన్ను ప్రేమించే హృదయమంటారు
నేను ఉంటేనే జీవి
నేను లేకపోతే ?

[02/06, 11:31] Mallapragada Ramakrishna: మనసుకు శాంతి నిచ్చు 
వయసుకు ఓర్పు నిచ్చు 
సొగసుకు మేలుచేయు 
మనో ధైర్యాన్ని పించి 
ఆనందాన్ని ఇచ్చేది 
ఏకార్గతధ్యానం   
 
మానవునకు 
రోగం కలిగించేది ' పాపం '.  
భోగం కలిగించేది ' పుణ్యం '.  
భవిష్యత్తు నిర్ణయించేది ' కర్మ '.

లాభం కలిగించేది ' సేవ '.  
సంపాదన  నిలిపేది ' పొదుపు '
విలువ పెంచేది ' దానం '. 

నష్టం కలిగించేది ' హింస '.  
అశాంతి కలిగించేది ' ఆశ '.  
శాంతి కలిగించేది ' తృప్తి '.
 
దుఃఖం కలిగించేది ' కామం ' . 
పతనం చేసేది ' అహంకారం ' . 
అందరిని దగ్గర చేసేది ' ప్రేమ '.

 అందరినీ దూరం చేసేది ' అసూయ ' .
 స్థితిని సూచించేది ' గుణం '. 
 దైవంగా మార్చేది ' దయ ' 

ఆత్మస్థితి తెలిపేది ' వాక్కు '.  
విజయం చేకూర్చేది ' ధర్మం ' . 
గొప్పవాడిగా చేసేది ' తత్వజ్ఞానం '.

మానవునకు ' ముక్తి'ని ఇచ్చేది  సత్యం. '  
అన్ని రకాలుగా సంస్కరించేది ' జపం / ధ్యానం / తత్వజ్ఞానము'.
అందుకే జపం / ధ్యానం / తత్వ దర్శనము అన్నింటి కంటే గొప్పవి.
[04/06, 07:43] Mallapragada Sridevi: పై చిత్రంపై చక్కటి కవిత పద్యం వ్రాయండి

హృదయ మెంత విశ్వాసం చూపు
అదియు అంత ఆవేశం చూపు
యదల పొంగు విన్యాసం చూపు
అదియు జీవ వైవిధ్యం వైపు

బతుకు బండి నడిపేది హృదయం
మనసు బండి నడిపేది మేధస్సే
వయసు బండి నడిపేది ఓర్పు ఓదార్పు
మనసు బండి నడిపేది నేర్పు తీర్పు

రెండు కళ్ళు చూసి చెప్పవు
రెండు చెవులూ విని చెప్పవు
రెండు రంద్రాల ముక్కు వాసన పట్టి చెప్పవు
సైకిల్ మోసి హృదయానికి, మేధస్సుకి శక్తి పంచి చెప్పదు

వ్యాయామం కు సైకిల్ ప్రయాణం
హృదయానికి మనసు ప్రయాణం
మనస్సుకు మేధస్సు ప్రయాణం
మేధస్సుకు సంకేతాల జోడు ప్రయాణం

[04/06, 15:08] Mallapragada Ramakrishna: నేటి కవిత్వం - బ్రహ్మము - ఆత్మ 
రచయత:: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

అసలు అన్నది ఉన్నదా  అనుట మిధ్య
తెలుసు కొన్నంత కొద్దియు  ధన్యు డగును
ఎవరి కైనను అత్యాస ఎంత వరకు
విలువ ఉండదు  బుద్ధికే వినయ మేది

ఎవడు అణ్యమై నదియంత ఎలా చెప్పు
ఎవడు  అన్యమై   వినకుండు ఎన్ని చెప్పు 
ఎవడు  అన్యమై తెల్సుకో  ఎంత వరకు
అతడు  పృద్వికి  ఆనంద  అర్ధ ముండు

తెలియ బడనిది ఆత్మను తెలుసు కొనవు  
తెలుసు కుందాము అన్నను తెలప నీదు
ఎదుట ఉన్నట్టి  వస్తువు ఎంతొ మార్పు
తెలుసు దృశ్యాన్ని  ఆత్మగ  తెల్ప లేవు

విషయ వాంఛల తోనుండు విధివిలయము
వినుట చెప్పుట చూచుట  వెనుక ఆత్మ 
మనసు వస్తువు మీదకు మనుట ఆత్మ 
తెలివి  చైతన్య  వెంటను దాశ్య మవ్వు 

--(())--
[05/06, 06:11] Mallapragada Ramakrishna: 
ఈదేశం మరో దేశంతో చెలిమి చేస్తుందో ఆ దేశం ప్రజా శ్రేయస్సు ముఖ్యమనిపేరు 
ఆదేశం సత్య వాక్కులతో దోహదపడుతుందో ఆ చెలిమి బంధం శాశ్వితమౌతుంది  

ఈప్రేమ మరో ప్రేమకు దారితీస్తుందో ఆ ప్రేమ ప్రయాణానికి ప్రణయపుకల అని పేరు 
ఆ ప్రేమ ధర్మ సాహిత్యానికి దోహద పడుతుందో ఆ ప్రేమ బంధాని కే భాగ్యమౌతుంది   

ఏ కర్మ, మరో కర్మ కు దారి తీస్తుందో ఆ కర్మ ప్రయాణానికే 'పునర్జన్మ' అని పేరు.
ఏ కర్మ, కర్మరాహిత్యానికి దోహదపడుతుందో ఆ కర్మ శూన్యానికే 'మోక్షం' అని పేరు.

kavita హృదయ మెంత  .... ... 98


హృదయ మెంత విశ్వాసం చూపు

అదియు అంత ఆవేశం చూపు

యదల పొంగు విన్యాసం చూపు

అదియు జీవ వైవిధ్యం వైపు


బతుకు బండి నడిపేది హృదయం

మనసు బండి నడిపేది మేధస్సే

వయసు బండి నడిపేది ఓర్పు ఓదార్పు

మనసు బండి నడిపేది నేర్పు తీర్పు


రెండు కళ్ళు చూసి చెప్పవు

రెండు చెవులూ విని చెప్పవు

రెండు రంద్రాల ముక్కు వాసన పట్టి చెప్పవు

సైకిల్ మోసి హృదయానికి, మేధస్సుకి శక్తి పంచి చెప్పదు


వ్యాయామం కు సైకిల్ ప్రయాణం

హృదయానికి మనసు ప్రయాణం

మనస్సుకు మేధస్సు ప్రయాణం

మేధస్సుకు సంకేతాల జోడు ప్రయాణం


ధరణికి చలనాన్ని ఇచ్చేది అంతర్గతం

మనిషికి మనసిచ్చె మార్గమ్ము అంతర్గతం

మనసుకు మురిపించు మార్గమ్ము అంతర్గతం

వయసుకు ఉడికించు ధైర్యమ్ము అంతర్గతం

****

కవితలు .. 1    (నమస్కారం ) .... 99


ఓం శ్రీ రామ్ అక్షర -  శ్రీకారం
అందరిలో ఉండే   - సంస్కారం
మనుష్యుల్లో ఉండే - మమకారం

ముందుగ అందరికీ -  నమస్కారం


కళల నిజాలన్నియు  -  శ్రీకారం

జ్ఞానవృద్ధులు చూపు -  సంస్కారం

పెద్దల మాటలోను -  మమకారం
గురువులకు పెట్టాలి - నమస్కారం

కులాల బంధాలకు  - శ్రీ కారం

తప:సంపన్నులకు  - సంస్కారం
కలసిన మనసులలో - మమకారం
పలకరించుటలోను -  నమస్కారం

మాటల  ధర్మాలకు  - శ్రీకారం
వయోవృద్ధులు చూపు -  సంస్కారం
ఇచ్చి పుచ్చుకోవట   - మమకారం
పురోభివృద్కి చూపి  - నమస్కారం

--(())--


kavita     (  హా హా కారం )  .... 100


తండ్రికి కూతురిపెళ్లి చేసే అధికారం
ఒకరిపై వకర్ని విమర్సించుట అనధికారం

ఒకారిని చూసి మాటాడితే వెటకారం

భయంతో చేసే కారం  - హా హా కారం


భార్యగా బిడ్డలుకని పోషించే అధికారం
ఒకరిని చూసి మరొకరిని చూపుట అనధికారం
ఓర్వలేక చులకన చేయుట వెటకారం

అనారోగ్యంతో చేసే  -  హా హా కారం

రాజుగా ప్రజల భాదను తీర్చే అధికారం
బిడ్డలు పెద్దలను తిరస్కరించుటే అనధికారం
మాట జారితే వత్తి చెప్పే వెటకారం

 నిద్రలో కలవరిస్తూ పెట్టే - హా హా కారం

యోగిగా ధర్మాన్ని నిలబెట్టే అధికారం
అది  లేకుండా చేసే కారం అనధికారం
ధనం లేదని తక్కువ చేసి వెటకారం
వినలేని మాట విని చేసే  - హా హా కారం

--(())--

No comments:

Post a Comment