Saturday, 12 October 2019


కలువ పువ్వులాంటి మనసిచ్చి
కర్మ బంధానికి అవకాశ మిచ్చి
కధ లాంటి జీవితాన్ని ఇచ్చి
కలలా  మాయ చేస్తున్నవా

కళ్ళకు ఆకర్షణ ఇచ్చి
కనికట్టుతో కోర్క లిచ్చి
కమనీయ గుణ మిచ్చి
కలలా మాయ చేస్తావా

కంఠానికి స్వరం ఇచ్చి
కనికరాన్ని తోడుగ ఇచ్చి
కళతో సంపదను ఇచ్చి   
కలలా మాయ చేస్తావా

కమ్ముకొనే ప్రేమ ఏర్పర్చి
కర్తవ్యాన్ని గుర్తు పర్చి
కష్టాలను చూసి ఓదార్చి
కలలా మాయ చేస్తావా

కాలంతో ప్రకృతి నిచ్చి
కామాన్ని మనిషి కిచ్చి
కావ్యానికి ఊతం ఇచ్చి
కలలా మాయ చేస్తావా

కాసులపై  ఆశను రగిల్చి
కాంతలకు చదువు లిచ్చి
కామికులకు చాకిరీ ఇచ్చి
కలలా మాయ చేస్తావా
కుల గజ్జిని రగిల్చి
కుమ్ములాటలు మిగిల్చి
కుళ్ళు సంఘాన్ని తగిల్చి
కలలా మాయచేస్తావా

కుండల చల్లదన మిచ్చి
కుక్క లాంటి బుధ్ధిని ఇచ్చి
కురులకు శృంగారం ఇచ్చి
కలలా మాయ చేస్తావా


హాసనాంబ దేవాలయం.

🙏 ఈ దేవత ముందు పెట్టిన అన్నం ఏడాదైనా చెడిపోదు...అందుకే...

భారతదేశం దేవాలయాల నిలయం అన్న విషయం తెలిసిందే. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క విశిష్టత.

అయితే ఆ విశిష్టతలకు కారణం మాత్రం ఆ పరమాత్ముడికే తెలుసు.

అందువల్లే అటువంటి విశిష్టతల పై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నా కారణాలు మాత్రం తెలుసుకోలేకపోతున్నారు.

అటు వంటి దేవాలయాలు భారత దేశంలో వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. అందులో ఒకటి కర్నాటకలో కూడా ఉంది.

ఈ దేవాలయానికి ఒకటి కాదు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. ఈ దేవాలయ భక్తులో మాజీ ప్రధానుల నుంచి ఎంతో మంది శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. ఈ దేవాలయం విశిష్టతలు ఏమిటి?...

దక్షిణ భారత దేశ రాష్ట్రమైన కర్నాటకలో హాసన్ అనే చిన్న పట్టణం ఉంది. ఆ పట్టణంలోని అమ్మవారి పేరే హాసనాంబ. హాస్యం అంటే నవ్వు అని అర్థం.

ఇక్కడ దేవత సదా నవ్వుతూ ఉంటారు కాబట్టే ఆ దేవతకు హాసనాంబ అన్న పేరు వచ్చిందని చెబుతారు. అంతే కాకుండా తన భక్తులను ఎవరైనా హింసింస్తే అంతే ఉగ్రరూపంగా మారిపోతారు.

అలా మారిపోయన అమ్మవారు భక్తులను హించిసినవారి అంతు చూస్తారని చెబుతారు. అందుకు ఉదాహరణకు హాసనాంబ భక్తులను హాసనాంబ అత్తగారు హింసించేదని చెబుతారు.

దీంతో కోపగించుకొన్న హాసనాంబ ఆమెను బండరాయిగా మారిపోమ్మని శపించింది. ఆ బండరాయిని మనం ఇప్పటికీ హాసనాంబ గర్భాలయంలో చూడవచ్చు.

అంతేకాకుండా ప్రతి ఏడాది ఈ రాయి రూపంలో ఉన్న అత్త ఒక ఇంచు హాసనాంబ అమ్మవారి దగ్గరకు జరుగుతూ ఉంది.

ఇలా ఒక రాయి మరో రాయి వద్దకు ఎలా జరుగుతూ ఉందన్న విషయం పై మాత్రం శాస్త్రవేత్తలు ఇప్పటికీ సమాధానం చెప్పలేక పోతున్నారు.

ఎప్పుడైతే ఆ అత్త రూపంలో ఉన్న రాయి హాసనాంబ అమ్మవారి వద్దకు చేరుతుందో అప్పుడు కలియుగాంతం అవుతుందని నమ్ముతారు. ఇక ఈ దేవాలయం ఏడాదికి ఒక్కసారి మాత్రమే తెరుస్తారు.

అందులోనూ ఏడు రోజులు మాత్రమే దేవాలయంలోని అమ్మవారిని దర్శించు కోవడానికి అనుమతి ఉంటుంది.

ఈ సమయంలో కేవలం కర్నాటక నుంచే కాకుండా భారత దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు.

ఏడు రోజుల తర్వాత ఈ దేవాలయాన్నిమూసివేస్తారు. ఆ సమయంలో నెయ్యితో వెలిగించిన దీపాన్ని హాసనాంబ విగ్రహం ముందు ఉంచుతారు.

అంతే కాకుండా కొన్ని పూలతో పాటు రెండు భస్తాల అన్నాన్ని కూడా అమ్మవారి ముందు పెట్టి ఆలయ గర్భగుడి ద్వారాలను మూసివేస్తారు.

మరలా ఏడాది తర్వాత ఆలయ ద్వారాలను తెరిచినప్పుడు ఆ దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది. అదే విధంగా పువ్వులు వాడిపోయి ఉండవు.

ఇక ముఖ్యంగా దేవత ముందు పెట్టిన రెండు బస్తాల అన్న కూడా వేడిగా ఉండటమే కాకుండా తినడానికి అనుకూలంగా ఉంటుంది.

దీనిని భక్తులు ప్రసాదంగా తింటారని చెబుతారు. సాధారణంగా దీపావళికి ఏడు రోజుల ముందు ఈ దేవాలయం తలపులను తీస్తారు. దీపావళి రోజున ఆయాలన్ని మూసివేస్తారు.

ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించినట్లు చెబుతారు. అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలు మాత్రం కనిపించడం లేదు.

ఈ ఆలయంలోపల మనకు తొమ్మిది తలలతో ఉన్న రావణుడు కనిపిస్తాడు. అదే విధంగా సిద్ధేశ్వరస్వామి మనకు లింగ రూపంలో కాకుండా మనిషి రూపంలో కనిపిస్తాడు. ఇవి రెండు చాలా అరుదైన విషయాలు.

బెంగళూరు నుంచి 184 కిలోమీటర్ల దూరంలో ఉన్న హసనాంబ దేవాలయం చేరుకోవడానికి నిత్యం బెంగళూరు నుంచి బస్సు సౌకర్యాలు ఉన్నాయి.🙏

 

--((***))--

"ఉత్తమ వధువు"
 .............................
      (నాకు నచ్చిన కధ)
     ఒక వర్తకుడికి ఏడుగురు కుమారులు. ఆరుగురికి వివాహమైనది.  కోడళ్లతో సమిష్టి కుటుంబం సజావుగా సాగిపోతూ వున్నది. ఇప్పుడు ఏడవ వానికీ పెళ్లి జరిగి నూతన వధువు ఈ ఇంట ప్రవేశించినది.    ఇంతవరకూ ఇంటిలో ఆరుగురు తోటి కోడళ్లు ఉదయం సాయంత్రం వంతులు వేసుకుని వంటలు చేస్తూ  వున్నారు. ఎవరైనా సుస్తీపడితే-
 " నా వంతు వచ్చినప్పుడు నీవు  వంట చేయలేదు కదా! మరి నీ వంతప్పుడునేనెందుకు చేయాలి?"
 ఇలాంటి చిన్నచిన్న తగాదాలు ఈ ఇంట్లో మామూలైపోయాయి..    సరే!
 కొత్త కోడలుఇంట్లోకి ప్రవేశించిన మొదటిరోజే చకచకా
 వంటగదిలోకి వచ్చేసింది. అత్త అన్నది‌.  " ఇక్కడ ఆరుగురు కోడళ్లు వున్నారు. నీవిప్పుడే వంటగదిలోకి రావద్దు"    చిన్నకోడలన్నది. " అత్తగారూ! ఆకలితో అతిధి ఇంటికి వస్తే మనం
 ఏం చేస్తున్నాము? శుభ్రంగా అన్నం పెడుతున్నాము కదా! దానివలన మనకు పుణ్యం కలుగుతున్నది. ఒక్కరికి అన్నం పెట్టినందుకే ఇంత పుణ్యం వస్తుంటే, మరి ఇంట్లో వాళ్లందరకూ వండి వడ్డిస్తే ఇంకెంత పుణ్యం రావాలి! ఇల్లు మీది, బియ్యం మీవి, ఇంట్లో పాత్రలు మీవి. వంట పదార్థాలన్నీ మీవే! నేను కొంచెం పరిశ్రమ చేసి వంట చేసి పెడితే నాకు పుణ్యం వస్తుందా రాదా? అందరూ తిని తృప్తిపడతారు, సంతోషిస్తారు. కాబట్టి అత్తయ్యా! మీరు అలా కూర్చోండి,నేనే వంట చేస్తాను."
    అత్త మనసులో అనుకున్నది. " చిన్న కోడలు బాగా చెబుతున్నది.
 అందరికన్నా చిన్నది అనుకున్నాను.
 ఈమె బుద్ధి మంచిది."    మరునాడు తెల్లవారింది. అత్త ఉదయమే వంటగదిలోకి చొరబడి
 వంట చేయడానికి కూర్చున్నది. కోడళ్లు అది చూసి " అయ్యో! అత్తగారూ! మేమంతా లేమా! మీరెందుకు శ్రమపడడం, లేవండి! లేవండి" అనగానే అత్త అన్నది. " మీరు చిన్నవాళ్లు,నేను పెద్దదాన్ని.
 నేను త్వరలో మరణించవలసి వుంది. నేనిప్పుడు పుణ్యం చేసుకొన
 కుంటే మరెప్పుడు చేసుకుంటాను?
 నా ఇంటిపని నేను చేసుకోవడం పాపమేమీ కాదు కదా! అదీకాక ఈ మాత్రం శ్రమ చేస్తే నా ఆరోగ్యంకూడా
 బాగుంటుంది." నిన్న చిన్నకోడలు,ఇవాళ అత్తగారు
 ఇలా మాట్లాడుతూంటే కోడళ్లందరికీ లోపల ఉత్సాహం కలిగింది.  " ఈ విషయం మనం ఊహించనే లేదు. మన ఇంటి పని మనం చేసుకుని, వంట చేసి అందరకూ
 పెట్టడం వల్ల పుణ్యం వస్తుంది."    ఇక ఇప్పుడు ఏ కోడలు ముందు లేస్తే ఆమే వంటగదిలోకి జొరబడి పొయ్యి వెలిగించి కాయగూరలు తరగడం మొదలుపెడుతున్నారు. నేను ముందు,నేను ముందు అని తగవులు వస్తున్నాయి. ఇంటి యజమాని ఇది గమనించి "అందరూ వంతులు వేసుకుని ఆ ప్రకారం వంట చేయండి." అన్నాడు.    ఒకప్పుడేమో! 'ఇవాళ వంట నీ వంతంటే నీది' అని వాదులాడుకునే వారు.ఇప్పుడేమో ఇవాళవంట'నేను  చేస్తానంటే నేను చేస్తాననే' భావాలు  వీరిమనస్సుల్లోఏర్పడ్డాయి. కొత్త కోడలు కొంచెంఅసంతృప్తిగావున్నది.
 'తన వంతు నాలుగైదు రోజులకో
 మారు వస్తున్నది. ఈ ఖాళీ సమయంలో ఏంచెయ్యను' అని ఆలోచిస్తూ ఉండగా ఆమె దృష్టి మూలనున్న తిరగలిపై పడింది. దివ్యమైన ఆలోచన వచ్చింది.    మరునాడు తిరగలిని తన గది లోకి మార్చుకుని పిండి విసరడం మొదలుపెట్టింది. అత్త ఇది గమనించింది.    "ఏమే! చిన్న కోడలా! నీవు పిండి ఎందుకు విసురుతున్నావు? మన దగ్గర డబ్బుకేమీ లోటు లేదు కదా! భగవంతుడు చాలానే ఇచ్చాడు." ఆమె ఇలా జవాబిచ్చింది.    " అత్తయ్యా! మనకు డబ్బు చాలా వుండవచ్చుగాక! కాని నన్ను ఈ పని వద్దని మాత్రం చెప్పకండి. పిండి రోజువారీ విసురుతూనే వుంటాను. ఇలా చేతితో పిండి విసరడం వలన శరీరం సరిగా వుంటుంది‌.
 వ్యాయామం కూడా దానంతట అదే  అవుతుంది. జబ్బులు రావు. పదే  పదే వైద్యులవద్దకు పోనక్కరలేదు.  అదీ కాక వంట చేసిన దానికంటె కూడా ఎక్కువ పుణ్యం ఈ పని వల్ల లభిస్తుంది. వంట ఎవరైనా చేస్తారు!
 పిండి మాత్రం నేను విసిరినదే అంతా తింటారు."    అత్త, ఆరుగురు కోడళ్ళు ఈ మాటలు శ్రద్ధగా విన్నారు. 'ఈమె సరిగానే చెబుతున్నది' అను కున్నారు. వారు తమతమ భర్తలతో   "ఇంటికి తిరగలి కొని తెండి. నేను రేపటినుండి పిండి విసరాలి" అని చెప్పుకుని తిరగళ్లు తెప్పించు కున్నారు. అందరూ రోజువారీ  రెండున్నర కేజీలదాకా పిండి సురుతున్నారు.ఇంట్లో పిండి  పేరుకుపోతున్నది. వెంటనే కొత్త కోడలు పిండిని సంచుల్లో సర్ది దుకాణంలో పెట్టి అమ్మించేసింది. బాగా లాభం వచ్చింది. అందరికీ ఆనందమైంది.   కొత్త కోడలు 'ఇంకా ఏంచెయ్యాలి?'
 అని ఆలోచిస్తున్నది. 'ఇంటి వెనుక  నుయ్యి వున్నది. రోజూ నౌకరువచ్చి  తొట్టెలోనికి నీళ్లు తోడుతుంటాడు.' ఈమె మరునాడు త్వరత్వరగా స్నానపానాదులు ముగించుకుని నుయ్యి దగ్గరకు చేరుకున్నది. చేద తీసుకుని నీళ్లన్నీ తోడి తొట్టెలో నింపింది. కొంచెం మొక్కలకు పోసింది. నౌకరు వచ్చాడు. వాడికి పనిలేకుండా పోయింది‌. ఖాళీగా కూర్చున్నాడు. విషయం పెద్దవాళ్ల  దృష్టికి వెళ్లింది. అత్త వచ్చినది.     " ఏమ్మా! చిన్న కోడలా! "నీవు గాని నీళ్లు తోడావా ?"   "అత్తయ్యా!మీరేమీమాట్లాడకుండా   వుండండి. మీరేమైనా మాట్లాడితే నా పుణ్య సంపాదన ఆగిపోతుంది.
 మీరు వైశాఖ మహత్మ్యం విన్నారా లేదా? వైశాఖ మాసంలో మంచి  నీళ్లివ్వడానికి సంబంధించి గొప్ప కథ వున్నది. నీళ్లిస్తే వచ్చేంత పుణ్యం- అన్నం పెట్టినందుకు లేదు. ఎందుకంటే అన్నం రోజుకు ఒకటి రెండు పర్యాయాలే కదా తింటాము!  కాని నీళ్లు-  నీళ్లు ప్రతిరోజూ అనేకసార్లు త్రాగుతాము. నీళ్లతో కాళ్లు చేతులు కడుక్కుంటాం,  ముఖం శుభ్రం చేసుకుంటాం, స్నానం చేస్తాం ఇలా నీరు చాలా ఉపయోగపడుతుంది‌. "    మర్నాడు అత్త పెందలకడనే లేచి
 నుయ్యి దగ్గరకు వెళ్లి నీళ్లు తోడి తొట్టిలో వేయసాగింది. కోడళ్లందరూ హడావిడిగా అక్కడకు చేరుకున్నారు.    "అత్తగారూ! మీరు చేసేదేమన్నా బాగున్నదా? మేమింతమంది వుండగా మీరు ఈ నూతి దగ్గరకు రావడమేమిటి? "    "మీరేమీ ప్రశ్నించకండి! నేను పెద్దదాన్నయ్యాను. అందువల్ల తొందరగా పుణ్యం సంపాదించు  కోవాలి. మీరైతే వెనుకనైనా చేసుకోవచ్చు."     మరునాటి నుండి కోడళ్లు కూడా నూతి దగ్గరకు చేరి వంతులు వేసుకుని నీళ్లు తోడసాగారు. నౌకరికి ఏంచెయ్యాలో తోచలేదు.  "అమ్మా! నాకు సెలవిప్పించండి."  అని వెనుతిరగ్గా చిన్న కోడలు అడ్డుకొని అత్తగారితో " ఇతడిని ఉద్యోగం మానిపించవద్దు. షాపులో వేరే పని అప్పగిద్దాం!" అన్నది.
 "చిన్నకోడలి మంచితనం"తెల్సుకుని అత్త చాలా సంతోషించింది.    చిన్న కోడలు ఇప్పుడు మళ్లీ ఆలోచనలో పడింది. "ఇంట్లో అందరూ వంటలు చేస్తున్నారు.
 పిండి విసురుతున్నారు. నీళ్లు తోడుతున్నారు. ఇక నేనేం చేయాలి? "ఒకనిర్ణయానికి వచ్చింది.     తరువాతిరోజు ఉదయాన్నే వంట  గది చేరుకుని అంట్లు ముందేసుకుని  బూడిద చేతిలోకి తీసుకుని మూల కూర్చున్నది. పనిమనిషి విస్తుపోయి అలాగే నిలబడిపోయింది‌. గబగబా అత్తగారు వచ్చింది.      "ఏమే! నా ముద్దుల కోడలా! ఇది మాత్రం నీకు తగదు.మనకుపనిచేసే
 వాళ్లున్నారు.అంట్లు తోమడం వల్ల   నీ బట్టలు ఖరాబవుతాయి. నీ నగలు అరిగిపోతాయి." అని
 సున్నితంగా మందలించింది. దానికి చిన్న కోడలు " అత్తయ్యా! నన్ను  కాస్సేపు మాట్లాడ నివ్వండి. ఎంగిళ్లెత్తడంలో గొప్ప మాహాత్మ్యము వున్నది. మీరు మహాభారతం లో కథ వినలేదో! పాండవులు రాజసూయాగం చేస్తూ శ్రీకృష్ణుణ్ని ప్రధమంగా పూజ చేసిన విషయం తెలుసు కదా! ఆ కృష్ణ భగవానుడే అక్కడ అందరి యెంగిలి  విస్తళ్లు ఎత్తేపని చేసాడు తెలుసా!  ఎంగిళ్లెత్తటమనేది ఎంత మహిమా న్వితం కాకపోతే భగవంతుడీ పనెందుకు చేస్తాడు?"   తర్వాత రోజు అత్తవచ్చి వంటింట్లో తిష్ట వేసి అంట్లు ముందేసుకుంది. ఈ వింత చూసి కోడళ్లందరూ చుట్టు ముట్టారు. వెంటనే చిన్న కోడలు
 " అత్తయ్యా! ఇలా నా పని మీరు తీసుకోవడం సమంజసం కాదు. ఇదిగో! ఈ పళ్లెం, చిన్న గ్లాసుపై నాకే హక్కు వున్నది. ఎందుచేతనంటే -  ఇవి నా పతిదేవుడివి. కనుక వీటిని
 నేను తోముతాను." అంది. దానికి అత్తగారు " వెళ్లు వెళ్లు! వీడు ముందు నా కొడుకు, తర్వాతనే నీకు భర్త అయ్యాడు.కాబట్టి వీటిని నేనే తోముతాను." ఈ విధంగా అని గబగబా అంట్లు తోమసాగింది. ఇది చూసి కోడళ్లందరూ కూర్చుని వాళ్లూ అంట్లు కడగడం ప్రారంభించారు.   " ఇప్పుడు నేనేంచెయ్యను? అని చిన్న కోడలు ఆలోచనలో పడింది. రోజూ ఉదయం ఇల్లు తుడవడానికి నౌకరు వస్తూంటాడు కదా! అనుకుని  వేకువకాగానే లేచి చీపురు పట్టింది. నౌకరు వచ్చేముందుగానే  గదులన్నీ ఊడ్చిపారేసింది. అత్త గారిది చూసి " చిన్న కోడలా! ఇల్లు
 నువ్వు తుడిచావేమిటి? అని అడగ్గా కోడలు-     " అత్తయ్యా! మీరు కాస్సేపు ఊరుకోండి. మారు మాట్లాడకండి. మీరు మాట్లాడారంటే నా చేతిలో పనిపోతుంది అని ఇంకా ఇలా అన్నది.
   "మీరు రామాయణం వినలేదా! అడివిలో గొప్ప గొప్ప ఋషులు,  మునులు వుండగా శ్రీరాముడు వారి కుటీరాలకు వెళ్లకుండా ముందుగా శబరి కుటీరానికే వెళ్లాడు. ఎందుకో తెలుసాండీ ?శబరి రోజూ పంపాసరో  వరానికివెళ్లే దారిలో రాళ్లూరప్పలని తొలగించి ఋషులకు దారిఏర్పాటు  చేసి వారికి సేవలు చేసేది. ఈ సేవలో గొప్ప మహిమ వున్నది. "      మర్నాటినుండి కోడళ్లందరూ చీపుర్లు పట్టారు. ఈ విధంగా ఇంటి స్వభావం పూర్తిగా మారిపోయింది. అందరూ ఉదయాన్నే లేచి ఎవరి  పనుల్లో వారు మునిగిపోతున్నారు.
 శుభ్రంగా గదులు తుడుస్తున్నారు. నీళ్లు తోడుతున్నారు. అంట్లు  శుభ్రపరుస్తున్నారు.వంటలు వండు కుంటున్నారు. అంతా సవ్యంగా జరిగిపోతున్నాయి. కోడళ్లందరూ అన్యోన్యంగా ఉంటున్నారు.  అత్తామామలను గౌరవంగా చూసు  కుంటున్నారు. దుబారా ఖర్చులు తగ్గిపోయాయి. యజమాని వ్యాపారంలో లాభం పెరిగింది. వెంటనే మామగారు కోడళ్లందరికీ
 నగలు చేయించారు.     ఒకరోజు చిన్న కోడలు తనకు మామగారిచ్చిన నగలు తీసుకుని పెద్ద కోడలు వుంటున్న గదిలోనికి వెళుతూండగా అత్త  చూసింది.    చిన్న కోడలు పెద్ద కోడలితో ఇలా అంటున్నది.     " అక్కా! మీకు ఆడపిల్లలు వున్నారు. వారు పెరుగుతున్నారు. రేపో,మాపో వారికి పెళ్లిళ్లు చేయాలి.  నాకైతే ఇంకా పిల్లలు లేరు. అందు వల్ల ఈ నగలు నేనేం చేసుకోను? మా అమ్మానాన్న నాకు నగలు బాగానే పెట్టారు. అవన్నీ నాదగ్గర ఇనప్పెట్టెలో పడి వున్నాయి. కాబట్టి ఈ నగలు నువ్వే తీసుకో! పిల్లల పెళ్లిళ్లకి అక్కరకొస్తాయి." అని ఆమె చేతిలో పెట్టింది. గుమ్మం బయట నుండి ఇదంతా గమనిస్తున్న  అత్త  ఒక్కసారిగా చలించి పోయింది. కొసమెరుపు: ఉపన్యాసాలు చెప్పడం వేరు. ఆచరణలో చూపడం వేరు.ఈకొత్త కోడలు తాను చెప్పినది  ఆచరణ చేసి చూపించింది. ఇంటిని సంస్కరణ బాటలోకి నడిపించింది. (వివేక చూడామణి.) స్వామీజీ వ్రాసిన పుస్తకం నుండి సేకరణ)
--((***))--
--((***))--

1) మీకు ఉదయం అల్పాహారం లేనప్పుడు కడుపు భయపడుతుంది.

 (2) మీరు 24 గంటల్లో 10 గ్లాసుల నీరు కూడా తాగనప్పుడు మూత్రపిండాలు భయపడతాయి.

 (3) మీరు 11 గంటల వరకు నిద్రపోకపోయినా, సూర్యోదయానికి మేల్కొనకపోయినా పిత్తాశయం భయపడుతుంది.

 (4) మీరు చల్లని మరియు పాత ఆహారాన్ని తినేటప్పుడు చిన్న ప్రేగు భయపడుతుంది.

 (5) మీరు ఎక్కువ వేయించిన మరియు కారంగా ఉండే ఆహారాన్ని తినేటప్పుడు పెద్ద ప్రేగులు భయపడతాయి.

 (6) మీరు సిగరెట్లు మరియు బీడీ యొక్క పొగ, ధూళి మరియు కలుషిత వాతావరణంలో he పిరి పీల్చుకున్నప్పుడు lung పిరితిత్తులు భయపడతాయి.

 (7) మీరు భారీగా వేయించిన ఆహారం, జంక్ మరియు ఫాస్ట్ ఫుడ్ తినేటప్పుడు కాలేయం భయపడుతుంది.

 (8) మీరు మీ భోజనాన్ని ఎక్కువ ఉప్పు మరియు కొలెస్ట్రాల్‌తో తిన్నప్పుడు గుండె భయపడుతుంది.

 (9) రుచి కారణంగా మీరు ఉచితంగా తిని, ఉచితంగా లభిస్తే క్లోమం భయపడుతుంది.

 (10) మీరు చీకటిలో మొబైల్ మరియు కంప్యూటర్ స్క్రీన్ వెలుగులో పనిచేసేటప్పుడు కళ్ళు భయపడతాయి.

 మరియు

 (11) మీరు ప్రతికూల ఆలోచనలను ఆలోచించడం ప్రారంభించినప్పుడు మెదడు భయపడుతుంది.

 మీ శరీర భాగాలను జాగ్రత్తగా చూసుకోండి మరియు వారిని భయపెట్టవద్దు.


 ఈ భాగాలన్నీ మార్కెట్లో అందుబాటులో లేవు.  అందుబాటులో ఉన్నవి చాలా ఖరీదైనవి మరియు మీ శరీరంలో సర్దుబాటు చేయలేవు.  కాబట్టి మీ శరీర భాగాలను ఆరోగ్యంగా ఉంచండి.  మీరు ఆరోగ్యంగా ఉండటానికి క్రమంగా యోగా, ధ్యానం లేదా ఎలాంటి కార్యకలాపాలు చేయండి

*ధ్యానము యొక్క చివరి ఫలితమే సాక్షాత్కారము.*
🕉🌞🌎🌙🌟🚩

  *పరబ్రహ్మ యొక్క భౌతిక రూపమే ఈ సమస్త ప్రపంచము.*


   *నీవు ఈ జగత్తులో భగవంతుని చేరలేకపోతే, హిమాలయ గుహలలో కూడా నీవు భగవంతుని కనుగొనలేవు.*


*మానవుడు సంసారములో కొట్టుకొని పోవుచున్నప్పుడు గట్టిగా పట్టుకొని సంరక్షింపబడు దైవప్రార్ధన ఒక పెద్ద బండరాయి వంటిది.*


  *ప్రేమ కళ్ళతో చూచునది కాదు . హృదయంతో మాత్రమే తెలియబడునది.*


*నిన్ను మంచితనము నుండి లాగివేసి దైవమునకు దూరము చేయుచున్నది ఏదో అదియే అధర్మము.*


*నీవు శాశ్వతమైన పదార్ధము అభిలషింతువేని, వ్యర్థమైనట్టి ఈ ప్రాపంచిక వస్తువులను త్యజించుము.*


 *సంతృప్తికి మించిన ధనాగారము లేదు. సత్యమునకు మించిన సద్గుణము లేదు. బ్రహ్మానందంనకు మించిన  ఆనందము లేదు. ఆత్మకు మించిన ఉత్తమ స్నేహితుడు  లేడు.*


*అహంకార నిర్ములనమే ఆత్మసాక్షాత్కారమునకు ముఖ్యనియమము అయి ఉన్నది.*


**అధైర్యముగా , నిర్జీవం గా ఉండుట నీ స్వభావం కాదు.ఎందుకంటే , నీయందు సర్వశక్తి వంతుడు అగు పరమాత్మ ఉన్నాడు.*


*బంధమోక్షంలు ఆత్మ యందు లేవు  అవి మనస్సు యందే ఉన్నవి.*


*త్యాగవైరాగ్యములు, అహంకారము స్వార్ధపరత్వమును  నిర్ములించుటకై యున్నవి.*


 *ఒకే ఒక పరబ్రహ్మము జీవుడు , జగత్తు , ఈశ్వరుడు అను మూడు రూపములలో కనపడుచున్నది.*

🕉🌞🌎🌙🌟🚩


 🌻🌻 *శుభోదయం*🌻🌻
*జై శ్రీమన్నారాయణ !!* 
12-10-2019 శనివారం
శ్రీ వికారి నామ సం।।రం।। దక్షిణాయనం
శరదృతువు; ఆశ్వయుజ మాసం; శుక్ల పక్షం
చతుర్దశి: రా. 11.37 తదుపరి పూర్ణిమ
పూర్వాభాద్ర నక్షత్రం: పూర్తి
అమృత ఘడియలు: రా. 2.46 నుంచి 4.32 వరకు
వర్జ్యం: సా. 4.08 నుంచి 5.54 వరకు
దుర్ముహూర్తం: ఉ. 5.55 నుంచి 7.28 వరకు
రాహుకాలం: ఉ. 9.00 నుంచి 10.30 వరకు
సూర్యోదయం: ఉ.5-55; సూర్యాస్తమయం: సా.5.39.
🍚 *ఆకలి విలువ.*🍚
బంధువుల పెళ్లి కని బయల్దేరాము. బాగా ఆకలి వేస్తే ఒకచోట హోటల్ చూసి ఆగాము. తలా ఒక్కో  ప్లేట్ ఆర్డర్ చేసి తిన్న తరువాత, బాగా ఆకలిగా ఉందని మరో ప్లేట్ ఆర్డర్ చేసి తెప్పించుకున్నారు మా అమ్మాయిలిద్దరు..

టిఫిన్ సగం తిని, సగం  వదిలేసి  మధ్యలోనే లేచి వెళ్లి చేతులు కడిగేసారు.   మిగిలి పోయిన టిఫిన్  చూసి నా మనసులో కళుక్కుమంది.  ఆకలి వేసి తెప్పించుకున్నారు కదా మొత్తం తింటారనుకున్నగాని ఇలా వదిలేస్తారనుకోలేదు.

దారి మధ్యలో ఒకదగ్గర పుచ్చకాయముక్కలు కోసి ఐస్ పైనపెట్టి  ఒకప్లాస్టిక్ ప్లేటులో ఆ ముక్కలు ఉంచి, వాటిమీద  ఉప్పు చల్లి  అమ్ముతున్నారు. అవి తిందామని బతిమాలి కారు ఆపించారు.  ఇక్కడా అదే తంతు. అందరం తిన్నతరువాత మరో ప్లేటు ఆర్డర్ చేసి, సగం తిని సగం వదిలేసారు. ఈ సారి వారిలో నా శ్రీమతి కూడా చేరింది.  మరోసారి బాధపడి, నోరుచేసుకోకుండా ఊరుకున్నాను.  వద్దని వారిస్తే పిసినారి పైసా పోనియడు, తాను తినడు, తినేవారిని  తిననియడు అని తిట్టుకుంటారని నోరు కట్టేసుకున్నాను. అంగరంగవైభవంగా అలంకరించిన వేదిక. వచ్చి పోయే అతిథులతో పెళ్లి మండపం కిటకిటలాడిపోతుంది.  వేదికముందు కుర్చీలలో కూర్చున్నవారికి కూల్ డ్రింకులు అందిస్తున్నారు. 

కూల్ డ్రింక్ తాగిన  వారిలో చాలా మంది సగం వదిలేశారు.  పెళ్ళి వారిని పలకరించి, భోజనాలవైపు బయలుదేరాము.  ఎన్నిరకాల వంటకాలు పెట్టారో, లెక్కపెట్టడానికే పదినిమిషాలు పడుతుంది.  నాకైతే చూసాకే సగం కడుపు నిండిపోయింది.  భోజనాల దగ్గర జనాలను చూస్తుంటే  కరువు ప్రాంతాలనుండి వచ్చిన వారిలాగా ఎగబడుతున్నారు.  జీవితంలో ఏనాడు అలాంటి పదార్థాలు చూడలేదు ,తినలేదు ,ఇప్పుడు  తినకపోతే జీవితం ఇంతటితో ముగిసిపోతుంది అన్నంతఇదిగా ఎగబడ్డారు.. ఎంత వడ్డించుకుంటున్నారో,ఎంతతింటున్నారో, ఎంతవదిలేస్తున్నారో వారికే తెలియడంలేదు. వడ్డించిన భోజనంలో సగం వృధాగా పోతుంది.  అక్కడ జరుగుతున్న తతంగమంత గమనిస్తూ ఆలోచనలో పడిపోయిన నన్ను మా అమ్మాయి పిలిచింది భోజనానికి. చేతిలో పళ్లెంతో దానినిండా పదార్థాలు. కలుపుకోవడానికి కూడా చోటులేదు. అది చూసి అన్నం తినబుద్దికాలేదు.  నాకు ఆకలిగాలేదు మీరు తినండి అని వారిని పురామయించి, ఓ పక్కన కూలబడిపోయాను.

అక్కడినుండి వస్తుంటే ఎవరో ఇద్దరు కూలీలు పల్లాలలలో వదిలేసిన భోజనాన్ని డేగిసలో నింపి గోడవతల విసిరేస్తున్న దృశ్యం కనిపించింది. వెంటనే మా అమ్మాయిలిద్దరిని పిలిచి చూపించాను.  నోరెళ్ళబెట్టి చూసారు, కానీ వారి ముఖంలో ఏ రకమైన భావాలు కనిపించలేదు. నాకు మాత్రం గుండెల్లో దేవినట్లు,కాలికింద నేల కదిలిపోయినట్లు అనిపించింది. తిరుగుప్రయణంలో, నా మనసంతా వృధా అవుతున్న భోజనం చుట్టే తిరిగింది. ముభావంగా ఉండిపోయాను.

ఏమైంది నాన్నా?

పిల్లలిద్దరూ పిలిచేసరికి ఆలోచనల్లోంచి తేరుకుని, ఒక్కక్షణం ఆగి, జేబులోనుండి వందరూపాయల నోటు తీసి బయటపడేయమని నా శ్రీమతి చేతిలో పెట్టాను. అకస్మాత్తుగా నేనలా చెప్పేసరికి విస్తుపోయి చూసింది.   నేను కల్పించుకుని, నువ్వు విన్నది నిజమే  వందరూపాయల నోటు బయటపడేయమన్నాను.  మరోసారి చెప్పాను.  ఎమ్మాట్లాడుతున్నారండి మీరు. భోజనాల దగ్గరనుండి చూస్తున్నాను. ముభావంగా ఉంటున్నారు.

ఏమిమాట్లాడటంలేదు, ఏమైందని పలకరిస్తే, వందరూపాయలు బయటపాడేయమంటారా? 

గాలిగాని సోకిందా, విసురుగా చూసింది.

ఒకవంద రూపాయల నోటు బయటపడేయమంటేనే నీకు అంతకోపం వచ్చింది కదా....?   పొద్దున్నుండి మీరు హోటల్లో టిఫిన్, పుచ్చకాయముక్కలు, పెళ్లిభోజనాల దగ్గరకూరలు. దిలేసిన వచ్చిన వాటి విలువ ఎంతో తెలుసా?   మీ ముగ్గురివి కలిపి దాదాపు వెయ్యి రూపాయలు అవుతుంది తెలుసా? అంటే మీరు వేయి రూపాయలు బయటపడేసారు.నేను వందరూపాయల నోటు విసిరేయడం పిచ్చయితే  మీరు అవసరాన్ని మించి భోజనం వడ్డించుకుని, వదిలేయడం పిచ్చి కాదా? అన్నం పరబ్రహ్మ్ స్వరూపమన్నారు. అలాంటి అన్నాన్ని పడేసి మనం దైవాన్ని అవమానించినట్లు కాదా?వృధాగా పడేసే అన్నం ఒక పేదవాడి ఆకలి తీరుస్తుంది. మనం భోజనాన్ని వృధా చేయక పోతే ప్రతి సంవత్సరం వందల కోట్ల రూపాయల దుర్వినియోగాన్ని ఆపినట్లే లెక్క. నేను ఆవేశంగా చెబుతున్నమాటల్ని అడ్డుకుంటు .... మీరొక్కరే అనుకుంటే సరిపోతుందా డాడీ, అడిగింది మా అమ్మాయి. అవునమ్మా  చిన్నచిన్న నదులు కలిసి సాగితేనే మహానదులు ఏర్పడతాయి.
ఒక్కొక్కనీటిచుక్క కలిసి కుంభవృష్టి వర్షం అవుతుంది. వేల మైళ్ళ గమ్యమైన ఒక్కఅడుగుతోనే మొదలవుతుంది. చెప్పడం ఆపేసాను.
అందరూ ఆలోచనల్లో పడిపోయారు. "మార్పు కి బీజం పడినట్లే......
ధన్యవాదములు 
🙏👏👏🙏
చైతన్యగీతం
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

కనికరము చూప వేమి 
కాసులు ఇవ్వ లేదని కోపమా ... 
కినుకు వహించి యున్నావేమి
నీలాలు అర్పించి తెలుపుతున్నా  చేసిన పాప
మ్ము

కాలం విలువ తెలియ లేక 
నీవు నిర్ణయించిన దాన్ని తృణీకరించా
స్పదన భావాలు రాయలేక
అక్షరసాహిత్యం తెల్సి కూడా అగౌరపరిచా
అందుకే నిన్ను వేడుకుంటున్నా శ్రీ వెంకటేశా 
  
గ్రంధాల విలువలు అర్ధం చేసుకో లేక
గ్రంథ చోరులకు నేను సహకరించా
మనసు తపించి మననం చేసుకోలేక
మదిని వక్రమార్గానా నడిపించా 
అందుకే నిన్ను వేడుకుంటున్నా
శ్రీ వెంకటేశా

కళ్లకు కప్పిన మాయపొరను తీయలేక
కనిపించిన సుందర దృశ్యాన్ని ఆస్వాదించా      
హృదయ స్పదన విలువ తెలుసుకోలేక
ప్రేమను అందించిన వారినే ఏడిపించా  
అందుకే నిన్ను వేడుకుంటున్నా
శ్రీ వెంకటేశా

అందాలు మనస్సుకు చేరిన గుర్తించలేక  
నిజం తెలియక స్వప్నాలు నిజమని అనుకరించా
నాకవితకు మూలం నివేనని నమ్మలేక
నమ్మి వేదనతో భావకవిత్వాన్ని తెలియపరిచా
అందుకే నిన్ను వేడుకుంటున్నా
శ్రీ వెంకటేశా

సంఘములోని దుశ్చర్యలు వీక్షిస్తూ ఉండలేక
కడుపులోని బాధను కక్కాలని తలంచా 
కానరాని దెబ్బల కౌగిలిని చేరా ఓర్వలేక
ఆవేశం పదాలను గుట్టలుగా క్రుమ్మరించా 
అందుకే నిన్ను వేడుకుంటున్నా
శ్రీ వెంకటేశా
 
ప్రకృతి విలువను కనికరించలేక
భూమాతకు భారంగా నిలిచా
అస్త్రాలున్నాయని అహాన్ని విడువలేక
ప్రాణు లన్నిటిని మనసుతో వేధించా
అందుకే నిన్ను వేడుకుంటున్నా
శ్రీ వెంకటేశా

మంచికి ప్రాణాన్ని అందించ లేక
చేదు వెంట నడిచి తీపిని మరిచా 
వేడుకుంటున్నా గత్యంతరం లేక
అందుకే చేతులెత్తి దండం పెట్టి పిలిచా
నిన్నే నమ్మి వేడుకుంటున్నా
శ్రీ వెంకటేశా

కనికరము చూపవేమి 
కాసులు ఇవ్వలేదని కోపమా
కినుకు వహించియున్నావేమి
నీలాలు అర్పించి తెలుపుతున్నా చేసిన పాపమ్ము 

 --((***))--



కొండపైన వేంకటేశ్వరుడు, కొండక్రింద అలివేలుమంగమ్మ ఏకమై
మా కష్టాలు కడతేర్చి సుఖ సౌఖ్యాలు అందించగా దూరంగా ఉండక దగ్గరగా రావమ్మా     

చైతన్య గీతం
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

అమ్మా నీవెట్లా ఉన్నావమ్మా అయ్యను మరచి దూరంగా
అయ్య గారి కోసం వేయి కన్నులతో వేచి ఉన్నావమ్మా
జీవయాన స్వర్గసీమను మరచి ప్రజల కొరకు దూరంగా  
వేంకటేశ్వరునికి ప్రణయ దేవతవైన రారాణి వమ్మా
 
తనువులో ఏకం చెందక హృదయాన్ని విడిచి దూరంగా
దివి నుంచి దిగి వచ్చిన సుర భామినివి నీవే కదమ్మా
ఉంచావు పెదవుల ఆదరామృతాన్ని రుచి చూపక దూరంగా  
వేంకటేశ్వరునికి బీడు బారిన ఎడారిగా మార్చకమ్మా 

కౌగిలిలో మధుర భావనలు చూపి సేదతీర్చక దూరంగా
చీకటి వెలుగులమధ్య చీకు చింతా లేక ఉన్నావమ్మా
ఉంచావు సొగసుకన్నులు చంచలమై కవ్వించక దూరంగా
వేంకటేశ్వరుని ధనువు విలవిల్లాడిపోతోందామో తెలియదమ్మా
 
కాలి అందెల సవ్వడితో గుండెలో అలజడి రేపి దూరంగా
మనసు కురుల నీడను కల్పించక పగలు రేయ్ మరిచావమ్మా
పరువం చూపి చిలిపి గాలికి ఉడికి ఉడికించి దూరంగా  
వేంకటేశ్వరునికి పలుకులతో ముచ్చడించి మురిపించవమ్మా  
--(())--


సద్భక్తులను కాపాడే శ్రీ వెంకటేశ్వరుఁడు || ||సమ్మోహుడై యుండి||
రాగం : హిందోళం

సమ్మోహుడై యుండి సత్యుడై వెలుగొందు
ధర్మాత్ముడై యుండి ధర్మమై తానుండు 
న్యాయత్ముడై యుండి బ్రహ్మమై తానుండు  
సద్భక్తులను కాపాడే శ్రీ వెంకటేశ్వరుఁడు || ||సమ్మోహుడై యుండి||

యేశక్తి  లోకంబు లెల్ల నేలెడు నాత
డే శక్తి  బ్రహ్మాదులెల్ల వెదకెడు నాత
డే శక్తి  నిజమోక్ష మియ్యజాలెడు నాత
డే శక్తి  లోకైక హితుడు|| ||సమ్మోహుడై యుండి||

యే శక్తి  నిజమూర్తి యేమూర్తి యునుగాడు
యేశక్తి  త్రైమూర్తు లేకమైన యాత
డేశక్తి  సర్వాత్యుడేమూర్తి పరమాత్ము
డాశక్తి  తిరుమల వేంకటేశ్వరుడు || ||సమ్మోహుడై యుండి||

యే దేవి దేహమున నిన్నియును జన్మించె
నేదేవి దేహమున నిన్నియును నఱగెమరి
యేదేవి విగ్రహంబీ సకల మింతయును
యేదేవి నేత్రంబు లిన చంద్రులు|| ||సమ్మోహుడై యుండి||

యే స్వామిడీ జీవులన్నింటిలో నుండు
నేస్వామి చైతన్య మిన్నిటికి నాధార
మేస్వామి డవ్యక్తుడే స్వామిడద్వంద్వుం
డాస్వామిడీ తిరుమల వేంకటేశ్వరుడు || ||సమ్మోహుడై యుండి||
--(())--

 

No comments:

Post a Comment