Thursday, 3 October 2019

" శివగీత -






 🌹. శివగీత  - 1  / The Siva-Gita - 1 🌹
 🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. ఉపోద్ఘాతము 🌻

తెలుగు వారికి భగవద్గీత సుపరిచితము. శివగీత అపరిచితము. శివుడు జ్ఞానమునకు మూలమైనవాడు, విశ్వప్రభువు. శివజ్ఞాన సర్వస్వమెరిగిన వాడే సమగ్రపండితుడు.

భగవద్గీత నర-నారాయణుల మధ్య జరిగిన చర్చ. శివగీత శ్రీరాముడు - పరమేశ్వరుడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. ఇది అమూల్యము. అతి రహస్యము. జ్ఞానము అర్హులకు లభించవలెనంటే అది రహస్యముగా ఉండవలసి ఉంటుంది. 

జ్ఞానమునకు మూల్యము నిర్ణయించగలవారు ఏ లోకములోనూ లేరు. భగవాన్ వేదవ్యాస మహర్షి కృపవలన ఈ అమూల్యమైన జ్ఞానము పద్మపురాణాంతర్గతముగ ఆస్తికులకు లభ్యమైనది.

భగవద్గీత వలెనే శివగీత కూడా పద్ధెనిమిది అధ్యాయములు కలిగి ఉన్నది. అక్కడ 'పార్థాయ ప్రతిబోధితాం' అని ప్రారంభమైతే, ఇక్కడ 'రామాయ ప్రతిబోధితాం' అని మొదలవుతుంది.

శ్రీరాముడు తారకనామబ్రహ్మము. నారాయణుని అవతారము కేవలము లోకహితార్థము శ్రీరాముడు ఉపాధిగా ఈ శివగీత ఉద్భవించినది. ఇది జ్ఞాన సుధాసాగరము. 

భక్తులకు సులభగ్రాహ్యము గావించుటకు సంక్షిప్తం చేయబడినది. ఇది నిత్యపారాయణ గ్రంథము. చదివిన కొద్ది శివభక్తి స్థిరపడుతుంది.
🌹 🌹 🌹 🌹 🌹

 శివగీత  - 2 / The Siva-Gita - 2 🌹
 🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

ప్రధమాధ్యాయము
🌻. భక్తి నిరూపణ యోగము  - 1 🌻

సూత ఉవాచ :
01. అధాత స్సం ప్రవక్ష్యామి - శుద్ధ కైవల్య ముక్తిదమ్,
అనుగ్రహాన్మ హేశస్య- భవ దుఃఖ స్య భేషజమ్ 1

శ్రీ శౌనకాది మహర్షుల గూర్చి సూతుం డిట్లు వాక్రుచ్చెను:

ఓయీ ముని పుంగవులారా! శ్రీ పరమాత్మ పరశివ మూర్తి యొక్క  అనుగ్రహము వలన, పరమ పునీతమగు, సంసార మనెడు ఔషధ ప్రాయమైన బ్రహ్మ స్వరూప కైవల్యమును మోక్ష ప్రదమగు జ్ఞానమును  నేను మీకు బోధించు చున్నాను.

02. న కర్మణా మనుష్టానై - ర్న దానై స్వపపాసివా,
కైవల్యం లభతే మర్త్య ! - కింతు జ్ఞానేన కేవలమ్ .2

ఎటువంటి పుణ్య కర్మల ననుష్టిం చుట వలనను,  ఎలాంటి తపో నుష్టాన ముల జేయుట వలనను  కైవల్య పద ప్రాప్తిని పొందలేడు. ఐతే కేవల మొక దివ్య జ్ఞానము వలననే కైవల్య ప్రాప్తి కలుగును .

03. రామాయ దండకారణ్యే - పార్వతీ పతినా పురా ,
యాప్రోక్తా శివ గీతాఖ్యా - గుహ్యా ద్గుహ్యాత మాపిసా 3

04. యస్యా శ్శ్రవణ మాత్రేణ - నృణాం ముక్తి ర్ద్రువా భవేత్,
పురా సనత్కుమారాయి - స్కందే నాభి హిఆ హి సా 4 

పూర్వ కాలమున దండ కారణ్యములో శ్రీరామునకు శంకరుని  చేత ఏదైతే ప్రధమమున బోధించ బడినదో, ఏదైతే పరమ గోప్యంబగు నదియు , దేనినీ ఆలించుట చేతనే మానవులకు  నిత్య (శాశ్వత) కైవల్యము లభించునో అట్టి శివ గీతను సనత్కుమారునకు షణ్ముఖ స్వామి బోధించెను.

05. సనత్కుమార : ప్రోవాచ - వ్యాసాయ ఋషి సత్తమా ,
మహ్యం కృపాతి రేకేణ - ప్రదదౌ బాధ రాయణః 5

తరువాత నా సనత్కుమారుడు వ్యాసునకు బోధించిన వాడయ్యెను. అట్టి వ్యాస మహర్షి నా యందు అనుగ్రహము కలవాడై  నాకు బోధించి యున్నాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శివగీత  - 3 / The Siva-Gita - 3 🌹
 🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

ప్రధమాధ్యాయము
🌻. భక్తి నిరూపణ యోగము  - 2 🌻

06. ఉక్తంచ తేన కస్మైచి - న్న దాతవ్య మిదం త్వయా ,
సూత పుత్రాన్య ధా దేవా! - క్షుభ్యంతి చ శపంతి. 

మరల చిత్త గింపు మని యుద్భోధించి దీనిని యితరుల కెవ్వరికిని బోధింప వలదనియు, దీని నుల్లం ఘించిన యెడల దేవత లావేశపరులై శపించ గలరని యాదేశించెను.

07. అధ పృష్టో మయా నిప్రో - భగవాన్బాద రాయణః
భగవన్! దేవతా స్సర్వా ! - క్షుభ్యంతి చ శపంతి. 

08. తాసా మత్రాస్తి కా హాని - ర్యయా కుప్యన్తి దేవతా,
పారాశ ర్యోధ మామాహ - యత్ప్రుష్టం శృణు వత్సల ! 

ఇంతటితో నేను ఓయి ముని పుంగవా ! ఇటులేల బలుకు చున్నారు.  ఈ శివ గీతను ఇతరులు దెలుసు కున్నంత మాత్రమున దేవతలకు కలిగే చెరుపే ( నష్టమేమి )? అలా కోపగించుటకు హేతువేమి?  ఎందులకు శపింతురు. అని ప్రశ్నింపగా వేదవ్యాసుడు నా యందు  గల శిష్య వాత్సల్యముతో నిట్లాదేశించెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శివగీత  - 4 / The Siva-Gita - 4 🌹
 🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

ప్రధమాధ్యాయము
🌻. భక్తి నిరూపణ యోగము  - 3 🌻

09. నిత్యాగ్ని హోత్రి ణో విప్రు స్సన్తి ఏ గృహ మేధిన :
త ఏవ సర్వ ఫల దాస్సు - రాణాం కామదేనవ :

10. భక్ష్యం భోజ్యం చ పేయం చ - యద్యదిష్టం సుపర్వణామ్,
అగ్నౌ హుతేన హవిషా - తత్సర్వం లభ్యతే దివి 

11. నాన్య దస్తి సురేశానా - మిష్ట సిద్ది ప్రదం దివి,
దోగ్ద్రి దేనుర్య ధా నీతా - దుఃఖ దా గృహ మేదినామ్ 

12. తధైవ జ్ఞాన వాన్ విప్రో - దేవానాం దుఃఖ దో భవేత్,
త్రిద శాస్తేన విఘ్నన్తి - ప్రవిష్టా విషయం నృణామ్ 

ప్రపంచములో నెల్లప్పుడు ద్విజ శ్రేష్టుడు గృహస్తాశ్రమం లో నుండి జ్యోతిష్టో మము మొదలగు యజ్ఞములు చేయుచు, అమరవరుల కేయే వస్తువులు ఇష్టములో నాయా భక్ష్య భోజ్య , చోష్య పానాదులు బర్హిర్ముఖ శ్రేష్టులకు అగ్ని ద్వారా హవ్య దానం బొనర్చుచున్నాడో అతడే బృందా రకుల పాలిటికి గల్ప వృక్షము వంటి వాడు, ఆ దేవతల అంతులేని ఆనంద భరితులై నిర్మల మనస్కులై యగ్ని  ద్వారా సమర్పించు వాటిని ప్రేమతో గైకుందురు.

కావున మానవుండైనను అమరుల కధిక ఆనంద దాయకము లైన యద్వరంబులను గావించి, వారి వారికి వహ్ని ద్వారా బలిని  సమర్పించు చుండవలెను. అట్లు చేయకుండ యోగాద లొనర్చి,  అమరులను విస్మరించి, కర్మలను త్యజించి వర్ణనా తీతమైన ఆనందాను భవ తృప్తీ నొంది న వాడైన ఎడల క్రతు భుక్తులు తమ కోరికలు దీరకుండుట వలన అసంతృప్తి చేత కుపితులై శాపింప బడుదురు 

మరియు, పాల నొసగు గోవును మరొకడు వేరు మార్గమున గొనిపోవ న గృహస్థుడు ఎంతటి వ్యధ గలవాడై చింతించి వెదకి మరల తన మార్గమునకు మరల్చు కొనునో,  అదే రీతిగా దేవతలు మిగుల విచారము గలవారై తమ మార్గమును  బరిత్య జించి మోక్ష గామి యగు వానిని యనేక విధముల ఆటంకము లనే గల్పించి ముందుకు బోనివ్వ కుండా అన్య మార్గమునకు బ్రవేశింప చేతురు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శివగీత  - 5  / The Siva-Gita - 5 🌹
 🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

ప్రధమాధ్యాయము
🌻. భక్తి నిరూపణ యోగము  - 4 🌻

13. తతో న జాయతే భక్తి - శ్శివే కస్యాపి దేహినః,
తస్మాద విదుషో నైవ - జాయతే శూల పాణినః 

14. యధా కధం చిజ్ఞాతాపి మధ్యే విచ్చిధ్యతే నృణామ్,
జాతం వాసి శివ జ్ఞానం - విశ్వాసం నభ జత్యలమ్

అందుచేత నెవడి కైనను, పరమ శివుని పై భక్తి యంకురింపదు. ఆ కతంబున, పరమ శివుని పై భక్తి కలుగ కుండును. ఇది నిస్సందేహము అట్లు కాకుండ యే ప్రకారము గానో ఎంతో  ప్రయత్నము తోడనో పరమ శివుని పై భక్తి కలిగినా, అది మధ్యనే కొంత సమయమునకు అనేక అడ్డంకు లేర్పడి నిష్పలమగును.  అటుల కానిచో భక్తి చేత ప్రేమ అంకురించుట క్వాచిత్కము.

15. యద్యేవ్యం దేవతా విఘ్నమా చ రన్తి తనూబృతామ్,
పౌరుషం తత్ర కస్యాస్తి - యేన ముక్తిర్భ విష్యతి? 
సత్యం సూతాత్మజ! బ్రూహి - తత్రో పాయోస్తి వానవా ? 

అది విని, శౌనకాదులు సూతుని గురించి యిట్లు పలికిరి ! ఓయీ సూతకుమారా!  ఈ విధముగా నమరులు తమ యధికారము మేరకు తృప్తి నొందని మానవు లాచరించు జ్ఞాన పద్దతికి పలు  అడ్డంకులు కలిగించిన ముక్తి పదంబును పొందుటెట్లు.?  
పౌరుషము కలవాడు (పట్టుదల కలవారు ) వారొడ్డిన ఆటంకములను  తొలగించే మార్గమేదైన కలదా ? అట్లుండినచో నా విధము మాకు తెలుపుమని అడుగగా సూతుండిట్లు పలికెను :

16. కోటి జన్మార్జి తై: పుణ్యై - శ్శివే భక్తి: ప్రజాయతే
ఇష్టా పూర్తా కర్మాణి - తేనా చరతి మానవః 

కోటి జన్మల నుండి సంగ్రహించిన పుణ్య ఫలము (సుకృతము వలన ) మహేశ్వరుని పై భక్తి కుదురుతుంది. 

అందుచేత (ఆ కారణమున ) మానవుడు తన ఇష్టానుసారముగా అనుష్టానము నాచరించుట, తటాకములను  ద్రవ్వించుట,  వృక్షములను నాటించుట చలి వేంద్రములను పెట్టించుట,  క్షుదార్తులకు అన్న సత్రములను పెట్టించుట మొదలగు పుణ్య కార్యములను చేయ బూనెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹. శివగీత  - 6  / The Siva-Gita - 6 🌹
 🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

ప్రధమాధ్యాయము
🌻. భక్తి నిరూపణ యోగము  - 5 🌻

శివార్పణ దియా కానూ - న్పరిత్యజ్య యధావిధి: 17

18. అనుగ్ర హాత్తేవ శంభో -ర్జాయతే సుద్రుడో నర;
తతో భీతా; పలాయన్తే - విఘ్నం హిత్వా సురేశ్వరా: 

దాని వలన మానవుడు తన కోరికలను వీడి నిష్కామము గలవాడై  శివార్పణ బుద్ది చేత సత్కర్మల ననుష్ఠించుట వలన అతడు శివాను గ్రహమునకు పాత్రుడై సంకల్ప సిద్దులను పొందును.  అట్టి యమూల్యమైన శివానుగ్రహము చేత నాతని సుఖములకు జరుగపోవు నాటంకములు సమసి పోవుటే గాకుండా  అమరులు సఫలీ భూతంబు లగు కర్మలు పసిగట్టి పరమ శివుని యనుగ్రహము వలన దమకెటువంటి చెరుపు (నష్టము ) కలుగునో  యని భయముతో నాతడు చేపట్టిన కార్యములకు ఏ విధమైన  ఆటంకములను కలిగింపక పలాయన మగుదురు.

19. జాయతే తేన శుశ్రూషా - చరితే చంద్ర మౌళిన:
శృణ్వతో జాయతే జ్ఞానం - జ్ఞానా దేవి విముచ్యతే 

అందువలన మానవుడెల్లప్పుడు శివార్పణ బుద్ది కలిగి నిష్కామముతో శివార్చన శివ కధా శ్రవణాదులందు జ్ఞానార్జనను గావించు కొనును.  దాని ప్రభావమున సంసృతి మోక్షమును పొందును.

20. బహునాత్ర కిముక్తేన - యస్య భక్తి శ్శివే దృడా,
మహాపాపో పపాపౌఘ - కోటి గ్రస్తో విముచ్యతే 

వేయేల ఏ భక్తుడి కైతే పరమశివుని యందు దృడమై నిర్మలమగు భక్తి కలుగునో అట్టివాడే మహా పాపముల చేతను ముక్తుడగును.

21. అనాధ రేణ శాట్యేన - పరిహాసై ర సూయయా,
శివ భక్తి రతశ్చేత్స్యా - దంత్య జో సివి ముచ్యతే 

అస్పృశ్యు డైనను, కారణ మేమియు లేకుండ గాని, వంచ కత్వముతో గాని , పరిహాసమునకు గాని , ఈర్ష్య చేత గాని శివుని యందు భక్తి యంకురించిన యెడల అటువంటి వాడు సమస్త పాపముల నుండి ముక్తుడగును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹. శివగీత  - 6  / The Siva-Gita - 6 🌹
 🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

ప్రధమాధ్యాయము
🌻. భక్తి నిరూపణ యోగము  - 5 🌻

శివార్పణ దియా కానూ - న్పరిత్యజ్య యధావిధి: 17

18. అనుగ్ర హాత్తేవ శంభో -ర్జాయతే సుద్రుడో నర;
తతో భీతా; పలాయన్తే - విఘ్నం హిత్వా సురేశ్వరా: 

దాని వలన మానవుడు తన కోరికలను వీడి నిష్కామము గలవాడై  శివార్పణ బుద్ది చేత సత్కర్మల ననుష్ఠించుట వలన అతడు శివాను గ్రహమునకు పాత్రుడై సంకల్ప సిద్దులను పొందును.  అట్టి యమూల్యమైన శివానుగ్రహము చేత నాతని సుఖములకు జరుగపోవు నాటంకములు సమసి పోవుటే గాకుండా  అమరులు సఫలీ భూతంబు లగు కర్మలు పసిగట్టి పరమ శివుని యనుగ్రహము వలన దమకెటువంటి చెరుపు (నష్టము ) కలుగునో  యని భయముతో నాతడు చేపట్టిన కార్యములకు ఏ విధమైన  ఆటంకములను కలిగింపక పలాయన మగుదురు.

19. జాయతే తేన శుశ్రూషా - చరితే చంద్ర మౌళిన:
శృణ్వతో జాయతే జ్ఞానం - జ్ఞానా దేవి విముచ్యతే 

అందువలన మానవుడెల్లప్పుడు శివార్పణ బుద్ది కలిగి నిష్కామముతో శివార్చన శివ కధా శ్రవణాదులందు జ్ఞానార్జనను గావించు కొనును.  దాని ప్రభావమున సంసృతి మోక్షమును పొందును.

20. బహునాత్ర కిముక్తేన - యస్య భక్తి శ్శివే దృడా,
మహాపాపో పపాపౌఘ - కోటి గ్రస్తో విముచ్యతే 

వేయేల ఏ భక్తుడి కైతే పరమశివుని యందు దృడమై నిర్మలమగు భక్తి కలుగునో అట్టివాడే మహా పాపముల చేతను ముక్తుడగును.

21. అనాధ రేణ శాట్యేన - పరిహాసై ర సూయయా,
శివ భక్తి రతశ్చేత్స్యా - దంత్య జో సివి ముచ్యతే 

అస్పృశ్యు డైనను, కారణ మేమియు లేకుండ గాని, వంచ కత్వముతో గాని , పరిహాసమునకు గాని , ఈర్ష్య చేత గాని శివుని యందు భక్తి యంకురించిన యెడల అటువంటి వాడు సమస్త పాపముల నుండి ముక్తుడగును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹. శివగీత  - 13  / The Siva-Gita - 13 🌹
 🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

ద్వితీయాధ్యాయము
🌻. వైరాగ్య యోగము  - 4 🌻

శ్రీ రామ ఉవాచ :-
మునే! దేహస్య ణో దుఃఖం - నైవ చేత్పర మాత్మనః,
సీతా వియోగ దుఃఖాగ్ని - ర్మాం భస్మీ కురుతే కధమ్ ? 23
సదాను భూయతే యోర్త - స్సనా స్తీతి త్వయే రితః,
జాయతాం తత్ర విశ్వాసః - కధం మే ముని పుంగవ ! 24

రాముడు నివేదించు కొను చున్నాడు: ఓయీ ముని పుంగవా!
 పరమాత్మకును శరీరమునకు వ్యధ లేదని మీరాదేశించితిరి. 

అటులైన యెడల సీత ఎడబాటుతో నుప్పతిలు దుఃఖము  మదన బాణాగ్ని నన్ను గాల్చి భస్మావ శేషము గావించు చున్నది. నిరంతర మేది యనుభవింప బడుచున్నదో ఆ విధమైనది మిధ్యయని నిరూపించితిరి, 

అద్దానిని గురించి నాకు విశ్వాస మెట్లు కలుగును? నాకు తెలియ పరచుము.

అన్యిస్తి నాస్తికో భోక్తా - యేన జన్తు: ప్రతప్యాతే,
సుఖస్య వాపి దుఃఖస్య - తద్బ్రూహి ముని సత్తమ! 25

ఎట్టి. దుఃఖము వలన మనుష్యుడు బాధ చెందునో అట్టి దుఃఖము
 ననుభవించుటకు గాని, ఎట్టి సుఖము వలన సుఖము  ననుభవించునో అట్టి సుఖ దుఃఖముల ననుభవించు వాడొక్కడే బాధ్యుడు గాని యితరులు భోక్త లెట్లగుదురు  నాకు వివరింపుమో మనివర్యా !

దుర్జే యా శాంభవీ మాయా తయా సమ్మో హ్యతే జగత్,
మాయాంతు ప్రకృతిం విద్ధి - మాయినం తు మహేవ్వర మ్ 26

తస్యా వయ భూతైస్తు - వ్యాసం సర్వ మిదం జగత్,
సత్య జ్ఞానాత్మ కోనన్తో- విభూరాత్మా మహేశ్వరః 27

అగస్త్యుడు చెప్పుచున్నాడు: ఆ మహేశ్వరుడు పన్నిన మాయను
 తెలిసి కొనుటకు ఎవరికి సాధ్య పడును.? ఆ మహేశ్వర మాయ 
వలన ఈ ప్రపంచ మంతయు మోహింప బడినది.

 అట్టి మాయను ప్రకృతి గను, మాయామయుడు  మహేశ్వరుడని యెరుంగుము.  ఆ మహేశ్వరు డెటువంటి వాడనగా సాక్షాత్తుగా సత్య జ్ఞాన స్వరూపుడు.  నాశము నభః పుష్పము వంటివాడు. (అనగా మృత్యుంజయుడు ). 

సకల లోక సంరక్షకుండు,  ఆత్మ స్వరూపుడు అతని యుపాంగ భూతములైన (అవయములైన ) చేతనాచేతన ప్రాణి కోటి చేత నీ ప్రపంచమును నిండా 
ఆవరించు కొని యున్నది.

తస్యై వాంశో జీవ లోకే - ప్రాణి నాం హృదయే స్థితః 28
విస్పులింగా యధా వహ్నే - ర్జాయన్తే కాష్ట యోగతః,
అనాది కర్మ సంబందా - త్తద్వ దంశా మహేశితు: 29

రాపిడి కలిగిన కర్రల నుండి యగ్ని బుట్టి దాని కణములు వ్యాపించి నట్లుగా మానవుని యనాది సంచిత మగు కర్మ వాసన చేత మహేశ్వరాంశము ప్రపంచ మందలి ప్రాణి కోటి హృదయము లందు ఇమిడి యున్నది.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

🌹. శివగీత  - 7  / The Siva-Gita - 7 🌹
 🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

ప్రధమాధ్యాయము
🌻. భక్తి నిరూపణ యోగము  - 7 🌻

శివ భక్తిశ్చ సర్వేషాం - సర్వదా సర్వతో ముఖా,
తస్యాం చ లిష్య మానాయాం - యస్తు మర్త్యో విముచ్యతే .22
సంసార బంధ నాత్తస్మా - ధన్యః కో వావి మూడది :

శివ భక్తి ఎవరి యందు దృడ పడునో వారలకు (శివ భక్తులకు ) ఎల్లప్పుడు కోరికలను దీర్చును. దానిలో పూర్తిగా ఆసక్తి గలవాడు ఈ సంసార పాశ బంధముల నుండి విడువ బడుచున్నాడు.

నియ మాద్యస్తు కుర్వీత - భక్తిం వాద్రో హమేవ వా ;
తస్యాపి చేత్ప్ర సన్నో సౌ - ఫలం యచ్ఛతి వాంచితమ్ 23
బుద్దిం కించిత్స మాదాయ - క్షుల్లకం జలమేవ నా ,
యోదత్తే నియమేనా సౌ - తస్మై దత్తే జగత్ప్రయమ్ 24

ఏనాడు నియమము తప్ప కుండా పరమ శివుని పై భక్తితో గాని,  చెడ్డ తనము చేయకుండగా గాని ఆచరించునో అట్టి భక్తునకు పరమాత్ముడు ప్రత్యక్షమై సంతోషించిన వాడై సర్వాభీష్టములను సఫల మొనర్చును. బిల్వ దళము గాని, జలము గాని,  అనన్య భక్తితో సమర్పించునో అతనికి నా పరమశివుడు త్రైలోకాదిపత్యము నొసంగును.

తస్యాప్య శక్తి నియమా - న్నమస్కారం ప్రదక్షిణామ్,
యః కరోతి మహేశస్య - తస్మై తుష్టో భవేచ్చినః 25
ప్రదక్షిణా స్వవక్తోపి - యస్స్వాంతే చింత యేచ్చినమ్,
గచ్చన్స ముపవిష్టో వా - తస్యా భీష్టం ప్రయచ్ఛతి.26

అట్లు చేయుట కవకాశము లేనిచో ప్రదక్షిణ నమస్కారముల మనస్పూర్తిగా సమర్పించినను అందుకు ప్రసన్నుడై మృత్యుంజయు డానం దించును.  అందుకును అవకాశముఅధవా సామర్ధ్యము లేని యెడల తానున్న చోటనే పరమ శివుని మనస్సులో ధ్యానించ వలెను.  దాన శివుడు కోరిన కోరికల తీర్చును.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శివగీత  - 8  / The Siva-Gita - 8 🌹
 🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

ప్రధమాధ్యాయము
🌻. భక్తి నిరూపణ యోగము  - 8 🌻

చందనం బిల్వ కాష్ట స్య - పుష్పాణి వన జాన్యపి. 27
ఫలాని తాదృశాన్యేవ - యస్య ప్రీతి కారాణి వై ,
దుష్కరం తస్య సేవాయాం - కిమస్తి భువన త్రయే 28

బిల్వ వృక్షము బెరడుతో (చెక్కతో ) నరగ దీసిన శ్రీ గంధము,  అడవిలోని పువ్వులు, ఫలములు మున్నగునవి యైనను భక్తితో  సమర్పించినను మహాదేవుడు సంతసించును. 

వీటి యందె అతనికి ఎక్కువ మక్కువ గూడా.  ఇటులుండగా నా పరమాత్ముని యుపాసించుటలో 
నెవరికి దానే కష్టమగును.

వన్యేషు యాదృశీ ప్రీతి - ర్వర్తతే పరమే శితు : ,
ఉత్తమేష్వపి నాస్త్యేవ - గ్రామ జేష్వ పితాదృశీ 29
తం త్యక్త్యా తాదృశం - దేవం యస్సే వే తాన్య దేవతామ్,
సమి భాగీ రధీం త్యక్త్యా - కాంక్షతే మృగ తృష్టికామ్ 30

శివునకు అడవియందే వికసించే పుష్పములందును, పండిన ఫలము లందును,  దళాదు లందును ఎంత మక్కువో అంతటి ప్రీతి గ్రామ మందుండి  శ్రేష్టము లె అయినప్పటికి ని వాని యందు ఆసక్తి యుండదు.

 ఆ విధముగా సులభముగా ప్రసన్నుడయ్యె భోలా శంకరుని వీడి  ఇతరత్ర నుండి దేవుళ్ళను బూజించినచో ప్రక్కనే యున్న గంగానది  ని వీడి ఎండ మావులను చూచి యాచించి మోసపోయిన వాడే యగును. అలంకార ప్రియో విష్ణు: అభిషేక ప్రియాః శివః సులభ సాధ్యుడు శివుడు.

కింతు యస్యాస్తి దురితం -కోటి జన్మ సు సంచితమ్,
తస్య ప్రకాశతే నాయం - త్వర్దో మోహాంధ చేతసః 31
న కాల నియమో యత్ర- న దేశస్య స్థల స్యచ,
యత్రాస్య రమతే చిత్తం - తత్ర ధ్యానేన కేవలమ్ 32
స్వాత్మ త్వేన శివస్యాసౌ - శివ సాయుజ్య మాప్నుయాత్ .

అసలు విషయమేమనగా - ఎవడైతే అనేక జన్మముల నుండి  పాప కర్మముల చేసి మూట గట్టుకుని యున్నాడో అట్టి పపిష్టునకు  జ్ఞాన శూన్యునికి, ఈ శైవ తత్వము నచ్చదు. 
ఇట్టి సులభైక ఉపాస్యుడైన శివుని సేవించుటకు ఇట్టి సమయమని కాని,  ఇట్టి స్థలమని కాని, ఇట్టి ప్రదేశమని గాని నిర్ణయము లేదు. 

ఎట్టి సమయ మందైనను ఏ కాలము, ఏ  దైవ మందై నను మనస్సు  సుప్రసన్నముగా నుండునో అదే సమయంబున ఆయా స్థలము  లందే తన హృదయమున పరమ శివుని ధ్యానించి నట్లైతే అట్టి  నిర్మల మనస్సు గల మానవునకు సాక్షాత్తుగా కైలాస ప్రాప్తి కలుగుటలో  సందేహము లేదు. అనగా సంశయింప నవసరము లేదు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

🌹. శివగీత  - 9  / The Siva-Gita - 9 🌹
 🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

ప్రధమాధ్యాయము
🌻. భక్తి నిరూపణ యోగము  - 9 🌻

అతి స్వల్పత రాయుశ్శ్రీ - ర్భూతే శాంశాధి పోపియః,
సతు రాజా హమస్మీతి - వాది నం హన్తి స్వాన్వయమ్. 33

కర్తాపి సర్వ లోకానా - మక్ష యైశ్వర్య వానపి,
శివ శ్శివో హమ స్మీతి - వాది నం యం చ కంచన 34

ఎట్టి మహేశాం శమున బుట్టిన వాడైనను, " నేనే ప్రభువును "  అనే అహంభావము ఎవనిలో ఉండునో అట్టి వానికి ఆయువు క్షీణించుటే కాకుండా నిర్వంశ మగుటకు మూలమగును.

 కావున మూడు లోకములకు ప్రభువైన ప్పటికి ఐశ్వర్య వంతుడైనను  దురభిమానమునకు లోను గాక శివో హం భావముతో నుండిన  అధవా దాసోహం భావంతో నుండి నను ఆ పర శివ మూర్తి మిక్కిలి  ప్రసన్నుం డై తనలో ఐక్య మొనర్చు కొనును.

ఆత్మనా సహ తాదాత్మ్య - భాగినం కురుతే బృశమ్,
ధర్మార్ధ కామ మోక్షాణాం - పారం యాస్యన్తి యేన వై .35

మునయస్త త్ప్ర వక్ష్యామి - వ్రతం పాశు పతాభిదమ్,
కృత్వాతు విరజాం దీక్షాం - భూతి రుద్రాక్ష దారిణః 36

జపంతో వేద సారాఖ్యం శివ నామ సహస్రకమ్,
సంత్య జ్యతేన మర్త్యత్వం శేవీం తను మవాప్య . 37

ఓయి ! (ఋషి) మునివరులారా ! తొల్లి మునీశ్వరులే ఆచరించి; ధర్మము,  అధర్మము ,కామము మరియు మోక్షమనెడు చతుర్విధములగు ఫల పురుషార్ధముల సారముల చక్కగా అవగతము చేసికొన్న పాశుపత మనెడి వ్రతమునకు నీకు వివరించెదను వినుడు.  

మీరు కూడా నేను వివరించిన విధముగా విరజా దీక్షను బొంది, విభూతి, రుద్రాక్షలను మేన దాల్చిన చతుర్వేద సారములైన శివ సహస్ర నామములను వల్లింపు చుండ దత్ప్రభావము చేత అశాస్వతమగు  నీ మనుష్యత్వమును వీడి శివ స్వరూపమును పొందగలవు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శివగీత  - 11  / The Siva-Gita - 11 🌹
 🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

ద్వితీయాధ్యాయము
🌻. వైరాగ్య యోగము  - 2 🌻

సూర్యోసౌ సర్వ లోకస్య - చక్షుష్వేన వ్యవస్థితః ,
తధాపి చాక్షుషై ర్దో షై - చక్షుష్వేన వ్యవస్థితః 7
తధాపి చాక్షు శైర్దో షై - ర్నక దాచి ద్విలిప్యతే,
సర్వ భూతాన్త రాత్మా సిత ద్వద్దు: ఖైర్న లిప్యతే 8
దేహో పిమల పిణ్నోయం - ముక్త జీవో జడాత్మకః,
దహ్యతే వహ్నినా కాష్టై - శ్శివా ద్యైర్భ క్ష్యతే పివా 9
తధాపి నైవ జానాతి - విర హేత స్య కావ్యధా,
సువర్ణ గౌరీ దూర్వాయా దళ వచ్చ్యా మలాపివా 10
పీనోత్తుంగ స్తనా భోగ -భుగ్న సూక్ష్మా వ లగ్నకా,
బృహన్నితం బజఘనా - రక్తపాద సరో రుహా 11
రాక చన్ద్ర ముఖీ బింబ - ప్రతి బింబ రదచ్చదా,
నీలేందీ వరనీ కాశ- నయన ద్వయ శోభితా 12
మత్త కోకిల సల్లాపా - మత్త ద్విరద గామినీ,
కటాక్ష్యైరను గ్రుహ్లాతి మాం - పంచే సుశోరొత్త మై:13
ఇతియో మన్యతే మూర్జ - స్సచ పంచే సుశాసితః,

బంగారు వర్ణము గలది లేత గరిక మావి శ్యామ లయ, బిగువు చనుదోయి (కలశ స్తనములు) గలది . దొండ పండు వంటి క్రింది పెదవి గలది. ఇందు ముఖియు మున్నగు విశేష నామములతో కూడిన  యువతులు క్రీగంటి చూపుల వలన నూ పూవిలు కాని నుండి దప్పించి కాపాడు నని ఎవ్వడైతే తలచునో అట్టి అవివేకి మన్మధుని  చేత శిక్షింప బడి న వాడే యగును.

తస్యా వివేకం వక్ష్యామి - శృణుష్వా వహితో నృప
నచ స్త్రీ పుమానేష - న చైవాయం నపుంసకః 14
అమూర్తః పురుషః పూర్ణో - ద్రష్ట్రా సాక్షీ సజీవనః
యాతన్వంగీ మృదుర్బాలా - మల పిండాత్మికా జడా 15

అటువంటి వాడి వివేకము ఎట్టిదో దానిని గురించి వివరించు చున్నాను.
 శ్రద్ధతో వినుము. పరమాత్ముడు స్త్రీ, పురుష ,నపుంసకముల కతీత మైన వాడు.  మూర్తిత్వర హితుడు, సర్వాంతర్యామి, సమస్తమునకు సాక్షి భూతుడు,  సర్వాపేక్షకుడు, సమస్త జీవితము కూడా అగును.

సాన పశ్యతి యత్కిం చిన్న - శ్రణో తిన జిఘ్రతి,
చర్మ మాత్రా తను స్త సయా- బుద్ధ్యా వీక్ష స్వరాఘవ! 16
యా ప్రాణ దదికా సైవ- హస్తతే స్యా ద్ఘ్రుణా స్పదమ్,
జాయన్తే యది భూతేభ్యో - దేహినః పాంచ భైతికాః 17

సున్నితము, కోమలమైన యుపాంగములు (అవయములు ) కలిగి,  మల మూత్ర పిండాత్మకము, జడదేహము గలది యునైన  ఎవనిత యనబడినదై, ఇతరులను జూడదు, వినదు, వాసన కూడా చూడదు. 

 ఓ రామా! వివేక జ్ఞానముతో నొక పరి దర్శింపుము.

నీవు దేనినైతే నీ ప్రాణము కంటెను మిన్నగాను,  ప్రేమకు పాత్రమైనది గాను దల పోయు చుంటివో అట్టి  శరీరము తోలు తిత్తి మాత్రమే. హేయాస్పద మైనది.  దానిని నీవు ప్రేమింప దగదు.

సశేషం... 

🌹. శివగీత  - 12  / The Siva-Gita - 12 🌹
 🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

ద్వితీయాధ్యాయము
🌻. వైరాగ్య యోగము  - 3 🌻

ఆత్మా యదే కలస్తేషు - పరి పూర్ణ స్సనాతనః,
కాకాన్తా తత్ర కః కాన్త - స్సర్వ ఏవ సహోదరా 18

నిర్మితాయాం గృహావల్యం  - తద వచ్చిన్న తాం గతమ్,
నభస్త స్యాం తు దగ్దాయాం - న కాంచి తక్షతి మృచ్చతి 19

తద్వ దాత్మా పి దేహేషు - పరి పూర్ణ స్సనాతనః,
హన్య మానే షు తేశ్వేవ - స్వయం నైవ హి హన్యతే 20

పంచ భూతాత్మ కంబైన శరీరములం దంతటను పరమ శివుడు
 ( ఆత్మ రూపమున ) వ్యాపించి యున్నాడు. గృహ నిర్మాణ
 సమయమున వాటిని విడిచి యాకాశ ముండదు,  కాని అవి దహింప బడు నప్పుడే విధముగా నాకాశము
 దహింప బడదో అట్లే దేహము లందుండెడు ఆత్మ నశింపదు.
దేహములు నశించును.

హన్తా చే న్మన్యతే హస్తుం - హతశ్చే న్మన్యతే హతమ్ ?
తావు భౌన విజానీతో - నాయం హన్తి హన్యతే. 21

అస్మాన్న్రు పాతి దుఃఖేన - కిం ఖేద స్యాస్తి కారణమ్,
స్వస్వరూపం విదిత్వేదం - దుఃఖం త్యక్త్యా సుఖీభవ 22

ప్రపంచము నందు ఒక వ్యక్తి మరొక వ్యక్తిని కొట్టినచో వాడిని  కొట్టి వాడని కాని అట్లు కొట్టబడిన వ్యక్తి దెబ్బల కోర్చిన వ్యక్తిని  కాని,  ఇట్లు కొట్టిన వాడు కొట్టబడిన వాడు ఈ యుభయులలో నే ఒక్కరు కర్తలు గారు. 

 కావున ఓ రామా! ఇందులకై శోకింప బని లేదు. నీ యాత్మ స్వరూపమును గనుకొని దుఃఖమును మాని నిత్య సుఖివి గమ్ము.


🌹 🌹 🌹 🌹 🌹 
🌹. శివగీత  - 13  / The Siva-Gita - 13 🌹
 🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

ద్వితీయాధ్యాయము
🌻. వైరాగ్య యోగము  - 4 🌻

శ్రీ రామ ఉవాచ :-
మునే! దేహస్య ణో దుఃఖం - నైవ చేత్పర మాత్మనః,
సీతా వియోగ దుఃఖాగ్ని - ర్మాం భస్మీ కురుతే కధమ్ ? 23
సదాను భూయతే యోర్త - స్సనా స్తీతి త్వయే రితః,
జాయతాం తత్ర విశ్వాసః - కధం మే ముని పుంగవ ! 24

రాముడు నివేదించు కొను చున్నాడు: ఓయీ ముని పుంగవా!
 పరమాత్మకును శరీరమునకు వ్యధ లేదని మీరాదేశించితిరి. 

అటులైన యెడల సీత ఎడబాటుతో నుప్పతిలు దుఃఖము  మదన బాణాగ్ని నన్ను గాల్చి భస్మావ శేషము గావించు చున్నది. నిరంతర మేది యనుభవింప బడుచున్నదో ఆ విధమైనది మిధ్యయని నిరూపించితిరి, 

అద్దానిని గురించి నాకు విశ్వాస మెట్లు కలుగును? నాకు తెలియ పరచుము.

అన్యిస్తి నాస్తికో భోక్తా - యేన జన్తు: ప్రతప్యాతే,
సుఖస్య వాపి దుఃఖస్య - తద్బ్రూహి ముని సత్తమ! 25

ఎట్టి. దుఃఖము వలన మనుష్యుడు బాధ చెందునో అట్టి దుఃఖము
 ననుభవించుటకు గాని, ఎట్టి సుఖము వలన సుఖము  ననుభవించునో అట్టి సుఖ దుఃఖముల ననుభవించు వాడొక్కడే బాధ్యుడు గాని యితరులు భోక్త లెట్లగుదురు  నాకు వివరింపుమో మనివర్యా !

దుర్జే యా శాంభవీ మాయా తయా సమ్మో హ్యతే జగత్,
మాయాంతు ప్రకృతిం విద్ధి - మాయినం తు మహేవ్వర మ్ 26

తస్యా వయ భూతైస్తు - వ్యాసం సర్వ మిదం జగత్,
సత్య జ్ఞానాత్మ కోనన్తో- విభూరాత్మా మహేశ్వరః 27

అగస్త్యుడు చెప్పుచున్నాడు: ఆ మహేశ్వరుడు పన్నిన మాయను
 తెలిసి కొనుటకు ఎవరికి సాధ్య పడును.? ఆ మహేశ్వర మాయ 
వలన ఈ ప్రపంచ మంతయు మోహింప బడినది.

 అట్టి మాయను ప్రకృతి గను, మాయామయుడు  మహేశ్వరుడని యెరుంగుము.  ఆ మహేశ్వరు డెటువంటి వాడనగా సాక్షాత్తుగా సత్య జ్ఞాన స్వరూపుడు.  నాశము నభః పుష్పము వంటివాడు. (అనగా మృత్యుంజయుడు ). 

సకల లోక సంరక్షకుండు,  ఆత్మ స్వరూపుడు అతని యుపాంగ భూతములైన (అవయములైన ) చేతనాచేతన ప్రాణి కోటి చేత నీ ప్రపంచమును నిండా 
ఆవరించు కొని యున్నది.

తస్యై వాంశో జీవ లోకే - ప్రాణి నాం హృదయే స్థితః 28
విస్పులింగా యధా వహ్నే - ర్జాయన్తే కాష్ట యోగతః,
అనాది కర్మ సంబందా - త్తద్వ దంశా మహేశితు: 29

రాపిడి కలిగిన కర్రల నుండి యగ్ని బుట్టి దాని కణములు వ్యాపించి నట్లుగా మానవుని యనాది సంచిత మగు కర్మ వాసన చేత మహేశ్వరాంశము ప్రపంచ మందలి ప్రాణి కోటి హృదయము లందు ఇమిడి యున్నది.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 


🌹. శివగీత  - 14  / The Siva-Gita - 14 🌹
 🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

ద్వితీయాధ్యాయము
🌻. వైరాగ్య యోగము  - 5 🌻

అనాది వాసనా యుక్తాః క్షేత్ర జ్ఞా ఇతితే స్మృతాః,
మనో బుద్ది రహంకార - శ్చిత్తం చేతి చతుష్టయమ్ 30
అన్తః కరణ మిత్యాహు - స్తత్రతే ప్రతి బింబితాః,
జీవిత్వం ప్రాప్నుయు: - కర్మ ఫల భోక్తార ఏవతే 31

అనాది యగు వాసనల చేత నిండి యున్న అట్టి మహేశ్వరాంశ
 సంజనితు లైన ప్రాణులు క్షేత్రజ్ఞాలన బడుచున్నారు.

 మనస్సు - చిత్తము బుద్ది - అహంకారము ఈ నాల్గింటిని
యంతః కరణ చతుష్టయము లందురు. 

వీటిలోనే ప్రతి బింబముగా నేర్పడిన చైతన్యమే ప్రాణముగా రూపొంది 
పుణ్య పాపముల ఫలముల ననుభవించు చుండును.
( సుఖ దుఃఖము లను జీవుడు అనుభవించు చుండునని భావము )

తతో వైష యికం తేషాం - సుఖం నా దుఃఖమేవ నా,
త ఏవ భుంజతే భోగా యత నేస్మిన్ శరీరకే 32
స్థావరం జంగమం చేతి - ద్వివిధం న పురుచ్యతే,
స్థాన రాస్తత్ర దేహా స్స్యు - స్సూక్ష్మా గుల్మల తాదయః 33

అండ జా స్స్వేద జాస్తద్వ- దుద్భిజ్జా ఇతి జంగామా:,

అందుచేత విషయ విశేషము నుండి పొడమిన ఆనందము గాని,
 వ్యధ గాని, భోగము నేయభి లషించు శరీరమును ప్రాణ కోటి యనుభవించు చుండును. 

అట్టి శరీరము స్థావరమని, జంగమమని రెండు విధములు.
 అందు స్థావర దేహును, వృక్షములు, పొదలు, తీగెలు- ఇవే మున్నగునవి.

వీని యందు సమన్వయించు కొనునది, జంగమ దేహము,
 అండ జము, స్వేద జమనియు, ఉద్భిజ్జ మనియు మూడు రకములుగా విభజింప బడినది.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 
🌹. శివగీత  - 16  / The Siva-Gita - 16 🌹
 🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

ద్వితీయాధ్యాయము
🌻. వైరాగ్య యోగము  - 7 🌻

మునే ! సర్వ మిదం సత్యం - యన్మ దగ్రే త్వయేరితమ్ 40

తదాపిన జహాత్యేత - త్ప్రార బ్దా దృష్ట ముల్బణమ్,
మత్తం కుర్యా ద్యదా మద్యం - నష్టా విద్య మపి ద్విజమ్ 41

తద్వత్ప్రా రబ్ద భోగో పిన జహాతి వివేకినమ్,
తతః కింబ హునోక్తేన - ప్రారబ్ద స్స శివ స్మృరః 42

బాధతే మాం ది నారాత్ర - మహంకారో పితా దృశః.
అత్యన్త పీడితో జీవ - స్థ్సూల దేహం విముం చతి 43

తస్మా జ్జీవాప్తయే మహ్య - ముపాయః క్రియతాం ద్విజ!
ఇతి శ్రీ పద్మ పురాణే, శివ గీతాయా ద్వితీయో ధ్యాయః 44

శ్రీ రాముడు పలుకును : ఓయీ ముని పుంగవా! మీరు నా యందలి 
అనుగ్రహముచేత నేమి యాన తిచ్చితిరో అవి యన్నియు 
వాస్తవములే అయినప్పటికిన్ని, నా ప్రారబ్ధ రూపంబగు ప్రియురాలైన
 సీత యొక్క ఎడబాటుతో నాలో రగిలిన దుఃఖాగ్ని యుపశమింపకున్నది.

 ఆ కారణము వలన వేయేల? నా ప్రారబ్ధ రూపుండైన శివుడే 
అలరు విల్తుని రూపంబున నన్ను రేయింబవళ్ళు వేధింపు చున్నారు. 
అహంకారము కూడా అటువంటిదే. 
ఈ విధముగా ప్రాణి మిగుల పీడింప బడినచో నీ జడ దేహము విడిపోవును. 

కనుక ఓ శివ భక్తాగ్రేసరా ! జీవ ధారణ చేయుటకు ఉపాయ మేదో తెల్పుము.
ఇది వ్యాసోక్త పద్మ పురాణాంతర్గతం బైన శివ గీతలో  ద్వితీయో ధ్యాయము సమాప్తము.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 The Siva-Gita - 16 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️  Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 02 : 
🌻 Vairagya Yoga - 7 🌻

40. 41. Sri Rama said: Hey Muni! Whatever discourse of Vairagya you gave to me is indeed true however due to my Prarabdha Karma the sadness which is burning me like fire, which is caused due to the separation from my beloved is not getting put off. 

42.  That Prarabdha which is of the form of Shiva is himself tormenting me day and night. Even pride is also like that. 

In this way if a being gets tormented then there are chances for this body to fall down. Hence Hey foremost devotee of Shiva! Show me the path to Jeevadharana 

43. Here ends the second chapter of Shiva Geeta from Padma Purana Uttara Khanda

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 The Siva-Gita - 13 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️  Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 02 : 
🌻 Vairagya Yoga - 4 🌻

23. 24. Sri Rama said: Hey Saint! You discoursed that Paramatma doesn't suffer from agonies caused due to the body.

 In that case why the pain of love and separation from Sita is burning me? 

Whatever (suffering) is being experienced by me continuously, you said that's all illusion. How to believe those words? Kindly explain.

The sorrow which torments a man, to experience that sorrow; 

Or, the pleasure which pleases a man, to experience such pleasure that man himself is responsible but how come someone else is the doer? Please explain that in detail O Sage!

26. 27. Agastya said: Who can understand the Maya of that Maheshwara? 

This entire universe is illusioned by the Shambhavi Maya of that Maheshwara. 

Know that Maya as Prakriti and that illusionist as Maheshwara.

That Maheshwara is himself the form of Truth and knowledge, eternal, imperishable, protector of all the worlds, the supreme soul. 

He pervades in the entire universe as manifest & unmanifest, living & nonliving things.

28. 29. The way two firesticks produces sparks when rubbed with each other and those sparks spread further (forest fire), 

similarly, due to the accumulation of Sanchita Karma (accumulated Karmas) that Maheshwaransham (portion of Maheshwara) lives in the hearts of all these millions of living beings.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹
🌹 The Siva-Gita - 14 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️  Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 02 : 
🌻 Vairagya Yoga - 5 🌻

30. 31. Due to being attached with the age old Vasana(s), those souls Which are Maheshwara's reflections are being called as Kshetragya. 

Mana (heart) Chitta (self) Buddhi (Mind)Ahankaram
(Ego); these four are called as 'Antahkarana Chatushtaya'. In these as a shadow remains the consciousness which is the soul and experiences the results of virtues and vices.

32. 33. Hence happiness or sorrow obtained from subjects, and the body which desires for Bhoga exists in the various forms of living beings। That kind of body is of two types called Sthavaram (Immobile) and Jangamam (mobile). Among them Sthavaram body belongs to Trees, bushes, creepers. 

Jangama bodies are those who are Andajam (egg born), Swedajam (sweat born), and Unbheejam. These are the three subcategories in which Jangamam bodies are classified.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 The Siva-Gita - 11 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️  Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 02 : 
🌻 Vairagya Yoga - 2 🌻

Having a golden hue, having pitcher like breasts, having bimba fruit kind of lower lip, a face resembling a full moon etc.; with such adjectives when a man gets trapped, such ignorant person gets punished by the Manmadhathe God of love!

14. 15. I am describing about that kind of person's ignorance. Listen with attention. Paramatma is beyond gender attribute. He is neither male, nor female, nor eunuch. He is formless, omnipresent, a witnesser of everything, and is everything.

16. That which has soft slender body parts, that is a malamootra pinda (a body containing faeces and urine). It doesn't see , smell or listen to others. O Rama! With your divine knowledge look at it once. 

17. That body whom you are considering worthy of love and infatuation, is nothing but a bag of skin and flesh. That's full of disgusting materials and hence not worthy of loving or getting attached with.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 The Siva-Gita - 12 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️  Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 02 : 
🌻 Vairagya Yoga - 3 🌻

18. 19. 20. In all the bodies which are formed of Pancha Bhoota (Five elements), Lord is present (as soul). When a house is built, sky remains attached to it. 

However when a house is burnt, it gets reduced to ashes but it doesn't burn the sky at all. Similarly, soul which resides inside the body doesn't perish while bodies perish.

21. 22. In this world, when one man beats another, one is seen as the punisher and another as the victim. But neither of them is the actual doer. Therefore, 

O Rama! it's worthless to doubt this fact. Realize your true self, and be in everlasting bliss by leaving this sorrow.

Continues... 

🌹 🌹 🌹 🌹 🌹

🌹 The Siva-Gita - 9 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️  Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 01: 
🌻 Bhakti Niroopana Yoga - 9 🌻

33. 34. Even if someone is an incarnation of Mahesha if he develops self pride by thinking, "I'm the Lord", such a person's life span would decline and also his lineage would get culminated. 

Hence, even if someone is a lord of the three worlds, if he remains free from ego and pride, and simply either remains filled with "Shivoham" feeling or else with the feeling of Lord's Servant (Devotee), that Supreme Lord Shiva would get pleased with him and would make him merge inside himself.

36. 37. Hey Monks! I would narrate one great 'Vratam' which bestows all the 'Chaturvarga Phala Purushardhas' viz.

 Dharma, Artha, Kaama, Moksha. that Vratam is called 'Pasupata Vratam'. 

You all may take the 'Viraja Deeksha' as per my instructions by applying Ash and wearing Rudraksha Mala, and chant the Shiva Sahasranama which is a summary taken from all the four vedas. 

If you do this kind of 'deeksha' you would leave your this ephimeral human body and would attain divinity by gaining Shiva's form itself.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 The Siva-Gita - 8 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️  Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 01: 
🌻 Bhakti Niroopana Yoga - 8 🌻

27. 28. Chandanam which is prepared from the wood of Bilwa tree (called as Sri Gandham), flowers of the forest, and fruits if offered to mahadeva, he would become exceedingly pleased, since these items are his favorite items. Such kind of service to the Lord is without a second in the three worlds.

29. 30. The way lord Shiva likes the flowers and fruits born in the forest compared to the so called better flowers of the villages, similarly, if someone neglects the easily pleasing Lord Shiva and worships other deities, it's as like as desiring for a mirage water by leaving the holy ganges beside.

31. 32. Fact is, a person who has done sins in numerous births and has accumulated a lot of vices such sinners, knowledge less people would not take interest and wouldn't like this 'Shaiva Tatwam'. 

To do service to Lord Shiva, there is nothing like right time or right place. Whatever time, whichever season, whichever place it might be, a person who meditates on Shiva within his own heart with happiness such a pure hearted person would achieve Salvation in Lord Shiva's abode Kailasha. And there is no doubt in that!!.

Continues.. 

🌹 🌹 🌹 🌹 🌹

🌹 The Siva-Gita - 7 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️  Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 01: 
🌻 Bhakti Niroopana Yoga - 7 🌻

22. One whose Shiva Bhakti becomes strong, such people would get all theyr desires fulfilled by it. But for those who are totally submitted in Shiva Bhakti, would get liberated out of the birthrebirth cycle and would attain Salvation.

23. 24. One who is devoted to Paramashiva with veneration, or devoted to him without doing any sins, with such kind of devotee Lord would be highly pleased, would fulfill all his wishes. 

One who dedicates Shiva the Bilva leaves, or water with full devotion; with him lord would be so pleased that he can bestow the devotee the empire of the three worlds. (Such a kind hearted Lord is our Lorrd Shiva).

25. 26. One who is unable to worship Shiva (as described in previous slokas), if he circumambulates and offers Namaskara (Salute) to the Lord, the Lord would get pleased and would become happy. 

Even to this simple thing as well, if someone doesn't have time or is unable to do, he can simply think of lord Shiva from the same place where he is. 

With this insignificantly seeming prayer also Lord Shiva would shower all the boons which the devotee is desirous of!! (That shows the generosity of Lord Shiva. How much he loves us, we can understand from the above Verse!!).

Continues.. 
🌹 🌹 🌹 🌹 🌹
🌹 The Siva-Gita - 5 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️  Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 01: 
🌻 Bhakti Niroopana Yoga - 4 🌻

13. 14. That's why Devotion for Parama Shiva doesn't take birth in anyone, due to the Gods devotion for Shiva
doesn't remain constant. In case with a lot of efforts if someone manages to gain devotion for Lord Shiva,
due to the disruption from the demigods, the devotion gets interrupted. But when that doesn't happen, Love
for Lord Shiva emerges out of the devotion.

15. Hearing all these from Suta, Saunakadi Munis questioned Suta in this manner: Hey Sutakumara! If in this manner Gods of heaven keep obstructing humans from walking on the path of Gyana, how would humans
attain salvation? For tenacious people is there any way to nullify the obstructions caused by Gods? If such
an alternative exists to escape the disturbances from gods, kindly preach that tos us.To their questions,
Suta answered this way:

16. One gets devotion towards Maheshwara only if he has accumulated Virtues over the past crores of births.
Due to that devotion he performs many tasks for the sake of the humanity.

Continues... 

🌹 🌹 🌹 🌹 🌹

🌹 The Siva-Gita - 6 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️  Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 01: 
🌻 Bhakti Niroopana Yoga - 5 🌻

17. 18. Because of that, devotee would become detached from all his desires and would get filled with a devoting everything to Shiva. Due to that nature he would keep doing good deeds and would gain the grace of Lord Shiva. When he earns the grace of Lord Shiva, the demi gods would not dare to interrupt his devotion
because of the fear of Lord Shiva's anger.

19. That's why human would all the time remain with 'Shivarpana' buddhi and would remain immersed in the
worship of Shiva and would gain knowledge which gives him Mukti (Salvation)

20. The devotee who keeps an unshaken faith in lord Paramashiva, only that person would get saved from
Maha Papa (Great Sins) and Upa Paapa (Minor Sins) even if they are crores in number.

21. Anyone while doing criticism, or while disrespecting, or due to jealousy, if gets devoted or gains devotion
for Shiva, he would get cleansed of all the Sins immediately. 

N.B: Let's analyze this statement further. We have real examples in our Hindu scriptures where such instances have been seen. Kamsa, Ravana Shishupaala, etc, all were filled with "Virodhi Bhakti" for Lord Vishnu, their hatred for hari increased to such limits  that they unknowingly used to think constantly about Hari only. Finally what happened we all know. They were given Salvation by Lord through killing. So, the same way, even if while criticizing Shiva, or while disrespecting him, or while hating him if one gets filled with that 'Virodhi Bhakti' he would get liberated of all sins. The idea here is not to develop Virodh Bhakti, but the sloka tells the importance of Shiva Bhakti. The meaning in short is:Even if inadvertently one develops slightest interest and devotion towards Shiva, he would get cleansed of sins right at that moment). 

22. One whose Shiva Bhakti becomes strong, such people would get all theyr desires fulfilled by it. But for those who are totally submitted in Shiva Bhakti, would get liberated out of the birthrebirth cycle and would attain Salvation.

Continues... 

🌹 🌹 🌹 🌹 🌹

🌹 The Siva-Gita - 4 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️  Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 01: 
🌻 Bhakti Niroopana Yoga - 3 🌻

09. In this world, the Brahmin who is a householder (gruhastha), doing Homams and Yagyams by dedicating  food and beverages to Gods through fire; such Brahmins are like Kamadhenu to the Demigods because  from their Yagyas and Havans the Gods get their food. 

10. The Gods accept these offerings with pleasant heart and happiness. (In turn Gods maintain timely rains and help the earth produce grains properly). 

11. So,  it's a duty of Brahmins to regularly do the homams and yagyams and keep the Gods happy (to get food on 
earth in return). 

If Brahmins leave doing these fundamental duties to Gods and immerse themselves in  Yoga and in learning about the absolute Brahman (Supreme Lord) and attain pleasure in serving him  through the path of knowledge/bhakti, it makes Gods unhappy since they wouldn't get their share of food  through sacrifices.

12. For that reason they may become unhappy and may curse. If someone else steals the  milk giving cow and takes in a different direction the way its actual owner would feel uncomfortable and  would want to get it back, same way these demigods also feel uncomfortable when some Brahmin  deviates away from his path of normal duties towards the path of Salvation, and in order to get him back  for their happiness they try to create disturbances in all possible ways on the devotee's path towards  salvation.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 The Siva-Gita - 3 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️  Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 01: 
🌻 Bhakti Niroopana Yoga - 2 🌻

06. Suta further cautioned his disciples not to discourse this knowledge to anyone, else DemiGods of heaven  would become displeased and would curse!

N.B: The reason for cursing is mentioned in below slokas, but these are not be afraid of in today's era  since in today's world we never do homas and yagyas regularly, neither we follow vedic practices.

Devotion towards the almighty is the only thing which we follow. Hence this is not applicable to Kaliyuga. Dharma changes in every Yuga. Hence this is not applicable to us now.

07, 08. Hearing this I said, "Hey Muni! how are you speaking like this? What harm would Gods face if someone tells this Shiva Gita to others? Why would they become angry? Why would they curse?"  When I  questioned him, VedaVyasa showered his affection on me and explained me like this.

🌹 🌹 🌹 🌹 🌹

🌹 The Siva-Gita - 2 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️  Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 01: 
🌻 Bhakti Niroopana Yoga - 1 🌻
  
01. Suta muni addresses his disciples Saunakadi Munis and said: Hey Munis! By the grace of the Lord Sri  Paramatma Parashivamurti, I'm going to impart a very sacred and divine knowledge which acts as a 
medicine on the samsaara and takes us to Brahma Swaroopa Kaivalya state known as Moksham
  
02. One cannot attain 'Kaivalya Padavi' by performing any kind of virtues or by performing any kind of  penances and religious rites. But only through the divine knowledge (Divya Gyana) Salvation (Kaivalya 
Prapti) can be achieved. 

03, 04. In olden days in 'Dandaka' forest whatever was preached by Lord Shankara to Rama, which is a divine 
secret, which when implemented in life would give Salvation to human beings, that 'Shiva Gita' was 
preached to Sanatkumara by Shanmukha (Skanda). 

05. Subsequently, that Sanat Kumara preached the same to Vyasa। That sage Vyasa became graceful on me 
and transferred that knowledge to me. 

Continues....

🌹 🌹 🌹 🌹 🌹
pranjali prabha  daily magazine 
🌹 The Siva-Gita - 1 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️  Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj /Mallapragada Ramakrishna 

🌻 INTRODUCTION 🌻

Among  the  numerous  scriptures  which  teach  us  the  path  to  Salvation,  Shiva  Geeta  is  one  of  the  foremost few  among  them.  

Although  it  didn't  gain  popularity  as  like  as  Bhagwad  Geeta,  yet  it  is  always  good  to learn  spirituality  irrespective  of  the  popularity  of  the  source.   

It  needs  to  be  mentioned  explicitly  here  that  there  cannot  be  a  comparison  between  Shiva  Geeta  with Bhagwad  Geeta  or  any  Geeta  as  a  matter  of  fact.  Every  Geeta  has  a  message,  a  central  theme  around which  it  revolves,  and  a  unique  style  of  rendering  the  message.  

Bhagwad  Gita  is  a  vedantic  scripture which  is  the  best  because  it  teaches  all  round  sacred  wisdom  from  upanishads.  But  that  doesn't  mean Shiva  Geeta  (or  any  other  Geeta)  is  inferior  to  that.  

Shiva  Geeta  primarily  focusses  on  preaching  about lord  Shiva  who  is  the  parabrahman  of  Vedas,  and  it  only  reveals  the  path  to  salvation  sailing  with  the sailor  called  'Shiva'.  So,  for  a  normal  Hindu  (who  doesn't  belong  to  any  sect),  this  would  be  a  good source  of  wisdom.  for  a  Shiva  devotee  or  a  Shaivite  this  geeta  would  be  like  a  treasure.  

Therefore  it  has to  be  understood  clearly  that  comparison  between  geetas  is  an  absurd  activity  and  everyone  is  expected to  learn  from  this  text  and  remain  blissful  in  the  devotion  of  the  Supreme  Personality  of  Godhead    Lord Shiva! It's  a  known  fact  that  Bhagwad  Geeta  has  achieved  such  a  widespread  recognition  because  people  have spread  it  across  the  world  by  translating  not  only  in  all  the  Indian  languages,  but  also  in  foreign languages.  Whereas  Shiva  Geeta  has  not  been  caught  attention  of  people  since  it's  documented  in  a Purana  and  not  present  in  the  famous  epic  Mahabharata  which  gained  greater  attention  of  people.  

Since people  usually  are  acquainted  with  Epics  but  rarely  read  or  analyze  Puranas,  Shiva  Geeta  skipped gaining  popularity  among  the  masses  due  to  the  same  reason  even  though  both  the  Geetas  are  believed to  be  documented  by  Veda  Vyasa  himself. 

Shiva  Geeta  belongs  to  the  Ramayana  era  of  Treta  Yuga  while  Bhagwad  Geeta  belongs  to Mahabharata  era  of  Dwapar  yuga.  So,  Shiva  Geeta  precedes  Bhagwad  Geeta  in  time.  However  there are  certain  instances  in  Shiva  Geeta  which  are  different  from  the  instances  in  Valmiki  Ramayana.  

But one  thing  which  is  common  is  in  Valmiki  Ramayana  as  well  as  in  Shiva  Geeta,  it  is  the  same  Sage Agastya  who  becomes  the  preceptor  of  Rama.  In  Valmiki  Ramayana  he  preaches  Rama  'Aditya Hrudayam',  and  in  Shiva  Geeta  he  preaches  him  VirajaDeeksha  Austerity.  So,  these  differences  in stories  between  Valmiki  Ramayana  and  Shiva  Geeta  could  be  understood  as  due  to  'Kalpa  Bheda' (these  might  belong  to  different  eons).  

Whatever  may  be  the  reality  behind  the  authenticity  of  Shiva Geeta,  it  definitely  is  a  text  worth  learning  since  the  verses  are  not  selfcooked  verses,  this  Shiva  Geeta verses  actually  exist  in  Upanishads  like  Svetawsatara,  Atharvasiras,  kaivalya  etc.  to  name  a  few. Therefore,  reading  this  Shiva  Geeta  is  as  equal  as  reading  the  verses  of  the  Upanisahds.  

  Shiva  geeta  also states  many  valuable  spiritual  things  including  Shiva  yoga  or  Shiva  tattwa. 

Following  a  Geeta  is  based  on  one's  personal  interest  and  choice  but  reading  spiritual  matter  always benefits  and  increases  the  devotion  towards  our  beloved  God.  Hence  readers  are  requested  to  read through  the  Shiva  Geeta  chapters  and  extract  whatever  good  things  are  taught  by  the  Lord  of  the Universe. 
🌹 🌹 🌹 🌹 🌹




No comments:

Post a Comment