Thursday, 3 July 2025

నిత్యానందం... కథ

 


*

సర్వం విష్ణుమయం జగత్
              (10వ. భాగం)
నారాయణుడు ఎత్తిన అవతారములలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంది. అన్నిటి మూలము దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ,ధర్మ సంస్థాపన. కొన్ని అవతారాలలో తానే ప్రత్యేక్షంగా కనిపిస్తాడు. మరికొన్ని అవతారాలలో వాటికి తగ్గ ప్రణాళికలు ఏర్పాటు చేసి ధర్మాన్ని స్థాపిస్తాడు. అల్లా పరోక్షంగా చరించే అవతారమే బ్రహ్మ మానస పుత్రుడుగా అవతరించిన నారదావ తారం. మొత్తం హైందవ వేదవాఙ్మయములో ఆయన లేని చోటు లేదు. మనకి అత్యంత ప్రమాణ గ్రంధములైన రామాయణ, భారత, భగవతాదులు మరియు అనేక పురాణాలలో ఆయన పాత్ర అనితర సాధ్యము.

“నారం దదాతి ఇతి నారద”
నారదుడు అనే పదమే గొప్ప అర్ధాన్ని కలిగి ఉన్నది. 'నార' అనే సంస్కృత పదానికి ఉన్న అనేకానేక అర్ధములలో 'జ్ఞానము' అనేది కూడా ఒకటి.నారదుడు అనగా 'జ్ఞానమును ప్రసాదించగలవాడు' అని అర్ధం.నారద మహర్షి అట్టి శక్తి సంపన్నుడు.మహిమాన్వితుడైనట్టి ప్రాతఃస్మరణీయుడు.

ఆయన గురించి మహాభారతం సభాపర్వంలో ఇలా చెప్పబడింది - ఇతడు వేదోపనిషత్తులను, పురాణాలను బాగా తెలిసినవాడు. దేవతలచే పూజితుడు. కల్పాతీత విశేషాలనెఱిగినవాడు. న్యాయ ధర్మ తత్వజ్ఞుడు. శిక్షా కల్ప వ్యాకరణాలు తెలిసినవారిలో శ్రేష్టుడు. పరస్పర విరుద్ధములైన వివిధ విధి వాక్యాలను సమన్వయపరచగల నీతిజ్ఞుడు. గొప్ప వక్త, మేధావి. జ్ఞాని, కవి, మంచి చెడులను వేరు వేరుగా గుర్తించుటలో నిపుణుడు. ప్రమాణముల ద్వారా వస్తు తత్వమును నిర్ణయించుటలో శక్తిశాలి. న్యాయవాక్యముల గుణదోషముల నెఱిగినవాడు. బృహస్పతి వంటి విద్వాంసుల సందేహములు కూడా తీర్చగల ప్రతిభాశాలి. ధర్మార్ధకామమోక్షముల యధార్ధ తత్వమునెరిగినవాడు. సమస్త బ్రహ్మాండములయందును, ముల్లోకములయందును జరుగు సంఘటనలను తన యోగబలముచే దర్శింపగలడు. సాంఖ్యయోగ విభాగములు తెలిసినవాడు. దేవ దానవులకు వైరాగ్యమును ఉపదేశించుటలో చతురుడు. సంధి విగ్రహ తత్వములు తెలిసినవాడు. కర్వ్య, అకర్తవ్య విభాగము చేయగల దక్షుడు. రాజనీతికి సంబంధించిన ఆరు గుణములలో కుశలుడు. సకల శాస్త్ర ప్రవీణుడు. యుద్ధ విద్యా నిపుణుడు. సంగీత విశారదుడు. భగవద్భక్తుడు. విద్యాగుణనిధి. సదాచారములకు ఆధారమైనవాడు. లోక హితకారి. సర్వత్ర సంచరింపగలవాడు.”

మన జాతికి జ్ఞాన భిక్ష పెట్టిన ఇద్దరు మహామహితాత్ములున్నారు.ఒకరు శ్రీమద్రామాయణ కృతికర్త యగు వాల్మీకిమహర్షి.వేరొకరు శ్రీమద్భాగవతమును రచించిన వేదవ్యాసమహర్షి. మన భారతజాతికి వీరే పరమగురువులు.ఒకరు ధర్మ స్వరూపుడైన భగవంతుని చరితమును రామాయణముగా అక్షరబద్ధం గావిస్తే,ఇంకొకరు లీలామానుష విగ్రహుడైన శ్యామసుందరుని కథను భాగవతముగా మనకు అందించారు.ఈ రెండు గ్రంధములున్నంత వరకూ భారత జాతీ,మతమూ సంస్కృతులు నిలిచి ఉంటాయి.కనుక వీరే మనకు పరమ గురువులు. ఈ పరమ గురువులకు కూడా ఉపదేశమొనర్చి వారు సంకటస్తితిలో ఉన్నప్పుడు మార్గాన్ని చూపి తద్వారా భారతజాతికి ఈ రెండు అమూల్యములైన గ్రంధములను ప్రసాదించిన పరమగురువు నారదమహర్షి. కనుక మనము పొద్దున్న లేవగానే మొదట స్మరించవలసినది గురువులకే గురువైన నారదమహర్షిని మాత్రమె.

దర్శనమాత్రం చేత సమస్త బాధలనూ పోగొట్టి మానవ హృదయానికి అమితమైన శాంతిని చేకూర్చగల దివ్యరూపుడు నారద మహర్షి.

ఆ నారదుని దివ్యస్తితి ఎట్టిది? ఆయనకు మనవలె లౌకికవాంచలు జంజాటములు లేవు.నిరంతరమూ నారాయణుని దివ్యనామాన్ని గానం చేస్తూ ఆయన రూపాన్ని ధ్యానం చేస్తూ మూడు లోకాలు సంచారించగల త్రిలోక సంచారి. త్రిలోక గురువు. ఆయన సాక్షాత్తు భగవంతుని ప్రతినిధి.పరమకరుణామూర్తి. దీనులకు,దారితప్పిన సాధకులకు దిక్కుతోచని ఆర్తులకు ఆయన పెన్నిధి.అటువంటి ఆర్తులకు ఎందరికో ఆయన కనిపించి కనికరించి వారికి భగవత్సాక్షాత్కారము కలిగే మార్గమును ఉపదేశించినట్లు అనేక నిదర్శనములు ఈ నాటికీ కలవు .

భగవంతుని దర్శనము అతి కష్టము.కాని నారదమునీన్ద్రుని దర్శనము సులభసాధ్యము.కర్మ పరిపాకమున గాని నారాయణుడు కరుణించడు.కాని మహర్షి అటులగాదు.ప్రేమతో భక్తులకు కనిపించి వారికి కర్మక్షాళణా ఉపాయమును బోధించుటలో ఆయన ఆసక్తుడు.హృదయపూర్వకమైన ఆర్తితో ఆయనను పిలచినచో చాలు.ఆయన నిత్యముక్తుడు.ఆయనకు ముల్లోకములలో చెయ్యవలసిన కర్మ లేనేలేదు.నిత్య స్వతంత్రుడు.కనుక ఆర్తితో అలమటిస్తున్న జీవులకు దారిచూపడమే ఆయన పని.
ధ్రువ, ప్రహ్లాదాది భక్త గ్రేస్వరులకు మంత్రోపదేసకర్త.

సంగీతశాస్త్రమున ఆయనను మించిన జ్ఞానులు గాని ఆయనను మించిన మధుర గాయకులు గాని ముల్లోకాలలో ఎవ్వరూ లేరు.

సంగీత త్రిమూర్తులలో ఒకరుగా ప్రాఖ్యాతి గాంచిన త్యాగబ్రహ్మకు స్వరార్ణవము ప్రసాదించి కర్ణాటక సంగీతానికి ప్రాణం పోసిన మహనీయుడు.

మనకి చాలా మందికి తెలుసు త్యాగరాజ పంచరత్న కీర్తనలు గురించి. కానీ నారద పంచరత్న కీర్తనలు…
త్యాగయ్య నారదుడిని స్తుతిస్తూ ఐదు ప్రధాన కీర్తనలు రచించారు అని చాలా తక్కువ మందికే తెలుసు. ఈ ఐదు కీత్తనలు వింటే నారద తత్వమేమిటో అర్ధమౌతుంది.

"నారద గురు" : నారద మహర్షిని గురువుగా భావించి రచించారు.

"శ్రీ నారద" : నారదుడి గొప్పతనాన్ని, సంగీతంలో ఆయన పాత్రను వివరిస్తుంది

“భజ రే రే"  నారదుడు భజన యొక్క ప్రాముఖ్యతను సూచిస్తారు.

"ఎంతయును ప్రీతితో"  నారదుడి పట్ల భక్తిని, ఆయనను కీర్తించడాన్ని తెలియజేస్తుంది.

"ధ్యానమే భాగ్యము"  నారదుడు ధ్యానం యొక్క గొప్పతనాన్ని ఎలా బోధిస్తారో వివరిస్తుంది.

ఈ విశేషాలు ఇలాఉంటే నారదులవారి ప్రజ్ఞ అనేకరంగాల్లో ప్రకటితమైంది కూడా.  ధర్మశాస్త్రం పై నారదవిరచిత “నారద స్మృతి” ఈనాటికీ న్యాయవ్యవస్థలో అమలులో ఉంది. “బృహన్నారదీయము “,“ లఘునారదీయము “ ఆంగ్లభాషలో కూడా అనువదించబడ్డాయి. ఈ గ్రంథంలో ఆస్తి పంపకములు మొదలగు ధర్మాలన్నీ చెప్పబడ్డాయి.

శిల్పశాస్త్రం పై కూడా నారదులవారు గ్రంధరచన చేశారు. గ్రామనిర్మాణము మొదలుకొని పట్టణ నిర్మాణ వివరములు కలిగిన వాస్తుశాస్త్ర లక్షణాలన్నీ చెప్పబడ్డాయి.

ఇతరరచనలు “ జ్యోతిర్నారదము“, “ చతుర్వింశతి మతము“. ఈ గ్రంధాల వైవిధ్యాన్ని గమనిస్తే నారద మహర్షికి ఈ లోకంలో మనుష్యులకు అవసరమైనవీ, అలాగే ఆధ్యాత్మిక లోకసాధన సంపత్తీ అన్నిటిపై పూర్తి అవగాహన ఉందని అర్ధమవుతుంది.

వ్యాసమహర్షి ఉపనిషత్సారాన్ని బ్రహ్మ సూత్రాలుగా ప్రకటస్తే, నారద మహర్షి గోపికల భక్తిని దృష్టాంతంగా చూపుతూ
నారద భక్తి సూత్రాలు ప్రసాదించాడు.

నారద విరచిత నారద సంహిత అనేది వేద జ్యోతిషశాస్త్రానికి సంబంధించిన ఒక ప్రాచీన గ్రంథం, ఇందులో నారద మహర్షిచే చెప్పబడిన జ్యోతిష్య సూత్రాలు, గ్రహాలు, నక్షత్రాలు, దశల వ్యవస్థ, రాశిఫలాలు, మరియు వాటికి సంబంధించిన నివారణలు (ఉపాయాలు) గురించి వివరించబడినాయి, ఇది కేవలం జ్యోతిషం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక, నైతిక బోధనలను కూడా కలిగి ఉంటుంది.

సద్గురు శ్రీశివానందమూర్తిగారు చెప్పినట్లు మహర్షులుగా ఉన్నత మానవుల గురించి తెలుసుకొని వారి అడుగుజాడలలో నడవడం వివేకవంతులు చేయవలసిన పని. మన అఖండభారతవాఙ్మయంలో ఇంతటి ప్రభావశాలి అయిన నారదమునీంద్రుని చరిత్ర ప్రతీ భారతీయుడు చదవాలి. తమతమ లౌకిక, అలౌకిక జ్ఞానసముపార్జనకు ఆయన చూపించిన దారిలో అడుగులువెయ్యాలి..

ఈ రోజు త్యాగరాజ విరచిత
“నారద గురుసామి”, “శ్రీ నారద”
కీర్తనలతో ఆ మహనీయుని కీర్తించి తరిద్దాము.

ఆకెళ్ళ శ్రీనివాసరావు.
B-910
హైదరాబాద్.

          నారద గురుసామి

దర్బారు - ఆది
పల్లవి:
నారద గురుసామి యికనైన న
న్నాదరింపవేమి? ఈ కఱవేమి? ॥నారద॥
అను పల్లవి:
సారెకు సంగీత యోగ నైగమ
పారంగతుఁడైన పరమ పావన! ॥నారద॥
చరణము(లు):
ఇతిహాస పురాణాగమ చరితము - లెవరివల్లఁ గలిగె?
పతిని దానమివ్వ బుద్ధి సత్య - భామ కెటులఁ గలిగె?
ద్యుతిజిత శరదాభ్ర! నిను వినా, ముని
యతుల కెవరు గలిగె?
క్షితిని, త్యాగరాజ వినుత! న
మ్మితి చింత దీర్చి ప్రహ్లాదుని బ్రోచిన ॥నారద॥

"శ్రీ నారద" : నారదుడి గొప్పతనాన్ని, సంగీతంలో ఆయన పాత్రను వివరిస్తుంది.

పల్లవి:
శ్రీనారద! నాద సరసీరుహ భృంగ, శుభాంగ ॥శ్రీ॥
అను పల్లవి:
దీనమానరక్షక! జగదీశ! భేష సంకాశ ॥శ్రీ॥
చరణము(లు):
వేద జనిత వర వీణా వాదన తత్త్వజ్ఞ!
ఖేదకర త్రితాప రహిత! ఖేచర వినుత!
యాదవ కులజాప్త! సదా మోద హృదయ మునివర్య!
"శ్రీద త్యాగరాజ వినుత! శ్రీకర! మాం పాలయ ॥శ్రీ॥

అట్టి నారద మహర్షిని త్యాగయ్య 'నాద సరసీరుహ భ్రుంగ' అని గొప్పగా భావిస్తాడు.అంటే 'నాదమనే పద్మములో నిరంతరమూ అమృతాన్ని ఆస్వాదిస్తున్న తుమ్మెద' వంటి వాడని భావం.

ఆయన 'వేదజనిత వరవీణా వాదన తత్వజ్ఞుడు'- వేదములలో ఉద్భవించిన వీణావాదన రహస్యములను ఎరిగినవాడు.వీణానాదమును అంతరిక సాధనలో మేరుదండమనబడిన వెన్నెముకలో గల సప్త చక్రములలో మ్రోగించుచు బ్రహ్మానంద రసాస్వాదన చేయగల విద్య మహాయోగులకు విదితమే.అట్టి విద్యకు నారదుడు పరమ గురువు.

ఇది నాదోపాసనలో మత్తిల్లిన చిత్తానికి సంకేతం.మహత్తరమైన యోగసిద్దికి తార్కాణం.'శుభాంగా' అన్న సంబోధనలో నారద మహర్షి యొక్క స్పటికనిభ సంకాశమైన శుభంకరమైన వర్చస్సు గోచరిస్తున్నది. ఆయన శరీరము భౌతికమైనట్టిది కాదు. భౌతికమే అయితే త్రిలోకములలో సంచరించలేదు.భౌతిక శరీరము ఈ భూమి వరకే ఉపయోగపడుతుంది.కాని మహర్షి త్రిలోక సంచారి.ఆయనది చిదాకాశము వంటి దివ్యదేహము గనుక ధ్యానించు వారికి శుభప్రదమైనది. 'భేశ సంకాశ' అన్న పదం అద్భుతమైనది.భేశ అనగా నక్షత్రములకు ఈశుడు అనగా చంద్రుడు కనుక చంద్రకాంతి వంటి చల్లని తెల్లని వన్నె కల్గినది మహర్షి దేహచ్చాయ.ఆయన దర్శనం దీనులను కాపాడునట్టిది.ధ్రువ ప్రహ్లాదాది పరమ భక్తులకు,వ్యాసవాల్మీకాది మహర్షులకు సంకట సమయంలో కరుణించి దారిచూపినట్టి పరమ గురువరేణ్యుడు నారద మునీంద్రుడు.
*****
🙏🙏🙏🌼🌼🌼🌼🙏🙏🙏

అందరికి నమస్కారం ధనుర్మాసం సందర్భంగా నేను శ్రీకృష్ణదేవరాయల రచించిన ప్రబంధం ఆముక్తమాల్యద పోస్ట్ చేస్తున్నాను. గ్రూప్ సభ్యులందరూ చదువుతారని ఆశిస్తూ

🌼🌿🌼🌿🌼🌿🌼🌿

*🌼ఆముక్తమాల్యద .* *(నేటి నుండి ప్రారంభం )*
*1 వ. భాగం*

🌼🌿🌼🌿🌼🌿🌼🌿

*ప్రార్ధన*

విశ్వశ్రేయస్సు కోసం నీతిబోధ చేయడం ప్రాచీన కావ్యాల ప్రధాన ఉద్ధేశ్యం కాగా చదువరులకు రసస్ఫూర్తి కలిగించడమే ప్రబంధాల ముఖ్య ఉద్ధేశ్యం.. ప్రబంధాలలో కథావస్తువుకంటే అలంకారాలు, పద విన్యాసాలు, పాత్రచిత్రణలకు, రసపోషణకు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. మనిషిలోని ఆకలి దప్పులలాగే సౌందర్య పిపాస, రస పిపాస, కళాతృష్ణ మొదలైన లక్షణాలను తృప్తిపరచడానికి ప్రబంధ సాహిత్యం ఒక అద్భుతమైన సాధనం. ఇదే క్రమంలో విజయనగర సామ్రాజ్యనేత శ్రీకృష్ణదేవరాయలు రచించిన "ఆముక్తమాల్యద" ఒక మహాద్భుతమైన ప్రబంధం.

గోదాదేవి తను ధరించిన మాలను విష్ణువుకు సమర్పించిన కారణం చేత ఆమెకు ఆముక్తమాల్యద అనే పేరు వచ్చింది. అట్టి గోదాదేవి , రంగనాధుడి పెళ్లి కథ " ఆముక్తమాల్యద అనే విష్ణుచిత్తీయము". దీనికి మూలంగా "దివ్య సూరి చరిత్ర", "గురుపరపరా ప్రభావం", "ప్రపన్నామృతం" అనే మత గ్రంధాలను రాయలు స్వీకరించాడు.

1518 ప్రాంతంలో కళింగరాజ్యం మీద దండయాత్రకు వెళ్లిన సమయంలో కృష్ణాజిల్లా కూచిపూడి సమీపంలోని శ్రీకాకుళాంద్ర మహావిష్ణువు దేవాలయానికి తీర్ధయాత్ర చేశాడు రాయలు. అక్కడ నిదురించిన వేళ ఆయనకు కలలో ఆంధ్రమహావిష్ణువు దర్శనమిచ్చి.. " ఓ రాజా! సంస్కృతంలో ఎన్నో గ్రంధాలు రాసి మెప్పు పొందావు. తియ్యనైన తెలుగు బాషలో నా సంతోషం కోసం నా కథను తెలుగులో కృతిగా నిర్మించు.. నీకు సర్వదా విజయము, శుభము కలుగుగాక..." అని ఆజ్ఞాపించి, ఆశీర్వదించినట్టుగా రాయలు చెప్పాడు.

అంతట ఆ రాయలు తన దండనాధులు, సామంతులు, వేదపండితులతో చర్చించి ఈ ప్రబంధ రచనకు పూనుకున్నాడు. ఈ కావ్యం మొత్తం అయిదు విడివిడి కథల సమాహారం . మొదటిది.. విష్ణుచిత్తుడి కథ .. రెండవది..ఖాండిక్య కేశిధ్వజ వృత్తాంతం. మూడవది.. యామునాచార్య వృత్తాంతం.. నాలుగవది. గోదాదేవి వృత్తాంతం.. అయిదవది.. చండాల, బ్రహ్మరాక్షసుల కథ. ఈ అయిదు కథలు కలిపి కావ్యంలో సుమారు అయిదువందల పద్యాలు ఉన్నాయి. వాటికి తోడు పీఠికా, విల్లిపుత్తూరు వర్ణనా, మధురాపుర వర్ణనా, ఋతువర్ణనలూ అన్నీ కలిపి ఒక అత్యద్భుతమైన కావ్యాన్ని మనకందించాడు శ్రీకృష్ణదేవరాయలు. ఈ ప్రబంధాన్ని తనకు ఇష్టదైవమైన శ్రీవేంకటేశ్పరునికే అంకితమిచ్చాడు.

రాయలు శ్రీవేంకటేశ్వరుని మీదనే మొదటి పద్యం రాశాడు. కల్యాణమూర్తులైన లక్ష్మీనారాయణులను అత్యంత రమణీయంగా వర్ణించాడు.

( ఈ పద్యం చదువరి స్వరంలో )
శ్రీ కమనీయ హారమణిఁ జెన్నుగఁ దానును, గౌస్తుభంబునం

దాకమలావధూటియు నుదారతఁ దోఁపఁ, బరస్పరాత్మలం

దాకలితంబు లైన తమ యాకృతు లచ్చతఁ బైకిఁ దోఁప, న

స్తోకత నందుఁ దోఁచె నన, శోభిలు వేంకటభర్తఁ గొల్చెదన్

భార్యాభర్తలకు ఒకరిమీద ఒకరికి ఉన్న అత్యంత ప్రేమను, అనురాగాన్ని ఈ పద్యంలో వివరిస్తూ, లక్ష్మీదేవి ధరించిన అందమైన హారములోని మణియందు శ్రీనివాసుడు, ఆతని కౌస్తుభమునందు లక్ష్మీదేవి చక్కగా ప్రతిబింభిస్తున్నారు. ఒకరి మనస్సులో ఒకరు నిండి యున్న కారణంగా వాళ్ళ మనసుల స్వచ్ఛత వలన (అవి transparent అయి) ఆ లోపలున్న రూపాలు వారు ధరించిన హారములలోని మణులలో స్పష్టంగా బయటకి కనిపిస్తున్నట్టుగా ఉన్నాయి. ఈ విధముగా విలసిల్లుతున్న వేంకటేశ్వరుని సేవిస్తాను అని ఉత్పలమాల(కలువపూలమాల) తో ఆముక్తమాల్యద (ధరించిన పూలమాలను సమర్పించినది) కావ్యాన్ని మొదలుపెట్టాడు కృష్ణదేవరాయలు.

(ఈ పద్యం చదువరి స్వరంలో)
సీ. ఖ నట త్పయోబ్ధి వీక్ష్య రసాతలాన్యోన్య పిండీకృతాంగ భీతాండజములు

ధృత కులాయార్ధ ఖండిత సమిల్లవరూప చరణాంతిక భ్రమ త్తరువరములు

ఘన గుహా ఘటిత ఝాంకరణ లోకైక ద్వి దుందుభీకృత మేరు మందరములు

చటుల ఝంపా తర స్స్వ నగరీ విపరీత పాతితాశాకోణ పరిబృఢములు

తే. ప్రబల తర బాడబీకృతేరమ్మదములు

భాస్వరేరమ్మదీకృత బాడబములు

పతగ సమ్రాత్పతత్త్ర ప్రభంజనములు

వృజిన తూలౌఘములఁ దూల విసరుఁ గాత.

గరుత్మంతుడి రెక్కల గాలుల వల్ల సముద్రంలోని నీళ్లన్నీ ఆకాశానికి ఎగిసిపోయి పాతాళలోకం బట్టబయలై కనపడింది. అప్పుడు పాతాళంలోనున్న పాములు తమ ఆజన్మశత్రువైన గరుత్మంతుని చూసి భయంతో గజగజ వణకుతూ ఒకదానికొకటి పట్టుకుని ముద్దలుగా కనిపిస్తున్నాయి. గరుత్మంతుడి రెక్కలగాలి ఎంత వేగంగా, తీవ్రంగా ఉందంటే పెద్ద పెద్ద చెట్లు కూడా కూకటివేళ్లతో సహా లేచిపోయి ఆతని కాళ్లకు తట్టుకున్నాయి. ఆతడు పక్షియగుట చేత, తన గూటి కోసం కట్టెపుల్లలను తన కాలిగోళ్లతో తీసికెళ్తున్నట్టుగా తోస్తున్నది. అతని రెక్కల గాలులు పర్వతగుహలలో ప్రవేశించినప్పుడు మేరుపర్వతం, మంధరపర్వతం రెండూ ఏకమై భేరీ, దుందుభులుగా శబ్దం చేస్తున్నట్టుగా లోకాలన్నీ దద్దరిల్లుతున్నాయి ...గరుడుని రెక్కల గాలులు మిక్కిలి తీవ్రంగా ఉండుటచేత దిక్కులు,మూలలయందు ఉన్న పాలకులు (అష్టదిక్పాలకులు) నిలబడలేక వేఱు వేఱు దిక్కులకు విసిరివేయబడ్డారు.

గరుత్మంతుడి రెక్కలగాలి వేగానికి ఆకాశంలోని మేఘములతోడి మెరుపులు సముద్రంలో పడి బడబాగ్నులు సృష్టిస్తున్నాయి. ఆ గాలి ఉధృతానికి బడబాగ్నులు మింటికెగసి మెరుపులుగా మారాయి. అట్టి ప్రచండమైన పక్షిరాజు రెక్కల గాలి పాపములనెడి దూదిపింజెల్లాటి మేఘములను చెదిరిపోవుగాక.

(ఈ పద్యం రాఘవ స్వరంలో..రాగం.. రీతిగౌళ )

పిడికెడు కౌను గొప్పు గని ప్రేమ ద్రివక్ర సమాంగి జేసి, తే

బిడికెడు కౌను గొప్పు బయిబెచ్చు గుణంబును గంటి నంచు, నే

ర్పడగ నిజత్రివక్రతయు బాపగ మ్రొక్కెడు నా, సుమాలిపై

జడిగొన నమ్ములీను హరి శార్‍ఙ్గ ధనుర్లత గాచు గావుతన్

విష్ణుమూర్తి సుమాలి అనే రాక్షసుడితో యుద్ధం చేస్తుండగా ఆయన చేతిలో ఉన్న శార్‌జ్గ ధనుస్సు వంగి అతనికి అభివాదం చేస్తూ ఏదో ప్రార్ధన చేస్తున్నట్టుగా ఉంటుంది. పిడికెడు నడుము, కొప్పూ కలిగి,మూడు వంకరలున్న కుబ్జను తీర్చి సుందరమైన స్త్రీగా చేసావు. అదే విధంగా పిడికెడు నడుమూ (ధనుస్సు మధ్యభాగమైన లస్తకము) , కొప్పు( విల్లు పైభాగం), వీటితో పాటు గుణమూ (గుణం, వింటితాడును గుణం అని కూడా అంటారు) ఉన్న నా వంకరలను ఎందుకు తొలగించవు ప్రభు?" అని యుద్ధములో సుమాలిపై జడివానల వేస్తున్న శరప్రయోగమునందు ఆ విల్లు ఈ విధముగా శ్రీమహావిష్ణువుకు వంగి మొక్కుచున్నట్టుగా ఉన్నది. ఇంతకీ ఆ ధనుస్సు వక్రతను విష్ణుమూర్తి ఎలా తొలగిస్తాడు? ఎడతెగకుండా యుద్ధం చేసేటప్పుడు విల్లు అర్థ చక్రాకారంలోకి మారుతుందని వర్ణిస్తూ ఉంటారు. అంటే అంతగా వంచబడుతుందన్న మాట. అప్పుడా త్రివక్రత పోయినట్టే కదా! అంచేత ఎప్పుడూ అలా యుద్ధం చేస్తూ శత్రు సంహారం చెయ్యమని ఆ ధనుస్సు ఆకాంక్ష అన్న అర్థం కూడా స్ఫురిస్తుంది.

(ఈ పద్యం రాఘవ స్వరంలో .. రాగం .ద్విజావన్తి )

అడరు గళాస్రధారలు మహాముఖ వాంత సుధాంబుధారలున్

పొడవగు వహ్నికీలములు పొంగును కాన్ పెరదైత్య కోటికిన్

బెడిదపు కిన్కతో నెసరు వెట్టిన పెద్దపనంటి వోలె, ఎ

క్కుడు వెస రాహు మస్తకము కొన్న సుదర్శనదేవు గొల్చెదన్

క్షీరసాగర మథనంలో పుట్టిన అమృతాన్ని రాక్షసులకు అందకుండా దేవతలకి పంచడానికి విష్ణుమూర్తి మోహినీ అవతారమెత్తుతాడు కదా. ఆ సమయంలో రాహువనే రాక్షసుడు దేవతలలో చేరి అమృతాన్ని త్రాగబోతాడు. అది గ్రహించిన విష్ణువు ఆ అమృతం రాహువు కంఠంనుండి కిందకి దిగకముందే తన సుదర్శన చక్రంతో అతని తల నరుకుతాడు. ఈ పద్యంలో ఆ ఘట్టం వర్ణించబడింది. అలా తెగిన తలనుండి రక్తం ఎగజిమ్మింది. రాహువు నోటినుండి అమృతం పైకి పొంగింది. ఆ ఎఱ్ఱని రక్తమేమో పొయ్యికింద మంటలా ఉంది. పైకి పొంగుతున్న అమృతమేమో ఎసరుపెట్టినప్పుడు పైకి పొంగే నీళ్ళలాగా ఉంది. తెగిన రాహువు తల ఎసరుపెట్టిన పెద్ద కుండలాగా ఉంది. కోపంతో రాక్షస సమూహమంతటికీ ఎసరుపెట్టిందా అన్నట్టుగా అతి వేగంతో రాహువు తల నరికిన ఆ సుదర్శన దేవుడికి నమస్కరించాడు. ఎసరుపెట్టడం అంటే నష్టాన్ని కలిగించడానికి ప్రయత్నించడం అనే తెలుగు జాతీయాన్ని ఈ పద్యంలో ఎంత చక్కగా ఉపయోగించాడో చూసారా!

ఇలా ఇష్టదేవతా ప్రార్థనలో వేంకటపతి అయిన విష్ణుమూర్తిని, ఆదిశేషువుని, విష్ణు వాహనమైన గరుత్మంతుడిని, విష్ణు సేనాధిపతి విష్వక్సేనుడి బెత్తాన్ని, విష్ణు శంఖమైన పాంచజన్యాన్నీ, అతని ఖడ్గమైన నందకాన్ని, కౌమోదకి అనే అతని గదని, శార్‌ఙ్గ ధనుస్సుని, సుదర్శమ చక్రాన్ని, పన్నెండుమంది ఆళ్వారులని ప్రార్థిస్తాడు శ్రీకృష్ణదేవరాయలు. రాయలు వైష్ణవ మతావలంబి. ఆ మతంలో విష్ణుమూర్తితో బాటు అతని సకలాయుధాలను, ఆదిశేషువును, గరుత్మంతుని, విష్వక్సేనుని కూడా పూజించడం ఆనవాయితీ. అలాగే పరమభక్తులైన ఆళ్వారులను కూడా. మరే ఇతర దేవతలని అందుకే ప్రార్థించ లేదు.

ఇష్టదేవతా ప్రార్థన అయిన తర్వాత, అసలు తను ఈ ఆముక్తమాల్యద వ్రాయడానికి వెనకనున్న కారణాన్ని నేపథ్యాన్ని వివరిస్తాడు. అది తర్వాతి పోస్టులో చూద్దాం.

                     *_🌻శుభమస్తు🌻_*
                              ఇట్లు
                                మీ
                         భవధీయుడు
             
         
           🙏సర్వే జనాః సుఖినోభవంతు🙏
          🙏లోకాస్సమస్తా సుఖినోభవంతు🙏
           🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏
                🙏🙏🙏🌼🌼🌼🌼🙏🙏🙏
*****
13వ. సర్వం విష్ణు మయం జగత
             దత్తాత్రేయుడు

దత్తా అనే పదానికి "సమర్పించిన" అనే అర్థముంది, త్రిమూర్తులు అత్రి మహర్షి, అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము "సమర్పించుకున్నారు" కనుక అతడికి దత్తా అని పేరు వచ్చింది. ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు "ఆత్రేయ" అయింది.

నారద మహర్షి అనసూయ "పాతివ్రత్యాన్ని" (భర్త పట్ల భక్తిభావం) గురించి బ్రహ్మ-విష్ణు-శివుడి ధర్మపత్నుల ముందు విశేషంగా ప్రశంసించాడు, దీంతో వారికి ఆమె పట్ల అసూయ ఏర్పడింది. ఆమె పాతివ్రత్యాన్ని కోల్పోయేలా చేయవలసిందిగా వారు తమ భర్తలను వేడుకున్నారు. అత్రి ఆశ్రమంలో లేని సమయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనసూయ వద్దకు అతిథులుగా వెళ్లి, తమకు భోజనం పెట్టమని అడిగారు. ఆమె అందుకు అంగీకరించగానే, ఆమె దుస్తులు ధరించకుండా నగ్నరూపంలో వడ్డిస్తేనే తాము భుజిస్తామని వారు చెప్పారు. అనసూయ దీంతో సందిగ్ధతలో చిక్కుకుంది. పరపురుషుల ముందుకు ఆమె నగ్నంగా వస్తే ఆమె పాతివ్రత్యం కోల్పోతుంది. ఆమె ఇందుకు వ్యతిరేకిస్తే అప్పుడు ఆమె అతిధులను అగౌరవపర్చినట్లవుతుంది. భర్త సహకారం తీసుకోవాలనుకున్నపుడు వారు అత్రి మహర్షి తపోశక్తిని లాగేసుకుంటారు. తన వద్దకు వచ్చి ఇలాంటి వింత కోరిక కోరి తనను చిక్కులో పడవేసిన ఈ ముగ్గురు అతిథులు సామాన్యులు కారని అనసూయ భావించింది. అనసూయ తన భర్తను మనసులోనే ధ్యానించుకుని, తాను కాముకత్వ ప్రభావానికి గురి కాను కాబట్టి దుస్తులు లేకుండా వారికి వడ్డించడానికి భయపడనని వారికి చెప్పింది. అతిథులు ఆమెను "భవతీ బిక్షాం దేహి" (ఓ మాతా! మాకు భిక్ష ప్రసాదించు) అని కోరుతూ ఆమెను తల్లీ అని పిలిచారు. అందుకని ఆమె వారిని తన పిల్లలుగా భావించి వారు కోరిన విధంగా భోజనం వడ్డించింది. ఆమె గొప్పతనం, ఆమె ఆలోచనల కారణంగా, ఆమె భోజనం వడ్డించే సమయంలో ముగ్గురు దేవుళ్లు చిన్న పిల్లలుగా మారిపోయారు, ఆమె వక్షోజాల నుంచి పాలు ధారగా వచ్చాయి. తర్వాత ఆమె వారికి పాలు కుడిపి ఊయలలో పరుండబెట్టి నిద్రపుచ్చింది. తర్వాత అత్రి ఆశ్రమానికి తిరిగివచ్చి జరిగిన కథను అనసూయనుంచి తెలుసుకుని ఊయలలో నిద్రిస్తున్న త్రిమూర్తులను స్తుతించాడు. వారు నిజరూపాలతో నిద్రలేచి అనసూయ పాతివ్రత్యానికి మెచ్చి ఆమెకు వరమిచ్చారు. అనసూయ ఆ ముగ్గురిని తన పిల్లలుగా ప్రభవించమని కోరింది.శివ, విష్ణు, బ్రహ్మ అంశలతో దూర్వాసుడు, దత్తాత్రేయ మరియ  చంద్రుడుగా మువ్వురు జమ్మించారు. మార్గశిర పూర్ణిమ దత్తాత్రేయుల వారు అవతరించిన దివ్యతిథి. దీనిని దత్త జయంతిగా వ్యవహరిస్తారు.

మహాభారత, రామాయణాల వంటి మహాకావ్యాలలో ఆయన ప్రస్తావన ఉంది.

కృష్ణుడు, తన యదువంశం అంతరించిపోతున్న సమయంలో, ఉద్ధవుడికి తన భౌతిక రూపం అంతం కాబోతుందని, మోక్షానికి మార్గం గురు ఉపదేశం ద్వారానే అని వివరిస్తాడు. ఆ క్రమంలో, దత్తాత్రేయుని జీవితం, ఆయన ప్రకృతి నుండి నేర్చుకున్న అద్భుతమైన పాఠాలను ఉద్ధవుడికి వివరించి, ఆ జ్ఞానాన్ని అనుసరించమని బోధిస్తాడు. ఈ విధంగా, ఉద్ధవ గీతలో దత్తాత్రేయ కథ భాగవత పురాణంలోని ముఖ్యమైన జ్ఞాన బోధనలలో ఒకటిగా నిలిచింది. కృష్ణుడు దత్తాత్రేయుడి ఇరవై-నాలుగు గురువుల జాబితాను ఈ విధంగా పేర్కొన్నాడు:
భూమి, గాలి, ఆకాశం లేదా ఖగోళం, నీరు, నిప్పు, సూర్యుడు, చంద్రుడు, నాగుపాము, రామచిలుక, సముద్రం, చిమ్మట, తేనెటీగ, మదపుటేనుగు, ఎలుగుబంటి, జింక, చేప, గ్రద్ద, పసిబాలుడు, కన్య, వేశ్య, లోహపు పనివాడు, సర్పం, సాలీడు, కందిరీగ.

దత్తాత్రేయుడి అనుయాయులు: కార్తవీర్యార్జున, పరశురాముడు, యదు, అలార్క, ఆయు, ప్రహ్లాదుడు. వీరు పురాణాల ద్వారా వెలుగులోకి వచ్చారు.
(వికేపిడియా)

దత్త సంప్రదాయంలో తొలి అవతారం శ్రీపాద శ్రీ వల్లభ, రెండో అవతారం నరసింహ సరస్వతి. మూడవ అవతారం మాణిక్ ప్రభు, నాలుగవ అవతారం అక్కల్ కోట్ స్వామి సమర్ధ, ఐదవ అవతారం శ్రీ షిరిడీ సాయి బాబా, మరియు శ్రీ వాసుదేవానంద సరస్వతి (టెంబి స్వామి)కూడా దత్తాత్రేయ అవతారాలుగా పరిగణిస్తారు.

దత్తాత్రేయుడు పూర్వ యుగములో 16 రూపాలలో దర్శనమిచ్చి యుండిరి . వారి పేర్లు…

యోగిరాజ్
అత్రివరద
దత్తాత్రేయ
కళాగ్నిషమాన్
యోగిజనవల్లభ
లీలావిషంభర్
సిద్ధరాజ్
ధన్యసాగర్
విషంభర్
మాయాముక్త
మాయాముక్త
ఆదిగురు
శివరూప్
దేవదేవ్
దిగంబర్
కృష్ణశ్యామల లోచనుడు.

ప్రసిద్ధ దత్త క్షేత్రాలు

1.పిఠాపురం
2.కురుపురం
3.గోకర్ణం
4.కరంజ
5.నర్సొబావాడి
6.గాణగా పూర్
7.ఔదుంబర్.

దత్త చరిత్ర, శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర పారాయణ సకల దుఃఖ విమోచనకారి అని సర్వ మంగళ ప్రదమని ఎందరో విశ్వసిస్తారు.

అట్టి దత్తుని మనం ఈ రోజు దత్త స్తోత్రం తో, శ్రీపాద శ్రీవల్లభ సిద్ధ మంగళస్తోత్రంతో
స్తుతించి తరిద్దాం.

B-910
హైదరాబాద్.

         దత్తాత్రేయస్తోత్రం

దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలమ్ ।
ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు ॥ 1 ॥

దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణమ్ ।
సర్వరక్షాకరం వందే స్మర్తృగామి సనోవతు ॥ 2 ॥

శరణాగతదీనార్త పరిత్రాణపరాయణమ్ ।
నారాయణం విభుం వందే స్మర్తృగామి సనోవతు ॥ 3 ॥

సర్వానర్థహరం దేవం సర్వమంగళ మంగళమ్ ।
సర్వక్లేశహరం వందే స్మర్తృగామి సనోవతు ॥ 4 ॥

బ్రహ్మణ్యం ధర్మతత్త్వజ్ఞం భక్తకీర్తివివర్ధనమ్ ।
భక్తాఽభీష్టప్రదం వందే స్మర్తృగామి సనోవతు ॥ 5 ॥

శోషణం పాపపంకస్య దీపనం జ్ఞానతేజసః ।
తాపప్రశమనం వందే స్మర్తృగామి సనోవతు ॥ 6 ॥

సర్వరోగప్రశమనం సర్వపీడానివారణమ్ ।
విపదుద్ధరణం వందే స్మర్తృగామి సనోవతు ॥ 7 ॥

జన్మసంసారబంధఘ్నం స్వరూపానందదాయకమ్ ।
నిశ్శ్రేయసపదం వందే స్మర్తృగామి సనోవతు ॥ 8 ॥

జయ లాభ యశః కామ దాతుర్దత్తస్య యః స్తవమ్ ।
భోగమోక్షప్రదస్యేమం ప్రపఠేత్ సుకృతీ భవేత్ ॥9 ॥

శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః
శ్రీపాదవల్లభ నరసింహసరస్వతి
శ్రీగురు దత్తాత్రేయాయ నమః

            సిద్ధ మంగళ స్తోత్రం

శ్రీమదనంత శ్రీవిభూషిత అప్పలలక్ష్మీ నరసింహరాజా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ॥ 1 ॥

శ్రీవిద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ॥ 2 ॥

మాతా సుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ॥ 3 ॥

సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ॥ 4 ॥

సవితృకాఠకచయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ॥ 5 ॥

దోచౌపాతీ దేవ్ లక్ష్మీ ఘన సంఖ్యా బోధిత శ్రీచరణా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ॥ 6 ॥

పుణ్యరూపిణీ రాజమాంబసుత గర్భపుణ్యఫల సంజాతా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ॥ 7 ॥

సుమతీ నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాదా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ॥ 8 ॥

పీఠికాపుర నిత్య విహారా మధుమతి దత్తా మంగళరూపా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ॥ 9 ॥
*****
సర్వం విష్ణుమయం జగత్
             ఋషభ దేవుడు

శ్రీమద్ భాగవత పురాణం ప్రకారం, ఋషభ దేవుడు విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారంగా పరిగణించబడతారు, మరియు యజుర్వేదంలో కూడా వీని ప్రస్తావన ఉంది.

ఆగ్నీధ్రుడు పెద్ద కుమారుడైన నాభి, ఆతని భార్య మేరుదేవి సంతానం కలగకపోవడంతో అనేక యజ్ఞాలు, యాగాలు చేశారు. సంతుష్టుడైన విష్ణుమూర్తి అప్పుడు ప్రకాశమానమైన చతుర్భుజాలతో; పట్టు పీతాంబరంతో రమణీయలైన శ్రీవత్సం, కౌస్తుభమణి, శ్రీదేవి విరాజిల్లే వక్షఃస్థలంతో; శంఖం, చక్రం, గద, పద్మం, ఖడ్గం మొదలైన దివ్యాయుధాలతో; సాటిలేని నవరత్నాల కాంతు లను వెదజల్లే బంగారు కిరీటంతో; మకర కుండలాలు, మొలనూలు, మణులు చెక్కిన స్వర్ణహారాలు, బాహుపురులు, కాలి అందాలు ప్రకాశిస్తుండగా లక్ష్మీపతి ఆ దంపతుల ముందు ప్రత్యక్షమైనాడు.

అప్పుడు నీవంటి కుమారుడిని ప్రసాదించమని నాభి విష్ణువును కోరాడు. విష్ణువు అంగీకరించి వారి సంతానంగా జన్మించాడు. ఆ దంపతులు తమ కుమారుడికి ఋషభుడు అని పేరు పెట్టుకున్నారు.

ఋషభుడు బాహ్యపూజలు చేయకపోడంతో ఇంద్రుడికి కోపం వచ్చి వర్షం కురిపించడం ఆపేయగా, ఋషభుడు తన యోగబలంతో మేఘాలను సృష్టించి తన రాజ్యంలో వర్షాన్ని కురిపించి, తన తండ్రిని సంతోష పరచాడు. దాంతో ఋషభుడికి పట్టాభిషేకం చేసి, తదనంతరం నాభి తపోవనంకు వెళ్ళిపోయాడు.

ఋషబునికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు వందమంది కుమారులు, వారిలో భరతుడు పెద్దవాడు. రెండవ భార్య కుమారుడు బాహుబలి. ఋషభుడు తన కుమారులకు అన్ని ఆచారాలను ఉపదేశించి తన రాజ్యాన్ని కురువు, హిరణ్మయము, రమణకము, భాద్రశ్వము, ఇలావ్రుతము, కేతుమల్యము, హరివర్శము, భారతవర్షము, కిమ్పురుశము అను తొమ్మిది భాగాలుగా చేసి మొదటి తొమ్మిదిమందిని వాటికి రాజులుగా చేసి, మిగిలిన వారికి ప్రధాన బాధ్యతలను అప్పగించాడు. ఇందులో భరతుడు పాలించిన భారతవర్షముకు భారతదేశం అనేపేరు వచ్చింది.

కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, అవిర్హోత్ర, దృమిల, చమస, కరభాజనులు నారాయణాంశతో జన్మించిన ఋషభ చక్రవర్తికి  100 మంది కుమారులలో వారు. వీరిని నవ నారాయణులని పిలిస్తారు.
వీరంతా అవధూతలు మరియు దత్తాత్రేయుల వారికి ఆప్తులు.

వీరే తదుపరి

1.మత్సేంద్రనాథుడు

2. గోరక్షనాథుడు


3. జాలంధరనాథుడు


4. కానీఫానాథుడు


5. చర్పటనాథుడు


6. నాగనాథుడు


7. భర్తరినాథుడు


8. రేవణనాథుడు


9. గహనీనాథుడు


గా ఉద్భవించి నాధ సంప్రదాయాన్ని విస్తరింప చేసారు. వీరే నవనాధులుగా ప్రాఖ్యాతి గాంచారు.

అవదూతగా మారిన ఋషభుడు అజగరవ్రతం (కొండచిలువ మాదిరిగా ఉన్నచోటు ఉండి కదలకుండా దొరికినపుడు దొరికినంత తినడం) ఆచరించాడు. అడవిలో నిద్రిస్తున్న సమయంలో మంటలు చుట్టుముట్టగా తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేయకుండా ఋషభుడు అందులోనే దహనమయ్యి చనిపోయాడు.
(వికిపిడియా)

ఈ అవతారంలో, భగవానుడు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలలో పాటించాల్సిన ధర్మాన్ని, ముఖ్యంగా పరమహంస ధర్మాన్ని బోధించారు.

చాలామంది పండితులు హిందూమతంలోని ఋషభ అవతారాన్ని జైనమత వ్యవస్థాపకుడు మరియు మొదటి తీర్థంకరుడైన ఋషభనాథుడితో ఒకటిగా భావిస్తారు, ఇది హిందూ మరియు జైన సంప్రదాయాల మధ్య ఉన్న అనుబంధాన్ని సూచిస్తుంది.

కొన్ని పురాణాల ప్రకారం (లింగ పురాణం), ఋషభ దేవుడు శివుని 28 అవతారాలలో ఒకరిగా కూడా పేర్కొనబడ్డారు, ఇక్కడ శివుడు వృషభ (ఎద్దు) రూపంలో భూమిపైకి వచ్చారని ఉంది.

ఋషభ అంటే సర్వోత్తమం, ధర్మం, నిగ్రహం, జ్ఞానం అని అర్థం. జ్ఞానముతో నిగ్రహమును సంపాదించి సర్వోత్తమ ధర్మమును తాను ఆచరించి ఆచరింపచేసిన అవతారమే ఈ ఋషభావతారం. యోగ మార్గం గురంచి ప్రపంచానికి తెలియజేశాడు. ఋషభుడు చేసిన ధర్మోపదేశంను ఋషభోపదేశం అని పిలుస్తారు.

సంక్షిప్తంగా, ఋషభ అవతారం అనేది విష్ణువు (లేదా శివుడు) మానవులకు ఉన్నత ధర్మాన్ని, మోక్ష మార్గాన్ని చూపించడానికి అవతరించిన రూపం, ఇది హిందూ, జైన మతాలలో ముఖ్యమైనది.

నేడు ముక్కోటి ఏకాదశి శుభదినాన నారాయణుని అవతారమైన ఋషభదేవుని బోధించిన ధర్మ మార్గాన చరించి జీవితాలను సుసంపన్నము కావించుకుందాము.

శ్రీ ఆదిశంకర విరచిత శ్రీ పంచాయుధ స్తోత్రం మరియు శ్రీ మత్తు స్వామి దీక్షితార్ “ శ్రీ రంగపురవుహారా” కీర్తనల లో తరిద్దాము.

B-910
హైదరాబాద్.

శ్రీ పంచాయుధ స్తోత్రం

స్ఫురత్సహస్రారశిఖాతితీవ్రం
సుదర్శనం భాస్కరకోటితుల్యమ్ ।
సురద్విషాం ప్రాణవినాశి విష్ణోః
చక్రం సదాఽహం శరణం ప్రపద్యే ॥ 1 ॥

(వేలకొద్దీ ప్రకాశవంతమైన జ్వాలలతో, కోటి సూర్యుల తేజస్సుతో వెలుగుతూ, రాక్షసుల ప్రాణాలను హరించే శ్రీమహావిష్ణువు యొక్క "సుదర్శన చక్రం"ను నేను శరణు వేడుకుంటున్నాను.)

విష్ణోర్ముఖోత్థానిలపూరితస్య
యస్య ధ్వనిర్దానవదర్పహంతా ।
తం పాంచజన్యం శశికోటిశుభ్రం
శంఖం సదాఽహం శరణం ప్రపద్యే ॥ 2 ॥

(విష్ణువు ముఖము నుండి వచ్చే గాలితో పూరించబడినదై, ఏ శంఖ నాదమైతే రాక్షసుల గర్వాన్ని అణచివేస్తుందో, కోటి చంద్రుల వలె తెల్లగా మెరిసే ఆ "పాంచజన్య శంఖాన్ని" నేను శరణు వేడుకుంటున్నాను.)

హిరణ్మయీం మేరుసమానసారాం
కౌమోదకీం దైత్యకులైకహంత్రీమ్ ।
వైకుంఠవామాగ్రకరాగ్రమృష్టాం
గదాం సదాఽహం శరణం ప్రపద్యే ॥ 3 ॥

(బంగారు కాంతితో మెరుస్తూ, మేరు పర్వతం అంతటి శక్తి కలిగి, దైత్యులను సంహరించేది మరియు వైకుంఠుని ఎడమ చేతితో తాకబడినది అయిన "కౌమోదకీ గద"ను నేను శరణు వేడుకుంటున్నాను)

యజ్జ్యానినాదశ్రవణాత్సురాణాం
చేతాంసి నిర్ముక్తభయాని సద్యః ।
భవంతి దైత్యాశనిబాణవర్షైః
శార్ఙ్గం సదాఽహం శరణం ప్రపద్యే ॥ 4 ॥

(ఏ ధనుస్సు యొక్క నారి ధ్వని వినగానే దేవతల భయాలు తొలగిపోతాయో, రాక్షసులపై పిడుగుల వంటి బాణ వర్షం కురిపిస్తుందో, ఆ "శార్ఙ్గ ధనుస్సు"ను నేను శరణు వేడుకుంటున్నాను.)

రక్షోఽసురాణాం కఠినోగ్రకంఠ-
-చ్ఛేదక్షరత్‍క్షోణిత దిగ్ధసారమ్ ।
తం నందకం నామ హరేః ప్రదీప్తం
ఖడ్గం సదాఽహం శరణం ప్రపద్యే ॥ 5 ॥

(రాక్షసుల కఠినమైన కంఠాలను తెగనరకడం వల్ల చిందిన రక్తంతో తడిసినది, మిక్కిలి ప్రకాశవంతమైనది అయిన "నందకం" అనే పేరు గల విష్ణువు యొక్క ఖడ్గాన్ని నేను శరణు వేడుకుంటున్నాను.)

ఇమం హరేః పంచమహాయుధానాం
స్తవం పఠేద్యోఽనుదినం ప్రభాతే ।
సమస్త దుఃఖాని భయాని సద్యః
పాపాని నశ్యంతి సుఖాని సంతి ॥ 6 ॥

(ఎవరైతే ప్రతిరోజూ ఉదయాన్నే విష్ణువు యొక్క ఈ ఐదు ఆయుధాల స్తోత్రాన్ని పఠిస్తారో, వారి సమస్త దుఃఖాలు, భయాలు మరియు పాపాలు వెంటనే నశించి సుఖం కలుగుతుంది.)

వనే రణే శత్రు జలాగ్నిమధ్యే
యదృచ్ఛయాపత్సు మహాభయేషు ।
పఠేత్విదం స్తోత్రమనాకులాత్మా
సుఖీభవేత్తత్కృత సర్వరక్షః ॥ 7 ॥

(అడవిలో గానీ, యుద్ధంలో గానీ, శత్రువుల మధ్య, నీటిలో, అగ్ని ప్రమాదంలో లేదా మరేదైనా ఆపదల్లో ఉన్నప్పుడు ప్రశాంత మనస్సుతో ఈ స్తోత్రాన్ని పఠిస్తే, వారికి సర్వ రక్షణ కలిగి సుఖంగా ఉంటారు.)

సచక్రశంఖం సగదాసిశార్ఙ్గం
[యచ్చక్రశంఖం గదఖడ్గశారంగిణం]
పీతాంబరం కౌస్తుభ-వత్స-చిహ్నమ్ । [కౌస్తుభ-వత్స-లాంఛితం]
శ్రియా సమేతోజ్జ్వల శోభితాంగం
విష్ణుం సదాఽహం శరణం ప్రపద్యే ॥

(చక్రం, శంఖం, గద, ఖడ్గం మరియు ధనుస్సును ధరించి, పీతాంబరధారియై, కౌస్తుభమణి మరియు శ్రీవత్స చిహ్నంతో, లక్ష్మీదేవితో కలిసి ప్రకాశించే శ్రీమహావిష్ణువును నేను శరణు వేడుకుంటున్నాను.)

జలే రక్షతు వారాహః స్థలే రక్షతు వామనః ।
అటవ్యాం నారసింహశ్చ సర్వతః పాతు కేశవః ॥

(నీటిలో వరాహస్వామి, నేల మీద వామనస్వామి, అడవులలో నరసింహస్వామి రక్షించుగాక! ఆ కేశవుడు అన్ని వేళలా, అన్ని దిక్కులా మనల్ని కాపాడుగాక!)

ఇతి శ్రీ పరమ హంస పరి వ్రాజక శ్రీమద్ శంఖరా చార్య విరచిత శ్రీ విష్ణు పంచాయుధ స్తోత్రం సంపూర్ణం.

రచన: మత్తుస్వామి దీస్సాక్షితార్

పల్లవి:
రంగాపుర విహార జయ కోదండ-
రామావతార రఘువీర శ్రీ ||రంగాపుర||

(శ్రీరంగాపురంలో విహరించేవాడా, కోదండరామునిగా అవతరించిన రఘువీరా, నీకు జయము కలుగుగాక)

అనుపల్లవి:
అంగజ జనక దేవ
బృందావన సారంగేంద్ర వరద రమాంతరంగా  ||అంగజ||
శ్యామళాంగ విహంగ తురంగ
సదయాపాంగ సత్సంగ ||రంగాపుర||

(మన్మథుని (అంగజ) తండ్రివైన ఓ దేవా! బృందావన సారంగ రాగ ప్రియుడా! గజేంద్రుడిని కాపాడిన వరదా! లక్ష్మీదేవి హృదయంలో నివసించేవాడా! నీలి మేఘం వంటి శరీర ఛాయ కలవాడా (శ్యామళాంగ), పక్షిరాజైన గరుత్మంతుని వాహనంగా కలవాడా (విహంగ తురంగ), దయతో కూడిన చూపులు కలవాడా, సత్పురుషుల సాంగత్యం కోరేవాడా, నీకు జయము.)

చరణం:
పంకజాప్త కుల జల నిధి సోమ
వర పంకజ ముఖ పట్టాభిరామ
పద పంకజ జిత కామ రఘురామ
వామాంక గత సీత వర వేష
శేషాంక శయన భక్త సంతోష
ఏణాంక రవి నయన మృదుతర భాష
అకళంక దర్పణ కపోల విశేష ముని-
సంకట హరణ గోవింద  వేంకటరమణ  ముకుంద
సంకర్షణ మూల కంద
శంకర గురు గుహానంద ||రంగాపుర||

ముత్తుస్వామి దీక్షితార్ రచించిన ఈ ప్రసిద్ధ కీర్తన శ్రీరంగంలోని వెలసిన శ్రీరంగనాథుని (విష్ణుమూర్తి) ప్రస్తుతిస్తూ సాగుతుంది. దీని భావం ఇక్కడ ఉంది:
పల్లవి:
శ్రీరంగాపురంలో విహరించేవాడా, కోదండరామునిగా అవతరించిన రఘువీరా, నీకు జయము కలుగుగాక!
అనుపల్లవి:
మన్మథుని (అంగజ) తండ్రివైన ఓ దేవా! బృందావన సారంగ రాగ ప్రియుడా! గజేంద్రుడిని కాపాడిన వరదా! లక్ష్మీదేవి హృదయంలో నివసించేవాడా! నీలి మేఘం వంటి శరీర ఛాయ కలవాడా (శ్యామళాంగ), పక్షిరాజైన గరుత్మంతుని వాహనంగా కలవాడా (విహంగ తురంగ), దయతో కూడిన చూపులు కలవాడా, సత్పురుషుల సాంగత్యం కోరేవాడా, నీకు జయము.

( సూర్యవంశమనే సముద్రానికి చంద్రుడి వంటివాడా (సముద్రాన్ని ఉప్పొంగించే చంద్రుడిలా వంశ కీర్తిని పెంచేవాడు).
పద్మం వంటి ముఖం కలిగిన పట్టాభిరాముడా!
నీ పాదపద్మాల సౌందర్యంతో మన్మథుని సైతం జయించిన రఘురాముడా!
ఎడమ తొడపై సీతాదేవిని కూర్చుండబెట్టుకున్న అందమైన రూపం కలవాడా!
ఆదిశేషువుపై పవళించేవాడా, భక్తులకు సంతోషాన్ని ఇచ్చేవాడా!
చంద్రుడు (ఏణాంక), సూర్యుడు (రవి) కళ్లుగా కలవాడా, మృదువైన మాటలు కలవాడా!
మచ్చలేని అద్దంలా మెరిసే చెక్కిళ్లు కలవాడా!
మునుల కష్టాలను తీర్చే గోవిందా, వేంకటరమణా, ముకుందా!
సంకర్షణ రూపానికి మూలమైనవాడా, శంకరుడికి మరియు గురుగుహుడికి (సుబ్రహ్మణ్యేశ్వరుడు - దీక్షితార్ ముద్ర) ఆనందాన్ని ఇచ్చేవాడా!

మార్గదర్శకులు మహర్షులు -3
*అష్టావక్రమహర్షి -1*

ఒకప్పుడు ఏకపాదుడనే బ్రాహ్మణుడు అఖండమయిన తపస్సు చేస్తున్నాడు. ఆయన భార్య సుజాత ఉత్తమ ఇల్లాలు, భర్తకు చాలా సేవచేసింది. అనేకమంది శిష్యులకు వేదములు, వేదాంగములు చెపుతూ ఉండేవాడు నిరంతరము. కొంతకాలానికి ఆయన భార్య గర్భవతి అయింది. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఆమె గర్భంలోని శిశువుకు మూడవమాసం వచ్చింది.

ఏకపాదుడు శిష్యులకి వేదం చెప్పేటప్పుడు రోజుకు 18 గంటలు చెప్పుతూ, వాళ్ళు వేదం చదివేటప్పుడు చేసే తప్పులను సరిదిద్దుతూ స్వరం చెపుతూ వాళ్ళను విసిగిస్తూ ఉండేవాడు. ఆయన చర్యకు సుజాతాదేవి గర్భంలో ఉన్న శిశువు నవ్వి, ఆయనతో "ఏమిటీ మూఢత్వం? శిష్యులకి వేదం నేర్పటానికి ఇన్నిగంటలా? ఇన్నిసార్లు చెప్పాలా? నీవేగనుక సరైన గురువైతే, ఒక్కమాటు వాళ్ళకు చెప్పితే వాళ్ళకు తెలియాలి కదా! వాళ్ళు సరిగా పలకాలి కదా!" అని తండ్రిని ఆక్షేపించాడట, గర్భంలో ఉండగానే.

కడుపులో ఉన్న శిశువు అలా అనేటప్పటికి ఆయనకు కోపం వచ్చింది. ఆయన శాస్త్రవేత్త, వేదాంగములు చదువుకున్న వాడు, తపస్వి. పుట్టకముందే వాడు తనను ఆక్షేపించటమా! దీనినే గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించిందని అంటారు.

ఆయన కోపంతో, "నా అంతటివాడిని పాఠం చెపుతూ ఉంటే నువ్వు వక్రభాష్యం చేస్తావా? నువ్వు ఎనిమిది వంకరలు కలిగిన శరీరంతో పుడతావు?" అని శపించాడు ఆ శిశువును (తనకు పుట్టబోయిన కొడుకును).

ఆ కారణంచేత ఆయన పుట్టినపుడు శరీరం ఎనిమిది వంకరలుగా ఉన్నది. అందుకని ఆయనకు 'అష్టావక్రుడు' అని పేరు పెట్టారు. కానీ ఆయన పుట్టుకతోనే సమస్త వేదవిజ్ఞానాన్ని నిధిగా కలిగిన వాడుగా పుట్టాడు.

ఆయన పుట్టుకకు పూర్వం తల్లి ఏకపాదుడితో, పురిటి సమయంలో పురిటి ఖర్చులకు, తరువాత పిల్లవాడి పెంపకానికి ధనం కావాలి కదా! అందుకని ఆ దేశాన్ని (మిథిలానగరాన్ని) ఏలే జనకమహారాజు దగ్గరికి వెళ్ళి ఆయనను అడిగితెమ్మని కోరింది.

ఏకపాదుడు ధనంకోసం జనకచక్రవర్తి కొలువుకి వెళ్ళాడు. ఆయన ఏకపాదుడిని, “నువ్వు ధనంకోసం వచ్చావు సరేకానీ, నీకు ఉన్న విద్య ఏమిటి? దేనిమీద నీకు అధికారము ఉంది? ఎట్లాంటి విజ్ఞానము ఉంది?" అని అడిగాడు.

ఏకపాదుడు అందుకు జవాబుగా, "నేను వేదవేదాంగములను చదువుకున్నాను. సంపూర్ణంగా సత్యాన్ని తెలుసుకున్న వాడిని” అని చెప్పాడు. స్వోత్కర్షగా కొంచెం గట్టిగా చెప్పుకున్నాడు తనను గురించి.

అప్పుడు జనకుడన్నాడు - "అలా అయితే నా ఆస్థానంలో ఉన్న వందితో నువ్వు వాదించి మహాపండితుడివి అని ఋజువు చేసుకుంటే, ఇప్పుడు నీవు చెప్పిన మాటలన్నీ సత్యములని తేలితే, నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తాము” అన్నాడు. వంది వరుణదేవుడి కొడుకు. జనకుడి ఆస్థాన విద్వాంసుడు. మహాపండితుడు.
వందితో జరిగిన వాదనలో ఏకపాదుడు సమాధానం చెప్పలేకపోయాడు. అంతకు ముందు షరతు ఏమిటంటే, ఒకవేళ వందితో వాదించి గెలవకపోతే, అక్కడ ఉన్న ఒక చెఱువులో (తవ్వించారు) కూర్చోవాలి. జలమజ్జిత అని దానికి పేరు. ఏకపాదుడు తను పండితుడినని అహంకరించి వచ్చినందుకు శిక్ష అది. అలా ఓడిపోయి జలమజ్జితుడై తిరిగి ఇంటికి పోలేదు. సుజాత పుట్టింటికి వెళ్ళింది చేసేదిలేక.

సుజాత తండ్రి పేరు ఉద్దాలకుడు. అష్టావక్రుడు పుట్టిన సమయానికి ఉద్దాలకుడి భార్య కూడా ప్రసవించి, శ్వేతకేతు అనే కొడుకును కన్నది. అంటే శ్వేతకేతు అష్టావక్రుడికి మేనమామ, సుజాతకు తమ్ముడు. వీళ్ళిద్దరికీ  ఉద్దాలకుడే విద్యాబోధన చేస్తూండేవాడు. కొడుకుకు, మనుమడికి ఆయన విద్య చెప్పాడు. అయితే పుట్టినప్పటినుండీ తండ్రిని చూడకపోవటంచేత ఉద్దాలకుడిని తండ్రి అని, శ్వేతకేతును అన్న అని అనుకునేవాడు అష్టావక్రుడు.
📖

ఒకనాడు శ్వేతకేతుకు, అష్టావక్రుడికి జరిగిన సంవాదంలో శ్వేతకేతు అష్టావక్రుడి తో, “నీ తండ్రి దగ్గరికి పో! ఇక్కడ మా ఇంట్లో ఎందుకు ఉన్నావు?" అన్నాడు. అప్పుడు అవమానభారంతో, తన తండ్రి వేరే ఉన్నాడని తెలియక తల్లిదగ్గరికి వెళ్ళి, "అమ్మా? నా తండ్రి ఎవరు? ఎక్కడ ఉన్నాడు?" అని అడిగాడు అష్టావక్రుడు.

అతడి ప్రశ్నకు సమాధానంగా ఆమె అష్టావక్రుడితో, “నాయనా! నీకు తెలియదు. నీవు పుట్టటానికి ముందే ధనంకోసమని రాజాస్థానానికి వెళ్ళిన నీ తండ్రి వందితో వాదించి ఓడిపోయి అక్కడ శిక్షననుభవిస్తున్నాడు” అని చెప్పింది.

"నేను వెళ్ళి తండ్రిని విడిపించుకుని వస్తాను" అని అష్టావక్రుడు శ్వేతకేతుని కూడా తీసుకుని రాజాస్థానానికి వెళ్ళాడు. మళ్ళీ ఇద్దరూ స్నేహంగానే ఉన్నారు.

ఉద్దాలకుడు చెప్పిన జ్ఞానము అమోఘమై నటువంటిది. ఆయన మహాపండితుడు. గొప్పజ్ఞాని. ఆయన బోధించిన జ్ఞానము, విద్యతో వారు ఆస్థానానికి వెళ్ళితే, ద్వారపాలకులు వాళ్ళను అడ్డగించారు.

“రాజాస్థానానికి మీలాంటి పిల్లలు పోకూడదు. లోపలికి వెళ్ళకూడదు. పెద్దలు, బ్రాహ్మణులు, పండితులైనవారు మాత్రమే వెళ్ళాలి. ఏదయినా పాండిత్య విషయం వస్తే సభలో చెప్పాలి అంతే. అదీ వయోవృద్ధులే వెళ్ళాలి. అందుకని లోపలికి పంపటానికి వీలుపడదు" అన్నారు.

"ఇది ఏమి రాజాస్థానము! వయసు చూచి పండితులనుకునే ఆస్థానమా ఇది!" అని తిరస్కరించి అష్టావక్రుడు, "వయసుకు, జ్ఞానానికీ సంబంధం లేదు" అని రూఢిగా చెప్పాడు. ఆ ద్వారపాలకుడు కూడా పండితుడే. అందుకే వెంటనే ఈయన సామాన్యుడు కాదని గ్రహించాడు. వెంటనే రాజు దగ్గరికి  వెళ్ళి, "మహారాజా! పండితులైన ఇద్దరు పిల్లలు తమరి దర్శనానికి వచ్చారు. వాళ్ళను సభ లోకి అనుమతిస్తారా?" అని అడిగితే, రాజు సరేనన్నాడు. వెంటనే ద్వారపాలకుడు - అష్టావక్రుడు, శ్వేతకేతులను ఆస్థానానికి తీసుకువెళ్ళాడు.

రాజు వాళ్ళను పలకరించి, “ఏమిటి మీరు పండితులా! మీరు బ్రహ్మచారులా?" అని అడిగాడు.

వాళ్ళు రాజుతో, "అవును. మేము మీ ఆస్థాన పండితుడైన వందితో వాదించటాని కి వచ్చాము" అన్నారు.

"అలాగా! ఓడిపోతే శిక్ష ఏమిటో తెలుసా?" అన్నాడు రాజు.

"జలాశయంలో కూర్చోబెడతారు. అంతేకదా! మాకు తెలుసు” అన్నాడు అష్టావక్రుడు. 

రాజు ఆస్థానంలో అనేకమంది పండితులు, జ్ఞానులు, మునులు, యోగులు ఇలా ఎంతోమంది ఉన్నారు. కేవలం ఎనిమిది సంవత్సరాల వయసు కలిగిన అష్టావక్రుడు వందితో వాగ్వివాదానికి దిగాడు.
🪷
*సశేషం*

*మార్గదర్శకులు మహర్షులు - 4*
🔱

రచన: మహామహోపాధ్యాయ శివానందమూర్తి

*అష్టావక్రమహర్షి -2*

సృష్టిలో ఉండేటటువంటి సత్యములలో వంది ఒకటి చెపితే, దాని పైసత్యాన్ని ఇంకొకటి చెప్పాలి తను. అదీ అక్కడ పందెం. ఒకటి అనే సంఖ్య ఏమేమి చెపుతుంది సృష్టిలో, ఆ పరమసత్యం చెప్పాలి. ఒకటికి చెప్పిన తరువాత, ఆ తరువాత సంఖ్య రెండు. ఈ సంఖ్య సృష్టిలో ఉండే ఏ పరమసత్యములను చెపుతుందో, అది తను చెప్పాలి. దాని తరువాత 3వ సంఖ్య మళ్లీ అతడు తీసుకుంటాడు. సృష్టిలో ఉండే పరమసత్యాలేమిటి - మూడు సంఖ్య వేటిని గురించి చెపుతుంది? ఈ విషయాన్ని అతడు చెప్పాలి. తరువాత నాలుగేది తను చెప్పాలి. ఈ ప్రకారంగా ఎక్కడయితే ఆ పైసంఖ్య గురించి అవతలి వాడు చెప్పలేక ఆగిపోతాడో, అక్కడ అతడు ఓడిపోయినట్లు.

"ప్రజ్వలించేది అగ్ని ఒకటే. సూర్యుడు ఒకడే! శివుడు ఒక్కడే సర్వవ్యాపి" అని ఒకటి సంఖ్యకు సంబంధించిన మూడు సత్యాలు వంది చెప్పాడు. అప్పుడు అష్టావక్రుడు రెండు సంఖ్యకి సంబంధించిన రెండు సత్యాలు చెప్పాడు.

“ఇంద్రాగ్నులిద్దరు. నారద పర్వతులిద్దరు, దేవతలైన అశ్వినేయులిద్దరు. సంసార మూలం అయిన భార్యాభర్తలు ఇద్దరు" అని చెప్పి రెండు సంఖ్య నిరూపించాడు. అవి శాశ్వతములైన సత్యాలు అయి ఉండాలి. ఈ ప్రకారంగా 12వ సంఖ్య వరకూ చెప్పుకుంటూ వెళ్ళారు. 12వ సంఖ్య అష్టావక్రుడు చెప్పాడు. 13వ సంఖ్య వంది చెప్పలేకపోయాడు.

"జితోస్మి!" ("ఓడిపోయాను నేను") అన్నాడు వరుణకుమారుడైన వంది.

నీకేం కావాలని అష్టావక్రుడిని జనక మహారాజు అడిగాడు. అష్టావక్రుడు "నా తండ్రిని విడిపించుకోవటానికి వచ్చాను. ఆయన శిక్షలో ఉన్నాడు. ఇంతకుముందు మీరు నిర్ణయించిన ప్రకారంగా ఈ వందిని ఆ చెరువులో కూర్చోబెట్టి నా తండ్రిని బయటకు పంపించండి!" అన్నాడు.

దానికి జవాబుగా వంది, "కేవలం అది ఒక వంక మాత్రమే! ఇలా చాలామంది బ్రాహ్మణులను తీసుకొచ్చి వాళ్ళను వాదనలో గెలిచి, వాళ్ళ మహత్యాన్ని తెలుసుకున్నవాడిని. వాళ్ళకు నిజంగా శిక్ష వెయ్యలేదు. నా తండ్రి అయిన వరుణ దేవుడు ఒక మహాయాగం సంకల్పించి చేస్తున్నాడు. దానికి ఋత్విక్కులు దొరకటం లేదు. అందుకని ఇలాగ వీళ్ళను ఆకర్షించి ఓడించి అక్కడికి పంపించి, అక్కడ ఆ యజ్ఞం సక్రమంగా జరిగేటట్లు చూస్తున్నాను. అయ్యా! నీ తండ్రి వరుణ దేవుడి యజ్ఞంలో ఉన్నాడు చూడు!" అని చెప్పి ఆయనను పిలిపించి సన్మానం చేశాడు. అందుకు ఫలంగా వందితో, “నిన్ను క్షమిస్తున్నాను!” అన్నాడు అష్టావక్రుడు.

ఎనిమిది ఏళ్ళ పిల్లవాడు వందిని క్షమించి విడిచిపెట్టాడు. ఆ ప్రకారంగా అష్టావక్రుడు లోకవిఖ్యాతుడయ్యాడు.

అష్టావక్రుడు ఇంకా తపస్సుచేసుకున్నాడు. తండ్రి శిక్షణలో వేద వేదాంగాలను, సృష్టిలో చాలా విషయాలను తెలుసుకున్నాడు. వివాహ కాలం ఆసన్నమయింది. 16, 17 సంవత్సరములు వచ్చాయి. ఎనిమిది వంకరలతో ఉన్నవాడిని ఎవరు పెళ్ళి చేసుకుంటారు! "నన్ను ఎవరు పెళ్ళి చేసుకుంటారు? నాకు పెళ్ళి ఎందుకు?" అని అనుకొని, ఒక చెరువు దగ్గరికి వెళ్ళి ఆ నీళ్ళమీద హాయిగా ఒక చాపవేసుకుని కూర్చొన్నాడు అష్టావక్రుడు. సిద్ధుడికి అసాధ్యమయినది ఏముంది! ఆ చెరువు మధ్యలో కూర్చొని ధ్యానం చేస్తున్నాడు.

ఆయన యొక్క జ్ఞానాన్ని, ఉత్కృష్ట తపోబలాన్ని తెలిసినటువంటి ఇంద్రుడు ఆయనకు సేవచేయటానికి అప్సరసలను పంపించాడు. రంభాది అప్సరసలు వచ్చి ఆయన చుట్టూ నాట్యాలు చేసి ఆయనను రంజింపచేసారు. "బాగుంది. మీరందరూ ఆడారు, పాడారు. చాలా బావుంది ఇక వెళ్ళండి" అన్నాడు. ఆయనకేమీ మనసు చలించలేదు. వాళ్ళు ఆయనతో, "మీరు చాలా మహాత్ములని ఇంద్రుడు చెప్పాడు. మాకో వరం ఇవ్వగలరా?" అని అడిగారు. సరే అడగమన్నాడు ఆయన. "మమ్మల్ని శ్రీమహావిష్ణువే పెళ్ళి చేసుకోవాలి" అని అడిగారు. విష్ణువు ఈయన చేతిలో ఉంటాడా! ఏదసాధ్యమో అది అడగటం!

"వీళ్ళు నన్ను పరీక్షిద్దామని చూస్తున్నారు, ఒక్క విష్ణువును తప్ప ఇంక వేరే ఎవరినీ అడగటానికి వీలులేని వరం అడిగారు" అని తనలో అనుకుని వాళ్ళతో, "మీరడిగిన వరం ఇస్తున్నాను. మీ కోరిక నెరవేరుతుంది. భవిష్యత్తులో ద్వాపర యుగంలో విష్ణువు శ్రీకృష్ణపరమాత్మగా అవతరిస్తాడు. ఆ కాలంలో మీరందరూ ఆయనకు భార్యలుగా ఉంటారు. ఆ జన్మలో మీ కోరిక సిద్ధిస్తుంది" అని వరమిచ్చాడు అష్టావక్రుడు.

వెళ్ళిపోతూ, ఆయన వక్రరూపం చూచి ఆక్షేపణగా నవ్వారు చాపల్యం ఉన్న ఆ అప్సరసలు. తనను చూచి నవ్వేటప్పటికి ఆయనకు కోపం వచ్చింది. "నాదగ్గరే వరం తీసుకుని నన్నే చూచి ఆక్షేపించి ఈవిధంగా నవ్వుతున్నారా! దీనికి ప్రతిఫలంగా ఒక శిక్ష కూడా అనుభవించండి! శ్రీకృష్ణ పరమాత్మ భార్యలుగా మీరు పుట్టిన కాలంలో మీరుండగానే ఆయన అవతారం చాలించి వెళ్ళిపోతాడు. ఆయన భార్యలుగా ఉండే మీరు వైదవ్యమే కాకుండా, సామాన్యమైన నిషాదులు - దొంగలచేతులలో అవమానం కూడా పొందుతారు! ఇదే మీకు శిక్ష!" అని శపించాడు వాళ్ళను.

ఆ కారణంచేతనే కృష్ణపరమాత్మ అవతారం చాలించిన తరువాత, అర్జునుడు కృష్ణుడి యొక్క భార్యలను, అంతఃపురకాంతలందరినీ తీసుకొని వెడుతుంటే, దోపిడీ దొంగలువచ్చి వీళ్ళ నగలను, ధనాన్ని దోచుకున్నారు. వెంబడి ఉన్న అర్జునుడు కూడా ఏమీ చేయలేక పోతాడు. దొంగల్ని జయించలేకపోతాడు. అస్త్రశస్త్రాలేవీ జ్ఞాపకంరాలేదు. దానికి కారణం అష్టావక్రుడి శాపమే!

('వీళ్ళు అష్టమహిషులా? వేరేవాళ్ళా?' - అని సందేహం కలుగవచ్చు. ఆయనకు అష్టమహిషులేకాక అనేకమంది భార్యలు ఉన్నారు. అయితే ఈ శాపగ్రస్తులైన అప్సరసలు అష్టమహిషులలోని కొందరు కావచ్చు. ఆయన అవతారసమాప్తి తరువాత, అష్టమహిషులలో ఒకరు ప్రాయోపవేశం చేసారు. ఒకరు యోగంతో శరీరాన్ని వదిలిపెట్టారు. కొందరు ఈ శాపవశాన అవమానం పాలయ్యారు).
📖

అష్టావక్రుడు తండ్రి దగ్గరకెళ్ళి, "తండ్రీ! నాకు ఆజన్మాంతమూ ఉండే బ్రహ్మచర్య దీక్ష ప్రసాదించు! అష్టావక్రుడినయిన నాకు వివాహం ఎలా అవుతుంది?" అని అడిగాడు.

అప్పుడు ఏకపాదుడు, “నాయనా! నీ అష్టావక్రత్వానికి నేనే కారణం. ఏదో క్రోధంలో ఎనిమిది వంకర్లతో పుట్టమని నిన్ను శపించాను. నువ్వు తల్లిగర్భంలో ఉండి నన్ను, నా బోధనా పద్ధతిని ఆక్షేపించటం చేత కోపం వచ్చి ఆ పని చేసాను. నీవంటి మహాత్ముడు నా కడుపున పుట్టటం నాకే గర్వకారణం. నా తపోబలంతో నీ అష్టవంకరలు తీరుస్తాను. నువ్వు యోగ్యుడివై, అందమైన శరీరంతో మంచి ఉత్తమురాలైన స్త్రీని వివాహం చేసుకుని సుఖపడవచ్చు" అని వరమిచ్చి ఒక నదిని చూపించాడు ఆయన. అతడి తలమీద చెయ్యిపెట్టి ఆశీర్వదించి, ఆ నదిలో స్నానంచేసి రమ్మని, తన తపస్సు ను ఆ నీళ్ళలో ధారపోసాడు - తండ్రి. ఆ నీళ్ళల్లో స్నానంచేసి బైటకి వచ్చేటప్పటికి అష్టావక్రుడి శరీరం అష్ట వంకరలుపోయి, సుందరంగా మారింది. ఆ తరువాత ఆయన వివాహం చేసుకున్నాడు. అయితే ఆయన వివాహం గురించి ఒక కథ ప్రచారంలో ఉంది.
🪷
*సశేషం*

*మార్గదర్శకులు మహర్షులు -5*

రచన: మహామహోపాధ్యాయ శివానందమూర్తి

*అష్టావక్రమహర్షి - 3*

అయితే అష్టావక్రుడి వివాహం గురించి ఒక కథ ప్రచారంలో ఉంది.

ఆయన వదాన్యుడు అనే ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి, ఆయన కుమార్తె అయిన సుప్రభ అనే కన్యను తనకిచ్చి వివాహం చేయమని అడిగాడు. వదాన్యుడు అంతకు పూర్వమే అష్టావక్రుడి కీర్తి బాగా విని ఉన్నాడు. ఆయన చరిత్ర లోకమంతా తెలుసు. అయినాసరే ఆయన మహత్తు గొప్పదని లోకానికి చాటిచెప్పాలి కాబట్టి -అందులోనూ తన అల్లుడి గొప్పదనం అందరికీ తెలియాలి అనుకుని - అతనికి ఒక పరీక్ష పెట్టాడు. ఆయన అష్టావక్రుడితో, "నీకు నా కుమార్తెను తప్పకుండా ఇస్తాను. నీకంటే యోగ్యుడెవరున్నారు! నువ్వు ఉత్తరదిశగా వెళ్ళి కుబేరుడి నగరం దాకా వెళ్ళి ఆ నగరం చూడాలి. అది దాటి ఇంకా ఉత్తరంగా హిమవత్పర్వత సానువులన్నీ దాటి ఇంకా పైకి వెళ్ళి కైలాసం చేరుకుని పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేసుకొని రావాలి. ఆ తరువాత అక్కడ ఉన్న కదంబ వనం చేరుకుని అక్కడ ఉన్న రత్నఖచిత సింహాసనం పైన కూర్చుని ఉండే ఒక జగదేకసుందరిని దర్శించి తిరిగి రావాలి. అప్పుడు వెంటనే పెళ్ళి చేస్తాను" అన్నాడు.

అష్టావక్రుడు అందుకు ఒప్పుకున్నాడు. ఆయనకు ప్రయాణానికి సన్నాహాలంటూ ఏమున్నాయి! అలాగే దండం, కమండలం పట్టుకొని వెళ్ళిపోయాడు. అష్టావక్రుడు వస్తున్నాడని తెలియగానే, కుబేరుడి ఆజ్ఞపై అతడి సేవకులు వచ్చి ఆయనకు ఆహ్వానం పలికారు, సర్వోపచారాలు చేసారు. కుబేరుడు చాలా ధనవంతుడు. సేవకులను, సేవికలను ఇచ్చాడు. వీటికి ఆయన ఏమీ చలించలేదు. అలాగే నిష్ఠగా ఉన్నాడు. అలాగ ఒక సంవత్సరకాలం గడిపాడు. మనసు ఏమీ చలించలేదు. కైలాసానికి వెళ్ళి దూరం నుంచీ పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేసుకొన్నాడు. అక్కడి నుంచీ ఇంకా ఉత్తరానికి ఆకాశ మార్గాన వెళ్ళాడు. అక్కడ కదంబవనం ఉంది. ఆ మధ్యలో ఒక స్త్రీ కూర్చుని ఉంది. ఆమె పరాశక్తి యొక్క అంశలో ఉంది. ఆమె ఈతడిని బాగా పరీక్షించింది. సమస్త రాజోపచారములు అన్నీ చేసి తనను వరించమని కోరింది. అతడిని గట్టిగా నిర్బంధించింది.

"అది అధర్మం -నేను అలా చేయను. నాకలాంటి కోరికలేదు. మా దేశంలో నేనొక కన్యకని వరించాను. అక్కడికెళ్ళి ఆమెని పెళ్ళిచేసుకోవటం కోసమని నిన్ను చూచి వెళుతున్నాను. నాకు కాబోయే మామ గారు పెట్టిన పరీక్ష ఇది. కాబట్టి ఇక్కడ మీతో నాకేమీ సంబంధం లేదు. నాకు మీరేమిచ్చినా, ఏమి ఇవ్వకపోయినా నాకేమీ పర్వాలేదు. నేను వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోతాను" అన్నాడు.

ఆయన నియమనిష్ఠలకు మెచ్చుకుని ఆమె అతడికి వరాలను ఇచ్చింది. "నీ బోధలు అమోఘమయిన జ్ఞానాన్ని ఇవ్వగలిగిన శక్తివంతములయి ఉంటాయి. నీ బోధలు చదివినవారికి జ్ఞానోదయం అవుతుంది. జగత్ప్రసిద్ధమయిన కీర్తిని సంపాదించి నువ్వు జగత్పూజ్యుడవు అవుతావు. బ్రహ్మతుల్యుడిగా నిన్ను పూజిస్తారు. నువ్వు బ్రహ్మజ్ఞానిగా ఖ్యాతి పొందుతావు!" అని చెప్పి ఆవిడ ఆయనను పంపించింది.

ఆయన తిరిగివచ్చి పెళ్ళిచేసుకున్నాడు. ఏకపాదుడు తన కొడుకు యొక్క కీర్తి విని సంతోషించాడు. సుప్రభ, అష్టావక్రుల వివాహం బాగా జరిగింది. కుబేరాదులు అందరూ వచ్చి ఆశీర్వదించారు. దేవతలు కూడా వారి వివాహానికి వచ్చి ఆశీర్వదించారట.

ఆ తరువాత ఆయన చిరకాలం అనేక మందికి బోధచేసారు. 'అష్టావక్రసంహిత' అనే గ్రంథం అష్టావక్రుడి బోధలతో నిండి ఉంది. అనేక వైదిక గ్రంథముల బోధకునిగా కర్తగా ఆయనను చెబుతారు. అవన్నీ నశించిపోయాయి, నేడు దొరకటంలేదు. ఆయన గీత, సంహిత మాత్రమే ఉన్నాయి.

అష్టావక్రుడికి సుందరమయిన రూపం రాక ముందు వంకరటింకరగా కుంటుకుంటూ, వంగుతూ లేస్తూ నడుస్తూ ఉండేవాడు. ఒళ్ళంతా ఎనిమిది వంకరలుగా ఉంది కదా పాపం! ఆయన ఒకసారి నడుస్తూ వెళ్ళుతూ ఉంటే, అర్భకుడైనటువంటి భగీరథుడు కూడా అష్టావక్రుడి లాగానే నడుస్తున్నాడు. అష్టావక్రుడు, భగీరథుడు తన రాజుకొడుకు కాబట్టి అహంకారంతో నన్ను వెక్కిరిస్తున్నాడు అనుకొని, భగీరథుడిని శపించటానికి కోపంతో శాపోదకం చేతిలోకి తీసుకున్నాడు. అంతలోనే ఆయనకు సందేహం వచ్చింది, "వీడు నిజంగానే అర్భకుడా లేక నన్ను వెక్కిరిస్తున్నాడా?" అని.

ఈ విషయం ఆయనకు అనుమానంగా ఉండటంచేత, "ఒకవేళ నాలాగ అర్భకమైన శరీరంతోనే ఉండిఉంటే, మంచి దృఢమైన శరీరాన్ని పొందుతాడు. ఇతడి శరీరం ఆరోగ్యంగా దివ్యతేజస్సుతో వెలుగును గాక!" అని ఆ శాపోదకం భగీరథుడిమీద చల్లాడు. సహజంగానే అతడు అర్భకమైన శరీరాన్ని కలిగి ఉండటం చేత, అష్టావక్రుడి దయచేత ఉత్తమమయిన శరీరాన్ని ధరించాడు భగీరథుడు.

కొంతకాలానికి అష్టావక్రుడికి వృద్ధాప్యం వచ్చేసింది. ఆయన భార్య అయిన సుప్రభాదేవికి ఆయన ఉత్తమగతులు కల్పించి ఆమెను ముందరే పంపించాడు. ఆమె వెళ్ళిపోయింది.

ద్వాపరయుగం వచ్చింది. ద్వారకలో కృష్ణ పరమాత్మ ఉన్నాడు. కృష్ణుని వెతుకుతూ ద్వారక చేరుకున్నాడు అష్టావక్రుడు. ఆయన కృష్ణుని చూచాడు. వెంటనే ధ్యాన యోగంలో నమస్కరించాడు. శ్రీకృష్ణుడు ఆయనను చూచి  లేచి, గౌరవించి ఆహ్వానించాడు. అష్టావక్రుడికి కృష్ణుడు అర్ఘ్యపాద్యాలు ఇవ్వబోతున్నాడు. ఇంతలో ఆయన శ్రీకృష్ణుడి పాదాల పై తల ఉంచి శరీరాన్ని వదిలేసాడు. శ్రీకృష్ణుడు ఆయనకు స్వయంగా అంత్యక్రియలు జరిపించాడు. ఉదకాలను తనే స్వయంగా ఇచ్చి ఆ జీవుణ్ణి ఎంతో గౌరవించాడు.

అప్పుడు ఆయన పత్నులు, మంత్రులు అందరూ కూడా అష్టావక్రుడిని గురించి అడిగారు, "ఎవరీ అష్టావక్రుడు? నీ సన్నిధి లో శరీరాన్ని వదిలిపెట్టి పోయినాడు! ఆయనకు అంత పరమభక్తి తాత్పర్యాలతో ఉత్తరక్రియలు నీవే నిర్వహించావు! ఇతడి వృత్తాంతమేమిటి?" అని.
🪷
*సశేషం*


*నిత్యానందం*
🤥

*నిత్యానందం గారి వివాహం - 1*

"వొళ్ళు రవరవ మండిపోతోంది. కోపం ఆగడంలేదు. 'ఏదో ఆఘాయిత్యం చేసేస్తాను. సందేహంలేదు. 'వీడు కోపధారి వెధవ, ఎప్పుడో ఏదో అఘాయిత్యం చేసేస్తా'డని మా నాయనమ్మ అంటూనే వుండేది.

ఎందుకింత కోపం, ఏం ముంచుకు పోయిందా? ముంచుకుపోయిందా, ముంచుకుపోయిందిన్నరా? ముంచుకు పోయిందిన్నర అంటే ఏమిటా ? నీబొంద! అసలే కోపంగావుంటే కవ్వించకు, నన్ను రెచ్చగొట్టకు. అగ్గిమీద గుగ్గిలం, కోపమొస్తే వొళ్ళూపై తెలీదు నాకు. మా నాయనమ్మ అంటూవుండేది కోపమొస్తే వీడికి వొళ్లూపై తెలీదని ! కొపమొస్తే నేను నిప్పులుతొక్కిన కోతిని! కాలు గాలిన పిల్లిని! రేగిన తేనెటీగని! బెదరిన మదపుటేనుగుని!! నాకు కోపమొస్తే ఎంత ఉపద్రవమో నాయనమ్మకి తెలుసు."

"ఇంతకీ సంగతేమిటో చెప్పమంటావు? పానకంలో పుడకలా మాట మాటకీ అడ్డు తగులుతూ, నేనేదో జాప్యం చేసినట్టు, నీ యిదేమిటి? కుక్కిన పేనులా నోరువిప్పక, చెవులు అప్పగించి విను కుక్కిన పేనుకి నోరుంటుందా అంటావు, నీకుందిగా దానిలా నోరు. దయచేసి దానికి తాళమే సెయ్యి. అదిగది. రెండు చేతులతోటి నోరు మూసుకో, చొప్పదంటు ప్రశ్నలెయ్యకు. భేష్!"

"రామాయణంలో ఈ పిడకలవేటతో ధోరణి తెగిపోయింది. ఎంతదాకా చెప్పనబ్బా ! ఆఁ జ్ఞాపక మొచ్చింది. వొళ్ళు రవ రవ మండి పోతోంది. అఘాయిత్యం చేసేస్తానంటున్నా ను. ఏమిట్రా, ఆ వెధవ సంజ్ఞలు ? నోరు లేదూ ? మూగాడివా? అవునవును విప్ప కూడదు. చేతులూ కాళ్ళూ కూడా కట్టేసుకు విను.

ఈ పెళ్ళి నాకిష్టం లేదు. ఆ అమ్మాయి మెడలో మంగళసూత్రం కట్టేశాననుకో. నే కట్టనని చెబుదామనుకుంటే, మాట విని పించకుండా వెనకాల ఢమఢమ డోలు వాయించేశారు. జబ్బ ఊడిపోయేలా నా చెయ్యి లాగేసి, ముడేయించేశాడు ఆ పురోహితుడు. ఆ మటకొస్తే, వాడే వేసేశాడు. 'మమ' అనికూడా అనుకోలేదు. అయినా ఆ అమ్మాయి నా పెళ్ళామేనట ! ఆ అమ్మాయి నా కిష్టంలేదు."

"నిజమేరా, పెళ్ళికి ముందు వాళ్ళింటికి వెళ్ళి ఆ అమ్మాయిని చూసిన తరవాతే పెళ్ళి ముహూర్తం పెట్టారు. కాని దాన్ని పెళ్ళి చేసుకుందామని నేనెప్పుడూ అనుకోలేదు. ఒప్పుకోలేదా అంటే, నోటితో ఎప్పుడూ ఒప్పుకోలేదు. పిల్లని చూడ్డానికి నాకు తోడుగా నక్షత్రకుణ్ణి పంపించారుగా ! నక్షత్రకుడిని ఎరగవూ? మా వెంకట్రా మయ్య ! వాడికేదైనా అప్పజెప్పితే జలగ లా పట్టుకుంటాడు. జీడిలా అంటుకుంటా డు. బంకలా తగులుకుంటాడు. ఇంకేముంది! బయలుదేరినదగ్గిర నించి కురుపు సలిపినట్టు ఒకటే సలపడం..

'అబ్బాయ్, బెండకాయ ముదిరినా, బ్రహ్మచారి ముదిరినా పనికిరాదు. యాభై ఏళ్ళకి శక్తి అంతా వుడిగిపోయిన తరవాత పెళ్ళి చేసుకుని లాభమేమిటి? మీ నాయనమ్మ నీ పెళ్ళి చూడాలని తహ తహలాడి చచ్చిపోయిందా? మీ నాన్న కూడా పెద్దవాడైపోయాడు, ఆయనా పోవచ్చు, దాంతో బెంగపెట్టుకుని మీ అమ్మా పోతుంది. ఇహ, నేను వచ్చే ఏళ్ళే గాని, పోయే ఏళ్ళు కావు గదా! పెళ్ళి కూతుళ్ళని చూడ్డానికి నేనూ నీతో రాలేను, నువ్వు ఒక్కడివీ ఏమీ చూసుకోలేవు. నీకేమీ తెలియదుగదా! వెంటనే పెళ్ళికి ఒప్పేసుకోవాలి. నువ్వు పెళ్ళికి మాత్రం ఒప్పేసుకోవాలి! ఊపిరి సలపనివ్వడు, ఆలోచనా తెమలనివ్వడు. పాడిందే పాట: చెవులు హోరెత్తిపోయాయి. విసుగెత్తి పోయి 'సరే నయ్యా' అన్నాను.

"అమ్మయ్య. పెళ్ళికి ఒప్పేసుకున్నావుగదా, ఇంక పెళ్ళికూతురే కుదరాలన్నమాట. అదెంతసేపు! చూడబోతున్నాంగా ఇప్పుడో పిల్లని, ఈ పిల్ల కాకపోతే మరోటి.. రంభ కాకపోతే ఊర్వశి. అదీ నచ్చకపోతే తిలోత్తమ. కొండమీద కోతి కావాలంటే దాన్నే తీసుకొస్తాం."

పెళ్ళి కూతురిగారింటికి చేరుకునే దాకా నోరు మూతపడలేదు. నా తల దిమ్మెత్తి పోయింది. పెళ్ళికూతురిగారింట్లో ఫలహారం సిద్ధంగా వుంది. జీడిపప్పు పాకం, చేగోడీలు. రెండూ నాకిష్టమే· మా వెర్రినాగమ్మకి చాలా ఇష్టమని కోమటి కోటిలింగాలు మిఠాయి దుకాణంనించి రహస్యంగా తెప్పించిపెడుతూ వుండేది నాయనమ్మ. కోటిలింగాలు దుకాణంలోనే అసలు నేతిసరుకు దొరికేది. ఆ ఫలహారం చూసిన తరవాత కాస్త ప్రాణం స్తిమిత పడింది. మా నాయనమ్మ జ్ఞాపకమొచ్చి కళ్ళ నీళ్ళు తిరిగాయి. నోట్లో నీళ్ళు ఊరించింది ఫల హారం.

"అబ్బాయ్, కతికితే అతకదు. నువ్వు తినకూడదు." అని బాంబు విసిరాడు నక్షత్రకుడు, ఈ రోజుల్లో ఆ పట్టింపులు పనిచెయ్యవని పిల్ల తండ్రి చెప్పినా వినిపించుకోడు. నాకు లేకుండా తిండి ప్రారంభించాడు.

"జీడిపప్పు పాకం చాలా బాగుందే! బెల్లప్పాకం! పంచదారకంటే బెల్లప్పాకమే మంచిది సుమండీ మ్యమ్ మ్యమ్... ఇప్పుడన్నీ సుతారం తిళ్ళు. తెల్లగా వుంటుందని పంచదార తింటే నులి పురుగులు పుట్టుకొస్తాయి...మ్యమ్ మ్యమ్... బెల్లానికి ఆ బాధ లేదు. ఈ ఊళ్ళో తప్ప మంచిబెల్లం దొరకదండి... మ్యమ్ మ్యమ్!!

'ఒకటే' దవడ ఆడింపు. నక్షత్రకుడి ప్లేటు ఖాళీ. నాకోసం తెచ్చిన ప్లేటులోనివి కూడా వాడి ప్లేటులోకి దొర్లిపోయాయి.

"అనుకున్నా, బజారు సరుకు ఇంత ఎలా బాగుందా అని. అమ్మాయి స్వయంగా చేసిందా ? అసలు పిండివంటల దాకా కాకపోయినా మాములు వంట వచ్చునన్న మాట. ఇంకేం. పిండివంటలు కూడా నేర్పెయ్యండి. మావాడికి పిల్ల బాగా నచ్చి పోయిందన్న మాటే...హిహిహి మావాడు భోజన ప్రియుడులెండి.. నిత్యానందం, నువ్వు తినకూడదు గానీ, ఈ తిండి చాలా బాగుందోయ్! చేగోడీలు కూడానూ... కమ్మగా కరకరలాడుతూ వున్నాయి."

నా వొంతు కూడా వాడే తినేశాడు.. నరికి పారెయ్యాలన్నంత కోపమొచ్చింది. గుడ్లెర్ర చేశాను. పళ్లు పటపట కొరికాను. అసలు నక్షత్రకుడికి అది అర్థమై ఏడిస్తేగా ! ఓ గ్లాసు మంచినీళ్ళు, రెండుగ్లాసుల కాఫీ తాగి, బ్రేవ్ మని త్రేన్చాడు.

"దుర్ముహుర్తం రాకుండా పిల్లని రప్పించండి!"

వచ్చింది ఆ అమ్మాయి. గజగమనం, మందగమనంతో కాదు, తారాజువ్వలా రివ్వున వచ్చింది. కుర్చీలో ధీమాగా కూర్చుంది. సిగ్గుపడలేదు. తల వొంచుకోలేదు.
🤠
*సశేషం*

*నిత్యానందం*

*నిత్యానందం గారి వివాహం - 2*

'బాగానే వుంది కదూ' నక్షత్రకుడు నా చెవులో గుసగుస. ఆడవాళ్ళంటే నాకసలే సిగ్గు, అందులో ఆ అమ్మాయి నాకేసి అలా ధాటీగా చూసేస్తూవుంటే...! 'పిల్లని తిన్నగా చూసుకోవోయ్,' అంటూ నక్షత్రకుడు !

"అమ్మాయ్, కొంచెం వెలుగుపడేలా కూర్చో అమ్మా! వెనకటికి ఓ పెళ్ళికొడుకు పిల్లని పసందుచేసి తరవాత క్రీనీడలో తిన్నగా కనిపించలేదు కనక ఒప్పుకున్నానని పేచీ పెట్టాడుట. ఆం.. అది, ఇప్పుడు చూసుకో వోయ్"

ఏం చూడను. ఓ అమ్మాయి, అందులో పెళ్ళికున్నది, సిగ్గూ, శరం లేకుండా చూస్తూ వుంటే, ఆ అమ్మాయి చూడకుండా, నే చూద్దామంటే, ఎప్పుడు ఆ అమ్మాయి నాకేసి చూడబోయినా, ఆ అమ్మాయి నాకేసి చూస్తూనే వుంటుంది. ఆడదాని చూపులు మన్మధుడి బాణాలంటారు. అమ్మాయి చూపులు నాకు ముళ్ళలా గుచ్చుకున్నాయి. "చూశావా, చూశావా అని చెవి కొరుకుతాడు నక్షత్రకుడు. చూశాను ! నెత్తిమీద పువ్వుల గోలెంతప్ప మరేమీ కనిపించలేదు.

"పిల్ల బాగానే వుందికదూ! ఏం? ప్రశ్నలేమన్నా వేస్తావా"

ఎవరిని? అమ్మాయినేట? ఇంతమందిలో చూడ్డానికే సిగ్గుగా వుంటే ఇక నే ప్రశ్నలేం వెయ్యగలను ? బొంచాయిలాటి వూళ్ళలో అమ్మాయినీ, అబ్బాయినీ, ఏ సినిమాకో, బీచీకో తోడు లేకుండా పంపిస్తారుట! అలా వదిలిపెడితే చూపిద్దును నా మజా? అంతేగాని పదిమందిలో కూచోపెట్టి, మాట్లాడమంటే, జంకుగా వుండదూ!

"పోనీ, నేనే పలకరిస్తానులే" అన్నాడు.

"నీ పేరేమిటమ్మా ?"

"సుబ్బమ్మ !"

"బాగుంది, సాంప్రదాయకమైన పేరు." ఆ అమ్మాయి పేరు దిబ్బమ్మ అయితే మరీ సంతోషంగా వుంటుందన్నట్టు మాట్లాడాడు నక్షత్రకుడు..

"చదువుకుంటున్నావా అమ్మా ?"

“ఆ... "

"ఎన్నో క్లాసు ?"

"ఆరో క్లాసు"

"ఆరో క్లాసే? రాసుల పేర్లు తెలుసా ?"

మేగజైన్లలో నక్షత్రకుడు వారఫలాలు తప్ప ఏమీ చూడడు.

" తెలుసండి!"

"చెప్పమ్మా!"

"అశ్వని, భరణీ... వృశ్చికం" అంటోంది ఆ అమ్మాయి నాకు మా చిరాకెత్తుకొచ్చింది. 'అనవసరంగా చంపకోయ్' నీ అవకతవక జవాబుల్తో, మమ్మల్ని చంపొద్దని ఆ అమ్మాయిననాలని నా ఉద్దేశం. 'అనవసరంగా చంపకోయ్  అ మ్మా యి ని' అని నోరు జారిపోయింది.

"మావాడు చాలా మంచివాడులెండి. భార్యని పువ్వుల్లో పెట్టి పూజించుకుంటా డు. ఏమంటావు ?" తొడమీద ఫేడేల్ మని కొట్టాడు.

"ఇంగ్లీషు చదువులు చూడండి. తెలుగు పేర్లన్నా తిన్నగా చెప్పరు. మా అమ్మాయికి హిస్టరీ జాగర్ఫీలు బాగా వచ్చునండీ!" ముక్కుమాటలతో అంది ఆ పిల్ల తల్లి.

"అమ్మా ! అశోకచక్రవర్తి ఏంచేశాడు ?"

"అశోకచక్రవర్తి గొప్ప చక్రవర్తి. ఆయన రోడ్లను త్రవ్వించెను, జంతువులకు.... జంతువులకు, మరమ్మత్తులను చేయించెను. అహా..., ఆసుపత్రులను వేయించెను. చెట్లను కట్టించెను. "

"శభాష్ ! చాలమ్మాచాలు. మెతుకు పట్టుకు చూస్తే చాలదూ! హిస్టరీ చాలా ధాటిగా వచ్చిందండి?" అని నక్షత్రకుడి మెప్పు !

"జాగర్భి కూడానండీ ! భూమధ్య రేఖ ఎక్కడుంది తల్లీ :"

"భూమధ్య రేఖ భూమధ్యంలో ఉందండీ ?"

"రైట్ ! జాగర్భీ క్షుణ్ణంగా వచ్చునండీ మా అమ్మాయికి. ఇంకా ఏమన్నా ప్రశ్న వేస్తే వెయ్యండి?"

నక్షత్రకుడికి అసలు జాగర్భీ అంటే ఏమిటో తెలిస్తేగా ప్రశ్న వెయ్యడానికి.

"తెలుస్తూనే వుందిలెండి - అనవసరంగా అందులో ప్రశ్నలెందుకు ? అమ్మాయికి వంటవచ్చునని ముందరే తేలిపోయింది. ఇంకేం కావాలీ...ఆఁ... సంగీతం ఏమైనా చెప్పించారా ?"

"నోటి పాటేనా, వాయిద్యం కూడానా?"

“నోటి పాటేనండి. వాయిద్యం చాలాయేళ్లు సాధకం చెయ్యాలి. అత్తారింటికెళితే అక్కడ కుదరదు. నోటి పాటైతే ఖర్చు పూర్తిగా వృధాపోదు పేరంటాల్లో మంగళ హారతో, పిల్లలుపుడితే జోలపాటో పాడుకోడానికైనా పనికొస్తుంది."

"అవునవును. సంసారుల సంగీతం అంతేలెండి. కృతులు నేర్పించారా ఏమిటి? బాగుంది. శాస్త్రీయ సంగీతం తప్పకుండా నేర్పంచాలండీ ! త్యాగయ్య మనవాడా అరవలు చూడండి. ఆయన్ని ఖూనీ చేసి పారేస్తున్నారు. మనం నేర్చుకోవాలి. ఏదీ ఒక్క కృతి పాడమ్మా?"

"శ్రుతి లేందే నే పాడలేనండీ నాన్నారూ?"

"శృతి కేమమ్మా ! సా.పా, సా" అన్నాడు నక్షత్రకుడు.. వాడి కోతిచేష్టలు చూస్తూ వుంటే నాకు చిరాకెత్తుకొస్తోంది. 'నీ పాటెవరికి కావాలోయ్, నోరుమూసుకో!' అందామనుకున్నాను గాని వాళ్ళం దరిముందూ గదమాయిస్తే ఏడిచిపోతాడు గదా అని వూరుకున్నాను.

వాళ్ళ నాన్న, అమ్మ, అన్నలు, తమ్ముళ్లు అందరూ బతిమాలగా పాట మొదలెట్టింది.

"నను పాలింపగ నడచి వొచ్చితివో, నా ప్రాణనాధ" అంటూ!

''ఆ హా హా ? యుక్తమైన పాట పాడావు. నడిచిరాలేదు. రైలే ఎక్కి వచ్చాడనుకో, హి హి హి..." తన తెలివికి తనే సంతోషించ ప్రారంభించాడు నక్షత్రకుడు.

"మా అమ్మాయికి సినిమా పాటలు చాలా బాగా వచ్చునండీ! తెలుగే కాదు, హిందీ కూడాను "

"అలాగా, ఏదమ్మా! ఓ సినిమా సాంగు విసురు."

''పందిట్లో పెళ్ళవుతున్నదీ... బలె విందౌతున్నది..."

"ఎందులోదోయ్ ఈ పాట నిత్యానందం ? మా వాడికి సినిమాపిచ్చిలెండి. ఊళ్లో వచ్చిన ప్రతి సినిమా చూస్తాడు, దాన్లో స్టార్లూ, పాటలూ అన్నీ మావాడికి కంఠతా. అవునా, నిత్యానందం?'' తొడమీద మళ్ళీ ఫెడేల్ మని కొట్టాడు. వీడికిదో రోగం. 'అవునా, ఏమంటావు' అని పక్కవాడి తొడమీద చరుస్తాడు. చాచి పుచ్చుకు లెంపకాయ కొడదామన్నంత కోపమొ చ్చింది. పరాయి వాళ్ల ముందర, అవమానం చెయ్యడమెందుకు,అఘోరించి పోతాడని వూరుకున్నాగాని ! 'రైలుకి టైమైనట్టుంది పద' అని వెంటనే బయటి
కొచ్చేశాను. నక్షత్రకుడు పిల్లతండ్రితో పావుగంట గుసగుసలాడాడు. జీడిపప్పు పాకం పొట్లం తెచ్చుకున్నాడు. ఇంకేముందీ! ఆయనకి దాసుడైపోయాడు. భట్రాజులా వాళ్ళని పొగిడాడు.

"ఆడ కూతుళ్ళని కన్నవాళ్ళు ఆశతో వేగిపోతూ వుంటారు. సంధిగ్ధంలో వుంచ కూడదు. పిల్ల సంగతి నువ్వే తేల్చు, కట్నం, కానుక సంగతి నే తేలుస్తాను." మళ్ళీ కురుపు నలుపు !

"ఆ అమ్మాయి పాటేం బాగాలేదు" అన్నాను.

"వరసలు బాగానే వచ్చాయి. పడగ్గదిలో నీకు వినిపించడానికి అది చాలు, కచేరీలు చేయించవుగా ?"

"పిల్ల అందంగా లేదు"

"అందం కొరుక్కుతింటామా?"

"అందం లేకపోతే మానె, ఆ అమ్మాయి ముక్కు వంకరగా ఉన్నట్టుంది."

"నీ ముక్కంత మెలికలు తిరగలేదు."

"మెల్లకన్నులా వుంది,"

''పెళ్ళానికి మెల్లయితే మొగుడికి అదృష్టం."

"బుద్ధున్నవాడు అనవలసిన మాటే అది? వొళ్ళు మండిపోయింది. ఛీ ఛీ! నీతో మాట్లాడకూడదనుకున్నాను. మోసం."

"అబ్బాయి ! నే చెదుతున్నాను విను. ఈ పిల్ల అన్నివిధాలా నీకు తగింది. ఆ మాటకొస్తే పిల్లముందు నువ్వే తీసికట్టని అనిపించావు. నువ్వు నోరు విప్పి పలకరించలేకపోయావు. నీకేమీ రాదేమో నని వాళ్ళకి అనుమానం పుడితే,... 'లేదండీ, మా వాడికి కొంచెం సిగ్గు? మొహమాటం, చనువయిన తరువాత చూడండి, మా వాడి తడాఖా అని నచ్చ చెప్పేసరికి నా తాతలు దిగొచ్చారు. నువ్వు అసమర్థుడవని నీ సంబంధం వాళ్ళకి నచ్చకపోతే. అది దేశమంతా పాకిపోయి, నీకు అసలు పెళ్ళి యోగం లేకుండా పోతుంది. నీ మేలుకోరి చెబుతున్నా ఒప్పేసుకో ... కానింటి రంభ కంటె అయినింటి కోతిని చేసుకోమన్నారు. ఈ సంబంధం కుదిరితే నువ్వు చాలా అదృష్టవంతుడివే ! "

అర్థం పర్థం లేని ఒకటే వాగుడు. ఎంత వాగినా నే జవాబు చెప్పలేదు. పో పో ! వాక్కుని వాక్కుని నీ నోరే నొప్పెట్టి పోతుంది అనుకున్నాను. అంతే భీష్మించు కు మౌనంగా ఉండిపోయాను. నువ్వేచెప్పు నాకిష్టం లేదని తేల్చేసినట్టేనా? కాని, ఇంటి కొచ్చేసింతరవాత పిల్ల నాకు నచ్చిందని నక్షత్రకుడు అందరితోటీ చెప్పేశాడు. నాన్నా, నక్షత్రకుడూ కలసి కట్నాలూ, కానుకలూ అన్నీ నిర్ణయం చేశారు. నన్ను దేనికీ సంప్రతించరు. ఏమీ అడగరు. నాకు ఒళ్లుమండిపోతోంది. ఎప్పటికప్పుడే 'నాకక్కర్లేదు, పెళ్ళి పనులు చేయించకండ ర్రా' అని చెబుదామనుకునేవాణ్ణి. మా నాయనమ్మ ఉంటే పైకి చెప్పకపోయినా మొహాన్ని బట్టే కనిపెట్టేసేది. ఏమిట్రా నాయనా ! ఆముదం తాగిన వాడిలా మొహం పెట్టావు?' అని అడిగి వుండేది.

"నాయనమ్మా! నాకీ పెళ్ళి ఇష్టంలేదే!" అనేవాణ్ణి.

"ఎందుకురా" అనేది.

"ఆ పిల్ల నాకు నచ్చలేదే!"

"ఎందుకు నచ్చలేదురా ?"

"ఆ పిల్లకి మెల్ల.. ముక్కు వంకర. కీచు గొంతుక. పాట రాదు"

'అలాట్రా వెర్రికుంకా! నీకు నచ్చనిపిల్లనిచ్చి పెళ్ళెందుకు చేస్తామురా. వద్దని ఉత్తరం రాయించేస్తానులే" అనేది.

"థాంక్యూ, నాయనమ్మా !"

దాంతో పెళ్ళి బంద్. 'పదిమంది పిల్లల్ని చూసి, అందులో ముగ్గుర్ని ఏరి, వాళ్ళని మళ్ళీ చూసి, ఆ ముగ్గుర్లో ఒకర్తిని ఎన్నుకో వాలని నా ఆశయం. చూసిన మొదటి పిల్లనే నాకు అంటగట్టేస్తే ఎలా భరించగల ను 'నువ్వు చచ్చిపోయి ఎంత సంకటం తెచ్చిపెట్టావు నాయనమ్మా ! నా పెళ్ళి చూడకుండా చావననేదానివి ఎంతపని చేశావు నాయనమ్మా! నా మొహంచూసి భావం కనిపెట్టే మనిషి లేదుకదా ! ఇంట్లో అన్నీ నేనే మాటల్లో చెప్పాలి. కోపమొస్తే నాకు మాటలు త్వరత్వరగా రావని నీకు తెలుసుగా' రంపం లాటి వాడిగల మాటల కోసం వెతుకుతాను, అవి దొరక్కపోతే నాలిక తడబడుతుంది. నాలిక తడబడితే నాన్న కరుస్తాడు అంచేత ధాటీగా పెద్ద ఉపన్యాసం తయారుచేసుకుని వెడదామ నుకుంటూ ఉంటే ముహూర్తం వచ్చేసింది. పీటలమీంచి లేచిపోదామనుకున్నప్పుడ ల్లా, పురోహితుడు నొక్కేసి, కూర్చోబెట్టేసే వాడు. పుస్తెకట్టించేశాడు. నేనొప్పుకోను. ఈ పెళ్ళి నాకొద్దు... ఏదో అఘాయిత్యం చేసేస్తాను.

"ఇక్కడే ఉన్నానండీ నాన్నగారూ!"

"గదిలో కెళ్ళడానికి టైమయిందిట్రా...''

“వస్తున్నానండీ నాన్నగారూ! వస్తున్నానండీ !"

"ఇంకేం అఘాయిత్యామా... ఏం? జవాబు చెప్పక ఇకిలిస్తావేమిటిరా? పోకిరీ పెద్దమ్మా?''
రచన: సోమంచి యజ్ఞన్నశాస్త్రి
*సశేషం*


*నిత్యానందం - 3*

*నిత్యానందం గారి సాంసారిక విజయాలు -1*

“ఇంత పొద్దెక్కినా తలపు తీసి ఊడిపడరేం? అమ్మాయ్ సుబ్బమ్మా, వాడికి లేకపోతే మానె, నీకైనా బుద్ధిలేదే? ఎంతసేపు గడియ బిడాయించుకు పడుకుంటారు" అని అమ్మ సాధింపు ప్రారంభించింది.

అమ్మకి నాలుగున్నర నించీ నిద్దురపట్టదు. నాయనమ్మ లాగ గజేంద్రమోక్షంలో పద్యాలూ, భజగోవింద శ్లోకాలూ చదువుకుంటూ మంచం మీదే నడుంవాల్చి వుండిపోదు. లేచి ఇల్లంతా సవరిస్తుంది. ఒంట్లో బాగాలేకపోయినా, చచ్చేదాకా వెట్టి చాకిరీ తప్పదని గొణుక్కుంటుంది. విసుక్కుంటుంది.

"లేవరా నిత్యానందం, ఎండెక్కిపోయింది రా..."

కళ్లు నులుముకుంటూ లేవబోయాను.

"ఇంకా బద్ధకం తీరలేదు. పడుకోండి" అంది మా ఆవిడ.

"ఎండెక్కి పోయిందట" అన్నాను.

"మరేం ఫరవాలేదు. ఇంకా ఆరున్నర కాలేదు. ఈ వెధవ్వూళ్ళో తెల్లారకుండానే ఎండొస్తుంది. మీ నాన్న ఆఫీసుకి టైముని బట్టి వెళతారా, ఎండనిబట్టా? పడుకోండి, పడుకోండి"

"నే లేస్తాను. నువ్వు పడుకో"

"మీరు మాత్రం లేచి వెలగబెట్టే రాచకార్యా లేమున్నాయి. మొగుడు లేచినా ఇంకా పడుకుందని నన్ను ఆడిపోసుకోడానికా, మీరూ పడుకోండి" అని దబాయించేసింది.

"లేవరా"

“పడుకోండీ”

"నిన్నేరా"

"మిమ్మల్నేనండీ"

"లెమ్మంటే"

“పడుకోమంటే"

అవతల తల్లి, గదిలో భార్య. ఎవరు గెలిచారా? ఏమిట్రా. చొప్పదంటు ప్రశ్న ? ఇలాటి విషయాల్లో ఎవరు గెలుస్తార్రా?

"వొరేయ్. ఎంతసేపురా మొద్దు నిద్దర ? లే" అని మా నాన్న అందుకున్నాడు. వెంటనే ఉలిక్కిపడి లేచి కూచున్నాను. నాన్న అందుకుంటే రండోలు వాయించినట్టే. ఇహ లాభం లేదు. లేచి బయటికి పోతేనే మంచిది.

"అనవసరమయిన విషయాల్లో జోక్యం కలుగజేసుకుంటున్నారు మీ నాన్న" అంది మా ఆవిడ, తనేదో మహాసత్యం మొట్ట మొదటి మాటగా కనిపెట్టినట్టు. నాకెప్పుడో తెలుసునయ్యె ఆ సంగతి. లేకపోతే ఈ పెళ్ళి మాత్రం జరిగుండేదీ! మొదట ఇష్టం లేదన్నానే. ఆ అమ్మాయే. ఇప్పుడిష్టమే. ఎలా మారిపొయానా? ఒరే, పిచ్చి ప్రశ్న వెయ్యకు. పెళ్ళామంటే అందరికీ ఎలా ప్రేమ పుట్టుకొస్తుందో, నాకూ అలానే. వొరేయ్ కాస్సేపు నీ కుళ్ళంకలు కట్టేసి, విను, ఏం చెబుతున్నానూ? మా నాన్న అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటు న్నాడని మా ఆవిడ అంది కదూ.

"అవును. ఆ సంగతి నా కెప్పుడో తెలుసు" అన్నాను.

"అనవసర జోక్యం కలగజేసుకోవద్దని చెప్పండి" అంది.

"నేనే? మా నాన్నతోటే ? కరుస్తాడు."

"కరవడానికి కుక్కా ఏమిటండీ, మనిషేగా?"
"నీకేం నువ్వేమైనా చెబుతావు, ఎదట పడేది నువ్వా నేనా?"

"ఏమిట్రా గదిలో గుసగుసలు, లేచి రమ్మంటేను" గుండెలు అదిరిపోయే లాగ నాన్న కేక. ఎదిగి, పెళ్లాంతో కాపురం చేస్తున్న కొడుకుని అనవలసిన మాటే ? 'నాన్నగారూ, ఇలా నాతో మాట్లాడ్డానికి వీల్లేదు. మా ఆవిడ వింటూంటే నామీద అధారిటీ చెలాయించడానికి వీల్లేదు' అని లేచి చెప్పేద్దామనుకున్నాను. కాని నేను ఊరికే లేచిపోతున్నాననుకుంది కాబోలు మా ఆవిడ, నే లేవకుండా అదిమిపెట్టి "ఆయనకి తల నొప్పిగా ఉందండీ, లేవ లేకుండా వున్నారు" అని జవాబు చెప్పింది.

"అజీర్తి తిళ్ళు తింటే తల నొప్పి రాకేంజేస్తుంది !"

"నిన్న రాత్రి తిన్నగా భోం చెయ్యనే లేదు."

"సాయంకాలం టిఫిను మస్తుగా తింటే రాత్రి భోజన మెందుకు !"

"ఏ తల నొప్పయినా, లేచి వొళ్ళువొంచి పని చేస్తే అదే పోతుంది"

"అది పోతేగాని లేవడానికి ఓపికరాదు. లేస్తే తల తిరుగుతుంది"

మా నాన్న వెనక్కి తగ్గాడు.

"తల తిరుగుతోందీ? జ్వర మొచ్చిందేమో చూడనీ" అని మా అమ్మ కేకెట్టింది.

"జ్వరం లేదులెండి"

"అన్నీ తెలిసినట్టు మాట్లాడతావేమిటి ? వొళ్ళు చూడనీ"

"నే చూసే చెబుతున్నాను. చల్లగానే వుంది”

"మా అబ్బాయి సంగతి నీకు తెలీదు. పైకి చల్లగా వున్నా ఒక్కొక్కప్పుడు ఉష్ణం వుంటుంది.”

"దానికి ముసుగెట్టుకు పడుకోడమే మందు"

"శొంఠి కొమ్ము అరగదీసి పెడితే రెండు నిమిషాల్లో తలనొప్పి పోతుంది".

"ఆ నాటు వైద్యపు రోజులు పోయాయి, ఇప్పుడు అంజనాలకి, ఆస్పిరిన్లకీ గాని లొంగడం లేదు ఈ తలనొప్పులు."

మాటకి మాట జవాబు చెబుతూ పావుగంట దాకా మా ఆవిడ తను గదిలో నుండి కదల్లేదు, నన్ను కదలనివ్వలేదు. కొంత అయిన తరువాత "బద్ధకం బలిస్తే, తలనొప్పేగాదు, ఒళ్ళంతా నొప్పులు పుట్టుకొస్తాయి. లేచి మందన్నా మింగమను" అని నసుక్కుంటూ నాన్న జారుకున్నాడు.

"అన్నిటికీ అదే జవాబు చెబుతుంది కాని వీడి నోరు పెగలదే ?" అని గొణుక్కుంటూ చివరికి అమ్మ జారుకుంది. అలా మరో పావుగంట విశ్రాంతి తీసుకునిగాని మేం బయటపడలేదు తరువాత ఒకటి రెండు మార్లు మళ్ళీ మమ్మల్ని పెందరాళే లేపడానికి ప్రయత్నం చేశారు కాని, మనం కొరకబడలేదు. ఏమిటనుకున్నావురా, నిత్యానంద మంటే? మనకి కొంత మాట సాయం, వెనక దమ్ము వుండాలి గాని నే లేస్తే మనిషినిగాను. మా నాయనమ్మ బతికి వున్న రోజుల్లో, నీకు జ్ఞాపకం లేదూ, అప్పడాల పిండి మాష్టారుక్కూడా నేనంటే హడలు పుట్టింది. అప్పడాల పిండి మాష్టార్నెరగవురా, గవర్రాజుగారి బడిలో రెండో మాష్టారు. చిన్నప్పుడెప్పుడో వాళ్ళమ్మ అప్పడాల పిండి కలిపి పెట్టుకుంటే, దబ్బకాయంత ముద్ద ఎవరూ చూడకుండా ఎత్తుకు పోయి, స్వయంగా అంతా భక్షించేశాడుట. దాంతో నాలుగు రోజులు విరోచనాలు పట్టుకున్నాయట.
కలరా వచ్చిందేమోనని రెండు రోజులు మందులిప్పించిం తరవాత ఈ సంగతి బయటపెట్టాడుట. అంచేత వాళ్ళింట్లో వాళ్ళే అప్పడాల పిండి అని ఓ ముద్దు పేరెట్టుకున్నారుట. వాళ్ళ వాళ్లు పెట్టుకున్న పేరే గదా సంతోషంతో స్వీకరించగూడదూ ! ఆ మాట ఏ రూపంలో వినిపించినా వుడుక్కునేవాడు, తిట్టేవాడు, కొట్టేవాడు. పేంబెత్తంతో కాదురా, రూళ్ళ కర్రతో కొట్టేవాడు. ఎక్కాలు వల్లించమనడం తప్ప క్లాసులో చెప్పే పాఠం లేదు. దానికి తోడు వాడికి నత్తి కూడాను. బకాసురుడు అదేదో ఊరి మీదపడి అందర్నీ పీడించుకుతిన్నట్టు స్కూల్లో పిల్లల్నందర్నీ పీడించుకుతినే వాడు. కాని బకాసురుని ప్రాణానికి భీముడు తటస్థపడ్డాడు. అప్పడాల పిండి మాస్టారుకి ఏకు మేకై గుచ్చుకున్నాడు నిత్యానందం. ఎలా గంటావా? ఓనాడు మా నాయనమ్మంది "వొరే నిత్యానందం. అప్పడాలు ఎండబెట్టాను. కాకులు రాకుండా కాయరా అంది.

"కాకుల్నయితే కాస్తానుగాని, పిచ్చికల్ని పిలుస్తాను నాయనమ్మా" అన్నాను.

"వీపు చిట్లగొడితే బావురుమని ఏడుస్తావు కూడాను'' అన్నాడు మా నాన్న, మా నాన్నకి 'జోకులు' తెలిసేవి గావు. మా నాయనమ్మ మాత్రం 'నిత్తిగాడికి కవిత్వం చెప్పడ మొస్తుంది.' అని సంతోషించింది. ఉష్ ఉష్ అని కాకుల్ని కాసి అలిసిపోయి, ఆలశ్యంగా స్కూలుకెళితే మాస్టారు పట్టుకున్నాడు.
రచన: సోమంచి యజ్ఞన్నశాస్త్రి
*సశేషం*


*నిత్యానందం - 4*

రచన: సోమంచి యజ్ఞన్నశాస్త్రి

*నిత్యానందం గారి సాంసారిక విజయాలు - 2*

*ఎ.. ఎందుకింత ఆలశ్యమయింది"

"మాస్టారండీ మరేమోనండీ..."

"ని.. ని.. నీళ్ళు న.. న.. నమలకు"

"మా నాయనమ్మండి అప్పడాలు ఎండబెట్టి కాకుల్ని కాయమందండి. అంచేత ఆలశ్యమయి పోయిందండి."

"భ.. భ.. భడవా బె.. బ్బెంచెక్కు"

"నేనేం చెయ్యలేదండి మాస్టారూ. మా నాయనమ్మే అప్పడాలు ఎండబెట్టి కాపలా వుండమందండి. మా ఇంట్లో కాకులు చాలా ఎక్కువ. కాపలా కాయకపోతే అప్పడాలు బతకనివ్వవు."

"పు.. పుండాకోర్ గొ.. గ్గోడ కుర్చీ వెయ్యి."

"తప్పంతా కాకుల్దండి. నాది కాదండి"

"వీపు చి.. చీరేస్తాను ఒ.. ఒళ్లు ఉతికేస్తా ను". అసలు మాట వినిపించుకోడు. ఒకటే ధుమధుమ.

"చె.. చెయ్యిపట్టు" అరిచెయ్యి వెనక్కి తిప్పి రూళ్ళకర్రతో ముడికలమీద వాయించాడు.

"మా నాయనమ్మతో చెబుతానుండండి'' అని ఏడుచుకుంటూనే స్కూల్లోంచి పారిపోయాను. నాయనమ్మ రెట్టింపు పటిక బెల్లం పెడితేగాని, ఏడుపు మానలేక పోయాను..

"నే నింక ఆ స్కూల్లో చదువుకోను నాయనమ్మా. మరో స్కూల్లో చేర్చేసెయ్యి !"

"వెర్రి నాన్నా, అద్దాంతరంగా ఇంకో స్కూల్లో ఎలా చేర్చుకుంటార్రా..."

"నువ్వు చెబితే చేర్చుకుంటారు"

"ఏడాది మధ్యలో నే చెప్పినా చేర్చుకోరురా"

"అయితే ఈ ఏడు చదువు మానేస్తాను. అప్పడాల పిండిగాడు నన్ను కొట్టి చంపుతున్నాడు. వాడిదగ్గర నే చదువుకోను"

"కొట్టొద్దని నే చెబుతానులే”

"వాడూరికే వుడుక్కుంటాడు. అనవసరం గా దంచుతాడు. చెప్పే పాఠాలు తక్కువ. కొట్టే దెబ్బ లెక్కువ.”

''నీ జోలికి రావొద్దని నే చెబుతాగా”

“మెల్లిగా చెబితే లాభం లేదు.”

"గట్టిగానే చెబుతాలే, వెళ్ళు"

"నువ్వొచ్చి దిగబెడితేనేగాని వెళ్ళను”

పది నిమిషాలు బేరమాడిన తరువాత, మళ్ళీ కసింత పటికబెల్లం పెట్టి నాయనమ్మ కర్ర పొడుచుకుంటూ నాతో స్కూలు కొచ్చింది. నాయనమ్మ ఇంట్లో నడవడానికి కర్రసాయం అక్కర్లేదుగాని, రోడ్డు మీద నడవాలంటే కర్ర చేతిలో వుండాలి. కుక్కల్నీ పందుల్నీ ఝడిపించడానికి. తిన్నగా క్లాసులోకే వెళ్ళిపోయాం.

"నాలుగు మూళ్ పన్నెండు. నాలుగు నాళ్ పదహారు" అని క్లాసంతా అరుస్తున్నారు. అప్పడాల పిండి వెంకన్నబుగ్గలు నులుము తున్నాడు. నన్నూ, మా నాయనమ్మనీ చూడగానే క్లాసంతా నిశ్శబ్దమైపోయింది. అప్పడాల పిండి నాకేసి పెద్దగా గుడ్లురిమి చూశాడు. నాయనమ్మ వెనకాలుంటే నాకేం లెక్క! పో పో, చూసుకో అనుకున్నా.

"ఏమయ్యా, ఎందుకయ్యా పిల్లల్ని అలా కొట్టి చంపుతావు" అంది నాయనమ్మ. రూళ్ళకర్రతో వేళ్ళ మీద కొట్టావట, మా వెర్రి నాగమ్మని!"

"అల్లరి చె..చేస్తే పనిష్ మెంట్ ఇ.. ఇవ్వద్దా"

"పిర్రమీద దెబ్బకి ఫిర్యాదు లేదుగాని, వేళ్ళ మీద కొడితే వూరుకుంటారుటయ్యా. అయినా మా వాడిప్పుడు ఏం అల్లరి చేశాడని కొట్టినట్టు"

దానికి జవాబు చెప్పగలిగితేనా. గుడ్లు మిటకరించి చూశాడు మాష్టరు.

"నాయనమ్మా, నువ్వు అప్పడా లెండబెట్టి నన్ను కాకుల్ని కాయమన్నావా. ఎందుకాలిశ్యంగా వచ్చావని అడిగితే మాస్టారూ, 'మా నాయనమ్మ అప్పడాలు ఎండబెట్టి కాకులెత్తుకుపోకుండా కాయ మంది" అన్నాను, అంతే. అప్పడాలు అనగానే ఆయనకి కోపమొచ్చింది. నువ్వే చెప్పు అప్పడాలు అన్నాను గాని అప్పడాల పిండి అన్లేదుగా, ఇందులో నా తప్పేమన్నా వుందా?'' అన్నాను.

"అయ్యో, అప్పడాల పిండీ. ఇన్నేళ్ళొచ్చినా ఇంకా ఉడుక్కుంటూనే ఉన్నావుటయ్యా''

"ఏమండోయ్ బామ్మగారూ, పెద్దవారని మర్యాదగా ఊరుకుంటే” అప్పడాల పిండి గుడ్లెర్రజేశాడు. నాయనమ్మ ఝడుస్తుందా!

"ఉడుకుడుకు బోలే" అంది. క్లాసంతా గొల్లుమన్నారు. ఏం జేస్తాడు? ఆయన చేతిలో రూళ్ళకర్రయితే, మా నాయనమ్మ చేతిలో పెద్ద కర్ర. మా నాయనమ్మతో చాల్లేడుగా.

"మావాడి జోలికి ఇంకెప్పుడూ రాకు. వాడి వల్లెమన్నా తప్పు వుంటే నాతో చెప్పు. నే కేకలేస్తాను" అని కట్టడిచేసివెళ్ళిపోయింది. ఆ తరవాత, మాస్టారుకి నాయనమ్మ, మనమంటే హడల్.

ఇప్పుడు మా ఆవిడ వల్ల మన అథారిటీ మళ్ళీ లేచిపోయింది. మొదటి విజయం నిత్యానందంగారు ఇష్టమొచ్చినంతసేపూ విశ్రాంతి తీసుకోవచ్చును. వారిని లెమ్మని వొత్తిడి చెయ్యడానికి ఎవరికీ అధికారం లేదు. ఎవరైనా ఆ విషయం గుర్తించక ఒత్తిడి చేసినా, నిత్యానందం గారు ఖాతరు చెయ్యరు. హాయిగా నిద్రపోతారు. నిద్ర పట్టకపోతే కళ్ళు తెరిచే నడుం వాలుస్తారు. లేదా, పక్కమీద పడుకుని, అటూ ఇటూ దొర్లుతారు. కాని, లేవరు. అదే విధంగా నక్షత్రకుడి బాధా వదిలిపోయింది. మా పెళ్ళయిం తరువాత వాడిపోరు భరించడం మరీ దుర్భరమయింది. నాకే కాదు, మా ఆవిడకి కూడా సలహాలివ్వడం ప్రారంభించాడు. - బోడి సలహాలు. మా పెళ్ళి తన వల్లే జరిగిందిట. వెయ్యి అబద్ధా లాడి ఇల్లు నిలబెట్టాలన్న సామెత పట్టుకుని ఎంతో కష్టపడి, ఈ సంబంధం కుదిర్చాడుట. అంచేత మా సంసారం దిద్దడానికి తనేవో బోలెడు హక్కులు దాచి పెట్టుకున్నట్టు అన్ని విషయాల్లోనూ
లుడుంగున జొరబడి చెప్పొచ్చేవాడు.

"ఏమిటోయ్ నిత్యానందం. మీ అమ్మగారు గోలెట్టి పోతున్నారు. ఆవిడొచ్చిందగ్గిర్నించీ అమ్మగారి మాట అసలే వినడంలేదుట. మీఅమ్మ నీమీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఎప్పుడు కోడలొస్తుందా, ఎప్పుడు సుఖ పెడుతుందా అని ఎదురు చూసింది. కాని చిన్న మెత్తు సాయం చెయ్యదుట నీ పెళ్ళాం. ఎక్కడ కందిపోతుందో అని అన్ని టికి వెనకేసుకొస్తావుట. మా అందరికీ పెళ్ళిళ్ళవలేదా? పెళ్ళాలు కాపరానికి రాలేదా? తప్పు సుమా. పెళ్ళాన్ని అదుపులో ఉంచుకోవాలి. అతి చనువిచ్చి ముద్దుచేస్తే ముక్కట్టుకుంటారు. 'తల్లి విష మాయె, పెళ్ళాము బెల్లమాయే' అవకూడదు"

మనవాడి ఉపన్యాసాలు వినే రోజులు పోయాయి. 'ఈ గోడలకీ ఆ స్తంభాలకి చెప్పుకో' అని వాడు ప్రారంభించగానే చల్లగా జారిపోయేవాడిని.

"చూడు సుబ్బమ్మా" అని మా ఆవిడ దగ్గిర ప్రవేశించేవాడు. "నీ పెళ్ళి చేయించిన వాడిని కనక, నీ మంచి కోరినవాడిని కనక, చెబుతున్నాను" అని ప్రతి మాటూ ఉపోద్ఘాతం. ''మా పెళ్ళి చేయించింది పురోహితుడయ్యా, నువ్వు కాదు" అందామనుకునే వాడిని. అత్తగారికి అణుకువగా వుండాలి. గుట్టుగా సంసారం దిద్దుకోవాలి.”

"అవునండి అబద్దాలాడ కూడదు. దైవభక్తి కలిగి వుండాలి. పెద్దల మాట ధిక్కరించ రాదు. ఇంకా చాలా నీతులు స్కూల్లోనే నేర్చుకున్నానండి." అని మా ఆవిడ జవాబు. ఏ మాత్రం బుద్ధున్న వాడయినా దాంతో వెనక్కి తగ్గవలసిందేనా... కాని వాడికి సున్నితంగా చెబితే అర్థంకాదుగా. అలా నీతులు చెబుతూనే ఉన్నాడు-సల హాలు ఇస్తూనే ఉన్నాడు...
🤠
*సశేషం*

꧁☆•┉┅

*నిత్యానందం -5*

*నిత్యానందం గారి సాంసారిక విజయాలు - 3*

"నీకే ఓ కొడుకున్నాడనుకో. వాడు పెద్ద వాడయినాక పెళ్ళి చేశావనుకో. కోడలు ఇంటికి కాపరానికొచ్చి నువ్వు చెప్పినమాట సుతరామూ వినలేదనుకో. అప్పుడు నీకెలా ఉంటుంది. ఆలోచించుకో''

మా ఆవిడ కింకా నెలలన్నా తప్పలేదు. వాడు అనుకోమన్నవన్నీ ఆలోచించుకుంటే బుర్ర గిరగిర తిరిగిపోదూ. మా ఆవిడ విసిగిపోయిందంటే తప్పా, విని విని చివరికి ఓనాడు మా ఆవిడంది...

"నక్షత్రకుడుగారూ, నాదో చిన్న కోరిక''

ఆ పేరు వినగానే వాడు బిక్కచచ్చి పోయాడనుకో. ఇన్ని రోజుల్నించీ వాడికి పేరంటే పెట్టాముగాని, ఎదటబడి ఆ పేరెట్టి ఎప్పుడూ వాణ్ణి పిలవలేదు.

"నక్షత్రకుడుగారూ, మా ఇంటి నుంచి
వీసెడు జీడిపప్పుపాకం తెప్పించి పెడతాను గాని, మాకు సలహాలివ్వడం మానుకుంటారూ?" దాంతో వాడి పై ప్రాణం పైన పోయింది. మొహం పాలిపోయింది. నిజమే, నలుపు మనిషి కనక ఎంత పాలి పోయినా, మొహంలో కనిపించదనుకో. కాని వాడి వాలకం చూస్తే పాలిపోయినట్టు తెలిసిపోయింది. వుండరా! చొప్పదంటు ప్రశ్నవేసి చంపొద్దని చెబితే వినిపించుకోవే మిట్రా? మా ఆవిడ ఇంత గట్టిదని తెలిసుం టే ఈ పెళ్ళి రికమెండు చేసే వుండనని, అమ్మతోటో, ఇంకా ఎవరితోటో చెప్పుకు ఏడ్చాడుట.

"ఏడవకు ఏడవకు వెర్రి నాగమ్మ, ఏడిస్తే నీ కళ్ళు నీలాలు గారు" అని ఓదారుద్దామను కున్నాగాని, మన వేళాకోళం అర్థంగాక, తిరిగి తగులుకుంటాడేమోనని కిక్కురు మనకుండా వూరుకున్నా. పర్యవసానం, మా జోలికి రావడం మానుకున్నాడు.

నక్షత్రకుడి నోరు మూయిస్తే బాగానే వుంది గాని, నా స్నేహితుల్ని కూడా ఝడిపించి నే వాళ్ళని కలుసుకోనివ్వకుండా చేస్తోందిరా ! ముఖ్యంగా బండరాముణ్ణి. బండరాముడు నీకు తెలుసుగా. ఒకటో క్లాసు నించి నేనూ వాడూ స్నేహితులం. నేను స్కూలుకెళ్ళనని మారాము పెడుతూ వుంటే వాణ్ణి మచ్చిక చేసి, సాయమిచ్చి స్కూలుకి పంపించింది నాయనమ్మ. నేనంటే వాడికి తగని ఇష్టం. నామీద ఈగ వాలనిచ్చేవాడు కాదు. అప్పుడప్పుడు నే చేసిన అల్లరికి, వాడు కిక్కురు మనకుండా దెబ్బలు తిన్నాడు కూడాను. బండ వెధవైనా, బుద్ధిమంతుడ ని నాయనమ్మే సర్టిఫికెట్ ఇచ్చింది. మాట మోటు అనుకో, మా ఆవిడ దగ్గర జాగర్తగా వుండాలని వాడికి తెలియొద్దూ.

ఓనాడేం చేశాడంటే, రోడ్డు మీద నించుని, “ఒరే నిత్యానందం పెళ్ళయిందగ్గిర్నించి నీ దర్శనమే మాకు కరువయిపోయింది. పడక గది వదలడమే లేదు. ఈ పద్ధతిని పీనుగయిపోతావు జాగర్త. సరసాలు చాలించి, బయటకిరా' అని ఇంటి కప్పెగిరి పోయేలా అరిచాడు.

''ఎవరండోయ్ ఈ స్నేహితుడు ?" అంది.

"వాడా-బండ రాముడు !"

"పోకిరీ రాముడులా వున్నాడు"

"శుభమ్ ఆ టైటిల్ తో మరో సినిమా తీసి పారెయ్యొచ్చు. మాటలు నువ్వూ, పాటలు నేనూ రాసేద్దాం" అన్నాను. మా ఆవిడ మెత్తబడబోయింది కాని ఇంతలోనే “ఓరేయ్ బయటి కొస్తావా, ఇంట్లో చొరబడి ఈడ్చుకు రమ్మంటావా'' అని వాడు మళ్ళీ అరిచాడు. వాడికి ఆవేశమొస్తే వొళ్లూ పై తెలీదు. అన్నంత పనీ చేసేస్తాడు. ఎవడో సవాలు చేశాడని ఈత రాకుండనే కాలవ లోకి ఉరికాడు. వుషారిస్తే, తాటిచెట్టు మీదకి పాకిపోయాడు. చచ్చినంత పని అయేదనుకో! అందుకే బండరాముడని బిరుదొచ్చింది. వాణ్ణి కవ్వించడం కొరివితో తల గోక్కోడం.

"క్యా బాత్ హై. ఆడంగులంటే మనకేం భయం లేదురోయ్. రమ్మంటావా లోపలికి,” అన్నాడు.

“వొద్దు నేనే వస్తున్నారా. నువ్వు లోపలికి జొరబడకు'' అని ఆపేశాను.

“ఇలాటి వెధవల్తో మీకు స్నేహ మేమిటండీ" అంది మా ఆవిడ. మా స్నేహం యొక్క హిస్టరీ, జాగర్ఫీలు చెప్పాను. చివరికి ఈ మాటుకి మాత్రం వెళ్ళనిస్తున్నాని వదిలి పెట్టింది.

"పోకిరీ వెధవల్తో స్నేహం కూడదు చెడిపో తారంటుంది. ఇదివరకు రోజూ కలుసుకునే వాళ్ళం. ఇన్నాళ్లూ చెడిపోనిది, ఇహ ముందు మాత్రం ఎందుకు చెడిపోతాను అంటే వినదు. ఇప్పటికే చెడిపోలేదని గ్యారంటీ ఏమిటంటుంది! ఒక్కొక్కప్పుడు మహ మూర్ఖపు పట్టుబడుతుంది. ఆడవాళ్ళంతా, ముఖ్యంగా పెళ్ళాలంతా అంతేనా. అలాటప్పుడేం చెయ్యాలిరా. దంచాలా ? ఏడిశావులే. పిచ్చి సలహాలు చెప్పకు. మా ఆవిడంటే ఇప్పుడు నాకు చాలా ఇష్టంరా ! ఆవిడొచ్చిన తరవాత మనకింట్లో చాలా సౌకర్యాలు ఏర్పడ్డాయి. అంచేత అప్పుడప్పుడు నాకు వళ్లు రవరవ మండిపోయి డొక్క నాలికలు చీరేద్దామ న్నంత కోపమొచ్చినా కొట్టడానికి చేతులు లేవవు. మనకే ఎదురు తగులుతాయేమో నన్న భయమేమోనంటావా. పోరా. అలాటప్పుడు ఏం చెయ్యమంటావురా... అయితే బతిమాలుకోమంటావా! వొరేయ్ నే అదే చేస్తున్నారా! ఎలాగో అలాగ నా మాట నెగ్గుకొస్తూనే వుంది, భయాన సాధించినా, నయాన సాధించినా విజయం విజయమే కదురా! ఎందుకురా ఆ నవ్వు? పో, నీ పారపళ్లే బయట పడతాయి, నాకేం!
📖

*నిత్యానందంగారి విజ్ఞాన యాత్ర -1*
😎

కనిపించిన శుంఠల్లా, ఏమండోయ్ నిత్యానందంగారూ, ఎంతవర కొచ్చింది. మీ విజ్ఞానయాత్ర అని అడిగేవాళ్ళే, దిష్టి తగలక ఏం చేస్తుంది. పురిట్లోనే సంధి కొట్టింది. అదేమిటంటా? మొదట్నించీ చెబుతాను విను.

ఓనాడు నేమా, రంగాచారీ, మస్తాన్, సుభాష్ చంద్రబోసూ, చంద్రరావూ మా ఇంటి అరుగుమీద కూర్చుని బాతాఖానీ కొడుతున్నాము. అసలు ఎప్పుడూ వొంతెన గట్టుమీద కూచుని బాతాఖానీ వేసేవాళ్ళం. మా ఆవిడ తగాదా పెడితే, మా ఇంటి అరుగుమీదికి మార్చాము, ఇదీ మానుకోమని మా ఆవిడ పేచీ పెడుతోంద నుకోండి. అయినా ఎలాగో సముదాయించి వారానికోమాటైనా కలుసుకుంటున్నాము. మాటల సందర్భంలో నేనన్నాను. 'వొరేయ్ మనం మరీ వేసిన గొంగళీల్లా అయిపోతు న్నాం రా. దేశాటనం చేస్తే జ్ఞానం వృద్ధి అవుతుందంటారు. మనం ఓమాటు దేశ సంచారానికి బయటదేరాలిరా.'

“నాకూ అదే అనిపిస్తోందిరా" అన్నాడు చంద్రరావు.

"ఏడిశావు. నాకు అనిపించినప్పుడే నీకూ అనిపించిందేం"

“నిజం. ఇవాళే ఓ ప్రకటన చదువుతూ వుంటే అనిపించింది."

"ఏమిట్రా ఆ ప్రకటన ?''

"ఇదిగో వినండి...''మంచిసమయము, మించిన దొరకదు. త్వరపడుడు, త్వరపడుడు. కన్యాకుమారి నించి బదరీ నాథము వరకూ పుణ్యక్షేత్రముల దర్శించి తరించండి. చవక, అతిచనక కన్నుల పండువైన సుందరదృశ్యాలు. పుష్టికరమైన భోజనాలు, రాఘవరావుగారి సంపూర్ణ యాత్రా స్పెషల్. కడుపులో చల్ల కదలకుండా ప్రయాణం చెయ్యండి. పుణ్య మార్జించుకోండి. చవక, అతి చవక. మడిగా ప్రయాణం చెయ్యదలచిన వారికి ప్రత్యేక సౌకర్యాలు. త్వరపడుడు. రాఘవరావుగారి సంపూర్ణ యాత్రాస్పెషల్. కొద్ది టిక్కట్లే మిగిలాయి."

ఇది చదివినప్పుడే నాకూ ఆ బుద్ధిపుట్టింది. మనం కూడా బయలుదేరితే సరి." అన్నాడు చంద్రరావు.

*సశేషం*
꧁☆•

*నిత్యానందం -6*


*నిత్యానందం గారి సాంసారిక విజయాలు - 4*


ఇది చదివినప్పుడే నాకూ ఆ బుద్ధి పుట్టింది. మనం కూడా బయలుదేరితే సరి." అన్నాడు చంద్రరావు.


"ప్రకటల్ని చూసి మోసపోకూడదు" అన్నాడు సుభాష్ చంద్రబోసు. ఓ సంవత్సరం క్రితం పదిరూపాయలు పెట్టి వాడో రిస్టు వాచీ కొన్నాడు, కొండ మీద నించి ఎత్తేసినా, సముద్రంలో ముంచేసినా అది పాడవదనీ, ఆగదనీ పేపర్లో గ్యారంటీ చూసి! బ్రహ్మాండ మైన వాచీ చవగ్గా వచ్చేస్తోందని మురిసిపోయి కొనేశాడు, వద్దని మేం హెచ్చరిస్తున్నా వినకుండా కొనేశాడు. అది పన్నెండు గంటలన్నా తిరక్కుండా ఆగిపోయింది. కొండమీద నించి ఎత్తేసినప్పుడు ఆగిపోతేనే మేము బాగుచేస్తాం కాని ఇంట్లో కూర్చుని చేతికి పెట్టుకున్నప్పుడు తిరగడం మానేస్తే బాగుచేస్తామన్న గ్యారంటీ లేదంటుంది 

కంపెనీ, వీడింకా కంపెనీకి ఉత్తరాలు వ్రాస్తూనే వున్నాడు - వాళ్లు జవాబులు వ్రాయడం మానుకున్నా !


"భయపడకురా. అందరూ నీలాగే పప్పులో కాలేస్తామనుకున్నావురా! వివరాలన్నీ తెలుసుకునే డిసైడ్ చేస్తాం. ఏమయినా

గోల్డెన్ ఆపర్చునిటీలా వుంది. వదులుకో కూడదు.'' అన్నాడు చంద్రరావు.


"పధ్నాలుగు కారట్ల గోల్డెన్ అపర్చూనిటీ" అన్నాడు రంగాచారి.


"కారక్టర్లు కాదురా, కారట్లు" అన్నాను.


“ఏడిశావు. మహ తెలిసినవాడిలా మాట్టాడకు. కారట్ అంటే ఇంగ్లీషు కూర. పచ్చిది కూడా తినచ్చు. అదెందుకు ఉంటుంది" అన్నాడు రంగాచారి. వాడికి వాదించడమంటే చాలా ఇష్టం. ప్రతిదానికీ ఎడ్డెమంటే తెడ్డెమంటాడు. పెడర్థాలు తీస్తాడు.


కారట్లు బంగారంలో కాదు. పులుసులో వుండొచ్చును" అన్నాడు.


“కారక్టర్ మనుష్యులకుంటుందిగాని, బంగారానికి కారక్టరేమిటి ?"


"కల్తీ బంగారానికి కారక్టర్ తక్కువన్న మాట"


"నాన్సెన్సు బంగారానికి వుండేది కారటే"


"గోన్ సంచి. బంగారానికి వుండేది కారక్టరే''


"కాదు"


"అవును"


"కా... దు"


"అ...వు... ను!"


"ఛాలెంజి. మా ఆవిడని అడుగుదామా”


"మీ ఆవిడ అధారిటీ నీమీద గాని నాకేమిట్రా, ఛాలెంజి పిలు చూద్దాం'' అన్నాడు రంగాచారి.


"వొద్దు బాబో వొద్దు. ఆవిడతో వాదించి గెలవడానికి నీ ముత్తాతలు దిగి రావాలి. అసలు ఆడంగులకి ఇందులో ప్రమేయం లేదు.'' అన్నాడు సుభాష్ చంద్రబోసు.


"నేతాజీ పేరెట్టుకునిగూడా ఆడంగులంటే డంగెత్తిపోతాడేం వీడు" అన్నాడు రంగాచారి.


''సుబ్బాయమ్మగారి కొంగు పట్టుకుని వాదనలోదిగే నిత్యానందం శిఖండిని ముందెట్టుకు కదనరంగంలో ఉరికిన భీష్మాచార్యుడు! వాడిని జయించడం ఎవరికి తరంగాదు. వెనక్కితగ్గు" అన్నాడు చంద్రరావు.


"శిఖండిని ముందెట్టుకున్నది భీష్మాచార్యులురా ! ఆయన్ని చంపడానికి అర్జునుడు శిఖండిని ముందెట్టుకున్నాడు'' అన్నాడు. మస్తాన్ సాయిబు.


"అందుకే కలికాలం. సాయిబుకి తెలిసిన పాటి పురాణాలు మనకి తెలియకుండా పోయాయి" అన్నాడు సుభాష్ చంద్రబోసు.


"నీ పురాణజ్ఞానం ఏడిసినట్టుంటే. నీ ఉపమానం అఘోరించినట్టుంది. సుబ్బాయమ్మగారిని శిఖండితో పోల్చిన వైనం అవిడగారి చెవినిబడితే మనకి ఉద్వాసనం" అన్నాడు మస్తాన్. 


సాయిబైనా, ఫస్టు మార్కులు తెలుగులో ఎప్పుడూ వాడివే!


“నోరుమూసుకోండిరా. మా ఆవిడ సంగతెత్తకండి" అన్నాను.


"అదే నేనూ ఇస్తున్న సలహా" అన్నాడు మస్తాన్.


"సాయిబు సలహాలు బోడిసలహాలు. మరోలా వుండడానికి వీలులేదు" అన్నాడు రంగాచారి.


"పంగనామం పెట్టే సలహాలు ఆచార్లవి" అన్నాడు మస్తాన్.


"గుండులేని సాయిబువి నువ్వూ, నామం లేని ఆచార్లు వాడూ ఇద్దరూ కూడా ట్రేడ్ మార్కు లేని మనుష్యులు. ఆ మార్కు లేని వస్తువులకి విలువలేదు. మీ సలహాలకీ విలువలేదు!" అన్నాడు చంద్రరావు.


"పంచపాండవులంటే నేనెరగనా. మంచం కోళ్ళలా ముగ్గురే కాదా అనేవాడివి నీకు వేరే ట్రేడుమార్కు అక్కర్లేదు. మైలు దూరం కంపుకొట్టే కల్తీ నెయ్యిలాటిది నీ సలహా! దానికి దూరం నించే నమస్కారబాణం విసిరెయ్యాలి" అన్నాడు రంగాచారి.


"అదే విధంగా సుబ్బాయమ్మగారికీ దూరం నించే ఒక నమస్కారం చేసి ఊరుకుంటేనే బతికిపోతాం" అన్నాడు సుభాష్.


"విశ్వాసఘాతకుల్లారా ! తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే మనుష్యుల్లారా, మా ఇంటి అరుగుమీద కూర్చునే మా ఆవిడని మాటలంటుంటారురా" అన్నాను. కోపమొచ్చిందేమో, కొంచెం గట్టిగా అరిచినట్టున్నాను.


"ఏమండి. ఓ మాటిలారండి" అని లోపల నించి మా ఆవిడ కేక వినిపించింది.


"శ్రీమద్రమారమణ గోవిందో హరి" అన్నాడు ఆచారి.


తినవలసిన చీవాట్లేమిటో కిక్కురుమన కుండా త్వరగా తినేసి వచ్చెయ్యి" అని సలహా ఇచ్చాడు సుభాష్.


"అవునవును. మాటకి మాట తెగులు, నీటికి నాచు తెగులు" అన్నారు. జవాబు చెబితే మొహం మరికొంచెం వాస్తుంది. ఈ చెవి లోంచి విని, ఆ చెవిలోంచి వదిలేసి త్వరగా వచ్చెయ్యి" అన్నాడు చంద్రరావు.


"ఆరునెల్లయి కాపరం చేస్తున్నాడు. వాడికన్నీ తెలుసులెండిరా వెళ్ళిరా నాయనా, వెళ్ళిరా" అన్నాడు మస్తాన్.


"గప్ చిప్. అందరూ షటప్" అన్నాను.


"అర్జెంటుగా రండి" అని మళ్ళీ మా ఆవిడ లోపలి నుండి కేక.


భయంలేదని ఎంత ధైర్యం చెప్పుకున్నా గుండెలు గుభీ గుభీ మని కొట్టుకోడం ప్రారంభించాయి. మా మాటలు విని పిలిస్తే సముదాయించడం కష్టమే. అల్లరిమూకను ఇంట్లో చేర్చొద్దని ఎప్పుడూ నాకు బుద్ధి చెబుతూనే వుంటుంది. నోరు దగ్గిర పెట్టుకుని మాట్లాడండిరా అంటే వాళ్ళకి బుద్దిలేదు. మధ్య నాకు ప్రాణసంకటం. పెద్దపులిలా బయలుదేర్దామనుకున్నాను, కాని పిల్లి పిల్లలా అడుగులు పడ్డాయి...

😆

*సశేషం*

꧁☆•┉

*నిత్యానందం -7*

🤥



*నిత్యానందంగారి విజ్ఞాన యాత్ర -2*


“పాతాళించిన శనగలున్నాయి తినండి” అంది మా ఆవిడ.


“శనగలు తినడానికా పిలిచావు”.


“ఏం ? మీకిష్టమేగా”


అమ్మయ్య ! ప్రాణం కుదటబడింది.


“ఇష్టమే, వాళ్ళందరూ వుండగా...”


“మరేం పరవాలేదు. తినేసి నీళ్ళు తాగెయ్యండి”


మా వాళ్ళందరూ డింకీ తినేశారు. మా ఆవిడ చీవాట్లు పెడుతుందనుకున్నారు, పాతాళించిన శనగలు పెట్టింది. శ్రావణ మంగళవారంనాడు పేరంటానికెళ్ళి తీసుకొచ్చిన శనగలు. చాలా రుచిగా వున్నాయి. గబగబ బొక్కెయ్యడం ప్రారంభించాను. "శనగలు నమలకుండా మింగెయ్యకండి. రాత్రంతా కడుపునెప్పితో బాధపడాలి. అవతల ముంచుకొచ్చిన పనేంలేదు. సావకాశంగా కూర్చొని నమిలితినండి." అంది.


కసిరినట్టు మాట్లాడుతుందిగాని మా ఆవిడకి నేనంటే చాలా ఇష్టమే నాకు కడుపునెప్పి రాకుండా చాలా సలహాలిస్తూ వుంటుంది.

📖


“వాళ్ళందరూ...”


“ఉంటే వున్నారు... అందరూ కలిసి చేసే పని గుడ్డిగుర్రానికి పళ్ళు తోమటమేగా."


"నో' నో... పనిలేని మంగలి చేస్తాం."


"క్షవరం ప్రారంభించారా పిల్లిని వెతికి పట్టుకోడంలోనే వున్నారా ఇంకా."


మా ఆవిడకి ఏదైనా చెబితే ఇట్టే అర్థమై పోతుంది. సరదాగా వున్నప్పుడు జోకుచేస్తే జవాబుతో జోకూ చేస్తుంది. మాటలు పెట్టుకు కూర్చుంటే అవతల మా వాళ్ళు తిట్టుకుంటారని జవాబు చెప్పకుండా త్వరత్వరగా తినేసి, మంచినీళ్ళు తాగి త్రేన్చేశాను.


"బాతాఖానీ త్వరగా తెమిల్చేసి ఇంట్లో పడండి" అంది మా ఆవిడ.


"మాది బాతాఖానీ కాదు. పూర్ణయాత్రా స్పెషల్లో దేశ సంచారానికి బైలుదేరుదా మని ప్లానులు వేస్తున్నాం."


"ఆ అల్లరిమూకతోటా?"


"తూముకట్టు మీద కూర్చుని బాతాఖానీ కొట్టినప్పుడు అల్లరి మూకగాని యాత్రా స్పెషల్లో ప్రయాణం చేసేటప్పుడు గొప్ప భక్తులుగా మారిపోతాం."


"మీరు వాళ్ళతో ఒక్కరూ వెళ్ళడానికి వీల్లేదు. నేనూ వస్తాను."


"నువ్వు కూడానా?"


"అవును"


"నువ్వెందుకు ?"


"మీరెందుకు ?"


"మొగాళ్ళందరమూ!"


"ఆ రైల్లో ఆడవాళ్ళుండరా ఏమిటి?"


"మా అల్లరిమూకతో.."


"అల్లరిమూకగాదు, గొప్ప భక్తులని మీరే అన్నారుగా.."


అన్నా, నామాట మీదే పట్టేసుకుందే. ఇహ వాదించి లాభంలేదు.


"అలాగేలే. మేం వెళ్ళితే నువ్యూ వద్దువు గాని" అని స్నేహితుల్ని చేరుకున్నాను.


"వొరేయ్, తల తడవనీ- ఎన్ని బొప్పెలు కట్టాయో" అన్నాడు రంగాచారి.


"ఆవిడింకా చెయ్యిచేసుకోడం దాకా రాలేదురా. కేకలేస్తుంది. బాగా చీవాట్లు తినిపిస్తుంది. మొహం ఎంత వాచిందో చూద్దాం" అన్నాడు మస్తాన్.


"నోరు ముయ్యండిరా. మనం తీర్థయాత్రల కి వెళితే తను కూడా వస్తానని చెప్పడానికి పిలిచింది. అంతే" అన్నాను. బాగుండదని పాతాళించిన శనగల సంగతి చెప్పలేదు.


"ఆడవాళ్ళతో ప్రయాణం పడదు" అన్నాడు సుభాష్.


పూర్ణయాత్రా స్పెషల్ నూటికి డెభ్బయి పైగా ఆడవాళ్ళుంటారు. అదీ ఒక ఎట్రాక్షన్" అన్నాడు చంద్రరావు.


"దాంట్లో ముప్పాతికమంది విధవలై వుంటారు. మడిగా భోజనాలున్నాయన్నా వు. బోడీ ఎట్రాక్షన్ జోరుగా వుంటుందన్న మాట. పుణ్యంలో మరో పుణ్యం. లేవగానే గుళ్ళ దర్శనం. శ్రీ మద్రమా రమణగోవిందో హరి!” అన్నాడు రంగాచారి.


"మా ఇంట్లో అరుగుమీద కూర్చున్నప్పుడు పోకీరీ మాటలు మాట్లాడకండి" అని కసిరాను.


"తీర్థయాత్ర ప్లాను నాకేం నచ్చలేదు. మనమేం పాపాలు చేశామా?” అన్నాడు సుభాష్.


“పాపాలు చేసిన తరవాతనే పుణ్యమార్జిం చాలని లేదురా. బ్యాంక్ లో డబ్బు నిలవ చేసుకున్నట్టు ముందుగానే పుణ్యమార్జిం చుకుని చిత్రగుప్తుడి దగ్గిర దాచుకోవచ్చు ను" అన్నాడు రంగాచారి. 


"పుణ్యం మాట దేవుడెరుగును. దేశం తిరుగుతే జ్ఞానం పెరుగుతుంది" అన్నాను.


"అయితే తిన్నగా విజ్ఞానయాత్రకే బయలు దేరక డొంకతిరుగుడుగా తీర్థయాత్రల కెందుకు ?" అన్నాడు సుభాష్.


"ఒక్క రాయితో రెండు పిట్టల్ని కొట్టడానికి."


"రంగాచారి తీర్థయాత్రా స్పెషల్లో పిట్టల వేటంటే, ఆ రాయి తిరిగొచ్చి మనకే తగిలి, పళ్ళూడవచ్చు" అన్నాడు సుభాష్.


"ఈ మాటలు మా ఆవిడ వింటే ఇప్పుడే ఊడతాయి మీకు పళ్ళు"


"యాత్రలంటే నేను రాలేను" అన్నాడు మస్తాన్.


"నిజమేరోయ్. పూర్ణయాత్రా స్పెషల్ సాయిబుల్ని రానిస్తారో లేదో" అన్నాను.


“మస్తాన్ గాడు సాయబేమిటి? బొట్టు పెడితే బ్రాహ్మడే!" అన్నాడు చంద్రరావు.


"అవునవును."


"బొట్టు కట్టు గూర్చి పట్టింపు లెక్కువై

శైవ వైష్ణవులకు సమరమైయ్యే

ఒకడు సున్నియయ్యె 

నొకడు షియాయయ్యె

విశ్వదాభిరామ వినుర వేమ !


అన్నారు కృష్ణ శాస్త్రిగారు.వీడు అలా సాయిబయిన బ్రాహ్మడే !" అన్నాడు రంగాచారి.


"వాడికి పులిహారంటే చాలా ఇష్టం. వైష్ణవం లోంచి జారినవాడే అనుకుంటాను" అన్నాడు సుభాష్.


"సందేహంలేదు. అడియేన్ దాసోహం. మస్తానాచార్లుగారు'' అన్నాడు చంద్రరావు.


"తీర్థయాత్రకంటే నేను రాను."


"మక్కా మదీనా, నీతో మేమూ వస్తాంరా. పులి వేషాల వెంట పీర్ల పంజాలకి మేమూ వొచ్చేవాళ్ళంగా"


“విజ్ఞానయాత్రకయితే నేనొస్తాగాని, తీర్థ యాత్రకయితే నేను రాను. "


"మాకూ యాత్రలక్కర్లేదు. విజ్ఞాన యాత్రకే బయలుదేరుదాం. టిక్కట్లేమున్నాయో కనుక్కుందాము."

😎

*సశేషం*


*నిత్యానందం -8*

🤥


రచన: సోమంచి యజ్ఞన్నశాస్త్రి


*నిత్యానందంగారి విజ్ఞాన యాత్ర*


“మాకూ యాత్రలక్కర్లేదు. విజ్ఞాన యాత్రకే బయలుదేరుతాం. బైరాగి టిక్కట్లేమున్నా యో కనుక్కుందాము."


"మొదట ఏఏ ఊళ్ళు వెళ్ళాలో లిస్టు తయారుచెయ్యాలి. తరవాత టిక్కట్ల కోసం వాకబు చెయ్యవచ్చును"


"దొరికే టిక్కట్టునిబట్టి టిక్కట్టు కొనాలా, వెళ్ళే ఊళ్ళని బట్టి టిక్కట్టు కొనాలా" అన్నాను.


"చెట్టుముందా, విత్తు ముందాలాటి ప్రశ్న వేశావురా" అన్నాడు రంగాచారి.


"అదిగాదు. ఇదీ కాదు. డబ్బుని బట్టి ప్రోగ్రాము. మనం ఎంత ఖర్చుపెట్టగలమో ముందు తేల్చుకోవాలి." అన్నాడు సుభాష్. వాడు నయా పైసలు లెక్క పెట్టకుండా దేన్లోకి దిగడు.


"వీడు తీతువుపిట్టలా ఎప్పుడూ డబ్బు సంగతే ఎత్తుతాడు. వెధవడబ్బు. ఏ మంచి పని చెయ్యాలన్నా అడ్డు తగిలిస్తాడు" అన్నాడు చంద్రరావు.


"ఏం చేస్తాం. కలికాలం. టిక్కట్టు చూపిస్తేనే గాని రైలెక్కనివ్వరు. ఎంత బడ్జట్టో చెప్పండి."


"నువ్వే చెప్పు"


"పదిహేను రూపాయలు."


"ముష్టి పదిహేను రూపాయలా!"


"నా దగ్గిర దాచుకున్న డబ్బు అంతే వుంది. ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాలంటే మీరెవరన్నా మదువు పెడితే, మెల్లిగా తీర్చుకుంటాను."


"మదుపు పెట్టడానికి ఎవరిదగ్గిరా డబ్బు పాతర్లేదు".


"అయితే పదిహేను రూపాయల బడ్జెట్లోనే టూర్ తయారు చెయ్యాలి".


"పదిహేను రూపాయలలో మన ఊళ్ళో బయలుదేరితే విజయవాడో, గుంటూరో వెళ్ళిరావచ్చును. విజ్ఞానానికి, వినోదానికి ఊళ్ళో సినిమా చూసి వచ్చెయ్యాలి" అన్నాడు రంగాచారి.


"ఏడిశావు నీకేం తెలుసురా. ఆంధ్రదేశపు పూర్వపుఔన్నత్యం? విజయవాడ గుంటూరుల మధ్య ఎన్ని గొప్ప ప్రదేశాలు కాలగర్భంలో కలిసిపోయాయో, తెలుగు తల్లి వ్యాసాలు చదివితే తెలిసుండును అన్నాడు సుభాష్.


"అయితే చెప్పుకూడదూ"


"అమరావతి వెళదాము."


"ఏముంది అమరావతిలో?"


"అమరావతిలోనా ? అమరావతిలో చాలా గొప్ప ... గొప్ప విషయాలున్నాయి."

"ఏమిటా గొప్ప విషయాలు ?"

"వివరాలు నాకు జ్ఞాపకం లేవుగాని చాలా గొప్ప విషయాలున్నాయి"

"ఇదివరకు ప్రకటన చూసి వాచీ కొన్నావు. ఇప్పుడు తెలుగుతల్లి వ్యాసం చదివి అమరావతి రమ్మంటావు. నిన్ను నమ్ముకుని బయలుదేరితే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే!"

"నిన్ను నమ్ముకుంటే ఇంకా అనర్ధం,"

"ఏమిటో ఆ అనర్థం."

"చెబితే ఏడిచిపోతావు,"

"ఏడవను"

"ఏడుస్తావు"

"ఏడవనంటే"

"ఏడుస్తావంటే"

"ఏడిస్తే ఏడిచాను? చెప్పు చూద్దాం".


"చెప్పనా?"


“చెప్పు”


"చెప్పెయ్యనా?"


"చెప్పేసెయ్యి."


"నోరుమూసుకోండిరా. రామాయణంలో ఈ పిడకల వేటేమిట్రా" అన్నాను.


"పిడకల వేట కాదు. పిచికలవేట" అన్నాడు రంగాచారి.


"వొరే నీకన్నీ తెలిసినట్టు మాట్లాడి ప్రతి దానికీ వాదం పెంచకు. ఇప్పుడు మన ప్రయాణం సంగతి తేల్చనీ..." 


"అమరావతే వెళదాము."


"మన తెలుగుతల్లి మళ్ళీ చదివి ఇంకా దగ్గిర్లో పదిహేను రూపాయల ఖర్చులో తేలిపోయే గొప్పగొప్ప ఊళ్ళున్నాయేమో తనిఖీచేసి మరీ నిర్ణయానికొద్దాం".


"అవసరంలేదు. అమరావతి దగ్గిరగా వుంది. ఖండాంతరాలకీ వ్యాపించిన కీర్తి గల మరో ఊరు ఆంధ్రదేశంలో లేనేలేదు."


"సరే అక్కడ ఏమివున్నాయో, ఏమేమి చూడాలో లిస్టు తయారుచెయ్యి మొదట" అన్నాడు రంగాచారి.


"మంచి భోజనం అదీ ఎక్కడదొరుకుతుందో ముందర వాకబు చెయ్యి" అన్నాడు చంద్రరావు. వాడికి ఎప్పుడు చూసినా తిండి గోలే.


"మరేం భయంలేదు. అన్నాడు సుభాష్. పూటకూళ్ళమ్మలు వుండకపోరు"


"వూటకూళ్ళమ్మలా? ఇంకా నయం. పేదరాసి పెద్దమ్మలు ఉంటారన్నావుగాదు. పెద్దమ్మా ఈ ఊళ్ళో వింతలేమిటి అని అడుక్కుంటూ తిరుగుదామనుకుంటున్నా వా" అన్నాడు రంగాచారి.


"అదేం పనికిరాదు, విజ్ఞానయాత్ర చాలా organised గా చెయ్యాలి" అన్నాను.


వివరాలన్నీ తయారుచేసి బైలుదేరాలన్న నా ప్రతిపాదన అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు.


"మనం ప్రతియేడూ ఓ విజ్ఞానయాత్రకి వెళ్ళాలి".


"ఆలూ లేదు, చూలూలేదు. కొడుకు పేరు సోమలింగం! ముందు ఒకటి కానీ, తర్వాత ప్రతియేడు సంగతి ఆలోచిద్దాం!" మరికొంత తర్జనభర్జన తర్వాత ఈ ఏటి యాత్ర అమరావతికని నిర్ణయానికొచ్చేశాం. ప్రయాణానికి వారం వర్జం చూసి మంచి ముహూర్తం పెట్టించాలని కూడా అందరం నిశ్చయించేశాము. మా ఆవిడ కూడా వస్తానని పట్టుపడుతుందని భయపడ్డాను గాని, ఆవిడ అమరావతి ఇదివరకే చాలా మాట్లు చూశాననీ, రాళ్ళూ రప్పలూ తప్ప అక్కడేమీ లేవనీ మాతో రానంది. బతుకు జీవుడా అనుకున్నాను మనస్సులోనే అనుకోండి. 


ఆదివారం పొద్దున్న ఏడుగంటల బండికి ప్రయాణం నిశ్చయం చేసుకున్నాం. ఆరు గంటల నుంచే వర్జం కనుక, అయిదున్నర కల్లా ఇంటిదగ్గర్నించి బయలుదేరి ఆరు గంటల లోపల స్టేషనుకి చేరుకోమన్నారు పంచాంగం శాస్తుర్లుగారు. వర్జం గిర్జం నాకు లేదు. నేను ఆరున్నరకిగాని రానని మస్తాన్ గాడు తగాదా పెట్టినా “ఒరే మనమందరం కలిసికట్టుగా వెళ్లాలి. గంగలో ఉరికినా చెట్టాపట్టాలేసుకొనే వురకాలి. మా అందరి కీ వర్జముంటే, నువ్వు సాయబువయినా, నీకు వర్జముందనే ఒప్పుకోవాలి." అని వాడికి నచ్చచెప్పి ఒప్పించేసరికి మా తాతలు దిగొచ్చారు.

😆

*సశేషం*


꧁☆•┉┅━

*నిత్యానందం -9*

🤥


రచన: సోమంచి యజ్ఞన్నశాస్త్రి


*నిత్యానందంగారి విలాస యాత్ర*


"ఏమండి, మీరూ, మీ స్నేహితులూ కలిసి విజ్ఞానయాత్రకి వెళ్ళే యోగం మీకెలానూ లేదు. నా స్నేహితురాలు బొంబాయి వెళు తోంది. దాని వెంట బహుశా దాని మొగుడూ వెళుతున్నాడు. మనమూ వెళితే బాగుంటుందనుకుంటున్నాను. వస్తారా" అంది ఓనాడు అకస్మాత్తుగా మా ఆవిడ.


"నాతో చెప్పకుండా మనం వెళదామని నువ్వు అనుకోడం ఏమిటి?" అన్నాను. 


అప్పుడప్పుడు అలా నిలవదీసి అడుగు తూంటూనే గాని పెళ్ళాలు మరీ పేట్రేగిపోతారు.


"ఇప్పుడు చేస్తున్న పనేమిటి? మీతో చెబుతున్నానుగా" అంది.


"ముందే చెప్పవలసింది”.


"దేనికి ముందే ?”


"నీ స్నేహితురాలితో కలిసి వెళదామని నువ్వు అనుకోడానికి ముందే."


"నా స్నేహితురాలితో వెళదామని అనుకున్నాను అన్నాను. వెళితే బాగుంటుందని అనుకున్నానన్నాను. ఒకటే పరధ్యానం చెప్పిన మాటలన్నా తిన్నగా విని అర్ధంచేసుకోరు." అంది కించిత్తు విసుగూ, కించిత్తు కోపమూ గొంతుకలో స్ఫురింపజేస్తూ. మా ఆవిడ స్వరాన్నిబట్టి ఇట్టే మనసు కనిపెట్టెయ్య గల శక్తిసామర్థ్యాలు సంపాదించుకున్నానే మో, "ఓహో కొంచెం కారం పాలెక్కువగా వుంది మాటల ధోరణిలో, మన ఒకటంటే తను రెండనే స్థితికి దిగిపోయే ప్రమాదం లేకపోలేదు. నిలవేసి అధారిటీ చెలాయించ డానికి ఇది సమయం కాదు అని క్షణంలో నిశ్చయానికొచ్చేసి "ఇంతకీ ఎవరా స్నేహితురాలు? బొంబాయి ప్రయాణంలో ఆవిడ దృష్టి ఏమిటి ? ధ్యేయం ఏమిటి?" అన్నాను.


"వస్తారా రారా, ముందర ఆ సంగత తేల్చండి" అంది.


"నీ స్నేహితురాలెవరో తెలీకుండా ఆవిడ వెంటపడిపోవాలంటే..." 


"ఆవిడ వెంటపడి పొమ్మనలేదు. నా వెంట రమ్మంటున్నాను."


"నీ వెంట రావడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. కాని..."


"కానీ లేదు, అర్ధణా లేదు."


"నయా పైసలన్నా వున్నాయిగా."


"పైసలతో అయ్యే కార్యం కాదు. రూపాయలు కావాలి."


నా జోకు విని ఆనందించడానికి సుముఖురాలు కాలేదు మా ఆవిడ.


"బొంబాయి ప్రయాణం మనకో విలాస యాత్ర. దానికి చిలకా గోరింకల్లాగ మనిద్దరం కాక, వెనక తీతువు పిట్టల్లాగ ఎవరో స్నేహితురాలు, దాని మొగుడు ఏమిటి కూడా ? మనమే సమయం చూసి ఎప్పుడో చల్లగా జారిపోదాం." అని ప్లేటు మార్చాను.


"ఆ. మిమ్మల్ని నమ్ముకుంటే ఈవూరు దాటామే. ఇంతకీ దూరప్రయాణానికి తోడుంటం మంచిది. నీళ్ళు నమలక ప్రయాణానికి ఒప్పించి, మీ నాన్నని అడిగి సొమ్ము పట్టుకురండి వెంటనే టిక్కట్లు కొనెయ్యాలిట" అంది.


ఏమన్నా సబవుగావుంది. మేం బొంబాయి వెళ్ళాలని తను నిర్ణయం చేసింది. సొమ్ము మాత్రం నేను పట్టుకురావాలిట. అందులో మానాన్నని అడిగి! మూడ్ లో లేకపోయిన ప్పుడు మా ఆవిడతో మాట్లాడం ఎంత కష్టమో, మానాన్నతో మాట్లాడం అంతకి రెట్టింపు కష్టం. ఆయన ఎప్పుడూ మూడ్ లో వుండడు. ముఖ్యంగా డబ్బు ఖర్చు చెయ్యవలసొచ్చినప్పుడు! చివరికి ఏ సినిమాకి వెళ్ళడానికి లాటి చిన్న సరదా కైనా సరే డబ్బు అడిగితే “చిల్లిగవ్వంత ఆర్జనలేదు. పెళ్ళాంతో కులకడానికి మాత్రం ఎప్పుడూ సిద్ధం" అని లెక్చరిస్తాడు. వొరే అర్ధంకాక అడుగుతాను. కులకడానికి కాకపోతే నసపెట్టి కోసుకు తినడానికటరా పెళ్ళాం! ఈ పెద్ద వాళ్ళతో ఇదో బ్రహ్మాండ మైన తంటా! ముద్దూ ముచ్చటా తీరడం లేదని పెళ్ళిచేసుకునేదాకా పోరతారు. తీరా పెళ్ళి చేసుకుని, ముద్దుముద్దుగా ముచ్చటలు తీర్చుకుందామంటే, మరీ పోరు పెట్టేస్తారు.


"నీ స్నేహితురాలి పేరైనా చెప్పకుండా, నీ వెంట బొంబాయి రమ్మని కట్టడి చేసేదానివి ప్రయాణం సొమ్ము కూడా నువ్వే ఎలాగో

సంపాదించు" అన్నాను.


"మీకు చేతకాదని కాళ్లు బారజాపితే అంతే చెయ్యవలసొస్తుంది, అయినా కాస్త మొగతనం చూపించండి."


మాట ధాటీగానే వున్నా, మనిషి మెత్తనయినట్టు గొంతుకలో కనిపించగా 

“నిన్ను బొంబాయి ప్రయాణం కట్టిస్తున్న ఆ స్నేహితురాలి పేరేదో ముందర చెప్పు. అది బైలు పెట్టడానికి పూర్వం పెళ్ళిళ్ళల్లో తలుపుల దగ్గిర మొగుడి పేరు చెప్పడానికి పెళ్ళికూతురు చేసినంత బెట్టూ చేస్తున్నావు" అన్నాను.


సరసాలకి కావలసినంత సమయముంది. సొమ్ము వసూలుచెయ్యడానికి నడుం బిగించండి అని అస్త్ర సన్యాసం చేసిన అర్జునుడి మీద శ్రీకృష్ణుడు విరుచుకు పడ్డట్టు నన్ను బొంబాయి ప్రయాణానికి తొందరపెట్టేసింది.


నాయనమ్మే కనక బతికివుంటేనా అరగంట లో అవసరమయిన డబ్బంతా ఇప్పించేసి వుండేది.


"కుర్ర నాగమ్మ సరదా పడుతున్నాడు. డబ్బిచ్చి పంపించరా" అనేది.


"ఏడిశాడు. వాడు బొంబాయి వెళ్ళకపోతే ముంచుకు పోయిందేమీలేదు. నే చూశాను కనకనా ఆ వూరు, వాణ్ణి పంపించడానికి" అని యధాప్రకారం కసిరేసి వుండేవాడు నాన్న.


"వాడి డబ్బు వాడి కివ్వడానికి ఇదయి పోతావేమిటి" అనేది.


"వాడి డబ్బేమిటి ?"


"మరి కట్నం తీసుకోలేదురా వాడి పెళ్ళికి? అది వాడి పేరని ఏ బాంకులోనో వెయ్య వలసింది. సొంతానికి వాడేసుకుంటున్నా వు. కొంత సొమ్ము వాడికి విదుల్చు" అనేది. దాంతో నాన్న చిత్తయిపోయి, “పోరా, తీసుకుపోరా” అని నామీద నోట్లు గిరువాటు పెట్టేసేవాడు. నేనే సొంతంగా ఆడుక్కోవలసి వచ్చేసరికి ఎంతో ఘర్షణ. మా ఆవిడ కంఠం ఎత్తి, ఓ మాటు కాస్త దబాయించి, అది ఫలించకపోతే, శుక్రవారం పూట సావిట్లో గడపమీద కూర్చుని బెక్కులు బెక్కడం ప్రారంభిస్తేనే గాని సొమ్మురాలలేదు. శుక్రవారం పూట ఇంట్లో గడప మీద కూర్చుని కన్నీళ్ళు కారిస్తే, మా అమ్మకే కాదు మా నాన్నకి కూడా భలే గాభరా. ఇంకే పాచికా పారక పోతే, మా ఆవిడ ఆ నారాయణాస్త్రం ప్రయోగించి నెగ్గుకొచ్చేస్తూ వుంటుంది. ఆవిడ ద్వారా మనం గెలుచుకొచ్చేస్తాం. కనక మరే ఆటంకాలూ లేకుండా ఛలో బొంబాయి!


కందిగుండ, అవకాయి, గోంగూరపచ్చడి నిమ్మకారం, వెన్న కాచిన నెయ్యి జంతికలు వగైరా ఇష్ట భోజన పదార్ధాల డబ్బీలతో కూడిన ఒక పెద్ద బుట్టతో సహా. ఆ బుట్ట ఏ సీటు కిందకీ దూరక మమ్మల్ని కొంత అల్లరి పెట్టిన మాట నిజమే. కిష్టయ్యగారు, అంటే మాతో వచ్చే మా ఆవిడ స్నేహితురాలి మొగుడు "ఎందుకండీ ఇవన్నీ. బొంబాయి లో ఎక్కడ పడితే అక్కడ మంచి భోజనం దొరుకుతుందిట. ఎన్నో దక్షిణాది హోటళ్ళు న్నాయిట.” అన్నాడు. సాంబారు మెతుకు లతో తృప్తిపడే వాళ్ళకి దక్షిణాది హోటళ్ళు న్నాయని సంతోషంగాని పచ్చడి కలిపితేనే గాని భోజనం పూర్తికాని మనకేం చాలతా యండి. ఆ హోటలు తిళ్ళు?" అంది మా ఆవిడ. రెండు మూడు ఆధరువులుంటే గాని మా ఆవిడకి తిండి సయించదు.


"తెలుగు వాళ్ళకి ఉన్న లోపమే ఇదండి. రోము నగరానికి వెళ్ళినప్పుడు రోమను పౌరుడిలా వుండాలని ఇంగ్లీషులో సామెత వుంది. దానికి మనం సరిగ్గా విరుద్ధం. తెలుగు వాడు ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాడిలాగే వుంటానంటాడు. అన్నీ ఇంట్లో జరిగి పోవాలనుకుంటాడు. గడుపుకోడం తెలీనే తెలీదు అంచేత మనం ఇలా అణగారిపోతున్నాం." అని లెక్చరు ప్రారంభించాడు.


నాయనా, మా నక్షత్రకుణ్ని వదిలించుకు న్నామనుకుంటే, నీ లెక్చర్లు తలుగుకున్నా యా అనుకున్నాను. మా ఆవిడ ఘాటుగా  జవాబు చెబుతుందనుకున్నానుగాని ఏకళనుందో “మీరివేం తినొద్దు లెండి" అని మాత్రం వూరుకుంది. ఇన్ని శ్రీరంగనీతులు చెప్పాడా నిజానికి తెచ్చిన వూరగాయలూ, పచ్చళ్ళూ, అధికభాగం వాడే ఊదేశాడు.


గంగారత్నం మొగుడయిన కిష్టయ్యనే కాకుండా, ఇద్దరు పిల్లల్ని కూడా వెంట బెట్టుకొచ్చింది. పెద్దాడు మొగ: నాలుగేళ్ళు.

చంటి: ఆడది రెండున్నర ఏళ్ళు. వాళ్ళు అల్లరి చెయ్యడం. కిష్టయ్య వాళ్ళని కేకలెయ్యడం, గంగారత్నం వాళ్ళని నాలుగు ఉతకడం, వాళ్ళు మరీ గంతులెత్తి గగ్గోలు చెయ్యడం, ఆ పైన అందరం కలిసి వాళ్ళని ఓదార్చి సముదాయించడం మా ప్రయాణంలో ఓ ప్రధాన భాగం. ఇలాటి పిల్లలు కనక తనకే పుడితే వాళ్లని పీక పిసికేసి వెంటనే చంపేసి, గిరగిరగిర గిర వాటేస్తానని గంటకోమాటయినా, మా ఆవిడ నా చెవిలో ప్రతిజ్ఞ చేసేది. పోలీసాళ్లు ఈ మాట వింటే ఏం ప్రమాదమో అని నా భయం !


రైలెక్కిన తరవాత నాలుగయిదు స్టేషన్లు సుఖంగా ప్రయా ణం చేశామోలేదో. పెద్ద తంబొచ్చిపడింది మా కారేజీలోకి...

😁

*సశేషం*


꧁☆•┉┅━꧂

*నిత్యానందం - 10*

🤥


రచన: సోమంచి యజ్ఞన్నశాస్త్రి


*నిత్యానందంగారి విలాస యాత్ర*



రైలెక్కిన తరవాత నాలుగయిదు స్టేషన్లు సుఖంగా ప్రయా ణం చేశామోలేదో. పెద్ద తంబొచ్చిపడింది మా కారేజీలోకి...


ఈ బల్ల రిజర్వుడు ఎవరూ దీనిమీదికి రాకూడదని గంగారత్నం గోలెట్టినా ఎవరూ వినిపించుకోకుండా మా మీదకూడా వొచ్చి పడిపోయారు.


"ఏయ్ అమ్మీ అవతలకెళ్ళి కూర్చో" అంది గంగారత్నం.


"మరెక్కడ జాగా లేందే" అంది ఆ అమ్మి.


"లేకపోతే అక్కడే సందు చేసుకునించో”


"మీ రేటి ఈ రైలు కొనేశారేటి ?"


"కొనెయ్యలేదు. రిజర్వుచేయించాము."


"రిజర్వేటి?"


"అంటే ఇక్కడ మేమే కూర్చోవాలని,"


"మిమ్మల్ని కూచోవొద్దన్నానేటి ?"


"పర్వతంలా నువ్వొచ్చి మీద పడుతూ వుంటే మేం ఎలా కూర్చోము."


"మాటలు మిగలక మ్మోయ్"


"ఈ బుకాయింపులు కట్టి పెట్టెయ్యండి" అని మరో ఆయన అందుకున్నాడు. "రిజర్వు చేయించారుట. రిజర్వు.”


"ఎవరిదగ్గిరకోస్తారండీ. ఈ పెట్టెలో రిజర్వేమిటి ?"


"ఏమండీ. జవాబు చెప్పరేం" అంది గంగారత్నం.


పోర్టరుకి నాలుగురూపాయలిచ్చి, తుండుగుడ్డ పరిచి రిజర్వు చేయించు కొచ్చారు కిష్టయ్యగారు. మేం ఎక్కిన స్టేషన్ లోనే దిగపడిపోయాడు ఆ పోర్టరుగాడు. మాకు సాక్ష్యమిచ్చి సమర్ధించేవాడేడి ! కిష్టయ్యగారు కిక్కురుమనలేదు.


“అసింటాకూచోండి." అనబోయింది మా ఆవిడ.


ఆవిడ మాట లక్ష్యంచెయ్యరు. వీళ్ళు ఒట్టి  అలగాజనం. స్వరాజ్యమొచ్చిన తరవాత చిన్నా పెద్ద లక్ష్యంలేకుండాపోయింది. వొళ్లు హూనమయిపోతోంది, మధ్య కయ్యోమని గంగారత్నం పిల్లలగోల. హుషారుగా జంతికలు నములుతూ, పద్యాలు విసురుతూ, మా అవిడ కేసి ఓర చూపులు చూస్తూ విలాసంగా, ప్రయాణం చెయ్యాల నుకుంటే, జంతికలన్నీ కిష్టయ్య పిల్లల్ని ఓదార్చడానికే అయిపోతున్నాయి.


మెడ మా ఆవిడకేసి తిప్పడానికి కూడా వీల్లేకుండా జనం కిక్కిరిసిపోయారు.


కూచునివుండగానే కునుకట్టిపోయింది. ఉలిక్కిపడి లేచాను కొంపదీసి బొంబాయి దాటిపోయిందేమో కిష్టయ్య మహా తెలిసిన వాడిలా వాగుతాడుగాని రిజర్వేషను విషయంలో వాడి బండారం బయటపడి పోయింది. ఇహ వాడిని నమ్మకూడదు. స్వయంగా చూసుకోవాలి.


"బొంబాయి వచ్చేసిందాండి." పక్కవాడిని అడిగాను.


"ఇప్పుడెక్కడ బొంబాయి అయ్యా "


"దాటి వెళ్ళిపోకుండా, నాతో చెప్పండి. నేను నిద్దర పోననుకోండి. ఒకవేళ కునుకు పట్టినా లేపి చెప్పెయ్యండి."


ఈ రైలు బొంబాయిలోనే ఆగిపోతుంది. ముందుకిపోదు".


"అయితేమాత్రం. ప్లాటుఫారమ్ మీదనించి షెడ్డులోకి తీసుకుపోయి, తలుపులు మూసేస్తే, ఉక్కిరిబిక్కిరయి ప్రాణం సంకటం కాదూ."


ఓరి నీ భయం దొంగలు దోలా !


ఎవరెలా వెక్కిరించుకుంటే యేం. గంట గంటకి లేచి బొంబాయి దాటిపోలేదని నిర్ధారణ చేసుకోవడం నా విధి.


"మీరు దాదర్ లో దిగుతారా వి. టి. లోనా" ఎవరో అడిగారు నన్ను. 


''బొంబాయిలో దిగుతామండి"


"అంతా బొంబాయేనండి కాని ఏ స్టేషన్ లో దిగుతారు. దాదరు స్టేషన్ లోనా, వి.టి స్టేషన్ లోనా?"


"బొంచాయి స్టేషన్ లోనే దిగుతాంలెండి."


"బొంబాయి స్టేషనంటూ లేదయ్యా.”


"ఇదేమిటండీ. బొంబాయిలో స్టేషనేలేదా! రైలు ఆగదూ!"


"బొంబాయికి స్టేషను వుందయ్యా, ఒకటి కాదు రెండు. దాదర్, వి.టి అని పేర్లు వాటికి.”


ఏమిటో ఇదంతా గజిబిజిగా వుంది. రాజమండ్రి, ఏలూరు లాటి రెండు స్టేషన్లున్నాయి నాకు తెలుసు. కాని, ఆ ఊరి పేరే ఏ స్టేషనుకీ లేకపోతే ఎలా !


"ఏ స్టేషన్ లో దిగితే దగ్గిరండి !"


"దేనికి దగ్గిర?”


"ఊరు చూడ్డానికి."


"ఊరు చూడ్డానికి ఊళ్ళో ఎక్కడ దిగినా ఒకటేగా !" మహ తెలివిగా చెప్పాననుకు న్నాడు కాబోలు. నవ్వడం ప్రారంభించాడు. సాచి రెండు జెల్లలు కొడితే.. పరాయి ప్రదేశం. తొందరపడకూడదు, అని నేనే తమాయించుకున్నాను. కిష్టయ్య నిటాగ్గా కూర్చునే గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు. వాడు మేలుకుంటే సహాయమని కాదు!


దాదర్ లో దిగాలా, వి.టి.లో దిగాలా అని మేం నిర్ణయించుకోకుండానే దాదర్ స్టేషన్ వచ్చేస్తోందని అందరూ పెట్టి బేడా సర్దుకోడం ప్రారంభించేశారు.


"ఏంచేద్దామండీ కిష్టయ్యగారూ?"


"గాభరాపడకండి. నాకు దూరపుబంధువు ఒక పెద్ద ఆఫీసరున్నాడు ఈ ఊళ్ళో. తిన్నగా వాళ్ళింటికి వెళిపోయి, ఆయన సలహా మీదే తరవాత ఏ పనయినా చేద్దాం."


"ఎక్కడున్నాడు ఆయన. ఇంతకీ ఏ స్టేషన్ లో దిగాలి".


కిష్టయ్య ఆయన ఎడ్రసు కోసం వెతకడం ప్రారంభించాడు. జేబులన్నీ వెతికాడు. కనిపించదు. పెళ్ళానికిచ్చానంటాడు. ఆవిడ అతనికే తిరిగి ఇచ్చేశానంటుంది. రభస. ఏమయినా ఎడ్రసు కాగితం మాత్రం కనిపించదు.


"మద్రాసీవాళ్ళు చాలామంది దాదర్ సమీపంలోనే వున్నారు. అక్కడే దిగుతే వారిని పట్టుకోడం తేలిక. దాదర్ లోనే దిగండి" అని ఎవరో సలహా ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రం వచ్చినా ఇంకా మనని మద్రాసీ వాళ్ళే అంటున్నారని కొంచెం కష్టం తోచినా, స్టేషను వచ్చెయ్యడంవల్ల వాదన పెట్టుకుని లాభంలేదని దిగిపోయాము.


కిష్టయ్యకి ఆ తెలిసిన తెలుగు ఆఫీసరు గారి ఎడ్రసు తెలియదు సరికదా పేరైనా తిన్నగా తెలీదు. ఏవో రెండు మూడు ఎ.బి.సి.డి పొడి అక్షరాలు చెప్పి రావుగారు అంటాడు. ఆ పొడక్షరాలూ కూడా తిన్నగా తెలివుట. “రావుగారని” మాత్రం నిశ్చితం గా తెలుసుట. సవాలక్షరావు గార్లుండే బొంబాయిలో, కిష్టయ్య దూరపుబంధువు రావుగారిని పట్టుకోడం ఎలా. 


ఇంకా తెల్లారలేదు.

😁

*సశేషం*


꧁☆•┉

*నిత్యానందం - 11*

🤥


రచన: సోమంచి యజ్ఞన్నశాస్త్రి


*నిత్యానందంగారి విలాస యాత్ర*



ఇంకా తెల్లారలేదు. స్టేషన్ లో దీపాలు ఆర్పేస్తే కటికచీకటి. సామానుదించిన కూలి వాడు డబ్బిచ్చి పంపించెయ్యమని ఒకటే వొత్తిడి. ఇంత సామానూ టిక్కట్టుమాస్టారు గారు చూస్తే. బోలెడంత ఎక్సెస్ ఛార్జీ కూడా చేసివుండునట. ఆయన కన్నుగప్పిమొత్తం సామాను బయటకి చేర్చాడుట. వాడికూలి డబ్బులే కాక, ఈ సహాయానికి కూడా వాడికి సొమ్ము చెల్లించుకోవాలట, వాడు ఓ పట్టాన పోడు.


ఏదో  తెలియని భాషలో ఇదంతా మాకు చెబుతాడు. కిష్టయ్య తనకి వచ్చిన హిందీ వాడిమీద ప్రయోగించబోయాడు. అది ఫలించకపోతే తెలుగులో తిట్టాడు. ఆ కూలివాడికి మిగతాది అర్ధం కాకపోయినా, తెలుగు తిట్లు మాత్రం అర్ధమయినట్టుంది. మరికొంత గొడవ.


"మీరు తెలుగువారిలా వున్నారే" అని సూటూ బూటూ వేసుకున్న ఓ పెద్దమనిషి స్వచ్చమయిన తెలుగులో పలకరించాడు. అమ్మయ్య తెలిసిన మాట విని ప్రాణం లేచి వచ్చింది. మా పరిస్థితి చెప్పుకున్నాం. కూలివాడి గోల ఆయన మాకు చెప్పాడు. చివరికి రాజీ చేసి, మూడు రూపాయలిచ్చి వాడిని వదిలిపించాడు. మా ఊళ్లో ఐతే పావలా డబ్బులిచ్చి ఎక్కించిన సామాను దించిన కూలివాడికే మూడు రూపాయలు వొదిలిపోతే, ఈ ఊళ్లో ఎంత డబ్బు చాలేటట్టు !


"ఇక్కడ దొంగలుంటారు. డబ్బు జాగర్తగా పెట్టుకోండి" అన్నాడు ఆ తెలుగు పెద్ద మనిషి. "తియ్యని మాటలు చెప్పి సొమ్ము లాగేస్తారు. గుండాలూ, రౌడీలూ కూడా చాలామంది వుంటారు. పరాయివాళ్ళని నమ్మకండి" అని కూడా హెచ్చరించాడు. సమయానికి భగవంతుడిలా దొరికావు నాయనా, అని నేనే కాదు. మా ఆవిడ కూడా సంతోషించింది. తనకిదివరకే ఇలాటి విషయాలన్నీ తెలిసినట్టు కిష్టయ్య మొహం పెట్టినా ! "ఏదండి మీ బంధువుని వెతికి పట్టుకుందాం" అన్నాడు ఆ తెలుగు పెద్ద మనిషి. అందరం కలిసిపోదాం అని నేను సలహా ఇచ్చినా వినిపించుకోకుండా, సామానులకి, ఆడంగులకి నన్ను కాపలా వుండమని, ఆ తెలుగు పెద్దమనిషితో ఒక్కడూ బయలుదేరాడు కిష్టయ్య.

📖


పావుగంటయింది. ఆరగంటయింది. వెళ్ళిన కిష్టయ్య రాడు. వాడి పిల్లలు నిద్దర లేచిపోయి, 'నాన్నోయ్' 'నాన్న కావాలోయ్' అని ఒకటే ఏడుపు. వాళ్ళని వూరుకో పెట్టండని నేను సలహాయిస్తే వెధవలు, ఏడిచి ఏడిచి, శోషోచ్చి వూరుకోవలసిందే గాని, ఇలాటప్పుడు మనం చెబితే మానరు ఏడవనివ్వండి" అని తోసిపారేసింది గంగారత్నం. మా ఆవిడ దిగాలుపడిపోయి పెట్టె మీద కూచుండిపోయింది. అయ్యో, మా ఆయన చెప్పిన మాట విని, ఇద్దరమే వచ్చి వుంటే, ఈ బాధలన్ని వుండక పోను గదా అని మనస్సులో అనుకుంటూ వుండివుంటుంది.


నాకు ఆకలేస్తోంది. కాలకృత్యాలు తీర్చుకోవాలి చుట్టు పక్క లెక్కడన్నా కూర్చుందామంటే ఎటు చూసినా పోలీసు వాళ్ళు. మరీ దూరం వెళదామంటే తప్పిపోతానేమోనని భయం.


ఓ గంటయిన తరవాత కాళ్ళీడ్చుకుంటూ, బుర్ర గోక్కుంటూ వచ్చాడు కిష్టయ్య. ఆ తెలుగు పెద్ద మనిషి జాగర్తగా దాచి పెడ తానని, కిష్టయ్యగాడి దగ్గిర్నించి యాభయి రూపాయలు పుచ్చుకుని, నాలుగు సందులు తిప్పి అదృశ్యమయిపోయాట్ట.


“ఓరి వాజమ్మా. నువ్విలా చేస్తావని నాకు ముందరే తెలుసురా" అనుకున్నాను మనసులో.


"ఆ వెధవ నెవడినో నమ్మి డబ్బెలా చేతిలో పెట్టారండి" అంది గంగారత్నం పళ్ళు పటపట కొరుకుతూ.


"దూరదేశంలో సాటి తెలుగువాడు మోసం చేస్తాడని అనుకోలేకపోయాను" అన్నాడు.


 "అయినా వాడికి డబ్బివ్వవలసిన అవసరమేమొచ్చింది. పెట్టెలో దాచండి అంటే మహా పొడిచేసేవాడిలా జేబులో పెట్టుకున్నారు."


“పెట్టమ్మా. అలా చివాట్లు పెట్టి గర్వం వొదిలించు" అనుకున్నాను మనసులో.


కిష్టయ్య చెప్పుకొచ్చాడు వెండితెరమీద చూపించే లాటి కథ.


“నేను, ఆ తెలుగు పెద్దమనిషి కొంతదూరం నడిచేసరికి ఇద్దరు ముగ్గురు మనుష్యులు మా వెనక తగిలారు. ఈలలేశారు. తెలుగు పెద్ద మనిషి ఓమాటు వెనక్కి తిరిగివాళ్ళని కేకలేస్తే వెనక్కి తగ్గారు. అప్పుడా పెద్ద మనిషి చెప్పాడు. వీళు ఈ ఊళ్ళో పెద్ద గూండాలు. కొత్తగా ఊరికి వచ్చిన వాళ్ళ వెంట తగిలి సొమ్ము కాజేస్తారు. మీకూ ఈపాటికి అది జరిగి వుండవలసింది. నేను వుండబట్టి వాళ్లు వెనక్కిపోయారు. అసలు వాళ్ళకి నేనంటే హడల్. మీ డబ్బు జాగర్తగా దాచి పెడతాను నాకివ్వండి" అన్నాడు.


"అబ్బే, నా దగ్గిరేం డబ్బులేదండీ" అన్నాను.


ఓహో అయితే భయంలేదు. మీరు ఇక్కడే వుండండి. పక్క సందులో వాకబుచేసి వస్తానని వెళ్ళాడు. ఆయన అలా వెళ్ళాడో లేదో ఆ గూండాగాళ్ళు మళ్ళీ వచ్చారు.


"తుమ్ క్యాకర్తాహై" అన్నాడు అందులో దున్నపోతులా వున్న ఒకడు.


“కుఛ్ నై ” అన్నాను.


"తబ్ ఇస్ గల్లీ మే క్యోంహై, శాయద్ తుమ్ చోర్ హో...పైసా నికాలో" అని మీద మీద కొచ్చాడు. వాళ్ళు సొమ్ము లాగేసే వాళ్ళే కాని, ఆ క్షణంలో "భాగ్ జావ్" అని కేక వేస్తూ ఆ తెలుగు పెద్దమనిషి. ప్రత్యక్షమ య్యాడు.


"నే చెప్పానా అండి. ఈ ఊళ్ళో జాగర్తగా వుండాలి. మీ సొమ్ము నా దగ్గిర దాచండి.

మీ స్నేహితుడి ఇల్లు పత్తా తెలిసి, మీరక్క డికి చేరగానే భద్రంగా ఇచ్చేస్తానన్నాడు. నమ్మి ఇచ్చేశాను. ఆ తరవాత రెండు సందులు తిప్పి మళ్ళీ కనిపించకుండా పోయాడు. అరగంట అయినా మళ్ళీ రాకపోతే, మీరిక్కడ ఏమయిపోతున్నారో అని స్టేషను దారి వాకబు చేసుకుంటూ ఇక్కడికి చేరుకున్నాను.”


తెచ్చిన డబ్బంతా క్షవరమే! కాదుట.


వున్నడబ్బంతా ఇదేనని యాభయి రూపాయలు ఆ తెలుగువాడి చేతిలో పెట్టినా, మరో పదిరూపాయలు బనియను జేబులో దాచుకున్నాట్ట. అవి మిగిలి పోయాయి. అవి దాచిన తెలివికి సంతో షిస్తూ ప్రజ్ఞ చెప్పుకోబోయాడు. 


"పోలీసుకి రిపోర్టు చెయ్యండి" అంది మా ఆవిడ.


“ఎందుకులెండి. పోలీసుల చేతిలో పడితే ఈ ఊర్నించి తెమలలేము" అన్నాడు. నిజానికి తన తెలివితేటలు బయట పడిపోతాయని సిగ్గుపడి దానికి ఒప్పుకో లేదు.


"బొంబాయంటే ఏదో మంచి ఊరు అనుకునేరు. అంతా శుద్ధ మోసం. మనం జాగర్తగా వుండాలి". అని మళ్ళీ లెక్చరు ప్రారంభించబోయాడు కిష్టయ్య. అసలు మోసపోయి డబ్బు క్షవరం చేసుకున్నదేమో తను ! మాకెందుకు నీతులు చెప్పడం.


ఏమిటి తరవాత ప్రోగ్రాము !

😄

*సశేషం*


꧁☆꧂


*నిత్యానందం - 12*

🤥

రచన: సోమంచి యజ్ఞన్నశాస్త్రి

*నిత్యానందంగారి విలాస యాత్ర*

ఏమిటి తరవాత ప్రోగ్రాము !

గంగారత్నం దగ్గిర దాచిన డబ్బు కూడా కలుపుకుంటే కిష్టయ్య సకుటుంబంగా తిరుగు రైల్లో ఇల్లు చేరడానికి మాత్రం సరి పోయిన డబ్బు మిగిలింది. చాలా అశుభం జరిగిపోయింది. ఇంకోమాటు జాగర్తగా రావొచ్చు వెళిపోదాం అని గంగారత్నం సలహా ఇచ్చింది.

అమ్మా గంగారత్నం, నువ్వూ మీ ఆయనా ఏదో నిర్వాకంచేసిపెడతారని, మా ఆవిడ మీతో మమ్మల్ని లాక్కొచ్చింది. వూరు చేరగానే మీ ఆయన గంగలో దింపాడు. నీ మాట విని తిరిగి వెంటనే వూరికిపోతే మళ్ళీ ఎప్పుడూ రైలెక్కి ఏ వూరూ వెళ్ళే యోగం లేకుండా చేస్తారు అని మనసులో అనుకుని "వెళ్ళాలంటే మీరు వెళ్ళండి. మేము ఒకటి రెండు రోజులువుండి వస్తాం" అన్నాను.

"నిత్యానందం. నువ్వు మన ఊఁళ్లోనే పరధ్యానంగా దారులు తప్పిపోతూ వుంటావు. ఈ ఊఁళ్లో అసలు గజిబిజీ అయిపోతావు. మేం వెళ్ళిపోయే పక్షాన మీరూ మాతోనే వచ్చేసెయ్యండి" అంటాడు కిష్టయ్య! ఏంచెప్పను వాడి ధైర్యం. నోరు నొక్కిపారేసేవాడు లేక !

"ఏదో అశుభం మనని వెంటాడుతున్నట్టు ఉంది. ఇప్పుడు వుండి లాభంలేదు మళ్ళీ వద్దాం. మనమూ పోదాంపదండి" అని వాళ్ళ పథమే పలికింది మా ఆవిడాను!

"మనం ఎన్ని మాటలుపడి ఎంత కష్ణ నిష్ఠూర్యాలకి ఓర్చి, నువ్వు ఎంత హంగామా చేసినమీదట ఈ ప్రయాణానికి సొమ్ము వగైరాలు లభించాయి? ఊఁరు చూడకుండా తిరిగిపోతే మళ్ళీ రావడం పడుతుందా? కొన్నేళ్ళదాకా అమ్మా నాన్నా, మన్ని విడిచిపెడతారా? జరిగే అశుభమేమిటో జరిగేపోయింది, ఇంకా మోసం జరిగినా, డబ్బేకదా పోతుంది. మనుష్యుల్ని కొరుక్కుతినరు కద ! ఈ ఊఁళ్ళో మంచి తెలుగువాళ్లూ వుండే వుంటారు. అలాటి ఆయన ఎవరైనా కనిపించి సహాయం చెయ్యరా! ఒక వేళ ఎవరూ దొరక్క డబ్బూ హరించిపోతే, కాలినడకనన్నా ఊఁరు చూసే వెళదాంగాని

వూరికే రెలెక్కొద్దు, మీరందరూ పోయినా, నేను రాను” అని ఖచ్చితంగా చెప్పేశాను. 

నా ధైర్యానికి, పట్టుదలకి మా ఆవిడే డంగెత్తిపోయింది. రహస్యంగా నన్ను మెచ్చుకుంది, దాంతో కిష్టయ్యగారి 

కుటుంబం వెళ్ళినా వుండినా మేంమాత్రం బొంబాయిలో రెండు రోజులుండిపోవాలనే నిశ్చయమయిపోయింది. సాయంత్రందాకా తిరిగి వెళ్ళిపోడానికి రైలు లేదని తెలిసిన తరవాత కిష్టయ్య కూడా ఈ రోజంతా ఎలానూ వుండాలిగదా రోడ్డుమీద కూచోలేము, ఆశ్రయం చూసుకోవాలి. అవసరమయితే ఇంటికి టెలిగ్రామిచ్చి సొమ్ము తెప్పించుకుంటాము. అందరం కలిసే ఊఁరు చూసి, ఇంటికి తిరిగిపోదాం" అన్నాడు. వదిలిపోతాడనుకుని సంతోషపడబోతూవుంటే, మళ్ళీ వీడు తగులుకున్నాడురా నాయనా, అనుకున్నాను.

"ఇప్పుడు తెల్లారిపోయింది. ఇహ మనకి భయంలేదు. టాక్సీ చేసుకుని హోటలుకి పోదాం, దగ్గిర్లో చవగ్గా ఏదైనా హోటలుందే మో, ఆ పోలీసాయన్ని అడిగితే చెప్పొచ్చు అంది" మా ఆవిడ.

"హోటలుకంటే సత్రం దొరికితే మంచిదండి. ఇంత పెద్ద ఊఁళ్లో సత్రాలుండకపోతాయా" అన్నాడు కిష్టయ్య. పైగా వెళ్ళి ఆ పోలీసు ఆయన్ని అడిగేసాడు.

"ఇదర్ సత్రం కిదర్ హై" అని అడిగాడు.

"క్యా..?" అన్నాడు పోలీసు.

"సత్రం కహా.."

"క్యా సత్రం."

సత్రమంటే ఏమిటో బోధచెయ్యబోయాడు. ఆ పోలీసాయనకి హిందీ తెలుగుల్లో..

"సత్రం గిత్రం వద్దు, శుబ్భరంగా హోటలుకే పోదాం. మీరెళ్ళి హోటలు సంగతి అడిగిరండి ఆ పోలీసుని" అని మా ఆవిడ

నాకు హుషారిచ్చింది. అనవసరంగా పోలీసువాళ్ళతో మాట్లాడం నాకు కొంచెం భయమయినా, ఈ పరిస్థితిలో మనం ధైర్యం విడనాడకూడదని గుండె నిబ్బరం చేసుకుని, వాడి సలహా అడిగి, టాక్సీలో ఎక్కి దగ్గిర్లో వున్న ఓ అరవ హోటలుకి చేరుకున్నాం.

ఊఁళ్లో చూడవలసిన వింతలు, విశేషాలూ అన్నీ పాపం హోటలు వాడే లిస్టు రాసి ఇచ్చాడు. రెండంతస్తుల బస్సులెక్కాం. ట్రాములెక్కాం. మా చిన్నతనంలో మా జమీందారుగారి దగ్గిరుండేది అలాటి గుర్రబ్బండి కూడా ఎక్కాం. ఎటొచ్చీ ఆ గుర్రం శల్యంలా వుంది. తిన్నగా తిండి పెట్టరు కాబోలు. మా జమీందారు గారి బగ్గీకి కట్టిన జోడు గుర్రాలూ, మిలమిల్లాడు తూ వుండేవి. మోటారు కారుకంటె చవక అని గుర్రబ్బండిలో ఎక్కితే, రెట్టింపు వొదిలిపోయింది. నిజానికి బొంబాయిలో అంతా అదో తమాషా. చవక అనుకున్నవి ఖరీదు పేరునుబట్టి వూహించుకోడానికి వీల్లేదు. Gate Way of India కి వెళితే అక్కడ గేటు లేదు. Hanging Gardens చూస్తే అది నేలమీదే వుందిగాని, ఎక్కడా వేళ్ళాడ్డం లేదు. మలబార్ హిల్లుమీదనించి చూస్తే, క్వీన్సు నెక్లేస్ కనిపిస్తుందన్నారు. కళ్ళు పొడుచుకు చూసినా, ఎక్కడా కనిపించలేదు. అర్ధచంద్రాకారంలో రోడ్డు మీదవున్న దీపాలేవో చూపించి ఇదే నెక్లెస్ అంటారు పైగా. మా ఊఁళ్ళో రోడ్లమీద దీపాలు మిణుకు మిణుకు మంటూ వుంటాయి గదా అని భూమిమీద నక్షత్రాలని చూపిస్తామని వాటిని చూపిస్తే ఏమన్నా సబబుగా వుంటుందా. రాణీబాగ్ లో కోతుల్నీ, అరే కాలనిలో గేదెల్ని చూస్తే బాగానే వున్నాయి కాని, కోతుల్నీ, గేదెల్నీ చూడ్డానికి బొంబాయికి వెళ్ళాలిట్రా? 

చెన్నపట్నంలోలా పెద్ద బీచి అయినా లేదు, ఏదో చపాతీట. అదే బీచన్నారు. మా ఊఁళ్ళో ఏటిలోవున్నంత ఇసకన్నా లేదు అక్కడ. పైకి చూడ్డానికి ఇళ్లు పెద్దవేగాని లోపల గూభ్యాలు. కిక్కిరిసిపోయిన జనం ! ఎక్కడికి వెళదామన్నా తోసుకు ముందుకిపోడానికి వీల్లేదుట. ఏదో క్యూట. లైనులో నించోవాలి గంటలకొద్ది ! మొత్తం మీద నాకే కాదు మా ఆవిడకీ బొంబాయి ఏమీ నచ్చలేదనుకో. పైగా, చూసినవన్నా, కులాసాగా, మజాగా, కబుర్లుచెప్పుకుంటూ చూద్దామంటే కిష్టయ్యగాడి ఫామిలీ అడ్డు. అన్నిటికీ ఏవో కామెంటరీలు చెబుతూ లెక్చర్లిస్తానంటాడు కిష్టయ్య. కనిపించింద ల్లా బేరంచేసి, మా ఊఁళ్ళో ఇంతకంటే చవగ్గా దొరుకుతాయే ఇవి అని, అమ్మే ఆసామీచేత గుడ్లు ఎర్ర జేయించుకునేది గంగారత్నం. వీటన్నిటినీ మించి, ఫిలిము లో background music లాగ హమేషా వాడి పిల్లల సన్నాయి మేళం.

ఏమయినా, మాట పట్టుదలొచ్చింది కనక అన్ని కష్టాలకి ఓర్చి లిస్టు ప్రకారం అన్నీ చూసి మరీ బొంబాయినించి కదిలాము. కిష్టయ్యగాడు కుదేలయిపోయాడు.

హఁ ఏమనుకున్నావురా! నాయనమ్మ బతికుంటే. "నాకు తెలుసురా. వెర్రి నాగమ్మా పైకి మెత్తనివాడిలా కనిపించినా గట్టివాడివేరా. చిన్నప్పుడు గుక్కపెడితే పావుగంటదాకా మానేవాడివి కాదు. ఉక్కిరిబిక్కిరి అయిపోయేవాడివిగాని, ఏడుపు మానేవాడివికాదు. అప్పుడే తెలుసురా నాకు నువ్వు చాలా గట్టివాడి వని" అని మెచ్చుకునేది. ఏడిశావు. మా ఆవిడా మెచ్చుకుందని చెప్పాను కాదురా ! మా నాయనమ్మలా, బాహాటంగాకాకుండా, సున్నితంగా, రహస్యంగా, విలాసంగా, చేసిందిరా ఆ పని ! "

దానికి థాంక్స్! బొంబాయీ, థాంక్స్!

*సమాప్తం*

꧁☆•┉┅

Thursday, 17 April 2025

April మూ డవ వారం కథలు

*


ఇది పాత తరం స్నేహితులకు అంకితం.............. 


జారే అరుగుల ధ్యాసే లేదు

పిర్ర పై చిరుగుల ఊసేలేదు

అమ్మ చేతి మురుకులు లేవు

అలసట లేని పరుగులు లేవు

ఎత్తరుగులు మొత్తం పోయే

రచ్చబండలూ మచ్చుకు లేవు

 వీధిలో పిల్లల అల్లరి లేదు

 తాతలు ఇచ్చే చిల్లర లేదు

 ఏడు పెంకులు ఏమైపోయే

 ఎద్దు రంకెలు యాడకి పోయె

ఎక్కడా వెదురు తడికెలు లేవు

ఏ తడికకీ భోగి పిడకలు లేవు

కూరలమ్మే సంతలు లేవు 

పెరుగులమ్మే ముంతలు లేవు

బువ్వా లాటల విందే లేదు

గవ్వలాటలు ముందే లేదు

కుప్పిగంతులు లేనే లేవు 

కళ్ళ గంతలు కానే రావు

డ్రింకు మూతల గోలే లేదు 

బచ్చాలాడే ఇచ్చా లేదు

కోతి కొమ్మచ్చి ఏమైపోయే

అవ్వా అప్పచ్చి ముందే పాయె

గూటీ బిళ్ళా గూటికి పోయే

తొక్కుడు బిళ్ళకు రెక్కలు వచ్చె

గచ్చకాయలు మచ్చుకు లేవు

చింత పిక్కలు లెక్కకూ లేవు

ధారగా కారే ముక్కులు లేవు 

జోరుగా జారే లాగులు లేవు

కొబ్బరి పుచ్చు కొరుకుడు లేదు

కొండముచ్చుని కెలుకుడు లేదు

బట్టన మురికి అంటక పోయె

మనసుకి మురికి జంటగ చేరె

కాకి ఎంగిలి కరువై పోయే

భుజాన చేతులు బరువై పోయె

అన్ని రంగులూ ఏడకో పోయె

ఉన్న రంగులూ మాసికలాయె

దానికితోడు కరోనా వచ్చె

బళ్ళూ, గుళ్ళూ మూసుక పోయె

బడిగంటల ఊసే లేదు

బడికి పోయే ధ్యాసే లేదు

మూతులన్నీ మాస్కుల పాలు

చేతులన్నీ సబ్బుల పాలు

ఆన్ లైన్ లో పాఠాలాయె

అర్థం కాని చదువులాయె

ప్రశ్నలకు జవాబులుండవు

కొన్నాళ్ళకు ప్రశ్నలే ఉండవు

ప్రస్తుత బాల్యం వెలవెల పోయె

దానికి మూల్యం ప్రస్తుత మాయే

రేపటి సంగతి దేవుడి కెరుక

నేటి బాలలకు తప్పని చురక

బాలానందం లేని జీవితం

మానవాళికే మాయని మరక.

మన బాల్యం పై ఒక మిత్రుడు పంపిన కవిత..

🙏🙏🙏🙏🙏🙏

మేమే అదృష్టవంతులమ్*!           

1960-80 లో పుట్టిన మేము ఒక ప్రత్యేక తరానికి చెందిన వాళ్ళం. చాలా సాధారణ స్థాయి బళ్ళో చదువుకున్నా, దాదాపు మా తరం వాళ్ళు అన్ని విషయాలలో నిష్ణాతులుగా కనిపిస్తారు. 

ఆంగ్ల  మాధ్యమంలో  చదువుకోకున్నా, మాకు ఆ భాష మీద ఉండే పట్టు అమోఘం. ఒక్క ఆంగ్లమే కాదు మేము చదువుకొన్న ప్రతి విషయంలో ఎంతో ప్రతిభ చూపించేవాళ్ళము.  లెక్కలు, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం ఇంకా అనేక విషయాలు ఎంతో శ్రద్ధతో నేర్చుకునేవాళ్ళము. 

పోటీ చాలా ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో అదేమంత 

గొప్ప విషయంగా కనపడకపోవచ్చు, కానీ ఆనాడు ఉన్న *సామాజిక -ఆర్థిక* పరిస్థితులకు మేము సాధించింది చాలా ఎక్కువ అనే చెప్పుకోవాలి. 

దాదాపు ప్రతీ కుటుంబంలో కనీసం నల్గురు నుండి ఆరుగురు పిల్లలు ఉండేవాళ్ళు. *ఇంత పెద్ద కుటుంబం కేవలం తండ్రి సంపాదన పైనే ఆధార పడేది...* అంటే అందరికీ కడుపునిండా తిండి దొరకటమే కష్టం అయ్యేది.

*పొద్దున్నే చద్దన్నం, మధ్యాహ్నం మామూలు భోజనం ఉండేది. రాత్రికి కూడా అంతే.* 

పండగ రోజుల్లో మాత్రం కాస్త ప్రత్యేకంగా ఉండేది. బొగ్గుల కుంపటిలోనో, కట్టెల పొయ్యిలోనో వంటలు చేసి, ఇంత మంది పిల్లలను పెంచిన *ఆ నాటి తల్లుల ఋణం ఎంత ఇచ్చినా తీర్చుకోలేము.* 

దాదాపు అందరం దుంపల బడిలోనో ప్రభుత్వ ఉచిత పాఠశాలలోనో చదువుకొన్న వాళ్ళమే. మాలో చాలా మంది డిగ్రీ చదువులకు వెళ్లేవరకూ చెప్పులు లేకుండా నడిచిన వాళ్ళమే!  

ఆ రోజుల్లో  చాలా సాధారణంగా ఉండేది. బడి చదువులు అయిన వెంటనే తల్లి-దండ్రులు తమ బిడ్డలకు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనుకునేవాళ్ళు.  

ఆ రోజులల్లో ప్రభుత్వ డిగ్రీ చేసి PG చేసిన వాళ్ళు తక్కువే.

మా తరం వాళ్లకి సినిమా, రేడియో తప్ప వేరే వినోదం ఉండేది కాదు. *మూడు అణాలు ఇచ్చి తెరకు దగ్గరగా కూర్చొని చూసిన సినిమాలు ఎన్నో.* అదీ కాకుండా, రేడియోలో పాత కొత్త పాటలు వినటం ఎంతో ఇష్టంగా ఉండేది. ఘంటసాల వెంకటేశ్వరరావు, పిఠాపురం నాగేశ్వరరావు , మాధవపెద్ది సత్యం, సుశీల, లీల, జిక్కీ గార్లు పాడిన తెలుగు పాటలు అంటే పడి చచ్చేవాళ్ళం ఇక హిందీ పాటల విషయానికొస్తే, పాటల ట్యూన్ ని బట్టి సంగీత దర్శకులెవరో చెప్పే వాళ్ళం. SD బర్మన్, నౌషాద్, మదన్ మోహన్, శంకర్ జైకిషన్, లక్ష్మీ కాంత్  ప్యారేలాల్,కళ్యాణ్ జీ ఆనంద్ జీ ... ఒకరేమిటి, ఎన్ని పేర్లు చెప్పుకోవాలో తెలియదు. ఈ సంగీత సామ్రాట్టులు అందించిన పాటలు ఈనాటికీ శ్రోతల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి.

మాకు ఉన్న మరో వినోదం పగలు గూటిబైళ్ల గోళీలాట ఏడుపెంకులాట బుచ్చలాట

రాత్రికి హరికథలు బుర్ర కథలు నాటకాలు చూడటం ఇదే వినోద కాలక్షేపం

ఈ నాటికీ దాదాపు అందరం 48-65సంవత్సరాలు పూర్తి చేసుకున్నవాళ్ళమే. జీవితంలో ఉన్నత ఉద్యోగాలు చేసుకున్నవాళ్ళమే. పిల్లలను పై చదువులు చదివించి ప్రయోజకుల్ని చేసినవాళ్ళమే!

అయినా ఉత్సాహం ఏమాత్రం తగ్గక ఇంకా యువకుల్లా కనిపిస్తున్నవాళ్ళమే. ఈ వయసులో కూడా మన చిన్నప్పటి స్నేహితులను పేరు పేరునా గుర్తుంచుకొని పిలుస్తున్న వాళ్ళమే.   

*ఇక మాకన్నా అదృష్టవంతు లెవరుంటారు?*

*ఆహా! జ్ఞాపకాల దొంతర అంటే ఇదీ!! అచ్చంగా మన బాల్యాన్నిమనమే రాసుకున్నట్టుగానే వుంది!!!

[10/10, 21:01] BCB: ప్రతి సంవత్సరం దసరా తర్వాత సరిగ్గా 21 రోజుల తర్వాత దీపావళి ఎందుకు వస్తుంది? మీరు నమ్మకపోతే, క్యాలెండర్‌ను తనిఖీ చేయండి. రామచంద్రుడి సైన్యం  శ్రీలంక నుండి కాలినడకన అయోధ్య చేరుకోవడానికి 21 రోజులు (504 గంటలు) పట్టిందని వాల్మీకి మహర్షి రామాయణము లో చెప్పారు !!! కాబట్టి 504 గంటలను 24 గంటలు విభజించినచో, సమాధానం 21.00 21 రోజులు. నేను ఆశ్చర్యపోయాను. దీనిని ధృవీకరించడానికి, నేను ఉత్సుకతతో గూగుల్ మ్యాప్‌లో శోధించాను. శ్రీలంక నుండి అయోధ్యకు కాలినడకన దూరం 3145 కి.మీ మరియు నడవడానికి తీసుకున్న సమయం 504 గంటలు అని. నేను షాక్ అయ్యాను !!!! ఈ రోజుల్లో గూగుల్ మ్యాప్ పూర్తిగా నమ్మదగినది. సంప్రదాయం ప్రకారం, త్రేతాయుగం నుండి మనము దసరా మరియు దీపావళిని జరుపుకుంటాము.

మీరు నన్ను నమ్మకపోతే, గూగుల్ సెర్చ్ చేయండి మరియు ఈ సమాచారాన్ని ఇతరులతో పంచుకోండి. వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఎంతో ఖచ్చితత్వంతో రాశాడు.  మన హిందూ సంస్కృతి ఎంత గొప్పది. హిందూ సంస్కృతిలో జన్మించినందుకు గర్వపడండి!

జై శ్రీ రామ్ 🙏🙏🙏

****

           మౌనంగానే ఎదగాలి

వాక్కును నియంత్రించడమే మౌనం. ఇదొక అద్భుతమైన తపస్సు. మాటలను వృథాగా వినియోగించకుండా అవసరం మేరకే వినేవారికి ఇంపుగా, హితంగా, మితంగా మాట్లాడాలని, అలా చేతకానప్పుడు మౌనమే మేలని విదురనీతి వివరిస్తోంది.

అయిదు శాంతులలో మౌనం ముఖ్యమైనదిగా చెబుతారు. ‘మాట వెండి, మౌనం బంగారం’ అని సామెత. ‘మాట్లాడటం ద్వారా శక్తిని వృథా చేసుకునేకంటే మౌనంగా ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చు’ అన్నారు స్వామి వివేకానంద.

మౌనం మూడు రకాలు. ఒకటి, వాక్‌మౌనం. వాక్కును నిరోధించడమే వాక్‌మౌనం. దీనినే మౌనవ్రతం అంటారు. ఇలాంటి మౌనం వల్ల పరుష వచనాలు పలకడం, అబద్ధాలాడటం, ఇతరులపై చాడీలు చెప్పడం, అసందర్భ ప్రలాపాలు అనే నాలుగు వాగ్దోషాలు హరిస్తాయి. రెండోది అక్షమౌనం. అంటే ఇంద్రియాలను నిగ్రహించడం. మూడోది కాష్ఠమౌనం. దీనినే మానసిక మౌనం అంటారు. మౌనధారణలోనూ మనసు అనేక మార్గాల్లో పయనిస్తుంది. దాన్నీ అరికట్టినప్పుడే కాష్ఠమౌనం సాధ్యపడుతుంది.

మౌనం ఆరోగ్య వృద్ధికి తోడ్పడుతుంది. దీనివల్ల దివ్యశక్తి ఆవిర్భవిస్తుంది. బాహ్య, అంతర సౌందర్యాలను పెంచుతుంది. మనోశక్తులు వికసిస్తాయి. ఎదుటివారిలో  పరివర్తన  తెస్తుంది. ఆధ్యాత్మిక శక్తి ఉత్పన్నమై ఆత్మకు శాంతి లభిస్తుంది. సమయం సద్వినియోగమవుతుంది. పతంజలి మహర్షి తన యోగ సిద్ధాంతంలో మౌనానికి ప్రాధాన్యమిచ్చారు. మౌనాన్ని అవలంబించిన మహాత్ముల్లో రమణ మహర్షి, శ్రీరామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, వంటి వారెందరో ఉన్నారు.

ధ్యానానికి మౌనమే పునాది. బహిర్గతంగానే కాదు, అంతర్గతంగానూ మౌనం పాటించనిదే ధ్యానం చేయడం అసాధ్యం. నిరంతర యోగసాధకులైన మహర్షులు మౌనంగా ధ్యానం కొనసాగిస్తారు.

రోజూ అరగంట మౌనంగా ఉంటే శారీరక, మానసిక ఆరోగ్యం సిద్ధించడంతో పాటు ఆశలు, ఆశయాలు, కలలు, కోరికలు నెరవేరతాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. మౌనంగా ఉండటమంటే ఇంట్లో పనులు చేస్తూ,  టీవీ కార్యక్రమాలు చూస్తూ, కంప్యూటర్‌ ముందు కూర్చుని అంతర్జాలం చూడటం కాదు. కళ్లు మూసుకుని మాటను, మనసును మౌనంలోకి జార్చేస్తే మనసు తేలిగ్గా ఉంటుంది. ఎంతో మంది అనుభవపూర్వకంగా చెబుతున్న విలువైన మాట ఇది.

ఆచి తూచి మాట్లాడటం చేతకానితనం కానేకాదు. తనపై తన ఆలోచనలపై తనకున్న పట్టును అది తెలియజేస్తుంది. ‘చేజారిన కాలం, పెదవి దాటిన పలుకు’ వెనక్కి రావు. అందుకే వాటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో తెలిసి తీరాలి.

ప్రతి రోజూ ఎన్నో రకాల ఆలోచనలు మనల్ని పట్టి పీడిస్తుంటాయి. వాటి ప్రభావం మన మాటలపై, చేతలపై పడుతుంది. అవి ఓ చక్రం తిరిగినట్టు తిరుగుతాయి. ఆ చక్రాన్ని ఆపే శక్తే ‘మౌనం’.

ఏ సాధన అయినా మౌనం వల్లనే సాధ్యమవుతుంది. భగవంతుడి సాన్నిధ్యానికి చేర్చే అసలైన సాధనం మౌనమే. మనందరం మౌనంగానే ఎదుగుదాం!


*****

కృష్ణ’ శబ్దం మనోహరం.!!

సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మరో రూపమే శ్రీకృష్ణ భగవానుడు. ద్వాపర యుగంలో పుట్టి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేసిన కరుణామయుడు. కారుణ్యశీలుడు. ఆదర్శ పురుషుడు. ప్రేమతత్వాన్ని అనేక దృక్పథాలలో విపులీకరించిన ఆదర్శమూర్తి.

భగవద్గీత ద్వారా అనేక విధాలైన ఆధ్యాత్మిక మార్గాలను మనకు అందించిన దివ్య పురుషుడు. యుగ ధర్మాలను, సాంఘిక న్యాయాలను, అనంతమైన విశ్వతత్త్వాన్ని తెలియచెప్పిన మహనీయుడు. అలాంటి….  శ్రీకృష్ణ మంత్రం బాహ్యశత్రువులను, అంతఃశత్రువులను హరించే శక్తి కలది.

సకల వేదాంతాలందూ చెప్పబడిన పూజ్య మంత్రమిది. సమస్త సంసార చింతనలను, సర్వైశ్వర్యాలను ఇచ్చే దివ్య మంత్రమిది. శ్రీకృష్ణునకు భక్తి పూర్వకముగా ఒక్కసారి నమస్కరిస్తే పది అశ్వమేధ యాగాలు చేసి, అవభృధ స్నానం ఆచరించినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

శ్రీకృష్ణుని త్రికరణశుద్ధిగా భక్తిశ్రద్ధలతో నమస్కరించిన మాత్రానే జన్మరాహిత్యం కలుగుతుంది. ‘కృష్’అనగా ‘సత్తు’, ‘ణ’ అనగా ఆనందమని అర్థం. అంటే సదానందము లేక సచ్చిదానందమని అర్థం.

కలియుగాన ‘కృష్ణ కృష్ణ’ అనే మంత్రాన్ని ఎవరు అహోరాత్రులు స్మరిస్తారో అలాంటివారు సాక్షాత్తు శ్రీకృష్ణ రూపాన్ని పొందుతారని పురాణోక్తి. ఓంకారం మొదలు వేదాల వరకూ ‘కృష్ణ’ అనే రెండక్షరాలు సమస్త విఘ్నాలను హరించి మనోభిష్టాలను నెరవేరుస్తున్నాయి. అలాంటి శ్రీమహావిష్ణువు స్వరూపమయిన శ్రీకృష్ణ భగవానుడు కారణజన్ముడు.

మధురలో పుట్టి, గోకులంలో పెరిగి, నంద యశోద ప్రేమకు పాత్రుడైన వాడు. గోపీ మానస చోరుడు, అర్జున రథసారథి అయిన శ్రీకృష్ణ భగవానుడి ఆవిర్భావమే దుష్టశిక్షణ. కంసుని దురాగతాలను అంతమొందించడానికి, నిరాశ్రయులైన దీనులను ఉద్ధరించడానికి అవతరించినవాడు.

గోకులంలో పెరిగాడు కాబట్టి గోపాలకృష్ణుడయ్యాడు. యమునా నదీ తీరంలో కాళీయమర్థనం చేసిన మహనీయుడాయన. బాల్యంలోనే తన నోటిలో అండపిండ బ్రహ్మాండాలను చూపించిన దైవం. సాక్షాత్తు శ్రీహరి అంశ అయిన కృష్ణునికి లెక్కలేనన్ని పేర్లు...                   ఆ స్వామి ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతాడు. ఏమిచ్చి అర్చించినా ఆదుకుని అక్కున చేర్చుకుంటాడు.

రామ శబ్దానికి, కృష్ణ శబ్దానికి భేదం లేదు. ఈ రెండు అవతారాలు సాక్షాత్తు శ్రీహరి అవతారాలే కావడంవల్లే ఆ స్వాముల నామస్మరణ సాక్షాత్తు శ్రీహరి నామస్మరణంగా భావిస్తారు. అందుకే ‘హరేరామ హరేరామ హరే కృష్ణ హరేకృష్ణ’ అంటారు.

ఇంతటి మహిమాన్వితమైన ఈ మంత్రాన్ని జపిస్తే సమస్త దోషాలూ సమూలంగా మటుమాయమై మానసిక ప్రశాంతత లభిస్తుంది.

నిష్కల్మషమైన మనస్సుతో కృష్ణుని పూజిస్తే, ఆ స్వామి కరుణించి కటాక్షిస్తాడు. కుచేలుడు, సుధాముడు లాంటి ఎందరో భక్తులను ఆదరించి, అక్కున చేర్చుకుని, ముక్తిని కల్గించిన అపురూప దైవం శ్రీకృష్ణ భగవానుడు.

కృష్ణ నామస్మరణమే పరమావధిగా ఎవరు స్మరిస్తారో, వారి మనస్సులలో శ్రీకృష్ణ భగవానుడు కొలువై ఉంటాడు. అనేక మంది యోగులు, సిద్ధులు యోగాభ్యాస సమయాన శ్రీకృష్ణుని సహస్రారమందు ధ్యానిస్తూ ప్రాణాయామం నిలిపి మోక్షాన్ని పొందారు.

వాయువును కపాలమునందున్న సహస్రార చక్రం వరకూ తీసుకొనిపోయే సహజశక్తి ‘కృష్ణ’ శబ్దానికి కలదు. కృష్ణ శబ్దము నోటితో ఉచ్చరించినపుడు ఆయా అక్షరాలకు స్థానాలగు దౌడ, కంఠం, వీనిలో పుట్టిన వాయువు, శబ్దమూలమున శిరస్సునగల సహస్రార చక్రం వరకూ సహజసిద్ధంగా చేరుకొంటుంది.

అపుడు ‘వాయువు’ను అంటి చలించే స్వభావంగల వనస్సును, యోగప్రక్రియచే వాయువుతో లయమొనర్చి, సహస్రారమునకు తీసుకునిపోయి నిలువ వచ్చు. ఇలాంటి సిద్ధ ప్రక్రియ. మహాత్ములైన యోగులకు మాత్రమే సాధ్యపడుతుంది.

ఈ విషయం సూక్ష్మాతి సూక్ష్మంగా మహాభారతంలో శ్రీకృష్ణ నామతత్వార్థ ప్రభావంగా చెప్పడం జరిగింది.✍️

 .        

*****

ఐకమత్యమే బలం! 


ఐకమత్యం లోపించడం అనేది ప్రస్తుతం భారతీయుల్లో కనిపిస్తున్న 'ప్రధాన సమస్య. ఐకమత్యం ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఐకమత్యం కంటే ప్రధానమైన విషయాలు పాత్ర వహిస్తాయి? అనేది కాస్త విచక్షణతో ఆలోచించాల్సిన విషయం. అందుకే పూర్వం కుటుంబంలో ఐకమత్యం బాగా నేర్పేవారు. 'వాడు నీ తమ్ముడురా! వాడిని ఎవరన్నా ఏమన్నా అంటే ఊరుకుంటావా! జాగ్రత్త చూసుకోవాలి కదా!' అని తల్లి అనేది. అప్పుడు అ కుర్రాడికి అర్థమయ్యేది. 'అన్నదమ్ములం, ఆక్కాచెల్లెళ్లం ఒక కుటుంబం. అందరం ఐకమత్యంగా ఉండాలి' అని ఈ కుటుంబపరమైన ఐకమత్యం. తరువాత వెంటనే దేశాన్ని చూపించారు. ఐకమత్యం ఉండాల్సింది. కులాల్లోనూ, మతాల్లోనూ, ప్రాంతాల్లోనూ కాదు. ముందు కుటుంబంలో, తరువాత దేశంలో! కుటుంబంలో ఐకమత్యం ఎలా ఉండాలో ధర్మరాజు మాటల ద్వారా నేర్చుకోవచ్చు.


పాండవులు అరణ్యవాసం చేస్తూ, అడవిలో ఆకులు, అలములు తిని జీవిస్తుంటే, అది కూడా వాళ్లకు దొరకడం నచ్చక దుర్యోధనుడు దండయాత్రలాంటి పనిచేశాడు. దానికి 'ఘోషయాత్ర' అని పేరు 'ఘోష' అంటే గొల్లపల్లె. చరిత్రలో దుర్యోదనుడిని మించిన ప్రతినాయకుడు ఉండడు. ధర్మరాజు ఏ నదీ తీరంలోనైతే యజ్ఞం చేస్తున్నాడో, ఆ నదీ తీరానికి అవతలి గట్టున తన మందీమార్బలం, సైన్యంతో మకాం పెట్టాడు దుర్యోధనుడు. జలక్రీడలు, విందులు, చిందుల్లో భాగంగా అక్కడున్న గంధర్వుల సరస్సులో స్నానానికి కౌరవులు దిగారు. అక్కడ కాపలావాళ్లు అభ్యంతరం చెప్పారు. దాంతో యుద్ధం జరిగింది. గందర్వుల సైనికులే కాదు, చిత్రసేనుడనే గంధర్వుడు కూడా వచ్చాడు. గంధర్వుల చేతిలో దుర్యోధనుడి సైన్యం ఓడిపోయింది. దుర్యోధనుణ్ణి రథ స్తంభానికి కట్టేసి లాక్కెళ్లారు. అప్పుడు కౌరవ సైనికులు వచ్చి దుర్యోదనుణ్ణి కాపాడమని పాండవుల కాళ్లు పట్టుకున్నారు. వెంటనే భీమార్జునులను ధర్మరాజు పిలిచి, "మన సోదరుడు దుర్యోధనుడికి ఆపద వచ్చింది. మీరు వెళ్లి కాపాడాలి" అని అన్నాడు. అప్పుడు భీముడు 'కాగల కార్యం గంధర్వులు తీర్చారు' అని అన్నాడు. ఈ సామెత అక్కడి నుంచి వచ్చిందే. మనను ఎన్ని కష్టనష్టాలకు గురిచేశాడు. అటువంటి వాడిపైన దయ ఏందుకు? మేం వెళ్లి రక్షించం' అని భీమార్జునులు అన్నారు. అప్పుడు భీముడిని ఉద్దేశించి ధర్మరాజు ఐకమత్యం అంటే ఏమిటో చెబుతాడు.


పరైః పరిభవేత్ ప్రాప్తే వయం పంచోత్తరం శతం |

పరస్పర విరోధేతు వయం పంచ శతం చ తే ||


ఒక తాత్వికమైన అవగాహన ఉన్న వారు జీవితాన్ని నిష్కల్మషంగా గడుపుతారు. అందుకే ధర్మరాజుని 'యుధిష్ఠిరుడు' అన్నారు. 'మనందరిదీ ఒకటే వంశం. 'పరస్పర విరోధేత్ మనలో మనకే గనక విరోధం వస్తే 'వయం పంచ"... మనం ఐదుగురం. శతంచతే... వాళ్లు వందమంది. అలా కాకుండా బయటి వాడు మనమీదకొస్తే 'పంచోత్తరం శతం' అంటే వాళ్లు వంద మంది, మనం ఐదుగురం. మొత్తం నూటా ఐదుగురం ఉన్నాం. కలిసి ఎదుర్కోవాలి' అని ధర్మరాజు అన్నాడు.


దీన్ని గనుక మనం కుటుంబాలకు అన్వయించుకుంటే కుటుంబపరమైన ఐకమత్యం బాగుంటుంది. తరువాత అన్వయించాల్సింది దేశానికి మనదేశంలో తమిళ, కన్నడ, తెలుగు సోదరులకు ఏమైనా భేదాలొస్తే సామరస్యంగా పరిష్కరించుకోవాలి. =కత్తులు దూసుకోకూడదు. (అదే పాకిస్తాన్ వాడో, చైనా?వాడో మన మీద దాడిచేస్తే అందరం ఐకమత్యంగా వాడి మీదకు వెళ్లాల్సిందే. మనదేశంలో ఏవైనా లోపాలుంటే మనం మాట్లాడుకోవాలి. మనమే పరిష్కరించుకోవాలి. విదేశాలకు వెళ్లినపుడు వాటి గురించి మాట్లాడకూడదు. కుటుంబమైనా అంతే. దేశమైనా అంతే! ఒక సమర్థుడైన వ్యక్తి ఒక మంచి సంస్థలో ఉంటే అతని వల్ల సంస్థకు ప్రయోజనం. సంస్థ వల్ల అతనికి ప్రయోజనం, సమర్థులైన వారు స్వదేశంలోనే ఉండాలి. అది దేశానికి గౌరవం, వారికి గౌరవం. ఎలా అంటే... శ్రీకృష్ణుడు 'సంజయ రాయబార సందర్భంలో "పాండవులు, కౌరవులు కలిసి ఉండటం అవసరం. వాళ్లకు చెప్పవయ్యా" అంటాడు. 'ఆ అవసరం ఏముంది?' అని సంజయుడు ప్రశ్నించినప్పుడు...'ధృతరా ష్ట్రుడున్ పుత్రులున్ వనముల్... దృతరాష్ట్రుడు ఆయన పుత్రులు మహారణ్యంలాంటివారు 'కుంతీ నందనుల్ సింహముల్... పాండవులు ఐదుగురు సింహాల్లాంటివారు. అయితే సింహంలేని అరణ్యాన్ని జనాలందరూ వచ్చి నాశనం చేస్తారు. అరణ్యంలో సింహం ఉంటే ఒక్కడూ అడుగుపెట్టడు. అరణ్యంలో ఉండకపోతే సింహాలకు కూడా రక్షణ ఉండదు. అలాగే పాండవులు కౌరవులతో కలిసి ఉంటే మంచి సామ్రాజ్యంతో ఉంటారు. కౌరవులు కూడా పాండవులతో కలిసి ఉంటే బలంగా ఉంటారు. ఇద్దరూ బాగుంటారు' అని చెబుతాడు శ్రీకృష్ణుడు. 'ఐకమత్యం మహాబలం' అనడానికి ఇది మంచి ఉదాహరణ.

****

 గురుభక్తి

ఉపనిషత్‌ వాక్యం

గురురేవ పరో ధర్మో గురురేవ పరా గతిః

యస్య దేవే పరాభక్తి ర్యథా దేవే తథా గురౌ,

సబ్రహ్మవి త్పరం ప్రేయా దితి వేదానుశాసనమ్‌ (శాట్యాయనీయోపనిషత్‌)


'గురువే పరమ ధర్మం. గురువే పరాగతి… ఎవరికి దేవుడిపై, గురువుపై సమానమైన భక్తి ఉంటుందో అతను పరబ్రహ్మను పొందగలడు' అని పై శ్లోక భావం. దీనిని బలపరిచే కథ ఇది. ధ్వజదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను దారిద్య్రంతో బాధపడుతూ నైమిశారణ్యంలోని పుష్కర మహాముని దగ్గరికి వెళ్లి సాష్టాంగపడ్డాడు. ఆ బ్రాహ్మణుడికి ముని హనుమత్‌ మంత్రాన్ని ఉపదేశించాడు. ధ్వజదత్తుడు రాత్రింబవళ్లు ఆ మంత్రజపం చేశాడు. గురువుపై విశ్వాసం లేక మంత్రసిద్ధి కాలేదు. కొన్నాళ్లకు వ్యాధిపీడితుడైన గాలుడనే వేటగాడు ధ్వజదత్తుడిని కలుసుకున్నాడు. తన బాధలు ఆయనతో చెప్పుకొన్నాడు. అప్పుడు ధ్వజదత్తుడు 'దైవం లేదు. మంత్రం లేదు. పుష్కరుడి నుంచి మాత్రం మంత్రం స్వీకరించకు' అన్నాడు. గాలుడు ఉత్సుకతతో పుష్కర మహర్షి దగ్గరికి వెళ్లి పరిచర్య చేశాడు. అతనిపై సందేహంతో మహర్షి ధ్యానించగా హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు. 'గురుభక్తి ఉంటే సరి. ఉపదేశించవచ్చు' అని ఆజ్ఞ ఇచ్చాడు ఆంజనేయుడు.

మంత్రోపదేశానికి ముందు గాలుడిని పుణ్యతీర్థంలో స్నానం చేసి రమ్మన్నాడు పుష్కర ముని. అప్పుడు గాలుడు 'మీ పాద జలమే పుణ్యతీర్థం' అన్నాడు. గురువు హనుమంతుడిని ధ్యానించి తన పాదజలాన్ని అతనిపై చల్లి ద్వాదశాక్షర మంత్రోపదేశం చేశాడు. గురు సమీపంలోనే గాలుడు 108 సార్లు జపం చేయగానే సిద్ధి లభించింది. భూత భవిష్యత్తులను దర్శించగలిగాడు. గాలుడు ఇంటికి వెళుతూ ధ్వజదత్తుడిని చూశాడు. కానీ, అతను గురునింద చేస్తాడన్న భయంతో మరోదారి ఎంచుకున్నాడు. అది గమనించిన ధ్వజదత్తుడు గాలుడికి అడ్డువచ్చి, అతనిలో అపూర్వ తేజస్సు చూసి అబ్బురపడ్డాడు. వెంటనే పుష్కరుడి దగ్గరికి వెళ్లి 'గాలుడికి ఎలా సిద్ధి కలిగింది? నాకు ఎందుకు కాలేదు?' అని నిలదీశాడు. అప్పుడు పుష్కరుడు 'నీకు దైవంపైనే గాని గురువుపట్ల నమ్మకం లేనందుకు' అన్నాడు. ధ్వజదత్తుడు పశ్చాత్తాపంతో పుణ్య నదీ తీరానికి వెళ్లి గురువు, దైవంపై సమాన విశ్వాసాన్ని దృఢతరం చేసి 108 సార్లు జపం చేయగానే అతనికి సిద్ధి కలిగింది. ఆంజనేయుడు ఉష్ట్ర వాహనారూఢుడై సువర్చలా సమేతంగా దర్శనమిచ్చాడు. ధ్వజదత్తుడికి అపార సంపదలతోపాటు మోక్షాన్ని కూడా ప్రసాదించాడు.

Wednesday, 2 April 2025

April రెండవ వారం కథలు

  


ఒక చిన్న కథ
అది ద్వాపరయుగం. ఒకసారి కృష్ణార్జునులు కలిసి వెళుతున్నారు. వారికి మధ్యలో ఒక యాచకుడు కనిపించాడు. చూసి జాలిపడిన అర్జనుడు అతని పేదరికం పోగొట్టేందుకు ఒక సంచీ నిండుగా బంగారు నాణేలు ఇచ్చాడు. సంతోషంగా తీసుకువెళుతున్న ఆ యాచకుడిని మార్గంమధ్యలో ఓ దొంగ కత్తితో బెదిరించి దోచుకున్నాడు.
మళ్లీ ఆ పేద బ్రాహ్మణుడు యాచకుడిలా మారి వీధుల్లో భిక్షాటన చేయసాగాడు. మళ్లీ ఓరోజు అతన్ని చూసి ఆశ్చర్యపోయిన అర్జనుడు ఈసారి ఓ ఖరీదైన వజ్రం ఇచ్చి ఆనందంగా జీవించమన్నాడు.
ఆ యాచకుడు ఈసారి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి గదిలో మూలన ఉన్న, వినియోగంలో లేని ఒక కుండలో వజ్రాన్ని దాచిపెట్టి పడుకున్నాడు. తెల్లారింది. చూస్తే భార్య లేదు. అంతేకాదు ఆ కుండ కూడా లేదు. పరుగెట్టుకుంటూ నదీతీరం వద్దకు వెళ్లాడు.
భార్యను, ఆమె చేతిలోని కుండను చూసి హమ్మయ్య అనుకున్నాడు. కుండ కింద పెట్టి చూస్తే వజ్రం లేదు. నదిలో నీళ్ల కోసం వంచినప్పుడు ప్రవాహంలోకి జారిపోయింది. తన దురదృష్టానికి ఎంతో చింతించిన ఆ బ్రాహ్మణుడు మళ్లీ యాచకుడిగా మారి వీధుల్లోకి వెళ్లాడు.
మళ్లీ కృష్ణార్జునులు అతన్ని విచారించారు ఏమైందని. ఇంక ఇతనికి సాయం చేసి ఉపయోగం లేదు బావా, ఇతనెవరో పరమ దురదృష్ణవంతుడిలా ఉన్నాడు. అన్నాడు అర్జనుడు శ్రీ కృష్ణుడితో. లేదు అర్జున. ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం అని బ్రాహ్మణుడి చేతిలో రెండు బంగారు నాణేలు పెట్టాడు శ్రీకృష్ణుడు.
ఒకప్పుడు సంచీడు బంగారు నాణేలు, విలువైన వజ్రం ఇస్తేనే నా దగ్గర నిలవలేదు. ఈ రెండు నాణేలేమైనా నా తలరాతను మారుస్తాయా నా పిచ్చికానీ అనుకుంటూ ఇంటికెళుతున్నాడు ఆ బ్రాహ్మణుడు.
దారిలో ఒక జాలరి వలకి చిక్కి విలవిలలాడుతున్న చేపను చూశాడు. అతని హృదయం ద్రవించింది. కృష్ణుడు నాకిచ్చిన రెండు నాణేలు ఎలాగూ నా తలరాతను మార్చలేవు. పాపం మూగజీవి దాని ప్రాణాలైనా రక్షిద్దాం అని తన దగ్గరున్న రెండు నాణేలూ ఇచ్చేసి ఆ చేపను తీసుకుని ఇంటికి తీసుకెళ్లి ఒక నీళ్ల గిన్నెలో ఉంచాడు.
అతని భార్య ఆ చేపను చూసి అయ్యో దాని నోటిలో ఏదో ఇరుక్కుంది అండీ అందుకే గిలగిలా కొట్టుకుంటోంది అని పిలిచింది. ఇద్దరు కలిసి ఆ చేప నోరు తెరిచి గొంతులో ఇరుకున్నది తీసి చూసి ఆశ్చర్యపోయారు. నదిలో తాము జారవిడుచుకున్న వజ్రం. ఆనందంతో ఉక్కిరిబిక్కిరై “దొరికింది...దొరికింది. నా చేతికి చిక్కింది”అని గావుకేకలు పెట్టాడు.
అదే సమయంలో అతనింట్లోకి ప్రవేశించిన *ఓ దొంగ ఈ పేద బ్రాహ్మణుడిని చూసి కంగారుపడ్డాడు. గతంలో అతన్ని దారిదోపిడి చేసి బంగారు నాణేలా సంచి దొంగలించాను,* నన్ను చూసి ఆ బ్రాహ్మణుడు కనిపెట్టాను, నాది నాకు దొరికింది అని అరుస్తున్నాడు అనుకుని వణికిపోయాడు.
ఆ బ్రాహ్మడు దగ్గరకి వచ్చి నీకు దణ్ణం పెడతాను, నీ బంగారు నాణేలు నువ్వు తీసేసుకో నన్ను రక్షకభటులకు మాత్రం పట్టివ్వద్దు అని ప్రాధేయపడ్డాడు. ఇప్పుడు నివ్వెరపోవడం బ్రాహ్మణుడి దంపతుల వంతయింది. తాము పోగొట్టుకున్న రెండు విలువైన వస్తువులూ తమకు చేరాయి. పరుగు పరుగున అర్జునుడి వద్దకు వెళ్లి కృతజ్ఞతలు చెప్పాడు.
కృష్ణా, నేను ఎంతో అమూల్యమైన స్వర్ణ నాణేలు, వజ్రం ఇచ్చినా అతని దశ తిరగలేదు. కానీ నీవిచ్చిన రెండు నాణేలు అతని జీవితాన్ని మలుపు తిప్పాయి ఎలా సాధ్యమైంది అని ప్రశ్నించాడు అర్జునుడు.
అర్జునా, అతని వద్ద బంగారం, వజ్రం ఉన్నప్పుడు అతను కేవలం తను, తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు. అదే రెండు నాణేలు ఉన్నప్పుడు మరో జీవి మంచిచెడులు, ఈతిబాధలు, కష్టసుఖాలు గురించి ఆలోచించాడు.
నిజానికి అది దేవుడి చేయాల్సిన పని. తనూ పంచుకున్నాడు. అందుకే అతని కష్టాన్ని నేను పంచుకున్నాను. ఇది అతని ధర్మ ఫలం అని ముగించాడు శ్రీకృష్ణ పరమాత్మ.

కాళిదాసు***--

ఒకసారి కాళిదాసుకూ భోజరాజుకూ అభిప్రాయ బేధాలోచ్చాయి.కాళిదాసు అలిగి వెళ్ళిపోయాడు. పక్కనే వున్న బోయీల పల్లెలో మారువేషం తో వుండసాగాడు.

రాజుగారికి కాళిదాసు లేనిదే పిచ్చి పట్టినట్లు వుంది.కొంతమంది అసూయాపరులైన కవులు కుట్ర చేసి తనకూ కాళిదాసుకూ విభేదాలు సృషించారని తెలుసుకొని,కాళిదాసును అవమానించినందుకు పశ్చాత్త్తాప పడ్డాడు. ఆయనను తిరిగి రప్పించాలని చారులను పంపించాడు.

వాళ్ళు ఆయన బోయీలతో పాటు వుండి  పల్లకీలు మోస్తున్నట్టు చెప్పారు. రాజు ఆయనను కని పెట్టాలని పల్లకీ లో తాను విహారం వెళ్లాలని బోయీలను పిలిపించాడు. పల్లకీ లో వెడుతున్నప్పుడు భోజరాజు  "అయ  మాందోలికా దండ స్తవ బాధతి  కిం భుజే"కావాలనే తప్పుగా చదివాడు 'బాధతే' బదులుగా 'బాధతి' అని చదివాడు. జవాబు రాలేదు. రోజూ బోయీలను మారుస్తూ రాజ్యములో తిరుగుతుండే వాడు.రోజూఅదే శ్లోకం చదివే వాడు. సమాధానం రాలేదు.

ఐదవరోజు    ఆయన ఆశ్లోకం చదవగానే పల్లకీ మోస్తున్న కాళిదాసు వుండబట్టలేక " "నాయమాం దోలికా దండ స్తవ 'బాధ తి' బాధతి"

ఈ పల్లకీ దండము నన్ను బాధించుట లేదు కానీ మీ 'బాధతి' అనే శబ్దము నన్ను బాధిస్తూ వుంది. ఆ సమాధానము విని నంతనే రాజు పల్లకి ఆపించి దిగి కాళిదాసును కౌగలించుకొని క్షమించ మని వేడి  ఆపల్లకీలోనే తనప్రక్కన కూర్చోబెట్టుకొని మరీ రాజ్యానికి తీసుకొని వచ్చాడు.

సంస్కృతం లో ఒక్క పదం తేడా వచ్చినా అర్థం మారిపోతుంది. కవులు అప శబ్దమును సహించలేరు. అందుకనే కాళిదాసు బయట పడ్డాడు. రాజుకు కావలిసిందీ అదే.
అందుకే పెద్దవాళ్ళు 'లలితా సహస్ర నామము"విష్ణు సహస్ర నామము" మొదలైన స్తోత్రాలను నేర్చుకునే టప్పుడు మంచి గురు ముఖంగా నేర్చుకోవాలని చెప్తారు. నామము చెప్పేటప్పుడు ఏవిధమైన అప శబ్దము రాకూడదు.అని. అలా చదవడం వల్ల మేలు కన్నా కీడే ఎక్కువ అని చెప్తారు.
*****
               *కర్మ సిద్థాంతం*

*ఇది చాలా కఠినమైనది ఎవ్వరికీ అర్థంకాదు*

*మహాజ్ఞానులను కూడా మోసం చేస్తుంది*

"కర్మను"  అనుభవించాలి ..... నిందిస్తే ప్రయోజనం లేదు .

రమణ మహాశయలు వారు ప్రతిదినము  స్నానం కొరకు  నదికి పోతుండేవారు.

ఆయన వెంట కృష్ణా  అను భక్తుడు పోయెడివాడు.

ఒకనాడు రమణ మహాశయులు నదికి పోతుంటే ఉన్నట్టుండి , తన వెనుకనున్న కృష్ణా  తో  "కృష్ణా ! నేను కట్టుకున్న పంచెను కొంచెం చించు". అని అన్నారు. కృష్ణా కు అర్ధం కాలేదు. వారిద్దరూ ఒకరి వెనుక ఒకరు నడుస్తూనే ఉన్నారు. ఇంతలో ఒక ఇటుక వచ్చి రమణ మహాశయుల కాలివేలు మీద పడినది . కాలి వేలు చితికింది . రక్తం కారుతోంది  . ఆ రక్తాన్ని ఆపేందుకు రమణ మహాశయులు పంచెను చింపమన్నారని అర్థం చేసుకున్నాడు, ష్ణా అప్పుడు గ్రహించాడు, వెంటనే రమణ మహాశయుల పంచెను చింపి, కట్టు కట్టాడు. అనుకోకుండా జరిగిన ఆ సంఘటన గుర్తించి , రమణ మహాశయులతో "మహారాజ్ ! ఇటుక వచ్చి మీ కాలివేలు మీద పడుతుందనే విషయము ముందే మీకు తెలుసు కదా !   మరెందుకు ఆ ఇటుక దెబ్బనుంచి తప్పుకోలేదు ?"  అని ప్రశ్నించాడు.

అప్పుడు రమణమహాశయులు కృష్ణా తో … "ఆలా జరగదు కృష్ణా పక్కకితప్పుకొంటే , ఎప్పుడో ఒకప్పుడు వడ్డీతో సహా కర్మను అనుభవించాల్సిందే!

రుణం ఎంత తొందరగా తీరిపోతే అంత మంచింది కదా !" అని అన్నారు.

కర్మ శేషాన్ని ఎవరయినా అనుభవించ వలసిందే.✍️
                       🌷🙏🌷


*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

ధర్భల మహిమ.....*

తులసి, ధర్భలు, బిల్వదళములు వున్న స్ధలం పరమ పవిత్రమైనదిగా భావిస్తారు.

ఒక విధమైన  గడ్డి జాతికి చెందిన ధర్భ మొక్కలు శ్రీ రాముని  స్పర్శ చేత  పునీతమై , ఆ ధర్భలను పవిత్ర కార్యాలకు వినియోగించబడుతున్నది.
ధర్భలకు ఉష్ణ శక్తి ఎక్కువ.   జలాన్ని శుభ్రపరుస్తుంది. విషానికి విరుగుడు గుణం కలది. గ్రహణ కాలంలో వ్యాపించే విషక్రిమి నాశనానికి  ఉప్పు కలిపిన పదార్థాలలో ధర్భలు వేసి వుంచడం గమనించవచ్చును.

ధర్భలని సంస్కృతం లో 'అగ్ని గర్భం' అంటారు. కుంభాభిషేకాలలోను యాగశాలలో ని కలశాలలోను‌ ,బంగారు, వెండి తీగలతో పాటుగా
ధర్భలను కూడా  తీగలుగా చుట్టి ఉపయోగిస్తారు.

ధర్భలలో కూడా స్త్రీ , పురుష  , నపుంసక జాతి ధర్భలని మూడు రకాలు వున్నాయి. పురుష జాతి దర్భలు అడుగు నుండి చివరికొసదాకా సమానంగా వుంటాయి. పై భాగంలో  దళసరిగా వుంటే అది స్త్రీ ధర్భ గా గుర్తిస్తారు. అడుగున దళసరిగా వున్న ధర్భను నపుంసక ధర్భ గా తెలుసుకోవచ్చును.
ధర్భల దిగువ భాగంలో   బ్రహ్మకు ,  మధ్యస్థానంలో  మహావిష్ణువుకు , శిఖరాన  పరమశివునికి   నివాసంగా భావిస్తారు.

దేవతలను తలచుకొని యిచ్చే తర్పణాలు ధర్భ కొసలతోను,  మానవులను  తలచి యిచ్చే తర్పణాలలో ధర్భల మధ్యభాగం నుండి, పితృదేవతలను  తలచుకొని యిచ్చే తర్పణాలలో ధర్భను మడిచి కొసలతోనూ  తర్పణాలు సమర్పించడం విధాయకంగా వుంది.

వైదికకార్యాలలో "పవిత్రం" అనే పేరుతో ధర్భతో చేసిన ఒక ఉంగరాన్ని కుడి చేతి  ఉంగరం వేలికి ధరింపజేసి ఆయా కార్యాలను ఆచరింపజేస్తారు .ఈ వ్రేలిలో కఫనాడి వుండడం వలన యీ ఉంగర ధారణవలన  కఫం శుభ్రం  చేయబడుతోంది.

ప్రేత కార్యాలలో  ఒక ధర్భతోను, శుభ కార్యాలలో  రెండు ధర్భలతోను, పితృ కార్యాలలో మూడు ధర్భలతోను , దేవ కార్యాలలో నాలుగు ధర్భలతోను‌,  ఆ ధర్భ ఉంగరాన్ని  ముడి వేస్తారు.
దేవతారాధన, జపం, హోమం, దానం తర్పణం  వంటి కార్యాలలో ధర్భతో చేసిన  'పవిత్రం'అనే యీ ఉంగరాన్ని తప్పనిసరిగా ధరించాలి.

ధర్భగడ్డిలో పులుపు, క్షార గుణాలు వుండడం వలన రాగి విగ్రహాలను , బూడిద  ధర్భలు ఉపయోగించి  శుభ్రపర్చాలని శిల్ప శాస్త్రం చెప్తోంది. ఇందు వలన శిల్పాలలోని ఆవాహన మంత్ర శక్తి  తరగకుండా చాలా రోజులు ప్రకాశవంతంగా వుంటాయని శాస్త్రజ్ఞులు చెపుతారు.

ఆదివారమునాడు కోసిన ధర్భలను ఒక వారముపాటు ఉపయోగించవచ్చును. అమావాస్యనాడు కోసి తీసుకుని వస్తే
ఒక మాసం వరకు ఉపయోగించవచ్చును.
పౌర్ణమినాడు కోసి తెస్తే పదిహేను రోజులు ఉపయోగించ వచ్చును.

శ్రావణమాసం లో కోసిన ధర్భలైతే తీసుకుని వస్తే ఒక ఏడాది ఉపయోగించ వచ్చును.  భాద్రపద మాసంలో తీసుకుని వస్తే ఆరు మాసాలు ఉపయోగించ వచ్చును. శ్రాధ్ధ కార్యాలకోసం తెచ్చిన ధర్భలను ఏ రోజు కా రోజే  ఉపయోగించాలి. తిరునల్లారు శైవక్షేత్రంలో  ధర్భలే స్ధల వృక్షం. ఈ క్షేత్రంలో నెలవైయున్న ఈశ్వరుని పేరు ధర్భారణ్యేశ్వర🙏🙏🏻

*****
*నేటి జీవిత సత్యాలు*

రచన.. మల్లాప్రగడ రామకృష్ణ

ఎవరికి ఎవరో సొంతము, ఎంతవరకీ బంధము, ఎదలో ఆలోచనలు ఎటు పోతాయో, ఏ విధంగా ఇటు మారుతాయో, ఎవరికి ఎరుక, ఏ విధంగా తెలపా, పాదయాత్ర వలన పదవి రావచ్చును, కాశీ యాత్ర వలన గతులు మారవచ్చును, సూత్రాల వలన యాత్రలు అంటే భవిష్యత్తు దగ్గరగా ఉండవచ్చును, భూమి మహావేగముగా తిరుగుతుండగా, నెమ్మదిగా కదులుతున్నదా,   ఎలా చెప్పగలరు, మొక్కలు పెరుగుతూనే ఉంటాయి, కాలం కదులుతూనే ఉంటుంది, శ్రీ మాతా కన్నులు సమస్తము వీక్షించును, పర్యవేక్షించును, రక్షించును, కన్నులతో సమస్త సృష్టి గావించి, పోషించగలుగుతుంది.

ప్రతి ఒక్కరికి శత్రువులు, మిత్రులు, వెంటపడే ఉంటారు కాలంతో పాటు, కదలిక తో వారు వెన్నంటే ఉంటారు, శ్రమ, శక్తి, భక్తి, యుక్తి, నేర్పు, మార్పు, కూర్పు, బట్టి జీవితంలోకి వచ్చి పోతూ ఉంటారు. ఎవరు ఎంతవరకు ఉంటారో ఎవరు చెప్పలేరు, సూర్యోదయం వెంటనే మనిషి ఆలోచనలు ఏ విధంగా ప్రభావితం అవుతాయో ఎవరూ చెప్పలేరు.

భగవద్గీతలో 16 వ అధ్యాయంలో భగవంతుడే ఈ విధంగా తెలియపరిచాడు ఇతర శత్రువులు కూడా వధించబడుదురు. నేనే భోక్తను పూర్తి శక్తివంతుడను మరియు సుఖిని నేనే. భాగ్యవంతులైన బంధువులతో కూడియుండు నేనే అత్యధిక ధనశాలిని.

ప్రాణం వల్ల స్వభావాలు వ్యవహారాలు తారుమారు కావు. అన్ని యధావిధి గానే ఉంటాయి మరి మార్పు వచ్చేది అవగాహన మాత్రమే ఆలోచన మాత్రమే, ఆదర్శం మాత్రమే, ఆకర్షణ మాత్రమే,ఆరోగ్యం మాత్రమే, అనుభవం మాత్రమే, ఆత్మీయులలో వచ్చే కలహాల పర్యవసానం మాత్రమే, జీవితం నల్లేరు తీగల కదులతూ, భయభ్రాంతుల మధ్య, సుఖశాంతుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెలు మధ్య ఆదర్శాలు తక్కువగా ఉండి మనిషి మనిషి మధ్య భేదాభిప్రాయాలు ఎక్కువగా ఉండి, కాలు ఏ దిక్కున నడిపిస్తుందో ఎవరు ఏ విధంగా చెప్పాలో, ఏ విధంగా చెప్పలేరు, అనేది తెలియకుండా మానవత్వాన్ని నిలబెట్టడానికి కారణాలు ఏమిటో, తెలియకుండా జీవితం సాగిపోవటమే, శక్తిలో అందరూ ఉన్నారు.

కాబట్టి అందరిలోనూ శక్తి ఉన్నది నేను అనే పరమాత్మ అందరిలో ఉన్నారు కాబట్టి అందరిలోనూ జీవాత్మ జీవమై ఉన్నది జగతి రూపంగా ఉన్నది దేవుడైన గ్రహించు ఈ ప్రపంచాన్ని ఎంత మేలు చేయగలవు చెయ్యి, అదంతా భగత్సేవేనని భావించు.

కధ కంచికి మనం ఇంటికి
అనేది ఒక ఆలోచన కాదు, కంచి అనగా భూలింగం, "కథ కంచికి అనగా " మరణించిన మన భౌతిక దేహాన్ని ఈ భూలోకంలోని వదిలేస్తామని గ్రహించాలి. మనం ఇంటికి అనగా" ఆత్మ పదార్థం తన స్వస్వరూపమైన మహా మూల చైతన్యానికి చేరుతుందని అంతరార్థం తెలుసుకోలేనటువంటి మానవ జన్మ అవటం వలన తెలపలేకపోతున్నాము.

పక్షులకు ఆకాశమే బలము, చాపలకు జలమేయ బలము, అడుగు వర్గం వారికి రాజే బలము, పసిపాపలకు ఏడుపే బలము, బ్రాహ్మణులకు సంధ్యావందనము బలము మరియు ఐశ్వర్యము.

మనిషి తన మనుగడని మర్చిపోతున్నాడు అతి తెలివి గర్వము పొగరు నాకేంటి అనే అహంకారంతో విచక్షణ రహితంగా ప్రవర్తిస్తూ మృగాలని తలపిస్తున్నాడు.

అందుకే నేమో రోజురోజుకీ పతనం అయిపోతుంది సమాజంలో మానవ వ్యవస్థ.

ఎవడి ఇల్లు వాడికి దిద్దుకోవడం చేతకాదు పక్కింట్లో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి కావాలి,

ఈర్ష ద్వేషాలతో నిండిపోయి జీవితాన్ని అతలంకుతలం చేసుకుంటూ, పక్కవాడిని కూడా ప్రశాంతంగా బతకకుండా చేస్తున్నారు.

పశువుల కూడా ఒక నీతి ఉంటుంది, ఒకదానికి కష్టం వస్తే పోలో మంట్ అవి వచ్చి జేరతాయి,

ఈ మనుషులేంటి,ఇంతలా దిగజారిపోతున్నారు స్వార్థంతో కూలిపోతున్నారు. మనం ఎలా ఆలోచిస్తే మనకు అలాగే జరుగుతుంది.

ఈరోజు సమాజంలో రేపు మీ ఇంట్లో ఆ బాధ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు ఒకసారి ఊహించి చూడు.

ప్రకృతి ప్రళయాలు ఏ క్షణంలో ఎలా ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు అయినా ఆశ దురాశ నేనింతే అనుకున్నప్పుడు మరొకరిని వేలెత్తి చూయించకు.

మళ్లీ చెప్తున్నాను నువ్వు ఏదైతే ఇస్తావు అదే తిరిగి నీకు వస్తుంది. ఇంతై అంతయి అనంతమై.

యవ్వనంలో మొటిమలు సహజం, ముసలి తనలో ముడతలు సహజం, యవ్వనంలో " స్త్రీ " చేయి పట్టుకోవాలని ఆశపడతాం, ముసలితలను ఎవరి చేయి పట్టుకుంటారో అని ఎదురు చూస్తాం, యవ్వనంలో ఒంటరిగా వదిలేస్తే బాగుంటుందనుకుంటాం, వృద్ధాప్యంలో ఒంటరిగా వదిలేస్తున్నారే అని బాధపడతాం, యవ్వనంలో సలహాలు ఇస్తే చికాకు, వృద్ధాప్యంలో సలహాలు పాటించలేని పరిస్థితిగా వాక్కు, యవ్వనంలో అందాన్ని ఆస్వాదిస్తాము, వృద్ధాప్యంలో అందాన్ని దైవంలో చూసుకుంటూ బ్రతకాలని ప్రయత్నిస్తాము. యవ్వనంలో ప్రతిక్షణం పండుగగా భావిస్తాము, వృద్ధాప్యంలో తీపి జ్ఞాపకాలు నెమరు వేస్తూ జీవితాన్ని సాగించాలని  ప్రయత్నం చేస్తూ ఉంటాము. జీవితమనేది ఆటుపోట్ల సంగ్రామం, ధైర్యంగా శక్తిగా యుక్తిగా జీవిత లక్ష్యంగా జీవనాన్ని గడిపిన వాడికి జీవితంలో కష్టం అనేది తెలియక సుఖంగా జీవించగలుగు తాడనేది సర్వ ప్రకృతి అనుకూలిస్తుందని, నిజమైన జీవితా అనుభవం తెలియపరుస్తుంది.

యవ్వనంలోనైనా ముసలితనంలోనైనా ఉన్న సత్యాన్ని గ్రహించే జీవితం చాలా ప్రశాంతంగా సాగిపోతుందనేది అందరి యొక్క నమ్మకం అదే నిజం అదే నిజం అదే నిజం.

   ఇంకా వుంది.

******

ఒక వ్యక్తికి 4 భార్యలు 4వ భార్య అంటే చాలా ప్రేమ అతనికి, ఆమెకోరిన కోరికలన్నీ తీర్చేవాడు.అపురూపంగా చూసుకునేవాడు.
మూడవ భార్య అన్నా ఇష్టమే. కానీ తన గురించి మంచిగా స్నేహితులదగ్గర చెప్పేవాడు కాదు. తను వారితో వెళ్ళిపోతుందేమో అన్న భయంతో..

2వ భార్యదగ్గరికి తనకు ఏదైనా సమస్య వస్తేనే వెళ్ళేవాడు.ఆమెకూడాఅతని సమస్యను తీర్చి పంపేది.

*మొదటి భార్య అంటే అస్సలు ఇష్టమే ఉండేదికాదు. ఆమెను అస్సలు పట్టించుకునేవాడే కాదు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి*

అతని ఆరోగ్యం క్షీణించిపోయింది.ఇక తను బ్రతకను అని తెలిసిపోయి తనమీద, ఎవరికి నిజమైన ప్రేమ ఉందో తెలుసుకోవడానికి తన నాలుగవ భార్యను పిలిచాడు.

నేను మరణానికి అతి దగ్గరలో ఉన్నాను.నిన్ను చాలా ప్రేమగా  చూసుకున్నాను కదా! నాతో పాటు నువ్వు కూడా వచ్చేసేయ్. మరణంలో కూడా నాకు నీతోడే కావాలి అని అన్నాడు. 4వ భార్య అది విని అతనికి దూరంగా జరిగిపోయింది.

ఆశ్చర్య చకితుడై తన మూడవ భార్యను ఇదే కోరాడు.3వ భార్య ఇలా అంది. ఇన్ని రోజులు నీతోనే,నీ దగ్గరే ఉన్నాను.నీ అవసరాలన్నీ తోర్చాను
ఇక నాకు నీతో పనిలేదు.వేరేవారి దగ్గరికి వెళ్ళిపోతున్నాను:"

బాధతో ఏడుస్తూ తన 2వ భార్యను ఇలాగే అడిగాడు. నేను నీతో పాటు నీ శవయాత్రలో పాల్గొనేంత వరకు నీవెంట ఉంటాను
తరువాత నేను వెళ్ళిపో్తాను.నిన్ను అప్పుడప్పుడు తలచుకోగలను.అంది.

ఇంత ప్రేమగా చూసుకున్న ఈ ముగ్గురూ ఇలా అనేసరికి ఇక మొదటి భార్యను బాగా నిర్లక్ష్యం చేశానుకదా తనని అడగడం వృద్ధా అని భావిస్తుండగా

*మొదటిభార్య తలుపు చాటునుండి ఇలా అంది.మీరు నన్ను ఎంత నిర్లక్ష్యం చేసినా నేను మాత్రం మీ వెంట మీ చివరి పయనం దాకా తప్పక వస్తాను.మీరేమీ బాధపడకండి"*

అతని కంట నీరు ఆగకుండా ప్రవహిస్తూనే ఉంది.కాబట్టి మనిషి దేన్నీ, ఎవరినీ నిర్లక్ష్యం చేయకూడదు. మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ
తెలియదు.పోయే ముందు తెలుసుకుని ప్రయోజనం ఉండదు.

నిజం చెప్పాలంటే మనం అందరం నలుగురు భార్యల్తోనే ఉంటున్నాము. అదేంటి అలా అంటున్నారు అని ఆశ్చర్యంగా ఉందా???????

*4వ భార్య, మన శరీరం*
*3వ భార్య, సంపద, ఆస్థిపాస్తులు*
*2వ భార్య నేస్తాలు, బంధువులు*
*మొదటి భార్య, మన ఆత్మ*

నిజమే కదా! దయచేసి మన ఆత్మ చెప్పిన దాన్ని ఆచరించండి. పెడచెవిన పెట్టి నిర్లక్ష్యం చేయకండి.సరేనా!
****
            *ఒకసారి కాళిదాసుకూ భోజరాజుకూ అభిప్రాయ బేధాలోచ్చాయి. కాళిదాసు అలిగి వెళ్ళిపోయాడు. పక్కనే వున్న బోయీల పల్లెలో మారువేషంతో ఉండసాగాడు.*

             *రాజుగారికి కాళిదాసు లేనిదే పిచ్చి పట్టినట్లు ఉంది. కొంతమంది అసూయాపరులైన కవులు కుట్ర చేసి తనకూ కాళిదాసుకూ విభేదాలు సృషించారని తెలుసుకొని, కాళిదాసును అవమానించినందుకు పశ్చాత్తాప పడ్డాడు. ఆయనను తిరిగి రప్పించాలని చారులను పంపించాడు.*

              *వాళ్ళు ఆయన బోయీలతో పాటు వుండి  పల్లకీలు మోస్తున్నట్టు చెప్పారు. రాజు ఆయనను కని పెట్టాలని పల్లకీ లో తాను విహారం వెళ్లాలని బోయీలను పిలిపించాడు. పల్లకీ లో వెడుతున్నప్పుడు భోజరాజు*

      *"అయ  మాందోలికా దండ స్తవ బాధతి  కిం భుజే"*

          *కావాలనే తప్పుగా చదివాడు ''బాధతే'' బదులుగా ''బాధతి'' అని చదివాడు. జవాబు రాలేదు. రోజూ బోయీలను మారుస్తూ రాజ్యములో తిరుగుతుండే వాడు. రోజూ అదే శ్లోకం చదివే వాడు. సమాధానం రాలేదు.*

              *ఐదవరోజు ఆయన ఆశ్లోకం చదవగానే పల్లకీ మోస్తున్న కాళిదాసు ఉండబట్టలేక "*

*"నాయమాం దోలికా దండస్తవ ''బాధ తి'' బాధతి"*

           *ఈ పల్లకీ దండము నన్ను బాధించుట లేదు కానీ మీ ''బాధతి'' అనే శబ్దము నన్ను బాధిస్తూ వుంది. ఆ సమాధానము వినినంతనే రాజు పల్లకి ఆపించి దిగి కాళిదాసును కౌగలించుకొని క్షమించమని వేడి  ఆ పల్లకీలోనే తనప్రక్కన కూర్చోబెట్టుకొని మరీ రాజ్యానికి తీసుకొని వచ్చాడు.*

         *సంస్కృతంలో ఒక్క పదం తేడా వచ్చినా అర్థం మారిపోతుంది. కవులు అప శబ్దమును సహించలేరు. అందుకనే కాళిదాసు బయట పడ్డాడు. రాజుకు కావలిసిందీ అదే.*

          *అందుకే పెద్దవాళ్ళు ''లలితా సహస్ర నామము,విష్ణు సహస్ర నామము" మొదలైన స్తోత్రాలను నేర్చుకునేటప్పుడు మంచి గురు ముఖంగా నేర్చుకోవాలని చెప్తారు. నామం చెప్పేటప్పుడు ఏవిధమైన అప శబ్దము రాకూడదుఅని. అలా చదవడం వల్ల పొందాల్సిన ప్రయోజనం పొందలేకపోతాం!*

*🌹🌹🌹*

సద్వినియోగం
ఒకరోజు బుద్దుడికి ఒక దుప్పటి కనుగోలు చేస్తున్న ఒక యువకుడు కనిపించాడు. ఈ "దుప్పటి కొన్నాళ్ళకు చినిగిపోతుంది కదా!అప్పుడు దాన్నేం చేస్తావన్నాడు" బుద్దుడు." దీన్ని రెండు ముక్కలుగా చింపి అంగవస్త్రంగా వాడుకుంటాను."అన్నాడు ఆ యువకుడు.మరి అవి కుాడా చినిగిపోతే అన్నాడు బుద్దుడు." ముక్కలుగా చేసి ఇల్లు తుడవడానికి వాడుకుంటాను.అన్నాడు.

అది కుాడా ముక్కలైపోతే అన్నాడు బుద్దుడు.!

ఆ ముక్కలన్నింటిని మట్టితో పిసికి బొమ్మలు చేస్తాను.ఆ బొమ్మలు అమ్మగా వచ్చిన డబ్బు తో మరో కొత్త దుప్పటి కొనుక్కుంటాను" అన్నాడు నవ్వుతూ ఆ యువకుడు.

ఈ మాటలకు బుద్దుడు సద్వినియోగం చేసుకోవడం అంటే ఇదేమరి అని తన శిష్యులకు చెప్పాడు..!!

మహాత్మాగాంధీ కుాడా సద్వినియోగం చేసుకోవడం సబర్మతి ఆశ్రమంలో వుండే తన సహచరులకు ఎప్పుడుా చెపుతుండేవారట.

ఒకనాడు చిటికెన వేలంత పెన్సిల్ కనపడలేదు..పుస్తకాలకింద అలసిపోయెాదాక వెదుకుతూ వున్నారంట..అప్పుడు ఒక శిష్యురాలు వచ్చి " బాపు ఇదిగో కొత్త పెన్సిల్ తీసుకోండి..అంది…"నేను కొత్త పెన్సిల్ కావాలని అడగలేదే?!

నా పెన్సిల్ కోసం వెదుకుతున్నాను..అన్నారట మహాత్ముడు .

బాపు చిన్న కాగితం కుాడా వ్యర్దం చేసే వారు కాదట.తనకు వచ్చిన ఉత్తరాల వెనకాల వున్న ఖాళీ ప్రదేశంలో ఏదో ఒకటి రాసే వారట.

బాపు కాగితాలు చాలా వున్నాయి వాడుకోండి అంటే " వద్దు..పేపర్ కోసం వాడే వెదురు చెట్లు బౌవిషిత్ తరాలకు అయిపోవచ్చు..అందుకని కాగితాన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలి.

అనవసరమనిపిస్తే ఉప్పు కుాడా ఎక్కువగా వడ్ధీంచుకోవద్దు…అని ఆశ్రమం గోడ మీద రాసి వుంచే వారంట.

వస్తువుల్ని సద్వినియోగం చేయడం చాలా మంచి అలవాటు …ఎందుకంటే భౌవిషిత్ తరాలకి అన్ని అందక పోవచ్చు తరిగిపోవచ్చు…ఆ లక్ష్యం మనసులో వుంటే ఆహారం నీరు వ్యర్థం చేయము.

ప్రతి వస్తువు అయిపోయాక ఏదో ఒక పనికి ఉపయెాగపడుతుంది…కొనడం మాసిపోయిందనీ పాత ది అయిందనీ పారేయడం వలన వాతావరణం ప్రకృతి కాలుష్యం అవుతుంది …బుద్దుడి కధ లో లాగా అది చివరికి మట్టిలో కలిసే వరకు ఉపయెాగించడం వలన ఎంతో ఉపయెాగముంటుంది.

మహాదేవుడు శివుడు కుాడా ఒక సంధర్భంలో అడవుల్ని కొట్టి వేసి జంతువుల్ని చంపివేసేవారికి తాను కఠిన శిక్ష వేస్తాన నీ చెప్పారు. ఈ జగత్తును పాలించే శివుడు కుాడా జనులకు ఐశ్వర్యము ప్రసాదించే వారైనప్పటికి….పట్టుపీతాంబరాలు ధరించక….

పులి లేదా ఏనుగు మరణించిన తరువాత లభింే వాటి చర్మం ధరిస్తాన నీ చెప్పారు…బ్రతికిన దాన్ని చంపి దాని చర్మం నేను ధరించను…అని వారే స్వయంగా రుషులకు జ్ఞాన త త్సంగంలో చెప్పెవారు…

విచ్చలవిడిగా వస్తువుల్ని నీటిని ఆహారాన్ని ప్రకృతి ని వ్యర్దం చేయడం తనకు ఆగ్రహం తెప్పిస్తుందనీ చెప్పెవారు..!!

మన వంతు బాధ్యత గా ప్రకృతి ని కాపాడుకోవాలి…మితంగా జీవిస్తుా పరిమితంగా వస్తువుల్ని వినియెగించుకోవాలి.ఎందుకంటే… రాబోయే తరాల కోసం…

అలాగే కాలాన్ని కుాడా సద్వినియోగం చేసుకోవాలి…కాలాన్ని సద్వినియోగం చేయకుండా సోమరితనం నిద్ర తో వ్యర్దపు మాటలతో కాలాన్ని దుర్వినియోగం చేసేవారికి కాలసర్పదోషం తగులుతుందనీ జ్యోతిషులు అంటారు..అదే కాలసర్ప దోషమంటే…!

కాలసర్ప దోషానికి పరిహారం కేవలం కాలాన్ని దుర్వినియోగం చేయకుండా మంచి పనులు మంచి మాటలు , వారి వారి బాధ్యతల్ని ధర్మం గా నిర్వహించడమే…భగవంతుని ధ్యానం , జపం పుాజ యెాగ సాధన , ఆధ్యాత్మిక సాధన చేయడం…పరోపకారం పరమ ధర్మంగా భావించడమే ..కాలాన్ని సద్వినియోగం చేయడం…!
*******

*మాతృప్రేమ*

               ➖➖➖

*మాతృప్రేమ ముందు ఈ సృష్టిలో ఏ శక్తీ నిలువలేదు..!*

*శివాజీ  రాయగఢ్ కోట శత్రువులకు అభేద్యంగా కట్టుదిట్టంగా ఉండేది.*

*ప్రొద్దున ఆఱింటికి తెఱిచిన కోట తలుపులు రాత్రి తొమ్మిదిగంటలకు మూయబడుతాయి.*

*ద్వారం మూసి ఉన్న సమయంలో చీమకూడా లోనినుండి బైటికి వెలుపల నుండీ లోనికి రాకూడదు.*

*ఇది ఛత్రపతి శివాజీ ఆజ్ఞ!*

*రాజ్య రక్షణార్థం ఇట్టి కట్టుదిట్టాలు తప్పలేదు.*

*ఎట్టి పరిస్థితులలోనూ రాత్రి తొమ్మిది తరువాత కోట ద్వారం తెఱవబడదు.*

*’హీరాకానీ’ అనే గ్రామవాసి రోజూ కోటలో ఉన్న అధికారులకు, సైనికులకు పాలుపోయటానికి వచ్చేది.*

*అందఱికీ తనకు చేతనైన సహాయం చేసేది.*

*ఇలా ఉండగా ఒక రోజు సాయంకాలం పాలుపోయటానికి కోటలోకి వచ్చింది హీరాకానీ.   ఒక సైనికుడి భార్య ప్రసవవేదన పడుతున్నదని తెలిసి అక్కడే ఉండి ఆమెకు సహాయం చేసింది. పురుడు అయ్యేదాకా అక్కడే ఉన్నది. ఇంటికి వెళదామని సమయంచూస్తే తొమ్మిది దాటిపోయింది.*

*పరుగులుతీసి కోటగుమ్మం చేరింది హీరాకానీ.*

*కావలి వాళ్ళు హీరాకానీ చాలా మంచిది అని అభిమానం ఉన్నా రాజాజ్ఞ ధిక్కరించలేక తలుపులు తీయలేదు.*

*“అయ్యో! ఇంట్లో ఉన్న పసిపిల్లవాడికి ఆకలివేస్తుంది. వాడికి పాలివ్వాలి” అని ప్రాధేయపడింది.*

*హీరాకానీ మీద జాలి పడిన కావలి వాళ్ళు “తల్లీ రాజాజ్ఞ మేము మీఱలేము. ఈ ఒక్క పూటకి  ఈ సైనికుని ఇంట్లోనే పడుకో. ఉదయం అవ్వంగానే నిన్ను మేమే స్వయంగా పంపిస్తాము” అని ఊఱడించినారు.*

*మఱునాడు ప్రొద్దురాగానే కావలివాళ్ళు హీరాకానీని వెదకసాగారు. ఎక్కడైనా ఆదమఱచి నిద్రపోయిందేమో లేపి ఇంటికి పంపుదామనుకున్నారు.*

*అలా వెదుకుతున్న వారికి కోటగోడ వద్ద హీరాకానీ పాల పెరుగు కుండ కనిపించింది.*

*పైకి చూసేసరికి ఆమె పూసల గొలుసు కోటమీద రాయికి వ్రేలాడుతూ కనిపించింది.*

*ఆశ్చర్యపోయిన కావలివాళ్ళు శివాజీకి ఈ విషయం విన్నవించారు.*

*ఒక స్త్రీ అభేద్యమైన కోట అర్ధరాత్రి ఒంటరిగా దాటడమా? అది ఎలా సాధ్యం అని నివ్వెరపోతూ స్వయంగా పరిస్థితిని పరిశీలిద్దామని అక్కడికి వచ్చాడు శివాజీ.*

*ఇంతలో ‘హీరాకానీ’ రానేవచ్చింది. వణుకుతూ శివాజీ ముందు నిలబడి “అయ్యా! రాత్రి పాలకై ఏడుస్తున్న నా బిడ్డడు గుర్తుకు వచ్చాడు. ఇక ఏ దారీ తోచలేదు. కోటగోడలెలా దాటానో నాకే తెలియదు. కొండలూ గుట్టలూ తుప్పలూ ఆ నడిరాత్రి ఎలా దాటానో కూడా తెలియలేదు. నా బిడ్డ ఒక్కడే నాకు జ్ఞప్తిలో ఉన్నాడు. నా తప్పు క్షమించండి ప్రభూ!” అని ప్రార్థించింది హీరాకానీ.*

*శత్రువులకు సింహస్వప్నమైన ఛత్రపతి కళ్ళు చెమ్మగిల్లాయి. ‘హీరాకానీ’కి అందఱూ చూస్తుండగా         సాష్టాంగ వందనం చేశాడు! “అమ్మా! మాతృప్రేమ ముందు ఈ సృష్టిలో ఏ శక్తీ నిలువలేదు. ఇక ఈ కోటగోడలెంత? ఇక్కడ కట్టబోయే బురుజుకు నీ పేరే పెడతాను” అని ఆమెను పంపివేశాడు అమ్మ విలువ తెలిసిన శివాజీ.*

*ఇప్పటికీ ఈ బురుజు ‘హీరాకానీబురుజు’ అనే పిలవబడుతోంది.*🙏
*****విధి... చక్కని సందేశం...

ఇంద్రుడి భార్య ఇంద్రాణి ఒక చిలుకను పెంచుతూ ఎంతో ప్రేమగా చూసుకునేది. ఒకరోజు ఆ చిలుకకు జబ్బు చేసింది. దిగులుపడి చిలుకను వైద్యునికి చూపించింది.

ఆ వైద్యుడు ఇక చిలుక బ్రతకడం కష్టమని చెప్పాడు.

ఆ మాటా విన్న ఇంద్రాణి పరుగుం పరుగున ఇంద్రుని వద్దకు వెళ్లి, "మీరేం చేస్తారో నాకు తెలియదు. నా చిలుకకు బ్రతికించండి. లేదంటే నేనూ చని*పో*తాను" అని కన్నీరుపెట్టుకుంది..!

దానికి ఇంద్రుడు... “దీనికే ఇంత ఏడవడం ఎందుకు.!? అందరి తలరాతలు వ్రాసేది బ్రహ్మా? కదా.! నేను వెళ్ళి ప్రార్ధిస్తాను. నువ్వేం దిగులు పడకు… అని బ్రహ్మ దగ్గరికి ఇంద్రుడు వెళ్ళాడు.

ఇంద్రుని ద్వారా విషయం తెలుసుకున్న బ్రహ్మ.! "నేను తలరాతలు మాత్రమే వ్రాస్తాను. దాన్ని అమలు పరిచేది మహావిష్ణువు.! కావున మనం విష్ణువు దగ్గరికి వెళదాం "పద.." అంటూ బయలుదేరారు.

వీరి రాకను గమనించిన విష్ణువు వారిని ఆహ్వానించి విషయం తెలుసుకున్నారు.

"నిజమే ప్రా*ణాలు కాపాడేవాణ్ణి నేనే…! కానీ..! చిలుక ప్రాణం చివరి దశలో ఉంది.! మళ్ళీ ఊపిరి పోయాలంటే శివునికే సాధ్యం.! మనం ముగ్గురం శివుని ప్రార్థిద్దాం పదండి... " అన్నారు.

అందరూ శివుని దగ్గరికి వెళ్లి విషయం చెప్పారు. శివుడు ఇలా అన్నారు.

ఆయుష్షు పోసేది నేనే కానీ ప్రా*ణం తీసే పని యమధర్మరాజుకు అప్పచెప్పాను.. మనం వెళ్ళి యమధర్మరాజు ను అడుగుదాం పదండి..! అంటూ అందరూ బయలుదేరారు.

ఇంద్రుడు, బ్రహ్మ విష్ణువు, శివుడు అందరూ యమలోకానికి రావడం చూసిన యముడు వారిని సాధారంగా ఆహ్వానించి విషయం తెలుసుకున్నాడు.

"అయ్యో.. అదేమి పెద్ద పనికాదు. మాములుగా చా*వుకు దగ్గరగా ఉన్న వారి పేర్లను, వారు ఎలా చని*పోతారు అన్నది ఒక ఆకుమీద వ్రాసి ఒక గదిలో వ్రేలాడ తీస్తాము. ఏ ఆకు రాలి క్రిందపడుతుందో వారు ఆయా సమయంలో చని*పోతారు. పదండి వెళ్లి ఆ ఆకుని తొలగించి చిలుకకు కాపాడుదాం..!" అని అన్నాడు.

యముడు, అందరూ ఆ గదిలోకి వెళ్ళగానే ఒక ఆకు రాలి పడింది.ఆ ఆకు ఎవరిదో అని అందులో ఏమి రాసిందో. చూద్దామని ఆ ఆకును తీసి చూడగా ఆకుపై చిలుక మర ణానికి కారణం వ్రాసి ఉంది ఇలా..!

ఎప్పుడైతే ఈ గదిలోకి ఇంద్రుడు, బ్రహ్మ, శివుడు, విష్ణువు, యమధర్మరాజు ఒకేసారి వస్తారో అప్పుడు చిలుక
మర ణిస్తుంది. అని వ్రాసి ఉంది.

ఇదే విధి…! విధిని ఎవ్వరూ మార్చలేరు!!
******

April మొదటి వారం కథలు

 

ప్రాంజలి ప్రభ.. కథలు.. (5)


వేసవి కాలం ఎండలు బాగా మండుతున్నాయి ఎవరైనా ఇంటికి వస్తే కూల్ డ్రింక్స్ ఇవ్వకుండా ఇంటిలో తయారు చేసే పానియాలను వాడుదాం...........

సహజ పానీయాలనే తాగుదాం :

*నిమ్మరసం* : మంచినీటిలో నిమ్మకాయ పిండి, చక్కెర, ఉప్పు కలుపుకుని నిమ్మరసం (షర్బత్) చేసుకొని త్రాగవచ్చు. అది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

చెరకు రసం : ముప్పావు లీటరు చెరకురసం గిన్నెలో వడ పోసుకుని 3 చెంచాల నిమ్మ రసం కలుపుకొని, ఆతర్వాత కొద్దిగా మిరియాల పొడి కలుపుకుని చల్ల బరచుకుని తాగొచ్చు.

మసాల మజ్జిగ : ఒక వంతు పెరుగు, నాలుగు వంతులు మంచినీరు కలుపుకోవాలి. సన్నగా తరిగిన ఒక మిర్చి కొద్దిగా అల్లం తురుము తాజా కరివేపాకులు, కొంచెం నిమ్మరసం, తగినంత ఉప్పు కలుపు కుంటే రుచికరమైన ఆరోగ్యకరమైన మసాల మజ్జిగ రెడీ ఔతుంది.

దీనిలో పొటాషియం, ఫాస్పరస్, క్యాల్షియం, రైబో ఫేవిన్, విటమిన్ బి-12 పుష్కలంగా లభిస్తాయి.

కొబ్బరి నీళ్లు : లేత కొబ్బరి నీళ్లు సహజ తియ్యదనం, రుచి కల్గిఉండి చల్లదనాన్నిచ్చి, జీర్ణ వ్యవస్థకు, మూత్ర వ్యవస్థకు మేలు చేస్తుంది.

గంజితో షర్బత్ : అన్నం వండేటప్పుడు వార్చినాక చిక్కని గంజి వస్తుంది.

దానిలో కొంచెం ఉప్పు వేసుకొని మజ్జిగ కలుపుకుని తాగితే

ఎండా కాలం వడ దెబ్బ సోకకుండా రక్షిస్తుంది.

రాగి అంబలి : 100 గ్రాముల రాగుల పిండిని కొద్దిపాటి నీళ్లలో

మెత్తని పేస్టులా (గడ్డలు లేకుండా) చేసుకోవాలి. దీనిని సుమారుగా అరలీటరు నుండి లీటరు మరిగే నీళ్లతో కలిపి సన్నని మంటలో 3 నుంచి 5 నిమిషాల సేపు కలుపుతూ ఉడికించాలి. చల్లారిన తర్వాత ఉప్పు లేదా బెల్లం (ఇష్టాన్ని బట్టి) మజ్జిగ కలుపు కోవాలి. వేసవితాపాన్ని చల్లార్చే ఆరోగ్యకరమైన రాగి అంబలి రెడీ.

వేసవి పానకం : పావుకేజి తురిమిన బెల్లం గిన్నెలో తీసుకుని ఒకటిన్నర

లీటరు మంచినీరు పోసుకుని బాగా కలిపి, బెల్లం కరిగే వరకూ ఉంచాలి. 25 గ్రాముల మిరియాలు, ఆరు యాలకులు పొడిగా చేసుకుని ఇందులో కలుపుకోవాలి. వేసవిలో చలవనిచ్చే ఆరోగ్యకరమైన పానకం రెడీ.

ఇవే కాకుండా పుచ్చకాయ, నారింజ, బొప్పాయి, దానిమ్మ, అనాస, ద్రాక్ష, సపోటా వంటి పండ్లరసాలు  కూల్డ్రింక్స్ కంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
*****
ప్రాంజలి ప్రభ....కథలు..(4)       4/2025

*_వృద్ధాప్యం.. నిప్పు లేకుండా హృదయాన్ని కాల్చే రక్త బంధాలు !!_*

రాధాకృష్ణారావు గారికి కీసర దగ్గర లంకంత కొంప ఉంది...

అదృష్టవశాత్తూ తన తండ్రికి ఒక్కడే కొడుకు కావడం...
దానికి తోడు ఇంత సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి తనకు పుట్టిన పిల్లలనిద్దరిని ఉన్నత చదువులు చదివించారు...
ఇప్పుడు రాధాకృష్ణారావుకు డెబ్భై  ఏళ్ళు...
పెళ్లయి యాభై సంవత్సరాలు...

"ముత్తైదువగా పోవాలి"
అని భార్య జానకి ఎప్పుడు అనుకునేది...
షుగర్ బీపీ ఉన్న రాధాకృష్ణారావు రాయిలా ఉన్నాడు కానీ ఆరోగ్యంగా
ఉన్న జానకి హఠాత్తుగా కన్ను మూసింది...

ఉన్నాన్నాళ్ళు చీటికి  మాటికి భార్యతో తగువు పెట్టుకున్న రావు గారు...
ఆమె పోయాకా ఆమె లేని లోటు అణువణువు కనబడుతుంది...
ఆఫీస్ ఉన్నప్పుడు హాయిగా సాగిన  సంసారం...
ఆయన రిటైర్ అయ్యాకా తన బీపీ అంతా భార్య మీద చూపించే సరికి ఎన్నో సార్లు 
అలగి గదిలో తలుపు బిగించుకునేవాడు...
జానకి మళ్ళీ బ్రతిమాలాడుతూ

ఆ జ్ఞాపకాలు...
ఆమె బుజ్జగించిన ఆ రోజులు అన్ని రావు గారికి గుర్తుకు వస్తున్నాయి...

ఎటూ చూసిన ఇల్లంతా జానకి ప్రతిరూపం కనబడుతుంది...
ఉన్నాన్నాళ్ళు కూర బాగాలేదని పచ్చడి బాగా లేదని ఆమెను వేధించుకు తిన్న రోజులు గుర్తుకు వచ్చి రావు కన్నీళ్లు ధారగా విలపిస్తున్నారు..
యాభై ఏళ్ళ వైవాహిక జీవితంలో ఇద్దరిదీ ఒకే మాట...
రిటైర్ అయ్యాకా మాత్రం కాస్త నోటి దురుసు రావు గారికి ఎక్కువైంది...

బయటకు వెళితే "బీపీ టాబ్లెట్స్ వేసుకున్నారా?" అని అడిగేది...
టిఫిన్ చేసి ముందు "టాబ్లెట్స్ వేసు కొండని" ఫోన్ లో చెప్పేది...
ఇంట్లో ఉంటే ఎప్పుడో తెల్లవారి ఝామున లేచి పూజ పునస్కారాలు చేసి తొమ్మిదికల్లా టిఫిన్ రెడీ చేసి భర్తకు పెట్టీ ఆమె తినేది...

*ఎప్పుడైతే పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యాయో అప్పట్నుంచి ఆమెకు రావు గారికి వైరం* మొదలైంది...
వాళ్ళ ఉద్యోగాలు హైటెక్  సిటి వైపు వాళ్లకు వచ్చే జీతం ఏమి సరిపోతుంది అని ఉన్న రెండెకరాల అమ్మి అమ్మాయికి అబ్బాయికి రెండు ఇళ్ళు కోనిచ్చే వరకు జానకి పోరు ఆగలేదు! పిల్లలకు సిటీలో ఇళ్ళు కొన్నకా ఇద్దరూ వాళ్ళ దగ్గర ఇమడ లేక సిటికి దూరంగా ఇలా ఒంటరి జీవితం గడుపుతున్నారు...
పైగా "నేను ముందు పోతే మీకు చేసే వారు ఉండరు" అని ఏడిపించేది...

ఎంత గిల్లి కజ్జాలు పెట్టుకున్నా కూడా భార్య భర్తలు ఒక గంట సేపటి తరువాత మాట  పట్టింపులు పక్కన పెట్టి దగ్గరయ్యేవారు...
రావు గారిదే ఎప్పుడు తప్పు అయ్యేది. జానకి ఓపిక వల్ల సంసారం ఇంత వరకు సాగింది...
పిల్లల పెంపకం...
వాళ్లకు ఉద్యోగాలు ...
వాళ్లకు ఇళ్లు పెళ్ళిళ్ళు అయ్యే సరికి ఉన్న ఆస్తి మొత్తం అయి పోయింది...
ఇప్పుడు తన పూర్వీకుల కట్టించిన ఇల్లు...
పెన్షన్ తప్పా రాధాకృష్ణారావుకు ఏమి మిగలలేదు!!

ఈ తరం పిల్లల అభిరుచులు వేరు,  దంపతులు ఇద్దరు ఉద్యోగాలు... తీరిక లేని పనుల వల్ల తల్లి దండ్రులను చూసే ఓపిక వారికి లేదు...
పైగా తన కన్న వాళ్ళని స్కూలుకు పంపడం...
తీసుకురావడం...
ఇదే ఒత్తిడితో ప్రతి కుటుంబంలో వృద్ధ తల్లి దండ్రులు పిల్లల దగ్గర ఇమడలేక పోతున్నారు...

వాళ్ళు తినే తిండి...
ఆచార వ్యవహారాలు....
వాళ్ళ వస్త్ర ధారణ ఇప్పడి పేరంట్స్ కు నచ్చడం లేదు...
పైగా మనవలు మనవరాళ్లుతో అన్యోన్యంగా ఉందామన్నా కూడా
"పిల్లల చదువు పాడై పోతుంది"
"మీరు గారాబం చేయకండి" అనే మాట కొడుకు - కూతురు నుండి రావడం..

తన పిల్లలకు కొన్న ఇల్లులో కూడా తనకు *స్థానం*, లేదని  తెలిసి వచ్చే సరికి ఆప్యాయత అనురాగం అంతా కనుమరుగై పోతుంది...

కన్న కొడుకు ఇంట్లోనే
తల్లి తండ్రులు కాందిశీకుల్లా బ్రతుకుతున్నారు...
ఇప్పుడు కన్న తల్లి దండ్రులు పిల్లలకు *బరువు*!!
అందుకే పండుటాకులుగా మిగిలి పోయి "దేవుడు ఎప్పుడు తీసుకెళతాడా?"
అని చూస్తున్నారు
రాధా కృష్ణారావు గారు. ఇవ్వాళ ఎంతో బాధకు గురయ్యారు..." ఛ...  ఇలాంటి పిల్లలను కన్నందుకా నేను ఇంత శ్రమ పడింది.. దానికి కారణం తనను కొడుకు అన్న మాటలు బాధించాయి...

"మనసు బాగాలేక దైవ దర్శనం చేసుకోవడానికి తిరుపతి వెళ్లి వస్తా" అని పిల్లల ఇద్దరికీ చెప్పాడు...
తానే రిజర్వేషన్ చేయించుకొని వెళ్ళాడు...
ఈ నాలుగు రోజుల్లో *ఎలా ఉన్నారు నాన్న* అని పిల్లల నుండి ఫోన్ లేదు...
తిన్నారా? పడుకున్నారా? అని బాగోగులు కూడా అడిగిన పాపాన పోలేదు...
రావు గారికి పిల్లల పట్ల ద్వేష భావం ఏర్పడడానికి బోలెడు సంఘటనలు జరిగాయి...
ఒక రోజు కొడుకు ఇంట్లో ఉంటే అర్ధరాత్రి రాజమండ్రి నుండి దిగిన అత్తా మామను తీసుకురావడానికి కొడుకు కారులో వెళ్లి తీసుకువచ్చాడు...
తాను రైల్వే స్టేషన్ కు వెళ్ళాలి అంటే క్యాబ్ లో వెళ్ళమని ఆఫీస్ కు వెళ్లి పోయాడు...
వారింట్లో ఉంటే  పిల్లలకు వాళ్ళు టిఫిన్ లు క్యారేజ్ లు కట్టి అటు ఆఫీస్ కు ఇటు స్కూల్ కి పిల్లలను పంపాకా "నాన్నా డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ ఉంది... తినండి" అని కొడుకు ఫోన్ చేసి చెప్పాడు... ఇంట్లో ఉన్న రెండు రోజుల్లో కోడలు "ఎలా ఉన్నారు మావయ్య" అని కూడా అడగలేదు... పైగా మనవరాలు మనవడితో గదిలో పడుకుందామని అనుకుంటే హాల్లో మంచం వేసి పరుపు వేసి పడుకోండి... అని కొడుకు అన్నప్పుడే అదే అర్ధరాత్రి తన ఇంటిలో వెళ్లి పోదామని కోపం వచ్చింది రావు గారికి..
అయిన తమాయించుకొని ఉన్నాడు...
తెల్లవారే తన బట్టలు సర్దుకొని *వెళ్లి వస్తా బాబు* అంటే *సరే నాన్నా* అన్నాడు తప్ప ఉండమని అనలేదు! తాను క్యాబ్ మాట్లాడుకొని కూతురు ఇంటికి వెళితే వెళ్ళిన రోజు బాగానే చూసింది... మరో రోజు ఉందామని అనుకొని తాను టీవీ చూస్తుంటే "నాన్నా అల్లుడు గారి పెదనాన్న పెద్దమ్మ వాళ్ళ బంధువులు వస్తున్నారు... వాళ్ళు మూడు నాలుగు రోజులు ఉంటారట... మీరు అన్నయ్య ఇంట్లో ఈ మూడు రోజులు ఉండండి తిరిగి నా దగ్గరికి రండి" అన్న మాట కూతురు నోట వినగానే  స్నానం చేయకుండానే ప్యాంట్ షర్ట్ వేసుకొని బ్యాగ్ సర్దుకొని *సరే అమ్మా ఆరోగ్యం జాగ్రత్త* అని లిఫ్ట్ దిగాడు...

వెంటనే ఆటో మాట్లాడుకొని పబ్లిక్ గార్డెన్ వెళ్లి ఒక చెట్టు చాటుకి వెళ్లి బోరున విలపించాడు...
తాను - జానకి ఏ యాత్రలకు వెళ్ళిన కూడా పిల్లలను అల్లారు ముద్దుగా చూసుకొని చలి పెడుతుందేమో అని రగ్గులు కప్పి పొదివి పట్టుకొని పెంచిన వీళ్ళు *మా ఇంట్లో పడుకోవడానికి స్థానం లేదు* అని నిర్మోహమాటంగా అనడం రాధాకృష్ణా రావు గారు జీర్ణించుకోలేక పోతున్నా రు...!!
జ్వరాలు రోగాలు వస్తే ఆసుపత్రికి తీసుకెళ్ళి వాళ్ళు స్వస్థత చేకూరే వరకు ఆసుపత్రి వరండాలో పడుకొని పిల్లలను పెంచితే ఇదా వాళ్ళు చేసే నిర్వాకం! తన లాగే పబ్లిక్ పార్కుల్లో మూగ రోదన చేస్తున్న తన వయసు వాళ్ళు కనబడ్డారు రావు గారికి...
భారతీయ కుటుంబ వ్యవస్థ ఇంత చిన్న భిన్నం కావడానికి కారణం
ఈ సాఫ్టు వేర్ జాబులా? 
లేక
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విలువలు పాటించక పోవడానికి
మా తరమే కారణామా?! అన్న ప్రశ్న రావు గారిలో  మొదలైంది..
అసలు జీవితం అనే రైలు ప్రయాణంలో ఫ్లాట్ ఫాం ఫ్రెండ్ గా పిల్లల్తో ఉండాలి...
స్టేషన్ రాగానే దిగిపోయే ప్రయాణికుడిలా మనం మారాలి...
అన్న దృఢ నిశ్చయం రావులో మొదలు అయింది...

వెంటనే తన ఫోన్ లో నుండి కొడుకు కూతురు కాంటాక్ట్ నెంబర్లు తీసేశాడు...
తన ఇంటికి చేరి ఇల్లంతా పని వాళ్ళతో శుభ్రం చేయించి కేవలం జానకి ఫోటో మాత్రమే ఇంట్లో తనకు కనబడేలా...
బెడ్ రూంలో పెట్టాడు...
పక్కనే హోటల్ వానీ దగ్గరికి వెళ్లి ఉదయం టిఫెన్, మధ్యాన్నం భోజనం రాత్రి రెండు చపాతీలు పంపేలా ఏర్పాట్లు చేసుకున్నాడు.
పక్కనే ఉన్న టీ కొట్టు వాడితో ఉదయం సాయంత్రం కాఫీ తీసుకు వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నాడు...
తన సెల్ లో టైమ్ ప్రకారం ట్యాబ్ లెట్స్  వేసుకునేలా అలారమ్ పెట్టుకున్నాడు...
నెలకు పది రోజులు ఇండియా టూర్ ట్రావెల్స్ వాడికి టికెట్ బుక్ చేసేలా ప్లాన్ చేసుకున్నాడు...
ఇపుడు పిల్లలు ఫోన్ చేసిన ఎత్తడం లేదు...
భవ బంధాలు అన్ని తెంపుకుని తనకు నచ్చిన జీవితాన్ని గడిపేలా ప్లాన్ చేసుకున్నాడు!

ఒంటరి తనం అనేది మనసు మాట! *తన మాటే మనసు వినేలా,* మనో నిబ్బరం తెచ్చుకున్నాడు! ఇప్పుడు ఆయన రోగాలు తగ్గు ముఖం పట్టాయి!

తొంబై ఏళ్ళ వయసులో కూడా చలాకీగా ఉన్న తన దగ్గరికి రిటైర్ అయి ఫారిన్ లో సెటిల్ అయిన తన కొడుకుల దగ్గర ఇమడలేక తండ్రి పంచన చేరిన తన కొడుకు హాల్లో టీవీ చూస్తుంటే గదిలో నుండి వచ్చిన రావు గారికి తన కోడలు కొడుకుతో మట్లాడుతున్న సంభాషణ వినపడింది... "ఏమండీ నేను అమెరికాలో ఇమడలేక పోతున్నాను *ఇక్కడ మన పిల్లలు పని మనుషులకన్నా హీనంగా చూస్తున్నారు నేను మీ దగ్గరికి  వస్తాను* అన్న భార్య మాటలకు చూసావా వృద్దాప్యం ప్రాయ చిత్తం ఏమిటంటే...
భార్యా వియోగం, (స్త్రీలు భర్త అని అన్వయించుకోవాలి) లోక నింద, రుణభారం (అప్పులు), నీచులకు తగ్గి ఉండాల్సిన పరిస్థితి, దారిద్ర్యం అనుభవిస్తున్న తరుణంలో ఇష్టమైనవారు వచ్చి పలకరించడం - ఇవన్నీ తట్టుకోలేని బాధలు.
ఈ ఐదు అంశాలు నిప్పు అవసరం లేకుండా హృదయాన్ని కాల్చేస్తాయి. అవమానభారంతో దహించుకుపోతారు !!

_*కాబట్టి వృద్ధ తల్లితండ్రులు... ప్రతిదానికి కుచించుకుపోయి, "బేలగా" బ్రతక్కండి... నిబ్బరంగా ఉంటూ కనీసం ఇప్పుడైనా మీకోసం.. ఒకరి కోసం ఒకరు సుఖంగా సంతోషంగా  బ్రతకండి..!!!*
*****
01-04-2025 ప్రాంజలి ప్రభ కథలు.. 1

*వృద్దులంటే వృద్ది చెందినవారు*

అవంతీనగరంలో అరవై సంవత్సరాలు నిండిన వారిని చంపేయాలనీ రాజ్యం పరిపాలించే రాజు ఆజ్ఞ జారి చేసాడు…వృద్దులు పని చేయలేరు…వాళ్ళ ఉపయెాగం లేదని అతని భావన….అంతే కాదు పాత వస్తువులు వుండ కూడదనీ…అవి శని కి సంకేతం అని కుాడ జారి చేసాడు…శని వుంటే రాజ్యానికి అరిష్టం అని భావించేవాడు…!

రాజ్యం లో చాలామంది తమ పుార్వీకుల జ్ఞాపకం గా దాచుకున్న పాతవిలువైన వస్తువులు విసిరి పారేయలేక …చాలా మనస్తాపం పొందేవారు…!!

కావున ఆ రాజ్యం లో వృద్దులు కానీ పాత వస్తువులు కానీ కనపడవు..శాంతమ్మకి ఈ మధ్య 60వ సంవత్సరం వచ్చింది … ఆమె కొడుకులు ఆమెను ఒక చోట రహస్యం గా 01-04-2025భటులకి కనపడకుండా దాచి వుంచారు.

ఒకనాడు అడవిలో సింహం ఒకటి ఊరిమీద పడి దొరికిన వారిని దొరికినట్లు దాడి చేయసాగింది.ప్రజలు భయబ్రాంతులైనారు.సింహఽ గర్జిస్తుా ఊరంతా …అడవిలో తిరిగినట్లు తిరుగుతుంది .ప్రజలు కు ఏమి చేయాలో తొిచలేదు…దాన్ని అడ్డుకోవడానికి వెళ్లి నభటులను అది దుాకి చంపేసేది.

శాంతమ్మ కి విషయం తెలిసింది.కొడుకుల్ని పిలుపిచ్చుకొని సింహం పీడ విరగడ కావలంటే…సున్నం నీళ్ళ లో ముంచిన మేకపిల్లను ఆహారం గా వేయమనీచెప్పిఽది…కొడుకులు ఆ పని చేసారు..ఆకలితో వున్న సింహం అమాంతం మేక పిల్లను తినేసింది. అది సున్నం తిన్నందు వలన కళ్ళు తిరిగి సృహ కొల్ల్పోయి పడిపోయింది …అప్పుడు భటులు వచ్చి దాని మీద వల వేసి పట్టుకొని భోనులో పెట్టారు.

ఇంత మంచి సలహా ఇచ్చిందెవరనీ రాజు విచారించాడు….శాంతమ్మ రహస్యంగా దాగిన విషయం తెలిసి రాజు ఆమె తెలివి కి మెచ్చుకొిని పెద్దలను వృద్దులను చంపకుడ దని…వాళ్ళ సలహాలు సుాచనలు అనుభవాలు విలువైనవనీ వృద్దుల అవసరం ఎంతో వుందని …వృద్దులను చంపే శాసనం రద్దు చేయించాడు…

అంతే కాదు….పుార్వీకులు జ్ఞాపకంగా దాచుకున్న వస్తువులు ఏదో ఒక సమయంలో ఉపయెాగపడతాయనీ దాచుకోమనీ రాజు ఆఙ్గ జారీ చేసాడు…!!
******

అపూర్వ శాస్త్రాలు *..ప్రాంజలి ప్రభ..-2-- 4/2025

నేడు అమలులోలేని మనకు తెలియని మన పూర్వీకులు మనకందించిన అపూర్వగ్రంథ శాస్త్ర రాజములు:

🌼 1.అక్షరలక్ష:

ఈ గ్రంథం ఒక ఎన్సైక్లోపీడియా గ్రంథము.రచయిత వాల్మీకి

మహర్షి.రేఖాగణితం,బీజగణితం,త్రికోణమితి,భౌతిక గణితశాస్త్రం మొదలైన 325 రకాల గణితప్రక్రియలు, ఖనిజశాస్త్రం,భూగర్భశాస్త్రం,జలయంత్ర శాస్త్రం, గాలి,విద్యుత్,ఉష్ణం లను కొలిచే పద్దతులు మొదలైన ఎన్నో విషయాలు ఇందులో తెల్పబడ్డాయి.

🌼 2.శబ్దశాస్త్రం:

రచయిత ఖండిక ఋషి. సృష్టిలోని అన్ని రకాల ధ్వనులను,ప్రతిధ్వనులను ఇది చర్చించింది.ఇందులోని ఐదు అధ్యాయాలలో కృత్రిమంగా శబ్దాలను సృష్టించడం,వాటి పిచ్(స్థాయి),వేగాలను కొలవడం వివరించారు.

🌼 3.శిల్పశాస్త్రం:

రచయిత కశ్యపముని. ఇందులో 22 అధ్యాయాలు ఉన్నాయి.307 రకాల శిల్పాల గురించి,101

రకాల విగ్రహాలతో కలిపి సంపూర్ణంగా చర్చించారు. గుళ్ళు,రాజభవనాలు,చావడులు మొదలైన నిర్మాణవిషయాలు 1000కి పైబడి ఉన్నాయి. ఇదే శాస్త్రం పై విశ్వామిత్రుడు,మయుడు, మారుతి మొదలగు ఋషులు చెప్పిన విషయాలు కూడా ఇందులో చర్చింపబడ్డాయి.

🌼 4.సూపశాస్త్రం:

రచయిత సుకేశుడు.ఇది పాకశాస్త్రం.ఊరగాయలు, పిండివంటలు తీపిపదార్థాలు,108 రకాల వ్యంజనాలు మొదలగు అనేకరకాల వంటకాల గురించి, ప్రపంచవ్యాప్తంగా ఆ కాలం లో వాడుకలో ఉన్న 3032 రకాల పదార్థాల తయారీ గురించి చెప్పబడింది.

🌼 5.మాలినీ శాస్త్రం:

రచయిత ఋష్యశృంగ ముని.పూలమాలలను తయారుచేయడం,పూలగుత్తులు,పూలతో రకరకాల శిరోఅలంకరణలు,రహస్యభాషలో పూవులరేకుల పైన ప్రేమసందేశాలు పంపడం లాంటి అనేక విషయాలు 16 అధ్యాయాలలో వివరింపబడ్డాయి.

🌼 6.ధాతుశాస్త్రం:

రచయిత అశ్వినీకుమార. సహజ,కృత్రిమ లోహాలను గురించి 7 అధ్యాయాలలో కూలంకుషంగా వివరించారు.

మిశ్రమలోహాలు,లోహాలను మార్చడం,రాగిని బంగారంగా మార్చడం మొదలగునవి వివరించారు.

🌼 7.విషశాస్త్రం:

32 రకాల విషాలు,వాటి గుణాలు,ప్రభావాలు,

విరుగుడులు మొదలైన విషయాలు చెప్పారు.

🌼 8.చిత్రకర్మశాస్త్రం(చిత్రలేఖనశాస్త్రం):

రచయిత భీముడు.ఇందులో 12 అధ్యాయాలు
ఉన్నాయి. సుమారు 200 రకాల చిత్రలేఖన ప్రక్రియల గురించి చెప్పారు. ఒక వ్యక్తి తలవెంట్రుకలను గాని,గోటిని కాని,ఎముకను కాని చూసి ఆ వ్యక్తి బొమ్మను గీసే
ప్రక్రియ చెప్పబడింది.

🌼 9.మల్లశాస్త్రం:

రచయిత మల్లుడు. వ్యాయామాలు,ఆటలు, వట్టిచేతులతో చేసే 24 రకాల విద్యలు
చెప్పబడ్డాయి.

🌼 10.రత్నపరీక్ష:

రచయిత వాత్సాయన ఋషి.రత్నాలు కల్గిఉన్న 24 లక్షణాలు చెప్పబడ్డాయి.వీటిశుద్దతను
పరీక్షించడానికి 32 పద్దతులు చెప్పబడ్డాయి.రూపం, బరువు మొదలగు తరగతులుగా
విభజించి తర్కించారు.

🌼 11.మహేంద్రజాల శాస్త్రం:

సుబ్రహ్మణ్యస్వామి స్వామి శిష్యుడైన వీరబాహువు రచయిత. నీటిపై నడవడం,గాలిలో
తేలడం వంటి మొదలైన భ్రమలను కల్పించే గారడిలను ఇది నేర్పుతుంది.

🌼 12.అర్థశాస్త్రం:

రచయిత వ్యాసుడు.ఇందులో భాగాలు 3.ధర్మబద్ధమైన 82 ధనసంపాదనా విధానాలు ఇందులో
వివరించారు.

🌼 13.శక్తితంత్రం:

రచయిత అగస్త్యముని. ప్రకృతి,సూర్యుడు,చంద్రుడు,గాలి,అగ్ని మొదలైన 64 రకాల బాహ్యశక్తులు,వాటి ప్రత్యేక వినియోగాలు చెప్పబడ్డాయి. అణువిచ్చేదనం ఇందులోని భాగమే.

🌼 14.సౌధామినీకళ:

రచయిత మతంగ ఋషి.నీడల ద్వారా,ఆలోచనల ద్వారా అన్ని కంటికి కనపడే విషయాలను ఆకర్షించే విధానం చెప్పభదింది.భూమి మరియు పర్వతాల లోపలిభాగాల ఛాయాచిత్రాలను తీసే ప్రక్రియ చెప్పబడింది.

🌼 15.మేఘశాస్త్రం:

రచయిత అత్రిముని.12 రకాల మేఘాలు,12 రకాల వర్షాలు,64 రకాల మెరుపులు,33 రకాల
పడుగులు వాటి లక్షణాల గురించి చెప్పబడింది.

🌼 16.స్థాపత్యవిద్య:

అదర్వణవేదం లోనిది. ఇంజనీరింగ్,ఆర్కిటెక్చర్,కట్టడాలు,నగరప్రణాలిక మొదలైన సమస్త నిర్మాణ విషయాలు ఇందులో ఉన్నాయి. ఇంకా భగవాన్ కార్తికేయ విరచిత కాలశాస్త్రం, సాముద్రిక శాస్త్రం, అగ్నివర్మ విరచిత అశ్వశాస్త్రం, కుమారస్వామి రచించిన గజశాస్త్రం, భరద్వాజ ఋషి రచించిన యంత్రశాస్త్రం మొదలగునవి , ఆయుర్వేదం,ధనుర్వేదం,గాంధర్వవేదం మొదలగు ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. నేటి భారతీయులకు ఎంతమందికి తెలుసు మన పూర్వీకుల ఈ విజ్ఞాన సంపద? వీటిలో చాలా వరకు నేడు అందుబాటులో లేవు​ . ఇందులో ఒక్క శాస్త్ర0 కూడా నాకు తెలవదు ,  ఇంతవరకు చదవలేదు, పుస్తకాలు ఉంటె తెలుపగలరు

🌼 ఓం నమః శివాయ
******

ప్రాంజలి ప్రభ కథలు.. భక్తి పాశము..(6)

భక్తి యందు క్రమము, అక్రమము అను రెండు విధానము లున్నవి. క్రమము లేని ఆరాధన పూర్ణభక్తి కాజాలదు. మంత్రహీనత, క్రియాహీనత, భక్తిహీనతలతో ఆరాధించు భక్తులు కోకొల్లలు. వీరు అసంపూర్ణముగనే జీవించు చుందురు. ఇట్టి వారికి శ్రీమాతయే సంకల్ప రూపమున క్రమమును నేర్పును. క్రమమును నేర్చిన భక్తులు క్రమముగ పూర్ణు లగుదురు. భగవద్గీత యందు కూడ ఈ విషయమే తెలుపబడినది.

శాస్త్రము విధించిన  ననుసరించి పూజించు వారికి సాన్నిధ్యము లభించునని, శాస్త్రము నుల్లంఘించు వారికి రజస్సు తమస్సు దోషము లంటి పూర్ణత్వము కలుగదని తెలుపబడినది. ఆరాధనకు సదాచారము, సంప్రదాయబద్ధత ప్రధానము. అవి అవసరము లేదనుట మెట్ట వేదాంతము. చిత్తశుద్ధి కలుగు వరకు విధానము ప్రధానము.

పశుపాశముల నుండి విమోచనము కలిగించునది శ్రీమాత అని అర్థము. తన మూలము తాను తెలియనివాడు పశువు. తాను అను ప్రత్యగాత్మకు మూలము పరమాత్మయే. పరమాత్మయే తానుగ నున్నాడు, ప్రత్యగాత్మగ నున్నాడు. ఈ అభేదస్థితి మరచుట మాయ. దీనినే అవిద్య అందురు. ఈ తెలియక పోవుటయే జీవులను పశువులుగ కోరికల వెంటపడి జీవించునట్లుగ చేయును. తాను వేరు, దైవము వేరు అనుకొనుచు ఉపాసించువారు పశువులని బృహదారణ్యక ఉపనిషత్తు చెప్పుచున్నది.

దైవము లేక తాను లేడు. తాను లేకున్నను దైవ మున్నాడు. దైవము నుండి స్థితి భేదము చెందినవాడే జీవుడు. పిండి నుండి యేర్పడిన రొట్టెవంటి వాడు. పిండిలేని రొట్టె లేదు. కాని రొట్టె వేరు, పిండి వేరుగ గోచరించును. పిండిలో లేని గుణములు రొట్టెకు వచ్చును. అట్లే జీవుడు కూడ గుణములతో కూడినవాడై వేరుగ గోచరించును. ఇది స్థితి భేదమే గాని మూల మొక్కటియే.