Thursday, 21 May 2020

యోగదర్శనం



ఓం నమః శివాయ: - యోగదర్శనం
ఓంశ్రీమాత్రే నమః యోగదర్శనం – ఆస్తిక దర్శనం

పురుష/ జీవాత్మ అవిద్య చేత తాను నిర్మలుడననేది మరచిపోయి, ప్రకృతి విషయాలతో సంబంధమేర్పడి, సుఖ దుఖాది అనుభవాలకు లోనవుతూ ఉంటాడు. సాధనలతో ప్రయత్నం చేస్తే ఈ సంసారమనే జనన మరణ రూపకమై ఉన్న బంధంనుంచి విడివడి మోక్షాన్ని/ కైవల్యాన్ని పొందవచ్చునని చెబుతారు.

తపస్సు , స్వాధ్యాయం , ఈశ్వర ప్రణిదానం అనే ఈ మూడూ కలసి క్రియాయోగం అంటారు.

మనస్సు, శరీరాన్ని వశం చేసుకొని తగిన రీతిలో నిరోధించటం- తపస్సు.

ముక్తి మార్గాన్ని అందించే సద్గ్రంద పఠనం – స్వాధ్యాయం. ఇది తన సిద్ధాంతాలని దృఢ పరచుకోడానికే. కర్మలను ఈశ్వరార్పణ చెయ్యడమే ఈశ్వర ప్రణిదానమంటే. చేసే కార్యం ఫలించినా భగ్నమైనా ఫలితాన్ని ఈశ్వరునికే అర్పించి స్వస్థ చిత్తంతో ఉండాలి.

అవిద్య, అస్మిత(అహంకారం), రాగం, ద్వేషం,అభినివేశం (ప్రాణం మీద తీపి) అనే అయిదూ క్లేశాలు. ఇవి సంసార బంధాలు. ఈ క్లేశాలను నివారించి సమాధి స్థితిని కల్గచెయ్యడానికే క్రియా యోగం ఏర్పడింది.

మొదట స్థూల మనోవికారాలను పిదప సూక్ష్మ వికారాలను వాటి వ్యతిరేక భావాలతో నిరోధించాలి.

అవిద్యాది క్లేశాలు కర్మలకు మూల కారణం. మనోవృత్తులు మంచివైనా, చెడువైనా క్లేశాలే. ఆత్మ స్వాతంత్ర్యానికి ప్రతి బంధకాలు. కర్మ పరిపాకం వల్ల జాతి, ఆయువు, సుఖ దుఃఖాలు కల్గు తాయి. పుణ్య పాప కర్మలు ఈ సుఖ దుఃఖాలకు హేతువు. ప్రకృతి దృశ్యాల సంయోగం వల్ల దుఃఖాలు కల్గుతుంటాయి. అంచేత వాటిని వదలాలి. పురుషుడు- మనస్సు మొదలుకొని స్థూల భూతాల వరకు ఉన్న ప్రకృతిని దృశ్యాలుగా చూస్తాడు. స్వతఃగా శుద్ధుడైన పురుషుడు ఈదృశ్యాల సంయోగంతో సుఖ దుఃఖాలు తనమీద ప్రతిబింబించే సమయంలో వాటిని తనే అనుభవిస్తున్నట్లు భావిస్తాడు. పురుషుడు ప్రకృతితో సంయోగం వల్ల తన దివ్యత్వాన్ని మరచి ఉన్నాడు. పురుషునికి అనుభవాన్ని కూర్చడమే ప్రకృతి ప్రయోజనం.

ఈ దుఃఖమయమైన ప్రపంచంలో కొన్ని బంగారు బంతులు దొర్లుతుంటే , లోకం వాటి వెంట పడుతుంది. ఐహిక జీవితం క్షణభంగురం. ఇది తాత్కాలిక అనుభవం మాత్రమే.  సంసారాన్నుండి తరించాలన్నది గుర్తించండి. మన స్వస్వరూపాన్ని మరువకుంటే సమస్త బంధాలూ తొలగి పోతాయి. మనంత మనమే ఈ ప్రకృతితో సంయోగమనే వలలో చిక్కుకొని దీనులమను కొంటున్నాం.

పురుషుడు ప్రకృతికన్న అతీతుడు,వాటి తత్వాలకన్నభిన్నుడు. బుద్దికన్న, మనస్సుకన్న,తన్మాత్రల కన్నస్థూల భూతాలకన్నను వేరైనవాడు. కేవలుడై ఉండటం వల్ల శాశ్వతుడని సాంఖ్యులు చెబుతారు. సంయోగ జనితం కాని వస్తువుకు ఎట్టి వికారాలూ కలుగవు. ఇలాంటి పురుషులు /లేక ఆత్మలు అనేకం ఉన్నాయంటారు.

బుద్దితత్వం స్వయం ప్రకాశం కాదు. అత్మవల్ల ఇది ప్రకాశవంతమవుతుంది. సాక్షి పురుషుడు చైతన్య మాతృడై , శుద్దుడై ఉన్నప్పటికీ బుద్ధిలో భాసించే వృత్తులననుసరించి చూస్తుంటాడు. స్పటికం ఎదుట ఎర్రని పూవును ఉంచితే ఎలా ఎర్రగా స్ఫటికం కన్పిస్తుందో, అలాగే సుఖదుఃఖాలు కూడ పురుషునిలో కేవలం ప్రతిబింబాలు మాత్రమే. స్వయంగా పురుషుడు నిర్వికారుడు.బుద్దితత్వం వృద్ది క్షయాలను చెందుతూ వికారాలను కలిగి ఉండటం వల్ల అది శాశ్వతమైనది కాదు. బుద్ది స్వతంత్రమైనది కాదు.ప్రకృతితో సంబంధపడి  ఉండేవన్నీ ప్రకృతి యందే ఉండటంవల్ల బద్దమై ఉంటాయి. వివిధ ఇంద్రియానుభవాలు, సుఖదుఃఖాలు దేన్లో ఏకత్వం పొందు తున్నాయో ఆ పురుష తత్వం బుద్ధికి అతీతమై ఉంది.

ఇంద్రియాలన్నిటికీ పురుషుడే కేంద్ర స్థానం. బుద్దితత్వం నుండి భాసించే సమయంలో జ్ఞాన రూపం పొంది దేశ, కాల, నిమిత్తాల వల్ల బధ్ధమవుతుందని యోగులు  గ్రహిస్తారు.పురుషునికోసం ఏర్పడిన ప్రకృతి స్వయం ప్రకాశం కాదు. పురుషుని సంపర్కం ఉన్నంత కాలం మాత్రమే ప్రకాశవంతంగా కనిపిస్తుంది. తాను ప్రకృతి కన్న అతీతుడననే నిజాన్ని గ్రహించిన ముక్తుడుని, ప్రకృతి మోహింప చెయ్యదు. కాని మిగిలిన బధ్ధజీవులకు యధాతధంగానే ఉంటుంది. అంచేత సాంఖ్యులు ప్రకృతి నిత్యమైనది అంటారు. నాకో శరీరము, నీకో శరీరమూ ఉందనుకోవడం మిధ్య. జగత్తంతా ఏక పదార్ధ రాశి. దాన్లో నువ్వొక కణం, నేనొక కణమూను.

జగత్తు ఎపుడూ మార్పు చెందుతూనే ఉంటుంది. అవిద్యయే ఈ శరీర భ్రాంతికి కారణం. సత్యాన్ని తెలుసుకొని ప్రకృతి అధీనం నుంచి తొలగటమే యోగానికి ప్రధాన ఆశయం. బాహ్య, అంతర ప్రకృతిల నంతా నిరోధించి, దివ్యత్వాన్ని వ్యక్తం చెయ్యడమే జీవిత ఆశయం. అంతర ప్రకృతిని నిరోధిస్తే బాహ్య ప్రకృతిని నిరోధించడం సులభం. దృశ్య ప్రపంచమంతా సూక్ష్మప్రపంచం యొక్క వ్యక్తీకరణ. అలాగే భౌతిక శక్తులు సూక్ష్మ శక్తుల వ్యక్తీకరణ.

పురుషుడు ఎట్టి వికారాలు పొందడని గ్రహించటమే మన పరమావధి. ఉత్పత్తి ప్రళయాలను పొందుతూ నిరంతరం మార్పు చెందేది ప్రకృతే. నిశ్చలమైన దీక్షతో నితానిత్య వివేకం చెయ్యడం మొదలు పెట్టగానే అజ్ఞానం తొలగి, పురుషుడు స్వయం జ్యోతిగా ప్రకాశిస్తాడు. ఈ స్థితిలో జ్ఞానం నిరాశ్రయమై ఉండటం వల్ల అన్ని విషయాలూ జ్ఞానతేజం వల్లనే భాసిస్తుంటాయి. ఇదే చరమావస్థ.

యోగాచార్యుడైన పతంజలి ; యమము, నియమము, ఆసనము, ప్రాణయామము, ప్రత్యాహారము అనే అయిదు బహిరంగ

యోగమార్గాలనీ ; ధారణ , ధ్యాన, సమాధి అనే మూడు అంతరంగిక యోగమార్గాలనీ బోధించాడు. వీటిలో మొదటి అయిదూ మనసులో నాటుకుంటే సమాధి స్థితికి చేరుకోడం సులభమవుతుందని అంటారు.యమము లో అయిదు దీక్షలు చెప్పబడ్డాయి.

అవి అహింస , సత్యము, అస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము. ఇక శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము , ఈశ్వర ప్రణిధానము అనేవి నియమాల్లోకి వస్తాయి. ఇలా యోగ దర్శనానికి ఎనిమిది సాధనా౦గాలు చెప్పబడటం వల్ల దీన్ని అష్టాంగ మార్గంగా చెబుతారు.

🕉🌞🌏🌙🌟🚩

తేట గీతి నేటి పద్యాలు


4 Saatchi Art Artists to Know: Spotlight on Germany – Canvas: A Blog By Saatchi Art


తేట గీతి నేటి పద్యాలు 
వృద్ధాప్యం -  
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

మనిషి యద్భవ  తత్భావ  మేను  అనక 
మనసు భౌతిక వాస్తవ  మేది  గనక 
వినయ భావపు మర్మము వింత  కొనక 
విషయ  వాంఛల వెంటనే వేళ్ళు వాయె   ...... 

యుక్త  మధ్యమ వృద్ధాప్య  యుజ్వలమ్ము  
త్యాగ బుద్ధియు ఉన్నచో తృప్తి గనుము 
శక్తి అంతయు ఖర్చుగా శపధ మాయె  
తార తమ్యము తెలిసికో  తప్పు గనుము  ........

దేహ కాంతియు వృద్ధాప్య దీనబందు  
మేధ  శక్తియు  వృద్ధాప్య మోక్ష మిచ్చు  
మూడు కాళ్ళను మోసియు ముందు నడుచు  
చూపు మంద గిస్తుందని చూసి నడుచు   ........

ప్రకృతి మౌనముండినదని ప్రభల తీరు  
వికృతి  తాండవించినదని  వీనులగుట  
సుకృతి ఇదియును అదియును శుభము కలుగు  
ఎశృతి విన్నను మంచిని ఎంచి కదులు  ...... 

మనకు  నైతిక భౌతిక మలుపు లుండు 
మనము అద్భుత ఆనంద మార్గ ముండు  
మనసు చట్రంలొ చిక్కితే  మాయ మెండు 
మనమె  ఆచార సంస్కృతి మనసు నందు  

నీలొ  నమ్మక వ్యవస్థ  నియమ మగుట  
కాల నిర్ణయ మార్పులు కధల మెండు        
హోళి ఆడేటి  కాంక్షయు హాయి తెలుపు   
జాలి చూపియు సంపద జడ్జ్య మెండు  
--(())--

Wednesday, 20 May 2020

. శక్తి మంత్రం - నిత్య మంత్రం - విపత్తులు నివారణ కోసం 🌹


🌹. శక్తి మంత్రం - నిత్య మంత్రం -  విపత్తులు నివారణ కోసం 🌹

🌻. ఓం తేజోసి తేజో మయి దేహి!
🌻. వీర్యమసి వీర్యమ్‌ మయి దేహి!
🌻. బలమసి బలం మయి దేహి!
🌻. ఓజోసి ఓజో మయి దేహి!
🌻. మన్యురసి మన్యుం మయి దేహి!
🌻. సహోసి సహో మయి దేహి! (శక్తి మంత్రం)

భగవంతుడిని ఆత్మ శక్తిగా, సంయమ శక్తిగా, శారీరక మానసిక శక్తులుగా, దివ్య శక్తిగా, ధైర్య శక్తిగా, సహన శక్తిగా భావిస్తూ ఆయా శక్తులను ప్రసాదించమని ప్రార్థించే మంత్రమిది. ఈ మంత్ర జపం వల్ల సాధకుడు తేజస్సంపన్నుడై ఒత్తిడులను సంభాళించుకునే శక్తిని సంపాదిస్తాడు.

అలాగే ఋగ్వేదంలోని సూర్యసూక్తం కూడా సూర్యుడిని జీవితానికి ఆధారభూతునిగా, దేహానికి శక్తిగా, వర్షాన్ని, ఆహారాన్ని ఇచ్చేవాడిగా, ప్రపంచాన్ని రూపొందించి, పోషించేవాడిగా, పర్యావరణాన్ని కాపాడేవాడిగా, సకల కార్యాలనూ సాధించేందుకు ప్రేరణ శక్తిగా, ఉన్నత జీవనాన్ని ప్రసాదించే వాడిగా చెపుతుంది.

 అంతేకాదు.. చేసే పనిలో శ్రద్ధను, ఆసక్తిని కలిగి ఉండాల్సిన అవసరాన్ని ఈ వేదసూక్తాలు చెబుతాయి.

వ్యక్తి తన మనసును, శరీరాన్ని, సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన ప్రాముఖ్యతను వాటిని సాధించేందుకు అవసరమైన మార్గాలను సూచిస్తాయి. అక్షరాలుగా ఒకచోట కూర్చబడిన మంత్రాలకు ఈ శక్తి ‘నమ్మకం’ ద్వారా కలుగుతుంది. జీవన యాన కేంద్రం నమ్మకమైనప్పుడు అది అన్నింటినీ తనవైపు ఆకర్షించుకుంటుంది.

పలికే ప్రతి అక్షరాన్నీ నిర్ణీత అంతరాలలో పలికినపుడు అవి మన కండరాలపై, నరాలపై, రక్తప్రసరణపై, గుండెపై తద్వారా శరీర ఆరోగ్యంపై మంత్రం తన ప్రభావాన్ని చూపుతుంది.

అలాగే పలికిన పదాలు సూచనలుగా మన మనసుపై ముద్రింపబడతాయి. ఆ ముద్రలు బలీయమైతే దానికి సంబంధించిన కార్యావిష్కరణకు దారి చూపుతాయి.

మన మనసు చాలా శక్తివంతమైనది. అది మనమిచ్చుకున్న సూచనల కనుగుణంగా పనిచేస్తుంది. మనస్సు బలీయమైతే, శారీరక ధర్మాన్ని అధిగమించి ముందుకు సాగుతుంది. కాబట్టి వేద మంత్రాల రూపంలో ఉచ్చరించిన అక్షరాలు శారీరకంగా మానసికంగా ప్రభావాన్ని చూపుతాయి.

ఈనాడు ప్రపంచవ్యాప్తంగా భయపెడుతున్న కరోనా లాంటి క్రిమి చేసే నష్టాన్ని తగ్గించుకునేందుకు అవసరమైన మానసిక, శారీరక సన్నద్ధతను ఈ వేద మంత్రాలు లేదా సూక్తాలు ఇస్తాయి. అయితే ఒక్క విషయాన్ని స్పష్టంగా గుర్తుంచుకోవాలి.

ఇవి వైద్యానికి అనుబంధంగా పనిచేస్తాయే కానీ ప్రత్యామ్నాయంగా జబ్బును తగ్గించేందుకు ఉపకరించవు. మనం ఈ మంత్రాలను ఉచ్చరించే సమయంలో వాటి అర్థాలను తెలుసుకొని వాటిని ఊహించ గలగాలి.

ఎంత బాగా, దగ్గరగా ఊహించుకోగలిగితే అంత మంచి ఫలితాన్ని రాబట్టుకోగలం. కల్పన లేదా ఊహ మరియు నమ్మకం ఈ రెండూ ఒక పక్షికి రెండు రెక్కల లాంటివి. రెండూ బలంగా ఉన్న పక్షి ఆకాశంలో చక్కగా విహరించ గలదు. కాబట్టి నమ్మకాన్ని, కల్పనను ఆదరించి ఈ మంత్రాల ద్వారా ఉపశమనం పొందుదాం.
🌹 🌹 🌹 🌹 🌹

Sunday, 17 May 2020

మహర్షుల జీవితం





Agasthya (Agathiyar)

అగస్త్య మహర్షి!
.
అగస్త్య మహర్షి హిందూ చరిత్రలో ఒక గొప్ప ఋషి. దక్షిణ భారతదేశంలో నేటికీ  ఈ ఋషి జీవించే ఉన్నట్టుగా చెప్తారు. అగస్త్యుడు నర్మద నది ఒడ్డున ఉన్న గరుడేశ్వర అనే ప్రదేశం వద్ద తపస్సు ఆచరించినట్లుగా చెబుతారు.
వింధ్యుని గర్వ మణచుట! 

మేరు పర్వతం అన్నింటికన్నా ఎత్తైన పర్వతం. దాని ఎత్తును చూసి భరించలేక ఈర్ష్యతో వింధ్య పర్వతం కూడా దానికంటే ఎత్తుగా ఎదిగి సూర్యుని గమనాన్ని కూడా అడ్డగించసాగింది. దీంతో రాత్రింబవళ్ళూ సక్రమంగా రాక వేద విధులకు ఆటంకం కలగసాగింది. అప్పుడు దేవతలందరూ కలిసి అగస్త్యమునిని ఏదో ఒకటి చేయమని ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించిన అగస్త్యుడు తన భార్యతో కలిసి ఆ పర్వతం వద్దకు వచ్చాడు. తాము దక్షిణ దిశగా వెళుతున్నామనీ, అంత పెద్ద పర్వతాన్ని ఎక్కి దిగలేమనీ దాని ఎత్తుని తగ్గించుకోమన్నారు. మహర్షులంటే భక్తి ప్రపత్తులు గల వింధ్యుడు తక్షణమే తన ఎత్తుని ఉపసంహరించుకుని వెంటనే వారు నడచి వెళ్ళడానికి వీలుగా దారి ఇచ్చాడు. తర్వాత అగస్త్యుడు తాము మరలా తిరిగి ఉత్తర దిశగా తిరిగి వస్తామని అప్పటిదాకా అలాగే ఉండమని చెప్పాడు. కానీ మళ్ళీ తిరిగి రానేలేదు. అప్పటి నుంచీ ఇప్పటిదాకా ఆ పర్వతం అలాగే ఉంది. కార్యక్రమాలు యదావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. వేరొక కథనం ప్రకారం-శివ పార్వతుల కళ్యాణానికి ఉత్తరానికి ఋషులందరు హిమాలయలకు వచ్చారు. అప్పుడు వారి శక్తికి ఉత్తరాన భూమి క్రుంగి పొవు చుండడం చూసి శివుడు అందరి శక్తికి ఇంచుమించు సమానమైన అగస్త్యభగవానులను దక్షిణ దిక్కున ఉండమని ఆదేశమిచ్చారు. అప్పుడు అగస్త్యులవారు కళ్యాణం చూడలేక పొతున్నందుకు చింతించుచుండగా వారికి అక్కడనుండి కూడ ప్ర్యత్యక్షంగా చూసే వరాన్ని ప్రసాదించారు. అప్పటి నుండి అగస్త్యులవారు దక్షిణాన ఉన్నారు. వారు మొట్టమొదటి దక్షిణ భాష ఐన తమిళంను పరిచయం చేసారు. తమిళం అతి ప్రాచీన భాష అని అందరికి తెలిసిన విషయమే. వారు మొట్టమొదటి నుండి హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉన్నారన్న గుర్తుగా వారి పేరు మీద ఒక ఊరు కూడా ఉత్తరాఖండ్ కేదార్ నాథ్ వెళ్ళే దారిలో ఉంది. అక్కడ శివాలయం పక్కనే శనీశ్వరాలయం ఉన్నాయి.

వివాహం!
మనుస్మృతి ప్రకారం అందరు హిందువుల లాగే అగస్త్యుడు కూడా వివాహం చేసుకుని సంతానం కనాల్సి వచ్చింది. అప్పుడు ఆయన బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆయన యోగశక్తిని ఉపయోగించి గుణగణాల్లోనూ, వ్యక్తిత్వంలోనూ అన్నిరకాలుగా ఒక విరాగికి భార్యగా ఉండేందుకు అవసరమైన లక్షణాలు కలిగిన ఒక ఆడశిశువును సృష్టించాడు. ఇదే సమయంలో ఘనకీర్తి కలిగిన విదర్భ రాజు సంతానం లేక భాధపడుతున్నాడు. ఆయన ఒక పుత్రిక కోసం జపతపాదులు చేస్తూ నిరీక్షిస్తున్నాడు. అగస్త్యుడు ఆయన సృష్టించిన శిశువును ఆ రాజు భార్య గర్భంలోకి ప్రవేశపెట్టాడు. పుట్టిన బిడ్డకు ఆ రాజదంపతులు లోపాముద్ర అని నామకరణం చేశారు. ఆమెకు యుక్త వయస్సు రాగానే అగస్త్యుడు ఆమెకు తనతో వివాహం జరిపించాల్సిందిగా రాజును కోరాడు. మొదటగా ఒక విరాగి నుంచి ఈ ప్రతిపాదన విన్నరాజు ఖిన్నుడయ్యాడు. కానీ మానసికంగా వ్యక్తిత్వ పరంగా ప్రతిభాశీలియైన తన కూతురు పట్టుబట్టడంతో ఒప్పుకున్నాడు. దాంతో రాజు వారిద్దరి వివాహం జరిపించాడు.

వాతాపి, ఇల్వలుల కథ !
ఒకానొకప్పుడు వాతాపి, మరియు ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులు నివసించేవారు. వీరు అడవిలో నివసిస్తూ దారిన పోయే బాటసారులను ఒక విచిత్రమైన రీతిలో చంపి తినేవారు. వాతాపికి సులభంగా తను కోరుకున్న జీవి రూపంలోకి మారే విద్య తెలుసు. ఇల్వలుడికి చనిపోయినవారిని బ్రతికించే సంజీవనీ విద్య తెలుసు. ఎవరైనా బాటసారి వచ్చినపుడు వాతాపి ఒక మేక రూపంలోకి మారిపోయేవాడు. ఇల్వలుడు ఒక బ్రహ్మచారి వేషం వేసుకుని అతిథులను భోజనానికి ఆహ్వానించేవాడు. వారు ఆ మేక మాంసాన్ని ఆరగించగానే ఇల్వలుడు వాతాపిని బ్రతికించడానికి సంజీవినీ మంత్రం పఠించేవాడు. అప్పుడు వాతాపి ఆ బాటసారి పొట్టను చీల్చుకుని బయటకు వచ్చేసేవాడు. అలా ఒక సారి అగస్త్యుడు ఆ అరణ్యం గుండా వెళుతుండగా రాక్షస సోదరులు గమనించి ఆయన్ను విందుకు ఆహ్వానించి అందరికీలానే మేక మాంసం వడ్డించాడు ఇల్వలుడు. ఆయన భోంచేసిన తరువాత ఇల్వలుడు యథావిధిగా వాతాపిని బయటకు రప్పించడానికి సంజీవనీ మంత్రం పఠించాడు. కానీ వాతాపి మాత్రం తిరిగి రాలేదు. ఎందుకంటే ఈ విషయం ముందుగా తెలుసుకున్న అగస్త్యుడు జీర్ణం జీర్ణం, వాతాపి జీర్ణం అనగానే వాతాపి జీర్ణమైపోయాడని ఇల్వలుడికి తెలియజేశాడు.

--(())--




సుందర కాండ .. సుందరమైన కాండ… సుందరుని కాండ….

నిప్పంటింపబడిన తోకతో, హనుమంతుడు రావణునిభవనంతో పాటు, అనేక భవనాలలో ప్రచండమారుత వేగంతో తిరుగాడాడు. అగ్నిజ్వాలలు అదుపుతప్పి భవనాల పై అంతస్తులు నేలకూలాయి. ఆ ఉష్ణోగ్రతకి స్వర్ణ, రజిత ఆడంబర అలంకారాలు ద్రవీభవించి, లావావలే వీధుల్లోకి ప్రవహించాయి.
తమ ఆస్థుల కోసం, ధ్వంసం అవుతున్న అశ్వాలు, యేనుగుల కోసం, రాక్షసుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఆ జ్వలిస్తున్న అగ్ని చూసేవారికి ‘ జగత్తుకు విలయం ముంచుకొస్తున్నదా ‘ అనిపించేటట్లు వున్నది. రాక్షసులైతే, ” ఈతడు వానరమా లేక అగ్నిదేవుడా ? ఇంద్రుడు గానీ, బ్రహ్మగానీ, కాలుడుగానీ లేక విష్ణుశక్తి గానీ ఈ రూపం లో రాలేదుకదా! ” అని విపరీతమైన ఆశ్చర్యం వెలిబుచ్చుతున్నారు.
నగరమంతా చుట్టివచ్చిన హనుమంతుడు, ఆ అగ్నికీలలను చూసి యెంతో తృప్తి చెందాడు. సముద్రం దగ్గరికి వెళ్లి, తన వాలానికివున్న అగ్నిని చల్లార్చాడు. ఉన్నట్లు వుండి హనుమంతునికి భయంకరమైన అనుమానం కలిగింది. ” నేనుచేసిన ఈ లంకాదహనమనే మూర్ఖమైన పనివలన సీతకూడా దగ్ధమైపోయిందా ?
ఆహా ! మితిమీరిన క్రోధం యెంత పని చేసింది ! కోపం వస్తే విచక్షణ వుండదు కదా ! కోపానికి వశుడైన వాడు గురువును, తల్లిని కూడా ఉపేక్షింపడు. మహాత్ములను అవమానిస్తాడు. సీత మరణించి వుంటే, ఈ ప్రయత్నమంతా వ్యర్ధమే కదా ! అక్కడ కిష్కింధలో, అయోధ్యలో యెవరూ ప్రాణాలతో మిగలరు ” అనుకంటూ విలపిస్తూ వుండగా కొన్ని శుభశకునాలు గోచరించి, ఊరటపడ్డాడు.
ఇంతసేపూ హనుమంతుని వీరోచితకార్యాన్ని వీక్షిస్తున్న సిద్ధులూ, చారణులు, యితర దివ్యపురుషులు, సీత సురక్షితంగా ఉన్నదనే వార్త, హనుమంతునికి తెలిపారు. శీఘ్రమే సీత వున్నచోటుకు వెళ్ళాడు. ఆమెను చూసి ఆనందబాష్పాలు కార్చాడు. సీత మరియొకసారి, తాను వున్న పరిస్థితులు రామునికి గట్టిగా వివరించి చెప్పమని, హనుమను కోరింది. హనుమ కూడా ఆమెను స్వాంతనపరచి, రాముని శక్తి సామర్ధ్యాలు మరియొకసారి గుర్తుచేసి, ఆమె సంశయం పోగొట్టాడు.
తాను వచ్చిన కార్యం పూర్తి అయిందని భావించిన హనుమంతుడు ‘ ఆర్శిత పర్వతం ‘ ని అధిరోహించి, కాయాన్నిపెంచి, పర్వతాన్ని అదుముతూ, పైకెగరాడు. ఆ పర్వతం ఆయన ధాటికి 30 యోజనాల లోతుకి దిగబడిపోయింది. శిఖరం నుజ్జునుజ్జు అయింది. తిరుగు ప్రయాణంలో హనుమంతుడు మరియొకసారి గౌరవపూర్వకంగా మైనాక పర్వతాన్ని స్పర్శించాడు. చివరకు మహేంద్ర పర్వతాన్ని సమీపిస్తూ, తన వానర మిత్రులను కలుసుకునే ఉత్సుకతతో, వాలచాలనం చేస్తూ విజయోత్సాహంతో, శబ్దాలు చేస్తూనే వున్నాడు.
హనుమంతుని అరుపులు వింటూనే, అతను తనకొసంగిన కార్యంలో సఫలీక్రుతుడు అయినాడని గ్రహించిన జాంబవంతుడు, వానరులు, ఇనుమడించిన ఉత్సాహంతో, తమ వస్త్రాలను ఆనందసూచకంగా వూపుతూ, వాలాలని విజయ గర్వంగా ప్రదర్శిస్తూ, ఒక వృక్షంనుండి మరొక వృక్షంమీదకు, ఒక పర్వతశిఖరం నుండి వేరొక దానిమీదకు చెంగుచెంగున దూకసాగారు.
హనుమంతుడు కనుచూపు మేరకురాగానే, మహేంద్ర పర్వతం పైకి దిగడాన్ని ముకుళిత హస్తాలతో వీక్షించారు. హనుమంతుని చుట్టూచేరి, కేరింతలు కొట్టారు. కందమూలాలు సమర్పించారు. హనుమంతుడు పెద్దలందరికీ నమస్కరించి, తర్వాత అంగదునికి అభివాదం చేశాడు. వారు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పి, వారిని సంతృప్తి పరచాడు. సీతను చూశానని చెప్పగానే, వారు హనుమంతుని పదేపదే ఆలింగనం చేసుకున్నారు. .
అంగదుడు , జాంబవంతుడుతో సహా, హనుమంతుని సాహస కార్యాన్ని, యింకా యింకా వినాలని ఉత్సాహంతో అందరూ హనుమంతుని చుట్టూ చేరారు. తన వీరోచిత కార్యాన్ని విశదంగా వివరించమని అడిగారు. హనుమంతుడు సీతకు మనస్సులోనే నమస్కరించి, అంతా పూసగ్రుచ్చినట్లు చెప్పాడు. ” నిరంతరం రాముని ధ్యాసలో వున్నది కాబట్టి, సీత సజీవంగా వున్నది. ఆమెను శీఘ్రమే రక్షించకబోతే, ఆమె శుష్కించి మరణించడం తధ్యం.” అని ముగించాడు.
అందుకు అంగదుడు ” మనం ఇటునించి ఇటే లంకమీదకు యుద్ధానికి వెళ్లి సీతను విడిపించుకునివద్దాము ” అన్నాడు. కానీ, హనుమంతుడు ” తనతో రమ్మనమంటేనే సీత రాలేదు. రాముని చేత శత్రుసంహారం చేయించి గానీ రానని చెప్పింది. ” అని ఆ ప్రయత్నం విరమింపచేశాడు.
ఓం శ్రీ హనుమతే శ్రీ రామదూతాయ శ్రీ ఆంజనేయాయ నమ :

Tuesday, 5 May 2020

దత్తాత్రేయ స్వామి 24 గురువులు/ శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర



శ్రీ దత్తాత్రేయ స్వామి 24 గురువులు
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః
🕉🌞🌏🌙🌟🚩

దత్తుడు త్రిమూర్తి స్వరూపమైన విశ్వగురువు. శిష్యునికి భగవంతుని వెలుగు ఎవరి ద్వారా వస్తుందో వారే గురువు.

గురువులో గకార సిద్ధివాచకం, రకార పాపనాశకం, ఉకార విష్ణువాచకాలు ఉన్నాయి.

గురువులో రెండు ఉకార వాచకాలు పాపనాశనాన్ని చేసి సిద్ధిని ఇచ్చే వ్యాపకత్వముతో కూడి శుధ్ధి చేయువారు గురువు.అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం ఎవరి ద్వారా కలుగుతుందో వారు గురువు (వారు లేదా వాటి ద్వారా)మరో అర్థం ఎవరి నుంచి మేలు పొందినా వారిని గురువు అనాలి. అంటే మేలు చేసినవారు కూడా గురువే

దత్తాత్రేయుడికి 24 మంది గురువులు.. వీరంతా లోకంలో ఉన్నవారే.

ఇలా ప్రతి ఒక్కరి నుంచి ఒక్కో విషయాన్ని గ్రహించి వారిని/వాటిని తన గురువులుగా దత్తాత్రేయుడు స్వీకరించారు. 

దీనిలో పరమార్థం మనం మన చుట్టు ఉన్న ప్రకృతిలోని జీవులు, వస్తువులోని మంచిని గ్రహించి జీవనాన్ని సన్మార్గంలో నడుపుకోవాలని తెలియజేస్తుంది.

దత్తాత్రేయ అవతారంలో ఎందరినో ఉద్దరించాడు.ఆధ్యాత్మిక సిద్ధి, యోగవిద్యను ఎందరికో ఉపదేశించాడు. వీరిలో ప్రహ్లాదుడు,యదురాజు, పరుశరాముడు,కార్తవీర్యార్జునుడు,మహాసతి మదాలస పుత్రుడైన అలర్క వీరిలో ప్రధానమైన వారు.

ఇక అవధూత పరంపరకు ఆద్యుడు. దత్తాత్రేయున్ని అవధూత శిరోమణి, ఆదిగురువు అని కూడా పిలుస్తారు.అవధూత అంటే స్వస్వరూపంగా అవస్థితమైన మహాత్ముడు. దీనిగురించి గోరక్ష సిద్ధాంతంలో విశేషంగా పేర్కొన్నారు.

ॐॐॐॐॐॐॐॐॐ

దత్తాత్రేయుని 24 మంది గురువులు.
ॐॐॐॐॐॐॐॐॐ
యాదవ వంశానికి మూలపురుషుడైన యదువు అనే రాజు దత్తాత్రేయుని చూచి స్వామీ మీరెలా సదానంద, చిదానంద స్వరూపులై ఉండ గలుగుతున్నారు అని ప్రశ్నించగా అప్పుడు దత్తాత్రేయుల వారు ఇలా సెలవిచ్చారు.

యదు రాజా ! నేను సమస్త ప్రకృతిని పరిశీలించి అన్నింటి నుండీ జ్ఞానం సంపాదించాను. చెప్తాను విను.

ప్రకృతిలో నాకు 24 మంది గురువులున్నారు. కొన్నింటి నుండి ఎలా ఉండాలో తెలుసుకున్నాను, కొన్నింటి నుండి ఎలా ఉండకూడదో తెలుసుకున్నాను. 

ఆ విధంగా తానే స్వయంగా దేవతలు, రాజులు, మహర్షులకి ఎందరికో గురువైనప్పటికీ, అహంకారం లేకుండా సృష్టిలోని ప్రతీ అణువు నుండి నేర్చుకుంటూ శిష్యుడు కూడా అయ్యాడు.

జగత్తుకూ, ప్రకృతికీ తానే గురువైనా మనందరిలో ఙ్ఞానమనే జ్యోతిని వెలిగించడానికి జగద్గురువైన దత్తాత్రేయ స్వామి ప్రకృతిలోని 24  తత్త్వాలను తన గురువులుగా ప్రకటించుకున్నారు అవి...

1)🎇 ఆకాశం
2) 🌏భూమి
3) 🔥అగ్ని
4) 💦జలం
5) 🌬️వాయువు
6) 🌞సూర్యుడు
7) 🌝చంద్రుడు
8)🐦 పావురం
9) 🐍కొండ చిలువ
10) 🐝తేనెటీగ
11) 🦋భ్రమరం ( తుమ్మెద )
12) 🌊సముద్రం
13) 🦅రాబందు
14) 🕷️సాలీడు
15)🐘 ఏనుగు 
16) 🦌జింక
17) 🐟చేప 
18) 👼పసి పిల్లవాడు
19) 🧏‍♀️కన్య 
20) 🐍పాము
21) 🤠లోహపు పనివాడు
22) 🐻ఎలుగుబంటి
23) 🧛‍♀️వేశ్య
24) 🦗చిమ్మట

ఇవన్నీ పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు , పంచ తన్మాత్రలు, మిగిలిన నాలుగు మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారాలకు ప్రతీకలు. ఆ ఙ్ఞానమూర్తి అవ్యక్త రూపంలో వీటన్నిటిలో ఉన్నట్టుగా చెప్తారు.

ఈ ప్రకృతి తత్త్వాలను దత్తాత్రేయుడు ఎలా గురువుగా  స్వీకరించాడో... తెలుసుకుందాం.

🕉🌞🌏🌙🌟🚩

1. మొదటి గురువు - 🌏భూమి:-

దత్తాత్రేయుడు తాను భూదేవి నుండి ఓర్పు వహించడం, కర్తవ్య నిర్వహణా ధర్మం, కార్య నిర్వహణలో ఎన్ని కష్టానష్టాలు వచ్చిన ఓర్చుకోని నిలబడడం, తన ధర్మం తాను తప్పకపోవడం లాంటి ఎన్ని విషయాలనో తాను గ్రహించానంటాడు జగద్గురువైన దత్తాత్రేయుడు. భూదేవి కన్నా ఓర్పు ఈ విశ్వంలో ఎవరికి ఉంటుంది. మానవుడు దుర్మార్గుడు ఎన్ని అకృత్యాలకు పాల్పడినా ఓర్పు వహించి భరించేదే భూమాత.

మనం ఎన్నో తప్పులు చేసి భూదేవిలో భాగమైన ఈ ప్రకృతి నడిచే సక్రమమైన వ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేసి ఉత్పాతాలు సృష్టించినా ఉపేక్షించి, కొడుకు ఎన్ని తప్పులు చేసినా కన్నతల్లి తన కడుపులో దాచుకున్నట్టు, ఓర్పుతో మనని ఉద్ధిరించే ప్రయత్నం చేస్తుంది తల్లి భూదేవి. ఇంకా భూదేవి నుండి నేర్చుకోవాల్సిన గుణం క్షమా గుణం.

భూమిపై ఉండే పర్వతాలు మరియు వృక్షాల లాగా ఇతరులకు ఎలా ఉపయోగపడాలో నేర్చుకోవలంటాడు దత్తాత్రేయుడు.

🕉🌞🌏🌙🌟🚩

2. రెండవ గురువు - 🌬️వాయువు:-

గాలి మనకు ప్రవిత్రత, వాసన లేని గుణం అంటే ఎలాంటి విపరీత భావాలూ లేకపోవడం మరియు అందరిలో తొందరగా కలిసిపోవడం లాంటి ఎన్నో గుణాలు నేర్పుతుంది. గాలి అన్నిటితో కలిసినా తన సహజలక్షణాన్ని ఎలాగైతం కోల్పోదో మనిషి కూడా అలాగే మనం కూడా ఎంతమందితో కలిసినా మన సహజ లక్షణాన్ని కోల్పోకూడదు.

ఎలాగైతే గాలి అదుపు తప్పి అతివేగంతో వీచి ప్రకృతిలో మహా విధ్వంసం సృష్టిస్తుందో అలాగే అదుపు లేని మనస్సు కూడా అలాగే ఎన్నో విధ్వంసాలు సృష్టిస్తుంది, అలాంటి మనస్సుని పరమాత్మ వైపు మరల్చడం చాలా కష్టం. అందుకే మన మనస్సుని సాధ్యమైనంత వరకు మన అదుపులో పెట్టుకొని పరమాత్మ వైపు నడిపించే ప్రయత్నం చేయాలి.

🕉🌞🌏🌙🌟🚩

3. మూడవ గురువు - 🎇ఆకాశం:-

విశ్వమునంతా కప్పి ఉంచే ఆకాశం అంతటా వ్యాపించి ఉంటుంది. కొన్నిసార్లు ఆకాశాన్ని మబ్బులు కమ్మి దాన్ని కనబడకుండా చేస్తాయి. అయినా ఆకాశం ఆ మబ్బుల చేత ప్రభావంఏ కాదు. తన స్థితిని తాను విడచిపెట్టదు. అలాగే ఆత్మకూడా ఈ ప్రాపంచిక విషయాల చేత కప్పబడినా తన అసలు స్థితిని మరవకూడదని దత్తాత్రేయ స్వామి అంటారు.

ఆకాశం విశ్వంలో ప్రతి చోట వ్యాపించి ఉంది. దానికి కనపడని వస్తువూ, విషయమూ లేదు. అలాగే పరమాత్మ కూడా సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఆయన చూడని విషయమూ, ఆయనకు తెలియని విషయమంటూ లేదు.

ఆకాశం మనకు నీలి రంగులో కనిపించినా, అసలు ఆకాశానికి రంగేలేదు. అలాగే పరమాత్మ ఒక రూపంలో మనకు కనబడ్డా రూపరహితుడు ఆ పరమాత్మ. ఎలాగైతే ఆకాశంలో ఎలాంటి పదార్థం ఉండకుండా పూర్తి ఖాళీగా ఉంటుందో, అలాగే ఒక ఙ్ఞాని తన ప్రవచనాలలో కూడా ఎలాంటి భావాలను ఉంచుకోకూడదని అంటాడు దత్తుడు.

🕉🌞🌏🌙🌟🚩

4. నాలుగవ గురువు - 💦జలము:-

ఋషి లేదా ఙ్ఞాని జలము లాంటి వాడు. ఙ్ఞాని నీరుగా స్వచ్ఛమైన మనసు కలవాడు. నీరులాగా కోమలమైన గుణం కలిగి, ఎలాగైతే నీరు సరిగా ప్రవహిస్తున్నప్పుడు మంచి మంచి శబ్దాలు చేస్తుందో అలాగే ఙ్ఞాని కూడా తన నోటి ఎన్నో మంచి మాటల ధారలను ప్రవహింపజేస్తాడు.

ఎలాగైతే నీటిలోని మురికి బట్టలు  కాసేపటికి శుభ్రమవుతాయో అలాగే మలినమైన మనస్సు గల మనం మహాత్ముల ( ఙ్ఞానుల ) సాంగత్యం కలగగానే మన మనసులు నిర్మలమవుతాయి. ఎలాగైతే నీరు ఎలాంటి అహం భావము లేకుండా జాతి, కుల, మత బేధాలు లేకుండా అందరి దాహార్తిని తీరుస్తుందో అలాగే ఙ్ఞాని కూడా కుల, మత, జాతి, వర్ణ బేధాలు విడిచిపెట్టి అందరికీ సమానంగా ఙ్ఞానాన్ని పంచాలి. అందుకే ఙ్ఞాని సమత్వ బుద్ధి కలిగి అందరిలో ఙ్ఞాన దీపాలను వెలిగించాలి.

🕉🌞🌏🌙🌟🚩

5. ఐదవ గురువు - 🔥అగ్ని:-

అగ్ని సమస్తాన్ని కబళించి ఆహారంగా స్వీకరిస్తుంది. అపవిత్ర పదార్థాలను స్వీకరించినా కానీ తాను మాత్రం పవిత్రంగానే ఉంటుంది. అలాగే మనం కూడా సమస్తమైన ఙ్ఞానాన్ని నేర్చుకోవాలి కానీ మనం అపవిత్రులం కాకూడదు. అగ్ని నుండి ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవాలంటాడు దత్తాత్రేయుడు.

ఙ్ఞాని కూడా అగ్నిలా పవిత్రుడు.  ఎలాంటి కల్మషమూ లేని వాడు. ఙ్ఞాని అరిషడ్వర్గాలకు అతీతుడు.

🕉🌞🌏🌙🌟🚩

6. ఆరవ గురువు - 🌝చంద్రుడు:-

చంద్రుడు కృష్ణ పక్షంలో తన కళలు క్షీణిస్తున్నా చల్లటి వెన్నెల వెలుగును ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. అలాగే ఙ్ఞాని కూడా తనకు ఏం జరుగుతున్నా ఇతరులకు మంచి చేసే ప్రయత్నమే చేస్తాడు. మహాత్ములు కూడా గుణంలో చాలా చల్లనివారు.

చంద్రుడు శుక్ల పక్ష, కృష్ణ పక్షాల్లో పెరిగుతూ , క్షీణిస్తున్నా తన అసలు గుణ స్వరూపాలలో మార్పు చెందడు. అలాగే మహాత్ములు కూడా వారు పుట్టినప్పటి నుండి మరణించే వరకు వారి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నా వారి యొక్క సహజ గుణంలో, స్వభావంలో మార్పును రానివ్వరు.

🕉🌞🌏🌙🌟🚩

7. ఏడవ గురువు - 🌞సూర్యుడు:-

సూర్యుడి ప్రతిబింబం ఎన్ని పదార్థాల్లో కనిపించినా సూర్యుడు మాత్రం ఒక్కడే. అలాగే పరమాత్మ కూడా ఎన్ని రూపాల్లో కనిపించినా పరమాత్మ మాత్రం ఒక్కడే. ఇలా సూర్యుడి నుండి చాలా విషయాలు నేర్చుకోవాలంటాడు దత్తాత్రేయుడు.

సూర్యుడు తన వేడిమితో సముద్రాలలో ఉన్న నీటిని ఆవిరి చేసి వర్షం రూపంలో మళ్ళీ ఆ నీటిని భూమికి చేరేటట్టు చేస్తాడు. కానీ ఈ మొత్తం ప్రక్రియలో సూర్యుడు ప్రత్యక్షంగా నీటిని అంటడు కదా. అలాగే మహాత్ములు కూడా మన నుండి ప్రాపంచిక పదార్థాలు స్వీకరించినా. వాటిపై మోజు పెంచుకోక మరల వాటిని ఏదో రూపకంగా మనకే ఇచ్చివేస్తారు.

🕉🌞🌏🌙🌟🚩

8. ఎనమిదవ గురువు - 🐦పావురం:-

దీనికి సంబంధించిన విచిత్రమైన కథ ఒకటి ఉంది. ఒక అడవిలో పావురాల జంట నివసిస్తూ ఉండేది. వాటికి కొంత కాలం తరువాత సంతానంగా రెండు పావురాలు జన్నించాయి.  శైశవ దశలో ఉన్న ఆ పావురాల కోసమని ప్రతిరోజూ ఈ పావురాల జంట ఆహారం తీసుకొని వచ్చేవి.

అలా ఒకనాడు పిల్లల కోసం ఆహారం తేవడానికి వెళ్ళిన పావురాల జంట తిరిగి వచ్చెసరికి తమ సంతానం వేటగాడి వలలో ఉండడం చూసి చాలా దుఃఖించాయి. ప్రాణప్రదంగా పెంచుకున్న వాటిని వీడి ఉండలేక ఆ పావురాల జంట కూడా అదే వలలో పడి వేటగాడికి ఆహారంగా మారాయి.

మనిషి కూడా ప్రాపంచిక విషయాలపై బాగా  ఆసక్తి పెంచుకొని పరమాత్ముని మార్గం నుండి వైక్లబ్యమును పొందుతారు. మోక్ష మార్గాన్ని విడిచి ఐహిక విషయసుఖాలకై ప్రాకులాడతారు. పుత్రులు, మిత్రులు, భార్య , బంధువులే కాకుండా పరమాత్మ అనేవాడు ఒకడున్నాడనే ధ్యాస కూడా ఉండకుండా ప్రాపంచిక సుఖాలలో మునిగితేలుతూంటాడు.అప్పుడు సద్గురువు లేదా ఆ పరమాత్మనే ఆశ్రయించి మోక్ష ప్రాప్తికై ప్రయత్నించాలి.ఆ పావురాల జంట లాగా మనిషి మూర్ఖంగా ప్రవర్తించ కూడదని హితవు పలుకుతాడు దత్తాత్రేయుడు.

🕉🌞🌏🌙🌟🚩

9. తొమ్మిదవ గురువు -🐍 కొండచిలువ:-

కొండ చిలువ తనకు ఎదురుగా ఏది వచ్చినా దానిని మింగేస్తుంది. అది మంచిదో, కాదో, చేదుగా ఉందా, తియ్యగా ఉందా అసలు తినవచ్చో, తినకూడదో అని కూడా చూడదు.

అలాగే మనిషి కూడా తన జీవితంలో వచ్చిన సుఖదుఃఖాలు, లాభనష్టాలు లాంటి ద్వంద్వాలు ఎన్ని వచ్చినా చలించక సమానంగా స్వీకరించాలంటాడు దత్తాత్రేయుడు.

🕉🌞🌏🌙🌟🚩

10. పదవ గురువు - 🐝తేనెటీగ:-

తేనటీగ పువ్వుల నుండి ప్రతి రోజూ తేనెను సేకరిస్తుంది. కానీ ఈ మొత్తం ప్రక్రియలో అది పువ్వులకు ఎటువంటి హాని కలిగించకుండా తన పని తాను చేసుకుపోతుంది.

అలాగే మహాత్ముడు లేదా ఋషి కూడా ఆన్ని గ్రంథాల నుండి ఙ్ఞానాన్ని సంపాదించాలి. ఇల్లిల్లూ  తిరిగి భిక్ష స్వీకరిస్తున్నప్పుడు గృహస్థులను ఇబ్బందులకు గురిచేయకూడదంటాడు దత్తుడు. ఙ్ఞాని తేనెటీగ లాగా పిసినారి వాడై ఉండకూడదు.

🕉🌞🌏🌙🌟🚩

11. పదకొండ గురువు - 🐻ఎలుగుబంటి:-

తేనెటీగలు తాము సేకరించిన తేనెను భద్ర వరచుకుంటాయి. కానీ ఆ తేనెని ఎప్పుడు కూడా తినవు, అసలు ఇతరులకు వాడే ప్రయత్నమే చయవు. అలా దాచిన తేనెని అడవి ఎలుగుబంట్లు తింటాయి.

యోగి అనే వాడు ఎప్పుడూ ఏదీ దాచుకునే ప్రయత్నం చేయకూడదు. తరువాతి క్షణానికి కూడా ఏదీ దాచుకోకూడదంటాడు దత్తుడు. తినడానికి నోరుని, తిన్న అన్నాన్ని భద్రపరచుటకు కడుపును మాత్రం ఉపయోగించాలి.. అలా కాకుంటే వస్తువుల మీద వ్యామోహం పుడుతుందేమో అని దీనిలో అంతరార్థం. యోగి పిసినారి వాడై ఉండకూడదు.

పుట్టినప్పుడు ఏమీ తెచ్చుకోని మనం, పోయే ముందు కూడా ఏమీ తీసుకెళ్ళం. అందుకే వస్తువ్యామోహం వద్దంటాడు దత్తాత్రేయుడు. ఎలాగైతే తేనె లేనిదే తేనెటీగలకు గుర్తింపు లేదో, ఆత్మ లేనిదే శరీరానికి కూడా గుర్తింపు ఉండదు. సమయం వచ్చినప్పుడు ఎలాగైతే ఎలుగుబంటి తేనెని తీసుకెళ్తుందో, అలాగే మరణ కాలం వచ్చినప్పుడు యముడు కూడా మనని తీసుకెళ్తాడు.

అప్పుడు మనతో పాటు మనం ఏమీ తీసుకెళ్ళలేం. చచ్చినప్పుడు తనతో పాటు ఏదైనా వస్తువును తీసుకెళ్ళిన మనిషి ఎవడైనా ఉన్నాడా? అందుకే వస్తువ్యామోహం తగ్గించి పరమాత్మ పైన ప్రేమను పెంచుకోవాలంటాడు దత్తాత్రేయుడు.

🕉🌞🌏🌙🌟🚩

12. పన్నెండవ గురువు - 🦅రాబందు:-

దీనికి సంబంధించిన కథ ఒకటి ఉంది. ఒక అడవిలో ఒక రాడందు చనిపోయిన పశుపక్షాదుల శవాలపై ఆధారపడి జీవిస్తూండేది. ఒకనాడు యథా ప్రకారం ఒక పశువు యొక్క శవంలోని మాంసం కొంత తిని, మరికొంత తన నోట కరచుకొని తన గూటిపైపుకు ప్రయాణించ సాగింది.

కానీ అది ప్రయాణిస్తున్న మార్గంలో బాగా ఆకలిగా ఉన్న గ్రద్దలు మాంసపు ముక్కను పట్టుకెళుతున్న ఈ రాబందును చూశాయి. వెంటనే ఆ మాంసపు ముక్క కోసం ఈ రాబందుపై దాడి చేశాయి. ఎంత ప్రయత్నించినా తప్పించుకోలేక ఆ రాబందు ఆ మాంసపు ముక్కను వదిలేసింది. ఆ గ్రద్దలు ఆ మాంసపు ముక్కపై పడి తమ ఆకలిని తీర్చుకున్నాయి.  మాంసపు ముక్క వదిలాక గానీ రాబందు తప్పించుకొని తనను తాను కాపాడుకో గలిగింది.

మనిషి ఎప్పటివరకైతే ప్రాపంచిక విషయాలు, ప్రాపంచిక సుఖాల కోసం పాకులాడతాడో అప్పటి వరకు తాను సుఖపడడు సరికదా తన చుట్టూ ఉన్నవారికి కష్టాలు, దుఃఖాలు తెచ్చిపెడతాడు. ఎప్పటివరకైతే ప్రాపంచిక వస్తువుల వెనుక పరిగెత్తుతాడో అప్పటివరకు తాను సుఖపడడు. ఎప్పుడైతే తాను ఆ విషయాలపై వ్యామోహాన్ని వదిలిపెడో అప్పుడే పరమపదాన్ని చేరుకోవడంలో ముందుకు సాగుతాడు.

మనం చూసిన కథలో ఎంతవరకైతే రాబందు తన దగ్గర మాంసం ముక్క ఉంచుకుందో అప్పటివరకు తాను ఆ గద్దల చేత వెంటాడబడింది. కానీ ఆ మాంసపు ముక్కని వదిలిపెట్టిన క్షణాన అది రక్షింపబడింది. అలాగే మనిషి కూడా ఎంతవరకైతే తాను ప్రాపంచిక వస్తువిషయాలపై మక్కువ పెంచుకుంటాడో అప్పటివరకు తాను ఈ భవసాగరంలో మునుగితేలుతూనే ఉంటాడు. కానీ వాటిపై వ్యామోహం వదలగానే అమితమైన ప్రశాంతతను పొంది పరమాత్మను చేరడంలో ముందుకు సాగిపోతాడు.

జీవి తను పరమాత్మను చేరడంలో కూడా పరమాత్మ సాయాన్నే అర్థించాలి. ఆయన కృపలేనిదే ఆయనను చేరడం అసంభవం. భాగవతంలో కుంతీదేవి శ్రీకృష్ణుడితో " పరంధామా! ఈ భవసాగరంలో మునిగితేలుతూ  వీటిపై ఆసక్తి పెంచుకున్న మేము నిన్ను ఎలా చేరుకుంటామయ్యా! ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గానీ ఈ మనిషి జన్మ ఎత్తలేము. ఎత్తినా నిన్ను చేరటంలో కొంతమాత్రమే ముందుకుపోగలుగుతాం. నిన్ను చేరాలంటే ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలి తండ్రి? కాస్త దయ చూపించవయ్యా!! " అని ఆర్తితో వేడుకుంది.

అప్పుడు కృష్ణుడు కుంతీదేవితో " అమ్మా కుంతీదేవి! బాధపడకు. నన్ను చేరటానికి ఎందుకంత శ్రమ? భక్తితో పిలిచే ఒక్క పిలుపు చాలు! నేను మీకు వశుడనైపోతాను. సాధ్వీ! భక్తి ఉంటే నన్ను చేరటంలో నేనే మీకు సహాయపడతాను. వేరే ఏ శక్తి అవసరం లేదు. కేవలం భక్తి ముఖ్యం " అని సెలవిస్తాడు. కానీ మనకు కనీసం ఒక్క క్షణమైనా భక్తితో పరమాత్మపై దృష్టి కేంద్రీకరించడం కష్టతరమైన విషయంగా మారిపోయింది.

మనం రోజూ చదివే స్తోత్రాలవలన దేవుడు మనకు వశుడైపోతాడనుకోవడం కన్నా  మూర్ఖత్వం ఉండదు. ఆ స్తోత్రాలు చదివేటప్పుడు భక్తి ఇంకా ఆర్తి ముఖ్యం. అంతేగానీ పొగడ్తలకు లొంగేవాడు పరమాత్ముడెందుకవుతాడు? స్తోత్రం చదివితే చదివిన ఫలం లభిస్తుందేమో గానీ పరమాత్మ లొంగుతాడా? పరమాత్మ లొంగేది కేవలం భక్తికి, ఆర్తికి మరియు మనకు ఆయన మీద ఉన్న అవ్యాజమైన ప్రేమ వలన మాత్రమే.

🕉🌞🌏🌙🌟🚩

13. పదమూడవ గురువు -🌊 సముద్రం:-

సముద్రం నిశ్చలంగా ఉంటుంది. కేవలం ప్రకృతి ప్రకోపించినప్పుడు తప్పించి అది సంవత్సరంలో ఎక్కవ సమయం ప్రశాంతంగానే ఉంటుంది. బాగా వర్షాలు పడి నదుల్లోని ఎక్కువగా నీరు చేరినా లేదా కరువు కోరల్లో చిక్కి నదులు ఎండినా సముద్రాల్లో నీరు పెరగదు, తరగదు.

అలాగే జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు సంభవించినా కానీ మహాత్ములు చలించరు. ఎందుకంటే వారు ఎప్పుడూ బ్రహ్మానందంలోనే ఉంటారు. అలాంటి నిశ్చలతను అలవరచుకోవాలంటాడు దత్తాత్రేయుడు. అలాగే మహాత్ముల యొక్క ఙ్ఞానాన్ని కూడా పరీక్షించలేము. ఎందుకంటే సముద్రంలో దాగిన ముత్యాలు మనకు చూడగానే కనిపిస్తాయా ? ఓపికతో వెతికితే గానీ కనిపించవు. అలాగే మహాత్ముల సాంగత్యం ఫలం చేత వారి మనఃఙ్ఞానాన్ని మనం తెలుసుకోగలము.

🕉🌞🌏🌙🌟🚩

14. పద్నాలగవ గురువు - 🐞మిణుగురు పురుగు:-

మిణుగురు పురుగు అగ్నిచేత ఆకర్షించబడి దాని చుట్టూనే తిరుగుతూంటుంది. అలా తిరుగుతూ నే అది ఒకానొక క్షణంలో దానిలోనే పడి అగ్నికి ఆహుతైపోతుంది.

అలాగే మూర్ఖుడైన మనిషి కూడా ప్రాపంచిక విషయాలకు మరియు ఐహిక సుఖాలకు లోలుడై పరమాత్మను చేరలేక జననమరణ చక్రాలలో తిరుగాడుతూనే ఉంటాడు. ఎన్నటికీ మోక్షకారకమైన పరమపదాన్ని చేరుకోలేడు.

అందుకే మనిషి కూడా తన కోరిబకలు, వాంఛలు మరియు ఇంద్రియాలపైన నిగ్రహము పెంచుకోవాలి.

🕉🌞🌏🌙🌟🚩

15. పదిహేనవ గురువు -🐘 ఏనుగు:-

సాధారణంగా ఏనుగును చాలా విధాలుగా పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ముందుగా తవ్విన ఒక పెద్ద గొయ్యిని ఆకులతో ఎవరూ గర్తుపట్టకుండా కప్పివేస్తారు. ఆ తరువాత గొయ్యి వెనకాల వైపు చెక్కతో చేసిన ఒక ఆడ ఏనుగును నిల్చోబెడతారు. అటు వెళుతున్న ఏ మగ ఏనుగైనా ఆ ఆడఏనుగు బొమ్మను చూసి ఆకర్షించబడి దాని దగ్గరకు వెళదామనుకొని ముందు గొయ్య ఉందని చూసుకోకుండా దానిలో పడిపోతుంది. ఇలా అంత పెద్ద ఏనుగు కూడా కామ వాంఛ చేత పట్టుపడిపోతుంది.

అలాగే మనిషి కూడా తన కామవాంఛలను అదుపులో ఉంచుకోవాలని చెప్తాడు దత్తుడు. అలా కామవాంఛలను అదుపులో పెట్టకోకపోవటం చేతనే నేటి ప్రపంచంలో ఆడ పిల్లలపైన ఎన్నో దాడులు జరుగుతున్నాయి. అలా తన వాంఛలను అదుపులో పెట్టుకోలేనివాడు తన బాగుపడడు సరికదా ఇతరులను బాగా బతకనివ్వడు. తరువాత అనేకానేక బాధలను పడతాడు.

🕉🌞🌏🌙🌟🚩

16. పదహారవ గురువు -🦌 జింక:-

మంచి సంగీతానికి జింక వశమైపోతుందంటారు. జింకను పట్టుకోవటానికి వేటగాళ్ళు మంచి సంగీతాన్ని వాయించేవారట. ఆ సంగీతము విని మైమరిచి వేటగాడికి సులువుగా దొరుకిపోతుంది.

అందుకని సాధకుడు ఎప్పుడు ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉండాలి. లేకుంటే సాధకుడనే జింక అరిషడ్వర్గాలనే వేటగాడికి చిక్కుతాడు. అలా అయితే భగవన్మార్గము కోసం మళ్ళీ ఎంతో వేచి ఉండాల్సి వస్తుంది. అరిషడ్వర్గాలను జయించాలంటే నిగ్రహం, ఓపిక, భక్తి, ఆర్తి, ప్రేమ మొదలైనవి ముఖ్యంగా పరమాత్మ పైన నమ్మకం అత్యవసరం.

🕉🌞🌏🌙🌟🚩

17. పదిహేడవ గురువు -🐟 చేప:-

చేపకు తన మీద తనకు నియంత్రణ లేకపోవటం చేత గాలానికి చిక్కుతుంది. అలాగే చేప తన నివాసమైన నీటిని వదిలి బ్రతకలేదు. అలాగే మనిషికి కూడా తన ఇంద్రియాల మీద నియంత్రణ ఉండాలి. లేకుంటే అనేక చిక్కులలో పడిపోతాడు. అలిగే మనిషి కూడా తన నిజ స్థావరాన్ని వదల కూడదు. తన నిజ రూపాన్ని కూడా మరవకూడదు. అలా మరిస్తే తిప్పలు తప్పవంటాడు దత్తాత్రేయుడు.

🕉🌞🌏🌙🌟🚩

18. పద్దెనిమిదవ గురువు -🧛‍♀️ వేశ్య:-

దీనికి సంబంధించిన కథ ఒకటి ఉంది. పింగళ అనే పేరు గల ఒక వేశ్య నివసిస్తు ఉండేది. అమె తన వేశ్యా వృత్తి చేత తన దగ్గరకు వచ్చే గ్రాహకుల కోరికలను తీర్చి వారిని సంతృప్తిపరచేది. అలా చాలా కాలం తరువాత పింగళ తన వేశ్యా వృత్తిని వదిలేసి ప్రశాంతంగా భగవన్మార్గంలో బ్రతుకుదామని నిశ్చయించుకుంది. అనుకున్నట్టే అదే ప్రయత్నం చేసి తన వేశ్యా వృత్తిని వదిలి భగవంతుణ్ణి చేరింది.

తన కోసం తను బ్రతకకుండా ఇతరుల శ్రేయస్సుకై బతికేవాడే మహాత్ముడు. సుఖం కోసం పింగళ, పింగళ ఇచ్చే సుఖముకై గ్రాహకుల ఎదురుచూసేవారు. కానీ పింగళ గ్రాహకులను నిజంగా ప్రేమించదు. గ్రాహకులు పింగళను ప్రేమించరు. కానీ ఇద్దరూ కలవగానే ప్రేమ అనే నాటకాన్ని మొదలుపెడతారు. ప్రపంచం ఇలా ప్రేమ నాటకాలు ఆడేవారు ఎంతమంది లేరు.

పింగళ లాగా మనిషి కూడా తన సుఖాలను త్యాగం చేసినప్పుడే బ్రహ్మంనందాన్ని పొందుతాడు. అసలైన సచ్చిదానంద స్వరూపాన్ని చేరతాడు. అలా అన్ని వదిలినప్పుడే అసలైన ప్రశాంతతను పొందుతాడు. ఇక అప్పుడు ఎటువంటి బాధలు, ఇబ్బందులు ఉండవు ఎందుకంటే అన్ని తానే అయినవాడిలో తాను లీనమైపోతాడు కాబట్టి ఇక తనకు తను కాకుండా ప్రపంచంలో ఏమి కనిపించదు. ఇదే అద్వైత తత్త్వం.

🕉🌞🌏🌙🌟🚩

19. పంతొమ్మిదవ గురువు - 👼 పసిపిల్లవాడు.

పసిపిల్లలు ఎటువంటి కల్మషం లేనివారై శుద్ధమైన, పవిత్రమైన మనస్సు కలిగి ఉంటారు. కల్లాకపటం లేని స్వచ్ఛమైన మనసు కలిగి ఉంటారు వారు కాబట్టి భగవంతునితో సమానులు. వారు సాధుస్వభావులు. ఎవ్వరి మీద కోపం కానీ ద్వేషం కానీ చూపరు. కానీ నేటి మానవుడు అరిషడ్వర్గాలతో పరిపూర్ణుడు.

మనిషి కూడా ఒక పసిపిల్లవాడిలోని మంచి గుణాలును తెలుసుకుని వాటిని ఆచరించే ప్రయత్నం చేయాలి. మన మనస్సు గ్లాసు వంటిది. ఒకవేళ దానిలో మట్టి చేరిన తరువాత దానిలో పాలు పోసినా, నీరు పోసినా లేదా అమృతం పోసినా వ్యర్థమే. అలాగే మన మనస్సు కూడా కల్మషం లేకుండా ఉండాలి. లేకుంటే దానిలో ఎంత ఙ్ఞాన ప్రవాహం జరిగినా వృథాయే. అలా మనస్సుని సాధ్యమైనంత వరకు ఎలాంటి కల్మషముల చేత పాడు కాకుండా చూసుకోవాలి.

ఐహిక విషయాలపై మక్కువ పెంచుకున్నవాడికి ఎంత చెప్పినా వాడికి ఙ్ఞానం అంటదు. ఎందుకంటే వాడికి శ్రద్ధ లేదు కదా. ' శ్రద్ధావాన్ లభతే ఙ్ఞానం ' అంటుంది భగవద్గీత. ఒకవేళ అలా కల్మషమయమైనా దానిని సద్గురువైన భగవంతుడినే ఆశ్రయించి బాగుచేయాలంటాడు దత్తాత్రేయుడు. అందుకే మనిషికి భక్తి అనేది చాలా ముఖ్యం.

🕉🌞🌏🌙🌟🚩

20. ఇరవైయవ గురువు -🧏‍♀️ కన్య:-

దీనికి సంబంధించి కూడా ఒక కథ ఉంది. ఒక ఊరిలో పేద దంపతులు ఉండేవారు. వారికి ఒక కుమార్తె ఉండేది. ఒకసారి కొంతమంది వారి ఇంటికి ఆతిథులు రావలసి వచ్చింది. కానీ ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు వ్యవసాయ పనులకై వెళ్ళారు. అతిథుల కోసం అన్నం వండుదామని బియ్యాన్ని చెరగడం మొదలుపెట్టింది.

కానీ అలా చేసేటప్పుడు తన గాజులు బాగా చప్పుడు చేయటం మొదలుపెట్టాయి. కానీ అతిథులకు ఆ శబ్దం వలన ఇబ్బందిగా ఉంటుందేమో అని ఒక్కొక్కటిగా తన గాజులు తీసివేయటం మొదలుపెట్టింది. చివరికి ఒక్కో చేతికి కేవలం ఒకే గాజు మిగిలాయి. అలా మళ్ళీ చెరగడం మొదలు పెట్టాక శబ్దం రావటం ఆగిపోయాయి.

ఆ కథ నుండి మనం ఏం నేర్చుకోవాలంటే, సాధన అనేది ఏకాంతంగా సాగాలి. అప్పుడే మనం చాలా ముందుకు వెళ్ళగలుగుతాం. అనేక తత్త్వాలు లేదా వాదనలు ఓకే చోట ఉండలేవు. చాలా రకాల తత్త్వాలు భోధించే మహాపురుషులు ఒకేచోట ఉండలేరు. వారి భావనలను తప్పని మనం అనలేం. ఎందుకంటే భగవంతుని చేరుటకై అనేకానక మార్గాలున్నాయి. అందుకే మహాత్ములు కేవలం ఏకాంతానికే ప్రాముఖ్యం ఇస్తారు.

మనం ఈ భవబంధాలను కూడా బాగా వంట బట్టిచ్చుకొని వాటి కోసమే పరితపించకూడదు అంటాడు దత్తాత్రేయుడు. వాటికే అత్తుక్కొని ఉండకూడదు. వాటిని పుస్తకాలకు వేసే అట్టలలాగా మాత్రమే ఉంచి తరువాత సమయం వచ్చినప్పుడు వదిలేయాలి. కానీ అలా కాకుండా మనం మాత్రమే వాటినే శాశ్వతం అనుకొని వాటికై పరితపిస్తాము.

🕉🌞🌏🌙🌟🚩

21. ఇరవైఒకటవ గురువు -🐍 పాము:-

పాము ఎప్పుడూ ఏకాంతంగా ఇతర జంతువుల సహవాసం కోరదు. తన జీవితంలో ఎక్కువ భాగం ఏకాంతంగానే గడుపుతుంది. అలాగే మహాత్ములకు, ముముక్షువులకు ఏకాంతం అవసరం. ఈ విషయాన్ని మనం ఇంతకు ముందు ఉదాహరణలో కూడా చూశాం.

పాము ప్రతిసారీ తన కుబుసమును అంటే పాత చర్మాన్ని వదిలి కొత్త చర్మాన్ని ధరిస్తుంది. అలాగే ఆత్మ కూడా తన జననమరణ చక్రంలో ఎన్నో శరీరాలను ధరించి వదిలేస్తు ఉంటుంది. శరీరానికే మరణం కానీ ఆత్మకు కాదు. కానీ మనం మాత్రం ఈ విషయాన్ని అర్థం చేసుకోక ఈ శరీరాన్ని ఎంతగానో ప్రేమిస్తాం.

చివరికి మరణ సమయంలో కూడా మనం ఈ శరీరాన్ని వదలడానికి ప్రయత్నం చేయము. యమభటుల ప్రయాస వలన కానీ మన ఆత్మ శరీరం నుండి వడివడదు. ఈ విషయం మనకు భగవద్గీతలో కూడా కనిపిస్తుంది. అందుకే ఙ్ఞాని ఎప్పుడు మరణం గురించి భయపడడు. ఈ జననమరణ చక్రం నుండి ఎలా బయటపడాలో ఆలోచిస్తూంటాడు.

🕉🌞🌏🌙🌟🚩

22. ఇరవై రెండవ గురువు -🤠 లోహపు పనివాడు :-

తన పని చేస్తున్నప్పుడు లోహపు పనివాడు ఎంత శ్రద్ధతో చేస్తాడో అంత బాగా తయారవుతాయి పనిముట్లు. ఒక పనిముట్టును అద్భుతంగా తీర్చిదిద్దాలంటే ఆ పని మీద పట్టు, చేయాలనే ఆసక్తి ఉండాలి. లేకుంటే ఆ పని ఎంత చేసినా లాభం ఉండదు. అలాగే మనిషి కూడా ఏ పని చేసినా శ్రద్ధతో, అమితాసక్తితో చేయాలి. పూజ కూడా ఏదో తంతుగా, తూతూ మంత్రంగా చేస్తారు చాలా మంది. కానీ అలా చేస్తే ఫలితం ఉంటుందా అనేది మనం ఆలోచించాలి.

పూజను ఒక ప్రక్రియగా భావిస్తారే తప్ప దాని మీద ప్రేమతో చేయరు. పూజ చేసేటప్పుడు కూడా శ్రద్ధాలోపం చాలా చూస్తూంటాం. ఎలాగంటే వారు పూజలో చదివేదొకటి చేసేదొకటి. ఉదాహరణకు శ్రద్ధలేని ఓ వ్యక్తి పూజలో ఉన్నప్పుడు పుష్పం సమర్పయామి అని అంటూనే ఒక పండును ప్రసాదంగా పెట్టాడట. ఒక్క పూజ అనే కాదు ఎన్నో పనుల్లో చాలా మంది ఇలాగే చేస్తారు.

మనసు ఒకటి ఆలోచిస్తుంది చేతలు ( చేసే పని ) మాత్రం వేరేగా ఉంటాయి. అలా చేస్తున్నప్పుడు ఒక్కోసారి ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంది. అందుకే ఏ పనిచేసినా శ్రద్ధ, ఆసక్తి, శ్రమ అనేది ముఖ్యమంటాడు దత్తాత్రేయుడు.

🕉🌞🌏🌙🌟🚩

23. ఇరవై మూడవ గురువు -🕷️ సాలెపురుగు:-

సాలెపురుగు తన సాలీడు ఎంతో అందంగా మరియు ఎంతో నైపుణ్యంతో నిర్మిస్తుంది. దాన్ని కట్టడానికి ఎంతగానో శ్రమిస్తుంది. అలా నిర్మించాక ఆ సాలీడులో చాలా కాలం నివసించి తరువాత అవే సాలెపురుగులు తమ సాలీడును తామే తినేస్తాయి.

భగవంతుడు కూడా అంతే, ఈ మాయా సృష్టిని తానే నిర్మించి, ఆ సృష్టితో ఆటలాడి కొంత కాలం తరువాత మళ్ళీ తనలోనే లయం చేసుకుంటాడు. కానీ మనం మాత్రం ఈ సృష్టే నిజమనుకుని భ్రమిస్తూంటాం. కాని ఇదంతా అసత్యమే కేవలం సచ్చిదానంద బ్రహ్మము మాత్రమే సత్యమంటాడు దత్తాత్రేయుడు.

🕉🌞🌏🌙🌟🚩

24. ఇరవైనాలుగవ గురువు - 🐛 గొంగళి పురుగు:-

గొంగళి పురుగు చిన్నగా ఉన్నప్పుడు దానిని పట్టుకున్న కందిరీగ దానిని తన గూటిలో దాచుకుని దానిని బంధించి దాన్ని కుడుతుంది. ఆ తరువాత దాని చుట్టే తిరుగుతూ  ఉంటుంది. అలా ఎందుకు తిరుగుతుందో అర్థం కాక భయపడిన గొంగళి పురుగు కాసేపటికి తనను తాను కందిరీగగా భావించుకుంటుంది. ఆ గొంగళి పురుగు కూడా తరువాత క్రమంగా అలా అలా తను కూడా కందిరీగగా మారిపోతుంది.

ఎవరైనా పదే పదే ఒకరి గురించి ఆలోచిస్తూ, ఎప్పుడు వారి గుర్తులే మనసులో ఉంచుకొని పదే పదే వారిని స్మరిస్తుంటారో అలాంటి వారు కొన్నాళ్ళకి వారు ఎవరినైతే ఊహించుకుంటారో, తాము వారు ఒకటేనని భావిస్తారు. ఇలాంటి సంఘటనలు మనం చూసేవుంటాం. అలాగే సాధకుడు కూడా ఎప్పుడూ పరమాత్మను గురించి ఆలోచిస్తే తన పరమాత్మలో లీనమౌతాడు. అందుకే మనిషనే వాడు మోక్ష ప్రాప్తికై ప్రయత్నించాలంటాడు దత్తాత్రేయుడు.

🕉🌞🌏🌙🌟🚩


[6:28 am, 06/05/2020] D Krishnamurthy: శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర

                                                                      శ్రీ గణేశాయ నమః

శుక్లాం భరదరం విష్ణుం శశి వర్ణం చతుర్ భుజం
ప్రసన్న వదనం ద్యాయేత్ సర్వ విఘ్నోపసాన్తయేత్
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే.
వక్ర తుండ మహా కాయ సూర్య కోటి సమ ప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా!

                                                      శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర - 1


ఒకనాడు శౌనకాది మునిపుంగవులు సూతుల వారిని సకల ఇష్టార్థ సిద్ధి ప్రదంబగు పుణ్యస్థలం బేదియయి యున్నది? 

శ్రీమన్నారాయణుడు భూలోకమునకు మానవుల పూజల బొందుటకు భూతలమునకు విచ్చేయుట, దానికి సంబంధించిన కథలను మాకు చెప్పవలసినది అని ప్రార్ధించిరి. 

అంతట సూతులవారు – మునులారా! 

భూలోకము మొత్తము మీద శ్రీవేంకటాచలము శ్రేష్ఠతరమయిన పుణ్యస్థలము, అందు శ్రీమహావిష్ణువు వేంకటేశ్వరుడై కలియుగమున దైవమై భక్తుల కోరికలీడేర్చుచుండును

తన  భక్తుల కోరికలను తీర్చుటయందు శ్రీవేంకటేశ్వరుని ముందు సర్వదైవములున్నూ తీసికట్టుగానేయుందురు. 

అనగా విని శౌనకాదులు మహానుభావా

ఆ మహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరుడైన విధము,
 ఆ శ్రీ వేంకటేశ్వరునికి చెందిన అనేకానేక లీలలను, మాకు తెలియజెప్పి, పుణ్యము కట్టుకొనుమనీ, తమ్ము మహానంద భరితులుగా నొనర్చవలసినదనిన్నీ కోరిరి. 

అంతట సూతులవారు మునీశ్వరులారా! నేను ఆ మహిమాన్వితుని వేంకటేశ్వరుని లీలలు చెప్పుట కెంతటివాడను,

 కాని మీరు ఆసక్తితో భక్తిశ్రద్ధలతో వినకోరెదరని నేను భావించి శ్రీ వేంకటేశ్వరునకు చెందిన యేవియో కొన్ని లీలలను చెప్పగలవాడను అని తన సహజ వినయమును ప్రకటించుకొని హృదయము గురువైన వేదవ్యాసుని తలపోసెను.

 అట్లు వేదవ్యాసుని తలచుకొనుట వలన సూతులవారికి తాను శౌనకాదులకు చెప్పబోవు కథా విశేషములు అన్నియు కళ్ళకు కట్టినట్లు అవగతమయ్యెను. అనంతరము శౌనకాది మహర్షులతో యిట్లు చెప్పసాగినారు.

మునులారా! నారదుడు మహాభక్తుడు. అతడు మఱి యెవరోకాడు. సాక్షాత్తూ బ్రహ్మదేవుని కుమారుడే, భగవద్భక్తులను అభిమానించు నారదుడు సజ్జనుల పాలిట కామధేనువుగ నుండి గర్వముతో పెటపెటలాడువారిని ఒక చూపు చూసి గర్వపు కోరలనుతీసి వినోదించు స్వభావము కలవాడు. 

నిరంతరము శ్రీమన్నారాయణుని నామస్మరణతో పరవశుడై గానము చేయుచూ యెచ్చట నాటంక మనునది లేకయే త్రిలోకములలో సంచరించు నారదుని మహిమ నారాయణునకు తెలియును. 

నారాయణుని లీలలు నారదునకు తెలియవలసినంతగా తెలియును.

ఒకనాడు తన జనకుడగు బ్రహ్మదేవుని సందర్శించుటకై సత్యలోకమునకు ప్రయాణమయి వెడలినాడు. 

పద్మాసనమున నాలుగు మోములతో చక్కగ కూర్చునియున్నాడు బ్రహ్మ, ఆయన భార్య అందాల రాశి, చదువుల తల్లియయిన సరస్వతీదేవి వీణ పై సామగానము చేస్తూ భర్తచెంత కూర్చోని యున్నది. 

ఇంద్రుడు మున్నగు దిక్పాలకులు, సూర్యుడు మున్నగు కాంతులీను గ్రహములూ, అనేక మంది మునులు, ముఖ్యముగా సప్తఋషులు, అప్పటికే ఆ సభలో తము అర్హమైన ఆసనముల నలంకరించియుండిరి.

అటువంటి మహాసభకు నారద మునీంద్రుడు విచ్చేసి వినయ పూర్వకంగా బ్రహ్మ, సరస్వతులకు నమస్కరించాడు. వారు నారదుననుగ్రహించి దీవించినారు. 

నారదుడు ఆ సభకు వచ్చుట సభాసదులకాసక్తికరముగా నుండెను. కారణము నారదుడు త్రిలోక సంచారి కదా. అతడు దేవతల వద్దకు వెడలును, రాక్షసుల వద్దకు వెడలును ఆయన ఎక్కడకు వెడలినను అడ్డు ఆపులుండవు కదా!

 అందువలన అచ్చటి విశేషము లిచ్చటను, ఇచ్చటి విశేషము లచ్చటను ముచ్చటించుట ఆయన కుండనే యున్నది. 

అందువలననే నారదాగమనం ఆనందకరమగుట బ్రహ్మదేవుడు తనయుని ఉచితాసనమలంకరింపజేసి యిట్లనెను –

 కుమారా! నారదా! నీవు మహాభక్తులలో ఒకడవు. లోకోపకార కార్యక్రమములు నిర్వహించుటయందు నీ ఆసక్తి, శక్తి నాకు తెలియనివి కావు. 

నీచే నాకొక మహాకార్యము జరుగుదగియున్నది. అందువలన నీ వర్హుడవని నేననుకొందును. ఇంతకు అది ఏమన...

మానవులందరూ దైవభక్తియనునది దానంతయులేక నాస్తిక భావములతో నజ్ఞానాంధ కారమున కొట్టుమిట్టాడుచున్నారు. మూర్ఖభావములు కలిగి, ఆ మనుష్యులు బరితెగించి యిష్టము వచ్చినట్లు చేయరాని పాపము లెన్నియో చేస్తూ యున్నారు. 

తల్లితండ్రుల మాటలు పిల్లలు వినుట లేదు. భర్తల మాటలకు భార్యలు విలువనిచ్చుట లేదు. పెద్దవారిని గౌరవించుట, గురువుల పట్ల భక్తి కలిగియుండుట యివి భూలోకమున నీ కలియుగమున నల్లపూసలగుచున్నవి. 

ఇవి అన్నియు మానవులందు పొడజూపుటకు కారణము యీ సర్వలోకము లకూ సర్వగ్రహ నక్షత్రాదులకు మొత్తము మీద సర్వ ప్రకృతి సృష్టికి కారకుడైన దైవము యొక్క చింతన లేకపోవుటయే. 

పైగా యీ కలియుగమందు శ్రీమహావిష్ణువుయొక్క అవతారము లేకపోయెను. కనుక, నారదా! ఇంతకూ నేను చెప్పబోవునదీ, నీవు చేయవలసినదీ యేమనగా నీ యొక్క నేర్పు చూపించి, యోచించి యెట్లయిననూ శ్రీమహావిష్ణువు భూలోకమున అవతరించునట్లు చేయవలెను. 

దానివలన మానవ కళ్యాణమగును. మరల భూలోకవాసులందు ఆస్తికత్వము ప్రబలుటకు వీలుండును అనెను.

 సభలో గల ఇంద్రాదులకు బ్రహ్మదేవుని ఆలోచన ఆనందమును రేకెత్తించినది. జనకుని మాటలను శ్రద్ధగా విని, నారదుడు తానా పనిని చేయబూనుట లోకోపకారమని భావించి చేయుటకు నిశ్చయించుకొని మరల తండ్రికి నమస్కరించి శెలవు గైకొని వీడి వెడలినాడు.

కశ్యపాది మహర్షులు గంగానది ఒడ్డున కలియుగ రక్షణార్థం క్రతువు చేయ నిర్ణయించారు.
 యజ్ఞం ఆరంభించే సమయానికి నారదుడు అక్కడకు వచ్చి, అక్కడ ఉన్న కశ్యప, ఆత్రేయ, మార్కండేయ, గౌతమాది మహర్షులను చూసి, ఆ మహర్షులను
 క్రతువు దేనికొరకు చేస్తున్నారు, 
యాగఫలాన్ని స్వీకరించి కలియుగాన్ని సంరక్షించే వారు ఎవరు అని 

ప్రశ్నను వదలి నారదుడు వెడలిపోగా వారలు చర్చించుకొనసాగిరి. 

కొందరు మునులు ‘‘బ్రహ్మ గొప్పవాడని కొందరు ‘‘కాదు విష్ణువే గొప్పవా’’డనిరి. మరికొందరు ‘కాదు’ శంకరుడు గొప్పవాడనిరి.

 తుదకు ఆయన గొప్పవారు, ఈయన గొప్పవారని అనుట నుండి ఈయన తక్కువవారు ఆయన తక్కువవారని అనుటవరకు దిగినది. చిలికి చిలికి గాలివాన అయినది. 

వాదోపవాదములు పెచ్చు పెరిగినవి. ఇవి వినిన కొందరు పెద్దలు ‘‘ఋషులారా! న్యాయా న్యాయములు, ధర్మసూక్ష్మములు, నీతి సూత్రములు ప్రకటించు అర్హత గలిగిన మీరు ఈ విధముగ తర్జన భర్జనలతో పరస్పర నిందలతో అసలు పని మరచుట న్యాయమా? నారదుడు విజ్ఞాన సంపన్నుడు, ఆయన మనకు చాలా ముఖ్యమైన ఒక సమస్యను గుర్తుకు తెచ్చి వెడలినాడు. 

మనము కార్యశూరులమయి సమస్యను పరిష్కరించు మార్గమును కనుగొనవలెనే కాని వ్యర్ధ వాదోపవాదములు కిది తగిన కాలము కాదు గదా అనిరి. 

‘‘సత్త్వగుణము, రజోగుణము, తమోగుణము అను త్రిగుణములందున సత్త్వగుణమే మహోన్నతము కదా! అందువలన త్రిమూర్తులలో సత్త్వ గుణ ప్రధానుడెవ్వరో గ్రహించుట శ్రేయస్కరము. 

మునులారా! మీ యందరి యందును త్రిమూర్తులను పరీక్షింపగల సమర్థుడెవ్వరో యాతనిని ఎంపిక చేసి పంపుడు, అందువలన మన సందేహము తీరుట జరుగును’’ అని కూడ ప్రవచించిరి. 

మునులు దాని కంగీకరించినారు. కాని అది కత్తి పై సాము వంటిది అని వారికి తెలియకపోలేదు. 

సరే ఎవ్వరిని పంపిన బాగుండునని బాగుగా యోచించసాగిరి మునీశ్వరులు, అంతలో కొంతమంది మన మునులలో ఘనుడగువాడు ఒక్క భృగువు మాత్రమే, అతడు మహా తపస్సును చేసి శక్తిని సంపాదించినవాడు. 

ఆయన మాత్రమే ఈ మహా కార్యమును నిర్వహించుటకు సమర్ధుడు అని వారు పలికినారు

ఇది అంతయు శ్రద్ధతో ఆలకించు చున్న మునులందరూ మహానుభావ అటువంటి మహోన్నత వ్యక్తి ,విష్ణుస్వరూపుడైన భృగు మహర్షి చరిత్రను మాకు తెలియజేయ వలసినదిగా కోరినారు 

దానికి సూతమహర్షి చిరు మందహాసముతో ఆ వృత్తాంత మంతయు తెలియజేయుటకు సంకల్పించినారు 


శ్రీనివాస గోవిందా, శ్రీ వేంకటేశా గోవిందా, 
భక్తవత్సల గోవిందా, భాగవతప్రియా గోవిందా; |

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||1||
[6:28 am, 06/05/2020] D Krishnamurthy: శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-2

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉



భృగువు చరిత్ర


☘☘☘☘☘☘☘☘☘


 భృగువు బ్రహ్మమానసపుత్రులలో ఒకఁడు. 
ఇతని పుత్రుఁడు కవి. పౌత్రుడు అసురులకు గురువు అయిన శుక్రాచార్యులు. 

భార్గవ వంశ మూలపురుషుడు అయిన  భృగువు బ్రహ్మ హృథయ స్థానం నుండి జన్మించెను

ఇదికాక ఇతనికి ఖ్యాతివలన ధాత, విధాత అని ఇరువురు కొడుకులు కలిగిరి. అందు ధాతకు మృకండుఁడు, విధాతకు ప్రాణుఁడును జన్మించిరి. 

ప్రాణుని కొడుకు వేదశిరుఁడు. వేదశిరుని కొడుకు ఉశేనస్సు. మృకండుని కొడుకు మార్కండేయుఁడు. 

భృగు మహర్షి ప్రజాపతులలో నవ బ్రహ్మలలో అగ్రజుడు కనుక ఆయన అత్యంత శక్తివంతుడే కాకుండ సకల దేవతలకు సకల ఋషులకు మానవులకు పూజ్యుడు
వారుణ యాగమున అగ్ని తేజమున జన్మించెను కనుక "వారుణీ విద్య" కు అధిపతి అయ్యారు

ఇతఁడు భాగీరథీ దక్షిణతీరమున మహాపద్మము అనియెడు పురమునందు ఉండెను

అతని భార్య  పులోమ గర్భవతిగా ఉన్నప్పుడు, ఒకనాడు భృగువు “నేను నదీ స్నానానికి వెళ్ళొస్తాను, ఈలోగ నువ్వు నిత్యాగ్నిహోత్రానికి అవసరమిన  సామాగ్రి కూర్చుము” అని చెప్పి వెడలినాడు. 

పులోమ హోమగుండంలో అగ్ని వెలిగించి, మిగతా పనులు చేసుకుంటూ వుండగా

పులోముడు అను రాక్షసుడు, అక్కడికి వచ్చి ఆమెను చూసి కామించి, ఆమె గురించి అగ్నిదేవున్ని అడుగుతాడు. 

" నేను నిజం చెప్పిన పులోమకి హాని కలుగును, అబద్ధము చెప్పిన నాకు అసత్య దోషము అంటును అని" అని అగ్నిదేవుడు యోచించి 

చివరికి నిజమ చెప్పాలనే నిర్ణయంతో, ఆమె భృగు మహర్షి భార్య పులోమ అని చెప్తాడు.

పులోముడు ఆమెను పెళ్ళి కాకముందు ప్రేమిస్తాడు 
కాని పులోమ తిరస్కరిస్తుంది. 

ఇప్పుడు సమయం వచ్చిందని ఆమెను చెరబట్టాలని నిశ్చయించి

 పేద్ద వరాహంగా మారి ఆమెను తన భుజాలపై వేసుకుని పారిపోవడానికి ప్రయత్నించగా ఆమెకు ప్రసవం జరిగి మగ పిల్లవాడు జన్మిస్తాడు

అతనే చ్యవనడు, అత్యంత శక్తి మంతుడు

ఆ బాలుడు కోపంతో పులోమున్ని చూడగానె, మంటలలో పులోముడు కాలిపోతాడు. 

అప్పుడు పులోమ ఆ పిల్లవాని తీసుకొని ఆశ్రమానికి పోయి జరిగిందంతా భృగువు కి చెప్తుంది.
భృగువు కోపంతో నీ గురించి ఎవరు చెప్పారు అని అడుగుగా అగ్నిదేవుడు చెప్పాడు అని పులోమ చెప్తుంది. 
అగ్నిదేవుడు నేను అబద్ధం చెప్పిన పాపం చుట్టుకుంటుందని నిజం చెప్పాను అని
 పలుకగా   భృగువు " ఇక నుండి నువ్వు సర్వభక్షకునివి అగుదువు" అని శపిస్తాడు.

అప్పుడు అగ్నిదేవుడు "నేను సర్వభక్షకున్ని అయిన, దేవతలకు హవిస్సులు ఎలా తెసుకెళ్ళలి" అని, తన మంటలను ఆపివేస్తాడు. 

ఇక హోమాలు, దేవతలకు హవిస్సులు లేకపోవడంతో బ్రహ్మదేవుడు అగ్ని దగ్గరికి వచ్చి   "ఓ అగ్నిదేవా, భృగువు శాపం ప్రకారం నువ్వు సర్వభక్షకునివే, 
కానీ నీ పవిత్రత పోలేదు కావున నువ్వు ఎప్పటిలాగే దేవతలకు హవిస్సులు చేరవేస్తూండు" అని చెప్పగా  అగ్నిదేవుడు అంగీకరిస్తాడు

ఇంతటి  శక్తి మంతుడు ఆ భృగు మహర్షి అంతే కాక

భగవద్గీతలో శ్రీ కృష్ణ పరబ్రహ్మ భృగువు గురించి ఇలా పలికెను

శ్లో: మహర్షీణాం భృగురహం గిరామస్మ్యక మక్షరం!
యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయం!!

మహర్షులలో భృగుమహర్షిని నేనే

అక్షరములలో ఓంకారమును నేనే

యజ్ఞములలో జపయజ్ఞము నేనే

స్థావరములలో హిమాలయమును నేనే యని పరమాత్మ పలికెను

అనగా శ్రీ మహా విష్ణువే "భృగు మహర్షి" యని అవగతమవుతున్నది

తన తపఃశక్తిచే తన పాదమునఒక నేత్రం మొలిచేలా చేసుకున్నమహా విశిష్టత కలిగిన మహాత్ముడు భృగు మహర్షి

ఆందువల్ల త్రిమూర్తులను పరీక్ష జేయగల కార్యమాయన మాత్రమే నిర్వర్తింపగలడు అని నిశ్చయించినారు

 తక్కిన మునులు కూడా ‘‘భృగువును పంపినచో పని చక్కబడును’’ అని ఏకీభవించిన వారయి వారి ఆమోదమును తెలిపిరి. 

భృగువు తన పై బెట్టిన దుష్కర కార్యసాధనకై వారి వద్ద శెలవు గైకొని వెడలినాడు..
నిత్యనిర్మల గోవిందా, నీలమేఘశ్యామా గోవిందా, పురాణపురుష గోవిందా, పుండరికాక్ష గోవిందా; |

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||2|

Wednesday, 1 April 2020



ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

ఎందరో మహానుభావులకు వినయపూర్వకముగా మనవి చేస్తున్నాను రామాయణ మాహా కావ్యాన్ని ఎందరో మహాను బావులు రచించారు నేను నాకున్న పరిజ్ఞానముతో అచ్చు తెలుగులో గద్యభాగముగా 2012     నుండి వ్రాసిన సుందరకాండను పొందు పర్చ దలిచాను ప్రతిఒక్కరుచదివి కనీసం ఒక్కరికి చదవమని చెప్పండి  సీతా రామ పఠాభిషేక  పటమును, రామభక్త జ్ఞాన స్వరూప ఆంజనేయ స్వామి పటమును,  పూజామందిరమున ఉంచి  చేయగలరని ఆశిస్తున్నాను  నా నా వ్రాతలలో ఏమైనా తప్పులుదొర్లిన క్షమించగలరు  ఆ పరమాత్ముని సంకల్పమని భావిస్తూ పొందు పరుస్తున్నాను .     

 ఆదికవి వాల్మీకి రచన  ఆధారముగా వ్రాయుటకు సంకల్పించినాను  నేను వ్రాయలేదు నేను  ఆరాధించే హనుమంతుడే వ్రాయించాడని అనుకుంటున్నాను. 
శ్రీ సీతారామాంజనేయ నమో నమ:

ముందుగా క్లుప్తముగా 

సీతారాముల జీవితం రామాయణంగా ప్రసిద్ధి చెందిన కథ. దీనిని "సీతాయాశ్చరితం మహత్" అని వాల్మీకి అన్నాడు. 24,000 శ్లోకములతో కూడిన రామాయణము భారతదేశము, హిందూ ధర్మముల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభావము కలిగియున్నది. రామాయణములో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడింది. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు-భక్తుడు - వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి. చాలా మంది అభిప్రాయములో రామాయణములోని పాత్రలు ఆదర్శజీవనమునకు ప్రమాణముగా స్వీకరింపవచ్చును. రామాయణ మహాకావ్యము ఆరు కాండములు (భాగములు) గా విభజింప బడింది.

బాల కాండము (77 సర్గలు) : కథా ప్రారంభము, రాముని జననము, బాల్యము, విశ్వామిత్రునితో ప్రయాణము, యాగపరిరక్షణ, సీతా స్వయంవరము, సీతారామ కల్యాణము

అయోధ్యా కాండము (119 సర్గలు) : కైకేయి కోరిక, దశరథుని దుఃఖము, సీతారామ లక్ష్మణుల వనవాస వ్రతారంభము

అరణ్య కాండము (75 సర్గలు) : వనవాస కాలము, మునిజన సందర్శనము, రాక్షస సంహారము, శూర్పణఖ భంగము, సీతాపహరణము

కిష్కింధ కాండము (67 సర్గలు) : రాముని దుఃఖము, హనుమంతుడు రామునకు సుగ్రీవునకు స్నేహము గూర్చుట, వాలి వధ, సీతాన్వేషణ ఆరంభము

సుందర కాండము (68 సర్గలు) : హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునకు తెలియజెప్పుట

యుధ్ధ కాండము (131 సర్గలు) : సాగరమునకు వారధి నిర్మించుట, యద్ధము, రావణ సంహారము, సీత అగ్ని ప్రవేశము, అయోధ్యకు రాక, పట్టాభిషేకము
ఉత్తర కాండము: సీత అడవులకు పంపబడుట, కుశ లవుల వృత్తాంతము, సీత భూమిలో కలసిపోవుట, రామావతార సమాప్తి - (కాని ఇది మూలకావ్యములోనిది కాదని, తరువాత జతచేయబడినదని కొందరి అభిప్రాయము.)
బాలకాండము

శివ ధనుర్భంగము - రవివర్మ చిత్రం

ఆయోధ్యా నగరం రాజధానిగా, కోసలదేశాన్ని ఇక్ష్వాకువంశపు రాజైన దశరథుడు పాలిస్తున్నాడు. పిల్లలు లేని కారణంగా దశరథుడు పుత్రకామేష్టి యాగం చేశాడు. తరువాత ఆ రాజుకు నలుగురు బిడ్డలు జన్మించారు. వారికి రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని నామకరణం చేశారు. రావణుడు అనే రాక్షసుడు బ్రహ్మవద్ద వరాలుపొంది దేవతలను జయించి మునులను వేధిస్తున్నాడు. వానికి దేవ గంధర్వ యక్ష రాక్షసుల వల్ల చావులేదు. దేవతల ప్రార్థనలు మన్నించి శ్రీ మహా విష్ణువు వానిని హతంచేయడానికి నరుడై జన్మింపనెంచాడు. విష్ణువు రామునిగా, ఆదిశేషుడు లక్ష్మణునిగా, శంఖ చక్రములు భరత శత్రుఘ్నులుగా అవతరించారు. శ్రీమహాలక్ష్మి సీతగా అయోనిజయై జనక మహారాజు ఇంట పెరుగుతున్నది. రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు కిష్కిందలో ఉన్నాడు.

కులగురువు వశిష్టుని వద్ద రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు సకల విద్యలనూ అభ్యసించారు. ఒకనాడు విశ్వామిత్ర మహర్షి దశరథుని వద్దకు వచ్చి తన యాగసంరక్షణార్ధమై రామ లక్ష్మణులను తనతో పంపమని కోరాడు. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకు ఎన్నో అస్త్రవిద్యారహస్యాలను బోధించాడు. దారిలో రామ లక్ష్మణులు తాటకి అనే రాక్షసిని సంహరించారు. గంగానదిని దర్శించారు. రాముని పాదము సోకి అహల్యకు శాపవిమోచనమైనది. రామ లక్ష్మణుల రక్షణలో యాగము జయప్రథముగా జరిగింది. మారీచ సుబాహులూ, ఇతర రాక్షసగణములూ దండింపబడ్డారు. తిరుగుదారిలో వారు జనకుని రాజధానియైన మిథిలానగరం చేరారు. అక్కడ సీతా స్వయంవరంలో రాముడు శివుని విల్లు విరచి, సీతకు వరుడైనాడు. సీతారాములు, ఊర్మిళా లక్ష్మణులు, మాండవీ భరతులు, శృతకీర్తి శతృఘ్నుల వివాహం కనుల పండువుగా జరిగింది. తిరుగుదారిలో రాముని ఎదిరించిన పరశురామనకు తాము ఇద్దరూ విష్ణుస్వరూపులే అని తెలిసింది. మహా వైభవముగా నలుగురు జంటలూ అయోధ్యకు తిరిగి వచ్చారు.
అయోధ్యా కాండము
భరద్వాజాశ్రమంలో సీతారామలక్ష్మణులు
దశరథుడు రాజ్యభారాన్ని పెద్దకొడుకైన రామునకప్పగింపవలెనని సంకల్పించాడు. పట్టాభిషేకానికి సర్వమూ సిద్ధమైనది. అంతటా వేడుకలు జరుగుతున్నాయి. రాముని సవతి తల్లియైన కైకేయి దశరథుని రెండు కోరికలు కోరింది - (1) భరతుని పట్టాభిషేకము (2) రామునకు 14 ఏండ్ల వనవాసము. రాముడు తండ్రి మాట నిలబెట్టడానికి వనవాసానికి బయలుదేరాడు. రామునితోబాటు ఆత్మయైన సీతా, నీడయైన లక్ష్మణుడూ వనవాసానికి బయలుదేరారు. దారిలో గుహుడనే నిషాదరాజు వారిని గంగానది దాటించాడు. రామునికై విలపిస్తూ అయోధ్యలో దశరథుడు మరణించాడు.
భరతుడు సైన్యంతో అడవికి వెళ్ళి - "నీకు చెందవలసిన రాజ్యం నావంటి అల్పుడు పాలించలేడు. నా తల్లి తప్పును మన్నించి, అయోధ్యకు తిరిగివచ్చి మమ్మలనందరినీ ఏలుకో" అని ప్రార్థించాడు. తండ్రి మరణవార్త విన్న రాముడు దుఃఖించాడు. కాని "తండ్రి మాట నిలబెట్టడం మన కర్తవ్యం. వనవాస దీక్ష ముగియవలసిందే" అని నిశ్చయించాడు. అప్పుడు భరతుడు - "14 సంవత్సరాల తరువాత నీవు అయోధ్యకు రావడం ఒక్కరోజు ఆలస్యమైనా నేను ప్రాణాలు త్యజిస్తాను. అంత వరకు నీ పాదుకలను సింహాసనంపై ఉంచి, భృత్యునిగా నేను రాజ్యపాలన నిర్వహిస్తాను" అని అయోధ్యకు తిరిగి వెళ్ళాడు.
సీతారామ లక్ష్మణులు మందాకినీ తీరాన చిత్రకూటం అనే సుందర ప్రదేశంలో ఒక పర్ణశాలను నిర్మించుకొని జపతపాది కార్యములు నిర్వహిస్తూ కాలం గడుపుతున్నారు. వారు అత్రి మహాముని ఆశ్రమాన్ని దర్శించినపుడు సీతమ్మవారు అనసూయ ఉపదేశములు, ఆశీర్వచనములు గ్రహించింది.
అరణ్యకాండము
రామునితో బంగారు లేడిని తెమ్మని చెబుతున్న సీత - రాజా రవివర్మ చిత్రం
సీతారామలక్ష్మణులు మహర్షుల ఆశ్రమాలను దర్శించి, పిదప గోదావరి తీరాన పంచవటి వద్ద పర్ణశాలను నిర్మించుకొని అక్కడ నివసింపసాగారు. అక్కడకి 8శూర్పణఖ అనే కామరూపియైన రాక్షసి వచ్చి రామ లక్ష్మణులను మోహించి సీతను తినివేయడానికి సన్నద్ధమైనది. లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసి పంపాడు. రోదిస్తున్న శూర్పణఖ కసి తీరడానికి తన సోదరులైన ఖర దూషణులనే రాక్షసులు 14 వేల మందిగల రాక్షస సైన్యముతో రామునిపై దండెత్తారు. రాముడొకడే వారందరిని హతం చేశాడు. శూర్పణఖ వెళ్ళి రావణునితో మొరపెట్టుకొంది. కసితో రావణుడు మారీచుడిని మాయలేడి రూపంలో పంపి రామ లక్ష్మణులను దూరంగా వెళ్ళేలా చేసి, తాను సీతను ఎత్తుకుపోయాడు. సీత కనిపించక హతాశులైన రామలక్ష్మణులు ఆమెను వెతుకనారంభించారు. కొనవూపిరితోనున్న జటాయువు వారికి సీతాపహరణం గురించి తెలిపి రాముని చేతిలో కన్నుమూశాడు. రామలక్ష్మణులు మాతంగముని ఆశ్రమంలో వారికోసం ఎదురు చూస్తున్న శబరి ఆతిథ్యం స్వీకరించి, ఋష్యమూకపర్వతానికి బయలుదేరారు.
కిష్కింధకాండము
వాలి మరణ సమయంలో రాముని ఉపదేశం
రాముడూ, వానరుడైన సుగ్రీవుడూ అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు. వాలిని వధించి రాముడు సుగ్రీవునకు వానర రాజ్యం కట్టబెట్టాడు. తరువాత సుగ్రీవుడు వానరులను నలుదిక్కులకూ సీతాన్వేషణ నిమిత్తమై పంపాడు. అలా దక్షిణదిశకు వెళ్ళినవారిలో అంగదుని నాయకత్వంలో హనుమంతుడూ, జాంబవంతుడూ, నీలుడూ, మైందుడూ, ద్వివిధుడూ, సుషేణుడూ వంటి మహావీరులున్నారు. వారు అనేక అవాంతరాలను అధిగమించిదక్షిణసముద్ర తీరానికి చేరుకొన్నారు. ఇక నూరు యోజనాల విస్తీర్ణమున్న సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళి సీతను వెదకడానికి హనుమంతుడు మహాతేజంతో సిద్ధమయ్యాడు.
సుందరకాండము
హనుమంతుని తోకకు నిప్పు అంటిస్తున్న రాక్షసులు c.1910's నాటి చిత్రం.
హనుమంతుడు దేవతలకు మ్రొక్కి, మహేంద్రగిరిపైనుండి లంఘించి, రామబాణములా లంకలో వ్రాలాడు. చీకటి పడిన తరువాత లంకిణిని దండించి, లంకలో ప్రవేశించి, సీతను వెదుకసాగాడు. రామలక్ష్మణులకు, జానకికి, రుద్రునకు, ఇంద్రునకు, యమునకూ, వాయువునకూ, సూర్య చంద్రులకూ, మరుద్గణములకూ, బ్రహ్మకూ, అగ్నికీ, సకల దేవతలకూ నమస్కరించి అశోకవనంలో సీతను వెదకడానికి బయలుదేరాడు. అక్కడ శింశుపా వృక్షము క్రింద, రాక్షసకాంతలచే పీడింపబడుతూ, భీతయై కృశించిన సీతను చూచాడు. ఈమె సీతయే అని నిర్ధారించుకొన్నాడు. సీతకు కనిపించి మెల్లగా తన వృత్తాంతమునూ, రాముని దుఃఖమునూ వివరించి, రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందించాడు. సీత దుఃఖించి, అందరి క్షేమసమాచారములు అడిగి, ఆపై రాముని వర్ణించమని కోరింది. హనుమంతుడు భక్తితో ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, శుభలక్షణములు గలవాడు, అనన్య సుందరుడు అయిన రాముని, అతని సోదరుడైన లక్ష్మణుని వర్ణించగా విని సీత ఓరడిల్లినది. హనుమంతుని ఆశీర్వదించి, తన చూడామణిని ఆనవాలుగా ఇచ్చింది. ఒక్క నెలలో రాముడు తనను కాపాడకున్న తాను బ్రతుకనని చెప్పినది.
ఇక హనుమంతుడు ఉగ్రాకారుడై వనమునూ, అడ్డు వచ్చిన వేలాది రాక్షసులనూ, రావణుడు పంపిన మహా వీరులనూ హతముచేసి, చివరకు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి వివశుడైనట్లు నటించి రావణుని వద్దకు వెళ్ళాడు. సీతమ్మను అప్పజెప్పి రాముని శరణువేడి, లంకను కాపాడుకోమనీ, ప్రాణాలు దక్కించుకోమనీ హితవు చెప్పాడు. రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. కాలిన తోకతో హనుమంతుడు లంకను దహించి, మరొక్కమారు సీతను దర్శించి, మరల వెనుకకు ప్రయాణమై మహేంద్రగిరిపై వ్రాలాడు.
"చూచాను సీతను" అని జరిగిన సంగతులన్నీ సహచరులకు వివరించాడు. ఆపై అంతా కలసి సుగ్రీవుడు, రామలక్ష్మణులు ఉన్నచోటకు వచ్చి సీత జాడను, ఆమె సందేశమును వివరించారు. ఆపై చేయవలసినది ఆలోచించమని కోరారు.
యుద్ధకాండము
హనుమంతుడు చేసిన మహోపకారానికి రాముడు "ఇంతటి క్లిష్టకార్యమును మరెవ్వరు సాధింపలేరు. మా అందరి ప్రాణములను నిలిపిన ఆప్తుడవు నీవు. నీవంటి దూత మరొకరు లేరు. గాఢాలింగనము కంటె నీకు నేనేమి బహుమానము ఇవ్వగలను" అని హనుమను కౌగిలించుకొనెను. తరువాత అందరూ తర్కించి యుద్ధమునకు నిశ్చయించారు. సరైన సమయము చూసి, నీలుని నాయకత్వములో బ్రహ్మాండమైన కపిసేన దక్షిణమునకు పయనమై సాగరతీరము చేరుకొన్నది. రావణుని తమ్ముడైన విభీషణుడు రావణునితో విభేదించి, సాగరముదాటి, రాముని శరణు జొచ్చెను. కానున్న లంకాధిపతివని రాముడు విభీషణునకు ఆశ్రయమిచ్చి, కానున్న లంకాధిపతిగా సాగరజలాలతో అభిషిక్తుని చేయించెను. ఇక సాగరమును దాటుటకు అద్భుతమైన వారధి నిర్మాణము విశ్వకర్మ కొడుకైన నలుని పర్యవేక్షణలో జరిగింది. వానర భల్లూకసేనల, రామలక్ష్మణులు వారధి దాటి లంకను చేరారు.
రామ లక్ష్మణులపై నాగాస్త్రమును ప్రయోగిస్తున్న ఇంద్రజిత్తు
ఇరు పక్షాలవారూ వ్యూహాలు సన్నద్ధం చేసుకొన్నారు. చిట్టచివరి ప్రయత్నంగా రాముడు పనిచిన అంగదరాయబారం విఫలమైనది.
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః
అంటూ వానరసేన లంకను ముట్టడించింది. మహాయద్ధం జరిగింది. వానరులచేతిలో రాక్షసవీరులు భంగపడ్డారు. దానితో ఇంద్రజిత్తు మాయాయుద్ధమారంభించి నాగాస్త్రంతో రామలక్ష్మణులను వివశులను చేసి శతృసైన్యాన్ని భయకంపితులను చేశాడు. అంతా విషణ్ణులైన సమయానికి గరుత్మంతుడు మహాప్రభంజనంలా వచ్చి వారిని నాగబంధాలనుండి విముక్తులను చేశాడు.
అనేకమంది రాక్షస వీరులు వానరుల చేత, రామలక్ష్మణులచేత హతులయ్యారు. రావణుడు స్వయంగా మహావీరులైన రాక్షసగణాలను వెంటబెట్టుకొని యుద్ధానికి వెడలాడు. అప్పుడు జరిగిన భీకరసంగ్రామంలో రావణుని కిరీటము నేలబడింది. ధనుసు చేజారింది. విశ్రాంతి తీసికొని మరునాడు యుద్ధానికి రమ్మని రాముడు రావణుని పంపేశాడు. అవమాన భారంతో కృంగిన రావణుడు తన సోదరుడైన కుంభకర్ణుని నిదురలేపి యుద్ధానికి పంపాడు. కుంభకర్ణుడు వానరులను కరకర నమలి మ్రింగుతూ, ఎండు అడవిని అగ్ని కాల్చినట్లుగా వానరసేనను నాశనం చేయసాగాడు. లక్ష్మణునిబాణాలు కుంభకర్ణుని నిలువరించాయు. రాముడు దివ్యాస్త్రాలతో వాని బాహువులనూ, ఊరువులనూ ఖండించగా వాడు పర్వతంలా క్రిందపడ్డాడు.
మరునాడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి అందరూ వివశులయ్యారు. హనుమంతుడు పర్వతసమేతంగా ఓషధులను తెచ్చి అందరినీ పునరుజ్జీవితులను చేసి, మరల పర్వతాన్ని యధాస్థానంలో ఉంచి వచ్చాడు. లక్ష్మణుడు అన్న ఆశీర్వాదము పొంది, హనుమంతుని భుజాలపై ఆసీనుడై వెళ్ళి, ఇంద్రజిత్తును చంపేశాడు.
పట్టాభిషిక్తులైన్ సీతారాములు
ఇక రావణుడు మహోదరాది మహావీరులతో యుద్ధానికి వెడలాడు. లక్ష్మణుడు దారుణంగా గాయపడ్డాడు. అప్పుడు రాముడు తనవారిని ఉద్దేశించి - "మీరు సౌమిత్రిని రక్షిస్తూ, యుద్ధం చూస్తూ ఉండండి. నేను రాముడంటే ఏమిటో చూపిస్తాను. రావణ సంహారం చేసి వస్తాను" అన్నాడు. రామ రావణ సంగ్రామం ప్రళయకాలాగ్నివలే చెలరేగినది. రావణుని అస్త్రంతో లక్ష్మణుడు కూలిపోయాడు. రాముడు విలపించసాగాడు. హనుమంతుడు మరల గిరిశిఖరానికి వెళ్ళి, శిఖరంతో సహా ఓషధులను తెచ్చి వాసన చూపగా లక్ష్మణుడు లేచి నిలబడి, "అన్నా! ఈ సాయంసంధ్యలో రావణుడు కడతేరాలి అన్నాడు".
రామునకు సహాయంగా ఇంద్రుడు మాతలిని సారథిగా పంపాడు. యుద్ధ పరిశ్రాంతుడై యున్న రామునకు అగస్త్యుడు "ఆదిత్య హృదయము"ను ఉపదేశించాడు. రాముడు దానిని మూడు మార్లు జపించాడు. రాముడు, రావణుడు శరవర్షాన్ని కురిపింపసాగారు. "రామరావణ యుద్ధం రామరావణ యోరివ" - వారి యుద్ధానికి మరొకటి పోలిక లేదు - అని దేవగణాలు ఘోషిస్తున్నాయి. రావణుని తలలు తెగి పడుతున్నా మరల మరల మొలుస్తూనే ఉన్నాయి. "రామా! ఇలా కాదు. బ్రహ్మాస్త్రాన్ని సంధించు" అని మాతలి అన్నాడు.
రాముడు సంధించిన బ్రహ్మాస్త్రం నిప్పులు చిమ్ముతూ రావణుని గుండెను చీల్చి, తిరిగి వచ్చి రాముని అమ్ముల పొదిలో చేరింది. రాముడు ఎరపెక్కిన కన్నులతో, శరదళితదేహంతో, కోటి సూర్యుల ప్రకాశంతో, ధనుస్సును నేలకానించి, మరో చేత బాణాన్ని త్రిప్పుతూ వీరశ్రీబంధురాంగుడై త్రిదశపతినుతుడై శోభిల్లాడు. సకలదేవతలు రామునకు అంజలి ఘటించారు.
అనంతరం రాముని నిరాకరణతో క్రుంగిపోయిన సీత అగ్ని ప్రవేశం చేసి తన ధర్మనిరతిని లోకానికి నిరూపించింది. సీతారామలక్ష్మణులు సపరివారంగా అయోధ్యకు తిరిగివచ్చారు. వైభవంగా సీతారాముల పట్టాభిషేకం జరిగింది.

రాముని నిర్యాణము
రావణాది దుష్టులెల్లరును మడసిరి కావున రామా నీవీ అవతారమును చాలింపుము అని యముడు అనెను.రాముడు, ఆతని సోదరులెల్ల సరయూనదిలో దిగి వారి అవతారములు చాలించిరి.[3]