Saturday, 28 May 2016

శృంగార సాహిత్యం

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   పోమ్ శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - శృంగార సాహిత్యం 
 తరుణామృతం

సర్వేజనా సుఖినోభవంతు

మ. మ . త  (పెద్దలకు మాత్రమే )
మనసు మనసు తరుణామృతం - సాహిత్య వచన శృంగార  కావ్యం
(రచయత: మల్లాప్రగడ రామకృష్ణ) 
 ------
  పచ్చటి తోటయందు పసిడి రంగుతోడ, ఓరచూపు ఇంపుతోడ, అడుగులు దడా  దడా అనుచుండ, జారేడు కుచకుంభాలు కదులుచుండ, కాల్నడక పోవు చుండ, వదనాంచల మందున చిన్కుల చెమట, మడుగులా మారుచుండగా, వయ్యారంగా మల్లిక కన్పించే. 

పసిదానిమ్మ పండు  చాయ, కొసరు ఆ కుసుమ గంధి కోమలపు తోడల్ (లేలేత తామర స్వేత తూడులా లేక పాల లాంటి అరటి ఊచలా ) 
 జారు చెమ్మ, నేలరారు ముత్యాల వరుస, సహజ సౌందర్యముతో వెలసిల్లు చుండా, పదహారో వసంతంలో అడుగుపెట్టి, వయసు వన్నెలతో, మాయని మెరుపు కాన వస్తున్నది, బాల్యము వెడలి, నవ యవ్వనపు మొలకులతో లేత సిగ్గుల దొంతరలతో, మధుర మంద హాసంగా ఉండి, నడుస్తుంటే, పురజనులు " ఆ ఆ " అని నోరు తెరచి, సొంగ కార్చు చుండే, ముందుకు నడుస్తున్నప్పుడు, ముందు వెనుక ఎవరున్నారు అనే జ్యాస అనేది లేదు, మరయు అమె కళ్ళకు ఎమీ కనిపించలేదు, కాని ఏదో తెలియని వయసు పొంగే మెరుపు ఆవహించినదని  మాత్రం అర్ధం అవుతున్నది, ఆమె ఏ శృంగార దేవత, కారణము ఏమగునో అని పలువురు ముచ్చట్లు చెప్పుకొనసాగిరి, సౌందర్యదేవత నడచి వెళ్ళినట్లు తన్మయులై ఉన్నారు ఆసమయాన?(1) 
   
   యవ్వన నడకతో నడుస్తుంటే  ఇసుక లో కాళ్ళు ఇరుక్కొని,  ఈడ్చు కుంటూ, తన్మయత్వపు  నడకతో, మేనుపై  వేడి కిరణాల సెగ ఆవహించిన నిట్టూర్పులతో, ఉన్న నడకను చూసిన వారికి కన్నులు  చెదిరినవి, వారి ఊహలు గాలిలో ఎలిపోతున్నవి. 


తామర మొగ్గచందమున మెత్తని మేను
జలజగంధము రతిజలముఁదనరు
మాలూరఫలముల మఱపించు పాలిండ్లు
కొలికుల కింపైన కలికి చూపులు 

తిలపుష్పముల వన్నె దిలకించు నాసిక
గురువిపూజనాపర సునియమ
చంపకకువలయ ఛాయయుగల మేను
నబ్జపత్రము బోలు నతనుగృహము

హంసగమనంబు కడుసన్నమైన నడుము
మంజుభాషిణి, శుచి, లఘుమధురభోజి
వెల్లచీరల యందున వేడ్క లెస్స
మానవతి పద్మినీభామ మధురసీమ

తామరపువ్వువలె మెత్తని శరీరంను,
తామరపువ్వువాసనగల రతిజలమును,
మారేడు పండ్లవంటి కుచములును,
సొగసగు చూపును, నువ్వుపువ్వువంటి ముక్కును,

గురు బ్రాహ్మణ పూజయందు ఆసక్తియు,
సంపంగి వంటియు కలువ పువ్వులవంటి
దేహఛాయ గలదియు, హంసగమనమును,
సన్నని నడుమును, మంచి మాటలును,

శుచియై కొద్దిపాటి భోజనమును, తెల్ల చీరల
యందు ప్రీతియును గల స్త్రీ పద్మిని జాతి

--((**))--

పడచు జింక పిల్ల నడిచినట్లు మల్లిక నడుస్తుండగా, కాలి పాదాల చెమ్మ, అద్భుత మెరుపుగా కనిపించే., ఆవిధముగా  పొతూ ఉంటే  అక్కడ కొంత దూరములో మామిడి తోపులు కానవచ్చే, మామిడి పూవు నవ యవ్వన సౌందర్యానికి పరవశించి, కొమ్మలపై రేమ్మలపై నిలువలేక, జల జల రాలి పాదాల ముందు చేరే, ఆమె పాదాలు స్పర్శకు పూలు  నలిగినా చెప్పుకోలేని సంతోషముతో ఉండగా, జిలుగు పూల కళంకారి చీర జాఱ, కాలి కడియాలు మలుపు కొనుచు, తనువంతా వంచి సరిదిద్దు కొనుచు, సందెడు చీర కుచ్చెళ్లు చెదరనీక గట్టిగా అదుము కొనుచు, పిల్ల గాలి సవ్వడికే ఎగసిపడుతున్న చీరను పట్టుకొనుచు ఉండగా, ఆ వనమంతయు చూసి పరవసంతో పూల వర్షం కురుపించే.        
అప్పుడే పవనుడు (నిత్య  సంచారి) ఈవిధముగా పాడుచున్నాడు
Photo
ఓ బాల బాల నిన్నే కోరి
 నీచెంతకు చేరి
నవ్వులు కురిపిస్తా రాదరి
సొగసుతో అలుగకు నారి

ఓ పరువంలో ఉన్న తుంటరి
ఓ మనసును తపిస్తున్న చకోరి
ఓ వయసులో చేయద్దు చాకిరి
ఓ ఎందుకు ఉంటావు ఒంటరి

ఒంటరిగా తిరుగకు మయూరి
వస్తాడు పరువాన్ని దోచే పోకిరి
నేను వెంట పడ్డా సరి సరి
నీ ఆశ తీర్చనా ఈ సారి

కళ్ళలో భావం చూపే గడసరి
నేను సరిజోడు కానా మరి
తోడూ నీడవుతాడు ఈ బాటసారి
నీ చూపుకే నాకు వచ్చు శిరి

అంటూ తన్మయత్వంతో నారి మణి చూపుల  తప్పుకోలేక, ఒప్పించలేక మదన తాపముతో కదిలాడు ఆకాశ సంచార పవనుడు .
 ఆ మాటలకు కణతలు త్రిప్పి అనగా విచ్చుకున్న పువ్వులా చూసి కొంగ్రొత్త శోభతో చిరునవ్వు విసిరి, వెన్నెల చెండ్లు పట్టి చేతిలో ఉంచి నెమ్మదిగా ఊదే  కనులు నేలచూపులు చూస్తు, పాదాలు అలవోకగా కదిలిస్తూ చూసి చూడనట్లుగా ఓర చూపు చూస్తూ, చేతితో చీర కొసలు పైకి  ఎగదోస్తూ,  వన మద్య నిలిచే మల్లిక.
  
స్వాగత పక్షి కుహు కుహు అని పిలుస్తున్నట్లు, హ్రదయము బరువెక్కగా, ఎద పొంగులు కాన రాకుండా చీర చుట్టు కొనగా,
 మోహనుడు కంచెను దాటి వచ్చినట్లుగా ఊహించె మోహనాంగి.
మిస మిస లాడు జవ్వనం, మేలిమి మైన పుత్తడి తనువును చేరి, ఓరగా సొగసు నంతా నలిపి నట్లుగా, మనసును పులకరింప చేసి నట్లుగా,  అతని చూపుల యందు ఆర్తి, హృదయాంతరము నందు తరింపక వేదన గురిచేసి వేళ్ళకు మోహనా, తొలకరి వానకు తడిసిన ముగ్ద మోహన లతాంగిని, నాలో ప్రవేశించి నన్ను ఇబ్బంది పెట్టకు ఓ చల్ల గాలి .
 అందెల రవళితో, జల జల పారే నదిలా సాగుతున్న లతాంగిని హరిణ పుత్రి చూసి, తొడగని చల్లని చెమటలూరు హస్తంబున దువ్వుచూ చల్లని పలుకులతో  నెమ్మదిగా ముచ్చట్లు చేసే, కళ్ళ వెలుగులు నవరత్నాల వెలుగుల కన్నా మిన్నగా ఉన్నాయి, ఈ మెరిసే ప్రాలు మాలికలకు కారణం ఏదైనా ఉన్నదా ? ........

ఈ వనము నందు వచ్చుటకు కారణం చిన్న తనపు చేష్ట అను కొందునా, అని పలుకుతూ కళ్ళ యందు వాత్సల్య మును కురిపించే, ఆ మోహన హరినంబును ముద్దాడి, తృణ పరిమళమును ఆస్వాదించి     అనువంతా తపించే.

నడచి వచ్చిన ఆయాసము పోలేదు
చీర చెఱగుల తడి యైన ఆరలేదు
తృణమును ముద్దాడిన మక్కువ తీర లేదు
ఆ హా హా ఏనాటి ప్రేమార్ధమో తెలియుట లేదు 

వాలు చూపులతో ఉన్న సొగసుకు మరి కాస్త వన్నె తెచ్చేందుకు, లలిత సుకుమార కుసుమాలు, కురులకు చేరి పరిమళాలతో పరవశిస్తూ  తుమ్మెదలను పిలుస్తున్నట్లుగా, శిరో మండలమునందు ఉండి, ఈ చెట్టు నీడను చేరు ఓ కోమలాంగి అని అన్నాయి. 

 
కొమ్మలతో రెమ్మలతో కిక్కిరిసి ఉన్న వన పందిరి క్రింద మల్లిక చేరే, అక్కడే  ఉన్న ఒక వృద్ధ వృక్షంబొకడు (రాం తాత), ఆ తరువు యందు సంత సించి సొన కార్చుచూ, చెమ్మతో చల్లదనము కల్పించుతూ ఇట్లు పలికే, ఎండ కన్నెరుగక, వాన నీడ  గిలక, వన సౌరభాన్ని చూడు, ఆనంద పారవస్యంలో మునిగి తరించు కుసుమమా .....అని పలికే . 

ఇంకా ఓ కుసుమమా మన్మధుడు మంచి వాడు తన పని తను చేసుకు పోతూ ఉంటాడు,  వానిని ఎదిరించి ఎవ్వరూ జీవనము గడపలేరు, ఆ త్రిమూర్తులకే చేతకాలేదు అది గమనించు. 

సుడిగాలి వస్తున్నా, అగ్ని గోళాలు విరజిమ్ము తున్నా, ఎండిన ఆకులు రాలుతున్నా, పిట్టలు చల్లదనం కోసం పరుగెడుతున్నా,  మేఘాలు ఘర్జిమ్చుతున్నా, అకాశ మంతా నల్లని రూపం దాల్చిఉన్నా, ఎడారి జీవులుగా మారుస్తున్నా, ఎవ్వరియందు చైతన్యము లేకున్నా, శృంగార తత్వం, మన్మధుని లీలలు మారవు అది మాత్రం గమనించు మల్లిక . ................
మనసుకు శృంగారము ఆవహించితే అది తొలగించుట ఎవ్వరికైనా కష్టమే, అందుకే అన్నారు ఒక మహాను భావుడు. 
 
మాటపై విశ్వాసము చూపుట కష్టమే
సత్యం పలికి జీవించటం కష్టమే
ధర్మాన్ని అనుకరించి బ్రతకటం కష్టమే 
న్యాయాన్ని నమ్మి నడుచు కోవడం కష్టమే 

వేడికి మంచు కరుగాకుండా ఉండుట కష్టమే 
నదులు సముద్రాన్ని కలవకుండా ఆపుట కష్టమే 
పుట్టిన జీవి పృధ్విలో కలువ కుండుట కష్టమే 
వయసు మార్పులు ఆపుట ఎవ్వరికైనా కష్టమే

నీడను బట్టి వయసును గుర్తించటం కష్టమే
మాటను బట్టి గుణాన్ని గుర్తించటం కష్టమే 
పురుషులందరూ మంచివారే ననుట కష్టమే
  యవ్వనవతు లందరూ పతివ్రతలనుట కష్టమే

మనువాడిన మనస్సు అర్ధం చేసుకోవడం కష్టమే 
వయస్సులో వచ్చే మర్మాన్ని గుర్తించడం కష్టమే 
కాల చక్రాన్ని, కాలాన్ని ఎదిరించి ఉండుట కష్టమే 
గురువులను, పెద్దలను, పిల్లను విడిచి ఉండుట కష్టమే 

ఆరిపోని వెలుగు, ఆగిపోని పరుగు లేదనుట కష్టమే
పిల్లలు కనుట తేలికే, బుద్ధులుమర్చటం కష్టమే 
తాపము వయస్సును వెంబడించిన చెప్పుట  కష్టమే  
ఎవ్వరినైన మన్మధుడు ప్రవేశిస్తే నిద్రపోవటం కష్టమే  

అని కొన్ని విషయాలు " రాం తాత ", కన్న కూతురికి చెప్పినట్లు మల్లికతో హిత వచనములు పలికే 

ఓ మదనికా వయస్సులో వచ్చే మార్పులు చెప్పేవి కావు, చెప్పరానివి కావు, చెపితే ఒక తంటా, చెప్పకుంటే మరో తంటా, వయస్సులో వచ్చే మార్పుల ఉరవడికి, ఆంక్షలు విధించిన, తప్పుత్రోవ పడతావని హెచ్చరించిన, వయసు పరుగులకు ఎటువంటి ఆన కట్టలు ఎవ్వరు వేయలేరు, కాని అదుపులో ఉంచు కోమని సలహా మాత్రము ఇవ్వగలరు. తప్ప త్రాగిన మొహం, ప్రేమలో పడ్డ మొహం, యిట్టె గమనించగలరు,వారి మాట, నడవడిక, ఎప్పటిమాదిరిగా ఉండదు, ఏదో తప్పు చేసాము అని భావనతో ఉంటారు. 

నీకొక చిన్న కధ  చెపుతాను విను కోమలాంగి అంటూ చెప్పటం మొదలు పెట్టాడు. ఒక కుటుంబములో తండ్రి , కొడుకు (12సంవస్చరములు ) కలసి ఒక ఉద్యాన వనమునకు పోయారు, అక్కడ మనుష్యులు చూసి కొడుకు ఈ విదముగా అడిగాడు తండ్రితో, అక్కడ యువతి యువకుడు చేయి చేయి పట్టుకొని తిరుగుట చూసి అట్లు తిరుగుట తప్పుకాదా అని కొడుకుఅడిగెను, వాల్లెవరో, అట్లా తిరుగుత ఏందుకో అర్ధం గాక అడుగుతున్నా నాన్న, వాళ్ళ గురించి చెప్పు నాన్న అని ప్రశ్నించెను?, తండ్రి కొడుకు మాటలకు ఏమి చెప్పాలో తోచక వారిరివురు ప్రేమలో పడ్డ వారు, ఒకరి కొకరు వివాహము చేసుకోవాలని నిర్ణ ఇంచుకొన్నవారు అని చెప్పెను. 

 ఇంకాదూరం వెళ్ళాక  కొడుకు నాన్న  నాన్న ఇక్కడేంటి, ఒక అబ్బాయి చుట్టూ ఇద్దరు అమ్మాయిలు తిరుగుతున్నారు వాళ్ళెవరు అని అడిగాడు కొడుకు.    ఒకరు ఇల్లాలు, మరొకరు ప్రియురాలు అనిచెప్పాడు నాకేమి అర్ధం కావటం లేదు నాన్న, నీకు అప్పుడే అర్ధం కాదు బుద్దిగా నాడు ముందుకు అన్నాడు తండ్రి. ఇద్దరు కలసి  ముందుకు పోతున్నారు. కొడుకు చూసాడు   అక్కడ ఒక మనిషి చుట్టూ అనేక మంది ఆడవారు నడుస్తున్నారు వారెవరు నాన్న అని అడిగాడు, వాడు ధనమున్న నాయకుడు, ఆడవారు అదుపులో అతను లేడు, అతని అదుపులో వాళ్ళు వున్నారు, వాళ్ళు డబ్బు కోసం సర్వం అర్పించేవారు. తండ్రి మాటలు ఎమీ కొడుకుకు అర్ధం కాక, అతనికి తేడా తెలియక అమాయకంగా నోరెల్ల బెట్టాడు.అంత మంది స్త్రీలను అదుపు చేసే శక్తి ఒక్క ధనానికి,  పురుషునికే ఉందని కొడుకుకు  తెలియదు! 


 అట్లాగే మనలో ఉన్న చైతన్య శక్తిని అర్ధం చేసు కోలేక, దేహేంద్రియాల మధ్య భందీలమై ఉన్నామనే బ్రమలో ఉన్నాం. ఈ సమస్త విశ్వము ఒక చైతన్యం నిండి ఉండి. మనలోను ఈ చేట్లులోను, ఈ నేలలోను చైతన్యం ఉంది. మనం ఏదో ఒక అను భూతికి చిక్కి ఉన్నాం. మనలో ఉన్న చైతన్యం గుర్తించు కోగల శక్తి మనకు లేదు, మనలో ఉన్న శక్తిని వేరొకరు చెపితేనే అర్ధం చేసుకోగలము. అట్లాగే నీలో యవ్వనం ఆవహించింది, నీవు కూడా ఆ బాలుడి లాంటి దానివి, లోకం చాలా పెద్దది,  నీకు సరి అయిన జోడును పొందే శక్తి నీకు ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి కధ ముగించాడు "రాం రామ్ తాత" .   
 రాం తాత తో మమతల వల్లి, మాణిక్యాల మల్లి, మనసెరిగిన మల్లిక  పలకరించి ఈ విధముగా పలకరించే
   
ప్రియనేస్తమా!!
మరువలేకున్న నేస్తం -
మదిలోని చెడు జ్ఞాపకాలను తరుముటకు 

కాంతివై రావా నేస్తం -
హృదయంలో ఉన్న అజ్ఞానందకారం తొలగించుటకు

స్వప్నంలోకి రావా నేస్తం -
నిదురెరగని నయనాలకు విశ్రాంతి కల్గించుటకు
 
రవళివై రావా నేస్తం -
మూగ పోయిన గొంతులో సరాగాలు నింపుటకు

తుంటరివై రావా నేస్తం -
ఒంటరి నైన బతుకుకు ధర్మాన్ని తెలుపుటకు

జ్ఞాపకానివై రావా నేస్తం -
మరచి పోయిన మానవత్వాన్ని గుర్తు చేయుటకు
 
భందువై రావా నేస్తం -
ప్రేమను రాగాలు పంచి బ్రతికిన్చుటకు

గంధానివై  రావానేస్తం -
దుర్ఘంధపు దురాలోచనలు తొలగించుటకు

కుసుమానివై రావా నేస్తం -
దేవునిపూజకు, మనస్సు పరిమళించుటకు  
...

చాలా చక్కగా చెప్పావు పరిమళ మల్లి,      
ఎవరో నిన్ను వెంబడిస్తున్నారు, వారు చెప్పే మాటలు విను అందులో ఉన్న సత్యాన్ని గ్రహించు, తరువాత నీవు చెప్పాలనుకున్నది ఆలోచించి చెప్పు అదే నేను నీకు చెప్పేది. వసంతుడు ఈ విధముగా చెపుతున్నాడు
"ఓ ప్రియ మల్లిక, అనురూపమైన గుణాల కలిగిన దానవు, ప్రసన్న  సీల వంతురాలవు, నవనీత వర్ణంలో వికసించిన పుష్పానివి నీవు, ప్రణయ మృదుల హృదయ రాణివి నీవు, నీ కోసం నా ప్రాణాలను అర్పించాలని అనుకుంటున్నాను.
నిన్ను నేను ఏంతో ఘాడంగా ప్రేమిస్తున్నాను, నీ మీద ఎన్నో ఆశలు పెట్టు కున్నాను, ఆశయాలతో జీవించాలను కున్నను, అందుకు గురుతుగా నా హ్రుదయ్ముమీద, నా రక్తం తో, నీ బొమ్మ గీసాను చూడు అంటూ ముందుకు వంగి చూపించాడు. ఇప్పుడు నా బ్రతుకు గ్రహణం పట్టిన చంద్రునిలా ఉన్నది,  అక్కడ చంద్రుడు గ్రహణం నుండి బయటకు వస్తాడెమో కాని, ప్రేమ గ్రహణంలో ఉన్నాను, ఈ గ్రహణం వీడి  ప్రేమ ఎప్పుడు ఫలిస్తుందో నాకే అర్ధం కావటం లేదు. నా పరిస్తితి కొన్ని నాళ్ళు మనస్సు భిన్న మదోవికారముగా మారిపోయింది, వలలో చిక్కిన పక్షిలాగా గిల గిల నీ కోసం కొట్టుకుంటూ తప్పించుకొని తిరుగు తున్నాను, ఈ ప్రాయము ఆకర్షణ తగ్గక ముందే నా ప్రేమను వప్పు కుంటావని నేను ఆసిస్తున్నాను.
 నీ ఓర చూపు మహాత్యముతో, నేను నీకు వశ మయ్యాను, నీమాటల తేటలకు చిక్కినాను, నిను పొందలేక, నిన్నుకలువలేక, నా మనసులో ఉన్న కోరిక చేప్పలేక, కాలానికి చిక్కి మదన తాపముతో, విరహ వేదనతో తిరుగుతున్నాను సఖీ. 

పువ్వు వికసించి వాడి పోయిందని చెప్పుకోలేక, భగ్న ప్రేమికుడుగా మారలేక, సముద్రములో నది కలసినట్లుగా నీవెప్పటికైనా నాతో  కలుస్తావని, నేను నీకోసం వేచి ఉండుట శ్రేయస్కరమని భావింఛి ఉన్నాను. 
లలితా లావణ్య పూర్ణ బింబ రూపమైన నీ రూపు, నేను ఎప్పుడు మరవలేకున్నను, కనులుమూసిన తెరిచినా నీవే నన్ను వెంబడిస్తున్నట్లు, నా ప్రేమును పొందు నేను నీ దాసుడను  అని పలు విధములుగా ప్రాధేయ పడినట్లు నాకు కలలోకి వచ్చి మరీ చెపుతున్నావు, ఇప్పుడు నా ప్రేమను తిరస్కరిస్తున్నావు ఎందుకు ?
మకరందాన్ని పొందుటకు తుమ్మెద ఎంతో కష్టపడుతుంది, మకరందాన్ని గ్రోలిన తర్వాత తన ఇష్టాను సారంగా తిరుగు తుంది.దానిలాగా నేను ప్రవర్తించను, నీ ప్రేమను పొందుటకు కాలమైన వేచి యుంటాను,     అని చెప్పి వచ్చిన దారిన వెళ్లి పోయాడు వసంతుడు" మనసును ఎవ్వరో తట్టి లేపినట్లు ఉన్నది

రాం తాత


రాం తాత  అంతా విన్న తరువాత ప్రేమ అనేది చాల గొప్పది, అది ప్రేవేసించిన తర్వాత ఎవ్వరిని నిల్వ నీయదు, ప్రత్యక్షముగా కాని, పరోక్షముగా కాని అది మనిషి జీవితానికి మంచి మర్గాన నడిపిస్తుంది అదిమాత్రం నాకు తెలుసు అసలు ఆడజన్మ గొప్పదనం గురించి ఒక కవి (సిరివెన్నెల గారు) చెప్పిన సినమా గీతం వినిపిస్తాను విను మల్లిక 
నాకు నీవు చెప్పే మాటలు వినాలి ఉన్నది చప్పు అన్నది  మల్లిక. 


     కార్యేషు దాసి కరణేషు మంత్రి
 

భోజ్యేషు మాత శయనేషు రంభ

 

అపురూపమైనదమ్మ ఆడజన్మ
 

ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
 

అపురూపమైనదమ్మ ఆడజన్మ
 

ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
 

మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా
 

జీవితం అంకితం చేయగా...
 


అపురూపమైనదమ్మ ఆడజన్మ
 

ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా

 

పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై
 

బ్రతుకుతుంది పడతి పతే లొకమై
 

మగని మంచి కొసం పడే ఆర్తిలో
 

సతిని మించగలరా మరే ఆప్తులు
 

ఏ పూజ చెసినా ఏ నోము నోచినా
 

ఏ స్వార్థము లేని త్యాగం
 

భార్యగ రూపమే పొందగా...

 

అపురూపమైనదమ్మ ఆడజన్మ
 

ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
 

అపురూపమైనదమ్మ ఆడజన్మ
 

ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా

 

కలిమిలేములన్నీ ఒకే తీరుగా
 

కలిసి పంచుకోగా సదా తొడుగా
 

కలిసి రాని కాలం వెలి వేసినా
 

విడిచిపోని బంధం తనై ఉండగా
 

సహధర్మచారిణి సరిలేని వరమని
 

సత్యాన్ని కనలేని నాడు
 

మోడుగా మిగలడా పురుషుడు...

 

అపురూపమైనదమ్మ ఆడజన్మ
 

ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
 

అపురూపమైనదమ్మ ఆడజన్మ
 

ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
 

మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా
 

జీవితం అంకితం చేయగా...

 

కార్యేషు దాసి కరణేషు మంత్రి
 

భోజ్యేషు మాత శయనేషు రంభ


తాత పాత చాలా బాగున్నది 



రాం తాత  చెప్పిన  మాటలు విన్నది,  మల్లికఎవరి మాటలు వినాలో ఏది చేయాలో నిర్దారించు కోలేని వయసులో ఉన్నది, పెద్దలు మాటలు వినమని ఒకరు చెపుతారు, మరొకరు ప్రేమించిన వాణి మాటలు వినమని చెపుతారు, అది నిర్ధారించు కోవటం ఈ వయసులో నాకు ప్రశ్నగా మారుతున్నది, ఏది ఏమైనా ఆబ్రహ్మా ఆడించి నట్లు ఆడుటే   కదా మానవుల లక్షణం, మనోధైర్యముతో మనసును నిగ్రహించుకొని నిర్ధారణగా అందరి మాటలు విని దానిలో ఉన్న మంచిని గ్రహించటయే  ఇప్పుడు నాకు తక్షణ కర్తవ్యం అని తలంచినదే మల్లిక. 

మల్లికా అనాలోచితముగా ఆలోచించు సమయాన చిరు మంద హాసము చేస్తు చెంగ్  చెంగ్ మంటూ ఎగురుకుంటూ వడిలో చేరింది ఒక జింక పిల్ల,  అమితానందంతో చేతితో నిమురుతూ ఆనంద పారవశ్యంలో మునిగి  పోయింది. అప్పుడే తప్పించు కొని నన్ను పట్టుకో పట్టుకో  అని కవ్వించి పరుగులు తీసినది, దానిని పట్టు కొనుటకు మల్లిక పరుగులు తీసింది, ఆ ఆటను చూసి అక్కడ ఉన్న మొక్కలన్నీ ఓక్క సారి వికసించాయి, నారికేళ తరులు వాలి ఊగుతున్నాయి, నారి కేళాలు పూబంతుల్లా  కదులు తున్నాయి, వనసమూహాన్ని మైమరిపించి ప్రతి పువ్వు వికసించి పరిమళాలు వేదజల్లుతున్నవి, ఏపుగా ఎదిగి ఉన్న కదలాడుతూ కనబడు తున్న ఎదురు బొంగుల పొదలు, అక్కడున్న
 గంధపుచెట్లు, సంపెంగ చెట్లు సువాసనలు వెదజల్లు తున్నాయి. చల్ల చల్లని పవనాలు వీచుటవల్ల మల్లిక మనస్సు తేలిక పడింది. అక్కడ ఉన్న వృద్ధుడైన తాతను కలసి ఏదైనా కధ చెప్పు మని మల్లిక కోరింది చెప్పలేని ఆనందంతో. అవును నీకు క్లుప్తముగా శకుంతల  కధ  చెపుతా విను అంటూ కధ మొదలు పెట్టాడు రామ్ తాత .

శకుంతలను ఏంతో గారాబంగా పెంచ సాగాడు కణ్వమహర్షి, యుక్త వయస్సు వచ్చింది శకుంతలకు, ఏ మహారాజునకైన ఇచ్చి వివాహముచేద్దామని తలంచాడు కన్వ మహర్షి. ఒకరోజు కణ్వమహర్షి లేని సమయాన వన విహారమునకు వచ్చిన దుష్యంతుడు శకుంతలను చూచుట జరిగింది, ఆసమయాన్నే ప్రీమలో పడిపోయాడు 
తాత ప్రేమ అంటే ఆకర్షణ, మనోతాపమా ఏమిటో చెప్పవా " ప్రేమ అనేది  ఎలా పుడుతుందో, అది పుట్టి ఎలా నడి పిస్తుందో ఎవ్వరూ చెప్పలేరు, కాని ప్రతివక్కరి మనసులోకి ప్రేమ మాత్రం ప్రవేశిస్తుంది దానివల్ల కొందరు మంచిగా ప్రవర్తిస్తారు, కొందరు మూర్ఖులుగా మారుతారు (అతి ప్రేమ మూలముగా) ప్రేమ గూర్చి ఒక చిన్న కవిత చెపుతా విను

"నీ పొందుకోసం, నీ చుట్టూ పరిబ్రమనం చేస్తున్నా, గమనించావా 
నీ చూపల కటాక్షం కోసం, నా కళ్ళ వెంట ఉన్న, నీరు చూసావా  
నీజ్ఞాపకాల మరకలను, నా ప్రేమనిజాన్ని  గుర్తుకు తెచ్చు కోవా      
   గుండెలోని భాధ నీకు వ్యక్త పరుస్తున్నాను మందు వేసి పోవా

మదిలోని అలజడలను నా రెప్పలపై చూపుచున్నను చూడ వా
మసక చీకటిలో నీ వెలుగు రూపాన్ని చూపి నన్ను తరించి పోవా
మౌనం వీడి కడలి పొంగి, ఉప్పెనలా వచ్చి నన్ను చుట్టు  కోవా
తపనలకు చిక్కన హృదయం ఎంత విలపిస్తుందో గమనించావా

కాంతి కిరణాలు కళ్ళను ఆవహించి అంధుడుగా మారకముందే రావా
మనస్సుకు చేరిన మమతల ఘోష అర్ధం చేసుకొని బ్రతికించవా 
నీ మువ్వలశబ్ధాలు నాగుండెను తాకి ఆడు కుంటున్నాయిచూడవా
నిన్ను చూసిన క్షణమే నన్ను నేను మరిచాను గుర్తు చేయవా

నీ జ్ఞాపకాలే నన్ను మన్మద బాణాల్ల గుచ్చి వెళ్లి పోయావా 
కవిత్వమే ఆధారంగా నాప్రేమను వ్యక్తపరుస్తున్నాను తెలుసుకోవా 
చల్లని నీ స్పర్సకోసం కోటి జన్మలైన వేచి ఉంటాను నాప్రేమను 
గుర్తించావా,
 తపనలు తగ్గించి తరించి తన్మయం చెందవా",


అంటూ ప్రేమ పిపాసిగా మారినవాడు ఆనాడు శాకుంతలనుచూసి దుష్యంతుడు. గాంధర్వ వివాహ పద్దతిలో భార్యగా పొందాడు, చేతికి అంగులీకము తొడిగి వశ పరుచుకున్నాడు, సర్వ సుఖాలు ప్రకృతిలో అనుభవించాడు. కమ్మిన మొహావేశాలు తగ్గినాయి, రాజధానికి వెల్లాలనిపించింది, వెంటనే శకుంతలను చేరి తన పరివారాన్ని పంపి రాజధానికి నిన్ను సగౌరవంగా రప్పించుకుంటానని  పలికి దుష్యంతుడు రాజభవణానికి చెరుకున్నాడు . ఆ తర్వాత రాజ్య పరిపాలనలో నిమగ్నుడైనాడు, శకుంతల విషయం  మరిచాడు  
     
కన్వ మహర్షి  శకుంతల  చేసుకున్న గాంధర్వ వివాహం గ్రహించాడు, తనకూతురు శకుంతల  గర్భవతి అని తెలుసుకున్నాడు , కూతురిని తనవద్దే ఉంచుకొని సుఖ ప్రసవం ఆయన త్రర్వాత దుష్యంతుని వద్దకు పంపవచ్చు నని తలంచెను. పండంటి మొగ బిడ్డ కన్నది శకుంతల. వానికి కన్వమహర్షి సర్వదమనుడు అని నామకరణం చేసినాడు. మెట్టి నింటికి సర్వ లాంచనాలతో పంపించాడు. కాని దుష్యంతుడు భార్యగా గుర్తించలేక నేను నిన్ను వివాహము చేసుకున్నట్లు గుర్తుకు రావట ములేదు ఏదైనా ఆధారము చూపుము అప్పుడు నేను నీభర్తగా అంగీకరిస్తాను అని తెలియపరిచెను.
  
శకుంతల దుష్యంతుని రాజ సభకు చేరింది. ఓ రాజా మన ఇద్దరి వివాహాన్ని ద్రువపరిచే సాక్షులు లేరని, నీ భార్యగా నీవు నన్ను అంగీకరించుటేలేదు.  కానీ అందరి హృదయాలలో అంతర్యామిగా ఉండే శ్రీ హరికి ఈ విషయం తెలుసును. అట్లే అంతరింద్రియమైన నీ మనసుకు కూడా తెలుసును. ఇదిగో నీవు ఆనాడు ఇచ్చిన ఉంగరము అని చేతి వే లును చూపింది కాని ఉంగరము వేలుకు లేనట్లుగా గ్రహించి ఏమిచేయలేక ఊరుకున్నది. ఎదీ ఆధారము అని అడుగగా మీరు నాకు తొడిగిన అంగులీకము ఎక్కడో జారినది, నాకు తోడుగా అంత సాక్షులు ఉన్నారు, వారే నాకు సహాయకులు.వారె సూర్య చంద్రులు తేజస్సు, వాయువు , భూమి, ఆకాశం, యముడు, వరాణుడు, పగలు, రాత్రి, ఉదయకాల, సాయంకాల, సధ్యాసమయములు ధర్మం, అనేవి కూడా ఉన్నాయి 

"ఆదిత్య శ్చంద్రా వినలానలౌ చ
ద్యౌ ర్భూ మిరాపో హృదయం యమశ్చ
అహశ్చ రాత్రిశ్చ ఉభెచ సంధ్యే
ధర్మశ్చ జానాతి నరస్య  వృత్తిం "
 అని శకుంతల దుష్యన్తునికి నిండు సభలో ప్రభోదించినది. నీకు నేను భార్యను అనే విషయం తెలిసికూడ నిన్ను నీవు మొసగించు కుంటూ  ఆత్మద్రోహానికి పాల్పడుతున్నావు. ఈ స్థితిలో  ఉన్న నీకు దేవతలుకూడా శ్రేయస్సును కలిగించరు
నా అంతటా నేను వచ్చానని, పెద్దల ప్రమేయం లేకుండానే నీతో  వివాహానికి అంగీకరించానని  నన్ను చులక చేసి చూడకు, నీవు ధర్మ విరుద్దంగా ప్రవర్తిస్తే మన వివాహానికి సాక్షులుగా ఉన్నవారందరూ నిన్ను శిక్షిస్తారు అని, శకుంతల  దుష్యంతునికి చేసిన  హెచ్చరికలు అన్ని ప్రాంతాలకు అన్నికులాలకు చెందిన వారందరికి  కనువిప్పు కలలిగించేవే
" రాం తాత శకుంతల భర్త వద్దకు చేరలేదా
ఎందుకు చేరలేదు నేను చెప్పేదేమిటంటే స్వతంత్రించి పెళ్లి చేసుకుంటే కష్టాలు వస్తాయని, మొగవాడు ప్రేమించాననగానే తనువూ అర్పించటం తప్పు అని, సీల పరిక్ష చేసే మగవాన్ని నమ్మకూడదని, పెద్దల ఆసీర్వాదముతో చేసుకొనే వివాహము మంచిది, అది మనసాంప్రదాయం కూడా అని, చెపుతూ కధ ఆపాడు.
 ....
"రామ్ తాతా " నేను అడిగిన దానికి ఇంకా చెప్పలేదు, కాస్త విశ్రాంతి తీసుకొని, నేనుకధచేప్పలన్న నాకుఒపిక రావాలికదా, కాస్త ఓపిక పట్టు, ఆ శకునాల తొందర నీలొ కనిపిస్తున్నది, అంట మంచిది కాదు అన్నాడు తాత 
 ఆప్పుడే రాజ సభలోకి జాలరుడు వచ్చి ఈవిధముగా చెప్పాడు  నేను సముద్రముపైకి వేటకు వెళ్ళినప్పుడు, ఎప్పటిలాగా వల వేసినాను, ఆ వలలో నాకు అద్భుతమైన చాప పడింది, అది నా  అదృష్టమని భావించి ఇంటికి తీసుకెల్లి కూర వండ మనగా, ఆ చేప పొట్టల ఈ విలువైన ఉంగరము ఉన్నది మహారాజ, ఇది రాజులకు చెందినది అని భావించి, మీ వద్దకు తెచ్చాను స్వీకరించండి అని, రాజు  దగ్గర ఉంచి వినయముగా ప్రక్కకు తోలి గాడు జాలరుడు. ఆ ఉంగరము చూసిన వెంటనే గతస్మ్రుతులు వెంబడించి నిండు సభలో తన తప్పును అందరిముందు వప్పుకొని శకుంతలను భార్యగా  స్వీకరించాడు. 

ఇదేనమ్మ క్లుప్తముగా కధ నీకు చెప్పాను ఈకధలొ ముఖ్యంగా నేరాలు చేసిన వారికి శిక్షలు విదించే  అధికారం న్యాయస్థానానికే ఉంటుంది. అయితే అపరాదులు ఎవరు, నిరపరాదులు ఎవరు  అని తగిన విచారణ చేసిన తర్వాతనే న్యాయమూర్తి శిక్షను ఖరారుచేస్తారు. నేర నిర్ధారణకు సాక్షుల వాంగ్మూలం చాలా ముఖ్యం.  వ్యక్తులు చూడనప్పుడు తప్పు చేసినవారు, సాక్ష్యం చెప్పేవారు, ఎవరూ లేరు, కాబట్టి నాకు శిక్ష పడద నీ అనుకుంటారు.  కానీ చేసే పుణ్య-పాపకర్మలకు అంతస్సాక్షులు ఉంటారని తెలుసుకోవాలి,  తప్పు అనేది ఎప్పటికి చేయకూడదు అని  నేను నీకు చెప్పు తున్నది. 
 రాం  తాత ఈరోజు సూర్యుడు అస్తమించే సమయము అవుతున్నది, చీకటిని పిలుస్తున్నది, నేను త్వరగా ఇంటికి పోవాలి, రేపు మల్లా కలుసుకొని  చక్కని మంచి మాటలు చెప్పుకొని సంతోష జ్ఞానాన్ని పొందుతాను 
  మంచిది నేను కాస్త విశ్రాంతి తీసుకొంటాను. ఆమాటలు విని తిరుగు మొఖం పట్టింది మమతల వల్లి మల్లిక .     
అలా ఇంటికి చేరింది మమత, తల్లి సరస్వతి  చాలా కోపముగా నీవు ఎక్కడకు పోయావు, ఇంతసేపు ఎం చేసావు అని అడిగింది, అమ్మ నేను వనమునకు పోయాను "రామ్ తాత" కలిసాను కధలు చెపుతుంటే విని తిరిగి వచ్చాను, చూడు  నీ మొఖముఎలా మారిపోయిందో,  తెల్లని బుగ్గలపై నల్లని కాటుక జారింది, కేశములు విడి పోయి అలంకారం తగ్గింది, కళ్ళ అందం తగ్గి, కమ్మే కేశాలతో నిండిఉన్నది. ముందు నీవు మొఖం కాళ్ళు చేతులు కడుక్కొని లోపలకు వచ్చి ముందు అల్పాహారము తిను, ఆ తర్వాత నీకు ఇష్టమైన పని చేసుకో అన్నది.

అసలు అల నీవు  పిరికి దానిలా ఉండకు, పోకిరికుర్రవాళ్ళు ఉంటారు ప్రేమించామని వెంబడిస్తారు, వారి మాటలు నమ్మి మమ్ము అన్యాయము చేయకు, మా జీవితాలు, నీ మీదె ఉన్నాయి, త్వరలో నిన్ను ఒక ఇంటి దాన్ని చేసి, మా భాద్యత కొంత తగ్గించుకో గలము అని అన్నది తల్లి . 
అమ్మ నీకో విషయం చెప్పాలనుకున్నాను, చెప్పమ్మా, నీవు  మనసులోని విషయాన్ని నీవు చెపితే కోపం వస్తుం దేమోనని అనుమానమగా ఉన్నదమ్మా , అనమానం లేకుండా నిర్భయంగా చెప్పు , నన్ను ఒకడు వెంబడి చ్చాడమ్మ, చెప్పుతీసుకొని బుద్ది చెప్ప పోయావా, అట్లా చేయ లేదమ్మా, మరి ఎంచేసావే, వాడ్ని వదిలించుకొని ఎలా వచ్చావే, ఆవిషయం నన్ను చెప్పనిస్తెగా నీవు., బి పి పెంచు కోకమ్మ ఎమీ కాలేదు, మరి ఎం చేసావే చెప్పవే, నా మనసులో మనసులోలేదు అన్నది తల్లి. అందకనే నమ్మ నీకు ఏ విషయ చెప్పదలుచు కోలేదు, ఆ చెప్పు చెప్పు , అమ్మ నేను రాం తాతను కలిసానమ్మ అది పాత విషయమే కదా, ఎప్పుడు పోతూనే ఉంటావు కదా, చిన్నప్పుడు నిన్ను ఎత్తుకొని పెంచాడే ఆయన, ఆయనకు మనం ఋణపడి ఉన్నాము, మన ఇంటికి రమ్మనమని చెప్ప బోయావా, ఆయన్ని చూసి, చాలా రోజులు అయింది, పిలుస్తాలేమ్మ, నీలో గాబరా లేదుగా, ప్రశాంతముగానే ఉన్నావుగా, ఆ ఉన్నానే చెప్పవే నన్ను వెంబడించాడని చెప్పానుగా అంతే, ఎమన్నా నిన్ను ఇబ్బంది పెట్టాడే, లేదమ్మా, మరి ఎం చేసాడే ఏవో కవితలు చపుతూ నా వెనక పడ్డాడే ఎం కవితలే బాబు ఉండు స్థిరం గా ముందు కూర్చో, ఈ మంచి నీళ్ళు త్రాగు అంటూ కూర్చొని ఇక చెప్పు అన్నది, కూతురు చెప్పటం మొదలు పెట్టింది. కవిత 


your Profile Photo
ప్రక్రుతి దృశ్యాలు చూడనెంచి కాళ్ళు కదిపే 
చినుకులు రాలగ జలదరించి వళ్ళు  తడిసే
జలాశయమున కమలము మనసు కుదిపే
కమలాన్ని  అందు కోవాలని ఆరాటం పెరిగే
నాలో
కడు  విశాల   నేత్రములు  కలిగి  నట్టి    
కను విందు  చెస్తూ కదులు తున్నట్టి
జలక మాడుతున్న జలకన్య  కాబట్టి
కన్య సౌందర్యం చూసి నామతి చెడింది
ఇప్పుడు
కన్య  సౌందర్యం  వర్ణింప  నా   తరమా
సుందర  ప్రభ వలే  ఉన్న చెందమామా
బరువైన పిరుదులపై ఉన్న కేశజాలమా  
బరువుతో కదులుతున్న వక్షో జాలమా 
అని వర్ణిం చాడే
కవ్వించే హృదయం గాలిలో  తేలగా
బంగారు వర్ణం  మదిలో    నిలువగా
ఆకర్షించే నేత్రములు త్రిప్పు చుండగా
బ్రహ్మకైన భామను చూస్తె తిక్కరేగదా
అన్నాడే
ఒడ్డున చేరిన జవరాలు వంగి వంగి చీర కట్టి
పాలిండ్లపై   పావడాను  ఊపి ఊపి  ఆర బెట్టి
వయ్యారంగా నడుంపెట్టి ముఖంపై బొట్టు పెట్టి
జలములో ముఖం చూసుకొని నవ్వు కుంటుంటే 
 

అందం ఇంతని చెప్పలేనన్నాడే 

చెట్టు చాటున  అంతా  చూసి  ఉండ  పట్ట   లేక
వంపుసొంపు నడకచూసి తపనకు తట్టుకోలేక
భువి  నుండి  దివికి   వచ్చిన నవరత్న మాలిక
దరిచేరి   ఆమెను   పలకరించే మనసు నిలవక  
       
హే   లావాన్య  ఎవరి బిడ్డవు ఎచ్చట  ఉందువు
నా  కంటికి నీవు సుకమార   సుందర వనితవు
ఇది స్వప్నము కాదు ప్రత్యక్ష శృంగార దేవతవు  
యవ్వనంలో ఉన్న బ్రాహ్మణ పుత్రిక ఐ ఉందువు 

తాపసి   గారాల   ముద్దు   బిడ్డవను   కున్నాను
దేహకాంతి చూసి ఆగలేక నీముందుకు వచ్చాను
మనసులో ఉన్న కోరికను తెలియపరుస్తున్నాను
చిరునవ్వుతో   మాట్లాడితే   ముత్యాలు   రాలునా
అని పలరించ బోయాడే
మందహాసపు మాటలు వినాలని ఉంది
విశ్వమంత విశాల హ్రుదయము ఉంది
కోకిల గానంతో వరుస కలపాలని ఉంది
చిలుక పలుకుల చిన్నారి మాటలు రావా

సుధలు   చిందు   నధరాలు కదలాడ
బిడియ   మేళ    విన్న   వించు  జాడ
మదిని శాంత పరుచు చెప్పు ఉండే వాడ
మాటలాడక నా హృదయంలో పెంచకు దడ

దడ తో వేగంగా నదుస్తూ వస్తునాను అమ్మా

మౌనమేల వహింతువు మనసు చెప్పు మాలినీ
వచ్చి నాను నీవెంట  పలకవు అందాల భామినీ
నన్ను గానక వేగంగానడుస్తున్నావు సునయనీ
వేడుకొందును మనసు తెలుపవా కామిని

నా మీద నీకు  జాలి   కలుగుట లేదా
అలుకమానుటకు నీకు ఏమి చెప్పేదా
నా మదిలో మెదిలిన   కోరిక తెలిపెదా
ప్రేమ వున్నచో నీతోడు నేనే ఉండాలి సదా

అన్నాడమ్మా 

పుడమి   పై   ఇంద్ర  భవనము    నిర్మించేదను
వజ్ర   వైఢూర్యముల  తో   నగలు  చేయించెదను
సుందర ప్రాంతములు నిత్యమూ చూపించెదను
లలనా కష్ట పెట్టకుండా నిన్ను  సుఖ పెట్టగలను

అని ఆశలు రేపాడమ్మా
 

నీ మదిలో మెదిలిన  కాంక్షను  తీర్చెదను
నీ   అడుగు  జాడలలో నడుచు కొందును
నీ హృదయమును సంతసింప చేయుదును      
నీవు నామనసు అర్ధం చేసుకొని పలుకుము 


అని జాలితో ప్రేమనువ్యక్త పరిచాడమ్మా 

అంటూ మన ఇంటి దాకా వచ్చాడమ్మ ఎం చేయ లేక, అంతే కదా వాడెవడో ప్రేమ పిచ్చోడు, వాడు ఈసారి కనబడితే 
నేరుగా యింటికి తీసుకురా వాడెవడో, వాడి కులమేదో, గోత్రమేదో  కనుక్కొని నీ ముక్కుకు తాడేసి కట్టేస్తా, అమ్మ వాడొక బైరాగి లా ఉన్నాడు, గడ్డాలు పెంచి ఉన్నాడు, కొందరు పిచ్చి పిచ్చిగా కవితలు వ్రాసి పాడుకుంటారు అవి ఏమి పట్టించుకోకు, అన్నం పెడతా హాయిగా నిద్రపో  అన్నది తల్లి . తల్లికి మొట్ట మొదటి సారిగా అబద్ధం చెప్పింది, ఎందుకంటే ఆ కుర్రోడు, మన ఇంటి ప్రక్కన అబ్బాయి అంటే అగ్గి మీద గుగ్గిలం అవుతుంది. ఎందుకంటే ఆ యింటికి మా యింటికి తర తరాలనుండి విభేదాలు ఉన్నాయి, అవి ఎప్పుడు తీరుతాయో, నాప్రేమకు బలం ఎప్పుడు వస్తుందో అనుకుంటూ అన్నం తిని పడుకుంది.
               
కలలో చేరాడు మోహన స్వరూపుడు, మిస మిస లాడే వయస్సులో, నవ యవ్వనంలో నన్ను దోచు కోవాలని ఆరాట పడుతూ ఉండగా నేను సహజంగా ఉండే స్త్రీలో సిగ్గు వలనో, కవ్వింపు నటనలు చేసినాను, కళ్ళల్లో ప్రవేశించి నా నీలిముంగురులు కదిలిస్తూ, ఏదో తెలియని శ్వాస నన్ను ఆవహించి, చూపుల యందు ఆర్తిగా అమాంతం, అన్యూన్య అనురాగాలు పంచుకుంటూ నా బ్రమలు తోలగించుటకు బ్రమరం వలే నాచుట్టు తిరుగుతూ స్వప్నంలో ఆలాపనలు చేయుట ఎందుకు?

నీవు నాకలలోకి వచ్చి చేసిన ఆగడానికి క్షణంలో అధరమ్ముల తడి అవరైంది ఎనలేని రుచి చూసే. నాకలలో నన్ను వెంబడించే సంశయ పడకు ఇందు ఎవ్వరూ లేరు, నీవు నేను తప్ప, మనం ఇరువురం కలసి ఒకరి నొకరు ఆస్వాదించు కోవటం తప్పు కాదు, ఇది ప్రకృతి సృష్టికి ప్రధమ మార్గం, నయనమ్ములు చూడు, నా ఆత్రం నీకు కనిపిస్తుంది, నా ప్రేమ నీకు దొరుకుతుంది, చనువుతో చెప్పుతున్నాను, వదనమ్ములు వ్యర్ధం చేయకు, కాలాన్ని వ్యర్ధం చేయకు, చిరు సమ్మేళనములోనే రక్తి ఉన్నది, శరీర భాగాల స్పర్సతో, శరీర భాగాల తాపము ఎందుకు అను కుంటావు, పడచుల జత కూడు  జన్మ సాహిత్యము, సంసార సంబోగ అంతరార్ధం, అర్ధ చేసుకోక పోవుట వలన నీ కలలోకి వచ్చి వేదించటం  కూడా  నాదే తప్పు ఆన్నాడు మోహన రూపుడు. ఆనాడు

 శృంగారమునకు చెందిన ఒక  పద్య విశేషము గుర్తు చెప్తాను విను అని చెప్పటం కలలో మొదలు పెట్టాడు.   




రాయల నాటి అజ్ఙాత కవిశేఖరులు ! వ్రాసినది

కాలం విచిత్రమైనది . కాలంకన్నా వ్యక్తుల జీవితాలు విచిత్రమైనవి. ఎంత గొప్పవాడైనా సరే అదృష్టదేవత అవుగ్రహం ఉంటే అందలాలెక్కుతాడు. ఆమెకరుణింపకుంటే యెన్ని తెలివి తేటలున్నా యెంతటి గొప్పకవియైనా వాని ఊరుపేరు లుండవు. వీటిగురించి తెలిసికోవాలంటే ముందుకొన్ని విషయాలు వినాలి.

రాయలు ఒకనాడు అంతఃపురంలో కాలక్షేపంకోసం తనకుమార్తె "మోహనాంగితో" చదరంగం ఆడుతున్నాడు.రాయలు పావులు కదుపుతూ ఉండగా ,మంత్రికీ ఏనుగుకీ ,మధ్యలో మోహనాంగి బంటు ఒకటి చిక్కుబడి పోయింది. దాన్నెలా తప్పించాలో ఆమెకు తెలియలేదు. అపుడామె కూనిరాగములతో " ఉధ్ధతుల మధ్య పేదల కుండఁ దరమె?"- అనేపద్యపాదం చదివింది. రాయలు విస్తుపోయాడు." ఏదితల్లీ! మళ్ళీచదువు? అనిప్రశ్నించాడు. అపుడామె తాను విపణిలో నొక కవికి 400 వరహాలిచ్చి కొన్న ఒకపద్యము లిఖింపబడిన తాటియాకును దెచ్చి రాయల కిచ్చినది. అందు-
" ఒత్తుకొనివచ్చు కటి ,కుచోద్యృత్తిఁ జూచి ,
సుదతి! తనుమధ్య మెచటికో ఁ దొలగిపోయె;
ఉండె నేనియు కనబడకున్నె- యహహ!
ఉధ్ధతుల మధ్య పేదల కుండఁ దరమె?"

కవికర్ణరసాయనము - సంకుసాల నృసింహకవి;
అనివ్రాసియున్నది. దీనిభావమును పరిశీలింతము.
కవి ఒక సుందరాంగిని వర్ణించుచున్నాడు. ఆమె తను మధ్యమును వర్ణించు సందర్భము.
కటికుచోద్యృత్తి యనగా వక్షోజములు , జఘనములయొక్క పొంగు (పెరుగుదల)
తనుమధ్యమంటే నడుము; యౌవ్వన విస్తృతివలన వక్షోజములయొక్కయు ,పిరుదులయొక్కయు
వుధ్ధృతిని తట్టుకొనలేక నడుము సన్నబడి, సన్నబడి , చివరకు మాయమైపోయినదట! ఉంది కానీ ప్రస్తుతం
ఎక్కడుందో తెలియటంలేదు.అంటున్నాడుకవి. ఉంటే కనబడకుండా ఉంటుందా? అనేప్రశ్నకు ఒక అర్ధాంతర న్యా సంతో సమాధాన మిస్తునాడు. " ఇద్దరు గర్విష్ఠులైన బలవంతుల నడుమ నొక బలహీనుఁ డుండ లేడుగదా? అందుచేత ఆమెనడుము అజ్ఙాతములోనున్నది. అనిదాని సమాధానము. ఇంతకీ నడుము సన్నముగా నున్నదనుట! యేమిచమత్కారము!!

7va


 

అంతలోనే మేలుకు వచ్చింది మల్లికకు ఏమిటి ఇది అంతా కలా కృష్ణదేవరాయలు కలలోవచ్చినట్లు తెలిసింది.మదన తాపముతో ఉన్నట్లు ఎవ్వరికి తెలియ కుండా జాగర్త పడాలని అనుకున్నది మల్లిక, ఎన్నివిన్న ఏమి చేయలేనట్లు, పెదవి విప్పక, చూపులలో తమకము కనబడ నీయక, నిశ్చెష్టురాలై తన్ను ఆవహించిన మేఘపు కొండలను అదుపు చేసుకొనుచు,ఆవహించిన మోహపు ఆలోచనలను తరిమి, మనస్సును తేలిక పరుచుకొని, కడుపునిండా నీరు త్రాగి, చల్లటి నీరుతొ మోఖముకడుక్కొని, నెమ్మదిగా నిద్రకు చేరింది. అప్పడే తల్లి అడుగు పెడుతూ, ఏమిటి ఇంకా నిద్ర పోలేద, ఏమోనమ్మ నాకు పిచ్చి కలలు వస్తున్నాయి, నాకు నిద్ర రావటము లేదు. అసలు ప్రేమ అంటే ఏమిటమ్మ నాకు చెప్పవా. చేపుతానమ్మ ప్రేమగురించి కధలు కధలుగా నాకు తెలిసివి చెపుతాను ఈరొజుకొన్ని మరొకరోజు మరిన్ని చెపుతానులే, నిద్రసరి పోకపోతే కళ్ళు వాచి పోతాయి, ముఖ వర్చస్సు తగ్గుతుంది అది మాత్రం తెలుసుకో సరే చేపుతానువిను అంటూ మొదలు పెట్టింది తల్లి           
మల్లికా నా పెళ్లికి  ముందు ఒక ప్రేమ లేఖ వచ్చింది, అది ఇప్పటికి బద్రంగా దాచుకున్నాను, కొన్ని సంవస్చరాలు దాటినా మరవలేకున్నాను, వ్రాసిన వారెవరో నాకు ఇంతకూ తెలియలేదు, అది తీసుకొచ్చి చూపిస్తాను, ఆ ఉత్తరములో ప్రేమ అంత  కుమ్మరించి అద్బుతముగా సాహిత్యాన్ని వలక పోసాడు.
" ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి దేవుని కందిన పువ్వులా ఉన్నావు, ఎప్పుడో కలలో పురుడు పోసుకొని వికసించిన చిత్రంలా ఉన్నావు, కనుచూపు ఆవల నీడ, నీలో ఉన్న నీడతో ఏకమై, నీడలా ఉన్నావు, ఏనాడో గాలి శృతి చేసి గంధర్వగానంలా, నీ కంట స్వరముతో మధురమైన గానంతో పిలుస్తున్నావు, చెందమామ కధలో దేవతా స్త్రీ లా ఆకాశములో ఎగేరే గుఱ్ఱము మీద రాజకుమారిలాగా విహరిస్తూ నన్ను కలవటానికి ప్రయత్నిమ్చావు. వెంటాడుతూ, వెంబడిన్తూ, నీ చుట్టూ ప్రదక్షణం చెస్తూ, నీకు కన బడ కుండా వలపు తలపులు తెనీయలను అందించాలని ఆశ తో ఉన్న ఒక ప్రేమికుడ్ని నేను".          
నాలో జవ జీవాలు నింపి, శాస్త్ర విజ్ఞానాన్ని పెంచి, ఆణువణువూ నీకోసం ప్రేమను నింపి, నా బాహు బంధాలలో నీకు సుఖము అందించాలని  నా మనసు నంతా రంగరించి ఒక ప్రేమికుడిగా నీకు తెలియపరుస్తున్నాను.
చిమ్మ చీకటిలో అజ్ఞానముతో నిండిన నామనసుకు వెలుగును పంచే కాంతి రేఖవు నీవు, కమ్ము కున్న మేఘాలను చిలికి నాపై జిరుజల్లు కురిపించుటకు వచ్చే గాలివై నామనసును చల్లగా తడిపే జల్లువు నీవు, నిరంతరమూ అంతరంగాలను అర్ధం చేసుకుంటూ, సుఖదు:ఖాలను సమానముగా చూస్తూ కదిలే తరంగిణివి నీవు, అలుపెరగని, అంతరాత్మలను అర్ధం చేసుకొని క్షోభ పెట్టకుండా, ఆనంద పారవశ్యంతో, సంసారానికి చుక్కానిగా, పరిమళాలను అందించి, నాకు జతగా  ఉంటావని నేను నిన్ను ప్రెమిస్తూ వ్రాస్తున్న ప్రేమ లేఖ.


వెన్నెల చీర కట్టి, వర్ణాలన్నీ కలగలిపి మనసకు నచ్చే రంగును చూపిస్తా, ఆకర్నాంతం ఆకర్షించే విధముగా, మనసు ఉల్లాస పరిచే విధముగా, మెరుపుల తలపుల్ని చల్లారు పరుస్తా.
రివ్వు రివ్వున ఎగిరి కురులను చూపి, పెదాల పరిమాళాలిని అందిస్తా, నీలో ఊరే జలాలను ఊరించి, నగవులతో నాట్యమాడించి, అధరామృతమును అందించి, ఆకలి తగ్గిస్తా.
ప్రకృతిలో ప్రకృతినై, మనసులో మనసునై, కలలో నాయికనై, ఆకృతినై  ఆకాశాన్నిసంతృప్తి పరుస్తా, సుకృతినై సురసౌఖ్యాలు  అందిస్తా, శుక్ర నీతుల భోధనలతో సుఖాలు అందిస్తా .
సీతాకోక చిలుకల్లో చిలకనై, నెమల్లలో నెమలినై, పువ్వులలో పువ్వునై, ఆకాశంలో విహరించే క్రౌంచ పక్షినై, యేతత్ భావాలను అనుకరించి, అనుభవాన్ని రంగరించి ఆనంద పరుస్తా, నా భావనలో రామాయణంలో సీతలా ఉండాలని ఉన్నది
                                                                                                                   
సీత అంత దు:ఖములో కూడా నామనసు రాముని వద్ద ఉన్నది, ఈ రాక్షసులు ఏమిచేసినా నన్ను మార్చ లేరు, అట్లే రాముడు కూడా పూలను, కన్నె పిల్లలను చూడ కుండా నీ ధ్యానంతో ఉన్నట్లు రామాయణము తెలుపుతున్నది. అదే నాకు ఆదర్శం ఆ సీతవు నీవని తలుస్తూ నీ ప్రేమ నాకే దక్కాలని ఆసిస్తూ వ్రాసుకున్న ప్రేమ ఉత్తరము,......................

......................... ఇట్లు నీ ప్రేమ పిపాసి x
8va bhaagamu
                            అమ్మా ఆ ఉత్తరం చూసి మీ ఇంట్లో వారు ఏమన్నారా, నాన్నకు తెలుసా , మీ నాన్నకు ఇప్పటికి చూపలేదు, ఉండ బట్ట లేక ఈ ఉత్తరము బయట పెట్టాను అని అన్న మాటలకు మల్లిక సంతోషించి మల్లికా ఉత్తరం మరొక్క సారి చదివింది.
అమ్మ నీ పెళ్లి విషయాలు చెప్పలేదు, ఇప్పు డెందుకే అప్పటి విషయాలు, మరి ఆ ఉత్తరము వ్రాసిన మహాను భావుడు ఎవరో కనుక్కోవటానికి ప్రయత్నం చేయలేదా, చేయలేదు ఎందుకంటే మా పెళ్లి అనుకోని విధముగా చరిగింది. 
అమ్మ నీ పెళ్లి విషయాల గురించి చెప్పవా ఎందుకు చెప్పనే ముందు చెడిపొయిన మెసెజ్ పెళ్లి గురించి విను తరువాత మా పెళ్లి గురించి చెప్పుతా, మా అమ్మ ఏంతో మంచిది అంటూ కుర్చీలాక్కొని కూర్చున్నది . కాఫితేనా, వద్దమ్మా కాఫిలాంటి కధ చేపుతానన్నావు చెప్పు, నేనే 2నిముషాల్లో కాఫీ కలుపుకొనివస్తా అని లోపలి వెళ్ళింది మల్లికా, అప్పుడే వేడి వేడి కాఫి తెచ్చి అమ్మకు కప్పులో ఇచ్చి, తను వేరొక కప్పుతో త్రాగుతూ కూర్చున్నది, ఇక చెప్పమ్మా, కాఫీ ఇచ్చావుగా త్రాగి చెపుతానులే., ఎందుకో ఈ కాలం పిల్లలకు తొందరా అంటూ కధ మొదలు పెట్టింది సరస్వతి. 

image not displayed
    
  బ్రహ్మా నందం అని అన్నందుకు నీకు కోపం వచ్చి ఉండవచ్చు , ఎందుకంటే మీ నాన్నను పేరు పెట్టి  పిలుస్తున్నాను కదా, ఎందు కంటే మా పెళ్లి చాలా విచిత్రముగా, అనుకోకుండా జరిగింది, దానికి మూలకారణం, అప్పుడే వస్తున్నా సెల్ ఫోన్ మహత్యం, మీ నాన్న గారు మాష్టర్ డిగ్రి తర్వాత పి. హెచ్. డి. పొందిన మనిపూస,  యాడాదిగా తెలుగు టీచర్ గా పని చేస్తున్నాడు, మీ నాన్న గారి తల్లి తండ్రులు చిన్నప్పుడు  దత్తత ఇచ్చి వేసారు, అప్పటి నుంచి పెంచు కున్న వారి ఇంటిలో పెరిగాడు, పెళ్లి వయసు ఉన్నందు, స్వయాన తండ్రి తగ్గర ఉండి పెళ్లి చేయ నిశ్చఇంచారు. అనేక పెళ్లి సంభందాలు చూసారు, ఏ పిల్ల నచ్చ లేదు, కారణం కొందరు అబ్బాయి నచ్చ లేదని, మరి కొందరు టీచర్ అని తక్కువగా మాట్లాడారు, ఇరువురు తల్లి తండ్రులు ఏంతో పట్టుదలతో పెళ్లి సంభంధాలు చూస్తున్నరు.
 

మావయ్యగారు (మీ నాన్న గారినాన్న) నా ఫోటో తీసుకొచ్చి చూపిస్తూ, ముక్తి సరిగా  అమ్మాయి బాగుండటంవల్ల నీకు సరిజోడని భావించా, నా మాట కాదనవని అమ్మాయ ఫోటో ఇందు  ఉంచా, మీ అమ్మకు నచ్చిందని వివాహము నిశ్చఇంచా, నా మాట కాదన వని పెళ్లి లగ్నం కూడా  పెట్టించా, అని మీనాన్నకు ఫోటో ఇచ్చి చెప్పాడు,  అమ్మాయి ఫోటో చూసి మెసేజ్ ద్వారా అభిప్రాయాలు, తెలుసుకోవాలని ఉంటే తెలుసుకో, పెళ్ళంటే నూరెళ్ళ పంట,  అని గట్టిగా చెప్పారు.

మీనాన్నగారు ఉండ బట్ట లేక చేక చేక మేసేజే చేసారు,               
నీవు నిర్మోహమాటమగా నేను నచ్చకపోతే చెప్పవచ్చు, పెద్దలు నిర్ణ యించారని నీవు తలవంచ నక్కరలేదు, నీ అభిప్రాయము నిర్భయముగా చెప్పవచ్చు, నా భిప్రాయమును కూడా ఇందు పొందు పరుస్తున్నాను, ఏమిటంటే 


ఫోటోను చూసి పెల్లిచూపులు లేకుండా వప్పుకున్నావా, పెద్దలు అన్నారని మనసు చంపుకొని   తల వంచావా, నా రంగు కాకి కన్నా నలుపు నీకు తెలిసి వప్పుకున్నావా, నీ ఇష్టానికి వ్యతరేకంగా వత్తిడి చేయను వద్దంటే పెళ్లి ఆపుతా అని అభిప్రాయము తెలియపరిచారు మోదటగా  .... 


 దానికి సమాధానముగా నేను నా అభిప్రాయము మెసేజ్ ద్వారా తెలిపాను 

ఏమని తెలిపావమ్మ అని అడిగింది మల్లికా

మీ వ్యక్తిత్వం,నిజాయితీ మెచ్చి నాను, నేను మిమ్మల్ని నమ్మి, నేను  మిమ్ము మోస గించకుండా నా అలవాట్లను ముందుగా చెపుతున్నాను, తరువాత మన సంసారములో కలతలు రాకూడదు.  నా రంగు కూడ నలుపే, (దొండ పండు రంగు అని ఆశ పడి ఉంటారు) రంగులు దిద్దిన ఫోటోను మా ఇంట్లోవారు మీకు పంపారన్న విషయం నాకు తెలిసింది.        నాఛాయ నలుపు, కాకులు రెండుకలిసిన నల్ల కాకి పుట్టి నట్లు, మనం కలువుట అంత మంచిది కాదు, మీకు ఎన్నో ఇష్టాలు, అభిప్రాయాలు ఉండవచ్చు, అవి త్యాగం చేయ నవసరము లేదు, ఇంట్లో వాళ్ళు వత్తిడి బాగా చేసారు, మీకు ఉద్యోగం ఉందని నేను తలవంచాను, నా విషయాలు చెప్పాను,  ఒక్క సారి ఆలోచించడి నలుపు నలుపు ఎరుపుగా మారదు అది గమనించండి,     మీకు ఇష్టం లేకపోతె వద్దని చెప్పండి
అని మెసేజ్ చేశాను మల్లికా

నా మెసేజ్ చూసి అందమైన భార్యను  పొందాలనుకున్నా, కాని అది తెలివి తక్కువ పని అని ఇప్పుడు గ్రహించా, అందం కన్నా గుణం ఉంటె బాగుండునని అనుకున్నా, నలుపు అనేది కాదు,  భర్త ప్రతిష్టను పెంచేదిగాను,భర్త మనసు తృప్తి పరిచి సుఖపడేదిగా ఉంటే  చాలునని ఊహించాను, అందులో ఎక్కువ మంది నల్లటి వారే కలసి మెలసి బ్రతుకట లేదా నాకు ఎటువంటి అనుమానము లేదు, నలుపు గురించి ఇక నీవు మర్చి పోవచ్చు, కాని నేను ముఖ్యముగా వ్రాయునది,

 నేను అధికముగా దూమపానము చేస్తాను, నీకు ముద్దు ఇవ్వవచ్చా, వాసనను భరిమ్చలేక, నన్ను మానమంటే మానలేను, ఈ దుర్వాసన మొగుడు అనికోపంలో కూడా అనికోవద్దు ముందుగా చెపుతున్నా నీకు,  పెళ్లి వద్దని చెప్పొచ్చు నాలో ఉన్న చెడ్డ గుణాలను  చెప్పుచున్నాను,నా ఊహల పల్లకిని ఇందు పొందు పరుస్తున్నాను 
నీ చిత్రాన్నిచూసి నా శృంగార భావాలను ఇందు పొందు పరుస్తున్నాను
చదివాక ఇంత ప్రేమ పిచ్చోడని మాత్రము అనుకోవద్దు ఇది నా ఉహా భావాలుమాత్రమే
 అని మీ నాన్న గారి నుండి మెసేజ్ వచ్చిందమ్మా.
ఏమిటమ్మ ఆ ఊహలు తొందరెందుకు నువ్వే చూడు 
 అని మీ నాన్న గారి నుండి మెసేజ్ వచ్చిందమ్మా.


9వ  భాగము
మ. మ . త  (పెద్దలకు మాత్రమే )
మనసు మనసు తరుణామృతం   - శృంగార సాహిత్య వచన కావ్యం

నీలో నేనూ..నాలో నువ్వూ.. కలయకతో 
మనసుల్ని పెనవేసే మమతల లతలతో
ఒకరి కొకరం స్వప్నించిన మధుర క్షణాలతో ..
నా మనసులో రేపే నిశ్శబ్ధ ఏకాంతాలు 

నిండుపున్నమి పండువెన్నెలతో
జాలువారు జల తుంపరులతో
గాలికి జారు పారి జాత పూలతో
నా మనుసు లో రేపే గిలిగింతలు

పూలకదలిక మధుర పరిమళాలతో
కోయిల మధుర గాన ఆలాపనలతో
విలాసంగా వీచే చల్లని పిల్లగాలుతో
నా మనసులో రేపే నవసోయగాలు

ప్రకృతి మైమరిపించే ఊహలతో
తనువు తపిమ్పచేసే కోర్కలతో
సరస సంభాషణ పలుకులతో
నామనసులో రేపే సింగారాలు 

మాయను కమ్మిన ప్రేమలతో 
మత్తుకు చిక్కిన నయనములతో 
వలపుకు చిక్కిన చక్కదనములతో
నామనసులో రేపే చుంబన తాపాలు
   
అదుపు తప్పకుండా యద కోరికలతో
పదము తప్పక మధుర మాటలతో
చిరునవ్వుల చిద్వి లాసము లతో
నామనసులో రేపే విరహ తాపాలు
ఆణువణువూ ప్రేమాగ్ని సెగలతో
స్వప్న సౌధాల పుత్తడి వెన్నెలతో
ఎర్రగులాబీలు వెదజల్లే పరిమళాలతో
నామనసు నీకోసం ఖాలిగా ఉంచాను    

   అని కవితను వ్రాసి  పంపాడు దానిని చూసి నేను కూడా నా అభిప్రాయముతో పాటు ఒక చిన్న కవితను వ్రాసాను

సిగరెట్టు త్రాగినా  ఏమను కోను, పొగాకు వాసనకు అలవాటు పడ్డ దాణ్ని, ఎందుకంటే మా యింట్లో అన్నలు త్రాగుతారు, అది పెద్ద తప్పు అని నేను అనుకోను, అది మీ బలహీనత అనుకుంటాను, నాకు చేతనైతే మార్చుకోవటానికి ప్రయత్నిస్తా, లేదంటే నోరుమూసుకొని మీకు సేవచేస్తా, కాని నేను చెప్పే విషయాలుమీరు గమనించాలి, ఆధునిక పరికరాలు ఏమివచ్చినా, కొత్త చీరలు ఏమి వచ్చినా నేను కొనే అలవాటు  ఉన్నది, అవి కొనే స్తోమత మీకు ఉన్నదా, ఇల్లంతా  వస్తువలని, ఇన్ని చీరలు ఎందుకని కోపంలో కూడా అనరుకదా,
 డబ్బులు లేవని పిసినారిగా మారుతారా, లేక ఇంత  ఖర్చు అని వేదిస్తారా, ముందుగా మీకు మెసేజ్ ద్వారా తెలుపు తున్నాను మీ అభిప్రాయము చెప్పండి. 
నా ప్రేమ గీతానికి నీ అభిప్రాయము కూడా చెప్పండి



(సుఖం )

వలపు తలుపుల వయసుంది 
మల్లెల అల్లికల చిక్కుంది
కళల మాలికల మత్తుంది
నరాల నడకలు మార్చావా

వణికే వలపుల చలి ఉంది
కులుకు కలువల కసి ఉంది
పలుకు పెదవుల రుచి ఉంది
వరాల తపనలు తీర్చవా

ఆకలి ఆరాటాల ఆశ ఉంది
రోకలి పోరాటాల మత్తు ఉంది
వెకిలి చేష్టల గమ్మతు ఉంది
గారాల హృదయం మార్చవా 

కురుల కదలిక పిలుపు ఉంది
ఫలాలు చెదరక వత్తిడి ఉంది
పెదాలు తడవక తపన ఉంది
స్వరాల రాగాలు గుర్తించావా

చెరకు తినీయల తీపి ఉంది
పడచు పరువాల పక్క ఉంది
వయసు మురిపాల సిరి ఉంది
కలల కోరికలు స్వయంగా తీర్చవా
--((*))--


నీ కవిత నా మనసు తపింప చేసింది నా భిప్రయముతో పాటు ఒక కవిత వ్రాస్తాను
వెంటనే మెసేజ్ వచ్చింది,  ఖర్చులకు వెను కాడను, ఆధునిక అభిప్రాయాలున్న స్త్రీని గౌరవించే వాడ్ని, నీ ఇష్టాలకు నేను ఎప్పుడు అడ్డు చెప్పను, నీ అభిప్రాయాన్ని నేను ఎకీభవిస్తున్నాను, ఎందు కంటే నీవు చేసే ఖర్చు అంతా నాకోసమే కదా, నీకోసం కాదు కదా, నీ ఉద్దేశ్యము చెప్పినందుకు సంతోషం, నేను  కుడా నీకు ఒక విషయం చెప్పాలనుకున్నా, నీవు ఏమి అనుకోవని నీకు తెలుపు తున్నాను. 
నా  మనసులో ఉన్న కోర్కలను కవితా రూపంలో శృంగార వర్ణను కొంత కలిపి వ్రాసి పంపుతున్నాను అంటూ ముగించాడు మీ నాన్న గారు . 

వెంటనే మీ నాన్న గారు కూడా ఒక కవిత వ్రాసి పంపారు అది చదువుకొని నవ్వటమే తప్ప ఏమి చేయ లేక పోయాను
(సుఖం )
గమత్తు కోరిక తీర్చుకోవాలిని ఉన్నది
నిన్ను ఎత్తుకొని హాత్తు కోవాలని ఉన్నది
హత్తు కొని వళ్ళంతా చిత్తు చేయాలని ఉంది
నాకు పైకముంది, నిన్ను పోషించే శక్తి ఉంది

ఎత్తుకొని వత్తు కుంటే జిల్ గా ఉంటుంది 
మనసు మెప్పించి హత్తు కుంటే జిల్ జిల్ గా ఉంటుంది 
నిస్సత్తు వదిలించి, శక్తి నింపితే మజాగా ఉంటుంది 
కొత్త కొత్త ఆశలను తీరుస్తే, తనువూ పులకిస్తుంది 

వలపందించి వయసు మలుపులు చూపిస్తా
మనసిచ్చి మనసు కోరికలు తీరుస్తా
సహాయ సహాకారంతో నిన్ను మెప్పిస్తా
జతకూడిన తర్వాత భావాలు ఇంకా చెప్తా

ఇంతటితో ముగిస్తున్నాను,

 నా పాత ప్రేమికురాలగురించి చెపుతున్నాను   
ఇంకా ఉన్నది

10 వ  భాగము

image not displayed 
 నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆమె నన్ను ఎంతో ప్రేమించింది, నేను లేనిదే తను జీవించ లేనని నా వెంట తిరిగింది, నన్ను పెళ్లి చేసుకోమని వత్తిడి చేసింది, అది నిజమైన ప్రేమనుకున్నాను, అందులో కపట ప్రేమ దాగుందని నేను అనుకోలేదు, నా ప్రేమను తిరస్కరించి వెళ్లి పోయింది, ఆ అమ్మాయిని మరవని  ప్రేమికున్ని,  నిద్రపట్టక క్లబ్బులవెంట తిరుగుతున్నాను,  నీకు ఇష్టం లేకపోతె పెళ్లి వద్దని చెప్పు అని వ్రాసారు అమ్మ  మీ నాన్న గారు. 

మీ నాన్న గారి మీద నాకు ప్రేమ ఇంకా పెరిగింది, నిజాయితిగా తన విషయాలు చెప్పారు, నా విషయాలు కూడా నేను తెలిపాను. 
 

మీరు క్లబ్బుల వెంట తిరిగిన మీశీలమ్ చేడదని నాకు తెలుసు, కాని నేనోకర్ని ప్రేమించా డబ్బు, హోదా ఉన్న అందగాడు వినయ్ నాచుట్టు తిరిగి పెళ్లి అంటే ఆలోచించా, పార్కుల వెంట, సినామాలకు వద్దన్నా ఇంట్లో వారికి తెలియకుండా సంచారించా, ఆ వయసులో ఏమి చేసానో నాకు తెలియలేదు, వినయ్ పెద్దలకు భయపడి పెళ్లి ఇప్పుడొద్దు, అన్నారు తల్లి తండ్రులను అనుమతితో పెళ్లి చేసు కుంటాను అని చెప్పాడు, ఇంత వరకూ రాలేదు కారణం ఉద్యోగరీత్యా అమెరికాకు పోవటమే మా మద్య సంభాషణలు తగ్గాయి, తగ్గటం కాదు ఇప్పుడు అసలు లేవు, ఎప్పుడొస్తాడో మరి నాకు తెలియదు ఆ విషయాన్ని ముందుగా మీ నాన్న గారికి చెప్పాను, మీకు ఇష్టము లేకపోతే, నా  సీలము పదిలంగా యున్నది అది మాత్రము నిజం,  ప్రేమలో పడ్డాను  తప్ప ఏమీ తప్పు చేయలేదు, నందం అని ఏకవచనముగా మాట్లాడినందుకు కోపంతెచ్చుకోకు, నా పరిస్థితి అర్ధం చేసుకోగలవు, నేను నిన్ను చేసుకోలేను, ఎందు కనగా
వినయ్ వచ్చి లేచి పోదామని చెప్పగా వప్పు కున్నాను
మన పెళ్లి కి ముందుగా మా పెళ్లి నిర్ణ ఇంచు కున్నాము, నన్నుక్షమించు నీకు ఎన్నో అవకాసులు ఇచ్చాను, నన్ను మరచి   అయిన నన్ను          
నా మెసేజ్ ల ద్వారా మిమ్ము ఇబ్బంది పెట్టితే క్షమించుము
అని మెసేజ్ చేసాను .
  మీ సంభందం  నాకు ఇష్టం లేదని అమ్మాయి తిరుగుడు నాకు నచ్చ లేదని చెప్పి పెళ్లి వద్దని చెప్పుగలరు అని మెసేజ్ పంపినాను.


అమ్మా అది నిజమా మీ ప్రేమ అంత దాకా వచ్చిందా, నీకు  అంత  ధైర్యము ఉన్నదా, ఇప్పుడు ఎప్పుడు భయము వ్యక్తం చేస్తావు, ప్రేమ అంటే అసలు తెలియని దానిలా ఉంటావు, ప్రేమించుకొనే వారిని చూస్తె మండి  పడతావు, ఇది తప్పు కదా అమ్మా, అవునే అప్పుడు నన్ను అజమాయిషి  చేసేవారు లేరు, నామీద ప్రేమ అంత ఎక్కువ మా తల్లి తండ్రులకు ఆ వయసులో అలా ప్రవర్తించా నేను చేసినది తప్పని ఎవ్వరు చెప్పలేదు, మా అమ్మ ఒక్కటే చెప్పింది "అరిటాకు వెళ్లి ముళ్ళు మీద పడ్డ, ముళ్ళు వచ్చి అరిటాకు పడ్డ అరిటాకుకే బొక్క పడు తుంది " అది అర్ధం చేసుకొని నీ ప్రవర్తన మార్చుకో అన్నది. మా నాన్న గారైతే " మగవారు అందరూ మూర్ఖులు అనుకోకు వారిలో కొందరు పుణ్య మూర్త్లులు  ఉంటారు,  నీ అదృష్టం కొద్ది నిన్ను ప్రేమించేవాడు మంచివాడో చెడ్డవాడో ముందు గమనించు, వాడి తల్లి తండ్రుల వివరాలు, స్నేహితుల వివరాలు సేకరించి అవి సమంజసము అనుకుంటే అప్పుడు నీ ప్రేమ మొదలు పెట్టు అంత కన్నా ఒక్క అడుగు ముందుకు వేసిన అందరూ అడదానినే అంటారు అది గమనించి నీ ప్రవర్తన మార్చుకుంటే మంచిది, ప్రేమ ఒకరితో పెళ్లి ఒకరితో నాతకమాదుట కష్టం, ఈ అబ్బాయిని చేసుకుంటానని చెపుతున్నావు, ఆ అబ్బాయిని పెళ్ళికి  రమ్మన మన్టున్నావు, నీ ధైర్యము ఏమిటో నాకు అర్ధం కావటం లేదు,  నా శక్తి కొద్ది, నాకు నచ్చిన వాడ్ని, నీకూ నచ్చినవాడ్ని మాత్రమే నీకు వివాహము చేస్తాను, మమ్ము తప్పు పట్టకు ప్రేమ  ప్రవర్తన మార్చుకోకపోతే కష్టపడేది నీవే  అది మాత్రం కుర్తించుకో, ఇంతకన్నా నేను చెప్పేది ఎమీలేదు, అయినా మగవాళ్ళ లక్షణాలు నీకు వినిపిస్తా విను వారి లక్షణాలు తెలియపరుస్తా అని చెప్పటం మొదలు పెట్టాడే మానాన్న. 
 ----------------------
11వ  భాగము

1.పతి, భర్త , మొగుడు, : తల్లి తండ్రుల అనుమతితో, పెద్దల ఆసీర్వాద బలముతో, బ్రాహ్మ నోత్తముడు లగ్నం నిర్ణ యించి, భాజా భజంత్రిల మద్య, చుట్టాలు, ఇరుగు పొరుగు వారు దీవెనలతో, వివాహ మహోస్చవము, కళ్యాణ మండపములో దేవతల దీవెనలతో, అమ్మ లక్కల అసీర్వాద పోట్లాటల సర్దుబాటల మద్య అంగరంగ వైభవముగా, వధువు మెడలో మంగళసూత్రం కట్టి తనదానిగా చేసుకొనేవాడు. ఆ మండపములో విరబోసిన కురులతో, విరజాజుల వంటి కన్నెపిల్లలు చంగు చంగుణ ఎగురుతూ జింక పిల్లల్లాగా తిరుగుతూ, పెద్ద పెద్ద హారములు ధరించి, పట్టు చీరలు ధరించిన నారీమణులు, (వధూవరుల మద్య తలంబ్రాల సంఘటన చెప్పుకోతగ్గది, ఇది నువ్వా నేనా అనేవిధముగా ఉంటుంది.    కాల క్షేపం కధలు చెప్పుతూ ముసలివారు, అది లేడి ఇది లేదు అని అరిచేవారి మధ్య భార్యా భర్తలుగా మారారు.               

2. అనుకూలుడు : వివాహము అయిన తరవాత తల ఎత్తి పరస్త్రీ ని చూడడు పెళ్ళాం చెప్పినట్లు నడుచుకొనేవాడు. మనకున్న సామెతే ఒకటి (పట్టు చీర కొనిపెట్టి పీట పట్టుకు తిరిగేవాడు), పెళ్ళాం కొంగు పట్టుకుని తిరిగేవాడు. పెళ్ళాం కూర్చోమంటే కూర్చొనేవాడు, పడుకోమంటే పడుకోనేవాడు, బట్టలుతక మంటే ఉతికేవాడు, గిన్నెలు తోమి, ఇళ్ళు ఊడ్చి, పక్కసర్ది, వంట చేసి, పెళ్ళాం కు పెట్టి తను తినేవాడు. వీడిని ఆడంగి అంటారు, సంసారం మాత్రము చేస్తాడు .

3. దక్షినుడు : యితడు వివాహము చేసుకుంటాడు, పెళ్ళాన్ని ప్రేమగా చూస్తాడు కాని స్త్రీల అందరిని మంచిగా పలకరిస్తాడు, కొత్త అందాలకోసం స్త్రీల వెంబడ పడు తుంటాడు. నాయికులందరిని, సమానంగా, స్వాభావికంగా, అందరిని ప్రేమించే నేర్పు కలవాడు. ఇది ఒకరకంగా కట్టుకున్న స్త్రీకి ఈర్శ్య పుట్టుట సహజం, మొగునిపై అనుమానం పెరగటం సూటి  పోటి మాటాలు రావాటం, కాపురంలో కలహాలు పెరగడం సంసారం మాత్రము చేస్తాడు. పరస్త్రీలను చూసి ఇంటికి తగాదాలు తెస్తాడు ఇటువంటి వాని యందు ఉండే భార్య చాలా ఓపిక కలిగి ఉండాలి, అనుమానించక బర్తను గౌరవించుతూ  ఉంటె, గౌరవం పెరుగు తుంది.

4..దృష్టుడు : మాటి మాటికి అపరాధం చేసి, నాయకి చేత ధిక్కరించబడి, వినయం అభినయించు వాడు.  దీనినే నక్క బుద్ది అంటారు, చెప్పేది శ్రీరంగ నీతులు, దూరేది దొమ్మర గుడిసెలు అంటారు.  వద్దన్నా పని ఎక్కువ చేస్తాడు, చేసి బతిమాలుతాడు, ఇంకెప్పుడు చేయనని వినయంగా మాట్లాడుతాడు. భుద్దిమంతుడిలా, చెవిలో పూలు పెట్టుకొని, దేవుని చుట్టూ ప్రదక్షణలు, చేసి ఒట్టు పెత్తుఇకొని మరీ చెపుతాడు. మరునాడు యధావిధి ఉంటాడు మారాడు. తనకవసరము వచ్చినప్పుడు కాళ్ళు పట్టు కుంటాడు.

5. సటుడు: స్త్రీల విషయంలో కపటం చేసేవాడు, ముక్కు పచ్చలారని, ప్రేమ అంటే ఎమీ తెలియని వారికి ప్రేమ ముచ్చట్లు తెలిపి లేని పోనీ ఆశలు చూపి, శృంగార విషయాలు తెలిపి, నమ్మించి సమస్తము దోచి, నట్టేతులో ముంచే వాడు
ఉప పతి : సదాచారానికి భంగ కరంగా ప్రవర్తించేవాడు, సదాచారంగా చేసేది శివ పూజలు, ప్రవృత్తి పరంగా చేసేది హత్యలు దోపిడీలు  , మానభంగాలు ఇటు వంటి వాడు భర్తగా ఉన్నా నిత్యాగ్నిహోత్రున్ని ప్రక్కన పెట్టుకున్నట్లే, త్రాచుపామును పక్కనున్చుకున్నట్లే, అటువంటి స్త్రీకి నిత్యమూ నరకము, ధనాన్ని చూసి సుఖాన్ని వదులుకోవటం తప్ప ఎమీ చేయలేదు.
వైశికుడు: వేశ్యా సంభోగములకు ఎక్కువ ఆసక్తి చూపువాడు, నిత్యమూ కొత్త దానం కోసం ఆరాట పడేవాడు, ధనమంతా పోయి దరిద్రుడుగా మారిన తన అలవాట్లు మార్చుకోలేనివాడు, పెళ్ళాం నగలు కూడా తీసికేల్లివేస్యకిచ్చేవాడు, చివరిన ఆదరించేవారు లేక, రోగాలతో మునిగేవాడు, పెళ్ళాం విసికి వేసారి వదిలేసి పోయినా బుద్ది రానివాడు.
మాని : నాయికపై ఆగ్రహిచు వాడు, ఏమాట అన్న తప్పు పట్టేవాడు, ఏమాట అనకపోయినా తప్పు పట్టేవాడు,ముక్కోపి,  కుందేలుకు మూడే కాళ్ళు అని వాదించేవాడు అడ్డు చెప్పిన కోపంతో అరిచేవాడు, లోకజ్ఞానం మీకేం తెలుసు అంటూ పెళ్ళాం నోరు ఎత్తకుండా అరిచి తనపని చేయించుకొని బ్రతికేవాడు.

6. వాక్చాతురుడు : సంభోగాభిలాషను మాటలలో చూపువాడు                     

7. చేస్టా చతురుడు : వాంఛను చేష్టలలో సూచించే వాడు. యితడు చేతులు త్రిప్పుతూ కళ్ళల్లో కైపును చూపిస్తాడు.
మర్మావయాలు స్పర్సతో ఉడికిస్తాడు. మదన తాపాన్ని రెచ్చ గోడతాడు. ఆనంద పర్వసంలో ముంచి సర్వం దోచుకొని తృప్తి పరచి సంతృప్తి చెందేవాడు.

8. ప్రోషిత పతి : నాయికను వదలి దేశాంతరము తిరుగు వాడు. యితడు మొదటి నుండి శృంగారం అంటే భయం ఆవహించి ఉన్నవాడు, స్త్రీని త్రుప్తిఒ పరచలేక, తను సంసారము చేయలేక భయముతో పెళ్ళాన్నే వదలి వెళ్ళేవాడు, ఇటువంటి వారు పెళ్లి చేసుకొని వేరొకరిని భాదపెట్టుట అవసరమా, సృష్టి కి పనికి రానివాడు జీవించుట వ్యర్ధము కాదు పెళ్లి చేసుకొనుట వ్యర్ధం

9. నాయికా భాసుడు : నాయిక యొక్క భావము గ్రహించని వాడు. ఇటువంటివారు దేశంలో చాలా మంది ఉన్నారు, వీరు స్త్రీని గౌరవించకుండా చీటికీ మాటికి స్త్రీని అనుమానిస్తూ, అవమానిస్తూ  ఉంటారు. స్త్రీ చెప్పే మాటలు అసలు పట్టించుకోరు, నేను మొగవాడ్ని అని అహం ఎక్కువగా ఉంటుది వీరిలో, భార్యమాటేను వినక తనమాటే నెగ్గాలని భావించేవాడు యితడు.

10. పీటమర్ధుడు: యితడు నాయకుని మిత్రుడు. అలిగిన నాయిక అలుక తీర్చువాడు. నాయకుడు నాయకని ఎప్పుడు భాదపెడు తున్నప్పుడు మిత్రుడుగా తనవంతు సహాయము చేయువాడు, సంసారానికి సహకారము అందించువాడు, నాయకని లొంగదీసుకొని తృప్తి పరచి గుప్తముగా వ్యవహారము జరుపువాడు.

11. విటుడు : నాయకుని స్నేహితుడు, కామశాస్త్రము భోధించు వాడు. జిహ్వ చాపల్యంతో తను గ్రహ్రించక, గ్రంధ వేశేష ములను మిత్రునికి చెప్పి మనిషిని చెడు మార్గములో తిప్పు వాడు, దానం కోసం ఆడవారిని అంగాంగ వర్ణణ  చేసి ఆనందించేవాడు, ఇటువంటి వాడు స్నేహితుడైతే మాత్రము తక్షణం అతన్ని వదిలించుకొనే మార్గాన్ని ఎన్నుకోవాలి, అతని మాటలకు లొంగారంటే జిఇవిటాలే నాశనము అవుతాయి.

12. చేటుడు : నాయకా, నాయకి సంధాన కర్త, భార్య భార్తల మద్య ఉన్నవి లేనివి చెప్పి మనస్పర్ధలు కల్పించి సంతోషించేవాడు, అనుమానాలు పెట్టుకొని విడిపోయిన వారిని ధనం కోసం కలిపేవాడు.

13. విధూషకుడు : అవయవాది వికారాలతో ప్రసంగాలతో నవ్వించేవాడు. కష్టాల్లో ఉన్నవారిని, దిగులుగా ఉన్నవారిని, భయముతో ఉన్నవారిని, చిన్న పిల్లాల్ను నవ్వించేవాడు, తన విచారాన్ని బయట పెట్టకుండా ఎప్పుదూ నవ్వుతూ ఉంటాడు.
 మగవాడి లక్షణాలు ఇంకా ఉన్నాయి, సమయం వచ్చినప్పుడు చెపుతా ను ఇంతటితో ముగిస్తున్నాను .  
                    ఇంకా ఉన్నది







అమ్మా నీ ప్రేమ కధ వింటుంటే నాకు నీ వెనుక ఇంత పెద్ద కధ ఉన్నదా అమ్మా ఇంకా చెప్పు, నీవు ప్రేమించిన పవన్ విషయాలు చెప్పలేదు, నాన్న బ్రహ్మానందం ఎప్పుడు నిన్ను పెళ్లి చుసుకున్నాడో మరి చెప్పలేదు, మీ న్నా గారిని అమ్మగారిని బాధ పెట్టకుండా పెళ్లి చేసుకున్నవా అన్నివివరాలు తెలుపమ్మా అని అడిగింది మల్లిక. 
అంట తొంద రెందుకే నీకు, ఆప్పటి విషయాలుఇప్పుడు ఎందుకు, అయినా తెలుసుకో నేను తెలియపరుస్తా. 
మల్లిక అప్పడు   

పొడుపు కథలు!

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - విజ్ఞాన ప్రభ

సర్వేజనా సుఖినోభవంతు

ప్రాంజలి ప్రభ 
* పొడుపు కథలు!
1* కాటుక రంగు, కమలం హంగు, 

విప్పిన పొంగు, ముడిచిన కుంగు
ఏమిటది?


(జవాబు : గొడుగు)

2* రెక్కలు లేవు కానీ ఎగురుతుంది.

 కాళ్లు లేవు, కానీ ముందుకు వెళ్తుంది,.
చివరకు మాయమవుతుంది ఏమిటది?


(జవాబు : మేఘం)
ప్రాంజలి ప్రభ 
* పొడుపు కథలు!-2

1* కదలకుండానే నదిని దాటగలదు? ఏమిటది?
(జవాబు : వంతెన)

2* ముందుకూ వెనక్కూ తప్ప పక్కలకు కదలదు. ఏమిటది?
(జవాబు : తలుపు)

3* గుడ్డ కింద దాగున్న దొంగకు నాలుగు కాళ్లు. ఎవరది?
(జవాబు : టేబుల్)



* చెట్టంతా చేదుమయం, రోగాలకు దివ్య ఔషదం, పుల్ల చేయు దంతదావనం ఏమిటది?
(జవాబు : వేపచెట్టు)

* నల్ల కుక్కకు నాలుగు చెవులు? ఏమిటది?
(జవాబు : లవంగం)

* పొట్టలో వేలు, నెత్తి మీద రాయి?ఏమిటది?
(జవాబు : ఉంగరం)

* సన్నని స్తంభం, ఎక్కలేరు, దిగలేరు?ఏమిటది?
(జవాబు : సూది)

* ఆకాశంలో కెగిరినా పక్షి కాదు, తోక కలిగిఉన్నా మేక కాదు, తాడు ఉన్నా ఎద్దు కాదు, ఏమిటది?
(జవాబు : గాలిపటం)

* వేసే వేసే జీలకర్రా, మొలిచే మొలిచే మూలకా కూర, పూసే పూసే బొండు మల్లే, వేసే వేసే వింత గెలరా, కాసే కాసే కామంచీ. ఏమిటది?
(జవాబు : అరటి)

* నల్లని చేనులో తెల్లటి దారి? ఏమిటది?
(జవాబు : తల్లో పాపిడి)

* దూడ అక్కడనే ఉండు, ఆవు పోతావుండు? ఏమిటది?
(జవాబు : గుమ్మడికాయ తీగ )

* జవ్వాది రాయంగా, పునుగు పూయింగా, మందగిరి పర్వతాలలో నీరు తాగి, మశాలకు వేసుకొని పడుకుంది. ఏమిటది?

((జవాబు : దివిటి)
* రెక్కలు గల మా చక్కని భామలు, నిక్కముగా అసలెగురలేదు, నీరంటే అడ్డమే లేదు. ఏమిటది?
(జవాబు : పడవ)
.
* అగ్గి అగ్గీ ఛాయ, అమ్మ కుంకుమ ఛాయ, బొగ్గు బొగ్గు ఛాయ, పోలి ఛాయ కంది పప్పు ఛాయ, కాలనేమి ఛాయ, కడసారి తాతయ్య కణతి ఛాయ. ఏమిటది?
(జవాబు : గురిగింజ)
* అమ్మ కడుపున పడ్డాను, అంతా సుఖాన ఉన్నాను, నీచే దెబ్బలు తిన్నాను, నిలువునా ఎండి పోయాను, నిప్పుల గుండు తొక్కాను,గుప్పెడు బూడిద అయినాను. ఏమిటది?
(జవాబు : పిడక)
* అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మాఇంటికొచ్చింది, మహాలక్ష్మి లాగుంది. ఏమిటది?
 (జవాబు : గడప)

* అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది. ఏమిటది?
 (జవాబు : చల్ల కవ్వం)
* అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు, కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు,  అన్ని పువ్వుల్లో రెండే కాయలు. ఏమిటవి?
(జవాబు : ఆకాశం, చుక్కలు, సూర్యుడు)

* బుర్రు బుర్రు మనచును ... రోడ్డు పైన నడచును....... ఏమిటది?
 (జవాబు : స్కూటర్)

* కుర్రు కుర్రు మనచును ......... చెట్టుపైకి ఎగురును .......... ఏమిటది?
 ( జవాబు : కోతి)
* తుర్రు తుర్రు మనచును ...... అంబరానికెగురును....... ఏమిటది?
(జవాబు : పక్షి)
* అంబ అంబా అని అరుచును తల్లి వెంట తిరుగును .....ఏమిటది ?
(జవాబు : తువ్వాయి (ఆవుదూడ))

* మీట నొక్కినంతనే ......... టక్కుమని వెలుగును ...... ఏమిటది?
(జవాబు : బల్బు)

* చుట్ల చుట్ల గోడ మీద నూరు నిమ్మపండ్లు పుట్టె, రాజులంత తలవంచిరి. ఏమిటది?
 (జవాబు : మొక్కజొన్నకంకి)

* ఒక చెట్టు, చెట్టుకు నాలుగు కొమ్మలు, కొమ్మకు రెండు కాయలు. ఏమిటవి?
( జవాబు : సూర్యుడు, చంద్రుడు)

* కావాలంటే పెద్ద చేసి చూపిస్తా సూర్యున్ని చిన్నగా చేస్తా మంటలు మండిస్తా. ఏమిటది?
(జవాబు : భూతద్దం)

* పన్నెండాకుల చక్రం పదే పదే తిరుగుతుంది తిరిగి తిరిగి ఆ రోజున అక్కడికే తిరుగొస్తుంది. ఏమిటది?
(జవాబు : సంవత్సరాది)

* వెలుతురులో నీతోటే ఉంటుంది.చీకటిలో తప్పించుకు పోతుంది. ఏమిటది?
 (జవాబు : నీడ)

* నారూ నీరూ అక్కరలేదు ఎంత కత్తిరిస్తున్నా ఎదుగుతునే ఉంటుంది.
(జవాబు : జుట్టు)

* ఇంటింటికి ప్రవహిస్తూ వస్తుంది, పనులెన్నో చేస్తుంది, ప్రమోదకారి, ప్రమాదకారి. ఎవరది?
 (జవాబు : విద్యుత్)


Tuesday, 17 May 2016

పరిపూర్ణ మానవుడు శ్రీరాముడు

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - సేకరణ ప్రభ 

మంచిని గ్రహించు - అందరికి భోధించు
సర్వేజనా సుఖినోభవంతు 


శ్రీమహాగణాధిపతయేనమః
పరిపూర్ణ మానవుడు శ్రీరాముడు
రచన: రాయపెద్ది అప్పాశేషశాస్త్రి,
రిటైర్డ్ ప్రిన్సిపాల్, ఆదోని



లీలా నాటక సూత్రధారి, జగదానందకారకుడైన శ్రీ మహావిష్ణువు ధర్మసంరక్షణార్థము, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థము అనేక అవతారాలు ధరించాడు. సనకసనందనాదుల శాపానికి గురి అయిన జయ విజయులు మూడు జన్మలలో శ్రీ మహావిష్ణువు శత్రువులుగాజన్మించి, అతని చేతిలోనే మరణించి శీఘ్రంగా వైకుంఠప్రాప్తిని పొందాలని కోరగా శ్రీ మహావిష్ణువు వారిని తథాస్తు అని అనుగ్రహిస్తాడు. అలా శాప కారణంగా హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులుగా, రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంత వక్త్రులుగా జన్మించిన తన సద్భక్తులను అనుగ్రహించడానికి వచ్చిన అవతారాలు వరాహావతారం, నరసింహావతారం, శ్రీరామావతారం, శ్రీకృష్ణావతారాలు. హిరణ్యాక్ష వధ, హిరణ్యకశ్యపుని వధ కొరకే అవతరించినవి వరాహావతారం, నరసింహావతారాలు.


శిశుపాల దంత వక్త్రుల వధానంతరం కూడా సుదీర్ఘ కాలం పృథ్వి పైన జీవించి సద్గురువుగా గీతోపదేశం చేసిన అవతారం శ్రీకృష్ణావతారం. విచిత్రం ఏమిటంటే శ్రీకృష్ణావతారంలో జననం నుంచీ మరణం వరకూ తాను మానవరూపం ధరించిన భగవంతుడిని అన్న విషయాన్ని ఎక్కడా దాచకుండా భగవత్ స్వరూపముగానే ప్రవర్తించి అవతార పరిసమాప్తి చేస్తాడు శ్రీకృష్ణుడు.

అలాగే రావణ కుంభకర్ణుల వధానంతరం కూడా సుదీర్ఘకాలం పృథ్వి పైన జీవించి మానవాళికి జీవనమార్గాన్నీ, ఆదర్శ జీవన విధానాన్ని తన జీవితమే ఉదాహరణంగా దర్శింపజేసిన అవతారం శ్రీరామావతారం. కానీ అద్భుతమైన, ఆదర్శవంతమైన గుణాలు కల రాముడు ఎక్కడా తాను భగవంతుడనని చెప్పుకోలేదు. ఇతరులు ఎవరైనా నీవు భగవంతుడివి అన్నా "ఆత్మానం మానుషం మన్యే" - నేను సాధారణ మానవుడిని అని నిక్కంగా పలుకుతాడు. తాను భగవదవతారం అన్న విషయం ఎక్కడా తనకు తెలిసినట్లుగా ప్రవర్తించకుండా, మానవునిగానే జీవితకాలమంతా సంచరించడం శ్రీరామావతారంలో చెప్పుకోదగిన విశేషంగా మనకు గోచరిస్తుంది. దానికి కారణమూ స్పష్టంగానే కనిపిస్తుంది. బ్రహ్మ ఇచ్చిన వరాలబలం వల్ల రావణ వధ దేవ, దానవ, యక్ష, సిద్ధ,సాధ్య, కిన్నెర, కింపురుషాదులు ఎవరికీ సాధ్యం కాని పని. నర వానరుల పట్ల రావణునికి ఉన్న తేలికభావం కారణంగా వారిచేతిలోమరణం లేకుండా ఉండాలని వరంలో భాగంగా బ్రహ్మను కోరనూలేదు, బ్రహ్మ ఇవ్వనూ లేదు. అందువల్ల నరుడుగా జన్మించి, నరుడుగా వ్యవహరించినపుడు మాత్రమే శీమహావిష్ణువుకైనా రావణుని చంపడం సాధ్యమౌతుంది. ఇందుకొరకు వానరరూపంలో జన్మించిన దేవతాగణాల సహాయం తీసుకొని రావణుని వధించవలసి వచ్చింది. మామూలుగా ఐతే రావణ సంహారంతో కథ ముగిసిపోయి అవతార పరిసమాప్తి జరగాలి కదా, కానీ అలా జరగలేదు. దశరథుని పుత్రకామేష్టి యాగానికి వచ్చిన దేవతలకు ప్రత్యక్షమైన శ్రీ మహావిష్ణువు, తాను దశరథాత్మజునిగా జన్మించి "దశవర్ష సహస్రాణి, దశవర్ష శతానిచ" అనగా పదకొండువేల సంవత్సరాలు మానవునిగా జీవిస్తానని ప్రకటిస్తాడు. ఇలా ఎందుకు చేయవలసి వచ్చింది అన్న అంశాన్ని సమగ్రంగా పరిశీలించాలి. ఒక పరిపూర్ణ మానవుడు, ఒక ఆదర్శమానవుడు ఎలా ప్రవర్తించాలి? నరుల పట్ల ఉన్న తేలికభావం తొలగించాలన్నా, ఆదర్శ మానవసంబంధాలు, ఆదర్శ కుటుంబ సంబంధాలు ఎలా ఉండాలి అన్న విషయాన్ని నా జీవితమే నా సందేశం అన్నట్లుగా జీవించి చూపాలన్నా ఇది అవసరం అవుతుంది. అలా జీవించి చూపిన అవతారమే శ్రీరామావతారం.
అందుకే
"యావత్ స్థాశ్యంతి గిరయః సరితశ్చ మహీతలే!
 తావద్రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతే!!"

పర్వతాలు, నదులు ఈ భూమిపై ఉన్నంత కాలం రామ కథ నిలిచి ఉంటుంది. అని బ్రహ్మ అంటాడు. ఏనాడో త్రేతాయుగంలో జరిగిన గాధ ఈ నాటికీ కలియుగంలో కూడాసజీవంగా, చైతన్యవంతంగా ఉండటానికి ఇదే కారణం. మానవసంబంధాలు గతి తప్పి, వికృత, విశృంఖల ప్రవర్తన వెర్రితలలు వేస్తున్న ఈ రోజుల్లో మనిషి మనిషిలా ఎలా జీవించాలన్న విషయాన్ని తెలుసుకోవడానికి శ్రీరాముని జీవితాన్నిఅధ్యయనం చేయవలిసిన అవసరం మునుపటికంటే చాలా ఎక్కువగాఉంది. ఈరోజుల్లోనే, రామ కథాశ్రవణం, రాముని గుణగణాల అధ్యయనం, రాముని అనుసరించే ప్రయత్నం చేయడం ఎక్కువ అవసరం. రాముడిని దేవుడిగా కొలవడం ముమ్మాటికీ తప్పు కాదు. కానీ రాముడిని దేవుడిగా ఆరాధిస్తూనే, రాముడిజీవితంనుంచీ మనం ఎలా జీవించాలి అన్న అంశాన్ని నేర్చుకోవడం అంతకంటే ముఖ్యం రామాయణ రచనా ప్రారంభంలోనే వాల్మీకి మహర్షి తన ఆశ్రమానికి వచ్చిన బ్రహ్మ మానస పుత్రుడైన నారదమహర్షిని అడిగిన ప్రశ్నను పరిశీద్దాము. వాల్మీకి మహర్షి నారదుడిని ఏమడిగాడంటె................

కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ | 
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ధృఢవ్రతః ||

 
చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః |

విద్వాన్ కః, కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ||

 
ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కః అనసూయకః |

కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే ||

ఈ లోకంలొ ఇప్పుడే, ఇక్కడే ఉన్న గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞత భావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, ధృడమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రము కలిగినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్ధుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలొ మంచిని చూసేవాడు, ఎవరి కోపం దేవతలను కూడ భయపెడుతుందో అట్టివ్యక్తి ఉంటె నాకు చెప్పండి అని అడిగాడు. అనేక సంవత్సరాల తపస్సుతో తన జీవితాన్ని పండించుకొన్న వాల్మీకి మహర్షిలో జాగృతమైన బ్రహ్మజిఙ్ఞాసే ఈ ప్రశ్న అన్నదిఇందులో ఉన్న నిగూఢార్థం ,


ఇందులో వాల్మీకి మహర్షి నారదులవారిని షోడశ గుణాత్మకమైన భగవత్ తత్వాన్ని గురించి ప్రశ్నించగా నారదుడు ఈ లక్షణాలన్నీ నరరూపంలో భూమిపై నడయాడుతున్న నారాయణుడైన శ్రీరామునివేనని వివరిస్తాడు. అలా ఈ లక్షణాలు పరిపూర్ణ మానవుని లక్షణాలుగా కూడా స్వీకరించదగినవి. చాలా చిన్నకారణాలకే కుంగిపోయి నిస్పృహకు గురయ్యే నేటి తరం శ్రీరాముని వద్ద నేర్చుకోవలసిన అతి గొప్ప లక్షణం స్థిత ప్రఙ్ఞత్వం. ఈ రోజు ఉదయం తండ్రి పిలిచి "రామా రేపే నీ పట్టాభిషేకం నీవు, నీ భార్య అవసరమైన దీక్షను చేపట్టండి" అన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండిపోయాడో ఆరోజే రాత్రి కైకేయి పిలిపించి, రామా! మీ నాన్న చెప్పలేకపోతున్నారు. నీవు అంగీకరిస్తావో లేదో అని భయపడుతున్నారు. నీకు పట్టాభిషేకం చేయడంలేదు, రేపటినుంచీ నీవు జటాధారివై, మునివృత్తి స్వీకరించి 14 సంవత్సరాలపాటు వనవాసం చేయాలి అని చెప్పినపుడూ అంతే సహజంగా నిర్వికారంగా స్వీకరించాడు. తల్లి పైన గానీ తండ్రి పైన గానీ ఆవేశపడిపోయి, తల్లితండ్రులను శాపనార్థాలు పెట్టకుండా ఉండడమే కాక, ఆవేశపడుతున్న లక్ష్మణుడిని మందలించి అరణ్యవాసానికి చాలా హాయిగా సిద్ధపడిపోయాడు. అంతకంటే పెద్దకష్టాలా మనకు వచ్చినవి అని ఆలోచించగలిగితే డిప్రెషన్ కు తేలికగా గురవుతున్న నేటియువతరంలో చాలా మార్పు వస్తుంది.

దేశభక్తి మాతృభక్తి కూడా రామునిచూసి నేర్చుకోవాలి. రావణసంహారం తరువాత లంకా నగరంలో సంచరిస్తూ లంకా నగర సౌందర్యానికి ముగ్ధుడైన లక్ష్మణునితో రాముడన్న మాటలను ఒక్క సారి గమనిద్దాం: "అపి స్వర్ణమయీ లంకా నమే లక్ష్మణ రోచతే, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ" బంగారంతో నిండినదైనా నాకు లంకానగరం రుచించదు లక్ష్మణా, జననీ జన్మభూములు స్వర్గంకంటే గొప్పవి అన్నమాటలు రాముని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఇంతకుమించిన దేశభక్తి, జాతీయతాభావన మరెక్కడ కనిపిస్తాయి?

కృతఙ్ఞతా గుణం మానవునికి వుండవలసిన ఉత్తమగుణాలలో ప్రధానమైనది. ఈ గుణం రామునిలోపుష్కలంగా దర్శనమిస్తుంది. పరిస్థితుల ప్రభావం వల్ల తండ్రికి దహనసంస్కారం కూడా చేయలోకపోతాడు రాముడు. తనభార్య సీతను రక్షించడంకోసం రావణునితో పోరాడి కొసప్రాణాలతో మిగిలి ఉన్న జటాయువు పట్ల కృతఙ్ఞతాభావంతో రాముడు. జటాయువుకు అంత్యక్రియలు నిర్వహిస్తాడు. ఇదీ కృతఙ్ఞతా గుణం అంటే. మనకు ఏ చిన్న ఉపకారం చేసినవారిని కూడా మరచిపోకుండా వారికి అవసరమైనపుడు ప్రతిసహాయంచేయగలిగే సంస్కారం రాముని దగ్గరే నేర్చుకోవాలి.
మనలను ఆశ్రయించి శరణు కోరిన వారిని పరిత్యజించకుండా శరణు ప్రసాదించడాన్ని వ్రతంగా కొనసాగించినవాడు రాముడు. చంపదగినట్టి శత్రువు రావణుని సోదరుడైన విభీషణుడు తనను శరణు కోరి అర్థించినపుడు, (హనుమంతుడు తప్ప మిగిలిన) వానర ప్రముఖులు అనుమానించినా, ఎట్లాంటి సంశయం లేకుండా అతనికి శరణు ప్రసాదించి, రావణుడే కోరినా శరణమిస్తానని అంటాడు. ఈ మాటలు రాముడు తప్పించి ఇంకొకరు పలకలేరేమో. అందుకే "శరణాగత త్రాణ బిరుదాంకితుడవు" అని కీర్తిస్తాడు రామదాసు.

ఒక పాలకుడుగా ప్రజారంజకమైన పాలన అందివ్వడమే కాదు. ప్రజలకు తాను ఆదర్శంగా నిలవగలగాలి. ఉత్తముడైన పాలకుని లక్షణం అది. ఎందుకంటే "యద్యదాచరతి శ్రేష్ఠః , తత్తదేవేతరో జనాః" అని కదా గీతా వాక్యం. శ్రేష్ఠుడైన వాడెలా ప్రవర్తిస్తాడో, అతనిని నమూనా(మాడెల్) గా తీసుకొని ఇతరులూ అలాగేప్రవర్తిస్తారని గీతచార్యుని భావం. కనుక పాలకుడైన వాడు తనలో చిన్న మచ్చకూడా లేకుండా జాగ్రత్త పడాలి. నా వ్యక్తిగత జీవితం, నా ఇష్టం అనడానికి పాలకునికి హక్కు లేదు. ప్రజా పాలకుని జీవితం తెరిచిన పుస్తకంగా ఉండాలి. అందుకే తను రావణ వధానంతరం సీతను చేపట్టడాన్ని గురించి విమర్శ రాగానే, ఆమెను పరిత్యజించడానికి సిద్ధపడతాడు. రాముడు కేవలం సీతారాముడే కాదు రాజా రాముడు కూడా. తన మీద విమర్శలు వెల్లువెత్తుతున్నా, ప్రజలు చీదరించుకొంటున్నా, నీ చేష్ఠలు భరించలేకుండా ఉన్నాం, దిగిపోవయ్యా మహానుభావాఅని ప్రజలు నెత్తీ నోరూ మొత్తుకొంటున్నా కుర్చీని పట్టుకొని వేలాడుతున్న నేటి రాజకీయ నాయకులు రాముని చూచి నేర్చుకోవాలసినది ఎంతైనా ఉంది.

క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం అని చెపుతడు భర్తృహరి. ఇతర ఆభరణాలన్నీ నశించిపోయేవే శాశ్వతమైన భూషణం వాగ్భూషణమే అని దీని భావం. వాక్కు భావ ప్రకటనాసామర్థ్యానికి ప్రధానమైన సాధనం. ఆధునిక వ్యక్తిత్వ వికాస నిపుణులు కమ్యూనికేషన్ స్కిల్స్ గాపేర్కొనే ఈ సామర్థ్యం రాముని సహజ లక్షణము. శ్రీరాముడిని ‘వచస్విగా, ‘వాగ్మి’(చక్కని వక్త)గా వాల్మీకి వర్ణించాడు. రామచంద్రుడు మృదుభాషి, మితభాషి, మధురభాషి, పూర్వభాషి, స్మితపూర్వభాషి అని ప్రశంసించాడు. తానే ముందుగా పలకరించడం, నెమ్మదిగా, ప్రశాంతంగా ఆవేశానికి లోను కాకుండా మాట్లాడగలగడం రాముని ప్రధాన లక్షణాలు. రాముడు పూర్వభాషి మాత్రమే కాదు. బంగారానికి తావి అబ్బినట్టు, స్మిత పూర్వభాషి కూడా. ముందు చిరునవ్వుతో పలకరించి, తరువాత మధురమైన మాటలతో మనసు చల్లబరచేవాడు. మితభాషిత్వం, సత్యభాషిత్వం, చిరునవ్వుతో సంభాషించడం ఇవన్నీ మనకందరికీ అనుసరణీయాలూ, ఆచరణీయాలు కూడా. అంతేకాదు. కొద్ద్ది నిముషాలు ఎదుటివ్యక్తితో మాట్లాడగానే అతని వ్యక్తిత్వాన్నీ, సామర్థ్యాన్నీ అంచనా వేయగలిగే సామర్థ్యం కూడా రాముని సొత్తు. కిష్కింధకాండలో హనుమంతుదు రాముని తొలిసారిగా యతి వేషంలో కలిసి రామునితో పరిచయవాక్యాలుగా నాలుగు మాటలు మాట్లాడుతాడు. సహజంగా తానే వాగ్మి ఐన రాముడు హనుమన్ంతుని సామర్థ్యాన్ని గురించి ఖచ్చితమైన అంచనా వేస్తాడు. ఈ వ్యక్తి వేదవేత్త అనీ, వ్యాకరణ నిపుణుడనీ, మాట్లాడే సమయంలోఇతని శరీర భంగిమలూ(బాడీ లాంగ్వేజ్) మాట్లాడే విధానమూ ఇతనిని ఒక అసాధారణ ప్రతిభాసంపన్నుడిగా తెలియచేస్తున్నాయని అంటాడు. ఇట్టి మంత్రివర్యుని కలిగిన రాజుకు అసాధ్యమైనది ఉండదనీ లక్ష్మణునితో చెబుతాడు రాముడు. దీన్నిబట్టే రాముని సూక్ష్మబుద్ధి ఎలాంటిదో తెలుసుకోవచ్చు.

రాముని సోదర ప్రేమ, సోదరుల పట్ల అతనికి ఉన్న తాపత్రయం వారి పట్ల అతనికి ఉన్న విశ్వాసం అసాధారణమైనవి. అరణ్యవాసం ప్రారంభంలో జరిగిన ఒక చిన్న సంఘటన ఇక్కడ చెప్పుకోవాలి. రాముని మరలా రాజ్యానికి తీసుకు వెళ్ళి రాజ్యభిషేకం చేయడానికి భరతుడు సైన్యంతో సహా బయలుదేరాడు. దూరంనుంచీ సైన్యసమేతంగావస్తున్న భరతుని చూచి మనలను చంపి రాజ్యాధికారాన్ని శాశ్వతం చేసుకోవడానికి భరతుడు వస్తున్నాడు.అతడిని నేను తుదముట్టిస్తానని ఆవేశపడతాడు లక్ష్మణుడు. అప్పుడు రాముడు భరతుని సోదరప్రేమనూ, తనపట్ల అతనికి ఉన్న భక్తి భావాన్ని లక్ష్మణునికి వివరిస్తాడు. వ్యక్తుల పట్ల లోతైన అవగాహనతో కూడిన రాముని వ్యక్తిత్వం అచ్చెరువు కొలుపుతుంది. గుహుని రాముడు ఆదరించిన విధానం, శబరిని రాముడు అనుగ్రహించిన తీరు అతనిని తర తమ భేదాలను పాటించని ఒక మహోన్నత పురుషోత్తమునిగా మనముందు నిలుపుతాయి.

తండ్రి నేరుగా అడవులకు వెళ్ళమని చెప్పలేదు, మీదు మిక్కిలి వెళ్ళవద్దని బతిమాలుతున్నాడు. ఐనా తండ్రి ఏనాడో ఇచ్చిన మాట వ్యర్థం కారాదనీ తద్వారా తండ్రికి అసత్యదోషం అంటరాదన్న రాముని తపన ఎంత విశేషమైనది. తండ్రి మరణించాక అతని అప్పులతో మాకు సంబంధం లేదు ఏం చేసుకొంటారో చేసుకొండి అని అప్పులవాళ్ళను బుకాయిస్తున్న నేటి సంతానం రామునినుంచి ఎంత నేర్చుకోవాలి. తల్లితండ్రులను అనాథాశ్రమాలలో చేర్చి వదలించుకొనే ప్రయత్నాలు చేయడం, ఆస్తిపాస్తులకోసం అవసరమైతే తల్లితండ్రులనూ, సోదరులనూ తుదముట్టించడానికి వెనుకాడని నేటి యువత రాముని పితృప్రేమనుంచీ, సోదరప్రేమనుంచీ ఎన్ని గుణపాఠాలనునేర్చుకోవాలి? రామకథ ఈ నాటి సమాజానికి కూడా గురుస్థానంలో నిలుపుకోవలసిన మహాకావ్యమే, రాముడు నేటికీ మనకు మార్గదర్శకుడే.
ఒక మంచి సోదరుడు, ఒక మంచికుమారుడు, ఒకమంచి పాలకుడు, ఒక మంచి మిత్రుడు,ఒక మంచి శిష్యుడు, ఒకమంచి నాయకుడు, అసమాన వీరుడు ఇలా ఎన్నో ఉత్తమ పార్శ్వాలు దర్శనమిస్తాయి. మాధవుడే మానవునిగా జన్మించి, పరిపూర్ణమానవునిగా, మానవాళికి వెలుగుచూపే దారిదివ్వె. నాటికీ, నేటికీ, ఏనాటికీ రాముని శీలసంపద, గుణసంపత్తి, అగాధమైన అమృతసాగరం. సర్వకాలాలకూ, సర్వదేశాలకూ ఒక దీపస్తంభం రాముని వ్యక్తిత్వం. జన్మతః రాక్షసుడైనారామబాణ స్పర్శతో విశేషమైన పరివర్తనకు లోనైన మారీచుడు రాముని వ్యక్తిత్వాన్నీ, దివ్యత్వాన్నీ సంపూర్ణంగా అవగాహన చేసుకొన్న ధన్యజీవి. అతని మాటల్లోనే రాముని గురించిన ఏకవాక్య సమగ్ర వివరణ రామో విగ్రహవాణ్ ధర్మః.
మూర్తీభవించిన ధర్మమే రాముడు.
జైశ్రీరాం- ఓం శ్రీరాం - ఓం శ్రీ సీతా రామాంజనేయ నమ:
ఇంతటి మహోదాత్తమైన విశ్లేషణ మనతో పంచుకున్న శ్రీ Ras Sastry గారికి కృతజ్ఞతాభివందనములు అర్పించటమే మనము వారికి చేయగల సత్కారము.

Friday, 13 May 2016

వైకుంఠ ఏకాదశి,శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ జయంతి

ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 



చెడు అనకు - చెడు వినకు - చెడు కనకు 
సర్వేజనా సుఖినోభవంతు 

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ జయంతి
http://www.vipravanam.com/
ఓం కుసుమ పుత్రీచ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవీ ప్రచోదయాత్‌
ఉపోద్ఘాతం- చరిత్ర
స్త్రీలోని ఆత్మీయతకు,అనురాగానికి, సౌమ్యానికి, త్యాగగుణానికి, పవిత్రతకు నిలువెత్తు నిదర్శనం ‘వాసవీ కన్యకా పరమేశ్వరి’. సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితామృత గ్రంధ ఆధారంగా వాసవి కన్యకాంబ శ్రీపాద శ్రీ వల్లభుల సహోదరి. 10వ, 11వ శతాబ్ధానికి చెందిన కుసుమశ్రేష్ఠి-కుసుమాంబ (కౌసుంబి) దంపతుల గారాల బిడ్డ,పుణ్యాల పంట వాసవాంబ. కుసుమ శ్రేష్ఠి వేంగి దేశంలోని ‘వసాల్‌’ ప్రాంతాన్ని పాలించేవాడు. కుసుమ శ్రేష్ఠిని ఆ రోజులలో అంతా పెద్ద శ్రేష్ఠి (ఈ శ్రేష్ఠి పదం కాల క్రమేణా శెట్టి గా రూపాంతరం చెందింది) అని పిలిచే వారు. ప్రజలంతా ఎంతగానో గౌరవించేవారు. ‘వసాల్‌’ దేశంలో పుట్టింది కనుక ఆమె ‘వాసవి’ అయింది. కన్యారాశిలో పుట్టింది కనుక ‘కన్యక’ అయింది. వాసవి అమ్మను పూజించే వారిని శ్రేష్ఠులు అంటారు. ఈ పదమే వ్యవహారంలో శెట్టి అయింది. ఈ శ్రేష్ఠులు గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉండి గోవును పూజించేవారు. గోదావరిని స్థానికులు గోమతి అని పిలుస్తారు అదేవిధంగా గోమాతను కుడా ‘గోమతి అని స్థానికంగా వ్యవహరిస్తారు’. ఈ పేరే ‘గోమ్టి’ గా మారింది. గోవును పూజించే గోమతి తీర వాసులు కనుక వీరిని ‘గోమట్లు’ అని పిలిచేవారు. ఈ పేరే వ్యవహారంలో ‘కోమట్లు’ గా మారింది.
శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి చరితామృతం
శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి గోమతీ లేదా ఆర్యవైశ్య కులస్తులకు కులదేవత. ఈ కులస్తులు శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి జననం నకు ముందు గోమాతను పూజించుట వల్ల వీరికి గోమతి అను పేరు వచ్చింది. శ్రీ పాద శ్రీ వల్లభుడు గో ప్రియుడు.బహుశా ఈ కారణం వల్లే ఆర్యవైశ్య కులస్తులంటే వారికి అబిమానం మెండు. అయితే మద్రాసు ప్రెసిడెన్సీకి చెందిన వైస్రాయి 1921 మరియు 1931 మధ్య కాలంలో ఒక కమీషన్ వేసారు . దాని ప్రకారం ప్రతి కులానికి తమ పేర్లలో కోరిన మార్పులు రిజిస్టర్ చేసుకునే వెసులుబాటు కల్పించబడింది. దానిని అనుసరించి అందరూ గోమతీ కులస్తులు గల వైశ్య అసోసియేషన్ (1905 లో స్థాపించబడినది) వారు తమ పేరును ‘గోమతీ’ నుండి “ఆర్యవైశ్య” గా మార్చుకున్నారు.
ఆర్య అంటే గొప్ప వంశస్థుడు, గౌరవింపతగినవాడు అని అర్ధం. క్రీ.శ. 10, 11వ శతాబ్ధాల తరువాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్య వైశ్యుల కులదేవత గా ఏర్పడ్డారు.
శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి జననం
వేంగి దేశాన్ని ఏలే కుసుమశ్రేష్టి వైశ్యులకు రాజు. ఈ ప్రాంతం విష్ణువర్ధనుడు (విమలాదిత్య మహారాజు) అనే చక్రవర్తి ఆధీనంలో ఉండేది. క్రీ.శ. 10, 11వ శతాబ్ధాలలో కుసుమశ్రేష్టి సుమారు 18 పరగణాలను జ్యేష్టశైలం/బృహత్శిలానగరం (పెనుగొండ) ను రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉండేవాడు. కుసుమశ్రేష్టి, ఆయన భార్య కుసుమాంబ ఆదర్శ దంపతులుగా మెలిగి ప్రశాంతమైన జీవనం గడిపేవారు. నగరేశ్వరస్వామి (శివుడు) ఆరాధన వారి దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండేది. వివాహం అయిన చాల సంవత్సరాలకి కూడా ఆ దంపతులకి సంతానం కలుగలేదు. రాజ్యానికి వారసులు లేరని వారు చింతిచేవారు. ఎన్ని ప్రార్ధనలు చేసినా, నోములు నోచినా వారి కోరిక తీరలేదు. అపుడు వారు తమ కుల గురువు అయిన భాస్కరాచార్యులను సంప్రదించగా, వారికి దశరధుడు చేసిన పుత్ర కామేష్టి యాగాన్ని చేయమని చెప్పారు. అంతట ఒక పవిత్ర కాలంలో వారు ఆ యాగాన్ని తలపెట్టారు. దేవతలు అనుగ్రహించి యజ్ఞ ఫలాన్ని ప్రసాదించి, దాన్ని ఆరగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు. భక్తి,శ్రధలతో దాన్ని ఆరగించిన కొన్ని దినాలకే కుసుమాంబ గర్భవతి అయినది. ఆమె గర్భవతిగా ఉండగా అనేక అసాధారణ కోరికలు వ్యక్తపరిచేది. ఇది ఆమె భవిష్యత్తులో జనుల బాగోగుల కోసం పాటుపడే ఉత్తమ సంతానానికి జన్మనిస్తుంది అనుటకు సంకేతం.
వసంత కాలంలో సర్వత్రా ఆనందాలు నెలకొన్న వేళ వైశాఖ శుద్ధ దశమి,శుక్రవారం ఉత్తర నక్షత్రం,కన్య రాశిలో కుసుమాంబ కవల పిల్లలకి జన్మ ఇచ్చింది. వారిలో ఒకరు ఆడ పిల్ల,మరొకరు మగ పిల్లవాడు. అబ్బాయికి విరుపాక్షుడు అని అమ్మాయికి వాసవాంబిక అని నామకరణం చేసారు. బాల్యం నుండి విరూపాక్షుడు భావి రాజుకు కావల్సిన అన్ని లక్షణాలను చూపేవాడు. వాసవి అన్ని కళలలోను ఆరితేరి, సంగీతం మరియు తర్క శాస్త్రాలలో మక్కువ చూపేది.
భాస్కరాచార్యుల శిక్షణలో విరూపాక్షుడు వేదాలని అభ్యసించాదు. గుర్రపు స్వారి, విలువిద్య, కత్తిసాము మొదలైన యుద్ధవిద్యలను నేర్చుకున్నాడు. వాసవి అన్నికళలను,తర్క శాస్త్రాలను అభ్యసించి తెలివైన అమ్మాయి గా పేరు తెచ్చుకుంది.
సహోదర వివాహక్షణాలు…
విరూపాక్షుడు యుక్త వయసుకి రాగానే ఆలేరుకి చెందిన అరిధిశ్రేష్టి కుమార్తె అయిన రత్నావతిని వివాహం ఆడాడు. వివాహానికి విచ్చేసిన అతిధులందరూ త్వరలో వాసవి వివాహం కూడా ఇంత వైభవంగా జరుగుతుంది అని భావించారు. అంతలో విష్ణువర్ధనుడు తన రాజ్య విస్తరణలో భాగంగా పెనుగొండకి విచ్చేయగా కుశుమశ్రేష్టి ఆ రాజుకి ఆహ్వానం పలుకుతూ గొప్ప ఊరేగింపు ఏర్పాటు చేసి ఘనమైన వేదిక పై సన్మానాన్ని జరిపాడు. అదే రోజు ఆదిపరాశక్తి పూజకు మంగళ వాద్యాలతో వెళ్లుచున్న వాసవిని విష్ణువర్ధనుడు చూసి మోహించి వివాహమాడదలచాడు. కుసుమశ్రేష్ఠికి వర్తమానం పంపాడు. అప్పుడు కుసుమశ్రేష్ఠి వాసవి దివ్య బాలికయని కావున వివాహం సమ్మతం కాదని తెలుపగా ఒక నెల రోజుల వ్యవది నిచ్చి వివాహానికి సమ్మతించనిచో సైన్యంతో యుద్ధం చేసి వాసవిని తీసుకొని పోతానన్నాడు. విష్ణువర్ధుని కోరిక కుశమశ్రేష్టికి శరాఘాతం అయింది. ఆయన తన అంగీకారాన్ని తెలుపలేడు, అలా అని కాదనలేడు. దానికి కారణం ఆ రాజు అప్పటికే వివాహితుడు, వయసులో తన కూతురి కంటే చాల పెద్దవాడు, వారి కులాలలో అంతరం ఉంది. విష్ణువర్ధనుడు క్షత్రియుడు. ఇవి తల్చుకుని ఆయన చాల ఒత్తిడికి లోనయ్యాడు. తన కుటుంబ సభ్యులతోను, స్నేహితులతోను చర్చించగా, అందరూ ఈ విషయంలో నిర్ణయాన్ని వాసవికే వదిలేయమని సలహా ఇచ్చారు. వాసవి తను జీవితాంతం కన్యగా ఉంటానని, ప్రాపంచిక విషయాలతో తనకి సంబంధం వద్దని తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పేసింది.
అనంతర పరిణామాలు…

కుశుమశ్రేష్టి ఈ విషయాన్ని విష్ణువర్ధునుడికి వర్తమానాన్ని పంపాడు. దీనికి విపరీతంగా ఆగ్రహించిన విష్ణువర్ధనుడు తన సైన్యాన్ని పంపి బలవంతంగా అయినా వాసవి ని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ధైర్య సాహసాలు గల వైశ్యులు సామ, దాన, భేద, దండోపాయాలతో ఆ సేనను తిప్పికొట్టారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో కుశుమశ్రేష్టి భాస్కరాచుర్యుల సమక్షంలో 18 నగరాలకి చెందిన 714 గోత్రాలకు చెందిన నాయకులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసాడు. సమావేశంలో భిన్నాభిప్రాయాలు వచాయి. 102 గోత్రాలకు చెందిన ముఖ్యులు పిరికివారు ప్రతి రోజు మరణిస్తారు, పోరాడి మరణిస్తే ఒకేసారి మరణం సంభవిస్తుంది, కాబట్టి పోరాటమే సరైనది అని అభిప్రాయ పడగా, మిగిలిన 612 గోత్రాల వారు మాత్రం విష్ణువర్ధునుడితో పెళ్ళి చేస్తేనే అందరికి మంచిది అని అభిప్రాయ పడ్డారు.
భాస్కరాచార్యులు మన ప్రాణాలు పోయినా సరే మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఈ మాటలు కుశుమశ్రేష్టికి మార్గదర్శక ప్రోత్సాహకాలుగా పని చేసాయి. తన పక్షంలో కేవలం కొంత మంది మాత్రమే ఉన్నప్పటికి, తన కూతురిని విష్ణువర్ధునుడికి ఇచ్చి ఎట్టి పరిస్థితులలోను పెళ్ళి చేయరాదని నిశ్చయానికి వచ్చాడు. ఈ సంఘటనతో వైశ్యుల మధ్య ఐకమత్యం దెబ్బతింది. విష్ణువర్ధనుడు దెబ్బతిన్న పాములా పగపట్టి, తన శత్రువులను తుదముట్టించడానికి, తన సమస్త సేనలను కూడదీసుకుని సంసిద్ధం అయ్యాడు. ఈ పరిణామాన్ని ఎదుర్కోవడానికి పెనుగొండలో ఉన్న 102 గోత్రాలకు సంబంధించిన వైశ్యులు కుశుమశ్రేష్టికి అండగా నిలిచారు. నాటి సమావేశం లో మొదటిసారిగా వాసవాంబిక తన ప్రతిస్పందనను సభాపూర్వకంగా తెలియజేసెను.
వాసవి దేవి ప్రతిస్పందన
వాసవి సభలోకి ప్రవేశించి, అందరిని ఉద్దేశించి ఈ విధంగా అంది- ”నేను వివా హానికి నిరాకరించినట్లయితే విష్ణువర్ధనుడు సైన్యంతో వచ్చి యుద్ధం చేస్తాడు . యుద్ధం వల్ల ఎంతోమంది సైన్యం నశిస్తారు. అపార జననష్టం, ధననష్టం జరుగుతుంది. ఎంతోమంది పునిస్త్రిలు వైధవ్యంతో బాధ పడతారు. తన వల్ల ఇంత రక్తపాతం జరుగకూడదు.ఒక అమ్మాయి కోసం మనం అంతా రక్తం ఎందుకు చిందించాలి? మన స్వార్ధం కోసం సైనికుల జీవితాలని ఎందుకు అర్పించాలి? యుద్ధం అనే ఆలోచనను విరమిద్దాం. దానికి బదులు ఒక కొత్త పద్ధతిలో పోరాడదాం. అహింసా విధానంలో మనల్ని మనం అర్పించుకుందాం . దృడ సంకల్పం, పట్టుదల ఉన్న వారు మాత్రమే ఈ పోరాటంలో పాల్గొనగలరు”. వాసవి చెప్పిన విధానానికి తల్లిదండ్రులు అంగీకరించి ఆమెను అనుసరించడి నడవడానికి నిర్ణయించుకున్నారు.
అమర దీపం అసాధారణ త్యాగం… ఆత్మార్పణ
వాసవి సూచనలను అనుసరించి, ఒకానొక మాఘ శుద్ధ పాడ్యమి రోజు గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం అనే పవిత్ర స్థలంలో రాజబటులు 103 అగ్ని గుండాలను ఏర్పాటు చేసారు. నగరం అంతా ఆ రోజు పండుగ వాతావరణంలో ఉంది. అప్పుడు వాసవి ఆ 102 గోత్రాలకు సంబంధించిన జంటలను ఉద్దేశించి మీరంతా నాతో పాటు మంటలలో దూకడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగితే వారంతా మనస్పూర్తిగా తమ సంసిద్ధతను వ్యక్తం చేసారు. వారు వాసవీ కన్యకాంబని దేవుని అంశగా అనుమానించి, తమకి నిజ రూపాన్ని చూపమని కోరారు. దానికి ఆమె ఆమె నవ్వి తన నిజ స్వరూపాన్ని దేదీప్యమానమైన వెలుగుతో చూపించి నేను ఆది పరాశక్తి ఆర్యమహాదేవి యొక్క అవతరాన్ని అని చెప్పింది. ధర్మాన్ని నిల్పేందుకు, స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు, విష్ణువర్ధునుడిని అంతం చేసేందుకు, వైశ్యుల ఔదార్యాన్ని ప్రపంచానికి చాటేందుకు కలియుగంలో జన్మించానని చెప్పింది. సతీదేవి తనకి జరిగిన అవమానానికి ప్రతిగా చితిమంటల్లో దూకినట్టుగానే నేను కూడా అగ్నిలోకి దూకి పుణ్య లోకాలని చేరుకుంటాను అని చెప్పింది. కుశుమశ్రేష్టి గత జన్మలో సమాధి అనబడే గొప్ప ముని. ఆయన తన 102 గోత్రాలకు చెందిన బంధువులతో సహా మోక్షాన్ని కోరాడు. అందుకే మీ అందరిని కూడా ఆత్మ బలి దానానికి పురి కొల్పాను అని అంది. ఆమె అక్కడ చేరిన వారందరికీ దేశభక్తి, నిజాయితి, సమాజ సేవ, సహనం మొదలగు వాటి గురించి వివరించింది.ఆమె నోటి నుండి పై పవిత్ర వాక్కులు వెలువడగానే దేవి మానవ రూపంలో, తిరిగి వాసవాంబిక రూపంలో ప్రత్యక్షం అయింది. వెంటనే వాసవాంబిక తనకు ఏర్పాటు చేయబడిన అగ్నిగుండంలో దూకి ఆత్మార్పణ కావించుకొనెను.అప్పుడు 102 గోత్రాలకు చెందిన వారు కుడా తమ ఇష్ట దైవాలను తల్చుకుని అగ్నిగుండంలో దూకారు.
విష్ణువర్ధునుడి మరణం
విష్ణువర్ధునుడికి దుశ్శకునాలు ఎదురైనప్పటికి తన సేనతో పెనుగొండ పొలిమేరాల్లో ప్రవేశించాడు. అప్పుడు వేగులు అప్పటి వరకు జరిగిందంతా విష్ణువర్ధునుడికి చెప్పారు. ఆ వార్త విన్నవిష్ణువర్ధనుడు రక్తం కక్కుకుని, తలపగిలి అక్కడికక్కడే మరణించాడు. వాసవి చేసిన ఆత్మత్యాగం, విష్ణువర్ధనుడి మరణం గురించి పట్టణం అంతా మార్మోగిపోయింది. విష్ణువర్ధునుడి చర్యలను ఖండించి, ఒక నూతన శకానికి నాంది పలికిన వాసవి మరియు ఆమె అనుచరులను కొనియాడారు.
అహింసే ముగింపు
ఈ సంఘటన తెలుసుకున్న విష్ణువర్ధనుని కుమారుడు రాజరాజ నరేంద్రుడు హుటాహుటిన పెనుగొండ పట్టణ పొలిమేరలకు చేరుకుని విలపించాడు. ఆ తర్వాత విరూపాక్షుడు వచ్చి అతన్ని ఈ విధంగా ఓదార్చాడు-”సోదరా, గతం నేర్పిన అనుభవాలు పాటంగా భవిష్యత్తును నిర్మించుకుందాం. మహా రక్తపాతం జరగకుండా వాసవాంబిక మన అందరిని రక్షించింది. ఆమె అహింసా సిద్ధాంతం ఉత్తమ ఫలితాలని ఇచ్చింది.” ఆ తర్వాత విరూపాక్షుడు భాస్కరాచార్యులు చెప్పిన విధంగా కాశీ, గయ వంటి అనేక పుణ్య క్షేత్రాలను దర్శించాడు. పెనుగొండ పుణ్య క్షేత్రంగా చేయడానికి అక్కడ 101 గోత్రాలకి గుర్తుగా 101 శివలింగాలని ప్రతిష్టించాడు. రాజరాజ నరేంద్రుడు వాసవాంబిక గౌరవార్ధం ఒక విగ్రహాన్ని ప్రతిష్టించాడు. అప్పటి నుండి వైశ్యులందరూ వాసవీ కన్యకా పరమేశ్వరిని వైశ్యకుల దేవతగా తలచి పూజలు చేయడం మొదలెట్టారు. వాసవీ కన్యకా పరమేశ్వ జీవిత చరిత్ర అహింసను నమ్మినందుకు,మత విశ్వాసాన్ని నిలిపినందుకు,స్త్రీల ఆత్మగౌరవాన్ని నిలిపినందుకు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయింది. వైశ్యుల కీర్తిని విశ్వవ్యాప్తంగా వ్యాపింపచేసినందుకు గాను ఆమె ఎప్పటికి అజరామరం అయింది. ప్రాపంచిక సుఖాలను విస్మరించిన ఆమె వైశ్యుల మనసులలో ఒక విజేతగా,శాంతికి చిహ్నంగా ఎప్పటికి నిలిచిపోతుంది.
శ్రీపాద శ్రీ వల్లభుడు – వాసవాంబిక
సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం ప్రకారం ఆర్య మహాదేవి యొక్క తేజో కిరణమే శ్రీ వాసవీ కన్యక. అనసూయ మాత “అగ్నియోగం” వల్ల జన్మించిన కవలపిల్లలే శ్రీపాద శ్రీ వల్లభులు మరియు శ్రీ వాసవీ కన్యక. శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి శ్రీపాద శ్రీ వల్లభుల సహొదరి. ఆమె ముఖ వర్చస్సు సాక్షాత్తు శ్రీపాద శ్రీ వల్లభుల వారిని పోలిఉండును . శ్రావణ శుద్ధ పౌర్ణమి (రాఖీ పౌర్ణమి) రోజు శ్రీపాద శ్రీ వల్లభులు ఎక్కడున్నా బృహత్సిలానగరం దీనికే జ్యేష్టశైలం అనికుడా పేరు (పెనుగొండ) నకు వచ్చెదరు . ఆ రోజు వాసవీ కన్యకాంబ శ్రీపాద శ్రీ వల్లభుల వారికి రక్షా బంధనం కట్టుపుణ్య దినము. ఆరోజు ఎవరైతే పిఠాపురం నందు శ్రీ పాదుల వారి సన్నిధానం లో ఉంటారో వారికి చిత్రగుప్తుడు మహాపుణ్యమును లిఖించును. శ్రీ వాసవీ కన్యకాంబ నామస్మరణ ఎక్కడ చేయబడుచుండునో అక్కడ గుప్త రూపం లో శ్రీపాద శ్రీ వల్లభులు నివసించును. !! ఓం శ్రీ వాసవాంబాయైనమః !!
వల్లూరి పవన్ కుమార్
- బ్రాహ్మణ సంఘం గ్రేటర్ వరంగల్ శాఖ
మిత్రులందరికీ శుభోదయం....  అనగా ఈ  రోజున" వైకుంఠ ఏకాదశి "
ప్రాముఖ్యత,విశిష్టత,ఆచరించవలసిన పద్దతులు తెలుసుకుందాం !
ఒక్క రోజు ముందుగానే మీకు,మీ కుటుంబసభ్యులకు,మిత్రులకు శ్రేయోభిలాషులకు
........ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ........శ్రీరామరక్ష - సర్వజగద్రక్ష ముక్కోటి ఏకాదశి -వైకుంఠ ఏకాదశి
ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గం' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. 


ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాబారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది. ఈ రోజున ముఖ్యమైనవి::
ఉపవాసం, జాగరణ. జపం, ధ్యానం.
విష్ణుపురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్నా మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడనీ, తమ కథ విని, వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశం కల్పించాలనీ వారు కోరారు. అందుజేతనే ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. ఈ రోజు భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకొంటారు.


పద్మ పురాణం ప్రకారం విష్ణువునుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. ముర అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువు శరణువేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చి వేసింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు. ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది. 


ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణుపురాణం చెబుతోంది. ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరిషడ్వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వ గుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చిని జాగురూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం.ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తరువాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది.
 

గీతోపదేశం జరిగిన రోజు కనుక 'భగవద్గీత' పుస్తకదానం చేస్తారు.
వైకుంఠ ఏకాదశి పేరు
వైకుంఠ ఏకాదశి అనే పేరులో వైకుంఠ, ఏకాదశి అని రెండు పదాలున్నాయి. వైకుంఠ శబ్దం ఆకారాంత పుంలింగం. ఇది విష్ణువునూ, విష్ణువుండే స్థానాన్ని కూడా సూచిస్తుంది. చాక్షుస మన్వంతరంలో వికుంఠ అనే ఆమె నుండి అవతరించినందున విష్ణువు "వైకుంఠః" (వైకుంఠుడు) అయ్యాడు. అదేకాక జీవులకు నియంత, జీవులకు సాక్షి, భూతముల స్వేచ్ఛావిహారాన్ని అణచేవాడు - అని అర్ధాలున్నాయి.
పండగ ఆచరించు విధానం ఈరోజు పూర్తిగా ఉపవసించాలి; తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు. ఈనాడు ఉపవసించినవారు పాప విముక్తులవుతారంటారు. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమొక దివ్యాస్త్రం. ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పథ్యమే ఉపవాసం. 'లంకణం పరమౌషధ'మనే నానుడి తెలిసిందే. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం; దైవానికి దగ్గరవాలనేదే ఉపవాసంలోని ఆశయం. పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి. ఏకాదశి వ్రతం నియమాలు : 1. దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి. 2. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. 3. అసత్య మాడరాదు. 4. స్త్రీ సాంగత్యం పనికి రాదు. 5. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. 6. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. 7. అన్నదానం చేయాలి.
 

వైకుంఠ ఏకాదశి ఈ ఏడాది సోమవారం ( డిసెంబర్--21) నాడు వస్తోంది.ముక్కోటి ఏకాదశి రోజున నిష్ఠతో పూజ నియమాలు ఆచరించే వారికి పుణ్యఫలముతో పాటు కార్యానుసిద్ధి చేకూరుతుందని,, వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠనియమాలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశిన మరణించేవారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, వైకుంఠ ద్వారాలు వారికోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిన స్తుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది.
పూజకు తామరపువ్వులు, తులసి దళములు ఉపయోగించాలి.......వైకుంఠ ఏకాదశి రోజున జాజిపువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లైతే సర్వపాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.
ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇవన్నీ చేయకపోయినా.. ఓం నమోనారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీరనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
  :: పండుగ ప్రాశస్త్యం:::
ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించే కొన్ని పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి
వైఖానసుడి కథ::
పర్వతమహర్షి సూచనమేరకు వైఖానసుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువల్ల నరక బాధలనుభవించే పితృదేవతలు విముక్తులై స్వర్గలోకానికి వెళ్లారట!
: మురాసురుడి కథ::

 కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, సత్పురుషులను బాధించేవాడు. దేవతలు తమ గోడును విష్ణుమూర్తికి విన్నవించి, రక్షించమని ప్రార్థించారు. విష్ణువు మురాసురుడిపై దండెత్తి, మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు. కాని మురాసురుడు మాత్రం తప్పించుకొని వెళ్లి, సాగరగర్భంలో దాక్కున్నాడు. మురాసురుణ్ని బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి, ఒక గుహలోకి వెళ్లాడు. విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు, విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు. అంతే! వెంటనే మహాలక్ష్మి దుర్గ రూపంలో అక్కడ ప్రత్యక్షమై, మురాసురుణ్ని సంహరించింది. విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని, ఆమెకు 'ఏకాదశి' అనే బిరుదునిచ్చాడు! అప్పటినుంచి ఏకాదశీ వ్రతం ప్రాచుర్యం పొందింది.
:పుత్రద ఏకాదశి కథ:::
వైకుంఠ ఏకాదశినే పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు.దీని గొప్పతనాన్ని వివరించే కథ : పూర్వం మహారాజు "సుకేతుడు" 'భద్రావతి' రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతని భార్య 'చంపక'; మహరాణి అయినా, గృహస్ధు ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అతిధి అభ్యాగతులను గౌరవిస్తూ, భర్తను పూజిస్తూ, ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేది. వారికి పుత్రులు లేకపోవడం జీవితంలో తీరని లోటుగా మారింది. వారు పుత్రకాంక్షతో ఎన్నో తీర్ధాలను సేవిస్తూ, ఒక పుణ్యతీర్ధం వద్ద కొందరు మహర్షులు తపస్సుల చేసుకుంటున్నారనే 'వార్త' తెలుసుకొని, వారిని సేవించి తనకు పుత్రభిక్ష పెట్టమని ప్రార్ధిస్తాడు. వారు మహారాజు వేదనను గ్రహించి, మీకు పుత్రసంతాన భాగ్యము తప్పక కలుగుతుందని దీవిస్తూ, నేడు 'పుత్రద ఏకాదశి' గావున నీవు నీ భార్యతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన యెడల మీ కోరిక తప్పక నెరవేరుతుంది అని చెప్తారు. అంతట, ఆ వ్రత విధానాన్ని వారి ద్వారా తెలుసుకొని, వారికి మనఃపూర్వకముగా ప్రణమిల్లి సెలవు తీసుకుంటాడు. వెంటనే నగరానికి చేరుకుని జరిగిన విషయాన్ని భార్య 'చంపక'కు చెప్తాడు. ఆమె సంతోషించి వారిద్దరు భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనారాయణులను, పూజించి మహర్షులు ఉపదేశించిన విధంగా 'ఏకాదశీ వ్రతాన్ని' చేస్తారు. అనంతరం కొద్దికాలానికి కుమారుడు కలుగుతాడు.
  
 తాత్త్విక సందేశం ::
విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం. కైవల్యోపనిషత్తు తెలిపినట్లుగా, ప్రతి మానవ హృదయగుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు (నిహితం గుహాయాం విభ్రాజతే). అంతదగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి, ఏకాదశీవ్రతాన్ని నియమంగా ఆచరించడమంటే, ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించడమని భావం. పంచజ్ఞానేంద్రియాలు (కళ్లు, చెవులు, మొదలైనవి) పంచ కర్మేంద్రియాలు (కాళ్లు, చేతులు మొదలైనవి), మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం; ఆ పదకొండే అజ్ఞానానికిగ స్థానం. అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని, జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారు.


వైకుంఠ ద్వారం:: శ్రీరంగం లోని శ్రీ రంగనాథస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజులు జరుగుతాయి. దీనిలో మొదటి భాగాన్ని పాగల్ పట్టు (ఉదయం పూజ) అని రెండవ భాగాన్ని ఇర పట్టు (రాత్రి పూజ) అని పిలుస్తారు. విష్ణువు అవతారమైన రంగనాథస్వామిని ఆరోజు వజ్రాలతో చేసిన వస్త్రాల్ని అలంకరించి వెయ్యి స్తంభాల ప్రాంగణంలోనికి వైకుంఠ ద్వారం గుండా తీసుకొని వచ్చి అక్కడ భక్తులకు దర్శనమిస్తారు. ఈ ద్వారం గుండా వెళ్ళిన భక్తులు వైకుంఠం చేరుకుంటారని భక్తుల నమ్మకం.
ధన్యోస్మి