Monday, 20 January 2025


సరదాగా నవ్వుకోవటానికి.😄

#భార్య భర్తల మీద ఏదన్నా ఒకటి రాయాలనుకున్నాను. 

భార్య, భర్తల మధ్య జరిగిన సంభాషణ మీ ముందు పెడతాను.

♦️భార్య: మీకు ఏమి పని లేదా? మొదట చాగంటి గారి మహా భాగవతం విన్నారు, అది అయిపోంగానే మాడుగుల వారిది విన్నారు, 

తరువాత గరికిపాటి వారిది, ఇప్పుడు సుందర చైతన్యానంద స్వామి వారిది. ఎవరు చెప్పినా అదే మహా భాగవతం కథ కదా!

 ఒకరిది వింటే సరిపోదా?

♦️భర్త: నువ్వు మినప్పిండి రుబ్బి మొదటి రోజు కొంచెం పిండిలో ఇడ్లీ రవ్వ కలిపి ఇడ్లీలు వేస్తావు,

 రెండో రోజు గారెలు, మూడో రోజు వడలు, నాలుగవ రోజు సాదా దోశలు, అయిదో రోజు కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లి దోశ, 

ఆరో రోజు పొటాటో కూర వేసి మసాలా దోశ, 

ఏడో రోజు ఇంత టొమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఊతప్పమ్, 

ఎనిమిదో రోజు అదే పిండితో గుంట పునుగులు, 

తొమ్మిదో రోజు పుల్ల మజ్జిగ కలిపి పుల్లట్లు వేస్తూ ఉంటే నేను 

రేపు అనేది ఉందో లేదో అని ఆత్రంగా తినటం లేదా!

వీటన్నిట్లో ఉన్నది మినప్పిండి అని తెలిసినా ఎంజాయ్ చేస్తున్నామా లేదా? 

♦️మహా భాగవతం కూడా అంతే! 

♦️చాగంటి వారు చెప్పేదాంట్లో భక్తి పాలు ఎక్కువ - అందుకు వినాలి, ♦️మాడుగల వారిది  ఎందుకంటే - ఆయన అమృత తుల్యమైన కంఠం లో పోతన గారి పద్యం వినటానికి,

♦️ గరికిపాటి వారు ప్రస్తుతo సమాజం లో జరుగుతున్న వాటిని మేళవిస్తారు కాబట్టి ఆయనది వినాలి, 

♦️చివరకు సుందర చైతన్యానందుల వారిది వినాలి - ఎందుకంటే  కలిపి కొట్టరా కావేటి రంగా అన్నట్టు ఆయన చెప్పే దాంట్లో పైన చెప్పినవి అన్నీ ఉంటాయి. 

♦️ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన పంథా. అన్నీ ఎంజాయ్ చేయాలి.

♦️భార్యకు ఏమి అర్థం కాలా. తను చేసే పనిని భాగవతం తో పోల్చి పొగిడారా లేక ఒకే పిండితో వారం రోజులు టిఫిన్ చేసి పెడుతున్నాను అని ఎత్తి పొడుపుగా అన్నారా! ఆలోచనలో పడింది.🤔

😃😀

*****

త్రివేణీ సంగమం - ప్రయాగ :

₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹

👉 భారతదేశంలోని పుణ్యక్షేత్రాల్లో ప్రయాగ ఒకటి. ఏడు మోక్షదాయక నగరాల తరవాత దివ్య పాపవిమోచన క్షేత్రంగా ప్రయాగ ప్రసిద్ధికెక్కింది. ప్రజాపతి బ్రహ్మ అక్కడ అనేక యాగాలు చేయడం వల్ల ప్రయాగ అనే పేరొచ్చిందని చెబుతారు. త్రివేణీ సంగమంలోని మూడు భాగాలను అగ్నిస్వరూప యజ్ఞవేదికలుగా భావిస్తారు. 

క్షేత్ర దర్శనానికి వచ్చే యాత్రికులు ఈ మూడు భాగాల్లోను భక్తి శ్రద్ధలతో స్నానం చేసి, ఒక్కొక్క రాత్రి బస చేస్తే త్రేతాగ్నుల ఉపాసనా ఫలం లభిస్తుందని విశ్వాసం. ప్రయాగరాజ అనే శబ్దాన్ని పలకగానే జీవుడు చేసిన పాపాలు భస్మమైపోతాయని, త్రివేణీ సంగమంలో స్నానం మోక్షప్రదమని భక్తులు విశ్వసిస్తారు. 

దానధర్మాలకు ప్రయాగ శ్రేష్ఠమైన భూమిగా పరిగణిస్తారు. ఎందరో రాజులు చక్రవర్తులు తమ సర్వస్వాన్నీ ఈ క్షేత్రంలో సమర్పించారని చెబుతారు. ఈ ప్రదేశంలో భరద్వాజ మహర్షి ఆశ్రమం ఉంది. వనవాసంలో సీతారామ లక్ష్మణులు ఈ ఆశ్రమాన్ని సందర్శించారని రామాయణం చెబుతోంది. భరద్వాజుడి విందు ప్రసిద్ధం. 

ఎప్పటికీ నాశనం కాకుండా కల్పాంతం వరకూ నిలిచి ఉండే అక్షయ వటవృక్షం ఇక్కడే  ఉంది. శంఖమాధవ, చక్రమాధవ, గదామాధవ మొదలైన 14 మంది మాధవులు విరాజిల్లుతున్న క్షేత్రం ఇది. తంత్ర చూడామణి ప్రకారం 51 శక్తిపీఠాల్లో ఒకటి ప్రయాగ. సతీదేవి చేతివేలు భూమ్మీద పడిన ఈ ప్రదేశంలో అమ్మవారిని లలితాదేవిగా పూజిస్తారు.

👉 కుంభ అనే సంస్కృత పదానికి తెలుగులో కుండ, కలశమనే అర్థాలున్నాయి. మేళా అంటే కలయిక, జాతర. సూర్యుడు, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు త్రయంబకేశ్వరంలో, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభమేళా జరుగుతుంది. బృహస్పతి వృషభరాశిలో సూర్యుడు మకరరాశిలో ఉన్నప్పుడు ప్రయాగలో, బృహస్పతి సూర్యుడు వృశ్చికరాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళా నిర్వహిస్తారు. 

క్షీరసాగర మథనంలో అమృతం లభించాక దేవతలు దానవులు దాన్ని చేజిక్కించుకోవటానికి పోరాటం చేస్తారు. విష్ణువు అమృతభాండంతో పారిపోతూ మార్గమధ్యంలో ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ అనే నాలుగుచోట్ల అమృత బిందువులు చిలకరించాడట

సాధారణ కుంభమేళా నాలుగేళ్లకోసారి జరుగుతుంది.

👉 అర్ధ కుంభమేళా ఆరేళ్లకోసారి ప్రయాగ, హరిద్వార్లలో జరుగుతుంది. పూర్ణ కుంభమేళా పన్నెండేళ్లకో పర్యాయం ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ లో నిర్వహిస్తారు. పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తయ్యాక 144 సంవత్సరాలకోసారి ప్రయాగలో మహా కుంభమేళా జరుగుతుంది.

👉 క్రీ.శ. 7వ శతాబ్దం నాటి హర్షవర్ధనుడి పాలనాకాలంలో చైనా బౌద్ధ యాత్రికుడు హుయాన్ త్సాంగ్ కుంభమేళాను ప్రస్తావించాడు. చారిత్రకంగా సముద్రగుప్తుడి దిగ్విజయాలను వర్ణిస్తూ హరిసేను రచించిన అలహాబాద్ శాసనం ప్రసిద్ధమైంది.

👉 ప్రయాగలో మాఘస్నానం అత్యంత పుణ్యప్రదమని పద్మపురాణం చెబుతోంది. ప్రయాగ క్షేత్ర మాహాత్మ్యాన్ని అగ్ని, మత్స్య, కూర్మ పురాణాలూ పేర్కొన్నాయి...!!

****

* ఓ ఉపాధ్యాయుడు, ఓ పోలీస్ అధికారి, ఓ బ్యాంక్ అధికారి ముగ్గురూ ఓ నౌకలో ప్రయాణిస్తున్నారు...

సముద్రం మధ్యకి నౌక చేరగానే ఒక సముద్ర రాక్షసుడు వారి ముందు ప్రత్యక్ష మయ్యాడు. మిమల్ని తినేస్తానని పెద్దగా కేకలు పెడుతున్నాడు.

ముగ్గురూ భయంతో వణికిపోతున్నారు. వారు భయపడటం చూసిన రాక్షసుడికి ఒక చిలిపి ఆలోచన వచ్చింది. వాళ్ళతో ఇలా అన్నాడు, మీ ముగ్గురూ మీకు తోచింది సముద్రంలోకి విసిరేయండి.

నేను తెచ్చి ఇస్తే గెలుపునాదే. వస్తువు తేలేకపోతే గెలుపు మీది వాళ్ళని వదిలేస్తాను. వాళ్లకు నేను జీవితాంతం బానిసగా ఉంటా నన్నాడు.

సరేనని ముందుగా బ్యాంక్ అధికారి తన చేతి వజ్రపుఉంగరం విసిరేశాడు.*
*సముద్రంలో మునిగి కాసేపటికి రాక్షసుడు ఆ ఉంగరాన్ని తెచ్చి ఆ  అధికారిని మింగేశాడు.

తరువాత పోలీసు  తన చేతికున్న ఖరీదైన వాచీని నీళ్ళలోకి విసిరేశాడు.

రాక్షసుడు సముద్రంలోకి దూకి దాన్నీ తెచ్చేసి అతన్ని మింగేశాడు.

ఇంక ఈ సారి ఉపాధ్యాయుడి వంతు వచ్చింది.

అతను కొంచెం యోచనచేసి తన దగ్గరవున్న నీళ్ళ సీసామూత తీసి అందులోని నీళ్ళను సముద్రంలోకి ధారగా పోశాడు. నా మంచి నీళ్ళను నాకు తెచ్చి ఇవ్వు అన్నాడు.

ఆ దెబ్బకి రాక్షసుడికి దిమ్మ తిరిగిపోయింది.

ఇది ఉపాధ్యాయుడి దెబ్బ ఎలావుంది? అన్నాడు రాక్షసుడితో*
*రాక్షసుడు తన ఓటమి ఒప్పుకొని అతనికి బానిసగా ఉండటానికి ఒప్పుకున్నాడు.

నా స్నేహితుల నిద్దరినీ బ్రతికించు అని ఆజ్ఞాపించాడు ఉపాధ్యాయుడు, రాక్షసుడు వాళ్ళని కక్కేశాడు.

మంచి పని చేశావు. ఇంక ఎవ్వరినీ యిలా బాధించకుండా ఉంటానంటే నిన్ను బానిసత్వంనుంచి విముక్తుడిని చేస్తానన్నాడు ఉపాధ్యాయుడు. రాక్షసుడు అలా చెయ్యనని ప్రమాణం చేసి సముద్రంలోకి దూకి మాయమయ్యాడు. ఎంతటి ఆపద వచ్చినా ఆలోచించేవాడు  ఉపాధ్యాయుడు

సమాజానికి సమస్య వస్తే తగు పరిష్కారం సూచించగలిగేవాడు గురువు... 🙏
******

Sunday, 19 January 2025

day .. 1


*భగవంతుడు మానవ జన్మ ఆనందం,ఆహ్లాదం,సంతోషం కోసం ఇచ్చాడంటా......

 

💥మనిషి యవ్వనంలో డబ్బు కోసం ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాడు.

 💥వృధ్యాప్యంలో ఆరోగ్యం కోసం డబ్బుని పోగొట్టుకుంటారు.

 💥ఆరోగ్యం ఆస్తికన్నా మిన్న, ఆరోగ్యం లేని ఆస్తి సున్నా.

 💥ఆరోగ్యం విషయంలో స్వార్థంగా ఉండండి.

 💥ఆస్తి విషయంలో నిస్వార్థంగా ఉండండి.

 💥వ్యాయామం చేసేదానికి సమయం లేదనే వాళ్ళు, భవిష్యత్తులో జబ్బులకు సమయం కేటాయించవలసి వస్తుంది.

 💥తిండి విషయంలో నాలుకను అదుపులో ఉంచుకునే వాడు యోగి, నాలుకను అనుసరించేవాడు భోగి, నాలుకకు బానిసైనవాడు రోగి.

 💥డబ్బు సంపాదించవచ్చు కానీ నిద్ర సంపాదించలేము.

 💥పుస్తకాన్ని కొనవచ్చు కానీ జ్ఞానాన్ని కొనలేము.

 💥మందులను కొనవచ్చు కానీ ఆరోగ్యాన్ని కొనలేము.

 💥పగను సంపాదించవచ్చు కానీ స్నేహాన్ని కొనలేము.

 💥ఆయుధాన్ని కొనవచ్చు. కానీ ధైర్యాన్ని కొనలేము.

 💥భోగాలకు ఖర్చు చేసి రోగాలను తెచ్చుకోకు.

 💥మంచి పనులకు ఖర్చు చేసి పుణ్యం పెంచుకో. ఆ పుణ్యమే నీ రాతను నిర్ణయించునని తెలుసుకో.

 💥ధనముతో పరుపుని కొనవచ్చు కానీ నిద్రను కాదు.

 💥ధనముతో విలాసవంతమైన వస్తువులను కొనవచ్చు కానీ సంతోషాన్ని కాదు.

 💥ధనముతో దేవాలయాలని కొనవచ్చు, కానీ దేవుణ్ణి కాదు.

 💥దాచిపెట్టి ఏమి చేస్తావు, శవం మీద గుడ్డకు జేబు అయినా ఉండదు.

 💥ప్రపంచానికి తాను చేసిన మేలే మానవునికి నిజమైన సంపద.

 💥ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు, ఎన్ని మంచి పనులు చేశామన్నది ముఖ్యం.

 💥ఇతరులకి కష్టం కలిగించడం ఎంత పాపమో, ఇంకొకరి కష్టం తీర్చడం కూడా అంతే పుణ్యం.

 💥జీవితంలో ఈ ముగ్గురిని దరికి రానివ్వకండి:

 1)నీకు విలువ ఇవ్వని వారిని

 2)నిన్ను చూసి ఈర్ష్య పడేవారిని

 3)మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని.

****

  "మరణం'' అంటే  ఆత్మ
  "మరణం'' అంటే  ఆత్మ (ప్రాణం) శరీరాన్ని   విడిచిపెట్టడం ఇది శాశ్వత మరణం

 "నిద్ర'' అంటే మనసు (బుర్రలోని మొరిగేకుక్క) ఆలోచనను తాత్కాలికంగా విడిచిపెట్టడం
ఇది తాత్కాలిక మరణం 

"పిచ్చి" అంటే మనసు (బుర్రలోని మొరిగేకుక్క) ఆలోచనను ఎన్నటికీ విడిచిపెట్టక పోవడం ఇది బుద్ధి మరణం

"కోమా" అంటే మనసు (బుర్రలోని మొరిగేకుక్క) ఆలోచనను ఎన్నటికీ విడిచిపెట్టక పోవడం ఇది మనసు మరణం

*మనలోని నిజం బయటకు నిజాయితీగా రావాలంటే, నిజం బయటపెట్టినా ఏమీ కాదు నిజం కావున ఎవరైనా తప్పుపడితే, వాళ్ళ తప్పులను సరిచేయడానికి నాకు తోడుగా ఒకడు ఉన్నాడు దేవుడు అనే నమ్మకం.... 
నిజానికి దేవుడికి, మనుషులకు ఒక్కటే తేడా.... 
దేవుని దగ్గర పుణ్యం ఎక్కువగా ఉంటుంది  అయన చేసిన మంచి...
మనుషులుఆపుణ్యంసంపాదించటానికిమంచితనం 
నేర్చుకోటానికి తెలుసుకోటానికి&ఆచరించటానికి, ఈ భూమి మీద జన్మించారు క్రిములు జంతువులు జలచరములు పక్షులు మనుషులు...
తరువాత దేవుడు అంతపుణ్యం సంపాదించిన తరువాత..
లేదంటే మళ్ళీ  పుణ్యం 
.
మనం ఎంతపెద్ద building కట్టినా,కట్టేటప్పుడు ఎక్కడైనా చిన్న తప్పు చేస్తే, దాని పరిణామం, మళ్ళీ అక్కడికి పడిపోతాం కద, ఎంత ఎత్తుకి ఎదిగినా....
మనందరి బ్రతుకులు అంతే....
.
అందుకేనేమో నాకు బుద్ధివచినప్పటినుంచి 9years back... దేవుడు=గురువుగారు అనుకుంటున్నాను...
.
దేవుడు(గురువుగారు) కూడా, మనం ఆయనను ఎలా భావిస్తామో, అయన కూడా మనతో అలానే ఉంటాడు వేదం లో ఉంది...
.
మనలో ఎవరికైనా తోడుగా సహాయంగా ఎవ్వరూ అవసరంలేదు అనుకునేవారికి,దేవుడు లేడు అనే భావించండి....
కానీ,
'నేను ఎక్కడైనా తెలీకుండా తప్పులు చేస్తానేమో, నన్ను కనిపెట్టుకుని ఒకరు ఉండాలి disturb చేయకుండా' అనుకునేవారికి దేవుడు సహాయం చేస్తాడు@నమ్మి, అయన rent@నమ్మకం+భక్తి+పూజ..ఆయనకు ఇచ్చేస్తే, అయన మనతోడుగా ఉంటాడు.... 

****

 🪷 జీవితాన్ని ధర్మబద్ధంగా కొనసాగించడానికి సన్మార్గమే ఉత్తమ సాధనం♪. తోటివారికి సహాయం చేయడం, సంఘ శ్రేయస్సు కోసం పాటుపడటమే సన్మార్గం♪. స్వార్థంతో ప్రవర్తించి, ఇతరులకు కీడు చేయడమే దుర్మార్గం♪. 

సన్మార్గంలో నడిచిన వ్యక్తి ఎప్పటికప్పుడు తానేమిటో, తన స్థాయి ఏమిటో తెలుసుకుంటాడు♪. ఆత్మవిమర్శ చేసుకొంటూ ఉన్నతమైన బాటలో ప్రయాణిస్తాడు♪.

🪷 ఈ సమాజం ఎలా అయినా ఉండనీ గాక, మనమెలా ఉన్నామన్నదే ముఖ్యం♪. ఏం చేస్తామన్నదే ముఖ్యం. కమలం బురద మధ్యలో జీవిస్తున్నా తన తేజస్సు కోల్పోదు♪. కోమలత్వాన్ని వీడదు. మనిషి కూడా కమలం లాగే బతకాలి♪.  సన్మార్గంలో సాగడం వల్లే మనిషి ఈ సమాజంలో అత్యుత్తమ గౌరవాన్ని పొందుతాడు. మానవత్వం వల్లే అందరికీ ఆదర్శప్రాయుడవుతాడు. అందుకే భగవంతుడు ప్రసాదించిన ఈ జన్మ ద్వారా అందరికీ సహాయం చేసే స్థాయికి మనిషి ఎదగాలి.

🪷 మరుజన్మ ఉన్నదో లేదో మనకు తెలియదు♪. గత జన్మ ఎలాంటిదో కూడా తెలియదు♪. ఈ జన్మలో లభించిన పవిత్రమైన మానవ జన్మను ప్రతి మనిషీ సార్థకం చేసుకోవాలి. పదిమందినీ ఉద్ధరించే ప్రయత్నం చేయాలి.  ఒకసారి సన్మార్గం వైపు ప్రయాణించిన మనిషి చెడుమార్గం వైపు మరి కన్నెత్తి చూడడు. సత్‌ కార్యాలు చేస్తూ ముందుకు సాగుతాడు. 

🪷 దారి దోపిడీలు చేసే రత్నాకరుడనే బోయవాడు నారద మహాముని ఉపదేశం వల్ల పరివర్తన చెంది, రామనామ జపంతో వాల్మీకిగా ప్రసిద్ధి పొందాడు. ఆదికావ్యమైన రామాయణాన్ని లోకానికి అందించాడు.

🪷 బుద్ధుడు సిద్ధార్థుడిగా ఉన్నప్పుడు ఎన్నో రాజభోగాలను అనుభవించాడు♪. ఆ సిద్ధార్థుడే అన్నింటినీ వదులుకుని సన్మార్గాన్ని అవలంబించి జ్ఞానోదయం పొందాడు. మహా బోధకుడిగా మారి అమరుడయ్యాడు. 

🪷 శ్రేష్ఠులైనవారు దేన్ని ధర్మంగా భావించి ఆచరిస్తారో సజ్జనులూ దాన్నే ఆచరిస్తారని బోధించాడు శ్రీకృష్ణుడు. జ్ఞానులు, మహాత్ములు సన్మార్గాన్ని అనుసరించారు, చరితార్థులయ్యారు. ప్రతి మనిషీ మహనీయుల మార్గాన్నే అనుసరించాలి. కీర్తి శిఖరాలు చేరుకోవాలి•.

🪷 రావణాసురుడు గొప్ప శివభక్తుడు. స్త్రీ వ్యామోహం వల్ల దుర్మార్గంగా ప్రవర్తించి, చివరికి నాశనమయ్యాడు. 

🪷 వివేకం కోల్పోయి బంధుమిత్రుల హితవచనాలు పెడచెవిన పెట్టినందువల్ల కౌరవ నాశనానికి కారకుడయ్యాడు దుర్యోధనుడు. 

🪷 ఏ మనిషైనా దుర్మార్గుడిగా మారడానికి ఎంతోకాలం పట్టదు♪. మంచివాడిగా, మానవోత్తముడిగా గుర్తింపు పొందడానికి చాలా కాలం పడుతుంది. తద్వారా వచ్చే కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది. సన్మార్గమే మనిషికి సంపద. సన్మార్గంలో ప్రయాణించే మనిషికి ధనధాన్యాలు లేకపోయినా అన్ని సంపదలూ ఉన్నట్లే. సత్ప్రవర్తన లేనివారికి సంపదలు ఉన్నా అవి లేనట్లేనన్నది నీతికోవిదుల మాట♪.

🪷 చూసిన ప్రతిదాన్ని ఆశించడం, ఆశించినదానికోసం పాకులాడటం, కోరుకున్నది దొరక్కపోతే బాధపడటం... ఇవన్నీ మనిషి అశాంతికి కారణాలు♪. ఇవే మనిషిని దుర్మార్గం వైపు నడిపిస్తాయి. అందుకే మనిషి ఎప్పటికప్పుడు కోరికలను నియంత్రించుకుని స్థిరచిత్తం ఏర్పరచుకోవాలి♪.

🪷 సన్మార్గం మనిషికి సుఖశాంతులు ప్రసాదిస్తుంది. సన్మార్గంలో నడిచే వ్యక్తుల మనసులు కడిగిన ముత్యాల్లా నిర్మలంగా ఉంటాయి. వారు ఎవరితోనైనా మృదుమధురంగా మాట్లాడతారు♪. కలిమిలోను, లేమిలోను నిబద్ధత కలిగి ఉంటారు. మంచి పనుల ద్వారా అందరినీ ఆకట్టుకుంటారు♪. సన్మార్గంలో ప్రయాణించిన మనిషి మనీషిగా ఎదుగుతాడు♪. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకుంటాడు. మంచి బాటలో నడిచిన మనిషికి దైవానుగ్రహం తప్పక లభిస్తుంది. అందుకే సన్మార్గం అందరికీ అనుసరణీయం♪.