Monday, 8 July 2024

 



ప్రతి రోజూ సమస్యను పరిష్కరించ మని గురువుగారు రామిరెడ్డి గారు ప్రాంజలి ప్రభలో పొందు పరచగా నా వంతు వ్రాసిన పద్యాలు వారు ఇచ్చినది చివరి పదముగా గుర్తించగలరు


ఆ..ప్రేమ పట్టు యున్న ప్రీతి గుండ బతుకు 

కంటి వెలుగు తీర్పు కాంచ గలుగు 

బాధ పెట్ట యున్న బాధ్యత మరచినా 

ఇంటి కెల్ల రోత యింతి గాదె


తే..నమ్మ లేవు నా పలుకులు నటన యనచు 

నల్లి గా నాపనియు చేయ నియమ మేది 

నారి చేరి వేడుక చెప్ప నమ్ము రామ 

నారి సారించె రాముండు నల్లి చచ్చె


ఆ..నమ్మలేని బ్రతుకు నమ్మమని తెలుపు 

సిరుల మనసు చుట్టు సిగల పట్టు 

మంచి చెడుల మధ్య మాయల మనిషిగా 

ఏమి చెప్ప వచ్చు నీశ్వ రాజ్ఞ


తే..నమ్మ లేని బతుకేయిది నటన కనుల 

పార్వతీదేవి శివునకు పత్ని గాదు 

నమ్మి కొలచిన వారికి నమ్మ బలుకు 

పార్వతీ దేవి శివునకు పత్ని గాను


కం..కనులే ప్రేమకు నాందీ 

చనువే మారినను పోరు చేయుట విధిగా 

మనువే హేళన చేసిన 

వనితో పోరాడి చచ్చె వనిత సబల యై


తే..కన్ను చూపుయు కనలేని కన్నుకన్ను 

మిన్ను మన్ను చెలిమి సుఖ మిన్ను మన్ను 

తన్ను కున్న మనసు కన్ను తన్ను తన్ను 

నిన్ను మరియు నిన్నును నిన్ను నిన్ను నిన్ను


కం..యేలిన భూపతి నిత్యము 

పాలిచ్చును దున్నపోతు ప్రజలందరికిన్ 

మాలిని కథలే తెలిపెను 

జాలిగ నీతి పలుకులగు జాతర యందున్


తే..కల్ల కపటము ఎరుగని కలువ రాజు 

చల్ల గా వెన్నలనుపంచి చెలిమి పంచ 

మెల్ల మెల్లగా కదులుతూ మేలుకొలుపు 

నల్ల వాడికి చిక్కెను తెల్ల పిల్ల


తే..అలసటనుతీర్చ సమయము ఆకలిగను 

అది యిది యనుటకు శుభము అలక తీర్చ 

అది వారమే సెలవేల నందరకును 

సుఖము విశ్రాంతి సహజము శుభ్రతయగు


తే..ఎప్పుడెప్పుడు కలవాలి యేల చెప్ప 

యెన్ని యున్నను లోటుయే యేల విప్ప 

కవిత కళల కవిత్వము కాల మార్పు 

దాహమే తీవ్రమగుటయె ధరణి యందు


తే..ప్రేమనంతటినీ దాచ ప్రీతినివ్వ 

గుట్టుగాదాచినా గుణం సుఖము నివ్వ 

భావ పరిమళం తో నీకు బంధ మవ్వ 

నిలువ నివ్వడంలేదులే నీలొ మువ్వ


తే..మల్లెలు పరుచుకొనియున్న మాల యివ్వ 

వలపు బాణాలు నీపైన వరుస యవ్వ 

అందమైన మా భావల నాడి నవ్వ 

మధువు కై తపియించుటే మార్గ మవ్వ


తే..బాహుబంధంలొ యిమిడిపోవాలని కళ 

వలపువానలొ తడిసి పోవాలని కళ 

 ఏకమౌతూను కరిగిపోవాలనికళ 

ప్రణయ బందమైయలసి పోవాలనికళ

***-

తే..ప్రాణులకు హితమైనది పలుకు కవియె 

సత్యమును తెలిపే కవి సమర మదియు 

భూత భవిషత్తు తెలుపేటి భుక్తి కవియె 

కవియె విశ్వము, విశ్వమే కవి నిజంబు


హనుమంతుని ధైర్యమ్మే 

హనుమంతుని పెండ్లి యాడి రార్గురు కాంతల్ 

గుణమే ధర్మా సత్యము 

ప్రణతీ యీరామ పలుకు ప్రతినిత్యముగన్


తే..మనిషి కీకీర్తి దొరకదు మాయకమ్మె 

మెరుపు కాంతియు చవుకగా మేయ నీదు 

సులువు నదులలో పరవళ్లు సూడ నీదు 

తాతకును దగ్గు నేర్పెను తమ్ము కుర్ర


పంచ భూతములముఖమే పద్య పంచ 

కమ్ము, పృద్వి స్వజలముయే కళల యగ్ని 

సూర్య చంద్ర యాకాశమ్ము సూత్ర వాయు 

గణగుణా శివతాండవం గమ్య గణము


పావులాటగాను పాఠమనెడి బోధ 

ధనము చుట్టు తిరుగు ధరణి యందు 

కులమతాల తోను కూడునివ్వని విద్య 

చావు లేని చదువు చదవ వలయు


ఉ.గద్యమనస్సుగా దెలుగు గాలము బట్టియు తెల్ప గల్గుటే 

సాద్యమనేదివిద్య కళ జక్కగ పండిత వర్య బోధయే 

పద్యవి ధానమే పలుకు భాద్యత విద్యగ చెప్పు శాంతి, దు 

రవిద్యను వీడి యొక్కరుడు వేద విశారదుడయ్యె నిద్దరిన్

తే..కడుపు ఎండబెట్టి బతుకుకాటి కెనన 

కడుపు నిండా తినగలిగి గంజి త్రాగు 

కూడ బెట్టు ధనముదొంగ కూడు గానె 

ఏడుపులు యున్న యరగదు ఎట్టి తిండి


తే. దోపిడీ మౌనమగుటేల నోయి జీవ 

పంటలకు ధర పలకకే పలక లేరు 

ఎంత యపహాస్య జనులపై యేల నిత్య 

యీప్రజా స్వామ్య చదరంగ ఇష్ట భోజ్య


కం..వేదము నిత్యము తెలిపే 

మోదము తెలిపెడి గురువులు మౌనము వీడెన్ 

సాధువు నిత్య ధ్యానమే 

పాదములంటిన ప్రజలకు పాపములుడుగున్


తే..నమ్మకమ్ము బ్రతుకు జీవనమ్ము సుఖము 

తెలుగు పలుకు మనసుమార్చు తేటగీతి 

సామ రశ్యపు పలుకులు సంఘ మెరుపు 

కమ్మనైన తెలుగు భాష కనగ వలయు


తే..లక్షితాదయ జీవుల లక్ష్యమగుట

జన్యు విన్యాస విషయసూచిక విజయము 

కృత్రిమ మేధశోధనగానుశృతుల భవిత 

మనిషి మనిషిగా మనలేని మరణ చరిత


తే..అక్షరాలుయే అమృతవృక్షాలు యగుట 

అనుభవాలన్ని యనుబంధ యాట లగుట 

విశ్వ కల్యాణ మాధవ విద్య మెరుపు 

మనిషి సాఫల్యత సమయం మాట విలువ


తే..లాభ నష్ట సందేహము లక్ష్య మగుట 

స్వార్థ నిస్వార్ధ సంఘమై సాధ్య గీత 

పలుకు యారోగ్య ఆయుష్షు పాఠ్య మగుట 

ప్రాప్తి తృప్తి యోగ్య మగుట పాప పుణ్య


తే..మన వివేకమ్ము విజ్ఞత మాయ మనసు 

అదుపు తప్పె అశ్వ పరుగు ఆశ చేర

శిక్షణారోగ్యకరమైనరీతి మనసు 

మనపురోగమ సహకార మార్గ బతుకు


మల్లాప్రగ్గడ 'పస' పద్యాల్ని  (తేటగీతి )చవి చూడకపోతే ఆయన చాటుకవితా సమీక్ష అసమగ్రమే అవుతుందట!! 


పప్పు పస బాపలకునులె పలుకు లేను 

ఉప్పు పస రుచులకుగాను , ఉవిద గాను 

కొప్పు పస పూల మాలయే కోర్కె గాను 

కప్పె దంతము పైపొరా కాల మౌన


మీసము పస మొగ మూతికి ధీరు డౌను 

వాసము పస ఇంటిన కెల్ల, వనితగాను 

వేసము పస, బంట్రౌతుకు వినయమౌను 

గ్రాసము పస ప్రగ్గడ గాను గమ్య నీతి 


వెన్నెల పసగా రాత్రుల విద్య గాను 

కెన్నులు పస సస్యములకు, ఇంతుల గను 

చన్నులు పస సుఖము చెంద చెలియ గాను 

కన్నులు పస ప్రగ్గడ గాను గమ్య నీతి 


మాటలు పస నియ్యోగికి మంచి గాను 

కోటలు పస దొరల కెల్ల, ఘోటక గాను 

దాటులు పస, బెబ్బులులకు దాడి గాను 

కాటులు పస, ప్రగ్గడ గాను గమ్య నీతి



పుణ్య పాప మన్న పుడమిన స్వేచ్ఛయె 

పాప భీతి లేదు పాత కులకు 

చెప్పునది నొకటియు చేయునదియు వేరు 

ధనము చుట్టు తిరుగు ధర్మ బుద్ధి

***

ఉ..మార్చుకొనేది డబ్బుయని మారణ హోమము చేయ నేస్తమున్ 

నేర్చును లోకమై విలువ నేటి మనోగతి సేవ లక్ష్యమున్ 

చేర్చును బంధమై మనిషి చేష్టలు మార్పులు నేర్పులే యగున్ 

మార్చును తృప్తి పర్చగల మాయల ఇంతియె నిత్య సత్యమున్

***

దత్తపది.. సిరి  పరి  హరి కరి 


గడసరి పలుకు గంభీర్య గమన మల్లె 

పరిపరివిధమ్ము సుఖ దుఃఖ పాఠమౌను 

కరిని గాచు మావటి వాడు కాల మందు 

హరి హర యనుటే జీవిత యాశ యమ్ము

***


నమ్మకమ్ము బ్రతుకు జీవనమ్ము సుఖము 

తెలుగు పలుకు మనసుమార్చు తేటగీతి 

సామ రశ్యపు పలుకులు సంఘ మెరుపు 

కమ్మనైన తెలుగు భాష కనగ వలయు

***

భూమి ఋణము తీర్చ భుక్తి కోరియు జీవి 

సత్య ధర్మ మార్గ సమయ ఖర్చు 

వయసు మీద పడ్డ వరుస పూజలుగాను 

చావు చావు అంటె చావ రెవరు

***

కాకి లాంటి మనిషి బుద్ధి కాలమందు 

ఎంత తిన్న యిoకనుకోరి యదను దోచు 

ఉన్న దాన్ని యుంచుకొనుట యూహ నిజము 

కాకి చిరకాలమున్న నే కార్య మగును

***

పుణ్య పాప మన్న పుడమిన స్వేచ్ఛయె 

పాప భీతి లేదు పాత కులకు 

చెప్పునది నొకటియు చేయునదియు వేరు 

ధనము చుట్టు తిరుగు ధర్మ బుద్ధి

***

కం..ఒక టొకటి శక్తిగనే 

త్రికరణశుద్ధిగ బతికెడి తీక్షణ బకమున్ 

చికిత్యగాబల్లిని తిను 

 బకమున్ వడిగా తినియెడు బల్లిం గనుమా


ఆ..ఏల చెప్ప లేను యెదలోన లీలలు 

మొద్దు నిద్ర యున్న మోత లున్న 

ఎద్దు నెక్కి విధిగ ఎలుక ఊరేగుటే 

ఏనుగెక్కి పోయె పేను నంత


తే..ప్రకృతి జ్యోతిగా వెలిగింది ప్రగతి కోరి 

కాల జీవన బాటలు కళలు తీరు 

సూర్య చంద్రుల లీలలే సూత్ర బతుకు 

దేవుడే లేడటంచును తెలిపి నారు


కం..ప్రాముఖ్యతగా కదిలే 

సుముఖం చమత్కారమౌను సూత్రమ్ముగనే 

మమతా మహిమే యిదియే 

రాముడు గర్భము ధరించి రావణు కనియెన్


ఆ..చిత్త సిద్ధి నున్న చిన్మాయ తొలగుతే 

సత్య ధర్మ పలుకు సమయ మగుట 

బుద్ధి చెప్పు వాడు గుద్దితే నే మాయ 

సంఘముందు బ్రతుకు సహజ మౌను


కం..భార్య బతుకు చూడాలిలె 

సౌర్యమనే శక్తి బతుకు సౌఖ్యము మార్చే 

సర్వము ధరణీ మెప్పుయు 

కార్యము చెడు యలవాటు కాలము దేవీ


తే..చదువు నేర్పు సంఘ బతుకు చలము తీరు 

మంచి చెడుల కొలువగుటె మనసు చేరు 

నేర్పు వోర్పును బట్టియే నీడ నిచ్చు 

వ్యక్తి భావ సంపద బట్టి వాక్కు చిలుకు


తే..ఋణము తీర్చగలుగు శక్తి రుద్రమూర్తి 

బంధ ఋణము తప్పదు విధి బాధ్యతగుటె 

అర్ధమున్నను యర్ధాంగి యర్ధమెరుగ

గుణము గుర్తింపు గోప్యము సుఖము బట్టి


ఆ..అమ్మలేవు బాధ ఆశయేలను నీకు 

సంతసమ్ము పంచ సాక్ష మేది 

అరువు పుట్టలేదు ఆరోగ్య మునకునే 

శాంతి యన్నదేది సాకు కాదు


ఉ..అండము దైవశక్తి గను అక్షయ రూపము దాల్చ నెంచగన్ 

పిండమ నేది యేర్పడుట పెన్నిధి సన్నిధి వల్లనే యగున్ 

గండము లెన్ని యున్నను సకామ్యము జర్గియు తృప్తి చెందగన్ 

ఖండము లేని జీవిగ సుఖమ్మగు కాన్పుయు వేంకటేశ్వరా


తే..అండమనునది వృద్ధి జరుగు ఆశ మహిళ

పిండమై పెర్గు యుదరము పిల్లగ ధరణి 

దినదినా గండమును మోయు దీన తల్లి 

ఉదర ఖండము తో బిడ్డ ఉద్యమించె


కం..జీవన వాహిని దేహము 

నావగ దశలై కదులుట నమ్ముట నిజమే 

అవయవ సౌష్టము క్షీనత 

నవయవ్వనవృద్ధశాంతి నమ్మక మగుటన్

****


తే..ఖ్యాతి కోరుకుంటూ సమేఖ్యతను జూప 

దాన ధర్మమే మనిషికి దారి జూపు 

ఆత్మసుఖ మనఃశాంతియే ఆది యగును 

రాతి బొమ్మను పూజింప రాదు సుఖము 

అన్ననూ సత్య వాక్కుకై ఆశ పూజ


ఆ..గుణ గణమును తెల్ప గుప్తవిద్యల యేల

గమ్య శోభ లన్ని కాల మాయ 

పూజలన్ని చేయ పురము మనిషి 

గణ చతుర్థి నాడు, ఫణి చతుర్థి


కం..పతి సేవ ఫలము గనుటే 

రతి సాఫల్యసుఖముగాను రంజిల్లి గనే 

మతియే స్థిరమై యోగ్యుని 

సతి సతి గలియంగ పుత్ర సంతతి గలిగెన్


కం..నెమ్మది చూపెడి తల్లియె 

నమ్మకమేను కలిగించు నానుడి కాదున్ 

కమ్మని పిలుపుల తల్లీ 

గుమ్మము లోనున్న ముద్దు గుమ్మను జూచెన్

No comments:

Post a Comment