దీర్ఘ కవిత్వ మనిషి తాండవ తత్త్వం (1)
రచన మల్లాప్రగడ రామకృష్ణ (రోజువారీ కథ)
అంబర వీధిలో అలుపెరగని మేఘాలు కలయిక, గాలిసవ్వడికి రంగురంగులుగా మారుతున్న స్థితి, ఒకవైపు నిద్రపోతూ ప్రశాంత వాతావరణం, ప్రకృతిలో పచ్చదనం విస్తరించి, పక్షుల కిలకిల రావాలు ధ్వనులతో, ఆలయ గంటల శబ్దాలు, ఆనంద పరిచే ప్రభాత భక్తి గీతాలు, మధ్య!
అత్త కడుపు చల్లనా, అమ్మ కడుపు చల్లనా, అందరి మధ్య ఆశీర్వచనాలుగా ప్రార్థన, ఆనంద డోలికలో ఊగినట్లుగా, ఆక్రందన మధ్య ఉత్సాహం ఉవ్విలూరుతూ, ఒకవైపు, ఆవేశం కట్టలుతెంచుకొని *చావా బ్రతుకా* ఆందోళనతో గర్భం ఊగుసలాడి *శీర్షోదయమైంది... శిశువు నైలపై బడింది*
ఉమ్మి జలాల మధ్య ఊపిరి తీసుకొని, విచిత్రంగా ఒక మాయను చేదించుకొని, ఉదర ఊబిలో నుండి కష్ట ఊబిలోనికి చేరిన చిత్రంగా, చిన్నారి చిన్మయ రూపంగా, పరంపర ప్రకృతి విన్యాసంలో, మరో మాయా లోకాన్ని ఉచిత ప్రవేశం.
చేసిన కన్న పేగుకు ధన్యత్వ స్పృహ, ఆనంద, సాఫల్య, సంతృప్తి, *శిశువులో శ్వాస చలనం... బొడ్డు కోస్తే ఏడుపు మయం*...
*గుప్పెట మూస్తే అంధకారం, గుప్పెడు తెరిస్తే అంతా అయో మయం* నోరు పెగలింది, రొద హోరు చుట్టూ పెరిగింది.
ఋధిర స్రావంతో, జన్యు కణాల పరంపరం జరిగింది, అని వార్యపు ఆణువంశకం ఆవిర్భవించింది. ఆదరణ నుంచి, వాతావరణం నుంచి, శతకోటి కాలుష్యాల మధ్య, గణ గుణాల మధ్య, ప్రకంపనల మధ్య, కట్టడి - కట్టుబడి తల్లి పాలనా మధ్య, ఎదుగుదల శ్వాస ప్రతి బంధాలు కాకుండా, ఆత్మీయత అనుబందాలు మధ్య, *ఫలం - ప్రతిఫలం* తెలియని భౌతిక శరీరంతో *నవ్వులతో... ఏడిపించి... ఏడుస్తూ నవ్వులు తెప్పించి* బోసి నవ్వుకేం తెలుసు, హంగు ఆర్బాటం, కనుమూసి నిద్రావస్థలో, కలవరింతలతో, జ్ఞాపకాల మలుపులతో, తెలప లేని చిన్నారి, ఊయలలో ఊగిసలాట. కొండ నుండి *అస్తమిస్తున్న సూర్యుడులా* ఎర్రటి మోముతో మూర్తీ భవించిన *చల్లలో వెన్నముద్దలా ఊగిసలాట*
ఇంకా వుంది
*****
దీర్ఘ కవిత్వ మనిషి తాండవ తత్త్వం (2)
రచన మల్లాప్రగడ రామకృష్ణ (రోజువారీ కథ)
పుడమిన పుట్టిన శిశువుకు పురిటిస్థానముతో శుద్ధిగా *హృదయాంతరాళములలో సంతృప్తిగా బంధుసమక్షమున చిన్న సంబరమగు*
కన్నవారి కళ్ళల్లో ఆనందం నింపి, వారి గొప్ప మనసుల్లో ఆశలు నింపి, తల్లిదండ్రుల పలుకుల్లో ప్రేమను చూసి, వారు పడే తపనలో అర్ధంలేని స్థితి, *సువిశాల ప్రపంచంలో ఒదిగి ఒదిగి పోయి*,
జన్మ దాతల కలలను సాకారం చేసి, సున్నితమైన మనసులను అర్థం చేసుకోలేని, చిన్నారి నవ్వుల మధ్య ఏడుపు *ఏమిలోకంఎంతటికీ అర్ధంకాని వైనం* ప్రేమ.
చిటపట చినుకులు సుందర నాట్యము, కన్నుల ఎదుటే అద్భుత దృశ్యము, నింపును మనసున మెండుగ మోదము, *ఆనంద కేరింతలతో నవ్వుల తేజము*.
ముద్దులబిడ్దగా, నిప్పులో కాలదు, నీటిలో నానిపోదు, సుడులెన్ని వచ్చిన గాలిలో ఎగిరిపోదు, ఎండలోన ఉన్నను ఎండకు వాడిపోదు, చలికి వనకదు, తప్పటడుగు తెలియని మొదలైన నవ్వులు, మమత చెదరక, మనసు గాయపడక తెలియ పరిచలేని తనం. పుడమిపై సమస్తం.. సకలం.. సర్వం.. అన్నీ.. బోసి నవ్వులుగా ప్రేమ.
*మందారం.. మనిషి కళలు*
ముద్దు బిడ్డతో తల్లి తండ్రుల భాష్యము
సమాధానమేనే సహాయమ్ము గానే.. నాదేను నీ దీను నాదౌ నుగానే...సకాలమ్ము సౌఖ్యమ్ము సౌందర్యమే
చమత్కార చాతుర్య భావమ్ము గానే.. నా మాట నీ మాట నా దౌను గానే.. విశేషం విశ్వమ్ము సౌభాగ్యమే
ప్రమోదమ్ము ప్రావీణ్య భావమ్ము గానే.. నాశక్తి నీయుక్తి నాతీర్పు గానే.. నిదానమ్ము నిత్యమ్ము సంతోషమే
మమేకమ్ము మాధుర్య లక్ష్యమ్ము గానే... నాభక్తి నీ ముక్తి నా నేర్పు గానే... చిదానంద సర్వమ్ము సంతృప్తి యే
జరుగు బాటు జీవితమ్ము జాగు నెంచి జాడ్య కళలు
రంజింపు కళలేమనసు రవ్వ వెల్గు జూపు కళలు
వాంఛలేని లేమి బతుకు వ్యామోహం తోను కళలు
బంధము నిలిపేటి కథలు బ్రతికి బ్రతికించే కళలు
పైసల పాశమనకయే పైరవీలు లేని కళలు
విలాసాల ఊహలేదు వినయవిధేయతగ కళలు
వేకువ నేస్తముగానే వెత లెన్ని యున్న కళలు
కడదాకా కన్న తల్లి కమ్మ నైన కథల కళలు
*మంచి అన్నది నేడు మంచులా కరగక, చెడు అన్నది నేడు చెత్తవలె పెరుగక, మోస మన్నది నేడు తెలియక, మాయ తెరలో మునిగి పోయె బాల్యం లో ప్రేమ.
ఇంకావుంది
*****
దీర్ఘ కవిత్వ మనిషి తాండవ తత్త్వం (3)
రచన మల్లాప్రగడ రామకృష్ణ (రోజువారీ కథ)
ఋతువులు మారుతూ కాలచక్రం జరుగుతుంది, ప్రకృతి కళల ప్రభావం ప్రతి కుటుంబంలో సంభవం.
ఈ చిన్నారి బాలిక కదలికలు చూడ,
నిర్మలంగా హర్షిస్తాయి పెదవులు, వక్షోజాలపాలతో ఆకలి తీర్చుకొని, పెదవులు చప్పరిస్తూ, కదలికలతో జరుగు తూ, చేతులతో కాళ్ళను పట్టుకుంటూ, నోటిలో పెట్టుకుంటూ, పక్కను తడుపుతూ, దీప శిఖలా చతురత వెలుగుతూ, మల మూత్రాల మధ్య నలుగుతూ, స్వేచ్ఛగా స్వచ్ఛత తెలియని తనము, నవ్వులు తెప్పిస్తూ, చేతులు కాళ్లతో గాలిలో బంతి యాట, జోల పాటకు నిద్రలో మునిగే.
ఇరువది ఒక్కరోజు సందర్భముగా పాపకు నామకరణం చేయదలచిన తల్లితండ్రులు *ధరణీ ధర్మతేజ యొక్క మొదటి సంతానం.
బంధుమిత్ర సమేతంగా పండితులు బ్రాహ్మణలు నిర్దేశించిన శుభదినమున సంతోష పారవస్యంతో మునిగిపోయారు.
పెద్దల సమక్షాన పాపకు *దేవీ శ్రీకృపా * నామ నిర్ధారణజరుగగా వచ్చినవారు దీవెనలిచ్చారు. నూతిలో చాదవేసి ఊయలలో పాప నుంచి ఊపుతూ అమ్మలక్కలు, ఆడబిడ్డలు, ఆనందపు స్వర మాధుర్యముగా వీనుల విందుగా లాలిపాటలతో నృత్యాల హావభావ విన్యాసాలుగా ఆత్మీయ హృదయాల స్పందనలు మారుమ్రోగె మేళతాలాల మధ్య సంబరాలు.
*మందారం.. దేవిశ్రీకృపా*
...సందడే సందడి...
ఎందు జూడ కాంతిమాల యెదను తట్టు కాంతిమాల
ముందు వెన్క కాంతిమాల క్రింద మీద కాంతిమాల
కొండపైన వెన్నెలతో కోనలోన వెన్నెలతో
నీటిపైన వెన్నెలతో తోటలోన వెన్నెలతో
గోపురాన వెన్నెలతో గుడిసెపైన వెన్నెలతో
పూలపైన వెన్నెలతో ఱాలపైన వెన్నెలతో
గుట్టపైన వెన్నెలతో గట్టుపైన వెన్నెలతో
పుట్టపైన వెన్నెలతో పిట్టపైన వెన్నెలతో
మిట్టపైన వెన్నెలతో మట్టిపైన వెన్నెలతో
చెట్టుపైన వెన్నెలతో దట్టమైన వెన్నెలతో
పాలవోలె వెన్నెలతో పూలవోలె వెన్నెలతో
పంచదార వెన్నెలతో మంచులాటి వెన్నెలతో
మరులు గొల్పు వెన్నెలతో మురిపె మిచ్చు వెన్నెలతో
వానవోలె వెన్నెలతో వఱదవోలె వెన్నెలతో
నిశీథాన వెన్నెలతో నీరవంపు వెన్నెలతో
కనుల దాకు వెన్నెలతో మనసు దాకు వెన్నెలతో
సరసమైన కాంతిమాల స్వరము లిచ్చు కాంతిమాల
ప్రేమరసపు కాంతిమాల కాల రసపు కాంతిమాల
****
భౌతిక భౌద్ధిక, మార్త, అమూర్త ప్రకాంపణాలు ప్రతిఫలనాలు, బంధ.. ప్రతిభంధకాల నడుమ ఉల్లాస, ఉత్సాహ, ఉన్నత, భావాల మధ్య జరిగింది వేడుక.
ఇంకవుంది
*****
దీర్ఘ కవిత్వ మనిషి తాండవ తత్త్వం (4)
రచన మల్లాప్రగడ రామకృష్ణ (రోజువారీ కథ)
ముద్దులొలికే పాప ఏడుపు మాప.. తల్లి హృదయంలో చెలరేగే పాట
అదిగదిగో గగనసీమ అందమైన సందె రంగు ఆడె నోయి
పదిల మనస్సుగలనీవు పంతమైన యేడ్పు యేల మాన వోయి
ఇదిగిదిగో తూలి రాలె నాకు లెన్నొ సందె రంగు కూడె నోయి
విధిగను నీదాహమంత తీర్చ తల్లి నైతి యేడ్పు మాన వోయి
హాయి హాయి యీశరత్తు తీయనైన దీవేళ
దేహతృప్తి తీర్చె మత్తు తీయనైన దీవేళ
యీధాత్రియె స్వర్ణవనం లోకమ్మే ప్రేమమయం మఱువకోయి యీ సత్యం
యీ మాయయె నమ్మవరం శోకమ్మే ప్రేమమయం మఱువకోయి యీ సత్యం
హాయిగా నిదురపో రేయిలో
నీకోసమె జగమంతా నిండెనోయి వర్ణాలు
నీప్రేమయె మనసంతా పండెనోయి యందాలు
తేలెనోయి గాలిపైన చిత్రమైన పర్ణాలు
పాలు త్రాగి నిద్ర పొమ్ము చిత్రమైన స్వర్ణాలు
పరువాల విరితోట పవనాలు రేయిలో నిదురపో పాపా
కరువౌనె యెదలోన కవనాలు రేయిలో నిదురపో పాపా
తరునాన సుఖమేను చలిగాలి రే యిలో నిదురపో పాపా
బరువైన హృదయమ్ము నందునే రేయిలో నిదురపో పాపా
జలతారు తెరలందు శశిరేఖ మాయలో చిక్కకా నిదురపో పాపా
వలరాయఁ డమరంగ భవనాలు రేయిలో నిదురపో పాపా
చదలందు శశి చిందు సరసాల హేలలో చిక్కక నిదురపో పాపా
మదియందు తలపోత జవనాలు రేయిలో నిదురపో పాపా
చెలువాల సిరిమల్లె సిరిగంద మెక్కడో చూడకు నిదురపో పాపా
తలలోని కురులందు దవనాలు రేయిలో నిదురపో పాపా
విన మోహనమనస్సు ప్రియమై ధ్వనించఁగాఁ నిదురపో పాపా
బ్రణయంపు మన ప్రేమ హవనాలు రేయిలో నిదురపో పాపా
యింకా వుంది
******
దీర్ఘ కవిత్వ మనిషి తాండవ తత్త్వం (5)
రచన మల్లాప్రగడ రామకృష్ణ (రోజువారీ కథ)
పాప ఏడుపు మానగా ఇంట్లో పడుకోబెట్టింది ధరణి, బయట బిచ్చగాళ్ళ యొక్క అరుపు వినబడుతున్నాయి, కొందరు సన్యాసులు పాటలు పాడుకుంటున్నారు, ఆ పక్కన ఉన్న దేవాలయంలో నుండి వినబడుతున్నాయి. అవి అద్భుతమైన తత్వాలుగా మనసును దోచుకుంటున్నాయి ప్రతి ఒక్కరిని
సంతోషాన్ని దాచుకోక సమయ సందర్భాన్ని సద్వినియోగపరచు
అభిమానాన్ని వదులుకోక అణువణువు సహకరించు
అవమానమని ఏకరువు పెట్టక తప్పొప్పులను గమనించు
మమకారాన్ని మరవక త్యాగమనే ఉపకారాన్ని అనుసరించు
అనుబంధాన్ని విడువలేక ఆనంద మారోగ్య మందించు
వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోక కీర్తి పదంలో ముందుకు పయనించు
కోపం భాధ వ్యక్త పరచక చెలిమిగా ప్రేమను కురిపించు
మోసాన్ని ద్వేషాన్ని చూపక అవరోదాన్ని నియమంగా అధికమించు
మనుషులు తలలెత్తి తిరిగేట్లు మనసు పంచి బతుకు నెంచు
తనువు దారి చూపి మనసుని నిర్భయంగా ఉంచు
మౌన మిధ్య సలుపు సంసారపు నడక గోడలే జ్ఞానం విరివిగా వెలువరించు
అలసట నెరగని శ్రమజీవి పలుకుల నిజములుగ మేల్కొలుపుగా జీవించు
దేశ గతి నంత కాలమాయ ఇదియు యని గమనించు
స్వచ్ఛ తనము చూపి స్వేచ్ఛా స్వర్గానికి దారి చూపించు
విడిపోదు ఎపుడు ప్రపంచము చెలిమితో కదిలించు
సత్యాంతరాళంలోంచి పలుకు నిత్య సత్య మొవ్వు,
వ్యత్సాస్యమేమియు చూపకు మతియు తెలిపి చదువు,
ఆచారపుటెడారి మనసునే ఆచి తూచి నడువు,
మనసు నిరంతరం వికసించె విధముగా ప్రవర్తించు
అంటూ పడుకుంటున్నారు.
అప్పుడే ధరణి అత్తగారు విన్నావా కోడలా, ఆ పాటల్లో సత్యం
అవి నాకేకాదు మీకు కూడా వర్తిస్తాయి కదండీ! ఆ.. ఆ
అప్పుడే తల్లి శాంతమ్మ వచ్చి పాప ఏడుస్తుంది పాలు పట్టు అట్లాగేనమ్మ అంటూ కదిలింది ధరణి
ఇంకవుంది....
*-****
దీర్ఘ కవిత్వ మనిషి తాండవ తత్త్వం (6)
రచన మల్లాప్రగడ రామకృష్ణ (రోజువారీ కథ)
లోకం తీరు తెలుసుకో కోడలా
త్రాగెవన్నీ పాలుకావు, వినేవన్ని మాటలుకావు, చూసేవణ్ణి నిజాలుకావు, అర్ధం, తీర్ధం, పరమార్ధం అంతా ఆ దేవుని లీలే మనం నిమిత్తమాతృలం
అంతేనా మావ గారు
అంతేకదా
అయితే
ఎవరైనా నన్ను పొగిడారు
అంటే నన్ను పాడు చేయడానికి
సిద్ధంగా ఉన్నారు అని అర్థమా?... ఆలోచించు
ఎవరైనా నా తప్పు లేకుండా
నిన్ను నిందించారంటే నా వల్ల వాళ్లు మానసిక ఆనందం పొందడానికి అని అర్థంమా?.... గమనించు
ఎవరైనా నన్ను ప్రేమించారంటే
వాళ్ళు నా నుంచి ఏదో ఆశిస్తున్నారని అర్థమా?.. సహకరించు
ఎవరైనా నన్ను నమ్మించారంటే వాళ్లు నన్ను వెన్నుపోటు పొడవడానికి అని అర్థమా? ... ధ్రువీకరించు
ఎవరైనా నన్ను ఎదుర్కోలేరంటే నా మీద నింద వేయడానికి తెగించారని అర్థమా? ... విశధీకరించు
ఎవరైనా నా మీద గెలవలేక వాళ్ళ ఓటమిని ఒప్పుకోలేక నన్ను నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారని అర్థమా?.... సందేహించు
ఎప్పటికైనా నువ్వు చేసేదే నిజమే
నీకు నిజమనిపించేదే నిజమేనని అర్ధమా? .... స్థితి లయలు వివరంచు
ఎదుటి వాళ్ళు చెప్పింది కాదు ఎదుటి వాళ్ళు చేసింది. కాదు నీకేది మంచిగా అనిపిస్తే అదే అర్ధమా.....తప్పొప్పులు తలపించు
ఒకటి సలహా వినకు ,ఒకరి గురించి ఆలోచించకు,
నీ పని నువ్వు చేసుకుంటే పో ఫలితం కాలానికి విడిచిపెట్టు. అంటే అర్ధమా?.... దేవుని లీలని జపించు
న్యాయంగా ఉండకు అన్యాయాన్ని సహించకు. న్యాయాన్ని అన్యాయాల గురించి ఆలోచిస్తే నువ్వు అన్యాయం అయిపోతావని అర్ధమా?.... త్రాసులా చలించు
ఈ క్షణం నువ్వు ఒకరి మీద జాలి పడితే తర్వాత అందరూ నిన్ను చూసి జాలి పడతారని యర్ధమా?.......అనుకరించు
ఎప్పుడైనా ఎవరైనా నిన్ను చూసి జాలి పడితే నువ్వు ఓడిపోయినట్టు. నువ్వు గెలవడానికి మాత్రమే ప్రయత్నించాలిని యర్ధమా?......విశ్రాంత పరచు
అమ్మో కోడలా ఎంత గడుసుతనము అర్ధం అంటూ, అర్ధమైనదా యంటూ, ఎంతచక్కగా చెప్పావు
మామ గారు ఎంతైనా మీ యనుభవం ముందు నా అర్ధం అంతా వ్యర్థం కదా......
ఎంతమాట ఎవరి తెలివి వారిదే, దీనిలో చిన్నా పెద్దా ఉండదు అందరం ఆ దేవుని బిడ్డలం అంతేకదా... అంతేకదా.. ఆ... ఆ..
*****
దీర్ఘ కవిత్వ మనిషి తాండవ తత్త్వం (7)
రచన మల్లాప్రగడ రామకృష్ణ (రోజువారీ కథ)
మావగారు మావగారు
ఏమిటమ్మా... యలా నెమ్మదిగా అడుగుతున్నావు
ఈనాటి వార్తలు వింటుంటే భయముగా వుంది
ఎవరుచేసిన కర్మ వారు అనుభవస్తున్నారు అంతే కదా...
మావారి నుండి ( ధర్మతేజ్ ) ఫోన్ విని 3 రోజు లైంది ఏదో భయముగా నుంది
ఏమీ కాదు ఆ దేవుణ్ణి నమ్ముకో ఏ చెడు జరగదు, ధైర్యమే నీకు బలము...
దీపావళికి వస్తాడమ్మా...
మక్కువ ప్రీతిగా మనసు మిక్కిలి దయ...మితిమీరిన వేగ మితము గాంచు
అత్యాశ బ్రతుకున అతి యా లోచన....అపకార చలిమియే అహము నెంచు
అల్పుల పలుకులు అంబరమును జూపు...అలవికాని పనులు ఆశ నెంచు
చెడని తెలిసి జేరి చింత లనుటయే... తోడ్పాటు జేయుట తోడు నెంచ
అంటూ పుస్తకము చదువుతున్నారు మావగారు....
ధరణి ఆలోచన లో పడింది.. నెమ్మదిగా అలాపనా
మావగారు నవ్వు మోముతో చదువు కుంటున్నారు
నిను జూడఁగ - నీవు రావుగా -కన లేనిది - కాలమేనుగా
ఋణమైనది - రమ్య తేనుగా -ప్రాణమైనది - ప్రాభ వమ్ముగా
దినమయ్యెను - దివ్వె వెల్గెరా -దినకరుఁడిప్పుడె - దిగ్గి వెళ్లెరా
ధనమంతయు - దారి తప్పెరా -అనయము నీకయి - యాస లిందురా
క్షణమైనను - క్షామ మేనురా -తృణముయు నీదియు - తృప్తి పొందురా
కణ మైనను - కామ్య మేనురా - ప్రణతియు మీదయ - ప్రాభ వమ్మురా
ఒక దిక్కున - నుండు సూర్యుఁడో - చకచక మున్గెను - సంధ్యవేళ రా
ఱొక దిక్కున - నుండు చంద్రుఁడో -చకచక లేచెను - సంధ్యవేళ రా
నిధి నీవని - నేను దల్చఁగా - వదనము సూపవు - పాపమబ్బురా
హృదయమ్మొక - ప్రేమడోలరా - కదలుచు రమ్మిట - గాలి నూఁపఁగా
కలలే గతి - కాల మార్పుగా - తలపులు నీవియు - తాప మవ్వురా
మలుపే స్థితి - మాయ నేర్పుగా -పిలుపులు నావియు - తీవ్ర మయ్యెరా
అప్పుడే ఫోన్ మ్రోగింది... అదుర్దాగ అందుకుంది, కుశలప్రశ్నలపర్వము కదిలింది, ఆనందం వెళ్ళు విరిసింది
అబ్బాయినుంచేనా ఫోన్, అవును మావగారు...
సంతోషం... మంచి కాఫీ తెస్తావమ్మా..
....
మావయ్యగారు ఇదిగోనండి...
ఆ... ఆ... కాఫీ సెగలు తగ్గలా.. ఆలోచనలు మారలా...
ఇంకా ఉంది
*****
దీర్ఘ కవిత్వ మనిషి తాండవ తత్త్వం (8)
రచన మల్లాప్రగడ రామకృష్ణ (రోజువారీ కథ)
ఏమిటి యలా యున్నావు ధరణి, మీమీద కోపమొచ్చింది
ఎందుకో
మనపాపను ముద్దాడి ఎన్నిరోజులైందో తెలుసా
పాపనా.... నిన్నా
మీ చిలిపి చేష్టలు ఇక్కడ పనిచేయవు
మరెక్కడ
అదిగో ఆచూపే నన్ను ఉడికిస్తుంది
చాలు చాలు స్నానం చేరండి వేడి నీళ్లు పెట్టొచ్చా
అబ్బా
ఏమైందండీ
వేడిగా విన్నాయి నీళ్లు, ఒక్కరివ్ చల్లభరచుకోండి...
అంతేనా... ఇప్పటికంతే
అబ్బో ఏదో కవిత వ్రాసి నట్లున్నావు
ఏదో మనసొప్పక కలల తీరు అక్షర రూపమండి
అవునా
వుండు చదవనీ
నవ్వుతూ కాగితం చేతిలో పెట్టింది
ఆ...
మబ్బుల దుప్పటి కప్పుకొని నిద్రిస్తుంటే
వెచ్చని నీ రాకతో....
కలల సముద్రంలో, నిద్రపోతు, తేలియాడుతూ,
మీ జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ, పాపకు ముద్దు లిస్తూ, రంగురంగుల వర్ణాలెన్నో మనసులో కలవరపడుస్తూ, మనమిద్దరమూ సీతాకోకచిలుకలమై
ఏ దూర తీరాల్లో విహరిస్తూ, అందమైన చిత్రాలను తిలకిస్తూ, ప్రకృతిని మీరు ఆస్వాదిస్తూ, నేను తిన్మయము చెందిఏదో తెలియని అనుభూతిని అనుభవిస్తూ,
మన ప్రేమ సామ్రాజ్యంలో మనదనే స్వర్గాన్ని సృష్టించుకొని చిట్టి చిట్టి పూలతో పలకరిస్తూ,
అందాల లోకంలో ఆనంద డోలికలో అనుభవ సంగమము వెచ్చని సూర్యుడు చల్లపడగా వేకువతో మెలుకువగా
మన పాప దేవి శ్రీ కృపా బ్రతుకు బండిలో
మనకు తోడు నీడగా జీవధాత్రి.
సరస రా యిది యెంత - చక్కని రేయి
సరిగమా సమయోగ - సంతృప్తి రెయి
చరలి రా యిది యెంత - చల్లని రేయి
మరువలేనితనమ్ము - మాధుర్య మోయి
మలలపైఁ బొగమంచు - మందము గాలి
కలువపై కళ పెంచు - కాలపు గాలి
కలలతో నిది యెంత - కమ్మని రేయి
వలలలో విధి చిక్కె - వలపుల గాలి
పొసఁగఁగా మెలమెల్ల - పిల్చెను తార
పసితనం కళలెళ్ళ - కల్లోల గాలి
పసిఁడియా యిది యెంత - పచ్చని రేయి
రసికతే చిరునామ - రమ్యత గాలి
రసిక నీరవమైన - రమ్యపు వేళ
కసి చూపు కరువైన -- కమ్మని గాలి
మిసిమితో నిది యెంత - మెత్తని రేయి
శశి రాత్రి చలనమ్మ - స్వేచ్ఛయు గాలి
భువి ముదంబిడుచుండె - మోహనమౌచు
కవికాంచ కనువిందు కమ్మని గాలి
దివి గదా యిది యెంత - తియ్యని రేయి
వివరాలు నిజమాయె --వినయమ్ము గాలి
అని కాగితం పై ధ ర్మ తేజ వ్రాసి ఉంచే
అబ్బో ఏదో మీరు కూడా వ్రాసారే
నీ అంత కాదులే ఏదో కొంత
ఆమ్మో చక్కగా వ్రాసారే ఆందులో చందస్సులో అద్భుతం ఏదోలె
యదో వ్రాత
మన తెలుగు భాష అగౌరపరచకండి చక్కగా వ్రాసారు
అంతేనా... అంతేగా.. ఆ... ఆ
.*****
దీర్ఘ కవిత్వ మనిషి తాండవ తత్త్వం (9)
రచన మల్లాప్రగడ రామకృష్ణ (రోజువారీ కథ)
ఏమండి... మీ పేరుతో ఒక ఉత్తరం వచ్చింది
చదివితివా
లేదండి
పరులవుత్తరాలు చదవకూడదని
ఆ సరే...ఏది ఆ ఉత్తరం
ఇక్కడే పెట్టానండి అంటూ వెతుకుతున్నది ధరణి
అపుడే మైమరుపా
గుర్తు తెచ్చుకో
ఆ గుర్తొచ్చుంది పాప చెడ్డీలు ఉన్న చోట పెట్టాను ఉండు తెస్తాను
ఆ ఇదిగో నండి
ఏమి టండి అలా చూస్తున్నారు
నీలో ఏదో కొత్త మార్పు కనిపిస్తుంది
ఎవడో చెప్పాడు ఎన్నేళ్ళొచ్చినా ఆపనికి ఎప్పుడూ కొత్తే నటా
ఏ పనో చెప్పలేదా
సిగ్గులేదా మహానుభావా, పాప పిలుస్తుంది వెళ్ళొస్తా
ఆ అప్పుడే మాటలా
ఆ నాన్నా అని పిలుస్తుంది, ఎత్తుకో మంటుంది రండి
యిప్పటికి నీవెళ్ళు...
ఈ ఉత్తరం చూస్తాను
చూస్తాను కాదండీ చదివి చెపుతాను అనండి అంటూ నవ్వుతూ కదిలింది ధరణి
నీ ప్రేమను కొలిచేందుకు.. చాలవందు ఈకన్నులు..!
నీ మార్పును మలిపేందుకు.. ఆశ యందు ఈ కన్నులు..
నీ ఒడిలో చేరువరకు..మలగవందు ఈకన్నులు..!
నీ దడిలో చిక్కు వరకు.. మెలగ నన్న ఈ కన్నులు...
ఆశ పడుట తప్పంటే..నొచ్చు కోను ఇంతైనా..
పాశమవని ప్రేమంటే... సెప్పు కోను ఇంతేనా
నీ చూపుల తేనె గాక..గ్రోలవందు ఈకన్నులు..!
నీ మాటలు మర్చి పోక.. జోల పాట ఈ కన్నులు
కలనైనా దరికిరావు..మాటాడవు నవ్వుతావు..
వల తోనా పనికి రావు.. చూడా రావు నవ్వుతావు..
మదినేలే దొర నీవని..తెలుప వందు ఈకన్నులు..
విధిలేకే తెలిపానని.. మరువ నన్న ఈ కన్నులు..
తలనిమరగ చిరుగాలిగ..ఏవేళకు వచ్చేవో..
మలుపు వలపు మనసాయగ.. యే తాపము తెచ్చావో
ఎదురుతెన్ను లేమాత్రం..ఓపవందు ఈ కన్నులు..
బెదురుతున్న ఈ తంత్రం.. చాల వందు ఈ కన్నులు
నా వెచ్చని ఊపిరికే..ఊపిరనగ నీధ్యాసే..
నా కొగిలి ఊపులకే... తాళవనగ నీ ధ్యాసే
ఆపదలో సంపదలో..తెలియవందు ఈ కన్నులు..
ఓ పికలో వోర్పౌనులే.. వయసునందు ఈ కన్నులు
నీదయతో పారిజాత..వనసీమగ..మిగిలితినే..
నీదరికే రాకయున్న.. తణువైతిమి.. మిగిలితినే
నీ పదములు గాకేమీ..చూడవందు ఈకన్నులు..!
నీ పెదవులు గాకేమీ... పల్క వందు ఈ కన్నులు
నీ మాయా వినోదమే..పట్టవందు ఈకన్నులు..!
నీదాహం తీర్చ నున్న... వేచి వున్న ఈ కన్నులు
నీ ప్రేయసి
ప్రేమ * పారిజాతం *
ఏమిటండీ ఆ ఉత్తరం.. ఏమి వ్రాసారండీ ఆ ఉత్తరములో
ఆ ఏమి లేదు, ఏమిలేదు
ఆ చాలా ముఖ్యమైన పనుంది ఇప్పుడే వస్తాను
తొందరొద్దండి నిదానంగా వెళ్ళండి
భోజనం కోసం వేచివుంటా
అలాగే.... అలాగే
****-
దీర్ఘ కవిత్వ మనిషి తాండవ తత్త్వం (10)
రచన మల్లాప్రగడ రామకృష్ణ (రోజువారీ కథ)
అనురాగపు శిఖరాల మధ్య ఆనందపు హావ భావాల మధ్య వెళ్లి విరిసిన కుసుమ తరంగాల వైభవోపేతమైన ఆలాపన ఆనందామృతం ఆహ్లాదముతో *ధరణీ ధర్మతేజ* తన్మయ తత్వం ఆశ్రిత బంగారపు కలల ఆనంద నిలయం ఆధరామృత ఆహ్లాదము అందరికి ఆనంద అమోదితం.
ఏమాయగ యీవేళే యే రూపము యీపూటే
ఏమందము నీమోమే యే మోజిక పోదేమో
నారాణివి నీవేగా నా ప్రాణివి నీవేగా
నా వాణివి నీవేగా నా వాక్కుగ నీదేగా
ఈరోజిక రాదేమో యీ మోజిక పోదేమో
ఈరాగము కాదేదో యీదాహము కాదేమో
నాపాలిట మోదమ్మే నాధ్యానపు నాదమ్మే
నాపాలన యోగమ్మే నా రాగపు వైనమ్మే
దీపావళి నేడేగా దీపాలకు వీడేగా
కోపాలిక వీడేగా కోలాటకు మేలేగా
ఈ రాత్రికి స్వర్ణాలే యీ ధాత్రికి వర్ణాలే
ఈ కాలము రత్నాలే యీ కామ్యము యత్నాలే
హారమ్మగు దీపాలే హర్షమ్మిడు యోగాలే
ప్రారంభపు శబ్దాలే ప్రావీణ్యపు మార్గాలే
మ్రోగెంబలు గానాలే మోక్షం బహు మానాలే
త్యాగంబులు వైనాలే తన్మాయలు రాగాలే
ఈ ముగ్గులు యందమ్మే భూమాత కు చందమ్మే
ఈ సిగ్గులు తీర్చేవే యీ పొంగులు తగ్గేవే
నా మానసమే ముగ్గే నా రూపము యారంగే
నా యానతియే సిగ్గే నా దేహము యారంగే
యీ చీకటిలో వెల్గే యీ జీవితమందెల్గే
ఈ దేహములో వోర్పే యీ దాహములో తీర్పే
ప్రాచీనము నవ్యమ్మే ప్రాబాల్యము భవ్యమ్మే
యోచించకు దివ్యమ్మే యోధైర్యము మూలమ్మే
నీ మోహపు హాసాలే నాజీవన వాసాలే
నీ చూపుల వైనాలే నీ యాకలి తీరా లే
ఈ దారిన కాంతేలే నిష్ఠమ్ముకు నీడేలే
ఈ హాయికి నీవేలే యీ రాత్రికి మోజేలే
అలా పాడుకుంటూ దీపాల వెలుగులమధ్య....మతాబులు, చిచ్చుబుడ్లు, కాక రపూవొత్తులు,, బాంబులతో మారుమ్రాగెను ఆ కుటుంబములో తీపి కధలతో సందడిగా....
చింత చెదిరియే యానంద చేత లుడుగె
మనసు గూటికి చేరువే మమత లుడుగె
కలిమి భోగము కలిగించు కళలు కలిగె
చెలిమి సంవృద్ధి గాకళా చేరువగు నె
తొలగు వెతలంబు తిమిరము తోడు గనియె
మోదపు వెలుగు విరియుట మోక్ష మగుయె
వెడలు నిస్పృహ నిస్సార వేల్పు లగుయె
కాంతి మదినెల్ల కోవెలె కాలమగుయె
బంధ మార్గ నిస్వార్ధము బలము గనగ
కలయు ప్రేమకాలమగుట కాంక్ష తీరె
వచ్చు యడ్డంకు లన్నియు వలసి పోవు
వెడలి దీపావళి శుభము లివ్వ వలెను
*****
ఉ.ఆదిగ నాదిలక్ష్మికళ ఆశ్రిత వెల్గుల లక్ష్యమేయగున్
శోధన కాంతులే కదలి సాద్య విముక్తియు సత్య నిష్ఠగన్
వేదన వీడి నిశ్చలత విద్యల వెల్లువ ఐక్యమేయగున్
మోదము కర్త కర్మలగు మోక్షపు కాంతిగ వారసత్వమున్
******
మ.అభిమానమ్మగు వేళ సన్నిహితమున్ యాత్మీయ జీవమ్ముగన్
అభిమానం వెళుగౌను యందరికి సేవాతత్త్వమే దీపమున్
సభ దీపావళి హృద్యమేయగుట యేసాధ్యమ్ము నిత్యమ్మునన్
అభయమ్మున్ సహనమ్ముగా జనులు ప్రామాన్యమున్ దేశమ్మునన్
*****
శా.కాపాడే భవబంధమున్ గనజనుల్ కామ్యమ్ము తీర్చేoదుగన్
పాపాత్ముల్నియె దున్మి నారుగననన్ పాశమ్ము కృష్ణాత్మగన్
శాపాలన్నియుతొల్గ నేస్తముగను న్ సాధ్యమ్ము ధర్మమ్ముగన్
దీపాదివ్యకలౌనుపండుగదియే దివ్యత్వ దీపావళిన్
*****
ఇంకా వుంది
*****-
దీర్ఘ కవిత్వ మనిషి తాండవ తత్త్వం (11)
రచన మల్లాప్రగడ రామకృష్ణ (రోజువారీ కథ)
ధరణీ.. ధర్మతేజ సుఖ సల్లాపం
నీలోఁ బ్రియమ్మే సకీ / నాలో వరమ్మే సకీ
నీలో జయమ్మే సకీ / నాలో ప్రియమ్మే సకీ
నీలో శుభమ్మే సకీ / నాలో భయమ్మే సకీ
నీలో మనస్సే సకీ / నాలో సుఖమ్మే సకీ
అంటూ పాడాడు ధర్మ తేజా అప్పుడే ధరణి వాక్కులు
ఆ లోచనమ్మే గదా / నాలో దృశమ్మే నువే
ఆలాపనమ్మే గదా / నాలో ప్రె మమ్మే నువే
కాలా వరమ్మే గదా / జ్వాలా భయమ్మే నువే
బేలా సుఖమ్మే గదా / బంధమ్ము యేలే దువే
అప్పుడే ధర్మతేజ పలుకులు
ఆనందలోకమ్ము నీ / వీణాస్వనమ్మే సకీ
ప్రాణమ్ము నీదేను నీ / స్వేచ్చా తనమ్మే సకీ
ధ్యానమ్ము నీతోను నీ / నాట్యమ్ము నమ్మే సకీ
మౌనమ్ము యేలేను నీ / మార్గమ్ము నాదే సకీ
అప్పుడే ధరణి వాక్కులు
కామాగ్ని ధూమమ్ము నా / ప్రేమాంబుదమ్మే నువే
క్షేమమ్ము కోరేటి నా / క్షేత్రంబు నమ్మూ నువే
శ్యామమ్ము కాంతుల్ల నా / శాంతంబు పొందే నువే
కామ్యమ్ము కాలమ్ము నా / కావ్యంబు పొందే నువే
ధర్మతేజ పలుకులు
వాణీవిలాసమ్ములో / గానోద్భవమ్మే నువే
రాణీ సుఖాసమ్ములో / రాజ్యమ్ము పొందూ నువే
వాణీ భవమ్ము విదీ / వాక్కౌను తృప్తీ నువే
రాణీ నయమ్ము మదీ / రమ్యత్వ తృప్తీ నువే
ధరణి పలుకులు
దామోదరాస్త్రమ్ములో / దాంపత్య సౌఖ్యం నువే
ఆమోహనాస్త్రమ్ములో / శ్యామోత్పలమ్మే నువే
ప్రేమా మనస్సే గతీ / ప్రావీణ్య బంధం నువే
క్షేమమ్ము గానే మదీ / దాహమ్ము తీర్చే నువే
నీనవ్వు నాదౌనులే / నాదేను నీదౌనులే
నీనవ్వు నాదౌనులే / నాదేను నీదౌనులే
అలా సాగింది ఈ రోజు ఆనంద సౌరంభం ఆశ్చర్యంతో సుఖాంతం
******
దీర్ఘ కవిత్వ మనిషి తాండవ తత్త్వం (12)
రచన మల్లాప్రగడ రామకృష్ణ (రోజువారీ కథ)
దీపావళి సంబరాలు ముగిసాయి, తీపి పదార్ధాలతో నోరు తీపి జేశారు. చిన్ని చిన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి, సముద్రానికి అలలు తప్పవు, కుటుంబంలో ఆట పోటు తప్పదు అనుకున్నారు.
ధరణి తెలుపుతుంది
చిత్రమైనదీ ధరిత్రి జీవితమ్ము సౌ ఖ్య మా
వింతమార్పుగా ధరత్రి యేల తెచ్చు దుఃఖ మా
శాంత యన్నదీ ధరిత్రి నందు
యేది బంధ మా
కాంతియున్నదీ ధరిత్రి మార్పు లేదు చిత్ర మా
ధర్మ తేజ పలుకులు
నేత్రమందు జిందె నీరు నిన్ను జూడ లేను రా
పత్రమో యనంగ రాలు భావనమ్ము నీకె రా
ధాత్రయే సుఘంద బంధ లక్షణమ్ము లేదు రా
రాత్రి పూట నాడు రాసకమ్ము నీకె రా
ధరణి తెలుపుతుంది
బాస లన్ని చేసినాను భగ్న మైన వెందుకో
మోస మేది నేను చేయ మౌన మేను మాను కో
ధ్యాస యంత నీదు భక్తి ధ్యాన మేను దేను కో
ప్రాస లన్ని వాడి చెప్ప ప్రాప కమ్ము మాను కో
ధర్మ తేజ పలుకులు
దోస మందు బల్కు చుండు దూష ణమ్ము నీకె రా
ఆశ చూప వద్దు నాకు ఆట యేమి నీకె రా
రోస మున్న కోప మున్న రొప్పు యాట నీకె రా
వాస మున్న చాలు నాకు వాక్కు లన్ని నీవి రా
ధరణి తెలుపుతుంది
పారు చుండు నాదు రక్త పాట లమ్ము నీకె రా
దారి చూప బుద్ధి నాది దాస్య మైన నీకె రా
నేర మేమి కాదు నాది నీడ గాను నీకె రా
భారమేది కాదు కాదు బంధ మౌను నీతొ రా
ధర్మ తేజ పలుకులు
వేరు జన్మ యున్న నీదు ప్రేమ నాకు దక్కు రా
వారు వీరు యన్న మాట వాసి కెక్క లేదు రా
చేరు వైన నన్ను జూడు చింత యేల నీకు రా
మారు మాట లన్ని వద్దు మాయ లన్ని మాపు రా
అలా అలా బంధమనే పడవ సాగుతుంది సంద్ర మనే కుటుంబం లో
******
ఇంకా వుంది
దీర్ఘ కవిత్వ మనిషి తాండవ తత్త్వం (13)
రచన మల్లాప్రగడ రామకృష్ణ (రోజువారీ కథ)
ఫలించునో నిష్పలమ్మొ నాయీ తలంపు సంగీత మౌనే నీకై
జ్వలించిన నిష్ఫలమ్మొ నాయీ ముగింపు విశ్వమ్ము వాక్కే నీకై
ముగింపు నిష్ఫలమ్మొ నాయీ తెగింపు ప్రాబల్య మంతా నీకే
యోగమ్ము నిష్ఫలమ్మొ నాయీ మౌనంబు జాడ్యమ్ము యంతా నీకై
స్మరింతు నిన్నీశ్వరుండా వంచున్ హరీ మురారి యనాది నాధా
భరింతునె వేషమంతా నున్నన్ హరీ భరీగ మనంగ నాధ
చలింతువె వేళయున్నా రీతిన్ మరీ తపించ సుఖించు నాధ
ఫలించునె నిత్యమున్నా కాలమ్ మరీ నటించ మనద్దు నాధ
వసంతుడై జీవనమ్ములో రా ప్రశాంతమై సుప్ర దీపనమ్మై
ప్రసన్నతే నీకలౌను లేరా ప్రభావమై సుప్ర వైపరీత్యమ్
జయమ్ముయే నిత్యమౌనులే రా భయమ్ము యేలౌను సమ్మతేలే
ప్రియావిదీనేస్త మే యగున్ రా ప్రయత్నమేనీది లే సుఖమ్ రా
నిశీథ వేళ న్నిరంతరమ్మై రసప్రదమ్ మై రమించ నింపై
విశాల సామ్యమ్ము గానులే యీవిపత్తు తీర్చేద సంభవమ్మే
సహాయ మేదేహ వాంఛలే తీర్చా సమంజసం నీకు నాకు దేవా
సహాయమే నిత్య తృప్తిపర్చేదా సమర్ధతే సత్య వాక్కు దేవీ
ధరణీ.. ధర్మతేజ.. నిరీక్షణ ఆధారం (జలౌఘ వేగా. జతరగ )
ఇంకావుంది
*------*
దీర్ఘ కవిత్వ మనిషి తాండవ తత్త్వం (14)
రచన మల్లాప్రగడ రామకృష్ణ (రోజువారీ కథ)
ధర్మటేజా యిలా రా బాబు
ఏమిటి నాన్నగారు నీవు నేను చేసేవన్నీ కాలాన్ని బట్టే
అర్ధం కాలేదు నాన్నగారు నీవు తెలుసుకోవాలి *కాల మహత్యం
చెప్పండి నాన్నగారు.
మార్పు కు కారణం నేర్పు, చదువుకు తగ్గ నేర్పు కు కారణం ఓర్పు, మానవత్వంతో బ్రతికే ఓర్పు కు కారణం తీర్పు, మంచో చెడో అర్ధం చుట్టూ తిరిగి తిరిగి తీర్పు కు కారణం కాలము
ప్రశ్న తోనే మనిషిలో వచ్చు మార్పు, ఎవరు జవాబుల సంకలనం చేస్తారో మరో కూర్పు,
సందేహాల హారంతో మనిషిలో వున్నా కనబడనీయని నేర్పు, జీవితంలో ఆటుపోటును తప్పవు
అన్వేషనలతో వ్యర్ధపరిచేది కాలము
మనిషి జీవితంలో శోధన సాధనతో కలిగేటి మార్పు, తెలియని సమాజము లో కల్పించు వింత పోకడలతో విధిలో కూర్పు, అనేక చిక్కు ముడులను విప్పి జీవి జీవితంలో తెచ్చు మార్పు అనేక విజయాల కోసం మారేటి కాలము
అవసరమో కాదో తెలియని నిజాల నిర్ధారణ పరీక్షల్లో మార్పు, జరుగుతున్నా మారుతున్న
అణ్వస్త్ర ప్రయోగాలలో వచ్చే కూర్పు, దేశ విదేశాల్లో సైతం అంతర్జాలంలో కలిగిన నేర్పు,
ధరణీ చరిత్ర మార్చలేక, జీవితకాలం బ్రతకలేక జన్మసార్ధకం అర్ధం కాక తిట్టుకొనేది కాలము
నవయువకులు జాతిని జాగృతం చేసే చైతన్యతో మార్పు తేవాలి, ఘాతుకములు అరికట్టుట, అఘాతములను తొలగించుటకు , ఘడియ, ఘడియ లో తెచ్చు నేర్చు, పెళ్ళిపుస్తకంతో అందరిలో ఉండే జీవ సాహిత్యం తీర్పు, విజ్ఞాన అజ్ణాన మేలవింపుతో ఉండేది కాలము.
ఇంకావుంది
--((***))--
దీర్ఘ కవిత్వ మనిషి తాండవ తత్త్వం (15)
రచన మల్లాప్రగడ రామకృష్ణ (రోజువారీ కథ)
ధర్మ సూత్రాలు కొన్ని తెలుపుతాను అలా కూర్చొని వినగలవు
అంటూ జ్ఞానేశ్వర్ గారు తెలియపరుస్తున్నారు
విజ్ఞానము దాచకయే
విజ్ఞతగను ప్రదర్శించు, వినయమ్మేలే
అజ్ఞానాన్ని తరిమియే
విజ్ఞానము భోదపర్చ విద్యగ ధర్మం
భయ్యం చెందక నిజ ని
ర్భయ్యం గురుసేవ చేసి, భాగ్యము విద్యే
భయ్యం గకళలు మార్చక
స్వయ్యం గా విద్యనేర్ప శిష్యగ ధర్మం
మాత, పితకు దూరంగా
శతృవులు దేశంలొదూర శక్తియు నాపే
పతకము యాయుధ జండా
మాతృత దేశముకు రక్ష మార్గము ధర్మం
పంచ విభూతుఁల నిన్నే
గాంచుచు పూజింతుమిచట గాఢపు ధర్మం
మించిన దేశము లేదు ప్ర
పంచమున, సుకృతము పండి పలుకే ధర్మం
తెలతెల వారక మున్నే,
తొలి భానుని కిరణము భువి దొరయక ధర్మం
కలకల ధ్వానముతో పిక
ములు నీదు స్తుతులు చలుపుట ముచ్చటధర్మం
సకల ప్రపంచము నీచే
చకచక నడిపించబడుచు సాగునెచట నా
గక, నానా కర్మలు తెలి
యక చేతుము, సైపు మాదు యజ్ఞా ధర్మం
వృద్దులు తల్లియు తండ్డ్రియు
శ్రద్ధ గ యాదరణచేయ సాక్షిగ జీవమ్
శ్రద్ధను చూపుచు కర్మలు
యుద్ధము వళ్లేను రక్ష పుత్రుని ధర్మం
బిడ్డకు మంచిని చెప్పియు
బిడ్డల విద్యాభివృద్ది చిత్తము నుంచే
అడ్డము తిరుగక చూచే
బిడ్డకు యండయగు తండ్రి తల్లి ధర్మం
భర్తగ సంపాదనలే
కర్తగ ఉండియు సమర్ద కార్యము దీక్షా
కర్తగ పిల్లల కండయు
భర్తకీ గౌరవము యిస్తు భార్యగ ధర్మం
సోమరి తనమే లేకయు
సమరము ధర్మాన్ని నిలప సా మ్యము నీదే
మమకారముధైర్యముగను
సమపాల్లగ నడచుటేను సమయం ధర్మం
నమ్మక మున్నమితృనికే
కమ్మిన చీకట్లుమార్చ కామ్యము ధర్మం
సొమ్ముగ యాధరణలుగా
వమ్మును చేయక చెలిమియె మిత్రని ధర్మం
ధర్మము సాక్షిగ పెళ్లియు
కర్మల విధిగాను సంఘ కార్యము చే సే
మర్మము తెలిసిన భర్తతొ
కూర్మం లా భార్య రక్ష పూజ్యము ధర్మం
--((*))--
దీర్ఘ కవిత్వ మనిషి తాండవ తత్త్వం (16)
రచన మల్లాప్రగడ రామకృష్ణ (రోజువారీ కథ)
*ప్రేమ.. మందారం*(ధరణీ.. ధర్మతేజ మధ్య)
వెర్రితనం ఉందెక్కడ..విశ్వమాయ నేనుగాను
చిరుగాలిగ అల్లుకుంది.. చిత్తమ్మున నేనుగాను
ప్రేమన్నది ఉందెక్కడ..ప్రీతి పంచ సుఖమ్మేను
గుండెసడిగ అల్లుకుంది గుబులుగాను నేనుగాను
నీవు-నేను ఉన్నామా..నేను నీకు సుఖమ్మేను
వేరేగా శ్వాసనడుగు.. విశ్వాసము నేనుగాను
మాట అసలు ఉందెక్కడ.. మాయలతో సుఖమ్మేను
మౌననిధిగ అల్లుకుంది.. మౌన గీత నేనుగాను
జలపాతా లేవోలే..జాలి జూప సుఖమ్మేను
మనకెందుకు ఈ వేళన.. మార్గ మార్పు నేనుగాను
చెలిమినదియె ఉందెక్కడ.. చిత్తమందు సుఖమ్మేను
ప్రియగీతిగ అల్లుకుంది.. ప్రేమ చుట్టు నేనుగాను
ఆగ్రహాలు మీటేనా..ఆశయాలు సుఖమ్మేను
ప్రణయవీణ తంత్రులనే.. ప్రణవ నాద నేనుగాను
ఆవేశం ఉందెక్కడ..ఆశయమ్ము సుఖమ్మేను
వేదాగ్నిగ అల్లుకుంది..విద్య లన్ని నేనుగాను
అనుబంధం ఆత్మీయత..అనురాగం సుఖమ్మేను
గంధాలే ఎన్నటికీ.. గాయాలగు నేనుగాను
వలపుతలపు ఉందెక్కడ..వరుస కలప సుఖమ్ముగాను
కాలమయం బ్రతుకు గాను..కావ్యమౌను నేనుగాను
వయసు ఉడుకు వరద పొంగు.. వలపు లింట సుఖమ్మేను
అనురక్తిగ అల్లుకుంది..ఆత్మీయము నేనుగాను
పరుగుతీయు పరువానికి.. పదనిసలగు సుఖమ్మేను
వసంతమే దాసోహం.. వాక్కుగాను నేనుగాను
ఆరాటం ఉందెక్కడ..ఆశ్చదనే సుఖమ్మేను
మరుమల్లిగ అల్లుకుంది.. మనసు నేను నేనుగాను
అక్షరాల గగనమోయి.. అర్ధమంత సుఖమ్మేను
ఒక భావం ఉందెక్కడ..ఒకమాటే నేనుగాను
శుభవాణిగ అల్లుకుంది..సుఖమ్మేను దుఃఖమ్మెను
రామకృష్ణ మాటలేను రమ్యతగా నేనుగాను
(ఎవరండీ ఈ రామకృష్ణులు... వారా.. ఆ వారే నా ఆరాధ్య దైవలు ) అమ్మవారినైతే నిత్యము
నేనూ వారినే పూజించేది అవునా నేనైతే ఆంజనేయుని తో సహా పూజిస్తాను
ఇంకా వుంది
-******
దీర్ఘ కవిత్వ మనిషి తాండవ తత్త్వం (17)
రచన మల్లాప్రగడ రామకృష్ణ (రోజువారీ కథ)
విన మ్మా ధరణీ ఆ కృష్ణ లీలలు అంటూ మావగారు తను వ్రాసుకున్న కవిత్వాన్ని చదివినిపించారు.
*
కొమ్ముతో వాడుండునేమో గంతు లేసే కన్నతల్లీ
కమ్మనైనా మాటల్లు చెప్పే యాట గాడే కన్నతల్లీ
నమ్మవేమో యీమాయ చేష్టే యాట యేమొ కన్నతల్లీ
నమ్మకమ్మే గోపి దేవీ నమ్మకమ్మే కన్నతల్లీ
అమ్మ నీకో దండమే వాడన్న చాలా బీతు నాకే
అమ్మ మాపై ప్రేమయే వాడన్న చాలా బీతు మాకే
నెమ్మ దెంచి వెన్నయే నేనన్న నాకే బీతు నాకే
కొమ్మలోనే దాగెనేమో కన్న డేడే కన్నతల్లీ
దుండగాలం జేయబోనే దుష్టులంటే దూరముంటా
బండ బుద్ధీ మార్చ నేనే బ్రష్టు లంటే దూరమంటా
అండ నేనే నన్న అత్మా నందు డంటే దూరమంటా
కుండలో వాడుండెనేమో కన్న డేడే కన్నతల్లీ
ఇండ్లలో నేదూరనమ్మా యెండలో నేనాడనమ్మా
కండ్లలో నిల్చేగనమ్మా కళ్ళతో నే నాడానమ్మా
పండ్లనే చేపట్టె నమ్మా పండ్లతో నే నాడానమ్మా
కొండపై వాడుండెనేమో కన్న డేడే కన్నతల్లీ
నీలమేఘమందు నేనే నేలపై నానోరు చూడే
గోల దేహమందు గొప్పే యైననే తప్పేమొ చూడే
కాల మాయయందు కమ్మే వెల్గుయే ఒప్పేమొ చూడే
గోళమంతా నేనెగాదా కన్న డేడే కన్నతల్లీ
మూలలో నీనీడలో నే మోహనుండే మంచివాడే
కాలమే నీ ధ్యాసగా యే మోహనుండే యెంచి నాడే
పాలనా నీదే విదీ యే మోహనుండే కాంచి నాడే
గోలలో నాపాలు లేదే కన్న డేడే కన్నతల్లీ
*
(వ్యోమగంగా (కామితా) - ర/త/మ/య/ర/గ )
అద్భుతంగా ఉంది మావయ్యగారు మీ రచన వింటుంటే తన్మయత్వంగా వుంది...
అదిచాలమ్మా ఆ కృష్ణుని ఆరాధిద్దాం...
ఇంకా వుంది
******
001.. ఒక వ్యక్తి సమాజంలో ఏ హోదాలో ఉన్నప్పటికీ తోటివారిలోని లోపాలను తొలగించి వారిని చక్కదిద్దటానికి తోడ్పడేవాడే మానవ జాతికి నిజమైన ఉపకారి అవుతాడు.
002..నిద్రిస్తున్న ఆత్మను తట్టి లేపండి. అది స్వస్వరూపంతో మేల్కొనడాన్ని చూడండి. మత్తు వదలి, పూర్తి మెలకువతో అది పని చేయడం మొదలుపెట్టిన మరుక్షణం అపరిమితమైన శక్తి సామర్థ్యాలు, తేజస్సు, పవిత్రతలూ మనసులో పెల్లుబుకుతాయి. సాటిలేని మేటి లక్షణాలన్నీ మన సొంతమవుతాయి.
003..చీకట్లు కమ్ముకున్నా యంటే వ్యభిచారుల కొంపలు వేల్గిపోతాయి అది చట్టబద్ధం అంటారు ఇదెక్కడి న్యాయం
004..ఒక్క రోజు జైల్లో ఉన్నవాడు అనర్హుడు అంటారు కాని నాయకులకు ఇది వర్తించదు ఎందుకో మనిషి మనిషికి తేడాతో ఇదెక్కడి న్యాయం
005..తల్లి తండ్రులు ప్రేమతో బిడ్డల్ని పెచుతారు, ఎదిగిన బిడ్డలు గుర్తించ లేదని బాధబడతారు బిడ్డల తల్లితండ్రుల మధ్య వ్యత్యాసం ఇదెక్కడి న్యాయం
006..చదువు తగ్గ ఉద్యోగం లేదు, వృత్తికి తగ్గ విలువలేదు, నెల బక్షం అంటూ బిచ్చగాళ్ళు ను మార్చే నాయకులు ప్రశ్నించే హక్కు ఎవ్వరికి ఉండదు ఇదెక్కడి న్యాయం