Wednesday, 28 February 2024




085.. ఓం శ్రీ రాం - శ్రీ మాత్రేనమ: శ్రీ కృష్ణాయనమ:
ఆనడం - ఆరోయం - ఆద్యాత్మికం

ప్రాంజలి ప్రభ
రచయత. మల్లాప్రగడ రామకృష్ణ
ఆది శంకరులు రచించిన భజగోవిందం శ్లోకాల భావాన్ని తేట తెలుగు లో తెలియ పరుస్తున్నాను.

భజగోవిందం -1
జీవితమనేది ఉషోదయం లా ఉత్సాహం అస్తమయం లా విశ్రాంతి ప్రతి ఒక్కరికి అవసరం. అన్నీ వషయాలలో వ్యాకరణ పాఠాలు వల్లె వేయుట వలన ప్రయోజనము లేదు. ఓ మూఢమతి ప్రాణావ సాన సమయమున చదివిన విధ్య రక్షించదు. కనుక గోవిందుని నిత్యము స్మరించండి. మృత్యు సమయంలో కూడా గోవిందుని నామమే రక్షించును.

భజగోవిందం - 2 (ప్రాంజలి ప్రభ)
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

మానవ జీవనానికి అతి ముఖ్యమైనది బ్రతుకు సార్ధకము చేసు కొనుటకు ఉపయోగపడేది ధనము. అవివేకి వలే ధనము కోసం అతిగా కష్ట పడకూడదు, లక్ష్మి యెంత వరుకు సహకరించునో అంతవరకే లభించును. పేరాశకు పోకుండా మంచి బుధ్ధితో బ్రతకటం నేర్చు కోవాలి. మన గత కర్మల ఫలితముగా మనకు లభించిన ధనముతో తృప్తి పడి జీవించటము వలన మన: శాంతి కలుగును ఆది శంకరులు తెల్పిన భజగోవిందం.

భజగోవిందం-3 (ప్రాంజలి ప్రభ)
రచయత. మల్లాప్రగడ రామకృష్ణ

ఆకర్షణలకు లొంగని మానవులు ఉండరు. మాయా ప్రపంచంలో బతకటం నేర్చు కోలేని వారు మనుష్యులగా గుర్తించటం కష్టం. పరమాత్ముడు స్త్రీ కి ప్రత్యేక రూపం కల్పించాడు, స్త్రీ ల వక్షోజములను, నాభి ప్రదేశమును చూచి, మోహా వేశము నొందకము. నీకు సుందరముగా కన్పించు ఆ అవయవము లన్నియు కేవలము మాంసము క్రొవ్వు మోదలగు వాని మారు రూపాలే అని స్పష్టముగా గ్రహింపుము. మితిమీరిన వ్యామోహం అనర్ధ దాయకం ప్రేమించి ప్రేమ పొందటమే జీవితం


086.. ప్రాంజలి ప్రభ భజగోవిందం -4
రచయత మల్లాప్రగడ రామకృష్ణ

మానవులకు బుధ్ధి నిలకడ ఉండదు. అది తామరాకు పై నీటి బొట్టులా కదులుతూ ఉంటుంది. చూడలేని గాలి కదలికలు యెలా మనలో ప్రవేసిస్తాయో అలాగే మనలో బుధ్ధులు చంచలముగా మారి వ్యాధులకు, దురభి‌ మానమునకు, దేహము ఆధీన మవుతుంది. లోకమంతా శోక మయ మగుటకు ఋధ్ధే కారణమవు తుంది. కనుక బుధ్ధి నిలకడగా ఉంచి, దేహతృప్తి కోశం ఆశ పడక ఉన్న జీవితమే నిజమైన జీవితం

మంత్రిగారూ! తమరేమీ అనుకోరంటే ఓ మాట!

ఏమీ అనుకోను, చెప్పవోయ్!

మీ కింద ఊడిగం చేసేవాడికి అప్పనంగా ఇరవై లక్షలు చేతిలో పెట్టి ఓ పదిమందిని రోజూ ఇస్తానని చెప్పి ఎం. పి గా పోటీ చేయమన్నారు, అదంత అవసరమా అని?

ఓరి పిచ్చోడా! ఇంతకాలం నాతో తిరిగావు గానీ రాజకీయాలు వంట పట్టించుకున్న పాపాన పోలేదు.
గత మూడు సార్లు మనకు ఎదురు లేదు కాబట్టి నెగ్గుకొచ్చాము, ఇప్పుడా పరిస్థితి లేదు, ఇక్కడ సరిసమానముగా రెండు వర్గాలున్నాయి!
ఇప్పుడు మనది కాని వర్గము మనిషి పోటీ చేయబోతున్నాడు, ఆ వర్గానికి చెందిన ఈ నా అనుచరుడిని బరిలోకి దింపుతున్నాను, వీడికి, వీడి వర్గంలో మంచోడనే పేరుంది, వీడు వీడి వర్గం నుండి నాలుగో వంతు వోట్లు రాబట్టుకున్నా నా గెలుపు సునాయాసము!

087..చేగోడీ కంప్యూటర్‌కంపెనీ(కథ) (సేకరణ) 

సాహితీమిత్రులారా! 
శివరాం కి సాధారణంగా కోపం రాదు. కానీ హైదరాబాదులో విమానం ఎక్కిన్యూయార్క్‌లో దిగేదాకా ఒళ్ళు మండుతూనే వుంది. ఎప్పుడు ఇండియా వెళ్ళినా, వచ్చినా, Air India లో ముసలి గుజరాతీ తల్లిదండ్రులు, పిల్లలకి గుళ్ళూ,గోపురాలూ చూపించి భారత లేదా తెలుగూ కల్చర్‌నాలుగు వారాల్లో crash course యిచ్చేద్దామనుకునే మధ్యవయసు భారతీయులే తప్ప ఇటువంటి ప్యాసెంజెర్లని చూడలేదు. విమానం నిండా వాళ్ళే… తనొక్కడు తప్ప. 

“ఏమిటి చేశారు .. విజ్వుల్‌బేసిక్కా? ఫరవాలేదు. నేనా! ఆరేకల్‌ ఆర్నెల్లు training తీసుకున్నాను… ఆరేకల్‌డి బి ఏ యా లెక financials నా? ఎందుకైనా మంచిదని రెండూనూ… ఈ మధ్య AS/400, PeopleSoft కి విపరీతంగా demandఉందండీ.. అవి చేసే బదులు ఏకంగా SAP చేస్తేనే మంచిది. ఏనుగు కుంభస్థలంకొట్టొచ్చు…” 

ఈ పై విధంగా ఆ Air India plane లో మాట్లాడుకునే వాళ్ళ భాషలో శివరాంకిఒక్క మాట కూడా అర్థం అవలేదు. అసలు ఆ టాపిక్‌ఏమిటో కూడా తెలియటం లేదు. పొరపాటున ఈ ఖగోళం నుంచి మరో సివిలిజేషన్‌కి వెళ్ళిపోయామేమో అనుకుంటూ పక్కనే కూచున్న చౌదరి గారికేసి చూశాడు. మన హైదరాబాదు మనిషి లాగే వున్నాడు. చౌదరి మెడలో ఒక లాకెట్‌వేలాడుతోంది. అందులో ఒక గెడ్డపాయన ఫోటో వుంది. చౌదరి గంటకొకసారిఆ గడ్దపాయన ఫోటో కళ్ళ కద్దుకుని దణ్ణం పెట్టుకుంటున్నాడు. 

ఎవరండీ ఆయన? కొత్తగా వెలిసిన స్వామీజీ గారా! అనడిగాడు శివరాం ఉండబట్టలేక. ఈయన స్వామీజీ కాదు సార్‌! చెంద్రబాబు నాయుడు. ఆయనే మా అందరికీ నాయకుడు. ఎవరూ! chief minister ఫోటోయా? అవును సార్‌! నాయుడు గారు ఆంధ్రాని అమెరికా కంటే పెద్ద కంప్యూటర్‌ దేశం చేసి పారేద్దామని వ్రతం పట్టాడు. Bill Gates అంతటివాడు నాయుడుగారిని చూసి డంగై పోతున్నాడు. మా అందరికీ అసలు స్వామీజీ నాయుడు గారే! 

“మా అందరూ” అంటే? 

అదేనండీ .. ఈ విమానంలో ఉన్న వాళ్ళం అందరం కంప్యూటర్‌ software గాళ్ళం.మేమే నేటి బాలలం .. రేపటి పౌరులం. దేశానికి డబ్బు, పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టే వీరులం. ఆవేశపడి పోతున్నాడు చౌదరి. 

అప్పటికి అర్థం అయింది శివరాం కి ఇందాకా వాళ్ళు మాట్లాడుకుంటున్న భాషకంప్యూటర్‌భాష అని. మెల్లిగా వివరాలు తెలిశాయి. చౌదరితో బాటు మరొక నలుగురు ఆ విమానంలోనే కత్తిపూడి, కాపవరం,కైకలూరు వగైరా ఊళ్ళలో computer training తీసుకుని H1 వీసాల మీద అమెరికా వస్తున్నారు. 

ఆముదాలవలస నుంచి అనకాపల్లి దాకా ఆంధ్రాలో అన్ని ఊళ్ళలోనూ, ప్రతి జంక్షన్‌దగ్గరా ఒకకిళ్ళీ కొట్టూ, పక్కనే కంప్యూటర్‌సెంటర్‌ఉండటం చూసి శివరాం నవ్వుకున్నాడు మొన్నమొన్ననే.చౌదరి sponsoror … అంటే H1 వీసాలు సంపాయించి అమెరికా తీసుకు వెళ్తున్న ఆసామీ పేరు క్రిస్‌మర్టీ ట. కంపెనీ అమెరికాలోచాలా పేరున్న పెద్ద కంపెనీ .. పేరు చేగోడీ కంప్యూటర్స్‌. 

చేగోడీ … ఆ మాట విని, చేగోడీలు తిని అనేక యుగాలు అయిందే అని కొంచెంగింజుకుంటున్న శివరాంని చూసి, క్రిస్‌గారికి చేగోడీ లంటే చాలా ఇష్టం అనీ, అమెరికా వాళ్ళు ఆనియన్‌రింగ్స్‌ని ఆంధ్రాచేగోడీ నుంచి కాపీ కొట్టారని క్రిస్‌గారి అభిప్రాయం అనీ, మా ఈ కంప్యూటర్‌బ్యాచ్‌వాళ్ళందరినీ డల్లాసులో ఒక బ్రహ్మాండమైన guest house లో వుంచి projects లో పనిచేయిస్తూ నెలనెలా జీతం ఇస్తూ అఖండ గౌరవం చేస్తారనీ చౌదరి ఎంతోకుతూహలంగా వివరించాడు. విమానంలో వున్నరావు, మూర్తి, రెడ్డి, రాజు వగైరా కంప్యూటర్‌కళాకారులందరూ పైకి ఆర్భాటంగాసూటూ బూటూ వేసుకుని ఎప్పుడుఅమెరికాలో దిగుదామా అని భయం భయంగా ధైర్యం నటిస్తున్నారు. 

Air India విమానం న్యూయార్క్‌లో దిగగానే కస్టమ్స్‌వాళ్ళు ప్యాసింజెర్లందరినీలైనులో నుంచోబెట్టారు. విజువల్‌బేసిక్‌ వాళ్ళంతా తెల్ల లైను, C, C++, java గాళ్ళందరూ నల్ల లైను, PeopleSoft, AS/400, గాళ్ళు ఎర్ర లైను, SAPవాళ్ళు మటుకు, ఇదుగో ఈ gold carpet మీద లైన్లలో నుంచోండి అని హెచ్చరికలు చేశారు. శివరాం కి మళ్ళీ ఒళ్ళు మండింది. తను అమెరికా వచ్చి పాతికేళ్ళయింది. తన గురించి ఒక్క కస్టమ్స్‌ఆఫీసరూ పట్టించుకోలేదు.తన ఒళ్ళు మంట ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూండగానే ఒక నల్ల దొర వచ్చి… దూకుడుగా .. ఏం ఇక్కడే నుంచున్నావు అని కోప్పడ్డాడు. ఎక్కడ నుంచోవాలో తెలీక అన్నాడు శివరాం. 

నువ్వేమిటి? విజువల్‌బేసిక్కా, యూనిక్సా, విండోసా … అని అడుగుతున్న ఆ జాన్సన్నిచూసి అయామ్‌ ఎ మెకానికల్‌ ఇంజనియర్‌ అన్నాడు శివరాం. 

ఇంజనియర్‌వా … ఐతే ఇక్కడ నిలబడు అన్నాడు జాన్సన్‌జాలిగా . ఆ లైనులోతనొక్కడే ఉన్నాడు. ఆఖరివాడిగా, మిగిలిన కంప్యూటర్‌లైన్లన్నిటికీ వెనకాల. 

మొత్తానికి ఆ కంప్యూటర్‌వాళ్ళందరూ న్యూయార్క్‌నుంచి Dallas, Chicago, Raleigh, Atlanta, ఎవరి దారిన వాళ్ళు పోగా తను హ్యూస్టన్‌ flightతీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రాణం పోయినా మళ్ళీ హైదరాబాదు నుంచి బయలుదేరే Air Indiaలో ప్రయాణం చెయ్యనని వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసుకున్నాడు. 

DFW – Dallas – Fort Worth విమానాశ్రయం లో విమానం ఆగింది. చౌదరి,రావు, రెడ్డి, రాజు, శాస్త్రి ఐదుగురూ అర్జంటుగా వేసుకున్న సూట్లు సద్దుకుని, పౌడరు, సెంటు పూసుకుని ఎర్రగా బుర్రగా పొడుగ్గా హాయ్‌హౌ ఆర్‌యు అని అమెరికన్‌ఇంగ్లీషులో మాట్లాడే క్రిస్‌మర్టీ గారికి ఎలా షేక్‌హండ్‌ఇవ్వాలా, ఎవరు ముందు మాట్లాడాలా అని ఆ పంచ పాండవులు తర్జన భర్జన పడుతుండగా … ప్యాసెంజెర్స్‌ని రిసీవ్‌చేసుకోవటానికివచ్చిన నల్ల, తెల్ల, పసుపు .. అంటే చైనా దొరలందరూ వెళ్ళిపోయారు. 

క్రిస్‌గారు ఎలా ఉంటారో తెలియక ఇప్పుడెలాగరా భగవంతుడా అని చౌదరికంగారు పడుతుండగా,క్రిస్‌మర్టీ వచ్చి హలో అయామ్‌క్రిస్‌మర్టీ అనిపరిచయం చేసుకున్నాడు. అతని మొహం చూసి చౌదరి రావు మొహం, రావు రెడ్డి మొహం, రెడ్డి రాజు మొహం, రాజు శాస్త్రిమొహం చూసుకున్నారు. ఇలా మొహాల వీక్షణ కార్యక్రమం పూర్తయ్యాక పంచపాండవులు కలిసి క్రిస్‌ మొహం కేసితీవ్రం గా చూశారు. గోధుమ రంగులో, పొట్టిగా, గుజరాతీ వాళ్ళలా గిల్టు బంగారు రంగు కళ్లద్దాలతో ఉన్న క్రిస్‌ వాళ్ళకి క్రిస్‌లా కనబడలేదు. మర్టీలా కనబడలేదు. క్రిస్‌మర్టీలా అసలు కనబడలేదు. 

ఆర్యూ క్రిస్‌మర్టీ సార్‌? అని అడిగాడు చౌదరి ధైర్యం చేసి. అవునండీ welcome to America అన్నాడు తెలుగుఇంగ్లీషులో క్రిస్‌మర్టీ. క్రిస్‌మర్టీ అంటే … నసిగాడు రావు. ఓ అదా! నా అసలు పేరు కృష్ణమూర్తి లెండి. అమెరికా కదా … అంచేత వాళ్ళకిఅర్థమయ్యే పేరు పెట్టుకోవాల్సి వచ్చింది.. 

సరే, క్రిస్‌గారు పంచపాండవుల్ని తన లెక్సస్‌, అనగా చిన్న ఖరీదైనకారులో ట్రంకులో సామాను అంతా పట్టకపోతే తాడు వేసి కట్టి guest house కి తీసుకెళ్ళాడు. Guest house అంటే ఆంధ్రా గవర్నర్‌గారి ఇల్లు లాగానో రామోజీ రావు గారి ప్రపంచ ప్రఖ్యాత స్టూడియో guest house లా డజనుమంది వంటవాళ్ళు, కార్లు, డ్రైవర్లతో ఉంటుందనో, కనీసం కాలవ మీదకి ఖాకీ టోపీ పెట్టుకుని నిక్కర్‌వేసుకుని ఉప్పాడ కాలవ inspection కి వచ్చే సివిల్‌ఇంజనీరు గారి రాదారి బంగళాలా ఉంటుందనోఅనుకున్న చౌదరి ఊహాశక్తి చాలా దెబ్బ తినేసింది. డల్లాస్‌లో అతిబీద నల్ల వాళ్ళూ, మరియుమెక్సికన్‌వాళ్ళూ ఉండే సందులు గల్లీల్లో ఒక బిల్డింగ్‌లో ఎనిమిదో అంతస్తులో ఉండే రెండు గదులఫ్లాట్‌ అనగా అపార్టుమెంట్‌నే కంప్యూటర్‌ వాళ్ళందరూ guest house అంటారని తెలిసి పంచపాండవులులక్క ఇంటిలో ధర్మరాజు, అర్జునుడూ, భీముడు, మరియు అన్ని సినిమాలలోనూ ఒక్క డైలాగు కూడా లేకుండాకేవలం తలకాయలు పైకీ కిందికీ ఊపుతూ అభినయించే నకుల సహదేవులు లాగా ఫీలయిపోయారు. 

పాపం పండి అమెరికా వచ్చి పడ్డామని పాండవులకి తెలియడానికి పాతికరోజులు పట్టలేదు. ఒక్కొక్కడి దగ్గరా లక్ష రూపాయలు trainingకనీ, వీసా ఖర్చులనీ డబ్బు పుచ్చుకున్నచిన్నారావు క్రిస్‌మర్టీ గారి స్వయానా రెండో బావమరిది అని తెలిసిపోయింది. వైజాగ్‌కరపాంమార్కెట్‌లోనూ, కాకినాడబోగందాని చెరువు పక్కనూ, అనకాపల్లి బెల్లం దుకాణాల మధ్యలోనూ ఉన్నకంప్యూటర్‌ training centers కీ, చేగోడీ కంప్యూటర్‌ కంపెనీకి ఉన్నది డబ్బు పంచుకోడం తప్ప అసలువ్యాపార సంబంధం ఏమీ కాదని తెలిసి పోయింది. Project మాట దేవుడెరుగు, నెలనెలా జీతం మాటదేవుడెరుగు, ఆరుగురు ఉన్న guest house లో telephone కూడా లేదనీ అందరికీ కలిపి మనోవర్తి, అంటే ప్రాణం పోకుండా తిండి ఖర్చులు మటుకు చేగోడీ కంప్యూటర్‌వారు కేవలం రెండు నెలలు భరిస్తారనీ, ఆ తర్వాత మీ ఇష్టం వచ్చిన చోటికి మీరు పోవచ్చు అని అంటారని తెలిసిపోయింది. డబ్బు పుచ్చుకుని,అమాయకులైన కంప్యూటర్‌ ప్రోగ్రామర్లని అమెరికా తీసుకు వచ్చి, నడిరోడ్డులో వాళ్ళని వదిలెయ్యడం మాత్రమే ఇటువంటి చేగోడీ కంపెనీల వ్యాపారమని తేలిపోయింది. 

మామూలు కంటే గట్టిగా టెలిఫోన్‌మోగింది. 

“హల్లో” అన్నాడు శివరాం 

ఓ! what a surprise, ఎలా ఉన్నారు? 

ఎలా ఉందండీ మా దేశం? 

అదేమిటి! నా మొహంలా వుందీ, అంటే! 

ఓ … really! 

… నిజంగానా! అంత మోసం చేస్తారా ఈ కంప్యూటర్‌ కంపెనీ వాళ్ళూ … too bad. 

… I am sorry! 

…ఓ పని చెయ్యండి, మా హ్యూస్టన్‌ వచ్చెయ్యండి. కొన్నాళ్ళు మా ఇంట్లో ఉండొచ్చు 

… అబ్బే పరవాలేదు. మా ఆవిడ చాలా understanding మనిషి. 

… ఫరవాలేదు. Greyhound లో డల్లాస్‌లో ఎక్కితే హ్యూస్టన్‌ ఐదారు గంటల్లోవచ్చేస్తారు. నేను వచ్చి pick-up చేసుకుంటాను. Don’t worry. We will work it out చౌదరి గారూఅనిఫోన్‌ పెట్టేశాడు శివరాం. 

శివరాం కి ఒళ్ళు మండిపోతోంది. ఈ శనివారం చౌదరి డెల్లాస్‌నుంచి వస్తాడు.పాపం, పంచపాండవులకి ఎంత మోసం జరిగిందీ … ఆంధ్రా వాళ్ళ కంప్యూటర్‌ వ్యాపారం ఇంత అధ్వాన్నంగాఉంటుందని అందరికీ తెలియదు కదా అని అనుకుంటూ Monica Lewinsky latest news విందామని TV remote కోసం సోఫా వెనకాల వెదుకుతూ ఉండగా శివరాం భార్య అర్జంటుగా గెంతులేసుకుంటూ వీధి తలుపు తీసుకుని లోపలికి వచ్చింది. వస్తూనే “ఏమండోయ్‌.. I finally did it ” అంది. 

ఏమిటి ఏంచేశావు? 

ఇదుగో చూడండి, అని కాయితాలు శివరాం మొహం మీద పడేసింది. 

అదేనండీ, మీరు ఇండియా వెళ్ళి వచ్చిన దగ్గర్నుంచీ ప్రాణం తీశారుగా ఏదోకంప్యూటర్‌కోర్స్‌లో చేరమనీ, I finally did it. 

శివరాం కి మళ్ళీ ఒళ్ళు మండింది ఆ కాయితాలు చూడగానే. 

ఏమిటీ, SAP లో జేరమన్నారుగా! చూడండి This is an excellent deal.మొత్తం ఖరీదు $10,000. రెండు వారాలు training. ఎక్కడనుకుంటున్నారు … హైదరాబాదులో! వాళ్ళే ticket పెట్టి అక్కడికి తీసుకెళ్ళి training ఇస్తారట. అటు ఇండియా వెళ్ళినట్టూ ఉంటుంది. రెండువారాలు training కి మూడు నెలలు training అయినట్టు సర్టిఫికెట్‌ ఇస్తారుట. చూశారా, అన్నీలాభాలే. వెనక్కి వచ్చాక గంటకి 150 డాలర్లు ముందు అంటే ఏడాదికి $300,000 – ఆ తర్వాత 200 డాలర్లు… ఇక మీరు ఉద్యోగం మానెయ్య వచ్చు, నేను సెటిల్‌అయాక మీరు కూడా SAP లో … 

శివరాంకి సాధారణంగా కోపం రాదు. ఇవాళ మటుకు ఒళ్ళు మండి పోతోంది. 

ఏమిటండీ అంత కోపం ఎందుకూ ? 

ఎందుకా! ఇదుగో ఇందుకూ, అన్నాడు ఆ కాగితాలలో ఆఖర్న ఉన్న సంతకం చూపించి. అవునండీ, He is a nice fellow .. క్రిస్‌మర్టీ from చేగోడీ కంప్యూటర్స్‌. Head quarters డల్లస్‌లో నట. వాళ్ళకి ఇండియాలో కూడాఅన్ని ఊళ్ళలోనూ training centers ఉన్నాయిట. 

అందుకు కాదు, అందుకే .. ఇందుకే .. అసలు అందుకే అన్నాను. శివరాంకి మాటలు తడబడు తున్నాయి. 

శివరాంకి ఎందుకు ఒళ్ళు మండుతోందో ఆవిడకి ఏమాత్రం అర్థం కాలేదు. 
----------------------------------------------------------- 
రచన: వంగూరి చిట్టెన్‌ రాజు, ఈమాట సౌజన్యంతో 
-------------------------------------------------------- 
- ఏ.వి.రమణరాజు

088.. ఒకసారి ఒక తెలివైన మరియు తెలివైన యువకుడు IAS (ఇండియన్ సివిల్ సర్వీస్) ఇంటర్వ్యూకి వెళ్ళాడు.
అతన్ని అడిగారు -
Q 1. భారతదేశం ఎప్పుడు స్వాతంత్ర్యం పొందింది?
అతను సమాధానం చెప్పాడు - ప్రయత్నాలు చాలా కాలం క్రితం ప్రారంభమయ్యాయి; కానీ 1947లో విజయం సాధించవచ్చు.
Q 2. ఈ స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తులు ఎవరు?
సమాధానం - ఇందులో పాలుపంచుకున్న మరియు సహకరించిన వారు చాలా మంది ఉన్నారు. నేను పేరు చెపితే ఇతరులకు అన్యాయం జరుగుతుంది.
Q 3. అవినీతి దేశానికి అతిపెద్ద శత్రువు అని మీరు అనుకుంటున్నారా?
సమాధానం - ఈ విషయంలో ఒక కమిటీ విచారణ చేస్తోంది. నివేదిక చూసిన తర్వాతే దీనికి సరైన సమాధానం చెప్పగలను.

ఇంటర్వ్యూ బోర్డు అతని అసలు ఆలోచనలకు ముగ్ధులైంది. వారు బయట వేచి ఉండమని అడిగారు; కానీ ప్రశ్నలను బహిర్గతం చేయవద్దని అతనికి సలహా ఇచ్చాడు, ఎందుకంటే వారు ఇతర అభ్యర్థులను కూడా అదే ప్రశ్నలను అడగవచ్చు.

యువకుడు గది నుండి బయటకు వెళ్లినప్పుడు, మరొక వ్యక్తి అడిగిన ప్రశ్నల గురించి ఆరా తీశాడు. ప్రశ్నలను బహిర్గతం చేయవద్దని ఇంటర్వ్ బోర్డుకు హామీ ఇచ్చినట్లు యువకుడు చెప్పాడు.
కానీ, అవతలి వ్యక్తి ఒక మార్గాన్ని కనుగొన్నాడు. "మీరు చెప్పిన సమాధానం చెప్పండి."

యువకుడు, "ప్రశ్నలను బహిర్గతం చేయను" అనే తన మాటలను వెనక్కి తీసుకోనందున, సరేనని అనుకున్నాడు. కాబట్టి అతను అతనికి మూడు సమాధానాలు ఇచ్చాడు, అవతలి వ్యక్తి త్వరగా హృదయపూర్వకంగా నేర్చుకున్నాడు.

తదుపరి అభ్యర్థి ఇంటర్వ్యూకు వెళ్లినప్పుడు, ఇది జరిగింది.
Q 1. మీరు ఎప్పుడు జన్మించారు?
అభ్యర్థి:- ప్రయత్నాలు చాలా కాలం క్రితం ప్రారంభమయ్యాయి, కానీ 1947లో విజయం సాధించవచ్చు.
ఇంటర్వ్యూయర్లు కంగారు పడ్డారు... తర్వాతి ప్రశ్న అడిగారు.

Q 2. మీ తండ్రి పేరు ఏమిటి?
అభ్యర్థి:- ఇందులో పాల్గొన్న మరియు సహకరించిన వారు చాలా మంది ఉన్నారు. నేను పేరు పెడితే ఇతరులకు అన్యాయం జరుగుతుంది.
ఈ సమాధానంతో బోర్డు సభ్యులు షాక్ తిన్నారని..అన్నారు.

Q 3. మీకు పిచ్చి ఉందా?

అభ్యర్థి :- ఈ విషయంలో ఒక కమిటీ దర్యాప్తు చేస్తోంది. నివేదిక చూసిన తర్వాతే దీనికి సరైన సమాధానం చెప్పగలను.
----
mallapdragada Ramakrishna 
***
089

ఒకసారి 45 ఏళ్ల వయసున్న ఒకామె కోర్టు మెట్లు ఎక్కింది. జడ్జిగారి ముందు ఆమె ఇలా విన్నవించుకుంది. "మా వారికి ఆరోగ్యం బాగాలేదు. మాకు ఒక పాప ఉంది. నేను అందరి ఇళ్లలో పనిచేసి తెచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నాను. అందరినీ అడుక్కుని ఎలాగోలా నా కూతురికి మంచి చదువు చెప్పించాను. మా అమ్మాయిని ఎటువంటి కష్టం తెలియకుండా పెంచాను. అమ్మాయి కూడా బాగా చదివి ఉద్యోగం సంపాదించుకుంది. ఇక మా కష్టాలు తీరాయి... అనుకునే లోపు అమ్మాయి కనిపించకుండా పోయింది. ఎవరైనా మాయమాటలు చెప్పి మోసంచేసి ఎత్తుకుపోయారేమో".... అని చెప్పింది. 

జడ్జిగారు ఆ విషయం గురించి పూర్తిగా విచారించగా, ఆ రోజు వాళ్ళ అమ్మాయి కోర్టుకు వచ్చింది. బోనులో ఎదురెదురుగా తల్లి కూతుర్లు. ఆ అమ్మాయి కళ్ళలో ఏమాత్రం ప్రేమ కనిపించలేదు. తప్పు చేశానన్న పశ్చాత్తాపమూ లేదు. 

ఆ అమ్మాయి... "నన్ను ఎవరూ మోసం చేయలేదు. నన్ను ఎవరూ ఎత్తుకుని పోలేదు. నేను మేజర్ ని నాకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను" అనిచెప్పింది. 

ఇంట్లో వాళ్లకు ఒక్కమాటైనా చెప్పాలి కదా!.... అని అడగాలని అనుకున్నా, కోర్టులో ఇలాంటి సంభాషణలు ఉండరాదు. కనుక ఒక గంటసేపు తల్లి కూతుర్లు మాట్లాడుకోవలసిందిగా జడ్జిగారు తీర్పు ఇచ్చారు. 

జడ్జిగారి ఆశ ఏంటంటే... ఒకవేళ ఆ తల్లీకూతుళ్ళు కలిసి మాట్లాడుకుంటే, ఆ తల్లి కష్టాన్ని కూతురు అర్థం చేసుకుంటుందని, గతాన్ని తలచి ఆమె మారుతుందేమో అని. ఆయనకూ మనసు ఉంది కదా! అందుకే  ఆలోచించి అలా చెప్పారు. 

ఒక గంట తరువాత మళ్ళీ వచ్చిన తల్లి కూతుర్లు ఎదురుగా నిలబడ్డారు. కానీ,  ఎటువంటి మేజిక్కూ జరగలేదు. 

అమ్మ ఒక నిశ్చయానికి వచ్చి, "ఇక అమ్మాయి ఇష్టం అండీ... తను సంతోషంగా ఉంటే మాకు అంతే చాలు. ఒక్కమాట... వాళ్ళ నాన్నతో వెళ్ళొస్తానని చెప్పమనండి. ఆయనకు ఆ పిల్లంటే ప్రాణం" అని తల్లి చెప్పింది. 

"వాళ్ళ నాన్న ఎక్కడ?" అని అడగగా... అతను ఒక మూలన కూర్చుని ఇవన్నీ గమనించి కన్నీరు పెట్టుకుంటున్నాడు. అతను వికలాంగుడు (physically handicapped.) అతనిని ఒకరు ఆసరాగా పట్టుకుని ఉన్నారు. 

అయినా ఏమాత్రం మనసు కరగని ఆ అమ్మాయి "ఇక నేను వెళ్లొచ్చా"... అని అడిగి బయట తన భర్త వేచిచూస్తున్న కార్ ఎక్కి వెళ్లిపోయింది. 

 ఆ అమ్మాయిని శిక్షించడానికి కోర్టుకి అధికారం లేదు. 'ఆర్డర్ వేసి ఇవి ఆచరించి తీరాలి' అని చెప్పడానికి ఇంకా చట్టాలు రాలేదు. 

జడ్జిగారు ఆ అమ్మను ఉద్దేశించి... "ఇప్పుడెలా వెళతారు?" అని అడిగితే... "బస్టాండ్ లో నలుగురి దగ్గర అడుక్కుని మా ఊరువెళ్ళిపోతాం. అక్కడ మళ్ళీ ఇళ్లలో పనిచేసుకుని మా బతుకులు ఈడ్చేస్తాం." అని అంటుంటే అక్కడ అందరి కళ్ళలో కన్నీళ్లు. 

కోర్టు నుండి బయటకు వచ్చిన జడ్జిగారు ఆమెకు వెయ్యి రూపాయలు ఇవ్వగా, అక్కడ ఉన్నవారంతా తోచిన సాయం చేసి పంపారు. 

సినిమాల్లో లాగా నిజ జీవితాల్లో మార్పులు ఉండవు. 

తప్పు చేశామేమో అనే పశ్చాతాపం ఉండదు. చట్టం కూడా కొన్నిసార్లు మౌనంగా చూస్తూ ఉండాలి అంతే. 

మన పిల్లలకు మన కష్టం తెలియకుండా పెంచాలి అని అనుకోవడమే పొరపాటు. 

ప్రేమను పంచినట్టే కష్టాన్ని కూడా పంచండి. అప్పుడు కాసింత మానవత్వంతో మనుషులుగా మిగిలిఉంటారు. లేకపోతే మానవత్వాన్ని మరిచిపోయి, ప్రేమగా పెంచిన మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా గాలికొదిలేసి ఎటో వెళ్ళిపోతారు.

"""**""" 

090.. పుణ్యం ఖరీదు ...01-08-2023

కాశీ పట్టణంలో ధనవంతుడు అయిన ఒక బ్రాహ్మణుడు వుండేవాడు.

అతను ప్రతీ రోజు దాన ధర్మాలు చేసేవాడు. దానికి తోడు మిక్కిలి దైవ భక్తి కలవాడు మరియు యజ్ఞ యాగాదులు కూడ చేసేవాడు.

 ఒక యాగంలో అన్నీ దానం చేయటంతో   కుటుంబ పోషణకు అతడి వద్ద డబ్బులు లేకుండా పోయాయి.

 పక్క ఊరిలో ఒక పెద్ద సేఠ్ నివసిస్తున్నాడని  అతడు ఇతరుల పుణ్యంను కొని ధనం ఇస్తాడని బ్రాహ్మణుడి  భార్య అతనికి చెప్పి  వారి వద్దకు వెళ్లి మీ పుణ్యాలు అమ్మి కొంత డబ్బు తీసుకురండి, తద్వారా వ్యాపారం మళ్లీ ప్రారంభం చేయవచ్చును అని సలహా ఇస్తుంది.

బ్రాహ్మణుడు  మాత్రం తను చేసిన పుణ్యం అమ్మడానికి ఇష్టపడలేదు, కానీ భార్య ఒత్తిడి మరియు పిల్లల బాధల కారణంగా అతను పుణ్యం అమ్మడానికి సిద్ధపడక తప్పలేదు.

దారిలో తినడానికి భార్య ఇచ్చిన నాలుగు రొట్టెలు తీసుకొని ప్రయాణం అవుతాడు.

అతను నడుచుకుంటూ అడవిలో నుండి పోయేవేళ ఆకలి కావటంతో ఊరికి చేరేలోపు భోజనం ముగించాలి అనుకుని రొట్టె తీయగానే ఒక కుక్క వచ్చి తన మూడు కుక్కపిల్లలతో ఎదుట నిలబడుతుంది. పిల్లలు చాలా చిన్నవి కావడంతో వాటిని వదిలి ఊరులోకి వెళ్లలేకపోయింది.

బ్రాహ్మణునికి  బాధగా అనిపించి అతను కుక్క పై  కుక్కపిల్లల కోసం జాలిపడి,  తన దగ్గర ఉన్న రొట్టెల నుండి ఒక రొట్టెను కుక్కకు ఇస్తాడు.

కుక్క చాలా రోజులుగా ఆకలితో ఉండటంతో, కుక్క త్వరగా రొట్టె తినేసింది, కానీ  ఇంకా ఆకలితో ఉండటంతో  బ్రాహ్మణుడి వైపు చూపసాగింది.

బ్రాహ్మణుడు  జాలిపడి  రెండవది, తరువాత మూడవది, చివరి నాల్గవది అలా  మొత్తం రొట్టెలు కుక్కకు వేసి  తను మాత్రం కేవలం  నీరు త్రాగి   సేఠ్ వున్న వూరికి చేరుకొంటాడు.

 బ్రాహ్మణుడు సేఠ్‌తో    తన పుణ్యాన్ని అమ్ముకోవడానికి వచ్చానని చెప్పుతాడు.

అప్పుడు సేఠ్    ‘నేను చాలా బిజీగా ఉన్నాను, సాయంత్రం రండి, నేను కొంటాను!’ అని అంటాడు.

మధ్యాహ్నం సేఠ్ తన ఇంటికి భోజనానికి వెళ్లి      ‘తన పుణ్యాన్ని విక్రయించడానికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడని భార్యతో చెప్పుతాడు. అతని దగ్గర నేను ఏ పుణ్యం కొనాలి చెప్పు!’ అని సలహా అడుగుతాడు.

సేఠ్ భార్య చాలా మంచి పతివ్రత స్త్రీ.  ఈరోజు బ్రాహ్మణుడు రొట్టెలన్నీ కుక్కకు ఇచ్చి చాలా పుణ్యం సంపాదించుకున్నాడని కండ్లు మూసుకొని ధ్యానం  చేసి తెలుసుకొంటుంది.

కుక్కలకు రొట్టెలు వేసి సంపాదించిన పుణ్యాన్ని బ్రాహ్మణుడి నుండి కొనమని తన భర్తకు చెబుతుంది.

సాయంత్రం బ్రాహ్మణుడు తన పుణ్యాన్ని విక్రయించడానికి వచ్చినపుడు సేఠ్  ఇలా అంటాడు…

 ’ఈరోజు నువ్వు చేసిన యజ్ఞం యొక్క పుణ్యాన్ని నేను కొనాలని అనుకొంటున్నాను.

బ్రాహ్మణుడు నవ్వి ఇలా అంటాడు… ’నా దగ్గర యజ్ఞానికి సరిపడ  ధనం ఉంటే నీకు పుణ్యం అమ్మడానికి వచ్చేవాడినా?’    అని.

’ఈరోజు ఆకలితో ఉన్న కుక్కకు ఆహారం పెట్టి ఆ కుక్కను, దాని పిల్లలను నువ్వు రక్షించావు. అదే యజ్ఞం!’ అని సేఠ్ అంటాడు.

’నువ్వు సంపాదించిన ఆ పుణ్యాలన్నీ నేను కొనాలని అనుకొంటున్నాను!’ అని అంటాడు.

 బ్రాహ్మణుడు పుణ్యం అమ్మడానికి అంగీకరిస్తాడు.

దానికి బదులుగా  నీకు నాలుగు రొట్టెల బరువుకు సమానంగా వజ్రాలు, ముత్యాలు ఇస్తానని  సేఠ్ అనటం దానికి  బ్రాహ్మణుడు కూడ అంగీకరించడం  జరిగిపోతాయి.

నాలుగు రొట్టెలు తయారు చేసి త్రాసులో  కాటాకు ఒక ప్రక్కన ఉంచబడతాయి.

రెండవ దానిలో, సేఠ్ ఒక సంచీ నిండా వజ్రాలు, ముత్యాలు మరియు ఆభరణాలు ఉంచుతాడు.

త్రాసు యొక్క కాటా కొంచెం కూడ కదలదు.

రెండవ సంచీ ఉంచినాకూడా కాటా కొంచెంకూడ కదలక పోయేసరికి  సేఠ్ తన దగ్గర వున్న ఆభరణాలు అన్నీ రెండో దిక్కున వుంచినా కూడ కాటా అసలుకే కదలదు. 

అది చూసిన తర్వాత అక్కడ వున్న వారందరు ఆశ్చర్య పోతారు.

అప్పుడు బ్రాహ్మణుడు  సేఠ్‌తో, "నేను నా మనసు మార్చుకున్నాను. ఇప్పుడు నా పుణ్యాన్ని నీకు అమ్మడం ఇష్టం లేదు!” అని రిక్త హస్తాలతో తన ఇంటికి ప్రయాణం అవుతాడు.

ఇంట్లోకి అడుగు పెట్టగానే భార్య తనతో గొడవ పడుతుందేమోనని భయపడి, దారిలో కుక్కకి రొట్టెలు ఇచ్చిన చోటు  నుంచి కొన్ని గులకరాళ్లు, రాళ్లను ఏరుకుని దానితో ఒక మూటనూ తయారు చేసి ముడి వేస్తాడు.

ఇంటికి చేరుకోగానే అతని భార్య పుణ్యాన్ని అమ్మి ఎంత సంపాదించావు అని అడగటం తో ఆ రాళ్ల మూటను భార్యకు ఇచ్చి అప్పు దొరుకుతుందేమోనని గ్రామం లోకి వెళ్ళుతాడు.

ఇక్కడ అతని భార్య ఆ మూటను చూసి  ఆగలేక, భర్త వెళ్లగానే ఆ  మూట  తెరిచి చూస్తుంది.  ఆ మూట  నిండా వజ్రాలు, నగలు ఉండటంతో ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోతాయి.

బ్రాహ్మణుడు ఇంటికి తిరిగి రాగానే అతని భార్య మీ పుణ్యానికి ఇంత మంచి ధర ఎవరు చెల్లించారని అడుగుతుంది. మీకు ఇన్ని వజ్రాలు మరియు ఆభరణాలు ఎక్కడ నుండి వచ్చాయి? అంటుంది.

”వజ్రాలు, నగలా ? ఎక్కడ ఉన్నాయో చూపించు!” అని అంటాడు బ్రాహ్మణుడు.

భార్య తన ముందు ఉన్న మూటను విప్పగానే అందులోంచి విలువైన ఆభరణాలు బయట పడటంతో బ్రాహ్మణుడు కూడా ఆశ్చర్యపోతాడు.

అప్పుడు అతను తన భార్యకు జరిగిన విషయాలు అన్నీ పూస గుచ్చినటుల చెబుతాడు.

విపత్తు సమయంలో తన పుణ్యంను  విక్రయించమని అతనిని బలవంతం చేసినందుకు అతని భార్య చాలా బాధపడుతుంది.

ఇదీ కథ…!

నిజానికి ఇది కథ కాదు. జీవితం!         ఈ కలిలో, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి.  ఆపదలో ఉన్న వారికి సాయం చెయ్యండి. మీకు ఎంత డబ్బున్నా ఇహలోక ప్రయాణానికే.    డబ్బును ఎవరైనా దొంగిలించవచ్చు. కానీ, మీ పుణ్యాన్ని ఎవరూ దొంగిలించలేరు.అందుకే, మీ దగ్గర ఉన్న డబ్బును పుణ్యంగా  మార్చుకోండి. పరలోక ప్రయాణానికి    పుణ్యం తోనే టిక్కెట్టు కొనుక్కోండి . దేవుడు మనల్ని పరీక్షిస్తాడు!  మనం ఆ పరీక్షలో ఉత్తీర్ణులైతే,  మనల్ని శాశ్వతంగా ఆశీర్వదిస్తాడు!అందుకే ఎంతటి సంక్షోభం వచ్చినా భగవంతునిపై విశ్వాసం వమ్ముకాకూడదు.

((()))

091..*వాక్చాతుర్యం 

                ➖➖➖

సాహితీ సంగీతప్రియుడైన భోజరాజ చక్రవర్తిని దర్శించడానికి     ఒక  పేద పండితుడు  చాలా రోజులుగా ప్రయత్నిస్తూ వచ్చాడు. కానీ కోట కావలి భటులు యేవో కారణాలు చెప్తూ అడ్డుకుంటూ వచ్చారు.

ఒకనాడు భోజరాజు ఊరిలోని దేవాలయం దర్శించడానికి వెళ్ళిన సమయంలో ఆ పండితుడు కూడా ఆలయానికి వెళ్ళాడు. అక్కడి ఆలయంలోని వారందరికీ    
ఆ పండితుడన్నా , ఆయన పాండిత్యం  అన్నా అపారమైన గౌరవాభిమానాలు వున్నాయి. 

మహారాజు పరమేశ్వరుని స్తుతిస్తుండగా, ఈ పేద పండితుడు మహారాజు వెనుకగా నిలబడ్డాడు. అర్చకుడు  దేవుడికి ఆరతి ఇస్తున్న సమయంలో ఆ పండితుడు గట్టిగా…
"గర్భగుడిలో పరమశివుడు లేడు" అని అరిచాడు.  

వెనక నుండి వచ్చిన అరుపు విని మహారాజు ఉలిక్కిపడ్డాడు. పండితుని  వేపు వెనక్కి తిరిగి చూసి "ఎందుకు అలా చెప్తున్నారు?  దేవుడిని దూషించడం  తప్పు అన్నట్టు  ఖండిస్తూ అడిగాడు. 

అందుకు ఆ పండితుడు "చాలా కాలం క్రితమే శంకరుడు తన దేహంలో సగం నారాయణునికి యిచ్చి శంకరనారాయణు డైనాడు. మరియొక సగాన్ని ధర్మపత్నికి యిచ్చి అర్ధనారీశ్వరుడైనాడు. అందుకే ఆయన చిహ్నంగా ఏదీ లేదని అంటున్నానన్నాడు. 

"ఆయన శిరసున గంగ వున్నది కదా.." అని భోజరాజు అడిగాడు. 
“గంగ సముద్రంలో కలిసి పోయింది.” అన్నాడు పండితుడు.

వెంటనే మహారాజు ఝటాఝూట అలంకారమైన చంద్రుడు ఏమయ్యాడు? అని అడిగాడు. "చంద్రుడు ఆకాశంలోకి వెళ్ళి ఇప్పుడు అక్కడే వున్నాడు." అని అన్నాడు పండితుడు. అప్పుడు భోజరాజు "అవేవీ లేకపోయినా ఆయన శక్తి మాత్రం తప్పకుండా వుంటుంది.” అన్నాడు.

"అది కూడా లేదు. తన శక్తినంతా మీకు యిచ్చివేశాడు .." అని అన్నాడు పండితుడు. పండితుని   నిందాచమత్కార సంభాషణ విని భోజమహారాజు , చిరునవ్వుతో "అన్నీ పోయినా కూడా ఆయన భిక్షాపాత్ర మాత్రం తప్పక ఆయన వద్దనే వుంటుంది" అన్నాడు.

పండితుడు అప్పుడు "ప్రభూ .. అది కూడా యిప్పుడు ఆయన వద్ద లేదు. దానిని పరమేశ్వరుడు నాకు యిచ్చివేశాడు." ఈ సంభాషణ విన్న భోజరాజుకు పండితుని  పేదతనం  అర్ధం అయింది. ఆ పండితునికి  ధనధాన్యాలు, అగ్రహారాలు దానం చేశాడు.  ఆ పండితుని కావ్యాలకు తగిన ప్రచారం చేయించాడు. ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా తనలోని ప్రతిభను ఇతరులకు తెలియజెప్పడానికి తగిన లౌక్యం, వాక్చాతుర్యం కావాలి. తన వ్యక్తిత్వానికి భంగకరం కాకుండా తన గురించి తానే పొగుడుకోకుండా తన గురించి చెప్పకనే  అవతలివారు తెలుసుకోగల బుధ్ధి సూక్ష్మత కావాలి. అలాటివారు ఏ మూలనున్నా రాణిస్తారు. 

***
092..శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-16
 
సీతాదేవిచే కాకాసుర వృత్తాంతము, చూడామణి ప్రధానము
సీతాదేవి ఆనందించినదియై హనుమతో రామలక్ష్మణుల కుశలములు, వారి కార్యసన్నద్ధత గురించి అడిగెను. జనస్థానములో శ్రీరాముడు ఒక్కడే పదునాలుగు వేల మంది రాక్షసులను సంహరించెను. అట్టి పురుష శ్రేష్ఠుడు ఆపదలచే చలించు వాడు కాడు. నాకు ఇంకా రెండు నెలల సమయము మాత్రమే యున్నది. కావున రాముని త్వరగా తీసుకొని వచ్చి నన్ను చెర నుంచి విడిపింపుము అని అనెను. అప్పుడు హనుమ సీతతో నీ అనుమతి అయితే ఇప్పుడే నేను నిన్ను రాముని దగ్గరకు చేర్చగలను అని అనగా సీత రవ్వంత హనుమ శక్తి సామర్థ్యములకు శంకించినను, తరువాత అతని శక్తిని చూసి ఉత్తమ పతివ్రత అయిన సీత అందుకు మృదువుగా నిరాకరించెను.
 
(ఇక్కడ గమనించితే రావణుడు సీతను బలముతో తీసుకొని వచ్చెను కానీ తనంతట తానుగా పరపురుషుని స్పర్శ ఇష్టపడదు. ఆధ్యాత్మిక శాస్త్ర దృష్టితో సీత నిర్ణయము సరియైనదే. పరపురుషుడనగా ఇచ్చట పరధర్మము లేదా పరవృత్తి. అటువంటి పరధర్మము యొక్క భుజములపై కూర్చొని స్వస్థానమునకు వెళ్ళుట యోగ్యము కాదు. గీతలో ఈ పరధర్మ స్వీకారం నిషేధించబడినది.
 
శ్లో|| శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్
      స్వధర్మో నిథనం శ్రేయః పరధర్మో భయావహః
 
పరవృత్తి రూప హనుమానుని స్పర్శ సీత స్వీకరించదు. రామ రావణుల వృత్తి సంఘర్షణ జరిగి, రావణ వృత్తిని జయించి, రాముడు తనదైన సీతావృత్తిని స్వీకరింప వలెను. అదియే శ్రేయస్కరమైనది).
అందుకు హనుమ మిక్కిలి సంతోషించి రాముడు గుర్తింపగల ఏదైనా అబిజ్ఞానమును ఒసగమని కోరెను. అప్పుడు సీత గద్గద స్వరముతో కాకాసురుని కథను రామునికి గుర్తుగా ఈ విధముగా తెలియ చేయు చున్నది.
 
శైలస్య చిత్రకూటస్య పాదే పూర్వోత్తరే పురా                 5.39.12
తతో మాంస సమాయుక్తో వాయసః పర్యతుణ్డయత్
తమ్ అహం లోష్టమ్ ఉద్యమ్య వారయామి స్మ వాయసం  5.39.15
 
దారయన్ స చ మాం కాక  స్త త్రైవ పరిలీయతే
న చా౭ప్యుపారమ న్మాంసా ద్భక్షా౭ర్థీ బలి భోజనః          5.39.16
ఆసీనస్య చ తే శ్రాన్తా పున రుత్స౦గమ్ ఆవిశమ్
 
క్రుధ్యన్తీ చ ప్రహృష్టేన త్వయా౭హం పరిసాన్త్వితాః     5.39.19
బాష్ప పూర్ణ ముఖీ మన్దం చక్షుషీ పరిమార్జతీ
లక్షితా౭హం త్వయా నాథ వాయసేన ప్రకోపితా            5.39.20
 
పరిశ్రమాత్ ప్రసుప్తా శ్చ రాఘవా౭౦కే ప్య౭హమ్ చిరం
పర్యాయేణ ప్రసుప్త శ్చ మ మా౭౦కే భరతా౭గ్రజః          5.39.21
స తత్ర పునరే నాథ వాయస స్సముపాగమత్
 
తత సుప్తప్రబుద్దాం మాం రామాస్యాంకా త్సముత్థితామ్  5.39.22
వాయస స్సహసాగమ్య విదధార స్తనాంతరే
పునః ్పున రథోత్పత్య విదధార స మాం భృశమ్    5.39.23
స దర్భ సంస్తరా ద్గృహ్య బ్రహ్మణోఽస్త్రేణ యోజయత్ 5.39.30
స దీప్త ఇవ కాలా౭గ్ని ర్జజ్వాలా౭భిముఖో ద్విజమ్
స తం ప్రదీప్తం చిక్షేప దర్భం తం వాయసం ప్రతి         5.39.31
 
తత స్తం వాయసం దర్భ స్సో౭మ్బరే౭నుజగామ హ
అనుసృష్ట  స్తదా కాకో జగామ వివిధాం గతిమ్               5.39.32
న శర్మ లబ్ధ్వా లోకేషు త్వా మేవ శరణం గతః              5.39.35
మత్కృతే కాక మాత్రేఽపి బ్రహ్మా౭స్త్రం సముదీరితమ్   5.39.39
 
కస్మా ద్యో మాం హరే త్త్వత్తః క్షమసే తం మహీపతే
తతో వస్త్రగతం ముక్త్వా దివ్యం చూడామణిం శుభమ్   5.39.69
ప్రదేయో రాఘవా యేతి సీతా హనుమతే దదౌ
 
"చిత్రకూటమిలో ఒకనాడు నేను అలసి రాముని తొడపై పరుంటిని. అప్పుడు మాంసము నందు ఆసక్తి గల ఒక కాకి నా గుండెలపై గీరుచు కొరికెను. ఈ విధముగా అది నేను ఎంత ప్రయత్నించినను పోకుండెను. ఆ విధముగా అలసి పోతిని. కొంతతడవకు రాముడు నా ఒడిలో పరుండెను. మరల ఆ వాయసము ఎగిరి వచ్చి నా వక్ష స్థలమును గోళ్ళతో గీరగా, నా గుండెల నుండి వచ్చిన రక్త బిందువులతో తడిసి రాముడు మేల్కొనెను. అందుకు రాముడు మిగుల కోపించి అక్కడి ఒక దర్భను (గరిక) బ్రహ్మాస్త్రమున అభిమంత్రించి వాయసముపై వదిలెను. ఇంద్రుని కుమారుడైన ఆ వాయసమునకు ముల్లోకములలో ఎవరును రక్షించ లేకపోయిరి. చివరకు అది తిరిగి రాముని శరణు జొచ్చినది. శరణు పొందిన కాకము ఒక కంటిని మాత్రమే ఆ అస్త్రమునకు ఇచ్చి దాశరథునికి నమస్కరించి వెడలి పోయెను. అట్టి కాకము మీద నాడు బ్రహ్మాస్త్రమును ప్రయోగించిన రాముడు ఈనాడు నన్ను రక్షించుటలో జాగు యేల?".  ఇట్లు చెప్పి వస్త్రములో దాచి యుంచిన దివ్యమగు చూడామణిని[1] తీసి రామునికి ఒసగమని సీత హనుమకు ఇచ్చెను అట్లా మణిని పుచ్చుకొని హనుమ సీతకు నమస్కరించి వెనుకకు వెళ్ళుటకు ఉద్యుక్తుడాయెను. 
 
శ్రీరామ జయరామ జయజయ రామ
[1] రత్నాకరం నందు పుట్టిన ఈ చూడామణిని సముద్రుడు, వరుణనునికి ఇవ్వగా అతడు జనకునికి ఇచ్చెను. జనకుడు ఈ మణిని వివాహకాల సమయమున తన భార్య ద్వారా సీతకు ఇచ్చెను
--(())--

093

*ఒకడు విమానాశ్రయంలో విమానాలు తుడిచే పనిలో ఉన్నాడు.*

*అలా తుడుస్తున్నప్పుడు కాక్పిట్ లో, 'విమానం నడపడం ఎలా?' అన్న పుస్తకం కనపడింది.*

*అతనిలో ఆసక్తి కలిగి పుస్తకం తెరిచాడు.*

*మొదటి పేజీలో 'విమానం ఇంజన్ స్టార్ట్ అవ్వాలంటే ఆకుపచ్చ బటన్ నొక్కాలి' అని ఉంది. అతడు అది నొక్కాడు. విమానం ఇంజన్ స్టార్ట్ అయింది.*

*అతడికి ఆసక్తి పెరిగింది. రెండో పేజీ తిప్పాడు.*

*'విమానం కదలాలంటే 'పచ్చ బటన్ నొక్కండి' అని ఉంది. అతడు నొక్కి చూసాడు. విమానం కదిలింది.*

*అతడు మరింత ఆసక్తిగా మూడో పేజీ తెరిచాడు.*

*'విమానం వేగం అందుకోవాలంటే నీలం బటన్ నొక్కండి' అని ఉంది. అతడు నీలం బటన్ నొక్కాడు. విమానం వేగం అందుకుంది.*

*అతడు మరింత ఉత్సాహంగా నాలుగో పేజీ తిప్పాడు.*


*'విమానం గాలిలోకి ఎగరాలంటే ఆరెంజ్ బటన్ నొక్కండి' అని ఉంది. అతడు ఆరంజ్ బటన్ నొక్కాడు. విమానం గాల్లోకి లేచింది.*


*యమా వేగంగా గాల్లో తేలుకుంటూ పోతున్న విమానంలో ఉన్న అతను ఐదో పేజీ తిప్పాడు.*

*'విమానం కిందకు దిగాలంటే 'ఈ పుస్తకం 2వ వాల్యూమ్ ' కొనండి' అని ఉంది.*😜

*ఇందులో నీతి  ఏంటంటే... విమానం అయినా... అధికారం అయినా... ఒక్క అవకాశం వచ్చింది కదా అని అనుభవం లేకుండా ఎక్కితే... సర్వ నాశనం కాక తప్పదు.*😁

*నడపడం అంటే బటన్ నొక్కడమే కాదు... సమర్ధత అనుభవం కూడా ఉండాలి.*☺️

****

094 

ఒకరోజు తమ్ముడు ఫోన్ చేసాడు. 

అక్కా నీ మరదల్ని తీసుకుని మీ ఇంటికి వస్తున్నాను అని. 

అందుకు సంతోషంతో పొంగిపోయిన అక్క 

ఇల్లంతా వెతికింది. వారికోసం ప్రత్యేకంగా ఏదైనా వండాలి అని. 

పేదరికంలో ఆమె ఓడిపోయింది. ఏమీ కనిపించలేదు. 

రెండే రెండు ఆరంజ్ పళ్ళు కనిపించాయి. వాటితో

రెండు గ్లాసుల జ్యూస్ తయారు చేసి ఇద్దరి కోసం సిద్ధంగా ఉంచింది ...

బెల్ మోగింది తమ్ముడు వచ్చేసాడని పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా తమ్ముడు, మరదలు, మరదలు తల్లి కూడా రావడంతో క్షణం ఆలోచనలో పడిపోయింది. 

అయినా వారిని ఆనందంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది.. 

వంట గదిలోకి వెళ్ళింది. రెండు గ్లాసుల్లో జ్యూస్ తీసుకుని ఒక గ్లాసు లో నీళ్లు తెచ్చింది. మరదలు ముందు ఆమె తల్లి ముందు ఆరంజ్ జ్యూస్ ఉంచింది. తమ్ముడి ముందు మాత్రం నీళ్ళ గ్లాసు ఉంచింది... తమ్ముడికి 7up అంటే ఇష్టం అని చెబుతూ ..

తమ్ముడి అది తాగి నిజం తెలుసుకున్నాడు. 

ఇంతలో అత్తగారు నాకు 7up కావలి అని అడగడంతో గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది అక్కకు.. 


అక్కా నువ్వు కూర్చో నేను తెస్తానని చెప్పి వంటింట్లోకి వెళ్ళి ఒక  గ్లాసు కింద పడేసాడు. అయ్యో ఏమైంది ఆని అందరూ అడిగితే 

జ్యూస్ ఒలికింది. నేను వెళ్ళి బయట తెస్తాను అని అల్లుడు వెళ్తుంటే.. అత్తగారు వద్దులే బాబు అంటూ వారించింది.

      ఇక వెళ్ళొస్తామంటూ.. బయల్దేరారు ముగ్గురూను.

     తమ్ముడు అక్క దగ్గరకు వచ్చి, చేతులు పట్టుకుని "అక్కా.! జాగ్రత్త. వంటగదిని శుభ్రంగా తుడిచేయి. లేదంటే చీమలు వచ్చేస్తాయి" అని చేతిలో కొంత డబ్బును చేతిలో పెట్టాడు.  భార్యకు, అత్తగారికి కనిపించకుండా డబ్బులను, అక్కకు తెలియకుండా.. కంటి నీరుని దాచుకుంటూ, అక్క కష్టాన్ని కాస్త తాను పంచుకుంటూ. 👍

    "ఇక నుంచి తరచూ.. పనుల మీద ఈ ఊరు రావలసి వస్తుంది. వచ్చినపుడల్లా.. నీ చేతి వంట రుచి చూడాల్సిందే" అన్నాడు. భవిష్యత్తులో చేయవలసిన వాటికి బీజం వేస్తూ.. ఆలోచించుకుంటూ!

సోదరులంటే ఇలా ఉండాలి కదా ..! 🤗🤗

బంధం అనే కాదు.. కష్టాల్లో  ఉన్నవారికి మన వల్ల చేతనైన సాయం అందించి వారిని కష్టాల నుండి బయటపడే సహాయం, ప్రయత్నం చేయాలి.

          *ఆత్మీయతను కోల్పోకండి.!*

దయచేసి మనకి అందరు దొరుకుతారు. ఎక్కడ అయినా తోడపుట్టిన వాళ్ళని కోల్పోతే వాళ్ళు దొరకరు. ఏదైనా విభేదాలు ఉన్నా.. మనమే ఒక అడుగు ముందుకు వేసి కలుపు కోవడంలో తప్పు లేదు.

         

ఇలాంటి ఆత్మీయతలను; అనుబంధాలను

నేడు మనం కోల్పోతున్నాం

***

095 //వ్యాఘ్రీ యధా హరేత్ పుత్రాన్  దంష్ట్రాభ్యాం చ న పీడయేత్

భీత పతనాదేతాభ్యాం తద్వత్ వర్ణాన్ ప్రయోజయేత్

1. వేదం లోని అక్షరాలు సునాయాసం గా పలకాలి

2. అక్షరాలు అస్పష్టం గా ఉండకూడదు

3. ధ్వని జారిపోవడం కాని తేలిపోవడం కాని జరగకూడదు అలా అని అరిచినట్టు గా కూడా ఉండకూడదు.

4. పెదవుల చివరనుంచి పదాలని పలకకూడదు

వేద పఠనానికి ఉండాల్సింది మూడు లక్షణాలు. అవి ఏమిటంటే అక్షర శుద్ధి, మాత్రా శుద్ధి, స్వర శుద్ధి. వేదాన్ని జాగ్రత్త గా పఠనం చెయ్యకపోతే అర్ధం మారిపోయే అవకాశం ఉంది. వేద పఠనం లో దైవ ప్రీతి కలిగించడమంతా వాటి స్వరం లో ఉంటుంది. ఉచ్ఛ మంద్ర స్థాయి లో పలికే స్వరాలని ఆ స్థానం గమనించి అలాగే పలకాలి. వేదం లో స్వరితము, అనుదాత్తము , దీర్ఘ స్వరితము, ఉదాత్తము అనే ముఖ్య స్వరాలు ఉంటాయి. వాటిని గురుముఖతా నేర్చుకుని వల్లె వేయాలి. వేద విద్యకి గురు అనుగ్రహం పూర్తిగా ఉండాలి. సంకల్పం ఉంటే మార్గము, గురువు దొరకడం కష్టం కాదు. అనుష్ఠానాన్ని క్రమం తప్పకుండా ఆచరిస్తూ ఆ వేదమాతని ప్రార్ధిస్తే నేర్చుకోవాలన్న తపన తోడయితే తప్పక మార్గం సుగమం అవుతుంది.

నేర్చుకునే ఒక్క పాఠం అయినా పద్దతిగా నేర్చుకుని సాధన చేస్తేనే ప్రయోజనం.

శంకరులు మనకు ఎన్నో స్తోత్రాలు అనుగ్రహించారు. తప్పులు లేకుండా అవి నేర్చుకుని చెప్పుకున్నా వేద మంత్రాలకి సమానమైన ఫలితం ఉంటుంది.

పై విషయాలపై సందేహాలు ఉంటే పెద్దవారి వద్ద నివృత్తి చేసుకోవచ్చు, కానీ చర్చకు వితండానికి తావు లేదు.

*** 

096...

096..1000 ఏళ్ల నాటి శ్రీరామానుజాచార్యుల శరీరం... శ్రీరంగంలో ఎప్పుడైనా చూసారా?*

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

వేదానికి సరైన అర్ధం చెప్పి, విశిష్టద్వైత గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు రామానుజాచార్యుడు. ఆయన మరణించి వెయ్యేళ్లు పూర్తియైనను ఇప్పటికీ ఆ శరీరం భద్రపరిచి ఉండడం విశేషం.

*శ్రీరామానుజచార్యులు*

భారతదేశంలో హిందూ మతానికి ఉన్న ప్రాముఖ్యత ఎంతో విశిష్టమైనది. ప్రతి రాష్ట్రంలోనూ అబ్బురపరిచే ప్రఖ్యాత దేవాలయాలు మనకు కనిపిస్తాయి. వాటిలో తమిళనాడులోని తిరుచ్చునాపల్లికి ఆనుకుని ఉభయ కావేరీ నదుల మధ్య ఉన్న శ్రీరంగం పట్టణం కూడా ఒకటి. ప్రసిద్ధ వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటైన శ్రీరంగం ఆలయంలో విష్ణు మూర్తి స్వయంభువుగా అవతరించినట్లు చెబుతారు. ఏడు ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆలయంలో అడుగడుగునా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది శ్రీ రామానుజాచార్యుల వారి శరీరం.

శ్రీరామానుజాచార్యులు పరమపదించి వెయ్యేళ్లకు పైగా గడిచినా ఆయన శరీరాన్ని నేటికీ ఇక్కడ భద్రపరిచి ఉంచడం విశేషం. అయితే చాలా మంది భక్తులకు దీని గురించి తెలియకపోవడం విచారకరం. కొందరు శ్రీరంగంలోని 4 వ ప్రాకారంలో ఉన్న రామానుజాచార్యుల ఆలయాన్ని సందర్శించినా... అక్కడ ఉన్నది ఆయన దివ్య శరీరం అని మాత్రం గుర్తించలేరు. 

పద్మాసనంలో యోగ భంగిమలో కూర్చుని రామానుజులు ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టారు. ఆ కూర్చున్న భంగిమలోనే ఇప్పటికీ ఆ శరీరం కనిపిస్తుంది. ప్రతి ఏటా రెండు సార్లు ఆయన కోసం ఓ ఉత్సవం నిర్వహిస్తారు. ఆ సమయంలో కర్పూరం, కుంకుమ పువ్వును ఓ ముద్దగా నూరి రామానుజుల శరీరానికి పూస్తారు. అందువల్ల ఆయన శరీరం ఓ ఎర్రని వర్ణంలో విగ్రహంలా మెరుస్తూ కనిపిస్తుంది. అయితే హారతి ఇచ్చే సమయంలో ఆయన కళ్లు, గోర్లను మనం స్పష్టంగా గుర్తించవచ్చు. కుంకుమ పువ్వు లేపనాన్ని అక్కడ అద్దకపోవడం వల్ల హారతి వెలుగులలో అవి మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయి.

*రామానుజాచార్యుల గొప్పదనం:*

రామానుజులు క్రీస్తు శకం 1017 సంవత్సరంలో చెన్నై పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరంబుదూరు (భూతపురి)లో జన్మించారు. దాదాపు 123 ఏళ్లు జీవించిన రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రచారానికి విశేష కృషి చేశారు. ఆయన జీవిత కాలంలో సగభాగం తమిళనాడులోని శ్రీరంగం, కాంచీపురం క్షేత్రాల్లోనే గడిపారు.

కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వర స్వామి విగ్రహం విష్ణువు రూపానిదా? శివ రూపానిదా? అని వైష్ణవులు, శైవులకు మధ్య ఏర్పడిన వాదోపవాదాలకు రామానుజాచార్యులు పరిష్కారం చూపించారు. తిరుమల స్వామి వారి గర్భాలయంలో శంఖు చక్రాలను ఉంచగా తెల్లవారి చూసే సరికి స్వామి వాటిని ధరించి కనిపించడంతో ఈ సమస్య సులువుగా పరిష్కృతమైంది. తిరుమల వెంకటేశ్వరుని నిత్య కైంకర్యాలను, సేవలను కూడా రామానుజాచార్యులే నిర్ణయించారు.

కొందరికే పరిమితమైన అష్టాక్షరీ ముక్తి మంత్రాన్ని తిరుకొట్టియూర్ ఆలయం గోపురం పైకి ఎక్కి అందరికీ వినిపించారు. ఈ మంత్రం బహిరంగంగా ప్రకటిస్తే నరకానికి వెళ్తారనే వాదనలను తోసి పుచ్చి.. తాను నరకానికి వెళ్లినా పర్వాలేదు, ఈ మంత్రోపదేశం పొందిన వారికి ముక్తి లభిస్తే చాలని ఆయన భావించారు. ఇలా సమ భావన, సహ జీవన, సమతా భావాలను ఆనాడే ఆయన ప్రతిపాదించారు. హిందూ మతంలో ఎన్నో గొప్ప సంస్కరణలకు ఆద్యుడయ్యారు.

*ప్రాచుర్యంలోకి రాని రహస్యం:*

క్రీస్తు శకం 11 - 12 శతాబ్ధాల మధ్య రామానుజాచార్యులు శ్రీరంగంలో శరీరాన్ని విడిచి పెట్టారు. అప్పటి నుంచి ప్రత్యేక లేపనాలను అద్ది ఆయన శరీరాన్ని భద్రపరుస్తున్నారు. అయితే రామానుజాచార్యుల మాదిరిగానే 15వ శతాబ్ధంలో మరణించిన సెయింట్ జేవియర్ పార్ధివ దేహాన్ని కూడా గోవాలోని బసిలికా ఆఫ్ బాంబ్ అనే చర్చిలో భద్రపరిచారు.

గోవాను పోర్చుగీసు వారు పాలిస్తున్న సమయంలో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనే క్రైస్తవ మతస్తుడు ఇక్కడ సువార్త వ్యాప్తికి కృషి చేశాడు. ప్రజలకు సహాయం అందిస్తూ క్రైస్తవ మతంపై నమ్మకాన్ని కలిగించాడు. ప్రపంచ వ్యాప్త పర్యటనల్లో భాగంగా మకావూలో క్రైస్తవ మత ప్రచారాలకు వెళ్ళిన ఆయన అక్కడ మరణించడంతో ఆ శరీరాన్ని గోవాలోని బసిలికా ఆఫ్ బాంబ్ చర్చికి తరలించారు. 

క్రైస్తవ మత వ్యాప్తిలో జేవియర్ చేసిన కృషికి గుర్తుగా ఆయన శరీరాన్ని ఓ గాజు పెట్టెలో ప్రత్యేక మూలికలతో కుళ్లిపోకుండా భద్రపరిచారు. దీంతో ఈ చర్చికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. గోవా పర్యాటకంలో ఇది ఒక ముఖ్యమైన సందర్శనీయ స్థలంగా పేరుగాంచింది. అయితే ఈ ప్రదేశానికి వచ్చిన ప్రాచుర్యం దీనికి ముందే శ్రీరంగంలో ఉన్న రామానుజాచార్యుల దివ్య దేహానికి మాత్రం లభించలేదు. అందుకే అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన రహస్యంగా ఇది మిగిలిపోయింది. కాబట్టి శ్రీరంగం పర్యటనకు మీరు వెళ్లినట్లయితే రామానుజుల పవిత్ర దేహాన్ని తప్పక సందర్శించండి.

097.. ప్రాంజలి prabha❤️

ఈ క్రింది 26 దోషాలు మనుష్యుని నరకం వైపు పయనింపచేస్తాయి - 1 🌹*

*🌻. భవిష్య పురాణం 5వ అధ్యాయము 🌻*

సేకరణ రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

*ఈ మనుష్యులెవరనగా*

*(1) అధముడు (2) విషముడు (3) పశువు (4) పిశునుడు (5) కృపణుడు (6) పాపిష్టుడు (7) నష్టుడు (8) రుషుడు (9) దుష్టుడు (10) పుష్టుడు (11) హృష్టుడు (12) కాణుడు  (13) అంధుడు (14) ఖండుడు (15) చండుడు (16) కుష్టు (17) దత్తాపహారకుడు (18) వక్త (19) కదర్యుడు (20) దండుడు (21) నీచుడు (22) ఖలుడు (23) వాచాలుడు (24)చపలుడు (25)మలీమసడు  (26)స్తేయి.*

*(ఈ దోషాలు స్త్రీలకున్నా దోషాలే... )*

*ఈ ఇరవై ఆరుదోషాల్లోనే మళ్ళా భేద, ప్రభేదాలు చెప్పబడ్డాయి.*

*అందుకే వాటిని ఒక్కొక్కటిగా సంగ్రాహంగానైనా వివరించి చెప్పవలసి వుంది. ఇలా :*

*(1) గురువుల వద్దకూ దైవసన్నిధికి చెప్పులు విడవకుండానే, గొడుగును ముడవకుండానే పోవుట, గురువుగారి ఎదురుగానే ఉన్నతాసనంపై కూర్చుని యుండుట, పల్లకిలో కూర్చొని తీర్థయాత్రలు చేయుట, తీర్థాలలో గ్రామ్యధర్మాచరణను చేయుట- ఇవన్నీ అథమసంజ్ఞక దోషాలు.*

*(2)  పైకి ప్రియంగా మధురంగా మాట్లాడుతూ హృదయంలో మాత్రం హాలాహలాన్ని కలిగియుండి చెప్పేదొకటిగా చేసేదొకటిగా జీవించేవాడు విషముడు.*

*(3) మోక్షమును గురించి అసలు ఆలోచించకుండా, ప్రాపంచిక విషయవాంఛలలోనే మునిగితేలుతూ, హరి సేవ వూసే తలపక, ప్రయాగలో వుంటూ ఇంకెక్కడో స్నానం చేస్తూ, ప్రత్యక్ష దైవాలను విస్మరించి అదృష్టభాగ్యాన్ని వెతుకుతూ, శాస్త్రసారాన్ని బొత్తిగా పట్టించుకోకుండా వుండేవాడు పశువు.*

*(4) బలంతోగాని, వేషంతోనో మోసంతోనో గాని, మిథ్యా ప్రేమను ప్రదర్శించి గాని మనుష్యులను తన లాభం కోసం ఆపదలలో ముంచేసేవాడు పిశునుడు.*

*(5)  దేవ, పితృ కార్యాలలో మంచి అన్నం పెట్టే స్తోమతు వుండీ కూడా మ్లానమై అశుభ్రమైన అన్నాన్ని భోజనాలలో వడ్డించే దుర్బుద్ధియైన మానవుడు కృపణుడు. వానికి స్వర్గమూ దొరకదు; మోక్షమూ లభింపదు.*

*అప్రసన్నమైన మనసుతో కుత్సిత వస్తువులతో దాన కర్మలను గావిస్తూ కోపంగా మొహం మాడ్చుకొని పూజలను చేసేవాడూ కృపణుడే. శరీర విక్రయదారులు కూడా కృపణులే.*

*(6) మాతాపితలను, గురువులను వారి కర్మకు వారిని వదలివేసి హోమ-యజ్ఞాల నిర్వహణలో కూడా లోపం చేసేవారు పాపిష్టులు.*

*(7) సాధనాచరణను పరిత్యజించి, అసత్యపు సేవాప్రదర్శన చేయువాడు, వేశ్యాగామి, దేవధనం ద్వారా స్వంత పబ్బం గడుపుకొనేవాడు, భార్యచేత వ్యభిచారం చేయించి బతుకు నిలుపుకొనేవాడు, కన్యలను తెచ్చి అమ్ముకొనో మరే విధంగానో మొత్తానికి స్త్రీధనం ద్వారానే  అపసవ్యంగా అక్రమంగా బతికేసేవాడు పురాణ పరిభాషలో నష్టుడన బడతాడు.*

*(8) మనసులో ఎప్పుడూ క్రోధమే తప్ప మరో మనోవికారమూ, సరాగమూ వుండనివాడు, తన హీనతను తానే తలచుకొని మరీ కోపం తెచ్చేసుకుని చల్లటి వాతావరణాన్ని మంట సెగలపాలు చేసేవాడు  (ఉడుకుమోతువాని ముఖాన కునుబొమలు శాశ్వతంగా ముడివడే ఉంటాయి. చిరునవ్వన్నది వుండదు ) - ఇలాంటి వాడు రుష్ఠుడు*

*(9) అకార్య లేదా నిందిత ఆచరణ ద్వారానే జీవించే వాడు. ధర్మకార్యమేదీ పూర్తిగా చేయని వాడు.*

*నిద్రాళువు, దుర్వ్యసనాలపై ఆసక్తిగలవాడు, మదిరాలోలోడు, స్త్రీలను సేవిస్తుండేవాడు, ఎల్లపుడూ దుష్టులుగా జగత్రసిద్ధులైన వారి సాంగత్యంలోనే తిరుగుతుండేవాడు దుష్టుడనబడతాడు.*

*(10) మధుర, మృష్టాన్న భోజనాన్ని తానొక్కడే తినేవాడు, వంచకుడు, సజ్జనులను నిందించేవాడు, శుకర (మద్యశాల వంటి వాటిని శుభ్రపరచుట)తో సమానమైన వృత్తి చేసేవాడు పుష్టుడు.*

*(11) నిగమాగమాలను అంటే వేదతంత్రాలను అధ్యయనం చేయకపోగా, వినడానికి కూడా రానివాడు హృష్టుడు*

*(12, 13) శ్రుతులు, స్మృతులు బ్రాహ్మణ్యానికి రెండు కళ్ళు. ఒకటి లేనివాడు కాణుడు, రెండూలేనివాడు అంధుడు.*

*(14) అన్నదమ్ములతో కయ్యమాడేవాడు, మాతాపితలను అప్రియవచనాలతో బాధించువాడు ఖండుడవుతాడు.*

*(15) శాస్త్రనింద జేయువాడు, చాటున కొండెములు చెప్పేవాడు, రాజ్ మాగీ, శూద్రసేవకుడు, శూద్రపత్నులతో అనాచర చేసేవాడు, శూద్రగృహంలో వండబడిన అన్నాన్ని ఒకమారు తిన్నా, శూద్రగృహంలో అయిదు రోజులు నివసించినా... వాడు చండుడనబడతాడు.*

*(16) కుష్టుడు :*

*ఎనిమిదిరకాల కుష్టురోగాలు కలవాడు, లేదా మూడురకాలైనా వున్నవాడు, శాస్త్ర నిందులతో కలిసి తిరిగేవాడు కుష్టుడు*

*(17) దత్తాపహారకుడు :*

*కీటకంలా తెగ తిరిగేవాడు, కుత్సిత దృష్టితోనే వ్యాపారం చేసేవాడు, దత్తాపహారకుడన బడతాడు.*

*(18) వక్త :*

*కుపండితుడై, అజ్ఞానియై ఉండి కూడా ధర్మోపదేశాలు చేసేస్తుండే వాడు వక్త. (వక్త అనే మాటకి ప్రస్తుతం మాత్రం మంచి అర్థముంది. అదే రూఢి)*

*(19) కదర్యుడు :*

*గురుజనుల వృత్తులను అపహరించడానికి ప్రయత్నించేవాడు. కాశీ నివాసి అయివుండి కూడా కాశినొదిలేసి బహుదినాలు బయటి ఊళ్ళల్లో వుండేవాడు కదర్యుడు.*

*(20) ఉద్దండుడు :*

*మిథ్యాక్రోధాన్ని ప్రదర్శిస్తూ, దండవిధానంలో, అమలులో కల్పించుకొని జనులను దండించేవాడు దండదోషి లేదా ఉద్దండుడు.*

*(21) దురాచారి :*

*బ్రాహ్మణ, రాజ, లేదా దేవ సంబంధి ధనాన్ని అపహరించి మరొక బ్రాహ్మణునికో దైవానికో పెట్టేవాడు, ఆ ధనంతో భోజనాలు పెట్టేవాడు, అక్షరాభ్యాసముండి చదవడానికి గాని, బలవంతాన చదివినా అర్థం చేసుకోవడానికి గాని ప్రయత్నించని వాడు, అనాచారి, దురాచారి నీచుడు.*

*(22) ఖలుడు :*

*గుణవంతులలో సజ్జనులలో దోషాలు వెతకడమే పనిగా పెట్టుకొనేవాడు ఖలుడు.*

*(23) వాచాలుడు :*

*భాగ్యహీనులను పరిహాసయుక్తంగా, వెటకారంగా సంబోధించి వేధించేవాడు, చండాలురతో మరీ బహి రంగంగా సల్లాపము లాడేవాడు వాచాలుడు.*

*(24) చపలుడు :*

*పక్షులను పెంచి అమ్ముకొనేవాడు పిల్లిపిల్లీ తగువులాడుకొని కోతి దగ్గరకు ధర్మంకోసం వెళితే రెండిటినీ మోసం చేసిన కోతిలాగా మానవద్రవ్యాలను భక్షించేవాడు, మాంస భక్షకుడు, అన్యాంగనాసక్తుడు, మట్టిపెళ్లలను పగులగొట్టేవాడు (వ్యంగా) చపలుడనబడతాడు.*

*(25) మలీమసుడు :*

*నూనె రాసుకొని నలుగు పెట్టుకొని తలంటి పోసుకోవడం వంటి శరీరశుద్ధికర్మ ఏనాడూ చేసుకోనివాడు, నిత్యశరీర శుభ్రతకర్మలేవీ చేపట్టనివాడు మలీమసుడు.*

*(26) స్తేయి :*

*చోరుడు దొంగతనం చేయడమేకాక మాతా పితలను పోషించకుండుట, గురువును గౌరవించకుండుట, మంచి ఆలోచనేదీ మనసులో లేకుండుట స్తేయి లక్షణాలు.*

*🌻. ఈ దోషాలలో ఏ ఒక్కటీ లేనివాడే నిజమైన మనిషి 🌻*

🌹 🌹 🌹 🌹 🌹

098.. ప్రాంజలి ప్రభ

వృద్ధదంపతులు మనసు కుదుటపడి ఒకరికొక్కరు చిన్ననాటి ఆలోచనలు గుర్తు చేసు కుంటున్నారు 

స్వచ్చమైన గాలి  నీళ్ళు,. పచ్చటి  పొలాలు. పరిశుభ్రమైన.    వాతావరణం  లో  పుట్టి.    పెరిగిన   వాళ్ళం... 

తలపై   నుండి.    చెంపల   మీదకు     కారిపోయేలా    నూనె రాసుకుని...

 చేతికి     పుస్తకాల.   సంచి తగిలించుకుని...,

ఒక్కడిగా.    బయలుదేరి    దారిలో స్నేహితులను ఒక్కొక్కళ్లను.      కలుస్తూ పెద్దగుంపుగా.  .  కిలోమీటర్ల    దూరంలో     ఉన్న  బడికి     కాళ్లకు    చెప్పులు    లేకుండా    నడచి   వెళ్ళిన     తరం వాళ్ళం, జారిపోయే    నిక్కరు    మీదకు   మొలతాడు.   లాక్కుంటు ..., చిరుగు.    బొక్కలకు    గుడ్డ ముక్కలు    అతుకులేయించుకున్న వాళ్ళం 

10 వ తరగతి    అయ్యే  వరకు    నిక్కరు.   వేసుకున్న.  ,  తరం మాదే...

గోలీలు, బొంగరాలు, కర్రా బిళ్ళ, నేలా బండ,. ఉప్పాట, ఏడు పెంకులాట.....

బంతి పుచ్చుకుని.  నేరుగా కొట్టేసుకుంటే బంతిలాగ  వంటిమీద ముద్రపడే ముద్రబాల్.   లాంటి ఆటలాడిన తరం...,

బడికి    వేసవి కాలం.   , సెలవులు రాగానే   తాటి చెట్లూ,. ..  సీమ తుమ్మ చెట్లూ    ఈతచెట్లు    ఎక్కి కాయలు.   కోసుకొని    తిన్న వాళ్ళం,   చెరువులు,     కాలవల్లో స్నానాలు     చేసిన   వాళ్ళం.   , తాటి   బుర్రలు     బండితో ఆడినోళ్లం...

దీపావళి  కి.    తాటి    బొగ్గుల రవ్వల   దివిటీ    కోసం   వళ్ళంతా మసి   పూసుకొని  మరీ     తయారు చేసుకనే  వాళ్ళం. 5 ps     ఐస్   తిన్నది   మేమె. ,,  .  పది    పైసలతో   బళ్ళో.  మ్యాజిక్   షో.   చూసింది    మేమే.... 

 వర్షం   వస్తె   తాటాకు.  గొడుగూ,    యూరియా   సంచులు, కప్పుకుని   బడికి  వెళ్ళిన    వాళ్ళం..

సెకెండ్   హ్యాండ్    సైకిల్  తొ  పక్క.   తొక్కుడుతో      సైకిల్ నేర్చుకున్నోల్లo     మేమే...

ఉత్తరాలు.., రాసుకున్న..   ,అందుకున్న తరంవాళ్ళం... 

పండగ    సెలవులు, వేసవి   సెలవులు. , ,దసరా,  సంక్రాంతి   సెలవులు

ఎన్ని సెలవులు.   వొచ్చినా   ఐదు పైసలు   ఖర్చులేకుండా    ఆనందాన్ని.   అనుభవించిన    తరంవోళ్ళం...,

పెద్దలు.  /పిల్లలూ అందరం    వీధి    అరుగుల మీద కూర్చుని   ఎన్నో     సాయంత్రాలు/రాత్రులు   ఆనందంగా    కబుర్లు చెప్పుకుని.   పొట్ట    చెక్కలయ్యేలా నవ్వుకున్నదీ మేమే.... 

 ఊర్లో,.  ఎవరి   ఇంట్లో    ఏ వేడుక  జరిగినా,.   మన   ఇంట్లో  జరిగినట్లు,.    అంతా మాదే. ,

అంతామేమే.  అన్నట్లుగా    భావించి    స్వచ్చందంగా. / నిస్వార్థంగా    పాలుపంచుకున్న    తరం   మాదే...

ఉర్లో   ఒక    ఇంట్లో   దొంగలు  పడ్డారని ,.  పిల్లలు.    అందరం  కలిసి    ఊరు  చుట్టూ    తెల్లవార్లూ   ఎన్నో రాత్రులు

టార్చిలైట్స్,    కర్రలు  పట్టుకుని  కాపలా కాసిన    వాళ్ళం  మేమే.

 వృద్ధదంపతులు ఓరి మొహాలు ఓకారు చూసుకుంటున్నారు 

ఏమంటుంది ఆలోచిస్తున్నారు మీరు అన్నది శ్రీమతి 

నాకనిపిస్తున్నదే ఇద్దరికి ఒకే సారి శ్రీ మరణం రావాలని కోరుకుందాము మన వేనని ఉంటుంది 

 

*. ఓ మరణమా…! :

హే…  ఎప్పటికప్పుడు నిన్ను ఎంతగా మిస్ అవుతున్నానో నీకేం తెలుసు… అసలెప్పుడు వస్తావ్ నువ్వు? త్వరగా రావూ… 

తమకంతో కళ్ళు మూసుకుంటున్నా… రెప్పలపై కమ్మగా వాలిపో... నా వంటిని వెచ్చని దుప్పటిలా కప్పేసేయ్… నన్ను సుఖాల మత్తులోకి నెట్టేస్తూ... 

రెప్పలపై నీ చప్పుడు వినగానే నీ శబ్దంలోకి నన్నులాగేసుకుంటావనుకుంటూ ఉంటాను.  

ఉత్తుత్తి చప్పుళ్ళతో నన్నుభ్రమల దారుల్లోనడిపిస్తూ ఎప్పటికప్పుడు ముఖం చాటేస్తావ్… ఎందుకోయ్? అంత అల్లరి? నీకెవరు నేర్పారు ఈ తిమ్మిరి ఆటలు? 

అసలు నీ కోసం కళ్ళు కాయలు కాసేలా ఉన్న ఎదురు చూపులలో నా విరహాన్ని ఎప్పుడైనా చదివావా? 

అయినా నువ్వెందుకు చదువుతావులే… నేనేం గొప్పట నీకు… నన్ను మించిన ఇష్టులెవరట నీకు… చాలా పోసెస్సివ్ గా ఉంది. నీకు నేను తప్ప ఎవరూ ఎక్కువ కాకూడదు. 

ప్రతి క్షణం నీ చప్పుడు వింటూనే ఉంటాను… పక్కనే ఉన్నట్లుంటావ్… పలకరిద్దాం అంటే పలుకులకి విరామమంటావ్… ఎప్పటికప్పుడు నా దగ్గరకు వచ్చి నన్ను అల్లుకుపోతావ్ కదా అని ఆశగా ఎదురు చూస్తుంటా. 

అసలు ఇన్నాళ్ళు నన్ను చూడకుండా నాకోసం వెదకకుండా ఉన్నావని నీ మీద చాలా కోపం వస్తుంది… నాకు నువ్వొద్దు పో అని అనాలని అనిపిస్తుంది… 

నీ మీదే ప్రాణం పెంచుకున్న నేను నువ్వు లేకుండా ఉండగలనా…? నీతో కలసి ప్రకృతిలో పరిమళమై నడుస్తున్న ఊహ వచ్చినప్పుడల్లా నా అలక మటుమాయం లే… బెంగ పడకు. 

నా ప్రతి విరామంలో నీ గురించిన ఆలోచనలతో మత్తు తెప్పిస్తావ్. నీకన్నా నాకు హితులెవ్వరు…? సన్నిహితులెవ్వరు…? 

నాకు నువ్వు ఉన్నావని అనుకున్నప్పుడల్లా దుఃఖ భారాలన్నీ మాటు మాయం అయిపోతాయి తెలుసా? ఆ దుఃఖాలన్నీ కట్టగట్టుకుని ఎక్కడికి పారిపోతాయో గానీ మనసుకి మాత్రం మధురమైన సేదని పోత పోసేస్తావ్. ఇది కేవలం నీకు మాత్రమే సాధ్యమైన విద్య కదూ... 

నువ్వలా నావైపు నడుస్తూ వస్తున్నప్పుడు నా కళ్ళల్లో కనిపించే అంత వెలుగుని నీ జీవితకాలం లో నువ్వు చూడలేవు. 

నేను దాటిన ప్రతి స్మృతికీ తెలుసు… ఇప్పుడు తమకన్నా నాకు నువ్వెక్కువ అని. నేను నాలో ఉండిపోవటంలో కంటే నీలోకి జారిపోవటంలో ఉన్న ఆనందం ఉంది చూశావూ… అది చెప్పటానికి సాధ్యం కాదురా… త్వరగా నువ్వొచ్చేసి నన్ను ఆనందాల్లో ముంచెయ్యవూ... 

అసలే నువ్వు దూరంగా ఉంటున్నావని చాలా దుఃఖంగా ఉందని తెలుసు కదా… 

అందుకే ఈ సారి నువ్వు ఇల్లు మారినప్పుడు నీ చిరునామా నాదే అవ్వాలి… ఓ మరణమా…! :) 

****

                    


c099.. దెయ్యపు కధ  



దేవతలూ, దెయ్యాలూ... రాజులూ, రాక్షసులూ... మంత్రాలూ, మాయలూ... నీతులూ, నవ్వులూ... భలేగుండేవి ఆ కథలు. ఆకాశంలో, పాతాళంలో విహరిస్తూ ఇంద్రధనుస్సులను తాకుతూ, రెక్కల గుర్రాలపై గెంతులేస్తూ, ఏడుతలల నాగుబాములతో తలబడుతూ, ఒంటికంటి రాక్షసులను సంహరిస్తూ, మాంత్రికులను బురిడీ కొట్టిస్తూ మంచిని గెలిపిస్తూ... అబ్బ అవి వినాలేగానీ ఇట్లా చెబితే ఆ ఆనందం అర్థం కాదమ్మా.
అమ్మ ఒడిలో పడుకొని వెచ్చగా పాలుతాగినట్లు, ఎండాకాలంలో వేపమాను కింద చేరి చల్లని గాలిలో ఉయ్యాలలూగినట్లు... పండగరోజున తియ్యని పూర్ణం కర్జికాయను నోట్లో పెట్టుకొని తనివితీరా నమిలినట్లు... నేను చెప్పలేనే.. ఆ ఆనందమే వేరు'' అంది.
దాంతో నాకు కూడా ఆ కథలు ఒక్కసారి వినాలనిపించింది. అమ్మమ్మతో అంతసేపు ఎప్పుడూ గడపలేదు. వెంటనే అమ్మమ్మకు మరింత దగ్గరగా జరిగి "అయితే నాకు కూడా ఒక కథ చెప్పు అమ్మమ్మా...వింటా'' అన్నాను.

"సరే, చెప్తాలే... కానీ ఈ రోజు బాగా పొద్దుపోయింది గదా... రేపు సాయంత్రం ఆ చెత్త టీవీ చూడకుండా బడయిపోగానే నా దగ్గరికి రా'' అంది.
తరువాత రోజు శనివారం. హాఫ్‌డే స్కూల్. పొద్దున్నే లేశా. అమ్మమ్మ ఇంకా లేవలేదు. తొందరగా తయారయి ఏడుకంతా బైటపడ్డా. బళ్లో అందరికీ అమ్మమ్మ గురించి, ఆమె చెప్పబోయే కథల గురించి చెప్పా. అందరూ సోమవారం ఆ కథలన్నీ తమకు కూడా చెప్పాలని ప్రామిస్ చేయించుకున్నారు.
మధ్యాహ్నం బడయిపోగానే పరిగెత్తుకుంటూ ఇంటికి చేరుకున్నాను. ఇంటి ముందంతా బంధువులు, నాన్న స్నేహితులు. లోపల ఏడుపులు. ఏమీ అర్థం కాలేదు. బెరుకుబెరుకుగా లోపలికి అడుగుపెట్టాను. వరండాలో అమ్మమ్మ కింద పడుకొని వుంది. కళ్లు మూసుకొని ఉన్నాయి. ముక్కల్లో దూది ఉంది. తలవెనుక దీపం వెలుగుతూ ఉంది.

"రాత్రి నిద్దురలోనే పోయింది. పొద్దున్న ఎంతసేపటికీ లేవకపోతే'' నాన్న ఎవరికో చెబుతూ ఉన్నాడు. అలా... ఆ రోజునుంచి కథ వినాలనే కోరిక నెరవేరనే లేదు. అమ్మను, నాన్నను, ఎదురింటోళ్లను, పక్కింటోళ్లను... ఎందరినో... అడిగీ... అడిగీ.. అలసిపోయా.

అన్నం తినబుద్ధి కాలేదు. నీళ్లు తాగబుద్ధి కాలేదు. ఒక్క కథ... ఒక్క కథ... అంటూ నిద్రలో కూడా కలవరించసాగానట ... అమ్మా, నాన్నా... నన్ను చూసి తల్లడిల్లిపోయారు. ఏవేవో బుక్కులు తెచ్చి చదివి వినిపించసాగారు. ఎవరెవరినో పిలిపించి కథలు చెప్పించసాగారు. కానీ ... వాళ్ల మాటల్లో జీవంలేదు. వాళ్ల ముఖాల్లో కథ చెబుతున్న ఆనందం లేదు. దాంతో... మా అమ్మమ్మ వర్ణించినట్టు కమ్మని అమ్మపాల వంటి అద్భుతమైన కథ వెంటనే ఏదీ నాకు దొరకలేదు. చివరికి ఒకరోజు వర్షంలో బాగా తడవడం వల్ల న్యుమోనియా వచ్చి చనిపోయాను. కథ వినాలనే నా కోరిక మాత్రం తీరలేదు'' అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ మంజు ఒళ్లో ఒదిగిపోయింది.

"నీ కోరిక తప్పకుండా తీరుతుంది కావ్యా ... నీకోసం తప్పకుండా మంచి కథని ఎలాగైనా విని, దాన్ని నీకు వినిపించి నీకు విమోచన కల్గిస్తాను. నీ కథని అందరికీ చెబుతా. నీ కథ విన్న వాళ్లు వాళ్ల పిల్లలకు చెప్పడానికైనా కథల్ని నేర్చుకుంటారు ... '' కావ్యని తన గుండెలకు మరింతగా పొదువుకుంటూ చెప్పింది మంజు.
(మీ అభిప్రాయాన్ని తెలియజేయండి)                సమాప్తం (8)

ధన్యవాదాలు

--(())--

Friday, 9 February 2024

slokas

 

6.  కదలికలుగా సఖ్యతే    

     మదన కళగా రమ్యతే  

శ్లో॥సుఖస్యానన్తరం దుఃఖం దుఃఖస్యానన్తరం సుఖమ్!

ద్వయమేతద్ధి జన్తూనామలంఘ్యం దినరాత్రివత్!!


సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తరువాత సుఖం తప్పకుండా వస్తుంటాయి. ఏ ప్రాణీ కూడా వీటినుండి తప్పించుకోలేదు. ఇవి దివారాత్రాలంత సహజంగా వరుసక్రమంలో వస్తూనే ఉంటాయి. విచారంనుండి తప్పించుకోవాలంటే సంతోషంలోకి వచ్చితీరాలి. సంతోషం వద్దనుకుంటే విచారం వచ్చి తీరుతుంది. ఈ ద్వంద్వాలలో దేనిని కోరినా నిరాకరించినా రెండవది తప్పకుండా ఉండనే ఉంటుంది. సముద్రంలో తిన్నగా వెళుతున్న కొద్దీ తరంగాలను తప్పించుకోలేం.


శ్లో॥ దివ్యచ్ఛాయా పథస్తత్ర నక్షత్రాణ్యను మండలం

దృశ్యతే భాసురా రాత్రా దేవీ త్రిపధగా తుసా..


ఆదియుగాలలో దేవతలు భూమి మీదకు తరచుగా వచ్చి ఎక్కువ కాలం ఉండి వెళుతుండేవారు. మొదటవారు దేవికా నదీతీరంలో దిగినారని పురాణాల ఉద్ఘాటన.హిమాలయాలు వారి నిత్యవిహార భూములు. కాళిదాస మహాకవి ఈ పర్వతాన్ని దేవతాత్మ అని వర్ణించాడు..


శ్లో॥ అస్త్యుత్తరాస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజః

పూర్వాపరౌ వారినిధీ విగాహ్య స్థితః పృథివ్యా ఇవ మానదండ:


తూర్పు పడమర సముద్రాల మధ్య భూమిని కొలిచే మానదండం (కొలబద్ద వలె ఉన్నది హిమాలయం. ఆది దేవతలకు ఆత్మస్థానం. అందులోనిది మానస సరస్సు. భారతంలో ఈ సరస్సుకు బిందు సరస్సని పేరుంది.


శ్లో𝕝𝕝 నాస్తి మేఘసమం తోయం నాస్తి చాత్మసమం బలమ్‌|

నాస్తి చక్షుఃసమం తేజో నాస్తి ధాన్యసమం ప్రియమ్‌||


తా𝕝𝕝 మేఘ జలముతో సమానమైన శుద్ధజలము లేదు.....ఆత్మ బలముతో సమానమైన బలము శరీరములో కాని పృథివిలో కాని రెండవది లేదు....కన్నుతో సమానమైన తేజస్సు గల యింద్రియము శరీరములో మఱొకటి లేదు..... ధాన్యముతో (అన్నముతో) సమానమైన వస్తువు మఱొకటి లేదు.


శ్లో॥ పద్మసంభవారాధితం ప్రభుం మర్మయోగినాం మంత్రసిద్ధిదం

వ్యాఘ్రవాహనం మృత్యువారణం వజ్రభైరవం దేవమాశ్రయే.


వజ్రయాన తాంత్రిక సాధనలలో వజ్రభైరవునకు, వజ్రయోగిని లేక వజ్రవారాహికి ప్రాధాన్యం ఎక్కువ.


వజ్రభైరవుని వలెనే మరో యిద్దరు భైరవ మూర్తులకు హిమాలయాలలో ప్రాముఖ్యo.పశుపతినాధుడు , మానస సరోవ ఆదిదేవుడు అమరభైరవుడని పేరు.


శ్లో𝕝𝕝 కిమప్యస్తి స్వభావేన సున్దరం వాప్యసున్దరమ్|

యదేవ రోచతే యస్మై భవేత్ తత్తస్య సున్దరమ్||


తా𝕝𝕝 ఈ లోకంలో ఏదైనా స్వభావరీత్యా అందంగా ఉన్ననూ లేకున్ననూ, ఎవరికైతే ఏదైతే నచ్చుతుందో  అది అందంగా లేకున్ననూ అదే వారికి అందంగా తోస్తుంది.


శ్లో॥ దివ్యచ్ఛాయా పథస్తత్ర

నక్షత్రాణ్యను మండలం
దృశ్యతే భాసురా రాత్రా
దేవీ త్రిపధగా తుసా..

ఆదియుగాలలో దేవతలు భూమి మీదకు తరచుగా వచ్చి ఎక్కువ కాలం ఉండి వెళుతుండేవారు. మొదటవారు దేవికా నదీతీరంలో దిగినారని పురాణాల ఉద్ఘాటన.హిమాలయాలు వారి నిత్యవిహార భూములు. కాళిదాస మహాకవి ఈ పర్వతాన్ని దేవతాత్మ అని వర్ణించాడు..

శ్లో॥ అస్త్యుత్తరాస్యాం దిశి దేవతాత్మా
హిమాలయో నామ నగాధిరాజః
పూర్వాపరౌ వారినిధీ విగాహ్య
స్థితః పృథివ్యా ఇవ మానదండ:

తూర్పు పడమర సముద్రాల మధ్య భూమిని కొలిచే మానదండం (కొలబద్ద వలె ఉన్నది హిమాలయం. ఆది దేవతలకు ఆత్మస్థానం. అందులోనిది మానస సరస్సు. భారతంలో ఈ సరస్సుకు బిందు సరస్సని పేరుంది.

యథా వ్యాలగలస్థో౬పి భేకో దంశానపేక్షతే!

తథా కాలాహినా గ్రస్తో లోకో భోగానశాశ్వతాన్!!

పాము నోట చిక్కిన కప్ప, తన మృత్యువును తెలియక ఈగలను తినుటకు కోరినట్లుగా, జనులు కాలరూపము అగు సర్పము నోట చిక్కిననూ తమ అస్థిరతను తెలియక అనిత్యమైన భోగములకై ప్రాకులాడుచుందురు.


*శ్లో𝕝𝕝 ఆదౌ చిత్తే తతః కాయే* *సతాం సంపద్యతే జరా|*

*అసతాం తు పునః కాయే*  *నైవ చిత్తే కదాచన||*

           *తా𝕝𝕝|| సజ్జనులకు ముందుగా మనస్సులోను, ఆ తరువాత శరీరమునందును వార్ధక్యం వస్తుంది.... దుర్జనులకు మాత్రం శరీరంలో వార్ధక్యం వస్తుందేగానీ మనస్సుకు ఎన్నడూ వార్ధక్యం రాదు... {పెద్దరికం రాదు}.*

*తత్త్వం బ్రువాణాని పరం పరస్మాత్ మధు క్షరంతీవ సతాం! 

ఫలాని ప్రావర్తయ ప్రాంజలిరస్మి జిహ్వే నామాని నారాయణ గోచరాణి!!*  

*భావం:-*

*ఓ జిహ్వా! దోసిలి యొగ్గి ప్రార్థించుచున్నాను. పరతత్వమగు నారాయణుని ప్రతిపాదించుచు, సత్పురుషులకు అమృతమును స్రవించు ఫలముల వంటివైన నామములను మరల మరల ఉచ్చరింపుము.*

*మనిషి పరిపూర్ణ విజయం, ఆనందం వెనుకవున్న గొప్ప రహస్యం: పూర్తి నిస్వార్ధత, ప్రతిఫలాన్ని ఆశించకపోవడమే.*

*తనపై తనకు నమ్మకం లేనివాడే అసలైన నాస్తికుడు.*

*నా చైతన్య విమానంలో పైన, క్రింద, కుడి, ఎడమ, లోపల, బయట అంతటా విహరించి, నా అంతరిక్ష గృహంలో, మూలమూలనా ఎల్లప్పుడూ, నా పరమపిత పబిత్ర సన్నిధిలోనే ఉన్నానని కనుగొన్నాను.*

*న యుజ్యమానయా భక్త్యా భగవత్య ఖిలాత్మని ।*

 *సదృశోఽస్తి శివః పన్థా యోగినాం బ్రహ్మసిద్ధయే  9 *

*టీకా:-*

న = లేదు; అఖిల ఆత్మని భగవతి = అన్ని ప్రాణులలో ఆత్మగా యున్న భగవంతుని; 

యుజ్యమానాయ భక్త్యా = భక్తి కలిసినట్లుగా; సదృశ్యః అస్తి = సమానముగా ఉండు; శివః పంథాః = పవిత్రమైన మార్గము; యోగినాం = ఆధ్యాత్మిక సాధకులకు; బ్రహ్మసిద్ధయే = భగవంతుని పొందుటకొరకు.

*భావం:-*

ఆధ్యాత్మిక సాధకులకు భగవంతుని పొందుటకు భక్తిని మించిన పవిత్రమైన మార్గము మరియొకటి లేదు. అన్ని ప్రాణులలో ఆత్మగా యున్న పరమాత్ముని చేర్చునది భక్తియే.

శ్లో|| వాసనా ఏవ సంసార ఇతి సర్వా విముంచ తాః |

తత్త్యాగో వాసనా త్యాగాత్ స్థితిరద్య యథా తథా | 8.

*టీకా*

వాసనా ఏవ = వాసనలే, సంసారః = సంసారము, ఇతి = ఇట్లని, జ్ఞాత్వా = తెలిసికొని, తాః సర్వాః = ఆ వాసనలన్నింటినీ, విముంచ = విడువుము, వాసనా త్యాగాత్ = వాసనాత్యాగమువలన, తత్త్యాగః = ఆ సంసార త్యాగము గూడా అగుచున్నది, అద్య = ఇట్లయిన పిదప, యథా = ప్రారబ్ధ మెట్లున్నదో, తథా = తదనుసారమే, స్థితిః = శరీరస్థితి యగుచున్నది. 

*వివరణ:-*

కోరికల చేతనే ఈ ప్రపంచమంతా నిర్మింపబడి నడుపబడుతుంది. కాబట్టి కోరికలను త్యజించు, కోరికలను విడివగలిగితే ప్రపంచాన్ని విడచినట్లే. ఈ స్థితిలో నీవు ఎక్కడ నివసించినా ఒకటే, సమానమే.

బన్ధోహి వాసనా బన్ధో మోక్షః స్యాద్ వాసనాక్షయః

వాసనాస్త్వం పరిత్యజ్య మోక్షార్థిత్వమపిత్యజ. (యోగవాశిష్టం) 

బధం అంటూ ఉంటే అది మన వాసనలే. ఈ వాసనలు లేకపోవడమే ముక్తి. ముందుగా వాసనలన్నిటినీ క్షయింపజేసుకుని తరువాత ముక్తి కావాలనే కోరికను కూడా విడచి పెట్టు, నీ లక్ష్యాన్ని సాధించి గమ్యాన్ని చేరినట్టే.

***

***

పద్యం యద్యపి విద్యతే బహు      సతాం హృద్యం విగద్యం నతత్

గద్యం చ ప్రతిపద్యతే న విజహత్పద్యం     బుధాస్వాద్యతాం ౹

ఆదత్తే హి తయోః ప్రయోగ     ఉభయోరామోద భూమోదయం

సంగ: కస్య హి న స్వదేశ మనసే     మాధ్వికమృద్వికయోః ౹౹


పద్యం చాలా గొప్పగా ఉంటుంది,కావాల్సినంత రసం ఉంది.రసికులకు గద్యము లేక పద్యం అంతగా సౌందర్యమనిపించదు.గద్యము కూడా పద్యం లేకుండా పండితులకు ఇష్టంగా అనిపించదు.ఈ రెండూ కలుస్తేనే ఎక్కువ ఆనందమవుతుంది.తేనె మరియు ద్రాక్ష కలిసిన రుచి ఎవరికైనా ఇష్టం లేకుండా ఉంటుందా?

***

భోగేషు ప్రసరో యస్యా మనోవృత్తేశ్చ దీయతే 

సాప్యాదావేవ హన్తవ్యా విషస్యేవాఙ్కురోద్గతిః। 


(భోగతృష్ణవలన) ఏ మనోవృత్తికి భోగములందు ప్రవేశ మివ్వబడుచున్నదో, దానిని విషాంకురముయొక్క గతినివలె మొదటనే ఛేదించి వేయవలెను। 


పూర్ణస్తు ప్రాకృతోఽ ప్యన్యత్పునరప్యభివాఞ్ఛతే 

జగత్పూరణ యోగ్యామ్బుర్గృహ్ణాత్యేవార్ణవో జలమ్‌ 


జగత్తును కూడ నింపుటకు యోగ్య మైనప్పటికిని సముద్రము నద్యాదుల జలమును గ్రహించుచునే యుండునట్లు నిగ్రహింపబడని పామరమనస్సు పదార్థములచే పూర్ణమై యున్నప్పటికిని ఆశవలన ఇంకను కోరుచునే యుండును।


హస్తం హస్తేన సంపీడ్య దన్తైర్దన్తాన్విచూర్ణ్య చ 

అఙ్గాన్యఙ్గైరివాక్రమ్య జయేచ్చేన్ద్రియశాత్రవాన్‌। 


చేతిని చేతితో నలిపి, పండ్లను పండ్లచే కొఱికి అవయవములను అవయవములచే నాక్రమించి ఏ విధముగ నైనను (సర్వప్రయత్నములచే) ఇంద్రియములను శత్రువులను జయించవలెను।


***


గౌర్గౌః కామదుఘా సమ్యక్ప్రయుక్తా స్మర్యతే బుధైః!

దుః ప్రయుక్తా పునర్గోత్వం ప్రయోక్తుః సై వ శంసతి!!


వాక్కు గోవు వంటిది. దానిని సదుపయోగము చేసినచో కామధేనువు వలె అభీష్టములనీడేర్చును. కానీ, దురుపయోగము చేసినచో, అట్లు చేసినవానికి గోత్వమును (పశుత్వమును) కలిగించును.

***

ఆ జాబిల్లి వెలుంగు వెల్లికల డాయన్ లేక రాకా నిశా

రాజశ్రీ సఖ మైన మోమున పటాగ్రం బొత్తి యెల్గెత్తి యా

రాజీవానన యేడ్చె గిన్నెర రాజత్కారాంభోజ కాం

భోజీ మేళ విపంచికా రవ సుధా పూరంబు తోరంబు గాన్


ఆ జాబిల్లి వెలుగుతో కలిగిన విరహాన్ని భరించలేక తన చంద్రుని లాంటి ముఖము పై చీర చెరగు యొత్తుకొని ఆ తామరపువ్వు వంటి ముఖముగల ఆమె కిన్నెరలు వీణ పై కాంభోజీ రాగమాలపించి నారో యన్నట్టుగా అమృతము చిందు నట్టుగా ఎలుగెత్తి యేడ్చేను.

ఈ ఏడుపునే రామకృష్ణుడు భట్టుమూర్తి బావురుమని యేడ్చె యని వ్యాఖ్యానించాడు.


స్నానేన సంగమేశం చ స్మృత్యం గౌరీశ్వరంశివం

పిండ ప్రదానం కర్తవ్యమ్ పితృ ణాం మోక్ష దాయకం.


అర్థము:--నదీ సంగమం లో పుష్కర స్నానం చేసి శంకరుడిని తలుచుకొనడం,పిండ ప్రదానం చేయడం పితరులకు మోక్ష దాయకము.యిది విధి.  ఈ ఉదాత్త ఆశయాన్ని అపహాస్యం చేయకుండా శ్రద్ద గా నిర్వర్తించండి. ఈ స్నానఘట్టం లోనే స్నానం చెయ్యాలి అని మూఢ నమ్మకాలు పెట్టుకోకుండా పుష్కరుడు ప్రవేశించిన నది ఎక్కడవున్నా అక్కడ స్నానం చెయ్యవచ్చు.12 దినాలలో ఏరోజైనా స్నానం చేయవచ్చు.


ఈ పద్యం ఎటువైపునుండీ చదివినా అదే వస్తుంది..

రాధా నాధా తరళిత

సాధక రధ తా వరసుత సరస నిధానా

నాధాని సరసత సురవ

తాధర కధ సా తళిరత ధానా ధారా!!


***

కోకిలానాం స్వరో రూపం  పాతివ్రత్యంతు యోషితాం

విద్యారూపం విరూపాణాం క్షమా రూపం తపస్వినాం


అర్థము: కోకిలకు స్వరమే అందము.మహిళలకు పా తివ్రత్యమే అందము.

కురూపులకు విద్యయే అందము.యతులకు(మునులకు) క్షమ,శాంతము లే అందము.(సూక్తిముక్తావళి)


విద్యా వివాదాయ ధనం మదాయ శక్తి: పరేషాం పర పీడనాయ

ఖలస్య సాధో ర్విపరీత మేతత్ జ్ఞానాయ దానాయ చ రక్షణాయః


అర్థము: దుర్మార్గునికి విద్య వితండ వాదము చేయుటకును, ధనము గర్వ పడుట కును, శక్తి పరులను బాధించుటకును,ఉపయోగ పడును. అదే సజ్జనులకు విద్య జ్ఞానమునకు, ధనము దానము చేయుటకును, శక్తీ పరులను రక్షించుటకును ఉపయోగపడును


***

క్రోధో మూల మనర్థానాం ; క్రోధః సంసార బంధనం

ధర్మ క్షయకరః క్రోధః ; తస్మాత్ క్రోధం విసర్జయేత్


అర్థము:--- అనర్థము లన్నింటికి కోపమే మూల కారణము. కోపమే సర్వ బంధనములకు హేతువు. అది ధర్మమును నాశనం చేస్తుంది. కనుక ముందుగా అందరూ కోపమును విడిచి పెట్టిన సుఖపడ గలరు

.

క్రోధో వైవస్వతో రాజా ; ఆశా వైతరణీ నదీ

విద్యాం కామ దుఘా ధేను: సంతుస్టో నందనం వనం


అర్థము:-- క్రోధము యమధర్మ రాజు వంటిది (అంటే మనుష్యున్ని చంపేది)ఆశ యనునది వైతరణీ నది వంటిది(దాటడానికి సాధ్యము కానిది) విద్య అన్ని కోరికలను తీర్చు కామధేనువు వంటిది. సంతోషమే నందనవనము వంటిది (మనసుకు ఆహ్లాదము కలిగించునది)

***

ఇది ఒకచమత్కార శ్లోకం.

కేశవం పతితం దృష్ట్వా,పాండవా హర్ష మాప్నుయు:

రుదంతి కౌరవాస్సర్వే,హా,హా కేశవ కేశవ


అర్థము:-కేశవుడు (కృష్ణుడు) యుద్ధము లో పడిపోయినాడట.దాన్ని చూసి పాండవులు సంతోషం తో ఎగిరారట.కౌరవులందరూ కేశవా కేశవా అని ఏడుస్తున్నారట.ఇది అసంబద్ధంగా వుంది. పదాలు కొన్నింటికి అర్థాలు మార్చుకోవాలి.కొన్ని విడదియ్యాలి.శవం=ఒక శవమును,కే=నీటియందు, పతితం=పడిపోయి వుంటే, దృష్ట్వా=చూసి, పాండవాః=గ్రద్దలు,హర్షం=ఆనందమును, ఆప్నుయు:= పొందినవి. హా హా కేశవ =నీటిలో శవము, నీటిలో శవము అని సర్వే కౌరవాః=నక్కలన్నీ ,రుదంతి=ఏడ్చుచున్నవి


.యుద్ధసమయం లో ఒక శవము నీటిలో పడి కొట్టుకువచ్చింది. గ్రద్దలు శవాన్ని ఎక్కడ వున్నా తినగలవు కనుక అవి ఆనందించినవి,నక్కలు నీటిలోకి వెళ్లి శవాన్ని తినలేవు కాబట్టి అవి ఏడుస్తూ వున్నాయి.పాండవాః =గ్రద్దలు,కౌరవా అంటే నక్కలు అని అర్థము తీసుకుంటే సరిపోతుంది.

***

ఒకసారి విద్వాన్.కావ్యతీర్థ .మద్దులపల్లి వెంకట సుబ్రహ్మణ్యం గారు యిలా అనుకున్నారు

'నీతో' 'నాతో' తనతో', మనతో అనే తెనుగు విభక్తి తో గూడిన తెనుగు పదముల నిమిడ్చి సంస్కృత శ్లోకం వ్రాయ వీలగునా యనుకొని ఇట్లు శ్లోకం వ్రాసినారు.


నీతో గురు సన్నిధి మక్షరాప్తై

నాతో ధికం వస్తు తవాస్తి కించిత్

కారుణ్య దృక్పాతనతో గురూణా

మధీహి భో రామ! నతోఖిలం త్వం


తా:--రామునితో దశరథుడు అన్నట్లు ఓ రామా!త్వం=నీవు , అక్షరాప్తై=అక్షరాప్రాప్తి కొరకు (చదువు కొరకు) గురో సన్నిధిం =గురువుగారి యొద్దకు, నీతః =చేర్పబడినావు., తవ=నీకు, అతః =యింతకంటే అధికం=అధిక మైన, వస్తు=వస్తువు, కించిత్=కొంచెము కూడా, నాస్తి=లేదు, గురూణాం= గురువులయొక్క కారుణ్య దృక్పాత నతః = వాత్సల్య పూరితమైన చూపులప్రసారము వలన నతః=నమ్రత గాల వాడవై అఖిలం =సమస్త విద్యలను,అధీహి= చదువుము


***


***

వెలయాలు శిశువ ల్లుడు

నిలయేలిక యాచకుండు నేగురు ధరలో

గలిమియు లేమియు దలపరు

కలియుగమునం గీర్తికామ! కాటయవేమా!


అతిథి ర్బాలక శ్చైవ స్త్రీ జనో నృపతి స్తధా

ఏతే విత్తం న జానంతే జామాతా చైవ పంచమః


అర్థము:--అతిథి, పిల్లలు స్త్రీలు, ప్రభువు (రాజుపన్నులు విధిస్తాడు) వీరంతా గృహస్తు దగ్గర తగిన ధనం ఉందా లేదా అని ఆలోచించరట. కోరికలు తీర్చమని

అడుగు తుంటారట. వీరిలో అల్లుడు ఐదవ వాడుగా చెప్పబడినాడు. ఇది ఎప్పుడో మనువు చెప్పినది. అయినా అందరూ అలా వుంటారని కాదు. లోక రీతి ఇలా వుంటుందని, "జామాతా దశమ గ్రహః" అనే నానుడి కూడా వుంది కదా!


***

దూష కశ్చ క్రియా శూన్యో నికృ స్టో దీర్ఘ కోపనః

చత్వారః కర్మ చండాలా జాతి చండాల ఉత్తమః


అర్థము: ఇతరులను దూషించువాడు ఏ పని చేయక సోమరిగా ఉండెడి వాడు లోభము గలవాడు దీర్ఘ క్రోధము (అంటే కోపము చాల రోజుల వరకు మనసులో పెట్టుకోనువాడు)గల వాడు వీరు నలుగురు కర్మ చండాలురు . వీరికంటే జాతి చండాలుడు ఉత్తముడు.


ఉత్తమే క్షణ కోపస్యాత్ మధ్యమే ఘటికా ద్వయం

అధమేస్యాత్ దహోరాత్రం పాపిస్టే మరణాంతకం


అర్థము:ఎవరి మీదైనా కోపము వచ్చినప్పుడు ఉత్తమునియందు ఒక క్షణ కాలము మాత్రమే ఉండును మధ్యముని యందు రెండు ఘడియలు మాత్రమే యుండును

అధముని యందు యొక ఆహోరత్రముండును (ఒక రాత్రి ఒక పగలు)

చచ్చేంత వరకు కోపము మనసులో పెట్టుకొని యుండు వాడు

పాపి స్టుడు అని అనబడుతాడు (అధమాధముడు)


ఉమాదేవి జంధ్యాల 9-8-16

అమ్మ! మీఁగడపాలు తెమ్ము లే లెమ్మని, పాణిపంకజమునఁ బైఁటఁబట్టి

తిగిచినమోము నొద్దికచూచి ముద్దాడి, గిలిగింతలిడుచుఁ గౌఁగిటను జేర్చి

ఔనుర కృష్ణ! నీ వాఁకలి గొన్నావు, బువ్వపెట్టెద నని యవ్వధూటి

మీఁగడపాలతో మేళగించినయోగి, రముఁ దవనీయపాత్రముననునిచి


చేతి కందీయ మెసఁగినకౌతుకంబుఁ

దలఁచి వర్ణింప నెవ్వరి కలవియగునె

సురుచిరాకార ఉన్నవపురవిహార

రాజగోపాల రాధామనోజఖేల


ఏమిరా కృష్ణ! మ న్నేఁటికిఁ దిన్నావు?, అమ్మ! నేఁ దినలేదు అయ్యతోడు

చిన్నవాండ్రందఱు చెప్పిరి గదవోయి, నీవు వారలమాట నిజము జేసి

విందువా నేనంతవెఱ్ఱినా శిశువునా!, ఆఁకొంటినా! చూడవమ్మ నోటి

వాసన యనుచును వక్త్రంబుఁ దెఱచి లో, నా యశోదకును బ్రహ్మాండభాండ


పంక్తులెల్లను దొంతులపగిదిగాను

బెంపుచేసిననిన్ను వర్ణింప దరమె?

సురుచిరాకార ఉన్నవపురవిహార

రాజగోపాల రాధామనోజఖేల