గణపతి రూపాల్లో మొదటి 16 గణపతులు చాలా మహిమాన్వితమైనవి. వీటిని "షోడశ'' గణపతులు అంటారు.
నంజనగూడు దేవాలయంలో ఉన్న 32 గణపతి విగ్రహాల పేర్లలో 15 పేర్లు మాత్రమే ఇప్పుడు చెప్పుకున్న పేర్లతో సరిపోలుతున్నాయి. తక్కినవి వేరుగా ఉన్నాయి. ఈ అంశాన్ని మైసూరు ప్రాచ్య పరిశోధనా సంస్థ వెల్లడించిన నివేదిక కూడా పేర్కొంది.
విద్యార్ణవ తంత్రంలో గణపతి రూపాల్లో 15 విభేదాలు కనిపిస్తాయి.
1. ఏకాక్షర గణపతి 2.మహా గణపతి 3. క్షిప్ర గణపతి
4. వక్రతుండ గణపతి 5. లక్ష్మీ గణపతి 6. హేరంబ గణపతి
7. వీర గణపతి 8.లక్ష్మీ గణపతి 9. శక్తి గణపతి
10. సుబ్రహ్మణ్య గణపతి 11. మహా గణపతి 12. త్రైలోక్య గణపతి
13. హరిద్రా గణపతి 14. వక్రతుండ గణపతి 15. ఉచ్చిష్ట గణపతి
ఇందులో రెండు మహా గణపతులు ఉన్నాయి. కాగా మూడు లక్షణాలు ఉన్న గణపతులు కనిపిస్తున్నాయి. లక్ష్మీ గణపతులు రెండు, వక్రతుండ గణపతులు రెండు, శక్తి గణపతి లక్షణాలు అయిదు, త్రైలోక్య మోహన గణపతి లక్షణాలు రెండు, వీర గణపతి లక్షణాలు రెండు, ఉచ్చిష్ట గణపతి లక్షణాలు రెండు స్పష్టమౌతున్నాయి.
ఈ 16 రూపాలలో ఒక్కో రూపానిదీ ఒక్కో విశిష్టత.
1. బాల గణపతి
ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి. కుడి వైపు చేతులలో అరటిపండు, పనసతొన, ఎడమవైపు వైపు ఉన్న చేతులతో మామిడిపండు, చెరకుగడని పట్టుకుని దర్శనమిస్తారు. బుద్ధి చురుకుగా పనిచేయాలంటే ఈ బాల గణపతిని పూజించాలి.
కరస్థ కదలీ చూత పన పేక్షుక మోదకమ్
బాలసూర్య నిభం వందే దేవం బాలగణాధిపమ్
అనే మంత్రంతో ప్రతిరోజూ సూర్యోదయ సమయాన చదవాలి.
2. తరుణ గణపతి:
ఈ వినాయకుడి రూపానికి ఎనిమిది చేతులుంటాయి కుడి వైపు చేతులతో పాశం, వెలగగుజ్జు, దంతం, చెరకు ఎడమ వైపు ఉన్న చేతులతో అంకుశం, నేరేడు పండు, వరివెన్ను పట్టుకుని అభయముద్రతో దర్శనమిస్తారు. ఈయనను...
పాశాంకశాపూస కపిత్థ జంబూ స్వదంత శాలీనమపి స్వహస్త్రైః ధత్తే సదా య సతరుణాభః పాయాత్స యుష్మాం ష్తరుణో గణేశః అనే మంత్రంతో పూజించాలి.
3. భక్త గణపతి
ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులలో కొబ్బరికాయ, అరటిపండు ఎడమ వైపు ఉన్న చేతులలో మామిడి పండు, బెల్లపు పరమాన్నం ఉన్న పాత్ర పట్టుకుని కనిపిస్తారు. ఈయనను...
నాలికేరామ్ర కదలీ గుడపాయాస ధారిణమ్
శరచ్చంద్రాభ్వవుషం భజే భక్త గణాధిపమ్
అనే మంత్రతో స్తుతించాలి...ఈయనను సేవిస్తే భక్తిభావం పెరుగుతుంది.
4. వీరగణపతి
ఈ వినాయకుడి రూపానికి పదహారు చేతులుంటాయి కుడి వైపు చేతులతో బాణం, బేతాలుడు, చక్రం, మంచపుకోడు, గద, పాము, శూలం, గొడ్డలిబొమ్మ ఉన్న జెండా, ఎడమవైపు ఉన్న చేతులతో శక్తి అనే ఆయుధం, విల్లు, ఖడ్గం, ముద్గరమనే ఆయుధం, అంకుశం, పాశం, కుంతమనే ఆయుధం, దంతం ధరించి దర్శనమిస్తారు. ఈయనను....
బేతాల శక్తి శర కార్ముక చక్ర ఖడ్గ ఖట్వాంగ ముద్గర గదాంకుశ నాగపాశాన్
శూలం చ కుంత పరశుధ్వజ మాత్తదంతం వీరం గణేశ మరుణం త్వనిశం స్మరామి
అనే మంత్రంతో కీర్తించాలి. ఈయనను పూజించిన భక్తులకు తిరుగులేని ధైర్యం ప్రసాదిస్తారు.
5. శక్తి గణపతి
ఆలింగ్య దేవీం హరితాంగయష్టిం పరస్పరా శ్లిష్ట కటిప్రదేశమ్
సంధ్యారుణం పాశ స్ఫటీర్దధానం భయాపహం శక్తి గణేశ మీదే
అనే మంత్రంతో ఈ గణేశుని ప్రార్థించాలి. నాలుగు చేతులున్న ఈ గణపతి అంకుశం, పాశం,
విరిగిన దంతం పట్టుకుని దర్శనమిస్తారు. ఈయన కరుణిస్తే ఏదయినా సాధించగలమనే ఆత్మస్థైర్యం పెరుగుతుంది.
6. ద్విజ గణపతి
ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పుస్తకం, దండం ఎడమవైపు ఉన్న చేతులతో అక్షమాల, కమండలం పట్టుకుని కనిపిస్తారు. ఈయనను...
యం పుస్తకాక్ష గుణదండ కమండలు శ్రీః విద్యోతమాన కరభూషణ మిందువర్ణమ్
స్తంబేరమానవ చతుష్టయ శోభమానం త్వాం ద్విజగణపతే ! సిద్ధ్విజ గణాధిపతే స ధన్యః అనే మంత్రంతో పూజించాలి. ఈ గణపతి తెలివి తేటలు ప్రసాదిస్తాడు.
7. సిద్ధి (పింగల) గణపతి
ఈ గణపతిని సేవిస్తే ప్రారంభించిన పనులలో అపజయమన్నది ఉండదు. ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పండిన మామిడిపండు, ఎడమవైపు ఉన్న చేతులతో పూలగుత్తి, గొడ్డలి పట్టుకుని కనిపిస్తారు. ఈయనను....
పక్వచుత ఫల పుష్పమంజరీ ఇక్షుదండ తిలమోదకై స్సహ ఉద్వహన్ పరశుమస్తు తే నమః
శ్రీ సమృద్ధియుత హేమం పింగల అనే మంత్రంతో స్తుతించాలి.
8. ఉచ్ఛిష్ట గణపతి
కోరిన కోర్కెలు తీర్చే ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడివైపు చేతులతో నల్ల కలువ, వరివెన్ను ఎడమ వైపు ఉన్న చేతులతో దానిమ్మపండు, జపమాల పట్టుకుని కనిపిస్తారు. ఈయనను....
నీలబ్జ దాడిమీ వీణా శాలినీ గుంజాక్ష సూత్రకమ్
దధదుచ్ఛిష్ట నామాయం గణేశః పాతు మేచకః
అనే మంత్రంతో ప్రార్థించాలి.
9. విఘ్న గణపతి
గణపతి అసలు లక్షణమైన విఘ్ననాశనం ఈ రూపంలో కనిపిస్తుంది. ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయ…
***
: 108 రూపాలలో మహా గణపతులు
1. ఏకాక్షర గణపతి
ప్రాతర్భజామ్య్భయదం ఖలు భక్త శోక దావానలం గణ్విభుం వరకుంజరాస్యమ్
అజ్ఞాన కానన వినాశన హవ్యవాహం ఉత్సాహ వర్ధనమహం సుతమీశ్వరస్య
2. మహా గణపతి
భిభ్రాణోబ్జక బీజాపూరక కదా దంతేక్షు బాణైస్సమంభిభ్రాణో మణికుంభశాలి కణిశం పాశంచ వక్ర్తాంచితంగౌరంగ్యారుచి రారవిందయుతయా దేవ్యాసనాధాంతిక:
శోణాంగ శ్శుభమాతనోతుభవతాం నిత్యం గణేశో మహాన్
3. బాల గణపతి
కరస్ధ కదళీచూత పనసేక్షు కపిత్ధకం బాలసూర్యప్రభందేవం వందే బాలగణాధిపం
4. తరుణ గణపతి
పాశాంకుశాపూస కపిత్ధ జంబూఫలం తిలాం చేక్షు మపిసవ హసై:
ధత్తే సదాయ స్తరుణారుణాంభ: పాయాత్సయుష్మాన్ తరుణో గణేశ:
5. విఘ్నరాజ గణపతి
విఘ్నరాజావతారశ్చ శేషవాహన ఉచ్చతే మమతాసుర సంహర్తా విష్ణు బ్రహ్మేతివాచక:
6. సిద్ది గణపతి
ఏకదంతం చతుర్హస్తం పాశాంకుశ ధారిణమ్ అభయంచవరదం హసైర్ద దానమూషకధ్వజమ్
7. బుద్ధి గణపతి
త్రయీమయాఖిలం బుద్ధిధాత్రే బుద్ధి ప్రదీపాయ సురాధిపాయ |
నిత్యాయ సత్యాయచ నిత్యబుద్ధే నిత్యం నిరీహాయ నమోస్తు నిత్యమ్ ||
8. లక్ష్మీ గణపతి
బిభ్రాణశ్శుక బీజపూర కమలం మాణిక్య కుంభాంకుశాన్ పాశం కల్పలతాంచ బాణకలికా ప్రోత్సస్సరో నిస్సర:శ్యామో రక్త సరోరుహేణ సహితో దేవీ చ యస్యాంతికే
గౌరాంగో వరదాన హస్తకమలో లక్ష్మీగణేశో మహాన్
9. సంతాన లక్ష్మీ గణపతి
శరణం భవదేవేశ సంతతిం సుదృఢాంకురు |
భవిష్యంతియే పుత్రామత్కులే గణనాయక: ||
10. దుర్గా గణపతి
తప్తకాంచన సంకాశం శ్చాష్ట్ట్ట మహత్తను: |
దీప్తాంకుశం శరం చాక్షం దంతం దక్షే వహన్కరై: ||
11. సర్వశక్తి గణపతి
ఆలింగ్య దేవీం హరితాం నిషణ్ణాం పరస్పరాశ్లిష్టకటీ నివేశం
సంధ్యారుణం పాశసృణీం వహస్తం భయాపహం శక్తి గణేశ మీఢే
12. విరివిరి గణపతి
సుసిద్ధాదం భక్తిజనస్యదేవ సకామిదా మామిహ సౌఖ్యదంతం |
అకా మికాగాం భవబంధహరం గజాననం భక్తియుతం భజామ ||
13. క్షిప్ర గణపతి
దంతం కల్పలతా పాశ రత్నకుంభోప శోభితం
బంధూక కమనీయాంగం ధ్యాయేత్ క్షిప్ర వినాయకం
14. హేరంబ గణపతి
అభయ వరద హస్త: పాశదంతాక్షమాల: పరశుమధ త్రిశీర్షం ముద్గరం మోదకం చ
విదధతు నరసింహ: పంచమాతంగ వక్త్ర: కనక రుచిర వర్ణ: పాతు హేరమ్బ నామా
15. నిధి గణపతి
విచిత్ర రత్నై: ఖచితం సువర్ణ సమ్బూతకంగుహ్యమయా ప్రదత్తమం |
తధాంగులీష్పంగులికం గణేశ చిత్తేన సంశోభయ తత్పరేశ
16. వక్రతుండ గణపతి
స్వర్ణవర్ణ చతుర్బాహుం | పాశాంకుశధరం విభుం |
ఆమ్రపాత్ర స్వదంతంచ | శక్తియుతం విచింతయేత్
17. నవనీత గణపతి
దానాయ నానావిధ రూపకాంస్తే గృహాణ దత్తాన్మనసామయావై|
పదార్ధ భూతాన్ స్థిర జంగమాంశ్చ హేరమ్నమాం తారయ మోహభావాత్ ||
18. ఉచ్ఛిష్గ్ట గణపతి
లీలాబ్జం దాడిమం వీణాశాలి గుంజాక్ష సూత్రకం
దధ దుచ్ఛిష్ట నామాయం గణేశ: పాతు మేచక:
19. హరిద్రా గణపతి
హరిద్రాభం చతుర్బాహుం హరిద్రా వదనం ప్రభుమ్ పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవచ భక్తాభయ ప్రదాతాం వందే విఘ్న వినాశనమ్
20. మోదక గణపతి
నాదబిందు కళాత్మకం వరనారదాది సుపూజితం |
మోదక ఫలదాయకం ప్రమోదవదన వినాయకం ||
21.మేధా గణపతి
సకలభాగ్య వశంకరం వర సాధు సజ్జన సంహితం
అఖిలదేవ ప్రదాయకం మమ ఆత్మరక్ష వినాయకం
22.మోహన గణపతి
రక్ష రక్ష గణాధ్యక్ష రక్షత్రైలోక్య రక్షక
భక్తానాం అభయంకర్తా త్రాతాభవ భవార్ణవాన్
23.త్రైలోక్య మోహన గణపతి
గదా బీజాపూరే ధను: శూలచక్రే సరోజతృలే పాశాధాన్య ప్రదంతారి కరై: సందధానం
స్వశుండాగ్ర రాజం | మణి కుంభ మంగాధి రూఢం స పత్న్యా ||
24. వీర గణపతి
భేతాళ శక్తి శరకార్ముక ఖేటఖడ్గ ఖట్వాంగ ముద్గర గధాంకుశ ముద్వహస్తం
వీరం గణేశ మరుణం సతతం స్మరామి
25. ద్విజ గణపతి
యం పుస్తకాక్ష గుణ దండకమండలు శ్రీవిద్యోతమాన కరభూషణమిందు వర్ణం
స్తంబేర మానన చతుష్టయ శోభమానం త్వాం య: స్మరే ద్ద్విజ గణాధిపతే సధన్య: ||
26. ఋణవిమోచన గణపతి
సృష్ట్యా బ్రహ్మణా సమ్యక్ పూజిత: ఫలసిద్ధయే
సదైవ పార్వతీపుత్ర: ఋణనాశం కరోతుమే
27. సంకష్టహర గణపతి
ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం
భక్తావాసం స్మరేన్నిత్యంమాయుష్కారమార్ధ సిద్ధయే
28. గురు గణపతి
ప్రవరం సర్వదేవానాం సిద్ధినాం యోగినాం గురుం |
సర్వస్వరూపం సర్వేశం జ్ఞానరాశి స్వరూపిణమ్ ||
అవ్యక్తమక్షరం నిత్యంసత్యమాత్మ స్వరూపిణం |
వాయుతుల్యంచ నిర్లిప్తం చాక్షతం సర్వసాక్షిణం ||
29. స్వర్ణ గణపతి
వందే వందారుమందార, మిందు భూషణ నందనం |
అమందానంద సందోహ, బంధురం సింధురాననమ్ ||
30. అర్క గణపతి
మూషారూఢం లంబసూత్రం సర్పయజ్ఞోపవీతినల|
విషాణం పాష కమలం మోదకంచ కరైధృతం ||
31. కుక్షి గణపతి
సరోజన్మన భూషాణాం భరణోజ్వలహస్త తన్వ్యా సమా
లింగితాంగాం | కరీంద్రాననాం చంద్ర చూడం త్రినేత్రం రక్తకాంతిం భజేత్తం ||
32. పుష్టి గణపతి
ఏకదంతం మహాకాయం లంబోదరం గజాననం |
విఘ్ననాశకరం దేవం హేరంబం ప్రణమామ్యహం ||
33. వామన గణపతి
లంబోదరం మహావీర్యం నాగయజ్ఞోపశోభితం |
అర్ధచంద్రధరం దేవం విఘ్నప్యూహం వినాశనం ||
34. యోగ గణపతి
యోగరూఢో యోగ పట్టాభిరామో బాలార్కభశ్చేంద్ర నీలాంశుకాఢ్య:
పాశాక్ష్వక్షాన్ యోగదండం దధానో పాయాన్నిత్యం యోగ విఘ్నేశ్వరో న:
35. నృత్య గణపతి
పాశాంకుశాపూప కుఠార దన్త చంచత్కరం వచరుతరాంగుళీయం
పీతప్రభం కల్పతరో రధస్ధం భజామి నృత్తైక పదం గణేశం
36. దూర్వా గణపతి
దూర్వాంకురాన్వై మనసా ప్రదత్తాం స్త్రిపంచపత్రైర్యుతకాంశ్చ స్నిగ్ధాన్ |
గృహాణ విఘ్నేశ్వర సంఖ్యయా త్వం హీనాంశ్చ సర్వోపరి వక్రతుండ ||
37. అభీష్టవరద గణపతి
నమస్తే వేద విదుషే నమస్తే వేద కారిణే |
కమన్యం శరణం యామ: కోను న: స్వాద్భయాపహ: ||
38. లంబోదర గణపతి
లంబోదరావతారో వైక్రోధాసుర నిబర్హణ:
శక్తిబ్రహ్మ ఖగ: సద్యత్ తస్యధారక ఉచ్యతౌ ||
39.విద్యా గణపతి
భక్త ప్రియాయ దేవాయ నమో జ్ణాన స్వరూపిణే |
నమో విశ్వస్యకర్త్రేతే నమస్తత్పాలకాయచ ||
40. సరస్వతీ గణపతి
వాగీశాద్యా స్సుమనస: సర్వార్ధానాముపక్రమే
యంనత్వాకృత కృత్వాస్స్యు: తం నమామి గజాననమ్ ||
41. సంపత్ గణపతి
పక్వచూత ఫలపుష్ప మంజరీచేక్షుదండ తిలమోదకైస్సహ
ఉద్వహన్ పరశుమస్తుతే నమ: శ్రీ సమృద్ధియత హేమపింగళ:
42. సూర్య గణపతి
హిరణ్యగర్భం జగదీశితారరమృషిం పురాణం మండలస్థం |
గజాననం యం ప్రవిశన్తిసంతస్తత్కాలయోగైస్త మహం ప్రపద్యే ||
43. విజయ గణపతి
శంఖేక్షు చాప కుసుమేఘ కుఠారదంత పాశాంకుశై: కళమమంజరికా సనైధై:
పాణిస్థితై: పరిసమావృత భూషణ శ్రీ:
44. పంచముఖ గణపతి
గణేశాయ ధామ్నే పరేశాయ తుభ్యం సదానంద రూపాయ సర్వార్తిగాయ|
అపారస్వరూపాయ దేవాధిదేవ నమస్తే ప్రభో భక్త సంరక్షకాయ ||
45. నీలకంఠ గణపతి
వినాయకం నాయకమౌక్తికం త్రయీ హారావళే రావళితం భుజంగమై: |
పినాకిజం నాకిజనేడ్య మంహసాం నివారణం వారణ్వక్త్ర మాశ్రయే ||
46. గాయత్రి గణపతి
యజ్ఞోపవీతం త్రిగుణస్వరూపం సౌవర్ణమేవం హ్యహినాధ భూతం |
భావేనదత్తం గణనాథతత్వం గృహాణ భక్తోద్దృతి కారణాయ ||
47. చింతామణి గణపతి
కల్పద్రుమాధ: స్థితకామధేయం | చింతామణిం దక్షిణపాణి శుండమ్ |
బిభ్రాణ మత్యద్భుత చిత్రరూపం | య: పూజయేత్తస్య సమస్త సిద్ధి: ||
48. ఏకదంత గణపతి
అగజానన పద్మార్కమ్ గజానన మహర్నిశం
అనేక దం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే
49. వికట గణపతి
వికటోనామ విఖ్యాత: కామాసుర విదాహక: |
మయూర వాహనశ్చాయం సౌరబ్రహ్మధర: స్మ్రత: ||
50. వరద గణపతి
వరదాభయ హస్తాయ నమ: పరశుధారిణే |
నమస్తే సృణిహస్తాయ నాభివిశేషాయతే నమ: ||
51. వశ్య గణపతి
విఘ్నేశ వీర్యాణి విచిత్రకాణి వన్దే జనైర్మాగధకై: స్మృతాని |
శ్రుత్వాసమత్తిష్ఠ గజానన త్వం బ్రహ్మేజగన్మంగళకం కురుష్వ ||
52. కుల గణపతి
శుండావిభూషార్థమనన్తఖేలిన్ సువర్ణజం కంచుకమాగృహేంణ |
రత్నైశ్చయుక్తం మనసామయాయ ద్ధతం ప్రభోతత్సఫలం కురుష్వ ||
53. కుబేర గణపతి
రత్నై: సువర్ణేన కృతాని గృహాణచత్వారి మయాప్రకల్ప్య |
సమ్భూషయ త్వం కటకాని నాథ చతుర్భుజేషు వ్యాజ విఘ్నహారిన్ |
54. రత్నగర్భ గణపతి
హేరంబతే రత్నసువర్ణయుక్తే సునూపుర మంజీరకే తథైవ|
సు కింకిణీ నాద యుతే సుబుద్ధ్యా సుపాదయో: శోభమయే ప్రదత్తే ||
55. కుమార గణపతి
మాత్రే పిత్రేచ సర్వేషాం హేరంబాయ నమో నమ:
అనాదయేచ విఘ్నేశ విఘ్నకర్తే నమోనమ:
56. సర్వసిద్ధి గణపతి
పరంధామ పరంబ్రహ్మ పరేశం పరమేశ్వరం |
విఘ్నవిఘ్నకరం శాంతం పుష్టం కాంతమనంతకం |
సురాసురేంద్ర్యై: సిద్ధేంద్ర్యై: స్తుతం స్తౌమి పరాత్పరం |
సురపద్మచినేశంచ గణేశం మంగళాయనం ||
57. భక్త గణపతి
నారికేళామ్ర కదళీ గుడ పాయస ధారిణం
శరచ్ఛశాంక సదృశం భజే భక్తగణాధిపమ్
58. విఘ్న గణపతి
పాశాంకుశం ధరన్నామ ఫలాశీ చాఖవాహన:
విఘ్నం నిహస్తు న: సర్వ రక్తవర్ణో వినాయక:
59. ఊర్ధ్వ గణపతి
కల్హారిశాలి కణిశేక్షుక చాపబాణ, దంత ప్రరోహ కబర: కనకోజ్జ్వలాంగ:,
ఆలింగనోద్యత కర: తటిదాభకట్యా దేయాత్స శతృభయ మూర్థ్వ గణేశ్వరస్తే
60. వర గణపతి
నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన
ఈప్సితం మేం వరం దేహి పరత్రా చ పరాంగతిమ్
61. త్ర్యక్ష్యర గణపతి
సర్వవిఘ్నహరం దేవం, సర్వవిఘ్నవివర్జితం
సర్వసిద్ధి ప్రదాతారం, వందేహం గణనాయకమ్
62. క్షిప్రప్రసాద గణపతి
యక్షకిన్నర గంధర్వ సిద్ధవిద్యా ధరైస్సదా
స్తూయమానం మహాబాహుం వందే హం గణనాయకమ్
63. సృష్టి గణపతి
ప్రాతర్నమామి చతురానన వన్ద్యమానం ఇచ్ఛానుకూలమఖిలం చ వరం దదానమ్
తం తుందిలం ద్విరసనాధిప యజ్ఞసూత్రం పుత్రం విలాస చతురం శివయో: శివాయ
64. ఉద్దండ గణపతి
ప్రాత:స్మరామి గణనాథమనాథ బంధుం సిందూరపూర పరిశోభితగండయుగ్మం
ఉద్ధండవిఘ్న పరిఖండన చండదండం అఖండలాది సురనాయక బృందవంద్యమ్
65. డుండి గణపతి
అక్షమాలాం కుఠారంచ రత్నపాత్ర స్వదంతకమ్
ధతైకరైర్విఘ్నరాజో డుంఢినామా మదేస్తున:
66.ద్విముఖ గణపతి
స్వదంత పాశాంకుశ రత్నపాత్రం కరైర్దదానో హరినీలగాత్ర:
రత్నాంశుకో రత్న కిరీటమాలీ భూత్యై సదామే ద్విముఖో గణేశ:
67. త్రిముఖ గణపతి
శ్రీమత్తీక్షణ శిఖాం కుశాక్ష వరదాన్ దక్షే దదానం కరై:
పాశాంచామృత పూర్ణకుంభమయం వామే దదానోముదా
పీఠే స్వర్ణమయారవింద విలసత్సత్కర్ణికాభాసురే
స్వాసీనస్త్రిముఖ: పరశురుచిరో నాగనన: పాతున:
68. సింహ గణపతి
వీణాం కల్పలతా మరించ వరదం దక్షేవిధత్తేకరై: వేణే తామరసం చ రత్న కలశం సన్మంజరీం చా భయం శుండాదండలసన్ మృగేంద్ర వందన: శంఖేందు గౌర: శుభో
దీప్యద్రత్న నిభాంకుశో గణపతి: పాయా దపాయాత్సన:
69. గజానన గణపతి
సదా సుఖానందమయం జలేచ సముద్రేన ఇక్షురసే నివాసం|
ద్వంద్వ స్థయానేనచ నాళరూపం గజాననం భక్తియుతం భజామ||
70. మహోదర గణపతి
మహోదర ఇతిఖ్యాతో జ్ఞానబ్రహ్మ ప్రకాశక:
మోహాసుర నిహంతావై ఆఖువాహన ఏవచ ||
71. భువన గణపతి
విశ్వమూలాయ భవ్యాయ విశ్వసృష్టికరాయతే |
నమో నమస్తే సత్యాయ సత్య పూర్ణాయ శుండినే ||
72. ధూమ్రవర్ణ గణపతి
ధూమ్రవర్ణావతారశ్చాభి మానాసుర నాశక:
ఆఖువాహన ఏవాసౌ శివాత్మేతి స ఉచ్యతౌ
73. శ్వేతార్క గణపతి
ఓం నమో గణపతయే శ్వేతార్క గణపతయే శ్వేతార్కమూలనివాసాయ
వాసుదేవ ప్రియాయ, దక్ష ప్రజాపతి రక్షకాయ సూర్యవరదాయ కుమారగురవే
74. ఆధార గణపతి
నాదం బాలసహస్ర భాను సదృశం నాగేంద్ర వక్త్రాన్వితం | హస్తాభ్యాం చషకం పవిత్ర కలశం హస్యంచ వృత్తాండవం | నానా చిత్రవిచిత్రయన్
పరగురుం ఆధార విద్యా స్థితిం | ఓంకార ప్రణవాకృతిం గణపతిం నిత్యం భజేహం ప్రభో ||
75. భూతరోగ నివారణ గణపతి
ఏకదంతం చతుర్హస్తం బిభ్రాణ పాశమంకుశం |
అభయం వరదం సాస్మృర్భధానం మూషిక ధ్వజం |
76. ప్రసన్న విఘ్నహర గణపతి
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం |
పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ||
77. ద్వాదశభుజవీర గణపతి
సురేంద్రనేన్యం హ్యసురై: సుసేవ్యం సమానభావన విరాజయంతం|
అనంతబాహుం మూషక ధ్వజం తం గజాననం భక్తియుతం భజామ: ||
78. వశీకర గణపతి
బీజాపూరగదేక్షుకార్ములసచ్చక్రోబ్జ పాశోత్పల|
వ్రీహ్యగ్రస్వ విషాణ రత్న కలశప్రోద్యత్కరాంభోరుహ: ||
ధ్యేయోవల్లభయా సపద్మకరయాశ్లిష్టోజ్వల- ద్భూషయ
విశ్వోత్పత్తి విపత్తి సంస్తుతికరో విఘ్నో విశిష్టార్ధద: ||
79. అఘౌర గణపతి
గజవదనమంచింత్యం తీక్ష్ణదంష్టృం త్రినేత్రం
బృహదుదరమశేషం భూతరాజం పురాణం
అమరవరసుపూజ్యం రక్తవర్ణం సురేశం |
పశుపతి సుతమీశం విఘ్నరాజం నమామి ||
80. విషహర గణపతి
నాగాననే నాగకృతోత్తరీయే క్రీడారతే, దేవకుమార సంఘై: |
త్వయిక్షణం కాలగతిం విహాయతౌ ప్రాపతు కన్దుకతామినేన్దూ ||
81. భర్గ గణపతి
బాలార్కకోటి ద్యుతి మప్రమేయం
బాలేందు రేఖా కలితోత్తమాజ్ఞమ్ |
భ్రమద్ద్విరేపావృత గణ్డభాగం భజే భవానీతనయం గణేశమ్ ||
82. సర్వ సమ్మోహన గణపతి
స్వాంకస్థితాయానిజవల్లభయాముఖామ్భుజాలోకేన లోలనేత్రం |
స్మేరాననాస్యం మదవైభవేన రుద్ధం భజే విశ్వవిమోహనంతం ||
83. ఐశ్వర్య గణపతి
సహస్ర శీర్షం మనసా మయా త్వం దత్తం కిరీటంతు సువర్ణజంవై |
అనేకరత్నై: ఖచితం గృహాణ బ్రహ్మేశతే మస్తక శోభనాయ ||
84. మాయావల్లభ గణపతి
సంసారార్ణవ పారేచ మాయాపోతే సుదుర్లభే |
కర్ణధార స్వరూపంచ భక్తానుగ్రహకారకం |
వరం వరేణ్యం వరదం వరదానామపి ఈశ్వరం |
సిద్ధం సిద్ధి స్వరూపంచ సిద్ధిదం సిద్ధి సాధనమ్ ||
85. సౌభాగ్య గణపతి
తతో హరిద్రామచిరంగులాలం సిన్ధూరకం తేపరికల్పయామి |
సువాసితం వస్తు సువాస భూతై: గృహాణ బ్రహ్మేశ్వర శోభనార్థమ్ ||
86. గౌరి గణపతి
విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ |
లంబోదరాయ సకలాయ జగద్ధితాయ |
నాగాసనాయ కృతియజ్ఞ విభూషితాయ |
గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే ||
87. ప్రళయంకర్త గణపతి
అకాలమేవ ప్రళయ: కథం లబ్ధో జనైరయం |
హా ! గజానన దేవేశ: హాహా విఘ్న హరావ్యయ ||
88. స్కంద గణపతి
కుమార భుక్తౌ పునరాత్మహేతో: పయోధరే పర్వతరాజ పుత్ర్యా|
ప్రక్షాళయంతం కరశీ కరేణ మౌగ్ధ్యేనతం నాగముఖం భజామి ||
89. మృత్యుంజయ గణపతి
సరాగలోకదుర్లభం విరాగిలోక పూజితం
సురాసురైర్నమస్కృతం జరాప మృత్యునాశకం ||
90. అశ్వ గణపతి
రాజోపచారాన్వి విధాన్గృహాణ హస్త్యశ్వఛత్రాధికమాద రాద్వై |
చిత్తేన దత్తాన్గణనాధడుణ్డే హ్యపార సంఖ్యాన్ స్థిరజంగమాంస్తే ||
91. ఓంకార గణపతి
వందే గణేశం భుజగేంద్ర భూషణం సమస్త భక్తాళికృతాతితోషణం
విశ్వం భరా సంస్థితలోక రక్షణం మదీయ పాపౌఘతమస్సు పూషణమ్ ||
92. బ్రహ్మవిద్యా గణపతి
బ్రహ్మేభ్యో బ్రహ్మదాత్రేచ గజానన నమోస్తుతే |
ఆదిపూజ్యాయ జ్యేష్ఠాయ జ్యేష్ఠరాజాయతే నమ: ||
93. శివ అవతార గణపతి
విఘ్నానాం పతయే తుభ్యం నమో విఘ్న నివారణ |
సర్వాంతర్యామిణే తుభ్యాం నమస్సర్వప్రియంకర ||
94. ఆపద గణపతి
ఓమ్ నమో విఘ్నరాజాయ సర్వసౌఖ్య ప్రదాయినే |
దుష్టారిష్ట వినాశాయ పరాయ పరమాత్మనే ||
95. జ్ఞాన గణపతి
గుణాతీతమౌనం చిదానంద రూపం | చిదాభాసకం సర్వగం జ్ఞాన గమ్యం |
ముని శ్రేష్ఠమాకాశ రూపం పరేశం | పరబ్రహ్మ రూపం గణేశం భజేమ ||
96. సౌమ్య గణపతి
నమస్తే గణనాధాయ గణానాం పతయే నమ: |
భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యో సుఖదాయక ||
97. మహాసిద్ధి గణపతి
గజవక్త్రం సురశ్రేష్ఠ కర్ణచామర భూషితం |
పాశాంకుశ ధరం దేవం వందే హం గణనాయకం ||
98. గణపతి
సిందూరాస్త్రినేత్ర: పృథుతర జదరో హస్త పద్మం దదానం | దంతం పాశాంకుశేష్ట్వానురుతర విలసద్విజ పూరాభిరామం | బాలేందు ఖ్యాతిమౌళి
కరిపతి వదాన దాన పూర్ణార్థ గంధో | భోగేంద్రై భూషితాంగోర్జేత్ గణపతిం రక్తస్త్రాంగరాగ: ||
99. కార్యసిద్ధి గణపతి
యతోబుద్ధి రజ్ఞాననాశో ముముక్షో: | యత స్సంపదోభక్త సంతోషదాస్సు: |
యతో విఘ్ననాశయత: కార్యసిద్ధి: | సదాతం గణేశం నమామో భజామ: ||
100. భద్ర గణపతి
అనామయాయ సర్వాయ సర్వపూజ్యాయతే నమ:
సుగుణాయ నమస్తుభ్యం బ్రహ్మణే నిర్గుణాయచ ||
101. సులభ గణపతి
వందే గజేంద్రవదనం – వామాంకారూఢ వల్లభాశ్లిష్టం
కుంకుమపరాగశోణం – క్వులయినీ జారకోరకా పీడమ్ ||
102. నింబ గణపతి
విఘ్నహర్తే స్వభక్తానాం లంబోదర నమోస్తుతే |
త్వాదేయ భక్తియోగేన యోగీశాం శాంతిమాగతా: ||
103. శుక్ల గణపతి
అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం |
తంనరం వపుషికుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలంమహ: ||
104. విష్ణు గణపతి
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే
105. ముక్తి గణపతి
పాశాంకుశౌ భగ్నరథం త్వభీష్టం కరైర్దధానం కరరన్ద్రముక్తై: |
ముక్తాఫలాభై: పృథుశీకరౌఘై: సిఙ్చన్తమఙ్గం శివయోర్భజామి ||
106. సుముఖ గణపతి
ఏకదంతాయ శుద్ధాయ సుముఖాయ నమోనమ: |
ప్రసన్న జనపాలాయ ప్రణతార్తివినాశినే ||
107. సర్వ గణపతి
చతు: పదార్థా వివిధ ప్రకాశాస్త్త వివ హస్తా: సచతుర్భుజం |
అనాథనాథాంచ మహోదరంచ గజాననం భక్తియుతం భజామ:
108. సిద్ధిబుద్ధి గణపతి
సత్పద్మరాగ మణివర్ణ శరీరకాంతి: శ్రీ సిద్ధిబుద్ధి పరిచర్చిత కుంకుమశ్రీ:
వక్షస్థలే వలయితాతి మనోజ్ఞ శుణ్డో విఘ్నం మామపహర సిద్ధి వినాయకత్వమ్ ||
***
శ్రీ గణనాయకాష్టకం.... ఓంశ్రీమాత్రే నమః
1) ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభమ్!
లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకమ్!!
2) మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతమ్!
బాలేందు శకలం మౌళీ, వందేహం గణ నాయకమ్!!
3) చిత్రరత్న విచిత్రాంగం, చిత్రమాలా విభూషితమ్!
కామరూపధరం దేవం, వందేహం గణనాయకమ్!!
4) గజవక్త్రం సురశ్రేష్ఠం, కర్ణచామర భూషితమ్!
పాశాంకుశధరం దేవం వందేహం గణ నాయకమ్!!
5) మూషి కోత్తమ మారుహ్య దేవాసురమహాహవే!
యోద్ధు కామం మహావీరం వందేహం గణ నాయకమ్!!
6) యక్షకిన్నెర గంధర్వ, సిద్ధ విద్యాధరైస్సదా!
స్తూయ మానం మహా బాహుం వందేహం గణ నాయకమ్!!
7) అంబికా హృదయానందం, మాతృభి: పరివేష్టితమ్!
భక్తిప్రియం మదోన్మత్తం, వందేహం గణ నాయకమ్!!
8) సర్వవిఘ్న హరం దేవం, సర్వవిఘ్న వివర్జితమ్!
సర్వసిద్ధి ప్రదాతారం, వందేహం గణ నాయకమ్!!
9) గణాష్టకమిదం పుణ్యం, యః పఠేత్ సతతం నరః!
సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్!!
ఇతి శ్రీ గణనాయకాష్టకమ్ సంపూర్ణం.
***
ఓం నమః శివాయ: శ్రీగణపత్యథర్వశీర్షోపనిషత్/భావార్థ సహిత తాత్పర్యం
ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా । భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః ॥
స్థిరైరఙ్గైస్తుష్టువాంసస్తనూభిః । వ్యశేమ దేవహితం యదాయుః ॥
ఓం స్వస్తి న ఇన్ద్రో వృద్ధశ్రవాః । స్వస్తి నః పూషా విశ్వవేదాః ॥
స్వస్తినస్తార్క్ష్యో అరిష్టనేమిః । స్వస్తి నో బృహస్పతిర్దధాతు ॥
ఓం తన్మామవతు తద్ వక్తారమవతు అవతు మామ్ అవతు వక్తారమ్
ఓం శాంతిః । శాంతిః ॥ శాంతిః॥।
॥ ఉపనిషత్ ॥
హరిః ఓం నమస్తే గణపతయే ॥ త్వమేవ ప్రత్యక్షం తత్త్వమసి ॥ త్వమేవ కేవలం కర్తాఽసి ॥
త్వమేవ కేవలం ధర్తాఽసి ॥ త్వమేవ కేవలం హర్తాఽసి ॥
త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి ॥
త్వం సాక్షాదాత్మాఽసి నిత్యమ్ ॥ 1॥
॥ స్వరూప తత్త్వ ॥
ఋతం వచ్మి (వదిష్యామి) ॥ సత్యం వచ్మి (వదిష్యామి) ॥ 2॥
అవ త్వం మామ్ ॥ అవ వక్తారమ్ ॥ అవ శ్రోతారమ్ ॥ అవ దాతారమ్ ॥ అవ ధాతారమ్ ॥
అవానూచానమవ శిష్యమ్ ॥ అవ పశ్చాత్తాత్ ॥ అవ పురస్తాత్ ॥ అవోత్తరాత్తాత్ ॥ అవ దక్షిణాత్తాత్ ॥ అవ చోర్ధ్వాత్తాత్ ॥ అవాధరాత్తాత్ ॥
సర్వతో మాం పాహి పాహి సమంతాత్ ॥ ౩॥
త్వం వాఙ్మయస్త్వం చిన్మయః ॥
త్వమానందమయస్త్వం బ్రహ్మమయః ॥
త్వం సచ్చిదానందాద్వితీయోఽసి ॥
త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి ॥
త్వం జ్ఞానమయో విజ్ఞానమయోఽసి ॥ 4॥
సర్వం జగదిదం త్వత్తో జాయతే ॥
సర్వం జగదిదం త్వత్తస్తిష్ఠతి ॥
సర్వం జగదిదం త్వయి లయమేష్యతి ॥
సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి ॥
త్వం భూమిరాపోఽనలోఽనిలో నభః ॥
త్వం చత్వారి వాక్పదాని ॥ 5॥
త్వం గుణత్రయాతీతః త్వమవస్థాత్రయాతీతః ॥
త్వం దేహత్రయాతీతః ॥ త్వం కాలత్రయాతీతః ॥
త్వం మూలాధారస్థితోఽసి నిత్యమ్ ॥
త్వం శక్తిత్రయాత్మకః ॥
త్వాం యోగినో ధ్యాయంతి నిత్యమ్ ॥
త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం
ఇన్ద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం
బ్రహ్మభూర్భువఃస్వరోమ్ ॥ 6॥
॥ గణేశ మంత్ర ॥
గణాదిం పూర్వముచ్చార్య వర్ణాదిం తదనంతరమ్ ॥
అనుస్వారః పరతరః ॥ అర్ధేన్దులసితమ్ ॥ తారేణ ఋద్ధమ్ ॥
ఏతత్తవ మనుస్వరూపమ్ ॥ గకారః పూర్వరూపమ్ ॥
అకారో మధ్యమరూపమ్ ॥ అనుస్వారశ్చాన్త్యరూపమ్ ॥
బిన్దురుత్తరరూపమ్ ॥ నాదః సంధానమ్ ॥
సంహితాసంధిః ॥ సైషా గణేశవిద్యా ॥
గణకఋషిః ॥ నిచృద్గాయత్రీచ్ఛందః ॥
గణపతిర్దేవతా ॥ ఓం గం గణపతయే నమః ॥ 7॥
॥ గణేశ గాయత్రీ ॥
ఏకదంతాయ విద్మహే । వక్రతుణ్డాయ ధీమహి ॥
తన్నో దంతిః ప్రచోదయాత్ ॥ 8॥
॥ గణేశ రూప ॥
ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణమ్ ॥
రదం చ వరదం హస్తైర్బిభ్రాణం మూషకధ్వజమ్ ॥
రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససమ్ ॥
రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుపూజితమ్ ॥
భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతమ్ ॥
ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతేః పురుషాత్పరమ్ ॥
ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగీ యోగినాం వరః ॥ 9॥
॥ అష్ట నామ గణపతి ॥
నమో వ్రాతపతయే । నమో గణపతయే । నమః ప్రమథపతయే ।
నమస్తేఽస్తు లంబోదరాయైకదంతాయ ।
విఘ్ననాశినే శివసుతాయ । శ్రీవరదమూర్తయే నమో నమః ॥ 10॥
॥ ఫలశ్రుతి ॥
ఏతదథర్వశీర్షం యోఽధీతే ॥ స బ్రహ్మభూయాయ కల్పతే ॥
స సర్వతః సుఖమేధతే ॥ స సర్వ విఘ్నైర్నబాధ్యతే ॥
స పంచమహాపాపాత్ప్రముచ్యతే ॥
సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి ॥
ప్రాతరధీయానో రాత్రికృతం పాపం నాశయతి ॥
సాయంప్రాతః ప్రయుంజానో అపాపో భవతి ॥
సర్వత్రాధీయానోఽపవిఘ్నో భవతి ॥
ధర్మార్థకామమోక్షం చ విందతి ॥
ఇదమథర్వశీర్షమశిష్యాయ న దేయమ్ ॥
యో యది మోహాద్దాస్యతి స పాపీయాన్ భవతి
సహస్రావర్తనాత్ యం యం కామమధీతే
తం తమనేన సాధయేత్ ॥ 11॥
అనేన గణపతిమభిషించతి స వాగ్మీ భవతి ॥
చతుర్థ్యామనశ్నన్ జపతి స విద్యావాన్ భవతి ।
స యశోవాన్ భవతి ॥
ఇత్యథర్వణవాక్యమ్ ॥ బ్రహ్మాద్యాచరణం విద్యాత్
న బిభేతి కదాచనేతి ॥ 12॥
యో దూర్వాంకురైర్యజతి స వైశ్రవణోపమో భవతి ॥
యో లాజైర్యజతి స యశోవాన్ భవతి ॥
స మేధావాన్ భవతి ॥
యో మోదకసహస్రేణ యజతి
స వాఞ్ఛితఫలమవాప్నోతి ॥
యః సాజ్యసమిద్భిర్యజతి
స సర్వం లభతే స సర్వం లభతే ॥ 1౩॥
అష్టౌ బ్రాహ్మణాన్ సమ్యగ్గ్రాహయిత్వా
సూర్యవర్చస్వీ భవతి ॥
సూర్యగ్రహే మహానద్యాం ప్రతిమాసంనిధౌ
వా జప్త్వా సిద్ధమంత్రో భవతి ॥
మహావిఘ్నాత్ప్రముచ్యతే ॥ మహాదోషాత్ప్రముచ్యతే ॥
మహాపాపాత్ ప్రముచ్యతే ॥
స సర్వవిద్భవతి స సర్వవిద్భవతి ॥
య ఏవం వేద ఇత్యుపనిషత్ ॥ 14॥
॥ శాన్తి మంత్ర ॥
ఓం సహనావవతు ॥ సహనౌభునక్తు ॥
సహ వీర్యం కరవావహై ॥
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ॥
ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా ।
భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః ॥
స్థిరైరంగైస్తుష్టువాంసస్తనూభిః ।
వ్యశేమ దేవహితం యదాయుః ॥
ఓం స్వస్తి న ఇన్ద్రో వృద్ధశ్రవాః ।
స్వస్తి నః పూషా విశ్వవేదాః ॥
స్వస్తినస్తార్క్ష్యో అరిష్టనేమిః ।
స్వస్తి నో బృహస్పతిర్దధాతు ॥
ఓం శాంతిః । శాంతిః ॥ శాంతిః
॥ ఇతి శ్రీగణపత్యథర్వశీర్షం సమాప్తమ్ ॥
వాతాపి గణపతిం భజే ముత్తుస్వామి దీక్షితులు రచించిన కీర్తన.
ఓంశ్రీమాత్రే నమః
వాతాపి గణపతిం భజే
హం వారణాస్యం వరప్రదం | | వాతాపి | |
భూతాది సంసేవిత చరణం
భూత భౌతికా ప్రపంచ భరణం
వీతరాగిణం వినత యోగినం
విశ్వకారణం విఘ్నవారణం!!
పురాకుంభ సంభవమునివర
ప్రపూజితం త్రిభువన మధ్యగతం
మురారీ ప్రముఖ ద్యుపాసితం
మూలాధారా క్షేత్రాస్థితం
పరాది చత్వారి వాగాత్మకం
ప్రణవ స్వరూప వక్రతుండం
నిరంతరం నిఖిల చంద్రఖండం
నిజ వామకర విదృతేక్షు దండం
కరాంబుజపాశ బీజాపూరం
కలుష విదూరం భూతాకారం
హరాది గురుగుహ తోషిత బింబం
హంసధ్వని భూషిత హేరంబం | | వాతాపి | |
(())
వాతాపి గణపతి అంటే!
కర్ణాటక సంగీతంలో ‘వాతాపి గణపతిం భజే’ అంటూ సాగే ముత్తుస్వామి దీక్షితులవారి కృతి వినని తెలుగువారు అరుదు.
శ్రీ వినాయక చ వితి
జై జై జై గణేశా!!
శ్రీ గణేశ వందనం పార్వతిసుత వందనం విఘ్నరాయ వినాయక వక్రతుండ వందనం!
జై జై జై గణేశా జయములివ్వు గణేశా మా ప్రార్థన మన్నించి మముగావుము గణేశా!
దేవలోక మందున మనుజలోకమందున తొలిపూజలు మీకయ్యా సకలలోక మందున!
విద్యబుద్ధు లందున వినయగుణా లందున విజేయుడై వెలిసినావు విజయచరిత లందున!
కష్టనష్టములు బాపగ కార్యాలను నడిపించగ నీవె దిక్కు ఓ దేవా కడకు జయం జేకూర్చగ!🙏
శ్రీ గణపతి తత్వం అంతరార్థం
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
***
‘తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని దలచిన పనిగా దలచితినే హేరంభుని దలచిన నా విఘ్నములును తొలగుట కొరకున్’ ప్రాచీన కాలం నుండీ నేటి వరకు ప్రతి పనికీ వినాయకుడి ననుసరించి ‘ఆదౌ నిర్విఘ్న పరిసమాస్థ్యర్థం గణపతి పూజాం కరిష్యే’ అని చెపుతూ విఘ్నాలను తొలగించమని కార్యసిద్ధి కోసం ‘ఆదౌ పూజ్యో గణాధిపః’ గణపతిని మొదటగా ఆరాధించడం జరుగుతుంది.
వినాయకుడు ఆది అంతం లేని ఆనందమయ తత్త్వమూర్తి. అకుంఠిత దీక్షతో భక్తిప్రపత్తులతో కొలవాలేగాని, కోరిన కోరికలను సకల సౌభాగ్యాలను ప్రసాదించే సిద్ధి దేవత. గణపతి శబ్ద బ్రహ్మ స్వరూపం. ఓంకార ప్రణవ నాద స్వరూపుడు మహా గణపతి. నామ మంత్రాలకు ముందు ‘ఓం’కారము ఎలా ఉంటుందో అలాగే అన్ని శుభ కార్యాలకి ముందు గణపతి పూజ తప్పక ఉంటుంది.
గణపతి పుట్టుక: జ్యోతిషశాస్త్ర అన్వయం ‘గ’ అంటే బుద్ధి, ‘ణ’ అంటే జ్ఞానం. గణాధిపతి అయిన విఘ్నేశ్వరుడు బుద్ధిని ప్రసాదిస్తే, సిద్ధి ప్రాప్తిస్తుంది. భాద్రపద శుక్ల చవితినాడు వినాయకుడు ఆవిర్భవించాడు. భద్రమైన పదం భాద్రపదం. శ్రేయస్కరమైన స్థానం. ఏమిటది? జీవిత గమ్యమైన మోక్షం. శుక్లమైన తేజోరూపం. చతుర్థి అనగా చవితి. జాగ్రత్, స్వప్న, సుషుప్తులనే మూడవస్థలనూ దాటిన తరువాతది నాల్గవది - తురీయావస్థ. నిర్వికల్ప సమాధి. ఆయన నక్షత్రం హస్త. హస్తా నక్షత్రం కన్యారాశిలో ఉంటుంది. రాశ్యాధిపతి బుధుడు. విజ్ఞానప్రదాత. మేషరాశి మొదటి రాశి. మేషరాశి నుంచి ఆరవ రాశి - కన్యారాశి. ఈ షష్టమ (ఆరవ) భావం, శతృ ఋణ రణ రోగములను తెలియజేస్తుంది.
మనిషి ఆధ్యాత్మిక ప్రగతికి, లౌకిక ప్రగతికి ఏర్పడే విఘ్నాలను విశదపరుస్తుందీ భావం. ఆ షష్ట్భావంతో (హస్తా నక్షత్రం,కన్యారాశి) చంద్రుడుండగా ఆవిర్భవించిన విఘ్నేశ్వరుడు, చవితి నాడు పుట్టిన వినాయకుడు ఈ నాలుగు రకములయిన విఘ్నాలను తొలగిస్తానని అభయమిస్తున్నాడు.
కన్యారాశికి సప్తమ రాశి మీనరాశి. మీనరాశి కాలరాశి చక్రంలో పన్నెండవ రాశి. అంటే వ్యయ రాశి. మేష రాశికి వ్యయ రాశి పనె్నండవ భావం వ్యయాన్ని, బంధనాన్ని, అజ్ఞాత శత్రువుల్ని తెలియజేస్తుంది. ఇక్కడ శత్రువులంటే అంతశ్శత్రువులు. అరిషడ్వర్గములు - కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు (ఆరు). ఇవి మానవుని ప్రగతికి విఘ్నాలు కలిగించేవి. హస్తా నక్షత్రం, కన్యారాశిలో ఉన్న చంద్రుడు సప్తమ దృష్టితో నేరుగా మీనరాశిని వీక్షిస్తున్నాడు. కనుక వాటిని తొలగించి జీవితాన్ని సుఖమయం సుసంపన్నం చేసి,లౌకిక, అలౌకిక, ఆధ్యాత్మిక ఆనందాన్నిచ్చి, మోక్షగతిని ప్రసాదించేవాడు వినాయకుడని జ్యోతిష శాస్త్ర అన్వయం.పత్రిపూజ, ఉండ్రాళ్ల నివేదనలోని ఆంతర్యం వినాయకుని నక్షత్రం ‘హస్త’ అని చెప్పుకున్నాం గదా. హస్తా నక్షత్రానికి అధిపతి చంద్రుడు. నవగ్రహములకు నవధాన్యములు, నవరత్నములు చెప్పబడ్డాయి. చంద్రుని తెల్లనివాడు - వినాయకుడు శుక్లాంబరధరుడు.
నవధాన్యాలలో చంద్రునికి బియ్యం. అందుకే బియ్యాన్ని భిన్నం చేసి, చంద్ర నక్షత్రమైన హస్తా నక్షత్రంలో ఆవిర్భవించిన వినాయకునికి, ఉండ్రాళ్లు నివేదన చేయటంలోగల ఆంతర్యమిదే. వినాయకునిది కన్యారాశి అని చెప్పుకున్నాం గదా. కన్యారాశికి అధిపతి బుధుడు కదా. బుధునికి నవరత్నములలో ‘పచ్చ’ రాయి- ఎమరాల్డ్ గ్రీన్ అనగా ఆకుపచ్చ రంగు. అందుకే వినాయక చవితి రోజున విఘ్నేశ్వరుని, ఆకుపచ్చ రంగులో ఉన్న పత్రితో పూజ చేస్తారు. సంతుష్టు డవుతాడు స్వామి.
గరికపూజ ప్రీతిపాత్రం ఎందుకు?వినాయకునికి గరిక పూజ అంటే ప్రీతి అంటారు. వినాయక చవితినాడే గాక, ప్రతిరోజూ విఘ్నేశ్వరాలయాలలో, గరికతో స్వామిని అర్చిస్తారు.పూజాద్రవ్యములలో గరికను కూడా జత చేసి సమర్పిస్తారు భక్తులు. దీనికి జానపదులు చెప్పుకునే కథ ఒకటి ఉంది. పార్వతీ పరమేశ్వరులు పాచికలాడుతున్నారు.న్యాయ నిర్ణేతగా నందీశ్వరుణ్ణి ఎంపిక చేశారు. ఈశ్వరుడే గెలిచాడని నంది తీర్పు చెప్పాడు.అయితే ఆ తరువాత అమ్మతో నిజం చెప్పాడు. ‘ఈశ్వరుడు నాకు ప్రభువు. ఆయనే నా ప్రాణం. అందుకే ఆయన గెలిచినట్లు చెప్పాను. అయినా ఆయన అర్ధనారీశ్వరుడు గదమ్మా మీరిద్దరూ ఒకటే’ అన్నాడు.
‘నందీ! నీవు నయం కాని వ్యాధితో బాధపడతావు’ అని శపించి, నంది దీనావస్థను చూచి జాలి చెంది, ‘నందీ! నా కుమారుడైన గణనాథుని పుట్టిన రోజున నీకు ఇష్టమైన పదార్థాన్ని అర్పితం చెయ్యి. అతను అనుగ్రహంతో నీకు శాపవిమోచనం కలుగుతుంది’ అని సెలవిచ్చింది, పార్వతీదేవి. నంది తన కిష్టమైన గరికను గణపతికి అర్పించాడు. అతనికి శాపవిముక్తి లభించింది. ఇది వినాయక పూజలో గరిక ప్రాధాన్యత.
‘సహస్ర పరమా దేవీ శతమూలా శతాంకురా సర్వగం హరతుమే పాపం దూర్వా దుస్వప్న నాశినీ’ సకల కల్మషములను తొలగించే సర్వశ్రేష్ఠమైన ఓషధి. లెక్కకు మించిన కణుపులు, చిగుళ్లు కలగి దుష్ట తలంపుల ప్రభావమును తొలగించు శక్తిగల పరమాత్మ స్వరూపమైన దూర్వాయుగ్మము. మనలోని మాలిన్యాన్ని తొలగిస్తుంది, అని ‘దూర్వాసూక్తము’ పేర్కొన్నది.
దూర్వాయుగ్మం అంటే గరిక. అందుకే గణపతిని గరికతో అర్చిస్తే సర్వశుభాలను ప్రసాదిస్తాడు.మనోమాలిన్యాలను తొలగిస్తాడు.‘గజ’ శబ్దార్థము వశ - శివ, హింస - సింహ, పశ్యకః - కశ్యపః అని వర్ణ వ్యత్యాసముతో మార్పు కలుగుతుంది.ఇదొక వ్యాకరణ శాస్త్ర ప్రక్రియ. ఆ విధంగా, జగ - గజ అని మారుతుంది. కనుక గజాననుడంటే ‘జగణాననుడు’ అని అర్థం. జగత్తే ముఖంగా గలవాడు. గ: లయము, జ- జన్మ. కనుక గజమనగా సృష్టి స్థితి లయములు గల జగత్తు అని అర్థము. ‘గ’ అంటే జ్ఞానము ‘జ’ అంటే పుట్టినది. గజమంటే జ్ఞానము వలన పుట్టిన మోక్షమని అర్థము.
‘జ్ఞానదేవతు కైవల్యము’ కనుక గజముఖము, గజాననుని ముఖ దర్శనము శుభప్రదము, జ్ఞానప్రదము, మోక్షప్రదము. సృష్టికి ముందు ‘ఓం’ అని ధ్వని వినవచ్చింది. అది గజాకారముగా పరిణమించింది. కనుక గజమనగా ఓంకార ధ్వని. ఓంకారము గజ నాదము అనగా హస్తినాదము.‘అశ్వపూర్వాం రథమధ్వాం సస్తినాద ప్రబోధినమ్’ ఇంద్రియములనే గుర్రములచే పూన్చబడిన దేహము అనే రథము మధ్యలోనున్న చైతన్యమూర్తి. చిచ్ఛక్తి - పరదేవత నిరంతరము హస్తినాదముచే అనగా గజ నాదముచే -ఓంకార నాదముచే మేలుకొలువబడుచున్నది. ఇది ‘గజ’ శబ్దానికి శ్రీసూక్త మంత్రానికి సమన్వయం. అదే వినాయక చవితికి స్ఫూర్తి.‘ఆననము’ అనగా ప్రాణనము అనగా జీవకము అని అర్థము.
గజమంటే జగత్తు కనుక, జగత్తుకే ప్రాణము గజాననుడు. గజాననుడనగా సృష్టి, స్థితి, లయ కారకుడని అర్థం. అందుకే మొదటిగా గజాననుని పూజ విధింపబడింది. సకల ప్రపంచమునకు ప్రాణదేవత - గజాననుడు.ప్రాణనాథుడే గణనాథుడు, నిఖిల ప్రాణి గణనాథుడు - గుణగణములు కలవాడు - గుణగణ నాథుడు.గణపతి - లలితా పరమేశ్వరి ‘శాంతిః స్వస్తిమతీ కాంతిః నందినీ విఘ్ననాశినీ’ అన్నది లలితా సహస్ర నామం. లలితాదేవి విఘ్నములను, అవిద్యను నశింపజేస్తుంది. కనుక ‘విఘ్ననాశినీ’ అని పేరు గల్గింది. మరి గణపతి కదా విఘ్నములను లేకుండా చేసేవాడు? దీనినిబట్టి, లలితాదేవి గణపతి స్వరూపిణి, గణపతి లలితా స్వరూపుడు అని తెలుస్తుంది. లలితా గణపతులకు అభేదం. విష్ణు సహస్ర నామములలో గణపతి: ఏకదంతుడు ఏకదం - అంతా ఒక్కటే. రెండవది లేదు అని ఏకత్వ బుద్ధిని అనుగ్రహించు ఆ ఏకదంతుని ఉపాసించాలి ‘అనేకదం’ - ఉపాసకులకు భక్తులకు అనేకములనిచ్చు,తం- గణేశుని, అనేక దంతం- ప్రళయ కాలంలో అనేకములను హరించు గణపతిని ఉపాసించాలి అని అర్థములున్నాయి. ‘ఏకః నైకః నవః కః కిం’ విష్ణు సహస్ర నామముల భావమే ఏకదః అనేకదః’ అని చెప్పారు.
గజాననుని రూపం: ఆధ్యాత్మికత మోక్ష సిద్ధికి వక్రమైన ఆటంకములను అరిషడ్వర్గములను (కామక్రోధములు) నశింపజేసి,చితె్తైకాగ్రత నొసగి, స్వస్వరూప సంధానతతో జీవబ్రహ్మైక్య స్థితిని అనుగ్రహించేవాడు వక్రతుండుడు.
మూలాధార క్షేత్ర స్థితుడు. మూలాధారి. లంబోదరం - బ్రహ్మాండానికి సంకేతం. విఘ్నేశ్వరుని చేతిలోని పాశ అంకుశాలు - రాగద్వేషాలను నియంత్రించే సాధనాలు. గణపతికి ప్రియమైన భక్ష్యం - మోదకం. ఆనందాన్నిచ్చేది. మొదకం ఆయన కృపాకటాక్షములలో ఆనందం లభిస్తుంది. నాగయజ్ఞోపవీతం - కుండలినీ శక్తికి సంకేతం. మానవుడు క్రోధాన్ని విడిచి, అనురాగాన్ని అభివృద్ధి చేసికొని శాంతి సహజీవనంతో, సంపూర్ణ శరణాగతితో భగవంతుని యందు ప్రేమభావనా భక్తిని పెంపొందించుకొని, జీవితాన్ని చరితార్థత నొందించుకోవాలని సూచించే ఆయుధదారుడు విఘ్నేశ్వరుడు.
‘యుక్తాహార విహారస్య’ అన్నారు గీతాచార్యుడు. ఆహార నిద్రాదులు అన్నమయ కోశమునకు సంబంధించినవి. తమోగుణానికి నిదర్శనము. ‘బ్రతుకుట ఆహారం కోసమే’ అనుకునే తిండిపోతులు తమోగుణాన్ని చంపుకోలేరు. అటువంటి వారి గూర్చి ఇతరులు జాలి పడటం, మనసులోనైనా పరిహసించటం సహజం. యోగి అయిన వాడు యుక్తాహార విహారాదులతో, తమోగుణాన్ని జయించి తత్వ గుణ సంపన్నుడై, త్రిగుణాతీతుడై, కుండలినీ యోగసిద్ధుడై ఆనందమయ స్థితిని పొంది చరితార్థుడు కావాలని తన శరీరాకృతి, నాగయజ్ఞోపవీతంతో తెలియజేసి, హెచ్చరించేవాడు - బొజ్జ గణపయ్య.
మూషిక వాహనం: అంతరార్థం మూషికం (ఎలుక) వాసనామయ జంతువు.తినుబండారాల వాసననుబట్టి అది ఆ ప్రదేశానికి చేరుకుంటుంది. బోనులో చిక్కుకుంటుంది. ఆ విధంగానే మనిషి జన్మాంతర వాసనల వల్ల ఈ ప్రాకృతిక జీవితంలో చిక్కుకొని చెడు మార్గాలు పడతాడు. మూషిక వాహనుడుగా వాసనలను అనగా కోరికలను అణగద్రొక్కేవాడు - వినాయకుడు.అంతేకాదు అహంకారానికి చిహ్నం - ఎలుక (మూషికం) అహంకారం బుద్ధిమంతుల్ని పతనం చెందిస్తుంది.
బుద్ధిపతి అయిన మహాగణపతి దీనిని మలిచి జయించి సద్వినియగం చేస్తాడు. మూషిక వాహనుడైన గణపతి సమృద్ధినిస్తాడు.వినాయక చవితి పండుగనాడు ఉదయానే్న మంగళ స్నానములు (తలంటు) ఆచరించి, మట్టి విఘ్నేశ్వరుని పత్రి పుష్పములతో పూజించి, తమ పాఠ్యపుస్తకాలన్నిటినీ వినాయకుని ముందు పెట్టి, శ్రద్ధ్భాక్తులతో అర్చించి, సద్బుద్ధి, విజ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థన చేస్తారు విద్యార్థులు. లక్ష్మీదేవి మూలాధార నిలయం. గణపతి కూడా మూలాధార నిలయుడు. తొలుతగా లక్ష్మీ పత్రార్చన సర్వకార్య సిద్ధిప్రదము. సకల ఐశ్వర్యప్రదం. కనుకనే తన సంగీత రూపకమునకు ఆదిలో శ్రీగణపతిని ‘శ్రీ గణపతిని సేవింపరారే శ్రీత మానవులారా’ అని ప్రార్థనా రూపమైన మంగళమును పలికాడు నాద ముని శ్రీ త్యాగరాజస్వామి.
ముత్తుస్వామి దీక్షితులు: మహా గణపతి కీర్తనలు వినాయక చవితి రోజున ముఖ్యంగా ముత్తుస్వామి దీక్షితుల వారి ముఖ్యమైన కీర్తన, విశేష ప్రాచుర్యం పొందినది, హంసధ్వని రాగ కీర్తన ‘వాతాపి గణపతిం భజేహం వారణాస్యం వరప్రదం. వీతరాగిణం, వినుత యోగినం విశ్వకారణం విఘ్నవారణం...’ తప్పక జ్ఞప్తి చేసికొని పాడుకోవాలి. కనీసం చదువుకోవాలి.
గణపతి పూజలో ఇది ఒక భాగం అవ్వాలి. ఆ మహనీయుడు కీర్తనలు అందించాడు. మహాగణపతిం మనసా స్మరామి, వశిష్ఠ వాసుదేవాం నందిత’ నాటరాగ కీర్తన, గజాననము తం గణేశ్వరం భజాను సతతం సురేశ్వరం ఇత్యాదులు వినాయక చవితికి స్ఫూర్తినిచ్చే ఆణిముత్యాలు.
‘శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజము...’ శుక్లమైన అంబరం అంటే పరిశుద్ధ జ్ఞానం. అది అంబరం లాగా సర్వవ్యాపకం. దానినే ఒక వస్త్రంలాగా ధరించాడాయన. దాన్ని మనకు ప్రసాదించాలంటే శశివర్ణుడౌతాడు. శశి అంటే చంద్రుడు.
చంద్రుడంటే మనస్సు. మనోభూమికకు దిగి వచ్చి బోధిస్తాడు మనకు ఆచార్యుడు. బోధించే స్థోమత ఎలా వచ్చిందాయనకు. చతుర్భుజం. ధర్మ, జ్ఞాన, వైరాగ్వైశ్వర్యాలనే సిద్ధి చతుష్టయ ముందాయనకు. వాటిని నిత్యమూ అనుభవించే మహనీయుడు కనుకనే ప్రసన్న వదనం. తనకు ప్రసన్నమైన శివశక్తి సామరస్య రూపమైన ఏ జ్ఞానముందో, దాన్ని మనకు ‘వదనం’ అంటే బోధించగలడు. ఆ బోధనందుకుంటే అదే మనకు సర్వవిఘ్నాప శాంతయే. సకల విఘ్నాలను సాధన మార్గంలో కలగకుండా తొలగజేస్తుంది.
అహంకారమును దరికి రానీయక, భూతదయ గాలికి, స్వార్థరహితంగా త్యాగబుద్ధితో, అమృతమైన మనస్సుతో సర్వమానవ సౌభ్రాతతతో విశ్వమానవ కళ్యాణాన్ని వీక్షించే వారి విఘ్నాలను నేను తొలగిస్తానని చెప్తున్నాడు మహాగణపతి.
గణపతి సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం.
గణం అంటే సమూహం. గణాలతో నిండి వున్న ఈ సమస్త విశ్వానికి అధిపతి గణపతి. అలాగే, అహంకారానికి ప్రతీక అయిన ‘ఎలుక‘ను శాసించి వాహనంగా చేసుకున్న గణపతిని, మహా గణపతి, హరిద్రా గణపతి, స్వర్ణ గణపతి, ఉచ్చిష్ట గణపతి, సంతాన గణపతి, నవనీత గణపతి అని 6 రూపాల్లో పూజిస్తారు.
‘గణపతి అథర్వ శీర్శం’ ఆయన్ని పరబ్రహ్మగా చెపుతుంది. ‘నమస్తే గణపతయే... నీ ముందు అహంకార రహితమైన నా మనస్సును సమర్పిస్తున్నాను. హే గణపతీ! ఏదైతే సనాతనమో, ఏదైతే ఆది అంత్యాలు లేనిదో, అనిర్వచనీయమో, భావానికీ శబ్దానికీ అతీతమైందో ‘అది‘ నీవే అయి ఉన్నావు. అన్నింటికీ కర్తవు, ధరించే వానివి, లయం చేసుకునే వానివి నీవే. నీవే బ్రహ్మమూ, సత్యానివీ. నీకు నమస్కరిస్తున్నాను. సకల వాక్సంబంధిత శక్తివి, జ్ఞానమూర్తివి, ఆనంద మయునివి నీవే. పరబ్రహ్మం, శాశ్వతమైన వానివి నీవే. ప్రత్యక్ష పరబ్రహ్మవూ నీవే. నీవే జ్ఞానానివి, నీవే విజ్ఞానానివి’ అంటున్నది ‘గణపతి అథర్వ శీర్శోపనిషత్తు’.
మంత్రశాస్త్రంలో వినాయకుణ్ణి మూలాధారచక్ర అధిష్ఠాన దేవత అని అంటారు. మూలాధారంలో సుషుమ్న నాడి మూడుచుట్టలు చుట్టుకొని పైన పడగ కప్పుకొని ఉన్న పాములాగ ఉంటుంది. యోగాభ్యాసంతో సుషుమ్న నాడిని మేలు కొల్పగలిగితే, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, ఆజ్ఞాచక్రం, సహస్రారం అనే షట్ చక్రాల ద్వారా ఆత్మను బ్రహ్మరంధ్రం చేర్చి బ్రహ్మ కపాల వి స్ఫోటనంతో ప్రకృతిని దాటి పరమాత్మను చేరే యోగ ప్రక్రియ జరుగుతుంది.
సుషుమ్న నాడి పక్కన ఇడ, పిం గళ అని రెండు నాడులు అనుసరించుకుంటూ ఉంటాయి. నిరంతరం సుషుమ్న వీటితో కలిసే పయనిస్తుంది. ఇడ అంటే జ్ఞానము, పింగళ అంటే కార్యసిద్ధి అలాగే ఇడ అంటే సిద్ధి, పింగళ అంటే బుద్ధి. మూలాధారం గణపతి, గణపతికి సిద్ధి, బుద్ధి భార్యలనడంలోని అంతరార్థం ఇదే.
అనగా గణపతి అంటే అష్టచక్ర గణములకు అధిపతి. గణపతి అంటే పదకొండు ఇంద్రియ గణములకు అధిపతి. పంచ తన్మాత్రలు, పంచ భూతాలు, పంచ విషయాలు, అహంకారం, మహాతత్త్వం, ప్రకృతి అనే 18గణములకు అధిపతి గణపతి.
మన శరీరంలో ఉండే హస్తములు,పాదములు, జాను, జంఘ, ఊరు, కటి, ఉదర, హృదయ, కంఠ, ఆశ్య, ఫాల, శిర అను ద్వాదశ అయవయ గ ణములకు అధిపతి మన గణనాథుడు.
అందుకే విఘ్నేశ్వరుడు విఘ్నాలను తొలగించడమే కాక విఘ్నాలకు కారణమైన వాటిని పోగొడతాడు. కార్యసిద్ధి కలిగించి తద్వారా సంతోషాన్ని కలిగించే పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. పాపాలు తొలిగితే మంచి బుద్ధి కలుగుతుంది. మంచి బుద్ధి అనగా శాశ్వతమైనదాన్ని పొందాలనుకోవడం. అనగా పరమాత్మను కోరుకోవడం. సంసారం, సిరిసంపదలు, భోగభాగ్యాలు ఇవన్నీ అశాశ్వతం.
కావున గణపతి శాశ్వతమైన వాటి గురించి జ్ఞానాన్ని, అశ్వాశ్వతమైన వాటి మీద వైరాగ్యాన్ని కలిగించి భక్తిని కలిగిస్తాడు. భక్తి, జ్ఞానము, వైరాగ్యము అనగా సుషుమ్న, ఇడ, పింగళ అనగా మూలాధారం గణపతి, సిద్ధి, బుద్ధి. ఇదే గణపతి తత్త్వం.
***
శ్రీగణపత్యథర్వశీర్షోపనిషత్/భావార్థ సహిత తాత్పర్యం
***
ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా ।
భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః ॥
స్థిరైరఙ్గైస్తుష్టువాంసస్తనూభిః ।
వ్యశేమ దేవహితం యదాయుః ॥
ఓం స్వస్తి న ఇన్ద్రో వృద్ధశ్రవాః ।
స్వస్తి నః పూషా విశ్వవేదాః ॥
స్వస్తినస్తార్క్ష్యో అరిష్టనేమిః ।
స్వస్తి నో బృహస్పతిర్దధాతు ॥
ఓం తన్మామవతు తద్ వక్తారమవతు అవతు మామ్ అవతు వక్తారమ్
ఓం శాంతిః । శాంతిః ॥ శాంతిః॥।
॥ ఉపనిషత్ ॥
హరిః ఓం నమస్తే గణపతయే ॥
త్వమేవ ప్రత్యక్షం తత్త్వమసి ॥ త్వమేవ కేవలం కర్తాఽసి ॥
త్వమేవ కేవలం ధర్తాఽసి ॥ త్వమేవ కేవలం హర్తాఽసి ॥
త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి ॥
త్వం సాక్షాదాత్మాఽసి నిత్యమ్ ॥ 1॥
॥ స్వరూప తత్త్వ ॥
ఋతం వచ్మి (వదిష్యామి) ॥ సత్యం వచ్మి (వదిష్యామి) ॥ 2॥
అవ త్వం మామ్ ॥ అవ వక్తారమ్ ॥ అవ శ్రోతారమ్ ॥ అవ దాతారమ్ ॥ అవ ధాతారమ్ ॥
అవానూచానమవ శిష్యమ్ ॥ అవ పశ్చాత్తాత్ ॥ అవ పురస్తాత్ ॥ అవోత్తరాత్తాత్ ॥ అవ దక్షిణాత్తాత్ ॥ అవ చోర్ధ్వాత్తాత్ ॥ అవాధరాత్తాత్ ॥ సర్వతో మాం పాహి పాహి సమంతాత్ ॥ ౩॥
త్వం వాఙ్మయస్త్వం చిన్మయః ॥ త్వమానందమయస్త్వం బ్రహ్మమయః ॥
త్వం సచ్చిదానందాద్వితీయోఽసి ॥ త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి ॥
త్వం జ్ఞానమయో విజ్ఞానమయోఽసి ॥ 4॥
సర్వం జగదిదం త్వత్తో జాయతే ॥ సర్వం జగదిదం త్వత్తస్తిష్ఠతి ॥ సర్వం జగదిదం త్వయి లయమేష్యతి ॥ సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి ॥ త్వం భూమిరాపోఽనలోఽనిలో నభః ॥
త్వం చత్వారి వాక్పదాని ॥ 5॥
త్వం గుణత్రయాతీతః త్వమవస్థాత్రయాతీతః ॥ త్వం దేహత్రయాతీతః ॥ త్వం కాలత్రయాతీతః ॥ త్వం మూలాధారస్థితోఽసి నిత్యమ్ ॥ త్వం శక్తిత్రయాత్మకః ॥
త్వాం యోగినో ధ్యాయంతి నిత్యమ్ ॥
త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఇన్ద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మభూర్భువఃస్వరోమ్ ॥ 6॥
॥ గణేశ మంత్ర ॥
గణాదిం పూర్వముచ్చార్య వర్ణాదిం తదనంతరమ్ ॥ అనుస్వారః పరతరః ॥ అర్ధేన్దులసితమ్ ॥ తారేణ ఋద్ధమ్ ॥ ఏతత్తవ మనుస్వరూపమ్ ॥ గకారః పూర్వరూపమ్ ॥ అకారో మధ్యమరూపమ్ ॥ అనుస్వారశ్చాన్త్యరూపమ్ ॥ బిన్దురుత్తరరూపమ్ ॥ నాదః సంధానమ్ ॥ సంహితాసంధిః ॥ సైషా గణేశవిద్యా ॥ గణకఋషిః ॥ నిచృద్గాయత్రీచ్ఛందః ॥ గణపతిర్దేవతా ॥ ఓం గం గణపతయే నమః ॥ 7॥
॥ గణేశ గాయత్రీ ॥
ఏకదంతాయ విద్మహే । వక్రతుణ్డాయ ధీమహి ॥ తన్నో దంతిః ప్రచోదయాత్ ॥ 8॥
॥ గణేశ రూప ॥
ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణమ్ ॥ రదం చ వరదం హస్తైర్బిభ్రాణం మూషకధ్వజమ్ ॥ రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససమ్ ॥ రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుపూజితమ్ ॥ భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతమ్ ॥
ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతేః పురుషాత్పరమ్ ॥ ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగీ యోగినాం వరః ॥ 9॥
॥ అష్ట నామ గణపతి ॥
నమో వ్రాతపతయే । నమో గణపతయే । నమః ప్రమథపతయే । నమస్తేఽస్తు లంబోదరాయైకదంతాయ ।విఘ్ననాశినే శివసుతాయ । శ్రీవరదమూర్తయే నమో నమః ॥ 10॥
॥ ఫలశ్రుతి ॥
ఏతదథర్వశీర్షం యోఽధీతే ॥ స బ్రహ్మభూయాయ కల్పతే ॥ స సర్వతః సుఖమేధతే ॥ స సర్వ విఘ్నైర్నబాధ్యతే ॥ స పంచమహాపాపాత్ప్రముచ్యతే ॥ సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి ॥ప్రాతరధీయానో రాత్రికృతం పాపం నాశయతి ॥ సాయంప్రాతః ప్రయుంజానో అపాపో భవతి ॥ సర్వత్రాధీయానోఽపవిఘ్నో భవతి ॥ ధర్మార్థకామమోక్షం చ విందతి ॥ ఇదమథర్వశీర్షమశిష్యాయ న దేయమ్ ॥ యో యది మోహాద్దాస్యతి స పాపీయాన్ భవతి సహస్రావర్తనాత్ యం యం కామమధీతే తం తమనేన సాధయేత్ ॥ 11॥
అనేన గణపతిమభిషించతి స వాగ్మీ భవతి ॥ చతుర్థ్యామనశ్నన్ జపతి స విద్యావాన్ భవతి ।
స యశోవాన్ భవతి ॥ ఇత్యథర్వణవాక్యమ్ ॥ బ్రహ్మాద్యాచరణం విద్యాత్ న బిభేతి కదాచనేతి ॥ 12॥
యో దూర్వాంకురైర్యజతి స వైశ్రవణోపమో భవతి ॥ యో లాజైర్యజతి స యశోవాన్ భవతి ॥
స మేధావాన్ భవతి ॥ యో మోదకసహస్రేణ యజతి స వాఞ్ఛితఫలమవాప్నోతి ॥
యః సాజ్యసమిద్భిర్యజతి స సర్వం లభతే స సర్వం లభతే ॥ 1౩॥
అష్టౌ బ్రాహ్మణాన్ సమ్యగ్గ్రాహయిత్వా సూర్యవర్చస్వీ భవతి ॥
సూర్యగ్రహే మహానద్యాం ప్రతిమాసంనిధౌ వా జప్త్వా సిద్ధమంత్రో భవతి ॥ మహావిఘ్నాత్ప్రముచ్యతే ॥ మహాదోషాత్ప్రముచ్యతే ॥
మహాపాపాత్ ప్రముచ్యతే ॥ స సర్వవిద్భవతి స సర్వవిద్భవతి ॥
య ఏవం వేద ఇత్యుపనిషత్ ॥ 14॥
॥ శాన్తి మంత్ర ॥
ఓం సహనావవతు ॥ సహనౌభునక్తు ॥ సహ వీర్యం కరవావహై ॥ తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ॥
ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా । భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః ॥
స్థిరైరంగైస్తుష్టువాంసస్తనూభిః ।
వ్యశేమ దేవహితం యదాయుః ॥
ఓం స్వస్తి న ఇన్ద్రో వృద్ధశ్రవాః ।
స్వస్తి నః పూషా విశ్వవేదాః ॥
స్వస్తినస్తార్క్ష్యో అరిష్టనేమిః ।
స్వస్తి నో బృహస్పతిర్దధాతు ॥
ఓం శాంతిః । శాంతిః ॥ శాంతిః
॥ ఇతి శ్రీగణపత్యథర్వశీర్షం సమాప్తమ్ ॥
***
అర్థ సహిత తాత్పర్యం
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
హరిః ఓం! లం! గణపతి బీజం.
నమస్తే గణపతయే... ఓ గణములకు పతియైన వాడా! - నమః తే... నీ ముందు అహంకార రహితమైన నా మనస్సును సమర్పిస్తున్నాను.
త్వమేవ - నీవు మాత్రమే ప్రత్యక్షంగా, "తత్" .. అది ఏదైతే సనాతనమో, ఏదైతే ఆది అంత్యములు లేనిదో, అనిర్వచనీయమో, భావానికీ శబ్దానికీ అతీతమైనదో "అది" నీవు (త్వం) అయి ఉన్నావు (అసి).
త్వమేవ కేవలం కర్తాసి... అన్నింటికీ నీవే కర్తవు, నీవే ధరించే వానివి (ధర్త) నీవే లయం చేసుకునే వానివి (హర్త). నీవు మాత్రమే సర్వమూ, బ్రహ్మమూ అయి ఉన్నావు కదా (ఖల్విదం) ఋతం-- ఇతః పూర్వం ఋజువు చేయబడిన వాడివి నీవే, సత్యానివీ నీవే. అవ (కాపాడు) మామ్ -- నన్ను, వక్తారం ... ప్రవచించే వక్తను, శ్రోతారమ్... జాగ్రత్తగా వినే శ్రోతలను, దాతారమ్ ... దానం చేసే దాతలను, ధాతారమ్.... బ్రహ్మాదులను, అనూచానంగా శేషించిన దానిని కాపాడు. అవ శిష్యమ్... శిష్యులను కాపాడు. అర్హత ప్రాతిపదికగా విజ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు. ఆ గురువును భక్తి పూర్వకంగా భావిస్తూ, అతనిచ్చిన అభిగమ్యమైన (పొందదగిన) విజ్ఞానాన్ని పవిత్రంగా, జిజ్ఞాసతో, అభిలాషతో అధ్యయనం చేసే వాడు శిష్యుడు. ఇరువురికీ సామాన్యంగా ఉండవలసిన లక్షణం "అర్హత".
జగత్తును ఆవరించిన ఈ ఆరు దిక్కులను (పూర్వ, దక్షిణ, పశ్చిమ, ఉత్తర, ఊర్ధ్వ, అధో దిశలు) కాపాడు. సర్వతో మాం పాహి.... ఈ ఆరు దిక్కులచే చక్కగా చుట్టబడిన (సమంతాత్) సర్వమును కాపాడు.
త్వం వాజ్ఞ్మయః .. నీవే సకల వాక్సంబంధిత శక్తివి, నీవే (చిత్ మయః) జ్ఞాన మూర్తివి, నీవే ఆనంద మయునివి, నీవే పరబ్రహ్మము. నీవే సత్ చిత్ ఆనందమవు. శాశ్వతమైన వానివి నీవే, నీకన్న రెండవది లేదు. ప్రత్యక్షంగా పర బ్రహ్మమవు నీవే. నీవే జ్ఞానానివి, నీవే విజ్ఞానానివి. (పంచేంద్రియాలచే తెలుసుకునేది లేదా గ్రహించేది జ్ఞానం కాగా వీటికి అతీతంగా పొదగలిగినది విజ్ఞానం. భౌతికంగా విజ్ఞానం అంటే... ఆచరించి దాని మంచి చెడ్డలను అనుభవ పూర్వకంగా తెలుసుకున్నది విజ్ఞానం.)
ఈ సకల చరాచర జగత్తు నీనుండే ఉద్భవించినది. ఈ జగత్తంతా నీలోనే ఉంటుంది. ఈ జగత్తు మొత్తంగా లయమయ్యేదీ నీలోనే. ఈ జగత్తంతా నీవైపే ప్రవహిస్తుంది (త్వయి ప్రత్యేతి) నిన్నే పొందుతుంది. నీవే భూమివి, నీరు, వాయువు, అగ్నివి, ఆకాశానివి. పరా పశ్యంతి మధ్యమా వైఖరి గా పేర్కొనబడే వాక్కు యొక్క నాలుగు పాదాలు నీవే.
త్రిగుణాలకు (సత్వ రజస్ తమో) నీవు అతీతునివి, నీవు స్థూల సూక్ష్మ కారణ శరీరాలుగా పేర్కొనబడే దేహత్రయానికీ అతీతునివి. నీవు భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు అతీతునివి. నీవే కుండలినీ శక్తిగా నిత్యమూ మూలాధార చక్రంలో స్థితమైన (ఉండే) శక్తివి. నీవే మూడు శక్తులకు (ఇఛ్ఛా జ్ఞాన క్రియా శక్తులు) అతీతమైన వానివి.
నిత్యం యోగులచే ధ్యానం చేయబడే వానివి నీవే. త్రిమూర్తులు, ఇంద్రాగ్ని వాయు సూర్య చంద్రాదుల రూపంలో భాసిల్లే వానివి నీవే. ముల్లోకములలో (భూః, భువః సువః) నీవే, ముల్లోకములూ నీవే అయిన వాడివి.
"గం" అనేది గణపతి బీజం. దానిని ఉఛ్చరించే పద్దతి చెపుతున్నారిక్కడ. "గ్" ను ముందుగా ఉఛ్చరించాలి అటు పిమ్మట వర్ణములకు ఆది అయిన "అ"కారాన్ని ఉఛ్చరించాలి. తదుపరి అనుస్వరాన్ని ఉఛ్చరించాలి. ఇది "గం" అవుతుంది. అదే గణపతి బీజం. (దీని సాధనచేత ఆ స్వామి గోచరమౌతాడు).
అర్ధేందులసితం... అక్షరములు ధ్వనులకు సంకేతాలు. ధ్వని నాద భరితము. బిందువు తదుపరి వచ్చే నాదాన్ని "అర్ధేందు" అనే సంకేతంతో సూచించారు. ఆ నాదంతో ప్రకాశించే వాడు.
తారేణ రుద్ధం... తార అనగా తరింప చేసే మంత్రము దానినే ఓంకారము లేదా ప్రణవము అంటున్నాము. రుద్ధము పరివేష్టితుడు. ప్రణవము చేత పరివేష్టితుడు లేదా ప్రణవ స్వరూపుడు.
ఇది అతని యొక్క మంత్ర రూపము.
(ఇక పోతే సామాన్యార్థంలో చెప్పుకుంటే....శివ సంబంధమైన వాడు గణపతి కాబట్టి అతడు అర్ధేందుచే (అష్టమినాటి చంద్రుని) ప్రకాశించే వాడు. తారకలచే (నక్షత్రములు) పరివేష్ఠితుడు, అని చెప్పు కోవచ్చు... కాని ఇది సంప్రదాయము కాదు.)
“గం” బీజం సాధన చేసే సమయంలో... "గ్" కారం పూర్వ రూపం, "అ" కారం మధ్యమ రూపం, అనుస్వరం అంత్య రూపం అవుతుంది కాగా బిందువు (౦) ఉత్తర రూపంగా ఉంటుంది. దీనిని పలికి నప్పుడు వచ్చే నాదమే సంధానము. దీనితో అత్యంత సాన్నిహిత్యం కలిగినది సంధి.
ఇది మొత్తంగా (సైషా.. స ఏషా...) గణేశుని విద్య. దీనికి ఋషి గణక ఋషి. అనగా దీనిని దర్శించి ప్రవచించిన వాడు, గణకుడు అనే ఋషి. దీని ఛందస్సు నిచృద్ ఛందం. అధిష్టాన దేవత గణపతి.
“ఓం గణపతయే నమః ఏక దంతాయ విద్మహే, వక్ర తుండాయ ధీమహి, తన్నో దంతిః ప్రచోదయాత్”!
ఏకదంతుడు, నాలుగు చేతులలో.... పాశము, అంకుశము, దంతము, (ఇది ఏనుగు దంతం, త్యాగానికి సంబంధించినది. మహాభారత రచనా కాలంలో తన దంతాన్ని విరిచి వ్రాసాడు) అభయ ముద్రను ధరించినవాడు, ఎలుక వాహనమును ధ్వజముగా కలిగిన వాడు, పెద్దనైన పొట్టను కలిగిన వాడు, చాటల లాంటి చెవులను కలిగిన వాడు, రక్త వర్ణ వస్త్రములను ధరించిన వాడు, ఎర్రనైన సుగంధములను పులు
ముకున్న శరీరము కలిగిన వాడు, ఎర్రనైన పుష్పములచే చక్కగా పూజితుడు, భక్త కోటిపై అమితమైన అనుకంప (దయ) కలిగిన వాడు, భగవంతుడైన వాడు, ఈ జగత్తుకు కారణమైన వాడు, అచ్యుతుడు (జారిపోని వాడు), సృష్టి ఆదిలోనే ఆవిర్భూతుడు, ప్రకృతి పురుషులకు కూడా పరమమైన వాడు, ఎవరైతే ఉన్నాడో (గణపతి) వానిని నిత్యం ఎవరైతే ధ్యానిస్తారో వారు యోగులలో శ్రేష్టునిగా చెప్పబడతారు.
హే వ్రాత పతి (సమూహమునకు భర్త) నీకు నమస్సులు. గణములకు పతియైన నీకు నమస్సులు, ప్రమథ గణములకు పతివైన నీకు నమస్సులు, లంబోదరుని వైన నీకు నమస్సులు, ఏకదంతుని వైన నీకు నమస్సులు (ఏక దంతము త్యాగానికి చిహ్నము) విఘ్నములను నశింప చేసే నీకు నమస్సులు, శివ సుత నీకు నమస్సులు. శివము అంటే మహదానందము.. దానికి పుత్రుడు అంటే ఆనంద మూర్తియే.
వరద మూర్తయే... అపరిమితమైన దయా కారుణ్యాలకు ఆకృతి వస్తే ఎలా ఉంటుంది అంటే అది గణపతి వలె ఉంటుంది అనేందుకు వరద మూర్తయే అన్నారిక్కడ. ఆ వరద మూర్తికి నమస్సులు.
ఇక చివరగా ఫల శ్రుతి....
ఈ అథర్వ శీర్షంను ఎవరైతే శ్రద్ధతో, చక్కగా అధ్యయనం చేస్తారో, వారు (స) బ్రహ్మ స్థానాన్ని పొందుతారు. వారు సర్వ విఘ్నములనుండి విముక్తుడవుతాడు, వారు సర్వత్రా సుఖములను పొందుతారు, వానికి పంచ మహా పాతకముల నుండి విముక్తి కలుగుతుంది.
సాయం సమయంలో దీనిని అనుష్ఠించడం వల్ల పగలు చేసిన పాపములు తొలగిపోతాయి. ప్రాతఃకాలంలో అనుష్ఠించినట్లయితే రాత్రి చేసిన పాపములు తొలిగిపోతాయి. సాయం ప్రాతస్సులలో అనుష్ఠించిన వానికి పాపములు అంటుకొనవు. సర్వత్రా ఏ కార్యములలో నైనా ఏ విధమైన విఘ్నములు కూడా అతనికి కలగవు. అతడు ధర్మార్ధ కామ మోక్షములను పొందగలడు. ఇది అధర్వ శీర్షం.
దీనిని శిష్యులు కాని వారికి ఇవ్వకూడదు. ఇక్కడ శిష్యుడు అంటే నేర్చుకోవాలనే జిజ్ఞాసతో గురువును సభక్తికంగా చేరిన వాడు. అశ్రద్ధ లేనివాడు, ఉపాసన యందు అనురక్తి కలిగిన వాడు. విషయంపైన భక్తిభావన కలిగిన వాడు. అలాంటి లక్షణాలు లేని వానికి ఈ విద్యను ఇవ్వగూడదని చెపుతుంది, ఈ సూక్తం. ఏ ప్రలోభాలకైనా లోనై అలా అనర్హులకు ఈ సూక్తాన్ని ఇచ్చినట్లయితే అతడు పాప కూపంలొ పడిపోతాడని హెచ్చరిస్తుంది.
ఏ ఏ కోరికలతో నైనా సహస్రావర్తనంగా దీనిని అనుష్ఠించినట్లయితే దీని చేత (అనేన) ఆ కోరికలు సాధింపబడతాయి. ఈ ఉపనిషత్ చేత గణపతిని అభిషేకించినట్లయితే అతడు చక్కని వాక్పటుత్వం కలిగిన వాడవుతాడు.
భాద్రపద శుద్ధ చవితినాడు భోజనం చేయకుండా (చతుర్థ్యామనశ్నన్… అన అశనము) ఎవరైతే జపిస్తారో, అతడు విద్వాంసుడౌతాడు. ఇది అథర్వణ వాక్యము.
దీనిని బ్రహ్మ విద్యగా ఆచరించడం వల్ల కొద్దిగా కూడా భయం అనేది ఉండదు. (నభిభేతి)
గణపతిని ... ఎవరైతే దూర్వారములచే అర్చిస్తారో అతడు అపర కుబేరుడౌతాడు. పేలాలతో ఎవరైతే అర్చిస్తారో అతడు యశస్కుడు అవుతాడు. మేధోవంతుడౌతాడు. మోదక సహస్రముచే ఎవరైతే అర్చిస్తారో వారికి వాంఛించిన ఫలితం లభిస్తుంది. ఎవరైతే ఆజ్యము (నేయి) సమిధలతో హవనం చేస్తారో వారికి ముమ్మాటికీ సర్వమూ లభిస్తుంది.
ఎనిమిది మంది వేద విదులైన బ్రాహ్మణులను చక్కగా సమకూర్చుకొని గణపతి నెవరైతే అర్చిస్తారో వారు సూర్య వర్చస్సును పొందుతారు.
సూర్య గ్రహణ కాలంలో, మహానది (జీవనది) వద్ద ప్రతిమ సాన్నిధ్యంలో జపించిన వారికి మంత్ర సిద్ధి కలుగుతుంది. వారికి మహా విఘ్నములు, మహా దోషములు, మహా పాపములు తొలగిపోతాయి. అతడు (స) అన్నీ తెలిసిన వాడవుతాడు... ఇది తెలుసుకోండి అంటుంది.. ఈ గణపతి అథర్వశీర్ష ఉపనిషత్తు.
ఓం శాంతిః శాంతిః శాంతిః
***
ఈ శాంతి మంత్రం యొక్క భావము
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
సమున్నతమైనది, ఇది భారత దేశము యొక్క సనాతన ధర్మం యొక్క అవున్నత్యాన్ని చాటి చెప్పుతుంది అంటే అతి శాయోక్తి కాదు. ఈ పద్యం యొక్క ఆర్థము,ఓ దేవతలారా! మా చెవులు ఎల్లవేళలా శుభమైన దానినే వినెదముగాక! మా నేత్రములు సర్వ కాల సర్వావస్థల యందు శుభప్రదమగు దానినే దర్శించెదము (చూచేదము) గాక ! మేము ఎల్లప్పుడూ మాకు ప్రసాదించిన ఆయుష్యు, దేహము, అవయవములతో మిమ్ములను సదా స్తుతించు చుందుము కనుక మాకు మంచి ఆయుష్యు, దేహ ధారుడ్యము, మంచి అవయవ సౌష్టవము శక్తి ని ప్రసాదించుము. ఆది కాలము నుంచి మహర్షులు, ఋషులచే స్తుతించబడిన ఇంద్రుడు మాకు శుభములు జేకూర్చుగాక! సర్వజ్ఞుడు ప్రత్యక్ష దేవుడైన సూర్యుడు మాకు శుభమును కలుగ జేయుగాక! ఆపదలనుండి మమ్ములను గరుత్మంతుడు రక్షించి మాకు శుభమును అనుగ్రహించుగాక! బృహస్పతి మాకు ఆధ్యాత్మిక ఐశ్వర్యమును కల్పించి సదా మాకు శుభమును ప్రసాదించుగాక !
ఓం శాంతిః శాంతిః శాంతిః ||
అర్థం :—
÷÷÷÷÷÷÷÷
మాకు తాపత్రయముల నుండి విముక్తి, శాంతి కలుగు గాక. తాపత్రయములు అనగా “మూడు తాపములు” అని ఆర్థము. అవి ఆది దైవిక తాపము, ఆది బౌతిక తాపము, అధ్యాత్మిక తాపము. ఈ మూడు తపముల నుండి మాకు శాంతి కలుగు గాక అని మూడు శాంతి మాత్రముల అర్థము.
***
శ్రీ మహా గణేశ కవచమ్&
శ్రీ మహాగణపతి అష్టోత్తర శత నామావళి&
శ్రీ మహాగణపతి సహస్ర నామ స్తోత్రం
***
శ్రీ మహా గణేశ కవచమ్:-
ఏషోతి చపలో దైత్యాన్ బాల్యేపి నాశయత్యహో |
అగ్రే కిం కర్మ కర్తేతి న జానే మునిసత్తమ || 1 ||
దైత్యా నానావిధా దుష్టాస్సాధు దేవద్రుమః ఖలాః |
అతోస్య కంఠే కించిత్త్యం రక్షాం సంబద్ధుమర్హసి || 2 ||
ధ్యాయేత్ సింహగతం వినాయకమముం దిగ్బాహు మాద్యే యుగే
త్రేతాయాం తు మయూర వాహనమముం షడ్బాహుకం సిద్ధిదమ్ |
ఈ ద్వాపరేతు గజాననం యుగభుజం రక్తాంగరాగం విభుమ్ తుర్యే
తు ద్విభుజం సితాంగరుచిరం సర్వార్థదం సర్వదా || 3 ||
వినాయక శ్శిఖాంపాతు పరమాత్మా పరాత్పరః |
అతిసుందర కాయస్తు మస్తకం సుమహోత్కటః || 4 ||
లలాటం కశ్యపః పాతు భ్రూయుగం తు మహోదరః |
నయనే బాలచంద్రస్తు గజాస్యస్త్యోష్ఠ పల్లవౌ || 5 ||
జిహ్వాం పాతు గజక్రీడశ్చుబుకం గిరిజాసుతః |
వాచం వినాయకః పాతు దంతాన్^^ రక్షతు దుర్ముఖః || 6 ||
శ్రవణౌ పాశపాణిస్తు నాసికాం చింతితార్థదః |
గణేశస్తు ముఖం పాతు కంఠం పాతు గణాధిపః || 7 ||
స్కంధౌ పాతు గజస్కంధః స్తనే విఘ్నవినాశనః |
హృదయం గణనాథస్తు హేరంబో జఠరం మహాన్ || 8 ||
ధరాధరః పాతు పార్శ్వౌ పృష్ఠం విఘ్నహరశ్శుభః |
లింగం గుహ్యం సదా పాతు వక్రతుండో మహాబలః || 9 ||
గజక్రీడో జాను జంఘో ఊరూ మంగళకీర్తిమాన్ |
ఏకదంతో మహాబుద్ధిః పాదౌ గుల్ఫౌ సదావతు || 10 ||
క్షిప్ర ప్రసాదనో బాహు పాణీ ఆశాప్రపూరకః |
అంగుళీశ్చ నఖాన్ పాతు పద్మహస్తో రినాశనః || 11 ||
సర్వాంగాని మయూరేశో విశ్వవ్యాపీ సదావతు |
అనుక్తమపి యత్ స్థానం ధూమకేతుః సదావతు || 12 ||
ఆమోదస్త్వగ్రతః పాతు ప్రమోదః పృష్ఠతోవతు |
ప్రాచ్యాం రక్షతు బుద్ధీశ ఆగ్నేయ్యాం సిద్ధిదాయకః || 13 ||
దక్షిణస్యాముమాపుత్రో నైఋత్యాం తు గణేశ్వరః |
ప్రతీచ్యాం విఘ్నహర్తా వ్యాద్వాయవ్యాం గజకర్ణకః || 14 ||
కౌబేర్యాం నిధిపః పాయాదీశాన్యావిశనందనః |
దివావ్యాదేకదంత స్తు రాత్రౌ సంధ్యాసు యఃవిఘ్నహృత్ || 15 ||
రాక్షసాసుర బేతాళ గ్రహ భూత పిశాచతః |
పాశాంకుశధరః పాతు రజస్సత్త్వతమస్స్మృతీః || 16 ||
జ్ఞానం ధర్మం చ లక్ష్మీ చ లజ్జాం కీర్తిం తథా కులమ్ | ఈ
వపుర్ధనం చ ధాన్యం చ గృహం దారాస్సుతాన్సఖీన్ || 17 ||
సర్వాయుధ ధరః పౌత్రాన్ మయూరేశో వతాత్ సదా |
కపిలో జానుకం పాతు గజాశ్వాన్ వికటోవతు || 18 ||
భూర్జపత్రే లిఖిత్వేదం యః కంఠే ధారయేత్ సుధీః |
న భయం జాయతే తస్య యక్ష రక్షః పిశాచతః || 19 ||
త్రిసంధ్యం జపతే యస్తు వజ్రసార తనుర్భవేత్ |
యాత్రాకాలే పఠేద్యస్తు నిర్విఘ్నేన ఫలం లభేత్ || 20 ||
యుద్ధకాలే పఠేద్యస్తు విజయం చాప్నుయాద్ధ్రువమ్ |
మారణోచ్చాటనాకర్ష స్తంభ మోహన కర్మణి || 21 ||
సప్తవారం జపేదేతద్దనానామేకవింశతిః |
తత్తత్ఫలమవాప్నోతి సాధకో నాత్ర సంశయః || 22 ||
ఏకవింశతివారం చ పఠేత్తావద్దినాని యః |
కారాగృహగతం సద్యో రాజ్ఞావధ్యం చ మోచయోత్ || 23 ||
రాజదర్శన వేళాయాం పఠేదేతత్ త్రివారతః |
స రాజానం వశం నీత్వా ప్రకృతీశ్చ సభాం జయేత్ || 24 ||
ఇదం గణేశకవచం కశ్యపేన సవిరితమ్ |
ముద్గలాయ చ తే నాథ మాండవ్యాయ మహర్షయే || 25 ||
మహ్యం స ప్రాహ కృపయా కవచం సర్వ సిద్ధిదమ్ |
న దేయం భక్తిహీనాయ దేయం శ్రద్ధావతే శుభమ్ || 26 ||
అనేనాస్య కృతా రక్షా న బాధాస్య భవేత్ వ్యాచిత్ |
రాక్షసాసుర బేతాళ దైత్య దానవ సంభవాః || 27 ||
|| ఇతి శ్రీ గణేశపురాణే శ్రీ గణేశ కవచం సంపూర్ణమ్ ||
**
శో|| శుక్లాం బరధరం విష్ణుం –శశివర్ణం చతుర్భుజమ్|
ప్రసన్న వదనం ధ్యాయేత్ – సర్వ విఘ్నోప శాంతయే||
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం ।
అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే||
మునిరువాచ:-
కథం నామ్నాం సహస్రం తం గణేశ ఉపదిష్టవాన్ ।
శివదం తన్మమాచక్ష్వ లోకానుగ్రహతత్పర ॥ 1 ॥
బ్రహ్మోవాచ
దేవః పూర్వం పురారాతిః పురత్రయజయోద్యమే ।
అనర్చనాద్గణేశస్య జాతో విఘ్నాకులః కిల ॥ 2 ॥
మనసా స వినిర్ధార్య దదృశే విఘ్నకారణం ।
మహాగణపతిం భక్త్యా సమభ్యర్చ్య యథావిధి ॥ 3 ॥
విఘ్నప్రశమనోపాయమపృచ్ఛదపరిశ్రమం ।
సంతుష్టః పూజయా శంభోర్మహాగణపతిః స్వయం ॥ 4 ॥
సర్వవిఘ్నప్రశమనం సర్వకామఫలప్రదం ।
తతస్తస్మై స్వయం నామ్నాం సహస్రమిదమబ్రవీత్ ॥ 5 ॥
అస్య శ్రీ మహాగణపతి సహస్రనామస్తోత్ర మాలామంత్రస్య ।
గణేశ ఋషిః, మహాగణపతిర్దేవతా, నానావిధానిచ్ఛందాంసి ।
హుమితి బీజం, తుంగమితి శక్తిః, స్వాహాశక్తిరితి కీలకం ।
సకలవిఘ్నవినాశనద్వారా శ్రీమహాగణపతిప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ।
అథ కరన్యాసః!!
గణేశ్వరో గణక్రీడ ఇత్యంగుష్ఠాభ్యాం నమః ।
కుమారగురురీశాన ఇతి తర్జనీభ్యాం నమః ।
బ్రహ్మాండకుంభశ్చిద్వ్యోమేతి మధ్యమాభ్యాం నమః ।
రక్తో రక్తాంబరధర ఇత్యనామికాభ్యాం నమః।
సర్వసద్గురుసంసేవ్య ఇతి కనిష్ఠికాభ్యాం నమః ।
లుప్తవిఘ్నః స్వభక్తానామితి కరతలకరపృష్ఠాభ్యాం నమః ॥
అథ అంగన్యాసః
ఛందశ్ఛందోద్భవ ఇతి హృదయాయ నమః ।
నిష్కలో నిర్మల ఇతి శిరసే స్వాహా ।
సృష్టిస్థితిలయక్రీడ ఇతి శిఖాయై వషట్ ।
జ్ఞానం విజ్ఞానమానంద ఇతి కవచాయ హుం ।
అష్టాంగయోగఫలభృదితి నేత్రత్రయాయ వౌషట్ ।
అనంతశక్తిసహిత ఇత్యస్త్రాయ ఫట్ ।
భూర్భువః స్వరోం ఇతి దిగ్బంధః ।
అథ ధ్యానం:-
గజవదనమచింత్యం తీక్ష్ణదంష్ట్రం త్రినేత్రం
బృహదుదరమశేషం భూతిరాజం పురాణం ।
అమరవరసుపూజ్యం రక్తవర్ణం సురేశం
పశుపతిసుతమీశం విఘ్నరాజం నమామి ॥
***
శ్రీగణపతిరువాచ:-
గణేశ్వరో గణక్రీడో గణనాథో గణాధిపః ।
ఏకదంతో వక్రతుండో గజవక్త్రో మహోదరః ॥ 1 ॥
లంబోదరో ధూమ్రవర్ణో వికటో విఘ్ననాశనః ।
సుముఖో దుర్ముఖో బుద్ధో విఘ్నరాజో గజాననః ॥ 2 ॥
భీమః ప్రమోద ఆమోదః సురానందో మదోత్కటః ।
హేరంబః శంబరః శంభుర్లంబకర్ణో మహాబలః ॥ 3 ॥
నందనో లంపటో భీమో మేఘనాదో గణంజయః ।
వినాయకో విరూపాక్షో వీరః శూరవరప్రదః ॥ 4 ॥
మహాగణపతిర్బుద్ధిప్రియః క్షిప్రప్రసాదనః ।
రుద్రప్రియో గణాధ్యక్ష ఉమాపుత్రోఽఘనాశనః ॥ 5 ॥
కుమారగురురీశానపుత్రో మూషకవాహనః ।
సిద్ధిప్రియః సిద్ధిపతిః సిద్ధః సిద్ధివినాయకః ॥ 6 ॥
అవిఘ్నస్తుంబురుః సింహవాహనో మోహినీప్రియః ।
కటంకటో రాజపుత్రః శాకలః సంమితోమితః ॥ 7 ॥
కూష్మాండసామసంభూతిర్దుర్జయో ధూర్జయో జయః ।
భూపతిర్భువనపతిర్భూతానాం పతిరవ్యయః ॥ 8 ॥
విశ్వకర్తా విశ్వముఖో విశ్వరూపో నిధిర్గుణః ।
కవిః కవీనామృషభో బ్రహ్మణ్యో బ్రహ్మవిత్ప్రియః ॥ 9 ॥
జ్యేష్ఠరాజో నిధిపతిర్నిధిప్రియపతిప్రియః ।
హిరణ్మయపురాంతఃస్థః సూర్యమండలమధ్యగః ॥ 10 ॥
కరాహతిధ్వస్తసింధుసలిలః పూషదంతభిత్ ।
ఉమాంకకేలికుతుకీ ముక్తిదః కులపావనః ॥ 11 ॥
కిరీటీ కుండలీ హారీ వనమాలీ మనోమయః ।
వైముఖ్యహతదైత్యశ్రీః పాదాహతిజితక్షితిః ॥ 12 ॥
సద్యోజాతః స్వర్ణముంజమేఖలీ దుర్నిమిత్తహృత్ ।
దుఃస్వప్నహృత్ప్రసహనో గుణీ నాదప్రతిష్ఠితః ॥ 13 ॥
సురూపః సర్వనేత్రాధివాసో వీరాసనాశ్రయః ।
పీతాంబరః ఖండరదః ఖండవైశాఖసంస్థితః ॥ 14 ॥
చిత్రాంగః శ్యామదశనో భాలచంద్రో హవిర్భుజః ।
యోగాధిపస్తారకస్థః పురుషో గజకర్ణకః ॥ 15 ॥
గణాధిరాజో విజయః స్థిరో గజపతిధ్వజీ ।
దేవదేవః స్మరః ప్రాణదీపకో వాయుకీలకః ॥ 16 ॥
విపశ్చిద్వరదో నాదో నాదభిన్నమహాచలః ।
వరాహరదనో మృత్యుంజయో వ్యాఘ్రాజినాంబరః ॥ 17 ॥
ఇచ్ఛాశక్తిభవో దేవత్రాతా దైత్యవిమర్దనః ।
శంభువక్త్రోద్భవః శంభుకోపహా శంభుహాస్యభూః ॥ 18 ॥
శంభుతేజాః శివాశోకహారీ గౌరీసుఖావహః ।
ఉమాంగమలజో గౌరీతేజోభూః స్వర్ధునీభవః ॥ 19 ॥
యజ్ఞకాయో మహానాదో గిరివర్ష్మా శుభాననః ।
సర్వాత్మా సర్వదేవాత్మా బ్రహ్మమూర్ధా కకుప్శ్రుతిః ॥ 20 ॥
బ్రహ్మాండకుంభశ్చిద్వ్యోమభాలఃసత్యశిరోరుహః ।
జగజ్జన్మలయోన్మేషనిమేషోఽగ్న్యర్కసోమదృక్ ॥ 21 ॥
గిరీంద్రైకరదో ధర్మాధర్మోష్ఠః సామబృంహితః ।
గ్రహర్క్షదశనో వాణీజిహ్వో వాసవనాసికః ॥ 22 ॥
భ్రూమధ్యసంస్థితకరో బ్రహ్మవిద్యామదోదకః ।
కులాచలాంసః సోమార్కఘంటో రుద్రశిరోధరః ॥ 23 ॥
నదీనదభుజః సర్పాంగులీకస్తారకానఖః ।
వ్యోమనాభిః శ్రీహృదయో మేరుపృష్ఠోఽర్ణవోదరః ॥ 24 ॥
కుక్షిస్థయక్షగంధర్వరక్షఃకిన్నరమానుషః ।
పృథ్వీకటిః సృష్టిలింగః శైలోరుర్దస్రజానుకః ॥ 25 ॥
పాతాలజంఘో మునిపాత్కాలాంగుష్ఠస్త్రయీతనుః ।
జ్యోతిర్మండలలాంగూలో హృదయాలాననిశ్చలః ॥ 26 ॥
హృత్పద్మకర్ణికాశాలీ వియత్కేలిసరోవరః ।
సద్భక్తధ్యాననిగడః పూజావారినివారితః ॥ 27 ॥
ప్రతాపీ కాశ్యపో మంతా గణకో విష్టపీ బలీ ।
యశస్వీ ధార్మికో జేతా ప్రథమః ప్రమథేశ్వరః ॥ 28 ॥
చింతామణిర్ద్వీపపతిః కల్పద్రుమవనాలయః ।
రత్నమండపమధ్యస్థో రత్నసింహాసనాశ్రయః ॥ 29 ॥
తీవ్రాశిరోద్ధృతపదో జ్వాలినీమౌలిలాలితః ।
నందానందితపీఠశ్రీర్భోగదో భూషితాసనః ॥ 30 ॥
సకామదాయినీపీఠః స్ఫురదుగ్రాసనాశ్రయః ।
తేజోవతీశిరోరత్నం సత్యానిత్యావతంసితః ॥ 31 ॥
సవిఘ్ననాశినీపీఠః సర్వశక్త్యంబుజాలయః ।
లిపిపద్మాసనాధారో వహ్నిధామత్రయాలయః ॥ 32 ॥
ఉన్నతప్రపదో గూఢగుల్ఫః సంవృతపార్ష్ణికః ।
పీనజంఘః శ్లిష్టజానుః స్థూలోరుః ప్రోన్నమత్కటిః ॥ 33 ॥
నిమ్ననాభిః స్థూలకుక్షిః పీనవక్షా బృహద్భుజః ।
పీనస్కంధః కంబుకంఠో లంబోష్ఠో లంబనాసికః ॥ 34 ॥
భగ్నవామరదస్తుంగసవ్యదంతో మహాహనుః ।
హ్రస్వనేత్రత్రయః శూర్పకర్ణో నిబిడమస్తకః ॥ 35 ॥
స్తబకాకారకుంభాగ్రో రత్నమౌలిర్నిరంకుశః ।
సర్పహారకటీసూత్రః సర్పయజ్ఞోపవీతవాన్ ॥ 36 ॥
సర్పకోటీరకటకః సర్పగ్రైవేయకాంగదః ।
సర్పకక్షోదరాబంధః సర్పరాజోత్తరచ్ఛదః ॥ 37 ॥
రక్తో రక్తాంబరధరో రక్తమాలావిభూషణః ।
రక్తేక్షనో రక్తకరో రక్తతాల్వోష్ఠపల్లవః ॥ 38 ॥
శ్వేతః శ్వేతాంబరధరః శ్వేతమాలావిభూషణః ।
శ్వేతాతపత్రరుచిరః శ్వేతచామరవీజితః ॥ 39 ॥
సర్వావయవసంపూర్ణః సర్వలక్షణలక్షితః ।
సర్వాభరణశోభాఢ్యః సర్వశోభాసమన్వితః ॥ 40 ॥
సర్వమంగలమాంగల్యః సర్వకారణకారణం ।
సర్వదేవవరః శారంగీ బీజపూరీ గదాధరః ॥ 41 ॥
శుభాంగో లోకసారంగః సుతంతుస్తంతువర్ధనః ।
కిరీటీ కుండలీ హారీ వనమాలీ శుభాంగదః ॥ 42 ॥
ఇక్షుచాపధరః శూలీ చక్రపాణిః సరోజభృత్ ।
పాశీ ధృతోత్పలః శాలిమంజరీభృత్స్వదంతభృత్ ॥ 43 ॥
కల్పవల్లీధరో విశ్వాభయదైకకరో వశీ ।
అక్షమాలాధరో జ్ఞానముద్రావాన్ ముద్గరాయుధః ॥ 44 ॥
పూర్ణపాత్రీ కంబుధరో విధృతాంకుశమూలకః ।
కరస్థామ్రఫలశ్చూతకలికాభృత్కుఠారవాన్ ॥ 45 ॥
పుష్కరస్థస్వర్ణఘటీపూర్ణరత్నాభివర్షకః ।
భారతీసుందరీనాథో వినాయకరతిప్రియః ॥ 46 ॥
మహాలక్ష్మీప్రియతమః సిద్ధలక్ష్మీమనోరమః ।
రమారమేశపూర్వాంగో దక్షిణోమామహేశ్వరః ॥ 47 ॥
మహీవరాహవామాంగో రతికందర్పపశ్చిమః ।
ఆమోదమోదజననః సప్రమోదప్రమోదనః ॥ 48 ॥
సంవర్ధితమహావృద్ధిరృద్ధిసిద్ధిప్రవర్ధనః ।
దంతసౌముఖ్యసుముఖః కాంతికందలితాశ్రయః ॥ 49 ॥
మదనావత్యాశ్రితాంఘ్రిః కృతవైముఖ్యదుర్ముఖః ।
విఘ్నసంపల్లవః పద్మః సర్వోన్నతమదద్రవః ॥ 50 ॥
విఘ్నకృన్నిమ్నచరణో ద్రావిణీశక్తిసత్కృతః ।
తీవ్రాప్రసన్ననయనో జ్వాలినీపాలితైకదృక్ ॥ 51 ॥
మోహినీమోహనో భోగదాయినీకాంతిమండనః ।
కామినీకాంతవక్త్రశ్రీరధిష్ఠితవసుంధరః ॥ 52 ॥
వసుధారామదోన్నాదో మహాశంఖనిధిప్రియః ।
నమద్వసుమతీమాలీ మహాపద్మనిధిః ప్రభుః ॥ 53 ॥
సర్వసద్గురుసంసేవ్యః శోచిష్కేశహృదాశ్రయః ।
ఈశానమూర్ధా దేవేంద్రశిఖః పవననందనః ॥ 54 ॥
ప్రత్యుగ్రనయనో దివ్యో దివ్యాస్త్రశతపర్వధృక్ ।
ఐరావతాదిసర్వాశావారణో వారణప్రియః ॥ 55 ॥
వజ్రాద్యస్త్రపరీవారో గణచండసమాశ్రయః ।
జయాజయపరికరో విజయావిజయావహః ॥ 56 ॥
అజయార్చితపాదాబ్జో నిత్యానందవనస్థితః ।
విలాసినీకృతోల్లాసః శౌండీ సౌందర్యమండితః ॥ 57 ॥
అనంతానంతసుఖదః సుమంగలసుమంగలః ।
జ్ఞానాశ్రయః క్రియాధార ఇచ్ఛాశక్తినిషేవితః ॥ 58 ॥
సుభగాసంశ్రితపదో లలితాలలితాశ్రయః ।
కామినీపాలనః కామకామినీకేలిలాలితః ॥ 59 ॥
సరస్వత్యాశ్రయో గౌరీనందనః శ్రీనికేతనః ।
గురుగుప్తపదో వాచాసిద్ధో వాగీశ్వరీపతిః ॥ 60 ॥
నలినీకాముకో వామారామో జ్యేష్ఠామనోరమః ।
రౌద్రీముద్రితపాదాబ్జో హుంబీజస్తుంగశక్తికః ॥ 61 ॥
విశ్వాదిజననత్రాణః స్వాహాశక్తిః సకీలకః ।
అమృతాబ్ధికృతావాసో మదఘూర్ణితలోచనః ॥ 62 ॥
ఉచ్ఛిష్టోచ్ఛిష్టగణకో గణేశో గణనాయకః ।
సార్వకాలికసంసిద్ధిర్నిత్యసేవ్యో దిగంబరః ॥ 63 ॥
అనపాయోఽనంతదృష్టిరప్రమేయోఽజరామరః ।
అనావిలోఽప్రతిహతిరచ్యుతోఽమృతమక్షరః ॥ 64 ॥
అప్రతర్క్యోఽక్షయోఽజయ్యోఽనాధారోఽనామయోమలః ।
అమేయసిద్ధిరద్వైతమఘోరోఽగ్నిసమాననః ॥ 65 ॥
అనాకారోఽబ్ధిభూమ్యగ్నిబలఘ్నోఽవ్యక్తలక్షణః ।
ఆధారపీఠమాధార ఆధారాధేయవర్జితః ॥ 66 ॥
ఆఖుకేతన ఆశాపూరక ఆఖుమహారథః ।
ఇక్షుసాగరమధ్యస్థ ఇక్షుభక్షణలాలసః ॥ 67 ॥
ఇక్షుచాపాతిరేకశ్రీరిక్షుచాపనిషేవితః ।
ఇంద్రగోపసమానశ్రీరింద్రనీలసమద్యుతిః ॥ 68 ॥
ఇందీవరదలశ్యామ ఇందుమండలమండితః ।
ఇధ్మప్రియ ఇడాభాగ ఇడావానిందిరాప్రియః ॥ 69 ॥
ఇక్ష్వాకువిఘ్నవిధ్వంసీ ఇతికర్తవ్యతేప్సితః ।
ఈశానమౌలిరీశాన ఈశానప్రియ ఈతిహా ॥ 70 ॥
ఈషణాత్రయకల్పాంత ఈహామాత్రవివర్జితః ।
ఉపేంద్ర ఉడుభృన్మౌలిరుడునాథకరప్రియః ॥ 71 ॥
ఉన్నతానన ఉత్తుంగ ఉదారస్త్రిదశాగ్రణీః ।
ఊర్జస్వానూష్మలమద ఊహాపోహదురాసదః ॥ 72 ॥
ఋగ్యజుఃసామనయన ఋద్ధిసిద్ధిసమర్పకః ।
ఋజుచిత్తైకసులభో ఋణత్రయవిమోచనః ॥ 73 ॥
లుప్తవిఘ్నః స్వభక్తానాం లుప్తశక్తిః సురద్విషాం ।
లుప్తశ్రీర్విముఖార్చానాం లూతావిస్ఫోటనాశనః ॥ 74 ॥
ఏకారపీఠమధ్యస్థ ఏకపాదకృతాసనః ।
ఏజితాఖిలదైత్యశ్రీరేధితాఖిలసంశ్రయః ॥ 75 ॥
ఐశ్వర్యనిధిరైశ్వర్యమైహికాముష్మికప్రదః ।
ఐరంమదసమోన్మేష ఐరావతసమాననః ॥ 76 ॥
ఓంకారవాచ్య ఓంకార ఓజస్వానోషధీపతిః ।
ఔదార్యనిధిరౌద్ధత్యధైర్య ఔన్నత్యనిఃసమః ॥ 77 ॥
అంకుశః సురనాగానామంకుశాకారసంస్థితః ।
అః సమస్తవిసర్గాంతపదేషు పరికీర్తితః ॥ 78 ॥
కమండలుధరః కల్పః కపర్దీ కలభాననః ।
కర్మసాక్షీ కర్మకర్తా కర్మాకర్మఫలప్రదః ॥ 79 ॥
కదంబగోలకాకారః కూష్మాండగణనాయకః ।
కారుణ్యదేహః కపిలః కథకః కటిసూత్రభృత్ ॥ 80 ॥
ఖర్వః ఖడ్గప్రియః ఖడ్గః ఖాంతాంతఃస్థః ఖనిర్మలః ।
ఖల్వాటశృంగనిలయః ఖట్వాంగీ ఖదురాసదః ॥ 81 ॥
గుణాఢ్యో గహనో గద్యో గద్యపద్యసుధార్ణవః ।
గద్యగానప్రియో గర్జో గీతగీర్వాణపూర్వజః ॥ 82 ॥
గుహ్యాచారరతో గుహ్యో గుహ్యాగమనిరూపితః ।
గుహాశయో గుడాబ్ధిస్థో గురుగమ్యో గురుర్గురుః ॥ 83 ॥
ఘంటాఘర్ఘరికామాలీ ఘటకుంభో ఘటోదరః ।
ఙకారవాచ్యో ఙాకారో ఙకారాకారశుండభృత్ ॥ 84 ॥
చండశ్చండేశ్వరశ్చండీ చండేశశ్చండవిక్రమః ।
చరాచరపితా చింతామణిశ్చర్వణలాలసః ॥ 85 ॥
ఛందశ్ఛందోద్భవశ్ఛందో దుర్లక్ష్యశ్ఛందవిగ్రహః ।
జగద్యోనిర్జగత్సాక్షీ జగదీశో జగన్మయః ॥ 86 ॥
జప్యో జపపరో జాప్యో జిహ్వాసింహాసనప్రభుః ।
స్రవద్గండోల్లసద్ధానఝంకారిభ్రమరాకులః ॥ 87 ॥
టంకారస్ఫారసంరావష్టంకారమణినూపురః ।
ఠద్వయీపల్లవాంతస్థసర్వమంత్రేషు సిద్ధిదః ॥ 88 ॥
డిండిముండో డాకినీశో డామరో డిండిమప్రియః ।
ఢక్కానినాదముదితో ఢౌంకో ఢుంఢివినాయకః ॥ 89 ॥
తత్త్వానాం ప్రకృతిస్తత్త్వం తత్త్వంపదనిరూపితః ।
తారకాంతరసంస్థానస్తారకస్తారకాంతకః ॥ 90 ॥
స్థాణుః స్థాణుప్రియః స్థాతా స్థావరం జంగమం జగత్ ।
దక్షయజ్ఞప్రమథనో దాతా దానం దమో దయా ॥ 91 ॥
దయావాందివ్యవిభవో దండభృద్దండనాయకః ।
దంతప్రభిన్నాభ్రమాలో దైత్యవారణదారణః ॥ 92 ॥
దంష్ట్రాలగ్నద్వీపఘటో దేవార్థనృగజాకృతిః ।
ధనం ధనపతేర్బంధుర్ధనదో ధరణీధరః ॥ 93 ॥
ధ్యానైకప్రకటో ధ్యేయో ధ్యానం ధ్యానపరాయణః ।
ధ్వనిప్రకృతిచీత్కారో బ్రహ్మాండావలిమేఖలః ॥ 94 ॥
నంద్యో నందిప్రియో నాదో నాదమధ్యప్రతిష్ఠితః ।
నిష్కలో నిర్మలో నిత్యో నిత్యానిత్యో నిరామయః ॥ 95 ॥
పరం వ్యోమ పరం ధామ పరమాత్మా పరం పదం ॥ 96 ॥
పరాత్పరః పశుపతిః పశుపాశవిమోచనః ।
పూర్ణానందః పరానందః పురాణపురుషోత్తమః ॥ 97 ॥
పద్మప్రసన్నవదనః ప్రణతాజ్ఞాననాశనః ।
ప్రమాణప్రత్యయాతీతః ప్రణతార్తినివారణః ॥ 98 ॥
ఫణిహస్తః ఫణిపతిః ఫూత్కారః ఫణితప్రియః ।
బాణార్చితాంఘ్రియుగలో బాలకేలికుతూహలీ ।
బ్రహ్మ బ్రహ్మార్చితపదో బ్రహ్మచారీ బృహస్పతిః ॥ 99 ॥
బృహత్తమో బ్రహ్మపరో బ్రహ్మణ్యో బ్రహ్మవిత్ప్రియః ।
బృహన్నాదాగ్ర్యచీత్కారో బ్రహ్మాండావలిమేఖలః ॥ 100 ॥
భ్రూక్షేపదత్తలక్ష్మీకో భర్గో భద్రో భయాపహః ।
భగవాన్ భక్తిసులభో భూతిదో భూతిభూషణః ॥ 101 ॥
భవ్యో భూతాలయో భోగదాతా భ్రూమధ్యగోచరః ।
మంత్రో మంత్రపతిర్మంత్రీ మదమత్తో మనో మయః ॥ 102 ॥
మేఖలాహీశ్వరో మందగతిర్మందనిభేక్షణః ।
మహాబలో మహావీర్యో మహాప్రాణో మహామనాః ॥ 103 ॥
యజ్ఞో యజ్ఞపతిర్యజ్ఞగోప్తా యజ్ఞఫలప్రదః ।
యశస్కరో యోగగమ్యో యాజ్ఞికో యాజకప్రియః ॥ 104 ॥
రసో రసప్రియో రస్యో రంజకో రావణార్చితః ।
రాజ్యరక్షాకరో రత్నగర్భో రాజ్యసుఖప్రదః ॥ 105 ॥
లక్షో లక్షపతిర్లక్ష్యో లయస్థో లడ్డుకప్రియః ।
లాసప్రియో లాస్యపరో లాభకృల్లోకవిశ్రుతః ॥ 106 ॥
వరేణ్యో వహ్నివదనో వంద్యో వేదాంతగోచరః ।
వికర్తా విశ్వతశ్చక్షుర్విధాతా విశ్వతోముఖః ॥ 107 ॥
వామదేవో విశ్వనేతా వజ్రివజ్రనివారణః ।
వివస్వద్బంధనో విశ్వాధారో విశ్వేశ్వరో విభుః ॥ 108 ॥
శబ్దబ్రహ్మ శమప్రాప్యః శంభుశక్తిగణేశ్వరః ।
శాస్తా శిఖాగ్రనిలయః శరణ్యః శంబరేశ్వరః ॥ 109 ॥
షడృతుకుసుమస్రగ్వీ షడాధారః షడక్షరః ।
సంసారవైద్యః సర్వజ్ఞః సర్వభేషజభేషజం ॥ 110 ॥
సృష్టిస్థితిలయక్రీడః సురకుంజరభేదకః ।
సిందూరితమహాకుంభః సదసద్భక్తిదాయకః ॥ 111 ॥
సాక్షీ సముద్రమథనః స్వయంవేద్యః స్వదక్షిణః ।
స్వతంత్రః సత్యసంకల్పః సామగానరతః సుఖీ ॥ 112 ॥
హంసో హస్తిపిశాచీశో హవనం హవ్యకవ్యభుక్ ।
హవ్యం హుతప్రియో హృష్టో హృల్లేఖామంత్రమధ్యగః ॥ 113 ॥
క్షేత్రాధిపః క్షమాభర్తా క్షమాక్షమపరాయణః ।
క్షిప్రక్షేమకరః క్షేమానందః క్షోణీసురద్రుమః ॥ 114 ॥
ధర్మప్రదోఽర్థదః కామదాతా సౌభాగ్యవర్ధనః ।
విద్యాప్రదో విభవదో భుక్తిముక్తిఫలప్రదః ॥ 115 ॥
ఆభిరూప్యకరో వీరశ్రీప్రదో విజయప్రదః ।
సర్వవశ్యకరో గర్భదోషహా పుత్రపౌత్రదః ॥ 116 ॥
మేధాదః కీర్తిదః శోకహారీ దౌర్భాగ్యనాశనః ।
ప్రతివాదిముఖస్తంభో రుష్టచిత్తప్రసాదనః ॥ 117 ॥
పరాభిచారశమనో దుఃఖహా బంధమోక్షదః ।
లవస్త్రుటిః కలా కాష్ఠా నిమేషస్తత్పరక్షణః ॥ 118 ॥
ఘటీ ముహూర్తః ప్రహరో దివా నక్తమహర్నిశం ।
పక్షో మాసర్త్వయనాబ్దయుగం కల్పో మహాలయః ॥ 119 ॥
రాశిస్తారా తిథిర్యోగో వారః కరణమంశకం ।
లగ్నం హోరా కాలచక్రం మేరుః సప్తర్షయో ధ్రువః ॥ 120 ॥
రాహుర్మందః కవిర్జీవో బుధో భౌమః శశీ రవిః ।
కాలః సృష్టిః స్థితిర్విశ్వం స్థావరం జంగమం జగత్ ॥ 121 ॥
భూరాపోఽగ్నిర్మరుద్వ్యోమాహంకృతిః ప్రకృతిః పుమాన్ ।
బ్రహ్మా విష్ణుః శివో రుద్ర ఈశః శక్తిః సదాశివః ॥ 122 ॥
త్రిదశాః పితరః సిద్ధా యక్షా రక్షాంసి కిన్నరాః ।
సిద్ధవిద్యాధరా భూతా మనుష్యాః పశవః ఖగాః ॥ 123 ॥
సముద్రాః సరితః శైలా భూతం భవ్యం భవోద్భవః ।
సాంఖ్యం పాతంజలం యోగం పురాణాని శ్రుతిః స్మృతిః ॥ 124 ॥
వేదాంగాని సదాచారో మీమాంసా న్యాయవిస్తరః ।
ఆయుర్వేదో ధనుర్వేదో గాంధర్వం కావ్యనాటకం ॥ 125 ॥
వైఖానసం భాగవతం మానుషం పాంచరాత్రకం ।
శైవం పాశుపతం కాలాముఖంభైరవశాసనం ॥ 126 ॥
శాక్తం వైనాయకం సౌరం జైనమార్హతసంహితా ।
సదసద్వ్యక్తమవ్యక్తం సచేతనమచేతనం ॥ 127 ॥
బంధో మోక్షః సుఖం భోగో యోగః సత్యమణుర్మహాన్ ।
స్వస్తి హుంఫట్ స్వధా స్వాహా శ్రౌషట్ వౌషట్ వషణ్ నమః 128 ॥
జ్ఞానం విజ్ఞానమానందో బోధః సంవిత్సమోఽసమః ।
ఏక ఏకాక్షరాధార ఏకాక్షరపరాయణః ॥ 129 ॥
ఏకాగ్రధీరేకవీర ఏకోఽనేకస్వరూపధృక్ ।
ద్విరూపో ద్విభుజో ద్వ్యక్షో ద్విరదో ద్వీపరక్షకః ॥ 130 ॥
ద్వైమాతురో ద్వివదనో ద్వంద్వహీనో ద్వయాతిగః ।
త్రిధామా త్రికరస్త్రేతా త్రివర్గఫలదాయకః ॥ 131 ॥
త్రిగుణాత్మా త్రిలోకాదిస్త్రిశక్తీశస్త్రిలోచనః ।
చతుర్విధవచోవృత్తిపరివృత్తిప్రవర్తకః ॥ 132 ॥
చతుర్బాహుశ్చతుర్దంతశ్చతురాత్మా చతుర్భుజః ।
చతుర్విధోపాయమయశ్చతుర్వర్ణాశ్రమాశ్రయః 133 ॥
చతుర్థీపూజనప్రీతశ్చతుర్థీతిథిసంభవః ॥
పంచాక్షరాత్మా పంచాత్మా పంచాస్యః పంచకృత్తమః ॥ 134 ॥
పంచాధారః పంచవర్ణః పంచాక్షరపరాయణః ।
పంచతాలః పంచకరః పంచప్రణవమాతృకః ॥ 135 ॥
పంచబ్రహ్మమయస్ఫూర్తిః పంచావరణవారితః ।
పంచభక్షప్రియః పంచబాణః పంచశిఖాత్మకః ॥ 136 ॥
షట్కోణపీఠః షట్చక్రధామా షడ్గ్రంథిభేదకః ।
షడంగధ్వాంతవిధ్వంసీ షడంగులమహాహ్రదః ॥ 137 ॥
షణ్ముఖః షణ్ముఖభ్రాతా షట్శక్తిపరివారితః ।
షడ్వైరివర్గవిధ్వంసీ షడూర్మిభయభంజనః ॥ 138 ॥
షట్తర్కదూరః షట్కర్మా షడ్గుణః షడ్రసాశ్రయః ।
సప్తపాతాలచరణః సప్తద్వీపోరుమండలః ॥ 139 ॥
సప్తస్వర్లోకముకుటః సప్తసప్తివరప్రదః ।
సప్తాంగరాజ్యసుఖదః సప్తర్షిగణవందితః ॥ 140 ॥
సప్తచ్ఛందోనిధిః సప్తహోత్రః సప్తస్వరాశ్రయః ।
సప్తాబ్ధికేలికాసారః సప్తమాతృనిషేవితః ॥ 141 ॥
సప్తచ్ఛందో మోదమదః సప్తచ్ఛందో మఖప్రభుః ।
అష్టమూర్తిర్ధ్యేయమూర్తిరష్టప్రకృతికారణం ॥ 142 ॥
అష్టాంగయోగఫలభృదష్టపత్రాంబుజాసనః ।
అష్టశక్తిసమానశ్రీరష్టైశ్వర్యప్రవర్ధనః ॥ 143 ॥
అష్టపీఠోపపీఠశ్రీరష్టమాతృసమావృతః ।
అష్టభైరవసేవ్యోఽష్టవసువంద్యోఽష్టమూర్తిభృత్ ॥ 144 ॥
అష్టచక్రస్ఫురన్మూర్తిరష్టద్రవ్యహవిఃప్రియః ।
అష్టశ్రీరష్టసామశ్రీరష్టైశ్వర్యప్రదాయకః ।
నవనాగాసనాధ్యాసీ నవనిధ్యనుశాసితః ॥ 145 ॥
నవద్వారపురావృత్తో నవద్వారనికేతనః ।
నవనాథమహానాథో నవనాగవిభూషితః ॥ 146 ॥
నవనారాయణస్తుల్యో నవదుర్గానిషేవితః ।
నవరత్నవిచిత్రాంగో నవశక్తిశిరోద్ధృతః ॥ 147 ॥
దశాత్మకో దశభుజో దశదిక్పతివందితః ।
దశాధ్యాయో దశప్రాణో దశేంద్రియనియామకః ॥ 148 ॥
దశాక్షరమహామంత్రో దశాశావ్యాపివిగ్రహః ।
ఏకాదశమహారుద్రైఃస్తుతశ్చైకాదశాక్షరః ॥ 149 ॥
ద్వాదశద్విదశాష్టాదిదోర్దండాస్త్రనికేతనః ।
త్రయోదశభిదాభిన్నో విశ్వేదేవాధిదైవతం ॥ 150 ॥
చతుర్దశేంద్రవరదశ్చతుర్దశమనుప్రభుః ।
చతుర్దశాద్యవిద్యాఢ్యశ్చతుర్దశజగత్పతిః ॥ 151 ॥
సామపంచదశః పంచదశీశీతాంశునిర్మలః ।
తిథిపంచదశాకారస్తిథ్యా పంచదశార్చితః ॥ 152 ॥
షోడశాధారనిలయః షోడశస్వరమాతృకః ।
షోడశాంతపదావాసః షోడశేందుకలాత్మకః ॥ 153 ॥
కలాసప్తదశీ సప్తదశసప్తదశాక్షరః ।
అష్టాదశద్వీపపతిరష్టాదశపురాణకృత్ ॥ 154 ॥
అష్టాదశౌషధీసృష్టిరష్టాదశవిధిః స్మృతః ।
అష్టాదశలిపివ్యష్టిసమష్టిజ్ఞానకోవిదః ॥ 155 ॥
అష్టాదశాన్నసంపత్తిరష్టాదశవిజాతికృత్ ।
ఏకవింశః పుమానేకవింశత్యంగులిపల్లవః ॥ 156 ॥
చతుర్వింశతితత్త్వాత్మా పంచవింశాఖ్యపూరుషః ।
సప్తవింశతితారేశః సప్తవింశతియోగకృత్ ॥ 157 ॥
ద్వాత్రింశద్భైరవాధీశశ్చతుస్త్రింశన్మహాహ్రదః ।
షట్త్రింశత్తత్త్వసంభూతిరష్టత్రింశత్కలాత్మకః ॥ 158 ॥
పంచాశద్విష్ణుశక్తీశః పంచాశన్మాతృకాలయః ।
ద్విపంచాశద్వపుఃశ్రేణీత్రిషష్ట్యక్షరసంశ్రయః ।
పంచాశదక్షరశ్రేణీపంచాశద్రుద్రవిగ్రహః ॥ 159 ॥
చతుఃషష్టిమహాసిద్ధియోగినీవృందవందితః ।
నమదేకోనపంచాశన్మరుద్వర్గనిరర్గలః ॥ 160 ॥
చతుఃషష్ట్యర్థనిర్ణేతా చతుఃషష్టికలానిధిః ।
అష్టషష్టిమహాతీర్థక్షేత్రభైరవవందితః ॥ 161 ॥
చతుర్నవతిమంత్రాత్మా షణ్ణవత్యధికప్రభుః ।
శతానందః శతధృతిః శతపత్రాయతేక్షణః ॥ 162 ॥
శతానీకః శతమఖః శతధారావరాయుధః ।
సహస్రపత్రనిలయః సహస్రఫణిభూషణః ॥ 163 ॥
సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ ।
సహస్రనామసంస్తుత్యః సహస్రాక్షబలాపహః ॥ 164 ॥
దశసాహస్రఫణిభృత్ఫణిరాజకృతాసనః ।
అష్టాశీతిసహస్రాద్యమహర్షిస్తోత్రపాఠితః ॥ 165 ॥
లక్షాధారః ప్రియాధారో లక్షాధారమనోమయః ।
చతుర్లక్షజపప్రీతశ్చతుర్లక్షప్రకాశకః ॥ 166 ॥
చతురశీతిలక్షాణాం జీవానాం దేహసంస్థితః ।
కోటిసూర్యప్రతీకాశః కోటిచంద్రాంశునిర్మలః ॥ 167 ॥
శివోద్భవాద్యష్టకోటివైనాయకధురంధరః ।
సప్తకోటిమహామంత్రమంత్రితావయవద్యుతిః ॥ 168 ॥
త్రయస్త్రింశత్కోటిసురశ్రేణీప్రణతపాదుకః ।
అనంతదేవతాసేవ్యో హ్యనంతశుభదాయకః ॥ 169 ॥
అనంతనామానంతశ్రీరనంతోఽనంతసౌఖ్యదః ।
అనంతశక్తిసహితో హ్యనంతమునిసంస్తుతః ॥ 170 ॥
ఇతి వైనాయకం నామ్నాం సహస్రమిదమీరితం ।
ఇదం బ్రాహ్మే ముహూర్తే యః పఠతి ప్రత్యహం నరః ॥ 171 ॥
కరస్థం తస్య సకలమైహికాముష్మికం సుఖం ।
ఆయురారోగ్యమైశ్వర్యం ధైర్యం శౌర్యం బలం యశః ॥ 172 ॥
మేధా ప్రజ్ఞా ధృతిః కాంతిః సౌభాగ్యమభిరూపతా ।
సత్యం దయా క్షమా శాంతిర్దాక్షిణ్యం ధర్మశీలతా ॥ 173 ॥
జగత్సంవననం విశ్వసంవాదో వేదపాటవం ।
సభాపాండిత్యమౌదార్యం గాంభీర్యం బ్రహ్మవర్చసం ॥ 174 ॥
ఓజస్తేజః కులం శీలం ప్రతాపో వీర్యమార్యతా ।
జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం స్థైర్యం విశ్వాసతా తథా ॥ 175 ॥
ధనధాన్యాదివృద్ధిశ్చ సకృదస్య జపాద్భవేత్ ।
వశ్యం చతుర్విధం విశ్వం జపాదస్య ప్రజాయతే ॥ 176 ॥
రాజ్ఞో రాజకలత్రస్య రాజపుత్రస్య మంత్రిణః ।
జప్యతే యస్య వశ్యార్థే స దాసస్తస్య జాయతే ॥ 177 ॥
ధర్మార్థకామమోక్షాణామనాయాసేన సాధనం ।
శాకినీడాకినీరక్షోయక్షగ్రహభయాపహం ॥ 178 ॥
సామ్రాజ్యసుఖదం సర్వసపత్నమదమర్దనం ।
సమస్తకలహధ్వంసి దగ్ధబీజప్రరోహణం ॥ 179 ॥
దుఃస్వప్నశమనం క్రుద్ధస్వామిచిత్తప్రసాదనం ।
షడ్వర్గాష్టమహాసిద్ధిత్రికాలజ్ఞానకారణం ॥ 180 ॥
పరకృత్యప్రశమనం పరచక్రప్రమర్దనం ।
సంగ్రామమార్గే సవేషామిదమేకం జయావహం ॥ 181 ॥
సర్వవంధ్యత్వదోషఘ్నం గర్భరక్షైకకారణం ।
పఠ్యతే ప్రత్యహం యత్ర స్తోత్రం గణపతేరిదం ॥ 182 ॥
దేశే తత్ర న దుర్భిక్షమీతయో దురితాని చ ।
న తద్గేహం జహాతి శ్రీర్యత్రాయం జప్యతే స్తవః ॥ 183 ॥
క్షయకుష్ఠప్రమేహార్శభగందరవిషూచికాః ।
గుల్మం ప్లీహానమశమానమతిసారం మహోదరం ॥ 184 ॥
కాసం శ్వాసముదావర్తం శూలం శోఫామయోదరం ।
శిరోరోగం వమిం హిక్కాం గండమాలామరోచకం ॥ 185 ॥
వాతపిత్తకఫద్వంద్వత్రిదోషజనితజ్వరం ।
ఆగంతువిషమం శీతముష్ణం చైకాహికాదికం ॥ 186 ॥
ఇత్యాద్యుక్తమనుక్తం వా రోగదోషాదిసంభవం ।
సర్వం ప్రశమయత్యాశు స్తోత్రస్యాస్య సకృజ్జపః ॥ 187 ॥
ప్రాప్యతేఽస్య జపాత్సిద్ధిః స్త్రీశూద్రైః పతితైరపి ।
సహస్రనామమంత్రోఽయం జపితవ్యః శుభాప్తయే ॥ 188 ॥
మహాగణపతేః స్తోత్రం సకామః ప్రజపన్నిదం ।
ఇచ్ఛయా సకలాన్ భోగానుపభుజ్యేహ పార్థివాన్ ॥ 189 ॥
మనోరథఫలైర్దివ్యైర్వ్యోమయానైర్మనోరమైః ।
చంద్రేంద్రభాస్కరోపేంద్రబ్రహ్మశర్వాదిసద్మసు ॥ 190 ॥
కామరూపః కామగతిః కామదః కామదేశ్వరః ।
భుక్త్వా యథేప్సితాన్భోగానభీష్టైః సహ బంధుభిః ॥ 191 ॥
గణేశానుచరో భూత్వా గణో గణపతిప్రియః ।
నందీశ్వరాదిసానందైర్నందితః సకలైర్గణైః ॥ 192 ॥
శివాభ్యాం కృపయా పుత్రనిర్విశేషం చ లాలితః ।
శివభక్తః పూర్ణకామో గణేశ్వరవరాత్పునః ॥ 193 ॥
జాతిస్మరో ధర్మపరః సార్వభౌమోఽభిజాయతే ।
నిష్కామస్తు జపన్నిత్యం భక్త్యా విఘ్నేశతత్పరః ॥ 194 ॥
యోగసిద్ధిం పరాం ప్రాప్య జ్ఞానవైరాగ్యసంయుతః ।
నిరంతరే నిరాబాధే పరమానందసంజ్ఞితే ॥ 195 ॥
విశ్వోత్తీర్ణే పరే పూర్ణే పునరావృత్తివర్జితే ।
లీనో వైనాయకే ధామ్ని రమతే నిత్యనిర్వృతే ॥ 196 ॥
యో నామభిర్హుతైర్దత్తైః పూజయేదర్చయే^^ఏన్నరః ।
రాజానో వశ్యతాం యాంతి రిపవో యాంతి దాసతాం ॥ 197 ॥
తస్య సిధ్యంతి మంత్రాణాం దుర్లభాశ్చేష్టసిద్ధయః ।
మూలమంత్రాదపి స్తోత్రమిదం ప్రియతమం మమ ॥ 198 ॥
నభస్యే మాసి శుక్లాయాం చతుర్థ్యాం మమ జన్మని ।
దూర్వాభిర్నామభిః పూజాం తర్పణం విధివచ్చరేత్ ॥ 199 ॥
అష్టద్రవ్యైర్విశేషేణ కుర్యాద్భక్తిసుసంయుతః ।
తస్యేప్సితం ధనం ధాన్యమైశ్వర్యం విజయో యశః ॥ 200 ॥
భవిష్యతి న సందేహః పుత్రపౌత్రాదికం సుఖం ।
ఇదం ప్రజపితం స్తోత్రం పఠితం శ్రావితం శ్రుతం ॥ 201 ॥
వ్యాకృతం చర్చితం ధ్యాతం విమృష్టమభివందితం ।
ఇహాముత్ర చ విశ్వేషాం విశ్వైశ్వర్యప్రదాయకం ॥ 202 ॥
స్వచ్ఛందచారిణాప్యేష యేన సంధార్యతే స్తవః ।
స రక్ష్యతే శివోద్భూతైర్గణైరధ్యష్టకోటిభిః ॥ 203 ॥
లిఖితం పుస్తకస్తోత్రం మంత్రభూతం ప్రపూజయేత్ ।
తత్ర సర్వోత్తమా లక్ష్మీః సన్నిధత్తే నిరంతరం ॥ 204 ॥
దానైరశేషైరఖిలైర్వ్రతైశ్చ తీర్థైరశేషైరఖిలైర్మఖైశ్చ ।
న తత్ఫలం విందతి యద్గణేశసహస్రనామస్మరణేన సద్యః ॥ 205 ॥
ఏతన్నామ్నాం సహస్రం పఠతి దినమణౌ ప్రత్యహంప్రోజ్జిహానే
సాయం మధ్యందినే వా త్రిషవణమథవా సంతతం వా జనో యః ।
స స్యాదైశ్వర్యధుర్యః ప్రభవతి వచసాం కీర్తిముచ్చైస్తనోతి
దారిద్ర్యం హంతి విశ్వం వశయతి సుచిరం వర్ధతే పుత్రపౌత్రైః ॥ 206 ॥
అకించనోప్యేకచిత్తో నియతో నియతాసనః ।
ప్రజపంశ్చతురో మాసాన్ గణేశార్చనతత్పరః ॥ 207 ॥
దరిద్రతాం సమున్మూల్య సప్తజన్మానుగామపి ।
లభతే మహతీం లక్ష్మీమిత్యాజ్ఞా పారమేశ్వరీ ॥ 208 ॥
ఆయుష్యం వీతరోగం కులమతివిమలం సంపదశ్చార్తినాశః
కీర్తిర్నిత్యావదాతా భవతి ఖలు నవా కాంతిరవ్యాజభవ్యా ।
పుత్రాః సంతః కలత్రం గుణవదభిమతం యద్యదన్యచ్చ తత్త -
న్నిత్యం యః స్తోత్రమేతత్ పఠతి గణపతేస్తస్య హస్తే సమస్తం ॥ 209 ॥
గణంజయో గణపతిర్హేరంబో ధరణీధరః ।
మహాగణపతిర్బుద్ధిప్రియః క్షిప్రప్రసాదనః ॥ 210 ॥
అమోఘసిద్ధిరమృతమంత్రశ్చింతామణిర్నిధిః ।
సుమంగలో బీజమాశాపూరకో వరదః కలః ॥ 211 ॥
కాశ్యపో నందనో వాచాసిద్ధో ఢుంఢిర్వినాయకః ।
మోదకైరేభిరత్రైకవింశత్యా నామభిః పుమాన్ ॥ 212 ॥
ఉపాయనం దదేద్భక్త్యా మత్ప్రసాదం చికీర్షతి ।
వత్సరం విఘ్నరాజోఽస్య తథ్యమిష్టార్థసిద్ధయే ॥ 213 ॥
యః స్తౌతి మద్గతమనా మమారాధనతత్పరః ।
స్తుతో నామ్నా సహస్రేణ తేనాహం నాత్ర సంశయః ॥ 214 ॥
నమో నమః సురవరపూజితాంఘ్రయే
నమో నమో నిరుపమమంగలాత్మనే ।
నమో నమో విపులదయైకసిద్ధయే
నమో నమః కరికలభాననాయ తే ॥ 215 ॥
కింకిణీగణరచితచరణః ప్రకటితగురుమితచారుకరణః ।
మదజలలహరీకలితకపోలః శమయతు దురితం గణపతినామ్నా ॥ 216 ॥
॥ ఇతి శ్రీగణేశపురాణే ఉపాసనాఖండే ఈశ్వరగణేశసంవాదే
గణేశసహస్రనామస్తోత్రం.
No comments:
Post a Comment