Monday 31 July 2023

daily story


పూజారి ఉపన్యాసం చెపుతున్నాడు 

 ప్రతిఒక్కరు  విచక్షణ జ్ఞానాన్ని సంపాదించాలి ఎవరో చెప్పారని చేశానని అనుట కాదు నీ  ఆత్మ సాక్షిగా నీ మనఃశాంతి నీతో ఉన్నవారికి శాంతి సౌఖ్యాలు కల్పించటమే మానవ జన్మకు సార్ధకం.    

తల్లితండ్రులపై పూర్తిగ భారము వైచి కర్తవ్యము నిర్వర్తింపని వాడు భ్రష్టుడగును. అట్టివానికి స్వశక్తి తగ్గును. నీపై నీవాధారపడుట పెంచుకొనుచు అత్యవసర విషయములనే తల్లితండ్రులకు  నివేదించుట నీ పెరుగుదలకు తోడ్పడును. తలితండ్రులేకదా ! అను మితిమీరిన విశ్వాసముతో బాధ్యతలను మరచుట అవివేకము. దీని వలన సాధారణ బాధ్యతలు కూడ నిర్వర్తించలేని స్థితి కలుగును. కనుక తల్లి తండ్రులను పురుషులైతే భార్యా సమేతముగా  నిరంతరమూ సేవలు చేయవలెను ఇది ఒక విధమైన ఋణము అటులనే కూతురైతే భర్తను ఒప్పించి తల్లి తండ్రులకు సేవచేయట సమంజసము, పిల్లలలకు పిల్లలు పెరుగుతుంటారు అయినను తాత బామ్మ,  అత్త మామ అంటూ పెద్దవారైన వారికి సేవలు చేయుట అందరి కర్తవ్యము.   

వేలు పట్టుకొని నడిపించుట ధీమంతులకు తగదు. నీకుగ నీవు నడువుము. కర్తవ్యములను, బాధ్యత లను నీకుగ నీవు మోయుము. కష్ట నష్టముల నోర్చుకొనుము. వేలు పట్టుకొని నడచువాడవు మహత్కార్యము లేమి చేయగలవు? ప్రతిదినము ప్రార్థన సమయమునందు నీకు వలసిన మానసిక సహాయము అందింపబడ గలదు. ధృతి గలిగి నీవే సమస్త బాధ్యతలను నిర్వర్తించుము. 

నిన్ను నిన్నుగ చూడగా - నన్ను నేనని తల్పగా   
నీవు నాకల దృష్టి గా  - నేను ప్రేమ సాక్షిగా 
నన్ను నీవని చెప్పగా   - కాల మాయకు చిక్కగా  
వాన నీటికి తడ్వగా    - ఎండ గాలికి మండగా
అగ్ని వాడక నీడగా    - రాజ కీయపు రంగుగా 
కాయ కష్టము నమ్మగా - మారు పల్కక చెప్పగా  
కారు చీకటి  కమ్మగా  - పాలు నిచ్చు బర్రెగా   
ఊలు నిచ్చిన గొర్రెగా - మేలు చేసెడి పెద్దగా 
వేలు ఖర్చులు చేయగా- రోజు లన్నియు ఒక్కగా    
దేని గూర్చియు ఆశగా  - సేవ చేసియు కోర్కగా   

ఇలా తడి పొడి మాటలు నిన్ను ఆవహిస్తాయి అయినా కార్వ్యము మరవకు అదే నేను కోరేది  
 IIU UUU IIU IIU 15/9

సమయానందంమ్మే సుఖసాగరమై 
సమ బాధా ప్రేమే సుఖరామయమై 
కమనీయంగా నే కరుణా లయమై 
రమయాలింగంమ్మే సమరాశయమై  

తన సమస్యలను తను స్ఫూర్తివంతముగ పరిష్కరించుకొను వానికి తల్లితండ్రుల సహాయము సద్గురువు సహాయము కూడ వెన్నంటి యుండగలదు. అర్జునుడు స్వయముగ యుద్ధము చేసినాడు. శ్రీకృష్ణుడు తోడ్పడినాడు. మిక్కుటముగ గురువుపై నాధారపడు వాడు ఏమియును చేయజాలడు.  

ఈరోజు మీరు బాగా చక్కగా చెప్పారు తల్లి తండ్రుల గురించి నాకు కొన్ని ప్రశ్నలు  వెయ్యాలని ఉంది 

అడుగూ స్త్రీ శక్తి కి ఎదురే లేదు అంత  తొద్దండి ఎదో నాకు ఆలోచన బట్టి అడుగుదామనికున్నా అంతే 

*ప్రశ్న :  ప్రజ్ఞానం అంటే ఏమిటి 
 : ప్రజ్ఞానం కేవలం జ్ఞానం అని తెలుసుకో, దానిలోనుండి వెడలేది విజ్ఞానం. అంటే సాపేక్ష జ్ఞానం, అంతర్దశ జ్ణానం, నిక్షిప్త జ్ణానం, దేహం,  ఆరోగ్యం,  సర్వాంతర్యామి జ్ణానం, మరియు సందర్భోచిత జ్ణానం

_*ప్రశ్న : విజ్ఞానదశలో సంవిత్ [విశ్వచైతన్యం] విదితమవుతుందా?

విశ్వ చైతన్యం మారుతూనే ఉంది. జీవపరిణామ ంం తగ్గిపోతుంది. స్త్రీ లు తగ్గుతున్నారు పురుషులు పెరుగు తున్నారు. గుప్తంగా ఉండే శృంగారం వీధిన వివరిస్తున్నది. అనుమానాలు వ్యక్తమవుతున్నాయి .  

_*ప్రశ్న : జగత్తులో విజ్ఞానం వల్ల  ప్రజ్ఞానం స్వయంగా భాసించదా? 

 ఎరుక అంతఃకరణ వల్ల ఇప్పుడూ ప్రజ్ఞానం సర్వదా నిద్రలో సైతం వెలుగుతూనే ఉంటుంది. మెలకువలో ఎరుక అనూనతమైతే నిద్రలో కూడా అట్లే ఉండవలె !*_

_*ఉదా : రాజు ఒకరు హాలులోకి వచ్చి కూర్చుండి వెళ్ళిపోయాడు. అతడు వంట ఇంటిలోకి వెళ్ళలేదు. ఆ కారణంగా రాజక్కడికి రాలేదనవచ్చునా ? ఎరుక జాగ్రత్తగా ఉంటే, నిద్రలోనూ ఉన్నదనే అనవలె !* మన ఆలోచనలు స్థిరముగా ఉండవు.

_*"లేదనే భావనే బాధ - బాధ లేని స్థితే ఆనందం !''*-

కనుక ఆనందం పరమానందం .. బ్రహ్మానందం ... ఆత్మానందం .. అందరికి ఉండాలి 

అదే ......  ....... .అదే ........  ...... 

--(())--

: *శుద్ధమనసు* *శరీరం కేవలం గూడు. అది ఆత్మకు ఆవాసం మాత్రమే..!*

*మానవజన్మ కర్మబద్ధం. కనుక ప్రపంచంలో కర్మనిష్ఠతో ఉండాలి. కానీ అంతరంగంలో బ్రహ్మనిష్ఠలో ఉండాలి. ఇదే మానవ జన్మకున్న విశిష్టత. సమ్యక్‌ దృష్టితో ప్రాపంచిక కర్తవ్యాలు నిర్వర్తించాలి. మేను మాత్రమే నేను కాదు. ఉన్నది ఒక్క నేనే. మూడు అవస్థలలో వున్న నేను అనే చైతన్యమే.*

*హృదయం వెన్న వలె ఉండాలి.  కాఠిన్యంతో కాకుండా.. కారుణ్య హృదయంతో ప్రపంచంలో సంచరించాలి. సిద్ధాంత రాద్ధాంతాలు, వాదోపవాదాలు లేకుండా మనీషతో వుండాలి. మనీష అంటే స్థిరప్రజ్ఞ, స్థిమిత బుద్ధి.  ఇది కాదు,ఇది కాదంటూ మనసును ఖాళీ చేసుకుంటూ పూర్ణ చైతన్యంతో ప్రవర్తించాలి. శాస్త్రాధ్యయనంతో మనసును పరిమళ భరితం చేసి, స్వాదువుగా తీర్చిదిద్దుకోవాలి.జడాత్మక దేహం అనుభవించే ఏ వికారమూ నీది కాదు.ఎరుకతో ఉండాలి.*

*దేనికీ అంటక, దేనినీ అంటించు కొనక కాంతి కటకం వలె, తామరపత్రం మీద నీటి బిందువువలె, తెరమీద బొమ్మవలె ఉండాలి. అంతా బ్రహ్మమే అనుకో గలగటమే అసలైన ముక్తి!!*


అప్పుడే గుడి మెట్ల ఒక యువకుడు (యిలా అంటున్నాను )

దేశంలో సత్యం కనుమరుగై పోయింది... 

అసత్యం తాండవిస్తుంది, సత్యాన్ని వెంటబడి... వేటాడి తరిమి తరిమి కొట్టేశారు... 

దేవుడు నిద్రపోతున్నాడు సత్యం తిరగబడి... బోర్లా పడింది..అసత్యమనే ధన గర్వంతో, అధికార దర్పంతో, విదేశ భక్తితో సత్యాన్ని తొక్కి పడేస్తూ వస్తున్నారు...  

న్యాయస్తానాలు నత్తనడక, విచ్చల విడిగా లంచాల రాజ్య కాంక్ష నాయకుల అసత్యవాక్కులు, గొర్రెల లాగ మారె జనులు ఎప్పటికి మారినో ఎప్పుడు వచ్చునో సత్య ప్రపంచం 

(అప్పుడే పూజారి అడుగు పెడుతూ కంఠ సోష దేనికి, కాసేపు ఆగు స త్యంగా ప్రసాదం పెడతా)

అవునూ నీవు దేవుడికి కళ్ళు గప్పి సంపాయిస్తున్నావు, మాలాంటి వారికి ప్రసాదంతో సరిపెడుతున్నావు. జాతీయ మీడియా రాజ్యాంగ నాయకుల చేతిలో పరాజితురాలై బానిసత్వం లో మగ్గు తూ ఉంది ఎదురు తిరిగితే వచ్చి గొంతే నులిమేస్తున్నారు.  

ఓహ్... ఒకటేమిటి ?


పార్టీకో పత్రిక.... 

పార్టీ కో ఛానెల్... 

అవి వెదజల్లే వార్తలు చూస్తూ ఉంటే ...

సత్యానికే సంకెళ్ళు, నిజాలు దివాలా తీశాయి అబద్దాలు దారిన పడ్డాయి. అసత్యాలు... అబద్ధాలు రాజ్యమేలుతూ ఉన్నాయి. 

(అప్పుడే పూజరి అక్కడఉన్న వారికి ప్రసాదం పెట్టాడు, చదగోపురంతో దక్షణ నొక్కేసాడు)

అవును ఆంజనేయ నీఆవేదన కాని మనం స్నేహితులం, నేను గుళ్లోనున్నాను, నీవు లోకాన్ని చూస్తున్నావు అయినా మన నాయకులు మహాతటాకాలు సైతం అదృశ్యపు దిశనని పర్యావరణ వెత్తలు చెరువులపూడ్చివేసి నవనాగరిక సౌధాల నిర్మాణాలు ఇప్పుడు అనుమతిస్తున్నారు, చెట్లు నరికేస్తున్నారు, చినుకుపడితే చిత్తుచిత్తు అవుతున్న ప్రతిష్టాత్మక జనవాసాలు దారి చూపలేని నోరు మెదపలేని ప్రభుత్వాలు, ప్రగతి పథాన్ని ప్రశ్నించె ప్రకృతి పరిచక్రం, నష్ట పరిహారమని నాయకుల భోజ్యం ఎవరితో చెప్పుకోగలం, న్యాయదేవత కళ్లు మూసినట్లు, మనం తెలియనివారులాగ నోరుమూసు కోవడమే ఇదే సత్యం, ఇదే నేటిన్యాయం, ఇదే ధర్మం అంటూ అరుచు కుంటూ వెళ్లి పొయ్యాడు .

అప్పుడే గుడిలో వృద్ధ దంపతులు వచ్చి కూర్చున్నారు పూజారి ఆకులో ప్రసాదము తెచ్చి ఇచ్చారు కుశల ప్రశ్నలు వేయగా దీనాతిదీనముగా క్లుప్తముగా పుత్రికాపుత్రులు ఇదరిద్దరు, 

పెళ్లి ఉద్యగవ్యవహారాలు వయసులో నెరవేర్చాము, ఉన్న శక్తి ఆస్థి పిల్లలకు ధారపోశాము, మనవళ్లను మోయలేక, పిల్లలవద్ద ఉండలేక కట్టుబట్టలతో ఇక్కడకొచ్చాము. 

అప్పుడే ఆంజనేయుడు అక్కడకొచ్చాడు ఏమిటి పిల్లలు మిమ్మల్ని చూడుటలేదా అన్నాడు   

పిల్లలు మంచివారే కానీ మారతాలు బాగుండలేదు అంతే అవునులే పిల్లల్ని ఏమి అనలేరు, వారిదగ్గర ఉండలేరు, బ్రతుకుకోసం మరలా జీవితమా మొదలుపెడతారు కదా 

అట్లాఅనకుబాబు ఎదో అప్పుడే కొన్ని కాగితాలు తెచ్చేడు ఆంజనేయుడు వీటిపై సంతకాలు పెట్టండి మిగతావి నేను చూసుకుంటా అందాక ఈగుడిలో నే ఉండండి గుడివానకాల గదులున్నాయి అక్కడ ఉండి వండుకుంటారో గుడి ప్రసాదం తింటారో మీయిష్టం అన్నాడు 

పూజారి అక్కడకొచ్చి ఆంజనేయ అప్పుడే అభయమిచ్చావే తప్ప దండి ఆదు కోవటమే తక్షణ కర్తవ్యం సంతకం దేనికి అన్నారు దేవాలయం కదండీ కొన్ని కారణాలు ఉంటాయి అందుకోసమే మిమ్మల్ని మోసం ఏమి చేయము నమ్మకమే మాధ్యాయం ఇక మీ ఇష్టం అన్నాడు పూజారి ఆంజనేయుడు సంతకాలు పెట్టించుకున్నాడు అసమయాన 


ఉ.వర్షపు నీరుపారు దల పాకము లా మురికై సువాసనే

హర్షపు కప్పవాక్కు లగు హారతి లా మెరిసేను నీటిలో

శీర్షపు ఆసనమ్ములగు చీమల రీ తిన దారిపట్టుటే 

కర్షక గోడు చూడకయు కాలము తీర్పుయు తెల్ప నాయకా


సీనియర్ సిటిజన్లు, పూర్తిగా నిర్లక్ష్యం  ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలి.  భారతదేశంలో సీనియర్ సిటిజన్‌గా ఉండటం నేరమా?*

   భారతదేశంలోని సీనియర్ సిటిజన్లు 70 సంవత్సరాల తర్వాత వైద్య బీమాకు అర్హులు కారు, వారు EMIపై రుణం పొందరు.  డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వలేదు.  ఆర్థిక పనుల కోసం వారికి ఎలాంటి పని ఇవ్వరు.  కాబట్టి వారు ఇతరులపై ఆధారపడతారు.  అతను తన యవ్వనంలో అన్ని పన్నులు చెల్లించాడు.  ఇప్పుడు సీనియర్‌ సిటిజన్‌ ​​అయ్యాక కూడా పన్నులన్నీ కట్టాల్సిందే.  భారతదేశంలో సీనియర్ సిటిజన్ల కోసం ఏ పథకం లేదు.  రైల్వేలో 50 శాతం తగ్గింపు కూడా నిలిపివేయబడింది.  బాధాకరమైన విషయం ఏమిటంటే రాజకీయాల్లో సీనియర్ సిటిజన్ అంటే అది ఎమ్మెల్యే, ఎంపీ లేదా మంత్రి కావచ్చు, వారు ప్రతిదీ పొందుతారు మరియు పెన్షన్ కూడా పొందుతారు, కాని మేము సీనియర్ సిటిజన్లు మన జీవితమంతా ప్రభుత్వానికి అనేక రకాల పన్నులు చెల్లిస్తున్నాము, ఇప్పటికీ పెన్షన్ లేదు.  వృద్ధాప్యంలో, వృద్ధాప్యంలో వారిని (కొన్ని కారణాల వల్ల) చూసుకోలేకపోతే పిల్లలు ఎక్కడికి వెళ్తారో ఊహించండి?  ఇది భయంకరమైన మరియు బాధాకరమైన విషయం.  ఇంటి పెద్దలకు కోపం వస్తే అది ఎన్నికలపై ప్రభావం చూపుతుంది.  మరి దాని పర్యవసానాలను ప్రభుత్వమే భరించాలి.  సీనియర్ సిటిజన్లను ఎవరు చూసుకుంటారు?

   ప్రభుత్వాన్ని మార్చే శక్తి సీనియర్లకు ఉంది, వారిని బలహీనులని ఉపేక్షించకండి!  సీనియర్ సిటిజన్ల జీవితాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం లేదు.  ప్రభుత్వం పునరుత్పాదక పథకాలకు చాలా డబ్బు ఖర్చు చేస్తుంది, కానీ సీనియర్ సిటిజన్లకు కూడా ఒక పథకం అవసరమని ఎప్పుడూ గుర్తించదు.  దీనికి విరుద్ధంగా, బ్యాంకుల వడ్డీ రేట్ల తగ్గింపు కారణంగా సీనియర్ సిటిజన్ల ఆదాయం తగ్గుతోంది.  కుటుంబ పోషణ కష్టంగా ఉన్న కొద్దిపాటి పింఛను వస్తే దానికి కూడా ఆదాయపు పన్ను విధిస్తారు.

 భారతీయ సీనియర్ సిటిజన్‌గా ఉండటం ఇప్పుడు నేరంగా పరిగణించబడుతుంది.

అంటూ ఏమిటి యీలోకం తీరు అర్ధంకావటంలేదు 

. *కరోనా కరోనా వచ్చి ఏం చేసావ్ అని అడిగితే:


 ఢిల్లీ, హైద్రాబాదు  లాంటి ప్రదేశాల్లో కూడా కాలుష్యం తగ్గించాను.,  కుటుంబాలతో సమయం వెచ్చించేలా చేశాను. డబ్బు ఒక్కటే ప్రాధాన్యము అనుకొని పరిగెత్తే వాళ్ళకి బుద్ధి తెచ్చేలా చేశాను.  రోజు మందు లేకపోతే బతకలేను అనే వాళ్ళ చేత మందు లేకుండా ఉండేలా చేశాను.  డబ్బున్నా ఏమీ చేయలేని ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి కల్పించాను.  వైద్య వ్యవస్థ మీద ఎంత నిర్లక్ష్యంతో ప్రభుత్వాలు ఉన్నాయో అందరికీ తెలిసేలా చేశాను.  ఎంత డబ్బు ఉన్నా మీకు నచ్చింది కావాల్సింది దొరకకపోతే ఆ బాధని ఎలా అధిగమించాలో నేర్పాను.  బతికుంటే చాలురా భగవంతుడా అనుకునేలా చేశాను. ఎన్ని కోపాలు తాపాలు ఉన్న బయటకు వెళ్ళలేక ఇంట్లో వాళ్లతోనే సర్దుకుపోయేలా చేశాను.  క్యాష్ తప్ప ఇంకేమీ అలవాటు లేని వాళ్ళ చేత ఆన్లైన్ పేమెంట్ అలవాటు చేశాను. యాక్సిడెంట్లు లేకుండా చేశాను..


 ఈ భూమి మనుషులకు మాత్రమే కాదు జంతు జీవరాశులకు కూడా అని వాటికీ ప్రశాంతమైన వాతావరణం కల్పించాను. ఎల్లప్పుడూ బిజీగా ఉండే వాళ్ళు నాకు "ఎప్పుడు ప్రశాంతత దొరుకుతుందా" అని ఏడ్చే వాళ్లకి ఇంట్లో ఖాళీగా ఉంటే ఎంత నరకం అని తెలిసేలా చేశాను.

మేము అగ్రరాజ్యాలమని విర్రవీగే వాళ్ళని పడుకునేలా చేశాను..

వైద్యం మీద కాకుండా రక్షణ వ్యవస్థ మీద ఎక్కువ పెట్టినందుకు బాధపడేలా చేశాను.

 "గవర్నమెంట్ హాస్పిటల్లను ఇప్పటిదాకా ఇలా ఎందుకు ఉంచారు" అని బాధపడేలా చేశాను.

 "డబ్బుతో అన్ని సుఖాలు ఇష్టాలు రావు సర్దుకుపోవడం లోనే వస్తుంది" అని ప్రతి ఒక్కరికి నేర్పాను.  "మనకెందుకు చావు వస్తుంది" అని ధీమాగా ఉన్న వాళ్ళ వెన్నులో వణుకు పుట్టించేలా చేశాను..

 క్రమశిక్షణ అంటే ఏంటో తెలియని వాళ్లకు అది నేర్పాను   "ఇలాంటి సమయంలో కూడా సేవ చేసేవాళ్ళు ఉంటారు" అని సమాజానికి చూపించాను. లోకంలో మనిషి పుట్టుక అద్భుతం

 నవ్వుతూ బ్రతకాలి నలుగుర్ని నవ్విస్తూ బ్రతకాలి!


*అంతా మట్టే మట్టిలో పుట్టాము ! మట్టిలోకే పోతాము కదా!

ఒక్కసారి ఆలోచించండి దయచేసి.....



 * తెలుసుకోదగిన విషయం ..... పూజారి తనకు తోచిన కధలు తేలుతున్నాడు 

ఒక రోజొక గురువు గారు తన ఇద్దరు శిష్యుల్నీ పిలిచి, “ఈ రోజు మీరిద్దరూ పొరుగూరికి వెళ్లి రావాలి” అని చెప్పారు. ఒక సంచిలో ఆహారాన్ని నింపి, ఒక శిష్యులకు ఇచ్చి, “ఎవరైనా అవసరం ఉన్న వాళ్లు కనిపిస్తే వారికి ఈ ఆహారాన్ని పంచుకుంటూ వెళ్లు” అన్నారు. 

రెండో శిష్యుడికి ఖాళీ సంచి ఇచ్చి ‘దారిలో ఏదైనా విలువైన వస్తువు కనిపిస్తే దాన్ని సంచిలో వేసుకుంటూ వెళ్లు’ అన్నారు.

ఇద్దరూ సంచుల్ని భుజాలకి తగిలించుకుని ప్రయాణం మొదలుపెట్టి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఖాళీ సంచి వాడు ఆడుతూపాడుతూ నడుస్తున్నాడు. కొంత దూరం వెళ్లాక అతనికి ఒక విలువైన రంగు రాయి దొరికింది. దాన్ని తీసి సంచిలో వేసుకున్నాడు. మరికొంత దూరం వెళ్లాక మరొకటి కనిపించింది. దాన్ని తీసి సంచిలో వేసుకున్నాడు. అలా ఎక్కడ రంగు రాయి కనిపిస్తే దాన్ని తీసుకుని సంచిలో వేసుకుంటూ నడక సాగించాడు. దాంతో సంచి బరువెక్కసాగింది. నడక భారంగా మారింది. శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది అయింది. ఉండేకొద్దీ అడుగు తీసి అడుగేయడమే చాలా కష్టమైపోయింది.

ఇక రెండోవాడు వెళ్తూ వెళ్తూ దారిలో ఆకలితో కనిపించిన వారికి తన సంచిలోని తిను బండారాలను కొంచెం కొంచెంగా పంచుకుంటూ వెళ్లాడు. క్రమంగా సంచి బరువు తగ్గి నడక సులభం అయింది. పంచుకుంటూ వెళ్లినవాడు తన గమ్యాన్ని తేలిగ్గా చేరుకోగలిగాడు. పోగేసుకుంటూ వెళ్లిన వ్యక్తి గమ్యాన్ని చేరుకోలేక పోయాడు. ప్రయాణమూ కష్టంగా సాగింది.

మరి మీరూ మనసు పెట్టి ఆలోచించండి. మీ యగమ్యాన్ని ఎలా చేరుకోదలచుకున్నారు?

ఈ కథను తాత్విక దృష్టితో చూసినట్లయితే “విలువగలవైనా ..

లౌకిక విషయాలను, వస్తు సమాగ్రిని ప్రోగు చేసుకుంటూ వెళితే, జీవితం దుర్భరమవుతుంది. అదే మన ప్రేమనీ , జ్ఞానాన్నీ పంచుకుంటూ జీవన ప్రయాణం సాగిస్తే, మోక్షానికి చేరే మార్గం సుగమం అవుతుంది”. 

అట్లాగే పిల్లలపై ప్రేమ ఉండోచ్చు మొదటి వ్యక్తిలాగా బరువులను మోస్తే ఇవితమంతా బరువుతుంది, రెండోవ్యక్తిలా అందుకున్నదంతా పంచి సహాయము చే యుటె సుఖము.       

***


No comments:

Post a Comment