Tuesday, 21 February 2023






నేటి కథ--- 32 ---

 *రెండూ లేవు అని అర్థం*

తెలిస్తే మోక్షము తెలియక పొతే సంసార బంధము।

 బ్రతుకంతా ఒక కలేకాని నిజము కాదు। శరీరము నశించును।

              ఇట్టి శరీరముపై ఆశ ఎందుకు ?అనే తత్వము తెలిసిన వారికి సుఖము లేదు ,దుఃఖము లేదు। కర్మ మాత్రమే చేయదగినది।కాని దాని ఫలమక్కరలేదు అని ఫలత్యాగము చేసే యోగికి పాపము లేదు,పుణ్యము లేదు నిరాహారదీక్ష గలవానికి అమృతము లేదు,విశము లేదు । 

              ప్రపంచమంతయు మిధ్య అని తెలిసి దానిపై వెగటు చెంది ప్రపంచమును వదిలిన వానికి పగవాడు లేదు , బంధువు లేడు। వేల వేల విధులున్నయి। ఈ విధులు చేసి ఏవేవో పొందుదామని తలంప సాధారణముగా ఉంటుంది।రానిది రాకమానదు।పోనిది పోక మానదు అని దైవమునే నమ్మిన వానికి వెరపు లేదు మరపు లేదు। 

             శ్రీ వేంకటేశ్వరుని చిత్తమున నిలిపి ఆయన దాసుడయిన వానికి ఈవల లేదు,ఆవల లేదు। తెలిసితేమోక్షము-తెలియకున్న బంధము, కలవంటిది బంధం-ఘనునికిని ఎవడు ఘనుడు.....?

             ఏది తెలిస్తే మోక్షం ``ఏది తెలియకుంటే బంధం

             నేను ఆత్మస్వరూపున్ని" భగవంతుణ్ణి అని తెలిసిన వాడు ఘనుడు.అతను మోక్షము పొందుతాడు. నేను శరీరమే అనుకునే వాడికి అంతా బంధమే..... బంధమే.... బంధమే..  అనయము సుఖమేడ -దవల దు:ఖమేడది తనువుపై నాసలేని - తత్వమతికి.

తత్వమతి అంటే ఎవరు....?

   "" తత్ ""అంటే ""అది  ""మతి """బుద్ది 

            నేను ఏదైతే అయి ఉన్నానో బయటిది    కూడా అదే అని తెలిసినప్పుడు వానికి

            ఓ అంతా వెలగబెట్టి పోవాలన్న బతుకు ఆశ     ఉండదు.....అటువంటి వానికి ప్రత్యేకంగా   సుఖమంటూ గానీ ,,,,దుఃఖమంటూ గానీ     ఎక్కడుంది....వానికి అంతా ఒక్కటే...

            పొనిగితే బాపమేది -పుణ్యమేది కర్మమందు, వొనర ఫలమొల్లవి - యోగికిని యోగి అంటే ఎవరు.... ''సమత్వం యోగ ఉచ్యతే"  అన్ని కర్మల యందు "సర్వకాల సర్వావస్థల" యందు అన్నింటి పట్ల సమస్తితిలో వున్నవాడు యోగి అనబడతాడు అని గీత అంటోంది. .

ఏ కర్మ చేసినా ఫలమాశించని  వాడు... యోగి అటు వంటి వానికి అంటుకునే పాపమేది పుణ్యమేది.....

          తగినయమృతమేది-తలవగవిషమేది,  తెగినిరాహారియైన-ధీరునికిని

 ఎవరు ధీరుడు....? ధ్యాన ముద్రలోశ్వాస నిశ్వాసలు శూన్యం చేసి  మనస్సు ను శూన్యం చేసి, అన్ననాలుకను,  చిరునాలుకను రెండింటినీ ఏకం చేయగా ఏర్పడే ఐ   ఖేచరీ ముద్రలో ఆత్మామృతం చిరునాలుక నుండి జీర్ణాశయంలోకి కారుతుంది....

ఇది తాగుతున్న  వాడికి విషమేముంది.....ప్రత్యేకమైన అమృతమేముంది....

పగవారనగ వేరే - బంధులనగ వేరే వెగటుప్రపంచమెల్ల - విడిచేవివేకికి

       ఎవరు వివేకి.....?"నిత్యానిత్య విచార వివేకి"        అన్నారు ఆదిశంకరులు..... ఏది శాశ్వతంగా  ఉండేది.....ఏది శాశ్వతంగా లేనిది.....ఆత్మే  శాశ్వతంగా ఉండేది....మిగతాదంతా మార్పు       చెందేదే.... అన్ని తెలిసినవాడు వివేకి....ప్రపంచం

లో వానికి బందువులూ లేరు....అలాగే           శత్రువులూ లేరు.....

వేవేలువిధులందు - వెఱపేది మఱపేది దైవము నమ్మినయట్టి - ధన్యునికిని    ఎవడు ధన్యుడు....?     ఎవడు నిత్యం ధ్యాన స్థితిలో ఉంటాడో      వాడు ధన్యుడు....నిత్యం నేను "ఆత్మను"      అందరూ, సర్వమూ ఆత్మ స్వరూపమే  అని తెలియడమే ధన్యత...వాడే ధన్యుడు.     వానికి ఎన్ని పనులున్నా.... మరుపు గానీ వెఱపు గానీ లేదు గాక, లేదు....

శ్రీవేంకటేశ్వరుడు - చిత్తములో నున్నవాడు యీవలేది యావలేది - యితనిదాసునికి

వేంకటము అంటే రెండింటిని ఏకం చేసినవాడు       వేంకటేశ్వరుడు అంటే ద్వంద్వాతీతుడు...      అలాంటి స్థితిని నిరంతరం చిత్తంలో కొలువై       ఉంటే , అలాంటి వానికి ఇవతల ఆనేదీ లేదు       అవతల ఆనేదీ లేదు....ఇవతల అంటే జననం

అవతల అంటే మరణం...రెండూ లేవు అని అర్థం...

***

 🧘‍♂️దైవము- మతము- రూపాలు🧘‍♀️

                ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దేవుడు ఉంటాడని మా దేవుడు వేరు అనుకుంటారు కొందరు. ఒకే దేవుడు ఒక్కొక్క మతంలో ఒక్కొక్క పేరుతో ధ్యానింపబడుతుంటాడు. మతాలన్నీ వేరు వేరు భాషల వంటివి. అనేక భాషలలోకి అనువదింపబడిన ఒకే గ్రంథము లాంటిది ఈ సృష్టి. దాని తాత్పర్యము దేవుడు. అయినప్పటికీ అనేక రూపాలలో అదే దేవుడు దిగి వస్తూ ఉంటాడు‌.

ఈ సృష్టిలోని జీవరాసుల రూపాలు అన్నీ అవే.  ప్రతిజీవి హృదయంలోనూ దేవుడు "నేను" అనే పేరుతో ఉంటాడు. అతని చుట్టూ జీవుడు కూడా అదే పేరుతో ఉంటాడు. జీవుడి దృష్టిలో అనేక మతాలు ఉన్నాయి. అవి శిక్షణ పొందే విద్యాలయాల వంటివి ఈ విషయం తెలియక కొన్ని మతాల వాళ్ళు తమ మతమే గొప్పది అనీ, తమ దేవుడు మిగిలిన దేవుళ్ళ కన్నా గొప్పవాడు అనీ తెలియ చెప్పడానికి ఆదుర్దా పడుతుంటారు. ఈ ఆదుర్దాలో మిగిలిన మతాల వాళ్ళని తిట్టడం, వీలయి నంత మందికి తమ మతం ఇప్పించడం గురించి ఆదుర్దా పడుతూ ఉంటారు. దేవుడి సృష్టిలో ఇది ఒక చిత్రమైన భాగం.

హిందూమతంలో రాముడు, కృష్ణుడు మొదలైన అవతారాలు, ఆంజనేయస్వామి, వినాయకుడు మొదలైన దేవుళ్ళు ఎంతమందో ఉన్నారనీ, విష్ణువు, శివుడు, అమ్మవారు మొదలైన వివిధ ఆరాధనలు ఉన్నాయని ఇలా ఉండటం ఒక లోపంగా మాట్లాడుతూ ఉంటారు. ఇవి అన్నీ సర్వాంతర్యామి అయిన ఒకే దేవుని యొక్క అనేక రూపాలు. సృష్టించేటప్పుడు అదే దేవుడు తన‌ కుమారుడి రూపంలో సృష్టికర్తగా దిగివస్తాడు. ఆ రూపాన్ని బ్రహ్మ అంటారు. అతడు నాలుగు స్థితులలో దేవుని వాక్కుగా దిగివస్తాడు కనుక చతుర్ముఖ బ్రహ్మ అంటారు. సృష్టిని తనలో లీనం చేసుకునేటప్పుడు పనిచేసే దేవుడికి శివుడు అని పేరు పెట్టారు‌. సృష్టిలో ఉంటూ సృష్టిని తన లక్షణాలతో నింపి రక్షించేటప్పుడు అదే దేవుడికి విష్ణుమూర్తి అని పేరు పెట్టారు‌. తాను తండ్రిగా ఉండి తన శక్తిని తన నుండి వేరుగా సృష్టిస్తాడు ఆ వేరయిన రూపాన్ని శక్తి అనీ, అమ్మ వారు అనీ అంటారు. అలాగే విఘ్నాలను తొలగించుకొనే శక్తిగా జీవులలో పని చేస్తూ ఉన్నప్పుడు విఘ్నేశ్వరుడు లేక వినాయకుడు అంటారు‌.

కనుక దేవుడు ఒకడే, ఇన్ని రూపాలలో ఆరాధింపబడుతూ ఉంటాడు.

***


సృష్టిలో  అనేక రూపములు ఏర్పరచి, వాటి యందు తానే వసించి దైవము  ఉంటాడు. ఈ ఒకేఒక తత్త్వమును వాసుదేవ తత్త్వము అంటారు. శరీరము అనే పురముల నేర్పరచి దాని యందతడే ఉంటాడు. అతడు వసించి ఉండగా, మనమున్నామని మనము అనుకుంటూ ఉంటే, అనుకోనిస్తున్నాడు. అతడే ఉన్నాడని సమస్త రూపముల యందు గుర్తు ఉంచుకోవడమన్నది భక్తి మార్గము.

అనుభవించే ఆనందంలో లౌకికత ఎంత లోపిస్తే, మనం అంత ఆధ్యాత్మ పరులం. ప్రాపంచిక సుఖాల కోసం ప్రాకులాడటం మానేద్దాం.

బలాన్ని స్మరించడమే బలహీనతల నుండి బయటపడే మార్గం, కానీ బలహీనులమని బాధపడడం కాదు.

మనసును నిర్మలంగా ఉంచుకోవడమే నిత్యధ్యానం. కోరికలేని మనసు తురీయావస్థలోనే ఉంటుంది. పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ రెండూ అవసరంలేదు. ప్రోపర్ థింకింగ్ ఉంటే చాలు. దేనికి ఎంత ఆలోచించాలో, ఎలా ఆలోచించాలో, ఏపని ఎలాచేయాలో అలా చేయడంలో మనసు సహజధ్యానంలోనే కొనసాగుతుంది. సత్ఫలం కోరికలో ఉండదు, సరిగాచేసే కార్యంలో ఉంటుంది. సత్కార్యంలో ఎప్పుడూ సత్ఫలమే ఉంటుంది. భక్తి అంటే దేవుని కొండను నడిచి ఎక్కడం మాత్రమే కాదు. దేవుడు చెప్పిన మార్గంలో కూడా నడవగలగటం భక్తికి సంపూర్ణతనిస్తుంది. అదే సంపూర్ణ ఫలాలను ఇస్తుంది. అదిలేని అసంపూర్ణభక్తి అసంపూర్ణ, అశాశ్వతమైన ఫలాలనే ఇస్తుంది !

అతడినే సమస్త రూపముల యందు, వారి ప్రవర్తన యందు దర్శనము చేస్తూ ఉండడము తప్ప, ఎందుకు వీళ్ళు ఈ విధముగా ప్రవర్తిస్తున్నారు అనే ప్రశ్న జోలి కి పోవద్దు అని నారదమహర్షి  చెపుతాడు.

****

*భాగవతం *బోధలు

మనిషికి మనసు ఉన్నది కాబట్టి మనుషులను, జంతువులను, చెట్లను, లోహములను, ఖనిజములను చూసినా భావములు వస్తూ ఉంటాయి. మనసెపుడూ భావముల పుట్టగా ఉంటూ ఉంటుంది. 

అది సద్భావన కావచ్చు. విరుద్ధమైన భావము కావచ్చు. ఇక్కడ సనత్కుమార మహర్షి ఏం చెపుతున్నారంటే నీకు కనబడుతున్న వస్తువు, దాని లోనుంచి అప్రయత్నముగా పుట్టుకొచ్చిన భావాలు ఈ మొత్తాన్ని అంతర్యామిగా చూడగలమేమో ప్రయత్నం చేయమంటున్నాడు. భావపరంపరలో కొట్టుకు పోతున్న మనస్సుకు పెద్ద ఉపకారం జరుగుతుంది.

దుఃఖస్థితిని ఎవరూ కోరుకోరు. అందరికీ సంతోషమే కావాలని ఉంటుంది. కానీ ఆ సంతోషస్థితి కన్నా ఏ వ్యాపకం లేని నిద్రస్థితిని మనం ఇంకా ఎక్కువగా ఇష్టపడతాం. అమితంగా ప్రేమిస్తాం. అందుకు కారణం అది మన సహజస్థితికి సంకేతం కావటమే. ఆ స్థితిని పొందేందుకు ఎన్నో ఆధ్యాత్మిక మార్గాలు, విధానాలతో పాటు లౌకికమైన ప్రక్రియలు కూడా అవలంబిస్తున్నాం. మంత్రం, ధ్యానం, పూజ వంటి ఆధ్యాత్మిక విధానాల్లోనే కాదు, ఇష్టమైన వ్యాపకాల్లో కూడా మనసు సుఖదుఃఖాలు లేని స్థితిని పొందుతుంది. కనుకనే ఎవరి ఇష్టం కొద్దీ వారు ఆయా మార్గాలను ఎంచుకుంటారు. ప్రతి అంశంలోనూ ఏం జరుగుతుందంటే మనసు తనకిష్టమైన విషయాన్ని పట్టుకొని సుఖదుఃఖాలను కలిగించే పూర్వ వ్యాపకాలను వదిలేస్తుంది. 'నేనెవరు ?' అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు కూడా జరిగేది అదే. 'నేనెవరు ?' అన్న ప్రశ్న వల్ల మనసుకు అప్పటి వరకు ఉన్న గుణాలు పోతాయి. దానివల్ల గుణాలు లేని శుద్ధమనసు అనుభవంలోకి రావటం వల్ల ధ్యానం అంటే ఏమిటో అనుభవం అవుతుంది !

***

రూపనామాల

నరనారాయణులనగా జీవుడు, దేవుడు. నరుడంటే నశించని వాడు. నారాయణుడంటే నశించని వాళ్ళందరికీ మూలము అయినటువంటి వాడు. అతని నుంచి అందరూ దిగి వచ్చి, అతని లోకే అందరూ వెడుతూ ఉంటారు. తన యందు, తన ప్రవర్తనము నందు అప్రమత్తుడైనటువంటి వాడు నరుడు. వీరిద్దరు ప్రపంచములో ఎలా ప్రవర్తించాలో నిర్వర్తించి చూపించారు.

"రూపనామాలతో పనిలేకుండా జీవనం కొనసాగించడం సాధ్యమయ్యేపనే !?"

అనంతమైన ఈ సృష్టిలో మనకు ఏది గుర్తుకు రావాలన్నా ఏదోక రూపనామాలతో గుర్తుకు రావలసిందే. అలా రూపనామాలు లేకుండా మనం దేన్నీ స్ఫురణకు తెచ్చుకోలేం. చివరికి మనని మనం స్ఫురణకు తెచ్చుకోవాలన్నా రూపనామాలతోనే సాధ్యమవుతుంది. రూపనామాలంటే మన మనోదేహాలే ! దేహంగా కనిపించే రూపంతోనూ, మనసులో దాన్ని స్ఫురణకు తెచ్చే నామంతోనూ తాదాత్మ్యత చెందటం ద్వారానే ఈ జీవనం సాగుతోంది. మన మనోదేహాలమధ్య ఏర్పడుతున్న బేధ భావమే ఈ తాదాత్మ్యతకు కారణం. గాఢనిద్రలో మనకి ఏ రూపనామాలు ఉండటంలేదు. మెలకువరాగానే రూపనామాలతోనే లేస్తున్నాం. గాఢనిద్రలో మనసు దేహంతో ఏకమైపోతోంది. అందుకే రూపభావన గానీ, నామంతో అవసరం గానీ రావడంలేదు. అప్పుడు ఏ బాధలు తెలియట్లేదు. మెలకువ రావడంతోనే మనోదేహాలు భిన్నమై పోతున్నాయి. అప్పుడు దేహంతోపాటు దానితో ఉన్న కష్టసుఖాలు తెలుస్తున్నాయి !

శ్రీరాముడిని మించిన నరుడు లేడు. సంపూర్ణముగా నరుడిగా దిగివచ్చి, నరత్వమంటే ఏమిటో చూపించాడు. మానవునికి నరుడి దగ్గరనుంచి నేర్చుకోవలసిన కళ్యాణ గుణములు ఉన్నాయి. నారాయణుడు చేసేటటువంటి కార్యములన్నీ అతి మానుషీ కార్యములుగా ఉంటాయి. అదే శ్రీకృష్ణుని జీవితములో గోచరిస్తూ ఉంటుంది. అందుకనే శ్రీకృష్ణుడు చెప్పినట్టు చేయమంటారు. రాముడు నడిచినట్లు నడవమని చెపుతారు.

రూపనామాలతో తాదాత్మ్యత తగ్గటమే సాధన  [మనోదేహాల కలయికే యోగం]!''- 
***

*సతీ కృతిర్జగద్రక్షా లక్షణాఽస్య యతస్తతః ।*

*సత్కృతిః ప్రోచ్యతే విష్ణుర్వేదికైస్తత్వదర్శిభిః ॥*


*పరమాత్ముడు జగద్రక్షణము అను మిగుల ఉత్కృష్టమైన కృతిని ఆచరించుచుండువాడు కనుక 'సత్కృతిః' - 'గొప్పపని కలవాడు.'*


సద్గతిస్సత్కృతిస్సత్తా సద్భూతిస్సత్పరాయణః ।శూరసేనో యదుశ్రేష్ఠస్సన్నివాసస్సుయామునః

*** 

🌴. స్వర్గం, నరకం ఉన్నాయా? 🌴

A:-- మనం వెలుగునుండి దూరంగా వెళ్ళినప్పుడు మన స్పందనలతో ఒక వ్యతిరేక ప్రదేశం ఏర్పడింది. 

మన స్పందనలను బట్టి మనం 7 ఆవరణలను సృష్టించుకున్నాము.

తక్కువ స్పందనలు అనగా చెడు ఆలోచనలు, చెడు మాటలు, ద్వారా తక్కువ frequency ఉన్న లోకాలు ఏర్పడ్డాయి. వీటిని నరకం లేదా నిమ్న ఆవరణ అంటారు.

ఎక్కువ స్పందనలతో ఎక్కువ frequency ఉన్న ఉన్నత లోకాలు ఏర్పడ్డాయి. ఆ విధంగా 7 ఆవరణలు మనమే సృష్టించుకున్నాము.

ఒక ఆధ్యాత్మిక జ్ఞానం లేని వ్యక్తి నిమ్న ఆవరణ లేదా నరకానికి వెళ్తాడు. ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న వ్యక్తి ఉన్నత ఆవరణకు చేరతాడు.

1 నుండి 3 ఆవరణలు నిమ్న ఆవరణగా పరిగణించబడింది. 4 నుండి 7 దాకా ఉన్నత ఆవరణలుగా పరిగణించబడింది.

ఈ విధంగా 7 ఆవరణలు, 7 విశ్వాలు సృష్టించబడ్డాయి. ప్రతి ఆత్మ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకుని ఒక్కో విశ్వానికి పయనమవుతుంది.

*యోగమనగా వ్యక్తిగత చైతన్యము, దివ్య చైతన్యముతో అనుసంధానము చెందుట. అనుసంధానము చెందుటకు సప్త *'అ'* వర్గములు అవరోధములై ఉన్నవి.*


*1.అహము*

*2. అనుమానం*

*3. అసూయ*

*4. అధర్మము*

*5. ఆవేశము*

*6. ఆత్రము*

*7. ఆడంబరము.*


*పై ఏడును మిమ్ములను ఏడిపించును. ఇవి మీరు వదలరు. కావున అవి మిమ్ములను వదలవు. ఈ ఏడును ఏరిపార వేసినచో అనుసంధానమునకు అవరోధమే లేదు.*

                             

    *ఆచార్య సద్భోదన*





పరిశుద్ధ జీవనము, మర్మములేని మనస్సు, నిర్మల  హృదయము, జిజ్ఞాసువగు చిత్తము, మాటుపడని అతీంద్రియ గ్రహణము, సహాధ్యాయి యెడల సోదర భావము, సలహాలను, నియమములను స్వీకరించుటకును, ఇచ్చుటకును సంసిద్ధత కలిగియుండుట,

దేశికుని యెడల విశ్వాసనీయమైన ధర్మానుష్టాన బుద్ధి, సత్యసూత్రములను అంగీకరించి విధేయుడగుట, వ్యక్తిగతముగా తనకు జరిగిన అన్యాయమును ధీరతతో సహించుట,


తన సిద్ధాంతములను నిర్భీతిగా నుద్ఘాటించుట, అన్యాయమునకు గురిచేయబడిన వారిని తెగువతో కాపాడుట, గుప్తవిద్య సూచించు ఆదర్శములగు మానవ పురోభివృద్ధి,



పరిపూర్ణతల యెడ నిరంతరము, జాగరూకత కలిగి యుండుట  అనునవి దివ్యజ్ఞానమను ఆలయమునకు సాధకుడు ఆరోహణ చేయుటకు వలసిన  సువర్ణ సోపానములు .......

*పవిత్ర జీవనం గడపటం ద్వారా మాత్రమే శాశ్వతమైన దాన్ని పొందగలం.*

*కొందరు మాట్లాడినప్పుడు ఆ మాట సచేతన స్పందనలతో ప్రతిధ్వనిస్తుంది. నూతన జీవితాన్ని ఆరంభించేలా చేస్తుంది. అదే మాట వేరొకరు మాట్లాడితే ఉపయోగం లేకపోవచ్చు.*

*మహాత్ముడు అంటే అర్థం ఏమిటి? అంతఃశుద్ధిని కలిగి ఉన్నవారు. వారిలోని ప్రకాశాన్ని చూడకుండా ఉండలేము. వారు ఏం చేసినా అది పవిత్రీకరించబడుతుంది.*

*అసలు భగవంతుని గురించిన వివేకం, ప్రజ్ఞ కలిగి ఉండటమే పవిత్రతలోని ముఖ్య లక్షణాలు. ఒక మనిషి జీవిత సత్యాలను అనుభూతి చెందినపుడు అతడు మృదువుగా, శీఘ్రగ్రాహిగా మారుతాడు.*

*ఆ గాఢానుభూతి ద్వారా దైవప్రేమిగా, సకల మానవాళిని ప్రేమించగలవాడిగా మారతాడు. ఇది జ్ఞానం ద్వారా మాత్రమే వస్తుంది.*

*ఆ జ్ఞానం సరియైన జీవనం  ద్వారానే వస్తుంది.*


🌹 🌹 🌹 🌹 🌹


ప్రాంజలి ప్రభ అంతార్జాల పత్రిక -  ఏకాగ్రత (12 )
  రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ                  

భూమి మీదపడ్డ ప్రతి ప్రాణి, ఏదో విధముగా బతకగలదు. కానీ ఈ విధంగానే బతకాలని ఆలోచనలే మనిషిని బతక నివ్వదు. కోరికల పుట్టతో దారులే అగమ్య గోచరం 
.      
 పక్షి రెక్కలతో గుడ్డును పొదిగి రక్షించినట్లు ఈశ్వరుడు రక్షిస్తాడు. అయితే, మనం హృదయ పూర్వకంగా నమ్మాలి.

ఈశ్వరుడు శరీరాదుల యందు అంతర్యామియై యుండి కూడ దాని ప్రకృతి లక్షణములతో అంటు పడడు. 

నగలలో నున్న బంగారము ఆభరణము యొక్క ఆకారము , పేరు మొదలగు వానిని అంటించుకొనదు. అందుండియు బంగారముగనే యుండును, మట్టి బొమ్మలతో ఉండేది మట్టే, అట్లాగే వస్త్రాలలో ఉండేది దూదే.    . 

అట్లే భగవంతుడు జీవులలో జీవుడై విహరించుచుండియు జీవిత్వమంటించు కొనక , దేవుడుగనే యుండును.

గురువు రూపాన గాని, తల్లితండ్రుల రూపాన గాని, స్త్రీ/ భార్య రూపానగాని ప్రతిఒక్కరింట   
కొంత విద్యా సంపద వెలుగు కమ్మివుంటుంది అదే శివదృష్టి. 
 .  
      గురువు (ఉద్యోగం) వెతుక్కుంటూ మన వద్దకు వస్తుంది  కాకుంటే ఎలాగో తన వద్దకు రప్పించుకుంటాడు. ఆ గురువు మనల్ని ఎప్పుడూ ఒక కంట కనిపెట్టే ఉంటాడు. ఈశ్వరుడు, గురువును మనకు చూపుతాడు.

      తన బిడ్డ క్షేమం తండ్రి కంటే విచారించేవారు ఎవరు? ఆయన ( ఈశ్వరుడు , గురువు ) సదా మన చుట్టూ ఆవరించే ఉన్నాడు.

ఈశ్వరతత్వాన్ని అర్ధం చేసుకోవటం ఎవరివల్లాకాదు, ఒక్క ఆ అమ్మవారికి తప్పా, అలాగే  ఏకాగ్రత గలవాని వాక్కు ఏ పరిస్థితిలో తప్పని సత్యం ఇది కూడా ఈశ్వర సంకల్పమే    

--(())--


*అభిమానం* “రెండు కిలోల గోధుమ పిండి, అరకిలో రాగి పిండి ప్యాక్ చేయండి...” అని కిరాణా షాప్ లో బిల్ కట్టబోతుంటే... ‘‘అన్నా కిలో బియ్యం ఎంత...?’’ అని అడుగుతోంది ముక్కుకు చెంగు చుట్టుకున్న ఒక చెల్లి. ఇరవై ఏళ్ళు ఉండచ్చు... కాళ్లకు చెప్పులు కూడా లేవు, చేతిలో చిన్న సంచి... ‘‘నువ్వు కొనలేవులే వెళ్ళవమ్మ...’’ అని విసుక్కున్నాడు షాపతను. “ఎక్కడుంటావమ్మా...?” అని అడిగాను. “యూసఫ్ గూడ బస్తీలో అన్నా... పనిపోయింది... పైసలు లేవు... ఇరవై రూపాయలే ఉన్నాయి... రెండు రోజుల నుండి బన్ను తింటున్నాం...” అన్నది. (ఇంకా వివరాలు అడగాలనిపించ లేదు) “నీకేం కావాలో తీసుకోమ్మా..!” అని షాపతని వైపు తిరిగి “ఆమె బిల్లు కూడా నా దాంట్లో కలిపేయి...” అన్నాను. ‘‘కిలో బియ్యం, కొంచెం కందిపప్పు చాలన్నా..!” అంది ఆమె అమాయకంగా... ఉచితంగా తీసుకోవడానికి ఆమెకు ఆత్మాభిమానం అడ్డువస్తున్నట్టు అనిపించింది. ‘‘నెలకు సరిపడా సరుకులు తీసుకొని వెళ్లమ్మా... ఇపుడు నేను పైసలు ఇస్తా.., నీకు పని దొరికినపుడు, నాకు తిరిగి ఇయ్యి... ఈ షాపతనికి నా వివరాలు తెలుసు.’’ అని ఆమెకు కావాల్సినవి ప్యాక్ చేయించి ఆటో ఎక్కించి పంపాను. ‘‘అమె మళ్ళీ మీ డబ్బులు ఇస్తుందంటారా సార్...?’’ అనుమానంగా అన్నాడు షాపతను. ‘‘అమె ఇస్తుందా, లేదా వేరే సంగతి”, మనం ఉచితంగా సాయం చేసినట్టు అమె ఫీల్ కాకూడదు. “కష్ట జీవులకు ఆత్మాభిమానం ఎక్కువ. దానిని గౌరవించాలి” అని, మొత్తం బిల్ కట్టేశాను. బిల్ తీసుకున్న షాపతను, రెండువందలు తిరిగి ఇచ్చాడు... నా ముఖంలో ప్రశ్నను చూసాడేమో... “మీరు అంత చేసినపుడు, నేను కూడా కొంత చేయాలి కదా సార్..! వ్యాపారంలో పడిపోయి, ఏదో మిస్ అవుతున్నట్టుంది సార్.!! ఇపుడు మనసుకు ఎంతో హాయిగా ఉంది.!!!” అంటున్న అతని ముఖంలో తృప్తి స్పష్టంగా కనిపించింది. 😇😇😇😇😇😇😇😇😇

“ఎవర్నో మార్చాలి” అనుకునే బదులు.., ఆ మార్పు మననుండే మొదలైతే సరిపోతుంది. అయితే... సహాయం చేసే గుణం మనకున్నా.., అందుకునే అర్హత ఎదుటి వారికీ ఉండాలి. అంటే... అది “అపాత్రదానం” కాకుండా... నీ దగ్గర ఉన్నది ఎంతో కొంత... నిజంగా ఇబ్బందిలో ఉన్నవారికి సాయం చేస్తే చాలు మిత్రమా. *మీరు సాక్షాత్తూ మీరు ఆరాధించే దైవమే.* (యాచన వృత్తిగా చేసుకునే వారికి కాకుండా) నిజంగా కష్టాల్లో ఉన్నవారిని గుర్తించి మీకు తోచిన సహాయం చెయ్యడం మంచిది. ఇలాంటి వాళ్ళు మన మధ్యలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు నోరు తెరచి అడగరు... వాళ్లకు "అభిమానం" ఎక్కువ అలాంటి వారిని గమనించినప్పుడు మనమే ఒక అడుగు ముందుకు వేసి సహాయం చేయాలి. *🙏సర్వే జనాః సుఖినోభవంతు🙏🏽*
****
నవ్వుల గుళికలు *వాన పడి వెలిశాక ఇంటికి తిరుగు పయనమయ్యారు కాన్వెంట్ టీచర్ యువతులు మీనాక్షి,కామాక్షి. దారిలో జిలేబి ల బండి దగ్గర ఆగి " అన్నా, ఒక పొట్లం జిలేబి కట్టు " అంది కామాక్షి. " రోజూ నీకేనా? మీ ఆయనకి కూడా ఒక పొట్లం తీసుకో వే నాలాగా" అంది మీనాక్షి. " అబ్బా అవసరం లేదు లేవే, ఆయన జిలేబి తినకపోయినా ఈ జిలేబి రుచి చూస్తాడు లే " అంది గడుసు కామాక్షి " ఎలానే, చెప్పు చెప్పు " అంది మీనాక్షి అమాయకంగా కామాక్షి అటు ఇటు చూసి మీనాక్షి చెవిలో చెప్పింది అది విన్న మీనాక్షి బుగ్గలు సిగ్గుతో కెంపులయ్యాయి. " అన్నా, నాక్కూడా ఒక పొట్లం చాలు, రెండు వద్దు" అంది మీనాక్షి. ఇద్దరు ఇంటి దారి పట్టారు మర్మం ఏమై ఉంటుంది? .....


 గ్లాసుడు నీళ్ళు (అనుశ్రుత గాథ)

 ఒక సన్న్యాసి అదృష్ట వశాత్తూ భగవంతుడిని కలుసుకున్నాడు. భగవంతుడి చిరునవ్వు నవ్వి నీకేం కావాలి నాయనా అని అడిగాడు.

 ఆ సన్న్యాసి నాకు సత్యాన్ని తెలుసుకోవాలని వుంది.సత్యాన్ని బోధించండి అన్నాడు. దానికి భగవంతుడు చూడు బాబూ!యిప్పుడు చాలా వేడిగా వుంది కదా ఒక గ్లాసుడు నీళ్ళు తెచ్చిపెట్టు.నీరు త్రాగి నీకు బోధిస్తాను అన్నాడు.

 అక్కడికి దగ్గరగా గ్రామం కానీ,ఇళ్ళు కానీ లేవు. చాలా దూరం నడిచి వెళ్లి ఒక యిల్లు కనబడితే వెళ్లి తలుపు తట్టాడు.లోపలినుండి ఒక అందమైన కన్య వచ్చింది.

 సన్నటి నడుము, కలువరేకుల్లాంటి కళ్ళు , చంద్రబింబం లాంటి ముఖం. అతను అంత అందమైన అమ్మాయిని అతను యింతవరకూ చూడలేదు.

 అతని వైపు చూసి అందంగా చిరునవ్వు నవ్వింది. అలా నవ్వుతూ వుంటే యింకా అందంగా కనిపించింది. అంతే తాను వచ్చిన పని మర్చిపోయి నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. ఆ కన్య అంగీకారంగా తల వూచింది.

వారిద్దరూ వివాహం చేసుకున్నారు.రోజులు గడిచిపోతున్నాయి చాలా మంది పిల్లలు కలిగారు.ఎంతకాలం గడిచి పోయిందో వాళ్లకి తెలియనేలేదు.

 ఇలా వుండగా ఒకరోజు పెద్ద గాలీ వాన ఒకటే ధార.ఊరూ వాడ ఏకమై పోయాయి. చెట్లు పడిపోయాయి, ఇళ్ళు కూలిపోయాయి. భార్యా పిల్లలతో అతడు ప్రవాహములో నడుచుకుంటూ పోతున్నాడు.

 ప్రవాహం వేగంగా వుంది. ఎక్కడా గట్టు దొరకడం లేదు.అప్పుడు భగవంతుడు జ్ఞాపకం వచ్చాడు. 'భగవంతుడా రక్షించు' అని మొర పెట్టుకున్నాడు. భగవంతుడు అతడి మొర విని నేను అడిగిన గ్లాసుడు నీళ్లేవీ? అని అడిగాడు.

 ప్రతిమానవుడు సత్యాన్వేషణ రేపో ఎల్లుండో చేద్దామని కాలం లో చిక్కుకుంటాడు. కాలం లో చిక్కుకొనినివసించడం అలవాటయి పోయింది. కాలం రెండు విధాలు

1.గడియారం సూచించే కాలమానం

 2.మనస్సు కల్పించే మానసిక కాలం.

 నిన్న,ఈ రోజు,రేపు అనేవి మనస్సు నిర్మించిన. నిన్న జరిగిన సంఘటనలు యిప్పుడు లేవు. "నిన్న''గతించినట్లే అవి గతించాయి. కానీ ఆ సంఘటనలు జ్ఞాపకం చేసుకొని యిప్పుడు జరుగుతున్నట్టే భావించి ప్రవర్తించే వాళ్ళు చాలామంది వున్నారు. రేపు యింకా రాలేదు కానీ ఈ రోజున జరిగిన సంఘటనలు రేపు కూడా

జరుగుతాయేమోనని ఊహించుకొని భయపడే వాళ్ళూ చాలా మందే వున్నారు.

 #నీతి : నిజానికి నిన్నా లేదు, రేపూ లేదు, వర్తమానమే ఎప్పుడూ వుండేది. మానసిక కాలమే మిథ్య. ఆ సన్న్యాసి నాకు సత్యాన్ని తెలుసుకోవాలని వుంది.సత్యాన్ని బోధించండి అన్నాడు. దానికి భగవంతుడు చూడు బాబూ!యిప్పుడు చాలా వేడిగా వుంది కదా ఒక గ్లాసుడు నీళ్ళు తెచ్చిపెట్టు.నీరు త్రాగి నీకు బోధిస్తాను అన్నాడు.

 అక్కడికి దగ్గరగా గ్రామం కానీ,ఇళ్ళు కానీ లేవు. చాలా దూరం నడిచి వెళ్లి ఒక యిల్లు కనబడితే వెళ్లి తలుపు తట్టాడు.లోపలినుండి ఒక అందమైన కన్య వచ్చింది.

సన్నటి నడుము, కలువరేకుల్లాంటి కళ్ళు , చంద్రబింబం లాంటి ముఖం. అతను అంత అందమైన అమ్మాయిని అతను యింతవరకూ చూడలేదు.

అతని వైపు చూసి అందంగా చిరునవ్వు నవ్వింది. అలా నవ్వుతూ వుంటే యింకా అందంగా కనిపించింది. అంతే తాను వచ్చిన పని మర్చిపోయి నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. ఆ కన్య అంగీకారంగా తల వూచింది.

 వారిద్దరూ వివాహం చేసుకున్నారు.రోజులు గడిచిపోతున్నాయి చాలా మంది పిల్లలు కలిగారు.ఎంతకాలం గడిచి పోయిందో వాళ్లకి తెలియనేలేదు.

ఇలా వుండగా ఒకరోజు పెద్ద గాలీ వాన ఒకటే ధార.ఊరూ వాడ ఏకమై పోయాయి. చెట్లు పడిపోయాయి, ఇళ్ళు కూలిపోయాయి. భార్యా పిల్లలతో అతడు ప్రవాహములో నడుచుకుంటూ పోతున్నాడు.

ప్రవాహం వేగంగా వుంది. ఎక్కడా గట్టు దొరకడం లేదు.అప్పుడు భగవంతుడు జ్ఞాపకం వచ్చాడు. 'భగవంతుడా రక్షించు' అని మొర పెట్టుకున్నాడు. భగవంతుడు అతడి మొర విని నేను అడిగిన గ్లాసుడు నీళ్లేవీ? అని అడిగాడు.

 ప్రతిమానవుడు సత్యాన్వేషణ రేపో ఎల్లుండో చేద్దామని కాలం లో చిక్కుకుంటాడు. కాలం లో చిక్కుకొనినివసించడం అలవాటయి పోయింది. కాలం రెండు విధాలు

1.గడియారం సూచించే కాలమానం

 2.మనస్సు కల్పించే మానసిక కాలం.

 నిన్న,ఈ రోజు,రేపు అనేవి మనస్సు నిర్మించిన. నిన్న జరిగిన సంఘటనలు యిప్పుడు లేవు. "నిన్న''గతించినట్లే అవి గతించాయి. కానీ ఆ సంఘటనలు జ్ఞాపకం చేసుకొని యిప్పుడు జరుగుతున్నట్టే భావించి ప్రవర్తించే వాళ్ళు చాలామంది వున్నారు. రేపు యింకా రాలేదు కానీ ఈ రోజున జరిగిన సంఘటనలు రేపు కూడా

జరుగుతాయేమోనని ఊహించుకొని భయపడే వాళ్ళూ చాలా మందే వున్నారు.

 #నీతి :  నిజానికి నిన్నా లేదు, రేపూ లేదు, వర్తమానమే ఎప్పుడూ వుండేది. మానసిక కాలమే మిథ్య.

.......

శ్రీ వారి ముచ్చట్లు కధ - 1

రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ


ఏమండి గుడ్డు తిన్న పాములా ఆ నిద్ర ఏమిటి, ప్రక్కన ఎవరున్నారు, అని ఒక్క సారి చూసేది లేదు, వంటి మీద గుడ్డ ఉందా లేదా అని గమనించేది లేదు.

ఏమిటే మాట్లాడు తున్నావు, ఈరోజు ఏమిటో తెలుసా

ఈరోజేమి పండగ కాదు, ఆదివారము

అవునే ఆదివారమంటే ఏమిటి, సెలవు దినము కదా

అవును మరి నన్ను ఉట్టి పుణ్యాన నోరు చేసుకున్నావు, అది నీకు అవసరమా, "బారెడు పొద్దు ఎక్కేదాకా పడుకోవచ్చు అని పెద్దలు చెప్పారు కదా.

మానాన్నగారు చెప్పిన విషయం చెపుతున్నాను, ప్రతి రోజు చేయాల్సిన విధి, దీనికి సెలవు అనేది ఉండదు అది గమనించండి అన్నది. 

అదేమిటో చెప్పఁవే నాకు నిద్ర మత్తు వదిలింది నీమాటలకే

బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి. అంటే సూర్యోదయానికి గంటన్నర ముందు మేల్కోవాలి. సూర్యోదయానికి ఎంత ముందు మేల్కొంటే అంత ఉత్తమం. స్నానం చేసిన తర్వాత శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. ఆర్ఘ్యం ఇచ్చేటప్పుడు సూర్యకిరణాలు తీవ్రంగా ఉండకూడదు. లేలేత భానుడి కిరణాల వల్ల ఆధ్యాత్మికతతోపాటు ఆరోగ్యపరమైన ప్రయోజనాలు చేకూరతాయి.

భక్తితో సూర్య భగవానుడికి నీరు సమర్పిస్తే మనసులోని కోరికలన్నీ నేరవేరతాయి. పరిశుద్ధమైన ఆత్మ, స్వచ్ఛమైన మనసుతో భగవానుడికి వినయపూర్వకంగా అర్ఘ్యం ఇస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయి.

ఆమ్మో చాలా విషయాలు చెప్పఁవే నాకు, ఇవి నేను ఆచరించాలంటే కొంత కాలము పడుతుంది, ఈరోజు వరకు నన్ను వదిలై, ఇదిగో బోర్డు వ్రాసా దాని ప్రకారముగా ఆచరిస్తా అని చెప్పాడు

ఎం రాసావు అక్కడ

చూడు నీకే తెలుస్తుంది.

రేపు నీవు చెప్పిన విధానంగా ఆచరిస్తాను అని ఉన్నది.

అవు నండి "ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు, బద్ధకస్తుడు రేపుచేస్తాను అనక తప్పదు "

చాలా చక్కగా నన్ను అర్ధం చేసుకున్నావు అని నవ్వు కున్నాడు భర్త.

పెళ్ళాం చెపుతున్న  నిద్రపోతూ భర్త.మత్తుగా ఇట్లా చెపుతున్నాడు.ఆలుమగలు ఎప్పుడు ఒకరినొకరు అర్ధంచేసుకుని జీవితం సాగించాలి పంతానికి పోయి తాడు తేగా దాకా చేయకూడదు, నిద్ర ఎట్లాగూ పోయింది ఇలా కూర్చో చెపుతాను అని భర్త భార్యకు చెప్పటం మొదలు పెట్టాడు.  

ఆలుమగలుయెపుడు, అలవోకగానవ్వి - నవ్వుబువ్వులుయింట రువ్వవలెను

యొకరిమాటనొకరు యెపుడుమన్ననజేసి - బంధుజనులమెప్పు పొందవలెను

తనవారు పరవారు తారతమ్యమువీడి - యాదరమునవారి నాదుకొనవలెను

అమ్మనాన్నలుయైన యత్తమామలుయైన - సాటిపిల్లలతోటి సాక వలెను

పతియు సేవ లోనె సతికిధర్మముగలదు - ధర్మ పధము పతికి ధర్మ సతియె 

క్షీర నీర మనగ కీర్తినొందవలెను - తగిన సంతు పొంది తరము బెంచి

ఆమ్మో చాలా నీతి వాక్యాలు చెప్పారే, పెద్ద కవిలాగా 

జరిగే సంఘటనలు చెప్పాలంటే కవే కావాలా, అనుభవం సరిపోదు, ఇప్పుడు నీవు నాకు సలహా చెప్పలేదు అట్లాగే ఇది కూడా అన్నాడు భర్త. 

మహానుభావా బుద్ధి తక్కువయి నిద్రలేపా " పట్టు పరుపుతో పనిలేదు, నడుము వాల్చటానికి నాపరాయి చాలు"     

ఇక నిద్ర పోండి నాతో పని ఏమిటి.అన్నది. 

ఓ శ్రీమతి ఇటురా "నిద్ర ఎంత సుఖావహమైనదో అంతటి భాగ్యమ్ము కలిగించునే " కొందరు  నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతారు, నిద్ర మాత్రలు కూడా వేసుకుంటారు, ఆ అవసరము లేకుండా నిద్ర పోతున్నా అన్నాడు. 

మగడా చిన్న పిల్లోడిలా జోల పాటలు పాడ మంటావా 

పాటలు పడతావే, ఆ పాడుతా ఉయ్యాల్లో పడుకో చిన్న పిల్లాడిలా 

" జోఅచ్చుతానంద జో జో ముకుందా ...  లాలి పరమానంద రామ గోవిందా .... " 

ఎంత చక్కగా పాడుతున్నావే

ఇంకొక పాట పాడు నిద్రవస్తుందేమో 

రామాలాలి, మేఘశ్యామలాలీ అంటూ పాట పాడు తున్నది భార్య  నవ్వుతూ 

అపుడే గురక పెడుతూ నిద్ర పోయాడు భర్త 

సూర్యుడు నడి నెత్తి మీదకు వచ్చే దాకా మంచం దిగని శాల్తీని పట్టుకొని "నిద్రాదేవత నిన్ వరించే గదరా నిర్భాగ్య దామోదరా అని హేళన చేస్తారు చూసిన వారు అను కున్నది భార్య ఏమీ చేయలేక.

చేప కళ్ళు తెరుచుకొని నిద్ర పోతుంది, ఎలుగుబంటు ఒకకంటితో నిద్రపోతుంది, మరో కంటితో జాగారం చేస్తుంది. మానవులు రెండు కన్నులు మూసుకొని కపట నిద్ర పోతారు. అటువంటి వారి ముందు ఏదన్న మాట్లాడాలన్నా కష్టమే. 

అప్పుడే భర్త నిద్రలో కలవరిస్తున్నాడు " కంటికి నిద్రవచ్చునే - సుఖంబగుఁ రతికేళివల్ల, కంటికి నిద్రవచ్చునే - శ్రమించుట వల్ల - కంటికి నిద్ర వచ్చునే రేపటి గురించి ఆలోచన లేక పోవుటవళ్ళ " 

"అనారోగ్యం, అసూయ, కామం, భయం ఉన్న చోట నిద్ర అసలు రమ్మన్నా రాదే " అది తెలుసుకో - నిద్ర పోయేవాడిని మాత్రం లేపి సుందర స్వప్నాలను భగ్నం చేయకు అన్నాడు నిద్రలో . 

మహాను భావా నీ ఇష్టం వచ్చినంత సేపు కుంభకర్ణునిలా నిద్రపో, నిద్రను ఆపే నీకు అన్నా లేడు, ఏ యుద్ధము లేదు హాయిగా పడుకో 

నేను కాఫీ త్రాగుతున్న నీ ఇష్టం అంటూ లోపలకు వెళ్ళింది భార్య 

ఏమిటోనే కాఫీపొగల్లా మిట మిట లాడుతున్నది నీ మొఖం,

అన్న మాటలు విన్నది 

ముందు మొఖం కడుక్కొని రండి అని ఒక్క తోపు తోసింది. 

కాఫీ త్రాగి మొఖం కడుకుంటానులే 

అట్లాకుదరదు ముందు మొఖం కడుక్కోండి అన్నది 

ఆ తర్వాత ఏమి ఇస్తావ్ "ముద్దులాంటి కాఫీ ఇస్తా "  

ఆ ....    ఆ ......   అట్లాగే ....  ఆ ...   ఆ    అట్లాగే      

--(())--


02. గుణాతీతుని కధ 

గుణాతీతమైన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? గుణాతీతుడు ఎటువంటి లక్షణాలను కలిగి వుంటాడు? ఆ స్థాయిని చేరుకోవాలంటే ఎలాంటి మానసిక స్థితి, ఆచార వ్యవహారాలు కావాలి? వంటి ప్రశ్నలకు సమాధానాలు లభించాలంటే.. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఇచ్చిన అద్భుతమైన విశ్లేషణ ద్వారా తెలుసుకోవచ్చు.

సాత్త్వికమైన బుద్ధి కలిగి, సరైన జ్ఞానాన్ని సంపాదించి, ఆత్మస్థైరాన్ని పెంపొందించుకుని సాత్త్వికమైన తపస్సు ద్వారా, యజ్ఞం, దానాల ద్వారా గుణాతీత లక్షణం సాధించవచ్చునని కన్నయ్య గీతలో వివరిస్తాడు.

సత్వగుణము కార్యరూపమైన సత్ఫలితములు సాధించగల ఉజ్వల ప్రకాశాన్ని కలిగిస్తుంది. రజోగుణం కార్యరూపమైన ప్రవృత్తిని మాత్రమే చూపుతుంది. తమోగుణం కార్యరూపమైన మోహమును కలిగిస్తుంది. ఈ మానసికమైన అవస్థలు తమంతట తామే ఏర్పడినప్పుడు గుణాతీతుడు ద్వేషింపడు. వానిని గురించి విచారపడడు. అవి వాటికై అవి తొలగినప్పుడు వాటికై ఆకాంక్షింపడు. అతడు ఎల్లప్పుడు అతీతమైన ఒకే స్థితిలో స్థిరంగా ఉంటాడు.

గుణాతీతుడు అని పిలువబడేవాడు మానావమానాలను సమానంగా భావిస్తాడు. మిత్రులయందు మమకారముగానీ, శత్రువులయందు వికారము గానీ కలిగి ఉండడు. ఇద్దరియందూ సమభావాన్ని ప్రదర్శిస్తాడు. తను చేయాల్సిన కర్మలన్నింటినీ విద్యుక్తధర్మంగా భావించి త్రికరణశుద్ధిగా నిర్వహిస్తాడు. అయినప్పటికీ ఆయా కర్మల కర్తృత్వంపై అభిమానము లేక ఫలాలను భగవదార్పణం చేసేవాడు గుణాతీతుడు అనబడతాడు.
--(())--



*స్త్రీ శబ్దానికి అర్థం ఏమిటని ఎప్పుడైనా ఆలోచించారా??*
 
*స + త+ ర + ఈ = స్త్రీ...*

*స అక్షరం సత్వ గుణాన్ని,..*. 

*త అక్షరం తమో గుణాన్ని,...*

*ర అక్షరం రజో గుణాన్ని, సంకేతిస్తాయి...* 

*ఇక "ఈ" అక్షరం  శక్తి బీజం...* 
*పై త్రిగుణాల శక్తి రూపమే మహిళ...* 

*సత్వ గుణం సృష్టి కార్యానికి,* 

*తమో గుణం లయ కారకమునకు,*

*రజో గుణం స్థితి కారకత్వమునకు సంకేతాలు..* 

*జన్మను ప్రసాదించి, సృష్టి కర్త బ్రహ్మను,* 

*పాలిచ్చి పెంచి, స్థితి కర్త విష్ణువును,*

*తప్పు చేస్తే దండించి, లయకారకుడైన రుద్రుడిని ఒక స్త్రీ ప్రతిబింబిస్తుంది...*
 
*అందుకే  సనాతన ధర్మం స్త్రీని అత్యున్నత స్థానంలో నిలబెట్టింది..*
 
*యత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమంతి దేవతా...* అని వేద వాక్యం... 

*ఎక్కడ స్త్రీలు గౌరవింప బడతారో అక్కడ దేవతలు తిరుగాడుతారు....* అని వాక్యార్థం.. 

*దేవతలు సకారాత్మక శక్తికి సంకేతం...* 

*స్త్రీ గౌరవింపబడిన చోట positivity తప్పకుండా ఉంటుంది...*
  
*మహిళా దినోత్సవ శుభాకాంక్షలు*

💐💐💐💐🙏🙏

ఒక వ్యక్తి ఎడారిలో దారి తప్పిపోయాడు. అతడు తెచ్చుకున్న నీళ్లు రెండు రోజుల తర్వాత అయిపోయాయి. 

నడుస్తున్నాడు..... నీరు ఎక్కడా కనబడటం లేదు. తన జీవితపు ఆఖరు దశకు చేరానని అతడికి తెలిసిపోయింది. 

ఈ రాత్రి గడవదు. రేపు ఉదయం చూడను అని అనుకుంటున్న దశలో ప్రయత్నం చెయ్యడమా? అలాగే నిరాశతో కూలబడి పోవడమా ఎటూ నిశ్చయించుకోలేకపోతున్నాడు. 

దూరంగా ఒక గుడిసెలాంటిది కనబడింది. అది నిజమా? తన భ్రమా? ఏమో! నిజమేమో! అక్కడ తనకు నీరు దొరకవచ్చునేమో! చనిపోయేముందు ఆఖరు ప్రయత్నం చెయ్యాలనుకున్నాడు.

శక్తిని కూడదీసుకున్నాడు..... తడబడిపోతున్న అడుగులతో ముందుకు నడుస్తున్నాడు. 

గుడిసెలోకి వెళ్లాడు. అక్కడ ఒక నీటి పంపు(బోరింగ్) కనబడింది. 

దానిని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టయింది. దాని దగ్గరకి వెళ్లి కొట్టాడు. నీరు రావడం లేదు. శక్తినంతా ఉపయోగించి కొట్టాడు. అయినా ప్రయోజనం లేదు. నిరాశ నిస్పృహ ఆవరించాయి. 

ఒంట్లో ఉన్న కొద్ది నీరూ అయిపోయింది. కళ్లు మూసుకుపోతున్నాయి. 

ఒక మూలన సీసా కనిపించింది. దానిలో నీరు ఉంది. మూత గట్టిగా బిగించి ఉంది. మూత విప్పి దాన్ని ఎత్తిపట్టి తాగుదామని పైకి ఎత్తాడు. 

దానికి ఒక కాగితం కట్టి ఉంది. దాని మీద ఇలా ఉంది. 

ఈ బాటిల్‌లో నీరు బోరింగ్ పంపులో పోయండి. పంపు కొట్టండి.. నీరు వస్తుంది. మీరు మళ్లీ ఈ బాటిల్ నింపి పెట్టండి.

అతడికి సందేహం కలిగింది. ఈ నీరు తాగెయ్యడమా? బోరింగ్ పంపులో పొయ్యడమా? 

ఎంత కొట్టినా రాని నీరు.. ఈ బాటిల్లో నీరు పోస్తే వస్తుందా? ఉన్న ఈ నీరు కాస్తా పోసేస్తే తర్వాత రాకపోతే తన గతి ఏమి కాను? చేతిలో ఉన్న నీరు తాగితే కనీసం ఇంకో రెండు రోజులు బతకొచ్చు. అందులో  పోసేస్తే మరణం ఖాయం.

ఏమి చేయాలి? ఎంతకూ ఆలోచనలు తెగడం లేదు. ఒక నిశ్చయానికి వచ్చాడు. నీళ్లను పంపులో పోశాడు. 

బోరింగ్ పంపు కొట్టడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యం. పాతాళ గంగ పైకి తన్నుకు వచ్చింది. 

నీళ్లు తాగి బాటిల్ నింపాడు. మూలన పెట్టాడు. తను తెచ్చుకున్న బాటిల్ నింపుకున్నాడు. 

గుడిసెలో ఎడారి మ్యాప్ కనబడింది. తను ఎటు వెళ్లాలో చూసి బయలుదేరాడు.

ఏదైనా పొందాలంటే ఇవ్వడం నేర్చుకోవాలి. ఇవ్వడం వల్ల మనం పొందగలం అనే నమ్మకాన్ని కలిగి ఉండాలి. 

ఫలితం మీద ఆశ పెట్టుకోకుండా ప్రయత్నించాలి. కృషి చెయ్యకుండా ఫలితం ఆశించకూడదు. 

నువ్వు ఇవ్వకుండా దేనినీ పొందలేవు.

........

******

 *లోకం భిన్న రుచులు, బుద్దులు భిన్నము,   

* శిష్యులారా తెలుగు సామెతల గురించి ఈరోజు మీకు వివరిస్తాను మీరు జాగ్రత్తగా అర్ధం చేసుకొని సమయానుకూలముగా, తెలుగు భాషను వాడుటవలన విన్నవారికి హృదయం గా మరి పరవసించాలి.  

* ఇతరులకు సజ్జనులు ఉపకారం చేసేదానిలో ఆశ్చర్యం ఏముంది?శ్రీగంధం వృక్షాలు తమ శరీర సుఖం కోసం పుట్టించబడలేదు. అలాగే మీరు మిసరిరాంకుకు దేశక్షేమంకోసం పుట్టారు మీమాటలలో సామెతలనుఉపయోగించి జీవితాన్ని సాగించండి  

* ఒక పని చేయాలనే సంకల్పంతో ప్రారంభించి, మధ్యలో చేయలేనేమో అని సందిగ్ధంలో ఉన్నప్పుడు, ఎడారిలో దాహానికి ఎండమావులు చేరి భాధ పడినప్పడు.   , అడవిలో చిక్కి దారివెదికేటప్పడు, వేటకుక్కల దగ్గరకు పోయి పరుగెత్తలేని సమయమైనప్పుడు, సముద్రంలో బాధపడుతూ  ఈదునపుడు      

"రోట్లో తల దూర్చి రోకటి పోటుకు వెరవనేల". 

* ఏదైనా పొరపాటు చేసి ఫలితం అనుభవించాల్సి వచ్చినప్పుడు చేయలేదని బుకాయించినప్పుడు, ఎక్కడో ఎవరితో కలసి ఎదో తెప్పించి బుకాయించినప్పుడు, కులాలు మతాలు మధ్య చిచ్చు బెట్టి బుకాయించినప్పుడు,   

నిప్పు ముట్టనిదే చేయి కాలదు 

*. పైకి కనిపించేది అంతా నిజమని మోసపోయినప్పుడు:, కధలన్నీ సత్యమైనప్పుడు, తీర్పులన్నీ న్యాయమైనప్పడు, మాటలన్నీ సత్యాలయినప్పుడు,   

మెరిసేది అంతా బంగారం కాదు

* మన ముందు మెచ్చుకుంటూ వెనక చాడీలు చెప్పేవారి గురించి , కొంపలు ముంచియు గొప్పలు చెప్పుట గురించి,    

"నోటితో మెచ్చుకుంటూ నొసలుతో వెక్కిరించినట్లు."

*. నాకు అన్ని సౌకర్యాలు లేవు అని బాధ పడే సమయంలో :, చదివిన చదువుకు వుద్యోగం వచ్చే సమయంలో, లంచాలు తీసుకోకుండా సేవలు చేసే సమయంలో 

"మంచం ఉన్నంత వరకే కాళ్ళు ముడుచుకోవాలి".

*. ఒకప్పుడు బాగా బ్రతికి చెడినప్పుడు :కట్టుకున్న ఆపేకమేడలు కూలినప్పుడు, ఉన్నది పోయాయి ఉంచుకున్నది పోయినప్పుడు ప్రతిఒక్కఋ   

"పూలమ్మిన చోటే కట్టెలమ్మవలసి వచ్చినట్లు".

*. ఒక రహస్యం ఎవరికీ చెప్పలేదు నీకు మాత్రమే చెప్పాను అన్నప్పుడు :, ఎవ్వరికి చెప్పలేదు నిక్ మాత్రమే చెపుతున్నాను అనేటప్పుడు  

"పెదవి దాటితే పృధివి దాటుతుంది".

*. ఒక కుటుంబంలో అందరూ మంచిగా ఉండి ఒక్కరే చెడ్డ వారిగా ఉన్నప్పుడు :అన్ని వస్తువులలో ఒక వస్తువే పగిలిఉన్నప్పుడు, అన్నంలో పలుకు రాళ్లు ఉన్నప్పుడు అనుకుంటారు.    

"తులసీ వనంలో గంజాయి మొక్క లాగా".

*. నిజం మాట్లాడిన వారు అందరికీ శత్రువుగా మారినప్పుడు :కోపంగా చెప్పిన నమ్మనప్పుడు, మంచిగా మాట్లాడినా తిరిగిమాట్లాడుతున్నాడు అనేటప్పడు చెపుతారు.  

"యదార్థ వాది -లోక విరోధి"

*. ఒక పని చేయాలనే గట్టిగా సంకల్పం ఉన్నప్పుడు దానంతట అదే దారి కనిపిస్తుందిఅనే సందర్బంగా:, నావంతు నేను చేయటమే మిగతాది భగవంతుడు చూస్తాడు అనేటప్పుడు 


"మనసుంటే మార్గముంటుంది".

                              (సశేషం)


 స్వర్గం -నరకం - 

ఒక వ్యక్తి మరణించాడు. 

అతడు చేసిన పాప పుణ్యాలకు ఒకరోజు నరకం ఒకరోజు స్వర్గం లో ఉండాలని చెప్పడం తో నరకం లోకి కాలుపెట్టాడు.. 

అక్కడ చుట్టూ చెత్తా దుమ్ము తో చాలా మురికిగా ఉంది. మనుషులూఅందరూ ఎక్కడంటే అక్కడ పడుకొని దొర్లుతూన్నారు. చూడ్డానికి మాత్రమ్ బక్క చిక్కిపోయి ఉన్నారు. అన్నము తిని ఎన్నిరోజులు ఐనదో అనేలా ఉన్నారు. ఎవరి ముఖము చూసినా విచారము తో దిగులుగా ఉంది. 

ఆ వ్యక్తి వీళ్ళకు అన్నము పెట్టకుండా ఇలా వదిలేస్తారేమో ఆకలితో అనుకొన్నాడు. 

ఇంతలో ఒక గంట మ్రోగింది. వెంటనే అందరూ ఒక పెద్ద హాలు వంటి గది వైపు వెళుతున్నారు..  

అతడు వెళ్ళాడు. 

వెళ్ళి నిర్ఘాంతపోయాడు. అది ఒక పెద్ద భోజనశాల. మధ్య లో చలా పొడవైన బల్ల ఉంది.  

దానిమీద అన్ని రకాల ఆహార పదార్థాలు ఉన్నయ్.శఖాహార, మాంసాహార పదార్థాలు మిఠాయిలు ఫలాహారాలు.  మరి వాళ్ళు యెందుకు బక్క చిక్కి పోయారు అని ఆ వ్యక్తి కి సందేహం వచినది.  

అందరూ బల్లలకు ఇరువైపులా కూర్చోగానే వాళ్ళ చేతులకి పెద్ద పెద్ద గరిటెలు కట్టారు. 

అవి చాలా పొడవుగా ఉన్నాయి. అందరూ తినడానికి ప్రయత్నము చేసారు. అంత పొడవు గరిటెలతో తినడము అసాధ్యమైనది. చివరకు కొన్ని మెతుకులు మత్రమే నోటిలో పడ్డాయి.

సమయము ముగియడం తో అందరూ నిరాశగా వెనుదిరిగి వెళ్ళారు.. 

ఆ రోజు రాత్రి భోజనసమయము లో కుడా అలాగే జరిగింది. ఉదయాన్నే ఆ వ్యక్తినీ స్వర్గానికి తీసుకెళ్ళారు. స్వర్గము చాలా అందముగా,శుభ్రం గా ఉంది.అక్కడున్న వాళ్ళందరూ చాలా ఆరోగ్యంగా బలము గా ఉన్నారు. పరిసరాలను శుభ్ర పరుస్తూ మొక్కలకు నీళ్ళు పోస్తూ పనుల్లో ఉన్నారు. మధ్యాహ్నం అవుతూనే అక్కడ కూడా గంట కొట్టారు వెంటనే వాళ్ళందరూ భోజనశాల కివెళ్ళారు. అది కుడా నరకం లో మాదిరే పొడవుగా ఉంది. నరకం లో మాదిరే అన్ని పదార్ధాలు ఉన్నాయి.  తినడానికి కూర్చోగానే వాళ్ళచేతులకూ పొడవైన గరిటెలు కట్టారు....

అది చూస్తూనే ఆ వ్యక్తి కి ఏమీ అర్థము కాలేదు..  

ఇక్కడ కుడా అలాగే ఉంటే మరి వాళ్ళు యేల అంత బలము గా ఉన్నారో అనుకొంటూ ఉండగా వాళ్ళు తినడము మొదలు పెట్టారు...

చూస్తుండగానే అన్ని తినేసారు......... 

ఎవరి చేత్తో వాళ్ళు తినకుండా ఎదురుగా కుర్చున్న వాళ్ళకు తినిపించుకోన్నారు... 

అలా కడుపునిండా తినగలిగారు.. 

మనము ఎదుటివారికి సహాయము చేస్తున్నాము అంటే స్వర్గము లో ఉన్నాము అని, ఆ సహాయము మనకు ఏదో ఒక రూపము లో మనకు తిరిగి వస్తుంది. 

స్వార్ధం తో నేను మాత్రమే అనుకొంటే నరకం లో ఉన్నట్లే. 

--((**))--

*ఆనంద పారవశ్యము*

రచయత మల్లాప్రగడ రామకృష్ణ 

మానవుల మనో భావాలు అనంతాలు, అనటానికి అర్ధం లేని విధముగా అంతరంగ రాగ సరిగమలు, పదనిసలు, సరసబావాలు, వెంట వెంటనే వెంబడిన్చుతూ తుమ్మెదలు  మకరందాన్ని అస్వాదిన్చుటకు వచ్చినట్లు నేను ఎందుకు  ఆస్వాదించ కూడదు అనే తపన మనిషిని వెంటాడుతుంది ఇది ప్రకృతి, మకరందాన్ని పంచి మదన కుహరమును మర్దనము చేసి తన్మయత్వం, ఇదని, ఇంతని, చెప్పుటకు ఎవ్వరి తరము కాదు, అది ఒక అద్భత సృష్టి, అది ఒక పరమాత్మకు మాత్రమే తెలుసు, అని అనుకో నవసరం లేదు,  ఆనంద పారవశ్యములో,  అరమరికలు లేకుండా,  పరవశించి తన్మయత్వంతో,  తపనతో, తరతమ భేదములు లేకుండా, తనువూ,  తనువూ, తప్పెట పై తప తప అని బాదిన వచ్చే శబ్ద సంతోష వాద్యము ఎంత  మధురముగా ఉంటుందో,  మనిష్యులను గుఱ్ఱము కన్నా వేగముగా  మనసును పరుగిట్టించి, మనసును  తపనలకు  తపింప చేసి తన్మయంతో తనువు హత్తుకొని, నీలి మేఘాల పచ్చని మేనుపై, పరవశించి ఆనంద పారవస్యముతో, పరిపక్వము చెంది, పువ్వు విప్పారి పరవశించి, పరిమళాలు విరాజిల్లి, విరహ వేదనతో విలవిల లాడి, ఓ మేఘమా శాశ్వతముగా నాపై కురువుమా, నా ఆనందమును పంచుకొని సుఖపడుమా

**********************

డబ్బు శాశ్వతం  కాదు,

                *డబ్బే జీవితమూ కాదు*

          *ఒక జడ్జి తన వృత్తినుండి పదవీవిరమణ అయ్యాక తన భార్య నుండి తనలోని భావాలను ఇలా పంచుకుంటున్నారు…*

*”లక్ష్మీ!  నేను లాయర్ గా ఉన్నప్పుడు కాని జడ్జి గా ఉన్నప్పుడు కాని ఈరోజు నేను చూసిన నా చివరి కేసు లాంటిది చూడనే లేదు” అని అన్నాడు.*

*“ఏంటా కేసు?” అని ఆమె అడగగా…*

*”ఒక తండ్రి తన కొడుకు తనకు నెలకు డబ్బులు ఇవ్వడం లేదని కేసు“ అన్నాడు.*

*కొడుకుని పిలిచి … “ఏంటయ్యా నీ తండ్రికి నెలకు సరిపడ డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు?” అని అడిగాను.*

*”మా తండ్రిగారు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పదవి విరమణ పొందిన వ్యక్తి. నెలనెలా ఆయనకు పెన్షన్ వస్తున్నది. బాగానే డబ్బులు ఉన్న వ్యక్తి. నా పైన ఇలా ఎందుకు కేసు పెట్టాడో అర్థం కాలేదు” అన్నాడు.*

*ఆ తండ్రి “అవును డబ్బుకు నాకు లోటులేదు, కాని నా కొడుకు నెలకు 100 రూపాయలు కానివ్వండి స్వయంగా వచ్చి అందించేలా తీర్పు ఇవ్వమ”ని అడిగాడు.*

*తీర్పు చెప్పాక ఆ తండ్రిని కలిసాను “ఎందుకయ్యా ఇలా అడిగావు” అని*

*”మాకు ఉన్నది ఒక్కడే కొడుకు. మీరు ఇచ్చే తీర్పు కారణంగా అయినా నెలకు ఒక్కసారి మా దగ్గరకు వచ్చి మాతో గడిపి వెళ్ళగలడని ఆశ, వాళ్ళ అమ్మకు వాడంటే ప్రాణం।” అని అన్నాడు.*

*ఇలా చెబుతూ ఆయన కళ్ళు తడిచాయి.*

*డబ్బే ప్రధానం అనుకుంటారు; అంత కంటే ఎక్కువగా మనల్ని ఎదురుచూసేవారుంటారు అని గుర్తించలేము.*

*నాకెందుకో అప్పటి కన్నవారికి నేడు ఉన్న తల్లితండ్రులకి చాలా తేడా  కనిపిస్తుంది.*

*మా పిల్లలు డబ్బు సంపాదించకపోయినా పర్లేదు మా కళ్ళ ముందు ఉంటే చాలు సరిపడా సంపాదన చాలు అనుకునే వారు.*

*నేడు పిల్లలు అంటే వారు విధేశాలకు వెళ్ళిపోవాలి, లక్షలు సంపాధించాలి అని కోరుకుంటున్నారు.*

*అందుకే  ప్రేమ ఆప్యాయతలు బంధాలు అనేవాటికి విలువ లేకుండా పోయింది .*

*ఎవరైనా ఇవన్నీ పిల్లల నుండి ఎదురుచూస్తుంటే పిచ్చివాళ్ళను చూసినట్టు చూస్తున్నారు*

*అనురాగం ఆప్యాయత అందని ద్రాక్ష  పళ్ళు కాకూడదు కనిపెంచిన తల్లిదండ్రులకు.*

      

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

చిన్నప్పుడు ఎప్పుడో చదివిన కథ.
 

పూర్వం ఇద్దరు రాజులు యుద్ధానికి దిగారు. ఓడిన రాజు తన రాజ్యాన్ని వీడి, అడవుల్లోకి పారిపోయాడు. అక్కడే ఆధ్యాత్మిక చింతనతో కాలం గడుపుతున్నాడు. గెలిచిన రాజు ఆ ఉత్సాహంతో యజ్ఞం చేసి దానధర్మాలు చేయాలని తలపెట్టాడు. అనుకోకుండా, అక్కడ యాగధేనువు మరణించింది. అది అశుభ సూచన. యజ్ఞాన్ని ఎలా పూర్తిచేయాలో తెలియక ఆ రాజు తికమక పడ్డాడు. నగర పురోహితుల్ని సంప్రతిస్తే- ఆ ధర్మసూక్ష్మం తెలిసినవాడు ఓడిపోయిన రాజేనని తేలింది. ధర్మసంకటం నుంచి గట్టెక్కించగలవాడు ఆయనేనని నిశ్చయమైంది.

గెలిచిన రాజు ఏమాత్రం సందేహించకుండా ఓడిన రాజు వద్దకు వెళ్లి, యజ్ఞాన్ని పరిపూర్తి చేయాలని అర్థించాడు. ఆయనా ఏ శషభిషలకూ తావు లేకుండా ధర్మనిర్ణయం కోసం ముందుకొచ్చాడు. శత్రువుకు సహకరించాడు.

ఆ ఇద్దరు రాజులూ ఆర్షధర్మ నిర్వహణ విషయంలో అహంకారాల్ని త్యజించారు. వారి కథే- శ్రీకృష్ణదేవరాయల ‘ఆముక్తమాల్యద’లోని ‘ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానం’ సారాంశం. సమాజం అనే ధర్మసౌధం పటిష్ఠంగా నిలిచేందుకు భారతీయ ప్రాచీన సాహిత్యం ఎంతగా తోడ్పడిందో, ఈ ఉదాహరణ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఈ కథలో ఓడిన రాజు ఖాండిక్యుడు; గెలిచినవాడు కేశిధ్వజుడు. కథ చివర గొప్ప మలుపు ఒకటుంది.

తన యజ్ఞ సంపూర్తికి సహకరించిన ఖాండిక్యుడికి గురుదక్షిణగా ఏది కావాలన్నా ఇస్తానని కేశిధ్వజుడు ప్రకటిస్తాడు. అది సంప్రదాయం. ఓడిన రాజుకు ఓర్మి ఎంత ప్రధానమో- గెలిచిన రాజుకు సంయమనం, ధర్మ సంప్రదాయ పరిరక్షణ అంతే అవసరం. ఈ అవకాశాన్ని చేజిక్కించుకున్న ఖాండిక్యుడు తాను కోల్పోయిన రాజ్యం తిరిగి గురుదక్షిణగా కావాలన్నా ఇచ్చేయడానికి కేశిధ్వజుడు సిద్ధపడతాడు. ఇక్కడే ఓ చిత్రం చోటుచేసుకుంటుంది. రాజ్యసంపద అయాచితంగా వచ్చిపడుతున్నా ఖాండిక్యుడు కాదంటాడు! తనకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించాలని, అదే కేశిధ్వజుడి నుంచి తాను కోరుకునే గురుదక్షిణ అని ప్రకటిస్తాడు.

ఖాండిక్యుడి నిర్ణయం కేశిధ్వజుణ్ని విస్మయానికి గురిచేస్తుంది. ఆయన ఆలోచన ఏమిటో తెలుసుకోవాలని అనిపిస్తుంది. అప్పుడు ఖాండిక్యుడు అంటాడు- ‘రాజ్యభోగాలు కేవలం భౌతిక సంపదలు. వాటిని కష్టంతో, శారీరక శ్రమతో సాధించుకోవాలి. అంతేగాని, అవి అయాచితంగా లభించాలని కోరుకోకూడదు. కష్టపడి సాధిస్తేనే, వాటి విలువ తెలుస్తుంది. నా కంటే బలవంతుడి చేతిలో ఓడిపోయాను. అందులో సిగ్గు పడాల్సింది ఏముంటుంది? తిరిగి పుంజుకొని ధర్మమార్గంలో, క్షాత్రంతో నా రాజ్యాన్ని నేను తిరిగి చేజిక్కించుకోవాలి. అది ఒప్పుతుంది గాని, దొడ్డిదారిన పొందితే పాపమవుతుంది’ అని బదులిస్తాడు ఖాండిక్యుడు!

ఇలాంటి కథల్ని పిల్లలకు పాఠ్యాంశాలుగా నిర్ణయిస్తే, వారి బాల్యాన్ని అవి ధార్మిక పథంలోకి నడిపిస్తాయి. వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయి. ఉచితాల కోసం తాపత్రయపడకుండా ఆపుతాయి. ఉచితానుచిత జ్ఞానాన్ని వారికి అలవరుస్తాయి.

ఆముక్తమాల్యదలోని ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానం- ఆ కావ్యానికి గుండెకాయ వంటిదని ప్రశస్తి రావడానికి ముఖ్య కారణాలేమిటి? ఆ కథలోని ధార్మిక నేపథ్యం, ప్రబోధ గుణం. గెలుపు ఓటముల విషయంలో, కర్తవ్య నిర్వహణలో, అయాచిత అవకాశాల తిరస్కరణలో ప్రతిఫలించిన ధర్మస్వరూపమే- భారతీయతకు వన్నెలద్దుతూ వచ్చింది.

లోకంలో ఇలాంటి కథలు ఒళ్లు మరిపించడమే కాదు, కళ్లు తెరుచుకొనేలా చేస్తాయి. దీనికి మన ప్రాచీన సాహిత్యమే గొప్ప ఆదరువు.

🙏దయచేసి ఇలాంటి నీతి ని మనం పాటిస్తూ,అలాగే ఇలాంటి కథలు కూడా తప్పకుండ ముందుతరాలకు పంచండి🙏


--(())--


స్వర్గానికి రోడ్డు మార్గం


పాండవులు ఈ మార్గం ద్వారానే స్వర్గానికి చేరుకున్నారని ప్రతీతి. భూమి నుండి స్వర్గానికి చేరుకోవచ్చు.... అనడానికి, భూమి మీద ఉన్న ఏకైక మార్గం ఇదే....

   బద్రీనాథ్ క్షేత్రం నుండి 5km దూరం లో వుండే చిన్న గ్రామం......⬇️

.....🔚🔚🔚భారతదేశ ఆఖరి గ్రామం ఇదే. 🔙🔙🔙

ఇక్కడి నుండే ఒకవైపు టిబెట్ ప్రారంభం అవుతుంది.

ఈ గ్రామ చివరన సరస్వతి నది మనకు కన్పించే ప్రాంతం ఉంటుంది. ఇక్కడి నుండి కొంత దూరం ప్రవహించాక, అలకనంద నదితో కలిసి అంతర్వాహిని గా ప్రవహిస్తుంది. ఇక్కడే సరస్వతి మాత ఆలయం కూడా ఉంటుంది.

ఈ సరస్వతి నది పక్కన  భీమపుల్ అనే ఒక పెద్ద రాతిబండ ఉంటుంది.

పాండవులు నదిని దాటడానికి భీముడు ఈ రాతిని ఒక వంతెన గా ఏర్పాటు చేసాడు అంటారు.
ఈ రాతిమీద భీమసేనుని వేలిముద్రలు వున్నట్లు గా పెద్ద పెద్ద అచ్చులు కుడా వుంటాయి.

ఈ వంతెన దాటాక స్వర్గారోహణ మార్గం ప్రారంభం అవుతుంది.

ఇక్కడ  నుండి చట్మోలి 8km......

మార్గ మధ్యమం లో భృగుమహర్షి ఆశ్రమం కన్పిస్తుంది.

తరవాత "మాతమూర్తి ఆలయం" కన్పిస్తుంది. ఈవిడే నరనారాయణుల కన్నతల్లి గా కూడా చెప్తారు.
ఈ ప్రాంతం 14,000 అడుగుల ఎత్తులో ఉంటుంది.

తర్వాత "కుబేర్ మకుట్ "అనే ప్రాంతం వస్తుంది. ఇక్కడే కుబేరుడి పుష్పక విమానాన్ని రావణాసురుడు బలవంతం గా తీసుకున్నట్లు చెప్తారు.

ఇక్కడినుండి 5km ప్రయాణం చేసాక "వసుధార జలపాతం" వస్తుంది.

ఇక్కడే అష్ట వసువులు ( భీష్ముడు ఆఖరివాడు) దాదాపు 1000 సం తపస్సు చేసినట్లు చెప్తారు.
ఈ జలపాతం దాదాపు 120మీ ఎత్తునుండి పడుతుంది.

ఇక్కడ గాలులు బలంగా వీస్తుండడం చేత ధార చాల పలుచగా నీటి తుంపర లవలె పడుతుంది.
అందుకే పాపులపై ఈ జలధార పడదు అని చెప్తారు.

చట్మోలి:-

తర్వాత చట్మోలి ( 12000 అ ఎత్తులో ) అనే అందమైన పచ్చని బయళ్ళు వుండే ప్రాంతానికి చేరుకుంటాం.

పర్వతారోహకులకు ఇది ఒక విడిది ప్రదేశం.

ఇక్కడే "సతోపంత్"  మరియు "భగీరధ్ కర్క్" అనే రెండు నదులు   ( హిమానీనదాలు ) కలిసి "అలకనంద" గా ఏర్పడతాయి.

అక్కడి నుండి ముందుకు వెళితే "ధనో హిమానీనదం" కు చేరుకుంటాం.

చట్మోలి నుండి లక్ష్మివన్ 1km ( 12600 అ ఎత్తు లో ).........

తర్వాత లక్ష్మి వన్ ప్రాంతం కు చేరుకుంటారు. ఇది ఒక అందమైన రకరకాల పూలు వుండే ప్రాంతం. ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.

ఇక్కడే లక్ష్మి మాత మరియూ విష్ణు భగవానుడు కొంతకాలం తపస్సు చేసినట్లు చెప్తారు.

ఇక్కడే ద్రౌపది దేవి తనువు చాలించింది అని  చెప్తారు. 

ఇక్కడి నుండి 2km ప్రయాణించాక  బంధర్ అనే ప్రాంతం కు చేరుకుంటాం.

ఇక్కడే ధర్మరాజు దాహార్తి తీర్చడానికి అర్జునుడు బాణ ప్రయోగం చేసాడని చెప్తారు.

బంధర్ నుండి సహస్రధార 4km ( 14000 అఎత్తులో).........

సహస్ర ధార నుండి చక్ర తీర్ధం 5km (15000 అ ఎత్తులో)........

చక్రతీర్థం విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని కింద పెట్టడం వలన ఏర్పడిన సరస్సు గా చెప్తారు.

ఇక్కడే అర్జునుడు తనువు చాలించాడని చెప్తారు.

చక్రతీర్ధం నుండి సతోపంత్ 5km........

ఈ సతోపంత్ అనేది త్రిభుజా కృతి లో వుండే సరస్సు.
ఇది 5 పర్వతాల మధ్య వుండే సుందరమైన స్వచ్చమైన నీరు ఉండే  సరస్సు.

ఇక్కడే ఏకాదశి రోజున త్రిమూర్తులు స్నానం చేస్తారని గంధర్వులు పక్షుల రూపం లో వారిని సేవిస్తారని చెప్తారు.

ఏకాదశి రోజున ఇక్కడ పక్షుల సమూహం ను చూడవచ్చట.
ఇక్కడే భీముడు తనువు చాలించాడని చెప్తారు.

సతోపంత్  నుండి స్వర్గారోహిణి 8 km......

ఈ మార్గం బహు కష్టం గాను ప్రయాణానికి దుస్సహం గాను చెప్తారు.

మార్గ మధ్యం లో చంద్రకుండ్ మరియూ సూర్యకుండ్ అనే సరస్సులు...భట్టాచార్య... ఉంటాయి.

ఇక్కడినుండే ధర్మరాజు మాత్రమే, కుక్క తోడు రాగా స్వర్గానికి ప్రయాణించాడు అంటారు.

నిజానికి స్వర్గారోహిణి అనేది  6 పర్వతాల సమూహం గా చెప్తారు. ఇందులో స్వర్గారోహిణి 1 అనేది ముఖ్యమైంది.
ఇది ఉత్తరాఖండ్ రాష్టం లోని ఉత్తరకాశి జిల్లా లో కల ఘర్వాల్ హిమాలయ ప్రాంతానికి  చెందినది.
దీనికి పడమర వైపు గంగోత్రి పర్వత సముదాయం ఉంటుంది.

ఈ స్వర్గారోహిణి పర్వతాగ్రం ( 20512 అ ఎత్తు లో , 6252 m ) మబ్బులలో ఉంటుందని అది 3 మెట్లు వలే ఉంటుంది అని అవి ఎక్కి పైకి వెళితే  మబ్బులలో మరో 4 మెట్లు ఉంటాయని అవి కూడా ఎక్కి  పైకివెళితే స్వర్గ ముఖ ద్వారానికి చేరుకుంటామని చెప్తారు.

    "స్వర్గారోహిణి పర్వత సమూహాలు" అన్నవి అతి పురాతనమైన పర్వత సమూహాలు. ఇవి గర్వాల్ హిమాలయాల లోని సరస్వతి హిమ శ్రేణులలో కలవు. నేటి "ఉత్తరాఖండ్" రాష్ట్రం లో గల "ఉత్తర కాశీ" జిల్లాలో కలవు. ఇవన్నీ మరల గంగోత్రి హిమ శిఖరాలు. ఇవి మరల నాలుగు శిఖరాలు. 1. స్వర్గారోహిణి - 1 అన్నది ప్రధాన శిఖరం.

    ఈ పర్వతం సముద్ర మట్టానికి 6,247 మీటర్ల ఎత్తులో కలదు.

     "స్వర్గారోహణ"....అన్న పదం, మన ఇతిహాసమైన "మహాభారతం" నుండి వచ్చింది. "స్వర్గారోహణ పర్వం"....మహాభారతమందలి పర్వాలలో ఒకటి కదా! మహాభారతంలో....చివరి అంకంలో ధర్మరాజాదులు, తమ రాజ్యాన్ని వదలి స్వర్గం వైపు ప్రయాణం కడతారు. ఈ "స్వర్గారోహిణి" పర్వతాలు, స్వర్గానికి నిచ్చెనలాంటివి అని పురాణ కథనం. కానీ పాండవాగ్రజుడైన, ధర్మ రాజు మాత్రమే స్వర్గాన్ని చేరుకుంటాడు. హిందూ ఐతిహ్యాల ప్రకారం........ఈ స్వర్గారోహిణి పర్వతాలే, స్వర్గానికి సశరీరంగా వెళ్ళడానికి మార్గంగా ఉన్నాయని, ఐతిహ్యాలు చెబుతున్నాయి. ఇందులోని మార్మికత ఏమిటో?

భట్టాచార్య

🧘‍♂️భగవంతుడి భాష🧘‍♀️

మనసులోని ఆలోచనల్ని వ్యక్తంచేయడానికి మనం భాషను సముచితమైన సాధనంగా వినియోగించుకుంటున్నాం. భాషాపటిమ లేనప్పుడు అభినయం, హావభావాల ద్వారా వ్యక్తంచేస్తున్నాం. మరి భగవంతుడికి కూడా భాషేదైనా ఉన్నదా? ఆ భాష ఏమిటి, ఎలా ఉంటుంది, ఆ భాష ద్వారా ఏం చెబుతున్నాడు, మనం దాన్ని ఎలా గ్రహిస్తున్నాం? ఇలాంటి సందేహాలు కలగడానికి ఆస్కారముంది.

నశ్వరమైన ఈ శరీరానికే భాష ఉన్నప్పుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడైన పరమాత్మకు మాత్రం భాషెందుకుండదు? ఉంది. భాషంటే మాటలా, వాక్యాలా, శబ్దాలా? మౌనం కూడా భాషేనా? రమణమహర్షి మౌని. ఆయన భాష మౌనమే. ఆయన బోధలూ మౌనంద్వారానే భక్తులకు సంప్రాప్తించాయి. దక్షిణామూర్తి మౌనసాధనం ద్వారానే జ్ఞానబోధ చేశాడు. అలాగే మహానుభావులెందరో మౌనంగా ఉంటూనే తత్వబోధ చేశారు. భగవంతుడూ మౌనంగానే ప్రకృతి ద్వారా మనకు జ్ఞానం ప్రసాదించాడు.

నదులు, పర్వతాలు, వృక్షాలు, కొమ్మలు, కాయలు, పూలు, పండ్లు, మేఘాలు, గాలి, నేల- వీటన్నింటి ద్వారా పరమేశ్వరుడు మనకెన్నో అమూల్య సందేశాలు అందజేస్తున్నాడు. జ్ఞానసంపదను పంచి పెడుతున్నాడు.

ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రతి వస్తువూ మనకు సౌఖ్యాన్ని, ఆనందాన్ని అందజేస్తోంది. సూర్యుడు వెలుగునిస్తున్నాడు. చంద్రుడు వెన్నెలనిస్తున్నాడు. పూలు పరిమళాలిస్తున్నాయి. నదులు నీటినిస్తున్నాయి. మబ్బులు వర్షిస్తున్నాయి. పక్షులు కిలకిలారావాలతో ప్రకృతిని పులకింపజేస్తున్నాయి. పొలాలు సస్యాలనిస్తున్నాయి. గోవులు క్షీరధారలిస్తున్నాయి. గాలి శ్వాస ద్వారా సకల ప్రాణి కోటికీ మనుగడనిస్తోంది. సృష్టిచక్ర నిర్వహణకు ఒక్కో వస్తువుకు, ఒక్కో రకమైన సామర్థ్యం, శక్తీ ఏర్పాటు చేశాడు భగవంతుడు.

అన్నీ మౌనంగా జరిగిపోతున్నా అవన్నీ భగవంతుడి భాషలే. వాటిలో వాక్యాలు, మాటలు ఉండవు. అన్నీ వేటికవే పరమాత్మ సంకేతాలు అందినట్టుగా, తమ తమ విధులను క్రమం తప్పకుండా నిర్వర్తిస్తున్నాయి. అనంతకోటి నామధేయాలున్నట్టే ఆయనకు అనంతకోటి భాషలూ ఉన్నాయి. ఎవరికి ఏ భాష ద్వారా కర్తవ్యబోధ చేయాలో అలా చేస్తున్నాడు. అలాగే మనకు తన మౌన భాష ద్వారా అనేక విధాలైన బోధలు చేస్తున్నాడు. వాటిని గ్రహించటం, ఆచరించటం- మన సుకృతం, వివేకం, ఆసక్తి మీద ఆధారపడ్డాయి.

వేదాలు, శాస్త్రపురాణాలు, ఉపనిషత్తులు, భగవద్గీతాది పవిత్రగ్రంథాల ద్వారా మనకెన్నో ధార్మిక విషయాలు, నీతి సిద్ధాంతాలు నిర్దేశితమయ్యాయి.

తపస్సంపన్నులు, మునులు, రుషులు, బుధులు, వేదజ్ఞులు, పౌరాణికులు, పండిత శ్రేణులు, ప్రవక్తలు మనకు పరమాత్మ భాష ద్వారానే రసానందసిద్ధిని కలగజేస్తున్నారు. మన సుఖజీవనయాత్రకు ఉపయోగపడుతున్న విషయ పరిజ్ఞానమంతా పరోక్షంగా ఆయన భాషా వ్యవహారమే. ఒక్క మనిషి తప్ప ప్రకృతిలోని ప్రత్యణువూ నిస్వార్థంగా సేవచేస్తోంది. ఆ సేవలు, సుఖాలు పొందిన మానవుడు మాత్రం కృతజ్ఞతాహీనుడై ప్రవర్తిస్తున్నాడు. అందుకే ప్రకృతినుంచి పరమాత్మ భాషను, భావాన్నీ, సందేశాన్నీ గ్రహించి, తదనుగుణంగా నడచుకోవాల్సి ఉంది.

అనంతమైన భగవంతుడి భాషల్లో కొన్ని మనకు బాగా తెలిసినవే. అవే సత్యం, అహింస, ప్రేమ, పరోపకారం, భూతదయ, సచ్ఛీలం, క్రమశిక్షణ, సమయపాలన, నిస్వార్థబుద్ధి, త్యాగశీలత, ధర్మం, దానం, నమ్రత, వాత్సల్యం, విధినిర్వహణ... ఇలాంటివి. ఇవన్నీ మనకు ఎంత బాగా తెలుసో, అంత బాగా మనసుకు దూరంగా ఉంచుతాం. అందుకే భగవంతుడి భాష అవగతం కాదు. ఆ సద్గుణాలన్నింటినీ మహానుభావులెందరో ఎప్పుడో సుగ్రాహ్యం చేసుకున్నారు. ఆచరించి చూపారు.

కనుక, వారందరికీ భగవద్భాష సుబోధకమే అయింది. ప్రధానంగా గ్రహించవలసింది- భక్తి ఒక్కటే మనల్ని ఎక్కువ దూరం తీసుకెళ్లలేదు. ఆర్తుల సేవ దానికి తోడైతేనే ఆధ్యాత్మికంగా ముందుకు పురోగమించగలం.

 అప్పుడే మనం భగవద్భాషను సంపూర్ణంగా సాకల్యంగా అవగాహన చేసుకున్నవాళ్లమవుతాం. సద్గురువు మార్గప్రదర్శనంలో సముచితమైన శిక్షణ పొంది, సాధనచేసి సార్థక జీవన ప్రస్థానం సాగిస్తే భగవంతుడి భాషలన్నీ మనకు అర్థమైనట్టే.

జీవించి, వికసించి, తత్వాన్ని తెలుసుకొని, ముక్తిని పొందడమే జీవితం. 'నేను' అనే మాటకు అర్థం తెలుసుకో గలిగితే, ఆ మాటను హృదయం నుంచి తొలగించగలిగితే భగవద్భాషా పరిజ్ఞానం పొందగలిగినట్టే! అదే మనం సాధించగలిగే మహత్కార్యం, మహావిజయం. అందుకే వీలైన్నన్ని భగవంతుడి భాషల్ని నేర్చుకునేందుకు ప్రయత్నిద్దాం.

(()))

చిదానంద రూపః

 -[చూసేవాడి మనసును బట్టి, వ్యక్తి వ్యక్తికీ ప్రపంచస్వభావం వేరేలా ఉంటుంది]-

"నేను పంచ భూతములతో కూడిన శరీరాన్ని కాను !

ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారమును కాను !

నాకు సుఖదుఃఖాలు, పాపపుణ్యములు, అరిషడ్వార్గాలు, ఈషణత్రయాలు, పురుషార్ధాలు లేవు !

నేను తెలుసుకోవలసింది, పొందవలసింది ఏమి లేదు !

నేను సచ్చిదానంద స్వరూపుడైన శివుడను !

శివుడను తప్ప వేరేమీ కాను !! అని ఉపనిషత్తుల సారాంశమంత తన నిర్వాణషట్కము/ ఆత్మషట్కములో తేల్చి చెప్పేశారు జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు."

"అంతే కాదు ప్రతి జీవుడు సచ్చిదానంద శివస్వరూపుడే ! ఆ సత్యాన్ని గ్రహించాలంటే ఆత్మభావంతో సాధన చెయ్యాలని, అప్పుడే తన నిజస్వరూపం బోధపడుతుందని సూచించారు జగద్గురువు.

ఇక సాధన మన చేతుల్లో వుంది.."

"ఎవరైతే అన్ని జీవులను ఆత్మలోనూ, ఆత్మను అన్ని జీవులలోనూ చూస్తారో వారికి యెవ్వరియందు ద్వేషభావం వుండదు". ఆత్మే అన్ని జీవరాసులుగా వున్నదని గ్రహించిన వ్యక్తికి మోహం, శోకం ఎలా వుంటాయి ?

ఆత్మానుభూతి పొందిన వ్యక్తి, విశ్వమంతటిని ఆత్మస్వరూపంగా చూస్తాడు. అతనికి ఆత్మ తప్ప ప్రపంచములో వేరేది కనిపించదు. ఏదైనా రెండవ వస్తువు ఉన్నప్పుడు మాత్రమే కదా మనకు దాని పైన మనసుపోయేది. అంతా ఒకటే అయినప్పుడు మనసు ఎక్కడకు పోగలదు. ఒక్కచోటే వుంటుంది ! అందువలన బాధగాని, మోహంగాని, ద్వేషంగాని కలగవు."

"ఆత్మానుభూతి, ఆత్మసాక్షాత్కారం మొదలగునవి ఆంతరంగిక అనుభవాలు. బయటి ప్రపంచం ఎప్పటిలానే ఉంటుంది. చూసేవాడి మనసును బట్టీ, వ్యక్తి వ్యక్తికీ ప్రపంచస్వభావం వేరేలా ఉంటుంది. ఒక యువకుడికి ఏదైనా సాధించగలననే విశ్వాసం ఉంటుంది. అదే ఒక ముసలి వ్యక్తికి అంతా అయిపోయిందనే భావన ఉంటుంది.

ప్రపంచం ఏమీ మారలేదు. మార్పంతా చూసేవాడిని బట్టే వుంటుంది. అందుకే ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తియొక్క మనసు విశాలమై విశ్వమంతటితోనూ ఏకం అవుతుంది."

"అతడు అన్నింటి అంతరార్థాన్నీ గ్రహిస్తాడు. అందున్న జ్ఞానాన్ని తెలుసుకుంటాడు. అతడు మాత్రమే నిజమైన మనీషి. మనీషి అంటే మనసును వశం చేసుకొన్నవాడు అని అర్థం. మనసు చెప్పినట్లు అతడు ఆడడు. అతడు చెప్పినట్లు మనసు ఆడుతుంది.

ఆత్మానుభూతి పొందినవాడికి తెలుసుకోవలసింది ఏమీ లేకపోవడం వలన అతడు నిత్యతృప్తుడై ఉంటాడు. అతడు కేవలం ఆత్మ /పరమాత్మనే విశ్వసిస్తాడు. వస్తువుల నిజమైన తత్వాన్ని తెలుసుకొన్నవాడు కాబట్టి దేనికీ లొంగడు !"

((()))

నేను భగవంతుని పనిముట్టునే అనే భావంతో ఇతరుల కష్టాన్ని తగ్గించటానికి ప్రయత్నిస్తే నీవు కృతార్థుడవైనా, కాకపోయినా ఆధ్యాత్మికంగా పురోగమిస్తావు. కాబట్టి ప్రపంచంతో మన వ్యవహారాలు ఇష్టాల వెంట పరుగెత్తేవిగా కాకుండా ఆ ఇష్టాన్ని అందులో ప్రేమరూపంలో ఉన్న దివ్యత్వాన్ని ఆకళింపు చేసుకునే విధంగా విశాలమైన ప్రేమభావంతో ఉండాలని శాంతిని మన ప్రయత్నం లేకుండానే పొందే మరో సులభోపాయం సద్గురు సన్నిధి. 'ఆత్మానుభవం అయినవారి' సన్నిధిలో కాలం గడపటం మనకు అసంకల్పితంగానే ఆ ప్రశాంతతను పంచుతుంది.  శ్లాఘనీయమైన ఆ పరమోత్కృష్టమైన స్థితి, ఆత్మవిచారం వల్ల ఈ జన్మలోనే లభించే ఈ స్థితి సాధుసమక్షంలో [ఆత్మ సాక్షాత్కారం కలిగిన వారి సమక్షంలో] హృదయంలో ఉదయిస్తుంది. అది ఎందరి ప్రబోధకుల ప్రవచనాలు విన్నా, ఎన్ని శాస్త్రాలను క్షుణ్ణంగా అభ్యసించినా, ఎన్ని సత్కార్యాలు చేసినా, ఏమి చేసినా లభించదు.  

ఆత్మే సర్వభూతరూపము !

ఆత్మే సర్వ ప్రపంచము. ఆత్మ గగనాకారాము. ఆత్మ నిరంతరము. అంటే నిరంతరం మనకి అనుభవంలో ఉండేది. మనకు ఈ ఆకాశమంతా నిండికనిపించేది, ప్రపంచంగా అనుభవంలో ఉన్నది ఆత్మకు భిన్నంకాదని తెలియజేస్తున్నారు. ఒక్కసారి ఆత్మస్వరూపం తెలిస్తే ఇక ఆత్మే సర్వజ్ఞానముగా ఉంటుంది. పరమ శాంతి స్వరూపమైన ఆత్మానుభవం కలిగితే దాని విలువ తెలుస్తుంది. అప్పుడు ఆత్మే పరమ ధనముగా ఉంటుంది. మనకు ప్రపంచంగా కనిపించే నీరు, నింగి, నిప్పు, నేల, గాలి... ఈ పంచభూతాలన్నీ ఆత్మస్వరూపమే. అందుకే ఆత్మే సర్వభూతరూపము !

సర్వదా ఉన్నది ఆత్మే !

దాని లక్షణం పరమ సుఖం !!

శ్రవణము అంటే ఆలకించడం. కేవలం విని ఊర్కోవడంకాదు. రోజంతా మన ప్రమేయం లేకుండానే మనకు వినబడే విషయాలు అనేకం ఉంటాయి. కాని మనం శ్రద్ధపెట్టి ఆలకించేవి కొన్నే ఉంటాయి. సద్విషయాలు అలా ఆలకించినప్పుడే సత్యం అనుభవంలోకి వస్తుంది. సత్యం అంటే "ఇదేమీ లేదు.. ఉన్నదల్లా కేవలము నేనే " అని తెలియడం. సర్వదా ఉన్నది ఆత్మే. దాని లక్షణము పరమ సుఖము. ఇది తెలియడమే ఆధ్యాత్మికసాధనలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఒక్కసారి అది తెలిస్తే ప్రతిసారీ ఆ స్మరణ అక్కర్లేదు. ఇక ఆత్మే పరమసత్యము అని సదా అనుభవంలో ఉంటుంది !

((()))

ఋణానుబంధం 

అన్నిటిని పరిత్యజించి మోక్షానికి వెళ్లవలసిన ఒక యోగి, ఒకనాటి మండుటెండలో వెడుతూ ఎండకి ఓర్చుకోలేక,  ఒక చెప్పులు కుట్టే వాడు దారిలో పెట్టిన చెప్పులపై కొంత సేపు నిలబడ్డాడు.

ఆ మాత్రం నిలబడినందున, ఆ ఋణం తీర్చు కోవడానికి  మరుజన్మలో ధారానగరంలో పరమేశ్వరి, సోముడు - అనే దంపతులకు సునందుడు అను పేరుతో పుట్టాడు. జాతకం చూపిస్తే,  పెద్దలు ఆ తలిదండ్రులకు ఒక హెచ్చరిక చేస్తారు. ఈ బాలుడు మీకు చాలా చాలా తక్కువ రుణపడి ఉన్నాడు. 'వాడి చేతి నుంచి పైసా కూడా తీసుకోకండి. అతడికి మీరే అన్నీ ఇస్తూండండి' అని చెప్తారు. 

నాటినుంచీ తల్లిదండ్రులు వానినుంచి ఏమీ ఆశించకుండా పెంచుతారు. పూర్వజన్మ గుర్తున్నందున ఆపిల్లవాడు వారి రుణంతీర్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. 

ఒకరోజు రాత్రి రాజభటుడైన తన తండ్రికి బదులుగా తాను రాజనగరుకు కాపలా కాయవలసి వచ్చింది. అపుడు ప్రతి జాముకీ ఒకసారి ఆ యువకుడు నగరప్రజలను హెచ్చరిస్తూ హితవు ఒకటి చెబుతుండే వాడు. రాజుగారు మారువేషంలో తిరుగుతూ ఇవన్నీ విని ఇతడు సామాన్యుడు కాడని గుర్తిస్తాడు. మరునాడు స్వయంగా అతడి ఇంటికి వెళ్లి రాత్రి తాను అన్నీ విన్నాననీ, తన మనసు ప్రశాంతి పొందిందనీ అంటాడు. 

పళ్లెంలో వెంట తెప్పించిన ధనాన్ని అతడికి అందిస్తాడు. అతడు వెంటనేె ఆ ధన రాశిని తల్లికి ఇవ్వగా ఆమె పుత్రోత్సాహంలో,  నియమం మరచి ఆ పళ్లెం అందుకుంటుంది. వెంటనే అతడు తనువును విడిచి ముక్తి పొందుతాడు. 

తలిదండ్రులు దుఃఖిస్తే రాజు ఆ యువకుడు రాత్రి కావలి సమయంలో చెప్పిన ఈ క్రింది ఉపదేశాలు వినిపించి ఓదారుస్తాడు : 

1. మాతా నాస్తి, పితా నాస్తి,  నాస్తి బంధు సహోదరః| 

అర్థం నాస్తి, గృహం నాస్తి,  తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 

తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 

2. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః పునః| 

సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 

తా:- ఈ జన్మ, వృద్ధాప్యము, భార్య, సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు. తిరిగి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 

3. కామః  క్రోధశ్చ, లోభశ్చ దేహే తిష్ఠతి తస్కరాః| 

జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 

తా :-  కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు  విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్నదొంగలు. 

కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 

4. ఆశయా బధ్యతే జంతుః కర్మణా బహు చింతయా| 

ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 

తా:- ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఏదో ఆశకు, కర్మకు కట్టుబడి ఏవేవో ఆలోచనలతో,  జీవితాలు 

గడుపుతుంటారు. ఆయుర్ధాయం తరిగిపోతుందన్న విషయాన్ని గమనించరు. 

కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 

5. సంపదః స్వప్న సంకాశాః యౌవనం కుసుమోపమ్| 

 విద్యుచ్చంచల ఆయుషం తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 

తా:- మన సంపదలన్నియు ఒక కలవంటివి, అంటే అశాశ్వతాలు.  యౌవనం పూవుతో సమానం అంటే ఎపుడు వాడి నశిస్తుందో తెలియదు. ఆయుష్షు మెరుపుతీగవలె చంచలమైనది.  

కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 

6. క్షణం విత్తం, క్షణం చిత్తం, క్షణం జీవితమావయోః| 

యమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 

తా:- ధనము, బుద్ధి, జీవితము ఇవన్నియు క్షణభంగురములు. మన ప్రాణములను హరించుటకై వేచియున్న యముడు ఏ మాత్రము దయ జూపడు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 

7. యావత్ కాలం భవేత్ కర్మ తావత్ తిష్ఠతి జంతవః| 

తస్మిన్ క్షీణే వినశ్యంతి తత్ర కా పరివేదన|| 

తా:- ప్రపంచంలో తమ కర్మబంధము ఎంతవరకు ఉంటుందో,  అంతవరకే ప్రాణులు జీవిస్తాయి. ఆ కర్మబంధం వీడిపోగానే మరణిస్తారు. జననమరణాలు జీవుని ధర్మము. దానికి బాధపడటం ఎందుకు. 

8. ఋణానుబంధ రూపేణ పశుపత్నిసుతాలయః| 

ఋణక్షయే క్షయం యాంతి తత్ర కా పరివేదన|| 

తా:- గత జన్మ ఋణానుబంధము ఉన్నంతవరకే భార్య, సంతానం, ఇల్లు, పశువులు ఉంటాయి. ఆ బంధం తీరగానే ఇవన్నీ నశించిపోతాయి. అందుకు వ్యథ చెందడ మెందుకు. 

9. పక్వాని తరుపర్ణాని పతంతి క్రమశో యథా| 

తథైవ జంతవః కాలే తత్ర కా పరివేదన|| 

తా:-  పండిన ఆకులు చెట్టునుండి ఆకులు ఏ విధముగా రాలిపోవునో అదే విధముగా ఆయువు తీరిన వారు మరణింతురు. దానికై దుఃఖించుట ఎందులకు? 

10. ఏక వృక్ష సమారూఢ నానాజాతి విహంగమాః| 

ప్రభతే క్రమశో యాంతి తత్ర కా పరివేదన|| 

తా:-  చీకటి పడగానే అనేక జాతులు పక్షులు ఒకే వృక్షం ఆశ్రయించి విశ్రమిస్తాయి. తెల్లవారగానే ఆ పక్షులు అన్నీ చెట్టును విడచి తమతమ ఆహార సంపాదనకు వెళ్ళిపోతాయి. అదే విధంగాబంధువులతో కూడిన మానవుడు కాలమాసన్నమైనపుడు తన శరీరాన్ని ఇంటిని వదలి వెళ్ళిపోతాడు. అందుకు బాధపడ నవసరములేదు. 

11. ఇదం కాష్టం ఇదం కాష్టం నధ్యం వహతి సంగతః| 

సంయోగాశ్చ వియోగాశ్చ కా తత్ర పరివేదన|| 

తా - ప్రవహించే నదిలో రెండు కట్టెలు దగ్గరకు చేరతాయి. కొంతదూరం కలిసి పయనిస్తాయి తరువాత విడిపోతాయి. అదేవిధంగా మానవుడు ఈ ప్రపంచ ప్రవాహంలో కొంతకాలం సంయోగసుఖమును, మరికొంతకాలం వియోగదుఃఖమును అనుభవిస్తాడు. దానికి పరివేదన చెందనవసరములేదు. 

ఈచివరి శ్లోకం భార్యభర్తల గురించి సంకేతంగా చెప్పినదే! ఒక అమ్మాయి,ఒక అబ్బాయి వేరు వేరు కుటుంబాలలో జన్మిస్తారు. వీరిద్దరు జీవితమనే నదిలో కలుస్తారు. కొంతకాలం కలిసి బతుకుతారు. కాలం సమీపించడంతో ఒకరు కైవల్యం చెందుతారు, మరొకరు ఉండిపోతారు మరికొంతకాలం. ఇది సహజం మరియు సృష్టి క్రమం.

ఇందులో  వేదన ఉండదని చెప్పలేదు. వేదన పడవద్దనీ చెప్పలేదు. సృష్టి సహజంగా వేదన తప్పదు. అందునా ఇద్దరు చాలా సంవత్సరాలు కలిసి జీవించిన వారిలో ఒకరు జారిపోతే మరొకరు వేదన పొందక ఎలా ఉండగలరు? సహజమైన వేదనను అడ్డుకోలేం. దానిని అనుభవించవలసినదే! 

మరి పరివేదన పనికిరాదన్నారు. వేదనకి, పరివేదనకి తేడా ఉంది. వేదన సహజాతం.  దానిని అను భవించాలి, పరివేదన అలాకాదు, మనం తలుచుకుని తలుచుకుని వేదన చెందడాన్నే పరివేదన అంటారు. ఈ పరివేదన పనికి రాదన్నారు. 

 యఇది సహజం, సృష్టి క్రమం సుమా! ఏడిస్తే పోయినవారు తిరిగొస్తారా? రాగలరా? సాధ్యమా? సృష్టి క్రమం ఇలాగే జరుతుంది, వేదన తప్పదు, పరివేదన పడకు అన్నారు.

మానవులలో చాలా రకాల బంధుత్వాలున్నాయి, కాని భార్యాభర్తలది ప్రత్యేక బంధం, ఇటువంటిది మరొకటి లేదు. అందుకే వీరిగురించి మాత్రమే ప్రత్యేకంగా ఉదహరించి చెప్పేరు. దంపతులిద్దరూ ఒకసారి పోరు, ఎవరి సమయమొస్తే వారు జారిపోతారు, రెండవవారు మిగిలిపోతారు,కొంతకాలం, ఒంటరిగా. 

ఇది అందరు భార్యభర్తలకీ జరిగేదే! 

ఇది సహజ పరిణామం,సృష్టి క్రమమమని చెప్పి ఓదార్చడమే లక్ష్యం.

((()))

ప్రయాణం

  

అంతులేని పయనం........!!!

ఎవరి ప్రయాణం ఎరుగని ప్రయాణం ఎక్కడికో ........!

తెలియని మనుషులు తెలుసుకోలేని భాష అడిగితె అర్ధమౌతుందో లేదో......!!

ఆలోచనతో ఆగిపోయి సాగిపోయే సామన్య వ్యక్తుల సాధారణ ప్రయాణాలు.........!!

పక్కవాడు పలకరింపుకోసం పాకులాటలోనే మాట కలుపుకొని పట్టుకున్న పెట్టె బేడ జాగ్రత్తలకు పడే పడిగాపులు.......!!

అరక్షణ లేనిది అందరికీ అనువుగా అందుకునేది........!!

ముందేవరు మూట పెడితే వారికే స్థానం తరువాత వచ్చేవాడు బ్రతిమాలితే పక్కకు జరుగుతారో లేదో అనుమానం..........!!

సాగిపోయే పయనంలో ఊచలు పట్టుకొని అటు ఇటు తలవొంపుల తలనొప్పులతో తోటి వారి తొడల పై తెలియనివాని భుజాలపై జల జల జారే చోంగలు చమటలుతో వేలాడుతూ పయనం.........!!

ఎక్కేవాడు దిగేవాడు చోటుకోసం వెతుకులాట.......!!

దారిలో కడుపు నింపుకు కాఫి పిలుపులతో కష్టపడే కష్ట జీవి........!!

కొనేవాడు కొంటాడు లేనివాడు పొమ్మంటాడు ఇది వాడికి కొత్తకాదు ఇది వారి రోజు వారి జీవనం.........!!

పరిచయం పెరిగి పలకరింపుతో పిలిచేలోపు దిగిపొతే మరొక కొత్త వ్యక్తి పరిచయం........!!

మాటల్లో మతాలు రాజకీయాలు ఆటలు పాటలు సినిమా చర్చలతో ఏర్పడే స్నేహం

స్నేహాభావంతో వాదనలతో గడిచిపోయే సమయం..........!!

అడ మగ ఆనే తేడాలుండవు దొరికిన చోట పడుకుంటే పగలయ్యేలోపు

ఎవరు ఎక్కడ దిగిపోయారో తెలుసుకోలేని ప్రయాణం...........!!

ఇది మన భారతదేశం సంస్కృతి సంప్రదాయం మనం భారతీయులం

దేశం మొత్తంమీద రోజు ఆగకుండా అన్ని దిశల్లో నలుగురు నాలుగు దిక్కుల్లో

పయనించేందుకు అన్ని వర్గాల వారికి అందుబాటులో అందించే అంతులేని ప్రయాణం

భారతీయ రైలు ప్రయాణం.......!!!


 అనన్యమైన భక్తి

అవలక్షణాలు అన్నీ వదిలిపెట్టి బ్రహ్మజ్ఞానమును పొందిన వాడు ఎల్లప్పుడూ ప్రశాంతమైన మనస్సు కలిగి ఉంటాడు. దేనికీ దుఃఖించడు. దేనిని కోరుకోడు. అన్ని వస్తువులను సమదృష్టితో చూస్తాడు.

అన్ని ప్రాణులలో పరమాత్మను దర్శిస్తాడు. అప్పుడు అతని భక్తి పరాకాష్టకు చేరుకుంటుంది. పరమాత్మ భక్తిని పొందిన వాడి పరిస్థితి ఏంటి అని చెబుతున్నాడు.

ఒకసారి పరమాత్మ యొక్క పరమమైన భక్తి తత్వమును పొందితే అతనిని సుఖములు దుఃఖములు బంధించవు. అతడు దేని కొరకు దుఃఖించడు. ఏదీ కావాలని కోరుకోడు. ఉన్నదానితో తృప్తిగా జీవిస్తాడు. అతని మనసు ప్రశాంతంగా ఉంటుంది. అతనికి ఏ కోరికా ఉండదు.

అన్ని ప్రాణులను సమంగా చూస్తాడు. పరమాత్మయందు నిర్మలమైన భక్తిని కలిగి ఉంటాడు. అంటే ఇవి జీవన్ముక్తుని లక్షణములు. ఈ శరీరములో ఉండి కూడా పరమాత్మలో ఐక్యం అయిన వాడు. మనసును ఆత్మలో స్థిరంగా ఉంచిన వాడు.

ప్రాపంచిక విషయముల యందు ఎటువంటి ఆసక్తి, అనురక్తి, మమకారము లేని వాడు. అతడికి దు:ఖము సుఖము అంటే ఏమిటో తెలియదు. అంతా సమానంగానే ఉంటుంది. మనస్సు నిర్మలంగా నిశ్చలంగా స్థిరంగా ఉంటుంది. నీచ జంతువులలోనూ ఉత్తమ మైన మానవులలోనూ పరమాత్మను దర్శిస్తాడు.

మనం చూచే ప్రపంచం అంతా మనసుతో కల్పించబడినది అని తెలుసుకుంటాడు. అతడికి కోరదగ్గది, పొందతగ్గది అంటూ ఏమీ ఉండదు. సంతృప్తుడు అవుతాడు. ఇది భక్తిలో పరాకాష్ట. అందుకే మద్భక్తిం లభతే పరామ్ అంటే నా యొక్క పరమమైన భక్తి లభిస్తుంది. పరమ భక్తి అంటే శంకరాచార్యులవారు ఈవిధంగా చెప్పారు.

"స్వస్వరూపాను సంధానం భక్తి రిత్యభిధీయతే" అంటే తన యొక్క స్వస్వరూపమును తెలుసుకోవడమే, ఆత్మతత్వమును అనుసంధానము చేసుకోవడమే పరమమైన భక్తి. అనన్యమైన భక్తి. అదే జ్ఞానము. అది తెలిస్తే ఇంక తెలుసుకోదగ్గది అంటూ వేరే ఉండదు.

((()))

తత్వబోధ

బుధ్ధి సాత్వికాంశలో ఉంటే సాక్షిగా ఉంటుంది ... రాజసికాంశలో ఉంటే పాత్రతో కలిసిపోతుంది ... గుర్తింపు కోరుతుంది. మనసు సాత్వికాంశలో ఉంటే ప్రశాంతముగా ఉంటుంది.

గర్భస్థశిశువుగా ఉన్నప్పటి నుండే చిత్తం ప్రభావం ఉంటుంది. సాత్వికాంశ లో ఉంటే చిత్ శక్తిని గుర్తించడానికి ఉపయోగపడు తుంది చిత్తము. రాజసికాంశలో ఉంటే విశేష లక్షణాన్ని పట్టుకుంటుంది. చిత్తం శ్రీవారు, బుధ్ధి శ్రీ మతి. బుధ్ధి ఎప్పుడూ చిత్తాన్ని సాత్వికాంశలో ఉంచాలి.

చిత్తం చిత్ శక్తి అయిన దైవం మీద ఊంచుకొని ఉంటే దైవానికి, చిత్తానికి అవినాభావ సంబంధము  ఊంచుకొని= ఆధారంగా ఉండుట.

అహంకారం అన్నిటితో తాదాత్మ్యతా సంబంధం పొందుతుంది. అహంకారం శ్రియ:పతి బ్రహ్మము ఆకార భ్రాంతిని విడిస్తే.

తత్వాల గురించి తెలుసుకోవటమే సాంఖ్య విచారణ, తారకం, అమనస్కం దృష్ట్యా తెలుసుకోవాలి.

 జ్ఞానేంద్రియాలను సాత్వికాంశలో వాడటమే గృహస్థా శ్రమం, అవస్థా త్రయాన్ని దాటగలిగే బలాన్నిస్తాయి.

అశరీరి గురువు సర్వవ్యాపకుడు.

గీత నాలుగు మాటలు చెప్పింది.తత్ బుధ్ధి- తదాత్మ- తన్నిష్ట -తత్పరం తత్ బుధ్ధి సాధన తదాత్మ అలా జీవనం తన్నిష్ఠ అది అయిపోతావు స్వాధీనమై ఉన్న స్థితే, నిష్ఠ, స్వస్థితి, తత్పరం ఈ నాలుగు మాటలకు "రాజ యోగమని పేరు".

మమైవాంశో జీవలోకే  జీవులు నా అంశీ భూతం  నేను రధికుడను.

 సాధకుడు తప్పనిసరిగా ఉండవలసినవి  శాస్త్రం ( తత్వజ్ఞానమే శాస్త్రం) గురువు దైవం.ఆత్మ ఈ నాలుగిoటి మీద విశ్వాసం ఉండాలి  ప్రాణ సమంగా భావించటమే విశ్వాసం.

మనసు- హృదయం- చైతన్యం-ఈ మూడు స్థాయిలలో అనుసరించి ఐక్యతా సిధ్ధిని పొందాలి.

సృష్టిలో ఏదైనా ఇవ్వబడుతోంది పరమాత్మచే నువ్వు పొందబడవలసినదేదో అది ముందుగానే నిర్ణయించబడి ఉన్నది.

' ప్రసాద బుధ్ధేన హాని రస్యోప జాయతే' పరమాత్మ ధాత-భర్త-ప్రభువు- దాత.

సృష్టిలో తిరుగు లేని ఆయుధం దం, తం సంస్కృత బీజాక్షరాలు దం-ఇచ్చునది తం-కాపాడునది.

ఏకం సత్ అనే జ్ఞానం ఇచ్చునది. ఏకం సత్ అనే జ్ఞానం రక్షింప బడుతుంది.

పరమాత్మను జ్ఞానం కొరకు మాత్రమే ఆశ్రయించినవారు తప్పక తరిస్తారు.

((()))

ప్రాంజలి ప్రభ --నేటి ఆధ్యాత్మిక బ్రహ్మానందం  12-09-2021

లౌకికమైన సుఖాలన్నీ వచ్చిపోయేవి. కానీ ఆత్మసుఖం మనతోనే ఉండిపోయేది. అది లౌకికసుఖంలా కష్టపడి సాధించాల్సింది కాదు. మనలోనే, మనతోనే స్వతఃస్సిద్ధంగా ఉండేది. ఆ పరమసుఖమే శాంతిగా, ఆనందంగా వ్యక్తమౌతుంది. పిల్లల్లో పక్వత వచ్చిన తర్వాత వారికి పెద్దలు చెప్పిన విషయాల్లోని ప్రయోజనం అర్థమైనట్లే మన మనసుకు కూడా పక్వత వస్తే మహానుభావులు సూచించే విషయాలు అర్థం అవుతాయి. 

లలితా సహస్ర నామావళి యందలి "అభ్యాసాతిశయజ్ఞాతా " యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం అభ్యాసాతిశయజ్ఞాతాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఉపాసించు సాధకులకు ఆ తల్లి కరుణచే తాము  చేయు సాధనలో పరిపూర్ణత ఏర్పడి  తరింతురు।

నిత్యము నిద్రనుండి లేచినది మొదలు మరల నిద్రపోవు వరకూ, జీవితకాలమంతయునూ వేదాంతవిచారణ చేయుటయే అభ్యాసము। 

అజ్ఞానులు ఇష్టానుసారము సంసారచక్రమున తిరుగుచుందురు గాక ! పరమానంద భరితుడనైన నేను దేనిని కోరి సంసారమున సంచరింతును ?

జ్ఞానికి కోరవలసినదేముంటుంది ? అంటే,  ఏమీ ఉండదని భావము. దుఃఖితులైన అజ్ఞానులు పుత్రకళత్రాదుల మీది కాంక్షతో ఈ ప్రపంచంలోకి వస్తూ పోతూ ఉంటే ఉండుగాక !

నేను పరమానంద పరిపూర్ణుడను.నేను ఇంకా ఏ కోరికల కోసం మళ్ళీ ఈ ప్రపచములోకి రావాలి ?

నాకేమీ కోరికలు లేవు కాబట్టి మళ్ళీ జన్మ పరంపరలో చిక్కుకోవలసిన అగత్యం లేదు,

అధికారం ఉన్నవారు శాస్త్రాలను వ్యాఖ్యానించవచ్చు, లేదా వేదశాస్త్రాదుల్ని అధ్యయనముచే ఇతరులకు భోధించవచ్చు గాక. కాని నాది "నిష్ర్కియ బ్రహ్మ" స్వభావం అయినందున నాకు వీనియందు అధికారము లేదు.

ఉదరపోషణ కోసం భిక్షాచరణం చేస్తున్నారు,పరలోక ప్రాప్తికోసం స్నాన ధ్యానాదులు చేస్తున్నారు  గదా ! మీరు నిష్ర్కియులు ఎట్లా అవుతారు ? అని అనవచ్చు, అంటే -

నిద్రింపవలెననిగాని భిక్ష చేయవలెననిగాని స్నాన శౌచములకై గాని - వీటిపై నాకు

కోరికలేదు,నేను వీటిని కోరటం లేదు.ఇతరుల భావనల వలన నాకు కలుగునదేమి ? 

ఇతరులు కల్పించుకొనే వాటివల్ల నాకు కలిగే నష్టమేముంది ?

ఇతరుల కల్పనవల్ల కూడా నిష్ర్కియత్వానికి బాధ కలగవచ్చు కదా ! అంటే -

చైతన్యపు ఎరుక అనే అనుభవమే భక్తి యొక్క స్థితి. వాడిపోని స్వచ్ఛమైన ప్రేమే భక్తి అంటే. ప్రేమ యొక్క శిఖరాన్ని అధిరోహిస్తే విముక్తి లభిస్తుంది. అదే అన్ని మతాల సారాంశం. ఆత్మానుభూతే ప్రేమంటే ! దాని అర్థం ప్రేమనే చూడటం, వినటం, అనుభవించటం, రుచి-వాసన చూడటం, అదే పరమానందం కాబట్టి ప్రాపంచిక విషయాలపై మనకున్న ఇష్టాన్ని విశాలం చేసుకుని అందులోని ప్రేమభావాన్ని వ్యక్తంచేస్తే అది కూడా ఆత్మ సాధనకు అనుకూలిస్తుంది. సత్కార్యాల నిర్వహణ, సేవాతత్పరత, సహనశీలత వంటివి అనుసరించేకొద్దీ మనలోని ప్రేమ పరిమళించి ఆత్మానుభవాన్ని తెలుసుకునేలా దోహదపడుతుంది. 

((())))

నేటి ఆధ్యాత్మిక ఆనందం  12-09-2021

ఏ సన్నివేశము నందుగాని, సంఘటన మందుగాని, అకస్మాత్తుగా జరుగు సంఘటనల యందు గాని చెదరకుండుట అభ్యసింపుము.  దైవము యొక్క స్మరణము భావరూపమున గాని, మంత్రరూపమునగాని నిరంతరము చేయుట ఒక ఉపాయము. 

దైవమును ఒక నామము నందో, ఒక రూపము నందో, ఒక కాలమునందో లేక ఒక దేశము నందో స్మరించుట ప్రాథమికమగు అభ్యాసము.   అంతర్యామిని అంతట దర్శించుట చేయు ప్రయత్నము సత్యమైన సాధన. ఈ సాధన ద్వారా అస్థిరస్థితి నుంచి మనస్సు స్థిరస్థితిని చేరుకొనగలదు.

 విజ్ఞానము యొక్క ఫలితముగా, అజ్ఞానముతో కూడిన ఫలితముల నుండి విముక్తి పొందుట జరుగుతుంది. అజ్ఞానమునగా (బంధనాలు ప్రపంచజనావాక్కు) . ఈ విషయము ఎడారిలోని ఎండమావి వంటిది. ఏ ప్రయోజనము లభించదు. అలా కాక బ్రహ్మమును గూర్చి తెలుసుకొన్నచో ఫలితములు చెడుగా ఉండవు కదా! 

 హృదయములో అజ్ఞానముతో కూడిన ముడులు పూర్తిగా విడిపోయిన, ఏవిధముగా అట్టి వ్యక్తి స్వార్ధ పూరితముగా వ్యవహరించగలడు? అట్టి వ్యక్తి భౌతిక వస్తు సముదాయ ఆనందాలకు విముఖుడై ఉంటాడు. 

 ఎపుడైతే బాహ్య వస్తు సముదాయము పట్ల ఏవిధమైన కోరికలు లేనిచో అతడు శాంతి శిఖరమును అదిరోహించగలడు. జ్ఞానము యొక్క అత్యున్నత స్థితి వలన, అహంకార పూరితమైన భావనలన్నింటికి అంతము పలికినట్లే. మరియు స్వయముగా అతడు తాను విముక్తి మార్గమును చేరి ఈ భౌతిక బంధనాలన్ని ఆత్మలో విలీనమై అదృశ్యమవుతాయి. 

407వ నామ మంత్రము :ఓం శివమూర్త్యై నమః

శివుడే తన స్వరూపముగా విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము।

శ్రీలలితా సహస్ర నామావళి యందలి శివమూర్తిః అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం శివమూర్త్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు సాధకులకు మోక్షస్వరూపిణియైన పరమేశ్వరి కరుణచే, ఆ భక్తుల జీవనమంతయు మంగళకరమగును మరియు శాంతిసౌఖ్యములకు, సిరిసంపదలకు కొరతలేకుండా ఉండును।

శ్రీచక్రం లోని నాలుగు సమద్విబాహు త్రిభుజాలు ఉర్ధ్వముఖంగా ఉండి శివుణ్ణి లేదా పురుష శక్తిని సూచిస్తాయి। అయిదు సమద్విబాహు త్రిభుజాలు నిమ్మముఖంగా ఉండి శక్తిని లేదా స్త్రీని సూచిస్తాయి। కావున శ్రీ చక్ర యంత్రము వ్యతిరేక దివ్యశక్తుల సంగమమును సూచిస్తుంది।  ఆ విధంగా శివశక్త్యైక్యము ప్రస్ఫుటమగుచున్నది।  

 శ్రీమాత్రేనమః

నేటి ఆధ్యాత్మిక ఆనందం  11-09-2021
ఏ సన్నివేశము నందుగాని, సంఘటన మందుగాని, అకస్మాత్తుగా జరుగు సంఘటనల యందు గాని చెదరకుండుట అభ్యసింపుము. దీనివలన ఎంతయూ ప్రయోజనము కలుగును. నిశ్చలమైన మనస్సును ఏర్పరచుకొనుటకు అనేక రకములగు అభ్యాసములతోను. దైవము యొక్క స్మరణము భావరూపమున గాని, మంత్రరూపమునగాని నిరంతరము చేయుట ఒక ఉపాయము. 

తనయందు, తన పరిసరముల యందు సతతము సాన్నిధ్యము నిచ్చుచున్న అంతర్యామిని ఎరిగియుండుట మరియొక యుపాయము. అనగా అన్యచింతన లేక అనన్యచింతన యందు నిలబడుట, దీనినే భగవానుడు పర్యుపాసనము అని తెలిపినాడు. ఈ ఉపాసనము దేశము, కాలము, నామము, రూపము అను పరిమితులు దాటి జరుగుచుండవలెను. 

దైవమును ఒక నామము నందో, ఒక రూపము నందో, ఒక కాలమునందో లేక ఒక దేశము నందో స్మరించుట ప్రాథమికమగు అభ్యాసము. అభ్యాసము ము…

స్వర్గలోకప్రాప్తి, ఉత్తమజన్మము,అధికారము వంటివానిని పొందుటకై వివిధములైన కర్మలను ఉపదేశించు వేదములందలి మధురమైన వాక్కుల యెడ అల్పజ్ఞులు అనురక్తులగుదురు. 

2/42 భగవద్గీత 

సాధారణముగా జనులు మందమతులై యుందురు. అజ్ఞానకారణముగా వారు వేదమందలి కర్మకాండ భాగములోని సకామ కర్మల యెడనే అనురక్తులగుదురు. మదిర, మగువ, లౌకికవైభవములు పుష్కలముగా లభించు స్వర్గలోకమునందు జీవితము ననుభవించుటను తప్ప వారు వేరేదియును కోరరు. అట్టి స్వర్గలోకములను పొందుటకు పెక్కు యజ్ఞములు(ముఖ్యముగా జ్యోతిష్టోమ యజ్ఞములు) వేదములందు ప్రతిపాదింపబడినవి. 

  నిన్ను చుట్టుముట్టిన సమస్త అస్తిత్వం దైవికమైన శక్తి. అదెప్పుడూ నీకు అందుబాటులో వుంటుంది.  కానీ మనం హృదయాల్ని తెరిచి వుంచం. హృదయాన్ని తెరిచి వుంచు. దేవుణ్ణి అందుకుంటావు. 

సమస్త అసిత్వం, నిన్ను చుట్టుముట్టిన సమస్త అస్తిత్వం దైవికమైన శక్తి. అది నిన్ను రక్షిస్తుంది. నీ పట్ల జాగ్రత తీసుకుంటుంది. అదెప్పుడూ నీకు అందుబాటులో వుంటుంది. అది చేజారి పోయిందంటే అది నీ వల్లనే జరుగుతుంది. నువ్వు నీ తలుపులు మూసి వుంటే సూర్యకాంతి బయటనే వుంటుంది. నువ్వు చీకట్లో వుంటావు. ఒక వేళ తలుపులు తెరిచినా సూర్యకాంతి లోపలికి వచ్చినా నువ్వు కళ్ళు మూసుకుంటే చీకట్లోనే వుంటావు.

అదే విషయం దేవుడికి సంబంధించినది అయినా ఆయన ప్రేమ ఎప్పుడూ అక్కడ వుంటుంది. మన హృదయాలే మూసుకుని వుంటాం. హృదయాల్ని తెరిచి వుంచం. హృదయాన్ని తెరిచి వ…


నేటి ఆధ్యాత్మిక ఆనందం  10-09-2021

సాధన, స్వాధ్యాయనము రెండూ ఉండాలి. బాహ్య బహిరంగ వ్యవహారము చేత ఆచ్ఛాదితమై పోయింది నీ చైతన్యము, నీ శుధ్ధ చైతన్యము నీకు గోచరించటము లేదు.

ఎక్కడెక్కడైతే కదలికకు భావం కలిగిందో అదంతా సగుణం. ఎక్కడెక్కడైతే కదలిక అభావ మయ్యిందో అది నిర్గుణం.

నీలోని భావ రూప చలనములను తెలుసుకోవటమే ధ్యానము. దానికి సాక్షి ...విలక్షణముగా ... అతీతముగా ఉండి చూడాలి.

భౌతిక వ్యవహారం మనసును నియంత్రించే ప్రపంచం ఇది ఇష్టంగా మారుతుంది, అంటే ప్రేమకు మరోముఖం. అందులో కూడా ఆత్మ ఆత్మానుభవమే ఉంది. ప్రేమ భగవంతుని స్వరూపం అదే ఆత్మ యొక్క నిజస్వరూపం. అదే శుద్ధానందం. కావాలనుకుంటే ఆనందమని గానీ, ఈశ్వరుడని గానీ, ఆత్మ అని గానీ అనవచ్చు. అదే భక్తి, అదే సాక్షాత్కారం ప్రేమ యొక్క రహస్యం తెలిసిన వారికి ప్రపంచమంతా ప్రేమమయంగా ఉన్నట్లు తెలుస్తుంది

మనం ఆత్మ స్వరూపులమని, ఆత్మ లక్షణము పరమ సుఖమని మహర్షి స్పష్టం చేస్తున్నారు. లౌకికమైన సుఖాలన్నీ వచ్చిపోయేవి. కానీ ఆత్మసుఖం మనతోనే ఉండిపోయేది. అది లౌకికసుఖంలా కష్టపడి సాధించాల్సింది కాదు. మనలోనే, మనతోనే స్వతఃస్సిద్ధంగా ఉండేది. ఆ పరమసుఖమే శాంతిగా, ఆనందంగా వ్యక్తమౌతుంది. పిల్లల్లో పక్వత వచ్చిన తర్వాత వారికి పెద్దలు చెప్పిన విషయాల్లోని ప్రయోజనం అర్థమైనట్లే మన మనసుకు కూడా పక్వత వస్తే మహానుభావులు సూచించే విషయాలు అర్థం అవుతాయి. “సర్వమూ బ్రహ్మమే” అనే వివరణము శ్రవణము చేయడమే ముక్తి ప్రదమని ఈ గీతబోధ !

మీరు ముందు శరీర దారుఢ్యాన్ని పెంచుకొని, అప్పుడు, మనోబలాన్ని పెంపొందించుకోండి. ప్రతిరోజూ ఏదైనా అర్ధయుక్తమైన దానిని సాధించడానికి ప్రయత్నించడమే మనోబలం పెంపొందించుకునే ఉత్తమ మార్గం. మీరు సాధించలేరు అని ఇతరులు చెప్పిన ఒక మంచి పనిని లేక ప్రణాళికను ఎంచుకొని, దానిని సాధించడానికి ప్రయత్నించండి. గతంలో మీరు చెయ్యలేమని భావించిన ఏదైనా పనిని ప్రతిదినం నెరవేర్చడానికి ప్రయత్నించండి.

ఓం శ్రీ మాత్రేనమ:--- ఓం శ్రీ గణేశాయనమ:  ఓం నమశివాయ : 

ప్రాంజలి ప్రభ --నేటి ఆధ్యాత్మిక బ్రహ్మానందం  09-09-2021

ఎందుకీ మానవ జన్మ  --  'ఎప్పుడు దీనికి విముక్తి" 

"జీవితం మీద మనకు విసుగు పుట్టినప్పుడు ‘ఛీ మనిషిగా ఎందుకు పుట్టాను రా బాబూ’ అని మనం అనుకుంటూ ఉంటాం. అసలు మనిషి జన్మ ఏమిటి, దీనికి విముక్తి ఎప్పుడు అనే విషయాలను తెలుసుకుందాం. నిజంగా మానవ జన్మ అంత నీచనికృష్టమైనదా, అసలు మనం ఈ భూమ్మీద ఎందుకు పుట్టాం… ఎందుకు చనిపోతున్నాం ? చనిపోయాక ఎక్కడికి పోతాం ? ఇలాంటి ప్రశ్నలన్నీ మనిషికి సర్వసాధారణంగా వస్తుంటాయి."

"మనం అనుకున్నట్లుగా మనిషి జన్మ నీచమైనది కాదు ఉత్తమోత్తమమైనది. పునరపి జననం… పునరపి మరణం అంటారు. జన్మ అంటే మళ్లీ పుట్టడం… అంటే చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుట్టడమే జన్మ. కానీ తిరిగి మానవ జన్మే వస్తుంది అని మాత్రం చెప్పలేం. ఎందుకంటే మనం ఎలాంటి జన్మ ఎత్తాలో మనం సంపాదించుకున్న జ్ఞానం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. కర్మ ఫలాలను బట్టే మనిషి జన్మ ఉంటుంది. 

మనిషి జన్మ అనేది దేవుడికి మనిషి చేరువ కావడానికి దొరికిన ఓ అపూర్వమైన అవకాశం. భక్తి మార్గంలో ఉండి వైరాగ్యం చెంది భగవంతుడిని చేరుకోవడానికి మనిషి జన్మ తప్పితే మరో జన్మలో ఆ అవకాశం లేదు. అయినా పూర్వ జన్మ పుణ్య ఫలంతో సాలీడు, ఏనుగు, పాము, నెమలి వంటివి దేవుడిని పూజించి ముక్తి పొందినట్టు మన పురాణ గ్రంథాలు తిరగేస్తే తెలుస్తుంది. కానీ మనిషిగా పుట్టిన వారంతా భగవంతుడికి దగ్గరయ్యే మార్గాన్ని నిజంగా ఉపయోగించుకుంటున్నారా లేదా అనేది మనకు మనం ఆలోచించుకోవాలి. మనిషి పుట్టినప్పటి నుంచి తాను చెయ్యాల్సిన మంచి పనులు చేయక తప్పదు. సంసార సాగరంలో ఈదుకుంటూ పోవడం తప్ప మనకు మరో దారి లేదు. ఇందులో మరో దారి లేదు."

"మనుషులకేనా చెట్లకు ఉండవా...                

ఇవన్నీ మానవ మాత్రులకేనా చెట్టూ చేమలకు ఉండవా అని మీరనుకోవచ్చు. అక్కడికే వద్దాం. ఒక చెట్టుకు మొగ్గ వచ్చింది. అది పువ్వై ఆ తర్వాత కాయగా మారింది. పండిపోయి కొంతకాలానికి అది నేల రాలిపోతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే పిందెగానో, కాయగానో ఉన్నప్పుడు దానిని కొమ్మ నుంచి కోసి వేరు చేస్తున్నప్పుడు అది ఉన్న చోటు నుంచి నీరు కారుతుంది. కాయ మొదలు లోనూ ఆ నీటి తడిని మీరు చూడవచ్చు. కానీ పండు రాలినప్పుడు కొమ్మలో ఎలాంటి నీటి తడి ఉండదు. పండు రాలిన చోట కూడా నీటి తడి ఉండదు. కానీ కాయ కోస్తున్నప్పుడు నీటి తడి ఉండటానికి కారణం, అయ్యో మరిన్ని రోజులు నన్ను అంటిపెట్టుకుని ఉంటే అది పండు అయ్యేది కదా అని చెట్టు కొమ్మ కంట తడి పెడుతుంది. కాబట్టి అక్కడ నీటి తడిని మనం చూస్తుంటాం."

"అలాగే కాయ మొదలులోనూ ఆ నీటి తడి ఉంటుంది. ‘అయ్యో ముందుగానే నన్ను చెట్టు కొమ్మ నుంచి వేరు చేసేశారు కదా’ అని కాయ కూడా బాధపడుతుంది. కానీ పండు విషయంలో అలా కాదు…. కాయ పండి రాలుతున్నప్పుడు చెట్టు కొమ్మన నీటి తడి కనిపించదు. పండు మొదలులోనూ నీటి తడి ఉండదు. రెండింటిలోనూ ఓ పరిపక్వత వస్తుంది. దాని బంధం అయిపోయింది కాబట్టే పండు రాలిపోయిందని చెట్టు కొమ్మ అనుకుంటుంది. పండు కూడా తన కాలం ముగిసినట్టు అనుకోవడంతో అటూ ఇటూ రెండువైపులా బాధ అనేది ఉండదు. అలాంటిదే మనిషి జీవితం కూడా.."

"సంసార చక్రంలో ఉండి కుటుంబ వ్యవహారాలు సాగిస్తున్న సమయంలో ఉన్నట్టుండి పక్కకు తప్పుకుంటే అటు కుటుంబ సభ్యులకూ బాధే. మధ్యలోనే దూరమవుతున్నామని అతనికీ బాధే. ఆ వ్యక్తి తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి నెమ్మదిగా జ్ఞానమార్గం వైపు అడుగులు వేస్తూ అందులో మునిగి తేలినప్పుడు అటు అతనికీ ఇటు కుటుంబ సభ్యులకూ బాధ ఉండదు. రెండువైపులా కన్నీరు కార్చడం అనేది ఉండదు. జ్ఞానమనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. నెమ్మదిగా రావాలి. అందుకే మెల్లమెల్లగా దాని వైపు అడుగులు వేయాలి."

"కర్మ ఫలాలు ఏమిటో తెలుసుకుందాం…        

జ్ఞానం, కర్మలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. జ్ఞానం పెరిగే కొద్దీ కర్మలు అంతరిస్తాయి. అనేక జన్మలుగా మనం చేసిన పాపపుణ్యాలు కర్మల రూపంలో మనతోనే వస్తాయి. ఈ కర్మలు మూడు రకాలుగా ఉంటాయి. ఆగామి, సంచితం, ప్రారబ్దం అని మూడు రకాలుగా ఈ కర్మలు ఉంటాయి."

"నిత్యం మనంచేసే కర్మలన్నీ ఆగామి కర్మల కిందికే వస్తాయి. కొన్ని వెంటనే ఫలిస్తాయి… మరికొన్ని తర్వాతి జన్మల్లో ఫలితాన్ని చూపిస్తాయి. మనం ఎన్ని పాపాలు చేశాం ? ఎన్ని పుణ్యాలు చేశాం ? దానదర్మాలు ఏమైనా చేశామా… లాంటివన్నీ ఆగామి కర్మల కిందిదకే వస్తాయి.

ఇక సంచిత కర్మలలోకి వెళదాం. మనం పూర్వ జన్మలో చేసిన కర్మలు ఈ జన్మకు వచ్చాయనుకోండి మనం ఈ జన్మలో కూడా వాటిని అనుభవించకుంటే అవి మళ్లీ రాబోయే జన్మకు వెళ్లిపోతాయి."

"వీటిని సంచిన కర్మలు అంటారు. ఉదాహరణకు గత జన్మలో మీరు ఒకర్ని హత్య చేశారనుకుందాం ఈ జన్మలో దాని ఫలితం అనుభవించాల్సి ఉన్నా రకరకాల కారణాలవల్ల అది జరగలేదు… అది రాబోయే జన్మకు తరలిపోతుంది. దీన్ని సంచిత కర్మ అంటారు. ఇక ప్రారబ్దం విషయానికి వస్తే అంతా నా ప్రారబ్దం అని మనం తరచూ అంటూ ఉంటాం !"



వేదం
--------
వేదాల గురించి చదువుతున్నప్పుడు, ప్రసంగాలు వింటున్నప్పుడూ కొన్ని కొన్ని పదాలు నాకు అర్థంకావు. ఆపదాల అర్థం తెలుసుకొనే ప్రయత్నంచేస్తూ, నాలాంటివారికి వుపయోగపడతాయని ఈ ప్రయత్నం.

అపౌరుషేయములు_తెలుపబడినవి.
--------------------------
వేదాలు ఏ మానవులచేతనూ
రచింపబడలేదు.కనుకనే వీటిని అపౌరుషేయములు అంటారు.

ద్రష్ట.---వేదములను తెలుసుకున్న ఋషులను
--------
ద్రష్టలు అంటారు

శృతులు----వినబడినవి. అందుకే వేదాలను శ్రుతులు అంటారు.
ఆ ఋషులకు వినబడినవి, దర్శించినవీ అదే విధంగా ఉఛ్ఛరిస్తూ శిష్యులకు బోధించారు.

అనుశ్రవం.----గురువు ఉచ్చరించిన దానిని శిష్యులు అదే విధంగా ఉచ్చరిస్తూ నేర్చుకోవాలి.

ఆమ్నాయము-----మననము ద్వారా నేర్చుకోబడే విద్య.

నిగమం,ఆగమం.-----భగవంతుని ఉశ్వాస నిశ్వాస రూపంలో బయలు పడేవి. ఇవి నాణానికి వుండే రెండు వైపుల వంటివి.
వీటి గురించి ఎంతో వివరణ ఇచ్చారు. కానీ ఇక్కడ మనం భగవంతుని ఆరాధనా, పూజా విధానాలు,,దేవాలయాల నిర్మాణ పధ్ధతులు తెలిపేవి ఆగమాలనీ, యగ్ఞయాగాదుల గురించి తెలిపేవి నిగమము లని అనుకుందాం.
శ్రీ మాత్రేనమః.
(సేకరణ)

#నారదమహర్షి!

#నారద ముని*
సామాన్యంగా నారదుడు అనగానే మనకు గుర్తు వచ్చేది ఏమంటే....
కలహాభోజనుడు అని, లేదా వారి మాటలు వీరికి వీరి మాటలు వారికి చెప్పేవాడు అని...
కానీ, అది ఏమాత్రం నిజం కాదు, లోక సంరక్షణ కొరకు, భక్త జన హితం కొరకు, చేసినవే కానీ తనకు ఏమాత్రం స్వార్ధం లేదు....

బ్రహ్మ మానస పుత్రుడనీ,
త్రిలోక సంచారి అనీ,
నారాయణ భక్తుడనీ,
ముక్తుడనీ ఇతని గురించి వర్ణనలలో తరచు వస్తుంది.

తెలుగు సాహిత్యంలోనూ, తెలుగు సినిమాలలోనూ నారదుని కలహ ప్రియత్వం, వాక్చతురత తరచు ప్రస్తావించబడుతాయి.
ఉపనిషత్తులు, పురాణములు, ఇతిహాసములలో నారదుని కథలు బహుళంగా వస్తాయి.

#ఎన్నో పురాణాలలో నారదుని పాత్ర కనుపిస్తుంది.

#అందులో ముఖ్యమైనవి

#భాగవతం, ప్రధమ స్కంధంలో నారదుడు వేద వ్యాసునికి భాగవతం రచింపమని బోధిస్తాడు. ఈ సందర్భంలోనే నారదుడు తన పూర్వ గాథను వ్యాసునకు వివరిస్తాడు.

#రామాయణం, బాలకాండలో నారదుడు వాల్మీకికి ఉత్తమ పురుషుడైన శ్రీరాముని గురించి చెప్పి రామాయణం వ్రాయమనీ, అది ఆచంద్రార్కం నిలిచి ఉంటుందనీ ఆనతిస్తాడు. అలా చెప్పిన భాగమే సంక్షిప్త రామాయణంగా చెప్పబడుతుంది.

#మహాభారతం సభా పర్వంలో నారదుడు
#నారద పురాణము
#నారద భక్తి సూత్రాలు
#నారదోపనిషత్తు

#నారదుని_పూర్వ_జన్మ_వృత్తాంతం*

మహాభాగవతం మొదటి స్కంధంలో నారదుడు తన గాథను స్వయంగా వేద వ్యాసునికి తెలిపాడు. తాను పూర్వజన్మ పుణ్య కారణంగా హరికథా గానం చేస్తూ ముల్లోకాలలో సంచరింప గలుగుతున్నానని చెప్పాడు.

పూర్వ కల్పంలో నారదుడు వేదవిదులైన వారింట పని చేసే ఒక దాసికి కుమారుడు. ఒకమారు అతడు చాతుర్మాస్య వ్రతం ఆచరించే కొందరు యోగులకు శ్రద్ధగా పరిచర్యలు చేశాడు. వారు సంతోషించి ఆ బాలునికి విష్ణుతత్వం ఉపదేశించారు. వారి దయవలన ఆ బాలుడు వాసుదేవుని అమేయ మాయాభావాన్ని తెలుసుకొన్నాడు. ప్రణవంతో కలిపి వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ మూర్తులను స్మరించి నమస్కరించినట్లయితే సమ్యగ్దర్శనుడౌతాని గ్రహించాడు.

అతని తల్లి ఒకనాడు పాము కాటువల్ల మరణించింది. అప్పుడు నారదుడు అన్ని బంధములనుండి విముక్తుడై అడవికి పోయి భగవత్స్వరూపాన్ని ధ్యానించ సాగాడు. ఏకాగ్ర ధ్యాన సమయంలో అతని మనస్సులో భగవత్స్వరూపం గోచరించింది. కాని మరుక్షణమే అంతర్ధానమైంది. చింతాక్రాంతుడై నారదుడు అడవిలో తిరుగుతుండగా అతనికి దివ్యవాణి ఇలా ఆదేశమిచ్చింది - ఈ జన్మలో నీవు నన్ను పొందలేవు. కాని నా దర్శనం వల్ల నీ సందేహాలు తొలగి అచంచలమైన భక్తి చేకూరింది. ఈ శరీరం త్యజించిన పిమ్మట నా పార్షదుడవై నన్ను పొంద గలవు. - నారదుడు సంతుష్టుడై నిరంతరం హరి నామ జపం చేస్తూ కాలం గడిపి, అంతిమ సమయం ఆసన్నమైనపుడు తన దేహాన్ని త్యజించాడు.

అనంతరం ప్రళయ కాలం సమీపించగా ఒక సముద్రంలా ఉన్న ఆ జలరాశి మధ్యలో నిద్రకు ఉపక్రమించిన బ్రహ్మ శ్వాసలో ప్రవేశీంచి ఆయనలో లీనమయ్యాడు. వేయి యుగాల కాలం తరువాత బ్రహ్మ లేచి లోకాలను సృష్టించడం ఆరంభించినపుడు బ్రహ్మ ప్రాణములనుండి మరీచి మొదలైన మునులతోబాటు నారదుడు కూడా జన్మించాడు. కనుకనే నారదుని బ్రహ్మ మానస పుత్రుడయ్యాడు. అలా నారదుడు అఖండ దీక్షాపరుడై విష్ణువు అనుగ్రహం వలన నిరాటంకంగా సంచరించగలుగుతుంటాడు. తాను స్మరించగానే నారాయణుని రూపం అతని మనసులో సాక్షాత్కరిస్తుంది.

ఇలా తన కథ చెప్పి హరికథా గానంతో నిండి వున్న భాగవతాన్ని రచించమని నారదుడు వేద వ్యాసునికి ఉపదేశించాడు.

#మహాభారతంలో_వర్ణన

మహా భారతం సభాపర్వంలో నారదుని గురించి ఇలా చెప్పబడింది - ఇతడు వేదోపనిషత్తులను, పురాణాలను బాగా తెలిసినవాడు. దేవతలచే పూజితుడు. కల్పాతీత విశేషాలనెఱిగినవాడు. న్యాయ ధర్మ తత్వజ్ఞుడు. శిక్షా కల్ప వ్యాకరణాలు తెలిసినవారిలో శ్రేష్టుడు. పరస్పర విరుద్ధములైన వివిధ విధి వాక్యాలను సమన్వయపరచగల నీతిజ్ఞుడు, గొప్ప వక్త, మేధావి, జ్ఞాని, కవి, మంచి చెడులను వేరు వేరుగా గుర్తించుటలో నిపుణుడు.

ప్రమాణముల ద్వారా వస్తు తత్వమును నిర్ణయించుటలో శక్తిశాలి. న్యాయవాక్యముల గుణదోషముల నెఱిగినవాడు. బృహస్పతి వంటి విద్వాంసుల సందేహములు కూడా తీర్చగల ప్రతిభాశాలి. ధర్మార్ధకామమోక్షముల యధార్ధ తత్వమునెరిగినవాడు. సమస్త బ్రహ్మాండములయందును, ముల్లోకములయందును జరుగు సంఘటనలను తన యోగబలముచే దర్శింపగలడు.

సాంఖ్యయోగ విభాగములు తెలిసినవాడు. దేవ దానవులకు వైరాగ్యమును ఉపదేశించుటలో చతురుడు. సంధి విగ్రహ తత్వములు తెలిసినవాడు.
కర్వ్య, అకర్తవ్య విభాగము చేయగల దక్షుడు. రాజనీతికి సంబంధించిన ఆరు గుణములలో కుశలుడు, సకల శాస్త్ర ప్రవీణుడు, యుద్ధ విద్యా నిపుణుడు, సంగీత విశారదుడు, భగవద్భక్తుడు, విద్యాగుణనిధి. సదాచారములకు ఆధారమైనవాడు. లోక హితకారి. సర్వత్ర సంచరింపగలవాడు.

స్వస్తి!




No comments:

Post a Comment