"శ్రీ చిద్రూపాం పరమమతిదాం పార్వతీంచంద్రరేఖాం ,
శ్రీ చాంపేయప్రసుమరుచిరాం వేదమంత్రాభిపూజ్యామ్..
శ్రీచక్రస్థాం శివహృదయగాం వైష్ణవీం తత్త్వదాత్రీం ,
శ్రీచంద్రాంశుప్రవరలసితాంశారదాం స్తౌమి నిత్యమ్ !!! "
" కాపాడుమమ్మ లలితా
మాపాలిఁటిదైవమీవె మంగళ గౌరీ..
పాపాలనుఁద్రుంచుసతము
లోపాముద్రార్చితాంబ లోకేశసతీ !!! "
----
" నూకాంబికాం పరాశక్తిం ,
ప్రకృతిం భువనావనీమ్..
సర్వపీడాప్రహంత్రీం , తాం ,
ఈడే కామ్యార్థసిద్ధిదామ్ !!! "
----
స్త్రీ సౌందర్య కన్నీరు
అంగన సౌష్ఠవమ్ము యే ప్రీతి కాంచన మగుట
అంబుజలోచనమ్ము గా శ్రుతియు ఆస్తియు యగుట
అంబుజానన యె తృప్తిగా సేవ ప్రాప్తియు అనుట
అంబురుహాక్షి హాయిగా ప్రేమ ఆశలు గనుట
అతివ అటు పాట అలక మనసు పరుగు తలుపు తెల్పుటే
అబల ఉండ బట్ట లేక కష్ట మంత మలుపు తెల్పుటే
ఆటది యను ఓర్పు నేర్పు కూర్పు టైపు తీర్పు తెల్పుటే
ఆడది శక్తి యుక్తి రక్తి తృప్తి నిచ్చి బ్రతుకు నిల్పుటే
అంగన, అంచయాన, అంబుజలోచన, అంబుజవదన, అంబుజాక్షి, అంబుజానన, అంబురుహాక్షి, అక్క, అతివ, అన్ను, అన్నువ, అన్నువు, అబల, అబ్జనయన, అబ్జముఖి, అలరుబోడి, అలివేణి, అవ్వ, ఆటది, ఆడది, ఆడుగూతురు, ఆడుబుట్టువు, ఇంచుబోడి, ఇంతి, ఇందీవరాక్షి, ఇందునిభాస్య, ఇందుముఖి, ఇందువదన, ఇగురాకుబోణి, ఇగురుబో(డి)(ణి), ఇభయాన, ఉగ్మలి, ఉజ్జ్వలాంగి, ఉవిద, ఎలతీగబోడి, ఎలనాగ, ఏతుల, కంజముఖి, కంబుకం(ఠ)(ఠి), కంబుగ్రీవ, కనకాంగి, కన్నులకలికి, కప్పురగంధి, కమలాక్షి, కరభోరువు, కర్పూరగంధి, కలకంఠి, కలశస్తని, కలికి, కలువకంటి, కళింగ, కాంత, కించిద్విలగ్న, కిన్నెరకంఠి, కురంగనయన, కురంగాక్షి, కువలయాక్షి, కూచి, కృశమధ్యమ, కేశిని, కొమ, కొమరాలు, కొమిరె, కొమ్మ, కోమ, కోమలాంగి, కోమలి, క్రాలుగంటి, గజయాన, గరిత, గర్త, గుబ్బలాడి, గుబ్బెత, గుమ్మ, గోతి, గోల, చంచరీకచికుర, చంచలాక్షి, చంద్రముఖి, చంద్రవదన, చక్కనమ్మ, చక్కెరబొమ్మ, చక్కెరముద్దుగుమ్మ, చాన, చామ, చారులోచన, చిగురుటాకుబోడి, చిగురుబోడి, చిలుకలకొలికి, చెలి, చెలియ, చెలువ, చే(డె)(డియ), చోఱబుడుత, జక్కవచంటి, జని, జలజనేత్ర, జోటి, ఝషలోచన, తనుమధ్య, తన్వంగి, తన్వి, తమ్మికంటి, తరళలోచన, తరళేక్షణ, తరుణి, తలిరుబోడి, తలోదరి, తాటంకవతి, తాటంకిని, తామరకంటి, తామరసనేత్ర, తీయబోడి, తీ(గ)(వ)బోడి, తెఱవ, తెలిగంటి, తొ(గ)(వ)కంటి, తొయ్యలి, తోయజలోచన, తోయజాక్షి, తోయలి, దుండి, ధవళాక్షి, ననబోడి, నళినలోచన, నళినాక్షి, నవ(ల)(లా), నాంచారు, నాచారు, నాచి, నాతి, నాతుక, నారి, నితంబవతి, నితంబిని, నీరజాక్షి, నీలవేణి, నెచ్చెలి, నెలత, నెలతుక, పంకజాక్షి, పడతి, పడతుక, పద్మముఖి, పద్మాక్షి, పర్వేందుముఖి, పద్మాక్షి, పర్వేందుముఖి, పల్లవాధర, పల్లవోష్ఠి, పాటలగంధి, పుచ్చడీక, పుత్తడిబొమ్మ, పు(వు)(వ్వు)బోడి, పువ్వారుబోడి, పుష్కలాక్షి, పూబోడి, పైదలి, పొ(ల్తి)(లతి), పొ(ల్తు)(లతు)క, ప్రతీపదర్శిని, ప్రమద, ప్రియ, ప్రోడ, ప్రోయాలు, బంగారుబోడి, బాగరి, బాగులాడి, బింబాధర, బింబోష్ఠి, బోటి, భగిని, భామ, భామిని, భావిని, భీరువు, మండయంతి, మగువ, మచ్చెకంటి, మడతి, మడతుక, మత్తకాశిని, మదిరనయన, మదిరాక్షి, మసలాడి, మహిళ, మానవతి, మానిని, మించుగంటి, మించుబోడి, మీననేత్రి, మీనాక్షి, ముగుద, ముదిత, ముదిర, ముద్దరాలు, ముద్దియ, ముద్దుగుమ్మ, ముద్దులగుమ్మ, ముద్దులాడి, ముష్టిమధ్య, మృగలోచన, మృగాక్షి, మృగీవిలోకన, మెచ్చులాడి, మెఱుగారుబోడి, మెఱుగుబో(డి)(ణి), మెలుత, మె(ల్త)(లత), మె(ల్తు)(లతు)క, యోష, యోషిత, యోషిత్తు, రమణి, రామ, రుచిరాంగి, రూపరి, రూపసి, రోచన, లతకూన, లతాంగి, లతాతన్వి, లలన, లలిత, లలితాంగి, లీలావతి, లేడికంటి, లేమ, లోలనయన, లోలాక్షి, వధువు, వధూటి, వనజదళాయతాక్షి, వనజనేత్ర, వనజాక్షి, వనిత, వరవర్ణిని, వరానన, వరారోహ, వలజ, వశ, వామ, వామనయన, వామలోచన, వారిజలోచన, వారిరుహనేత్ర, వారిరుహలోచన, వారిరుహానన, వాల్గంటి, వాలుగకంటి, వాశిత, వాసుర, విరితీవబోడి, విరిబోడి, విశాలాక్షి, వెలది, శంపాంగి, శఫరాక్షి, శర్వరి, శాతోదరి, శిఖరిణి, శుకవాణి, శుభదంతి, శుభాంగి, శోభన, శ్యామ, శ్రమణ, సకి, సకియ, సారసాక్షి, సిత, సీమంతిని, సుందరి, సుగాత్రి, సుజఘన, సుదతి, సుదృక్కు, సుధ్యుపాస్య, సునయన, సుప్రియ, సుభాషిణి, సుభ్రువు, సుమతి, సుమధ్య, సుముఖ, సురదన, సులోచన, సువదన, హంసయాన, హరిణలోచన, హరేణువు, హేమ।
"।
-----
( ఇందు।।।।యెత్తు పద్యంలో।।
1 ,3 ---- తే ట గీ తి ;
2 , 4 ---- ఆ ట వె లఁ ది।।)
-----------------
నమస్కారములు
ఓం శ్రీ రామ.. శ్రీ మాత్రే నమః.. శ్రీ దత్తాత్రేయ నమః
ఈరోజు స్వామి వారి ని దర్శించుటకు గానుగాపురం బయలుదేరాము.. దర్శనం సర్వ మంగళ ప్రధం దత్తుని వేషము పామర కర్థము కాదును కాలము నిర్భయ మాయలుయే ప్రేమను పెంచును మాయను తుంచును ఆశలు చూపును ఆశయమే హేమసుహాసపు సాహస వందన ఆస్రిత నందన భావము యే ధీనుని జూచెను మోనము వీడెను ప్రేమను సారము తెల్పుట యే జీవన సారము ఆకలి వేగము అర్ధము కాదును ఏల అనే మానవ మాత్రుడు చేసెను కర్మలు తీరక బాధల వల్లననే కాలము నీదియు కర్మలు నీవియు మానస ముంచుము సాధనగాకోరిన కోర్కెలు తీర్చెడి దత్తుని సేవలు నీకును ధర్మముగా మౌనమనోహర, గానవిలోలుడు, జ్ణానపిపాశుడు ధ్యానపరాా గానగలేకను చేరిక గాకును చేతులు చాచితి వేదికగా వైనము నాదియు వాదము దేనికి సాహస మైనను ప్రేమపరా దానము చేసితి,ధ్యానము చేసితి, కాలము నీదియు దైవపరా
*******
(రాగిచెట్టు వద్ద స్వామివారు తపస్సు చేసినట్లు అక్కడ గురుచరిత్ర చదితున్నవారు సన్నిధిలో నామదిలో మెదిలిన పై పద్యములు (30-030022)
*****
న్యస్తాక్షరి..
చంద్ర బింబమోలె చక్కనిది ముఖము
ద్రయభయంభుతో నదయకుసాక్షి
మతిగతియునుమార్చు మాతశ్రీ వేధమ
తివిరజల్లు ధననిధివిగ నీదు...
తేటగీతి
: శక్తి మూర్తులు పిల్లలే సకలమందు
అవని అవతార మూర్తులు అరయు చుండు
బ్రహ్మ విష్ణు మహేశ్వర భరత భూమి
గానుగాపుర గురువుల గురువు దత్త
******
: భావ భావావేశం గల భాగ్య సీమ
నిత్య.సంఘర్షణతొ ఉన్న నియమ దీక్ష
భక్తి భావంతొ ఓర్పుతో భజన చేయు
ధనము బలము సుఖము ధరణి యందు