Wednesday, 9 March 2022

మార్చి నెల మూడవ వారం ::



 1. 
మనసులో సున్నితత్వం పెరిగే కొద్దీ నిర్మలత్వం వస్తుంది !!

శత్రుత్వం, క్రోధం, ద్వేషం వంటి గుణాలతో మనసును నింపితే ఎదుటివారితో అసహజంగా ఉండాలి. గంభీరంగా, ముభావంగా, పలకరింపులేకుండా ఉండటం అలవాటుగా మారి పవిత్రమైన మనసు ను మలినం చే
సుకుంటాం. అది దైవానికి మనని దూరంచేస్తుంది. మనో నిర్మలత్వమే దైవం. మనసులో సున్నితత్వం పెరిగే కొద్ది నిర్మలత్వం వస్తుంది. సున్నితత్వం అంటే ప్రేమ నిండిన మనసు. మాతృత్వంలో మనకు కనిపించేది  ఆ సున్నితత్వమే. అది దైవత్వానికి ప్రతిరూపం. వాస్తవిక దృక్పథంతో అన్వేషిస్తే దైవంలేని చోటును చూడలేము. ఒక మొలకెత్తిన మామిడి టెంకె 100 ఏళ్ల పంటను, లక్షకాయల కాపు తనలో ఇముడ్చుకొని ఉండటం మాతృత్వం. అదే దైవం !

*****


ప్రభలు

----------

1. సృష్టిఅనే దేవుడు చూస్తున్నాడు మానవులంతా ఒక్కటే అని...

కానీ మానవులంతా అతనికి వేరేవేరే రూపాలిచ్చి వేరేవేరే భావనాలతో చూస్తున్నారు...

ఎందుకు అలా?

దేవుడి ఆశయముతో చేరి నువ్వు అలా చూడు మానవ!!


2. మనం ఎప్పటివరకు డబ్బు,ఆస్తి,అంతస్తు అని వాటి వెనుక పరిగెత్తడం ఆపలేమో...

అలాగే మనకు ఉన్నదానితో తృప్తిగా ఉండలేమో...

అప్పటిదాకా శాంతి-నెమ్మది కనబడకుండా,పోరాటాల గోడవల్లో చిక్కుకొని అప్పుడు మనకి పతనం 

తప్పదు,ఇది నిజం!!


3. జీవన బాటలో దొరికే స్నేహితులు కొందరే

ఆ కొందరిలో మిగిలేవారు కొందరే

ఆ కొందరిలో మంచి కోరేవారు అపురూపమైనవారు.ఆ అపురూమైనవారిలో మిగిలిన విశేషమైనవారే...

మనం అనుకొనే వారు!!


4. అందరికీ శుభం కోరే మనస్సు...

అందరికీ మంచిని కోరే మనస్సు...

అందరి కష్టానికి బాధపడే మనస్సు...

దేవుడికి చాలా ఇష్టంగా ఉండే మనస్సుగా ఉంటుంది. అంతేకాదు...

అదే మనస్సుకి అతి ఎక్కువ బాధలను దుఃఖాలను సహించుకుని,అందరితో

ఎపుడూ నవ్వుతూ ఉంటుంది!!


5. పరిస్థితులు ఎలా ఉండనీ 

సందర్భం ఏమైనా అవ్వనీ

సమస్యలు ఏమైనారానీ

ప్రాణం పోయేవరకు నీ చేతులు విడవను అనే,నమ్మకం భరోసా ప్రేమ విశ్వాసం ఉండేలా...

స్నేహముంటే మరి అది భగవంతుని కృపే...కదూ!!

*****

సామెతల్లో ఆయుర్వేదం!

"తల్లిని చేసినవాడే కాయమూ పిప్పళ్ళు తెస్తాడు" ..

అని ..కాయము అంటే బాలింతకు పాలు ఎక్కువగా రావటానికి మూలికలతో తయారు చేసే లేహ్యం , పిప్పలి త్రిదోషాలను పోగొడుతుంది !

పేరులేని వ్యాధికి పెన్నేరు గడ్డ ! ...ఏ రోగమో ఎందుకొచ్చిందో తెలియక పోతే "అశ్వగంధ" పెద్ద మందు !

త్రిదోషహరం తిప్పతీగ అని సామెత !

"ఉత్తరేణు ఉత్తమం, మధ్యమం మారేడు, కనీసం కందిపుల్ల" ...ఇవి పళ్ళు తోముకోవడానికన్నమాట.

వాస్తే వాయిలాకు 

పాస్తే  పాయలాకు ..

అప్పుడే పుట్టిన శిశువుకు 

దొండాకు పసరు పోసేవారు 

లోపలి కల్మషాలు పోతాయని ... సామెత ఏమంటే .... "కొడితే చిన్నప్పుడు తాగిన దొండాకు పసరు కక్కుతావు "

పుండుమీదకు ఉమ్మెత్త , నీరుల్లి నూరి నూనెలో వెచ్చజేసి గాయాలపై కట్టేవారట ...సామెత ఇలా ... "పుండుమీదకు నూనె లేదంటే గారెలొండే పెండ్లామా అన్నట్లు"... "ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు "...

వెల్లుల్లి చాలా రోగాలు నయం చేస్తుంది. అది క్షయరోగాన్ని కూడా హరించే శక్తి కలది ... సామెత ...ఇలా ... "ఆశపడి వెల్లుల్లి తిన్నా రోగము అట్లానే ఉన్నది "

కరక్కాయ పువ్వు , పిందె,

పండు చాలా ఉపయోగకరమైనవి ... శ్వాస, కాస, ఉదర, క్రిమి, గుల్మ, హృద్రోగం , గ్రహణి, కామిల, పాండు ..ఇన్ని రోగాలు హరిస్తుంది.. అందుకే ..  ."మున్నూట ఇరవై రోగాలకు మూడు గుప్పిళ్ళ కరక్కాయ పొడి ".. అని సామెత

ఆయుర్వేదం మితంగా తినమని చెపుతుంది .. సామెత ఇదుగో ... "పిడికెడు తిన్నమ్మ పీటకోడు లాగ ఉంటే చాటెడు తిన్నమ్మ చక్కపేడులాగుంది ".... "ఒక పూట తింటే యోగి రెండు పూటలా తింటే భోగి మూడు పూటలా తింటే రోగి "

అలానే ... శిశువు పాలు వాంతి చేసుకోవడం ఆరోగ్యలక్షణమని చెప్పే సామెత ... "కక్కిన బిడ్డ దక్కుతుంది " అని...

ఇలా ఎన్నో సామెతలు ఒక్కొక్కటీ కనుమరుగవుతున్నాయి !

పిల్లవాడు భాషనే నేర్వనప్పుడు సామెత ఎలా వస్తుంది ?

సామెత తెలియనప్పుడు సంస్కృతి ఎలా తెలుస్తుంది ?

అందుకే భాషను చంపితే సంస్కృతి చస్తుంది!

జాతి జీవనాడి నశిస్తుంది.

అప్పు గాయం నిప్పు మరియు చింతలను ఎప్పుడూ చిన్నవని అనుకోరాదు....

ఎందుకంటే వీటికి పెద్దాగా పెరిగే గుణం ఉంది. దానివల్ల ప్రాణం లేకపోతే జీవితాన్ని పాడుచేసే

సామర్ధ్యం ఉంది...జాగ్రత్త!!

*****


6. తల్లిదండ్రులపై భక్తి భావం పెంచుకోవయ్య

హిత వచనములు శ్రద్ధతో వినవయ్యా

పెద్దలను గౌరవించిదే ఈశ్వరుడి సేవయని తెలిసుకోవయ్యా

మనస్సులు నొప్పించక సన్మార్గంలో నడిచిన పూజలే మెచ్చునయ్య

మన శివయ్య...!!


7. మనకు తెలియక పోతే అడిగి తెలుసుకుందాం

మనకి నచ్చక పోతే చర్చలు చేద్దాం...

మనకి ఇష్టమే లేకపోతే నమ్రతతో చెపుదాం.

అంతేకాని... 

నాదే సరిఅనే వాదన వద్దు. ఈ అహకారంతో స్నేహ సంబంధాలు పాడై పోరాదు!!


8. కష్టం కలిగినపుడు రక్షణ కోసం ఒక దుర్భలుడి దగ్గరకు లేక ఒక స్వార్ధ బుద్దికలిగిన ప్రముఖుల దగ్గరకు పోరాదు. అతివంటివారు ఎప్పుడూ తమ మంచికే మిమల్ని ఉపయోగించుకుంటారు.

అటువంటి స్వార్ధ,నీచులవెనుకపడి ప్రజా రక్షణ తీసుకోవాలని ప్రయత్నిస్తే మరిన్ని కష్టాలు

దుఃఖం మడుగులో ములిగి పోవాల్సివస్తుంది!


9. బిక్షగాడు ఆకలి ఆకలి తీర్చుకోవాలని చెయ్యి చాచి అడిగితే రెండు చేతులు...

కాళ్ళు ఉన్నాయని చాలు అని ఉచిత సలహాలిచ్చే మనం...

అన్నీ ఉండి దేవుడి హుండిలో డబ్బులువేసి కోరడం...

బిచ్చగాడి బ్రతుకుకన్నా నీచమైనదని తెలుసుకోవాలి!


10. వ్యతిరేక భావంతో ఆలోచిస్తే స్త్రీ కలలు నాటి, మాయ అయ్యింది ఆనిపిస్తుంది.

అదే,సకారభావంతో ఆలోచిస్తే... 

స్త్రీ కలలు నాటేదే కాదు...

కలలు నిజమవ్వడానికి భుజానికి భుజం అందించి నిలుస్తుందని అనిపిస్తుంది. అన్నీ మనం ఆలోచించే బాటనుబట్టి ఉంటాయి...!!

****

2. ఈ రోజు ** మంచి మాట..లు 

ఎండాకాలం మొదలైంది. పశుపక్ష్యాదులు దాహం తీర్చుటం కోసం ఏమి ఖర్చు కాని కొద్దిగా నీళ్ల ను పెడదాము.. అవకాశం ఉంటే ఏదైనా గింజలు పెడదాము.. చిన్న జీవులను బతకనిద్దాం

సమాజం విచ్చిన్నం కావటానికి కారణం చెడ్డ వారు చేసే పనులేకాదు... 

మంచివారు ఏమి చేయకుండా ఉండటం కూడా కారణం

మన మనస్సును మనం కంట్రోల్ చేసుకోలేనప్పుడు ఇతరులను శాసించే హక్కు మనకి ఎక్కడిది

 వంద పేజీలున్న పుస్తకం లోనే తప్పులున్నప్పుడు వంద సంవత్సరాల జీవితం లో తప్పులు లేకుండా ఎలావుంటాయి..చదువుతూ సరిదిద్దుకోవాలి సరిదిద్దుకొని చదువుకోవాలి.. జీవితంలో తెలిసి తెలియక జరిగే తప్పులను కూడా సరిదిద్దుకోవాలి.. సరిదిద్దుకుంటూ జీవించాలి  అది పుస్తకం అయినా జీవితం అయినా

మన కష్టాన్ని చూసి ఇంకొకరు నవ్వితే నవ్వని పరవాలేదు.. కానీ ఇంకొకరి కష్టాన్ని చూసి మనం నవ్వకూడదు..కష్టాన్ని అర్థం చేసుకుందాం 

మనకు వంద కోట్లు ఉన్నంతమాత్రాన మనం వందేళ్లు బతుకుతామని గ్యారెంటీ లేదు..

అలానే మనకు పది ఇల్లు ఉన్నoత మాత్రాన పది ఇళ్లలో ఒకేసారి ఉండలేము ఒక్కదానిలో మాత్రమే ఉండగలం. ఉన్నది ఒకే జన్మ.. అనుకుని పది జన్మలకు సరిపడా మంచిని చేద్దాం.. మరలా చేసే అవకాశం ఉంటుందో ఉండదో.

సేకరణ ✍️

*****



11. మనిషి నేర్చుకున్నది అతి తక్కువ...

నేర్చుకోవల్సింది  సముద్రమంత ఉంది. జీవితములో పాండిత్యముంటే చాలదు,దీనితోకల్పి అతి

ముఖ్యంగా కావాల్సింది వినయం మఱియు వివేకం!!


12. అందరూ ప్రపంచం మారింది అని అంటారు.

అయితే,మిరకాయలోని కారం మార్పు రాలేదు.

మామిడి పండులోని తీయదనంలో ఎటువంటి మార్పు రాలేదు.

ఆకుల రంగు మారలేదు మార్పు వచ్చినది...

మనిషిలోని మానవత్వానికి...!!

అవునా...!?


13. తనకు తోచిన విధంగా ఆలోచనలు చేయకుండా తీర్మానాలు చెప్పే వ్యక్తి నమ్మకస్తుడు కాడు.

ఒకరి మంచి చెడు రెండూ తెలుసుకొని మంచి ఆలోచన చెప్పేవాడు నిజమైన నమ్మకమైనవాడు!!


14. అంతస్తు పెరగాలన్న రభసలో...

జతలో ఉన్నవారిని చెడుపుకోకు...

ఎందుకంటే అది సాధించిన తరువాత సంతోషాన్నిపంచుకోవాలంటే...

మనవారనే వారులేకపోతే ఒంటరిగా నిల్చునే సమయం వస్తుంది!!


15. కోపం ఉన్న వాళ్ళకి లోకమే కటిక చీకటి పరుల తప్పులు వెతికి మనస్సు బాధించి చెడకు...

మంచి గుణాలు చూడు సహన శక్తికి ఉందిలే మంచి అంతస్తు ఆ కోపాలే సంసారాలకు చెడుపు

వివేకంతో నడుస్తే... కలదు మంచి కాలం!!

****

దేవీ శ్లోకః

సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే ।

శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే ॥

ఆత్మీయ బంధుమిత్రులకు  శుక్రవారపు శుభోదయం శుభాకాంక్షలు లక్ష్మీ గాయత్రీ దుర్గా సరస్వతి అమ్మవార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ

****

"  గజాస్యం , ఫాలచంద్రం ,తం ,

  ' గం ' మంత్రాధిపతిం , హరిమ్.‌.

  సర్వవిద్యాప్రదాతారం ,

 సర్వవిఘ్నాంతకం భజే !!!

*****

 శ్రీ సప్త గిరిభాస్వంతం ,

  శ్రీతప్తకాంచనాంబరమ్...

శ్రీప్రాప్తవక్షసం , భూపం ,

సంకటఘ్నంసదా భజే !!! 

--***

" ఆరోగ్యవాక్ప్రదం , పూష్ణం ,

నీరేజలోకతుష్టిదమ్..

భూరిప్రకామ్యదాతారం ,

వందే హరిస్వరూపిణమ్ !!!

****

" మనస్వినీం , మహారాజ్ఞీం ,

  నిష్క్రోధాం , క్రోధనాశినీమ్..

  సదాశివప్రియాం , వందే ,

  విశ్వకళ్యాణకారిణీమ్ !!!

****

" ఇందీవరాననాం , లక్ష్మీం ,

  ఇందీవరాసనాం , రమామ్

  ఇందీవరాక్షహృద్ధామాం ,

  వందేऽష్టైశ్వర్యదాయినీమ్ !!!

*****
" వక్రతుండాయ , (హేరంబ)దేవాయ ,
శుక్లదుకూల ధారిణే..
వేదండాస్యవిభూషాయ ,
గౌరీపుత్రాయ నమోనమః !!!
****
ఈ వారం" సీసపద్యాలు
--
శంకర ! పురహర ! శంభో ! మహాదేవ..
   పంచాక్షరీమంత్రభరితవినుత
కైంకర్యతోషిత  గాంగజటాధర !
    సోమేశ ! త్రిణయన కామేశ ! హర !
ఓంకారశబ్దప్రయుక్తతత్త్వార్థద
    ధావళ్యశోభితతనువిలసిత
సంకటసంహార సాయుజ్యదాయక
   గౌరీమనఃప్రియ గరళకంఠ
----
తే.గీ.
----
మాం దయాపయోనిధిచంద్రమంగళాంగ
పాలయసదైవ శుభకర పార్వతీశ
నాగభూషణ భూతిద నాగవసన 
వేదసూక్తప్రియ ! భవ ! వేదపూజ్య !!! 
--రచయిత.. అప్పాజీ గారు
*****

16. ఆనందం పొందడం మంచిదే కదా!?

ప్రపంచలో మనకు నవ్వు ఆనందం ఇచ్చే వస్తువులు విషయాలు వ్యక్తులు అడుగు అడుగునా దొరుకుతారు పరిశుద్ధమైన మనస్సుతో సంతోషపట్టే మనోభావాలు మనం పెంచుకుంటే

సంతోషంపడవచ్చు కేవలం కొరతలే చూసే మనోభావాలు ఉన్నవారు...

ఆ ఆనందానికి వంచితులవుతారు సంతోషంపడే మనస్తత్వం పెంచుకొంటే ఆనందం మనదే అవుతుంది...

మరి,ఆ ఛాన్సు మీ చేతుల్లోనే ఉందికదా...ఆలోచించండి!!


17. ఒక విత్తనం శబ్దం లేకుండా అంకురిస్తుంది అయితే వృక్షమై పెద్ద చప్పుడు చేస్తూ పడిపోతుంది.

వినాశనానికి శబ్దం ఉంది అయితే సృష్టి శాంతంగా ఉంటుంది ఇదే ప్రశాంతమైన శక్తి లాగే,మౌనంగా పెరగండి ఎవరూ మిమ్మల్ని ఎదురక్కో లేరు!


18. జీవితమనేది అందరికీ ఒక రంగుల పుస్తకం వ్యత్యాసం ఇంతే!

కొంతమంది మనసుపెట్టి ప్రతి పేజీ చదువుతారు మరి కొంతమంది పై మనస్సు కోసం

ఊరికే పేజీలు త్రిప్పుతారు ప్రతి క్షణంలో ఒక ప్రేమ ఉంది ప్రతి క్షణంలో సంతోషం ఉంది

అది తప్పితే,మిగిలేది ఉత్తి జ్ఞాపకాలే...

అందుచేత,మనిషి జీవితాన్ని మనసుపెట్టి చదివి గమనించి అర్ధం చేసుకుని...

నవ్వుతూ బ్రతకాలి...ఏమంటారు!?


19.  సవాలకు భయపడి ఓడిపోరాదు ఓడి పోతామేమో అని ప్రయత్నాలు చెయ్యరాదు గట్టిగా ప్రయత్నం చేస్తూ...

ధైర్యంతో గెలుపు పొందాలి గెలుపుకు గౌరవం ఉంటుందని గుర్తుంచుకోవాలి,మర్చి పోకూడదు!!

స్నేహమనేది ఎక్కువ మాట్లాడదు, స్నేహం ఎపుడూ పాతబడదు, స్నేహానికి సుఖాంతం ఉండదు,

ఎందుకంటే స్నేహం ఎపుడూఅంత్యం చూడదు. నిర్మలమైన,నిస్వార్ధమైన మరియు నిజమైనది,ఈ స్నేహాలు...స్నేహితులను ఉంచుకునేదాక!!


20. పూర్తిగా విషయం తెలియకుండా,ఊరికే ఎవరి గురించి మాట్లాడకండి ఎందుకంటే ...వాళ్ళ

పరిస్థితులు మరియు సందర్భాలు వాళ్లకు మాత్రమే తెలిసి ఉంటాయి!

****



హిందూ పూజా విధానంలోని క్రియలలో అంతరార్థము:

₹₹₹

1. గంటలు :

దేవాలయాల్లో పూజ సమయంలో గంటలు వాయిస్తారు. దీనివల్ల రెండు విధాల ప్రయోజనం ఉంది. 

ఒకటి-బయటి ప్రపంచంలో శబ్దాలు లోపలికి ప్రవేశించకుండా చేయడం, 

రెండవది-మనస్సును దేవుని మీదికి ఏకాగ్రంగా మళ్లించడంలో తోడ్పడుతుంది.

2.దీప హారతి:

దీపాన్ని వెలిగించి దేవుని విగ్రహం ముందు తిప్పడం. దీనిలోని అంతరార్థం ఏమిటంటే దైవాన్ని జ్యోతి స్వరూపంగా భావించడం. 

దైవమే కాంతి. 

ఆ సమయంలో భక్తుల భావన ఈ విధంగా ఉంటుంది.  స్వామీ! నీవే ఈ విశ్వంలో స్వయం ప్రభవమైన జ్యోతివి. సూర్యుడు, చంద్రుడు అన్నీ వీటిలోని తేజస్సు. 

కాంతివి నీవే. 

నీ దివ్య కాంతిచే మాలోని చీకటిని తొలగించి, 

మా బుద్ధిని ప్రభావితం చేయి" అని.

3. ధూపం:

భగవంతుని ముందు పరిమళాలు వెదజల్లే అగరువత్తులను వెలిగిస్తాము. 

వాటి సువాసనలు అన్ని దిక్కులా వ్యాపిస్తాయి. 

వీటి ధూపం క్రిమిసంహారిణిగా కూడా పనిచేస్తుంది. భగవంతుడు సర్వవ్యాపి. 

విశ్వమంతా నిండియున్నాడు అన్న భావన 

అందరిలో కలుగుతుంది. 

ఈ విషయం అక్కడ ఉన్న వారందరికీ మాటి మాటికీ 

జ్ఞప్తి చేసినట్లవుతుంది.

4. కర్పూర హారతి:

వ్యక్తిగతమైన అహంకారము కర్పూరమువలె కరిగిపోవాలని ఈ హారతిలోని అంతరార్థం. 

ఈ విధంగా జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావాలని 

భక్తులు కోరుకుంటారు.

5. గంధపు సేవ:

ఈ సేవలో చాలా అర్థం ఉంది. 

భగవంతుని విగ్రహానికి పూయడానికి గంధాన్ని మెత్తగా నూరుతారు. 

అంత శ్రమకు లోనయినప్పటికీ గంధం ఓర్పుతో సహించి, మంచి పరిమళాన్ని వెదజల్లి ఆహ్లదం కలిగిస్తుంది. 

ఆ విధంగానే ఎన్ని కష్టాలకు లోనయినప్పటికీ భక్తుడు చలించక కష్టాలను చిరునవ్వుతో స్వీకరించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ శత్రువుకైనా అపకారం తలపెట్టకూడదు. 

ఇదే ఈ గంధసేవలోని అంతరార్థం. 

6. పూజ:

దేవునికి పత్రం, పుష్పం, ఫలం, తోయం అనే వాటిని భక్తులు పూజలో సమర్పిస్తారు. 

కాని భగవంతునికి వీటితో పనిలేదు. 

నిజానికి ఏ విధమైన వస్తువులు భక్తులు సమర్పించాలని భగవంతుడు కోరడు. 

కాని ఆ అర్పణలో ఎంతో పరమార్థం ఉంది.

7 పత్రం(శరీరము):

ఇది త్రిగుణాలతో కూడుకున్నది. 

పూజలో దీనిని భగవంతునికి అర్పిస్తాడు.

8 పుష్పం (హృదయము):

ఇక్కడ పుష్పం అంటే చెట్ల మీద పూచే పూవు 

అని అర్థం కాదు. 

సుగంధ పరిమళాలను వెదజల్లే హృదయ కుసుమం 

అని అర్థం. 

ఇటువంటి హృదయ కుసుమాన్ని దైవపరంగా అర్పించాలి.

9 ఫలం (మనస్సు):

మనస్సు ఫలాలను అంటే మనం చేసే కర్మల ఫలితాలను మనం ఆశించక భగవంతునికి అర్పితం చేయాలి.

దాన్నే త్యాగం అంటారు.

10. తోయం(నీరు):

భగవంతునికి అర్పించవలసిన నీరు అంటే మనలోని హృదయపూర్వకమైన ప్రేమ, ఆనందం మొదలైన 

దివ్య భావాల వల్ల వెలువడే ఆనంద భాష్పాలు 

దైవానికే అర్పితం కావాలి.

11 కొబ్బరికాయలు:

హృదయం అనే కొబ్బరికాయ కోరికలు అనే పీచుతో కప్పబడి ఉంటుంది. 

దానిలో ఉండే నీరు సంస్కారము. 

కోరికలు అనే పీచును హృదయం అనే కొబ్బరికాయ నుంచి వేరుజేసి, తీయనైన కొబ్బరిని భగవంతునికి అర్పితం చేయాలి. 

అదే నిజమైన నివేదన. 

లోపల సంస్కారము అనేవి వున్నంతకాలం, 

హృదయం శరీరాన్ని కదలకుండా అంటిపెట్టుకొని ఉంటుంది. 

హృదయము అనే కొబ్బరికాయను పీచు అనే కోరిక వాసన వదలదు. 

మనంచేసే పనులను విత్తనాలతో పోలుస్తారు.

మంచి విత్తనం వేస్తే మంచి మొక్క ఎట్లా మొలుస్తుందో మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.

12. నమస్కారము:

చేతులు జోడించగానే పదివేళ్లు కలసివుంటాయి. 

ఈ పదివేళ్లు పది ఇంద్రియములకు గుర్తు. 

ఇందులో కర్మేంద్రియ,జ్ఞానేంద్రియములను హృదయములోని పరమాత్మకు కైంకర్యము చేయుచున్నాను అని చేతులు జోడించుటయే నమస్కారములోని అంతరార్థము.

13. ప్రదక్షిణము:

ముల్లోకములన్నియు భగవంతుని స్వరూపముతో నిండివున్నాయి. 

ఆ భగవంతుని సగుణాకరామైన విగ్రహమునకు గాని, లింగమునకు గాని, ప్రదక్షిణము చేసినట్లయిన ముల్లోకములు చుట్టి సర్వదేవతలకు నమస్కారములు చేసిన ఫలితము వుంటుంది.. 

అందుకే ప్రదక్షిణము పూజాంగములలో ఒకటిగా చేర్చారు.

సేకరణ :

*****

#మజ్జిగ

*****

మజ్జిగకి సంస్కృతంలో మూడు పేర్లున్నాయి.

1. తక్రం  2. మధితం  3. ఉదశ్విత్తు

🔸 తక్రం

నాలుగోవంతు మాత్రం నీరుపోసి తయారు చేసేది తక్రం.

🔸 మధితం 

అసలే నీరు పోయకుండా చిలికినది మధితం ఇది రుచిగా ఉంటుంది, కానీ ఆరోగ్యానికి అంత ప్రశస్తం కాదు.

🔸 ఉదశ్విత్తు

సగం నీళ్లు పోసి తయారుచేసేది ఉదశ్విత్తు.

ఈ మూడింటిలోకి తక్రం ఆరోగ్యానికి చాలా ప్రశస్తం.

🔸 మజ్జిగ - మహా పానీయం

మజ్జిగ తాగేవాడికి ఏ వ్యాధులూ కలగవనీ, వచ్చిన వ్యాధులు తగ్గి, తిరిగి తలెత్తకుండా ఉంటాయనీ, విషదోషాలు, దుర్బలత్వం, చర్మరోగాలు, దీర్ఘకాలిక వ్యాధులు, కొవ్వు, అమిత వేడి తగ్గిపోతాయనీ, శరీరానికి మంచి వర్చస్సు కలుగుతుందనీ, యోగరత్నాకరంలో ఉన్నది.

వలోకంలో దేవతల కోసం అమృతాన్నీ, ఇక్కడ మానవుల కోసం మజ్జిగనీ భగవంతుడు సృష్టించాడట.

వేసవి కాలంలో మనం మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి.

తోడుపెట్టినందు వలన పాలలో ఉండే పోషక విలువలన్నీ మజ్జిగలోనూ పదిలంగా ఉండటంతో పాటు, అదనంగా లాక్టో బాసిల్లై అనే మంచి బాక్టీరియా మనకు దొరుకుతుంది. పాలలో ఈ ఉపయోగకారక బాక్టీరియా ఉండదు. 

ప్రిజ్జులో పెడితే మజ్జిగలోని ఈ బాక్టీరియా నిరర్థకం అవుతుంది, అందుకని అతి చల్లని మజ్జిగ తాగకూడదు. 

చిలికినందువలన మజ్జిగకు తేలికగా అరిగే గుణం వస్తుంది అందుకని పెరుగుకన్నా మజ్జిగ మంచిది.

వయసు పెరుగుతున్నకొద్దీ మజ్జిగ ఎక్కువ తీసుకోవాలి.

వేసవి కోసం ప్రత్యేకం కూర్చిక పానీయం..    

ఒక గ్లాసు పాలు తీసుకొని, కాచి చల్లార్చి అందులో రెండుగ్లాసుల పుల్లని మజ్జిగ కలపండి ఈ పానీయాన్ని  కూర్చిక అంటారు.

ఇందులో పంచదార, ఉప్పు బదులుగా ఈ క్రింది  వాటిని కలపండి. 

ధనియాలు, జీలకర్ర, శొంఠి ఈ మూడింటినీ  100 గ్రాముల చొప్పున దేనికదే మెత్తగా దంచి, మూడింటినీ కలిపి తగినంత ఉప్పు కూడా చేర్చి, దాన్ని ఒక సీసాలో భద్రపరచుకోండి 

కూర్చికను తాగినప్పుడల్లా, అందులో ఈ మిశ్రమాన్ని  ఒక చెంచా మోతాదులో కలిపి తాగండి, వడదెబ్బ కొట్టదు, పేగులకు బలాన్నిస్తుంది, జీర్ణకోశ వ్యాధులన్నింటికీ ఇది మేలు చేస్తుంది, వేసవిలో కలిగే జలుబుని నివారిస్తుంది, వడదెబ్బ కొట్టని రసాల పానీయం ఇది.

ఇది దప్పికని పోగొట్టి వడదెబ్బ తగలకుండా చేస్తుంది కాబట్టి, ఎండలో తిరిగి తిరిగి ఇంటికి వచ్చిన వారికి ఇచ్చే పానీయం ఇది. 

ఎండలోకి వెళ్లబోయే ముందు  మజ్జిగను  ఇలా కూడా తయారు చేసుకొని తాగండి.

చక్కగా చిలికిన  మజ్జిగ ఒక గ్లాసునిండా తీసుకోండి. 

అందులో ఒక నిమ్మకాయ రసం, తగినంత ఉప్పు 

(సైంధవ లవణం), పంచదార, చిటికెడంత తినేసోడాఉప్పు కలిపి తాగి అప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్లండి వడదెబ్బకొట్టకుండా ఉంటుంది. 

మరీ ఎక్కువ ఎండలో ప్రయాణాలు చేయవలసి వస్తే, ఒక సీసానిండా దీన్ని తయారు చేసుకొని వెంట తిసుకెళ్లండి, మాటిమాటికీ తాగుతూ ఉంటే వడదెబ్బ కొట్టదు.

 సర్వేజనా సుఖినో భవంతు 🙏

((()))

21. ప్రేమ,విశ్వాసం,నమ్మకం అన్నీఅభిమానం కన్నా పెద్దవి వీటిని మీరినవి ఏవిలేవు

ఆశ్వీర్వదించే మనసులకన్నాఐశ్వర్యము గొప్పదేమి కాదు పవిత్రమైన స్నేహమొక్కటే

ఏ కాలానికైనా విలువైనది!!


22. సమయం మారినపుడు బాధ వెయ్యదు! అయితే...

సమయానికి తగినట్టుగా మనవాళ్లు అనుకున్నవారు మారిపోయినపుడు...!

ప్రాణం పోయినంతగా బాధ వేస్తుంది...!!


23. కొంతమందికి సూర్యుడు వేడిగా మరి కొంతమందికి వెల్గులా అనిపిస్తుంది...

అలాగే,మనం కూడా కొంతమందికి మంచిగా...

మరి కొంతమందికి...

చెడ్డవారిగా అనిపించ వచ్చు అందుకే,ఎపుడూ మన పద్ధతి ప్రకారం మనం బ్రతకాలి ప్రజల ఆలోచనలతో కాకుండా!!


24. ఎవరో చేసి పెట్టినది ఖర్చు పెడితే...

జీవితమంటే ఏమిటి అనేది తెలియదు...

స్వయంగా శ్రమించి వృద్ధి చెందినవారికి ఖర్చుకని ఇచ్చేటప్పుడు అసలు జీవితమంటే...

ఏమిటి అనేది ఏమిటో తెలిసేది...!!


25. తన తప్పును మన దగ్గర చెప్పేవాడు నిజమైన మిత్రుడు మన తప్పును ఇతరుల

దగ్గర చెప్పి గేలి చేసేవాడు...

మన మిత్రుడైనా శతృవుతో సమానం...!!

*****

పన్ను చెల్లింపుదారుల ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైంది.

 ప్రపంచంలో అతిపెద్ద సంస్థ ఏది?

 ఇప్పుడు దేశంలో పన్ను చెల్లింపుదారుల సంఘం ఏర్పడాలి.  ఏ ప్రభుత్వం పాలించినా, 

ఈ పన్ను చెల్లింపుదారుల సంఘం ఆమోదం లేకుండా, ఉచిత విద్యుత్, ఉచిత నీరు, ఉచిత పంపిణీ, లేదా రుణమాఫీలు ఎవరూ ప్రకటించలేరు, ఏ ప్రభుత్వమూ కాదు. ఇలా ఏదైనా అమలు చేయండి.

 మన పన్ను చెల్లింపుల నుండి డబ్బు వస్తుంది, కాబట్టి దానిని ఎలా ఉపయోగించాలో చెప్పే హక్కు కూడా మాకు ఉండాలి.

 ఓట్ల కోసం ఉచితాలను ప్రకటించి పంపిణీ చేయడం ద్వారా సాధారణ ప్రజలు ఇటువంటి రాజకీయ పార్టీలకు ఆకర్షితులవుతారు, ఎందుకంటే అది వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రజలు వారికి వారు సంపాదించుకోకుండా సోమరులను తయారు చేయడం వల్ల దేశం అధోగతి పాలవుతుంది

ప్రభుత్వాలు విద్య మరియు వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వాలి. 

మనం పన్నులు కట్టేది దేశం అభివృద్ది కోసం కానీ దేశాన్ని నాశనం చెయ్యడానికి కాదు.

ఏ పథకాలు ప్రకటించినా, ముందుగా దాని బ్లూప్రింట్ ఇవ్వండి, యూనియన్ నుండి సమ్మతిని తీసుకోండి మరియు ఇది ఎంపీలు & ఎమ్మెల్యేల జీతాలు మరియు వారు పొందే ఇతర ప్రయోజనాలకు కూడా వర్తించాలి.

 ప్రజాస్వామ్యం కేవలం ఓటుకే పరిమితమా ??

 ఆ తర్వాత మనకు ఎలాంటి హక్కులు ఉన్నాయి?

 అలాంటి "ఫ్రీబీస్" ఏదైనా రీకాల్ చేసే హక్కు కూడా త్వరలో అమలు చేయాలి.

****

నీలాకాశంలో పేర్చినట్లున్న తెల్లని మబ్బులు వెనుకనుండి అతని తల్లి తనని చేతులు సాచి ఆర్తిగా పిలిచినట్లనిపించేది.

పసి వయసులోనే తన బాధ్యత తీర్చుకోకుండా రామభద్రన్ ని ఒంటరిగా వెళ్లి పోయినందుకి విచారిస్తున్నట్లుగా కనిపించేదతని తండ్రి రూపం.
దిక్కులేని అన్నని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించేదతని చెల్లి.
రామభద్రన్ లేత హృదయం వేటు తిన్న గువ్వలా గిలగిల్లాడేది. గుండెలో లుంగ చుట్టుకుని గొంతు కడ్డంపడి కరగని మంచు ముక్కలాంటి దుఃఖం అతన్ని అణువణువునా నలిపేసేది!

అంబరం కదిలే మబ్బు లతొ ఉండిఉండక నీలమై 
సంబరం జరిపే మనుష్యులు బత్కి బత్కక నీలమై 
నిబ్బరం లెక కన్నవారును పెంచినారును నీలమై 
డబ్బులున్నను శాంతిలేకయు తిండియర్గక నీలమై 
  
అప్పుడే అతని హృదయంలో మరణం పట్ల ఒక రకమైన ద్వేషం – దాన్ని జయించాలన్న బలమైన కోరిక ప్రోది చేసుకోనారంభించేయి.
ఎలా?
ఏ విధంగా?
అస్పష్టమైన భావాలు.
నిర్దుష్టత నెరుగని ఆలోచనలు.
జవాబు దొరకని ప్రశ్నలు.
అప్పుడే సరిగ్గా తనని లాలించి ఇంతన్నం పెడుతున్న మేనత్త కూడా ఉన్నట్టుండి విరుచుకుపడి చనిపోయింది.
హార్టెటాక్ అన్నారందరూ!
మేనమామ ఆమె మీద పడి ఏడుస్తుంటే రామభద్రన్ ఆ దృశ్యాన్ని చూడలేకపోయేడు.
మనసు మెలితిప్పి పిండుతున్న గుడ్డలా తల్లడిల్లిపోయింది.
ఎందుకిలా – తనకి ఎవర్నీ లేకుండా చెయ్యడం.

దీక్షతో మనిషే కధా మరుభూమిలా అనుకంపనం
కక్షతో  మది తొల్చియే సమరం సమోన్నత కంపనం
తక్షణం ఇది మార్చుటే వినియోగమే కధ కంపనం 
వీక్షణం అని గాజుగోళిగ నిర్విరామము కంపనం 

చావనేదియు రాకమానదు జాలిగుండెకు బాధయే 
ఏవగించకు ఎత్తిచూపకు ప్రశ్నలేయకు బాధలో 
నిడుయవ్వన ముద్దుగుమ్మకు పాండురోగము ఎందుకో 
మంచిచేసిన మృత్యవే మము తోడునీడన ఎందుకో

ఈ చావనేది యింత చెప్పా పెట్టకుండా – ఎలాంటి సూచననివ్వకుండా ఒక్కసారి కలుగులోంచి అకస్మాత్తుగా బయటకొచ్చిన కాలసర్పంలా మనిషి మనుగడనెందుకు కాటేసి వెళ్లాలి?
అసలీ చావెందుకు?
ఇదింత అనివార్యమా?
దీన్నుండి మనిషికి విముక్తి లేదా?
భూమి గుండ్రంగా వుందని – దాన్ని పాములా అనంతమైన జలరాశి చుట్టుకుని వుందని – సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయని – ఆకాశం శూన్యమని ఎందుకీ అనవసరపు జ్ఞానం?

కాలసర్పము కాటువేసియు రాక్షసీ వలె ఎందుకో 
ఆలుబిడ్డల ఆశపాశము అంటివుండుట ఎందుకో 
దీనురాలిని బీదవారిని మృత్యువే కబళించెనే 
మృత్యురాతయు లేకయుండుట ఎవ్వరీ తరమవ్వునో

విమానంలో కొన్నివేల మైళ్ళని కొన్ని గంటల్లోనే చేరుకోగలనని, టి.విలో ఎక్కడెక్కడివో చూడగలనని, వినగలనని, ఎన్నెన్నో తన మేధస్సుతో కనుక్కుని సుఖపడుతున్నానని మిడిసిపడే మనిషి – మరణం తన మెడలో పాములా చుట్టుకునే కూర్చుందని – దాన్ని అధిగమించలేని తన తెలివి బూడిదలో పోసిన పన్నీరని గ్రహించలేకపోతున్నాడే!
అకస్మాత్తుగా అతని దృష్టి మేనత్త సాంప్రదాయ సిద్ధంగా శిష్టాచారాలతో, అనంత భక్తిభావంతో తెల్లవరాగానే పూజించే దేవుడి పటాల మీద పడింది.

 అనేక రూపాలతో, అనేక చేతులతో ఆశీర్వదిస్తూ, స్మిత వదనాలతో వున్నాయి దేవుడి రూపాలు.
ఈ యావత్ ప్రకృతిని, ప్రాణుల్ని శాసించే ఒక అద్భుత శక్తి వుందని నమ్మి పూజించిన అత్తని ఈ దేవుళ్లెవరూ మరణం నుండి కాపాడలేకపోయారే?
అసలు దేవుడనే వాడున్నాడా?
ఉంటే..! వాడి పని కేవలం మనిషిని ఏడిపించడమేనా?
స్థితిని వదిలేసి సృష్టి, లయలు చేయడమేనా అతని వృత్తి.
 అంటే దేవుడొక శాడిస్టన్నమాట.
అంతే!
రామభద్రన్  హృదయం భగ్గున తాటాకులా మండింది.
--(())--

 మీరు అంగీకరిస్తే, దయచేసి వీలైనంత ఎక్కువ మందిని సంప్రదించండి.  దీన్ని అమలుచేయడానికి, పోస్ట్‌ని షేర్ చేయండి.

 కనీసం మీ 10 మంది స్నేహితులకు పంపండి.


ఇంకొకరి కోసం కొంచమైనా సుఖం సంతోషం నెమ్మది ఇవ్వాలంటే మనమేమి...

శ్రీమంతులుగా ఉండనవసరం లేదు ఒకటి రెండు మాటల మూలకంగా

స్పందించే సౌజన్యత ఉంటే చాలు...అదే పదివేలు...!!


ఎండిన పువ్వును చూసి విరిసిన పువ్వు నవ్వవచ్చు

అయితే,అది శాశ్వతం కాదు దానికి వాడిపోయే...

సమయం వస్తుంది. అహంకారమైన నవ్వు తాత్కాలికము అంతే!!


ఉండాలి ఆడ-మగ స్నేహితులు బాధలకు స్పందిస్తూ తప్పులను సరిదిద్దుతూ

కష్ట సుఖాలలో...                                                         

పాలు పంచుకుంటూ అప్పుడప్పుడు రేకెత్తించే అల్లరితో జీవితంలో ఒకరికొకరు

స్ఫూర్తిని ఇచ్చుకుంటూ ఉండాలి... అవును కదా!!


No comments:

Post a Comment