Thursday, 24 March 2022



ప్రాంజలి ప్రభ - నేటి సూక్తులు 

* ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోఁక దేహతాపంబులు దీఱిపోవు 
నే నీ శుభాకార మీక్షింపఁ గన్నుల కఖిలార్థలాభంబు గలుగుచుండు 
నే నీ చరణసేవ లే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబుఁ బొందఁగలుగు 
నే నీ లసన్నామ మేప్రొద్దుభక్తితోఁ దడవిన బంధసంతతులు వాయు 

నట్టి నీయందు నా చిత్త మనవరతము నచ్చియున్నది నీ యాన నానలేదు 
కరుణఁ జూడుము కంసారి! ఖలవిదారి! శ్రీయుతాకార! మానినీ చిత్తచోర! 

పోతనామాత్య "భాగవతము" దశమ స్కంధము నుండి

****
* వస్త్రేణ వపుషా వాచా విద్యయా వినయేనచ
వకార పంచకేనైవ నరః ప్రప్నోతి గౌరవం

వస్త్ర ధారణ , శరీర స్వభావం , మాట్లాడేతీరు , విద్య , వినయం వకార పంచకం వీటితో మనిషిలో మార్పు వస్తుంది మంచి నడవడిక అయితే గౌరవం , చెడుని ఆశ్రయిస్తే నరకం ।
****
* న చోరహార్యం నచరాజ హార్యం 
న భ్రాత్రృభాజ్యం నచ భారకారి
వ్యయేక్రృతే వర్ధత ఏవ నిత్యం
విధ్యాధనం సర్వ ధనప్రధానం

దొంగలు దొంగిలించ లేనిది, ప్రభువులు స్వాధీనం చేసుకో లేనిది, సోదరులు పంచుకో లేనిది ఖర్చుచేసిన దినదిన ప్రవర్ధమాన మయ్యేది, అయిన విద్యా సంపద అన్నీ సంపదల్లోకెల్ల ప్రధాన మైనది
****
* ఏనికమోముతా ల్పెలుక నెక్కిన రావుతురాజు సౌరసే 
నానియనుంగుఁబెద్దన వినాయకదేవుఁడు కర్ణతాళఝం 
ఝూనిలతాడనంబున నిరంతరమున్ బ్రబలాంతరాయసం 
తానమహాఘనాఘన కదంబములన్ విదళించుఁ గావుతన్ 

ఏనికమోముతాల్పు= గజముఖుడు, ఎలిక।।। రాజు= మూషికవాహనుడు, సౌర।।అన్న=దేవతల సైన్యాధిపతి కుమారస్వామి అన్నగారు అయిన వినాయకుడు, కర్ణ ।। తాడనంబునన్= చెవులగాలితో, ప్రబల ।। కదంబములన్=విఘ్నములను కారుమబ్బులను, విదలించుగావుతన్=పోఁగొట్టుఁగాక 

గజముఖుడు,  మూషికవాహనుడు, దేవతల సైన్యాధిపతి కుమారస్వామి అన్నగారు అయిన వినాయకుడు,  చెవులగాలితో, విఘ్నములను కారుమబ్బులను, పోఁగొట్టుఁగాక 
****
శ్రీనాథ కవిసార్వభౌముని "శ్రీభీమేశ్వర పురాణము (భీమఖండము)" నుండి గజానన ప్రార్ధన

*అపూర్యమాణ మచల ప్రతిష్ఠం,
సముద్ర మాపః ప్రవిశన్తి యద్వద్।

ఆపూర్వమాణ మంటే అంతటా నిండినది। అచల ప్రతిష్ఠర్సకదలక మెదలక ఉండేది। అది రాలేదే, ఇది రాలేదే, ఇంకా నీరు చాలదే అని సముద్రం దుఃఖించదు। కొంచెమయినా చలనం లేనిది సముద్రం।
అంతటా ఆవరించి ఉండేది  " గాలి " ఇదే జీవకోటి ప్రాణాధారం, సముద్రంలో ఎంత నీరు చేరిన తన గుణం మార్చుకోదు, అట్లే అహంతో ఉన్నదా మగవాడికి ఎన్ని మంచి  చెప్పిన యాలకు ఎక్కవు కదా ? 

****
"కవితా కన్య రసజ్ఞత కవి కన్నా
రసజ్ఞుడెరుంగు గాని కవి కేమి ఎరుగు;
నవ కోమలాంగి సురతము
భర్త ఎరుంగును కాని తండ్రికేమి తెలియును"
,
భావము:
కవిత యొక్క భావంలోని అందం అది వ్రాసిన కవికంటే దాన్ని ఆస్వాదించే రసజ్ఞులకే బాగా తెలుస్తుంది। అలాగే యవ్వన స్త్రీ యొక్క సొగసులు తండ్రి కంటే కూడా భర్తకే బాగా తెలుస్తుంది
*****
* శరచ్చంద్రప్రకాశేన వపుషా శీతలద్యుతిమ్,
ధ్యాయేత్సింహాసనాసీనముమయా సహితం శివమ్।

శరత్కాలమునందలి చంద్రునివంటి కాంతిగల దేహముతో గూడినవాడును, చల్లనికాంతిగలవాడును, సింహాసనమున గూర్చుండినవాడును, ఉమతో గూడిన శివుని ధ్యానించుచున్నాను।
దేవత: శంభువు, ఋషి: శంభువు
****
అదిపర్వం 1-6 -175 
*క// ధరణీ దిశ ప్రసారిత ;గురుకర నికరంబు లుడిచికొని దీర్ఘనిరం ;// 
తరగతి ఖిన్నుడ పోలెను;హరిదశ్వుడు విశ్రమించె నస్తాద్రిదరిన్ 

దీర్ఘనిరం తరగతిన్= ఎడతెగని నడక చేత // 
ఖిన్నము =భేదము నొందినది //ఖిన్నుడ పోలెను= అలసెనో అనునట్లు//కరము =కిరణము ,చెయి 

విరామము లేని సుదీర్ఘ గతిచేత అలిసెనో యనునట్లు ; సూర్యుడు భూమిపై చాపిన స్వీయ కిరణములనే చేతులను అస్తగిరిగుహ లోకి ముడుచుకొని విశ్రమించాడు । 

ఈ పద్యములో ప్రతిఒక్కరు పగలు శ్రమించిన రాత్రి యందు నిద్రలో విశ్రాంతి సుఖము కలుగునని నీతి ణాని తీసుకోక తప్పదు 
*****
* అహు: సత్యంహి పరమం ! ధర్మం ధర్మవిధో జనా:
(రామాయణంలో అయోధ్యకాండ, 14 వ సరిగా, ౩వ శ్లోకం) 

ధర్మం తెలిసిన సజ్జనులు సత్యపాలననే పరమధర్మమని చెపుతూ ఉంటారు

రామాయణంలో దశరధుని భార్య కైకేయి "వరాలిస్తావని ప్రతిజ్ఞ చేసావు"  తీర్చమని అడుగగా "ఎదో తప్పు చేసినట్లు తెగ భాద పడతావేమి " ధర్మం తెలిసిన సజ్జనులు సత్యపాలననే పరమధర్మమని చెపుతూ ఉంటారు " నీ మాటను నిలబెట్టుకొని ఉత్తమగతిని పొందవయ్య అని పలికిన సందర్భం। 

"ప్రతిఒక్కరు వాగ్దానాలు చేసేటప్పుడు చాలా జాగర్త పడాలి లేదా దశరధుని గతి పట్టవచ్చు అనే హెచ్చరిక"।  
ఒక స్త్రీకి సహాయం చేద్దామను కోవటం తప్పుకాదు నెరవేర్చ గలమో లేదో ఆలోచించాలి అనేదే ఇందు నీతి 
*****
। 
* అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె 
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో 
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా 
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్। 
। 
భావము: 
దుర్గాదేవి తల్లు లందరికి తల్లి; సప్తమాతృకలను కన్నతల్లి; ముల్లోకాలకు మూలమైన లక్ష్మి సరస్వతి పార్వతులకు మూలమైన తల్లి; అందరు అమ్మల కన్నా అధికురాలైన గొప్పతల్లి; రక్కసి మూకలను అణచిన యమ్మ; నమ్ముకున్న దేవతామతల్లుల నిండు మనసులలో నివసించే తల్లి; అయిన మా అమ్మ దయాసముద్రి అయ్యి ఈ మహాభాగవత తెలుగు ప్రణీత మందు కవిత్వంలో గొప్పదనము, పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించు గాక। 
తల్లి హృదయంలో నిండు మనసుతో బిడ్డ లందరు సేవచేస్తూ ఆరాధించాలనేదే ఇందు నీతి  
****
* ధర్మోహి పరమోలోకే ధర్మే సత్యం ప్రతిష్ఠితమ్
(అయోధ్యకాండము -21వసర్గ - 40 వ శ్లోకం)
సత్యమనే గుణం సక్రమంగా నిలబడాలంటే ధర్మమార్గమే ప్రధానమైనది।

రామాయణంలో అరణ్యమునకు పోయిన రాముడ్ని కలసిన భరతుడు అయోధ్యకు వచ్చి పట్టాభిషేకము చేయిన్చుకొని మా కందరికి సంతోషాన్ని కలిగించమని వేడుకొనెను। వారిమాటలకు సంతోషం వక్తపరుస్తూ  రామచంద్రుడు పలికిన మాటలు।

"తండ్రి మాటను జవ దాట రాదు అనేది ధర్మము, సత్య గుణం రక్షించ బడాలంటే ధర్మాన్ని అను సరించి తీరాల్సిందే "  
 "తండ్రి మాట " ఎట్టి పరిస్థితిలో తృణీకరించ కూడదనేది రాయణంలోని సూక్తి
****
* పితుర్హి వచనం కుర్వన్ ! నకశ్చిన్నామ హీయతే !!
(అయోధ్యకాండము -21వసర్గ - 36 వ శ్లోకం)

"తండ్రిమాటను పాటించు వాడు ఎన్నటికీ నాశనం పొందడు"

రామాయణంలో అరణ్యమునకు పోయిన రాముడ్ని కలసిన  "తల్లి కౌసల్య "  అయోధ్యకు వచ్చి పట్టాభిషేకము చేయిన్చుకొని మా కందరికి సంతోషాన్ని కలిగించమని వేడుకొనెను। తల్లికి దు:ఖం  కలిగించరాదు నాయనా  అన్నమాటలకు సంతోషం వక్తపరుస్తూ  రామచంద్రుడు పలికిన మాటలు।

"తండ్రి మాటను జవ దాట రాదు అనేది ధర్మము, తండ్రి మాటకు కట్టుబడి ఉన్నవాడు మంచి ఫలితము పొందుతాడు,  ధిక్కరించిన వాడు నాశనము పొందుతాడు అది మీకు తేలుసు కదమ్మా,  సత్య గుణం రక్షించ బడాలంటే తండ్రి మాటను ధర్మాన్ని అను సరించి తీరాల్సిందే "  
 "తండ్రి మాట " పాటించేవాడు సుఖ సంతోషాలతో ఉండగలడనేదే రాయణంలోని సూక్తి
*****
 



Mallapragada Sridevi: ప్రతి మనిషి జీవితంలో ముఖ్యమైన వైద్య సంఖ్యలు

1. రక్తపోటు: 120/80

2. పల్స్: 70 - 100

3. ఉష్ణోగ్రత: 36.8 - 37

4. శ్వాసక్రియ: 12-16

5. హిమోగ్లోబిన్: పురుషులు (13.50-18)

 ఆడవారు ( 11.50 - 16 )

6. కొలెస్ట్రాల్: 130 - 200

7. పొటాషియం: 3.50 - 5

8. సోడియం: 135 - 145

9ట్రైగ్లిజరైడ్స్: 220

10. శరీరంలో రక్తం మొత్తం: 5-6 లీటర్లు

11. చక్కెర: పిల్లలకు (70-130)

 పెద్దలు: 70 - 115

12. ఐరన్: 8-15 మి.గ్రా

13. తెల్ల రక్త కణాలు: 4000 - 11000

14. ప్లేట్‌లెట్స్: 150,000 - 400,000

15. ఎర్ర రక్త కణాలు: 4.50 - 6 మిలియన్లు..

16. కాల్షియం: 8.6 - 10.3 mg/dL

17. విటమిన్ D3: 20 - 50 ng/ml (మిల్లీలీటర్‌కు నానోగ్రామ్‌లు)

18. విటమిన్ B12: 200 - 900 pg/ml

 

మీకు దాహం అనిపించకపోయినా లేదా అవసరం లేకపోయినా ఎల్లప్పుడూ నీరు త్రాగండి ... అతి పెద్ద ఆరోగ్య సమస్యలు మరియు వాటిలో ఎక్కువ భాగం శరీరంలో నీరు లేకపోవడం.

మీరు మీ ప్రాధాన్యతలో అగ్రస్థానంలో ఉన్నప్పుడు కూడా క్రీడలు ఆడండి... శరీరాన్ని తప్పనిసరిగా కదిలించాలి, కేవలం నడక ద్వారా లేదా ఈత ద్వారా... లేదా ఏ రకమైన క్రీడలు అయినా.

 విపరీతమైన ఆహార కోరికలను వదిలేయండి...ఎందుకంటే అది ఎప్పుడూ మంచిని తీసుకురాదు.

 కోపం వదలండి...

 కోపం వదలండి.

*****

: ఒక తండ్రికి కొడుకు నుండి ఒక సందేహం.... మీ కాలంలో1. ఇంత టెక్నాలజీ లేదు..2.విమానాలు లేవు..3.. ఇంటర్నెట్ లేదు..4.. Tv లు లేవు..5.. కంప్యూటర్ లు లేవు..6.. ఏసీ లు లేవు..7.. లగ్జరీ కార్ లు లేవు..8.. మొబైల్ ఫోన్ లు లేవు... మీరెలా బతికారు...               దానికి ఆ తరము తండ్రిగారు ఇచ్చిన జవాబు అందరూ చదవ వలసిందే...........  మీ తరము ఈరోజు కాలంలో ఎలాగైతే 1.. ప్రార్ధన లేకుండా..2.. మర్యాద లేకుండా 3.. ప్లానింగ్ లేకుండా 4.. క్రమశిక్షణ లేకుండా..5.. పెద్దల ఎడ గౌరవం లేకుండా..6.. మన చరిత్ర పై అవగాహన లేకుండా..7.. కుటుంబ విలువలపై ఏ మాత్రం పట్టింపులు లేకుండా..8.. Morals లేకుండా... ఎలాగైతే హాయి గా రోజులు గడిపేస్తున్నారో... మేము వాటిని పాటిస్తూ ఆనందముగా జీవించాము...మేము మీలాగా... 1..వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించలేదు..2.. పాఠశాల వేళలు అయినా తదుపరి చీకటి పడేదాకా ఆడుకున్నాము tv లు చూడలేదు...3.. ఇంటర్నెట్ స్నేహితులతో కాక నిజమైన స్నేహితుల తో గడిపాము..4..దాహము వేస్తె కుళాయి నీరు తాగాము.. బాటిల్ నీరంటే ఏమిటో తెలియదు..5..ఒకేగ్లాస్ లో నలుగురం జ్యూస్ తాగినా మాకెప్పుడూ జబ్బులు రాలేదు..6..మూడు పూటలా అన్నం తిన్నా మాకు ఊబకాయం రాలేదు...7.. షూస్ లేకుండా ఉత్తి పాదాలపై పరిగెత్తినా మాకు కీళ్ళ నొప్పులు రాలేదు..8..సొంత ఆట వస్తువులు తయారు చేసి ఆడుకున్నాము,, బంధువులతో కలసి మెలసి ఆనందముగా ఉన్నాము, పండుగలు కలిసి చేసుకున్నాము..9.. పిలవకపోయినా స్నేహితుల ఇండ్లకు వెళ్లి వారి తినుబండారాలు ఆరగించాము..10.. మావి black and వైట్ ఫొటోలే అయినా వాటి వెనుక ఎన్నో మధుర స్మృతులు..... మాది జీవితాన్ని చదివిన తరము.. బహుశా మాతల్లి దండ్రులు చెప్పినది ఆచరించిన చివరితరం... మా వారసులు శాసించినది పాటించే మొదటి తరమూ మాదే కావచ్చు..... అయినప్పటికీ.. మీ యాంత్రిక జీవితానికి యధాశక్తి సహాయ పడుతున్న వాళ్ళము... మేము ఒక limitted ఎడిషన్ మోడల్స్ లాంటి వాళ్ళము..... అందుకే మా విన్నపము ఏమంటే.. మీ జీవితాలనుండి, ఈరోజు భూమి పైనుండి మేము వెళ్ళిపోకముందే ఎంతో అంత మానుండి మీరు నేర్చుకోండి... (నేను చూసిన ఒక ఆంగ్ల వాట్సాప్ message కి తెలుగు సేత.. మాత్రమే )

*****

 🙏🙏🙏🙏🙏

1) నేను చాలా మొత్తాన్ని ,చాలా సార్లు విరాళం ఇచ్చాను 

2) నేను చాలా దేవాలయాలను సందర్శించాను 

3) నేను చాలా మందికి సహాయం చేసాను 

4) నేను చాలా స్వచ్ఛంద కార్యక్రమాలు చేశాను 

5) నేను అనాథ పిల్లలను దత్తత తీసుకున్నాను 

6) నేను రక్తదానం చేశాను 

7) నేను చాలా చెట్లను నాటాను

8) నేను అరుణాచలం, తిరుపతి, కాశీకి చాలాసార్లు వెళ్ళాను 

9) నేను చాలా దీక్షలను తీసుకున్నాను (అయ్యప్ప, హనుమాన్, భవానీ, శివ) 

10) నేను చాలా సార్లు అన్నదానం చేశాను 

11) నేను చాలా పక్షులను, జంతువులను పోషించాను

12) నేను సమాజానికి చాలా చేశాను 

13) నేను చాలా భక్తితో జీవిస్తున్నాను 

14) నేను అన్ని ధర్మాలను అనుసరిస్తున్నాను 

15) నేను గోషాలాలను నడుపుతున్నాను, గౌ సేవా కూడా చేస్తాను 

16) నేను రోజూ భజనలు చేస్తాను 

17) నేను చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చాను

18) నేను చాలా మందికి ఆశ్రయం ఇచ్చాను

19) నా దగ్గర కోట్లు, కోట్లు ఆస్తి ఉన్నాయి

చివరగా, మీరు మీ స్వంత శక్తితో ఇవన్నీ చేశారని మీకు అనిపిస్తే, అది పూర్తిగా వ్యర్థం.

నేను నేను నేను నేను నేను - ఈ భావనను వదిలివేయండి

 మీరు చేసారు ఎందుకంటే, ఈశ్వరుడు ఈ పనులు చేయడానికి మిమ్మల్ని ఎన్నుకున్నారు.ఇది మీ క్రెడిట్ కాదు, ఇది శివుడి క్రెడిట్.  

మీరు కేవలం ఆటగాడు మాత్రమే మరియు  హీరో, స్క్రీన్ ప్లే, కథ రచయిత, నిర్మాత ,దర్శకుడు శివుడు మాత్రమే. మీ మనస్సులో ఈ భావన ఉంటే, అప్పుడు మీరు గొప్ప వ్యక్తిగా పరిగణించబడతారు. 

మీరు ఈ రోజు గొప్ప వ్యక్తి, మీరు ఏమి చేసినా, శివుడు మీ వెనుక ఉన్నాడు.దీన్ని ఎప్పటికీ మరచిపోకండి. శివుడు సహాయం, మద్దతు లేకుండా మీరు ఒక్క పని కూడా చేయలేరు.

🙏🙏🙏🙏🙏


Friday, 18 March 2022

సంకటహర చతుర్థి ‬పూజ వ్రత విధానం



*నేడు సంకటహర చతుర్థి ‬పూజ వ్రత విధానం మరియు సమగ్ర వివరణ*

🙏

గణపతి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరించెదరు. *మొదటిది వరదచతుర్థి ,*  

*రెండవది సంకష్టహర చతుర్థి*  

*అమావాస్య తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతమును "వరదచతుర్థి" అని, పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను "సంకష్టహర చతుర్థి / సంకటహర చతుర్థి వ్రతం"  అంటారు.*

ఇందులో వరదచతుర్థి ని వినాయకవ్రతంగా వినాయక చవితి రోజున ఆచరించెదరు. సంకటములను తొలించే సంకట హర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు.

ఒకవేళ సంకష్ట హర చతుర్థి *మంగళవారం  వస్తే దానిని అంగారక చతుర్థి* అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. అంగారక చతుర్థి (Angarika Chaturthi) నాడు సంకటహర చతుర్థి వ్రతం  ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరునని ప్రతీతి.

ప్రతిమాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత 3 , 4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు (సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి. అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా గమనించాలి.

꧁┉┅━❀🕉️❀━┅┉꧂

 *సంకటహర చతుర్థి ‬ వ్రత పూజా విధానం* 🌈

సంకటహరచవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి.

ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి.

వ్రతాచరణ రోజున ప్రాతఃకాలమే శిరస్సున స్నానం చేసి , తరువాత గణపతిని పూజించాలి. అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవిక గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని

పసుపు,  కుంకుమలతో అలంకరణను చేయాలి. మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు

ఖర్జూరాలు , రెండు వక్కలు , దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి.


 *సంకటనాశన గణేశ స్తోత్రం , సంకట హర చతుర్థి వ్రత కథ* ను చదవవలెను.

ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి.

తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి.

శక్త్యానుసారము గరిక పూజను కాని , గణపతి హోమమును కాని చేయించుకొనవచ్చును.

సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన వినాయకుడిని కదపరాదు.

సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి.

నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి.

꧁┉┅━❀🕉️❀━┅┉꧂

🌈 *సంకట హర చతుర్ధి వ్రత కథ:* 🌈

ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో బృఘండి (వినాయకుని గొప్ప భక్తుడు) అనే ఋషి దగ్గర్నించి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుండగా ఘర్‌సేన్‌ అనే రాజు రాజ్యం దాటే సమయంలో , అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం పై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరువు చెందుతూ తిలకించ సాగాడు.

అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అపుడు ఇంద్రుడు… ఓ రాజా ! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అపుడు ఆ రాజు అయ్యా ! మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా !

అపుడు ఇంద్రుడు ఇవాళ పంచమి , నిన్న చతుర్ధి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేసారో , వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ.. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా ? అని !!   కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు.

అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత , *‘నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం వుంది. తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్ధి వ్రతం చేసింది. ఈ రోజు మరణించింది’* అని చెప్పాడు.

అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. 

గణేషుని దూతని అపుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని , అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేషుని దూత అంగీకరించనే లేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్పోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు.

ఈ కథ సంకష్ట హర చవితి ప్రాముఖ్యత , ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. 

వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన ! ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశిస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు.

꧁┉┅━❀🕉️❀━┅┉꧂

🙏 *గణపతి ప్రార్ధన* 🙏

*శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం !*

*ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే !!*

꧁┉┅━❀🕉️❀━┅┉꧂

🙏 *గణనాయకాష్టకం* 🙏

ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభమ్

లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకమ్

మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతమ్

బాలేందుశకలం మౌళీ , వందేహం గణ నాయకమ్

చిత్రరత్నవిచిత్రాంగం , చిత్రమాలా విభూషితమ్

కామరూపధరం దేవం , వందేహం గణనాయకమ్

గజవక్త్రం సురశ్రేష్ఠం , కర్ణచామర భూషితమ్

పాశాంకుశధరం దేవం వందేహం గణ నాయకమ్

మూషికోత్తమ మారుహ్య దేవాసురమహాహవే

యోద్ధుకామం మహావీరం వందేహం గణ నాయకమ్

యక్షకిన్నెర గంధర్వ , సిద్ధ విద్యాధరైస్సదా

స్తూయమానం మహాబాహుం వందేహం గణ నాయకమ్

అంబికాహృదయానందం , మాతృభి: పరివేష్టితమ్

భక్తిప్రియం మదోన్మత్తం , వందేహం గణ నాయకమ్

సర్వవిఘ్నహరం దేవం , సర్వవిఘ్నవివర్జితమ్

సర్వసిద్ధి ప్రదాతారం , వందేహం గణ నాయకమ్

గణాష్టకమిదం పుణ్యం , యః పఠేత్ సతతం నరః

సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్

*ఇతి శ్రీ గణనాయకాష్టకం*

꧁┉┅━❀🕉️❀━┅┉꧂

🙏 *సంకటహర గణపతి స్తోత్రం* 🙏

ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేన్నిత్యమాయు: కామార్ధ సిద్ధయే

ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయం

తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్ధకం

లంబోదరం పంచమం చ షష్టం వికటమేవచ

సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తధాష్టకం

నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం

ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననమ్

ద్వాదశైతావి నామాని త్రిసంధ్యం యఃపఠేన్నిత్యం

నచవిఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో

విద్యార్దీ లభతే విద్యాం ధనార్దీ లభతే ధనం

పుత్రార్దీ లభతే పుత్రాన్ మోక్షార్ధీ లభతే గతిమ్

జపేత్ గణపతిస్తోత్రం చతుర్మాసై: ఫలం లభత్

సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః

అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయః సమర్పయేత్

తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః

꧁┉┅━❀🕉️❀━┅┉꧂

🙏 *విఘ్నేశ్వర నమస్కార స్తోత్రం* 🙏

జయ విఘ్నేశ్వర ! నమో నమో , జగద్రక్షకా ! నమో నమో

జయకర ! శుభకర ! సర్వపరాత్పర ! జగదుద్ధారా ! నమో నమో

మూషిక వాహన ! నమోనమో , మునిజనవందిత ! నమో నమో

మాయా రాక్షస మదాపహరణా ! మన్మధారిసుత ! నమో నమో

విద్యాదాయక ! నమో నమో , విఘ్నవిదారక , నమో నమో

విశ్వసృష్టి లయ కారణ శంభో ! విమల చరిత్రా ! నమో నమో !

గౌరీప్రియ సుత నమో నమో గంగానందన నమో నమో

అధర్వాద్భుతగానవినోదా ! గణపతిదేవా ! నమోనమో !

నిత్యానంద ! నమో నమో , నిజఫలదాయక ! నమో నమో

నిర్మలపురవర ! నిత్యమహోత్సవ ! రామనాథ సుత నమో నమో

***

 పెళ్లిళ్ల సీజన్‌లో కళ్యాణ మండపాలు దొరకడమే కష్టం. దొరికినా సామాన్యుడికి అందుబాటులో లేని అడ్వాన్సులు. కానీ లలిత రైస్ ఇండస్ట్రీస్ అధినేతల్లో ఒకరైన మట్టె శ్రీనివాస్ సుమారు రూ.4 కోట్ల వ్యయంతో సెంట్రల్ ఎయిర్ కండీషన్డ్ కళ్యాణ మండపాన్ని అన్నవరం దేవస్థానంలో ఏర్పాటు చేశారు. ఈ కళ్యాణ మండపంలో ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే తమ పిల్లల పెళ్లిళ్లు చేసుకోవచ్చు.

ఇది పేద వారి కోసం పెద్ద మనసుతో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదిక. అన్నవరం దేవస్థానంలో అధికారులు బుకింగ్‌లు ప్రారంభించారు. ఈ మండపంలో ఒకేసారి 12 జంటలకు వివాహం జరిపించేందుకు వీలుగా ఉంటుందని దేవస్థానం అధికారులు వివరించారు. పెళ్లి వారికి కావలసిన పాత్రలు, పాదుకలు, కుర్చీలు ఇలా అన్నీ దాత శ్రీనివాస్ సమకూరుస్తారు.

పెళ్లి పేదలకు తలకుమించిన భారమే. అయితే వారు కూడా సాదాసీదాగా కాకుండా ఉన్నతంగా జరుపుకోవాలనే సదుద్దేశంతో ఈ ఏర్పాట్లు చేసినట్లు దాత శ్రీనివాస్ చెబుతున్నారు. ఈ కళ్యాణ వేదికను ఈ నెల 16న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించగా.. వివాహాలు చేసుకునే వారి కోసం దేవస్థానం అధికారులు ఆదివారం నుంచి బుకింగ్స్ ప్రారంభించారు. సంబంధిత పత్రాలు తీసుకువస్తే ఆయా తేదీలలో మండపాలను బుక్ చేస్తారు.

ఏసీ కళ్యాన మండపంలో వివాహం చేసుకోదల్చిన వారు లగ్న పత్రిక, వధూవరుల ఆధార్ జిరాక్స్, వారి తల్లిదండ్రుల ఆధార్ జిరాక్స్‌లను రత్నగిరిపై ఉన్న సీఆర్‌వో కార్యాలయంలోఅందజేయాలి. వారికి ఉచిత కళ్యా వేదిక నెంబరును కేటాయిస్తారు. ఆ నంబర్‌ను ఉచిత కళ్యాణ వేదిక వద్ద చూపించి వివాహ సామాగ్రిని పొందాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియలో ఎవరికీ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పని లేదని ఆలయ అధికారులు వెల్లడించారు.

  ఓం శ్రీ సత్య దేవాయ నమః                    

🌿🌸🌿

: తిరుమల జోలికి వెళ్లొద్దు

*********************

దాదాపు యాభై సంవత్సరాల క్రితం, పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం లో జరిగిన సంఘటన. 

పెరుగుతున్న భక్తుల రద్దీని తట్టుకుని మంచి దర్శనం కల్పించడానికి తి.తి.దే ఎప్పుడూ ఏవో ప్రణాలికలు రచిస్తూనే ఉంటుంది. అలా ఒకసారి పౌర సంబంధాల అధికారి మరియు దేవస్థానం సభ్యులు కలిసి ఒక పథకం ఆలోచించారు.

మామూలుగా జయవిజయు లను దాటి స్వామి వారి దర్శనం చేసుకున్న భక్తులు మరలా అదే దారి లోనే బయటకు రావడం ఆనవాయితీ. అలా కాకుండా అర్ధమండపం యొక్క ప్రక్క గోడలు తొలగించి అక్కడ ద్వారములు తెరిస్తే, వాటి నుండి దర్శనం చేసుకున్న భక్తులు కుడిఎడమలకు వెళ్ళవచ్చు. దీని వల్ల భక్తుల రద్దీని భరించవచ్చు. 

ఇది అమలు చెయ్యాలనుకున్న ప్రతిపాదన.

దీని గురించి లోతుగా చర్చించి నలభై లక్షల వ్యయం తో అమెరికా నుండి కటింగ్ మెషిన్ ను కొనుగోలు చెయ్యాలని నిర్ధారించారు. ఇదంతా విని అక్కడే ఉన్న శ్రీ గణపతి స్థపతి గారి మనస్సు కలతపడింది. మనస్సు లోని బాధ మోహంలో కొట్టొచ్చినట్టు కనబడుతోంది. అక్కడే ఉన్న ఒక మంత్రి దీన్ని గమనించారు. స్వయంగా స్థపతి గారినే, “ఎందుకు స్థపతి గారు మౌనంగా ఉన్నారు ? ఈ నిర్ణయం మీకు సమ్మతమే కదా ?” అని అడిగారు.

“నా అభిప్రాయాల్ని నేను చెప్పవచ్చునా ?” అని అడగగా, సరే అన్నట్టు తలూపారు మంత్రి గారు. దేవాలయ ఆగమ పద్ధతులను అనుసరించి వేల ఏళ్ళ క్రితం ఆగమ శాస్త్రం లో ఉద్ధండులైన మహాత్ముల చేత కట్టబడింది ఈ దేవాలయం. గర్భాలయం ముందర ఉన్న అర్థ మండపం పరమ పవిత్రమైనది. దారి కోసమని ఆ మండపం గోడలను కూల్చడం సరైన పని కాదు. అలా జరిగిన పక్షం లో వేంకటేశ్వర స్వామి వారి పవిత్రత కు, శక్తి కి ఆటంకం ఏర్పడవచ్చు.

ఈ పడగొట్టే ప్రణాలికను ఆపేయడం మంచిది అని ధైర్యం గా చెప్పారు.

సభ్యులందరూ ఈ కొత్త ఆలోచనను అప్పటికే ఏకగ్రీవంగా ఆమోదించడంతో, స్థపతి గారి మాటలను పట్టించుకోలేదు. దీన్ని కార్యరూపం లోకి తీసుకురావడానికి పనులన్నీ అక్కడే జరిగిపోయాయి. ఇక చేసేది లేక అందరి బలవంతం పైన స్థపతి కూడా సంతకం పెట్టవలసి వచ్చింది.

అప్పటి నుండి స్థపతి గారి మనస్సు ప్రశాంతతను కోల్పోయింది. గుండె బరువెక్కగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. దీన్ని ఎలాగైనా ఆపాలని పరి పరి విధాల ఆలోచిస్తున్నారు. ఈ సమయం లో సాక్షాత్ పరమేశ్వర స్వరూపుడైన పరమాచార్య స్వామి వారు తప్ప ఎవరూ సహాయం చెయ్యలేరని నిర్ణయించుకున్నాడు. వెంటనే మహాస్వామి వారి వద్దకు పరుగులు తీసాడు.

కార్వేటి నగరం చేరేటప్పటికి ఉదయం అయ్యింది. బాధపడిన మనస్సుతో పరమాచార్య స్వామి వారిని దర్శించగానే కళ్ళ వెంట అదేపనిగా నీరు వస్తోంది. మహాస్వామి వారు వేళ్ళను నుదుటిపై మూడు నామాల వలె చూపిస్తూ, “అక్కడి (తిరుమల) నుండే వస్తున్నావా ?” అని అడగడంతో కాస్త కుదుటపడ్డాడు.

“అవును” అని మహాస్వామి వారితో తన బాధనంతా చెప్పుకుందామని నోరుతెరవగానే, చేతి సైగ ద్వారా ఆగమన్నారు స్వామివారు. “ఇప్పుడు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు.

ముందు వెళ్లి ఏమైనా తిను”. తల్లి ప్రేమ కంటే గొప్పది ఇంకేదైనా ఉంది అంటే అది పరమాచార్య స్వామి వారి కరుణ మాత్రమే. ఎందుకంటే ఆ తల్లి ప్రేమకు మాత్రమే తెలుసు స్థపతి రెండు రోజులుగా ఏమీ తినకుండా మదనపడుతున్నాడని.

మఠ సేవకుణ్ణి పిలిచి, “ఏదైనా హోటలుకు తీసుకుని వెళ్లి కడుపు నిండా ఆహారం పెట్టించు” అని స్థపతి తో పాటు పంపారు. ఆ సమయం లో కేవలం ఒక్క హోటల్ మాత్రమే తెరచి ఉంది. హోటల్ ఓనరుతో స్థపతి గారికి పెట్టిన ఆహారానికి పరమాచార్య స్వామి వారు డబ్బు కడతారు అని చెప్పగా, “పరమాచార్య స్వామి వారు పంపిన వారికి ఆహారం ఇవ్వడం నా పూర్వజన్మ సుకృతం” అని సిద్ధంగా ఉన్న వివిధ రకాలైన ఆహార పదార్థాలను వడ్డించారు.

తిన్న తరువాత వెళ్లి పరమాచార్య స్వామి వారి ఎదుట నిలబడ్డారు. “ఇప్పుడు చెప్పు” అని స్థపతి చెప్పిన విషయాలను మొత్తం విని, అలా గోడలను తొలగిస్తే ఏమవుతుంది?  అని అడిగారు.

తిరుమల ఆలయంలో ఏ మార్పు అయినా పరమాచార్య స్వామి వారికి చెప్పిన తరువాతనే అమలుపరుస్తారు. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని మీకు చెప్పలేదు. అర్థ మండపాన్ని కదిలిస్తే మునుపటి లాగా వేంకటాచలపతి యొక్క దివ్యశక్తి జనులకు ప్రసరించదు. బహుశా వారి నిర్ణయాన్ని మీకు తెలపడానికి వారు ఇక్కడకు రావచ్చు. అప్పుడు మీరు దీనికి అనుమతి ఇవ్వవలదు అని పరమాచార్య స్వామి వారిని ప్రార్థించాడు.

మానవ జాతినే ఉద్ధరించడానికి ఈ భువి పై అవతరించిన మహాస్వామి వారు తమ చల్లని చిరునవ్వుతో, “అంతా నీవు అనుకున్నట్టుగానే జరుగుతుంది. చింత వలదు” అని అభయమిచ్చారు. కొద్దిగా మనోవేదన తగ్గడంతో స్థపతి అక్కడి నుండి వచ్చేశారు. బాగా అలసిపోవడం వల్ల ఆ రాత్రి బాగా నిద్రపట్టింది. ఎవరో తనని నిద్ర లేపుతునట్టు అనిపించడంతో హఠాత్తుగా భయం తో లేచి చూస్తె అక్కడ ఎవరూ లేరు. కాని తన అలసట బాధ అంతా తీరిపోయి, చాలా ఉల్లాసంగా అనిపించింది. వెంటనే అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి ఇంటికి పరుగెత్తాడు. గేటు దగ్గర ఉన్న సెక్యురిటీ గార్డు స్థపతి గారిని గుర్తుపట్టి ఆశ్చర్యం తో ఇంత ఉదయం రావాల్సిన పనేమిటని అడిగాడు. వెంటనే తాను ముఖ్యమంత్రి గారిని కలవాలని చెప్పారు.

ముందస్తు సమాచారం లేనందున అతను అందుకు ఒప్పుకోలేదు. కాని, తిరుపతి గణపతి స్థపతి అంతే ఎవరో అందరికి తెలిసినదే కాబట్టి వారి కోరికను మన్నించడానికి ఒక అధికారి సమాయత్త మయ్యాడు. “అయ్యా, ఒక పని చేద్దాం. సరిగ్గా నాలుగున్నర కు కాఫీ తాగడానికి ముఖ్యమంత్రి గారు కిందకు వస్తారు. కిందకు వచ్చి హాలు లోకి వెళ్ళేటప్పుడు వారు మిమ్మల్ని చూస్తే సమస్య లేదు. లేదంటే మీరు ఉదయం దాకా ఆగవలసిందే” అని చెప్పాడు.

పరమాచార్య స్వామి వారు ఖచ్చితంగా దారి చూపిస్తారు అనే నమంకంతో స్థపతి గారు అక్కడ నిలబడ్డారు. ముఖ్యమంత్రి గారు మెట్లు దిగుతూ వాకిట్లో నిలబడ్డ స్థపతిని చూశారు. “ఏంటి గణపతి ఇంత ఉదయాన్నే ?” అని అడిగి, లోపలి కి రమ్మన్నారు..

“తిరుమల దేవాలయానికి ప్రమాదం” అంటూ మొదలుపెట్టి మొత్తం జరిగిన విషయాన్నంతా చెప్పారు. స్థపతి చెప్పినదంతా విన్న ముఖ్యమంత్రి ముఖం లో కోపం కనపడింది. వెంటనే దేవాలయ వ్యవహారాలు చూసే మంత్రిని సంప్రదించారు. “మొన్న తిరుమల లో ఏం జరిగింది?” అని అడిగారు. “ఓహ్ అదా! మీతో ఆ విషయం మాట్లాడుదామనే మొత్తం వివరాలతో సిద్ధం అవుతున్నాను” అని బదులిచ్చారు మంత్రిగారు.

ముఖ్యమంత్రి గారు కోపంతో “నేను అడిగింది ఏమి జరిగింది అని మాత్రమే?”, ఈసారి ప్రశ్న చాలా సూటిగా వచ్చింది. మొత్తం తమ ప్రణాలికను వివరించారు మంత్రిగారు. ఇంకా ఏదో చెప్పబోయేంతలో,

“ముందు నేను చెప్పేది విను,

వెంకన్న జోలికి పోకండి” అని నిక్కచ్చిగా చెప్పారు. తిరుమల వేంకటేశ్వర స్వామి వారి విషయాల్లో అనవసరంగా తలదూర్చకండి అని చెప్పి సంభాషణ అక్కడితో ముగించారు.

స్థపతిని పంపుతూ, “తిరుమలకు ఏమీ జరగదు, నువ్వు నిశ్చింతగా వెళ్ళు” అని భరోసా ఇచ్చారు. పెద్ద బరువు దింపుకుని చాలా ఉత్సాహంగా తిరుగు ప్రయాణమయ్యారు స్థపతి.

 తనను నిద్ర నుండి లేపి, ఈ సమయంలో ముఖ్యమంత్రి గారిని కలిసి, ఇంత పెద్ద సమస్య కు పరిష్కారాన్ని చూపించింది ఏదో ఒక అదృశ్య శక్తి అని గ్రహించాడు.

వెంటనే పరమాచార్య స్వామి వారి పలుకులు చెవిలో వినబడ్డాయి. “అంతా నువ్వు అనుకున్నట్టుగానే జరుగుతుంది” అన్న మాటలు గుర్తుకు రావడంతో ఒక్కసారిగా ఒణుకు ప్రారంభమై ఒళ్ళు గగుర్పాటుకు గురైంది. 

వరుసగా జరిగిన ఈ సంఘటనలన్నీ కేవలం మహాస్వామి వారు ఆశీస్సుల వలన మాత్రమే అని తలచి ఆ ఉషోదయ సమయంలో స్వామివారిని తలచుకుని పులకించిపోయాడు.

--- “కంచి మహానిన్ కరుణై నిళగల్” నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

*******

కాలక్షేపం కాదు -- జ్ఞాన సంపద 

వ్యాపారి:- ఆధ్యాత్మిక జ్ఞానం అంతా ఒక్క మాటలో చెప్పగలరా?

గురువు:- నిశ్శబ్దం 

వ్యాపారి:- మరి ఆ నిశ్శబ్దాన్ని ఎలా అందుకుంటాం?

గురువు:- ధ్యానం ద్వారా 

వ్యాపారి:- అయితే ధ్యానం ఎలా చేస్తారు?

 గురువు:- నిశ్శబ్దంగా ఉండటం ద్వారా 

వ్యాపారి:- నిశ్శబ్దంగా నిష్క్రమించాడు 

****

వ్యాపారి:- ఆధ్యాత్మిక జ్ఞానం తో సంపాదన గూర్చి  చెప్పగలరా?

గురువు:- నిశ్శబ్దం 

వ్యాపారి:- మరి సంపాదన ఎలా అందుకుంటాం?

గురువు:- నీతి,  నిజాయితి, ధర్మ ధ్యానం ద్వారా 

వ్యాపారి:- అయితే ధ్యానం ఎలా చేస్తారు?

 గురువు:- ధనం లెక్కించక దానం చేయుట ద్వారా 

వ్యాపారి:- నిశ్శబ్దంగా నిష్క్రమించాడు 

****

వ్యాపారి:- ఆధ్యాత్మిక జ్ఞానం తో బంధాన్ని వదులుటకు ఒక్క మాటలో చెప్పగలరా?

గురువు:- నిశ్శబ్దం 

వ్యాపారి:- మరి ఆ నిశ్శబ్ద ప్రేమను ఎలా అందుకుంటాం?

గురువు:- తృప్తి పరచి, సంతృప్తి పడుట ద్వారా 

వ్యాపారి:- అయితే ఆడదానికి లొంగి పోవాలా ఎలా చేస్తారో ?

 గురువు:- నిశ్శబ్దంగా మూగవానిలా ఉండటం ద్వారా 

వ్యాపారి:- నిశ్శబ్దంగా నిష్క్రమించాడు 

****

వ్యాపారి:- ఆధ్యాత్మిక జ్ఞానం గా మనసు కోతి లాంటిది కదా ఒక్క మాటలో చెప్పగలరా?

గురువు:- నిశ్శబ్దం 

వ్యాపారి:- మరి ఆ నిశ్శబ్ద హృదయంలో చంచలం ఎలా అందుకుంటాం?

గురువు:- ఆశ, పాశం , వదిలే , ధ్యానం ద్వారా 

వ్యాపారి:- అయితే ధ్యానం ఎలా చేస్తారు?

 గురువు:- నిశ్శబ్దంగా ప్రశ్నించకుండా, కోర్కల్కు లొంగకుండా ఉండటం ద్వారా 

వ్యాపారి:- నిశ్శబ్దంగా నిష్క్రమించాడు 

****

విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ 


****


గీతము -1

పాట సందర్భం.

*******

 పల్లెలు  దేశప్రగతికి ప్రతీకలు అటువంటి పల్లె లు  నేడు వ్యవసాయం  గిట్టుబాటు కాక  భూములన్ని  ఎండిపోయి  పిచ్చిమొక్కల నివాసాలుగా మారాయి..

 చదువుకున్న ఓ యువకుడు మా వూరికి వ్యవసాయమే జీవనాధారం ఇలా మా పల్లే వుండకూడదని ఉద్యోగం మానేసి గ్రామము   ప్రపంచం దృష్టి ని ఆకర్షిఃచేలా చేసి   ఆ పల్లె కళ్ళలో కాంతులు నింపుతాడు. అలా ఆ యువకుడిపైన మనసు పడ్డ  పల్లె ప్రజలు తన మదిలోని ప్రేమను 

తన పల్లె గూటికి పండుగ తెచ్చిన  ఆ యువకుడి పై కురిపించిన    ప్రశంసల ప్రేమే ఈ పాట...

 ***************

పల్లవి:-

****

మబ్బులు కమ్మిన వేళా, 

మాయను దాచిన వేళా  

మమతలు కరువైన వేళా 

మనసు చేయును గోళా 

అదే అదే మన గ్రామం బాగు పడాలి ఎలా ఎలా 


చరణం : 


చేత చీపురు పట్టి చిమ్మే ఆడదిలా 

చేయి చేయి కలిపే ప్రేమికులులా  

మంచిని తెల్పి అనుకరించేవానిలా 

కదలాలి మనమందరం బాగు చేయాలి 


అలా అలా కదిల్తే మేటి గ్రామమవుతుందిలే 

అలా అలా కదిల్తే మేటి గ్రామమవుతుందిలే 

 

చరణం : 


రోడ్లను సరిచేసి, గుమ్మాలు సరిచేసి, చెట్లను సరిచేసి 

మార్ఖులను వేరుచేసి, దుర్మార్గులను తరిమివేసి, ఆధునిక 

వెలుగులను నింపేసి, బద్దకస్తులకు, జూదగాళ్ళకు, 

భోలాశంకారులకు, పనులు పురమాయించి, పంట పంటకు 

సహకారం అందించి బ్రతుకుతెరువు అందిస్తే ఆగ్రామం 


అలా అలా కదిల్తే మేటి గ్రామమవుతుందిలే 

అలా అలా కదిల్తే మేటి గ్రామమవుతుందిలే 


పల్లవి:-

మబ్బులు కమ్మిన వేళా, 

మాయను దాచిన వేళా  

మమతలు కరువైన వేళా 

మనసు చేయును గోళా 

అదే అదే మన గ్రామం బాగు పడాలి ఎలా ఎలా 

****

విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ        


వెన్నెల ఛాయ వృత్తము -26 అక్షరాలు

...................................

ర స జ జ భ ర ర స లగ - గణములు

11, 19 అక్షరములు - యతి స్థానములు

ప్రాస కలదు.

............................

UIU IIU IUI I - UI UII UIU - UIU IIU IU


ప్రేమపొందుట సామరస్యము -ప్రేమతత్వము శోధనే - ప్రేమ పంచుట కార్యమే 

ప్రేమగాలులు వచ్చి ఏడ్చిన -ప్రేమ తొందర చెందకా - ప్రేమ సౌఖ్యము చందమే  

ప్రేమ ఆటలు పాట పొందిక - ప్రేమభావం వల్లనే  - ప్రేమ లక్ష్యము తీరుటే 

ప్రేమ అర్ధము ప్రేమదేశము - ప్రేమ సఖ్యత కల్గుటే - ప్రేమ యే మన సంపదే  


చిత్త భ్రాంతియు పొంది క్రోధము - చిత్తకాంక్షకు మొహమై - చిత్తమే కళ జీవులై 

చిత్త మందున ఆశ పాశము - చిత్త ధైర్యము దాహమై - చిత్త గించెను జీవుడై 

చిత్త మంతయు తామసమ్ముయు - చిత్తమే గతి వైనము - చిత్తమందున దేవుడై 

చిత్త కాంతులు కామితార్దము - చిత్త వేగము రౌద్రము - చిత్త గించెను ప్రేమకై 

      

కాలమన్నది తెల్పలేరును - కాల గమ్యము ప్రశ్నయే - కాల నిర్ణయ జీవమై 

కాల వాంఛలు కల్పనవ్వుట - కాల యాపన జెయకే - కాల మన్నది ప్రాణమే 

కాల సత్యము న్యాయ పాలన - కాల ధర్మము చూపుటే - కాల ప్రేమల శాంతియే    

కాల జ్ఞానము మార్గ మవ్వుట - కాల తండ్రియు తల్లియే - కాల బిడ్డల ప్రేమయే 

    

విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 


 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*లక్ష్మీ కళ్యాణం - చదివితే కొన్ని కోట్ల జన్మల వల్ల వచ్చిన పాపం నశించబడుతుంది. ఆడవారు కానీ, మగవారు కానీ లక్ష్మీ ఆవిర్భావం, లక్ష్మీ కళ్యాణం చదువుకుంటే చాలా మంచిది.*


*శ్రీ ముదివర్తి కొండమాచార్యులవారు రచించిన ఈ శ్రీలక్ష్మీ కళ్యాణం ద్విపద*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*శ్రీ లక్ష్మీదేవి ఆవిర్భావం, శ్రీ లక్ష్మీ కళ్యాణం*


*పాలమున్నీటిలో పడవంపులతగా*

*పసివెన్నముద్దగా ప్రభవంబునొంది*


*కలుములు వెదజల్లు కలికి చూపులకు*

*మరులొంది మధువుకై మచ్చికలట్లు*


*ముక్కోటి వేల్పులూ ముసురుకొనంగా*

*తలపులో చర్చించి తగ నిరసించి*


*అఖిలలోకాధారు నిగమసంచారు*

*నతజన మందారు నందకుమారు*


*వలచి వరించిన వరలక్ష్మి గాధ*

*సకల పాపహరంబు సంపత్కరంబు*


*ఘన మందరాద్రినీ కవ్వంబుగాను*

*వాసుకి త్రాడుగా వరలంగ చేసి*


*అమృతంబు కాంక్షించి అసురులు సురలు*

*చిలుకంగ చిలుకంగ క్షీరసాగరము*


*పరమ పావనమైన బారసి నాడు*

*మెరుగారు తొలకరి మెరుగుల తిప్ప*

*ఒయ్యరములలప్ప ఒప్పులకుప్ప*


*చిన్నారి పొన్నారి శ్రీ మహాదేవి*

*అష్ట దళాబ్జమందావిర్భవించె*


*నింగిని తాకెడు నిద్దంపుటలలు*

*తూగుటుయ్యాలలై తుంపెసలార*


*బాల తానటుతూగ పద్మమ్ము ఛాయ*

*కన్నె తానిటుతూగ కలువపూఛాయ*


*అటుతూగి ఇటుతూగి అపరంజి ముద్ద*

*వీక్షించుచుండగా వెదురు మోసట్లు*


*కల్పధ్రువంబున కలికలంబోలి*

*పెరిగి పెండిలి ఈడు పిల్లయ్యెనంత*


*తనువున పులకలు దట్టమై నిగుడ*

*బారసాచి ప్రమోద భాష్పముల్ రాల*


*రావమ్మ భాగ్యాల రాశి రావమ్మ*

*రావమ్మ ఇందిరా రమణి రావమ్మ*


*లోకశోకము బాపు లోలాక్షివీవు*

*నాకు కూతురువవుట నా పుణ్యమమ్మా*


*అంచు మురిసిపోయి అంబుధి స్వామి*

*ఉప్పొంగి ఉప్పొంగి ఉప్పరంబంటె*


*సఖియను మంగళ స్నానమాడింప*

*వాసవుండర్పించె వజ్రపీటమ్ము*


*పూత నదీజలా పూర్ణ పుణ్యాహా*

*కళశాలతోడ దిగ్గజములవ్వేళ*


*జలజాతగంధికి జలకమ్ములార్చె*

*బంగారు సరిగంచు పట్టు పుట్టమ్ము*


*కట్టంగ సుతకిచ్చె కళశవారాసి*

*వెలలేని నగలిచ్చె విశ్వకర్ముండు*


*రాజీవ ముఖులైన రంభదులంతా*

*కురులు నున్నగ దువ్వికుప్పెలు వెట్టి*


*కీల్జెడ సవరించి కింజెల్కధూలి*

*చెదరనీక విరుల్ చిక్కగ ముడిచి*


*కళలు పుట్టిన ఇండ్లు కన్నుదమ్ములకు*

*కమ్మని కవ్రంపు కాటుక దిద్ది*


*వెన్నెల తెటయౌ వెడద మోమునకు*

*గుమ్మడి విత్తంత కుంకుమ పెట్టి*


*ఆత్తరు జవ్వాజి అగరు చందనము*

*హత్తించి తనువల్లె ఆమె ముంగిటను*


*నిలువుటద్దంపును నిలిపెరంతటను*


*తనరూపు శ్రీలక్ష్మి దర్పణంబందు*

*కనుబొమ్మ నిక్కగా కనుగొని నవ్వి*


*సింహసనము దిగి చెంగళ్వదండ*

*చెదార్చి అచ్చెరల్ చేరి కొల్వంగా*


*కుచ్చెళ్ళు మీగాల్ల గునిసియాడంగా*


*గరుడ గంధర్వ యక్ష రాక్షస దివిజ*

*సంఘముల మద్యకు సరుగున వచ్చె*


*చెప్పచోద్యంబయిన శ్రుంగారవల్లి*

*మొలకనవ్వుల ముద్దు మోమును చూచి*


*సోగ కన్నుల వాలు చూపులు చూచి*

*ముదురు సంపెంగ మొగ్గ ముక్కును చూచి*


*అమృతంబు తొలకెడు అధరంబు చూచి*

*సిగ్గులు సుడివడు చెక్కిళ్ళు చూచి*


*ముత్యాల మెచ్చని మునిపండ్ల చూచి*

*పాలిండ్లపైజారు పయ్యెద చూచి*


*జవజవమను కౌసు సౌరుని చూచి*

*గుండ్రని పిరుదుల కుదిరిక చూచి*


*కమనీయ కలహంస గమనంబు చూచి*

*మొగమునకందమౌ మొటిమను చూచి*


*మధుసూధనుడు తక్క మగవారలెల్ల*

*వలపు నిక్కాకకు వశవర్తులైరి*


*కన్నులకెగదన్ను కైపున తన్ను*

*తిలకించుచున్నట్టి దిక్పాలకాది*


*సురవర్గమును చూచి సుదతి భావించె*


*ఒకడంటరానివాడొకడు జారుండు*

*ఒకడురక్తపిపాసొక్కడు జడది*


*ఒక్కడు తిరిపెగాడొకడు చంచలుడు*

*కాయకంఠి ఒకండు కటికవాడొకడు*


*ఒక్కటి తరకైన ఒక్కటి తాలు*

*ఈ మొగమ్ములకటే ఇంతింత నునుపు*


*శ్రీవత్సవక్షుండు శ్రితరక్షకుండు*

*పుండరీకాక్షుండు భువనమోహనుడు*


*శంఖచక్రధరుండు శారంగహస్తుండు*

*తప్తచామీకరా ధగధగద్ధగిథ*

*పీతాంబరధరుండు ప్రియదర్శనుండు*


*మణిపుంజరంజిత మంజులమకుట*

*మకరకుండలహార మంజీరకటక*


*కాంచికాకేయూర కమ్రభూషణుడు*

*అనుపమ ఙ్ఞాన బలైశ్వర్య వీర్య మాధుర్య*


*గాంభీర్య మార్థవౌదార్య శౌర్య స్థైర్య చాతుర్య*

*ముఖ్య కళ్యాణ గుణగణ మహార్ణవుండు*


*తనకు నీడగువాడు తననించు వాడు*

*విశ్వమంతయును తానైనవాడు*


*శేశాద్రినిలయుండు శ్రీనివాసుండు*

*పతియైన సుఖములు పడయంగ వచ్చు*


*తులలేని భోగాల తులతూగ వచ్చు*

*ఎడేడు లొకాలనేలంగవచ్చు*


*అంచు శౌరికి వేసె అలవేలు మంగ*

*చెంగళ్వ విరిదండ చిత్తమొప్పంగా*


*సకల జగంబులు జయ వెట్టుచుండ*

*శచియు గౌరియు వాణి సర్వేశ్వరునకు*


*తలయంటి పన్నీట తానమాడించి*

*తడియొత్తి వేణుపత్రములంత జేసి*


*నామంబులను దిద్ది నవభూషణముల*

*గైసేయ దివిజవర్గంబులు గొలువ*


*కదలనై రావణ గజముపై స్వామి*


*కేశవాయంచును కీరముల్ పలుక*

*నారాయణాయంచు నమలులు పలుక*


*మధవాయంచును మధుపముల్ పలుక*

*గోవిందయంచును కోయిలల్ పలుక*


*తైతక్కధిమితక్క తద్దిమ్మితకిట*

*జనుతతకజనుత జనుత యటంచు*

*అచ్చర విరిబోణి ఆడిపాడంగా*


*ముత్తైదువులు శెస ముత్యాలు జల్ల*

*చల్లగా వేంచేయు జలదవర్ణునకు*


*అగ్రంబునన్ వేద ఆమ్నాయ ఘోష*

*వెనుక మంత్రధ్వని వినువీధి ముట్టే*


*అదె వచ్చె ఇదె వచ్చె అల్లుడటంచు*

*మామగారెదురేగి మధుపర్కమిచ్చె*


*పందిటిలోనికి పట్టి తొడ్తెచ్చి*

*పుణ్యతీర్థంబులు ప్రోక్షించి ఋషులు*


*మంగళశాసన మంగళమ్మిడగా*

*కమలచేతికి చక్రి కట్టె కంకణము*


*దివ్యశంకంబులు తిరుచిన్నములును*

*వేణుమర్దల రుద్రవీణలు మొరయ*


*తలవంచి కూర్చున్న తన్వి కంఠమున*

*మధువైరి గీలించె మాంగళ్యమపుడు*


*చేతుల తలంబ్రాలు చేకొనికూడా*

*పొయగా వెనుకాడు పువుబోణి ముందు*


*శిరమువంచినయట్టి శ్రీధరు జూచి*

*పకపకా నవ్విరి పల్లవాధరులు*


*పదునాల్గు భువనముల్ పాలించునట్టి*

*చల్లనివిభునకు జయమంగళంబు*


*పదము మోపిన చోట పసిడి పండించు*

*చూడికుత్తుకకు శుభమంగళంబు*


*అంచు హారతులెత్త అంగనామణులు*

*సాగె బువ్వము బంతి సంతోషముగను*


*కళిత కంకణ జనాత్కారమ్ము లెసగా*

*కటక గళంగళాత్కారముల్ పొసగా*


*మొగమున తిలకంబు ముక్కున జార*

*చిరు చెమ్మటలదోగి చెదరు గంధమ్ము*


*గమగమ వాసనల్ క్రుమ్మరింపంగా*

*చురుకు చూపులకోపు చూపరగుండె*


*పలువ చిచ్చు రగల్పు వగలాడియొకతె*

*కోడిగమ్మాడెను కొమరితె ఒకతె*


*మన పెండ్లి కొడుకెంత మహనీయుడమ్మా*

*మహిళలను వలపించు మంత్రగాడమ్మ*


*మచ్చు మందులు జల్లి మది దోచకున్నా*

*కరివానినెవ్వరు కామింతురమ్మ*


*సుకియలు పోలీలు సొగియవు గాని*

*పురపుర మట్టిని బ్రొక్కెడునంట*


*పట్టె మంచము వేసి పానుపమరింప*

*పాముపై తాపోయి పవళించునంట*


*అంబారి యేనుగు అవతలకంపి*

*గద్ద మీద వయాలి కదలెడునంట*


*వింత వెషములెన్నో వేసెడునంట*


*రాసిఖ్యమటులుంచి రంగటులుంచి*

*ఆకార సౌందర్యమరయిదుమన్నా*


*కనులు చేతులు మోము కాల్లు మొత్తమ్ము*

*తామర కలికికి స్థానమ్ము సుమ్ము*


*ఈయంటు మన బాలకెపుడంటకుండా*

*తామర సిరికల ధన్యాత్మునకును*


*నలిచి నల్లేరుతో నలుగిడవలెను*

*కందనీటను ఒడల్ కడగంగవలెను*


*గంధకలేపమ్ము కడుబూయవలెను*

*వాడవాడల తిప్పి వదలంగవలెను*


*ఆ మాటలాలించి హరు పట్టమహిశి*

*మాధవ చెల్లియ ఆ మడతుకిట్లాడె*


*అతి విస్తరంబేల అందాల చిలుక*

*నీవు నేర్చిన తెలుగు నెర్తురే యురులు*


*వెన్నుని నలుపంచు వెక్కిరించితివి*

*నెలతుక ఎరుపంచు నిక్కుచూపితివి*


*కలువ పూవూ నలుపు కస్తూరి నలుపు*

*కందిరీగ యెరుపు కాకినోరెరుపు*


*ఈ రెండు రంగులందేరంగు మెరుగో*

*సొడ్డు వేయుట కాదు సూటిగా చెప్పు*


*వరుని చూచిన కంట వధువుని చూడు*

*మాయ మర్మము వీడి మరి పదులాడు*


*కళికి కాల్సేతులు కన్నులు మోము*

*తామర విరిసిన తావులు కావో*


*కొమ్మ మేనికి దూలగొండి రాచెదవో*

*కంద నీటికిగిచ్చగారవించెదవో*


*ఇంతింత కన్నుల ఎగదిగ చూచి*

*సిగ్గుతో నెమ్మోము చేత కప్పుకొని*


*అనలు కొనలు వేయు అనురక్తి తోడ*

*రసికత లేని మా రంగని మెడను*


*పూలమాలను వేసి పొలుపుగా అతని*

*గుండెలపై చేరి కులుకంగ తలచు*


*రంగనాయకి ఎంత రసికురాలమ్మ*

*చపరలోచన ఎంత చపలురాలమ్మా*


*ఆనవ్వు లీనవ్వులరవిరిమల్లె*

*అందాలు చిందుచు అలరింప మదులు*


*సకల వైభవములా జరిగెను పెండ్లి*

*అంపకమ్ముల వేల అరుదెంచినంత*


*పసుపు కుంకుమ పూలు పండుటెంకాయ*

*తాంబూలమొడి దాల్చి తరళాక్షి లక్ష్మి*


*తలపు లోపల క్రుంగు తండ్రిని చేరి*

*నాయనా యని పిల్చి నవదుఖ: భాష్ప*


*కణములు జల జల కన్నుల రాల*

*గుండెపై తల వాల్చి కుములుచుండంగా*


*కడివెడు బడబాగ్ని కడుపులోననిచి*

*శిరమున మూర్కొని చెక్కిళ్ళు నిమిరి*


*పాలపూసల తల్లి భాగ్యాల వెల్లి*

*వేడ్క అత్తింటికి వెళ్ళి రావమ్మా*


*ఆడ పిల్లలకు తండ్రి అయ్యెడు కంటే*

*మతి గతి లేనట్టి మానౌట మేలు*


*వీనుల నీ పాట వినిపించుచుండ*

*కన్నుల నీ ఆట కనిపించుచుండ*


*ఊరటతో యెట్టులుండెదనోయమ్మా*

*గడియలొ నిను వచ్చి కనుకుందునమ్మా*


*అనిసాగరుడు పుత్రిననునయింపంగా*

*బుద్దులు గరపిరి పుణ్య కామినులు*


*ఏమి నోము ఫలంబొ ఏమి భాగ్యమ్మో*

*వేదంతవేద్యుడు విభుడాయె నీకు*


*ఆముదాలన్నియూ ఆణిముత్యములే*

*చిగురుబోండ్లందరూ సింధు కన్యకలే*


*తల్లినీవెరుగనీ ధర్మంబుగలదే*

*నెలతనీవెరుగనీ నీతులున్నవియే*


*పదుగురు నడిచిన బాటయే బాట*

*మందికి నచ్చిన మాటయే మాట*


*మంచిని విత్తిన మంచి ఫలించు*

*జొన్నలు విత్తిన చోళ్ళేల పండు*


*పోయిరాగదమ్మ పుత్తడిబొమ్మ*

*నీదుపుట్టింటిపై నెనరుంపరమ్మ*


*కనిపెంచకున్ననూ కళ్యాణి నిన్ను*

*కన్నుల చూడక పొద్దు గడచునే మాకు*


*చిలుకలు పలికిన చిగురుమావిళ్ళ*

*కోయిలల్ కూసిన గుండెలెట్లాడు*


*పొగడ చెట్లకు వ్రేలు పూదొట్ల గన్నా*

*నిమ్మలంబుగ యెట్లు నిలుతుమే కన్నా*


*కాటుకాయను కాంతనేనిత్తు*

*కుంకుమ భరణిని కొమ్మనేనిత్తు*


*జోడు సొమ్మెలు నీకు జోటినేనిత్తు*

*పట్టినదంతయు బంగారు కాగా*


*ముట్టినదెల్లయూ ముత్యంబు కాగా*

*కడుపు సారెకు వేగ కదిలిరావమ్మ*


*మదిలోన మమ్ముల మరిచిపోకమ్మ*

*అంత మహాలక్ష్మి అనుగు నెచ్చెలుల*


*చెక్కిళ్ళు ముద్దాడి చుబుకంబునంటి*

*కంఠంబు నిండిన కన్నీళ్ళనాపి*


*బంగారు చెలులారా ప్రాణంబులారా*

*నేనయిమీరెల్ల నెగడిమాయింట*


*అయ్య కన్నుల ముందు ఆడుకోరమ్మ*

*పట్టు కుచ్చులు నావి పరికిణీల్ నావి*


*పందిట తూగాడు పవిటల్ నావి*

*కాళ్ళ గజ్జెలు నావి కడియాలు నావి*


*పొలుపైన బచ్చెన బొమ్మలు నావి*

*బొమ్మలకునువెట్టు భూషణముల్ నావి*


*స్వేచ్చగా మీరెల్ల చేకోరమ్మా*

*అప్పుడప్పుడు లచ్చి తలుచుకోరమ్మా*


*అని బుజ్జగములాడి అందలంబెక్కి*

*కమళాక్షునింటికి కదిలె శ్రీలక్ష్మి*


*కనుపాపలో క్రాంతి క్రందుకొన్నట్లు*

*కండచక్కెర పాలు కలిసియున్నట్లు*


*అంజనాచలవాసుడలమేలుమంగ*

*జంట వాయక సుఖ సంతోషలీల*


*సాధురక్షణమును సలుపుచున్నారు*

*సాధురక్షణమును సలుపుచున్నారు*


*అఱుగని మంగళసూత్రము చెరగనికుంకుమ,పసుపు,చెదరని సిరులున్,తఱుగని సుఖము లొసంగును,హరిసతి యీ పాట విన్న అబలల కెపుడున్.* 🙏🙏🙏

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


*గజల్ -- అంచయాన - (012) *శ్రీ శివ మానసపూజ స్తోత్రమ్ *విహంగ , భ్రమర, మీన , తాబేలు న్యాయాలు *అత్తగారిమాటలకు ఏ చీర కొన్నది కోడలు ? *తల్లికి కపిలుడు బోధ, *భాగవతం


సుభాషితం


* సాహిత్య సంగీత కళా విహినః సాక్షాత్పశు: పుచ్ఛవిశాణహీనః౹

     తృణం న ఖాదన్నస్పి జీవమానస్తద్భాగ  ధేయం పరమం పశూనామ్౹౹


సాహిత్యం,సంగీతం,కళలను నేర్చుకొననివాడు సాక్షాత్తు కొమ్ములు,తోకలేని పశువులాంటివాడే.గడ్డి తినకుండా అతను జీవిస్తున్నది పశువుల పరమభాగ్యమే.

🌺✍🏽

           2-5-2022.

ఉపనిషత్ సూక్తి 


* ఓం లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి||

(గణపత్యుపనిషత్)


-ఓం లం గణపతి కొరకు నమస్కారము. నీవు ప్రత్యక్షమైన తత్త్వము నీవే అయియున్నావు. 


***

నిజమైన విద్య అంటే సమాచార సేకరణ కాదు. ప్రజ్ఞను పెంపొందించేదే విద్య.సంకల్ప శక్తిని సరైన రీతిలో, నైపుణ్యంగా ఉపయోగించేలా, వ్యక్తులకు ఇచ్చే శిక్షణే విద్య.

****

జాగృతి, స్వామివివేకానంద స్ఫూర్తి వచనాలు


గడచిన కాలమే గతాన్ని తొలగించుగాక. అనంతమైన భవిష్యత్తు మీ ముందుంది.

***

*నిష్ఠ 


మీరు ఈ దైవ గృహంలో ఉంటున్నారు. ఇది మీ ఇల్లు. మీ పని ఎడల గర్వము, నిష్ఠ కలిగి ఉండాలి. అప్పుడు దేవుని ఆశీస్సు మీ ద్వారా ప్రవహిస్తుంది. తన సంస్థ పట్ల, దేవుడు తనకిచ్చిన పని పట్ల నిష్ఠ లేనివాడు , దేవునియందు నిష్ఠ లేని వాడే. నేను విశాల భావాలు కలిగిన వాడినైనా, నా గురు పరంపర --- బాబాజీ , లాహిరీ మహాశయ , శ్రీ యుక్తేశ్వరులను మాత్రమే పేర్కొనడం మీరు గమనిస్తారు.


*శ్రీ పరమహంస యోగానంద ప్రవచనం*


శ్రీ ఆదిశంకరాచార్య విరచితము భజగోవిందం


Friday, 11 March 2022

మార్చి నాలుగవ వారం

 


వద్దని ఎంత వేడినను వచ్చెడి వాడె స్తుతింప నర్హుడే
చద్దిని తింటినే హృదయ చింతను తెల్పు భజింప నర్హుడే
హద్దులు తెల్సినా మనసు హారతి తపంబు నర్హుడే
ముద్దుల కృష్ణుడే మనకు భాగ్యము ను పెంచు దర్శనం







[17/03, 20:32] Mallapragada Sridevi: 😂 *సరదాగా నవ్వుకోండి.*😂
😂 *జైలర్: ఈరోజు నిన్ను ఉరి తీస్తారు. నీ చివరి కోరిక ఏంటో చెప్పు..?* *ఖైది: నా బదులు మీరేస్కోండి... సార్...!* 😂 *"ఏమండీ మన బాబు నిద్రలో జడుసుకుంటున్నాడు...."* *"వాడి పెళ్ళాం ఎక్కడో పుట్టినట్టుందిలే..నువ్వు పడుకో.."* 😂 *బస్సులల్లో ఆడవారు కూరుచ్చునే వైపు "ఆడవాళ్ళని గౌరవించండి".. అని వ్రాశారు సరే...* *అలాగే మగ వాళ్లు వైపు "మగ వాళ్ళను గౌరవించండి"... అని రాయాలి కాదా..* *కానీ మావైపెమో.... "దొంగలున్నారు జాగ్రత్తా".. "టికెట్ లేని ప్రయాణం నేరం" అని రాస్తారా ఇది అన్యాయం కాదా.!!* 😂 *"టీచరుకిచ్చి పెళ్ళి చేసి నా గొంతు కోశారు" భోరుమంది సుశీల.* *"ఏవైందమ్మా... నిన్నేమన్నా అన్నాడా..?" అడిగింది తల్లి. "నిన్న వడ్డించిన కూరలో కాస్త ఉప్పు తక్కువైందని ఆ కూరను పదిసార్లు వండమన్నాడు" చెప్పింది సుశీల.* 😂 *భార్య : గత 4 సంవత్సరాలుగా నేను వ్రతాలు ఏవీ చేయడం లేదు...* *భర్త : ఇప్పుడేమైంది..* *భార్య : అయినా మీరు ఆరోగ్యంగా ఉన్నారు..!!* *భర్త : అవును..నేను ఆరోగ్యం పై చాలా శ్రద్ధ తీసుకుంటుంటాను.* *భార్య : నేనేం వెర్రి దానిలా కనిపిస్తున్నానా.. తిన్నగా నిజం చెప్పు..ఎవర్తది..నీ ఆరోగ్యం కోసం పూజలు, వ్రతాలూ చేస్తున్నది. ?* *వామ్మో...భర్త వెర్రి చూపులు చూస్తున్నాడు..* 😂 *భార్యాభర్తలైన సుబ్బారావు, సుందరి ఏడు గంటలు ఏకధాటిగా దెబ్బలాడి అలసిపోయారు. చివరికి..* *సుబ్బారావు- ".. సరే, పైన దేవుడున్నాడు... నాది తప్పయితే నేనే పోతాను.." అన్నాడు రొప్పుతూ. "గుళ్లో అమ్మోరుంది.. నాది తప్పయితే నా పసుపు కుంకాలే పోతాయిలే..." ముక్కు చీదుతూ అంది సుందరి.* 😂 *ఇదిగో అక్కా ! పక్కింటాయన కోమా లోకి వెళ్ళాట్ట తెలుసా!* *అవునా ! ఈ డబ్బున్నోళ్లు ఎక్కడికైనా వెళతారమ్మా!* 😂 *కట్నం ఎందుకు తీసుకుంటారో ఇప్పుడు నాకు అర్ధం అయ్యింది. పెళ్లి జరిగిన తర్వాత భార్య పెట్టే మానసిక సమస్యలకు "నష్ట పరిహారంగా" భర్త కట్నం తీసుకుంటాడు.* 😂 *భార్య : ఏవండీ..కొన్నేళ్ల కిందట నేను పెప్సీ బాటిల్ లా సన్నగా.. నాజుగ్గా ఉండేదాన్ని కదా...* *భర్త : ఇప్పుడు కూడా నువ్వలానే ఉన్నావ్ డియర్..* *భార్య (ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ) నిజమా!!..* *భర్త : అవును..కాపోతే అప్పుడు 200ml బాటిల్..ఇప్పుడు 2.5ltr బాటిల్.. అంతే.* *భార్య : సచ్చినోడా..* 😂 *మొగుడు: పండగకి చీర కావాలా? చుడీదార్ కావాలా?* *పెళ్లాం: నాదేం ఉంది మీకు ఏది ఉతకడానికి సులువుగా ఉంటుందో అదే కొనివ్వండి.* 😂 *ఏవోయ్ రామారావు ఎనిమిదైంది, అసలేకొత్తగా పెళ్ళయింది, ఇంకా ఆఫీసులోనే పనిచేస్తూ ఉన్నావు ఇంటికి వెళ్ళాలనిపించడం లేదా? అని అడిగాడు ఆఫీసర్. ఏం లేదు సార్, మా ఆవిడ కూడా ఉద్యోగం చేస్తుంది. “ముందుగా ఎవరైతే ఇంటికి చేరుతారో వాళ్ళు వంట చేయాలి” రహస్యం చెప్పాడు రామారావు.* 😂 *భర్త : నీ చీర పని మనిషికి ఇచ్చావా?* *భార్య : అవును.. ఏమైంది?* *భర్త : వంటింట్లో ఉంటే నువ్వే అనుకుని వెళ్ళి..* *భార్య : ఆ.. అనుకుని.. వెళ్ళి.. ఏమైంది.. త్వరగా చెప్పండి.. ఏంచేశారు?* *భర్త : నీకెందుకు శ్రమ తప్పుకో అని అంట్లన్నీ నేనే కడిగేశా!!* *సర్వే జనా సుఖినోభవంతు.🙏🙏* [17/03, 22:03] మల్లాప్రగడ రామకృష్ణ:

Wednesday, 9 March 2022

మార్చి నెల మూడవ వారం ::



 1. 
మనసులో సున్నితత్వం పెరిగే కొద్దీ నిర్మలత్వం వస్తుంది !!

శత్రుత్వం, క్రోధం, ద్వేషం వంటి గుణాలతో మనసును నింపితే ఎదుటివారితో అసహజంగా ఉండాలి. గంభీరంగా, ముభావంగా, పలకరింపులేకుండా ఉండటం అలవాటుగా మారి పవిత్రమైన మనసు ను మలినం చే
సుకుంటాం. అది దైవానికి మనని దూరంచేస్తుంది. మనో నిర్మలత్వమే దైవం. మనసులో సున్నితత్వం పెరిగే కొద్ది నిర్మలత్వం వస్తుంది. సున్నితత్వం అంటే ప్రేమ నిండిన మనసు. మాతృత్వంలో మనకు కనిపించేది  ఆ సున్నితత్వమే. అది దైవత్వానికి ప్రతిరూపం. వాస్తవిక దృక్పథంతో అన్వేషిస్తే దైవంలేని చోటును చూడలేము. ఒక మొలకెత్తిన మామిడి టెంకె 100 ఏళ్ల పంటను, లక్షకాయల కాపు తనలో ఇముడ్చుకొని ఉండటం మాతృత్వం. అదే దైవం !

*****


ప్రభలు

----------

1. సృష్టిఅనే దేవుడు చూస్తున్నాడు మానవులంతా ఒక్కటే అని...

కానీ మానవులంతా అతనికి వేరేవేరే రూపాలిచ్చి వేరేవేరే భావనాలతో చూస్తున్నారు...

ఎందుకు అలా?

దేవుడి ఆశయముతో చేరి నువ్వు అలా చూడు మానవ!!


2. మనం ఎప్పటివరకు డబ్బు,ఆస్తి,అంతస్తు అని వాటి వెనుక పరిగెత్తడం ఆపలేమో...

అలాగే మనకు ఉన్నదానితో తృప్తిగా ఉండలేమో...

అప్పటిదాకా శాంతి-నెమ్మది కనబడకుండా,పోరాటాల గోడవల్లో చిక్కుకొని అప్పుడు మనకి పతనం 

తప్పదు,ఇది నిజం!!


3. జీవన బాటలో దొరికే స్నేహితులు కొందరే

ఆ కొందరిలో మిగిలేవారు కొందరే

ఆ కొందరిలో మంచి కోరేవారు అపురూపమైనవారు.ఆ అపురూమైనవారిలో మిగిలిన విశేషమైనవారే...

మనం అనుకొనే వారు!!


4. అందరికీ శుభం కోరే మనస్సు...

అందరికీ మంచిని కోరే మనస్సు...

అందరి కష్టానికి బాధపడే మనస్సు...

దేవుడికి చాలా ఇష్టంగా ఉండే మనస్సుగా ఉంటుంది. అంతేకాదు...

అదే మనస్సుకి అతి ఎక్కువ బాధలను దుఃఖాలను సహించుకుని,అందరితో

ఎపుడూ నవ్వుతూ ఉంటుంది!!


5. పరిస్థితులు ఎలా ఉండనీ 

సందర్భం ఏమైనా అవ్వనీ

సమస్యలు ఏమైనారానీ

ప్రాణం పోయేవరకు నీ చేతులు విడవను అనే,నమ్మకం భరోసా ప్రేమ విశ్వాసం ఉండేలా...

స్నేహముంటే మరి అది భగవంతుని కృపే...కదూ!!

*****

సామెతల్లో ఆయుర్వేదం!

"తల్లిని చేసినవాడే కాయమూ పిప్పళ్ళు తెస్తాడు" ..

అని ..కాయము అంటే బాలింతకు పాలు ఎక్కువగా రావటానికి మూలికలతో తయారు చేసే లేహ్యం , పిప్పలి త్రిదోషాలను పోగొడుతుంది !

పేరులేని వ్యాధికి పెన్నేరు గడ్డ ! ...ఏ రోగమో ఎందుకొచ్చిందో తెలియక పోతే "అశ్వగంధ" పెద్ద మందు !

త్రిదోషహరం తిప్పతీగ అని సామెత !

"ఉత్తరేణు ఉత్తమం, మధ్యమం మారేడు, కనీసం కందిపుల్ల" ...ఇవి పళ్ళు తోముకోవడానికన్నమాట.

వాస్తే వాయిలాకు 

పాస్తే  పాయలాకు ..

అప్పుడే పుట్టిన శిశువుకు 

దొండాకు పసరు పోసేవారు 

లోపలి కల్మషాలు పోతాయని ... సామెత ఏమంటే .... "కొడితే చిన్నప్పుడు తాగిన దొండాకు పసరు కక్కుతావు "

పుండుమీదకు ఉమ్మెత్త , నీరుల్లి నూరి నూనెలో వెచ్చజేసి గాయాలపై కట్టేవారట ...సామెత ఇలా ... "పుండుమీదకు నూనె లేదంటే గారెలొండే పెండ్లామా అన్నట్లు"... "ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు "...

వెల్లుల్లి చాలా రోగాలు నయం చేస్తుంది. అది క్షయరోగాన్ని కూడా హరించే శక్తి కలది ... సామెత ...ఇలా ... "ఆశపడి వెల్లుల్లి తిన్నా రోగము అట్లానే ఉన్నది "

కరక్కాయ పువ్వు , పిందె,

పండు చాలా ఉపయోగకరమైనవి ... శ్వాస, కాస, ఉదర, క్రిమి, గుల్మ, హృద్రోగం , గ్రహణి, కామిల, పాండు ..ఇన్ని రోగాలు హరిస్తుంది.. అందుకే ..  ."మున్నూట ఇరవై రోగాలకు మూడు గుప్పిళ్ళ కరక్కాయ పొడి ".. అని సామెత

ఆయుర్వేదం మితంగా తినమని చెపుతుంది .. సామెత ఇదుగో ... "పిడికెడు తిన్నమ్మ పీటకోడు లాగ ఉంటే చాటెడు తిన్నమ్మ చక్కపేడులాగుంది ".... "ఒక పూట తింటే యోగి రెండు పూటలా తింటే భోగి మూడు పూటలా తింటే రోగి "

అలానే ... శిశువు పాలు వాంతి చేసుకోవడం ఆరోగ్యలక్షణమని చెప్పే సామెత ... "కక్కిన బిడ్డ దక్కుతుంది " అని...

ఇలా ఎన్నో సామెతలు ఒక్కొక్కటీ కనుమరుగవుతున్నాయి !

పిల్లవాడు భాషనే నేర్వనప్పుడు సామెత ఎలా వస్తుంది ?

సామెత తెలియనప్పుడు సంస్కృతి ఎలా తెలుస్తుంది ?

అందుకే భాషను చంపితే సంస్కృతి చస్తుంది!

జాతి జీవనాడి నశిస్తుంది.

అప్పు గాయం నిప్పు మరియు చింతలను ఎప్పుడూ చిన్నవని అనుకోరాదు....

ఎందుకంటే వీటికి పెద్దాగా పెరిగే గుణం ఉంది. దానివల్ల ప్రాణం లేకపోతే జీవితాన్ని పాడుచేసే

సామర్ధ్యం ఉంది...జాగ్రత్త!!

*****


6. తల్లిదండ్రులపై భక్తి భావం పెంచుకోవయ్య

హిత వచనములు శ్రద్ధతో వినవయ్యా

పెద్దలను గౌరవించిదే ఈశ్వరుడి సేవయని తెలిసుకోవయ్యా

మనస్సులు నొప్పించక సన్మార్గంలో నడిచిన పూజలే మెచ్చునయ్య

మన శివయ్య...!!


7. మనకు తెలియక పోతే అడిగి తెలుసుకుందాం

మనకి నచ్చక పోతే చర్చలు చేద్దాం...

మనకి ఇష్టమే లేకపోతే నమ్రతతో చెపుదాం.

అంతేకాని... 

నాదే సరిఅనే వాదన వద్దు. ఈ అహకారంతో స్నేహ సంబంధాలు పాడై పోరాదు!!


8. కష్టం కలిగినపుడు రక్షణ కోసం ఒక దుర్భలుడి దగ్గరకు లేక ఒక స్వార్ధ బుద్దికలిగిన ప్రముఖుల దగ్గరకు పోరాదు. అతివంటివారు ఎప్పుడూ తమ మంచికే మిమల్ని ఉపయోగించుకుంటారు.

అటువంటి స్వార్ధ,నీచులవెనుకపడి ప్రజా రక్షణ తీసుకోవాలని ప్రయత్నిస్తే మరిన్ని కష్టాలు

దుఃఖం మడుగులో ములిగి పోవాల్సివస్తుంది!


9. బిక్షగాడు ఆకలి ఆకలి తీర్చుకోవాలని చెయ్యి చాచి అడిగితే రెండు చేతులు...

కాళ్ళు ఉన్నాయని చాలు అని ఉచిత సలహాలిచ్చే మనం...

అన్నీ ఉండి దేవుడి హుండిలో డబ్బులువేసి కోరడం...

బిచ్చగాడి బ్రతుకుకన్నా నీచమైనదని తెలుసుకోవాలి!


10. వ్యతిరేక భావంతో ఆలోచిస్తే స్త్రీ కలలు నాటి, మాయ అయ్యింది ఆనిపిస్తుంది.

అదే,సకారభావంతో ఆలోచిస్తే... 

స్త్రీ కలలు నాటేదే కాదు...

కలలు నిజమవ్వడానికి భుజానికి భుజం అందించి నిలుస్తుందని అనిపిస్తుంది. అన్నీ మనం ఆలోచించే బాటనుబట్టి ఉంటాయి...!!

****

2. ఈ రోజు ** మంచి మాట..లు 

ఎండాకాలం మొదలైంది. పశుపక్ష్యాదులు దాహం తీర్చుటం కోసం ఏమి ఖర్చు కాని కొద్దిగా నీళ్ల ను పెడదాము.. అవకాశం ఉంటే ఏదైనా గింజలు పెడదాము.. చిన్న జీవులను బతకనిద్దాం

సమాజం విచ్చిన్నం కావటానికి కారణం చెడ్డ వారు చేసే పనులేకాదు... 

మంచివారు ఏమి చేయకుండా ఉండటం కూడా కారణం

మన మనస్సును మనం కంట్రోల్ చేసుకోలేనప్పుడు ఇతరులను శాసించే హక్కు మనకి ఎక్కడిది

 వంద పేజీలున్న పుస్తకం లోనే తప్పులున్నప్పుడు వంద సంవత్సరాల జీవితం లో తప్పులు లేకుండా ఎలావుంటాయి..చదువుతూ సరిదిద్దుకోవాలి సరిదిద్దుకొని చదువుకోవాలి.. జీవితంలో తెలిసి తెలియక జరిగే తప్పులను కూడా సరిదిద్దుకోవాలి.. సరిదిద్దుకుంటూ జీవించాలి  అది పుస్తకం అయినా జీవితం అయినా

మన కష్టాన్ని చూసి ఇంకొకరు నవ్వితే నవ్వని పరవాలేదు.. కానీ ఇంకొకరి కష్టాన్ని చూసి మనం నవ్వకూడదు..కష్టాన్ని అర్థం చేసుకుందాం 

మనకు వంద కోట్లు ఉన్నంతమాత్రాన మనం వందేళ్లు బతుకుతామని గ్యారెంటీ లేదు..

అలానే మనకు పది ఇల్లు ఉన్నoత మాత్రాన పది ఇళ్లలో ఒకేసారి ఉండలేము ఒక్కదానిలో మాత్రమే ఉండగలం. ఉన్నది ఒకే జన్మ.. అనుకుని పది జన్మలకు సరిపడా మంచిని చేద్దాం.. మరలా చేసే అవకాశం ఉంటుందో ఉండదో.

సేకరణ ✍️

*****



11. మనిషి నేర్చుకున్నది అతి తక్కువ...

నేర్చుకోవల్సింది  సముద్రమంత ఉంది. జీవితములో పాండిత్యముంటే చాలదు,దీనితోకల్పి అతి

ముఖ్యంగా కావాల్సింది వినయం మఱియు వివేకం!!


12. అందరూ ప్రపంచం మారింది అని అంటారు.

అయితే,మిరకాయలోని కారం మార్పు రాలేదు.

మామిడి పండులోని తీయదనంలో ఎటువంటి మార్పు రాలేదు.

ఆకుల రంగు మారలేదు మార్పు వచ్చినది...

మనిషిలోని మానవత్వానికి...!!

అవునా...!?


13. తనకు తోచిన విధంగా ఆలోచనలు చేయకుండా తీర్మానాలు చెప్పే వ్యక్తి నమ్మకస్తుడు కాడు.

ఒకరి మంచి చెడు రెండూ తెలుసుకొని మంచి ఆలోచన చెప్పేవాడు నిజమైన నమ్మకమైనవాడు!!


14. అంతస్తు పెరగాలన్న రభసలో...

జతలో ఉన్నవారిని చెడుపుకోకు...

ఎందుకంటే అది సాధించిన తరువాత సంతోషాన్నిపంచుకోవాలంటే...

మనవారనే వారులేకపోతే ఒంటరిగా నిల్చునే సమయం వస్తుంది!!


15. కోపం ఉన్న వాళ్ళకి లోకమే కటిక చీకటి పరుల తప్పులు వెతికి మనస్సు బాధించి చెడకు...

మంచి గుణాలు చూడు సహన శక్తికి ఉందిలే మంచి అంతస్తు ఆ కోపాలే సంసారాలకు చెడుపు

వివేకంతో నడుస్తే... కలదు మంచి కాలం!!

****

దేవీ శ్లోకః

సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే ।

శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే ॥

ఆత్మీయ బంధుమిత్రులకు  శుక్రవారపు శుభోదయం శుభాకాంక్షలు లక్ష్మీ గాయత్రీ దుర్గా సరస్వతి అమ్మవార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ

****

"  గజాస్యం , ఫాలచంద్రం ,తం ,

  ' గం ' మంత్రాధిపతిం , హరిమ్.‌.

  సర్వవిద్యాప్రదాతారం ,

 సర్వవిఘ్నాంతకం భజే !!!

*****

 శ్రీ సప్త గిరిభాస్వంతం ,

  శ్రీతప్తకాంచనాంబరమ్...

శ్రీప్రాప్తవక్షసం , భూపం ,

సంకటఘ్నంసదా భజే !!! 

--***

" ఆరోగ్యవాక్ప్రదం , పూష్ణం ,

నీరేజలోకతుష్టిదమ్..

భూరిప్రకామ్యదాతారం ,

వందే హరిస్వరూపిణమ్ !!!

****

" మనస్వినీం , మహారాజ్ఞీం ,

  నిష్క్రోధాం , క్రోధనాశినీమ్..

  సదాశివప్రియాం , వందే ,

  విశ్వకళ్యాణకారిణీమ్ !!!

****

" ఇందీవరాననాం , లక్ష్మీం ,

  ఇందీవరాసనాం , రమామ్

  ఇందీవరాక్షహృద్ధామాం ,

  వందేऽష్టైశ్వర్యదాయినీమ్ !!!

*****
" వక్రతుండాయ , (హేరంబ)దేవాయ ,
శుక్లదుకూల ధారిణే..
వేదండాస్యవిభూషాయ ,
గౌరీపుత్రాయ నమోనమః !!!
****
ఈ వారం" సీసపద్యాలు
--
శంకర ! పురహర ! శంభో ! మహాదేవ..
   పంచాక్షరీమంత్రభరితవినుత
కైంకర్యతోషిత  గాంగజటాధర !
    సోమేశ ! త్రిణయన కామేశ ! హర !
ఓంకారశబ్దప్రయుక్తతత్త్వార్థద
    ధావళ్యశోభితతనువిలసిత
సంకటసంహార సాయుజ్యదాయక
   గౌరీమనఃప్రియ గరళకంఠ
----
తే.గీ.
----
మాం దయాపయోనిధిచంద్రమంగళాంగ
పాలయసదైవ శుభకర పార్వతీశ
నాగభూషణ భూతిద నాగవసన 
వేదసూక్తప్రియ ! భవ ! వేదపూజ్య !!! 
--రచయిత.. అప్పాజీ గారు
*****

16. ఆనందం పొందడం మంచిదే కదా!?

ప్రపంచలో మనకు నవ్వు ఆనందం ఇచ్చే వస్తువులు విషయాలు వ్యక్తులు అడుగు అడుగునా దొరుకుతారు పరిశుద్ధమైన మనస్సుతో సంతోషపట్టే మనోభావాలు మనం పెంచుకుంటే

సంతోషంపడవచ్చు కేవలం కొరతలే చూసే మనోభావాలు ఉన్నవారు...

ఆ ఆనందానికి వంచితులవుతారు సంతోషంపడే మనస్తత్వం పెంచుకొంటే ఆనందం మనదే అవుతుంది...

మరి,ఆ ఛాన్సు మీ చేతుల్లోనే ఉందికదా...ఆలోచించండి!!


17. ఒక విత్తనం శబ్దం లేకుండా అంకురిస్తుంది అయితే వృక్షమై పెద్ద చప్పుడు చేస్తూ పడిపోతుంది.

వినాశనానికి శబ్దం ఉంది అయితే సృష్టి శాంతంగా ఉంటుంది ఇదే ప్రశాంతమైన శక్తి లాగే,మౌనంగా పెరగండి ఎవరూ మిమ్మల్ని ఎదురక్కో లేరు!


18. జీవితమనేది అందరికీ ఒక రంగుల పుస్తకం వ్యత్యాసం ఇంతే!

కొంతమంది మనసుపెట్టి ప్రతి పేజీ చదువుతారు మరి కొంతమంది పై మనస్సు కోసం

ఊరికే పేజీలు త్రిప్పుతారు ప్రతి క్షణంలో ఒక ప్రేమ ఉంది ప్రతి క్షణంలో సంతోషం ఉంది

అది తప్పితే,మిగిలేది ఉత్తి జ్ఞాపకాలే...

అందుచేత,మనిషి జీవితాన్ని మనసుపెట్టి చదివి గమనించి అర్ధం చేసుకుని...

నవ్వుతూ బ్రతకాలి...ఏమంటారు!?


19.  సవాలకు భయపడి ఓడిపోరాదు ఓడి పోతామేమో అని ప్రయత్నాలు చెయ్యరాదు గట్టిగా ప్రయత్నం చేస్తూ...

ధైర్యంతో గెలుపు పొందాలి గెలుపుకు గౌరవం ఉంటుందని గుర్తుంచుకోవాలి,మర్చి పోకూడదు!!

స్నేహమనేది ఎక్కువ మాట్లాడదు, స్నేహం ఎపుడూ పాతబడదు, స్నేహానికి సుఖాంతం ఉండదు,

ఎందుకంటే స్నేహం ఎపుడూఅంత్యం చూడదు. నిర్మలమైన,నిస్వార్ధమైన మరియు నిజమైనది,ఈ స్నేహాలు...స్నేహితులను ఉంచుకునేదాక!!


20. పూర్తిగా విషయం తెలియకుండా,ఊరికే ఎవరి గురించి మాట్లాడకండి ఎందుకంటే ...వాళ్ళ

పరిస్థితులు మరియు సందర్భాలు వాళ్లకు మాత్రమే తెలిసి ఉంటాయి!

****



హిందూ పూజా విధానంలోని క్రియలలో అంతరార్థము:

₹₹₹

1. గంటలు :

దేవాలయాల్లో పూజ సమయంలో గంటలు వాయిస్తారు. దీనివల్ల రెండు విధాల ప్రయోజనం ఉంది. 

ఒకటి-బయటి ప్రపంచంలో శబ్దాలు లోపలికి ప్రవేశించకుండా చేయడం, 

రెండవది-మనస్సును దేవుని మీదికి ఏకాగ్రంగా మళ్లించడంలో తోడ్పడుతుంది.

2.దీప హారతి:

దీపాన్ని వెలిగించి దేవుని విగ్రహం ముందు తిప్పడం. దీనిలోని అంతరార్థం ఏమిటంటే దైవాన్ని జ్యోతి స్వరూపంగా భావించడం. 

దైవమే కాంతి. 

ఆ సమయంలో భక్తుల భావన ఈ విధంగా ఉంటుంది.  స్వామీ! నీవే ఈ విశ్వంలో స్వయం ప్రభవమైన జ్యోతివి. సూర్యుడు, చంద్రుడు అన్నీ వీటిలోని తేజస్సు. 

కాంతివి నీవే. 

నీ దివ్య కాంతిచే మాలోని చీకటిని తొలగించి, 

మా బుద్ధిని ప్రభావితం చేయి" అని.

3. ధూపం:

భగవంతుని ముందు పరిమళాలు వెదజల్లే అగరువత్తులను వెలిగిస్తాము. 

వాటి సువాసనలు అన్ని దిక్కులా వ్యాపిస్తాయి. 

వీటి ధూపం క్రిమిసంహారిణిగా కూడా పనిచేస్తుంది. భగవంతుడు సర్వవ్యాపి. 

విశ్వమంతా నిండియున్నాడు అన్న భావన 

అందరిలో కలుగుతుంది. 

ఈ విషయం అక్కడ ఉన్న వారందరికీ మాటి మాటికీ 

జ్ఞప్తి చేసినట్లవుతుంది.

4. కర్పూర హారతి:

వ్యక్తిగతమైన అహంకారము కర్పూరమువలె కరిగిపోవాలని ఈ హారతిలోని అంతరార్థం. 

ఈ విధంగా జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావాలని 

భక్తులు కోరుకుంటారు.

5. గంధపు సేవ:

ఈ సేవలో చాలా అర్థం ఉంది. 

భగవంతుని విగ్రహానికి పూయడానికి గంధాన్ని మెత్తగా నూరుతారు. 

అంత శ్రమకు లోనయినప్పటికీ గంధం ఓర్పుతో సహించి, మంచి పరిమళాన్ని వెదజల్లి ఆహ్లదం కలిగిస్తుంది. 

ఆ విధంగానే ఎన్ని కష్టాలకు లోనయినప్పటికీ భక్తుడు చలించక కష్టాలను చిరునవ్వుతో స్వీకరించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ శత్రువుకైనా అపకారం తలపెట్టకూడదు. 

ఇదే ఈ గంధసేవలోని అంతరార్థం. 

6. పూజ:

దేవునికి పత్రం, పుష్పం, ఫలం, తోయం అనే వాటిని భక్తులు పూజలో సమర్పిస్తారు. 

కాని భగవంతునికి వీటితో పనిలేదు. 

నిజానికి ఏ విధమైన వస్తువులు భక్తులు సమర్పించాలని భగవంతుడు కోరడు. 

కాని ఆ అర్పణలో ఎంతో పరమార్థం ఉంది.

7 పత్రం(శరీరము):

ఇది త్రిగుణాలతో కూడుకున్నది. 

పూజలో దీనిని భగవంతునికి అర్పిస్తాడు.

8 పుష్పం (హృదయము):

ఇక్కడ పుష్పం అంటే చెట్ల మీద పూచే పూవు 

అని అర్థం కాదు. 

సుగంధ పరిమళాలను వెదజల్లే హృదయ కుసుమం 

అని అర్థం. 

ఇటువంటి హృదయ కుసుమాన్ని దైవపరంగా అర్పించాలి.

9 ఫలం (మనస్సు):

మనస్సు ఫలాలను అంటే మనం చేసే కర్మల ఫలితాలను మనం ఆశించక భగవంతునికి అర్పితం చేయాలి.

దాన్నే త్యాగం అంటారు.

10. తోయం(నీరు):

భగవంతునికి అర్పించవలసిన నీరు అంటే మనలోని హృదయపూర్వకమైన ప్రేమ, ఆనందం మొదలైన 

దివ్య భావాల వల్ల వెలువడే ఆనంద భాష్పాలు 

దైవానికే అర్పితం కావాలి.

11 కొబ్బరికాయలు:

హృదయం అనే కొబ్బరికాయ కోరికలు అనే పీచుతో కప్పబడి ఉంటుంది. 

దానిలో ఉండే నీరు సంస్కారము. 

కోరికలు అనే పీచును హృదయం అనే కొబ్బరికాయ నుంచి వేరుజేసి, తీయనైన కొబ్బరిని భగవంతునికి అర్పితం చేయాలి. 

అదే నిజమైన నివేదన. 

లోపల సంస్కారము అనేవి వున్నంతకాలం, 

హృదయం శరీరాన్ని కదలకుండా అంటిపెట్టుకొని ఉంటుంది. 

హృదయము అనే కొబ్బరికాయను పీచు అనే కోరిక వాసన వదలదు. 

మనంచేసే పనులను విత్తనాలతో పోలుస్తారు.

మంచి విత్తనం వేస్తే మంచి మొక్క ఎట్లా మొలుస్తుందో మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.

12. నమస్కారము:

చేతులు జోడించగానే పదివేళ్లు కలసివుంటాయి. 

ఈ పదివేళ్లు పది ఇంద్రియములకు గుర్తు. 

ఇందులో కర్మేంద్రియ,జ్ఞానేంద్రియములను హృదయములోని పరమాత్మకు కైంకర్యము చేయుచున్నాను అని చేతులు జోడించుటయే నమస్కారములోని అంతరార్థము.

13. ప్రదక్షిణము:

ముల్లోకములన్నియు భగవంతుని స్వరూపముతో నిండివున్నాయి. 

ఆ భగవంతుని సగుణాకరామైన విగ్రహమునకు గాని, లింగమునకు గాని, ప్రదక్షిణము చేసినట్లయిన ముల్లోకములు చుట్టి సర్వదేవతలకు నమస్కారములు చేసిన ఫలితము వుంటుంది.. 

అందుకే ప్రదక్షిణము పూజాంగములలో ఒకటిగా చేర్చారు.

సేకరణ :

*****

#మజ్జిగ

*****

మజ్జిగకి సంస్కృతంలో మూడు పేర్లున్నాయి.

1. తక్రం  2. మధితం  3. ఉదశ్విత్తు

🔸 తక్రం

నాలుగోవంతు మాత్రం నీరుపోసి తయారు చేసేది తక్రం.

🔸 మధితం 

అసలే నీరు పోయకుండా చిలికినది మధితం ఇది రుచిగా ఉంటుంది, కానీ ఆరోగ్యానికి అంత ప్రశస్తం కాదు.

🔸 ఉదశ్విత్తు

సగం నీళ్లు పోసి తయారుచేసేది ఉదశ్విత్తు.

ఈ మూడింటిలోకి తక్రం ఆరోగ్యానికి చాలా ప్రశస్తం.

🔸 మజ్జిగ - మహా పానీయం

మజ్జిగ తాగేవాడికి ఏ వ్యాధులూ కలగవనీ, వచ్చిన వ్యాధులు తగ్గి, తిరిగి తలెత్తకుండా ఉంటాయనీ, విషదోషాలు, దుర్బలత్వం, చర్మరోగాలు, దీర్ఘకాలిక వ్యాధులు, కొవ్వు, అమిత వేడి తగ్గిపోతాయనీ, శరీరానికి మంచి వర్చస్సు కలుగుతుందనీ, యోగరత్నాకరంలో ఉన్నది.

వలోకంలో దేవతల కోసం అమృతాన్నీ, ఇక్కడ మానవుల కోసం మజ్జిగనీ భగవంతుడు సృష్టించాడట.

వేసవి కాలంలో మనం మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి.

తోడుపెట్టినందు వలన పాలలో ఉండే పోషక విలువలన్నీ మజ్జిగలోనూ పదిలంగా ఉండటంతో పాటు, అదనంగా లాక్టో బాసిల్లై అనే మంచి బాక్టీరియా మనకు దొరుకుతుంది. పాలలో ఈ ఉపయోగకారక బాక్టీరియా ఉండదు. 

ప్రిజ్జులో పెడితే మజ్జిగలోని ఈ బాక్టీరియా నిరర్థకం అవుతుంది, అందుకని అతి చల్లని మజ్జిగ తాగకూడదు. 

చిలికినందువలన మజ్జిగకు తేలికగా అరిగే గుణం వస్తుంది అందుకని పెరుగుకన్నా మజ్జిగ మంచిది.

వయసు పెరుగుతున్నకొద్దీ మజ్జిగ ఎక్కువ తీసుకోవాలి.

వేసవి కోసం ప్రత్యేకం కూర్చిక పానీయం..    

ఒక గ్లాసు పాలు తీసుకొని, కాచి చల్లార్చి అందులో రెండుగ్లాసుల పుల్లని మజ్జిగ కలపండి ఈ పానీయాన్ని  కూర్చిక అంటారు.

ఇందులో పంచదార, ఉప్పు బదులుగా ఈ క్రింది  వాటిని కలపండి. 

ధనియాలు, జీలకర్ర, శొంఠి ఈ మూడింటినీ  100 గ్రాముల చొప్పున దేనికదే మెత్తగా దంచి, మూడింటినీ కలిపి తగినంత ఉప్పు కూడా చేర్చి, దాన్ని ఒక సీసాలో భద్రపరచుకోండి 

కూర్చికను తాగినప్పుడల్లా, అందులో ఈ మిశ్రమాన్ని  ఒక చెంచా మోతాదులో కలిపి తాగండి, వడదెబ్బ కొట్టదు, పేగులకు బలాన్నిస్తుంది, జీర్ణకోశ వ్యాధులన్నింటికీ ఇది మేలు చేస్తుంది, వేసవిలో కలిగే జలుబుని నివారిస్తుంది, వడదెబ్బ కొట్టని రసాల పానీయం ఇది.

ఇది దప్పికని పోగొట్టి వడదెబ్బ తగలకుండా చేస్తుంది కాబట్టి, ఎండలో తిరిగి తిరిగి ఇంటికి వచ్చిన వారికి ఇచ్చే పానీయం ఇది. 

ఎండలోకి వెళ్లబోయే ముందు  మజ్జిగను  ఇలా కూడా తయారు చేసుకొని తాగండి.

చక్కగా చిలికిన  మజ్జిగ ఒక గ్లాసునిండా తీసుకోండి. 

అందులో ఒక నిమ్మకాయ రసం, తగినంత ఉప్పు 

(సైంధవ లవణం), పంచదార, చిటికెడంత తినేసోడాఉప్పు కలిపి తాగి అప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్లండి వడదెబ్బకొట్టకుండా ఉంటుంది. 

మరీ ఎక్కువ ఎండలో ప్రయాణాలు చేయవలసి వస్తే, ఒక సీసానిండా దీన్ని తయారు చేసుకొని వెంట తిసుకెళ్లండి, మాటిమాటికీ తాగుతూ ఉంటే వడదెబ్బ కొట్టదు.

 సర్వేజనా సుఖినో భవంతు 🙏

((()))

21. ప్రేమ,విశ్వాసం,నమ్మకం అన్నీఅభిమానం కన్నా పెద్దవి వీటిని మీరినవి ఏవిలేవు

ఆశ్వీర్వదించే మనసులకన్నాఐశ్వర్యము గొప్పదేమి కాదు పవిత్రమైన స్నేహమొక్కటే

ఏ కాలానికైనా విలువైనది!!


22. సమయం మారినపుడు బాధ వెయ్యదు! అయితే...

సమయానికి తగినట్టుగా మనవాళ్లు అనుకున్నవారు మారిపోయినపుడు...!

ప్రాణం పోయినంతగా బాధ వేస్తుంది...!!


23. కొంతమందికి సూర్యుడు వేడిగా మరి కొంతమందికి వెల్గులా అనిపిస్తుంది...

అలాగే,మనం కూడా కొంతమందికి మంచిగా...

మరి కొంతమందికి...

చెడ్డవారిగా అనిపించ వచ్చు అందుకే,ఎపుడూ మన పద్ధతి ప్రకారం మనం బ్రతకాలి ప్రజల ఆలోచనలతో కాకుండా!!


24. ఎవరో చేసి పెట్టినది ఖర్చు పెడితే...

జీవితమంటే ఏమిటి అనేది తెలియదు...

స్వయంగా శ్రమించి వృద్ధి చెందినవారికి ఖర్చుకని ఇచ్చేటప్పుడు అసలు జీవితమంటే...

ఏమిటి అనేది ఏమిటో తెలిసేది...!!


25. తన తప్పును మన దగ్గర చెప్పేవాడు నిజమైన మిత్రుడు మన తప్పును ఇతరుల

దగ్గర చెప్పి గేలి చేసేవాడు...

మన మిత్రుడైనా శతృవుతో సమానం...!!

*****

పన్ను చెల్లింపుదారుల ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైంది.

 ప్రపంచంలో అతిపెద్ద సంస్థ ఏది?

 ఇప్పుడు దేశంలో పన్ను చెల్లింపుదారుల సంఘం ఏర్పడాలి.  ఏ ప్రభుత్వం పాలించినా, 

ఈ పన్ను చెల్లింపుదారుల సంఘం ఆమోదం లేకుండా, ఉచిత విద్యుత్, ఉచిత నీరు, ఉచిత పంపిణీ, లేదా రుణమాఫీలు ఎవరూ ప్రకటించలేరు, ఏ ప్రభుత్వమూ కాదు. ఇలా ఏదైనా అమలు చేయండి.

 మన పన్ను చెల్లింపుల నుండి డబ్బు వస్తుంది, కాబట్టి దానిని ఎలా ఉపయోగించాలో చెప్పే హక్కు కూడా మాకు ఉండాలి.

 ఓట్ల కోసం ఉచితాలను ప్రకటించి పంపిణీ చేయడం ద్వారా సాధారణ ప్రజలు ఇటువంటి రాజకీయ పార్టీలకు ఆకర్షితులవుతారు, ఎందుకంటే అది వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రజలు వారికి వారు సంపాదించుకోకుండా సోమరులను తయారు చేయడం వల్ల దేశం అధోగతి పాలవుతుంది

ప్రభుత్వాలు విద్య మరియు వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వాలి. 

మనం పన్నులు కట్టేది దేశం అభివృద్ది కోసం కానీ దేశాన్ని నాశనం చెయ్యడానికి కాదు.

ఏ పథకాలు ప్రకటించినా, ముందుగా దాని బ్లూప్రింట్ ఇవ్వండి, యూనియన్ నుండి సమ్మతిని తీసుకోండి మరియు ఇది ఎంపీలు & ఎమ్మెల్యేల జీతాలు మరియు వారు పొందే ఇతర ప్రయోజనాలకు కూడా వర్తించాలి.

 ప్రజాస్వామ్యం కేవలం ఓటుకే పరిమితమా ??

 ఆ తర్వాత మనకు ఎలాంటి హక్కులు ఉన్నాయి?

 అలాంటి "ఫ్రీబీస్" ఏదైనా రీకాల్ చేసే హక్కు కూడా త్వరలో అమలు చేయాలి.

****

నీలాకాశంలో పేర్చినట్లున్న తెల్లని మబ్బులు వెనుకనుండి అతని తల్లి తనని చేతులు సాచి ఆర్తిగా పిలిచినట్లనిపించేది.

పసి వయసులోనే తన బాధ్యత తీర్చుకోకుండా రామభద్రన్ ని ఒంటరిగా వెళ్లి పోయినందుకి విచారిస్తున్నట్లుగా కనిపించేదతని తండ్రి రూపం.
దిక్కులేని అన్నని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించేదతని చెల్లి.
రామభద్రన్ లేత హృదయం వేటు తిన్న గువ్వలా గిలగిల్లాడేది. గుండెలో లుంగ చుట్టుకుని గొంతు కడ్డంపడి కరగని మంచు ముక్కలాంటి దుఃఖం అతన్ని అణువణువునా నలిపేసేది!

అంబరం కదిలే మబ్బు లతొ ఉండిఉండక నీలమై 
సంబరం జరిపే మనుష్యులు బత్కి బత్కక నీలమై 
నిబ్బరం లెక కన్నవారును పెంచినారును నీలమై 
డబ్బులున్నను శాంతిలేకయు తిండియర్గక నీలమై 
  
అప్పుడే అతని హృదయంలో మరణం పట్ల ఒక రకమైన ద్వేషం – దాన్ని జయించాలన్న బలమైన కోరిక ప్రోది చేసుకోనారంభించేయి.
ఎలా?
ఏ విధంగా?
అస్పష్టమైన భావాలు.
నిర్దుష్టత నెరుగని ఆలోచనలు.
జవాబు దొరకని ప్రశ్నలు.
అప్పుడే సరిగ్గా తనని లాలించి ఇంతన్నం పెడుతున్న మేనత్త కూడా ఉన్నట్టుండి విరుచుకుపడి చనిపోయింది.
హార్టెటాక్ అన్నారందరూ!
మేనమామ ఆమె మీద పడి ఏడుస్తుంటే రామభద్రన్ ఆ దృశ్యాన్ని చూడలేకపోయేడు.
మనసు మెలితిప్పి పిండుతున్న గుడ్డలా తల్లడిల్లిపోయింది.
ఎందుకిలా – తనకి ఎవర్నీ లేకుండా చెయ్యడం.

దీక్షతో మనిషే కధా మరుభూమిలా అనుకంపనం
కక్షతో  మది తొల్చియే సమరం సమోన్నత కంపనం
తక్షణం ఇది మార్చుటే వినియోగమే కధ కంపనం 
వీక్షణం అని గాజుగోళిగ నిర్విరామము కంపనం 

చావనేదియు రాకమానదు జాలిగుండెకు బాధయే 
ఏవగించకు ఎత్తిచూపకు ప్రశ్నలేయకు బాధలో 
నిడుయవ్వన ముద్దుగుమ్మకు పాండురోగము ఎందుకో 
మంచిచేసిన మృత్యవే మము తోడునీడన ఎందుకో

ఈ చావనేది యింత చెప్పా పెట్టకుండా – ఎలాంటి సూచననివ్వకుండా ఒక్కసారి కలుగులోంచి అకస్మాత్తుగా బయటకొచ్చిన కాలసర్పంలా మనిషి మనుగడనెందుకు కాటేసి వెళ్లాలి?
అసలీ చావెందుకు?
ఇదింత అనివార్యమా?
దీన్నుండి మనిషికి విముక్తి లేదా?
భూమి గుండ్రంగా వుందని – దాన్ని పాములా అనంతమైన జలరాశి చుట్టుకుని వుందని – సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయని – ఆకాశం శూన్యమని ఎందుకీ అనవసరపు జ్ఞానం?

కాలసర్పము కాటువేసియు రాక్షసీ వలె ఎందుకో 
ఆలుబిడ్డల ఆశపాశము అంటివుండుట ఎందుకో 
దీనురాలిని బీదవారిని మృత్యువే కబళించెనే 
మృత్యురాతయు లేకయుండుట ఎవ్వరీ తరమవ్వునో

విమానంలో కొన్నివేల మైళ్ళని కొన్ని గంటల్లోనే చేరుకోగలనని, టి.విలో ఎక్కడెక్కడివో చూడగలనని, వినగలనని, ఎన్నెన్నో తన మేధస్సుతో కనుక్కుని సుఖపడుతున్నానని మిడిసిపడే మనిషి – మరణం తన మెడలో పాములా చుట్టుకునే కూర్చుందని – దాన్ని అధిగమించలేని తన తెలివి బూడిదలో పోసిన పన్నీరని గ్రహించలేకపోతున్నాడే!
అకస్మాత్తుగా అతని దృష్టి మేనత్త సాంప్రదాయ సిద్ధంగా శిష్టాచారాలతో, అనంత భక్తిభావంతో తెల్లవరాగానే పూజించే దేవుడి పటాల మీద పడింది.

 అనేక రూపాలతో, అనేక చేతులతో ఆశీర్వదిస్తూ, స్మిత వదనాలతో వున్నాయి దేవుడి రూపాలు.
ఈ యావత్ ప్రకృతిని, ప్రాణుల్ని శాసించే ఒక అద్భుత శక్తి వుందని నమ్మి పూజించిన అత్తని ఈ దేవుళ్లెవరూ మరణం నుండి కాపాడలేకపోయారే?
అసలు దేవుడనే వాడున్నాడా?
ఉంటే..! వాడి పని కేవలం మనిషిని ఏడిపించడమేనా?
స్థితిని వదిలేసి సృష్టి, లయలు చేయడమేనా అతని వృత్తి.
 అంటే దేవుడొక శాడిస్టన్నమాట.
అంతే!
రామభద్రన్  హృదయం భగ్గున తాటాకులా మండింది.
--(())--

 మీరు అంగీకరిస్తే, దయచేసి వీలైనంత ఎక్కువ మందిని సంప్రదించండి.  దీన్ని అమలుచేయడానికి, పోస్ట్‌ని షేర్ చేయండి.

 కనీసం మీ 10 మంది స్నేహితులకు పంపండి.


ఇంకొకరి కోసం కొంచమైనా సుఖం సంతోషం నెమ్మది ఇవ్వాలంటే మనమేమి...

శ్రీమంతులుగా ఉండనవసరం లేదు ఒకటి రెండు మాటల మూలకంగా

స్పందించే సౌజన్యత ఉంటే చాలు...అదే పదివేలు...!!


ఎండిన పువ్వును చూసి విరిసిన పువ్వు నవ్వవచ్చు

అయితే,అది శాశ్వతం కాదు దానికి వాడిపోయే...

సమయం వస్తుంది. అహంకారమైన నవ్వు తాత్కాలికము అంతే!!


ఉండాలి ఆడ-మగ స్నేహితులు బాధలకు స్పందిస్తూ తప్పులను సరిదిద్దుతూ

కష్ట సుఖాలలో...                                                         

పాలు పంచుకుంటూ అప్పుడప్పుడు రేకెత్తించే అల్లరితో జీవితంలో ఒకరికొకరు

స్ఫూర్తిని ఇచ్చుకుంటూ ఉండాలి... అవును కదా!!