కనక రత్న వజ్ర వైడూర్య మకుటమ్ము
కల్గి ఉన్న శోభ నిచ్చు కృష్ణ
తళుకుల సుమలలిత ఫాలదేశముజూపు
సురుచిర కర సుముఖ వెల్గు కృష్ణ .... .... 1
లలిత ఫాల దేశ భ్రూలతా శోభితం
సుందర కనుగవ బెళుకుల కృష్ణ
లేత ముదురు మొగ్గ నాసిక మంద
స్మిత కనికరమును జూపు కృష్ణ ... .... 2
రత్న దంత వెలుగు మధురాతి మధురమ్ము
రమ్య మైన బింబ ఆధారమ్ము
సిరులు ఒలక పుచ్చు చిన్నయా రూపమ్ము
పలువురి మనసులను దోచు కృష్ణ ..... .... 3
--(())--
ఈరోజు .. ఉత్తమం పై కవిత
కన్నులార ఎదలోయలు మనుగడమే ఉత్తమం
చిన్న పిల్ల పలుకే పలు విధముగనే ఉత్తమం
ఉన్న మాట తెలిపేందుకు సహనముయే ఉత్తమం
అన్న మాట మరుపేందుకు మనుగడ యే ఉత్తమం
పరా యెవరు లేరన్నది తెలియడమే ఉత్తమం
వినోదముయు పొందాలని తలచుటయే ఉత్తమం
మనోమయము కోరేదియు జరువుటయే ఉత్తమం
సుఖాలయము సౌందర్యతొ మనుఁగడ యే ఉత్తమం
చల్లఁదనానికి వెచ్చదనం తోడైతే మనసుకు ఉత్తమం
అల్లము బెల్లము కల్సి ఒకే తీపైతే వయసుకు ఉత్తమం
అల్లిక మన్నిక ఇస్తె ఒకే తృప్తైతే సొగసుకు ఉత్తమం
ఉల్లము జిల్లను ఆశ మనో మాధుర్యం మగనికి ఉత్తమం
ఆట మాటల మధ్య శత్రువు లేక పోవడమే ఉత్తమం
మాట పాశము మధ్య వైరము లేక బత్కుట యే ఉత్తమం
వేట ఎందుకు మధ్య బేధము లేని ఆశలు యే ఉత్తమం
బాట చూపుట నేత ధర్మము మంచి తెల్పుటయే ఉత్తమం
కనీసం ఒక్కరుకూడ చూడలేని ఫేస్బుక్ లో చేసినా ఫలితం లేదు అదే నాకు ఉత్తమం
--(())--
నేటి కవిత్వం - - - రామ
మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ
రామ శాంతియు లోక మంతయు రాజ్య మేలెను రక్షగా
రామ ఆశ్రిత భావ శిధ్ధిని రమ్య పర్చియు నాయకా
రామ మందిర మెల్ల పోకయు రాజి చేసియు పిల్పుకే
రామ వచ్చియు మాకు దీవెన రవ్వ వెల్గులు ఆత్మగా
రామ సీతయు ఆంజ నేయుని రక్ష దీవెన సత్క్రపన్
రామ రక్షయె భాగ్య బీదకు రక్ష సత్యపు సత్క్రపన్
రామ శక్తియే లక్ష్య సాధన రక్ష శోధన సత్క్రపన్
రామ నామము పాడు చుంటిని రక్తి భక్తి గ సత్క్రపన్
రామ చంద్రుడు ఆశ్రితా సుమ రమ్యమై సహ వాసుడై
రామ భద్రుడు ధర్మ రక్షణ రాత్రి భావపు ధీరుడై
రామ లైక్యుడు ఏక పత్నిగ రమ్య వాక్కును వేల్పుడై
రామ భావము దుష్ట శిక్షణ రామ రక్షక భానమై
రామ కృష్ణుని వేడు చుంటిని రాల్చు ముక్తికి తోడుగా
రామ మాయతొ వెల్గు లిచ్చియు రాక్షసత్వము మార్చగా
రామ లక్ష్యము మాకు దీవెన రమ్య మయ్యెను ఆత్మగా
రామ ధర్మము సంభవామియు రాజ్య మేలెను భక్తిగా
--((***))__
నేటి ఛందస్సు కవిత
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
గణములు - న,న,మ,య,య
III III UUU IUU IUU యతి 9
నిరుపమగుణదీప్తీ నిత్యకల్యాణ కారీ
హరిహర సుతకీర్తీ ఆత్మవిద్యాప్రదాత్రీ
చిరునగవుల చిత్తాచిత్త భవ్యా భవానీ
కనక కళలు సద్భక్తా తపస్వీ సుభద్రా
సవినయ సమదృష్టీ సమంతా సకారీ
మురహర భవబాగ్యాన్ముక్త సౌమ్య ప్రదాత్రీ
పరశివ హృదిభాసా భక్తిగమ్యా భవానీ
సురుచిర మృదుహాసా శోభితాంగీ సుభద్రా
వినిమయ ఉచితా సవ్యా విధానం సకారీ
నరహర నవతేజాన్ముక్త రమ్య ప్రదాత్రీ
మనసు మమత మొహమ్మే ప్రదీప్తి భవానీ
పలుకు అలక వాక్కేభక్త సాద్వీ సుభద్రా
మునివరమన సేసౌమ్యా లయమ్మే సకారీ
సరిగమ పద నాట్యశాస్త్ర దివ్యప్రదా త్రీ
కనుల కనులు కల్సేకాలమాయే భవానీ
వినయ వికసితా తావీ అలేఖ్యా సుభద్రా
--(())--
నేటి ఛందస్సు కవిత
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
గణములు - న,న,మ,య,య
III III UUU IUU IUU యతి 9
ధర్మ బోధ అర్ధ మవుటయు తేలిక
అర్ధ మయిన ఆచ రణములేదు
ఆచరణము ధర్మ కలియుగ మర్మము
కర్మ లన్ని జన్మ సార మగు
పరువు అనుకుంటె బతుకు లు బరువు ఎక్కు
నిగ్రహమ్ముగా ఉంటేనే శాంతి కలుగు
ఉగ్ర వాదిలా మారితే నిద్ర కరువు
ఆగ్ర హమ్ము జీవితాన్ని నష్ట పరచు
నిరతము వినుతింతున్ నెమ్మియున్ శ్రధ్ధ తోడన్
శభధము విను పింతున్ నమ్మకమ్ వల్ల తెల్పెన్
చదువుల విన యమ్మే జీవితమ్ శోభ పెంచున్
సుఖముల పస వల్లే వ్యసనమ్ పెర్గు జుండున్
ప్రణతులు నుతులందన్ వచ్చి రూపించు రక్తిన్
తరువులు మున్గి చూపించు శక్తి న్జలమందున్
పలుకులు సుఖమందున్ వచ్చు సౌభాగ్యయుక్తిన్
కరుణయు భయమందున్ తెచ్చు ప్రాధాన్యముక్తిన్
వనరుహ దళనేత్రీ బ్రహ్మజిహ్వాగ్ర వాసీ
శరణము శివధాత్రీ సర్వాత్మ గ్రాహ్య వాసీ
కరుణయు కమలాత్రీ కారుణ్య స్నేహ వాసీ
గరళము గలకంఠా ఐశ్వర్య ప్రేమ వాసీ
కినుకనునిడకుండన్ ఖేలగా నాడిబాసల్
మణిమయమణిమాలన్ వెల్గు గా రత్నవెల్గుల్
తరుణము తిధికాలన్ హేలగా తత్వతాపల్
ఫలములపదపాలన్ సేవగా సత్వమాయల్
మఱి మఱి తలపో్తున్ మాతగా నిన్ను నిచ్చల్
నిరతము వినుతింతున్ నెమ్మియున్ శ్రద్ధ తోడన్
హరుసము నిడలేవా యన్నిటంజూపి వెల్గున్
ప్రణతులు, నుతులందన్ వచ్చి రూపించు రక్తిన్
కరుణనుఁ గనవేలా కంజనేత్రీ సవిత్రీ
వరములనిడకుండన్ వాక్ప్రదాత్రీ వరాంగీ
వనరుహ దళనేత్రీ బ్రహ్మజిహ్వాగ్ర వాసీ
వినతుల విననట్లున్ వేసటం గూర్చ నేలా
మఱిమఱి యడిగించన్ మంచిదా నీకునైనన్
సరసములవి చాలున్ జాటుగానుండి యెప్డున్
మురిపెము నిడరమ్మా ముందు నిల్చుండి పేర్మిన్
తనయనె యనియంచున్ దాపమీయంగ మేలే
కనులకుఁ గనువిందై కమ్రమౌ రూపుతోడన్
తనివినిఁ గలిగించన్ ధర్మమౌ కాద నీకున్
కినుకనునిడకుండన్ ఖేలగా నాడిబాసల్
గుణయుత నని యంచున్ గ్రుంగఁజేయన్ శుభమ్మే
ऊँ!
----
" పద్మనాభం ( పంచపాది )..
----
రచయత: శ్రీ గురుతుల్యులు వెంకటేశ్వర రావు గారు పంపగా క్రింది పధ్యము వ్రాసితిని
గౌరీశ ! పాకారి దేవాది భూతాది గమ్యప్రణేత్రప్రమేయా ! మహేశా !
గౌరీశ ! కాలస్వరూపస్థ !దక్షప్రగర్వాపహారీ ! గిరీశేంద్రబంధూ ( / ధో ) !
గౌరీశ ! నందీశ భృంగీశ నాగేశ గైర్వాణపూజ్యా ! గురో ! విశ్వపాలా !
గౌరీశ ! శబ్దాది వేదాంత తత్త్వప్రకామ్యేష్ట సంధాత ! సాయుజ్యమిమ్మా !
గౌరీశ ! సాష్టాంగ దండంబుగైకొమ్ము గారుణ్యమున్జూపు శంభో! శివయ్యా !!!"
" పద్మనాభం ( పంచపాది )..
శాపమ్ము నావెంట వెంటాడి ఉన్నాది నేనేమి చేసేను చాపల్య బుద్ధే
కాలమ్ము వీలున్న సద్భుద్ది లేకున్న నీచెంత నేనుండ ఉండేటి వాడ్నా
నీలాలు అర్పించి నాకున్న దుర్భుద్ధి యంతాను చెప్పాను మొక్కే
పాదమ్ము తాకాక పాపమ్ము తగ్గేను రోగమ్ము పోయేను గౌరమ్మ శక్తే
ఆరాధ్య దైవమ్ము కార్యమ్ము తీర్చేను పూజ్యగురో విశ్వ శక్తమ్మ రక్షే
మోనమ్ము వీడాక నాదమ్ము విన్నాక కాలమ్ము నచ్చాక దేహమ్ము నీకే
ధ్యాసంత నీమీద అనంద మొందేటి మార్గమ్ము అంతాను ముందుంచె దేవా
ప్రేమంత నీమీద ఉంచాను సిధ్ధించు విశ్వాస భావమ్ము యీదేవి కుందీ
ధ్యానమ్ము చేస్తున్న విశ్వేశ్వరా నన్ను కాపాడి ఆలింగ సౌఖ్యమ్ము పొందూ
శ్రీ శంకరా శక్తి మందార నాప్రేమ నాదేహ మంతయు నీకేత్రినేత్రా
మత్తకోకిల
సేవశక్తికి తోడునీడగ బత్కువేటలొ ఆత్మయే
ఇచ్ఛశక్తికి మొనమంతయు కాలామాయగ కమ్ములే
ప్రేమ భక్తికి సాధనన్నది ఒక్కమాదిరి ఉండులే
రామచంద్రుని ఆంజనేయుని పూజచేయగ మోక్షమే
సుందరమ్మగు సీత శక్తిని శోభితమ్ముగ చేయగా
సుందరాంగుడు రామచంద్రుని శోభలన్నియు చూపగా
మందిరమ్మును కట్టుచుండిరి మానవత్వము చాటగా
అందరమ్మొక దీక్షతోడను అందినంతయు చేర్చుమా
అనిశ్చితి తొలగించటానికి సృజనాత్మకత ముఖ్యం. దీనితోనే ధీరత్వం వస్తుంది.
తేటగీతి
కాలము నమ్మియున్న నను సత్యము కమ్మియు సేవ చేయుటే
తాళము వేసి రాగము ను చూపియు తన్మయ భావపంచుటే
శీలము నీకు పంచుటకు దాహము తీర్చుట ధర్మ మవ్వుటే
యేల్లలు లేవు కృష్ణ మనము ఏకము అవ్వుట ధర్మరక్షణే
--(())--
No comments:
Post a Comment