🌹 . శ్రీ శివ మహా పురాణము - 240 🌹(07-10-2020)( 1)
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ/ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
54. అధ్యాయము - 9..
🌻. మారగణములు - 1 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ మహర్షీ! ఆ మన్మథుడు తన అనుచరులతో గూడి శివస్థానమునకు వెళ్లగానే, చిత్రమగు వృత్తాంతము జరిగినది. దానిని వినుము (1).
మహావీరుడు, మోహకారకుడు నగు మన్మథుడు అచటకు చేరి వెంటనే తన ప్రభావమును విస్తరింపజేసెను. మరియు ప్రాణులను మోహపెట్టెను (2).
వసంతుడు కూడా శివుని మోహపెట్టుటకై తన ప్రభావమును విస్తరింపజేసెను . ఓమునీ! ఏకకాలములో వృక్షములన్నియు పుష్పభరితములైనవి (3).
మన్మథుడు రతితో గూడి అనేక ప్రయత్నములను చేసెను. జీవులన్నియు వశమైనవి.కాని గణేశుడు, శివుడు వానికి వశము కాలేదు (4).
ఓ మహర్షీ! మన్మథుడు వసంతునితో కలిసి చేసిన ప్రయత్నములన్నియూ వ్యర్థము కాగా, ఆతని గర్వము తొలగి పోయెను. అపుడా తడు నా వద్దకు మరలి వచ్చెను (5).
ఓ మహర్షీ! ఆతడు గర్వము తొలగినవాడై, నిరుత్సాహముతో నుండి నాకు ప్రణమిల్లి గద్గదస్వరముతో నిట్లు పలికెను (6).
మన్మథుడిట్లు పలికెను -
హే బ్రహ్మన్! యోగనిష్ఠుడగు శంభుని మోహింపజేయుట అసంభవము సుమా! నాకు గాని, ఇతరులకు గాని అట్టి శంభుని మోహింపజేయు శక్తి లేదు (7).
హే బ్రహ్మన్! నేను నా మిత్రుడగు వసంతునితో, మరియు రతితో గూడి శివుని యందు ప్రయోగించిన ఉపాయములన్నియూ వ్యర్థయమ్యెను (8).
హే బ్రహ్మన్! మేము శివుని మోహింపజేయుటకు చేసిన వివిధోపాయములను చెప్పెదను. తండ్రీ! వినుము (9).
శంభుడు ఇంద్రియములను నియంత్రించి సమాధియందుండగా, అపుడు నేను సమాధియందున్న ఆ ముక్కంటి మహాదేవునకు నిరంతరముగా ప్రయత్నపూర్వకముగా చల్లని, వేగముగల, మోహమును కలిగించే, పరిమళభరితమైన వాయువుతో వీచితిని (10.11).
నేను నా అయిదు బాణములను మరియు ధనస్సును చేత బట్టి శివగణములను మోహింపజేయుచూ ఆయన చుట్టు ప్రక్కల తిరుగాడితిని (12).
నేను ప్రవేశించుట తోడనే సర్వ ప్రాణులు నాకు తేలికగా వశమగును. కాని, శివప్రభువు మరియు ఆయన గణములు ఎట్టి వికారమునూ పొందనే లేదు (13).
హే బ్రహ్మన్! ప్రమథ గణాధిపతి యగు ఆ శివుడు హిమవత్పర్వత మైదానములకు వెళ్లగా, అపుడు నేను గూడ రతితి, వసంతునితో గూడి అచటకు వెళ్లితిని (14).
ఆ రుద్రుడు మేరు పర్వతమునకు గాని, నాగకేశర (?) పర్వతమునకు గాని, లేదా కైలాసమునకు గాని వెళ్లినప్పుడు నేను కూడా ఆయా స్థలములకు ఆయనను వెన్నంటి వెళ్లితిని (15).
ఎపుడైననూ శివుడు సమాధిని వీడినచో, ఆ సమయములో నేను ఆయన యెదుట చక్రవాక పక్షుల జంటను ప్రదర్శించితిని (16).
హేబ్రహ్మన్! ఆ పక్షుల జంట పునః పునః హావభావములను ప్రకటించుచూ ఉత్తమమగు దాంపత్యపద్ధతిని ప్రకటించినవి (17).
గణములతో కూడియున్న, నల్లని కంఠము గల ఆ మహాదేవుని యెదుట మృగములు, పక్షులు శృంగామును ప్రకటించినవి (18).
ఆయన యెదుట మరియు సమీపమునందు నెమలి జంట శృంగారరసమును ఉద్ధీపింపజేయు విధముగా వివిధ గతుల నాట్య మాడినది (19).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 . శ్రీ శివ మహా పురాణము - 241 🌹(08-10-2020)(2)
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ/ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
🌻. మారగణములు - 2 🌻
నా బాణమును ప్రయోగించుటకు ఆవశ్యకమగు దౌర్బల్యము శివునియందు నాకు ఏనాడూ కానరాలేదు. హే జగత్ర్ప భూ! నేను సత్యమును పలుకుచున్నాను. శివుని మోహింపజేయు శక్తి నాకు లేదు (20).
వసంతుడు శివుని మోహింపజేయుటకు ప్రయత్నించినాడు. మహాత్మా! ఆ వృత్తాంతమును వినుము. నేను ముమ్మాటికీ సత్యమునే పలుకుచున్నానను (21).
శివుడు ఉన్నచోట వసంతుడు సంపెంగలను, కేసరపుష్పములను, కురువేరు పుష్పములను, అరుణవర్ణము గల పొన్నలను, నాగకేశరములను, కింశుక పుష్పములను, మొగలి పువ్వులను, దానిమ్మ పువ్వులను (22),
అడవి మల్లెలను, దట్టమగు మోదుగ పువ్వులను, గోరింట పువ్వులను వికసింపజేసెను (23).
ఆతడు ప్రయత్న పూర్వకముగా శివుని ఆశ్రమములో సరస్సులను వికసించిన పద్మములతో సుగంధ భరితములగునట్లు చేసి మలయానిలము వీచునట్లు చేసెను (24).
అచట గల లతలన్నియూ పూలతో, చిగుళ్లతో నిండి వృక్షముల మొదళ్లను ప్రేమతో చుట్టుకొని యుండెను (25).
పుష్పములతో నిండియున్న ఆ వృక్షములను చూచి, ఆ సుంగధి భరితములగు గాలులను అనుభవించిన మునులు కూడా కామమునకు వశమైరి. ఇతరుల గురించి చెప్పనదేమున్నది? (26).
ఇట్లు ఉన్ననూ శివునకు మోహమును పొందే హేతువు గాన రాలేదు. ఆయనలో లేశమైనను వికారము కలుగలేదు. శంకరుడు నాపై కోపమును కూడ చేయలేదు (27).
ఈ వృత్తాంతమునంతనూ చూచిన నేను ఆ శివుని భావనను తెలుసుకున్నాను. నాకు శివుని మోహింపచేయుట యందు అభిరుచి లేదు. నేనీ మాటను నీకు నిశ్చయముగా చెప్పుచున్నాను (28).
ఆయన సమాధిని వీడినప్పుడు ఆయన చూపుల ముందు మేము నిలబడుటకైననూ సమర్థులము కాము. అట్టి రుద్రుని ఎవరు మోహింపజేయగలరు? (29).
హే బ్రహ్మన్! మండే అగ్నివలె ప్రకాశించు కన్నులు కలిగినట్టియు, జటాజూటముతో భయంకరముగా నున్నట్టియు, విషమును ధరించియున్న శివుని చూచి, ఆయన యెదుట నిలబడ గలవారెవ్వరు? (30).
బ్రహ్మ ఇట్లు పలికెను -
నాల్గు మోములు గల నేను ఈ మన్మథుని మాటలను విని, సమాధానమును చెప్పగోరియు చెప్పక ఊరకుంటిని. అపుడు నా మనస్సు చింతతో నిండి పోయెను (31).
శివుని నేను మోహింపచేయ జాలను అను మన్మథుని పలుకులను వింటిని. ఓ మహర్షీ! ఈ మాటలను విన్న నేను మహా దుఃఖముతో నిట్టూర్పు విడిచితిని (32).
నా నిట్టూర్పు వాయువుల నుండి అనేక రూపములు గలవారు, మహాబలులు, వ్రేలాడు జిహ్వలు గలవారు, అతి చంచలమైన వారు, మిక్కిలి భయమును గొల్పువారు నగు గణములు పుట్టినవి (33).
వారందరు అసంఖ్యాకములు, గొప్ప భయంకరమైన ధ్వని చేయునవి అగు పటహము మొదలగు అనేక వాద్యములను మ్రోగించిరి (34).
నా నిట్టూర్పుల నుండి పుట్టిన ఆ మహాగణములు నా ఎదుట నిలబడి 'చంపుడు నరుకుడు' అని కేకలు వేసినవి (35).
నన్ను ఉద్దేశించి వారు 'చంపుడు నరుకుడు' అని వేయుచున్న కేకలను విని మన్మథుడు వారిని ఎదుర్కొనెను (36).
ఓ మహర్షీ! అపుడు మన్మథుడు నాయెదుటనున్న ఆ గణములను వారించి, నాతో బ్రహ్మన్ అని సంబోధించి ఇట్లు పలికెను (37).
మన్మథుడిట్లు పలికెను -
హే బ్రహ్మన్! ప్రజాపతీ! సృష్టినంతనూ ప్రవర్తిల్ల జేయువాడవు నీవే . ఈ భయంకర వీరులు ఉత్పన్నమైరి. వీరెవ్వరు? (38).
హే విధీ! వీరి కర్తవ్యమేమి? వీరు ఎక్కడ ఉండెదరు? వీరినామము ఏమి? ఈ విషయములను చెప్పి, వీరిని నియోగింపుము (39).
వారికి స్థానమునిచ్చి, పేరు పెట్టి, వారి కర్మలయందు వారిని నియోగింపుము. హే దేవేశా! అపుడు దయతో నాకు తగిన ఆజ్ఞను ఇమ్ము (40).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*: 🌹 . శ్రీ శివ మహా పురాణము - 242 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ/ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
54. అధ్యాయము - 9
🌻. మారగణములు - 3 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ మహర్షీ! సృష్టికర్తనను నేను మన్మథుని ఆ వాక్యమును విని వారి కర్తవ్యము, పేరు ఇత్యాదులను నిర్దేశిస్తూ, మన్మథునితో నిట్లంటిని (41).
వీరు పుట్టుచుండగనే 'మారయ (చంపుడు)' అని పలుమార్లు అరచిరి గాన, వీరికి మారులు అనుపేరు సార్థకమగు గాక! (42).
ఈ గణములు తమను అర్చించకుండగా వివిధములగు కామనలను పొందగోరు మానవులకు సర్వదా విఘ్నములను కలిగించెదరు (43).
హే మన్మథా! నిన్ను అనుసరించి ఉండుట వీరి ప్రధాన కర్తవ్యము. వీరు ఎల్ల వేళలా నిన్ను అను సరించి ఉందురనుటలో సందియము లేదు (44).
నీవు నీ కర్తవ్యమును నిర్వర్తించుటకై ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడకు వెళ్లెదవో, అప్పుడప్పుడు అక్కడక్కడకు వీరు నీ సహయము కొరకు అనుసరించి రాగలరు (45).
నీ అస్త్రములకు వశమగు మానవులకు వీరు చిత్తభ్రాంతిని కలిగించెదరు. వీరు జ్ఞానుల జ్ఞానమార్గమునకు అనేక విధముల విఘ్నములను కలిగించెదరు (46).
ఓ మహర్షీ! ఈ నా మాటను విని, రతీ దేవితో మరియు అనుచరులతో కూడియున్న మన్మథుని ముఖములో కొంత ప్రసన్నత కానవచ్చెను (47).
ఆ గణములన్నియూ కూడ ఈ మాటను విని, నన్ను మన్మథుని చుట్టు వారి యథేచ్చగా అచట నిలబడి యుండిరి (48).
అపుడు బ్రహ్మ మన్మథుని ఉద్దేశించి ప్రీతితో నిట్లనెను. నా ఆజ్ఞను పాలింపుము. నీవు మరల వీరితో గూడి వెళ్లుము. మనస్సును లగ్నము చేసి శివుని మోహింపజేయు యత్నమును చేయుము . (49)
ఈ మారగణములతో సహావెళ్లి, శివుడు మోహమును పొందునట్లు చేయుము. అపుడు శివుడు వివాహమును చేసుకొనగలడు (50).
ఈ మాటలను విని మన్మథుడు నన్ను మర్యాద చేసి వినయముతో ప్రణమిల్లెను. ఓ దేవర్షీ! అపుడాతడు నాతో నిట్లనెను.
మన్మథుడు ఇట్లు పలికెను -
తండ్రీ! శివుని మోహింపజేయు ప్రయత్నమును నేను శ్రద్ధగా చేసితిని. కాని ఆయన మోహమును పొందలేదు. ఇపుడు గాని ఆతడు మోహమును పొందడు (52).
నీ మాట యందలి గౌరవముతో నీ యాజ్ఞాను సారముగా నేను మరల శివుని ధామమునకు వెళ్లెదను. ఈ మారగణములు నాకు కొంత ఆశను కల్గించు చున్నవి (53). కాని నా మనస్సు లో శివుడు మోహమును పొందడనియే నిశ్చయముగా తోచుచున్నది. హే బ్రహ్మన్ ! శివుడు నా దేహమును భస్మము చేయడు గదా యను శంక నాకు గలదు (54).
మన్మథుడు ఇట్లు పలికి భయము గలవాడై వసంతునితో, రతీ దేవితో గూడి అపుడు శివుని ధామమునకు వెళ్లెను. ఓముని శ్రేష్ఠా! మారగణములు కూడ ఆతనిని అనుసరించినవి (55).
అపుడు మన్మథుడు పూర్వమునందు వలెనే వసంతునితో గూడి బాగుగా ఆలోచించి అనేక ఉపాయములను శివుని పై ప్రయేగించి తన ప్రభావమును చూపెను (56).
మారగణములు కూడా అనే ఉపాయములను చేసిరి. కాని శివ పరమాత్మకు మోహము కలుగనే లేదు (57).
అపుడు మన్మథుడు వెనుదిరిగి నా స్థానమునకు వచ్చెను. మారగణములు గర్వమును వీడి దుఃఖముతో నా ముందు నిలబడెను (58),
కుమారా! అపుడు నిరుత్సాహముతో నిండియున్న మన్మథుడు మారగణులతో, వసంతునితో గూడి గర్వమును వీడి నా ముందు నిలబడి ఇట్లు పలికెను (59).
హే బ్రహ్మన్! శివుని మోహింప జేయు యత్నమును పూర్వము కంటె అధికముగా చేసితిని. కాని ధ్యానమునందు లగ్నమైన మనస్సు గల శివునకు మోహము లేశమైననూ కలుగలేదు (60).
దయామయుడగు శివుడు నా దేహమును భస్మము చేయలేదు. పూ ర్వపుణ్యమే దీనికి కారణమై యుండును. ఆ ప్రభువు నందు వికారము లేమియూ కలుగలేదు (61).
ఓ పద్మ సంభవా! శివుడు వివాహమాడ వలెననే ఇచ్ఛ నీకు ఉన్నచో, నీవు గర్వమును వీడి, మరియొక ఉపాయమును చేయవలెనని నా అభిప్రాయము (62).
బ్రహ్మ ఇట్లు పలికెను -
మన్మథుడిట్లు పలికి , నాకు నమస్కరించి, గర్వమును దునుమువాడు దీనులపై ప్రేమను గురిపించువాడునగు శంభుని స్మరించుచూ, తన అనుచరులతో గూడి తన ఆశ్రమమునకు వెళ్లెను (63).
శ్రీశివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందు సతీఖండములో కామ ప్రభావము - మారగణముల పుట్టుక అనే తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (9).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 . శ్రీ శివ మహా పురాణము - 243 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
55. అధ్యాయము - 10
🌻. బ్రహ్మకు జ్ఞనోదయమగుట - 1 🌻
నారదుడిట్లు పలికెను -
హే బ్రహ్మన్! విధీ! మహాత్మా! శివుని యందు లగ్నమైన మనస్సు గల నీవు ధన్యుడవు. శంకర పరమాత్ముని పుణ్యచరితమును చెప్పితివి (1).
మన్మథుడు తన సహచరులతో మరియు రతితో గూడి తన ఆశ్రమమునకు వెళ్లగా ఏమి ఆయెను? నీవు ఏమి చేసితివి? ఆ చరితమునిప్పుడు చెప్పుము (2).
బ్రహ్మ ఇట్లు పలికెను -
నారదా! చంద్రమౌళి యొక్క చరితమును మిక్కిలి ప్రీతితో వినుము. దీనిని విన్నంత మాత్రాన మానవుడు కామక్రోధాది వికారములకు దూరము కాగల్గును (3).
తన అనుచరులతో కూడి మన్మథుడు తన ఆశ్రమమునకు వెళ్లిన తరువాత జరిగిన చరితమును చెప్పెదను. తెలుసు కొనుము (4).
నారదా! నా గర్వము తొలగిపోయెను. నా హృదయములో ఆశ్చర్యము కలిగెను. ఓ మహర్షీ! నా కోరిక తీరనందున నాకు ఆనందము కరువయ్యెను (5).
కామ క్రోధాది వికారములు లేని వాడు, జితేంద్రియుడు, యోగ పరాయణుడునగు ఆ శంకరుడు వివాహమాడే ఉపాయమేది అని నేను మనస్సులో పరిపరి విధముల తలపోసితిని (6).
ఓ మహర్షీ! అపుడు నేను గర్వము తొలగిన వాడనై, పరిపరి విధముల తలపోసి, శివస్వరూపుడు, నాకు తండ్రి అగు విష్ణువును భక్తితో స్మరించితిని (7).
మరియు, దీన వచనములతో గూడిన స్తోత్రములతో ఆయనను స్తుతించితిని. వాటిని విని విష్ణుభగవానుడు వెంటనే నా ఎదుట ప్రత్యక్షమయ్యెను (8).
నాల్గు భుజములు గలవాడు, పద్మముల వంటి కన్నులు గలవాడు, శంఖమును, శార్‌ఙ్గమనే ధనస్సును, గదను ధరించినవాడు, ప్రకాశించే పచ్చని వస్త్రము గలవాడు, నీలమేఘశ్యాముడు, భక్తవత్సలుడు (9),
భక్తులకు శరణునొసంగువాడు అగు ఆ హరిని చూచి కన్నీరు విడుచుచూ, గద్గదమగు వాక్కుతో ప్రేమపూర్వకముగా అనేక పర్యాయములు స్తుతించితిని (10).
ఆ స్తోత్రమును విని తన భక్తుల దుఃఖములను తొలగించే హరి మిక్కిలి ప్రసన్నుడై, శరణు పొందిన నన్ను ఉద్దేశించి ఇట్లు పలికెను (11).
విష్ణువు ఇట్లు పలికెను -
హే విధీ! బ్రహ్మన్! సృష్టికర్తవగు నీవు మహా ప్రాజ్ఞుడవు, ధన్యుడవు. ఈనాడు నీవు నన్ను స్మరించి, స్తుతించుటకు కారణమేమి? (12).
నీకు కలిగిన మహాదుఃఖము ఏది? నాకు ఇప్పుడు చెప్పుము. నీ సర్వదుఃఖములను పోగెట్టెదను. నీకు సంశయముఅక్కరలేదు (13).
బ్రహ్మ ఇట్లు పలికెను -
విష్ణువు యొక్క ఈ మాటలను విన్న నా ముఖములో కొద్ది ఉత్సాహము కన్పట్టినది. నేను దోసిలి యొగ్గి విష్ణువునకు నమస్కరించి ఇట్లు పలికితిని (14).
ఓ దేవ దేవా! లక్ష్మీపతీ! మర్యాదను నిలబెట్టువాడా! నా మాటను వినుము. విని, దయను చూపి, దుఃఖమును పోగొట్టి , సుఖమునిమ్ము (15).
నేను రుద్రుని మోహింపజేయుట కొరకై కాముని పంపితిని. హే విష్ణో! ఆతడు మారగణములతో, వసంతునితో, భార్యతో మరియు సహచరులతో గూడి వెళ్లెను (16).
వారు అనేక ఉపాయములను చేసిరి. కానిఅవి నిష్ఫలమయ్యెను. యోగి, సమదర్శి యగు శివునకు వ్యామోహము కలుగలేదు (17).
సర్వజుడు, శివతత్త్వమును బాగుగా నెరింగినవాడు అగు విష్ణువు నా మాటను విని, ఆశ్చర్యమును పొంది నాతో ఇట్లనెను (18).
విష్ణువు ఇట్లు పలికెను -
హే పితామహా! నీకు ఇట్టి ఆలోచన కలుగుటకు కారణమేమి? హేబ్రహ్మన్! నీవు మంచి బుద్ధితో సర్వమును ఆలోచించి నాకు సత్యమును చెప్పుము (19).
బ్రహ్మ ఇట్లు పలికెను -
తండ్రీ! ఆ చరిత్రను వినుము. నీ మాయ మోహింపజేయును. జగత్తంతయూ దానికి వశమై సుఖదుఃఖాదుల యందు లగ్నమై యున్నది (20).
ఆ మాయచే ప్రేరితుడనై నేను పాపము చేయనొడగట్టితిని. ఆ వృత్తాంతమును వినుము. హే దేవదేవా! నీ ఆజ్ఞచే చెప్పు చున్నాను (21).
సృష్ట్యాది యందు నాకు పది మంది దక్షుడు మొదలగు కుమారులు, ఒక కుమార్తె జన్మంచిరి. అతి సుందరియగు ఆమె నా వాక్కు నుండి జన్మించిరి (22).
వక్షస్థ్సలము నుండి ధర్ముడు, మనస్సు నుండి మన్మథుడు, ఇతరకుమారులు దేహమునుండి జన్మించిరి. హేహరే! ఆ కుమార్తెను చూచిన నాకు మోహము కలిగినది (23).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 . శ్రీ శివ మహా పురాణము - 244 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
55. అధ్యాయము - 10
🌻. బ్రహ్మకు జ్ఞనోదయమగుట - 2 🌻
నేను నీ మాయచే మోహితుడనై ఆమెను చెడుదృష్టితో చూచితిని. వెంటనే శివుడు వచ్చి నన్ను, మరియు నా కుమారులను నిందించెను. (24). హే నాథా! తాను పరమాత్మ, జ్ఞాని, యోగి, విషయలాలసత లేని జితేంద్రియుడు అని భావించే శివుడు అందరినీ ఉద్దేశించి ధిక్కారమును చేసెను (25).
హే హరీ! నాకుమారుడైన ఈ రుద్రుడు వీరందరి యెదుట నన్ను నిందించినాడని నాకు గొప్ప దుఃఖము కలిగినది. నేను నీ యెదుట సత్యమును చెప్పితిని (26). ఆయన వివాహమాడినచో నాకు దుఃఖము తొలగి సుఖము కలుగును. హే కేశవా! దీనికొరకై నేను నిన్ను శరణు జొచ్చితిని (27).
ఈ నా మాటను విని మధుసూదనుడు నవ్వి సృష్టికర్త, బ్రహ్మ అగు నాకు ఆనందమును కలిగించు వాడై, వెంటనే ఇట్లు పలికెను (28).
విష్ణువు ఇట్లు పలికెను -
హే బ్రహ్మన్ ! భ్రాంతులనన్నిటినీ తొలగించునది, వేద శాస్త్రములన్నింటి పరమార్థ సారము అగు నామాటను వినుము (29). హే బ్రహ్మన్! నీవీనాడు ఇంత పెద్ద మూర్ఖుడవు ఎట్లు కాగల్గితివి? వేద ప్రవర్తకుడవు, సర్వ జగత్తును సృష్టించినవాడవు అగు నీకు దుర్బుద్ధి ఎట్లు కలిగినది?(30).
ఓ తెలివతక్కువ వాడా! నీ జడత్వమును వీడుము. ఇట్టి ఆలోచనను చేయకుము. కొనియాడదగిన వేదములన్నియూ ఏ పరమాత్మతత్త్వమును బోధించుచున్నవో, దానిని సద్బుద్ధితో స్మరింపుము (31). ఓరీ దుష్టబుద్ధీ! పరమేశ్వరుడగు రుద్రుని నీ కుమారుడని తలపోయుచుంటివి. హేబ్రహ్మన్! నీవు వేద ప్రవర్తకుడవే అయిననూ, విజ్ఞానమునంతనూ మరచిపోయితివి (32).
శంకరుని దేవతలలో ఒకనిగా తలంచి నీవు ద్రోహమును చేయుచున్నావు. ఈనాడు నీకు మంచి బుద్ధి లుప్తమై, దుర్బుద్ధి పుట్టినది (33). ఈశ్వరతత్త్వమును గురించిన సిద్ధాంతమును వినుము. సద్బుద్ధిని కలిగియుండుము. వేదములలో ప్రతిపాదింపబడిన తీరులో వాస్తవమగు సృష్టికర్తను నిర్ణయించుకొనుము (34).
సర్వమును సృష్టించి, రక్షించి, హరించునది శివుడే. ఆయనయే పరాత్పరుడు, పరబ్రహ్మ, పరమేశ్వరుడు. ఆయన నిర్గుణుడు మరియు నిత్యుడు (35). వికారములు లేని శివుని ఇదమిత్థముగా నిర్దేశించలేము. ఆయన అద్వితీయ, అవినాశి, అనంత పరమాత్మ. ప్రలయకర్తయగు ప్రభువు. సర్వవ్యాపకుడగు పరమేశ్వరుడు ఆయనయే (36).
ఆప్రభువు రజస్సత్త్వ తమోగుణ ప్రధానుడై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అను పేర్లతో సృష్టిస్థితి లయములను చేయుచుండును (37). మాయను స్వవశములో నుంచుకునే ఆ మాయావి కంటె వేరుగా మాయ లేదు. ఆయన ఆప్తకాముడు.ఆయన సగుణుడే అయినా నిర్గుణుడు. ఆయన స్వతంత్రుడు, ఆనందఘనుడు (38).
ద్వంద్వములకు అతీతుడగు శివుడు తనయందు తాను రమించే జ్ఞాని. ఆయన భక్తులకు వశుడై, దివ్యమంగళ విగ్రమహమును ధరించియుండును. ఆ మహాయోగి నిత్యము యోగనిష్ఠుడుగా నుండి, భక్తులను యోగమార్గమున చూపును (39). ఆ లోక ప్రభువు దుష్టుల గర్వమునడంచును. ఆయన సర్వకాలములలో దీనులపై దయను చూపును. ఇట్టి ఆ స్వామిని నీవు నీ కుమారుడని భావించుచున్నావు (40).
నీవు ఈ దుష్ట భావనను వీడి, ఆయనను శరణు జొచ్చుము. సర్వ విధములుగా శంభుని భజించుము. ఆయన సంతసించి నీకు సుఖమును కలిగించగలడు (41).
హే బ్రహ్మన్! శంకరుడు భార్యను స్వీకరించవలెననే ఆలోచన నీ హృదయములో నున్నచో, ఉమను ఉద్దేశించి శివుని స్మరించుచూ మంచి తపస్సును చేయుము (42). నీవు హృదయములో మన్మథుని ఉద్దేశించి ఉమను ధ్యానించుము. ఆ దేవదేవి ప్రసన్నురాలైనచో, నీకోర్కెలనన్నిటినీ ఈడేర్చగలదు (43).
ఆ శివాదేవి సగుణయై అవతారమునెత్తి లోకములో మనుష్య దేహముతో ఎవరో ఒకరి గృహములో జన్మించినచో, నిశ్చయముగా శివునకు పత్ని కాగలదు (44). హే బ్రహ్మన్! శివుని కొరకు కన్యను కనుటకై దక్షుడు భక్తితో ప్రయత్న పూర్వకముగా తపస్సును చేయవలెను. కాన ఆతనిని ఆజ్ఞాపించుము (45).
వత్సా! పరబ్రహ్మ స్వరూపులగు ఆ ఉమాపరమేశ్వరులు భక్తసులభులు. వారి స్వరూపమును భక్తిచే తేలికగా తెలియవచ్చును. వారు తమ ఇచ్ఛతే సగుణ రూపమును స్వీకరించెదరు (46).
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఇట్లు పలికి విష్ణువు వెను వెంటనే తన ప్రభువగు శివుని స్మరించెను. ఆయన కృపచే ఆయన స్వరూపము నెరింగి తరువాత నాతో నిట్లనెను (47).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 . శ్రీ శివ మహా పురాణము - 245 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
55. అధ్యాయము - 10
🌻. బ్రహ్మకు జ్ఞనోదయమగుట - 3 🌻
విష్ణువు ఇట్లు పలికెను -
హే బ్రహ్మన్ ! మనమిద్దరము శంకరుని సంకల్పముచే జన్మించిన సమయములో ఆయనను మనము ప్రార్థించగా, మనలను ఉద్దేశించి ఆయన అపుడు చెప్పిన పలుకులను గుర్తుకు తెచ్చుకొనుము (48).
నీవా వృత్తాంతమునంతనూ మరచితివి. శాంభవీ పరాదేవి ధన్యురాలు. ఆమె చే జగత్తు సర్వము మోహింపబడినది. శివుడు తక్క ఇతరులు ఆమెను ఎరుంగజాలరు (49).
శివుడు తన ఇచ్ఛచే నిర్గుణ స్వరూపము నుండి సగుణుడై నన్ను సృష్టించి, ఆ తరువాత నిన్ను సృష్టించెను. ఆయన తన శక్తితో లీలలను సృష్టించును (50).
అపుడు శంభుప్రభువపు నిన్ను సృష్టిని చేయుమని ఆదేశించెను. హే బ్రహ్మన్! దాని పాలనను నాకు అప్ప జెప్పెను. నాశరహితుడు ఉమా సహితుడునగు శివుడే వాస్తవముగా జగత్కారణమగును (51).
అపుడు మనిమిద్దరము దోసిలి యొగ్గి, సాష్టాంగ ప్రణామమును చేసి, మనస్థానములకు వచ్చితిమి. సర్వేశ్వరుడవగు నీవు కూడా గుణ సంహితుడవై రూపమును స్వీకరించి అవతరించుము (52).
అని మనము కోరగా, కరుణామయుడు అనేక లీలలను సృష్టించుటలో నిపుణుడు అగు ఆ ప్రభువు నవ్వి, ఆకాశము కేసి చూచి మిక్కిలి ప్రీతితో నిట్లనెను (53).
హే విష్ణో! నా శ్రేష్ఠమగు రూపము, నన్ను పోలిన రూపము, బ్రహ్మదేహమునుండి ప్రకటమై లోకములో రుద్రుడను పేర కీర్తింపబడును (54).
ఆ రుద్రుడు నా పూర్ణావతారము. మీరు ఆయనను సర్వదా పూజించుడు. ఆయన మీ కోర్కెలనన్నిటినీ ఈడేర్చును. త్రిగుణసాక్షి, నిర్గుణుడు, గొప్ప యోగమునకు ప్రవర్తకుడునగు ఆ రుద్రుడు లయమును చేయగలడు (55).
ఈ త్రిమూర్తులు నాకుమారులు. వారు నా స్వరూపమే రుద్రుడు విశేషించి నా పూర్ణాంశ గలవాడు. ఉమాదేవికి కూడ మూడు రూపములు ఉండగలవు (56).
ఆమె లక్ష్మి అను పేరుతో విష్ణువునకు భార్య యగును. సరస్వతి అను పేరుతో బ్రహ్మకు పత్నియగును. ఆమె పూర్ణరూపముతో సతియను పేరుగలదై రుద్రునకు భార్య కాగలదు (57).
మహేశ్వరుడు దయతో ఇట్లు పలికి అంతర్ధానమయ్యెను. మనము మనకు అప్పిగించబడిన కార్యముల యందు నిమగ్నులమై సుఖముగా నుంటిమి (58).
హే బ్రహ్మన్! మనము కాలము వచ్చుటచే వివాహమాడితిమి. శంకరుడింకనూ వివాహమాడలేదు.ఆయన స్వయముగా రుద్రుడను పేర అవతరించి కైలాసము నాశ్రయించి ఉన్నాడు (59).
హే ప్రజాపతీ! ఉమాదేవి సతియను పేర అవతరించును. ఆమె పుట్టుట కొరకు ప్రయత్నమును చేయవలెను (60).
విష్ణువు ఇట్లు పలికి మిక్కిలి దయను చూపి అంతర్దానమాయెను. నేను మిక్కిలి అధికమైన ఆనందమును పొందితిని. నాలోని ఈర్ష్య తొలగి పోయెను (61).
శ్రీ శివ మహాపురాణములోని రెండవది యగు రుద్రసంహితయందురెండవది యగు సతీ ఖండములో బ్రహ్మ విష్ణు సంవాదము అనే పదియవ అధ్యాయము ముగిసినది (10).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[6:00 pm, 08/10/2020] On Sriram**: 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 130 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. నారద మహర్షి - 4 🌻
30. విష్ణువు యొక్క నాభికమలంలోంచి వచ్చినటువంటి బ్రహ్మ, విశ్వాన్ని సృష్టించమని తనకు విష్ణువుయొక్క ఆజ్ఞ అవటంచేత; “తాను ఏమి చేయాలి? సృష్టిని ఎక్కడ ప్రారంభించాలి?” అనే విచికిత్సచేసాడు.
31. ఈ ప్రశ్నలకు సమాధానం విష్ణువు ఆయనకు చెప్పలేదు. “నీ కర్తవ్యం నువ్వు నెరవేర్చుకో!” అని బ్రహ్మను చాలాదూరం పంపించివేసాడు. నాభికమలంలోంచి ఒక గొప్ప తేజస్సు శతకోటియోజనాల దూరం ఎక్కడికో వెళ్ళిపోయింది.
32. ఆ ప్రకారంగా విష్ణువుయొక్క నాభికమలంనుంచీ చాలాదూరం వెళ్లిపోయి, సుదూరంలో బ్రహ్మాండమయిన ఒక కమలం విస్తారితమై, అందులో తననుతాను చూచుకున్నాడు. అక్కడ తనొక్కడే ఉన్నాడు బ్రహ్మ. తనుతప్ప ఇంకొకరు లేరు. ‘నేనెవరిని?’ అని అడిగితే జవాబు చెప్పేవారెవరూ లేరు.
33. తానొక్కడే ఉన్నప్పుడు, …
[6:00 pm, 08/10/2020] On Sriram**: 🌹 Seeds Of Consciousness - 194 🌹
✍️ Nisargadatta Maharaj
Nisargadatta Gita
📚. Prasad Bharadwaj
🌻 42. Whatever you try to become that is not you, before even the words ‘I am’ were said, that is you. 🌻
Just look at this mad pursuit that you have been indulging in or have been conditioned to indulge in by the society: ‘I am so and so’, ‘I must become this’ or ‘I must become that’, ambition, status, name, fame and what not! It’s quite unnatural; you are trying to become what you are not.
You are even before you could say or feel the ‘I am’, this feeling ‘I am’ has appeared on your True state and is dependant, transient and false.
The identification of the ‘I am’ with the body has completely…
[6:00 pm, 08/10/2020] On Sriram**: 🌹. గీతోపనిషత్తు - 48 🌹
🍀 8. మోక్షము - బంధము - తన శ్రేయస్సు కన్న ఇతరుల శ్రేయస్సు మిన్నగ యుండడుటయే పవిత్రతకు కారణము. అదియే భగవానుని ఆదేశము 🍀
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. కర్మయోగము - 13 📚
కర్మానుష్ఠాన మార్గమున మలినముల నుండి విముక్తి చెందుటకు భగవానుడీ సూత్రము పలికినాడు. ఇతరులకు పెట్టి తాను తినువాడు పవిత్రుడగును. తనకు తాను తినువాడు అపవిత్రుడగును. ఇది సృష్టి ధర్మము.
*🌻 13. యజ్ఞశిష్టాశిన స్సన్తో ముచ్యంతే సర్వకిల్బిషైః |
భుంజతే తే త్వఘం పాపా యే పచంత్యాత్మ కారణాత్ || 13 🌻*
వ్యాపారము చేయువాడు తన సంస్థ యందలి సమస్త కార్యవర్గమునకు జీతభత్యములను ఏర్పరచి, ప్రభుత్వమునకు ఈయవలసినది, సంఘమునకు ఈయవలసినది ఇచ్చి, కుటుంబ సభ్యులకు కూడ అందించవలసినది అందించి, అటుపైన తననుగూర్చి భావించవలెను. అట్లు చేసినచో యజ్ఞమున మిగిలిన అవశిష్టమును భుజించినవాడగును. అందరి పరితృప్తి తరువాత తన తృప్తి.
అందుచేత అతని యందు తన శ్రేయస్సు కన్న ఇతరుల శ్రేయస్సు మిన్నగ యుండును. అదియే పవిత్రతకు కారణము. అదే విధముగ ఒక అధికారి, ఒక యజమాని తన ఆశ్రయములో (లేక పరిధిలో) నున్నవారి క్షేమమును నిర్వర్తించి అటు పైన తనను గూర్చి అలోచింపవలెను. ఇది ధర్మము.
అందరికన్న ముందుగ భోజనము చేయుట, అందరికన్న ముందుగ తాను పొందుట, ముందుగ అనుభవించుట మొదలగున వన్నియు అపవిత్రమగు కార్యములు. పోటీపడి ఇతరుల కన్న తాను ముందు పొందవలెనను భావనతో జీవించువాడు, మానసికముగ బంధితుడు. అతడు యావజ్జీవ బంధితుడే. ఈ విషయము తెలియక ఆధునిక యుగమున పోటీలు ఎక్కువ అయినవి. తత్కారణముగ అశాంతి ఎక్కువైనది.
తత్కారణముగ ఘర్షణలు, హత్యలు, మారణ హోమములు జరుగుచున్నవి. తోటి వారి శ్రేయస్సును గమనించని వాడు నరపశువేగాని నరుడు కాదు. నరపతి కాదలచినచో లోక హితమునకై పాటుపడవలెను గాని పశువువలె కుమ్ము లాడుచు, దౌర్జన్యముతో దోచుచు భోగించువాడు భయంకరముగ బంధింప బడును.
తెలిసి నిర్వర్తించిన వారికి కర్మలు మోక్ష కారణము. తెలియక నిర్వర్తించు వారికి కర్మలు బంధకారణము. మోక్షము పేరున మోహపడిన జీవులు ఎన్నో రకములుగ ఇతర ఉపాయముల నాలోచింతురు. కర్మ మార్గమున మోక్షము సులభమని తెలిసినవారు తమ వంతు కర్మను యజ్ఞార్థముగ నిర్వర్తింతురు.
ఒక మనిషి పవిత్రతకు, అపవిత్రతకు మూలకారణము అతని కర్మానుష్ఠాన విధానముననే యున్నది. కర్మను జీవ శ్రేయోదాయకముగ నిర్వర్తించిన పవిత్రుడగుచు అగ్నిహోత్రునివలె ప్రకాశించును. లేనిచో
అంధకారమున పడును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*ప్రపంచంలో గణేశ్ అసలు తల ఉన్న ఏకైక ఆలయం, దాని స్థానంలో ఏనుగుల తల ఉంది.
మానవ ముఖంతో వినాయకర్ కనిపించే ప్రపంచంలో ఉన్న ఏకైక ఆలయం ఆతి వినాయకర్ ఆలయం.
మిగతా ప్రపంచం అతన్ని ఏనుగు ముఖంతో చూస్తుంది.
ఈ ఆలయం పూమ్‌తోతం వద్ద ఉంది, తిరుచికి ఆగ్నేయంగా 4 గంటలు డ్రైవ్ చేసి పూంపుహార్ వైపు ఉంది.
వినాయకర్ మానవ ముఖంతో కనిపిస్తాడు, ఎందుకంటే అతన్ని చంపడానికి ముందు మరియు అతని తల ఏనుగు తలతో భర్తీ చేయబడింది.
ఇక్కడ అతన్ని నర్ముఖ వినాయకర్ అని పిలుస్తారు.*
--(())--
శబరిమలలో స్వామికి జరిగే నిత్య కైంకర్యాలు ఇవే !
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
హరిహరసుతుడు అయ్యప్పస్వామికి భక్తిశ్రద్ధలతో శాస్త్ర ప్రకారం నిర్వహించే పూజలు , అర్చనలు హైందవ సంప్రదాయానికి ప్రతీకలు. మండలం , మకరం , ఓణం సందర్భాల్లో సన్నిధానంలో ఘనంగా నిర్వహించే పూజాదికాలతో పాటూ పంప , ఎరుమేలిల్లోని ఉత్సవాలూ భక్తులకు కనువిందు చేస్తాయి. మండలం , మకర విలక్కు సందర్భాల్లో ఉదయం 7.30 గంటలకు నిర్వహించేది ఉషపూజ. ఈ పూజను మేల్‌సంతి నిర్వహిస్తారు. ఈ సందర్భంలోనే ‘ఉష పాయసాన్ని’ స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. మధ్యాహ్న సమయంలో తంత్రి ఆధ్వర్యంలో జరిగే పూజ ఉచపూజ. ఈ పూజలో ప్రత్యేకంగా తయారు చేసిన 25 కలశాలను ఉంచి , ఎలనైవేద్యం , ఆరవణ పాయసాలను స్వామివారికి నివేదిస్తారు. రాత్రిపూట అదాజ పూజను మేల్‌సంతి చేస్తారు. ఈ సమయంలో ఎలనైవేద్యం , అప్పంలను నైవేద్యంగా సమర్పిస్తారు.
సన్నిధానానికి దీక్షతీసుకున్న భక్తుల్ని చేర్చే పద్దెనిమిది మెట్లకు పడి పూజ చేస్తారు. మండలం , మకర విలక్కు సందర్భాల్లో భక్తుల రద్దీని బట్టి పూజను చేసేదీ లేనిదీ నిర్ణయిస్తారు. అయితే మలయాళ మాసాల్లో ఆలయాన్ని తెరిచిన ప్రతి సందర్భంలోనూ పడి పూజ చేస్తారు. ఈ పూజ తంత్రి ఆధ్వర్యంలో , మేల్‌సంతి సహకారంతో జరుగుతుంది. మకరజ్యోతి దర్శనం తర్వాత , ఆలయాన్ని మూసివేసే ముందు పడిపూజ నిర్వహిస్తుంటారు.
మండల పూజ సమయంలో పదిరోజులపాటు ‘ఉల్సవం’ పేరుతో ఓ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ముందు తంత్రి ఆధ్వర్యంలో ‘కొడిమరం’ అనే ఆచారం ప్రకారం ధ్వజస్తంభం దగ్గర జెండాను ఎగురవేస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలూ , అభిషేకాలూ ఉంటాయి. చివరి రోజున ఉత్సవమూర్తిని గజారోహణంపై ఊరేగించి , పంపకు తీసుకొస్తారు. అక్కడ పవిత్ర స్నానం చేయించి ‘ఆరాట్టు’ వేడుక జరుపుతారు. ఈ కార్యక్రమానికి మేల్‌శాంతి ఆధ్వర్యం వహిస్తారు.
మాలికాపురత్తమ్మ శబరిమల నుంచి శరంగుత్తి వరకూ గజారోహం ద్వారా సాగించే యాత్రే ఎజున్నెలిప్పు. అలంకరించిన ఏనుగు మీద అమ్మవారి ప్రతిమను ఉంచి , స్వామి సన్నిధి మీదుగా శరంగుత్తికి తోడ్కొనివస్తారు. అక్కడ కన్నెస్వాములు గుచ్చిన శరాలను చూసి వెనుదిరిగి పదునెట్టాంబడి మీదుగా మాలికాపురత్తమ్మ ఆలయానికి ఈ ఊరేగింపు సాగుతుంది. శరాలను చూసిన ఏనుగు విషణ్ణవదనంతో వెనక్కి వస్తుందని భక్తులు చెబుతారు.
మకర విలక్కు తర్వాత సన్నిధానాన్ని మూసే ముందు రోజు అమ్మవారి ఆలయంలో పందళరాజు నిర్వహించే కార్యక్రమమే గురుథి ఆ రోజు రాత్రంతా రాజు ఆలయంలోనే ఉంటారు. ఈ సందర్భంలో అక్కడ ఎవరికీ ప్రవేశం ఉండదు.
జ్యోతి దర్శనానికి ముందు రోజు పంపానది తీరంలో భారీ ఎత్తున జరిగే అన్నదాన కార్యక్రమమే పంప సద్య. ఇతిహాసాల ప్రకారం వేటకు వెళ్లిన అయ్యప్ప ఇక్కడే తన సన్నిహితులకు అన్నదానం చేశారనీ , దానికి సంబంధించిందే ఈ కార్యక్రమమనీ అంటారు. అనంతరం పంప విలక్కు పేరుతో దీపాలు వెలిగించిన ఓ పడవను నదిలో వదులుతారు.
ఎరుమేలిలోని వావర్ మసీదు దగ్గర ముస్లింలు చేసే వేడుక చందనకుడం. మకర విలక్కు సమయంలోనే ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అలంకరించిన ఏనుగుల మీద చందన కలశాలు ఉంచి మేళతాళాలతో మసీదుకు వచ్చి అయ్యప్ప స్నేహితుడైన వావర్‌కు నైవేద్యంగా ఇస్తారు.
అంబళ్‌పుజ - అలంగత్ పేటతుల్లాల్ : సందళ్‌పేట తరువాత అంబళ్‌పుజ , అలంగత్ అనే ప్రాంతాల ప్రజలు ఎరుమేలిలో భారీయెత్తున పేటతుల్లాల్ అనే వేడుకను జరుపుతారు. వీరంతా వావర్ దర్శనం చేసుకుని ఎరుమేలిలో స్నానం చేసే సమయంలో ఓ గరుడ పక్షి వచ్చి అక్కడ తిరుగుతుంది. వీటితోపాటు ఆలయం తెరిచిన సమయంలో నిత్యం సుప్రభాత సేవ , ఘృతాభిషేకాలు , చందనాభిషేకం , పుష్పాభిషేకం , కలశభిషేకం , భస్మాభిషేకం , గణపతి హోమం , హరిహరాసనం లాంటి ధార్మిక విధులను తప్పకుండా నిర్వర్తిస్తారు. #🙏మన సాంప్రదాయాలు #🥁స్వామియే శరణం అయ్యప్ప #
--(())--
[06:27, 26/08/2020] +91 95506 66184: *🌹. అద్భుత సృష్టి - 13 🌹
✍ రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌟. భూమి దురాక్రమణ తర్వాత మూడవ పరిధికి పడిపోయింది.12 ఉన్నత తలాలకు ఎదగగలిగిన ఈ భూమి 3వ పరిధి స్థాయికి పరిమితమైనందువల్ల మానవుల DNA 2 ప్రోగుల స్థాయికి పడిపోయింది. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం వరకు భూమి 12 తలాల స్థాయికి ఎదిగి ఉండినప్పుడు...72 జతల DNA (144Strands-12×12) గా ఉండేది.
💫. అట్లాంటియన్ నాగరికత సమయంలో అంతరిక్ష యుగ మార్పుల వల్ల చాలా సంవత్సరాలు మనం సిక్స్ డబుల్ స్ట్రాండ్ స్ట్రక్చర్ అయిన 12 స్ట్రాండ్స్ లో ఉండిపోయాం.
మిలియన్ సంవత్సరాలకు పూర్వం DNA 12 ప్రోగుల నుండి,2 ప్రోగులకు పడిపోయింది. ఆ సమయంలో DNA లో ఉన్న 128 కోడాన్స్.. 20 కోడాన్స్ కు తగ్గించబడ్డాయి. 384 లైట్ ఎన్ కోడెడ్ ఫిలమెంట్స్ నుండి 60 LEF కి తగ్గించబడ్డాయి.
💠 LEF ద్వారా షుగర్ పెయిర్ తయారు చేయబడతాయి (శక్తి వ్యవస్థ).
💠. 1 కోడాన్ =3 న్యూక్లియోటైడ్స్ కలిపితే ఒక కోడాన్ అవుతుంది (సమాచార వ్యవస్థ).
💠. మిలియన్ సంవత్సరాల నుండి ఇదే స్థితిలో నిలిచిపోయాం.
💠. 20 సంవత్సరాల నుండి DNA ను పునర్నిర్మాణం (లేదా) క్రియాశీలపరిచే సమాచారం - మూలం నుండి భూమిపైకి అత్యధికంగా అందుబాటులోకి వచ్చింది.
💠. సైన్స్ DNA గురించి 2 ప్రోగులు మాత్రమే యాక్టివేషన్ లో ఉందనీ.. మిగిలిన 10 ప్రోగులు "జంక్ DNA" గా నిద్రాణస్థితిలో ఉన్నాయనీ చెబుతుంది.
💫. స్పిరిచువల్ సైంటిస్టులు "నిద్రాణమై ఉన్న DNA లోనే మన ఆధ్యాత్మిక జ్ఞానం మరి అందులోని విశ్వ సమాచారం దాగి ఉంది" అని తేల్చి చెప్పారు. 'ఇది జంక్ DNA కాదు... స్పిరిచ్యువల్ DNA" అని వారు చెప్పడం జరిగింది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹*
[06:27, 26/08/2020] +91 99666 91450: శుభోదయం
గడిచిపోయిన నీ జీవితంలో కష్టాలను గుర్తు తెచ్టుకో!
నీవు ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాల తీయదనం రెట్టింపుగా కనిపిస్తుంది..
🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞
[06:27, 26/08/2020] +91 95506 66184: *🌹 12. ఆత్మ - ఆత్మ దర్శనమునకు నిర్దిష్టమైన సాధనా మార్గము కలదు. అదియే యోగవిద్య. 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 23, 24, 25, 📚
*ఆత్మతత్వము నెరిగిన వారికే ఆత్మను గూర్చి పూర్ణమైన అవగాహన యుండును. ఎరుగుట యనగా అనుభవ పూర్వకముగా నెరుగుట. బోధనా పూర్వకముగ కాదు. బోధనా పూర్వకముగ ఆత్మను గూర్చి తెలుపుట కేవలము సమాచారము
నందించుటయే.*
నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః |
న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతó || 23
అచ్ఛేద్యో-య మదాహ్యోయ మక్లేద్యో-శోష్య ఏవ చ |
నిత్య స్సర్వగత స్థా ్సణు రచలో-యం సనాతనó || 24
అవ్యక్తో-య మచింత్యో-య మవికార్యో-య ముచ్యతే |
తస్మా దేవం విదిత్వైనం నానుశోచితు మర›సి || 25
ఆత్మ దర్శనమునకు నిర్దిష్టమైన సాధనా మార్గము కలదు. అదియే యోగవిద్య. అట్టి యోగవిద్యను ప్రతిపాదించు ప్రపంచ గ్రంథంము భగవద్గీత యొక్కియే!
ఆత్మ స్వరూపుడైన శ్రీ కృష్ణ భగవానుడు రెండవ
అధ్యాయమున ఆత్మతత్త్వమును ప్రతిపాదించినాడు. అటుపైన
ఆత్మదర్శనము జరుగుటకు వలసిన సోపానము లేర్పరచినాడు.
ఆచరణ పూర్వకముగా భగవద్గీతను అందించటం జరిగింది.
అనుసరించుటయే సజ్జనుని కర్తవ్యము.
''ఆత్మ'' ఆయుధముచే ఛేదింపబడనిది. అగ్నిచే దహించబడనిది. నీటిచే తడప బడనిది. గాలిచే ఎండిప బడజాలదు. ఆత్మ నిత్యము. అంతా వ్యాపించి యున్నది. స్థిరమైనది. చలనము లేనిది. తుది, మొదలు లేనిది.
''ఆత్మ'' ఇంద్రియములకు గోచరము కాదు. మనస్సుచే చింతింప శక్యము కాదు. ఇట్లు ఆత్మను గూర్చి వివరించినపుడు పాఠకునకు అది సమాచారమే గాని, అనుభవపూర్వకము కాదు.
దానిని అనుభూతి చెందుటకే ''భగవద్గీత'' యను యోగ
శాస్త్రమును భగవానుడే జాతి కందించినాడు. ఆచరణమే దీనికి
ప్రధాన సూత్రము.
🌹 🌹 🌹 🌹 🌹*
[06:28, 26/08/2020] +91 95506 66184: *🌼🌿శ్రీ మాత్రే నమః🌼🌿కాపీ చేసుకోండి , సేవ్ చేసుకోండి లేదా షేర్ చేసుకోండి .
🌼🌿శ్రీ లలితా సహస్ర నామముల నుండి రోజుకు ఐదు శ్లోకాలు నేర్చుకుందాం 🌼🌿
దక్షిణా, దక్షిణారాధ్యా, దరస్మేర ముఖాంబుజా |
కౌళినీ కేవలా,உనర్ఘ్యా కైవల్య పదదాయినీ || 171 ||
* దక్షిణా దక్షిణారాధ్య - నేర్చుకున్న మరియు అజ్ఞానులచే ఆరాధించబడే ఆమె
* దరస్మేర ముఖాంబుజా - తామర వంటి నవ్వుతున్న ముఖం ఉన్న ఆమె పూర్తిగా వికసించింది
* కౌలినీ కేవలా - కౌలా మరియు కేవాలా పద్ధతుల మిశ్రమం
* అనర్గ్య కైవల్య పదదాయిని - ఆమె అపరిమితమైన స్వర్గపు పొట్టితనాన్ని ఇస్తుంది
స్తోత్రప్రియా, స్తుతిమతీ, శ్రుతిసంస్తుత వైభవా |
మనస్వినీ, మానవతీ, మహేశీ, మంగళాకృతిః || 172 ||
* స్తోత్ర ప్రియా - శ్లోకాలను ఇష్టపడే ఆమె
* స్తుతిమతి - ఆమె శ్లోకాలు పాడేవారికి వరం ఇచ్చేది
* శ్రుతిసంస్తుత వైభవా - వేదాలచే ఆరాధించబడే ఆమె
* మనస్విని - స్థిరమైన మనస్సు ఉన్న ఆమె
* మానవతి - పెద్ద హృదయం ఉన్న ఆమె
* మహేశీ - గొప్ప దేవత అయిన ఆమె
* మంగళా కృతి - మంచి మాత్రమే చేసే ఆమె
విశ్వమాతా, జగద్ధాత్రీ, విశాలాక్షీ, విరాగిణీ|
ప్రగల్భా, పరమోదారా, పరామోదా, మనోమయీ || 173 ||
* విశ్వ మాతా - విశ్వం యొక్క తల్లి
* జగద్ధాత్రి - ప్రపంచానికి మద్దతు ఇచ్చే ఆమె
* విశాలాక్షి - విశాలమైన కన్ను ఉన్న ఆమె
* విరాగిణి- త్యజించిన ఆమె
* ప్రగల్భా - ధైర్యవంతురాలు
* పరమోదారా - గొప్ప ఇచ్చేవాడు
* పరమోదా - గొప్ప ఆనందం ఉన్న ఆమె
* మనోమయిా- మనస్సుతో ఉన్న ఆమె
వ్యోమకేశీ, విమానస్థా, వజ్రిణీ, వామకేశ్వరీ |
పంచయఙ్ఞప్రియా, పంచప్రేత మంచాధిశాయినీ || 174 ||
* వ్యోమకేశి - శివుడి భార్య అయిన ఆమె జుట్టుకు ఆకాశం ఉంది
* విమానస్థా - అగ్రస్థానంలో ఉన్న ఆమె
* వజ్రిణి- ఇంద్రుడి భార్యను ఒక భాగంగా కలిగి ఉన్న ఆమె
* వామకేశ్వరీ - ఎడమ మార్గాన్ని అనుసరించే ప్రజల దేవత
* పంచ యజ్ఞ ప్రియా - ఐదు త్యాగాలను ఇష్టపడే ఆమె
* పంచప్రేత మంచాధిశాయిని - ఐదు శవాలతో చేసిన మంచం మీద నిద్రిస్తున్న ఆమె
పంచమీ, పంచభూతేశీ, పంచ సంఖ్యోపచారిణీ |
శాశ్వతీ, శాశ్వతైశ్వర్యా, శర్మదా, శంభుమోహినీ || 175 ||
* పంచమి - సదాశివ భార్య అయిన ఆమె - పంచ బ్రహ్మాలలో ఐదవది
* పంచ భూతేశి - "భూమి, ఆకాశం, అగ్ని, గాలి, మరియు నీరు, పంచ భూతాలకు అధిపతి అయిన ఆమె."
*పంచ సంఖ్యోపచారిణీ- ఐదు ఉపచారములు ఇష్టపడే ఆమె
* శాశ్వతి- శాశ్వత ఆమె
* శాస్వతైశ్వర్య - శాశ్వత సంపదను ఇచ్చేది
* శర్మదా - ఆనందం ఇచ్చే ఆమె
* శంభుమోహిని - శివుడిని మంత్రముగ్ధులను చేసేది
🌼🌿శ్రీ మాత్రే నమః🌼🌿*
--(())--
ధర్మ సూత్రాలు
1. వాల్మీకి శ్రీరామ పట్టభిషేకానంతరం రామాయణ రచన చేశాడు. ముందుగా ఊహించి వ్రాసినది కాదు.
2. వినాశ కాలం వచ్చిన వారు వివేకమును కోల్పోయి ధర్మ విరుద్ధమైన పనులు చేసి నశిస్తారు.
3. ఎవరి పాప కర్మలకు వారే బాధ్యులు. కానీ, పాపంలో భాగం కూడా పిల్లలకు రావటం తప్పదు.
4. రావణుడు, ఆంజనేయుడు నవ వ్యాకరణాలు చదివిన సర్వ శాస్త్రవేత్తలు.
5. పరమార్థం తెలియనిదే జీవితానికి ప్రయోజనం లేదు.
6. వ్యాసమహర్షి మహాభారతాన్ని కురుక్షేత్రము అయిన తరువాత చాలాకాలం కి వ్రాసిరి.
7. కైవల్య ముక్తి అంటే మోక్షమే. జీవన్ముక్తి అంటే జీవించి ఉండగనే ముక్తుడై యుండడం. జీవన్ముక్తికి ప్రారబ్దము నశించగా, విదేహ ముక్తుడవుతాడు.
8. భగవత్కథలు ఎప్పుడూ మిధ్యలు కావు. ఇది పెద్దలమాట.
9. పున్నామ నరకం నుంచి రక్షించే వాడే పుత్రుడు.
10. నవగ్రహ స్తోత్ర పఠనం వల్ల నవగ్రహాలు ప్రసన్నములై శుభ ఫలాన్ని యిస్తాయి.
11. ఇతరులకు అపకారం చేసి, ఇతరుల బాధల వల్ల సంతోషము పొందే దుర్మార్గుడిని ఖలుడు అంటారు.
12. జమ్మి చాల పవిత్రమైన చెట్టు. అగ్ని స్వరూపము.
13. బ్రహ్మకపాలం లో పిండ ప్రదానం చాల మంచిపని. అంత మాత్రం చేత తద్దినాలు ఎగ్గొట్ట కూడదు. శరీరం ఉన్నంత వరకు పితృ దేవతలకు తద్దినం పెట్టుట శాస్త్రీయ ధర్మము.
14. ఇతరుల ఐశ్వర్యాన్ని చూసి ఎప్పుడూ దుఃఖపడకూడదని, సత్పురుషులను, ద్వేషించకూడదని, స్త్రీలను పరాభవించ కూడదని, పరద్రవ్యాన్ని అన్యాయంగా అపహరించ కూడదని, మహాభారతం ద్వారా గ్రహించిన నీతి.
15. భగవంతుని త్రికరణ శుద్ధిగా పరమోత్తమ భక్తితో ఆశ్రయించిన భక్తులకు దేహాభిమానము గానీ, అహంకారము గానీ ఏమాత్రము వుండకూడదు.
16. పూర్వ కర్మను బట్టి ఇప్పటి జీవితంలో సుఖదుఃఖాలు సంప్రాప్త మౌతాయి.
17. దేవాలయల్లో ధ్వజస్థంభాలు పవిత్రమైనా, కాపురాలుండే ఇళ్ళ పైన వాటి నీడ పడడం శాస్త్ర విరుద్ధం.
18. అశ్వథామ, బలి చక్రవర్తి, వ్యాస మహర్షి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, ఈ ఏడుగురు చిరంజీవులు.
19. గురువునకు, దైవమునకు ఎప్పుడూ వంగి నమస్కారం పెట్టగూడదు. సాష్టాంగం గానే పెట్టాలి.
20. శివాలయానికి ఎదురుగా ఇల్లు కట్టగూడదు.
21. జగమెరిగిన వాడు అంటే తత్త్వవేత్త అన్నమాట. అతనికి దేహాభిమానం లేదు.
22. రాధ గోకులము నందు పరాశక్తి. శ్రీకృష్ణుడు పరమాత్మ. శక్తి, శక్తిమంతుల అభిన్నమైన ప్రేమ, భక్తులకు ఆదర్శం.
23. గాయత్రీ మంత్రం జపమాలతో చేసిన ఉత్తమము. విశేష ఫలం.
24. గాంధారి గర్భవతి గా వున్నప్పుడు, సేవ చేసిన మరొక స్త్రీకి కలిగిన ధృతరాష్ట్రుని కుమారుడు యుయుత్సువుడు.
25. విష్ణుమూర్తికి ఇద్దరు కుమారులు, బ్రహ్మ మరియు మన్మథుడు.
26. భక్తి వల్ల జ్ఞానము, రక్తి వల్ల అజ్ఞానము కలుగును.
27. కృతయుగము నందు తప్పస్సు, త్రేతాయుగము నందు జ్ఞానము, ద్వాపరయుగము నందు యజ్ఞము, విశేష ప్రాముఖ్యమును పొందియున్నవి. కలియుగమున దానము చేయుటయే ముఖ్య కర్తవ్యము.
28. ఏకాదశి వ్రత ఉపవాసమునకు దశమి నాటి రాత్రి భోజనం చేయకూడదు. ఏకాదశి పూర్తి ఉపవాసం.
ద్వాదశి ఘడియలు ఉండగానే భుజించుట సంప్రదాయం. దీనినే విష్ణువాసం అంటారు.
29. శివుడు అభిషేక ప్రియుడు కావున లింగరూప అభిషేకమే ఆయనకు ప్రియం.
30. మానవ జన్మకు జ్ఞానం విశేషం.
🙏సర్వే జనా సుఖినోభవంతు
💫 భక్తునికి మహర్షికి జరిగిన సంభాషణ ⚜️
ఒక భక్తుడు దైవం కోసం అన్వేషణ చేస్తూ ప్రపంచం అంతా తిరిగాడు. అలా తిరుగుతూ తిరుగుతూ ఎందరినో ఎన్నో సందేహాలు అడిగాడు. కానీ మనస్సుకి వారి సమాధానాలు రుచించలేదు. ఇలా ఉండగా ఒకనాడు ఒక మహర్షి ఇతడికి తారసపడ్డాడు. అప్పుడు ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇది..
⚜️ స్వామి పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు ? ఎలా ఉంటాడు ? అని అడిగాడు.
💫 అప్పుడు మహర్షి చిరునవ్వు నవ్వుతూ.. నీ సందేహం త్వరలోనే తీరుతుంది నాయన.. అంటూ ఒక మహా వృక్షం చూపించి అది ఏమిటి నాయన అన్నాడు.
⚜️ అది వృక్షం.
💫 ఓహో వృక్షమా ! ఎలా వచ్చింది ?
⚜️ విత్తనం ద్వారా వచ్చింది స్వామి.
💫 సరే అక్కడ పలుగు ఉంది. తీసుకొని ఆ చెట్టు పునాది త్రవ్వు అన్నాడు.
⚜️ ఎందుకు స్వామి ? మహావృక్షం కదా ! త్రవ్వితే చచ్చిపోతుంది.
💫 చచ్చిపోతుంది కాని ఆ విత్తనం ఎలా ఉందో చూడాలని ఉంది !
⚜️ అయ్యో స్వామి ! అదెలా సాధ్యం అవుతుంది ?
💫 విత్తనం నుండి చెట్టు వస్తుంది అన్నావు. విత్తనం చూడలేమా ?
⚜️ విత్తనమే చెట్టు. చెట్టుకి విత్తనానికి తేడా లేదు. విత్తనం ప్రత్యేకంగా ఉండదు కదా !
💫 ఇదే నాయన నీ సందేహానికి సమాధానం.
⚜️ అదెలా స్వామి ?
💫 విత్తనం అనేది పరమాత్మ ఆ పరమాత్మే వృక్షం. అనగా సృష్టి. సృష్టి వేరు పరమాత్మ వేరు కాదు. ప్రతి అణువులో పరమాత్మ ఉన్నాడు. సృష్టి నుండి పరమాత్మని వేరు చేసి చూడలేము.
⚜️ మరి విగ్రహారాధన ఎందుకు స్వామి ?
💫 పరమాత్మని తెలుసుకోవాలి అంటే సాధకుడికి ఒక ఆకారం కావాలి. సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నాడు కనుక ధ్యానం చేయమంటే ఎలా చేస్తాడు ? ఏమి అర్థం కాదు. అదే ఆ పరమాత్ముడికి ఒక రూపం, ఒక వర్ణన కల్పితే సాధకుడు ఆ ఆకారాన్ని, ఆ వర్ణనని తన ధ్యానంలో చూస్తాడు. ధ్యానం నిలబడుతుంది. అంతేతప్ప శూన్యంలోకి చూస్తూ ధ్యానం చేస్తే సాధకుడికి చీకటి తప్ప ఏమి అర్థం కాదు. అందుకే పూర్వం మహర్షులు వేదాన్ని ఆధారంగా చేసుకొని వేదం వర్ణించిన విధంగా పరమాత్మకి ఒక రూపం కల్పించి సృష్టిలో ఉన్న పరమాత్మ శక్తిని ఆ విగ్రహంలో నిక్షిప్తం చేశారు. కొన్ని చోట్ల ఆయనే స్వయంభువై వెలిసి భక్తులను అనిగ్రహించాడు. అంతేతప్ప ప్రత్యేకంగా అంటూ పరమాత్ముడు ఎక్కడా లేడు. సృష్టిలో ఉన్న ప్రతి అణువులో ఉన్నాడు.
💫 సాధకులను ఉద్దరించే నిమిత్తం విగ్రహారాధన ఏర్పాటు చేయబడింది. భగవంతుడు నీలో ఉన్నాడు. నాలో ఉన్నాడు. ప్రకృతిలో ఉన్నాడు అంటే సామాన్య భక్తుడు భగవంతుడిని దర్శించలేడు. సాధ్యం కాదు. అందుకే రూపం, దానికి దీపం ధూపం, నైవేద్యం, నివేదన, పుష్పాలంకరణ ఇలా అనేక సేవలు ఏర్పాటు చేసి భగవంతుడి దగ్గరికి భక్తుడిని, సామాన్య సాధకులని తీసుకెళ్ళే మార్గం చూపారు తప్ప విగ్రహమే దైవం కాదు. అది ఒక మార్గం. దాని నుండి ముందుకి వెళ్ళాలి అంతేతప్ప విగ్రహారాధన దగ్గరే ఆగితే భగవంతుడిని ఎన్నటికి తెలుసుకోవడం సాధ్యం కాదు !
⚜️ స్వామి ! భగవంతుడి ఆస్తులు భగవంతుడే రక్షించుకోలేకపోతే భక్తులని ఏమి రక్షిస్తాడు ?
💫 భగవంతుడు నాకు ఇది కావాలని ఎప్పుడు అడగలేదు. ఒకడు విగ్రహం పెట్టుకున్నాడు. మరొకడు గుడి కట్టాడు. మరొకడు తన దగ్గర ఉన్న డబ్బుతో వజ్రాలు కూర్చిన నగలు చేయించి దర్జాగా వచ్చి అలంకరించాడు. మరొకడు దొడ్డిదారిలో వచ్చి తీసుకెళ్ళాడు. భగవంతుడిని ప్రతిష్టించడం దగ్గర నుండి అలంకరిచడం వరకు అన్ని చేసిన మనమే వాటిని కాపాడు కోవాలి కాని భగవంతుడి మీద నిందలు వేస్తె మనకే అపచారం. పరమాత్ముడికి మట్టిగడ్డ అయినా వజ్రమైన తేడా లేదు. ఎందుకంటే రెండిటిలో ఉంది తనే కనుక.. నగలు పెట్టినవాడిలో ఉన్నాడు. దోచుకెళ్ళినవాడిలోనూ ఉన్నాడు. తన భక్తులని ఎవరైనా బాధలకు గురి చేస్తే తప్ప మిగిలినవి ఏమి పరమాత్మ పట్టించుకోడు !
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂
మధురాంతేశ్వర సిద్ధి వినాయక ఆలయం, మధూరు .
కాణిపాకం వినాయకుడి గురించి తెలుసు..కానీ అలాగే రోజు రోజుకూ పెరిగే గణేశుడు ఎక్కడ వున్నాడో తెలుసా..
జగన్మాత కుమారుడైన విఘ్నేశ్వరుడి విశిష్ట ఆలయాల్లో కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలోని మధూరు మధురాంతేశ్వర సిద్ది వినాయక ఆలయం ఒకటి.
మధురవాహినీ నదీతీరంలో ప్రకృతి రమణీయత మధ్య కొలువు దీరిన ఆ విఘ్నరాజు దర్శనానికి దేశం నలుమూలల నుంచీ భక్తులు బారులు తీరతారు.
మధూరు ఆలయంలో ప్రధాన దైవం పరమశివుడు. ఇక్కడ కొలువైన వినాయకుడు మధురాంతేశ్వర స్వామిగా పూజలందు కుంటాడు. గర్భగుడిలో ఆ గజముఖుడి పక్కనే జగన్మాత పార్వతీదేవి కూడా కొలువై కుమారుడితో
సమానంగా నిత్యపూజలూ అభిషేకాలూ అందుకుంటుంది.
అలానే ఆలయ ప్రాంగణంలో దుర్గాదేవి, వీరభద్రుడితోపాటు గణపతి సోదరులైన అయ్యప్ప, సుబ్రమణ్య స్వామి కూడా కొలువు దీరి ఉన్నారు
మధుర్ మహాగణపతి ఆలయం మిగతా ఆలయాలకంటే భిన్నంగా కనిపిస్తుంది. మూడు చుట్టలుగా ఉన్న ప్రాకారాల రూపంలో ఇది ఉంటుంది. ఏనుగు వెనుక భాగంలాగా కనిపించే ఇలాంటి నిర్మాణాలని ‘గజప్రిస్త’ గోపురాలని అంటారు. ఆలయంలోని చెక్క మీద రామాయణ, మహాభారత ఘట్టాలని తలపించే శిల్పాలని చెక్కడం చూడవచ్చు.
ఈ ఆలయానికి ముందు భాగంలో నదీ, మిగతా మూడు వైపులా కొబ్బరి తోటలూ, వరి పొలాలూ... ఉండి పచ్చదనంతో కళకళలాడుతూ దర్శనమిస్తాయి.
స్థల పురాణం ...
ఒకానొకప్పుడు మధురవాహినీ నదీతీరంలో మధూరు అనే మహిళ నీటికోసం వెళ్లినప్పుడు గణపతి ఆమె ఎదుట సాక్షాత్కారించి విగ్రహంగా మారిపోతాడు. వెంటనే ఆ విషయాన్ని గ్రామస్తులకు తెలియ జేసి వారి సాయంతో ఆ ఉద్భవమూర్తిని నది ఒడ్డునే ఉన్న శివాలయంలోకి చేర్చు తుంది మధూరు. అందుకనే ఆమె పేరు పైనే మధూరు ఆలయంగా ప్రసిద్ది చెందింది.
అలానే ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలని టిప్పు సుల్తాన్ దండెత్తి వస్తాడు. ఆ సమయంలో ఆలయ ప్రాంగణంలోని బావి
నీళ్లను తాగిన తరవాత మనసు మార్చుకుని దాడిని విరమించుకుని... స్వామిని భక్తితో కొలిచి అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు స్థల పురాణం చెబుతోంది.
బ్రహ్మాండపురాణంలో సాక్షాత్తూ భార్గవ రాముడే ఈ గుడిని నిర్మించి
వినాయకుడికి పూజలు జరిపించినట్టుగా ఉంది. అయితే 10వ, 15వ శతాబ్దాల్లో ఈ గుడిని పునర్నిర్మించినట్టూ, పలువురు రాజవంశీయులు ఈ గుడికి ధర్మకర్తలుగా ఉన్నట్టూ చరిత్ర ఆధారాలు కూడా ఉన్నాయి.
కేరళ సంప్రదాయ వంటకమైన అప్పాన్నే ఇక్కడ మహాగణపతికి నైవేద్యంగా పెడతారు. అదే భక్తులకు ప్రసాదంగానూ ఇస్తారు. ప్రతిరోజూ ఉదయాస్తమాన సేవలను ఘనంగా నిర్వహిస్తారు. సహస్ర అప్ప పూజలో భాగంగా వెయ్యి
అప్పాలతో ప్రతిరోజూ పూజలు జరిపించడం విశేషం. మూడ అప్పం పేరుతో మరో పూజా కార్యక్రమం కూడా జరుపుతారు.
అందులో
భాగంగా స్వామి వారికి ఏ అలంకారం లేకుండా విగ్రహాన్ని అప్పాలతో కప్పేసి పూజాదికాలు నిర్వహిస్తారు. ఆ దృశ్యం కన్నుల పండువగా ఉంటుంది.
వినాయక చవితికి ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
🍁🍁🍁
[10:04, 26/08/2020] +91 94935 83582: 🌹తెలిసికొనదగిన విషయాలు!🌹
1. గడప ఇవతల నుంచి భిక్షం వేయకూడదు.
2. ఎంత అవసరమైన కర్పూరాన్ని ఎండాకాలంలో దానమివ్వకూడదు.
3. మీ శ్రీమతితో చెప్పకుండా ఇంటికి భోజనానికి ఎవర్ని పిలవకూడదు.
4. శుభానికి వెళ్తున్నప్పుడు స్రీలు ముందుండాలి. అశుభానికి స్రీలు వెనక వుండాలి.
5. ఉదయం పూట చేసే దానకార్యాలు ఏవైనా సరే ఎక్కువ ఫలన్నిస్తాయి .
6. అమంగళాలు కోపంలోను , ఆవేశంలోను ఉచ్చారించకూడదు. తదాస్తు దేవతలు ఆ పరిసరాల్లో సంచరిస్తూ వుంటారు.
7. పెరుగును చేతితో చితికి మజ్జిగ చేసే ప్రయత్నం ఎన్నడు చేయకూడదు.
8. పిల్లి ఎదురొస్తే కొన్ని నిముషాలు ఆగి బయలుదేరాలి.కుక్క ఎదురొస్తే నిరభ్యంతరంగా ముందుకు సాగాలి.
9. చూపుడు వేలితో బొట్టు పెట్టుకోరాదు.
10. పగలు ధనాన్ని సంపాదించాలి. రాత్రి విశ్రాంతి తీసుకోవాలి.
అన్నం పరబ్రహ్మ స్వరూపం ప
అనేక రకాల పోషకాలు ఈ అరటిఆకులో ఉన్నందున మంచి రుచిని కలిగిస్తాయి ,మరియు పర్యావరణానికి విఘాతం కలుగకుండా తేలికగా మట్టిలో కలిసిపోతాయి
అందుకే ఇంటికి వచ్చిన అతిధుల కు అరిటాకులో భోజనం పెడతారు.
అరటి ఆకులో విస్తరి ఆకులో భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది,ఆరోగ్యవంతులుగా ఉంటారు.
తామరాకులో భోజనం చేయడo వలన ఐశ్వర్యం కలిగి సాష్టాత్ లక్ష్మీ దేవి కటాక్షo కలుగుతుంది.
బాదాం ఆకులో భోజనంచేయడంవలన కఠిన హృదయులవుతారు.
టేకు ఆకులో భోజనం చేయడం వలన భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోగలిగే జ్ఞానం వస్తుంది.
జమ్మి ఆకు విస్తరిలో భోజనం చేస్తే లోకాన్ని జయించే శక్తి సంపాదించవచ్చునని తపఃసంపన్నులు జ్ఞానులు చెబుతారు.
1) ధర్మ శాస్త్రం ప్రకారం ..మన ఇంట్లో మీకు పని వత్తిడులవల్ల వస్తున్నాను ఆగమని చెప్పి .... అన్నీ వడ్డించిన విస్తరి/పళ్లెం ముందు కూర్చోరాదు,మనం కూర్చున్నతరువాతే అన్నీ వడ్డించుకుని భుజించాలి...
ఎందుకంటే అన్నం కోసం మనం ఎదురుచూడాలి తప్ప మనకోసం అన్నం ఎదురుచూడరాదు ..అలా చేస్తే రానున్నకాలంలో దరిద్రం అంటే అవకాశం ఎక్కువ.
2) తూర్పునకు ముఖం పెట్టి భోజనం చేయడం ఎక్కువ ప్రాముఖ్యం ఉంది, ఎందుకనగా .... దీర్గాయుష్షు వస్తుంది
తూర్పు దిక్కు ఇంద్రునికి ఆధిపత్యస్థానము ,సూర్యునికి నివాస స్థానం ఉండటం వలన ప్రాధాన్యమెక్కువ.
పడమర ముఖంగా కూర్చుంటే ... బలం వస్తుంది
ఉత్తర ముఖంగా కూర్చుంటే ..... సంపద వస్తుంది
దక్షిణ ముఖంగా కూర్చుంటే .... కీర్తి వస్తుంది
అన్నము తింటున్నప్పుడు అన్నమును మరియు ఆ అన్నము పెట్టువారిని తిట్టట,దుర్భాష లాడుట చేయరాదు.
ఏడుస్తూ తింటూ ,గిన్నె / ఆకు మొత్తం ఊడ్చుకొని తినడం పనికిరాదు,దెప్పి పొడువరాదు.
ఎట్టిపరిస్థితిలో నైనా ఒడిలో కంచెం పళ్ళెము పెట్టుకుని అన్నం తినరాదు,ఇది చాలా దరిద్రము,అట్టివారికి నరకము ప్రాప్తించును.
భోజనసమయంలో నవ్వులాట,తగువులాట,తిట్టుకొనుట,గేలిచేయుట నష్టదాయకం
భోజనానంతరము ఎంగిలి ఆకులు / కంచాలు ఎత్తేవాడికి వచ్చే పుణ్యం,అన్నదాతకు కూడారాదు.
[10:04, 26/08/2020] +91 94935 83582: రాధ ఎవరు.? Part-A
రాధ ఎవరు? పశ్చిమ సముద్రతీరములోని ద్వారక రాధికా క్షేత్రమే. ద్వారకలోని పరాశక్తి అంశ రాధ. దాక్షాయణి హృదయము అక్కడ ఉంది. కృష్ణావతారసమయములో ఆమె మానవస్త్రీగా జన్మించినప్పుడు ఆమెలో గోలోక జ్ఞానము ఉన్నది. ఆమె లోకాతీతజ్ఞానముతో పుట్టినది. కృష్ణుడు ఆరాధించినది ఆ పరాశక్తి రూపమైన రాధనే. ఆమె మానవ స్త్రీ గావచ్చి ఆయనతో సాహచర్యము చేసి వెళ్ళినది. ఆమె జ్ఞానాంశ. కృష్ణునితో అభేదము కలిగియున్నది. ఈ ద్వారకా నాథుడు కూడా పరశివ తత్త్వము. కృష్ణుడు ప్రభాస తీర్థములోని సోమనాథుని ఆరాధించాడు. ఆ సమీపములోనే ఆయన మహాపరి నిర్వాణము కూడా జరిగినది. ఆయన లోని విష్ణుతత్త్వము అవతార సమాప్తి కాగానే వైకుంఠమునకు వెడలిపోయినది. శివతత్త్వమే మిగిలిఉన్నది. కృష్ణుడు భూమి మీద అవతరించక ముందే భూలోకములో ఆయనకై వేచియున్న పరాశక్తి రాధ.
బ్రహ్మ వస్తువు రూపగుణములులేని నిత్య సత్యము. జగత్తు నిత్యమూకాదు, సత్యమూ కాదు. దీని నిర్మాణమునకు ఆ నిర్గుణబ్రహ్మమునుండి పుట్టి అందులోనే లయమయ్యే రెండు తత్త్వములు కారణము. అవి పురుష స్త్రీ తత్త్వములు. మనమున్న 14 లోకముల బ్రహ్మాండ సృష్టికి మహావిష్ణువు అనే పురుషతత్త్వము, బ్రహ్మ, రుద్రుడు అనే మరిరెండు పురుష రూపములు, లక్ష్మి, సరస్వతి, పార్వతి అనే స్త్రీ తత్త్వములు కారణము. ఈ సృష్టిలోని జీవులు ఈ త్రిమూర్తులను ఆరాధించి వరములు పొందుతారు. ఈ లోకములు కాక బ్రహ్మాండమందు గోలోకమనే లోకము ఉన్నది. ఈ లోకములో జీవులు నిత్యులు, ఆనంద స్వరూపులు. ఈ లోక పాలకులు రాధాకృష్ణులు.శుద్ధ ఆనందమైన బ్రహ్మ స్వరూపులు. ద్వాపరాంతమందు వీరే భూమియందు అవతరించినారు. వారి ఉపాసన వలన సర్వ కర్మాతీతమై ఏ కర్మఫలమూ కానటువంటి ఒకానొక ఆనందము మనకు లభిస్తుంది.
దేవీభాగవతం రాధాదేవి ఉపాసనను వివరిస్తుంది. గోలోకంలో రాధాకృష్ణులను దేవతలందరూ అర్చించారు. సరస్వతి, బ్రహ్మ, శివుడు, లక్ష్మి, దుర్గ, మొదలైన వారందరూ దుర్గా మహోత్సవం జరిపినట్లు, పురాణ కథనం. బ్రహ్మకోరిక మేరకు శివుడు గానం చేయగా, ఆ గానరసంలో రాధాకృష్ణులు కరగి జలమై ప్రవహించారట. ఆ విధముగా గంగయే రాధ. శివుడు తిరిగి స్తుతించిన తరువాత రాధాకృష్ణుల దర్శనం అందరికీ లభించింది. ఈ గంగ భూలోకంలోని రాసమండలంలో ఉద్భవించినదనికూడా చెబుతారు. రాసమండలమంటే శ్రీకృష్ణుడు రాసలీల నిర్వహించిన వర్తులాకార స్థలము. దీని అంతరార్థము రాధాకృష్ణులు కేవలము రసమయ స్వరూపులు. వారి రస తత్త్వము అనురాగ జన్యమైన ఆనందము. భూమిపై అవతరించిన శ్రీకృష్ణుడు రాధయందు గోపికల యందు మానవాతీతమైన అనురాగమును కలిగించినాడు.
శ్రీకృష్ణుడు తన భార్యలందరినీ సమముగా ప్రేమించినాడు. అందులో ఆశ్చర్యమేమున్నది? అతడు సమస్త ప్రాణికోటినీ సమానముగా ప్రేమిస్తున్నాడు. ఒక సారి కృష్ణుని భార్యలైన మిత్రవింద, కాళింది అనేవారికి ఆయన ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడు? అనే సందేహము వచ్చింది. శ్రీకృష్ణుడంటే ఎక్కువ భక్తి కలిగినది రుక్మిణి అని ఎక్కువ ప్రేమ కలిగినది సత్యభామ అనీ వారి అనుమానము. వారినే వాళ్ళు అడిగారు. సత్య సమాధానం "భక్తి, ప్రేమలలో ప్రేమ ప్రధానం. అందరు భార్యలకంటె నేనే ఆయనకు ఇష్టము" అని ఆమె అన్నదట. రుక్మిణి ఇలాచెప్పినది. "ఆయనకు సమస్త జీవరాసులపై సమానమైన ప్రేమ.అట్టివారిలో నేనొకతెను." శ్రీకృష్ణుడు దక్షిణ నాయకుడు, భార్యలందరిపై సమాన ప్రేమ కలవాడు. సత్యభామ, రుక్మిణీ, రాధ వీరి ప్రేమలలో తేడా ఏమిటి? సత్యభామది భూతత్త్వము. ఆమె నిరంతరం ఆయన భౌతిక సాన్నిహిత్యము కోరుతుంది. ఇది తామసిక ప్రేమ. రుక్మిణి అతడు తనవద్దకు వచ్చినప్పుడు పూజిస్తుంది. అతడు దగ్గరలేనప్పుడు హృదయమందు ధ్యానిస్తుంది. ఇది రాజసిక ప్రేమ. రాధ ఎప్పుడూ కృష్ణుని సన్నిధిలోనే ఉన్నట్లు భావించుకుంటుంది. అతడు సన్నిహితముగా లేని భావనయే ఆమెకు ఉండదు. ఆమెది సాత్త్విక ప్రేమ. రాధాకృష్ణుల తత్త్వము అర్ధనారీశ్వర తత్త్వమే. ఒక నాణెమునకు కృష్ణుడు ఒకవైపు, రాధ మరియొకవైపు. వారు సనాతనులు.
రాధ అంటే ఎవరు !! Part-B
ఒకరు ప్రియురాలు అని... మరికొందరు
కృష్ణుని బంధవులు అని... వేరొకరు కన్నయ్యకు అత్త అని..
ఏవేవో ఉహాలు ...కానీ....
ఒక్క ధ్యాని సాధకుడు యోగి మాత్రమే కృష్ణ తత్వాన్ని గ్రహించ గలుగుతాడు .
ధ్యాన స్దితిలో సాధకుడుగా సత్యం ఏమిటి అని ఒక్క క్షణం పరికిస్తే ....
రాధ అంటే భగవంతుని విశేషముగ ఆరాధించునది అని(భక్తీ అని ) అర్ధము.
అనగా అత్యంత భక్తురాలు.
రాధ : ధారా ............ అదో నిరంతర వాహిని
కుండలి నుండి మూలాదార వరకు జాలువారుతున్న అమృత బిందువులను (విశ్వశక్తిని )
ధారలా భూలోకము నుండి ( మూలాధారా ) వైకుంఠము (సహస్రారం ) నకు తీసుకుని
వెళ్ళగలిగే ఒక శక్తి ... ధార .....రాధ ...... ఇదో నిరంతర వాహిని ...
ఇదే ధ్యానం ......భక్తీ ...... ప్రేమ....
కృష్ణుడనగా ఆకర్షించు వాడని యర్ధము:: నిరంతరం ఆత్మ అంతర్ముఖం కమ్మంటుంది
కాని మనం అత్మరాత్మ మాట వినం. ఇంద్రియాలు చెప్పినది చేస్తూ ఉంటాము ..
రాధ యనగా సిద్ధింప చేయునది అని అర్దము (మోక్షం )
కృష్ణ ( సాధకుడు ) ఎక్కడ ఉంటే ( నిరంతర ) ధార (రాధ ) అక్కడ ఉంటుంది .
నా దేహం వేరు ... నా శ్వాస వేరు అని చెప్పగలమా ?? లేదే
ఇరువురు ఒక్కటే ... ఇలా కృష్ణుని అంతరమైన స్వరూపము రాధగను,
బాహ్య రూపము పురుషుడినియు.
అలాగే రాధయొక్క అంతర్ స్వరూపము పురుషుడైన కృష్ణుని గాను,
బాహ్య స్వరూపము రాధ.
భగవాన్ కృష్ణ కోసం 16, ౦౦౦ మంది గోపికలు వచ్చారు ..
రాసలీలలు అని వ్యర్ద ప్రేలాపనలు చెపుతూ ఉంటారు .
యద్బావం తద్బభవతి వారిని మనం మార్చలేము ... కాని సత్యం మాత్రం ఇదే ....
ఎప్పుడు భాహ్య నేత్రాలతో చూడటమేనా ? ..
ఒక్కసారి అంతర్ముఖులమై మనో నేత్రంతో ఆత్మ స్దితిలో చుస్తే ...
పరమాత్ముని కోసం పరితపిస్తున్న జీవాత్మలు 16,౦౦౦..
నిరంతర ధ్యాన యజ్ఞంలో సమిధలుగా మారి
సత్య జ్ఞానాన్ని పొందిన (ఎరుక ) సిద్దులు .
వారు లక్ష్యం వెతుకులాట !!!!
ఆ మహాచైతన్యం కోసం వెతుకులాట!!!!
ఆ పరంధాముని కోసం వెతులాట .. !!!!
ఆ వెతుకులాటలో ధ్యాన మార్గం చూపిన వాడు కృష్ణ
జ్ఞాన మార్గం చూపిన వాడు కృష్ణ
దేముడికి జీవుడికి ఉన్న బంధాన్ని ఎరుక పరచిన వాడు కృష్ణ
శోధన నుండి సాధన వైపు
సత్యాన్ని ఎరుక పరచిన వారు కృష్ణ .........
ఆబాల గోపాలం అంతా సిద్దులు యోగులు తాపసులు
గోకులం అంటే వైకుంఠం అందులో భక్తీ అంటే రాధ
వైకుంఠం + ధ్యానం +కలిసి యున్నదే బృందావనం ..
కాపున బృందావనము అంటే ఓ సమూహం
జీవ సమూహము. ధ్యాన జీవుల సమూహం ........
ఇకనైనా రాధ మాధవ తత్వాన్ని అర్ధం చేసుకుందాం .......
[10:15, 26/08/2020] +91 73370 58025: 👌🏻👌🏻🌹🌹👏🏻👏🏻
[11:03, 26/08/2020] Mallapragada Ramakrishna: రాధిక ఒక పకృతి కిరణముగ వెల్గు
సహజ సిధ్ధితో గోపాల కరుణ కొరకు
కృపతొ హృదయ మందున దాచి ఉంచు చుండు
సార్ధ కమవుటకు ముకుంద వెలుగు చూపు..,.......
[11:04, 26/08/2020] +91 97043 58280: 🌸మూడు తొండాల గణపతి దేవాలయం మీకు తెలుసా ?🌸
గణపతి… ఏ పని ప్రారంభించాలన్న ఆయన అనుగ్రహం తప్పనిసరి. సకల గణాలకు నాయకుడు ఆయన. సాధారణంగా అందరూ ప్రార్థించేది ఏకదంత ఉపాస్మహే అని. ఏకదంతుడిగా ప్రసిద్ధి చెందిన ఆ వినాయకుడికి మూడు తొండాలు ఉన్నాయంటే ఆశ్చర్చం కదా. కానీ ఇది నిజం. ఆ మూడు తొండాల గణపతి దేవాలయ విశేషాలు తెలుసుకుందాం…
🌻త్రిసూంద్ దేవాలయం🌻
మూడు తొండాలున్న త్రిసూంద్ గణపతిని చూడాలంటే మనం పూనేలో ఉన్న సోమ్వర్ పేట్ జిల్లాకి వెళ్ళాల్సిందే. ఈ ప్రాంతంలో ఉన్న నజగిరి అనే నదీ తీరంలో ఉంది ఈ త్రిసూంద్ గణపతి దేవాలయం.
👉🏻కథనం:
భీమజీగిరి గోసవి అనే వ్యక్తీ ఈ ఆలయాన్ని 1754లో మొదలుపెట్టారట. పదహారు సంవత్సరాల నిర్మాణం తరువాత 1770లో గణపతిని ప్రతిష్టించారు. ఇక్కడి గర్భగుడి గోడల మీద మూడు శాసనాలు చెక్కబడి ఉన్నాయట. రెండు శాసనాలు సంస్కృతంలో ఉంటే మూడోది పెర్షియన్ భాషలో ఉందట. ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఆలయంలోని వినాయకుడికి మూడు తొండాలు, ఆరు చేతులు ఉండి స్వామి నెమలి వాహనంపై ఆశీనుడై ఉంటాడట. ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న ద్వారపాలకుల విగ్రహాలు ఎంతో అందంగా చెక్కబడి ఉంటాయి.
ఆలయంప్రాంగణంలో కూడా అనేక దేవతా విగ్రహాలు, ఏనుగులు, గుర్రాలు మొదలైన జంతువుల విగ్రహాలు శోభాయమానంగా కనపడతాయి. ఎక్కడా లేని మరొక వింత ఈ ఆలయంలో ఒక గోడ మీద అమెరికన్ సైనికుడు ఖడ్గ మృగాన్ని ఇనప చైనులతో కడుతున్నట్టుగా ఉండే విగ్రహం. ఇలాంటి విగ్రహాలు మన దేశంలో మరెక్కడా చూడలేము. అలాగే ఆలయాన్ని నిర్మించిన గోసవి మహాశయుడి సమాధి కూడా ఆ ఆలయ ప్రాంగణంలో ఉండటం ఇంకో విశేషం. ఆలయం క్రింద భాగంలో నీరు నిలవ ఉండే విధంగా కొలనులాంటిది కట్టారు. ఎప్పుడూ నీటితో ఉండే ఆ కొలనుని గురుపూర్ణిమ రోజు నీరంతా ఖాళీ చేసి పొడిగా ఉంచుతారు. ఆ రోజు అక్కడివారు తమ గురువుగా భావించే ఆలయ నిర్మాణకర్త గోసవికి పూజలు నిర్వహిస్తారు.
👉🏻ఉత్సవాలు
ఈ ఆలయంలో సంకటహర చతుర్థిని ఎంతో ఘనంగా నిర్వహించే ఆచారం ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తోందిట. నెలలో ఆ ఒక్క రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కూడా. ఇక వినాయక చవితి ఉత్సవాలు ఇంకెంత ఘనంగా జరుగుతాయో వేరే చెప్పకర్లెద్దు. తొమ్మిది రోజులు పూనే చుట్టుపక్కల ఉన్న ఊరుల నుంచి భక్తులు వచ్చి ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తారట. రాజస్థాని, మాల్వా మాదిరి శిల్పకళ ఉట్టిపడే ఈ ఆలయాన్ని ప్రస్తుతం ఒక ట్రస్ట్ నడిపిస్తోందని చెపుతున్నారు ఇక్కడి అధికారులు.
[11:15, 26/08/2020] +91 94923 06908: 👌👌👍👍👍🙏🙏🙏
[11:17, 26/08/2020] +91 94923 06908: అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ.🙏🙏🙏🙏
[11:18, 26/08/2020] +91 97043 58280: ఈ సందేశం ఈ సమూహంలో కాదండి మన ఆరోగ్యాలు సమూహంలో పెట్టండి
[11:19, 26/08/2020] +91 94923 06908: 👌👌👍👍🙏🙏
[11:21, 26/08/2020] +91 94923 06908: 👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏
[11:23, 26/08/2020] +91 94923 06908: 👌👌
[08:10, 26/08/2020] +91 97043 58280: 🌸జ్ఞానయోగము- సాధన (7)🌸
🌻సమాధానం🌻
క్రింది స్థాయిసమాధిని శమాదిషట్కంలో సమాధానం అంటారు. ఇది అప్రయత్నంగా సిద్ధించే సమాధిస్థితి గనుక ఇది సాధనగా చెప్పబడలేదు. మనస్సును /చిత్తాన్ని ఒకచోట సంపూర్ణంగాను, నిలకడగాను ఉంచడాన్ని సమాధానమని అంటారు. ఒక సమయంలో అనేకమైన విషయాలను చింతించే దాన్ని ఒకచోట కదలకుండా ఉంచడం సమాధానం. మనస్సును కలపడం. అంటే దాన్ని ఒకచోట సంపూర్ణంగా ఉంచడం. అటూ ఇటూ కదలకుండా ఉంచడాన్ని సమాధానం అంటారు. దీన్లో ఉండేది బ్రహ్మముతో ఏకత్వమే. సమాధానం వల్ల మనస్సు విశ్రాంతంగా ఉంటుంది.
“శంకరులు శ్రద్ధనుగురించి చెప్పేటపుడు మనస్సులోనే విశ్వాసం ఉంచాలని చెబుతూ బుద్ధితో నిశ్చయించి అని చెప్పారు. సమాధానం గురించి చెప్పేటప్పుడు బుధ్ధి అనే పదాన్నే వాడారు. బుద్ధిని ఎల్లపుడూ బ్రహ్మమునందే సరైన రీతిలో ఉంచడాన్ని సమాధానమని అన్నారు. అంటే బుద్ధి తన సమస్త శక్తులను ధారబోసి బ్రహ్మంపై లగ్నం కావాలి. ఇదే, బుద్ధిని సరిగ్గా ఉంచడమంటే( సమ్యగ్ స్థాపనం ). ఇలా నిరంతరమూ కొనసాగటాన్ని బుధ్ధియొక్క సమాధానం అంటారు. మనస్సు ఏది మంచి అనుభవమో, ఏదికాదో తెలియక అన్నిటిలోనూ మునిగి ఉంటుంది. ఆవేశంలో కొట్టుకుపోకుండా ఏది సత్యమో, ఏది అసత్యమో బుధ్ధి మంచి చెడుల న్యాయనిర్ణయం చేస్తుంది. ఇలాంటి బుధ్ధికూడా ఇక్కడ ప్రక్కకు తప్పుకోవాలి సమాధానంలో”.
క్రిందిదశలో బుద్ధికి బాగా పదునుపెట్టాలి. అలాంటి పదునైన బుధ్ధి, నిత్యానిత్య వస్తువివేకం చేస్తుంది. ఇప్పుడు చెప్పుకున్న సమాధానంలో సాధకుడు ఒకస్థాయికి చేరుకున్నాడు. బుద్దినుంచి తెలుసుకోవలసిన జ్ఞానంతో అతడికి ఏ సంబంధమూ లేదు. అన్నివేళలా బ్రహ్మమును గురించిన చింతనే ఉంటుంది. అందుకే ఇక్కడ బుద్ధిని కూడా విడవాలి. ఇది రెండోదశ అనవచ్చు. సమాధానం అనేది క్రిందిస్థాయి సమాధి అని చెప్పుకున్నాం.
ఇక మూడవదశ సమాధిలో బుద్ధిని బ్రహ్మమనే సముద్రంలో ముంచెయ్యాలి. అంటే బుద్ధి తన సమస్త శక్తులను ధారబోసి బ్రహ్మంపై లగ్నం కావాలి. ఇదే బుద్ధిని సరిగ్గా ఉంచడమంటే( సమ్యగ్ స్థాపనం ). ఇలా నిరంతరమూ కొనసాగటాన్ని బుధ్ధియొక్క సమాధానమని చెప్పుకున్నాం. కాని ఇక్కడ బ్రహ్మానుభవం ఇంకా కాలేదు. అది చివరన వస్తుంది. ఐతే బుద్ధిని శుద్ధబ్రహ్మముపై లగ్నం చెయ్యడం అంటే, బ్రహ్మమును గురించి చెప్పబడ్డ శాస్త్ర విషయాలమీద, గురువు బోధించిన ఆత్మ విషయాలపైనా, బ్రహమును గురించిన బుద్ధిజ్ఞానంపైన ఏకాగ్రతతో బుద్ధిని ఉంచాలి. ఇదే బుద్ధియొక్క సమాధానమని కంచిపీఠాధిపతి శ్రీ చంద్రశేఖర స్వామి వారు అద్వైతసాధన అనే ఉపన్యాసాల సంపుటిలో చెబుతారు.
ప్రస్తుతం సాధకుడు ధ్యానంలో, బుద్ధిని ఆత్మలో లీనం చెయ్యడానికి కావలసిన సమర్ధత ఇంకా రాలేదు. అంచేత బుద్ధి తన వ్యాపార మైన శాస్త్రవిషయాలు, ఆత్మగురించి తెలుసుకున్న విషయాలమీదా పనిచేస్తుంది. అదే చివరకు ఆధ్యాత్మిక ప్రగతికి దారి చూపిస్తుంది.
సాధన తొలిదశ- నిత్యానిత్యవివేకంలో బుద్ధికి బాగా పదును పెట్టాలి. ఎపుడు ఆత్మ సాధకుడయ్యాడో, ఇక బాహ్య ప్రపంచజ్ఞానం గాని, మిగిలిన విషయాలను గాని తెలుసుకోవలసిన అవుసరం అతనికి ఉండదు. బ్రహ్మచింతనలోనే నిరంతరమూ ఉంటాడు. అంటే సమాధి స్థితి ఉన్నతమయ్యేకొద్దీ (మూడవ దశ సమాధిలో) బ్రహ్మమనే సముద్రంలో బుద్ధిని ముంచెయ్యాలి. మనం ఏ జ్ఞానాన్నైనా తెలుసుకునేది బుద్దితోనే. అట్టి బుధ్ధి, ఇక్కడ తన శక్తులన్నిటినీ ధారపోసి బ్రహ్మంపైనే లగ్నం కావాలి. ఇదే సమ్యగ్ స్థాపనమంటే. ఇలా నిరంతరం కొనసాగించడాన్ని బుధ్ధియొక్క సమాధానం అంటాం. ధ్యానంలో కూర్చుని బుద్ధిని, ఆత్మలోలీనం చెయ్యలేకపోతే బుధ్ధి పనిచేస్తూంటుంది. శాస్త్రాలు, ఆత్మను గురించిన విషయాలపైకీ బుధ్ధి పోతుంటుంది. అంటే ఈ దశలో బుద్ధిని సంపూర్ణంగా బ్రహ్మమందు స్థిరంగా ఉంచడమే సమాధానం.
ముందుదశలో సాధకుడు నిత్యానిత్యవస్తు వివేకంలో బుద్ధికి పదును పెట్టాలి. రెండవ దశకు చేరుకున్న సాధకుడికి జ్ఞానం యొక్క ఆవశ్యకత ఉండదు/ లేదు. అందుకే సమాధానంలో జ్ఞానానికి కారణంగాఉండే బుధ్ధి కూడా ప్రక్కకు తప్పుకోవాలి. అందుకే క్రిందిదశ సమాధిగా చెప్పే సమాధానంలోనే బుధ్ధి ప్రస్తావన. మూడవదశలో సమాధిస్థితి ఉన్నతం అయ్యే కొలదీ బ్రహ్మమనే సముద్రంలో బుద్ధిని ముంచి వెయ్యాలి. బ్రహ్మానుభవం చివరనే వస్తుంది. బుద్ధిని శుద్ధబ్రహ్మముపై సంపూర్ణంగా నిలపాలి అంటే – ఇక్కడ – బ్రహ్మమును గురించి చెప్పిన శాస్త్రంపైనా, గురూపదేశంపైనా బుద్ధిని ఏకాగ్రతతో ఉంచడం అని విజ్ఞుల అభిప్రాయం.
[08:28, 26/08/2020] +91 97043 58280: 🌸కాంచీపురం (భాగం 6)🌸
🌻కాంచీనగరమందలి ఇతర ఆలయములు:🌻
శ్రీ వైష్ణవ ఆళ్వార్లు మంగళాశాసనం చేసిన 108 దివ్యదేశములలో 15 దివ్యదేశములు ఒక్క కాంచినగరము నందు యున్నవి. ఈ కారణమున ఈ నగరము వైష్ణవ సాంప్రదాయమునకు ఎంతో ముఖ్యమైన స్థానమని తెలియఛున్నది. బస్టాండ్ కు ఎడమ ప్రక్కగా యున్న ప్రాంతమును "విష్ణుకంచి" అనెదరు. ఈ ప్రాంతమున ఎన్నో వైష్ణవ ఆలయములు ఉన్నవి.
ఒకమారు శ్రీమహాలక్ష్మి మరియు శ్రీసరస్వతీ తల్లుల మధ్య "ఎవరు గొప్ప" అను వివాదము తలెత్తెను. దీనిని పరిష్కరించుటకు వారు మొదట దేవేంద్రుడిని, పిదప బ్రహ్మదేవుని ఆశ్రయించిరి. వీరిరువురూ గూడ శ్రీ సరస్వతీ దేవి కన్నా శ్రీ మహాలక్షి యే గొప్ప అని పేర్కొనెను. అది విని కోపించిన శ్రీ సరస్వతీ దేవి ఇంద్రుని ఒక ఏనుగు కమ్మని శపించెను. ఆ తల్లి తన భర్త అయిన బ్రహ్మదేవుని మీద అలిగి బ్రహ్మలోకము విడిచిపెట్టెను. శాపగ్రస్తుడైన ఇంద్రుడు, తొలుత పరమభాగవతోత్తముడైన ప్రహ్లాదుని ద్వారా "శ్రీ నరసింహ మహా మంత్రము" ను ఉపదేశము పొంది అనంతరము శ్రీ వరదరాజ స్వామి ఆలయ క్షేత్ర పాలకుడగు శ్రీ గుహానరసింహ స్వామి ని గొలిచి శాపవిమోచనము పొందెను.
వాగ్దేవి తనను విడిచిపెట్టిన అనంతరము బ్రహ్మదేవునికి తన శక్తి కరువై సృష్టి కార్యమునందు విఫలమవ్వసాగెను. తనకు మరల సృష్టి చేయుటకు కావలసిన శక్తి, శ్రీహరి ఆరాధన వలన మాత్రమే కలుగునని గుర్తించిన ఆ విధాత ఆ స్వామి యొక్క అర్చావతార మూర్తి కొరకు కాంచీనగరము నందు గల హస్తగిరిపై అశ్వమేధ యాగము నిర్వహించెను (ఈ విశేషము "శ్రీ వరదరాజ స్వామి ఆలయ" వర్ణన యందు వివరించబడినది). అయితే తన భార్య అయిన భారతి దేవి లేకుండానే బ్రహ్మదేవుడు యాగము చేయసాగెను. ఇది తెలిసి కోపించిన సరస్వతీ దేవి యాగ విధ్వంసమునకు పూనుకోనేను. అయితే శ్రీహరి, సరస్వతీ దేవి యొక్క ప్రయత్నములు వ్యర్ధములు గావించి యాగసంరక్షణ చేసెను.
తొలుత శ్రీ సరస్వతీ దేవి బ్రహ్మాండమైన ఒక బడబాగ్నిని సృష్టించి, యాగ ప్రదేశమును ఆహుతి చేయ బూనేను. అంతట శ్రీహరి ఆ అగ్నిని స్వాధీనపరుచుకొని తన కరము యందు నిలిపి దీపపు ప్రకాశము వలెనె పట్టుకొనెను. అనంతరము, సరస్వతీ దేవి అనేక మంది అసురులను సృజించి పంపెను. వారందిరినీ శ్రీహరి నిగ్రహించెను. అంతట సరస్వతీ దేవి ఒక మహా శరభమును సృష్టించి వదిలెను. అంతట నారాయణుడు అష్టభుజుడై, ఎనిమిది చేతుల ఎనిమిది ఆయుధములు ధరించి ఆ శరభమును వధించెను. అనంతరము వాగ్దేవి ప్రయోగించిన కాపలికాస్త్రమును స్వామి నిగ్రహించెను. తన ప్రయత్నములన్ని వ్యర్ధములైన అనంతరం యాగ విధ్వంసమునకు స్వయముగా సరస్వతీ దేవి వేగవతి అను పేర ఒక నదీ రూపము దాల్చి యాగము జరుగు ప్రదేశము వైపుకు ప్రవహించసాగెను. అది గమనించిన శ్రీహరి ప్రహావాహమునకు అభిముఖముగా తానే పరుండెను. అది జూసిన సరస్వతీ దేవి సిగ్గు పడి అంతర్వాహిని ఆయెను. అనంతరము తన పొరబాటు తెలుసుకొని, పతిసేవయే సతిగా తన ధర్మమని తెలిసి నిలిచెను.
👉🏻శ్రీ దీపప్రకాశ స్వామి ఆలయము:
శ్రీ సరస్వతీ దేవి సృజించిన బడబాగ్నిని తన కరమున బట్టి దీపము గా ప్రకాశింపజేసినా కారణమున శ్రీహరి "శ్రీ దీపప్రకాశ స్వామి" గా వెలిసి యున్నారు. ఈ ఆలయమునకు ఆనుకొని "శ్రీమద్ వేదాంత దేశికుల" అవతారస్థలము యున్నది. తెలుగు వారికి "శ్రీ అన్నమాచార్య స్వామి" ఎటులో, తమిళులకు "శ్రీ వేదాంత దేశికర్" అటుల. ఇక్కడే శ్రీ దేశికర్ ఉపాసన చేసిన అత్యంత శక్తిమంతమైన "శ్రీ లక్ష్మి హయగ్రీవ" దివ్య సాలగ్రామమున్నది.
👉🏻శ్రీ అష్టభుజ స్వామి ఆలయం:
అష్ట భుజములతో శరభ సంహారణము చేసిన కారణమున స్వామి "శ్రీ అష్టభుజ స్వామి" గా వెలసి యున్నారు. ఈ ఆలయమున యున్న "శ్రీ హయగ్రీవుని" ఉపాసన చేసిన వారికి సకల విద్యలు కటాక్షింప బడునని పెద్దల మాట. ఈ ఆలయము వద్ద యున్న పుష్కరిణి బహు విశేషమైనది. "శ్రీమద్ భాగవతము" నందు యున్న ప్రధాన ఘట్టములలో ఒకటైన "శ్రీ గజేంద్ర మోక్షము" జరిగిన ప్రదేశము ఈ కోనేటి తీరము అని విశ్వాసము. అష్టభుజుని ఉపాసన మనిషికి యున్న అంతర్గత శత్రువులైన అరిషడ్వర్గములను జయించుటకు యున్న గొప్ప మార్గమని పెద్దల మాట.
👉🏻శ్రీ యధోక్తకారి ఆలయము:
వేగావతి యను నామముతో ప్రవాహము గా వస్తున్న సరస్వతీ దేవికి అభిముఖముగా శయనించి యాగ రక్షణ చేసిన కారణమున స్వామి "శ్రీ యధోక్తకారి" యను నామమున వెలసి యున్నారు. ఈ ఆలయమున స్వామి శయనించి యున్న భంగిమలో దర్శనమిచ్చును. ఈ ఆలయము యొక్క కోనేరు నందు ఒక పద్మము నందు, ఆళ్వారులలో మొదటి వారైన "శ్రీ పోయగై ఆళ్వార్" అవతరించిరి.
👉🏻శ్రీ యోగనారసింహ స్వామి ఆలయము:
సరస్వతీ దేవి ప్రయోగించిన కాపలికాస్త్రం నుండి రక్షించి, యాగ రక్షణ చేసిన కారణమున, బ్రహ్మదేవుని కోరిక పై స్వామి "శ్రీ యోగ నరసింహ స్వామి" గా వెలసి యున్నారు. ఈ ఆలయము వేగావతి నదీ తీరమున యున్నది. ఈ స్వామియే ఒకనాడు "శ్రీ భ్రుగు మహర్షి" కి దర్శనమిచ్చి రక్షణ చేసెను.
పై నాలుగు ఆలయములు విష్ణుకంచి యందు, శ్రీ వరదరాజ స్వామి ఆలయము నుంచి సుమారుగా ఒకటి, ఒకటిన్నర కి.మీ. దూరములో, ఒకదానికొకటి బహు దగ్గరలో యున్నవి. ప్రతీ ఆలయము నందు శ్రీ లక్ష్మీదేవికి ప్రత్యేక స్థానము గలదు. కాంచీనగరము నందు ఇంకా శ్రీ ఏకామ్రనాథుని ఆలయము వద్ద యున్న "శ్రీ పాండవదూత స్వామి" అను పేర యున్న శ్రీ కృష్ణుని ఆలయము, రైల్వేస్టేషన్ కు సమీపమున యున్న "శ్రీ పచ్చైవర్ణ - శ్రీ ప్రవాళ వర్ణ స్వామి" ఆలయము మరియు బస్టాండ్ కు సమీపమున యున్న "శ్రీ వైకుంఠనాథ స్వామి" ఆలయము సుప్రసిద్దములు.
👉🏻శ్రీ ఖచ్చపేశ్వర స్వామి ఆలయము:
మన పురాణ ఘట్టములలో అత్యంత ప్రసిద్ధి చెందిన వాటిలో ఒకటి "క్షీరసాగర మధనము". దూర్వాస మహర్షి శాపము చేత తన ఐశ్వర్యం కోలోయిన దేవేంద్రుడు దేవతలను, దానవులను ఇరు ప్రక్కలా నిలబెట్టి, మంధర పర్వతమును కవ్వముగా నెంచి, వాసుకి సర్పమును త్రాడుగా జేసి క్షీరసాగరమును మధించెను. ఆ సమయమున శ్రీహరి శిష్టరక్షణకై పలు రూపములు దాల్చెను. వాటిలో ప్రముఖమైనది "శ్రీ కూర్మావతారము". ఆ నారాయణుడు తాబేటి రూపమున మంధర పర్వతమును తన మోపు పై భరించెను. శ్రీహరి చేసిన మహోపకారమునకు ప్రత్యుపకారముగా క్షీరసాగర మాధనము నందు ఉద్భవించిన శ్రీ మహాలక్ష్మి తల్లి ని నారాయణునకు ఇచ్చి దేవతలు వివాహము చేసిరి.
క్షీరసాగర మదనము నందు ముందుగా ఉద్భవించినది భయంకరమైన హాలాహలము. ఆ హాలాహలమును శంకరుడు తన కంఠమున నిలిపి "శ్రీ నీలకంఠుడు" అయి లోక రక్షణ చేసెను. అయితే ఆ హాలాహలము ఆవిర్భావ సమయమున కూర్మధారి అయిన శ్రీహరికి అత్యంత క్లేశము కలిగించెను. క్షీరసాగర మధనము ముగిసిన తరువాత తన క్లేశ నివారణకై శ్రీహరి మహేశుని ప్రార్థించెను. అంతట సదాశివుడు హరితో, కాంచి క్షేత్రమునకు వెళ్లి తనను అర్చించమని మార్గము చెప్పెను. నారాయణుడు కాంచి క్షేత్రమున మహేశ్వరుని ఆరాధించి తన క్లేశ నివారణ చేసుకొనెను. ఈ క్షేత్రమున నారాయణుడు చేసిన శివ పూజ ఫలితము గా శ్రీహరికి మన్మధుడు పుత్రునిగా జన్మించెను.
ఖచ్చపము అనగా తాబేలు. తాబేటి రూపమున యున్న శ్రీహరిని కరుణించిన కారణమున ఈశ్వరుడు ఖచ్చపేశ్వరుడైనాడు. శ్రీ ఖచ్చపేశ్వరుని ఆలయము కాంచిపురము నందు గల అత్యంత సుందర ఆలయములలొ ఒకటి. బస్టాండ్ నుండి శ్రీ ఏకామ్రేశ్వరుని ఆలయమునకు వెళ్ళు మార్గమున ఉత్తరాభి ముఖమైన గొపురముతో యున్నది. ఈ ఆలయము నందు అత్యంత మహిమాన్వితమైన "యిష్ట సిద్ధి" తీర్థము యున్నది. ఈ పుష్కరిణి లో నాలుగు వైపులా నుండి ప్రవేశించి స్నానము చేసిన వారికి నాలుగు రకములైన ఫలితములు కలుగునని ప్రతీతి. ఈ తీర్థము నందు భానువార స్నానము రోగనివారిణిగా ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయము నందు శ్రీ సరస్వతీ మాత అష్టభుజములతో దర్శనమిచ్చుట మరియొక విశేషము.
👉🏻శ్రీ కైలాసనాథుని ఆలయము:
"పత్రం, పుష్పం, ఫలం, తోయం...." అని అన్నరు. నిజమైన భక్తితో, స్వచ్ఛమైన సమర్పణ భావముతో ఏది అర్పించినానూ అది భగవంతుడు స్వీకరించునని ఆర్షవాక్కు. ఆయనకు సమర్పించు వాని భావము ముఖ్యము గాని సమర్పించు వారు గాదు. ఆయనకు తన భక్తుల ఎడల గొప్ప-పేద అను ద్వంద్వ భావము ఉన్నవాడు కాదు. ఆయనకు అందరూ సమానమే. అందరూ బిడ్డలే. అహంకార భావనతో ధనవంతుడు సమర్పించే పంచభక్ష్య పరమాన్నముల కన్నా స్వచ్ఛమైన భక్తీ తో పేదవాడు మానసికముగా సమర్పించు పచ్చడి మేతుకులంటేనే ఆయనకు ప్రీతి. భగవంతుని యొక్క ఈ తత్వమునకు నిలువుటద్దము గా యున్న స్థలము కాంచీనగరము నందు గల "శ్రీ కైలాసనాధుని ఆలయము".
ఒకప్పుడు దక్షిణ భారతదేశమును పరిపాలించిన పల్లవ రాజులు, కాంచీనగరమును రాజధానిగా చేసికొని పరిపాలన సాగించిరి. శివానుగ్రహముతొ రాజ్యము సుభిక్షముతో, ఆనందముతో యుండసాగెను. రాజు పరమశివునకు ఒక ఆలయము నిర్మింప తలబెట్టెను. కాంచినగరము నందు పశ్చిమ భాగమున ఇసుకరాతి తో ఒక బ్రహ్మాండమైన శివాలయమును నిర్మించి, ఆ ఆలయ కుంభాభిషేకమునకు ముహూర్తము నిర్ణయించెను. కుంభాభిషేకమునకు కొద్ది దినముల ముందు ఒక రాత్రి రాజుకు కలలో శంకరుడు దర్శనమిచ్చి, తిన్ననూరు గ్రామమున యున్న పూసల్లారు అను భక్తుడు తాను నిర్మించిన ఆలయమునకు గూడా రాజు నిర్ణయించిన ముహూర్త సమయము నందే కుంభాభిషేకము జరుప నిశ్చయించిన కారణమున తాను నిర్మించిన ఆలయ కుంభాభిషేక ముహూర్తమును వేరొక రోజుకు మార్చమని రాజుకు తెలిపెను.
తెలివి వచ్చిన అనంతరము రాజు సపరివారముతొ తిన్ననూరు చేరి పూసల్లారు మరియు ఆయన కట్టించిన శివాలయమునకై వాకబు చేసెను. పూసల్లారు పేదవాడైననూ పరమశివ భక్తుడు. ఆయన తన స్వామి కొరకు ఆలయము నిర్మించ దలచి విరాళములు సేకరించ సంకల్పించెను. అయితే విరాళాలీయుటకు సర్వులూ నిరాకరించిరి. అయిననూ పూసల్లారు చింతింపక తన మనఃఫలకమున శివాలయము నిర్మించి, ఆ ఆలయమనకు కుంభాభిషేకము చేయుటకు రాజు నిశ్చయించిన ముహూర్త సమయమునే నిశ్చయించెను. ఇది తెలుసుకున్న రాజు, పుసల్లారు యొక్క పరమభక్తిని లోకమునకు తెలియబరచుటకై శంకరుడు తన కలలో కనిపించెనని తెలిసికొని, మొదట తిన్ననూరు నందు పూసల్లారు ఆధ్వర్యమున ఒక శివాలయమును నిర్మింపచేసి, ఆ ఆలయమునకు కుంభాభిషేకము గావించి, తదనంతరము తాను కాంచీపురము నందు నిర్మించిన ఆలయమునకు కుంభాభిషేకము గావించెను.
ఆ పల్లవరాజు నిర్మించిన ఆలయమే "శ్రీ కైలాసనాథుని ఆలయము". అత్యద్భుతమైన శిల్పకళా నైపుణ్యముతో, చూపురులను ఎంతగానో ఆకర్షించే కట్టడములతో నిర్మించబడెను. గర్భాలయము నందు ప్రదక్షిణ ఇక్కడి ప్రత్యేకత. ప్రదక్షిణము మొదలు పెట్టు సమయమున మరియు పూర్తి చేయు సమయమున మార్గము బహు ఇరుకుగా యుండి నేలపై ప్రాకుతూ వెళ్ళవలసిన పరిస్థితి యున్నది. స్వర్గప్రదక్షిణ మనబడు ఈ ప్రదక్షిణ వలన జననమరణ రాహిత్యము కలుగునని పెద్దల మాట. ఈ ఆలయము నందు "శ్రీ నారద మహర్షి" చే పూజించబడిన శివలింగము గూడ దర్శనమిచ్చును.
👉🏻శ్రీ చిత్రగుప్త స్వామి ఆలయము:
దక్షిణ దిక్కు యొక్క అధిపతి అయిన యమధర్మరాజు యొక్క అనుచరులు "శ్రీ చిత్రగుప్తుల వారు". గుప్తము గా యుండి చిత్రాలు తీసెడి కారణమున ఆయనకు చిత్రగుప్తుడను నామమేర్పడెను. ఈ స్వామి జనుల పాపపుణ్యముల లెక్కలు వ్రాసెదరు. ఈయనచే ఈయబడిన లెక్కల ఆధారముగానే యమధర్మరాజు నరకములో శిక్షలు అమలు చేసేదరు.
శ్రీ చిత్రగుప్త స్వామి ఆలయము కాంచీపురం బస్టాండ్ కు అతి సమీపమున యున్నది. ఈ స్వామి దర్శనము మనుష్యులు పాప కార్యములు చేయుటకు అంగీకరించని మనస్తత్వమును కలిగించును.
[08:31, 26/08/2020] +91 94481 66042: 🙏🙏🙏
[08:32, 26/08/2020] +91 94481 66042: 🙏🙏🙏
[08:50, 26/08/2020] +91 89850 99086: 🙏🙏🙏
[08:51, 26/08/2020] +91 94935 83582: 👌🙏🙏
[08:52, 26/08/2020] +91 94935 83582: 🙏🙏🙏🙏🙏🌹
[08:55, 26/08/2020] +91 94935 83582: 🙏🙏🙏🌹
[08:55, 26/08/2020] +91 94935 83582: 🙏🙏
[08:56, 26/08/2020] +91 94935 83582: 👍👍
[09:41, 26/08/2020] +91 99666 91450: వ్యాధులు నయం చేసే #పాలజ్‌కర్రగణేశుడు:
#తెలంగాణ, #మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఓ చిన్న #మరాఠి గ్రామం పాలజ్. ఈ చిన్న మారుమూల పల్లె . ఇక్కడి ప్రత్యేకతే ఈ కుగ్రామానికి 15 ఏళ్లుగా లక్షలాది మందిని రప్పిస్తోంది. ఎక్కడా లేని విధంగా వినాయక నవరాత్రుల్లో ఈ గ్రామస్తులు కర్ర గణేశుని ప్రతిష్ఠించి.. పూజించడమే ఈ పాలజ్ ప్రత్యేకత.
ఇక్కడ కొలువుదీరే #కర్ర_గణేశుడు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పేరొందాడు. పాలజ్ లో ప్రభుత్వం నుంచి ఏ ఒక్క అధికారి లేకపోయినా ఆలయ కమిటీ, గ్రామస్తులు కలిసి సమష్టిగా లక్షలాది భక్తులకు సౌకర్యాలను సమకూరుస్తుంటారు.
గణేశ్ ఉత్సవాలన్ని రోజులూ ఈ ఊరి పేరు ఉత్తర తెలంగాణ, మహారాష్ట్రలోని ప్రతి ఒక్కరికి తెలిసిన గ్రామమే..
తెలంగాణ సరిహద్దు మండలమైన కుభీర్ కు పక్కనే మహారాష్ట్ర లోని బోకర్ తాలూకాలో పాలజ్ గ్రామం ఉంటుంది. ఇక్కడ 1948 లో నిర్మల్ కు చెందిన నకాషీ కళాకారుడు పోలకొండ గుండాజీ వర్మ కర్రతో మలిచిన వినాయకుడికి ప్రతిష్ఠాపన చేసి ప్రతియేటా పూజలు నిర్వహిస్తున్నారు.
ప్రతి వినాయక చవితి సందర్భంగా కర్ర గణేశుడిని ప్రతిష్ఠించి, చివరి రోజు సమీప వాగులో పూజలు జరిపి నిమజ్జనోత్సవంగా భావిస్తారు. అనంతరం కర్ర విగ్రహాన్ని తిరిగి ఆలయం లోని బీరువాలో భద్రపరుస్తారు. కేవలం వినాయక నవరాత్రులప్పుడు మాత్రమే పాలజ్ కర్ర గణేశుడు దర్శనమిస్తాడు. మిగతా సమయంలో ఇక్కడి ఆలయంలో గణేశుడి ఫొటో మాత్రమే ఉంటుంది..
స్వాతంత్య్రానికి పూర్వం పాలజ్ గ్రామంలో కలరా, ప్లేగు వ్యాధులు ప్రబలి ఊరంతా మంచం పట్టింది. ఇదే సమయంలో వినాయక చవితి పండుగ వచ్చింది. ఊరి ప్రజలంతా గణేశుని నమ్ముకుందాం.. అని నిశ్చయించుకున్నారు. ఇందుకు ప్రత్యేకంగా #కర్ర_గణపతిని చేయించి ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. అందుకోసం నిర్మల్‌లో కొయ్యబొమ్మలు చేసే నకాషీ కళాకారుడైన గుండాజీవర్మను రప్పించి సుందరమైన కర్ర గణేశుడి విగ్రహాన్ని చేయించారు.
ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఊరంతా మొక్కితేనే వ్యాధులన్నీ దూరమయ్యాయని గ్రామపెద్దలు చెబుతారు. అలా అప్పటి నుంచి కర్ర గణేశుడిని మాత్రమే వినాయక ఉత్సవాల్లో కొలువడం ఆనవాయితీగా వస్తోంది. ఇక ఇక్కడ పూజలు చేసి, ముడుపు కడితే కోరుకున్న పని జరిగి తీరుతుందన్న నమ్మకం ఉంది. ముందుగా ఈ ఊరికి చెందిన ఆడపడుచుల ద్వారా #కర్ర_గణేశుడి మహిమ ఇతర గ్రామాలకు తెలిసింది. అలా ఊరూరా పాలజ్ ప్రత్యేకత విస్తరిస్తూ ఇప్పుడు ఏకంగా ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర అంతా వ్యాపించింది.
కర్రతో చేసిందైనా.. నకాషీ కళాకారుడైన గుండాజీవర్మ చేతుల్లో సుందరంగా రూపుదిద్దుకున్నాడు ఇక్కడి లంబోదరుడు. అసలు. కర్రతో ఇంత అందంగా విగ్రహాన్ని మలచవచ్చా.. అనేంత నునుపుగా గణపయ్యను తీర్చిదిద్దాడు. సింహాసనంపై ఆసీనుడైన గణపయ్యకు పెద్ద చెవులు ఉంటాయి. నాలుగు చేతుల వాడిగా.. ఒక చేతిలో గండ్ర గొడ్డలి, మరో చేతిలో త్రిశూలం, ఇంకో చేతిలో లడ్డులతో పాటు కుడిచేత్తో ఆశీర్వదిస్తుంటాడు.
లక్షల్లో తరలివచ్చే భక్తులతో పాలజ్ ఆలయానికి ఆదాయమూ లక్షల్లోనే వస్తోంది. ఈ గ్రామస్తులు కలిసికట్టుగా కర్రగణేశుడి సేవలో పాల్గొంటారు. పదేళ్ల కింద సాదాసీదాగా ఉండే పాలజ్ ఆలయం ఇప్పుడు సరికొత్త హంగులతో ఇరుగుపొరుగు జిల్లాల వారినీ ఆకట్టుకుంటోంది.
2004 ప్రాంతంలో ఆలయ కమిటీ, గ్రామస్తులు చందాలు పోగు చేసి సేకరించిన మరో రూ. 2 లక్షలు కలిపి ఆలయ నిర్మాణం ప్రారంభించారు. అందంగా నిర్మించిన ఆలయం పూర్తయిన తర్వాత భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గ్రామస్తులే కోటి రూపాయలతో అన్నదాన సత్రాలు, స్నానపు గదులు, మరుగుదొడ్లు నిర్మించారు.
చుట్టుపక్కల గ్రామాలకూ ఇక్కడి నుంచి శుద్ధ నీరు అందిస్తున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలోనే సీసీ రోడ్లు వేశారు. ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలను అమర్చారు.
పాలజ్ వెళ్లడం ఇలా...
హైదరాబాద్ నుంచి వచ్చేవారు నిజామాబాద్, బాసర ల మీదుగా భైంసా చేరుకుంటే దూరభారం తగ్గుతుంది. నిర్మల్ మీదుగా వచ్చేవాళ్లు కూడా భైంసా మీదుగానే పాలజ్‌కు వెళ్లాల్సి ఉంటుంది. భైంసా నుంచి 23 కిలోమీటర్ల దూరంలో పాలజ్ ఉంటుంది. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. ప్రైవేటు వాహనాలూ అందుబాటులో ఉంటాయి.
హిందూ సాంప్రదాయాలు ఆచరిద్దాం- పాటిద్దాం
ఓం శ్రీ మహా గణాధిపతయే నమః
.🙏🐁🙏🐁🙏🐁🙏🐁🙏🐁🙏
[09:41, 26/08/2020] +91 99666 91450: ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
నిమ్మగడ్డ వారి పంచాంగం
శుభమస్తు 👌
26.08.2020
బుధవారం
రాశిఫలాలు
🐐 మేషం
ఏకాగ్రతతో పనిచేస్తే అనుకున్నది దక్కుతుంది. ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. శారీరక శ్రమ పెరుగుతుంది. అష్టమంలో చంద్ర సంచారం అనుకూలించట్లేదు. దగ్గరివారితో విబేధాలు రాకుండా చూసుకోవాలి. ఆహారనియమాలను పాటించాలి.
చంద్ర శ్లోకం చదవాలి.
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 వృషభం
ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. విజ్ఞానపరంగా ఎదుగుతారు. ముఖ్యమైన విషయాల్లో ఓర్పు అవసరం. శివనామస్మరణ ఉత్తమం.
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 మిధునం
శరీర సౌఖ్యం ఉంది. ఇష్టకార్యాలు సిద్ధిస్తాయి. యశస్సు వృద్ధి చెందుతుంది. ముఖ్య విషయాల్లో కుటుంబ సహకారం ఉంటుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన మేలు చేస్తుంది.
💑💑💑💑💑💑💑
🦀 కర్కాటకం
చేపట్టిన పనులు కొద్దిగా ఆలస్యం అవుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలి. శ్రమ అధికం అవుతుంది.
శివ నామాన్ని జపించాలి.
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 సింహం
కాలానుగుణంగా ముందుకు సాగితే సత్ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కీలక పనుల్లో కాస్త జాప్యం జరిగే సూచనలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా చదవడం శుభప్రదం.
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 కన్య
ప్రారంభించిన పనిలో ముందుచూపుతో వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. చక్కటి ఆలోచనా విధానంతో ముందుకు సాగి మంచి పేరు సంపాదిస్తారు. శివనామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
💃💃💃💃💃💃💃
⚖ తుల
గొప్ప ఫలితాలను సాధిస్తారు. సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. ఒక వార్త మీ మనోధైర్యాన్నిపెంచుతుంది. సుఖసంతోషాలతో గడుపుతారు. చక్కటి ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలను పొందుతారు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన శ్రేయోదాయకం.
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 వృశ్చికం
శుభకాలం. మంచి పనులు చేపడతారు. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యను పరిష్కరిస్తారు. శ్రీమహాగణపతి ఆరాధన మంచిది.
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 ధనుస్సు
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. మీ మీ రంగాల్లో శ్రద్ధగా పనిచేయాలి. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ అధికం అవుతుంది. సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. ఆవేశాలకు పోకూడదు. గోవిందనామాలు చదివితే మంచి జరుగుతుంది.
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 మకరం
వృత్తి, ఉద్యోగ వ్యాపారాది రంగాలలో మీకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. పట్టుదల వదలకండి. కలహ సూచన. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది.
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 కుంభం
అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. నూతన వస్తువులు కొంటారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. లక్ష్మీ గణపతి ఆరాధన శుభప్రదం.
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 మీనం
ఉద్యోగంలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. చేపట్టే పనుల్లో కుటుంబ సహకారంతో మంచి ఫలితాలను సాధిస్తారు. శుభవార్తలు వింటారు. బుద్దిబలం బాగుంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు.
ఇష్టదైవ సందర్శన శుభప్రదం.
🦈🦈🦈🦈🦈🦈🦈
శ్రీ సాయి భోగేశ్వర జ్యోతిష్యలయము
15/71,ఈడేపల్లి
మచిలిపట్నం:- 521001
9949989068/8522019789
లోకాసమస్తా సుఖినోభవంతు👌
[09:41, 26/08/2020] +91 79892 34854: (పుష్ప మేరు) శ్రీ చక్ర నవావరణ పూజ, పౌర్ణమి రోజున శ్రీ లలితా వరప్రదయని దేవీ శక్తి పీఠం నందు మాతాజీ శ్రీ వర ప్రదాయిని మాత చే శ్రీ చక్ర నవావరణ పుష్ప మేరు పూజ చేసిన చిత్రం. శుభం భవతు. శ్రీ మాత్రే నమః. శ్రీ మాతా అనుగ్రహ ప్రాప్తిరస్తు.✋✋✋✋✋
[07:34, 26/08/2020] +91 97043 58280: అనుమానం పెనుభూతం
మహాభారతంలో.. పాండవులకు కౌరవులకు మధ్య యుద్ధం మొదలవబోతుందని తెలిసిన కృష్ణుడు మధ్యవర్తిత్వం చేయాలని యుద్ధాన్ని ఆపే ప్రయత్నంగా దుర్యోధనుడి దగ్గరకు వెళ్తాడు.
ఎందుకంటే యుద్ధం మొదలైతే కౌరవుల పక్షంలో భీష్ముడు, ద్రోణుడు ఆయన కొడుకు అశ్వద్దాముడు, కర్ణుడు లాంటి చాలా మంచి యోధులు ఉన్నారని కృష్ణుడికి బాగా తెలుసు. అందులోనూ అశ్వద్దాముడు మరణం లేని వరం పొందినవాడని చిరంజీవి అని తెలుసు..
కౌరవుల పక్షంలో అశ్వద్దాముడు కనుక సైన్యాధిపతిగా నియమించబడితే పాండవులు గెలవలేరని తలచిన కృష్ణుడు ఒక ఆలోచనను పన్నాడు.. అది అమలుపరిచేందుకై హస్తినాపురం చేరుకున్న కృష్ణుడు సభలోని అందరికి నమస్కరించి అశ్వద్దాముడిని మాత్రం ఒంటరిగా తీసుకెళ్లి మాట్లాడే ప్రయత్నం చేయగా దుర్యోధనుడు ఇది గమనించసాగాడు..
అపుడు కృష్ణుడు అశ్వద్దాముడి క్షేమసమాచారాలు అడుగుతూనే తన చేతి వేలికి ఉన్న ఉంగరాన్ని కిందకు జారవిడిచాడు..
అలా ఉంగరం పడిపోవటం చుసిన అశ్వద్దాముడు వంగి నేల పైన ఉన్న ఉంగరాన్ని తీసి ఇవ్వబోగా కృష్ణుడు ఆకాశాన్ని చూపెట్టి మాట్లాడడం మొదలుపెట్టాడు.
కృష్ణుడు ఎం చుపిస్తున్నాడో అని ఆకాశం వైపు చూసిన తరువాత అశ్వద్దాముడు కృష్ణుడి వేలికి కింద పడ్డ ఉంగరాన్ని తొడిగాడు.
ఇదంతా గమనిస్తున్న దుర్యోధనుడు, అశ్వద్దాముడు “నేను కౌరవుల పక్షంలో ఉన్నా పాండవుల గెలుపుకు తోడ్పడతానని ఆ నింగి నేల సాక్షిగా ప్రమాణం చేసి మాటాయిస్తున్నాను ”
అన్నట్లు అర్థం చేసుకున్నాడు. ఈ అనుమానం తోనే చివరివరకు అతన్ని యుద్ధం లో సైన్యాధిపతిగా నియమించలేదు దుర్యోధనుడు. కురుక్షేత్రం17వ రోజు యుద్ధంలో దుర్యోధనుడు భీముడి దెబ్బకు కాళ్ళు విరిగి పడిపోయిన సమయంలో అశ్వద్దాముడు దుర్యోధనుడి వద్దకు వచ్చి ఇలా అడుగుతాడు..
నేను చిరంజీవి వరం పొందినవాడిని అని తెలుసు కదా.. నన్ను గనక సేనాధిపతిగా నియమించి ఉంటె యుద్ధంలో మనం గెలిచేవారం కదా అని అడిగాడు …అప్పుడు దుర్యోధనుడు నువ్వు పాండవులకు సహాయం చేస్తానని ఆ కృష్ణుడికి మాట ఇచ్చావు కదా అని అంటాడు.. దీనికి బదులుగా “ఎవరు మాట ఇచ్చింది” అని అశ్వద్దాముడు అడిగేడు అక్కడ జరిగింది అతను అర్థం చేసుకున్నది దుర్యోధనుడు వివరించగా ఆ మాటలు విన్న అశ్వద్దాముడు ముందు విరక్తితో నవ్వి.. ఆ రోజు కృష్ణుడి ఉంగరం జారిపడిపోతే అది తీసి ఇచ్చాను కానీ నేను ఎటువంటి మాట ఇవ్వలేదు.
నాపైన నీకు కలిగిన అనుమానంతో నీ ఓటమికి నువ్వే కారణం అయ్యావు.. అప్పుడే నన్ను ఈ విషయం అడిగి ఉంటె నీకు నిజం తెలుసుండేది, ఇది కూడా ఆ పరమాత్మ పాండవులను గెలిపించటానికి ఆడిన నాటకమే అయి ఉంటుంది అని చెప్పాడు అశ్వద్దాముడు.
మనకు కూడా అనుమానం వస్తే వెంటనే అడిగేయడం ఉత్తమం......అంతే కానీ మనసులో దాచుకుని దానిని పెంచుకుంటూ పోతే జీవితాల్లో దుర్యోధనుడిలా మనకు ఓటమి తప్పదు.. అనుమానం పెను భూతం అనే మాట నిజమే అనడానికి మంచి ఉదాహరణ భారతంలోని ఈ ఘట్టం.
🙏సేకరణ ....
[07:34, 26/08/2020] +91 90942 22931: 👍
[07:34, 26/08/2020] +91 89850 99086: 🙏
[07:35, 26/08/2020] +91 95506 66184: ఈ రోజుమాసిక దుర్గాష్టమి
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
దుర్గాష్టమి చాలా పవిత్రమైన రోజు మరియు హిందూ మతంలో చాలా శక్తివంతమైన దేవత అయిన దుర్గాదేవికి అంకితభావంతో ప్రతి నెలా జరుపుకుంటారు. ఆమెను బ్రహ్మ , విష్ణువు మరియు శివుడు సృష్టించారు. మాసిక దుర్గాష్టమి ప్రతి నెల శుక్ల పక్ష , అష్టమి తిథిలో జరుపుకుంటారు. దుర్గాదేవి సృష్టి వెనుక ఉన్న ప్రాధమిక ఉద్దేశ్యం భూమిపై చెడును వ్యాప్తి చేస్తున్న రాక్షసుడిని సంహరించడం .
దుర్గాదేవి శక్తి మరియు కోపం యొక్క సారాంశం.
మాసిక దుర్గాష్టమి వ్రతం ప్రతి నెల శుక్ల పక్ష ఎనిమిదవ రోజున పాటిస్తారు. ఇది ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక రోజు - ఉపవాసం. ఈ రోజు తల్లి దుర్గామాతకు ఆచార పూజతో గుర్తించబడింది.
మాసిక దుర్గాష్టమి యొక్క ప్రాముఖ్యత:
మాసిక దుర్గాష్టమి వ్రతం గత జీవితాల యొక్క అన్ని చెడు కర్మలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది.
ఇది ప్రేమ మరియు సంబంధం , ఆత్మవిశ్వాసం మరియు ధైర్యాన్ని మెరుగుపరుస్తుంది. వ్రాట్ వ్యాధి నుండి రక్షిస్తుంది మరియు ఆరోగ్యం మరియు శ్రేయస్సును తెస్తుంది. మాసిక దుర్గాష్టమి వ్రతాన్ని పాటించడం యొక్క ఉద్దేశ్యం దుర్గదేవి ఆశీర్వాదం ద్వారా జీవితంలో అన్ని ఇబ్బందులను తొలగించడం. భక్తులు తమ జీవితంలో దైవిక రక్షణ , శ్రేయస్సు , విజయం , ఆనందం మరియు శాంతిని పొందడానికి ఈ రోజు ఉపవాసం ఉంటారు. విధానాల ప్రకారం మాసిక దుర్గాష్టమిని శ్రద్ధగా పాటించేవారు ఈ ఉపవాసాలను అత్యంత ప్రాచుర్యం పొందిన గ్రంథాలలో హామీ ఇచ్చినట్లుగా గొప్ప ఫలితాలను పొందారు.
పురాణాల ప్రకారం , దుర్గ అనేది బ్రహ్మ , విష్ణు మరియు శివుడి ఉమ్మడి దైవిక మంత్రాల సృష్టి. శాంతిని అమలు చేయడానికి దుర్గాదేవి సృష్టించబడింది. ఆమె పది చేతుల్లో పది ఆయుధాలతో అత్యంత శక్తివంతమైన మరియు అందమైన దేవతగా మరియు సింహాన్ని ఆమె వాహనం గా అవతరించింది. ఒక స్త్రీ మాత్రమే తనను చంపగలదని మరియు అది దెయ్యంకు అసాధ్యమని అనిపించిన బ్రహ్మ నుండి వరం పొందిన మహిసాసుర అనే రాక్షసుడి అణచివేతకు దేవతలు ఒకప్పుడు భయపడ్డారు. పురాణాల ప్రకారం , రాక్షసుడు ఇంద్రుడిని ఓడించినప్పుడు , త్రిదేవ్ దుర్గను సృష్టించాలని నిర్ణయించుకున్నాడు. దుర్గా అష్టమి రోజున మహిసాసుర అనే రాక్షసుడిని తన త్రిశూలంతో చంపినది ఈ దైవిక స్త్రీ.
పండుగ యొక్క మూలం గురించి సమాజంలో ఇంకా చాలా కథలు ప్రబలంగా ఉన్నాయి. వారిలో , సీతను రక్షించడానికి రావణుడితో యుద్ధానికి ముందు రాముడు శక్తిని ఎలా ఆరాధించాడో , మరియు దేవతను ఎలా పిలిచాడు మరియు దుష్ట రాజును చంపే సామర్థ్యాన్ని అతనికి ఇచ్చాడు.
వేడుకలు / ఆచారాలు:
దుర్గాదేవి భక్తులు ఒక రోజు ఉపవాసం పాటిస్తారు మరియు దుర్గా ఆశీర్వాదం పొందడానికి దుర్గాదేవి యొక్క ఎనిమిది వ్యక్తీకరణలను పూజిస్తారు. ఖీర్ మరియు హల్వా యొక్క ప్రసాదం పూజా సమయంలో తల్లి దుర్గాకు అర్పించబడుతుంది. దుర్గాష్టమి పూజ సంప్రదాయంలో , చిన్నపిల్లలను పూజించే ఆచారం ఉంది. పూజ సమయంలో , అమ్మాయి దుర్గాను ప్రోత్సహించే విధంగా హల్వా పూరి మరియు బహుమతిని అందిస్తారు.
ఒక బలిపీఠం మీద పవిత్ర కలశం స్థాపించబడి సాధారణంగా , ఒక రాగి కుండ లేదా ఐదు లోహాలు, వెండి లేదా మట్టి కుండల కలయిక కూడా అనుమతించబడుతుంది. ఇది లోపల నీరు మరియు సుగంధ ద్రవ్యాలతో అలంకరించబడి ఉంటుంది , మరియు మామిడి ఆకులు మరియు కొబ్బరికాయలు దాని ముఖం మీద ముఖం క్రిందికి చూపిస్తాయి. తల్లి దుర్గా యొక్క చిత్రం వ్యవస్థాపించబడి తల్లి దుర్గా విగ్రహం వద్ద భక్తుడు పువ్వులు అర్పించాలి. పూజలో పవిత్ర స్నానం మరియు విగ్రహానికి పదహారు రకాల నైవేద్యాలు ఉన్నాయి. పెరుగు , పాలు , తేనె , ఆవు నెయ్యి , చక్కెర సహా ఐదు వస్తువులతో తయారు చేసిన పంచమృతంను దేవతకు అర్పిస్తారు. ఇతర సమర్పణలలో పండ్లు , పొడి పండ్లు మరియు రెసిన్లు , బెట్టు ఆకులు మరియు కాయలు , లవంగాలు మరియు ఏలకులు ఉన్నాయి. పూజ ముగింపులో , కర్రము యొక్క ఆర్తి , తొమ్మిది మంది చిన్నారులను ఆహ్వానించడం , పవిత్ర జలంతో పాదాలను కడుక్కోవడం వారికి బహుమతులు ఇవ్వడం ద్వారా పూజ ఎదురుచూస్తోంది. తల్లి దుర్గా ఆశీర్వాదం కోరడం ద్వారా రోజంతా ఉపవాసం పూర్తవుతుంది. #🙏
[07:36, 26/08/2020] +91 95506 66184: ఈ రోజు బుధ అష్టమి - బుదాష్టమి వ్రతము
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
🕉 బుధ అష్టమి అనునది హిందువులకు అతి పవిత్రమైనది. ఈ అష్టమి అనగా 8 వ తిథి , శుక్ల పక్షమున గాని , కృష్ణ పక్షమున గాని , బుధవారము నాడు సంభవించినచో ఆ అష్టమిని “బుదాష్టమి” అని అంటారు.
🕉 ఈ బుదాష్టమి పరమ శివుని పూజకు , అమ్మ పార్వతి దేవి పూజకు మిక్కిలి శ్ఱేష్టము. మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారము , ఎవరైతే ఈ బుధాష్టమి నాడు ఉపవాసముండి , శివారాధన , పార్వతి ఆరాధన చేస్తారో , అట్టి వారు , వారి మరణానంతరం నరకమునకు పోవరట. ఈ బుదాష్టమి వ్రతమును ఉత్తర దేశమున , అనగా గుజరాత్ నందును , మహారాష్ట్ర యందును ఎక్కువగా ఆచరిస్తారు.
ఈ బుదాష్టమి వ్రత విధానము:
🕉 ఈ దినము అనగా బుదాష్టమి నాడు భక్తులు నవగ్రహాలలో ఒకడైన బుదుడిని ఆరాదించి , ఆయన అనుగ్రహమును పొందుతారు.
🕉 ఈ దినము భక్తులు ఉపవాసముండి బుదుడికి ప్రత్యేక నైవేద్యమును నివేదించుతారు. వ్రత పూజ పిదప ఆ ప్రసాదమును మాత్రము తీసుకొన వలయును.
🕉 ఈ వ్రతమునకై బుధ విగ్రహము కానీ , బంగారు , వెండి కాసులో చిత్రీకరీంచిన బుదరూప కాసు ను కానీ , ఉపయోగించెదరు.
🕉 ఈ బుధుడి ముందు నీటితో నింపిన కలశమును పెట్టి కొబ్బరి బోండామును ప్రతిష్టించెదరు.
🕉 పిదప భయ భక్తులచే వివిధ పూజలను చేసి , ఆ నైవేద్య ప్రసాదమును అందరికీ పంచి ఇస్తారు.
🕉 ఈ వ్రతము ప్రారంబించివారు వరుసగా 8 మార్లు ఆచరించవలెను.
🕉 ఈ విధముగా ఆచరించిన పిదప , కడపటి బుదాష్టమి నాడు నీరు పేదలకు , భోజనాలు పెట్టి , తోచిన వస్త్ర దానం చేయవలెను , వారికి నెలకు సరిపడ బియ్యం , నూనె , పప్పులు దానము చేయవలెను , ఈ విధముగా బుద అష్టమి వ్రతమును చేసిన వారికి , వారి సకల దోషములు తొలగి , పుణ్యం లభించి నరక లోకమునకు పోక కైవల్య ప్రాప్తి పొందుతారు. కొందరు ఈ దినమున శివ పార్వతులకు పూజలు కూడా నిర్వహిస్తారు.
ఈ బుదాష్టమి విశిష్టత:
ఈ బుదాష్టమి యొక్క విశిష్టత బ్రహ్మాండ పురాణము నందు వివరింప బడివున్నది. ఈ వ్రతం చేసిన వారికి ప్రస్తుత , పూర్వ , జన్మ పాపములనుండి విముక్తి లభించును. శివ , పార్వతుల ఆరాధన ఈ బుదాష్టమి నాడు చేసిన అంతటి ఫలితం లభించును. ఈ వ్రతమాచరించిన వారికి బుధ గ్రహ దోషములు నివారింపబడి , బుధ గ్రహ బాధలనుండి విముక్తి లభించును. #🙏అమ్మవారి అలంకారాలు #🔱🙏
[07:42, 26/08/2020] +91 97043 58280: 🌸ప్రారబ్ధము ఆకస్మిక సుఖదుఃఖములకు కారణము🌸
చాలాసార్లు ప్రకృతి నియమమునకు పూర్తి వ్యతిరేకముగా అనిపించు విషయములు సంభవిస్తూ ఉంటాయి. ఒక మనిషి ఎంతో ఉత్తమ జీవితమును గడుపుతున్నప్పటికీ ఏదో తప్పుకు దండన విధించినట్లు ఆపదలు వస్తుంటాయి. వేరొకరు ఎంత చెడు పనులు చేస్తున్నప్పటికీ అతనికి అన్ని రకములైన సుఖసౌభాగ్యములు లభిస్తూ ఉంటాయి. కష్టపడి పనిచేయనివారికి లాటరీలో, జూదములో, లేక ఎక్కడో దొరకడం, లేక ఎవరో ఇవ్వడం మూలంగానో ధనము లభిస్తూ ఉంటుంది. కానీ నిరంతరం శ్రమ చేస్తున్న వ్యక్తి మాత్రం లేమిలో ఉంటూ ఉంటాడు. ఒకరు కొంచం శ్రమ చేయగానే విజయాన్ని సాధిస్తారు. ఇంకొకరు కఠిన ప్రయత్నం చేసినప్పటికీ అపజయాన్నే పొందుతూ ఉంటారు. దీనికి కారణము ప్రారబ్ధము. ఒక్కక్కసారి ప్రయత్నం చేసినప్పటికీ ఫలితము రాదు. దానికితోడు వ్యతిరేక ఫలితాలు వస్తుంటాయి. వాటిని ఎంతోకొంత అనుభవించక తప్పదు. ఇటువంటి అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఇంటికి వచ్చిన వారినో, కొత్తగా జన్మించిన పిల్లలనో, కొత్త కోడలినో ఆల్లుడునో, కొత్తగా కొన్న పశువులనో, ఇంటినో, వస్తువులనో ఈ సంఘటనలకు కారణముగా చూపిస్తూ ఉంటారు.
ఉదాహరణకు ఇంటిలోకి కొత్త కోడలు వచ్చిన కొన్ని రోజులలోనే ఆ ఇంటిలోఎవరైనా మరణిస్తే అలాంటప్పుడు మృత్యు దోషమునకు కారణము కొత్తకోడలు అని, దురదృష్టవంతురాలు వస్తూనే ఒకరిని బలి ఇవ్వవలసి వచ్చింది అని అంటారు. కానీ వాస్తవముగా ఆకస్మిక దుర్ఘటనలు జరిగినప్పుడు మనస్సు తీవ్ర బాధకు గురియై కర్తవ్యములను వదిలేసి మాటలను వాడటం జరుగుతూ ఉంటుంది. అకస్మాత్తుగా వచ్చు మూడు రకములైన సుఖదుఖములు (దైవిక, దైహిక, భౌతిక సంఘటనలు) సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలపై ఆధారపడి ఉంటాయి.
[07:51, 26/08/2020] +91 97043 58280: 🌸తపస్సు అంటే దేవున్ని స్మరించడం కాదు, కార్యసాధన ఆరాటం🌸
భగవంతుని కోసం నిరంతము పరితపించడాన్నే తపస్సు అంటారు .
మనోవాక్కాయకర్మల యందు ఆధ్యాత్మిక చింతనతో తపించ టాన్నే తపస్సు అంటారు .
నిత్య కృత్యాలు నేరవేరుస్తున్నా భగవంతుని తో అనుసంధానం అయి ఉంది కార్యాచరణను కావించటాన్నే తపస్సు అంటారు.
'తపస్సు...!' ఈ మాట వినగానే మన మహర్షులు, యోగులు, సిద్ధులు, మునులు ఏళ్లతరబడి చేసిన తపస్సే గుర్తుకొస్తుంది. వారు తమకోసం కాక, లోక కల్యాణార్థం వాయుభక్షణచేస్తూ నిరాహారులై తపస్సు చేశారు. సిద్ధి పొందారు.
శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో తపస్సును సాత్విక, రాజసిక, తామసికాలనే మూడు విధాలుగా వర్గీకరించి ప్రబోధించాడు. దీన్నే దేవతలు, గురువులు, జ్ఞానుల్ని పూజిస్తూ సేవిస్తూ, శుచి, నిష్కపటం, బ్రహ్మచర్యం, అహింస కలిగి ప్రవర్తించటం శారీరక తపస్సుగా చెబుతారు. ఇతరుల్ని బాధించే మాటలు పలకకుండా, సత్యంగా, ప్రియంగా మాట్లాడటం వాజ్మయ తపస్సు అంటారు. ప్రసన్నంగా, ప్రశాంతంగా ఉంటూ మౌనం, ఆత్మనిగ్రహం, భావశుద్ధి కలిగి ఉండటం మానసిక తపస్సు.
మదాహంకారాలతో మూఢంగా ఇతరుల్ని పీడిస్తూ పరుల నాశనం కోరడం ద్వారా తన వినాశనాన్ని పరోక్షంగా ఆహ్వానించడం తామసిక తపస్సుగా చెబుతారు. అలా తామసి తప్పక 'తా' 'మసి' అయిపోతాడని తాత్పర్యం. పౌరాణిక, చారిత్రక వేదికలపైన మనకీ మూడు వర్గాలవారూ కనిపిస్తారు. ఒక పవిత్ర లక్ష్యంతో ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో, నిస్వార్థ చింతనతో, పరహితార్థభావనతో, తపనతో చేసే దీక్షనే తపస్సు అంటారు. క్రమశిక్షణ, సమయపాలన, ధర్మాచరణ, ధ్యానం తపస్సులోని కీలకాంశాలు.
మనమంతా ఇప్పుడు తపస్సు చేస్తూనేఉన్నాం. నిర్దిష్ట సమయాల్లో నిత్యకృత్యాలను శ్రద్ధగా నిర్వర్తించుకుంటూ కార్యాలయాల్లో కానీ, బయట కానీ, ప్రభుత్వ ప్రభుత్వేతర నిర్దేశిత కార్యక్రమాలను, విధులను నెరవేరుస్తున్నాం.
నేర్చుకున్న జ్ఞానానికీ, విద్యకు, కళకు, అంకితమైపోయి జాతి శ్రేయం కోసమే వాటిని సద్వినియోగం చేయడం మన సనాతన ధార్మిక, తాత్విక సంస్కృతిని పరిపోషించడం, మానవసేవా యాగసమిధలమైపోవడం, సాటి ప్రాణిలో దైవత్వాన్ని చూసి గౌరవించడం, అభిమానించడం, సత్యం, ధర్మం, కరుణ, ప్రేమ, సత్సాంగత్యం వంటి తపస్సులోని అంతస్సూత్రాలే. తపస్సుకున్న లక్షణాలే.
ఇక్కడే మనం ఆత్మాన్వేషణ చేసుకోవాలి. ఆంతరిక విశ్లేషణ చేసుకోవాలి. మన ఈ తపోగానంలో ఎన్ని అపశ్రుతులు దొర్లుతున్నాయో, అంతర్వీక్ష చేసుకోవాలి.
కొంతమంది కాలకృత్యాలు తీర్చుకోవడం దగ్గరనుంచీ ప్రతిదీ వాయిదా వేసుకుంటూంటారు. సమయపాలనకు విలువ ఇవ్వరు. అవసరం లేకున్నా అసత్యాలు వందలు వందలుగా వల్లిస్తూనే ఉంటారు. ఎక్కడ, ఎలా అవకాశం దొరుకుతుందా? ఎవడ్ని ఎలా దోచుకుతిందామా అన్న ఆలోచనలతో ఎదకు, మెదడుకూ పదును పెడుతుంటారు.
తక్కువ శ్రమతో ఎక్కువ ధనమూ, సుఖమూ ఎలా లభ్యమవుతాయా అన్న తపనే తపస్సయిపోతోంది ఇవాళ. ఈ రకమైన ఆలోచనా విధానాన్ని త్యజిస్తేకానీ తపస్సుకు అర్థం బోధపడదు. అది ఒకసారి అవగతమై హృదయంలో తిష్ఠవేసుకుందీ అంటే, అప్పటి ఆనందం అనుభవైకవేద్యం. అది వివేచనాపరులకే సాధ్యం.
ఏదైనా అడుగుతూ తపస్సు చేశామంటే ఆ సర్వజ్ఞుడి విజ్ఞతను తక్కువ అంచనా వేసే అట్టడుగు స్థాయిలో ఉన్నామని అర్థం.
కొంచెం శ్రద్ధ, మరికొంత సంయమనం, ఇంకొంచెం సంస్కారం, మరికాస్త జ్ఞానం, మరింత పట్టుదల ఉంటే జీవనయానమనే తపస్సు సాధ్యమే.
మన సనాతన రథసారథులు సాధకులకోసం మోక్ష ద్వారాన్ని చేరుకోవడానికెన్నో సుగమమైన మార్గాలు చెప్పారు. అవి తెలుసుకోవడానికి మరీ అంత కష్టపడవలసిన పనిలేదు. ఆసక్తి ఉంటే చాలు, 'ఆ'శక్తి దానంతటదే మనల్ని ఆవహిస్తుంది. విజయసుధల్ని ఆహ్వానిస్తుంది. ఆ ఆసక్తిని కూడా చూపక నిరాసక్తులమై, బద్ధక చక్రవర్తులమైతే జీవితంలో ఇంక సాధించేదేంటి? భూమికి భారంగా, చరిత్రహీనంగా జీవించే హక్కు భగవంతుడు మనకివ్వలేదు!
భగవంతుణ్ని మనమేదైనా అడిగే బదులు, అడక్కుండానే మన అవసరాన్ని గ్రహించి ఆయనే తనంతతానుగా మనకు ఇచ్చే విధంగా 'అర్హత'ను మనం ఆర్జించడమే ఉత్తమమైన తపస్సు.
నిత్యజీవన విధానంలోని అంశాలన్నింటినీ- అంటే- స్నానం, ధ్యానం, ఆహారం, నిద్ర, కర్తవ్యం మొదలైనవాటిని తపస్సులోని ప్రధానాంశాలుగా, పవిత్రమైన అంశాలుగా, భావించి, ఆచరించిననాడు మోక్షగవాక్షం మనకళ్ల ముందే ప్రత్యక్షమవుతుంది. అందుకు మనం కటిబద్ధులం కావాలి, నవబుద్ధులం కావాలి.
👉🏻తపస్సు విశిష్ఠత
👉🏻తపస్సు అంటే ఏమిటి ?
ఒక మంత్రాన్నో..., ఏదో ఒక దైవాన్నో ఉపాసిస్తూ., నిరంతర ధ్యానంలో ఉండడమే తపస్సు అనుకుంటే పొరపాటు.
'తపనే' తపస్సు. ఒక కార్యసాధన కోసం అనుక్షణం తపించడమే..., ఆరాటపడడమే 'తపస్సు. అలా తపించినంత మాత్రాన., ఆరాటపడినంత మాత్రాన ప్రయోజనం ఉంటుందా అనే సందేహం ఎవరికైనా కలుగవచ్చు. తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే...మనస్సంకల్పానికి ఉన్న శక్తి, బలము.... ఈ సృష్టిలో దేనికి లేదు. ఆయుధాన్ని వాడకుండా, ఓ మూల పడేస్తే తుప్పుపట్టి పనికిరాకుండా పోతుంది. ఆయుధాన్ని నిరంతరం వాడుతూంటే పదునుదేలి..దాని పనితనాన్ని చూపిస్తుంది. అలాగే మనస్సు కూడా. అయితే., ఇక్కడ మీకో సందేహం రావచ్చు.'అయ్యా.. మనస్సు నిరంతరం ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూనే ఉంటుంది కదా అని.' నిజమే...ఆలోచించడం వేరు. ఆరాటపడడం వేరు. ఏదో ఒక విషయం గురించి ఆలోచించడాన్ని.., ఆరాటపడడం అనరు. చంచలమైన మనస్సును నియంత్రించి, ఒక నిర్దిష్ఠమైన లక్ష్యాన్ని దానికి నిర్దేశించి., ఆ దిశగా మనసును మళ్ళించడానికి పడే ఆరాటాన్నే., తపననే., తపస్సు అంటారు. అది మంచి అయితే మంచి ఫలితాన్ని.., చెడు అయితే చెడు ఫలితాన్ని తప్పకుండా ఇస్తుంది. అందుచేతనే తపస్సు చేసే సాధకుడు మంచినే ఆశించి., విశ్వశాంతిని కాంక్షిస్తూ తపస్సు చేయాలి. అదే నిజమైన తపస్సు. తపస్సు గురించి ఇంత వ్యాఖ్యానం ఇచ్చారు కదా...ఇది నిజం అని నిరూపించడానికి ఏదైనా ఆధారం ఉందా ? అని ప్రశ్నించ వచ్చు. ఆధారం లేకుండా ఏ విషయాన్ని మన ఋషులు ఇంతవరకు ప్రతిపాదించలేదు. దీనికి ప్రకృతి పరమైన ఆధారం ఉంది. సృష్టిలో అందమైన కీటకం 'సీతాకోకచిలుక'. దీని పుట్టుక చాలా వింతగా ఉంటుంది.
సాధారణంగా ఒక ప్రాణి నుంచి అదే విధమైన ప్రాణి పుడుతుంది. ఉదాహరణకు కోడిగ్రుడ్డు నుంచి కోడిపిల్ల పుడుతుంది. సీతాకోకచిలుక పెట్టే గ్రుడ్ల నుంచి సీతాకోకచిలుకలు రావు. గొంగళిపురుగులు వస్తాయి. ఈ గొంగళిపురుగులు చూడడానికి చాలా అసహ్యంగా ఉంటాయి.ఆ దశలో అది రాళ్ళలో., రప్పల్లో.., ముళ్ళలో తిరుగుతూ., ఆకులు తింటూ కాలం గడుపుతుది. అలా కొంత కాలం గడిచాక తన జీవింతం మీద రోత కలిగి.,ఆహార, విహారాలు త్యజించి, ఎవ్వరికీ కనిపించని ప్రదేశనికి పోయి., తన చుట్టూ ఓ గూడు నిర్మించుకుని, తపస్సమాధి స్థితిలోకి వెళ్లిపోతుంది. అలా కొంతకాలం గడిచాక, దాని తపస్సు ఫలించాక అది తన గూడు చీల్చుకుని బయటకు వస్తుంది. అయితే అది గొంగళిపురుగులా రాదు. అందమైన సీతాకోకచిలుకలా వస్తుంది. అప్పుడది ఆకులు, అలములు తినదు. పూవుల్లో ఉండే మకరందాన్నే తాగుతుంది. ప్రకృతి ధర్మానికి కట్టుబడి గ్రుడ్లు పెట్టిన మరుక్షణం ఈ సంసార జగత్తులో చిక్కుకోక మరణిస్తుంది. అదీ తపస్సు ఇచ్చే ప్రతిఫలం. అలాగే తపస్సిద్ధి పొందిన మానవుడు ఈ సంసార లంపటంలో చిక్కుకోక.... భగవన్నామామృత పానంతో తరిస్తాడు.
[07:54, 26/08/2020] +91 90942 22931: 🙏 భార్య మంగళసూత్రాన్ని అలా వేసుకుంటే
భర్త వందేళ్లు జీవిస్తాడు,
ప్రతి భర్త తెలుసుకోవాల్సిన విషయాలివి. 🙏
🙏 పెళ్ళైన స్త్రీకి అందం ఐశ్వర్యం మెడలో తాళి బొట్టు భర్త భార్యకి కట్టినప్పుడు వేద మంత్రాలతో ఆ తంతు జరుగుతుంది. భార్య మెడలో మంగళసూత్రం, నుదిటిన సింధూరం భర్త ప్రాణాలను సంతోషాలను కాపాడుతుంది. మంగళసూత్రానికి సంబంధించిన విషయాలను ప్రతి భర్త ఎందుకు తెలుసుకుని భార్య అలా మంగళసూత్రం వేసుకునేలా చూసుకోవాలి. 🙏
🙏 వివాహ సమయం నుంచి స్త్రీలు మంగళసూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్దంలోనే ఆరంభమైంది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుంచి పుట్టింది. పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురి మెడలో తాళి బొట్టు మాత్రమే కడతాడు.🙏
🙏 సంసారం నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో సాగాలని
ఆ తర్వాత ఆడవారు మంగళ సూత్రంలో పగడాలు, ముత్యాన్నీ, చిన్న చిన్న విగ్రహాల్ని ధరిస్తారు. అలా ధరించడం ఫ్యాషన్ అని చాలా మంది అనుకుంటారు. అది పొరపాటు. అలా చేయకూడదు. అలాగే మంగళసూత్రం భార్యాభర్తల అనుబంధానికి ప్రతీక. 🙏
🙏మంగళ అంటే శుభప్రదం, శోభాయమానం, సూత్రం అంటే తాడు, ఆధారమని అని అర్థం. వివాహంలో భాగంగా వరుడు వధువు మెడలో మూడుముళ్ళను వేస్తాడు. భర్త ఆరోగ్యంగా ఉండాలని, తన సంసారం నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో సాగాలని వధువు మెడలో మూడు ముళ్ళను వేయిస్తారు వేదపండితులు. ఆ ముక్కోటి దేవతల సాక్షిగా ఈ పెళ్లి జరిగినట్లు, దేవ దేవతలందరూ నూతన వధూవరులను దీవిస్తారని నమ్మకం.🙏
🙏అయితే ప్రస్తుతం కొందరు మహిళలు మంగళసూత్రాలను పక్కనబెడుతున్నా, మంగళసూత్రం బదులుగా నల్లపూసల హారాన్ని, ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కు తగ్గట్లుగా ఉన్న మంగళసూత్రాలను ఉపయోగిస్తున్నారు. దక్షిణాదిన మంగళసూత్రాన్ని తాళిగా పలుకుతున్నారు. నలుపు, బంగారువర్ణంలో ఉండే మంగళసూత్రంలో ఆ పార్వతి పరమేశ్వరులు కొలువై ఉంటారట.🙏
🙏 నలుపు రంగు వర్ణంలో శివుడు, బంగారు వర్ణంలో పార్వతిదేవి కొలువైఉంటుంది. ఎటువంటి కీడు జరగకుండా, వధువు సుమంగళిగా ఉండాలని పార్వతిపరమేశ్వరులు స్త్రీ హృదయానికి అంటుకొనే ఉంటారు. అందుకే మంగళసూత్రాన్ని స్త్రీ హృదయం వరకు ఉండేలా చేస్తారు. హృదయస్థానానికి మంగళసూత్రం తాకుతూ ఉండటం వలన, ఆ స్త్రీ సుమంగళిగా ఉంటుంది.🙏
🙏మంగళసూత్రం ధరించడం వలన స్త్రీకి ఎక్కడలేని శక్తి, ఎక్కడైనా పోరాడగలను,నెగ్గగలను అనే ధైర్యసాహసాలు కలుగుతాయట. మంగళసూత్ర్రాలలో పసుపుతాడును వాడుతారు. వరుడు మూడు ముళ్ళు వేసిన తర్వాత ఒక్కో ముడికి కుంకుమను అద్దుతారు. మంగళసూత్రాలను బంగారువి చేయించుకున్నా, మధ్యలో తాడు మాత్రం పసుపుతాడునే వాడాలి. ఇతర ఏ లోహాలతో తయారుచేసినవి వాడకూడదు. పసుపు కుంకుమలలో సర్వమంగళాదేవి ఉంటుందట.🙏
🙏 అయితే కొందరు మంగళసూత్రంపైన బొమ్మలు గీయించడం, రంగులు దిద్దిచడం వంటివి చేస్తుంటారు. కొంతమంది లక్ష్మీబొమ్మ మంగళసూత్రంపై కనిపించే విధంగా తయారుచేసుకుంటారు. అసలు ఇలాంటివి చేయించవచ్చా లేదానని ఇప్పుడు తెలుసుకుందాం. మనకు ఆదర్శ దంపతులు అంటే గుర్తుకువచ్చేది సీతారాములు. సీతమ్మ అంటే రాముడికి ఎంత ఇష్టమో చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సీతే తన మంగళసూత్రంపై రాముల వారి బొమ్మగాని, రంగులు కానీ వేయించుకోలేదట. సీత ఎలాగైతే మంగళసూత్రాన్ని చేసి వేయించుకున్నారో అలా చేస్తే ఖచ్చితంగా సిరిసంపదలు కలుగుతాయట.🙏
🙏 కొంతమందికి వేంకటేశ్వరస్వామి అంటే ఇష్టం. మరికొందరికి దుర్గాదేవి అంటే ఇష్టం. ఇంకొంతమందికి మిగిలిన దేవుళ్ళంటే ఇష్టం. ఎవరికి ఇష్టమొచ్చిన దేవుడిని మంగళసూత్రంపై తయారుచేసి వేయించుకుంటుంటారు. అలా దేవుడి ప్రతిమలను అస్సలు మంగళ సూత్రాలపై వేసుకోకూడదట. ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమను ఉన్న మంగళసూత్రాన్ని అస్సలు వేసుకోకూడదట. ఒకవేళ వేసుకుంటే సిరిసంపదలు పోయి కష్టాలు ప్రారంభమవడం మొదలవుతాయట. కాబట్టి మంగళసూత్రాన్ని మామూలుగా వేసుకోవడం మంచిది.🙏
🙏 వాస్తవానికి మంగళసూత్రాన్ని పత్తి నుంచి తీసిన దారంతో గానీ, పట్టునుంచి వచ్చిన దారంతో గాని చేయాల్సి ఉంది. దీనికి ఒక సంపూర్ణమైన శాస్త్రమే వుంది. దీనిని ఒక తాంత్రిక విధానంతో, ఒక నాడిని మీ వ్యవస్థ లోంచి, మరొకటి మీకు నిశ్చితార్థం అయినవారి దగ్గర నుంచి తీసి, ఈ సూత్రాన్ని తయారుచేసి కడతారు. ఈ విధంగా సూత్రాన్ని తయారు చేశాక, ఎప్పుడైతే భౌతిక సాన్నిహిత్యం కలుగుతుందో అప్పుడు శక్తిపరమైన సాన్నిహిత్యం కూడా కలుగుతుంది. ఈ దంపతులు ఎంతగా ఒక్కటైపోతారంటే, ఇంక ఆ బంధాన్ని విడదీయలేరు. ఒకరి నుంచి ఒకరిని విడదీయడమన్నది ఎంతో కష్టమైనది.🙏
🙏 అలాగే భార్య మెడలోని మంగళసూత్రం భర్తను అలాగే వివిధ రకాల దుష్ట శక్తుల నుంచి కాపాడుతుంది. మంగళసూత్రాల విషయంలో స్త్రీలు కచ్చితంగా కొన్ని విషయాలు పాటిస్తే ఆ ఇంట్లో సుమంగళి యోగం సిద్ధిస్తుంది.🙏
🙏ప్రతి శుక్రవారం, మంగళవారం అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి ఆ పసుపుని మంగళసూత్రాలకు పూజ సమయంలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఐదోతనాన్ని ఇచ్చే పార్వతి దేవి కటాక్షిస్తుంది. మంగళసూత్రాలకు పిన్నీసులు, ఏ ఇతర ఇనుముకి సంబంధించిన వస్తువులు పెట్టకూడదు.
మంగళసూత్రం ఎప్పుడు హృదయం కింద వరకు ఉండాలి అంటే వక్షస్థలం పూర్తిగా దాటి కిందకి ఉండాలి.🙏
🙏మంగళసూత్రాలకి ఎప్పుడు ఎరుపు (పగడం) నలుపు పూసలు ఉండాలి. పొరపాటున మంగలసూత్రం తెగిపోతే వెంటనే 5 వరసల దారం తీసుకుని దానికి ఒత్తుగా పసుపు రాసి పసుపు కొమ్ము తీసుకుని దానిని ఆడపడుచు చేత కాని భర్త చేత కాని వేయించుకోవాలి. ఇంకా ఎవరు లేకపోతే తమకు తామే వేసుకోవాలి. మంచి రోజు చూసి ఉదయం 9 గంటల లోపు మళ్లీ మంగళసూత్రాన్ని (బంగారు తాళిని) వేసుకోవాలి. ఇవన్నీ భార్య పాటిస్తే భర్త ఆయుష్షు బలంగా ఉంటుంది. వందేళ్లు సుఖంగా జీవిస్తాడని శాస్త్రాలు చెపుతున్నాయి🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శుభోదయం
[07:19, 26/08/2020] +91 97043 58280: శుభోదయం.
*జెర్మన్ విచారకుడు స్కోపెన్హర్ గీతని చదవగానే, దాన్ని తన తల మీద పెట్టుకుని నాట్యం చేశాడు. ఆయన ఆత్మచైతన్యం పొందడం జరిగిందా? అలాగే బెర్ట్రాండ్ రస్సెల్ కూడా భగవద్గీత చదివాడు కానీ, కృష్ణునిచే ప్రభావితుడు కాలేదు. ఆయన బుద్ధుని వలన ప్రభావితుడు అయినా కూడా, ఆయనకి శిష్యుడు కాలేదు. ఈ రెండు ఘటనల గురించి కొంచెం చెప్పండి.
వారిద్దరి చిత్త దశ భిన్నంగా ఉంది. స్కోపెన్ హర్ అర్జునునిలా విషాద స్థితిలో వున్నాడు. అతని జీవితం ఒక సంతాపం. అలాంటి స్థితిలో అతని చేతుల్లో భగవద్గీత పడింది. దాహంగా ఉన్నవాడికి ఎడారిలో సెలయేరు దొరికినట్లయింది. చేతిలో పడడం ఆలస్యం దాన్ని వెంటనే చదివేశాడు. ఆ తర్వాత గీతని తల మీద పెట్టుకుని నాట్యం చేయసాగాడు. ఏ కిరణాల మీద నాకు భరోసా ఉండేది కాదో, ఇప్పుడు వాటి మీద భరోసా ఏర్పడింది అన్నాడు. ఆ కిరణాల సాయంతో అతను కృష్ణుడు దాకా వెళ్లగలడు.
ఇక రస్సెల్ లో విషాదం లేదు. అతను ఒక ప్రశాంత చిత్తం గల మనిషి. అసలు విషాదమే లేనప్పుడు గీతని ప్రారంభించడం కుదరదు. జీవితంలో విషాదం లేనప్పుడు, గీతతో జోడింపబడడం కుదరదు. దాహం లేనప్పుడు జలధార పక్కనే ఉన్నా పట్టించుకోవడం ఉండదు. అతనికి బుద్ధినితో కొంచెం జత కలిసింది. బుద్ధుడు కొంత బుద్దివాది.
[07:27, 26/08/2020] +91 97043 58280: 🌸మానవజీవితపరమార్థం....🌸
🌻బాలస్తావత్ క్రీడాసక్తః
తరుణస్తావత్ తరుణీ సక్తః
వృద్ధస్తావత్ చింతాసక్తః
పరమే బ్రహ్మణి కో పినసక్తః🌻
ఈ దేహాన్ని గురించి, దాని యదార్థ తత్వాన్ని గురించి తెలుసుకోలేని సామాన్యులు జీవితాన్ని ఎలా గడిపి వ్యర్థం చేసుకుంటున్నారో ఆది శంకరులు తెలిపిన శ్లోకమిది. ‘మోహముద్గరం’గా పేరొందిన 31 శ్లోకాల ‘భజగోవిందం’లోని ఏడో శ్లోకం. మానవుడు.. బాల్యంలో ఆటపాటల మీద ఆసక్తితో ఉంటాడు. యౌవనంలో స్త్రీల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. వృద్ధాప్యంలో చింతలతో సతమతమౌతుంటాడు. అంతే తప్ప.. పరమోత్కృష్టమైన మానవ జన్మ లభించినా ఆ పరమాత్మ యందు ఆసక్తి చూపేవారెవరూ ఉండరుగదా అని దీని అర్థం. జీవుడు అనేక దేహాలను ధరిస్తూ, వదులుతూ ప్రయాణం చేస్తుంటాడు.
ఈ క్రమంలో మానవదేహం వచ్చినప్పుడు దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. మానవ జన్మ వచ్చినప్పుడు.. బుద్ధి ఉంటుంది. దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. అంటే బుద్ధిని భగవంతుని వైపునకు తిప్పాలి. అలా తిప్పకపోతే మానవ జీవితం వచ్చి కూడా.. సంపాదించుకోవడం, తినడం, నిద్రపోవడం, పిల్లలను కనడం, వారిని పోషించడం, కూడబెట్టడం, అనుభవించడం అనే కార్యాలలోనే మునిగిపోయి జంతువులాగా జీవిస్తే జీవితం వ్యర్థమవుతుంది. ఫలితంగా ఆ మనిషి ఇంకా అనేక జన్మలు ఎత్తాల్సి ఉంటుంది.
అయినా మానవుడు ఇహంలో ఉన్న అల్ప విషయాల్లోనే ఆనందాన్ని వెతుక్కుంటూ దుఃఖాలతో కూడిన తాత్కాలిక సుఖాలనిచ్చే విషయ వస్తువుల్లోనే సుఖాన్ని వెతుక్కుంటూ, నరక సదృశంగా ఉండే సంసార దుఃఖ సాగరంలోనే స్వర్గాన్ని వెతుక్కుంటూ అజ్ఞానంలోనే జీవితాన్ని గడుపుతున్నాడు. వీటన్నింటినీ మించిన శాశ్వత ఆనందం ఒకటి ఉన్నదని.. అది తనలోనే ఉన్నదని, అది అసలు తన స్వరూపమేనని తెలుసుకోలేక అజ్ఞానంతో జీవితమంతా పరుగులు పెడుతున్నాడు. ఇలా పరుగులు పెట్టే మానవుడి జీవితకాలం బాల్య, యవ్వన, వార్ధక్యాల్లో ఎలా వృథాగా గడిచిపోతుందో శంకరాచార్యులవారు ఈ శ్లోకం ద్వారా తెలిపారు.
జీవితమంతా ఇలా గడిచిపోతుంటే ఇక జీవితపరమార్థమైన మోక్షాన్ని అందుకోవడానికి కృషి చేసేదెప్పుడు? పరమాత్మను చేరుకునేదెప్పుడు? లౌకిక విషయాలకే పరిమితమైపోతే పారమార్థిక విషయాలకు చోటెక్కడ? మనిషిగా పుట్టినందుకు, భగవంతుడు వివేకాన్ని ఇచ్చినందుకు సాధించవలసింది ఇదేనా? కానే కాదు. బుద్ధిని పరమాత్మ వైపునకు మళ్లించి ఆయనపై ప్రేమానురాగాలు చూపించి ఆయనను స్మరిస్తూ కడకు ఆయన్ను అందుకోవడమే మానవ జీవిత పరమార్థం. అందుకే మనకు మానవ జన్మ లభించింది. పరమాత్మను అందుకుంటున్నామంటే దుఃఖాలతో, బాధలతో కూడిన ఈ సంసార జనన మరణ చక్రం నుండి తప్పించుకొని మనను మనం ఉద్ధరించుకొంటున్నామన్నమాట.
[07:30, 26/08/2020] +91 97043 58280: పురోహితులు పూజాది కర్మ కాండలను దేవాలయాల్లో మరియు ఇళ్ళలో చేస్తుంటారు. స్వర్గలోకంలో బృహస్పతి ప్రధాన పురోహితుడు. అందుకే ఆయన పురోహితులలో కెల్లా అతిముఖ్యుడు. అందరు పురోహితులలో కెల్లా తాను బృహస్పతిని అని ఇక్కడ శ్రీ కృష్ణుడు అంటున్నాడు. కానీ, శ్రీమద్భాగవతంలో 11.16.22వ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు, పురోహితుల్లో తాను వశిష్టుడను అని అన్నాడు. ఈ రెండు చోట్ల ఆయన భిన్నముగా ఎందుకు చెప్పాడు? ఇది సూచించేదేమిటంటే, మనం ఆ వస్తువుకు ప్రాధాన్యత ఇవ్వకూడదు, ఆ వస్తువులో ప్రకటితమయ్యే భగవంతుని విభూతికి ప్రాధాన్యం ఇవ్వాలి. శ్రీ కృష్ణుడు ఉదహరిస్తున్న అన్ని మహిమాన్వితమైన వస్తువు/వ్యక్తులనూ మనం ఈ విధంగానే అర్థం చేసుకోవాలి. ప్రాధాన్యత వస్తువుకి కాదు, ఆ వస్తువులో ప్రకటితమయ్యే భగవంతుని విభూతికి ఇవ్వాలి.
శివుని పుత్రుడైన కార్తికేయుడు, దేవతల సేనాధిపతి, ఆయనకే స్కందుడు అని కూడా పేరు. అందుకే ఆయన సమస్త సేనాపతులకు అధ్యక్షుడు, మరియు భగవంతుని విభూతిని చక్కగా ప్రకటిస్తున్నాడు. అంతేకాక, ప్రవహించని జలాశయాల్లో, తానే గంభీరమైన మహా సముద్రమును అని కూడా శ్రీ కృష్ణుడు అంటున్నాడు.
🚩🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏
+91 94923 06908: అరుణాచల శివ 🙏
🍁🍁🍁🍁
ఒకరోజు భగవాన్ రమణమహర్షి తన ఆశ్రమంలోని వంటిగదికి వెళ్ళారు.
అక్కడ నేలమీద బియ్యపుగింజలు పడి ఉండడంచూశారు.
ఆయన వెంటనే కింద కూర్చుని వాటిని ఒక్కొక్కటిగా ఏరడం మొదలు పెట్టారు.
కాసేపటికి అక్కడికి ఆయనశిష్యులు వచ్చారు. తమ గురువుగారు నేలమీద కూర్చుని బియ్యం గింజలు ఏరుతుండడం చూసి విస్తుపోయారు.
ఆత్మజ్ఞానం కోసం ఇంటినీ, తల్లినీ, ఇతర బంధువులను విడిచిపెట్టి వచ్చిన రమణమహర్షి ఇలా బియ్యపుగింజల్ని ఏరడం ఏమిటా అని వాళ్ళలో వాళ్ళు చెవులు కొరుక్కున్నారు.
ఉండబట్టలేక వారు ఆయనవద్దకు వెళ్ళి "స్వామీ, నేలమీదపడిపోయిన కొన్ని బియ్యపుగింజలకి ఇంత ప్రాధాన్యమివ్వాలా? మన ఆశ్రమంలోబియ్యపు బస్తాలకు ఏ మాత్రం కొరతలేదు కదా?" అని ఆయనను మెల్లిగా అడిగారు.
అప్పుడు ఆయన ఏం చెప్పారో చూడండి - "మీరు వీటిని ఉత్తి బియ్యపుగింజలుగా చూడటం సరికాదు. వీటి లోపల ఏమేమున్నాయో చూడగలగాలి. మీకెవ్వరికీ అన్నదాత శ్రమ కనిపించడంలేదా? సూర్యుడి వెలుగు కనిపించడం లేదా? హాయినిచ్చే గాలి లేదా? మృదువైన మట్టి లేదా? ఇలాంటివేవీచూడలేకపోతున్నందువల్లె మీరు వీటిని ఉత్తి బియ్యపు గింజలుగా అనుకుంటున్నారు.
కానీ నేను చెప్పినవన్నీ వీటిలోకనిపించి ఉంటే కిందపడిపోయిన ఈ బియ్యపుగింజల్ని ఏరాలా? అని నన్ను అడిగేవారు కాదు. ప్రతి బియ్యపు గింజకూ భగవంతుడి కటాక్షం ఉందన్న సంగతి పరచిపోకండి.
అందుకే అంటున్నా...మీరు ఈ వాస్తవాన్నివిస్మరించకండి...
ఎప్పుడైనా సరే మీ పాదాలతో వాటిని తొక్కి వృథా చేయకండి. నేలమీద పడిన బియ్యపు గింజలనుభద్రపరచి తినడం ఇష్టం లేదనుకుంటే వాటిని పక్షులకైనా వెయ్యండి. అవి ఎంతో తృప్తిగా తింటాయి..." అని.
ఆయనమాటలు విన్న తర్వాత శిష్యులు ఇక నోరెత్తితే ఒట్టు.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరావు గారి ప్రవచనములు.నుండి ...
🍁🍁🍁🍁
+91 94923 06908: *🌺🙏ఓం నమో భగవతే రమణాయ
🌴 భక్తి అంటే మనము భగవంతుని వెదుక్కుంటూ వెళ్లడం కాదు, భగవంతుడే మనలను వెదుక్కుంటూ రావాలి. అది నిజమైన భక్తి అంటే! పుణ్యకార్యాలు, సేవలు చేసేవారు తాము ఇంత చేసాము అంత చేసాము అని చెప్పుకోవలసిన అవసరం లేదు. ఎందువలనంటే ఇలాంటి ఆడంబరాలు, ప్రకటనలతో మనలో ఉండే ఆ కాస్తంత ప్రేమ కూడా అహంకారముగా రూపుదాల్చే ప్రమాదం లేకపోలేదు. కనుకనే సేవలు చేసేవారు నిస్వార్థబుద్ధితో నిరాడంబరంగా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఫలాసక్తి లేకుండా సేవలు చేసేవారు భగవంతుని కోసం ఎక్కడకీ వెదుక్కుంటూ పోనవసరం లేదు ఆయనే ఇటువంటి వారిని వెదుక్కుంటూ వస్తాడు.
--(())--
+91 94923 06908: గెలిపించే స్ఫూర్తిమంత్రం
గెలిచినవాడి ముఖం ఎలా ఉంటుంది, విజేత ఎలా నడుస్తాడు, ఎలా మాట్లాడతాడు... విజయం తరవాత విజయం అతడిని ఎక్కడికి చేరుస్తుంది? విజయగర్వంతో అతడు పాత మిత్రులను మరిచిపోతాడా? అలా ఎన్నటికీ జరగదు.
శిఖరాగ్రం చేరిన విజేత పళ్ల బరువుకు వంగిన చెట్టులా ఉంటాడు. సముద్రపుటొడ్డున ధీరోదాత్తంగా నిలబడి నావలకు దారి చూపుతున్న కాంతి స్తంభంలా ఉంటాడు. స్నేహహస్తం చాచి తన దారిలో ముందుకు రమ్మని మిత్రులను పిలిచి సాయం చేస్తాడు నిజమైన విజేత.
విజేతలు ప్రత్యేకంగా ఉండరు. ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటారు. తొణక్క, బెణక్క నిండు కుండలా ఉంటారు. తలెత్తుకుని విజయ పతాకం వైపు చూస్తుంటారు. అర్జునుడి ఏకాగ్రత పక్షి కన్ను మీద ఉన్నట్లు- విజయం వైపు తమ గురిపెట్టి అత్యంత చాకచక్యంగా, నేర్పుగా, లాఘవంగా ముందుకు కదులుతుంటారు విజేతలు.
విజేతలు ఖాళీగా ఉండరు. కాలక్షేపం కబుర్లు చెప్పరు. వాస్తవాన్ని అంగీకరిస్తూనే కలలకు రంగుల రెక్కలు తొడుగుతారు. భ్రమలకు దూరంగా ఉంటారు. వేసిన ప్రతి అడుగుతో లక్ష్యానికి చేరువవుతూ ఉంటారు.
జగజ్జేతలు కాదలచిన అలెగ్జాండర్, నెపోలియన్, హృదయ సామ్రాజ్యాలు గెలిచిన అశోకుడు, చంద్రగుప్తుడు, ఆధ్యాత్మిక విజేతలైన ఆదిశంకరుడు, బుద్ధుడు, రామానుజుడు... విజేత తత్వానికి దర్పణం పట్టారు.
గులాబీ పరిమళాలను ఇస్తుంది. గంధం సువాసనను ఇస్తుంది. తేనె మధురంగా ఉంటుంది. విజేత హస్త కరచాలనం విజయ ప్రకంపనలు పుట్టిస్తుంది. విజేత దరహాసం ఆకర్షిస్తుంది. విజేతలు కొమ్ములతో, ఆజాను బాహువులుగా ఉండాలని లేదు. విజేతలు ఎలాగైనా ఉండవచ్ఛు దివ్యాంగులు, అంధులు, అనాకారులు జయాన్ని గుప్పిటపట్టవచ్ఛు మనిషై పుట్టిన వారెవరైనా విజేతగా మారవచ్ఛు
మనలోపల దేదీప్యమానంగా వెలుగు తున్న ఒక ఉజ్జ్వలమైన కోరిక ఉండాలి. మనలో మనం ఒక విజేతను చూసుకోవాలనే తపన ఉట్టిపడుతుండాలి. ఇవే విజేతను పట్టిచ్చే గొప్ప లక్షణాలు.
విజేత అందరిలాగే తింటాడు. నిద్రపోతాడు. లేస్తాడు. నడుస్తాడు. కారులో తిరుగుతాడు. విమాన ప్రయాణం చేస్తాడు. అతడి మనసు మాత్రం ఎప్పుడూ విజయాకాశంలో విహరిస్తుంటుంది.
అర్జునుడు, శ్రీకృష్ణుడిని స్థితప్రజ్ఞుడి లక్షణాలు అడిగి తెలుసుకున్నట్లు, విజయం సాధించాలనుకునేవారు మొట్టమొదట విజేతల లక్షణాలు, అలవాట్లు తెలుసుకోవాలి.
రోడ్డు వెయ్యడం కష్టంతో కూడుకున్న పని. వేసిన రోడ్డు మీద వెళ్లిపోవడం సులువు. విజేత మార్గం తెలుసుకుంటే ఆ దారంట వెళ్ళి మనం లక్ష్యం చేరుకోగలం. శిఖరాగ్రం చేరుకుని, విజయ పతాకం ఎగరేసినవాణ్ని లక్ష్య సంకేతంగా పెట్టుకుంటే గమ్యం మనకు కనిపిస్తూ ఉంటుంది.
కష్టాలతో కూడుకున్నా శ్రీరామ మార్గం అత్యున్నతమైనదని త్రేతాయుగం నుంచి ఆయనను అనుసరిస్తున్నవారు కోటానుకోట్ల మంది ఉన్నారు. శ్రీరాముడు విజేత. శ్రీకృష్ణుడు విజేత. పరమశివుడు విజేత. విజయదుందుభులు మోగించే ప్రతి దేవత, ప్రతి దేవుడూ విజేతే. విజయం సాధించడం మానవుడి జన్మహక్కు. పుట్టుకతో మనిషి విజేత. విజేతలను సత్కరించడం అంటే, మనం వారి మార్గంలో నడిచి, అనుసరించి విజయాలను పొందడం. కొంతమంది విజేతల అద్భుతమైన జీవిత చరిత్రలు మనకు నిరంతర ప్రేరణను, స్ఫూర్తిని కలిగిస్తాయి. గాంధీజీ సత్యశోధన, చార్లీ చాప్లిన్ జీవితం... ఆ కోవకే చెందుతాయి.
యువత విజేతల లక్షణాలు ఒడిసిపట్టుకోవాలి. నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకుపోవాలి.
--(())--
, 25/08/2020] Mallapragada Ramakrishna: సంఘటనం ఒక యజ్ఞం సమిధగ మన జీవనం
భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరు నవ్వులం || సంఘటనం ||
గలగల పారే ఆ జలపాతం నిలిచిందా తనకోసం ఏనాడైనా
మిల మిల మెరిసే ఒక అగ్ని కణం మిగిలిందా తనకోసం ఏ క్షణమైనా
తరతరాల భారతీయ తాపసులది ఈ మార్గం
ఆత్మలో నివేదనం అమ్మకు నీరాజనం || సంఘటనం ||
భూమి పొరలలో పురుడును పోసే రైతు రాసాడా తన పేరును ఏనాడైనా
ఆజన్మాంతం సేవలు చేసే తల్లి అడిగిందా ఆనవాలు ఏనాడైనా
ఆనామికత సందేశం హైందవ జీవన సారం
జనని జన్మ కారణం జన్మభూమిదీ ఋణం || సంఘటనం ||
మమతల సిరులై తన్మయ ఝరులై మనం సాగాలి సమరమ్మున సాగిన శరమై
కోవెల గంటై కోటి ఆశల పంటై మనం మ్రోగాలి జనపదాల గుండెల స్వరమై
కర్మఫలం ఆశించని ధర్మ వీరులం మనం
జయ జయహే మాతరం జయం జయం భారతం || సంఘటనం ||
--(())--
+91 79892 34854: ఈనాడు.. అంతర్యామి
-------------
జీవన్ముక్తి
--------------
(రచన.. ఎర్రాప్రగడ రామకృష్ణ, రాజమండ్రి )
ఇసుకలో ఆడుకొంటున్న పిల్లల్ని చూస్తుంటాం. అద్భుతంగా గుడి కడతారు. తీరికగా అలంకారాలు అద్దుతారు. తోచినంతసేపు హాయిగా ఆడుకుంటారు. పొద్దు వాలేటప్పటికి, ఆ కట్టడాలన్నింటినీ చటుక్కున కూలదోస్తారు. కిలకిల నవ్వులతో నిశ్చింతగా ఇంటిదారి పడతారు. అక్కడి ఆ నిర్మాణాలకు సంబంధించిన మమకారాలు, వియోగ దుఃఖాలు ఏవీ వారికి ఉండవు. ‘అంతగా అయితే, మరునాడు వచ్చి మళ్ళీ కడతాం. పోయేదేముందీ’ అనే ధీమాతో పిల్లలందరూ ‘సొంతిళ్ల’కు వెళ్లిపోతారు.
‘త్య్రంబకం యజామహే...’ అనే మృత్యుంజయ మహామంత్ర సారాంశమూ అదే. ‘జీవితాన్ని ఎంతైనా నిర్మించుకో...ఆత్మీయ బంధాలెన్నింటినో పెంచుకో. ప్రేమానురాగాల్ని గాఢంగా పంచుకో. ఆట ముగిసే సమయానికి, వాటిని అదేవిధంగా సునాయాసంగా తెంచుకో’ అని ఆ మంత్రం బోధిస్తుంది.
వాటికి, మనిషికి మధ్య ముడి ‘ఉర్వారుకమివ బంధనం’లా ఉండాలంటుంది. పచ్చి దోసకాయ ముచికకు, దోస తీగకు మధ్య బంధం ఎంత గట్టిగా ఉంటుందంటే- ఆ కాయను పట్టుకు లాగితే ఆ తీగ మొత్తం వచ్చేస్తుంటుంది. అవి ఒకదాన్ని మరొకటి అంత గట్టిగా పట్టుకొని ఉంటాయి.
అదే రీతిలో మనిషి తన చుట్టూ ఉన్న పరివారంతో, ప్రపంచంతో బంధాన్ని అంత గట్టిగానూ పెనవేసుకొని ఉంటాడు.
(రచన... ఎర్రాప్రగడ రామకృష్ణ, రాజమండ్రి)
పిల్లలు ఇసుక గూళ్ళు కట్టినంత ప్రీతిగా తన, తనవారి జీవితాల్ని తీర్చిదిద్దుకుంటాడు. దోసపండు మిగలముగ్గేనాటికి పరిస్థితి మారుతుంది. ఉన్నట్లుండి ఆ తీగ నుంచి అది చటుక్కున విడిపోతుంది. అప్పడు చూస్తే ముచిక గాని, తీగ గాని ఎండి ముదిరిపోయినట్లు ఉంటాయి. అంతవరకు ఆ రెండూ ఒకదానితో మరొకటి గాఢంగా, బలంగా అతుక్కునే ఉన్నాయా అనే అనుమానం వస్తుంది.
వయసు పడమటికి వాలేటప్పటికి, ప్రతి మనిషీ పసివారి మాదిరే తాను నిర్మించుకొన్న జీవితంపై పట్టు వదిలించుకోవాలి. తుది పిలుపు చెవిన పడేవరకు వదులుగా ఉంచుకోవాలి. ఆ సమయం రాగానే, దోసపండు మాదిరే పాత చిహ్నాలేవీ మిగలకుండా ప్రపంచం అనే తీగ నుంచి విడిపోగలిగిన స్థితికి రావాలి. పసిపిల్లల ధోరణిలోనే ‘మరో గుడి కట్టుకుందాంలే’ అన్నంత ధీమాతో ఈ శిథిలాలయాన్ని నిర్మూలనకు వదిలేయాలి.
సునాయాసంగా మరణించాలని కోరుతూ చేసే ప్రార్థనను పెద్దలు ‘మృత్యుంజయ మంత్రం’గా ప్రకటించడం ఓ విశేషం! ఆ రహస్యం బోధపడితే, మృత్యువును ఆహ్వానించగల స్థితికి మనిషి చేరుకోగలడు. మృత్యువును జయించడం అంటే- చావు లేకుండాపోవడం కాదు... మృత్యుభీతిని జయించడం!(రచన.. ఎర్రాప్రగడ రామకృష్ణ)
ప్రపంచంతో అన్నింటినీ చివరన తెంచుకోగలిగితే, ‘ఈ ఆత్మ నిత్యం’ అని నమ్మగలిగితే మృత్యుభయాన్ని అధిగమించడం సాధ్యమవుతుంది. సాయంత్రం అయ్యేసరికి పిల్లలు నిశ్చింతగా సొంతింటికి తిరిగి వెళ్లిపోయినట్లు, ఈ అద్దె ఇంటితో అనుబంధాన్ని వీడాలన్నదే ఆ మంత్ర మహోపదేశం! ‘వీడి వెళుతున్నాను’ అనేది అసురీ భావం.
‘అద్దె గృహాన్ని వీడుతున్నాను’ అనేది అమృత భావన! అలా అమృతత్వ స్థితిలోకి చేరుకోవడమే ముక్తి అనిపించుకుంటుంది. మనిషి జీవించి ఉండగానే సాధించాల్సిన స్థితి అది. అందుకే దాన్ని ‘జీవన్ముక్తి’ అంటారు.
మనుషులందరూ దానికి అర్హులే!
--ఎర్రాప్రగడ రామకృష్ణ , రాజమండ్రి
[06:28, 26/08/2020] +91 99666 91450: ఎలుక పైన ఊరేగి
ఎలుక పైన ఊరేగి ఎల్ల లోకములు తిరిగి
ఏలుచుందు వెల్లరను గణపతి
ఎటు పొగడుదు నీ మహిమలను
ఎలుక పైన ఊరేగి ఎల్ల లోకములు తిరిగి
ఏలుచుందు వెల్లరను గణపతి
ఎటు పొగడుదు నీ మహిమలను
మోద కముల నైవేద్యం
భుజియింపుచు కడుపారా
మోదమొందు విగ్నేశ్వరా...
భక్తుల మ్రొక్కుల గొనుమో దొరా
మోదకముల నైవేద్యం
భుజియింపుచు కడుపారా
మోదమొందు విఘ్నేశ్వరా
భక్తుల మ్రొక్కుల గొనుమో దొరా
ఎలుక పైన ఊరేగి ఎల్ల లోకములు తిరిగి
ఏలుచుందు వెల్లరనూ గణపతి
ఎటు పొగడుదు నీ మహిమలను
ఎన్నెన్నో అడ్డంకులు ఈ బ్రతుకు పొడుగునా
అన్ని అడ్లు తీరునట్లు వరమీయగ దిరానా
వేడెదమో గజవదనా గతి వేరెవరిక నినువినా
ఎలుక పైన ఊరేగి ఎల్ల లోకములు తిరిగి
ఏలుచుందు వెల్లరనూ గణపతి
ఎటు పొగడుదు నీ మహిమలను
లోకములో మొదటి పూజ నీకే గద విఘ్నరాజ
నీ ఘనతకు వే..రే...ల నిదర్శనం
మాకు నీవొసగుము నీ....దర్శనం
లోకములో మొదటి పూజ నీకే గద విఘ్నరాజ
నీ ఘనతకు వే..రే...ల నిదర్శనం
మాకు నీ వొసగుము నీ...దర్శనం
ఎలుక పైన ఊరేగి ఎల్ల లోకములు తిరిగి
ఏలుచుందు వెల్లరనూ గణపతి
ఎటు పొగడుదు నీ మహిమలను
ఎటు పొగడుదు నీ మహిమలను
దేవా ఎటు పొగడుదు నీ మహిమలను
శుభ శుభోదయం
🙏🐀🙏🐀🙏🐀🙏🐀🙏🐀🙏
[06:29, 26/08/2020] +91 95506 66184: _శ్రీ దేవి భాగవతం - 35 వ అధ్యాయము*_
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
త్రిమూర్తులు త్రిమూర్తులను గని విస్మయమందుట
☘☘☘☘☘☘☘☘☘
బ్రహ్మ యిట్లనియె: ఆ దివ్యవిమానము మనోవేగమున మరొక చోటి కేగినది. మా కచట నీరు కనిపింపలేదు. అందులకు మే మాశ్చర్యము జెందితిమి. ఆ ప్రదేశమందంతట పర్వతములు మధుర ఫలభరితములై కోకిలల కుహూకుహు రాగములుగల వృక్షము శోభలతో నొనరు వనోపవనములు-స్త్రీ పురుషులు పశుసంపదలు పసిడిపంటలు నదీనదములు సెలయేళ్లు వాపీకూప తటాకములు నీటి చిలుపలు యాగశాలలు ఎత్తైన ప్రాకారములు పలు సుందరభవనాలు గల్గి కలకలలాడు నగరములు నిండి కన్నులపసండువుగ నుండును. మే మా దివ్యనగరమునుంగాంచి యిది స్వర్గసీమ గాబోలు! ఇంత మహాద్భుతముగ దీని నెవరు నిర్మించిరో కదా? ఆహా! ఏమి వింత! అనుకొని పరమాశ్చర్య మందితిమి. అంతలో నచ్చట వేటాడుచు విహరించుచు ఇంద్రుని బోలు ఆ నగరపు రాజును విమానముపై తేజరిల్లు జగదంబికయు కనబడిరి. ఆ విమాన మొక్క మూర్తమాత్రమున వేగమున మరొక మనోహరప్రదేశమున కరిగెను.
అచట మేము నందనవనమును నందులో చల్లని పారిజాతపు నీడ చలువలో సుఖించు కామదేనువును గాంచితిమి. దానికి సమీపమందు నాల్గుదంతములుగల మహాగజము గలదు. అచ్చట మేనక మున్నగు నచ్చరలు రాగ తాళ మధుర బావములతో నాట్యమాడుచుండిరి. గంధర్వ విద్యాధరులు నందన వన వాటికలో గుమిగూడి గానములతో ఆనందపరవశులై యుండిరి. ఇంద్రాణీ సహితముగ నింద్రుడు మాకు గనబడెను. రవి యమ వరుణ కుబేరులు నచట నుండిరి. మే మచట నటు లాసురలనుగాంచి విస్మయమందితిమి. అంతలో ఆ నగరపు రాజు దేవరాజువలె అక్షోభ్యుడగు నరవాహనముగల పల్లకిలో నెక్కి బయలువెడలెను. మా విమాన మటులు మాతోకూడ మహావేగమున మరల ముందుకు సాగి సర్వదేవ నమస్కృతమగు బ్రహ్మలోకమును జేరెను. అచట కమలాసనుడగు బ్రహ్మనుగని శివకేశవులు చోద్యమందిరి. ఆ బ్రహ్మసభలో వేదములు సాంగములుగ రూపుదాల్చి వెలుగొందుచుండెను. అచ్చో దివ్యసాగరమును నదీపర్వతములును మాకు నయనానందము గల్గించినవి. అంత శివకేశవు లీ క్రొత్త బ్రహ్మ యెవరని నన్నడిగిరి. నేను రెండవ సృష్టికర్త నెరుంగనంటిని. ఇతడెవరో! నేనెవరనో! ఇదంతయు నాకే మాత్రము దోచుటలేదు' అని నేనను నంతలో మా విమానము మనోవేగముగ ముందునకు సాగెను.
అట్లు మా విమానము సాగిసాగి కైలాసగిరి జేరెను. అచట యక్షగణములు జేరి శివుని భక్తిమీర గొల్చుచుండిరి. కీరకోకిలములు మధుర గానముల నలరొందు మందారవనములును నట గలవు. పరమశివుడు వీణామురజ వాద్యములనుండి వెడలు చల్లని మధురరాగములను చెవులపండువుగ వినుచుండెను. ఆ శివుడు మా విమానమునుగని కైలాసమును వదలి పెట్టెను. ఆ రీతిగ నెలతాలుపు పంచాననుడు దశభుజుడు ముక్కంటి వృషవాహనుడునగు శంభుభగవానుడు కైలాసము నుండి బయటికి వెడలెను. ఆ సాంబసదాశివుడు మొలయందు పులితోలును పైని నేనుగు తోలుత్తరీయమును దాల్చియుండెను. ఆ పురాణదంపతుల కిరుప్రక్కల మహావీరులగు గణపతి కుమారు లుండిరి. అట్లు నంది మున్నగు గణశ్రేష్ఠములు తన కూర్మి తనయులు తన్ను గొలువ శివుడు బయలుదేరెను. ఆ శివగణములు శివుని వెంటజేరి హరహర మహాదేవశంభో యని నినాదములు సేయుచుండెను. ఆ యభినవ శంకరుని గాంచి మేము విస్తుపోతిమి. ఆ శివుడు మాతృకలను గూడియుండెను. పిదప మా విమాన రాజము క్షణములో గాలివాలున ముందుకు దూసికొని పోయినది. శ్రీరమారమణుని మందిరమైన వైకుంఠధామము జేరినది. అచట మేమెన్నడును కనివిని యెరుగని పెక్కులు దివ్యవిభూతులు కనులార గాంచితిమి. మే మా రమణీయమైన పురముగాంచి విస్మయానందము లందితిమి. మా విమానము మఱికొంతముందున కేగెను. అచట రాజీవనయనుడు పీతాంబరుడు అగిసె పూశోభనలరువాడు చతుర్భుజుడు గరుడవాహనుడు దివ్యభూషణభూషితుడు చామరములు చేతదాల్చి చల్లగ మెల్లగ వీచుచున్న రమాకాంతతోగూడి రాజిల్లువాడునగు హరిని మేము మా భాగ్యముకొలది సందర్శించితిమి. ఆ సనాతనుని వైకుంఠునిగనిన మా యాశ్చర్యమునకు మేర లేకుండెను.
అపుడు మా యాసనములందు కూర్చుండి మే మొకరి మొగా లొకరము వింతగ జూచుకొంటిమి. అంతలో నొక పెనుగాలి వాలున మా విమానము మఱికొంత ముందునకు సాగెను. అంతలో మేము పలువిధముల జలచరములతో నువ్వెత్తుగ లేచు కెరటములతో డెంద ముప్పొంగజేయు నమృతసాగరము చూచితిమి. దాని నడుమ మందార పారిజాతాది తరువులు చిత్రవిచిత్ర వస్తువులు పెక్కాసనములు-మేలుజాతి ముత్తియముల హారాలు అశోకవకుళకురవక తరువులు - నలుగడల ఘుమఘుమలాడుచు కనులపండువు సేయుచున్న మొగలి సంపెంగ మున్నగు పూలచెట్లు కోయిలల కుహూకుహూరావ మధిరిమలు-గండుతుమ్మెదల ఝంకారములు గల్గి తనరారు నొక్కదీవి గలదు. ఆ దీవియందు శివాకారమున చెలువొందు మంచ మొకటి సుమనోహరముగ నున్నది. అది నవరత్నకాంతులతో పొదుగబడెను. మేము దూరమందుండియే దాని శోభ కన్నులనిండ తిలకించితిమి. దానిపై నాసనములు పెక్కులు గలవు. ఆ పర్యంక మింద్రచాపము భాతిగ చిత్రశోభలతో నలరుచుండెను. అందొక పరమలావణ్యవతి యగు దివ్యాంగన సుఖాసీనయై యొప్పారుచుండెను. ఆ జగదేకసుందరి రక్తమాల్యాంబరధర రక్తగంధానులేపన కోట్ల మెరుపుకాంతులతో మిరుమిట్లు గొల్పుచుండెను. ఎఱ్ఱజీఱల కనుదమ్మలు గలది, కోట్ల పసిండిచాయల మిసిమివన్నె గలది, రవి బింబములను వెన్నుదన్నుకాంతి గలది. చారు వదన రక్తదంత విరాజిత-లావణ్యసీమ. పాశాంకుశములదాల్చి వరదాభయ ముద్రలతో వాత్సల్యము గురియు తల్లి, చిరుతనవ్వు వెన్నెలలు కనుగొలంకుల ముని పెదవుల చిందులాడునది, అపూర్వసుందరి ఐన శ్రీత్రిభువనేశ్వరీదేవి విరాజిల్లుచుండెను.
ఆ నవ వన దివ్యాంగన తన నవ్వు రాజిల్లెడు మోమునుండి దయామృతము గురియుచుండెను. ఆ దేవిచుట్టును జేరి హ్రీంకార జపనిష్ఠలో మేనులు మరచిన పక్షిబృందములు దేవిని జపించుచుండెను. ఎల్ల రసరాజము లామె సింగారములో చోటు చేసికొన్నవి. ఆమె చిగురునవ్వుల మోహనకాంతుల ముఖకమలముతో బలు తమ్మి మొగ్గలను త్రోసిరాజను గబ్బివట్రువ గుబ్బలతో నొప్పుచుండెను. పెక్కు మేలైన జాతిమణుల సొమ్ములతో బంగారపు కేయూరాంగద కిరీటములతో ధగధగలాడుచుండెను. ఆమె ముఖకమలము శ్రీచక్రము విధముగ నున్న తాటంకవిటంకములతో చెన్నొందుచుండెను. 'జయహో! హృల్లేఖ! శ్రీభువనేశి' యని దేవి చెలియలు ఆమెను స్తుతించుచు దేవీజప పరాయణులై యుండిరి. ఆ దేవి భువనేశ్వరి మహేశ్వరి హృల్లేఖ మొదలుగాగల దేవకన్యలతో కొలువు తీర్చియుండెను. ఆ కొలువులో ననంగ కుసుమాది దేవతలును గలరు. ఇట్లా దేవి షట్కోణమధ్యమున నలరు యంత్రరాజమున నలరుచుండెను. మేమా దేవిని దర్శించి, ఈమె యెవరో? ఈమె శుభనామ మెద్దియో తెలియుట లేదేయని పరమ విస్మయమందితిమి. ఈమె వేయికనుల దయామృతలహరి - వేయికేలుదమ్ముల వరదాయిని - వేయివదనాల సుప్రసాదచంద్రిక యని దూరమందుండియే మాకామె దోచుచుండెను. ఈమె యచ్చరగాని గంధర్వకన్యగాని దేవాంగనకాని కాదు. కాని, ఈ పరదైవ మెవ్వరై యుండునోయని తెలిసికొననేరక మేము సంశయములో కొట్టుమిట్టాడుచుంటిమి.
అంతలో విష్ణుభగవానుడు రవిజ్ఞాన శక్తితో నాచారుహాసినిని జగదంబగ మదినెఱింగి యిట్టనియెను: ఈ భగవతి దేవియే మన కందఱకు తరణభూతురాలు. మహావిద్య; మహామాయ; పరిపూర్ణ; మూలప్రకృతి; అవ్యయ. ఈమె కొంచెపు బుద్ధులవారికి మదికెక్కనిది. యోగగమ్య. పరమాత్ముని యిచ్ఛాశక్తి. నిత్యానిత్యస్వరూపిణి. ఈమె శివస్వరూపిణి; భాగ్యహీనులచేత గొలువబడనిది. విశ్వేశ్వరి వేదగర్భ విశాలాక్షి సర్వాది పరమేశ్వరి సనాతని. ఈ మహాశక్తి ప్రళయకాలము నందు సకల విశ్వమును బరిమార్చి యెల్లజీవుల వాసనలను దనలో విలీన మొనరించుకొని క్రీడించుచుండును. సురలారా! సర్వబీజస్వరూపిణి యీమెయే. ఈమె దివ్య సన్నిధానములో ననంత విభూతులు రూపొంది సొంపు పెంపొందుచున్నవి. చూడుడు, ఓ శివబ్రహ్మలారా! చూడుడు. ఇచ్చటివారెల్లరు మేనుల దివ్యచందనములలందుకొని మేలిమిబంగరు సొమ్ములు దాలిచి ప్రేమభక్తులు వెల్లివిరియగ నీ జగన్మాతకు పరిచర్యలు సలుపుచున్నవారు. నేడు మన మిచ్చోట జగద్ధితయగు శ్రీభగవతిని సందర్శించి ధన్యజీవులము కృతకృత్యులము మహాసౌభాగ్యవంతులము నైతిమి. మనము పూనికతో నేనాడే పుణ్యము చేసికొంటిమో యే తప మాచరించితిమో దాని ఫలితముగ మన కీనాడు శ్రీమాతృదేవి దివ్యదర్శనము లభించినది. త్యాగధనులు పుణ్యభాగులు తపస్సంపన్నులు దానరతులునైన మహాత్ములే యీ భవ్యాత్మ నవలోకింపగలరు. కాని, రాగులు మూఢులు ప్రమత్తులు నా శివాభగవతి నేనాటికిని గాంచనేరరు.
ఈమెయే ప్రకృతులకన్నిటికిని మూలప్రకృతి. ఈ ప్రకృతి జనని పురుషసంగతిజేసి పరమేశ్వర ప్రీతికొఱ కీ బ్రహ్మాండములను సృజించి వెల్లడించుచుండును. దేవతలారా! ఈ కనబడు బ్రహ్మాండ మంతయును దృశ్యము. ఈ మాయాదేవియే ద్రష్ట్రి. ఈమెయే విశ్వయోని సర్వేశ్వరి సర్వమాయ పరమశివాత్మిక. ఈ విశ్వమాత యెక్కడ? మన మెక్కడ? లక్ష్మి మొదలుగాగల దేవకాంతల యంద మీమె యందములోని లక్షాంశమునకు సరిపోలవు. ఆనాడు మహాసాగరమునందు మనకు దర్శన మొసంగిన జ్యోతిఃస్వరూప మీ విశ్వజననియే. ఆ మహాదేవియే మనలను బాలురనుజేసి యాడించుచు వినోదించుచున్నది. మున్ను నేను వటపత్త్రపు పానుపుపై పరుండి నా పదారవిందమును కరారవిందముతో ముఖారవిందమున నుంచుకొని ఆ వ్రేలిరసము జుబ్బట్లాడగ జీకుచు కోమలాంగుడనై పెక్కులు బాలక్రీడలు సాగించితిని. అట్టి నాలో నీ జగన్మాతయే చేరి నన్నాడించుచు లాలిజోలలు పాడుచునుండెనని నే డీ మేనుగాంచినతోడనే నా మదికి నిశ్చయజ్ఞానము స్ఫురించెను. నా పలుకులు విశ్వసింపుడు. మనల గన్నతల్లి యీమెయే. నేను పూర్వ మనుభవించిన జ్ఞాన మిపుడు తిరిగి గుర్తునకు వచ్చినది.
ఇది శ్రీదేవి భాగవతమందలి తృతీయ స్కంధమందు తృతీయాధ్యాయము.*
[06:29, 26/08/2020] +91 95506 66184: *గణపతి వైభవం:-6
శమంతకోపాఖ్యానం:-1
ఓం శ్రీ మహా గణాధిపతయే నమః
గణపతి గణపతివైభవం వినాయకుడు వినాయకచవితి
వినాయకచవితి వ్రతకధలో ముఖ్యమైంది శమంతకోపాఖ్యానం.
వినాయకచవితి సందర్భంగా పుస్తకాలలో ప్రచురిస్తున్న కధలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. దాని ఫలితంగా ఆ కధ విన్నా, అసలు ఫలితం రాదు. ఇప్పుడు మనం విష్ణు, స్కాందపురాణాలలో చెప్పబడిన అసలు కధ గురించి విఘ్నేశ్వరుని అనుగ్రహంతో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
వినాయకచవితి నాడు చంద్రదర్శనం చేసినవారు నీలాపనిందల పాలవుతారని గణపతి శాపం అలానే ఉంది. అది ద్వాపర యుగం. సత్రాజిత్తు, ప్రసేనుడు అన్నదమ్ములు, ద్వారకలో ఉంటారు. సత్రాజిత్తు గొప్ప సూర్యభక్తుడు. విష్ణుపురాణం ప్రకారం సత్రాజిత్తుకు సూర్యభగవానుడు మిత్రుడు. సత్రాజిత్తు సముద్రం వద్దకు వెళ్ళి సూర్యుడితో కాసేపు మాట్లాడుదామని పిలిస్తే సూర్యుడు వచ్చాడు. సూర్యుడంటే మాములువాడు కాదు. పెద్ద…
[06:29, 26/08/2020] +91 95506 66184: *ఈశ్వరా
మౌనంగా ఉన్నా
మదిలో నీవే
శూన్యంలా అనిపించినా
సమస్తము నీవే
చీకటిలో నిలిచినా
చిరునవ్వు నీవే
అగాధంలో పడినా
ఆలంబన నీవే
పాతాళంలో నిలిచినా
పైకి లాగే ప్రభువు నీవే
అయోమయంలో ఉన్నపుడు
ఆధారము నీవే
ఏ దిక్కు కానరానపుడు
దోవ చూపే దైవము నీవే
ఒకపుడు నీవే
ఆశగా నిలిచినా జీవికి
నేడు స్వాసగా
మారావు
పరమేశ్వరా శరణు..శరణు
ఓం నమఃశివాయ ...అరుణాచలశివ 🕉🙏🏻🕉*
[06:30, 26/08/2020] +91 95506 66184: _💫 భక్తునికి మహర్షికి జరిగిన సంభాషణ ⚜️*_
ఒక భక్తుడు దైవం కోసం అన్వేషణ చేస్తూ ప్రపంచం అంతా తిరిగాడు. అలా తిరుగుతూ తిరుగుతూ ఎందరినో ఎన్నో సందేహాలు అడిగాడు. కానీ మనస్సుకి వారి సమాధానాలు రుచించలేదు. ఇలా ఉండగా ఒకనాడు ఒక మహర్షి ఇతడికి తారసపడ్డాడు. అప్పుడు ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇది..
⚜️ స్వామి పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు ? ఎలా ఉంటాడు ? అని అడిగాడు.
💫 అప్పుడు మహర్షి చిరునవ్వు నవ్వుతూ.. నీ సందేహం త్వరలోనే తీరుతుంది నాయన.. అంటూ ఒక మహా వృక్షం చూపించి అది ఏమిటి నాయన అన్నాడు.
⚜️ అది వృక్షం.
💫 ఓహో వృక్షమా ! ఎలా వచ్చింది ?
⚜️ విత్తనం ద్వారా వచ్చింది స్వామి.
💫 సరే అక్కడ పలుగు ఉంది. తీసుకొని ఆ చెట్టు పునాది త్రవ్వు అన్నాడు.
⚜️ ఎందుకు స్వామి ? మహావృక్షం కదా ! త్రవ్వితే చచ్చిపోతుంది.
💫 చచ్చిపోతుంది కాని ఆ విత్తనం ఎలా ఉందో చూడాలని ఉంది !
⚜️ అయ్యో స్వామి ! అదెలా సాధ్యం అవుతుంది ?
💫 విత్తనం నుండి చెట్టు వస్తుంది అన్నావు. విత్తనం చూడలేమా ?
⚜️ విత్తనమే చెట్టు. చెట్టుకి విత్తనానికి తేడా లేదు. విత్తనం ప్రత్యేకంగా ఉండదు కదా !
💫 ఇదే నాయన నీ సందేహానికి సమాధానం.
⚜️ అదెలా స్వామి ?
💫 విత్తనం అనేది పరమాత్మ ఆ పరమాత్మే వృక్షం. అనగా సృష్టి. సృష్టి వేరు పరమాత్మ వేరు కాదు. ప్రతి అణువులో పరమాత్మ ఉన్నాడు. సృష్టి నుండి పరమాత్మని వేరు చేసి చూడలేము.
⚜️ మరి విగ్రహారాధన ఎందుకు స్వామి ?
💫 పరమాత్మని తెలుసుకోవాలి అంటే సాధకుడికి ఒక ఆకారం కావాలి. సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నాడు కనుక ధ్యానం చేయమంటే ఎలా చేస్తాడు ? ఏమి అర్థం కాదు. అదే ఆ పరమాత్ముడికి ఒక రూపం, ఒక వర్ణన కల్పితే సాధకుడు ఆ ఆకారాన్ని, ఆ వర్ణనని తన ధ్యానంలో చూస్తాడు. ధ్యానం నిలబడుతుంది. అంతేతప్ప శూన్యంలోకి చూస్తూ ధ్యానం చేస్తే సాధకుడికి చీకటి తప్ప ఏమి అర్థం కాదు. అందుకే పూర్వం మహర్షులు వేదాన్ని ఆధారంగా చేసుకొని వేదం వర్ణించిన విధంగా పరమాత్మకి ఒక రూపం కల్పించి సృష్టిలో ఉన్న పరమాత్మ శక్తిని ఆ విగ్రహంలో నిక్షిప్తం చేశారు. కొన్ని చోట్ల ఆయనే స్వయంభువై వెలిసి భక్తులను అనిగ్రహించాడు. అంతేతప్ప ప్రత్యేకంగా అంటూ పరమాత్ముడు ఎక్కడా లేడు. సృష్టిలో ఉన్న ప్రతి అణువులో ఉన్నాడు.
💫 సాధకులను ఉద్దరించే నిమిత్తం విగ్రహారాధన ఏర్పాటు చేయబడింది. భగవంతుడు నీలో ఉన్నాడు. నాలో ఉన్నాడు. ప్రకృతిలో ఉన్నాడు అంటే సామాన్య భక్తుడు భగవంతుడిని దర్శించలేడు. సాధ్యం కాదు. అందుకే రూపం, దానికి దీపం ధూపం, నైవేద్యం, నివేదన, పుష్పాలంకరణ ఇలా అనేక సేవలు ఏర్పాటు చేసి భగవంతుడి దగ్గరికి భక్తుడిని, సామాన్య సాధకులని తీసుకెళ్ళే మార్గం చూపారు తప్ప విగ్రహమే దైవం కాదు. అది ఒక మార్గం. దాని నుండి ముందుకి వెళ్ళాలి అంతేతప్ప విగ్రహారాధన దగ్గరే ఆగితే భగవంతుడిని ఎన్నటికి తెలుసుకోవడం సాధ్యం కాదు !
⚜️ స్వామి ! భగవంతుడి ఆస్తులు భగవంతుడే రక్షించుకోలేకపోతే భక్తులని ఏమి రక్షిస్తాడు ?
_💫 భగవంతుడు నాకు ఇది కావాలని ఎప్పుడు అడగలేదు. ఒకడు విగ్రహం పెట్టుకున్నాడు. మరొకడు గుడి కట్టాడు. మరొకడు తన దగ్గర ఉన్న డబ్బుతో వజ్రాలు కూర్చిన నగలు చేయించి దర్జాగా వచ్చి అలంకరించాడు. మరొకడు దొడ్డిదారిలో వచ్చి తీసుకెళ్ళాడు. భగవంతుడిని ప్రతిష్టించడం దగ్గర నుండి అలంకరిచడం వరకు అన్ని చేసిన మనమే వాటిని కాపాడు కోవాలి కాని భగవంతుడి మీద నిందలు వేస్తె మనకే అపచారం. పరమాత్ముడికి మట్టిగడ్డ అయినా వజ్రమైన తేడా లేదు. ఎందుకంటే రెండిటిలో ఉంది తనే కనుక.. నగలు పెట్టినవాడిలో ఉన్నాడు. దోచుకెళ్ళినవాడిలోనూ ఉన్నాడు. తన భక్తులని ఎవరైనా బాధలకు గురి చేస్తే తప్ప మిగిలినవి ఏమి పరమాత్మ పట్టించుకోడు !
[07:17, 26/08/2020] +91 95506 66184: #🙏అమ్మవారి అలంకారాలు #🔱🙏జగజ్జనని🙏🔱
ఈ రోజు రాధాష్టమి
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
భాద్రపదమాసంలోని అష్టమి శ్రీకృష్ణ పరమాత్మ పూజకు ఉత్కృష్టమైన రోజు. ఈ నాడు పవిత్ర ప్రేమకు చిహ్నంగా చెప్పబడుతూ ఉన్న శ్రీ రాధాకృష్ణులను పూజించాలి. ఈ దినానికి 'రాధాష్టమి' అని పేరు. ఈ రోజు రాధాకృష్ణులను పూజించడంవల్ల సంసార సుఖం లభిస్తుందని , భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని చెప్పబడుతూ ఉంది.
శ్రీకృష్ణుని ప్రియురాలు రాధ జన్మదిన వేడుకలను సంద్భంగా రాధకృష్ణుల విగ్రహాలకు పెరుగు , పాలు , పండ్ల రసాలు , పాలు , కొబ్బరినీరు తదితరాలతో అభిషేకాలు నిర్వహించి అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తితో గీతాలు ఆలపింస్తారు.
ప్రత్యేక పూజ , సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాధాకృష్ణుల విగ్రహాలను అభరణాలు , నూతన వస్త్రాలతో విశేషంగా అలంకరిస్తారు. బృందావనంలో ముఖ్యమైన ప్రదేశాలను భక్తులకు తెలియజేస్తూ వాటి విశిష్టతతో కూడిన వీడియోను ప్రదర్శిస్తారు. రాధారానిని కీర్తిస్తూ వైష్ణవ ఆచార్యులు స్వరపరిచిన అద్భుత పాటలు ఆలపిస్తారు. అమ్మవారికి విశేష హారతి తర్వాత పవళింపు సేవ నిర్వహింస్తారు.
రాధామాధవం ఎంత రమణీయం ! రెండు పవిత్ర హృదయాల దివ్య సంగమం , స్వచ్ఛమైన ప్రేమకు అచ్చమైన ప్రతిరూపం. తనను తాను ప్రేమించుకుందుటకు , తన నుండి తాను వేరుపడి మాధవుడు రాధగా జన్మించాడు. రాధ లోకోత్తర సౌందర్యమూర్తి. అరవిందం లాంటి అందం. మకరందం లాంటి మనస్సు. ఇలకు దిగిన ఇంద్రధనుస్సు. ప్రణయ మాధురి , రాధాసుందరి.
మాధవుడు సౌందర్యసారసర్వస్వం. కోటి మన్మధ లావణ్య కోమలాంగుడు. త్రిజగన్మోహన నీలవర్ణ శోభితుడు. సకల సద్గుణ భూషితుడు. నిర్మల హృదయుడు. నిర్గుణుడు. అది బృందావనం. కృష్ణాష్టమి పర్వదినం. ఈ ప్రత్యేక సందర్భానికై జాజుల దారాలతో నేయించి , వెనె్నలతో అద్దకాలు వేయించి , పాల నురగతో సరిగంచులు దిద్దించిన కొత్త చీర ధరించి
విశేషమైన అలంకారాలతో , చందనం పూసిన కుందనపు బొమ్మలా వినూత్న శోభను విరజిమ్ముతున్నది రాధ. ఆమె ఎదురుగా కృష్ణుడు , సహజాలంకార సుందరుడు , రాగరంజితుడు , అనురాగ బంధితుడు రాధ సన్నిధిలో ఏకాంతంలో తన్మయుడై ఉన్నాడు.
రాధాయ నమః అనే ఆరు అక్షరాల (షడక్షరీ) మహా మంత్రం నాలుగువిధాలుగా(చతుర్విధ) ఫలప్రదాయిని అని భక్తులు విశ్వసిస్తారు. 'రాధ' మంత్రాన్ని శ్రీకృష్ణుడు ఆ దేవి నుంచి రాస మండలంలో ఉపదేశ రూపంలో పరిగ్రహించాడని , అదే మంత్రాన్ని గురు పరంపర నుంచి నారదుడు గ్రహించాడని 'పద్మ పురాణం' చెబుతున్నది.
రాధాకృష్ణులు - ద్వంద్వ సమాసం. ఆ మాట వినగానే అద్వైత ప్రణయం గోచరిస్తుంది. అప్రాకృతమైన జగత్తులో - ముక్త ధామం , వైకుంఠం , గోలోకం అనే మూడు ప్రధాన లోకాలు ఉన్నాయని నారాయణోపనిషత్తు వర్ణిస్తుంది.
గోలోకాన్ని మహారాస మండలి అంటారు. నిత్య బృందావనం , శ్వేత మండలి అని కూడా వ్యవహరిస్తారు. అది ఒక మహా రస జగత్తు. ఆ జగత్తుకు ప్రభువు గోపాలుడు. ఆయనే రాధామాధవుడు. ఆ రస సమ్రాట్ శక్తినే రాసేశ్వరిగా భావిస్తారు. 'రాసము' అంటే గోకులంలోని ఒక క్రీడావిశేషం , సల్లాపం అని అర్థాలున్నాయి. ధావనం అంటే పరుగు.
శ్రీకృష్ణుణ్ని ప్రాణాధారంగా చేసుకొన్న రాధ ఆయన వామ పార్శ్వం నుంచి పుట్టిందని చెబుతారు. ఆమె పుట్టగానే రాస మండలంలో కృష్ణుడి సేవకోసం ధావనం (పరుగు) సాగించడం వల్ల రాధగా మారిందని బ్రహ్మవైవర్త పురాణం వివరిస్తోంది.
శ్రీకృష్ణుడికి రాధ ప్రాణాధికురాలైన ప్రియురాలు. మహా ప్రకాశవంతమైన గోలోక రాస మండలంలో రాధాకృష్ణులే ఆది దంపతులు. నాలుక కొన నుంచి పుట్టిన కన్య 'రాధ' కాలాంతరంలో రెండు రూపాలు ధరించిందని పురాణ కథనం. అందులో ఒకటి లక్ష్మి రూపమని , రెండోది రాధ ప్రతిరూపమని భావిస్తారు.
రాధ జన్మ వృత్తాంతం గురించి భిన్నగాథలు వ్యాప్తిలో ఉన్నాయి. ఆమె కేదారుడు అనే రాజుకు యజ్ఞకుండంలో పుట్టిన కుమార్తె అని చెబుతారు. పేరు బృంద అని , కృష్ణుణ్ని భర్తగా పొందాలని
కోరి తపం ఆచరిస్తే ఆయన ప్రత్యక్షమయ్యాడని విశ్వసిస్తారు. ద్వాపర యుగంలో రాధ తనను సేవించడం వల్ల ఆ ప్రదేశం 'బృందావనం' గా మారుతుందని వరమిచ్చాడనీ ఆ గాథ సారాంశం.
వృషభానుడు , కళావతి దంపతులకు పుట్టిన తనయకు గర్గ మహాముని 'రాధ' అని నామకరణం చేశాడు. బ్రహ్మవైవర్తం ప్రకారం , దూర్వాస ముని 'రసరశ్మి' అని పేరు పెట్టాడు. శ్రీకృష్ణుణ్ని రాధాదేవి తన మనసులో లయం చేసి విజయం సాధించిన రోజు - భాద్రపద శుద్ధ అష్టమి. అందుకే 'రాధాష్టమి' గా వ్యవహరిస్తారు.
పవిత్ర ప్రేమకు చిహ్నంగా భావించి రాధాకృష్ణులను పూజిస్తారు.
రాధాకృష్ణులను ఆరాధించడం వల్ల భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని విశ్వాసం. రాధా కృష్ణులు ఏకైక రూపులు. వారిది రాధ పేరులో ఉండే 'ర'కార ఉచ్చారణ వల్ల మానవులకు శ్రీకృష్ణుడి చరణ కమలాలపై నిశ్చల భక్తి కుదురుతుంది. 'ధ' నామస్మరణ వల్ల సాయుజ్యం కలుగుతుందని , రాధ నామస్మరణతో రోగ , మృత్యు భయాల నుంచి నివృత్తి కలుగుతుందనీ భావన.
' రాధా ! ఈ రోజు నా పుట్టినరోజు. ఏమైనా కోరుకో. ఏదైనా ఇస్తాను.'
'మాధవా ! నువ్వు నా స్వంతం. నాకే చెంది ఉన్నావు , ఔనా ?'
'అవును రాధా !'
'నా దగ్గర లేనిది , వెలకట్టలేనిది , నీకన్నా విలువైనది నాకు కావాలి. ఇవ్వగలవా కృష్ణా ?'
చెప్పడానికి గోపాలుని వద్ద సమాధానం లేదు. ఆశ్చర్యంగా చూస్తున్నాడు. రాధ మెల్లగా కృష్ణుని దగ్గరకు వచ్చింది. అతని చరణాలు ముట్టుకుంది. విశ్వసుందర పాదారవింద యుగళిని తనివితీరా ముద్దాడింది. శశాంకశీతల మనస్కుని కంఠాన్ని తన మృదుకర ద్వయంతో బంధించింది. గోవిందుని గట్టిగా హత్తుకుంది.
'నిన్ను పొందిన తర్వాత నాకిక పొందవలసినదేముంది సర్వేశా !'
అదే బృందావనం. ఈ రోజు రాధాష్టమి. రాధ పుట్టిన రోజు. ఈ అరుదైన రోజు కోసం అపూర్వమైన రీతిలో , తన గుణగణాలను దివ్యాభరణాలుగా మార్చి , మనోజ్ఞంగా అలంకరించుకుని సరికొత్త శ్యామసుందరుడు అవతరించాడు. అటు రాధావిలాసం , ఇటు మురళీగాన వినోదం , సరస శృంగార చక్రవర్తి ,
రాధికా మానస విహార రాజహంస , సకల భువనైక మోహన దివ్యమూర్తి రాధను మంత్రముగ్ధం చేస్తున్నాడు. జలతరంగిణి మీటినట్టు రాధ నవ్వుతున్నది. జగమంతా అమృతం వర్షిస్తున్నది. ప్రణయ మకరందమాధురీ భరితలోచనాలు కడు చిత్రంగా తిప్పుతూ రాధ ఇలా అంటున్నది.
'కృష్ణా ! ఈ రోజు ఎంత అందంగా వెలిగిపోతున్నావో తెలుసా ! నీ పుట్టినరోజునాడు నేను ముస్తాబై వచ్చాను. నా పుట్టిన రోజున నువ్వు అలంకరించుకున్నావు. బలే విచిత్రంగా ఉంది కదూ ! ఇంత సమ్మోహనకరంగా ఎప్పుడూ నిన్ను చూడలేదు.
నువ్వు నా అద్దానివా ? నన్ను నేను చూసుకుం టున్నానా ?'.. సరస భాషిణి , సహజ చమత్కారి కదా రాధ. 'ఈ సంతోష సమయంలో , నీకొక వరం ఇవ్వాలనిపిస్తోంది. నీ పుట్టిన రోజున నేను కోరుకున్నా. నా పుట్టిన రోజున నువ్వు కోరుకో కృష్ణా !' ఆశ్చర్య చకితుడయ్యాడు కృష్ణుడు తేరుకుని , వొకింత ఆలోచించి , ఆమె చమత్కారాన్ని ఆమెకే అప్పగిస్తూ ఇలా అన్నాడు.
'ఏదైనా నువ్వే నన్ను కోరుకో. ఇదే నా కోరిక రాధికా ! అన్నట్లు రాధా ! నాకన్నా విలువైనది కోరుకోవాలి సుమా ! 'గలగలా నవ్వింది రాధ. 'నీకన్నా విలువైనది నేనే గోపాలా !'
హతాశుడయ్యాడు కృష్ణుడు ! ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు.
'ఏమంటున్నావు రాధా ! నువ్వు నాకంటే విలువైనదానివా ? ఎలా ?'
'భక్తుడికి , భగవంతుడు దాసుడు కాదా , వాసుదేవా !'
'అవును'
'నువ్వు ప్రేమకు బానిసవు కదా కృష్ణా'
'నిజం'
'నువ్వు నా ప్రేమకు బానిసవు కదా ప్రియా !'
'అనుమానమెందుకు రాధా !'
'నువ్వు బానిసవు. నేను యజమానురాలిని. నేనే గొప్ప కదూ'
'ఒప్పుకున్నాను రాణీ ! మరి నిన్ను నువ్వే ఎలా కోరుకుంటావు ?'
'ఎప్పటికీ నువ్వు బానిసగానే ఉండాలి , నేను యజమానురాలుగానే ఉండిపోవాలి. ఇదే నా కోరిక జగన్నాథా'
కృష్ణుని హృదయం ద్రవించింది. ఒకరిని బానిసగా మార్చగలిగిన ప్రేమ సామాన్య ప్రేమ కాదు. పరమ పవిత్ర ప్రేమ. ఏ కారణం లేనిది , ఏ అవసరం లేనిది , ఏ షరతులు లేనిది రాధ ప్రేమ. అటువంటి ప్రేమను కృష్ణునికి ఇస్తున్నది రాధ. అతనికింకేమి కావాలి ! కృష్ణుణ్ణి పూజించే వారెందరో , ఆరాధించే వారింకెందరో.
కానీ , ఆ రాధ మాదిరిగా ప్రేమించేవారేరీ ? రాధకు కృష్ణుడి అవసరం కంటె , కృష్ణుడికే రాధ అవసరం అధికం. రాధ కృష్ణుడిపై ఆధారపడి ఉందో , లేదో కానీ కృష్ణుని ఉనికి మాత్రం పూర్తిగా రాధపైనే ఆధారపడి ఉంది. ఈ క్షణంలో కృష్ణుని అవతారానికి సార్ధకత లభించింది.
కన్నయ్య పాదాలకు రాధ నమస్కరించబోయింది.
వద్దని రాధను వారించాడు. రాధ పాదాలకు తానే మోకరిల్లాడు నందనందనుడు. సాష్టాంగ ప్రణామం చేశాడు.
'ఏ.. ఏమిటిది !.. మా.. మాధవా !' రాధ కంఠం గద్గదమయింది. ఆ ప్రణయమూర్తి మూగదయింది.
'బానిస , యజమానికి నమస్కరించాలి కదా !'
కృష్ణుని వినయ సౌశీల్య వచనాలు విన్న బృందావనం అతనికి ప్రణమిల్లింది.
రాధ పాదాల స్పర్శకు కృష్ణునిలో విద్యుత్తు ప్రవహించింది. కృష్ణుడు మోకాళ్లపై కూర్చున్నాడు. మాధవుని కళ్లలో నీళ్లు... రాధ కళ్లల్లో నీళ్లు.. అతని చుబుకాన్ని పైకెత్తి , సూటిగా కృష్ణుని కళ్లల్లోకి రాధ చూసింది. ఆమె కన్నీటి చుక్కలు అతని కళ్లలో కురిశాయి. అతని కన్నీటితో ఆమె కన్నీరు సంగమించింది. మాధవుని చెక్కిళ్లపై ధారలు ప్రవహిస్తున్నాయి.
ఆ పవిత్ర జలాన్ని దోసిలితో పట్టి , తీర్థంగా స్వీకరించి యమున తరించింది. పొన్నలు వెన్నలుగా కరిగి నీరయ్యాయి. జాబిల్లి కళ్ల నుండి జాజులు వర్షించాయి. ఆ అమల ప్రేమికులను , ఆ అమర ప్రేమికులను అభిషేకించాయి.
యశోదా ప్రియసుతుడు , ఉదయచంద్ర వదనుడు , సౌమ్య , సౌజన్యగుణధాముడు శ్రీకృష్ణుడు. అద్వితీయ సౌందర్యరాశి , అనుపమాన ప్రేమవారాశి రాధాదేవి. అనిర్వచనీయం , వర్ణనాతీతం , అలౌకికం , జగదేక ప్రేమకావ్యం 'రాధామాధవం'.
No comments:
Post a Comment