రేపటి నుండి మహాలయ పక్షం ప్రారంభం (ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఏమి లభిస్తుంది)
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం. మహాలయ పక్షం
ఈ పక్షములో పితరులు అన్నాన్ని , ప్రతిరోజూ జలమును కోరుతారు. తండ్రి చనిపోయిన తిథి రోజున , మహాలయ పక్షములలో పితృతర్పణములు , యధావిధిగా శ్రాద్ధవిధులు నిర్వర్తిస్తే , పితృదేవతలంతా సంవత్సరమంతా తృప్తి చెందుతారు , తమ వంశాభివృద్ధి జరుగును . వారు ఉత్తమ గతిని పొందుతారు. ఈ విషయాలన్నీ నిర్ణయసింధువు , నిర్ణయ దీపికా గ్రంథములు పేర్కొన్నాయి.
భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవపదము , కృష్ణపక్షం పితృపదము , అదే మహాలయ పక్షము. మహాలయమంటే - మహాన్ అలయః , మహాన్‌లయః మహల్ అలం యాతీతివా అనగా పితృదేవతలకిది గొప్ప ఆలయము , పితృదేవతల యందు మనస్సు లీనమగుట , పుత్రులిచ్చు తర్పణాదులకు పితృదేవతలు తృప్తిని పొందుట , అని అర్థములు. అమావాస్య అంతరార్థం: ‘‘అమా’ అంటే ‘‘దానితోపాటు’’, ‘వాస్య’ అంటే వహించటం. చంద్రుడు , సూర్యుడిలో చేరి , సూర్యుడితోపాటు వసించే రోజు కాబట్టి ‘అమావాస్య’ అన్నారు.
భాద్రపద అమావాస్య రోజున పితృదేవతలు పుత్రులిచ్చే తర్పణములకు ఎదురు చూస్తూ ఉంటారని ధర్మగ్రంథాలు తెలుపుతున్నాయి.
మహాలయ పక్ష ప్రారంభం / రేపటి నుండి పితృ పక్షం మొదలయ్యే రోజు. ఇక్కడ నుండి వరుసగా పదిహేను రోజులు పితృ దేవతలు పూజలకు ఉద్దేశించినవి.
పితృ దోషం అంటే ఒక శాపం. గత జన్మ లో ఎవరైనా వృద్దులకు కాని , తల్లితండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటే , లేదా వ్యక్తి కి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తీ యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి.
జాతక చక్రం లో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి.
భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు మహాలయ పక్షం పితృ ఋణం నుండి ముక్తి పొందటం చాలా కష్టం. తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తపిస్తారో వెల కట్టడం సాధ్యం కాదు. పితృ గణాల శ్రాద్ధ కర్మ గౌరవప్రదం గా చేయటం సంతానం తప్పని సరి విధి. శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు బ్రాహ్మణులతో కూడా వాయురూపం లో భోజనం స్వీకరిస్తారు. సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర , పౌత్రుల దగ్గరకు వస్తారు
ప్రతి మాసంలోను అమావాస్య , పితరుల పుణ్య తిథి గా భావించబడినా , మహాలయ అమావాస్య కు విశేష ప్రాముఖ్యత ఉంటుంది.
ఆదర పూర్వకం గా శ్రాద్ధ కర్మతో సంతోషపెడితే వారు తమ సంతత వారి ఆయువు , విద్య , ధనం , సంతానం , సమస్తం కలిగి ఉండేట్టు ఆశీర్వదిస్తారు. అన్నదానం ఎప్పుడు చేసిన మంచి ఫలితాన్నే ఇస్తుంది , కాని ఈ మహాలయపక్షం లో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది. అలాగే మఖ నక్షత్రం పితరులకు సంబందించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధ కర్మ అక్షయఫలన్నిస్తుంది.
మహాలయ పక్షంలో ఏ రోజు శ్రాద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లబిస్తుందని వివిధ పురాణాల ఆధారంగా , గురువుల ద్వారా తెలుసుకోన్నది.
1. పాడ్యమి తిధి రోజు శ్రార్ధము పెడితే లక్ష్మి కటాక్షం కలుగుతుంది.
2. విధియ లో శ్రార్ధము పెడితే సంతాన ప్రాప్తి.
3. తదియ లో శ్రార్థం పెడితే మంచి సంబంధం కుదురుతుంది లేదా మంచి కోడలు వస్తుంది.
4. చవితి రోజు శ్రార్ధము పెడితే పగ వారు(శత్రువులు)లేకుండా చేయును.
5. పంచమి రోజు శ్రార్ధము పెడితే సకల సౌభాగ్యాలు కలుగచేయును.
6. షష్టి రోజు ఇతరులకు పూజ్యనియులుగా చేయును.
7. సప్తమి రోజు పరలోకంలో ఓక దేవగోష్టికి నాయకునిగా చేయును.
8. అష్టమీ రోజు మంచి మేధస్సును చేకూర్చును.
9. నవమి మంచి భార్యను సమ కూర్చిను. గయ్యాళియైన భార్య కూడా బుధ్దిమంతు రాలిని చేయును. మరో జన్మలో కూడా మంచి భార్యను సమకూర్చును.
10. దశమి తిధి రోజు కోరికలను నేరవేర్చును.
11. ఏకాదశి రోజున సకల వేదా , విద్యా పారంగతులను చేయును.
12. ద్వాదశి రోజున స్వర్ణములను , స్వర్ణ ఆభరణములను సమ కూర్చును.
13. త్రయోదశి రోజు న సత్సంతానాన్ని , మేధస్సును , పశు , పుష్టి , సమృద్ధి , దీర్ఘఆయుష్షు మొదలగు సకల సౌభాగ్యములను సమకూర్చును.
14. చతుర్దశి తిది రోజు న వస్త్రం లేక్ అగ్ని(ప్రస్తుత కాలంలో రైలు , మోటారు వాహనములు వల్ల విపత్తు) వీని మూలంగా మరణం సంభవించిన వార్లకు మహలయ శ్రార్ధము చేయవలయును. అప్పుడే వారికి సంతృప్తి కలుగుతుంది.
15. అమావాస్య రోజున సకలాభిష్టములు సిద్దించును
16. పాడ్యమి తర్పణం ముందుగా నిర్వర్తించి వానిలోగల లోపములను నివృత్తిచేసీ పరి పూర్ణతను చేకూర్చును.
ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్దాలు ఈ మహాలయపక్షం పదిహేను రోజులు చేయలేనివారు ఒక్క మహాలయమైన చేసి తీరాలి. ఆర్దిక భావం వలన విద్యుక్తంగా శ్రాద్ధ కర్మలు చేయలేక పొతే , పితృ పక్షం లో కేవలం శాకంతో శ్రాద్ధం చేయవచ్చు. అది కూడా వీలు కాక పొతే గోవుకు గ్రాసం పెట్టవచ్చు , అదీ చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశం లో నిల్చొని అపరాన్న సమయం లో రెండు చేతులు ఆకాశం వైపు పైకి ఎత్తి , పితృ దేవతలకు నమస్కరించవచ్చు. శ్రాద్ధ కర్మ చేత పితృ దేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు , పరలోకం లో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది.
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం. మహాలయ పక్షం
ఈ పక్షములో పితరులు అన్నాన్ని , ప్రతిరోజూ జలమును కోరుతారు. తండ్రి చనిపోయిన తిథి రోజున , మహాలయ పక్షములలో పితృతర్పణములు , యధావిధిగా శ్రాద్ధవిధులు నిర్వర్తిస్తే , పితృదేవతలంతా సంవత్సరమంతా తృప్తి చెందుతారు , తమ వంశాభివృద్ధి జరుగును . వారు ఉత్తమ గతిని పొందుతారు. ఈ విషయాలన్నీ నిర్ణయసింధువు , నిర్ణయ దీపికా గ్రంథములు పేర్కొన్నాయి.
భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవపదము , కృష్ణపక్షం పితృపదము , అదే మహాలయ పక్షము. మహాలయమంటే - మహాన్ అలయః , మహాన్‌లయః మహల్ అలం యాతీతివా అనగా పితృదేవతలకిది గొప్ప ఆలయము , పితృదేవతల యందు మనస్సు లీనమగుట , పుత్రులిచ్చు తర్పణాదులకు పితృదేవతలు తృప్తిని పొందుట , అని అర్థములు. అమావాస్య అంతరార్థం: ‘‘అమా’ అంటే ‘‘దానితోపాటు’’, ‘వాస్య’ అంటే వహించటం. చంద్రుడు , సూర్యుడిలో చేరి , సూర్యుడితోపాటు వసించే రోజు కాబట్టి ‘అమావాస్య’ అన్నారు.
భాద్రపద అమావాస్య రోజున పితృదేవతలు పుత్రులిచ్చే తర్పణములకు ఎదురు చూస్తూ ఉంటారని ధర్మగ్రంథాలు తెలుపుతున్నాయి.
మహాలయ పక్ష ప్రారంభం / రేపటి నుండి పితృ పక్షం మొదలయ్యే రోజు. ఇక్కడ నుండి వరుసగా పదిహేను రోజులు పితృ దేవతలు పూజలకు ఉద్దేశించినవి.
పితృ దోషం అంటే ఒక శాపం. గత జన్మ లో ఎవరైనా వృద్దులకు కాని , తల్లితండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటే , లేదా వ్యక్తి కి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తీ యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి.
జాతక చక్రం లో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి.
భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు మహాలయ పక్షం పితృ ఋణం నుండి ముక్తి పొందటం చాలా కష్టం. తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తపిస్తారో వెల కట్టడం సాధ్యం కాదు. పితృ గణాల శ్రాద్ధ కర్మ గౌరవప్రదం గా చేయటం సంతానం తప్పని సరి విధి. శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు బ్రాహ్మణులతో కూడా వాయురూపం లో భోజనం స్వీకరిస్తారు. సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర , పౌత్రుల దగ్గరకు వస్తారు
ప్రతి మాసంలోను అమావాస్య , పితరుల పుణ్య తిథి గా భావించబడినా , మహాలయ అమావాస్య కు విశేష ప్రాముఖ్యత ఉంటుంది.
ఆదర పూర్వకం గా శ్రాద్ధ కర్మతో సంతోషపెడితే వారు తమ సంతత వారి ఆయువు , విద్య , ధనం , సంతానం , సమస్తం కలిగి ఉండేట్టు ఆశీర్వదిస్తారు. అన్నదానం ఎప్పుడు చేసిన మంచి ఫలితాన్నే ఇస్తుంది , కాని ఈ మహాలయపక్షం లో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది. అలాగే మఖ నక్షత్రం పితరులకు సంబందించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధ కర్మ అక్షయఫలన్నిస్తుంది.
మహాలయ పక్షంలో ఏ రోజు శ్రాద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లబిస్తుందని వివిధ పురాణాల ఆధారంగా , గురువుల ద్వారా తెలుసుకోన్నది.
1. పాడ్యమి తిధి రోజు శ్రార్ధము పెడితే లక్ష్మి కటాక్షం కలుగుతుంది.
2. విధియ లో శ్రార్ధము పెడితే సంతాన ప్రాప్తి.
3. తదియ లో శ్రార్థం పెడితే మంచి సంబంధం కుదురుతుంది లేదా మంచి కోడలు వస్తుంది.
4. చవితి రోజు శ్రార్ధము పెడితే పగ వారు(శత్రువులు)లేకుండా చేయును.
5. పంచమి రోజు శ్రార్ధము పెడితే సకల సౌభాగ్యాలు కలుగచేయును.
6. షష్టి రోజు ఇతరులకు పూజ్యనియులుగా చేయును.
7. సప్తమి రోజు పరలోకంలో ఓక దేవగోష్టికి నాయకునిగా చేయును.
8. అష్టమీ రోజు మంచి మేధస్సును చేకూర్చును.
9. నవమి మంచి భార్యను సమ కూర్చిను. గయ్యాళియైన భార్య కూడా బుధ్దిమంతు రాలిని చేయును. మరో జన్మలో కూడా మంచి భార్యను సమకూర్చును.
10. దశమి తిధి రోజు కోరికలను నేరవేర్చును.
11. ఏకాదశి రోజున సకల వేదా , విద్యా పారంగతులను చేయును.
12. ద్వాదశి రోజున స్వర్ణములను , స్వర్ణ ఆభరణములను సమ కూర్చును.
13. త్రయోదశి రోజు న సత్సంతానాన్ని , మేధస్సును , పశు , పుష్టి , సమృద్ధి , దీర్ఘఆయుష్షు మొదలగు సకల సౌభాగ్యములను సమకూర్చును.
14. చతుర్దశి తిది రోజు న వస్త్రం లేక్ అగ్ని(ప్రస్తుత కాలంలో రైలు , మోటారు వాహనములు వల్ల విపత్తు) వీని మూలంగా మరణం సంభవించిన వార్లకు మహలయ శ్రార్ధము చేయవలయును. అప్పుడే వారికి సంతృప్తి కలుగుతుంది.
15. అమావాస్య రోజున సకలాభిష్టములు సిద్దించును
16. పాడ్యమి తర్పణం ముందుగా నిర్వర్తించి వానిలోగల లోపములను నివృత్తిచేసీ పరి పూర్ణతను చేకూర్చును.
ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్దాలు ఈ మహాలయపక్షం పదిహేను రోజులు చేయలేనివారు ఒక్క మహాలయమైన చేసి తీరాలి. ఆర్దిక భావం వలన విద్యుక్తంగా శ్రాద్ధ కర్మలు చేయలేక పొతే , పితృ పక్షం లో కేవలం శాకంతో శ్రాద్ధం చేయవచ్చు. అది కూడా వీలు కాక పొతే గోవుకు గ్రాసం పెట్టవచ్చు , అదీ చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశం లో నిల్చొని అపరాన్న సమయం లో రెండు చేతులు ఆకాశం వైపు పైకి ఎత్తి , పితృ దేవతలకు నమస్కరించవచ్చు. శ్రాద్ధ కర్మ చేత పితృ దేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు , పరలోకం లో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది.
--(())--
ఆడవారు తులసి చెట్టు వంటివారు.😍
మగవారు దురదగుంట చెట్టు వంటివారు.😏
సీన్ కట్ చేస్తే ..!
"బీర్బల్ ... దర్బారుకు ఆలస్యంగా ఎందుకు వచ్చావు?"
"ఆలంపనా... జహాపనా.... ఈ రోజు మా తులసీ మాత పూజ ప్రభూ....!! అమ్మకి పూజచేయడంలో ఆలస్యం అయిపోయింది."
అక్బర్ కి నవ్వొచ్చింది.
"తులసి... మాత.... హ హ హ హ ... ఈ చిన్న మొక్క మీకు తల్లా?" అంటూ వికటాట్టహాసం చేశాడు.
"ఎవరక్కడ... ఒక తులసి చెట్టును తెప్పించండి"
పాదుషా తలచుకుంటే మొక్కలకు కొదవా?
సభలో అందరి ముందే తులసి మొక్కను చింపి పోగులు పోశాడు అక్బర్.
"చూశావా... నీ మాతను ఏం చేశానో..."
బీర్బల్ ఏమీ అనలేదు. "చిత్తం జహాపనా" అన్నాడు.
మరుసటి రోజూ బీర్బల్ ఆలస్యంగా వచ్చాడు.
"ఈ రోజేమిటి బీర్బల్... మళ్లీ ఎందుకాలస్యం?"
"ప్రభూ నిన్న మా తల్లిగారి పూజ అయింది. ఇవాళ్ల తండ్రిగారి పూజ ప్రభూ..."
"మీ తండ్రి కూడా ఒక మొక్కేనా..."
"అవును ప్రభూ...."
"ఆ మొక్కని తీసుకురండి"
ఆ మొక్కని దర్బారులో పెట్టారు.
అక్బర్ "మీ అమ్మ పని పట్టాను. ఇక మీ అబ్బ పని పడ్తాను చూసుకో..." అంటూ ఆ మొక్కను చింపి పోగులు పోశాడు.
కాసేపటికి అక్బర్ కి దురద మొదలైంది. ముందు మర్యాదగా కనీ కనిపించనట్టు గోక్కున్నాడు.
తరువాత బరబరా గోక్కున్నాడు. బట్టలువిప్పి మరీ నేలపై పొర్లుతూ గోక్కోవడం మొదలుపెట్టాడు.
"అమ్మోయ్... బాబోయ్... నాకేమైంది బీర్బల్ ...." అంటూ గావుకేకలు పెట్టాడు.
బీర్బల్ నెమ్మదిగా, తెచ్చిపెట్టుకున్న వినయంతో "జహాపనా... మా తల్లి శాంత స్వభావురాలు, ఏమీచేయదు. కానీ మా తండ్రి అలాంటివాడు కాదు. ఆయనకు ముక్కుమీదే ఉంటుంది కోపం."
"ఎవరయ్యా ఈ తండ్రి... బాధ భరించలేకపోతున్నాను."
"ప్రభూ... తులసి మాకు తల్లి. దూలగొండి మాకు తండ్రి. దూలగొండిని కెలుక్కున్నారు మరి...." అన్నాడు బీర్బల్.
"ఏం చేయాలయ్యా... ఎలా తగ్గుతుందయ్యా ఈ దురద....?" అక్బర్ గారు నేలమీద పడి దొర్లుతున్నాడు.
"ప్రభూ దీనికి ఒకటే మార్గం. మా తండ్రి గారి కోపాన్ని మా తల్లి మాత్రమే శాంతింపచేయగలదు. కాబట్టి ఆమెకు మొక్కండి. తులసి ఆకుల రసాన్ని పూసుకొండి. దురద తగ్గుతుంది." అన్నాడు బీర్బల్.
అక్బర్ ఓ చేత్తో గోక్కుంటూనే రెండో చేత్తో తులసమ్మకు దణ్ణం పెట్టాడు.
ధర్మం గురించి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకు ఇలాగే బుద్ధి చెప్పాలి.
🙏🙏🙏🙏🙏🙏
[12:32, 25/05/2020] Prathyusha: 🌿బ్రాహ్మణ జన్మ - గొప్పదనం🌿
🌺 బ్రాహ్మణత్వము గురించి భీష్ముణ్ణి...
ధర్మరాజు ఇలా అడిగాడు...!
శ్రీ పితామహా ! బ్రాహ్మణులు కాక ఇతరులు తాము చేసే గుణకర్మల వలన బ్రాహ్మణత్వము పొందవచ్చునా ! అని తన సందేహం వెలిబుచ్చాడు.
🌺 భీష్ముడు ధర్మనందనా ! బ్రాహ్మణత్వము పొందడం చాలా దుర్లభం.ఎన్నోజన్మలు ఎత్తిన తరువాత కాని బ్రాహ్మణజన్మ లభించదు. ఈ విషయము గురించి నీకు ఒక ఇతిహాసము చెప్తాను విను.
🌿 పూర్వము మతంగుడు అనే విప్రకుమారుడు ఉండే వాడు. అతడు తండ్రి ఆదేశానుసారము ఒక యజ్ఞానికి వెడుతున్నాడు.
దారిలో అతడు ఒక గాడిదపిల్లను కర్రతో గట్టిగా కొట్టాడు. ఆ గాడిద పిల్ల ఏడుస్తూ తనతల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పింది. ఆ గాడిద తన కూతురుతో అమ్మా ! ఇతడు చంఢాలుడు, క్రూరుడు అందుకే నిన్ను అలా కొట్టాడు అని చెప్పింది.
🌿 గాడిద మాటలను అర్ధము చేసుకున్న విప్రకుమారుడు ఆ గాడిద ఊరికే అలా అన లేదు. గాడిద మాటలలో ఏదో అంతరార్ధము ఉంది. లేకుంటే అలా ఎందుకు అంటుంది? అనుకున్నాడు.
🌿 విప్రకుమారుడు ఆ గాడిద వద్దకు వెళ్ళి తన జన్మరహస్యము చెప్పమని అడిగాడు.
గాడిద విప్రకుమారా ! నీ తల్లి కామంతో ఒక క్షురకుని వలన నిన్ను కన్నది. కనుక నీవు బ్రాహ్మణుడివి కాదు అని చెప్పింది.
🌿 ఆపై అతడికి యజ్ఞముకు వెళ్ళడానికి మనస్కరించక ఇంటికి తిరిగి వెళ్ళి తండ్రితో తండ్రీ ! నేను బ్రాహ్మణ స్త్రీకి క్షురకుడికి పుట్టాను కనుక నేను బ్రాహ్మణుడను కాను. ఆ గార్ధభము ఏదో శాపవశాన ఇలా జన్మ ఎత్తి ఉంటుంది. లేకున్న ఈ నా జన్మరహస్యము ఎలా తెలుస్తుంది?. తండ్రీ ! నేను తపస్సు చేసి బ్రాహ్మణత్వము సంపాదిస్తాను అని చెప్పి మతంగుడు తపస్సు చేయడానికి అడవులకు వెళ్ళాడు.
🌿 మతంగుడు కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి ఇంద్రుడిని ప్రసన్నము చేసుకున్నాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై కుమారా ! నీవు తపస్సు ఎందుకు చేస్తున్నావు ? నీ కోరిక ఏమిటి అని అడిగాడు. మతంగుడు దేవా ! నాకు బ్రాహ్మణత్వము ప్రసాదించండి అని అడిగాడు.
🌿 ఇంద్రుడు కుమారా ! బ్రాహ్మణత్వము మహత్తరమైనది. ఇతరులకు అది లభ్యము కాదు కనుక మరేదైనా వరము కోరుకో అని అన్నాడు. మతంగుడు అయ్యా ! నా కోరిక తీర్చడం మీకు కుదరదు కనుక మీరు వెళ్ళండి. నా తపస్సు కొనసాగిస్తాను అన్నాడు.
🌿 ఇంద్రుడు వెళ్ళగానే మతంగుడు తన తపస్సు కొనసాగించి ఒంటి కాలి మీద మరొక నూరేళ్ళు తపస్సు చేసి ఇంద్రుడిని ప్రత్యక్షం చేసుకున్నాడు.
ఇంద్రుడు కుమారా ! నీ పట్టు విడువక ఉన్నావు! శూద్రుడు ఇలాంటి తపస్సు చేస్తే చస్తాడు జాగ్రత్త అని బెదిరించి అసలు బ్రాహ్మణత్వము ఎలా సిద్ధిస్తుందో నీకు తెలుసా !
🌿 ఇంతకంటేపది రెట్లు తపస్సు చేస్తే కాని ఒక చంఢాలుడు శూద్రుడు కాలేడు.
దాని కంటే నూరు రెట్లు తపస్సు చేస్తే కాని శూద్రుడు వైశ్యుడు కాలేడు.
దాని కంటే వేయిరెట్లు తపస్సు చేసిన కాని వైశ్యుడు క్షత్రియుడు కాలేడు.
దాని కంటే పది వేల రెట్లు తపస్సు చేసిన కాని క్షత్రియుడు దుర్మార్గుడైన బ్రాహ్మణుడు కాలేడు.
దానికంటే లక్షరెట్లు తపస్సు చేస్తే కాని దుర్మార్గుడైన బ్రాహ్మణుడు ఇంద్రియములను, మనస్సును జయించి, సత్యము అహింసలను పాటించి, మాత్సర్యము విడిచి పెట్టి సద్బ్రాహ్మణుడు కాలేడు.
🌿 అటువంటి సద్బ్రాహ్మణత్వము ఒక వంద సంవత్సరాల తపస్సుకు వస్తుందా ! చెప్పు అన్నాడు. ఒక వేళ బ్రాహ్మణ జన్మ పొందినా దానిని నిలబెట్టుకొనుట కష్టము.
ఒక్కొక్క జీవుడు అనేక జన్మల తర్వాత కాని బ్రాహ్మణజన్మ ఎత్తలేడు. అలా ఎత్తినా అతడు దానిని నిలబెట్టుకోలేడు. ధనవాంఛ, కామవాంఛ, విషయాసక్తితో సదాచారములను వదిలి దుర్మార్గుడు ఔతాడు.
🌿 తిరిగి బ్రాహ్మణజన్మ రావడానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది. అటువంటి బ్రాహ్మణజన్మ కొరకు నీవు తాపత్రయపడి నీ వినాశనము ఎందుకు కొని తెచ్చుకుంటావు. నీ కిష్టమైన మరొక వరము కోరుకో ఇస్తాను తపస్సు చాలించు అన్నాడు.
🌿 మారుమాటాడని మాతంగుడి మొండి తనము చూసి విసుగు చెంది ఇంద్రుడు వెళ్ళి పోయాడు. మాతంగుడు తిరిగి తన తపస్సు కొనసాగించాడు. కాలి బొటనవేలి మీద నిలబడి శరీరం అస్థిపంజరము అయ్యేవరకు తపస్సు చేసాడు.
అతడి శరీరము శిధిలమై పడిపోతుండగా ఇంద్రుడు పట్టుకున్నాడు. ఏమిటి నాయనా ఇది? పెద్ద పులిలా నిన్ను మింగగలిగిన బ్రాహ్మణత్వము నీకెందుకు? చక్కగా వేరు వరములు అడిగి సుఖపడు అన్నాడు.
🌿 మాతంగుడు అంగీకరించగానే ఇంద్రుడు నీవు చంఢదేవుడు అనే పేరుతో అందమైన స్త్రీల. పూజలందుకుని వారి వలన నీ కోరికలు ఈడేర్చుకుంటావు అని వరాలు ప్రసాదించాడు.
కానీ బ్రాహ్మణ జన్మను ప్రసాదించలేదు.
(భారతంలోని అనుశాసనిక పర్వంలోని కథ).
🌿 అటువంటి ఉత్కృష్టమైన, పరమ పవిత్రమైన బ్రాహ్మణ జన్మను కాపాడుకోవలసిన అవసరం మన అందరిది.
[07:37, 26/05/2020] Prathyusha: ఆవకాయ వెన్నముద్దతో ఆదరిస్తుంది
మాగాయ పేరిన నేయ్యితో మంతరిస్తుంది
మెంతికాయ మోజు పెంచేస్తుంది
తొక్కుడుపచ్చడి జిహ్వను తోడేస్తుంది
కోరు తొక్కుడుపచ్చడి ఆకలి పెంచేస్తుంది
బెల్లపావకాయ పెరుగన్నానికే కావలి కాస్తుంది
పెసరావకాయ కమ్మదనం కడుపు నింపేస్తుంది
పులిహోరావకాయ ఘాటు మాడుకెక్కుతుంది
చింతకాయ చింతించినా చూడరు
ఉసిరికాయ ఉసూరుమన్నా ఊరుకుంటారు
గోంగూరపచ్చడి ఘొల్లుమన్నా ఓదార్చరు
కొరివికారం కొరకొర చూసినా చలించరు
టమాటా టక్కుటమారాలు చేసినా పడరు
నిమ్మకాయ పచ్చడి నిక్కినీలిగినా
అల్లం పచ్చడి అందలమెక్కిస్తానన్నా ఎక్కరు
వంకాయ బండపచ్చడి బాధపడినా
నువ్వు పచ్చడి నువ్వులేక నేను లేనన్నా
దోసావకాయ దోరగా నవ్వినా
నారింజకారం కవ్వించినా
కొత్తిమీరపచ్చడి కొంటెగా విజిలేసినా
పుదీనా పచ్చడి ప్రాణం పెడతానన్నా
క్యాబేజి పచ్చడి ఘుమఘుమలాడినా
కొబ్బరిపచ్చడి కూతపెట్టి పిలిచినా
బీరకాయ పచ్చడి బీరాలు పోతున్నా
కన్నెత్తయినా చూడని ఋష్యశృంగుడిలా
వేసవికాలమంతా వేడి ఆవిర్లు కమ్ముతున్నా
వడగళ్ల జడివానలు కురుస్తున్నా
చల్లని హేమంత శీతగాలులు వణికిస్తున్నా
అన్ని ఋతువుల అమృతమనుచు
మామిడికాయ తో కలిపిన ఆవకాయలకే
అగ్ర తాంబూలమిచ్చే ఆంధ్రులందరికీ
ఎన్నెన్ని రుచులు ఇల లో ఉన్నా
కంటికింపుకాదు నోటికి రుచికాదు
మనసుకి తృప్తికలుగదన్నది నిక్కమని
అమ్మలా ఎప్పుడయినా ఆదరించేదావకాయే అని నొక్కి వక్కాణించేదే కామేశ్వరి ఉవాచ
- a forwarded one.
🍁ఓం నమో నారాయణాయ.🍁
మొన్న కురిసిన భారీ వర్షాలకు కేరళ రాష్ట్రంలో ఎన్నో జిల్లాలు వరదల పాలయ్యాయి . అనంత పద్మనాభ స్వామి కొలువై ఉన్న తిరువనంతపురం లోను వరదలు వచ్చాయి . స్వామి వారి ఆలయం ముందు ఉండే పద్మ తీర్ధం నిండిపోయింది , ఆలయం దగ్గరకు వెళ్ళే మార్గం వర్షపు నీటిలో మునిగిపోయింది . దాంతో మూడు రోజుల పాటు స్వామి వారి ఆలయం తెరువలేదు , నిత్య పూజలు జరుగలేదు.
అయితే పురాణ ప్రాశస్త్యం ప్రకారం అనంత పద్మనాభ స్వామి వారిని ప్రతి రోజూ దేవతలు పుజిస్తారట . అర్చక స్వాములు ఆలయాన్ని తెరువక ముందే దేవతలు స్వామి వారిని సేవిస్తారట .
అనంత పద్మనాభ స్వామి వారి మూర్తి పూర్తిగా నీటిలో మునిగిపోతే ప్రళయం సంభవిస్తుందని ఆలయ శాసనంలో ఉంది . మొన్న కురిసిన వర్షాలకు తిరువనంతపురం దాదాపుగా మునిగిపోయింది .స్వామి వారి మూర్తి ఎంత వరకూ వరదలో మునిగిందో అనీ తిరువనంతపుర ప్రజలు భయాందోళలను పొందారు . ఆలయం దగ్గర కనిపించిన వరద తాకిడి కూడా భయానకంగా కనిపించిందట .
మూడు రోజుల తరువాత అర్చక స్వాములు ఆలయ తలుపులు తీసి చూడగా వారు నిశ్చేష్టులయ్యారు . స్వామి వారి గర్భాలయంలోనికి నీరు ప్రవేశించలేదు . ఎక్కడా తేమ కూడా లేదు . అప్పుడే కడిగి శుబ్రపరచినట్లుగా పొడిగా , సుగంధ పరిమళాలతో సువాసనలతో , అఖండలంగా ప్రజ్వరిల్లుతున్న దీపం దర్శనమిచ్చాయి . అంతే కాదు స్వామి వారికి అలంకరించిన పూల మాలలు తాజాగా ఉన్నాయి . బయట ధ్వజ స్థంభం కూడా పరి శుభ్రంగా తేమ లేకుండా ఉన్నాయి .స్వామి వారి ఆలయం చుట్టూ ఉండే ఉపాలయాలలోను వరద నీరు ప్రవేశించలేదు..
🌺🌺🌺🌺🌺
[07:38, 26/05/2020] Prathyusha: 🌀 పిత్రార్జితం🌀
...సి.ఎన్.చంద్రశేఖర్
‘‘అమ్మ ఎవరి దగ్గర ఉంటుంది?’’
వినోద్ తన అన్నయ్యను అడుగుతున్న ప్రశ్న విని ఉలిక్కిపడింది సావిత్రి. అటువంటి సన్నివేశం ఎన్నో కథల్లో చదివింది, ఎన్నో సినిమాల్లో చూసింది. కానీ తన జీవితంలో మాత్రం అటువంటి సన్నివేశం రాకూడదనీ, భర్తకంటే ముందే పునిస్త్రీగా వెళ్ళిపోవాలనీ అందరు దేవుళ్ళనూ కోరుకుంది. అయితే తన ప్రార్థన ఫలించలేదు. భర్త గుండెపోటుతో తనకంటే ముందుగా భగవంతుణ్ణి చేరుకున్నాడు.
‘‘అమ్మ మన ఇద్దరిదగ్గరా ఉంటుంది. అలా అని ఏడాదికి ఆరునెలలంటూ మనం పంచుకోవలసిన అవసరంలేదు. ఆమెకు ఇష్టమైనన్ని రోజులు ఎవరి ఇంట్లోనైనా ఉండొచ్చు’’ అన్నాడు విజయ్.
విజయ్ సమాధానం విన్నాక ఆమె మనసు కాస్త స్థిమితపడింది. ‘అయినా తనకెందుకు లేనిపోని భయాలు, అనుమానాలు? తన బిడ్డల గురించి తనకు తెలియదా?’ అనుకుంది.
విజయ్, తండ్రి బీరువా తెరిచి అందులోంచి బ్యాంకు పాస్‌బుక్ తీశాడు. తండ్రి పోయినరోజు నుంచి వైకుంఠ సమారాధన వరకూ అయిన ఖర్చులు ఇద్దరూ కలసి లెక్కలు వేశారు. బ్యాంకులో ఉన్న డబ్బు తాము ఖర్చుపెట్టిన మొత్తంకంటే ఎక్కువగానే ఉండటం చూసి సంతోషించారు.
భర్త అకౌంటులో ఉన్న డబ్బు గురించి తనతో సంప్రదించకుండానే కొడుకులు నిర్ణయాలు తీసుకోవడం సావిత్రిని బాధించింది. ‘అయినా తండ్రి అంతిమయాత్రకూ కార్యాలకూ అయ్యే ఖర్చులు ఆమాత్రం భరించలేరా... ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో ఉన్నారు’ అనుకుంది.
తర్వాత ఇంటి ప్రస్తావన వచ్చింది.
‘‘మేమిద్దరం ఇళ్ళు కట్టుకున్నాం. అందుకు బ్యాంకు లోనుతోపాటు బయట కూడా అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ ఇల్లు అమ్మితే పదిలక్షలదాకా వస్తుంది. మేము చెరో అయిదు లక్షలు తీసుకుంటాం. ఎటూ నువ్వు మాతోనే ఉంటావు కాబట్టి ఇక ఈ ఇంటి అవసరం ఉండదు’’ అన్నాడు విజయ్ తల్లితో.
‘‘మీ నాన్నగారు ఎంతో ఇష్టంతో కట్టుకున్న ఇల్లురా ఇది. కేవలం ఇటుకలు, సిమెంట్‌తో కట్టిన ఇల్లు కాదు. ఎంతో శ్రమతో, శ్రద్ధతో, ఆయన కష్టార్జితంతో కట్టిన ఇల్లు. ఈ ఇంట్లో ఎన్నో శుభకార్యాలు జరిగాయి. మీ చదువులూ ఆటలూ మీ భార్యల సీమంతాలూ మీ పిల్లల బారసాలలూ... అన్నీ ఈ ఇంట్లోనే జరిగాయి. ఎంతోమంది బంధువులూ స్నేహితులూ ఈ ఇంటికి వచ్చి, మన ఆతిథ్యాన్ని స్వీకరించి, మనసారా దీవించి వెశ్ళారు. మనకెన్నో తీయని అనుభూతుల్నీ మీ నాన్నగారికి తృప్తినీ ఆనందాన్నీ ఇచ్చిన ఈ ఇంటిని అమ్మడం నాకిష్టంలేదురా’’ అంది సావిత్రి.
‘‘మనిషే పోయాక ఇక ఇల్లెందుకమ్మా?
మా ఇళ్ళకీ బంధువులూ మిత్రులూ వస్తారు. అక్కడ కొత్త అనుభూతులకు స్వాగతం పలుకుదాం. పైగా ఆర్థికంగా మేము ఇబ్బందుల్లో ఉన్నాం. ఇల్లు అమ్మితే వచ్చే డబ్బుల్తో మా సమస్యలు తీరితే నాన్న ఆత్మ కూడా సంతోషిస్తుంది’’ అన్నాడు వినోద్.
‘‘లేదురా, ఆయనకు ఈ ఇల్లంటే ప్రాణం. కనీసం నేను ఉన్నంతవరకైనా ఇల్లు అమ్మకండి. కావాలంటే నా నగలన్నీ ఇస్తాను. అవి అమ్ముకుని మీ అప్పులు తీర్చుకోండి’’.
‘‘నీ నగలు ఎన్ని ఉన్నాయమ్మా? అన్నీ అమ్మినా యాభైవేలు రావు’’ అన్నాడు విజయ్ విసుగ్గా.
‘‘అమ్మా, ఇంటి డాక్యుమెంట్లు కనబడటంలేదు. బ్యాంకు లాకర్లో పెట్టారా నాన్న?’’ బీరువా వెతుకుతున్న వినోద్ అడిగాడు.
‘‘లాకర్లో కాదు. నాన్న ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టారు. నేనూ ఆ విషయం మరచిపోయాను. ఇప్పుడు నువ్వడిగితే గుర్తొచ్చింది’’.
‘‘తాకట్టు పెట్టారా? అంత అవసరం ఏం వచ్చింది?’’ కొడుకులిద్దరూ ఒకేసారి అడిగారు.
‘‘మీ చదువుల కోసం’’.
‘‘మా చదువుల కోసమా? మా చదువులు పూర్తయి అయిదేళ్ళు కావస్తూంది’’ అన్నాడు విజయ్ అసహనంగా. బ్యాంకులోను వల్ల ఇల్లు అమ్మితే వచ్చే మొత్తంలో తన వాటా మరింత తగ్గిపోతుందన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు అతను.
‘‘కావచ్చు. ఆయన రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసినా జీతం తప్ప మరో ఆదాయం ఆశించలేదు. మీకు ఎంట్రన్స్‌లో మంచి మార్కులు రాకపోతే లక్షలు ఖర్చుపెట్టి ప్రైవేటు కాలేజీల్లో మిమ్మల్ని ఇంజినీరింగ్ చదివించారు. మరి అంత డబ్బు ఆయనకు ఎక్కణ్ణుంచి వచ్చిందనుకున్నారు? మీకు ఉద్యోగాలొచ్చాక ఆయన అప్పుల గురించి మీరు అడుగుతారనీ మీ వంతు సాయం చేస్తారనీ అనుకున్నాం. కానీ మీకా ఆలోచన లేకపోయింది. మీముందు చేయిచాచడానికి ఆయన ఇష్టపడలేదు.
ఆ అప్పు అలాగే నిలిచిపోయింది.
అప్పటికీ తన పెన్షను నుంచి కొంత, పైపోర్షను బాడుగ నుంచి కొంత బ్యాంకు లోనుకు కడుతూనే ఉన్నారు’’.
‘‘ఇంకా ఎంత కట్టాలట?’’
విజయ్ అడిగాడు.
‘‘అయిదు లక్షలు కట్టాలి’’ బీరువా నుంచి తీసిన బ్యాంకు స్టేట్‌మెంట్‌ను టీపాయ్‌మీదకి గిరాటేసి అన్నాడు వినోద్.
‘‘హు, ఏడ్చినట్లే ఉంది. ఈమాత్రం దానికి ప్రపంచంలో తానొక్కడే ఇల్లు కట్టినట్లూ పిల్లల్ని చదివించినట్లూ ఫోజులు’’ అన్నాడు విజయ్.
పిల్లలు భర్తను తేలికచేసి మాట్లాడుతూంటే సావిత్రికి ఎంతో బాధేసింది.
‘‘లోను తీసుకున్న ఆయన ఇప్పుడు లేరు కదరా. అయినా ఆ అప్పు మీరు తీర్చాలా?’’ అని తన అనుమానం వ్యక్తంచేసింది.
‘‘ఆయన లేకపోతేనేం? మేం బతికున్నాం కదా. ఆయన ఇంటికి ఎలా వారసులమో ఆయన అప్పుకూ వారసులమే. అయినా అవన్నీ నీకు చెప్పినా అర్థంకాదు. ఇక మమ్మల్ని వదిలెయ్’’ రెండుచేతులూ జోడించి విసుగ్గా అన్నాడు వినోద్. సావిత్రి కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ‘తను చదువుకోలేదు. ఉద్యోగం చెయ్యలేదు. కానీ చెబితే అర్థం చేసుకోలేనిదేంకాదు. భర్త ప్రతి విషయం ఎంతో ఓపికతో తనతో చెప్పేవాడు. అర్థంకాకపోతే వివరించేవాడు. వీళ్ళకు అంత ఓపిక లేదు. అందుకే ఇలా విసుక్కుంటున్నారు. వీళ్ళకోసం, వీళ్ళ ఆరోగ్యం కోసం తను ఎన్ని పూజలు చేసింది? ఎన్ని రోజులు ఉపవాసాలుంది? ఎంత ఓపికతో అన్నీ అమర్చిపెట్టింది? అవన్నీ వాళ్ళకు ఇప్పుడు గుర్తులేదు. గుర్తుచేసుకోరు కూడా’ అనుకుంది.
ముఖ్యంగా కోడళ్ళముందు కొడుకులు తనను అలా విసుక్కోవడం ఆమెను మరింత బాధించింది. ‘కోడళ్ళను కన్నకూతుళ్ళలా చూసుకున్నారు తనూ భర్తా. వాళ్ళు కల్పించుకుని భర్తల్ని వారించకపోవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూంది. ఆర్థిక అవసరాలు అభిమానాల్ని ఇంతగా చంపేస్తాయా?’ అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది.
* * *
ఉదయం నిద్రలేచిన సావిత్రి గడియారం వంక చూసింది. ఏడు గంటలు చూపిస్తూంది. ‘అబ్బ, ఇంతసేపు ఎలా నిద్రపోయాను?’ అనుకుంటూ పిల్లల గదిలోకి నడవబోయింది. ఇంతలో కొడుకులు తమ కుటుంబాలతో ఉదయమే ఊరికి వెళ్ళిపోవడం గుర్తొచ్చింది ఆమెకు.
‘రాత్రంతా ఏడ్చీ ఏడ్చీ నిద్రపోయేసరికి పన్నెండు దాటింది. తెల్లవారుజామునే పిల్లల ప్రయాణం. నిద్రలేమి వల్ల తల పగిలిపోతూంది. కాఫీ గొంతులోపడితేగానీ అది తగ్గదు’ అనుకుంటూ గేటు దగ్గరకు వెళ్ళి పాలబ్యాగులో చెయ్యిపెట్టి చూసింది. అది ఖాళీగా ఉంది.
తల్లిని తనతో తీసుకెళుతున్నాననీ మరుసటిరోజు నుంచి పాలప్యాకెట్ అవసరంలేదనీ పాలవాడితో విజయ్ ముందురోజు చెప్పడం గుర్తుకొచ్చింది. ‘ఇంటిపై లోను ఉందని తెలిసి, ఆ నిరుత్సాహంతో నన్ను పిలుచుకుని వెళ్ళడం మరచిపోయారు ఇద్దరూ’ అనుకుని నవ్వుకుంది.
షాపు నుంచి పాలప్యాకెట్ తెచ్చుకోవడానికి చిల్లరకోసం ఇల్లంతా వెదికింది. ఎక్కడా చిల్లరగానీ కరెన్సీ నోట్లుగానీ కనిపించలేదు. తలనొప్పి క్షణక్షణానికి అధికం కాసాగింది. ఏంచేయాలో తెలియక నిస్సహాయంగా నిలబడిపోయిన ఆమెకు ఎదురుగా కొక్కేనికి తగిలించి ఉన్న భర్త చొక్కా కనిపించింది. ఆశగా వెళ్ళి జేబులో చెయ్యి పెట్టింది. కొన్ని పదిరూపాయల నోట్లు ఆమె చేతికి తగిలాయి. ఆమెకు ప్రాణం లేచివచ్చింది.
‘నీకు నేనున్నాను’ అని భర్త తనతో అన్న భావన కలిగింది ఆమెకు. ‘ఎప్పుడూ వందరూపాయలకు సరిపడా పదిరూపాయల నోట్లు జేబులో ఉంచుకోవడం ఆయనకు అలవాటు. ఆ అలవాటే ఇప్పుడు తన అక్కర తీర్చింది’ అనుకుంది. కాసేపు భర్త ప్రేమను తలచుకుని ఏడ్చింది. తర్వాత చెప్పులేసుకుని షాపుకు బయలుదేరబోతూంటే రామయ్య వచ్చాడు. అతను ఆమె భర్త పనిచేసిన ఆఫీసులో అటెండరు.
అతను చేతిలోని ఫ్లాస్కు ఆమె చేతికిస్తూ ‘‘పిల్లలు ఊళ్ళకు వెళ్ళిపోయారని విన్నాను. వాళ్ళ పనులు వాళ్ళకుంటాయిగా మరి. మరో నాలుగురోజులు మీరు వంట జోలికి పోకండి. కాఫీ, టిఫిన్, భోజనం అన్నీ నేను తెచ్చిస్తాను. మంచి శాకాహార హోటల్‌నుంచే తెస్తానులెండి. పదిరోజులుగా మనిషి పోయిన బాధతో, వచ్చేపోయే జనంతో బాగా అలసిపోయి ఉంటారు. నాలుగురోజులు విశ్రాంతి తీసుకోండి. మళ్ళీ ఎటూ మనుషుల్లో పడిపోవాలి. తప్పదు’’ అన్నాడు.
సావిత్రి కాఫీ రెండు కప్పుల్లో పోసి, అతనికొకటి ఇచ్చి తనొకటి తీసుకుంది.
‘‘అమ్మా, నా కూతురి పెళ్ళికి అయ్యగారిని పదివేలు అప్పడిగాను. ఆయన తన పి.ఎఫ్. నుంచి లోను తీసుకుని నాకిచ్చారు. ప్రతినెలా అయ్యగారి జీతంనుంచి ఆ లోన్‌కు అయ్యే కటింగ్ మొత్తం ఆయనకు నా జీతంనుంచి ఇచ్చేసేవాణ్ణి. ఆయన రిటైర్ అయ్యేలోపు ఆ అప్పు తీర్చేయాలనుకున్నానుగానీ సాధ్యంకాలేదు. ఆయన రిటైర్ అయినప్పుడు ఆ డబ్బుల్ని ఆయనకు ఇవ్వాల్సిన పి.ఎఫ్. నుంచి పట్టుకున్నారు. నేను ఈ నెల రిటైర్ అవుతున్నాను. నాకొచ్చే డబ్బుల్లోంచి మిగిలిన బాకీ మీకిచ్చేస్తాను. అటువంటి గొప్పవ్యక్తి అప్పు ఎగ్గొడ్తే నాకు మంచి జరగదమ్మా. ఆయన దేవుడమ్మా. అటువంటి మనుషుల్ని మళ్ళీ మనం చూడలేం’’ అంటూ రామయ్య ఏడవసాగాడు. సావిత్రి కళ్ళనిండా నీరు నిండింది.
‘‘అమ్మా, మీ పెన్షన్ పేపర్లన్నీ నేనే తెచ్చి మీ సంతకం తీసుకుంటాను. ఈ విషయంలో మీకు సహాయం చేయడానికి మా ఆఫీసులో అందరూ సిద్ధంగా ఉన్నారు’’ అని చెప్పి రామయ్య శెలవు తీసుకున్నాడు. ఆమెకు మళ్ళీ భర్త తనతో ‘నేనున్నాను’ అన్న భావన కలిగింది.
రామయ్య వెళ్ళిపోయాక ‘రామయ్య తీసుకున్న అప్పు గురించి ఆయన నాకు చెప్పారు. కానీ పదివేలు అప్పు తీసుకున్న రామయ్య అది తీర్చాలని తపనపడుతున్నాడే. మరి పాతికేళ్ళు పిల్లల్ని పెంచి, పెద్దచేసి చదివించామే. వాళ్ళకు తండ్రి బాధ్యత పంచుకోవాలనిగానీ తల్లి ఒంటరిగా ఉంటుందన్న ఆలోచనగానీ ఎందుకు రావడంలేదు? ఎందుకు పిల్లలు ఇలా మారిపోయారు? పిల్లలు పెద్దవాళ్ళయ్యాక వారికీ తల్లిదండ్రులకీ మధ్య ఆర్థిక సంబంధాలు తప్ప ఇంకే బంధాలూ ఉండవా?
ఆయన పిల్లల్ని ఎంతో శ్రద్ధ తీసుకుని పెంచారు. మంచితనం, మానవత్వం, నిజాయతీ, క్రమశిక్షణ లాంటి సుగుణాలను నూరిపోశారు. ఆయన వాటిని పాటించి చూపించారు కూడా. తన తల్లిదండ్రుల్ని చివరి శ్వాస వదిలేవరకూ తనవద్దనే ఉంచుకుని చూసుకున్నారు. తన తల్లి చివరి మూడురోజులూ మంచంమీదే ఉండిపోతే విసుగూ అసహ్యం లేకుండా అన్నిరకాల సేవలూ చేశారు. అవన్నీ పిల్లలు గమనించారు కూడా. మరి ఈరోజు వాళ్ళు తమ తల్లిపట్ల ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు’ అనుకుంది.
వెంటనే తన ప్రశ్నకు సమాధానం కూడా దొరికింది ఆమెకు.
‘ఆ కాలంలో టీవీలూ ఫ్రిజ్జులూ లేవు. సంపాదించిన డబ్బు కుటుంబంకోసం, పిల్లల చదువులకోసం ఖర్చుపెట్టేవారు. దుబారా ఖర్చులు చేసేవారు కారు. రాబడి, ఖర్చు దాదాపు సమానం కావడంతో పెద్దగా అప్పులుచేసే అవసరం ఉండేదికాదు. తృప్తిగా మనశ్శాంతితో బతికేవారు. కానీ ఈనాటి పరిస్థితి వేరు. పెళ్ళైన వెంటనే టీవీ, ఫ్రిజ్, ఏసీ, కంప్యూటర్, కారు అన్నీ కొనేయాలి. వీటిలో చాలా వస్తువులు స్టేటస్ సింబల్‌గా మారిపొయ్యాయి. అవసరాలకూ విలాసాలకూ తేడా తెలుసుకోలేకపోతున్నారు. ఇంటికి నిదానంగా ఒక్కొక్కటీ అమర్చుకుందామన్న ఆలోచన, ఓపిక లేదు. పైగా ఫ్లాట్ల రేట్లు పెరుగుతున్నాయనీ ఇన్‌కమ్‌టాక్స్ తగ్గుతుందనీ చేతిలో డబ్బులు లేకపోయినా ఇళ్ళు కూడా కొనేస్తున్నారు. కంపెనీలూ బ్యాంకులూ లోన్లు ధారాళంగా ఇస్తూండటంతో అన్ని లోన్లూ తీసుకోవడం, జీతంలో ఇన్‌స్టాల్‌మెంట్లకు పోగా మిగిలింది చాలకపోవడం, దీంతో ఇబ్బందులు, విసుగు, అసహనం మొదలు. వీటన్నిటితోపాటు ఉద్యోగంలో ఒత్తిడులు, అభద్రతాభావం పెరుగుతున్నాయి. ఇన్ని ఒత్తిడులమధ్య పాపం తల్లిప్రేమ, ఆమె సేవలు వీళ్ళకు గుర్తురావడంలేదు. ఉన్నంతలో తృప్తిగా బతకడం వీళ్ళకు ఎప్పుడు అలవాటవుతుందో’ అనుకుని బాధగా నిట్టూర్చింది.
* * *
వారంరోజులు గడచిపోయాయి. సావిత్రికి పిల్లల నుంచి ఫోన్‌కాల్స్ లేవు. ఫోన్ మోగితే ‘పిల్లలనుంచేమో’ అని ఆశగా ఫోను దగ్గరికి పరిగెడుతూంది.
ఓరోజు తన ఇంట్లోకి అడుగుపెట్టిన కొత్త వ్యక్తిని ఆశ్చర్యంగా చూసింది సావిత్రి.
‘‘నా పేరు శ్రావణ్. బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ని’’ అంటూ తన వివరాలు చెప్పాడతను.
‘‘రండి, కూర్చోండి’’ అంటూ కుర్చీ చూపించింది.
‘‘రామనాథంగారు నేను క్లర్క్‌గా ఉన్నప్పటినుంచీ నాకు తెలుసు. ఆయన ఇల్లు కట్టడంకోసం, పిల్లల చదువులకోసం, వాళ్ళ పెళ్ళిళ్ళకోసం, ఎన్నోసార్లు లోన్లు తీసుకున్నారు. అయితే ఆయన ఇన్‌స్టాల్‌మెంట్ కట్టకపోవడం అన్నది ఇంతవరకూ జరగలేదు. మొదటిసారిగా ఆయన మార్ట్‌గేజ్ లోన్ ఇన్‌స్టాల్‌మెంట్ బాకీ పడింది. నాకు అనుమానమొచ్చి విచారిస్తే ఆయన చనిపోయారని తెలిసింది. మా బ్యాంకు క్రమశిక్షణ కలిగిన ఓ కస్టమర్‌ను కోల్పోయింది’’ అన్నాడు బాధగా.
‘‘నాకు ఫ్యామిలీ పెన్షన్ మొన్న శాంక్షన్ అయింది. ఈనెల పెన్షన్ తీసుకోగానే బ్యాంకుకు వచ్చి కట్టేస్తాను’’ అంది సావిత్రి నొచ్చుకుంటూ.
‘‘అవసరంలేదమ్మా. ఆయన ఇంటిపై తీసుకున్న లోనుపై దాదాపు ఏడులక్షలు బాకీ ఉంది. అయితే చాలా ఏళ్ళకిందటే మా బ్యాంకు ప్రవేశపెట్టిన ఇన్సూరెన్సు స్కీములో మీవారి లోను కూడా కవర్ అయ్యేందుకు ఆయనచేత సంతకాలు పెట్టించుకుని ప్రీమియం కట్టించుకున్నాం. రామనాథంగారు మరణించారు కనుక ఆ రుణం మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది. మీరు నయాపైసా కూడా కట్టక్కరలేదు. నేను అప్లికేషన్ మీకు పంపిస్తాను సంతకాలు చేసి పంపండి. ఉంటానండీ’’ అతను నమస్కారం చేసి వెళ్ళిపోయాడు.
సావిత్రి భర్త ఫొటో వైపు చూసింది. రామనాథం నవ్వుతున్నట్లు కనిపించింది ఆమెకు.
* * *
సావిత్రి కొడుకులకు ఫోన్‌చేసి రుణం మాఫీ అయిన విషయం చెప్పి ‘ఇల్లు అమ్మకానికి పెట్టాననీ ఎవరైనా వస్తే కబురు చేస్తాననీ వచ్చి మాట్లాడుకొమ్మనీ’ చెప్పింది. కొడుకులు ఆమె ఊహించినదానికంటే ఎక్కువగానే సంతోషించారు. ఆ రోజు సాయంత్రం ఊళ్లోఉన్న వృద్ధాశ్రమానికి వెళ్ళి ఆశ్రమం మేనేజరుతో మాట్లాడింది. త్వరలోనే తను ఆశ్రమంలో చేరతానని చెప్పింది.
సావిత్రి వివరాలు తెలుసుకున్న మేనేజరు ‘‘రామనాథంగారు చనిపోయారా? నాకా విషయమే తెలియలేదే’’ అంటూ విచారం వెలిబుచ్చారు.
‘‘ఆయన మీకు తెలుసా?’’ ఆశ్చర్యంగా అడిగింది సావిత్రి.
‘‘తెలియకపోవడం ఏమిటమ్మా? ఈ ఆశ్రమం స్థలం కోసం గవర్నమెంటుకు అర్జీ పెట్టినప్పుడు కలెక్టరాఫీసులో ఆ సీట్లో ఉన్న మీవారిని కలిశాను. ఆయన సానుకూలంగా స్పందించారు. మంచి కార్యం తలపెట్టినందుకు మమ్మల్నెంతో అభినందించారు. కలెక్టరుగారికి చెప్పి ఈ స్థలం మాకిప్పించారు. డిపార్ట్‌మెంట్‌లో ఆయనకున్న మంచిపేరు వల్ల కలెక్టరుగారు వెంటనే ఒప్పుకున్నారు. ఇంతచేసిన ఆయన మా నుంచి ఒక్క పైసా కూడా ఆశించలేదు. అటువంటి వ్యక్తి భార్య అయిన మీరు ఓ అనాథలా మా ఆశ్రమంలో చేరడం నాకు బాధగా ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళతాను. మాతోపాటు ఉండిపొండి. మిమ్మల్ని మా అమ్మలా చూసుకుంటాను’’.
సావిత్రికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ‘భర్త మంచితనం గురించి తెలుసుగానీ అది ఇంతమంది మనసుల్ని గెలుస్తుందని తను ఊహించలేదు’ అనుకుంది. ‘మరణించి కూడా బతికి ఉండటం’ అంటే ఏమిటో ఆమెకు అర్థమైంది.
‘‘వద్దండీ. నావల్ల ఎవరికీ ఇబ్బంది ఉండకూడదనే పిల్లల్ని కూడా కాదనుకుని ఇక్కడికి వస్తున్నాను. పైగా ఇక్కడ ఉంటే నాకు కాలక్షేపం కూడా అవుతుంది. మీరు ఆ మాట అన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు పిల్లాపాపలతో కలకాలం చల్లగా ఉండాలి. నేను ఇల్లు అమ్మకం పనులు పూర్తయ్యాక వస్తాను’’ అంటూ అతని దగ్గర శెలవు తీసుకుంది.
* * *
ఒకరిద్దరు సావిత్రికి ఫోన్‌చేసి ఇల్లు కొనడానికి తమ ఆసక్తిని వెలిబుచ్చారు. ఓ ఆదివారం కొడుకుల్ని రమ్మంటాననీ ఆరోజు వచ్చి మాట్లాడమనీ వాళ్ళతో చెప్పింది సావిత్రి. మరుసటి ఆదివారమే కొడుకులు భార్యలతో వచ్చారు.
ఆ ఆదివారం ఉదయం ఇంటి గురించి మాట్లాడటానికి వచ్చిన వ్యక్తిని చూసి ‘‘మీరు మా ఎదురింటి మేడపైన ఉండేవారు కదా?’’ అని అడిగాడు వినోద్.
అతను ‘‘అవును. నా పేరు రామారావు’’ అంటూ తన వివరాలు చెప్పసాగాడు.
తర్వాత ‘‘మేము చాలా ఏళ్ళు ఆ ఇంట్లోనే ఉన్నాం. ఏడాదిక్రితమే ఇల్లు చాలక వేరే ఇంట్లోకి మారాం. మీ ఇంటి మండువా మా గది కిటికీ నుంచి బాగా కనబడేది. మీ కుటుంబం మమతానురాగాలకూ తీపి అనుభవాలకూ ప్రతీకలా అనిపించేది నాకు.
ఉదయాన్నే మీ అమ్మగారు ఇంటిముందు ముగ్గులేస్తూంటే మీ తండ్రీకొడుకులు కబుర్లు చెబుతూ కంపెనీ ఇవ్వడం, భోగి పండుగరోజు ప్రాతఃకాలాన మీరు భోగిమంట వేస్తూంటే మీ అమ్మగారు కాఫీ తెస్తే అందరూ కలసి తాగడం, దీపావళిరోజు మీ నాన్నగారు మీతో టపాకాయలు జాగ్రత్తగా కాల్పించడం, ఉదయం నాలుగు గంటలకు లేచి మీరు చదువుకుంటూంటే మీకు తోడుగా మీ నాన్నగారు కూర్చోవడం, మీ ఇంటికి తరచుగా బంధువులు, మిత్రులు రావడం, రాత్రిపూట అందరూ మండువాలో కూర్చుని పాటలు పాడటం మాకు కనిపించేది.
ఓసారి విజయ్‌కి ఆటల్లో చేయి విరిగితే ప్రమోషన్ పరీక్ష రాయడానికి వెళ్ళిన మీ నాన్నగారు పరీక్ష రాయకుండానే తిరిగొచ్చి పుత్తూరు తీసుకెళ్ళి కట్టు కట్టించడం, నొప్పి తెలియకుండా రాత్రంతా కథలు చెబుతూ జాగారం చెయ్యడం, తన తల్లి వేసుకోవాల్సిన మాత్రల్ని ఏ పూటకాపూట గుర్తుగా ఆమెకివ్వడం, ఆవిడ మంచానపడితే సేవలు చేయడం నా మనసును కదిలించేది. ఆయన చేసిన ఉద్యోగానికి కావాలనుకుంటే ఈ ఊళ్లో పది ఇళ్ళు కట్టించి ఉండేవారు. కానీ ఆయన తీరే వేరు. ‘పైసంపాదన ఆశించని వ్యక్తి’ అని ఊళ్లో మంచిపేరు తెచ్చుకున్నారు. కళ్ళముందు నోట్లకట్టలు కనబడుతున్నా అవసరాలు ఇబ్బందిపెడుతున్నా చలించక నీతికి కట్టుబడి వాటికి దూరంగా ఉండటం చాలా గొప్ప విషయం.
ఇక మా ఇంట్లో ఎప్పుడూ గొడవలే. మా నాన్న గెజిటెడ్ ఆఫీసరు. లంచాలు బాగా తినేవాడు. ప్రతిరోజూ తాగొచ్చి ఇంట్లో గొడవలు చేసేవాడు. మాకు చదువు తలకెక్కేది కాదు. ఆయన చనిపోతే ఆ ఆఫీసులో నాకు ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడు నా తమ్ముళ్ళతో నాకు మనస్పర్థలు పెరుగుతున్నాయి. వాళ్ళింకా జీవితంలో స్థిరపడలేదు. నాన్న ఉద్యోగం నాకొచ్చింది కాబట్టి వాళ్ళను నేను పోషించాలంటారు. ఈ విషయంలో నాకూ నా భార్యకూ మధ్య గొడవలు.
మనిషికి డబ్బు పుష్కలంగా లేకపోయినా ఉన్నంతలో జీవితాన్ని ఎంత ఆనందంగా అనుభవించవచ్చో మీ నాన్నగారిని చూశాక నాకు తెలిసింది. అందుకే మీ ఇల్లు కొని ఇందులో చేరితే ఆ అదృష్టం మాకూ తగిలి మా సమస్యలు తగ్గుతాయని మా ఆశ. చదువుకునే రోజుల్నించీ ఈ ఇల్లు నా ‘డ్రీమ్ హౌస్’. ‘ఇటువంటి మనుషుల మధ్య నేను లేనే’ అని బాధపడేవాణ్ణి. కనీసం ఈ ఇంట్లో నివసించే అవకాశం వస్తే అది నా అదృష్టంగా భావిస్తాను’’ అన్నాడు రామారావు.
* * *
రామారావు వెళ్ళిపోయాక విజయ్, వినోద్‌లు మౌనంగా కూర్చుండిపోయారు. రామారావు చెప్పిన విషయాలే పదేపదే గుర్తుకు రాసాగాయి. తమ గుండెలో ఎంతో అపురూపంగా దాచుకోవలసిన జ్ఞాపకాల్ని పరాయివ్యక్తి వచ్చి చెపితే తప్ప గుర్తుచేసుకోలేకపోయినందుకు సిగ్గుపడ్డారు. వాళ్ళ మనసులో తప్పుచేసిన భావన కలిగింది. పశ్చాత్తాపం మొదలైంది.
రాత్రి భోజనాల సమయంలో సావిత్రి - కొడుకు, కోడళ్ళతో వాళ్ళు ఊరు వదిలివెశ్ళాక జరిగిన విషయాలన్నీ చెప్పింది. రామయ్య, బ్యాంకు ఫీల్డ్ ఆఫీసరు, ఆశ్రమం మేనేజరు అన్న మాటల్ని చెప్పింది. అది విన్న కొడుకుల మనసుల్లో పశ్చాత్తాపం మరింత పెరిగింది.
వినోద్‌కు తండ్రి తమతో తరచుగా చెప్పే కొటేషన్ ‘గుడ్‌నెస్ ఈజ్ ద ఓన్లీ ఇన్‌వెస్ట్‌మెంట్ విచ్ నెవర్ ఫెయిల్స్ టు ఎర్న్ డివిడెండ్స్’ గుర్తొచ్చింది.
‘నిజం నాన్నా, మీ మంచితనం డివిడెండ్లను సంపాదించడమే కాదు, ఎంతోమంది హృదయాల్ని కూడా గెలుచుకుంది. మాలాంటి పాపాత్ముల హృదయాలు తప్ప’ అనుకుని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు.
విజయ్ తల్లితో ‘‘అమ్మా, మమ్మల్ని క్షమించు. నాన్న మంచితనాన్ని ఇంతమంది గుర్తించినా మేము కొడుకులమై ఉండీ గుర్తించలేకపోయాం. గొప్పలకుపోయి ఆర్థిక ఇబ్బందుల్లోపడి, బయటి వ్యక్తులు వచ్చి మన ఇంట్లో జరిగిన మధురమైన దృశ్యాల్ని గుర్తుచేస్తే తప్ప గుర్తుకురాని పరిస్థితిలో ఉండిపోయాం. మనం ఇల్లు అమ్మవద్దు. కింది పోర్షను రామారావుగారికి అద్దెకిద్దాం. పై పోర్షను మాత్రం ఖాళీగా ఉంచుదాం. నువ్వు మాతో వచ్చేసెయ్. ప్రతి సంవత్సరం వేసవిలో ఇక్కడకు వచ్చి ఓ వారంరోజులు హాయిగా గడుపుదాం. పాత రోజుల్ని గుర్తుచేసుకుని ఆనందిద్దాం’’ అన్నాడు.
‘‘అవునమ్మా, నిన్ను ఇన్నాళ్ళూ నిర్లక్ష్యం చేసినందుకు సిగ్గుపడుతున్నాం. నువ్వు మాతో వచ్చెయ్. ఈ ఇంటి గురించీ నాన్నగారి మంచితనం, వ్యక్తిత్వం గురించీ మా పిల్లలకు కూడా చెబుదాం. ఈ ఇంటితోపాటు ఆయన పాటించిన విలువలు కూడా వాళ్ళకు వారసత్వంగా లభించనీ’’ అన్నాడు.
సావిత్రి భర్త ఫొటోవైపు చూసింది. ఆయన ఆనందంతో నవ్వుతున్నట్లు కనిపించింది ఆమెకు. ‘అవును మరి, మానవత్వపు విలువల్ని పిల్లలకు ఆస్తిగా ఇచ్చారు ఆయన. వాళ్ళు వాటిని నిలుపుకుంటే ఆయన ఆత్మ సంతోషిస్తుంది’ అనుకుంది తృప్తిగా.
💦🐬🐥🐋💦
[08:56, 27/05/2020] Prathyusha: గర్భగుడిలోకి వెళ్లేముందు గడపకెందుకు నమస్కరిస్తారు............!!🙏
సాధారణంగా ఆలయంలో ప్రధాన ద్వారం వద్ద, గర్భగుడిలోకి వెళ్లేముందు ఉన్న గడపలు రాయితో తయారు చేసి ఉంటారు. ఈ గడపకు ప్రతి భక్తుడూ నమస్కరిస్తుంటాడు. ఇలా ఎందుకు నమస్కరిస్తారనే విషయం చాలా మంది భక్తులకు తెలియదు.
వాస్తవానికి గృహాలకు చెక్కతో తయారు చేసిన గడప ఉంటుంది. అలాగే, ఆలయాలకు అయితే రాయితో తయారు చేసిన గడప ఉంటుంది. ఆలయాలకు రాతితోనే ఎందుకు గడపను తయారు చేస్తారు? ఆ ఆలయ గడపకు ఎందుకు నమస్కరించాలి అనే అంశాలను పరిశీలిస్తే...
రాయి పర్వతానికి చెందినది. భద్రుడు అనే ఋషి భద్రమనే పర్వతంగానూ, హిమవంతుడు అనే భక్తుడు హిమాలయముగానూ, నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రిగానూ అవతరించారని పురాణాలు చెపుతున్నాయి. ఈ ఆ భక్తుల కోసం భగవంతుడు కూడా ఆ కొండలమీదే వెలిశాడు. అందుకే ఆ కొండ రాళ్ళ నుంచి వచ్చిన రాయినే మలిచి ఆలయ గర్భగుడులకు గడపగా పెట్టారని శాస్త్రాలు చెపుతున్నాయి.
అయితే, ఆ గడప నిత్యం దైవాన్ని దర్శిస్తూ ఉంటుంది. అలా ఆ గడప రాయి పుణ్యం చేసుకుంది. అందుకే ఆ గడప రాయి చేసుకున్న పుణ్యానికి నమస్కరిస్తూ, కొండ రాయిగా మారిన భక్తుడిని దాటుతున్నందుకు క్షమించమని, మన్నించమని వేడుకోవడమే గడపకు నమస్కరిస్తారని పురాణాలు చెపుతున్నాయి. అందుకే ఆలయాల్లో ప్రధాన గడప తొక్కకుండా కేవలం దాటాలని ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తున్నారు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
[08:38, 30/05/2020] Prathyusha: 💥💥కారులో శానిటైజర్..బాంబ్ కంటే ప్రమాదం..తస్మాత్ జాగ్రత్త !💥💥
కోవిడ్-19: కరోనా వైరస్ ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే మాట. చిన్నాపెద్ద తేడా లేదు. పల్లె పట్నం, అంతటా విస్తరిస్తూ వైరస్ ప్రతాపం చూపెడుతోంది. ‘కరోనా వైరస్’పేరు వింటేనే సామాన్య జనానికి ఒంటిలో నుంచి వణుకుపుడుతోంది. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వాలు, వైద్యులు చెప్పిన సూచనలు తూ.చ తప్పక పాటిస్తున్నారు. చాలా మంది సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందరూ మాస్క్ లు ధరించడం మొదలు పెట్టారు. ఫేస్ మాస్క్ పెట్టుకోవడం, శానిటైజర్‌తో చేతులు కడుక్కోవడం పాటిస్తున్నారు. అయితే వీటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే రక్షణకు బదులు అవే కరోనా దారులుగా మారే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తించకుండా ఉండేందుకు తరచూ శానిటైజర్లతో చేతులు కడుక్కొవాలన్న వైద్యుల సూచన మేరకు ఇప్పుడు అందరూ వాటిని వెంటపెట్టుకుని ఉంటున్నారు. అయితే, ఈ శానిటైజర్ల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కారు ప్రయాణాల తర్వాత వేడిగా ఉన్నప్పుడు వాటిలో శానిటైజర్లను ఉంచకూడదని అమెరికన్ అధికారులు హెచ్చరిస్తున్నారు. శానిటైజర్‌లో ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది కనుక అది బయటికొచ్చి మంటలు వ్యాపించే ప్రమాదం ఉందంటున్నారు. దీంతో కార్లు తగలబడతాయని హెచ్చరిస్తున్నారు. ఇటీవల అమెరికాలో ఓ కారు శానిటైజర్ వల్ల కాలిపోవడంతో ఈ హెచ్చరిక జారీ చేశారు. అసలే వేసవి కాలంతో మండిపోతున్న ఎండలకు కార్లు మరింత వేడెక్కుతాయని, ఏమాత్రం పొరపాటు జరిగినా మంటలు చెలరేగే ప్రమాదం పొంచిఉందంటున్నారు. కారు ప్రయాణం చేసేటప్పుడు శానిటైజర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.