Thursday, 7 January 2016

*శ్రీ లక్ష్మి హృదయం

ఓం శ్రీ రాం- శ్రీ  మాత్రే నమ: 
 ప్రాంజలి ప్రభ - (ఆనందం -ఆరోగ్యం-ఆధ్యాత్మికం ) మాధ్యేయం 
సేకరణ : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

‘శ్రీలక్ష్మీ హృదయం’
1. హస్తద్వయేన కమలే ధారయంతీం స్వలీలయా!
హార నూపుర సంయుక్తాం మహాలక్ష్మీం విచింతయేత్

భావం: తనలీలావిలాసంతో ఇరుహస్తాల్లో కమలాలు ధరించి, హారాలు, మువ్వలగజ్జలు వంటి అనేక ఆభరణాలను ధరించిన మహాలక్ష్మీదేవిని స్మరిస్తున్నాను.


2.కౌశేయపీతవసనామరవిందనేత్రాం పద్మాద్వయాభయవరోద్యతపద్మహస్తాం |


ఉద్యఛ్ఛతార్క సదృశాం పరమాంకసంస్థాం ధ్యాయేద్ విధీశనత పాదయుగాం జనిత్రీం
భావం: పద్మ దళముల వంటి కన్నులు కలది, పద్మముల వంటి కోమల హస్తాలతో అభయాన్ని ఇచ్చేది, ఉదయ భానుడి వంటి ప్రకాశవంతమయిన దేహము కలది, ఎరుపు-పసుపు మేళవించిన వస్త్రాలు ధరించినది, పరమార్ధ ప్రదాయిని, లోకమాత అయిన మహాలక్ష్మీదేవి పాదపద్మములను స్మరించుచున్నాను.




3. పీతవస్త్రాం సువర్ణాంగీం పద్మహస్తద్వయాన్వితాం
లక్ష్మీం ధ్యాత్వేతి మంత్రేణ స భవేత్ పృధివీపతిః

భావం: బంగారు మేనిఛాయతో , పీతవస్త్రాలను (పసుపు రంగు) వస్త్రాలను , ఇరు హస్తాలలో పద్మాలు ధరించిన లక్ష్మీదేవిని పై విధంగా ధ్యానించిన వారికి మహారాజయోగం పడుతుంది.




4. మాతులుంగ గదాఖేటే పాణౌ పాత్రంచ బిభ్రతీ
వాగలింగంచ మానంచ బిభ్రతీ నృపమూర్ధని
భావం: తన చేతులలో గద, డాలు,నిమ్మ పళ్ళతో నిండిన పాత్ర ధరించి, వాగలింగాన్ని గౌరవించే రాజుల నుదిటిపై వెలుగొందే లక్ష్మిని ధ్యానించుచున్నాను




5. వందే లక్ష్మీం పరశివమయీం శుద్ధజంబూనదాభాం
తేజోరూపాం కనకవసనాం సర్వభూషోజ్జ్వలాంగీం
బీజాపూరం కనకకలశం హేమపద్మం దధానాం
ఆద్యాం శక్తిం సకలజననీం సర్వమాంగళ్య యుక్తాం.

భావం: దైవత్వానికి ప్రతిరూపమయినది, స్వచ్చమయిన బంగారం వలె దివ్యతేజస్సు కలది, కనక వస్త్ర ధారిణి , సకల ఆభరణాలతో మెరిసే దేహము కలది, 
దానిమ్మగింజలతో నిండిన కనక కలశాన్ని,పద్మాలను చేత ధరించినది, ఆదిశక్తి , లోకమాత అయిన లక్ష్మికి ప్రణామములు.




6. శ్రీమత్సౌభాగ్యజననీం స్తౌమి లక్ష్మీం సనాతనీం 
సర్వకామ ఫలావాప్తి సాధనైక సుఖావహాం
భావం: తన ఉపాసనతో సకలసౌభాగ్యాలను కలిగించేది, అన్ని కోరికలనూ తీర్చేది, అదృష్టదాయిని,సనాతని అయిన లక్ష్మిని నుతించుచున్నాను.




7. స్మరామి నిత్యం దేవేశి త్వయా ప్రేరితమానసః 
త్వదాజ్ఞాం శిరసా ధృత్వా భజామి పరమేశ్వరీం
భావం: నీ వలన ప్రేరితమయిన మనస్సుతో, నీ ఆజ్ఞను శిరసావహించి, పరమేశ్వరివయిన నిన్ను నిత్యం తలచుకుంటాను దేవీ




8. సమస్తసంపత్సుఖదాం మహాశ్రియం
సమస్తకల్యాణకరీం మహాశ్రియం 
సమస్తసౌభాగ్యకరీం మహాశ్రియం
భజామ్యహం జ్ఞానకరీం మహాశ్రియం

భావం: సమస్త సంపదలను ప్రసాదించేది, సమస్త మంగళాలను కలిగించేది, సౌభాగ్యదాయిని, జ్ఞానప్రదాయిని అయిన మహాలక్ష్మీదేవిని భజిస్తున్నాను




9. విజ్ఞాన సంపత్సుఖదాం మహాశ్రియం
విచిత్రవాగ్భూతికరీం మనోరమాం 
అనంతసౌభాగ్యసుఖప్రదాయినీం
నమామ్యహం భూతికరీం హరిప్రియాం

భావం: మానసిక ఉల్లాసాన్ని కలిగించేది, హరిప్రియ, వాగ్దాయిని, సర్వసంపదలను ప్రసాదించేది, విజ్ఞాన సంపద ద్వారా శాశ్వత ఆనందాన్ని ప్రసాదించేది అయిన మహాలక్ష్మికి వందనములు..




10. సమస్తభూతాంతరసంస్థితా త్వం
సమస్తభక్తేశ్వరి విశ్వరూపే 
తన్నాస్తి యత్త్వద్వ్యతిరిక్తవస్తు
త్వత్పాదపద్మం ప్రణమామ్యహం శ్రీః

భావం: తల్లీ! నువ్వు సర్వంతర్యామినివి. భక్తులందరికీ ఆరాధ్యదేవతవు. విశ్వరూపిణివి. నువ్వు కానిది ఏదీ ఈ లోకంలో లేదు. అట్టి నీ పాదపద్మములకు నమస్కారములు.




11. దారిద్ర్య దుఃఖౌఘ తమోనిహంత్రి
త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ 
దీనార్తివిచ్ఛేదన హేతుభూతైః
కృపాకటాక్షైరభిషించ మాం శ్రీః

భావం: దుఃఖాన్ని, దారిద్ర్యాన్ని హరించే, నీ పాదపద్మముల సన్నిధిని నాకు ప్రసాదించు. నా లోని ఆర్తిని, దీనత్వాన్ని తొలగించే నీ కృపాద్రుష్టిని నాపై వర్షింపచెయ్యి తల్లీ !

ప్రాంజలి ప్రభ - అష్టమోద్యాయ: 
సర్వేజనా సుఖినోభవంతు


1 comment: