ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం
ప్రాంజలి ప్రభ -దసరా మహోత్సవములు
సర్వేజనా సుఖినోభవంతు
ప్రాంజలి ప్రభ అందరికి దసరా శుభాకాంక్షలు
ప్రాంజలి ప్రభ అందరికి దసరా శుభాకాంక్షలు
దసరా మహోత్సవములు – 2017 శ్రీ అమ్మవారి దివ్య అలంకరములు ది:21-09-2017 గురువారము ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి శ్రీ స్వర్ణకవచ దుర్గాదుర్గాదేవి ది:22-09-2017 శుక్రవారము ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి(మిగులు)విదియ శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి ది:23-09-2017 శనివారము ఆశ్వయుజ శుద్ధ తదియ శ్రీ గాయత్రి దేవి ది:24-09-2017 ఆదివారము ఆశ్వయుజ శుద్ధ చవితి శ్రీ మహాలక్ష్మిదేవి ది:25-09-2017 సోమవారము ఆశ్వయుజ శుద్ధ పంచమి శ్రీ అన్నపూర్ణా దేవి ది:26-09-2017 మంగళవారము ఆశ్వయుజ శుద్ధ షష్ఠి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి ది:27-09-2017 బుధవారము ఆశ్వయుజ శుద్ధ సప్తమి శ్రీ సరస్వతీ దేవి(మూలానక్షత్రం) ది:28-09-2017 గురువారము ఆశ్వయుజ శుద్ధ అష్టమి శ్రీ దుర్గా దేవి ది:29-09-2017 శుక్రవారము ఆశ్వయుజ శుద్ధ నవమి శ్రీ మహిషాసురమర్ధినీ దేవి ది:30-09-2017శనివారము ఆశ్వయుజ శుద్ధ దశమి శ్రీ రాజరాజేశ్వరి దేవి నవరాత్రి (దసరా) మహిళలకు మంగళకరమైనదీ, శుభదాయకమైనది, ముతైదువులందరూ తొమ్మిది రోజులు సంతోషంగా, సందడిగా జరుపుకొనే ఈ దసరా పండుగ మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబించే పర్వదినాలు ఈ నవరాత్రులు. ఇక ఈ పండుగలో ప్రత్యేకత ఏమిటంటే మహిళలు తెల్లారే లేచి ఇళ్ళు వాకిళ్ళు కడిగి ముగ్గులు పెట్టుకొని మంగళతోరణాలతో మంగళప్రదంగా అలంకరించి గడపకు పసుపురాసి కుంకుమ బొట్లుపెట్టి మన సంప్రదాయాలకు అనుగుణంగా స్నానపానాదులు చేసి భ్యాగ్యదాయినీ, సౌభాగ్యప్రదాయిని అయిన ఆ దేవిని ఒక్కోరోజు ఒక్కోక్క దేవిని కొలిచి మీకు తెలిసిన ముతైదువులను పేరంటానికి పిలిచి కాళ్ళకు పసుపు రాసి కుంకుమ పెట్టి తాంబూలాలతో వారిని సంతుస్టులను చేసి ఆ తల్లి ఆశీస్సులు పొందాలి. ఆ తల్లిని ప్రసన్నురాలిని చేసుకొని సకల సౌభాగ్యలు అష్ట ఐశ్వర్యాలు కావాలని కోరుకొని వచ్చిన పేరంటాలు అమ్మవారి మీద పాటలు పాడి హారతులు ఇచ్చి అక్షింతలు వేసి పూజించాలి.ఈ దసరా పండుగకి మనము ఆ తల్లికి చేయవలసిన నైవేద్యము, ఆ తల్లికి ఇష్టమైన రంగు శ్రీ అమ్మవారి దివ్య అలంకరములు రంగు నైవేద్యం 1 బాలత్రిపుర సుందరి నీలం రంగు ఉప్పు పొంగల్ 2 గాయిత్రి దేవి పసుపు రంగు పులిహోర 3 అన్నపూర్ణా దేవి లేత రంగు కొబ్బరి అన్నం 4 శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి ఆకాషం రంగు అల్లం గారెలు 5 సరస్వతి దేవి కనకంబరం రంగు పెరుగన్నం 6 మహాలక్ష్మీ దేవి తెలుపు రంగు రవ్వకేసరి 7 దుర్గాదేవి మెరున్ రంగు (ముదురు ఎరుపు) కదంబం (వెజిటబుల్, రైస్ కలిపి వండే ఐటం) 8 మహిషాసురమర్థిని దేవి ఎర్రటి ఎరుపు రంగు బెల్లమన్నం 9 రాజరాజేశ్వరి దేవి ఆకుపచ్చ రంగు పరమాన్నం ఇలా 9 రోజులు తొమ్మిది రకాల వంటకాలతో ఆ తల్లికి ఆరగింపులు చేసి ప్రసన్నులు కావచ్చు. | ||
దసరా మహోత్సవములు – 2015
శ్రీ అమ్మవారి దివ్య అలంకరములు ది:13-10-2015 మంగళవారము ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి శ్రీ స్వర్ణకవచ దుర్గాదుర్గాదేవి ది:14-10-2015 బుధవారము ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి(మిగులు) శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి ది:15-10-2015 గురువారము ఆశ్వయుజ శుద్ధ విదియ శ్రీ గాయత్రి దేవి ది:16-10-2015 శుక్రవారము ఆశ్వయుజ శుద్ధ తదియ శ్రీ మహాలక్ష్మిదేవి ది:17-10-2015 శనివారము ఆశ్వయుజ శుద్ధ చవితి శ్రీ అన్నపూర్ణా దేవి ది:18-10-2015 ఆదివారము ఆశ్వయుజ శుద్ధ పంచమి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి ది:19-10-2015 సోమవారము ఆశ్వయుజ శుద్ధ షష్ఠి శ్రీ సరస్వతీ దేవి(మూలానక్షత్రం) ది:20-10-2015 మంగళవారము ఆశ్వయుజ శుద్ధ సప్తమి శ్రీ దుర్గా దేవి ది:21-10-2015 బుధవారము ఆశ్వయుజ శుద్ధ అష్టమి శ్రీ మహిషాసురమర్ధినీ దేవి ది:22-10-2015 గురువారము ఆశ్వయుజ శుద్ధ నవమి/దశమి శ్రీ రాజరాజేశ్వరి దేవి నవరాత్రి (దసరా) మహిళలకు మంగళకరమైనదీ, శుభదాయకమైనది, ముతైదువులందరూ తొమ్మిది రోజులు సంతోషంగా, సందడిగా జరుపుకొనే ఈ దసరా పండుగ మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబించే పర్వదినాలు ఈ నవరాత్రులు. ఇక ఈ పండుగలో ప్రత్యేకత ఏమిటంటే మహిళలు తెల్లారే లేచి ఇళ్ళు వాకిళ్ళు కడిగి ముగ్గులు పెట్టుకొని మంగళతోరణాలతో మంగళప్రదంగా అలంకరించి గడపకు పసుపురాసి కుంకుమ బొట్లుపెట్టి మన సంప్రదాయాలకు అనుగుణంగా స్నానపానాదులు చేసి భ్యాగ్యదాయినీ, సౌభాగ్యప్రదాయిని అయిన ఆ దేవిని ఒక్కోరోజు ఒక్కోక్క దేవిని కొలిచి మీకు తెలిసిన ముతైదువులను పేరంటానికి పిలిచి కాళ్ళకు పసుపు రాసి కుంకుమ పెట్టి తాంబూలాలతో వారిని సంతుస్టులను చేసి ఆ తల్లి ఆశీస్సులు పొందాలి. ఆ తల్లిని ప్రసన్నురాలిని చేసుకొని సకల సౌభాగ్యలు అష్ట ఐశ్వర్యాలు కావాలని కోరుకొని వచ్చిన పేరంటాలు అమ్మవారి మీద పాటలు పాడి హారతులు ఇచ్చి అక్షింతలు వేసి పూజించాలి.ఈ దసరా పండుగకి మనము ఆ తల్లికి చేయవలసిన నైవేద్యము, ఆ తల్లికి ఇష్టమైన రంగు శ్రీ అమ్మవారి దివ్య అలంకరములు రంగు నైవేద్యం 1 బాలత్రిపుర సుందరి నీలం రంగు ఉప్పు పొంగల్ 2 గాయిత్రి దేవి పసుపు రంగు పులిహోర 3 అన్నపూర్ణా దేవి లేత రంగు కొబ్బరి అన్నం 4 శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి ఆకాషం రంగు అల్లం గారెలు 5 సరస్వతి దేవి కనకంబరం రంగు పెరుగన్నం 6 మహాలక్ష్మీ దేవి తెలుపు రంగు రవ్వకేసరి 7 దుర్గాదేవి మెరున్ రంగు (ముదురు ఎరుపు) కదంబం (వెజిటబుల్, రైస్ కలిపి వండే ఐటం) 8 మహిషాసురమర్థిని దేవి ఎర్రటి ఎరుపు రంగు బెల్లమన్నం 9 రాజరాజేశ్వరి దేవి ఆకుపచ్చ రంగు పరమాన్నం ఇలా 9 రోజులు తొమ్మిది రకాల వంటకాలతో ఆ తల్లికి ఆరగింపులు చేసి ప్రసన్నులు కావచ్చు. | ||
విని ఆనందించండి
1. http://vocaroo.com/i/s0r60NB0KSk9
శక్తి పీఠ సంస్మరణ (ఆట వెలదులలో...)
-------------------
1.శక్తి పీఠములలొ శాంకరంబ మొదలు
లంక యందు నిన్ను లక్షణముగ
ద్వీప మదియె నీదు దివ్య ధామంబాయె
అమ్మ నన్ను నీవె యాదరింపు!!
2.కంచి పురము నందు 'కామాక్షి'గా నీవు
భక్తులకును కొంగు బంగరంబు!
మరియు మధుర లోన మా తల్లి 'మీనాక్షి'
అమ్మ నన్ను నీవె యాదరింపు!!
3.'సంకెల'లను దెంచ సౌరాష్ట్ర మందునా
విబుధ జనుల కొఱకె విడిసి నావు!
ప్రణతు లందుకొనుచు ప్రద్యుమ్న నగరిలో
అమ్మ నన్ను నీవె యాదరింపు!!
4.క్రౌంచ పురము నందు గొల్వ 'చాముండి'వై
భక్త జనులలోని భయము బాపు!
సర్వ సిద్ధి యైన శక్తి మాతవు నీవు
అమ్మ నన్ను నీవె యాదరింపు!!
5. అవతరించినావె ఆలంపురములోన
'జోగులాంబ' పేర జూడుమమ్మ
రుద్ర కనులె గాని రోషంబు లేదాయె
అమ్మ నన్ను నీవె యాదరింపు!!
6.మల్లి కార్జునయ్య మహిమెల్ల తోడుగా
శైలమందు నీవె శక్తి వైతి!
భక్త జనుల బ్రోచ భ్రమరాంబ వైతివి
అమ్మ నన్ను నీవె యాదరింపు!!
7.తొల్లి చెప్పినట్లు 'తోయజ'వే నీవు
కొలువు దీరినావు కొల్హపురిలొ!
పూజలంది ప్రజకు పురుషార్థ మొకటివ్వు
అమ్మ నన్ను నీవె యాదరింపు!!
8.మాహు గ్రామ మందు మహా శక్తి నీవు
'ఏక వీర' పేర ఏలికైతి
దారి తప్పనీవు ధర్మరక్ష ణెపుడు
అమ్మ నన్ను నీవె యాదరింపు!!
9.ఉజ్జయినిలొ నీవు యజ్ఞారినే జంప
'మహా కాళి'వైతి మమ్ము జూడ!
ఉగ్ర రూప మాపి యూరడింపు తల్లి
అమ్మ నన్ను నీవె యాదరింపు!!
10.పీఠపురములోన పీట వేసిన దేవి
అవతరించె, సాయి యచట నీతొ
పూజ లందుకొనుము 'పురుహూతికా' నీవు
అమ్మ నన్ను నీవె యాదరింపు!!
11.ఓఢ్ర దేశ మందు నుగ్రాక్ష పత్నివె
'గిరిజ' పేర నీవు కెలస గోరి
అఖిల లోకములనె యదుపు జేసెదవుగా
అమ్మ నన్ను నీవె యాదరింపు!!
12.ద్రాక్ష రామ మందు దయగల తల్లివే
వరద శక్తి నీవు వామ దేవి
మహిమ జూపు మాకు 'మాణిక్య' యంబవే
అమ్మ నన్ను నీవె యాదరింపు!!
13.'కామరూపిణం'చు కైంకర్యమివ్వగా
అస్సమందు అవతరించినావు !
ఆర తీయ నదియు నా యీశు దిక్కాయె
అమ్మ నన్ను నీవె యాదరింపు!!
14.'మాధవేశ్వరి'యని మనుజు లెల్ల గొల్వ
ఉత్తరాన వెలసి యున్నతముగ!
భద్ర నదుల నడుమ పావన క్షేత్రాన
అమ్మ నన్ను నీవె యాదరింపు!!
15.మంచు కొండ లందు మహిమ జూపగ నీవు
జ్వాల యందు 'వైష్ణొ దేవి' యైతి!
వెలుగు నిచ్చి జ్ఞాన, వైరాగ్యముల బెంచు
అమ్మ నన్ను నీవె యాదరింపు!!
16.శ్రాద్ధ కర్మ జూసి శక్తి పీఠమునను
విస్తు బోవ నేల విబుధ జనులు?
గయలొ ఉన్న 'గౌరి' కాద వాముని పత్ని?!
అమ్మ నన్ను నీవె యాదరింపు!!
17.వారణాసి యందు 'వఱలు కన్నుల ' గూడి
విబుద జనుల జూడ వీలు గొఱకె!
ఆది భిక్షువునకు యన్నపూర్ణవు నీవె
అమ్మ నన్ను నీవె యాదరింపు!!
18.'ధాత పత్న' రూపు దాల్చితివే నీవు
కశ్మిరంబు నందు గొలువు దీర!
జ్ఞాన భిక్ష వెట్టు శక్తి, జ్యోతియు నీవె
అమ్మ నన్ను నీవె యాదరింపు!!
------------------------------
వివరణ : 3లో ...సంకెల ...శృంఖలాలు ...(అమ్మ పేరు అక్కడ శృంఖలాదేవి కదా), 5. రోషము...కోపమునకు పర్యాయము,7. తోయజ ....లక్ష్మి,9.యజ్ఞారి..రక్కసు
-----------
om sri ram
ReplyDelete