Monday, 31 July 2023

daily story


పూజారుల కధ


ఇండియా లో సందుకో గుడి ఉంటుంది.  భక్తులు డబ్బులు, కానుకలు తెగ వేస్తారు అసలు ఆ డబ్బంతా ఏం చేస్తారు అని పాశ్చాత్య దేశం లో ఓ మేధావికి కుతూహలం పుట్టి.దీనిమీద డాక్యుమెంటరీ వ్రాయాలి అనుకుని వెంటనే మన రాష్ట్రానికి వచ్చాడు. ఆరోజు రెస్ట్ తీసుకుని ఏ దేవాలయానికి వెళ్తే ఇన్ఫర్మేషన్ సరిగా వస్తుందో తర్జన భర్జనలు పడి హోటల్ ఓనర్ విషయం చెప్పి అడిగితే మామూలు రోజుల్లో ఎక్కువ గా రద్దీ వుండని. ఈ మేధావికి కావలసిన సరైన సమాచారం ఇచ్చే జ్ఞాని అయిన పూజారి వుండే శివాలయానికి వెళ్ళమని చెప్పాడు

మర్నాడు తీరికగా హోటల్ ఓనర్ చెప్పిన శివాలాయనికి ఆ మేధావి డాక్యుమెంటరీ కోసం వచ్చాడు.. అక్కడ పూజారి గారు ఎర్ర పట్టువస్త్రం లాటిది కట్టుకుని వున్నారు.. ఆ ప్రక్కన మరో భారీకాయం టేబుల్ దగ్గర  కుర్చీ లో కూర్చుని ఉన్నాడు. ఆ ప్రక్కన రెండు చేతులకి 10 ఉంగరాలు పెట్టుకుని మరో భారీ కాయం ఉంది.. భక్తులు వస్తున్నారు ఆ రెండో భారీ కాయం అప్పుడప్పుడు వచ్చే భక్తులపై ఏవేవో అరుస్తున్నాడు..  భక్తుల రద్దీ అయిన తర్వాత మన మేధావి పూజారి గారిని ఇంటర్వ్యూ చెయ్యడానికి వెళ్ళాడు.. ఇంగ్లీష్ భాష లో మీతో చిన్న ఇంటర్వ్యూ కావాలి అన్నాడు...పూజారి గారు యం ఏ చదువుకున్నారు. ఒంటి గంటకి ఫ్రీ అవుతాను వీళ్లిద్దరూ కూడా వెళ్ళిపోతారు వైట్ చెయ్యండి అని ఇంగ్లీష్ భాష లో చెప్పి దర్శనం చేయించి తీర్థం ఇచ్చి శఠగోపం పెట్టేసారు..   అది మొదటి  భారీ కాయానికి అర్ధం కాలేదు..రెండో భారీ కాయం హెడ్ ఫోన్స్ పెట్టుకుని వాట్సాప్ లో ఎదో చూస్తున్నాడు ..మొదటి భారీ కాయం ఏంటట అని గర్జించాడు. అబ్బే ఏమీ లేదు చిన్న ఇంటర్వ్యూ కావాలట అని పూజారిగారు చెప్పారు, దానికి ఆ భారీ కాయం ఇక్కడ ఇంటర్ చదివే వాళ్ళు ఎవరూ లేరని చెప్పండి. ఈ లోపల ఒంటి గంట అయ్యింది ఆ రెండు భారీ కాయాలు సాయంత్రం 5 గంటలకు వస్తాం అని చెప్పి తమ స్వంత  కార్లలో వెళ్లిపోయారు.. పూజారి గారు గర్భ గుడికి తాళం వేసి గుడి ఆవరణ ల్  ఓ చల్లని చెట్టు క్రింద బెంచి పై ఆ మేధావిని కూర్చోబెట్టి తాను కూర్చుని ఇప్పుడు అడగండి మీకు ఏం కావాలో అన్నారు.. అప్పుడు మేధావి సార్ మీకు భక్తులు డబ్బు, కానుకలు చాలా ఇస్తారు అవి దేముడు మీరు ఎలా పంచుకుంటారు అని అడిగుతూ పూజారి గారిని నిశితంగా పరిశీలించాడు. పూజారి గారు బాగా బక్కగా ఉన్నా మంచి ఆరోగ్యం తో వున్నాడు.. 

పూజారి గారు డబ్బు, కానుకలు అని పేలవంగా ఓ నవ్వు నవ్వాడు.. అది పూర్వ వైభవం నాయనా గుళ్ళకి మాన్యాలు ఉండేవి రాజులు పూజారులకి ఎకరాలు పొలాలు ఇచ్చేవారట. ఇప్పుడు చాలామంది పూజారులకి  రోజు గడవడం కష్టంగా ఉంది నాయనా అన్నారు.  ఇంటరెస్టింగ్ గా ఉంది విపులం గా చెప్పండి అన్నాడు మేధావి. డబ్బు కానుకల ఒకప్పటి మాట నాయనా ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు..నేను ఎం ఏ చదివాను ఉద్యోగం కూడా వచ్చింది ఈ అర్చకత్వం అనువంశికం గా వస్తోంది మా నాన్నగారు ఓ 40 ఏళ్ల క్రితం చనిపోవడం వల్ల నాన్నగారి భాద్యత ఉద్యోగం వదిలి నేను తీసుకున్నాను.. ప్రస్తుత పరిస్థితి లో ప్రతీ గుడి కి పాలక మండలి ఉంటుంది ఈ గుళ్లు పై వచ్చే ఆదాయ పర్యవేక్షణ కి ఓ ప్రభుత్వ శాఖ ఒకటి ఉంటుంది. ఆదాయం ఉన్న ఏ గుడి అయినా ఆ ప్రభుత్వ శాఖ ఆధీనం లో కి వచ్చేస్తుంది.  ఇందాక గుడిలో  పది ఉంగరాలు పెట్టుకుని హెడ్ ఫోన్స్ పెట్టుకుని వాఁట్సప్ చూస్తున్నవాడు ఆ ప్రభుత్వ శాఖ ఉద్యోగి. వచ్చిన భక్తులని డబ్బులు కానుకలు హుండీ లో వెయ్యండి అని గదమాయిస్తూ ఉంటాడు. ఇప్పటి దాకా ఎంత మింగాడో వాడికే తెలియదు. ఉద్యోగం లో చేరిన క్రొత్తలో వాడికి సైకిల్ కూడా లేదు ఈ రోజు ఓ కారు మూడు ఫ్లాట్ లు ఉన్నాయి. రూల్ ప్రకారం భక్తులు  పళ్ళెము లో వేసినవి మాకు చెందుతాయి హుండీ లో వేసినవి మాకు చెందవు.  ప్రతీ భక్తుడు హుండీ లో నే కానుకలు వేసేలా  చూడడమే వాడి  కర్తవ్యం.దేవాలయాల ఆస్తులు వాటి పై వచ్చే రాబడి అవి ఇవి చూస్తుంటాడు  ఇక భక్తులు పెద్దనోట్లు హుండీ లో వేసి చిల్లర,దొంగ నోట్లు చిరిగి అతికించబడిన నోట్లు మా పళ్లెం లో వేస్తారు..ఓ అరవై మంది పేర్లు చెప్పి అర్చన చేయిస్తారు కానీ సర్వే జనాః సుఖినో భవంతు అని ఒక్కడూ అడగడు. ఒకవేళ ఎవరైనా దైర్యం గా పెద్ద నోటు పళ్లెం లో వేస్తే అది వీరు చూస్తే ఆ రోజు మాకు నరకమే… ఇక ఎవరైనా భక్తులు అమ్మవారికి ఖరీదైన చీర పెడితే ఆ ప్రభుత్వం నియమించిన ఉద్యోగి తన కర్తవ్యం మర్చిపోయి ఆ చీరని లటుక్కుమని మాయం చేస్తాడు..  ఇక మొదటి భారీకాయం పాలక మండలి చైర్మన్,, సారా కాంట్రాక్టర్.. భక్తులు ఇచ్చిన బంగారు ఆభరణాలు ఈయన ఇంట్లో నే ఉంటాయి. ఏదో ఉత్సవాలకు మాత్రామే బయటకు వస్తాయి..  

ఇక అన్నీ వేలం పాట లే. గుడిముందు కొబ్బరి కాయల దుకాణం నించి ప్రతీది వేలం వేస్తారు.. టిక్కట్లు అమ్మకం లో కుంభకోణాలు, ప్రసాదం కౌంటర్ లో కుంభకోణాలు. అమవారికి భక్తులు పెట్టే చీరలు జాకెట్ ముక్కలు కూడ వేలం వేస్తారు.. 

చివరికి భక్తులు కొట్టే కొబ్బరి కాయ కి కూడా వేలం పాటే. కాయలో క్రింద సగం భక్తుడు కి ఇవ్వాలి. పై భాగం ఎవరో హోటల్ వాళ్ళు వేలం పాడుకుంటారు. ఆ సగం చిప్ప కూడా మాకు దక్కదు.. చాలీ చాలని జీతం ఇస్తారు, అందులోనే నైవేద్యం మేమే వండాలి
ఈ పూజరిని ఎలా ఎప్పుడు పీకేయ్యాలా, మనకి అనుకూలం గా ఉండేవారిని ఎలా పెట్టుకోవాలా 
అని ఆలోచిస్తారు.. ఆ ప్రభుత్వ ఉద్యోగి మా చేత చెప్పులు కూడా మోయిస్తాడు. దొంగ తనాలు అంటకడతారు కొందరు పూజారులు వీళ్ల టార్చెర్ భరించలేక ఆత్మహత్య లు చేసుకుంటున్నారు.. నాయనా.

గత కొన్ని సంవత్సరాలుగా భక్తులు పరాయి రాష్ట్ర దేముళ్లపై పడుతున్నారు.. చిన్న దేవాలయాల పరిస్థితి ఘోరం గా తయారయ్యింది.. రామాలయాలు వీళ్ళకి శ్రీరామనవమి నాడే గుర్తుకువస్తాయి. రామాలయం లో పని చేసే పూజారుల పరిస్థితి మరీ ఘోరం.. ఈ సందు చివరన ఉంది అక్కడికి కూడా ఓ  సారి వెళ్లి చూడండి.

మధ్యలో మేధావి.. మరి ఎలా బ్రతుకుతున్నారు.. 
నమ్ముకున్న దేముడిని పూజారి వదిలే ప్రసక్తి లేదు.
కుంచెమ్ ఆయుర్వేదం హోమియోపతి జాతకాలు వాస్తు జ్ఞానం ఉంటుంది భక్తుల కు నమ్మకం ఎక్కువ.

పల్లెటూళ్ళలో  ఎవరికైనా జ్వరం వస్తే ముందు గుడి పూజారి దగ్గర కే వెళ్లేవారు ఆయన నేర్చుకున్న వైద్య జ్ఞానం తో మందు ఇస్తారు.. కొందరు భక్తులు పూజారి కి ఇస్తే మంచిది అని భావించి మాకు గుప్తం గా సాయం చేస్తుంటారు.. 
దారుణం ఏమిటంటే 1983 నించి కంచె లా దేవాలయాలని కాపు కాయవలసిన ప్రభుత్వమే దేవాలయాల ఆస్తులపై పడుతోంది.. 

దేముడి సొమ్ము తినే ఎవరైనా సరే ఆఖరికి పొందేది అధోగతే..
మరి ఇవన్నీ చూసి మీ దేముడుకి కోపం రాదా ఆయన ఏమీ చెయ్యడా.. అని మేధావి అడిగారు.. 
మంచి ప్రశ్న వేశావు నాయనా.. నీకు కోట్ల ఆస్తి ఉంది లేక లేక నీకు ఓ కొడుకు పుట్టాడు. వాడికి నువ్వు వాడి ప్రధమ జన్మదినానికి ఓ 10 లక్షలు పెట్టి చైన్ చేయించి మెడలో వేస్తావు, ఓ 5 లక్షలు పెట్టి వజ్రాల ఉంగరం చేయించి వెలికి పెడతావు. ఓ 10 వేలు పెట్టి బట్టలు కొని వేస్తావు. బర్త్ డే పార్టీ కి పుర ప్రముఖుల్ని పిలుస్తావు సాయంత్రం పార్టీ పెడతావు.. 

అందరూ వస్తారు. బుగ్గలు నిమిరి ముద్దులు పెడుతుంటారు. కానీ వాడి కళ్ళు ఎవరి కోసమో వెతుకుతూ ఉంటాయి.. నువ్వు చేయించిన బంగారం కానీ వజ్రాల ఉంగరాలు కానీ 10 వేలు పెట్టి కొన్న బట్టలని వాడు పట్టించుకోడు.. పార్టీ కి పెద్ద వాళ్ళు వస్తారు అని ఎక్కడో రూమ్ లో బంధించబడిన  రోజూ తనతో ప్రేమగా ఉంటూ తనని ఆడించే లాలించే  తాతా నానమ్మ, తోటమాలి ల కోసమే వాడి కళ్ళు వెతుకుతుంటాయి.. ఆ విధం గానే దేముడు కూడా తనే లోకం గా బ్రతికే భక్తుల కోసమే ఎదురు చూస్తుంటాడు. ఈ మాన్యాలు, ఆస్తులు ఆభరణాలు ఆయన పట్టించుకోడు.. నీ ఆనందానికి నువ్వు నగలు గట్రా చేయిస్తున్నావు, ఆయన ఏన్నడూ నాకు ఫలానా ది కావాలి అని అడగడు.. ఆయన సృష్టించిన వాటిని ఆయనకే ఇవ్వడం ఏమిటి.. మీ దేముడు ఏమీ చెయ్యడా అని ఆడిగావు మా అమ్మవారు ఊరికి కాపలా కాస్తూ ఉంటుంది. అయ్యవారు స్మశానం లో కూర్చుంటాడు.

ఎవరు పోయినా బంధు, మిత్ర జనం స్మశానం వరకే వస్తారు అక్కడ నించి అయ్యవారు చూసుకుంటారు..అని చెప్పారు.. ఈ లోపల పూజారి గారు పులిహోర చక్రపొంగలి ఆ మేధావికి పెట్టి మంచినీళ్ళు ఇచ్చారు. 
మేధావి మస్తిష్కాన్ని ఆధ్యాత్మిక జ్ఞాన మేఘం ఆవరించింది..
మరి మీ దేముడికి వీళ్ళు మంచివాళ్ళు కాదు నా సొమ్ము తినేస్తారు అని ముందే తెలియదా అని అడిగాడు.. 
చూడు నాయనా దైవ వాసన లేనిదే ఆయన ప్రమేయం లేకుండా ఆయన సన్నిధి లో ఉండటం ఎవరికీ సాధ్యం కాదు.. పైగా దేముడు ఎవరి ఋణమూ ఉంచుకొడు.. వీరు గత జన్మలలో ఉత్సవాలలో పల్లకీ లు మోసే వాళ్ళో, త్యాగరాజు అన్నమాచారి కీర్తనల కచేరీ లో  వెనక నించి చిడతలు, సన్నాయి, తాళాలు వేసే వారో రకరకాలైన దైవ సేవలలో పాలు పంచుకున్నవారో అయ్యివుంటారు వారు సేవ చేశారు, దానికి ఫలం ఈ విధం గా ఇచ్చాడు. ఈ సదవకాశాన్ని ఇప్పుడు వారు దుర్వినియోగం చేసుకుంటున్నారు.. 

మరి  ఉత్తమ మార్గం లో కి పోవాలంటే ఏమి చెయ్యాలి అని మేధావి అడిగాడు.. 
బాబూ ముందు తల్లి తండ్రులకి సేవ చెయ్యాలి..
మానవసేవ ని మించింది లేదు.. ప్రతిఫలం మీద కోరిక లేకుండా, తిండి లేనివాడికి అన్నదానం, చదువుకునే స్తోమత లేనివారికి విద్యాదానం లాటివి చేస్తే ఉత్తమ మార్గం లో కి వెళ్లడం సాధ్యం అని చెప్పారు పూజారి గారు. 

మేధావి లేచి బ్యాగ్ లోంచి పూజారిగారికి ఇవ్వడానికి చాలా డబ్బు తీశాడు.. పూజారిగారు అది నాకు వద్దు మా అబ్బాయి బ్యాంకు లో ఉద్యోగం చేస్తున్నాడు నాకు డబ్బు.పంపిస్తున్నాడు. ఈ సందు చివర రామాలయం ఉంటుంది ఆ ప్రక్కనే పాక లో పూజారిగారు వుంటారు. రామాలయ పూజారుల పరిస్థితి అంతగా బాగోలేదు. ఆయన చాలా  ఆర్ధిక ఇబ్బందులతో వున్నారు. ఆయనకి ఇమ్మని చెప్పారు. 
ఆయన చెప్పిన విధంగా నే ఆ సందు చివర రామాలయం ప్రక్కన ఉన్న పాకలోకి మేధావి వెళ్ళాడు. అక్కడ ఇంట్లో  పరిస్థితి చూసి నేను చాలా పోరాబాటుగా ఆలోచించాను అనుకుని వృద్ధ పూజారి గారిని కలిసి జరిగినది అంతా చెప్పి నాకు ఇంకా జ్ఞానం కావాలి అని మేధావి అడిగాడు.
ఆయనకు ఆయన ఆర్ధిక సమస్యలు అన్నీ తీరిపోయి సుఖం గా బ్రతకడానికి  సరిపోయే డబ్బు ఆయన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసి ఆయన ఆతిధ్యం స్వీకరించాడు.  పూజారిగారు నా కష్టాలు చూసి రాముడే ఈయనని ఈ విధం గా పంపాడు అనుకున్నాడు.. మేధావి గారు  పూజారి గారిని  కదిలిస్తే ఆధ్యాత్మిక విషయాల మీద  చాలా  ఇన్ఫర్మేషన్ దొరికింది 
నువ్వు కాశీ ఒక్కసారి వెళ్ళు అక్కడ నీకు అంతా తెలుస్తుంది అని చెప్పారు రామాలయం పూజారిగారు.
సత్యాన్వేషణ కోసం మేధావి కాశీ వెళ్ళిపోయాడు.. 
ఒక్క రోజులో ఒక చిన్న సంభాషణ ఒక పెను మార్పు తెచ్చింది. ఇంతమంది జ్ఞానులు చుట్టూ వున్నారు వివిధ రకాలైన మాధ్యమాలద్వారా జ్ఞానం మనచుట్టూ పారుతూనే ఉంటుంది.. అయినా మన జ నాలలో మార్పు ఎందుకు రాదో ఎవరికీ అర్థం కాని ప్రశ్న…..
ఇది మన పూజారుల పరిస్థితి .

ప్రాంజలి ప్రభ ।। కధలు।।

ఆంజనేయునికి సింధూరమంటే అత్యంత ఇష్టం !
హనుమంతుడు రామునికి దాసానుదాసుడు। మహా భక్తుడు । రాముడు హనుమ భక్తిని మెచ్చి ముత్యాల హారమిస్తే, అందులో రాముడున్నాడా లేదా అని కొరికి చూసి , రాముడు లేదు కాబట్టి ఆ హారానికే విలువలేదని ఒకింత అమాయకత్వం నిండిన కొంటె చేష్టతో చెబుతాడు హనుమ। తన హృదయంలోని రాముడున్నాడని , గుండెని చీల్చి సీతమ్మకి చూపిన మహా భక్తుడు । రాముని ప్రేమలో నిత్యం రమించిపోయే ఆ అంజనీసుతునికి  సీతమ్మమీద ఒకింత అసూయ కూడా కలిగింది । అదే, ఆయన ఒంటినిండా సింధూరం పూసుకోవడానికి కూడా కారణమయ్యింది । 
హనుమా నీకు నమస్కారం అని చెప్పినప్పటికన్నా , ఓ రామభక్తా నీకు నమస్కారం అంటే, వెంటనే అనుగ్రహిస్తాడట హనుమంతుడు । రామ కథని ఎక్కడ గానం చేస్తారో , ఎక్కడ రామనామం జపిస్తారో అక్కడకి  ఏదొకరూపంలో హనుమ స్వయంగా వస్తారని శృతివచనం । భక్తిలో రమించిపోయినప్పుడు, భక్తునికి ఉన్మత్తావస్థ అనుభవంలోకి వస్తుందని యోగశాస్త్రం చెబుతుంది । హనుమ తన అస్తిత్వాన్ని కూడా మరిచిపోయి ఆ రాఘవుని భక్తిలో నిమగ్నమయ్యేవారు । ఆయన దేహంపైనున్న సింధూరాన్ని ధరించిన వారిని దుష్ట శక్తులు దరిచేరవని, రామానుగ్రహం వారికి సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం। కానీ ఆయనకీ సింధూరం అంత ప్రియమైనదవ్వడానికి కారణం కూడా రాములవారే  । ఆ కథ చదువుదాం పదండి । 
 శ్రీరామ పట్టాభిషేకానంతరం ఒకనాడు, సీతమ్మ చక్కగా తలంటి స్నానం చేసి నుదుటన తిలకం దిద్దుకొని , పాపిటన ‘సింధూరం’ పెట్టుకొని, శ్రీరామునితో కలిసి విశ్రాంతి మందిరానికి వెళుతున్నారట। అప్పటివరకూ శ్రీరాముని సేవకై నిరీక్షించిన ఆంజనేయుడు వారి వెనుకనే వెళ్ళసాగాడు। ఇది గమనించిన సీతమ్మ, హనుమంతునితో ‘మేము విశ్రాంతి మందిరానికి వెళ్తున్నాం హనుమా। నీవు రాకూడదు కదా ! స్వామీ సేవకోసం తరవాత వద్దువులే !’ అన్నారట । చిరునవులు చిందిస్తూ రాఘవుడు కూడా అందుకు వంతపాడారట । 
అప్పుడు  ‘రామా! మీరు పూర్తిగా అమ్మకి దాసులైపోయారు ।  ఈ దాసానుదాసుణ్ణి కరుణించడమే లేదు । మీ సేవ చేసుకోనిదే, నాకు తోచేదెలా’ అని వాపోయారు హనుమ ।   ‘నేను వివాహ సమయమున వైదేహి పాపిట చిటికెడు సింధూరము దిద్దాను హనుమా ! అందుకే నేను ఆమెకి దాసుడనయ్యాను’ అని చెప్పారట జానకీపతి  ।
ఆమాటకి హనుమంతుడు ఆశ్చర్యముతో “అమ్మా! మీ నుదుట తిలకముంది కదా! పాపిటన సింధూరం దేనికి” అని సీతమ్మని ప్రశ్నించారు । సీతాదేవి ‘నాయనా హనుమా! స్వామి వారికి ఇ
*****

ఒక్కసారి చదవండి మీరుకూడ।।। 985
హత్యకు భూ వివాదాలే కారణమా?
కానే కాదు।।।।।।।! 
 #కడపMP సీట్!!
తన అనుచరులకు రెండు MLA సీట్ల అడగటం
కఢప MP సీట్ ఇస్తే నాకు లేదా షర్మిళకు ఇవ్వమని
వివేకా పట్టుపట్టడం అవినాష్ కి ఇస్తే నే టిడిపి లోకి వెళ్తా  రెండు రోజులలో తేల్చమని వివేకా ఆల్టిమేటం 
ఈ విషయమై  #జగన్ రెడ్డి #చేయిచేసుకున్నాడు
అని  మీడియా లో వార్తలు వచ్చాయి 
ఈ వార్తలకు ఆధారం నాడు #వివేకా #కన్నీరు తో
లోటస్ పాండ్  నుండి బయటకు రావటం
డౌట్ ఉంటే హత్యకు రెండు రోజుల ముందుటి
 #టివిబైట్స్ చూడొచ్చు
హత్యకు ప్లాన్  లోటస్ లోనే అనేది నిజం ? 
హత్య జరిగాక తెల్లవారు జామున
అందరి కంటే ముందు వివేకా ఇంటికి చేరుకుంది 
కడప  MP  అవినాష్ రెడ్డి జగన్ రెడ్డి కి పిల్ల నిచ్చిన మామ డాక్టర్  గంగి రెడ్డి
నాటి అక్కడి సీన్ ఆఫ్ ఎఫెన్స్   చూసాకా
 గొడ్లు కాచే బుడ్డాడు కూడా చెప్తాడు అది హత్య అని
విచిత్రం అక్కడ ఓ డాక్టర్ అయిండి  వివేకా తలపై  గాయాలకు కుట్లేసి నీట్ గా డ్రసింగ్ చేసి శవాన్ని బెడ్ మీదకు చేర్చారు MP అవినాష్ రెడ్డి తో కలిసి
సక్కగా బాత్ రూమ్ లో బెడ్ రూమ్ లలోని రక్తపు మడుగులను తుడిపించారు నాటి పులివెందుల SI వద్దని వారిస్తున్నా ఆగకుండా।।।।
పై విషయం నాటి SI ప్రాదమిక రిపోర్ట్ లో ఉంది! 
ఇక తన సొంత మీడియా లో గుండె పోటని ప్రచారం
విజయసాయి రెడ్డి గుండె పోటుతో పోయారు అని మీడియా ముందు సంతాప వచనాలు
వివేకా కూతురు పోష్ట్ మార్టానికి పట్టు పట్టక పోతే
గొడ్డలి పోటు గుండె పోటు అయ్యేదే! 
వాచ్ మెన్  బాత్ రూమ్ లో పడి ఉన్న వివేకా ఫోటోలను ఆయన కూతురి కి పంపటం ఆవిడ ఆఫోటోలను చూసిన ఆవిడ అనుమానంతో పోష్ట్ మార్టం చేద్దాం అని పట్టు బట్టింది 
ఇక నిజాన్ని దాయలేమనే నిర్ణయాని కొచ్చిన
 లోటస్ పాండ్ త్రయం మ్రుతిపై హత్య అనుమానాలు ఉన్నాయ్ అని మీడియా ముందు రెండో ష్టేట్ మెంట్ ఇచ్చింది
2 ష్టేట్ మెంట్లు ఇచ్చిన విజయసాయి రెడ్డి గు లో పప్పు గుత్తి దింపితే నాడే నిజాలు గట గటా వచ్చేవి
ఇక అబ్బాయ్ పులివెందుల చేరుకుని గొడ్డలి తో గొడ్డలితో ఏసేసే సార్ ఎంత అన్యాయం అంటూ నాటకాన్ని పీక్ లెవల్ కి తీసుకు పోయాడు 🙏
స్ధానిక పోలీస్ ల పై నమ్మకం లేదు అని
నాడు దర్యాప్తు ఆపమని కోర్టుకు వెళ్ళిందీ
                                              జగన్ రెడ్డే
CBI ఎంక్వయిరీ కోరిందీ జగన్ రెడ్డే
ప్రాధమిక రిపోర్ట్ రివీల్ చేయొద్దంటూ
       కోర్ట్ కెళ్ళిందీ జగన్ రెడ్డే  తాత
***

నవగ్రహాలు।।విశేషాలు।।।
01। ఆదిత్యుడు :
కశ్యపుని కుమారుడు సూర్యుడు। భార్య అదితి। అందుకేఆదిత్యుడు అని పిలుస్తాము। సప్త అశ్వాలతో ఉన్న రధం అతనివాహనం। ఆ సప్త అశ్వాలు ఏడు చక్రాలకు ( మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ, ఆగ్య్హ్నా చక్రం, సహస్రారం )
వివాహ పరిబంధన దోషం, పుత్ర దోషం, పుత్ర పరిబంధన దోషం, విద్యా పరిబంధన దోషం, ఉద్యోగ పరిబంధన దోషం, సూర్యదోషం మొదలైన దోషాలతో బాధ పడే వారు సూర్యునిపూజించటం వలన ఫలితం పొందుతారు।
సింహరాశి కి అధిష్టాన దేవుడు సూర్యుడు। నవగ్రహాలలో మద్య స్థానం ఆదిత్యుడిది।అధిదేవత అగ్ని, ప్రత్యధి దేవత రుద్రుడు। ఆదిత్యుడు ఎరుపు వర్ణం లో ఉంటాడు।
ఇష్టమైన ధాన్యం : గోధుమలు
పుష్పం : తామర
వస్త్రం : ఎర్రని రంగు గల వస్త్రం
జాతి రాయి : కెంపు
నైవేద్యం : గోధుమలు, రవ చక్కర పొంగలి
02। చంద్రుడు :
చాల అందమైన వాడిగా మనం వర్ణిస్తూ ఉంటాం। వర్ణనలకుకంటే మిన్నగా చంద్రుడు చాల అందమైన వాడు। పది తెల్లటిగుర్రాలతో ఉన్న రధాన్ని అధిరోహిస్తాడు। నిశాదిపతి ( రాత్రికి రాజు), క్షుపరక (రాత్రిని కాంతివంతం చేసే వాడు) అనిపేర్లు కూడా కలవు। ఇరవైఏడు నక్షత్రాలను సూచిస్తునట్టు,ఇరవైఏడు మంది భార్యలను కలిగి ఉన్నాడు। తండ్రి సోమతల్లి తారక।
అనారోగ్యం తో బాధ పడుతూ ఉన్న తల్లి, చర్మ వ్యాధులు మొదలైన సమస్యలు కలవారుచంద్రుని పూజ వలన ఫలితం పొందగలరు।
కుంభ రాశి కి అధిపతి చంద్రుడు। తూర్పు - దక్షిణ అభిముఖుడై ఉంటాడు।
అధిదేవత : నీరు।
ప్రత్యధిదేవత : గౌరి
వర్ణం : తెలుపు
ధాన్యం : బియ్యం / వడ్లు
పుష్పం : తెల్లని తామర
వస్త్రం : తెల్లని వస్త్రం
జాతి రత్నం : ముత్యం
నైవేద్యం : పెరుగన్నం
03। మంగళ :
అంగారకుడు ( ఎర్రని వర్ణం కలవాడు) అని కూడా పిలుస్తాం।ఇతను భూదేవి కుమారుడు। మేష, వృశ్చిక రాసులకిఅధిపతి। దక్షినాభిముఖుడు। రుచక మహాపురుష యోగవిద్యను భోదిస్తాడు। తమోగుణ వంతుడు।
భార్య / పిల్లలు / అన్నదమ్ముల వాళ్ళ సమస్యలు ఉండేవారు,స్నేహితులతో శత్రుత్వం, సంపదను కోల్పోయిన వారు మంగళ దేవుడిని పూజించటంవలన సత్ఫలితాలను పొందుతారు।
అధిదేవత : భూదేవి
వర్ణం: ఎరుపు
ధాన్యం : కందిపప్పు
పుష్పం : సంపంగి మరియు తామర
వస్త్రం : ఎరుపు రంగు వస్త్రం
జాతి రత్నం : ఎర్రని పగడం
నైవేద్యం : కందిపప్పు తో కూడిన అన్నం
04। బుధుడు :
తార, చంద్రుల పుత్రుడు బుధుడు। రజోగుణవంతుడు। పుత్రదోషం, మంద విద్య, చంచలమైన మనసు కలవారు బుధునిపూజలు చేసి ఉపసమనం పొందుతారు। తెలివితేటల వృద్ధి,సంగీతం, జ్యోతిష్యం, గణితం, వైద్యం వంటి వాటిలోరానిచాలంటే బుధుడి అనుగ్రహం పొందాలి।
మిధున మరియు కన్యారాశి కి అధిపతి బుధుడు। తూర్పు -ఉత్తర ముఖుడై ఉంటాడు।
అధిదేవత : విష్ణు
ప్రత్యధిదేవత : నారాయణుడు
వర్ణం : చిగురాకు పచ్చ
వాహనం : సింహం
ధాన్యం : పచ్చ పెసర పప్పు
వస్త్రం : పచ్చని రంగు వస్త్రం
జాతి రత్నం : పచ్చ
నైవేద్యం : పెసరపప్పు తో కూడిన అన్నం
05। గురు :
బృహస్పతి అని కూడా అంతము। దేవతలకు, దానవులగురువైన శుక్రాచారుడికి గురువు ఇతను। సత్వగుణసంపన్నుడు। పసుపుపచ్చ / బంగారు వర్ణం లో ఉంటాడు।
పేరు ప్రఖ్యాతులు, సంపద, తోడ బుట్టినవారి క్షేమము కొరకుగురువు ని పూజించాలి 
ధన్నురాశి, మీనా రాశిలకు అధిపతి। ఉతరముఖుడైఉంటాడు।
అధిదేవత : బ్రహ్మ
ప్రతదిదేవత : ఇంద్రుడు
వర్ణం: పసుపు
వాహనం : గజరాజు
ధాన్యం : వేరుసెనగ పప్పు
పుష్పం : మల్లె
వస్త్రం : బంగారు రంగు వస్త్రం
జాతి రత్నం : పుష్య రాగం
నైవేద్యం : సెనగపప్పు తో కూడిన అన్నం
06। శుక్రుడు :
ఉషన, బృగు మహర్షి ల సంతానం। అసురులకుగురువు ఇతను। రజోగుణ సంపన్నుడు। ధవళ వర్ణంతో మద్యవయస్కుడిగా ఉంటాడు। ఒంటె / గుఱ్ఱము /మొసలి వాహనంగా కల్గి ఉంటాడు।
అనుకోని పరిస్థితుల వల్లనా కుటుంబాలు విడిపోవడంలేక తగాదాలు రావడం , బాగా కలిసి ఉండేవారిమద్యలో శత్రుత్వం కలగడం మొదలైన విపత్కరపరిస్థితులనుండి శుక్రాచార్యుని పూజ వలన బయటపడే అవకాశం ఉంది।
వృషభ, తులరాశులకు అధిపతి।
అదిదేవత : ఇంద్రుడు
వర్ణం : తెలుపు
వాహనం : మొసలి
ధాన్యం : చిక్కుడు గింజలు
పుష్పం : తెల్లని తామర
వస్త్రం : తెల్లని వస్త్రం
జాతి రత్నం : వజ్రం
నైవేద్యం : చుక్కుడు గింజల తో కూడిన అన్నం
07। శని :
సూర్యభగవానుడి పుత్రుడు శని। భార్య ఛాయా దేవి (నీడ)। నల్లని వర్ణం తో, నలుపు వస్త్రదారనతో, కాకివాహనంగా కలిగి ఉంటాడు।
శని దేవుడిని అందరు తిడ్తూ ఉంటారు। నిజామే అలంటిబాధలు పెడతాడు శని। మనల్ని ఎంతగా బాధ పెట్టికస్టాలు పెడతాడో, అంతకంటే ఎక్కువ మంచి చేసివెళ్తాడు।
కుంభ, మకర రాసులకి అధిపతి। పడమటి వైపు ముఖాసీనుడై ఉంటాడు।
అదిదేవత : యముడు
ప్రతదిదేవత : ప్రజాపతి
వర్ణం : నలుపు
ధాన్యం : నల్ల నువ్వులు
వస్త్రం : నల్లని వస్త్రం
జాతి రత్నం : నీలం
నైవేద్యం : నల్లని నువ్వులు కలిపిన అన్నం
08। రాహువు :
సూర్య చంద్ర గ్రహాణాలకు కారకుడు గా చెప్పబడేరాహువు ను ఒక పాము రూపం లో వారిన్స్తారు। ఒకకత్తి ని ఆయుధంగా చేసుకొని, ఎనిమిది నల్లటిగుర్రాలను అధిరోహిస్తూ ఉంటాడు।
పుత్ర దోషం, మానసిక రోగాలు, కుష్టు మొదలైనవిరాహు ప్రభావములే।
పడమర - దక్షినాభిముఖుడై ఉంటాడు।
అదిదేవత : దుర్గ
ప్రత్యధిదేవత : పాము
వర్ణం : నలుపు
వాహనం : నిలపు సింహం
ధాన్యం : మినుగులు
పుష్పం : అడవి మందారం
జాతిరత్నం : గోమేధుకం
వస్త్రం : నల్లటి వస్త్రం
నైవేద్యం : మినుగులతో కూడిన అన్నం
09। కేతువు :
భార్య చిత్రలేఖ। ఆస్తి నష్టం, చెడు అలవాట్లు, పుత్ర దోషంమొదలైనవి తొలగాలంటే కేతు పూజలు చేయాలి।
ఉత్తరం - పడమటి ముఖాసీనుడై ఉంటాడు।
అదిదేవత : చిత్రగుప్తుడు
ప్రత్యధిదేవత : బ్రహ్మ
వర్ణం : ఎరుపు
వాహనం : గద్ద
ధాన్యం : ఉలవలు
పుష్పం : ఎర్రని కలువ
వస్త్రం : రంగురంగుల వస్త్రం
జాతి రత్నం : వైడుర్యం
నైవేద్యం : ఉలవల అన్నం।
మీ। ప్రాణాలు ప్రభ ।
0 కామెంట్స్
****

శ్రీ కాకుళం గురించి కొన్ని విషయాలు।।।
*చికాకోల్ ప్రత్యేకతలు- కళిం
గాంధ్ర భాష 😘
*విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో ప్రజలు మాట్లాడే భాషను కళిగాంధ్ర భాష అంటారు। తెలుగులోనే ఒక ప్రత్యేకమైన యాస ఇక్కడ మీకు కనిపిస్తుంది। బ్రిటీషర్ల కాలంలో శ్రీకాకుళం చికాకోల్ పేరుతో చెలామణీ అయ్యింది। నాగావళి, వంశధార, మహేంద్ర తనయ, చంపావతి, బహుదా, కుంభికోటగెడ్ మొదలైన ఈ ప్రాంతంలో ప్రవహించే ముఖ్య నదులు।ప్రత్యేకమైన యాసతో  కాళీపట్నం రామారావు గారు శ్రీకాకుళం మాండలికంలోనే ఎన్నో రచనలు చేశారు। గణేశ్ పాత్రో లాంటి సినిమా రచయితలు ఈ యాసను చలనచిత్ర పరిశ్రమకు సైతం పరిచయం చేశారు। బేపి (కుక్క), పెనిమిటి (భర్త), గీర లేదా గీర్మానం (పొగరుబోతుతనం), వర్ర (కారం), గుంట (కాలువ), బుగత (భూస్వామి), గుడ్డి (పొలం) లాంటి పదాలు, మాటలు ఎన్నో శ్రీకాకుళం యాసలో కనిపిస్తాయి। గురజాడ వారి కన్యాశుల్కంలో కూడా లెక్కలేనన్ని శ్రీకాకుళం యాస పదాలున్నాయి।*
*ఆ మధ్యకాలంలో విడుదలైన అల వైకుంఠాపురంలో చిత్రంలో "సిత్తరాల సిరపడు" పాట రాసిన కవి ఎవరో కాదు।। శ్రీకాకుళం వాసైన బల్లా విజయకుమార్। ఈ పాటలో చాలా శ్రీకాకుళం పదాలు కనిపిస్తాయి। బుగతోడి ఆంబోతు, కొమ్ములతో కోలాటం, వరదలో గుంటగాళ్లు, గుక్కి గుండ చేసినోళ్లు, పనిమోల సొరసేప, సక్కనమ్మ కళ్లలో యేల యేల సుక్కలు।। ఇలా చాలా గమ్మత్తైన జానపద పదాలు ఈ పాటలో కనిపిస్తాయి। శ్రీకాకుళం జానపద పదాల సంపదను మనకు మన గుండెకు మరింత దగ్గర చేస్తాయి।*
*వీరులు తిరుగాడిన నేల:*
శ్రీకాకుళం జిల్లా చరిత్రలో తాండ్రపాపారాయుడి పేరు కచ్చితంగా నిలిచిపోతుంది। ఆయన కోట రాజాంలో ఉండేది। బొబ్బలి యుద్ధం తర్వాత విజయరామరాజును పాపారాయుడు మట్టుబెట్టాడన్న సంగతి తెలిసిందే। తాండ్ర పాపారాయుడి రాజాం కోట ఎన్నో రహస్యాలకు కేంద్రమని పెద్దలు అనేవారట। ఆ కోటను దుర్గామాత ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటుందని, కోట పైభాగాన భేతాళుడు నివసిస్తుంటాడని పలు కట్టుకథలు కూడా హల్చల్ చేశాయి।
*ఉద్యమాల నేల 😘
 ప్రపంచ ఉద్యమాల చరిత్రలో శ్రీకాకుళ గిరిజనోద్యమానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది। 'ఎరుపంటే కొందరికి భయం, భయం, పసిపిల్లలు వారికంటే నయం నయం’, ‘కష్టజీవులం మేము కమ్యూనిస్టులం అవునన్నా కాదన్నా అదే ఇష్టులం’ అంటూ సుబ్బరావు పాణిగ్రహి లాంటి విప్లవకారులు సోంపేట లాంటి ప్రాంతాలలో పోరాటాలకు బీజం వేశారు। ఈయన కంటే ముందే గరిమెళ్ల సత్యనారాయణ లాంటి స్వాతంత్య్ర సమయోధులు శ్రీకాకుళం నేలపై సమర శంఖరావాన్ని మ్రోగించారు।
****

శ్రీ కాకుళం గురించి కొన్ని విషయాలు।।।

*చికాకోల్ ప్రత్యేకతలు- కళింగాంధ్ర భాష 
*విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో ప్రజలు మాట్లాడే భాషను కళిగాంధ్ర భాష అంటారు। తెలుగులోనే ఒక ప్రత్యేకమైన యాస ఇక్కడ మీకు కనిపిస్తుంది। బ్రిటీషర్ల కాలంలో శ్రీకాకుళం చికాకోల్ పేరుతో చెలామణీ అయ్యింది। నాగావళి, వంశధార, మహేంద్ర తనయ, చంపావతి, బహుదా, కుంభికోటగెడ్ మొదలైన ఈ ప్రాంతంలో ప్రవహించే ముఖ్య నదులు।ప్రత్యేకమైన యాసతో  కాళీపట్నం రామారావు గారు శ్రీకాకుళం మాండలికంలోనే ఎన్నో రచనలు చేశారు। గణేశ్ పాత్రో లాంటి సినిమా రచయితలు ఈ యాసను చలనచిత్ర పరిశ్రమకు సైతం పరిచయం చేశారు। బేపి (కుక్క), పెనిమిటి (భర్త), గీర లేదా గీర్మానం (పొగరుబోతుతనం), వర్ర (కారం), గుంట (కాలువ), బుగత (భూస్వామి), గుడ్డి (పొలం) లాంటి పదాలు, మాటలు ఎన్నో శ్రీకాకుళం యాసలో కనిపిస్తాయి। గురజాడ వారి కన్యాశుల్కంలో కూడా లెక్కలేనన్ని శ్రీకాకుళం యాస పదాలున్నాయి।*
*ఆ మధ్యకాలంలో విడుదలైన అల వైకుంఠాపురంలో చిత్రంలో "సిత్తరాల సిరపడు" పాట రాసిన కవి ఎవరో కాదు।। శ్రీకాకుళం వాసైన బల్లా విజయకుమార్। ఈ పాటలో చాలా శ్రీకాకుళం పదాలు కనిపిస్తాయి। బుగతోడి ఆంబోతు, కొమ్ములతో కోలాటం, వరదలో గుంటగాళ్లు, గుక్కి గుండ చేసినోళ్లు, పనిమోల సొరసేప, సక్కనమ్మ కళ్లలో యేల యేల సుక్కలు।। ఇలా చాలా గమ్మత్తైన జానపద పదాలు ఈ పాటలో కనిపిస్తాయి। శ్రీకాకుళం జానపద పదాల సంపదను మనకు మన గుండెకు మరింత దగ్గర చేస్తాయి।*
*వీరులు తిరుగాడిన నేల:*

శ్రీకాకుళం జిల్లా చరిత్రలో తాండ్రపాపారాయుడి పేరు కచ్చితంగా నిలిచిపోతుంది। ఆయన కోట రాజాంలో ఉండేది। బొబ్బలి యుద్ధం తర్వాత విజయరామరాజును పాపారాయుడు మట్టుబెట్టాడన్న సంగతి తెలిసిందే। తాండ్ర పాపారాయుడి రాజాం కోట ఎన్నో రహస్యాలకు కేంద్రమని పెద్దలు అనేవారట। ఆ కోటను దుర్గామాత ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటుందని, కోట పైభాగాన భేతాళుడు నివసిస్తుంటాడని పలు కట్టుకథలు కూడా హల్చల్ చేశాయి।

*ఉద్యమాల నేల 
 ప్రపంచ ఉద్యమాల చరిత్రలో శ్రీకాకుళ గిరిజనోద్యమానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది। 'ఎరుపంటే కొందరికి భయం, భయం, పసిపిల్లలు వారికంటే నయం నయం’, ‘కష్టజీవులం మేము కమ్యూనిస్టులం అవునన్నా కాదన్నా అదే ఇష్టులం’ అంటూ సుబ్బరావు పాణిగ్రహి లాంటి విప్లవకారులు సోంపేట లాంటి ప్రాంతాలలో పోరాటాలకు బీజం వేశారు। ఈయన కంటే ముందే గరిమెళ్ల సత్యనారాయణ లాంటి స్వాతంత్య్ర సమయోధులు శ్రీకాకుళం నేలపై సమర శంఖరావాన్ని మ్రోగించారు। 
****

*అదృష్టం అంటే నీదేరా (అద్భుత సరదా కథ)* 883
*******************************
      ఒక ఊరిలో ఒక రైతు వుండేటోడు। ఆయన చానా పేదోడే కానీ చానా చానా మంచోడు। మూగవాళ్ళకు నోటిలో మాటలాగుండేటోడు। గుడ్డివాళ్ళకు చక్కని చూపులాగుండేటోడు। ముసలివాళ్ళకు చేతికర్రలాగుండేటోడు। ఆడపిల్లలకు ధైర్యాన్నిచ్చే ఆయుధంలా వుండేటోడు। వూరిలో ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా అందరికన్నా ముందు అక్కడ వుండేటోడు। కార్యక్రమం ముగిసేదాకా అన్ని పనుల్లో చేయి కలిపేటోడు। అందుకే అందరికీ ఆ రైతంటే చానా ఇష్టం। సొంత బంధువులెక్క చూసుకునేటోళ్ళు। రైతు పెండ్లాం గూడా చానా మంచిది। మొగుడు చేసే పనికి సాయం చేయడమే తప్ప ఏనాడూ ఎదురు మాట్లాడిందీ లేదు, చెయ్యనని వెనక్కి తిరిగిందీ లేదు। ఆ రైతుండే వూరి పేరు జొన్నగిరి। దాని అసలు పేరు సువర్ణగిరి అని, ఒకప్పుడు అశోకుని పాలనలో రెండవ రాజధానిగా ఒక వెలుగు వెలిగిందని చానామంది పండితులంటారు। ఆ వూరిలో వజ్రాలు దొరుకుతాయని పెద్ద పేరు। దాంతో ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి ఆశగా ఆ వూరి చుట్టుపక్కల వున్న పొలాల్లో, కొండల్లో నిరంతరం తవ్వుతా వెదుకుతా వుంటారు। అనేకమందికి చానా విలువైన వజ్రాలు ఎన్నోసార్లు దొరికినాయి। రాత్రికి రాత్రి ధనవంతులైనవారు ఎందరో। ఒకసారి ఆ పేదరైతు పొలానికి పోయి దాన్ని దున్నుతా బాగా అలసి పోయినాడు। దాహం అవుతావుంటే తాగుదామని చెంబు పైకెత్తినాడు। అంతలో ఒక్కసారిగా సర్రుమని గాలి పైకి లేచి, దుమ్ము రైతు కంట్లో పడింది। దాంతో చేతిలోని చెంబు జారి కిందపడి నీళ్ళన్నీ పొలంలో ఒలికిపోయినాయి। రైతు కల్ళు నులుముకుంటూ ఆ చెంబును తీసుకోవడానికి కిందికి వంగినాడు। ఆ నీళ్ళు యాడైతే పడినాయో ఆడ ఏదో తళుక్కుమని మెరిసింది। ఏమబ్బా మెరుస్తావుంది అని పరీక్షగా వంగి చూస్తే।।।। ఇంగేముంది చానా చానా విలువైన చిన్న వజ్రం నక్షత్రం లెక్క ధగధగా మెరిసిపోతా కనబడింది। నీళ్ళు పడి అంతవరకూ దానిమీదున్న మట్టంతా తొంగిపోయింది। రైతు ఆ వజ్రాన్ని చేతుల్లోకి తీసుకొని ''ఆహా।।। ఎంత అదృష్టం। చూడ్డానికి చిన్నగా వున్నా లోపల ఒక్క మచ్చగూడా లేకుండా తళతళతళ మెరిసిపోతావుంది। ఈ వజ్రం అమ్మి ఇంకొంచం పొలం కొనుక్కుంటే ఇకపై జీవితమంతా ఎటువంటి చీకూ చింతా లేకుండా హాయిగా బతకొచ్చు అనుకున్నాడు। సంబరంగా ఆ వజ్రాన్ని ఇంటికి తీసుకోనొచ్చి పెండ్లానికి చూపిచ్చినాడు। అమె దాన్ని ముట్టుకోని, ముట్టుకోని మురిసిపోయింది।

*పటిక బెల్లం లో మూడవవంతు* 
అరుణాచల ఆలయంలో యదార్ధంగా జరిగిన సంఘటన 
ఒకసారి అరుణాచల ఆలయ ప్రాంగణం లో ఇద్దరు పిల్లలు ఆడుకుంటుండగా వారి దృష్టి అరుణాచలుని సన్నిధి లోని హుండీపై పడింది।
ఆ పిల్ల లిద్దరు హుండీ లోని పైసల్ని ఎవరూ లేనపుడు సన్నని రేకుతో లాగి తీయటం ప్రారంభించారు।

అందులో ఒకడు " ఒరేయ్ ఎవరన్నా చూస్తున్నారేమో - చూడరా అన్నాడు ఇంకొకడితో।
రెండవవాడు చుట్టూ చూసి।।।। అరుణాచలుడు ఇంతేసి గుడ్లు ఏసుకొని చూస్తున్నాడురా అన్నాడు।
ఇద్దరు అరుణాచలుని కి ఎదురుగా నిలబడి మా దొంగ తనం బయట పడకుండా చూచే బాధ్యత నీదే, అందుకు పటిక బెల్లం లో మూడవ వంతు నీకిస్తాము, ముగ్గురం సమానంగా తీసుకుందాం, ఇది మన ఓడంబడిక ( అగ్రిమెంట్ ) అన్నారు।
ఇలా ప్రతీ రోజు పటిక బెల్లం అరుణాచలునికి పెడుతున్నారు, ఆశ్చర్యం గా శివుని ముందు పెడుతున్న పటిక బెల్లం  మాయమవుతోంది।

ఒకరోజు ఆలయ పూజారి ఇద్దరు దొంగల్ని పట్టుకొని ఆలయ అధికారి కి అప్పగించాడు, వీళ్లిద్దరు ఎనిమిదేళ్ల  పసి కాయలు, వీళ్ళను ఎలా శిక్షించాలి అని, అరేయ్ పిల్లలు మీరు ఇద్దరు అంతరాలయం లో 108 ప్రదక్షిణలు చేయండి అని, ఇదే మీ శిక్ష అన్నాడు।
పిల్లలు ఇద్దరు ప్రదక్షిణాలు చేయడం ప్రారంభించారు, ఆలయ పూజారి, అధికారి దూరంగా కూర్చొని పిల్లల ప్రదక్షిణాలు చూస్తున్నారు వినోదంగా। ఇంతలో పూజారి , అధికారి ఒక్కసారిగా తృల్లి పడ్డారు, పరిశీలించి పిల్లల్ని మళ్ళొకసారి  చూసారు, ఆ ఇద్దరి పిల్లతో పాటు, మూడవ పిల్లవాడు ప్రదక్షిణ చేయడం చూసారు, మూడవ పిల్లవాడు మెరిసిపోతున్నాడు మళ్ళీ మాయమవుతున్నాడు మాటిమాటికీ। ఇది గమనించి అధికారి మెల్లగా పిల్లల్ని సమీపించి మూడవ పిల్లవాడిని  గట్టిగా వాటేసుకున్నాడు।

అద్భుతం!!
మూడవ పిల్లవాడు కాంతిరేఖ గా మారి, గార్బాలయం లోకి వెళ్లి మాయమై పోయాడు।
అరుణాచళేశ్వరుడు దొంగ పటిక బెల్లం మూడవ వంతు తిన్నాడు కదా, అందుకని పరమేశ్వరుడు వారితో ప్రదక్షిణ చేస్తున్నాడన్నమాట।
ఆ అధికారి పిల్లల్ని బుజ్జగిస్తూ "  అసలేం జరిగింది " అని అడిగాడు। పిల్లలు అరుణాచళేశ్వరుని వాటా గురించి చెప్పారు। అది విని వారు ఆశ్చర్యం, ఆనందం లో మునిగిపోయారు।
సాక్షాత్తు అరుణాచళేశ్వరుడు కూడా వారితో వాటా పంచు కున్నందుకు శిక్ష అనుభవించాడన్నా మాట। ఆలయం లో సాక్షాత్తు అరుణాచళేశ్వరుడు ఉన్నాడు అంటానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి ??।

నిష్కల్మష  ప్రేమకు, నిర్మల  భక్తి కి అరుణాచళేశ్వరుడు ఎపుడూ బందియే !! అరుణా చలుడు  కాంతి రూప
1
*****
ప్రాంజలి ప్రభ కధలు।882

ఆచరణమే జీవన మార్గం, జీవన గమ్యం। ఆచరణమే ప్రయత్నం, ఫలం। జ్ఞాన పరిణతికి, భక్తి విమలతకు ప్రమాణం। సాధనాస్థాయికి, బాధ్యత నిర్వహణకు సూచిక ఆచరణం। ఇంద్రియ నియంత్రణకు, హృదయ సున్నితత్వానికి, వ్యక్తిత్వ పు ఔన్నత్యానికి కొలమానం ఇది। మతం, ఆచారం, సంప్రదాయం, సంస్కృతి అన్నవి ప్రధానంగా మనిషి ఆచరణను సంస్కరించడానికే! తద్వారా వ్యక్తి జీవి తాన్ని, సామాజిక జీవితాన్ని సుసంపన్నంగా, భద్రంగా వికసింపజేయడానికే। ఈ దిశలోనే సరళమైన, శుద్ధ జీవనశైలిని కేంద్రంగా చేసుకున్న ఐదు ఆచారాల ను పంచ ఆచారాలుగా నిర్దేశించింది। అవి సదాచారం, గణాచారం, భృత్యాచారం, శివాచారం, లింగాచారం।

దేహాన్ని పవిత్రంగా ఉంచుకోవడం సదాచారం। నిష్ఠ వహించమని, శుచిగా ఉండమని ఇది సూచిస్తుంది। ఎప్పుడూ ఎవరికీ ఎలాంటి హాని కానీ, అవమా నం కానీ కలిగించకుండా వర్తించడమే సదాచారం। అందరికీ క్షేమకరంగా జీవిం చడం। డాంబికాలను పక్కన పెట్టి సరళంగా, సహజంగా, పరిశుభ్రంగా జీవించ డం। ఒకరకంగా చెప్పాలంటే మానవీయ జీవన మూలాధారమే సదాచారం।
సంఘం కట్టుబాట్లకు లోబడి జీవించడం గణాచారం। సంఘ క్షేమానికి విరుద్ధం గా జీవించరాదని చెబుతుంది। అంటే సమాజంలోని అన్ని వర్గాలకు హితకరం గా జీవించాలి। అనవసర ఘర్షణలకు తావివ్వకుండా, సగౌరవంగా అందరితో కలిసి ఉండాలి। సమష్టి తత్వపు ప్రాధాన్యాన్ని తెలుసుకొని విజ్ఞతతో వ్యవహ రించాలి। గణాల మధ్య సమన్వయం, సహకారం పెరగడంతో గుణబలం నిలబ డుతుందని తెలుసుకొని దానికి అనుగుణంగా నడుచుకోవడమే గణాచారం। 

కృతజ్ఞతతో, నిగర్వంగా సేవాభావంతో జీవించడం భృత్యాచారం। గురువుల పట్ల, సమాజంలోని శిష్టజనుల పట్ల భక్తితో నడచుకోవాలి। తన ఉనికిని అనేక శక్తుల ఫలంగా గుర్తించి ప్రకృతిపట్ల, ప్రాణికోటిపట్ల ప్రేమతో ప్రవర్తించాలి। ఆధిక్యతా భావన, దుర్గుణాలకు లోనుకాకుండా ఉండాలి। ఎంతటి ఉన్నతాధికా రంలో ఉన్నా ధర్మపాలనకు, ధర్మరక్షణకు మహాభటుడిగా వ్యవహరించాలి। దర్పానికి ఇసుమంతైనా తావివ్వక సేవాభావంతో కర్తవ్యాలను నిర్వర్తించడమే భృత్యాచారం।
ఎప్పుడూ లోకహితాన్ని కోరడమే శివాచారం। అంటే అహంకా రాలకు, అలంకార పటాటోపాలకు, వికారాలకు అతీతంగా జీవించడం। సరళం గా, సహజంగా, నిష్కపటంగా చిత్తంలో భగవంతుడిని దర్శిస్తూ మనుగడ సాగిం చాలి। నిస్సంకోచంగా, నిస్సంకుచితంగా పరుల కష్టాలలో పాలుపంచుకోవాలి। ఈ జీవితాన్ని దేవుడి ఆదేశంగా భావించాలి। లోకహిత జీవనాన్ని సాగించాలి। విశాలమైన, అద్వయమైన శివచైతన్యంతో సకల భేదాలకు అతీతంగా
****

శివుని అష్టపుష్ప మానస పూజతో పుణ్య ఫలం 💐💐💐881
మహాగ్రంథాలు - శ్రీ శివ మహాపురాణము
అట్టి శ్రీ సదాశివమూర్తికున్న ఎనిమిది పేర్లనూ అర్ధసహితంగా వివరిస్తున్నాను।।।
1। శివాయనమః = అన్నటికీ శుభము కలిగించువాడా! నీకు ఇదే నా నమస్కారం!
2। మహేశ్వరాయనమః = సంధాన - తిరోధాన కర్తవైన నీకు నమస్కరించుచున్నాను।
3। రుద్రాయనమః = సర్వ ఆపదలను నివారించువాడవైన నీకు అంజలి।
4। విష్ణవేనమః = సర్వే సర్వత్రా వ్యాపించియున్న వాడవైన నీకు నా కైమోడ్పులివియే!
5। పితామహాయనమః = అన్నిటికీ మూలకారకుడైనవాడా! నీకు ఇదే నా నమస్కారం!
6। సంసార భిషజేనమః = సమస్త ప్రాపంచిక రుగ్మతలనూ దూరం చేసే వైద్యుడైన వాడా! అంజలి।
7। సర్వజ్ఞాయనమః = అన్నీ తెల్సినట్టి మహా విద్వన్మూర్తీ! నమస్కృతులు। నా నమస్సుమాంజలి!
8। పరమాత్మాయనమః = అన్నిటికీ అతీతుడైనట్టి భగవంతుడా! ఇదే నా నమస్సుంజాలి!
పైన చెప్పిన మొదటి ఐదు నామాలూ ఇహసాధనకు - ఆ పిదప మూడు నామాలూ పరసాధనకు తారక మంత్రాలవంటివి।
ఇక।।।మానస పూజారాధకులకు అష్టపుష్పపూజ అనేది ఉన్నది।
అష్టపుష్ప మానస పూజ:
శ్లో। అహింసా ప్రథమం పుష్పం - పుష్పమింద్రియ నిగ్రహః
సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషత ।।
శాంతి పుష్పం, తపః పుష్పం - ధ్యాన పుష్పం తథైవచ
సత్య మష్టవిధం పుష్పం - శివ ప్రీతికరం భవేత్‌ ।।
(శివా! ఈ పుష్పాష్టకంతో నీవు సంతృప్తుడవయ్యెదవు గాక! అహింస, ఇంద్రియచాపల్యరాహిత్యం, అన్ని ప్రాణుల పట్ల దయ, కష్ట నష్టాలను భరించగలిగే ఓర్పు, అన్నిటినీ సమానంగా చూసే నిర్మల శాంత గుణం, నిరంతర తపం, నిత్య ధ్యానం, నిజం చెప్పే గుణం।।।వీటితో నిన్ను మానసికారాధన చేయుదును।)
అనగా - ఈ గుణాలు ఎవరిలో వుంటాయో వారు వేరే పూజలేవీ చేయనక్కర్లేదు। తమ గుణాలద్వారానే, శివపూజ వారు చేస్తున్నట్లేనని భావం!
ద్యాన రీతులు :
సర్వకాల సర్వావస్థలయందునూ శివ ధ్యానం చేస్తూండాలి। శివమూర్తులు ధ్యానపరంగా మూడు విధాలు -
1। ఘోరమూర్తి
2। మిశ్రమూర్తి
3। ప్రశాంతమూర్తి
ఘోరమూర్తి ఆరాధన = తక్షణ ఫలప్రదం
మిశ్రమూర్తి ఆరాధన = కొద్దికాలంలో ఫలవంతం
ప్రశాంతమూర్తి ఆరాధన = అంత్యమున మోక్షప్రాప్తి।
ఇక।। ధ్యానం 2 రకాలు। అవే సవిషయ నిర్విషయ పూర్వకాలు।
సవిషయం = సాకారోపాసన
నిర్విషయం = నిరాకారోపాసన
రెండూ సక్రమ యోగ మార్గాలే।
💐మహా శివుని యొక్క అష్టమూర్తి నామాలు💐
1। ఓం భవాయ దేవాయ నమః
2। ఓం శర్వాయ దేవాయ నమః
3। ఓం ఈశానాయ దేవాయ నమః
4। ఓం పశుపతయే దేవాయ నమః
5। ఓం  రుద్రాయ దేవాయ నమః
6। ఓం ఉగ్రాయ దేవాయ నమః
7। ఓం భీమాయ దేవాయ నమః
8। ఓం మహా తే దేవాయ నమః।
సహస్ర నామాలతోను అష్టోత్తర శత నామాలతో ను పూజ చేయలేని వారు కనీసం ఈ ఎనిమిది నామాలతో నైనా మహా దేవుని పూజించవచ్చు।
ప్రతిరోజు ప్రదోష వేళలో ఈ నామస్మరణ సర్వ శుభప్రదము।ఓం శనైశ్చరాయనమః

****

మనదేవవాలయాలు🪔* 880
*జగన్నాథ స్వామి దేవాలయం -వడాలి*
దక్షిణ పూరి గ పిలువబడే #వడాలి గ్రామం కృష్ణ జిల్లా ముదినేపల్లి మండల కేంద్రం లో ఉంది । 200 సంవత్సరాల క్రితం నిర్మించిన #జగన్నాథస్వామి దేవాలయం దక్షిణ పురిగా ప్రసిద్ది చెందింది । 
గుడివాడ - బంటు మిల్లి ప్రధాన రహదారికి సమీపం లో కొలువైన బలరామ,సుబధ్ర సమేత జగన్నాథ స్వామి దేవాలయం ఒకప్పుడు దేదిప్యామానంగా వెలుగొందిన క్షేత్రం ।అంతులేని భు సంపద ఉండేది అంత ఆక్రమణకు గురి అయిపొయింది । కాని నేడు తిరిగి అత్యంత వైభవంగా పునర్నిర్మాణం గావిన్చాబడుతుంది । 
1765 వ సంవత్సరం లో ఒక వైష్ణవ భక్తుడు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది । భక్తుడు స్వప్నం లో స్వామి వారు దర్శనమిచ్చి తనకు దేవాలయాన్ని నిర్మించమని ఆదేశించగా స్వామి వారి అజ్ఞానుసారం ఆ భక్తుడు దేవయానికి కావాల్సిన భూమిని ఆ ప్రాంతాన్ని పరిపాలించే నావాబ్ దగ్గర నుండి పొంది ,పూరి నుండి విగ్రహాలను తీసుకోని వచ్చి ఇక్కడ దేవాలయాన్ని ఎంతో అద్బుతంగా ,రమణీయంగా నిర్మించారు। ఈ ప్రాంతమంతా ఒకప్పుడు దట్టమైన అరణ్యం ల ఉండేది బోయల ఎక్కువ ఉండే ఈ ప్రదేశాన్ని పూర్వము వ్యాధాళి అనేవారట అది కాలక్రమేనా వడాలి గ రూపాంతరం చెందింది అని చేబుతారు ।

*****
879
అభినందన్ గారి కన్నా ముందు పాకిస్థాన్ యుద్ధ మిస్సైల్ ల పనిపట్టిన ఎందరో వీరుల త్యాగాలను మరో సారి ఒక్కొక్కరుగా గుర్తు చేసుకుందాం।
అది 1965  వ సంవత్సరము భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధపు చివరిరోజు ।
తన యుద్ధవిమానంలో బయలుదేరాడు ఒకభారతీయ యోధుడు ! దురదృష్టవశాత్తు అది కూలిపోయింది శత్రుసైనికులకు పట్టుబడ్డాడు ! అతనిని వారు తీసుకెళ్ళారు! 
అందరిలానే అతనుకూడా తనపేరు, తనరాంక్, యూనిట్ నంబరు చెప్పాడు । 
ఈ సమాచారం రావల్పిండి ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కి చేరింది ।
ఒక గంట తరువాత పరుగెత్తుకుంటూ కొందరు పాకిస్తాన్ అధికారులు వచ్చారు
నువ్వు ఆయన కొడుకువేనా ? అని అడిగారు ! 
అప్పుడు ఆ వీర సైనికుడు" అవును ఆయన కొడుకునే "అని జవాబిచ్చారు ।
ఈ విషయం మిలిటరీ పాలకుడైన ఆయూబ్ ఖాన్ చెవిన పడ్డది।
ఒక్కసారిగా నిటారుగా అయిపోయాడు, భారత్ లోని ఆ పెద్దాయనతో మాట్లాడాడు ! ఆ పెద్దాయన  అవిభక్త భారత్‌ లో తన పై అధికారి ! తన బాస్ !!!
 ।।సర్ !అతను మీ అబ్బాయని మాకు తెలిసింది !।।।సర్ వెంటనే విడిచివేస్తాము ! అని ఆ పెద్దాయన  అడగకుండానే ఆయూబ్ ఖాన్ ప్రకటించాడు ।
అప్పుడు ఆ భారత సింహం ఏమన్నదో తెలుసా !!!
పట్టుబడ్డ ప్రతిభారతీయ సైనికుడు నా పుత్రుడే ! అందరిలాగానే ఇతనినీ చూడండి ! దేశానికి ఇచ్చిన తరువాత నాకు అతనిమీద ప్రత్యేక మైన అభిమానమేమీ లేదు ! అందరినీ విడిచినప్పుడే అతనినీ విడిచిపెట్టండి ! అని చెప్పారు!
ఆ భారతసింహం ఫీల్డ్ మార్షల్ జనరల్ కరియప్ప గారు ! 
పట్డుబడ్డ ఆ సింహంపిల్ల పేరు
 "KC_నంద_కరియప్ప" !।।ఆయన ఎయిర్ మార్షల్ గా రిటైర్ అయినారు।
ఇదీ మన సంస్కృతి మన వారసత్వం మనకు నేర్పాల్సింది ! మన పిల్లలకు ఈ సంఘటనలు పాఠాలుగా పెడితే వారిలో అవినీతి బంధుప్రీతి మచ్చుకైనా కానరావు !
దేశం కోసం పోరాడిన మహానుభావులందరి చరిత్ర ఏ పాఠశాలల టెస్ట్ పుస్తకంలో ఉండదు।।ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు టెస్ట్ బుక్ ఉండాలి।।అప్పుడే దేశ భక్తి కి బాటలు వేయవచ్చు।

***+

బ్రాహ్మీముహూర్తంలో లేస్తే ఏంటట!
ఉదయాన్నే నిద్రలేవాలని మన పెద్దవాళ్లు తెగ పోరేవారు। అలా చెప్పీ చెప్పీ చాలా తరాలు వెళ్లిపోయాయి। తరం మారుతున్న కొద్దీ జీవవనశైలి మారిపోతోంది। నిద్రలేచే సమయాలూ, పనిచేసే వేళలూ మారిపోతున్నాయి। కొన్నాళ్ల తరువాత పని చేయడానికీ, నిద్రపోవడానికీ రాత్రీపగలుతో సంబంధమే లేకపోవచ్చు। కానీ ఇప్పటికీ బ్రాహ్మీముహూర్తం` అన్న మాట అక్కడక్కడా వినిపిస్తూనే ఉంటుంది। ఇంతకీ ఆ బ్రాహ్మీముహూర్తం అంటే ఖచ్చితంగా ఏ సమయంలో వస్తుంది। ఆ సమయంలో నిద్రలేవడం వల్ల ప్రయోజనం ఏంటి!
సూర్యోదయానికి 96 నిమిషాల ముందున్న కాలాన్ని బ్రాహ్మీముహూర్తం అంటారు। అయితే రుతువుని బట్టి సూర్యోదయ వేళలు మారిపోతూ ఉంటాయి కాబట్టి, 4:00 -4:30 a।mని బ్రాహ్మీముహూర్తంగా అనుకోవచ్చు। బ్రాహ్మీ అంటేనే సరస్వతి అని అర్థం। మన పెద్దలు చాలా ఆలోచించే ఆ పేరు పెట్టారేమో అనిపిస్తుంది। ఈ సమయంలో నిద్రలేవడం వల్ల ఉపయోగం ఏంటి అని అడిగే ప్రశ్నకు చాలానే జవాబులు వినిపిస్తాయి।
ఆ సమయంలో ప్రకృతి మొత్తం ప్రశాంతంగా, నిద్రలోని ఆఖరి జామును గడుపుతూ ఉంటుంది। సూర్యుని వేడి భూమిని కాస్త తాకుతూ ఉంటుంది, కానీ వెలుతురు ఇంకా మనల్ని చేరుకోదు। అంటే రాత్రివేళ చల్లదనాన్నీ, పగటివేళ చురుకుదనాన్నీ ఏకైక కాలంలో కలిగిఉండే సమయం ఇదన్నమాట! అందుకే ఈ సమయంలో మనుషులు సత్వగుణం ప్రధానంగా ఉంటారట। లేలేత కిరణాలు శరీరాన్ని తాకడం చాలా మంచిదని వైద్యులు కూడా చెబుతున్నారు కాబట్టి, ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని సూర్యనమస్కారాలు చేయడమో, వ్యాహ్యాళికి వెళ్లడమో చేస్తే ఆరోగ్యానికి మంచిది।
మనలో జీవగడియారం అనేది ఒకటి ఉంటుంది। అది మనం ఏర్పరుచుకున్న అలవాట్లను బట్టీ, ప్రకృతిని బట్టీ నడుచుకుంటూ ఉంటుంది। నిద్రపోవడం, లేవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం… ఇవన్నీ సమయానికి అనుకూలంగా చేస్తేనే ఆరోగ్యంగా ఉంటాం। సాక్షాత్తూ ఆయుర్వేదమే `తన ఆరోగ్యాన్నీ, ఆయుష్షునూ కాపాడుకోవాలని అనుకునేవాడు బ్రాహ్మీముహూర్తంలో లేవాలి` అని చెబుతోంది। పైగా ఆయుర్వేదం ప్రకారం ఈ సమయం `వాత` ప్రధానంగా ఉంటుంది। శరీరంలో కదలికలనీ, ఆలోచనలనీ, రక్తప్రసరణనీ ప్రభావితం చేసేది ఈ `వాత` లక్షణం। ఈ లక్షణం మన శరీరంలో ప్రముఖంగా ఉన్నప్పుడు మనం ఎలాంటి పనినైనా చురుగ్గా చేయగలం; ప్రశాంతంగా ఉండగలం; మంచి ఆలోచనలు చేయగలం; చదివినదానిని ఆకళించు చేసుకుని దీర్ఘకాలం జ్ఞప్తికి ఉంచుకోగలం।
ధ్యానం చేయాలనుకునేవారికి కూడా ఈ సమయం చాలా అనుకూలమని యోగశ
0 Comm


*టిఫెన్ బ్యాగ్

" డ్రైవింగ్ లైసెన్స్ ఉందా " 

" ఉన్నది సర్ " చూపించాడు

" ఆర్ సి బుక్ ఏది "

బండి లో నుండి తీసి ఇచ్చాడు

" ఇన్స్యూరెన్స్ ,పొల్యూషన్ సర్టిఫికేట్లు……"

మాటలు పూర్తి కాకముందే అవి కూడ పోలీస్ ఇన్ స్పెక్టర్ కు  అందించాడు అరుణ్. కొద్ది సేపు ఏమి చేయాలో అర్థం కాకుండా ఎదో ఆలోచిస్తున్నాడు. అరుణ్ కు భయం వేసింది.అన్నీ సరిగానే ఉన్నాయి కదా ,అవి తిరిగి ఇచ్చేస్తే ఆపీసు కు త్వరగా వెళ్లవచ్చు అనేది అతని అభిప్రాయం. అరుణ్ చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. ఇతరుల పై ఆధారపడడం తనకి నచ్చదు. చేసేది చిరుద్యోగమైనా ఉన్నదానితో సంతృప్తి చెందే ఉత్తముడు. ఈ మధ్య తరచుగా బండ్లను చెక్ చేస్తున్నారు. అరుణ్ బండికి సంబంధించిన పత్రాలను ఎప్పుడు బండి లొనే ఉంచుకోవడం అలవాటు.పదిహేను సంవత్సరాల నుండి ఎన్నో సార్లు పోలీసులు, రవాణా అధికారులు చెక్ చేసినా ఒక్కసారి కూడా జరిమానా పడలేదు.      హెల్మెట్  బాండిపై పెట్టి పోలీసుల వంక చూస్తూనే ఉన్నాడు అరుణ్. పరిచయం ఉన్నవారిని కానిస్టేబుళ్ళు వదిలి పెడుతున్నారు. కొందరికి చాలన్లు వ్రాసి ఇస్తున్నారు. మరికొందరు బతిమిలాడుతున్నారు. వాచీ చూసాడు అరుణ్.ఆపీసు సమయం ఇంకను పది నిమిషాలు మాత్రమే బాకీ ఉన్నది.ధైర్యం తెచ్చుకుని మెల్లగా ఇన్ స్పెక్టర్ దగ్గరకు వెళ్లి

" సర్,ఆపీసు కు టైమ్ అ…….." అతను కోపంగా తిరిగి చూడగానే అరుణ్ మాట ఆగిపోయింది. రెండడుగులు వెనకకు వేసి సూటిగా చూడలేక తల పక్కకు తిప్పుకున్నాడు .అతను చాలను వ్రాసి అరుణ్ మొహం పైకి విసిరాడు.

అరుణ్ భయంభయంగానే క్రింద పడిన చాలను తీసుకొని చూసాడు. అధిక వేగంగా బండి నడిపినందుకు వంద రూపాయల జరిమానా అని ఉంది." ఇదిఅన్యాయం '" అనాలనిపించింది.మాట గొంతు దాటలేదు.ఎప్పుడూ నలభై మీటర్ల వేగంతో బండిని నడిపించే తనని అందరూ హంస వాహనమని ఎగతాళి చేసేవారు. అయినా తను పట్టించుకోలేదు.ఈరోజు ఇలా జరిమానా కు గురికావడం మనసును కలిచి వేస్తుంది.

జేబు చూసాడు.నెలాఖరు రోజులాయే.  సగటు ఉద్యోగుల కు ప్రతి రూపాయి కూడా అత్యంత విలువైనది కదా! పై జేబు ,రెండు ప్యాంటు జేబుల్లో తడిమి చూస్తే యాభై రూపాయలకు నాలుగు రూపాయలు తక్కువగా ఉన్నవి.ఏమి చేయాలో పాలు పోవడం లేదు. ఈ ప్రమాదం నుండి గట్టెక్కేదెలా అనుకునేంతలో నిన్న రాత్రి ఇంట్లొ జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది.

అరుణ్ కొడుకు కార్తీక్  నాల్గవ తరగతి చదువుచున్నాడు.వారి పాఠశాల లో డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తే, కార్తీక్ కు ప్రథమ బహుమతి గా వంద రూపాయల నగదు బహుమతి లభించింది. ఆ విషయం రాత్రి ఇంట్లో చెప్పి మురిసిపోయాడు.వంద రూపాయలు అరుణ్ కు ఇచ్చి " నాన్న, ఈ వంద రూపాయలతో నువు టిఫిన్ బ్యాగ్ కొనుక్కో. ఇది నా మొదటి బహుమతి.అది మీకే ఇవ్వాలని ఉంది ". చినిగిన టిఫిన్ బ్యాగ్ మార్చి కొత్త బ్యాగ్ కొనాలని తనకు రాని ఆలోచన ప్రతిరోజు గమనిస్తున్న కార్తీక్ కు రావడం, తనపై ఉన్న అమితమైన ప్రేమనే కావచ్చు." నాన్నా కొనలేక కాదు, అనవసర ఖర్చులెందుకని పాత బ్యాగ్ నే కుట్టించాడు "  మధ్యతరగతి ఇల్లాలు కాబట్టి భర్త ను వెనకేసుకొచ్చింది. ఏదైతేనేమి బ్యాగ్ కొనడానికి వంద తీసుకుని టిఫిన్ బ్యాగ్ లో పెట్టాడు. బండికి వ్రేలాడదీసిన బ్యాగ్ ను చూడగానే కళ్ల నుండి అప్రయత్నంగానే నీళ్లు వచ్చాయి."నాన్న, ఈ వంద పోలీసులకు ఇవ్వవద్దు " కార్తీక్ అరిచినట్లనిపించింది.  

మదనపడుతూనే బండి దగ్గరకు వచ్చాడు. పదేళ్ల క్రితం పదహరువేలకు కొన్న తన పాత బండి తననే దీనంగా చూస్తూ నిలబడి యున్నది. ఇప్పుడు ఈ వంద రూపాయలు ఇచ్చి, ఆపీసు లో ఎవరినైనా అడిగితే "ఎవ్వరు ఇవ్వరు ఎందుకంటే నీకు ఆత్మాభిమానం ఎక్కువ." అంతరాత్మ తీవ్రంగా హెచ్చరించింది. జేబులో కనీసం వంద రూపాయలు కూడా లేవనే బాధ ఒక వైపు, కొడుకు ప్రేమతో ఇచ్చిన డబ్బుతో బ్యాగ్ కొనపొతే వాడి మనసు ఎంత తల్లడిల్లుతుందోననే నిరాశ మరొక వైపు,అన్నిటిని మించి చేయని తప్పుకు జరిమానా చెల్లించడమే అరుణ్  మనసుని తీవ్రంగా బాధిస్తుంది. పుత్ర ప్రేమ కన్న ఆత్మాభిమానం గొప్పేమి కాదు అనుకొని టిఫిన్ బ్యాగ్ తెరిచాడు.ఇంతలో "అరుణ్ గారు బాగున్నారా, మీరు ఇక్కడ…" ఆశ్చర్యాన్ని వ్యక్త పరుస్తూ ఓ అపరిచిత వ్యక్తి సంభోధించాడు.అప్పుడే బండి దిగి సరాసరి ఎస్సై దగ్గరికి వస్తున్న అతనిని అరుణ్ గుర్తుపట్టలేదు. ఇప్పుడు అతనెవరనే విషయం ఆలోచించే పరిస్థితి లో  అరుణ్ లేడు. ఆ వ్యక్తి ఎస్సైతో కరచాలనం చేసి అరుణ్ ని ఎస్సై దగ్గరికి పిలిచి " ఇతనెవరో తెలుసా నీకు "అన్నాడు.  ఎస్సై అరుణ్ వంక విచిత్రంగా చూసాడు. అరుణ్ కి అంతా అయోమయంలా ఉంది. "రెండు సంవత్సరాల క్రితం పది లక్షల రూపాయలు ఉన్న బ్యాగ్ దొరికిందని పోలీస్ స్టేషన్ కు వచ్చి అప్పగించాడు చూడు.ఆయనే ఈ అరుణ్. ఇతడు నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం .ఏ రోజు విధులకు ఆలస్యంగా వెల్లడు. ఒక్క పైసా అవినీతి గా సంపాదించలేదు.బహుమతిగా పోలీసులు పదివేలు ఇచ్చినా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.నువ్వు ఈ మధ్యనే వచ్చావుగా,నీకు ఈయన గురించి తెలిసీ ఉండదులే "

ఒక్క క్షణం ఆగి అరుణ్ చేతిలో చాలను తీసుకుని చూసి ఆశ్ఛర్యంగా " వ్వాట్, నువ్వు ఓవర్ స్పీడ్ లో బండి నడిపావా? " అరుణ్ ఎస్సై వంక చూసాడు.ఎస్సై మాట్లాడలేదు.అతనికి మొత్తం అర్థమయినది. అతను చాలను డబ్బులు ఎస్సైకి ఇవ్వబోయాడు. ఎస్సై తీసుకోలేదు. ఎస్సై అరుణ్ కి కరచాలనం చేసి వెళ్లు మని సైగ చేసాడు. అరుణ్ అతనికి కృతజ్ఞతలు చెప్పి మీరెవరో తెలుసు కోవచ్చా అన్నట్లు ప్రశ్నార్థక మొహం పెట్టాడు."నా పేరు భరత్. నేను ఈ ఎస్సై మంచి స్నేహితులం. ఆ రోజు పది లక్షల బ్యాగ్ పోగొట్టుకున్నది కూడా నా స్నేహితుడే .అప్పుడే నీ నిజాయితీ తెలిసింది.ఇలాంటి వారు ఈ రోజుల్లో ఉన్నారా అని నీ గురించి ఆరా తీసాను.నీ మంచితనం నన్ను విశేషముగా ఆకర్షించింది.నీకు ఏ విధంగా నైనా సహాయం చేయాలనిపించింది.కాని నువ్వు స్వీకరించవని అర్థమయింది. " ఎస్సై ప్రేక్షక పాత్రుడయ్యాడు. ఆపీసు కు ఆలస్యమయిందని  అరుణ్ బండి ఎక్కాడు. ఎస్సై ఎదో చెప్పాలని అరుణ్ దగ్గరికి వచ్చాడు. అప్పటికే అరుణ్ బండి పరుగులంకించుకుంది.

సాయంత్రం ఆపీసు నుండి బయటకు వచ్చి బండి దగ్గరకు రాగానే ఒక కానిస్టేబుల్  వచ్చి  చేతిలో కొత్త టిఫిన్ బ్యాగ్ ,ఒక కవరు పెట్టి అరుణ్ మాటలు వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు.అరుణ్ కవరు తెరిచి చూసాడు. అందులో ఒక ఉత్తరం ఉన్నది. " ప్రియమైన మిత్రమా ఉచితంగా మీరు  ఏది తీసుకోరు అని నాకు తెలుసు .మీలాంటి ఉత్తములను ఈ రోజు చాలా ఇబ్బంది పెట్టాను.భరత్ ద్వారా  మీ గురించి పూర్తి వివరాలు సేకరించాను.ఈ టిఫిన్ బ్యాగ్ కొనడానికి ఉదయం మీరు పడిన బాధ కు నేనే కారణం. ఇప్పుడు కూడ ఇది మీకు ఉచితంగా ఇవ్వడం లేదు.మీ బాబు చదివే స్కూలుకు వెళ్లి కార్తీక్ వేసిన పెయింటింగ్ ను తీసుకున్నాను.దానికి ప్రతిఫలంగానే ఈ టిఫిన్ బ్యాగ్ తెచ్చి ఇచ్చాను. ఇది మీదే అరుణ్ గారు. మీకు అభ్యంతరం లేనిచో నన్ను మీ స్నేహితునిగా స్వీకరించండి."

ఎస్డ్సై  వ్రాసిన ఉత్తరం చదివి బండి వైపు చూసాడు అరుణ్. ఏదో  అద్బుత విజయం సాధించినదానిలా తలెత్తి గర్వంగా చూసింది.

🌼🌼

కధ నచ్చినా నచ్చుక పోయినా  అభిప్రాయాలు తెలపగలరు

రచనా .

***


*ఋణ బాధలు-పరిహారం*

శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. అంటే ఈ సృష్టిలో జరిగే ఏ చర్యకైనా, ఏ కార్యానికైనా శివుని ఆజ్ఞ లేనిదే అది ముందుకు నడవదు. మనకున్న ఎనిమిది దిక్కులకు అష్టదిక్పాలకుడు శివుడు. నవగ్రహాలకు ఆయనే అధిపతి.

ఆ పరమశివుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషమైనా మనల్ని పట్టి పీడించదు. ఆ మహేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం. సోమవారం శివుడి పూజతో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఉమా అంటే మహేశ్వరితో కూడిన వాడైన పరమేశ్వరుడు. సోమవారం ఉమామహేశ్వరులను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మనకున్న దారిద్ర్యము, సమస్యలు పోవాలంటే శివుడిని ఈవిధంగా పూజించాలి.

1. సోమవారం ముందుగా తలస్నానం చేయాలి. ఆ తరువాత పార్వతీ పరమేశ్వరుల పటానికి గంధం రాసి బొట్టుపెట్టి దీపారాధన చెయ్యాలి. పూలు సమర్పించుకోవాలి ( తుమ్మి పూలు , మోదుగ పూలు శ్రేష్టమైనవి ). తరువాత శివఅష్టోత్తరం చదువుతూ విభూదిని సమర్పిచి , ఆ విభూతిని నుదిటిన ధరించాలి.సాయంత్రం వరకు ఉపవాసము ( పాలు , పండ్లు వంటివి తీసుకోవచ్చు ) ఉండి , శివాలయానికి వెళ్లి ఆవు నేతితో దీపారాధన చేయాలి .

2. సాయంత్రము పరమశివునికి నైవేధ్యంగా నేతితో తాలింపు వేసిన దద్యోధనం ( పెరుగన్నం ) సమర్పించాలి. ఇలా ప్రతి సోమవారం చేయడం వల్ల అప్పుల బాధలు, ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు. ముఖ్యంగా దేవునికి పూజ చేసినా, ప్రసాదం పెట్టినా ఏకాగ్రమైన మనసుతో చేయాలి. అప్పుడే ఆ భగవంతుడు స్వీకరిస్తాడు.

3. మూడు ఆకులు కలిగిన బిల్వపత్రం శివుని మూడు కనులకు చిహ్నం. అంతేకాదు త్రిశూలానికి సంకేతం కూడా. ఈ బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది.

4. ఏ పండైనా శివునికి ప్రసాదంగా పెట్టవచ్చు. అయితే శివునికి ప్రీతికరమైనది వెలగపండు. ఇది దీర్ఘాయిష్షును సూచిస్తుంది. ఈ పండుని స్వామికి సమర్పించడం వల్ల శుభం చేకూరుతుంది.

5. ఉమామహేశ్వరులను వేకువ జామున పూజించడం వల్ల ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు.


--((***))--


శ్రీ మేధా దక్షిణామూర్తి రూపు ఉన్నత విద్య కొరకు, పిల్లలకు చదువు పట్ల ఆసక్తి, జ్ఞాపకశక్తి పెరిగి పరీక్షలలో విజయం చేకూర్చే శ్రీ మేధా దక్షిణామూర్తి రూపు


శివ జ్ఞాన స్వరూపుడు మేధా దక్షిణామూర్తి, విష్ణు జ్ఞాన స్వరూపుడు హయగ్రీవుడు. 
వీరిద్దరూ జ్ఞాన స్వరూపులే. జ్ఞాన ప్రదాతలే

ఇక విద్యల గురించి వేరే చెప్పనక్క ర్లేదు. దక్షిణామూర్తి స్తోత్రం గురు గ్రహ అనుగ్రహాన్ని కూడా కలిగిస్తుందని పెద్దలు చెబుతారు

గురవే సర్వలోకానాం భిషజే భవ రోగిణాం
నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయేనమ:

అన్నిలోకాలకూ గురువు సంసారమనే రోగంతో బాధపడుతుతన్న వారికి వైద్యుడు, అన్ని విద్యలకూ నిధి అయిన శ్రీదక్షిణామూర్తికి నమస్కారమని దీని అర్థం.

శివుని గురు స్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సంప్రదాయం 

దక్షిణ అంటే సమర్థత అని అర్ధం. దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం. అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఖాలన్నీ తొలగిపోయాయి. దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేది దయాదాక్షిణ్యం.

 .ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే ఆ రూపమే దక్షిణామూర్తి.

.మహర్షులు దర్శించిన దక్షిణామూర్తులు అనేక రకాలు. మొట్టమొదట బ్రహ్మకు దర్శనమిచ్చారు దక్షిణామూర్తి.

.ఆ తర్వాత వశిష్టునకు, సనకసనందనాదులకు కూడా సాక్షాత్కరించారు దక్షిణామూర్తి.

దక్షిణామూర్తిని ఉపాసించేవారికి బుద్ధి వికసిస్తుంది.

.అందుకే దక్షిణామూర్తిని పూజించమని విద్యార్ధులకు ప్రత్యేకంగా చెప్తారు. విష్ణు, బ్రహ్మ, సూర్య, స్కంద, ఇంద్ర తదితరులు దక్షిణామూర్తిని ఉపాసించి గురుత్వాన్ని పొందారు.

మంత్రశాస్త్రం అనేక దక్షిణామూర్తులను ప్రస్తావించింది.

ఆ రూపాలు వరుసగా….

శుద్ధ దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి,  విద్యా దక్షిణామూర్తి, 
లక్ష్మీ దక్షిణామూర్తి, వాగీశ్వర దక్షిణామూర్తి, వటమూల నివాస దక్షిణామూర్తి, 
సాంబ దక్షిణామూర్తి¸ హంస దక్షిణామూర్తి, లకుట దక్షిణామూర్తి, 
చిదంబర దక్షిణామూర్తి,  వీర దక్షిణామూర్తి, వీరభద్ర దక్షిణామూర్తి¸ 
కీర్తి దక్షిణామూర్తి,  బ్రహ్మ దక్షిణామూర్తి¸  శక్తి దక్షిణామూర్తి,
 సిద్ధ దక్షిణామూర్తి.

దక్షిణామూర్తులలో మేధా దక్షిణామూర్తి విద్యార్ధులకు చదువును ప్రసాదించగలడు.

 సరస్వతీదేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవాలు మేధా దక్షిణామూర్తి స్వామివారు మరియూ శ్రీ హాయగ్రీవ స్వామివారు.

మేధా దక్షిణామూర్తి చలవతో పిల్లలు చక్కటి విద్యావంతులై, జీవితంలో సుఖసంతోషాలను సొంతం చేసుకుంటారు.

(సేకరణ)

హర హర మహాదేవ శంభో శంకర ఓం నమఃశివాయ సిద్ధం నమః శివ సంకల్పమస్తుః
........

*సాలిగ్రామం ఎలా పుట్టింది*

సాలిగ్రామం .......? విష్ణు చిహ్నంగల శిలనే సాలిగ్రామం అంటారు.
అలాంటి సాలిగ్రామాలు ఒకటి కాదు రెండు కాదు వందలూ వేలు కాదు, లెక్కకు మిక్కిలిగా ఆ ఒక్క నదిలోనే పుడతాయి. మరెక్కడా దొరకవవి.
ఆనది పేరు గండకీ.

చిన్నగా పెద్దగా రకరకాల పరిమాణాల్లో ఉంటాయి. గండకీ నదిలోనే దొరుకుతాయి. గుండ్రని రాళ్ళలా ఉన్నా – తాబేలు నోరు తెరచుకున్నట్టు ఉండి లోపల శ్రీ మహా విష్ణువే శేషసాయిగా ఉండి దర్శన మిస్తాడంటారు. పూజిస్తుంటారు. మరి గండకీ నదిలోనే ఈ సాలిగ్రామాలు పుట్టడానికి వెనుక ఒక కథ ఉంది!

గండకీ నది నదిగా మారడానికి ముందు ఒక స్త్రీ, గండకీ పేరుతోనే శ్రావస్తి నగరంలో ఉండేది.
ఆమె అందాల వేశ్య. ఆమె అనుగ్రహం కోరి ధనవంతులు కూడా పరితపిస్తూవుండేవారు.

గండకీ అందరినీ అంగీకరించేది కాదు. ప్రతి రోజూ ముందొచ్చిన బేరం ఒప్పుకొనేది.
ఆరోజుకి అతనే భర్త. రెండో మనిషికీ రెండో బేరానికి ఒప్పుకొనేది కాదు.
ధనం ఆశ చూపినా దరి చేరనిచ్చేది కాదు. ఆమె తల్లి గండకిని మార్చాలని ఎన్నోవిధాల ప్రయత్నించి విఫలమైంది. సాక్షాత్తూ నారాయణుడికే గండకిని పరీక్షించాలని కోరిక పుట్టింది.

ఒక రోజు పరివారంతో పొద్దున్నే వచ్చిన ధనవంతుడు బేరం చేసుకొని కానుకలు ఇచ్చాడు.

అలవాటుగా గండకి అతనికి స్నానం చేయించాలని దుస్తులు తీస్తే దుర్వాసన…
ఒళ్ళంతా పుండ్లు. ఈగల ముసిరాయి. కుష్టు వ్యాధి ఉందని కూడా గ్రహించింది. తల్లి తిట్టి పొమ్మనబోతే గండకి ఆమెనే తరిమేసింది.

సంపంగి తైలం పూసింది. గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేయించింది. చేనేత వస్త్రాలు చుట్టింది. చక్కని భోజనం పెట్టింది. అతడు తినబోతే పుచ్చిన చేతులు. వేళ్లూడి పడితే పక్కన తీసి పెట్టింది. తినిపించింది.

అదే కంచంలో తానూ తిన్నది. పక్కమీదకు చేర్చింది. విసురుతూ కూర్చుంది. జ్వరంతో అతడు ఆ రాత్రే ప్రాణాలు వదిలాడు. అప్పటి ఆచారం ప్రకారం సహగమనానికి పూనుకుంది. తల్లీ బంధువులూ తల్లడిల్లినా ఆగలేదు. తాళి కట్టని భార్యలా తల్లడిల్లింది. తనువుని చాలించదలచింది. ఉన్న ధనమంతా బీదసాదాలకు పంచి పెట్టింది.

ధాన ధర్మాలు చేసి దహన కార్యక్రమానికి శవం వెంట మేళ తాళాలతో వెళ్ళింది. శ్మశాసనంలో చితి పేర్చింది. తనే నిప్పంటించింది. తనూ చితిలోకి దూకింది. చిత్రంగా ఎగిసిన మంటలు మల్లెలయ్యాయి. కాలిన కట్టెలు పువ్వులయ్యాయి. లక్ష్మి సమేతంగా విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు.
గండకి వారిని చూస్తూనే ముగ్దురాలైంది. చేతులు జోడించింది.

కన్నీళ్ళతో కీర్తించింది. కీర్తిస్తూ కాళ్ళు కడిగింది.  శరీరమూ మనసూ స్వచ్ఛంగా నిలిపింది.

గండకి పవిత్రతకు నారాయణుడు పరవశించిపోయాడు. ఆమె నియమ నిబంధనలకు నిర్ఘాంతపోయాడు. ఆమె నిశ్చలతకు చలించిపోయాడు. నిష్టకు ఇష్టపడ్డాడు.

ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. గండకి డబ్బూ ధనం కోరలేదు. మోక్షమూ కోరలేదు. మాతృత్వాన్ని వరంగా కోరింది. మహా విష్ణువుని తన కడుపున కొడుకుగా పుట్టాలని కోరింది. ఫలితమే.

 మరు జన్మలో గండకీ నదిగా పుట్టింది. నది కడుపులో సాలిగ్రామాల రూపంలో విష్ణుమూర్తి పుట్టి పూజలందుకున్నాడు.

గండకి ఏకులంలో పుట్టినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనసు మలినం కాలేదు.

ఆ విధంగా పవిత్రురాలైంది. విష్ణుమూర్తిని తన గర్భంలో దాచుకొని తల్లయింది. కృతయుగాన జరిగినా ఈయుగానికీ గండకీ కథ నిలిచిపోయింది!.

   గండకీ సరసస్తీరే చంద్ర తీర్థేన శోభితే|
   సాలగ్రామ పురశ్రేష్ఠ కనకాఖ్య విమానగ:||
   శ్రీ మూర్తిదేవ శ్శ్రీ దేవ్యా కుబేరోముఖ సంస్థిత:|
   గండకీ గణికా రుద్ర బ్రహ్మణా మక్షిగోచర:
   శ్రీవిష్ణుచిత్త కలిజిత్ స్తుతి భూషిత నిగ్రహ:||🙏


🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*భాగవతము ఎంత గొప్పదో…!

     లోకంలో పుట్టిన ప్రతి మనిషీ తాను బతికి ఉన్నంత కాలం సుఖసంపదలు, అభ్యుదయాలు కలుగుతూ ఉండాలని, జీవితం ప్రశాంతంగా కొనసాగాలని, ఎలాంటి అవరోధాలూ ఉండరాదని కోరుకుంటాడు. తానుచేసే ప్రతిపనికీ ఫలితం లభించాలని ఆశిస్తాడు. మరణం కూడా ఏ యాతన లేకుండా సునాయాసంగా లభించాలని దేవతలను ప్రార్థిస్తాడు.

మనిషిని బాధపెట్టే తాపాలు (దుఃఖాలు) మూడు ఉన్నాయని పురాణేతిహాసాలు చెబుతున్నాయి.                 అవే ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతిక తాపాలు. వీటినే ‘తాప త్రయాలు’ అని పిలుస్తారు.

ఆధ్యాత్మిక తాపాలంటే  మానసిక, శారీరక రోగాలు.   మనిషి పైకి ఎంత అందంగా ఉన్నా అతడి మనసు అంత అందంగా ఉంటుందని చెప్పలేం. మనసులో ఎన్నో ఆందోళనలు, అలజడులూ ఉండవచ్చు. ఇక శారీరక రోగాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ముసురుపడితే జలుబు, ఎండకాస్తే వేడి, చలి విజృంభిస్తే వణుకు ఇలాంటి చిన్న బాధలు మొదలుకొని ఎంతకూ నయంకాని రోగాలు మనిషిని చుట్టుముట్టి అతడికి సౌఖ్యాన్ని దూరంచేస్తాయి.

ఆధిదైవిక తాపాలలో అతివృష్టి, అనావృష్టి, ప్రకృతి బీభత్సాలు, భూకంపాలు, పిడుగుపాట్లు, రాళ్ళవానలు, కరవుకాటకాలు ఆవిర్భవిస్తాయి. మనిషిని కోలుకోలేని దెబ్బతీస్తాయి.

 ఆధిభౌతిక తాపాలంటే పాముకాట్లు విషకీటకాల విజృంభణ, క్రూరమృగాలు, జంతువుల వల్ల కలిగే బాధలు, కష్టనష్టాలు. ఈ మూడు విధాల తాపాలను తట్టుకొని మనిషి నూరేళ్లు బతకడం అంటే గొప్ప విజయమే.  ఇలా మనిషి జన్మ పరమ దుఃఖభూయిష్ఠంగా సాగడం ఎవరికైనా బాధను కలిగిస్తుంది. మానవాళిలో ఉన్నతులు, ఉత్తములు, ఫలాపేక్షలేని వారైన మహర్షులకు మానవులపై అపారమైన కారుణ్యం ఉంది. అందుకే వారు ఏళ్ల తరబడి తపస్సుచేసి సాధించిన దివ్యజ్ఞానంతో మానవాళిని తరింపజేసే సాహిత్యాన్ని సృష్టించారు. తాపత్రయాలతో తల్లడిల్లుతున్న మానవులకు తరుణోపాయాలను చూపించారు. అలాంటి ఉపాయాల్లో అత్యున్నతమైంది ‘భాగవతం’.

ఈ భాగవతం ఎలాంటి అసత్యాలు లేని ఉత్కృష్ట గ్రంథం. ఇందులో ఎలాంటి లంపటాలులేని శాశ్వతా నందదాయక మోక్ష విషయాలే ఉంటాయి. ముక్తిని (ఏ తాపాలూ లేని ప్రశాంత స్థితిని) కోరేవారికి ఈ పుస్తకం అమృతపాత్ర వంటిది.  ఇందులోని కథలన్నీ మనిషికి పరమసౌఖ్యాన్ని అందిస్తాయి. మనసును విక సింపజేస్తాయి. ఈ గ్రంథాన్ని చదివితే తాపత్రయాలు దూరమవుతాయి.

ఇందుకు ఉదాహరణ పరీక్షిత్తు వృత్తాంతమే.

పూర్వం పరీక్షిత్తు అనే మహారాజు వేటకు వెళ్ళి దారి తప్పుతాడు. ఒక ముని ఆశ్రమానికి వెళ్లేసరికి అక్కడ తపోధ్యానంలో ఉన్న ‘శమీకుడు’ కనిపిస్తాడు. బదులివ్వని ముని మెడలో అక్కడ చచ్చిపడి ఉన్న పామును వేసి రాజు వెళ్ళిపోతాడు.

కొంత సేపటికి వచ్చిన ముని కుమారుడు శృంగి తండ్రికి అవమానం జరిగిందని రగిలిపోతాడు. అలా చేసినవాడు ఏడురోజుల్లో తక్షకుడి కాటుతో చనిపోతాడని శపిస్తాడు.

ధ్యానం నుంచి మేల్కొన్న శమీకుడు ఇదంతా తెలుసుకుని చింతించి, పరీక్షిత్తుకు సమాచారం పంపిస్తాడు. పరీక్షిత్తు తాను చేసిన అపరాధానికి పశ్చాత్తాపం చెంది, పరమ దయాళువైన శుకమహర్షిని ఆశ్రయించి, తనకు మోక్షం లభించే మార్గాన్ని ఉపదేశించ మన్నాడు.

అప్పుడు శుకుడు ఈ ఏడుదినాలూ భాగవత కథలను వింటూ, కాలక్షేపం చేయమని చెప్పాడు.

భాగవతం చదివితే ఇతర శాస్త్రాల అవసరం ఉండదని హృదయం భగవంతుడిలో స్థిరంగా నిలుస్తుందని చెప్పాడు వ్యాసుడు. ఈ మాట అక్షరసత్యం.

.....

*కొంటె ప్రశ్నలు

అవధానాల్లో అప్రస్తుత ప్రసంగి వేసే కొంటె ప్రశ్నలకి  అవధాని అంత కంటే కొంటెగా  సమాధానం చెప్తే మంచి హాస్యం పుడుతుంది. అలాంటి కొన్ని ఉదాహరణలు ఎవరో నాకు పంపిస్తే మీతో పంచుకుంటున్నాను .

ప్రశ్న :- అవధానం చేసేవారికి చప్పట్లంటే చాలా ఇష్టమంట కదా! మరి మీకో ?
జవాబు :- నాకు చప్పట్లు ఇష్టం వుండవు. నాకు చప్ప అట్లుకంటే కారం అట్లంటేనే ఇష్టం .

ప్రశ్న :- భార్య తన భర్తకు వడ్డిస్తోంది. భర్త 'పశువ' అన్నాడు. భార్య నవ్వుతూ 'కోతి' అంది ఏమిటిది?
జవాబు :- పశువ అంటే పళ్లెంనిండా శుభ్రంగా వడ్డించమని. కోతి అంటే కోరినంత తిను అని అర్థం .

ప్రశ్న :- పద్యానికి, శ్లోకానికి తేడా ఏమిటి ?
జవాబు :-పద్యం వేగంగా వస్తుంది. శ్లోకం నెమ్మదిగా వస్తుంది. ఎందుకంటే స్లో... కమ్ కదా .

ప్రశ్న:- అమెరికాలో భర్తల సమాధులను భార్యలు విసనకర్రలతో విసురుతారట. చిత్రంగా లేదూ ?
జవాబు:- భర్త చనిపోతూ ‘నా సమాధి ఆరేవరకైనా నువ్వు మరోపెళ్లి చేసుకోవద్దు...' అంటూ ప్రమాణం చేయించుకుంటాడు. భర్త సమాధి తొందరగా ఆరాలని భార్యలు అలా విసురుతూ వుంటారు.

ప్రశ్న : పెళ్లి కాకముందు వధువు, పెళ్లి అయ్యాక భార్య ఎలా కనిపిస్తుంది.
జవాబు : – పెళ్లి కాకముందు 'అయస్కాంతంలా', 'పెళ్లి అయ్యాక సూర్యకాంతంలా...’

ప్రశ్న :- ఉగాది కవి సమ్మేళనానికి కవితలను తీసుకు రమ్మన్నారు
జవాబు :-ఇంతకీ ఏ కవి 'తలను' తీసికెళ్తున్నారు

ప్రశ్న :- పెళ్లికి వెళ్లుతూ పిల్లిని చంకన పెట్టుకొని వెళ్లటమంటే ఏమిటి ?  
జవాబు :- అవధానానికి వెళ్లుతూ అప్రస్తుత ప్రసంగిని వెంట పెట్టుకొని వెళ్లటం .

ప్రశ్న :- అవధానాలను నిషేధించే పని మీకు అప్పజెప్పితే ఏం చేస్తారు?
జవాబు :- దశల వారిగా చేస్తాను. ముందు అప్రస్తుత ప్రసంగాన్ని నిషేధిస్తాను .

ప్రశ్న :- అవధానికి ఆశువులు ఎప్పుడొస్తాయి, ఆశ్రువులు ఎప్పుడొస్తాయి ?
జవాబు :- ప్రశ్నవేస్తే ఆశువులు వస్తాయి. అవధానం జరిగి సత్కారం ఎగరగొడితే ఆశ్రువులు వస్తాయి .

ప్రశ్న :- బోడిగుండుకు, మోకాలికి ముడిపెడతారెందుకు
జవాబు :- రెండింటి మీద అంతగా వెంట్రుకలు వుండవు కాబట్టి .

ప్రశ్న :- మీకు రంభనిస్తే ఏం చేస్తారు?
జవాబు :- ఆనందంగా ఇంటికి తీసికెళ్లి ఆకలి తీర్చుకుంటాను. రంభ అంటే అరటిపండు అని అర్థం .

ప్రశ్న :-నాకీ మధ్య శ్రీకృష్ణుడిపై భక్తి పెరిగిపోతోంది. ఆయనలాగే ప్రవర్తించమంటారా ?
జవాబు :- మీ ఆవిడకు ద్రౌపదిపై భక్తి పెరగకుండా చూసుకోండి.

ప్రశ్న :- మీ మైకులో బాంబు పెడితే ఏం చేస్తారు
జవాబు :- వెంటనే ఆ మైకు అప్రస్తుత ప్రసంగీకుడికి ఇచ్చి మాట్లాడమమటాను.

ప్రశ్న :- మీరెప్పుడైనా బూతు పనులు చేశారా జవాబు : -ప్రభుత్వ ఉద్యోగిని కదా ఎన్నికల్లో పోలింగ్ బూతు పనులు' తప్పవు .

ప్రశ్న :- అవధాని గారు మీది వర్ణాంతర వివాహమట నిజమా?
జవాబు :- నిజమే నేను నల్లగా వుంటాను, మా ఆవిడ తెల్లగా వుంటుంది .

ప్రశ్న :-పావురం అంటే మీకు ఇష్టమా ?
జవాబు :-పావు ‘రమ్’ ఎవరికి ఇష్టం వుండదు .

ప్రశ్న :-మీరు సారా త్రాగుతారా ?
జవాబు :- అవును అవధాన కవితామృతాన్ని మన 'సారా’ త్రాగుతాను .

ప్రశ్న :- సన్యాసికి, సన్నాసికి తేడా ఏమిటి?
జవాబు :- అందర్ని వదిలేసిన వాడు సన్యాసి, అందరూ వదిలేసిన వాడు సన్నాసి .

ప్రశ్న :- మీకు వాణిశ్రీ అంటే ఇష్టమా ?
జవాబు :- చాలా ఇష్టం. వాణి అంటే సరస్వతి -జ్ఞానం, శ్రీ అంటే సంపద.

ప్రశ్న: – రైలు పట్టాలకు, కాలి పట్టీలకు అనుబంధం ఏమిటి?
జవాబు:- రైలు, పట్టాల మీద వుంటుంది. పట్టీలు, కాలి మీద వుంటాయి .

ప్రశ్న:- సభలో ఎవరైనా ఆవులిస్తే మీరేమి చేస్తారు ?
జవాబు:- పాలిచ్చేవైతే యింటికి తోలుకెళ్తా .

ప్రశ్న:- పురుషులందు పుణ్యపురుషులు వేరయా! అన్నాడు వేమన. మరి మీరేమంటారు?
జవాబు:- పురుషులందు పుణ్యపురుషులు 'ఏరయా!’

ప్రశ్న:- అవధానిగారు ఇక్కడికి రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వస్తే మీరేం చేస్తారు?
జవాబు:- మరో నలుగుర్ని పిలిచి 'అష్టావధానం' చేస్తాను.

ప్రశ్న:- పెళ్లయిన మగవారిని ఏమీ అనరు. కానీ పెళ్లయిన ఆడవాళ్లను 'శ్రీమతి' అంటారెందుకు?
జవాబు:- పెళ్లయిన తరువాత 'స్త్రీ మతి' స్థితిమతి.
మీదే పురుషులు ఆధారపడుతారు గనుక .

ప్రశ్న:- ప్రేమికుడికి, భర్తకు ఏమిటి తేడా గురువు గారు
జవాబు:- గొడవపడితే మాట్లడదేమోనని
భయపడేవాడు ప్రేమికుడ ... మాట్లాడితే గొడవ పడుతుందేమోనని భయపడేవాడు భర్త

ప్రశ్న:- అవధానిగారు కీర్తిశేషుల పెండ్లిపత్రిక వచ్చింది. పెళ్లికి వెళ్లమంటారా?
జవాబు:- తప్పకుండా వెళ్లు. కీర్తిశేషులంటే ' కీర్తి' అమ్మాయి పేరు, 'శేషు' అబ్బాయి పేరు .

ప్రశ్న:- గురువుగారు మా మొదటి అమ్మాయి పేరు దీపిక, రెండవ అమ్మాయి పేరి గోపిక. మరి మూడో అమ్మాయి పుడితే ఏ పేరు పెట్టాలి?
జవాబు: - ‘ఆపిక’ వెంటనే అవధాని సమాధానం
****

 

****





పూజారి ఉపన్యాసం చెపుతున్నాడు 

 ప్రతిఒక్కరు  విచక్షణ జ్ఞానాన్ని సంపాదించాలి ఎవరో చెప్పారని చేశానని అనుట కాదు నీ  ఆత్మ సాక్షిగా నీ మనఃశాంతి నీతో ఉన్నవారికి శాంతి సౌఖ్యాలు కల్పించటమే మానవ జన్మకు సార్ధకం.    

తల్లితండ్రులపై పూర్తిగ భారము వైచి కర్తవ్యము నిర్వర్తింపని వాడు భ్రష్టుడగును. అట్టివానికి స్వశక్తి తగ్గును. నీపై నీవాధారపడుట పెంచుకొనుచు అత్యవసర విషయములనే తల్లితండ్రులకు  నివేదించుట నీ పెరుగుదలకు తోడ్పడును. తలితండ్రులేకదా ! అను మితిమీరిన విశ్వాసముతో బాధ్యతలను మరచుట అవివేకము. దీని వలన సాధారణ బాధ్యతలు కూడ నిర్వర్తించలేని స్థితి కలుగును. కనుక తల్లి తండ్రులను పురుషులైతే భార్యా సమేతముగా  నిరంతరమూ సేవలు చేయవలెను ఇది ఒక విధమైన ఋణము అటులనే కూతురైతే భర్తను ఒప్పించి తల్లి తండ్రులకు సేవచేయట సమంజసము, పిల్లలలకు పిల్లలు పెరుగుతుంటారు అయినను తాత బామ్మ,  అత్త మామ అంటూ పెద్దవారైన వారికి సేవలు చేయుట అందరి కర్తవ్యము.   

వేలు పట్టుకొని నడిపించుట ధీమంతులకు తగదు. నీకుగ నీవు నడువుము. కర్తవ్యములను, బాధ్యత లను నీకుగ నీవు మోయుము. కష్ట నష్టముల నోర్చుకొనుము. వేలు పట్టుకొని నడచువాడవు మహత్కార్యము లేమి చేయగలవు? ప్రతిదినము ప్రార్థన సమయమునందు నీకు వలసిన మానసిక సహాయము అందింపబడ గలదు. ధృతి గలిగి నీవే సమస్త బాధ్యతలను నిర్వర్తించుము. 

నిన్ను నిన్నుగ చూడగా - నన్ను నేనని తల్పగా   
నీవు నాకల దృష్టి గా  - నేను ప్రేమ సాక్షిగా 
నన్ను నీవని చెప్పగా   - కాల మాయకు చిక్కగా  
వాన నీటికి తడ్వగా    - ఎండ గాలికి మండగా
అగ్ని వాడక నీడగా    - రాజ కీయపు రంగుగా 
కాయ కష్టము నమ్మగా - మారు పల్కక చెప్పగా  
కారు చీకటి  కమ్మగా  - పాలు నిచ్చు బర్రెగా   
ఊలు నిచ్చిన గొర్రెగా - మేలు చేసెడి పెద్దగా 
వేలు ఖర్చులు చేయగా- రోజు లన్నియు ఒక్కగా    
దేని గూర్చియు ఆశగా  - సేవ చేసియు కోర్కగా   

ఇలా తడి పొడి మాటలు నిన్ను ఆవహిస్తాయి అయినా కార్వ్యము మరవకు అదే నేను కోరేది  
 IIU UUU IIU IIU 15/9

సమయానందంమ్మే సుఖసాగరమై 
సమ బాధా ప్రేమే సుఖరామయమై 
కమనీయంగా నే కరుణా లయమై 
రమయాలింగంమ్మే సమరాశయమై  

తన సమస్యలను తను స్ఫూర్తివంతముగ పరిష్కరించుకొను వానికి తల్లితండ్రుల సహాయము సద్గురువు సహాయము కూడ వెన్నంటి యుండగలదు. అర్జునుడు స్వయముగ యుద్ధము చేసినాడు. శ్రీకృష్ణుడు తోడ్పడినాడు. మిక్కుటముగ గురువుపై నాధారపడు వాడు ఏమియును చేయజాలడు.  

ఈరోజు మీరు బాగా చక్కగా చెప్పారు తల్లి తండ్రుల గురించి నాకు కొన్ని ప్రశ్నలు  వెయ్యాలని ఉంది 

అడుగూ స్త్రీ శక్తి కి ఎదురే లేదు అంత  తొద్దండి ఎదో నాకు ఆలోచన బట్టి అడుగుదామనికున్నా అంతే 

*ప్రశ్న :  ప్రజ్ఞానం అంటే ఏమిటి 
 : ప్రజ్ఞానం కేవలం జ్ఞానం అని తెలుసుకో, దానిలోనుండి వెడలేది విజ్ఞానం. అంటే సాపేక్ష జ్ఞానం, అంతర్దశ జ్ణానం, నిక్షిప్త జ్ణానం, దేహం,  ఆరోగ్యం,  సర్వాంతర్యామి జ్ణానం, మరియు సందర్భోచిత జ్ణానం

_*ప్రశ్న : విజ్ఞానదశలో సంవిత్ [విశ్వచైతన్యం] విదితమవుతుందా?

విశ్వ చైతన్యం మారుతూనే ఉంది. జీవపరిణామ ంం తగ్గిపోతుంది. స్త్రీ లు తగ్గుతున్నారు పురుషులు పెరుగు తున్నారు. గుప్తంగా ఉండే శృంగారం వీధిన వివరిస్తున్నది. అనుమానాలు వ్యక్తమవుతున్నాయి .  

_*ప్రశ్న : జగత్తులో విజ్ఞానం వల్ల  ప్రజ్ఞానం స్వయంగా భాసించదా? 

 ఎరుక అంతఃకరణ వల్ల ఇప్పుడూ ప్రజ్ఞానం సర్వదా నిద్రలో సైతం వెలుగుతూనే ఉంటుంది. మెలకువలో ఎరుక అనూనతమైతే నిద్రలో కూడా అట్లే ఉండవలె !*_

_*ఉదా : రాజు ఒకరు హాలులోకి వచ్చి కూర్చుండి వెళ్ళిపోయాడు. అతడు వంట ఇంటిలోకి వెళ్ళలేదు. ఆ కారణంగా రాజక్కడికి రాలేదనవచ్చునా ? ఎరుక జాగ్రత్తగా ఉంటే, నిద్రలోనూ ఉన్నదనే అనవలె !* మన ఆలోచనలు స్థిరముగా ఉండవు.

_*"లేదనే భావనే బాధ - బాధ లేని స్థితే ఆనందం !''*-

కనుక ఆనందం పరమానందం .. బ్రహ్మానందం ... ఆత్మానందం .. అందరికి ఉండాలి 

అదే ......  ....... .అదే ........  ...... 

--(())--

: *శుద్ధమనసు* *శరీరం కేవలం గూడు. అది ఆత్మకు ఆవాసం మాత్రమే..!*

*మానవజన్మ కర్మబద్ధం. కనుక ప్రపంచంలో కర్మనిష్ఠతో ఉండాలి. కానీ అంతరంగంలో బ్రహ్మనిష్ఠలో ఉండాలి. ఇదే మానవ జన్మకున్న విశిష్టత. సమ్యక్‌ దృష్టితో ప్రాపంచిక కర్తవ్యాలు నిర్వర్తించాలి. మేను మాత్రమే నేను కాదు. ఉన్నది ఒక్క నేనే. మూడు అవస్థలలో వున్న నేను అనే చైతన్యమే.*

*హృదయం వెన్న వలె ఉండాలి.  కాఠిన్యంతో కాకుండా.. కారుణ్య హృదయంతో ప్రపంచంలో సంచరించాలి. సిద్ధాంత రాద్ధాంతాలు, వాదోపవాదాలు లేకుండా మనీషతో వుండాలి. మనీష అంటే స్థిరప్రజ్ఞ, స్థిమిత బుద్ధి.  ఇది కాదు,ఇది కాదంటూ మనసును ఖాళీ చేసుకుంటూ పూర్ణ చైతన్యంతో ప్రవర్తించాలి. శాస్త్రాధ్యయనంతో మనసును పరిమళ భరితం చేసి, స్వాదువుగా తీర్చిదిద్దుకోవాలి.జడాత్మక దేహం అనుభవించే ఏ వికారమూ నీది కాదు.ఎరుకతో ఉండాలి.*

*దేనికీ అంటక, దేనినీ అంటించు కొనక కాంతి కటకం వలె, తామరపత్రం మీద నీటి బిందువువలె, తెరమీద బొమ్మవలె ఉండాలి. అంతా బ్రహ్మమే అనుకో గలగటమే అసలైన ముక్తి!!*


అప్పుడే గుడి మెట్ల ఒక యువకుడు (యిలా అంటున్నాను )

దేశంలో సత్యం కనుమరుగై పోయింది... 

అసత్యం తాండవిస్తుంది, సత్యాన్ని వెంటబడి... వేటాడి తరిమి తరిమి కొట్టేశారు... 

దేవుడు నిద్రపోతున్నాడు సత్యం తిరగబడి... బోర్లా పడింది..అసత్యమనే ధన గర్వంతో, అధికార దర్పంతో, విదేశ భక్తితో సత్యాన్ని తొక్కి పడేస్తూ వస్తున్నారు...  

న్యాయస్తానాలు నత్తనడక, విచ్చల విడిగా లంచాల రాజ్య కాంక్ష నాయకుల అసత్యవాక్కులు, గొర్రెల లాగ మారె జనులు ఎప్పటికి మారినో ఎప్పుడు వచ్చునో సత్య ప్రపంచం 

(అప్పుడే పూజారి అడుగు పెడుతూ కంఠ సోష దేనికి, కాసేపు ఆగు స త్యంగా ప్రసాదం పెడతా)

అవునూ నీవు దేవుడికి కళ్ళు గప్పి సంపాయిస్తున్నావు, మాలాంటి వారికి ప్రసాదంతో సరిపెడుతున్నావు. జాతీయ మీడియా రాజ్యాంగ నాయకుల చేతిలో పరాజితురాలై బానిసత్వం లో మగ్గు తూ ఉంది ఎదురు తిరిగితే వచ్చి గొంతే నులిమేస్తున్నారు.  

ఓహ్... ఒకటేమిటి ?


పార్టీకో పత్రిక.... 

పార్టీ కో ఛానెల్... 

అవి వెదజల్లే వార్తలు చూస్తూ ఉంటే ...

సత్యానికే సంకెళ్ళు, నిజాలు దివాలా తీశాయి అబద్దాలు దారిన పడ్డాయి. అసత్యాలు... అబద్ధాలు రాజ్యమేలుతూ ఉన్నాయి. 

(అప్పుడే పూజరి అక్కడఉన్న వారికి ప్రసాదం పెట్టాడు, చదగోపురంతో దక్షణ నొక్కేసాడు)

అవును ఆంజనేయ నీఆవేదన కాని మనం స్నేహితులం, నేను గుళ్లోనున్నాను, నీవు లోకాన్ని చూస్తున్నావు అయినా మన నాయకులు మహాతటాకాలు సైతం అదృశ్యపు దిశనని పర్యావరణ వెత్తలు చెరువులపూడ్చివేసి నవనాగరిక సౌధాల నిర్మాణాలు ఇప్పుడు అనుమతిస్తున్నారు, చెట్లు నరికేస్తున్నారు, చినుకుపడితే చిత్తుచిత్తు అవుతున్న ప్రతిష్టాత్మక జనవాసాలు దారి చూపలేని నోరు మెదపలేని ప్రభుత్వాలు, ప్రగతి పథాన్ని ప్రశ్నించె ప్రకృతి పరిచక్రం, నష్ట పరిహారమని నాయకుల భోజ్యం ఎవరితో చెప్పుకోగలం, న్యాయదేవత కళ్లు మూసినట్లు, మనం తెలియనివారులాగ నోరుమూసు కోవడమే ఇదే సత్యం, ఇదే నేటిన్యాయం, ఇదే ధర్మం అంటూ అరుచు కుంటూ వెళ్లి పొయ్యాడు .

అప్పుడే గుడిలో వృద్ధ దంపతులు వచ్చి కూర్చున్నారు పూజారి ఆకులో ప్రసాదము తెచ్చి ఇచ్చారు కుశల ప్రశ్నలు వేయగా దీనాతిదీనముగా క్లుప్తముగా పుత్రికాపుత్రులు ఇదరిద్దరు, 

పెళ్లి ఉద్యగవ్యవహారాలు వయసులో నెరవేర్చాము, ఉన్న శక్తి ఆస్థి పిల్లలకు ధారపోశాము, మనవళ్లను మోయలేక, పిల్లలవద్ద ఉండలేక కట్టుబట్టలతో ఇక్కడకొచ్చాము. 

అప్పుడే ఆంజనేయుడు అక్కడకొచ్చాడు ఏమిటి పిల్లలు మిమ్మల్ని చూడుటలేదా అన్నాడు   

పిల్లలు మంచివారే కానీ మారతాలు బాగుండలేదు అంతే అవునులే పిల్లల్ని ఏమి అనలేరు, వారిదగ్గర ఉండలేరు, బ్రతుకుకోసం మరలా జీవితమా మొదలుపెడతారు కదా 

అట్లాఅనకుబాబు ఎదో అప్పుడే కొన్ని కాగితాలు తెచ్చేడు ఆంజనేయుడు వీటిపై సంతకాలు పెట్టండి మిగతావి నేను చూసుకుంటా అందాక ఈగుడిలో నే ఉండండి గుడివానకాల గదులున్నాయి అక్కడ ఉండి వండుకుంటారో గుడి ప్రసాదం తింటారో మీయిష్టం అన్నాడు 

పూజారి అక్కడకొచ్చి ఆంజనేయ అప్పుడే అభయమిచ్చావే తప్ప దండి ఆదు కోవటమే తక్షణ కర్తవ్యం సంతకం దేనికి అన్నారు దేవాలయం కదండీ కొన్ని కారణాలు ఉంటాయి అందుకోసమే మిమ్మల్ని మోసం ఏమి చేయము నమ్మకమే మాధ్యాయం ఇక మీ ఇష్టం అన్నాడు పూజారి ఆంజనేయుడు సంతకాలు పెట్టించుకున్నాడు అసమయాన 


ఉ.వర్షపు నీరుపారు దల పాకము లా మురికై సువాసనే

హర్షపు కప్పవాక్కు లగు హారతి లా మెరిసేను నీటిలో

శీర్షపు ఆసనమ్ములగు చీమల రీ తిన దారిపట్టుటే 

కర్షక గోడు చూడకయు కాలము తీర్పుయు తెల్ప నాయకా


సీనియర్ సిటిజన్లు, పూర్తిగా నిర్లక్ష్యం  ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలి.  భారతదేశంలో సీనియర్ సిటిజన్‌గా ఉండటం నేరమా?*

   భారతదేశంలోని సీనియర్ సిటిజన్లు 70 సంవత్సరాల తర్వాత వైద్య బీమాకు అర్హులు కారు, వారు EMIపై రుణం పొందరు.  డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వలేదు.  ఆర్థిక పనుల కోసం వారికి ఎలాంటి పని ఇవ్వరు.  కాబట్టి వారు ఇతరులపై ఆధారపడతారు.  అతను తన యవ్వనంలో అన్ని పన్నులు చెల్లించాడు.  ఇప్పుడు సీనియర్‌ సిటిజన్‌ ​​అయ్యాక కూడా పన్నులన్నీ కట్టాల్సిందే.  భారతదేశంలో సీనియర్ సిటిజన్ల కోసం ఏ పథకం లేదు.  రైల్వేలో 50 శాతం తగ్గింపు కూడా నిలిపివేయబడింది.  బాధాకరమైన విషయం ఏమిటంటే రాజకీయాల్లో సీనియర్ సిటిజన్ అంటే అది ఎమ్మెల్యే, ఎంపీ లేదా మంత్రి కావచ్చు, వారు ప్రతిదీ పొందుతారు మరియు పెన్షన్ కూడా పొందుతారు, కాని మేము సీనియర్ సిటిజన్లు మన జీవితమంతా ప్రభుత్వానికి అనేక రకాల పన్నులు చెల్లిస్తున్నాము, ఇప్పటికీ పెన్షన్ లేదు.  వృద్ధాప్యంలో, వృద్ధాప్యంలో వారిని (కొన్ని కారణాల వల్ల) చూసుకోలేకపోతే పిల్లలు ఎక్కడికి వెళ్తారో ఊహించండి?  ఇది భయంకరమైన మరియు బాధాకరమైన విషయం.  ఇంటి పెద్దలకు కోపం వస్తే అది ఎన్నికలపై ప్రభావం చూపుతుంది.  మరి దాని పర్యవసానాలను ప్రభుత్వమే భరించాలి.  సీనియర్ సిటిజన్లను ఎవరు చూసుకుంటారు?

   ప్రభుత్వాన్ని మార్చే శక్తి సీనియర్లకు ఉంది, వారిని బలహీనులని ఉపేక్షించకండి!  సీనియర్ సిటిజన్ల జీవితాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం లేదు.  ప్రభుత్వం పునరుత్పాదక పథకాలకు చాలా డబ్బు ఖర్చు చేస్తుంది, కానీ సీనియర్ సిటిజన్లకు కూడా ఒక పథకం అవసరమని ఎప్పుడూ గుర్తించదు.  దీనికి విరుద్ధంగా, బ్యాంకుల వడ్డీ రేట్ల తగ్గింపు కారణంగా సీనియర్ సిటిజన్ల ఆదాయం తగ్గుతోంది.  కుటుంబ పోషణ కష్టంగా ఉన్న కొద్దిపాటి పింఛను వస్తే దానికి కూడా ఆదాయపు పన్ను విధిస్తారు.

 భారతీయ సీనియర్ సిటిజన్‌గా ఉండటం ఇప్పుడు నేరంగా పరిగణించబడుతుంది.

అంటూ ఏమిటి యీలోకం తీరు అర్ధంకావటంలేదు 

. *కరోనా కరోనా వచ్చి ఏం చేసావ్ అని అడిగితే:


 ఢిల్లీ, హైద్రాబాదు  లాంటి ప్రదేశాల్లో కూడా కాలుష్యం తగ్గించాను.,  కుటుంబాలతో సమయం వెచ్చించేలా చేశాను. డబ్బు ఒక్కటే ప్రాధాన్యము అనుకొని పరిగెత్తే వాళ్ళకి బుద్ధి తెచ్చేలా చేశాను.  రోజు మందు లేకపోతే బతకలేను అనే వాళ్ళ చేత మందు లేకుండా ఉండేలా చేశాను.  డబ్బున్నా ఏమీ చేయలేని ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి కల్పించాను.  వైద్య వ్యవస్థ మీద ఎంత నిర్లక్ష్యంతో ప్రభుత్వాలు ఉన్నాయో అందరికీ తెలిసేలా చేశాను.  ఎంత డబ్బు ఉన్నా మీకు నచ్చింది కావాల్సింది దొరకకపోతే ఆ బాధని ఎలా అధిగమించాలో నేర్పాను.  బతికుంటే చాలురా భగవంతుడా అనుకునేలా చేశాను. ఎన్ని కోపాలు తాపాలు ఉన్న బయటకు వెళ్ళలేక ఇంట్లో వాళ్లతోనే సర్దుకుపోయేలా చేశాను.  క్యాష్ తప్ప ఇంకేమీ అలవాటు లేని వాళ్ళ చేత ఆన్లైన్ పేమెంట్ అలవాటు చేశాను. యాక్సిడెంట్లు లేకుండా చేశాను..


 ఈ భూమి మనుషులకు మాత్రమే కాదు జంతు జీవరాశులకు కూడా అని వాటికీ ప్రశాంతమైన వాతావరణం కల్పించాను. ఎల్లప్పుడూ బిజీగా ఉండే వాళ్ళు నాకు "ఎప్పుడు ప్రశాంతత దొరుకుతుందా" అని ఏడ్చే వాళ్లకి ఇంట్లో ఖాళీగా ఉంటే ఎంత నరకం అని తెలిసేలా చేశాను.

మేము అగ్రరాజ్యాలమని విర్రవీగే వాళ్ళని పడుకునేలా చేశాను..

వైద్యం మీద కాకుండా రక్షణ వ్యవస్థ మీద ఎక్కువ పెట్టినందుకు బాధపడేలా చేశాను.

 "గవర్నమెంట్ హాస్పిటల్లను ఇప్పటిదాకా ఇలా ఎందుకు ఉంచారు" అని బాధపడేలా చేశాను.

 "డబ్బుతో అన్ని సుఖాలు ఇష్టాలు రావు సర్దుకుపోవడం లోనే వస్తుంది" అని ప్రతి ఒక్కరికి నేర్పాను.  "మనకెందుకు చావు వస్తుంది" అని ధీమాగా ఉన్న వాళ్ళ వెన్నులో వణుకు పుట్టించేలా చేశాను..

 క్రమశిక్షణ అంటే ఏంటో తెలియని వాళ్లకు అది నేర్పాను   "ఇలాంటి సమయంలో కూడా సేవ చేసేవాళ్ళు ఉంటారు" అని సమాజానికి చూపించాను. లోకంలో మనిషి పుట్టుక అద్భుతం

 నవ్వుతూ బ్రతకాలి నలుగుర్ని నవ్విస్తూ బ్రతకాలి!


*అంతా మట్టే మట్టిలో పుట్టాము ! మట్టిలోకే పోతాము కదా!

ఒక్కసారి ఆలోచించండి దయచేసి.....



 * తెలుసుకోదగిన విషయం ..... పూజారి తనకు తోచిన కధలు తేలుతున్నాడు 

ఒక రోజొక గురువు గారు తన ఇద్దరు శిష్యుల్నీ పిలిచి, “ఈ రోజు మీరిద్దరూ పొరుగూరికి వెళ్లి రావాలి” అని చెప్పారు. ఒక సంచిలో ఆహారాన్ని నింపి, ఒక శిష్యులకు ఇచ్చి, “ఎవరైనా అవసరం ఉన్న వాళ్లు కనిపిస్తే వారికి ఈ ఆహారాన్ని పంచుకుంటూ వెళ్లు” అన్నారు. 

రెండో శిష్యుడికి ఖాళీ సంచి ఇచ్చి ‘దారిలో ఏదైనా విలువైన వస్తువు కనిపిస్తే దాన్ని సంచిలో వేసుకుంటూ వెళ్లు’ అన్నారు.

ఇద్దరూ సంచుల్ని భుజాలకి తగిలించుకుని ప్రయాణం మొదలుపెట్టి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఖాళీ సంచి వాడు ఆడుతూపాడుతూ నడుస్తున్నాడు. కొంత దూరం వెళ్లాక అతనికి ఒక విలువైన రంగు రాయి దొరికింది. దాన్ని తీసి సంచిలో వేసుకున్నాడు. మరికొంత దూరం వెళ్లాక మరొకటి కనిపించింది. దాన్ని తీసి సంచిలో వేసుకున్నాడు. అలా ఎక్కడ రంగు రాయి కనిపిస్తే దాన్ని తీసుకుని సంచిలో వేసుకుంటూ నడక సాగించాడు. దాంతో సంచి బరువెక్కసాగింది. నడక భారంగా మారింది. శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది అయింది. ఉండేకొద్దీ అడుగు తీసి అడుగేయడమే చాలా కష్టమైపోయింది.

ఇక రెండోవాడు వెళ్తూ వెళ్తూ దారిలో ఆకలితో కనిపించిన వారికి తన సంచిలోని తిను బండారాలను కొంచెం కొంచెంగా పంచుకుంటూ వెళ్లాడు. క్రమంగా సంచి బరువు తగ్గి నడక సులభం అయింది. పంచుకుంటూ వెళ్లినవాడు తన గమ్యాన్ని తేలిగ్గా చేరుకోగలిగాడు. పోగేసుకుంటూ వెళ్లిన వ్యక్తి గమ్యాన్ని చేరుకోలేక పోయాడు. ప్రయాణమూ కష్టంగా సాగింది.

మరి మీరూ మనసు పెట్టి ఆలోచించండి. మీ యగమ్యాన్ని ఎలా చేరుకోదలచుకున్నారు?

ఈ కథను తాత్విక దృష్టితో చూసినట్లయితే “విలువగలవైనా ..

లౌకిక విషయాలను, వస్తు సమాగ్రిని ప్రోగు చేసుకుంటూ వెళితే, జీవితం దుర్భరమవుతుంది. అదే మన ప్రేమనీ , జ్ఞానాన్నీ పంచుకుంటూ జీవన ప్రయాణం సాగిస్తే, మోక్షానికి చేరే మార్గం సుగమం అవుతుంది”. 

అట్లాగే పిల్లలపై ప్రేమ ఉండోచ్చు మొదటి వ్యక్తిలాగా బరువులను మోస్తే ఇవితమంతా బరువుతుంది, రెండోవ్యక్తిలా అందుకున్నదంతా పంచి సహాయము చే యుటె సుఖము.       

***