. గీతోపనిషత్తు - 95 🌹
🍀 26 - 8 . ప్రాణాయామ యజ్ఞము - ప్రాణవాయువు, అపాన వాయువు ఈ రెండింటి సామ్యమే సమాన వాయువు. ఈ సామ్యము చెందినపుడు, శ్వాస, మనసు కరగి సమాన ప్రాణ స్పందనము నిలచును. అపుడు బహిర్ముఖమగు మనసు అంతర్ముఖమై నిలచును. సాధకునకు తాను స్పందనాత్మక చైతన్యమని తెలియును. బాహ్య ప్రనుండి అంతర్ ప్రజ్ఞ మేల్కొనును. 🍀
📚. 4. జ్ఞానయోగము - 29, 30 📚
పంచప్రాణములు దేహమున ఈ క్రింది భాగములలో పనిచేయుచున్నవి.
🌷 3. సమాన వాయువు: 🌷
ఉదర వితానమునకు పై భాగమున కనుబొమల వరకు ప్రాణవాయువు పనిచేయు చున్నదని తెలుపబడినది. ఉదర వితానము నుండి క్రింది భాగమంతయు అపాన వాయువు పని చేయు చున్నదని తెలుపబడినది. ఈ రెండింటి సామ్యమే సమాన వాయువు.
అంతియే కాదు- ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన ప్రాణముల సామ్యము కూడ సమాన వాయువే. ప్రాణము, అపానము, సమానము కేంద్రముగ నిర్వర్తింప బడుచున్నవి. ప్రాణాపానములు పరస్పర విరుద్ధమగు శక్తులు. కావున రెండు విధములగు ప్రయోజనములు అవి దేహమున నిర్వర్తించు చున్నవి.
ఈ వైరుధ్యము శత్రుత్వము కాదు, మిత్రత్వమే. ఒకటి బాగుండిన రెండవది బాగుండును. ఒకదాని నొకటి బలపరచుకొనును. ఒకటి బలహీనపడిన రెండవది కూడ బలహీనపడును.
బాగుగ శ్వాస పీల్చినచో బాగుగ వదల వచ్చును. అట్లే బాగుగ వదలినచో బాగుగ పీల్చవచ్చును. ఈ రెంటిని సామ్యపరచుటనే ఒకదాని యందొకటి హోమము చేయుటగ భగవద్గీతా శ్లోకములు (29, 30) తెలుపుచున్నవి.
ముందు తెలిపిన ప్రాణా యామ యజ్ఞము ద్వారా ఈ రెండును సమాన వాయువు నందు సామ్యము చెందినపుడు, శ్వాస, మనసు కరగి సమాన ప్రాణ స్పందనము నిలచును. అపుడు బహిర్ముఖమగు మనసు అంతర్ముఖమై నిలచును. సాధకునకు తాను స్పందనాత్మక చైతన్యమని తెలియును. బాహ్య ప్రనుండి అంతర్ ప్రజ్ఞ మేల్కొనును.
అంతర్ముఖుడైన జీవునకు బాహ్యమున తనకు గల స్థితి గతులన్నియు తాత్కాలికమే అని తెలియును. తాను హంస స్వరూపుడ నని తెలిసి ద్వయాక్షరి యగు ' సోహం' అను స్పందనముగా తెలియును. ఈ విషయము ముందు పాఠములలో తెలుప బడినది.
అంతర్ముఖుడుగ మేల్కాంచిన జీవునకు బహిర్ముఖముగ తన అస్థిత్వమంతయు తాత్కాలికమే అని ధృవపడి శాశ్వతమగు అస్థిత్వమునకు ప్రయత్నము ఆరంభమగును. ఇది నిజమగు పుట్టుక.
సశేషం...
🌻. దక్షుని విరోధము - 1 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను -
పూర్వము ప్రయాగలో మహాత్ములగు మహర్షులందరు ఒక్కచోట గూడి, యథావిధిగా యజ్ఞమును చేసిరి (1)అచటకు సిద్ధులు, సనకాది దేవర్షులు, ప్రజాపతులు, దేవతలు, జ్ఞానులు, బ్రహ్మసాక్షాత్కార సంపన్నులు విచ్చేసిరి (2). నేనచటకు పరివార సమేతముగా వచ్చితిని. వేద శాస్త్రములు దివ్యకాంతులీను మూర్తులను ధరించి నాతో కలిసి వచ్చినవి (3). ఉత్సవములో పాల్గొను వారందరితో కూడిన ఆ కలయిక చాల విచిత్రమైనది. అచట అనేక శాస్త్ర విషయములలో జ్ఞానులగు పండితుల చర్చలు జరిగినవి (4).
ఓ మహర్షీ! ముల్లోకములకు హితమును గూర్చు స్వామి, జగత్కారణుడనగు రుద్ర ప్రభువు భవానితో, ప్రమథ గణములతో గూడి అచటకు ఆ సమయములో విచ్చేసెను (5). శివుని చూచి సర్వదేవతలు, సిద్ధులు, మునులు, మరియు నేను ఆ ప్రభువునకు నమస్కరించి భక్తితో స్తుతించితిమి (6).
అందరు ఆనందముతో నిండిన వారై శివుని యాజ్ఞచే తమ తమ స్థానములలో ఉపవిష్టులైరి. ప్రభువు దర్శనముచే సంతసించి, వారు తమ భాగ్యమును కొనియాడిరి (7). ఆ సమయములో ప్రజాపతులలో ముఖ్యుడు, ఆనందముతో నున్నవాడు, గొప్ప తేజశ్శాలి యగు దక్షప్రభువు అనుకోకుండగా అచటకు వచ్చెను (8).
ఆ దక్షుడు నాకు నమస్కరించి నా ఆజ్ఞచే అచట గూర్చుండెను. ఆతడు తానే బ్రహ్మాండమునకు అధిపతిని యను గర్వముతో నుండెను. ఆతడు తత్త్వమును దర్శించలేని బహిర్ముఖుడు (9). దేవతలు, ఋషులు అందరు వినయముతో చేతులు జోడించి, గొప్ప తేజశ్శాలి యగు దక్షుని స్తుతులతో, నమస్కారములతో పూజించిరి (10).
అనేక తీరుల విహరించు ప్రభువు, స్వతంత్రుడు, అద్భుతలీలలను ప్రకటించువాడు మహేశ్వరుడు తన ఆసనమునందున్న వాడై, అతి శయించిన గర్వముతో నున్నదక్షుని అపుడు చూచెను (11). నా కుమారుడగు దక్ష ప్రజాపతి అచట అనంతుడగు శివుని జూచి, అప్రసన్నమగు మనస్సు గలవాడు అయెను. అతడు వెనువెంటనే రుద్రునియందు క్రోధమును పొందెను (12)
మహాగర్విష్ఠి, అజ్ఞాని యగు ఆతడు గొప్ప తేజశ్శాలి యగు రుద్రుని క్రూర దృష్టితో చూచి, అందరు వినునట్లు బిగ్గరగా నిట్లు పలికెను (13). ఈ దేవతలు, రాక్షసులు, బ్రాహ్మణ శ్రేష్ఠులగు ఈ ఋషులు అందరు నన్ను నమస్కరించుచున్నారు. ప్రేత పిశాచములతో చుట్టు వారబడియుండే ఈ రుద్రుడు దుర్జనుని వలె నమస్కారమును చేయని గర్విష్ఠి ఎట్లు అయినాడు?(14).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 180 🌹
🌻. మార్కండేయ మహర్షి - 6 🌻
45. వ్యవస్థలో ప్రతి శ్రాద్ధకర్మకీ నక్షత్రం చూచుకోవలసిన ఆవశ్యకత, దానిని గురించిన మీమాంస ఏర్పడుతున్నది. ప్రతి శ్రాద్ధానికి ముహూర్తం చుడవలసివస్తుంది.
46. విధినిషేధాలు వచ్చేటప్పటికి అదొక పెద్ద confusion అయిపోతున్నది. అయితే ఆ విషయాన్ని దాచి, అంటే దాన్ని గురించి చెప్పక, ఆ తిథినాడే చేసెయ్యటం మనకు అలవాటు చేసారు. అట్లా ప్రతీదీ కూడా ఒక విమర్శనీయమైన విషయం అవుతుంది. ప్రతీదానికి పంచంగం చూడాల్సివస్తుంది కాబట్టి, అలా వ్యవస్థ చేస్తున్నారు. దానిని కుదిరినంత అనుసరిస్తూ, ఏదో కష్టసుఖాలు అనుభవిస్తున్నారు.
47. అదృష్టవశాత్తు ఆ శ్రాద్ధకర్మలు నిర్వీర్యంగా ఉన్నాయి. అందులో ఏమీలేదు కాబట్టి అవి మనని ఏమీచేయటంలేదు. అదే తిథినాడూ శ్రాద్ధం పెట్టాలని ఏమీలేదు. ముందుకాని, వెనుక కానీ చెయ్యవచ్చు. ప్రతీదానికీ తిథే ప్రధానం అనుకోవటం ఊరికే మనకు అలవాటయిపోయింది.
48. గయలో శ్రాద్ధంపెడితే మళ్ళీ పెట్టవలసిన అవసరం లేదంటారు. నిజమేనా అని కొందరి సందేహం. ఏదో ఒక చోట చేస్తే ఇంకొకచోట అఖ్ఖరలేదు అంటే, అనవసరం అన్నమాటే అది. అసలాంటి మాట – Provison – ఉందంటేనే, మానివేయచ్చని, ఎగవేయచ్చని అర్థంవస్తుంది. నేటికి మిగిలిన ఆ కాస్త క్రియాకలాపంకూడా విస్మరిస్తే, పెద్దలను మరచిపోతారు.
49. వారి ఋణాన్నితీర్చుకోవటానికి ఇక ఏ పనీచెయ్యరు. కాబట్టి సంప్రదాయంలో ఒక అర్థముంది. అయితే, ఇప్పుడున్నటువంటి ఛాందస ప్రవృత్తిలో చేయటం మాత్రం శాస్త్రసమ్మతం కాదు. అది అంత ఆవశ్యకమూ కాదు. మొత్తానికి ఏదో ఆరాధన ఇంకా మిగిలి ఉంది! అందుకు సంతోషించాలి.
50. అసలు పెళ్ళితోసహా అన్నికార్యాలూ శ్రద్ధతోచెయ్యాలి. వ్యవహారంలో ఏమైపోయిందంటే, పిత్రుకార్యాల(శ్రాద్ధం)లో వాడతంచేత, శ్రద్ధ అనే మాట ఎక్కడవచ్చినా అది చెడ్డమాటే అవుతున్నది. అలా అయిపోయింది ఈ వ్యవస్థ. ఏదైనా పాపపు మాట వింటే, రామరామ అంటాం. రామ శబ్దం ఉత్తమం. ఎక్కడయినా స్మరించవచ్చు.
51. పెళ్ళిలో కూడా!! కొత్త దంపతులు దణ్ణం పెడితే రామరామ అంటే ఊరుకుంటార! ఏం! రామనామం చెడ్డదా? వీళ్ళకలా అలవాటు అయిపోయిందంతే! ఎక్కడో ‘పాపం శమించుకాగ’ అనే అర్థంలో రామశబ్దం వాడబడటంచేత, శుభంలో ఎక్కడా వాడకూడదని అనటం అలవాటయిపోయింది.
52. కాబట్టి మన అలవాట్లు ఒకమాటు విమర్శచేసుకుంటే చాలా విషయాలు తెలుస్తాయి. ఇలా మన అలవాట్లు కొన్ని అర్థరహితంగా కూడా ఉన్నాయి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
[17:37, 10/12/2020] +91 98494 71690: 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 119 🌹
🌻. సర్వశూన్య స్థితి యందు ఎరుక - 4 🌻
495. నిజమైన సుషుప్తియగు 'నిర్వాణ అవస్థ' యైన ' ఫనా' లో పూర్తి విశుద్ధ చైతన్యము ఉండును.
496. నిజమైన ఫనాకును తదితర ఫనాలకును అనంత తారతమ్యత గలదు.
497. ప్రతి భూమికకు'ఫనా' 'బకా' లుండును. కానీ భూమికలలో నున్న 'ఫనా' ఏడవ భూమికలో నున్న ఫనా- కాదు. అట్లే భూమికలలో నున్న 'బకా' సద్గురు స్థితిలో నున్న 'బకా' కాదు.
498. ఫనా = నాశనము, అస్థిరమైన స్థితి.
499. బకా = స్థిరత్వము, ఎల్లకాలము ఉండు స్థితి.
ఫనా× బకా = అస్థిరము×స్థిరము.
సశేషం...
[
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 58 🌻
శ్రోత్రాది ఇంద్రియములు జడములగుట చేత శబ్దాది విషయములను గ్రహించు శక్తి లేనివిగా యున్నవి. ఇంద్రియములకు అంతరముగా ఉన్నటువంటి, విజ్ఞానమే స్వభావముగా గల, ఆత్మమాత్రమే అన్నిటిని తెలుసుకొనుచున్నది. ఎట్లనగా ఆత్మతో కూడిన అంతఃకరణ వృత్తి బహిర్గతమై చక్షరింద్రయముల ద్వారా దశవిధరూపములను, జిహ్వేంద్రియముల ద్వారా షడ్రసములను, ఘ్రాణేంద్రియము ద్వారా చతుర్విధ గంధములను, త్వగీంద్రియము ద్వారా ద్వాదశ స్పర్శలను, శ్రోత్రము ద్వారా చతుర్విధ శబ్దములను, అటులనే విషయానందమును తెలిసికొనుచున్నది. ఈ దేహములో ఆత్మచైతన్యము ఉన్నంత వరకే ఇంద్రియములు విషయములను గ్రహించుచున్నవి.
ఆత్మచైతన్యము లేనప్పుడు, (మరణించినప్పుడు) ఇంద్రియములు వానివాని స్థానములలో ఉన్నప్పటికీ, విషయములను గ్రహించుట లేదు. కనుక అన్నిటిని తెలుసుకొనునది ఆత్మయే. ఆత్మ తెలుసుకొనుటకు శక్యము కాని వస్తువు ఏదియునూ లేదు. ధర్మాధర్మముల కంటే భిన్నమైన ఏ ఆత్మతత్వమును నీవు ఎరుంగ గోరితివో, దేవతలు సైతం దేని విషయమున సంశయగ్రస్థులైరో, అట్టి ఆత్మతత్వము ఇదియేనని తెలుసుకొనుము.
జ్ఞాత - జ్ఞాతుం ఇచ్ఛతి. జ్ఞాతకు ఉన్నటువంటి ఒకే ఒక లక్షణం - తెలుసుకొనుట. జ్ఞానము- జ్ఞాత్వాం ఇతి సర్వత్రం - మిగిలిన 24 లక్షణాలని, 24 తత్త్వాలని, 24 అంశాలని పిండాండ పంచీకరణ యందున్నటువంటి భావమును, అందించే ప్రయత్నాన్ని చేస్తున్నారు. జ్ఞాత చక్షురింద్రియము ద్వారా పని చేస్తున్నాడు అనుకున్నట్లయితే, ఆ యా దృశ్యములను గ్రహిస్తున్నాడు. అదే జ్ఞాత యొక్క ప్రభావం రసనేంద్రియము ద్వారా పనిచేసినప్పుడు, రుచులను సంగ్రహిస్తున్నాడు.
అదే జ్ఞాత ఘ్రాణేంద్రియము ద్వారా పని చేసినప్పుడు, ఆ ఘ్రాణము యొక్క వాసనలను ఆఘ్రాణిస్తున్నాడు. అదే జ్ఞాత స్పర్శేంద్రియమైనటువంటి త్వక్ ద్వారా పనిచేసినప్పుడు ఆ జ్ఞాత యొక్క ప్రభావము చేత త్వక్ - త్వగింద్రియము స్పర్శను తెలుసుకోగలుగుతున్నారు. శీతోష్ణములు, సుఖదుఃఖములు అనేక రకములైనటువంటి ద్వంద్వాది స్పర్శములను తెలుసుకోగలుగుతున్నాడు.
అయితే ఈ జ్ఞానేంద్రియములు అన్నీ కూడాను, స్వయముగా పనిచేయుచున్నవా? అనే విచారణ చేయకపోయినట్లయితే, కళ్ళు ఉన్నాయి కాబట్టి చూడగలుగుతున్నానని, చెవులు ఉన్నాయి కాబట్టి వినగలుగుచున్నానని, నోరుంది కాబట్టి తినగలుచున్నానని, ముక్కు ఉన్నది కాబట్టి వాసనను గ్రహించగలుగుతున్నానని, త్వగింద్రియము ఉన్నది కాబట్టి స్పర్శారూప సుఖదుఃఖాలను పొందగలగుచున్నాను అనేటటువంటి భావనలు కలుగుచున్నాయి.
కానీ నిజానికి ఆత్మచైతన్యం కనుక ఈ శరీరంలో వ్యాపకమై, వ్యవహారశీలం కాకపోయినట్లయితే, ఆత్మచైతన్యం యొక్క ఉనికి ఉండక పోయినట్లయితే, ఈ ఇంద్రియములన్నీ సమర్థవంతములు కావు. అవి నిలబడి ఉన్నప్పటికి, శరీరమునందున్నటువంటి ఇంద్రియములు ఆత్మచైతన్యం గనుక సహాయం చేయకపోయినట్లయితే, జ్ఞాత యొక్క సహాయం లేకపోయినట్లయితే, ఏ రకమైనటువంటి అనుభవాన్ని ఈయజాలవు. దీనికి ఉదాహరణ చెబుతున్నారు.
శవం. శవానికి అన్ని ఇంద్రియాలు ఉన్నాయి. లేనిది ఒక్క ఆత్మచైతన్యము మాత్రమే. మరి ఆ ఇంద్రియములు వేటిని గ్రహించడము లేదు కదా! కాబట్టి, ఈ గోళకములు కానీ, ఆ నాడీ వ్యవస్థ అయినటువంటి ఇంద్రియములు కానీ, దానికి ఆధారభూతమైనటువంటి, శబ్దస్పర్శాది రూపకమైన తన్మాత్ర సహిత జ్ఞానము కానీ, దాన్ని అనుసంధానపరిచేటటువంటి మనస్సు కానీ, దాన్ని నిశ్చయించేటటువంటి బుద్ధికానీ, ఇవన్నీ ఆత్మచైతన్యం చేతిలో పనిముట్లు.
ఇవన్నీ పంచభూతాత్మకమైనటువంటి మహతత్త్వము, అవ్యక్తములో భాగములు. అట్టి పంచభూతాత్మకమైనటువంటి శరీరము, వాటియందున్నటువంటి ఇంద్రియములు, వాటియందున్న గోళకములు, వాటియందు పనిచేయుచున్న శబ్దాది విషయజ్ఞానము, పంచతన్మాత్రల యొక్క ప్రభావము, ఇవన్నీ కూడా ఒక దానికంటే ఒకటి సూక్ష్మతరము, సూక్ష్మ తమమైనప్పటికి ఇవన్నీ ప్రత్యగాత్మ యొక్క చైతన్యం చేతనే ప్రవర్తిస్తూఉన్నాయి, వ్యవహరిస్తూఉన్నాయి.
తమకు తాము స్వయముగా వర్తింపజాలవు అనేటటువంటి నిర్ణయాన్ని, పంచీకరణని బాగా అధ్యయనం చేయడం ద్వారా నిరంతరాయముగా అనుసంధానం చేయడం ద్వారా, బాగా పరిశీలనం చేయడం ద్వారా, పరిశోధన చేయడం ద్వారా, అధ్యయనం చేయడం ద్వారా నిజజీవితంలో ఆ పిండాండ పంచీకరణని అన్వయం చేసుకోవడం ద్వారా తనకు తాను విరమించడం ద్వారా, తనను తాను తెలుసుకోవడం ద్వారా, తనదైనటువంటి స్వస్వరూప ఆత్మాసాక్షాత్కార జ్ఞాన స్థితిలో నిలకడ కలిగి ఉండడం ద్వారా మాత్రమే మానవుడు ఆత్మనిష్ఠను పొందగలుగుచున్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది.
సశేషం...
:: భగవద్గీత - సాఙ్ఖ్య యోగము ::
అచ్ఛేద్యోఽయమదాహ్యోఽయమక్లేద్యోఽశోష్య ఏవచ ।
నిత్యస్సర్వగతస్థ్సాణూరచలోఽయం సనాతనః ॥ 24 ॥
ఈ ఆత్మ ఛేదింపబడజాలదు, దహింపబడజాలదు, తడుపబడజాలదు, ఎండింపబడజాలదు. ఆ ఆత్మ నిత్యము, సర్వవ్యాపి, స్థిరస్వరూపి, నిశ్చలమూ, పురాతనమూ.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
. శ్రీమద్భగవద్గీత - 575 / Bhagavad-Gita - 575 🌹
🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 19 🌴
19. మూఢగ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తప: |
పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతమ్ ||
🌷. తాత్పర్యం :
తనను తాను హింసించుకొనుటచే గాని, ఇతరులకు హాని లేదా నష్టమును గూర్చు నిమిత్తముచేగాని మూఢత్వముతో చేయబడు తపస్సు తమోగుణమునకు సంబంధించినదని చెప్పబడును.
🌷. భాష్యము :
హిరణ్యకశిపుడు వంటి దానవులు మూఢతపస్సు నొనరించిన దృష్టాంతములు పెక్కు కలవు. అతడు అమరుడగుటకును మరియు దేవతలను నిర్జించుటకును అట్టి నిష్టాపూర్ణమగు తపస్సు నాచరించెను.
ఆ వరములకై అతడు బ్రహ్మదేవుని ప్రార్థించునను అంత్యమున దేవదేవునిచే సంహరింపబడెను. అసాధ్యమైనదాని కొరకు ఒనర్చబడెడి తపస్సు నిక్కముగ తమోగుణప్రధానమైనదే కాగలదు.
🌹 🌹 🌹 🌹 🌹
[05:48, 11/12/2020] +91 98494 71690: 🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 2 🌹
🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
🍀. అభంగ్ - 2 🍀
చహూ వేదీ జాణ్ సాహి శాస్త్రీ కారణ్!
అథరాహి పురాణే హరిసీ గాతీ!!
మంథునీ నవనీతా తై సేఘే అనంతా!
వాయా వ్యర్డ్ కథా సాండీ మారు!!
ఏకహరీ ఆత్మా జీవశివసమా!
వాయా తూ దుర్గమా న ఘలీ మన్!!
జ్ఞానదేవా పాత్ హరి హా వైకుంఠి!
భరలా ఘనదాట్ హరి దిసే!!
భావము:
నాలుగు వేదముల జ్ఞానము ఆరు శాస్త్రాలకు కారణము పద్దెనిమిది
పురాణాలు హరికి సంబంధించిన సారమునే గానము చేయుచున్నవి.
మంథనము చేసి నవనీతము తీసినట్టు అనంతుడిని తీసి పట్టవలెను.
అవసరానికి రాని వ్యర్థ కథలను, మార్గములను వదిలి పెట్టవలెను.
ఒక్క హరియే ఆత్మగా జీవశివులలో సమముగా ఉన్నాడు. కావున
అవసరములేని కథలు, సాధ్యము కానటువంటి సాధనలలో మనసు
పెట్టకు.
నేను నిరంతరముగా హరిపాఠము పఠించుట వలన నాకు
అంతటను హరి దట్టముగా కనిపించినాడు. కావున హరిపాఠము
వైకుంఠమనిపించినదని జ్ఞానదేవుడన్నాడు.
🌻. నామ సుధ -2 🌻
నాలుగు వేదాల సంపూర్ణ జ్ఞానము
ఆరు శాస్త్రాల మూల కారణము
పద్దెనిమిది పురాణాల నామ గానము
హరి నామానికి చెందిన సారము
మంథన చేసి నవనీతము తీయుము
చింతన చేసి అనంతున్ని పొందుము
నామము లేని కథలు వ్యర్థము
అన్య మార్గములు వదిలిపెట్టుము
హరి ఒక్కడే ఆత్మ స్వరూపము
జీవ శివులలో హరి సమానము.
కఠిన సాధనను వదిలి పెట్టుము
నామములోనే మనసు నిలుపుము
జ్ఞాన దేవుడు పఠించే నామము
హరి నామము వైంకుఠ ధామము
నిండియున్నాడు హరి దట్టము
కనిపించినదంతట హరి రూపము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
[🌻141. 'శాంతా' 🌻
శమము కలది శాంత అని అర్థము.
అంతమున శాంతి కలిగించునది శాంత. 'శ'కారము అంతమున గలదగుటచే ఆరాధనానంతరము ప్రశాంతత నిచ్చునని అర్థము. దైవారాధనమునకు ఫలశ్రుతి శాంతము పొందుటయే. అట్లే సర్వకార్యముల ముగింపు శుభముగను, ఆనందముగను, శాంతి కలుగునట్లు అనుగ్రహించునది శ్రీలలిత.
దైవారాధకులకు ఏ విధముగ శాంతి కలిగించవలెనో ఆ విధముగ శాంతిని ప్రసాదించునది దైవము. ఆర్తులకు ఆర్తి తీర్చుట, కోరికలు గలవారికి కోరికలు తీర్చుట, జిజ్ఞాసువులకు జ్ఞాన మందించుట,
జ్ఞానులకు సాన్నిధ్యము ఇచ్చుట వలన వారికి శాంతి కలుగును. తాత్కాలికమగు శాంతి నుండి శాశ్వతమగు శాంతివరకు సమస్తమును అనుగ్రహించు శ్రీలలితను 'శాంత' అని పిలుతురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌻142. 'నిష్కామా' 🌻
కామము లేనిది, కామముచే బంధింపబడనిది, కామమునకు అతీతమైనది శ్రీలలిత అని తెలియనగును.
అన్ని కోరికలు పొందగలిగిన సమర్థత వుండి, యే కోరిక యందాసక్తి లేక కేవలము పరతత్త్వమునే ఆశ్రయించి వుండు వారిని నిష్కాములందురు. సృష్టియందలి సమస్తము శ్రీలలితకు అందుబాటు
లోనిదే. కావున సృష్టి నుండి ఆమె పొందవలసిన దేమియు లేదు. తనయందు ఉన్నదే సృష్టి యందు వెలిసినది.
తనయందు ఉన్నవి తనవే కనుక వానిని పొందవలసిన అవసరమేలేదు. జీవులు తమయందు లేనివానిని పొందుటకు శ్రమ పడుచుందురు. అది వారిలోని లేమి. ఉన్నది పొందవలసిన అగత్యము లేదు. నిజమునకు అంతయూ తమలోనే వున్నదని తెలిసిన జ్ఞానులే నిష్కాములు. వారు త్రిగుణములను దాటినవారు. వారిని ఇచ్ఛాశక్తి బంధించదు.
ఇక శ్రీలలిత విషయమునకు వచ్చినచో జ్ఞానులకు సైతము మోహము కలిగించునేమోగాని, తన కెట్టి మోహమూ లేదు. పరమేశ్వరుని యందు కూడ అర్ధ భాగమై స్థిరపడుటవలన యిక పరతత్త్వమును గూర్చి కూడ ఇచ్ఛ లేనిది శ్రీదేవి.
పై కారణముగ శ్రీలలిత పూర్ణస్థితి యందున్నది. ఆమెకు తనకన్న అన్యమైనది లేదు. అన్యమున్నచో గదా పొందవలె ననిపించుట. అంతా తానై వుండుట వలన ఆమె నిజమగు నిష్కామ. పరమశివుడు నిష్కాముడు.
శివుని నిష్కామత్వమునకు, శ్రీలలిత నిష్కామత్వమునకు పోల్చి చూచినచో ఒకవిధముగ ఆమె నిష్కామత్వమే గొప్ప దనిపించును. పరమశివు డన్నిట వుండును.
శివాని ఆయన ఆధారముగ సృష్టిని అల్లుచు, జీవులకు పరిణామము కలిగించుచు, లోకములను పాలించుచు, కోరికయను మోహమున పడకుండుట నిజమగు నిపుణత. చేయుచూ చేయక యుండుట, అల్లుచూ అల్లికయందు బంధింపబడకుండుట శ్రీదేవి గొప్పదనమేమో అనిపించును. యోగుల కామెయే సంపూర్ణమగు ఉదాహరణము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment