01-02-2023
ఒక రోజు వేటగాడొకడు అడవి పందిని బాణం వేసి కొట్టాడు. ఆ దెబ్బకది తప్పించుకొని పరుగెత్తుతూ వచ్చి సత్యవ్రతుడున్న కుటీరం దగ్గరి పొదలో దూరింది. బోయవాడు వచ్చి "అయ్యా ! సత్యవ్రతా ! మీరు అబద్ధమాడరని, నిజమే చెపుతారని అందరికీ తెలుసు. నేను ఆటవికుణ్ణి. వేట నా కులవృత్తి. ఇవాళ తిరగ్గా తిరగ్గా అడవిపంది దొరికింది. దానిని చంపి కొంతమాంసం ఇంట్లో పెళ్ళాం బిడ్డల ఆహారానికి ఉంచి మిగతాది అమ్ముకొని కుటుంబం పోషించుకోవాలి.
దానిని బాణం వేసి కొట్టాను. అది తప్పించుకొని ఇటీవచ్చింది. మావాళ్ళంతా ఆకలితో ఉన్నారు. దాన్ని చంపి తీసుకెళ్ళాలి. అది ఎక్కడో ఇక్కడే దాక్కొని ఉండాలి. నీవు చూచే ఉంటావు. దయచేసి చెపితే నేను దాన్ని చంపి తీసుకెళ్తాను" అన్నాడు.
సత్యవ్రతుడు చాలా ఇరకాటంలో పడ్డాడు. చూడలేదంటే అబద్ధమాడినట్లవుతుంది. ఇన్నేండ్ల తన సత్యవ్రతానికి భంగం. చూచాను అదుగో ! ఆ పొదలో ఉన్నదంటే వాడు దాన్ని చంపుతాడు. తనకు హత్యాపాతకం వస్తుంది. కనుక నిజం చెప్పకూడదు. కానీ అబద్ధమూ ఆడకూడదు. ఒకరోజు ఆహారం లేనంత మాత్రాన వాడి కుటుంబమేమీ మరణించదు. ఏ పండ్లో తిని ఉండవచ్చు అనుకుని ఇలా అన్నాడు.
“శ్లో|| యాపశ్యతి నసా బ్రూతే యాబ్రూతే సాన పశ్యతి
అహో ! వ్యాధ ! స్వకార్యర్థిన్ ! కిం పృచ్ఛసి పునఃపునః
ఏది చూస్తుందో (కన్ను) అది పలుకలేదు. ఏది పలుకుతుందో (నోరు) అది చూడలేదు. కార్యార్థివైన ఓ బోయవాడ ! మళ్ళీ మళ్ళీ నీవు ఎంత అడిగినా నేనేమీ చెప్పగలను?"
ఆ వేటకాడు “అయ్యా ! మీరు మాట్లాడేదేమీ నాకు అర్థం కాలేదు. సరే! లెండి ! నేవెళ్ళి వెతుక్కొంటాను” అని వెళ్ళిపోయినాడు. సత్యవ్రతుడు బోయవాడు వెళ్ళిన తర్వాత ఆలోచిస్తుంటే ఆ అడవిపంది ఆర్తితో అరచిన అరుపులో "ఐ" అనే ధ్వని వింతగా తోచింది. ఐఐ అంటూ దానినే మననం చేస్తున్నాడు.
ఉన్నట్లుండి సరస్వతీదేవి సాక్షాత్కరించి "సత్యవ్రతా ! నీ భూతదయ నాకు తృప్తి కలిగించింది. నా మంత్ర బీజాక్షరం ఐం. బిందువు లేకుండా నీవు ఉచ్చరించినా నీకు మంత్రసిద్ధిని ప్రసాదిస్తున్నాను.
నీవు మహాపండితుడవగుదువు గాక!" అని వరమిచ్చింది. సత్యవ్రతుడు పులకించిపోయినాడు. ఆమె పాదాల మీద పడి "తల్లీ ! నాజీవితం తరించింది. మరుభూమిలో నీటిని సృష్టించినట్లు మూర్యడనైన నాకు దివ్యభాగాన్ని ప్రసాదించావు, కృతజ్ఞుదనమ్మా !" అని నమస్కృతులు చేశాడు.
ఆ కథ చెపుతున్నపుడు బ్రాహ్మణునకు తాను కూడా పుత్రకామేష్టి చేస్తే సంతానం కలుగవచ్చుగదా ! అని అనిపించింది. కాని యజ్ఞం చేసే శక్తి తనకున్నదా? తాను నిరుపేద. నోటి మంచితనం వల్ల సంసారాన్ని ఎలానో నెట్టుకు వస్తున్నాడు. యజ్ఞానికి రావలసిన సంభారాలను సమకూర్చుకోవటం తనకు సాధ్యమా ? హోతలు, ఉద్గాతలు ఇంకా ఎందరో మంత్ర విదులైన బ్రాహ్మణులు కావాలి. తన ఊరిలో ఎవరూ లేరు. మహానగరానికి వెళ్లాలి. అక్కడి వారు తన మాట వింటారా? వారికి తృప్తికరంగా దక్షిణ లివ్వగల శక్తి తనకున్నదా? దక్షిణారహితమైన యజ్ఞం ఫలించదని శాస్త్రం చెపుతున్నది. కనుక యజ్ఞం తనవల్లకాదు, ఇంక ఉన్నదొకటే మార్గం.
మ
శ్లో॥ యద్దుష్కరం యద్దురాపం
యదుర్గం యచ్చ దుస్తరం
తత్సర్వం తపసా సాధ్యం
తపోహి దురతి క్రమం.
మానవ ప్రయత్నంవల్ల పురుషకారంవల్ల సాధ్యం కానిది తపస్సువల్ల సాధ్యం. అయితే తపస్సు చాలా కష్టం. అందులోనూ వయస్సుపైన బడుతున్న ఈ దశలో కఠోర తపస్సు తనవల్ల అవుతుందా ? అసాధ్యం. ఇక ఒక్కటే మార్గం ఉన్నది. ఎవరైనా సిద్ధుడైన గురువు దయతలిస్తే కోరిక తీరవచ్చు.
అయితే ఆ సద్గురువు లభించటం ఎలా ? తీర్థయాత్రలు చేస్తూ వెళ్తుంటే దివ్యక్షేత్రాలలో ఎవరైనా మహనీయులు కనపడవచ్చు. వారి కాళ్ళ పైన బడి
వేడుకొంటే కనికరించ వచ్చు. ఇలా సాగుతున్న ఆలోచనలతో భార్యతో సంప్రదించాడు. ఆమె అమాయకురాలు. భర్త ఏమి చెప్పినా కాదనదు.
తీర్థయాత్రలు చేద్దామని ఆమె కూడా కోరింది.
××××××××××××××××
02-02-2023
*ఒక బ్రిటిష్ కల్నల్ సాబ్ తన సిపాయిలతో ఎక్కడికో వెళ్తుండగా పొరపాటున చూసుకోకుండా ... నేలబారున ఉన్న నూతిలో పడిపోయారు .... వెంటనే*
*ఎలర్టయిన సైనికులు ఒక తాడు తీసుకొచ్చి కల్నల్ ని పైకి లాగుతున్నారు .... సచ్చిచెడి కల్నల్ నూతి పై అంచుకొచ్చేసరికి .... నిబంధనలు ఖచ్చితంగా పాటించే సిపాయిలు .... ఎటెన్షన్ లోకి వచ్చి ... తాడు వదిలేసి కల్నల్ కి సెల్యూట్ చేసేసరికి ... కల్నల్ మళ్ళా నూతిలో పడిపోయాడు ....*
*ఇలా ....* *మూణ్ణాలుగుసార్లు .... తాడట్టుకుని*
*కల్నల్ పైకి రావటం ... ఆయన్ని చూసిన జవాన్లు శాల్యూట్ చేసే పనిలోపడి తాడొదిలేయటం .... దొరగారు మళ్ళా నూతిలో పడిపోటం చూసిన పెద్డాయనొకడు .....* *అదికాదుగాని అబ్బాయిలు .... ఈయనకంటే SENIOR OFFICER పట్టుకురండయ్యా .... ఆయనయితే .... ఈయనగారు బైటికొచ్చినప్పుడు శాల్యూట్ సెయ్యడు .... పని జరుగుద్ది ... అనేసరికి ... ఆ ఐడియా నచ్చిన సిపాయిలు ... బ్రిగేడియర్ ని తీసుకొచ్చారు ....*
*సైనికుల* *సాయంతో బ్రిగేడియర్ ... తాడట్టుకుని కల్నల్ ని బయటకు లాగుతున్నాడు .... మొత్తానికి పై అంచుకు చేరిన కల్నల్ ... ఇంక పర్లేదు బయటకొచ్చేస్తాడు అనుకుంటుండగా .... అతను తాడు లాగుతున్న బ్రిగేడియర్ని చూశాడు ..... నిబంధనలంటే ప్రాణమిచ్చే కల్నల్ ... వెంటనే తన పై అధికారికి శాల్యూట్ చేశాడు .... ఇంకేముంది మళ్ళా ఎనక్కి నూతిలోకి పడిపోయాడు .....*
*ఇదంతా చూసి* *చిర్రెత్తిపోయిన బ్రిగేడియర్ .... ఒరే బుర్ర తక్కువ దద్దమ్మల్లారా .... వెళ్లి వాడి* *బ్యాచ్ మాట్ ఎవడైనా ఉన్నాడేమో చూసి అతణ్ణి పట్రండి .... ఆడైతే .... ఆడూ* *ఈడూ సేమ్ క్యాడర్ కాబట్టి ఈ శాల్యూట్ ల* *గోలుండదు ....అని హుకుం జారీ చేశాడు ....*
*వెంటనే* *స్పందించిన సైనికులు ....* *కల్నల్ బ్యాచ్ మేట్ ఎవర్నో వెతికి పట్టుకొచ్చి పాపం కల్నల్ని నూతి నుండి బయటకు తీసేసరికి కథ సుఖాంతం అయ్యిందనుకోండి ....*
*నీతి : ఎప్పుడూ మీ బ్యాచ్ మేట్లను క్లాస్ మేట్ లను మాత్రం మర్చిపోకండి ....
***
మన పూర్వీకులు అందించిన ఆరోగ్య సూత్రాలలో ఒకటి 'ఎంగిలి దోషం' అంటకుండా జాగ్రత్త పడటం. ఇతరులు తినగా మిగిలినది, లేదా ఇతరులు తింటున్న సమయంలో వారి దగ్గరి నుంచి తీసుకుని తినడం ఎంగిలి. ఒకరి ఎంగిలి ఇంకొకరు తినడం మహాపాపం అన్నారు.
ఎంగిలి చాలా ప్రమాదకరం, ఒకరి ఎంగిలి మరొకరు తినడం, తాగటం వలన సూక్ష్మక్రిములు వ్యాపించి అనేక రకాలైన జబ్బులు వచ్చే అవకాశం ముమ్మరంగా ఉంటుంది. ఒకే కంచంలోని ఆహారం ఇద్దరు ముగ్గురు కలిసి తినడం, ఓకే సీసాలోని నీటిని నలుగురైదుగురు ఒకరి తరువాత ఒకరు తాగటం మొదలైనవన్నీ ఎంగిలి దోషాలే.
ఇంతెందుకు ! స్వయంగా సీసాలోని నీటిని సగం తాగి పక్కన పెట్టి ఐదు నిమిషాల తర్వాత మిగిలిన సగాన్ని తాగితే కూడా ఎంగిలి దోషం అంటుతుంది, అంటే స్వంత ఎంగిలి కూడా మనకు పనికి రాదు అని అర్థం..
పెద్దలు, పూజ్యులు, గురువుల ముందుకు వెళ్ళినప్పుడు నేరుగా మాట్లాడరు. నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని మాట్లాడతారు. అది కనీసం మర్యాద. పొరపాటున కూడా పెద్దలు, గురువుల మీద మాటల సమయంలో ఉమ్ము పడకూడదు.
పసిపిల్లలకు కూడా ఎంగిలి ఆహారం పెట్టకూడదు. ఉపనయనంలో హోమం సందర్భంలో కొన్ని మంత్రాలు వస్తాయి. అందులో ఇంతకముందు నేను ఎంగిలి తినడం వలన ఏదైనా పాపం వచ్చివుంటే అది శమించుగాక అని ప్రాయాశ్చిత్తం చేయిస్తారు. ఇక ముందు తినను అని అగ్నిదేవునకు వటువుతో చెప్పిస్తారు.
ఐదువేళ్ళతో నోటిలో నమలడానికి సరిపోయేటంత ఆహారం మాత్రమే స్వీకరించాలి. నోట్లోకి ఎక్కువ ఆహారం తీసుకుని, అది నమలలేక, తిరిగి కంచంలో పెట్టడం దోషమని శాస్త్రం చెప్తుంది.
పూర్వం మన ఇళ్ళలో ఎవరి కంచాలు, చెంబులు వారికే ఉండేవి. అతిథులు వచ్చినప్పుడు, వారికి వేరే పాత్రలలో ఇచ్చేవారు. ఒక 50 ఏళ్ళ క్రితం వరకు పేదవారి ఇళ్ళలో కూడా వెండి కంచాలు, చెంబులు ఉండేవి. వెండి అనేది చాలాశాతం క్రిములను తన ఉపరితలం మీద నిలువనీయదు. అది వాటిని నశింపజేస్తుంది. ఇంకొన్ని ఇళ్ళలో అయితే వెండి కంచంలో బంగారు పువ్వు వేసి ఉండేది. అప్పుడా కంచానికి ఎంగిలి దోషం ఉండదని చెప్పేవారు. ఇప్పుడు కూడా వెండి క్రిమిసంహారకమని శాస్త్రవేత్తలు ఋజువు చేస్తున్నారు. ఇప్పుడు మీకు అర్ధమైందా మనము పూజల్లో వెండి వస్తువులకు ప్రాధాన్యం ఎందుకు ఇస్తామో ?!
వంట వండే సమయంలో సైతం మనవాళ్ళు మడి కట్టుకుని మౌనంగా ఉండటంలో ఇది కూడా ఒక కారణం. మాట్లాడితే పొరపాటున నోటి తుంపరలు వండే ఆహారంలో పడి అవి ఎంగిలి అవుతాయని భయం.
కొందరు ఈనాటికి నిత్యపూజకు మడి నీళ్ళు పడితే చాలామంది వరలక్ష్మీ వ్రతం, వినాయకచవితి మొదలైన పర్వదినాలప్పుడు, పితృకర్మలు చేసే రోజుల్లో మడి కట్టుకుని నీళ్ళు పడతారు. ఆ దైవకార్యం పూర్తయ్యేవరకు ఆ నీటిని వేరే పనులకు వాడరు, అశుభ్రంగా ముట్టుకోరు.
ఎంగిలి చేసిన అన్నాన్ని ఆవు, కుక్క, కాకి మొదలైన జీవాలకు కూడా పెట్టడం దోషమని చెప్తారు. ఆహారం (అది ఏదైనా సరే) పడేయకూడదు. అలాగని ఎంగిలి చేసి ఇతరులకు పెట్టకూడదు. ఎంతకావాలో అంతే వడ్డించుకుని తినాలి. ఆహారం వృధ చేస్తే వచ్చే జన్మలో ఆహారం దొరక్క బాధపడతారు.
ప్రస్తుత క్లిష్ట పరిస్థితిలో నోటిద్వారా తుంపరలు వ్యాపించకుండా జాగ్రత్త వహించమని ఈ ఎంగిలిదోషాన్ని నిర్వచిస్తున్నారు.
ఎంగిలి దోషం అంటని మూడు పదార్థాలు ఈ లోకంలో ఉన్నాయి.
1. చిలక కొరికిన పండు,
2. తేనెటీగ నోటిద్వారా తయారైన తేనె.
3 దూడ తాగిన తర్వాత పిండినటువంటి ఆవుపాలు. వీటిని చక్కగా దేవుని అభిషేకానికి వాడవచ్చు, మనమూ సేవించవచ్చు.
వేద సంస్కృతి వల్ల మనకు లభించిన పూర్వ ఆచారాలను మన ఆయురారోగ్య ఐశ్వర్యాభివృధ్ధి కోసం పాటిద్దాం.
సర్వే జనాః సుఖినో భవంతు .
___((()))___
🌹 ఇదీ నేటి జనరేషన్ హృదయం
----------------------------
05-02-2023
ప్రతీ శ్రీరామ
నవమి కీ గుడి దగ్గర తాటాకు పందిరికి రంగు కాగితాలు అంటించడం, , మామిడి తోరణాలు కట్టడం. కోసం. ముందు రోజు రాత్రంతా జాగారం. చేసింది మేమే. .🌾
👨👩👧👧చుట్టాలు వస్తేనే అమ్మ కోడి కూర. , వండి పెట్టిన తరం....🍁
అత్తయ్యా,
మామయ్య,. ,పిన్ని,, బాబాయ్, అక్కా ,బావ అంటూ ఆప్యాయంగా పిలుచుకున్న తరం,
స్కూలు మాష్టారు కనపడితే భయంతో పక్కనున్న సందుల్లోకి పారిపోయిన తరం... ,🌺
పుల్లల పొయ్యి మీద అన్నం/కూర ఉడుకుతున్నప్పడు వచ్చే అద్బుతమైన పరిమళాన్ని ఆస్వాదించిన తరం. వాళ్ళం..,🌱
పొయ్య మీదనుంచి. నేరుగా పళ్ళెం లోకి వచ్చిన వేడి వేడి అన్నంలో ఆవకాయ, వెన్నపూస వేసుకుని పొయ్యి దగ్గరే
తాతయ్యలు. అమ్మమ్మ/నాయనమ్మ, , అమ్మా నాన్నా, పెదనాన్న. ,, ,పెద్దమ్మ,, . పిన్ని బాబాయ్,. అత్తయ్య మామయ్య, అక్కలు చెల్లెళ్లు అన్నయ్యలు తమ్ముళ్లు అందరం ఒకే. దగ్గర చేరి మధురమై. అనుభూతితో కూర్చుని అన్నం. తిన్న తరం ..,..🦋
అమ్మమ్మలు. / నాయమ్మల చేత గోరుముద్దలు తిన్నది,. అనగనగా ఒక రాజు.... కథలు విన్నది ,🌵
నూనె పిండితో నలుగు పెట్టించుకుని కుంకుడు కాయ పులుసుతో తలంటు స్నానం చేయించు కున్న తరం...,🍀
📻రేడియో, దూరదర్శన్📺 టూరింగ్ టాకీస్📽️. కాలం చూచిన వాళ్ళం... .🍁
🎥 40 పైసల. నేల టిక్కెట్ తో నేల మీద కూర్చుని,
1. .20. రూపాయల chair టిక్కెట్ తో ,,rs 2 ticket బాల్కనీ లో కూర్చుని సినిమా చూచిందీ మేమే...🌵
స్కూల్ , కాలేజీ రోజుల్లోనే ఎలక్షన్లు చూచిన వాళ్ళం.. .🍂
అమ్మా నాన్నా తో సంవత్సరానికి ఒక సారి, పరీక్ష పాస్ అయ్యావా.. .. అని మాత్రమే అడిగించు కున్న తరం వాళ్ళం...🌹
📲🖥️🖨️
ప్రస్తుత0 ఉన్న Whatsapp Fb skype లు మీతో పాటు సమానంగా వాడేస్తున్న మాతరం...,
మేమే ఆ తరానికి ఈ తరానికి మధ్యవర్తులం...
మేమే-- -💐
అవును.......రెండు తరాల మద్యలో జరిగిన అనూహ్యమైన మార్పులకు మేమే సాక్షులం 🌸
అప్పటి గుండె లోతుల్లో నుంచి వచ్చిన ప్రేమని చూసిన వాళ్ళం,
ఇప్పుడు గుండీల g పైనుంచి వచ్చే ప్రేమని
చూస్తున్న వాళ్ళం---🌷
ఒక విధంగా చెప్పాలంటే మేం చాలా అదృష్టవంతులం...👏🙏🙏🙏🙏👍👍👍....
06-02-2023
*ఒకరోజు ఒక పూల వ్యాపారి క్షౌరం కోసం క్షౌరశాల వద్దకు వెళ్లాడు.
కట్ తర్వాత, అతను తన బిల్లు గురించి అడిగాడు, మరియు బార్బర్ ఇలా సమాధానమిచ్చాడు, 'నేను మీ నుండి డబ్బు తీసుకోలేను, నేను ఈ వారం సమాజ సేవ చేస్తున్నాను.
పూల వ్యాపారి సంతోషించి దుకాణం నుండి వెళ్లిపోయాడు.
మరుసటి రోజు ఉదయం మంగలి తన దుకాణాన్ని తెరవడానికి వెళ్లినప్పుడు, అతని కోసం ఒక 'ధన్యవాదాలు' కార్డు మరియు డజను గులాబీలు అతని కోసం వేచి ఉన్నాయి.
తరువాత, ఒక కిరాణా వ్యాపారి హెయిర్‌కట్ కోసం వచ్చాడు మరియు అతను తన బిల్లు చెల్లించడానికి ప్రయత్నించినప్పుడు, క్షౌరకుడు మళ్లీ ఇలా సమాధానమిచ్చాడు, 'నేను మీ నుండి డబ్బు తీసుకోలేను, నేను ఈ వారం సమాజ సేవ చేస్తున్నాను.
కిరాణా వ్యాపారి సంతోషించి దుకాణం నుండి వెళ్లిపోయాడు.
మరుసటి రోజు ఉదయం బార్బర్ తెరవడానికి వెళ్ళినప్పుడు, అతని కోసం ఒక 'ధన్యవాదాలు' కార్డు మరియు తాజా కూరగాయల సంచి అతని కోసం వేచి ఉంది.
*అప్పుడు ఒక రాజకీయ నాయకుడు జుట్టు కత్తిరింపు కోసం వచ్చాడు, అతను తన బిల్లు చెల్లించడానికి వెళ్ళినప్పుడు, క్షౌరకుడు మళ్లీ ఇలా సమాధానమిచ్చాడు, 'నేను మీ నుండి డబ్బు తీసుకోలేను.
నేను ఈ వారం సమాజ సేవ చేస్తున్నాను.*
రాజకీయ నాయకుడు చాలా సంతోషించి దుకాణం నుండి వెళ్లిపోయాడు.
మరుసటి రోజు ఉదయం, బార్బర్ తెరవడానికి వెళ్ళినప్పుడు,
ఒక డజను మంది రాజకీయ నాయకులు ఉచిత హెయిర్‌కట్ కోసం వేచి ఉన్నారు.
ఇది, మన దేశ పౌరులకు మరియు సమాజాన్ని నడిపే రాజకీయ నాయకులకు మధ్య ఉన్న ప్రాథమిక వ్యత్యాసాన్ని వివరిస్తుంది.
మీరు దీన్ని ఫార్వార్డ్ చేయకపోతే, ఎవరైనా మంచి నవ్వును కోల్పోతారు.
😃😃😂😝😜
*************
విద్వత్సు విమలజ్ఞానా విరక్తా యతిషు స్థితాః |
స్వీయేషు చ గరోద్గారా ననాకారః క్షితౌ ఖలా: ||
ఈ భూమిలో దుర్జనులు వివిధి రీతుల్లో కనబడతారు.విద్వాంసుల ఎదురుగా పరిశుద్ధ జ్ఞానం ఉన్నవారిలా,మునుల ముందు విరక్తిగా,అలాగే తమ దాయాదుల విషయంలో విషం కక్కేవారిలా ఉంటారు.
***
నిష్ఠ
నిజమైన భక్తులకు దేవునిపై ఉన్న భక్తిని మూఢవిశ్వాసమనవచ్చు। సరియైన మూఢవిశ్వాసం దేవుని పట్ల నిష్ఠయే-- రాత్రి పగలూ, రాత్రి పగలూ సదా ఆయన గూర్చి ఆలోచనే। ఈ విధమైన నిష్ఠ లేనిదే దేవుని కనుగొనడం అసాధ్యము। క్రియ ను క్రమం తప్పక చేస్తూ , ధ్యానంలో ఎక్కువ సమయం గడుపుతూ, దేవుణ్ణి గాఢంగా ప్రార్ధించేవారికి కోరిన నిధి లభ్యమవుతుంది।
అనంతమైన ఓర్పు, అనంతమైన పవిత్రత, అనంతమైన పట్టుదల ఇవే సత్కర్మ సఫలమవటంలోని రహస్యాలు।
***
స్వీకరించిన ఆదర్శాన్ని ఆచరించే ప్రయత్నంలో వేయిసార్లు
***
No comments:
Post a Comment