01-01-2023
*మేము అరవై లో ఇరవై। *రెండురత్నాలు, *గాజు - వజ్రం కధ, *గజదొంగను మహర్షిగా మార్చిన నారదుడు, *10 వ తరగతి పబ్లిక్ పరీక్ష, *దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు * సరళమైన తెలుగులో అర్ధాలు. మా గుంటూరు కధ
ఉభయమపి హి రక్షతేంధకారో జనయతి యశ్చ భయాని యాశ్చభీతః ౹౹
(సంగ్రహః)
దట్టమైన అరణ్యము,చీకటి రెండూ ఒకే రకమైన భయాన్ని కలిగిస్తాయి.అంతేకాదు ఈ రెండూ భయాన్ని కలుగజేసే దొంగనన్ను,భయంతో పరుగులు పెట్టే మనిషిని తమలో దాచుకుంటాయి.
" ఆంధ్రలోచెల్లనిదియ్యది యక్కజముగ
భారతమ్మునవెల్గునుభారమనక
వణిజులకుకల్గుశంకలువట్టివయ్యె
ఇప్పదికినెప్పుడందునో ' ' యిజ్జతు ' గద ??? "
--
( నాకేకలిఁగిన.. అనుభవం.. మద్రాసు నగరంలో... దీనికి చక్కని ' చెలామణి ' .. ఉన్నది.. అంతే కాకుండా.. అన్ని ప్రాంతాల్లో కలదంట..
ఆంధ్రాలోనే..' నాస్తి '..) "
*మేము అరవై లో ఇరవై।
పచ్చగా మెరిసే పండుటాకులమే గాని, చప్పుడు చేసే ఎండుటాకులం కాదు, కలలు పండినా పండకపోయినా
మేము తలలు పండిన తిమ్మరుసులం, కొరవడింది కంటి చూపు గాని మందగించలేదు, ముందు చూపు అలసిపోయింది దేహమే గాని మనసుకు లేనే లేదు, సందేహం ఎగిరి అంబరాన్ని అందుకోకున్నా ఈ భూమికి కాబోము భారం
అరవై లో ఇరవై కాకున్నా అందని ద్రాక్ష కై అర్రులు చాచం
కుందేళ్ళమై పరుగులు తీయకున్నా, తాబేళ్లమై గెలుపు బాట చూపగలం చెడుగుడు కూతల సత్తా లేకున్నా। చదరంగపు ఎత్తులు నేర్పగలం
దేహమ్ము తిత్తి గదరా తెలియంగ లేదా
దాహమ్ము ముత్తి గదరా తరుణంబు రాదా
వాహమ్ము మిత్తి గదరా పరువంబు పోదా
సోహమ్ము చిత్తి గదరా సులభంబు గాదా
సమయం ఎంతో మాకు లేకున్నా సమయమంతా మీకు సమర్పిస్తాం అనుకోకుంటే అధిక ప్రసంగం అనుభవ సారం పంచుకుంటాం వాడిపోయే పూవులమైనా సౌరభాలు వెదజల్లుతాం రాలిపోయే తారలమైనా కాంతి పుంజాలు వెదజల్లుతాం
____
02-01-2023 *రెండురత్నాలు
ఒక వ్యాపారి తాను ప్రయాణం చేయడం కోసం ఒక ఒంటెను కొనాలి అని అనుకున్నాడు.
ఒక వ్యక్తి దగ్గర బేరమాడి ఒక ఒంటెను కొనుక్కుని ఇంటికి చేరుకున్నాడు.
తన ఇంటి పనిమనిషిని పిలిచి ఆ ఒంటెను శుభ్రంగా కడగమని చెప్పాడు.
యజమాని చెప్పినట్టే ఆ పనిమనిషి ఒంటెను శుభ్రం చేస్తుంటే ఒక చిన్న సంచి కింద పడింది.
అది తీసుకెళ్లి యజమానికి ఇచ్చాడు. అతను సంచి తీసి చూడగా నవరత్నాలు ధగధగా మెరిసి పోతున్నాయి.
’ఇది వెంటనే తీసుకెళ్లి ఒంటెను అమ్మిన వ్యక్తికి ఇచ్చేయాలి!’ అన్నాడు.
ఆ పనివాడు ‘అయ్యా ఇది ఎవరికీ తెలిసే అవకామేశమే లేదు మీరే ఉంచేసుకోండి!’ అని చెప్పాడు.
’మరి ఇది నాకు కూడా తెలియకుండా నువ్వు ఉంచుకోవలసింది కదా!’ అన్నప్పుడు…
’నేను మీరు నమ్మిన బంటును అయ్యా మిమ్మల్ని మోసం చేయలేను!’ అన్నాడు.
’నువ్వే నన్ను మోసం చేయలేను అన్నప్పుడు నన్ను నాకెలా మోసం చేసుకోను?’ అన్నాడు.
’ఆ రత్నాల మూటను తీసుకెళ్లి ఒంటెను అమ్మిన వ్యక్తికి ఇచ్చాడు.
అతను సంతోషంతో స్వాగతించి ‘మీ ఈ చర్యకు నేను ఆనందంగా ఉన్నాను, మీకు కావలసినన్ని రత్నాలు తీసుకోండి!’ అన్నాడు.
’మీకు ఇచ్చే ముందే రెండు రత్నాలను నేను ఉంచుకున్నాను!’ అన్నాడు.
ఈ వ్యక్తి ఇచ్చిన సంచిలోని రత్నాలను లెక్కపెట్టాడు ఆ రత్నాల యజమాని. ‘అన్నీ రత్నాలు ఉన్నాయి ఒక్కటికూడా తగ్గలేదు!‘ అన్నాడు.
అందుకు ఇతను నా రెండు రత్నాలు ‘నా నిజాయితీ, నా ఆత్మగౌరవం అన్నాడు.
*మనిషి జీవితంలో ఎదగడానికి ఎన్నో అడ్డ దారులు....! కానీ భయ పడుతూ బతకాలి!!
నిజాయితితో సాధించినా సంపాదించినా ఆ ధైర్యమే వేరు.
శుభం
****
03-01-2023 *గాజు - వజ్రం కధ
ఒక రాజ దర్బారు నిర్వహించబడుతోంది. శీతాకాలం కావడంతో దర్బారు బహిరంగ ప్రదేశంల్లో ఏర్పాటుచేయబడింది.
పెద్దల సభ అంతా ఉదయపు నీరెండలో కూర్చుని ఉన్నారు. రాజు సింహాసనం ముందు ఒక రాచరికమైన బల్ల ఉంది, దాని మీద కొన్ని విలువైన వస్తువులు పెట్టి ఉంచారు.
పండితులు, మంత్రులు, దివానులు అందరూ అక్కడ ఉన్నారు. రాజ కుటుంబ సభ్యులు కూడా అక్కడ కూర్చుని ఉన్నారు. అంతలోనే ఓ వ్యక్తి వచ్చి లోపలికి వెళ్లేందుకు అనుమతి కోరాడు.
అతను లోపలికి ప్రవేశించి, రాజుకు నమస్కరించి ఇలా అన్నాడు, " మహారాజా! నా దగ్గర రెండు వస్తువులు ఉన్నాయి, నేను వివిధ రాజ్యాలు తిరిగి అక్కడ ప్రతీ రాజుకు వాటిని చూపించాను, కానీ ఎవరూ వాటిని సరిగ్గా పరీక్షించలేకపోయారు. అందరూ ఓడిపోయారు, నేను విజేతగా అన్నీ చోట్లకు తిరుగుతున్నాను. ఇప్పుడు నేను మీ రాజ్యానికి వచ్చాను.".
" ఏమిటవి ?", అని రాజు కుతూహలంగా అడిగాడు.
అతను ఆ రెండు వస్తువులను రాజగారి బల్ల మీద పెట్టాడు. అవి రెండూ సరిగ్గా ఒకే పరిమాణంలో, ఒకే ఆకారంలో, ఒకే రూపురేఖలతో, ఒకేలా ప్రకాశిస్తూ, అన్నీ వైపులా నుండీ, అన్నీ రకాలుగా ఒకేలా ఉన్నాయి.
రాజు వెంటనే, "ఈ రెండూ వస్తువులూ ఒకటే" అన్నాడు.
దానికి ఆ వ్యక్తి ఇలా అన్నాడు, "అవును, అవి ఒకేలా కనిపిస్తున్నాయి, కానీ అవి భిన్నంగా ఉంటాయి. వాటిలో ఒకటి చాలా విలువైన వజ్రం, మరొకటి కేవలం ఒక గాజు ముక్క.
కానీ వాటి స్వరూపం, వాటి రంగు ఒకే విధంగా ఉంటాయి; ఇప్పటి వరకు ఏది వజ్రమో, ఏది గాజు ముక్కో ఎవరూ గుర్తించలేకపోయారు... ఎవరైనా వాటిని పరీక్షించి ఇది వజ్రం అని, మరొకటి గాజు అని చెప్పవచ్చు. ఎవరైనా సరిగ్గా గుర్తించగలిగితే, నేను ఓటమిని అంగీకరించి, ఈ విలువైన వజ్రాన్ని మీ రాజ్య ఖజానాలో నిక్షిప్తం చేస్తాను.
కానీ షరతు ఏమిటంటే, ఎవరైనా దానిని గుర్తించలేకపోతే, ఈ వజ్రం విలువతో సమానమైన మొత్తాన్ని మీరు నాకు ఇవ్వాలి. నేను చాలా రాజ్యాల నుండీ ఇప్పటికి ఇలా మొత్తాన్ని గెలుపొందాను”.
" నేను దానిని పరీక్షించలేను",అన్నాడు రాజు.
దివాన్లు కూడా, "రెండూ సరిగ్గా ఒకేలా ఉన్నందున మేము కూడా ధైర్యం చేయలేం."
ఓడిపోతామనే భయంతో ఎవరూ ధైర్యం చేయలేకపోయారు. ఓడిపోయిన తర్వాత చెల్లించవలసిన డబ్బు, అంత సమస్య కాదు, ఎందుకంటే రాజు దగ్గర చాలా ధనం ఉంది. అయితే రాజుగారి పరువు పోతుందేమోనని అందరూ భయపడి, ఎవరూ గుర్తించదానికి ముందుకురాలేకపోయారు
హఠాత్తుగా, ఆ ప్రదేశానికి ఒక మూలన చిన్న అలజడి మొదలయ్యింది.
ఒక గుడ్డివాడు చేతిలో కర్ర పట్టుకుని ముందుకొచ్చాడు. "నన్ను రాజు దగ్గరకు తీసుకువెళ్ళండి. నేను ఇందాకటి నుండీ ఈ విషయాలన్నీ వింటున్నాను, అలాగే ఈ వజ్రాన్ని ఎవరూ పరీక్షించలేకపోతున్నారు. నాకు ఒక అవకాశం ఇవ్వండి", అన్నాడు.
ఒక వ్యక్తి సహాయంతో రాజు వద్దకు చేరుకుని, రాజును ఇలా అభ్యర్థించాడు, "నేను పుట్టుకతో అంధుడిని, అయితే దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి, తద్వారా నేను కూడా నా తెలివితేటలను ఒకసారి పరీక్షించుకోవచ్చు. బహుశా నేను విజయం సాధించవచ్చునేమో .... ఒకవేళ నేను విజయం సాధించలేకపోయినా, మీరు ఎలాగూ పందెం ఓడిపోతున్నారు కాబట్టి అంతకుమించి వేరే కోల్పోయేదేమి ఉండదు."
అతని మాటలు రాజుకి అర్ధం అయ్యి ఒక అవకాశం ఇచ్చినందువల్ల నష్టం లేదని భావించాడు. రాజు తన ఆమోదం తెలుపుతూ, “సరే” అన్నాడు.
ఆ తర్వాత ఆ వృద్దుడికి ఆ రెండు వస్తువులను తాకించి, వీటిలో ఏది నిజమైన వజ్రం, ఏది గాజుముక్క అని అడిగారు.
ఒక్క క్షణంలో, ఆ వ్యక్తి, 'ఇది విలువైన వజ్రం, ఆ రెండవది కేవలం గాజుముక్క!' అని చెప్పాడు.
అన్నీ రాజ్యాలలో గెలిచి వచ్చిన వ్యక్తి నమస్కరించి, "అది నిజమే, నువ్వు బాగా గుర్తించావు.. నువ్వు చాలా గొప్పవాడివి...ఇచ్చిన మాట ప్రకారం ఈ వజ్రాన్ని నీ రాజ్య ఖజానాకి ఇచ్చేస్తున్నాను", అన్నాడు*.
అందరూ చాలా సంతోషించారు. వచ్చిన వ్యక్తి కూడా వజ్రాల నిజమైన నాణ్యతను గుర్తించేవారు కనీసం ఒకరైనా ఉన్నారని చాలా సంతోషించాడు.
వచ్చిన వ్యక్తి , రాజు, ఇతర ప్రజలందరూ ఒకే ఉత్సుకతను వ్యక్తం చేస్తూ, ఆ అంధుడిని ఇలా అడిగారు, "నీవు కనీసం చూడలేవు కదా, ఇది వజ్రం, ఇంకోటి గాజు అని ఎలా గుర్తించావు?"
అంధుడైన ఆ వృద్ధుడు ఇలా అన్నాడు, "అది చాలా తేలిక, ప్రభూ, మనమంతా ఇందాకటి నుండీ ఎండలో కూర్చుని ఉన్నాం. అలాగే ఈ రెండూ కూడా చాలాసేపటి నుండి ఎండలో ఉంచబడ్డాయి. రెండింటినీ ముట్టుకున్నాను. చల్లగా ఉన్నది నిజమైన వజ్రం. .. *వేడెక్కింది గాజు... అంతే."
జీవితంలో కూడా, ప్రతి చిన్న విషయానికి వేడెక్కిపోయినవారు, చిక్కుబడిపోతారు, బంధింపబడిపోతారు ... ఆ వ్యక్తులు"గాజు" వంటివారు. ప్రతికూల పరిస్థితులలో కూడా చల్లగా (శాంతంగా, స్థిరంగా) ఉండేవాడు ... ఆ వ్యక్తి మాత్రమే "విలువైన వజ్రం"లాంటివారు.
మనం ఎలా ఉండాలో ఈ కథ ద్వారా తెలుసుకున్నాం.
మనం కూడా వజ్రంలా తయారవుదాం.
శుభోదయం
----
04-01-2023 *గజదొంగను మహర్షిగా మార్చిన నారదుడు
ఒకానొకప్పుడు రత్నాకరుడు అనే గజదొంగ ఉండేవాడు. ఒక అరణ్య మార్గాన్ని స్థావరంగా ఎంచుకుని దారిదోపిడీలనే వృత్తిగా చేసుకుని జీవించేవాడు. అడవి దారిలో ప్రయాణించే బాటసారులను నిర్దాక్షిణ్యంగా చంపేసి, వారి వద్ద ఉన్న డబ్బు, విలువైన వస్తువులను దోచుకునేవాడు. రత్నాకరుడి పేరు చెబితేనే ప్రజలు భయంతో వణికిపోయేవారు. ఒంటరిగా అడవి దారిలో వెళ్లడానికి ఎవరూ సాహసించేవారు కాదు.ఒకనాడు నారద మహాముని ఆ అడవి మార్గం మీదుగా వెళుతుండగా, రత్నాకరుడు ఆయనను అడ్డగించాడు. డబ్బు దస్కం ఏమేమి ఉన్నాయో బయటకు తీయమని గద్దించాడు.నారద మహాముని అతడి మాటలకు ఏమాత్రం బెదిరిపోలేదు. ప్రశాంతంగా అతడి వైపు చూసి...ఎందుకిలా దారికాచి ప్రజలను దోచుకుంటూ అమాయకుల ప్రాణాలు తీస్తున్నావు?’ అని ప్రశ్నించాడు. ‘నా కుటుంబాన్ని పోషించుకోవడానికే ఇలా దోపిడీలకు పాల్పడుతున్నాను.’ అని బదులిచ్చాడు.నీ కుటుంబంలో ఎవరెవరు ఉంటారు?’ అడిగాడు నారద మహాముని.నేను, నా భార్య, నా కొడుకు... ఇంకా వయసుమళ్లిన నా తల్లిదండ్రులు... వాళ్లందరి బాగోగులు నేనే చూసుకోవాలి’ బదులిచ్చాడు రత్నాకరుడు.వాళ్లందరి బాగోగులు చూసుకోవడం కచ్చితంగా నీ బాధ్యతే! అయితే, అందుకోసం అమాయకులను చంపి దోచుకోవడం పాపం కదా! ఇందుకు నరకంలో శిక్షలు తప్పవు. నీ కుటుంబంలో ఎవరైనా నీ పాపాలకు నరకంలో శిక్షలు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారేమో కనుక్కో’ అన్నాడు నారద మహాముని.సరే... నా ఇంట్లో వాళ్లను కనుక్కుంటాను’ అని బయలుదేరడానికి రత్నాకరుడు సిద్ధపడ్డాడు. అయితే, తాను తిరిగి వచ్చేలోగా నారద మహాముని ఎక్కడికైనా పారిపోతాడేమోనని భావించి, ఆయనను ఒక చెట్టుకు కట్టేశాడు. నేరుగా ఇంటికి వెళ్లాడు.నిన్ను పెళ్లి చేసుకున్నాక... నిన్ను బాగా చూసుకోవడానికి దారిదోపిడీలు చేస్తున్నాను. నన్ను ఎదిరించిన అమాయకులను చంపేస్తున్నాను. ఈ పాపాలకు నరకంలో నాకు శిక్షలు తప్పవు. నా బదులుగా నువ్వు నరకంలో శిక్షలు అనుభవిస్తావా..?’ అని భార్యను అడిగాడు.నన్ను పోషించడం భర్తగా నీ ధర్మం. అందుకు నువ్వు ఏ పాపం చేసినా ఫలితం నువ్వు అనుభవించాల్సిందే’ తేల్చి చెప్పింది భార్య.తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లాడు... ‘వృద్ధులైన మిమ్మల్ని పోషించడానికి దారిదోపిడీలు, హత్యలు చేస్తున్నాను. నా పాపాలకు నరకంలో శిక్షలు ఉంటాయి. మీ కోసమే ఇవన్నీ చేస్తున్నాను కదా..! నా పాపాలకు మీరు నరకంలో శిక్షలు అనుభవించడానికి సిద్ధపడతారా?’ అని అడిగాడు.నిన్ను కన్న తర్వాత నిన్ను పెంచి పెద్ద చేయడానికి నానా కష్టాలు పడ్డాం. ఇప్పుడు వయసు మళ్లిన దశలో కాటికి కాళ్లు చాచుకుని ఉన్నాం. ఈ దశలో మమ్మల్ని చూసుకోవాల్సింది నువ్వే. నీ పాప పుణ్యాల ఫలితం నువ్వే అనుభవించాలి గానీ, మేమెలా అనుభవిస్తాం’ అన్నారు.చివరిగా కొడుకును అడిగాడు. ‘నిన్ను పెంచి పెద్దచేయడానికి దోపిడీలు, హత్యలు చేస్తున్నాను. నరకంలో నా బదులుగా శిక్షలు అనుభవించడానికి నువ్వు సిద్ధమేనా?’ససేమిరా అనేశాడు కొడుకు. ‘నన్ను కన్నందుకు పెంచి పోషించాల్సిన బాధ్యత తండ్రిగా నీపై ఉంది. నీ పాప పుణ్యాలతో నాకేమీ సంబంధం లేదు. వాటి ఫలితాన్ని నువ్వు స్వయంగా అనుభవించాల్సిందే’ అన్నాడు.అప్పుడు జ్ఞానోదయమైంది రత్నాకరుడికి. హుటాహుటిన అడవికి చేరుకుని, చెట్టుకు కట్టేసి ఉన్న నారద మహామునిని బంధ విముక్తుడిని చేశాడు. ఆయన కాళ్లపై పడి తనను క్షమించమని వేడుకున్నాడు. తన పాపాలకు ప్రాయశ్చిత్తం చెప్పమన్నాడు.భగవన్నామ స్మరణతోనే పాపాలు నశిస్తాయని, ఇక నుంచి మంచిగా బతకమని సెలవిస్తాడు నారద మహాముని. ఇక అప్పటి నుంచి రత్నాకరుడు దైవధ్యానంలో మునిగి మహర్షిగా మారాడు. ఆయనే వాల్మీకి మహర్షి.
____
05-01-2023 *10 వ తరగతి పబ్లిక్ పరీక్షల ' మూల్యాంకనం ' లో అధికమార్కులు వేస్తే నష్టం ఏమిటి ?
పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో , విద్యార్థులు జవాబు పత్రాలలో జవాబులు అసలు వ్రాయకపోయినా / కొద్దిగా వ్రాసినా , తప్పులు వ్రాసినా valuation లో అధిక మార్కులు వేస్తున్నారు. దీనిని Grade Inflation / Inflation of Marks అంటారు . ( తెలుగు లో దీనిని మార్కుల ఉల్బణం / మార్కుల వాపు అని అనవచ్చు ).
దేశ ఆర్థికవ్యవస్థ ను ద్రవ్యోల్బణం ఎలా నాశనం చేస్తుందో , పేద - మధ్యతరగతి - సామాన్యుల జీవితాలను ద్రవ్యోల్బణం ఎలా అతలాకుతలం చేస్తుందో ; అంతకన్నా " పదింతలు " విద్యావ్యవస్థ లో ఉన్న Inflation of Marks వలన విద్యార్థుల మరియు దేశ భవిష్యత్తు నాశనమవుతున్నది.
Inflation of Marks వలన దేశ ఆర్థిక రంగం పై ప్రభావం ఏమిటి ? జీడీపీ ఎలా పతనం అవుతుంది ? పెట్టుబడుల పై దీని ప్రభావం ఎంత ? Knowledge Based Economy లో ఆర్థిక వ్యవస్థకు నిజమైన చోదకశక్తులు అయిన " సృజనాత్మకత మరియు Self Initiation " ను ఈ అధిక మార్కులు ఎలా చంపేస్తున్నాయి ? ఈ ఉచిత మార్కులు ( అధిక మార్కులు వేయటం ) విద్యార్థుల ఆలోచనా విధానాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి ? రాష్ట్రం లోని యువత లో కష్టపడేతత్వాన్ని , పని సంస్కృతి ని దెబ్బతీయడం లో సామాజిక మాధ్యమాల కన్నా , ఉచిత మార్కుల పథకం ఎలా ప్రధాన కారణం అయ్యింది ? "
అనే పై సంక్లిష్టమైన అంశాల విశ్లేషణ లోకి వెళ్లకుండా .... సులభంగా అందరికీ అర్థం అవ్వటం కోసం " రెండు యదార్ధ సంఘటనలను ఉదాహరణలుగా తీసుకొని వివరిస్తాను ".
***********
1. 2017-18 లలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు , ఇంజనీరింగ్ విద్యార్థుల సమూహం తో జరిపిన ఒక బహిరంగ సమావేశం లో, ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని ఈ విధంగా మాట్లాడింది
" నమస్తే జగనన్న ! నా పేరు ..... , ..... కాలేజ్ లో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను. అన్నా! ఎంతో మంది గొప్ప గొప్ప సివిల్ ఇంజనీర్లు , ఆర్కిటెక్ట్ లు ఉన్న దేశమన్నా మనది. అటువంటిది, మన వాళ్ళను కాదని రాజధాని నిర్మాణం ఎక్కడో ఉన్న సింగపూర్ కి అప్పగించారు. మళ్లీ ఇప్పుడేమో రాజమౌళి అంటున్నాడు! సినిమాల కోసం టెంపరరీ సెట్లు వేస్తాడు - తీస్తాడు రాజమౌళి . అన్నా ! చంద్రబాబు కూడా ఓట్ల కోసం ఏమన్నా టెంపరరీ రాజధాని కడదామని అని ఆలోచిస్తున్నాడా అన్న ! నాకు మాత్రం చాలా భయంగా ఉందన్న!
నాలాంటి వేల మంది సివిల్ ఇంజనీర్లు ఇక్కడ ఏమి చేయాలన్నా !
అప్పట్లో ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో చాలా కాలం చక్కర్లు కొట్టింది . ఆత్మవిశ్వాసం తో మాట్లాడిన ఆ అమ్మాయి వీడియో చూసిన మేధావులు కరక్టే కదా! అని అడిగారు . సామాన్యులు , మధ్యతరగతి వారు కూడా అదే భావన !
కొంతమంది అయితే " ఒకప్పుడు విద్యార్థులు ఆడతా పాడతా చదివేవారు. అందుకని అప్పుడు మార్కులు సరిగా వచ్చేవి కాదు ... ఇప్పుడు విద్యార్థులు ఎంతో కష్టపడుతున్నారు . అందుకనే వేల మందికి , ఇంజనీరింగ్ లో 80% పైగా మార్కులు వస్తున్నాయి. కొద్దిమంది అయితే " మైకు పట్టుకొని మాట్లాడిన ఆ అమ్మాయి ఆత్మవిశ్వాసం చూసి , ఆ అమ్మాయి లో ఇంజనీరింగ్ లో ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందిన తెలుగు తేజాలు అయిన శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు , శ్రీ కె. ఎల్. రావు గార్లను మించిన ప్రతిభ ఉందేమో !! అని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. నిజానికి ఆ అమ్మాయి కూడా తన తెలివితేటలు , తన నైపుణ్యం అంతర్జాతీయ స్థాయి అని నమ్మింది! .
వాస్తవం :- ఆ అమ్మాయి ఇప్పుడు గ్రామ వాలంటీర్ గా పనిచేస్తుంది. పాఠశాల స్థాయి నుండి ఇంగ్లీష్ మీడియం చదివిన ఈ సివిల్ ఇంజనీర్( B.tech ) , గడచిన రెండు - మూడు సంవత్సరాలుగా " గ్రామ/ వార్డ్ వాలంటీర్ " గా పనిచేయడం ఏమిటి ?
తనకు వచ్చిన మార్కుల వాపు ( inflated marks ) చూసి , ఆ ఆమ్మాయి కూడా తనలో ఆ స్థాయి నైపుణ్యం ఉందని నమ్మింది . కానీ వాస్తవం వేరు .
**********
06-01-2023 *దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు
1. బియ్యాన్ని దానం చేస్తే – పాపాలు తొలుగుతాయి.
2. వె౦డిని దానం చేస్తే – మనశ్మా౦తి కలుగుతుంది.
3. బ౦గారం దానం చేస్తే – దోషలు తొలుగుతాయి.
4. ప౦డ్లను దానం చేస్తే – బుద్ధి. సిద్ధి కలుగుతాయి.
5. పెరుగు దానం చేస్తే – ఇ౦ద్రియ నిగ్రహ౦కలుగుతుంది.
6. నెయ్యి దానం చేస్తే – రోగాలు పోతాయి. ఆరోగ్య౦గా ఉ౦టారు.
7. పాలు దానం చేస్తే – నిద్ర లేమిఉండదు.
8. తేనె దానం చేస్తే – స౦తానంకలుగుతుంది.
9. ఊసిరి కాయలు దానం చేస్తే – మతిమరుపు పోయి, జ్ఞాపకశక్తీ పెరుగుతు౦ది.
10. టె౦కాయ దానం చేస్తే – అనుకున్న కార్య౦సిద్ధిస్తు౦ది.
11. దీపాలు దానం చేస్తే – క౦టి చూపు మెరుగు పడుతుంది.
12. గోదానం చేస్తే – ఋణ విముక్తులౌతారు ఋషుల ఆశీస్సులు లభిస్తాయి.
13. భూమిని దానం చేస్తే – బ్రహ్మలోకదర్శనం లభిస్తుంది
14. వస్త్రదానం చేస్తే – ఆయుష్షు పెరుగుతు౦ది.
15. అన్న దానం చేస్తే – పెదరికంపోయి, ధనవృద్ధి కలుగుతుంది.
పైవన్నీమన వేదాల్లో చెప్పినవే…
వీటిలో మీకు సాధ్యపడేది ఒక్కటైన చేయ్యమని అర్థం. చేసే సహాయం చిన్నదైనా సరే మనస్తూర్తిగా, శ్రద్ధగా చేస్తే ఫలితం అధికంగా కలదు.
---
07-01-2023
*మీకు తెలుగు భాష పై ఎంత పట్టు ఉందో తెలుసుకోండి..!!!*
👍కింది పదాలకు సరళమైన తెలుగులో అర్ధాలు చెప్పగలరా!!?.
1.పిపీలికము =
2. మశికము =
3. మార్జాలము =
4. శునకము =
5. వృషభము =
6. మహిషము =
7. శార్దూలము =
8.మత్తేభము =
9.మకరము =
10.మర్కటము =
11. వాయసము =
12. మూషికము =
13.జంబుకము =
14. వృకము =
15.తురగము =
16. గార్ధభము =
17. వరాహము =
18.పన్నగము =
19. కుక్కుటము =
20. బకము =
21. ఉష్ట్రము =
22. శుకము =
23. పికము =
24.శలభము =
25. కీటకము =
26. మత్స్యము =
27. హరిణము =
28. మత్కుణము =
29. మయూరము =
30.కూర్మము =
31. మకుటము =
32. మకరందము =
33. వానరము =
34. వావురము =
35. ఉరగము =
*కనీసం 25 చెప్పగలిగితే పాస్...
*30 chepte good total chepte great
1.Chima(ant) చీమ , 2.dhoma(mosquito)దోమ ,
3.pilli(cat), పిల్లి 4.kukka(dog), కుక్క 5.edhdhu(ox),
6.dhunnapothu,7.puli(tiger),8.enugu(elephant),9.mosali(crocodile), 10.kothi(monkey) ,11.kaki(crow),12.eluka(rat), 13.nakka(fox), 14.thodelu(wolf),15.gurram(horse), 16.gadidha(donkey),17.pandhi(pig),18.paamu(snake), 19.kodipunju(rooster),20.konga(crane),21.onte(camel), 22.ramachiluka(parrot),23.koyila(koila),24.enugu(elephant),25.purugu(insect), 26.chepa(fish),27.jinka(deer),28.nalli(bedbug),29.nemali(peacock), 30.thabelu(tortoise),31.kireetamu(crown👑),32.thene(honey), 33.kothi(monkey),34.kaaki(crow), 35.paamu(snake)
నేతి నేతీతి వాక్యేన శేషితం యత్పరంపదమ్!
పరిత్యక్తు మశక్తత్వా త్తదస్మీతి సుఖీభవ!!
తా:- "ఇది కాదు", "ఇది కాదు" మున్నగు వాక్యములద్వారా వస్తువు లన్నిటిని తొలగించి వేసినచో తొలగించుటకు వీలుకాని ఏ పరమాత్మ వస్తువు శేషించునో అదియే నీవని భావించి సుఖముగ యుండుము.
వ్యాఖ్యానము:- ఆత్మ నెరుగుట ఎట్లో ఇట సులభోపాయము తెలుపబడినది. ఆత్మ కానట్టి వస్తువులన్నిటిని “ఇది కాదు, ఇది కాదు” అని తొలగించి వేసినచో తుదకు ఆత్మ మిగులును. అపుడు అదియే తానని భావించి సుఖముగా యుండవలెను.
ప్రప్రథమమున అనాత్మ వస్తువులన్నిటిని తొలగించి వేయవలెను. శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిదాభాసుడు, పంచమహాభూతములు ఇవన్నియు అనాత్మ స్వరూపములు. వీటికి సాక్షిగా యున్న ఆత్మయే తాను. అవియే తన యొక్క నిజస్వరూపము.
కాని జడమైన పైన తెలిపిన వస్తువులు కాదు. ఇట్లు ఆత్మ విచారణ చేసి క్షేత్రక్షేత్రజ్ఞ విభాగము గావించవలెను. భగవద్గీత 13వ అధ్యాయములో ఈ విషయమును గూర్చి విపులముగా చెప్పబడినది.
ఓం ఓం సోఽహం, సోఽహం, శివోఽహం, శివోఽహం, చిదానందరూప శ్శివోఽహం శివోఽహం!
***
* బ్రాహ్మణుల పేర్ల చివర ఉండే సంభోదాలు, ప్రాంతీయంగా ఉండే వాటి వివరణ
**********
శర్మ - SHARMA
శాస్త్రి - SASTRI
సోమయాజులు - SOMAYAJUL
దేశ్ ముఖ్ - DESH MHUK,
దేశ్ పాండె.- DESHPANDEY.
కులకర్ణి - KULKARNI
జ్యోషి - JYOSHI
బెహరా - BEHARA
ఆచార్యులు - ACHARYA
#రాజస్థాన్_RAJASTHAN
********
తివారీ -THIVARI
బెంగాల్ - BENGAL
బెనర్జి - BANARJEE
భట్టాచార్య - BHATTACHARYA
ఛటర్జీ - CHATTERJEE
గంగూలి - GANGULI
ముఖర్జీ - MUKHERJEE
#బీహార్_BIHAR
*****
ఝా - JHA
మిశ్రా - MISHRA
#గుజరాత్_GUJARAT
********
భట్నాగర్ - BHATNAGAR
పాండ్య - PANDYA
త్రివేది - TRIVEDI
తివారి - TIWARI
#జమ్ము_కాశ్మీర్_JAMMU&KASHMIR*
**********
కర్ - KAR
పండిత్ - PANDIT
శర్మ - SHARMA
#కర్నాటక_karnataka
********
ఆడిగ - ADIGA
ఐథల్ - AITHAL
భట్ - BHAT
దేశ్ పాండె - DESHPANDE
హెబ్బార్ - HEBBAR
అయ్యర్ - IYER
అయ్యంగార్ - IYENGAR
కరంథ్ - KARANTH
సోమయాజులు - SOMAYAJI
శర్మ - SHARMA
శాస్త్రి - SHASTRI
బింద్రె - BENDRE
#కేరళ_KERALA
*****
నంబూద్రి - NAMBOODARI
#మహారాష్ట్ర_MAHARASTRA
**********
అథవాలె - ATHAVALE
భట్ - BHAT
భావే - BHAVE
దతర్ - DATAR
దాతయ్ - DATEY
దేశ్ పాండె - DESHPANDE,
దేష్ ముఖ్ - DESH MHUK,
దీక్షిత్ - DIXIT
గోఖలే - GOKHALE
జోషి - JOSHI
పండిత్ - PANDIT
పట్వర్దన్ - PATWARDHAN
కులకర్ణి - KULKARNI,
#ఒడిషా_ODISHA
*******
కనుంగొ - KANUNGO
కర్ - KAR
మిశ్రా - MISHRA
సత్పతి - SATPATI
#పంజాబ్_PUNJAB
******
శర్మ - SHARMA
#రాజస్థాన్_rajasthan
********
శర్మ SHARMA
వ్యాస్ VYAS
#తమిళనాడుTAMILNADU
*********
అయ్యర్ - IYER
అయ్యంగార్ - IYENGAR
#ఉత్తరప్రదేశ్_UTTAR_PRADESH
**********
చతుర్వేది - CHATURVEDI
ద్వివేది - DWIVEDI
జోషి - JOSHI
మిశ్రా - MISHRA
శర్మ - SHARMA
త్రిపాఠి - TRIPATHI
వాజపేయి - VAJAPAYEE
ఇవి ఎక్కువగా అందరి నోళ్ళల్లో నిత్యం మెదిలేవీ మాత్రమే ఇక్కడ అందించానని భావించకండి. ఇంకా ఎన్నో ఇంటిపేర్లతో కూడినవి కూడా ఉన్నాయి... అవి👇
Trivedi, Dubey, Chaubey, Tripathi, Tiwari,, Joshi, Pandey, Shukla, Deekshit, Pathak, Agnihotri, Tyagi, Ojha, Bharadwaj, Sharma, Dutt, Kaul, Mattoo, Haksar / Hak, Tikkoo, Labroo, Bindroo, Raina, Razdan, Vyas, Bhat/Bhatt, Desai, Apte, Gokhale, Ranade, Lele, Nene, Kulkarni, Chitale, Vaidya, Deshpande, Mukherjee, Banerjee, Chatterjee, Ganguly, Bhattacharjee, Chakrabarti, Sanyal, Lahiri, Bagchi, Bhaduri, Maitra, Ray Chaudhuri, Ghoshal, Tagore/ Thakur, Rath, Kar, Dash, Mahapatra, Satapathy, Acharya, Panda, Goswami, Borthakur, Barua, Gayen, Iyer, Iyengar, Shastry, Chari, Adiga, Joshi, Kulkarni, Hegde, Desai, Shenoy, Bhat, Pai, Prabhu, Kamath, Benegal, Shanbhag, Shirali, Padukone, Dixitulu, Bhattu ..లాంటివి.
వాటి పుట్టు పూర్వోత్తరాలు:
ఒకతను పాట్నాలో వేదం-వల్లె వేస్తున్న పిల్లల్ని గమనిస్తూ అక్కడ ఉన్న గురువుగారైన సదానంద్ ద్వివేది గారిని "ఎందుకండీ ఇలా బట్టీ పట్టిస్తున్నారు? చేతికి పుస్తకం ఇస్తే... చూసి జాగ్రత్తగా చదువుతారు కదా! అని అడిగితే....
దానికి ఆయనిచ్చిన సమాధానం..
"నలంద, తక్షశిల,విక్రమశిల విశ్వవిద్యాలయాలలో ఉన్న అమూల్యమైన గ్రంధాలను భక్తియార్ ఖిల్జీ అనే ఉన్మాదుడైన మహమ్మదీయ రాజు కాలంలో కాల్చి వేయ్యబడ్డాయి - తరువాతి కాలంలో మళ్ళి ఆ వేదం విద్యనూ గ్రంధాలను తిరిగి రాయడానికి ప్రయత్నం చేసిన ఎంతో మంది భారతీయ విద్యావేత్తలను అత్యంత క్రూరంగా హింసించి చంపేయ్యడం జరిగింది!
ఇది ముందే గమనించిన మనవిద్యావేత్తలు వేదాన్ని ఏనాటి నుండో... కంఠస్థం చెయ్యడం అలాగే మరికొంత మందికి కంఠోపాఠంగా నేర్పడం మొదలుపెట్టారు - అలా చాలావరకు వేదాధ్యయనం ముఖతము గానే కొనసాగింది, అందువల్లే వేదాన్ని కంఠస్థం చెయ్యడం అలవాటుగా మారింది.
★4 వేదాలు నోటికి వచ్చిన వారిని చతుర్వేది, అని
★3 వేదాలు వచ్చినవారిని త్రివేది, అని
★2 వేదాలు వచ్చినవారిని ద్వివేది, అని
★1 వేదం నేర్చినవారిని ఉపాధ్యాయ, అని
★శాస్త్రాలు తెలిసినవాడిని శాస్త్రి, అని
★మిశ్రమంగా కొన్ని విషయాలు నేర్చుకున్న వాడిని మిశ్రా, అని
★శాస్త్రీయ కర్మ, విధి విధానాలను నేర్చిన వాడిని శర్మ, అని .... ఇలా రకరకాలుగా విభజించి నేర్పించడం జరిగింది!
"మరి.. ఇప్పుడు రాయచ్చు కదండీ.. ఇప్పుడు మనం స్వతంత్రులం కదా?" అని అడిగారు.
ఆయన నవ్వేసి.."ఎవరు చెప్పారు మనం స్వతంత్రులమని? గత 70 ఏళ్లుగా గమనిస్తున్నాను.. ఒక్కడంటే ఒక్క మంత్రి లేదా ప్రభుత్వ అధికారి ఈ వేదాలను తిరిగి రాయించడం మీద దృష్టి పెట్టనేలేదు! ఇప్పటికీ మనం మొఘల్ రాజుల పాలనలోనే ఉన్నాం - హిందుమత గ్రంధాలను అవహేళన చేస్తూనే... ఇతర మతగ్రంధాలకు ఎనలేని గౌరవం ఇస్తున్నాం!
దీనర్థం—ఇతరులకు ఇంకా భయపడుతున్నట్లే కదా!" అన్నారు.
ఇక బ్రాహ్మణుల పుట్టుపూర్వోత్తరాలు ఎలా ఉన్నా... వేదాలను, శాస్త్రాలను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిదీ.... ఇప్పటికీ మనం ఎన్నో గ్రంథాలను దక్కించుకోలేకపోయాము🙏🏽🇮🇳😢
సేకరణ:-
🕉#శుభమస్తు🕉
లోకా సమస్తా సుఖినోభవంత్
❤🙏❤🙏❤🙏❤