హోబిలం నరసింహస్వామి
ఆంధ్ర దేశం లోని అత్యంత ప్రాచీనమైన నారసింహ క్షేత్రాల్లో మిక్కిలి ప్రాచుర్యాన్ని పొందిన నవ నారసింహ క్షేత్రం అహోబిలం. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుండి 25 కి.మీ ల దూరంలోను, నంద్యాల నుండి 65 కి.మీ, దూరంలోను నల్లమల అడవుల్లో ప్ర కృతి రామణీయకత మధ్య వెలసిన నరసింహుని దివ్య ధామమిది.
ఎగువ అహోబిల రాజ గోపురం స్థలపురాణం:: ఇందుగల డందు లేడని సందేహము వలదని, హితవు పలికి – చక్రి సర్వోప గతుండని ప్రకటించిన ప్రహ్లాదుని విశ్వాసాన్ని నిజం చేసి, ఆస్తికత్వాన్ని సజీవంగా ఉంచడానకి, స్ధంభం నుండి ఆవిర్భవించి హిరణ్య కశిపుని మట్టుపెట్టిన ఉగ్ర నరసింహుడు కొలువు దీరిన ప్రదేశమిది. ఇచ్చట హిరణ్యకశిపుని గోళ్ల తోచీల్చి సంహరించిన సమయం లో స్వామిని దర్శించిన ఇంద్రాది దేవతలు —-
“అహోవీర్య అహోశౌర్య అహోబహుపరాక్రమః !
నారసింహ పరః దైవం ఆహోబిలః ఆహోబిలః !!”
అని కీర్తించారట. అప్పటి నుంచి ఈ క్షేత్రం” అహోబలం “అని పిలువబడుతోందని స్ధల పురాణం. ఎగువ అహోబిలం లోని గుహ లో స్వయం భువు గా వెలసిన ఉగ్ర నర సింహు ని ఆరాధించి సాక్షాత్కరింపజేసుకొని దివ్యాను భూతికి లో నైన గరుడుడు స్వామి కొలువు తీరిన గుహను చూసి అహో! బిలం , అన్నాడట. ఆనాటి నుండి ఈ పుణ్యక్షేత్రాన్ని అహోబిలమని పిలుస్తున్నారని ఒక ఐతిహ్యం. హిరణ్య కశిపుని సంహరించిన అనంతరం ఇంకా చల్లారని ప్రతాపం తో నరసింహుడు అరణ్యం లో గర్జిస్తూ, క్ష్వేళిస్తూ,పలు ప్రదేశాల్లో సంచరించాడని, అలా సంచరిస్తున్నప్పుడు ఆయన లో విరిసిన వివిధ భావాలకు రూపాలే నవ నారసింహ రూపాలని భావించబడుతోంది.
ఎగువ అహోబిలం స్వామి వారి కళ్యణ మండపం::
వీర రసావతారరూపుడైన తన నాధుని శాంతింప జేయడానికి శ్రీ మహాలక్ష్మి చెంచు లక్ష్మి గా అవతరించి స్వామిని ప్రసన్నుని చేసుకోవడానికి చాల శ్రమించ వలసి వచ్చింది. ఆ సమయం లో ఆ చెంచెతకు స్వామి నవరూపాల్లో దర్శనమిచ్చి, అలరించారని, ఆరూపాలే నవ నారసింహులు గా వెలసి స్వామి ఇప్పుడు భక్తులను అను గ్రహిస్తున్నాడని భక్తులు సంతోష పారవశ్యం తో చెంచులక్ష్మీ నరసింహుల కథలను చెప్పు కుంటుంటారు. జానపద గీతాలు పాడుకుంటుంటారు. ఇచ్చటి గిరిజనులు చెంచెతను మహాలక్ష్మి గా పూజిస్తూ, లక్ష్మీనరసింహ కళ్యాణాన్ని చాల గొప్పగా జరిపిస్తారు.
రాజగోపుర దృశ్యం::
నరసింహుడు హిరణ్యకశిపుని సంహరణానంతరం అరణ్యం లో సంచరిస్తూ భక్తులను అనుగ్రహించడానకే స్వామి నవరూపాల్లో దర్శనమిచ్చాడు. మరొక కథ ను అనుసరించి గరుత్మంతుడు విష్ణువు ను నరసింహ రూపుని గా దర్శన మీయ వేడుకున్నాడు. ఆనాడు గరుడునికి స్వామి సాక్షాత్కరించిన తొమ్మిది రూపాలే నవ నారసింహ రూపాలు. అందుకే ఈ పర్వతాన్ని గరుడాద్రి అని,గరుడాచలం అని, గరుడశైలం అని కూడ పిలుస్తారట.
“జ్వాలాహోబిల మాలోల క్రోండ గరంజ్ భార్గవ !
యోగానంద చత్రవట పావన నవమూర్తయః !!”
జ్వాల, అహోబిల,మాలోల, క్రోడ,కరంజ, భార్గవ, యోగానంద, ఛత్రవట, పావన నార సింహ అను తొమ్మిది రూపాలు గా స్వామి అహోబిలం మీద కొలువు తీరి ఉన్నాడు. ఎగువ అహోబిలం లో ఉగ్రనరసింహుడు కొలువు తీరగా. దిగువ అహోబిలం లో లక్ష్మీనరసింహుడు శాంత మూర్తి యై భక్తులను అనుగ్రహిస్తున్నారు. చుట్టూ 5 కి.మీ పరిధి లో మిగిలిన ఆలయాలను కూడ మనం దర్శించవచ్చు. నవరూపులుగా వెలసిన ఈ దివ్య మూర్తులను దర్శించడం వలన వాని ఫలితాలు కూడ వేరు వేరు గా ఉంటాయని స్థలపురాణం చెపుతోంది. అంటే భక్తులు ఏ ఫలితాన్నికోరుకుంటున్నారో ఆ స్వామి రూపాన్ని ప్రత్యేకంగా ఆరాథించుకొని, సఫలీకృత మనోరధులు కావచ్చు నన్నమాట. ఇది నారసింహ తత్త్వము. ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని గురించి కూర్మ పురాణం, పద్మపురాణం, విష్ణుపురాణా లలో ఫ్రస్తావించబడింది. హిరణ్యకశిపుని వృత్తాంతం బ్రహ్మండ పురాణం లో కన్పిస్తుంది.
ఆలయప్రత్యేకత :
శ్రీ భార్గవ నరసింహ స్వామి : దిగువ అహోబిలానికి 2.5 కి మీ దూరం లో కొండపై ఈ స్వామి దర్శనమిస్తాడు. ఇక్కడే” అక్షయ తీర్థం” ఉంది. ఈ అక్షయ తీర్థంలో స్నానం చేస్తే అనంత సంపదలు ప్రాప్తిస్తాయని ఛెప్పబడుతోంది. పరశు రాముడు ఈ ప్రదేశం లోనే తపస్సు చేశాడు. అందువలన ఈ అక్షయ తీర్థాన్నే”భార్గవ తీర్థమని” కూడ పిలుస్తారు.
శ్రీ యోగానంద నరసింహ స్వామి : వీరు దిగువ అహోబిలానికి తూర్పు దక్షిణం గా 2 కి.మీ దూరం లో వేంచేసియున్నారు. స్వామి ప్రహ్లాదునకు ఇక్కడ ఎన్నోయోగ శాస్త్ర మెళకువ లను నేర్పారని. అందువలన స్వామి కి ఆపేరు వచ్చిందని చెపుతారు. ఈ ప్రదేశం తపస్సునకు అత్యంత అనువైన ప్రదేశంగా పేరెన్నికగన్నది. కష్టాల్లో ఉన్న భక్తులు ఈ స్వామి ని సేవిస్తే స్వామి కష్టాలను కడతేర్చి, సౌ భాగ్యాన్ని కల్గిస్తాడని ప్రహ్లాదుడు చెప్పాడు.
శ్రీ ఛత్రవట నరసింహస్వామి : ఈ స్వామి దిగువ అహోబిలానికి 3కి.మీ దూరం లో వట వృక్షచ్ఛాయ లో కొలువుతీరి ఉంటాడు. ఈ స్వామిని సేవిస్తే కేతుగ్రహ బాధలు నశిస్తా యని చెపుతారు. లలితకళలను అభ్యసించేవారు ఈ స్వామిని సేవిస్తే సత్ఫలితాలను పొంద గలుగుతారు
శ్రీ అహోబిల నరసింహస్వామి : నవ నరసింహులలో ఈయన ప్రధాన దైవం. ఈయననే ఉగ్ర నరసింహమని కూడ పిలుస్తారు. ఎగువ అహోబిలం లో చెంచులక్ష్మీ సమేతుడై ఈ స్వామి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. శతృభయాలు. గ్రహపీడలు మతిమాంద్యాలు, ఈ స్వామిని సేవించడం వలన పటాపంచలౌతాయి.
శ్రీ వరాహ నరసింహస్వామి: ఎగువ అహోబిలానికి 1 కి .మీ పైన లక్ష్మీ దేవి తో కొలువు తీరి ఉన్నాడు. ఈ స్వామిని సేవిస్తే ఆటంకాలు తొలగి,కార్య సాఫల్యత కల్గుతుంది. ఈయన నే క్రోడ నరసింహ స్వామి అని కూడ పిలుస్తారు.
శ్రీ మాలోల నరసింహస్వామి : ఈస్వామి ఎగువ అహోబిలానికి 2.కి మీ ఎగువున ఉన్నాడు.ఈఆలయం ఉన్న ప్రాంతాన్ని లక్ష్మీపర్వతం గా పిలుస్తారు. మా- అనగా లక్ష్మి మా –లోలుడు అనగా లక్ష్మీప్రియుడు అని అర్థము .ఆయనే లక్ష్మీ సమేత నరసింహుడు. ఈయనను సేవిస్తే ఇహ,పరలోకాలలో సైతం బ్రహ్మానందం లభిస్తుంది.
శ్రీ జ్వాలా నరసింహస్వామి: ఈ స్వామి ఎగువ అహోబిలానికి 4 కి.మీ దూరం లో దర్శన మిస్తాడు. ఈ పర్వతాన్ని “ అచలాచయ మేరు” అని కూడ పిలుస్తారు. హిరణ్యకశిపుని తనవాడియైన గోళ్ల తో చీల్చి, చెండాడిన నరసింహస్వామి ఇక్కడ కన్పిస్తాడు. ఈస్వామిని సేవిస్తే సకల ప్రయత్నాలు సఫలమౌతాయి. పెళ్లిళ్లు కుదురు తాయి. కార్తీకమాసం లో నేతి దీపాన్ని స్వామి సన్నిథి లో వెలిగించి, ఆరాథిస్తే, సమస్త పాపాలు తొలగి, కీర్తిప్రతిష్టలు లబిస్తాయి. మిగిలిన ఎనిమిది ఆలయాల కన్నా ఈ ఆలయాన్ని చేరు కోవడమే మిక్కిలి శ్రమ తో కూడిన పని. ఇక్కడ “రక్తకుండం “అనే అరుణ వర్ణ పుష్కరిణి ఉంది. ఇందులో నీరు ఎల్లప్పుడూ ఎఱ్ఱగానే ఉంటాయి. కారణం నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించిన తరువాత రక్తసిక్తమైన తన చేతులను ఈ పుష్కరిణిలోనే కడుక్కున్నాడట. అందువల్ల ఆ నీరు ఎఱ్ఱగా ఉండిపోయింది.
శ్రీ పావన నరసింహస్వామి: ఎగువ అహోబిలానికి 6 కి. దూరం లో పావన నదీతీరాన ఈ స్వామి కొలువు తీరి ఉన్నాడు. నవ ఆల యాల్లో ఈ ప్రదేశం అత్యంత ప్రశాంతమైంది. అందుకే ఈ ప్రదేశాన్ని క్షేత్రరత్నమని పిలుస్తారు. ఈయన కే పాములేటి నరసింహస్వామి అని కూడ పేరు. ఈయనను సేవిస్తే ఈ జన్మలోను, పూర్వజన్మల్లోను తెలిసీ తెలియక చేసిన పాపాలన్నీ తొలగి పోతాయని చెపుతారు. ఈస్వామి భక్తులు ఇచ్చిన నివేదనను ఖచ్చితంగా సగం స్వీకరించి మిగతా సగం ప్రసాదంగా ఇచ్చివేస్తాడని ప్రతీతి.
శ్రీ కరంజ నరసింహస్వామి : ఎగువ అహోబిలానికి 1 కి మీ దూరం లో ఈస్వామి కొలువై ఉన్నాడు. కరంజ వృక్షం క్రింద కొలువు తీరిన స్వామి కాబట్టి ఈయన కరంజ నరసింహస్వామి అయ్యారు. ఈ స్వామిని మనసా వాచా కర్మణా త్రికరణ శుధ్ధి గా సేవిస్తే జీవితం లో అభివృధ్ధి ని సాధిస్తారని, కోరిన కోరికలన్నీ తీరుతాయని చెపుతారు
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి: ఈ తొమ్మిది రూపాలు కాక దిగువ అహోబిలం లో ప్రహ్లాదవరదుడైన లక్ష్మీనరసింహుడు శాంతరూపుడై, భక్తులను రక్షిస్తున్నాడు . ఇది మూడు ప్రాకారాలు కలిగిన దివ్యాలయము. శ్రీరాజ్యలక్ష్మీ దేవి, శ్రీఆండాళ్. ఆళ్వారుల సన్నిథి కూడ ఉపాలయాలు గా మనకు దర్శనమిస్తాయి. నవ గ్రహాలకు ఈ నవ నారసింహ రూపాలకు గల సంబంధాన్ని కూడ భక్తులు విశ్లేషించుకుంటున్నారు.
***
#శివలింగాలు_రేడియోధార్మికతతో_ఉంటాయా??
అవును 100% నిజం !!#అదెలాగో_చూద్దాం..
భారతదేశం యొక్క రేడియో కార్యాచరణ పటాన్ని తీయండి, మీరు ఆశ్చర్యపోతారు! భారత ప్రభుత్వం యొక్క అణు రియాక్టర్ కాకుండా, అన్ని జ్యోతిర్లింగాల ప్రదేశాలలో అత్యధిక రేడియేషన్ కనిపిస్తుంది.
శివ లింగం అణు రియాక్టర్లు తప్ప మరొకటి కాదు,అందుకోసం మాత్రమే లింగాలకు నీరు అందించబడుతుంది, తద్వారా అవి ప్రశాంతంగా ఉంటాయి.
#బిల్దేవా,
#అక్మద్,
#ధాతురా,
#గుధల్ వంటి మహాదేవులకు ఇష్టమైన పదార్థాలన్నీ అణుశక్తి శోషకాలు.
****ఎందుకంటే శివలింగం పై పొసే నీరు కూడా రియాక్టివ్‌గా మారుతుంది, అందుకే డ్రైనేజ్ ట్యూబ్ దాటదు.
భాభా అణు రియాక్టర్ రూపకల్పన కూడా శివ లింగం మాదిరిగానే ఉంటుంది.
నదిలో ప్రవహించే నీటితో కలిపినప్పుడు లింగం మీద పోసిన నీరు ఔషధం యొక్క రూపాన్ని తీసుకుంటుంది.
****మన పూర్వీకులు మహాదేవ్ శివశంకర్‌కు కోపం వస్తే హోలోకాస్ట్ వస్తుందని మాకు చెప్పేవారు.
మన సంప్రదాయాల వెనుక #సైన్స్_ఎంత_లోతుగా దాగి ఉందో గమనించండి.
కేదార్‌నాథ్ నుండి రామేశ్వరం వరకు ఒకే సరళ రేఖలో నిర్మించిన ఇంత ముఖ్యమైన శివాలయాలు భారతదేశంలో ఉన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.మన పూర్వీకులు ఈ రోజు వరకు మనకు అర్థం చేసుకోలేని శాస్త్రీయ మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నారా? #ఉత్తరాఖండ్‌లోని_కేదార్‌నాథ్,
#తెలంగాణలోని_కాలేశ్వరం,
#ఆంధ్రప్రదేశ్‌లోని_కాళహస్తి,
#ఏకాంబరేశ్వర్_లోని_చిదంబరం,
#తమిళనాడులోని_రామేశ్వరం
ఆలయాలు భౌగోళిక సరళ రేఖలో 79 ° E 41’54 ”రేఖాంశంలో నిర్మించబడ్డాయి.
ఈ దేవాలయాలన్నీ ప్రకృతి యొక్క 5 అంశాలలో లింగ వ్యక్తీకరణను సూచిస్తాయి, వీటిని మనం సాధారణ భాషలో పంచభూత అని పిలుస్తాము. పంచభూట్ అనగా భూమి, నీరు, అగ్ని, గాలి మరియు అంతరిక్షం. ఈ ఐదు అంశాల ఆధారంగా, ఈ ఐదు శివలింగాలు భర్తీ చేయబడ్డాయి.
1)#తిరువనకవల్(జంబుకేశ్వర)ఆలయంలో నీరు ప్రాతినిధ్యం వహిస్తుంది అందుకే దీనిని జల లింగం అంటారు
2)#తిరువన్నమలైలో (అరుణాచలేశ్వర)అగ్ని ప్రాతినిధ్యం వహిస్తుంది అందుకే దీనిని అగ్నిలింగం అంటారు.
3)వాయువు ప్రాతినిధ్యం వహిస్తుంది కనుక #కాళహస్తి లింగాన్ని వాయులింగం అని అంటారు.
4) భూమి ప్రాతినిధ్యం వహిస్తుంది కనుక దానిని #కాంచీపురంలో #పృథ్వి_లింగం అని అంటారు.
5)#చిదంబరం ఆలయంలో ఆకాశం ప్రాతినిధ్యం వహిస్తుంది!అందుకే దానిని ఆకాశ లింగం అంటారు.
ఈ ఐదు దేవాలయాలు వాస్తు-విజ్ఞాన-వేదం యొక్క అద్భుతమైన అంతరాన్ని ప్రతిబింబిస్తాయి.
ఈ దేవాలయాలలో భౌగోళిక లక్షణాలు కూడా కనిపిస్తాయి.ఈ ఐదు దేవాలయాలు యోగ విజ్ఞానం ప్రకారం నిర్మించబడ్డాయి మరియు ఒకదానితో ఒకటి ఒక నిర్దిష్ట భౌగోళిక అమరికలో ఉంచబడ్డాయి. దీని వెనుక ఖచ్చితంగా కొంత శాస్త్రం ఉంటుంది, ఇది మానవ శరీరంపై ప్రభావం చూపుతుంది.
ఈ దేవాలయాలు #ఐదువేల_సంవత్సరాల క్రితం నిర్మించబడ్డాయి, ఆ ప్రదేశాల అక్షాంశం మరియు రేఖాంశాలను కొలవడానికి అప్పట్లో ఉపగ్రహ సాంకేతికత అందుబాటులో లేదు అయినప్పటికీ ఐదు దేవాలయాలు ఇంత ఖచ్చితంగా ఎలా స్థాపించబడ్డాయి?భగవంతుడికి మాత్రమే తెలుసు.
కేదార్‌నాథ్ మరియు రామేశ్వరం మధ్య 2383 కి.మీ దూరం ఉంది. కానీ ఈ దేవాలయాలన్నీ దాదాపు ఒకే సమాంతర రేఖలో వస్తాయి. ఏ టెక్నిక్‌ను సమాంతర రేఖలో నిర్మించారు, ఏ టెక్నిక్‌ను ఉపయోగించి వేల సంవత్సరాల క్రితం నిర్మించారు అనేది ఈనాటికీ మిస్టరీగా మిగిలిపోయింది.
శ్రీకాళహస్తి ఆలయంలో #మెరుస్తున్న_దీపం అది వాయు లింగమని చూపిస్తుంది.
తిరువానిక్క ఆలయం లోపలి #పీఠభూమిలోని నీటి బుగ్గ అది జల లింగం అని సూచిస్తుంది.
అన్నామలై కొండపై ఉన్న భారీ దీపం అది అగ్ని లింగమని చూపిస్తుంది.
కాంచీపురం ఇసుక యొక్క స్వయం ప్రకటిత లింగా అది భూమి లింగా అని చూపిస్తుంది
చిదంబరం యొక్క నిరాకార స్థితి నుండి, భగవంతుని యొక్క నిరాకారత అంటే ఆకాశ మూలకం అంటారు.
ఇప్పుడు అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, విశ్వంలోని ఐదు అంశాలను సూచించే ఐదు లింగాలు శతాబ్దాల క్రితం ఒకే వరుసలో పొందుపరచబడ్డాయి. మన పూర్వీకుల విజ్ఞానం మరియు జ్ఞానం గురించి మనం గర్వపడాలి, అలాంటి విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక పరిజ్ఞానం ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని కూడా గుర్తించలేకపోయాయి. ఈ ఐదు దేవాలయాలు మాత్రమే కాదు, ఈ వరుసలో కేదార్‌నాథ్ నుండి రామేశ్వరం వరకు సరళ రేఖలో పడే అనేక దేవాలయాలు ఉంటాయని నమ్ముతారు. ఈ పంక్తిని "శివశక్తి ఆకాష్ రేఖ" అని కూడా పిలుస్తారు. బహుశా ఈ దేవాలయాలన్నీ 81.3119 ° E లో పడే కైలాష్ పర్వతంను దృష్టిలో ఉంచుకుని నిర్మించబడ్డాయి.
అది ఆ ఈశ్వరుడికే తెలియాలి.
"#మహాకాళేశ్వర్" నుండి శివ #జ్యోతిర్లింగాల మధ్య సంబంధాన్ని చూడటం ఆశ్చర్యంగా ఉంది.
ఉజ్జయిని నుండి మిగిలిన జ్యోతిర్లింగాల మధ్య దూరం కూడా ఆసక్తికరంగా ఉంటుంది-
ఉజ్జయిని నుండి సోమనాథ్ - 777 కి.మీ.
ఉజ్జయిని నుండి ఓంకరేశ్వర్ - 111 కి.మీ.
ఉజ్జయిని నుండి భీమాశంకర్ - 666 కి.మీ.
ఉజ్జయిని నుండి కాశీ విశ్వనాథ్ - 999 కి.మీ.
ఉజ్జయిని నుండి మల్లికార్జున్ - 999 కి.మీ.
ఉజ్జయిని నుండి కేదార్‌నాథ్ - 888 కి.మీ.
ఉజ్జయిని త్రయంబకేశ్వర్ - 555 కి.మీ.
ఉజ్జయిని నుండి బైజ్నాథ్ - 999 కి.మీ.
ఉజ్జయిని టు రామేశ్వరం - 1999 కి.మీ.
ఉజ్జయిని ఘ్రితేనేశ్వర్ - 555 కి.మీ.
హిందూ ధర్మంలో, కారణం లేకుండా ఏమీ జరగదు
వేలాది సంవత్సరాలుగా సనాతన ధర్మంలో నమ్మకం ఉన్న ఉజ్జయిని భూమికి కేంద్రంగా పరిగణించబడుతుంది.అందువల్ల, సుమారు 2050 సంవత్సరాల క్రితం సూర్యుడు మరియు జ్యోతిషశాస్త్రం యొక్క లెక్కింపు కోసం ఉజ్జయినిలో మానవ నిర్మిత సాధనాలు తయారు చేయబడ్డాయి.
సుమారు 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ శాస్త్రవేత్త ఊహాత్మక రేఖ ను సృష్టించినప్పుడు, అతనికి మధ్య భాగం ఉజ్జయిని అని తేలింది.నేటికీ #శాస్త్రవేత్తలు #ఉజ్జయినికి_సూర్యుడు మరియు #అంతరిక్షం గురించి #సమాచారం కోసం వస్తారు.
*****
ఓం హర్ హర్ మహాదేవ్
హళేబీడు హొయసలేశ్వరాలయం మందిరం
హళేబీడు హొయ్సళేశ్వర స్వామి..
హొయసలేశ్వరాలయం. ఇది ద్వికూటాలయం. ఇందులో రాజా హోయసల పేరు మీదుగా ఒకటి, రాణి శాంతలదేవి పేరు మీదుగా మరొకటి, రెండు శివలింగాలను ప్రతిస్ఠించారు. వీటికి హోయసలేశ్వరుడని, శాంతలేశ్వరుడని పేరు. ఈ రెండు శివలింగాలకు ఎదురుగా రెందు పెద్ద నందులు ఏర్పాటు చేశారు. వీటి చుట్టూ మండపాలు ఉన్నాయి. ఈ నందులు రకరకాల అలంకరణలతో అందంగా చెక్కబడినవి. ఇవి దేశంలో అతి పెద్ద నందులలో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నవట. గర్భగుడి ముఖద్వారం, నంది, బృంగీ విగ్రహాలు, ఆలయంలోపల పై కప్పుపై, వెలుపల ఆలయ గోడలపై హిందూ పూరాణ గాథలను స్ఫురింపజేసే శిల్పాలు, జంతువులు, పక్షులు, నర్తకిల శిల్పాలు బహు సుందరంగా తీర్చిదిద్దబడ్డాయి. ఇక్కడి శిల్పాలు, కళాకృతులు, హోయసల శిల్ప శైలికి నిలువుటద్దాలు. ఈ దేవాలయాల నిర్మాణానికి సబ్బురాతిని/బలపపు రాయిని ఉపయోగించారు. ఈ ఆలయం తూర్పు ముఖమై ఉంటుంది. ఈ ఆలయానికి నాలుగు ద్వారాలు ఉన్నాయి. రెందు ద్వారాలు తూర్పు వైపు, ఒకటి ఉత్తరం వైపు, మరోటి దక్షిణం వైపునూ. ఉత్తరం ద్వారం దగ్గర ఉన్న ద్వారపాలక విగ్రహం ఆకర్షణియంగా ఉంటుంది. ఆలయం వెలుపల ఉద్యానవనంలో గోమఠేశ్వరుడి విగ్రహం ఉంది. ఈ దేవాలయ సముదాయంలో పురావస్తు శాఖ వారి మ్యూజియం, దగ్గరలోనే ఓ పెద్ద సరస్సు ఉన్నాయి..
అంతేకాక
హళేబీడు అంటే " ప్రాచీన నగరం " అని అర్ధం చెప్పవచ్చు. ఒకప్పుడు హొయసల రాజులు తమ రాచరిక హంగులను ఈ ప్రదేశంలో ప్రదర్శించారు. పురాతనకాలంలో దానిని " ద్వారసముద్రం " అంటే సముద్రానికి ప్రవేశం అనే అర్ధంలో పిలిచేవారు. హళేబీడు కర్నాటక రాజధాని బెంగుళూరుకు 184 కి.మీ. దూరంలో హాసన్ జిల్లాలో ఉంది. సాంస్కృతిక రాజధాని మైసూరు పట్టణానికి 118 కి.మీ. ల దూరంలో ఉంది. హళేబీడు, బేలూరుల మధ్య దూరంలో సుమారు ఇరవెై నిమిషాలు వుంటుంది. కన్నడ భాషలో ‘హళె' అంటే పాత అని అర్థం. బీడు అంటే పట్టణం. హళేబీడు అంటే పాత పట్టణం. ఈ రెండు ప్రదేశాలు హొయసల నిర్మాణ ప్రతిభకు ప్రసిద్ధ ఉదాహరణలు - తరచుగా యాత్రికులు ఈ రెండు నగరాలను ఒకే సారి దర్శిస్తూ ఉంటారు. ఈ రెండు ప్రాంతాలని కలిపి " దక్షిణ వారణాసి " గా అభివర్ణిస్తారు
చెన్నకేశవ ఆలయం, బేలూర్
బేలూర్ లోని అత్యంత రమణీయమైన దేవాలయాల్లో ఒకటైన చెన్నకేశవ దేవాలయం తప్పక సందర్శించదగినడి. ఈ దేవాలయం మృదువైన సున్నపురాయిని ఉపయోగించి నిర్మించారు. ఈ ఆలయము, విష్ణువు యొక్క ఒక అవతారము ఐన చెన్నకేశవ స్వామికి అంకితం చేయబడినది.
ఈ ఆలయం హొయసల కాలమునకు చెందినది మరియు వివిధ డిజైన్లకు తార్కాణంగా ఉన్న 48 శిల్ప స్తంభాలను కలిగి ఉంటుంది.1117 లో తాలక్కాడ్ యుద్ధ సమయంలో, ఈ మహానిర్మాణాన్ని చోళులపై తన విజయానికి చిహ్నంగా హోయసల విష్ణువర్ధనుడు కట్టించాడు. పర్యాటకులు పురాణాల్లోని అనేక గాధలను, ఉపనిషత్తులను, ఏనుగులు, రామాయణ మహాభారతాలలోని అనేక శిల్పాలను చూడవచ్చును. వీటితో పాటు, వివిధ రంగులలో చెక్కిన నవ యవ్వన పడతుల చిత్రాలు మరియు సువర్ణ చిత్రాలు కూడా ఉన్నాయి.
అంతేకాక ఆలయం వరండ లోపల అనేక ఇతర ఆలయాలు నిర్మించబడి ఉన్నాయి.ఈ దేవాలయలోని అనేక శిల్పాలలో అనేక రకాలైన ఆభరణాలు,పైకప్పులు, జంతువులు, పక్షులు, ద్వారాలు మరియు అనేక రకాలైన ఇతర చిత్రాలను చూడవచ్చును . పర్యాటకులు ఆలయం యొక్క ప్రవేశద్వారం వద్ద ఒక పుష్కరణిని (మెట్లబావి) కూడా చూడవచ్చు. విజయనగర సామ్రాజ్యం రోజులలో ఈ ఆలయం యొక్క రాజగోపురాలు నిర్మించబడ్డాయి. ఆలయం యొక్క అంతర్భాగంలోనే కప్పే చేన్నిగరాయ ఆలయం, మరియు లక్ష్మి దేవీకి అంకితం చేసిన ఒక చిన్న కట్టడము కూడా ఉన్నాయి.
*****
శ్రీ దానేశ్వరి అమ్మవారి ఆలయం, దువ్వ
ఈ ఆలయాన్ని 40 సంవత్సరాల క్రితం నిర్మించారు. 1967 కి ముందు వనదేవత దానమ్మ రూపంలో భక్తులు పూజించే చెట్టు ఉండేది. ఈ చెట్టు 1967 లో కూలిపోయింది. అప్పుడు స్థానిక భక్తులు ఒక ఆలయాన్ని నిర్మించి శ్రీ దనేశ్వరి అమ్మవరును స్థాపించారు. ప్రధాన దేవత పక్కన సరస్వతి దేవి మరియు లక్ష్మీ దేవి దేవాలయాలు ఉన్నాయి. ప్రధాన ద్వారం తరువాత కోనేరు ఉంది.
దుర్వాస మహర్షి ఇక్కడ యజ్ఞం చేశాడని నమ్ముతారు. యజ్ఞం చేస్తున్నప్పుడు ఒక దైవిక శక్తి అగ్ని నుండి ప్రసాదంగా బయటకు వచ్చి ధన్యేశ్వరి అమ్మవారు అని నమ్ముతారు మరియు తరువాత దీనిని దానేశ్వరిగా మార్చారు. దుర్వాస మహర్షి ఇక్కడ తపస్సు చేయడంతో ఈ ప్రదేశాన్ని దుర్వాసపురి అని పిలుస్తారు మరియు తరువాత దీనిని దువ్వాగా మార్చారు.
శక్తిస్వరూపిణి అయిన అమ్మవారు అనేక నామాలతో పిలవబడుతూ .. అనేక రూపాల్లో కొలవబడుతూ వుంటుంది. అలా అమ్మవారు 'దానేశ్వరి'గా పిలవబడుతోన్న క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా 'దువ్వ'లో కనిపిస్తుంది. ఇక్కడి ఆలయ ప్రాకారాలపై అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తూ ఉంటుంది. సువిశాలమైన ఆలయ ప్రాంగణంలో పుష్కరిణి కనిపిస్తుంది.
గర్భాలయంలో అమ్మవారి మూర్తి చాలా చిన్నదిగా దర్శనమిస్తూ ఉంటుంది. అమ్మవారి మహిమలు అపారమని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. చాలాకాలం క్రితం అమ్మవారు ఇక్కడ 'ధాన్యేశ్వరి'గా పూజలు అందుకునేదట. అమ్మవారిని పూజించడం వలన ధన ధాన్యాలకు లోటు ఉండదని భక్తులు విశ్వసిస్తుంటారు.
కాలక్రమంలో అమ్మవారు 'దానేశ్వరి'గా పిలబడుతోంది. ఇప్పటికీ అమ్మవారిని 'వనదేవత'గానే ఆరాధిస్తుంటారు. వానలు కురిసేది .. పంటలు బాగా పండేది .. సంపదలు వృద్ధి చెందేది ఈ అమ్మవారి అనుగ్రహం వల్లనే అని భక్తులు విశ్వసిస్తుంటారు. ప్రతి వైశాఖ మసంలో 5 రోజులు జరుపుకునే బ్రహ్మోత్సవం సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. దువ్వలో దానేశ్వరి అమ్మవారి ఆలయానికి ఏటా రూ. కోటికి పైగా ఆదాయం వస్తుంది. జిల్లాతోపాటు పొరుగు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆమె అనుగ్రహం పొందుతుంటారు.
రోడ్డు మార్గం ద్వారా
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రధాన ప్రదేశాల నుండి బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆలయానికి సమీప పట్టణాలు అయిన తనుకు (12 కి.మీ) మరియు ఎలురు (70 కి.మీ) నుండి తరచుగా బస్సులు నడుస్తాయి.
రైలులో సమీప రైల్వే స్టేషన్ 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న తనకు రైల్వే స్టేషన్. ఆలయానికి చేరుకోవడానికి బస్సులు అందుబాటులో ఉన్నాయి.
గాలి ద్వారా సమీప విమానాశ్రయం 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజమండ్రి విమానాశ్రయం. ఆలయానికి చేరుకోవడానికి బస్సు, టాక్సీ సేవలు అందుబాటులో ఉన్నాయి.
సర్వేజనా సుఖినోభవంతు
****
గోకర్ణ క్షేత్రం
వింతైన క్షేత్రం గోకర్ణ…అంతుపట్టని క్షేత్రం గోకర్ణ…
II లింగరూప తుంగ, జగమాఘనాశన భంజితాసురేంద్ర రావణలేపన
వరగోకర్ణఖ్యా క్షేత్ర భూషణ క్షేత్ర భూషణ శ్రీమహాబలేశదేవ సార్వభౌమతే II
జయజయ శంకర..హరహర శంకర..హరహర శంకర..జయజయ శంకర..హరహర శంకర..జయజయ శంకర..
గోకర్ణ క్షేత్రం ఒక వింతైన ‘సాధనాదత్త’ క్షేత్రం. ఈ క్షేత్రంలో అనేకానేక సంస్కృతుల సమ్మేళనం మన కళ్ళకు కనిపిస్తుంది. ఎలాగంటే ఒక విదేశీ పురుషుడు ఒక చేతిని బీరు బాటిల్ మీద మరో చెయ్యిని విదేశీ స్త్రీ మీద వేసి అక్కడ గుడి వీధుల్లో తిరగడం ఎంత సాధారణమో… మరో విదేశీ వొళ్ళంతా భస్మధారణతో, రుద్రాక్షయుతంగా ఉండి శివ నామస్మరణతో శంఖం ఊదుతూ అదే వీధుల్లో తిరగడం కుడా అంతే సాధారణమక్కడ . హిందువులు కుడా చెయ్యలేని సాధనలు చేసే విదేశాలవారు, శతశృంగి పర్వత గుహలలో మంత్రాలు నేర్చుకునే విదేశీ స్త్రీలు, ఇక్కడి రామతీర్ధంలో దొరికే పరమ పవిత్ర ఔషద జలాన్ని క్యాన్ లలో మోసుకొని పోయే విదేశీ జంటలు వారి చిన్నచిన్న పిల్లలు, కాళ్ళకు చెప్పులు లేకుండా రాళ్ళలో ముళ్ళలో తిరిగే తెల్లవారు(మనం నడవగలమా! అని అనిపిస్తుంటుంది), బికినిలలో తిరుగాడే విదేశీ వనితలు ఇక్కడ నిత్యకృత్యంగా కనిపిస్తారు. గుర్తుపెట్టుకోండి ‘గోకర్ణ’ ఒక గొప్ప సాధనాదత్త క్షేత్రం. ఇందాక మనకి బీరు బాటిల్ తో కనిపించిన విదేశీ స్త్రీ-పురుషులు సాక్షాత్తు అనఘా-దత్తాత్రేయుల వారిగా తలచిన వారికి ఈ క్షేత్రంలో అనేక ఆధ్యాత్మిక వింత అనుభూతులు ఎదురౌతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మనమెలా తలిస్తే ఆ తల్లి (గోకర్ణ క్షేత్రం) మనకలా కనిపిస్తుంది. మీ మనస్తత్వాన్ని బట్టి ఆ క్షేత్రం నడుచుకుంటుంది. గోకర్ణ క్షేత్రానికి – మన మనసుకు – మన సాధనకు గల సంబంధం ఈ క్షేత్రంలో బయటపడుతుంది. అదే ఈ సాధనా దత్తక్షేత్ర విశిష్టత.
గోకర్ణ క్షేత్రం గురించి…
మూరకో గుడి – బారకో బ్రాహ్మడు, అడుగుకో ఔదుంబరం – అరుగుకో అనఘదత్త వృక్షం (పనస చెట్టు), గడపకో గోవు – వీధికో విదేశీజంట వెరసి ‘గోకర్ణ’. గోకర్ణ క్షేత్రాన్ని ఒక్క రోజులో చూడచ్చు… ఒక్క వారంలోనూ చూడచ్చు. ఇది గోకర్ణ క్షేత్రానికి గల మరో ప్రత్యేకత. గోకర్ణ బీచ్, ‘ఓం’ బీచ్, ప్యారడైస్ బీచ్, కుండ్లె బీచ్, హాఫ్ మూన్ బీచ్, తడడి బీచ్ లలో ఒకటైనా దర్శించనివారుండరు. కాని శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారు మూడు సంవత్సరాలు తపస్సు చేసుకున్న ప్రదేశము, వారు స్థాపించిన శివలింగం [దత్త ప్రతిష్టిత 'దత్తశివలింగం'], వారి చేతుల మీదుగా సంకల్ప మాత్రం తోనే ఏర్పడ్డ కోనేరు [దత్త కోనేరు], వారు ప్రతిష్టించిన అనసూయా మాత విగ్రహం, శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారు ప్రతిరోజూ కాలినడకన వెళ్లి అర్చించిన ఉమామహేశ్వర దేవాలయం ఉన్నాయని కుడా చాలామందికి తెలియదు. తెలిసినా బీచుల మీద ఉండే శ్రద్ధ భగవంతుడి మీద ఉండదు. భగవంతుని గురించి సమాచారం ఇచ్చేవారు గోకర్ణలో దొరకడం కష్టం. కాని బీచ్ లగురించి సమాచారమిచ్చే వారు అడుగుకొకరు ఉంటారు. చాలామంది గోకర్ణ మహాబలేశ్వర స్వామినీ, గోకర్ణ బీచ్ లను చూసి బయల్దేరుతుంటారు. సరైన సమాచారం భక్తులకు అందుబాటులో లేకపోవడమూ, శ్రీపాదుల వారి సమాచారం తెలిసిన వారందరూ వృద్ధాప్యంలో ఉన్న కారణంగా, అటువంటి వారు ఇంటికి మాత్రమే పరిమితమవ్వడం కుడా సమాచారలేమికి మరో కారణం. శ్రీపాద శ్రీ వల్లభులు ఎక్కడ తపస్సు చేసారని గోకర్ణ మహాబలేశ్వర స్వామి దేవాలయం లోని పుజార్లను కనుక్కుంటే వారిదగ్గర నుండి కుడా సరైన సమాచారం అందదు. కొంతమంది మాత్రం “ఇక్కడే” [మహాబలేశ్వర స్వామి దేవాలయం లోనే] తపస్సు చేసారని తప్పుడు సమాచారం అందివ్వడం జరిగింది (ఏదో ఒకటి చెప్పక పోతే ‘నామోషీ’ మరి). అందువల్లనే ఇంత పెద్ద Article రాయడానికి శ్రీపాదుల వారు నాకు ఆశీస్సులను, శక్తిని అందించారు. దత్తభక్తులందరూ ఈ Article లోని సమాచారం ఆధారంగా శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారు ప్రతిష్టించిన శివలింగం, అనసూయా మాత విగ్రహం మరియు దత్తకోనేరులను దర్శించి తరిస్తారని ఆశిస్తున్నాను. సహ్యాద్రి పర్వత శ్రేణి లోని ‘గోకర్ణం’ కర్నాటక రాష్ట్రంలో పడమర దిక్కుగా ఉన్న ఒక గ్రామం. చుట్టూరా సముద్రపు ఉప్పును తయారు చేసే ‘ఉప్పుమడులు’ [Salt Flats], చూడచక్కటి మడ అడవులు [Mangroovs] కలిగి రెండు నదులు [శాల్మలి & అఘనాశిని] సముద్రంలో కలిసే మద్య ప్రాంతంలో [రెండు నదీసంగమప్రదేశాలు] గల అతి గొప్ప సాధనా దత్త క్షేత్రం మరియు ప్రముఖ శైవక్షేత్రం. మహారాష్ట్ర లోని ‘గోవా’ కు అతి దగ్గరలోఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం గోకర్ణ, పైకి ప్రముఖ శైవక్షేత్రంలా కనిపించే గొప్ప “దత్తక్షేత్రం” గోకర్ణ.
దిగంబరా..దిగంబరా..శ్రీపాద వల్లభ దిగంబరా..
ఎలా చేరుకోవాలి?
By Public Transport
కాచిగూడ రైల్వే స్టేషన్ / సికందరాబాద్ రైల్వే స్టేషన్ / బేగంపేట్ రైల్వే స్టేషన్ / లింగంపల్లి రైల్వే స్టేషన్ ---->హుబ్లి రైల్వే స్టేషన్ ----->హుబ్లి Old బస్ స్టాండ్ (BSNL Office దగ్గర) ----> అంకోలా ----> గోకర్ణ (ట్రైన్ మరియు బస్సు కలిపి హైదరాబాద్ నుండి దాదాపు 18 గంటల నుండి 20 గంటల ప్రయాణం). దయచేసి గమనించండి హుబ్లి నుండి మరియు ఇతర ప్రదేశాల నుండి గోకర్ణ కు డైరెక్ట్ బస్సులు అతి తక్కువ. ఎక్కడకి వెళ్ళాలన్న 'అంకోలా', 'హొనావర్' లేదా 'కుంట' ల నుండి మరొక బస్సు మారి గోకర్ణ చేరుకోవచ్చు.
By Own Transport
హైదరాబాద్ ----> జూపార్క్ ----> ఆరంఘర్ చౌరాస్తా ----> బెంగలూరు హైవే ----> జడ్చర్ల---->మహబూబ్ నగర్ ----> దేవరకద్ర ----> మఖ్తల్ ----> రాయచూరు (రాయచూరు ఊర్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు)----> సింధనుర్ ----> కొప్పాల్ ----> గదగ్ ----> హుబ్లి ----> ఎల్లాపుర ----> అంకోలా ----> గోకర్ణ ( మొత్తం దాదాపు 800 KMs 16-18 గంటల ప్రయాణం).
గోకర్ణ క్షేత్ర దర్శనానికి అనువైన సమయం…
సంక్రాంతి శెలవలు గోకర్ణ క్షేత్ర దర్శనానికి అనువైనవి. కారణం కర్నాటకలో సంక్రాంతి శెలవలు ఉండవు. కేవలం మకర సంక్రాంతి ఒక్కరోజు శెలవుగా ప్రకటిస్తారు. కాబట్టి సంక్రాంతి శెలవలల్లో రద్దీ తక్కువగా ఉంటుంది. పైగా జనవరి నెలలో ఇక్కడి వాతావరణం వివిధ ప్రదేశాలు తిరగడానికి అనువుగా ఉంటుంది. రూములు ఇతర సౌకర్యాలకోసం కొట్టుకోవలసిన పని ఉండదు. ఈ రోజులలో ఉదయంపూట గోకర్ణ మహాబలేశ్వర స్వామి [ఆత్మలింగ] దర్శనం [ ప్రధాన దేవాలయం] 3 నుండి 5 నిముషాలలో జరిగిపోతుంది.
అసలు శివుని యొక్క ఆత్మలింగం ఎందుకు అక్కడే (గోకర్ణ లో) గణపతి చేతుల మీదుగా భుమిమీద పెట్టబడింది?…
gokarna history
భూగోళం పై సృష్టి జరగకముందు మొత్తం భూమిని ఆవరించి ‘సముద్రుడు’ ఉండేవాడు. ఎక్కడా కుడా ఇసుమంతైనా భూభాగం కనిపించేది కాదు. దేవతలు సముద్రుడికి భూగ్రహాన్ని నివాసంగా ఇవ్వడం జరిగింది. అటువంటి సమయంలో దేవలోకంలో ఉన్న బ్రహ్మ సృష్టి జరగాలనీ, అదికూడా మహాశివుని ద్వారా జరగాలనీ, అదికూడా ‘భూమి’ మీద సముద్రుడి చుట్టుకొలతలతో జరగాలనీ ఆశించాడు. ఆవిషయాన్ని తెలుసుకున్న సముద్రుడు తను ఆవరించిన చుట్టుకొలతలో కొంతమేర తగ్గించి అక్కడక్కడ భూమి బయటకు కనిపించే విధంగా తన రూపాన్ని అమర్చుకున్నాడు. అంతట పరమశివుడు మరణము సంభవించనీ, సమానగుణములూ, సత్వగుణములు కలిగిన మానవజాతిని సృస్టించడానికి కావలసిన శక్తి కోసం పాతాళలోకంలో ఒకానొక శుభదినాన్న తపస్సు ప్రారంభిస్తాడు. ఆవిషయాన్ని తెలుసుకున్న బ్రహ్మ సృష్టి అంటే ‘చరాచర’ జగత్తు. అవి ఒకదానికొకటి భిన్నంగా ఉంటూ ఒకదానిమీద మరొకటి ఆధారపడేలా ఉండాలి కాని సృష్టి అంటే సమాన జగత్తు కాదనీ, 5 భిన్న సముదాయాల సమ్మేళనమే (పంచ భూతాలు) సృష్టి అనీ, శివుని తపస్సు అందుకు భిన్నంగా ఉందనీ “నేనొకటి తలిస్తే శివుడొకటి తలుస్తున్నాడని” అందరిలో (తను కలిసిన వారందరితో) చెబుతాడు. ఆ విషయాన్ని పాతాళలోకంలో తపస్సులో ఉన్న శివునికి తపోభంగం కలిగించి మరీ చెబుతుంది ‘ప్రకృతి’.
ఆ విషయాన్ని తెలుసుకున్న శివుడు ఆవేశంతో అయితే “ఆయన్నే సృష్టి చేసుకోమని” కైలాసం వెళ్ళడానికిగానూ పాతాళలోకం నుండి పైకి వచ్చుటకొరకై చక్రాకార భ్రమణం చేయుచున్న భూమి అడ్డువచ్చుట చూసి “నేను వెళ్ళాలి దారిని వొదులు, అడ్డులే!” అని అరుస్తాడు. అప్పుడు భూమాత వినయంతో “పరమశివా! రాకరాక ఇక్కడికి వచ్చావు. కారణమేదైనా, ఎవరిమీద కొపమున్నా దయచేసి నాకు నీ స్పర్శన భాగ్యం కలిగించి, నన్ను భాదింపకుండా సూక్ష్మరూపధారుడవై నాలో ప్రవేసించి, నా కర్ణముల గుండా కైలాసానికి వెళ్ళవలసింది” అని దీనంగా స్తోత్ర సహితంగా ప్రార్దించింది. ఆస్తోత్రాన్ని విన్న రుద్రుడు శాంతించి అంగుష్టమాత్ర శరీరాన్ని ధరించి భూమాత కర్ణముల గుండా బయటకు వచ్చి ఆనందంతో “నీకు గల మరొక పేరు (భూమికి గల మరొక పేరు) ‘గో’, ఇది నీ కర్ణ ప్రదేశం కనుక ఇకనుండి ఈ సుందర ప్రదేశం “గోకర్ణ” గా ఖ్యాతి పొందుతుంది. ముందు యుగాలలో ఇక్కడ గోకర్ణ ఆకారంలో, “గోకర్ణేశ్వరుడనే మహాబలేశ్వరుడు ఆత్మలింగంగా”స్థాపింపబడతాడు. అశ్వనీదేవతల పై నాకుగల ప్రేమను చాటడంకోసం ఈ పేరులో అంతర్లీనము గా ఉన్న గోకర్ణ (ఆవుచెవి – ఆవు చెవిలో అశ్వనీ దేవతలుంటారు) ఆకారం లోనే గోకర్ణేశ్వరుడు ఉంటాడు. ఈ ప్రాంతం అనేక గోవులకు ఆలవాలమై ఉంటుంది. నేను పాతాళం నుండి బయటకు వెళ్ళునప్పుడు ఈ ప్రదేశం “యోని” లాగా నాకు కనిపించినందున ఈ ప్రాంతాన్నే “రుద్రయోని / విశ్వయోని” అనీ, ప్రళయకాలంలో భూమిపై గల సముద్రుడు ఇక్కడే “సుడి” తిరిగి సృష్టిని తనలో కలిపేసుకుంటాడుగాన దీనికి “వరుణావర్తం” అనీ పేరు వస్తుంది. “గోకర్ణ” నామమును ఇక్కడ ఉండి పొద్దున్న ఉచ్ఛరించిన , గత రాత్రి చేసిన పాపములన్నీ హరించుకుపోవును. అలాగే “గోకర్ణ” నామమును ఇక్కడ ఉండి సాయంత్రం ఉచ్ఛరించిన, పొద్దున్న చేసిన పాపములన్నీ హరించుకుపోవును. ముందు ముందు క్రమంగా ఇక్కడకు మహర్షులూ, దేవతలూ, గంధర్వులూ, యోగులు వచ్చి వారి పాపముల ప్రక్షాళనగావించుకొనెదరు. ఇక్కడికి తీసుకురాబడేవారెవరైనా, ఇక్కడనుండి తీసుకుపోబడేవాడేవడైనా (ఇక్కడ మరణం పొందినవారు) అత్యంత అదృష్టవంతుడని తలంపుము. ఇక్కడే తాంత్రిక విద్యలు పుడతాయి. వాటిని నిరోధించే హనుమంతుడూ ఇక్కడే పుడతాడు. ఈ ప్రాంతం భూమి మీద గల ప్రత్యేక ప్రాంతంగా, భౌతిక సుఖాలకు, ఆధ్యాత్మిక సుఖాలకు కేంద్రంగా మారుతుంది. ఈ ప్రాంతంలో ముందు ముందు “అఘనాశిని మరియు గంగావళి ” (అఘనాశిని = పాపమును నశింపజేసేది, గంగావళి = గంగతో సమానమైనది) అనే పాపాలను సమూలంగా కడిగే ఈ విశ్వం లోనే గల ఏకైక సముద్ర సంగమసహిత రెండు నదులు పారుతాయి. (కాశి లోని గంగానది సముద్రసంగమ ప్రదేశం కాదు). ఎవరైతే ఈ అఘనాశిని మరియు గంగావళి నదులు సముద్రంలో కలిసే చోట స్నానమాచరిస్తారో వారికి పన్నెండు పూర్వ జన్మలలో చేసిన పాపాలూ, అలాగే ప్రస్తుత జన్మలో అప్పటివరుకు చేసిన పాపాలూ “శూన్యమవుతాయి”, ఇక్కడికి మునులూ దేవతలూ సైతం వచ్చి సంధ్యవార్చి స్నానం చేసి వెళ్ళవలసిందే!” అని రుద్రుడు భూమికి వరముని ఇచ్చి కైలాసానికేగుతాడు.
గోకర్ణ క్షేత్రం లో చూడవలసిన ప్రదేశాలు / ఆలయాలు
(1) గోకర్ణేశ్వరుడనే ‘మహాబలేశ్వరుని’ దేవాలయం [ఆత్మలింగ దేవాలయం]
లంకానగరంలో ఉన్న రావణాసురుడి తల్లి ‘కైకసి’ నిత్యం సముద్రపు ఒడ్డున ఇసుకమట్టి తో శివలింగాన్ని చేసి పూజిస్తూ ఉండేది. ఇలా మట్టితో చేసిన శివలింగాన్ని “పార్థివలింగం” అంటారు. ఇటువంటి పార్థివలింగం పూజ అన్నింటికన్నా మిన్న అయినది. ఒక రోజు కైకసి ఎన్ని సార్లు పార్థివలింగాన్ని చేసినా సముద్రపు అలలు వాటిని నాశనం చేయసాగాయి. ఆరోజు పార్థివలింగాభిషేకం చేయకపోవడం వల్ల కైకసి కన్నీటి పర్యంతమవుతుంది. పార్థివలింగాభిషేకం తంతులో కన్నీరు పెట్టిన రావణాసురుడి తల్లి కైకసి నిత్యం పూజించుకోవడం కోసం రావణాసురుడు “పార్థివలింగం ఏమిటి నీకు శివుని ఆత్మలింగమే తెచ్చి ఇస్తానని” తన తల్లి తో చెప్పి కైలాసానికి వెళతాడు. రావణాసురుడు అకుంఠిత దీక్షతో తపస్సు చేసి పరమశివుడిని మెప్పించి, కేవలం ఆత్మలింగం కోసం కైలాసానికి వెళ్ళిన రావణుడు అక్కడ శివునితో పాటు ఉన్న పార్వతీదేవి అందాన్ని చూసి వచ్చిన విషయాన్ని మరిచి పార్వతీ దేవినే చూస్తున్న రావణుడుని “ఏం కావాలని?” అడుగుతాడు శివుడు. అప్పుడు రావణుడు “పార్వతి” కావాలని అడుగుతాడు. శంకరుని మనస్సు తెలుసుకున్న పార్వతి రావణుడుకి కొన్ని నిభంధనలను పెట్టి రావణునితో వెళ్ళడానికి అంగీకరిస్తుంది. వింధ్యా పర్వతాల ప్రాంతంలో పార్వతి రావణునితో “నాకు ఆకలిగా ఉన్నది వనములో దొరికే కొన్ని ఫలములు కావాలి” అంటుంది. అంతట రావణాసురుడు పార్వతిని ఒక చెట్టు క్రింద కూర్చోనమని చెప్పి ఫలములు తేవడం కోసం అడవిలోకి వెళతాడు. అక్కడ రావణాసురుడుకి పాతాళలోక రాజైన, మాయాసురుని పుత్రికైన “మండోదరి”కనిపిస్తుంది. పార్వతీ దేవి కంటే అందంగా ఉన్నమండోదరిని చూసి మోహించి, మండోదరి తోసహా తిరిగి పార్వతి దగ్గరకు వచ్చి “నాకు మండోదరే కావాలని” అడుగుతాడు . అప్పుడు వారిరువురినీ ఆశీర్వదించి తిరిగి కైలాసానికి వెళుతుంది పార్వతి. ఈ విధంగా ఆత్మలింగం రావణ రాజ్యానికి తేవాలనే మొదటి ప్రయత్నం బెడిసికొడుతుంది.
లంకకు చేరిన రావణుడు- మండోదరి లను చుసిన కైకసి తనకోసం తెచ్చిన” ఆత్మలింగ మెక్కడ? ” అని అడుగుతుంది. అప్పుడు రావణాసురుడు తిరిగి కైలాశం వెళ్లి శివుని మెప్పించి ఆత్మలింగం ఇవ్వమని కోరతాడు. శివానుగ్రహంతో రావణాసురుడు ఆత్మలింగాన్ని భూలోకానికి తీసుకువస్తాడు. భూమిమీద ఆత్మలింగాన్ని ఎక్కడయితే ఉంచుతారో, అక్కడ అది స్థాపితం అయిపోతుందనీ, తిరిగి దాన్ని ఎత్తడం, జరపడం సాధ్యంకాదనీ పరమశివుడు ఆత్మలింగం ఇవ్వడానికి మునుపే రావణాసురుడికి ఒక నిబంధన పెడతాడు.
అయితే రావణుడు పరమశివుడి ఆత్మలింగాన్ని గనుక లంకలో ప్రతిష్టించితే నష్టం జరుగుతుందని భావించి దేవాధిదేవతలు మహావిష్ణువును వేడుకొంటారు. దాంతో విష్ణువు తన మాయతో సూర్యాస్తమయం అయ్యేటట్లుగా తన సుదర్శన చక్రాన్ని సూర్యునికి క్రమంగా పద్దతి ప్రకారం అడ్డువేస్తూ వస్తాడు. అప్పుడు రావణుడు సూర్యాస్తమయం అయ్యిందని భావించి సంధ్య వార్చుకునేందుకు సిద్ధపడతాడు. ఈలోగా విషయం తెలుసుకున్న నారదమునీంద్రుడు వినాయకుడి వద్దకు వచ్చి, “రావణాసురుడి వద్దనున్న ఆత్మలింగం తీసుకుని రావణ రాజ్యంలో కాకుండా (లంకలో కాకుండా మరెక్కడైనా) ఇంకెక్కడైనా భూమిపై పెట్టాలనీ, దానికి తగిన స్థలం ‘గోకర్ణ’ అనీ. పైగా గతంలో మీ తండ్రిగారైన మహాశివుడు భూమాతకు ‘ఆత్మలింగ’ ప్రతిష్ట గోకర్ణలో జరుగుతుందని మాటిచ్చారు కుడా!” అని చెప్పి, అందుకు నువ్వే సమర్దుడవని చెప్పి భూలోకానికి పంపిస్తాడు. రావణుడు సంధ్యవార్చుకునే సమయానికల్లా బ్రాహ్మణవేషంలో వెళతాడు వినాయకుడు. ఆ బ్రాహ్మణ బాలుడిని చూసిన రావణుడు సంధ్యవార్చుకునేంతదాకా ఆత్మలింగాన్నిభూమిపై పెట్టకుండా పట్టుకోవాల్సిందిగా కోరతాడు. ఈ లింగం చాలా బరువుగా ఉండడం వల్ల తాను ఎక్కువసేపు మోయలేననీ, మోయలేనప్పుడు మూడుసార్లు తమను పిలుస్తాననీ అయినప్పటికీ మీరు రాకపోతే ఈ లింగాన్ని భూమిపై ఉంచేస్తానని అంటాడు బాల బ్రాహ్మణుడి రూపంలోని వినాయకుడు.
ఆ పరిసర ప్రాంతంలో మరెవ్వరూ లేకపోవడంతో గత్యంతరం లేక రావణుడు అందుకు అంగీకరించి, ఆత్మలింగాన్ని బాల బ్రాహ్మణుడి చేతిలో పెట్టి సంధ్య వార్చుకునేందుకు సముద్రం లోకి వెళతాడు. రావణుడు వెళ్లిన కాసేపటికే తాను లింగాన్ని మోయలేకపోతున్నానంటూ వినాయకుడు మూడుసార్లు పిలుస్తాడు. సంధ్యవార్చే కార్యక్రమం మధ్యలో ఉండటంతో కాస్త ఆలస్యంగా వస్తాడు రావణుడు. ఈలోగా వినాయకుడు ఆత్మలింగాన్ని భూమిమీద పెట్టేస్తాడు. దాంతో కోపంతో రావణుడు వినాయకుడి నెత్తిపై గట్టిగా మొట్టికాయ కొట్టగా అక్కడ గుంట పడుతుంది. ఇప్పటికి ఆ గుంటను మనం గోకర్ణ మహాగణపతి తలపై చూడవచ్చు.
ఈలోగా తాను అనుకున్న కార్యం నిర్విఘ్నంగా జరిగిపోవటంతో సంతోషించిన విష్ణువు, తన సుదర్శన చక్రాన్ని ఉపసంహరించడం వల్ల వెంటనే సూర్యుడు ఆకాశంలో కనిపిస్తాడు. వెంటనే విషయాన్ని గ్రహించిన రావణుడు కోపంతో ఆత్మలింగాన్ని తన చేతులతో బలవంతంగా పెకిలించే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమం లో ఆత్మలింగం పై కప్పిన వస్త్రం అడ్డు రావడం వల్ల దానిని తీసి విసిరేస్తాడు. అది పడిన ప్రదేశమే “మురుడేశ్వర”. మళ్లీ ప్రయత్నించినప్పుడు ఆత్మలింగం కవచం వల్ల చేతులు జారడం వల్ల కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరివేస్తే అది ” సజ్జేశ్వర” అనే ప్రదేశంలో పడుతుంది. మళ్లీ ప్రయత్నించినప్పుడు ఆత్మలింగం పై నున్న మూత అడ్డు రావడం వల్ల దానిని తొలగించి విరిచి విసిరి వేస్తే అందులో ఒక ముక్క “గుణేశ్వర / గుణవంతేశ్వర్” లో, మరో ముక్క “ధారేశ్వర్” లో పడుతుంది. రావణాసురుడు ఆత్మలింగం పై ప్రయోగించిన బలం ఫలితంగా ఆత్మలింగం పైభాగం ఆవు చెవి ఆకారంలో సాగుతుందే కాని అది భూమినుండి ఊడిరాదు. కాల క్రమములో మహావిష్ణువు శాలిగ్రామ పీఠం రూపంలో ఈ ఆత్మలింగాన్నిచుట్టి ఉండడం జరుగుతుంది. గోకర్ణలోని భక్తులు ఈ మహాబలేశ్వరుని ఆత్మలింగాన్ని “శాలిగ్రామ పీఠం” లోని మధ్య భాగంలో వున్న గుండ్రని రంధ్రం లోనుండి తమ చేతులతో తాకుతారు. ఈ రంద్రం గుండానే అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. అత్యంత అరుదుగా ఆత్మలింగం పై గల ఈ శాలిగ్రామ పీఠంను తొలగించి ఎనిమిది రోజులు పుజిస్తారు. ఇట్టి కార్యక్రమాన్ని “అగమ్య అష్టబంధన మహోత్సవం” అంటారు. తదుపరి తిరిగి విష్ణు శాలిగ్రామ పీఠాన్ని యధాతధంగా పునః ప్రతిష్టాపన చేస్తారు. ఇది అతి అరుదుగా జరిగే కార్యక్రమము. ఈ కార్యక్రమం క్రీ.శ. 1903, 1930,1983 లో జరిగినవి.
******
గోకర్ణేశ్వర మహాబలేశ్వర (ఆత్మలింగం) ఆలయ ప్రాంగణంలోగల ఇతర ఆలయాలు
1.ఆది గోకర్ణేశ్వర లింగం – Aadi Gokarneshwara Linga
ప్రధాన ఆత్మలింగ ఆలయానికి ఎడమ చేతి వైపుగా గోశాలకు దగ్గరలో ఉంటుంది. ప్రధాన దేవాలయ ప్రాంగణంలో ముందుగా దర్శించవలసిన ప్రదేశమిది (మొత్తం గోకర్ణ యాత్రలో ముందుగా దర్శించవలసిన ప్రదేశం ‘మహాగణపతి’ దేవాలయం). ఇక్కడ బిల్వాలను సమర్పించి జలాభిషేకం (నీటిని మనమే తీసుకుని వెళ్ళాలి, అక్కడ చుట్టూరా ఉండే నీటిని మళ్లీ అభిషేకానికి వాడరాదు) చేస్తే సరిపోతుంది.
2.దత్తాత్రేయ దేవాలయం – Guru Dattatreya Temple
గోకర్ణేశ్వర మహాబలేశ్వరుడి (ఆత్మలింగం) దర్శన అనంతరం దర్శింప వలసిన ప్రదేశమిది. మొత్తం గోకర్ణలో దత్తత్రేయునికి అధిక ప్రాముఖ్యత గలదు. అందువల్లనే దత్తత్రేయుడి ఆలయం ప్రధాన ఆలయం లోనే గలదు. పైగా గోకర్ణ ఒక “దత్త సాధనా క్షేత్రం”. ప్రధాన దేవాలంలో కుడి చేతి వైపు ప్రసాదాలు అమ్మే కౌంటర్ దగ్గరలో ఉంటుంది. ఇక్కడ దిగంబర నామ స్మరణ చేస్తూ 3 ప్రదక్షిణలు చెయ్యాలి.
3.వీరభద్ర ఆలయం – Veerabhadra Temple
గోకర్ణేశ్వర మహాబలేశ్వరుడి (ఆత్మలింగం) ఆలయం వెనుక వైపున వీరభద్ర ఆలయం కలదు. ఇక్కడి క్షేత్ర పాలకుడు యీయనే. ఇక్కడ గల వీర భద్రుడిని నీటితో అభిషేకించి పుష్పాలను సమర్పించాలి. ఇక్కడి వీరభద్రుడు తన పాదములను ఎడమ వైపుగా తిప్పిఉంచి సూర్య-చంద్ర సహితంగా ఉంటాడు.
3.సాక్షి గోకర్ణేశ్వర లింగం / శాస్త్రేశ్వర గోకర్ణ లింగం – Saakshi Gokarneshwara Linga / Shastreshwara Gokarna Linga
గోకర్ణేశ్వర మహాబలేశ్వరుడి (ఆత్మలింగం) ఆలయ ప్రాంగణం లోని అన్ని ఆలయాలను దర్శించిన అనంతరం చివరిగా సాక్షి గోకర్ణేశ్వరలింగాన్ని దర్శించాలి. ఇది తప్పని సరిగా దర్శించ వలసిన దేవాలయం. ప్రధాన దేవాలయానికి ఎడమ చేతి వైపు ఉంటుంది. మనం గోకర్ణయాత్ర చేసామనడానికి “సాక్షిభూతమే” యీ సాక్షి గోకర్ణేశ్వరలింగం.ఇక్కడ బిల్వాలను సమర్పించి జలాభిషేకం (నీటిని మనమే తీసుకుని వెళ్ళాలి)చెయ్యాలి.
గోకర్ణేశ్వర మహాబలేశ్వరుడి (ఆత్మలింగం) ఆలయ దర్శన నియమాలు మరియు వివిధ పూజల సమయం వివరాలు
విషయము వివరణ
డ్రస్ కోడ్ - వస్త్ర నియమాలు పురుషులు : Traditional Indian Dress (పంచె కండువా లేదా షర్ట్, బనియన్ లేకుండా) స్త్రీలు : Traditional Indian Dress (ఆధ్యాత్మిక వస్త్రధారణ)
అభిషేక సమయం ఉదయం 05:00 గంటల నుండి ఉదయం 08:00 గంటల వరుకు (ఇక్కడ సాధారణంగా Rs. 150/- క్షీరాభిషేకం చేయిస్తే సరిపోతుంది).అభిషేక సమయం లోనే మహాబలేశ్వర ఆత్మలింగాన్ని చేతితోతాకి స్పర్శదర్శనం కుడా చేసుకోవచ్చు.
స్పర్శదర్శన సమయం ఉదయం 05:00 గంటల నుండి ఉదయం 08:00 గంటల వరుకు. అభిషేక సమయం లోనే మహాబలేశ్వర ఆత్మలింగాన్ని చేతితోతాకి స్పర్శదర్శనం కుడా చేసుకోవచ్చు.
అలంకార దర్శనం ఉదయం 09:00 గంటల నుండి రాత్రి 08:00 గంటల వరుకు.
మహాహారతి - ప్రసాద దర్శనం రాత్రి 09:00 గంటల నుండి రాత్రి 09:30 గంటల వరుకు.
కేమ్రా/ వీడియో కేమ్రా వాడకం కేమ్రా & విడియో కేమ్రా వాడకం పూర్తిగా నిషేధము. కేమ్రా సెక్యురిటి వారికి కనిపిస్తే దానిలోగల ఫోటోలను చూసే అధికారం కలదు. కేమ్రా లో ప్రధాన దేవాలయానికి సంబంధించిన ఫోటోలు ఏవైనా ఉంటే కేమ్రా సీజ్ చేయబడుతుంది. అలాగే ప్రధాన దేవాలయం లోకి మొబైల్ ఫోన్లు తీసుకువెళ్ళడం నిషేధం.
దర్శన ప్రవేశ రుసుము పూర్తిగా ఉచితము
పూజలు అష్టోత్తర బిల్వపూజ: Rs.101/- క్షీరాభిషేక పూజ: Rs.151/- పంచామృతాభిషేక పూజ: Rs.251/- మహాపంచామృతాభిషేక పూజ & రుద్రాభిషేక పూజ కలిపి: Rs.351/- నవధాన్యాభిషేక పూజ: Rs.501/- రజితనాగాభరణ పూజ: Rs.1101/- స్వర్ణనాగాభరణ పూజ: Rs.1501/-
చిరునామా [Address] Sri Mahabaleswar Dev Samsthan, Gokarna (PO), Kumta (TQ), Uttara Kannada(UK) - 581326 Ph: 08386-257955 / 09482331354
(2) మహాగణపతి ఆలయం / సిద్ధగణపతి దేవాలయం
గోకర్ణ యాత్ర లో ముందుగా దర్శింప వలసిన దేవాలయం “మహాగణపతి” దేవాలయం. ముందుగా గోకర్ణ బీచ్ లో సముద్ర స్నానం చేసి మహాగణపతి ని గరిక తో పూజించి అనంతరం గోకర్ణేశ్వర మహాబలేశ్వర (ఆత్మలింగం) దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ ఉదయం పూట 08:00 గంటల లోపు అయితే గర్భ గుడిలోకి వెళ్లి ఎవరైనా అభిషేకంచేయించుకోవచ్చు. ఆ సమయంలో రావణుడు కోపంతో వినాయకుడి నెత్తిపై గట్టిగా మొట్టికాయ కొట్టగా ఏర్పడిన గుంటను చూడవచ్చు.
(3) తామ్రగౌరీ (పార్వతి) దేవాలయం
మహాబలేశ్వర ఆలయ వెనుక వైపున ఈ ఆలయం ఉంది. ఈమె మహాబలేశ్వరుని పత్ని. ఈమె బ్రహ్మదేవుని కుడిచేయినుండి ఉద్భవించిందని చెబుతారు. ఈ దేవి తపస్సు చేసి రుద్రుణ్ణి వివాహం చేసుకుంది. ఈ ఆలయం ఉదయం 06:00 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు, సాయంత్రం 05:00 నుంచి రాత్రి 08:30 వరకు తెరిచి ఉంటుంది. తామ్రగౌరీ పుట్టిల్లు తామ్రపర్వతం. అందువల్ల ఈమెని తామ్రగౌరీ అని పిలుస్తారు. ఇక్కడ పసుపు,కుంకుమ, పూలు, గాజులు, జాకెట్ గుడ్డ సమర్పించవచ్చు.
(4) భద్రకర్ణికా (భద్రకాళీ) దేవాలయం / మహాబలేశ్వర మహీషీ
లోకకంటకులైన ‘శుంభ – నిశుంభ’ లను సంహరించిన కాళిక, శివుని ఆజ్ఞ మేరకు గోకర్ణ వచ్చి అక్కడగల ‘కాళీహ్రుద’ అనే కోనేరులో తన రక్తపు ఆయుధాలను కడిగి దక్షిణదిక్కుగా గోకర్ణ పొలిమేరలలో ఊరిబైట ఉండి గోకర్ణకు రక్షణ (భద్రత) కోసం అక్కడే ఉండిపోయింది. అందువల్లనే ఈ తల్లిని భద్రకర్ణికా (భద్రకాళీ) దేవి అంటారు. ఈమెనే “మహాబలేశ్వర మహీషీ” అని కుడా పిలుస్తారు. ఈవిడ విష్ణు మాయవల్ల జన్మించింది.
(5) కోటితీర్ధము
ఇచ్చట అగస్త్యుడు ప్రతిష్టించిన ‘వరదేశ్వరశివలింగం’ కలదు. అలాగే ఈ తీర్ధము ‘గరుక్మంతుడు’ వల్ల ఏర్పడినది కాబట్టి ఇచ్చట ‘గరుడమండపం’ గలదు. ఒకప్పుడు కోటితీర్ధములో భక్తులు స్నానమాచరించే వారు. కాని ప్రస్తుతం ఆ పరిస్థితులులేవక్కడ. పితృతర్పణాలు ఇచ్చట పెట్టుకోవచ్చు. అలాగే ప్రతీ సంవత్సరం కోటితీర్ధము లోనే కార్తిక పౌర్ణమి రోజున గోకర్ణ మహాబలేశ్వరుని నౌకాయానం (తెప్పోత్సవం) జరుగుతుంది.
(6) కాలభైరవ దేవాలయము
శివుని ఆజ్ఞ మేరకు బ్రహ్మ యొక్క నాలుగవ తలను నరుకుతాడు కాలభైరవుడు. అందువల్ల కాలభైరవునకు ‘బ్రహ్మహత్యా పాతకం’ చుట్టుకుంటుంది. అప్పుడు కాలభైరవుడు రక్షించమని ఆదిశంకరుడిని వేడుకొనగా దానికి శివుడు “గోకర్ణలో ఆశ్రమం ఏర్పరచుకొని సముద్ర స్నానమాచరించిన నీ పాపం పూర్తిగా పోవును”అని చెప్పగా కాలభైరవుడు ఒక ఆశ్రమాన్ని గోకర్ణలో ఏర్పరచుకుంటాడు. అదే కాలభైరవ దేవాలయము. ఇది కోటితీర్ధము వద్ద గలదు. ఉదయం పూట అప్పుడప్పుడూ ఇక్కడ అఘోరాలను చూడవచ్చు.
(7) పట్ట వినాయక దేవాలయము
శివుని యొక్క ఆత్మలింగాన్ని రావణుడి రాజ్యానికి (లంకకు) చేరకుండా చాకచక్యంగా గోకర్ణలో భూమిమీద పెట్టిన వినాయకుడిని దేవతలందరూ అభినందించి రత్నపీఠము పై కూర్చుండబెట్టి సన్మానం చేస్తారు. ఆ సందర్భంగా శివుడు వినాయకుడి వ్రేలికి ఉంగరాన్ని తొడిగి “ఇకనుండి ఈ సన్మానం జరిగిన ప్రదేశంలోగల నిన్ను ‘చింతామణి వినాయకుడ’ ని పిలుస్తారు. నువ్వు గోకర్ణలో ఆగ్నేయ దిక్కుగా స్థావరం ఏర్పరచుకొని ‘పట్ట వినాయకుడు’ గా పిలవబడేదవని” ఆశీర్వదిస్తాడు. ఒకప్పుడు గోకర్ణ యొక్క మెయిన్ రోడ్డు ఆగ్నేయ దిక్కుగా పట్ట వినాయక దేవాలయము ప్రక్కగా ఉండేది. అప్పట్లో గోకర్ణకు వచ్చే వారంతా ముందుగా పట్ట వినాయకుడుని దర్శించుకునేవారు. పట్ట వినాయకుడినే ‘బట్టే వినాయకుడు’ అని కుడా పిలుస్తారు. పట్ట వినాయక దేవాలయము కోటితీర్ధము వద్ద గలదు.
(8) నాగదేవత దేవాలయము / నాగతీర్ధము
మహాగణపతి దేవాలయం నుండి కోటితీర్ధము వెళ్ళే దారిలో నాగదేవత దేవాలయము కలదు. ఒకప్పుడు ఇక్కడ సుందరమైన కోనేరు ఉండేది. ఇక్కడ నాగదోషం గలవారు ప్రతిష్టించిన అనేకానేక రకాలైన నాగదేవతలను చూడవచ్చు. నాగదేవత దేవాలయము లో ఉన్న శివలింగం పెద్దదిగా ఉండి అందరిని ఆకట్టుకుంటుంది. అలాగే ఇక్కడ ఒక గొప్ప దేవతా వృక్షం (అస్వత్థ) కుడా కలదు.
(9)శ్రీ వేంకటేశ్వర దేవాలయము
గోకర్ణ ప్రధాన వీధిలో ‘పాయ్ హోటల్’ సమీపంలో శ్రీ వేంకటేశ్వర దేవాలయము కలదు. శివుని యొక్క ఆత్మలింగాన్ని రావణుడి రాజ్యానికి (లంకకు) చేరకుండా చాకచక్యంగా గోకర్ణలో భూమి మీద పెట్టిన వినాయకుడిని అభినందించడానికి శ్రీలక్ష్మీ సమేతుడై వేంకటేశ్వరుడు గోకర్ణకు వచ్చినప్పుడు కొలువైఉన్న ప్రదేశమే ఇది.
(10) శ్రీగురు దత్తాత్రేయ దేవాలయము
గోకర్ణలో అనేక దత్తాత్రేయ దేవాలయములు కలవు. ఒకటి గోకర్ణ మహాబలేశ్వరుని (ఆత్మలింగం) ఆలయ ప్రాంగణంలో ఉంటే ఇప్పుడు చెబుతున్న ఈ దత్తాత్రేయ దేవాలయము శ్రీవేంకటేశ్వర దేవాలయమునకు అతి దగ్గరలో కుడి వైపుగల సందులో గలదు. ఇది ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో నడుస్తోంది. అతి మహిమగల దత్తాత్రేయ దేవాలయమిది.
(11) పితృస్థలేశ్వర్ / విధ్యుత పాపస్థలి
పితృకార్యక్రమాలు చేయవలసిన వారు / చెయ్యాలనుకునే వారు తప్పనిసరిగా ఇక్కడ పితృశ్రాద్ధములు పెట్టే తీరవలయును. తండ్రి చనిపోయిన కొడుకులు ఇక్కడ ఒక్కసారి పితృ శ్రాద్ధములు పెట్టిన వారి పితృపాపాలు మరియు శాపాలు పోయి నూతన జవసత్వాలతో కూడిన సంతతి పుడుతుంది. ఇది పితృ జన్యు కణముల లోని పాపమును హరింపగల ప్రదేశమవడం వల్ల దీనిని “విధ్యుత (విధ్యుతము = కడగడం) పాపస్థలి” అని కుడా పిలుస్తారు.
(12) రుద్రభూమి
“గోకర్ణ సర్వదావాసం మరణం ముక్తి మంటపే…రుద్ర భూమ్యాంతు దహనం కాంక్షతే విబుధా అపి”
గోకర్ణ క్షేత్రంలో దేవతలు సైతం దహనమగుటను కోరెదరు. అంతటి విలక్షణమైన రుద్రభూమి (స్మశానం) గల క్షేత్రం గోకర్ణ. మాములుగా శవ దహనానికి 80 KG ల నుండి 100 KG ల కర్రలు అవసరం పడతాయి. కాని ఇక్కడ శవ దహనానికి కేవలం 20 KG ల కర్రలు సరిపోతాయి. గోకర్ణ రుద్రభూమి (స్మశానం) లో తక్కువ కర్రలను (20 KG) వాడినా ప్రేతం (శవం) ‘ఫెళ ఫెళ’మంటూ బూడిద అయిపోతుందట. గోకర్ణ రుద్రభూమి (స్మశానం) అఘోరాలకు ముఖ్య స్థావరము.
చితాభస్మం యొక్క గొప్పదనాన్ని గురించి చెబుతూపోతే తెల్లారిపోతుంది, అంత గొప్పది ‘చితిబూడిద’. మీరు ‘ఉజ్జయినీ’ పేరు వినే ఉంటారు. అక్కడగల శివుడిని “మహాకాళేశ్వరుడు” అంటారు. అక్కడ ప్రతినిత్యం రహస్యంగా జరిగే ఒక తంతు మీకు చెబుతాను, దానిని బట్టి చితిబూడిద ఎంత గొప్పదో మీకే అర్ధమవుతుంది. ఉజ్జయినీ మహాకాళేశ్వరునికి శ్మశానం నుంచి అఘోరాలు తీసుకువచ్చే చితాభస్మంతో ప్రతీరోజూ అర్ధరాత్రి రెండు గంటలకు ‘భస్మాభిషేకం’ జరుగుతుంది. ఈ దేవాలయంలో ప్రతీ నిత్యం అర్ధరాత్రి రెండుగంటలకల్లా ‘మహాశ్మశానం’ నుంచి అఘోరాలు తీసుకువచ్చిన ‘తాజా వేడి వేడి చితాభస్మం’తో భస్మార్చన ప్రారంభమవుతుంది. ఆలయ సంప్రదాయం ప్రకారం ఈ అభిషేకాన్ని స్త్రీలు చూడకూడదు. అందువల్ల స్త్రీలకు ప్రవేశం లేదు. అర్ధరాత్రి రెండుగంటలకు ఈ దేవాలయానికి వెళ్ళిన పురుషులంతా ఈ భస్మాభిషేకం చూడచ్చు. పురుష జన్మయెత్తిన వాళ్ళంతా ఈ ‘భస్మాభిషేకం’ చూసి తీరాలన్నది నా మనవి. అలాగే ఇంకో రహస్యం చెబుతాను వినండి. ఎవరికైనా వారి తల్లి మరణించినప్పుడు, ఆవిడ దహనక్రియల అనంతరం ఏర్పడిన చితాభస్మాన్ని కొద్దిగా ఒక డబ్బాలో సేకరించి దానిని విభూదిగా ధరించిన కొడుకు ‘గోమాత’తో సమానము. వాడిలో సమస్త దేవతలు కొలువైఉంటాయి.
గోకర్ణ రుద్రభూమి (స్మశానం) ప్రత్యేకత
ఇక్కడ దేవతా (అవతార) దేహాలు దహనం చేయబడతాయి. ఇటువంటి స్మశానం మరెక్కడా లేదు. కాశీలో కుడా… తక్కువ కలపతో శవం బూడిదగా మారటానికి కారణం ఇక్కడి రుద్రభూమి (స్మశానం) లో ప్రవహించే ‘వెచ్చటి రుద్రశక్తి’. ఆ శక్తి ఇక్కడి స్మశానం ‘కాంపౌండ్’ వరుకు మాత్రమే ఉంటుంది. ఇది ఇక్కడి విచిత్రం. కుంభవృష్టిలో కుడా ఇక్కడ చితి ఆరకుండా మండుతుంది. నేను ఎన్నో స్మశానాలలో ఉన్నాను. చివరికి కాశీలో కుడా!.. కాని ఇక్కడి ‘వెచ్చటి అనుభూతి’ మిగతావాటిలో లేదు. ఇక్కడి ప్రేతాలు కుడా ఎంతో శక్తివంతమైనవి. ఒకటే గుర్తు శక్తివంతం కాని స్మశానాలను అసలు మేము సాధనాస్థలాలుగా ఎంచుకోము. దీని తరువాత రెండవ శక్తివంతమైన రుద్రభూమి (స్మశానం) మైసూర్ చాముండీ కొండల సమీపంలో ఉంది. మూడవ శక్తివంతమైన రుద్రభూమి (స్మశానం) ఉజ్జయినీ లో ఉంది. ఇక నాలుగవ శక్తి వంతమైన రుద్రభూమి కాశీ లో గలదు.
(13) రామతీర్ధం మరియు శ్రీ శాండిల్య మహారాజ్ మహాసమాధి
రావణసంహారం అనంతరం రావణాసురుడు ‘బ్రాహ్మణుడు’ అని రాముడు తెలుసుకున్నాడు. బ్రాహ్మణుడిని తెలిసి చంపినా తెలియకుండా చంపినా ‘బ్రహ్మహత్యాపాతకం’ తప్పనిసరి. అందుకు బాధపడిన శ్రీరాముడు దోషపరిహారార్ధం గోకర్ణ చేరి శతశృంగీ పర్వతపాదాల వద్ద ఒక శివలింగాన్ని ప్రతిష్టించి ‘బ్రహ్మహత్యాపాతక’ దోషం నుండి బైటపడతాడు. ఎక్కడైతే రాముడు శివలింగాన్ని ప్రతిష్టించాడో ఆ ప్రదేశాన్ని ‘రామతీర్ధము’ అంటారు. ఈ రామతీర్ధము కాలక్రమేణా జీర్ణస్థితి లోకి రాగా ‘శాండిల్య మహారాజ్’ అనే ఒక యోగి వచ్చి (ఖంబారవాడి వాస్తవ్యులు) రామతీర్ధాన్ని బాగుచేయించి అక్కడే ముక్తిని పొందారు. కనుక ప్రస్తుతం వారి సమాధి కుడా రామతీర్ధమునందే చూడవచ్చు. రామతీర్ధములో నిరంతరంగా వచ్చే ఒక జలధార
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
ప్రాంజలి ప్రభ
శ్రీ లక్ష్మీనృసింహస్వామి క్షేత్రం......లింబాద్రి
నిజామాబాద్ జిల్లాలోని లింబాద్రి గుట్ట తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ దేవాలయం. పచ్చని కొండల నడుమ ప్రకృతి రమణీయత మధ్యన అలరారే ఈ క్షేత్రంలోని స్వయంభూ శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారిని సందర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తారు. ఏటా కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కార్తీక పౌర్ణమి రోజున జరిగే రథోత్సవానికి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడాభక్తులు వస్తారు.
భీమ్‌గల్ మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో లింబాద్రి గుట్ట ఉంది. రెండంతస్తుల గుట్ట ఇది. మొదటి అంతస్తుపైకి మెట్ల మార్గం, రహదారి మార్గం ఉన్నాయి. మొదటి అంతస్తులో శ్రీవారి మాడ వీధులు, కమలా పుష్కరిణి, కళ్యాణ మంటపం, రథం గుడి, అయోధ్య ఆంజనేయ స్వామి ఆలయం ఉంటాయి. రెండవ అంతస్తులో లోతైన రాతి గుహలో కొలువుదీరిన స్వామి వారి మూల విరాట్టు ఉంది. ఈ స్వామిని దర్శించుకోవడానికి ఇరుకైన గుహ మార్గం గుండా వెళ్లాలి. ఈ గుహ మార్గం ప్రవేశ ద్వారం వద్ద జోడు లింగాలు ఉంటాయి. గుహమార్గం ద్వారా వంగుని 250 మీటర్లు వెళితే రాతి గుహలతో ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన గర్భాలయంలో శ్రీ లక్ష్మీనృసింహ స్వామి వారి మూల విరాట్టు, పక్కనే నరనారాయణుల (కృష్ణార్జునుల) విగ్రహాలు కనువిందు చేస్తాయి.
శాంత నరసింహుడు
సాధారణంగా ఏ నరసింహ క్షేత్రంలో చూసినా స్వామి వారి విగ్రహం ఉగ్ర రూపంతో ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం తొడపైన లక్ష్మీదేవిని కూర్చోబెట్టుకుని శాంత రూపంలో దర్శనమిస్తాడు.
స్వయంభూ నరసింహ క్షేత్రం
శ్రీ లక్ష్మీ నరసింహుడి స్వయంభూ క్షేత్రాలలో ఇదొకటి. బ్రహ్మదేవుడు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ సమయంలో పార్వతి పాదాలను చూడడంతో కోపోద్రిక్తుడైన ముక్కంటి తన గోటితో బ్రహ్మ ఐదవ తలను తొలగించాడని పురాణం చెబుతుంది. దీంతో బ్రహ్మ ఇక్కడే తపమాచరించి శ్రీహరిని నరసింహుడిగా సాక్షాత్కరించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. దీంతో లక్ష్మీసమేతుడుగా స్వామి వారు ఇక్కడే వెలియడం అరుదైన విషయమని చెబుతారు.
పవిత్ర బద్రీనాథ్ క్షేత్రం తర్వాత గర్భాలయంలో స్వామి వారి మూలవిరాట్టు పక్కన నరనారాయణుల విగ్రహాలు ఇక్కడ మాత్రమే∙ఉన్నాయి. దీంతో ఈ క్షేత్రానికి దక్షిణ బద్రీనాథ్‌గా విశిష్టత వచ్చింది.
జోడులింగాలు
పరమశివుడు తనకు సంప్రాప్తించిన బ్రహ్మహత్యా దోష నివారణకై తపమాచరించి దోష విముక్తుడై శ్రీవారి ఆజ్ఞచే ఈ క్షేత్రంలోనే జోడు లింగాల రూపాన వెలిసాడట. ఇందుకు ప్రతీకగా గర్భాలయ మార్గ ప్రవేశ ద్వారం వద్ద భక్తులకు జోడు లింగాలు దర్శనమిస్తాయి. యముడు ఈ క్షేత్రంలో బిల్వవృక్ష రూపంలో తపమాచరించి శాంతి పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇంద్రుడు ఈ క్షేత్రంలో స్వామిని కమలాలతో పూజించి శాప విముక్తుడైనాడట.
అయోధ్య హనుమాన్
శ్రీరాముని ఆజ్ఞతో కవి పుంగవుడైన హనుమంతుడు ఇక్కడకు వచ్చి తపమాచరించి నరసింహుని రూపంలో ఉన్న శ్రీరాముని దర్శించాడట. అందుకే కొండ దిగువ ప్రాంతంలో క్షేత్ర పాలకుడైన అయోధ్య హనుమాన్ ఆలయం కనిపిస్తుంది.
కమలా పుష్కరిణి
ఇక్కడి పుష్కరిణికి కమలా పుష్కరిణిగా పేరు. సతీ విక్రయ దోషనివారణకై సత్య హరిశ్చంద్రుడు నరసింహుని సేవించి తరించాడట. నరనారాయణులు సన్నిధానంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారట. ధర్మరాజు ఈ క్షేత్రాన్ని దర్శించి కృతార్థుడైనట్లు, ప్రహ్లాదుడు తపమాచరించినట్లు పురాణకథనం.
ఈ ప్రాంతంతో పాటు జిల్లా, పక్క జిల్లా అయిన రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్ జిల్లాలో అడుగడుగునా లింబాద్రి, లింబన్న, లింబయ్య, నర్సింహులు, నర్సయ్య, నర్సయ్య, నర్సింగ్ తదితర పేర్లు గల వ్యక్తులు తారసపడతారు. మండలంలో అడుగుడుగునా ఈ పేర్లు గల వాళ్లు కనబడతారు.
హైదారాబాద్ నుండి నేరుగా ఆర్మూర్ వరకు బస్సులో రావచ్చు. నిజామాబాద్ జిల్లా కేంద్రం నుండి ఆర్మూర్ వరకు 25 కి.మీ. అక్కడి నుండి భీమ్‌గల్ మండల కేంద్రానికి 25 కిలోమీటర్లు. భీమ్‌గల్ నుండి 5 కిలో మీటర్ల దూరంలోని లింబాద్రి గుట్టకు బస్సులు, ఆటోలు, ఇతర వాహనాల ద్వారా చేరుకోవచ్చు. బ్రహ్మోత్సవాల సమయంలో మాత్రమే దేవాలయం బస సౌకర్యం కల్పిస్తుంది.
*****
పూజ-పరమార్థాలు
పూజ --> పూర్వజన్మవాసనలను నశింపచేసేది. జన్మమృత్యువులను లేకుండాచేసేది సంపూర్ణఫలాన్నిచ్చేది.
అర్చన--> అభీష్ట ఫలాన్నిచ్చేది చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది, దేవతలను సంతోషపెట్టేది.
జపం--> అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది, పరదేవతను సాక్షాత్కరింప చేసేది జపం.
స్తోత్రం--> నెమ్మది నెమ్మదిగా మనస్సు కి ఆనందాన్ని కలిగించేది, సాధకుని తరింపజేసేది స్తోత్రం.
ధ్యానం--> ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో నియమింప చేసేది, ఇష్టదేవతను చింతింపచేసేది ధ్యానం.
దీక్ష--> దివ్యభావాలను కల్గించేది, పాపాలను కడిగివేసేది, సంసార బంధాలనుండి విముక్తిని కల్గించేది దీక్ష.
అభిషేక:--> అహంభావాన్ని పోగొట్టేది, భయాన్ని మథించేది, పవిత్రోదకాన్నిచల్లేది, ఆనందాదులను కల్గించేది.
మంత్రం--> తత్త్వం పై మననం చేయడం వల్ల భయాల నుండి రక్షించేది మంత్రం.
ఆసనం--> ఆత్మసిద్ధి కల్గించేది, రోగాలను పోగొట్టేది, క్రొత్తసిద్ధిని, లేదా నవసిద్ధులను కల్గించేది ఆసనం.
తర్పణం--> పరివారంతో కూడిన పరతత్త్వానికి క్రొత్త ఆనందాన్ని కల్గించేది.
గంధం--> అంతంలేని దౌర్భాగ్యాన్ని, క్లేశాన్ని నశింపుచేసేది ధర్మఙ్ఞానాలనిచ్చేది.
అక్షతలు--> కల్మషాలను పోగొట్టడం వల్ల తత్ పదార్ధంతో తదాత్మ్యాన్ని కల్గించేవి.
పుష్పం--> పుణ్యాన్నివృద్ధిచేసేది, పాపాన్ని పోగొట్టేది, పుష్కలార్ధాన్ని ఇచ్చేది.
ధూపం--> చెడువాసనలవల్ల వచ్చు అనేక దోషాలను పోగొట్టేది, పరమానందాన్ని ప్రసాదించేది.
దీపం--> సుదీర్ఘమైన అఙ్ఞానాన్ని పొగొట్టేది, అహంకారం లేకుండా చేసేది, పరతత్త్వాన్ని ప్రకాశింప చేసేది.
నైవేద్యం--> ఆరు రుచులతో నున్న నాల్గు విధాల పదార్ధాలను,దేవతకు తృప్తినిచ్చేదానిని నివేదన చేయుటయే.
ప్రసాదం--> ప్రకాశానందాల నిచ్చేది, సామరస్యాన్ని కల్గించేది, పరతత్త్వాన్ని దర్శింపచేసేది ప్రసాదం.
ఆచమనీయం--> లవంగ, జాజి, తక్కోలములతోకూడిన ద్రవ్యం ఆచమనీయం .
ఆవాహనం--> పూజ కొరకు దేవతను పిలుచుటయే ఆవాహనం.
స్వాగతం--> దేవతను కుశలప్రశ్నవేయుట.
పాద్యం--> చామలు, గరికలు, పద్మాలు, విష్ణుక్రాంతలతో కూడిన ద్రవ్యం పాద్యం, పాదాలు కడుగుటకు ఇచ్చే జలం.
మధుపర్కం--> తేనె, నెయ్యి, పెరుగులతో కూడినది.
స్నానం--> గంధం, కస్తూరి, అగరు మొవాటితో స్నానం.
వందనం--> అష్టాంగాలతో కూడిన నమస్కారం వందనం ఉరస్స(వక్షస్థలం,
శిరస్సు, మనస్సు, మాట, పాదాలు, కరములు, కర్ణాలు, నేలకుతాకించి చేసే వందనం సాష్టాంగం).
ఉద్వాసన--> దేవతను, ఆవరణ దేవతలను పదహారు ఉపచారాలచే పూజించి పంపడాన్ని ఉద్వాసనమని అంటారు.
*******
దత్తాత్రేయుడు - పంచభూతాలు!
తాను 24మంది గురువుల నుంచి జ్ఞానాన్ని పొందానని చెబుతారు దత్తాత్రేయులవారు. వాటిలో పంచభూతాలు కూడా ఉన్నాయి. వాటి నుంచి దత్తాత్రేయులవారు గ్రహించిన విషయాలు ఇవీ...
భూమి: తన మీద ఉండే చరాచరాలన్నింటికీ భూమి ఆధారంగా నిలుస్తోంది. తన గుండెలను నాగళ్లతో తవ్వుతున్నా పంటలను కానుకగా అందిస్తుంది. అగ్నిపర్వతాలు పేలుతున్నా ముందుకు కదులుతూనే ఉంటుంది. యుద్ధంలోనైనా, శాంతి వర్ధిల్లుతున్నా నిశ్చలంగానే ఉంటుంది. సహనం అన్న లక్షణం గురించి చెప్పేటప్పుడు భూమాతనే ఉదాహరణగా ఎంచుతారు. అందుకే సహనం, ప్రేమ, నిబద్ధతలకు మారుపేరైన భూమిని తన తొలి గురువుగా ఎంచుతారు దత్తాత్రేయులు.
గాలి: గాలిలో ఎన్నో అంశాలు కలుస్తూ ఉంటాయి. ఒకోసారి అది చెడు వాసనలను మోసుకువెళ్తుంది. మరోసారి సువాసనలను వెదజల్లుతుంది. కానీ అదంతా తాత్కాలికమే. తిరిగి తన నిజరూపానికి చేరుకుంటుంది. ఆ నిజ రూపంలో గాలికి ఎటువంటి రంగూ, రుచీ, వాసనా ఉండవు! అలాగే మనిషిని కూడా ఈ లౌకిక ప్రపంచంలో ఎన్నో లక్షణాలు చుట్టుముట్టినా, అతని నిజరూపమైన ఆత్మ పరిశుద్ధంగా ఉండాలని అంటారు దత్తాత్రేయులు. అందుకే వాయువుని తన రెండవ గురువుగా ఎంచారు.
ఆకాశం: ఆకాశంలో ఒకోసారి దట్టమైన మేఘాలు కమ్ముకుంటాయి. మరోసారి ఇంద్రధనుస్సులు వెలుస్తాయి. ఒకోసారి చంద్రుని కాంతులతో వెలిగిపోతుంది. మరోమారు చీకట్లతో నిండిపోతుంది. తనలో ఎన్ని రంగులు మారుతున్నా, తాను మాత్రం నిశ్చలంగానే ఉంటుంది ఆకాశం! జీవితం అనే నాటకరంగంలో కూడా ఎన్ని ఘట్టాలు గడుస్తున్నా, తాను మాత్రం ఆకాశంలాగా నిమిత్తమాత్రునిగా ఉండాలని అంటారు దత్తాత్రేయులు. అందుకే ఆకాశాన్ని తన మూడవ గురువుగా పేర్కొన్నారు.
అగ్ని: జీవుల ఆహారాన్ని దహించే జఠరాగ్ని నుంచి సముద్రపు లోతుల్లో ఉండే బడబాగ్ని వరకూ అగ్ని లేని చోటు లేదు. చిన్న నిప్పుకణిక దగ్గర్నుంచీ, అడవిని దహించే దావానలం వరకూ అది తీసుకోని రూపం లేదు. తాను ఏ వస్తువునైతే దహిస్తోందో అదే రూపంలో ఉంటుంది అగ్ని. చిన్నాపెద్దా, చెట్టూచేమాలాంటి బేధాలేవీ దానికి ఉండవు. ఒకసారి మొదలుపెట్టాక దహించడమే దాని పని. యోగి కూడా తనను శరణు కోరే సంసారుల పాపాలను దహించివేస్తాడు. అంతేకాదు! ఈ శరీరం అనే కట్టె దహించుకుపోయాక మిగిలేది బూడిదే అన్న శాశ్వతసత్యాన్ని కూడా తెలుసుకుంటాడు. అందుకే దత్తాత్రేయులు తన నాలుగో గురువుగా అగ్నిని పేర్కొన్నారు.
నీరు: ఆహారం లేకుండానైనా మనిషి కొద్ది వారాలు బతకగలడు కానీ, నీరు లేకుండా కొన్ని రోజులు మించి ఉండలేడు. ఆ ఆహారాన్ని పండించేందుకు కూడా నీరు ఉండాల్సిందే! కులమతాలకూ, జాతిబేధాలకూ, పరువుప్రతిష్టలకు అతీతంగా నీరు ప్రతి ఒక్కరి దాహాన్నీ తీరుస్తుంది. కానీ తాను మాత్రం అందుకు గర్వపడకుండా దిగువకే ప్రవహిస్తుంటుంది. ఒక యోగి కూడా ఈ ప్రపంచం యావత్తు మీదా తన కరుణను ప్రసరిస్తూనే, భగవంతుని పట్ల వినయవిధేయతలతో ఉండాలి. అందుకే దత్తాత్రేయులు నీరుని కూడా తన గురువుగా భావించారు.
--(())--
ధారేశ్వర ఆలయం
ఈ ఆలయం గోకర్ణానికి దక్షిణదిక్కున సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఆత్మలింగానికి సంబంధించిన లింగం. ఈ ఆలయం చాళుక్య, హోయిసల శిల్పశైలిలో కనబడుతుంటుంది. దీనిని పదకొండవ శతాబ్దంలో పునర్నిర్మించినట్లు చెప్పబడుతోంది. ఈ ఆలయం ఉదయం ఆరుగంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిదిగంటల వరకు తెరచి ఉంటుంది.
గుణవంతేశ్వర ఆలయం
ఈ ఆలయం కూడ గోకర్ణ ఆత్మలింగానికి సంబంధించిన క్షేత్రంగా చెప్పబడుతోంది. ఇది గోకర్ణం నూంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం ఉదయం ఆరుగంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరచిఉంటుంది.
మురుడేశ్వర ఆలయం
పంచలింగాల క్షేత్రాలలో ఇది కూడ ఒకటి. ఈ భారీ ఆలయం భక్తులను విపరీతంగా ఆకర్షిస్తుంటుంది. ఇది గోకర్ణక్షేత్రానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం ఆరు గంటల నుండి తెరచి ఉంటుంది.
--((**))--
గోకర్ణంలో ప్రధానాలయం శ్రీ మహాబలేశ్వరాలయం. ఈ ఆలయంలో స్వామిని దర్శించుకునే ముందు భక్తులు కోటితీర్థంలో స్నానం చేస్తారు. కోటితీర్థంలో స్నానం చేస్తే సమస్తరోగాలు నయమవుతాయని ప్రతీతి. కోటితీర్థంలో స్నానం చేసిన తరువాత భక్తులంతా ప్రక్కనున్న సముద్రంలో స్నానం చేస్తారు. ఆలయానికి ప్రక్కనున్న అరేబియా సముద్రంలో స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మిక. కోటితీర్థానికి దక్షిణం వైపు అగస్త్యులవారిచే ప్రతిష్ఠింప బడిన వరటేశ్వరలింగం ఉంది. ఈ ఆలయము భక్తుల సౌకర్యార్థం
ఇరవైనాలుగు గంటలూ తెరువబడే ఉంటుంది.
*పంచ సరోవరాలు దేవాలయాలు.. (సేకరణ)
మన సంసృతి సంప్రదాయాలలో తీర్థయాత్రలకు చాలా ప్రాముఖ్యత వుంది. ప్రస్తుతం తీర్థం అంటే ఓ క్షేత్రమనే అర్థాన్నే అన్వయించుకుంటున్నాము. అయితే వేద కాలంలో తీర్థమనే పదానికి సరస్సు అర్థం కూడ ఉండేది. అలా తీర్థాలకు చేసే యాత్రలనే తీర్థయాత్రలని పిలుచుకుంటున్నాం. దేశంలో ఎన్నో సరోవరాలు ఉండగా, వాటిలో ఐదు 'పంచ సరోవరాలు' గా ప్రసిద్ధికెక్కాయి. అవి:
1. మానస సరోవరం
2. పంపా సరోవరం
3. పుష్కర్ సరోవరం
4. నారాయణ సరోవరం
5. బిందు సరోవరం
1. మానస సరోవరం
సమస్త లోకాలలో మానస సరోవరం వంటి పవిత్ర సరోవరం మరొకటి లేదన్నది వాస్తవం. ఈ సరోవరం బ్రహ్మదేవుని మనస్సు నుంచి ఉద్భవించింది. అందుకే దీనిని గతంలో 'బ్రహ్మసరం' అని పిలిచేవారు. ఇది ఎన్నో పవిత్ర నదులకు పుట్టినిల్లు. ఈ సరోవరం చెంతనే గంగను దివి నుంచి భువికి తెప్పించడానికి భగీరథుడు తీవ్రమైన తపస్సు చేశాడు. మన పురాణాలలో మానస సరోవర ప్రస్తావన అక్కడక్కడా కనిపిస్తూంటుంది. ఈ సరోవరాన్ని బ్రహ్మదేవుడు ఆది దంపతుల కోసం సృష్టించాడని పురాణ కథనం.
ఒకసారి బ్రహ్మమానస పుత్రులైన సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు పన్నెండు మంది పరమశివుని ప్రశన్నం చేసుకోవడానికి ఘోరమైన తపస్సు చేశారు. వారి తపస్సు సుమారు పన్నెండు సంవత్సరాల పాటు సాగింది. అదే సమయంలో ఆ పన్నెండేళ్ళపాటు ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలలో తీవ్రమైన దుర్బిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. దగ్గర దాపుల్లోని జలవనరులన్నీ ఎండి పోవడంతో మునులందరూ నిత్యం స్నానాదికాల కోసం మందాకినీ నది దాకా వెళ్లాల్సి వచ్చేది. పన్నెండు సంవత్సరాలు ముగుస్తున్న సమయంలో బ్రహ్మమానస పుత్రులకు ఆది దంపతుల సాక్షాత్కారం లభించింది. అప్పుడు ఆది దంపతులను పూజించడానికి ఆ దరిదాపుల్లో నీరు లేకపోవడంతో, మునులందరూ తమ తండ్రియైన బ్రహ్మదేవుని నీటికోసం ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు తన సంకల్పంతో ఒకసరస్సు సృష్టించాడు. హంస రూపంలో తానే స్వయంగా సరస్సులో ప్రవేశించాడు. అలా ఆ సరస్సు ఏర్పడుతున్నప్పుడే అందులోంచి ఒక బ్రహ్మాండమైన శివలింగం ఉద్భవించిందట. అలాగే మనం పూజలు చేస్తూ సంకల్పం చెప్పుకుంటున్నప్పుడు, 'జంబు ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, అని సంక్పలం చెబుతూంటాం. ఈ జంబూ ద్వీపం అఖండ భారతావనిని సూచిస్తుంటుందని చెబుతున్నారు.
ఈ పేరు రావడానికి వెనుక కూడ ఓ కథ వుంది. పూర్వం ఈ సరోవరం మధ్యలో ఓ చెట్టు ఉండేదట. ఆ చెట్టులో ముగ్గిన పండ్లు నీటిలో పడుతున్నప్పుడు 'జం' అనే శబ్దం వస్తుండేదట. అందుకే ఈ సరోవరం చుట్టు ప్రక్కల ప్రాంతాలను జంబూలింగ ప్రదేశమని పిలువసాగారట. అలా మన ప్రాంతానికి జంబూద్వీపమనే పేరు ఏర్పడిందట. కాబట్టి, జంబూద్వీపమనే పేరు రావడానికి కూడా కారణం మానస సరోవరమేనని తెలుస్తోంది. మానస సరోవరం గురించి భారతావనిలో పుట్టిన ప్రతి మతం ఓ కథను చెబుతూ వుండడం విశేషం. ఉదాహరణకు జైనమతం కథనం ప్రకారం, ఇక్కడ జైనుల ప్రథమ తీర్థంకరుడైన ఆదినాథ ఋషభదేవుడు ఈ సరోవర పరిసరాలలో నిర్వాణం చెందాడని చెప్పబడుతోంది. ఇక, బౌద్ధ గ్రంథాలు మానస సరోవరాన్ని అనోత్తత అని పేర్కొంటున్నాయి. ఈ పదానికి వేడి, బాధ లేని సరస్సు అని అర్థం. ఈ సరస్సు మధ్యలో ఉన్న చెట్టున పూచే పువ్వులూ, కాయలు చాలా రకాల వ్యాధులను నయం చేస్తాయని బౌద్ధుల నమ్మకం. అలాగే మానస సరోవరంలో చాలా పెద్ద తామరపువ్వులు పూస్తాయనీ, బుద్ధుడు, బోధిసత్త్వలు ఆ పువ్వులపై కూర్చునేవారని కథనం. బుద్ధుని జన్మ వృత్తాంత కథలో కూడ ఈ సరస్సు ప్రస్తావన కనిపిస్తుంది.
మరో కథనం ప్రకారం, మానస సరోవరం చుట్టూ ఏడు వరుసల్లొ చెట్లు, దాని మధ్యలో ఓ పెద్దభవనం ఉండేదట. సరోవర మధ్యలో కల్పవృక్షం ఉండేదట. నాగులు ఆ చెట్టుకు కాసే కాయలను తింటుండేవారట. నాగులు తినకుండా వదిలేసిన కాయలు, సరస్సు అడుగు భాగానికి చేరుకుని బంగారంగా మారాయని చెబుతూంటారు.
ఈ మానస సరోవరం శక్తిపీఠాలలో ఒకటని కూడ చెప్పబడుతోంది. 51శక్తి పీఠాలలో మానస సరోవరం కూడా ఒకటి. దక్షయజ్ఞం సమయంలో తండ్రి చేసిన అవమానాన్ని భరించలేకపోయిన సతీదేవి ప్రాణత్యాగం చేస్తుంది. ఆ ఉదంతాన్ని విన్న పరమశివుడు అగ్రహోదగ్రుడై శివగణాలను పంపి, దక్షయజ్ఞ వాటికను ధ్వంసం చేస్తాడు. సతీదేవి వియోగాన్ని భరించలేకపోయిన ఆ స్వామి, అ తల్లి కళేబరాన్ని భుజంపై ఉంచుకుని ఆవేశంతో తిరగసాగాడు. ఫలితంగా లోకాలన్నీ కల్లోలంలో కూరుకుపోయాయి. అప్పుడు దేవతలంతా విష్ణుమూర్తితో మొర పెట్టుకోగా, విష్ణుదేవుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సతీదేవి కళేబరాన్ని ముక్కలుముక్కలుగా చేస్తాడు. అప్పుడు ముక్కలైన సతీదేవి శరీరభాగాలు ఒక్కొక్క చోట పడతాయి. అలా సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలే శక్తి పీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ సతీదేవి కుడిహస్తం పడిందని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి.
మానస సరోవరాన్ని తాకినా, స్నానమాచరించినా బ్రహ్మలోకం చేరుకుంటారనీ, ఆ సరోవర జలాన్ని తాగిన వారికి శివలోక ప్రాప్తి కలుగుతుందని పురాణ వచనం. మానస సరోవర పరిక్రమ మరో గొప్ప సాధన. మానస సరోవరంలో స్నానమాచరించి, పితృదేవతలకు తర్పణాలు వదలడం, సరోవర తీరంలో హోమం చేయడం వల్ల పితృదేవతలకు ఉత్తమగతులు సంప్రాప్తిస్తాయి. ఈ సరస్సులోని నీటికి అద్భుత చికిత్సా గుణాలున్నాయని పెద్దలు చెబుతారు. అదేవిధంగా మానస సరోవరం దగ్గర దొరికే కొన్ని రాళ్ళు 'ఓం' ఆకారంలో ఉంటుండటం విశేషం.
ఇంతటి మహిమాన్వితమైన మానస సరోవరం సముద్ర మట్టానికి సుమారు 14,900 అడుగుల ఎత్తులో ఉంది. ఈ సరోవరం చుట్టుకొలత దాదాపు 54 మైళ్ళు అని అంటారు. 200 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో పరుచుకుని ఉన్న ఈ సరోవరం సుమారు 300 అడుగుల లోతు ఉంటుంది.
చాలామంది మానస సరోవర పరిక్రమను చేయడానికి ఉత్సుకతను చూపిస్తుంటారు. మానస సరోవర తీరంలోని ఎనిమిది బౌద్ధ మఠాలు మీదుగా పరిక్రమనం చేయాలంటే, దాదాపు 110 కి.మీ దూరం నడవాల్సి ఉంటుంది. సరోవర తీరం వెంబడి నడిస్తే 90 కి.మీ దూరం మాత్రమే ఉంటుంది. ఈ పరిక్రమను చేయడానికి దాదాపు రెండు రోజుల సమయం పడుతుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఈ పరిక్రమకు దాదాపు నాలుగైదు రోజులు సమయం కూడా తీసుకుంటుంది. ప్రదక్షిణా మార్గం దుర్గమంగా ఉంటుంది. మార్గమధ్యంలో అనేక సెలయేర్లను, నదులను దాటాల్ని ఉంటుంది. సాధారణంగా పరిక్రమణ కార్యక్రమాన్ని వేసవి కాలంలోనే పెట్టుకుంటుంటారు. గతంలో నడుస్తూనే పరిక్రమ చేసేవారు... ప్రస్తుతం రహదారుల సౌకర్యం ఏర్పడతంతో వాహనాల ద్వారానే పరిక్ర్తమ చేస్తున్నారు. ఈ యాత్ర అత్యంత కష్టంతో కూడుకున్నది. పరమశివుని అనుగ్రహానికి ఆ మాత్రం కష్టపడక తప్పదుగా. మానస సరోవరం ఒకప్పుడు భారతావనిలో భాగాలే అయినప్పటికీ, ప్రస్తుతం టిబెట్టులో ఉన్నాయి. ప్రస్తుతం టిబెట్ చైనా అధీనంలో ఉన్నది కనుక, మానస సరోవర యాత్ర ఓ విధంగా విదేశీ యాత్రను చేసినట్లే అవుతోంది. ఆవిధంగా ఆ యాత్ర చేయడానికి అయ్యే ఖర్చు కూడా అధికంగానే ఉంటోంది. శ్రమ కూడా అధికం.
ఈ యాత్రకు సంబంధించి భారత ప్రభుత్వం ప్రచార సాధానాలలో ప్రకటనలు ఇస్తారు. ఇలా భారత ప్రభుత్వం ద్వారా యాత్ర చేస్తోంటే, ఆ యాత్ర రక్షణ బాధ్యత అంతా ప్రభుత్వమే వహిస్తుంటుంది. ఈ యాత్రను చేయదలచుకున్నవారు 'అండర్ సెక్రెటరీ (చైనా), విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారిని సంప్రదించాల్సి ఉంటుంది. ముందుగా వచ్చినవాళ్లకు ముందు అన్న ప్రాతిపదికన ఆ కార్యాలయం దరఖాస్తులను స్వీకరిస్తుంది. మరికొంత మంది నేపాల్ రాజధాని ఖాట్మంటు మార్గం ద్వారా యాత్రను చేస్తుంటారు. అయితే ఆ యాత్రలో అంతగా సౌకర్యాలు ఉండవన్నది యాత్రలు చేసి వచ్చిన యాత్రీకులు చెబుతున్న విషయాలు. శ్రమదమాదులను ఓర్చుకుంటూ ముందుకు సాగే మానస సరోవర యాత్ర ద్వారా సహనం, కృతనిశ్చయం, మౌనం వంటి గుణాలు అలవడతాయి.
2. పంపా సరోవరం
పంపా సరోవరం కర్ణాటక రాష్ట్రంలో హంపిలో ఉంది. ఆ సరోవరం రామాయణ కాలం నాటిదని ప్రతీతి. ఇక్కడ భక్త శబరి ఉండేదట.
ఆ కథ ప్రకారం, ఒక బోయకాంత అయిన శబరి, పంపానదీ తీరంలో మాతంగ మహర్షి శిష్యులకు సేవలు చేస్తూండేది. వారు శబరికి రామలక్ష్మణులు ఇక్కడకు వస్తారని చెప్పారు. అప్పటినుంచి శబరి అక్కడే నివశిస్తూ రాముని రాక కోసం ఎదురు చూస్తూండేది.
సీతాన్వేషణలో కబంధుని సూచనను అనుసరించి రామలక్ష్మణులు పంపా సరోవర తీరానికి చేరుకున్నారు. రామలక్ష్మణులను చూసిన వెంటనే సంతోష పులకాంకితురాలైన శబరి ఆయన పాదాలకు నమస్కరించింది. ఆ అన్నదమ్ములకు అర్ఘ్యపాద్యాదులతో మర్యాదలు చేసింది. వారి కోసం తాను సేకరించిన ఫలాలను అందించింది. "శ్రీ రామచంద్రమూర్తి.! మీ దర్శనం వలన నా జన్మ ధన్యమైంది. నా తపస్సు ఫలించింది. నాకు ఇప్పటికి తపః సిద్ధి కలిగింది. నా గురుసేవ సఫలీకృతమైంది. ఓ పురుషోత్తమా! నీవు దేవతలందరిలోను శ్రేష్ఠుడవు. నాకిప్పుడు నిన్ను పూజించే భాగ్యం కలిగింది. నాకు ఇక స్వర్గం సిద్ధించినట్లే. ఓ రామా! నీ చల్లని చూపుల వల్ల నేను పరిశుద్దురాలి నయ్యాను. నీ అనుగ్రహం వలన దివ్య లోకాలకు చేరుకుంటాను. స్వామీ, మాతంగ ముని శిష్యులకు సేవ చేస్తూండేదానిని. అప్పుడు వారు, మీరు ఇక్కడకు వస్తారని చెప్పారు. అప్పట్నుంచీ మీకోసం ఎదురు చూస్తూ, పండ్లు ఫలాలు సేకరించి పెడుతున్నాను. కాబట్టి నువ్వు నీ తమ్ముడు నా ఆతిథ్యాన్ని స్వీకరించాలి" అని అభ్యర్థించగా, శ్రీరాముడు "శబరీ! కబంధుడు నీ గురించి, నీ గురువుల గురించి చెప్పారు. నాకు ఇక్కడి వనాల మహిమలను గురించి తెలుపవలసింది" అని శ్రీరాముడు అడగడం ఆలస్యమన్నట్లుగా, శబరి ఆ విశేషాలను చెప్పసాగింది.
"ఓ రామా! మేఘ సమూహాల వంటి వృక్షాలతో, నానావిధ పక్షి గణాలతో ఈ మతంగ వనం అత్యంత ప్రసిద్ధి చెందింది. ఇక్కడే మునులు తమ ఆశ్రమాలను ఏర్పాటు చేసుకుని తపస్సులను చేసేవారు. వారి తపః ప్రభావం వలన ఈ ప్రాంతమంతా దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతోంది. ఆ మహర్షులు తమ శక్తి వలన సప్త సాగరాలను ఇక్కడున్న పంపా సరస్సులోనికి వచ్చేట్లుగా చేశారు. ఈ నేల అత్యంత మహిమాన్వితమైనది.
అందుకే ఇక్కడి పుష్పాలు ఎప్పటికీ వాడవు" అని చెప్పి, తాను సేకరించిన ఫలాలను అందించింది.
రామలక్ష్మణులు ఫలాలను ఆరగించగానే, భక్తితో పులకాంకితురాలైన శబరి, ఆస్వామి అనుగ్రహంతో సమాధియోగ బలం వల్ల మోక్షపథాన్ని చేరుకుంది.
హంపికి వెళ్ళాలనుకునేవారు గుంతకల్లు - హుబ్లీ రైలు మార్గంలో నున్న హోస్పెటలో దిగి హంపి చేరుకోవచ్చు. హోస్పేట నుంచి హంపికి బస్సు సౌకర్యం ఉంది.
3. పుష్కర సరోవరం
పద్మ పురాణంలో ఈ తీర్థాన్ని గురించి విపులంగా వివరించబడింది. ఒకసారి బ్రహ్మదేవుడు ఇక్కడకు రాగా, ఇక్కడున్న చెట్లన్నీ ఘనస్వాగతం పలికాయట. అవి పలికిన స్వాగత వచనాలకు ముగ్ధుడైన బ్రహ్మదేవుడు ఆ వృక్షాలను ఏదైనా వరం కోరుకొమ్మనగా, బ్రహ్మదేవుని ఇక్కడే ఉండాల్సిందంటూ ఆ వృక్షాలు అభ్యర్థించాయట. ఫలితంగా బ్రహ్మదేవుడు అక్కడ తామర పువ్వును నేలపై వదిలాడు. అప్పుడు పెద్ద శబ్దం ఏర్పడి, ఆ నాద ప్రభావానికి చిన్నపిల్లలను చంపే వజ్రనాభుడు అనే రాక్షసుడు అంతమయ్యాడట.
ఈ సరస్సు రాజస్థాన్‌లోని అజ్మీరుకు ఏడు మైళ్ళ దూరంలో ఉంది. అక్కడే బ్రహ్మదేవుని ఆలయం కూడ ఉంది. పుష్కర సరస్సులోని నీటికి రోగాలను నయం చేసే శక్తి ఉందని నమ్ముతుంటారు. ఇందుకు ఉదాహరణగా 9 వ శతాబ్దంలో ఓ రాజు ఈ నీటిని స్పృశించగా, చేతిపై ఉన్న మచ్చలు మాయమైయ్యాయని చెబుతూంటారు. అత్యంత పవిత్రమైన ఈ సరోవరంలో యాత్రీకులు పితృ తర్పణాలను చేస్తుంటారు.
4. నారాయణ వన సరోవరం
ఈ సరోవరం గుజరాత్ రాష్ట్రంలో కచ్ ప్రాంతంలో ఉంది. గుజరాత్‌లోని భుజ్ పట్టణం నుంచి సుమారు 150 కి.మీ దూరంలో ఈ నారాయణ వన సరోవరం ఉంది. ఈ నారాయణ వన పరిసర ప్రాంతాలన్నీ శివకేశవుల పాద స్పర్శతో పునీతమయ్యాయని స్థల పురాణాల ద్వారా మనకు తెలుస్తోంది. ఈ సరస్సుకు కాస్త దూరంలో శివుడు కోటేశ్వరునిగా కొలవబడుతున్నాడు. ఆయన ఇక్కడ కొలువై ఉండటం వెనుక ఓ కథ చెప్పబడుతోంది.
ఒకసారి పరమశివుని వేడుకుంటూ ఘోరమైన తపస్సు చేసిన రావణునికి శివుడు ప్రత్యక్షమై ఓ విగ్రహాన్ని బహుకరిస్తాడు. స్వామి నుంచి లింగాన్ని అందుకున్న రావణుడు, అశ్రద్ధతో ఆ లింగాన్ని నేలపై పడవేస్తాడు. దాంతో కోపగించుకున్న శివ పరమాత్మ అనేక లక్షల కోట్ల లింగాలుగా మారిపోతాడు. రావణునికి అన్ని కోట్ల లింగాలలో ఏది అసలైన లింగం అనే విషయం తెలియదు. చివరకు అసలు లింగాన్ని అక్కడే వదిలేసి, చేతికి అందిన లింగంతో రావణుడు వెళ్లిపోయాడని కథనం.
ఇలా శివుడు నారాయణ వన సరోవర ప్రాంతాలలో కొలువై ఉండగా, విష్ణురూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ మధుర నుంచి ద్వారకకు వెళ్తున్నప్పుడు, ఇక్కడున్న సరోవరంలో పాదాలను కడుకున్నాడనీ, అందుకే ఇది నారాయణవన సరోవరమని పిలువ బడుతోందని మరో కథనాన్ని భక్తులు చెబుతున్నారు.
భుజ్ పట్టణం నుంచి ఈ నారాయణవన సరోవరం రెండు గంటల ప్రయాణమే కాబట్టి, ప్రయాణానికి పెద్దగా శ్రమపడాల్సిన అవసరం లేదు. నారాయణవన సరోవర ప్రాంతంలో భక్తులకు బస సౌకర్యాలు బాగానే ఉన్నాయి.
5. బిందు సరోవరం
గుజరాత్‌లోని సిద్ధపూర్‌లో ఉన్న బిందు సరోవరం కపిలముని తపస్సు చేసి తరించిన ప్రాంతమని చెబుతారు. బిందు సరోవరం పరమశివుని కృప వలన ఏర్పడిన సరోవరమనీ, కపిలముని తపస్సు చేసిన ప్రాంతమంటూ బిందుసరోవరానికి అనేక ప్రత్యేకతలున్నాయి.
ఓ పురాణ కథనం ప్రకారం, స్వాయంభువు మనువు - శతరూప దంపతులకు ఆకూతి, ప్రకూతి, దేవహూతి అంటూ ముగ్గురు కుమార్తెలు. యుక్త వయస్కురాలైన దేవహుతికి తగిన వరుని కోసం వెదికే ప్రయత్నంలో పడిన స్వాయంభువు దేశదేశాలకు తిరిగాడు. చివరకు ఇక్కడకు రాగానే కర్దముడు అతని కంటబడ్డాడు. అతడే తన కూతురికి తగిన వరుడని సంతోషిస్తున్న సమయంలో అతని కళ్ళ నుండి ఆనంద భాష్పాలు వెలువడ్డాయట. ఆ భాష్పాల వెల్లువతో ఓ సరోవరం ఏర్పడిందనీ, అదే బిందు సరోవరమని కథనం.
కర్దమ - దేవహూతిల వివాహం అయిన తరువాత సంతానప్రాప్తి కోసం కర్దమ ముని ఓ విమానాన్ని సృష్టించి, తద్వారా లోకమంతా తీర్థయాత్రలు చేస్తూ పుణ్యస్నానాలు చేయసాగారు. అలా వారు సరస్వతీ నదిలో పుణ్యస్నానం చేయగా వారికి కళ, అనసూయ, శ్రద్ధ, హరిర్భువు, గతి, క్రియ, ఖ్యాతి, అరుంధతి, శాంతి అంటూ తొమ్మిది మంది కుమార్తెలు కలిగారు. కూతుళ్లకు పెళ్లుళ్ళు చేసిన కర్దముని మనసులో తనకు ఓ కొడుకు కూడ ఉంటే బాగుంటుందనిపించింది. భార్యను పిలిచి శ్రీమన్నారాయణుని పూజ చేయమన్నాడు. అలా దేవహుతి ప్రార్థనలతో ప్రసన్నుడైన విష్ణుదేవుడు ఆమెకు పుత్ర భాగ్యాన్ని కలిగించాడు.ఆ పుత్రుడే కపిలుడు.
ఈ బిందు సరోవరం ప్రక్కన కపిలముని, కర్దమ - దేవహూతిల సన్నిధులున్నాయి. ఈ బిందు సరోవరం ప్రక్కనున్న రావిచెట్టు క్రింద తర్పణాలు చేస్తుంటారు. ఇక్కడ మాతృ దేవతలకు మాత్రమే తర్పణాలను చేయడం విశేషం. ఇలా మాతృ దేవతలకు మాత్రం తర్పణాలు ఇవ్వడాన్ని దేశంలో మరెక్కడా చూడలేము.
బిందు సరోవరం గుజరాత్‌లోని పఠాన్ జిల్లా, సిద్ధపూర్‌లో అహ్మదాబాద్ - డిల్లీ జాతీయ రహదారిలో ఉంది. సిద్ధపూర్ అహ్మదాబాద్ నుంచి సుమారు 115 కి.మీ దూరములో ఉంది. గుజరాత్‌లోని అన్నిముఖ్యపట్టనాల నుంచి సిద్ధపూర్‌కు బస్సు సౌకర్యాలున్నాయి. సిద్ధపూర్ చిన్న ఊరే అయినప్పటికీ ఇక్కడ యాత్రీకుల సౌకర్యార్థం అనేక ధర్మశాలలు ఉన్నాయి.
అహ్మదాబాద్ నుంచి సుమారు రెండు గంటల ప్రయాణమే కాబట్టి, అహ్మదాబాద్‌కు యాత్రార్థం వెళ్లిన యాత్రీకులు తప్పక బిందు సరోవరాన్ని దర్శించుకుని వస్తుంటారు.
ముఖ్యంగా పితృదేవతలకు తర్పణాలను అర్పించాలనుకున్నవారు ఈ పంచ సరోవర యాత్రలను చేస్తుంటారు. మరికొంతమంది ఆయా ఆలయాలకు వెళ్ళినపుడు అక్కడున్న సరోవరాలను దర్శించుకుంటుంటారు. మొత్తం మీద పంచ సరోవరాల దర్శనం ఉభయ తారకం. ఎందుకంటే ఒకప్రక్క తీర్థయాత్రను చేసిన అనుభూతితో పాటు, మరో ప్రక్క పితృదేవతలకూ తర్పణాలను విడిచి, వారికి ఉత్తమలోక గతులను ఏర్పరచి, పితృ దేవతల్ను తృప్తి పరిచినట్లు అవుతుంది.
ఇలా తీర్థయాత్రలు చేయడం వల్ల మనలో మానసిక తీర్థాలు కూడ నెలకొంటాయి. అవి: సత్యం, ఓర్పు, ఇంద్రియ నిగ్రహం, దయ, ఋజుత్వం, దానం, తృప్తి, బ్రహ్మచర్యం, మధుర సంభాషణం, జ్ఞానం, తపశ్చర్యలు తదితరాలు మానసిక తీర్థాలు.
ఓం నమో నారాయణాయ🙏
తామ్రగౌరీ ఆలయం
మహాబలేశ్వర ఆలయప్రాంగణంలో ఉత్తరం వైపున ఈ ఆలయం ఉంది. ఈమె మహాబలేశ్వరుని పత్ని. ఈమె బ్రహ్మదేవుని కుడిచేయినుండి ఉద్భవించిందని చెబుతారు. ఈ దేవి తపస్సు చేసి రుద్రున్ని వివాహం చేసుకుంది. ఈ ఆలయం ఉదయం ఆరుగంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు, సాయంత్రం ఐదుగంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరిచి ఉంటుంది.
మహాగణపతి ఆలయం
రావణుడు ఆత్మలింగాన్ని తీసుకెళ్తున్నప్పుడు, అతడిని అడ్డుకున్న గణపతి చారుర్యాన్ని మెచ్చుకున్న పరమశివుడు మహాబలేశ్వరక్షేత్రంలో ముందుగా వినాయకుని దర్శించుకున్న తరువాతే భక్తులు తన సన్నిధికి వస్తారని వరమిచ్చాడు. రావణుడు వేసిన మొట్టికాయకు గుర్తుగా ఈ స్వామి తలపై చిన్న పల్లం కనబడుతుంటుంది. ఈ ఆలయం మహాబలేశ్వర ఆలయానికి తూర్పుదిక్కున ఉంది. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహనం ఒకటిన్నరవరకు, సాయంత్రం నాలుగున్నర నుంచి రాత్రి ఎనిమిదింపావు వరకు ఆలయం తెరిచి ఉంటుంది.
ఇంకా ఈ క్షేత్ర ప్రాంగణంలో భద్రకాళి, కాలభైరవ శ్రీకృష్ణ, నరసింహస్వామి దేవాలయాలున్నాయి. నేత్రాసురుడు అనే రాక్షసుని సంహరించేందుకై, త్రిమూర్తుల శక్తితో భద్రకాళి ఆవిర్భవించారట. అమృతమధనం జరుగుతున్నప్పుడు దేవతలు ఇక్కడకు వచ్చి ఆత్మలింగానికి పూజలు చేయడం వల్ల వారికి అమృతం లభించిందని ప్రతీతి.
గోకర్ణంలో బస చేసేందుకు హోటళ్ళ సౌకర్యం బాగానే ఉంది. గోకర్ణం బెంగుళూరు నుంచి సుమారు 450 కి.మీ దూరంలో ఉంది. హబ్లి, ఉడుపి, మంగళూరు, బెల్గాంల నుండి ఇక్కడికి బస్సు సౌక్యం ఉంది. కొంకణీరైలు మార్గంలో గోకర్ణరోడ్డు స్టేషన్‌కి ఆలయానికి మధ్య ఐదు కిలోమీటర్ల దూరం ఉంది.
గోకర్ణానికి చుట్టుప్రక్కల ఉన్న పుణ్యక్షేత్రాలు
*****
******
పంచ గయలు
మన దేశంలో మొత్తం 5 గయలు ఉన్నాయని చెబుతారు.
1. శిరోగయ, 2. నాభిగయ, 3. పాదగయ, 4. మాతృగయ, 5. పితృగయ.
🔹1. శిరోగయ : బిహార్ రాష్ట్రంలో ఫల్గుణీ నదీ తీరంలో “శిరోగయ” గా వెలసింది. దీనినే బుద్ధగయ అని కూడా అంటారు.
🔹2. నాభిగయ : జాజాపూర్, ఒరిస్సా రాష్ట్రంలో వైతరణి నదీ తీరంలో వున్న ప్రదేశంను “నాభిగయ” అని అంటారు.
🔹 3. పాదగయ : పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్‌లో గయని పాదాలుండటం వలన అవి వున్న ప్రదేశం పిఠాపురాన్ని “పాదగయ” అంటారు.
🔹4. మాతృగయ : గుజరాత్ రాష్ట్రంలో మహేషన జిల్లాలో సరస్వతీ నదీ తీరంలో గల ప్రాంతాన్ని “మాతృగయ” అని అంటారు. బిందు సరోవరమనే మరో పేరు కూడా కలదు. అహమ్మదాబాదుకు 32 కి||మి|| దూరంలో గల మాతృగయలో మాతృవంశం వారికి పిండప్రదానం మరింత ముఖ్యం. ఒరిస్సాలోని భువనేశ్వర్‌కి 33 కి||మి|| దూరంలో వున్న బిందు సరోవరం వద్ద కూడా పిండ ప్రదానాలు చేస్తారు.
🔹 5. పితృగయ : బధరీనాథ్, ఉత్తర ప్రదేశ్‌లోని అలకనందా నదీ తీరంలో గల “బ్రహ్మకపాలం” అనే ప్రదేశాన్ని “పితృగయ” అంటారు.
****
పక్షితీర్థం తమిళనాడు కు చెందిన ఒక పుణ్యక్షేత్రం.
ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైైైైఃః
పక్షితీర్థం చెంగల్పట్టు నందు కలదు. ఇక్కడ గల కొండపైకి ప్రతి రోజు రెండు పక్షులు వచ్చి ప్రసాదాన్ని తిని వెళుతుంటాయి.
కృత యుగములో ఒకసారి సర్వ సంగ పరిత్యాగులైన ఎనిమిది మంది మహామునులకు ప్రపంచ భోగములను అనుభవించవలెననే కోరిక కలిగింది. ఇక్కడ వెలసిన కొండపై తపస్సు చేయగా పరమశివుడు ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోమన్నాడు. వారు నిజము చెప్పడానికి తటపటాయిస్తూ మాకు మీ సేవయే కావాల న్నారు. కానీ శివుడు వారి మనసులందు కోరిక గమనించి ఎనిమిది మందినీ ఎనిమిది పక్షులై జన్మించ మన్నాడు. ఒక్కొక్క యుగము నందు ఇద్దరు రెండు పక్షాల చొప్పున ప్రతి రోజూ గంగా స్నానము ఆచరించి తన ప్రసాదాన్ని తినిపోతూ ఉండమన్నాడు.ఆ తరువాత జన్మమున మోక్షం పొందగలరని చెప్పి అదృశ్యం అయ్యాడు.
అలా శంకరునిచే ఆజ్ఞాపించబడిన పక్షులే కృతయుగంలో పూష విధాతల పేరుగల పక్షులయ్యాయి. త్రేతాయుగమున జటాయువు, సంపాతి అనే పక్షులుగా ద్వాపర యుగమున శంభుగుప్త, మహా గుప్తులనే పక్షులయ్యాయి. కలియుగమున శంబర శంబరాదులనే పక్షులై ప్రతి దినము గంగాస్నానము చేసి ఈ కొండపైకి వచ్చి పోతుంటారని స్థల పురాణం చెబుతుంది.
యాత్రికులు ఉదయాన్నే పక్షితీర్థంలో స్నానం చేసి కొండ ఎక్కి స్వామికి పండ్లు, పూలు, కర్పూరం మొదలైనవి సమర్పిస్తారు. దేవాలయ పరివారం ఈ విరాళాలను స్వీకరించి చక్కెర పొంగలి, నేయి పాత్రలను స్వామికి సమర్పించి పూజా కార్యక్రమాలను నెరవేరుస్తారు. తరువాత పూజారులు ఒక పక్క, భక్తులు ఒక పక్క కూర్చుని ఉంటే ఆకాశ మార్గాన రెండు పక్షులు వచ్చి చక్కెర పొంగలి తిని నేతిని తాగేసి పోతుంటాయి. ఆ తరువాత ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెడతారు.
పైన చెప్పుకున్న పక్షులు కాశీ, రామేశ్వరం యాత్ర చేస్తూ, మధ్యలో పూజారి ఇచ్చిన పరమాన్నం రుచిచూసిన ప్రాంతంలో ఆగుతాయని అక్కడి స్థల పురాణం చెబుతోంది. అందుకే ఈ ప్రాంతం "పక్షితీర్థం" గా ప్రసిద్ధిగాంచింది.
ఈ పక్షితీర్థం చెన్నయ్ నగరానికి దక్షిణంగా చెంగల్పట్టు నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో మహాబలిపురం వెళ్లే దారిలో ఉంటుంది. నిజానికి ఈ ఊరి అసలుపేరు "తిరుక్కుర కుండ్రం". ఇక్కడ ఒక పెద్ద దేవాలయం ఉంటుందన్న విషయమే చాలా మందికి తెలియదు. ఈ ఆలయం ప్రాంగణంలోపల పెద్ద పుష్కరిణి కూడా ఉంటుంది.
ఈ ఆలయంలోని స్వామి పేరు "భక్తవత్సలేశ్వరుడు", అమ్మవారి పేరు "త్రిపురసుందరి". ఈ ఆలయంలోని శిల్పకళ అత్యద్భుతంగా ఉంటుంది. పక్షితీర్థం సందర్శించే యాత్రికులు తప్పకుండా ఈ ఆలయాన్ని కూడా చూసి తరించాల్సిందే. అదలా ఉంచితే... మహాబలిపురం సందర్శించేవారుగానీ, చెంగల్పట్టు నుంచి నేరుగా వచ్చేవారుగానీ ఉదయం 11 గంటలలోపు ఈ పక్షితీర్థానికి చేరుకోవాల్సి ఉంటుంది.
పక్షితీర్థం ఊరి మధ్యలో ఉన్న మెయిన్‌రోడ్డును ఆనుకుని ఒక కొండ ఉంటుంది. ఈ కొండమీదకే పక్షులు వస్తుంటాయి. సుమారు 500 అడుగుల ఎత్తులో ఉండే ఈ కొండను వేదగిరి అని పిలుస్తుంటారు. కొండమీద వేదగిరీశ్వరాలయం అనే పేరుతో ఒక శివాలయం ఉంటుంది. కాగా.. ఇక్కడి అమ్మవారిని చుక్కాలమ్మగా స్థానికులు కొలుస్తుంటారు.
వేదగిరిపైన వేదగిరీశ్వరాలయం మినహా మరేమీ ఉండదు. ఈ ఆలయాన్ని పదిగంటల తరువాత తెరుస్తారు. ఇక్కడి స్వామివారికి, అమ్మవారికి నిత్యపూజలు అయిన తరువాతే అర్చకుడు ప్రసాదాన్ని బిందె నిండా నింపుకుని గుడికి ఆనుకుని ఉండే దడికి అవతల కూర్చుని, పై నుంచి వచ్చే రెండు పక్షులకూ ప్రసాదాన్ని ఇచ్చే దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు, భక్తులు దడికి అవతల నిలబడి తదేకంగా చూస్తూంటారు. పక్షులు ప్రసాదాన్ని తిని వెళ్తున్న దృశ్యాన్ని కళ్లారా చూసిన వారు దేవుడి మహిమవల్లనే ఇలా జరుగుతోందంటూ స్వామివారిని భక్తిశ్రద్ధలతో కీర్తిస్తారు.
ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో మాతల్లిగారి అస్తులు మహాబలిపురంలో నిమజ్జనం చేసి వస్తూ
పక్షి తీర్థాన్ని సందర్శించాను.గతంలో రెండు సార్లు సందర్శించాను.
****
ఆత్మలింగ క్షేత్రం! (00--00--2022)
(భూకై లాస్)
మనదేశంలోని అత్యంత ప్రాచీనమైన శైవక్షేత్రాలలో గోకర్ణం ఒకటి. పవిత్రమైన త్రిస్థలాలలో గోకర్ణం ఒకటి. మిగతా రెండు వారణాశి, రామేశ్వరం. గోకర్ణక్షేత్రానికి పడమట అరేబియా సముద్రం, తూర్పున సిద్ధేశ్వరక్షేత్రం, ఉత్తరాన గంగావళినది, దక్షిణాన అగనాశిని నది ఉన్నాయి. ఇలా ప్రకృతి రమణీయతతో అలరారుతుండే ఈ క్షేత్రంలో శివుని ఆత్మలింగం ప్రతిష్టితమైంది.
పురాణ కథ
ఈ పుణ్యక్షేత్ర ప్రసక్తిని రామాయణ, మహాభారతాలలో చూడగలం. ఇక స్కాందపురాణంలో ఒక అధ్యాయమే ఈ క్షేత్ర ప్రాముఖ్యాన్ని వివరిస్తోంది. పూర్వం రావణాసురుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేయగా, అతని తపస్సును మెచ్చి ప్రత్యక్షమైన శివుడు వరాన్ని కోరుకొమ్మన్నాడు. అప్పుడు రావణాసురుడు తనకు ఆత్మలింగం కావాలని కోరాడు. అందుకు ఓ నిబంధన విధించిన శివుడు, రావణాసురునికి ఆత్మలింగాన్ని ఇచ్చాడు. ఆ నిబంధన ప్రకారం, రావణాసురుడు లంకకు వెళ్ళేంతవరకు ఆత్మలింగాన్ని నేలపై దించుకూడదు. ఆత్మలింగాన్ని అందుకున్న రావణాసురుడు లంకవైపు పరుగులు తీయసాగాడు. ఆత్మలింగం రావణాసురుని దగ్గరే ఉంటే లోకాలన్నీ అల్లకల్లోలమైపోతాయని కలత చెందిన దేవతలు, తమను కాపాడవలసిందంటూ విష్ణుమూర్తి, బ్రహ్మ, విష్నేశ్వర తదితర దేవుళ్లను వేడుకోగా, గణపతి చిన్నపిల్లవాని వేషంలో రావణాసురునికి మార్గమధ్యంలో ఎదురుపడతాడు. సరిగ్గా అప్పుడే విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని సూర్యునికి అడ్డంగా పెడతాడు. సాయంత్రం అవుతుందనుకున్న రావణాసురుడు సంధ్యావందనాన్ని నిర్వర్తించాలనుకుంటాడు. అయితే అతని రెండు చేతుల్లో శివుని ఆత్మలింగం ఉంది.
అప్పుడు అటుగా బాలరూపంలో వచ్చిన వినాయకుని చూసిన రావణాసురుడు, కాసేపు ఆత్మలీంగాన్ని పట్టుకొమ్మని, తాను సంధ్యావందనం చేసి వస్తానని అభ్యర్ధిస్తాడు. అందుకు ఒప్పుకున్న బాలవినాయకుడు, తాను మూడుసార్లు పిలుస్తానని, అప్పటికీ రావణాసురుడు రాకపోతే ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తానని చెబుతాడు. వేరే దారిలేని రావణాసురుడు వినాయకుని నిబంధనకు ఒప్పుకుని సంధ్యావందనం చేసుకోడానికి వెళతాడు. అయితే రావణాసురునికి ఏమాత్రం అవకాశాన్ని ఇవ్వని వినాయకుడు, గబగబా మూడుసార్లు రావణాసురుని పిలిచి, ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు.
రావణాసురుడు ఎంతగా పరుగులు పెట్టి వచ్చినప్పటికీ జరగాల్సింది జరిగిపోతుంది. ఆ సంఘటనకు కోపగించుకున్న రావణాసురుడు బాలవినాయకుని తలపై ఒక మొట్టికాయ వేస్తాడు. ఫలితంగా గణపతి తలపై నొక్కు ఏర్పడుతుంది. ఆ నొక్కును ఇప్పటికీ, ఇక్కడున్న మహాగణపతి ఆలయంలోని గణపతి విగ్రహానికి చూడవచ్చు. ఆ తరువాత రావణాసురుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ, ఆత్మలింగాన్ని పైకి లేపలేకపోతాడు. ఆత్మలింగాన్ని తీసుకువచ్చిన పెట్టెను ఉత్తరం వైపు నుంచి లాగుతాడు. అది విసురుగా వెళ్ళి దూరంగా పడిపోతుంది. అక్కడ సజ్జేశ్వర లింగం వెలుస్తుంది. పెట్టె మూతపడిన చోట గుణేశ్వర లింగం ఉద్భవిస్తుంది. లింగంపై కప్పబడిన వస్త్రం పడిన చోట మురుడేశ్వర లింగం వెలుస్తుంది. పెట్టెను కట్టిన (తాళ్ళు) పడినచోట ధారేశ్వరలింగం ఉద్భవిస్తుంది. ఈ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగం మహాబలేశ్వరలింగంగా గోకర్ణంలో వెలుస్తుంది. ఆత్మలింగంతో ముడిపడిన ఐదుక్షేత్రాలను శైవ పంచక్షేత్రాలని పిలుచుకుంటుంటారు.
ఇంకొక కథనం ప్రకారం, పాతాళలోకంలో తపస్సు చేసి, భూలోకానికి వస్తున్నప్పుడు, భూమాత గోరూపాన్ని ధరించిందట. ఆ గోవుచెవి నుండి పరమేశ్వరుడు బయటకు రావడంతో ఈ క్షేత్రనికి గో (ఆవు) కర్ణం (చెవి) = గోకర్ణం అనే పేరు ఏర్పడిందట.
పురాతన ప్రాశస్త్యం
దక్షిణకాశి, భూకైలాసం అని భక్తులచే కొనియాడబడుతున్న ఈ క్షేత్రచరిత్ర ఎంతో పురాతనమైనది. కాళిదాసు, తన 'రఘువంశం' కావ్యంలో ఈ క్షేత్ర ప్రస్తావన చేసాడు. క్రీ.శ. ఏడవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన హర్షవర్ధనుడు 'నాగానంద' కావ్యంలో ఈ క్షేత్రం గురించి వివరించాడు. కదంబ చక్రవర్తి మయూరశర్మ ఈ ఆలయంలో నిత్యపూజాదికాలైన ఏర్పాట్లు చేసాడనీ, చెన్నమ్మాజీ, ఆమె కుమారుడు సోమశేఖర నాయకుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు హళసునాడు - కుందపురానికి చెందిన విశ్వేశ్వరాయుడు చంద్రశాల, నందిమంటపాలను నిర్మించాడని శసనాల ద్వారా తెలుస్తోంది. అనంతరం గోకర్ణం క్షేత్రాన్ని విజయనగర రాజులు అభివృద్ధి చేసారు. క్రీ.శ. 1665వ సంవత్సరంలో ఛత్రపతి శివాజీ ఈ క్షేత్రాన్ని దర్శించుకుని పూజలు చేసాడట.
******
పుణ్య క్షేత్రాలు
మహాబలేశ్వరాలయం
పురాతనమైన ఈ ఆలయం పెద్ద గాలిగోపురంతో భక్తులను ఆహ్వానిస్తుంటుంది. ఈ లింగం కిందివైపు కాస్త వెడల్పుగా, పైన సన్నగా కనబడుతుంటుంది. రావణాసురుడు ఈ శివలింగాన్ని పైకి లాగడనికి ప్రయత్నం చేయడం వల్ల లింగంపై భాగాన సన్నగా ఉందంటారు. పైకి ఉండే ఒక రంధ్రంలో వ్రేలును ఉంచినపుడు కిందనున్న లింగం వ్రేలుకి తగులుతుంది. భక్తులు శివలింగం చుట్టూ కూర్చుని పూజలు నిర్వహిస్తారు. ఈ శివపూజను నిర్వహించడానికి ఒక భక్తునికి ఒక రూపాయి చొప్పున రుసుమును వసూలు చేస్తూంటారు. అయితే, మహామంగళహారతుల సమయంలో గర్భగృహహంలోకి భక్తులను అనుమతించరు. ఇక్కడ పన్నెండు సంవత్సరాల కొకసారి ఒక విశేషమైన కార్యక్రమము జరుగుతుంది. అప్పుడు శివలీంగాన్ని బయటకు తీసి, నిజస్వరూప లింగానికి పూజలు చేస్తారు. ఈ పుష్కర ఉత్సవాలకు దేశవిదేశాల నుండి లక్షలసంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం జరగాల్సి ఉంది. ఇక, ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలు ఏడురోజులపాటు ఘనంగా జరుగుతాయి. ఈ సందర్భంగా రథోత్సవం జరుగుతుంది. ఈ ఆలయంలో మధ్యాహ్నం పన్నెండున్నర నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు మంగళహారతి పూజలు జరుగుతుంటాయి. ఆలయంలోకి ప్రవేశించే పురుషులు చొక్కాలను విడిచి, భుజాలపై కండువాలతో స్వామి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది.
--((())--
No comments:
Post a Comment